ఈనాటి పరుగు పందెపు ప్రపంచంలో వివిధ రకాలైన కాలుష్యాలతో, అసభ్యకర నాగరికతతో, స్వార్థరాజకీయాలతో పెద్దా – చిన్నా అనే తేడా లేక నైతిక విలువలు పతనమయ్యాయి. తల్లిదండ్రులు, గురువులపైన వినయ విధేయతలు, భక్తిశ్రద్ధలు మృగ్యమైనాయి. సుఖం మరిగి ఆర్థిక జీవన వ్యాపారంలో ధనార్జనే ధ్యేయంగా సొంత లాభంకోసం మానవుడు వెంపర్లాడుతున్నాడు. ఈ కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ యుగంలో మనుషులు యంత్రాల్లాగా తయారై, మనసులు మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘సమకాలీన తెలుగు గ్రామాలను’’ సింహావలోకనం చేస్తే ….

పదిహేను వసంతాల తెలుగు కథను గురించి ప్రస్తావించుకోవల్సి వచ్చినప్పుడు గత శతాబ్దాపు చివరి దశకం ప్రారంభంలో మన జీవితాల్లోకి ఒక ఉప్పెనలా తోసుకొచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానాలలోని మార్పు …. పందొమ్మిది వందల తొంభయి అయిదులో వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పడడం, పాలకులు జాతిభద్రతను సైతం మరిచిపోయి బహుళజాతి కంపెనీలను ప్రేమించడం …. రాష్ట్ర ప్రభుత్వాలు తమంతట తాము విదేశీ సంస్థలతో నేరుగా చేసుకుంటూన్న ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు లాంఛన ప్రాయమవడం …. దేశ ఆర్థిక భద్రతను అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు నియంత్రించడం …. ఒక దానికకటి అనుబంధంగా జరిగిపోయిన గాథ పరిణామాలు మన వ్యక్తిగత జీవితాలను, సమాజాల్నీ కూడా అతలాకుతలం చేసిన క్రమంలో ఆ మార్పులన్నీ కూడా కథల్లో ప్రతిబించిస్తూ వచ్చాయి…

1990 తర్వాత తెలుగు సాహిత్యధోరణులు వికేంద్రీకృతమయ్యాయి. దానితో చాల ‘మంచి’ రచనలు సైతం తెలియకుండ పోయాయి. అలాంటి వాటిని నేను ఈ వ్యాసాల ద్వార గమనించగలిగాను. అట్లే సినిమాలకు సంబంధించి, గ్రామపునర్నిర్మాణానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం నాకు కలిగింది.

భారతదేశం సకల కళలకు కాణాచి, అందులో ఆంధ్రదేశం ఎన్నో కళలకు జన్మస్థానమై విరాజిల్లుచున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సంగీత రంగస్థల కళారంగాన్ని నాటినుంచి నేటి వరకు పర్యావలోకనం చేయుట ప్రస్తుత వ్యాస ఉద్దేశము.

వస్తువులోనూ, కథనంలోనూ ఎన్నదగినవిగా ఉన్నవి ముఖ్యంగా రెండు. అవి జిగిరీ, తోలుబొమ్మలాట. జిగిరీ నవల మానవుడిలో ఉన్న రెండు పార్శ్వాలను స్పృశించిన రచన. తోలుబొమ్మలాట- ఆధునికీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో మన వినోదాలుకూడ టీవీ, సినిమాలకు పరిమితమై, దేశీయ కళలు, జానపద ప్రదర్శన కళలు కనుమరుగైపోతున్న విషయం ఇందులో వస్తువు.

ఇరవయ్యవ శతాబ్ది మధ్య భాగంలో తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు అనేకం చోటుచేసుకున్నాయి. ఒకవైపు పాండిత్య ప్రదర్శనే కవిత్వమనే అపోహతో సుదీర్థ సంస్కృత సమాసాలతో పొంతనలేని అలంకారాలతో, భయం కొలిపే శబ్ద విన్యాసంతో కొందరు కావ్యాలు వ్రాస్తూ ఉండగా, మరోవైపు జాషువా, కరుణశ్రీ, దువ్వూరి, రాయప్రోలు వంటి పండిత కవులే క్రత్త పుంతలు త్రొక్కి సామాన్య విద్యావంతులను సైతం ఆకట్టుకొనేలాగా ఖండకావ్యాలూ, లఘుకావ్యాలూ సరళమైన భాషలో వ్రాయసాగారు.

తెలుగు నవల సంఘ సంస్కరణోద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచింది. ఆంధ్రుల చారిత్రక వైభవాన్ని చాటి చెప్పింది. జాతీయ ఉద్యమానికి ఊపిరులూదింది. మనిషి మనోవల్మీకంలో సంచరించే సరీసృపాల విన్యాసాల్ని, వాటి హేతువుల్ని వెదికింది. పోరాటాల్లో ‘మృత్యుం జయులై’న ‘‘ప్రజల మనుషుల్ని’’ వారి వీరోచిత గాథల్ని గానం చేసింది. ‘‘చెలియలి కట్టల్ని’’ దాటి ‘స్వేచ్ఛ’గా ‘మైదానాల్లో’ సంచరించింది. మధ్య తరగతి బుద్ధి జీవులకు ‘చదువు’ నేర్పించి ‘మంచీ – చెడులను’ విడమరిచింది. ‘అల్పజీవి’కి ఆలంబనగా నిలబడింది. ‘అంధకారంలో’ ఉన్న ‘మట్టి మనిషి’ని గురించి ఆరా తీసింది.

1891లో కోనసీమలో శుద్ధశ్రోత్రియ వైదిక బ్రాహ్మణ పుటక పుట్టి, 1961లో చనిపోయే లోపల చిన్నా పెద్దా నిడివిగల 65 తెలుగుకథలు రాసిన శాస్త్రిగారిని తెలుగు ప్రపంచపు దిగ్దంతులు చాలామంది గొప్ప స్రష్టగానూ, గొప్ప వ్యక్తిగానూ గుర్తించారు. యేటుకూరి బలరామమూర్తిగారు ఈయన్ని ‘కథక చక్రవర్తి’ అన్నారు. పోరంకి దక్షిణామూర్తిగారు ‘జాతి రచయిత’ అని చాటగా, వాకాటి పాండురంగారావుగారు ‘తెలుగు వేళ్ళున్న ప్రపంచస్థాయి రచయిత’ అన్నారు. ‘కనక్‌ ప్రవాసి’గారు ఈయన రచనలమీద పి.హెచ్‌డి.,పరిశోధన గ్రంథం ప్రచురించి వాటికి ‘అకాడమీ’లో స్థానాన్ని ఇచ్చారు.

ఫిడేల్ రాగాల డజన్ ఆనాటి కవిత్వానికి విద్యుత్ చికిత్స అయింది. భావకవిత్వంలో ఏవి సున్నితంగా చెప్పుకుంటారో వాటి నన్నిటినీ హేళన చేసిన “anti-poem” పఠాభి రచన. అయితే శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది.

అర్థాలతో పద్యాలు చెప్పీ చెప్పీ, లోకానికీ నిజానికీ మధ్య దూరం పెరిగిపోతోందన్న దశలో కొందరు కవులు ఆ భాషని బతికించడానికి ఇలాంటి పద్యాలు రాస్తారు. అంటే లోకంలో భాషని వాడడం మానేసి భాషలో మరో లోకాన్ని సృష్టిస్తారు. ఒకరకంగా ఈ పనే చేసారు పఠాభి.

ఇన్ని అనువాదాలకు నోచుకున్న మూలాలు నాకయితే ఎక్కువగా తెలియవు. ఆ దృష్టితో చూస్తే రవీంద్రుల మూలగీతపు రవికిరణాలు ఇంద్రధనుస్సులోని కొన్ని కొన్ని వర్ణాల కలయికలలా ఆయా అనువాదాల్లో వ్యక్తమయ్యాయి.

ఆ మధ్య (తెలుగునాడి, జనవరి 2006) వెల్చేరు నారాయణరావు గారు “కృష్ణరాయల కవిపోషణ నిజమా?” అనే చిరువ్యాసంలో కృష్ణరాయల “ఆముక్తమాల్యద” లోని ఒక పద్యానికి వ్యాఖ్యానం అందించారు. అది చూశాక కృష్ణరాయలికి సంబంధించి ప్రచారంలో ఉన్న భావాల్ని ఇంకొంచెం పరిశీలించాలనిపించింది.

ప్రవాసాంధ్రులుగా జీవితం గడిపిన మనలో కొందరు తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుభూతి గల ఇతరులు దీన్ని అభిరుచి అనీ, గిట్టనివాళ్ళు దురద అనీ అంటూ ఉంటారు.

“సాహిత్యం వల్ల తాత్కాలిక ప్రయోజనం విశేషంగా ఉండటమే కాక అది త్వరగా అయిపోతే అంత మంచిది… నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏకోశానా లేదు.”

“కథ ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? పాత్రలను ఎలా మలచాలి? ఎటువంటి నేపథ్యంలో చెప్పాలి? ఎటువంటి కంఠస్వరం ఉపయోగించాలి? ఎల్లాంటి దృష్టికోణంలో చెప్పాలి?” అన్న ప్రశ్నలకి సమాధానమే కథా శిల్పం.

ఆడ వాళ్ళు కొన్ని చదవకూడదు, కొన్ని నేర్చుకోకూడదు. ఎందుకు? గుడి లో ఇంత వరకే వెళ్ళచ్చు దాటి లోపలకి వెళ్ళకూడదు. ఎందుకు? పూజారి అవటానికి అర్హులు కారు… ఎందుకు? అని అడిగితే ఇచ్చే జవాబుల్లో మొదటిలో కాని, చివరిలో కాని, మొత్తానికి ఒకే విషయం వచ్చేది: “ముట్టు.”

దురదృష్టవశాత్తూ ఎక్కువమంది తెలుగువాళ్ళకి సినిమాలో శంకరాభరణం శంకరశాస్త్రి అంటే తెలుస్తుందికాని ఈమని శంకరశాస్త్రి అంటే తెలియకపోవచ్చు. వీణలో మహామహోపాధ్యాయుడైన ఈమని శంకరశాస్త్రిగారి కచేరీలు విన్నవారికి ఆయన గొప్పదనం ఎటువంటిదో తెలిసినదే.