రచయిత వివరాలు

తల్లావజ్ఝుల శివాజీ

పూర్తిపేరు: తల్లావజ్ఝుల శివాజీ
ఇతరపేర్లు: Tallavajhula Sivaji
సొంత ఊరు: ఒంగోలు
ప్రస్తుత నివాసం: హైద్రాబాద్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు.

 

మెహక్ ఈ సంపుటి ముందుమాటలో చెప్పినట్టు రెండు ముఖ్య విషయాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకటి – ఇతివృత్తాలు, సంవిధానం, ముగింపు భిన్నంగానే కనిపిస్తాయి. రెండు – ఇరు మతాల మధ్య సయోధ్య పెంపొందించి, వైరుధ్యాలను వెదికి వేరుచేసి, చెరిపేసే కృషి వున్న సృజనశీలత. ఈ రెండు విశేషాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి ఈ కథల్లో.

ఒక పాఠకుడిగా ఝాన్సీ రాణి ప్రతి కదలికకు చలించిపోయాను. ఆవిడ ప్రేమలో పడ్డట్టే లెక్క. ఆపై, తెలివయిన గుర్రాన్ని అధీనంలో వుంచుకోడం, సకాలంలో గొప్ప వ్యూహరచన చేయడం, స్వదేశీ విదేశీ వీరులకు ధీటుగా ధైర్య ప్రదర్శన! గట్టి పట్టుదలతో తనని మోసం చేసినవారిని సైతం ఆశ్చర్యంలో పడేసే ఎత్తుగడలు! భలే మనిషి- పోనీ, భలే రాణి!

నవల చదివేవారికి చిత్రకళ, చరిత్ర, రంగుల లోతుపాతులు తెలియకపోతే ఏమీ అర్థం కాదన్న సంశయం, కళాకారుడి కళామయ జీవితం దేనికన్న సంశయం కంటే, ఒక ఆర్టిస్టుకి కళ పట్ల, జీవితం పట్ల గల అగాధపు లాలస గుండె నిండిపోయేలా కనిపిస్తుంది. అతడి జీవన వైరుధ్యాన్ని ప్రతి సెంటీమీటరు తాకి, స్పందించగల నిర్మాణం ఈ నవలలో ఉంది.

కూల్డ్రే దొర కూడా కలోనియల్ బ్రిటిష్ చిత్రకళానైపుణ్యానికి అవతల నిలబడలేదు-ఆయనదీ అదే నేత. కానీ దారితెన్ను, అతీగతీ లేని చిత్రకళాపథంలో నాటికి ఆ ప్రాంతాల్లో ఆయన కాటన్ దొర వంటి పనే చేసేరు – మంచి పంటకు మొలకలెత్తించారు నారు పోసేరు. ఆ సరసన దామెర్ల రామారావు, ఆయన సాటి కళాకారులు, మిత్రులు అతి కొద్దిమంది గొప్ప చిత్రకారులుగా మిగిలారు-ఇక్కడ.

నిజానికి మహా సౌందర్యాఘాతమూ నరకమే. అదేదో గట్టిగా అనుభవించిన దాఖలా ఈ కవిగారు తన గురించి ఈ పుస్తకంలో చెప్పినచోట కనిపించింది. నా సొంత అనుభూతిలో నడిచి నడిచి సీదా తిరిగి మళ్ళీ ఈ సంకలనంలోని కవితల్లోకి ఇరుక్కున్నట్టయింది. అంటే భారీ సెంటిమెంట్లు, మరికొళుందు వాసన గోల కాదు నాది. ఈ కవితలు పన్నిన వలే అంత!

రవివర్మ అనే ఆనాటి కళాకారుని జీవితకథలో ఒకటి రెండు మలుపులను వెదికి పెన్సిల్ చెక్కినట్టు రాసిపడెయ్యటం, కిట్టించడం కుదరదు–నాటి ప్రాంతీయ చరిత్ర, వలస కళల వాతావరణం, తైనాతీల వస్తుప్రపంచం, బ్రిటిష్ జమీందారీ అడుగుబొడుగు నీడలు సర్వసమగ్రంగా శోధించి నేతపని చేయడంవల్ల పాఠకుడికి ‘రవి’ కళాప్రపంచపు ‘అదనపు విలువలు’ బహుళ ప్రయోజనం చేకూర్చాయి.

మనం చదివిన చరిత్ర పుస్తకాలు, పరిశోధక పత్రాలు, ప్రసంగ పాఠాలూ దురదృష్టవశాత్తూ మంచి నవల రూపంలోకి మారలేదు. ఒకటీ అరా తప్ప ఇలాటి కథావస్తువు గల నవలలు ‘కాల్పనిక’ సాహిత్యమార్గం పట్టినవే. కల్పన ముఖ్యమై, చరిత్ర వాస్తవాలను తెరవెనక పారేసినట్టు వుంటాయవి. కొన్ని చారిత్రక వివరాలు మినహా వాస్తవ చిత్రణ జోలికి పోనివే అవి!

కార్యమో, కాలక్షేపమో ఏదీ తోచక సగం నిద్రలో ఎడం చేత్తో ఏవో జ్ఞాపకాలు రాసిపడేసిన (మన నెత్తిన) తీరు కథలు కావు… పుస్తకం నిండార వున్న చిన్న చిన్న సంగతులన్నీ మనిషి స్పృహ తాలూకు తేమ ఏ మాత్రం ఎండిపోకుండా వున్నా, దానికి పని కల్పిస్తాయి. పత్రికల్లో వార్త చదవనివాళ్ళకు సైతం వారి ఆలోచనల్లో చిన్నపాటి సుడిగుండమొకటి బయలుదేరి ‘వాట్ మస్ట్ బి డన్?” అని నిలదీస్తుంది.

ఉరికంబంలాగానో, ధ్వజస్థంభంలాగానో నిటారుగా నిలబడి మనం అన్నిటినీ ప్రశ్నించగలం. అసలు ప్రశ్నే ఎదురవని సమాజం చివరికి అంతరంగం కూడా సులువుగా పట్టుబడవని రచయిత నందిగం కృష్ణారావు ఈ నవలతో మనముందుకు వచ్చారు. ఆ పై, ఇరుపక్కల తోడై నీకో నిజాయితీ, నిన్ను దాటిన ప్రయోజనం, వీటిలో మనిషితనం వుండాలనీ కూడా గుర్తు చేయించే పనిపెట్టారు ఈ నవలతో.

ఇక మన ఇష్టాయిష్టాలను బట్టి ప్రాచీన సంస్కృతిని, సాహిత్యాన్ని ఎంచుకోవచ్చుగాని, భీష్మించుకుని అవే ఆనాట వాస్తవరూపాలని మొండికెత్తడాన్ని ఏమనగలం? కాలగతిలో కుల, మత, ప్రాంతీయ, రాజకీయ, తాత్త్విక గంధకం వీటిలోకి చేరడంలో ఆశ్చర్యంలేదు – మొత్తం ప్రతి అక్షరం పరమపవిత్రం అనుకోవడం, కాదు, మొత్తం అంతా చెత్త అని నేలకేసి కొట్టడమూ ఒకే రకపు జ్ఞానం.

వనవాసం చేయడానికి వస్తానన్న సీతను నివారించడంతో సీతకు రామునిపై కోపం వచ్చి స్వేచ్ఛగా ఇలా అన్నది: “రామా, నీవు పురుష శరీరంగల స్త్రీవి. నా తండ్రి నిన్ను ఏమనుకుని అల్లుడుగా చేసుకున్నాడో తెలియదు! నీవు ఏ దశరథాదుల హితం మాట్లాడుతున్నావో వారికి నీవు విధేయునిగా వుండవచ్చు గాని నన్ను వారికి విధేయురాలుగా వుండమనటం యుక్తం కాదు.”

అలా పరవశించిన తిరుగుడులో అజంతా, ఎల్లోరా, తంజావూరు, మహాబలిపురం, పట్టడకల్ చిత్ర శిల్పాలు, కంచు శిల్పాలు, తాళపత్ర చిత్రాలు, దక్షిణాది ఫ్రెస్కోల్లోని ఆకుపచ్చ, నీలి, ముదురు పసుపు, చామనచాయల్లో అందగత్తెలయిన దేవతలలో చూసింది పౌరాణిక దృశ్యాల్లో ఆధునిక రేఖల వొంపుల విన్యాసాలను, చైతన్యం తొణికిసలాడే లయనీ!

జ్ఞాపకాలు కవితల్లాగో తీయని కలల్లాగో దుఃఖాంతపు నిర్వేదంలాగో మరెలాగో వుండటం ఒక ‘సంగతి’. కానీ జ్ఞాపకాలు పరిశోధకులకు పనికివచ్చే పాఠాలుగా వుండటం మాత్రం కవిత్వ ప్రయోజనాన్ని మించిన ఆవశ్యకం. మోహన్ గీసిన రేఖలూ క్రోక్విల్ గీతలూ సౌందర్య సమీక్షకు సిసలైన సుబోధకాలు.

చాలామందికి పెయింటింగ్ అంటే కేన్వాస్ మీద ఆయిల్ కలర్స్‌తోనో ఆక్రిలిక్ రంగులతోనో వెలుగునీడలు చూపెట్టడంతోనే చిత్రంలోని ఆకారంలో చైతన్యం వస్తుంది. ఇది రేఖలతో సాధ్యం కాదనుకుంటారు; రేఖలు ‘కళ’ కిందికి రావనీ గీతలు, రేఖలనే స్ట్రోక్‌లతో నిండిన ఆకారాలను వట్టి ‘ఇలస్ట్రేషన్’ అనుకుంటారు. నిజానికి చిత్రకళకి అలాటి నియమం ఏదీ లేదు.

మరి మన మహనీయ చిత్ర శిల్ప కళాఖండాలు రెండవ ఎక్కం అప్పగించినంత సులువుగా ప్రజల కళ్ళకి కట్టడం అసాధ్యమా? కానేకాదు. సాంస్కృతిక, కళా రంగాల విశేషాలూ జనం కళ్ళలో, నోళ్ళలో నిత్యం ఉండాలంటే శ్రోతలు, పాఠకులు, సందర్శకులు, ప్రేక్షకులు, భక్తులూ అనే మనం కొంత దురభిమానం, చౌకబారు ఆనందం అనే ‘ఎంటర్‌టైన్‌మెంట్’ను కొంచం త్యాగం చేసే ప్రయత్నం చేసుకోవాల్సిందే.

మనుషులుగా మనం సంగీతం వినటం, చిత్రశిల్పాలు చూడటం, మంచి పుస్తకాలు చదవటం – ఒక సంస్కారం, సంస్కృతీ అని మనకు మనమే చెప్పుకోనిదే కళ గురించి మాట్లాడుకోవటం నిరర్థకం. ఇందుకే నోటికి వేమన, సుమతీ శతకాలు గడగడా వచ్చినట్టే కంటికి చిత్ర శిల్ప కళాఖండాలను చకచకా అప్పగించేట్టు చూడటం, చూపించటం అత్యవసర ప్రాథమిక చర్య, చికిత్స.