కళాపూర్ణోదయం: విషయ సూచిక

”కతరాజు” గా పేరుపడ్డ పింగళి సూరన సంప్రదాయ తెలుగు సాహితీకారుల్లో ఎంతో విశిష్టుడు. అతను రాసిన “కళాపూర్ణోదయం”, “ప్రభావతీ ప్రద్యుమ్నం” తెలుగు సాహిత్యంలో అపూర్వ కథా రచనలు. కథాకల్పనలో ఇతనికున్న ప్రతిభ ఇంకెవర్లోనూ కనిపించదు. పురాణపాత్రల్ని వాడుకుంటూనే పూర్తిగా స్వయంకల్పిత కథల్ని అల్లటంలోనూ ఉత్కంఠత పెంచుకుంటూ చెప్పటం లోనూ ఇతనికితనే సాటి. ఇవి రెండూ కాక చిన్నతనంలోనే “రాఘవపాండవీయం” అనే రెండర్థాల కావ్యం కూడ రాసిన ప్రతిభామూర్తి పింగళి సూరన. ఈ “కళాపూర్ణోదయం” కావ్యాన్ని తేలికైన వచనంలో“సంప్రదాయ కథా లహరి” లో భాగంగా మీకందిస్తున్నాం.

విషయ సూచిక

  1. తొలిభాగం: సిద్ధుడి ప్రవేశం
  2. రెండోభాగం: మణికంధరుడి తపోభంగం
  3. మూడోభాగం: రంభా గర్వభంగం
  4. నాలుగోభాగం సుగాత్రీశాలీనులు
  5. ఐదోభాగం: అలఘువ్రతుడు
  6. ఆరోభాగం: బ్రహ్మలోకం
  7. ఏడోభాగం: శల్యాసురుడు
  8. ఎనిమిదోభాగం: మణిహారం