రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఏ తీరుగ నను…

రచన: కోడూరి విజయ్‌కుమార్‌

రోజూ సాయంత్రం పార్కులో
ఆ మూలన బెంచీలపై
ఆరుగురు ముదిమి వయసు స్త్రీలు
ఆరోగ్యం కోసమో, ఆహ్లాదం కోసమో వచ్చిన వాళ్ళకు
కాసింత సంగీత ప్రసాదం పెడతారు

‘ఏ తీరుగ నను దయ చూసెదవో ….’
అడవిలో ఒక కోకిల స్వరాన్ని మిగతా
కోయిలలు అందుకున్నట్టు
ఒకరు మొదలు పెట్టిన కీర్తనని మిగతా వాళ్ళు
రాగయుక్తంగా అందుకుంటూ
చుట్టూ వున్న లోకం గొడవలేవీ పట్టనట్టు
ఒక అలౌకిక ఆనందంలో మునిగిపోయి వుంటారు

జీవితాలని ప్రసాదించిన స్త్రీలు
జీవితాలని మోసిన స్త్రీలు
జీవిత చరమాంకం లో జీవించడం అంటే
ఒక అలౌకిక ఆనందంలో బతకడమే
అన్నంత గాఢంగా
సాయంకాలాలు పాటలలో మునిగిపోయే స్త్రీలు

స్త్రీలకు దూరంగా మరొక మూలన బెంచీలపై
కొందరు మూడు కాళ్ళ ముదిమి వయసు పురుషులు
ఇంట్లో మాటలు కరువైన రక్తబంధం గురించి ఒకరూ
మాటలు తప్ప చేతల్లేని రాజకీయాల
గురించి మరొకరూ
ఇంటా, బయటా గొడవల రహస్యం ఏదో
చరమాంకంలో కూడా అర్థంకాని అయోమయంలో
జీవితాలని బలిగోరిన పురుషులు
జీవిత పర్యంతం పరాన్న జీవులుగా బతికే పురుషులు
ఒక శ్రావ్యమైన పాటకూ, అందమైన పద్యానికీ
నోచుకోని పురుషులు
స్త్రీల వలె జీవితాన్ని కళగా జీవించడం
తెలియని పురుషులు

యౌవ్వనంలోనైనా, ముదిమిలోనైనా
ఒక పాటో, పద్యమో తోడు లేని
బతుకు ఎంత దుర్భరమో కదా

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఏ తీరుగ నను…

ఇటువంటివే…

  1. ఒక జీవితం – రెండు దృశ్యాలు
  2. గతమెంతో ఘనకీర్తి – భవితెంతో భవదీప్తి
  3. తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు
  4. ఏం చేస్తున్నావురా!
  5. అక్షరాన్నై ప్రవహిస్తాను

సంచికలో ...

  • రుబాయీలు
  • చెట్లు
  • కత్తి పడవలు
  • కవిత్వీకరణ కొన్ని సంగతులు
  • విన్నపం
  • శిశిర గీతం
  • స్వప్నవాసవదత్తం
  • ఈరాతలు అమెరికాలో తెలుగు కథానిక
  • మన పేర్లు, ఇంటి పేర్లు
  • మీ ఘంటసాల
  • సంకల్పం
  • స్పర్శ
  • ఒక్కడినై..
  • కవి హృదయం
  • కోరిక
  • తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3
  • నిశ్చయం
  • మన దీపావళి కథ
  • సశేషమ్‌
  • 1998
  • 2005 తానా – కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
  • e తరమ్‌ (నాటిక )
  • అతిథి
  • అదే నేను
  • అనాచరణ
  • అనురాగ దగ్ధ సమాధి
  • ఆకలి నిజాయితీ
  • ఆవాహన
  • ఆశాగ్ని రేణువు
  • ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
  • ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల
  • ఉక్కు శిశువు
  • ఉన్మాద ప్రకృతి
  • ఊరెడుతున్నాను
  • ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
  • ఓటమిలోని గెలుపు
  • కలిశాం
  • గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం
  • చెప్పులు
  • జననం
  • జన్మదిన రాహిత్యం
  • జీవన తీరాలు
  • జ్ఞాపకాల వాసన
  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • టైటానిక్‌
  • డబ్బు పంజరం
  • తుపాకి కాల్పులు
  • త్రిశంకు లోకం
  • దేవుడూ
  • దేహాత్మ
  • నటించగల ప్రాణి
  • నిద్రపోతు జాతి
  • నిర్విరామం
  • నివాసం
  • పసిఁడిపల్లకి
  • పాపం ఈ లోకం
  • బహు ‘మతులు’
  • బహుశా ఇంకో నిజం
  • బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
  • భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఒక జీవితం – రెండు దృశ్యాలు
మహావాక్యంగా…

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.