ఈ మధ్య వస్తున్న సినిమాలను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నా, విడుదలై వస్తున్న సినిమాల సరళి మారలేదు. అటు దర్శక నిర్మాతల, ఇటు నటీనటుల ధోరణిలో కూడా రవ్వంత మంచి మార్పు రాకపోవడం చాలా దురదృష్టకరం, విచారించదగ్గ విషయం కూడా. 50 సంవత్సరాల క్రితం ఒక సినిమా నిర్మించడానికి సంవత్సరాల వ్యవధి చాలేది కాదు. అటువంటిది, ఈనాడు రెండు, మూడు నెలల్లో తయారై సినిమాలు ప్రేక్షకుల్ని హింసిస్తున్నాయి. రాశి పెరిగింది, వాసి తరిగింది.

(శ్రీ విన్నకోట రవిశంకర్ “కుండీలో మర్రిచెట్టుకి పరిచయం”) రవిశంకర్ని నేను పదేళ్ళబట్టి ఎరుగుదును. అప్పట్లో అతను మా కాలేజీ విద్యార్థి. అప్పుడే ప్రారంభమైంది అతని […]

(శ్రీ స్మైల్ చేసిన ఇంటర్‌వ్యూ. 1988లో ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం. తేదీ గుర్తులేదు) ప్ర: మిమ్మల్ని స్పృశించిన సాహిత్య ప్రభావాలేమిటి? అవేమైనా మీకు మార్గనిర్దేశం […]

కృష్ణశాస్త్రి గారు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆయనే ఎక్కడో ఎప్పుడో ప్రస్తావించిన దృశ్యం నా మనస్సులో బొమ్మ కడుతుంది. కవిత్వం రాయటం ప్రారంభించిన తొలిరోజుల్లో, అంటే […]

(శ్రీ శిఖామణి “మువ్వల చేతికర్ర”కి పరిచయం) కవిత్వం రాయటానికి చిట్కా చెప్పాడు టొనీకోనర్ అనే కవి. ఒక అరణ్యాన్ని సృష్టించుకో. దాన్లో అన్వేషించుకుంటూ పో. […]

మనుషుల్ని కలిపే ఈ “మనీష” వట్టి “బుద్ధి” మాత్రమే కాదు. సానుభూతితో కూడిన అవగాహన, సహృదయత, ఇప్పటి ప్రపంచానికి ముఖ్యావసరం ఇదీ. ఇది అలవర్చుకున్నప్పుడే మనిషి స్వేచ్ఛని సాధిస్తాడు.

(శ్రీ సతీష్ చందర్ చేసిన ఇంటర్వ్యూ. జనవరి 18, 1988 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమయింది) (చెట్లు తమవేళ్ళతో ప్రహరీ గోడల్ని కూల్చేస్తున్నాయ్. లోపల తెరిచిన […]

ఐరిష్ కవి యేట్స్ (W.B.Yeats) చనిపోయినపుడు ఇంగ్లీషు కవి ఆడెన్ (W.H.Auden) ఒక అద్భుతమైన సంతాప పద్యం రాశాడు. ఇంగ్లీషు భాషలోని గొప్ప కవితల్లో […]

“ఈ అనుభూతి కవితలో ఆలోచనకీ, తర్కానికీ, విశ్లేషణకీ స్థానం లేదు. మన పంచేంద్రియాల్ని తాకే పద చిత్రాలద్వారా మన అనుభూతిని మేలుకొలుపుతాడు కవి. తను […]

గీరతం తెలుగుసాహిత్యంలో ఒక విలక్షణమైన రచన. అది రెండు పక్షాల కవుల మధ్య జరిగిన సంఘర్షణని చూపిస్తుంది. ఇందులో ఒకరు తిరుపతి వెంకట కవులు. రెండవ వారు వెంకటరామకృష్ణ కవులు. వీరిద్దరి వివాదాంశం చాలా విచిత్రమైంది.

మీరు నమ్మండి, నమ్మకపొండి. నేను నడకకి వెళ్ళిన ప్రతి రోజూ – దరిదాపుగా ప్రతిరోజూ – దారిలో నేల మీద ఒక పెన్నీ (సెంటు లేదా పైస) కనిపించి తీరుతుంది. కరువు రోజుల్లో పుట్టి పెరిగిన శాల్తీనేమో, ఒంగుని పెన్నీని తీసి జేబులో వేసుకుంటాను.

ముకేశ్‌కు తారస్థాయిలో అపస్వరాలు పలుకుతాయని నౌషాద్‌కు కొన్ని అభ్యంతరాలుండేవి. అందుకనే అందాజ్‌, మేలా మొదలైన సినిమాల్లో ముకేశ్‌ చేత అతను మంద్ర స్థాయిలో పాడించాడు. ఒక్క “తూ కహే అగర్‌” పాట కోసమని ముకేశ్‌ నౌషాద్‌ ఇంటికి వచ్చి 23 సార్లు రిహార్సల్‌ చేశాడట. అప్పటి కమిట్‌మెంట్‌ అటువంటిది.

ప్రవాసాంధ్ర సాహిత్యం ప్రవాసంలో వున్నవారు ఏం రాసినా ప్రవాస సాహిత్యమవుతుందా లేక ప్రవాసజీవితం గురించి రాసిందే ప్రవాసాంధ్ర సాహిత్యమవుతుందా అన్న విషయం మీద గత […]

మనకు పరాయీ అనిపించే పరిస్థితులూ, మనది కాని సంస్కృతి, మనవి కాని భాషల మధ్య – మనకెంత మాత్రమూ తెలియని లోకంలో మన వునికి ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
-ఇవి ఇప్పుడు ప్రవాసాంధ్రసాహిత్యం ముందు వున్న ప్రశ్నలు. అసలు ప్రవాసాంధ్ర సాహిత్యం అంటూ వుందా? వుంటే, దానికి కొన్ని సాంస్కృతిక లక్షణాలు వున్నాయా అన్న మౌలికమైన ప్రశ్న నుంచి ఈ అన్వేషణ మొదలు కావాలి.

ప్రస్తుతం తెలుగుభాషను ప్రభావితం చేస్తున్న కొన్ని అంశాలనూ, అవి మన భాషపై ఆదరణ తగ్గడానికి ఏ రకంగా కారణమవుతున్నాయన్న వివరాలనూ ఇక్కడ చర్చిస్తాను. దానితోపాటు నాకు తోచిన కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచిస్తాను.