ఇందులో చంపడం, చావడం మాత్రమే ఉండదు. వాటి చుట్టూ అల్లుకున్న వివశత, వెర్రితనం కూడా ఉంటాయి. వాటిని గురించి వెగటూ ఉంటుంది, వెటకారమూ ఉంటుంది. ఏడ్వలేక నవ్వటమూ ఉంటుంది. అంతటి విపరీత పరిస్థితుల్లోనూ ఒకడిని ఒకడు దోచుకోవడమూ ఉంటుంది. అంతటి గందరగోళంలోనూ ఆడ-మగ, పేద-ధనిక, బలవంతుడు-బలహీనుడు మధ్య మారని హెచ్చుతగ్గులుంటాయి.
రచయిత వివరాలు
పూర్తిపేరు: సాదత్ హసన్ మంటోఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
సాదత్ హసన్ మంటో రచనలు
నువ్వు కొంచెం ఆలోచించి ఉంటే నీకు తెలిసేది నువ్వు ముమ్తాజ్‌ని, ఒక ముస్లిమ్‌ని, ఒక స్నేహితుణ్ణి కాదు చంపివేసింది, నువ్వు చంపివేసింది ఒక మనిషిని, అని. వాడొక దగుల్బాజీ అయినా సరే. నువ్వు చంపింది నీకు నచ్చని వాడి దగుల్బాజీతనాన్ని కాదు, వాడినే. వాడు ఒక ముసల్మాన్ అయితే నువ్వు వాడిలోని ముసల్మానీని చెరిపివేయలేదు. వాడి జీవితాన్నే చెరిపివేశావు.
ఒకసారి… కాస్త కనికరం ఉన్న రజాకారు ఒకడు సహరన్‌పూర్‌లో ఇద్దరు అమ్మాయిలు పాకిస్తానులో ఉన్న అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళడానికి నిరాకరించారని, వాళ్ళని అక్కడే ఒదిలిపెట్టేశానని నాకు చెప్పాడు. జలంధరులో ఒక అమ్మాయిని తాము బలవంతాన తీసుకెళ్ళినప్పుడు, అక్కడున్న కుటుంబాలన్నీ ఎవరి ఇంటి కోడలో దూరప్రయాణానికి వెళ్తున్నట్టు వీడ్కోలు చెప్పారని, ఒక రజాకారు చెప్పాడు.
మరుసటి రోజు, వాళ్ళమ్మాయి రాత్రికి రాత్రి మాయమైపోయిందని తెలుసుకున్నాక, వాడి అత్తవారింట్లో పెద్ద గొడవ మొదలైంది. ఒక వారం వరకూ ఆమె కోసం అక్కడా ఇక్కడా వెతికారు. ఎవరికీ ఈ సంగతి గురించి తెలియనివ్వలేదు. కానీ తర్వాత, అమ్మాయి వాళ్ళ అన్నయ్య నా దగ్గరకి వచ్చాడు. అతడికి తోడుదొంగనైనట్టు మొత్తం కథ చెప్పుకు రావాల్సి వచ్చింది.
మనుషులు మనుషులని చంపారు. ఆడవాళ్ళని చెరిచారు. భవనాల్లోని ఎండిన కట్టెలు, నోరులేని ఇటుకలను కూడా అదే చేశారు. ఆ తుఫానులో ఆడవాళ్ళని నగ్నంగా నిలబెట్టారని, వారి రొమ్ములను కోశారని విన్నాడు. అతడు చుట్టుపక్కల చూస్తున్నవన్నీ నగ్నంగా, ప్రాణం లేకుండా తెగి పడున్నాయి.
అంబాలా ఛావనీలో ఆమె దందా బాగా నడుస్తుండేది. ఛావనీలో తెల్లవాళ్ళు ఆమె దగ్గరకు తాగి వచ్చేవారు. ఒక మూడు నాలుగు గంటల్లో ఆమె షుమారు పదిమందిదాకా తెల్లవాళ్ళను తృప్తి పరచి ఇరవై ముప్ఫై రూపాయలదాకా పుట్టించేది. ఈ తెల్లవాళ్ళు దేశీలకన్నా మంచివాళ్ళు. వాళ్ళేం అంటున్నారో సుల్తానాకు అర్థం అయేది కాదు నిజమే కాని వాళ్ళ భాష అర్థం కాకపోవటం అనేది ఆమెకి బాగా ఉపయోగపడింది.
అదబే-లతీఫ్ మాస పత్రికలో, నా కథ ఒకటి కాలీ సల్వార్ పేరిట 1942లో అచ్చయ్యింది. దీనిని అందరూ అశ్లీలమని అన్నారు. ఇది పచ్చి అబద్ధం. కథలు రాయడం నా వృత్తి. నాకు సాహిత్యపు అన్ని లక్షణాలతోనూ పరిచయముంది. నేను ఇంతకు మునుపు ఇలాంటి అంశాల మీదే అనేక కథలు రాసున్నాను. వీటిలో ఏ కథ కూడా అశ్లీలం కాదు. నేను ఇకపై కూడా ఇలాంటి అంశాల గురించి రాస్తాను. అవేవీ కూడా అశ్లీలమవ్వవు.