గిరియందు గాక గడ్డిదిబ్బల మీద ఆడునా నెమలి?
కొలనులో గాక చిన్నికాల్వల నీరాడునా కలహంస?
మావిచిగుళ్ళు మెసవక మోమెత్తి పాడునా కోకిల?
పరిమళములు లేని పూలపై వ్రాలునా తుమ్మెద?
నా దేవుడు చెన్నమల్లికార్జునుని గాక నా మనసు
ఇతరుల నెట్లు చేరగలదో? చెప్పరమ్మా?
రచయిత వివరాలు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
అక్కమహాదేవి రచనలు
చిటచిట నిప్పులు రేగిన
నా ఆకలి తీర్చుట కనుకొందును!
పెళపెళ మొయిళ్ళు కురిసిన
నా స్నానము కొరకే ననుకొందును!
తొటదొట రాళ్ళే పైబడిన
రాలిన పుష్పములనుకొందును!
నన్ను నేనెరుగనప్పుడు
నీవెక్కడుంటివో చెప్పవయ్యా!
స్వర్ణములోని వర్ణమువోలె
నాలోనే నీవుంటివిగాదా?
పట్టుపురుగు కోరి యిల్లు కట్టుకొనగ
తనదు పట్టు తననె చుట్టి చచ్చినట్లు
మదిని రేగు కోర్కెలు మనిషిని బంధించునయ్య!
నా మనసు దురాశల నాశమొందగజేసి
నీ దరిని జూపు చెన్నమల్లికార్జునయ్య!