రచయిత వివరాలు

చేకూరి రామారావు

పూర్తిపేరు: చేకూరి రామారావు
ఇతరపేర్లు: చేరా
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

ఉద్యమాన్ని నెలబాలుడుగా ఊహించటంలోనే శివసాగర్ కాల్పనిక ధోరణి వ్యక్తమవుతున్నది. అలలపై కలలు కంటాడు. అలల పైనుంచి వచ్చే చిరుగాలి సితారా ధ్వనులకు పరవశిస్తాడు. మిత్రద్రోహంచేత శత్రు చేజిక్కి తన ప్రజలకు చందమామ చేత సందేశం పంపిస్తాడు. ఏమని? ‘జీవితాంతం వరకు ప్రజలకు సేవలు చేయ విఫలమైనందుకు తన్ను క్షమించమ’ని.

ప్రాచీన కవిత్వం ఎందుకు చదవాలంటే ఎట్లా రాయకూడదో తెలుసుకోవడానికి అని ఎవరో కాదు సాక్షాత్తు శ్రీశ్రీయే అన్నాడు. ఆయన మాత్రం ప్రాచీన సాహిత్యం చదివి పాండిత్యాన్ని, భాషాపాటవాన్ని పెంచుకున్నాడు.

చాలామంది వచన పద్యం అంటే ఏమిటో చెప్పకుండానే దానిమీద పెద్ద పెద్ద వ్యాసాలు, వచన కవిత్వాన్ని గురించి కవితామయ నిర్వచనాలిచ్చారు. కవిత్వాన్ని గురించి కవిత్వంలో చెప్పితే అది లక్షణం కాదు.

ఈ చిక్కులన్నిటికీ కారణం ఛందస్సాంప్రదాయంలో ఈ వచన పద్యానికి చోటు కల్పించటం కోసం ప్రయత్నించటం. ఏదో రకమైన ఛందస్సూ, గణ విభజన ఉన్నయ్యంటే, వచన పద్యానికి అదనంగా ఏదో గౌరవం వస్తుందనుకోవటం.

భావగణ విభజనలో వ్యాకరణాంశాల పాత్రను సంపత్కుమార పూర్తిగా నిరాకరించలేదు. ఆ పాత్ర ఎంతవరకు అన్నదాంట్లోనే మాకీ అభిప్రాయ భేదం. వ్యాకరణ సంబంధాలకీ, భావాంశాలకీ ఏకైక సంబంధం ఉందని నా అభిప్రాయం.

మహాప్రస్థాన మరోప్రస్థానాలు భూమ్యాకాశాల సరిహద్దులనుకుంటే, మధ్యనున్న విశాలాకాశంలో మెరుస్తున్న గోళాలు శ్రీశ్రీ సాధించిన కవితా విజయాలు.