కరుణముఖ్యం విషయ సూచిక

ఇస్మాయిల్“ఈ అనుభూతి కవితలో ఆలోచనకీ, తర్కానికీ, విశ్లేషణకీ స్థానం లేదు. మన పంచేంద్రియాల్ని తాకే పద చిత్రాలద్వారా మన అనుభూతిని మేలుకొలుపుతాడు కవి. తను ఉద్దేశించిన సంవేదనల్ని (feelings) మనలో రేపే పదచిత్రాల్ని (images) ఎన్నుకుంటాడన్నమాట. అనుభూతికి అవరోధమయే ఆలోచనా సామాగ్రిని దరికి జేరనివ్వడు. అనుభూతి ద్వారా మనిషికి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆ అనుభూతి స్వరూపం ఆనందం. ఇంతకన్నా పరమార్థం వేరే ఉందనుకోను.”

“క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం?” అంటూ ఎంతోమంది యువకవులకు మార్గదర్శకాలైన ఇస్మాయిల్‌ గారి ఆలోచనలని వ్యాసాలు, ఇంటర్వ్యూల రూపంలో అందించే పుస్తకం ఈ “కరుణముఖ్యం”.

విషయ సూచిక

  1. అనుభూతి కవిత్వం
  2. చంద్రుణ్ణి చూపించే వేలు
  3. “మీరు కవిత్వం ఎందుకు రాస్తారు?”
  4. నా స్వేచ్ఛాగానంలోని బంధాలు
  5. అరణ్యాన్ని సృష్టించుకో
  6. కృష్ణశాస్త్రి తపస్య
  7. కవిత్వం చేసే పని మనస్సులో దీపం వెలిగించడమే
  8. కవిత్వ విద్యుచ్చక్తి
  9. అతివాదాలు – అర్థసత్యాలు
  10. గోదావరి శర్మ
  11. స్వప్నద్వారాలు
  12. “ప్రేమని పునఃసృష్టించుకుందాం”
  13. ఐడియాలజీ
  14. నేపథ్యం
  15. మిత్రునికి వీడ్కోలు
  16. యాంటీనాచ్ కాని సౌజన్యారావు పంతులు
  17. ఆకులందున అణిగి మణిగీ
  18. సాహస యాత్ర
  19. నా మొదటి పద్యం
  20. కరుణ ముఖ్యం
  21. Sixty Years of Telugu Poetry : A telugu retrospective

అంకితం: నా బాల్య మిత్రులు ప్రయాగ వెంకన్న పంతులు, వంకా సుబ్బారావు – ఇద్దరికీ ఈ పుస్తకం