రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఒప్పుకోలు

రచన: రఘు శేషభట్టర్
మార్చి 2026

అందాకా కానే కాదని
చివరికి ఔనని ఒప్పుకున్నప్పుడు
వాడు ప్రయాస నుండి విడుదలైనట్టుంటాడు
వాఙ్మయ కథల్లోని ముక్త జీవిలా ఉంటాడు
కలకలం లేని నవ్వక్కడ తుంపరలా కురిసిపోతుంది

మనం దేని మీద పంతాలు పోతామో
అది అసత్యమో అర్ధసత్యమో ఐనప్పుడు
ఒక్క ఒప్పుకోలు కొన చాలు –
బింకాలు
దులిపినట్టు వదులుతాయి
యుద్ధాలు తునకలై విరుగుతాయి
వినికిడి శ్రోతలా మిగులుతుంది

రాయని సంగతులెన్నో గరిమలై ఊగే
ఆ ఒప్పుకోలు క్షణికం ద్రావకమై
సౌజన్యం చిమ్ముతుంది

మనిషితనం పతాకలా ఎగిరి
తతిమ్మా సంగతులు ఫలకాలై మిగిలినప్పుడు
ఒప్పుకోలు ఒంటి రెక్క పక్షి కాదని అర్థమౌతుంది

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఒప్పుకోలు

ఇటువంటివే…

  1. చిట్లని నీటిబుడగ
  2. చెట్టు
  3. ఇదే చివరిసారి…
  4. కుమ్నో ఫిలాంగ్*, షిల్లాంగ్
  5. నీళ్ళున్న ఎండమావి

మార్చి 2026 సంచికలో ...

  • అక్కడ పుస్తకాలు తగలబడ్డాయి!
  • అనువాదంలో అనునాదం
  • అవతీర్ణపరిమళం
  • అస్తిత్వవాద సాహిత్యం: 5ఆ. కాఫ్కా
  • ఇదే చివరిసారి…
  • ఒప్పుకోలు
  • ఓడిస్సీ – 4: మరులు గొలిపే మహిళ
  • కంప్యూటర్ చిప్ కథ – 11: హెర్ట్‌జియన్ తరంగాలు
  • కళాసాగరం కర్ణాటకం-2
  • కాంతి దూరం
  • కావ్యదహనోత్సవం (ఈ-పుస్తకం)
  • కుమ్నో ఫిలాంగ్*, షిల్లాంగ్
  • గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాలు – 2026
  • జయహో జీవనమా!
  • తమిళ సంగ సాహిత్యం-3: కుఱుందొగై
  • తెలుగు నిఘంటువు గురించి వేలూరి వేంకటేశ్వర రావు
  • నీళ్ళున్న ఎండమావి
  • మధుకుల్యలవంటి కవితలు రాసిన మహెజబీన్
  • మనసులు దోచే మనస్లు – 3
  • మార్చి 2026
  • యూట్యూబ్‍లో ఈమాట: ఫిబ్రవరి 2026
  • రాంగునంబరండి బాబయ్యా
  • వేలూరి వేంకటేశ్వర రావు రచనలు: కాటుక కంటినీరు పద్యం
  • వేలూరి వేంకటేశ్వరరావు రచనలు: బాపూ
  • వేలూరి వేంకటేశ్వరరావు రచనలు: వార్ధక్యం
  • వేలూరి వేంకటేశ్వరరావుగారి కావ్యదహనోత్సవం — కథాసంగ్రహం
  • వేలూరిగారి నిష్క్రమణ పెద్ద లోటు
  • వ్యంగ్యం ఆయన కథకు చిరునామా
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఇదే చివరిసారి…
కాంతి దూరం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.