[ఈ అనువాదాలను మధురంగా పాడి వీడియో రూపంలో అందజేసిన మ్యూజిక్ ఇండియా దుబాయ్ వ్యవస్థాపకురాలు శ్రీమతి ప్రశాంతి చోప్రాకు మా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియో లింకు చివర చూడవచ్చును. — సం.]
భావన మఱుగున బ్రహ్మము తాను!
నేల మఱుగున నిధివలెను
ఫలము మఱుగున రుచివలెను
శిలల మఱుగున హేమమువలెను
తిలల మఱుగున తైలమువలెను
చెట్టు మఱుగున తేజమువలెను
భావన మఱుగున బ్రహ్మమైనట్టి
చెన్నమల్లికార్జునుని నెఱవు అరయగ లేము!
నెలద మరెయ నిధానదంతె
ఫలద మరెయ రుచియంతె
శిలెయ మరెయ హేమదంతె
తిలద మరెయ తైలదంతె
మరద మరెయ తేజదంతె
భావద మరెయ బ్రహ్మవాగిప్ప
చెన్నమల్లికార్జునన నిలవనరియబారదు.
(263)
చీమ కూడా రుద్రుడవడా?
నీరక్షీరమువలె నీవుండిఉంటే
ఏది ముందో ఏది వెనుకో ఎరుగగలమా?
ఎవరు కర్తయో ఎవరు భృత్యుడో అరయగలమా?
ఏది ఘనమో ఏది చిడుగో చెప్పగలమా?
నిన్ను సతతము తలచి కొలిచిన
చీమ కూడా రుద్రుడవడా?
చెప్పవయ్యా! చెన్నమల్లికార్జునయ్యా!
నీరక్షీరదంతె నీనిప్పెయాగి,
ఆవుదు ముందు, ఆవుదు హిందు ఎందరియె.
ఆవుదు కర్తృ, ఆవుదు భృత్యనెందరియె.
ఆవుదు ఘన, ఆవుదు కిరిదెందరియె.
చెన్నమల్లికార్జునయ్యా,
నీనొలిదు కొండాడిదడె
ఇరుహె రుద్రనాగదె హేళయ్యా?
(262)
నా దేహము మన్ను, జీవమాకాశము
నా దేహము మన్ను, నా జీవమాకాశము!
దేన్ని పట్టుకొనగలనయ్య?
దేవా, నిన్నెట్లు ఎంచగలనయ్య?
నా మాయపొరలను మాపవయ్య
చెన్నమల్లికార్జునయ్య!
ఎన్న కాయ మణ్ణు, జీవ బయలు,
ఆవుద హిడివెనయ్యా.
దేవా,నిమ్మనావ పరియల్లి నెనెవెనయ్యా?
ఎన్న మాయెయను మాణిసయ్యా
చెన్నమల్లికార్జునా. (92)
పట్టుపురుగు కోరి యిల్లు కట్టుకొనగ …
పట్టుపురుగు కోరి ఇల్లు కట్టుకొనగ
తనదు పట్టు తననె చుట్టి చచ్చినట్లు
మదిని రేగు కోర్కెలు మనిషిని బంధించునయ్య!
నా మనసు దురాశల నాశమొందగజేసి
నీ దరిని జూపు చెన్నమల్లికార్జునయ్య!
తెరణియ హుళు తన్న స్నేహదింద మనెయ మాడి
తన్న నూలు తన్ననె సుత్తి సావంతె,
మన బందుదను బయసి బేవుత్తిద్దేనయ్యా.
ఎన్న మనద దురాశెయ మాణిసి నిమ్మత్త తోరా
చెన్నమల్లికార్జునా. (231)
పొందితి పొందితి సుఖాసుఖాలను!
ఒకటిగాదు రెండుగాదు మూడు కాదు నాలుగు కాదు
ఎనభై నాలుగు లక్షల యోనులనుండి
కలిగిన భవముల నుండి వచ్చితి వచ్చితి
పొందితి పొందితి సుఖాసుఖాలను!
వెనుకటి జన్మల ఊసేదైనా,
వచ్చే జన్మలో కరుణించయ్య! చెన్న మల్లికార్జునయ్య!
ఒందల్ల ఎరడల్ల మూరల్ల నాల్కల్ల
ఎంబత్తు నాల్కులక్ష యోనియొళగె
బారద భవంగళల్లి బందె బందె.
ఉండె ఉండె సుఖాసుఖంగళ.
హిందణ జన్మ తానేనాదడెయూ ఆగలి
ముందె నీ కరుణిసా, చెన్నమల్లికార్జునా. (119)