బయట నుంచి గుర్రం జూలు విదిలించిన శబ్దమూ గంటల శబ్దమూ వినిపించాయి. అంటే బగ్గీ సిద్ధమైందన్నమాట. కొట్టు తాలూకు తాళాల గుత్తి చేతిలోకి తీసుకుంటాడు నాన్న. గడియారం ముల్లు ఎనిమిదిన్నర వైపు కదులుతూ ఉంటుంది. క్వీచ్ క్వీచ్ మంటూ నాన్న తన కిర్రు చెప్పులు వేసుకుంటాడు. తర్వాత గొడుగు సరిగా పని చేస్తుందా లేదా చూడ్డానికి దాన్ని ఒకసారి తెరిచి మూసిన శబ్దం వినిపిస్తుంది. ఇదంతా రోజువారీ రివాజు. నెమ్మదిగా తలుపు తెరుచుకుంది.
రచయిత వివరాలు
పూర్తిపేరు: సుజాత వేల్పూరిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
సుజాత వేల్పూరి రచనలు
హోటల్‌కి వెళ్ళి టీ తాగాను. ఆకలి వేయలేదు.కడుపులో మంటగా అనిపించింది. రోజూ భోజనం పంపమని హోటల్లో ఉన్న వ్యక్తితో చెప్పాను. నా చిరునామా విని “పగలైతే పర్లేదు గానీ రాత్రి పూట హోటల్ కుర్రాళ్ళు అటు రావడానికి భయపడతారండీ. ఒకమ్మాయి ఆ ఇంటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది తెల్సా? ఆమె అక్కడే తిరుగుతుంది అంటారు మరి. మీకు దెయ్యాలంటే భయం లేదా సార్?” అన్నాడు.
కొద్ది వారాల తర్వాత ఫ్రాన్సిస్ ఆంటీ మళ్ళీ ఫోన్ చేసింది. ఇంకో ఉత్తరం రాయాలట నేను. ఆ ఉత్తరం ఫ్రాన్సిస్ అత్తయ్యకు పంపాను. కొద్ది రోజుల తర్వాత ఆమె నుంచి ఫోన్ వచ్చింది. హెరాల్డ్ ఫోన్ తీసి, మౌత్‍పీస్‍కు చెయ్యి అడ్డం పెట్టి “ఫ్రాన్సిస్ ఆంటీ, నీ ఉత్తరం గురించి లేటెస్ట్ రివ్యూ కాబోలు” అన్నాడు. ఫోన్ తీసుకున్నాను. “జోనథన్? నీ దగ్గర చాలా టాలెంట్ ఉందిరా. ఎంత బాగా రాశావో ఉత్తరం. చదువుతుంటే నాన్నమ్మ మొహం వెలిగిపోయిందనుకో. “
చిన్నప్పుడు నిజానికీ అబద్ధానికీ తేడా తెలీని అయోమయంలో ఉండేదాన్ని. పాలిపోయిన నిజం కంటే, రంగేసిన అబద్ధమే బాగుంటుందని అర్థమైంది. ఎప్పుడు సమయం చిక్కినా నా రహస్య ప్రపంచంలోకి పరిగెత్తేదాన్ని. అమ్మ పెట్టిన నియమాలను ఎగరగొట్టడంలో గొప్ప ఆనందం దొరికేది. పనివాళ్ళ కంచాల్లో తింటూ వాళ్ళతో గడపటం, చెల్లమ్మక్క వేలు పట్టుకుని పొలాల్లో నడుస్తున్న ఊహలు, గాల్లో దూరం నుంచి తేలి వచ్చే పనివాళ్ళ కేకలు. వొద్దన్న పనులు చేస్తుంటే కలిగే ఆనందం, నాలో బోల్డంత ధైర్యాన్ని నింపింది.
అమ్మకి ఇంత తలపొగరెందుకో అర్థం కాదు. కోపంగా ఉంది. బాబాయి మేము చెడిపోయే సలహాలేం ఇవ్వడుగా? అదీగాక అసలు ఊళ్ళో ఎంత బాగుంటుంది. మామిడిపళ్ళు, పనసపళ్ళు, కొండ మీద రకరకాల అడవిపళ్ళు, ఇంటి చుట్టూ దడుల మీద కాసే దోసకాయలు, పుచ్చకాయలూ… ఎన్నెన్ని దొరుకుతాయని? నదిలో స్నానం చేసి ఆడుకోవడం ఎంత హాయి! ఇవన్నీ వదిలేసి ఇక్కడ కూచుని బుట్టలు అల్లుతానంటుంది.
కొంచెం సేపు నిశ్శబ్దం ఆవరించింది. ఆ యువకుడిని తన పందెం ప్రతిపాదనతో డిస్టర్బ్ చేయడంలో పొట్టి వ్యక్తి సఫలమయ్యాడు. కాసేపు స్థిరంగానే కూచున్నా, అతనితో ఏదో అశాంతి బయలు దేరింది. అటూ ఇటూ కుర్చీలు మారాడు. చేతుల్తో ఛాతీ రుద్దుకున్నాడు కాసేపు. వీపు మీద, మెడ మీద చేత్తో తట్టుకుంటూ ఆలోచించాడు. చివరికి ఒక కుర్చీలో కూలబడి మోకాళ్ళ మీద చేతుల్తో టక టకా కొడుతూ కూచుండి పోయాడు కాసేపు. పాదాలు నేల మీద తడుతున్నాయి.
నానమ్మ చాలా ఏళ్ళుగా నిద్ర మాత్ర వేసుకుంటుంది రోజూ. ఆమె నిద్రపోయిందని నిర్థారించుకుని తాతయ్య లేచి ఉంగరం కోసం అంతటా వెదికాడు. వాష్ బేసిన్ దగ్గర, బీరువాలో, బాత్‌రూములో, అన్ని చోట్లా. ఉంగరం పోయిన సంగతి భార్యకు ఎలా చెప్పాలో తెలీడంలేదు ఆయనకి. ఏదైనా వస్తువు పోయిందంటే నానమ్మకి నేరమూ నేరస్తులూ వీటి గురించి చాలా అంచనాలుండేవి. పోగొట్టుకున్నవాళ్ళ అసమర్థత మీద కూడా.
వర్ణా నది ఒడ్డున పట్నానికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది భీమా ఊరు. ఒంట్లో ఎంత బలమున్నా, అది ఆ చిన్న వూర్లో అతని కడుపు నింపలేకపోయింది. ముంబయికి వచ్చాడు. ఊరంతా గాలించినా తగిన పని దొరకలేదు. ముంబయిలో పని దొరికి, బాగా సంపాదించాలనీ, భార్యకు కాసుల పేరు చేయించాలనీ కన్న కలలు చెదిరిపోయాయి. పని మీద ఆశ వదులుకుని శివారులో ఉన్న అడవి దగ్గర ఒక చిన్న ఊరికి చేరాడు. అక్కడికి చేరాక దగ్గర్లో ఒక క్వారీలో రాయి కొట్టే పని దొరికింది.
కథాకాలాన్ని అనుసరించి ఈ కథల్లో యుద్ధ వాతావరణమూ, యుద్ధం మీద చర్చా ఉన్నాయి. రచయితకు ఉన్న అపార విజ్ఞానం ఈ కథల్లో చోటు చేసుకున్న సంఘటనల మీద, అంతర్జాతీయ పరిణామాల మీద ఆయన వ్యాఖ్యానం తేటతెల్లం చేస్తుంది. రచయిత రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో పాల్గొని ఉండటం ఆయన నేవీ కథలకు నేపథ్యం అని స్పష్టమవుతుంది.
కాళ్ళు భూమిలో పాతేసినట్టు కదలడానికి మొరాయించాయి. చిమన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు చెప్పింది కరెక్టే. ఇక్కడ నుంచి లేచి వెళ్ళాలి నేను. ఆమె ఏ క్షణంలో ఏం చేస్తుందో? బాగ్ లోంచి కత్తి తీసి పొడిస్తే మాత్రం ఎవరు చూడొచ్చారు? అసలు ఆమె ఒక చేత్తో తోస్తే చాలు నేను కుప్పకూలిపోతాను. అంత బలంగా ఉన్నాయి ఆమె చేతులు. కొంపదీసి కరుడుగట్టిన నేరస్తుడెవరైనా ఆ బుర్ఖాలో లేడు కదా? వెన్నులో చలి పుట్టింది.
అకస్మాత్తుగా మరో లైన్ మెరిసింది మెదడులో. ఒంటి నుండి నీటి బొట్లు జారిపడుతూ ఉండగా సుష్మ కిచెన్ లోకి పరిగెత్తుకొచ్చింది, ఆ లైను మాయమయ్యే లోపే కాగితం మీద పెట్టేయాలని. తెరచి ఉన్న పరదాల వెనక నుంచి, ఎదురింట్లో పనీ పాటా లేకుండా కూచునుండే డేగ కళ్ళు రెండు తనని చూస్తున్నాయేమో అని కూడా తోచలేదు సుష్మకి. ఆ లైన్ రాయడం పూర్తయ్యేసరికి ఒంటి మీద నుంచి జారిన నీటి బొట్లతో ఆమె పాదాల చుట్టూ చిన్న మడుగు కట్టింది.
కుస్తీలో జగా ప్రావీణ్యం విని, అతడికి మరి కొన్ని ఉద్యోగావకాశాలు వచ్చి పడ్డాయి. తుపాకీ పట్టుకుని ఒక ఇంటి ముందు గార్డుగా కూచోడం, దానికి మంచి జీతం. ఇంకో ఉద్యోగం మరీ గొప్పది. కావలసినంత తిండి, జీతం, అందరూ తనని చూసి భయపడే ఉద్యోగం. యజమాని చెప్పినపుడు, ఎవరిదన్నా కాలు విరగ్గొట్టడం, మొహం పగలగొట్టడం, మెడ విరిచేయడం… ఇదీ అతని పని అక్కడ.
ఒకరోజు రాత్రి పొడుగాటి హాల్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ జంపకాన పరిచి, కొన్ని తలగడలు పడేసుకుని పడుకున్నాం. నూనె మరకలతో కనీసం గలీబులైనా లేని ఆ తలగడల అందం చూసి తీరాలి. పైన ముదురు రంగు గుడ్డ, లోపలేమో గడ్డ కట్టిన దూది ఉండలుగా పైకి కనిపిస్తూ ఉండేది. రోజంతా ఒళ్ళు హూనమయ్యేలా ఆటలాడిన పిల్లలం తలగడ మీద తల ఆనీ ఆనగానే నిద్రలో పడేవాళ్ళం. అవి రాళ్ళలా ఉంటే మాత్రం ఎవడిక్కావాలి గనక?
కాసేపటికి ఒక పడవ నెమ్మదిగా అటువైపు వచ్చి గుడిసె ముందున్న కొబ్బరి చెట్లకు సమీపంలో ఆగింది. దాని ఆశలు మళ్ళీ చిగురించాయి. ముందుకాళ్ళ మీద సాగిలపడి, తోక ఊపుతూ ఆవలించింది. పడవలోంచి ఒకడు కొబ్బరి చెట్టెక్కి, ఒక కొబ్బరి బోండాం కోసుకొని నీళ్ళు తాగి, దొప్పల్ని నీళ్ళలో విసిరేసి, పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. కుక్క నిరాశతో చూస్తూ ఉండిపోయింది.
గోపాల కామత్ కొట్లో కుప్పన్న బాకీ ఏటికేడాదీ పెరుగుతూ పోయి వెయ్యి దాటేసింది. అప్పుడప్పుడు గోపాల కామత్ పంపే మనిషి కుప్పన్న ఇంటికి పోయి డబ్బు కట్టమని అడగటం అందరికీ తెలుసు. అప్పన్న భట్ట గోపాల్ కొట్లోనే కాదు, మఠం కౌలు కూడా ఏడాది చివర్లో పైసా కూడా బాకీ లేకుండా తీర్చేస్తాడు. మఠం నుంచి కౌలు వసూలుకు వచ్చే మనిషికి అప్పన్న భట్ట ఇంట్లో సకల మర్యాదలూ దక్కుతాయి కూడా.
పేషంట్ పొట్టమీద ఆపరేషన్ చేయబోయే చోట చర్మాన్ని సమియా స్టెరిలైజ్ చేసింది. అన్వర్ స్కాల్పెల్ అందుకుని గాటు పెట్టబోతుండగా, అకస్మాత్తుగా బయట పెద్దగా కలకలం వినిపించి అతని చేయి ఆగిపోయింది. గట్టిగా ఏదో అతని వీపు మీద గుచ్చుకుంది. “చేస్తున్న పని ఆపి, ముందు, ఈ కామ్రేడ్ ఛాతీలో దిగిన బులెట్ బయటికి తియ్యి” కర్కశంగా ఆదేశించింది ఒక గొంతు.
యుద్ధం మొదలైన తొలి రోజుల్లో తన ప్రేమ కరీమ్‌తో యూనివర్సిటీలో ఎలా మొదలైందో నాకు గుర్తుంది. ఆ రోజుల్లో ఇబ్తిసామ్ ఎంతగా మారిపోయిందంటే, ఈ కొత్త పిల్ల అప్పుడే నా కళ్ళ ముందే పుట్టి పెరిగిందనిపించేది. ఆమె కళ్ళు, స్వరం, శరీరం పూర్తిగా స్త్రీత్వాన్ని సంతరించుకున్నాయి. నీలి రంగు జీన్స్ మీద, తెల్ల షర్టు, భుజాల మీదుగా వేలాడేసుకున్న నల్ల కార్డిగన్ వేసుకుని తిరిగే ఇబ్తిసామ్ నాకింకా కళ్ళ ముందే మెదులుతోంది.
అతను ఆ సంఘటనని కవితాత్మకంగా కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నాడు. ‘అతను పేలిపోయాడు’ అనే పదప్రయోగం ఇంతకుముందు ఎక్కడా వినలేదు నేను. బహుశా ఇది యుద్ధ పరిభాష అయి ఉండాలి. సందేహం లేదు, ఇది యుద్ధ భాషే. అతను చెప్తూ ఉంటే, ఆ సంఘటన నా కళ్ళ ముందే జరిగినట్టు, నేను అప్పుడు అక్కడే ఉన్నట్టుగా, అదంతా స్లో మోషన్‌లో జరిగినట్టు నా కళ్ళముందే కనిపిస్తోంది.
ఇజాలు రాసే వాళ్ళంతా వాటిని పాటిస్తారని హామీ ఏదీ లేదు. నా వరకూ నేను మానవ ప్రవృత్తిని, స్వభావాన్ని పరిశీలించడాన్ని చిత్రించడాన్ని ఇష్టపడతాను. మనుషుల సహజ స్వభావం ఎలా ఉంటుందో కథల్లో యదాతథంగా చిత్రించడానికే నా ప్రాధాన్యం. నేను రాసింది కూడా అవే!
ఇదొక 20 ఏళ్ళ యువకుడి అంతరంగ ఘోష. తెరలు తెరలుగా పొరలు వీడి నగ్నంగా పరిగెత్తే అతని ఆలోచనలు, అతని ఊహలు, అతని పశ్చాత్తాపం, అతని ధర్మాగ్రహం, అతని నిస్సహాయత, అతని ఓటమి, అవమానం, అతని గెలుపు, అతని హృదయోల్లాసం, అతని మోహం, అతని లైంగిక అశాంతి, అతని ఆకలి, అతని ప్రేమ, ఇంకా అతనివే స్నేహం, అభిరుచులు, దుఃఖం — అన్నీ అతడివే!