పురులు ఒక్కొక్కటే పికిలిపోవటం గమనిస్తూనే వున్న. ఎవల సత్తువకొద్దీ వాళ్ళు గుంజిపట్టుకునే వున్నరు. పెద్ద కొండ. చాలా ఎత్తైనది. కాశెంత ఇరుకైనది.
అంచుల మీద నిలబడి బలాబలాలు తేల్చుకుంటాల్లు. ఎవల పట్టుసడలినా కూలబడుతానికి జాగైతే లేదు. జారిపడితేనో!?
కాళ్ళకింది న్యాల తవ్వి తోడుతున్నదెవలో ఎంకులాడాలె. మట్టిపలకలు మెసలకుంట నేటువెట్టి సుట్టూతా దడిగట్టాలె.
దేనికీ ఒరుసుకపోకుండా దందెడ పికిలిపోవుడేంది? ఆ దాగుడుమూతల మర్నాగిని కనిపెట్టాలె. ఇకపై కనిపెట్టుకుని వుండాలె.
ఎప్పుడు మొదలైందో ఈ వలపట దాపట తిరిగే అగులు బుగులు? ఎవలు నాటిండ్లో కలుపు బీజం? ఆరాదియ్యాలె.
నాటిన చేతుల్ని సుత పీకిపారెయ్యాలె.