రచయిత వివరాలు

ఆర్. దమయంతి

పూర్తిపేరు: ఆర్. దమయంతి
ఇతరపేర్లు:
సొంత ఊరు: బందరు
ప్రస్తుత నివాసం: బెంగుళూరు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: పుట్టింది బందరు, స్థిరపడింది హైదరాబాదులో. ప్రస్తుత నివాసం - బెంగుళూరు. ఎం.ఏ సోషియాలజీ చదువుకున్న వీరు జర్నలిస్ట్ గా పని చేసారు. ఇప్పటి దాకా25 కవితలు, 50 పైగా కథలు రాసారు.ప్రస్తుతం ఒక సీరియల్ రాస్తున్నారు. "చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువగా ఇష్టపడేది మాత్రం మొదటిదే. సాహిత్య విలువల్ని ప్రేమిస్తాను. సంస్కారవంతుల్ని గౌరవిస్తాను." అంటున్నారు ఈ రచయిత్రి.

 

రాత్రంతా ఒక్క కునుకైనా తీస్తే ఒట్టు. టెన్షన్… టెన్షన్. ఎప్పుడూ లేనంత ఉద్వేగం. యామిని నించి ఏ క్షణాన ఏ కబురొస్తుందో అని భయం. గుండె దడ. ఏదో జరగరానిదే జరిగుంటుందని మనసు పదే పదే సూచిస్తోంది. లేకపోతే ఇంటికెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పినా, చేయలేదంటే అర్ధం? రాత్రంతా అది కూడా నాలానే మానసిక క్షోభననుభవించి వుంటుంది. కోపంతో శ్రీధర్ అన్నయ్య యామిని మీద చేయి చేసుకోలేదు కదా?

ఏమో. ఇప్పుడు నేను చేయాల్సిన పని? ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తులసి ఇంటికి ఎందుకు వెళ్ళానో ఇప్పుడు మళ్ళీ అందుకే వెళ్ళాలి. తను విషయం చెప్పేలోగా ఆమె ‘హుష్’ అంటూ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి ఏడుస్తుంది. పిల్లలు వింటే పరువు పోతుందని. కోడలు చూస్తే జీవితమే నాశనమైపోతుందని, కొడుకు ఛీ కొడ్తాడని కారణాలు చెబుతుంది. ‘విహారికేం చెప్పమంటావ్’ అని అడుగుతాను. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడూ చెప్తుంది. కారణాలు మాత్రమే వేరు.

హాల్లో అత్తయ్యా మావయ్యా నల్ల బల్ల ఉయ్యాల మీద కూర్చున్నారు. ఒకరెదురుగా ఒకరు. ఆవిడ సన్నజాజుల మాల కడుతోంది. మావయ్య పూల మొగ్గల్ని జోడించి అందిస్తున్నాడు. చాలా దీక్షగా. ఎంత శ్రద్ధ మావయ్యకి. రోజూ మేడెక్కి పూలు కోసుకొస్తాడు. ఎండా కాలాల్లో మల్లెపూలు, కనకాంబరాలు పది మరువం రెమ్మలూ. ఇదీ ఆ సముద్రంలా ఎప్పుడొచ్చినా మనసు నిండా నిండిపోయే చిత్రమే.

ఇద్దరమూ కలిసి ఈ బంధాన్ని ‘మన అంతరంగాల సాక్షిగా అంగీకరించుకుని’ వున్నామేమో? అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు, ఇంకో అప్పుడు నేను, సర్దుకున్నాం. పెళ్ళైన కొత్తల్లో నువ్వెంత అంటే నువ్వెంత వరకూ వెళ్ళినా, ఏదో జంకు, ఇంకొంచెం బెరకు, మనల్ని ఈ గీటు దాటనీకుండా ఆపింది. అరి కట్టింది.

చల్ల గాలి తెరతెరలు తెరలుగా వచ్చి, వింజామర్లు వీస్తుంటే, అలుపు తీర్చుకుంటున్నా. ఇంతలో ఒక చైనా అమ్మాయి, నా ముందు నించి ఆ అడవి లోకి ట్రెకింగ్‌కి పోతోంది. ఈ బక్క ప్రాణి అందులో చిక్కుకు పోతే ఎలా అనిపించింది. వొద్దని చెప్పబోయి ఆగిపోయాను. మనకెందుకొచ్చిన గొడవలే పోనీ అని. ఎందుకంటే ఆమె వెళ్ళే దారితో నా కొక చేదు అనుభవం వుంది.

తడారిన గాలి, వడి వడిగా నడుస్తూ నిప్పులోకి దూకుతోంది.
తన చివరి పరిమళపు జావళిని వినిపిస్తూ ఓ మల్లె
మట్టిలో రాలిన చప్పుడవుతోంది.

నాగమ్మ పని మానేయడానికి నన్ను కారణం చేస్తున్నందుకు నాకైతే భలే మండుకొచ్చింది. శాసన సభలోలా, ఈ సంసారంలో – ఈవిడ ఎప్పుడు ప్రతిపక్షమౌతుందో, ఎప్పుడు మిత్రపక్షం వహిస్తుందో తెలీదు. తను నాకు అత్తగారన్న సంగతి ఆర్నెల్లకో సారి ఇదిగో ఇలా గుర్తు చేస్తూ వుంటుంది. సుర్రుమంది మనసు. పీకల దాకా వచ్చిన కోపాన్ని నిభాయించుకోవాల్సి వచ్చింది.

అమ్మ నాకు జడ గంటలేసి, పచ్చని చేమంతి చెండు ఈ జడ మీంచి ఆ జడ మీదకి అర్థ చంద్రాకారపు వొంపు తేల్చి జడలల్లేది. పేరంటాలలో అందరూ నా జడల్ని చూసి మెచ్చు కుంటూంటే నా కంటే అమ్మకే ఎక్కువ ఆనందమేసేది. వంటింట్లో భోజనాల సమయంలో గమనించేదాన్ని; అందర్లోనూ భోగి ‘పండగ తలంటి’ కళ కొట్టొచ్చినట్టు కనిపించేది.

అంత అద్భుతంగా ఎంత కాలమో జరగలేదు. ఆ తర్వాత, పెరిగి పెద్దవుతున్న కొద్దీ పరిస్థితుల్లో, ఆలోచనల్లొ మార్పులొచ్చాయి. మబ్బులాకాశం, పిల్ల తెమ్మెరలు, వీచే గాలులు భవిష్యత్తు మీద కొత్త ఆశల్ని రేపేవి. చూసినప్పుడల్లా ప్రియమైన వారి గుర్తులేవో మోసుకొస్తున్న భావన కలిగేది.

ప్రాంగణాన పెద్ద ముగ్గు. ప్రహరీ గోడ బయట వీధిలో మరో ముగ్గు. గేట్ తీసుకుని బయటకు తొంగి చూస్తే ఇంటింటికీ ముగ్గులు. తెల్లగా నక్షత్రధూళి దారంతా పరుచుకున్నట్టు తోచేది.