యుగయుగాలుగా పేరుకున్న ఒంటరితనం
నీ రాక తో ఒక్కసారిగా బద్దలవుతుంది
చాప కింద నీరు లా నన్ను ఆవరించిన నిశ్శబ్దం
నీ గొంతులో గుసగుసగా సంగీతమై పారుతుంది
మా ఇంటి ముందు సీతమ్మ వారి జడబంతి
నిన్ను చూసి మరింత ముగ్ధం గా నవ్వుతుంది
నీ వేలికొనలు తగిలి నా వయొలిన్
వయ్యారంగా గారాలు పోతుంది
రవికిరణాలు సైతం తాకని కన్నె కపోలాలు
శశి చూపులతో ఎర్రని కలువలై వికసిస్తాయి
నీ కంఠం లోంచి మధురం గా జారే
రాగాల పారిజాతాలను సరాగంగా
నా జడ లో అలంకరించుకుని
నేను
ఓ సుగంధవీచికనై పరిమళిస్తాను.