ఆకాశాన్ని నిలువునా చీల్చే
అంతు లేని దుఃఖం ముంచెత్తినపుడల్లా
ఈ దుర్భరబాధ ఇదే చివరిసారి అని
ఇంకెప్పుడూ కలగదని
అనుకుంటూ ఉంటాను.
మనం ప్రతి ఒక్కరం బాధల సంద్రాలమని
దుఃఖాలు అలవికాని కెరటాలై వచ్చి
ప్రతిసారీ ముక్కలు ముక్కలు చేస్తాయని —
నాకు నేర్చుకోవాలనిపించదు
[Based on the English translation by Harriet Truscott]