రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మణికర్ణిక

రచన: పాలపర్తి ఇంద్రాణి

ముసలి కట్టెల మీది
మంటల గుబురుల్లోంచి
గంగ వైపుకి పాకే
తెల్లని పొగ పాము.

నీళ్ళల్లో ఊగుతున్న
నిర్జీవ హస్తాన్ని
ఒడ్డుకి లాగే
అఘోరా డేగ.

అట్టలు కట్టిన జుట్టుముడి
మడిచిన కాళ్ళు
ముడిచిన వేళ్ళు
మూసిన కళ్ళు
సాధువు పిసినికాయ.

పురాతన ధ్వనులేవో
ముక్కున కరుచుకుని
గంగ మీదుగా
పడవల పైకెగిరి
కాశీ ఇరుకువీధుల్లో
రెక్కలార్చే
గాలి వాయసం.

తడి పాదాలను మోస్తున్న
మూగ బండలను తట్టి
నీళ్ళు తాగి బరువెక్కిన
బట్టలను తాకి
ఊరికే మెట్లెక్కి దిగే
సూర్యుడు యాత్రికుడు

పాములు
ఆకారాలను మార్చే
మబ్బులను చేరి
వాయసాలు
నిరామయంగా ఊగుతున్న
పడవలను తాకి
డేగలు గంగ మీదికి
పంజాలు విసిరి
పిసినికాయలు
సీతాకోక చిలుకలై
నలుదిక్కులా వెదికితే
గంగ ఒడ్డున
యాత్రికుడి దోసిలిలో
దొరికిపోయింది అదిగో
మణికర్ణిక.

(శివుడు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని వెళుతున్నప్పుడు ఒక్కక్క అవయవము ఒక్కొక్కచోట పడిపోతూ ఈ ఘాట్‌ వద్ద చెవి కమ్మ పడిపోయిందని చెబుతారు. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కధనాల ప్రకారం ఇది మణికర్ణికా ఘాట్‌.)

    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    wahed November 21, 2013 10:56 am

    ముసలి కట్టెల మీది
    మంటల గుబురుల్లోంచి
    గంగ వైపుకి పాకే
    తెల్లని పొగ పాము

    ఈ ఒక్క స్టాంజా చాలు రోజంతా నెమరువేసుకోడానికి

  2. 2
    నవీన్ నంబూరి March 18, 2014 7:34 pm

    ఎందుకో తెలియదు గాని, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమా చూస్తున్నట్టు, విశాలమైన కాన్వాసు మీద గీసిన అద్భుతమైన చిత్రాన్ని చూసినట్టూ.. అనుభూతి కలిగింది!

  3. 3
    Indrani Palaparthy March 26, 2014 10:09 am

    నవీన్ గారు, లార్డ్ ఆఫ్ ద్ రింగ్స్ తో పోల్చినందుకు మీ అభిప్రాయాన్ని ప్రింట్ తీసి ఫ్రేం కట్టించుకోవాలన్నంత సంతోషం కలిగింది. 🙂

    ధన్యవాదాలు
    ఇంద్రాణి.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మరి, సరి, లాగా!
  • పిల్లల కోసం
  • నీళ్ళు కాచే పనిపిల్ల
  • Mrs. Bird’s House
  • స్నానాల గదిలో

ఇటువంటివే…

  1. అస్మిత
  2. తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు
  3. ఏం చేస్తున్నావురా!
  4. ఏ తీరుగ నను…
  5. గతమెంతో ఘనకీర్తి – భవితెంతో భవదీప్తి

సంచికలో ...

  • రుబాయీలు
  • చెట్లు
  • కత్తి పడవలు
  • కవిత్వీకరణ కొన్ని సంగతులు
  • విన్నపం
  • శిశిర గీతం
  • స్వప్నవాసవదత్తం
  • ఈరాతలు అమెరికాలో తెలుగు కథానిక
  • మన పేర్లు, ఇంటి పేర్లు
  • మీ ఘంటసాల
  • సంకల్పం
  • స్పర్శ
  • ఒక్కడినై..
  • కవి హృదయం
  • కోరిక
  • తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3
  • నిశ్చయం
  • మన దీపావళి కథ
  • సశేషమ్‌
  • 1998
  • 2005 తానా – కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
  • e తరమ్‌ (నాటిక )
  • అతిథి
  • అదే నేను
  • అనాచరణ
  • అనురాగ దగ్ధ సమాధి
  • ఆకలి నిజాయితీ
  • ఆవాహన
  • ఆశాగ్ని రేణువు
  • ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
  • ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల
  • ఉక్కు శిశువు
  • ఉన్మాద ప్రకృతి
  • ఊరెడుతున్నాను
  • ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
  • ఓటమిలోని గెలుపు
  • కలిశాం
  • గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం
  • చెప్పులు
  • జననం
  • జన్మదిన రాహిత్యం
  • జీవన తీరాలు
  • జ్ఞాపకాల వాసన
  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • టైటానిక్‌
  • డబ్బు పంజరం
  • తుపాకి కాల్పులు
  • త్రిశంకు లోకం
  • దేవుడూ
  • దేహాత్మ
  • నటించగల ప్రాణి
  • నిద్రపోతు జాతి
  • నిర్విరామం
  • నివాసం
  • పసిఁడిపల్లకి
  • పాపం ఈ లోకం
  • బహు ‘మతులు’
  • బహుశా ఇంకో నిజం
  • బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
  • భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మళ్ళీ నువ్వే!
కవులు మరిచిపోయారు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.