రచయిత వివరాలు
పూర్తిపేరు: జె. యు. బి. వి. ప్రసాద్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
జె. యు. బి. వి. ప్రసాద్ రచనలు
అస్తమానూ, “ఉత్తరం రాయీ, ఉత్తరం రాయీ” అంటుంటే, “దేని గురించి రాయమంటావూ?” అని నేనడిగినప్పుడు, “ఏదో ఒకటి రాయి. పిల్లి గురించో, కుక్క గురించో రాయి” అంటావు కదా?
ఆ వంట వాసనలకి స్వర్గం ఇంట్లో, ముఖ్యంగా వంటిట్లోనే వుందని నమ్మాడు సుబ్బారావు. “ఏంటోయి ఇవాళ వంట?” అని అడిగాడు హాస్యంగా, అన్నీ కనబడుతూ వున్నా.
“‘మదర్స్ డే’ నాడు మదర్స్ లా వుండక్కర్లేదు. ‘ఫాదర్స్ డే’ నాడు ఫాదర్స్ లా వుండక్కర్లేదు.ఇదేమీ బాగో లేదు అస్సలు” అంది నిక్కచ్చిగా. “పోదురూ! మీకు చాదస్తం ఎక్కువ. అలాంటివి పట్టించు కోకూడదు” అంది మొదటావిడ హాస్యంగా.
“హరిణి గుజరాతీ అమ్మాయి అని మా అమ్మ అభ్యంతరం. మా నాన్నకీ అదే అభ్యంతరం అని నా నమ్మకం” కాస్త కోపంగా అన్నాడు.
నాన్నగారూ! మీకెప్పటి నించో చెబుదామనుకుంటున్నాను. చాలా కాలం నించీ నాకు దేముడి విషయాల మీద నమ్మకం పోయింది. ఆ కార్యక్రమాలు నేను ఇక చెయ్యలేను.
అమాయకులైన కుశలవులూ, కపటత్వంగల సీతా, ఫెమినిస్టు శూర్పణఖా, వెరసి “సమాగమం” కథ!
ఇప్పుడే అర్థమయింది నాకు నేను చేసిన తప్పు. తను చెయ్యకూడని పని ఎదటివాళ్ళ సంతోషం కోసం కూడా చెయ్యకూడదు అని.
నామిని బడిపిల్లల కోసం ఒక పుస్తకం రాశారు. ఇందులో రచయిత సదుద్దేశాన్ని అపార్థం చేసుకోకూడదు. పిల్లలకి ఎన్నో మంచి విషయాలు చెప్పాలనే రచయిత తాపత్రయం. […]
ఇంటి ముందర ఆగిన రిక్షాని చూసి రామూ సంభ్రమంగా అరిచాడు, “అమ్మా, మనింటి ముందు రిక్షా ఆగిందే!” అని. వాళ్ళమ్మ గుంభనంగా నవ్వింది. అర్థం […]
పదహారేళ్ళ మా పిల్లాడు ఒక కేథలిక్ హైస్కూల్లో పదకొండవ తరగతి చదువుతున్నాడు. వాడి చిన్నప్పటి నించీ వాడిని పెంచడంలో ఎక్కడ తప్పులు చేస్తానో అని నన్ను నేను చెక్ చేసుకుంటూనే వస్తున్నాను. నాకిష్టం లేకపోయినా అమెరికన్ ఫుట్‌బాల్ టీమ్‌లో చేరనిచ్చాను. వాడికోసమని అర్థం కాకపోయినా వాడి ప్రతీ మాచ్‌కీ వెళ్ళాను. నెగ్గినప్పుడల్లా వాడితో పాటూ నేనూ సంతోషించాను. ఓడినప్పుడల్లా వాడితో పాటూ నేనూ విచారిమ్చాను. ఐదవ తరగతి నించీ వాడిని ప్రైవేటు స్కూళ్ళో చేర్పించాను ఖర్చు ఎక్కువైనా. వాడికి కావలసినవన్నీ కొంటూనే వున్నాను. వాడికి స్నేహితుడిలా కూడా ప్రవర్తించేవాడిని. ఫ్రీగా ఆర్య్గూ చేయనిచ్చేవాడిని. బేంక్ బేలన్సులూ, నా జీతం అన్నీ తెలుసు వాడికి. చిన్నపిల్లాడిలా ట్రీట్ చెయ్యకుండా అన్ని విషయాలూ చెప్తూవుండేవాడిని. అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడిని ఏం కొనుక్కోడానికన్నా. నాకిష్టం అయిన కర్నాటక సంగీతం క్లాసులు మానేసి, వాడి కిష్టమయిన కరాటే క్లాసులకి వెళతానంటే అలాగే ఒప్పుకున్నాను. పక్కా శాఖాహారినయినప్పటికీ, స్కూళ్ళో మాంసం తినడం నేర్చుకుని ఆ రుచుల కోసం అడుగుతూ వుంటే, వాడి కోసమ్ నేర్చుకుని ఇంట్లో మాంసం వండేవాడిని.
బి.యస్సీ రెండవ యేడాది వరకూ కాకినాడలో తెలుగు మీడియంలో చదివాను. ఆ తరువాత హైదరాబాద్‌లో ఇంగ్లీషు మీడియంలో చదవాల్సి వచ్చింది. యూనివర్సిటీ మార్పు అనేది […]