“అవునొరేయ్. బొత్తాల్లో ఉన్న సుకవే సుకం రా. జుప్పు అటిటు ఆడకుండా ఆగిపోయిందనుకో. బాచేయటానికి కాజా గాడింకో ఇరవయ్యో పాతికో దొబ్బుతాడు. రాంబారికో యాభై ఎకరం గొబ్బిరితోటుంది కాబట్టి, ఆళ్ళ మాంగారు ఇంకో యాభై పల్లంకొట్టి పిల్లనిచ్చేరు. నీకూ నాకూ ఏం వుంది? తాడుంటే బొంగరవుండదు. బొంగరవుంటే తాడుండదు.” జిప్ ప్యాంట్ కుట్టించడం విరమించుకున్నాడు సత్తిగాడు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు రచనలు
బండ్రాజు పుట్టినప్పుడు అతని జాతకం చూసిన సత్రంలోని సాధువులూ సన్నాసులూ ‘సిరి నీకు చిడుమూ గజ్జీ పట్టినట్టు పట్టేస్తుందని, బండోడికి అదృష్టం, దరిద్రం తగులుకున్నట్టు తగులుకొంటుందని’ ఒకటే ఊదరగొట్టారు. బండ్రాజు పదహారేళ్ళ ప్రాయంవాడైనా ఇప్పటికీ వాళ్ళా బాకా ఊదడం మానలేదు. అది నిజమని నమ్మిన నరసరాజు ఇంటి తలుపులు వేసేస్తే లక్ష్మీదేవి ఎక్కడ రావడం మానేస్తుందోనన్న అనుమానంతో వాటిని బార్లా తెరిచే వుంచడం మొదలెట్టాడు.
మనకి చెప్పుకోడానికి చరిత్ర లేదు. అది లేకపోవడమే నా శిరోభారానికి మూలం. అవును ఏం ఉన్నా లేకపోయినా పాలకులకి చరిత్ర ముఖ్యం. అదెంత బాగుంటే… అంత బాగా మనం గుర్తింపు పొందుతాం. అర్ధవయ్యిందా? అందుకని మనం మన చరిత్రని రాయించుకోవాల! అవసరమైతే అసలు చరిత్రలని తిరగ రాయించెయ్యాల. అడ్డొస్తున్నాయనుకుంటే ఆ పాత చరిత్రలని చింపి పారెయ్యాల!
జనార్ధనరాజుకి రోజూ పిట్ట మాంసం వుండాలి. లేకపోతే ముద్ద దిగదు. నల్లగా నేరేడుపండులా నిగనిగలాడే జనార్ధనరాజు వయస్సు యాభైకి అటూ ఇటూ వుంటాయి. అంతటి నలుపు మొహంలోనూ ఎర్రటి పెదాలు ఎప్పుడూ తాంబూలం వేసుకున్నట్టు కనిపిస్తాయి. కాంతులీనే ఆయన కళ్ళు ఎలాటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆడవాళ్ళనైతే మరీను. ఆయన్ని బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆయన కళ్ళ వెనక కదిలే భావాల గురించి తెలుస్తుంది.
మేకకి సంబంధించినంతవరకూ చావు అనేది, కత్తికీ దాని కుత్తుకకీ మధ్య కార్యకారణ సంబంధం. ఇందులో వాదోపవాదాలకీ తర్కోపతర్కాలకీ తావు లేదన్నది కత్తిమేక ప్రగాఢ విశ్వాసం. చావుని దూరం లాగో, భారం లాగో, కాలం లాగో, వేగం లాగో కొలవడం సాధ్యం కాదని, అన్నీ కలగలిపిన ఓ క్రొత్త ప్రక్రియని కనిపెట్టాలని, చావుని బెత్తడు దూరం నుంచి తప్పించుకొన్నప్పుడే కత్తిమేక నిశ్చయించుకొంది.
ఒక్క టూ మినిట్స్ టైమ్ ఇవ్వండి సార్. టోటల్ ప్రోజక్ట్ డిటైల్స్ చెప్పేస్తాను. ఎకరాకి ఎనభై మొక్కలు వేస్తాం. ఫస్ట్ క్రాప్ పదకొండు నెలకొస్తుంది. కానీ… అది వేసే పిలకలు పెరిగి పెద్దయి గెలలేస్తే, ప్రతి మూడు నెలలకీ ఓ క్రాప్‌లా అనిపిస్తుంది. యావరేజిన ఏడాదికి ఫోర్ కటింగ్స్. ఎలా లేదన్నా గెలకి వంద పీసులుంటాయి. ప్రభుత్వం ‘లెవీ’కి యాభై పళ్ళు తీసేసినా, జస్ట్ టూ లాక్స్ మీవి కాదనుకుంటే… మీ టూ హండ్రెడ్స్ ఫ్రూట్స్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీక్వెల్టూ… లెక్కేసుకోండి!
కరణంగారు లేచి “కృష్ణంరాజుగారూ, మీరు మాట్టాడింది భావ్యం కాదు. పెద్దలనిబట్టో మీ కుటుంబం మీద వున్న అభిమానంతోనో జనం మీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు. ఇప్పుడు మీలో మీరే పోటీ పడతానంటే పడండి. ఎవరి సత్తా ఏంటో ప్రజలే తేలుస్తారు. అంతేకానీ ఇలా పేకాటాడో, కోడి పందేలుకట్టో అధికారం అనుభవిస్తామంటే మొత్తం గ్రామాన్ని అవమానించినట్టే!” స్థిరంగా అన్నారు.
వీధిలో పచార్లుచేస్తున్న పెదరాజుగారు పరిపరివిధాల ఆలోచిస్తున్నారు. ‘ఏమయ్యుంటది? ఎలా అని వెదకడం? ఎక్కడని వెదకడం. ఆ రేవు దాటి పోతానన్న బాబయ్యని అనవసరంగా ఇలా రమ్మని గొప్పకి గొరిగించుకున్నాను. ఈ సంగతేంటో తేలకుండా ఆయన వచ్చేస్తే… విషయం ఆయన చెవిన పడితే… ఇంటి పరువు ఇద్దరి నుంచి అద్దరిదాకా గోవిందా గోవింద!
చామనచాయలో వుండే ఆయన కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా వుంటాయి. ఆ ఎరుపు కనపడకుండా నల్లకళ్ళద్దాలు కాపు కాస్తూ వుంటాయి. ఆయన పెదాలు మాడిన కెంపు రంగులో వుంటాయి. వాటిని పొగలుగక్కే సిగరెట్లు దాచి పెడుతుంటాయి. ఆయన వంటి మీద లాల్చీ షరాయిలు ఎప్పుడూ లేత మొగలి రేకుల్లా తళతళమంటుంటాయి.
రాజుగారి ప్రస్తుత పరిస్థితికీ ఈ నడింపిల్లోరి టెంకబాబుకీ ఏదో మెలికుంది. ఏంటదీ? టెంక మాటెత్తితేనే ఈయన ఉలుకులికిపడుతున్నారు. టెంకగారేమో అస్సలు ఏమీ తెలనట్టే వుంటాడు. ఆ బాబు కూడా చాలా మంచోడు. అందరితో కలివిడిగా వుంటూ ఊరికేదో ఉపకారం చేద్దాం అనే బాపతే తప్ప అల్లరి చిల్లర రకం కూడా కాదు. అసలేమై వుంటది?
వీటిలో కొమ్మూరి ఎక్కడున్నారో? కొవ్వలి ఎక్కడున్నారో? ఎంతోమంది నేరస్థులని ఒంటి చేత్తో మట్టికరిపించిన ఆ డిటెక్టివ్ యుగంధర్ రుబ్బురోట్లో నలిగిపోతుంటే… పాపం ఎంత యమయాతన పడ్డాడో. అయ్యో… అయ్యో… ఆ క్రిజ్లర్ కారు ఎలా పచ్చడయిపోయిందో? విక్రమార్కుడి భుజంమీది ఆ భేతాళుడన్నా చెట్టెక్కి తప్పించుకున్నాడా? లేకపోతే వాడూ రోట్లో పడి పచ్చడయిపోయేడా?
‘సావిత్రి మంచిదనుకున్నాను. దొంగముండన్న మాట! తాతనాన్న చెప్పులు దొబ్బుకొచ్చేసింది. అందుకేనేమో… నేను రాగానే భయపడి చస్తంది! దాచెయ్యమనేమో అమ్మా అమ్మా అని చీరుకుంటోంది. నాదగ్గరా నీ దొంగేషాలు… హన్నా! ఎవరూ చూడకుండా ఈ చెప్పులు ఇంట్లో వేసుకుని తిప్పుకుంటూ తిరుగుదామనా? పాపం తాతనాన్న చెప్పుల్లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో… ఎన్ని ముల్లు గుచ్చూ పోయాయో ఏంటో!