రచయిత వివరాలు

పూర్తిపేరు: ఇటాలో కాల్వీనో
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

పట్నాలు – ప్రేమలు: మేము ఇటుపక్క ఒడ్డు మీద ఉన్నాం. ప్రేమ అంటారే, దానిలో మునిగి. ఒకరినొకరు చూసుకుంటూ, తెలుసుకుంటూ, ఒకరి రుచి ఒకరికి వగరుగా, తెలుసుగా నీకు, ప్రేమలో. నా మనసంతా నిండిపోయిన విషాదం, ఒంటరితనం. ఆ సాయంత్రం నదుల ఒడ్డున నీడలు, కొత్త ప్రేమలలో ఉండే విషాదం, ఒంటరితనం. పాతప్రేమల నెమరువేత తెచ్చే విషాదం, ఒంటరితనం, పోగొట్టుకున్నతనం.

నిచ్చెన చివరిమెట్టు ఎక్కిన తర్వాత, నిటారుగా నిలబడి, మీరు చేతులు పైకి ఎత్తి చందమామను తాకవచ్చు. మేము జాగ్రత్తగా నిలబడి కొలుచుకున్నాం కూడా. (అప్పట్లో అది దూరంగా జరిగిపోతుందన్న అనుమానం ఏమాత్రం రాలేదు.) మీరు చేతులు ఎక్కడ పెడుతున్నారన్నది జాగ్రత్తగా గమనించవలసింది.

గూఢచారి కోడిపెట్ట: యాజమాన్యం ఎప్పుడూ పనివారిమీద ఒక కన్నేసి ఉంచాలి. కేవలం వారితో సమర్థవంతంగా పని చేయిస్తే సరిపోదు. వారి మెదడులోనూ ఖాళీలుంచకూడదు. అలా ఖాళీ ఉండి, పనివారికి ఆలోచనలొచ్చినప్పుడల్లా చరిత్రలో ఏం జరిగిందో, యాజమాన్యం వారికి తెలుసు. అందుకే వారి ఆలోచనల్లో ఎప్పుడూ కుట్ర గురించిన భయాలుంటూనే ఉంటాయి.

ఒక అద్దం, ఒక లక్ష్యం: ఒరే మాధవా! మనిషన్నాక ఒక లక్ష్యం ఉండాల్రా. జీవితంలో తనకేం కావాలో, దాన్ని ఎలా సాధించాలో తెలిసుండాల్రా. ఏం చేయదల్చుకున్నావని ఎప్పుడడిగినా అలా మాట దాటేస్తావేంట్రా! చుట్టూ చూడరా ఒకసారి. నీ స్నేహితుల్ని, మిగతావాళ్ళని చూడు. అందరూ ఎంత కష్టపడుతున్నారో చూడు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, సీఈఓలు కావాలని. కష్టపడాల్రా, లేకుంటే ఏమీ సాధించలేవు ఈ జన్మలో.

నేతల తలకోతలు: నాయకులు బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా చంపబడ్డారనేది నిజం కాదు. అలా అంటున్నారూ అంటే మన రాజ్యాంగపు చట్టాలను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాటే. నాయకులను ప్రజలతో నిజంగా కలిపే బంధం మన చట్టాల నిజమైన అర్థం, ఆశయం. నేతల తలలే తెగిపడతాయి ఎందుకూ అంటే తెగిపడడానికి సిద్ధపడని తల ఒక సమాజానికి పెద్దతల కాలేదు.

గూగోళ జ్ఞానంమన అనుభవాలను గుర్తుంచుకోవడం కోసం భాషలను పుట్టించుకొని, వ్రాయటం నేర్చుకొని సమాచారాన్ని పెంచుకోవడం పంచుకోవడమే మన లక్ష్యంగా, సమాచారమే మన ఉనికికి ప్రమాణంగా చేసుకున్నాం. సమాచార జీవితం యదార్థం గానూ, యదార్థ జీవితం సమాచారంగా మారడానికి పనికొచ్చే జ్ఞాపకంగా మాత్రమే మనం బ్రతుకుతున్నాం.

తిరగబడ్డ తొమ్మిదిఇప్పుడీ సంగతి నాకు కాక నీకొక్కడికే తెలుసు. ఇంకెవరికీ చెప్పకు! నువ్వు మర్చిపోకు! నువ్విందాక అన్నావే కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ బుర్రలు, వాటిని నడిపే మేధావులందర్నీ వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని లెక్కలేసుకోమను. కానీ ఇప్పుడు అర్థమయిందా మన లెక్కలన్నీ శుద్ధ తప్పని?

స్టాప్! స్టాప్! ఆల్ట్-కంట్రోల్-ఎఫ్8! ప్రోగ్రాం ఆపాలి. ఇంతకు ముందు ఇన్‌పుట్ చేసిన నియమం – పీక పిసికించుకున్న వ్యక్తికి కత్తిపోటు అనవసరం – మార్చాలి. కంప్యూటర్ పాత మెమరీని తుడిచేసుకొని సున్నాలూ ఒకట్లను కొత్త కొత్త వరసల్లో నిలబెట్టుకుంటోంది. నాకు సన్నగా చెమట పడుతోంది.

“ఆ కళ్ళు ఇంతకు ముందు నిన్ను ఇలా నిలదీసి చూడలేదు. నిన్ను చూసి చూపు తిప్పుకునే కళ్ళు నిన్నిప్పుడు సూటిగా చూస్తున్నాయి. నువ్వూ మెల్లిగా మర్చిపోతున్నావు. ఆ కళ్ళు అప్పటి శత్రువులవి. వీళ్ళవి కాదు. ఇప్పుడు వీళ్ళూ అవే కళ్ళతో మనల్ని చూస్తున్నారు.

హటాత్తుగా అతను నన్నే చూస్తున్నాడని నాకనిపించింది. మామూలుగా చూడటం కాదు. అతని చూపులు సూటిగా, అటూ ఇటూ తొణక్కుండా నన్ను ఆపాదమస్తకం శ్రద్ధగా చదువుతున్నట్టుగా, అక్కడితో ఆగకుండా లోపల్లోపలికి చొచ్చుకొనిపోయి నా వీపుని కూడా ఒదిలిపెట్టకుండా, నా శరీరాన్ని బైటా లోపలా కూడా శల్యపరీక్ష చేస్తున్నాట్టుగా, అబ్బ! చటుక్కున చూపు తిప్పుకున్నాను.

అప్పల్నర్సిమ్మడికి తర్కం బోధపడలేదు. “సూడండి బాబులూ. మీకేఁవో నానెవర్ని సంపినా పర్నేదు. నాకు మాత్రం ఖదీరుగాడే గావాల. ఆడికి బదులు, ఆడికేవిటికీ సమ్మందం లేనోల్లని సంపీడానికి నా మనసొప్పుకోదండి. అన్నెం పున్నెం తెలీనోల్లని చంపి ఆల్ల ఉసురు నేనెందుకండీ పోసుకుంట?” అని వాదించేడు.

“నన్ను క్షమించండి.” అన్నాను వాళ్ళను సమాధానపరుస్తూ. “బహుశా సవ్యంగా లేనిది నేనేనేమో. తప్పు నాలోనే ఉందేమో. ఎందుకో ఒక్క క్షణం నాకలా అనిపించింది. ఇప్పుడంతా మళ్ళీ మామూలుగానే, బాగానే ఉంది. దయచేసి నన్ను క్షమించండి.” అని మెల్లిగా వాళ్ళ మధ్యనుండి తల దించుకొని బయటకొచ్చాను.