తెలుగు బాలసాహిత్య జాతకంలో “చంద్ర మహాదశ” వంటిదేదో “చందమామ”తోనే మొదలైనట్టుగా అనిపిస్తుంది.
Category Archive: వ్యాసాలు
ఈ ఆంగ్లం నిజానికి దేశభాషలని ఏమీ చెయ్యలేదు; సంస్కృతం పూర్వం ఏ స్థానంలో ఉండినదో ఆ స్థానాన్ని ఆంగ్లం ఆక్రమించుకుంది.
అమాయకులైన కుశలవులూ, కపటత్వంగల సీతా, ఫెమినిస్టు శూర్పణఖా, వెరసి “సమాగమం” కథ!
అనువాదం అనువదించబడే భాషలో సాహిత్య స్థానాన్ని సంపాదించ లేక పోతే అది ఎంత విధేయంగా వున్నా అది సాహిత్యానువాదం కాదు. అంచేత సాహిత్యానువాదకుల పని ప్రధానంగా తాము అనువదించిన భాషలో తమ అనువాదానికి సాహిత్యస్థానాన్ని సంపాదించుకోవటమే.
“క” అనే అక్షరం, “వి” అనే అక్షరం కలిస్తే “కవి” అనే రెండక్షరాల పదం అవుతుంది. ఆ రెండక్షరాలు కలవక వేరే వేరే వుండిపోతే […]
కొత్త గొంతుకతో శిలా హృదయాల్ని కదిలించే గీతాల్ని సృజించి, తెలుగు నవలా సాహిత్యంలో ఒక మణిరత్నానికి కారకురాలయిన “శిలాలోలిత” రేవతీదేవి.
తెలుగువారి అచ్చతెలుగుదనం తెలుగు వారి వంటకాల్లోనే ఉట్టిపడుతూ ఉంటుంది.
హిందూస్తానీ గాత్రంలో విలంబిత్ ఖయాల్ విన్న తెలుగువాళ్ళు కొందరు “ఇదేమిట్రా, పులితేన్పు లొచ్చినట్టుగా పాడుతున్నాడూ?” అంటారు.
మంచి సినిమా అంటే ఉన్నత భావాలను ప్రేరేపించేటట్టు ఉండాలి. కాని ఈ నాటి తెలుగు సినిమా ప్రేరేపించేది చాలా మట్టుకు నీచ భావాలే.
తెలుగుభాష గురించి చాలామంది భాషావేత్తలు ఒప్పుకునే వివరాలను నాకు తెలియవచ్చినంత తేటపరచాలని ఈ వ్యాసరచనా సాహసానికి పూనుకున్నాను.
గురజాడ, గిడుగు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సుదొర — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారికభాషోద్యమం ఆరంభమైంది.
నేను ప్రస్తావించబోయే ప్రార్థన పద్యాలు, మనం చిన్నప్పుడు నేర్చిన పద్యాల వంటివి కావు. అంతేకాదు. మనం పెద్దైన తరువాత, ఏ కావ్యాలనుంచో, ప్రబంధాలనుంచో, నేర్చుకున్న పద్యాలూ కావు.
కాని, మనం మాట్లాడే నాలుగోవంతు, పదోవంతు తెలుగైనా ఆ సంభాషణలు ఇంగ్లీష్ లో కుదరవు. కొన్ని నాజుకైనా భావాలు, పలకరింతలు, ఆప్యాయతలు తెలుగు పదాలలో మాత్రమే చెప్పగలుగుతాము. అవి లేకపోతే విషయాలు తెలపగలము, కాని అల్లం పచ్చిమిరపకాయ లేని పెసరట్టు లాగా చప్పగా ఉంటుంది.
ప్రకృతిలో నాలుగు ప్రాథమిక బలాలు (fundamental forces) ఉన్నాయని ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతోంది. విశ్వార్భవానికి మూలకారణమైన ఆదిశక్తి ఒక్కటే అయినప్పటికీ అది ఈ నాడు మనకి నాలుగు వివిధ బలాలుగా ద్యోతకమవుతున్నాదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
అసలు “శృంగార నైషథ” కావ్య కర్త ఐన ఆ శ్రీనాథుడు వీటిలో ఒక్కటైనా చెప్పాడో లేడో కూడ మనకు తెలియదు. ఐతే, ఆయన చెప్పినా మరొకరు చెప్పినా ఈ పద్యాల ద్వారా, శ్రీనాథుడి “వ్యక్తిత్వం” గురించి తర్వాతి తరాల వారు ఏమని భావించారో మనకు తెలిస్తుంది.
ఈ కవిత అర్థమవడానికి “వర్షుకాభ్రములు” అన్న పదంకోసం నిఘంటువులు తిరగెయ్యనక్కరలేదు. మహా ప్రవాహంలా హోరెత్తించే ఆ కవిత్వ వేగం సామాన్య పాఠకుణ్ణి సైతం మున్ముందుకి తోసుకుపోతుంది.
శాస్త్రీయ సంగీతం అంటే సామాన్యంగా సీరియస్ వ్యవహారం. అయనా అందులో కూడా కొన్ని జోకులూ, ఛలోక్తులూ ఉంటూనే ఉంటాయ. వాటిలో చిరునవ్వు తెప్పించేవి కొన్నిటిని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను.
మనకి గతశతాబ్దంలో మహాకవులు ఇద్దరే: విశ్వనాథ, శ్రీశ్రీ.
డిట్రాయిట్ నగరంలో, జులై 1,2,3 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 15వ సమావేశం జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా, తానా ప్రచురణల కమిటీ, […]
ప్రాచీన సాహిత్యాన్ని పరమ పవిత్రమని నెత్తిన పెట్టుకోవడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారేయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టి కోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.