రచయిత వివరాలు

స్వాతికుమారి బండ్లమూడి

పూర్తిపేరు: స్వాతికుమారి బండ్లమూడి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

ఉన్నంతసేపు దిగులుగా ఉంటావు. నవ్వితే మాత్రం పిచ్చిదాన్లా నవ్వుతావేమ్మా, అన్నాడు నాన్న. రాత్రి దాదాపు స్పృహపోతూ తలపక్కకి వాలుస్తుంటే ఏవో ఇంజెక్షన్లు పొడిచేరు నాలుగు చోట్ల. ఇవ్వాళ తల ఎంత తేలిగ్గా ఉందో, ఏ పిచ్చి ఆలోచనలు లేకుండా. ఆ ఇంజెక్షన్లేవో రోజూ చేస్తే బాగుండు. రోజూ ఇంజెక్షన్లు కావాలనుకోవడం కంటే పిచ్చి ఆలోచన ఏముంది, అన్నాడు కొడుకు. నాకెందుకో ఇంటికన్నా ఇక్కడే హాయిగా ఉంది.

అయినా విషాదాన్ని మోశాం అకారణంగానే. నిరంతర దుఃఖితులుగా బతికాం ఆయాచితంగానే. ఇప్పుడీ తటస్థ బిందువు మీద నిశ్చలంగా, ఈ గాలిబుడగలో పదిలంగా ఎదురుచూస్తున్నాం. లోతుగా లోతుగా మెలాంకొలిగ్గా జీబురు జీబురుగా ఏళ్ళకేళ్ళు సాగదీశాక ఒక్కపూట, ఒక్కపూట కావాలనే, అదేంటో చూద్దామనే ఢమఢమ మెరుపుల్ని లౌడ్‌స్పీకర్లో వేసి గదిగోడలతో పిచ్చినాట్యాలు చేయించాం.

వాళ్ళందరూ స్టేజీ సర్దేశారు. మొహాలకి పూసుకున్న రంగులు తుడిచేసుకున్నారు. తళుకుల బట్టలు మార్చి అతుకులేసిన పాతచొక్కాలు తొడిగేసుకున్నారు. కథానాయకుడున్నాడుగా, నువ్వడిగిన మాటలు మహబాగా చప్పట్లమధ్య మళ్ళీ మళ్ళీ చెప్పి గొంతు జీరబోయినవాడు, వాడు మాత్రం నల్లవిగ్గు తీసేసి ఎర్రజుట్టు దువ్వుకున్నాడు, సీసా మూత తెరుచుకు కూచుని, అప్పుడప్పుడూ ఏదో గుర్తొచ్చి అమ్మలక్కలు లంకించుకుని శివాలెత్తుతున్నాడు.

గట్టెక్కక పట్టుబడక
ఒట్టిచేతుల మెట్టమాటల
మొనాటనీ గుటకల గటగట
మధ్యకుట్టులో మూతపడ్డ పుస్తకం
మిథ్యా వాస్తవ మీటలపై
వేలికొనల పలవరింతల
డ్రిప్ డ్రాప్ డ్రిప్ డ్రాప్

బండి ఖాళీగా పోతుందనీ
ఇద్దరు మనుషులకి ఇరవై రూపాయిలే అనీ
కేకవిని చెంగుమని
లోపలికెక్కి కూలబడతాం
నెట్టుకుంటాం, సర్దుకుంటాం
లేదా చోటు దొరక్క నిలబడతాం

“మోనీ, ఒకటి చెప్తా, ప్రామిస్ చెయ్, ఎవరికీ చెప్పకూడదు.”

“ప్రామిస్, చెప్పవే ఏంటో?”

… …

“ఓ! సత్యా?! ఆరోజు బస్ వెనక చీకట్లో తనతో… అది నువ్వేనా?”

“ఏంటీ? కాలేజ్‌లో తెలిసిపోయిందా? వద్దన్నాను. నైట్ కదా! చీకట్లో ఎవరూ చూడరని… చున్నీ కప్పేసుకుని…”

“మరి ఇంట్లో చెప్పావా?”

“అమ్మో, డాడీ చంపేస్తారు. ఇంటర్ కాస్ట్ అంటే అసలొప్పుకోరు.”

మళ్ళీ ఏమైంది?
ఎవరో పిలిచారు నేలపైకి.

ఒక్క నిముషం,
నిన్నొకసారి సర్దేసి వెళ్ళనీ.
మిగిలిన రెండు జాజిపూలనీ
దిండుమీదే వదిలేసి ఉంచనీ.

ఎవరో కనబడుతారు, అంతగా తెలీని వాళ్ళు, “ఆరోజు కూడా ఇలానే మనం రైల్వే స్టేషన్లో కలిసినప్పుడూ…” అని పలకరించబోతారు- “ఆరోజు కలవలేదు, తగిలాం!” అని సవరిస్తాను. సెల్లో, పర్సో చూసుకుంటూ చాకచక్యంగా తప్పేసుకుంటారు. ఒక్కోసారి బాగా కావలసిన వాళ్ళే, “ఏమిటిక్కడ, ఎవరొస్తున్నారూ?” అని.

త్రిపుర వెతుకులాట — ప్రతీ ప్రశ్ననీ మరో పెద్ద ప్రశ్నతో రద్దు చేసి చివరికి మిగిలిన ఒకే ఒక్క ప్రశ్నను చూసి తనపై తాను జాలితో నవ్వుకుని నలుపు తెలుపుల్ని నిండుగా కలిపేసి చివరికి అసలు నేనెవరని? నేను, ఎవరు? నుదుటిపై పుట్టుమచ్చనా? కోటేరుగా ఉన్న ముక్కునా, కోటానుకోట్ల కణాల్లోంచి ప్రమాదాల్ని తప్పించుకు పుట్టేసిన ఒక…

సంధ్యా సముద్రమూ చెరోవైపు నుంచి మీదకొచ్చి పడుతుంటే తిరిగి వెళ్ళే ప్రతి అలతో పాటు ఇసుకలోకి కూరుకుపోయే పాదాల్ని పైకి లాక్కుంటూ ప్రయాసపడే వాడు దీపస్థంభానికి చిక్కుకుని రెపరెపలాడుతున్న గాలిపటంతో గుసగుసగా అన్నాడు నాకు తెలుసు ఓడిపోవడానికే మొదలెట్టాను ఈ ఆటని

మేల్కొలుపుతూ వినబడ్డాడతను
వేకువల్ని వణికించే వేణువుగా.
గాలి మడుగులో
రాగాల జాడలు పట్టుకుని
వెదుక్కుంటూ వెళ్ళి చూశానతన్ని.

చుట్టు పక్కలంతా దీపాలు వెలిగినప్పుడు,
కొండెక్కలేని ఒత్తి రెపరెపలు లీలగా…
అతనికి ఉన్నపళాన బెంబేలౌతుంది
‘వెళ్ళొస్తా’ అనడానికి తడారిన నోరు పెగలదు.
వయసు తరుముతున్నవాడిలా
చకచకా, ఒక్క విసురుతో
మెట్లపైకి దూకి పలాయిస్తాడు…