నన్ను నేను బయటేసుకోవాలనే వుంటది.
నన్ను మోసిన తల్లికి నా నిస్సహాయతను,
నా బిడ్డల్ని మోస్తున్న తల్లికి నా నిర్లక్ష్యాన్ని తప్ప
ఏమీ ఇవ్వలేని అసమర్థుడిలా మిగిలిపోతుంటాను.
ఇద్దరు తల్లుల దీవెనార్తులే ఊపిరిగా శ్వాసిస్తుంటాను.
రచయిత వివరాలు
పూర్తిపేరు: బండారి రాజ్ కుమార్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
బండారి రాజ్ కుమార్ రచనలు
దేనికీ ఒరుసుకపోకుండా దందెడ పికిలిపోవుడేంది? ఆ దాగుడుమూతల మర్నాగిని కనిపెట్టాలె. ఇకపై కనిపెట్టుకుని వుండాలె.
ఎప్పుడు మొదలైందో ఈ వలపట దాపట తిరిగే అగులు బుగులు? ఎవలు నాటిండ్లో కలుపు బీజం? ఆరాదియ్యాలె.
ఎన్నెన్ని నిండుకుండల్లాంటి మేఘాలు! గుండుపిన్నుతో గుచ్చకుండానే టప్‌మని పేలిపోయే బెలూన్‌లా ఎంత వుబ్బిందో నా గుండెకాయ! ఎప్పుడు ముట్టుకుంటే పేలిపోతదోనని కాపలా కాస్తుంట. నీ వూహల ప్రపంచం గేటు కాడ నిలబడి, కూలబడి, నిండుకున్న వూటచెలిమల తడిని తడుముకుంటుంటే ఖాళీ ఆకాశంలో రంగుల గాలిపటాలు ఎగరేసిన సాయంత్రాలు యాదికొస్తుంటాయి. మాంజా తెగిన పతంగై నీ కోసం వెతుకుతుంటా.
ఇంటిబెల్లు గొట్టిన సూరన్న ముసుగుదన్ని పన్నంక సుత ఒడ్వని ముచ్చట్లే కాపలాగాత్తంటయి. పిట్టలు రాయబారం మోసుకొచ్చే యాల్లయితాంటది. ఆడిబిడ్డను అత్తగారింటికి సాగదోలినట్టు మనసంతా ఒకటే బుగులైతాంటది. ఒక్కొక్కలుగ తలో తొవ్వబట్టుకుని బోతాంటె బడిల వీడ్కోలు సమావేశం యాదికొత్తది. కండ్లనీళ్ళొత్తుకునుడే దక్కువ.
ఈడంత గంజి వార్సినట్టయితాందని
ఊరకుక్కలు ఓరసూపు జూత్తయి.
పలుకు మీదున్నప్పటి పదునే పదునని
పదిమంది గుడిసె సుట్టే కాపల గాత్తాంటరు.
గంజిలబడ్డ ఈగకు గాశారమా పాడా?
అని మొఖం జూసుకుంటనే గొణుగుతాంటరు.
నా కలల వాకిట్ల ముగ్గుబెట్టి
దినాం రంగులద్దిపోయే అమ్మ
పరిగేరటం ఆపి ఉరుక్కుంటావచ్చి
గుడ్లల్ల నీళ్ళు తీసుకున్నట్టే అనిపిత్తది
వీపు నిమిరి దగ్గరకు దీస్కుని ధైర్నం జెప్పే
నాయిన కళ్ళముందు మెదిలినట్టే ఉంటది
సోపతి గాళ్ళందరు మతిల కొచ్చి సొదబెట్టినట్టే ఉంటది