అందువలన భారతదేశప్రభుత్వము బ్రిటీషువారి చేతులలో నుండి భారతీయుల చేతులలోనికి ఎంత త్వరితముగమారిన నంత మంచిది అనుభావము వ్యాపించెను. అయితే ఈ భావము ఇంగ్లాండులోనెంత తీవ్రముగ వ్యాపించియున్నదో భారతదేశీయులెరుగరు. బ్రిటిషువారు చెప్పు మాటలను భారతీయులు విశ్వసింపరైరి. లూయీఫిషరుగారి గాంధీజీ జీవితములో ఈ సంగతిని చెప్పియున్నారు.
రచయిత వివరాలు
ఇతరపేర్లు: డి. వి. శివరావు
సొంత ఊరు: విజయవాడ
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
దిగవల్లి వేంకట శివరావు రచనలు
తిరువాన్కూరు మొదట చేసిన నిశ్చయమును మార్చుకొని భారతీయ సమితిలో చేరదలచెను. హిందూప్రజలును మహమ్మదీయ పరిపాలకుడును గలిగిన నిజాము రాజ్యము మాత్రము భారతదేశ క్రొత్త అధినివేశముల రెండింటితోనూ సంధి యేర్పాటుల ద్వారా రాజ్యాంగబంధమును కలిగుయుండుటకు నిశ్చయించెను.
1942లో జరిగిన దౌర్జన్యములకు కాంగ్రేసే ఉత్తరవాదులని గవర్నమెంటువారు నిందించగా గాంధిగారు కాదనిరి. రాజప్రతినిధి దర్శనమివ్వలేదు. ఆయన ఉపవసింపగా ఆయనకు ప్రాణాపాయకర పరిస్థితి కలిగెను. అంతట బ్రిటీషు ప్రభుత్వమువారాయనను 1944 సం. మే 6వ తేదీన చెరసాల నుండి వదిలివేసిరి.
ఈలోపు ఘాజీయుద్దీనుగారు ఢిల్లీ దర్బారు చక్రవర్తిగారి వజీరు మొదలయినవారి వలన దక్కనుసుబేదారీకి తానొక అధికారపత్రమును సంపాదించి తరలివచ్చుచున్నారని వార్తయొకటి వ్యాపించెను. అంతట సలాబతుజంగుగారు గోలకొండనుండి తక్షణమే బయలుదేరి ఔరంగాబాదు నగరమునకు పోయి అక్కడనుండుటకు నిశ్చయించిరి.
బుస్సీగారు తన కార్యసాధన విధానమున కేవలం సైనికబలముపైననే ఆధారపడి యూరకుండలేదు. అది అతని పలుకుబడికిని అధికారమునకును పునాదియైనమాట నిజమే. అంత బలవత్తరమైన స్థానమును పొందిన మరియొక సామాన్యవ్యక్తియైనచో దానిని వృథాచేసి యుండెడివాడు. బుస్సీగారికి విదేశీయుల స్వభావము, చిత్తవృత్తి బాగా తెలియును.
ఉత్తర సర్కారులోని నిజాముగారి జమీందారులు చాలా దౌర్జన్యము చేసిరని పిండారీలు, మరాటీ దండ్లు దేశమును కొల్లగొట్టుచుండెనని, హైదరాబాదు రాజ్యమున ప్రతిదినము బందిపోట్లు, దొంగతనములు జరుగుచుండెనని, రోహిలాలగుంపులు, దొంగలగుంపులు గ్రామములను దోచుకొనుచుండెనని బిల్‌గ్రామీగారు తమ గ్రంథమున వ్రాసినారు.
కర్నూలు నవాబగు గులాం రసూలుఖానుగారి కోటను తనిఖీచేయగా రహస్యాయుధాగారము బయల్పడెను. అంతట ఆయనను పట్టుకొని పదచ్యుతుని చేసి తిరుచినాపల్లిలో ఖైదుచేసిరి. ఆతడక్కడ ఇంగ్లీషువారి మెప్పుకై క్రైస్తవ దేవాలయములో ప్రార్థనలకు హాజరగుట ప్రారంభించెను. అప్పుడొక వాహబీ ఫకీరతనిని వధించెను.
హైదరాబాద్ జాడ్యములకు పుట్టినిల్లు. అక్కడ అవినీతి తప్ప మరేమియు వర్ధిల్లదు. ఆదేశము నందలి దురదృష్ట ప్రజలను తుపాకి సన్నీల (బాయొనెట్ల) వాడిమొనలను చూపి భయపెట్టియు, పదునైన ఖడ్గములను ఝుళిపించియు సొమ్ము వసూలు చేయుదురు. అక్కడి యన్యాయములకు అంతము లేదు.
చందులాల్‌గారిని గూర్చి ఆ కాలమున రెండు అభిప్రాయములుండెను. ఆయన కుటిలరాజ్యతంత్రజ్ఞుడనియు, లంచగొండియనియు, దుబారాఖర్చు చేయువాడనియు, దుర్మార్గుడనియు, కొందరాయనను గూర్చి చెప్పుచుండిరి. మరికొందరాయన చాలా మంచివాడనియు, కార్యదక్షుడనియు, స్నేహపాత్రుడనియు, దాతయనియు పొగడుచుండిరి.
మహమ్మదీయ మతమునందేగాక అన్ని మతములందును సత్యమున్నదని నమ్మిన అక్బరుచక్రవర్తి యంతటి వేదాంతికి కూడా పైన చెప్పినవానియందు కొంత విశ్వాసముండెను. ఆయన కుమారుడైన జహంగీరునకీ విషయమున వెర్రినమ్మకముండెను.
ధరణా కూర్చుని సాత్విక నిరోధము చేయుట భారతదేశములో అనాదిసిద్ధమైన సత్యాగ్రహ పద్ధతి. ఒకడింకొకనికన్యాయము చేసినయెడల అన్యాయమును పొందినవాడాయన్యాయము చేసినవాని వాకిట తిండి తినక, ఎండయనక వానయనక నిశ్చలముగా కూర్చుండి యుండును. దీనికే ధరణాకూర్పొనుటయందురు. ఇట్లు కూర్చుండి ప్రాణములను బాసినవాని యుసురాయింటివానికి గొట్టునని ప్రజలనమ్మకము.
ఇంగ్లీషు కుంపినీవారి దుష్పరిపాలనమునందు జరుగుచుండిన అన్యాయముల వలన మన్యములోని కొండరాజులు జమీందారులు తరచుగా తిరుగుబాటుచేయుచు తమ పరిసరారణ్యములోని ఆటవికజాతుల నాయకుల దగ్గర తలదాచుకొనుచుండిరి. ఆ మన్యప్రాంతములందు కల్లోలములు కలిగినప్పుడు ఆటవికజాతులును తిరుగుబాటు చేయుచుండెను.
ఇట్టి స్థితిలో నాంగ్లేయులకీ ప్రజలలో నెట్టి పలుకుబడియుండును? భయము వల్ల నేర్పడిన భక్తియేగాని ప్రేమవలన నేర్పడిన విశ్వాసము లేదు. తమ అధికారమును సంపదను హరించి తమ్ము నాశనము చేసిన ఈ ఆంగ్ల ప్రభుత్వము నీ ప్రజలు ప్రేమింతురా? తమ గౌరవమును తీసివేసి అధోగతిలోనికి దింపినవారిని వీరు మన్నింతురా?
ఈ సన్యాసులు చేసిన యుద్ధవిధానమును పరిశీలించినచో అది ధర్మయుద్ధమేయని తేటపడగలదు. లోకసంగ్రహముకొరకును మతధర్మములను రక్షించుటకును మ్లేచ్ఛులను ప్రతిఘటించి ధర్మసంస్థాపనము చేయుటలో మహానుభావులైన సన్యాసులు కూడా రాజులకు తోడ్పడినట్లు మనదేశ చరిత్రలో కొన్నియుదాహరణములున్నవి.
మహమ్మదీయులీదేశమునకు వచ్చిన కొలదికాలములోనే మారిపోయిరి. ఈ దేశమునకు వచ్చిన ముసల్మానులు క్రౌర్యమును మతావేశమును వీడి సాత్వికులైరి. ఈ దేశములోని ఇస్లాము, విదేశములలోని ఇస్లాముకు భిన్నమైన మతముగా మార్పుజెందినది. అది భారతీయ సంస్కృతిని పొంది జాతీయ మతముగా మారినది. ఈ దేశపు మహమ్మదీయులు మనోవాక్కాయకర్మములగు భారతీయులుగనేయుండిరి.
చెన్నపట్నం తూర్పు కోస్తాలో చాలా ముఖ్యమైన రేవుపట్నంగానుండేది. దేశంలో అన్నిప్రాంతాలలోను తయారైన మేలురకం నూలుబట్టలు రంగు అద్దకాలు ఇంకా తూర్పుదేశాల సరుకులు ఈ రేవునుండి సీమకు ఎగుమతి అయ్యేవి. పాండుచేరిలోని ఫ్రెంచి వర్తకులు తమ ముద్దవెండిని అమ్మడానికి చెన్నపట్నంలోని వెండిబంగారు షరాబు వర్తకుల ద్వారా వ్యాపారం జరిగించేవారు. సెంట్ ఆండ్రూస్ చర్చి ఫాదరీలు ఈ బేరాలు జరిగించేవారు.
ఇట్లు వంగరాష్ట్రములోను మనరాష్ట్రములోను కూడా ముందుగా విద్యాభివృద్ధి కొరకు ప్రారంభమయిన ప్రచారము ఆందోళనము తరువాత స్వధర్మ రక్షణముకొరకును అటుతరువాత పరిపాలనములో గల అన్యాయములను బాపుటకొరకును అటుపిమ్మట రాజ్యాంగ సంస్కరణముల కొరకును చేయబడిన రాజకీయోద్యమముగా పరిణమించెను.
భారతదేశ ప్రభుత్వమున మిషనరీల పలుకుబడి హెచ్చెను. అంతట గవర్నరులు ప్రభుత్వసభ్యులు కలెక్టర్లు జడ్జీలు వీరికి సర్వవిధములైన సాయములను జేయుచు వీరిని ప్రోత్సహింపసాగిరి. క్రైస్తవులైనవారి కుద్యోగములిచ్చుట ప్రారంభించిరి. దేశీయుల మతముతో జోక్యము కలిగించుకొనమనియు మతవిషయకమైన విచక్షణచూపమనియు కుంఫిణీవారు వాగ్దానము చేసియున్నను అందుకు విరుద్ధముగా ప్రవర్తింపసాగిరి.
1841 సంవత్సరం ఏప్రియలు 14వ తేదీన మదరాసు కాలేజి హాలులో మదరాసు యూనివర్‌సిటి ప్రారంభోత్సవము ఎల్‌ఫిన్‌స్టన్‌ప్రభువు అధ్యక్షతక్రింద జరిగెను. ఆసభకు 1500మంది పౌరులు వచ్చిరి. అంతమంది నేటివు ప్రజలు అదివరకెన్నడును ఏ సందర్భమునను చెన్నపట్టణమున సమావేశమై యుండలేదు. ఈ విద్యావిధానమును గూర్చి ప్రజలలో అంత యుత్సాహముండెనని కనపడెను.
1820లో మదరాసు స్కూలుబుక్కు సొసయిటీకి సదరు కోర్టు ఇంటర్‌ప్రిటరగు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావుగారు ఇంగ్లిషులో నొక దీర్ఘమైన లేఖ వ్రాసి ఈ దేశమునందు పాఠశాలలను సంస్కరించి ఆంగ్లేయవిద్యను వ్యాపింప జేయుడని ప్రభుత్వమువారిని కోరియుండిరి. ఈ లేఖ ఈ సొసైటీ వారి ప్రథమ నివేదికలో 1823లో ప్రకటింపబడినది.