జగతినాడించు జంత్రకారుడవు
కోల చివరనున్న కోతివోలె
తాడు చివర తోలు బొమ్మవోలె
ఆడితినయ్యా నీవాడించినట్లు
పలికితినయ్యా పలికించినట్లు
జగతినాడించు జంత్రకారుడా, ఓ చెన్నమల్లికార్జునా!
బ్రతుకు గడిపితినయ్యా! నీవు చాలు, చాలనువరకు!
కోల తుదియ కోడగదంతె,
నేణ తుదియ బొంబెయంతె,
ఆడిదెనయ్యా నీనాడిసిదంతె,
ఆను నుడిదెనయ్యా నీ నుడిసిదంతె,
ఆను ఇద్దెనయ్యా నీను ఇరిసిదంతె,
జగద యంత్రవాహక చెన్నమల్లికార్జున సాకెంబన్నక్క
(181)
నీవొడ్డు మాయను అడ్డుకొనలేమయ్యా!
కాయమును నీడగా పీడించునది మాయ
ప్రాణమును మనసుగా పీడించునది మాయ
మనసును జ్ఞాపకమై పీడించునది మాయ
జ్ఞాపకమును జ్ఞానమై పీడించునది మాయ
జ్ఞానమును మరిపించు అజ్ఞానమే మాయ
జగతిలో జనతతిని ములుకోలయై గ్రుచ్చి
నడిపించునది మాయ! చెన్నమల్లికార్జునయ్యా!
నీవొడ్డు మాయను అడ్డుకొన లేమయ్యా!
కాయక్కె నెళలాగి కాడిత్తు మాయె.
ప్రాణక్కె మనవాగి కాడిత్తు మాయె.
మనక్కె నెనహాగి కాడిత్తు మాయె.
నెనహింగె అరుహాగి కాడిత్తు మాయె.
అరుహింగె మరహాగి కాడిత్తు మాయె.
జగద జంగుళిగె బెంగోలనెత్తి కాడిత్తు మాయె.
చెన్నమల్లికార్జునా,
నీనొడ్డిద మాయెయనారిగూ గెలబారదు.
(158)
గురువుల పాదములు చూచి ధన్యనైతిని
ఎండిపోయిన చెరువులో ఏరుపారి నిండినట్లు
వాడిపోయిన మొలకపై వానజల్లే కురిసినట్లు
నేడు ఇహలోకసుఖమూ, పరలోకగతులు
నడిచివచ్చినట్టాయెను నాకు
చూడవయ్యా! చెన్నమల్లికార్జునయ్యా!
గురువుల పాదములు చూచి ధన్యనైతిని చూడవయ్యా!
అరలుగొండ కెరెగె తొరె బందు హాయ్దంతాయిత్తు.
బరలుగొండ ససిగె మళె సురిదంతాయిత్తు
నోడా ఇందెనగె.
ఇహద సుఖ, పరద గతి
నడెదు బందంతాయిత్తు నోడా ఎనగె.
చెన్నమల్లికార్జునయ్యా,
గురుపాదవ కండు ధన్యళాదె నోడా.
(38)
నీవుండే తావేదో చెప్పవయ్య!
గిరియందు వనమందు ప్రతితరువునందును
“దేవా! ఓ దేవా! రావయ్యా!”
“చూపించవయ్యా నీ కరుణ” అని నేను
వెతికి వేసారితినయ్యా! నిన్నుగానక ఏడ్చితినయ్యా!
శరణుల సంగమున వెతికితిని
దాగితివని వారియందు!
నీవుండే తావేదో చెప్పవయ్య, చెన్నమల్లికార్జునయ్యా!
గిరియొళు వనదొళు గిడగిడదత్త
దేవ, ఎన్నదేవ, బారయ్యా,
తోరయ్యా నిమ్మ కరుణవనెందు,
నాను అరసుత్త అళలుత్త కాణదె
సుయిదు బందు కండె.
శరణర సంగదింద అరసి
హిడిదిహెనిందు-
నీనడగువ ఠావ హేళా చెన్నమల్లికార్జునా?
(190)
నాలోనే నీవుంటివిగాదా?
నన్ను నేనెరుగనప్పుడు నీవెక్కడుంటివో చెప్పవయ్యా!
స్వర్ణములోని వర్ణమువోలె నాలోనే నీవుంటివిగాదా?
అయ్యా! నాలోనే ఉన్నాగానీ మేను చూపని భేదమేదో
నీయందే కంటినయ్యా, చెన్నమల్లికార్జునయ్యా!
ఎన్న నానరియదల్లి ఎల్లిర్దె హేళయ్యా?
చిన్నదొళగణ బణ్ణదంతె ఎన్నొళగిర్దె.
అయ్యా ఎన్నొళగె ఇనితిర్దు మైదోరద భేదవ
నిమ్మల్లి కండె కాణా చెన్నమల్లికార్జునా.
(95)