రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అక్కమహాదేవి వచనాలు – 3

రచన: సురేశ్ కొలిచాల
మూలం: అక్కమహాదేవి
మార్చి 2025

నాకెందుకు చూపవు నీ ముఖము?

వనమెల్లయు నీవే, దేవా, వనమందలి తరువెల్లా నీవే
తరులందాడెడు ఖగమృగమెల్లా నీవే
చెన్నమల్లికార్జునా, సర్వభరితుడవైన నీవు
నాకెందుకు చూపవు నీ ముఖము?

కన్నడ మూలం:
వనవెల్లా నీనె, వనదొళగణ దేవ తరువెల్లా నీనె,
తరువినొళగాడువ ఖగమృగవెల్లా నీనె.
చెన్నమల్లికార్జునా,సర్వభరితనాగి
ఎనగేకె ముఖదోరె?
(361)

చూడలేదా, మీరు చూడలేదా?

చిలిమిలి అని పలుకు చిలుకలారా!
చూడలేదా, మీరు చూడలేదా?
స్వరమెత్తి పాడేటి కోకిలలారా!
చూడలేదా, మీరు చూడలేదా?
రేగి తిరిగేటి తుమ్మెదలారా!
చూడలేదా, మీరు చూడలేదా?
కొలనిని ఆడేటి కలహంసలారా!
చూడలేదా, మీరు చూడలేదా?
గిరిగహ్వరమునాడు నెమలులారా!
చూడలేదా, మీరు చూడలేదా?
చెన్నమల్లికార్జునుడెచట నుండెనో
చెప్పలేరా, మీరు చెప్పలేరా?

కన్నడ మూలం:
చిలిమిలి ఎందు ఓదువ గిళిగళిరా,
నీవు కాణిరె, నీవు కాణిరె.
సరవెత్తి పాడువ కోగిలెగళిరా,
నీవు కాణిరె, నీవు కాణిరె.
ఎరగి బందాడువ తుంబిగళిరా,
నీవు కాణిరె, నీవు కాణిరె.
కొళనతడియొళాడువ హంసెగళిరా,
నీవు కాణిరె, నీవు కాణిరె.
గిరి గహ్వరదొళగాడువ నవిలుగళిరా,
నీవు కాణిరె, నీవు కాణిరె.
చెన్నమల్లికార్జుననెల్లిద్దహనెందు హేళిరె.
(204)

పిలిచి చూపించరే?

అళిసంకులమా, ఓ మామిడితరువా!
ఓ తెలివెన్నెల, ఓ కోకిల గణమా!
మీ అందరినీ నే వేడేదొక్కటే
నా ఒడయడు చెన్నమల్లికార్జున దేవుని చూచిన
నను పిలిచి చూపించరే?

కన్నడ మూలం:
అళిసంకులవె, మామరవె,
బెళుదింగళె, కోగిలెయె
నిమ్మనెల్లరనూ ఒంద బేడువెను.
ఎన్నొడెయ చెన్నమల్లికార్జునదేవ కండడె
కరెదు తోరిదె.
(51)

రాకూడని భవములందు వచ్చితినమ్మా!

చిచ్చులేని సెగలోన వేగితి నమ్మా!
రేగనట్టి గాయముచే నొగిలితి నమ్మా!
సుఖములేని శ్రమము నే చేకొంటినమ్మా!
చెన్నమల్లికార్జున దేవుణ్ణి వలచి
రాకూడని భవములందు వచ్చితినమ్మా!

కన్నడ మూలం:
కిచ్చిల్లద బేగెయల్లి బెందెనవ్వా.
ఏరిల్లద గాయదల్లి నొందెనవ్వా.
సుఖవిల్లదె ధావతిగొండెనవ్వా.
చెన్నమల్లికార్జునదేవంగొలిదు
బారద భవంగళల్లి బందెనవ్వా.
(166)

మనసులోని మనసు వాడు

తనువనువాయెను, మనసనువాయెను,
ప్రాణము కూడా సిద్ధమాయెను.
కినిసి రాడాయెను కిచ్చుకంటివాడు
నా ప్రాణములో నున్నవాడు, మనసులోని మనసు వాడు
నా దేవుడు చెన్నమల్లికార్జునుని గానక
నేనెట్లు బ్రతుకుదునయ్యా?

కన్నడ మూలం:
తనువనువాయిత్తు, మనవనువాయిత్తు,
ప్రాణవనువాయిత్తు.
మునిదు బారద పరి ఇన్నెంతు హేళా?
ఎన్న ప్రాణదల్లి సందు, ఎన్న మనక్కె మనవాగి నింద
ఎన్న దేవ చెన్నమల్లికార్జునన కాణదడె
ఆనెంతు బదుకువెనయ్యా.
(214)

నిను కొఱలుచు మైమరిచి యుంటి!

పగలు నాలుగు జాములు నీ కలవరమున నుంటి
రేయి నాల్గు జాములు లింగవికలావస్థ నుంటి
రేబవళ్ళు నిను కొఱలుచు మైమరిచి యుంటి
చెన్నమల్లికార్జునయ్యా, నీ వలపు కొరకు
ఆకలి దప్పులు, నిద్రయు తొఱగితినయ్యా!
(కొఱలు= కోరు; తొఱగు= తృణీకరించు)

కన్నడ మూలం:
హగలు నాల్కు జావ నిమ్మ కళవళదల్లిప్పెను.
ఇరుళు నాల్కు జావ లింగద వికళావస్థెయల్లిప్పెను.
హగలిరుళు నిమ్మ హంబలదల్లి మైమరెదొరగిప్పెను.
చెన్నమల్లికార్జునయ్యా,
నిమ్మ ఒలుమె నట్టు హసివు తృషె నిద్రెయ తొరెదెనయ్యా.
(404)

చిటచిట నిప్పులు రేగిన …

చిటచిట నిప్పులు రేగిన
నా ఆకలి తీర్చుట కనుకొందును!
ఫెళఫెళ మొయిళ్ళు కురిసిన
నా స్నానము కొరకే ననుకొందును!
తొటతొట రాళ్ళే పడిన
నాపై రాలిన పుష్పములనుకొందును!
చెన్నమల్లికార్జునయ్య!
గిరగిర శిల గిరినుండి జారి
శిరమున బడుచో
నా ప్రాణమే నీకర్పితమనుకొందును!

కన్నడ మూలం:
కిడికిడి కెదరిదడె ఎనగె
హసివు తృషెయడగిత్తెంబెను.
ముగిలు హరిదు బిద్దడె
ఎనగె మజ్జనక్కెరెదరెంబెను.
గిరి మేలె బిద్దడె ఎనగె పుష్పవెంబెను.
చెన్నమల్లికార్జునయ్యా,
శిర హరిదు బిద్దడె ప్రాణ నిమగర్పితవెంబెను.
(167)

అక్కా, నేనొక్క కలగంటి!

అక్కా, వినవే, నేనొక్క కలగంటి
ఆకు వక్కలు ప్రాలు టెంకాయలను గంటి
చిటిపొటి జడలతో తెలిపళ్ళ గురువును
భిక్షకై వాకిలిని నిలిచిన దొరను
మిక్కిలి మీరిన మక్కువతో చేపట్టితిని!
చెన్నమల్లికార్జునుని చెలువము జూచి
కన్నులు తెరచితిని! నేను కన్నులు తెరచితిని!

కన్నడ మూలం:
అక్క కేళౌ, నానొందు కనస కండె.
అక్కి అడకె ఓలె తెంగినకాయ కండె.
చిక్క చిక్క జడెగళ సులిపల్ల గొరవను
భిక్షక్కె మనెగె బందుద కండెనవ్వా.
మిక్కు మీరి హోహన బెంబత్తి కైవిడిదెను.
చెన్నమల్లికార్జునన కండు కణ్దెరెదెను.
(12)

కనుల కఱవు తీరిపోయె నేడు

పొలయు కెంజడలు
మణిమకుట మొప్పెడు పలువరుసయు
నగుమొగముతో కనుల కాంతి గలిసి
ఈరేడు భువనములకే
వెలుగైన దివ్యరూపము గంటిని
కన్న కనుల కఱవు తీరిపోయెను నేడు
గండరగండులను పెండ్లముగ నేలేటి
గఱువనే కంటి నేను!
జగదాదిశక్తితో జతకూడి జగమేలు
పరమగురువైనట్టి
చెన్నమల్లికార్జునుని నెఱవుగని బ్రతికితి నేను!

కన్నడ మూలం:
హొళెవ కెంజెడెగళ,
మణిమకుటద, ఒప్పువ సులిపల్గళ,
నగెమొగద, కంగళ కాంతియ,
ఈరేళు భువనవ బెళగువ
దివ్యస్వరూపన కండె నాను.
కండెన్న కంగళ బర హింగిత్తెనగె.
గండగండరెల్లర హెండిరాగి ఆళువ
గరువన కండె నాను.
జగదాది శక్తియొళు బెరసి
మాతనాడువ పరమగురు
చెన్నమల్లికార్జునన నిలవ కండు బదుకిదెను.
(429)

వలచిన దాననవ్వా!

నా మనసునే మాఱుకొనెనవ్వా!
నా తనువునే చూఱగొనెనవ్వా!
నా సుఖమునే సందుకొనెనవ్వా!
నా మనికినే ప్రాపుగొనెనవ్వా!
చెన్నమల్లికార్జునుని వలచినదాననవ్వా!
(మాఱుకొను=ఎదురుకొను; సందుకొను=స్వీకరించు; ప్రాపుగొను=అండగొను, ఆశ్రయించు)

కన్నడ మూలం:
ఎన్న మనవ మారుగొండనవ్వా,
ఎన్న తనువ సూరెగొండనవ్వా,
ఎన్న సుఖవనొప్పుగొండనవ్వా,
ఎన్న ఇరవనింబుగొండనవ్వా.
చెన్నమల్లికార్జునన ఒలుమెయవళాను.
(101)

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    మాధురి March 6, 2025 4:33 pm

    ఎంతో సరళమైన భాషలో, తేట తెలుగులో ఉన్న ఈ పద్యాలు (చెన్న మల్లికార్జున ముద్ర తొలగిస్తే) భావకులు అయిన ప్రణయైక జీవులు రాసుకునే ప్రేమలేఖలా అనిపిస్తున్నాయి! ఇవి చదివితే మోహ పారవశ్యానికీ, భక్తి పారవశ్యానికీ తేడా ఇంత స్వల్పమా అనిపిస్తుంది!

    నమస్సులు!

  2. 2
    Lyla Yerneni August 14, 2025 1:10 pm

    Caption: “Music in India is essentially a hand maiden of religion”

    ఈమాట పత్రికలో ఏప్రిల్ 2024 సంపాదకీయంలో, మదరాస్ మ్యూజిక్ ఎకాడమీ, కృష్ణన్ కి బహుమతి ప్రదానం, దానిపై వివాదం -జరుగుతున్నదని తెలిపినప్పుడు, ఎవరీ టి. ఎమ్. కృష్ణన్, ఏమిటీ ఎకాడమీ అని అప్పుడు దక్షిణ భారతం నుండి యూ ట్యూబ్ విడియోలు కొన్ని గంటలు చూసి, సంగీతజ్ఞుల సంభాషణలు తీరుబాటుగా విని, భారతీయ సంగీతంపై వివాదాల గురించి నన్ను నేను కొంత అప్డేట్ చేసుకున్నాను. అసలు కొన్నేళ్లుగా నేనెక్కువ వెస్టర్న్- మ్యూజిక్ హిస్టరీ క్లాసుల్లోనే కూర్చుంటున్నాను, ఇండియన్ సంగీతం గురించి చదవటం లేదని అనిపించి, వెస్టర్న్ సంగీతకారుల గురించి చదవటం కొంచెం ఆపి, మళ్లీ ఇండియన్ మ్యూజిక్ చరిత్ర గురించి చదువుదామని, దగ్గర్లోని యూనివర్సిటీ మ్యూజిక్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు తెచ్చి చదివాను.

    అందులో ఈమాట సంపాదకీయం లోని విషయాన్ని అర్ధం చేసుకోటానికి ఈ కింది పుస్తకం సహాయం చేస్తుందని అనిపించింది.

    ‘From Tanjore court to the Madras Music academy. A social history of music in South India,’ by Lakshmi Subramanian. Oxford University Press, 2006. New Delhi.

    ఐతే¸ ఈ భారతీయ రచయిత్రి లక్ష్మి తన పుస్తకంలో మొట్టమొదటిగా ఇచ్చిన Quote, -ఐరిష్ లేడీ మార్గరెట్ కజిన్స్ సంగీతం గురించి రాసి ఇండియాలోనే ప్రచురించిన పుస్తకం నుండి. ఆ quote,

    “In the Orient there is depression, lack of Joy, pessimism and passive acquiescence in bad luck, no active movement towards a determined happiness”

    ఈమె ఎవరు భలేగా చెప్పింది. (ఓరియంట్ అంటే ఇండియా మాత్రమే కాదు అని తెలిసినా,) నాకు ఇండియా నుండి ఏది చదివినా, విన్నా ఇలాగే అనిపిస్తుంది. అంతా వైరాగ్యం, ఎంతో వేదాంతం. పుట్టుటయు నిజము, చచ్చుటయు నిజము, నట్టనడిమి నీ పని నాటకము, కట్టకడపటిది కైవల్యము -ఎప్పుడూ ఇదే టాక్.

    తెలుగు పురాతనపద్యాలు, ఆధునిక కవితలు, వ్యాసాలు, కథలు, యూట్యూబ్ సంగీతం, ట్రావెలాగ్- ఎన్నో, అన్నీ -రెలిజన్. మతసంబంధి. కాకుంటే వేదాంతం.

    సరే, Orientals overall depression గురించి నన్ను నవ్వించిన అలాటి మాటలు రాసిన మార్గరెట్ కజిన్స్ ఎవరా అని, ఆమె రాసిన పుస్తకం ముందు చదివాను. ఆ పుస్తకం -Music of the Occident and Orient. Essays towards mutual understanding, by Margaret Cousins. B.G Paul &Co, Madras 1935.

    మార్గరెట్ ఐరిష్ మ్యూజికాలజిస్ట్. చాలా సంవత్సరాలు ఇరవయ్యో శతాబ్ది ఇండియాలో నివసించింది. భారతీయ శాస్త్రీయ సంగీతం డిగ్రీ కోర్సులు ప్రారంభించటంలోను, స్కూల్, కాలేజీలలో సంగీతం కర్రిక్యులమ్ క్రియేట్ చెయ్యటంలోనూ పరిశ్రమించింది. భారతస్త్రీ హక్కుల పరిరక్షణలో పాల్గొంది, మాజస్ట్రేట్ గా పనిచేసింది. మార్గరెట్ ఉద్దేశంలో ప్రతి స్కూల్, కళాశాల స్వదేశపు సంగీతం విధిగా నేర్పించాలని.

    “Just as we learn how to write script in order to ‘express our thoughts and reasonings objectively so should every child be taught the script of musical notation and the’ laws of musical composition in order to express its feelings. Originality in this form of self-expression should be encouraged from quite as early an age as is writing…”

    చక్కని ఉద్దేశం. (మా తెలుగు స్కూల్లో 1950 లలో, అందరికీ కర్ణాటక సంగీతం నేర్పారు. స్పోర్ట్స్. బైబిల్ స్టడీస్ కూడా తీసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, నేర్పారు. ఏ భాషలో పండితులు ఆ భాషలు నేర్పారు. ఆ భాషలలోని సాహిత్యాన్ని, వ్యాకరణాన్ని తెలియచేసారు. టీచర్లు కొందరు వారే పిల్లల కోసం పాఠ్యగ్రంథాలు రాసారు.)

    మార్గరెట్ పుస్తకంలో, ఇతరదేశాల సంగీతం, సంగీతకారుల పరిచయం ఉన్నది. ఆమె భర్త పొయెట్. ఐరిష్ Yeats కవి ద్వారా బెంగాలీ ఠాగోర్ రెలిజియస్ పొయట్రీ విని, ఆకర్షితులై, వారిద్దరూ ఆ తర్వాత ఇండియాకి వచ్చి నివసించారు.

    లక్ష్మి సుబ్రమణ్యన్ హిస్టొరీ ప్రొఫెసర్. ఈ సంగీత విషయకమైన పుస్తకం ప్రచురించినప్పటికి కలకత్తా నివాసి అనుకుంటాను. ఈమె తన పుస్తకం లో మద్రాస్ ఎకాడమీ వారి జర్నల్స్ నుండి ఇండియన్ సంగీతం గూర్చిన సమాచారం సేకరించి, compile చేసిన విధానం నన్ను ఆకర్షించింది. ఈమె పుస్తకం ఇంగ్లిష్ లోనే ఉన్నది.

    ఇంగ్లిష్ భాష, కంప్యూటర్ లు, సెల్ ఫోన్లు, ఇత్యాది అవసర వస్తువులపై రోజుకో పోజు వికార విప్లవాత్మక విముఖతలు జనించని మనుషులు, తెలుగు లోనే ఆలోచించి, తెలుగు లోకే అనువదించి, తెలుగులోనే సమస్తం రాయాలని అందరిపై ఆంక్షలు విధించని తెలుగువారు, సంగీతం మీద జెన్యుయైన్ ఇంటరెస్ట్ ఉన్న సరసులు, నెట్ మీద మార్గరెట్ కజిన్స్ పుస్తకం చదవవచ్చు.

    వింతగా ఉంటుంది నాకు. ఈమాట పత్రికలో ఎక్కువ రచనలు అనువాదాలే. ఎక్కువమంది నెట్ మీద ఇంగ్లిష్ అనువాద కథలు, వ్యాసాలు చదివి, వాటిని తెలుగులోకి ఇక్కడ దించినవారే. వీళ్లకు రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, బెంగాలీ, సంస్కృతం వచ్చా పాడా. ఐనా అప్పుడప్పుడూ ఈ అనువాద ప్రియులే ఒకరిద్దరు హడావిడిగా వచ్చి -ఈమాట తెలుగు పత్రిక సుమండీ, అందుకని శీర్షిక దగ్గరనుండి తోక దాకా అంతా అచ్చతెలుగులోనే రాయండీ, అని విన్నపాలూ, పితూరీలూ చేస్తుంటారు. ఎప్పటికప్పుడే సుద్దతెలుగు అభిమానులుగా ఫేక్ చేస్తూ, ఏవో సొడ్లు పెడుతుంటారు.

    సైన్స్ రచనలకు మాత్రం తెలుగు వారికి మెటీరియల్ ఎక్కడినుండి వస్తున్నదని? వీరి స్వతంత్ర పరిశోధనలు ఏమైనా ఉన్నవా. పాము కాటుకు మందు కనిపెట్టటం రాదు, విద్యుత్తు కనిపెట్టలేదు, కాని అష్టకష్టాలు పడి ఎప్పటికప్పుడు ఇంగ్లిష్ మాటలకు తెలుగుపదాలు కనిపెట్టి, మానవజాతికి ఏదో ఒరగపెట్టినట్టు మురుస్తుంటారు. ఉంటం ఇంగ్లిష్ ప్రధానభాషగా ఉన్న దేశాల్లోనే ఎంతో ఇష్టంగా ఉంటారు. తింటం, ఇంగ్లిష్ భాష వాడుతూ చేసే ఉద్యోగాల నుండి వచ్చిన డబ్బుతోనే తింటారు. మరి మల్టై లింగ్వాలిటీని అందించి ప్రోత్సహించే AI యుగంలో, ఈ హిపొక్రిట్ ఆలోచనలతొ, ఎందుకో తమను ఉత్తుత్తిగా నిర్బంధించుకుని, ఇతరులకు కూడా మోసపు సంకెళ్లు వెయ్యటానికి ప్రయత్నిస్తారు!

    సరే, సరే, ఈ మేగజిన్ లో కొన్ని నెలలుగా సాగుతున్న అనువాదం, శివభక్తి సన్యాసిని(అక్క మహాదేవి) పాటలు గురించి నాకు మరి కొంత తెలుసుకోవాలనిపించింది. కవిత్వం గురించైనా, భక్తి గురించైనా ఎవరు నాకు అర్ధం అయ్యేట్లు చెప్పగలిగిన స్కాలర్ అని ఆలోచిస్తే, నాకు కన్నడ, తమిళ, సాంస్క్రిట్, ఇంగ్లిష్ లిటరరీ స్కాలర్ -ఎ. కె. రామానుజన్ గుర్తుకు వచ్చి ఆయన ఇంగ్లిష్ రచనలున్న లావాంటి పుస్తకం నా ఇంట్లోనిదే తీసుకుని చదివాను.

    The collected essays of A.K. Ramanujan ఎన్నో ఛాప్టర్ లలో Mahadevyakka ప్రసక్తి, ఆమె కవితల అనువాదాలు ఉన్నవి. తమిళ, కన్నడ లవ్ పొయట్రీ, క్రమంగా సంఘం, దేశం లోని మార్పులతో భక్తి పొయట్రీగా ఎలా మార్పు చెందిందో, ఆ ఇవల్యూషన్, భారతీయ పొయెట్స్ మానసికస్థితులలో పరిణామాలు, చక్కని flow charts తో ఎంతైనా శాస్త్రీయంగా చెప్పారు. (ఈయన ఉద్దేశంలో, సాహిత్యం లో ప్రేమ ముందు, భక్తి తరువాత జనించాయి.)

    మొగుడంటే ఇష్టం లేక వారి ఊరి తెల్ల మల్లిపూవు మల్లికార్జునుడితో సంగమించాలనుకునే మానవ స్త్రీ మహాదేవక్క. ఈమె ‘రాధికా సాంత్వనము’ లో రాధ లాటి హీరోయిన్. ఆ కావ్యం లోని రాధ ఒకటి రెండు పద్యాల్లో ఆమెకు తన మొగుడుతో కాపురం, అతడి ఇంటిలోని వారంటే ఎంత అసహ్యమో చెపుతుంది. అవి ఈ శైవభక్తురాలి మహాదేవక్క పద్యాలను పోలినవే. తేడా ఎక్కడంటే కొందరి ఈ కవిత్వాలలో, పాటలలో లవర్స్ ఇద్దరూ దేవుళ్లు. శివుడు, పార్వతి; విష్ణువు, లక్ష్మి; ఇలా. కాని తరవాత తర్వాత మానవ కాంతలు దేవుళ్లతో ప్రేమలో పడ్డారు. వారికి కోరిక -బాగా అందగాడూ, బాగా బలవంతుడూ, ప్రపంచాన్నే పాలించగలిగిన మగదేవుడితో సంగమించాలనే. వారివి సెక్స్యుయల్ భావనలే. మామూలు మగవాళ్లు ఆనటంలేదిక వారికి. మీరాకి, సక్కుకి ఇదే కామన. (అక్కమహదేవి ఐతే, బట్టలు విప్పేసి మరీ ఊళ్ల మీద తిరిగింది. అది మగ వివస్త్ర భక్తులతో అనుకరణ/పోటీ.) ఈ రివల్యూషనరీ భక్తురాళ్లు కొందరు నల్లని వాడిని ఇష్టపడితే కొందరు తెల్లని వాడిని ఇష్టపడ్డారు. మొత్తానికి అసమర్ధునికి ఆలిగా ఉండేకన్నా బలవంతుడు భగవంతుడికి బానిసగా ఉంటమే భక్తులకు ఇష్టం.

    తర్వాత, ఇక, మగవారి భక్తి సంగీత సాహిత్యాలు పరికిస్తే, స్త్రీ భక్తులకు ఒక పవర్ఫుల్ మగవాడిపై ఉన్న కామవాంఛకూ, భారతీయ మగభక్తుల పెరపెరకూ ఏమంత తేడాలు లేవు. మగభక్తుడు కూడా దాసానుదాసుడై పోయి, దేవుడితోనే కులకాలనుకోటానికీ ఏం తేడా లేదు. రక్తమాంసాలున్న మనుషులను ఉపేక్షించి, ఇంటిపనులు మానేసి, ఊహా ఘనుడితో ఊహాలోకంలో ఎప్పుడంటే అప్పుడు విహరించటం, మరి తేలిక కాదూ.

    ఈ భక్తి గణాలలో, ఇండియాలో పైకులం మగవారి ‘దాసత్వానికీ’ , కిందికులం మగవారి దైవభక్తి లోని ‘తిరుగుబాటుతనం’ కీ ఉన్న subtle differences (స్వదేశీ విదేశీ) పొయటిక్ ఊహలలోని subversions, inversions రామానుజన్ వివరించి చెప్పాడు. From classicism to Bhakti; On Women Saints; Men, Women, and Saints; The myths of Bhakti -ఈ భాగాలన్నీ అక్కమహాదేవినీ, మరి ఇతర ఇండియన్ ప్రేమిక-భక్తులనూ తెలుసుకోటానికి నేను చదివాను.

    ఐతే ఇంతచేసి, ఇండో అమెరికన్ కల్చర్, లిటరేచర్ కి మధ్య తనను హైఫన్ గా భావించుకున్న ఎ.కె. రామానుజన్ ని చదివి, నేను మళ్లీ వచ్చి ఈ మాట పత్రికలో ఇటీవలి అనువాదపు భక్తి పద్యాలనూ, పాటలనూ విన్నప్పుడు; ఎందువలన వీరు ఇప్పుడు బిల్వమంగళుని, అక్కమహాదేవిని అనువాదం చేసినారు, ఈ రచయిత, ఆ గాయని వీరు ఏ మ్యూజిక్ స్కూల్ లో చదివారు, ఈ ఖండాంతరాల కొలాబొరేషన్ కు, వీరి టెక్నాలజీ ఎక్స్పర్టిజ్ కారణమా, లేక సంగీతపు చదువా అని సందేహం కలిగింది. ఆ విషయాలు చెపితే అవీ చదువుతాను.

    నేను ఏళ్లుగా సంగీతజ్ఞుల క్లాసుల్లో కూర్చుని, విని తెలుసుకున్నది, భగవంతుడిపై కామకాంక్ష లేని కవులెందరో ఉన్నారు. వీరు మతవాదులు కూడా కారు. వీరు, తమలాటి మామూలు మనుషులతో ప్రేమలో ఉండి, వారిపైన కవిత్వం రచించారు. వీరి కవనం కూడా ఎంతైనా అందంగా ఉంటుంది.

    అలా మనుషుల మీద ప్రేమ కవిత్వంతోనూ, దైవం మీద ఆర్తి కవిత్వంతో నన్ను ఆకర్షించిందీ నాకు చటుక్కున గుర్తు వచ్చింది, అది మళ్లీ షాకీల్ బదయూనీ నే. పాడింది నౌషాద్ సంగీతానికి, మహమ్మద్ రఫీనే.

    “…ఆగ్ బనే సావన్ కీ బరసా, ఫూల్ బనే అంగారే
    నాగన్ బన్ గయి రాత్ సుహానీ, పధ్థర్ బన్ గయె తారే
    సబ్ టూట్ గయే హై సహారే,
    ఓ జీవన్ అప్ నా వాపస్ లేలే, జీవన్ దేనేవాలే
    భగవాన్! భగవాన్! భగవాన్!”

    ఏ భాషైతేనేం -లిరిక్ కు, సంగీతానికి, గాయకుడికి సామరస్యం కుదిరినప్పుడు శ్రోతలు సుఖిస్తారు. భగవంతుడంటారా, ఎక్కడబడితే అక్కడ, ఎన్నిటిలోనో, ఎందరి మధ్యనో హైఫన్. ఉంచితే ఏం వచ్చె, తీసేస్తే ఏం పోయె!

    -Lyla

    (ఈ పత్రిక సంపాదకత్వం మారిన విషయం పాఠకుల గమనిక లోకి తేకముందే నేను రాసుకున్న అభిప్రాయం, ప్రచురణకై ఇప్పుడు పంపుతున్నాను. Thanks.)

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మూడు వందల రామాయణాలు
  • గణానాం త్వా గణపతిం – తెలుగు అనువాదం
  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1
  • పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2
  • సీతాంజనేయ సంభాషణం – I

ఇటువంటివే…

  1. అక్కమహాదేవి వచనాలు – 4
  2. అక్కమహాదేవి వచనాలు – 2
  3. అక్కమహాదేవి వచనాలు – 5
  4. అక్కమహాదేవి వచనాలు – 1
  5. అక్కమహాదేవి వచనాలు – 6

మార్చి 2025 సంచికలో ...

  • అక్కమహాదేవి వచనాలు – 3
  • అనుకోని అతిథి
  • అస్తిత్వవాద సాహిత్యం: 2ఆ. దొస్తోయెవ్‍స్కీ
  • ఇండియా అంటే పేదల అమెరికానా?
  • ఎవరెస్ట్ బేస్ కాంప్ – 5
  • గాజుసముద్రం
  • చరిత్రా సంస్కృతుల కథలు
  • నా కవితా వ్యాసంగం
  • పంచేంద్రియాలు: 2. చూపు
  • పుంతరేవమ్మ తల్లి
  • బెష్టు ఫ్రెండ్స్
  • మార్చ్ 2025
  • మిడ్ సమ్మర్ లవ్ డ్రీమ్
  • యూట్యూబ్‍లో ఈమాట: ఫిబ్రవరి 2025
  • రహస్యం
  • రెండు పతంజలులు, ఒక జ్ఞాపకథ
  • వచన రచనలో పదస్వరూపాలు, సింటాక్స్
  • స్త్రీవాద కథల సంపుటి: విభజిత
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఇండియా అంటే పేదల అమెరికానా?
పుంతరేవమ్మ తల్లి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.