‘ఆరుగురు గుడ్డివాళ్ళు – ఏనుగు’ అన్న కథలో లాగ చలాన్ని రకరకాలుగా అర్థాలో, అపార్థాలో మనవాళ్ళు చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. నేను రెండు మూడు సార్లు చలంగారు వుండగా తిరువణ్ణామలై వెళ్ళాను. ఆంధ్ర దేశం నుండి ప్రేయసీ ప్రియులు పెళ్ళి చేసుకుందామనుకునేవారు తిరువణ్ణామలై వచ్చి చలంగారి ఎదురుగా దండలు మార్చుకునేవారు. నాకు ఆశ్చర్యం వేసింది. చలంగారేమో నవ్వుతున్నారు. ఎందుకంటే చలంగారికి వివాహ వ్యవస్థ మీద మొట్టమొదటి నుండి ఏవగింపు.
ఇస్మాయిల్
జీవిత విశేషాలు
కాకినాడ, వాల్తేరు లలో విద్యాభ్యాసం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (ఆనర్స్) పట్టా. కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్‌గా పనిచేసి ఆ తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీలో ప్రిన్సిపాల్‌గా 1988లో ఉద్యోగ విరమణ చేశారు. అధికార భాషాసంఘంలో సభ్యునిగా కొంతకాలం పనిచేశారు. లండన్‌లోని ఆంధ్ర కల్చరల్ సొసైటీ ఆహ్వానం మేరకు 1978లో ఇంగ్లాండు తదితర ఐరోపా దేశాలలో పర్యటించి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.1976 సంవత్సరానికి మృత్యువృక్షం కవితా సంపుటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని, 1990లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య విమర్శ విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు.
ఇస్మాయిల్ రచనలు
The British colonial occupation of India was not an unmitigated catastrophe, as is generally believed. It threw open […]
“ఏలూరు కమ్ముల అప్పన్నగారి కళ్ళల్లో దయ” — మ్యూజింగ్స్ I చిన్నప్పటినుంచీ అంతే. గుండె చెరువు. జాలీ కరుణతో నిండిపోయేది. కష్టాలు పడేవాళ్ళంటే. ముఖ్యంగా […]
నా మొట్టమొదటి పద్యం నాకు గుర్తు లేదు. 1942లో రాసి ఉంటాను. నవజ్యోతి అనే లిఖిత పత్రిక నడిపేవాళ్ళం మిత్రులం కొంతమందిమి కలిసి. అందులో […]
( శ్రీ ఉయ్యపు హనుమంత రావు “గీతాలహరి – కవితాఝరి” కి ముందుమాట) తనకీ కొంపెల్ల జనార్ధన రావుకీ సామాన్య ధర్మాలు పేర్కొంటూ శ్రీ […]
(శ్రీ సురేంద్ర రాజు చేసిన ఇంటర్వ్యూ 5-5-1992 న సుప్రభాతం లో ప్రచురితం) ( కవిగా ఇస్మాయిల్ “సదాబాలకుడు”. తత్వం, తర్కం, ఛందస్సు, అలంకారం […]
(మిత్రులు శ్రీ సి. ధర్మా రావు గారు రిటైరన సందర్భంలో, మార్చి 1992) 1973 లో అనుకుంటాను , నగ్నముని, రంగా రెడ్డి కలిసి […]
(మిత్రులు భమిడిపాటి జగన్నాధ రావు గారు కాకినాడ నుంచి బదిలీ అయినప్పుడు 1976 లో) జగన్నాధ రావు గారికి బదిలీ అయి వెళుతున్నారంటే , […]
1944 లో నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాను. దీనికి కారణం నా లోపలా బయటా అశాంతి.అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు.దేశ పరిస్థితులు అస్థిమితంగా ఉన్నాయి.అప్పుడే వికసిస్తున్న […]
(శ్రీ సిద్ధార్ధ చేసిన ఇంటర్వ్యూ. 23-8-1993 “ఆంధ్ర ప్రభ” దినపత్రికలో ప్రచురితం) ప్ర : మీ poetical ideology (ఆలోచనా వ్యవస్థ) ఏమిటి? జ […]
(శ్రీ ఆకెళ్ళ రవిప్రకాష్ చేసిన ఇంటర్వ్యూ. “ఆంధ్రభూమి” దినపత్రికలో 9-9-1989న ప్రచురితం) (ఇస్మాయిల్ గారిల్లు మా ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌కు ఒక మైలు దూరంలో […]
(సుమనశ్రీ ‘మహాస్వప్నం’ కు పరిచయ వాక్యాలు) పని మీద బయటికి వెడతూ ఇంటికి తాళం వేసి, కుటుంబసభ్యులకోసం తాళం చెవి ఏ గూట్లోనో, కుండీ […]
అకస్మాత్తుగా గోదావరి శర్మ చనిపోయాడని విన్నప్పుడు ఒక్కమారు మొహం తిరిగి, ‘ఛీ! ఎంత absurd!జీవితానికి అర్థం లేదు సుమా’, అనిపించింది. జీవితాన్ని కవిత్వించి, కవిత్వాన్ని […]
(శ్రీ విద్యారణ్య కాంలేకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూ. 25-9-1989 నాటి “ఆంధ్రపత్రిక”లో ప్రచురితం.) ప్ర: “కళ కళ కోసమే” అన్న వాదన మళ్ళీ ఎదో వొక […]
(శ్రీ విన్నకోట రవిశంకర్ “కుండీలో మర్రిచెట్టుకి పరిచయం”) రవిశంకర్ని నేను పదేళ్ళబట్టి ఎరుగుదును. అప్పట్లో అతను మా కాలేజీ విద్యార్థి. అప్పుడే ప్రారంభమైంది అతని […]
(శ్రీ స్మైల్ చేసిన ఇంటర్‌వ్యూ. 1988లో ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం. తేదీ గుర్తులేదు) ప్ర: మిమ్మల్ని స్పృశించిన సాహిత్య ప్రభావాలేమిటి? అవేమైనా మీకు మార్గనిర్దేశం […]
“కృష్ణపక్షం”లో ప్రకృతితో తాదాత్మ్యంతో మొదలై, ఆత్మకీ, స్వేచ్ఛకీ, అద్వైతాన్ని తెలుసుకుని సౌందర్యాన్వేషణలో పండి, ప్రేమకై తపించి, విరహాగ్నిలో కాగి, లోకం చేత నిరసింపబడి, అత్మదైన్యంతో క్రుంగి; తరవాతి కావ్యమైన “ప్రవాసం”లో అన్వేషణ తీవ్రతరం కాగా, దుఃఖంతో నిర్వేదంతో ఐక్యం చెంది, చివరికి “ఊర్వశి” కావ్యంలో సాక్షాత్కరింప చేసుకున్నారు. తనలోని మౌలిక శూన్యాన్నించి కృష్ణశాస్త్రి సాగించిన ఈ అన్వేషణ, దుఃఖమూ, నిర్వేదమూ సాధనాలుగా, చివరికి ఊర్వశీ మూర్తిని అందుకుంది.
(శ్రీ శిఖామణి “మువ్వల చేతికర్ర”కి పరిచయం) కవిత్వం రాయటానికి చిట్కా చెప్పాడు టొనీకోనర్ అనే కవి. ఒక అరణ్యాన్ని సృష్టించుకో. దాన్లో అన్వేషించుకుంటూ పో. […]
మనుషుల్ని కలిపే ఈ “మనీష” వట్టి “బుద్ధి” మాత్రమే కాదు. సానుభూతితో కూడిన అవగాహన, సహృదయత, ఇప్పటి ప్రపంచానికి ముఖ్యావసరం ఇదీ. ఇది అలవర్చుకున్నప్పుడే మనిషి స్వేచ్ఛని సాధిస్తాడు.
(శ్రీ సతీష్ చందర్ చేసిన ఇంటర్వ్యూ. జనవరి 18, 1988 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమయింది) (చెట్లు తమవేళ్ళతో ప్రహరీ గోడల్ని కూల్చేస్తున్నాయ్. లోపల తెరిచిన […]
(శ్రీ బి.వి.బి. ప్రసాద్ ‘దృశ్యాదృశ్యం’ కు భూమిక) హైకూ అంటే చంద్రుణ్ణి చూపించే వేలు; ఏరు దాటాక దిగవిడిచే తెప్ప. చంద్రుణ్ణి చూపించాక వేలు […]
ఐరిష్ కవి యేట్స్ (W.B.Yeats) చనిపోయినపుడు ఇంగ్లీషు కవి ఆడెన్ (W.H.Auden) ఒక అద్భుతమైన సంతాప పద్యం రాశాడు. ఇంగ్లీషు భాషలోని గొప్ప కవితల్లో […]
“ఈ అనుభూతి కవితలో ఆలోచనకీ, తర్కానికీ, విశ్లేషణకీ స్థానం లేదు. మన పంచేంద్రియాల్ని తాకే పద చిత్రాలద్వారా మన అనుభూతిని మేలుకొలుపుతాడు కవి. తను […]
శబ్దం నించి ప్రపంచం ఉద్భవించిందని ఒక పురాణగాధ చెబుతున్నా, పూర్వ మీమాంసకులూ, నైయాయికులూ శబ్ద శక్తి గురించి కూలంకషంగా తర్కించినా, ప్రాచ్య దేశాల్లో ఆధ్యాత్మిక […]
స్వేచ్ఛాగానం దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది గడియేని ఆగని సూర్యుణ్ణి గడియారపు బాహువులు బంధిస్తాయి పీతడెక్కల చంద్రుణ్ణి చేతులెత్తే సముద్రం […]
అకస్మాత్తుగా
ఒక రోజు
మృత్యు వృక్షం
వ్యత్యస్తంగా
తలకిందుగా
మొలిచింది.
నూతిలో తాబేలు నూతిలో తాబేలుందంటే కోతిమూకలా పరిగెత్తాం పిల్లలమంతా. తొంగి చూస్తే మా తలకాయలూ నింగి నీలిచట్రమూ కనిపించాయి. రాళ్ళూ గెడలూ ఏరుకొచ్చి నీళ్ళన్నీ […]
రవిశంకర్ని నేను పదేళ్ళబట్టి ఎరుగుదును. అప్పట్లో అతను మా కాలేజీ విద్యార్థి.అప్పుడే ప్రారంభమైంది అతని అన్వేషణ. మనిషైన ప్రతివాడిలోనూ కొద్దో గొప్పో ఈ తపన […]
భూషణ్‌పద్యాలు బక్కగా,బలంగా ఉంటాయి.ఎక్కడా పిసరంత కొవ్వు కనిపించదు. తెలుగు కవిత్వానికి లయ హృదయస్పందన వంటిదనీ,అక్షరమైత్రి ఊపిరి వంటిదనీ ఇతనికి తెలుసు.ఇతని పద్యాలు కొన్ని సీతాకోక చిలకల్లా అన్ని వేపులకీ ఒకేమారు ఎగరాలనే ప్రయత్నంలో గాలిలో రెక్కలల్లార్చుతున్నట్టు కనిపించినా,భూషణ్ సామాన్యుడు కాడు.