Comment navigation


"కవిత" : 2035

  1. వేలూరిగారితో ఒక సంభాషణ గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    04/08/2025 2:00 am

    హనుమంతరావు గారికి:

    మీరు సూచించిన అసంబద్ధత గురించి, నా వివరణ.

    వేలూరి గారిని ఇంటర్వ్యూ శ్రీనివాస్ గారూ, నేనూ చేసాము. వీడియో ఇంటర్వ్యూ చెయ్యాలన్నది మా ప్రణాలిక. వీడియో కెమేరా మొరాయించింది. అందువలన సెల్ ఫోనులో రికార్డు చేసాము.

    కొన్ని ప్రశ్నలు శ్రీనివాస్ అడిగితే, మరికొన్ని నేను అడిగాను. మామూలు పత్రికల్లో ఇంటర్వ్యూల్లాగా, ప్రశ్నలడిగేవారి పేర్లు పెట్టలేదు.

    ఇక్కడ ఎవరు ప్రశ్న అడిగారన్నది ముఖ్యం కాదు. ప్రశ్న ఏవిటన్నదే ముఖ్యం.

    శ్రీశ్రీ అమెరికా వచ్చారా? అన్నది శ్రీనివాస్ గారు అడిగితే, తదుపరి ప్రశ్న నేను అడిగింది. శ్రీశ్రీ అమెరికా ప్రయాణం గురించి నాకు వివరం తెలుసు; అదీ వేలూరి గారి ద్వారానే! ఇది సవరించమని ఈమాటకి తెలియ పరుస్తాము.

    సంజీవ్ దేవుకి రంగులు తెలీయవని చెప్పాను–అన్న మాట ఆ ఎగ్జిబిషన్ సమయంలో మాటల మధ్య అన్నారు. దానిమీద అక్కడ చర్చ జరిగుండకపోవచ్చు. అందుకే అదొక్క వాక్యం వేలూరి చెప్పారు. మేమూ దాన్ని పొడిగించలేదు. అంతే.

    చిత్రలేఖనం వచ్చిన అందరికీ–ముఖ్యంగా పెయింటర్స్ (Water Colors or Oils) అందరికీ రంగుల ఎంపికపై అవగాహన వుండాలని లేదు. చిత్రకళలో రంగుల ఎంపికన్నది వేరే పెద్ద టాపిక్. వేలూరి గారు Modern Art Criticism మీద అమెరికాలో కోర్సులు చేసారు. ఒక పెయింటింగ్ ఎందుకు గొప్పదీ, ఎందుక్కాదూ అన్న అంశంపై గంటల కొద్దీ మాట్లాడగలరు–ఆయన పెయింటింగ్స్ వేయకపోయినా.

    ఒకానొక సందర్భంలో –బాపు గారికీ కలర్స్ ఎంపిక సరిగా వుండదని నేనే అన్నాను ఆయనతోనే, డైరెక్టుగా. ఆయన పగలబడి నవ్వి–నేను గీతాకారుణ్ణి; కలర్‌కారుణ్ణి కాదంటూ భుజం తట్టారు.

    నేను అలా అన్నానని ఆయన నాపై కోపగించుకోలేదు. బొమ్మల గురించి నీకేం తెలుసూ అని నన్ను తిట్టలేదు.

    ప్రతీ ఆర్టిస్టుకూ కొన్ని ప్రత్యేకతలుంటాయి. కొన్ని అంశాల్లో పట్టింపు వుండదు. సరిగ్గా సంజీవ్‌దేవు గారి విషయంలో కూడా వేలూరి గారి మాటలివే. ఆయన రంగుల ఎంపిక అద్భుతంగా వుండదు. అద్భుతంగా గీతలుంటాయి. అందులో తక్కువ చేసిందీ, కించపరిచిందీ ఏమీ లేదు. కొంతమంది కవిత్వమూ, కథలూ రెండూ రాస్తారు. మీ కథలు బావుంటాయి, కవిత్వం కన్నా–అంటే కవిత్వం రాదన్నట్లు, తక్కువ చేసినట్లు భావించడం పొరపాటు.

    ఈ క్రింది వాక్యం పెట్టమని ఈమాట వారిని అడుగుతాను.
    “తామర కొలనులో మందారం (Hibiscus on the Lake)”

    మా ఇంటర్వ్యూలో అసంబద్ధతలు సూచించినందుకు ధన్యవాదాలు.

    వేలూరి గారి అరవయ్యేళ్ళ అమెరికా జీవితంలో ఇంకా చాలా ఆశ్చర్యకరమైన, గమ్మత్తైన అంశాలు ఖచ్చితంగా ఉండే వుంటాయి (నాకు తెలుసు). ఆయనే రాయాలి లేదా మాట్లాడాలి.

    మా పరిధిలో మేము ప్రశ్నలడిగాం–అంతే.
    ఏవైనా తప్పులు దొర్లితే మా అవగాహనా లోపమే.
    ఈ సారికి మమ్మల్ని ఒగ్గేయండి 🙂

  2. ఏప్రిల్ 2025 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    04/07/2025 6:07 am

    భాషా వివేచన లేకుండా సాధించేది లేదు. కవులు/రచయితలూ భాషా పరిణామాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. శ్రద్ధాసక్తులు గలవారు శాసన భాషను అధ్యయనం చేయాలి. వ్యావహారిక భాష, ప్రామాణిక భాష ఈ రెంటి మధ్య గల సంబంధం అర్థం కావాలి. మన ప్రాచీన కవిత్వాన్ని అర్థం చేసుకొనే తీరులో మార్పులు రావాలి. ఉదాహరణకు విజయనగర సామ్రాజ్యంలో భాగంగా హంపీ కేంద్రంగా వచ్చిన కవిత్వంలో Urban nuances కనిపించవచ్చు. కారణం అప్పటి కాలంలో బీజింగ్ తర్వాత పెద్ద నగరం హంపీయే. తర్వాత కాలంలో దక్షిణాది తెలుగులో ఎక్కువ రచనలు వచ్చాయి – ఉదాహరణకు త్యాగరాజును కేవలం సంగీతానికి పరిమితం చేయకుండా ఆయన భాషలోని ప్రత్యేకతను పట్టుకోవాలి. నౌకా చరిత్ర లో ఆయన శైలి చాలా ఆసక్తి గొలుపుతుంది. తెలుగు భావింప నలవిగాని పెద్ద భాష – దాన్ని సాధించడం అంత సులువు కాదు.

    కాజి నజ్రుల్ ఇస్లాం – భారతీయ పురాణాలను, ఇతిహాసాలను లోతుగా అధ్యయనం చేశాడు, ఆయన గొప్ప గాయకుడు కూడా. ఆయన కొడుకు సవ్యసాచి గానం చేసిన విద్రోహి కవిత:
    https://www.youtube.com/watch?v=29X1GFso6y0
    (బెంగాలీలో విప్లవాన్ని విద్రోహం అంటారు)

    బెంగాలీ ముస్లింల వ్యావహారిక భాషకు/హిందువుల వ్యావహారిక భాషకు మధ్య పెద్ద తేడాలు లేవు. న్యూయార్క్ లో ఒక బెంగాలీ రెస్టారంట్ పేరు ఇత్యాది. నాకు తెలిసిన ఒక బాంగ్లా ముస్లిం అమ్మాయి పేరు ఇతి. మతం వేరైనా వారి సంస్కృతిని, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేయరు. మలయాళీ క్రైస్తవులు సైతం సంస్కృతాన్ని సమాదరిస్తారు. మనలో వివేకం పెరిగే కొద్దీ నేల విడిచి సాము చేయాలి అన్న మూర్ఖత్వం తొలగి భాషా సంస్కృతుల పట్ల ప్రేమ పెరగాలి – ఆ పునాది మీదే సాహిత్య సృష్టి సాధ్యం.

    చక్కని సంపాదకీయం – మంచి విషయాలు ప్రస్తావించినందుకు మీకు ఒక వీరతాడు వేయవలసిందే.

  3. వేలూరిగారితో ఒక సంభాషణ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ . గారి అభిప్రాయం:

    04/06/2025 9:08 pm

    వేలూరి గారిని “అమెరికాలో అర శతాబ్దం” పేరిట తమ అనుభవాలు -జ్ఞాపకాలు గ్రంధస్తం చేయమని కోరాను. ఈ ఇంటర్వ్యూ చదివాక ఆయన తప్పక ఈ పని చేయగలరని అనిపించింది. అభిరుచి ఉన్నవారు ఆత్మ చరిత్రలు రాసుకోవడం వల్ల ఎన్నో లాభాలు. సంజీవదేవ్ గారి ‘తెగినజ్ఞాపకాలు’ చదవక పోతే ఆయన గురించి నాకు తెలిసేదే కాదు. (ఆయన ఆత్మచరిత్ర ద్వారా కలిగిన పరిచయం నాకు ఎంత గానో లాభించింది. తత్వశాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, రస శాస్త్రము, మనస్తత్వ శాస్త్రాలు, చిత్రకళా చరిత్ర — ఇలా అనేకము చిన్న వయసులో అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది). తెలుగు వారికి హైకూలు పరిచయం చేసింది ఆయనే. టర్నర్ రంగుల ప్రపంచం గురించి, Constable చిత్రకళ Turner కన్నా ఏ రకంగా భిన్నం? – ఇవన్నీ ఆయన ద్వారా తెలిసి వచ్చిన విషయాలే. ఒక చిత్రకారుని గురించి లోతులకు పోకుండా తెలుసుకోవడం వేరు – చిత్రకారుని ఆత్మను పట్టుకొని చిత్ర శైలీ పరిణామాన్ని గుర్తెరిగి ఆనందించడం వేరు. ఇవన్నీ, ఎంతో క్రమశిక్షణతో, దక్షతతో చేయవలసిన పనులు.

    ఇక తెలుగులో కవిత్వం, అనువాదం – ఈ విషయాలకొస్తే – మనవారిలో పీఠాధిపతులు, వారికి అడుగులకు మడుగులొత్తి పాదసేవలో తరించే భక్త బృందాలు అధికం. కార్యరంగం విజయవాడైనా, విస్కాన్సిన్ ఐనా దృశ్యం మారదు. స్నేహాలు వేరు, విమర్శలు వేరు అన్న స్పృహే లేదు. కవిత్వం, అనువాదాలు, వాటిపై వచ్చే విమర్శను సీరియస్ గా పట్టించుకోవాలి అన్న వివేకం మన వారికి లేదు. మనకు కావలసింది భజన బృందాలు.

    కొడవళ్ళ గారు ప్రస్తావించినట్టు ఇంటర్‌వ్యూలో అక్కడక్కడా స్పష్టత లేదు. పాద పీఠికలు ఇవ్వాలి – text without context leads to utter confusion -సందర్భ శుద్ధి లేని వచనం, గందరగోళానికి దారి తీస్తుంది.

    నా వంతుగా “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు” పుస్తకానికి లింకు ఇస్తున్నాను.
    https://sundarayya.org/sites/default/files/2023-09/Neti%20kalapu%20kavitwam%20-%20Theeru%20thennulu.pdf

    కొడవళ్ళ గారు ప్రస్తావించిన వ్యాసం, దానికి తోడుగా మరొక వ్యాసం:
    Hibiscus on the lake (పుట 108)
    అనువాదంలో ‘పద్య సమాధి’ (పుట 111)

    అలాగే, తెలుగు విమర్శలో మైలురాయి అనదగ్గ అక్కిరాజు ఉమాకాన్తం గారి పుస్తకానికి లింకు ఇక్కడ:
    https://archive.org/details/in.ernet.dli.2015.333044

  4. వేలూరిగారితో ఒక సంభాషణ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    04/03/2025 12:52 am

    చక్కగా ఇంటర్వ్యూ చేసినందుకు పరుచూరి, గొర్తి గార్లకు, ఇచ్చినందుకు వేలూరి గారికి, ప్రచురించినందుకు సంపాదకులకు, కృతజ్ఞతలు. అమూల్యమైన ప్రచురణ అయినా, ఒకటి రెండు నచ్చనివి ప్రస్తావిస్తాను.

    “శ్రీశ్రీ అమెరికా వచ్చారా?” అని అడిగి, వెంటనే, “మీరు శ్రీశ్రీగారి మాటల్ని రేడియో స్టేషన్‌లో రికార్డు చేయించారు కదా!” అనడం అసంబద్ధంగా ఉంది.

    “ప్రసాదరావుగారు మాట్లాడలేక పోయేవారు. అప్పటికే మాట పోయింది. పేపర్‌ మీద నోట్‌ లాగా రాసిస్తుండేవాడిని. … చలసాని ప్రసాదరావుగారి గురించి తెలుసుకోవాలంటే… He is a peculiar person. చాలా తక్కువమందికి తెలుసును.”

    చిన్నప్పుడే చలసానికి జబ్బు వచ్చి వినికిడి పోయిందని చదివాను; అందుకే నోట్ రాసి చూపెట్టడం, మాట పోయినందుకు అయి ఉండదు. సందర్భం కళ కావున చలసాని దాంట్లో ఏం సాధించారో, చెప్తే, అడిగితే, బావుండేది.

    “ఏదో తామర కొలనులో మందారం పువ్వో అదేదో… మన అంపశయ్య నవీన్‌ రాశాడు దానిమీద. దట్స్‌ నాట్‌ క్రిటిసిజమ్‌. ఆయన సరిగ్గా ట్రాన్స్‌లేట్‌ చేయలేదని. పోనీ నువ్వు చెయ్‌. ఇంతకంటే బెటర్‌ ట్రాన్స్‌లేషన్‌ నువ్వు చేసి చూపించు. (తమ్మినేని యదుకుల) భూషణ్‌తో కూడా ఇదే గొడవ. భూషణ్‌ బాగా చదువుకుంటాడు. ఉమాకాన్తమ్‌ని గుర్తుంచుకున్నామా? లేదు. … కావ్యం మీద పుస్తకమే రాశాడాయన. నేటికాలపు కవి ఎలావుండాలి? అనో ఏమో. చదివారా మీరా పుస్తకం? ఏమైంది, ఎవరు గుర్తున్నారు? ”

    ఇక్కడ రచనలని నిర్దిష్టంగా ప్రస్తావించకపోవడం, ఇంకాస్త లోతుకు వెళ్ళి తెలుసుకుందామనుకునే చదువరులలో, గందరగోళం కలిగిస్తుంది. “తామర కొలనులో మందారం,” అంటే వెల్చేరు, “Hibiscus on the Lake,” మనసులో మెదిలింది. దానిని నవీన్ విమర్శించారా? ఎక్కడ? తమ్మినేని, “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు,” లో “వెల్చేరు… ఏమి తేల్చారు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. మందారం తేల లేదు … సరికదా,” అన్నారు. అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుల, “నేటికాలపు కవిత్వం,” పీఠికలో చేకూరి, “సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతం గారి నిర్ణయాలు ముఖ్యం కాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాస్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు,” అన్నారు.

    “నేను సంపాదకునిగా ఉన్నన్నాళ్ళు, ఈమాటకు ఆ రకమైన స్ట్రక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించాను.”

    వేలూరి గారు “ఈమాట” ని న్యూయార్కర్ పత్రిక స్థాయిలో మలచాలని యత్నించడం చెప్పుకోదగ్గ విషయం. మొన్న నా వ్యాసానికి చివరి మెరుగులు దిద్దుతుండగా, సంపాదకులతో నేను ‘కామా’ ల గురించి తర్జన భర్జన పడాల్సొచ్చింది. విరామ చిహ్నాలవరకైనా, ఈమాట న్యూయార్కర్ పద్ధతిని అవలంబిస్తే బావుండు.

    చివరగా, వేలూరి గారితో నాకు ఇరవై ఏళ్ళ క్రితం, డెట్రాయిట్ లో తానా సభల సందర్భంగా పరిచయం. కన్నెగంటి రామారావూ, నేనూ కాలువ పక్కన నడుస్తూ వేలూరి గారితో మాట్లాడుతుంటే, వారన్న ఓ మాట, “శ్రీశ్రీ కవిత్వం లోని మాటల కర్థం తెలియకుండానే పొగిడే వాళ్ళు అనేకం,” నాకిప్పటికీ గుర్తు. “షెల్లీ కవనపు హల్లీసకమూ,” అని తన్మయించడమే కాని, హల్లీసకం అంటే అర్థం తెలియదే అని నేను మనసులో అనుకున్నాను. అప్పటి నుండి, నా చదువు కాస్త కుంటు పడింది – అర్థం తెలియని పదం తగిలితే, నిఘంటువులో వెతక్కుండా ముందుకు పోలేక. అందుకూ, మరెన్నెటికో మార్గదర్శకులుగా ఉన్నందుకూ, శ్లాఘనీయులైన వేలూరి గారికి కృతజ్ఞతలతో,

    కొడవళ్ళ హనుమంతరావు

  5. నా కవితా వ్యాసంగం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:

    03/24/2025 4:07 am

    సంపాదకమహాశయులు ఈ తీగను పట్టుకుని చదువరులు ఆయన ఆత్మకథలోని శతాపత్రాలను చదువాలనేది మా పెద్ద కోరిక అన్నారు. చాలా సంతోషం. బహుసముచితమైన కోరిక. చదువరులు ఎంతమంది ఆకోరికను తీర్చటానికి పూనుకుంటారో తెలియదు. అలా పూనుకొని తీర్చినవారు ఇక్కడ తెలియజేస్తే సంపాదకులతో పాటు చదువరులూ మిక్కిలి సంతోషిస్తారన్నది నిర్వివాదం అనుకుంటాను.

    నేను గడియారం రామకృష్ణశర్మ గారి ఆత్మకథ ‘శతపత్రము’ కోసం https://archive.org/ సైటును ఆశ్రయించి చూచాను కాని అది అక్కద లభ్యం కాలేదు. అక్కద వారి రచనలు మన వాస్తుసంపద, విజ్ణానవల్లరి, తెలుగులో పదకవిత కనిపించాయి.

    ఈ పుస్తకం మీద సమీక్ష ఒకటి నాకు https://pustakam.net/?p=19853 అనేది కనిపించింది. కనీసం ఏడేళ్ళ క్రిందటి వ్యాసం అనుకుంటాను. ఇంకా చదువలేదు. కొంచెం పెద్దది గానే ఉందది. వ్యాసం మొదట్లోనే పుస్తకం లభించు చోటు ‘ఇది’ అంటూ ఒక లింక్ ఇచ్చారు సహృదయంతో. దురదృష్టవశాత్తు ఆలింక్ ఇప్పుడు పనిచేయటం లేదు.

    మరొక వ్యాసం ఈపుస్తకం గురించినది కూడా అదే సైటులో https://pustakam.net/?p=1766 ఉంది.

    అలాగే ఈపుస్తకం గురించి డా. వాడ్రేవు వీరలక్క్ష్మీదేవి గారు వ్రాసిన సుదీర్ఘసమీక్ష కనిపించింది. దానికి లింక్ https://avkf.org/BookLink/book_of_week/562_book_detail.pdf.

    ఈపుస్తకం Navodaya Book House, Hyderabad వారి వద్ద లభిస్తుందని ఒకచోట చూసాను. వారిని సంప్రదించి చూడాలి. మరొక రకంగా లభ్యం అవుతోందా అన్నది తెలియదు. సంపాదకులకు గాని, చదువరుల్లో ఎవరికైనా గాని తెలిస్తే చెప్పవలసిందిగా విన్నపం చేస్తున్నాను.

  6. సంపాదకునికి ఉత్తరం గురించి అనామక రచయిత గారి అభిప్రాయం:

    02/03/2025 12:14 pm

    అమ్మా బి.వి.ఎస్.మనస్విని గారూ:

    మీరు రాసిన “సంపాదకునికి ఉత్తరం” చదివాకా ఎందుకో ఇది “సంపాదకుని ఉత్తరం”లా తోచింది తప్ప ఒక కొత్త పాఠకురాలు రాసారంటే నమ్మబుద్ధి కాలేదు. నిబిడాశ్చర్యంతో నన్ను నేను గిచ్చుకున్నాను.

    యథా రచనా–తథా పాఠకా, తీరులో తెలుగు సాహిత్యం పరిగెడుతోంది.
    పత్రికలు కూడా వాల్ పోస్టర్ గోడల్లా తయారయ్యాయి.

    మీరు వ్రాక్కుచ్చినట్లు సోషల్ మీడియా ప్రభావం అంతటా వుంది; అన్ని భాషల్లోనూ ఇదే జాడ్యం. దీనికి తెలుగు ఒక్కటీ మినహాయింపు కాదు.

    కరోనా కంటే తీవ్రమైన “గుర్తింపు వైరస్” ప్రపంచాన్ని ఆవరించి దశాబ్దం దాటింది. లైకులు, లవ్వులతో ఎదుటవారిని సంతోష పరిచే చట్రంలో అందరూ ఇరుక్కున్నారు.
    ఇచ్చినమ్మ లైకు, పుచ్చుకున్నమ్మ లైకు–తీరున ప్రపంచమంతా ఒక అనధికార, అదృశ్య ఒప్పందం సంస్కార ప్రదంగా కుదుర్చుకుంది.

    కాబట్టి ఎవరి పుస్తకమ్మీద ఎవరూ ఉన్నదున్నట్లు రాయరు. రాయలేరు కూడా.
    రాసే దమ్ముని సభ్య సమాజం కోల్పోయి చాలా కాలం అయ్యింది.
    ఇది “గుర్తింపు వైరస్” సైడ్ ఎఫెక్ట్. దీనికి వాక్సిన్ ఇంకా రాలేదు.
    కాబట్టి వైరస్ అందరికీ పట్టినా, ఎవరికీ అంటనట్లే నటిస్తున్నారు.

    అడుక్కుని రాయించే భిక్షక రచయితలు అన్నికాలాల్లోనూ, అంతటా వున్నారమ్మా! ఇదేం కొత్త కాదు!
    ఎవరూ రాయకపోతే సదరు సంపాదక మహాశయులు మారుపేరుతో రాసిన సంఘటనలు కూడా వున్నాయి.
    తమ పత్రిక్కి వచ్చిన రచనలన్నీ కుటుంబరావు గారు తిరగరాసేవారని, అప్పట్లో చెవులు కొరుక్కునేవారు రచయితలు .

    సోషల్ మీడియా వల్ల రచయితలూ, పాఠకులూ అందరూ ఒకే చోట ఉండటం వలనా, ఎవరి పుస్తకం మీదా ఎవరూ ఉన్నదున్నట్టు రాయరు. పొగిడి తీరాలి. లేదంటే తిరిగి తన పుస్తకానికి మంచి రివ్యూలు రావనే భయం. అందరూ దూరం పెడతారేమో అనే జంకు. దీన్నుండి బయటపడే సూచనలు కనుచూపు మేరలో లేవు.

    ఇంతమంచి వాక్యం రాసిన మనస్విని తల్లీ, నువ్వు కూడా నీకు నచ్చిన పుస్తకం గురించి రాయమని నా విన్నపం.
    కథో, కవితో ఏదో ఒకటి–నీకు నచ్చింది.
    అదీ తెలుగుదే. వేరే భాషది కాకూడదు సుమా?
    మీకు సమయం లేకపోతే సదరు సంపాదకుల వారికి తెలుగులో ఒక మంచి పుస్తకం సూచించు.
    రాయమని అర్థించు తల్లీ!

    –అనామక తెలుగు పాఠకుడు.

  7. భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/25/2025 12:29 am

    డాల్రింపుల్ చరిత్రలోని లోపాలు: 1) చైనీస్ వారి శాస్త్రవిశేషాలను పెద్దగా ప్రస్తావించలేదు; Joseph Needham పేరయినా లేదు. 2) ఇస్లాముల గురించిన భాగంలో ఖయ్యాము లేడు; కవియే గాక (రుబాయత్), గణితంలో ఖగోళంలో విశేషమైన ప్రజ్ఞ చూపెట్టాడు. 3) ఫిబొనాచీ శ్రేణిని ఫిబొనాచీ కన్నా కొన్ని వందల సంవత్సరాల ముందరే ఆర్యభట ప్రస్తావించాడన్నారు; ఆర్యభట కాదు.

    ఫిబొనాచీ శ్రేణి గురించి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి తెలుసు కాని కవులకు మిక్కిలి ఆసక్తికరమైన సంగతి. ఈమధ్య మా ఆవిడ, కన్నెగంటి రామారావు ఫేస్‍బుక్‍లో బైరాగి మీద రాస్తున్నాడు అని చెప్తే, రామారావు పోస్ట్ చూశాను: “పూవుల నెత్తావి కవిత్వంలోనే కాదు, నాకు ఫిబొనాచీ సీక్వెన్స్‌లో కూడా కనబడుతుంది.”

    మంజుల్ భార్గవకి (2014 ఫీల్డ్ మెడలిస్ట్) చిన్నప్పుడు తాతగారి దగ్గర సంస్కృత కావ్యాలు చదవడాన గణితంపై ఆసక్తి కలిగిందట. క్రీస్తుకు పూర్వమే పింగళ, ఛందస్సులో గురు, లఘువులు ఎన్ని విధాలగా ఉండవచ్చో తెలిపాడంటారు. ఒక్క బీట్‍లో {(ల)}, రెండు బీట్‍లలో {(ల, ల), (గు)}, మూడయితే {(ల, ల, ల), (ల, గు), (గు, ల)), నాలుగయితే {(ల, ల, ల, ల), (ల, ల, గు), (ల, గు, ల), (గు, ల, ల), (గు, గు)}… అలా, బీట్‍లను బట్టి గురు, లఘువులు రక రకాల విన్యాసాలలో లయబద్ధంగా ఉండొచ్చు. ఎన్ని రకాలు? 1, 2, 3, 5, … అదే ఫిబొనాచీ శ్రేణి; దానిని ఫిబొనాచీ కన్నా కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు కనిపెట్టారన్న విషయం పాశ్చాత్యులకి ఇటీవలదాకా తెలియదు.

    Donald Knuth పేరు తెలియని కంప్యూటర్ సైన్స్ వారు ఉండరు. తెలియని వాళ్ళకి. యయాతి మహారాజు తన కుమారుడు పూరునకు బోధించిన ఓ నీతి:

    “ఎఱుక గలవారి చరితలు | గఱచుచు, సజ్జనుల గోష్ఠిఁ గదలక ధర్మం
    బెఱుఁగుచు, నెఱిఁగిన దానిని | మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్‌.” — నన్నయ

    Knuth కంప్యూటర్ సైన్స్‌కు ‘బైబిల్’ లాంటిది రాశాడు; రాస్తున్నాడు అనాలి, ఎందుకంటే ఏడు పర్వాలని ఆ యజ్ఞం మొదలెట్టింది 1962లో; మొదటి మూడు, నాలుగోదాంట్లో మొదటి భాగం మాత్రం అచ్చయినాయి. 87 ఏళ్ళ వృద్ధుడు కనుక బహుశా అసంపూర్ణంగానే మిగలొచ్చు. దాని పాత ప్రతులలో, ఫిబొనాచీ శ్రేణి ప్రస్తావనలో మన వాళ్ళ గురించి ఏమీ లేదు. కాని కొత్త ప్రతిలో:

    Before Fibonacci wrote his work, the sequence had already been discussed by Indian scholars, who had long been interested in rhythmic patterns that are formed from one-beat and two-beat notes or syllables. The number of such rhythms having n beats altogether is Fn+1; and the rule for computing those numbers was stated by Virahäka (c. 700) in his work Vttajātisamuccaya, sloka 6.49. Therefore both Gopāla (before 1135) and Hemacandra (c. 1150) mentioned the numbers 1, 2, 3, 5, 8, 13, 21, 34, … explicitly.

    నేనిది చెప్పడానికి కారణం: సైన్సులో వలసవాదం కరడుగట్టుకొని ఉన్నదనే వాదన ఉంది; కాని గత నాలుగయిదు దశాబ్దాలగా, ఇతర దేశాలలో పూర్వం జరిగిన పరిశోధనలు వెలుగులో కొచ్చేకొలదీ, వాటి విలువ పాశ్చాత్యులు గుర్తిస్తున్నారు.

    చివరగా, సైన్సు చరిత్రని గురించిన చర్చ కనుక, Knuth, పదేళ్ళ క్రితం Stanford Universityలో ఇచ్చిన ప్రసంగంతో ముగిస్తాను:

    “Why do I, as a scientist, get so much out of reading the history of science? Let me count the ways:

    1. To understand the process of discovery—not so much what was discovered, but how it was discovered. Primary sources are best: the words of somebody who discovered something, as they were discovering it. The more examples I see, the more likely I’ll be able to discover something tomorrow.

    2. To understand the process of failure. We learn a good deal from historical errors, not only from our own. It also helps to know that even the greatest minds are unable to grasp things that seem obvious to us. Leibniz spent much time working on combinatorics, and most of what he did was underwhelming and totally wrong.

    3. To celebrate the contributions of many cultures. There are many ways of thinking, many points of view, and many independent researchers. Fibonacci numbers were discovered in India long before Fibonacci. Catalan numbers were discovered in China, a hundred years before Catalan. Many uneducated people have discovered wonderful patterns in numbers, and I can share their joy of discovery.

    4. Telling historical stories is the best way to teach. It’s much easier to understand something if you know the threads it is connected to. Give credit to Fibonacci, but also to Narayana in India. The complete story is of many separate individuals building a magnificent edifice with a series of small steps.

    5. To learn how to cope with life. How did other scientists grow up, make friends or enemies, manage their time, find mentors, mentor others, and serve their communities? Balance is important.

    6. To become more familiar with the world, and to know how science fits into the overall history of mankind. What was life like on different continents and in different epochs? The main difference between human beings and animals is that people learn from history.”

    కొడవళ్ళ హనుమంతరావు

  8. భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/19/2025 2:51 am

    “ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు
    నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు.”
    — తిలక్, “మన సంస్కృతి,” అమృతం కురిసిన రాత్రి.

    ముందుగా విలియమ్ డాల్రింపుల్ పుస్తకాన్ని ఈమాట పాఠకులకి పరిచయం చేసినందుకు రాణి శివశంకరశర్మ గారికి కృతజ్ఞతలు. ప్రాచీనకాలంలో ఇండియా సాంస్కృతిక విజ్ఞాన రంగాలలో సాధించిన వాటికి తగిన గుర్తింపు తేవడానికే ఈ పుస్తకం రాశానన్నాదు డాల్రింపుల్. అనేక వివరాలతో, తగిన ఆధారాలతో ఉన్న చదవదగ్గ రచన. ఆధ్యాత్మిక పరమైన విషయాలకంటె శాస్త్రీయ విజ్ఞానపరంగానే ఇండియా ప్రాభవాన్ని చెప్పుకోవాలంటాడు.

    ఈ వ్యాసాన్ని చూస్తే రాణి బహుగ్రంథపఠితులనీ ఆలోచనాపరులనీ తెలుస్తుంది. కాని అనేకుల ఉటంకింపులతో సాగిన ఈ వ్యాసం అకటవికటంగా తయారయింది. ఎందుకిలా రాశారా అని రాణి గారి “ది లాస్ట్ బ్రాహ్మిన్” ఇటీవల హైద్రాబాదు వెళ్ళినప్పుడు నవోదయలో దొరికితే కొని చదివాను. అందులో అంటారు: “నేనా రోజుల్లో ప్రధానంగా ప్రేమ కవిత్వం రాసేవాణ్ణి. ఒకసారి ఒక వ్యంగ్య కవిత రాసి సీతంపేట గ్రంథాలయంలో జరిగిన కవి సమ్మేళనంలో చదివాను. … నా కవిత్వంలో యేదో వుందని నాను నమ్మకం కుదిరింది. ఇందిరాగాంధీ తాత్విక గురువు ధీరేంద్ర బ్రహ్మచారిని కూడా ఆ కవితలో లింకు పెట్టాను యెందుకో. ఇలా దూర సంబంధం కూడా లేనట్టు కనిపించే రెండు దత్తాంశాల్ని ఆకస్మాత్తుగా కలిపి వాటి అన్యోన్య సంబంధాల నుంచి వెల్లడయ్యే నిజాన్ని అతివాస్తవికంగా చెప్పే కవిత్వశైలి ఆది నుంచీ నాకు సహజంగానే వంటబట్టింది. ఇది థీసిస్ యాంటీ థీసిస్ సింథసిస్ అనే ఈక్వేషన్ కి దగ్గరిదని తర్వాత నేను తెలుసుకున్నాను.” (160 పేజి.)

    ఆ ప్రత్యేక కవిత్వ ధోరణి ఈ రచనలో కూడా ప్రజ్వరిల్లి వ్యాస ప్రయోజన్నాన్ని దెబ్బతీసింది.

    రాణి గారికి అనంతం అంటే మిగుల అభిమానం లాగుంది. (“ది లాస్ట్ బ్రాహ్మిన్” అంకిత వాక్యం: “గడచిపోయిన అనంత కల్పాలలో అనంత జన్మలలో అనంత రూపాలలో ఇదే రూపంలో మీరు లేరు, నాన్న గారూ, రాబోయే అనంత కల్పాలలో అనంత జన్మలలో అనంత రూపాలలో ఇదే రూపంలో మీరు కానరారు.”) కాని అనంతాన్ని సున్నాతో సమానం చేసి (తాత్వికంగానే అయినా) గందరగోళ పరిచారు.

    “అనంతాన్ని గ్రీకులు చీకటిగా భావించారు, భయపడ్డారు. అనంతంలో వస్తువులు ఏర్పడవు అని అరిస్టాటిల్ అన్నాడు. భారతీయులు మాత్రమే అనంతాన్ని పాజిటివ్‌గా చూశారు.”

    “ఇలా ఋతువులూ యుగాలూ చక్రాకృతిలో ‘అనంతం’గా పునరావృతి చెందడం అనే భావన జీరో, అనంతం, అనంత విశ్వం, చివరికి భూకేంద్రక సిద్ధాంతాన్ని నిరాకరించే లాజిక్‌కి దారితీసింది.”

    “అనంతం, జీరో అనే భారతీయ ఆవిష్కరణలు పాశ్చాత్య వికాసయుగానికి మూలం అనేంతవరకూ వెళుతున్నారు విలియమ్ డాల్రింపుల్.”

    ఇంతకీ డాల్రింపుల్ పుస్తకం సూచికలో అనంతం లేదు.

    అనంతం అంటే విస్మయం కలగని వారుంటారా? “అమలిన తారకా సముదాయంబుల నెన్నను … విధాతృకైనను నేరం బోలునే” అంటాడు నన్నయ. మన వాళ్ళు అనంతాన్ని ఆవిష్కరించి గణితపరంగా ఏమి సాధించారో రాణి గారు చెప్పలేదు. గణితపరంగా అనంతాన్ని మొట్టమొదట గ్రహించింది గ్రీకులే:

    “There is no smallest amongst the small and no largest among the large; But always something still smaller and something still larger.” – Anaxagoras (500-428 BC)

    కాని జీనో (490-430 BC) పారడాక్స్ లు గ్రీకులని కలవర పెట్టాయి. అందుకని అరిస్తాటిల్ (384–322 BC) సంభావ్య అనంతం (potential infinity), సంపూర్ణ అనంతం (completed infinity) అని విడదీసి, గణితంలోనూ, తత్వంలోనూ సంపూర్ణ అనంతాన్ని నిషేధించాడు. అయినా ఆర్కిమెడెస్ (287– 212BC) అనంతాన్ని ఎంత సృజనాత్మకంగా వాడుకున్నాడో “The Man Who Harnessed Infinity” [1] లో చదవచ్చు. (యురేకా! అంటూ వీధుల్లో నగ్నంగా పరిగెత్తాడని చిన్నప్పుడు చదువుకున్నాం.) ఆర్కిమెడెస్ ఆలోచనలకి సరయిన రూపం, న్యూటన్, లైబ్నిజ్ ల, కలన గణితం ద్వారా రావడానికి దాదాపు మరో రెండు వేల సంవత్సరాలు పట్టింది.

    జైనులు పెద్ద పెద్ద సంఖ్యల గురించి ఆలోచించారు; కాని అనంతం వాటి కంటె పెద్దదని గుర్తించారు. అంతేకాక రకరకాల అనంతాలుంటాయని భావించారు (సూర్య ప్రజ్ఞాప్తి, 400BC), కాని లోతుగా వెళ్ళేందుకు కావలసిన గణిత పరిజ్ఞానం అప్పట్లో లేదు.

    గెలీలియో (1564-1642) అనంతం గురించిన ఓ తాత్విక సమస్యని పేర్కొన్నాడు: “భాగం కంటే మొత్తం ఎక్కువ” కదా. {1, 4, 9, 16, 25, 36, …} అన్నది {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, …} దాంట్లో భాగం. కాని ప్రతి పూర్ణ సంఖ్యనీ, దాని వర్గం తో జత చెయ్యవచ్చు: (1, 1), (2, 4), (3, 9), (4, 16), (5, 25), … అంటే “భాగం మొత్తంతో సమానమే!”

    అనంతంతో వచ్చే ఈ సమస్యలకి అత్యంత ప్రతిభతో సరయిన పరిష్కారం చూపించిన వాడు Cantor (1845-1918) [2].

    భూకేంద్రక సిద్ధాంతాన్ని మొదట నిరాకరించింది అరిస్టార్కస్ (310-230BC); అయితే గ్రీకులు దానిని అంగీకరించలేదు. కోపెర్నికస్ (1473-1543) అరిస్టార్కస్ ప్రతిపాదనలనే పునరుద్ధరించాడు.

    డాల్రింపుల్ ఇండియా తన పూర్వ వైభవాన్ని తిరిగి చేజిక్కిచ్చుకునే స్థానంలో ఉందని ముగిస్తే, రాణి ‘అసలు మానవ ఆలోచనే వినాశకరమయినదేమో’ అని ముగిస్తారు.

    “భారతీయ ఖగోళ గణిత విజ్ఞానాలు పాశ్చాత్యానికి వెళ్ళి ప్రాగ్మాటిక్ లక్షణాల్ని క్రమేపీ సంతరించుకున్నాయి. ఆ విజ్ఞానం పాశ్చాత్యంలో అభివృద్ధి చెంది, తిరిగి వచ్చి భారతదేశాన్నే వ్యాపారం పేరుతో ఆక్రమించింది. ఇది భారతీయులపై కేవలం భౌతిక విజయమే కాదు. భావజాల దురాక్రమణ కూడా.”

    ఇది చాలా సంకుచిత దృష్టి. డాల్రింపుల్ కూడా యూరప్ లో వచ్చిన శాస్త్రీయ విప్లవం గురించి మాట్లాడడు.

    “Science is now international, perhaps the most international aspect of our civilization, but the discovery of modern science happened in what may loosely be called the West. Modern science learned its methods from research done in Europe during the scientific revolution, which in turn evolved from work done in Europe and in Arab countries during the Middle Ages, and ultimately from the precocious science of the Greeks. The West borrowed much scientific knowledge from elsewhere—geometry from Egypt, astronomical data from Babylon, the techniques of arithmetic from Babylon and India, the magnetic compass from China, and so on—but as far as I know, it did not import the methods of modern science.” – [3]

    డాల్రింపుల్, రాణి కూడా, మరో ముఖ్య విషయం ప్రస్తావించరు. మధ్యయుగాల ప్రారంభంలో, బాగ్దాద్ లో పెద్దలు గ్రీకు ఫిలాసఫీ గురించి చర్చించుకుంటూంటే, యూరప్ లో పెద్దలు సంతకం చెయ్యడమెలాగో నేర్చుకుంటున్నారట. అలాంటి స్థితి నుండి యూరప్ ఎలా పైకొచ్చింది?

    జయంత్ నర్లీకర్ సామాన్యులకి సైన్సు గురించి తెలియజేయడానికి బాగా కృషిచేసిన పేరున్న భౌతిక శాస్త్రవేత్త. సైన్సూ గణితం పరస్పర ప్రభావంతో నాగరికతకి ఎలా దోహదమయ్యాయో ఓ మరాఠీ పుస్తకంలో వివరిస్తే దానికి పాఠకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది, మహారాష్ట్ర ప్రభుత్వం ఓ బహుమతి నిచ్చింది. ఆ ప్రోత్సాహంతో, దానిని కాస్త విపులీకరించి ఇంగ్లీషులో “Science and Mathematics: From Primitive to Modern Time,” అన్న పేరిట Jayant Narlikar ప్రచురించారు.

    దానిలో నాలుగో అధ్యాయంలో ఆసక్తికరమైన చర్చ ఉంది. పాకిస్తాన్ కి చెందిన అబ్దుస్ సలాం (1926-1996, మొదటి ముస్లిం నోబెల్ గ్రహీత) ఓ ప్రశ్న లేవదీశాడు – గొప్ప శిల్ప కట్టడాలయిన ఆగ్రా లోని తాజ్ మహల్, లండన్ లోని సెయింట్ పాల్ కేథడ్రల్ దాదాపు ఒకే కాలంలో నిర్మించారు. అదే సమయంలో యూరప్ లో సైన్సు అనూహ్యంగా పెరిగితే భారత ఉపఖండంలో చాలా అరుదుగా కనిపించింది; ఎందువలన?

    “It is good to recall that three centuries ago, around the year 1660, two of the greatest monuments of modern history were erected, one in the West and one in the East; St. Paul’s Cathedral in London and the Taj Mahal in Agra. Between them, the two symbolize, perhaps better than words can describe, the comparative level of architectural technology, the comparative level of craftsmanship and the comparative level of affluence and sophistication the two cultures had attained at that epoch of history. But about the same time there was also created—and this time only in the West—a third monument, a monument still greater in its eventual import for humanity. This was Newton’s Principia, published in 1687. Newton’s work had no counterpart in the India of the Mughals.”
    ― Abdus Salam, Ideals and Realities: Selected Essays of Abdus Salam

    దానికి నర్లీకర్ కొన్ని కారణాలు ఊహిస్తాడు. ఒకటి: మన పాలకులు (చక్రవర్తులు, రాజులు, చిన్న చిన్న జమీందారులు) సంగీత, సాహిత్య, కళా రంగాలకి ఆశ్రయమిచ్చారు కాని, సైన్సుకివ్వలేదు; యూరప్ లో రాయల్ సొసైటీ, ఫ్రాన్సులో ఫ్రెంచ్ అకాడెమీ ఉన్నాయి, మనకలాంటివి లేవు.

    ప్రస్తుతానికి ఇంతటితో ముగిస్తాను.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] Steven Strogatz, “Infintie Powers: How Calculus Reveals the Secrets of the Universe,” HMH, 2019.
    [2] Ian Stewart, “Infinity: A Very Short Introduction,” OUP, 2017.
    [3] Steven Weinberg, “To Explain the World: The Discovery of Modern Science,” Harper, 2015.

  9. సంపాదకునికి ఉత్తరం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    01/11/2025 12:35 pm

    అమరేంద్ర గారు,

    మీకు మినహాయింపు ఇచ్చాను మొదటి వ్యాఖ్యలో 🙂 ఎవరెస్ట్ నామవాచకమే కానీ “బేస్ కేంప్” ను అనువదించవచ్చు అనుకుంటున్నా. (మూల విడిది, మొదటి మెట్టు వగైరా.. మీకంటే ఎక్కువ తెలిసినవాణ్ణి కాదు కానీ ఏదో చెప్పాను ఉదాహరణకి). మరో విషయం:

    ఏడుకొండల రావును Sevenhills Rao అనగూడదు కదా!

    నేను ఈ గొడవ తుట్టె కదిలించడానికి అసలు కారణం ఇంగ్లీషులోంచి తెలుగు లోకి అనువాదం గురించి [లేదా తెలుగు కధలకి/కవితలకి పెట్టే పేర్ల గురించి]. మీరు ఇచ్చిన ఉదాహరణ తెలుగు నుంచి ఇంగ్లీషులోకి. ఈ మాటలో టాల్ స్టాయ్ కధలు అనువదించినప్పుడు – మీరు చెప్పినట్టే, నేను నామవాచకాలు మార్చలేదు (మార్టిన్, సైమన్, పాస్టర్ వగైరా). “కనీసం” కధల పేర్లు తెలుగులో ఉంటే బాగుంటుంది అన్నాను. పూర్తిగా ఇంగ్లీషు వాడకూడదు అనలేదు.

    దయచేసి ఇది కూడా ప్రచురించగలరు.. ఇది ఏమిటో మీరే ఎలాగోలాగ తెలుసుకోండి.

    eemaata
    はテルグ語の見出しのみを受け入れる必要があります
    ኣርእስታት ተለጉ ጥራይ ክቕበል ኣለዎ።
    חייב לקבל רק כותרות טלוגו

  10. సంపాదకునికి ఉత్తరం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    01/05/2025 12:36 pm

    సంపాదకులకి ఒక ప్రశ్న/ఉత్తరం లేదా మీరు ఏదనుకుంటే అది.

    ఇంటర్నెట్ (అంతర్జాలం) మీద తెలుగు చదువుకోవడానికి, ఈమాట లో తెలుగు కధలు కాకరకాయలు చూసుకోవడానికి (అదే తెలుగులోనే) వస్తూ ఉంటాము. రోజులో దాదాపు 90 శాతం ఆంగ్లంలో గడుపుతూ ఉంటాం కనక తెలుగులో చదువుకోవడానికి అదో సంతోషం. మనం రాసే కధల్లో (నాతో సహా) ఆంగ్ల పదాలు లేకుండా రాయలేకపోతున్నాం, సరే కనీసం కధ పేర్లు కూడా తెలుగులో రాయరేం? జనవరి నెలలో పేర్లు ఇలా ఉన్నై – నో ఎక్జిట్, బ్లిస్ హోం, ఎవరెస్ట్ బేస్ కేంప్, వర్ల్డ్ వితిన్, ఐడెంటిటీ ఉద్యమాలు వగైరా. ఇవన్నీ పంటి కింద ఇంగువ ముక్కల్లా తగుల్తున్నాయి. ఎవరెస్ట్ బేస్ కేంప్ వదిలేసి (యాత్రానుభవం కనక, కానీ దీన్ని కూడా సులభంగా అనువదించగలరు అమరేంద్ర గారు) మిగతావి అన్నింటికీ తెలుగు పేర్లు పెట్టవచ్చు కదా? కనీసం సంపాదకులు కధలు/కవితలు రాసేవారికి ఎందుకు చెప్పడం లేదు తెలుగు పేర్లు పెట్టమని. మొత్తం అంతా తెలుగులో రాయమని కాదు కానీ కనీసం కధ/కవిత కి పేరు అయినా తెలుగులో పెట్టలేమా?

    ఇంక ఈ నెలలో సంపాదకులకి ఉత్తరం గురించి చెప్పనవసరమే లేదు. దాదాపు మొత్తం అంతా ఆంగ్లంలోనే ఉంది. ఆంగ్ల కధకులని ఉటంకించినప్పుడు వాళ్ళవి ఇంగ్లీషులో చెప్పడం బాగానే ఉంది కానీ మొత్తం అంతా ఇంగ్లీషులో అయితే (అదీ వేలూరి లాంటి వారినుంచి!!). ఒక్కొక్కప్పుడు లైలాగారు స్పానిష్షో, ఫ్రెంచో రాస్తారు. అది ఎవరికోసమో అర్ధం కాదు. నాలాటి అర్భకులకి తెలుగు, ఇంగ్లీషుకూడా సరిగ్గా రావు; మిగతాభాషల సంగతి ఎందుగ్గానీ.

    ఈమాట తెలుగు పత్రిక అనేది మర్చిపోతున్నామా? ఒక్కొక్కప్పుడు కధ/కవిత పేరు ఇంగ్లీషులో చూడగానే అది ఇంక చదవాలనిపించడం లేదు (కనీసం నా మటుక్కి). అనువాదాలు చేసే అవినేని భాస్కర్ గారు కూడా చక్కగా “అకాశంలో వినిపించే స్వరాలు,” అంటూ అనువదించగలుగుతున్నప్పుడు మిగతావారికి ఏమిటి కష్టం? సంపాదకులు కనీసం ఈ విషయం రచయితలతో చెప్పాల్సిన అవసరం ఉంది.

  11. నిశీధిసంద్రం గురించి Kishore Karnam గారి అభిప్రాయం:

    01/02/2025 9:59 pm

    చంద్ర శేఖర్ ప్రతాప గారు, చాలా బాగా Astronomy ని కవిత్వాన్ని కలిపారు.

  12. బ్లిస్ హోమ్ గురించి Sunkara Gopalaiah గారి అభిప్రాయం:

    01/02/2025 5:57 am

    మంచి కవిత

  13. 1-1. సంయమనం ఈమాటకూనా? గురించి Chandra Shekhar Pratapa గారి అభిప్రాయం:

    12/28/2024 10:56 am

    ఓ నందనోద్యానవనంలా, ఓ ఇంద్రధనుస్సులా, అన్ని ప్రక్రియలతో అలరారే “ఈమాట”ను ఏదో ఒక చట్రంలో ఇమిడ్చి చూడాలనుకోవడం, తమ తమ కోణంలోనో, వర్ణoలోనో, వాదంలోనో, పోకడలోనో, తాము నిర్దేశించిన కక్ష్యలో నడవడం లేదనే అక్కసువల్లనో గుచ్చుకునే ఆరోపణలు చేయడం, భావ దారిద్ర్యం కిందకే వస్తుంది! మీ సుదీర్ఘ విశ్లేషణ చదివితే నా “వైరుధ్యాలు” అనే కవిత గుర్తుకు వచ్చింది (తెలుగువెలుగులో ప్రచురితం)

    *వైరుధ్యాలు*

    తూర్పున సూర్యోదయం ఆస్వాదిస్తూ వాడు!
    వెల్తురు వెనక చీకటి కుట్రనేదొ శోధిస్తూ నువ్వు!

    ముళ్ల దారైనా కొత్తగా నడవాలని వాడు!
    ట్రెడ్మిల్ మీద నడుస్తూ నడక తెలీదని
    పరిహసిస్తూ నువ్వు!

    నీ చెంత నాలుగు అక్షరాలు నేర్చుకుంటాననుకుంటూ వాడు.
    వాడి కక్ష్యని సైతం నిర్ణయించాలని నువ్వూ!

    గొంతు సవరించుకుని కొత్త పాట పాడుతూ వాడు!
    అది నీ గూటి పాటై వుండాలని శాసిస్తూ నువ్వు!

    జంతువుల్ని ప్రేమిస్తూ వాడు
    మనిషిగా ఎదగ లేదని వాదిస్తూ నువ్వూ!

    సీతాకోక చిలుక వర్ణాల్తో వివశుడౌతూ వాడు
    ఇంకా గొంగళి పురుగనే ఊహిస్తూ నీవు!

    హృదయం అద్దంలా వుండాలని వాడు
    లైబ్రరీలా వుండాలని నువ్వూ!

    నవ్వులో నవ్వు మాత్రమే చూసే వాడు
    నవ్వు వెనక విషం శోధించే నువ్వు!

    నీకేది తిన్నగా వినిపించదు
    వాడికేదీ నిన్నగా కనిపించదు!

    ఎదిగే కొద్దీ తేటతెల్లం అవుతూ వాడు
    కొత్త ముసుగులు తొడుక్కుంటూ నువ్వు!

    (ప్రతాప చంద్రశేఖర్)

  14. భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    12/25/2024 6:34 pm

    కొడవళ్ళ హనుమంతరావు గారు, మీ వివరణ, చాలా సంతోషం. నేను వ్యాసం చదివి నా అభిప్రాయం రాస్తున్నప్పుడు మీ గురించి తలచుకున్నాను: కారణం మీరు వ్యాసాల్లో గాని, అభిప్రాయాల్లో గాని ఉట్టంకింపుల విషయంలో రాజీలేని ధోరణి ప్రదర్శిస్తారు. నేను అనుకున్నాను కొడవళ్ళ గారే ఈ వ్యాసం రాసివుంటే – ఆధారాల విషయంలో తన్నుకు చచ్చే పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను ఉదహరించిన ప్రఖ్యాత శ్లోకం భాస్కరుని బీజగణితం లోనిదే – అనేకులు ఆ శ్లోకాన్ని లీలావతిలో ప్రసంగవశాత్తు ప్రస్తావించారు. శ్లోకానువాదం ఎవరు చేశారో తెలియడానికి ఆ వివరాలు ఇచ్చాను. బీజగణితంలో ‘ఖషడ్విధం’ అన్న ప్రకరణాంతంలో వస్తుందీ శ్లోకం.

    ఉట్టంకింపులో మొదటి భాగానికి మూలమేదో నాకు ఇదమిత్థంగా అర్థం కాలేదు. బీజగణితంలోని ‘ఖషడ్విధం’ అన్న ప్రకరణంలో ఇచ్చిన శూన్య పరికర్మలు అన్ని ప్రస్తారాలను పేర్కొంటాయి.

    (ఉదాహరణకు -శూన్యంతో గుణకారం: 0xn =0; nX0 =0; 0X0 = 0) లీలావతిలోని సూత్రాలు దానికి భిన్నంగా, సూటిగా ఉంటాయి, భాష్యాన్ని ఆశించవు). సమీక్షకుల మొదటి వాక్యం లీలావతిలోని మూలానికి దగ్గరగా ఉంది, కాబట్టి, సమీక్షకులు ఉదహరించిన వాక్యాలకు మూలం లీలావతిలోని శూన్య పరికర్మాష్టకంలోనే వెదుక్కోవలసి వచ్చింది.

    “ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము. ”
    (సమీక్షకుల వాక్యాలు)

    ఖగుణః ఖః (ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును), ‘శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును’ అన్న దానికి శూన్య పరికర్మాష్టకం లో చూపడానికి ఆధారం లేదు. కానీ ‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము’ (ఖభాజితో రాశిః ఖహరస్యాత్) అన్నది తప్పుడు భావానువాదం.
    (నా వాక్యాలు)

    నేను చిన్ననాడు ఆంధ్రప్రభలో ప్రాచీన గణితం గురించి ఎవరో వారం వారం రాసేవారు. ఖహారగణితం గురించి మొట్ట మొదటిసారి అక్కడే చదివాను. ఆనాటి నుండి ఈ పద ప్రయోగం పట్ల వింత ఆకర్షణ ఉండి పోయింది.

    “Zero Denominator అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది. వీటి స్వారస్యాన్ని గ్రహించడానికి ఇంచుక గణిత రసజ్ఞత కావాలి” అని రాశాను గానీ, ఎక్కువ వివరాల్లోకి పోలేదు. మీరు జోసెఫ్ గారి పుస్తకం నుండి ఉట్టంకించి నా పని సులువు చేశారు:

    “A quantity divided by zero becomes a fraction, the denominator of which is zero (ఖహరం)
    This fraction is termed an infinite quantity. (‘అయమనంతో రాశిః ఖహర ఇత్యుచ్యతే’ ఈ యనంత రాశికి ఖహరమని పేరు. )

    అస్మిన్ వికారః ఖహరే న రాశా
    వపి ప్రవిష్టే ష్వపి నిస్సృతేషు
    బహుష్వపి స్యా ల్లయ సృష్టికాలేఽ
    నంతేఽచ్యుతే భూత గణేషు యద్వత్

    పై శ్లోకానికి చక్కని అనువాదం:
    In this quantity consisting of that which has zero for its divisor, there is no alteration, though many may be inserted or extracted. [Similarly], no change takes place in the infinite and immutable God when worlds are created or destroyed, though numerous orders of beings are absorbed or put forth.”

    ఇక్కడ భాస్కరుల ఖహరంతో గొడవ వస్తోంది:
    This, at its face value may seem approaching correctness, by suggesting that any number when divided by zero is infinity, but then Bhaskara II (b. 1114 CE) suggests that zero multiplied by infinity is any number, and hence all numbers are equal, which is certainly not correct. Emancipated from the role of a mere place-holder, zero joined the family of numbers capable of arithmetical operations.

    (కాబట్టే, తొందర పడి మూలంలో లేనివి ఊహించరాదు అని చెప్పడం, అక్కడ ఖహరం అని ఉంటే ఖహరం అనే రాయాలి, తొందరపడి అనంతం అనేయరాదు. ప్రాచీన కవిత్వాన్నిగాని, గణిత శాస్త్రాన్నిగాని అనువదించేటప్పుడు మూలం యథాతథంగా తెలుసుకోవడం ప్రథమ కర్తవ్యం. ఒక్కోసారి, ఇవాళ్టి అర్థాలు ఒకప్పటి అర్థాలు ఒకటి కాకపోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టే, hermeneutical study అవసరమవుతుంది.)

    0 X 1/0 = n (శూన్యం భాజ్యం ఖహరం భాజకం ఐతే వచ్చే లబ్ధం ఒక సంఖ్యయే (zero multiplied by infinity is any number); అందుకే, “Zero Denominator” అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది. వీటి స్వారస్యాన్ని గ్రహించడానికి ఇంచుక గణిత రసజ్ఞత కావాలి” అని రాశాను.

  15. భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:

    12/24/2024 9:53 am

    భారతీయ బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశనానికి మూలమా?

    భారతీయ విజ్ఞానం అంటే చాలు ప్రతి వాక్యంలో బ్రాహ్మణ శబ్దాన్ని జొప్పించడం అనవసరం. ఆర్యభట బ్రాహ్మణుడు కాదు, దళితుడు. బ్రహ్మగుప్తుడు కూడా బ్రాహ్మణుడు కాదు, వైశ్యుడు. పాశ్చాత్యులు యూక్లిడ్‍ను ఏ రకంగా తెల్లవాడిగా చూపిస్తారో – అదే విధంగా మనవారు ఆర్యభటని తెలిసో తెలియకో ఆర్యభట్టగా రాసి – విషయాన్ని తారుమారు చేస్తారు. మరిన్ని వివరాలకు చూ: Aryabhata dalit, his philosophy of ganita, and its contemporary applications. C. K. Raju. (చంద్ర కాంత రాజు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత వేత్త, గణిత శాస్త్ర చరిత్రను కూలంకషంగా ఎరిగిన వారు.)

    ఇప్పటి కులతత్వపు కళ్ళద్దాలతో గతాన్ని చూడరాదు. ఈ వ్యాసం కూడా వలసవాద సామ్రాజ్యవాద ప్రతిధ్వనే తప్ప మరొకటి కాదు. అంతేకాదు, వ్యాసం ఆమూలాగ్రం స్పష్టత కొరవడింది. కలిపికొట్టు కావేటి గంగ తరహాలో తయారైంది. భారతీయతను ఎలా నిర్వచించాలి అన్న శీర్షికన వేరొక వ్యాసం రాయవచ్చు, సమీక్షను అడ్డం పెట్టుకొని అర్థం లేని కుల మత రాజకీయాలను ఈడ్చుకురావడం మంచి పద్ధతి కాదు. శ్రద్ధ చూపవలసింది ఆకరాలను సరైన రీతిలో ఇవ్వడంలో. భాస్కరుని వాక్యాలు ఉట్టంకించారు, మూలంలో ఏ శ్లోకం అది, దాని తాత్పర్యం సరి చూసుకున్నారా? భాస్కరుడు సూటిగా అనంత ప్రస్తావన తీసుకువచ్చాడా? భాస్కరుడు దాన్ని ‘ఖహరం’ అని వ్యవహరిస్తాడు. ‘అయమనంతో రాశిః ఖహర ఇత్యుచ్యతే (“ఈ యనంత రాశికి ఖహరమని పేరు.”)

    అస్మిన్ వికారః ఖహరే న రాశా
    వపి ప్రవిష్టే ష్వపి నిస్సృతేషు
    బహుష్వపి స్యా ల్లయ సృష్టికాలేఽ
    నంతేఽచ్యుతే భూత గణేషు యద్వత్

    ఏ ప్రకారముగా సృష్టి నిర్మాణకాలమందెన్ని భూతములు పుట్టినను ప్రళయ కాలమందెన్ని భూతములు లయించినను అనంతుడును, అచ్యుతుడును అగు పరమేశ్వరుని యందు వికారము పుట్టదో యట్లు ఈయనంత రాశియందెన్ని సంఖ్యలు కలిపినను, ఇందుండి యెన్ని సంఖ్యలు తీసివేసినను దీనికి మార్పు కల్గదు.’ (ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, కొమఱ్ఱాజు వారి సంపాదకత్వం.)

    తన వలన అనేక భూతజాతము సృష్టి కాలమున సృజింపబడినను, లయకాలమందు తనయందు లీనమైనను, ఆత్మ పదార్థము మార్పు చెందనట్లు ఈ ఖహర రాశియు ఇతర సంఖ్యలను కలిపినను తీసివేసినను మార్పు చెందదు’ (పిడపర్తి వారి భావానువాదం).

    ఇక సమీక్షకుల ఉట్టంకింపు పరిశీలిద్దాం:

    ‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము. అనంతము నుండీ ఏదయినా పరిమిత సంఖ్యను తీసివేసిననూ కలిపిననూ దాని విలువ మారదు. ఈ అనంతము అద్వితీయమగు పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూతసృష్టి వల్ల కానీ లయము వల్ల కానీ మారడు’ అంటాడు భాస్కరాచార్య. పూర్ణమదః పూర్ణమిదం అనే ఉపనిషత్ శ్లోకసారం కూడా ఇదే.’

    పై ఉట్టంకింపులో మొదటి భాగం:

    “ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము.”

    ఖగుణః ఖః (ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును), ‘శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును’ అన్న దానికి శూన్య పరికర్మాష్టకంలో చూపడానికి ఆధారం లేదు. కానీ ‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము’ (ఖభాజితో రాశిః ఖహరస్యాత్) అన్నది తప్పుడు భావానువాదం.

    1/0 = ∞ అని ఆధునికులు వ్యవహరించినా, భాస్కరుడు మతి పోగొట్టే స్పష్టత చూపుతాడు ఇక్కడ. ‘ఖభాజితో రాశిః ఖహరస్యాత్’ (శూన్య పరికర్మలు – 4వ ప్రకరణం – లీలావతి గణితం (1936) పిడపర్తి వారి అనువాదం); సున్నతో భాగించబడినది అనగా సున్న హారముగా గలది (ఖహరం – A fraction with cipher as its denominator ( Coolebrook, Henry T (1893, Calcutta). Zero Denominator అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది. వీటి స్వారస్యాన్ని గ్రహించడానికి ఇంచుక గణిత రసజ్ఞత కావాలి, శ్రీవారికి సంచలనం కలిగించే రాజకీయాల మీద శ్రద్ధ లావు కావున, ఎన్నో దూడలను వదిలేయడం జరిగింది.

    ‘అనంతము నుండీ ఏదయినా పరిమిత సంఖ్యను తీసివేసిననూ కలిపిననూ దాని విలువ మారదు'(ఈ వాక్యం కూడా మూలార్ధాన్ని సరిగా తెలపడం లేదు. భాస్కరుని గొడవ ఖహరంతో.)

    ‘ఈ అనంతము అద్వితీయమగు పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూతసృష్టి వల్ల కానీ లయము వల్ల కానీ మారడు’ (ఇక్కడ కాళిదాసు కవిత్వం కొంత ఆ పై తన పైత్యం కొంత – మూలంలో ఉన్నది ఏమిటి -అచ్యుతం అనంతం – బ్రహ్మ ఎవరి సృష్టి? బ్రహ్మకు స్వయం అస్తిత్వం ఉన్నదా? పై అనువాదాలతో పోల్చి చూడండి.)

    ఇంతటితో నా ఆసక్తి పూర్తిగా చచ్చి పోయింది – పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే అన్న కప్పదాటు, అక్కడ చెబుతున్న దేమిటి? బోడిగుండుకు మోకాలికి ముడి వేయడమంటే ఇదే. తర్వాత ధర్మ తత్వజ్ఞుని స్వరంతో: “ఉపనిషత్ పూర్ణమా? బౌద్ధ శూన్యమా? ఏది జీరోకి మూలం? ఏది గణితంలో అనంతానికి ఆధారం?”

    భగవంతుడా అని గోచీ సర్దుకొని లేచి పోవలసిన పరిస్థితి! ఇంత దూరం వచ్చిన పాఠకులు ఎవరైనా ఉంటే పుస్తకసారం నాలుగు మాటల్లో ముక్తాయించి బయట పడతాను.

    The Golden Road: How Ancient India Transformed the World అన్న పుస్తకంలో, ప్రాచీన కాలంలో భారతదేశం (250 BC – 1200 AD) యావత్ ప్రపంచాన్ని – తన వైజ్ఞానిక ప్రగతి, సాంస్కృతిక ఘనత, వాణిజ్య సరళితో ఎలా మార్చివేసిందో ఒక అంచనా వేసే ప్రయత్నం చేశాడు భారత దేశంలో స్థిరపడ్డ బ్రిటిష్ చరిత్రకారుడు William Dalrymple. ఇదివరకూ వచ్చిన విలియమ్ డాల్రింపుల్ చారిత్రక గ్రంథాలను చదివిన ఎవరికైనా తెలిసివచ్చేది ఏమంటే, ఈతని పుస్తకాల్లో విషయచర్చ ఎంతో విపులంగా ఉంటుంది.ఒక ధ్యేయంతో విషయసేకరణ చేసి, ఒక పద్ధతికి లోబడి గ్రంథరచన చేస్తాడు కావున ఇష్టంగా చదువుతాము. ఐరోపాకు గ్రీసు ఎలాగో మొత్తం ఆసియా ఖండానికి భారతదేశం ఆలాగు అని ఈ చరిత్రకారుని ఉవాచ. కానీ, జ్ఞానప్రదాయినిగా గ్రీసు గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. విజ్ఞానశాస్త్రాలకు కాణాచి ఐన భారతదేశం గురించి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో సైన్సు బోధించే ఆచార్యులకే సరిగా తెలియదు. కావున, విజ్ఞాన రంగంలో భారతదేశం ప్రాశస్త్యాన్ని ఉగ్గడిస్తూ ఈ పుస్తకరచనకు పూనుకున్నాడు. దీన్ని కూడా చైనాకు ధీటుగా భారతదేశాన్ని పోటీగా నిలబెట్టే అగ్రరాజ్యాల ప్రయత్నంలో భాగమే అని పాకిస్తాన్ పత్రికా రచయితలు కొందరు చెవులు కొరుక్కున్నారు.

    ఇటీవల పరిశోధనల్లో తేలినదేమిటంటే – అసలు సిల్క్ రోడ్ [జర్మన్‍లో Seidenstrasse అంటారు – కారణం ఆ కూట సృష్టి వారిదే (1877)] అన్నదే లేదు. మంగోల్ దండయాత్రలకు (13వ శతాబ్దం) మునుపు చైనా – పాశ్చాత్య దేశాల మధ్య ప్రత్యక్ష వర్తక వాణిజ్య సంబంధాలు లేవు. చైనా ఉత్పత్తులు – ఇండియా ద్వారానే రోమ్ వెళ్ళేవి. ఇండియా రోమ్‍ల మధ్య సముద్ర వర్తకం చాలా ప్రాచీనమైనది అని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఐనా కూడా, ఘనతరమైన మన భారతదేశం కథ ఎవరికీ తెలియదు. ఇదీ ఈ పుస్తక నేపథ్యం. పుస్తకంలో బౌద్ధం ఏ రకంగా చైనా, మంగోలియా, జపాన్ కొరియా తదితర దేశాలకు పాకిందో, ఏ విధంగా హిందూ ధర్మం ఆగ్నేయాసియా మొత్తం వ్యాపించిందో అనేకాధారాలతో మనముందుకు తీసుకువస్తాడు డాల్రింపుల్. తర్వాత, భారతీయ గణిత ఖగోళ విజ్ఞానం ఎల్లలు దాటి అరబ్బువర్తకుల ద్వారా ఐరోపాకు పాకి చివరికి యావత్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుపుతాడు.

    ఈ పుస్తకాన్ని లోతుగా సమీక్షించాలి అంటే History of Science మరీ ముఖ్యంగా History of Mathematics బాగా చదువుకుని ఉండాలి. మరీ ముఖ్యంగా – దశాంశమాన పధ్ధతి, శూన్య భావపరిణామం, అనంత భావనతో దానికి గల సంబంధం; కనీసం ఆర్యభట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్యుల రచనలు మూలంలోనో, అనువాదంలో చదివి అర్థం చేసుకోగల ఓపిక, ఆసక్తి -వెరసి ఆధునిక గణిత శాస్త్ర పద్ధతుల్లో కనీస ప్రవేశం, అప్పుడు గాని ఈ గ్రంథ నేపథ్యం అర్థం కాదు.

    8వ శతాబ్దానికే బ్రహ్మగుప్తుని రచనలు అరబ్బీలోకి వెళ్లాయి. తర్వాత అరబ్బులు వైద్య, గణిత శాస్త్ర గ్రంధాలను సంస్కృతం నుండి విరివిగా తర్జుమా చేసుకున్నారు. క్రమేణా భారతీయ విజ్ఞానం అరబ్బు వర్తకుల ద్వారా ఇటలీ, స్పెయిన్ చేరుకుని ఐరోపా పునరుజ్జీవనానికి (Renaissance) దోహదపడిన వైనం రేఖామాత్రంగా నైనా తెలియాలి. ఎడారి మతాల, కొత్త మతాల గొడవలు, పరిమితులు, భారత దర్శనాల ప్రత్యేకత తెలిస్తే సమీక్షకుని పని మరింత సులువవుతుంది. సమీక్షకునికి ఇవేవీ తెలియనప్పుడు ఉపరితల స్పర్శజేసే సమీక్షతో ‘మమ’ అని బయట పడాలి. అలవాటు లేని ఔపోసనం జేస్తే మీసాలు తెగ కాలినవి తరహాలో ఉన్నది సమీక్ష వ్యవహారం. సమీక్ష చేయవలసిన విషయమే ఘనమైనది అయినప్పుడు, అది తనకు సరిగా తెలియనప్పుడు – తా దూర కంత లేదు మెడకో డోలు అన్నట్టు -హిందుత్వ, ముస్లింలు, నవ బౌద్ధులు, మూల వాసులు, మార్క్సు అని నానా చెత్తను తలకెత్తుకున్నారు. అసలు ఈ పుస్తక సమీక్షకు, వ్యాస శీర్షికకు ఏమైనా సంబంధం ఉన్నదా? నిజంగా భారతీయతను నిర్వచించవలసిన సందర్భం ఇదేనా? సమీక్షకుడు పుస్తకపరిధికి లోబడి సాము చేసి ఉంటే సమీక్ష ప్రయోజనం నెరవేరేది. వ్రతం చెడింది, ఫలం దక్కలేదు అని చెప్పక తప్పదు.

    ఇంకొక విషయం రచయిత తరచూ మాతృభాషకాని ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాస్తున్నట్టు తోస్తుంది- ఆ ప్రక్రియలో నుడికారం పూర్ణానుస్వారం కావడంతో వ్యాసరచనలో అనవసరంగా అయోమయం చోటు చేసుకొంటోంది.

    “చరిత్ర అంటే గతం కాదు, పూర్తిగా వర్తమానం. వర్తమానం గతంతో చేసే సంభాషణ కూడా కాదు చరిత్ర. వర్తమానం గతంపై చేసే వ్యాఖ్యానమే చరిత్ర.”

    ఇదేదో వచనకవిత్వంలో గందరగోళానికి పేరెన్నిక గన్న సీనియర్ కవి శివారెడ్డి వచనంలా ఉంది. ‘అర్థం కాలేదు’ అంటే, ‘మహార్థమును నిక్షేపించితిని’ అని బుకాయించడం కవులకు జన్మహక్కు. కనీసం, వ్యాసరచయితలైనా స్పష్టతకు కట్టుబడాలి కదా. పై పేరాకు ఆంగ్ల తర్జుమా:

    “History is not the past, but the present in its entirety. History is not even the conversation of the present with the past. History is the present’s commentary on the past.”

    వాక్యనిర్మాణం ఆంగ్లానికి దగ్గరగా ఉంది కాబట్టి, ఆంగ్లంలో చదివితే సులభంగా అర్థమవుతోంది. కానీ, తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’ స్థాయికి దిగజారి పాఠకుడిని దారితప్పిస్తోంది. కావున, ఈ సమీక్ష – రచయిత మాటల్లో చెప్పాలి అంటే ‘వలసవాద సామ్రాజ్యవాద ప్రతిధ్వనుల్లో’ భాగమే.

  16. కవిత్వం అమృతమవ్వాలి గురించి v r. veluri గారి అభిప్రాయం:

    12/02/2024 6:54 pm

    మీ చిన్న కవిత చాలా బాగుంది.

    కుర్చీలు విరిగిపోతే కూర్చోడం మాననట్టు
    కూర్చెడి శక్తి నశిస్తే
    చేర్చెదనొక ఇంత చెత్త సిరిసిరి మువ్వా. అన్నాడు మహాకవి.

    మీ మొదటి చరణం చదిన తరువాత నాకు గుర్తుకొచ్చిన పాత కవిత.

    వేవేరా.

  17. చదవాలి గురించి Sailaja గారి అభిప్రాయం:

    12/02/2024 2:43 pm

    పద్మావతి గారు,
    మీ కవిత్వం చాల చాల బాగుంది. ప్రతి వరుసలో చాలా లోతైన అర్ధం ఉంది. మీరు ఇంకా ఇలా అద్భుతమైన రచనలు మరి ఎన్నో చేయాలి అని కోరుకుంటున్నాం.

  18. చెప్పులు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/26/2024 1:54 am

    చెప్పులు స్వయంగా ఎందుకు కుట్టుకోకూడదు అంటారు లైలా గారు. పైగా చాలమంది చొక్కాలూ, జాకెట్లూ, కుట్టుకుంటూనే ఉంటారుగా అంటారు.

    జాకెట్లు కుట్టడం కుట్టు సెంటర్లు నేర్పేవండీ అమ్మాయిలకు. చొక్కాలు కుట్టటం మాత్రం ఎవ్వరూ అబ్బాయిలకు నేర్పించేవారు కాదు. సూదీ దారం తోలూ వంటివి సంపాదించి చెప్పులు స్వయంగా కుట్టుకోవటం కుదిరేపని కాదండీ. అవి సంపాదించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ఆటూల్స్ సులువుగా దొరకవు దొరికినా ఎంచుకోవటం తెలియాలి గా? నైపుణ్యం లేకుండా ప్రయత్నం చేస్తే ఆ డబ్బు దండుగ అవుతుంది. నేర్చుకుందుకు ఏ ఐటీఐ లోనో చేరి కోర్సు చేయాలి. ఊరికే ఎద్దేవా చేసేముందు ఆలోచించే పనిలేదా?

    ఎందుకో మరి. సంపాదనపరులైన ఆడవాళ్ళను రచయితలు ఫోకస్ లోకి తేరు. ఏం చెయ్యను. నేనే ఊహించుకోవాలి అంటారు లైలా గారు.

    ఒక పాత్రను ఫోకస్ లోనికి తేవటం అంటే ఆపాత్ర పాఠకుడికి కథను చదివిన తరువాత కూడా గుర్తు ఉండేలా చేయటం అని అర్థం. అంతే కాని సాధ్యమైనంత ఎక్కువ నిడివిని పాత్ర కోసం కథలో కేటాయించటం కాదు.

    ఈ కథలోని అక్క గారి పాత్ర పాఠకుల మందిని నిలచే పాత్రగా ఉంది. ఇంకేం కావాలి?

    ఇక కవిత గారికి హిపోక్రసీ కనిపించింది. కథచెప్పిన రచయిత నిజాయితీ కనిపించింది కాదు. విడ్డూరంగా అనిపించింది.

    నాకూ పన్నెండవ తరగతిలో కూడా చెప్పులు లేవు కాలేజీలోనికి వచ్చే దాకా పేంట్లూ లేవు. నాస్కూలు చదువంతా సెకండ్ హేండ్ పుస్తకాల తోనే గడిచింది. కాలేజీ చదువు లోనూ లైబ్రరీ పుస్తకాలు దొరక నప్పుడే మొహమాట పడుతూ నాన్నగారిని పుస్తకాల కోసం డబ్బులు అడిగే వాడిని. ఎప్పుడూ బ్రౌన్ పేపర్లతో నోటు పుస్తకాలు కుట్టుకునే వాడిని. ఈకథ చదువుతుంటే ఆరోజు లన్నీ మదిలో మెదిలాయి. ఇదంతా నా హిపోక్రసీ అంటే చేయగలిగింది లేదు.

    ఆ టీనేజీ కథకుడి లాగే నేనూ పెద్దయ్యాక కుటుంబానికి అది చేయాలీ ఇది చేయాలీ అని కలలు కనే వాడిని. భగవదనుగ్రహం వలన అవి చాలావరకూ నెరవేరాయి.

    అన్నట్లు ఒక మాట. కాలేజీకి వెళ్తున్న పిల్లాడి నని ఒకసారి మా అమ్మగారు నాకు తను దాచుకున్న డబ్బులిచ్చి కాస్త మంచి చెప్పులు కొనుక్కో మన్నారు.

    ఈకథ అరవైల నాటి వాస్తవిక జీవితాలను ఆవిష్కరించింది.

    రచయితకు అభినందనలు.

  19. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    11/12/2024 6:46 pm

    ఈ నా అభిప్రాయం మూలం గురించి. అనువాదాల గురించి కాదు. అది ఎవరు రాశారు లేదా పాడారు అన్న విషయం పక్కన వుంచి శ్లోకాల్ని మాత్రమే చూస్తే – వీటిలో వీటి కర్త భక్తిపారవశ్యం స్పష్టంగానే మనక్కనిపిస్తుంది. “చౌర్యం” అనే భావాన్ని తీసుకుని దాన్ని అన్ని శ్లోకాల్లోను అంతర్లీనంగా చొప్పించే ప్రయత్నం జరిగింది, అభినందనీయమే. “నవనీతచోరుడిగా”, “గోపీమానసచోరుడిగా” కృష్ణుడు ప్రసిద్ధుడే. మొదటిదాన్ని పాలు, మజ్జిగలకి ఇంకా కావాలంటే నెయ్యికి, రెండోదాన్ని రాధ, రుక్మిణి మొదలైన ప్రియులకీ భక్తులకీ పొడిగించటం సాధారణమే. అలాటి చోరుణ్ణి చీకటికొట్లలో బంధించటం – భక్తుల మనసుల్తో సహా – అనేది కూడ లోతైన భావనగా నాకు కనిపించదు. శబ్దప్రయోగాలూ ఏమంత చెప్పుకోదగ్గవి కావు.

    కనుక నా సందేహం వీటిలో కవిత్వం వున్నదా అనేది. అంటే పైపైన కనిపించే విషయమేనా లేక ఆలోచనామృతమైన వ్యవహారం ఏమైనా వుందా అనేది. నాకలాటిది కనిపించలేదు. కనిపించినవారు ధన్యులు. అదేదో మిగిలిన వారితో కూడ పంచుకుంటే ఇంకా బాగుంటుంది.

    భక్తిపురస్సరంగా వీటిని పాడుకుంటాం అంటే మంచిదే. కాని దీన్లో ఏదో అద్భుతసాహిత్యం వుందంటే ఒప్పుకోవటం కష్టం.

  20. ఆవంత్స సోమసుందర్ – గేయాలు, లఘుకవితలు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/11/2024 3:41 am

    70ల మొదటి భాగంలో నేను రంపచోడవరంలో ఉండగా అక్కద రావాడ కృష్ణ అనే ఒక చిత్రకారులు ఉపాధ్యాయులుగా ఉండేవారు. అప్పట్లో యువకుడినైన నాతో చాలా అత్మీయంగా ఉండేవారు. (అక్కడ మానాన్నగారు ప్రధానోపాధ్యాయులు.)

    కృష్ణగారికి సోమసుందర్‌గారంటే చాలా ఆరాధనా భావం ఉండేది (సోమసుందర్ ఎవరో అప్పట్లో నాకు తెలియదు). సోమసుందర్‌గారు చిన్నమ్మ వస్తోంది అని కాబోలు ఒక స్వీయ కవితాసంకలనం తెస్తున్నారని చాలా ఉత్సాహంగా చెప్పేవారు. అటువంటి కవితాసంకలనం సోమసుందర్‌గారు ప్రకటించారేమో తెలియదు.

    అప్పట్లో శ్రీశ్రీగారికీ సోమసుందర్‌గారికీ ఏదో పెద్ద రగడ నడిచింది. శ్రీశ్రీ‌గారు సోమసుందర్‌గారిని విమర్శిస్తూ పద్యాలు ప్రకటించారు. అందులో ఒక దాని చివరి పాదం “రుచి తెలియని కండచీమ సుందరదోమా!” అని ఉంటుంది.

    సోమసుందర్‌గారి కవిత్వం నేను ఇంతవరకూ చదువలేదు.

  21. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/10/2024 11:31 am

    ఇకపోతే దండుగ గణాలు (దండుగ్గణాలు అనటం నాకు నచ్చలేదు) అని ఈసడించబడే వాటి గురించి కొంతైనా చెప్పుకోవాలి. తప్పదు.

    సంస్కృతంలో శబ్ధాల స్వరూపం విభక్తులను అనుసరించి మారుతూ ఉంటుంది సాధారణంగా. అందుకే శబ్దమంజరిని తీసుకొని శబ్దాలను బట్టీపట్టటం. తెలుగులో ఐతే విభక్తులు ఎక్కువగా విడిపదాలు. అందుచేత సంస్కృతంలో దీర్ఘంగా సమాసాలను తయారు చేయగలిగినట్లు తెలుగులో చేయటం కుదరదు. అందుచేత సంస్కృతంలోని క్లుప్తతను తెలుగులో అలాగే దిగుమతి చేయటం దుస్సాధ్యం. సంస్కృతంలో ఒకటి చిన్న వృత్తంలో ఉంది కదా దానిని తెలుగులో దైర్ఘ్యం పెంచకుండానే వ్రాసితీరాలి అనటం అన్యాయం.

    విడివిడిపదాలతో తెలుగులో పద్యాలను కూర్చేక్రమంలో అనేకకారణాలవలన కొన్ని ఇతరపదాలనూ చేర్చి పద్యపు బిగింపు తప్పదు. కేవలం అవసరమైన పదాలనే ఏరుకోవాలన్న ఆశ మంచిదే కాని తరచుగా వాటిని ఇతరపదాలతో మాటువేయకుండా ఛందస్సులలో ఇరికించటం వీలుకాదు. ఇలా అదనంగా కనిపించిన పదాలను దండుగలు అని ఈసడించటం పొరపాటు. అదనపు పదాలవలన పద్యం బిగువు చెడుతున్నదా అన్నది చర్చనీయాంశం కావచ్చు కాని అదనపు పదాలు ఉండవచ్చా అన్నది కానే కాదు.

    ఆమాటకు వస్తే సంస్కృతంలో కూడా ఇలా మాటువేయకుండా శ్లోకాలను అల్లటం కుదరదు. తరచుగా పాదపూరణాక్షరాలను వాడవలసి వస్తుంది. అందరికీ తెలిసిందే చకారాలను బిగించని శ్లోకాలే అరుదు. ద్రోణంచ భీష్మంచ జయద్రధంచ వగైరా శ్లోకాలు తెలియనిది ఎవరికి? అని. కాళిదాసు గారు వ్యాసుణ్ణి చకారకుక్షి అని ఆక్షేపించాడని ఒక ఐతిహ్యం. తు హి చ స్మ హ వై పాదపూరణే అని నానుడి. శ్లోకంలో ఒకోసారి ఒక అక్షరం మేర లోటువస్తే చ వేసేయటమే. మరి దండుగలు అని అంటున్నామా వాటిని? కవుల బాధలు కవులవి, ఛందోబధ్ధంగా వ్రాయటంలో ఉన్న బాధలు ముఖ్యంగా రెండు. ఛందస్సును ఒప్పించటం అందంగా రచించటం – ఈరెండూ తరచు పరస్పర విరుధ్ధమైన త్రోవల్లో ఉంటాయి. కవి ఏవో తిప్పలు పడి ఉభయతారకం చేయాలి మరి. చేయితిరిగిన కవికైతే అంతకష్టం కాదు తరచుగా. కాని ఎంతవారికైనా సరే పూరణపదాలూ పూరణాక్షరాలూ అస్సలు లేకుండా అసిధారావ్రతంగా రసవంతమైన కవిత్వం చెప్పటం సాధ్యం కాదు.

    విమర్శకాగ్రేసరులు కాస్త సానుభూతితో ఆలోచించితే బాగుంటుంది. స్వల్పాంతరత్యశ్చ బహూపయోగాః. తత్యజ్యతే తన్నతు దూషణాయ అని ఒక సూక్తిని ఒక జ్యోతిష గ్రంథంలో చదివాను. నాకు సంస్కృతం రాదు. కాబట్టి సూక్తిని ఉటంకించటంలో కించిత్తుగా పొరపాటు ఉండవచ్చును. మన్నించాలి.

    అలాగని, చచ్చీచెడీ ఏవో కొన్నికొన్ని మాటలను ఛందశ్చక్రంలో ఇరికించి హమ్మయ్య ఐపోయింది పద్యం అన్నట్లు కిట్టించిన పద్యాలను ఆక్షేపించవద్దని అనటం లేదు. ఛందస్సు ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే. కవి ప్రతిభతోనే పద్యం వస్తుంది.

  22. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/09/2024 10:58 am

    మొదటి శ్లోకానికి నేను ఉత్పలమాలను ఎంచుకున్నాను. దానిని వీరు చీల్చి చెండాడారు. వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం గురించి వారి వాదన వారిది. మూలం యధాతధంగా రాకపోవటమూ దీర్ఘవృత్తాన్ని ఎంచుకోవటమూ తత్కారణంగా కొన్ని కొత్తపదాలు చేరటమూ వంటివి వారికి నచ్చలేదు. వారి దృక్కోణం వారిది.

    కాని వారు “మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది” అన్నారు. ఈమాట ఆశ్చర్యం కలిగించింది. నిజం చెప్పాలంటే కొంచెం బాధించింది.

    దొంగిలె పాలువెన్నలను తొల్లిట నీతడు గొల్లపల్లెలన్
    దొంగిలె గొల్లకన్నియలు తోయములాడెడు వేళ చీరలన్
    దొంగతనంబుచేసె బహుధూర్తత నావగు పాపసంపదల్
    దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద వీని కెప్పుడున్

    అన్న ఈవృత్తం గానయోగ్యంగా లేదని వారు ఎలా భావించారో అర్ధం కాదు. క్లుప్తత వీడి దీర్ఘం అవటం వలన గానయోగ్యం కాకుండా పోయిందా? కొత్తపదాలతో పొడుగై పేలవమై గానయోగ్యం కాకుండా పోయిందా? దీర్ఘవృత్తాలు గానయోగ్యాలు కావనుకుంటే ఎవ్వనిచేజనించు పద్యం కూడా గానయోగ్యం కాదు కదా. తిరుపతివేంకట కవుల చెల్లియో చెల్లకో పద్యం అస్సలు గానయోగ్యం కాదు కదా? ఇక మందారమకరంద అంటూ సాగే సీసం ఐతే అస్సలు గానయోగ్యం కాకుండా పోవాలి కదా?

    వీరిదృష్టిలో దండుగ గణాలు చేరాయి. సరే, అలా చేరితే అవి దైర్ఘ్యాన్ని ఆపాదించగలవు కాని పద్యాన్ని ఏకంగా గానయోగ్యం కాకుండా చేస్తాయా?

    ఈపద్యం గానయోగ్యంగా ఉందని నావిశ్వాసం. నేను గాయకుడిని కాను. ఐతే పాడి మరీ ఋజువు చేయగలిగి ఉండేవాడి నేమో. మిగిలిన పద్యాలూ నాదృష్టిలో గానయోగ్యాలే. కావనుకుంటే నేను చేయగలిగినది లేదు.

    దండుగ గణాలు అంటే ఒక సంగతి గుర్తుకు వస్తోంది కరుణశ్రీ గారు కుంతీకుమారి ఖండకావ్యంలో దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్ అంటారు. దిగటం అంటేక్రిందికి కాక పైకి కూడా ఉంటుందా? క్రిందికి అనటం దండుగే కదా. మెట్లమీదుగన్ అని మాత్రం ఎందుకు? మేడ దిగాలంటే మెట్లే దిగాలి కదా (అప్పట్లో లిఫ్టులు లేవు సుమా) కాబట్టి మెట్లమీదుగన్ అన్నది కూడా దండగే కదా. ఇలా పూరణకోసం పదాలు పడటం దండుగ గణాల వ్యవహారమే కదా. ఇలా లెక్కలు వేస్తూ పోయి కరుణశ్రీకి పద్యాలు వ్రాయటం చేతకాదనీ కుంతీకుమారి, పుష్పవిలాపమూ పేలవకవిత్వాలనీ అనటం చేయవచ్చునేమో. ఏమో నాకు తెలియదు. ఈశంకల వంకల డొంకల నుండి ఏకవి బ్రతికి బయటపడగలడో తెలియదు.

  23. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    11/08/2024 9:44 pm

    అధికమాసం (పురుషోత్తమ మాసం అనీ పిలుస్తారు) లో చౌరాష్టకం గానం చేసే వైష్ణవ సంప్రదాయం ఒకటి ఉంది. ఇక ఈ అష్టకం ‘ఉపజాతి’ అన్న మిశ్ర ఛందస్సులో ఉన్నది. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్రను సమ విషమపాదాల్లో ప్రస్తరిస్తే వచ్చే ఛందమిది (మినహాయింపు అష్టకంలో చివరిది – అందులో ప్రస్తరించిన పాదాలు ఇంద్ర వజ్ర (18 మాత్రలు), ఉపేంద్ర వజ్రవి (17 మాత్రలు) కావు, మరేదో వృత్తం -7 మాత్రలు ఎక్కువ). అన్ని అష్టకాల్లాగే ఇది గాన యోగ్యం. అనువాదంలో అసలు గొడవ ఇక్కడి నుండే మొదలవుతుంది. మూలంలో సంగీత గుణమున్న కవిత్వాన్ని అనువాదంలో మెప్పించలేము. అష్టకాలు మరీ కష్టం.

    అనువాదకులు అధికంగా మాలికలు ఎంచుకున్నారు (4 ఉత్పలమాలలు & 2 చంపకమాలలు – 28 మాత్రలు – వజ్రలతో పోలిస్తే 10-11 మాత్రలు ఎక్కువ); సీసం ఆటవెలది, తేటగీతి కూడా వచ్చాయి. ఇందులో తేటగీతితో చేసిన అనువాదం మేలుగా ఉంది. కారణం – తేటగీతి పాదంలో తక్కువ అంటే 17 మాత్రలు, ఎక్కువ అంటే 19 – మధ్యస్థంగా 18 మాత్రలు వస్తాయి. కొంత మెలకువతో రాస్తే క్లుప్తత చెడకుండా భావాన్ని, ఉపజాతి లోని స్ఫూర్తిని సమంగా పట్టుకురావచ్చు – ఏమాత్రం దండుగ్గణాలు లేకుండా. సంస్కృతంలో ఏదో ఒక వృత్తాన్ని ఎన్నుకొని చివరికంటా దానితోనే బండి లాగించడం పరిపాటి, మన కవుల్లో దూకుడు ఎక్కువ, అది అలా ఉండనిస్తే, అక్కడక్కడ లోతైన వ్యంగ్యం ఉన్నా – మూలంలో కథ అందరికి తెలిసినదే. కావున చౌరాష్టకం మొత్తం తేటగీతులతో రాస్తే మరింత అందగించేది. మూలంలో – వ్యంగ్యంగా, క్లుప్తంగా చెప్పడం ఉంది, ఎక్కడా వివరణ అన్నది లేదు.

    ఎంచుకున్న వృత్తం ఉపజాతి కాబట్టి, ఆ పరిమితులకు లోబడి, ఎంతో సంయమంతో నడిచింది వ్యవహారం. ఇక అనువాదంలోకి ప్రవేశిస్తే –

    మొదటి శ్లోకం, దానికి ఆంధ్రీకరణ:

    వ్రజే ప్రసిద్ధం నవనీతచౌరం
    గోపాంగనానాం చ దుకూలచౌరం
    అనేకజన్మార్జితపాపచౌరం
    చౌరాగ్రగణ్యం పురుషం నమామి

    దొంగిలె [పాలు]వెన్నలను [తొల్లిట నీతడు] గొల్లపల్లెలన్
    దొంగిలె గొల్లకన్నియలు [తోయములాడెడు వేళ] చీరలన్
    దొంగతనంబుచేసె [బహుధూర్తత నావగు] పాప[సంపదల్]
    దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద [వీని కెప్పుడున్]
    [కుండలీకరణల్లో ఉన్నవి – మూలంలో లేని అంశాలు ]

    చిన్ని కృష్ణుడు వెన్నదొంగ అని తెలుసు కానీ, పాల దొంగ అని తెలియడం ఇదే ప్రథమం – కుండంత భావాన్ని కొండంత వృత్తంలో చెప్ప బోతే వచ్చే చిక్కులు – మూలంలో నవనీతం – అనువాదంలో పాలలో కలిసిపోయింది.
    కొండ మీద కూచుని రోజుకొక కృతి రచించిన అన్నమయ్య కూడా ‘ కినిసి వెన్న దొంగిలె వీడే’ అన్నాడే గానీ పాల ప్రస్తావన తీసుకురాలేదు. (5 వ పద్యానువాదంలో “వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు” అన్న వాక్యమున్నది – పాల ప్రస్తావన లేదక్కడ). ఇక, జలకాలు ఆడేటప్పుడే కదా బట్టలు మాయమయినది – మూలంలో స్నానాల ప్రస్తావన తేలేదు. అది అనువాదంలోకి వచ్చి చేరింది. కవిత్వంలో పాఠకుని ఊహకు వదిలేయవలసిన విషయాన్ని విస్తరించడం, వివరణకు పూనుకోవడం పెద్ద దోషం – మూలంలోని లేని దోషాన్ని అనువాదంలో స్థాపించడం మరింత పెద్ద తప్పు. అంతేకాదు, అగ్రగణ్యుడు అంటే రాజు అనడం కూడా తప్పు – వీరాగ్రగణ్యుడు అంటే వీరుల్లో మొదట లెక్కించవలసిన వాడు అంతే గాని వీరులకు రాజు కాదు. ఇన్ని తప్పులు ఎందుకు దొర్లాయి అంటే – మూలంలో కావ్యాత్మను పట్టుకోలేకపోవడం, వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం. కాబట్టి మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది.
    ఐదవ శ్లోకం దానికి ఆంధ్రీకరణ:

    “ధనం చ మానం చ తథేంద్రియాణి
    ప్రాణాంచ హృత్వా మమ సర్వమేవ
    పలాయసే కుత్ర ధృతోద్య చౌర
    త్వం భక్తిదామ్నాసి మయా నిరుద్ధః” (5)

    నాధనంబుల నెల్ల [నయముగా నీపాలు చేసికొన్నావుగా]( చిన్నిదొంగ)
    నా మాన[ధన]మును (శ్యామసుందర) [నీవు కొల్లగొట్టితివిగా] (గోపబాల)
    అరయ నా సర్వేంద్రియముల సత్వంబుల నీవ గైకొంటివి (నీటుకాడ)
    నాప్రాణములు [కూడ నావి కావాయెనే నీయందు నిలచెనే] (నీలవపుష)

    ఇన్ని యపహరించి యెందు బోయెదవయ్య
    [వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు]
    భక్తిరజ్జువులను బంధించినాను నా
    [హృదయమందిరమున నింపు మీఱ] ( 5)

    (మూలము నందు లేని సంబోధనలు ) [మూలంలో లేనివి ]

    మూలంలో కృష్ణ సంబోధన అష్టకం ముగిసేటప్పుడు కేవలం ఒక్క సారి వినిపిస్తుంది – అనువాదంలో ఐదారు వచ్చి చేరాయి. మూలంలో రెండు పాదాల్లో చెప్పిన భావం అనువాదంలో సీసమై విస్తరించింది. తర్వాత రెండు పాదాల్లోని భావం చెప్పడానికి అనువాదంలో ఒక ఆటవెలది ప్రవేశించింది. అనువాదం కత్తి మీద సాము, అందులోను గానయోగ్యమైన అష్టకాలకు ఇక చెప్పేదేముంది. దాని కన్నా – మూలంలోని విశేషాలు సరళంగా అనువాదకునికి తెలిసిన వాడుకభాషలో వివరించడం శ్రేయస్కరం అనిపిస్తుంది. లేదా గురజాడ మార్గంలో, ముత్యాల సరాల్లో అణకువగా తేలిక తెలుగులో అనువాదం చేయవచ్చు.
    (ఉరామరికగా, కేవలం ఉదాహరణ కోసం సుమా)

    పేరుమోసిన వెన్న దొంగవు
    గొల్లభామల వల్లెవాటులు,
    జన్మజన్మల పాపభారం –
    హరించు నీకు నమస్కారం 1

    రాధమనసును చూరగొంటివి
    మెరిసిపోయే మేఘకాంతిని,
    పంచ జేరినవారి సమస్తం –
    హరించు నీకు నమస్కారం 2

    ఆరవ శ్లోకం దానికి ఆంధ్రీకరణ :
    ‘ తేటగీతితో చేసిన అనువాదం మేలుగా ఉంది ‘ అని పైన తెలిపి ఉన్నాను. ఛినత్సి, భినత్సి అన్న రెండు సంస్కృత క్రియలను తెనుఁగులో ఏకంగా త్రెంచి పడ వైచినా – దాని దుంప తెంచిరి అది అటుండనిద్దాం- బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నారు శ్యామలకవి – ఉపజాతిని ఎంతో ఔచిత్యంతో తేటగీతిలో తెనిగించారు.
    “దించెదను కవిభావ ముదీర్ణశక్తి ” అని గొప్పగా రాశారు ఈ పద్యం.

    ఛినత్సి ఘోరం యమపాశబంధం
    భినత్సి భీమం భవపాశబంధం
    ఛినత్సి సర్వస్య సమస్తబంధం
    నైవాత్మనో భక్తకృతం తు బంధం (6)

    త్రెంచెదవు ఘోరయమపాశ మంచితముగ
    త్రెంచెదవు భవపాశ ముదీర్ణశక్తి
    త్రెంచెద వఖిలబంధముల్ దీనుల గని
    భక్తిపాశంబులను ద్రెంచ వశమె నీకు

    స్థాలీపులాకంగా అనువాదంలో కష్టసుఖాలను వివరించాను. ఇంకా ఎవరైనా అనువాదాల్లో మెలకువలు తెలుసుకోదలిస్తే: “అనువాదంలో మెలకువలు

    ఇంత కష్టమైన పనిని తలకెత్తుకున్నందుకు తాడిగడప శ్యామలరావు గారికి అభినందనలు తెలుపుతున్నాను. అందరిలాగా, వారి ఇతర పద్యరచనల కోసం ఎదురుచూస్తాను.

  24. నవంబర్ 2024 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    11/05/2024 6:28 am

    మీరు అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన చేయవలసింది – పుస్తక సమీక్షలు, విమర్శలు ప్రచురించడం – మీ ధ్యేయాలు, ఆశయాలు ఇప్పటికే అందరికీ స్పష్టంగా తెలిసివచ్చాయి – ఇక కావలిసినదల్లా కార్యాచరణ; అమెరికాలో తెలుగును ఉద్ధరించడానికి ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరికీ అర్థం కాని చిన్న విషయం – భాషను, సాహిత్యాన్ని సజీవంగా ఉంచుకోవాలి అంటే సమీక్షలను, విమర్శలను విరివిగా వచ్చేలా ఒక యంత్రాంగాన్ని, వ్యవస్థను ఏర్పరచుకోవడం. కవిత్వంలో ఒక కవి స్థానాన్ని నిర్ణయించే, సాహిత్యంలో కథ స్థాయిని నిరూపించే, అనువాదాల గుణదోషాలను విచారించే -విమర్శ ద్వారానే అది సాధ్యం. గతంలో ఈ మార్గంలో నేను కొంత ప్రయత్నం చేసి ఉన్నాను – ఆ అనుభవంతో చెప్పగలను – తొలినాళ్ళలో అందరూ మీ ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేరు – సదరు కవి కీర్తికి కళంకం తెస్తున్నారనో, సదరు అనువాదకుడి కంచుఢక్కను పగులగొట్టే ప్రయత్నం చేస్తున్నారనో వారి అనుచరశ్వానగణం దాడి చేయవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఇతరులకు భుజకీర్తులుగా, భజంత్రీలుగా మారే ‘సృజనకారుల’ సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకరం. ఎవరూ విమర్శలకు అతీతులు కారు. పుఠం పెట్టవలసిందే. వయసు, పదవి, ప్రచురించిన పుస్తకాల సంఖ్యా, తెచ్చుకొన్న లెక్కలేని అవార్డులు -ఇవేవి నహి నహి రక్షతి డుకృఞ్కరణే. మీరు కార్యాచరణ మొదలు పెట్టడం మంచిది. ఒంటి చేత్తో ఒకరు చేయగల పని కూడా పెద్ద పెద్ద పత్రికలు చేయలేక పోవడం క్షమార్హం కాదు. అట్టే సమయం లేదు – ఇరవై ఏళ్ళుగా చూస్తున్నా – ఈమాట ఈ విషయంలో ముందడుగు వేయలేదు అని చెప్పడానికి విచారిస్తున్నాను.

    [పుస్తకాలు, కథలు చదివినవారు వాటిగురించి వ్రాయాలి. అలా సమీక్షలు, విమర్శలు, చర్చలతో నిండిన సాహిత్యవాతావరణం కావాలి. తెలుసు. ఈ చింత మాకూ ఉంది. ఈలోటు ఎలా పూడ్చాలా అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. తరచుగా రచయితలను, విమర్శకులను సంప్రదిస్తూనే ఉన్నాం. సమీక్షలు, విమర్శావ్యాసాలు వ్రాయమని అభ్యర్ధిస్తూనే ఉన్నాం. ఇది అందరు రచయితలు, పాఠకులు కలిసి చేయవలసిన పని. విరివిగా చదివి సమీక్షలు ప్రతినెలా వ్రాయగల వారికోసం వెతుకుతూనే ఉన్నాం. – సం.]

  25. నో ఎగ్జిట్ .1 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    11/05/2024 5:59 am

    కథలోంచి బయటపడలేరు – గమ్మత్తయిన కథ. Alice’s Adventures in Wonderland అందరూ చదివే ఉంటారు కదా. కుందేలు కంతలో దూరిన అమ్మాయి వింత లోకంలోకి అడుగుపెడుతుంది. వింత పాత్రలతో నిండిన లోకం. ఎన్నిసార్లు చదివినా – బయట పడలేము, దానికి కారణం అందులోని వాతావరణ కల్పన. కథ ఒక వాతావరణం ద్వారా వ్యక్తమవుతోంది – కవిత్వానికి రూపం లాంటిది కథకు వాతావరణం. అంతరంగం, ఆకాశం కలిస్తే గాని మంచి కథ పుట్టదు. కథకుడు కన్నెగంటి చంద్రకు అభినందనలు.

  26. అంతిమ లతాంతము గురించి NS Murty గారి అభిప్రాయం:

    11/03/2024 11:38 pm

    శ్రీరామనాథ్ గారూ,

    భాషపట్ల అవ్యాజమైన అనురాగం ఉన్నవారు తప్ప ఇటువంటి కవిత, దానికి తగిన ఆముఖము వ్రాయలేరు.

    “కన్నుల మాటలాడుచున్,’
    ‘రసన పత్రాంజనమ్ము లేని ముద్రణశాల,’
    ‘చరమంపు చప్పరింపు,’
    ‘తనదు జాతి జాలువార్చినట్టి సంస్కృతి తుది వారికణము;
    ఆతడొక భావనాలతికాంత్యసుమము.’

    ఇవి గుండెలోతులలోనుండి వచ్చినవని స్పష్టంగా తెలుస్తోంది.

    ఏ భాష అయినా మనిషి నాలుక మీదనే చిరంజీవి.

    హృదయపూర్వక అభినందనలు.

  27. అజ్ఞాతవాసి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    10/29/2024 1:00 pm

    A multi-point focus painting. No one is made big of; everyone gets their fair share of the canvas.
    The gentleman who opens the story is an aspiring poet. He is a nice guy. He is fond of his wife. And I like that.
    As I read the story, it does not come across as though he would have ever said before marriage, something like this to her,

    “ఆప్ జైసా కోయీ మేరీ జిందగీ మె ఆయే
    తో బాత్ బన్ జాయే, ఆహా! బాత్ బన్ జాయే!
    గుల్ కో బహార్, బహార్ కొ చమన్
    దిల్ కొ దిల్, బదన్ కొ బదన్
    హర్ కిసీ కొ చాహియే తన్ మన్ కా మిలన్
    కాష్ ముజ్ పే ఐసా, దిల్ ఆప్ కో భీ ఆయే
    తో బాత్ బన్ జాయే! ఆహా..”

    That is what I call poetry. It does not matter if it is sung in a nightclub, to disco music by Jeenat Aman, or if you read it embedded in a short story. The Hindi words are red hot coals. They just burn holes in the romantic souls. Man! The Hindi and Urdu poets are so good!

    The aspiring Telugu poet’s shown poetry is tepid, సంసార సాధక బాధక సర్దుకు పోయే kind of కవిత్వం and has no fireworks at all. Look at the couple’s parting scene in the train station in this story. One on either side of a train window. Such a middle class married Telugu goodbyes.
    Even afterwards, in private also, the budding poet has to run and grab his notebook to read his own poetry to his wife. He cannot recite it from his memory. If the poet cannot, who can afterwards!
    And the wife’s reaction – she acts as a sort of poetry critic, one who humors her husband like a child. Not as the recipient of his love poetry. Too bad.
    Ojala! How I wish she herself is a love poet like Elizabeth Browning. Elizabeth wrote better poetry than Robert Browning. How I wish, in their separation, the lady of the house could think romantic and invite her husband as in the old-style Telugu song below.

    వెన్నెల సౌధము నాది
    విడిది చేయ రారా మురారీ!
    మారుతముతో నా మరుల లేఖ నంపేను
    తేలివచ్చేవని చంద్రవంక తేరు నంపేను
    మేడంత మేఘాలె, గాఢంపు ధూపాలె
    చక్రవాకాల గానాలె, చక్రి రావటరా!
    వన్నె వాకిళ్లు తెరిచేను, తెలతెల్లని పూలు పరిచేను
    నడచిరారా! నాథ!
    చేతులకు చేతులల్లి, హృదయానికి హృదయమొత్తి
    అధరానికి అధరమిత్తు;
    సౌందర్యపు సౌరభాల సనాతనపు ప్రణయాలకు
    నూత్న నూత్న అర్ధమిత్తు
    వెన్నెల సౌధము నాది విడిది చేయ రారా, ప్రియా!

    The celebrity poet in the story is a dullard, who withdrew into a shell like a snail, he is half dead, and it is a fine decision they all made (even if for assumed wrong reasons.) He should be left to his own vanity, grandiosity and persecution mania. Nothing good will come out of meeting with that chap. We never heard one bit of his hotshot poetry in the story, anyway.

    So on and so forth.
    Happy Diwali and all other jazzy sizzling festivals! Dearies!
    -Lyla

  28. అజ్ఞాతవాసి గురించి శివకుమార శర్మ గారి అభిప్రాయం:

    10/16/2024 10:46 pm

    “రాను రాను తెలుగు సాహిత్యం పాఠకులను పోగొట్టుకుంటోంది. ఒకప్పుడు పత్రికలు, ప్రచురణకర్తలే రచయితకి పాఠకులకి మధ్య వారధులు. నాకు తెలియని ఆ పాఠకులు నిర్మొహమాటస్తులు. నా కవితలలో అస్పష్టతని, కథలలో అర్థంకానితనాన్ని వివరిస్తూ వారినుంచి వచ్చే విమర్శలో నిజాయితీ వినిపించేది.”

    అన్న ఒక రచయిత చుట్టూ అల్లిన కథ. అహంలేని, కీర్తికాంక్షకి దూరంగా ఉండే రచయిత గూర్చి. అలాంటి వాళ్లు ఉండరని కాదు గానీ, వెబ్ పత్రికలు లేని కాలంలో కూడా శ్రీశ్రీ, దేవులపల్లి, ఆరుద్ర వంటి మహామహులకి బ్రహ్మరథం పట్టారు. వాళ్లని ప్రసంగాలకోసం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఆహ్వానించాయి. రెండు మహారచయితల/కవుల బృందాలు పత్రికా ముఖంగా చేసుకున్న యుద్ధాలగూర్చి విన్నాను కానీ, అది కనీసం అయిదు దశాబ్దాలకి పైగా వెనుక. ఎంత నిష్కర్షగా సంపాదకులకి సామాన్య పాఠకులు ఉత్తరాలు రాశారో గానీ, నేను పత్రికలు చదవడం మొదలయిన దగ్గర్నించి అచ్చులో పేరు చూసుకోవాలన్న తపనలే ఎక్కువ కనిపించాయి. అందుకే ఆ వారధి పోలిక అసమంజసం అనిపించింది. కానీ, అదే ఈ కథకి కీలకం.

  29. అజ్ఞాతవాసి గురించి రమేశ్ బాఋ గారి అభిప్రాయం:

    10/08/2024 10:14 pm

    బాగుందండీ కథనం… కథ నేపథ్యంగా కొన్ని స్పష్టం చేసారు. “రాను రాను తెలుగు సాహిత్యం పాఠకులను పోగొట్టుకుంటోంది. ఒకప్పుడు పత్రికలు, ప్రచురణకర్తలే రచయితకి పాఠకులకి మధ్య వారధులు. నాకు తెలియని ఆ పాఠకులు నిర్మొహమాటస్తులు. నా కవితలలో అస్పష్టతని, కథలలో అర్థంకానితనాన్ని వివరిస్తూ వారినుంచి వచ్చే విమర్శలో నిజాయితీ వినిపించేది. ఎప్పుడైతే పాఠకులు దూరం అవుతారో, సెల్ఫ్ ప్రమోషన్, ఒకరినుండి ఇంకొకరు మెప్పు ఆశించడం, మొహమాటపు పొగడ్తలు, ఇవన్నీ రచయితలకి అదనపు బరువులు. అందుకే ఇకపైన ఈ రకమైన జీవితానికి దూరంగా వుండదలిచాను” ఇది నిజం… Self promotion ఇటీవల రచయితల్లో ఎక్కూవ అయ్యింది.

  30. అక్టోబర్ 2024 గురించి ఎ. కె. ప్రభాకర్ గారి అభిప్రాయం:

    10/03/2024 11:28 pm

    [కేవలం ‘వస్తువు’ వల్లనే కథగానీ కవితగానీ మంచి సాహిత్యం కాలేదు అని మేము అనడం ఇది మొదటిసారి కాదు, చివరిసారీ కాబోదు. ఇదే విషయం ఇంతకుముందు ముందుమాటలలోనూ ఎన్నోసార్లు ప్రస్తావించాం – సం.] ” మీరు మాట్లాడింది మనుషుల గురించి. జీవితాల గురించి. అవి సాహిత్యంలోకి ఎక్కడం గురించి. ఇంకా ఆంక్షలు ఎందుకు పెడతారు? ఆ పని మంచిది కాదేమో చూసుకోండి అంటే ఇంతకు ముందు అదే చేశాం, ఇకముందు అదే చేస్తాం అనడాన్ని ఎలా పరిగణించాలి?

    [మీరు దయచేసి మా జులై 2024 ముందుమాట చదవండి – సం.]

  31. అక్టోబర్ 2024 గురించి Mula Ravi Kumar గారి అభిప్రాయం:

    10/03/2024 10:21 pm

    ప్రతిభా, నిజాయితీ ఉన్నవారికి నెగెటివ్ ఆలోచనలు ఉండకూడదన్న నియమం లేదు…

    వెంకట్ సిదారెడ్డి గారి కథలపుస్తకం “సోల్ సర్కస్” చదవగానే నేను రాసిన ఫేస్‌బుక్ వ్యాఖ్య: “ఈ పుస్తకం చదవగానే నా కథలు నాకు వ్యాసాల్లా అనిపిస్తున్నాయి…”

    అలాగే గతంలొ ఈమాట పత్రికలో గతంలో వచ్చిన “ఎక్కిళ్ళు ఎక్కుతూ చదివిన పద్యాన్ని హాస్యం”గా రాయటం నన్ను బాధపెట్టింది.

    ఈ రెండూ రాసాకా నా అభిప్రాయం రాస్తే నేను ఎవరి కొమ్మూ కాయాలనుకోవట్లేదు అని చెప్పుకోగలను.

    ఒక లాయర్ ప్రతిభకి ఏది కొలమానం? అతడు న్యాయం వైపు నిలబడటమా? తాను నిలబడ్డ పక్షంవైపు న్యాయం ఉందని చెప్పే చతురతా?

    ఖచ్చితంగా రెండొదే.
    ఎందుకంటే, ఏది న్యాయమో నిర్ణయించగలిగితే అసలు గొడవే లేదు. అలా అని, ప్రతిభ ఉన్న లాయరు ఖచ్చితంగా పీడితులకు వ్యతిరేకంగా ఉండాలి అన్న నియమం లేదు.

    శతాబ్దం కిందట చనిపోయిన లాయర్‌ని ఇప్పుడెందుకు మెచ్చుకుంటున్నారు? కులంమతం చూసి కాదా? అన్న ఆక్రోశం దురుద్దేశ్యాలతో కూడిన ఆక్రోశమే. పాతికేళ్ళక్రితం శ్రీశ్రీ కవిత్వంతో ఊగిపోయి, చలం పుస్తకాలతో బుర్ర గందరగోళం కాగా, అప్పుడు పెన్ను పట్టుకొని, తరువాత సమాజంలో గుర్తింపు పొందిన కవులూ, రచయితలు కూడా ఇప్పుడు “పాతతరం రచయితలను పట్టుకొని వేళాడటం కేవలం కులాభిమానం” అని అనెయ్యగలుగుతున్నారు. “వారిని మెచ్చుకుందికి కారణం వారి కులమే” అని గట్టిగా అంటూ, “నేనెంతో ప్రతిభావంతుడిని, కానీ నా కులం చూసి నన్నెవరూ మేచ్చుకోవట్లేదు…” అని గొణుగుతున్నారు.

    సాహిత్యమైనా, సినిమా ఐనా (పాఠకులకూ, ప్రేక్షకులకూ చదువులో తప్ప ఆలోచనా స్థాయిలో తేడా లేదు అనుకొనేవాడిని) తక్కువమంది రాసే/ తీసే రోజుల్లో, తక్కువ ముద్రణా సంస్థలు/ సినిమా సంస్థలూ ఉన్న రోజుల్లో, నిలబడ్డ క్లాసిక్స్, తరువాతి తరం రచయితలూ/ దర్శకులకి “పాఠ్యాంశాలు/ కేస్ స్టడీస్” అయ్యాయి. ఈరోజు అంతకంటే ప్రతిభ ఉన్న రచయితలూ, దర్శకులూ కూడా, ఆ క్లాసిక్స్‌లో ఒకశాతం గుర్తింపుకి కూడా నోచుకోలేని స్థితిలో ఉండొచ్చు.

    ఆరోజుల్లో రాసే పదిమందిలో ఒక్కడిని గుర్తించటం జరిగింది. పైగా చదివేవారు లక్షల్లో ఉండీ, రచయిత-పాఠకుడి రేషియో 1:10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండేది. ఈ రోజుల్లో రాసే వేలమందిలో చదివే వేలమంది ఉండగా… “పేరు” రావటం అంత సుళువు కాదు.

    పుస్తకం చదివించుకుందికి రచయిత ప్రతిభతో పాటు, పాఠకులను చేరే “వ్యూహం” కూడా ముఖ్యం అని పదిహేనేళ్లక్రితం చేతన్ భగత్ నిరూపించాడు. వ్యూహం అంటే పక్కా పచ్చి సరుకు. మరునాటికి కొత్త వ్యూహం సిద్ధం చేసుకోవలసిందే.

    ఇప్పుడు తెలుగునాట, పుస్తక పఠనాన్ని తగ్గించిన సోషల్ మీడియానే ఆయుధంగా వాడుకొని పుస్తక పఠనాన్ని పెంచే అద్భుతమైన వ్యూహం పాటిస్తూ అనేక పుస్తకాలను పాపులర్ చేసిన వారు ఇలాంటి నెగెటివ్ వాదాన్ని భుజానికి ఎత్తుకోవటం చూసి బాధ పడుతున్నాను.

    ప్రతిభా, నిజాయితీ ఉన్నవారికి నెగెటివ్ ఆలోచనలు ఉండకూడదన్న నియమం లేదు, మరి.

  32. అక్టోబర్ 2024 గురించి ఎ. కె. ప్రభాకర్ గారి అభిప్రాయం:

    10/03/2024 2:37 pm

    “సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు”

    ఇది దురుసు వ్యాఖ్య మాత్రమే కాదు; దుర్మార్గమైన ప్రతిపాదన కూడా. పాతతరం రచయితల్ని చదవాలి అన్న నెపంతో ఇంతకు తెగబడాలా? ఇంకా వెనకటి తరాల రచయితల రచనలనే తలకు ఎత్తుకోవడం వెనక కుట్ర వుందనడం అసమంజసమే కావచ్చు; కానీ మీ ఈ పై ప్రకటన మాత్రం కుట్రే.

    [కేవలం ‘వస్తువు’ వల్లనే కథగానీ కవితగానీ మంచి సాహిత్యం కాలేదు అని మేము అనడం ఇది మొదటిసారి కాదు, చివరిసారీ కాబోదు. ఇదే విషయం ఇంతకుముందు ముందుమాటలలోనూ ఎన్నోసార్లు ప్రస్తావించాం – సం.]

  33. మాతృకాంక్ష గురించి వరిగొండ కాంతారావు గారి అభిప్రాయం:

    10/02/2024 4:07 am

    చాల మంచి కవిత. ఆరుద్రంత మంచితనం. ధన్యవాదాలు.

  34. కరుణశ్రీ: తపోభంగము గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    08/31/2024 3:31 am

    చక్కని పరిశీలన. భావకవుల చాపల్యాన్ని బాగా పట్టుకొచ్చారు. పరిమితమైన శబ్ద శక్తితో, భాషా పటిమతో రాయప్రోలు, కరుణశ్రీలు పద్యాలు రాయగలరేమో గానీ వాటిలో కలికానిక్కూడా కవిత్వం కనిపించదు. ప్రధానంగా వీరు ఉపాధ్యాయులు – ఇరువురూ నిర్దుష్టంగా వచనం రాయలేరు. ఉట్టికెక్కలేనమ్మ – స్వర్గానికి అన్నట్టు ఉంటాయి వీరి పద్యాలు. ‘ఏ మంచి పూవులన్ ప్రేమించినావో, నీ తల్లి నిను మోసె కనక గర్భమున’ అన్నప్పుడు మాత్రం రాయప్రోలు ప్రతిభ ద్యోతకమవుతుంది, అంతవరకే. వృత్తాలు , జాతులు అంటే ‘భగవంతుడా’ అని గోచి సవరించుకొని లేచి పోవాలి అనిపిస్తుంది. మా నాన్న స్నేహితులు కరుణశ్రీ ‘అమర్ ఖయ్యాం’ పద్యాలు ఆంధ్రజ్యోతిలో వస్తున్నప్పుడు ‘ఆహా ఓహో’ అనేవారు, నాకు బొత్తిగా రుచించేవి కావు. శ్రీనాథుడు దరులొరుసుకొని ప్రవహించే ఒక గంగా నది. జవజీవాలు ఉట్టిపడే ఆ పద్యాలూ, శాస్త్రస్పర్శచే గట్టి పడిన వచనం – మరెవ్వరిలో చూడము.

    “Approach love and cooking with reckless abandon.” దలైలామా అన్నట్టు చెప్పబడే వాక్యం, టీకా టిప్పణితో ఈ సందర్భంలో ఉటంకించవలసిందే.

    ‘Approach love and cooking with reckless abandon’ is a quote attributed to the Dalai Lama. The phrase ‘reckless abandon’ means to give oneself to a passion or impulse without regard for convention, appearances, or risk. When applied to love, it can mean to love with a whole heart, without considering outside influences.

    శ్రీనాథుడిలో ఉన్న దొమ్మ పొగరు (reckless abandon) నిఖార్సైన ఏ కవిలోనైనా గమనించవచ్చు. మన భావకవుల్లో – ముఖ్యంగా వీరిద్దరిలో లేనిదే అది. నేను భావకవిని కావున ‘చాలా అందంగా’ చెప్పాలి అన్న కట్టుబాటులోనే ఉంది అసలు గొడవ. శ్రీనాథుడిది కవిత్వంలో రాజమార్గం – దిమ్మసా కొట్టిన హై రోడ్డు!

    శ్రీనాథుడికి కట్టుబాట్ల మీద బొత్తిగా ఖాతిరీ లేదు. కావునే ‘అంత ప్రాధాన్యం లేని విధంగా’ (as a matter of fact తీరున) చెప్పేశాడు. లోతుగా ఆలోచిస్తే ‘అంత ప్రాధాన్యం లేని విధంగా’ అంటే అలవోకగా కవిత్వం రాయటం నిజంగా కష్టం.

  35. కరుణశ్రీ: తపోభంగము గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    08/30/2024 6:19 pm

    వేలూరి వారి అభిప్రాయాన్ని ఆలస్యంగా చూశాను. దాన్లో వారు భావకవుల గురించి నేను వాడిన “చాపల్యం” అనే పదానికి అభ్యంతరం చెప్పారు. నాకూ వాళ్ళ చాలా పద్యాలు నచ్చుతాయి. ఐతే కొన్నిట్ని చూశాక నవ్వు కూడ వస్తుంది. అలాటి కలగాపులగపు భావాల్నుంచి పడిన పదమే ఆ “చాపల్యం”.

    ఈ పద్యాలు చూడండి:

    అతను డాక్టరయ్యోరు, మహావిశుద్ధ
    జీవి, నిత్యస్నానాలంకృతా విశేష
    భూషితుండు, ఆరోగ్య సంభాషితుండు
    ధర రుజాబాధిత ప్రజా దండధరుడు. ॥

    పూజ్యులౌ వారి వైద్యసామ్రాజ్యమందు
    రోజులూ నెల్లు పట్టు, ఐవేజు లేదు
    అమృతమూర్తి మందీయ ఒప్పాడ చాలు
    మినిటులూ లిప్తలూ సెకన్ల మీద చంపు ॥

    ఇంట యేర్కన్న సుస్తి యొకింతజేయ
    అసలు ఇంటి కింజక్షనీయాలి యనును
    అంత ఓ ఘడియన్నర కా గృహమ్ము
    అమర కైలాసగిరి క్రింది అప్పడమ్ము ॥

    భావకవిత్వపు రోజుల్లోనే వారి శైలిని వెక్కిరిస్తూ మాచిరాజు దేవీప్రసాద్ రాసిన పేరడీ.

  36. 3. పద్యానికీ, రాగానికీ కుదురుతుందా? గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    08/18/2024 5:01 pm

    శ్రీపాద గోపాలకృష్ణమూర్తి రచించిన వ్యాసాలన్నీ నేను చదువుతూ వస్తున్నాను. 1994 లో ప్రచురించబడిన ‘అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం’ అన్న వీరి వ్యాసాల సంకలనం కూడా డిజిటల్ లైబ్రరీలో చదివాను.

    వీరు చాలా చక్కని, చిక్కని ఆలోచన చేస్తారు. పద్యం, సంగీతం, నాట్యం ఒకదానితో ఒకటి కలపనే కూడదు అన్న మొండిపట్టు నుండి, మళ్ళీ అలాగే చిత్రలేఖనం, శిల్పం, వాస్తు (architecture) కలపనే గూడదు అనే మొండిపట్టు దాకా, చక్కని సమర్ధనలతోనే వాదం సాగిస్తారు. చాలా పరిశీలన గలవారే. చాలా నిజాలున్నవి చెప్పిన వాటిలో. ఒప్పుకోటానికి నాకు మహా ఇష్టంగా ఉంటుంది ఈయన చెపుతున్నంత సేపూ.

    ఐతే వివిధ కళల మిశ్రణాలు, దేశదేశాలలో, ప్రాంత ప్రాంతానికీ, తేడాలతో విని, చూసి, ఆయా కళాకారుల నుండి, వీలైనప్పుడు లెసన్స్ తీసుకుంటూ, వేర్వేరు వేదికల మీద పలువురి ఉపన్యాసాలు అవీ వింటూ, ఆ పాఠాలు, ప్రదర్శనలు తర్వాత ఎప్పుడైనా చర్చలలో పాల్గొంటూ, వస్తుంటాను. నేను చదివినవి చూసినని కొన్నాళ్ళకు ఎన్నో గుర్తుండవు. ఐనప్పటికీ, ఎప్పటికప్పుడే, ఎన్నో మనసు రంజించే సంఘటనలు, దృశ్యాలు. రోజూ ఒకే ఇల్లు, ఒకే రాష్ట్రం, ఒకే దేశం, గోడమీద ఒకటే కేలండర్ బొమ్మ, వ్యాసపీట మీద ఒకటే సద్గ్రంథంగా, నా జీవితమైతే గడవటం లేదు. వనజభవుండు నెన్నొసట వ్రాసిన వ్రాలు. He has his own style. What can I say about it?

    వ్యాసకర్త శ్రీపాద గోపాలకృష్ణమూర్తి -ఫిజిక్స్‌లో లండన్ నుండి డాక్టరేట్ తీసుకున్నట్టు చదివాను. వీరు స్వయంగా కళాకారులు కారనుకుంటాను. తాముగా క్రియేటివిటీ చూపలేదు. అంటే వీరు రాసిన పొయట్రీ, కథ, నాటకం గాని లేవు. ఉన్నవా? ఉంటే చెప్పండి, చదువుతాను. అలాగే వీరు చెక్కిన బొమ్మలు కాని, కట్టిన, కట్టించిన భవంతులు కాని లేవు. అందువల్ల వీరిని ఒక కళాప్రేక్షక, శ్రోత, విమర్శకుడిగానే, నేను చదువుకోవాలి.

    మరైతే Creative streak, spark ఉన్నవారు, ఇట్టి వారి అభిరుచులకు, అభిప్రాయాలకు లోబడి ఉండరు. ఈ వ్యాసం ఈ మేగజీన్‌లో చదివినప్పుడు, contrastingగా నాకు స్ఫురించిన వ్యక్తి E.T.A. Hoffmann. And the book – ‘His musical writings: Kreisleriana, The poet and the Composer, Music criticism’ – Cambridge university press 1989. The book is edited, annotated, and introduced by David Charlton. Translated by Martin Clarke.

    Hoffmann in his forty and odd years of life, became noted for his wild, ghastly ghost stories, painting, musical composition, opera writing, theater management, screen settings. He did all in his short lifespan, moving from place to place as circumstances dictate. Besides from time to time, doing a daytime job as a lawyer and later holding a judgeship.

    This book is extremely tough for me to read. Intros, as well as Hoffmann’s own writings. It is about 476 pages. Still, I wanted to get a taste of this 18,19-century legend. I wanted to see what he had to say about the arts, from his own experiences.

    I am reading and re reading a few such as, -his musical sufferings, thoughts about great value of music, Beethoven’s instrumental music, extremely random thoughts, the complete machinist, the music hater, the poet and composer, review of Beethoven’s Fifth symphony, letters on music in Berlin. Mozart’s Don Giovanni etc. etc.

    As a small sample, About Mozart’s opera he says: (Excerpt from page 106, Kreisleriana) –
    “Mozart is said to have repeatedly put off composing the overture, long after the opera itself had been finished, and even on the day before the performance, when his worried friends thought he was at last sitting at his desk, to have cheerfully gone off for a walk. Finally, on the very day of the performance, early in the morning, he supposedly composed the overture in a few hours, so that the parts were carried to the theatre with the ink still wet. Where upon everyone was bowled over with amazement and admiration that Mozart was able to compose so quickly: and yet one could accord the same admiration to any competent and rapid copyist. Do you not think the composer had for a long time been carrying Don Giovanni in his head? His profoundest work for his friends – for people, that is, who understood his innermost feelings? And that it was all laid out and complete in his mind in all its wonderfully distinctive detail, just as if it had been cast in a perfect mold? And do you not think that this overture of all overtures, in which every aspect of the opera is so brilliantly and vividly suggested, was not just as complete as the whole work before its great composer took up his pen to write it out…

    What can I say, I simply loved the above.

    So, I will read on as much as I can from this book, still thinking of the Telugu essayist and his fine observations fondly.

    Hasta luego amigos!
    -Lyla

  37. Janaki’s Zen గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    08/17/2024 2:14 am

    శ్యామలగారు అన్నది నిజమే తనది సంప్రదాయిక కవిత్వం అని లైలా గారు చెప్పుకోలేదు. ఆవిడ తప్పు లేదు. సంప్రదాయిక కవిత్వం అనే విభాగంలో ప్రచురించటం పత్రిక సంపాదకులు చేసిన తప్పు అని నా ఉద్దేశం. ఈమధ్య కాలంలో సంప్రదాయం అన్నమాటకు కొత్త అర్ధం ఏదైనా వచ్చిందేమో మరి నాకు తెలియదు. అలాగైతే క్షంతవ్యుడిని.

    రామాయణం ఒక పపపపాతకథ రాముడు ఒక ఆపాతకథలో హీరో మాత్రం అని ఈదేశం అనుకోవటం లేదండీ. మీరలా అనుకుంటున్నారేమో. లైలాగారు అలా అనుకుంటున్నారేమో. ఒకవేళ ఈకాలంలో అలాగే అనుకొని తీరాలేమో. నాకు తెలియదు. రామాయణమూ రాముడూ ఈజాతి సంపదలు. వాటి విలువలను నవ్యత కోసం నాశనం చేయటం హర్షణీయం కాదు. ఇది నాపాతచింతకాయపచ్చడి భావం అని ఈకాలం వాళ్ళు అంటారేమో మరి.

    కీచకుడు మహాజ్ఞాని అని ఒకాయన తన సినిమాలో అంటాడు. రావణుడి వద్దనే సీత సుఖంగా ఉంది అని ఒకడు అంటాడు. రావణుడు మహాత్ముడు అని కొందరు కథలూ కావ్యాలూ అల్లుతారు.

    ఇదంతా మన సంస్కృతిలో ఒకభాగం గొప్పదనం అంటారు మీలాంటి విజ్ఞులు. నేనలా అనుకోలేనండీ.

    అవును లెండి. వాల్మీకి కాని రాముడు కాని కోర్టులో కేసువేయరు కదా. ఇక మనిష్టమే కాబోలు.

    మనలో అందరమూ హింసను వ్యతిరేకస్తాం. కాని హింసకు పెద్దపీటవేసే సినీమాలు ఎగబడి చూస్తాం.

    శ్రీరామనవమి ఓదండం పారేస్తే రాముడికి మముట్టచెప్పవలసిన గౌరవం పారేసినట్టే అవుతుంది. మిగతారోజులు రాముడిని గురించి ఎలాగైనా మాట్లాడవచ్చును. అవసరం ఐతే రాముడిపై రావణుడి విజయం అనీ అల్లవచ్చును. మన సంస్కృతి గొప్పది కదా. ఫరవాలేదు. ఇదేనంటారా మంచిమాట. సంతోషం.

    [ఈమాటలో సంప్రదాయిక కవిత్వం అన్న విభాగం లేదు. పద్యసాహిత్యం అన్న కేటగిరీ ఉంది. ఛందోబద్ధమైనదే పద్యం అన్న నిర్వచనం మాకు లేదు. ఈ కేటగిరీలు కేవలం శోధనకు, మా నిర్వహణకూ సహకరించడం కోసమ్ పెట్టుకున్నవే తప్ప వాటికి ఏ రకమైన సాహిత్యప్రయోజనమూ లేదు. అందుకే ఏప్రిల్ 2019 సంచికనుంచీ అవి కనిపించకుండా చేశాం. చూ. ఏప్రిల్ 2019 ముందుమాట. -సం.]

  38. బాధిత స్వరం గురించి Sidhartha గారి అభిప్రాయం:

    08/01/2024 10:08 am

    సుంకర గోపాలయ్య కలం నుంచి మరో మంచి కవిత. ప్రస్తుత కాలంలో పోరాటం చేసే మనిషికి తోడుగా నిలిచే వారు ఎవరూ లేకపోవడం బాధ కలిగించే విషయం. బాధలలో తోడు నిలిచేవారు లేకపోవడం బాధాకరం.

  39. ఆలిస్ మన్రో గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:

    07/18/2024 1:46 pm

    కెనడా రచయిత్రి గురించి వేలూరిగారి లఘు టిప్పణి బావుంది. ఈ సందర్భంగా, కొడవళ్ళ హనుమంతరావుగారు ప్రస్తావించిన విషయాలు విలువైనవి. కేవలం రచన గొప్పదైతే చాలా? రచయిత జీవితం కూడా గొప్పది కావాలా? ఈ చర్చ పాతదే ఐనా మళ్ళీ ప్రస్తావనకు రావడం మంచిదే.

    ఇంకొక విషయం కథా రచనలో చర్చనీయాంశం: వాతావరణ కల్పన – వాతావరణ వర్ణన – మన తెలుగులో అధికులది – బుచ్చిబాబు, రావిశాస్త్రి గార్లతో సహా పాత పద్ధతే. అంటే వారికి తెలిసినది వర్ణన, కల్పన కాదు. ఈ సందర్భంగా -గుమ్మడిదల రంగారావుగారి అభ్యంతరం ఎన్నదగినదే.

    గతంలో – అంటే ముప్ఫై ఏళ్ళ క్రింద నేను మన తెలుగు కథారచన మీద చిన్నపాటి పరిశోధన చేపట్టాను, తెలుగులో గురజాడ మొదలుగా వచ్చిన మూడు తరాల కథలను – విమర్శనా దృష్టితో చదివి – నాకు ఒక కథ ఎందుకు నచ్చిందో, నచ్చలేదో ఆ కారణాలను గుర్తుంచుకునేవాడిని. అప్పట్లో ఇతర భాషల్లో వచ్చిన కథలను ఇబ్బడి ముబ్బడిగా చదివి నచ్చిన కొన్ని కథలను అనువాదం సైతం చేసేవాడిని. ఆ క్రమంలో – ఒక కథ ఎందుకు నచ్చుతోంది. ఒక కథ ఎందుకు నచ్చడం లేదు అన్న ఆలోచన మొదలైంది. నాకు జూడగా – “కవిత్వానికి రూపం లాంటిది కథకు వాతావరణం; ప్రతి కవితకూ ఒక రూపం ఉన్నట్టే, ప్రతి కథకు ఒక వాతావరణం ఉంటుంది. కవితకు ఒక నిర్దిష్ట ఆకృతిని ప్రసాదిస్తుంది దాని రూపం, అలాగే,కథ రూపు రేఖలను నిర్ణయించేది దాన్ని వ్యక్తపరుస్తున్న వాతావరణమే.” (కథ-వాతావరణం)

    వాతావరణ కల్పన అంటే ఏమిటో తెలుసు కాబట్టే Alice Munro కింది ఉదహరించిన వాక్యం రాయగలిగింది.

    “Sand was stinging their faces and the waves delivered crashing loads of gravel at their feet.”

    ఈ ఎఱుక లేని కారణంగానే – కొడవళ్ళగారు అనుమానించినట్టు “బుచ్చిబాబు చివర అలా ఒక్క వాక్యంతో వర్ణన వదిలేవాడు కాదేమో.”

    కథకుడు వాతావరణాన్ని కల్పించాలి – వర్ణనకు దిగబడరాదు. ఈ విషయంలో ఆసక్తి గల పాఠకులు “కథ -వాతావరణం”, “కథన కుతూహలం” అన్న వ్యాసాలు (నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు (2004)) చదవగలరు.

    ఇక కథకురాలి కూతురి వ్యధ – తల్లి ప్రపంచం పట్టనంత రచయిత్రి అయినా నికృష్టుడైన సవతి తండ్రి బారినుండి సొంత కూతురిని కాపాడలేక పోయింది. కాపాడటం అటుంచి, కూతురి ఆవేదనను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవి ఒక తరహా Narcissistic Personality Disorder (NPD) పోకడలు – కొందరు గొప్ప రచయితల్లో , వ్యక్తుల్లో గమనించవచ్చు. NPD పరిశోధనలు ఇటీవలి కాలంలో అందరికీ తెలిసివచ్చాయి, గతంలో ఇటువంటి ప్రవర్తనను అంచనా వేయడం కష్టంగా ఉండేది.

  40. మరల రామాయణంబదేల… గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    07/18/2024 12:47 pm

    I enjoyed Eluri Rajah’s friend Veluri’s essay and the subsequent discussions on Krauncha birds. Being a Floridian I get to see these birds. “తెల్లని కొంగలు బారులు బారులు, నల్లని మబ్బులు గుంపులు గుంపులు, అవిగో అవిగో అవిగో…” is an everyday thing for us.

    క్రిందిది ఒక క్రౌంచపదము.

    నిల్చితి నెంతో ఓర్పుతొ నేనొక్క అలతిపదమునె ఇలనిడి; నిల్చీ
    కొల్చితి నన్ని క్రౌంచమునై వెంచల జలముల నడుమలను మహేశా!
    తల్చితి నిన్నే కూరిమితో రేలు పవలనవరతము నిరతి; ఏమో?
    గెల్చితినేమో నీ హృది నా దేశి తెలుగు వలపుల పలుకుల నీశా!

    క్రౌంచపదము అను ఒక వృత్త ఛందస్సును గురించి ‘ఈమాట’ పత్రికలో జె.కె. మోహనరావు, ‘నన్నెచోడుని క్రౌంచపదము’ అన్న వ్యాసములో (మార్చ్ 2009) తెలిపారు. రచ్చబండ యాహూ గ్రూప్స్ లో కూడ చర్చించారు. ఆ చెప్పిన చదువు మూలాన; భ మ స భ న న న య గణములు కలిగి, పాదానికి 24 అక్షరములు ఉన్న ఈ క్రౌంచపదము ఎప్పుడోగాని నేను రాసాను. ఐతే నాకు చేతకానందున తెలిపిన యతులు, పదముల విరుపులు ఉంచలేదు. ఆ హంగులు లేకున్నా మరే విధమైన లొసుగులున్నాగాని, ఈ పద్యము అందమైనది అని నా భావన. ఎందువలనంటే ఈ పద్యంలో శివదీక్షాపరురాలైన పార్వతి; శివగాథలు తలుస్తూ ఒక కావ్యాన్ని శివునికి అర్పించిన నన్ని కవి; ఒంటికాలి జపం చేస్తున్న ఒక తెలుగు కొంగ ఉన్నట్టు నాకు తోస్తున్నది. అందువలన.

    -Lyla
    PS: నన్నెచోడుని కవిత్వము, పార్వతి తపస్సు గురించి ఎవరు ‘ఈమాట’ లో రమ్యంగా రచించినారంటే, ఆమె -కాశీనాథుని రాధ. (సెప్టెంబర్ 2014: పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము). అలాగే పోతన/యశోద ను గురించిన ఆమె వ్యాసం అమ్మ గోపెమ్మ(జూలై 2012: అమ్మ గోపెమ్మ) కూడాను.

  41. తిక్కన భారతంలో పలుకులపొందు గురించి డా. మోదుగు గారి అభిప్రాయం:

    07/16/2024 2:45 am

    తిక్కన భాషలోని అనేకానేక విశేషాలు వెలువడటానికి కృష్ణమూర్తిగారు తిక్కనపై జరిపిన ప్రత్యేక అధ్యయనం ఒక కారణమైతే, తిక్కన పదప్రయోగకోశ సహకారం రెండవది. ఈ వ్యాసంలో భాషావిశేషాలతోపాటు తిక్కన కవితావ్యక్తిత్వాన్ని కూడా కృష్ణమూర్తిగారు ఎత్తిచూపారు. కృష్ణమూర్తిగారు గొప్ప భాషాశాస్త్రవేత్తేకాదు, గొప్ప సాహిత్యవిమర్శకులు అనటానికి ఈ వ్యాసం ఉపకరిస్తుంది. నా అవగాహనలో సాహిత్యాన్ని, భాషను సమతూకంగా అధ్యయనం చేసిన ఏ పండితులైనా భావితరాలకు ఉపయుక్తగ్రంథంగా నిలుస్తారనటానికి కృష్ణమూర్తిగారికి మించిన ఉదాహరణ ఉండదని చెప్పవచ్చు.

  42. జాషువా – పిరదౌసి గురించి కదిరి రాము, విశాఖ 9848535887. గారి అభిప్రాయం:

    06/30/2024 5:26 pm

    మీ పేరులాగే మీ మానస కవితాత్మతను ఆవిష్కరించారు.ఎంతో అనుభవాన్ని, ఎవరికి తీసి కట్టు కాకుండా వివరించారు.అద్భుతం.

  43. చెట్టు నీడలో ఇల్లు గురించి Sesha Reddigari గారి అభిప్రాయం:

    06/26/2024 10:31 am

    చాలా అందంగా ఉందండీ. చదువుతుంటే గుల్జార్ గారిదో కవిత గుర్తుకొస్తోంది… తన చిన్నప్పటి ఇంటి దొడ్లో చెట్టు గురించి…

  44. భ్రాంతి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    06/25/2024 1:33 pm

    ““భ్రాంతి” అని పేరుపెట్టడంతోనే రచయిత పాఠకుణ్ణి చెయ్యి పట్టుకుని తన దారిలో తీసుకువెళ్లారు.” -శివకుమార శర్మ

    Perhaps I didn’t choose the right sentence from this critic’s opinion before? Should I have chosen the above one instead? (How tenderly romantic! We know it is a good looking రచయిత్రి.) And wondered from then on: రచయిత్రి వారిని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్లిన దెట్టి దారియో? ఆ దారిలో absinthe బాటిల్స్ దొర్లుచున్నవో. ఆటగా ghosts వాటిని తన్నుకుంటూ నడుస్తున్నారో. లేక ఒకరి తలకాయనే ఊడదీసి సాకర్ బాల్ లా కిక్కులిస్తున్నారో! ఆ దారి, ఆ దారి మశానానికా లేక కామనాశానికా?

    And continue my musing on my readings: Emile Zola is definitely under the influence of absinthe. Like his other painter and writer friends. His Therese Raquin (1867) is a horror of guilty consciences, Paris morgues, cadavers, apparitions, scars. No sex. Only misery. I am bored with his morose prose, midway, I switched to Kate Chopin’s ‘Athenaise’ – a novella. (1896.) Kate is an excellent writer. Natural impulses. No stunts to please readers. I like her.

    And extend my thoughts further, Reading ‘Athenaise’ is like reading 19th century’s young Bengali Toru Datt’s poetry. Toru is such a sweet girl. Chaganti Somayajulu, a Telugu writer in an interview says he is charmed by her poetry, so he tried writing poetry like her. But he failed. (Naturally. He does not have one sweet thought in his head.)

    So, instead of poetry writing, Chaganti went into short story writing and! Dios Mio! what a corrupt thought he brought into the relationships of men and women. He recycled some old kavya, purana stories, gave them a modern coat of paint. He misinterpreted Gurazada’s aspirations, and introduced solutions into Telugu society’s matrimonial, worse than preexisting kanyasulkam. The relations between men and women are more perverted. They can never trust each other. Their survival tactics are playing dirty tricks, and cheating. (Amigos, does anyone, anyone in their right mind wants to get introduced to their son, in a railway compartment? Never mind the youngster doesn’t know you are his dad; after all you are just a stud in the progressive society of Chaganti.) ఆర్యా, దుష్యంతా, నీ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు చేకొనుము.
    I guess, it is sweet Sakuntala, of Kalidasa, gone worse. I dislike this writer’s and his buddies’ ideas. What a horror!

    ఆ బేచ్ ‘అభ్యుదయ కవులు, రచయితల వల్ల తెలుగు లోకి వర్గపోరాట రథచక్రాలు, ఛందోముక్త కవిత్వం, వ్యాకరణ రిక్త వచనం, ఎత్తులు పైయెత్తుల, నక్కజిత్తుల సారా రాతలు వచ్చి, తెలుగు సాహిత్యం – శృంగారముక్త, ప్రేమరాహిత్య రచనా వ్యాసంగం గా పరిణమించింది. There is the beginning of end of Love and Romance in Telugu literature.

    -Lyla

    PS: 1. ‘Absinthe’ is also a music society’s recent clever presentation of live classical music and film together, in Miami.
    2. Besides an interview with Chaganti Somayajulu, in శబ్దతరంగాలు, (Nov 2013 issue) A sample of three stories written by him -reviewed by Narayana Rao (చా. సో కథ March 2000 issue)- are in eemaata magazine. Check them out, if you wish.
    3. there is a head of Ravana lying around in one prior story, and there is a body of a woman, in the story ‘భ్రాంతి’ and it is perhaps better to transplant this head onto that body. So, the guy whoever she is sleeping with that night, when he wants to kiss the girl, at least there is a head. Why is it so hard for Siva Kumar Sarma to notice that?
    Isn’t the very first God, Hindus pray is Ganesh who has a transposed head? Didn’t he read the myth of Siva’s son (శివ కుమారుడు) with an elephant’s head? Did he not read about Girish Karnad’s hayavadana play where a man has a horse’s head? Karnad’s plays are Greek and Indian myths transposed into political satires on modern Bangalore stage.
    4. Carl Jung’s theories-the psychology of unconscious- evolved from studies of Indian and other religions, ancient literature – fictional poetry, stories.
    5. How does S.K. Sarma intend to help writers? If he is not an avid reader? Did he not read the June eemaata editorial? Why do Telugu writers need S.K. S’s help anyway? Why doesn’t he stick to correcting typing and spelling mistakes? Why does he advise editors of eemaata all the time?

    Preguntas, y más preguntas, pero no hay eruditos. Entonces no hay respuestas. ¡Qué pena!

  45. భ్రాంతి గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    06/23/2024 12:30 pm

    కధ, తల, మొండెం, సాయంత్రం మొగుడికి కాఫీ, అనకాపల్లె, ఆంధ్రా, అమెరికా అన్నీ వచ్చాయి కనక నాకు తెల్సిన విషయాలు చెప్తున్నాను. అవును శర్మ గారు అన్నట్టూ, ఇది కధకి సంబంధించినది కాదు. సంపాదకులు ఈ వ్యాఖ్య వేస్తారో వేయరో వారిష్టం.

    నాకు తెల్సున్నంతలో “అమెరికాలో” ఈమాట పత్రిక పెట్టడానిక్కారణం – తెలుగంటే ఉన్న ‘ఇది’ చంపుకోలేక. తెలుసా, న్యూస్ గ్రూపులు ఉన్న రోజులనుంచి, వెబ్ సైట్, మెల్లిగా రెణ్ణెళ్లకోసారి విడుదల లోంచి నెలకోసారిలోకి వచ్చాం. ఎటువంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా కధ, కవిత, వగైరాలు మాత్రమే ఉండేటట్టు చూసుకున్నారు (కనీసం ఇప్పటివరకు). ఈ వెబ్ సైటు తయారీకి, రోజువారీ పనికీ ఎవర్నీ డబ్బులివ్వండో అని ముష్టి ఎత్తినట్టు నాకైతే తెలియదు. ఇచ్చే దాతలు గుప్తంగా ఇచ్చి/ఇస్తూ ఉండొచ్చు అది వారు చెప్పలేదు, ఎవరూ అడినట్టూ లేదు. అడిగినా చెప్పాల్సిన అవసరమూ లేదు. ఇటువంటి వెబ్ సైట్ (ప్రతీ ప్రచురణతో పెరిగే డిస్క్ సైజు) అదీ ఉంచాలంటే డబ్బులౌతాయి. ప్రపంచంలో ఏదీ ఉచితం కాదు (ఇక్కడ కామెంట్లు తప్ప) కదా. ఎవరూ మిమ్మల్ని వచ్చి చదివి ఈమాట పురోగతికి అక్షింతలు వేసి ఆశీర్వదించమని అడగలేదు. ఇష్టం ఉంటే రండి లేకపోతే ఇంటర్నెట్లో సవాలక్ష వెబ్ సైట్లు ఉన్నాయి కాలక్షేపానికి. అసలు ఈమాట పత్రిక ఎంతకాలం ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేరు కదా?

    అన్నింటికన్నా ముఖ్యంగా ఎవర్నీ వచ్చి ‘దయచేసి మా ఈమాట పత్రిక చదివి మమ్మల్ని ఉద్ధరించి, మిమ్మల్ని కూడా ఉద్ధరించుకోండొహో’ అని ఎక్కడా ప్రచురించినట్టు చూడలేదు నేను. వచ్చినవారు వస్తున్నారు. లేనివారికో నమస్కారం. వచ్చి చదివి నచ్చకపోయినా, నచ్చినా, ఘాటుగా వ్యాఖ్య రాసినా దాదాపు (కొన్ని తీసేస్తున్నారు కూడా) ప్రచురిస్తున్నారు. ఏ కధైనా ప్రచురిస్తే అది సంపాదకుల ఇష్టం, మొదట్లో చెప్పినట్టూ పత్రిక వారిది కనక (డబ్బులు ఎవరు పెట్టినా) వారికి తోచినట్టు నడుపుతున్నారు. ఒక పత్రిక నడపాలంటే మానవ వనరులు కావాలి; మీలో ఎందరు ప్రతీనెలా మీ స్వంత వనరులు ఉపయోగించి – ఉచితంగా అన్నీ ప్రచురించేసి ఏ రచయిత/రచయిత్రికి హాని కలిగినా, పోయినా చేతులు దులుపుకునే – ఈ పని చేస్తారో ముందుకి రాగలరు? పత్రిక అమెరికానుంచి కనక సంపాదకులకి, ప్రచురణకర్త(ల)కీ వేరు వేరు ఉద్యోగాలు ఉంటాయి. ఇంట్లో అమ్మగారు చెప్పే పనులు, పిల్లలు, సంసారం, మధుర గారు మొగుడికి కాఫీ ఇచ్చే పనులలాంటివి అవీ వేరే. దూరంగా ఉన్న గ్రోసరీ షాపుకో, పిల్లలని ఏ ఈతకొలనుకి తీసుకెళ్ళడానికో, డాక్టర్ దగ్గిరకో, లేదా వారాంతం గుడికి వెళ్ళాలంటే రోజంతా పోయినట్టే. ఈమాట మీద కూర్చోగానే అమ్మగారు ఇంటి/యార్డ్/షాపింగ్ పని చేయనందుకు పెట్టే చివాట్లూ, తిట్లూ శాపనార్ధాలు మీకు తెలియవు కాబోలు. కధలు రాసే నాకే అక్షింతలు పడుతూ ఉంటాయి ప్రతీసారి. ఇదంతా ఉచితంగా ఎందుకు చేయాలి? అయినా చేస్తున్నారు. అవన్నీ ఆలోచించకుండా కధా, మొండెం, కాఫీ, అమ్మలక్కల కబుర్లు == కధమీద కామెంట్ గా == పెట్టడం ఎంత సబబు? ఇది మీ భ్రాంతి లేదా భ్రమ అనుకోవాలా?

    ఏ ఈనాడు పేపరో అయితే వీడిలా రాసాడు వాడిలా అన్నాడు అని అనడానికి, నోరు పారేసుకోవడానికీ అధికారం ఉంటే ఉండొచ్చు – డబ్బులు పెట్టి కొన్నారు కనక. లేదా మీకు నచ్చకపోతే ఈనాడు మానేసి మరో పేపర్ కొనుక్కోవచ్చు. ఇక్కడ డబ్బు ప్రసక్తి లేదు కనక ఎవరిష్టం వచ్చినట్టు వారు నోరు పారేసుకుంటే ఆ వ్యాఖ్య వేయకుండా ఉండడానికి సంపాదకుల ఇష్టం అని నేను అనుకుంటున్నాను. ఇదీ ఒక బ్లాగు లాంటి వెబ్ సైట్ కనక. ఈ వ్యాఖ్యాతలలో కొంతమంది మహామహులు ఇక్కడ మాట్లాడే ధైర్యం లేక ఫేసుబుక్కులో రాసుకున్నారు కూడా. అది వారి మానసిక స్థితికి మచ్చుతునక. అలా అని ఈమాట వారు ఏది పడితే అది చే/వేయడానికి కుదరదు కూడా, ఎందుకంటే కొన్ని విషయాలు పబ్లిక్ కి సంబంధించినవి – ఉదా: రాజకీయాలు, మతం వగైరా.

    అనకాపల్లె అన్నారు కనక దానిమీద సర్దాగా వినండి. అనకాపల్లె బెల్లం మార్కెట్లో రేట్లు రోజు రోజుకీ మారతాయి. మీరు పంపిన బెల్లం అచ్చులు నలుపా పసుపా అనేవి చూడకుండా (సీల్ చేసి ఉంటాయి కనక) రేటు బట్టి డబ్బులు లాభం రావచ్చు, పోవచ్చు. పండించిన చెరుకుతో బెల్లం ఆడించి అనకాపల్లె పంపుతారా, లేకపోతే లోకల్ సుగర్ ఫాక్టరీకి తో తోలి వారిచ్చిన ఫిక్సిడ్ రేట్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ బెల్లం ఆడించి అనకాపల్లె తోలితే ‘ఆ రోజు వచ్చిన రేట్’ చచ్చినట్టు తీసుకోవాల్సిందే. ఈమాటకి వచ్చే కధలు ఈ అనకాపల్లె బెల్లం వంటివే. సీల్ విప్పి చదివితే కానీ నలుపా పసుపా అనేవి తెలియదు. అయితే నల్లబెల్లం రుచి బాగుండదని ఎక్కడా లేదు; కానీ కొన్నాక సీల్ లోపల నల్ల బెల్లంలో రుచి బాగోకపోతే ఏం చేస్తారు? అందుకే ఒక్కోసారి వచ్చే కధలు నల్లబెల్లం లాంటివి – బాగుండొచ్చేమో అని వేస్తారు. రుచి బాగానే ఉండొచ్చు కానీ ఒక్కోసారి బెడిసికొడుతుంది. సంపాదకులకీ ఒక లెర్నింగ్ కర్వ్ ఉందని గుర్తుంచుకోండి. వాళ్ళేమీ పెర్ఫెక్షనిస్టులు కాదు కదా? ఫలానా కధ రాస్తే/చదివితే/ సంపాదకులు వేస్తే నా మొండెం తెగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. సంపాదకులు కూడా అనుకుని ఉండరని నా ఊహ. రోజులు మారుతున్నాయి. కొత్తగా వినపడని ‘మనోభావాలు దెబ్బతినడం,” “ఆయన/అవిడ అనడం బదులు వారు అనాలి” అనేవి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంపాదకుల చేతులు కాలాక రచయిత చేతులు కాల్చడానికి ఎవరికీ అధికారం ఉండకుండా ఉంచడం కోసం కధ తీసేసి ఉండొచ్చు. తలకాయ ఉంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి? డబ్బులిచ్చి పుస్తకాలు కొనుక్కునే షాపుకీ, తేరగా ఉచితంగా వచ్చే ఈమాటకీ ఏమిటి సంబంధం? నిజానికి ఒక పుస్తకాల షాపు పుస్తకం తీసేసి ఫలానా పుస్తకం బాన్ చేసారు కనక మేము అమ్మడం లేదు అని నోటిస్ పెడితే (అలా పెడతారు కూడా) మొదటి గుమ్మం తలుపుమీద, మీరేం చేయగలరు నిజానికి?

    మధుర/లైలా గారి కామెంట్ల ప్రకారం: మొండెం ఉంచాలా, తలకాయ ఒకటే చాలా అనేది ఎవరి ఇష్టం ప్రకారం చేయాలి అని మీరు అనుకుంటున్నారు? ఒక కధ వేసారు. దానివల్ల ఎవరికో హాని కలగవచ్చు అని తీసేసారు. ఇలా హాని కలగవచ్చేమో అని అనుకుని తీసేసాం అని చెప్పారు. ఇంకా ఏం చేయాలి? కధ ఉంచి, రచయిత్రి కి హాని కలిగినా, పోయినా మా పని అయిపోయింది అని చేతులు దులుపుకోవాలా? అప్పుడు రచయిత/త్రి కి నిజంగా హాని కలిగితే లైలా, ఒక కామెంట్ తో ఆవిడ చెల్లి అయిపోయిన మధుర గార్లు రచయిత్రికి ఏ హాని కలిగిందో తెలుసుకుని ఆవిడకి ఏమీ కాకుండా చేయగలరా? పోనీ ఆ హాని ఏదైనా నిజంగా జరిగితే దానిని రివర్స్ చేయగలరా? గమనించండి ఇక్కడ నేను ఆ కధలో ఏముందో చర్చించడం లేదు. నేను అది చదవలేదు అందులో ఏముందో కూడా చూడలేదు/తెలియదు. అన్నింటికన్నా హాస్యాస్పదం మధుర గారి వ్యాఖ్య – అంత ధైర్యంగా మొండెం, తల, ధాం ధూం అన్నట్టూ మాట్లాడిన వీరికి ఇంట్లో మొగుడికి కాఫీ ఇవ్వకపోతే తలతీసేస్తాడనే (సరదాకి రాసారని తెలిసే అంటున్నా) ఆలోచన రావడం.

    శివకుమార్ శర్మగారి తో ఏకీభవిస్తున్నాను. కధకి సంబంధించిన వ్యాఖ్యలు ఉంటేనే మంచిది. ఆయన చెప్పినట్టూ “ఈ కథ మీద నా వ్యాఖ్య లోని ఒక వాక్యంతో మొదలుపెట్టి ఈ కథతో సంబంధం లేకుండా ఎక్కడికో, మొండేన్ని తుంచేసి శీర్షికని మాత్రం ఉంచిన కథ మీదికి, అక్కడినించీ మరెక్కడికో వెళ్ళిపోయారు.” ఇది పూర్తిగా నిజం.

    తాజాకలం: ఈ కామెంట్ ఎవరిమీదా కోపంతో కానీ మరో భావంతో కానీ రాసినది కాదు. ఆడవారు వచ్చి వ్యాఖ్య రాస్తే నేనిలారాసాను కనక “ఈ మగాళ్ళందరూ అంతే” అనుకుంటే అది మీ మన:స్థితి, మీఇష్టం. నేను రాసినది కేవలం ఈమాట పత్రిక నిర్వహణలో ఉన్న కష్ట/నష్ట/నిష్టురాల గురించి, నాకు తెల్సినంతలో. మరో విషయం. నేనెప్పుడు ఈమాటకి ఒక్క పైసా ఇవ్వలేదు. సంపాదకులతో కనీసం నాకు ముఖ పరిచయం కూడా లేదు. నేను కధలు రాస్తే పంపుతాను. వేస్తే వేస్తారు లేకపోతే వేయట్లేదని చెప్తారు. అంతవరకే. న్యూస్ గ్రూపులనుండి తెలుసా అక్కడనుండి వెబ్ వరకూ జరిగిన విషయాలు నాకు చూచాయగా తెలుసు కనక ఇది రాసాను. ఈ వ్యాఖ్య సంపాదకులు ప్రచురిస్తే తర్వాత ఎవరు నన్ను ఎలా ఏకినా సమాధానం ఇవ్వను. Au Revoir!

  46. అద్వైతం గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    06/05/2024 10:43 am

    ఏమిటి ఈ కవిత అర్థం? కవిత రాసిన సుబ్రహ్మణ్యం గారైనా, చదివి అర్థమైంది అనుకున్న వారైనా వివరించరూ.
    నాకు తెలుసుకోవాలని ఉంది. అందుకని అడుగుతున్నాను.
    -Lyla

  47. అద్వైతం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    06/04/2024 6:56 pm

    నేను సాధారణంగా కవితలు చదవను కానీ ఈ చిన్న కవిత ఈ “కొస” నుండి ఆ “కొస” కి చదివించింది. అర్థగర్భితంగా ఉందేమో, “భలే” బాగుందనిపించింది.

  48. అద్వైతం గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    06/03/2024 11:13 pm

    శర్మగారూ,
    కవిత నిడివి ఎప్పుడూ చూసుకోలేదండీ. చెప్తున్న భావానికి అనుగుణంగా కవిత తన నిడివిని తనే నిర్ణయిచుకుంటుందని నమ్ముతాను. “అస్సలు” పదంపై మీ ఆక్షేపణ కొంతవరకూ నిజమే. అయితే రాస్తున్నది వచన కవితే అయినా అందులో కూడా ఒక రకమైన లయ, అక్షర మైత్రి ఉండాలని అనుకుంటాను. అందుకనే ఆ పదం వాడాల్సి వచ్చింది. ఇక “కొస” అంటే తాడు చివర అని మాత్రమే కాదనుకుంటానండీ – the end, tip అనే అర్ధం కూడా ఉంది. జి. యన్. రెడ్డిగారి తెలుగు పర్యాయపద నిఘంటువులో అగ్రభాగము, అగ్రము, కొన, శిఖరము, శిఖి అనే పదాలు కూడా కనిపించాయి. “కొండకొస” “ఆ కొసకెలా చేరాలో” లాంటి ప్రయోగాలు మనకి కొత్త కాదు.

    సినారె “మట్టీ, మనిషీ, ఆకాశం” నుండి –

    పొద్దు పొడుపును చూడగానే
    తూర్పుదిక్కు పట్టనంత పరవశించిపోయే తాను –
    కొండకొస నుంచి దూకే జలధారలో
    గుండెలోని శ్రుతిని సరిచూసుకునే తాను-
    తోటి మనిషి అలికిడి వింటేనే
    తుళ్ళిపడతాడెందుకని?

    నమస్కారాలతో,
    సుబ్రహ్మణ్యం

  49. అద్వైతం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    06/02/2024 9:25 am

    ఇంత నిడివంటూ ఉండాలి
    అని కాదు కానీ
    కవిత పదకొండు పదాలతో
    ఐదు లైన్లు
    భలే !
    “రచయిత గురించి” అనేది
    దాదాపు మూడు రెట్లు ఉంది
    భలే ! భలే !!
    “అస్సలు” అనే పదం తీసేసినా
    అర్ధమేమీ మారదోయ్
    “కొస” అనేది
    తాడు చివర్లు కాదని
    శిఖరాగ్రానికి వాడొచ్చని
    కొత్తగా తెల్సింది
    భలే ! భలే !!

  50. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి తః తః గారి అభిప్రాయం:

    05/30/2024 2:08 pm

    “తెలుగు సాహిత్యాన్ని ప్రపంచసాహిత్య రంగమ్మీద సమున్నత స్థానాన ఉంచటంలో అద్వితీయ కృషి నారాయణరావుది. బహుశ ఆయన రాసిన వందకి పైగా వ్యాసాలు, డజను పైగా పుస్తకాల గురించి ఇండియాలో తెలిసిన వారు, తెలిసినా పట్టించుకున్న వారు బహు అరుదు – అసలంటూ ఉంటే. ఈ రచయిత్రి కూడ ఆయన కవితావిప్లవాలు తప్ప మరే రచననీ (“తెలుగుదారి” వరకు) చదివినట్టు చెప్పలేదు. అది ఆయన రాసి యాభై ఏళ్ల పైగా అయింది.“

    వెల్చేరువారి గురించి పైన చెప్పిన విషయానికీ వారి ‘తెలుగు దారి’ పై అభిప్రాయాన్ని చెప్పటానికీ సంబంధం ఏమిటో నాకు తెలియటం లేదు.

    ముక్కుమీద మూడొందల కప్పులను నిలబెట్టి సర్కస్ డేరా అంతా ఒక్క కప్పూ కదలకుండా తిరిగిన వాడు, తన ఇంట్లో కప్పు పొరబాటునే అనుకుందాం పగలకొడితే వాణ్ణి వాడి పెళ్ళాం బూతులు తిట్టొచ్చా – తిట్ట్గకూడదా? ఎవరైనా తెలుపగలరు.

    తః తః

  51. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    05/27/2024 8:58 pm

    ఒకేసారి రెండు విపుల సమీక్షలు ఈ నెల సంచికలో రావటం చాలా ఆనందం కలిగించింది. రాసిన ఇద్దరు పరిశోధకులకు అభినందనలు. ఇండియాలో కనీసం ఇద్దరు “తెలుగుదారి” పుస్తకం చదవటం మంచి విషయం. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచసాహిత్య రంగమ్మీద సమున్నత స్థానాన ఉంచటంలో అద్వితీయ కృషి నారాయణరావుది. బహుశ ఆయన రాసిన వందకి పైగా వ్యాసాలు, డజను పైగా పుస్తకాల గురించి ఇండియాలో తెలిసిన వారు, తెలిసినా పట్టించుకున్న వారు బహు అరుదు – అసలంటూ ఉంటే. ఈ రచయిత్రి కూడ ఆయన కవితావిప్లవాలు తప్ప మరే రచననీ (“తెలుగుదారి” వరకు) చదివినట్టు చెప్పలేదు. అది ఆయన రాసి యాభై ఏళ్ల పైగా అయింది.

    ఐతే నారాయణరావు తర్వాత తెలుగు సాహిత్యం గురించి ప్రపంచస్థాయి పబ్లికేషన్స్‌లో పరిశోధనలు ప్రచురించగలిగే వారు కనుచూపు మేరలో లేకపోవటం విషాదం. ఇక “తెలుగుదారి” విషయం అందామా, “తెలుగుదారి ఒకదారి మాత్రమే” అన్నవారు కనీసం మరొక దారినైనా చూపించినట్టు నాకనిపించలేదు, మరెన్నో దారుల మాట దేవుడెరుగు. ఇక “తెలుగుదారి సరే, తెలుగువారిక్కాదు” అన్న వారి మాట చాలావరకు నిజమే, అది వ్యావహారిక తెలుగు నేర్చుకోవాలనే కుతూహలం వున్న తెలుగు రాని వారికి ఉద్దేశించినదని స్పష్టమే కనుక.

    ఏమైనా వీరిద్దరి కృషి అభినందనీయం. ఈ వ్యాసాల్ని ప్రచురించగలిగే జర్నల్లో, పత్రికలో ఇండియాలో కూడ వుంటే అక్కడా ప్రచురించమని వారికి మనవి.

  52. చావు బ్రతుకులు గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    05/26/2024 4:57 pm

    “కధాంతంలో నిజంగా చనిపోయి తాను మునుపు చావలేదని నిరూపించిన కాదంబిని పాత్ర పాఠకుల హృదయాలలో సజీవమూర్తిగా నిలిచిఉంటుంది…” కె.కె. రామయ్య

    A literary platitude.
    *
    రబీంద్రనాథ్ టాగోర్ చిన్నకథల్లో – తెరచాపల పడవల్లో నదిలో పైకీ కిందకూ తిరుగుతూ, నది గట్టమ్మటే కాలే శవాలు చూస్తూ, శాలువా, పైజమా లాల్చీ, పాదరక్షల, ఏమీ త్రాణలేని దివాళా మగవాళ్ళు కనిపిస్తుంటారు. కథానాయకుడు కలకత్తాలో కాలేజికి వెళ్ళేముందు చూసిన పక్కింటి నబవధు, మళ్ళీ అతను సెలవల్లో పల్లెలో ఇంటికి తిరిగి వచ్చేసరికి, బిధవా వేషంలో వచ్చి వంగి, వినయంగా అతని పాదధూళి తీసుకుంటుంది. మగవాళ్ళు వంటింట్లోకి వచ్చి కూర్చుని విసినకర్రతో విసిరించుకుంటూ, ఆడవాళ్ళు వండి వడ్డించే చేపలపులుసులు వాళ్ళకేదో ఫేవర్ చేస్తున్నట్టు, నిరాసక్తంగా తిని పోతుంటారు. బినయ్ దా, బిపిన్ దా, కమలాదీదీ, కుసుమ్‌బహెన్, పిలుపులతో కథలు గడిచిపోతుంటయ్యి. ఎటు చూడూ పడవ మునకలు, మరణాలు, రచనల్లో అజ్ఞానం, మూఢనమ్మకాలు, Dogma, ఆచారాలు మాత్రమే కనిపిస్తాయి. ఉత్తి డెస్క్రిప్టివ్ డాక్యుమెంటేషన్. Pervasive passive acceptance. Complacency. Status Quo. కథల్లో, జీవితంలో, మనుషులు ఎలా చస్తేనేం, రచయితకు అక్కడికే నోబెల్ రానేవచ్చె.

    (టాగోర్ బెంగాలీ వచ్చినంత బాగా, ఇంగ్లిష్ కూడా వచ్చినవాడు కనక తన ప్రోజ్, పొయట్రీలను తనే ఇంగ్లీషులో అనువదించుకుని, విదేశీయుల దృష్టి లోకి తన సాహిత్యం ఒక ఇంగ్లండ్ ట్రిప్‌లో తనే తెచ్చాడు. అతడు కలిసిన లిటరాటీ అతని సాహిత్యంతో అతి స్వల్ప పరిచయం లోనే అత్యంత వేగంతో ప్రకంపించి, ఒక సంవత్సర కాలంలోనే, ఒక్క విడతలోనే అతడికి నోబెల్ ఇప్పించారు. ఇది ఆ లిటరరీ ప్రైజ్ చరిత్రలోనే ఒక అనూహ్యమైన ఘటన.)

    టాగోర్ ఈ కథ లోనూ అంతటా, అందరికీ భూతాలు, దయ్యాల మూఢనమ్మకం వ్యాపించి ఉంది. ఆడవాళ్ళు హిస్టెరికల్ హీప్స్, మగవాళ్ళు నిర్వీర్యులు. విశ్వకవి రవీంద్రుడు తన ప్రసిద్థి వహించిన Patriotic prayer పద్యంలో లాగానే, తన చిన్నకథల్లోనూ – దేశంలో మూఢత్వం వదిలించి, జ్ఞానం ప్రసాదించే భారం భగవంతుడి పైనే వదిలివేసినాడా? జనగణమంగళదాయక జయహే, భారత భాగ్యవిధాతా… తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష్ మాంగే, గాహే తవ జయ గాథా! ఇవేనా ఆ గాథలు!

    స్ధూలంగా (current popular word in the magazine), టాగోర్ కథానాయికలకూ, గురజాడ పుత్తడి బొమ్మ పూర్ణమ్మకీ ఏం తేడా ఉండదు. స్త్రీలు తరచూ నుయ్యో, గొయ్యో చూసుకుని, కాళిలోనో దుర్గలోనో చేరిపోతారు. రచనలలో ఆనాటి వాస్తవత ఉండొచ్చు గాక! ఈ ఆత్మహత్యల కథలు, పద్యాలు మూలంగా – చదివినవారు అంతకన్నా వేరుదారిలేదన్న నిస్పృహకు లోనవటం, జీవితంలో ఆసక్తి కోల్పోవటం కూడా జరగొచ్చు. జర్మన్ కవి Goethe -The sorrows of young Werther, రాసిన తర్వాత చాలామంది యువకులు నిజంగానే ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతీతి.

    పల్నాటియుద్థం సినిమాలో, చితి లోకి దూకకముందు రోదించే ఒక నాయికకి, జాషువా కవి -ఆయన తెలుగు బిరుదు ఏమిటీ?- అందించిన పద్యం “…నల్లపూసల సౌరు నాశమయ్యె, గంగలో కలిసె నా గాజుమట్టెల శోభ,..” Something like that, ఆ పద్యం విని, కన్నీరు విడవని తెలుగు వీరులెవ్వరు? ఆ పైన ఉద్రేకించి, యుద్ధం ఎవరెవరి మధ్యనో ఎందుకు జరుగుతోందో కూడా తెలియని బాలవీరులు కొందరు బలి.

    తనను కడజాతి వాడన్నందుకు, ఎంతో ఆర్తితో కవిత్వం చెప్పిన జాషువాకు, సినిమాకి రాస్తున్నప్పుడు, ఈ పద్యంలో తను ఎంత క్రూరకార్యాన్ని ప్రమోట్ చేస్తున్నాడోనన్న స్పృహ లేదు. (ఈ కథ మొదట్లోనే “పసుపు కుంకుమలు పోగొట్టుకున్న కాదంబిని” అంటూ టాగోర్ పొయట్రీ, కథల, ఇంగ్లీషు అనువాదకుడు William Radiceకి రాని, తెలుగు పలుకుబడి కనిపిస్తే, ఆ పాత సినిమా సన్నివేశం గుర్తొచ్చింది.)

    ఈ మాగజీన్లోనే ఈమధ్య ఇచ్చిన మరో అనువాద కథ ‘పోస్టు మాస్టరు’లోనూ రచయిత టాగోర్ attitude నాకు నచ్చలేదు. There is a hidden tease and tormentor in Tagore. He plays with women and small girls’ hearts. He drowns his heroines like rats. What kind of nonsense is that?

    అదే, ఈ టాగోర్ భూతాల కథ సమయం నుండే, అదే – ఆ 19 శతాబ్దినుండే; ఒక ఫ్రెంచ్ రైటర్ Jules Verne కల్పించిన Philias Fogg ని చూడండీ, హీరో అంటే అతనూ హీరో. ఫిలియాస్ తన “around the world in 80 days” యాత్రలో, ఇండియాలోనే – ఆ బెంగాల్ ప్రాంతాలలోనే, అప్పటి దారుణమైన “సతి” కార్యక్రమంలో, Aoudaకి మత్తుమందిచ్చి, ఆమె చేతులు కాళ్ళు కట్టేసి, చచ్చిన మొగుడితోపాటు పాడెక్కట్టేసి, సంబరంగా ఊరోళ్ళంతా డప్పులు కొట్టుకుంటూ శ్మశానానికి తీసుకుపోయి, నిప్పెట్టపోతుంటే, Passepartout సహాయంతో, ఉపాయంతో ఆమెను విడిపించాడు. బ్రతికి ఉన్న స్త్రీని తగలెట్టటానికి ఇంతకూడా సంకోచించని ఊరిజనం, భూతాలంటే హడలు కాబట్టి, పాడెమీది మగవాడి శవం లేచికూర్చుంటే అప్పుడు పారిపోయారు. ఆమెను తర్వాత ఫిలియాస్ తనతో లండన్ తీసుకుపోయాడు. వేజర్ గెలిచాడు.

    అదీ కథంటే. అతడూ మగవాడంటే. ట్రావెలర్ అంటే. హీరో అంటే. నిజానికి, Fogg, Passepartout, Aouda, అందరూ హీరోయిక్ స్పిరిట్ ఉన్నవారే. కార్యశూరులే. వారి సంభాషణలు, పనులు ఆ విషయం మనకు స్పష్టం చేస్తాయి.

    Así es como se cuentan algunas historias.

    -Lyla

  53. మాటలు ఉండాలి గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    05/02/2024 8:09 am

    అంత్యశయ్య మీద… నిప్పు రాజుకునే ముందు

    అక్షర సత్యాలు చెప్పారు. అద్భుతం. నిజంగా నోరు విప్పకపోతే చివరకి జరిగేది ఇదే.

    హై టెక్ అనుకుంటూ మనం తవ్వుకున్న గొయ్యే ఇది. మొదట్లో ఉత్తరం వస్తే – కార్డు ముక్క అయినా – ఎంతో సంతోషం. తర్వత ఫోన్ మోగితే సంతోషం మనలని ఎవరో పలకరిస్తున్నారని. ఆ కాల్ రాంగ్ నెంబర్ అయినా (ఒరే చిట్టిగా బావున్నావా? … సారీ ఇది లారీ సప్లై ఆఫీసండి) అదో నవ్వుకునే ఆనందం. ఇప్పుడవన్నీ పోయి స్నేహం ఫేసుబుక్కు మీదా, ఎన్ని లైకులొచ్చాయ్, ఎవడు కొట్టాడు లైకు, వాట్సాప్ లో సంతోషం వెతుక్కునే జీవితం రావడానిక్కారణం; ప్రతీ కుర్రాడూ కుర్రమ్మా ఫోన్ మీద వీడియోలూ అవీ చూసుకోవడానికీ కారణం మన స్టీవ్ జాబ్స్ బాబే. ఫోన్ మోగితే ఎత్తరు కానీ ఎస్సెమ్మెస్ మెసేజ్ వస్తే చంకలు గుద్దుకుంటూ అది మరో పది మందికి ‘స్ట్రైట్ ఫార్వార్డ్’ చేసేయడమే; అది నిజమా కాదా అనేది ఎవరికీ పట్టదు. ఆశ్చర్యంగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారిక్కూడా ఈ ఫేసుబుక్కు జ్వరం గొరిల్లా గ్లూలా అంటుకుని ఎంతకీ వదలడం లేదు.

    చేతులు పట్టుకుని పక్కపక్కనే కూర్చుని ఒక మాయాబజార్ లాంటి సినిమా చూసి, రోజువారి పడే తిప్పలు మర్చిపోయి, మనసు విప్పి మాట్లాడుకునే రోజులేవీ? మనుషులున్నారు నిజమే, కానీ ఎవరికీ నోరు పెగలదు. అర్ధాంగినో, కొడుకునో, కూతుర్నో చూసి ‘ఐ లవ్ యూ’ అనే రోజులు లేవు. మొహం ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడలేక, వాట్సాఫ్ లో చెప్పుకోవడమో లేదా ఫేసుబుక్కులో లైకులు కొట్టడమో. పక్క గదిలో కుర్రాడు ఈ గదిలో తమ్ముడితో మాట్లాడ్డు – మెసేజ్ పంపుకోవడమే. ఫోను కూడా కమ్యూనికేషన్ కి కాదు ఇప్పుడు. వీడియోలకి ఆటలకీ ఎస్సెమ్మెస్ లకీ అంతే. దేనికైనా సరే ఒకే ఒక ఆయుధం – గూగిల్ కరో భాయీ!

    మనుషులు మాట్లాడుతున్నప్పుడు వినకపోయినా, వాళ్ళు చెప్పినది అక్కర్లేదనుకున్నా, తర్వాతెప్పుడో కావాలనుకున్నప్పుడు మాట్లాడ్డానికి ఆ మనుషులు ఉండరు. ఈ కవితలో ఇది సరిగ్గా ప్రతిబంబించారు

  54. అంతవఱకె గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    05/01/2024 9:17 am

    ఆఖరి ఆటవెలదితో కవులమని చెప్పుకునేవారి మీదా కవిత్వం రాసే వారి నడ్డి మీదా కొరడా ఝుళిపించారు ఆచార్యులవారు. కనీసం ఇప్పటినుంచైనా మంచి కవిత్వం వస్తుందని ఓ ఆశ.

  55. అసాధారణకవి: షార్ల్ బోద్‌లేర్ గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    04/28/2024 10:11 am

    (Notes on my reads on Charles Baudelaire, contd.) 

    Christopher Isherwood translated Intimate Journals of Charles Baudelaire, into English. (First Beacon paperback edition published in 1957.) His introduction begins with the question of “What kind of a man wrote this book?” and in the next paragraph he summarizes his answers like so.

    “A deeply religious man, whose blasphemies horrified the orthodox. An ex-dandy, who dressed like a condemned convict. A philosopher of love, who was ill at ease with women. A revolutionary, who despised the masses. An aristocrat, who loathed the ruling class. A minority of one. A great lyric poet.” 

    Then Isherwood proceeds to give a life history of C.B.  At one point, he says- “Shy men of extreme sensibility are born victims of the prostitute. Baudelaire’s mulatto mistress, Jeanne Duval was a beautiful indolent animal. She squandered his money and slept with his friends. The biographers usually condemn her most unjustly. Few of us would really enjoy a love affair with a genius. Jeannie had to endure Baudelaire’s moods and listen to his poems: she understood neither. But in some mysterious manner, these two human beings needed each other. They stayed together, on and off, for twenty years. Baudelaire always loved and pitied her and tried to help her…” 

    I think -this is where Suraparaju RadhakrishnaMurthy got his tone for his C. B’ s bio in Telugu. His idea about how to present to the Telugu readers, another slave woman, C.B., meets in Mauritius.  

    సూరపరాజు గారి మాటల్లో:“బోద్‌లేర్‌లో నిద్రాణంగా ఉండిన కవితకు పునరుద్దీపనమయింది యీ కేరళకాంతనీలకాంతి. ఆమెపై ఒక కవితరాశాడు: ‘మలబారు యువతి’ (A une Malabaraise). బహుశా యీ యువతి కలిసివుండకపోయి ఉంటే, మనకొక బోద్‌లేర్ మిగిలేవాడు కాదేమో? ఈ విషయం బోద్‌లేర్ స్వయంగా ఒకచోట రాసుకున్నాడు. బోద్‌లేర్‌లో కవిని ఆరిపోకుండాఅందమైన తన అరచేతులు అడ్డంపెట్టిన యీ మలబారు మహిళకు సాహిత్యలోకం ఋణపడి ఉండవలసిఉంటుంది.” 

    అధ్యాపకుడు సూరపరాజుకు,ఈ ఫ్రెంచ్ కవిని “భారతీయ సనాతన ధర్మదృష్టి తో సమన్వయం” చేసి, చూపటం ఆయన రచన ధ్యేయం కనుకనేమో, అక్కడ తెలుగు కవి థూర్జటిశ్రీకాళహస్తీశ్వరశతకంలో ‘రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్..’ – పద్యంతో సాపత్యం తెస్తారు. బూదలేర్ బానిస స్త్రీ, ఆపెరా హౌస్ స్త్రీలతో సంబంధం పెట్టుకోటం నైతికంగా అతడిని పతనం చేసిందనిభావిస్తూనే, అతడు గొప్ప కవికావటానికి నీచ స్త్రీ సంబంధం ఉపకరించిందనీ, అందువల్ల “మనం” ఆ స్త్రీ/ స్త్రీలకు రుణపడి ఉండాలంటారు. ఆ మెలిక నాకర్థం కాదు.అలాగే -తెలుగు కవి థూర్జటి కవిత్వాన్ని గౌరవిస్తూ, ప్రజలు బోగంస్త్రీని నిరసించాలి. ఈ మిసాజినీకి అంతెక్కడ! దేశదేశాల పాతశతాబ్దపు పరిస్థితులు, ఆలోచనలు,ఈ శతాబ్దివిలా ధ్వనింప చెయ్యటం,ఇప్పటి తరం సాహిత్య వేత్తకు,భావ్యమా? స్త్రీ గాని, మగవాడు కాని,ఒక సమయంలో, ఒక వయసులో భోగించి, మళ్లీ మళ్లీ కావాలనిఅనుభవించి, ఆ తరువాత ఆ సుఖాలనునిరసించటం దేనికి? Why knock them? అంత మట్టుకు కృతజ్ఞులై ఉండి ఆ తర్వాత కాలంలో అప్పుడు వారికి ఇష్టమైనవి,అవేవో తెలిస్తే చేసుకోరాదా? 

    In Christopher Isherwood’s translation -The squibs, there are about 22 of them, followed by “my heart laid bare.” Maybe twenty, thirty. Followed by a selection of ‘consoling maxims upon love.’ Some fifty or so. I lost count. (Bad at counting Roman numerals.) Interspersed are some sketches by Baudelaire. There is a sketch of Jeannie Duval after page 56. Reading them, I got some glimpses of B’s thought processes about some of his contemporaries. In these pages, Baudelaire comes across as an ordinary, o.k., guy. Don’t know why Isherwood thinks he is a super genius. Baudelaire is no match for Emerson, Thoreau in philosophic thought, or Oscar Wilde in wit.

    In his squibs: B thinks there are only three worthwhile high-minded pursuits in life. 1. Priest 2. Soldier 3. Poet.  B thinks the rest of humans are “professionals.”  They do mundane things, just to earn a living, for themselves. This dandy, this ‘Flaneur’ of 19thcentury Paris streets, he is dead wrong, isn’t he?

    In actuality, What B really needed is some penicillin. To save his life and sanity. Unfortunately, Alexander Fleming did not find Penicillium notatum, until about a century later. (sept 28, 1928 – a day to remember!) In his experiments with various kinds of plants, Baudelaire himself did not stumble on any cures for any diseases. Therefore, B joined the group of talented artists like Schubert, Schumann, most likely Telugu poet Dhurjati, the prostitutes in his poetry, and many other humans who suffered terribly from syphilis and died of it.

    However, I am glad that before he died in his forties, Baudelaire managed to enjoy a few pleasures of life. Otherwise, his life would have been one big wasteland of misery and deprivation. God forbid! Who wants that!

    I am all for the delights of body and mind, however transient the pleasure or life may be.! Asi So Yo! A few of my lines in poetry, from memory: 

    ఎన్నడు కుడిచితినో నీతోటి ఆ తోటలో
    ఎన్నడు ఒంపితినో నీకు తేనీరు!
    ఎన్నడు ముడిచితినో బిడియము వీడి నీకు విడియము;
    కన్నడ! అన్నడె వీగిపోయె నా అంతరంగపు సుడులు,  
    వెన్నడ! అన్నడె వ్రీలిపోయె నా కంచుకపు ముడులు.

    -Lyla 

  56. రెండు ప్రయాణాలు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    04/06/2024 9:25 am

    సత్యాన్వేషి మూలా సుబ్రతో కవిత్వం స్వీట్ అండ్ సింపుల్ అని త్రిపుర తండ్రి చేత కూడా ప్రశంసించ బడినాడు.

  57. క్రోధి గురించి నెల్లుట్ల నవీన చంద్ర గారి అభిప్రాయం:

    04/01/2024 9:25 am

    ఎప్పుడూ రాసినట్లే దేశికాచారిగారు అర్థవంతమయిన కవిత రాశారు. క్రోధి పేరుకు మాత్రమే. అందరికీ బాగానే జరుగుతుంది. “నిండు మనంబు నవ్య నవనీత సమానము” అన్నట్లు క్రోధి గారు కూడా. అభినందనలు మిత్రమా.

    నెల్లుట్ల నవీనచంద్ర

  58. జీవితాంతం గురించి K. Devendra గారి అభిప్రాయం:

    03/02/2024 4:19 am

    కవిత చాలా బాగుంది. అద్భుతమైన మేటఫర్స్ ఉన్నాయి. తలపండిన అనుభవం. కవిత సృష్టి పై పట్టు. తాత్విక స్పర్శ మేలు కలయిక ఈ కవిత.

    దేవేంద్ర ఖమ్మం

  59. కొత్త వాచ్‌మన్ గురించి మహమూద్ గారి అభిప్రాయం:

    02/19/2024 2:04 am

    కవిత బాగుంది శ్రీరాం గారు. మీరు సాధారణంగా రాసే కవిత్వానికి భిన్నంగా సాగింది. అభినందనలు.

  60. కొత్త వాచ్‌మన్ గురించి Vijay Koganti గారి అభిప్రాయం:

    02/11/2024 7:03 pm

    ఈ రోజు కురిసిన వాన నిన్న మొన్నటిది కాదు. మంచి కవిత.

  61. అసంపూర్ణం గురించి జి.యస్. రామకృష్ణ గారి అభిప్రాయం:

    02/08/2024 6:15 pm

    ఎప్పుడూ వ్రాయడానికి సాహసించను నేను. అలాంటిది ఈ కవిత్వం చదివిన తరువాత మెదడు తిమ్మిరెక్కినట్లయి, కాసేపు నాదగ్గరున్న గువ్వలచెన్నడి పదాలు చదివి ఊపిరి పీల్చుకున్నాను. కవిత్వం ఎంత తేలికైపోయందీ అనిపించింది. ఇదొకటనే కాదు. అన్నీ ఇలాగే ఉన్నాయి. తప్పు నాదే మరి. ఇంకొన్నాళ్ళు కవిత్వాలు చదవకుండా ఉండాలి. నాకూ నా ప్రాణమంటే తీపేగదా!

  62. కొత్త వాచ్‌మన్ గురించి కవిత గారి అభిప్రాయం:

    02/07/2024 6:54 am

    తరచుగా నగరాల్లో ఎదురయ్యే దృశ్యాలని చాలా చక్కగా కవిత్వీకరించారు శ్రీరాం గారు… ఈ కవిత మీ సున్నిత స్వభావాన్ని వెలికి తెచ్చేదిగా ఉంది!!

  63. Endowed Chair In Telugu To Expand Language And Cultural Opportunities గురించి Vasudeva Y. గారి అభిప్రాయం:

    01/23/2024 2:26 pm

    మావి చిగురు దిన్న మత్త కోకిల పాట మబ్బుగన్న నెమలి ఉబ్బులాట
    మాటమాటనుండు తేట తెనుగునందు. వాగ్వధూటి కెన్ని భాషలున్న నామె
    పలుకు సంస్కృతమ్ము కులుకు తెలుగు సొగసులూరు మాట సొంతమైనది నాకు.
    తెలుగు పాదుజేసి తెలుగు నీళ్ళనుబోసి పెంచి తెలుగు తోట పంచి పూలు
    తెలివి గలుగు వరకు తెలుగు లెంక నగుదు. జాషువా కవితల జాజిపూదోటలో
    విశ్వనాథ కావ్య వేది మీద తెలుగు తల్లి నుంచి తెల్ల వారులు గొల్తు.

    కోటి చేమొగువులు కొడవళ్ళ జోడుకు – తః తః

  64. అప్రతిహతం గురించి ఇబ్రహీం నిర్గుణ్ గారి అభిప్రాయం:

    01/02/2024 8:56 am

    అరణ్యంపై పరుచుకున్న
    సాయంకాలపు నవ్వుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి

    ఎంతో అద్భుతంగా చెక్కారన్నా ఈ వాక్యాలను.

    కవిత వస్తువు మిణుగురు లను తీసుకోవడం అద్భుతమైన విషయం.

    అభినందనలు భాయ్ 🎉🎊💝💞🌹

  65. శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి అభిప్రాయం:

    12/02/2023 9:54 am

    చక్కని అనువాదం కవితలో ‘శాంత్యోదయ’ వ్యాకరణం ప్రకారం సరికాదు. దానిని కూడా సరి చేస్తే మొత్తం బాగుంది.

    [ సరిచేసాం. దోషం చూపినందుకు ధన్యవాదాలు. – సం. ]

  66. వాక్యం పాదాల దగ్గర గురించి Poduru v s Pardhasaradhi గారి అభిప్రాయం:

    12/02/2023 4:07 am

    కవిత చాలా భావుకతతో కూడిఉంది.

    “మత్తిలిన నిదురరాత్రి” పద ప్రయోగం అద్బుత మనిపినిచ్చింది. రచయితకు అభినందనలు, ధన్యవాదాలు.

  67. అదృశ్యం గురించి k.venkata Rama Krishna గారి అభిప్రాయం:

    11/04/2023 7:43 am

    చాలా బావుంది మీ కవిత. ఆద్వైతాన్ని బోధిస్తున్నది.

  68. నాకు నచ్చిన పద్యం: ఆర్తవబిల్వదళం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    10/30/2023 12:41 pm

    ఈ శీర్షికలో విన్న అన్ని కవి పరిచయాలు, కవిత్వము ఎంతో బాగున్నవి. వీరందరి పొయటిక్ జీనియాలజీ ఇంచుమించు ఒకటే కదా! వీరి పాండిత్యము, వ్యాకరణ జ్ఞానము, ఊహాశక్తి శబలము. ఆకర్షణీయము. వీరు తమకన్నా ముందు తరాల భారతీయ సాహిత్యం చక్కగా చదివిన వారు.

    (“…For greatest poets have aspects which do not come to light at once: and by exercising a direct influence on other poets centuries later, they continue to affect the living language…” — In the essay -The Social Function of Poetry, page 11. (T.S. Eliot on Poetry and Poets, Publication 1954 –Farrar, Straus and Giroux, New York.)

    ఐతే, ఈ కవులు వీరెవరివీ distinct voices కావు. కవి పేరు ఇవ్వకుండా కొన్ని పంక్తులనో ఒక పద్యాన్నో ఇచ్చినప్పుడు, అది ఎవరు రచించినదీ చెప్పటం ఇతర శ్రోతలకు సాధ్యం కాదు.

    “In Swinburne an Estimate” (Archon books 1969) another poet John Drinkwater in the first chapter – Lyric technique says: The most immediate impression gathered from a close acquaintance with Swinburne’s lyric poetry is its curious distinctiveness from all other poetry.”

    అది నిజమే. అంతమాత్రాన అతడు కీట్స్, టెనిసన్, వర్డ్స్‌వర్త్ వీరందరికన్నా గొప్ప కవిత్వం చెప్పాడని కాదు. Lyric technique, Lyric thought, Lyric art… అంటూ స్విన్‌బర్న్ గురించి ఇందులోని ఛాప్టర్లన్నీ నేను చదువుకున్నాను. ఎలియట్ – స్విన్‌బర్న్ యాజ్ ఎ పొయెట్, యాజ్ ఎ క్రిటిక్ – కూడా ఎన్నిసార్లో చదివాను.

    Meera, the Indian woman poet, is direct and intense in expressing emotion. She, in her simple sentences, is so musical.

    జో తుమ్ తోడో పియా మై నాహి తోడూ రే
    తోస్ ప్రీత్ తోడ్ కృష్ణ, కౌన్ సంగ్ జోడూ రే!

    So is Telugu Annamayya. This is a super-duper dream!

    కలగంటి కలగంటి, ఇప్పుడిటు కలగంటి
    ఎల్ల లోకంబులకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి!

    They have distinct beautiful voices, yet, they too must have had their ancestral poets. In this Telugu poetry of mine(?) below, obviously, the person’s -Silsila, the spiritual ancestry- goes back to some of Meera’s and Potana’s Krishna poetry. These days when I recall-sing it to myself, in Biltmore or Vizcaya gardens, where peacocks dance and parrots fly -all I see and hear is lush, lust, luxury, happiness. There is no devotion. No submission. No Nada. Only pure self-indulgence. Here are the words:

    ఏ లలనామణులారటంబున మురారీ! కనరారా ప్రియా! యం
    చే మల్లెనికుంజముల నీకై గాలించిరో!
    ఏ కాంతారమున ఆ కాంత లేకాంతమున నీతో భోగించిరో!
    ఏ వనసీమల మ్రోగె నీ మురళి! ఆ కానలలో
    నే మోదుగ పూవుగ పూచి యుందునుర, కృష్ణా! వనమాలీ, శౌరీ!

    Es la verdad.

    -Lyla

  69. అక్టోబర్ 2023 గురించి Purnima గారి అభిప్రాయం:

    10/29/2023 1:34 am

    ఈ సంపాదకీయం ఫేస్బుక్‌లో కనిపించి హడావిడిగా చదివిన మొదటిసారి, నాకు చాలా విసుగ్గా అనిపించింది. తర్వాత అయిన రాద్ధాంతం, దానికి మీరిచ్చిన వివరణలు అన్నీ చదివాను. అయినా నావో రెండు మాటలు: 

    1. పైన పవన్‌గారు అన్నట్టు ఇక్కడ మీరేమీ అబద్ధాలు రాయలేదు. పైగా మన ఎవ్వరి దగ్గర గణాంకాలు/qualifiers/quantifiers లేవు. అప్పుడు ఇలాంటి వ్యక్తీకరణల వెనుక ఆలోచన, అక్కర కన్నా భావోద్వేగమే ఎక్కువ కనిపిస్తుంది. 

    2. తెలుగులో ఏది “అల్లిబిల్లి రచన” అనేదానిపై ఒక baseline లేదు. ఇక్కడ “ఎవరు రాశారు” †>>> “ఏం రాశారు” >>> “ఎలా రాశారు” – విమర్శలు తీసుకోడానికి రచయితలు ఎందుకు సిద్ధంగా లేరు అంటే, వాళ్ళకి పళ్ళెంలో పెట్టి పొగడ్తలు అందిస్తుంటే,  పిలిచారు కదా అని స్టేజీలెక్కి ఏ మాత్రం నిబద్ధత లేకుండా వాళ్ళది ఎందుకు అత్యుత్తమ రచనో నోటికొచ్చింది అతిథులు వాగుతుంటే, ఆ వీడియోలు గట్రాలు యూట్యూబుల్లో పెట్టినప్పుడు, ఇంకో పది మంది వచ్చి “మీరెంత గొప్ప కాకపోతే ఇందులో గొప్పతనం చూడగలరు?” అని మోస్తుంటే… ఆత్మవిమర్శలు, ఆత్మపరిశీలన — ఇవ్వన్నీ అత్యాశలు కావా? 

    3. గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకుని, ఇక్కడికే వచ్చి “అయ్యా, మీది privilege. మీకు డబ్బు, ఇంగ్లీషుపై పట్టు, ప్రపంచ జ్ఞానం అన్నీ ఉన్నాయి. మాకు లేవు. మీ తూకంలో మమల్ని తూగమంటే ఎట్టా? మా పాట్లు చెప్పుకుంటే మీరేం సాయం చేయగలరు? చేయలేనప్పుడు ఈ నీతి బోధలు ఎందుకు?” అని కూడా అడుగుండచ్చు. కానీ వాళ్ళు మీమ్స్/ట్రోలింగుతో సమాధానాలు ఇచ్చామనుకున్నారు. అక్కడితో వాళ్ళది పై చేయి అయి (అని వాళ్ళు అనుకుని) చర్చ ముగించారు. 

    4. ఈమాట సంపాదకీయాన్ని పాజిటివ్‍గా పంచుకున్నవాళ్ళలో కూడా కొందరు పరిశుద్ధాత్ములేం కారు. అదేదో మీ భుజం మీద తుపాకి ఉంచి పేల్చడమే. “నువ్వు రాసిన కవితలో సవాలక్ష సమస్యలున్నాయి” అని హింట్ ఇచ్చినా వాళ్ళు 3వ పాయింట్ వాళ్ళతో కలిసిపోతారు. 

    5. నా ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి lash-out సంపాదకీయాల వల్ల లాభమేమిటి? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎవరికైతే ఉందని మీ ఊహో, వాళ్ళెటూ ఈ సంపాదకీయం చదవరు, చదివినా మీమ్స్‌కు మించి వాళ్ళు మీతో చర్చకు కూడా దిగరు.

    కాకపోతే, రాయాలన్న తపనతో పాటు సరిగ్గా రాయాలన్న పట్టుదల ఉన్నవాళ్ళని ఇలాంటి సంపాదకీయాలు ఇంకా ఊబిలోకి కూర్చేస్తాయి. Imposter Syndrome ఒక నిజం. ముఖ్యంగా మహిళల్లో. మంచి రచన అంటే ఏంటి అనేదానికి వ్యక్తిగత అభిప్రాయాలు, biases తప్పించి ఎలాంటి కొలమానాలూ, ఎలాంటి ఫీడ్బాక్ లేని తెలుగు సాహిత్య లోకంలో ఇలాంటి ముసుగులో గుద్దులాట వల్ల సున్నితంగా ఉన్నవాళ్ళకే దెబ్బలు తగులుతాయి కదా! 

    6. అవును, తెలుగు సాహిత్యంలో సవాలక్ష సమస్యలున్నాయి. కానీ ఎంతసేపూ వాటిని ఒక superficial levelలో మాట్లాడతారే తప్పించి అంతకన్నా లోతుగా వెళ్ళరు. ఇలా ఈ పైపై చర్చలు ఎంత కాలం? మొత్తం రభస అంతా అయ్యాక మీ వివరణలో “జ్యోతి వలబోజు”గారి పేరుని ప్రస్తావించారు, మంచి పనికి ఉదాహరణగా. ఒక నెల సంపాదకీయంలో చెడమడా తిట్టేసినా, ఇంకో దాంట్లో ఇట్లా మంచిగా చేస్తున్నవారిని, (లేదా సంపాదకీయాల్లో వ్యక్తుల పేర్లు వాడకూడదంటే) జరుగుతున్న మంచి పనులు చెప్పడానికి కూడా ప్రయత్నించండి. 

    వాస్తవాలను విస్మరించేంతటి గుడ్డి పాజిటివిటి కాకుండా, గడ్డు పరిస్థితుల్లో కూడా ఒక చిన్న దివ్వెను వెతుక్కునేలా కూడా మీ సంపాదకీయాలు ఉండచ్చు. పరిగణించండి. 

    †>>> — అంటే ఇంటర్నెట్ లింగోలో one is far greater/far more important than the other అని అర్థం.

  70. రుచి గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    10/10/2023 5:04 pm

    ఈమాటలో – ఏ కవిత చూసినా ఏమున్నది గర్వ కారణం! స్త్రీ కళ్లలోనే ఎప్పుడూ నీళ్లు. మగవాడు మహాద్రష్ట కవి.

    ఈమాటలో – మహా రచయిత జయమోహన్ ఏ కథ చూసినా ఏమున్నది గర్వకారణం! ఈ కథలోనూ స్త్రీ కళ్లలోనే నీళ్లు. ఇతని కథల్లో – ఏనుగు, డాక్టరు, రచయిత ఉంటే – ఏనుగుకి కాదు, ఏనుగుని రక్షించిన డాక్టరుకు కాదు, డాక్టరుని రక్షించే ఏనుగుకి కాదు, కథ రాసిన రచయితకి ఎవార్డు వస్తుంది.

    కథలో ‘హీరోయిజమ్’ మగవాడిది. స్త్రీ రక్షించబడేది. స్త్రీ ఇతరులను రక్షించే, కాపాడే, సహాయం చేసే స్థానంలో ఉండదు.

    అక్కడికి ఈ ‘రుచి’ కథలో బాస్ హీరో ప్రైడ్ ఏమిటి? ఆమె పే-చెక్‌ లోనే కొంత కట్ చేసి ఆమెను చీరలు కొనుక్కోమనటమా? ఆమెతో బలవంతాన తన అన్నం తినమని గొంతు పెంచి తన బాస్ గిరీ చూపటమా? ఆ యువతి ఇంటికి పొయ్యాక మిగతా పే-చెక్ ఎలాగూ నాన్న దొబ్బుతాడు కదా? జరిగిన మాలావు ఘనకార్యం ఏం లేదు. కథలో హీరోకి తన పనికిమాలిన సహృదయత గురించిన తన ఓన్ సంతృప్తి తప్ప.

    నా చిన్నతనంలో ఓ రోజు, నా ఒక తమ్ముడు డ్రీమ్ లేండ్‌లో ఉన్నట్టుంటే – ఏం ఊహిస్తున్నావని అడిగాను. నాకు పెద్ద కష్టం వచ్చినట్టూ, తను డ్రాగన్‌లతోనూ, రాక్షసులతోనూ యుద్ధం చేసి నన్ను రక్షిస్తున్నట్టూ కలగంటున్నట్టు చెప్పాడు. ఎప్పుడూ నిజమే చెప్తాడు, ఆ సుగుణం ఉంది. కాని నేను – ఆహా! నా తమ్ముడు, నాపై ఎంత ప్రేమ! అనుకోలేక పోయాను. నాకన్నా ఎంతో చిన్న బక్క పీచు వెధవ, గాలేస్తే కొట్టుకు పోయే వెధవను, బోలెడుసార్లు నేను చేయి పట్టుకుని రోడ్ మీద నడిపించి రక్షిస్తే ఇదీ ఈ రాస్కెల్ కృతజ్ఞత. నాకు కష్టాలు రావటమెందుకూ? ఈ బొట్టిగాడు నన్ను రక్షించటమెందుకూ. దాని బదులు తనకే కష్టమొచ్చినట్టు, నేను తనను రక్షించినట్టు ఊహించుకోవచ్చుగా.

    అదే హీరోయిజమ్‌లో దాగి ఉన్న ఈగోయిజం. కొందరి రచనల్లో హీరోయిజంకి, విక్టిమిజంకి గల సంపర్కం. అదే! ఈ వెనక బడిన కథలో హీరో వీరత్వం. తన బొచ్చు మగ బతుకులో, తనే ఓ చచ్చు ఇగోయిస్ట్‌నని ఆఖరి సీన్‌లో కూడా గ్రహించుకోలేని మూర్ఖత్వం.

    ఒక స్త్రీ ఎఛీవ్‌మెంట్స్ ఏ సెక్టర్‌లో గాని ఎత్తి చూపగల సాహసం, భారతీయ మగరచయితకు ఎప్పటికైనా వస్తుందా? అలాటి హీరో అతడు కాగలడా? ఐ డౌట్ ఇట్.

    -Lyla

  71. అసలు నేను గురించి డా.ఇస్మాయిల్ పెనుకొండ గారి అభిప్రాయం:

    10/09/2023 12:12 am

    ఇందుకు కదా రాయాలి… కవిత!

  72. అక్టోబర్ 2023 గురించి పవన్ సంతోష్ సూరంపూడి గారి అభిప్రాయం:

    10/08/2023 10:53 pm

    ఈమాట చేస్తున్న పని ఇష్టపడేవాడిగా, దశాబ్దం పైగా వాళ్ళ రచనలకు పాఠకునిగా ఇలాంటి ఏకపక్ష సంపాదకీయం వాళ్ళ నుంచి నేనెప్పుడూ ఆశించలేదు.

    కొన్ని పబ్లిషింగ్ హౌస్‌లు రచయితల పుస్తక ప్రచురణాభిలాష మీద మోపుతున్న నిర్దాక్షణ్యమైన భారాన్ని చూశాకా ఈ సంపాదకీయం లో సహానుభూతి లోపించిందని తోస్తోంది. ఈ విమర్శ నలుగురు సంపాదక మిత్రులు కలసి డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని “రచయితలెంత వెధవలంటే” అని ప్రారంభించి మాట్లాడుకున్నదాన్ని సారాంశంగా ప్రచురించినట్టుంది తప్పించి సహానుభూతితో అన్నివైపులను గమనించి రాసిన “సంపాదకీయం”లా తోచలేదు. ఇది ఆబ్జెక్టివ్‌గా చూసి తిరగరాసుకుని ఉండొచ్చు. అది జరగలేదని అర్థం అవుతోంది.

    ఇందులో అబద్ధాలు రాయలేదు. కానీ, ఒకే దృక్కోణం నుంచి మొత్తం రాశారు. కనీసంలో కనీసం – ఈ విషయంలో మార్పులు ఎక్కడైనా జరుగుతుంటే వాటిని ప్రస్తావించడమో, బిగ్ పిక్చర్ ఇలా ఉండడానికి జరుగుతున్న కారణాలను మెరుగ్గా విశ్లేషించడమో కూడా లేదు. ఇది విమర్శ కాదు. ఉత్తి Rant.

    ఉదాహరణకు “ఆ ప్రచురణకర్తలు ఎన్ని అమ్మారో ఆ డబ్బు ఏమైందో చెప్పరు అంటూ వాపోయే రచయితల రద్దీ గత కొంతకాలంగా ఎక్కువయింది” అన్న వాక్యం చూడండి. ఈమధ్యకాలంలో ప్రచురణకర్తలకు తామే డబ్బిచ్చి, ప్రచురణసంస్థల పేరిట రచయితలు ప్రచురించుకోవడం బాగా పెరిగింది. ప్రచురణకర్తలు ఇదొక తరహా వ్యాపారంగా చూస్తున్నాయి. ఇంతవరకూ బానే ఉంది. అలాంటప్పుడు డబ్బిచ్చిన రచయిత ఎన్ని అమ్మారో, ఆ డబ్బు ఏమైందో చెప్పకపోతే దానిపై వ్యంగ్యంగా రాసే పనేముంది? పోనీ ఇది వ్యంగ్యం కాదనుకుంటే సంపాదకీయంలో మరోచోట ప్రచురణకర్తలను సమర్థిస్తూ రచయితలను “మీకేం తెలవదు, తెలియనట్టు ఉండరు” అన్న ధోరణిలో ఎందుకు రాయాలి? ఈ రకంగా రాసే సంపాదకీయంలో “మార్పు ఎలా అయితే అనివార్యమో, మార్పు తాలూకు ప్రభావాలను అన్ని కోణాలనుంచీ విశ్లేషించుకోవడమూ అంతే అనివార్యం.” అని మొదట్లోనే ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయాల్సిన అవసరం ఏముంది?

    నేను అర్థం చేసుకున్నంతలో ఈ వ్యాసం లక్ష్యం వ్యాసంలో చెప్పినంత విస్తృతమైనది కాదు. సగానికి సగం వ్యాసం – ఈమాట సంపాదకీయ పద్ధతులను వ్యతిరేకించే, అంగీకరించని రచయితల మీద Rantగానే సాగింది. అసలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో రాస్తున్న, పుస్తకాలు వేస్తున్న రచయితల్లో ఎంతమంది ఈమాటకి వ్యాసాలు, కథలు, కవితలు పంపించివుంటారు? ఎంత శాతం? అలాంటప్పుడు, ఆ అంశమే ప్రధానంగా రచయితలను మదింపు వేస్తూ రాసే పనేమిటి? అలాంటప్పుడు దీన్ని విస్తృతమైన రచనల నాణ్యత గురించి, ఈమాట నిర్వాహకవర్గంలో అత్యధికులకు అస్సలు సంబంధం లేని పబ్లిషర్లు-రచయితల డైనమిక్స్ గురించి తోచిన జడ్జిమెంట్లు పాస్ చేయాల్సిన అవసరం ఏమిటి?

    ఇన్ని రాశారు కదా. అసలు ఈనాడు ఉన్న పరిస్థితిలో సగటు రచయితకు తన రచనల గురించి ఏవో కొన్ని చప్పట్లు మినహాయించి ఏం మోటివేషన్ మిగిలింది? “అహాలు, అపోహలు” మినహా ఏమీ లేవని జనరలైజ్ చేయకపోతే ఇన్సెంటివ్, మోటివేషన్ వంటివి అయినా ఎక్స్‌ప్లోర్ చేసి ఉండకూడదా?

    తమాషా ఏమిటంటే – రచనల్లో నాణ్యత గురించి రాసిన సంపాదకీయమే కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రాయడం. బహుశా, తెలుగు సాహిత్యపు తీరుతెన్నుల్ని సంకేతాత్మకంగా ఈమాట సంపాదకులు ఇలా చెప్పాలనుకుని ఉంటారు.

  73. అక్టోబర్ 2023 గురించి Indra Prasad గారి అభిప్రాయం:

    10/06/2023 12:31 pm

    మీ సంపాదకీయం నాకు నచ్చింది. ఇటీవలి నా రెండో పుస్తకం.”కాలం సైకత తీరం” తుది రూపం ఇచ్చే ముందు కవితల ఎంపిక, ఎడిటింగ్, విభజన, విశ్లేషణ, ముగ్గురు స్నేహితులు చేసేరు. ప్రచురణ బాధ్యత ఛాయా తీసుకున్నా, మూడు, నాలుగు సార్లు ప్రతిని సరిచూసి విడుదల చేసేం. మొదటి పుస్తకానికి కూడా ఇలాగే పని చేసేం. స్వంత ప్రచురణ అంటే మనకి తోచింది ప్రచురించడం కాదు అని నాకూ అనిపిస్తుంది.

  74. అసలు నేను గురించి శ్రీరామ్ గారి అభిప్రాయం:

    10/04/2023 11:37 am

    కవిత బాగుంది. మరీ ముఖ్యంగా మీ వాక్య నిర్మాణం. ఎంతో లోతైన అర్ధాన్ని కలిగి ఉండటం ఈ కవితలో చెప్పుకోదగ్గ విషయం. మీకు అభినందనలు.

  75. వికసితం గురించి దివాకర్ గారి అభిప్రాయం:

    09/05/2023 7:14 pm

    చాలా బావుంది కవిత.
    ముఖ్యంగా…
    “వెలిసిపోతున్న నీడలను
    కొలుచుకుంటూ”
    బాగా నచ్చింది.

  76. గీతాచారి గురించి Sasikala గారి అభిప్రాయం:

    09/04/2023 3:09 am

    ఇంకు మబ్బులు కరిగి,
    కవితల కళ్ళు తడిచిపోయేవి.

    👌👌నిజంగా చారి గారి బొమ్మల్లో పల్లె మోటుతనం నిజాయితీగా కనపడేది.చాలా బాగా వ్రాశారు.

  77. సగం వాన గురించి Sudha Rani గారి అభిప్రాయం:

    09/03/2023 11:26 am

    తెలుగు భాషకు దుర్దశ పడుతుందేమో అని భయపడుతున్న పాఠకాభిమానులకు ‘బీగం’ లాంటి పదాల వాడుకతో తెలియని ఊరట లభించింది. ఆసాంతం చదివించేలా చేస్తూ, రసాస్వాదన కలిగించింది ఈ కవిత.

  78. వికసితం గురించి శ్రీరామ్ గారి అభిప్రాయం:

    09/02/2023 3:08 am

    మీ కవిత చదువుతూ మైమరచిపోతూ మధ్య మధ్యలో ముసిముసిగా నవ్వుతూ — కవిత బాగుంది పద్మగారు.

  79. అనాదిగా గురించి డాక్టర్ కె.జి. వేణు గారి అభిప్రాయం:

    09/02/2023 2:36 am

    కవిత చాలా బాగుంది. అద్భుతమైన భావవ్యక్తీకరణ. కవికి అభినందనలు.

  80. సగం వాన గురించి జూలూరి శైలజ, హైదరాబాద్. గారి అభిప్రాయం:

    09/01/2023 11:04 pm

    కాలం వేళ్ళ సందుల్లోంచి జీవితాలు జారుతున్నట్టు* ప్రారంభమే అద్భుతంగా ఉంది. మొత్తంగా మీ కవిత భావస్ఫోరకంగా అందంగా ఉంది👏👏👌👌

  81. సగం వాన గురించి Poojitha charan గారి అభిప్రాయం:

    09/01/2023 6:21 pm

    ‘సగం వాన’ శీర్షికతోపాటు, కవితా ఆసాంతం అలరించింది. చాలా బాగా వ్యక్తీకరించారు. అభినందనలు ✍️✍️✍️💐💐💐

  82. నాకు నచ్చిన పద్యం: మానవల్లివారి మాలికాస్మృతిగీతం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    08/07/2023 9:05 am

    “కవిని కవియొక్క కావ్యము కమ్మివేసింది. కవి లేడు, కాని కవి పలికిన కావ్యం ఉంది. ఆ కావ్యంలోని నాయిక ఉంది. ఆ కవిత ఇచ్చిన రసానందం ఉంది. దాన్నే గానం చేశారు రామకృష్ణకవి. ఇంతకన్నా కవికి కావలసినదేమిటి?”

    Beautiful thoughts.

    I would say English poet A.C. Swinburne, (1890) Telugu poet Manavalli (మానవల్లి) are contemporaries, though from different continents.
    Swinburne wrote an elegy, on Baudelaire. He titled it “Ave Atque Vale” (Hail and Farewell.) He ran it as a seven-liner rhymed metrical stanzas of total of 200 lines. I am adding up the title and Swinburne’s signature. A quotation from B’s French poetry precedes Swinburne’s poem in English.

    Commonalities of course will be mythological references and Nature. Does not surprise me.
    Like Manavalli, Swinburne praises B’s major poetic work ‘Les Fleurs du Mal.’ Knowing B did not have an easy life, and was rather a troubled individual, Swinburne just wishes ‘rest’ for him. He is relieved there will be no further aggravations for this dead man. No creditors at his doorstep. No more letters to write to mother begging her to release some money, so he can buy some hashish, opium, and human companionship. Or buy a little more time on earth, to continue his artistic work. Whichever way one wants to look at it.

    Swinburne is not a believer of Christian God, afterlife, forgiveness of God for man’s sins.
    Seriously, what is God! What is soul! There are no such things. They too are grand poetic thoughts of men. ఘనత వహించిన కవిసమయములు.
    Swinburne does not like Church. He loves mythology, but his feet are steadily on earth.
    He believes more in man. So, he very humanly -asks B to forgive others who had wronged him personally during his life. For his own peace. Rest, rest peacefully my predecessor! dear B, dear brother! My fellow poet!

    Manavalli as per his own beliefs and existing sentiments at that time, sends Madabhushi (మాడభూషి వేంకటార్య) to heaven. He also is not a criticizing poet in his elegy, not critical of liaison between Menaka and Vishwamitra, has no moralistic condemnation. Looks upon the birth and subsequent life of Sakunthala with admiration, joy. He sees beauty in nature, on earth, in heaven.
    These two Elegists are very focused on Literary creation, of appreciating Literary work. They ‘come in praise’ for the poet.

    I am now giving an old poem of mine just for the heck of it, (which came to my mind when I recently received a certificate for being a member of a medical society for fifty years) without analyzing it. Here it is.

    Fall in Rochester

    The raker of falling leaves
    Of Chestnut and Maple trees
    Off 41 Lake Lacoma groves
    Rake not too hard
    And pierce not my heart
    I laid myself down
    By the side of the brown lake.

    Do you not hear my sighing,
    Underneath the rustling leaves?
    Rake not too hard
    And tear me not to pieces.
    Let me be. Let the leaves fall.
    Let colors swirl around.

    Later when the snows fall,
    I may be numb and frozen.
    My heart will still be throbbing.
    Do not bring in your ploughs!
    And carry me away not.

    Remember Rochester
    Rake not too hard!
    I have not left town.
    Let things be.

    -Lyla

  83. నాకు నచ్చిన పద్యం: ఒక పరిణతమైన ఆశుధార గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    07/18/2023 8:20 am

    Parimi’s opening paragraph is brilliant.

    సమస్యాపూరణము, పద్యావిర్భావము గురించి పరిమి భావనలు ఉదాత్తమైనవి. క్లిష్టమైనవి. వారి వచనం- మొదటి పేరాలోని విషయం, ఆ ఆలోచన చేసిన విధం, ఆపైన చెప్పిన విధం, నాకెంతో నచ్చి, it is brilliant! Bravo! అనుకున్నాకే, అప్పుడు నేను పార్వతీశ్వర శాస్త్రి గారి పద్యం చదివాను.
    పద్యం నాకు నచ్చింది. ఐతే పరిమి గారి వల్లనే, నేను ఆ పద్యం కొంత వేరు విధంగా చదువుకున్నానేమో. ప్రస్తుతం నేను చదువుతున్న ఇతర కవుల ప్రభావం కూడా ఉండవచ్చును.

    Poets Swinburne and Baudelaire -Both are sticklers for music, symmetry and sound in a poem. They both are fanatical about choosing the right words. More so, they hope for proper interpretation of the chosen words, from the reader. And above all, they believe poetry should evoke “Un état d’âme” (a state of mind.)

    పరిమి మొదట్లో అన్నట్లు ఈ ఒక్క పద్యమే కావ్యమై, అది భాసించాలంటే, దానిలోని పదాల అర్ధాలు కొంత వేరుగా చదువుకోవాలి.

    ఇప్పుడు -‘ఈమాట’ కవి సమ్మేళనంలో శ్రోతలు, ప్రశాంతతతో, ఈ క్రింది గీతం లోని నాయికను ఊహించి, వినండి. ఆమె ఆ రాత్రి, ఇలా పాడుతున్నది.

    “ఏదీ చాందినీ?
    ఏదా చలువల కాంతీ?
    ఇవేళా
    అలలమిలమిలలవేవీ!

    ఏదీ సంపగీ?
    ఏదా కుసుమపు భ్రాతీ!
    ఇవేళా
    సుఖపరిమళములవేవీ!

    ఏదీ తెమ్మెరా
    ఏలా నిమురదు చెక్కిలీ?
    ఇవేళా
    తనువులపులకలవేవీ!”

    కవి పార్వతీశ్వరశాస్త్రి మృదుహృదయుడు. ఆయనకు ఒక కోమలి ఒక్క పువ్వు కోస్తే, అంతమాత్రానికే కోయిల కన్నెర్ర చేసి, ఆమెను బెదిరేట్టు చేయటం నచ్చలేదు. అందువల్ల, తన కవితా శక్తితో దరిమిలా అంతటా వెన్నెల పరిపించాడు. మన్మథుడిచే ఆమెపై పలుమార్లు ‘పూలు’ కురిపించి పదేపదే ‘అహహా అనేట్టి వివశతను’ ఆమెకు కలిగించాడు.

    I like guys with heart. I like such givers. I like people that can make others happy.

    పార్వతీశ్వర శాస్త్రి పద్యంలో ‘అహాహా’ (the woman’s repeated exclamations,) బాధా సూచకము కాదు. ‘బాణం’ అనగానే ‘బాధను’ ఊహించటం సభికులకు సర్వత్రా సరికాదు. నిఘంటువు ప్రకారం ఆ అర్ధం సాధ్యమే కాని ఎందుకు? ఆ ఆలోచన పద్యపు అందం తగ్గిస్తుంది. అందునా ఒక్కటే పద్యం చెపుతున్నప్పుడు Pain, deprivation తో ఎవరి మనసైనా రంజించగలరా!

    పూలబాణాలు, పూలు, flowers-intoxication అన్న పొయటిక్ ఆలోచన ఈ సందర్భంలో సరైనది.

    -Lyla

  84. వానగీతం గురించి నల్లపనేని విజయలక్ష్మి గారి అభిప్రాయం:

    07/03/2023 7:38 am

    వాన మాత్రం తడి కళ్లను
    మంచు గదుల అద్దాలకు అతికించి
    చెమ్మగిల్లని మనుషులను
    దిగులుతో చూస్తోంది
    – చిరు జల్లులలో తడిసి హృదయమాలిన్యాన్ని కడుక్కొని పసి మనసుతో పరవశించాల్సిన బిడ్డ దారి తప్పాడని తల్లి అనుభవించే దిగులు.
    చక్కని కవిత. అభినందనలు పద్మావతిగారూ!

  85. వానగీతం గురించి Poduru v s Pardhasaradhi గారి అభిప్రాయం:

    07/02/2023 5:51 am

    వాన గీతం చాలా భావుకతతో ఉంది. పద్మావతిగారు తానే ప్రకృతిలో మమేకం అయి ఎంతో అందంగా భావవ్యక్తీకరణ చేశారు. ఆమె కవితల్లో సరళమైన, సొగసైన పదకూర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి తెలుగు భాషపై ఆమె అభిమానాన్ని, పట్టుని పరిమళిస్తాయి.

  86. నాకు నచ్చిన పద్యం: ఒక పరిణతమైన ఆశుధార గురించి వాడపల్లి శేషతల్పశాయి గారి అభిప్రాయం:

    07/02/2023 3:17 am

    అనుబంధపఠనమునకై..

    అభినవాంధ్రకవితాపితామహుని కవితావినోదములు 1 – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1932-04)
    https://archive.org/details/bharathi19320401/page/n107/mode/2up

    అభినవాంధ్రకవితాపితామహుని కవితావినోదములు 2 – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1932-10)
    https://archive.org/details/bharathi19321001/page/n137/mode/2up

    అభినవాంధ్రకవితాపితామహుని కవితావినోదములు 3 – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1933-01)
    https://archive.org/details/bharathi19330101/page/n45/mode/2up

    కవితావినోదములు – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1937-11)
    https://archive.org/details/bharathi19371101/page/n105/mode/2up

    మండపాక పార్వతీశ్వరశాస్త్రి (ఆంధ్రరచయితలు – మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి)
    https://archive.org/details/in.ernet.dli.2015.372401/page/47/mode/2up

    ముడుంబ నృసింహాచార్యకవి (ఆంధ్రరచయితలు – మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి)
    https://archive.org/details/in.ernet.dli.2015.372401/page/59/mode/2up

    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  87. తెలుగు కవిత్వంలో దళితవాదం గురించి విష్ణు ప్రసాద్ గారి అభిప్రాయం:

    07/01/2023 12:30 pm

    అధ్బుతమైన కవిత్వాన్ని చదివాను… ఇన్ని రోజులూ చదివినందుకు బాధపడ్డాను. ఇది పుస్తక రూపంలో ఉంటే పేరు తెలియజేయగలరు

  88. ఏకం సత్… గురించి k.venkata Rama Krishna గారి అభిప్రాయం:

    06/17/2023 8:23 am

    చక్కగ ఉన్నది కవిత.

  89. రుబాయీలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    06/11/2023 8:35 am

    రెండు నెలలకు ముందు హైదరాబాదులో ఒక సాహిత్య సమావేశములో ఒక expert కేవలము aaba అంత్యప్రాసలతో ఒక కవితను రుబాయీ అని వ్రాసినారు. నేను దానికి రుబాయీ ఛందస్సు లక్షణములు లేవు అని చెప్పగా రుబాయీకి తెలుగుకు సరిగా మహాకవి దాశరథి చెప్పినట్లు (దాశరథి అలా చెప్పలేదు) వ్రాస్తే చాలు, విదేశీయ ఛందస్సు అవసరము లేదని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా రుబాయీ ఛందములను పరిశీలిస్తున్న నేను అందులోని 3/12 కందములోని సరి పాదములకు సరిపోయినప్పుడు దానికి విదేశీయతను ఆపాదించడము సబబు కాదని ఈ వ్యాసమును రచించినాను. అది దీని background. ఇక పోతే దువ్వూరి ఆదిభట్ల మున్నగువారు వారు వ్రాసినవి అనువాదములు అనుసృజనలు అనియే చెప్పుకొన్నారు. పారసీకములోవలె రుబాయీలు అని చెప్పుకోలేదు. కాని తెలుగులో పారసీక ఉర్దూ భాషలలోవలె రుబాయీలను వ్రాయ వీలగును, అలా వ్రాసినప్పుడు అవి సహజముగానే తెలుగులో ఉంటాయి అన్నదే ఈవ్యాసపు ముఖ్యోద్దేశము. మఱి అరవై సంవత్సరాలుగా ఎందుకు వీటిని గొప్ప కవులు తప్పు దారిని నడిపించారో నాకు తెలియదు. నాకు Spanish తెలియదు కనుక మీ రుబాయీ నాకు అర్థము కాలేదు. నమస్సులు.

  90. వలలెందుకు? గురించి నరేష్ నున్నా గారి అభిప్రాయం:

    06/03/2023 12:00 am

    పదాలతో పెనవేసుకొని ఉండే conventional మూసల ఇమాజినేషన్‌ని సదా ప్రతిఘటిస్తూ పదాలకి ఆవలి భావాన్ని తోడితెచ్చి, చదువరికి అనుభవం చేసే auditory imagination నిండి ఉన్న మీ కవిత ‘వలలెందుకు?’ (టైటిల్ బాలేదు గానీ) గొప్పగా ఉంది. ఇటువంటి మంచికవితలు అరుదుగానైనా ఈమాటలో కనబడటం బాగుంది.

    ఈమాట శీర్షికల్లో ఒక్క ‘కవితలు’ మినహా, మిగతా genresలో ఉత్తమాభిరుచి, ఉన్నత ప్రమాణాలూ కనబడుతుంటాయి. ఇందులో రాసేవాళ్లు, కామెంట్లు చేసేవాళ్లు, చర్చోపచర్చల్లో కలబడేవాళ్లు, ఈ ఈమాట నిర్వాహకులతో సహా ఒక Finite Set (గణిత పరిభాష) లాగా, నిలయవిద్వాంసుల బృందం! ఆధునిక – ఆధునికోత్తర కవిత dictionకి ఆ finite set అలవాటు పడకపోయినా, ఇస్మాయిల్ గారి వంటి కవులకి ఈమాటలో స్థానం దక్కడానికి కారణం – బహుశా వేల్చేరు నారాయణరావు గారి వంటి ఒకరిద్దరు scholars, connoisseurs of modern poetry అసోసియేషన్ వల్ల కామోసు.

  91. నాకు నచ్చిన పద్యం: మది కలతలు పోగొట్టే పుష్పాచయము గురించి మలశా గారి అభిప్రాయం:

    06/02/2023 2:45 am

    మరుగున పడిన తెలుగు సంపదలని వెలికితీసి ఆ సౌరభాల్ని మాఅందరితో మీవంటి విద్వాంసులు పంచుకోవటం శ్లాఘనీయం. కవికవిత్వం ఎన్నిమారులు చదివితే తనివి తీరుతుందో అన్న లెక్కపక్కన పెడితే, మీ వ్యాఖ్యానం జీర్ణించుకోవటానికి ఎక్కువ సమయం పడుతుందేమో!

    ధ్యానం, యోగం, సంయోగం, సోపానం, అనుభూతి సిద్థి వంటి మీ‌ పదప్రయోగాలు కూడా కవిత్వమే కాబట్టి వాటినీ ఆస్వాదించాము. రసాస్వాదనలో హేతువు కూడదు!

  92. సీతాయనం గురించి Dr.K.Sujatha గారి అభిప్రాయం:

    06/01/2023 7:40 am

    సీతాయనం కవిత చాలా అద్భుతంగా ఉంది మేడం. సీత అంతరంగాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు.

  93. ముక్తచ్ఛంద కవిత – కొన్ని మౌలిక సమస్యలు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    05/16/2023 10:24 am

    మంచి వ్యాసం.

    కాని ఈ తెలుగువ్యాసంలో సంస్కృతపదాడంబరం హెచ్చుగా ఉన్న వాక్యాలను తొలగించితే మనకు చివరకు ఒక్క వాక్యం కూడా మిగలదు. ఆ విషయం అటుంచితే ఆలోచనీయమైన అంశాలు చాలానే ఉన్నాయి.

    వచనకవిత్వప్రక్రియ బలపడి స్థిరపడిందని ఆలోచించి సంతోషించాలో అది వెఱ్ఱితలలు వేసి కవిత్వానికి చదువరులు కరువయ్యారని విచారించాలో తెలియకుండా ఉంది.

  94. సోల్జర్ చెప్పిన కథలు: బాటిల్ పెరేడ్ గురించి ఇంద్రప్రసాద్ గారి అభిప్రాయం:

    05/06/2023 11:24 am

    మంచి కథనం. చదివించే నేర్పు, కవితాత్మక వర్ణన. వాంగో ఆకాశం కనిపించింది.

  95. స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    05/03/2023 11:52 am

    ఒక రచయిత పుస్తకం మీద మరొక రచయిత సమీక్ష రాయడం అరుదు. ప్రపంచం పట్టని మేధావి గురజాడ కార్యరంగం విజయనగరం కావడం ఉత్తరాంధ్ర రచయితలకు వరం. కథల్లో తమ భావగతులను వాడుక భాషలో పలికించగల భాగవతులు శ్యామ్‌గారు. ఐతే,వారి కళా ప్రదర్శన బహు సకృతు. ఒక కథకుడు ఎందుకు తన ప్రయాణాన్ని అర్థాంతరంగా ఆపివేస్తాడో చెప్పడం కష్టం. లేస్తే కథ, కూచుంటే కవిత్వం తరహాలో కొందరు ఇబ్బడి ముబ్బడిగా రాస్తూ – పొద్దున్న లేచింది మొదలు -అభిప్రాయం చెప్పు అని కణతల దగ్గర గన్ను పట్టుకు నిలుచునే వారితో పోలిస్తే – చెప్పడం అయిపోయాక మౌనం పాటించడం మంచిదే అనిపిస్తుంది ఒక్కోసారి. నా వరకు నేను సందిగ్ధం అనండి, అన్వేషణ లేదా అచ్చ తెనుగులో వేట అనండి.

    “అంత తేలికగా ఒడ్డుచేరడం నే ఇష్టపడను” – పరమ సౌష్ఠవంగా రూపుదిద్దుకోగల కథ రాసే అవకాశాన్ని ఏ కథకుడు సాధారణంగా వదులుకోడు. ఒక్కోసారి – లోకోత్తరమైన ఉదాసీనత ఆవహించినప్పుడు, పేరు తెచ్చుకోవడం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేనప్పుడు – అన్ని అవకాశాలను జారవిడుచుకుంటాడు కథకుడు. ఈ సమీక్ష తర్వాత శ్యామ్‌గారు విస్తారమైన తమ అనుభవాలను కథల ద్వారా మన అందరితో పంచుకుంటారని, చిట్టెన్‌రాజు గారు ఎప్పటిలా ప్రకాశకులుగా వ్యవహరించి వాటిని ప్రపంచం ముందు పడవేస్తారని ఆశిస్తూ –

    తమ్మినేని యదుకుల భూషణ్

  96. అహం మిగిల్చేది గురించి Rama Rao గారి అభిప్రాయం:

    04/30/2023 12:51 am

    మీ భావ కవిత “అహం మిగిల్చేది” చాల బాగుంది. అభినందనలు.

  97. నాకు నచ్చిన పద్యం: లాక్షణికులు గుర్తించని అనురాగభేదము గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    04/19/2023 9:21 am

    “అంతేకాదు, ఈ కవితకు కవిగారుంచిన శీర్షిక అనురాగభేదము. ‘కలిగెను భేదమొక్కటిదె’ అన్న ఎత్తుగడ ఏతదనుగుణమైనదే. భేదమంటే ఒక విశేషము.”

    పరిమి గారు:

    ఇక్కడ కవి ఉద్దేశించింది అది కాదు. ‘భేదము’ పదం ఇక్కడ వాడుక చిన్నయ సూరి మిత్రలాభము, మిత్రభేదము లో వలె. అనురాగలాభము. అనురాగభేదము. పద్యం లోని నాయకుడికి ముందు కొంతకాలం లభించిన అనురాగం. తర్వాత చెడిన అనురాగము అని. Paradise lost; Paradise regained titles లాగా. పోగొట్టుకున్న స్వర్గం, తిరిగి లభించిన స్వర్గం లాగా.

    మీ వ్యాసం అర్ధం చేసుకోవటానికి నేను చదువుతున్నవి, ఈ క్రిందివి.
    1. Bhoja’s Sringara Prakasa Raghavan V 1978 by Manish Dutta, (Detailed notice of contents, page 41.)
    2. Bhoja’s Sringara Prakasa, Sheldon Pollock.

    Thanks to you, As I was reading and thinking about your essay, I read about V. Raghavan, and there after I also listened to M.S. Subbulakshmi singing Chandrasekharam Ashraye – a carnatic musical piece written by Raghavan.

    All new and pleasurable to me
    -లైలా.

  98. ఆక్సిజన్ మాస్క్‌ గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    02/12/2023 9:48 am

    మునుపు ‘వంద కుర్చీలు’ కథ కింద ఈ రచయిత అభిప్రాయం చూశారు కదా. లేకుంటే from: Sivakumar Tadikonda on December 15, 2022, at 7:30 pm చూడండి. అది ఇలా మొదలవుతుంది.

    “ఇది కథ కాదు. కల్పన కాదు. చారిత్రికతని నింపుకుని, అద్భుతమైన అక్షరాల పేనికతో చేసిన సంఘర్షణభరిత నిజజీవిత చిత్రణ. భార్యాభర్తలు ఒకరినొకరు ఎంపిక చేసుకోవడంలో కూడా కాల్క్యులేషన్! కథగా మలచింది మాత్రం గుర్తుండిపోయే ముగింపునిచ్చి అనిపిస్తుంది. ఈ జీవితం తన కెలా తెలిసిందో రచయిత కథలోనే చెబుతాడు…”

    ‘వందకుర్చీలు’ కథ వీరికి బాగా అర్ధమైంది. ఓహో జయమోగన్, ఓహోహో భాస్కరన్ అన్నారు. పాత వాస్తవిక ‘వార్తలు’ ఉదహరించారు. (వార్తను కథగా, కవితగా తాము మలుస్తామని కొందరు రచయితలు ఈ పత్రికలో పూర్వం చెప్పియున్నారు.)

    సరే, వీరి ఆ అభిప్రాయం చదివిన వారు, వీరిదే మరో కథ కింద వెలువరించిన అభిప్రాయం ఇస్తున్నాను. పరిశీలించండి. ఆ కథ పేరు ‘ప్రతీక.’ ఈ మాట పత్రిక లోనే చూడవచ్చును.

    “అక్కర్లేని చోట కామాలు విరివిగా దర్శనమిచ్చి చదవడానికి చాలా ఇబ్బందిని కలిగించాయి. ఉదాహరణలు: మొదటి వాక్యంలో కామా అవసరమే లేదు. అలాగే, “నిసి, రెసిడెన్సీ అప్పుడు ఛార్లీ బెన్సన్, బ్రాంక్స్ వెటరన్స్ హాస్పిటల్‌కు వారం వారం, విజిటింగ్ ప్రొఫెసర్‌గా వచ్చి వారి ప్రోబ్లమ్ కేస్ లకు సొల్యూషన్స్ చెప్పేవాడు.” అన్న వాక్యంలో మొదటి మూడు చోట్ల కామాలుండడంలో అర్థంలేదు. అది వుండాల్సిన ఒకేచోట – “వచ్చి” తరువాత కామానే లేదు.”

    ‘ప్రతీక’ -comma, full stop ల గురించి చెప్పే కథ లాగా, మరెవరికైనా అనిపించిందా? ‘వంద కుర్చీలు’ లో ఎలాటి దర్శనాలు వీరికి ఇబ్బంది కలిగించలేదు! రచయిత (జయమోహన్) సొంత పేరుతో కథలో వ్యాస భగవానుడిలా, వచ్చి కూర్చున్నందున కాబోలు! అతడు రాసిందంతా ‘నిజమని’ అనుకోటం! ‘ప్రతీక’ చదివినపుడు అలాటి అనుమానం కూడా రాదు, ఆ కథ ఎందుకో మరి అర్ధమే కాదు.

    ‘అభిప్రాయాలలో రచయితలు వివక్షత చూపటం’ కి ఇది ఒక ‘వాస్తవ’ ఉదాహరణ. Thanks to scientists, కోవిడ్ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్లు తమ అభిప్రాయాలలో ఇలాటి వివక్షతలు చూపవు కదా!

    -Lyla

  99. వాడి కథ గురించి శ్రీరామ్ పుప్పాల గారి అభిప్రాయం:

    02/09/2023 8:49 am

    మీరు కధని నడిపించిన తీరు నాకు చాలా నచ్చింది. పాత్రల వ్యవహారం సరేసరి. కధలో కొంత వైరాగ్యం కనిపించింది. కానీ జీవితం పట్ల మనిషికుండాల్సిన ఆలోచనల ఫ్రెష్ నెస్ ప్రతీ వాక్యంలో నన్ను హత్తుకుంది. బిగి సడల్లేదు. నిర్మాణం చక్కగా ఉంది. మీలో ఉన్న సారాంశ బలం, పరిణితి కధని కత్తి అంచుపై నడిపించాయి. సాహిత్య జీవులపై చేసిన వ్యాఖ్యల నిడివి తగ్గించినా కధకి ఎటువంటి నష్టం జరిగేది కాదు. మీ వాక్యం చాలా బాగుంది. కవిత్వం కంటే కధలో మరింత, మరింత గొప్పగా ఉంది. మీకు నా హృదయ పూర్వక శుభాభినందనలు.

  100. నాకు నచ్చిన పద్యం: అమృతం కురిసిన మైథిలి మనస్సు గురించి ఎరికలపూడి వాసుదేవ రావు గారి అభిప్రాయం:

    02/06/2023 10:20 am

    మరొక పెళ్ళికూతురు: సీత: (ఈమధ్య నా పెద్దన్న నాకు వాట్సాప్‌లో పంపినది యథాతథంగా: పంపినది పంపినట్టుగా)

    మరొక జ్ఞాపకం: ముఖపుస్తక మిత్రురాలు చి.సౌ.శిరీష తంగిరాలగారి సీతను చదవంగానే నాఆత్మీయమిత్రుడు శ్రీ చల్లాసీతారామాంజనేయులు గారు స్ఫురించారు. వారిప్పుడు కీర్తిశేషులు.

    వారొకప్పుడు వారి మేనల్లుడు చదువుతున్న “బారులు తీరి కేల కరవాలములం ధరియించి కూరుచున్నారు… జానకి చూచువారి నోరూరగ…” పద్యాన్ని విని ఎవర్రా రాసింది? అని అడిగారట. మేనల్లుడు సమాధానమిచ్చాడు. చూచువారి నోరూరటానికి సీతాదేవి మిఠాయిపొట్లమా! అన్నారట.నువ్వైతే ఎలా రాస్తావు మామా? అని అల్లుడు అడిగాడట. వీరు మరునాడు అల్లుడిని పిలిచి సీత అంటే ఏమిటో విను:

    పతింవర
    ******

    “మనసులోనున్న వాంఛితమ్మునకు రూప మొదవినట్టుల నా పురామృదుల పుణ్యలతకు ఫలమట్ల ఈ వీర లలిత మూర్తి, తా నవతరించి నన్ను సౌఖ్యాన కెత్తు! 1

    తాత్త్వికులెల్ల మన్నిటల తాండవకుంకుమ రాగ వీరప
    త్నీత్వ మహోగ్రరేఖ గణుతించి వచించిరి తండ్రి “కీమె శౌ
    ర్యత్వ మహత్త్వపూర్ణుడగు రాజసమూర్తికి రాజ్ఞియౌ”నటం-
    చా త్వరపెట్టు వాంఛ హృదయమ్మున నేండ్లు భరించి యుంచితిన్! 2

    భోగము ఆస చేయను;విభుత్వ ప్రభుత్వము కోరుకోను నా-
    యోగము పండెనేని ప్రథనోగ్ర భుజోజ్వల శౌర్యమూర్తి అ-
    భ్యాగతుడౌను గావుత; ప్రభావిత మామక భాగ్యమౌ ధను
    -ర్యాగ మహోత్సవమ్మునకు రాగ నవోదయ మైన వేళకున్! 3

    ఈతని చేత వింటి కొన లెంతగ వంగెనొ!శత్రు వక్ర రే-
    ఖాతి పరాక్రమమ్ములటు,లల్లరి తుమ్మెద లల్లెత్రాటి మ్రో-
    తై తెగి యాడెనే ప్రణయ తాండవ కన్యక వోలె నారి;నా-
    చేతము నందు; కండ్ల నును సిగ్గులు మూయగ వీని చూపులై! 4

    మా జనకుడు నా కొరకు మంగళమే పొనరించినాడునా
    పూజలకైన లక్ష్యంమగు పుణ్యుడటే;యితడాత్మ శౌర్యహే
    లాజయ సూచకోన్నత విలాసం వలాహక నీల మూర్తి;వే
    లాజలు చల్లునట్లు చెలులందరు ఈతనివైపె చూస్తుంటే! 5

    జయలక్ష్మీ మృదుపీఠమైన విరళాశ్మ ప్రౌడ వక్షస్సము-
    ఛ్ఛ్రయదేశంబున మాలకట్టెదను హస్తాబ్జాత యుగ్మాన; హై
    మ యశఃక్షౌమము చుట్టెదన్ పృధు మహాంసస్నిగ్ధతూణీరమౌ
    గ్ధ్యయుతోపాంతమునన్, మనోజ్ విశిఖాకారంబులౌ వ్రేళులన్!6

    శ్రీ సుమదీప్తిమన్మమతలే,తలబ్రాలుగ చల్లెదన్,లతా
    పేశలకుంతలాఢ్యునకు; వేణు మృగాలకు రాగతోయముల్
    పోసెద క్షాత్రధారలుగ,భౄధనురంతర దేశలగ్న దీ
    ర్ఘాసమ నాసికాశుగ విరాడ్యువతీ వికసన్మనోహరున్! 7

    క్షమ హృదయమ్ము,బుద్ధిని వికాసము, చిత్తము సుస్థిరత్వ మం
    గమును శుచిత్వమై,విషయకంటక దూరగమౌ మనస్సుతో,
    విమలయశో2భివర్తను, పవిత్ర చరిత్రు,పతింవరాశిరో2
    గ్రమణి వరించె,నీలమృదులద్యుతిమత్సమభక్త దేహునిన్!!8

    (శ్రీ చల్లా సీతారామాంజనేయులుగారి కావ్యమాల (1968)నుండి. అంతర్వాణి-వారి కలంపేరు)

    ****

    మళ్ళీ నేను: చల్లావారితొ పరిచయం 1973,74లలో ఒక సంక్రాంతికి బెజవాడ సోనొవిజన్ మేడమీద జరిగిన స్వీయకవితా పఠన కార్యక్రమలో నేనూ నా పెద్దన్న శ్రీ సుబ్రహ్మణ్య శర్మా శ్రీ చల్లా మా మా కవితలు చదివిన సందర్భంలో కార్యక్రమం ముగిసిన తర్వాత కలిసిన పలకరింపులతో మొదలై 2004-05ల దాకా నడిచింది. వారు విశ్వనాథకు పరమ ఆత్మీయులు. వారు నాకు రెండు మూడు సార్లు చెప్పిన ఒక వివరం: “ఆంజనేయులూ నా పెళ్ళికి పంచరత్నాలు నువ్వు సంస్కృతంలో రాయి. తెలుగులో నేను రాసుకుంటానులే!” శ్రీ కొంగర జగ్గయ్య – గుంటూరు లో వారి సహాధ్యాయి మిత్రుడు.

    శ్రీ చల్లా నా పెళ్ళికీ మా అబ్బాయి పెళ్ళికీ పంచరత్నాలు రాశారు.

    ఎ వా రా

  101. నాకు నచ్చిన పద్యం: అమృతం కురిసిన మైథిలి మనస్సు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    02/05/2023 4:43 am

    సుకుమారసుందరమైన ఊహ, దానికి తగిన పద్యరచన, దానికి సరితూగే వ్యాఖ్య. సీతాదేవి రూపంలో తిలక్ తానే శ్రీరాముని దర్శించి పరవశించి వ్రాసిన కవిత అనిపిస్తుంది.

    “తిలక్ పద్యరచనావిధానం చూసినప్పుడల్లా నాకు కలిగే ఆలోచన, దీన్ని ఏ మాత్రం గ్రాంథికంగా బిగించినా ప్రబంధకవుల పద్యమైపోతుంది. సడలిస్తే పద్యం కాకుండా పేలవమై వ్యావహారికమైపోతుంది.”

    గొప్ప ఆలోచన!

    నాకు నచ్చిన పద్యం శీర్షిక పరిమి శ్రీరామనాథ్ గారిచేత పునఃప్రారంభం కావడం చాల సంతోషంగా ఉంది.

  102. ఫిబ్రవరి 2023 గురించి JVVSN Murthy గారి అభిప్రాయం:

    02/05/2023 2:30 am

    మంచి రచనలు, అవి కథలు గాని, కవితలు గాని ఇప్పుడూ వస్తున్నాయి. కాని పాఠకులలో చదివే అలవాటు, అభిరుచి తగ్గిపోతున్నాయి. అందువల్ల పాఠకుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. చివరికి రచయితలే పాఠకులుగా మిగిలిపోయే దుస్థితి ఏర్పడింది. ఏ రచనలైనా సమకాలీన సమాజంలోని సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, వీలైనంత పరిష్కారం చూపిస్తే అటువంటి రచనలు కొంత కాలమైనా నిలబడతాయని నా అభిప్రాయం. మన సినిమాలకు కథలు దొరక్క ఎలాగైతే ఒక స్తబ్ధత ఏర్పడిందో, అలాగే మన రచయితలకు సరైన కథా వస్తువులు దొరకటం లేదు. ఒక తరం వెనక్కు వెళితే సమాజంలో అప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు. క్రమంగా తగ్గుతున్నాయి. వరకట్నం, స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం ఇతివృత్తంగా ఎన్నో రచనలు వచ్చేవి. ఇప్పుడు అసలు వైవాహిక వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలా మారుతున్న సమాజంలో సరైన సమస్యలను ఎంచుకుని మంచి కథలుగా మలిచే రచయితలు తక్కువగా ఉన్నారు. ఇక పుస్తక ముద్రణ అనేది వ్యక్తిగతం. రచయితను అనిపించుకోవాలి, నా పేరు ప్రింట్ లో చూసుకోవాలి అనేవాళ్ళు ఆ పుస్తకాలను బంధు మిత్రులకు ఉచితంగా పంచుతున్నారు. కొన్ని పత్రికలు మంచి థీమ్ లను నిర్దేశిస్తూ కథల పోటీలను నిర్వహిస్తున్నాయి. ఇది ముదావహం. ….జయంతి.

  103. నిరీక్షణ గురించి Poduru v s Pardhasaradhi గారి అభిప్రాయం:

    01/04/2023 4:47 am

    పద్మావతిగారి కవితలు సరళమైన బాషలో అపారమైన భావాన్ని సృజించే ప్రజ్ఞాశాలి… ఎందుకో ఈ కవిత నాకు అసంపూర్తిగా అనిపిస్తోంది.

  104. ముగ్గు గురించి Rambabu Kopparthy Indian Bank గారి అభిప్రాయం:

    01/02/2023 10:47 am

    చక్కటి కవిత. నూతన సంవత్సరానికి స్వాగతం

  105. వంద కుర్చీలు 2 గురించి తః తః గారి అభిప్రాయం:

    12/15/2022 4:20 am

    ప్రభాకర్ గారూ, మీరు జాలి పడినా పడకపోయినా వివక్ష ఏ జంతు సమాజాన్నుంచీ పోదన్నది దుర్భరమైన నిజం. మానవ సమాజంలో వివక్ష ‘ఎదురు వివక్ష’కు కారణమౌతున్నది కూడా అంతే నిజం. (వివక్ష గూర్చి శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి మాటలను యూట్యూబ్‍లో వినవచ్చు.)
    రచన సంగతి: చదువరిని ముక్కలు ముక్కలు చేసే రచనలను నేను మెచ్చుకోలేను. ‘లోక ధర్మమును తలపింప జేయుటయే కళాధర్మము కానీ లోకధర్మమే కళా ధర్మము కా(కూడ)ద’న్న పింగళి వారి మాటనూ ‘అగ్ని జల్లిన్నా అమృతం కురిసినా అందం ఆనందం ‘దాని’ పరమావధి’ అన్న తిలక్ కవితా వాక్యాన్నీ నేను ఇష్టపడతాను.

    నమస్కారాలతో –
    తః తః

  106. నువు గురించి Rekha Jyothi గారి అభిప్రాయం:

    12/02/2022 3:08 am

    ఎంత తేలికగా ఉందో కవిత!

  107. ఈ రచన నా సొంతం కాదు! గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    11/25/2022 8:40 pm

    భూషణ్ గారూ: గ్రంథచౌర్యం గురించి సమగ్రమైన, సునిశితమైన చక్కని వ్యాసం వ్రాశారు. అలాగే చౌర్యానికి గురైన మా నాన్నగారి వ్యాసాన్ని ప్రస్తావించి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు 🙏 ఇండియా ప్రయాణం, అనారోగ్యం, ఇతర వత్తిళ్లలో వెంటనే స్పందించలేకపోయాను.

    తః తః గారూ: మీరన్నది నిజం. చెళ్ళపిళ్ళవారు శ్రీశ్రీతో మాట్లాడుతూ “మన కవిత్వానికి లక్షణం కంఠవశమయ్యే రచన” అన్నారు. ఇది అబ్బూరివారి పుస్తకంలో ప్రస్తావించారు. పైన హనుమంతరావుగారు కూడా quote చేశారు.

    ఇదే విషయం గురించి మా నాన్నగారు కవిత్వం నా దృక్పథం (2010లో వ్రాసిన వ్యాసం)లో ప్రస్తావించారు. అది జయంతిలోనో మరో అచ్చు పత్రికలోనో తర్వాత ప్రచురింపబడినా వెబ్ లింకు లేదు. అయినా ఆ సందర్భం గురించి ఆయన వ్రాసిన వ్యాసంలో ఒక పేరాని ఇక్కడ quote చేస్తున్నాను.

    “ఛందోబద్ధంగా పద్యం వ్రాయగలిగితే చాలు దానికి ఏదో ఒక మేరకు readability వస్తుంది. ఏదో ఒక మేరకు కంఠవశం అయ్యే గుణం అది సంతరించుకుంటుంది. అంటే, ప్రాచీన ఛందోరీతుల ఔదార్యం వల్ల, వైశిష్ట్యం వల్ల ఒక handsome subsidy రచయిత పొందవచ్చునన్నమాట. కానీ, వచన కవిత అలా కాదు. వచన కవిత వ్రాయబోయి ఎందుకూ కొరగాని భ్రష్టమైన వచనమే వ్రాయడం చాలా సందర్భాలలో జరుగుతుంది. తిలక్ గారు వచన కవితలపై కల్పించిన మక్కువతో ఎన్నో వచన కవితల్ని, అక్కడక్కడనైనా చదివాను. సత్యమైన విషయమేమిటంటే, ఆకట్టుకొనే కవితల కోసం వెదికినా అవి ఎక్కువగా కనిపించకపోవటం, కంఠవశమయ్యే గుణం వాటికి లేకపోవటం, మనల వదలకుండా వెంబడించే పంక్తుల సమాహారం లేకపోవటం.”కంఠవశమయ్యే గుణం” అని ఈ వ్యాసంలో పదే పదే ప్రస్తావించటం జరుగుతున్నది. ఇది చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి పదబంధం. ఒకసారి శ్రీశ్రీగారు వేంకటశాస్త్రిగారిని (శ్రీశ్రీగారికి శాస్త్రిగారంటే చాలా గౌరవమట) వినయంగా అడిగారట,’కవిత్వానికి ప్రధాన లక్షణమేమిటి’ అని. దానికి వారు’కంఠవశమయ్యే గుణం కవితకు ప్రధాన లక్షణాలలో ఒకటి’అని అభిభాషించారట.“

    ఈ వ్యాసం ప్రతి నాకు అందుబాటులో ఉండటానికి ఒకే ఒక్క కారణం మా నాన్నగారి ప్రతి తెలుగు రచనను నేను టైప్ చేయడం మాత్రమే 😊

  108. ఈ రచన నా సొంతం కాదు! గురించి Kodavalla Hanumantha Rao గారి అభిప్రాయం:

    11/24/2022 9:39 pm

    శ్రీశ్రీ, శాస్త్రిగార్ల సంభాషణ

    అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవనకుతూహలం” నుండి:

    వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయో వృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవినేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు. “కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప… అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.

    ఆనాటి శాస్త్రి గారి నిర్వచనాన్ని శ్రీశ్రీ నాతో జీవితాంతం దాకా ప్రస్తావించేవాడు. ఈనాటి ‘ప్రయోగాత్మక’ కవితలో కంఠవశం కాగల లక్షణం లోపించిందని శ్రీశ్రీకి తెలుసు. అంచేతనే అలాంటి కవిత్వానికి భవిష్యత్తు సంకోచప్రదమనేవాడు. అంతేకాదు, ఇతర భాషల్లోంచి కవిత్వాన్ని అనువందిచటం కూడా తెలుగు సాహిత్యాభ్యుదయానికి ముఖ్యాంశం అని అంటూ “శాస్త్రిగారూ అలా అన్నారే” అనేవాడు.

    — కొడవళ్ళ హనుమంతరావు

  109. ఈ రచన నా సొంతం కాదు! గురించి తః తః గారి అభిప్రాయం:

    11/20/2022 12:42 pm

    శ్రీ భూషణ్:

    కంఠవశమయే గుణం కవిత్వం యొక్క అతిముఖ్యమైన లక్షణాలలో ఒకటి-
    చెళ్ళపిళ్ళ వారన్నట్టు గుర్తు.

    Plagiarism Software Unveils a New Source for 11 of Shakespeare’s Plays
    New York Times Michael Blanding Feb. 7, 2018.

    నమస్కారాలతో
    తః తః

  110. ఒక ఖాళీ ఉదయం గురించి Subramanyam గారి అభిప్రాయం:

    11/20/2022 12:43 am

    విజయ్ గారు మీ కవితలు ఎంతో బాగున్నాయి నిజంగా చాలా అర్థవంతంగా కూడా ఉన్నాయి కంగ్రాట్యులేషన్స్ అండి ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే నేను తూర్పుగోదావరి జిల్లా నుండి పీపుల్స్ గార్డియన్ అనే ఒక వెబ్ డైలీ న్యూస్ పేపర్ ని నడుపుతున్నాను దానిలో మీ కవితలు ప్రచురించాలి అని ఆశిస్తున్నాను దయచేసి మీ మొబైల్ నెంబర్ తెలియజేయగలరు ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను 949 2251150 మరియు 6281679225 పై రెండింటికీ వాట్సాప్ అకౌంట్ కలవు దయచేసి కవితలను ప్రచురించడానికి అనుమతించగలరు

  111. ఈ రచన నా సొంతం కాదు! గురించి వీరభద్రం గారి అభిప్రాయం:

    11/12/2022 4:24 am

    క్షేమేంద్రుడు తన కవికణ్ఠాభరణంలో ఇలా అంటాడట.

    ఛాయోపజీవీ పదకోపజీవీ పాదోపజీవీ సకలోపజీవీ |
    భవేదథ ప్రాప్త కవిత్వజీవీ స్వోన్మేషతో వా భువనోపజీవ్యః ||

    ఛాయోపజీవి, పదకోపజీవి, పాదోపజీవి, సకలోపజీవి, అని కవులు నాలుగు విధములుగా ఉందురు. కొంతకాలము తరువాత లభించిన స్వీయ కవిత్వమునే ఆధారముగా గొనువాడుగా అయి, లేదా స్వీయ ప్రతిభావిశేషముచేత; భువనోపజీవ్యు డగును.

    వివరణ. పూర్వకవుల కవిత్వచ్ఛాయలను స్వీకరించి కవిత్వము చెప్పువాడు ఛాయోపజీవి. పూర్వకవుల శ్లోకములలోని కొన్ని పదములు గ్రహించి కవిత్వము చెప్పువాడు పదకోపజీవి. పాదములను గ్రహించువాడు పాదోపజీవి.పదాలను అర్థచ్ఛాయను కూడ ప్రాచీనకవులనుండి గ్రహించినవాడు సకలోపజీవి. ఇట్లు ప్రయత్నము చేయగా చేయగా కవితాశక్తి లభించినవాడు, లేదా ఛాయోపజీవిత్వాదులు లేకుండగనే స్వప్రతిభావిశేషముచే కవిత్వము చెప్ప గలిగినవాడు భువనోపజీవ్యు డగును. అనగా ప్రపంచములో కవిత్వము చెప్ప దలచినవా రందరును ఈతనిపై ఆధారపడి యుందురు. ఇతరులపై ఆధార పడి జీవించువాడు ఉపజీవి. ఇతరులు జీవించుటకు ఆధారమైనవాడు ఉప జీవ్యుడు.

    ఈ శ్లోక భావాన్నీ వివరణనీ సకలోపజీవిగా నేను యేరుకొచ్చింది పండితలోకచిరంజీవి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల స్రీరామచంద్రుడు గారి పుస్తకం నుంచీ.

  112. ఈ రచన నా సొంతం కాదు! గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:

    11/04/2022 7:20 am

    వేలూరి గారి వ్యాసం 14 ఏళ్ల తర్వాత కూడా తాజాగా ఉంది. కొన్ని వ్యాసాలు అంత త్వరగా పాతబడవు. గ్రంథ చౌర్యం మీద ఇంత సమగ్రంగా ఎవరూ రాయలేరు అనుకుంటాను. 2008 లో నానీల నాన్న ప్రముఖ కవి నక్క గోపీ, నోబెల్ గ్రహీత Octavio Paz ను కాపీ కొడుతూ దొరికిన వైనం “ఔరా! ఏమి ఈ ‘దిగుమతి’? (ఆంధ్రజ్యోతి వివిధ)” అన్న లింకుగా కనిపిస్తుంది. కానీ ఆ లింకు ఇప్పుడు పనిచేయదు. తెలుగు పత్రికలకు కనీస వనరులు కరువు – సాహిత్య విషయాలకు కూడా archives ఉండవు. ఇలాంటప్పుడు ఈమాట లాంటి పత్రికల విలువ తెలిసి వస్తుంది.

    బ్రహ్మానందం గారు: సదరు రచయిత బ్లాగు వివరాలు ఇచ్చి ఉంటే బావుండేది. తల్లకిందులై నానా కష్టాలు పడి త్యాగరాజు మీద ఒకరు చక్కని వ్యాసాలు రాస్తే వాటిని తర్జుమా చేసి తమవిగా చలామణి చేసుకోవడం నేరం.

    తెలుగులో నేను గమనించిన విషయం – ఒక పరభాషాకవిని మనం అనువాదం చేస్తాము, ఆ పరభాషా మనకు రాదు, ఇంగ్లీషు సాయంతోనే బండి నడిపించాలి. అప్పుడు, ఆంగ్ల అనువాదకుని పేరు ఇవ్వాలా వద్దా ? ఉదాహరణకు, శ్రీ శ్రీ అనువాదాలు చూసినా అటువంటి వివరాలు మనకు కనిపించవు. అప్పట్లో సంపాదకులు ఇవన్నీ పట్టించుకునేవారు కాదా ? ఆంగ్ల అనువాదకుడు మూలం చదివి, సదరు కవి కవిత్వాన్ని అంచనా వేసి ఒక లఘు టిప్పణి రాశాడే అనుకుందాం, మనవాళ్ళు దాన్ని తెలుగు చేసి దాని కర్తృత్వాన్ని తమ ఖాతాలో వేసుకుంటారు- మూలం చదివి అందులో లోతులు ముట్టినట్టు పోజు. టన్నులకొద్దీ అనువాదం చేసేవారు తమకు కలిగిన inspiration, అందులో ఇతరుల ప్రమేయం, అనువాదంలో పొందిన సాయం – ఏవీ రాయరు. అందుకే నేను వీరిని స్వయంభువు అన్నది. పుస్తకాలు వేసేవారు పొడి పొడి థాంక్స్ కాకుండా, ఎవరి వల్ల ఏమి పొందామో ఆ వివరాలు పొందుపరిస్తే – పుస్తక ప్రచురణ వెనుక ఎంత భారం ఉందో అందరికీ తెలిసివస్తుంది.

  113. వార్కా బీచ్ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    10/06/2022 3:21 am

    వార్కా బీచ్, గోవా: దక్షిణ గోవా మార్గో నుండి 8 కిలోమీటర్లు మరియు రాష్ట్ర రాజధాని నగరం పనాజి నుండి 40 కిలోమీటర్లు దూరం లోని వార్కా బీచ్ సుందరమైనది, తెల్లటి మెత్తటి ఇసుక తీరాల ఇక్కడ నుండి అద్భుతమైన సూర్యాస్తమయాలను చూడవచ్చు. జనబాహుళ్యాల/పర్యాటకుల రద్దీ అంతగా లేని బీచ్, వార్కా బీచ్.

    కవితా హృదయులైన కవయిత్రి చామర్తి మానస లాంటి వారు వార్కా బీచ్ తీరాన జీవన సాఫల్య క్షణాలను లెక్కపెట్టగలుగుతారు… సాగరతీర సమీపాన కావ్యసుధాగానం చేస్తారు. అలాగే వారోసారి శ్రీశ్రీ, రావిశాస్త్రి, త్రిపుర తండ్రుల విశాఖ బీచ్, యారాడ కొండల దగ్గర కెళ్లి కలం ఝళిపించాలని ఓ చిన్న విన్నపం.

    అందుకు వారికో చిరు కానుక (న్యూటన్ బాబు కొటేషన్):

    “I do not know what I may appear to the world, but to myself I seem to have been only like a boy playing on the seashore, and diverting myself in now and then finding a smoother pebble or a prettier shell than ordinary, whilst the great ocean of truth lay all undiscovered before me.” ~ Sir Isaac Newton, one of he greatest physicist and mathematician who made seminal discoveries in several areas of science.

    సివరాకరిగా ఓ సిన్న కన్ఫెషన్: మాలాంటి బడుగులు 16వ శతాబ్ధపు రోమన్ కాథలిక్ మతబోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భౌతికదేహాన్ని భద్రపరిచిన గోవాలోని అతి పురాతనమైన ‘బసిలికా ఆఫ్ బామ్ జీసస్’ చర్చి (The Basilica of Bom Jesus, a UNESCO Heritage site) కెళ్లి హృదయ మాలిన్యాల క్షాళనకు విఫల ప్రయత్నం చేస్తారు.

  114. మాటల అంచున గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    10/01/2022 5:53 pm

    కాదేదీ కవితకనర్హం అన్న పెద్దాయన మాట మరోసారి ఋజువు చేసారు. అభినందనలు

  115. Vaidehi’s Bliss -A Musical గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    10/01/2022 3:10 pm

    సుందర రామునితోడను
    సుందరి సీతయును వెడలె – సుందర వనికిన్
    సుందరమగు మానసముల
    మందముగ నయోధ్య వీణ – మఱిమఱి మ్రోఁగెన్

    లైలాగారు, మీకవిత బాగు! – మోహన

  116. బాల్కనీ అతిథులు గురించి Poduru v s Pardhasaradhi గారి అభిప్రాయం:

    10/01/2022 6:07 am

    చిన్న పదాలతో చిక్కటి అనుభూతి కలిగించింది ఈ కవిత. చాలా చాలా బాగుంది…

  117. శెలవు రోజున గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    09/19/2022 1:24 pm

    “ఎవరొచ్చినా ఎదురుచూస్తున్న ఆ ఒక్కరూ రారు! అనకు
    అలసిపోకు, విశ్రాంతిగా ఉండు, ఆలోచనలు ఎంత ముంచుతాయో అంత మునుగు.
    తోట బాగు చేసుకో, కవిత్వం రాసుకో, మట్టి పిసికి బొమ్మలు చేసుకో.

    కిటికీ ఆవల పొర్ణమి, కళ్ళలో యమున, వెన్నెల ప్రతిఫలిస్తోంది.
    అదిగో నెమ్మదిగా ఒక నవ్వు ముఖం స్పష్టమవుతోంది”

    అనంత నీరవ నిరీక్షణలకు నిర్మల మందాకినీ వీచికలతో సాంత్వన నిస్తాయి అంబుజోదర దివ్య పాదారవిందాలు.

  118. ఉద్ధరేదాత్మనాత్మానం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    09/14/2022 2:02 pm

    ఈ కథలోని భగవానుడు, ఈ పత్రిక లోనే ప్రచురించబడిన “మేనక” తెలుగు ఆపెరాలో – ప్రదర్శించబడిన సుందరి-నందుడి ఉపనాటికలోని బుద్ధభగవానుడు ఒకరేనా? ఆ కథలో బుద్ధుడు ఎంత అఘాయిత్యం చేశాడో మీరు చదవనే లేదా?

    అక్కడి కథ ప్రకారం – సుందరీ, నందుడు, తింటానికి ఉంటానికి సరిపడా ఉన్న యువదంపతులు. ఒకరంటే ఒకరికి ఇష్టం. హాయిగా ఉంటున్న వాళ్లింటికి, బుద్ధుడు అడుక్కోటానికి వెళ్లి, భిక్ష తీసుకుని పోకుండా, వాళ్ల సంసారం చెడగొట్టి, లిటరల్లీ -నందుడికి చిప్ప చేతికిచ్చాడు బుద్ధుడు. ఆ తర్వాత మళ్లీ వాళ్లకు ఫేవర్ చేస్తున్నట్టు, సుందరి క్కూడా, ‘అర్హత?’ ఇప్పిస్తానంటాడు. తన జన్మ లోనే తనే ఇంత క్రూరపు పని చేసి, ఆ ఇంగితం లేనివాడు, ఇతరులకు, ఇతడు ముందు జన్మలు గురించి ఏం బోధలు చేస్తాడు?

    ఎందుకు నందుని ఊరివాళ్లు బుద్ధుడికి జడుస్తున్నారు? వాళ్ల ఇళ్లూ వాకిళ్లూ ఊడగొట్టుకుని, ఈయన అడుక్కుని కట్టించే వసతులకు పోయి, ఉన్న జుట్టు గొరిగించుకుని, గోచీలు పెట్టుకుని ఇతని సోది వింటూ పడి ఉండాల్సిన పనేమిటి? Makes no sense at all. భగవానుడు ఏం చేశాడయ్యా అంటే -నందుడు, సుందరి ఆస్తి అంతా అప్పనంగా పట్టేశాడు. My God! What a scam! తన రాజ్యం వదిలేసానంటూ, ఇంకో ఇంటర్నేషనల్ సన్యాసిరాజ్యం స్ధాపించాడా?

    ఈ కధలో ఉన్నదీ ఆ భగవానుడేనా? ఈయన లెక్చర్లలో విషయాలకు ఇప్పటికీ లాజికల్ కనెక్షన్ కనపడదు. ఆ సిల్లీ ఉపన్యాసం సోపంతా అయ్యాక, ఉన్నట్టుండి -ఏవో జంతువుల గురించి -వాటిని చంపొచ్చా, మనమే చచ్చిపోతే మంచిదా,- ఆ గోలేంటి? ఆనందుడికి సుతీమతీ లేదు ఈ భగవానుడితో రోడ్లమ్మట తిరగటానికి?

    ఆ రోడ్డు పక్కన ముసలమ్మ చుట్టూ వారిద్దరూ ఆ వెర్రి చేష్టలేంటి? హల్లీసకాల శ్రీశ్రీ కవిత్వంలో ప్రశ్నల కన్నా ఈ కథలో వీరి ప్రవర్తన ఇంకా సిల్లీయర్ గా ఉంది. శ్రీ శ్రీ పద్యం చదివారా? (మా ఒక కమ్యూనిస్ట్ చుట్టం అమెరికా వచ్చినప్పుడు నాకు ముందుగా చదివి వినిపించిన పద్యం ఇది. కమ్యూనిస్టులకు ఎందుకు ఈ పద్యం ఇష్టం?)

    “ఆ అవ్వే మరణిస్తే
    ఆ పాపం ఎవ్వరిదని
    వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది
    ఎముకముక్క కొరుక్కొంటు
    ఏమీ అనలేదు కుక్క
    ఒక ఈగను పడవేసుకు
    తొందరగా తొలగె తొండ” ( విన్నకోట రవిశంకర్ వ్యాసం నుండి తీసుకున్నాను. Thank you. నా పుస్తకాలు కనబడలేదు.)

    గాలిలోకి విసురుతారు వెర్రి ప్రశ్నలు కొందరు కవులు. వారి జాలి హృదయం చూసి ఇతరులు మురిసి మూర్ఛ పోవాలని. ఎముక ముక్క, కుక్క, తొక్క, ఈగ, తొండ. ఏమిటీ సొల్లు అనకుండా, చతుర్మాత్రలు, పంచ మాత్రలు అంటూ కొందరు ఛాందసులు వ్యాసాలూ, కొందరు అరస-విరసులు సభలూ, సన్మానాలూ. ఆ ముసలామెకి తిండి తెచ్చిపెట్టరు. ఆమెనెందుకు తన షెల్టరు లోకి తీసుకువెళ్లడు బుద్ధుడు? ఈ జన్మలో ఒక్కరోజు అన్నం పెట్టించలేని వాడు, ముందు జన్మలు లేకుండా చేస్తాడంట? బుద్ధుడు తన కొంప కూలదోసుకొని, ఆ తర్వాత సిస్టమేటిక్గా, చాలామంది సంసారాలు చెడగొట్టినట్టుంది ఈ కథలు చదువుతుంటే. “ఆలికి అన్నం పెట్టలేనివాడు ఊరికి ఉపకారంట” అని తన కమ్యూనిస్ట్ మార్టియర్ మొగుడి గురించి ఒక స్త్రీ చెప్పిన తెలుగు సామెత నాకు తట్టకుండా ఎలా ఉంటుంది!

    రోడ్డు మీద కారులో వెళ్తుంటే, మెళ్లో కార్డ్ బోర్డ్ మీద “Broke. No money to buy food” అని రోడ్డు మధ్యలో డివైడర్ మీద బక్కచిక్కిపోయి, మనిషి కనిపిస్తుంటే, లేన్లు మారి, కారు విండో దించి, చేతికందిన కేష్ ఇస్తారెందరో. నేనిస్తాను. అతడు అప్పటికి అడుగుతున్నది అదే. ఆ రోజుకు బతికితే, మరోరోజుకి అవసరమైతే మరి కొందరిస్తారు. బతుకుతాడు. పాపం, పుణ్యం, బ్లేమ్ గేమ్, లాయర్ సవాళ్లలో ఏం లాభం లేదు. Darwinism is Darwinism. కాక్ రోచ్ గా పుట్టినా, మనిషిగా పుట్టినా ఆ ప్రాణికి ఒకటే జన్మ. మరో జన్మ లేదు. Dust to dust, ashes to ashes. The game is over.

    -Lyla

  119. తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి గురించి జాన్ గారి అభిప్రాయం:

    09/12/2022 10:24 am

    దిశానిర్దేశం. క్రొత్త పాత కవులకు మంచి అంశం. కవిత కావ్యం, వచన కవిత్వం యొక్క అవసరం, ప్రాధాన్యత వంటి చాలా ఉపయుక్తమైన మౌలిక విషయాలు తెలియజేశారు. ఎలా వ్రాయాలి, ఎలా వ్రాయకూడదు అనే విషయాన్ని కూలంకషంగా చర్చించారు. ధన్యవాదాలు నమస్సులు.

  120. నేనే! గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    09/07/2022 10:35 pm

    అనేకానేక వలయాలకావల విషాద జీరల మీ కవిత చదువుతున్న పాఠకుల్లో నేనొకడిని తల్లీ!

  121. Trash గురించి థింసా గారి అభిప్రాయం:

    08/17/2022 2:14 pm

    తెలుగు కవిత్వంలో ఇంతవరకూ నేను చదవని అత్భుతమైన వాక్యం “రాత్రి అశ్రువు నుండి రాలిపడిన ఉదయం” it speaks volumes. కవి చాలా అలవోకగా రాసినట్లనిపిస్తుంది కానీ ఈవెన్ Keats కూడా రాయని, రాయలేని కవితా వాక్యం. కవిత మొత్తం గురించి వివరించాలంటే చాలానే ఉంది. ఇప్పటికీ ఒక్క వాక్యం చాలును. పొయెం మంచి selection. ఈ మాటకీ కవి అనురాధకీ మనసాభినందనలు.

    — థింసా, హైదరాబాద్.

  122. Trash గురించి Vijay bhaskar గారి అభిప్రాయం:

    08/03/2022 8:45 am

    చాలా బావుందండీ, ఎప్పటిలానే. మరిన్ని కవితలు మీరు ఈమాట ద్వారా పంచుకోవాలని కోరుకుంటూ 🙏🙏

  123. అభిప్రాయ వేదిక గురించి ఎం వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం:

    08/01/2022 8:03 am

    గురువిందగింజ నాయకులే అభిమానుల ఇలవేల్పులవుతున్నప్పుడు వంటి అద్భుత పదాలతో ప్రస్తుత సమాజానికి దర్పణం ఈ కవిత. రచయిత మిత్రులు శ్రీ అనిశెట్టి శ్రీధర్‍గారికి అభినందనలు.

  124. తెలుగు కవిత్వంలో దళితవాదం గురించి Upender Ou గారి అభిప్రాయం:

    07/19/2022 9:52 am

    “ఒళ్ళు కడుక్కుందాం రండి” కవితలో చిన్ని రాసిన మాటలు
    “రెల్లు పొదలో పడ్డ వీర్యం నుండి పుట్టిందెవరు?
    ఎవడో మాయగాడిచ్చిన కుండనుండి మొలకెత్తిందెవరు?
    గుర్రం రతినుండి ఊడిపడ్డదెవరు?
    నాపుట్టుక అసహ్యమైనప్పుడు
    పరమ అసహ్యమైన పుట్టుకనుండి
    కళ్ళు తెరిచిన దేవుళ్ళను కొలుస్తున్న
    మీపుట్టుకనే నేను ఇప్పుడు సవాల్‌ చేస్తున్నాను.” రచయిత గురించి కావాలి #చిన్ని

  125. నిత్యప్రళయము గురించి కవితా ప్రసాద్ గారి అభిప్రాయం:

    06/14/2022 2:31 am

    ‘ముడుచు, అసహాయత’లలో చదువుకోటానికి వీలుగా ఉంటుందని తరువాతి పాదంలో ఉండాల్సిన అక్షరాన్ని ముందు పాదంలో ఉంచటం సంప్రదాయం కాదు. పద్య పఠితలకు అలాంటి ఇబ్బంది ఉంటుందనుకోను. పద్యాలు బాగున్నాయి. భావమున్నూ.👌

  126. పాత నెలవంక గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    06/08/2022 11:33 am

    Following ten-year-old writing of mine appears to be done from an international airport, for the present pleasure of ‘eemaata’ writers and readers:

    “I should have quietly watched T.V. in the airport. Instead, I got into a conversation with an Arab girl who is sitting at an empty bar and is reading an English novel. She would not be sitting there at the bar if the bar is operational, I suppose. I have seen Muslim women working in the book shops, running small snack stations in airports, but I don’t think I saw them selling liquor so far.

    The girl is very sweet, very kind. She recited some poetry for me. She got so excited and turned so red, that in her black hood, encasing her face she looked like a palash flower. She gave me some tips how to go about learning Arabic. I doubt whether I will ever get to it, but being still under spell of that sweet girl, I want to.

    She told me how in the olden days in middle east, wars were fought peacefully, using only poetry as weapons. Whoever told better verse, that tribe has won and the other simply withdrew with grace. No one called foul or said the elections are rigged, like the recent times.

    Convert

    నాకు మతమిప్పించు సాయీ
    నే సాయిబ్బుల్లో కలిసిపోతాను.
    నాకింత అరబిక్ కవిత్వం పోయించవోయీ
    ఖుదా కీ కసమ్
    నే క్లబ్బుల కెళ్లటమ్
    మానేసి పోర్ట్, షెర్రీ తాగనని ఒట్టేసి
    బుర్ఖా వేసుకుని ఖురాన్ పఠిస్తూ
    కార్టియే పెన్ పాళీలు మార్చి, కలీగ్రఫీ రాస్తూ
    సదా సలామత్ గా ఉంటాను.

    నన్ను తురకల్లో కలిపెయ్యి ముల్లా
    నే రోజూ మూడు సార్లు నమాజ్ చేస్తాను.
    అల్లా, అల్లా అనుకుంటూ
    కఠోర ఉపోషమ్ పట్టి
    పగళ్లు ఖర్జూరాలు, బాదం, పిస్తా పప్పూ
    రాత్రిళ్లు రుమాల్ రోఠీ, అనాబ్షాహీ ద్రాక్ష మాత్రమే తింటూ
    ఏ ముసీబత్ లేకుండా పైకి వెళ్లిపోతాను.”

    -Lyla.

  127. అర్థంకాని కవిత్వం గురించి CSRAMBABU గారి అభిప్రాయం:

    06/05/2022 5:33 am

    కవిత్వాన్ని ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో చెప్పిన వ్యాసం!

  128. ఎమ్. ఎస్. రామారావు లలితగీతాలు గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    05/28/2022 3:45 pm

    Lyla, Thanks for your comment! That prompts me to be more rigorous and motivates me to post more such songs. You are absolutely right about బాపిరాజు’s signature words. I have to admit that I did not pay attention to them in identifying the writer. I did follow up MSR’s reference to బాపిరాజు before he sang లేపాక్షి బసవయ్య లేచిరావయ్య though and quickly checked my 2 volume set అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం (1995) but missed it (in vol. 2).

    ఇక విషయానికొస్తే ఈ పాట “లోకము” అన్న శీర్షికతో “శశికళ (పాటల సంపుటి)” – 1954 అన్న పుస్తకంలో వుంది. అలాగే సమగ్ర కవితా సంకలనం, 2వ భాగంలో కూడా. But if you look at the original text:
    https://archive.org/details/in.ernet.dli.2015.371070/page/19/mode/2up you notice that MSR made significant changes to the text.

    MSR was very good at singing those “romantic” poems. One of my favourite renditions of MSR is this set of 3 verses: విరహవీధి from రాయప్రోలు సుబ్బారావు in జడ కుచ్చులు (1925)
    https://archive.org/details/in.ernet.dli.2015.372034/page/n43/mode/2up

    Sreenivas

  129. ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం గురించి తః తః గారి అభిప్రాయం:

    05/03/2022 11:05 am

    మూర్తీ: నిషిగంధ ‘జాజుల జావళి’ని – మీరు- కవితా సౌదర్యాన్ని దర్శించి పరిచయం చేశారు. మీకు అభినందనలు. రెండు మాటలు చెప్పక తప్పదు మూర్తీ: 1. తిలక్ “నా మాటలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు” అనలేదు, “నా మాటలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అన్నాడు. ‘అందమైన’ అని పెద్ద తప్పు చేశాడని నా అభిప్రాయం. 2. నిశ్శబ్దాన్ని ‘వినగలిగిన’ కవయిత్రి ‘నిశ్శబ్ద శబ్దం’ అని ఎందుకు అనవలసి వచ్చిందో తెలియలేదు. నమస్కారాలతో- తః తః

  130. ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం గురించి నిషిగంధ గారి అభిప్రాయం:

    05/03/2022 8:56 am

    హృదయపూర్వక ధన్యవాదాలు, మూర్తిగారు!!

    ఆమె దగ్గర అక్షరాలు అదృశ్యమైనా మిగిలే రహస్య భాష ఒకటి ఉంది.” ఈ వాక్యం దగ్గర చాలా సేపు ఆగిపోయాను… కవిత్వం ఆత్మని స్పృశించడం అంటే ఏమిటో అర్ధం అయింది. డే టూ డే బాధ్యతల మధ్య సఫొకేట్ అవుతున్న నా భాషకి కూడా కాస్త ఊపిరి దొరికింది.

    ఈ కాస్తన్ని కృతజ్ఞతలతో మీకు నమస్సులు!

  131. పద్యాలు ఎదురుచూస్తూ ఉంటాయి గురించి Mani Sarma గారి అభిప్రాయం:

    05/02/2022 3:39 am

    శ్రీ సాంబమూర్తి గారు అన్నది నిజం. కవితలోకెళ్ళినకొద్దీ కొరడా వేడెక్కి వాతలు పెట్టేదే. గానీ ఈ కవిఖడ్గమృగాలకి అబ్బబ్బే…

  132. పద్యాలు ఎదురుచూస్తూ ఉంటాయి గురించి సాంబమూర్తి లండ గారి అభిప్రాయం:

    05/01/2022 4:39 am

    అసలు ఆరంభమే కొరడాతో చెళ్ళున కొట్టినట్టుంది. బాధ్యతాయుతమైన కవిత.. అభినందనలు సర్.

  133. చీకటి కలలు గురించి దివాకర్ గారి అభిప్రాయం:

    04/02/2022 9:55 pm

    కవిత మొదలు, దాని నిడివి, నడత, ముగించిన విధానము ప్రత్యేకముగా వున్నది.

  134. అంతా రొటీనే గురించి రత్నశ్రీ గారి అభిప్రాయం:

    03/02/2022 9:35 pm

    గడగడా చదివేసి, సత్యమిదే కదా అని నిట్టూర్చి, వాపోతున్న మనసును ఊరడించి, ఇదో మీ కవితకి కరతాళ ప్రశంసలు అందిస్తున్నా 👏👏👏👏 సూపర్ 👌👌

  135. అంతా రొటీనే గురించి మాధవ్ యినుగంటి గారి అభిప్రాయం:

    03/02/2022 11:31 am

    ‘దేవరకొండ బాలగంగాధరతిలక్, 2020 తర్వాత కవిత వ్రాస్తే ఆ కవిత ఎలా ఉంటుంది?’ అన్న పోటీలకు పంపిస్తే మొదటి బహుమతి వస్తుంది.

  136. అంతా రొటీనే గురించి NageswaraRao గారి అభిప్రాయం:

    03/01/2022 10:58 am

    కథలలో పదును కవితలలోకి అనువదిస్తున్నారు శ్రీధర్ గారు. పచ్చి నిజాలు మాట్లాడారు. బుజాలు తడుముకున్నవారిలో నేనూ ఉన్నానోచ్!!

  137. రెండు అక్షరసామ్య యతులు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    02/27/2022 3:02 pm

    ఈ వ్యాసంలోని అతి చిన్న ప్రపోజల్ గాని, ఇతర పెద్ద వ్యాకరణాలు రాసిన వారి సూత్రాలు గాని చూస్తే, అవన్నీ కవి చక్కని కవిత్వాన్ని చెప్పాలన్న కోరికతోనే అనిపిస్తున్నది. “కవ్యనుమతమున” -భాషలో మార్పులు జరుగుతాయి. సూత్రాలు బిగుతు చేసినా, సడలించినా గాని కవి కోసమే. అతడి పదకోశాగారం, మ్యూజికాలిటీ పెంచటానికే. మీకు నచ్చిన సూత్రాలు ఉంచుకోండి, నచ్చకపోతే తీసెయ్యండి, అని మధ్య మధ్య, వీరందరూ చెపుతున్నారు.
    ఇన్ని వీలుసాలులు చెపుతున్నప్పుడు, నాకు పద్యం రాయాలనే అనిపించింది. ఈ రచయితవే, ఈ పత్రిక లోని -శత కంద సౌరభము, కంద పద్య గాథ వ్యాసాల్లో, అక్కడే మరొకసారి రూల్స్ చదువుకుని వచ్చి రాస్తున్నాను. Isn’t that convenient!

    స్థితిమంతురాలికి, స్వర
    శ్రుతి శ్రావ్యత సొరగు షోకు శ్రితశార్వరికిన్
    అతిలాలస యగు సుదతికి
    యతితో పొసగదుగ కృష్ణ మోహన రాయా!

    చిలకల గుంపులు వచ్చి, బాల్కనీ పక్కనే ఉన్న చెట్టుమీద వాలినప్పుడు, పిట్టలు మాయమై, చెట్టు అకస్మాత్తుగా ఎర్రని బెర్రీలు కాసిన సుందర దృశ్యం నేను చూసినందున, చిలకల కేరులు విన్నందున ఆ పద్యం.

    Don’t miss those bird sounds in the poem. -Lyla

  138. వెతలే వెతుకులాట గురించి బుచికి గారి అభిప్రాయం:

    02/19/2022 2:49 pm

    ఇలాంటి రచనల వల్ల ఏమి ఉపయోగం? కవితల పేరుతో ఈమాటలో వస్తున్న రచనలు కొన్ని పేలవంగా మరికొన్ని అర్థరహితంగా ఉంటున్నాయి. సంపాదకులు ఎలా ప్రచురిస్తున్నారు. సంపాదకుల అభిరుచి పైనే సందేహం వస్తుంది. కొన్నిసార్లు పేరున్న రచయితలు వ్రాసినవి కూడా ఏమంత బాగాలేవు.

    పై రచనలో ఉన్న వాక్యాలకు సంబంధం ఏమి ఉందో రచయిత లేదా సంపాదకులు వివరించగలరు.

  139. తెలుగు వాళ్ళకిది వర్తించదు! గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    02/14/2022 11:31 am

    ఇంతకు ముందు వాసు, ఈ సంచికలో శివకుమార్ శర్మ, అనిల్, – కవిత్వం, పుస్తక ప్రచురణలు, పుస్తకావిష్కరణల గురించి చెప్పిన విషయాలు చదివాను. నేనిప్పుడు రాసేది ఒక సాహిత్య పాఠకురాలిగా. పుస్తకాలు కొన్నేళ్లుగా విరివిగా కొనుక్కుంటున్న వ్యక్తిగా.

    కవికి తన కవిత్వం మాత్రమే పుస్తకంగా తనే ప్రచురించుకోటం, కవిని, ఎవరూ పరిచయం చెయ్యకపోటం, మంచి పనే. శ్రోతకు కవికి మధ్య ఎడం తగ్గుతుంది. పరిచయం చేసేవారి నీడలు, కవి మీద పడవు. అలాగే వారి ధగధగలు, నా దృష్టిని పరిచయం చేస్తున్నవారి వైపుకు మళ్లించవు. కొన్నిసార్లు పాఠకురాలిని నేను -మీ కవిత్వం చదవటం మానేసి, విమర్శకుడితో వెళ్లిపోయే అవకాశం కవులు మీరే కల్పించటం ఎందుకు?

    ఇంకోటి; పరిచయాలు లేపోతే కవిత్వం పుస్తకాలు పలచగా ఉంటాయి. ఔట్ డోర్ బుక్ షాప్ లో అప్పటికప్పుడు, సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని, గార్డెన్లో, ఉడ్స్ లో, కఫేలలో కవిత్వం చదువుకోటం ఎంతో బాగుంటుంది. అలా నేనెంతో కవిత్వం చదువుకున్నాను.

    కవికి తన కవిత్వం ఇతరులు చదివితే, ఆత్మసంతృప్తి కలుగుతుందా? ఏమో! మీరు చెపుతున్నారు మీరు రాయటంలో అది ఒక పెద్ద ఫాక్టర్ అని. నేను ఆలోచిస్తున్నాను, కవిత్వం చదివే ఒక వ్యక్తిగా. నేను పొయట్రీ చదివేప్పుడు, అలాటి బరువు భారంతో నేనైతే చదవలేను. మీ ఆత్మ సంతృప్తితో నాకేం పని? కవిత్వం లోని విషయంతోనే గాని, కవిమీద రీడర్ కి ఏం ఆసక్తి? ఐతే, చదువరికి రచన తనంత తానే తెలుపుతుంటుంది రాసిందెవరో.

    కవికి – చదువుతున్నారా లేదా, తన కవిత్వం వారికి నచ్చిందా, ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో చెప్పమనటం, ఇతరుల అభిప్రాయాలకోసం దేవిళ్లాడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఏం చేసుకుంటారు ఆ అభిప్రాయాన్ని? రాసిన పుస్తకాలు మార్కెట్లో అమ్ముడు పోవటమే, పాఠకులు చెప్పే నిజమైన అభిప్రాయం. నేను కొనుక్కున్న పుస్తకానికి ధర, పుస్తకాల షాపులో నేను కట్టివేసాను. అది బతికున్న/ చచ్చిన రచయిత నిర్ణయించిన ధరే. ఇంక ఆ తర్వాత రచయిత నానుండి వేరే వేరే ఆశించటం సరా? నా అభిప్రాయానికి మూల్యం పాఠకురాలిని నేను నిర్ణయిస్తే, రచయితకు కట్టసాధ్యమా? నేను పుస్తకాలు కొనుక్కుని, కొన్ని దశాబ్దాలుగా సంతృప్తిగా చదువుకుంటూనే ఉన్నాను. ఫీడ్ బేక్ అడగనందువలనేమో, మరణించిన రచయితల రచనల మీద నాకు ఎక్కువ అభిమానం.

    సమీక్షలు నేను చదవను. ఒకవేళ false pretenses/for their own reasons తో నాతో చదివిస్తే, ఇక ఆ అసలు పుస్తకం చదివే ఆసక్తి నాకుండదు. అలాగే ఘోస్ట్ రైటర్ల రైటింగ్స్ కూడా. తన అనుభవాలు వేరే వాడితో ఎవరైనా ఎలా చెప్పిస్తారు? అది ఉత్త బోగస్ రైటింగ్. అలా రాయల్టీ లాగా ఫీలయ్యే ఒబామాలూ, హేరీలూ రాసేవి, నేను చదవను. అలాగే, ఇతరులకు మౌత్పీస్ లాగా మార్ఫ్ చెందినవారి రచనలు, తెలిసాక నేను చదవను. ఇవన్నీ అసలు పంట కళ్లచూడకుండా పరిగె ఏరుకు తింటున్నట్టు అనిపిస్తుంది. I don’t want that fluff.

    -Lyla

  140. రెండు అక్షరసామ్య యతులు గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    02/01/2022 9:33 am

    ఎంతో చక్కని ప్రతిపాదనలు. పద్యకవిత్వం రాస్తున్న వారు అంది పుచ్చుకుంటే – ప్రయోగ ప్రమాణమేర్పడుతుంది. ముందు ముందు ప్రామాణిక ఛందః గ్రంథాల పునర్ముద్రణలో – ఈ వ్యాసాన్ని చేర్చితే ఉపయోగంగా ఉంటుంది. కందప్ప చెట్టి అకాలమరణం తెలుగు శాసన పరిశోధనకు తీరని లోటు. ” తెలుగు భాషా చరిత్ర ” అన్న ప్రామాణిక గ్రంథాన్ని – సంపాదకులు భద్రిరాజు కృష్ణమూర్తి , ఆయనకే అంకితమిచ్చారు. ‘లక్షణ శిరోమణి ‘(పొత్తపి వెంకటరమణ కవి ప్రణీతము) గ్రంథాన్ని పరిష్కరించిన రావూరి దొరసాని శర్మ గారి పాండిత్యము అందరికీ తెలిసినదే. “Historical Grammar of Telugu ” హరప్పా ముద్రలను అర్థం చేసుకోవడానికి ఉపకరించిన ఉద్గ్రంథం. శాస్త్రీయ ధోరణిలో శాసనాధారములు చూపి , చక్కని ఉదాహరణలు ఇచ్చి – విషయాన్ని తేటతెల్లం చేసి
    చక్కని చర్చకు తెరతీసినందుకు మోహనరావు గారికి నమోవాకములు.

  141. కేతన ఆంధ్ర భాషాభూషణము-8 గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    01/30/2022 5:38 pm

    ప్రొఫెసర్ అయినవోలు ఉషాదేవి రచించిన “కేతన ఆంధ్ర భాషాభూషణము” వ్యాస పరంపరలో చివరిదైన ఈ భాగంలో ఒకచోట – ‘మల్లె పూవు’ ను, కావ్యం లో ఐతే ఎలా వాడాలో, ఏక వచన బహువచనాలలో, సమాసరూపంలో ఎలా వాడాలో ఉంది. ఇప్పుడు నే రాసిన ఈ కింది పద్యాన్ని కేతనదండి, చిన్నయసూరి వ్యాకరణ సూత్రాలు ఒప్పుకుంటాయో లేదో!

    రాయా! నెలరాయ యంచు దరహాసాలై, మరందాల జా
    లై, యామిని లోన పిల్చెదవు; ఆ రేరాజు రాజాలునా?
    ఓ యోజనగంధి! కాముని శిఖీ! మా కోసమై పూయవే
    మాయావిని! పూయి పున్నమిగ, శృఙ్గారీప్రియా! మల్లియా!

    ఈ పద్యంలో యతి లేదు. ఎందుకు లేదంటే అంత sophistication నాకు లేక, చేతగాక. నేను పదేళ్లకొక పద్యం రాసేసరికి, ఈ లోపల చేతయిన వారెన్నో అందమైనవి రాస్తారు. నేను వాటిని చదివి ఆనందిస్తాను.

    పద్యంలోని – ‘యోజనగంధి’ ‘శృఙ్గారీప్రియా’ అన్న ప్రయోగాల గురించి ఛందస్సు, భాషాపరిశోధకుల అభిప్రాయం ఏమిటి? మీకెవరికైనా చెప్పాలనుంటే చెప్పండి.

    నేనొక సుందరనగరంలో ఉన్నందున, ఇక్కడ మస్తుగా పూదోటలున్నందున, అక్కడ సుస్తు లేకుండా తిరుగుతున్నందున, నేనీ పద్యం రాస్తం. పాడుకోటం. ఈ పత్రికలో ప్రచురితమవుతున్న చాలా కవితలు నాకు కవిత్వమే కావు. Barnes & Noble లో erotic poems by E.E. Cummings తెచ్చుకుని చదువుకుంటున్నాను. ప్రాణం హాయిగా ఉంది.

    Have fun folks. -Lyla

  142. చేరాతో ముఖాముఖి గురించి సతీశ్ గారి అభిప్రాయం:

    01/17/2022 6:57 am

    సౌమ్యగారూ,

    క్షమించాలి. ఇన్నాళ్ళకు చూశాను. ‘A Reference Grammar of Modern Telugu’ పేరుతో అచ్చైంది. ఇది తెలుగువాక్యానికి కొంత చేర్పుతో ఆంగ్లంలో 2017 జూన్ లో ఎమెస్కో ప్రచురణగా వచ్చింది.

    ఇకపోతే, చేకూరి రామారావు రచనలన్నిటినీ (కవిత్వం, వ్యాసాలు (ఆంగ్లం కూడా), ఉత్తరాలూ…) కలిపి “మనసు ఫౌండేషన్” ప్రచురుస్తోంది. ఈ జూలై 1 న ఆవిష్కరణ.

    చేరా 1969లో రాసిన “A Grammatical Sketch of Telugu” కూడా ఆచార్య ఎ. ఉషాదేవిగారి వద్ద దొరికింది.

  143. డిసెంబర్ 2021 గురించి Vasu గారి అభిప్రాయం:

    01/02/2022 11:07 am

    ఈమాట సంపాదకులకు నమస్కారాలు:

    ఇక్కడ పుస్తకాలు అచ్చు వేసుకొనేవారిని మీరు మీ సంపాదకీయంలో కాస్త అపహాస్యం చేశారు. నిజమే, ఇప్పుడు తెలుగునాట ఊకదంపుడు ఉపన్యాసాలు ఎక్కువయ్యాయి. అయితే ఇవి నిన్నటి తరంలోనూ ఉన్నాయి. సాహిత్యం – మరీ ముఖ్యంగా కవిత్వం – ఎవడూ అమ్ముకోగలనని వేసుకోడు. మన సంస్కృతిలో భక్తిసాహిత్యాన్ని కవిత్వం (ఆధునిక కవిత్వం) ఎప్పుడూ మించలేదు. కవులంతా పుస్తకాలు అచ్చు వేసి పంచిపెట్టుకునేవారే. ఇది దాదాపు నిష్కామకర్మ. ఇది passionతో చేసేది, ప్రతిఫలాపేక్ష కోసం కాదు. నాకు పాశ్చాత్యదేశాల్లోని పుస్తకావిష్కరణోత్సవాలు ఎలా జరుగుతాయో చిన్న అవగాహన ఉంది. నిజమే. అదే సరైనదేమో! అయినా మన సంస్కృతి మనది. (దుః)శాలువాలు కప్పడం, వక్తలు ప్రసంగించడం, వగైరా. ఒక మాట నిజం. తెలుగునాట కవిత్వపఠనం డబ్బుపెట్టి కొనుక్కునేంతటి విలువైనది కాదు (Reading poetry is not an experience worth paying for!) ఎవడూ కొనడు. ఇచ్చినా చదివేవారు తక్కువ. చదివినా స్పందించేవారు ఇంకా తక్కువ. ఇది అందరికీ తెలిసినదే. మీరు ఐదువందలకాపీలు అన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య నూటికో రెండొందలకో తగ్గింది కూడా. ఇంకా మీరన్నారు ఇలా:

    “రచన నిజంగా గొప్పగా ఉంటే పాఠకుడే అడిగి మరీ కొనుక్కుంటాడు అన్న విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, తన రచన మీద గౌరవం ఉన్న ఏ రచయితా తన పుస్తకాన్ని ఉబ్బరగా ఎవరికీ ఇవ్వడు. ఇవ్వకూడదు.”

    నేను మీతో విభేదిస్తున్నాను. కాస్త ఇటు చూడండి. ఈ అపహాస్యం బాగోలేదు. మీరు ఏ దంతప్రాకారంలో (ivory tower) ఉండి చెబుతున్నారో గానీ, మీతో ఏకీభవించేవారెవరూ తెలుగునాట ఉండరు. ఇది నా స్వానుభవం. నేను మీరన్నట్టు నా కవితా సంపుటి (“కాసేపు”) అచ్చువేసుకొని పంచిపెట్టుకున్నవాడినే.

    -వాసు-

    [వాసుగారూ, ఉంటే గింటే కొండొకచో ఆవేశము, ఆక్రోశమూ ఉన్నాయేమో కాని ఎవరినీ అపహాస్యం చేసే ఉద్దేశ్యం మాకు ఏ కోశానా లేదండీ. మేము అందరిలా నేల మీద ఉండే, నాల్గువైపులా చూసి గమనించే చెప్తున్నాం, చెప్పదలచుకుంది ఏదైనా – సం.]

  144. నా స్నేహితులు గురించి విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ గారి అభిప్రాయం:

    01/02/2022 6:45 am

    నమస్కారమండి శ్రీధర్ గారు. మీ విశ్రాంత జీవితానికి శుభారంభం పలుకుతూ మరలా మీ కవితా వ్యాసంగానికి శుభారంభం పలుకుతూ మరలినందుకు ఆనందంగా ఉంది. కవిత చక్కగా ఉన్నది. కొనసాగించండి.

  145. నా స్నేహితులు గురించి విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ గారి అభిప్రాయం:

    01/02/2022 6:37 am

    నమస్కారమండి శ్రీధర్ గారు. విశ్రాంత జీవితానికి శుభారంభం పలుకుతూ మరలా మీ కవితా వ్యాసంగానికి మరలినందుకు చాలా సంతోషంగా ఉంది. అభినందనలు.
    చక్కగా ఉన్నది.

  146. నా స్నేహితులు గురించి Ganga Rao గారి అభిప్రాయం:

    01/01/2022 3:09 am

    కవిత బాగుంది.

  147. The song cycle of Shyam గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    12/23/2021 1:15 pm

    నమస్కారం తః!

    కలివె విశ్వనాథం గారి ఉపన్యాసాల లింక్ గురించి ఇంతకు ముందు చెప్పినందుకు సంతోషం. చదివాను శక్తి కొద్దీ. కాని ఇంగ్లిష్ అక్షరాలు కనపడక, ప్రతి బాగోనందున, ఆయన విద్వత్తు నాకు ఆనందించటానికి వీలవదు. It’s my loss. I really wish I can read his lectures on English poetry.

    దాశరథి తెలుగు కవిత్వం ఆంధ్రభారతిలో చదువుతున్నాను. మీరిచ్చిన మీ కవిత నాకు బాగుంది. యాదాలాపంగా రచించినట్టుండే కవితలు నాకిష్టం. ఐనా మీరు బాగా చదువుకునుండేసరికి మధ్య మధ్య మీ విజ్ఞానం ఆడేపాడే పాటకు అడ్డం పడుతూ ఉంటుంది. I suppose you can’t help it. I like it.

    This guy Frank O’ Ohara is a well-educated guy. I saw his poetry books in MOMA two years back, as an exhibit. A sample:

    O god it is wonderful
    To get out of bed
    And drink too much coffee
    And smoke too many cigarettes
    And love you so much.

    అలాటి కొందరి పొయట్రీ, కొందరి భారతీయుల, ఇతర దేశస్థుల ఆర్ట్, నేను చూస్తానికి వెళ్లినప్పుడూ, నేను రాసేవి ఇలా ఉంటయ్యి. మెమొరీ లోంచి కొన్ని పంక్తులు:

    జడినానలో మేను తడిసింది తెలియదు
    శిశిరం ఆకులు నాపై రాల్చింది తెలియదు
    గడగడ చలిలో నేను వణికింది తెలియదు

    నా దేశం వాసివనీ
    నీవేదో చేసావని
    ఆ బొమ్మ చూడాలనీ
    ఆ రాత చదవాలనీ

    నీ ఊహలు నాకు మెరిసి
    నా ఊహలు నీకు తెలిసి
    ఆ ఊహల ఉయ్యాల జమిలిగ ఊగాలనీ

    నీకై, నీకై, నీకై, వచ్చి ఉన్నాకదా! ప్రియా!

    -లైలా

    Happy Holidays to All!

  148. ఏనుగు డాక్టర్ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    12/11/2021 11:21 am

    “ఏనుగు డాక్టర్” కధ తమిళ కధారచయిత ( వామపక్ష, సామ్యవాద భావజాలాల ) జయమోహన్ గారిని, అద్బుతంగా తెలుగులోకి అనుసృజన చేసిన అవినేని భాస్కర్ గారిని అభినందించిన పెద్దలు నౌడూరి మూర్తి గారికి … ప్రకృతి ఆలపించే స్వేఛ్ఛాగానం గురించి ( అమెరికన్ కవయిత్రి మాయా ఏంజెలో మరణించిన సందర్భం లో రాసిన వ్యాసం లో వివరించిన ) యీ “ఏనుగు డాక్టర్” సందర్భం లోనూ స్పందిందించిన పెద్దలు నౌడూరి మూర్తి గారికి నెనర్లు.

    ” పంజరం లోని పిట్ట భయద నిస్వనంతో ఆలపిస్తుంది…
    తనకి తెలియనివీ, అయినా ఆకాంక్షించే కలలగురించి.
    ఆ గీతం దూరతీరాలనున్న కొండలలో ప్రతిధ్వనిస్తుంది,
    ఎందుకంటే, ఆ పంజరపు పిట్ట ఆలపించేది స్వేఛ్ఛాగానం”.

    ~ సమకాలీన అమెరికను కవయిత్రి మాయా ఏంజెలో కవిత I know Why the Bird in the Cage Sings కి నౌడూరి మూర్తి గారి అనువాదం

  149. ఒక కవిత ఏమి చేయలేదు గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    10/21/2021 2:51 pm

    “….అయితే, జూలై-ఆగస్ట్ 2021 పొయట్రీ పత్రికలో ఆలియా కాటన్‌ (Aliyah Cotton) రాసిన కవిత (What a Poem Cannot Do) ప్రచురించబడింది. ఈ కవిత డాట్రీ కవితకన్నా శక్తివంతమైనదని, సమయోచితమైనదనీ నా అభిప్రాయం.

    నేనే పొయట్రీ పత్రికకి అతిథి సంపాదకుడినయివుంటే, ఈ రెండు కవితలూ ఒకే సంచికలో ప్రచురించేవాడిని. అంతేకాదు. ప్రచురణకి ముందుగా రెండు కవితలనీ ప్రముఖ విమర్శకులకి పంపించి, తులనాత్మకంగా పరిశీలించి వ్యాఖ్యలు రాయమని కోరేవాడిని. జూలై-ఆగస్ట్ 2021 సంచిక పూర్తిగా ఈ రెండు కవితలకే కేటాయించేవాడిని. మొదటి కవిత ఆంధ్రజ్యోతిలో అచ్చు కాకపోతే, రెంటినీ ఒకే వారం వెయ్యమని బ్రతిమాలుకునేవాణ్ణేమో! అది ఎలానూ కుదరదు కాబట్టి ఇప్పుడు ఈమాటలో రెండో కవిత ఈ ముందుమాటలతో వేయమని అడిగాను. – వేవే.”

    Poetry (పొయట్రీ పత్రిక,) ఆవిర్భావం, ఘనత, నిర్వాహకం, గురించి వ్యాసంలో చదివాను. అక్కడి వరకూ బాగానే తెలుస్తూ వచ్చింది. ఆ తర్వాత, వ్యాస రచయిత వేలూరి, ఏం జరిగిందో తెలియదు, వారు ఆకస్మికంగా -A rebel without a cause- ఐపోయినట్టనిపించింది. నాకు వివరం అడగాలనిపించింది.

    అసలు మొదటికి, ఏ రచయిత/కవి గాని “ఉరితీత” మీద పద్యాలు రాయటం సమయోచితమెలానో, నాకు తెలియలేదు. Timely? Why is the subject of these poems timely? Are we in Clint Eastwood – ‘For a few dollars more’ movie times? ఆ ఉరిపద్యాలను వేలూరి తెలుగులో పనిగట్టుకుని అనువదించటానికి కారణమేమిటో తెలియలేదు. ఆంధ్రాలో, ఆంధ్రజ్యోతిలో ప్రచురించటమెందుకో తెలియలేదు. సమయోచితమంటే? ఎలా సమయోచితం? How is this poem relevant to Telugu people? Any others?

    మొదటి పద్యం కన్నా రెండోది శక్తివంతమైనదంటే, ఏమిటి అర్థం? ఏమిటా శక్తి? ఎలాటి శక్తి? ఎలా ఆ పద్యానికి శక్తి సంక్రమించింది?ఎలా ఆ నిర్ణయానికి వచ్చారు? వేలూరి ఎందుకిలా భావిస్తున్నారో వివరించి చెప్పాలి. నాకు తెలుసుకోవాలని ఉంది.

    పద్యాలు పాటికి పది మాట్లు చదువుకుంటే తప్ప, అనువాదం, తులనాత్మక విమర్శ సాధ్యం కాదు కదా? ఎందుకు గ్రాఫిక్ వయొలెన్స్ ఉన్న కవితలు చదవటం, అనువదించటం, వాటిని ప్రజలతో చదివించటం? ఏ ప్రయోజనం ఆశించి? చెప్పరూ?

    తనే గాని ‘పొయట్రీ పత్రిక’ అతిథి సంపాదకుడై ఉంటే, తనకు నచ్చిన రెండు పద్యాల కోసం, మిగతా పద్యాల పబ్లికేషన్ ఆపేసి, ఈ రెండు పద్యాలే ప్రచురిస్తానంటం ఇంకా అఘాయిత్యంగా అనిపించింది. హాస్యమాడుతున్నారా? నిజమా? పద్యం ప్రచురించక ముందే విమర్శలకు కూడా ఆహ్వానం! పాఠకులు ఎవరూ ఇక ‘ఉరితీతలు’ గురించి తప్ప ఆ సంచికలో ఇంకేం చదువుకోటానికి వీల్లేదు. అది అతిథి సంపాదకుడి దొరపెత్తనం. ప్రజల వినోదం, వికాసం, విజ్ఞానం అంతా అతిథి సంపాదకుడి చేతిలో ఉంచుకోవాలనుకోవటం, నిజంగానే?

    ఈ పత్రిక చదువుతూ, ఇతర పుస్తకాలు చదువుతూ, నేను కవిత్వం గురించి నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఎంచుకున్న పుస్తకం “How to read poetry like a professor” by Thomas C. Foster. Harper Collins Publishers. ప్రతి ఛాప్టరులో, ఒక్కో కవిత్వవిషయానికి ఒక్కో పద్యం, పద్యభాగం తీసుకుని, ఎంతో సౌమ్యతతో, కొంత చెణుకులతో, వివరిస్తున్నాడీ రచయిత.

    వేలూరి స్వయంగా కొన్ని ఏళ్లపాటు ‘ఈమాట’ పత్రికకు ప్రధాన సంపాదకులన్న విషయం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో తెలుసు. వీరికి విస్తారంగా ప్రపంచ విషయాలు తెలుసు. విస్తారంగా ప్రపంచ కవులను చదువుతారు. అందుకే నా ప్రశ్నలు. పై పుస్తకం లోని విషయాలపై నాకు ప్రశ్నలుంటే కూడా, వేలూరికి, పత్రిక లోని కవి/విమర్శకులకు మళ్లీ రాస్తాను.

    Thanks. – Lyla

  150. ఊహల ఊట 5 గురించి ఈశ్వర్ పంపాన గారి అభిప్రాయం:

    10/13/2021 12:29 am

    తులసిగారు రాసిన “ఊహల ఊట” చదివినప్పుడు ఆమె చిరుప్రాయం నుంచీ “ఉడుం పట్టుల తులసి”గానే కనిపిస్తారు. ఆమె ఆలోచనా అంగళ్లు ప్రశ్నల వైపే పరిగెత్తాయి. “ప్రశ్న మీద ప్రశ్నని ఊహిస్తూ, ప్రశ్నల గాలాంతో బుర్ర నూతిని శోధిస్తూ, జవాబులు కొక్కేనికి తగిలేవరకు ఆలోచనలకు పదునుపెట్టారు.

    “ప్రశ్న-జవాబులు” “పొగబండి పరిగెత్తే పట్టాలని” జ్ఞాన నిధిని చేరాలంటే రెండూ అవసరమేనని వివరించారు.”గోడ గుర్రం” నచ్చింది. ఊహల తరంగాలలో విహరిస్తూ పసి మనస్సు ఆడుకునే ఈ ఆట బొమ్మకి “కాళ్ళూ లేవు-కళ్లెం లేదు” అందుకే ఈ “గోడ గుర్రం” బాగా నచ్చింది.

    “ఊహల ఊటతో
    వికసించిన భాషల తోటలో
    కవితా కుసుమాలేరుతూ
    కనిపించిన ఆ చిరు నేస్తం”
    పరిచయమై పలకరిస్తుంటే
    ఊహల ఊట ఊరక మానదు.

  151. మేము – మా భోజనపుబల్లలు గురించి సాంబమూర్తి లండ గారి అభిప్రాయం:

    10/07/2021 2:27 am

    జీవితపు ఒక సున్నిత అనుభవాన్ని కవిత్వం చేయడం బాగుంది. ప్రాణమున్న మనం కూడా అవసరానికి అనుగుణంగా మారిపోతే బాగుండును… 👌

  152. ఒక కవిత ఏమి చేయలేదు గురించి రామారావు కన్నెగంటి గారి అభిప్రాయం:

    10/06/2021 12:52 pm

    చాలా బాగా వచ్చింది. మూలం, అనువాదం రెండూను. ఒక్క చోట, “ఇది ఆమె రక్తం వేడిని అనుభవించదు” అన్నది లయ బద్ధంగా లేదు. ఇది ఆమె రక్తం వేడిని అనుభవించలేదు అంటే సరిపోతుందేమో, మిగతా పద్యంతో చూస్తే.

    మీరన్నట్లు, అంతకు ముందటి కవితకంటే, ఇదే బాగా ఉంది.

    పోయెట్రీ మ్యాగజిన్ చరిత్ర తెలిపినందుకు ధన్యవాదాలు. రూత్ లిలీ గురించి గుర్తు ఉంది కానీ, ఆ గిఫ్ట్ ఏంచేసారో తెలియదు ఇప్పటిదాకా.

  153. అక్టోబర్ 2021 గురించి purnima గారి అభిప్రాయం:

    10/01/2021 1:31 pm

    Firstly, the editorial notes in recent times have been at a different level. Appreciate the rage and passion that is coming out so strongly in these notes.

    నేను కక్కలేకా మింగలేకా సతమవుతున్న పాయింట్ అదే: ప్రస్తుతం రాసేవాళ్ళ మీద ఎవరికీ ధ్యాస లేదు. ధ్యాస ఉన్నవాళ్ళు తమ దోస్తులు, ఫంకాలు. అలా లేనివారు ఇంకా ఆక్టివ్ గా రాస్తుండగానే ఎవరికీ గుర్తు రారు. అసలు గత ఏడాదిగా ఫేస్బుక్ లో కోవిడ్ కారణాన అన్ని ఈవెంట్స్ ఆన్లైన్ అవ్వడం, ఆ ఈవెంట్స్ లో సాహిత్య జనాలు మాట్లాడేది వింటుంటే విరక్తి వస్తుంది. ఇహ వాటిల్లో “సమకాలీన” అని టైటిల్ లో పేరు ఉంటే అంతే సంగతులు! పూర్తిగా భజన. నాకు అర్థమవుతున్నంత వరకూ ప్రస్తుతం రాస్తున్నవారి గురించి ఎవరికీ పట్టడం లేదు. కూర్చుని చదివే ఓపిక తోటి రచయితలకి, విమర్శకులకే లేదు. వాళ్ళకి నచ్చిన ఒకరిద్దరు రచయితలెవరో ఉంటారు. వాళ్ళ గురించే తిప్పి తిప్పి మాట్లాడుతుంటారు. కొత్తగా తెలుగు సాహిత్యానికి పరిచయమవుతున్న వారు ఆ ఒక్కళ్ళిద్దరే చదవదగ్గ వారని నిశ్చయించుకుంటారు… అదో లూప్.

    శ్రీశ్రీని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ పుస్తకం మార్కెట్టులో ఉన్నంత సేపే కవి గుర్తొస్తాడు. ఏదో, చలాన్ని మాత్రమే కొంచెం గట్టిగా, అప్రయత్నంగా తలుచుకుంటుంటారు అనిపిస్తుంది నాకు.

    రామారావు గారి పల్ప్, మీడియోకోర్, సీరియస్ లిటరేచర్ గురించి కూడా మనం కొంచెం విస్తారంగా మాట్లాడుకోవాల్సి ఉంది. Westలో ఉన్న terms and patterns ఇక్కడ కాపీ-పేస్ట్ చేయలేము.

    ఒక వైపు, మనం చుట్టు తిప్పి తిప్పి ఈమాట, సారంగ – ఇలా ఒక నాలుగైదు పత్రికల గురించే మాట్లాడుకుంటున్నాం అనిపిస్తుంది. pratilipi.com లాంటి సైట్లలో ఒక్కోళ్ళు నాలుగైదు నవలలు రాసేసినవారున్నారు, మనమిక్కడ తెలుగులో నవల్లే రావడం లేదు సరిగ్గా అంటున్నాం. వారికి వ్యూస్ లక్షల్లోనూ, అవార్డులు వేలలోనూ వస్తున్నాయని వినికిడి, ఇక్కడ మనం పాఠకులే లేరనుకుంటున్నాం. మనం ఎంత elitists గా ఫీల్ అయిపోయినా ప్రతిలిపిలో వచ్చేది కూడా తెలుగు సాహిత్యమే. ఇదే రామారావుగారి పాయింట్ అనుకుంటాను.

    అయినా కూడా నేను ఇక్కడ సోషల్ మీడియా భాష గురించి, సాహిత్యం గురించి అన్న మాటలతో ఏకీభవిస్తున్నాను. అన్ని రకాల సాహిత్యాలూ ఉండవలసిందే. ఒకదాని కోసం మరోటి పణంగా పెట్టనవసరం లేదు. అయితే నా వాల్ మీద కనిపించే తెలుగు/ఇండియన్ ఇంగ్లీష్ సాహిత్యకారుల పోస్టులు కంపేర్ చేస్తూ చెప్తున్నాను: మన వాళ్ళు, ది సో కాల్డ్ elitist సాహిత్యకారులు కూడా సాహిత్యానికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. “నేను చెప్పే మాట ఎంత అవసరమైంది. అది ఎక్కువ మందికి చేరేలా, ఎక్కువ కాలం అందుబాటులో ఉంచేలాంటి platforms ఏవి?” అనే ఆలోచన లేకుండా కేవలం తమ వాల్స్ మీద వచ్చే ఇమ్మీడియట్ రెస్పాన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. మన వాల్స్ మీద రాసుకునేవి కొన్ని ఉంటాయి, పత్రికలకి వెళ్ళాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ జడ్జ్మెంట్ ఉండాలి కదా! అవును, ఫేస్బుక్ ఆల్గోరిథమ్ బయట లింక్స్ ఇచ్చిన పోస్టులకి ప్రాధాన్యత ఇవ్వదు. అందుకని కథో, వ్యాసమో అంతా పోస్టులో డంప్ చేస్తే ఎట్లా?

    కథలో, కవితలో చదవమని సతాయించడం మామూలే తెలుగులో, కానీ రెండు వేల పదాల కథలని ముక్కలు ముక్కలుగా చేసి వాట్సాప్ లో ఫార్వార్డ్ చేస్తుంటారు. కవితలు పంపేటప్పుడు కనీసం బేసిక్ ఫార్మాటింగ్ కూడా లేకుండా వచనం ఉన్నట్టు వస్తాయి మెసేజెస్. అదే, కాగితం మీద రాసిన కథనో, కవితనో లుంగచుట్టి ఎవరి మొహానికైనా వేసి కొడతారా చదవమని? ఎంత సేపని టెక్నాలజీని నిందిస్తాం? కొత్త కొత్త ఆప్స్ వస్తూనే ఉంటాయి… మన పని మీద మనకి గౌరవం ఉండక్కర్లేదా? ఇవ్వన్నీ immediate consumption కోసం వెంపర్లాటలే.

    Sorry state of affairs. I’ll end my rant here.

  154. బండిసున్నా గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    09/18/2021 6:14 am

    సున్నితమైన భావంతో కవిత చాల చక్కగా ఉంది.

  155. టి. ఎస్. ఎలియట్ కవితాశిల్పం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    09/02/2021 2:34 pm

    Enjoyed the essay.
    The following poem of mine composed 10 or 12 years back, explains itself.

    Eliot and Bacon

    సుతి లేని ఎలియట్ కి
    మతి లేని పెళ్ళాం
    శివ శివా! శివ శివా!
    అతలాకుతలం అతని ప్రపంచం.
    ఇంటిలోని పోరు ఇంతింత కానపుడు
    హరి హరీ! హరి హరీ ! ఇంకేదిరా దారీ!
    హార్వర్డులో చదువు, ఆక్స్ ఫోర్డులో చదువు, కాని
    పిచ్చి పెళ్ళామున్న, కచ్చి కవితలె పుట్టు
    కవితలో రట్టు గద అతివపై అతి కసి.
    కాగితంపై వక్ర విషాదమే కురిసింది
    బ్రతుకు ఇవ్వని సుఖము
    సాహితీ బహుమతులలో మెరిసింది!
    అతని కన్న ఘనుడు అతని అడారి అభిమాని
    ఏథియిస్టు, హోమో, ఫ్రాన్సిస్ బేకన్
    ఒకరి కళ వేస్ట్ లేండ్, మరొకరి కళ వాస్ట్ మోర్గ్
    బేకన్ కేన్వాసు మీదంతా కార్కాసులే గదా
    ఆ కేజ్ లో మనుషులా, మరి మాంసపు ముద్దలా!!
    ఎంత జంతువు, ఎంత బందీ, ఎంత బాధ ఇతని మనిషి
    ఎంత న్యూనత, ఎంత హేళన, ఎంత శూన్యత ఇతని మనిషి
    అందుకేనా అతని కామి జార్జ్ డయర్,
    ఆ ఆర్టిస్ట్ అసహ్యాన్నీ,అసహనాన్నీ అనుభవించీ
    అనుభవించీ, తనను తానే చంపుకుందీ?
    టేట్ బ్రిటన్ లో ఈ కాళకళ విలయనృత్యం
    చూసి నే నివ్వెర పోతే, కాలు కదలక నిలిచిపోతే
    ప్రళయ వేగంతో పరుగులెత్తే స్ప్రింటర్ల మార్గంలోంచి,
    ఇతర ప్రేక్షకులు నన్ను పక్కకు లాగారు.
    నాకేం తెలుసు, టేట్ లో ఇప్పుడు
    ఆర్టే కాక రన్నింగు కూడా ఎక్సిబిట్ చెయ్యొచ్చని!:-)
    గాడ్! ఆ స్ప్రింటర్లు -ఆ వేగపు చలనపు మాస్,
    నా స్తంభించిన బాడీని కొడితే
    నే ఫట్ ఫట్ పేలిపోయి, నా మాంసం, నా రక్తం, నా ఎముకల
    స్ప్లింటర్లు పక్కన గేలరీ తెల్ల గోడలకు ప్లాస్టరైతే,
    నేనే ఫ్రాన్సిస్ బేకన్ పాస్తుమస్ మాస్టర్ పీసును.
    నే మ్యూసియం గోడ మీంచి – స్వీనీ స్వీటు గొంతులో
    “Birth and copulation and death
    That’s all the facts when you come to brass tacks”
    అని ఎప్పటికీ పాడుతూ ఉండే పని.
    అంతేనా, అంతేనా, మళ్ళీ
    ” Birth and copulation, and death
    I have been born, and once is enough.
    You don’t remember, but I remember,
    Once is enough ”
    జననం, సంగమం, ఖననం
    ఒకసారి అయ్యింది చాలు
    నీకు గుర్తులేదూ! నాకు గుర్తుంది!
    ఒకసారి అయ్యింది చాలు:-)
    ఈ మరుభూమిలో మరుజన్మ వద్దు
    మహదేవా! శివా! శివా! అని
    గోడమీద బేకన్ బొమ్మగా, ఎలియట్ పొయెట్రీగా
    అతుక్కుపోయి గోల గోల చేసే పని.

    -Lyla

  156. జెరర్డ్ మేన్లీ హాప్కిన్స్ గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    07/26/2021 1:54 pm

    నేనింతకు ముందు Gerald Manley Hopkins కవిత్వం చదవలేదు. సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారు, ప్రత్యేకించి పరిచయం చేసిన హాప్కిన్స్ పద్యాలు చక్కగా బోధపడి ఆయన ఇచ్చిన తెలుగు తర్జుమాలు అందంగా ఉండి ఆనందింపచేసాయి. ఇక్కడి పరిచయం రసవత్తరంగా ఉండినందున నెట్ లో హాప్కిన్స్ వి వీలైనన్ని కవితలు చదివాను. పొయెట్రీ లోని భావం, ప్రాసొడీ చిత్ర విచిత్రాలు, మళ్లీ మళ్లీ చదవగా కొంత మెరుగ్గా తెలుస్తున్నవి.
    తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ పొయట్రీ -ఇంగ్లిష్ లోనే, తెలుగుసేత కన్నా బాగా అర్థం అవుతుందేమో. తెలుగు రాని తెలుగు వాళ్లున్నారు కాని, ఇంగ్లిష్ రాని తెలుగు వాళ్లిప్పుడున్నారా? సంస్కృతం, అరవం, కన్నడం ఇలా ఇతర భాషలు రాని తెలుగు వారున్నారు కాని, ఇంగ్లిష్ రాని తెలుగు వారున్నారా? మరొకటి. రచయిత ఇంగ్లిష్ పొయట్రీని విప్పి చెపుతారు, కాని సంస్కృత వాక్యాలను అర్థం చెప్పకుండా వదిలేస్తారు. అదేం పని! ఎందుకని! సంస్కృతం కన్నా, ఇంగ్లిష్ తెలిసిన వారే పాఠకులలో ఎక్కువమంది కాదా? ఇంత నేర్పరి రచయిత, విప్పి చెప్పటమే తన రచన ముఖ్యోద్దేశమైనప్పుడు సగం సగం చెప్పి వదిలెయ్యటం సరికాదు. ఐనా ఏక కాలంలో కొంత తెలుగు భాషను, కొంత ఇంగ్లిష్, వెనకటి కవుల, ఫిలాసఫర్ల పరిచయాలు ఏ రకంగా తెలుసుకున్నా ఆనంద దాయకమే. ఈ పత్రికలో ఇచ్చిన, సూరపరాజు గారి రచనలన్నీ చదువుతున్నాను. Thanks.

    ఈ Hopkins కవి కవితలు, ఇక ముందైనా ట్యూటరింగ్ లేకుండా నాకు అర్థంకావనుకుంటాను. నాకు క్రిస్టియానిటీతో కొంత పరిచయం ఉన్నా, కవి కాలం నాటి ఇతరుల కవిత్వంతో కొంత పరిచయం ఉన్నా, ఈ జెస్యూట్ కవిని గ్రహించుకోటానికి ఇంకా చాలాసార్లు చదివితే తప్పించి నాకది సాధ్యపడదు.
    ఉదాహరణకు The Wreck of Deutschland పద్యం. ఆ పొడుగు కవితలో ఉన్న 35 సానెట్స్ బిబ్లికల్ భావాలు, లిరికల్ బ్యూటీ అర్థం కాటానికి ప్రత్యేకించి poetry class తీసుకోవలసిందే. ఈ కవితపై సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారి ప్రచురించబడిన పుస్తకంలో గాని పూర్తి వివరణ ఉంటే వారి పుస్తకం, మరో ఇతరులు ఇంగ్లిష్ లో రాసిన మరో పుస్తకం తెప్పించుకుని చదవాలి.
    ఈ ‘wreck’ పద్యం పైకి stanza After stanza చదువుతుంటే అందులోని మ్యూజిక్ ఆనందపరుస్తున్నది. హాప్కిన్స్, ఒక పద్యపాదంలో మెలడీ, మరో పాదంలో కౌంటర్ పాయింట్ రాసాడంటే, నాకు మురిపెం. ఈ పొడుగు పద్యం ఒక అందమైన తయారీ. ఒక శిల్పకారితనం. ఒక విషాద సంఘటనను, ఒక ప్రీస్ట్ లిఖించటంలో ఇంత పనితనమా? అని నాకు అచ్చెరపాటు.

    (మాటలో మాట! కొద్ది రోజుల క్రితం ఈ పత్రికలో వేటూరి సినిమా పాటల గురించిన ప్రసక్తి, పాఠకులు తెచ్చినందున ఆ వ్యాసం మళ్లీ చదివాను. నేనిప్పుడు హాప్కిన్స్ సానెట్స్, వేటూరి పాటలు కొన్ని పక్కపక్కనే చదవొచ్చు. ఇద్దరి శబ్ద ప్రయోగాలు, కొత్త మాటల తయారీ విధానాలు గమనించవచ్చును. That excites me.)

    The Wreck of Deutschland చదువుతుంటే, నాకు పూర్వపు కొందరి ఆర్టిస్ట్ ల, (J.W. Turner లాటి) shipwreck పెయింటింగ్స్ చూడాలనిపించింది. చూసాను. క్రితంలో నేను రాసిన ఈ కిందున్న ఒక పొయెమ్ నా మనసులో మెదిలింది. ఒక స్త్రీ నలుగురి దగ్గరి బంధువుల ఆకస్మికమరణానికి sea drowning తో, ship కు she తో, death కు sea తో, ఇందులో అన్వయం.

    All of a Sudden

    Three brethren have fallen
    And wriggled helplessly in Sea.
    The death wave is so massive
    It swept them all away
    The first mate didn’t even
    Know he is dying.

    She sees her ship keel
    She is not made of steel.
    She will wail and reel,
    She has no hope to heal.

    There is no mainland in sight
    There is no island to maroon
    A life spent in to and fro freight
    She now awaits her own swoon.

    The Sea waves rise and fall
    Every seaman knows its roar
    Every creature knows its fury
    Every day begging for small mercies
    With fear in hearts, they live and die.

    -లైలా

  157. హృదయాల ఊసులు గురించి ప్రకాశరావు గారి అభిప్రాయం:

    06/02/2021 2:05 am

    The following is not a criticism, just my “loud thinking”: కవిత, వాడిన పదజాలం బాగుంది. Independent of that, no useful purpose shall be served in memorizing the sweet past. మన ”చిత్తశుద్ధి” మీద మనకి నమ్మకం ఉండి ధ్యేయాన్ననుసరించి, కావలసిన “ఆత్మబలం” తో ముందుకు సాగగలిగితే ఫలితం లభించే ఆస్కారం ఉండనోపు.

  158. సంక్షోభం-శోకం-సాహిత్యం గురించి విశీ గారి అభిప్రాయం:

    06/01/2021 1:10 pm

    కవితలు చదివాక ఏదో ఊపిరాడనితనం నన్ను చుట్టుముట్టింది..

  159. సంక్షోభం-శోకం-సాహిత్యం గురించి మధు చిత్తర్వు గారి అభిప్రాయం:

    06/01/2021 7:44 am

    Poignant poetry. మనసుని ఘనీభవింపజేసే ప్రతీకలు. గంగ విచారానికి సంకేతం అయినప్పుడు, చక్రవర్తికి లేని ముఖమల్ బట్టలు చిన్న పిల్ల చూసి చెప్పేదాకా కనబడనప్పుడు, వూపిరాడని శవాలు భూమికి తిరిగి రావడానికి భయపడినప్పుడు… రైళ్ళన్నీ వెళ్లిపోయి ఖాళీగా మిగిలిన స్టేషన్… ఈ భయాలు డిస్గస్టింగ్ పిపీయీ కిట్లన్నీ తీసేసి నది పక్కన కేబిన్ పక్కన పచ్చగడ్డిలో ఇవన్నీ మరిచిపోయి నిన్ను బిగ్గరగా పిలవాలనే చిన్న కోరిక నెరవేరుతుందా…

    కొంచెంసేపు అన్నీ మీరు రాసిన కవితలేమో అనుకున్నాను. మరుక్షణం అర్థం అయ్యింది ఇది అనేక కవితాత్మల ఏకైక ఘోష అని. కవిత్వం అవసరం. ఇలాంటి poignant కవిత్వం మన సామూహిక వేదనను కన్నీటి చుక్కలుగా బహిర్గతంచేసి కొంచెం విచిత్రమైన ఓదార్పుని ఇస్తుంది. ఇచ్చింది. థ్యాంక్స్.

  160. ఎవరైనా అడిగితే… గురించి తః తః గారి అభిప్రాయం:

    05/31/2021 9:42 am

    “చూడు మామా శిబి చక్రవర్తి తొడ కోసి ఇచ్చాడు.”
    “మెడ కోసి ఇవ్వ లేక పోయాడా?”
    (విజయా వారి షావు కారు)

    చాలా బావుంది మీ కవిత ఇంద్ర ప్రసాద్ గారూ.
    తః తః

  161. అడవి పుస్తకం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    05/13/2021 8:58 pm

    డా. లైలా యెర్నేని గారు, నమస్కారములు.

    ‘అడవి పుస్తకం’ గురించి క్రిందపొందుపరిచిన సోమ భూపాల్ గారి వ్యాఖ్యానం దయచేసి చూడండోసారి.

    ఫేస్బుక్లో జయతి లోహితాక్షన్ గారి పోస్ట్‌లు; వారు తీసిన అడవి, అడవి బిడ్డల అరుదైన ఫొటోలు చూడండి. దాసరి అమరేంద్ర గారు, కాకినాడ అక్కయ్య డా. వాడ్రేవు వీరలక్ష్మి, వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఇంకా ఎందరెందరికో మల్లే తను మీకూ మరింత దగ్గరిగా పరిచయమవుతారు. మీ అభిమానానానికి పాత్రులవుతారు.

    అడవి మాట పక్కన పెట్టి జయతికి తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాల పట్ల ఉన్న ఉత్తమ అభిరుచిని చూడండి. మీరు కనెక్ట్ అవుతారు.
    ________________________________________

    అనంత చీకట్లో ఒక్కటే పాక, దాని ముందు చలిమంట, ఆ మంట ముందు మేము ముగ్గురం
    ( జయతి, లోహితాక్షన్, వైటీ.)

    ఎక్కడో పుస్తకం మధ్యలో వస్తుంది ఈ మాట.నేను మెల్లగా కూరుకుపోతూ ఉన్నాను ఆ భావనలో.యజ్ఞం కాక మరేమిటి అది.యజ్ఞమే.అన్వేషనా యజ్ఞం.కాసేపు పుస్తకం కనపడలేదు నాకు.చీకటి,ముందు మంట.. అనంతమైన ఆకాశం…చేతికందే పాలపుంత.ఆమె ఇది కవిత్వంగా రాయలేదు.ఆ గాఢమైన అడవిలో కవిత్వంలా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు.

    అడవి నుండి అడవికి మొదలై అడవి పుస్తకమైపోయిన ఇద్దరు మనుషులు, ఒక కుక్క-వైటీ. పుస్తకం చదివాక మీతో పంచుకోకుండా ఉండలేని కొన్ని విషయాలు ఇక్కడ ఉంచుతున్నాను.

    ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నందున పుస్తకం మా ఊరు చేరింది. చేతికందడం ఆలస్యమైంది. ఎదురుచుస్తూ ఉన్నాను. వీలుచేసుకుని నేనే వెళ్లి పుస్తకం తెచ్చుకుని ఇక నిన్న ఉదయం తెరిచాను. నేను ఏదీ ఉహించుకోలేదు ఈ పుస్తకం గురించి. ఎందుకంటే ఇది ఏ ప్రముఖ రచయితో రాసిన కథో, కవితో, ఏ నవలో సీరియలో కాదిది.

    ఈ పుస్తకం నిండైన ఒక అన్వేషి యదార్థ జీవన పథ అనుభవాల మాల.మనుషుల ఇరుకుతనం మధ్య, వాడిపోయిన మానవత్వం మధ్య ఇమడలేని ఒక సున్నిత పసి హృదయం పాడిన తన హృదయాంతరాల తపన. సత్యం కోసం అర్రులుచాస్తూ కొండల్లోకి, చిక్కటి అడవుల్లోకి, నదుల్లోకి, అనేక పూల వనాల్లోకి నిశ్చలంగా నడుస్తూ వెళ్లిన ఒక సాధకురాలు చెప్పిన అత్యంత పురాతన మార్మిక రహస్యం ఈ పుస్తకం.

    “ఎడారిని చూడటమంటే ప్రియతముని జాడ తెలియడం” అని తన హృదయాంతరాల్లోంచి నాకు ఆ యోగిని గంభీరమైన స్వరం వినపడగానే నా చుట్టూ. నాలో ఒక నిశ్చలత ఆవరించింది. మరుక్షణమే ఎదో అలజడి కూడా.

    ఏవీ వద్దు అనుకుని వెళ్లిపోయారంట అడవిలోకి… అనుకుని కాదు. అనుకుంటూ ఉంటే వెళ్లలేం అనుకుని… ఇక అనుకోకుండా వెళ్లిపోయారు. లోకమంటే అసహ్యమూ కాదు. జీవితమంటే నిర్వేదం అసలు కానే కాదు.ఏదీ కాదు. ఏదీ కానప్పుడు మరెందుకు అక్కడున్నారు అంటే “ఇక్కడెందుకు ఉండకూడదు?” అని ప్రశ్నించే తత్వం.

    మాలా ఇక్కడ మనుషుల మధ్య ఎందుకు లేరు అంటే “మీరు కూడా మాలాగా అడవిలో ఎందుకు ఉండలేరు?” అని అడిగినట్లు అనిపిస్తుంది నాకు.నిజమే…

    కొందరు లోకానికి చెందరు.వాళ్ళను ఆశ అనే గురుత్వాకర్షణ పట్టి ఉంచలేదు. నాది అనే చక్రంలో ఎల్లకాలం తిరుగుతూ ఉండలేరు. ఉండనివ్వదు వారి హృదయం. అలాగే జయతి లోహితాక్షన్లు కూడా లోకానికి చెందరు.వీళ్ళనుగానీ… ఈ పుస్తకాన్నిగానీ “ఇదీ” అని నిక్కచ్చిగా చెప్పలేము. ఒక విషయానికి పరిమితం చెయ్యనూలేము.

    వాళ్లు అనంతమైన సత్య దర్శనానికి వెళ్లిపోయారంతే.

    జయతిగారి సత్య సౌందర్య దాహానికి సహచరుడు లోహితాక్షన్ గారి సహకారం చరిత్రలో చెరగని ప్రేమ ముద్రగా నిలిచిపోతుంది. తండ్రిమాటను కాదనక రాముడు అడవులకెళ్తే..వెంట సీతాదేవి..లక్ష్మణుడు నడిచినట్టు… సీతాదేవి అడవులకు వెళ్తానంటే వెంట నడచిన ఒక రాముడు, అలాగే వైటీ… ఇది రామాయణంలా ఉంది అనిపిస్తోంది.

    “నాకు అడవికి వెళ్లిపోవాలనీ, అడవికే సొంతమైపోవాలనీ, అక్కడే ఆ కొండల్లో ఉండిపోవాలనీ ఉంది” అని జయతిగారు చెప్పినప్పుడు మరొకరిలా “ఏమిటీ పిచ్చి? ఎందుకు అడవి?” అని కేకలేయకుండా
    “సరే. నీ ఇష్టం” అని ప్రేమగా అనేంత సముద్రమంత హృదయం లోహితాక్షన్ గారిది. అన్నింటా వెంట ఉండి… వెన్నుగా నిలుస్తూ ఉన్నారు వారు.ఇద్దరూ సాధకులే.సాధువులే.

    పగలంతా ప్రకృతి మాత వారిపై కురిపించిన సౌందర్య రసాన్ని హృదయ పాత్ర నిండా నింపుకుని… నింపుకున్న పాత్రను దోసిట్లో ఉంచుకుని జాగ్రత్తగా సాయంత్రానికి కుటీరాన్ని చేరుకుంటారు.గాఢమైన చీకటి పడ్డాక సత్య సౌందర్య రస పాత్ర చేతబుచ్చుకుని త్రాగుతూ అనంతమైన ఆనందంలో మునకలేస్తారు… వారిని చుస్తూ వైటీ కూడా ఆనందంతో గంతులేస్తుంది.

    రేపు ఏమి తినాలి? అన్న పట్టింపు లేదు, ఎక్కడికెళ్లాలన్న ప్రణాళికా లేదు, అడవి,కొండ,కుటీరం,వైటీ తో కలసి ముగ్గురి జీవనం. తదేకమైన జీవితం. రోజులతరబడి ఒకే సంగీతం. నదిగలగలలు, జలపాతపు హోరు, జివ్వుమని వీచే మహా వృక్షాల శబ్దం…కుండపోత వర్షపు ఊపిరాడనీయని మ్రోత ఎప్పుడూ తదేకమైన జీవితమే. సుదూరపు అడవులను, కొండలను, నదులను అనంతమైన ఏడారులనూ కలగంటూ తదేకమైన చూపు.

    సూర్యోదయ, సూర్యాస్తమయాలు కురిసే మెత్తటి నారింజ రంగు నీరెండలలో నిత్యం తడిసిపోతూ ఉంటారు ఈ అన్వేషకులు. చీకటి పడ్డ పున్నమి రోజులలో కుటీరపు ఆరుబయట కూర్చుని నింగినుండి భూమిపైకి పారే చల్లని వెన్నెల్లో సేదతీరుతారు ఈ పుణ్య దంపతులు.

    వేవేల అడవి పూల చెట్లు రంగురంగుల పక్షులు మీదకు వాలే సీతాకోకచిలుకలు భూమిపై ఉండే ఆనందంమంతా వారిదే.

    వాళ్ళు అడవికి చెందినవారు.అడవి అపార దయామయి వారికి. అడవి అందాలను ఫోటోలు తీస్తూ… కొన్నిసార్లు ఫోటోతీయలేక ఆ సౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోవడం. ఇదొక అద్భుత యదార్థ జీవిత యాత్ర.

    అంతా ఆనందమే కాదుగా. ఆకలుంటుంది.భయముంటుంది. అడవంటే అడుగడుగునా ప్రమాదముంటుంది. క్రూర జంతువులు, విష నాగులు, క్రిమి కీటకాలు, ఎండలు… హోరు వానగాలులు… అన్నీ ఉంటాయి. మనం చలిస్తాం. ఇక చాలని చాలిస్తాం. కానీ వాళ్ళలా కాదు….

    గీతలో యోగి గురించి శ్రీకృష్ణుడు
    సర్వభూతస్తమాత్మానాం సర్వభూతానిచాత్మని
    ఈక్షతేయోగయుక్తాత్మా సర్వత్రసమదర్శినః

    అన్నట్టు వీరు అన్నింటినీ నిశ్చలంగా చూస్తూ ముందుకు నడచిపోయే, మన కాలంలో జీవిస్తూ ఉన్న అద్భుత సాధకులు. మరింత గాఢమైన అడవి కోసం వెతుకుతూ… చిక్కని ఆనంద పారవశ్యంలో నడుస్తూ అనంతమైన దారుల్లో వారి పయనం.

    వీరి అనుభవాలూ, అనుభూతులు పుస్తక రూపంలో వచ్చాయిగనుక ఈ మాట చెబుతున్నాను. వీరి ఈ సాధనా పథం తెలుగు సాహిత్యములో కొందరిని… నిజమైన అన్వేషకులను… మరింత ముందుకు… మరింత లోతుకు… మరెంతో విశాల విస్తీర్ణం చేయగలరని నా చిన్న అభిప్రాయం.

    ఇదెంతో అందమైనది కూడా. పుస్తకంలోంచి ఓ బిందువు అమృతానుభూతిని గుండెలోకి ఒంపుకున్నాను. మీరూ అడవి పుస్తకం చదివి హృదయ పాత్రను నింపుకోండి.

    – సోమ భూపాల్ May 11, 2021

  162. అదృశ్య దుఃఖాన్నై… గురించి nagamurali గారి అభిప్రాయం:

    05/01/2021 2:12 am

    కవిత బాగుంది.

    హాస్యానికో, కవితను తేలిక పరచడానికో అంటున్న మాట కాదు. కానీ, వేదాంత పాఠం బోధించడానికి చక్కటి ఉపోద్ఘాతంగా అనిపిస్తుందీ కవిత.

  163. కొన్ని నిర్ఘాంతాలు గురించి nagamurali గారి అభిప్రాయం:

    05/01/2021 2:12 am

    బాగుంది. ఈ కవిత నాకు చాలా నచ్చింది.

  164. మేనక గురించి desikachary గారి అభిప్రాయం:

    04/13/2021 7:04 pm

    ఈ Manon, మేనక రెండిటి కథా లక్షణాలలో పెద్ద తేడాలేమీ నాకు తెలియలేదు. దేశికాచార్యులు గారు, భావించే ఈ భారతీయ సంస్కృతి ఎట్టిది? ఎలా ఇటాలియన్, ఫ్రెంచ్ సంస్కృతి, సంప్రదాయాలతో విభేదిస్తుంది, ఎక్కడెక్కడ ఈ మార్పులు ఈ తెలుగు రూపకం లో గమనించాలి? అన్న విషయాలు రచయిత నుండి వివరంగా వినాలని ఉంది.

    ఛందోబద్ధకవిత్వమంటే సంపెంగను చూచిన తుమ్మెదలాగా పాఱిపోకుండా, ఓపికతో ఈ రచనను, బెవర్లీసిల్స్ యూట్యూబు ప్రదర్శనను చూచి పైవాక్యాలను వ్రాసిన లైలాగారికి నాకృతజ్ఞతలు. ఐతే, వారు నారచనను, పైయూట్యూబు ప్రదర్శనలోని సన్నివేశ పరంపరనూ నిశితంగా పోల్చుకోనట్లుగా తోస్తున్నది. అట్లా పోల్చుకొని ఉంటే వారే నాకు చెప్పేవారేమో నారచన దానికి మూలభూతమైన ఆపెరా లిబ్రెట్టోకంటె ఎక్కడెక్కడ భిన్నంగా ఉన్నదనే విషయం.

    నాదృష్టి కథను పూర్తిగా మార్చాలని కాదు. దేశాలు వేరైనా, మానవప్రకృతి అంతటా ఒక్కటే అని నాభావం. అందుచేత మనోఁ కథ ఫ్రాన్సులో జరిగినట్లే భారతదేశంలోనూ జరుగవచ్చు. ఇట్లా జరుగగలిగినప్పుడు కథాశరీరాన్ని మార్చవలసిన అవసరం లేదు. ఐతే ఆకథాపరిధిలో దేశభేదాలనుబట్టి సన్నివేశపరికల్పనను దేశసంస్కృతికి అనుగుణంగా మార్చవలసి ఉంటుంది. ఇదే నేను వ్రాస్తున్న ఆపెరాలలో చేస్తున్న పునస్సృజన. ఈమార్పు నేను పాత్రలకు, ప్రదేశాలకు ఇచ్చే పేర్లదగ్గరినుండి ప్రారంభమౌతుంది. ఉదాహరణకు ఈ ఆపెరాలో పారిస్ పేరు భోగపురంగాను, ఏమియన్ విజయపురంగాను మార్చబడడమే కాక, బుద్ధపురము, రాజపురము, శాలిగ్రామము అనే మూడు క్రొత్త ఊర్లుగూడ ప్రవేశపెట్టబడినవి. పారిస్‌లో ఉండే St.Sulpice మొనాష్టరీ బుద్ధపురంలోని బుద్ధాశ్రమంగా మార్చబడింది. పారిస్ భోగాలకు, విలాసాలకు పెట్టింది పేరు. అందుచేత దీని పేరు భోగపురంగా మార్చబడ్డది. మేనక ఊరు శాలిగ్రామంగా పేర్కొనబడ్డది. సంస్కృతంలో ‘శాలి’ అంటే వరి అని అర్థం. ఆ ఊరిలో వరి ఎక్కువగా పండటంవల్ల ఆపేరు వచ్చిందని ఊహించవచ్చు. అట్లే వృద్ధుడయ్యును కాంతావ్యామోహమును మానని క్రూరుడైన Guillot పేరు శాకునికునిగను, అత్యంతధనవంతుడైన de Brétigny పేరు భౌరికునిగను మార్చబడినవి. సంస్కృతంలో శాకునికుడంటే వేటకాడని, భౌరికుడంటే బంగారునిధి కధికారి యని , స్థాయుకుడంటే గ్రామాధికారి అని అర్థాలు. (‘జీవాన్తకశ్శాకునికః, భౌరికః కనకాధ్యక్షః, స్థాయుకోఽధికృతో గ్రామే – అని అమరకోశము). అంతేకాక Guillot స్వభావం శూద్రకుని మృచ్ఛకటకంలోని శకారుని పోలియున్నది. అందుచేత పడుచుపిల్లల వేటకాడైన క్రూరస్వభావియగు Guillot ను శాకునికగా పేర్కొనడమే కాక, అతని పాత్రీకరణ శకారునికివలెనే చేయడం జరిగింది. అట్లే మహాధనవంతుడైన de Brétigny కి భౌరికనామధేయం సార్థకమైంది. వేశ్యలైన Poussette, Javotte, Javotte లకు రమణి,రంజని రాగిణి అనే పేర్లుంచడం వారి వేశ్యాస్వభావద్యోతకంగా ఉన్నది. Manon ను మేనక అనడం ఆమే విలాసలాలసతకు, సొమ్ములయందలి అభిలాషతకును తగినట్లుగాను, Manon అను శబ్దమునకు సన్నిహితంగాను ఉన్నది. అట్లే జూదరియైన Lescaut దేవనదత్తుడుగా పేర్కొనబడినాడు. ‘దేవనాః పాశకాశ్చ తే’ అని అమరకోశంలో చెప్పబడినట్లుగా దేవనములంటే పాచిలకలని అర్థం. అందుచే పాచికలాటకు దాసుడైన అతనిని దేవనదత్తు డనటం జరిగింది.

    ఇట్లా వ్రాస్తూ పోతే ఇదొక మహాగ్రంథమౌతుంది. అందుచేత సంగ్రహంగా నేను చేసిన సన్నివేశములయందలి మార్పులను పేర్కొంటాను:

    1. మొనాష్టరీని బుద్ధాశ్రమంగా మార్చడం. బుద్ధుని కాలంనుండి బుద్ధాశ్రమాలలో శ్రమణికల నియోగం జరిగింది. అందుచే మేనకను శ్రమణికాత్వము స్వీకరించుటకు పంపడం, తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరడం అనేవి భారతీయసంస్కృతికి తగినట్లుగా జరిగినవి.

    2. ప్రథమాంకంలో విశ్రాంతిగృహంలో లభించే ఆహారనామాలు భారతదేశీయుల ఆహారనామాలుగా మార్చబడినవి

    3. ద్వితీయాంకంలో ప్రథమ, ద్వితీయదృశ్యములు అమూలకములు. ఇవి కథాపుష్టికై పరికల్పింపబడినవి. తృతీయదృశ్యంలో అదే చిన్న రూములో కిటికీకి దగ్గర దేవనతరుణార్కులు కూర్చున్నారనుటకు బదులుగా, వారు ఆరూముకు ముందుండే అంగణంలో కూర్చున్నారని, అందుచేత భౌరికుడు మేనకకు తరుణార్కుని అపహరణవిషయం తరుణార్కునికి దెలియకుండా రహస్యంగా చెప్పడానికి అనుకూలంగా ఉండిందనే కల్పన చేయబడ్డది.

    4. తృతీయాంకంలో ప్రథమదృశ్యం అమూలకం. ఇది కథాపరిపుష్టికై కల్పింపబడినది. ద్వితీయదృశ్యం, అందులో సౌందరనందమనే బుద్ధగాథాత్మకమైన అంతర్నాటకం పూర్తిగా మూలంలో లేని, భారతసంస్కృతికి అన్వయించే నూత్నకల్పనలు. మూలంలో des Grieux (తరుణార్కుడు) మొనాష్టరీలో చేరుటకు ప్రేరకం సహేతుకంగా నిరూపింపబడలేదు. కాని ఇచ్చట ఈ ద్వితీయతృతీయ దృశ్యములద్వారా తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరుటకు సిద్ధమగుట సహేతుకంగా కల్పింపబడింది. ఈవిధంగా ఈ అంకమంతా అమూలకమైన నూతనకల్పనయే.

    5. మూలంలోని చతుర్థాంకంలో పారిస్‌లో ఒక కార్నివాల్ జరిగినట్లు, అక్కడ ఒక బాలే డాన్సుగూడ ప్రదర్శింపబడినట్లు, ఆసందర్భంలోనే తరుణార్కుడు మొనాష్టరీలో చేరినవిషయం అతని తండ్రినుండి మేనక నేరుగా విన్నట్లును కథ నడిచింది. కాని ఇటువంటి కార్నివాల్, బాలే భారతసంస్కృతికిపనికిరావు. అందుచే వసంతోత్సవసందర్భంలో భోగపురసమీపంలోని ఒక తోటలో మేనకాదులు విలాసంగా పాల్గొన్నట్లును, ఆసందర్భంలో తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరిన విషయం స్థాయుకుడు భౌరికునికి చెప్పుచుండగా చెట్లచాటునుండి మేనక పరోక్షంగా విన్నట్లును కల్పించినాను. ఆవనవిహారానికి ముందుగా ప్రథమదృశ్యంలో మేనక సేవికలచేత అలంకరింపబడుట అనే అమూలకమైన దృశ్యాన్ని కల్పించి ఆమె భౌరికుని పోషణలో అనుభవించిన వైభవము నిరూపించినాను. అట్లే తృతీయదృశ్యంలో ఆవైభవములపట్ల అమె అనాసక్తి, పునః తరుణార్కుని యందలి అభిలాష చక్కగా నిరూపింపబడినవి. మూలంలో మొనాష్టరీలోనికి మేనకప్రవేశించి అతనిని తనతో పునస్సంగమమునకు సుముఖుని చేసికొన్నట్లున్నది. కాని అది అసంగతంగా ఉన్నదని, ఈఅంకంలోని చతుర్థదృశ్యంలో బుద్ధాశ్రమోద్యానంలో తరుణార్కుడు ధ్యాననిమగ్నుడై ఉండగా మేనక అతనిని సమీపించి, తనకు పునర్వశవర్తుని చేసికొన్నట్లు కల్పించినాను. ఈవిధంగా ఈ అంకమంతా అమూలకమైన నూతనకల్పనయే.

    6. పంచమాంకంలోని ప్రథమదృశ్యంలో మేనకాదేవనులు తరుణార్కుని జూదమునకు ప్రేరేచినసన్నివేశం అమూలకం.

    ఈవిధంగా ఎన్నో మార్పులు, చేర్పులు చేసి, కేవలం భారతసంస్కృతికి సంబంధితమైన స్వతంత్రరచనగా గోచరించే విధంగా నేనిది వ్రాసినానని అనుకొంటున్నాను. దీనిని సమగ్రంగా పరిశీలించి, ఇందులో నేనెంతవఱకు కృతకృత్యుడ నైనానో మీవంటివారు తేల్చవలసియుంటుందని విన్నవించుకొనుచున్నాను. అందుచేత లైలాగారూ, ఈవిషయంలో మీరు చేయవలసిన HomeWork చాలా ఉన్నది.

  165. నాలుగో వరం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    04/12/2021 8:36 pm

    “పాపం సమాచరతి వీతఘృణో జఘన్యః ప్రాప్యాపదం సఘృణ ఏవ తు మధ్య బుద్ధిః
    ప్రాణాత్యయేపి తు న సాధుజనః స్వవృత్తిం వేలాం సముద్ర ఇవ లంఘయితుం సమర్ధః”

    I have doubts about the accuracy of Telugu translation given here, in the story. I want a second opinion.

    I just don’t get Buddhism. I guess, it just goes against my grain!

    If it is Mythology, there got to be Magic
    If it is Philosophy, there got to be Logic
    Is Buddhism a religion?
    It is neither heroic, nor stoic. Not an epic,
    What exactly is its legion?

    ఈ కథలన్నీ ఎన్ని చదివినా, భవరోగమేంటో, దాని వినాశనం బుద్ధుడెలా చేస్తాడో తెలియటం లేదు. రోగానికి చావుకి జడిసి, సన్యాసిగా మారి గుండు చేయించుకుంటే రోగం రాదా, చావు రాదా? మరి దేని నుండి ఆయన తప్పించుకున్నాడు. ఇతరులను ఎలా విముక్తులను చేశాడు ఇన్ని వందల యేళ్లుగా?

    రాజకుమారుడుగా పుట్టి, భోగాలన్నీ వదిలేసాడని అదో గొప్ప. ఇదుగో -ఇప్పుడు ప్రిన్స్ హేరీ తలతిక్క కబుర్లు లాగానే. శుభ్రంగా Duke and Duchess of Sussex – Windsor లోనో, Montecito లోనో వాళ్లు వైభోగంగా ఉంటూ, -ఇతరులను ఉద్ధరిస్తున్నట్టు పోజ్! Who falls for those stunts!

    లాజికల్ గా చెప్పిన ప్రతి రచన, ప్రసంగం లో కొన్ని మెప్పించేవి, పాటించదగినవి ఉంటవి. ఎప్పటికీ పాటించేవంటూ సత్యాలు ఏవీ లేవు. ఉండగూడదు. పుడుతూ, చస్తూ, కొత్త జనాలు, కొత్త జాతి కాంబినేషన్లు, కొత్త సైన్స్ ప్రయోగాలు వస్తున్నప్పుడు, జన్మంతా అందరికీ ఒకే గుడిలో, ఒకే మొనాస్టరీలో ఒకే రకమైన సత్సంగం ఎందుకు? అందునా వరసా వాయీ ఆలోచన క్రమం లేని ఉపదేశాలు. భగవానులు గాని, ఆనందులు కాని చిరునవ్వులు నవ్వినంత మాత్రాన, ముఖం ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన, ఒంటరిగా ఊరికే అడవుల్లో పడో, ఆ చివరినించి ఈ చివరికి నడిచో, ఆ ఇంటికో ఈ ఇంటికో, వెళ్లి వస్తేనో, భవరోగాలు నశిస్తాయా?

    ఈ మధ్యే వేమూరి, గ్రీక్ మిథాలజీ కొంత, తెలుగులో రాసిస్తే, ‘ఈమాట’ మేగజీన్, పాఠకులకు 11 ప్రకరణాలుగా చదవమని ఇచ్చినప్పుడు, అందులో ఒకచోట అదాటున ఆయన భారతంలో నుండి ఈ పద్యం ఇచ్చారు.
    “ఒరులేయవి యొనరించిన
    నరవర యప్రియము దనమనంబున కగు దా
    నొరులకు నవి సేయకునికి
    పరాయణము పరమధర్మ పదములకెల్లన్ (భారతం, శాంతి, 5-220)”

    అది చదివినప్పుడు బాగుంది నీతి పద్యం అనుకున్నాను. ఐనా, కిరస్తానీ ప్రభావం నాపైన అంతకంతా ఉన్నందున, నాకు ఈ ప్రవచనం గుర్తొచ్చింది.
    “Do unto others as you would have them do unto you” Luke 6:31

    ఈ రెండూ చెప్పేదొకటే కదా అంటే, పైపైకి అలానే అనిపిస్తుంది. కాని కానే కాదు. హిందూ ఇతిహాసం లోని పద్యం, – ఇతరులు ఏవి చేస్తే, నీకు మనసులో ఇష్టంకావో, అవి నువ్వు ఇతరుల పట్ల చెయ్యొద్దు. అది ధర్మం అంటున్నది.
    బైబిల్ – ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీకిష్టమో, నువ్వూ అలాగే వారికి ప్రీతి కలిగించేవి చెయ్యి- అంటున్నది.
    ఈ రెంటికీ చాలా తేడా ఉంది. భారతం లోది – ‘అలా చెయ్యకు’ అంటున్నది. అప్రియమైనని చెయ్యకు! అంటుంది. ABOVE ALL DO NO HARM అనే వైద్యుల అల్టిమేట్ గైడ్ లైన్ కూడా కొంత ఇలాటిదే.

    కాని, స్క్రిప్చర్స్ చెప్పింది నాకెక్కువ నచ్చింది – ఇతరులనుండి నువ్వేం ఆశిస్తావో, వాళ్లేం చేస్తే నీకు ఇష్టం కలుగుతుందో అలాటి పనులు ఇతరుల పట్ల చెయ్యమంటున్నది. మనిషిని, మునగదీసుకుని, ముసుకేసుకుని, ఎవరికీ హాని చెయ్యను అని సంఘం నుండి, ప్రపంచం నుండి విత్ డ్రా అవకుండా, ఎవరికైనా సంతోషం కలిగించేవి చెయ్యమంటున్నది. Neither is fool proof and complete, but they both are good.
    ఈ జాతక కథలు ఏమి చెపుతున్నవి! నాకు తెలియదు.

    ఇంతకు ముందొకసారి, శర్మ దంతుర్తి రాసిన “తుఫాను” కథ నాకు బాగా నచ్చిందని రాసాను. The foremost reason I liked it for is;
    In a storm, a young girl, takes another girl who can’t go home, into her house. Protects her. Feeds her. Keeps her safe.
    The second young girl who is helped, afterwards, just didn’t send her a Thank you note. Instead, she reciprocated. She helped the first girl and family in a big way. She knew she can do it. That she should do it. And she did it.
    In this story, she is emphasizing the good side of human nature, and taking a positive action. She is proving the possibility, no, no, – the certainty of one person helping the other.
    Negative people may think – It is just a feel good story. These things don’t happen in real life. Wrong! They happen.

    ఆలోచిస్తే, ఇతరుల సహాయం లేకుండా మనలో ఒక్కరమైనా పైకి వచ్చామా! రోజువారీ లభించే సహాయాలెన్నో. ఒక్కోసారి, ఇక నా పని ఆఖరు. ఈ విపత్తు లోంచి బైట పడలేము అనుకున్నప్పుడు, అకస్మాత్తుగా సహాయం లభిస్తుంది. అది ఆలోచనాపరులైన పాజిటివ్ పీపుల్ నుండి వస్తుంది.
    మానవ స్వభావంలోని లేకితనాన్ని, మోసకారితనం, క్రూరత్వాల గురించి, పన్నెండు సార్లు చెపితే, ఏమిటి ఘనత ఎవరైనా కథలో, కవితలో. మనలోకి మనం ముడుచుకుపోవటం, ఇతరుల నుండి విత్డ్రాయల్, విరక్తిలు వస్తాయి. ఎవరికి కావాలవి? నాకు జాయస్ గా, జాలీగా ఉండి, ఉదారులైన వాళ్లకు మల్లేనే, ఉల్లసిల్లి ఉండాలని ఉంటుంది. జెనరాసిటీ గురించి ఎవరైనా చెప్పినప్పుడు, చూపినప్పుడు నా కళ్లు వర్షిస్తాయి.

    బౌద్థం నాకెందుకు! బౌధ్థం ‘సువర్ణ శ్రీ’ కి అక్కర్లేదు. నాకూ అక్కర్లేదు.

    మృత్యువు సత్యం, మృత్యువు తథ్యం. ఐనా నాకు లూయీస్ పాశ్చర్, బుద్థుడి కంటే ఇష్టం. పాశ్చర్ జంతువుల, మనుషుల రోగం, పెయిన్, అకాల మరణం తప్పించిన వాడు. సైంటిఫిక్ స్టడీతో, పరిశోధన తర్వాత పరిశోధనతో మానవులకు వందల ఏళ్లు పనికొచ్చే కంక్లూజన్స్ కి వచ్చే, లూయీస్ పాశ్చర్ కి, మృత్యువు, రోగము, భవము, అని ఏవో మాటలు పేర్చే కన్ఫ్యూజింగ్ జాతక కథలకీ పోలిక ఏముంది!
    మృత్యువు మీద రాయలేనిది ఎవరు! చనిపోయాక రాయలేం కాబట్టి ముందే రాసుక్కూచ్చోటం. నేనూ రాసాను, అప్పుడప్పుడూ!
    వాటిలో ఈ కిందిదొకటి!

    గతములో ప్రతి రాత్రి, అతి కాంతి దీపమ్ములన్ని ఆర్పి
    శయనమందిరాన మినుకు దీపాలనే మిగుల నిచ్చి
    పందిరిమంచపు చుట్టు తెల్లమల్లు తెరలన్ని కదియలాగి
    పట్టుపరుపుల మీద సుఖస్వప్నాలలో
    పాతప్రియులెందరి తోనొ నే పవళించిన రీతి;
    ఆఖరి నిశ్వాసము తరి మృత్యుదేవ!
    నీపైనను విశ్వాసముంచి, శాశ్వత స్వప్నాలలో
    నీతోను నే సుఖముగ పన్వళింతు!

    -Lyla

    PS: I read a little while ago, that Sarma Danturti won a prize in Vanguri Foundation’s – Ugadi short story competition. Congratulations to him, other winners and contestants.
    Happy Ugadi to All! Enjoy!

  166. చిత్ర కవిత్వం ఒక చిరుపరిచయం గురించి డా||బోలుగద్దె అనిల్ కుమార్ గారి అభిప్రాయం:

    04/12/2021 5:05 am

    చిత్రకవిత్వం మీద మా కర్నూల్ లో అద్భుతమైన కృషిని చేసిన మహానుభావులు ఉన్నారు, ఆయనే శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులు. ప్రస్తుతం వీరు” బంధకవితాసర్వస్వం” అనే పుస్తకాన్ని రచిస్తున్నారు. అలాగే తిరుపతిలోని తిరువాయిపాటి చక్రపాణి అనే ఒక పండితుడు ఏకంగా తొలితెలుగు రథబంధ శతకాన్ని రచించారు. హైదరాబాద్ లోని అన్నమరాజు ప్రభాకర్ రావుగారు, చింతా రామకృష్ణగారు, అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావుగారలు చక్కని చిత్రకవిత్వాన్ని రచిస్తూ ఉన్నారు.

  167. పద్య పదార్థ విజ్ఞానం గురించి తః తః గారి అభిప్రాయం:

    04/07/2021 2:33 pm

    కామేశ్వరి గారు: పఠాభి గుర్తు వచ్చారని మీరనటం తః తః రచన ‘చిరునవ్వుగాది ‘ఈమాట’లో వచ్చినప్పుడు రమా భరద్వాజ్ గారు పఠాభిని గుర్తు చేసుకున్న సందర్భాన్ని గుర్తుకు తెచ్చింది. ధన్యవాదాలండీ!

    శ్రీ కామేశ్వర రావు, శ్రీ యదుకుల భూషణ్: ఈమాట పరిచయం చేసిన ఆత్మీయులు మీరు.

    శ్రీ వేలూరి: మీ మాటలు నావంటి వారికి మార్గ దర్శకాలు.

    శర్మ గారు: ఒక కవిత రాయటానికి ఎలాంటి కారణాలుండాలో- Maxwellనో , Oppenheimerనో అడగలేను. ఏ కుక్క పిల్లనో, అగ్గిపుల్లనో, సబ్బుబిళ్ళనో అడిగి అవి చెప్పిన ‘సరియైన కారణాలను’ మీకు మనవి చేస్తాను. అప్పటిదాకా- సిగ వాసన తగిలినా మగవాసన తగిలినా- నా మీద గానీ, “ఏపాపమూ ఎరుగని” సంపాదకుల మీద గానీ ఎవరూ ఏ రకమైన కేసూ వేయకుండా చూడండేం!

    మరి రెండు మాటలు: ఈ పద్యం ఆంధ్ర విశ్వ కళాపరిషత్‍లో ఎం.ఎస్సీ – అప్లయిడ్ మాథ్ పిల్లలకు -బాచ్ తర్వాత బాచ్- Continuum Mechanics పాఠం చెబుతున్న రోజుల్లో- అంత్య ప్రాసను అద్భుతంగా వాడే కవి Gavin Ewart పద్యాలు, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ స్మారక గ్రంథాలయంలో, London Magazineలో చదువుతూ, ‘A Material Poem’ అని ఇంగ్లిష్ లో రాసుకున్నది. ఇప్పుడు ఈమాటకు – మాతృక రూపం కొంత, సొంత రూపం కొంతతో- ఇలా వచ్చింది.

    అన్నట్టు మీకు తెలిసే ఉంటుంది, (EMT) ఎలెక్ట్రో మాగ్నెటిక్ థియరీ నిర్మాత, James Clerk Maxwell కవి కూడానూ. Lectures to Women on Physical Science అన్నది ఆయన రాసిన ఒక పద్యం.

    అందరికీ నమస్కారాలతో
    తః తః

  168. పద్య పదార్థ విజ్ఞానం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    04/03/2021 9:41 am

    ఆడపిల్లల కాలేజ్‍లో ఫిజిక్స్ పాఠాలు చెబుతాను.
    పెళ్ళాం పక్కన కామా ఉంది. గమనించండి
    పచారుకు వచ్చే మా ప్రాంశుపాలిని

    కవిత రాయడానిక్కారణాలు ఇవేనుటండీ? మీ ఆవిడ వెనకనుంచి చూస్తూంటే రాసినట్టున్నారు ఈ కవిత. దీన్ని ఇప్పుడొచ్చే సెక్యూరిటీ తగదాల్లో “షౌల్డర్ సర్ఫింగ్” అంటున్నారు. ఏమైనా మీ మీద మహిళా వకీలొకావిడ కేసు వేస్తారేమో అని నా అనుమానం. వాళ్ళకి ఈ కవిత బాగా “మగవాసన” కొడుతున్నట్టు ఉండొచ్చు మరి.

    ఎందుకైనా మంచిది వేరే కాలేజీలో కూడా ఖాళీలున్నాయేమో కనుక్కుంటే మంచిదేమో? మందయానలూ, మంజరీ ద్విపదలూ మొగవాళ్ళైతే, శార్దూలాలూ మత్తేభాలూ ఏమౌతాయో అనే నా కుతూహలం తీర్చండి మరి.

  169. స్వప్నసంచారం గురించి పార్థసారధి పోడూరు గారి అభిప్రాయం:

    04/01/2021 10:46 pm

    చాలా బాగుంది. రెప్పల ఊడలు, పెదవికొమ్మ, ఇంకినభయాలు మొదలైన గమ్మత్తు పదప్రయోగాలతో అసాధారణ భావవ్యక్తీకరణ చేశారు. రచయితకి అభినందనలు. మంచి కవితను చదివిన తృప్తినిచ్చినందుకు ధన్యవాదాలు.

  170. పద్య పదార్థ విజ్ఞానం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    04/01/2021 9:11 am

    “పప్పులు నమలుటలు గాదు పద్యరచనముల్!”

    ఒక్కసారి సంజీవ దేవ్ గారిని కలవడానికి వెళితే -ఆయన ఇదే వాక్యం చెప్పి -ఆత్రేయను ఎంతో ప్రశంసించారు. (ఆత్రేయ పద్యాల్లో రాస్తుకున్న ఆత్మకథ అప్పుడే వచ్చింది.)

    కవి , శాస్త్రవేత్త ఒక ఫాయా లోని వాళ్లే .- అంతర్జగత్తు -బాహ్య జగత్తులను నిరంతర పరిశీలనకు గురిచేయడం, వారి దినచర్య. లోపల వెలుపల , వెలుపల లోపల కాగల ప్రజ్ఞ (నాచన సోముని మాటలు, నావి కావు) వారి సొంతం.

    “footnote to a poem” అన్న 70 పుటల బ్రాడ్ స్కి వ్యాసం గుర్తుకొచ్చింది – 14 అధస్సూచికలను చూసి.

    ‘ప్రతిపదార్థ విజ్ఞానం’ అంటే మరింత సార్థకమయ్యేది కవిత.

  171. ఛందస్సులో గణితాంశములు – 4: అంత్యప్రాస గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    04/01/2021 6:31 am

    కవిత్వం ఒక్కోసారి అందమైన పూల అమరిక; ఒక్కోసారి అణు విస్ఫోటనం. కవిత్వం వెనుక గణితం, గణితంలో కనిపించే కవిత్వం -బుద్ధిజీవి,సహృదయుడైన పాఠకుడు ఒడిసి పట్టుకోగలగాలి. అప్పుడే, జీవితం సంపూర్ణం.

    మోహనరావు గారు పరిచయం చేసిన – ఛందస్సులో నూతనాంశాలు , వసంతకాలపు ఎండలా ఆహ్లాదంగా ఉన్నాయి. ఆధునిక కవిత్వంలో కూడా ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేయవచ్చు- భావం బలంగా ఉన్నంత వరకు కవిత్వానికి వచ్చిన ప్రమాదం లేదు. పాతికేళ్ల క్రిందట, నేను మొట్ట మొదటి సారి ఒక మహానగరాన్ని చూసిన అనుభవం – అది కవితగా మారిన క్రమం, దాని వెనుక గణితం ఒక్కసారి గుర్తుకొచ్చాయి.

    https://eemaata.com/em/library/nnn/350.html

    వ్యాసకర్తకు అభినందనలు!!

    తమ్మినేని యదుకుల భూషణ్

  172. మేనక గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    03/30/2021 10:05 pm

    మేనక అను ఈ ఆపెరా ఈకోవలో నేను చేసిన ఏడవరచన. ఇది ఫ్రెంచిభాషలో గల సుప్రసిద్ధమైన మనోఁ (Manon) అను ఆపెరాను భారతసంస్కృతికి అన్వయించుకొనుటకై అనేకమగు మార్పులు, చేర్పులు చేసి చేసిన అనుసృజన.”
    “గమనిక: పై ఇతివృత్తమంతయు నేనీ రూపకంలో వ్రాసిన విధంగా పేర్కొన్నాను. ఇది మసెనే ఆపెరాకంటె అనేకవిషయములలో భిన్నముగా నున్నది. ఇతివృత్తమును భారతసంస్కృతికి అన్వయించుచు వ్రాయుటకై ఈభిన్నత్వ మవసరమైనది. తృతీయచతుర్థాంకములు చాలావఱకు అమూలకములే!

    ఈ రచన చదివాను. బెవర్లీ సిల్స్ నాయికగా నటించిన ‘Manon’ ఆపెరా యూ ట్యూబ్ లో చూసాను. రెండూ నాకు నచ్చాయి. న్యూయార్కర్ లకు బెవర్లీ సిల్స్, బర్న్ స్టైన్ లపై, అభిమానం తప్పనిసరి.

    ‘మేనక’ రచనలో ముందుమాటగా, భారతీయ సంస్కృతికి తగినట్టుగా,( భారతీయ పాఠకులకు నచ్చేట్టుగా??) ఈ ఆపెరాలో మార్పులు చేసినట్టు చెప్పారు. ఇంతకు ముందు ఆపెరాల తర్జుమాలలోనూ, కొన్నిసార్లు ఇలాగే చెపుతూ, వీరి తెలుగు రచనలను అనుసృజనలు అనుకోమన్నారు. అలానే అనుకోవచ్చు. ఐతే, ఈ Manon, మేనక రెండిటి కథా లక్షణాలలో పెద్ద తేడాలేమీ నాకు తెలియలేదు. దేశికాచార్యులు గారు, భావించే ఈ భారతీయ సంస్కృతి ఎట్టిది? ఎలా ఇటాలియన్, ఫ్రెంచ్ సంస్కృతి, సంప్రదాయాలతో విభేదిస్తుంది, ఎక్కడెక్కడ ఈ మార్పులు ఈ తెలుగు రూపకం లో గమనించాలి? అన్న విషయాలు రచయిత నుండి వివరంగా వినాలని ఉంది.

    ఆ మధ్య ‘శ్రీహర్షుని గ్రంథ గ్రంథులు’ అన్న వ్యాసం ఈ మేగజీన్ లో చదివినపుడు, అభిప్రాయాల శీర్షికలో అక్కిరాజు ఉమాకాన్తమ్ గారి ‘నైషధతత్త్వజిజ్ఞాస’ అన్న రచన చదవమని చేసిన సూచన మేరకు, నేను చదివాను. శ్రీ హర్షుని నైషధం ఏ కారణాల వల్ల ఆయనకు నచ్చలేదో ఆ వ్యాసంలో ఉంది. భారతీయ సంస్కృతి, భారతీయ శృంగారం, భారతీయ సాహిత్యం సంబంధాలు చర్చించే- ఈ వ్యాసాన్ని కూడా దేశికాచార్యులు ఈ సందర్భంగా కొంతలో కొంత స్పృశిస్తారని నేను ఆశిస్తున్నాను.
    ఉమాకాన్తమ్ గారి ఉద్దేశంలో –భారతీయ సాహిత్య పతనం -భారత దేశంలో ఇతర దేశాల వారొచ్చి జేరటంతో జరిగిందని. శ్రీ హర్షుని నైషధం నచ్చకపోటానికి ఉమాకాన్తమ్ చేసిన ఒక అభియోగం; విదేశీయుల డబ్బు, కామం, వ్యామోహం శ్రీ హర్షుడికి అంటుకుందనీ, అందువల్లే వ్యాసుడి బంగరు రెక్కల హంసను, పూర్తి బంగారు హంసను చేసాడని, కాళిదాసు పార్వతీ పరమేశ్వరుల లాగా ఉదాత్త ప్రణయం చూపించవలసిన నల దమయంతులను, కేవలం కాముకులుగా మార్చివేసాడనీ, ఆ మార్పుల మూలాన భారతీయ ప్రణయం, శృంగారం శ్రీ హర్షుని చేతిలో పతన మయ్యాయని.
    (పనిలో పనిగా, ఆ వ్యాసం మాత్రమే కాక, ‘సాహితీ వైజయంతి’(సుప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి, సం. అక్కిరాజు రమాపతిరావు) పుస్తకం లోని ఇతర రచనలూ చదివాను. చాలా నచ్చాయి. పూర్వం తెలుగు వాళ్లు తెలుగులో ఎంత మంచి వ్యాసాలు రాసారని సంతోషం కలిగింది.)

    అలాటిదే ఇంకో సంకలనం – నా లైబ్రరీలో ఉన్న ‘శత వసంత సాహితీ మంజీరాలు’ అన్న పుస్తకం. విజయవాడ రేడియో స్టేషన్లో అంతకు ముందు వరసగా ప్రసారం చేసిన -తెలుగునాట ప్రసిద్ధి గాంచిన తెలుగు రచనలపై విశ్లేషణలను 2002 లో- పుస్తక రూపంలోకి తెచ్చారు. బాగున్నాయీ విశ్లేషణలు. ఈ పుస్తకంలో, ఉమాకాన్తమ్ గారు ‘నేటి కాలపు కవిత్వం’ అని ఒక గ్రంథం రాసారనీ, అది తెలుగు సాహిత్య విమర్శనే ఒక గొప్ప మలుపు తిప్పిన పుస్తకం అని -తన భాషణలో కోవెల సంపత్కుమారాచార్య చెప్పారు. ‘నేటి కాలపు కవిత్వం’ అన్న ఆ గ్రంథం దొరికితే చదవాలని ఉంది.
    (చిత్రంగా, ‘విమర్శ’ అనేది ఎప్పుడు ప్రారంభమయిందో, కవిత్వ పతనం, అప్పుడే మొదలయిందని, ఉమాకాన్తమ్ గారి మరో ఉద్దేశం. మరి, ఆయన ‘విమర్శ’ ను కవులెంతో గౌరవించారట!)

    దేశికాచార్యులు గారు, భారతీయ సంస్కృతికి సూటబుల్ గా ఈ ఆపెరాలను అనుసృజన చేస్తున్నాను అంటున్నప్పుడు – ఎన్నో విషయాలలో పాండితి కలిగిన ఆయన, తమ ఆలోచనలు ఇంకొంత వివరంగా చెపుతారేమో అని నాకు ఆశ. అందువలన రాస్తున్నాను. మరికొందరు చర్చిస్తే మరింత ఆనందం.

    Thanks.
    Lyla

  173. తలుపు తీసుకుని… గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    03/03/2021 7:46 am

    చిక్కన అవుతోన్న కవిత్వం..లాగే రహో శ్రీనివాస్

  174. ఉత్సాహానికి దూరంగా… గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    03/01/2021 6:44 pm

    అచ్చమైన కవిత్వం – అలవోక పదాలు

  175. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    02/05/2021 10:27 pm

    మినీ కవిత లాంటి మీ స్పందనకు థాంక్స్ వంశీ

  176. అతడు నవ్వుతూనే ఉన్నాడు! గురించి SHAIK ABDUL RAHMAN గారి అభిప్రాయం:

    01/23/2021 8:09 am

    అర్థవంతంగా కవిత చాల బాగుంది.

  177. A Solemn Vedic Wedding గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    01/11/2021 2:56 pm

    నేను రాసిన Vedic Wedding పై శ్రీ కృష్ణదేశికాచారిగారు పెట్టిన మొట్టమొదటి కామెంటుకి నేను సంజాయిషీ ఇచ్చాను. ఆతరువాత ఆయన, నేను రాసిన మంత్రాలలో, శ్లోకాలలో దొర్లిన తప్పులు క్రోడికరిస్తూ శ్రీ కొలిచాల సురేశ్‌కి టపా పంపించారు. శ్రీ సురేశ్‌ ఆ టపా ఉన్నదున్నట్టుగా, యథాతథంగా నాకు పంపారు. అందుకు కృతజ్ఞుణ్ణి. ఆ టపా చూడగానే, మొట్టమొదట నా గుండె ఆగినంత పని అయ్యింది. నా వ్యాసంలో “తప్పులు” ఎర్ర రంగులో ఉండబట్టి నాకు లెక్కపెట్టడం తేలికయ్యింది. మొత్తం మీద డెబ్బది పైచిలుకు “తప్పులు” లెక్కించాను. నిజం చెప్పద్దూ! కించిత్ భయం కూడా వేసింది. ఈ రొంపిలోకి నేనెందుకు దిగానురా అనిపించింది. (అయినా, నాలో రాక్షసాంశ మస్తుగా వుంది కాబట్టి తేరుకొని సరిపెట్టుకున్నాను!)

    కొంచెం జాగ్రత్తగా చూసిన తరువాత, ఆ తప్పులు, కేవలం మకార అనుస్వరాలకు సంబంధించినవి, అవి రెండు వ్యాకరణ సూత్రాలకు పరిమితమైనవి, అని తెలిసి కుదుటపడ్డాను. నేను శ్రీ దేశికాచారిగారితో ఈ విషయంపై సుమారు రెండు గంటలు మాట్లాడాను. ఆయన ఎంతో ఓపికగా నాకు సమాధానాలు ఇచ్చారు. అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

    ఆ రెండు వ్యాకరణ సూత్రాలూ కింద ఇస్తున్నాను. (ఇవి శ్రీ దేశికాచారిగారి టపానుంచి కాపీ చేస్తున్నాను.)

    1. పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును.

    2. అపదాంతములైన నకార, మకారములకు ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ తప్ప ఇతరహల్లులు పరమైనపుడు అనుస్వారము (సున్నా) వచ్చును.

    మొదటి సూత్రం: ఒక మాట చివర మకారమునకు హల్లు పరమైతే, ఆ మకారము సున్నా గారాయాలి. వాక్యం చివర మకారానికి హల్లు పరమయ్యే ప్రసక్తి రాదు గనుక అక్కడ సున్నా రాదు.

    రెండవ సూత్రం: పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది.

    ఉదాహరణకి, నేను రాసిన ఉపనిషత్తు మంత్రం చూడండి. అందులో తమీశ్వరాణామ్ అని నేను రాసిన (మొదటి ప్రార్థనలో) ణామ్‌ వ్యాకరణం ప్రకారం తప్పు. దానిని ణాం అని రాయాలి. అదే మంత్రంలో, రెండవలైనులో, పరమం చ దైవతమ్‌ అని ఉన్నది. ఇది వాక్యాంతం కాబట్టి, ఇక్కడ మకారము సున్నా కాదు.

    అయితే ఒక్క విషయం. ఈ మంత్రం వల్లించేటప్పుడు, ఈ మకార, అనుస్వరాలలో తేడాలు తెలుస్తాయా, కనిపిస్తాయా అని సహృదయులైన నవీన పాఠకులు ప్రశ్నించవచ్చు. అట్లా ప్రశ్నించడం సమంజసమో కాదో నాకు తెలియదు. నామటుకు నాకు, వ్యాకరణంతప్పయినా, కరణం తప్పయినా తప్పు తప్పే! period. ఈమాట సంపాదకులు నాకు preview పంపినప్పుడు, రోమను స్క్రిప్ట్‌ చూసి అంతా బాగానే వుంది; అడక్కండానే రోమను స్క్రిప్ట్ లోకి కూడా మార్చారని గొప్పగా సంతోషించాను కాని, ఒళ్ళు దగ్గిరపెట్టుకొని నేను పంపిన ప్రతితో పోల్చి చూడలేదు. బద్ధకం. అది నా తప్పు. ఈ వ్యాకరణం తప్పులు ఎలా దొర్లాయి అని తర్జన భర్జన చేశాం. ఇవి బహుశా, రోమను స్క్రిప్ట్‌ నుంచి మళ్ళీ తెలుగులోకి రాయటంవలన వచ్చి వుండవచ్చునేమోనని సర్దుకున్నాను.

    పోతే, శ్రీ దేశికాచారిగారు కొన్ని అచ్చుతప్పులు కూడా సవరించిన ప్రతి నాకు పంపించారు. దానిని సురేశ్‌ గారికి, మాధవ్‌ గారికీ పంపిస్తున్నాను. దయచేసి, వ్యాకరణ దోషాల సవరణ తోపాటు, అచ్చు తప్పులుకూడా సరి చేయమని వారిని కోరుతున్నాను.

    Begin Side Bar:

    I have to tell a story in regard to మ్‌ and సున్న. I have written about this in 1997 (Telusaa), 2006 (Racchabanda), and in 2017 in the Facebook.

    భవభూతి రాసిన ఉత్తరరామచరిత నాటకంలోని ఈ కింది శ్లోకం సంప్రదాయ సంస్కృత సాహిత్యంలో అతి చక్కని ప్రేమ కవిత అని అటు తూర్పున, ఇటుపడమరనా సాహితీ వేత్తలందరూ చెప్పుతారు.

    కిమపి కిమపి మందం మందమాసక్తియోగా-
    దవిరలితకపోలం జల్పతోరక్రమేణా |
    అశిథిల పరిరంభ వ్యాప్రతైకైకదోషనో—
    రవిదితగతయామా రాతిర్‌ ఏవ వ్యరంసీత్ | I.27

    భవభూతి (బహుశా ఎనిమిదవ శతాబ్దం) తన ఉత్తర రామ చరిత కావ్యాన్ని కాళిదాసుకి (బహుశా నాలుగవ శతాబ్దం) ఒక దూత ద్వారా వినిపించాడట! (ఇది చాటు కథ!)ఆ సమయంలో కాళిదాసు చదరంగం ఆడుతున్నాడట. ఆ దూత భవభూతి దగ్గిరకి తిరిగి రాగానే భవభూతి, ‘కాళిదాసు ఏమన్నాడు?’ అని ఆతృతగా అడిగాడట. ‘ఏమీ అనలేదు,’ అని దూత సమాధానం. ‘మొత్తం కావ్యం అంతా విని ఏమీ అనలేదా?’ అని భవభూతి రెట్టించి మరీ అడిగాడట.

    దానికి దూత సమాధానం: ‘కాళిదాసుగారు చదరంగం ఆడుతున్నారు. ఆ చదరంగం ఆట మధ్యలో ఒక పరిచారిక కాళిదాసుకి తమలపాకులు, వక్క, సున్నం తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ తాంబూలం వేసికొని, హుఁ! సున్నం ఎక్కువయ్యింది! అన్నాడు, అంతే!’

    భవభూతి ఈ పై శ్లోకంలో ఆఖరి పాదంలో ‘ ఏవం వ్యరంసీత్‌’ అని రాసి ఉండాలి. వెంటనే ఏవం లో సున్న (nasal) తీసిపారేసి ‘ఏవ వ్యరంసీత్‌’ అని మార్చాడట.

    తమాషా ఏమిటంటే, తెలుగులో సున్న, సంస్కృతంలో మకారప్పొల్లు. ఇక్కడ కాళిదాసుగారిని, భవభూతిగారినీ పదహారణాల తెలుగు వాళ్ళని చేసుకున్నాం. కాళిదాసు సున్నం ఎక్కువయ్యింది అన్న మాట ఈ శ్లోకంలో ఒక ‘సున్నా’ ఎక్కువయ్యింది అన్నట్టుగా భవభూతికి అర్థం అయ్యింది.

    Merwin, Massonలు Sanskrit Love Poetry అన్న సంకలనంలో చెప్పిన కథలో భవభూతే కాళిదాసుకి ఉత్తరరామచరిత అంతా చదివి వినిపించాడని, కాళిదాసు అంతా విని, మొత్తం కావ్యంలో ఒకే ఒక్క శ్లోకంలో ఒక్క మకారపు పొల్లు ఎక్కువయ్యింది అన్నాడని ఉంది.

    ఒక్క మాట కవితార్థాన్ని ఎంత పల్చబడేట్టు చెయ్యగలదో, సంస్కృతం క్షుణ్ణంగా వచ్చిన వాళ్ళకి తెలియచ్చు. రాతిర్‌ ఏవమ్‌ వ్యరంసీత్, అంటే the night has passed in this way అని అర్థం. దాని బదులు రాతిర్‌ ఏవ వ్యరంసీత్, అంటే, only the night disappeared, (but the rest of it continued) అని భావం.

    End Side Bar.

    ఆఖరిగా నా సంజాయిషీ:

    కవిత్వభాషలో ఒక్క అక్షరం అర్థం, అలంకారం మార్చివేయచ్చు. రాసిన మంత్రాలు వల్లించడంలో ఆ తేడా కనిపిస్తుందా? నేను క్లుప్తంగా రాసిన వేదసంప్రదాయ వివాహ పద్ధతి, పాశ్చాత్యదేశాల్లో (ముఖ్యంగా అమెరికా ఖండంలో) స్థిరపడ్డ మన వాళ్ళకోసం. అందుకని, సాధ్యమైనంతవరకూ, ఇంగ్లీషులో భావం ఇవ్వడం జరిగింది. తెలుగులో ప్రతిపదార్థాలు, తాత్పర్యాలూ, వ్యాఖ్యలూ కావాలనుకుంటే, ఉపనిషత్తు మంత్రాలకి, శ్రీ నోరి శ్రీనాథ వేంకట సోమయాజులు గారి ఉపనిషద్దర్శనం – 4, పెళ్ళి మంత్రాలకి, శ్రీ చల్లా లక్ష్మీ నరసింహశాస్త్రి గారి పుస్తకం లోనూ చూడవచ్చు.

    భవదీయుడు,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  178. పుస్తక పరిచయాలు గురించి NS Murty గారి అభిప్రాయం:

    01/02/2021 11:23 am

    కవి అనుభూతి అతని మాటలద్వారా ప్రవహిస్తూ, పాఠకుడిని కూడా సాంద్రమైన అనుభూతికి లోనుచెయ్యగలిగిన కావ్యం కవిత్వం అనుకున్నప్పుడు, మూలా సుబ్రహ్మణ్యం గారి “సెలయేటి సవ్వడి” నా అనుభూతి ప్రమాణంలో నిశ్చయంగా మంచి కవిత్వం.

    ఏ కారణమూ లేకుండా ఆనందించగలగడమే పసితనం. వెనుకనున్న కారణాల వివేచన లేకుండా ఎదురుగా ఉన్న ప్రకృతిని అనుభూతించడమే పసితనం. వయసుతోపాటు మనం పోగొట్టుకునేదీ అదే. పసితనం మిగిలి ఉన్న వారే ప్రేమని నిండుగా పంచి ఇవ్వగలరు. కవిత్వం ప్రేమని పంచుకోవడంలో ఒక భాగం.

    ఈ సంకలనంలో చాలా మంచి కవితలున్నాయి. అందులో ఒక క్షణాన్ని కెమేరాలో బంధించినట్టు చిత్రించిన చాలా చక్కని కవితలున్నాయి.

  179. అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ గురించి వీరభద్రం గారి అభిప్రాయం:

    12/29/2020 1:21 am

    ఇలాంటి వ్యాసం చదవగలగటం నా అదృష్టం.పోతన భాగవతంలోని ఒక యాభై పద్యాలనెంచి,వాటికి చక్కని వ్యాఖ్యను “మందార మకరందాల”ను పేర,సినారె గారు వ్రాసారు కదా!.అలాంటి ప్రయత్నం ఆంధ్రభారతం మీద జరిగిందో,లేదో నాకు తెలియదు. మీబోటి వారు కవిత్రయం వారి భారత సంహిత నుంచి ఇలాగే చక్కటి పద్యాలనెన్నుకుని వాటికి మీ వ్యాఖ్య జోడించి వ్రాస్తే, చదువరులకు ఉపయోగకరంగా ఉంటుంది.

  180. కవిత్వం: దోహదక్రియలు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    12/13/2020 11:11 am

    ఈ వ్యాసం చదువుకోవటం ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది. ఇందులోని పద్యాలు సుందరతలో ఒకటిని మించి ఒకటి ఉన్నాయి.
    వ్యాసం లోని విషయం చదివాక – నేను పూర్వం వ్రాసిన క్రింది పదాలలో ఒకటి కాదు, రెండు ‘దోహద క్రియలు’ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ప్రాచీన సాహితీవేత్తలచే ఆమోదింపబడిన కవితా ప్రక్రియలు ఉన్నాక, నేను రచించింది కవిత్వమే కదా! కాకపోవటం ఎలా?

    Temptress

    గులాబిని చుంబించి
    ఆఘ్రాణించి
    దీర్ఘ నిశ్వాసం విడిస్తే,
    ఒక చుట్టు రేకులు విప్పింది
    ఆశ్చర్యంతో
    మళ్లీ వాసన పీల్చి వదిలాను
    మరో వరస రేకులు విప్పింది
    ప్రతి సారీ అంతటి అందమైన
    ప్రతిచర్యలకు
    చకితనై, పులకితనై
    అర్ధనిమీలిత నేత్రనై
    ఓహో! స్వైరిణీ! అని
    నడిబొడ్డున ముద్దిచ్చి
    చేతిలో పువ్వుతో
    నూర్జహాన్ లా నిలిచాను.

    Have a nice day! -Lyla

  181. తెరుచుకోవు గురించి దివాకర్ గారి అభిప్రాయం:

    12/07/2020 11:58 pm

    ఈమె చాలా చక్కగా తనదైన శైలిలో ప్రకృతిని మనకు కళ్లకు కట్టినట్టు వర్ణిస్తూ కవితల రాసారు. అందరూ తప్పక చదవండి.
    హృద్యంగా కవిత రాయడం ఈమె ప్రత్యేకత..

  182. వీధి అరుగుపై… గురించి సాంబమూర్తి లండ గారి అభిప్రాయం:

    11/19/2020 5:17 am

    జీవం తొణికిసలాడిన కవిత.

    ఉన్నప్పుడు విసుగనిపించవచ్చేమో కానీ
    ఆ వ్యక్తి లేనప్పుడు కనిపించే వెలితి
    అనుభవిస్తేనే తెలిసే బాధ.

  183. ఆగిపోని గానం గురించి సాంబమూర్తి లండ. గారి అభిప్రాయం:

    11/18/2020 8:49 pm

    అద్భుత కవిత.

    పాడాల్సినవి అగణ్యంగా
    పెరిగిపోతూనే ఉన్నాయి (చాలా బాగుంది)

    తుడిచిపెట్టుకు పోతోంది
    (అక్షరదోషం గమనించగలరు)

    [అక్షరదోషాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. — సం. ]

  184. సార్ గారండీ… సార్ గారండీ… గురించి Sambhamurthy Landa గారి అభిప్రాయం:

    11/18/2020 7:57 pm

    కవిత అద్భుతంగా ఉంది.

    చిన్న వివరణ కావాలండి. కవిత మొట్టమొదటి స్టాంజాలో అమ్మాయిని రిఫర్ చేస్తూ… మిగతా కవిత అంతా అబ్బాయిని ఉద్దేశించి చెప్పినట్టు నాకు అనిపించింది.

    ఒక తరం తన నడతను ప్రసవించుకునే వేళ
    నేను మంత్రసాని నౌతాను. క్లాప్స్!

  185. ఐసోలేషన్ గురించి anil Dani గారి అభిప్రాయం:

    10/07/2020 6:11 am

    థ్యాంక్స్ అందరికి. ముందుగా సంపాదకులకి నా కవితని ఈమాటలో ప్రచురణకి అంగీకరించినందుకు. అలాగే స్పందించిన మిత్రులకి పెద్దలకి నా కృతజ్ఞతలు…

  186. అక్కడికి గురించి haranadh obilisetty గారి అభిప్రాయం:

    10/04/2020 6:00 am

    ప్రసాద్ గారూ….
    మీ కవిత అద్భుతం….
    మీరు ఎలాంటి స్థితి నుంచి ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తారు…

  187. ఎవరైనా అడిగితే… గురించి Indraprasad గారి అభిప్రాయం:

    10/02/2020 6:27 am

    మీ కవితలు చదువుతూ ఉంటాను face book లో. నెనర్లు మీకు నచ్చినందుకు.

  188. ఐసోలేషన్ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    09/11/2020 9:34 pm

    కళాత్మకతతో పాటు వర్తమానత, సామాజికత, మానవత్వ దృక్పథంతో కవితలు రాసిన ” ఎనిమిదో రంగు కవి ” అని తగుళ్ళ గోపాల్ గారిచే పాఠకలోకానికి పరిచయం చెయ్యబడ్డ అనిల్ డ్యాని గారు … కలలు పాతిపెట్టబడి, కల్లోలాలు మొలుస్తున్న వేళ… ఒంటరితనం, కనిపించని దిగులు ముసురుకుంటున్న వేళ … ” ఐసొలేషన్ ” హద్దులు దాటి నలుగురికీ వినపడే ఆప్యాయతల గళం విప్పినందుకు నెనర్లు.

  189. ఐసోలేషన్ గురించి Sanjeev గారి అభిప్రాయం:

    09/04/2020 9:25 pm

    అనిల్ డ్యానీ కవితలు చదువుతువుంటే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. అవును కదా..అనే భావన, ఒక కూల్ సినిమా చూసినప్పుడు వచ్చే భావన, కవితలో మనము ఒక భాగం అవుతాం…You are blessed Anil.

  190. ఐసోలేషన్ గురించి venugopal jujjuri గారి అభిప్రాయం:

    09/04/2020 9:38 am

    సృజనాత్మక వ్యక్తీకరణ అంత సులభమైన విషయమేమీ కాదు. అందుకేనేమో కవుల్లో కవిత్వం రాయగలిగినవాళ్ళు తక్కువ.
    మీలాంటి కవులు ఆ లోటును భర్తీ చేస్తున్నారు. అభినందనలు.

  191. డెఫినిషన్స్ గురించి P.Srinivas Goud గారి అభిప్రాయం:

    08/05/2020 9:05 am

    అయ్యా…మీ కవిత్వానికి దాసోహం…నాలుగుసార్లు చదివించావు…చంపి పాతరేసావు పో…

  192. శిలాలోలిత : విషయ సూచిక గురించి udaya గారి అభిప్రాయం:

    07/31/2020 12:05 am

    చాల చదువుతాము కాని ఏ కొన్నో పదే పదే మనస్సును పలకరిస్తాయి అందులో రేవతి దేవిగారి శిలాలోలిత నన్ను ఎంతగా కదిలించిందంటే — ఆ కవితల వెనకాల భావాలు –అక్షరాలతో వ్యక్తీకరించటానికి నేను రేవతి దేవిగారిని కాదే

  193. విరాగి గురించి Siddu గారి అభిప్రాయం:

    07/24/2020 12:46 pm

    మధురమైన చింతన కవిత్వం

  194. విరాగి గురించి S A Rahman గారి అభిప్రాయం:

    07/21/2020 11:17 am

    విరాగి కవిత చాల బాగున్నది.

  195. రాత్రి గురించి srinivas sathiraju గారి అభిప్రాయం:

    07/04/2020 8:25 pm

    రాత్రంటే వయసొచ్చి హార్మోనుల భారంతో అల్లల్లాడడమే అని కవి గారి భావన జాలి కొలిపేలాగ ఉంది.. తీరని కోరికలతో సతమతమయ్యే మధ్య తరగతి కష్ట జీవి బ్రతుకులో ఇంకా కోరికలు రగలుతూ ఉండడం తప్పని సరి సమస్యే కావొచ్చు కాని..జీవితమంటే పగలు రాత్రులే నని ఇద్దరు కలిస్తే వచ్చే మూడో వాళ్ళని, ఆ రాత్రి తాలూకూ భాద్యతలను నెర్పే రోజు కూడా కవి హృదయంలో మెదలాలని ఆశిస్తూ….. ఒక చక్కని పొంగే బీరు లాంటి, కాపు కాచిన విప్పపువ్వు సారాలాంటి కవిత.మాత్రం మత్తెక్కించిందనే చెప్పాలి..

  196. ఉదయానే ఓ రంగుల పిట్ట గురించి Srinivas Banda గారి అభిప్రాయం:

    06/17/2020 11:26 am

    చాలా బాగుందండి! మనం చూసే ప్రతి క్షణం వెనుకా ఎన్నో వేల చేతులుంటాయి.. మనుషులవీ, ప్రకృతివీ! చక్కటి కవిత అందించినందుకు ధన్యవాదాలు!

  197. ముక్కోణాలు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    06/03/2020 2:11 am

    విరబూసిన మల్లె గుబురుని ఒంగి ముద్దాడి అభినందించలేని సౌందర్య రాహిత్య…
    పిచ్చుకల గూళ్ళు పీకి పారేసే కర్కశత్వ …
    ఇచ్చిన మాటలు మర్చిపోయే గందరగోళంలో ఉన్న ప్రేమరాహిత్య…
    ముక్కోణ తిమిరంలో ఉన్న అతడు…
    తమోగుణ అంధకారం నుండి విడివడి ఉషోదయంతో ఉదయించి…
    మదిలో వెన్నెల వెలుగులు నింపేలా తను చెప్పే మాటకోసం
    రాత్రులు మేలుకొనే ఉంటున్న ఆమె…
    అలికిడైతే కిటికీలో పిచ్చుకలు జడుసుకుంటాయని, కదిలితే పవిటచెంగుకి అంటుకున్న గరికపూవులు రాలిపోతాయని తలొంచుకొని పనిచేసుకునే ఆమె…
    ఆమె గుండె మరోసారి పగుళ్లిచ్చింది… అతడి స్పందన రాహిత్యానికి… అంగాత్మ సంధాన యోగ వైఫల్యానికి.

    శివ నివేదనగా, అగ్నితప్తమై మేను త్యాగమిచ్చిన అపర్ణ వేదననూ తలపుకు తెచ్చింది మీ కవిత రేఖాజ్యోతి తల్లీ.

  198. పుస్తక పరిచయాలు గురించి AtreyaSarma U గారి అభిప్రాయం:

    06/02/2020 8:44 am

    ముకుంద రామారావుగారు వివిధ భారతీయ భాషలనుంచి విశిష్టమైన కవితలను మథించి అనువదించి వెలువరించిన బృహద్గ్రంథానికి మరో ఈ సమీక్ష నిండు చంద్రునికి సమర్పించే ఓ నూలుపోగులాంటిది.

  199. పుస్తక పరిచయాలు గురించి ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారి అభిప్రాయం:

    06/02/2020 2:33 am

    ముకుంద రామారావు గారు తనదైన రీతిలో ఇదివరకు నోబెల్ కవిత్వాన్నీ, ఇతర ప్రపంచ కవుల కవిత్వ విపులతనూ పరిచయం చేసినట్టుగానే ఇప్పుడు ఈ ‘ అదే నేల ‘ గ్రంథంలో తెలుగేతర భారతీయ భాషల్లోని కవిత్వ మాధుర్యాన్ని చాలా లోతుగా పరిచయం చేశారు. ఇంత విస్తృతంగా ఒకే ఒక్క మనిషి ఎట్లా చేశాడబ్బా అని ఆశ్చర్యం కలిగించే రీతిలో ఈ పుస్తకం విస్తరించింది. ఇంతవరకు ఎవరూ ఇంత వైశాల్యంతో కవిత్వ విశ్లేషణను చేసింది లేదు. ఇటువంటి రచన చేయడానికి ఎంతో మగ్నతతో కూడిన తపస్సమాన దీక్ష కావాలె. అటువంటి లీనతతో రామారావు ఈ ఘన కార్యాన్ని సాఫల్యపర్చారు. ఈ సందర్భంగా నాకు మంచి మిత్రుడైన రామారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

  200. పుస్తక పరిచయాలు గురించి Dr. Veldandi Sridhar గారి అభిప్రాయం:

    06/01/2020 10:46 pm

    ఒక గొప్ప పుస్తకానికి అంతే గొప్ప పరిచయం బావుంది. ఉటంకించిన కవితలను బట్టే తెలుస్తుంది ఇది సాధారణ పాఠకులకే కాదు కవులకు కూడా పాఠ్య గ్రంథమని ఇలాంటి గొప్ప పుస్తకాన్ని అందించిన ముకుంద రామారావుగారికి, పత్రిక సంపాదకులకు అభినందనలు…

  201. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    06/01/2020 12:58 pm

    ఈర్ష్యాసూయల బురదగా, గోముఖ వ్యాఘ్రాల బజారుగా, మనో వికారాలకు యవనికగా ఉన్న మాయా మయసభ వ్యామోహం నించి ( సోషల్‌ మీడియా కీకారణ్యంలో నించి, ప్రసార మాధ్యమాల వెల్లువనించి ) తప్పించుకోవడానికి భగీరథ ప్రయత్నం చేసి…

    1) మొబైల్ ఫోనులో సందేశాలు చదవడం అనే దురలవాటును బలవంతంగా తెంచివేసి
    2) సోషల్ మీడియాతో అనుబంధాన్ని తాత్కాలికంగా ఉత్తరించి
    3) అనవసర సమాచార మార్గాలూ శాశ్వతంగా మూసివేసి

    ఆధ్యాత్మిక చింతనకి, ప్రాచీన వాఙ్మయం గ్రంథ పఠనానికి, సాంకేతిక విద్యల సాధనకు… ఏకాగ్రత కుదిరింది, శాంతి కలిగింది అన్న కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి గారికి హార్ధిక అభినందనలు.

    అయినా…. దైనందిన జీవితంలో కొంత సమయం వీటికీ కేటాయించగలరు… కొన్ని పత్రికలు చదవటం ( The New York Times, The Washington Post, The Wall Street Journal, The Guardian, the Times of India, The Hindu Newspaper )… కొంత తెలుగు సాహిత్యయానం చెయ్యడం ( కొడవటిగంటి కుటుంబరావు, చాసో, రావిశాస్త్రి, విలక్షణ కధకుడు త్రిపుర; శ్రీశ్రీ, తిలక్… తెలుగు కవిత్వాన్ని శాసించిన దిగంబర ఉద్యమ కవుల్లో ఒకరైన మహాస్వప్న …)

  202. సాయం ఛాయ గురించి nagamurali గారి అభిప్రాయం:

    05/10/2020 11:36 pm

    బాగుంది కవిత. నా కూతురికి (పదమూడేళ్ళు) చదివి వినిపించాను డ్రమటిక్ గా. ఇద్దరం బాగుందని నవ్వుకున్నాం.

  203. కెహర్వా! గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    05/08/2020 12:27 pm

    >> ఎందుగాల్నంటే కెహర్వా వొంటి మాట ఈడ సర్పోయె గావట్టి.

    అయ్యా కెహర్వా అనేది సరిపోలేదనీ ఆ మాట చెడ్డదనీ నేననలేదు. ఓ సారి సరిగ్గా చదవండి. హిందీలో ‘హమ్ దో హమారే దో’ అనేదాన్ని పొందికగా ‘మేమిద్దరం మాకిద్దరు’ అని తెలుగులో అందంగా కూడా అనవచ్చు. నా ఏడుపు ఏమిటంటే మొత్తం కవిత అద్భుతంగా తెలుగులో రాయగల్గినవారు ఆ కవిత కి పేరు తెలుగులో ఓ మంచి పేరు ఎందుకు పెట్టలేకపోయారు? ఒక్క తెలుగు పదం దొరకలేదా? మీరు రాసేది తెలుగు పత్రికకి, మీకు తెలుగు వచ్చు, మరి ఏమిటి అభ్యంతరం? కెహర్వా కి సరిపోయే పదం హిందీలో మరోచోటో ఉండడం అసంభవం అంటారా, సరే ఆ మాటతోటే మీకు తెలుగు భాష పట్ల ఉన్న న్యూన్యత అర్ధమౌతోంది.

    తిరుపతిలో కూడా ఇదే సంత. తిరుమంజనం, ఆళ్వారుకోయిల్, అనేటువంటి తమిళ పదాలు వాడ్డానికి తెలుగువాళ్ళమైన మనం సిధ్ధమే కానీ తెలుగు నాట ఉన్న తిరుపతిలో ఉన్నదేవుడు ఎవరు అంటే “శ్రీవెంకటేశ్వరుడు” అని చెప్పడానికి మనకి ఇష్టం ఉండదు. ఆయన్ని బాలాజీ అనీ ఉండేచోటు ఏలుమలై అనీ, మరోటనీ అనడానికెప్పుడూ సిధ్ధమే. ఆ మధ్యన ఏలూరులో భోజనానికి వెళ్ళాం హోటల్ కి. వడ్డించే కుర్రాణ్ణి ‘చారు’ ఉందా అంటే నవ్వు. చారు అనకూడదుట; రసం అనాలి. ఎక్కడి మద్రాస్, ఎక్కడి ఏలూరు? నేనూ మద్రాస్, మధ్యప్రదేశ్ లలో చదువుకున్నవాణ్ణే, ఎవో రెండు మూడు తమిళ/హిందీ వ్యాక్యాలు మాట్లాడి, రాసి, చదవగలిగినవాణ్ణే. కానీ ఏలూరు లో తమిళం ఎందుకు మాట్లాడాలి? మన భాష తల నరుక్కుని తెలుగుతల్లిని పబ్లిగ్గా రోడ్డు మీద మానభంగం చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధమే. దానికి పేద్ద ఉదాహరణ మన ముఖ్యమంత్రిగారే. తెలుగు మాధ్యమం అక్కర్లేదని ఓ ఆర్డర్ పారేసారు. తెలుగు అక్కర్లేదు, రెండో భాషగా హిందీ, మూడో భాషగా ఫ్రెంచ్ లేదా సంస్కృతం తీసుకుంటాం. వాటికి సమాధానాలు ఇంగ్లీషులో రాసేయవచ్చు. నూటికి 90 వేస్తారు. పోనీ బయటకి వచ్చాక ఆ భాషలు వస్తాయా మనకి? తెలిసీ తెలుగుని సర్వనాశనం చేసుకునేది మనమే. ఇంగ్లాండ్ నుంచి మనని ఏలడానికి వచ్చిన కాటన్, బ్రౌన్ లు కూడా ఎప్పుడూ తెలుగు తల్లిని మానభంగం చేయాలని చూడలేదనుకుంటా. దానిబదులు వాళ్ళు నిఘంటువులు తయారు చేసుకుని తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నించి తెలుగుతల్లికి పట్టుచీర కట్టడానికి ప్రయత్నం చేసారని నేను అనుకుంటున్నాను – నాకు తెల్సినంతలో. మన తమిళ తంబిలు కూడా సంగీతం నేర్చుకునేటపుడు చివరకి ఒక్క త్యాగరాజ పంచరత్న కృతి నేర్చుకుందామనే అనుకుంటాడు. మనమో? ఒక్క మాట గమనించండి – నాకు తెల్సినది “అతి” తక్కువ, అది ఒప్పుకోవడానికి ఏమీ సిగ్గు పడడం లేదు.

    >> అయితెగాని అది గట్ల పక్కంబెట్టి జూస్తే మీర్మట్కు సంపాదకుల గూర్సి ఎప్పుడు జూసినా మంచి మాటల్ జెప్త ఉంటరు.

    సంపాదకుల దగ్గిరనుంచి “నేను మాత్రమే” నేర్చుకున్నవి అలా చెప్పానండి. మీకు నచ్చాలని ఎక్కడాలేదు. నేను రాసిన కధలూ, పత్రాలూ అనేకానేక సార్లు దిద్దించుకుంటూ అక్షింతలు వేయించుకుంటూ ఉంటా – ఇది దాదాపు ప్రతీసారీ జరిగేదే. అందువల్ల మొదట్లో వచ్చే కోపం, కన్నీళ్ళూ అన్నీ కట్టిపెట్టి వాళ్లెందుకు అలా చెప్తున్నారా అని ఆలోచించడం మొదలుపెట్టాక నా రచనా జీవితం బాగు పడింది. ఇది మరోసారి చెప్తున్నా మళ్ళీ గొడవ లేవదీయకండి – నాకు జరిగినట్టూ మీకు జరగాలని ఎక్కడాలేదు. అందువల్ల మీకు నచ్చకపోతే దానికి నేను బాధ్యుణ్ణి కాదు. మరో విషయం. నేను రాసేవన్నీ సంపాదకులు మెచ్చేసుకుంటారని మీరనుకుంటే అది శుధ్ధ తప్పు. ఎందుకంటే ఈమాటవారే నేను పంపేవి ఎలా ఎందుకు నచ్చలేదో చెప్తూ ఉంటారు. నచ్చినా అందులో రెండేసి పంక్తులూ, పేరాలు, పుఠలూ తీసేస్తారు. అది వాళ్ల ఇష్టం. ఒక్కొక్కప్పుడు నేను రాసినవి నచ్చకపోతే – ‘అసలిది మేము వేసుకుంటామని ఎలా అనుకున్నారు?’ అని అడుగుతారు కూడా. కొంతమంది ఏమీ చెప్పరు. ఎన్ని సార్లు అడిగినా మౌనమే నీ భాష ఓ మూగ మనసా’. రెండే రెండు రోజుల క్రితం ఒక సంపాదకులు పంపిన సమాధానం – “మీరు రాసినది మా వెబ్ సైట్ లో వేసుకోవడానికి పనికిరాదు అని మేము తేల్చాము.” ఆ తర్వాత ఎన్ని సార్లు ‘అమ్మా దీన్ని ఏమి చేసి బాగు చేయవచ్చో చెప్పగలరా?’ అని అడిగినా సమాధానం రాదు. ఇంకా వీళ్ల గురించి వివరంగా చెప్పాలంటే కిందన చూడండి.

    >> సంపాదకులెవ్వలైన గాని ఏద్జూసినా సరే ఆల్ల నోటనుంచి వచ్చేట్ది, అనంగా మొదటి మాట ఏందంటె “ఇది బాగలె” …ఆల్లు ఆ మాటను గాట్టిగ పట్కోని కూకుంటరు.

    ఎవరైనా రాసినది సంపాదకులు మనం రాసినది వెంఠనే ఎందుకు వేసుకోవాలంటారు? వాళ్ళ కష్టాలు వాళ్లకున్నాయి. నేను పాతిక పేజీలు కధ రాసాననుకోండి. దాన్ని పది పేజీలు మించకుండా కథ సరిగ్గా చెప్పవచ్చేమో? ఆ మధ్యన ఒక పరిశోధన పత్రం రాసాను. పది మంది దిద్దాక చెప్పారు – “అయ్యా ఇది బాగానే ఉంది కానీ పేజీకి పాతిక తప్పులున్నై అని మేము అనుకుంటున్నాం. దిద్దితే వచ్చే ఏడు – అంటే ఎనిమిది నెలలు ఆగాలి – వేసుకుంటాం. లేకపోతే మీకో దణ్ణం మా సమయం చెడతినకండి.” ఏదైనా నేను రాసినది నా కళ్ళకి అద్భుతమైన వస్తువు. అది సంపాదకులకి ఎందుకు నచ్చాలి? మీరో కవిత రాసారనుకుందాం. ఎవరో చదివేసి ‘అద్భుతం’ అన్నారు. మరోటి మరోటీ రాసారు. ఎప్పుడూ కూడా అదే సమాధానం వస్తోంది. అంటే ఏమిటో తెలిసిపోతోంది కదా – మీరు రాసేది అవతలవాళ్ళు చదవడంలేదు. మీరు పంపారు కదా అని అద్భుతం అంటున్నారంతే. ఫేసు బుక్కులో లైకులు, ఫోనుమీద వచ్చేవీ ఇటువంటివే. ఎవరికీ తీరికలేదు. అవతల వాడు ఏదో పెట్టాడు పేజీలో నేను వాడి స్నేహితుణ్ణి కనక ఓ లైకు కొట్టేసి తప్పుకుంటే చాలు. లైకు కొట్టకపోతే వాడేమనుకుంటాడేమో అని మరో చింత.

    ఇప్పుడు మీరు అదే కవిత సంపాదకుడికి పంపారు, ఆయన – “అబ్బాయి ఇందులో అక్షర దోషాలున్నై, కవిత పెద్దదైంది ఇలా చేస్తే బాగుంటుంది” అన్నారనుకోండి. దానివల్ల మీకు కొత్తగా కవిత చిన్నదిగా పొందిగ్గా రాయడం ఎలా అనేది తెలియవచ్చు. మీ కళ్లలో కనిపించని అక్షర దోషాలు ఆయనకి కనిపించినై. ఇప్పుడు చెప్పండి మీక్కావాల్సింది ఇటువంటిదా లేకపోతే ఫేసుబుక్కు లైకులా? నా మటుక్కి నాకు ఎవరైనా నేను రాసేదాంట్లో ఫలానాది ఇలా చేస్తే బాగుండొచ్చుఅని చెప్తేనే నా రాత బాగు పడొచ్చు అనిపిస్తుంది. ఇంకో విషయం నేను రాసిన పాతికపేజీలు కథ వేయాలంటే సంపాదకులకి తలనెప్పి – వెబ్ సైట్ మీద కంటెంట్ వల్ల, పుస్తకంలో కాయితాల వల్లా, పొడుగు వల్లా, అంత పెద్దది అసలు మన పాఠకులు చదువుతారా అనేదాని వల్లా. మొదట్లో చెప్పినట్టూ వాళ్ళ కష్టాలు వాళ్లవి. మీకు ఇష్టం ఉంటే రాయండి లేకపోతే మీ ముక్కు మూసి, మీ గొంతుకలో బలవంతంగా ఎవరూ కాకర రసం పోయాలనీ అది మీరు మింగి తీరాలనీ చూడడం లేదు కదా? అసలు ఈ పత్రికలు చదవమనే మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేరు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం పత్రిక వాళ్లది. మిమ్మల్ని బొట్టుపెట్టి పిల్చి రాయమన్నారా? చదవమన్నారా? నేను పంపించే పత్రికల్లో, పరిశోధన పత్రాల్లో ‘బాగాలేదు, దిద్దండి, వేసుకోం’ అనే సమాధానాలు నూటికి 99 సార్లు వస్తాయి. మీకు ఇంకా తెలియకపోతే ఇది వినండి. మొదట్లో నేను ఈమాట పత్రికకి ‘అతి ఉత్సాహం’ వల్ల టాల్ స్టాయ్ కధ ఒకటి తెలుగులో ముక్కస్య ముక్కార్ధంగా రాసి పంపించా. “అనువాదం అంటే ఇది కాదండి, కొన్ని చోట్ల మిగతావాళ్ళు చేసిన అనువాదాలు చూసి నేర్చుకోండి’ అని చెప్పారు. ఇదేమిటిలా అన్నారని వెనక్కి చూసుకున్నాక మిగతావి చేయగలిగాను. అందువల్ల నేను నేర్చుకున్నా కొన్ని విషయాలు. అయితే అందరికీ అలా అవ్వాలని లేదు. నాకొచ్చిన పదో తరగతి తెలుగుకంటే ఇక్కడ అతిరధ మహారధులైన రచయిత(త్రు)లకి చాలా బాగా వచ్చు. వాళ్ళకి ఎలాంటి అనుభవం అయిందో నాకు తెల్సుకోవల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టకష్టాలు వారివి. మరోమాట చెప్పనివ్వండి. సంపాదకులు వేసేవన్నీ మహా గొప్పవేమీ కానక్కర్లేదు. కొండొకచో వాళ్లకి నచ్చినవి పాఠకులు మెచ్చరు. మనం నేర్చుకుంటున్నట్టే వాళ్లకీ ఓ లెర్నింగ్ కర్వ్ ఉందనేది పచ్చి నిజం.

    >> పోతె మీరు “డు” అనె పదం పుచ్చుకోని ఎన్ని పైదా బెట్టించొచ్చు అని అడ్గిరి. నే లెక్కెసిన, 3666 పదాలు పైదా అయితయ్…ఔ! తీన్ హజార్ పైననే అయితయ్! కావల్నంటె ఫ్రి డిక్షనరి డాట్ కాం లా సూస్కోండి.

    Do అనే దానిలో D, O అనే రెండు అక్షరాలతో మొదలయ్యే పదాలు లెక్కబెట్టినట్టున్నారు. నేను చెప్పినది “Do” అనే క్రియాపదంలోంచి వచ్చే పదాలు. చేయు, చేయను, చేయించు, చేయగలను వగైరా. కవిత చాలాబాగుంది అందువల్ల శ్రీనివాస్ గారికి అభినందనలు చెప్పాలి. చివరగా, ఈ వ్యాఖ్యల వల్ల కవిత గురించి మనం అసలు విషయం మాట్లాడ్డం మానేసి పక్కదోవపడుతున్నాం కనక ఇక్కడ ముగిద్దాం. దయచేసి ఇంక లాగకండి. మీరు చెప్పినట్టుగా ఇంగ ఇక్కడ్నే ఉందాం. 🙂

  204. అసలేం చేశానని?! గురించి దార్ల వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం:

    05/04/2020 9:57 pm

    గిరిధరరావుగారూ, నమస్కారం
    ఎంత చక్కని భావుకత. పెర్సానిఫికేషన్ చేయడంలో కవి ప్రతిభావంతుడైతే తప్ప ఇలాంటి చక్కటి భావచిత్రాలు సాధ్యం కాదు. మొక్కను మహావృక్షంగా మలచడం, తర్వాత దాన్ని మనం అందుకోలేకపోవడం…ఆహా…ఎంత బాగుంది. ఇందులోని మొక్క మొక్కే అయితే కవిత్వమేముంది. అదే మనల్ని భావుకతవైపు నడిపిస్తుంది. ఎంతైనా వ్యాఖ్యానం రాయిస్తుంది.
    మరో సారి నమస్కరిస్తూ…దార్ల వెంకటేశ్వరరావు

  205. కెహర్వా! గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    05/04/2020 11:31 am

    ఈమధ్య ఒక గాయకుడి పాటని విన్న తర్వాత, మళ్లీ అప్పటి తాదాత్మ్యతని రుచి చూసేను. ఈ పంక్తులు రాసుకున్నాను.. ఆ పేరు పెట్టటమే ఉచితమనిపించింది.

    రెండు విషయాలండి.

    మొదటిది – వంగూరి వారు ప్రచురించిన పుస్తకంలోది – పారుపల్లి కోదండరామయ్య గారు రాసిన "తెలుగే గొప్ప భాష" – తెలుగులో ఒక క్రియా పదం నుంచి వందల కొద్దీ పదాలు పుట్టించవచ్చు. ఉదాహరణ – "చేయు" అనే పదం తీసుకుని నిఘంటువు చూడండి. అదే ఆంగ్లంలో Do అనే పదం నుంచి ఎన్ని పుట్టించవచ్చు? మీరు రాసిన తెలుగుబట్టి మీకు తెలుగులో మంచి పట్టు ఉంది. దానితో ఈ కవితకి మంచి పదం అల్లలేరా? ఆ తాళం ఎంత గొప్పదైనా మీరు రాసే కవితకి తెలుగు పేరు పెట్టలేరా?

    రెండోది – ఈనెల ఈమాటలోనే (మీరే గాబోలు వ్యాఖ్య కూడా పెట్టారు) సంపాదకులు మాధవ్ గారు ఒక వ్యాసం ప్రచురించారు "ఈమాట సంపాదకుల పధ్ధతి" అని. నేను పైన ఉదహరించిన మీ వాక్యాలు ఒకసారి ఈ వ్యాసానికి కలిపి చూసుకుంటే సరిగ్గా మీరు అనుకున్నదీ, సంపాదకులు చెప్పే విషయం తేటతెల్లం అవుతున్నాయి కదా?

    చాలాసార్లు ఇటువంటి సందర్భం నాకు కూడా తగిలింది. ఇప్పటికీ తగుల్తూనే ఉంది. సంపాదకులు చెప్తూ ఉంటారు – మీరు పంపిన కధ/కవిత మీరు అనుకున్న "పేద్ద గొప్పగా" ఏమీ లేదు అని. వాళ్ళు అనా అన్నాక మొదటగా కోపం, తర్వాత అసంతృప్తి, తర్వాత ఆలోచన, ఆ తర్వాత మొహమాటం లేకుండా చెప్పినందుకు, అలా చెప్పడం వల్ల నా రాతలు బాగుపడతాయనే ఆశ, సంతోషం వగైరాలు. ఫేసు బుక్కులో కొట్టే లైకులూ, ఏ పత్రికలో అయినా ఎవరైనా చెప్పే ఆహా, ఓహోలూ నాకు చారులో కరివేపాకులా వాసనకి తప్ప ఎందుకూ పనికిరావని తెలిసివచ్చేలా చేసాయి. అందువల్ల ఇటువంటి సునిశితంగా పరిశీలించి చెప్పే సంపాదకుల వల్లే నేను బాగుపడతానని తెలుసుకుని ఇప్పటికీ తిట్లు తింటూన్నా వాళ్లకే పంపుతూ ఉంటా. ఇది నా స్వంత అభిప్రాయం. ఈ వ్యాఖ్య చదివే ఇతరులూ, మీరూ కూడా అడగలేదు కనక మీరు స్వీకరించకపోయినా నేనేమీ అనుకోను.

    ఇంతకీ నా అసలు ఆలోచన ఏమిటంటే – మొత్తం అద్భుతమైన తెలుగులో రాసిన కవితకి పైన పెట్టిన పేరు – అదీ ఈమాట అనే తెలుగు పత్రికలో – పంటికింద ఇంగువముక్కలా తగిలింది. అది "మీకు మాత్రం" ఉచితమని అనిపిస్తే అది వేరే కథ.

  206. గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం గురించి lalitha n గారి అభిప్రాయం:

    05/04/2020 10:20 am

    స్త్రీవాద కవితా సంకలనాలు ఉంటే పెట్టగలరా (నీలిమేఘాలు, గురిచేసిపాడేపాట కాకుండా).

  207. మౌనవిపంచి గురించి Kishore Karnam గారి అభిప్రాయం:

    05/02/2020 12:26 pm

    అధ్బుతమైన కవిత భావవ్యక్తీకరణ.

  208. ఒకానొక ఊట కోసం గురించి Spoorthy గారి అభిప్రాయం:

    05/02/2020 9:58 am

    చాలా బాగుంది జానీ గారు. చాలా డీప్ మీనింగ్ ఉంది మీ కవితలో.

  209. కెహర్వా! గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    05/01/2020 12:18 pm

    ఒక చిన్న ధర్మ సందేహం. కష్టపడి ఆలోచించి పొందిగ్గా మొత్తం తెలుగులో కవిత రాసిన వారు – విషాదానందం, స్వరతరంగం, విశ్వాంతరాళం, వక్షాంతరాళం అనులోమాలాపనం, తాళముద్ర – అనే పదాలు అల్లగల కవి అయ్యుండీ, ఆ కవితకి పేరు – ఒకే ఒక పదం – తెలుగులో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎంతకాలం ఈ దరిద్రం మన తెలుగుకి?

  210. ఒకానొక ఊట కోసం గురించి Palagummi Padmavijay గారి అభిప్రాయం:

    05/01/2020 11:24 am

    గుండెలో ఏదో తెలియని బాధ కలిగింది. కవితలో భావవ్యక్తీకరణ అద్భుతంగా ఉన్నది.

  211. ఒకానొక ఊట కోసం గురించి కొండవీటి అంతయ్య గారి అభిప్రాయం:

    05/01/2020 7:53 am

    తెలుగు మాటలను మీకే సొంతమైన రీతిలో, నవ్య భావాలతో ప్రయోగిస్తూ రాసిన మీ కవిత చాలా బాగుంది!

  212. ఒకానొక ఊట కోసం గురించి సిరిపురపు శ్రీనివాసు గారి అభిప్రాయం:

    05/01/2020 7:00 am

    నదులు సముద్రాలుగా కదులుతున్న చీకటి
    క్షణాలుగా విస్ఫోటనమైన దేహం
    ఎప్పుడూ గాయాలుగానే ప్రవహిస్తుంటుంది.
    ఊపిరి ఏ సమయంలోనైనా
    మట్టిలో తల దాచుకుంటుంది.

    అద్భుతమైన భావాల సమాహారం మీ కవిత.

  213. ఒకానొక ఊట కోసం గురించి వారణాసి భానుమూర్తి రావు గారి అభిప్రాయం:

    05/01/2020 6:32 am

    జానీ తక్కెడ శిల గారి కవితలో వస్తు వైవిధ్యం కనబడుతుంది. ఆయన కవిత చక్కని వచన కవితా ప్రమాణాలతో ఉంది.శీర్షిక ‘ ఒకా నొక ఊట కోసం ‘ కవితకు తగ్గట్లుగా ఉంది.చక్కని ఎత్తుగడ , ముగింపు తో కవిత చక్కగా ఉంది.గాయాలన్నీ గేయాలు కావడానికి ఒక ఊపిరి కావాలి, ఊపిరి ‌ఒక అపనమ్మకం..ఏ సమయంలో నైనా మట్టిలో దాక్కొంటుంది అనే పద బంధాలతో కవిత చక్కగా సాగింది. కవికి అభినందనలు.

  214. ఒకానొక ఊట కోసం గురించి A. Syamasundar గారి అభిప్రాయం:

    05/01/2020 6:20 am

    హృదయాలను కదిలించి ఆలోచనలను రేకెత్తించే కవిత!

  215. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    04/21/2020 11:17 am

    “ఇక గూగులమ్మ ఇచ్చిన కవి పరిచయం: జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి.”

    నమస్కారం రామయ్యగారు!
    చాల శ్రద్ధతో తెలుగు సాహితీకారుల whereabouts, what other things they are into, తెలుపుతున్నారు. Very nice of you!

    నేను ఇలాటి విశేషాలు చదువుకుంటూ, ఇల్లు సర్దుకుంటూ, చుట్టూ పక్షుల కూతలు వింటూ, తోటలో కొత్త కొత్త పూలు ఏం పూసినవో చూస్తూ, ఏరోజు సుఖం ఆ రోజుకి కేష్ చేసుకుని, జాలీగా ఉంటానా;
    మధ్యే మధ్యే ఎంతో జాలి గొంతుతో, “అయ్యో, అమ్మో, వెంటిలేటర్లు చాలక, ఒక వయసు దాటిన వాళ్లని హాస్పిటల్ లో వెంటిలేటర్ల మీద పెట్టటం లేదంట, నువ్వు జాగ్రత్తగా ఉండాలి,” అని ఫోన్లు వస్తూంటాయి.

    నాకు వళ్లు మండి;
    “ఎవడేడిసాడు ఇప్పుడు నన్ను వెంటిలేటర్ మీద పెట్టమని, నువ్వు రోజూ హాస్పిటల్ కెళ్లొస్తావు, నువ్వే జాగ్రత్తగా ఉండు, ఇప్పటిదాకా హాయిగా ఊపిరాడతా ఉంది. ఇప్పుడు నీమీద అరిసి, అనవసరమైన ఆయాసం. గో డిక్టేట్ యువర్ మెడికల్ ఛార్ట్స్, డోంట్ బాదర్ మీ” -అంటాను నేను.

    ఇంకో పక్కనుండి ఇండియా లో వాళ్లకు తెల్లారింది కదా అని, నాకు అర్ధరాత్రో, అపరాత్రో గమనించకుండా, పనిమాలా నాకు ఫోన్ చేసి;
    మా అమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు నాకు ఫోన్ చెయ్యకపోవటం తనకు చాలా బాధ కలిగించిందంటుంది ఇంకో చుట్టం! అంతకు ముందు వారం వారం, ఆ 100 దశకం లోని అమ్మ, అనారోగ్యం మూలాన తనతో చేయించే సర్కస్ తనే ఫోన్ చేసి నాతో చెప్పుకున్నది కదా! విన్నది నేనే కదా! మరి, ఇప్పుడు వాళ్లమ్మ చావు తనకు బాధే కలిగించిందో, రిలీఫ్ ఇచ్చిందో తనే కొంచెం సోల్ సర్చ్ చేసుకుని మాట్లాడితే న్యాయం! నా మీద ఈ తెలుగు ట్రెడిషనల్ గిల్ట్ ట్రిప్ ఎందుకు! ఇంతలోనే ఆమెకు మాయ ఏమ్నీషియా!
    నేను ఏమీ చచ్చు లేకుండా, ఫ్రాంక్లీ మై డియర్! ఐ డోంట్ గివ్ ఏ డామ్! ఐ డోంట్ కేర్! అన్నాను! ఈ ట్రాజిక్ క్వీన్లందరినీ వీళ్ల ప్రతి ఆనవాయితీ ‘టైమ్ ఆఫ్ నీడ్’ లో నేను సపోర్ట్ చెయ్యలేను.

    జెన్యుయైన్ గా -ఆనందించటంలో నాకెక్కువ ఆసక్తి ఉంది. తెచ్చిపెట్టుకుని విషాదించటమంటే పరమ విరక్తి.

    అసలుకి ఆ పోయిన నా పెద్దచుట్టం, అమెరికాలో ఉన్నప్పుడు, ఇన్నీ అన్నీ తెలుగు సామెతలు గావు నాకు చెప్పినవి! ప్రతి సందర్భానికీ ఒక సామెతుండేది ఆమె వద్ద. మా సంభాషణ ఆమె గాని వినుంటే “ ఏడిసి తద్దినం పెట్టించుకున్నట్టుంది’ ‘కడుపులో లేనిది కావిలించుకుంటే వస్తుందా’ ‘చచ్చిన గొడ్డు ఎక్కువ పాలిస్తుందంట’ ‘తంగేళ్లు దాటాక భ్రమత లెక్కువ’ ఇందులో ఏదో ఒకటి ఆమే అనుండేది.

    నన్ను విచ్చలవిడిగా వదిలేస్తే, నేనిలా రాసుకుంటూ పోతుంటాను. అసలెందుకు రాస్తున్నట్టు నేను!

    రామయ్యగారూ! “మీలాటి సాహితీ పెద్దలు” అని మీరు ఒక సమాసం వేసి ఈ pandemic time లో నన్ను పెద్దల్లో కలిపేసారు, అని నవ్వొచ్చి రాసాను. ఈ కవి – ఇంగ్లిష్ లో, హిందీలో కూడా కవిత్వం రాస్తారని మీరు చెపితే సంతోషించి రాసాను. ఎంతమందో భారతీయులు చక్కని ఇంగ్లిష్ రాస్తారు. నారాయణరావు ఇంగ్లీషులో తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవులను ప్రపంచానికి పరిచయం చేసాడు. Did he enrich Telugu Literature? Or did he enrich English Literature! నా ఉద్దేశంలో నారాయణరావు -ప్రేమతో, దీక్షతో, తెలుగు సాహిత్యాన్ని, ఆ పైన ప్రపంచ సాహిత్యాన్నిపెంపొందించాడు. తెలుగు భాషను ప్రపంచ భాష చెయ్యటం అంటే ఏమిటి! ఏ పార్లమెంట్ లోనో ఓట్ చేయించి, రాజకీయంగా ప్రజలను ఒప్పించటమా! లేదండి! సాహిత్యం తనంత తానే మెప్పించి ఒప్పించాలి. ‘ఈమాట’ లో సాహిత్యం మీద కన్నా, తెలుగులో రాయాలా, ఇంగ్లీష్ లో రాయాలా, కలగలుపు భాష రాసే దుర్మదాంధులను ఏం చెయ్యాలి! -ఇలాటి డిస్కషన్స్ శాతం ఎక్కువ! సాహిత్యం మీద మనసు లగ్నం చేస్తే, ఈ మేగజీన్ కి పులిట్జర్ ప్రైజ్లు వచ్చునేమో! అని ఆశతో రాసాను.

    As I write this prose, I hear the singing of Thrush. This decastich I wrote sometime before, stealthily found it’s way back, into my conscience.

    “Don’t ever please pen a song
    If no lover is climbing a ladder rung
    To tumble you in hay, to have a fling
    Don’t you then please sing a song
    The nightingale will forget its notes
    The azalea bush will shed its buds
    The shrill sounds of your throat
    Will kill all that is lovely and sweet
    The sky unwraps its gloomy dark cloud
    April will go and wear a shroud.”

    -Lyla

  216. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    04/17/2020 10:18 am

    డా. లైలా ఏర్నేని గారూ.. నమస్కారములు.

    కవి జాని తక్కెడశిల గారిని ఆశ్వీరదిస్తున్న యీ నాగరాజు గారి (వీరు శ్రీ పప్పు నాగరాజు గారై ఉందురా) పదబంధనాలని ఇలా విశదీకరించుకోవాలని ఉంది. ఆపై దీని టీకా తాత్పర్యాలు మీలాంటి సాహితీ పెద్దలను అడిగి తెలుసుకుంటాను.

    ” కవిగారూ ….పద్యమై, గద్యమై, వచనమై, గణయతిప్రాసాను ప్రాసలమయమై …రహితమై… పరహితమైన పదబంధమై… జనరంజిత అక్షరమై… ప్రక్షేపిత కిరణమై… ప్రక్ష్వేడనమై… ( ప్రక్ష్వేడన=బాణములయొక్క ) ప్రతిధ్వనించగలరు….! ”

    పులివెందుల, అనంతపురం, సింగమనేని నారాయణలతో జతపడి ఉన్నాడని తెలిసి మురిసిపోతూ… వర్ధమాన కవి జాని తక్కెడశిల గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.

    ~ ఇట్లు త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు.

    ఇక గూగులమ్మ ఇచ్చిన కవి పరిచయం: జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి. సామాజిక సమస్యలను కవితా వస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. కవిత్వంతో పాటు కథలు, గేయాలు, విమర్శలు, సమీక్షలు, నానోలు, నానీలు, నక్షత్రాలు రాశారు. బాల సాహిత్యంలోనూ విశేష కృషి చేస్తున్నారు. వీరు రచించిన అనేక కవితలు, కథలు, వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి.

    మొదట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా వివిధ సంస్థలలో పని చేశారు. ప్రస్తుతం ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ కి మేనేజర్ గా ఉన్నారు.

    వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వీరి స్వస్థలం. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో వీరి మొదటి పుస్తకం అఖిలాశ 2017లో జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంట్లో పుస్తకావిష్కరణ చేశారు. రెండవ కవితా సంపుటి విప్లవ సూర్యుడు వై.ఎస్ అవినాష్ రెడ్డి గారు 2017లో పులివెందుల ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. మూడవ కవితా సంపుటి నక్షత్ర జల్లులు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారితో అనంతపురంలో ఆవిష్కరణ చేశారు. నాల్గవ కవితా సంపుటి (హిజ్రాలపై దీర్ఘ కావ్యం) రాయలసీమ కథా శిఖరం సింగమనేని నారాయణ గారితో ఆవిష్కరణ చేశారు.

  217. నీ లోపలి నిజం గురించి నాగరాజు గారి అభిప్రాయం:

    04/17/2020 1:24 am

    లోపలి ‘నేను’కు అక్షర అలంకరణ ఈకవిత… కానీ దృశ్యం ద్రష్ట ఒకటేగా, అప్పుడు లోపల బయట నిజం (truth) ఒహటే.

  218. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    04/05/2020 1:44 pm

    చాలా బాగున్నది కవిత.

    ఐతే, గంటగంటకీ బజాయిస్తున్న, CDC నగారాల వల్ల కాబోలు, ‘పద్యం’ అన్న చోటల్లా ‘వైద్యం’ అని తిరగ చదువుకున్నాను. అప్పుడచ్చంగా the poem for the right moment అనిపించింది.

    ఎవరి preoccupations, occupational health hazards వారివి!
    – Lyla

  219. Tara and the Teacher గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    04/05/2020 12:34 pm

    ఆ రమణుడి పాదాలు కడిగేసి విబూది తీసుకోటమే పాఠకుల పని అనుకుంటున్నారు.

    లైలా గారు
    మీరు మాట వరసకి ఇలా అన్నారనుకుంటున్నాను. రమణులు తన జీవితకాలంలో ఎన్నడూ ఎవరికీ విభూది ఇచ్చిన దాఖలాలు లేవు. వచ్చినవాళ్లకేసి ఒక్కచూపు చూసేవారు(ట). ఆ చూపుకి వళ్ళు తప్పిపోయి, తలలో గర్వం పాదాల్లోకి ఒక్క క్షణంలో వచ్చి ఆయన శిష్యులైనవారున్నారు (ఉదాః చలం అనబడే ఒకానొక ప్రబుధ్ధుడు). ఆ చూపుకి అర్ధం తెలియక, ఎప్పటికీ ఏమీ తెలుసుకోలేని నాలాంటి వేలమంది ఉన్నారు కూడా. ఎవరు ఎలా ఆయనవల్ల ఉధ్ధరింపబడ్డారనేది వేరే విషయం, అప్రస్తుతమేమో కూడా.

    అయితే ఈ ఇంగ్లీషు అనువాదానికి, అదీ పూర్తిగా చేయని దానికి, ఈమాట పత్రికలో చోటు లేదని నేనూ అనుకున్నాను. మనం రాసే తెలుగు కధల్లో కవిత్వాలలో ప్రతి అయిదు మాటలకీ ఒక ఇంగ్లీషు పదం ఎలాగా దొర్లుతోంది. అటువంటప్పుడు అసలు దీన్ని ఈమాటలో వేసుకోవడానికి కారణం రచయిత తెలుగువారు కావడం ఒకటేనా అర్హత?

    నాగరాజు గారు – అన్యధా భావించకండి. మీరు బ్లాగు మొదలుపెట్టినప్పటినుండీ నేను చదువుతున్నా మీరు రాసేవి. మీకు తెలుగులో ఉన్న పటుత్వంతో మీరు దీన్ని తెలుగులో అద్భుతంగా అనువదించగలరు. అలా ప్రయత్నం చేయండి. మనకి ఇప్పటికే ఉన్న ఆంగ్ల దరిద్రానికి మరో సమిధ వేయడం ఎందుకు? ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకండి.

  220. ఆకురాలిన చప్పుడు గురించి సిరిపురపు శ్రీనివాస శర్మ గారి అభిప్రాయం:

    04/05/2020 3:16 am

    మీ కవితా శిల్పం చాలా బాగుంది. అంతర్మథనాన్ని ప్రశ్నగా వేసిన తీరు బాగుంది. ఆఖరి వరకు సాగిన అక్షర యుద్ధం చివరి పేరాలో మౌనం వహించింది అనిపించింది.

  221. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి సిరిపురపు శ్రీనివాస శర్మ గారి అభిప్రాయం:

    04/05/2020 3:11 am

    మీ కవితా శిల్పం అద్భుతం. కాకుంటే, మొదటి మూడు పేరాల్లో ఉన్న ఆక్రోశం, ఆవేదన ఒక్కసారిగా నాలుగో పేరాలో మాయమైంది. ఆ టెంపో సడలకుండా దీన్ని నడిపిస్తే బాగుండేదేమో.

  222. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి డా. జడా సుబ్బారావు గారి అభిప్రాయం:

    04/01/2020 8:43 pm

    చాలా బాగుంది సార్ కవిత
    ప్రత్యేకించి రెండవ పేరాలోని ప్రతీ లైను కవితాశక్తిని
    ఇనుమడింపజేసింది…
    అభినందనలు…

  223. తిరస్కృత గురించి Raghavendra గారి అభిప్రాయం:

    02/16/2020 11:26 am

    చాలా బావుందండీ..! చాలా మంది మనోస్థితికి మీ కవిత అద్ధం పడుతోంది

  224. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    02/08/2020 3:46 pm

    గ్రంథ గ్రంథులు = ?

    శ్రీహర్షుని ‘అవామే వామార్ధే’ అని మొదలయ్యే ఒక శ్లోకానికి కల మూడు రకాల అర్ధాలు ఇచ్చి, తనుగా ఇంకా శ్లోక రహస్యాలు శోధిస్తూ; ఈ వ్యాసం లో మొదటిగా ఇచ్చిన శ్లోకంలో ‘గ్రంథి’ అన్న మాటకు ముఖ్యార్ధం ముచ్చటించకపోటం, ‘చిక్కు ముడి’ అన్న ఒక్క అర్థంలో మాత్రమే ఆ మాటను శ్రీహర్షుడు వాడినట్టుగా ఆసాంతం ఈ వ్యాస రచయిత అనుకోటం ఆశ్చర్య పరిచింది.

    గురువు లేనందున, సంస్కృతమే తెలియదు నాకు. ఐతే, సంస్కృత కావ్యాలు చక్కగా చదువుకున్న, రసికులైన పంతుళ్లు, నాకు బెజవాడలో చెప్పిన తెలుగొచ్చు. అందుకేగా రచ్చబండ యాహూ లో ఇలాటి తెలుగు కవిత్వాలు చెప్పాను.

    నిన్న మొన్నటి దాక
    ఎన్నొ పున్నమి రాత్రులు
    పున్నాగల మీద జంట మిన్నాగుల వలే
    పెద్దకాలము మనము పెనగితిమి ప్రియతమా!
    నేడా చనువు చెలగాటములు లేవు
    నేడా తనువు తగలాటములు లేవు
    ఆ బులుపుల పున్నాగల గంధాలు
    భద్రముగ నుంచులే
    మెదడు మడుపుల సూక్ష్మగ్రంధాలు
    తలను వీడవుగాదా వాసనలు
    మనమిలను వీడువరకు!

    కవిత్వం చదివిన ఒక సభ్యులు జాబాలిమునిగారు, గ్రంథులు అనబోయి గ్రంథాలన్నారా? వైద్యులు లైలాగారు, అంటే ఆ తర్వాత కొంత డిస్కషన్ నడిచింది. యాహూ నిర్వాహకులు -గ్రూపులు మూసివేసినందున, కంటెంట్ తుడిసివేసినందువలన, ఇక ఆ లింకు ఇచ్చే గొడవ లేదు.

    పైది రచ్చబండ- యాహూ లో రాసినప్పటికి ఆంధ్రభారతి నిఘంటువుల తయారీ పూర్తికాలేదు. ఇప్పుడు ఆ నిఘంటువుల నుండి:

    గ్రంథి : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
    సంస్కృత విశేష్యము

    • 1. బుడిపి. గడ్డవలె పుట్టు రోగము.
    • 2. చెట్టు మొ.ని ముడి.
    • 3. కీలు.
    • 4. [జీవశాస్త్రము] శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).

    అందులో నాలుగవది అతి ముఖ్యమైన అర్ధం. అన్ని రసాలకు కారణం ఆ గ్రంథులు.

    -Lyla
    Ps: సంస్కృత పండితులు ఈ వ్యాసంలోని మొదటి శ్లోకం గురించి విడమర్చి చెపుతారని ఆశిస్తాను.

  225. ఆత్మావై పుత్రనామాసి గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    01/27/2020 9:20 am

    బాబా గారు
    మీరు కామెంట్ పెట్టేటప్పుడు అక్కడే ఉన్నమొదటి కామెంట్ చూసారా? ఇంతటి మార్మికం లేని, విషయ ప్రకటన లా ఉండే అధ్వాన్నపు కవిత మీకు కళ్ళమ్మట నీళ్ళు తెప్పించింది అంటే సంతోషమే. ధన్యవాదాలు

  226. నవోదయతో నా రుణానుబంధం గురించి RD గారి అభిప్రాయం:

    01/15/2020 5:10 am

    పుస్తకాలు చదివే ఎవరికైనా విజయవాడ, ఏలూరు రోడ్డులో 2017 వరకు ఉన్న “నవోదయ” గురించి తెలియకుండా ఉండదు. 2009 వ సంవత్సరం నుండి వదలకుండా “విజయవాడ పుస్తక మహోత్సవానికి” వెళ్ళడం నాకు అలవాటు. గత సంవత్సరం కూడా అదే సందర్భముగా కారులో మా పుస్తకాల షాపు వద్దకు వచ్చినప్పుదు కలిశాను, చిరునవ్వుతో పలకరించారు. పుస్తక మహోత్సవములో 2017 వరకు వారి షాపు, మాది పక్కపక్కనే ఉండేవి. ముప్పై సంవత్సరాల పాటు “జనవరి 1 – 11 లేదా 12 వ తారీఖు” వరకు క్రమం తప్పకుండా, తారీఖు మారకుండా జరిగింది. ఈ సంవత్సరం ఆయనా లేరు, పుస్తక మహోత్సవం మొదలయిన తారీఖు మారింది. ( జనవరి 03, 2020 – 12,2020 ). మూడు సంవత్సరాల క్రితం వరకు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా, 320 పైచిలుకు పుస్తకాల షాపులతో ఒక పండగలా ఈ మహోత్సవం జరిగేది. గత రెండు మూడేళ్ళగా సరిగ్గా జరగడం లేదు. ఈ సంవత్సరమయితే మాటల్లో చెప్పలేనంత పేలవంగా జరిగింది. దానికి కొంత వర్షం కారణమయితే, 80% నిబద్దతా లోపం.

    ఇప్పుడు అసలు విషాయానికి వస్తాను. ప్రతి సంవత్సరం అన్ని షాపులు తిరిగి నాక్కావలసిన పుస్తకాలు జల్లెడ పట్టడం నా పని. 2014 లో అలా నేను ఒక చుట్టు వేయబోయే ముందు మా షాపులో వారు “రామ్మోహనరావు” గారికి ఏవో పుస్తకాలు కావాలంటే వెళ్ళి ఆయన్ని కలిశాను. అప్పుడు నా చేతిలో ఒక చిన్న చీటి పెట్టి, దానిలో ఉన్న ఏ పుస్తకం దొరికినా కావాలి / తీసుకొమ్మని అన్నారు. ఆ చీటిలో ఉన్న పుస్తకాల జాబితా ఇదే!

    1. శస్త్రదాస్యం – కొప్పరపు సుబ్బారావు
    2. తారాశశాంకం ( నాటకం ) – కొప్పరపు సుబ్బారావు
    3. హితసూచని – సామినేని ముద్దునరసింహ నాయుడు

    మొదటి పుస్తకం అక్కడే ఒక షాపులో దొరికింది, తీసుకొచ్చి ఆయనికిస్తే ఆ మూడింటిలో ఒక్కటైనా దొరికినందుకు సంతోషించారు. ఆ తరువాత విజయవాడలోని సోషల్ సైన్సెస్ లైబ్రరికి, పోలండ్ దేశం నుండి రెండవ ప్రపంచ యుద్ధ సమయం వరకు వచ్చిన గొప్ప కవిత్వానికి సంబంధించి ఒక పుస్తకముంటే తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఉన్న పుస్తకాలన్నిటిని గమనిస్తుంటే “మూడవ” పుస్తకం దొరికింది. అది వెంటనే తీసుకుని, కాపి చేయించి ఏలూరు రోడ్డులో ఉన్న షాపుకెళ్ళి ఆయనకిచ్చాను, నవ్వారు, నేనూ నవ్వి చివరి పుస్తకం కుడా దొరికితే అందజేస్తానని చెప్పి వెళ్ళిపొయాను. విజయవాడ నుండి వెళ్ళిపోయిన తరువాత అంతర్జాలములో గాలిస్తే “రెండవ” పుస్తకం దొరికింది, అది ఆయనకి “జనవరి 29, 2014” న వారి ఈ-మెయిల్ ( vjw_booklink@yahoo.co.in ) కి పంపించాను. దానికి బదులు సమాధానంగా ఇలా వ్రాసి పంపారు “8, ఫిబ్రవరి, 2014” న…

    “బాపుగారు అడిగిన 3 పుస్తకాలు సంపాదించిపెట్టినందుకు ధన్యవాదాలు. బాపుగారు చాలా సంతొషించారు.’మిసిమి’ ఫిబ్రవరి ఇష్యులో బాపుగారు ‘లెటర్ టు ది ఎడిటర్’ వ్రాశారు. చుశారా? ”

    (https://misimi1990.files.wordpress.com/2017/03/misimi_2014_02.pdf) – 3వ పేజి.

    మధ్యలో అయనతో ఫోనులో మాట్లాడినప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన అడిగిన అన్ని పుస్తకాలు ఇవ్వలేకపొయాను. చాలాకాలం తరువాత అడిగిన మూడు పుస్తకాలు ఇవ్వగలిగాను అని సంతోషంగా చెప్పారు. ఆయన ఈ-మెయిల్లోనే ఉన్నట్ట్లుగా “ఆయనకి పుస్తకాలకి, పుస్తకాలు కావలసిన వాళ్ళకి ఆయనకి లింకు”. నాతో ఫోనులో మాట్లాడినప్పుడు ఆ మూడు పుస్తకాలు అందజేయగలిగినందుకు ఆయన గళంలో ధ్వనించిన సంతోషం ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది.

    ఒక అరుదైన మనిషి. విజయవాడ పుస్తక ప్రచురణ రంగంలో మేరుశిఖరం.

  227. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి pragna గారి అభిప్రాయం:

    12/05/2019 11:05 am

    ఇది శేషేంద్ర కవిత్వం అయ్యే అవకాశం లేదు. పదం, భావం శేషేంద్రవిలా లేవు. శేషేంద్ర వచనం కవిత్వంలా ఉంటుంది. ఇందులో కవిత్వం లేదు శేషేంద్ర మార్కు ముద్రా లేదు.

  228. మరొకసారి గంగ నేలకు దిగింది గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    11/10/2019 1:47 pm

    వాడ్రేవు ఈ పత్రికలో ప్రచురించిన రచనలు నేను ఆసక్తితో చదువుతాను. ఈ ‘ముందు మాట’ చదువుకోటానికి బాగుంది. “కాళీ పదములు” అన్న కవితా సంకలనానికి ఈయన ఈ ముందుమాట రచించారు. వ్రాసిన తీరు నింపాదిగా, అనేక విషయాలు సేకరించి, పరిశీలించినదిగా ఉంది.

    ఐతే, అంతా చదివిన తర్వాత, ఈ కవితలకు పరిచయాన్ని రామకృష్ణుని జీవిత చరిత్ర ప్రస్తావన, ఆయన భగవంతుని గురించి బోధనో, పాటో, -ఆ కొటేషన్స్‌తో ఎందుకు మొదలు పెట్టారో తెలియదు. ముందే తెలియక్కర్లేదు కాని, ఎప్పటికో ఒకసారి, కనీసం చిట్టచివరికన్నా తెలియాలి కదా?

    బెంగాల్ లో ఉద్భవించిన కాళి భక్తి, అందుకు సంబంధించిన వంగ సాహిత్యావతరణ, విదేశీయ రీసెర్చ్ స్కాలర్స్ రచనలు- ఈ అంశాలు ఇంటరెస్టింగ్‌గా ఉన్నై. అందుకు అవి ‘నిజం’ ఐ ఉండాల్సిన అవసరం కూడా లేదు. రెలిజియస్ ఐకాన్స్, భక్తి, మతం, సంబంధించిన పరిశోధనలలో నిజమేమిటి? అబద్ధమేమిటి?

    సరే, కవితల పుస్తకమా అంటే తెలుగు కవిత్వపు పుస్తకం. పుస్తక ప్రచురణ విజయవాడలో. రిలీజ్ విజయవాడలో. రచయిత్రి కూడా చిన్నప్పుడు విజయవాడ (బెజవాడ) లో ఉండి వచ్చినట్టున్నారు. మరి ఆమె పుస్తకానికి ముందుమాటగా బెంగాలీ కాళీ ప్రసక్తి ఎలావచ్చింది? బెజవాడలో ఇంటి వెనకాల కొండమీద గుడిలో వెలసిన కనకదుర్గమ్మ -కాళి కాదా? కాని ఆ దేవత, ఆమె చరిత్ర, ఆమెపై భక్తి సాహిత్యం ఉందో లేదో విమర్శకులు ఎత్తనే లేదు. మరి బెజవాడ దుర్గ ఎలా ఉద్భవించిందో, బెంగాలీ కాళి, బెజవాడ కాళి ఒకరో కారో, అలాటి సంగతులు ఈ ముందుమాట రాసినవారు చెప్పనే లేదు. చెప్పమని కాదు కాని, -ఈ కవితలలో బెజవాడ కాళిని కాదు, ఆ బెంగాలీ కాళిని తల్లిగా ఊహించి, ఈ కవయిత్రి స్మరిస్తున్నది సుమా, అని ముందుమాటలో మనకు స్పష్టం చేస్తున్నారా అని నా సందేహం. ఒకవేళ రచయిత్రి గాని బెంగాల్లో ఉండి, కలకత్తా కాళిపై గాని బెంగాలీ భక్తి సాహిత్యంపై గాని ఆసక్తి జనించి కవితలు రాసారా? ఈ ముందుమాటలోని బెంగాలీ సాహిత్యానికి, ఈ రచయిత్రి కవిత్వానికీ ఉన్న లింక్ ఏమిటో తెలియటం లేదు. ఈ పత్రికలోనే ప్రచురించబడిన ‘కాళీ పదాలు’ కవితలు కొంచెం కూడా ఆ సందేహాన్ని నివారణ చెయ్యలేదు.

    కవయిత్రిని, ‘మరొకసారి గంగ నేలకు దిగింది’ లాటి ఇమోషనల్ పదజాలంతో అభినందిస్తూ వాడ్రేవు ఆకస్మికంగా తనే కవి ఐపోటం కొంచెం తబ్బిబ్బు కలిగించింది. గంగావతరణం కథ బాగానే చదివిన నాకు ఆ మాటలు ఆయన వాడటంలో కూడా ఆయన చెప్పదలచిందేమిటో తెలియలేదు.

    కవితల పుస్తకానికి ఆయనను ముందుమాట రాయమని అభ్యర్ధించిన వారికి, ఏవో సాహిత్యపరమైన కారణాలు ఉండే ఉంటాయి. అడిగిందెవరైనాగాని, కవయిత్రి అనుమతి లేకుండా, ప్రచురణకర్తలు, ఆమె కవితల సంకలనానికి వీరి ముందుమాటను జోడించరు కదా. ఈ ముందుమాటకు, కవితలకు అసలు జోడీ ఏదీ?

    -Lyla

  229. ద్వాసుపర్ణా: అనువాద కవిత్వం గురించి Vasu గారి అభిప్రాయం:

    11/08/2019 10:22 am

    ఈ అనువాదం వల్ల మూలంలో ఉన్న భావం తెలుగులో పాఠకుడికి అందదు. అందువల్ల, ఈ అనువాదాలు తెలుగు పాఠకుల కోసం, ప్రత్యేకించి కవిత్వాన్ని చదివే పాఠకుల కోసం చేశారనుకుంటే, ఈ పుస్తకం ప్రధాన లక్ష్యం సౌభాగ్య కవిత్వాన్ని తెలుగులోకి తీసుకురావడం కాకుండా, అతని కవిత్వాన్ని తెలుగులో, కవిత్వంగా అందజేయడం అయి ఉండాల్సింది.

    పైనున్న మాటల్లో సమీక్షకుల ఆంతర్యం నాకు పూర్తిగా అవగతం కాలేదు. వేలూరి గారు ఎంత పొరుగునున్న రాష్ట్రమైనా మరొక భాషకు చెందిన కవిని (అంటే వేరే సాహిత్య సంప్రదాయలూ, అభిరుచులూ గల ప్రజల మధ్యనున్న కవిని) అనువాదం చెయ్యడంలో ఎంత చెయ్యగలరో అంతా చేశారనే నాకు అనిపిస్తోంది. ఏ అనువాద కవితనైనా చదివిన వెంటనే అది అనువాదమన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇక్కడ వెల్చేరు గారిని quote చెయ్యడమూ నాకు పూర్తిగా అందలేదు. ఇది నా అభిప్రాయం.

    -వాసు-

  230. నో-బుల్ బహుమతి గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    11/05/2019 2:32 pm

    అష్టాదశ అధికార్లూ
    మీకు నో- బుల్
    ఇస్తే, గిస్తే
    వాళ్లకి మీరిచ్చే
    లంచం
    గించం
    ఏదీ? చెప్పరే?
    ఇంతటి నో – బుల్
    కవిత్వంలోనూ
    అది మరిచారో,
    అదమరిచారో
    లేక
    రాసి అవతల పారేశారో
    మా బుర్రకి తట్టట్లే
    ఎంతటి
    హోలీ-కౌ !!!

  231. నో-బుల్ బహుమతి గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    11/04/2019 11:44 am

    ఆర్యా! ఉత్తమ పాఠకుడు బహుమతి కోరుతూ మీరు పెట్టుకున్న అర్జీ పత్రాన్ని పరిశీలించిన నో-బుల్ కమిటీ మీ నుండి మరికొన్ని వివరాలు కోరుతున్నారు. వాల్మీకి రామాయణం, కవిత్రయం తెనిగించిన భారతాలు, పోతన భాగవతం, శ్రీనాధుడి నైషధము మీరు చదివిన దాఖలాలు జతచెయ్యగలరు (వీలుంటే పెద్దల సాక్షి సంతకాలతో).

    కాళిదాసు, భారవి, భవభూతి బుక్కులు మీవద్ద ఉన్న ఫొటోలు కూడా జతచెయ్యగలరు.

    విశ్వనాథ, శ్రీశ్రీ, తిలక్, చాసో, శ్రీపాద, రావి శాస్త్రి లు మీకు ఇష్టులు అనే జగమెరిగిన సత్యానికి …. భౌతిక శాస్త్రం నోబెల్ పురస్కారం అందుకున్న ఖగోళభౌతిక శాస్త్రవేత్త చంద్ర (సుబ్రమణియం చంద్రశేఖర్‌) ఆత్మకధ (Chandra: A Biography of S. Chandrasekhar by Kameshwar C. Wali) ను చదివిన వారుగా మీకు కొన్ని బోనస్ మార్కులు లభిస్తున్నాయి.

    పైన పేర్కొన్న వివరాలు దఖలు పరిచినచో నో-బుల్‌ పురస్కారం మిమ్మల్నే వరిస్తుందని మా ప్రఘాఢ విశ్వాసం. మీరు అర్జీని ఆమెన్ (Amen) అంటూ ముగించారు. ఎందుకైనా మంచిది ఆమెన్ తో పాటు ఆవుమెన్ (Awomen) అని కూడా అనండి… ఆన్ లైన్ వోటింగ్ కూడా చేస్తాము కాబట్టి మీకు దండిగా వోట్లు దొరుకుతాయి. Insha Allah

  232. పఠాభి కవిత్వం: మళ్ళీ కొత్తగా కొన్ని ఆలోచనలు గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    10/27/2019 12:46 am

    కొంత ఆలస్యంగా చదివినా ఆలోచింపజేసే వ్యాసం చదివానన్న భావన కలిగింది. విశ్వనాథ పఠాభిని అర్థం చేసుకున్నట్టుగా ఇతర సాహితీవిమర్శకులు అర్థం చేసుకోలేదని అనటం కూడ చాలా వరకు సమంజసంగానే అనిపించింది. పఠాభి, ముఖ్యంగా ఫిడేలు రాగాల డజన్ లో అప్పటివరకు వున్న కవిసమయాల్ని చించిచెండాడాడనేది ఇప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు గాని అప్పటి విమర్శకులు ఎక్కువమంది ఆ రచనలకి ప్రేరకాలు, కారణాలు అన్వేషిస్తూ రకరకాల నిర్హేతుక ప్రతిపాదనలు చెయ్యటం వాస్తవం, చినవీరభద్రుడు గారు అలాటి చాలా ప్రతిపాదనల్ని ఇక్కడ ప్రస్తావించారు కూడ.

    ఐతే, నాకు రెండు విషయాల్లో ఈ వ్యాసం అసంపూర్ణంగా అనిపించింది. ఒకటి – విశ్వనాథ ప్రతిపాదనకి, తను చేస్తున్న ‘గ్రోటెస్క్’ అన్న ప్రతిపాదనకి సంబంధం వివరించకపోవటం, రెండు – అసలు గ్రోటెస్క్ లిటరెచర్ అంటే ఏమిటో, పఠాభి రచనలు ఆ కోవలోకి ఎందుకు వస్తాయో వివరించక పోవటం.

    ఆన్ లైన్ లో వెదగ్గా కనిపించిన అనేక చోట్లలో, ఈ కిందిది నాకు ‘గ్రోటెస్క్ లిటరెచర్‘కి మంచి క్లుప్తమైన వివరణలా అనిపించింది – The Grotesque is both an artistic and literary term, and is a bit difficult to describe, as it is less of a solid definition, and more of a range between a number of different qualities. The Grotesque is primarily concerned about the distortion and transgression of boundaries,be they physical boundaries between two objects, psychological boundaries, or anything in between. Exaggeration also plays a role.

    There are two main ways to define something as Grotesque, as evidenced by the diagrams: The Grotesque fits in between the real and the fantastic (non-real). The Grotesque simultaneously fits somewhere between being funny and being frightening. (This is a bit more difficult to gauge, as what is funny to one person is frightening to another, so maintaining a bit of an open mind is helpful).

    వ్యాసకర్త ‘డిస్టార్షన్’గురించి చాలా చెప్పారు కాని గ్రొటెస్క్ గురించి అంతగా మాట్లాడలేదు ఎందుకో మరి. అలాగే వారు చెప్పిన డిస్టార్షన్ కూడ పైన వివరణలో చెప్పిన సరిహద్దుల డిస్టార్షన్ కాదు. ఆ వివరణలో వున్న రెండు లక్షణాల గురించి ఎలాటి ప్రసక్తి కూడ రాలేదు. ఇక విశ్వనాథ ప్రతిపాదనకీ ఈ వ్యాసకర్త చెప్పిన డిస్టార్షన్ కీ సంబంధం గురించి ఒక్క ముక్క కనిపించదు.

    నాకు వారితో ప్రత్యక్ష పరిచయం లేదుకాని చినవీరభద్రుడు గారు పేరున్న సాహితీ విమర్శకులని విన్నాను. వారు ఎలాటి పాఠకులని ఉద్దేశించి ఈ వ్యాసం రాశారో కూడ తెలియదు (నేననుకుంటున్నది ఇంకెక్కడో ప్రచురితమైన వ్యాసాన్ని ఇక్కడ పునఃప్రచురించారని). కనుక వారు ఈ పత్రికని చూస్తే వారికి నా మనవి – వారి దృష్టిలో గ్రొటెస్క్ కవిత్వం ఏమిటో, ఆ భావానికి విశ్వనాథ ప్రతిపాదనకి సంబంధం ఏమిటో, సామాన్యంగా గ్రొటెస్క్ రచన అనే పదానికి వున్న డెఫినిషన్ కి వారిది భిన్నమైతే ఎందుకు అలా చేయవలసివచ్చిందో కొంతైనా వివరిస్తే ఇంకా సంతృప్తికరంగా వుంటుందని. కవిత్వానికి తర్కం అక్కరలేదు గాని సాహిత్యవిమర్శకి తర్కం అత్యవసరమని నమ్మే నా లాటి వారికి మార్మికత కన్న తార్కికత ఉంటే బాగుంటుందని.

  233. త్యాగరాజయ్య సాహిత్యము: సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టి చేసిన త్యాగయ్య గానప్రతిభ గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    10/26/2019 7:03 pm

    త్యాగరాజు పట్ల వీరి అభిమానం, ఇతరులపై preconceptions ఈ మొదటి paragraphsలో కనిపిస్తున్నాయి.

    అటువంటిదేమీ లేదు. ఒకరిని గురించి చెప్పాలంటే మరో ఇద్దరో ముగ్గురో ‘సమ ఉజ్జీల’ గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. అప్పుడు ఎవరో ఒకరిని తక్కువ చేసినట్టు, కొందరికి అనిపిస్తుంది.

    ధర్మరాజు, భీముడు, అర్జునుడు – అవటానికి అందరూ ఇంద్రులే. కాని వారిలో ఎంతెంత తేడాలు! ఎవరు ఎక్కువ తక్కువ కాకపోయినా, ఆ తేడాలబట్టి, మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టులవుతారు.

    ఒకప్పుడు కవిత్రయం కన్నా, నాచన సోముడు గొప్పవాడని కొందరు పండితులకు అమాంతంగా ఎందుకో అతని మీద ప్రేమ పుట్టుకు వస్తే, ఎందుకు కాదో రాళ్లపల్లి రచనల్లో చెప్పారు. నేను చదివిన రెండు వ్యాసాలలో ఆయన మాటలలో -సోమన దూషణ నాకు కనిపించలేదు. పొగడ్త కూడా కనిపించలేదు. నాచన సోమన రచనాస్వభావపు విశ్లేషణ ఎంతో బాగా చేసారు అనిపించింది. రాళ్లపల్లి రచనలో హాస్య ప్రియత్వం ఉంటుంది. He has an inner laughter.

    త్యాగరాజుపై ఈ వ్యాసం నాకు నచ్చింది. చాలాసార్లు చదివాను. ‘త్యాగయ్య గారి నాద సుధారసం’ అన్న వ్యాసం (ఉపన్యాసం) కూడా చాలా బాగున్నది. అందులో త్యాగరాజు -రామభక్తి, కవిత, గానం, ఈ మూడింటి తత్త్వం గురించి రాళ్లపల్లి ఆలోచనలు ఎంత వివరంగా ఉన్నవో. ఆ వ్యాసం రాయటం ఇంకా కష్టం అనిపిస్తుంది. రెండు వ్యాసాలూ ఒకదాని వెంట మరోటి చదవాలి. అదింకా మంచిపని.

    ఆ మరో వ్యాసం చివరలో రాళ్లపల్లి ఇలా అన్నారు. “..కవిత్వం రసింపగలిగితే తెలుగు తెలిసిన వారానందిస్తారు. కాని త్యాగయ్య గారి నాద సుధ దొరికితే – హిందువులే కాదు మనుష్యజాతే తరించి పోతుంది..” ఇంకా బాగా లేదూ! కాని ఆ నాదసుధ కూడా కొంతలో కొంత అది భారతీయతతో ముడిపడి ఉంది.

    ఏమైనా, వినగా వినగా; ‘పాలారగించరా’ అనో ‘తులసీదళములతో’ అనో, వాగ్గేయకారుడు కవిత్వం రాస్తే, సంగీతపు సంగతులు వేస్తే, అవి వేరే మథన, వేరే రసన; అంతేకాని విగ్రహాలమీద కడవలతో పాలు పొయ్యటం, తులసి ఆకులు తుంపుకు వచ్చి నెత్తినో కాళ్లమీదో ఉంచటం మాత్రం ఈ కవిత్వపు, సంగీతపు ఉద్దేశం కాదు, అని అంతమట్టుకైనా నాకు తెలిసింది. అది తెలియనివాళ్లు, ఆ మరో విధమైన తెలుగుతనం, భారతీయత గలవాళ్లు ఇప్పటికీ లక్షలు.

    -Lyla

  234. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    10/07/2019 8:18 pm

    చాలా చక్కటి వ్యాసపరంపరని రాశారు నారాయణరావు, శ్రీనివాస్ గార్లు. దీని వెనక ఎంతో పరిశ్రమ వుంది. దీన్లో ఎంతో పనితనం వుంది.
    ఐతే గమ్యం ఏదో ముందుగా ముచ్చటగా చెప్పివుంటే ముందు రెండు భాగాలూ ఇంకా తేలిగ్గా అర్థమై వుండేవి (బహుశా ఎక్కడికి చేరతారో మొదలెట్టినప్పుడు వారికి విస్పష్టంగా తెలియక పోయి వుండే అవకాశమూ లేకపోలేదు). ఏమైనా, నాకర్థమైంది ‘కవితలు, కథలు, ఇతర కల్పిత రచనలు కాని’ రచనల్లో రాసే తెలుగు గురించి చాలా కూలంకష చర్చ చేసి ఇప్పటి దుస్థితి నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారని. కల్పనా రచనల మీద ఎలాటి ఆంక్షలూ పెట్టటం మంచిది కాదని స్పష్టంగా వివరించారని. ఐతే మాట్లాడే తెలుగు ఎలా వుండాలనేది ఈ వ్యాసాల పరిధి లోకి రాలేదు, నాకర్థమైనంత వరకు. మొత్తం మీద, చాలా విస్తారంగా మొదలైన చర్చ కొంత ఇరుకైన గమ్యాన్ని మాత్రమే చేరిందేమో అనిపిస్తుంది.

    ఐతే, అకల్పితరచనల భాష గురించి ఇంత లోతైన పరిశోధన, లోచూపు, విస్తారం వున్న ఈ పరంపరని ఇన్నాళ్లుగా కొనసాగించిన వ్యాసకర్తలు అభినందనీయులు. తెలుగు మీద (ఇంకా) మమకారం వున్నవాళ్లకి ఇది అవశ్యపఠనీయం.

    పదిహేనేళ్ల క్రితం అనుకుంటాను, ఒక తేలికైన mathematical model ని ఉపయోగించి ఇంక ఏడు తరాల్లో తెలుగు భాష కేవలం విద్యావిహీనులు మాట్లాడే భాషగా మాత్రమే మిగుల్తుందని నేనో వ్యాసం రాశాను. చాలా మంది నా మీద విరుచుకు పడ్డారు కూడ. కాని ఇప్పుడు అది బహుశ దురాశాపూరితమైన అంచనా అని, అంతకాలం కూడ పట్టకపోవచ్చునని అనిపిస్తున్నది. తెలుగు మాట్లాడటం వెనకబాటుతనానికి గుర్తని, ఇంకే భాషలూ రాని వాళ్లకి మాత్రమే తెలుగు గతని చాలామంది విద్యావంతులైన తెలుగు వాళ్ల అభిప్రాయమని నా అభిప్రాయం. తెలుగు మనకి గర్వకారణమని భావించి, తెలుగువాళ్లు తెలుగు లోనే మాట్లాడే స్థితి కలగాలంటే, ఎవరో ఒక సినీ ప్రముఖుడు నడుం కట్టి ఉద్యమం నడిపిస్తే తప్ప సాధ్యం కాదని నాకనిపిస్తున్నది ఇప్పటి పరిస్థితుల్లో. కర్ణాటకలో రాజ్ కుమార్ నడిపిన ఉద్యమం గుర్తొస్తున్నది ఈ సందర్భంగా. అలా కాకుండా ఏదో కొద్దిమంది ఎంత అరిచిగీపెట్టినా తెలుగు వాళ్లు అవకాశం ఉంటే తెలుగు తప్ప ఇంకే భాషనైనా మాట్లాడతారు తప్ప తెలుగుని కాదు.

  235. భరోసా గురించి msk krishna jyothi గారి అభిప్రాయం:

    10/01/2019 10:05 am

    భలే ఉంది కవిత! నాకెంతో నచ్చింది

  236. జాషువా – పిరదౌసి గురించి JVVSN Murthy గారి అభిప్రాయం:

    09/27/2019 9:31 pm

    మానస గారూ, జాషువా కవితా వైశిష్ట్యాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు. మీకు హృదయపూర్వక అభినందనలు.

  237. తీరా నేను విముక్తమయ్యాక! గురించి సత్యస్వరూప్ గారి అభిప్రాయం:

    08/21/2019 7:24 am

    ఆప్యాయతకై ఎదురుచూసిన హృదయమెంత నిర్వేదనచెందుతుందో తెలియచేశారీ కవితలో. కవిత చివరి పంక్తుల్లో కూడా మొదటి అల్లిక అంత బిగువు కనిపించి వుంటే ఇంకా బాగుండేదేమో!

    నదిగా ప్రవహించాక సాగరమయే కంటే ఆవిరై ఎడారిలా మారుంటే గొంతు ఎండిపోయే దుఃఖానికి గుణపాఠమేమో!

    మంచిప్రయత్నానికి అభినందనలు.

  238. తీరా నేను విముక్తమయ్యాక! గురించి Vijayalakshmi గారి అభిప్రాయం:

    08/21/2019 5:57 am

    శాంతి గారికి, కె. కె రామయ్య గారికి లైలా యెర్నేని గారికి ధన్యవాదాలు.
    లైలా గారు చెప్పింది వాస్తవం. వ్యక్తులు ప్రదర్శించే ఆత్మీయతను, ప్రేమాభిమానాలను వారు జీవించి ఉన్నప్పుడే గుర్తించగలగాలి. తరువాత గుర్తించినా ఎటువంటి ప్రయోజనము ఉండదనే సూచన, తాత్త్వికతల కలగలుపు ఈ కవిత.
    కవితను ప్రచురించిన సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  239. తీరా నేను విముక్తమయ్యాక! గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    08/13/2019 2:03 pm

    కె. కె. రామయ్య గారు!

    కవిత చదివినప్పుడు ముందుగా కలిగిన తలపులు ఏమిటో మీరు చెప్పలేదు కాని; పార్వతి కథ, హిమాలయాల హిమం గురించిన ఆలోచనలు ఈ కవితలో లేవు. కవిత గాని అర్థం ఐఉంటే, మీకు కలిగిన తలపులు జనించే అవకాశం కూడా లేదండి.

    The poem’s content is quite contemporary, and has nothing, nothing what so ever to do with Hindu mythology.

    Lyla

  240. తీరా నేను విముక్తమయ్యాక! గురించి కె.కె రామయ్య గారి అభిప్రాయం:

    08/11/2019 2:28 pm

    దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి అగ్నికి ఆహుతైన దక్ష ప్రజాపతి తనయ సతీదేవి తిరిగి హిమవన్ పర్వత రాజ తనయ పార్వతిగా జన్మించి శివుని అర్ధాంగిగా హిమ శీతల స్పర్శలో సేద తీరిన తలపులు కూడా కలిగాయి “తీరా నేను విముక్తమయ్యాక!” కవిత చదువుతుంటే. ధన్యవాదాలు నల్లపనేని విజయలక్ష్మి గారు.

  241. కొడుకుల శివరాం భాగవత గానం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    07/26/2019 11:07 pm

    సుప్రసిద్ధ సాహితీమూర్తి శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ జూలై 25, 2019 న హైదరాబాద్ లో కన్నుమూసారు! పైన ఇచ్చిన పోతనగారి పద్యాల్లో ఒకటైన “కుప్పించి ఎగసిన…” పద్యం ఆధారంగా ప్రముఖ చిత్రకారుడు బాపు ఇంట్లో గోడకు ఒక చిత్రపటం ఉండేదిట!

    దాన్ని సమీక్షిస్తూ శ్రీ ఇంద్రకంటి ” ఈ బొమ్మ వేయాలంటే శ్రీకృష్ణుడు ఒక్కడూ తెలిస్తే చాలదు! భీష్ముడూ తెలియాలి. పోతనా తెలియాలి. కవిత్వం పేరిట అక్షరాలు, వాక్యాలు, శిల్పమే కాక, కవుల మనసును చదవగలిగే బాపు మాత్రమే వేయగల బొమ్మ అది” అని వ్యాఖ్యానించారు!

    శ్రీ ఇంద్రకంటి ధన్యజీవి అనటానికి ఇంతకన్న సాక్ష్యాలు ఏం కావాలి?

    ( ఈ మాటలు మళ్ళీ గుర్తు తెచ్చిన శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారికి కృతజ్ఞతలతో)

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  242. కిరాతి ఖడ్గాన్నోయ్‌ గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:

    07/24/2019 12:51 pm

    దేశికాచారి గారికి, లైలా గారికి-

    మీ విలువైన సూచనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.🙏వాటిని దృష్టిలో ఉంచుకుని, నా కవిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మున్ముందు ప్రయత్నిస్తాను.

    పాలపర్తి ఇంద్రాణి.

  243. శ్రీనాథుని చాటుపద్యములు గురించి Acharya Dr.Sudhakar Rao, MD గారి అభిప్రాయం:

    07/23/2019 1:51 pm

    ఈ పద్యం శ్రీనాథుడిదదేనా అన్న సంశయం:

    ప్రౌఢి పరికింప సంస్కృత భాష యండ్రు
    పలుకు నుడిగారము ఆంధ్ర భాష యండ్రు,
    ఎవ్వరేమనుకున్న నాకేమి కొరత,
    నా కవిత్వము నిజము కర్ణాట భాష.

    ఇది భీమేశ్వర పురాణం లోనిదా, లేక ఆల్లసాని పెద్దన గారిదా?

    కృతజ్ఞడను
    సుధాకరరావు

  244. కిరాతి ఖడ్గాన్నోయ్‌ గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    07/22/2019 12:34 pm

    పాఠకుల అభిప్రాయాలలో, దేశికాచారి గారు ఇక్కడ ఇచ్చిన పద్యం నన్ను ఆనందపరచింది. అందువల్ల రాస్తున్నాను.

    “(…) compelling poem is one that has already set itself to music” a part of closing line of a chapter in James Longenbach’s in his book “How poems get made.”

    దేశికాచారి గారిచ్చిన పంక్తులు నాకు అలా వినిపించాయి. పద్యం అసంపూర్తిగా ఉంటేనేం అక్కడికే నన్ను రంజించాయి.

    ఈ సంచికలోనే ‘పటాభి కవిత్వం’ గురించి మనకు తెలుపుతూ, అతని కవిత్వాన్ని నిరసించినవారు పురాతన పద్యకవిత్వానికి అలవాటు పడి ఉన్నందున వారికి అసహనత కలిగిందని, విమర్శకులు వాడ్రేవు పినవీరభద్రుడు ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. పినవీరభద్రుడుగారి సాహిత్య విమర్శలు నాకు బాగుంటాయి. దేశికాచారి అటువంటి బయాస్ కి లోనైనారా? ఆయన అంటున్నమాటలు నిజమేనా? అని మేగజీన్ లో పైనిచ్చిన “కిరాతి ఖడ్గాన్నోయ్” అన్న రచన చదివాను. అప్పుడు నాకు దేశికాచారి గారిచ్చిన పద్యం ఇంకా నచ్చింది. “Poem’s insight or information may be shockingly relevant…” అని మొదలయిన జేమ్స్ వాక్యం తోచి మళ్లీ నవ్వించింది.

    ఇంతకీ, మొత్తానికి తన వాక్యంలో జేమ్స్ ఉద్దేశం, పద్యంలోని సమాచారం ఎంత నిజమైనా, దాని ఆకర్షణ శక్తి పంక్తిలోని సంగీతం నుండే వస్తుందని. ఐతే, ‘పద్యంలోని సంగీతం’ అంటే ఏమిటి? అని తెలుసుకోటానికి, ‘song’ అన్న chapter మాత్రమే కాకుండా, Diction, Syntax, Voice, Figure, Rhythm, Echo, Image, Repetition, Tone, Prose, Poetry, అన్న ఛాప్టర్లన్నీ, -అంటే మొత్తం పుస్తకం చదవాలి.

    I finished reading James Longenbach’s book. Now I am enjoying a book by Ellen Bryant Voigt – “The art of syntax.”

    ఈ రచయిత్రికి సంగీతమూ వచ్చు. కవిత్వమూ వచ్చు. ఆమెను చదువుతూ, కవిత్వానికి, భాషకు సంబంధించిన ప్రత్యేకమైన మాటలను మర్యాదగా అప్పటికప్పుడు డిక్షనరీలో చూసి, తెలుసుకుంటూ మరీ చదువుతున్నాను.

    As I am reading these books on poetry, I am also reading/cross referencing – Borges on writing, Two of Bernstein’s books on Music, I am revise-reading couple of chapters from books on Beethoven, And Mahler, which discuss usage of poetry in some of their symphonies.

    పై వీరందరి మూలానా – కవి సమయాలు తమకి గిట్టక పోయినా, ఏ సందర్భాలలో మనోరంజకంగా ఉండేదీ; రెలిజన్ తమకి ఎంతమాత్రమూ నచ్చకపోయినా ఎవరి కవిత్వంలో దైవం సాక్షాత్కరించేదీ; సరస్వతిని, కాళి ని తలిచి జడిపించినంత మాత్రాన ప్రతి రాత పొయెట్రీ అవదనీ; ఓయ్, కోయ్ అని నోటికొచ్చిందల్లా అనేస్తే verse Libre కాదనీ; meter కీ rhythm కీ ఉన్న అంతరాలు, poetic Form కీ poetic Structure కీ ఉన్న తేడాలు, కవిత్వ వాక్యాలలో చిన్న చిన్న syllabic groups, పెద్ద పెద్ద phrases మధ్య తగువుల ఆకర్షణలు; ఈ విషయాలు చక్కగా స్పృహ లోకి వస్తున్నయ్యి.

    కవిత్వం జడత్వం లేకుండా మారుతూ ఉన్నందుకూ, శతాబ్దాల మీద మారిన, రకరకాల అందమైన కవిత్వాలు పై పుస్తకాలలో చదివగలుగుతున్నందుకూ నాకు సంతోషం కలిగింది.

    ఎమర్సన్ -ఉత్తమకళను గ్రహించగలిగిన విజ్ఞులు ప్రపంచంలో అసంఖ్యాకంగా ఉంటారు, కానీ ఎప్పటికీ కళాకారుల సంఖ్య బహుతక్కువేనని అంటాడు. ఐతే ఏం పోయె, ఎప్పటికప్పుడు కొందరైనా ఉంటున్నారు కదా, చాలు.

    ఇంతకీ దేశికాచారిగారిచ్చిన పద్యమెవరిదో! అది వారు రచించినదా? అది నాకు తెలియదు.

    Lyla

  245. పఠాభి కవిత్వం: మళ్ళీ కొత్తగా కొన్ని ఆలోచనలు గురించి పాలపర్తి ఇంద్రాణి గారి అభిప్రాయం:

    07/07/2019 7:18 pm

    చదవాల్సిన వ్యాసం. పఠాభి గారి కవిత్వంపై కొత్త చూపు.
    సోదరులు చిన వీరభద్రుడు గారికి నమోవాకములు.

    ఇంద్రాణి.

  246. మరొకసారి గంగ నేలకు దిగింది గురించి వాధూలస గారి అభిప్రాయం:

    06/01/2019 1:36 pm

    చిన వీరభద్రుడుగారు పరిచయం చేశారంటేనే అందులో నవ్యత ఉన్నదని అర్థం. ఒక పుస్తకాన్ని పరిచయం చెయ్యడానికి, ఒక కవయిత్రిని ఆవిష్కరించడానికి ఆయన తరచే లోతులు ఆశ్చర్యాద్భుతానందాల్ని ఒకేసారి కలిగిస్తాయి.బంగారాన్ని గీచటం, కావటం వంటి నాలుగు ప్రక్రియల ద్వారా ప్రామాణిక నాణ్యత కనుక్కుంటారని విన్నాను.పాలపర్తి ఇంద్రాణిగారి కవితా స్నర్ణాన్ని చారిత్రక, సాంప్రదాయక,సామాజిక, రాజకీయ నేపథ్యాల వెలుగులో పరిశీలించి తాను మురిసి మనల్ని మురిపింపజేస్తారు. ఇప్పుడు ఎపరిని అభినందించాలి? స్వర్ణాన్నా లేక షరాబునా? ఇద్దరికీ అభినందనలు.శాక్తేయ కవితను ఎన్నుకోవటమే ఒక నవ్యధోరణి. పండించటం సాధ్యమయ్యింది ఎందుకంటే ఆమె ఇంద్రాణి. అదీ పడమటి తీరాన ప్రాగ్దిశా విన్యాసం- మరి ఆమె పాలపర్తి కద చాలా రోజుల క్రితం న్యూజెర్సీలో ఒకే వేదికను పంచుకున్న జ్ఞాపకం ఒక జ్ఞాపికగా కవులకు కనిపించింది.

  247. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    05/15/2019 2:23 pm

    ప్రసంగం నాకు నచ్చింది. మాట్లాడుతున్నదెవరు! మరి! ‘సారస్వతాలోకము’ అన్న తన వ్యాససంపుటిలో ఒక వ్యాసం లో ‘కావ్యమునకు జీవనము రసము’ అంటూ ‘రసము’ అంటే ఏమిటని తెలియ చెప్పిన వారు. (Pages 99 – 101, నవోదయ పబ్లిషర్స్, హైదరాబాద్.) వీరి ప్రసంగం రసవిహీనంగా ఉంటుందా? No way!

    రాళ్లపల్లి తమ ఆలోచనలు, స్పష్టమైన మాటల్లో, స్పష్టమైన చక్కని స్వరంలో చెపుతారు. బయటి ప్రపంచంలో -తను మాట్లాడదలచిన విషయంలో విభిన్నతలు ఉంటే, అవి ఏమిటో వారి ఉపన్యాసం లోనే చెపుతారు. సైంధవి రాగం దక్షిణ భారతంలో మునుపటి నాలుగు రకాల వాడుకలు ఎంత ఓర్పుతో విడదీసి చెప్పారు!
    ఈ వక్త, విషయం ఏదైనా అర్థం కాకపోతే కాలేదని చెపుతారు. ప్రసంగం లో ఒకచోట (listen at 3.50 of tape) ‘మ’ ‘పూర్ణంగా’ ఉండాలి అంటే ఏమో నాకు అర్థం కాలేదన్నారు రాళ్లపల్లి. నేననుకోటం, దాని అర్థం, composer is instructing the musician to – Hold the note for its full value. (Tenuto.)

    ప్రసంగం లో వసుచరిత్రలోనుంచి ఉదహరించిన పద్యం గురించి:
    ఈ ప్రసంగం లో లాగే, చక్కని వివరణలు రాజన్నకవి – (వసుచరిత్ర కవితా విపంచి) వ్యాసంలోను, అలాగే వ్యాఖ్యాన సహితమైన వసుచరిత్ర డిజిటల్ వర్షన్ లోనూ గమనించ వచ్చును. రచయితల అభిప్రాయాలలో చిన్ని తేడాలున్నవి. అన్నీ చదువుకుంటే చాలా సరదా కలుగుతుంది. పద్యం లోని విశేషార్థము బాగా తెలుస్తుంది. సింధుకన్యకలు ఇందులో ముగ్గురు. సింధు ప్రాంతంలో పుట్టిన రాగం, లక్ష్మి, కావ్య నాయిక గిరిక కూడాను. కాని పద్యాన్ని సైంధవి/ సింధూర రాగానికి లక్షణ పద్యంగా ఎవరం అనుకోనక్కర్లేదు. (పాఠక మిత్రులు వసుచరిత్ర కావ్యంలో ఈ పద్యం కన్నా మరో రెండు పద్యాల ముందర, ఒక సీస పద్యంలో – గిరిక, వసురాజుల పెళ్లి అప్పటి ఆర్కెస్ట్రా, పెళ్లి కోలాహలం కూడా వినొచ్చు.)

    సంగీత రాగాల పేర్లు, పుట్టుకలు, గుర్తించటాల గురించి:
    ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి -అని, ఇప్పుడు ఖరారుగా బతికి ఉన్న ఒక్కొండు రచయితలు పన్నెండు సార్లు చెప్పేకన్నా, ( అదీ ఒక విషయమే అనుకోండి ) ప్రతి పిక్కి పిక్కి స్వర విభేదానికీ ఒక కొత్తపేరు తగిలించే కన్నా ( అదీ ఒక పనే అనుకోండి. ) నా ఉద్దేశంలో – ఏ శాస్త్రం లో నైనా, క్లాసిఫికేషన్స్ బేసిస్ తెలపగలగటం/తెలుసుకోటం ఎక్కువ ఉపయోగకరం. ఉంటాయి విభేదాలు. కాని ప్రతి సంగీతం విషయం గురించి సందిగ్ధతలు మాత్రమే ఉండటానికి సంగీతం రెలిజన్ కాదు కదా? సంగీతం శాస్త్రమయ్యె. ఈ సైన్స్ లోనూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ యా శాస్త్రజ్ఞులు సంభాషించుకోటం వెసులుబాటు కోసం, దానికో సాంకేతిక భాష, విభజన పథకాలుంటం, అవి అవసరాన్ని బట్టి అప్డేట్ చెయ్యబడటం జరుగుతుంది. సంగీత రాగాల ( అలాగే ఛందస్సు) విభజన పథకాల బేసిస్ ఏమిటి అని తెలిస్తే, ‘కొందరు’ ఎవరికి వారే రాగాలు, స్వర స్థానాలు డిరైవ్ చేసుకోగలరు. కొన్ని పాటలు (పద్యాలు) వారే డిజైన్ చేసుకోగలరు.

    రవిశంకర్ My music, My Life అన్న పుస్తకం లో (109 వ పేజీ) హిందూస్తానీ రాగాలు (థట్) ప్రధానమైనవి పట్టుమని పది ఉన్నాయని, అవి బిలావల్, కళ్యాణ్, ఖమాజ్, కాఫీ, అసావరి, భైరవి, భైరవ్, పూర్వీ, మార్వా, తోడి – అని తెలిపాడు. ఇది 20 వ శతాబ్ది ‘వి. ఎన్. భక్తఖండే’ ప్రతిపాదించిన విభజన అనీ, దీనికన్న పదిహేడవ శతాబ్ది ‘వెంకట మఖి’ 72 మేళకర్తల విభజన ఉత్తమమైనదని అంటాడు.
    In Ravi Shankar’s words (page 30):
    “I myself however, as well as a number of other musicians, do not feel that these ten scales adequately accommodate a great variety of ragas. For there are many ragas that use notes not contained in these ten Thats. We therefore think it is more reasonable and scientific to follow the old Melakartha system of the south, because it can almost sustain any raga, no matter how unusual its ascending and descending structures.”

    సంగీత విద్వాంసులు రచించిన సంగీతవిషయకమైన గ్రంథాలు, (జీవిత చరిత్రల పోసుకోలు కాదు) కొన్నైనా చదవటం నాకిష్టం. The next book in queue for me is – ‘The infinite variety of music’ by Leonard Bernstein.

    అన్నమయ్య పాట గురించి:
    అనంతకృష్ణ శర్మ గారు, సైంధవి రాగంలో అన్నమయ్య పాడినట్టు లేదన్నారు. పాడలేదేమో. కాని ఇక్కడ విజయవాడ రేడియోకేంద్రం వారి ఆర్టిస్టులు వినిపించారు.
    There you go. Another feather in the cap of Bezwada. Thanks for the lovely broadcast! -Lyla

  248. కొన్ని దూరాలంతే! గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    05/01/2019 12:39 pm

    కోగంటి గారు
    “ధన్యవాదాలు” అనే పదం పైన ఉన్న వాక్యం అనవసరం అని నేను అనుకుంటున్నానండి. మీరు ఎప్పుడైతే ఒక కవితో కథో ఒకటి పబ్లిగ్గాచదవడానికి పెట్టారో అప్పుడే దాని మీద వచ్చే “ఎటువంటి” వాఖ్య కైనా సిద్ధంగా ఉండాలి. మీరో ఐడియాతో రాస్తే చదివే వారికి మరో కోణం కనిపిస్తుంది. అందుకే “డైవర్సిటీ” అనేది చాలా ముఖ్యం అంటారు. మీకు కవిత్వం తెలిసిన/వచ్చినవాళ్ల దగ్గర్నుంచి మాత్రమే ఏదైనా వెనక్కి రావాలని అనుకుంటే ఆ మాట చెప్పవచ్చు – ఇదిగో మీకు కవిత్వం రాకపొతే ఏమీ కామెంటకండి అని. ఎప్పుడైతే వాఖ్య మీకు నచ్చినట్టూ రాదో అదే మీకు ఒక మంచి విషయం; ఎందుకంటే ఆ కామెంట్ లోంచి మీకు మరో కోణం, మరో కవితకో కథకో స్ఫూర్తి రావొచ్చు. ఆహా ఓహో అనేవారితో మీకు ఉపయోగం పెద్దగా ఉండదనుకుంటున్నాను. కనీసం ఇది నా స్వంత అభిప్రాయం; నాకు రాయడంలో దోహదం చేసినది.

    మరో విషయం, ఏదైనా కథో, కవితో చదివినప్పుడు చదివే మనుషుల మానసిక స్థితి కూడా కామెంటడంలో సహకరిస్తుంది. పెద్దన అందుకే కాబోలు కవిత్వం చెప్పాలంటే సుష్టుగా భోంచేసి తాంబూలం వేసుకుని హాయిగా ఉయ్యాలలో ఊగుతుంటే బాగుంటుందంటాడు (నాకు గుర్తున్నంతలో).

    ఇదంతా నా స్వంత స్వకపోల విషయం; మిమ్మల్ని వెక్కిరించడానిక్కాదు. నమస్కారం.

  249. ఉద్యమ కవితా శివసాగరం గురించి Kurmanath గారి అభిప్రాయం:

    05/01/2019 6:54 am

    బాగుంది, సూఫీ.

    కొత్త తరాలకి శివసాగర్ పరిచయం చెయ్యడం అవసరం. కవిత్వం పేరుతో భావకవిత్వం, ఆత్మాశ్రయ కవిత్వం కుప్పలుతెప్పలుగా వస్తున్న రోజుల్లో శివసాగర్ గురించి రాయడం అత్యవసరం.

    ఇంకా వివరంగా కూడా రాయాలి.

    శివసాగర్ ప్రపంచ విప్లవ సాహిత్యంలోనే అరుదైన, అపురూపమైన కవి. విప్లవాన్ని కాంక్షించి, శ్వాసించిన శివసాగర్, ప్రతి కవితలోనూ విప్లవ అశావాదాన్ని పలికించి స్ఫూర్తి కలిగించాడు.

    శివసాగర్ లేని తెలుగు సాహిత్యాన్ని, విప్లవసాహిత్యాన్ని ఊహించడం కష్టం.

    కలిసింది కొన్నిసార్లే అయినా అ ఆత్మీయకలయికల warmth ఇప్పటికీ వుంది.

  250. కొన్ని దూరాలంతే! గురించి విజయ్ కోగంటి గారి అభిప్రాయం:

    05/01/2019 2:07 am

    కుమార్ గారికి నమస్సులు.

    మీరు కవిత చదివినందుకు ధన్యవాదాలు. విమర్శ చేయాలని ప్రయత్నించినందుకూ ధన్యవాదాలు. కవిత్వమంటే అన్నీ వివరంగా విశదీకరించటం కాదు అని నాకు తెలిసినంతవరకూ. వెలుతులు పూడ్చడం, సమాధానాలు చెప్పడం కవిత్వం కాదు. ఒక మనోస్థితిని ప్రతీకల ద్వారా వర్ణించడమే నేను చేయ దలుచుకున్న పని. కవికి పాజిటివ్ నెగటివ్ దృక్పథాలు ఉండవు.

    కవిత్వ విమర్శ చేసే ముందు ఇంకొంచెం లోతుగా కవిత్వం గురించి తెలుసుకుంటే బాగుంటుందేమో.

    ధన్యవాదాలు.

  251. వసంతం గురించి Lalitha TS గారి అభిప్రాయం:

    04/28/2019 12:46 pm

    వసంతాగమనం గురించి – తేలిక మాటల్లో – చాలా బావుంది మీ కవిత.

  252. నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుడు చూపిన తల్లిప్రేమ గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    04/17/2019 5:54 pm

    చాలా ఆసక్తికరంగా ఉన్నది రచన. పద్యాన్ని నచ్చుకుని మమ్మల్నీ మెచ్చుకోమంటూనే, దాని లోని ముఖ్యాంశం నుండి (భారతీయ మాతల మాతృప్రేమ నిరూపణకు మరో దక్షిణ భారతీయ రచయిత నుండి మరో తిరుగులేని తార్కాణం.) మనసు తప్పించి మరెన్నో ఇతర విషయ చర్చ చేసారు. అలానూ ఆకర్షించారు.

    మీ రచన గురించి కొంత ఆలోచించాక, మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ఒక కథ మళ్లీ నిదానంగా చదివాను. కథ పేరు ‘రవిచంద్రిక’. ఆ కథ “ఇది శివుని కథ అనుకునేరు. శ్రీనాథుని కథ” అంటూ మొదలెట్టి ఒక పదిహేడు పేజీలు రాసుకుంటూ పోయి, ద్రాక్షారామం, రాజమహేంద్రవరం, శ్రీశైలం అంటూ, శ్రీనాథుని వ్యక్తిత్వ పరిచయం, చేశాడాయన.

    మల్లాది ఆ కథలో – దాదాపు చివరలో, శ్రీశైలం లో ఒక యతీంద్రులు ‘ఈశాన సంహిత’ లోని ‘సుకుమారుని’ చరితం వినిపిస్తున్నప్పుడు శ్రీనాథుడు శ్రోతలలో ఉంటాడు. దాని సారాంశం నచ్చక “ చిత్తశుద్ధిగా చేసిన పాపం శివనామం తుడిచివేస్తుందా? పుణ్యాన బోయేందుకు పాపుల కథలు వినవలెనా?” అని శ్రీనాథుడు అడుగుతాడు.
    యతీంద్రుడు అప్పుడు కొన్ని మాటలు సభ హర్షించేట్లు చెప్పి, “ఈ కథను కావ్యంగా రచించమని నీకు ఆదేశించమని శివాజ్ఞ అయినది” అని శ్రీనాథుడికి చెపుతాడు.
    శ్రీనాథుడు శివుడు తనను కానిపనులు చెయ్యమని ఆదేశించడని, తరించటానికి కావ్యాలాపం అవసరమా? అని విముఖత చూపితే యతీంద్రుడు “ఇది శివాపరాధం” అంటాడు.
    శ్రీనాథుడు మరికొన్ని మాటలు చెప్పి “నాకు పుట్టుకిచ్చినవాడు, నాచేత కవనమల్లించినాడే కాని పాపకర్ముని చెయ్యలేదు. పాపులను వర్ణించేందుకు పలుకీయలేదు. అందుకు తామే సమర్థులని తోస్తున్న”దంటాడు.

    మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ఈ కథ నుండి – ‘సుకుమారుడు’ అన్న పాత్ర శ్రీనాథుడు కల్పించింది కాదు, అతని ప్రవర్తనను ఇష్టపడనూ లేదు, తనకూ సుకుమారుడికీ ప్రవర్తనలలో పోలిక ఉందనీ అనుకోలేదు, అతని చరిత (శివరాత్రి మాహాత్యం) మళ్లీ శ్రీనాథుడు రాయనూలేదని, – ఆయన (మల్లాది) చెప్పదలిచారని నాకనిపిస్తూంది. (Ref: రామకృష్ణశాస్త్రి కథలు, నవోదయ పబ్లిషర్స్, విజయవాడ. పేజీలు. 159- 176.)

    శ్రీనాథుని పేరిట ఉన్న పుస్తకాలు మరికొన్ని చదవాలని ఉన్నా, అవి తెలుగు పాఠకులకు అందుబాటులో లేవు. విద్వాంసులకే అవి అందుబాటులో ఉన్నట్టు లేవు. మీ ఇక్కడి ఈ రచన చదివాను. ఏల్చూరి మురళీధరరావు గారు రచించిన -‘సిరిమల్లె’ అన్న ఈ-పత్రికలో ఈ నెలలో ప్రచురించబడిన- “శ్రీనాథుని కవిత్వాదర్శం:లక్షణపరిశీలన” – అన్న వ్యాసం చదువుతున్నాను. వారు మొదట్లోనే ‘భీమేశ్వర పురాణం’ అవతారిక నుండి ఒక పద్యం ఇచ్చినారు. నాకు ఆ భీమేశ్వర పురాణం వెంటనే చదవాలని ఉంటుంది. అది దొరకదు. అందువల్ల కొంచెం మనసు కుతకుతలాడుతున్నది. ఐనా సంబాళించుకొని, ఇంతమట్టుకు రాస్తున్నాను.

    Thank you. Have a nice day! – Lyla.

  253. నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుడు చూపిన తల్లిప్రేమ గురించి చిం. ల.న. శాస్త్రి. గారి అభిప్రాయం:

    04/01/2019 7:20 pm

    శ్రీనాథుని కవిత్వ విమర్శ బాగుంది. శ్రీనాథుని జీవితానికి, సాహితీ సేవకు బహుశా సంబంధం ఉందేమో! అతని గ్రంథస్తం ఐన సుకుమారుని వ్యక్తిత్వంలో కవిగారి ప్రత్యక్ష పరిశీలన ఉండి ఉండవచ్చు. జీవితం కేవలం భోగానికే అన్నవిధమైనట్లున్న శ్రీనాథుని తాత్వికతే, అతని అంత్యదశలో అతని ఈతిబాధలకు కారణమైనదనుకుంటున్నాను. బృందావనరావుగారి విపులీకరణ దీనిని బలపరుస్తుంది. తెనాలి రామకృష్ణులవారి నిగమశర్మకు, ఈ సుకుమారునికి కొంత తేడా ఉన్నదేమో కదా.

  254. బేతాళ కథలు: కథన కుతూహలం-9 గురించి Apple Macintosh గారి అభిప్రాయం:

    03/10/2019 1:23 am

    ఇప్పటిదాకా ఈ శీర్షికలో వచ్చిన తొమ్మిది కథలూ చదివాను. వీటిని కథలు, (అందులోనూ “బేతాళ కథలు”) అని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదు. కథకి ఎత్తుగడ, ముగింపు, ఒకటో రెండో మలుపులన్నా ఉండాలి కదా! చందమామలో వచ్చిన బేతాల కథలే వీటికి నమూనా అనుకుంటున్నాను. బేతాళ కథల్లో జరిగేది: విక్రమార్కుడు శవాన్ని మోసుకురావడం, కథ వినడం, ప్రశ్నలకి సమాధానం చెప్పడం, తిరిగి బేతాళుడు ఎగిరిపోవడం. ఆ కథల ముఖ్యలక్షణం: బేతాళుడు చెప్పే కథలు స్వయం ప్రతిపత్తి గలిగి ఉండడం. ఆ కథల్లో ఎత్తుగడ, ముగింపు లాంటి దినుసులన్నీ ఉండేవి. ఆ కథలు విడిగా కూడా మనగలిగేవి. వాటిలో బేతాళుడు అడిగే ప్రశ్న తర్కబద్ధంగానే ఉంటుంది, పాఠకులకి ఆ ప్రశ్నకి జవాబు తెలియకపోయినా, జవాబు అర్థం కాకపోయినా, ఆ కథ కలిగించే అనుభూతి తక్కువవదు. (చందమామ కథల్లాంటి కథల్ని సులువుగా బేతాళ కథల్లో “wrap” చెయ్యచ్చని నాకో నమ్మకం..)

    “కథన కుతూహలం” శీర్షికలో వచ్చిన మూస కథలన్నిటిలోనూ విషయం ఒకటే, పాఠకరావు కథలు చదువుతూ ఉంటాడు, అంతే! ఏ కథ ఎందుకు, లేదా మొదట ఎందుకు చదివాడన్నదే ప్రతీసారీ బేతాళుడి ప్రశ్న! పోనీ, ఆ ప్రశ్నకి జవాబు విక్రమార్కుడికి ఎలా తెలుస్తుందో మనకర్థం కాదు. మొదటి విడత కథలో, పాఠకరావు మొదట చదివిన కథకి శీర్షిక (టైటిల్) వైవిధ్యంగా ఉందని ఆ కథ మొదట ఎంచుకున్నాడట. ఆ కథ పేరు “అరణ్యంలో అల్పపీడనం”. ఇది బేతాళుడు చెప్పకుండా విక్రమార్కుడికి ఎలా తెలిసింది? ఇలాగే రెండో విడత కథలో, పాఠకరావు మొదట ఎంచుకున్న కథలో ఎత్తుగడ బావుందని ఎంచుకున్నాడట! ఈ విషయం విక్రమార్కుడికి ఎలా తెలిసింది? ఈ “అవుటాఫ్ సిలబస్” ప్రశ్నలకి విక్రమార్కుడు ఎలా జవాబు చెబుతున్నాడు? ప్రియమైన పాఠకుల్లారా! ఈ ప్రశ్నలకి జవాబు తెలిసీ చెప్పకపోయారో! ఐదో విడత కథలో పాఠకరావు “కాలక్షేపానికి కథలు చదవడం లేదు” కాబట్టే విశిష్టమైన కథలకోసం చూస్తున్నాడన్నారు. మరి రచయిత ఈ మూస కథలు ఎందుకు రాస్తున్నారు?

    ప్రతి విడత కథలోనూ కథానికల ధర్మసూక్ష్మాల గురించి చెప్పే రచయిత ఆ ధర్మసూక్ష్మాలని తనే పాటించకపోవడం గమనార్హం. మొదటి విడత కథలో “శీర్షికాశిల్పం” గురించి ప్రస్తావించి కూడా, ఈ “కథన కుతూహలం” లో ఏ కథకీ ప్రత్యేకమైన పేరు పెట్టలేదు. రెండో విడత కథలో కథకి కావలసిన ఎత్తుగడ గురించి మనకి బోధించి, మరో విడత కథలో కథకి ముగింపు పాఠకుల ఊహకందేలా ఉండాలని వక్కాణించి, రచయిత తన కథలకి ఎత్తుగడ లేకుండా, ఉహాతీతమైన ముగింపు ఇస్తే మనమేమనాలి?

    పైగా, ప్రతి కథలోనూ పంటికింద రాయిలా తగిలే విపరీతమైన, అనవసరమైన శబ్దాడంబరం: (ఇవి హాస్యానికని మనం ఊహించుకోవాలి కాబోలు) మచ్చుకి కొన్ని: “కారుకేసి కవితాపూర్వకంగా చూశాడు”, “పట్టుదలకి సినానిముడు”, “దృష్టిచక్రాలు”, “అతడి మొహం తీగపై ఒక నవ్వుపువ్వు”, “రింగు, కలరింగు చేసుకుని రింగులురింగులుగా తిరిగింది”. (ఇవి ఏ అలంకారాలు??) ఇలాంటి వింత ప్రయోగాలు కోకొల్లలు. రచయితలు పాఠకులకి మానసిక వ్యాయామం కలిగించడకూడదని చెబుతూనే, రచయిత చీకటిని ప్రతి విడతలోనూ కనీసం రెండు మూడు పేరాగ్రాఫుల్లో ప్రీతిగా వర్ణించారు!

    ఇంకొన్ని వాక్యాలు చూడండి: “కారు శిరోదీపాల (హెడ్‌లైట్లకు వచ్చిన తిప్పలు) వెలుతుర్లో కొంచెం దూరం వేగిరంగా నడిచి”, “విక్రమార్కుడు చెట్టు దగ్గరకి తన కారువెలుతురు (కారుచీకటికి వ్యతిరేక పదం కాదు) “. ఇవి చదివితే, కథ ఎవరి దృకోణం నించి చెబుతున్నారో అర్థం కాక బుర్ర గోక్కావాల్సి వస్తుంది. ఫిక్షన్ రాస్తూ మధ్యలో ఈ “ఫోర్త్ వాల్ బ్రేక్” చేయడం ఏమిటి? ఇది ఫిక్షనా? మెటాఫిక్షనా?

    చంద్రశేఖర రెడ్డి గారు కథలమీద చేస్తున్న “మెటాడేటా” అనాలసిస్సు నిజానికి నాకు చాలా ఆసక్తికరంగా ఉన్నా, ఆ అనాలసిస్సుని బలవంతంగా ఇంత పేలవంగా కథల పేరుతో అందించడం అన్యాయం. దయచేసి మీ విశ్లేషణని వ్యాసాల రూపంలో వెలువరించండి, పుస్తకంగా కూడా వేయండి, తప్పకుండా కొనుక్కుంటాను, స్నేహితులతో కూడా కొనిపిస్తాను.

    నమస్కారం.

  255. అమానుషి గురించి M.k.kumar గారి అభిప్రాయం:

    02/11/2019 2:31 pm

    1 కవిత్వం బాగుంది.
    2 కంటిపాప దొన్నెల్లొ అని రావాలి.
    3. 2 stanzas గందరగోళంగా వున్నాయు
    4. చివరి 2 స్టాంజాలు బాగున్నాయి
    5. కవిత్వంలో కంటిన్యూటీ దెబ్బ తింది
    6. వేటికవే విడివిడిగా వున్నయ్
    7. పొయెట్రీలొ లొతు వుంది కాని గతి సరిగా లీదు
    8. ఆమనుషి అయున కాలం వెర్రివెంగళప్ప ఎలా అవుతుంది.
    9. వెర్ర్రివెంగల్లప్ప పద ప్రయూగం కవితను నీరుగార్చింది.

  256. Muse గురించి మూర్తి గారి అభిప్రాయం:

    02/03/2019 10:21 am

    >> eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries

    ఈమాట ఎల్లలు లేని **తెలుగు** పత్రిక అంటూ ఇలా ఇంగ్లీష్ కధలు కవితలూ ఎందుకు వేస్తున్నారో తెలుసుకోవచ్చా? మనం రోజూ రాసే, చదివే కధల్లో ఇంగ్లీషు ముక్కలు ఎలాగా తప్పడంలెదు. అవి కాక అనువాదాలు సరేసరి.

    పూర్తిగా ఇంగ్లీషులోనే ప్రచురించుకోవడానికి సవా లక్ష పత్రికలున్నై.

    మూర్తి వక్కలంక

  257. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి తః తః గారి అభిప్రాయం:

    01/25/2019 3:02 pm

    ఇప్పటికి కూడా తెలుగు భాష కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయింది కానీ కొత్త ఆలోచనలు తయారు చేసే భాష కాలేదు.

    ఇందులో తెలుగు భాష చేసిన పాపం ఏమీ లేదు. (ఈ రచయితలే తెలుగులో ఆనాళ్లల్లో వచ్చిన శాస్త్రగ్రంథాలను పేర్కొని ‘ఇప్పటికి కూడా’ అనటం ఎందువల్లనో).

    అయినా, దీనికి తెలుగు సమాజములో చోటు చేసుకున్న సాంఘిక, రాజకీయ పరిణామాలే ఎక్కువగా కారణం. సాంఘిక విలువలు మార్పుచెంది ‘Value for money’ అన్నది తెలుగు వారి నరనరాల్లోకీ పాకటం, ఐ టి లో ఆంధ్రులు అద్భుతాలు సాధిస్తున్నారంటూ రాజకీయ ప్రయోజనాల కోసం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ప్రచారంతో మొలకెత్తిన అపోహల విత్తనాలు వృక్షాలుగా ఎదిగి యువతను చదువు నుంచి దూరం చేయటం. తెలుగు సమాజం లో శతాబ్దాలుగా నెలకొన్న బ్రాహ్మినికల్ వాల్యూస్ నుంచి (బ్రాహ్మణేతరులు శంకరాద్వైత గ్రంథాలను తెలుగు చేయటం నాకు తెలుసు) సమాజాన్ని మళ్ళించిన ఉద్యమాలు అంతటితో ఆగిపోయి, ఉన్నతమైన కొత్త విలువలను అందివ్వలేక రాజకీయ వాణిజ్యానికి దాసోహమనటం సినిమా దానికి వత్తాసు పలకటం వంటివి. రచయితలు ఈవిషయాలను గమనించలేకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించదు.

    తః తః

  258. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి మద్దిపాటి కృష్ణారావు గారి అభిప్రాయం:

    01/20/2019 6:54 pm

    ఇప్పటికి కూడా తెలుగు భాష కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయింది కానీ కొత్త ఆలోచనలు తయారు చేసే భాష కాలేదు.

    కొత్త ఆలోచనలు తెలుగు విద్యార్ధుల్లో పుట్టించడానికి తెలుగు మాధ్యమంలో బోధన ప్రారంభించి తెలుగు అకాడమీ వారితో పుస్తకాలు రాయస్తే దాని ఫలితం amphiphloic siphonostele కు అనువాదం ‘ఉభయత్ర పోషక కణజాలయుత నాళికాకార పోషక కణజాలము’ అయ్యింది! ఇది కేవలం సాంకేతిక పదజాలాన్ని తయారు చెయ్యటానికి పూనుకున్న వారి బద్ధకం, నిర్లక్ష్యం, అంతకు మించి తెలుగుకు చేసిన (చేస్తున్న) ద్రోహం. ఎప్పుడో, ఎక్కడో ఒక గిడుగో, ఒక సామినేనో, ఒక టేకుమళ్ళో పూనుకున్నా, పట్టుదలతో ఉద్యమంగా నడిచిందెప్పుడైనా ఉందా? పైగా మనం ఇప్పుడు ఇంగ్లీషు పండితులం మరి!

  259. వనమయూరము గురించి గన్నవరపు నరసింహమూర్తి గారి అభిప్రాయం:

    01/06/2019 10:42 pm

    విస్తృతముగా వివిధ ఛందోరీతులను శోధిస్తూ , వర్ణిస్తూ, కొత్తవి సృష్టిస్తూ , వాటిలో చక్కని కవితలు చెబుతున్న మీరు ఋషితుల్యులు. పద్యసాహిత్యానికి మీరు చేస్తున్న సేవలకు అభినందన వందనములు.

  260. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి ఎన్. కుమార్ గారి అభిప్రాయం:

    01/03/2019 8:47 am

    ఈ వ్యాసమూ ఇంతకుముందు వచ్చిన వ్యాసమూ చదివాక ఇవి కొన్ని confused premises మీద కట్టినవని అనిపిస్తోంది. చదువుతుంటే నాకు స్ఫురించిన కొన్ని సంగతులు చెబుతున్నాను.

    — తెలుగులో శాస్త్ర పరిజ్ఞానం వృద్ధి చెందటానికి తగిన వ్యాకరణయుక్తమైన ఆధునిక రచనా పద్ధతి అవసరాన్ని వ్యాస రచయితలు నొక్కి చెబుతున్నారు. అలాగే దాన్ని అడ్డుకొన్నది గిడుగువారి వ్యావహారిక వాదం అంటూ గిడుగును దించి చిన్నయను పైకెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగులో ఆధునిక శాస్త్ర పరిజ్ఞాన వృద్ధిని ఆపుతున్నది గిడుగు ఆదిగా మొదలైన వ్యవహారిక దృక్పథం కాదు కదా. గిడుగు తదనంతరం వ్యాప్తిలోకొచ్చిన వ్యావహారిక తెలుగు వచనానికి శాస్త్ర పరిజ్ఞానాన్ని వ్యక్తం చేయగలిగే చేవ ఉన్నది. ఈ విషయంలో ఇబ్బంది వాక్యరణం కాదు. అంతకుమించినది- పరిభాష లేకపోవటం. ఈ పరిభాషకూ, వ్యాకరణానికీ ఏమీ సంబంధం ఉన్నట్టు తోచటం లేదు. (ఉదాహరణకి, మాట్లాడే మామూలు భాషలోనే, పెద్ద పద్ధతైనదిగా ఏమీ తోచని వాక్య నిర్మాణంతోనే/ శైలితోనే ఈ వ్యాసం చక్కగా కొత్త ఆలోచనల ప్రతిపాదనకు పూనుకున్నది కదా–పోనీ ఇది పక్కనపెట్టి వెల్చేరు ప్రసిద్ధ గ్రంథమే తీసుకున్నా.)

    — ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పొదువుకొనే వచనం తెలుగులో ఎదగకపోవటానికి కారణం గిడుగు మీదకు నెడుతున్నారంటే, వ్యవహారంలో వున్న భాషను రచనలోకి తెచ్చుకొనే స్వేచ్ఛను తప్పుబడుతున్నారని అనాలి (అదే గిడుగు చేసింది కాబట్టి).

    — గిడుగు ఉద్దేశంలో మాట్లాడే తెలుగు వాడాలీ అంటే “What did you do” అన్నది “వాడ్డిడ్జుడూ” అన్నట్టు రాయమని కాదు, అంటే “పలికే తీరులో” రాయమని కాదనుకుంటాను. మాట్లాడే భాషలో ఉండే syntactic libertiesనూ, పదాలనూ రాసే భాషలోకి తీసుకోవచ్చని ఆయన ఉద్దేశం. ఆయన మాట్లాడుతున్నది- పదాలు పలికే తీరు గురించి కన్నా, పలుకుబడిలోని వాక్యాలకుండే syntax గురించీ, పలుకుబడిలో మాత్రమే వినిపించే (అప్పటిదాకా రాతలో కనిపించని) పదాల గురించీను. వాటిని రచనలోకి తీసుకురావాలన్నది ఆయన ప్రతిపాదన. మరి అదేమీ వ్యాస రచయితలు వాంఛిస్తున్న “ఆధునిక గ్రాంథికా”నికి అడ్డు కాదే? పైపెచ్చు దాని వల్ల ఆ రచనలోని ఆలోచనల వ్యాప్తికి అవకాశం విస్తృతమవుతుంది కూడాను.

    — అసలు గిడుగు ఒక పూర్వనిర్దేశిత నియమాలు ఉండరాదూ అని చెబుతున్నది సృజనాత్మక రచనలకేగాని, శాస్త్ర గ్రంథాల విషయంలో కాదు కదా. ఇదే సంచికలో టేకుమళ్ళ పుస్తకానికి ఆయన రాసిన ముందుమాటలో: “కథలూ, నాటకాలూ, పాటలూ ఇంకా ఇటువంటి రసవద్రచనలు చేసేవారు, ప్రతిభావంతులైతే, పురాణపద్ధతులు అవలంబించరు. వారి రచనలో ‘వ్యక్తిత్వ’ముంటుంది. అద్దెచీట్లు, క్రయచీట్లు, ఒడంబడికలు, ప్రభుత్వంవారి శాసనాలూ, ప్రకటనలూ ఇటువంటివి Standard భాషలో ఉంటవి.” అని ఆయనే చెబుతున్నారు కదా. ఈ తోవలోనే కదా ఆ శాస్త్ర గ్రంథాలూ వచ్చేది. అయితే అదికూడా పూర్తిగా కాదు. శాస్త్ర గ్రంథాలకూ వ్యక్తిత్వం ఉండకుండా పోదు (పాఠ్యపుస్తకాలను, పరిశోధనా పత్రాలనూ మినహాయిస్తే.)

    — అసలు ఇంగ్లీషులోనైనా మరే భాషలోనైనా తాత్త్వికులు, శాస్త్రవేత్తల గ్రంథాలు ఒకే స్టయిల్ మాన్యువల్‌ని పాటిస్తున్నాయని వ్యాస రచయితలు ముందు నిరూపించగలిగే బాగుంటుంది. సృజనాత్మక రచనలో రచయిత ప్రత్యేక శైలి ద్యోతకమైనట్టే తాత్త్వికుల, శాస్త్రవేత్తల రచనల్లోనూ ద్యోతకమవుతుంది. అదేమీ లేకుండా ఒట్టి స్టయిల్ మాన్యువల్ శైలిలో పొడిగా రాసే రచనలు బహుశా ఇక్కడ డాక్టరేట్ల కోసం రాసే గ్రంథాలలాగే ఉంటాయి తప్ప, వాటికి ఆలోచనల్ని ముందుకు తీసుకుపోయే చేవ ఉండదు. ఏ ఒరిజినల్ థింకర్ కైనా తన శైలి ఉంటుంది.

    — చిన్నయసూరిని గిడుగు వ్యతిరేకించింది కూడా గ్రాంథికపు సింటాక్సు విషయంలో కాదు, గ్రాంథికపు పదజాలం విషయంలో అనుకుంటాను. దీనికి ఫలితరూపమైన వచనం ఒకవేళ గిడుగు దగ్గరే కన్పించకపోతే అందులో ఆయన వాదానికి వచ్చిన లోటేమీ లేదు. ఆయన ప్రయత్నాలు సఫలించిన వైనం మాత్రం తర్వాత తెలుగులో చలం ఆదిగా కొడవటిగంటి మీదుగా ఆ తర్వాతి రచయితలు, నేటి రచయితల ఎందరి రచనల్లోనో కనిపిస్తోంది. చలం వాక్య వైభవం చిన్నయసూరి నీతిచంద్రికలో వాక్యాలకన్నా మెరుగ్గానే ఉంటుంది. ఇక ఈ కథలూ, నవలలూ, కవితలూ రాసుకునే భాష ఆలోచనలు తయారు చేసుకునే భాషగా మారకపోవటానికి గిడుగు పెట్టిన అడ్డేమీలేదు. తెలుగు లోకంలో ఆలోచనాపామరత్వానికి మనం వేరే కారణాలు వెతకాలి. బహుశా విద్యా వ్యవస్థ, గ్రంథాలయ వ్యవస్థల వంటివి సరైన రీతిలో ఎదగకపోవటంలో వెతకాలి. వ్యావహారిక భాష అడ్డురాగా ఆలోచనలు కుంటుపడిపోయిన ఆలోచనాపరులు ఎంతమందో మరి నాకనుమానమే!

    — మనక్కావాల్సింది సింటాక్టికల్ లెవెల్లో ఆధునిక గ్రాంథిక భాష అని అనుకున్నప్పుడు ఇక పదాల లెవెల్లో మాత్రమే వ్యాకరణం గురించి మాట్లాడాడని వ్యాస రచయితలే చెబుతున్న చిన్నయసూరి ఎందుకు పనికివస్తాడు? ఆ గ్రాంథికపు పదజాలం తీసివేస్తే చిన్నయలో ఉన్నపాటి సింటాక్టిక్ రిఫైన్మెంటు కొడవటిగంటిలో కనిపించదా? చిన్నయకు ముందువున్న నేపథ్యంలోనుంచి చూస్తే చిన్నయ ఎంతో ప్రకాశవంతంగా కన్పించవచ్చు. ఆయన పాదుకొల్పిన వాక్య నిర్మాణ ఒరవడికి గిడుగు ఇచ్చిన వ్యావహారిక పదజాల స్వేచ్ఛ తోడయ్యాకా, ఆ రెండూ కలిసి రియలైజ్ అయ్యాకా వచ్చిన వచనం ముందు చిన్నయ్య, గిడుగు ఇద్దరూ తేలిపోతారు–ఒకవేళ మనకు కొత్తేదైనా రోతే అన్న మౌఢ్యం అనాలోచితంగా ఉంటే తప్ప.

    — “మేం సృజనాత్మక సాహిత్యం గురించి కాదు మాట్లాడుతోంది, ఇతర వచనం గురించి” అంటారా? గిడుగు ఆలోచనలు సృజనాత్మక వచనాన్ని ఎన్నో శృంఖలాల నుంచి తప్పించాయన్నది విశదమైన విషయం. ఆయన సంకెళ్ళు వదులు చేసాకనే భాష ప్రజాస్వామికమైంది. గత మూడు దశాబ్దాలుగా బ్రాహ్మణేతర, ముఖ్యంగా వెనుకబడిన కులాల సంస్కృతి రచనలో ఆవిష్కృతమవుతున్నదంటే గిడుగు తొలిచిన దారి మహిమే. నాగప్పగారి సుందర్రాజు ‘మాదిగోడు’ కథలు ఒక గొప్ప సంభవం కాదూ? అది అంతకుముందు అన్ని వందల ఏళ్ళ తెలుగు పుస్తకాల్లోనూ ఆవిష్కృతంకాని ప్రపంచం కాదూ? అదెలా సాధ్యమైందంటారు? విద్య గ్రాంథికాన్ని వీడి వ్యావహారికంవైపు మరలటం వల్ల కాదూ? మరి అదెలా సాధ్యమైందంటారు? గిడుగు వల్ల కాదూ? తెలుగు సాహిత్యం కొన్ని శతాబ్దాలుగా సాగుతూ వచ్చిన వైనానికి (ఒకే వర్గం చేతిలో చిక్కుపోయిన వైనానికి) స్పీడు బ్రేకులు వేసే సాహిత్యం గత రెండు దశాబ్దాలుగానే వస్తోంది. గిడుగు ప్రభావం అంచెంలంచెలుగా వెదజల్లిన ప్రభావానికి ఫలితమే అది.

    — గిడుగు అందించిన స్వేచ్ఛని సృజనకారులు అందిపుచ్చుకున్నట్టు, ఇతరేతర విభాగాల్లోని (చారిత్రక, శాస్త్రీయ, తాత్విక) రచయితలు అందిపుచ్చుకోకపోవటానికి కారణం ఆయన కాదు. సృజన మనసులోంచి పుడుతుంది. దానికి వేరే వ్యవస్థల దన్నూ ప్రాపకం మరీ అంతగా అవసరం లేదు. శాస్త్రపరమైన ఆలోచనలకు విద్యా వ్యవస్థ, ముఖ్యంగా గ్రంథాలయ వ్యవస్థ, ఇతరేతర సంస్కృతీ దన్నుగా నిలవాలి. ముఖ్యంగా ఇప్పటిలా తుప్పుపట్టిపోకుండా స్వేచ్ఛగా ఆలోచనల మారకం జరిగే విశ్వవిద్యాలయాల్లాంటి ఆవరణలు కావాలి. అవి తగినవిధంగా లేకపోవటమే ఆలోచనారంగంలో తెలుగు వెనుకబాటుకి కారణం తప్ప, గిడుగు వ్యవహారిక వాదం కాదు.

  261. TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ గురించి ఉమా గారి అభిప్రాయం:

    11/29/2018 1:56 am

    శర్మ గారు బాగా చెప్పారు. కొద్దిగ శ్రమ అనుకోకుండా “రచనల పోటీ” అని గూగుల్ లో వెతికితే, ఇంతకు మునుపు ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలు పెట్టిన కధా, కవిత పోటీల బహుమతుల వివరాలు తెలుస్తాయి. వాటితో పోలిస్తే పైన చెప్పిన బహుమతులు తక్కువేమి కాదులేండి. మొత్తం బహుమతుల విలువ దాదాపు 60,000 రూపాయలు పైచిలుకు ఉన్నట్లుగా తోస్తుంది. మూర్తిగారు చెప్పినట్లు ఒక్క కధకే $1160 అంటే, దాదాపు 81,000 రూపాయలు ఇవ్వడం వారికే సాధ్యమైన పని అని చెప్పక తప్పదు అండి. ఈలెక్కన మొత్తం బహుమతుల విలువ $8000 అంటే దాదాపు ఏడు లక్షల రూపాయలు అవుతుంది. అయినా పది పేజీల కధకి 81,000 రూపాయల బహుమతి ఆశించేవారు రాయకపోతే నష్టం లేదు కానీ, కానీ పాపం వారి వ్యధ తీర్చే వారు ముందుకు రావాలని కోరుకుందాం!!! కానీ కొద్దిగ పెద్దమనసు, ఓపిక చేసుకొని వారు కూడా ఇలాంటి పోటీలో పాల్గొంటే తెలుగు సాహిత్యానికి కాసింత మేలుచేసినవారు అవుతారు అని నాకు ఎందుకో అనిపిస్తుంది అండి.

  262. జీవనసంధ్య గురించి S. Narayanaswamy గారి అభిప్రాయం:

    11/17/2018 11:45 am

    కవులు రాసే కథల్తో నాకు చాలానే ఇబ్బంది. కవిత్వం వాళ్ళని ఓ పట్టాన వదిలి పెట్టదు. ఆ ఇబ్బంది పక్కనబెట్టి చదివాను. చాలా బాగా రాశారు.
    అందరూ మెచ్చుకోళ్ళు మాత్రమే కురిపిస్తే ఎలా? దిష్టి చుక్కలాగా రెండు విమర్శలు పెడతాను.
    మధ్యమ పురుష (ద్వితీయ పురుష కాదు, ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నా, కోకపోయినా ఇంగ్లీషు మనల్ని ఎంత ఆవహించి ఉందో!) నిర్వహించడం కష్టం. దీన్ని ఇంకెవరో కూడా ప్రస్తావించారు. ఎలాగూ కథ చెప్పే స్వరం సర్వజ్నాని స్వరం కాబట్టి ప్రథమ పురుష కథనం ఇంకాస్త రాణించేదేమో?
    దానికి తోడు వచన కవిత్వం లాంటి వాక్య నిర్మాణం ఒకటి. “..వేరేపక్కకి తిరుగుతావు.” సాధారణ భూతకాలం కాకుండా ఇలాంటి వర్తమాన సూచక క్రియా రూపంతో సాధించిన అదనపు ప్రయోజనం ఏదన్నా ఉందా? కొన్ని చోట్ల భూతకాల రూపం తొంగి చూస్తూనే ఉంది.

    ఒకే సంచికలో రెండు మధ్యమ పురుష కథలు – తమాషాగా అనిపించింది.

    మొత్తానికి కలాన్ని కదిలించారు. ఈ అక్షరాల్తో పాఠకుల్నీ కదిలించారు. అభినందనలు.

  263. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి రాళ్ళపల్లి సున్దర రామ శర్మ గారి అభిప్రాయం:

    11/12/2018 3:49 am

    ఏల్చూరి మురళీధరరావు గారికి శత సహస్ర వందనాలు.

    మీ వ్యాసం ఆసాంతం నన్ను కట్టి పడేసింది. గణపవరపు వారి ప్రబంధరాజము మీద ఇంత విస్తృతంగా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.

    ఇకపోతే, పద్య కవిత్వం బాగా అలవడి అదికాస్తా చిత్ర కవిత్వం పై మక్కువ గా మారింది. గర్భ కవిత్వం, ద్వ్యక్షరీ, త్ర్యక్షరి, ముక్త పదగ్రస్తం వంటి ప్రయోగాలు బాగానే చేయగలిగినా ప్రబంధరాజ కావ్యాన్ని దానిపై పరిశోధిత వ్యాసాలను చదివి మరిన్ని మెళుకువలు సాధించాలని ఆశ.

    కాని ఆ పొత్తము అంగడిలో అలభ్యంగా ఉంది. అలాగే అంతర్జాలంలోనూ లభించుట లేదు. అది ఉపలబ్దమయ్యే మార్గము సూచించ గలరు.

    భవధీయుడు
    రాళ్ళపల్లి సున్దర రామ శర్మ
    Akshara Vinyasam
    Natelugu savvadi blogspot.com
    +919440597260

  264. ఆనందం గురించి Phani Dokka గారి అభిప్రాయం:

    11/08/2018 8:38 pm

    ఇంచుమించు ఒక దశబ్దం తరువాత ఈమాట ఓపెన్ చేసాను, అప్రయత్నంగా. ఏమున్నాయా అని వెతుక్కుని, పక్షపాతంతో ముందు మీ కవితే చదివాను. నా అంచనా తప్పలేదు. నా కవి ఎదిగాడే గానీ, కలుషితమవలేదు.ఇంత అందంగా పదాలని వాడడం, ఇంత నాజూకుగా భావాలని చెప్పడం మీలాంటి ఏకొద్దిమందికో చెల్లింది. పునః పునః నమస్సులు.

  265. నవంబర్ 2018 గురించి హెచ్చార్కె గారి అభిప్రాయం:

    11/05/2018 9:30 am

    ‘ఈ మాట’ పయనం వెనుక వున్న అందరికీ మనసారా అభినందనలు, శుభాకాంక్షలు.
    దాదాపు మొదటి నుంచి నాకు ‘ఈమాట’ తెలుసు. ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాను.
    బాగా మొదట్లో ఈమాట లో కాలమ్ రాయాలని వేలూరి గారు అడిగారు. ‘ఈనాడు’ లో వుండగా.. చాల జాగర్తగా పొయెమ్స్ మాత్రం మారుపేరుతో అచ్చేసే వాడిని, మరెక్కడా సృజనాత్మక రచనలు చేసే వాడిని కాదు, అది నిబంధన… అందువల్ల కాలమ్ కోసం డబ్బు ఇస్తామని కూడా వేలూరి గారు అంటే లోలో నవ్వుకున్నాను.. కుదరలేదు. అమెరికా వచ్చాక కొన్ని సార్లు నా కవిత్వ ప్రచురణకుఈ వేదికను వుపయోగించుకున్నాను. అందువల్ల ఇవి కృతజ్ఞతా పూర్వక అభినందనలు కూడా.

  266. ఏడు కవితలు గురించి తః తః గారి అభిప్రాయం:

    11/03/2018 2:56 pm

    ఆమధ్య ఐఐటి భుబనేశ్వర్లో మాతృభాషా దినోత్సవ సందర్భంగా జరిగిన సభానంతరం శ్రీ మిశ్రాను కలవటం — వారితో ఈమాట లో వచ్చిన వారి కవితల తెలుగు అనువాదాల గురించి రెండు మూడు మాటలాడటం. వారు తెలుగు వారు బాగా ఎక్కువగా ఉన్న బరంపురం లో – ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా- పని చేసినా తెలుగు పెద్దగా రాదనే అన్నారు. వారింటికి రమ్మన్నారు గానీ ఎంత వెళ్దామని ఉన్నా ఇప్పటిదాకా కుదరలేదు. అనువాదం అనగానే నా పద్యాలు వారికి చూపిస్తూ కబుర్లాడుకుంటున్నప్పుడు శ్రీ రోణంకి ప్రెంచ్ రచయితనొకణ్ణి కోట్ చేస్తూ చెప్పిన “All translations are like women, when they are faithful they are not beautiful, when they are beautiful they are not faithful” గుర్తుకొస్తుంది.

    ఈ అనువాదాలు చాలా అందంగా ఉన్నాయి. (నాకు ఒడియా రాదు).

    తః తః

  267. ఏడు కవితలు గురించి తమ్మినేని యదుకుల భూషణ్, గారి అభిప్రాయం:

    11/01/2018 2:09 pm

    అద్భుతం. ఎన్ని రంగులు ఎన్ని భావాలు ఎన్ని అనుభవాలు; సౌభాగ్యుని ద్వా సుపర్ణా పుస్తకంతో తెలుగులో కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం వచ్చిన కాలాన్ని నిద్ర పోనివ్వను (నక్క గోపి), మోహనా మోహనా (శివారెడ్డి) లాంటి ప్రముఖుల పుస్తకాలను పోలిస్తే హత విధి అనుకోక తప్పదు; మన ప్రముఖులకు తెలుగులో వాక్య నిర్మాణం చేతకాదు — ఈ అధునిక కవిత్వంలో అగుపించే స్వచ్చత, పారదర్సకత ఎప్పుడు సాధించాలి? గొప్ప కవిత్వాన్ని చదవడం దూర దేశపు అడవుల్లో రైలు ప్రయాణం లాంటిది. ఎన్నో సెలయేర్లు, అందమైన లేళ్ళు, ఎదురెండ, అనుకోని వర్షం అన్నీ ఎదురవుతాయి. గొప్ప అనువాద ప్రయాణాన్ని మొదలు పెట్టి అభయారణ్యంలో విహరిస్తున్న వేదండ ద్వయానికి అభినందనలు.

  268. పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    11/01/2018 1:16 pm

    తాత్పర్యం రాయటానికి, ప్రతిపదార్థం రాయటానికి ఉన్న వ్యత్యాసం అది అనుభవించిన వారికే తెలుస్తుంది ! అందునా రెండు వేల ఏళ్ల పైగా ఉన్న కావ్యానికి తొలిసారిగా ఇలాటి ప్రయత్నానికి పూనుకున్న భాస్కర్ ధైర్యాన్ని, మొదల్లోనో మధ్యలోనో వదిలెయ్యకుండా సాగించి సాధించిన పట్టుదలని మనసా అభినందించి తీరాలి. ఇంత గౌరవం తొలిగా తెలుగుకే దక్కించటం మరో అభినందనీయ విషయం.

    భాస్కర్ “ఈమాట” ప్రారంభకుల్లో ఒకరు. శిశువుగా వున్న పత్రికని పాకించి, అడుగులు వేయించి, పరుగులు తీయింఛిన వారిలో ప్రముఖుడు. అప్పట్లోనే భాసుడి “స్వప్న వాసవదత్తం” నాటకాన్ని తేలిక తెలుగులో ఈమాట పాఠకులకు అందించిన వాడు, వాల్మీకి – కాళిదాసుల కవిత్వాల తారతమ్యాల గురించి తన లోతైన అవగాహనని ఈమాట పాఠకులకూ అందించినవాడు. మరో మారు అభినందనలు, తన సాహితీ ప్రతిభని ఇంతటి మహత్తర, బృహత్తర కార్యానికి ఉపయోగించి అనితరసాధ్యమైన గౌరవాన్ని తెలుక్కి సంపాదించి పెట్టినందుకు.

    మోహనరావు గారి పరిచయం గురించి కొంచెం: 1. పుస్తక రచయిత పరిచయాన్ని (ఛాయాచిత్రంతో) ముందుగా ఇచ్చివుంటే బాగుండేది. పుస్తక రచయితని వదిలి పరిచయకర్తల గురించిన వివరాలు ఇవ్వటం కొంత అభ్యంతరకరం. 2. ఆదికావ్యం రామాయణాన్ని మర్చిపోయినట్టున్నారు. 3. “పాత” సంస్కృతానికి ప్రతిపదార్థాలు రాయటంలో ఉన్న క్లిష్టతని కూడ స్పృశించి వుంటే ఇంకా బాగుండేది.

  269. నాకు నచ్చిన పద్యం: సోమన తెలుగు జాతీయాల సొబగు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    10/21/2018 5:35 am

    ఒకే కథ రకరకాల తేడాలతో వివిధ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ కనిపించడం మనకు కొత్తకాదు కదా! ఇది కూడా అంతే. నేను సంస్కృత హరివంశం చదవలేదు కానీ సోమన ఉత్తరహరివంశంలో ఉన్నట్టుగానే (ఈ వ్యాసంలో పేర్కొన్నట్టు), ఎర్రన హరివంశంలోనూ ఉంది. కాబట్టి బహుశా సంస్కృత హరివంశ భాగవతాల్లోనే ఈ తేడాలు ఉండి ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆయా కాలాలలో ప్రసిద్ధమైన తత్త్వ దర్శనాలకు అనుగుణంగా యీ మార్పులు జరిగి ఉండవచ్చునని అనిపిస్తుంది. భాగవత కథలో చివరకు వైకుంఠంలో నారాయణుడు దర్శనమిస్తే, హరివంశ కథలో ఒక మహా కాంతి మాత్రమే కనిపిస్తుంది. అందులోకి కృష్ణుడు మాత్రమే ప్రవేశిస్తాడు. అది సాంఖ్యులు, యోగులు చెప్పే పరమపురుషుని స్వరూపంగా అభివర్ణింపబడింది! (భాగవత కథలో కొన్ని పొసగని అంశాలున్నట్టు నాకనిపించింది, అది వేరే విషయం)

    ఇక ఒకే కథను ఇద్దరు కవులు ఎలా నిర్వహిస్తారో పరిశీలిస్తే, అసలు కవిత్వం ఎక్కడ ఉంటుందో, అందులో కవి వ్యక్తిత్వం ఎలా ప్రతిఫలిస్తుందో చక్కగా తెలుస్తుంది. అందుకు ఎర్రన హరివంశం, సోమన ఉత్తరహరివంశం మంచి అవకాశాన్ని యిస్తాయి. ఈ విప్ర బాలకుల కథనే తీసుకుంటే, సోమన రచనలోని వక్రత (అదే అతని కవిత్వంలోని ప్రత్యేకత) స్పష్టంగా కనిపిస్తుంది.

    కథ మొదలుపెట్టినప్పుడు, కృష్ణుడు యాగదీక్షుతుడు కావడం అనే అంశాన్ని ఎర్రన రెండు మూడు పద్యాలలో వివరంగా వివరిస్తాడు. “పశువులు యూపసంబద్ధంబులై యొప్ప” అంటూ యజ్ఞాన్ని పెద్ద సీసపద్యంలో వర్ణిస్తాడు.

    అదే సోమన అయితే:

    ఒకనా డొక శాస్త్రములో
    నొక క్రతు వొకనాటి దీక్ష కొనరిన గని ధా
    ర్మికు డా హరి యది గైకొని
    యొకచో నుండంగ విప్రు డొక డేతెంచెన్

    అని అర పద్యంలో అదే విషయాన్ని టూకీగా చెప్తాడు. పైగా ‘ఒక’ అన్న పదం అన్ని సార్లు వాడడంలో ఆ చేసే యజ్ఞానికి కథలో ఏమాత్రం ప్రాధాన్యం లేదు సుమా అన్న వ్యంగ్యం ఉంది. ఒకరోజు ఏదో ఒక శాస్త్రంలో చెప్పబడిన ఒక క్రతువు చెయ్యడానికి కూర్చున్నాడు – అనడంలో అది స్పష్టంగా తెలుస్తోంది. బహుశా ఎర్రన హరివంశంలో ఆ క్రతువు గురించి అంత పెద్ద వర్ణన చదివి, ఈ కథతో నేరుగా సంబంధం లేని దాన్ని గురించి అంతలేసి వర్ణన అనవసరం అనిపించి, దాన్ని ఎత్తిపొడవడానికే ఈ పద్యం నాచన సోమన రచించాడేమోనని నాకు అనిపిస్తుంది!

  270. అహోరాత్రం గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    10/07/2018 11:51 am

    ఉదాహరణకి, ‘ఏకం చక్రం వర్తతే ద్వాదశారం’ – అన్న అశ్వినీసూక్తంలోని మాట. ఈ సూక్తం ఎంత ప్రాచీనమైనదో తెలియదు.

    చంద్రుని గమనంలో అమావాస్య నుండి అమావాస్య దాకా ఉండే 30 రోజులని మాసం అనుకుంటే, దాదాపు అటువంటి 12 మాసాల తరువాత ఋతువులు మళ్ళీ తిరిగి రావడం గురించి ఈజిప్టు నాగరికత కాలం నుంచి మెసోపొటమియా, సింధు నాగరికతల దాకా వ్యవసాయం మీద ఆధారపడిన నాగరికతల వారందరికీ తెలిసినట్టు భావించవచ్చు. 12 మాసాల ప్రస్తావన ఋగ్వేదంలో కూడా ఉంది. ఉదాహరణకు ఋగ్వేదంలోని 7వ మండలము, 103 సూక్తములోని తొమ్మిదవ శ్లోకం చూడండి:

    దేవహితిం జుగుపుర్ ద్వాదశస్య ఋతుం నరో న ప్ర మినంత్యేతే ।
    సంవత్సరే ప్రావృష్యాగతాయాం తప్తా ఘర్మా అశ్నువతే విసర్గం ॥
    (ఋగ్వేదం 7.103.9)

    సంవత్సరానికి 12 మాసాలన్నది దైవనిర్ణయమని, వాటిని చక్కగా నిర్వర్తించినందుకు బ్రాహ్మణులు జరుపుకొనే విజయోత్సవమే సోమ-అతిరాత్ర యజ్ఞమని ఈ శ్లోకాల ద్వారా మనకు తెలుస్తున్నది.

    అయితే, 12 మాసాల గురించి ప్రస్తావన ప్రాచీనంగానే కనిపిస్తున్నా, 12-రాశుల ప్రస్తావన మాత్రం యవనులతో సంపర్కం జరిగిన కాలం తరువాతే కనిపిస్తుంది. గ్రీకు zodiac గుర్తులు, మన రాశుల గుర్తులలో పోలికలే కాక ఈ సిద్ధాంతాల్లో మనకు ఎన్నో గ్రీకు నుంచి అరువు తెచ్చుకొన్న పదాలు మనకు కనిస్తాయి. మచ్చుకు కొన్ని: హోర (Greek: hora, ὥρα), కేంద్ర (kentron, κέντρον), హేలి (helio, ἧλιος) జ్యామితి (dimetron, διάμετρον) మొ॥

    కవిత మీద చర్చ పక్కదారి పట్టినట్టుంది. ఇంతటితో ఆపేస్తాను.

    సురేశ్.

  271. అహోరాత్రం గురించి నాగమురళి గారి అభిప్రాయం:

    10/06/2018 10:50 pm

    సురేశ్ గారు,
    హోర అన్న పదం “అ’హోరా’త్రం” నుంచి పుట్టింది అని సాంప్రదాయికులు అంటారు. ఈ కవిత పేరు అహోరాత్రం కాబట్టి, పరాశరుణ్ణి ఉటంకించారు కాబట్టి ఆ మాట వ్రాశాను. అంతకు పైన శబ్ద వ్యుత్పత్తి గురించి ఆలోచించలేదు.

    యవనుల కంటే పూర్వం భారతదేశ ఖగోళశాస్త్రం ఎక్కువగా నక్షత్రాల మీద ఆధారపడిందే తప్ప, రాశుల గురించి చర్చ లేదు

    ఇది నేనూ విన్నదే. కానీ కొన్ని సందేహాలు ఉన్నాయి. ఉదాహరణకి, ‘ఏకం చక్రం వర్తతే ద్వాదశారం’ – అన్న అశ్వినీసూక్తంలోని మాట. ఈ సూక్తం ఎంత ప్రాచీనమైనదో తెలియదు.

    in geo-centric theories, sun takes one day to rotate around earth

    It is not only Sun, all planets (the entire zodiac for that matter) appear to rotate around the earth in just one day due to the diurnal motion of earth. This motion represents the Lagna (rising zodiacal degree in the east), which is the most important, and other houses in Astrology.

    అమూర్తుడు అన్న పేరు నేనూ ఎప్పుడూ వినలేదు. కానీ ఆ పదంద్వారా ముహూర్తం లేక లగ్నాన్ని సంకేతిస్తున్నారనే నా అనుకోలు.

    మొత్తానికి కవితకన్నా నా వ్యాఖ్యానం పెద్దదైనట్టు ఉంది. 🙂

  272. అహోరాత్రం గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    10/06/2018 3:35 pm

    హోర = Hour. ఈ పదం “అ’హోరా’త్రం” నుంచి పుట్టింది.

    నాగమురళి గారు, ఇది సరైన వ్యుత్పత్తి కాదు. యవనుల కంటే పూర్వం భారతదేశ ఖగోళశాస్త్రం ఎక్కువగా నక్షత్రాల మీద ఆధారపడిందే తప్ప, రాశుల గురించి చర్చ లేదు. 12 రాశుల చర్చ అంతా తరువాత గ్రీకు (పారశీక-గ్రీకు), రోమన్ల ప్రభావంతో వచ్చిందే. యవనజాతక, రోమకసిద్ధాంత, హోరాశాస్త్ర మొదలైన గ్రంథాల్లో మనవాళ్ళు వారి వారి సిద్ధాంతాలకు యవన సిద్ధాంతాలు మూలమని కచ్చితంగా చెప్పారు కదా. గ్రీకు, లాటిన్లలో హోర- అన్న శబ్దం కాలసూచిక (సంవత్సరంలో భాగం, దినములో భాగం).

    కవితలో నెలరోజుల్లో వృత్తం చుట్టబెట్టేవాడు చంద్రుడు అయితే, ఒక్కరోజులో వృత్తం చుట్టబెట్టేవాడు సూర్యుడనుకొన్నాను. అయితే, అమూర్తుడని ఎందుకన్నారో నాగరాజుగారే వివరించాలి. (As you know, in geo-centric theories, sun takes one day to rotate around earth, while moon takes about 30 days).

    ఇవన్నీ మీకు తెలియనివి కాదనుకోండి. మీరు చెప్పిన వ్యుత్పత్తే ఆశ్చర్యం కలిగించి నాచేత ఈ వ్యాఖ్య రాయించింది.

  273. నాకు నచ్చిన పద్యం: మారన వరూధిని కామన గురించి విశ్వం-విష్ణుర్వ -షట్కారో గారి అభిప్రాయం:

    09/12/2018 7:17 am

    మాగంటి గారు
    నేను రచయిత ని కానీ, వారి కవితా పటిమని కానీ పండిత విద్వత్తుని కానీ ఏమీ అనలేదండి. వారి ప్రచురణలు చదువుతూ ఉంటాను కనక ఆయన గురించి మాట్లాడలేదు. అయితే ఒక్కొక్కప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా వేళ్ల సందుల్లోంచి ఇలా పదాలు జారిపొతూ ఉంటాయి. రచయిత దిద్దినా ఇది సంపాదకుల చేతుల్లోంచి జారింది. చదువుతుంటే పచ్చడి మెతుకుల్లో పంటికింద రాయిలా తగిలింది. దీన్నే ఇంగ్లీషు వాడు “ఫాలింగ్ త్రూ క్రాక్స్’ అంటాడనుకుంటా. అదే చెప్పాను.

    నేను నా కీబోర్డు మీదనుంచి వేళ్లతో “అక్కడకొట్టి ఇక్కడ అతికించే” పద్ధతిలో చేస్తాను కాబట్టి ‘రాయడం’ అనేది సరినదే అనుకుంటున్నాను. పెన్ను కానీ పెనిసిలు కాని వాడి “వ్రాయ” లేదు కదండి? అయినా తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు కనక అలా నేను ఎన్నిన తప్పుని – పెద్ద మనుసుతో – క్షమించి వదిలేయగలరు 🙂

    పేరు గురించి – విశ్వం విష్ణర్వ షట్కారో అని రాయడనికి వేరే కారణం ఉంది. మరో విషయం, నా లాంటి మూర్ఖులు “విష్ణాయ” అంటారు. తెలుసున్న మీలాంటివారు, ఏపిల్ పండితులూ ‘విష్ణవే’ అంటారు. అయితే

    మూర్ఖో వదతి విష్ణాయ విద్వాన్ వదతి విష్ణవే
    ఉభయో సదృసం పుణ్యం, భావగ్రాహీ జనార్దన:

    అని అనడం తెలుసు. అందువల్ల హనుమంతులవారిని దర్శించినంతటి మీకు ఎంత పుణ్యం వచ్చిందో నాకూ అంతే వచ్చిందని (మరియు వైస్ వెర్సా) జబ్బలు చరుచుకుంటూ నేను సంతోషపడిపోతున్నాను.

    నమస్కారం

    తా. క. పేరు దిద్దాను.

  274. నాగరికుడు గురించి Lalitha TS గారి అభిప్రాయం:

    09/03/2018 2:38 pm

    కవితలో pun బావుందండి. పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

  275. కాళీ పదములు 2 గురించి Lalitha TS గారి అభిప్రాయం:

    09/03/2018 2:36 pm

    కవితల భావం నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ చదవడానికి భలేగా వున్నాయండి, ఇంద్రాణీ!

  276. మా పీకల మీదుంచిన కత్తులు తీయండి గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    07/27/2018 11:52 am

    “Ilango Krishnan, a well-known name in Tamil literary circles and an acclaimed poet, recently took to poetry to speak out against the killings. “How else can a writer express his extreme sadness?” he asks. “I do everything in my limits to express my anguish, and poetry is one of them. It is the medium I know. To me, this is almost like mourning.”

    నాకు తమిళం రాదు. బహుశా ఇలంగో కృష్ణన్ తమిళ మూలంలో కవిత్వం చెప్పారేమో. ఇక్కడ ఇచ్చిన ఈ తెలుగు అనువాదములో శవాలు, గాయాలు, మనుషుల కేకలు, ప్రశ్నలు, పోలీసుల సమాధానాల నమోదు ఉంది. కవిత్వపు జాడ లేదు.

    కృష్ణన్ Acclaimed poet అట. ఇప్పటి ప్రజలకు సంబంధించిన విషయాలు, రోజువారీ భాషలో చెప్పటం ప్రస్తుత కవిత్వ లక్షణం. అలాగే చెప్పనీ చదువుదాం, అని మళ్లీ చదివాను.

    చదువుతూ, ఈ అనువాదపు ప్రచురణ -మరణాల ‘వార్త’, అందులో పోలీసుల పాత్ర- పాఠకులకు తెలియ చెయ్యటం కోసమైతే, దానికి నెలకోసారి వచ్చే ‘ఈమాట’ సాహిత్య పత్రిక సరైన మీడియమ్ కాదు. అందుకు బొచ్చెడు న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. సాహిత్య పత్రిక వార్తా పత్రిక కాదు. అబ్జెక్షన్! అని అందాం అనుకున్నా. కాని అది మాత్రం ఎందుకు! సంగతి ఏమిటో తెలుసుకుందాం. చూద్దాం, అని మరోసారి సాంతం చదివాను.

    చూస్తే, కవిగారు, సంఘటన లోని నిజానిజాలు చిత్రించేందుకు, ‘killings’ జరిగినప్పుడు అసలుకి వారు అక్కడ లేరనుకుంటా. బ్రతికి ఉన్న మనుషుల గాయాలకు, రోడ్డు మీద కాని, హాస్పిటల్ లో కాని – మందు రాయటం, కుట్లు వెయ్యటం, వారి పని ఎలాగూ కాదయ్యె. ఈ కవి ఏంబులెన్స్ నడపరు. స్ట్రెచర్లు తొయ్యరు. హాస్పిటల్లో వాలంటీర్ పనైనా చెయ్యరు. ఎవరి శవాలు మోర్గ్ కి చేర్చరు. తన ఆవేదన, శోకం ‘కవిత్వంగా’ చెప్పటం మాత్రమే వీరు పూనుకొన్న పని. ఈ అనువాదపు మాటల్లో కవిత్వం ఏదీ? ఏమో, ఆ ‘almost like mourning’ ఫీలింగు ఈ అనువాదంలో ఉన్నదేమో. “It’s almost like mourning” అన్న emotion ఏమిటో తెలియని నేను, ఆ సంగతి ఆ తమిళకవికి వదిలి వేస్తాను.

    ఇది కాల్పనిక విషయం కాదు. తమిళనాడులో ఇటీవలి ఒక నిజ సంఘటన నుంచి ఈ రాత వచ్చింది. సరే, ఆ వార్త వరకూ అందులో చెప్పిన విషయం నిజమై ఉండొచ్చు. ఐనా, అదొక్కటే కాక ప్రసిద్ధకవి గారు, ప్రజాస్వామ్య రాజ్యాలలో బతికే మామూలు ప్రజలం మనమూ, గుర్తించాల్సిన విషయాలింకా ఉన్నయ్యి. అందుకని ఈ కింది వాక్యాలు.

    ప్రస్తుత కాలంలో స్కూల్, చర్చ్, కాన్సర్ట్, రోడ్, ఇల్లు- ఎక్కడైనా సరే, ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారు కాపాడమని పొలీస్ ని పిలుస్తారు. కవులను పిలవరు.

    ఇటీవలే, అమెరికాలో ఒక వార్తా పత్రిక ఆఫీసు లో పని చేసే వారిని ఒక వ్యక్తి రైఫిల్ తో కాల్చి చంపుతున్నప్పుడు, వార్తాపత్రికలో పనిచేసేవాళ్లు భయంతో వెంటనే పోలీసులని పిల్చారు రక్షించమని. అదే సమయంలో ఇతర విలేఖరులను, ప్రమాదం నుండి దూరంగా ఉండమని, ఆ బిల్డింగ్ కు రావద్దని కూడా వారికి హెచ్చరికలు పంపారు. ప్రజాస్వామ్యంలో ‘పొలీస్ ఫోర్స్’ పౌర రక్షణ కోసం, ఎప్పుడూ సన్నద్ధంగా ఉండే ఒక శాఖ, అని జర్నలిస్టులకు నమ్మిక ఉంది కాబట్టే, రక్షించమని పొలీస్ ని పిల్చింది.

    ప్రొటెస్ట్ కవులు, ఏడుపు కవులు, అన్ని రకాల పాప్యులర్ కవులు కూడా వారి రక్షణకు పొలీస్ నే వినియోగిస్తారు. కవి గాయకులు ఆపదలో ఉన్నప్పుడు పొలీస్ నే పిలుస్తారు.

    ఏడవవలెననుకున్న కవులు తనివి తీరా ఏడవ వచ్చును. ఆవేశాలు, ఆవేదనలు, రోదనలు, ఇత్యాది ‘ప్రకటన’ లలో వారు మునిగి తేలవచ్చు. డబ్బుంటే ‘ఏడుపు ఏంథోలజీ’లు మూలాలు/ అనువాదాలు ప్రచురించుకోవచ్చు. కానీ, ఈ విశాల భూప్రపంచంలో డెమొక్రాటిక్ దేశాలలో ప్రజలకు నిత్యం చాలా ఆవశ్యకమైన సర్విసెస్ సమకూర్చేవారిలో, పౌరులను రోజువారీ ప్రమాదాలనుండి రక్షించే శాఖలలో కవులు లేరు. వారికి అలాటి శిక్షణ, స్కిల్స్ లేవు.

    నిన్నగాక మొన్న థాయ్ లేండ్ లో underwater caves లో ఇరుక్కుపోయిన పిల్లలను ఎంతమంది divers, కలిసికట్టుగా పని చేసి రక్షించారు! That’s heroic. ప్రజలు చచ్చాక తీరుబాటుగా కవి కాళ్లారజాపుకుని, మైక్రొసాఫ్ట్ వర్డ్ లో మాటలు, శవాలు కుప్పలు పోసి, వెళ్లబోసే ఏడుపు కవిత్వం వల్ల వచ్చేదేంటి, పిడకలు.

    If there is a rescuer and there is a weeper -who does nothing but weeping, who would you choose! I will choose the rescuer.

    Lyla

  277. వేలూరి వారి కథల పుస్తకం గురించి నాగేస్రావ్ గారి అభిప్రాయం:

    07/18/2018 7:33 am

    అన్వర్ గారూ, ఆయన రామారావు బొమ్మకి రాసిన కవిత చూశారా? – బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ ఇక్కడ

    నాగేస్రావ్

  278. అనంతకవితాకాంచి గురించి సంతోష్ గారి అభిప్రాయం:

    07/13/2018 10:20 pm

    బావుంది. కొత్తగా అనిపించింది. తిలక్ గారి ద్వైతం కవిత గుర్తొచ్చింది. ఇలాంటి ప్రక్రియ చూడటం ఇదే మొదటిసారి. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  279. సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/02/2018 8:15 pm

    శ్రీవల్లీ రాధిక గారు “వ్యాఖ్యలు వ్రాసే విషయంలో ఈమాట వారు పాఠకులకు చేస్తున్న సూచనలు (కొన్ని) నాకు నచ్చనందువలన ఇక ఈ పత్రికకి ఎప్పుడూ వ్యాఖ్య వ్రాయకూడదని అనుకున్నాను.” అన్నారు. అలాటి వారికి ఈ అభిప్రాయం కలగటం పత్రికకి దురదృష్టకరం. అభ్యంతరకరమైన సూచనల్ని నేరుగా చర్చించి తెలుసుకుని ఇలాటి మంచి రచయితల్ని రాయమని ప్రోత్సహించటం పత్రికకే కాదు, పాఠకులకీ అవసరం. ఇదివరకు వారు ఎన్నో చక్కటి కథలు, కవితలు ఇక్కడ ప్రచురించారు.

  280. కొత్తనేలపాట గురించి అఫ్సర్ గారి అభిప్రాయం:

    07/02/2018 5:06 pm

    మానసా

    మీ తొలి ప్రవాస కవిత కదా! ఆ జంకు ఇప్పటికీ పోలేదు నా మటుకు నాకు! మీరు బాగా వ్యక్తం చేశారు, నేను వ్యక్తం చేయలేనిది!

  281. జూన్ 2018 గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    06/13/2018 8:58 pm

    [“క్షమించండి. మేము చెప్పింది స్పష్టంగా ఉన్నట్టు లేదు. మీ మొదటి వ్యాఖ్య అలానే మేము ప్రచురించగలిగి ఉంటే ఇబ్బంది ఏముంది? ఆ వ్యాఖ్యలోని కొన్ని వాక్యాలు మాకు ఇప్పటికీ అభ్యంతరకరమే కాబట్టి అది అలానే ప్రచురించలేము. ఆ వ్యాఖ్య మీ అభిప్రాయం అయితే అది వెలిబుచ్చిన తీరుపట్ల మాకు అభ్యంతరం ఉన్నది. అందువల్లనే అది ఎడిట్ చేసినాము. అది ఒక కవిత అని మీరు అన్నట్లయితే అది సృజనాత్మక రచన కావున దానికి అభిప్రాయవేదికలో చోటు లేదు.” – సం.]

    In response to the above, dear editors and other interested readers of this magazine, who might have just joined, please read.

    జూన్ మొదటి తేదీన, నాతో సంపాదకులు కింది విధంగా అన్నారు. పాఠకులు అందరిలానే నేను ఈ పత్రికలోనే చదువుకున్నాను:

    [As much as you hate to see it, we do believe it is better to celebrate than to ignore the life and works of one when departed. And, please get used to it because we are not changing any time soon about this. ఏదీ తొక్కిపట్టుకుని ఎవరుపోతారా అని ఏ “సప్లయ్ దారులూ” చూడరు. అలా ఒకరిని నిందించటం మీకు తగదు. When we celebrate, some may come and mourn.That’s their prerogative. చచ్చిపోయినవారిని తలచుకోడం మీకు అత్యాచారం ఎలా అనిపిస్తుందో అలా అది వారి ఇష్టం. బైదివే, మీరు కోట్ చేసిన ముందుమాటకూ మీ అభిప్రాయానికి ఏ సంబంధమూ లేదు. గమనించగలరు. – సం.]

    ఇందులో ఆఖరి వాక్యం ముందు చదువుదాం: “బైదివే, మీరు కోట్ చేసిన ముందుమాటకూ మీ అభిప్రాయానికి ఏ సంబంధమూ లేదు. గమనించగలరు. – సం.”

    సంపాదకులు వారే చెప్పారు, 1. నేను పంపినది అభిప్రాయమని. 2. దానికీ నేను కోట్ చేసిన పత్రిక ‘ముందుమాటకూ’ ఏ సంబంధమూ లేదని. హడావిడిగా కొన్ని మాటలు రాసేసి (అవి నాకు (లైలా) ఉద్దేశించబడినవే కదా – అది వారి ప్రధానమైన పనిగా భావించుకున్నారేమో,) ఆ తర్వాత బైదివే,…. గమనించగలరు అన్నారు. అది ‘బైదివే’ కాదు. ‘By the way’ అన్న expression ఎప్పుడు వాడతారంటే, అసలు విషయం చెప్పటం అయ్యాక, దానితో సంబంధం అంతగా లేని మరేదో చెప్పేప్పుడు. Synonyms are -incidentally, on the side line.

    సంపాదకుల అసలు పని రచయిత/ పాఠకులు పంపిన “మాటలు (text)” పరిశీలించి ప్రచురణార్హత నిర్ణయించుకోవటం. By the wayగా చెప్పే విషయం కాదు, చేసే పని కాదు. అదే సంపాదకుల మొదటి పని.
    నేను పంపిన ‘మాటలు / text’ ముందు సంపాదకులకే చేరినాయి. ఎడిటర్ల ‘ముందుమాట’ లో ఏముందో వారికి తెలిసినంత బాగా, బ్రహ్మరుద్రాదులకు కూడా తెలిసే అవకాశం లేదు కదా. సంపాదకీయంతో సంబంధమే లేని అభిప్రాయం అనుకున్నప్పడు తీసెయ్యవలసిన పని ఎడిటర్లదే. మరి ఎందుకు తీసెయ్యలేదు? నేను పంపిన మాటలు కవిత రూపంలో ఉందని ఎడిటర్లు చూసి కూడా, మార్చిందీ వారే. ‘కవిత’ ఐతే అక్కడ ప్రచురించకూడదని వారికి రూల్ ఉంటే, అది అమలు చెయ్యగలగటం వారి చేతుల్లోనే ఉంది. నేను రాసిన మాటలు సంపాదకులు ఎడిట్ చేసినందువల్ల, ఇప్పుడు ‘ముందుమాటతో’ సంబంధం ఏర్పడినదా? మొదలుకే లేని సంబంధం, కొన్ని మాటలు తీసివేసి, సాధించారా?

    నేను పంపిన మాటలపై, నేను తీర్చవలసిన సందేహాలుంటే, ఎడిటర్లు నాకు రాసి, సందేహాలు ముందే తీర్చుకుని ఉండేవారు. ఈ మెయిల్ అడ్రస్ సంపాదకుల దగ్గర ఉన్నది అందుకేగా. ఆ పని చెయ్యలేదు. ఆ రోజున సంపాదకులు చేసిన ఎడిటింగ్, రాసిన మాటల్లో నా ప్రమేయం ఏమీ లేదు.

    తర్వాత,

    [As much as you hate to see it, we do believe it is better to celebrate than to ignore the life and works of one when departed. And, please get used to it because we are not changing any time soon about this. ఏదీ తొక్కిపట్టుకుని ఎవరుపోతారా అని ఏ “సప్లయ్ దారులూ” చూడరు. అలా ఒకరిని నిందించటం మీకు తగదు. When we celebrate, some may come and mourn.That’s their prerogative. చచ్చిపోయినవారిని తలచుకోడం మీకు అత్యాచారం ఎలా అనిపిస్తుందో అలా అది వారి ఇష్టం.]

    ఇవి సంపాదకుల మాటలే కదా. వీటి భావమేమిటి? ఎందుకు ఇవి పరిష్కరించబడిన నా మాటలు/text కు జోడించారు? కారణమేమిటి? మరియూ, ఈ పత్రికలోనే, మనం పరికిస్తే, అసలు ఏది కథ, ఏది స్కెచ్? ఏది పద్యం, ఏది కాదు; గద్యమేదో వచనమేదో, ఏది గద్య కవితో, వాక్యాలు అడ్డంగా పేర్చకుండా, నిలువుగా పేరిస్తే అంతమాత్రాన కవిత అవుతుందో లేదో; సృజన ఏదో, విమర్శ ఏదో; ఇలా ఎన్నో వ్యాసాలున్నాయి. ఏది సాహిత్యము, ఏది కాదు? రచనకు ప్రచురణార్హత ఉన్నదా, లేదా అన్న అంశాలపై పండితులు, పాఠకుల చర్చలు మేగజీన్ లో సాగుతూనే ఉన్నయ్యి.

    నేను ఈ ఉత్తరాలు రాస్తుండగానే కవితల రూపంలో వేరే శీర్షికలలో, పాఠకుల అభిప్రాయాలు ప్రచురించబడుతూనే ఉన్నాయి. అవి సృజనలా, అభిప్రాయాలా, రెండూనా?

    నా కొన్ని మాటలు/text నేను రాసింది రాసినట్టుగా పబ్లిష్ చేస్తే దాని రూపమేంటో, అందులో విషయమేంటో, అసలు అలా రాయొచ్చో, కూడదో – అప్పుడు కావాలంటే ఎవరైనా చర్చ చేసుకోవచ్చు. ఇప్పటికీ నేను రాసింది రాసినట్టుగా ఇక్కడ ప్రచురించటానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. నా రచనలో అభ్యంతరకరమైన మాటలున్నాయా? అవి ఏమిటి? ఎన్ని? అభ్యంతరకరమైన విషయమంటే ఏమిటి? ఎందువలన? ఎవరు నిర్ణయిస్తారు? అన్న విషయాల మీద కూడా బాహాటంగా సాహితీ చర్చ సాగించవచ్చు. I have no objections.

    పాఠకులలో/రచయితలలో ఎన్నో రకాల అభిరుచులున్నవారుంటారు. విభిన్నరీతుల వ్యక్తీకరణలున్నవారుంటారు. అన్నిటికీ పత్రిక చోటివ్వాలి. ఇస్తే ఎవరికి నచ్చినవి వారు చదువుకుంటారు. నచ్చక పోతే వదిలేసి ఇంకోటి చదువుకోవచ్చు. Professor Borges says, if you don’t like something, even if it is ‘Paradise Lost’ or ‘Don Quixote,’ don’t read it. Like him, I read both and I liked both. Professor Borges thought – There is no “obligatory reading.” In my opinion, there is no restricted writing either.

    నేను హాయిగా Foucault, A very short introduction by Gary Gutting, Oxford series చదువుకుంటున్నా. Michael Foucault’s ‘Who is an author’, Roland Barthes’s ‘ The death of the author’ essays లో – what is a text, what is literature, what is the relation between writing/writer/death -from ancient times to now. – ఇలాటి విషయాలు చదువుకుంటున్నాను. ఈ రచయితల తెలివికి నాకు ఆనందం కలుగుతున్నది.

    Thanks – Lyla.

  282. జూన్ 2018 గురించి Madhav గారి అభిప్రాయం:

    06/07/2018 11:31 am

    (సందిగ్ధంలో ఉన్నాను, ఇలా చర్చ జరుగుతున్న సమయంలో నేను కామెంట్ పెట్టచ్చా? సాటి ఎడిటర్లేమనుకుంటారు? నేనుగా పెట్టాలా, ఎడిటర్‌గా పెట్టాలా? ఏ హ్యాట్ పెట్టుకోవాలి? అసలు పెట్టుకోవాలా? ఆ తేడా ఎవరైనా కనీసం గమనిస్తారా? అయినా సరే, ఒక రెండు ముక్కలు చెప్పకుండా ఉండలేక ఈ కామెంట్ రాస్తున్నాను. ఒకసారి పోస్ట్ చేసినాక దాన్ని ఏం చేస్తారో సంపాదకుల ఇష్టం. నేనైనా వారి నిర్ణయానికి కట్టుబడి ఉండవల్సిందే మరి.)

    1. రామారావు గారూ, మీ సూచనలు ఎప్పుడూ విలువైనవే. మీకు కృతజ్ఞతలు. రెండు విషయాలు.

    ఒకటి – I do not see any ‘escalation’ either from Lyla or from the editors. Initially the voices registered a slightly higher note, but then toned down. Looking at the published commentary, it appears to me that the problem here lies not with the decision but the execution of which, could have been a tad better. రచయితలకు, పాఠకులకు ఉన్నంత వాక్‌స్వేచ్ఛ సంపాదకులకు, నిర్వాహకులకు ఉండదు. వారికి నిగ్రహం మరింత అవసరం.

    రెండు – [Editor hat ON]ఈమాట రెగ్యులర్‌గా చదివే మీరు కూడానూ ఎవరి “మనోభావాలు దెబ్బతింటాయనో” సంపాదకులు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అనడం/అనుకోడం నిజంగా ఆశ్చర్యం. ఆమాట ఈమాట గురించి ఏనోటా వినలేదు ఇన్నేళ్ళలో నేను. పైపెచ్చు “మనోభావాలు” గాయపరుస్తున్నామని మమ్మల్ని తిట్టేవారే ఎక్కువ. That was, is and will be never our concern, but the standards and the etiquette of eemaata are. At times we err in our judgement. We learn from it and go on. కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకు కోపం. Our only job is to do our job the best we can.

    2. ఈమధ్యనే ఒక స్నేహితునితో అన్నాను అతని రచన గురించిన ప్రస్తావనలో. “మాకు రచన ముఖ్యం, రచయిత ఎవరు అన్నది అనవసరం. మామెక్కడైనా మామే కాని మొక్కజొన్న చేనుకాడ కాదని తెలుగులో ఒక మొరటు సామెత ఉంది. మాకూ అలానే ఈమాట దగ్గర అందరూ పరాయివారే”, అని. ప్రత్యక్షానుభవంతో చెప్తున్నాను – సంపాదకులు కేవలం వారి రచనల నాణ్యత మాత్రమే పరిశీలిస్తూ (చాతయినంతగానే అనుకోండి), వారి మనోభావాలకు, అహంభావాలకు, స్థాయీపరపతులకు విలువనివ్వనందువల్లే ఈమాటకు తమ రచనలు పంపని రచయితలు ఉన్నారు. అదే సమయంలో, ఆ ప్రొఫెషనాలిటీ, సాహిత్యం పట్ల గౌరవం శ్రద్ధాసక్తులు ఆశించి, పొందినందువల్ల తమ రచనలు మొదటగా ఈమాటకే పంపే రచయితలూ ఉన్నారు. నాణేనికి ఒకేవైపు ఎలా ఉండదో అలానే విమర్శ లేకుండా సాహిత్యం ఉండదు. రచయిత నుంచి వచ్చినది వచ్చినట్టు ప్రచురించగల స్థాయి ఏ కొద్ది రచనలకో ఉంటుందేమో. మొదట్లో మా విమర్శ తీసుకోలేకపోయినా, మా పరిష్కరణలను సందేహించినా, ఒకసారి మాతో కలిసి పని చేసినాక, ఈమాటపై తమ అభిప్రాయాలను పూర్తిగా మార్చుకున్న రచయితలూ ఉన్నారు. ఇంకా మా పద్ధతుల పట్ల అపోహల్లోనే ఉన్న రచయితలూ ఉన్నారు. It is a diverse world out there. అందువల్ల, ఇక్కడ పారేది పన్నీరా మురికినీరా అనేది ఎవరి దృక్పథం బట్టి వారు నిర్ణయించుకునేది. [Editor hat OFF]

    3. ఇకపోతే, I have known Lyla well and her wickedly sharp wit very well. I am sure, if their tone offended Lyla, she would have openly said so and the editors too would have offered her an unconditional apology. More importantly, what struck me here is the maturity and decorum she has shown. “సాహిత్యం మీదే ఆసక్తి. ఈ లోపల ఈ పత్రికలో వేరే ఆర్టికల్స్ చదువుతూనే ఉంటాను. వాటి మీద అభిప్రాయాలు ఈ మేగజీన్ లో రాస్తూనే ఉంటాను. ఎప్పటి మాదిరే. కొన్నేళ్లుగా ఈ పత్రికలో నేను రచన చేస్తూనే ఉన్నాగా. ఈ ఒక్క కామెంట్ మీద ఎక్కువ తక్కువ ఇంట్రస్ట్ ఏమీలేదు.” She didn’t take this episode personally. తన “మనోభావాలు” గాయపరచుకోలేదు.

    తెలుగులో రచయితలు ఈ పరిణితిలో కనీసం సగమైనా కలిగివుంటే ఎంత బాగుండునోనని నేను కలగన్నదీ నిజం! అలాగే, ఇక్కడ కొన్ని వ్యాఖ్యలలో కనిపించిన సృజనాత్మకత చూసి కొంత ముచ్చట పడి, అది కథల్లోనూ కవితల్లోనూ కూడా కనిపిస్తే ఎంత బాగుండునోనని నేను అనుకున్నదీ నిజం!

    4. చర్చ ఆ ముందుమాట మీద – కేవలం తెలుగులోనే ఎందుకు పాప్యులర్ రచయితలు, సీరియస్ రచయితలు అని రెండు కులాలు ఉన్నాయి అన్న విషయం మీద – జరిగి ఉంటే బాగుండేదని ఆశించాను. కాని, పక్కదారి పట్టింది. నెట్ స్వభావమే అంత. Personally I think it’s time for us to move on. (నేను చెప్పదలచుకున్న రెండు ముక్కలూ చెప్పేశాను కాబట్టి!)

    I hope I did not disappoint any one with my uncharacteristic humility!

    Regards
    మాధవ్

  283. జూన్ 2018 గురించి రాధిక గారి అభిప్రాయం:

    06/07/2018 11:30 am

    ఈమాట సంపాదకులకు:
    ఇంతకు మునుపు వ్రాసిన నా అభిప్రాయంలో నా భయానికి కారణాన్ని (వ్రాసినదానిని “మార్చి” ప్రచురించే అవకాశాన్ని సంపాదకులు ఎలా ఉపయోగించుకుంటారో తెలియనపుడు ఏమి వ్రాస్తే ఏమవుతుందోనన్నది నన్ను భయపెట్టిన విషయమని) నేను స్పష్టంగా వ్రాశాను.

    అటువంటి భయం అర్థరహితం కాదనీ, అన్ని అభిప్రాయాల విషయంలో సంపాదకులు ఒకేరకంగా వ్యవహరించడం లేదనీ ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమయింది.

    “సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచనని పాటించకుండా వ్రాసిన ఒక వ్యాఖ్యని – అది కూడా హుందాగా కాక అపహాస్యం చేస్తూ వ్రాసిన వ్యాఖ్యని – ప్రచురించడం ద్వారా మీరు ఆ విషయాన్ని స్పష్టం చేశారు.

    అది అపహాస్యం కాదు కవిత్వం అనుకునేందుకు కూడా ఇపుడు అవకాశం లేదు. “మీ అభిప్రాయాలను కవితలుగా, ఆలాపనలుగా, కథానికలుగా రాయకండి. మీ సృజనకు అభిప్రాయాల పెట్టె వేదిక కాదు.” అన్న మీ కొత్త నిబంధనను అంగీకరిస్తూ వ్రాసినందువలన ఆ అభిప్రాయాన్ని సూటిగా చేసిన అవమానంగానే తీసుకుంటున్నాను.

    ఇలా అవమానింపబడినందుకు బాధపడుతూ ఇకపై ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను.
    అభినందనలు!

    [క్షమించాలి. అది కేవలం సరదాగా అన్న మాట అని, “సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచన ఉన్నప్పటికీ, కొన్నిసార్లు పాఠకుల మధ్య చర్చలో లైట్ బ్యాంటర్ వల్ల లాభమే కాని నష్టం లేదని అనుకోవడం చేత, ఆ వ్యాఖ్యలో మాకేమీ మీ పట్ల అవమానం కనిపించకపోవడం వల్లనే, ఆ వ్యాఖ్య ప్రచురించాం. -సం.]

  284. జూన్ 2018 గురించి రాధిక గారి అభిప్రాయం:

    06/06/2018 9:02 pm

    కేవీయస్ రామారావుగారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
    వ్యాఖ్యని మార్చడం వలన అర్థం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.
    “కొందరు సప్లైదారు రచయితలు- వారి అభిమాన సాహితీవేత్తల చావుకు ముందే” – ఈ పేరాకి ముందు లైలా గారు బహుశా ఈ సంచికలోని రచనల నుండి కొంత పక్కకి వెళ్ళి ఇటువంటి వాటిపై సాధారణంగా తనకి ఉన్న అభిప్రాయాన్ని కవితారూపంలో వెల్లడించి ఉంటారనుకుంటున్నాను.
    ( పాఠకుల అభిప్రాయాలు రచనకు ప్రత్యక్షంగా సంబంధించి ఉండాలన్న నిబంధన ఉన్నది నిజమే కానీ ఇక్కడ ఈ అభిప్రాయం ఒక రచన గురించి కాదు కనుక, సంపాదకీయం గురించీ పత్రిక గురించీ కనుక ఇక్కడ అది పొసగుతుందని నా ఉద్దేశ్యం)
    సంపాదకులు ఆ భాగాన్ని తీసివేసి ప్రచురించడం వలన పైన పేర్కొన్న పేరాలోని మాటలు నేరుగా ఈ సంచికలోని రచయితలను ఉద్దేశించి అన్నట్లుగా తోచే అవకాశం వుంది. అలా ఉండకూడదనే బహుశా ఆవిడ ఆ విషయాన్ని కవితలా వ్రాసి ఉంటారు (ఒక మర్యాదని పాటించదలచి).
    దానిని తీసివేయడం ద్వారా, ఆవిడ ఆ విషయాన్ని పదే పదే చెప్తున్నా అదలింపు స్వరంతో జవాబివ్వడం ద్వారా – సంపాదకులు పాఠకులను భయపెడుతున్నారనిపించింది. నాకయితే నిజంగానే భయం వేసింది, వ్రాసినదానిని “మార్చి” ప్రచురించే అవకాశాన్ని సంపాదకులు ఎలా ఉపయోగించుకుంటారో తెలియనపుడు ఏమి వ్రాస్తే ఏమవుతుందోనని. అందుకే ఇప్పటివరకూ వ్యాఖ్య వ్రాసేందుకు సందేహించాను కానీ చూస్తూ ఊరుకోలేక ఇప్పుడు సాహసించాను. 🙂

  285. జూన్ 2018 గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    06/06/2018 1:08 pm

    […However, we are sorry that we cannot delete/alter the published comment history here. -Ed.]

    సంపాదకులు ఈ విషయంలో నాతో తిరిగి మాటలు కొనసాగిస్తున్నందుకు సంతోషం.
    నేను మొదలుకు రాసిన రచన ఇప్పుడైనా ఇక్కడే మీరు పబ్లిష్ చేస్తే, అప్పుడు పాఠకులు జరిగింది జరిగినట్టుగా, వరసలో శుభ్రంగా అంతా చదువుకోవచ్చు. దానికి నాకు ఏం అభ్యంతరం లేదు.
    ఇప్పటికీ ఇక్కడి పాఠకులకు అసలు నేనేం రాసానో తెలియదు గద. ఒకవేళ గాని నా రచన మీరు పారేసుకుని ఉంటే, ఆ విషయం ఇక్కడే తెలియచేస్తే, మళ్లీ పంపిస్తాను. నా దగ్గర ఉంది.

    Thanks, Lyla.

    [తమ నిర్ణయాల గురించి చర్చ చేయకపోయినా పాఠకుల ప్రశ్నలకు జవాబివ్వాల్సిన బాధ్యత సంపాదకులకు ఉన్నది కద.

    క్షమించండి. మేము చెప్పింది స్పష్టంగా ఉన్నట్టు లేదు. మీ మొదటి వ్యాఖ్య అలానే మేము ప్రచురించగలిగి ఉంటే ఇబ్బంది ఏముంది? ఆ వ్యాఖ్యలోని కొన్ని వాక్యాలు మాకు ఇప్పటికీ అభ్యంతరకరమే కాబట్టి అది అలానే ప్రచురించలేము. అందువల్లనే మీరు ఆ వ్యాఖ్యను వేరొక వేదిక పైన ప్రచురించుకొనవచ్చు లేదా మీ దృక్పథాన్ని (ఇక్కడ ఒక కవిత రూపంలో కామెంట్ వలె కాకుండా) వ్యాసం రూపంలో వివరిస్తూ ఈమాటకు ఒక రచనగా పంపవచ్చును (దానివలన మీరు ఆశించినట్లుగా చర్చ కూడా జరగవచ్చును) అని సూచించినాము. ఆ వ్యాఖ్య మీ అభిప్రాయం అయితే అది వెలిబుచ్చిన తీరుపట్ల మాకు అభ్యంతరం ఉన్నది. అందువల్లనే అది ఎడిట్ చేసినాము. అది ఒక కవిత అని మీరు అన్నట్లయితే అది సృజనాత్మక రచన కావున దానికి అభిప్రాయవేదికలో చోటు లేదు. – సం.]

  286. జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    06/06/2018 8:13 am

    బ్రహ్మానందం గారు, ధన్యవాదాలు. ఇతర రచయిత(త్రు)ల గురించి నాకు తెలియదు కానీ ఎప్పుడైతే నేను ఏదైనా రాసి పంపిస్తానో అప్పుడే దాని మీద విమర్శ కి సిద్ధంగా ఉంటాను. రచయితగా మీకు తెలిసే ఉండొచ్చు. “ఆహా, ఓహో” అనేవాళ్లతో మీకు ఏమీ ఉపయోగం లేదు – ఛాతీ అయిదంగుళాలు పెంచుకుని మరో కధో, కవితో రాయడానికి అది పనికివచ్చినా. అలా పెరిగిన ఛాతీ అక్కడే ఉండిపోదు కనక విమర్శ చేసేవాళ్లతోనే నాకు లాభం. వాళ్ళు సరైన విషయం, చేదు నిజం చెప్తారు. అయితే అందరూ ఒకేలాగ నెమ్మదిగా చెప్పరు కదా? ఒకరి భాష మరొకరికి రాకపోవచ్చు. కాని వాడిన భాష, వెక్కిరింపూ వదిలేసి అందులో అసలు ఏమి చెప్పదల్చుకున్నారు అనేది; వాళ్ళు చెప్పేది గ్రహించగలిగితే నా రచనలు మెరుగుపడతాయి. లేకపోతే మూసలో పొసినట్టు ఒకే రకం రచనలు రావడం తధ్యం. అంటే మొదటి రెండు పేరాలు చదవగానే ఇది ఫలానా శర్మ గారు రాసారు, చివర్లో ఇలా అవుతుంది గారంటీగా అని చెప్పేయవచ్చు. తెలుగు సినిమాల్లో లాగా మొదట్లో హీరో, నాలుగు గుద్దులూ, చివర్లో మళ్ళీ అందరూ ఒకోచోట ఫేమిలీ ఫోటో, శుభం కార్డు. ఓ సారి ఆ మూస పద్ధతీ, ముద్రా పడగానే ఇంక గొర్రె తోక రచనలు వస్తాయి. ప్రస్తుతం నావి అలాగే ఉన్నాయి కాబోలు.

    ఎప్పుడైతే ఒక పత్రికకి రచన పంపించానో అప్పుడే- ఆయా సంపాదకులు విమర్శిస్తారనీ, అందులో తప్పులూ, ఒప్పులూ ఎత్తి చూపుతారని సిద్ధంగా ఉండాలి. నేను రాసిన పదహారు పేజీల కధ ఒక్కోసారి నాలుగు పేజీల్లో రాయొచ్చు. కన్నెగంటి చంద్రగారు దీనికో ఉదాహరణ అనుకుంటా. ఒక్కోసారి దాన్ని పద్ధెనిమిది పేజీలకి పెంచవచ్చు. అయితే “ఈ సంపాదకుడు నేను అమెరికా రాకముందు బొడ్డూడని బచ్చా గాడు ఇప్పుడు నా రచనలనే దిద్దే అంతవాడా?” అనుకుంటే ఆ పత్రిక మీరు చెప్పినట్టు మురికినీరు అయ్యి కడుక్కోవడానిక్కూడా పనికిరాదు. అప్పుడు మరో చెరువు వెతుక్కోవచ్చు. అయితే అక్కడ కూడా ఇదే విధంగా మురికి నీరు ఎదురవ్వొచ్చు కదా? మరో విషయం ఏమిటంటే ఒక సంపాదకుడికి నచ్చని రచన మరోచోట బాగుండవచ్చు (గ్రిషాం, హారీ పాటర్ లాంటి రచయితలకి ఇదే సమస్య మొదట్లో)

    నేను రాసినది ప్రతీ అక్షరం పొల్లుపోకుండా వేసి తీరాలి అనుకుంటే బ్లాగు అంత ఉత్తమం మరోటి లేదు. అక్కడ కూడా మీరు మోడరేషన్ పెట్టుకోకపోతే ఎవరో ఒకరు ‘ఇది ఏడిసినట్టు ఉంది” అనడానికి అవకాశం ఉంది కదా? ఆఖరికి ఫేసు బుక్కులో కూడా లైకులు రాలేదంటే అర్ధం అది ఎవరికీ నచ్చకపోవడం కావొచ్చు – చదవక కాదు. అయితే ఆయా మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టూ రాస్తే ఏమౌతుందో రోజూ చూస్తూనే ఉన్నాం. అందువల్ల సంపాదకుల కత్తెర ఉండడం వల్ల లాభమే కానీ నష్టం లేదని నా అభిప్రాయం.

    సంపాదకుల పని మూడో కంటితో చదివి ఎలా ఉందో చెప్పడం. దాన్ని వేసుకుంటారా లేదా అనేది వేరే విషయం. ఒకోసారి బూతు కధ, సాహిత్య లోకంలో ఎవరికీ నచ్చనిది పత్రిక లాభం కోసం వేయవచ్చు. అందులో ముఖ్య సంపాదకుడు ఎంత గింజుకున్నా మిగతా సహ సంపాదకులవల్ల కురదరక పోవచ్చు – అచ్చు పత్రిక మనుగడ డబ్బు మీద ఆధారపడి ఉంటుంది కనక. ఇంతకీ ఏమి చెప్పదల్చుకున్నానంటే సంపాదకుల దిద్దుబాటుకి సిద్ధంగా లేకపోతే ఫలానా పత్రికకి పంపడం మానుకోవడమే మంచిది. ఇదే మీరు చెప్పిన మురికినీరు వాడకపోవడం. అయితే దీనివల్ల ఎవరికి నష్టమో రచయితకే బాగా తెలుస్తుంది. నా ఉద్దేశ్యంలో మారవల్సినది రచయితే. అలాగని మొత్తం మారిపోయి సంపాదకుల తొత్తుగా ఉండమని చెప్పట్లేదు.

    ఎప్పుడైతే “నేను షరతులకి కట్టుబడి ఉంటాను” అనే “ఆప్ట్ ఇన్” చెక్ బాక్స్ నొక్కి వ్యాఖ్య, కధా పంపించారో అప్పుడే మీరు సంపాదకుల కత్తెర కి ఒప్పుకున్నట్టు లెఖ్ఖ. అలాకాని పరిస్థితుల్లో వేరే చెరువు చూసుకోవడం ఉత్తమమే – రచయిత దృష్టిలో ఫలానా పత్రిక మురికినీరు కాబట్టి. దీన్నే అచ్చు పత్రికలలో ‘ఇందులో ఉత్తర ప్రత్త్యుత్తరాలకి తావు లేదు’ అని రాస్తారనుకుంటా. అయితే మూస పద్ధతిలోంచి బయటకి రావడం అసంభవం అనేది తెలిసి వస్తుంది త్వరలోనే – ఒక్కో చెరువూ మురికి అనుకుంటూ పోతే. మరో మాటండోయ్, నేను అంత పేరున్న రచయితనీ కాదు నన్నెవరూ “దయచేసి మా పత్రికకి రాయండి” అని అడగలేదిప్పటివరకూ. అందువల్ల ఆ విషయం నేను చెప్పలేను. నాకు తెలిసినంతలో సంపాదకులూ చదువరులూ చేసిన విమర్శల వల్ల (ఉదా: కవిత్వం మార్మికంగా ఉండాలి, ఓ చట్రంలోంచి బయటకి రావాలి, ఇందులో ఫలానా సన్నివేశం అనవసరం, ఆ మొదటిపేరా కంగాళీ తీసేయవచ్చు, ఫలానా వ్యాక్యం రాసాక మిగతా కధ అనవసరం, మీరు ప్రతి వ్యాఖ్యలు పెట్టి మరొకరెవరూ వ్యాఖ్య చేయకుండా చేస్తున్నారు [ఇంత ఆశ్చర్యం కలిగించిన కామెంట్ ఇప్పటిదాకా చూడలేదు]) నా రాతలు మెరుగుపడ్డాయని అనుకుంటున్నా.

    మరో విధంగా బ్లంట్ గా చెప్పాలంటే నేను రాసిన కధో, వ్యాఖ్యో ఫలానా పత్రిక వారు ఎందుకు వేయాలి? ఆఖరికి నన్ను నిజంగానే “మా పత్రికకి ఏదో ఒకటి రాయండి” అని అడగగానే, నేను రాసినది “ఏది పడితే అది” వేయాలా? ఆహ్వానించారు కదా అని ఏదో ఒకటి రాస్తే అది వాళ్లకి నచ్చవద్దా? రాయడం నా విశేషాధికారం అయితే దిద్దడం, వేయాలా వద్దా అనేవి వాళ్ల ప్రత్యేధికారం కాదా?

    చివరిగా, ఏదో చెప్దామనుకుని మరొకటేదో చెప్పినట్టు అనిపిస్తే క్షంతవ్యుడను. నమస్తే

  287. మరోసారి గురించి Dr.Ismail గారి అభిప్రాయం:

    06/05/2018 12:25 am

    కథ కవిత్వమైతే,
    కవిత్వం కథైతే,
    ఇలాగే ఉంటుంది…Splendid.👏🏼
    నేనింకా ఆ ఖాళీ సినిమా హాలు,
    చెత్త దగ్గరే ఆగిపోయాను.😕

  288. సెలవు మాస్టారూ! గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:

    06/04/2018 11:28 am

    సత్యవతి గారు,

    మీరు ప్రస్తావించిన త్రిపుర గారి కవితని వారి అల్లుడు, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు మొన్నామధ్య ఫేస్‍బుక్ లో ఒక టపా ద్వార పంచారు. అది ఇక్కడ ఆసక్తి ఉన్న పాఠకుల కోసం ఇస్తున్నాను.

    ఓ కాఫ్కా సుబ్బరామయ్య గారి యింగువ వృత్తాంతం – త్రిపుర

    అతనిప్పుడు ఒక ఎముకల గూడు
    ఎవరీ ప్రపంచంలో
    తమ పాదముద్రలొదిలేసి పోయారు
    ఎవరెవరో ఎందరెందరో ఎక్కడెక్కడికో
    అనంత కాల ప్రవాహంలో కొట్టుకపోయారు’

    అతనోసారి ఎన్నేళ్ల క్రితమో
    రోడ్డుమీద నడుస్తూ
    ఉన్నట్లుంది అన్నాడు నీతో
    జీవితంలో ఎన్నో విషయాలు
    తెలుసుకోకుండానే వెళ్లిపోతాం
    నువ్వు రోడ్డు మీద పోతూంటావ్
    అవతల దూరంగా వెళ్తున్న ఎవరినో
    చూడాలనుకుంటావ్
    కాని ఏ లారీయో ట్రక్కో అడ్డువస్తుంది
    అంతే, ఆ మనిషిని ఎప్పటికీ చూడలేవు
    ఏదో తెలుసుకోవాలనో చూడాలనో
    అనుకుంటూనే
    కాలం గడిచిపోతుంది
    చివరకు అట్లాగా చచ్చిపోతాం
    ఆఖరుగా ఒక ప్రశ్న:
    యింతకీ ‘యింగువ’ ఏమిటి?

    ఒక కుడివైపు చిన్నగదిలో
    కిటికీ పక్కన నవ్వారు మంచానికి
    అతడిపుడొక అంటుకున్న బల్లి
    మగత లోంచీ దగ్గు లోంచీ
    ఎప్పుడో ఒకసారి పైకి చూస్తూ
    వచ్చిన వాళ్లందర్నీ
    ఏదో అడుగుతున్నాడు

    అతని గుండెలమీదికి వంగి విందామని
    నువ్వు ఏమిటి కావాలని అడిగితే
    ఆఖరి గరగర ఊపిరితో
    యింగువ ఏమిటి అన్నాడు
    తరవాత రెండుసార్లు తల ఎగరేసి
    దేన్నో వెతుకుతున్నట్లు చూసి
    అంతా అయిపోయిందనిపించాడు

    యింగువ ఏమిటో అతనికి తెలియలేదు
    సుబ్బరామయ్యగారు కూడా చెప్పలేదు
    నీక్కూడా చాలా తెలుసు
    కాని యింగువ ఏమిటో యిప్పటికీ తెలియదు

    అదొక కుట్ర
    అదొక విద్యుత్ రహస్యం
    అదొక మాయావి చెలగాటం
    అదొక పులులు తిరిగే రాత్రి
    ఏదేనా అవవచ్చు
    తెలుసుకోవాల్సిన అవసరం
    వుందోలేదో కూడా తెలియదు
    నవ్వారు మంచం మీదో
    హాస్పిటల్ ఆక్సిజన్ టెంట్ లోనో
    ఆఖరి శ్వాస విడుస్తున్నప్పుడైనా

    (‘త్రిపుర కాఫ్కా కవితలు’, ప్రచురణ సాహితీ మిత్రులు, విజయవాడ, 2001)

  289. జూన్ 2018 గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    06/04/2018 5:56 am

    చదువుతున్న పాఠకులకు, పత్రిక యజమాని, ఇతర అధికారులకు మరి కొన్ని వివరాలు తెలియటం కోసం:

    “తొక్కిపట్టి ఆపి ఉంచుతారో తెలియదు.

    ఇంతకన్నా అత్యాచారం సాహిత్యం పట్ల ఘోరాపచారం ఒక సాహితీజీవి పట్ల ఇంకోటి ఉంటుందా?”

    నేను రాసి పంపిన పైదానిలో ‘తెలియదు’. ‘ఇంతకన్నా’ అన్న మాటల మధ్య ఇంకా పన్నెండు మాటలున్నాయి. అవి ప్రచురించనూ లేదు. కత్తిరించామని సంపాదకులు చెప్పనూ లేదు. కత్తిరిస్తే ఎందుకో తెలియదు. అవి ఎక్కడకు పోయాయో తెలియదు.

    ఇప్పటి సాహిత్యం తీరుతెన్నులు ఏవో బాగులేవని, సాహిత్యవిమర్శ కావాలని, రచయితలు మారాలని వారి ఆశ అని రాసిన సంపాదకీయం చదివినాక, నేను సంపాదకీయం లోని చివరి భాగం ఉదహరిస్తూ, సాహిత్యంలోని ఒక ప్రత్యేక అంశాన్ని చర్చలోకి తేవటానికి, కొన్ని ఆలోచనలు, సంశయాలు కలిగిఉన్న ఆధునిక కవితా రూపంలో, సంపాదకీయం కింది అభిప్రాయాల బాక్స్లోనే దానిని సబ్మిట్ చేసాను.

    పత్రిక సంపాదకులు నా రచనను ముక్కలు, మార్పులు చేసి, ప్రచురించి, పైగా, సరిచేసి పూర్తిగా ప్రచురించటానికి నిరాకరిస్తున్నారు. పద్యం పూర్తిగా ప్రచురిస్తే నేను సాహిత్య చర్చ కొనసాగిస్తాను.
    ఈ పత్రికకు నా రచన, తదనంతర చర్చ అవసరం లేకపోతే, వారు ఎడిట్ చేసిన నా రచన ఇతర ఉత్తరపత్రాలు తొలగిస్తే నేను వేరే చోట నా పద్యం ప్రచురించుకుని, నా సాహిత్య చర్చ కొనసాగించుకుంటాను. రచన మీద హక్కులు రచయితవే. I reserve my legal rights.

    పత్రిక నిర్ణయాలు తీసుకోటానికి వారం రోజుల వ్యవధి సరిపోతుందని నేననుకుంటున్నాను.

    లైలా

  290. మా పీకల మీదుంచిన కత్తులు తీయండి గురించి సంతోష్ గారి అభిప్రాయం:

    06/02/2018 5:01 am

    తమిళనాడులో జరిగిన నిర్దాక్షిణ్య ఏకపక్ష దాడులని నిరసిస్తూ కృష్ణన్ గారు రాసిన కవితను అనువదించి తెలుగువారికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు భాస్కర్ గారు. కవితలు విమర్శనాత్మకంగా చక్కగా ఉన్నాయి.

  291. చిత్రపటం గురించి ప్రశాంతి గారి అభిప్రాయం:

    06/01/2018 2:22 pm

    చాలా బాగుంది సాంఘిక గారు మీ కవిత. చిత్రపటం.

  292. ఆత్మావై పుత్రనామాసి గురించి Ajit Kumar గారి అభిప్రాయం:

    04/17/2018 7:30 am

    కవిత్వం విషయ ప్రకటన లాగా కాకుండా మార్మికంగా వుండాలి.

  293. రెండు కవితలు గురించి శ్రీనివాసరావు గారి అభిప్రాయం:

    03/11/2018 11:51 am

    అందరూ అందహీనంగా, భయానకంగా భావించే చీకటిని చెడిపేసే మిణుగురులా ఉంది మీ కవిత

  294. నాకు నచ్చిన పద్యం : మెయి బూదిపూత మాగాణి గురించి VSTSayee గారి అభిప్రాయం:

    03/04/2018 8:39 am

    ఆ పద్యంలో ‘చిద్గగన ప్రాలేయాంశువు’ అనే పదముంది. ‘ప్రా’ అనే ద్విత్వాక్షరం ముందున్న ‘న’ అనే అక్షరం లఘువుగా వాడాడు. ఒకే సమాసం మధ్యలో వున్నప్పుడు ద్విత్వాక్షరం ముందున్న లఘువు గురువౌతుంది గదా, నీ కావ్యం తొలి పద్యంలోనే ఛందోదోషముంది అనీ, మరికొన్ని విషయాలనూ ఉటంకిస్తూ, కొత్త సత్యనారాయణ చౌదరి అనే పండితుడు తీవ్ర విమర్శ లేవనెత్తాడు.

    శ్రీ రావూరి దొరసామిశర్మగారి ”విశ్వనాథ-ప్రయోగ వైలక్షణ్య సమీక్ష” (భారతి, జనవరి 1962) నుండి..

    కల్పవృక్ష ప్రథమపద్యములో రెండవపాదములో ‘ప్రథమకబళేమక్షికాపాతః’ అన్నట్లు గణభంగ మెదురగునని క్రొత్తవారి యాక్షేపము. ఆ పద్యభాగము:
    ‘శ్రీమంజూషిక భక్తరక్షణకళాశ్రీచుంచు వానందవ
    ల్లీమంజుప్రసవంబుఁ జిద్గగనప్రాలేయాంశువున్‌ …’
    ‘గగనప్రాలేయాంశు’ వనుచోట సిద్ధసమాస మగుటచే సామాన్యలక్షణానుసారము ‘న’ గురువు కావలె, కాని యిందు లఘువుగాఁ బ్రయుక్తము. ఇట్లు ప్రయోగించుట దోషముగాదు. దీనికి శాస్త్రమును బ్రయోగములును గలవు; చూడుడు: …

    పూర్తి సమీక్ష ఇక్కడ పుట72 (PDF page 79) నుండి.

    “`హరిఓమ్మ’ని కల్పవృక్షములోని అవతారిక తీయఁగా తొలిపద్యములోనే రెండవ పాదములో ‘ప్రథమకబళేమక్షికాపాతః’ అన్నట్లు గణభంగ మెదురగును. … సంయుక్తాక్షరమునకు పూర్వాక్షరము గురువన్నమాట ఇంగ్లీషుబడులలో కుఱ్ఱకాఱునకు సైతము తెలిసిన చదువు” అంటూ “విశ్వనాథ – ప్రయోగ వైలక్షణ్యము” వ్యాసంలో (భారతి, సెప్టెంబరు 1961) ఆక్షేపించిన కొత్తవారు, పైన ఇచ్చిన ఉదాహరణను ‘కల్పవృక్షఖండనము’ పుస్తకము తెచ్చినప్పుడు, “సకృత్తుగా ఏ కొందఱో .. లఘువుగాఁ జేసిన కవులు లేకపోలేదు. అట్లని అది రాచబాటకాదు; అదే ప్రధానముగాఁ జూచుకొనిసాగిన కవిత, ప్రథమశ్రేణికి రాదు. అందు కొంత ‘కక్కుర్తి’ ఉన్నదనక తప్పదు.” అంటూ, వదలిపెట్టారు.

    1960లలో, ఆంధ్రపత్రికలో. చాలా తుములంగా సాహిత్య సమరం జరిగి చాలా కాలం కొనసాగింది. … ఆ ఖండనమండనలన్నీ క్రోడీకరించి ఎవరైనా పుస్తకంగా వేశారో లేదో …

    వాటిని భారతి, జనవరి 1962 సంచికకు అనుబంధం (PDF page 104 నుండి)గా ఇచ్చారు.

    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  295. మునిమాపు వేళకు గురించి Suresh గారి అభిప్రాయం:

    03/02/2018 12:10 am

    ఫెంటాస్టిక్, … “మూస” అనేది కనపడదు మీ కవితలో, ప్రతి సారి అందమైన కొత్త ప్రయోగం

  296. నిర్నిమిత్తం గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    02/09/2018 11:28 pm

    బావుందండి కవిత.

  297. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి VSTSayee గారి అభిప్రాయం:

    01/29/2018 11:53 am

    తః తః గారు on 01/29/2018 7:50 am said:

    ఏకా దండయ్య పంతులు గారు … జాషువా రచన ప్రచురణ లకు చేసిన సహాయం …

    “నివసింప నిల్లు కవిత
    వ్యవసాయంబునకు రెండుయకరాల్‌ పొలమున్‌
    కవిచక్రవర్తి కిడు వా
    రెవరున్నా రాంధ్రభూమి నేకాయే కా!”
    — నక్షత్రమాల (జాషువ – ఖండకావ్యము 6 : కృతిభర్త – శ్రీ ఏకా ఆంజనేయులు)

    నమస్తే,
    శాయి.

  298. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి తః తః గారి అభిప్రాయం:

    01/29/2018 7:50 am

    లైలాఎర్నేని : “ఈ మాట’ దేవళంలో ఊరికే గబ్బిలం లా ఎగరటం లేదని పాఠకులు తప్పక గ్రహిస్తారు.” జాషువా కవితల గురించి, జీవితం గురించి ప్రస్తావిస్తూ మీరు ‘గబ్బిలం ‘ ప్రసక్తి తేవటం నవ్వు తో కూడిన సంతోషం కలగజేసింది.

    విశ్వకళా పరిషత్ లో ఒక సారి జరిగిన జాషువా సంస్మరణ సభ లొ నేనూ, కళాప్రపూర్ణ శ్రీ కొండవీటి వెంకట కవి గారూ పక్క పక్కన కూచున్న శ్రోతలు గా మాట్లాడుకుంటున్నాం. వేదిక మీద వక్తలు ఒకరి వెంట ఒకరుగా అగ్రవర్ణులు జాషువా ని కష్టాలపాలు చేసినట్టు చెప్పుకుంటూ పోతుంటే కవి గారికి చాలా కోపం వచ్చింది. నాతో ఏకా దండయ్య పంతులు గారు జాషువాని తన కారులో కూచోబెట్టుకుని తీసుకు వెళుతూ జాషువా రచన ప్రచురణ లకు చేసిన సహాయం గురించి సూక్షం గా చెప్పి, ఇంక పట్ట లేక వేదిక మీదికి వెళ్ళి వెళ్ళడించారు.

    నమస్కారాలతో
    తః తః

  299. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    01/26/2018 4:40 pm

    K.V.S. Ramarao on January 19, 2018 at 3:30 pm said:

    నా ఉద్దేశ్యంలో ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం. ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక. బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం. ఈ దృష్టితో చూస్తే జాషువాకి ఫిరదౌసి గురించి ఏమీ తెలియనక్కర్లేదు ఎప్పుడో ఎక్కడో ఒక కవికి ఎంతో అన్యాయం జరిగిందన్న ఒక myth తప్ప.

    Nice of you, to allow the readers here to examine your opinion. Ramarao garu. Here are my thoughts.

    1.”ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”

    జాషువా “ఫిరదౌసి” 1932 లో వెలువడింది.

    ‘ఫిరదౌసి’ రాస్తున్నప్పుడు ఆయన బడి పంతులు పని చేస్తున్నాడు. రచన సరిగా సాగటం లేదు. రాసింది ఆయనకే నచ్చటం లేదు. అచ్చుకు డబ్బు లేదు. ఆపివేసాడు. రాసిన రచన లో భాగాలు అక్కడక్కడా చదివి వినిపిస్తున్నాడు. హెడ్ మాస్టరు, జాషువా ఆందోళన, రచన – రెండూ విని తప్పక పూర్తి చెయ్యమనీ, జనులు ఆదరిస్తారనీ చెపితే,- మళ్లీ ఉత్సాహం కలిగి రచన ముగించాడు. (జాషువా రచనలు మూడవ సంపుటి. Page 268.)

    జాషువా ఫిరదౌసి రాసేనాటికి, ఆయనకు 37 ఏళ్లు. అప్పటికి ఆయన ఎంతో కవిత్వం చెప్పి ఉండలేదు. ఎన్నో పబ్లికేషన్స్ లేవు. విలువలో Homer- Ilead తో తూగుతుందని, భారత రామాయణాల వంటిదని, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన షానామా రచయితతో తనను పోల్చుకోడు. తన కెంత ఖ్యాతి రావాలో, అది వస్తుందో రాదో ఊహ చేసే సమయం కాదు.

    పైగా ఖ్యాతి, డబ్బు సంగతి పీడా పోయింది, ఫిరదౌసి కథలో కొడుకు పోవటం అన్న దుర్ఘటన ఉన్నది. అప్పట్టున మీ ఉద్దేశం భార్యాబిడ్డలు గల జాషువాకి వర్తింప చేయటం అసాధ్యం.

    2.”ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక.”

    జాషువా తనే రాసుకున్న జీవిత చరిత్ర ( నా కథ ) చదివితే, ఫిరదౌసికి ప్రతి పద్యానికి బంగారపు దీనారు ఇవ్వవలసి ఉండటమేమో గాని, గమనించండీ – ఒకచోట తన ప్రతి పద్యం లోనూ జాషువా నూటపదహార్ల వర్షం కురిపించాడు. సన్మానాలే సన్మానాలు. ఊరికే శాలువాలు కప్పి తాంబూలాలిస్తే ఆయనకు కుదరదు. డబ్బు ఇవ్వకుండా తన కవిత్వం వినటం ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాడాయన. జాషువాకి ప్రతిష్ఠ పుష్కలంగా లభించింది. ఊరూరా సన్మానాలూ గండపెండేరాలు తొడిగించుకోటం, శాసనసభకు ఎన్నికవటం, పద్మభూషణ్ రావటం. – ఇవన్నీ అతని కవిత్వానికి గుర్తింపూ, వ్యక్తిత్వానికి గుర్తింపూ, జీవితంలో upward moves కదా.

    3.”బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం”

    “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా!” అనుకున్న చేమకూరి కవి మాటలు తన పట్ల వర్తించవని జాషువానే చెప్పుకున్నాడు. “నేనే గతి రచియింతునో చెప్పంజాలను కాని సమకాలీనుల వాత్సల్యమునకు గురియైతినని చెప్పుకొను పుణ్యము నాకు గల్పించిన తెలుగువారికి నేను కృతజ్ఞుడను..” అని చెప్పుకున్నాడు.

    జాషువాకి తన జీవితకాలం లోనే కవిగా, వ్యక్తిగా సమాజంలోనూ, స్వకుటుంబంలోనూ కూడా ఖ్యాతి, ప్రేమాభిమానాలు లభించాయనే నాకు అనిపిస్తున్నది.

    4.” అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”

    Not at all. For the reasons already given. Here is what I think is possible at that time.

    When he is dwelling on the story, I would say Joshua has made a silent vow to himself, not to be a loser ‘financially’, like the man in his story. Joshua did not want to make the foolish mistake of waiting around 30 years to collect on his poetry revenue. The story taught him financial prudence. If you notice, Joshua showed quite a bit of financial wisdom eventually. He was making sure he is paid every time he wrote. He was lining up his writings, and matching them up with his publishers, donors. He was motivated. He was continuously moving upwards.

    Also, knowingly or unknowingly; He sent a message to the public, thru the publication of Firdaus.
    జాషువా ఫిరదౌసిమీదున్న కథని కావ్య వస్తువు గా ఎన్నుకుని, కవిని గౌరవించాలనీ, కవిత్వం చాలా గొప్పవస్తువనీ, బంగారు నాణేలు ఇవ్వవచ్చనీ, అతనికి ప్రామిస్ చేసిన డబ్బిస్తేనే, షావుకారు మర్యాద నిలుస్తుంది – అన్న నీతిని ప్రజకు అందించాడు కదా. కవికి డబ్బు ఇవ్వకుండా మహమ్మద్ చచ్చాక – అతని తలకాయ రాత్రులలో గజనీపట్టణ వీధులలో ఆర్తనాదాలు చేస్తూ తిరుగుతుందన్న పద్యంతో ముగించాడు ఫిరదౌసిని. With that, He put God’s fear into people’s hearts.
    ఫిరదౌసి కావ్యం రాయటం, జాషువాకి పై విధాలుగా లాభించింది.

    Expanding the discussion a bit for clearer understanding, a little more writing on Joshua, based on my reading Joshua’s poetry in ‘జాషువా రచనలు.’

    ఫిరదౌసి కావ్యం రాసాక, ఆ కావ్యం రాసిన కవిగా, ఇతరులు అతన్ని గుర్తించారు కాబట్టి, తరవాత తరవాత జాషువా ఆలోచనను ‘అతని ఫిరదౌసి’ కొంత ఆక్రమించాడు. సందర్భాన్ని బట్టి ఆ ఫిరదౌసితో identification వస్తుంది.

    జాషువా, సుమారు తన 60 ఏళ్ల వయసులో రాసిన ‘నిర్వేదము’ అని ఒక చిన్నకవితలో అది చూడవచ్చు. (జాషువా రచనలు నాల్గవ సంపుటి. పేజీ 214.) ఆయన మీద ఏవో అభియోగాలు మోపినట్టున్నారు. ఆయనతో కలసి 40 ఏళ్లు పైన కాపురం చేసిన భార్య గతించింది. డబ్బు పొడిదుడుకులు అలానే ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో నేను ఫిరదౌసి కవి లాగానే, డబ్బు ఇబ్బందులతోనే చస్తాను కవీశ్వరేశ్వరీ! నీతో పాటు మట్టిలో కలుస్తాను, జీవితేశ్వరీ! – అనుకుంటాడు. It is momentary. At that point, it is apt. That grief passes. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్ళాడాడు. ఆ పైన ఇంకా చాలా జీవితం నడిచింది.

    కవిత్వపు తొలిదినాల్లో జాషువా identification కర్ణుడితో ఉండింది.

    తొలిరోజుల్లో, జాషువాని ఒకసారి కవిత్వ సభలో పోటీ చేద్దువు గాని అని స్నేహితుడు తీసుకువెడితే, అక్కడ అతడు పంచముడు అని కోపంతో కొంతమంది సభ లోంచి లేచి వెళ్లిపోతారు. అక్కడ కొందరి మాటలకు మనసు గాయపడి, ఇంటికి వెళ్లి ఏడుస్తాడు. అప్పుడు మనశ్శాంతి కోసం భారతం చదువుకుంటూ -నిద్రపడితే- కర్ణుడు ఎంతో ప్రకాశమైన రూపంతో కనిపించినట్టు తలుస్తాడు. కర్ణుడిని – నువ్వు సూతుడవు, నువ్వు రాజకుమారులతో విలువిద్యలో పోటీ చెయ్యటం వీలుకాదన్న ఆ సందర్భం తలుస్తాడు.
    అక్కడ కర్ణుని గురించిన పద్యాలు చక్కగా ఉన్నవి.

    Pretty easy to see similarity in situation, for any of us.

    In his times Joshua is told many times by some people, he is not an equal. He cannot enter certain arenas. He cannot take up sports/studies or compete in certain things reserved only for others. But, truly, Joshua is also a son of India. He is an equal to others.

    There is a great deal of truth, in Joshua’s identification with this powerful character from fiction. Karna who is kind and heroic in his spirit and in his suffering. Joshua became better than Karna, deciding in -not to hate others, more in the line of Gandhi, Christ. But, he does not become a sacrificial lamb either.

    Thanks, Lyla
    PS: నేను సాహిత్యం, సాహిత్య విమర్శ విషయాల ఆలోచనలోనే ఉన్నానని, ‘ఈ మాట’ దేవళంలో ఊరికే గబ్బిలం లా ఎగరటం లేదని పాఠకులు తప్పక గ్రహిస్తారు.

    శాయి గారు కాని చదువుతుంటే, ‘భారతి’ పత్రికలో కర్ణుడి మీద జాషువా గారు రాసిన వ్యాసం దొరుకుతుందా? ఆ వ్యాసం నాకు చదవాలని ఉంది. Thanks.

  300. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి కోదాటి రమాకాంత రావు గారి అభిప్రాయం:

    01/23/2018 8:16 am

    మానస చామర్తి గారి వ్యాసానికి డెట్రాయిట్ వారి ప్రధమ బహుమతి లభించినందుకు సంతోషం. అభినందనలు..

    వీరు ఇచ్చిన కొత్త ఆలోనలు ప్రత్యేకించినవేమీ కావు.

    ౧ వీరు చెప్పిన రచనా లోకానికీ జీవన వాస్తవికతకీ తేడాని గమనించలేదు సరికదా భావుకత పేరుతో నిరాకరణని శాస్త్రీకరించారు. ఉదా: రేవతీదేవి “దిగులు”నీ, రాజేశ్వరీదేవి “మార్కెట్ సమాజాన్నీ” వీరు సరిగ్గా అంచనా వేయలేక పోయారని తెలుసుసుకోవడం కష్టమేమీకాదు. వాస్తవం వద్దు రంగుల కలే ముద్దు అనడంలోని (సత్యం వద్దు స్వప్నమే కావాలి) సామాజిక సత్యాన్ని గుర్తించలేకపోవడమే కారణం.

    ౨ నువ్వు ఏమైనా చెప్పు ముందు అది కవిత్వమై ఉండాలి అన్నది పైకి చాలా సమంజసంగానే కనిపిస్తుంది. కానీ పైకి కనిపించే సామాజిక వాస్తవాల ముసుగు తీయడానికి భావవాద/రూపవాద విమర్శకుల శక్తికి మించిన పని అని వేరే చెప్పనక్కరలేదు.

    ౩ “సహృదయ విమర్శ” గోడ మీద పిల్లి. సాహిత్యానికీ దాని భూమికైన సమాజానికీ ఈ “రకం” విమర్శ ఏమాత్రం మేలుచేయకపోగా చదువరుల్ని మభ్య పెట్టి మబ్బుల్లో తిప్పుతుంది. కాకపోతే సృజకుడిని (కవి, రచయిత) తృప్తిపరచి పైమెట్టెక్కిస్తుంది.

    ౪ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు తెలుగులోసాహిత్య విమర్శ లేదనుకోవడానికి కూడా సవాలక్ష కారణాలు కనిపిస్తుండవచ్చు. విమర్శని కూడా ఒక సృజనగా భావించకపోవడం శోచనీయం.

    ౫ “గులక రాయి” దేనికి సంకేతమో తెలియక అస్పస్టత ఏర్పడిందని మానస గారు అనుకోవడంలో విఫలమైనారని అనుకోవాల్సివస్తోంది.

    వీరి వ్యాసంలో కేవలం “వాచక” విమర్శకే పరిమితమైనారని సులభంగానే తెలుసుకోవచ్చు. అందుకే ఇది రూపవాద విమర్శకు సంబంధించిన ఆలోచనలుగానే మిగిలిపోయినాయి.

    –కోదాటి రమాకాంత రావు

  301. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి రాధిక గారి అభిప్రాయం:

    01/22/2018 5:49 am

    ఈ వ్యాసంలో నాకు అసంతృప్తి కలిగించిన విషయాలు రెండుమూడు ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్దామనుకుంటున్నాను. వ్యాసంలోని ఉదాహరణలు, వాటిని వివరించిన తీరు సరిగా లేవని అనిపించాయి. ఉదాహరణ సరిగా లేనపుడు ప్రస్తావించిన ముఖ్యాంశం పాఠకులని మెప్పించడానికి బదులుగా ‘ఇది కేవలం పడికట్టుపదాల ప్రయోగమేమో’నని సందేహించే పరిస్థితిలో పడేస్తుంది.

    1. “సైన్స్‌ ఫిక్షన్‌ రచనలో టైమ్‌ ట్రావెల్‌ ఒక అంగీకరింపబడిన సత్యం. అలాంటి రచనను టైమ్‌‌ ట్రావెల్‌ అనేది లేదు అది కేవలం కల్పన అనే ప్రాతిపదికన పరిశీలించబోవడం, ఆ రచనను దాని పరిధి దాటి పరిశీలించడం అవుతుంది. హాస్యం ప్రధానోద్దేశమైన రచనలో సామాజిక సందేశం వెతకడం ఇలాంటిదే.” –

    ఇది మొదటి ఉదాహరణ. ఈ ఉదాహరణ కి ముందు వ్యాస రచయిత్రి చెప్పిన అంశం చదివి సమకాలీన విమర్శ గురించి ఒక సమగ్ర పరిశీలన చేస్తున్నారేమోనని అనుకునేలోపూ ఈ ఉదాహరణ వస్తుంది. దానితో ఆ అంశం యొక్క స్థాయి ఒక్కసారిగా పడిపోతుంది. ఇక్కడ చెప్తున్నది చాలా మామూలు విషయమనిపిస్తుంది. “పరిధి” అని దీనిని అంటున్నారా వ్యాసరచయిత్రి! ఈ పరిధి కూడా తెలియకుండా వున్నారా ఇప్పటి విమర్శకులు! అన్న ఆశ్చర్యం కలుగుతుంది.

    (ఎందుకంటే నాకయితే ఫేస్బుక్ లో వ్యాఖ్యల వంటివి ఇలా (ఈ ఉదాహరణలలోగా) ఉండవచ్చు కానీ విమర్శ అనే శీర్షిక క్రింద వ్రాయబడే వ్యాసాలు ఇలా ఉంటాయని ఒప్పుకోలేమనిపించింది. సైన్సుఫిక్షన్ రచన గురించి విమర్శించ బూనుకున్న “సమకాలీన విమర్శకులు” టైమ్‌‌ ట్రావెల్‌ అనేది లేదు అనే ప్రాతిపదికన (అంటే మరీ ఆ స్థాయిలో) పరిశీలిస్తున్నారని అనడం సబబు కాదేమోననిపించింది.)

    2) అలాగే “సూరన కళాపూర్ణోదయం యొక్క ప్రశస్తి, అందులోని వర్ణనలకే పరిమితం కాదనీ, మన దేశంలో ఆ కాలానికి వాడుకలో లేని ఆధునిక నవలా సాహిత్య లక్షణాలన్నీ అందులో ఉన్నాయనీ, ఆ రకంగా ఆ కావ్యం సాహిత్య చరిత్రనే కాదు, సాహిత్యం ఆధారంగా మన దేశచరిత్రనే పునఃపరిశీలించడానికి ఆస్కారం ఇచ్చిందనీ చెప్పడం– ఆ రచన సామాజిక, సాహిత్య చరిత్రలో ఎక్కడ ఒదుగుతోందో వెల్చేరు నారాయణరావుగారు[1] విశ్లేషించి, వివరించి చూపించడం వల్లే సాధ్యపడింది.” అన్న ఉదాహరణ కూడా. –

    2002 లో వెల్చేరు నారాయణరావుగారు (ఆ పుస్తకం పీఠికలో) చెప్పేవరకు ఆ నవల ప్రశస్తిని విమర్శకులు వర్ణనలకే పరిమితం చేశారన్న ఈ ఉదాహరణ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.

    3) ఇక “సోదాహరణంగా విమర్శ” అన్న శీర్షిక క్రింద మొదలుపెట్టిన పేరాలో కవితని వివరించిన తర్వాత వ్రాసిన వాక్యాలు “ఇప్పుడు ఎవరైనా- ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు, ఈ మట్టివేర్లతో ఓ ఆకుపచ్చ దుప్పటి మీద కప్పుకోవడమన్న భావన ఆహ్లాదంగా ఉందనీ, ఇది సౌందర్యమనీ అనుకోవడం కద్దు. సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు.” అన్నారు.

    ఇవి చాలా అజాగ్రత్తతో వ్రాసిన వాక్యాలనిపించాయి. “ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు” అనే మాట వ్రాయడంలో వ్యాస రచయిత్రి భావం ఏమిటి? విమర్శకులు కనీసం ఆసాంతమూ చదవకుండా విమర్శిస్తారనా! కాదు కదా!

    లేక కవిత అసాంతమూ చదవనివారు అపార్థం చేసుకుంటారు కానీ ఆసాంతమూ చదివితే అందరికీ ఒకేలా అర్థమవుతుందనా! అదీ కాదు కదా! మరి ఇక “ఆసాంతమూ చదవనివారు” అనేమాట ఎందుకు వాడినట్లు?

    అంతే కాదు “సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు.” అన్న వాక్యం కూడా అనేక ప్రశ్నలకి తావిస్తుంది.

    సమర్థులైన విమర్శకులు సరే సమకాలీన విమర్శకులు ఇలా చేస్తున్నారా చేయట్లేదా! అనేది వెంటనే వచ్చే ప్రశ్న. ఎందుకంటే వ్యాసం శీర్షిక “సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ” కాబట్టి.

    అసమర్థులైన విమర్శకులు అసమర్థంగా చేస్తారు సమర్థులైన విమర్శకులు సమర్థంగా చేస్తారు అనేది ఎప్పుడూ ఉండేదే కదా! ఇపుడు ఈ వ్యాసం శీర్షికకి ఈ అంశం ఎలా పొసగుతోంది అనేది ఒక ప్రశ్న.

    ఇక “ఈ ఉదాహరణలో చెప్పినదే సమర్థమైన విమర్శా!” అన్న ప్రశ్నని పక్కన పెట్టినా, “వ్యాసరచయిత్రి అభిప్రాయం ప్రకారం అది సమర్థమైన విమర్శ, విమర్శ అంటే అలా ఉండాలి” అని ఒప్పుకున్నా.. ఆతర్వాత కూడా మరికొన్ని ప్రశ్నలు వస్తాయి.

    “ఇప్పుడీ నేపథ్యంలో మనం చర్చిస్తున్న కవితను చూస్తే, ఇది ఏ కోవకు చెందిందో స్పష్టంగా చెప్పడం అంత తేలిక కాదు. వాక్యం వెనుక వాక్యం హాయిగా ముగిసే తీరు, సౌమ్యమైన పదాల పోహణింపు ఇది ఒక సౌందర్యాత్మకమైన కవితేనన్న భావన కలిగించినా, కవి పాఠకుడికి చెప్పాలనుకున్న భావం ఆ వాతావరణానికి పూర్తిగా ఆవలి దిక్కున ఉండి, ఒక చేదు అనుభూతినీ బాధనూ మిగుల్చుతోంది.” లాంటి వాక్యాలు వ్యాసరచయిత్రి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో అర్థం కాదు. సాధారణ పాఠకులనా! విమర్శకులనా! వాళ్ళలో సమర్థులనా! అసమర్థులనా! వగైరా వగైరా…

    ఎందుకంటే అక్కడే మళ్ళీ “ఇలా ఒకేసారి రెండు భిన్నమైన అనుభవాలను కలిగించడం ద్వారా, ఈ కవిత పాఠకుడిని మలి పఠనాలకు ప్రేరేపిస్తోంది” అంటున్నారు. అదే ఆ కవిత యొక్క ప్రత్యేకత అని విశ్లేషిస్తున్నారు. మరి అలాంటి రెండు భిన్నమైన అనుభవాలని కవిత పాఠకుడికి అందించగలుగుతున్నపుడు ఇక్కడ విమర్శకుడి పాత్ర ఏమిటి అనేది మరొక ప్రశ్న!

    ఇలా అడుగడుగుకీ ఎన్నో ప్రశ్నలు రావడం వలన ఉదాహరణలు, పదాలు మరింత జాగ్రత్తగా ఎంచుకోవలసిందేమోననీ, వాక్యనిర్మాణాల పట్ల ఇంకొంచెం శ్రద్ధ పెట్టవలసిందేమోననీ అనిపించింది.

  302. Ekphrasis గురించి మరి కొంత… గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    01/18/2018 2:00 pm

    బాగా రాసారు ఈ వ్యాసం. చక్కగా విషయం గురించి చదివి, ఆలోచించి, వివరంగా చక్కని ఉదాహరణలతో రాసారు. మీ కవిత, చిత్రమూ కూడా బాగున్నవి.

    మీ కవితల గురించి, చిత్రాల గురించి ఈ పత్రికలో ప్రచురించండి. One artist’s exhibition లాగా ఆనందం కలిగిస్తుంది. ఎదురు చూస్తాను.

    వేలూరి తన వ్యాసంలో, ఈ ‘ప్రక్రియ’ తెలుగువారికి పరిచయం లేదు అని ఉండాల్సింది కాదు. Ecphrasis అన్న ‘మాట’ తో తెలుగు వారికి (ఇతరులకు కూడా) పెద్దగా పరిచయం లేదు అని ఉండాల్సింది. వెబ్స్టర్ డిక్షనరీ ఆ మాటతో తనకు అంత పరిచయం లేదని చెప్పుకున్నట్టు. Microsft word కి కూడా Ekphrasis మాట తో పరిచయం లేదు. రెండు స్పెల్లింగులు ఇప్పుడు డిక్షనరీ లో ఎక్కించాను. Ecphrasis ప్రక్రియ గా ఐతే వాడుకలో ఎప్పుడూ ఉంది. భారతదేశంలో తెలుగు స్కూల్లో ఉన్నప్పడే లేండ్సేప్ చిత్రాలు, ఇతర పోస్టర్లు ఇచ్చి వాటికి మాటలు రాయించేవారు మాతో. ఐతే అది ఏదో ప్రక్రియ అని టీచర్లు చెప్పలేదు.

    వేలూరి విస్తారంగా చదువుతారు. ఎక్కువమందికి తెలియని మాటలు, కాన్సెప్ట్స్ తెలియచేస్తారు. డయాస్పోరా లిటరేచర్ అంటే ఏమిటి అని కొన్నేళ్ల క్రితం వేలూరి ఉపన్యాసంగా మాట్లాడితేనే నాకు తెలిసింది. పద్యాల మొదటి లైన్లు తీసుకుని, మరో పద్యం చేస్తే వాటిని అదేదో ఆ మాట అంటారని ఇక్కడి పాఠకులకు చెప్పినట్టు. రాసి చూపించినట్టు. మనకి కూడా ప్రయత్నించ బుద్ధి అవుతుంది. ఐతే దామెర్ల రామారావు చిత్రానికి తెలుగులో వేలూరి వివరణ పద్యం నాకేం పెద్ద ఆనందం కలిగించలేదు. ఇంగ్లీష్లో రాస్తే, Sarojini Naidu – Bangle Sellers poem లాగా కొంచెం exotic గా ఉండేదేమో. అరుంధతీ రాయ్ కోతులు -కొబ్బరికాయల కథలు ఫారెనర్స్కి బాగున్నట్టు. కొందరు ఇండియన్స్కి కూడా బాగుంటయ్. నాకు సోది. కొన్నిసార్లు ఒళ్లు మంట. ఆ ‘ద న్యూయార్కర్’ లో టీనా బ్రౌన్ ఎడిటర్గా ఉన్నప్పుడు, కొంతమంది స్త్రీ రైటర్లను ముద్దు చేసింది. వారికి పులిట్జర్లూ, బుకర్ ప్రైజ్ లూ వచ్చాయి. ఏమైనా, emphasis (చూసారా, మైక్రొసాఫ్ట్ ఇంకా మాట నేర్చుకోలేదు. నేను రాసిన మాటను మళ్లీ emphasis అని దిద్దింది) ఎక్ఫ్రాసిస్ లో అందమైన Grecian Urn – art piece కి దీటుగా ఉండే On Grecian Urn అన్న కీట్స్ పొయెట్రీ లాటి వైతే రెండూ ‘కళ ‘ గా ఆనందిస్తాము. లేకుంటే ఒకటి కళ, రెండోది exercise. ‘వేలూరి’ కెందుకంట ఆ వెంకాయమ్మ టెంకాయమ్మ ఒకటో తరగతి కబుర్లు, పిల్లమ్మ ఇకనుంచి ఓణీ వేసుకోవాలి – లాటి ఎడ్వైజులూ.

    సర్లెండి, మరి ఈ వ్యాసం ఇంత చక్కగా రాసారుగదా, ఆ ట్రివియా వ్యాసమెందుకు పాఠకుల వ్యాఖ్యల మీద. నాకు నచ్చలేదు. అది ఎడిటర్ లకు నచ్చింది. ఏదో మంచి ఎడ్జెక్టివ్ వాడారు మీ పరిశీలన ప్రస్తావిస్తూ. ఎడిటర్ల సూచనలను మీరు Ten Commandments లాగా చూపి, పాఠకులను, కొద్దిగా రూల్స్ ఉల్లంఘించి, కట్టుబాట్లకు లొంగని వాళ్లుగా, సరదాకి ఏదో గాలిగా రాసేస్తూ, పత్రికల్లో లిటరేచర్ని ‘సీరియస్’ గా తీసుకోని వాళ్లలాగా చూపినందునా. Can’t be. ఇక్కడ ఎడిటర్లు నవ్వూ హాస్యం, ఉన్నవాళ్లు. పాఠకులు పత్రికలో ఆటలాడితే వాళ్లకు ఇష్టమే. ఎవరైనా పాఠకులు, సరదాకి రాసానంటే, వేరే వాళ్లకు బాధ ఎందుకు.

    పైగా ఈ వ్యాసంలో మీ కవిత, అక్కడ ఆమె బొమ్మ చూస్తే, కట్టుబాట్లు అంటే మీకు ఎంత రోత అనేది తెలుస్తా ఉంది కదా. జీవితంలో సరదా పాడూ లేకుండా ఆమె ఇష్టం లేని పెళ్లి జైల్లోకి బోయి ఆ తలుపు మూత బడిపోతే ఇంకేమన్నా ఉందా? అనే కదా మీ కవిత చెప్పేది. (పాతకాలపు Bias ఉందనుకోండి. ఆడవాళ్లకే ఇష్టం లేని పెళ్లి జరుగుతుందనీ, మగవాళ్లకు అది వర్తించదన్నట్టు. ‘ఆమె’ కావటం వల్ల ఒక్క ప్రెగ్నెన్సీ తప్పించి మిగతా సమస్త కష్టాలూ, ఆడా, మగా కు సమానమే. ఒ ఓ. సవరింపు. మగవాళ్లకు బట్టతల. మగవాళ్లు ఆడవాళ్ల మీద ప్రద్దానికీ జాలి పడిపోయినట్టు, తమ విషయం గురించి రాతల్లో బట్టబయలు చెయ్యరు). మరి సాహిత్యంలో మాత్రం రాసేవారికీ, రాసినవి చదివి రాసేవారికీ -అందరికీ స్వాతంత్రం అక్కర్లేదూ? వ్యాఖ్యల పరిశీలన అంటూ – లెక్కలతో మొదలెట్టి, లింగూ లిటుకూ డేటా కలెక్షన్ చేసి ఆఖరులో వ్యవసాయం ఉపమానం గల కవిత్వపు వాక్యంతో ముగించారు.

    ఆ ముగింపు వాక్యాల అర్ధమేమిటి? నాకు తెలియలేదు. అందులో గానీ పరిశీలనా ఫలితం, ఏదైనా హెచ్చరిక గాని ఉంటే అది నాకు తెలియలేదు.

    ఓ. నేను ముగించే ముందు – Rx: మేరేజ్! కథ మీరు సమ్మరైజ్ చేసినట్టుగా గాని, ఇక్కడి మీ సీరియస్ తెలుగు కవితలో కంటెంట్ లాగా గాని చదవాల్సిన కథ కాదు. అది కొంచెం నవ్వూ, హాస్యంతో చదువుకోవాల్సిన కథ. (చి.న.) అందంగా లేకపోతే పెళ్లి కాదనుకుంటే అన్ని కోట్ల పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయండీ? భలేవారు మీరు! (ద.హా.)

    Lyla

  303. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    01/18/2018 11:52 am

    “విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు.” డా. విజయ్ కోగంటి

    Well and Good.

    మానస గారి వ్యాసం ‘జాషువా –ఫిరదౌసి’ ఈ పత్రికలోనే ఉన్నది. చదివినారా? ముఖ్యంగా ఈ పై కారణం వల్లనే, చాలా పేలవమైన వ్యాసం అని నేను అనుకున్నాను.

    జాషువా రచించిన ‘ఫిరదౌసి’ ఒక ఎన్నదగిన రచన కానే కాదు. ఆ ఖండకావ్యానికి మంచిపేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇంటర్మీడియేట్ విద్యార్ధులకు 1940 వరకు పఠనగ్రంధాలలో ఒకటి గా ఉన్నదని జాషువా కవి తెలిపారు. ఆ యా గురువులు ఆ కావ్యం గురించి ఆ రోజులలో వారి విద్యార్ధులకు ఏమి బోధించారో!

    నా ప్రశ్న – జాషువా ‘ఫిరదౌసి’ లో ఒక పారశీక కవి రూపుగాని, మాటగాని, ఏ పారశీక కవిత్వపు తీరుగాని, అందునా ఫిరదౌసి కవిత్వ పరిచయం గాని ఉన్నదా? సమాధానం: శూన్యం. సున్నా. షానామా కవిత్వప్రఖ్యాతి వల్లే కదా జనులు ఫిరదౌసిని తెలుసుకోవాలనుకునేది? కాదా? స్వాతంత్ర పోరాటం, సత్యాగ్రహం గురించి కాపోతే, మోహనదాస్ కరంచంద్ గాంధీని గురించి ఎవరు తెలుసుకోవాలనుకుంటారు?

    కవిత్వ ప్రియులు, కవిత్వం తెలుసుకోటం మాని, కవిని గురించిన కాకమ్మ కథలు వినటం – జాషువా ఫిరదౌసి చదవటం. ఫిరదౌసి అన్న పారశీక కవిని గురించి ప్రచారం లో ఉన్న ధన సంబంధమైన ఒక కథను గూర్చి మాత్రమే జాషువా రాసినాడు. (ఇలాటి చాటువు, చాటు గురించి ఈ పత్రికలో మాటికి ముమ్మారు చాటి చెప్పిగా విన్నాం కదా.) ఆ రచన ఎలాటిదంటే, ఒక సంగీతవేత్త గాని – భక్త రామదాసు జైల్లో ఉంటే రాముడు లక్ష్మణుడు వచ్చి, కప్పం కట్టి అతడిని చెర వినిపించటం కట్టుకథ మనకు చెప్పి, – రామదాసు కీర్తన ఒక్కటి తెలియచెప్పటం గానీ, పాడటం కానీ చెయ్యలేకపోటం వంటిది.

    ఒక కవి, ఇంకో కవి కవిత్వం చదవకుండానో, ఆ ప్రసక్తి ఇంత తేకుండానో, మకుటం లో అతని పేరుతో అతని మీద ఖండకావ్యం రాయటమేమిటి?

    జాషువా రాసిన ఫిరదౌసి కావ్యం పేరు మార్చి, కాళిదాసు, బమ్మెర పోతన అని పెట్టినా, కీట్స్ అని గాని, షేక్స్పియర్ అని గాని పెట్టి, లోపల పద్యాలలో పేరు మారిస్తే, చాలు. ఏం తేడా రాదు. ఆ ఏ ఒక్కరి specific జీవనం, విద్య, శైలి, ఆలోచన రీతి, సాధించిన పని, మనకింత కూడా తెలియదు. అలాటి generic రచన జాషువా చేసింది. ఫిరదౌసి పారశీకపు కవిత్వపు తీరు తెన్నులు జాషువాకు బహుశా తెలియవు. ఆయన చెప్పలేనందున ఈ ఖండకావ్యం ద్వారా మనకూ తెలియవు. కొంతమంది చదువరులకు మరి ఫిరదౌసి కవిత్వ పరిచయం జాషువా రచన ద్వారా, ఎలా కలిగిందో?

    ఫిరదౌసి అన్న కావ్యంలో ఆ కవి లేనే లేడన్న విషయం మానస మాత్రం గమనించిందా? లేదు.

    జాషువా రాసిన ఆ ఖండకావ్యము పేరుగొన్నదనే చదువుకుని, బాగున్నదనే నమ్మి, వాల్మీకి, నారాయణరావు, గురజాడ – ఇలా సాహిత్యంలో తెలిసిన కొందరిని, వారి మాటలను తన వ్యాసం లో ప్రస్తావిస్తూ రివాజు ప్రకారం ఒక సాంప్రదాయికమైన వ్యాసాన్ని, మానస తయారు చేసింది. ఆ ప్రస్తావనలు కూడా ఆమెకు ఈ రచన సందర్భంలో సొంత ఆలోచన లేకపోటాన్నే బలపరుస్తాయి. వాల్మీకి – సీతకు ఎడమ కన్నో, కుడి కన్నో అదరటానికీ, ఒక పారశీక కవి నమ్మికలకూ, మానసిక స్ధితిగతులకూ ఏమిటి సంబంధం?

    ఫిరదౌసి గురించి జాషువా “ఏమని కవిత్వం వ్రాసినట్టు, ఎందుకు వ్రాసినట్టు” అని మానస ప్రశ్నించుకుంది. సాహితీ వ్యాసాల్లో – ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి? అని తమ వ్యాసాల్లో అనటం నేర్పిన సాహిత్య సైంటిస్ట్ ల నుండి ఆ వాక్యం రాయటం వరకు ఆమెకు వచ్చింది. మరి సంపాదించిన సమాధానం? అదసలు ఏమిటి? దొరికినది సజావుగా ఉన్నదా?

    ఎన్నో విషయాల మీద ఆసక్తితో మనుషులు శ్రమిస్తారు. సైంటిస్ట్ లకు ఒక పరిశోధనలో ముఫ్పై ఏళ్లు శ్రమిస్తే, అందునుండి మనుషులకో, మరెవరికో ఉపయోగించే ఫలితం ఏదీ రాకపోతే ఆవేదన కలుగుతుంది. అనుకున్న ఆదాయం రాకపోయినా కష్టం కలుగుతుంది. నిజమే.. మరి, ఫిరదౌసి కవిత్వమైతే ప్రజలకు ఆనందించటానికి ఉన్నది. జాషువా కావ్యం రాసేనాటికి ఫిరదౌసి ప్రసిధ్ధుడైన కవే. ఆ కవిత్వం దొరుకుతున్నది. మరి జాషువా ఒక పాతకథను పట్టుకు ఎందుకు పాకులాడ్డం? ప్రపంచంలోనే పేరు పడిన కవిని, మరో కవి ముఖ్యంగా అతని కవిత్వాన్ని గుర్తిస్తాడా? కవిత్వాన్ని పరిచయం చేస్తాడా – లేక, అది మరచి, (నిజమో కాదో తెలియని) ఒక పరిదీన పరిస్థితిలో మనకు ఫిరదౌసిని చూపుతాడా? అది చేయదగ్గ పనిగా నాకు అనిపించటం లేదు.

    జాషువా కావ్య వస్తువుగా తన తెలుగు జీవితం, తన నిజ పరిస్థితిని తనే వర్ణించి తన సమకాలీన పాఠకులకు చూపవచ్చు. “గబ్బిలము” లో ఎంతో కొంత చూపినాడు. కాని, ఏనాటి వాడో పర్షియన్ ఫిరదౌసిని జీవితంలో ఏదో అన్యాయానికి గురైన వాడుగా మాత్రమే నమ్మి మనకు కావ్యంలో చూపటం గాని, కవిత్వ ప్రస్తావనే లేని కావ్యం రాయటం కాని, ఫిరదౌసి జీవితం తో జాషువా జీవితానికి సాపత్యం ఉంది – అని అతనైనా, ఎవరైనా అనుకోటం కాని, అవి సరైన ఆలోచనలు కావు.

    మానస – తన రచనలో 1. జాషువాకు ఫిరదౌసి కవిత్వం తెలుసునో తెలియదో చెప్పగలగాలి. 3. అందుకు స్వయంగా ఫిరదౌసి కవిత్వం కొంతైనా తను చదివి, చర్చించ గలిగి ఉండాలి. అప్పుడు గదా ఆమె ‘జాషువా- ఫిరదౌసి’ అన్న వ్యాసం రాయవలసింది. కాదా? Is it not?

    (సమయం కొద్దీ, మానస చామర్తి కవితలు, కవిత పరిచయాల గురించి మరోసారి.)

    Lyla

  304. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి B J S REDDY (శ్రీ) గారి అభిప్రాయం:

    01/16/2018 8:04 pm

    శ్రీశ్రీ అంటే ప్రాణం. అర్ధం అయిన వాటి నుంచి ఏదో తెలుసుకోవాలని, అలా నేను నాలుగు మాటలు చెప్పాలని అనిపించేది, కానీ అర్ధం కానీ పదాలు వచ్చినప్పుడు కవిత ప్రవాహం అయితే సాగిపోయేది కానీ ఎక్కడో చిన్న అసౌకర్యం ఉండేది. నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనకు నచ్చిన ముద్దపప్పుతో గోంగూర పచ్చడి నంజుకుని తింటునేటప్పుడు ఎక్కడో అన్నములో మట్టి బెడ్డ తగిలినట్లు.

    చిన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకాలూ చదువుకునేటప్పుడు పాఠం మొత్తము అయిన తరువాత అర్ధాలు ఉన్నట్లే, ఈ కవితల్లో ఉన్న తెలియని, క్లిష్టంగా ఉన్నాయి. అనుకున్న పదాలకు అర్ధాలు సమకూరిస్తే ఈ కవుల కవిత్వం మరింత కాలం సజీవంగా ఉంటాది.

    ఎందుకంటే మా క్లాసులో ఉన్న 60 మందిలో, ఒక 6 గురికి మాత్రమే తెలుగు చదవాలని చిన్న ఆశ, అందులో ఇద్దరికీ మాత్రమే ఇలాంటి కవితలు చదవాలని, రాయాలని ఆశ, మరి ఇలాగే ఉంటే ఆ పాఠకులను కూడా కోల్పోతారు.

    అలా జరగకూడదని ఆశిస్తూ….

  305. ఉగాది పాటలు గురించి సత్యసాయి విస్సా గారి అభిప్రాయం:

    01/09/2018 11:03 am

    తేట తెలుగు తేనెల ఊట ఈమాట
    ఈ పూట నేనన్న ఈ మాట మామూలు మాట కాదు
    ఏనాటిదో ఆ తెలుగు బంధం నేటికీ ఇక ఏ నాటికీ వసివాడని
    ఈ మాటని మా కందించిన మహానుభావులకు హృదయపూర్వక అభినందనలు
    పరవశాన ఊగిన మా శిరసుల పాదాభివందనాలు

    అలాగే మిగిలిన ఉగాది, వివిధ సందర్భాల్లో ఉషశ్రీ, దాశరధి, తిరుమల, మల్లెమాల, సినారే వంటి నాటి మేటి గళాలు ముదిమి మీదపడినా నేటికీ తొణకని ఆచార్య మానాప్రగడ శేషసాయి గారివంటి మహానుభావుల కవితా సుధా రసధారలు అందించమని వినమ్ర విన్నపముతో!

    భవదీయుడు
    సత్యసాయి విస్సా

  306. ఉడుత గురించి దడాల వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం:

    01/02/2018 10:53 pm

    మీరు అక్షరాలను పదాలుగా పదాలను కవితలుగా అలవోకగా చిత్రీకరించగలరు

  307. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి అఫ్సర్ గారి అభిప్రాయం:

    01/01/2018 9:36 am

    మానసా,

    ముందుగా అభినందనలు! యింత వివరంగా ఇటీవలి కాలంలో సాహిత్య విమర్శని పట్టించుకున్న వాళ్ళే లేరు. అయితే, కేవలం కవిత్వం పరిధిలో మాత్రమే విమర్శని పరిశీలించడం వల్ల ప్రయోజనం తక్కువ అని నా అభిప్రాయం. అత్యంత విలువైన సాహిత్య విమర్శ చర్చ అంతా వచన ప్రక్రియల్లో- ముఖ్యంగా కథల మీద- జరిగింది. మీ అభిరుచి పరిధిలో చేసిన కవిత్వ విమర్శ అనుశీలన ఇది. చివర్లో మీరిచ్చిన సూచనలు బాగున్నాయి. యిప్పుడు ఇలాంటి విమర్శ వ్యాసాలని ప్రోత్సహించే ఆసా, భరోసా వెబ్ పత్రికలే అనిపిస్తోంది నా మటుకు నాకు.

  308. పరిచయం: ఇంటివైపు – అఫ్సర్ కవితల సంపుటి గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    01/01/2018 3:05 am

    ప్రియమైన శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు,

    ఒక ఆత్మగత ప్రపంచానికి ప్రతీకగా ఉన్న అఫ్సర్ గారి కవితల పుస్తకం “ఇంటివైపు”ను నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారు అందించారు కాని దాన్ని ఎలా ఆశ్వాదించాలో మీ యీ విశ్లేషణ వల్లే తెలుసుకున్నాను. (వాకిలి అంతర్జాల పత్రికలో స్వాతి కుమారి బండ్లమూడి గారు కూడా యీ పుస్తక పరిచయం చేసి సాయపడ్డారు). మీకు ధన్యవాదాలు.

    “కణకణ మండే ఉద్యమ రక్తకాసారాల్లోకి
    దేహాల్ని చితుకుల్లా విసిరేస్తున్న ప్రాణాలూ తెలుసు నాకు” అన్న అఫ్సర్ గారికి వొందనాలు.

  309. మంచి కవి, మంచి స్నేహితుడు గురించి తః తః గారి అభిప్రాయం:

    12/31/2017 1:40 pm

    “నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” లో ‘అందమైన’ అని తిలక్ అనిఉండకూడదనీ, అలా అనటం నన్ను చాలా బాధ పెట్టిందనీ ‘ఈమాట’ అభిప్రాయాలలో (ఎప్పుడో, ఎక్కడో గుర్తు రావటం లేదు) ఒక సారి రాసాను. మొన్న డిసెంబర్ 18 వ తేదీ ‘ఈనాడు’ అనుబంధం II వ పుటలో – అప్పుడు హైదరాబాదు లో జరుగుతున్న ‘ప్రపంచ తెలుగు మహసభల’ ప్రేరణతో – ఒక ఆడ పిల్ల – వేమూరి సుధా మాధురి, భీమవరం- రాసిన ‘అమ్మ ఒడంత వెచ్చదనం నా తెలుగు’ అంటూ మొదలైన ‘అమ్మ ఒడి’ అన్న ఒక కవిత వచ్చింది. అందులో చివరి చరణం:

    “తిలక్ చెప్పినట్లు మన తెలుగు అక్షరాలు
    నిజంగానే వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు”

    1968 నుంచీ నేను పడిన బాధ సుధా మాధురి కి తెలిసిందని ఊరట కలిగింది.

    2018 శుభాకాంక్షలతో,
    తః తః

  310. ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    12/13/2017 8:01 am

    ‘అలతి అలతి పదాలతో లోతైన కవితలు’ రాసిన చామర్తి మానస గారి కవిత్వం కూడా పుస్తకం రూపంలో పాఠకులకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్న వారు … వారి సమకాలీన ప్రతిభావంతులైన కవయిత్రులే కాక, మాలాంటి సామాన్య పాఠకులు కూడా.

  311. వో షామ్ కుచ్ అజీబ్ థీ… గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    12/11/2017 10:35 am

    వో షామ్ కుఛ్ అజీబ్ థి – ఎ కవిత భి బహుత్ సె అజీబ్ హై. కవిత చాలా చాలా బాగుంది.
    ఎస్.ఎ.రహమాన్, చిత్తూరు.

  312. పర పరాగ్ ​- 1970​ గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    12/11/2017 10:30 am

    గిలి గిలి గిలిగా కవిత ముద్ద మందారం లా ఉంది. చక్కని చిక్కని కవిత చాలా బాగుంది.

    ఏస్.ఎ.రహమాన్.చిత్తూరు.

  313. కూచిపూడి పదం–భుజంగరాయ శర్మ గురించి ముజఫర్ రహ్మాన్ గారి అభిప్రాయం:

    12/09/2017 10:37 am

    ఈ మాటవారి సింబల్ “ఈ” అనేది కధ/కవితల్లో ఉన్న బొమ్మ మీద మౌస్ పెడితే పైకొచ్చి కనిపిస్తోంది (మెయిన్ పేజీలో మాత్రమే) .అయితే ఈ వ్యాసంలో పెట్టిన శర్మ గారి బొమ్మమీద అది ఒక సూదిని శర్మగారి కపాలం లోంచి పెదాల దాకా దిగినట్టు చూపించి అతి వికృతంగా ఉంది. ఆయన పోయాక రాసిన ఈ వ్యాసం లో బొమ్మ అలా కనిపించడం కడుపులో దేవినట్టుగా ఉంది; గమనించగలరు.

    ముజఫర్ రహ్మాన్
    ఖమ్మం

  314. ఉగాది కవిసమ్మేళనాలు గురించి సత్యసాయి విస్సా గారి అభిప్రాయం:

    12/08/2017 11:44 am

    అలనాటి మేటి రతనాల మూట ఈమాట
    తేట తెలుగు తేనెల ఊట ఈమాట
    ఈ పూట నేనన్న ఈ మాట మామూలు మాట కాదు
    ఏనాటిదో ఆ తెలుగు బంధం నేటికీ ఇక ఏ నాటికీ వసివాడని
    ఈ మాటని మా కందించిన మహానుభావులకు హృదయపూర్వక అభినందనలు
    పరవశాన ఊగిన మా శిరసుల పాదాభివందనాలు
    అలాగే మిగిలిన ఉగాది, వివిధ సందర్భాల్లో ఉషశ్రీ, దాశరధి, తిరుమల, మల్లెమాల, సినారే వంటి నాటి మేటి గళాలు ముదిమి మీదపడినా నేటికీ తొణకని ఆచార్య మానాప్రగడ శేషసాయి గారివంటి మహానుభావుల కవితా సుధా రసధారలు అందించమని వినమ్ర విన్నపముతో
    భవదీయుడు
    సత్యసాయి విస్సా

  315. సడి లేని సంభాషణలు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    12/06/2017 5:55 am

    ఎప్పటిలాగే మరో మంచి కవితను రాసారండి.

  316. ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి Naveenkumar K గారి అభిప్రాయం:

    12/02/2017 10:51 am

    వావ్..ఈ కవిత్వాన్ని ఇంత లోతుగా ఆత్మీయంగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు . I’m impressed by the way you owned this anthology Manasa garu. It’s such a delight to read this introductory review about KUNDAAPANA. 🙂

  317. ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి అఫ్సర్ గారి అభిప్రాయం:

    12/02/2017 10:32 am

    కవిత్వాన్ని గురించి యెట్లా మాట్లాడుకోవాలో, ఎట్లాంటి మాటలు ఆ సంభాషణకి కావాలో మానసకి తెలుసు! మానస విశ్లేషణ చదివాక మనకీ తెలుస్తోంది అన్న నమ్మకం కలుగుతుంది యీ వ్యాసం చదివాక యింకో సారి! మానసా, యిదే వరసలో మరిన్ని రాయాలని కోరుకుంటూ..

  318. సడి లేని సంభాషణలు గురించి Lakshmi గారి అభిప్రాయం:

    12/02/2017 1:50 am

    రేఖ గారూ, మీరు రాసిన ఏ కవిత చదివినా, చదివే ఆ ఒక్కరికోసమే రాసినట్లు ఉంటుంది.

    “మరొక్క మాటా పెగలని మన మర్యాదల మీద”
    మన భావమును చెప్తూనే మన విలువను పెంచుకునే పద ప్రయోగం. చాలా బాగ రాశారండి.

  319. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి Chandra Sekhar Devarakonda గారి అభిప్రాయం:

    11/17/2017 11:36 pm

    మురుగన్ గారు సృజనాత్మక రచయిత. ఆయన వ్యాసం సాంస్కృతిక వ్యాసం. అటువంటి వ్యాసాలకు సాహిత్య పత్రికల్లో తప్పక చోటివ్వాలి. కళను సిద్ధాంతం మింగేయకూడదని ఈరోజుల్లో మార్క్సిస్టులు కూడా ఒప్పుకుంటారు. అలాగే కళ వెనుక ఏదో ఒక భావజాలం ఉండి తీరుతుందని మార్క్సిస్టులు కాని వాళ్ళు కూడా ఈరోజుల్లో ఒప్పుకుంటున్నారు. భారతరామాయణాలు రసవత్తరంగా రాయబడిన కారణం చేతనే అవి ప్రచారం చేసిన భావజాలాలు ఇప్పుడు కూడా ప్రభావితం చేస్తున్నాయి. కళ కళ కోసమే అన్న భావన మన సంప్రదాయంలో ఎప్పుడూ లేదని నా అభిప్రాయం. కవిత్వం విలువ నిర్ణయించడానికి ఆర్ద్రహృదయం ఒక్కటే చాలదు. ఆ కవిత్వం వెనుకనున్న రాజకీయాలు కూడా తెలియాలి. లేకపోతే అందమైన ప్రకటన చూసి కరిగిపోయి అది ప్రకటించే వస్తువు కొనుక్కొనే వినియోగదారుడిలా మిగిలిపోతాం. ప్రకటన అందాన్ని మెచ్చుకోవచ్చు. కాని వస్తువు నాణ్యతను ఇంకా ముఖ్యంగా పరిగణించాలి.

  320. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    11/15/2017 8:22 am

    ప్రియమైన శ్రీ దేశికాచారి గారికి, శ్రీ నాగేశ్వరరావు గారికి,

    “ప్రచారమే ధ్యేయంగా రాయబడిన వ్యాసము”, “సాహిత్యపు విలువలు” వంటి విషయాల గురించి మీతో వాదించాలనుకుంటున్నా కాని, బహుశా ఇది సమయం కాదేమో అని సందేహిస్తున్నా.

    “భావవ్యక్తీకరణ విషయంలో జరిగే తిరుగుబాటుకీ కులవ్యవస్థకీ ఉన్న సంబంధం అతి కీలకమైనది” అంటూ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌గారు చేసిన ప్రసంగపాఠంలో నాకు యెలాంటి తప్పులు కాని, వాస్తవాలకు విరుద్ధమైన తప్పుడు ప్రచారం లాంటిది కాని కనబడుటలేదు. ఇది ఆర్ద్రహృదయముతో వారు చేసిన ప్రసంగంగా అనిపించటం లేదా.

    మన కుల వ్యవస్థ, కులవిచక్షణ సాంఘిక రుగ్మతల వల్ల జరుగుతున్న అన్యాయాలు, అనర్థాలు మనకు తెలియని విషయాలా. దేశపురోగమనానికి ఇవి ఆటంకాలు కావా. దయచేసి యీ కోణంలో మరొక్కసారి ఆలోచించగలరు.

    కథ, నవల, నాటకం, కవిత్వం ఇంకా అనేక ప్రయోగాలు సాహితీ ప్రక్రియలు అయినట్లే వ్యాసాలు కూడా సాహితీ ప్రక్రియ క్రింద రావా. యీ వ్యాసం ప్రచురించటం వల్ల ఉన్నత సాహితీ విలువలు కలిగి ఉన్న ఈమాట అంతర్జాల పత్రికకు యేవైనా అపకీర్తి చుట్టుకుంటుందా.

  321. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి desikachary గారి అభిప్రాయం:

    11/13/2017 10:41 am

    I stand by my word. Since it is propagandish devoid of any literary value I said this is not the right forum for that. There are other forums too willing to publish such stuff where it can go. As for the quote by Ramayyagaru, it is irrelevant, because it is not a piece of literature we are talking about. It is a pity that people are too willing to quote foreigners than Indian Laakshanikas on literature. Here is a quote from respected modern poet and scholar Sri Indraganti Hanumacchaastrigaru regarding the true nature of poetry, which, by extension is relevant to all literature.
    కవిత్వము సిద్ధాంతములను మ్రింగివేసి జీర్ణించుకొని తన జీవశక్తితో తాను నిలబడవలెను. కాని సిద్ధాంతములే కవిత్వమును మ్రింగి తూర్యారవములు ప్రారంభించినచో నాటితో ఆ సాహిత్యపు విలువ సరి. నాదములు, వాదములు తాత్కాలికములు. కవిత్వపు విలువ శాశ్వతము. తిక్కన భారతమును, పోతన భాగవతమును, పెద్దన మనుచరిత్రమును సమకాలిక సిద్ధాంతదర్శనమునకై చదువుట లేదు. వాని లోకోత్తర కవితాశిల్పము, వ్యంగ్యప్రభావము తరతరములనుండి చదివించుచున్నవి. కనుక కవిత్వపు విలువను నిర్ణయించుటకు వేరు పరికరములు కాక, ఒక్క ఆర్ద్రహృదయము మాత్రమే ప్రయోజకమని సమ్మతించినచో ఏ రచనకైనను న్యాయము జరుగును” – ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి.

  322. Nails గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    11/11/2017 11:02 pm

    సంస్కృతంలో వేద వ్యాసుడు రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం లోని ఎర్రాప్రగడ మన ఎనకపడ్డ పెకాశం జిల్లా ప్రాంతం వారే కదా ఇంద్రాణి తల్లీ. “వానకు తడిసిన పువ్వొకటి” రచనకు గాను ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇచ్చే ఇస్మాయిల్ అవార్డు అందుకున్న ఇంద్రాణి గారూ! కాకినాడ పెద ఇస్మాయిల్ గారి మిత్రులు త్రిపుర గారి కధలూ, కవితలను చదివి మీరు పులకిత యామినివి కావాలమ్మా.

  323. మరికొన్ని అరుదైన పాటలు గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    11/03/2017 3:55 pm

    Lyla: The verse “kausalyaa suprajaa raama” was sung by Balijepalli Lakshmikantam (a.k.a Lakshmikanta kavi), who played the role of Viswamitra in that film. Obviously I won’t tell you who he is, etc.

    Regarding other songs, there is no dispute about taste. But my motivations, or selection criterion for picking them are different, not necessarily “good quality” singing. But, I would particularly disagree with you about the song “madhoodayaMlO …”. But, we can take that off-line!

    తెలుగులో గళమాధుర్యం కోసం నేను విన్నది స్త్రీలలో -బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మి, భానుమతి, శ్రీరంగం గోపాలరత్నం. మొదటి ముగ్గురి స్వరం తప్పక గుర్తించగలం. snip … snip … గాయని సుశీల లాగా. సుశీల గొంతు వేలాది వేల తెలుగు స్త్రీలకు ఉన్నది. ఏమీ ప్రత్యేకత లేదు.

    I have been saying the same for a while. So …

    But, Rohini Prasad gaaru put it quite well here: http://eemaata.com/em/issues/201003/1556.html#comment-19094

    డూడూ బసవన్న అంటే జానపదమై పోతుందనీ, ఛందస్సుంటే చాలు కవిత్వమని, పాట పాడినవారందరూ గాయకులేనని, అందరూ పాడటానికి అర్హులేననీ, ఎవరైనా ఏ పనైనా చేసెయ్యగలరనీ, ఇలాటి డెమొక్రాటిక్ భావనలు నాకు లేవు.

    same here!!

    Best,
    Sreenivas

  324. ఇస్మాయిల్ అవార్డు-2015 గురించి వేణు గోపాల్ గారి అభిప్రాయం:

    11/03/2017 9:21 am

    కవితలుకూడా ప్రచురిస్తే బాగుండేది

  325. తిలక్ కవితా మూలాలు – ఆయన సాధించిన సౌందర్యం గురించి తః తః గారి అభిప్రాయం:

    10/28/2017 12:46 pm

    సి యస్ రావు గారూ, తన (వచన) కవిత్వంలో అక్షరం అక్షరానికీ మొగలి పూ పరిమళం అద్దిన కవి తిలక్. నేను విస్తృతంగా చదివిన వాణ్ణి కాను గానీ తను ఎంచుకున్న వస్తువును అందిచటంలో ఆధునిక పద్యకవులలో నాకు అంత శబ్దార్థ సౌందర్యాన్ని సాధించిన కవిగా కాటూరి కనబడతాడు. వచన కవుల్లో ‘చితి – చింత’లో వేగుంట సాధించిన కవితా సౌందర్యం విలక్షణమైనది.
    నమస్కారాలతో
    తః తః

  326. తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా! గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    10/22/2017 5:01 pm

    Reading You, Sivaji. Looking at the different paintings you are bringing to us in this magazine, with interest. Thank you.

    I dislike the heading of this article. ‘తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా’ Just like, I disliked this title of another essay in a previous issue of this magazine, on Bapu’s art- ‘చిత్రం – ‘బాపు’రే విచిత్రం’ Punning based on Artist’s name is more boring than repeatedly copied calendar art. These kind of titles to articles, is a ‘Traditional’ disease, in a Telugu magazine. See some issues in this magazine. You would notice how prevalent it is. కళకాలమ్ should be included, when you take the head-count.

    Turning to the subject of Art:
    I like to hear your opinion on a drawing of Bapu, titled అమ్మ. You can access this drawing from the above mentioned essay on artist Bapu in this magazine. There is a Sanskrit poem. And there is a Telugu translation next to it. The Telugu poetry goes like this. (I have no idea who wrote it. Don’t know how many ‘అమ్మ’ drawings there are all together.)

    “ప్రసవ పర్యంతం నెలనెలా కష్టం కలిగించినందుకు
    ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.”

    కవిత్వపు మాటలకు, బాపు – బొమ్మ వేసారు. మీకు సంస్కృతం, తెలుగు తెలిస్తే ఆ కవిత్వాలకు కూడా సందేహించకుండా అర్ధం చెప్పండి.

    1. మాతృపిండం అంటే ఏంటి? ఆ కవిత్వానికి అర్థం ఏమిటి?

      I think this Bapu’s drawing is an abhorrence, beyond words. Bapu has no clue about the relationship of size of foetus, to uterus, to the size of a woman’s tummy in a term pregnancy. Am I turned off, just by that technicality? May be. Is this a colored cartoon? It cannot be a caricature of a pregnant woman? Can it? What kind of feelings does this drawing evoke in you, with or without the words next to it?

    2. చిత్రకళా పరిభాషలో గీతకూ, రేఖ కూ తేడా ఉన్నదా?
    3. ముక్తకంఠం, దగ్ధమౌతున్న బాగ్దాద్, మౌనం యుద్ధ నేరం, జెన్ కథల పుస్తకం, మీరూ జర్నలిస్ట్ కావచ్చు – అన్న పుస్తకాల మీద మోహన్ ఆర్ట్ ఉందట. ఆ ఆర్ట్ చూపగలరా? మోహన్ – ఆరు రుతువులు చూపిస్తూ కేలండర్ బొమ్మలు వేసారట. వాటిని చూపగలరా.
    4. చిత్తప్రసాద్ ఎవరు? ఆ ఆర్టిస్ట్ ఎవరో తెలియనందుకు నిందించకుండా, ఆయన ఆర్ట్ ను ఇక్కడ మాకు పరిచయం చెయ్యమని మరో కోరిక. ( గొప్ప తెలుగు వాళ్లని గూర్చి గర్వపడాలనీ, గొప్ప తెలుగువాడని తెలియనందుకు పాఠకులు సిగ్గు పడాలనీ – ఇలాటి మాటలతో తలకాయ వాసిపోయింది.)

    Lyla

    PS:
    “కార్టూనిస్ట్‌గా మీ సాధన ఎలాంటిది?”

    “సాధన అంటూ పత్యేకంగా ఏం లేదు. గీయగా గీయగా ఒక బెటర్ ప్రజంటేషన్‌కి సెటిల్ అయిపోతాం. వేయగా వేయగా వికారపు కేరికేచర్‌క్కూడా జనం సెటిల్ అవుతారు.” మోహన్ (Words taken from an interview attached to an article on artist మోహన్, by journalist గోవిందరాజు చక్రధర్ in this issue. Very good interview. Thanks.)

  327. మరికొన్ని అరుదైన పాటలు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    10/22/2017 3:58 pm

    About these rare Telugu songs:

    గాయకుడెవరో గాని – కౌసల్యా సుప్రజా రామా! – అంటూ శ్రీరాముడిని నిద్ర లేపే విశ్వామిత్రుడి శ్లోకం చక్కగా పాడారు. కంఠం, గంభీరమూ, శ్రావ్యమూ ఐ ఉంది. పాడిన పద్ధతి అర్థవంతంగా, మధురంగా ఉంది. తల్లిదండ్రుల నుండి, మెత్తని పరుపులనుండి, వేరు చేసి తీసుకు వచ్చి, సరయూ నది ఒడ్డున, నేలపై పడుకోబెట్టిన ఇద్దరు రాకుమారులను పొద్దున్నే గురువు నిద్ర లేపాలి. ఆ రోజు వారికి దైవం నియమించిన పనులు చేయటానికి వారిని ప్రోత్సహించాలి.

    తల్లి పేరు పలుకుతూ ఆ పిల్లలను నిద్రలేపటం, ఎంతో కరుణ కలిగినది గురువు హృదయం అని తెలుపుతూనే ఉంది. ఐనా, కంఠంలో, శిష్యులకు విషాదం వినిపించనీయడు. రాముడికి తన తల్లి పేరు, లక్ష్మణుడికి రాముడి పేరూ, వినిపిస్తూ – ఏదో ఎత్తునుండి దూరంలోకి చూస్తూ, విస్తరిస్తున్న ప్రభాత సంధ్యను దర్శిస్తూ పలుకుతున్నాడు. దూరం నుంచే పలుకుతున్నాడు. గురువు చైతన్యశీలి. కార్యశాలి. అది ఒక కొత్త రోజు. కొత్త పనులు. రామలక్ష్మణులు చిన్నవాళ్లైనా వారితో పెద్ద పనులు చేయించటానికే విశ్వామిత్రుడు తీసుకు వచ్చింది. అతని గొంతు ధృడత్వం, ఆదరం, మర్యాదతో కూడి ఉండాలి. అతడి గొంతు శాసించగలిగీ ఉండాలి. ఉన్నది.

    ఈ శ్లోకం ఇంతా అంతా అందమైనదా! వినటానికి మనసు తపించి పోతుంటుంది. ఎన్నాళ్లో కొన్నాళ్లకు దూరంగా ఎక్కడి నుండో గాలిలో తేలివచ్చి పొద్దున్నే చెవుల బడితే, చాలు, దైవమా! అనిపిస్తుంది. ఈ శ్లోకం సంపూర్ణ రామాయణం సినిమాలో ఉంది. పాడినదెవరో నాకు తెలియదు. శ్రీ కృష్ణాంజయనేయ యుద్ధం సినిమా లో ఘంటసాల పాడగా వింటాము. ఇంకా, వెంకటేశ్వర సుప్రభాతం లో, మొదటి శ్లోకంగా కూడా, వేర్వేరు గొంతులలో నేను విన్నాను. ఎన్ని విధాల విన్నాగాని, మన మనసులో చూసే దృశ్యం, వినిపించే ధ్వనికి, న్యాయం జరగలేదనే అనిపిస్తుంది.

    ఇప్పుడు ఇక్కడ ఉంచిన శ్లోకం నాకు బాగుంది. గాయకుడు మరి ఎవరో! పూర్వా సంధ్యా అన్న దగ్గర పూర్వా సంధ్వా అన్నట్టుగా వినిపిస్తున్నది. అలా ఎందుకు పలికారో మరి. ‘సంధ్వా’ అని పలకటం తప్పు. ‘సంధ్య’ అనాలి, అసలు ‘సంధ్వ’ అన్న మాట లేనే లేదు, మాట సరీగా అనకపోతే నేను వినలేను అనవచ్చు కొంతమంది. అది నిజమే. ఐనా, మాటలు ఎప్పుడూ మారుతూనే ఉన్నాయనీ, ఉంటాయనీ; కొత్తమాటల పుట్టుకకు ఒక కారణం ఎక్కువమంది ఒక మాటను తప్పుగా పలకటమేననీ, బూదరాజు రాధాకృష్ణ ‘ భాషా శాస్త్ర వ్యాసాలు’ పుస్తకంలో అంటారు. అదీ నిజమేగా. సీతా, సీతా అని లవకుశ సినిమాలో, N.T.R లా పలవరించే తెలుగు వాళ్లు, ‘సీతే’ అని మరో భాషలో అంటే లేచి వెళ్లిపోతారు, అందులో ఏ తప్పూ లేకపోయినా. ఏ భాష వారికి ఆ భాష బంగారం కాబోలు.

    ఈ కౌసల్యా సుప్రజా రామా అన్న మేలుకొలుపు తప్పించి, మిగతా వేవీ నాకు నచ్చలేదు. నాకు, సీత, అనసూయలు, సూర్యకుమారి గొంతులు, పాటలు ఏం బాగులేవు. గాత్ర సంగీతం లో ముందు నచ్చవలసినది ఏమిటి? మనిషి గొంతే. అలా తెలుగులో గళమాధుర్యం కోసం నేను విన్నది స్త్రీలలో -బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మి, భానుమతి, శ్రీరంగం గోపాలరత్నం. మొదటి ముగ్గురి స్వరం తప్పక గుర్తించగలం. గోపాలరత్నం కొన్నిసార్లు వేరే అనేకానేకమైన స్త్రీ గొంతుల్లో కలిసిపోతుంది. గాయని సుశీల లాగా. సుశీల గొంతు వేలాది వేల తెలుగు స్త్రీలకు ఉన్నది. ఏమీ ప్రత్యేకత లేదు.

    ఈ తెలుగు పాటలు, పాడింది తెలుగు వాళ్లు అని వింటమే తప్ప, వినదగిందిగా ఏదీ లేదు. తెలుగును ఉబ్బేస్తే, ఆ కవిత్వం బాగున్నట్టే నని, దైవం పేరు పాటికి పన్నెండు సార్లు తీసుకొస్తే, ఆ కవితలను భక్తి గీతాలుగా భావించాలని, డూడూ బసవన్న అంటే జానపదమై పోతుందనీ, ఛందస్సుంటే చాలు కవిత్వమని, పాట పాడినవారందరూ గాయకులేనని, అందరూ పాడటానికి అర్హులేననీ, ఎవరైనా ఏ పనైనా చేసెయ్యగలరనీ, ఇలాటి డెమొక్రాటిక్ భావనలు నాకు లేవు.

    I am Sorry! విశ్వామిత్రుడికి కూడా ఉన్నట్టు లేవు. ఉంటే పనిగట్టుకుని, నలుగురు సోదరులలో, రామలక్ష్మణులను మాత్రమే తన వెంట తీసుకువెళ్లటమెందుకు? వారిద్దరిలోనూ కూడా రాముడికే -బల, అతిబల అన్న మంత్రాలు ఉపదేశించి “సౌందర్యం, సామర్ధ్యం, జ్ఞానం, బుద్ధి నిశ్చయం, ప్రత్యుత్తరం” అన్న ఐదు విషయాల్లో రాముడిని అధికుడుగా చెయ్యటమెందుకు!
    Lyla

  328. యుద్ధం గురించి Anjaneyulu KSR గారి అభిప్రాయం:

    09/05/2017 4:40 pm

    ప్రేమ మనసుకి కలిగె భావన
    కీర్తి మన శక్తి యుక్తులకొచ్చె గుర్తింపు
    కీర్తికి ప్రేమకి మధ్యనున్న సున్నిత సుతార తీగని లాగారు, మీ కవితతొ….

  329. వలసపోతున్న మందహాసం గురించి పురాణం రామప్రసాద్ గారి అభిప్రాయం:

    08/30/2017 10:37 pm

    కవిత చక్కగా కుదిరింది. అలల గుడ్డ బదులు, అలల వలువ బాగా కుదురుతుంది.

    ఈ రోజే కాకతాళీయంగా చదవడం జరిగింది.

    నేను ••••లో చేరాను, ఓ మోపెడు…అనలేను గాని నేనూ కవితలు రాస్తుంటాను.

    క్రమం తప్పకుండా సంపర్కంలో ఉంటాను.

    ఈ మాట నిజం.

    భవదీయుడు,
    పురాణం రామప్రసాద్
    అత్తాపూర్, హైదరాబాద్.
    హస్తభూషణం : 9505255100

  330. తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు గురించి నిష్టల సింహాచల శాస్త్రి గారి అభిప్రాయం:

    08/24/2017 1:41 am

    చెత్త, మంచి అన్నది కవి చేతుల్లో వుంది. విశ్వనాథ్ లాంటి మంచి సంస్కారం గల దర్శకులు ఆయన చేత అద్భుతమైన సాహిత్యాన్ని రాయించుకోలా? అశ్లీల గేయాలు రాసినా, సినీ గీతానికి కావ్యగౌరవం తెచ్చినా అది వేటూరికే చెల్లు.

    అలాంటి ప్రతిభాశాలిని చూస్తుంటే ఏ ఆదికవి నన్నయో, అల్లసాని పెద్దనో తిరిగి జన్మించారేమో అని అన్పిస్తుంది. ఏదైనా ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన లాంటి వ్యక్తి ఆయన సృష్టి చేసిన కవిత్వం “న భూతో న భవిష్యతి”.

  331. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి VSTSayee గారి అభిప్రాయం:

    08/12/2017 1:45 pm

    “తః తః”

    కవిత కేవలం గుర్తు మీద రాశాను . ఆ సంచికను పారేసుకుని దశాబ్దాలు గడిచి పోయాయి.

    అంతర జాతీయం

    క్యూబెక్‌లో పడుకున్నా
    చెవుల్లో బంగాళాఖాతం రొద
    మాంట్రియల్‌లో జెట్‌ దిగి
    కాబ్‌ కోసం నడుస్తున్నా
    ఎల్లమ్మ తోటలో మొదటిసారి బస్‌ దిగి
    చిత్రాలయ వైపు టికెట్‌కోసం నడుస్తున్నట్టే
    గతాగతాల మధ్య
    గ్రంథులు విప్పలేనివాణ్ణి
    నీవీ మోక్షణ వేళలో
    వస్త్ర మూల్య పరీక్షణం నేర్పిన
    పాఠశాల విద్యార్థిని
    ఎన్ని సమ్మర్లపాటు
    ఏడ్మాంటన్‌ చిన్నది ఎండలో తడిసినా
    తెలుపు తెలుపేకాని నలుపుకానట్టు
    ‘బాన్‌ జోర్‌’ ‘బాన్‌ సాయిర్‌’ కరచాలనాల మధ్య
    పరిచయానుద్రిక్త పరిరంభ సమయాలు
    స్మరించి
    చెమరించేవాణ్ణి
    ఎంత చెడ్డా
    తంతే
    గారెల బుట్టలో పడేవాణ్ణి
    —తః తః
    (2-10-87 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, పుట 71.)


    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  332. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి ‘తః తః గారి అభిప్రాయం:

    08/12/2017 5:54 am

    1987 జున్ జులై రొజుల్లో ఎడ్మంటన్‌లో ఒక సమావేశానికి వెళ్లి, వెనువెంటనే (ఫ్రెంచ్ కెనడా) లవాల్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ శాఖలో అతిథిగా గడిపాను. ఎండాకాలంలో అక్కడి పగళ్ళకు రాత్రంటూ ఉండేది కాదు. నిద్ర వచ్చేది కాదు. పైగా అటూ ఇటూ పరుగులు తీస్తున్న కార్ల చక్రాల చప్పుడు విశాఖ పట్నపు సముద్రపు రొదలాగా చెవులకు చుట్టుకొనేది. ఎడ్మంటన్, కుబెక్, మాంత్రేల్ అన్న మాటల్ని ఇంగ్లిష్ లిపి లోనే ఉంచుతూ “కుబెక్‌లో పడుకున్నా చెవుల్లో బంగాళా ఖాతం రొద, మాంత్రేల్‌లో జెట్ దిగి కాబ్ కోసం పరుగెడుతున్నా ఎల్లమ్మ తోటలో బస్సు దిగి చిత్రాలయకు పరుగెడు తున్నట్టే, ఎడ్మంటన్ చిన్నది ఎన్ని సమ్మర్ల పాటు ఎండలో తదిసినా తెలుపు తెలుపేగాని నలుపు కానట్టు గతాగతాల మధ్య గ్రంథులు విప్పలేనివాణ్ణి, నీవీ మోక్షణ వేళ వస్త్ర మూల్య పరీక్షణం నేర్పిన పాఠశాల విద్యార్థిని… అంతరిక్ష నౌక లోంచి అమాతం తన్నినా సూటిగా వచ్చి బూరెల బుట్టలో పడేవాణ్ణి” అంటూ ‘అంతర జాతీయం’ అని ఒక కవితతో – శ్రీ ఫురాణం సుబ్రహ్మణ్య శర్మ, సంపాదకులు, ఆంధ్ర జ్యోతి వార పత్రిక,విజయవాడ, ఏ.ఫ్. ఇండీయా. అన్న చిరునామాకు – తః తః గా ఒక ఎన్వలప్ పొస్ట్ చేశాను. ఈ విషయం మరిచే పోయాను. ఆగస్టు నెలలో అంధ్ర విశ్వకళా పరిషత్ టీచర్స్ క్వార్టర్స్ లో ఇంటికి వచ్చేశాను. ఆంధ్రజ్యోతి 1987 అక్టోబర్ 2 సంచిక పోస్ట్‌లో ఇటికి వచ్చింది అందులో -ఇంగ్లిష్ లిపి లోవన్నీ తెలుగు లిపిలోకి మార్చబడి- ‘అంతర జాతీయం’ తః తః*.

    శ్రీరమణ గారికి నమస్కారాలతో
    తః తః

    * కవిత కేవలం గుర్తు మీద రాశాను . ఆ సంచికను పారేసుకుని దశాబ్దాలు గడిచి పోయాయి. తః తః గా రాస్తున్న నేను అక్టొబర్ 2-3ల మధ్య పుట్టాను. ఆశ్చర్యం! తః తః పుట్టుక కూడా అక్టొబర్ 2)

  333. పాట ఒకటి… గురించి chandra naga srinivasa rao desu గారి అభిప్రాయం:

    08/11/2017 6:14 am

    కవిత చాలా బాగుంది. అభినందనలు.

  334. గాయం గురించి స్వాతి యాకసిరి గారి అభిప్రాయం:

    08/09/2017 12:28 pm

    చాలా బావుందండి ఓ కవితలా అనిపించింది.

  335. పాట ఒకటి… గురించి స్వాతి యాకసిరి గారి అభిప్రాయం:

    08/09/2017 11:16 am

    చాలా రోజుల తరువాత మీ నుండి ఓ కవిత చదివాను. ఎప్పటిలానే ఎంత బావుందో. మీ అక్షరాలు తీసుకెళ్ళే మరో లోకం నాకు భలే నచ్చుతుంది.

  336. గోళం గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    08/01/2017 12:50 am

    నిద్రలోనె
    మేలూకున్నా
    చదువుకున్నా
    నవ్వుకున్నా
    అందుకే
    అభినందించకుండా
    ఉండలేకున్నా.
    ముచ్చటైన కవిత చాలా బాగుంది.

    ఎస్.ఎ.రహమాన్.

  337. మాటలు గురించి తః తః గారి అభిప్రాయం:

    07/12/2017 10:45 am

    కవిత అంటే మాటలే అని ఆహ్లాదంగా చూపించారు రాజిరెడ్డిగారూ, అభినందనలు.

    నమస్కారాలతో
    తః తః

  338. రంగులూ మాటాడతాయి! గురించి విజయ్ కోగంటి గారి అభిప్రాయం:

    06/16/2017 5:38 am

    ధింసా గారు, ప్రతిస్పందనకు ధన్యవాదాలు.

    ఏ కవీ తన చదువరులను ఇబ్బంది/తికమక పెట్టాలని అనుకోరని నా భావన. ఒక్కోసారి కవికి ఉన్న దృక్కోణం రీడర్ కి దొరక్కపోవచ్చు. అలాగని కవిత, దాని లోని భావన ఇలాగే ఉండాలని చెప్పలేము. వీలున్నంతవరకు కవితను తన చదువరీ ఆస్వాదించాలనే కవి భావన కదా.

    వైరి సమాసమో, దుష్ట సంధో, ముద్రా రాక్షసమో ఐతే మీరన్నట్లు పంటి కింద రాయే. కానీ ఈ నా భావన అంత సంక్లిష్టమో జుగుప్సాకరమో కాదు గదా.

    మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  339. రంగులూ మాటాడతాయి! గురించి థింసా గారి అభిప్రాయం:

    06/15/2017 4:26 pm

    ప్రియమైన డా. విజయ్ గారూ, మీ వివరణ అర్థమయింది. నా రాతతో మీ సున్నిత మనస్సుని మీ మృదు హృదయాన్ని గాయపరచడం నా ఉద్దేశ్యం కానేకాదని గమనించ మనవి. పరస్పర అభిప్రాయ కలబోత హలదాయకం కాగలదని నా నమ్మకం. అంతే.

    1. మీరు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చిన “తెల్ల నవ్వులు” నిజానికి నాకెక్కడా ఎదురు కాలేదు. ఇది నా పరిమిత జ్ణానమే కావచ్చును. “జీవం లేని (నిర్జీవపు) “, “పేలవపు”, “వెలతెల బోయిన” “నిర్వేదపు” “కిలకిల గలగల” “ముత్యాలు జాలువరే” ఎట్సెట్రా నవ్వుల వరకే నా తెలివిడి. నిజానికి సాదారణ వాడుకలో “తెలుపు” స్వచ్చతకి ప్రతిబింబం. కానీ అది సందర్భ ఔచితిని బట్టి ముఖ్యంగా సంఘర్షణలో “తెలుపు” ఓటమిని తెలిపే సంకేతం. “ప్రతి రంగుకూ ఒక భాష ఉంటుంది” అన్న మీకు రంగు ప్రాధమ్యత అబోధకమని నేను పొరబడను గాక పొరబడను.
    2. నిజమే.. ఏ వస్తువుకు ఆ రూపాన్నీ ఏ భావానికి ఆ రంగునూ అద్దడం వాస్తవిక కవి సమయం. మీరు కోపానికి ఎరుపు రంగును సరిగ్గా ప్రయోగించి, ఆకసం, గడ్డిపరకల్ని విరుద్ధ రంగుల బారిన పడెయోద్దనడం చమత్కారమనుకోమనడం భావ్యమేనంటారా?
    3. డా. విజయ్ గారూ నిజమే అన్ని రంగుల కలయికే జీవితం..కానీ జీవితమ్లో కొన్నింటికే ఎక్కువ ప్రాధాన్యమియ్యడం అందరి అనుభవంలో ఉన్నదే గదా! అందుకే రంగులకు భాష మాత్రమే కాదు భావజాలం కూడా ఉంటుందన్నాను. మీరు నొచ్చుకుంటే మన్నించండి. రంగు కున్న ప్రాధాన్యమది.
    4. మాటడుతాయి, మాట్లాడుతాయి మాండలిక భేదాలను, యాసల పార్శ్వాలని తెలిపేటివని మీకు తెలియనిది కాదనుకుంటాను. అందుకే సర్దుకుని అర్థం చేసుకోవచ్చులేనని భావించాను తప్ప అన్యం కాదు.
    5. “గుండె అంగీ” ప్రయోగం మీకు అత్యంత ఇష్టమైన మీ మమకారాన్ని దాయలేనంత ప్రీతిపాత్రమైన పద ప్రయోగమే కావచ్చును. కాదనడం లేదు. కానీ ఏ ప్రయొగమైనా పాఠకుడికి పంతికింది రాయిలా ఉండకూడదన్నదే నా భావన.
    6. రంగులు మానసిక భావవేశాలను వ్యక్తం చేయడమే కాదు కావలసింది ఆ వ్యక్తీకరణకి ఒక క్రమగతి, క్రమోన్మీలన కూడా ఆవశ్యకమని మీరూ గుర్తిస్తారు కాదా డా. విజయ్ గారూ.
    7. “ఏదైనా చదివినప్పుడు ఏమైనా మాట్లాడె హక్కు అందరికీ ఉంది” అని మీరంటారు గానీ అట్లా “ఏమైనా మాట్లాడడం” బాధ్యతా రాహిత్యమని నేను గాఢంగా భావిస్తాను. కవి మాత్రమే కాదు చదువరులు కూడా ఔచిత్యాన్ని పాఠించాలని నా ప్రగాఢ ఆకాంక్ష. అవసరమైనప్పుడు పెదవి విప్పకపోతే అనవసర అపార్థాలనధిగమించడం దుస్సాధ్యమౌతుంది కదా. అవసరాన్ని గుర్తించిన పరస్పరుల కవితాస్వాదనా సంలబ్ది కోసమే గదా మన భావాభిప్రాయాల కలబోత.
    8. మీకు తెలియని విషయమేమీ కాదు గానీ – కవి కవిత రాసి ప్రకటించాక ఇక ఆ కవిత కవిది కాదు పాఠకులదౌతుంది. అనుకుంటాం గానీ ఏ కవీ తన కోసం మాత్రమే కవిత్వం రాసుకోడన్నది జగమెరిగినదే. పాఠకులు లేదా చదువరుల ఆస్వాదనిరాస్వాదన వల్లనే ఆ కవితకొక ఉనికి ఏర్పడుతుందని చెప్పడం అవాస్తవమో అతిశయోక్తో కాబోదు.

    కొంచెం ఎక్కువగానే స్పందించాననుకుంటాను.
    నా అభిప్రాయ నివేదనని అన్యధా భావించరని కవికీ సంపాదకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ….
    –థింసా

  340. రంగులూ మాటాడతాయి! గురించి విజయ్ కోగంటి గారి అభిప్రాయం:

    06/15/2017 12:16 am

    ‘అపారా’నుభవంతో ‘సునిశిత’ విమర్శ చేసిన ధింసా గారికి నమస్సులు.

    చాలా సమయం వెచ్చించి వ్యాఖ్య(లు) చేసినందుకు ధన్యవాదాలు.

    అనేక భావావేశాలనే రంగులని గ్రహించి జీవితాన్ని అందమైన చిత్రాన్నెలా చేసుకోవాలో చెప్పడమే నా ఆలోచన.

    1. ‘తెల్ల నవ్వులు’ అనే ప్రయోగం సర్వ సాధారణమే. మీరు వినలేదంటే ఆశ్చర్యమే వేసింది. తెల్ల నవ్వు వెలిసిపోయిన తనాన్ని, జీవం లేని తనాన్ని సూచిస్తుందనేది అందరకు తెలిసిన విషయమే. అందుకే నవ్వుల్లో తెల్లదనం ఎక్కువ కాకూడదనేది కవి హృదయం.
    2. ఇక ఇంగిత జ్ఞానం గురించి మీరు చేసిన వ్యాఖ్య: కవితలోని చమత్కారాన్ని గ్రహిస్తే ఇంగిత జ్ఞానం త్వరగా బోధపడుతుంది.ఏ భావానికి ఆ రంగును అద్దమని కవి ఆకాశం , గడ్డి పరకల రంగుల గురించి ప్ర స్తావించాడు. లేకుంటే ఇదిగో ఇలాగే ఒక దానికి మరొకటి అర్ధమౌతాయి.
    3. ఏ ఒక్క రంగునీ కవి ద్వేషించ లేదు – లేడు. ఎందుకంటే ఒక మంచి చిత్రానికి అన్ని రంగులూ అవసరమే – అందులోనూ జీవిత చిత్రం కదా. చాలా తేలికైన పదాలతోనే జీవితాన్ని గూర్చి చెప్పాలని ప్రయత్నించిన కవిత ఇది – అంత దాగని సత్యాలేముంటాయి చెప్పండి ? 
    4. ఇక శీర్షిక విషయంలో మీరు చేసిన వ్యాఖ్య : మాటాడు – మాట్లాడు ; పోటాడు – పోట్లాడు – వాడుకలో ఉన్నవే . అంత ‘సర్డుకు’ పోవాల్సిన అగత్యం లేదేమో.
    5. ‘గుండె అంగీ’ లా చుట్టుకోడమంటే మనసుకు చాలా ఇష్టమైన దానిలా చుట్టేసుకొమ్మని. మీకు నచ్చకపోతే నేనేమీ చేయలేను. నాకు నచ్చి చేసిన ప్రయోగమది. అంతే కానీ ఫేసు బుక్ లో బోలెడన్ని లైకుల కోసమో చప్పట్ల కోసమో కాదు. అసలు నేను వ్రాసుకునేదే నాకోసం. నాకిష్టమై వ్రాసాను. సంపాదకులకి నచ్చి ప్రచురించారు. నచ్చిన వారు చదువుతారు. ఇష్టపడతారు. బలవంత మేమీ లేదు.
    6. రంగులు మానసిక భావావేశాలను వ్యక్తంచేసినపుడే మాటాడి నట్టు – అదే – మాట్లాడినట్లు. నేను చెప్పిందీ అదే.
    7. ఏదైనా చదివినపుడు ఏమైనా మాట్లాడే హక్కు అందరికీ వుంది. అవసరమైనపుడే మాట్లాడాలి – కానీ నా మటుకు నాకు అవసరాన్ని గుర్తించ గలిగినపుడే మాట్లాడాలన్నది నా ఉద్దేశ్యం.

    ఇలా మీ పరిచయం కలగడం మహద్భాగ్యం. నమస్తే.

  341. ఇంటికి మళ్ళు గురించి indrani palaparthy గారి అభిప్రాయం:

    06/10/2017 5:48 pm

    థింసా గారు,

    1. అత్తింటి పోరు, నస, చాకిరీ భరించలేక ఆత్మహత్య చేసుకుందామని వస్తుంది తల్లి.

    2. ఇంతలో పాప మరణించిన శీతాకోక చిలుక తెచ్చి అది ఎగరడం లేదని ఏడుస్తుంది.

    3. తల్లికి తాను చనిపోతే పాప పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకి వస్తుంది. పాపని తీసుకుని ఇంటి వైపుకు ఆడుగు వేస్తుంది.

    ఇదీ నేను చెప్పదల్చుకున్నది. బహుశా నేను అనుకున్న విధంగా చెప్పలేకపోయి ఉండవచ్చు.

    నా కవిత మాట ఎలా ఉన్నా మీ మారుపేరు భలే ఉన్నాదండీ. ధింసా అంటే- తుం సా నహి దేఖా! అన్న పాట గుర్తొస్తోంది. 🙂

    ధన్యవాదాలు.
    ఇంద్రాణి.

  342. రంగులూ మాటాడతాయి! గురించి థింసా గారి అభిప్రాయం:

    06/10/2017 1:36 pm

    నాకు తెలిసినంతవరకు తెలుపు లొంగుబాటుకు ప్రతీక. తెలుగు కవిత్వంలో కూడా ఈ అర్థంలోనే ప్రయోగించారు. కానీ నవ్వులకు కాదు. నవ్వు తెల్లగా ఉండదు పచ్చగా ఉంటుందనుకుంటాను.

    ఆకాశానికి పచ్చదనాన్నీ గరికకు నీలిమనీ ఇంగిత జ్ఞానమున్న కవి ఎవరూ ప్రయోగించరు గాక ప్రయోగించరు. ఇక్కడ విజయ్ గారు ఎందుకు అట్లా వ్యక్తీకరించారో సులభంగానే గ్రహించవచ్చు. ఏమంటె ఎరుపుని కోపానికి ప్రతీకగా తీసుకున్న కవికి రంగు(ల) రుచి వాసన స్వరూప స్వభావాల గురించి తెలియక కాదని చెప్పకనే తెలుస్తోంది. ఎరుపు మీద వ్యతిరేకతతో ఈ పొయెం రాసారని దాచేస్తే దాగని సత్యం.

    వీరి పొయెం శీర్షిక “రంగులు మాటాడుతాయి” అన్నారు గానీ నిజానికి “రంగులు మాట్లాడుతాయి” అనాలె. వ్యావహారికమని ఏదో సర్దుకుపోవచ్చును లెండి.

    కానీ చివరి మూడు పాదాలు పొయెంకి అతికినట్లనిపించట్లేదు. “గుండె అంగీ” ఏమిటొ మరి. కొత్త ప్రయోగమని బోలెడన్ని లైకులు కొట్టి మరీ చప్పట్లు చరుద్దామా!? పేరుబడ్డ కవి తప్పు ఎన్నటికీ చేయడని, మనదే పొరపాటని ముడుచుకుందామా!?

    ఈ కవి చెప్పదలచుకున్న విషయం బోధపడక కాదు గానీ రంగులు మాట్లాడ్డమె కాదు మానసిక స్థాయినీ ప్రస్పుటిస్తాయనుకుంటాను. అట్లాగే భావజాల దిశ దశనీ చెప్పకుండానే చెబుతాయిగదా. ఈ పొయెం మీద కొంచెం ఎక్కువే మాట్లాడాననిపిస్తోంది. తప్పదుకదా అవసరమైనప్పుడు. తక్కువేననుకుంటే చర్చకు సిద్ధమవక తప్పుతుందా?!

    –థింసా

  343. ఇంటికి మళ్ళు గురించి థింసా గారి అభిప్రాయం:

    06/09/2017 1:30 pm

    కొన్ని హైకూల్లాంటివి కలిపి కుట్టినట్లుందీ కవిత. వీటితో వచ్చిన సమస్యల్లా కవితని పూర్తిగా ఆస్వాదించనీవు ముక్కలు ముక్కలుగా తప్ప. పాలపర్తి ఇంద్రాణి మంచి poet అని విన్నాను. వారి కవిత్వ తాత్వికతని నేనే అందుకోలెకపోతున్నానేనేమో.
    మన్నించగలరు.

  344. కిటికీ పక్క ఆకాశం గురించి థింసా గారి అభిప్రాయం:

    06/09/2017 1:15 pm

    కవితకి గుండెకాయైన మాయమైన మట్టి హృదయాన్ని పట్టుకున్నారు. అభినందనలు.

  345. కడవ గురించి S A RAHMAN. గారి అభిప్రాయం:

    06/04/2017 12:18 pm

    ముచ్చటైన కవిత. చాలా బాగుంది.
    ఎస్. ఎ. రహమాన్.

  346. కిటికీ పక్క ఆకాశం గురించి S A RAHMAN. గారి అభిప్రాయం:

    06/04/2017 12:15 pm

    ఆకాశం నుండి రాలి కిటికీ ద్వారా ఇంట్లో పడ్డ మంచి కవిత. చాలా బాగుంది. మరీ మరీ చదవాలనిపిస్తోంది.

    ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు.

  347. నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం గురించి తః తః గారి అభిప్రాయం:

    06/02/2017 2:27 pm

    కామేశ్వర రావు గారూ! కవి గురిచి ఆయన పేరు తప్ప మరొక మాట చెప్ప లేదు ఏమిటి కారణం?

    హంపీ క్షేత్రం రచయితలుగా పుస్తకం మీద ఇద్దరి పేర్లు కనపడతాయి రెండవది సుబ్బారావు (కవి) మేన మామది (కామరాజుగడ్ద శివయోగానంద రావు). (ఈ కవికి) “వచ్చిన కవిత్వము పూర్వ జన్మమునుండి; వచ్చిన భాష ఏటి కెదురీది నేర్చినది” అన్నారు విశ్వనాథ. హంపీ క్షేత్రం ఇంటెర్నెట్లో దొరుకుతోంది.

    నమస్కారాలతో,
    తః తః

  348. నాతి చరామి గురించి Chandranaga srinivasa Rao Desu గారి అభిప్రాయం:

    05/23/2017 11:16 pm

    కవిత చాలా బాగుంది

  349. రామరసాయనము గురించి పరిమి శ్రీరామనాథ్ గారి అభిప్రాయం:

    05/23/2017 5:47 am

    శ్రీ చంద్రనాగ శ్రీనివాసరావు గారికి,

    మీకు ఈ కవిత నచ్చినందుకు, సమయం తీసుకుని అభివ్యక్తీకరించినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    శ్రీ లక్ష్మీదేవి గారికి,

    ఇక్కడ రసాలని ఆయా పద్యాల పక్కన ఉటంకించకపోవడం చదువరులకి పరీక్ష కలిగించాలనే ఉద్దేశంతో చేసిన పని కానే కాదని, నాకు నేనే స్వయంలేఖనాసామార్ధ్యాన్ని, శుద్ధరసప్రకటనాఫణితి ని, రసోచితస్థితిపోషణాపటిమ ని బేరీజు వేసుకునే క్రమంలో పాఠకుల ఆమోదముద్ర పొండటం ద్వారా పెట్టుకున్న పరీక్ష అని తెలియజేసుకుంటున్నాను.

    కొన్ని పద్యాలలో సందర్భం ద్వారా, కొన్నింటిలో రసాన్ని ఉటంకించడం ద్వారా వాటికి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశాను.

    రసాల క్రమం ఇది – శృంగార(శివధనుర్భంగం ముందు సీతాలోకన ఘట్టం) , శాంత(వనవాసోద్యుక్త ఘట్టం) , అద్భుత(అహల్యాశాప విమోచన ఘట్టం) , కరుణ (విభీషణ లంకాధిప వరణ ఘట్టం), భీభత్స(సర్వ రాక్షస సంహార సంబంధము) , రౌద్ర (రావణ శిరచ్ఛేదన ఘట్టం), హాస్య(సీతా హాస్యాలాప ఘట్టం) , భయానక(మాయామృగ మారీచ సంహార ఘట్టం), వీర(సాధారణ వీరత్వ స్తుతి) రసముల వరుస.

    కవిత చదివినందుకు, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించినందుకు, మీ సహాయానికి నా నుండి శతాధిక ధన్యవాదాలు.

    శ్రీ కె.వి.ఎస్. రామారావు గారికి,

    మీ స్పందన నాకు విశేషతోషాన్నిచ్చింది. కవిత మీకు నచ్చినందుకు, స్పందించినందుకు శతధా ధన్యవాదాలు.

    పదబంధాల విషయమై రసోచితంగా వాడటానికే చాలా ప్రయత్నించాను. వీర రౌద్ర భీభత్స రసవర్ణనాసమయాల్లో ఔచిత్యాన్ని అనుసరించి పదబంధాలు, సున్నితరసాలైన కరుణ, హాస్య, శాంతాది రసాలలో సులభమైన పదోపయోగానికే చూశాను.

    మీ సూచనని మున్ముందు మనస్సులో ఉంచుకుని, మరింత పరిపక్వతకి ప్రయత్నిస్తాను.

    ఇతి శివమ్
    పరిమి శ్రీరామనాథ్.

  350. సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    05/12/2017 11:27 pm

    పూజ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి నమస్కారములు. వ్యాసాన్ని ఆసాంతం చదివి, ఎంతో ఔదార్యంతో వ్రాసిన మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    ఒక్క చిన్నమాట: మహాకవులు తమ రచనలలో పూర్వులను అనుకరించిన సన్నివేశాలు విశ్వసాహిత్యమంతటా గోచరీభవించేవే. అది వారి కృతజ్ఞతకు, గౌరవభావానికి, వ్యుత్పన్నతకు, శీలితబహుకావ్యత్వానికి నిదర్శకమే గాని శక్తిలోపానికి ప్రదర్శకం కాదు. సభలలో విద్వత్సన్నిధిలో కావ్యపఠనవేళ “ఇది ఫలానా కవి శ్లోకానికి అనుసరణం” అనికూడా తప్పక పేర్కొనేవారనుకొంటాను. అందువల్లనే, అవతారికలోని పూర్వకవిప్రశంసలో తమకై వెలుగుబాటలను పరిచిన మహాత్ములను స్మరించటం జరిగేది. ఎవరి నుంచి మన మనోగతాన్ని మాటలుగా మార్చుకొనటం నేర్చుకొన్నామో, ఆ మహనీయుల ప్రభావం మనపై తప్పనిసరిగా ఉండితీరుతుంది కదా. పూర్వకవుల కవిత్వపు నీడల జాడలు తమ రచనలలో ఏ మాత్రం ప్రతిఫలింపకూడదని ప్రయత్నపూర్వకంగా అభ్యసించిన శ్రీ విశ్వనాథ వంటి మహాకవులే ఆ ప్రభావం నుంచి తప్పించుకొనలేకపోయారు.

    సుబంధుడొక విశాలవటవృక్షం. ఆ నీడను ఆశ్రయింపని తెలుగు కవులు లేరు. ఆయన ఒక చల్లని ఊరబావి. అక్కడ ఊహాదాహార్తిని తీర్చుకొననివారు లేరు.

    యుష్మన్నిరంతరాశీర్వచనకృతాభ్యుదయాభిలాషి,
    ఏల్చూరి మురళీధరరావు

  351. సరస్సు నవ్వు గురించి విజయ్ కోగంటి గారి అభిప్రాయం:

    05/05/2017 8:55 pm

    మీ ప్రతి కవిత లోనూ ఒక ప్రత్యేకత వుంటుంది. మనిషి-మనస్సు- సరస్సు- చిత్రమైన అంతర్వలయాలు. బాగుంది. అభినందనలు.

  352. రామరసాయనము గురించి Desu Chandranaga Srinivasa Rao గారి అభిప్రాయం:

    05/04/2017 7:07 am

    పరిమి శ్రీరామనాథ్ గారి ఈ కవిత నచ్చింది.

  353. సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు గురించి గన్నవరపు నరసింహమూర్తి గారి అభిప్రాయం:

    05/03/2017 11:09 pm

    వాసవదత్త కధను సూక్ష్మముగా చిన్నతనములో చదివినా అది సుబంధ ప్రణీతమని నాకు తెలియదు. ఆధునిక విద్యాభ్యాసము వలన నా సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయము లోపభూయిష్ఠమే ! నేడు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వ్యాస పఠనము వలన సుబంధుని వివరాలు, వాసవదత్తాఖ్యాయిక పరిమళ విశేషాలు, నన్నయ శ్రీనాథ ప్రభృతుల సుబంధ కవితానుకరుణలు , వారి కవితా మాధుర్యములు తెలిసాయి. శ్రీ ఏల్చూరి వారి వ్యాసము చదివిన వెంటనే , పాండిత్యానికి అవధులు లేవని తెలియడమే కాక సాహిత్య మింత లోతయినదా, భావాంబర వీధి యింత విశాల మైనదా అని సంభ్రమము కలిగింది. శ్రీ మురళీధరరావు గారి పరిశోధన చాలా విస్తృతమైనది. వాసవదత్త ఆఖ్యాయికమా , కధా, కాక చంపూకావ్యమా అనే అంశము పై వివిధ కవివర్యులను, పరిశీలకులను, వ్యాఖ్యాతలను వారు విశేషముగా పేర్కొన్నారు. సుబంధుడి చారిత్రక వివరణ లుత్సాహముగా నున్నాయి.

    వాసవదత్తను చదివి, నన్నయ శ్రీనాథుల భావానుసరణలు చూసి శ్రీ మురళీధరరావు గారు మందహాసమే , చేసారో, కొద్ది పర్యాయములు బిగ్గఱగానే నవ్వుకున్నారో వారికే తెలియాలి. చెప్పే విధానములో నూతనత్వము శోభిల్లు నపుడు , మధుర భావాల ననుకరించడములో తప్పు లేదనే తలుస్తాను. స్వచ్ఛానువాదములైనా, స్వేచ్ఛాను వాదాలైన శ్రీనాథుని అనుసరణలు, నన్నయ, తెనాలి రామకృష్ణుల ఆంధ్రీకరణలు విలక్షణతను పరిపోషించాయి. ప్రత్యక్షముగా సుబంధుని వాసవదత్తను కాని, విస్తృతముగా ఆంధ్రసాహిత్య పఠనమును చెయ్యలేని నావంటి వారికి శ్రీ మురళీధరరావుగారు ఆ కవితా మాధురిమలకు స్వీయ వాక్పటిమ, రచనా చాతుర్యములను చేర్చి చక్కని విందు సమగూర్చారు. వారి రచనలు, వ్యాసావళులు చదివే టప్పుడు చాలా క్రొత్త పదజాలము, విషయపరిజ్ఞానము కలుగుటచే నాలో విద్యార్థి భావన పెల్లుబుకుతుంది. వారికి నమోవాకములు!

  354. సగమే పూర్తయిన ఓ కవిత గురించి VVLNSPRASAD గారి అభిప్రాయం:

    05/03/2017 6:33 am

    hello విజయ్, బుంగ మూతి బుజ్జి తల్లి, గుచ్చు కొని గుచ్చు కో కుండా ఉండే నీవు కురిపించినమౌనమొ, మాటలో కన్నీరో నవ్వులో అలికిడి చేస్తున్న “సగమే పూర్తయిన ఓ కవిత” ADBHUTHAHA——PRASAD

  355. సరస్సు నవ్వు గురించి అశితకేశ్‍ గారి అభిప్రాయం:

    05/02/2017 4:12 pm

    పద్యం బాగుంది. అంతరంగంలోని మాట ఎప్పటికీ చెప్పలేం.చెప్పలేక నవ్వుకోడమో ఏడ్చుకోడమో చేస్తాం. కవులు కూడా అదే చేస్తారేమో. ఈ వ్యాఖ్య రాసేప్పుడు పైన‍ శర్మ గారి కామెంటు చదివాను. కవితలో లేని సముద్రాలెందుకు ఇక్కడ? రచనలో వున్నవి వదిలేసి, లేనివి తెచ్చిపెట్టడం మంచి విమర్శ కాదేమో.

  356. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Lokesh గారి అభిప్రాయం:

    05/02/2017 8:54 am

    అద్భుతమైన కవిత్వం. ధన్యవాదాలు.

  357. సరస్సు నవ్వు గురించి T V Sharma గారి అభిప్రాయం:

    05/02/2017 4:27 am

    సరస్సు నవ్వు ఒకానొక నిచ్చల నిచ్చింత స్వప్న కిలికించితాలకి తార్కాణం.
    సరస్సు నిలవనీటికీ ప్రవాహరాహిత్యానికీ నిదర్శనం. నిచ్చలత్వాన్ని నిద్రతో పోల్చడం కవితాత్మకమైనా ఈ కవిత అందించే శూన్య తాదామ్యత ఎవరికీ సుబోధకం కాదు సుమా!

    సరస్సు ప్రవహించదు, సముద్రమూ ప్రవహించదు.. కానీ సముద్రానికీ సరస్సుకీ అసలు పోలికెక్కడుందీ? సరస్సులోనే గిలకొట్టేవాళ్ళు సముద్రాన్ని తలచడం సాధ్యం కాదు గాక కాదు. అందుకే మీ మీ మనఃసరస్సులలోనే మనోవాంచితాలను సాధించుకోండి సలక్షణంగా!

  358. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి సుందరం గారి అభిప్రాయం:

    05/02/2017 1:29 am

    “ఒక నిర్ధూమ సజీవాగ్ని శైలహస్తాల్లో
    నా కవిత్వాన్నుంచి బెరుగ్గా ఎదుట నిల్చున్నాను
    చిన్ని గడ్డిపోచ
    వసంత స్పర్శ తననెట్లా తలమున్కలు చేసిందీ
    వచ్చీరాని భాషలో చెప్తే ఎవరికర్థమవుతుంది
    ఒక్క దండకారణ్య సాలవృక్ష సమూహాలకు తప్ప”
    ఎంత ‘ఎదిగినా’ ఇంతకంటే “ఒదిగి” వుండటం మరొకరికి సాధ్యమా!
    ఒక్క భద్రుడి గారికి తప్ప

    “మహానగరాల్లో తను ఏకాకేమో గానీ ఆ శరభవరం పక్కనున్న అడవిలో ఆ జాతర్ల గుంపులో భద్రుడు ఎప్పుడూ ఏకాకి కాడు. అక్కడెక్కడ తనని మనం వదలిపెట్టినా చక్కగా గోధూళివేళకి ఇల్లు చేరుకోగలడు.”
    మీ ఇద్దరి సాహితీ సాన్నిహిత్యానికి ఇంక వేరే ఋజువులెందుకు?

  359. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి renuka ayola గారి అభిప్రాయం:

    05/02/2017 12:26 am

    ఆద్భుతమైన సమీక్ష వీరభద్రుడి గారి కవిత్వంలా ….

  360. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Swathi Yakasiri గారి అభిప్రాయం:

    05/01/2017 11:27 pm

    వారి కవిత్వానికి తగిన అద్భుతమైన సమీక్ష!

  361. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Vijay Koganti గారి అభిప్రాయం:

    05/01/2017 9:40 pm

    భద్రుడుగారి అద్భుత కవిత్వానికో విరిదండ యీ సమీక్ష.

  362. సగమే పూర్తయిన ఓ కవిత గురించి Vadrevu Chinaveerabhadrudu గారి అభిప్రాయం:

    05/01/2017 9:19 pm

    చక్కని కవిత.

  363. ఐదు కవితలు: అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర గురించి తమ్మినేని యడుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    04/28/2017 9:11 pm

    మానస సమీక్ష సర్వ సమగ్రంగా ఉంది. కవిత్వాన్ని అనుభవించి పలవరిస్తే తప్ప ఇటువంటి సమీక్ష రాదు. లోతైన పరిశీలన అందరికీ సాధ్యం కాదు. “‘ఏదో ఒక’ అనడం లేదిక్కడ కవి, ‘ఒకేఒక’ అంటున్నాడు” అన్న వాక్యం మానస సూక్ష్మబుద్దిని పరిచయం చేస్తుంది. ఇప్పటి కవులు ఆత్మ వ్యామోహ పీడితులు కాకుండా కనీసం అప్పుడప్పుడు ఇతరుల కవిత్వాన్ని చదివి తమకు తోచిన నాలుగు వాక్యాలు నిర్భయంగా రాస్తే అందరికీ మంచిది.

    సమీక్షల విలువ తెలియని జాతికి విముక్తి లేదు. సంపాదకులు కూడా శ్రద్ధ వహించి చక్కని పుస్తకాలపై నలుగురితో సమీక్షలు చేయించాలి. సమీక్ష ఉమ్మడి బాధ్యత-అందరూ తమ తమ బాధ్యతలను తలకెత్తుకోవాలి, అప్పడు మంచి సమీక్షలు చదివే వారు, వాటి స్వారస్యాన్ని గ్రహించేవారు క్రమేణా పెరుగుతారు. కవులు, రచయితలూ, విమర్శకులు తాము రాసిందే గొప్ప అనుకునే భ్రమలనుండి బయటపడగల ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సాహిత్యకాననంలో విమర్శకుడు పులిలాంటి వాడు. భారతం చెప్పినట్లు పులి అడవికి రక్ష. అడవికి పులి రక్ష. అదీ సంగతి.

  364. ఐదు కవితలు: అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:

    04/26/2017 8:58 pm

    మానస చామర్తి తాను రాసిన సమీక్షపై చాలా రోజుల క్రితం నా అభిప్రాయం వినాలని అడిగారు. ‘ఏవైనా కామెంట్లు వచ్చిన తరువా తప్పకుండా రాస్తాను,’ అని అన్నాను.

    ఆశ్చర్యం!

    మానస, అవ్యయ కవితా సంకలనం పూర్తిగా చదివి, వీలయినంతవరకూ మూలంతో పోల్చిచూసి, విపులంగారాసిన సమీక్షపై ఒక్క కామెంట్‌ రాకపోవడం విచిత్రంగా కనిపించింది. కవిగా, విమర్శకురాలిగా మానస ప్రతిభ ఎన్నదగినది. ఒక్క కామెంటు రాకపోవడానికి కారణం, బహుశా అనువాదకుడిగా నాపేరు ఉండటం కావచ్చు. అంతకన్నా వేరే కారణం నాకు దొరకటల్లేదు.

    సౌభాగ్య వాడిన ప్రతీకల గురించి మీరు చెప్పిన ప్రతి వాక్యమూ నిజమే!

    మీరు పద్యం చదివే పద్ధతి వేరు. పద్యాన్నివ్యాఖ్యానించే పద్ధతి మీ ఆరోచకత్వానికి నిదర్శన.

    కవితల ఎంపికలో అనువాదకుల అభిరుచి సుస్పష్టంగా కనపడింది. అపురూపమైన ప్రతీకలకు అంతే అందమైన తెలుగు పదాలను వాడడం ద్వారా మూలంలోని సౌందర్యాన్ని వీలైనంతగా తెలుగులోనూ ప్రతిఫలింపజేశారు,’ అని మీరు అంటే కాదని ఎట్లా అనగలను?

    మీరు చూపిన కొన్ని వాక్యాల్లో అస్పష్టతకి చాలా కారణాలున్నాయి. వాటినన్నింటినీ ఏకరువు పెట్టటం అనవసరం. ‘ఇవాళ గనుక నగరంలో టెలిగ్రాఫ్ తీగలన్నీ తెగిపోతే,/ ప్రియురాలి ముఖం నీరసంగా కనపడుతుంది, మాటలు అన్నీ/ గాలిలో ఎగిరిపోవు.’ ఇక్కడ ఎగిరిపోవు అన్నది, పోవును అన్న అర్థంలోనే వాడాను. కానీ మీరన్నట్టు పోతాయి అంటే బాగుండేది.

    ‘ అనుసృజన లోని వాక్యం తెలుగు నుడికారానికి మరికొంత దగ్గరగా ఉండి, భాష ఆసాంతమూ ఒకే ఒరవడిలో సాగి ఉంటే, పాఠకులకు ఆ ఇబ్బంది తెలిసేది కాదేమో,’ అని రాసారు. ఒప్పుకుంటాను.

    ‘ఈ పుస్తకంలోని కవితలన్నీ అనుభూతి ప్రధానమైనవి. సౌభాగ్య ఏ అనుభూతినీ మామూలు మాటలతో పాఠకులకు చేరవేయాలనుకోడు. ఎన్ని ప్రతీకలు వాడైనా సరే, తన అనుభూతిలోని గాఢతని పాఠకులకు చేరవేసే తీరుతాడు.

    ఈ ప్రతీకలే సౌభాగ్య కవిత్వానికి అసలైన బలం. ఒక సంఘటనో, అనుభవమో ఇలా ప్రతీకలతో వర్ణించినప్పుడు, అది పాఠకులకు అర్థం కాకపోయే అవకాశాలు తక్కువ. కాబట్టి, ఈ పుస్తకంలో ఎక్కువ భాగం ఇవే ఉన్నాయంటే, ఇది కవితల ఎంపికలో అనువాదకుల శ్రద్ధను, అనువాదంలో ఉండే పరిమితుల పట్ల వాళ్ళకున్న అవగాహననూ చూపెడుతోంది.’ మాకు మీరు మరీ ఎక్కువ గౌరవం ఇచ్చారు. Thanks.

    బ్రతికి ఉన్న కవి కవితలని అనువదించటం లో చాలా ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందులు ఏకరువు పెట్టి విగించదలచుకోలేదు.

    ఆఖరిగా ఒక్కమాట: ఈ కవితలపై, న్యాయపతి శ్రీనివాస రావు (వాసు) పుస్తకమ్.నెట్ లోను, వాడ్రేవు చిన వీరభద్రుడు ఫేస్‌బుక్‌ లోను, తమ్మినేని యదుకులభూషణ్‌, ఈమాట లోనూ సమీక్షించారు. మీరు ప్రస్తావించిన ప్రతీకలు, అనుభూతులూ, అనుసృజనలో మంచీ-చెడూ, సౌభాగ్య కవితలలో కనిపించే ప్రాంతీయత, ఆథునికత, వాళ్ళు కూడా విపులంగా చర్చించారు.

    నలుగురు లబ్ధప్రతిష్టులైన కవి-విమర్శకులు నా సంకలనాన్ని సమీక్షించి/విమర్శించడం నాకెంతో గర్వకారణం.

    అందరికీ నా అభినందనలు.

  365. వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి Vinjamuri Venkata apparao. గారి అభిప్రాయం:

    04/22/2017 9:39 am

    శివరామరావుగారు మా బాబయ్యగారు. వారు రాసిన రామయణం నేను యు ట్యూబ్ లో upload చేశాను. అది పాడింది బొడ్డుపల్లి సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి గారు మాసోదరి బాల మురళి ప్రియ శిష్యురాలు. ఆవిడ పాడిన మరి కొన్ని పాటలు కూడా నాచాన్నేల్లో చూడవచ్చు. కృష్ణశాస్త్రి గారి కవితలు కూడా అప్లోడ్ చేసాను.

  366. విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు గురించి తమ్మినేని యడుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    04/16/2017 10:47 pm

    తెలుగులో ఒక సైగల్ జన్మించనందుకు ఎప్పుడూ విచారపడుతుండే వాణ్ణి. పలువురు పెద్దలు విశ్వనాథ గళ ప్రాశస్త్యాన్ని ఉగ్గడించినా నాకు వినే భాగ్యం కలుగలేదు. కిన్నెరసాని పాటలు మహాకవి గొంతుకలో వినడం ఒక అద్భుతం .తెలుగులో సైగల్ లేని లోటుని తీర్చారు విశ్వనాథ. సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీత వైదుష్యం జగమెరిగినదే. ఆ లలితమైన స్వరం ముందు పలువురి గొంతులు రాసబ స్వరాలే. గాయకుడు అనగా భాష వెనుక లోతులను ఎరిగి, ఉద్వేగపు టెత్తులను తడిమి అవలీలగా హృదయగతం చేయగలిగిన వాడు. సంగీతంలో కేవలం తాళ లక్షణాలను, రాగ జ్ఞానాన్ని ఒదిగించడం లో లేదు గాయకుని నేర్పు -అది చాలా ప్రాథమిక స్థాయి. ఛందోబద్దంగా పద్యం రాసి అదే కవిత్వమని భ్రమసి అదే కొలమానంతో నలుగురు మహాకవుల మారు మూల పద్యాల్లో యతి లేదు అని అల్పానందంతో మిడిసిపడే స్థాయి. లైలా గారి విశ్లేషణ కొద్దో గొప్పో వంగకవి రవీంద్రుని విషయంలో నిజం.

    విశ్వనాథ రసైక జీవి, సైగల్ ని వినడం అలవడితే విశ్వనాథను అందుకోవడం కష్టం కాదు. పాశ్చాత్య సంగీతం మాటకొస్తే Haydn, Beethoven ల మధ్య భేదాలను చక్కగా గుర్తుపట్టగలిగితే నేను క్లుప్తంగా రాసిన నాలుగు మాటలు వేగంగా అర్థమవుతాయి.

  367. విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    04/16/2017 10:26 pm

    <> Rest of the insightful comment deleted for brevity.
    Lyla: I am completely with you! On a personal note, I was inspired to collect the poets’ voices in Telugu following a 78rpm disc of T.S. Elliott that I have seen during my early college days. A short time later came across a disc of Sarojini Nayudu reciting her own poetry. So, I started looking for such recordings in Telugu. The real motivation to submit them to eemaaTa came when I happened to visit British Library. Even today BL sells a CD of famous writers/poets voices :-). I am pretty sure that it was also the motivation for late Dr. Gutala Krishnamurti when he brought out SriSri’s (London) “mahaaprasthaanam” in 1980 with SS reciting his own poems.

    ఒక కవిత్వం లోని అందాన్ని చూపలేని, పైగా తగ్గించే -ఈ కవన పఠనం, ఇప్పుడు ఎందుకు వింటం? అనుకుంటాను నేను.

    Here I have come across people who believe that only the poet can bring out the beauty in his/her recitation. A cousin of mine hated the film version of “aanandam arNavamaitE” but liked SS’s version.

    Nitpicking: Are you referring to (Bedrich) Smetana’s Moldau (Vltava in Czech)?

    Thanks for a good piece of writing! — Sreenivas

  368. విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    04/15/2017 7:12 pm

    ఈలాటి శబ్ద తరంగాలు ‘సెలెబ్రిటీ’ మోజు ఉన్నవారి కోసం. అంతే కాని ఇవి కవిత్వ ప్రియులను, సంగీత ప్రియులను రంజింప చేయలేవు.

    ఉంటుంది, మనుషులకు కుతూహలం ఉంటుంది. అందమైన వర్ణ చిత్రాలను చూసినా, రచనలు చదివినా, ఆ కళాకారుడు ఎవరు, అతని ఫొటో చూడాలనో, స్వయంగా కలవాలనో ఉంటుంది. చూడొచ్చు, కలవొచ్చు. విశ్వనాథ సాహితీ ప్రియులకు కొందరికి ఆయన కంఠంలో ఆయన కవిత వినాలని ఉంటుంది. పాఠకుల విభిన్న మనస్తత్వాలను, ఇష్టాలను గ్రహించగలిగిన సంపాదకులు బహుశా ఆ కారణం చేత వీటికి ఈ పత్రికలో స్థానం ఇస్తూ ఉంటారు.

    కాని, కవితా పఠనం బాగు ఓగుల దృష్యా చూస్తే, కిన్నెరసాని లోని ఊహకు, ఇక్కడ విశ్వనాథ కంఠం నుండి వెలువడే ధ్వనికి సమగ్ర సంయోగం లేదు. కవి -ప్రియురాలా! జవరాలా! అంటూ అస్పష్టపు కూనిరాగాలు తీస్తూ, కవిత చదువుతూ, ఆపుతూ, మధ్య మధ్యలో ఆ కిన్నెరసాని వాగు కథ చెపుతున్నారు. ఆయన మెదడులో ఉన్న ఆ దృశ్యం, ఆ ధ్వని, మన కళ్లకూ, చెవులకూ చేరే దృశ్యం, ధ్వనీ -ఒకటి కావు. మనలో చాలామందిమి, పాడుకుంటున్నప్పుడు జరిగేది ఇదే.

    ఉదాహరణకు: నేను (లైలా)
    “శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ
    నీ శ్రీపాదమే శరణు ఊ…..”
    అని పాడుతుంటే, నాకు మెదడులో అప్పటికే రికార్డ్ ఐపోయి ఉన్న నా కిష్టమైన శ్రీమతి సుబ్బులక్ష్మి పాట వినిపిస్తుంటుంది, నామటుకి నేను ఒక ఆనంద ప్రపంచంలో ఉంటాను. నా పాట వింటున్న పక్క వాళ్లు, ముందు నేలమీద మొదలై, అకస్మాత్తుగా ఆకాశాన్నంటి, మళ్లీ గబుక్కున పాతాళంలోకి పోయి, స్వరానికీ స్వరానికీ పొంతన లేని అపశృతి మయమైన కఠోర శబ్దాలు వింటుంటారు. సుబ్బులక్ష్మి పాటనే కాక, నా పాట కూడా రికార్డ్ చేసుకుని నేను వింటే తప్ప, ఆవిడ అత్యంత మధురంగా పాడిన ఆ అన్నమాచార్యుని కీర్తనకు నేను ఎంతదూరంలో ఉన్నానో తెలియదు.

    అది తెలియక, ఇంకా అదే చాపల్యంతో;
    “కమలాసతీ ముఖ కమల కమల హిత, కమల ప్రియే, కమలేక్షణా
    కమలాసన హిత, గరుడగమన, శ్రీ కమల నాభ! నీ పదకమలమే శరణు ఊ….”
    అని నే పాడేస్తుంటాను.

    నా అదృష్టవశాత్తు, నే వినేది నా మెదడులో, సుబ్బులక్ష్మి పాటనే. సంగీతం లక్షణాలలో, దాని పుణ్యమా అని, అది ఒకటి.

    అదే విశ్వనాథకు కూడా జరుగుతున్నది. ఆయన తన కాలంలో చాలా మధుర గాయకులను వినే ఉంటారు. తన కిన్నెరసాని కవితను ఈ సభలో అలా పాడుతున్నాను అనుకుంటున్నారు. వాస్తవం అది కాదు. ఆ పఠనం అంత గొప్పగా లేదు.

    ఒక కవిత్వం లోని అందాన్ని చూపలేని, పైగా తగ్గించే -ఈ కవన పఠనం, ఇప్పుడు ఎందుకు వింటం? అనుకుంటాను నేను. ఎప్పుడో ఒక సభలో ఆయనకు కవిత చదివే అవకాశమిచ్చారు. అప్పటి శ్రోతలు విన్నారు. దాని ఆవశ్యకత అంతటితో తీరిపోయింది. ఫేమస్ ఐన వాళ్ల ఒకప్పటి మాటలు పాటలు ఎట్లా ఉన్నాగాని కలెక్టబుల్స్ అనుకుని, ఆ route లో, నాస్టాల్జియా కలెక్షన్గా, ఇలా ఇప్పటి పత్రికలో వచ్చి చేరతాయి, కొన్ని గరగరల, అపశబ్దాల ఆడియోలు.

    కళ మీద ఆసక్తి ఎక్కువ, వ్యక్తి మీద drooling తక్కువ ఉంటే, కిన్నెరసాని ఆకస్మిక కోపం, దు:ఖం, ఆమె నీరవటం, భర్త బండవటం, సముద్రుడు ఆమెకోసమై ఎగసిపడటం, ఆమె కళవళపడి గోదావరిలో లయించటం – ఈ గాథను ఇప్పటి గాన గంధర్వులతో పాడించి, లేదా మంచి వాయిద్యకారులతో సింఫొనీ మ్రోగింపచేయిద్దామని వారిని నియోగించి, ఆ కొత్త రికార్డింగ్ బాగుంటే విడుదల చెయ్యొచ్చు.

    లేదూ, విశ్వనాథ కిన్నెరసాని దాని దోవన అది చదువుకుని, అప్పుడో మరోసారో, Edward Greg- Solveig’s song విన్నా. Svetlana – Moldau విన్నా, సుఖం ఉంది. ఆ సంగీత నదీ ప్రవాహాల చలనాలకి హృదయం కరిగి పోతుంది.
    చక్కని శబ్దానికి, ఎక్కడిదైతేనేం మంచి శ్రోతగా మారితే చాలదా?

    Lyla

  369. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి kalluri bhaskaram గారి అభిప్రాయం:

    04/05/2017 3:08 pm

    ఇలాంటి చర్చలో పెద్దగా ఎప్పుడూ పాల్గొనలేదు కానీ, తెలిసిన పద్యం కావడంతో వ్యాసమూ, దానిపై వచ్చిన స్పందనలూ కలిగించిన కుతూహలం కొద్దీ–

    నాకు అనిపించింది ఏమిటంటె, ఈ పద్యంలో రుతువర్ణన ఎంత ప్రధానమో, కవుల గురించి కవితాసరళుల గురించి చెప్పడమూ కవికి అంతే ప్రధానం. ఇక్కడ రెండు రకాల కవితాసరళుల గురించి ఆయన చెబుతున్నాడు. మొదటిది, వట్టి మాకులను కూడా చిగురింపజేసే వసంతుని రసోపగుంఫిత పదవాసనలతో కూడినది. రెండవది, రాళ్ళను కూడా కరిగింపజేసే చంద్రుని ప్రసన్నతా, సౌకుమార్యాలతో కూడినది. కేవలం రసగుంఫిత పదవాసనలు ఉంటే సరిపోదు, ప్రసన్నత, సౌకుమార్యం కూడా ఉండాలి. అందుకే వసంతుని చంద్రుడు మెచ్చలేదని కవి చెబుతూ ఉండచ్చు. తన మీదే వచ్చిన ఏ విమర్శనైనా దృష్టిలో పెట్టుకుని దేనికవే గొప్పవని చెప్పదలచుకుని ఉండవచ్చు. ఈ విధంగా చూసినప్పుడు ఈ పద్యంలో సూచిస్తున్న స్పర్థ కవుల మధ్య కన్నా, ఉత్తరోత్తర ప్రాధాన్యం కలిగిన రెండు రకాల కవితా సరళుల మధ్య అనిపిస్తుంది.

    ‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా’ అనడంలో ఉన్న ఇంకో విశేషాన్ని కూడా గమనించాలి. ఇక్కడ వసంతుడికి, చంద్రుడికీ మధ్య మధుమాస రూపమైన సమకాలీనత ఉంది. ఇలా చూసినప్పుడు రుతువర్ణనతో సమానంగా కవితా సరళుల గురించి, ఒకరి సరళిని ఒకరు మెచ్చకపోవడం గురించి కవి చెబుతున్నాడన్న అభిప్రాయానికి మరింత బలం చేకూరుతుంది.

  370. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:

    04/05/2017 2:55 pm

    “ఇక్కడ ఒక తెలుగు చిత్రకారుడి పదహారణాల తెలుగు బొమ్మని తెలుగులో చిత్రించిన కవిత. చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా పైన నేను మళ్ళా ఎత్తి రాసిన వాక్యాల్లో కవి అంతరంగమంతా బావిలో నీళ్ళల్లా లోతుగా, చల్లగా కనిపిస్తున్నది. … ఆయనిట్లాంటి కవితలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను,” అని శ్రీ వీరభద్రుడు రాసారు.

    వా.చి.వీ కి నా కృతజ్ఞతలు.

    ‘ప్రార్థన’ పద్యంలో సౌభాగ్య కుమార మిశ్ర అంటాడు: ‘ నా అహంకారం పెరిగి పెరిగి పైపైకి పోతోంది, ఎంతోఎత్తుకి’ అని. నేను కూడా ‘కవి’ నే నన్న భ్రమలో పడి నా #ego# పెరగకముందే, సంజాయిషీ ఇచ్చుకుంటున్నాను.

    వా.చి.వీ ఎత్తిరాసిన ’వాక్యాలు’ నావి కావు. మరొక ప్రఖ్యాత కవివి. ఆ కవి ఎవరో చెప్పడం, ఈమాట పాఠకుల సాహిత్య పటిమను కించపరచడమే అవుతుంది.

    Eliot expert కన్నెగంటి రామారావు రాసాడు: ‘అద్భుతంగా ఉంది. బాగా ఉంది,’ అని. అందుకు కారణం ఎలియట్ కొటేషన్‌ ఒక్కటే కారణం కాదని అనుకుంటున్నాను. Thanks again, Ramarao!

    శ్రీ ఏల్చూరి మురళీధరరావు ఇచ్చిన ‘మెప్పుల కుప్పల’కి ధన్యవాదాలు. ‘దృశ్యవర్ణనాత్మకమైన సెట్టి లక్ష్మీనరసింహకవి గారి ‘చిత్రమాలికలు’ నేను చదవలేదు. అసలు అటువంటి పుస్తకం ఉన్నదనే తెలియదు. It is my loss.

    Thank you very much, JKM! శ్రీ మోహన రావు ఆ పాతబొమ్మలపై రాసిన కవితలు ప్రచురిస్తే, అందరం చూసి, చదివి ఆనందిస్తాం కదా!

    Sri PRK Rao raises several interesting questions and his comments are very incisive.

    Yes. I attempted to map my perceptions on seeing Damerla Ramarao’s painting “ baavi daggira.” I went back in time and I split the painting into three segments to emphasize my impression/imagination of the different people in the painting. I used my insipid prosaic lines, with a pretension of creating the effect of a ‘poem’ by simply breaking the lines artificially. It should have been evident to the well versed poets that frequent this journal. I wish the three segments could be zoomed at will for a better feel.

    In the second half of the “poem” I have inserted lines borrowed from several well-known poets in between my broken prosaic lines only to give the entire experiment a viable credence of a poem. And also, I believed that these borrowed lines could somehow mask my incompetence and inability at versification.

    Suddenly, you have reminded me of our joint-reading of the ‘Doors of Perception,’ and ‘Heaven and Hell,’ by Aldous Huxley. That was almost sixty years ago. I still remember us writing to Huxley on how to obtain ‘Mescaline’ in India, and his disappointing response to us. Reading Heaven and Hell later, has completely subdued our enthusiasm.

    You hit the nail right on its head. Each and everyone will have a different perception at a painting, a poem, a short story, or what ever, depending on the individual’s training and ‘mental make up.’ There is nothing inherent in the work of art to prompt others to see my perceptions in it. But, I can try to persuade them to see my way by suggestion.

    In the end I implored at some of the contemporary painters (they know who they are!) to paint a new picture that reflects more closely the present realities of ‘waiting for drinking water,’ in the third world countries.

    Invoking Oscar Wilde a la Dorian Gray in the end, you might say, is a my “convoluted” way of looking at the aestheticism of Damerla Ramarao’s painting ‘baavi daggira,’

    Finally, thanks again to each and everyone that reacted to the ekphrastic poem.

    Regards.

    Veluri Venkateswara Rao

  371. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    04/05/2017 1:28 pm

    ఈ పద్యంలోని భావమూ సారమూ కూడా సమకాలపు సాహితీవేత్తల మధ్యనుండే స్పర్థ గురించేనన్నది స్పష్టమే. అయితే ఆ చెప్పడం వాచ్యంగా కాకుండా ప్రస్తావనగా చేప్పబడిందన్నది గమనించాల్సిన అంశం. అందుకే అది కవిత్వం అయింది!

    వేదంవారి వ్యాఖ్యని ప్రస్తావించి వేలూరిగారి కోరికని తీర్చినందుకు ఏల్చూరిగారికి ధన్యవాదాలు! వేదంవారి వ్యాఖ్యలో “రసోపగుంభిత పదవాసనల్” అన్నదానికిచ్చిన అదనపు అర్థం, “కాళ్ళకు సిద్ధరసముఁ బూసికొని త్రొక్కడం”, నాకు పెద్దగా నచ్చలేదు. అది ఊహని మరీ ఎక్కువ పొడిగించినట్టు అనిపించింది. అందుకే నేను దాన్ని ప్రస్తావించ లేదు.

    వసంతుని చేతను చంద్రుడు మెచ్చకపోవడానికి స్పర్థ తప్ప వేరే కారణం ఎందుకు? అకారణంగా స్పర్థబూనడాన్ని గురించే కదా కవి వాపోతున్నది! ఇక్కడ కవి వసంతుని కార్యాన్ని తక్కువచేసి చెప్పాడని వేదంవారు అభిప్రాయపడ్డారు. వసంతుని చేతకన్నా చంద్రుని కార్యమే గొప్పదని కవి భావిస్తే చివరి వాపోవడం సబబు కాదు కదా, అంచేత అలాంటిదేమీ లేదని తాపీవారు అన్నారు.

    ఇద్దరి అభిప్రాయాలూ సమంజసంగానే ఉన్నాయి! వసంతుని తక్కువ చేయడం అనేది పద్యంలో స్పష్టంగా తెలుస్తోంది. కానీ అలా అనుకుంటే చివర వాపోవడం సరికాదు. ఇందుకు నా అన్వయం ఏమిటంటే – పద్యంలో వసంతుని చులకన చేస్తున్న గొంతు, కవిది కాదు చంద్రునిది – అని. సమకాలమువారు ఏ రీతిలో మెచ్చరో మాత్రమే అందులో ధ్వనిస్తోంది తప్ప, ఇద్దరి రచనల విషయమై కవి ఎవరి పక్షమూ తీసుకోలేదని నా అభిప్రాయం. ఇందులో ఎవరి రచన గొప్పదన్న అంశం యిక్కడ అవసరమే లేదు. ఒకరిని చూసి మరొకరు స్పర్థ పూనడమన్నదే ఇక్కడ చెపుతున్న విషయం.

    ఈ పద్యాన్ని మరోసారి నెమరు వేస్తూంటే, మరొక సూక్షమైన అంశం కనిపించింది. ఇది భాషలోని వాక్య నిర్మాణానికి సంబంధించిన అంశం. ఈ రెండు వాక్యాలనూ గమనించండి:

    అంతటా చికట్లు ముసిరేట్టు ఆకాశంలో మేఘాలు కమ్ముకొన్నాయి.

    ఆకాశంలో మేఘాలు కమ్ముకొని అంతటా చీకట్లు ముసురుకొన్నాయి.

    మొదటి వాక్యంలో మేఘాలు కమ్ముకోడం అనేది ప్రధానం (వాక్యం దానితో ముగుస్తోంది కాబట్టి), దాని ఫలితమైన చీకట్లు ముసరడం కాదు. కాని రెండో వాక్యంలో చీకట్లు ముసురుకోడం ప్రధానం.

    వాక్యనిర్మాణంలోని ఈ ఒడుపు పట్టుకొని పద్యంలో చక్కగా సహజంగా కూర్చాడు చేమకూర. వసంతుని కార్యం గురించి చెపుతున్నప్పుడు ఫలితాన్ని ముందు చెప్పి, తర్వాత ప్రయతాన్ని చెప్పాడు. దానివల్ల చేసిన ప్రయత్నం ప్రధానమయింది (ఎక్కువగా చూపబడింది). చంద్రుని విషయంలో ప్రయత్నం ముందు చెప్పి, ఫలితం తర్వాత చెప్పబడింది. అంచేత ఫలితం ప్రధానమై, అందులోని ఆధిక్యం సహజంగా పాఠకులకి స్ఫురిస్తోంది. ఇన్ని రకాలుగా చంద్రునిది పై చేయిగా చూపబడినా, అది సమకాలము వారిని మెచ్చని చంద్రుని దృష్టినే సూచిస్తుంది తప్ప, కవి స్వంత అభిప్రాయం/నిర్ణయం కాదని నా అభిప్రాయం.

    వేలూరి గారు,
    కాళిదాసు వసంత వర్ణన గురించి – కంగారేం లేదు, ఇంకా బోలెడన్ని వసంతాలు మిగిలున్నాయి! ఎప్పుడో మరో వసంతానికి ముచ్చటించుకోవచ్చు 🙂

  372. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    04/05/2017 8:07 am

    శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారికి
    నమస్కారములతో,

    కొత్తదనంతో తళతళ మెరుస్తున్న పరిచయాన్ని, మీ కవిత్వీకృతిని చదివి, మీరు సూచించిన రచనలను గురించి తెలుసుకొంటున్నప్పుడు మధురోహలు కలుగుతున్నాయి. దీనిని సరిపోలినది కాకపోయినా, దృశ్యవర్ణనాత్మకమైన సెట్టి లక్ష్మీనరసింహకవి గారి ‘చిత్రమాలికలు’ సంపుటం మనస్సులో మెదిలింది.

    మీకు మెప్పుల కుప్పలతో,
    ఏల్చూరి మురళీధరరావు

  373. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    04/04/2017 11:44 pm

    శ్రీ కామేశ్వరరావు గారు అద్యతన వసంతోత్సవ స్మరణోత్సవంగా వెలుగులోకి తెచ్చి వివరించిన ఈ విజయవిలాస పద్యాన్ని చాలా రోజుల తర్వాత చదువుతున్నప్పుడు ఇంతకు మునుపెన్నడూ కలుగని సందేహాలు కలిగి, మళ్ళీ ఒకసారి 1911 నాటి వేదము వేంకటరాయశాస్త్రిగారి వ్యాఖ్యను, 1968లో అచ్చయిన తాపీ ధర్మారావుగారి వ్యాఖ్యను బయటికి తీసి సాకల్యంగా చదువుకొన్నాను.

    క్షితిపయిన్ = భూమిమీఁద, వట్టిమ్రాఁకులున్ = కేవలంపు మ్రోడులు సయితము (రసజ్ఞత బొత్తిగా లేనివారు సయితము అని కవనపరము), చిగిర్పన్ = చిగిరించునట్లు (ఆనందించునట్లు అని క.ప.), వసంతుఁడు = ఆమని, తాను, రస ఉపగుంభిత పద వాసనల్ – పాలతో నిండిన (ఆకు పూవు కాఁడ మొద లగు) వస్తువులయొక్క పరిమళములను, – (రస = పాదలేపముతో – ఉపగుంభిత = పూయబడిన, పద – చరణములయొక్క, వాసనల్ = తాఁకులన్ అనియు) (శృంగారాది రసములతో నిండిన శబ్దములయొక్క భావములను అని క.ప.) నెఱపన్ = విస్తరింపఁగా, మెచ్చక, చంద్రుడు, మిన్నునన్ = ఆకాశమున, ప్రసన్నతయున్ = అనుగ్రహమును (విమలత్వము ననియు), – సౌకుమార్యమున్ = శ్రమపడనిమియును (కోమలత్వము ననియు) (ప్రసాద సౌకుమార్యము లనెడు కావ్యగుణములు), కనంబడన్ = స్ఫుటమగునట్లుగా, ఱాల్ కరఁగంగఁ జేసెన్ – (చంద్రకాంత) శిలలను = కరఁగించెను (వసంతుడు రంజించినవారికన్న నరసికు లగువారిని రంజింపఁజేసెను అని క.ప.) – అనఁగా – వసంతుఁడు భూమిలో కాళ్ళకు సిద్ధరసముఁ బూసికొని త్రొక్కి, కష్టముచేత భూమియందు వట్టిచెట్లు చిగిర్చునట్లు చేయఁగా, అదెంత లోనిదని చంద్రుడు శ్రమ లేకయే అనుగ్రహముచేతనే ఆకాశమునందుండి రాలు కరఁగునట్లుగాఁ జేసెనని అర్థము.

    – అని వేదము వారి వివరణ. ధర్మారావు గారు దీనిని పూర్తిగా అనుసరింపలేదు.

    మొత్తం మీద ప్రకృతమైన ఆమని వర్ణన, కవిత్వపరమైన తారతమ్యవర్ణన – రెండూ కవి దృష్టిలో ఉన్నాయన్నది స్పష్టం. వేంకటకవిని కవిత్వేతరకారణాల వల్ల ఎవరో, ఎందుకో నిరాదరించినందువల్ల బాధపడి ఈ పద్యాన్నిక్కడ సందర్భస్థగితంగా నివేశింపజేశాడని జనశ్రుతిలో ఉన్న కథ నిజమే అయివుంటుంది. అయితే, వసంతుని చేతను చంద్రుడు ఎందుకు మెచ్చలేదో వ్యాఖ్యాతలు వివరింపలేదు. మాత్సర్యమో, కీర్తికాంక్షో అందుకు కారణమై ఉండదు. “వసంతుడు ఎండిన మోడు చిగురించేట్లు కవిత్వం చెప్పాడు. చంద్రుడు దాన్ని మెచ్చక రాళ్ళు కరిగేట్లుగా కవిత్వం చెప్పాడు. ఎంత బాగా చెప్పినా సమకాలం వాళ్ళు మెచ్చుకోరు కదా!” అన్నప్పుడు – ఎవరిని విమర్శిస్తున్నట్లు? సండర్భాన్ని బట్టి కవియొక్క సానుభూతి వసంతుని మీదనే అన్నది స్పష్టం. వసంతుని చంద్రుడెందుకు మెచ్చుకోలేదు? అని పాఠకులు అడిగితే – చంద్రుడెందుకు మెచ్చుకోలేదో కల్పనలో సమాధానం తప్పక చెప్పబడాలి. చంద్రుని కవిత్వానికంటె తన కవిత్వమే మేలని వసంతుడు కూడా వాదిస్తే, దొందూదొందే కాబట్టి, “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అన్న అర్ధాంతరన్యాసం ఉభయతారకంగా ఉంటుంది. కాని, అట్లా జరగలేదు. వసంతుని మెచ్చుకోని చంద్రుని ప్రవర్తన మాత్రమే ఇక్కడ విమర్శకు గురైంది. వసంతుని చేతలో ఏదో లోపం ఉన్నందువల్ల చంద్రుడు వసంతుణ్ణి మెచ్చుకోకపోవటం జరిగి, చంద్రుని రచన నిజంగా వసంతుని రచనకంటె మేలుగా ఉన్నట్లయితే – ఆ గుణోత్కర్షను చూసిన వేంకటకవి “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అని బాధపడటం భావ్యం కాదు. తిరస్కృతుడైన వసంతుని రచన మేలైనదీ, తిరస్కరించిన చంద్రుని రచన దానితో సరితూగనిదీ కావటం వల్లనే వేంకటకవికి తన మనసులోని మాటను వెల్లడించే సదవకాశం ఏర్పడింది.

    వసంత – చంద్రులిద్దరూ మన్మథుని ప్రియానుచరులే. పద్యంలో వారికి విరోధం చిత్రింపబడి ఉంటుందనుకోవటం సంభావ్యం కాదు. ఎందుకంటే, ప్రథమాశ్వాసంలో ఆ తర్వాతిదైన 211-వ పద్యంలో కవి ఉత్సవసమయంలో మన్మథునికి కానుకగా వసంతుడు చెరకువిల్లును, చంద్రుడు కలువబాణాన్ని బహూకరించి గౌరవాన్ని పొందారని ప్రశంసాపూర్వకంగా అభివర్ణించాడు. అందువల్ల వారిద్దరూ పరస్పరమాత్సర్యోపహతులు కారన్నమాట. వసంతుణ్ణి మెచ్చుకోకపోవటం ఎంత సమంజసమైనా, ఔన్నత్యచికీర్షతో ఆ చంద్రుడు చేసినది వసంతుని చేతకంటె గొప్పేమీ కాదని; కనుకనే, అనాదరింపబడిన వసంతునిపై సానుభూతి కలిగి అతనికి సమర్థనగా వేంకటకవి “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అని వ్యాఖ్యానించాడని మనము ఊహించాలి.

    అందువల్ల కవి హృదయావిష్కరణకై వేంకటరాయశాస్త్రి గారు, ధర్మారావు గారు చెప్పిన పద్యార్థాన్ని, చేసిన అన్వయాన్ని సహృదయులు పునర్విమర్శింపవలసి ఉన్నదని మనవి.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  374. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి వేలూరి వేంకటేశ్వరరావు గారి అభిప్రాయం:

    04/04/2017 5:34 pm

    కామేశ్వర రావుగారూ!

    మీరు మరీ బడాయికి పోయారు కానీ, ఆఖరి చరణం తీసేస్తే ఈ పద్యం కేవలం ఋతువర్ణన పద్యమేకదా! (Of course, give a little to the poet for drawing the contrast between the Lord of Spring and the satellite to the earth!)

    …ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!

    అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ – ముఖ్యంగా తెలుగు సాహితీవేత్తలమనుకొనే ఈ నాటి కవుల్లో, విమర్శకులలో కొట్టవచ్చినట్టు కనిపించే ఒకానొకలక్షణం.

    ఈ పద్యంలో ఉన్నది వసంతుడూ చంద్రుడే కాని కవులు కాదు. కవుల మధ్యనున్న స్పర్థ కేవలం పాఠకులకు స్ఫురించే అంశమే తప్ప నేరుగా కవి చెప్పింది కాదు,’ అని మీరు మొహమాటానికి అన్నారని నేను అంటాను.

    కాకపోతే, తరువాత ఇలా ఎందుకు రాసారు?

    “… అయినా ఒక కవిగా, ఎంత గొప్ప కవిత్వాన్ని రచించినా సమకాలము వారలు మెచ్చకపోవడాన్ని గూర్చి వాపోయాడు వేంకటకవి. మెచ్చకపోవడమే కాదు, ఏ రకంగా తక్కువ చేసి చిన్నబుచ్చుతారో కూడా మనకీ పద్యంలో చూచాయగా తెలియజెప్పాడు.

    ఈ పద్యం మీద వేదం వారి వ్యాఖ్యకూడా జోడిస్తే ఇంకా బాగుండేది.

    మరొక విషయం: కాళిదాసుని వదిలేయడం ఏమీబాగాలేదు. కుమార సంభవంలో వసంతుడి రాక పై శ్లోకాలు, అంతకన్న మరీముఖ్యంగా, ఋతుసంహారం లోని వసంతవర్ణన (They may be a little explicit, hence more likable!) వదిలేయటం ఏమీ బాగాలేదు, చెప్పొద్దూ!

    అసలు విషయం: ఋతుసంహారం, నాలాంటి ‘ మీడియోకర్ల’ కి తేలిగ్గ అర్థమయే కావ్యం. ఎప్పుడో, ధాతనామసంవత్సరంలో, ఋతుసంహారంలో వర్ణనలతో, కన్నెగంటి చంద్ర కవితలని పోల్చానని, నన్ను ఆక్షేపించారు.

    (ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!)

    ఏది ఎలావున్నా, మంచి పద్యం; మరీమంచి వ్యాఖ్యానం. (I envy you!)

  375. అంతా కొత్తగా… గురించి J.V.RAMANA గారి అభిప్రాయం:

    04/02/2017 5:43 am

    కొత్త కొత్తగా కవిత చాలా బాగుంది. అక్షరం అక్షరంలో కవి హృదయం ఆవిష్కృతమవుతోంది.

  376. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి vaadrevu chinaveerabhadrudu గారి అభిప్రాయం:

    04/01/2017 9:33 pm

    నూతిచుట్టూరా చెట్లు.
    పాతవానల రహస్య నిద్రల్ని తట్టి
    పాతస్మృతుల సుడిగుండాల్ని గాలించి
    ఆ తపించే వర్తమానం కోసం
    శైతల్యాన్ని తెస్తాయి, చెట్టూ, బావీ.

    ఈ మధ్య సూర్యలంకలో కొందరు తెలుగు కథకులు ఒక శిబిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి నేను ఈ ఎక్ ఫ్రాసిస్ ని పరిచయం చెయ్యవలసి వచ్చింది. డొనాల్డ్ బార్తెల్మి రాసిన ‘టాల్ స్టాయి మ్యూజియం దగ్గర ‘అనే కథని పరిచయం చేసినప్పుడు. ఈ పదాన్ని తనంతట తనుగా మొదటిసారి వాడిన తెలుగు కవి ఇదుగో వేలూరి వారే కనిపిస్తున్నారు. చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని , శిల్పాన్ని కవిత్వంతో వివరైంచే ప్రయత్నం యూరోపియన్ కవులు చాలా తరచు చేసే పని. తెలుగు లో తక్కువ. ఒకరూ అరా రాసినా యూరోపియన్ చిత్రలేఖనాల్నో, కళాకృతుల్నో ఉద్దేశించి మటుకే చేసి ఉంటారు. కాని ఇక్కడ ఒక తెలుగు చిత్రకారుడి పదహారణాల తెలుగు బొమ్మని తెలుగులో చిత్రించిన కవిత. చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా పైన నేను మళ్ళా ఎత్తి రాసిన వాక్యాల్లో కవి అంతరంగమంతా బావిలో నీళ్ళల్లా లోతుగా, చల్లగా కనిపిస్తున్నది. వెంకటేశ్వరరావుగారు గొప్ప చిత్రరహస్యవేత్త కాబట్టి ఆయనిట్లాంటి కవితలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను.

  377. సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    03/17/2017 11:50 am

    మాన్యులు శ్రీ వాడపల్లి శేషతల్పశాయి గారికి
    నమస్కారములతో,

    మీ సేకరణలో ఆనంద ముద్రణాలయం వారు అచ్చువేసిన అద్భుతావహమైన శ్రీ తంజనగరం తేవప్పెరుమాళయ్య (దేవరాజసుధి) గారి వసుచరిత్ర వ్యాఖ్యకు పిడియఫ్ ప్రతి ఉన్నట్లయితే తెలియజేయ ప్రార్థన.

    శ్రీ తంజనగరం వారి వ్యాఖ్యకు మద్రాసు లోని రాయల్ అండ్ కో వారొక సుపరిష్కృత పునర్ముద్రణను ప్రారంభించి, మూడువంతులు పూర్తయాక దానిని అరుణా పబ్లికేషన్స్ వారికి ఇచ్చివేశారు. ఆ ప్రతులిప్పుడు దొరకటం కష్టం. 2001లో శ్రీ రామరాజభూషణ పరిషత్తు (భీమవరం) వారు పూర్తిగా పునర్ముద్రణను వెలువరించారు కాని, తొలినాటి ఆనంద ముద్రణాలయం వారి ప్రతివలె అది అంత సంతృప్తికరంగా లేదు. జూలూరి అప్పయ్యశాస్త్రి గారి వసుచరిత్ర వ్యాఖ్య ఎక్కడో ఒకటి రెండు చోట్లలో తప్ప అంత విశేషంగా చెప్పుకోవలసినది కాదు.

    మీరు ఉదాహరించినట్లు సోమనాథకవి 1750 నాటివాడన్న శ్రీ నిడుదవోలు వారి నిర్ణయమే సరైనది. అయితే కవితరంగిణిలోని వివరాలు, వ్రాతప్రతులలోని వివరాలు, వావిళ్ళ వారి ప్రతిలోని వివరాలు ఒక తీరున లేవు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  378. ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lalitha TS గారి అభిప్రాయం:

    03/16/2017 7:09 pm

    Sreenivas Paruchuri గారు: దిబ్బరొట్టి అబ్బాయి రూపకం వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    జిలేబిగారు: మీ పద్య వ్యాఖ్యకి బదులు నా బ్లాగులో – ధన్యవాదాలు 🙂
    చంద్రిక: బోల్దన్ని థాంక్ యూలు – యూట్యూబు లింకుకి.
    లక్ష్మీదేవిగారు: నా కవిత నా గొంతులో మెచ్చినందుకు ధన్యవాదాలు.

  379. సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    03/14/2017 9:55 am

    “నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం
    దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధారాసుధారాశి సం
    జనితైకైకదినప్రబంధఘటికాసద్యశ్శతగ్రంథక
    ల్పను సంగీతకళారహస్యనిధిఁ బిల్వం బంచి పల్కెం గృపన్.”

    అని శ్రీ రామరాజభూషణుడు తాను “సంగీతకళారహస్యనిధి”ని అన్న విషయాన్ని వసుచరిత్ర (1-16) లో స్వయంగా తానై పేర్కొన్నాడు. అది ఒక బిరుదం కాదు. స్వోపజ్ఞమైన విశేష్యమాత్రం. ఆయన సంగీతకళారహస్యనిధిత్వాన్ని గురించిన అవగాహనకు ఆ కావ్యమూ, దానిపై వెలువడిన సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారివి, శ్రీ రాజన్న కవిగారివి, తదితరుల విమర్శగ్రంథాలు ఉండనే ఉన్నాయి.

    ఆధునికయుగంలో మహావిద్వాంసులైన శ్రీ శిష్టు కృష్ణమూర్తికవి గారు దీనిని పునఃపఠనపాఠనాలలోకి తెచ్చి, వీణాదికసంగీతవాయిద్యాలపై రాగధర్మాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు చేసేవారని ప్రతీతి.

    మొత్తంమీద సంగీతరసజ్ఞులకు కొరుకుడుపడని కల్పనలు వసుచరిత్రలో ఉన్నాయన్నది ఈ ప్రసంగంలోని ప్రతిపాద్యార్థం. ఆ సంగతిని ప్రస్తుతీకరించటమే గాని, కవిని ప్రస్తుతించటం జరగలేదు. లైలా గారన్నట్లు అది కొన్ని పారిభాషికపదాల ప్రయోగం వల్ల ప్రస్ఫుటించే సామాన్యవిషయం కాదు. కవి సంగీతకళారహస్యనిధి అన్న విషయం అడుగడుగున స్పష్టమే. ఆ ప్రపంచంలో ఉపజీవిస్తున్నవారికి తప్ప సంస్ఫురింపని అపూర్వములైన సాంగీతిక కల్పనలు అందులో అనేకం ఉన్నాయి. “కాంభోజి” అన్న ఒకానొక రాగనామప్రయుక్తికై దీర్ఘజకారాన్ని ప్రాసస్థానంలో నిలిపేందుకు “ఆ జాబిల్లి” అన్న నిర్దేశాత్మకమైన ఉపక్రమణిక జరిగిందని ఊహించటం ఎవరో మామూలు కవుల విషయంలో అనవలసిన మాట. శ్రీ శాస్త్రిగారి వంటి పెద్దలు శబ్దబ్రహ్మవేత్త అయిన రామరాజభూషణుని వంటి మహాకవిని అధికరించి అనవలసిన మాట కాదు.

    ఇంతకీ, కాంభోజి కావ్యోపగతమైన నాయికారోదనకు నైమిత్తికం కాకూడదని శ్రీ శాస్త్రిగారు ఎందుకు భావించారో తెలియలేదు.

    “ధాన్తగ్రహాంశః సనిపైశ్చ భూరిః కామ్భోజికేయం కకుభప్రసూతా
    భాషాఙ్గకం యాష్టికసంమతస్య తుల్యవరా చ పూర్ణా.

    ఇమాం త్రిషడ్జాం విధరం నిభూరిం హిన్దోలజా మాహు రతద్విదోఽన్యే
    శుచౌ నియుక్తాం కరుణే రసే చ సంచారివర్ణం ప్రగుణం వదన్తి.

    అని క్రీస్తుశకం 1433-1468 నాటి కుంభకర్ణ నరేంద్రుని సంగీతరాజం. అంతటి జగదేకమహాకవి ఆ మాత్రం చూసుకోడా?

    అద్భుతావహమైన “అరిగా పంచమ మేవగించి” పద్యాన్ని గురించిన చర్చ చాలామంది పెద్దలచే జరిగినదే కనుక ఇప్పుడా ప్రసక్తిని మాని, ఆ కల్పనలో ఎటువంటి దోషమూ లేదన్న అక్కడి నిగమనాన్ని మాత్రం స్థూలంగా ఇక్కడ పేర్కొంటున్నాను.

    శ్రీ శాస్త్రిగారు సంగీతశాస్త్రవేత్త అని, శ్రావ్యగాయనులని వారి కంఠస్వరం చెప్పకనే చెబుతున్నది. పాండిత్యగౌరవం వల్ల ధ్వనిస్తున్న వారి శాస్త్రాధికారమూ ప్రశంసనీయమే. ప్రసంగమంతటా పరచుకొని ఉన్న వారి పలుకుబడిలోని ఆప్యాయనం కూడా ప్రస్ఫుటమే. “ఆలంబిత పల్లవవ్రతవిధుల్” అని ఉచ్చరిస్తున్నప్పుడు రెండుమార్లూ “పల్లవ – వ్రత” అని ఆ పదాలను విడదీయకుండా చదివి ఉంటే వకారం గురుత్వాన్ని కోల్పోక – ఛందస్సు పాటింపబడి, మహాకవి వేతృత్వాన్ని గూర్చిన విమర్శ కాబట్టి – పద్యపఠనం మరింత శ్రావ్యంగా ఉండేది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  380. సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    03/14/2017 12:44 am

    రేడియో స్టేషన్ లో కొన్ని సంవత్సరాల క్రింద చేసిన ప్రసారం, ఎంతో ప్రేమతో దేశ దేశాల్లో ఉన్న తెలుగు వారిని, ఈ వక్త వినమని ఇచ్చారు. ఆ ఉదారతకు చాలా సంతోషం కలిగింది.

    నాకు వీరి ఉపన్యాసం కన్నా, వీరి గానం ఎక్కువ నచ్చింది. మళ్లీ ఏమన్నా కమ్మగా పాడిన ఆడియోలు పత్రిక శ్రోతల కోసం పంపిస్తారేమో. తప్పక వేచి ఉంటాను.

    ఉపన్యాసం లోని విషయాలకు వస్తే:
    భట్టుమూర్తిని సంగీత కళా రహస్య నిధి అని ఎవరన్నారో, ఎందుకన్నారో మనకెలా తెలుసు? ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి. భట్టుమూర్తికి, సంగీతం ప్రావీణ్యతలో బిరుదులివ్వటం, అసలు ఒక కావ్యరచన పరిశీలించి చెయ్యటమెలా జరుగుతుంది? ఉపన్యాసకులు చెప్పిన ప్రకారం, కవి కాలానికి సంగీతం, సాహిత్యం (కవిత్వం) స్వంత ప్రతిపత్తి కలిగిన కళలు కదా. సంగీతం, సాహిత్యం లో ప్రజ్ఞలు విడిగా పరీక్షించడానికి సాధనాలున్నయ్యి కదా. సంగీతం పరీక్షలు పెట్టి, సంగీత స్వరకల్పనకు కాని, సాహిత్యం కూర్చినందుకో, పాడగలిగినందుకో, వాయిద్యం వాయించగలిగినందుకో గాని, అతడు మేటి ఐతే సంగీత కళానిధి అని సంగీత విద్వాంసులు బిరుదు ఇవ్వచ్చు. అతను అలాటి పరీక్షలు ఇచ్చి ఉన్నాడేమో, ఇచ్చి ఆ బిరుదు పుచ్చుకున్నాడేమో. మరి ఆ విషయం ఎక్కడా చదవటానికి కనపడదు. వసు చరిత్ర కావ్యం ద్వారా అతని సంగీత పాటవం ఎలా చెపుతారూ? అనేది నా సంశయం.

    పైగా, కేవలం రెండు పద్యాల ద్వారా అతని సంగీత ప్రావీణ్యత ఎలా తెలుస్తుంది? అదీ సరి కాదు. వసుచరిత్ర రాసిన భట్టుమూర్తి సంగీత జ్ఞానం గురించి, ఎందుకు ఎవరైనా ఆ రెండు పద్యాలే ఉదహరిస్తారో నాకు అర్థం అవదు.

    ఒక కవి పద్యాల్లో అక్కడో చోట ఇక్కడో చోట ‘వీణ’ అనో ‘మద్దెల’ అనో, లేకపోతే ‘నాట’ అనో ‘కల్యాణి’ అన్నంత మాత్రాన, ఎవరైనా సంగీత కళానిధి అని బిరుదు ఇస్తారా? ఊరికే, ఒక కథలో మలేరియా, టైఫాయిడ్ అన్నంత మాత్రాన కథా రచయితకు వైద్య శిఖామణి బిరుదు ఇచ్చిన తంతు ఎక్కడా వినలేదు.

    సరే, కొంతమందిని కవి అని అంటే సర్లే పోనీలే అని నాలాటివాళ్లు సరిపెట్టుకుందామంటే, ఇంకా ఉద్రేకులు ఢమిక్కిన ఒక్కొక్కరిని మహాకవి, శతాబ్ది కవి అనేస్తారు. మార్క్సిస్టులు శ్రీశ్రీని ప్రజాకవి, మహాకవి అంటే వాళ్ల అభిమానుల గుంపులో చెల్లుబడి అవుతుందేమో కాని, ప్రపంచ కవులు ఎవరండీ ఈ శ్రీ శ్రీ! అంటే ఏం చెపుతారు? ఇదుగోండి ఈ మా గొప్ప తెలుగు కవి – ఈయన ‘ఆనందం అర్ణవమైతే’ అని ఒక పాట రాసాడు, ఆ పాటకి ‘కన్యాశుల్కం’ తెలుగు సినిమాలో మహానటి సావిత్రి ఇలా డాన్స్ చేసింది, ఈ విడియో బిట్ చూడండి అని గాని – ఎవరైనా డాన్స్ వచ్చిన వాళ్లకు చూపిస్తే, నిజంగా నృత్యం నేర్చిన వాళ్లు, వచ్చిన వాళ్లు – ఇది డాన్సా? ఇదేం పాట, ఇదెక్కడి డాన్స్ అయ్యా ఇదా తెలుగు నృత్యం అని వాళ్లు నవ్వి పోతారు.

    ఇప్పుడా మధురవాణి, కుహనా కవిత్వం, కుహనా నృత్యం సంగతి నాకెందుకు గానీ, హిందోళ రాగం, వసంత రాగం గురించి, భట్టుమూర్తి ఒక పద్యం లో చమత్కరించి చెప్పినంత మాత్రాన, పద్యం మొదటి భాగం, హిందోళ లో, రెండో భాగం వసంత రాగంలో పాడమని కవి ఉద్దేశం కానే కాదు. అసలు ఏ రాగంలోనూ తన పద్యాలు పాడమని కవి ఆదేశమివ్వలేదు.

    పద్యం కూర్చిన భట్టుమూర్తి అతడు ఉపయోగించిన ఛందస్సులు మాత్రమే ఇచ్చాడు. ఆ పద్యం మత్తేభము. అని మాత్రమే అతడు మనకు చెప్పింది. ఆ ఛందస్సులో ఎన్నైనా పద్యాలున్నయ్యి. ఆ ఛందస్సులు వేల మంది కవులు వాడినారు కదా. వారు కూడ అక్కడో పద్యం ఇక్కడో వచనంలో, నాట, కల్యాణి, వసంత, మోహన, కాంభోజి – అంటే ఇక వారికీ సంగీతం వచ్చినట్లేనా. ఆ లెక్కన తెలుగు సినిమా పాటలు రాసిన వాళ్లు వైణికులై కూర్చుంటారు. తకిట తకిట అంటే తబలా expert, ఓంకార నాదాలు సంధానమౌ గానమే – అంటే శంకరాభరణము specialist– ఐ పోతారు.

    ఆ పద్యంలో మొత్తం మీద, కవి చమత్కారంగా ఉద్దేశించింది, తోటలో ఆడవాళ్ల ఉయ్యాల పాటలకు, కోయిలలు గొంతు కలిపినందున వసంతం పరిపూర్ణంగా శోభించిందని. అదే ఇంకోలాగా తిప్పి, గిరిక వీణా వాదనం విన్నప్పుడు, వసురాజు స్నేహితుడు – ఎవరో వీణ ఎంత బాగా వాయిస్తున్నారు, ఈ కొండ కోనలలో! కోయిలలు, నెమళ్లు తమ గొంతు కలిపి -పంచమ, షడ్జమాలు వినిపిస్తున్నాయి, అంటాడు. తెలుగు ( కర్ణాటక) సంగీతంలో, కోయిల స్వరం పంచమం కి సరిపోతుందని, నెమలి షడ్జమమని ఆ విషయాలు అలా రాసి ఉన్న సంగీతం పుస్తకాలు ఉన్నవి. ఒక్కొక్క సంగీత స్వరం ప్రకృతి లోని ఆ యా జంతువుల అరుపుతో సరిపోల్చటం పాతకాలంలో ఉన్నది.

    అందువల్ల మహా అనుకుంటే మనం – భట్టుమూర్తి కవి సంగీతం పుస్తకాలు చదివాడేమో, పాట మీద అభిమానం ఉన్నట్లుంది, ఔరంగజేబు కాదు సుమా అనుకోవచ్చు.

    హిందోళ రాగం వినాలంటే భట్టుమూర్తి పద్యం కష్టపడి పాడటమెందుకూ? – త్యాగరాజు ఆది తాళములో కూర్చిన ‘సామజ వర గమనా’ కృతి వింటే ధన్యులమై పోమా? సాహిత్యం లేకుండా స్వరం వీణ మీద పలికిస్తే, ముగ్ధులమై వినమా? సంగీత స్వరాలతో మనల్ని సమ్మోహితులను చేసి, ఈ త్యాగరాజు తన మాటలలో ఏమి చెప్పాలనుకుంటున్నాడు అని చూస్తే

    సామజ వర గమనా సాధు హృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
    సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ..

    అంటూ ఆ సాహిత్యం తోనూ మనల్ని రంజింప చేస్తాడు. సామజ వర గమనా సాధుహృ – అని అక్కడికి ఆపి, సంగతులు వెయ్యటం మొదలు పెడితే, కొంతమంది పట్టూ విడుపూ లేని వాళ్లకు, దొబ్బిడాయి వస్తుంది కాని సంగీత హృదయులు నొచ్చుకోరు. తన్మయులౌతారు. త్యాగరాజు తప్పకుండా సంగీత కళానిధి. సందేహం లేకుండా వాగ్గేయకారుడు.

    ఉపన్యాసకులు మనకు ఆయా రాగాలు గురించి ఎంతైనా చెప్ప వచ్చు. కాలక్రమాన రాగాల స్వరాలలో వచ్చిన మార్పులు గురించి చెప్ప వచ్చు. అవి తప్పక శ్రోతలకు ఆసక్తికరంగా ఉంటాయి. ఆ ప్రస్తావనలు నాకు నచ్చాయి.

    కాని, భట్టుమూర్తి కావ్యనాయిక గిరిక ఏడిస్తే కాంభోజీ రాగంలో మేళవించిన వీణలా వినిపించిందని -తన ఒక పద్యంలో అంటే ఉపన్యాసకులు ఆ పద్యాన్ని కాంభోజిలో పాడి వినిపించటం ఎందుకు? పద్యం అంతా గిరిక ఏడుపు కాదే. పద్యం ఒక విరహావస్థ వర్ణన. వెన్నెలలో ఒక సుందర స్త్రీ విలాప దృశ్యం. గిరిక ఎవరు? కోలాహలుడు అనే పర్వత రాజు కూతురు. కోలాహలుడు హిమవంతుడి కొడుకు. పార్వతికి సోదరుడు. గిరిక తల్లి నది. ఆ శుక్తిమతి గంగ లాగా స్వర్గంలో, భూమ్మీదా ప్రవహించే నదేమో మనకు తెలియదు. గిరిక దేవకాంత ఏమో. ఆమె నెత్తి మీద ముసుగు వేసుకు ఏడుస్తుందా? తెలుగు ఆడవాళ్ల లాగా, పమిట వెనక నించి ముందుకు లాగి, చెంగులోకి ముక్కు చీదుతుందా. దేవా! ఏమి దుస్థితి. విరహం లో కూడా వసురాజు ప్రేమిక గంభీర కాదా? ఆమెను ‘పటాగ్రంబెత్తి’ అని కవి ఎంత నాజూకుగా వర్ణించినాడు. గిరిక కట్టినది అది ఎంత నాజూకు దుకూలమో. ఆమె దానిని మునివేళ్ళతో ఎత్తి, తన ముఖానికీ, వెన్నెలకూ మధ్య అడ్డంగా ఎలా ఎత్తి పట్టిందో ఆ చిత్రం గొప్ప చిత్రకారుడు గీయాలి, మనం చూడాలి. భట్టుమూర్తి చాలా చక్కని వర్ణన చేసాడు. వడ్డాది పాపయ్య ఐతే బహుశా బాగానే చిత్రించ కలిగి ఉండొచ్చు.

    గిరిక కాంభోజీ లో ఏడవటానికి అది సరైన రాగం కాదు, అలా సూచించటంలో భట్టుమూర్తి సంగీత పరంగా పొరపాటు చేసాడనుకోటం సరికాదు. భట్టుమూర్తి ఏదో మొదటి మూడక్షరాల కోసం కక్కుర్తి పడి, కాంభోజీ అన్న మాట వాడతాడా? అన్ని వందల తియ్యని పద్యాలు రాసినతడు, ఒక పద్యం అవతల పారెయ్యటానికి తిరగ రాయటానికి వెనకాడతాడా? ఏ కాలంలోనూ చూడండి, వందల పేజీలు తిరగ రాసే రచయితలుంటారు. వారి మనసుకే నచ్చక మళ్లీ మళ్లీ రాస్తారు. ఎడిటర్ కి నచ్చకపోతే, సలహాను గౌరవించి, తను చెప్పదలచింది సరిగా వివరించ గలిగే దాకా తిరగరాసేవి ఇక ఎన్నో.

    కధా విషయం హిమాలయాల ప్రాంతంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఉత్తరాది కాంభోజీ రాగం ఎందుకు కవి ఉదహరించకూడదు? ఆ రాగం కాంభోజ ప్రాంతంకు చెందినందున ఆ పేరు వచ్చిందనీ, గంభీరం ఐన రాగం అని raga guide లో పేర్కొన్నారు. స్వరాలలో కైశిక నిషాదం ఉన్నది. విషాదం ఎందుకు పలకదు!

    గిరిక సంగీతం దేవతల దేమో. మానవ సంగీతానికి అతీతమైన దేమో. సంగీతం పుస్తకాల్లో, రాసి ఉన్న ప్రకారం మంద్ర, షడ్జమ స్థాయి లే మానవులకు అందుబాటులో ఉన్నవి. గాంధర్వం దేవతలే పాడగలరు. కాళిదాసు కుమార సంభవం లో కూడా ఈ విషయ ప్రస్తావన ఉంది. భారతదేశంలో తయారయే తంజావూరు వీణలు, సరస్వతీ వీణల నాదం పక్కల కూర్చొన్న వాళ్లకే వినిపిస్తుంది. గిరిక వీణ వసురాజుకు, కొండమీద అడవులలో దూరానికి వినిపించిందంటే, అది మనుషులు చేసిన వీణ కాదు. వసురాజు ఇంద్రుని వరాలు పొందిన వాడు. వసురాజుకు స్వర్గానికి విమానంలో రాకపోకలున్నయ్యి. అతడి నర్మసఖునికి కూడా, స్వర్గానికి వీసా, పాస్పోర్ట్ ఉండి ఉండాలి. వారు గంధర్వ గానం విని ఆనందించి ఉన్నారు. అంతకన్నా ఎక్కువ ఆకర్షణీయంగా గిరిక వీణ పలికించిందని వసురాజు, అతని మిత్రుని సంభాషణలద్వారా కవి మనకు ముందే చెప్పి ఉన్నాడు.

    భట్టుమూర్తికి సంగీత కళా రహస్య నిధి అని బిరుదు ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో? నాకు తెలియదు కాని, వసుచరిత్ర కావ్యం చదివి, అతడి సంగీత కళా పాటవం నిర్ణయించక్కర్లేదు. ఒకటి రెండు పద్యాల ద్వారా, అతడు చేయని తప్పులు సంగీత పరంగా అతని మీద ఆరోపించక్కర్లేదు. సంగీతజ్ఞులు ఆ ధోరణిగా ఆలోచించక్కర్లేదు, అని నాకనిపిస్తున్నది.

    లైలా.

  381. ఒకటి నుంచి పదిల దాకా… గురించి mala గారి అభిప్రాయం:

    03/09/2017 6:54 am

    మీ కవిత చదివాను. విన్నాను. చాలా బాగుంది. అభినందనలు.

  382. ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lalitha TS గారి అభిప్రాయం:

    03/07/2017 10:39 pm

    ఏల్చూరి మురళీధరరావు: మీ ఈ పొగడిక నాకెంతో అమూల్యమయినది – ధన్యవాదాలు!

    వెంకటేశ్వర రావు గారు: మీ లలితమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు 🙂

    చంద్రికగారు: ‘దిబ్బరొట్టి అబ్బాయి’ – అంటే ఏంటో తెలీలేదండి. మీరు రాస్తే చదవాలని వుంది. మరా కథేంటో చెప్పేయండి.

    ఉషా: మీ వ్యాఖ్యే ఒక అందమైన కవితలా వుందండి. నా ఈ అల్లిబిల్లి పాట మీకు నచ్చడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ధన్యవాదాలు.

  383. నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    02/25/2017 4:14 pm

    శర్మ గారూ! మీరు నిశ్చింతగా ఉండండి. ఈ మాట లో మీ కథల కోసం ఎదురు చూస్తాను.

    అభిప్రాయాలు చదివే పాఠకుల అనుమాన నివృత్తి కోసం:

    నేను రిఫర్ చేస్తున్న పుస్తకం నా లైబ్రరీలోని కాళిదాస కృత ‘కుమార సంభవము’. పుస్తక ప్రకాశకులు వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్. ఈ పుస్తకం కోలాచల మల్లినాథసూరి సంస్కృత వ్యాఖ్యానం ఆంధ్ర టీకాతాత్పర్య సహితం.

    1. మన్మథుడు శివుని పై బాణ ప్రయోగం చేసాడు అన్న విషయానికి కాళిదాసు కావ్యంలోనే మరో ఆధారం ఉంది గదా. అది బ్రహ్మదేవుడిపై మన్మథుడు అంతకు ముందెప్పుడో తన బాణాలు ప్రయోగించినపుడు, బ్రహ్మ ఆగ్రహించి అతని కిచ్చిన శాపం, శాపవిమోచన ఆవశ్యకతల ఉదంతం. బ్రహ్మ శాపం గురించి రతీ మన్మథులకు తెలియదు.

      బ్రహ్మదేవుడు తారకాసురుడి కిచ్చిన వరం, మన్మథుని కిచ్చిన శాపం లేకుంటే, కాళిదాసు ఈ కావ్యమెక్కడిది! (ఐనా, కాళిదాసు అభిమాన విషయాలు ప్రకృతి సౌందర్యం, స్త్రీ శరీర సౌందర్యం. అవి రాసుకోటానికి పురాణ కథ నడ్డం పెట్టుకుంటాడు. కథ మీద, భక్తి మీద అతనికి ఆసక్తి నాస్తి. నా అనుమానం కాళిదాసు ‘రుతు సంహారము’ లోని పద్యాలు, ఇతర కావ్యాల్లోంచి అతని ఎడిటర్లు లాగి పడేస్తే, అతను వాటిని వేరే పుస్తకంగా కలిపి కుట్టుకున్నాడని. నా ఉద్దేశంలో అదే అతని రచనలన్నిటిలో ఉత్తమమైనది.)

    2. ఈ పుస్తకం ప్రకారమే, శివునికి గంగ రెండో భార్య అన్న భావన చెల్లదు. పుస్తకం మొదట్లోనే నారదుడు, శివుడికి పార్వతికి పెళ్లి అవుతుందని, పార్వతికి సవతులు ఉండరని చెపుతాడు. “సమాదిదే శైక వధూం భవిత్రీం ప్రేమ్ణా శరీరార్ధహరాం హరస్య.”

      తన సేవకై వచ్చిన పార్వతిని, శివుడు స్వయంగా దీవించుతాడు. “అనన్యభాజం పతిమాప్నుహీతి”

      నన్నెచోడుని కావ్యంలో శివుడు, గంగ గురించి, ఆ కవి ఏం రాసుకున్నాడో నాకు తెలియదు.

    3. కాళిదాసు కావ్యంలో పార్వతికి – ‘స్వేదం’ ఉన్నది. కావ్యం చివరలో, పార్వతి శివుడి కోసం తపస్సు సాగించాక, శివుడు ఆమెను మారు రూపులో పరీక్షించాక, తన పరీక్ష ముగించి, ఆమె చెయ్యి పట్టుకుంటే, ఆమె ఒళ్లు వణికి, చెమట పడుతుంది.

      “తం వీక్ష్య నేపథుమతీ సరసాంగయష్టి:”

      It’s not a hot shot poem either.

      I prefer Parvathi did not sweat. Perhaps a few tiny beads of perspiration on her nose, may be? No, not really. It is not romantic. Like హెచ్చార్కె says, “చెమట ఏమంత రొమాంటిక్‌గా వుండదు / రొమాన్స్ లేనిది కవిత్వం కాదు”

    అంతేనండీ, ప్రస్తుతానికి. – Lyla
    ( కొన్ని అక్షరాలు రాయటం నాకు రాలేదు. Sorry.)

  384. తాటిపండుకల్లు గురించి S A RAHMAN,CHITTOOR గారి అభిప్రాయం:

    02/24/2017 9:53 am

    ముచ్చటైన కవిత చాల బాగుంది.

  385. గులకరాళ్ళు గురించి S A RAHMAN,CHITTOOR గారి అభిప్రాయం:

    02/24/2017 9:48 am

    చక్కటి కవితలు. నిజంగా గులక రాళ్ళు కాదు, గులక రత్నాలు.
    es.e.rahamaan,chittUru.

  386. నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    02/12/2017 3:45 am

    ‘ఈమాట’ పత్రికా భూతపూర్వ సంపాదకదిగ్గజాయమానులు, సహృదయులు శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారు చమత్కారికగా ప్రస్తావించిన దిగ్గజద్వయీ పుంస్త్వ-పుంస్త్వేతరత్వనిర్దిదిక్షకు మునుపు సమాధేయాలుగా రెండు మనవి మాటలు:

    దిగ్గజాలు పుంస్త్వభావాన్ని పొందినప్పుడు గజశాస్త్రంలో భద్రగజాలకు ఆవశ్యకమైన ‘మదము’ లేనందువల్ల ఆ ఇద్దరిలోనూ ‘ఉద్ధతులూ’ లేరు; విద్వన్మాన్యులైన మీకు తన్మధ్యోపగతమైన అల్పీయత్వమూ లేదు.

    ఆ పద్యం అంతగా మీ అభిమానానికి నోచుకొన్న కృష్ణదేవరాయల కుమార్తె అని చెప్పబడే మోహనాంగి రచన కాదు; అది సంకుసాల నృసింహకవి రచించిన కవికర్ణరసాయనంలోని (3-25) వ పద్యం.

    ఇక, అసలు సంగతి: శ్రీ కామేశ్వరరావుగారు నాకు అభిమానపాత్రులు. అద్యతనకాలంలో తమ వ్యాసాల ద్వారా (పద్య) కవిత్వాభిరుచిని బహుముఖీనం చేయటానికి ప్రయత్నిస్తున్న సాహిత్యికులుగా వారంటే అభిమానం నాకు. అందువల్ల ఎప్పుడైనా వారితో అభిప్రాయైకధ్యం విలోపించినా, దిగ్గజాష్టకంలో నా ‘వామనత్వ’మూ, వారి ‘సుప్రతీక’త్వమూ సార్వభౌమంగా తెలిసినవే కనుక “పోరు” నీరాట వనాటాల జోరుగా పరిణమించే అవకాశం లేదు. నేరమిని గూర్చిన చర్చ కాదన్న నేరిమితోడి కూరిమితోడి పోరిమి కాబట్టి నన్నెచోడుని మాటలలోనే చెప్పాలంటే, “అభిరామఘోరంబు” అని ఎవరైనా అనుకోవచ్చును. 🙂

    అయినా, ఆత్మీయతానైమిత్తికమైన ముహూర్తకాలచక్రంలో షష్ఠాష్టకమేమీ లేనందువల్ల గాయనశాఫరికపాఠకులకు వాక్పుష్పాపచయం పరిహాసభాజకం కాగల ఆ మాత్రపు పోరు జరిగే అవకాశమూ కనబడటం లేదు. 🙂

    నన్నెచోడుని కుమారసంభవంలో శ్రద్ధావైసాదృశ్యం కలరూపు ఎటువంటిదో ప్రతిపద్యాన్ని పరీక్షానిషోపలం పైని గీచి చూచినప్పుడు కాని తెలియదు. కామేశ్వరరావు గారు ప్రకటించిన పద్యం పరిశీలనీయం అని తోచి మైత్రీధర్మంగానే నేను ఆ వాక్యాలను, మరొక పద్యం క్రింద మరికొన్ని వాక్యాలను వ్రాశాను. నా అభిప్రాయం సమంజసం కాకపోతే సరిదిద్దుకోవటానికి నేనెప్పుడూ సిద్ధమే.

    వెన్నుడును వెన్ను నితవరి
    గున్నయేన్గుల జమ్ Eliot లుండ
    ఎన్న నేటికి Pound రకేశుని
    కున్న సత్త్వంబున్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    మీకెప్పుడైనా వీలైనప్పుడు ఈ వ్యాసాన్నీ పరికింపగోరుతున్నాను: వాకిలి పత్రికలో “పోతన – నన్నెచోడులు చిత్రించిన మన్మథుని రథనిర్మాణం”

  387. నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:

    02/11/2017 7:47 pm

    ఇద్దరు సాహితీ దిగ్గజాలమధ్య పోరు
    ప్రారంభం కాకముముందే
    రెండు మాటలు చెప్పనోపుదున్
    ఓరుపుతో వినుడీ!

    Gee! ఆదిలోనే హంసపాదా?
    రెండు సాహితీ దిగ్గజాలు అనాలా?
    ఇద్దరు సాహితీ దిగ్గజాలు అనాలా?
    ఇది కుంటి ప్రశ్నకాదు సుమా!
    (ఈ విషమ సమస్యా పరిష్కారం వాళ్ళిద్దరికే వదిలేద్దాం)

    ఎప్పుడో, ఎక్కడో చిన్నప్పుడు చదివిన గుర్తు.
    ఉద్ధతులమధ్య “అల్పులకుండ” తరమే! అని.
    ముందుగానే క్షమాపణలు చెప్పుకుంటూ,
    ( Forgime me for my rude and un-metrical improper prosodaic interpolation, My dear Mohanamgi and His Highness KrishnadEvaraaya!)

    But semi-seriously, అసలువిషయం:
    ఈ రాబోయే సాహితీ రణం తలచుకుంటే,
    నాకు Bob Dylan పాడిన ”Desolation Row” అనే పద్యంలో కొన్ని చరణాలు గుర్తుకొచ్చాయి.

    Begin: స్వోత్కర్ష.
    Bob Dylan కవితలపై నేను, నవంబర్ 2016 ఈమాటలో ఒక వ్యాసం రాసానని గుర్తు.
    end : స్వోత్కర్ష.

    సదరు పద్యంలో గుర్తొచ్చిన చరణాలు ఇవిగో!

    …And everybody’s shouting
    “Which Side Are You On?”
    And Ezra Pound and T. S. Eliot
    Fighting in the captain’s tower
    While calypso singers laugh at them
    (italics are mine)
    And fishermen hold flowers…

    మన దిగ్గజాలలో ఎజ్రా పౌండ్ ఎవరో, టి.యస్.ఎలియట్ ఎవరో పాఠకులే నిర్ణయించుకోవాలి.

    సవినయంగా,
    వేలూరి వేంకటేశ్వర రావు.

  388. తాటిపండుకల్లు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    02/09/2017 9:14 pm

    “Hello Lyla!
    When you say “పండు తాటి కల్లు,” do you mean that the palmyra tree is ripe and old enough…”

    No sir! I meant పండు కల్లు. Ripe toddy. పులిసిన కల్లు కాదు. కల్తీ కల్లు కాదు. పండు కల్లు.
    ఎండు తాటి మట్ట, ఎండు కొబ్బరి మట్ట అంటే తాటిచెట్టు, కొబ్బరి చెట్టు ఎండిపోయినవని కాదు, మట్ట ఎండిపోయినదనే.
    పండు తాటికల్లు అంటే కల్లు పరిపక్వమైందని. Palmyra tree గురించి కాదు.
    తాటిపండుకల్లు అన్న heading పొరపాటనీ, కవితలోని పండుతాటికల్లు usage సరి అని నేననుకున్నా. కారణం మీరూ చెప్పారు కదా. తాటికాయ నుండి కాదు కల్లు తీసేది. తాటికాయ ల్లోని ముంజెలు (seeds 1-4) లేతవి, తింటారు. ముదురు ముంజెలు బాగుండవు. ముదిరిన తాటికాయలు పాతేస్తే కొత్త తాటి మొక్కలు వస్తాయి. అవి లేతగా ఉన్నప్పుడు తేగలంటారు. అవీ కాల్చుకు తింటే బాగుంటాయి.
    తాటిచెట్టు ఏ భాగమూ పల్లెటూరి వాళ్లు ఊరికే పోనివ్వరనుకుంటా.
    తెలుగు పల్లెటూళ్లతో మీ చిన్నప్పటి పరిచయం నేననుకోటం, తాటియాకులు, తాళ గ్రంథాలు, శ్లోకాలు వైపనీ, నా చిన్నప్పటి పరిచయం చావిళ్లు, వాములదొడ్లు, గొడ్లు, తాడి చెట్లు, తాగుడు, బూతుల పురాణంతో నని. ఐనా ప్రస్తుత పల్లెల్లో మీరూ లేరు, నేనూ లేను. అక్కడ ఇప్పటి వ్యవహారాలు నాకైతే కొంచెం కూడా తెలియవు.
    కవితలో అన్ని మాటలూ తెలియక పోయినా ‘సారాంశం’ నాకు తెలిసింది. కవిత నచ్చింది. మీరు బాగుందన్నాకేగా చదివింది. 🙂 Sure I trust you.
    Looks like we are getting inebriated on eemaata articles. Naples is equally intoxicating. Come visit వేలూరి గారూ! Come visit.
    Lyla

  389. రెండు కవిత్వాలు గురించి హెచ్చార్కె గారి అభిప్రాయం:

    02/09/2017 1:21 am

    1. కామేశ్వ‍ర‍ రావు గారు, థాంక్యూ. నేను పేర్కొన్న ముగ్గురూ స‍ంప‍న్నులు కాదు గాని, చెమ‍టోడ్చిన‍ వారు కూడా కాదు. నేనీ మాట‍ వేమ‍న‍, వీర‍ బ్రహ్మం వ‍ంటి తాత్విక‍ క‍వుల‍ గురించి అన‍ను. చాల‍ మ‍ంది భ‍క్తి క‍వుల‍ గురించి అన‍గ‍ల‍ను. వారు అన్నం కోసం… కలిగినోళ్లను ఆశ్రయించారు లేదా భిక్ష మీద‍ ఆధార‍ప‍డ్డారు. ఇది వారిని త‍క్కువ‍ చేయ‍డానికి అంటున్న మాట కాదని మ‍న‍వి.

    2. మ‍రో సారుకు జ‍వాబు. ‘కవిత్వాలు’ అనేది నిఘ‍ంటువులో దొరుకుతుంద‍ని నేనూ అనుకోను. ‘రెండు క‍విత‍లు’ కాదు, ‘రెండు క‍విత్వ‍పు ర‍కాలు’ అని నా క‍వి హృద‍య‍ం మీకు తెసిస్తే చాలు. 🙂 క‍వి స‍మ‍య‍మ‍ంటే క‍వితా ప‍ర‍ంగా మాత్రమే వున్నదని క‍దా?! 🙂

  390. రెండు కవిత్వాలు గురించి Html గారి అభిప్రాయం:

    02/05/2017 7:57 pm

    కవిత్వాలు అంటే ఏమిటండి? నిఘంటువు చూసినా అర్ధం దొరకలేదు

  391. రెండు కవిత్వాలు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    02/05/2017 4:01 am

    ఉన్నవాళ్ళ లేనివాళ్ళ బతుకు చిత్రాల మధ్యనున్న కాంట్రాస్టుని శక్తివంతంగా పట్టి చూపిన కవిత. బతకడానికి చెమటోడ్చే మనిషికి చెమట రొమాంటిక్‌గా ఉండదేమో కానీ, ఎండకన్నెరుగని సున్నితదేహాలకి అదికూడా రొమాంటిక్ దినుసే!

    కవిత చదవగానే నాకు మొన్నీ మధ్యనే మళ్ళీ చదివిన పెన్నేటిపాటలో పద్యాలు గుర్తుకొచ్చాయి:

    ఈ యింటనున్నట్టి యిటుకగోడల పాలగారలో అద్దాలు కలిసిపోవు
    ఈ యింటి మహిడీల నెక్కిన చానల వేనలిలో మబ్బుసోన లూరు
    ఈ యింట దిరుగాడు నింత పిల్లియు నూరిపెద్ద రైతుల నిలవేయ జాలు
    ఇచట త్రేన్పులె కాని విన్పింప వూర్పు, లిచట రూకల గలగల లెత్తిపోవు
    ఇచట లక్ష్మీసరస్వతులే వసింతు, రిచట లేనిది మానవహృదయ మొకటె

    ఈ యింటి యజమాని ఎంత విద్యావంతు డెపుడు భాగవతమ్మునే పఠించు
    ఈ యింటి యిల్లాలు పూయించు గన్నుల కొల్లలు కొల్లలు మల్లెపూలు
    ఈ యింటి కొడుకొక్క డింగ్లాండులో ప్రజాస్వామ్యశోధన నెంతొ జరిపి వచ్చె
    ఈ యింటి కూతురు పోయిన యేడె సాంఘికశాస్త్రమున పట్ట మొకటి గొనియె

    ఎచట జూచిన చిత్రాలు నెన్నొ శిల్పఖండములు కనిపించు నెక్కడను మలిన
    మన్నదేలేదు కాని సంపన్నగృహము చొచ్చి చూచిన నాత్మయే శూన్య మిచట

    ఎటు చూచినా ప్రక్కలెండి యున్నారు
    ఎటు చూచినా విలాపించుచున్నారు
    ఎటు చూడలేక తమ కిటికీలు మూసుకొని
    కటు జీవిత యథార్థ కథ చూడకున్నారు

    అయితే, ఈ “రెండు కవిత్వాలు” కవితలో భావకవిత్వాన్నీ (“అన్నీ జాగర్తగా తుడిచి వుంచిన గాజు పదాలు”), భక్తికవిత్వాన్నీ (“దేవుడికీ భక్తుడికీ మధ్య రొమాన్స్ కవిత్వం”) ఒకే గాటకింద కట్టేయడం సబబుగా లేదు. భావకవిత్వంలో భక్తి ఒక భాగమయినా (ఏకేశ్వరోపాసన), భక్తికవిత్వం అంతకన్నా ప్రాచీనమైనదీ, ప్రత్యేకమైన ఉనికి కలదీనూ. ఆ భక్తికవిత్వం పాడిన భక్తులెవరూ చెమట మరకలంటని అందమైన భవనాల్లో ఉండినవారు కారు. అంతెందుకు, ఈ కవితలోనే ఉదాహరించిన ముగ్గురు కవులుకూడా అలాంటివారు కారు. అంచేత ఆ భాగం మిగతా కవితతో అతకలేదు సరికదా ఒక distraction అనిపించింది.

  392. గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి తెలుగువాడు గారి అభిప్రాయం:

    02/04/2017 11:32 am

    అద్భుతంగా ఉందండి. మా తెలుగు తల్లికీ అనే పాటనీ, జయ జయ ప్రియ భారత జనయిత్రి అనే దాన్నీ, వ్యాస భాగవతాన్ని, వాల్మీకి రామాయణాన్నీ, వ్యాస భాగవతాన్నీ కూడా ఇలా తయారుచేయండి. పనిలోపనిగా కవిత్రయం రాసిన భారతాన్ని కుడా. మనకున్న జాతీయ పక్షి నెమలినీ, అలా దేశనికి సంబంధించిన మిగతా వాటినీ కూడా “దయచేసి” వె-హెక్-కిరించండి. మిగతా తెలుగువాళ్ళందరూ బా-హెక్-గా మెచ్చుకుంటారు, ఇక్కడ పాఠకులు మెచ్చుకున్నట్టే. పనిలో పనిగా ఇక్కడ వాడినట్టే, శాస్త్రి, అవధాన్లు, వెంకటేశ్వర్లు అనే బ్రహ్మణ పదాలు బాగా వాడండి. మన కుల గజ్జిని బాగా గోకవచ్చు. అప్పుడు మిగతా కులస్థులందరూ అబ్బో, ఓహో ఆహో అని మిమ్మల్ని ఆకాశనికెత్తేస్తారు. అది ఎంఅతటి గౌరవమో మళ్ళీ చెప్పక్కర్లేదు.ఇవన్నీ ఒక పుస్తకంగా వేస్తే తెలుగువాళ్లందరూ – మనం శుద్ధ వెధవాయిలం కనకే – వెకిలిగా నవ్వుకుంటూ అవన్నీ కొనుక్కుని మిమ్మల్ని నోబుల్ బహుమతికి ఎంపిక చెస్తారు. అలా వచ్చిన డబ్బులతో కోకో కోలాలు తాగుతూ ఎన్-హెక్-క్కా రిటైరైపోవచ్చు.

    తమిళ తంబిల దగ్గిర ఎం.జి.ఆర్ గురించీ, అన్నా దురై గురించీ, వాళ్ళ కవి తిరునక్కరసు గురించి కూడా రాయగలరా? అది తమిళ తంబిల దగ్గిరకి తీసుకెళ్ళండి. వెళ్ళేముందు ఓ తలగడ పట్టుకెళ్ళండి కూడా. వాళ్ళు పేడ నీళ్ళు మొహం మీద జల్లి పళ్ళు రాలగొడితే కాచుకోవడానికి.

    ఇదే మనకున్న దౌర్భాగ్యం. మన వాళ్లని, మన కున్న విలువల్నీ మనమే కాపాడుకోలేము. నాలుగు ఇంగ్లీషు పుస్తకాలు చదగానే మనం పోతన పురాణాన్ని అడ్డం పెట్టుకుని వెక్కిరించడానికి తయారు. సిగ్గుపడవల్సిన విషయం. మరి Jordan Bass ని Jord-AN b-ASS లా విడగొట్టుకోవచ్చు కదా? Then all capitals added together makes better words too. Yup why not?

  393. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    02/03/2017 12:04 pm

    మొదటి సంగతి: ‘అనుక్త మన్యతో గ్రాహ్యమ్’ అన్నట్లు కాళిదాస కుమారసంభవాన్ని ముందుంచుకొని చదివితే గాని ఈ పద్యార్థం బోధపడదు. కాళిదాసు వర్ణించినది పార్వతీ మనోజ్ఞతనువుపై చిలికిన తొలకరి జలకణాల స్థితిగతులను. ఆ కల్పనలోని సౌందర్యాతిశయం, అభినవత్వం, భావధ్వని, ప్రతిపదాన్ని ఆచితూచి ఎన్నుకొన్నప్పటి పరికరాలంకారపు దివ్యశోభ – వ్యాఖ్యాతల మనస్సులనే గాక మహాలంకారికుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఆ గంభీరిమను వివరించేందుకు దానిపై లెక్కలేనన్ని వ్యాఖ్యలు వెలిశాయి. అనర్ఘమైన శ్లోకం అది.

    తెలుగు కవి రూపిస్తున్నది అడరు నవాంబుధారలను. అంటే, వర్షర్తువేళ క్రమక్రమంగా విజృంభిస్తున్న నవాంబుధారల స్వస్థితిని. ఎంత నవంనవములైనప్పటికీ అతిశయిస్తున్నవి అంబువుల “ధారలు” కనుకనే అవి జటాటవిలో “విభ్రమించటం” (తిరుగుళ్ళు పడటం) సంభవించింది. తొలుకారు నాటి నీటిచుక్కలైతే జటాటవిలో విభ్రమించే అవకాశమే ఉండేది కాదు. బిందువులకు విభ్రమించటం ఉండదు. జలధారలు కాబట్టే విభ్రమణాన్ని పొందాయి. ఎట్లా పొందాయి? అంటే, పరమేశ్వరుని వలె పార్వతీదేవి కూడా కేశపాశాన్ని కపర్దజటాజూటోపమంగా బంధించి ఉన్నందువల్ల ఆ మహాజటాటవిలో అంబుధారలు చిక్కుకొని కేశావర్తాల వెంబడిని తిరుగుళ్ళుపడవలసివచ్చిందని భావం. దట్టమైన చుట్టుకురులకోసం పాపం పార్వతికి సైతం జటాటవిని కల్పింపవలసివచ్చింది. అంతకు ముందు పద్యంలోనే (6-108) పార్వతి అందమైన జడలపై తొలకరి నీటిబిందువులు ముత్యాల సేసల వలె మనోహరంగా ఉండటాన్ని వర్ణించాడు. అంతలోనే ఆ సంగతిని మర్చిపోయి, లేనిపోని జటాటవిని తెచ్చిపెట్టుకోవటం వల్ల – ఆ జటాటవిలో విభ్రమింపవలసివచ్చిన “అడరు నవాంబుధార”లను తెచ్చిపెట్టుకొని తబ్బిబ్బయ్యాడు. అంతకు క్రితమే నెఱిజడలతో ఉన్న పార్వతీదేవి అంతలోనే వేణీబంధకపర్దిని అయినప్పటికీ, అది సమున్నద్ధశిఖండకం కాక, ఆవర్తాకారంలో కుంభీబంధసంయుక్తమై సముల్లేఖ్యంగా ఉన్నప్పటికీ – దానికి జటాటవితో తాద్రూప్యం సరికాదని చూసుకోలేదు. అననురూపమైన ఆ జటాటవిలో వర్షానవాంబుధారలు విభ్రమిస్తుండటం పార్వతీ కేశవర్ణనకు శోభాహేతువు కాదని కవి గ్రహింపలేదు.

    అంబుధారలు “వెల్వడి, చనుదెంచి” అంటే, పార్వతీజటాటవిలో విభ్రమించి విభ్రమించి, అక్కడినుంచి బైటపడి వచ్చి – అన్నమాట. “వెల్వడి” అంటే సరిపోయేది. “వెల్వడి, చనుదెంచటం” ఎందుకు? వెల్వడిన తర్వాత ఎక్కడికి చనుదెంచినట్లు? పోనీ, ఫాలాగ్రసీమకో ఎక్కడికో అక్కడికి చనుదెంచిన తర్వాత, “రాలుగొనటం” ఎట్లా సాధ్యమైంది? ‘రాలుగొను’ అన్న ఆ విచిత్రమైన ధాత్వర్థానికి కవి అనుకొన్న భావం ఏమిటో కవికే తెలియాలి. ఎంత సూర్యరాయ నిఘంటువు సర్దిచెప్పినా, ‘గళితమై, క్రిందికి జాఱి’ అన్న అర్థంలో ‘రాలు’ ధాతువుపై క్త్వార్థకమైన ‘కొను’ ధాతువు చేరి ‘రాలుగొని’ అని స్వార్థంలో రూపం ఎట్లా ఏర్పడుతుంది? నీళ్ళకు ‘రాలటం’ ఉండదు కనుక జలధారలకు ‘రాలుగొను’ అన్న భావార్థక స్వతంత్రక్రియాకల్పన సార్థకం కాదు. ఆముక్తమాల్యద (4-82) లో “నవమేఘపృథుకములకు రాలె నొయ్యన వడగండ్లు పాలపండ్లు” అన్నప్పుడు అక్కడ శిశువులకు పండ్లు రాలటమూ ఉన్నది; మేఘాల నుంచి వడగండ్లు రాలటమూ ఉన్నది. అది సార్థకమైన ప్రయోగం. ప్రకృతపద్యంలోని నీటిధారలు ‘రాలుగొనటం’ వ్యర్థకల్పితమని గ్రహించాలి. అందుకే దానికి ప్రయోగాంతరాలు దొరకవు.

    కేశబంధం నుంచి (ఫాలస్థలికి కాబోలు) వెల్వడి, (అక్కడినుంచి) చనుదెంచి, రాలుగొంటూ – అంటే, రాలుకుంటూ (క్రిందికి జారుతూ) వచ్చిన జలధారలు కనురెప్పలపై పడి, ఆ పక్ష్మములు (కనురెప్పలు) పక్ష్మలములు (దట్టమైన వెంట్రుకలు కలవి) కావటంవల్ల “వెడ నిల్చి” = కొద్దిసేపు నిలిచిపోయాయన్నమాట. నిలిచినవి ప్రథమోదబిందువులు కాదని, అడరు నవాంబు“ధార”లని అంతలోనే కవి మర్చిపోయాడు. కాళిదాసు వర్ణనలో “ఉదబిందువు-లు” అని బహువచనం ఉన్నది కాబట్టి వాటికి అవిరళత్వం చెప్పబడిన మాట నిజమే. ఎంత అవిరళములైనా, అవి నీటిచుక్కలు. “అడరు నవాంబుధారలు” కావు. ఎంత దట్టమైన కనురెప్ప అయినా, ప్రథమోదబిందువులకు వలె అంబు“ధార”లకు ఆ రెప్పపై నిలుకడ ఎలా సాధ్యమని తెలుగు కవికి తోచలేదు. ‘స్థితాః క్షణం పక్ష్మసు’ అన్నది ‘పక్ష్మములన్ వెడ నిల్చి’ అని తెలుగయింది కాని, అది ఉదబిందువులకు అనువర్తించినట్లుగా అంబుధారలకు వర్తింపదు. “ధార” అన్న తర్వాత, అవిచ్ఛిన్నగతి మూలాన “నిలుకడ”కు వీలుండదు కదా.

    ‘తాడితాధరాః’ అన్న కర్మవాక్యం తెలుగులో ‘మోవిపై పడి’ అయింది. మోవిపై పడిన ధారలు ఏమైనాయో తెలుగు కవి చెప్పకపోవటం వల్ల – క్రిందిపెదవి యొక్క స్వాభావికమృదుత్వం వ్యంజింపబడిన సంగతి శ్లోకాన్ని చదవనివాళ్ళకు తెలియదు. అధ్యాహారవిషయస్ఫురణ కలుగదు. పయోధరముల ఉత్సేధం (ఉన్నతి, కాఠిన్యము), వాటిపై ఉదబిందువుల నిపాతం, తత్ఫలితంగా ఉదబిందువులు చూర్ణితాలు కావటం అన్న కాళిదాసు శ్లోకంలోని అద్భుతావహమైన పరిణామక్రమమంతా తెలుగులో “మోవిపైఁ బడి”, “కుచఘట్టనన్” అన్న కరుకు మాటలతో కుప్పకూలిపోయింది. ఆ కుచఘట్టన వలన – అంటే, స్తనములతోడి ఒరపిడి వలన ఆ అంబుధారలు చెదరి = చెల్లాచెదరై(నందువల్ల); పాఱి = పరువులెత్తి లేదా పునఃప్రవాహగతిని పొంది; రయంబునన్ = వేగంగా (?); ముత్తరంగలన్ = మూడు వళులనెడి విషమరేఖలయందు (తత్తన్మధ్యములందు); మడుగులువాఱి = నిమ్నోన్నతములందు చిక్కినవైనందున మడుగులు కట్టి (?) – అని భావం. ఒక్క వాక్యశకలంలో ఇన్ని అన్వయింపని వ్యర్థపదాలెందుకు?

    కొందరు విమర్శకులు “నాభికిన్ + ఎడము + ఆనక + చొచ్చెను” అని పదచ్ఛేదం చేయటం సరికాదు. ఆ పక్షాన యతిభంగం. కొందరు వ్యాఖ్యాతలు “నాభికిన్ + ఎడ + మానక = చోటువిడువక” అని వ్రాసిన అర్థం కూడా సరిపడదు. నాభికి చోటువిడువకపోవటం ఏమిటి? దానికి ‘స్తనముల రాపుచే చెదరి, ప్రవహించి, మూడు వళులందు మడుగులుగా నయి, నాభియందు సంపూర్ణముగా ప్రవేశించెను’ – అని ముద్రితప్రతులలో ఉన్న తాత్పర్యం ఎట్లా సరిపడుతుంది? ‘మడుగు కట్టిన నీటికి’ అన్న అర్థంలో ‘మడుగులు వాఱటం’ అన్న క్రియారూపం ఎట్లా ఏర్పడుతుంది? “మడుగులుగా” అయిన తర్వాత, మళ్ళీ పాఱే ప్రవాహగతి ఎట్లా సిద్ధిస్తుంది? “చోటు విడువక”, “సంపూర్ణముగా ప్రవేశించటం” ఏమిటి? ఇన్ని వ్యర్థపదాలకు అర్థం ఎట్లా పొందుపడుతుంది?

    అక్కడ నిజానికి, “నాభి + కెడ + మానక” అని చదువుకోవాలి. “కెడ” అంటే పార్శ్వసంగతి. “చెదరి తోఁ బఱతెంచు చెందమ్మిఱేకులు గెడగొని మొగుపుఁ గెంగేలు గాఁగ” అని కుమారసంభవం (9-72) లోనిదే మరొక ప్రయోగం. జలధారలు వళుల వద్ద మడుగులు కట్టి ఆగిపోక, నాభి వైపునకు సైతం పరువులువారటం మానక – అని కవిహృదయం.

    నీటిచుక్కల నాభీప్రవేశాన్ని అభివర్ణించటం నాభియొక్క లోతును సూచించటానికి – అన్నది భావ్యమే. వళులలోనికి జారిన ఉదబిందువులు “చిరేణ” = నెమ్మది నెమ్మదిగా పొక్కిలిని చేరాయని మాత్రమే కాళిదాసు. “మానక చొచ్చెను” అన్నప్పుడు అంబుధారల ప్రవాహగతి అవిచ్ఛిన్నంగా కొనసాగి, శ్లోకభావం భగ్నమైపోయింది. ‘చేరెను’ అనక, “చొచ్చెను” అన్నందువల్ల, అంబుధారలు నాభిలోనికి ప్రవేశించి అంతర్ధానమైపోయినట్లు ఊహింపవలసివస్తుంది. అది నాభియొక్క ప్రకరణోచితమైన గంభీరిమకు తగని పదసంగతి. ఆ విధంగా జటారణ్యంలోనుంచి వెలువడి, చనుదెంచి, రాలుగొని, దట్టమైన కనురెప్పలపైని ఆగి, కుచఘట్టన మూలాన చెల్లాచెదరైన నవాంబుధారలు వళుల వద్ద మడుగులు కట్టి, ఆ మడుగులు మళ్ళీ ప్రవాహగతిని మానక నాభికి అభిముఖంగా పరుగులుతీసి, ఆ నాభియందు చొరబడటం ప్రకృతిసహజం కాదని, కవితాత్మకం అసలే కాదని, నాయికాసౌందర్యవర్ణనలో అనౌచిత్యాపాదకమని కవికి తోచలేదు.

    అద్భుతావహమైన కాళిదాసు శ్లోకానికి అసమర్థమైన అనువాదం ఇది. ఇందులో ఏ అలంకారమూ లేదు. శ్లేష అసలే పొందుపడదు. స్వభావోక్తికి తావులేదు. పరికరం పద్యం మొదట్లోనే భగ్నమైపోయింది.

    పెద్దలు ఈ మాటను అంటున్నందుకు మన్నించాలి. పూర్వకవుల పద్యాలలో ఈ విధంగా ఇన్ని సరిపెట్టుకోవలసిన అన్వయదోషాలు కనబడేది మచ్చుకు ఒకటి కూడా ఉండదు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  394. తాటిపండుకల్లు గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:

    02/02/2017 7:12 pm

    Excellent poem.

    కవిత మొత్తంలో అందంగా ఇమడని ఒకేఒక్క మాట, “బుద్ధిమంతుడు.”

    మరో విషయం. తాటికల్లు గురించి నాకు మరుపురాని అనుభవాలున్నాయి. పండిన తాటిపండునుంచి కల్లు రాదనుకుంటాను. ముదిరిన ముంజెలొస్తాయి. కవి ఉద్దేశం వేరుకావచ్చు.

    ఏది ఏమయినా I am a strong believer in Roland Barthes. It’s the reader that really completes a poem.

    అబినందలతో,
    వేలూరి వేంకటేశ్వర రావు.

    ps: When I was the Chief Editor of eemaaTa, where were you? Hybernating?

  395. చెప్పేదెవరు? గురించి విన్నకోట నరసింహారావు గారి అభిప్రాయం:

    02/01/2017 9:27 pm

    కవిత బాగా వ్రాసారు బండి వారూ. నిర్వేదానికి “ముగింపు ఎక్కడో? ఎన్నడో?” తెలిస్తే అంతకన్నా కావలసినదేముంది?

  396. గులకరాళ్ళు గురించి శ్రీహరి గారి అభిప్రాయం:

    02/01/2017 7:37 am

    చక్కటి కవితలు. సరళమైన పదాలు.

  397. ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి చంద్ర మోహన్ గారి అభిప్రాయం:

    01/06/2017 2:54 am

    మంచి కవిత్వం గురించి మంచి పరిచయం. ’పరిచయం ఇలా ఉండాల” అని చూపించగలిగినంత మంచి రచన. అభినందనలు.

  398. ఒక్కో రోజు గురించి సాయి.గోరంట్ల గారి అభిప్రాయం:

    01/05/2017 10:04 am

    అనుకోకుండా ఈ పొయెమ్ చూశాను. మానస సరోవరాన స్వేచ్చగా మెదిలే మీ కవిత. చాలా బాగుంది మీ కవితాఝరి.

  399. ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి సాయి.గోరంట్ల గారి అభిప్రాయం:

    01/05/2017 10:01 am

    తన నుంచి జాలువారిన కవితల్నిలా మాలగా గుచ్చి మాకందిచడం. చాలా గొప్పగా వుంది. తన ప్రతి కవితా నాకు అత్యంత ఇష్టం.

    థాంక్యూ మానస గారు

  400. ఏకాంతం కోసం గురించి సాయి.గోరంట్ల గారి అభిప్రాయం:

    01/05/2017 9:53 am

    హ్మ్ చాలామంది పేదల బతుకు చిత్రం ఈ కథలో కనిపించింది. వేలాది మంది పార్కర్లు కళ్ళముందు కనిపించారు. ఏడవడానికి స్థలం దొరక్కపోవడం… ఏ స్మశానమో తప్ప మరేదీ సాంత్వన ఇవ్వదేమో తనకు.

    కథలో చమక్కులా కవిత్వం(ఆకాశంలో టీ మరకలు) కూడా చాలా బాగుంది.

    ధన్యవాదాలు శారద గారు.

  401. చిత్రకవిత్వరీతులు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    01/04/2017 11:55 am

    మాన్యులు శ్రీ తిరుమల కృష్ణదేశికాచార్యుల వారికి
    నమస్కారములతో,

    చిత్రకవితావాఙ్మయానుగతములైన వివిధశాఖలను పరిచయం చేస్తూ ప్రధానంగా చ్యుతకచిత్రాలను అధికరించి మీరు వ్రాసిన వ్యాసం గంభీరమైన మీ వైదుష్యానికి, వైయాత్యపూర్ణమైన వ్యాఖ్యానశక్తికి అనురూపమై ప్రామాణికంగా ఉన్నది. దీనిని కొనసాగించి మీరు తక్కిన అన్ని శాఖలను ఇదే తీరున సోదాహరణంగా వివరింపగలరని ఎదురుచూస్తుంటాము.

    చ్యుతకచిత్రాలలో బిందుచ్యుతకం, మాత్రాచ్యుతకం, వర్ణచ్యుతకం మొదలైన భేదాలు అనేకం ఉన్నాయి. లక్షణగ్రంథాలు వీటిని వర్ణచిత్రప్రభేదాలు గానూ, విదగ్ధముఖమండనం వంటివి ప్రహేళికలు గానూ గుర్తించాయి. అయితే, భేదకధర్మం వల్ల చ్యుతకచిత్రాలను ప్రత్యేకశాఖగా పరిగణించటమే సమంజసం. మీరన్నట్లు గణపవరపు వేంకటకవి వీటిలోని అనేకవిశేషాలను పేరుపేరున ప్రదర్శించాడు. శ్రీ చామరాజనగరం రామశాస్త్రి గారు తమ ‘సీతారావణ సంవాద ఝరి’ లో వీటిని సరిక్రొత్తగా అన్వయించి, వర్ణచిత్రాలలో చ్యావితాక్షరం, అధిదత్తాక్షరం, ప్రతిదత్తాక్షరం అని చేసిన ప్రయోగాలను మీరు తెలుగులో వివరించిన తీరు చాలా బాగున్నది. సుగృహీత నామధేయులైన యీ రామశాస్త్రి గారు అలంకారకౌస్తుభాది బహుగ్రంథకర్త అయిన పరకాల మఠాధీశ్వరులు శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర యతీంద్రుల వారితోపాటు మైసూరులో శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారికి శాస్త్రగురువులు. ఒకానొక విద్యావివాదంలో అహమహమిక ఏర్పడి, అపురూపమైన ఈ చిత్రకావ్యాన్ని వినిర్మించారు. వీరి సోదరులు శ్రీ మహాలింగశాస్త్రిగారు కూడా చిత్రకవులే. మీరన్నట్లు ఇది అసంపూర్ణమై ఉండగా వీరి శిష్యులు శ్రీ మైసూరు సీతారామశాస్త్రుల వారు దానిని పూర్తిచేశారు. అది నాగరిలిపిలో అచ్చయింది. ఆ విధంగానే రామశాస్త్రిగారి 50-వ శ్లోకం తర్వాత 51-వ శ్లోకం నుంచి ‘సీతారావణ సంవాద ఝరి’ని శ్రీ బచ్చు సుబ్బారాయకవి గారు కూడా చక్కటి శైలిలో కొనసాగించి, తెలుగు అర్థతాత్పర్యాలతో రెండుసార్లు ప్రకటించారు. ఇటీవల శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు దీనిని రెండు భాగాలుగా అనువదించారు.

    మీరు ఈ వ్యాసపరంపరను కొనసాగించి, చిత్రకవిత్వవిమర్శశాఖను ఇతోఽధికంగా పరిపుష్టం చేయండి.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  402. గుప్పిట ప్రేమ గురించి పూర్ణ చంద్ర గారి అభిప్రాయం:

    01/03/2017 1:14 pm

    అద్వితీయం…మీ కవిత…భావుకత్వం ఎల్లలని చెరిపేసి, హృదయ స్పందనలను ఆకాశగమనం గావించింది..అనేకానుభూతుల స్వర్గధామంలా..ప్రేమలో రస మాధుర్యం పున్నాగపూలలా విరగబూసింది. చాలా చాలా బాగుంది…మీకవిత… సుపరిమళాల తోటలా

  403. రాజేశ్వరీదేవి: శైవలిని గురించి పూర్ణ చంద్ర గారి అభిప్రాయం:

    01/03/2017 12:21 pm

    అద్భుతం…గుండె లోతుల్లో స్పృశిస్తూ…దాచుకున్న చిన్ననాటి స్మృతులను తోడి తీసేలా….ఆధునికతను వెనక్కినెట్టి మన జీవిత తొలినాళ్ళ తడబడు అడుగుల దారులతో పయనమయ్యేలా… జీవన స్మృతుల మాధుర్యాలను కమ్మిన చీకటి మబ్బులను పారద్రోలేలా… మీరు అద్వితీయంగా రాసిన కవిత మళ్ళీ కాలాన్ని వెనక్కినెట్టి. తాటికాయలచక్రాలతో గట్టు మీద పరుగులెత్తిస్తోంది. గుళ్ళొ రాములవారి పాట…చెరువు గట్టున కడవల శబ్దాలు…ఎడ్లబండ్ల గలగలలు…భానుమతి రామారవు సినిమా పోస్టర్లు…టెలిగ్రాం తెచ్చిన పోస్టుమాన్ బాబాయి…చొప్పబెండ్లతో కళ్ళద్దాలతో… షావుకారు దగ్గర కొన్న పిప్పరమెంటు చప్పరిస్తూ.. స్కూల్ మాస్టారు ఎదురైతే సందులో దాక్కున్న వైనం… అమ్మ స్వయంగా కలిపి పెట్టె పెరుగన్నం…వెన్నెల రాత్రులు…బుర్రకథలు…రెడియోలో ఘంటసాల పాటలు… ఒక్కసారే ఉప్పెనలా పెనవేస్తున్న జ్ఞాపకాలు… మీ కవిత యొక్క ఉద్దేశ్యాన్ని నేను సరిగా అర్థం చేసుకోలెకపోతె మన్నించగలరు… నా వరకు…ఏదో అస్పష్టమైన…భావోద్రేకం మాత్రం కలిగింది…దాని ఫలితమే ఈ నా స్పందన… ఏది ఏమైనా…మీ కవితలు చాలా బాగున్నాయి…

  404. ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి P. Vijayalakshmipandit గారి అభిప్రాయం:

    01/02/2017 11:10 am

    కవి ఇలా అన్నాడు, “కవిత చెబుతున్నదిదీ అని వ్యక్తి నుండి Vcs చూడక్కర్లేదు, ఒక అనుభూతి చట్రం నుండి విడివడి మరొకదానిలోకి ప్రవేశించవలసిన కష్టం లేదు. బ్రతుకంతా ఒక్క మాట కోసమే పరితపించే మనిషి, ఏ ఏటికాయేడు తనను తానెట్లా నిలబెట్టుకుంటూ వచ్చిందో పుట వెనుక పుట తిప్పుతూ తెలుసుకుంటామంతే.”

    రాజేశ్వరి గారి మనసు నుండి ధారగా ఒలికిన ఈ కవితలు వంద శాతం నిజమయిన నిజాయితి ప్రేమ ఈ లొకంలొ మ్రుగ్యమనే వాస్తవాన్ని పదే పదే గుర్తు చసే కవితలు.

    ఆ సున్నిత మనస్కురాలి ఆలొచననల అక్షర రూపాన్ని బాగా పరిచయం చెసారు మనసా.

  405. ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి Kumar N గారి అభిప్రాయం:

    01/01/2017 11:50 pm

    Wow! మానసా. కొత్త సంవత్సరం మొదటి రోజు కళ్ళకి చెమ్మనిచ్చావు. థాంక్యూ.

    “‘రాత్రి కవితై పెనవేసున్న అక్షరాలు, పగలు వచనమై విడివడతాయని’ బెంగటిల్లిన రాజేశ్వరీదేవికి, తన కవితలు రేపవళ్ళు వెలిగే నక్షత్రాలై కాంతులీనుతున్నాయని ఎవరు చెప్తారు?”

    విడివడలేదు, ఇంకా చిక్కనయ్యాయి ఇతని కళ్లల్లో . మీరంటూ తెలియని వ్యక్తికి మీ అక్షరాలు కనపడక నక్షత్రాలే నిండాయి అని చెప్పండి వీలయితే.

  406. తెలుగు కథల పోటీ గురించి సిరి .లాబాల గారి అభిప్రాయం:

    12/17/2016 2:47 am

    కధ, కవిత, వ్యాసం, విమర్శ విషయం ఏదైనా కాని వ్రాస్తున్న వాళ్లకు కనీసం చదివి ఓ చిన్న స్పందన ఇచ్చేవాళ్ళు ఎంతైనా అవసరం. కాని ఈ రోజుల్లో పత్రికల్లో ప్రచురణకు నోచుకోలేదే అన్న బాధ చాలా మందిలో ఉండనే ఉంటుంది. ముందుగా మనం చెప్పే విషయం కొంతమందికి అయినా చేరాలి అంటే ఎన్నో మరెన్నో ముఖ పుస్తక సమూహాలతో పాటు చాలా బ్లాగులు వెబ్ పత్రికలు ఉండనే ఉన్నాయి. మనం వ్రాసేదాంట్లో విషయం ఉంటే మనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడతారు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వ్రాస్తూ ఉంటేనే మనలో ఉండే నాణ్యత కూడా పెరుగుతుంది.

    సిరి. లాబాల

  407. ఎవరు చూడొచ్చేరు? గురించి Venkat గారి అభిప్రాయం:

    12/16/2016 3:11 am

    కవితను కనకప్రసాద్ గారు, దార్ల వేంకటేశ్వరరావు గారు ఉదహరించిన కవిత చదవకుండానే రాస్తే గనుక చాలా గొప్ప కవిత.

  408. Yippee! I’m a poet, and I know it గురించి ఉణుదుర్తి సుధాకర్ గారి అభిప్రాయం:

    11/19/2016 2:20 am

    చక్కటి పరిచయాన్ని అందించిన వేలూరి వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.

    లిఖిత, మౌఖిక సాంప్రదాయాల లేదా ప్రక్రియలనడుమ మనమే సృష్టించుకున్న లక్ష్మణరేఖల్ని చెరిపేసుకుంటే బాబ్ డిలాన్ వంటి గాయకుల, గేయకారుల కవిత్వం ఉప్పొంగి ఉక్కిరిబిక్కిరి చేస్తుందని తెలుగు, ఇంగ్లీషు భాషల జోడుగుర్రాల పైన అవలీలగా స్వారీ చేస్తూ వచ్చి నాబోంట్లకు తెలియజెప్పినందుకు – మరీ ముఖ్యంగా ధన్యవాదాలు.

    ఈ పరిచయ వ్యాసం చదివినవాళ్లెవరైనా ఒక గాయకుడికి సాహిత్యరంగంలో నోబెల్ బహుమతి ఇవ్వొచ్చునా, కూడదా అనే అనవసరపు వివాదంలోంచి బయటపడగలుగుతారని నమ్ముతున్నాను.

  409. ఫ్రాగ్మెంట్స్ గురించి మణి వడ్లమాని గారి అభిప్రాయం:

    11/08/2016 4:28 am

    బాబా గారు చాల బావుంది కవిత ప్రాగ్మేంట్ గా

  410. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి లక్ష్మీదేవి గారి అభిప్రాయం:

    11/07/2016 3:22 am

    తెలుగు కావ్యాలను ఈ విధంగా కూలంకషంగా పరిశీలించి మౌలిక ప్రతిపాదనలను చేయడానికి పూనుకుంటున్నవారిని చూస్తే సంతోషం కలుగుతుంది.వ్యాసంలో అనేక విషయాలను పరిశీలించి చక్కగా వివరించారు.

    రసస్వరూపావగాహన లేని ఆధునిక కవులు ఎన్నో కావ్యాలను ఈ విధంగా అధిక్షేపించారు. గతశతాబ్దం నుంచే ఇది మొదలైందనుకుంటాను. దానివల్ల తర్వాతి తరాలకు ఆ కావ్యాల భాషాపరమైన ఇతరప్రయోజనాలు కూడా లేకుండా పోతున్నాయి. వ్యాసకర్త తథ్యమిథ్యా వివేచన బాగున్నది.

    దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం – కావ్యపు గుణాన్ని ఉత్కర్షించే కారణం కాజాలదు కదా? అని అనామకుడు గారన్నది వాస్తవం.(ఈ నాటి కవిత్వానికి ఉన్న పెద్ద లోపం అదే కదా.)అందువల్ల ఔచిత్య విచారణ విషయంలో మాత్రం ఇంకొంచెం అనుమానం మిగిలే ఉన్నది.

    నమస్కారములు.

  411. Yippee! I’m a poet, and I know it గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:

    11/06/2016 4:44 pm

    వాడ్రేవు చినవీరభద్రుడు గారికి,శ్యామ్‌ గారికీ కృతజ్ఞతలు.

    నేను నా వ్యాసం క్లుప్తంగా ఉంచుదామన్న ఉద్దేశంతో బాబ్‌ డిలన్‌ ‘ప్రేమ’ కవితల గురించి రాయలేదు. చినవీరభద్రుడుగారు, ఆ ప్రస్తావనతెచ్చి, ప్రేమ కవితలగురించి చెప్పవలసిన అవసరం సూచించారు.

    1965 లో లాస్‌ యాంజెలస్‌ లో పత్రికాముఖంగా డిలన్‌ చెప్పిన మాటలు:

    What does the word protest mean to you?

    “To me? Means uh — singing when I don’t really wanna sing.”

    What?

    “It means singing against your wishes to sing.”

    Do you sing against your wishes to sing?

    “No, no.”

    Do you sing protest songs?

    “No.”

    What do you sing?

    ” I sing love songs.”

    ….

    Of course, the song, Lay, Lady, Lay ‘has become one of Dylan’s best-known love songs, almost by accident.’ — (From the note in the album ‘Biograph.’)

    In addition, “On a Night Like This,” is also equally worth listening to. Both the poems are available on Bob Dylan’s web page.

    Regards,

    Veluri Venkateswara Rao

  412. Yippee! I’m a poet, and I know it గురించి Chinaveerabhadrudu గారి అభిప్రాయం:

    11/05/2016 11:11 pm

    చాలా చక్కటి వ్యాసం. డిలన్ కి నోబెల్ బహుమతి వచ్చిన తరువాత, ఇంత సవివరంగా, సమగ్రంగా ఉన్న వ్యాసం ఇంటర్నెట్ లో మరెక్కడా (ఇంగ్లీషులో) కూడా కనిపించలేదు. పాట,పద్యం- ఈ రెండింటి గురించీ శ్రీశ్రీ చాలా స్పష్టంగా చెప్పాడు: Poetry that is spoken and poetry that is sung. అని. ఆయన కవిత్వప్రస్థానమంతా పాడుకునే కవిత్వం నుంచి మాటాడుకునే కవిత్వం వైపు నడిచింది. తిక్కన పద్యం రాసినా, అది మాటాడుకునే తరహాలోనే ఉంటుందనీ, నన్నయ, కృష్ణశాస్త్రి వంటి కవులు పాడుకునే తరహాలో రాసారనీ శ్రీశ్రీ భావన. అయితే ఆయన ఆధునిక కవి. ఆధునికానంతర కాలంలో కవిత్వం తిరిగి మాటాడుకునే తరహానుంచి పాడుకునే తరహాకు మలుపు తిరిగింది. తెలుగులో ఇది విరసం ఆవిర్భావంతో మొదలయ్యింది. డిలన్ కవిత్వం పాటనే గాని, అది మాట్లాడినట్టే ఉంటుంది. బహుశా ఆ కవిత్వం సమ్మోహనీయంగా ఉండటానికి అది కూడా కారణమనుకుంటాను. ఇక డిలన్ కేవలం సామాజిక నిరసన కవి మాత్రమే కాదు, అంతకన్నా కూడా అరుదైన ప్రేమకవి. సమకాలికప్రపంచంలో ప్రేమ కవిత్వానికి అతడొక కొత్త డిక్షన్ ఇచ్చాడు. డిలన్ లోని ఆ అపురూపమైన పార్శ్వాన్ని ఈ వ్యాసం చాలా స్పష్టంగానూ, ఆవశ్యకంగానూ పైకెత్తి చూపింది. తెలుగు సాహిత్య, కళా ప్రశంసలకు వేలూరి అందిస్తున్న ఉపాదానం వెలకట్టలేనిది.

  413. రెండు కవితలు గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    11/03/2016 8:38 am

    రెండు కవితలు రెండు ఆణిముత్యాల్లా ఉన్నాయి. చాలా బాగున్నాయి.

  414. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి అనామకుడు గారి అభిప్రాయం:

    11/03/2016 5:43 am

    బహుముఖ పాండిత్యంతో, సునిశితపరిశీలనతోనూ రచించిన అద్భుతమైన వ్యాసం. ఈ కాలంలో ఇటువంటి వ్యాసాలు శ్రీ మురళీధరరావు వంటి విద్వాంసులు తప్ప మరెవరూ వ్రాయలేరు. వ్యాసాన్ని ప్రచురించిన సంపాదకులకు ధన్యవాదాలు. రచయితకు ప్రణామాలు. ఇటువంటి వ్యాసాలు మరిన్ని రచించటానికి భగవంతుడు శ్రీ మురళీధర రావు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలి.

    ఇటువంటి వ్యాసంపై ఏ చిన్న అభియోగమైనా అనుచితం అవుతుంది. అయినా ఒకట్రెండు చిన్న విన్నపాలు/ప్రశ్నలు. ఇందులో పరుషత్వమో, అసమంజసమో ఉంటే మన్నించగలరు.

    నైపథ్యానుసంజన – ఇటువంటి క్లిష్టమైన సమాసాలకు బ్రాకెట్ లోనైనా అర్థం చెప్పగలరా ఇకపై వచ్చే వ్యాసాలలో? సాధారణ పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుంది.

    శ్రీహర్షుని నైషధీయచరితం పై వ్యాసరచయిత ఇలా అన్నారు.

    ఇన్ని వందల సంవత్సరాల కాలంలో ఆసేతుశీతాచలపర్యంతమైన లాక్షణికప్రపంచం ఏనాడూ ఆయన కవితను ఉచితిమ లోపించిన కావ్యదోషప్రకరణంలో చేర్పలేదు.

    – శ్రీహర్షుని నైషధీయచరితం రచన క్రీ. శ. 12వ శతాబ్దపు కాలం నాటిది కదా. అప్పటికి ప్రసిద్ధులైన భామహ, దండి, ఆనందవర్ధన, అభినవగుప్త, క్షేమేంద్ర, మమ్మట, మహిమభట్ట, భోజ, కుంతక, జయదేవ రాజశేఖరాది పండితులందరూ గతించారు. వారెవ్వరికీ ఈ కావ్యాన్ని చదివే అవకాశం లేదు. ఆ తర్వాత లాక్షణికులలో విద్యానాథుడు, జగన్నాథుడూ తమ గ్రంథాలలో స్వీయ ఉదాహరణాలు ప్రకటించారు. ఇక అప్పయ్యదీక్షితుల వారు, సాహిత్యదర్పణకారుడు (విశ్వనాథుడు) మౌలిక ప్రతిపాదనలేవీ చేయలేదు. దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం – కావ్యపు గుణాన్ని ఉత్కర్షించే కారణం కాజాలదు కదా? లేక 12వ శతాబ్దం తర్వాత కూడా కావ్యదోషప్రకరణాన్ని సాకల్యంగా వివరించి ప్రకటించిన పండితులు ఉన్నారంటారా? వ్యాసంలోని ఆ వాక్యం భావం ఏమిటి?

    ఇది జిజ్ఞాసతో అడుగుతున్న ప్రశ్నే తప్ప వ్యాసం యొక్క ప్రతిపాదనతో విభేదించే ఉద్దేశ్యంతో అడుగుతున్నది కాదు. అదీనూ ఎందుకంటే – శ్రీహర్షుని గురించిన ఒకట్రెండు చాటుకథల్లో ఆయన కావ్యప్రకాశకారుడైన మమ్మటుని మేనల్లుడని, ఆయనకు శ్రీహర్షుడు “అశేషశేముషీ మోషపూషానశ్నామి మాతుల” అని ఒక సందర్భంలో బదులిచ్చాడని ఒక చాటువూ, మమ్మటభట్టారకుడు శ్రీహర్షునితో “నైషధీయచరిత కావ్యాన్ని నేను ముందుగా చదివి ఉంటే బావుండేది. నా పుస్తకంలో దోషప్రకరణం కోసం ఉదాహరణలు దొరికేవి” అన్నాడని రెండవ చాటువూ చెబుతారు. ఎంత నిజమో తెలీదు. బహుశా ఈ రెండవ చాటువు గిట్టనివారు కల్పించిన కట్టుకథ అయి ఉండాలి.

  415. ఆకు గురించి లావణ్యవతి కఠారి గారి అభిప్రాయం:

    11/02/2016 9:45 am

    అద్భుతమైన కవిత. గొప్ప తాత్వికత. పరిశుద్ధమైన అనువాదం !!!

  416. జంతువు గురించి దేవరకొండ గారి అభిప్రాయం:

    09/27/2016 12:35 am

    మనిషనేవాడికి ఈ ఒక్క కవిత చాలు! వైరముత్తు, భాస్కర్ గార్లకు ధన్యవాదాలు.

  417. నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి K V SESHAKUMAR గారి అభిప్రాయం:

    09/24/2016 9:40 am

    పద్యాలను కంఠస్థం చేయడం వల్ల కలిగే లాభం చక్కగా వివరించారు శ్రీ కామేశ్వర రావుగారు. ధన్యవాదాలు. తరువాత సహ రచయితలు/సహృదయ పాఠకులు వెలిబుచ్చిన అభిప్రాయాలు మరింత లోతైన విషయాలను తెలిపాయి. ఎంతో ఆనందం కలుగుతున్నది. దయచేసి ఈ శీర్షికను ఆపకుండా కొనసాగించాలని మనవి. శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి “పద్య కవితా పరిచయం” పుస్తకాన్ని వారి అనుమతి/ప్రచురణ కర్తల అనుమతితో ఈమాటలో పొందు పరిస్తే మరింత బాగుంటుంది.

    గతంలో, కీ.శే. కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి) గారు సంకలనం చేసి ప్రచురించిన “కళ్యాణ కల్పవల్లి” పుస్తకం లోని పద్యాలకు ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలను వరుసగా రచింపజేసి వెలువరిస్తే, గొప్ప ఉపకారం చేసిన వారు ఔతారు. పద్యం అంటేనే భయపడి పారిపోవాలనుకునే నేటి యువతరానికి ఆసక్తిని ప్రేరేపించి పుణ్యం కట్టుకోవాలని ఈమాట నిర్వాహకులకు హృదయ పూర్వక మనవి.

  418. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి కె. వి. ఎస్. రామారావు గారి అభిప్రాయం:

    09/11/2016 9:04 pm

    ముందుగా, నారాయణరావు, శ్రీనివాస్ గార్లకి అభినందనలు – అతి ముఖ్యమైన ఒక సమస్యని గుర్తించి, దానిని కూలంకషంగా విలోకించి, విచారించి, విశ్లేషించి, కొత్త ఆలోచనలకి దారి తీసే విషయాల్ని ప్రతిపాదిస్తున్నందుకు. ఆ ఆలోచనల లోతులు ఇంకెంత వున్నాయో రెండో వ్యాసంలో చదవాలని నాకు కుతూహలంగా వుంది.

    ఐతే, “ఏవం విధ విషయవిమర్శ” అని ఒకవంక, “వ్యాసతాత్పర్యానికి భంజకాలు కావని” మరోవంక అంటూనే మురళీధరరావు గారు చేసిన వ్యాఖ్య మాత్రం నాకు అనవసరమనే అనిపిస్తోంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే – వారన్నవి ఒక్కొక్కటి తీసుకుని వాటివల్ల ఈ వ్యాస విషయాన్ని విస్తృతపరిచే ఏమన్నా ప్రయోజనం ఉందేమో చూస్తే నాకు అలా కనిపించటం లేదు.

    మొదటగా – “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు” అన్న వాక్యం వారికి అభ్యంతరకరమైందన్నారు మురళీధరరావు గారు.. ఐతే వారు చూపిన తిరుపతివెంకట కవులు చెప్పిన శ్లోకాలు, వారి శిష్యుల సంస్కృత భాషాజ్ఞానం తిరుపతి వెంకట కవులు పండితులు ఔనని ఏ అర్థంలో నిరూపిస్తాయో నాకు బోధపడడం లేదు.

    ఇక – “పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్లే” అన్న విషయాన్ని తీసుకుందాం. ఈ వ్యాసం మాట్లాడుతున్నది పందొమ్మిదో శతాబ్దపు చివరి భాగం, ఇరవయ్యో శతాబ్దపు మొదటి భాగాల్లోని పరిస్థితుల గురించి. ఆ కాలంలో ఎవరిని పండితులనే వాళ్లో చెళ్లపిళ్ల వారి ఆత్మకథ స్పష్టంగానే చెప్తున్నది. వ్యాసంలో, చెళ్లపిళ్ల వారి ఆత్మకథ నుంచి ఈ సందర్భంలోని కొన్ని విషయాల్ని తీసుకున్నామని వ్యాసకర్తలూ చెప్పారు. ఉదాహరణకి వారి “కథలు గాధలు” పుస్తకంలో “వెనకటి పండితులు” అన్న వ్యాసం చూడండి (అదృష్టవశాత్తు ఎవరో ఈ మధ్యనే ఈ పుస్తకాన్ని archive.org లో పెట్టారు. చెళ్లపిళ్ల వారి “కాశీయాత్ర” కూడ ఎప్పటినుంచో అక్కడ ఉంది.) అందులో వారు పండితులుగా చెప్పిన వారంతా వ్యాకరణ, తర్క, మీమాంస, వేదాంతాది శాస్త్రాల్లో పండితులే, ఎవరూ “తెలుగు పండితులు” కారు. వాళ్లలో కవిత్వం చెప్పగలిగిన వాళ్లు ఎవరైనా ఉన్నారేమో తెలియదు; ఉన్నా వాళ్లని వాళ్లు పండితులుగా భావించుకున్నారు తప్ప కవులుగా చూసుకున్నట్టు దాఖలాలు లేవు ఈ పుస్తకంలో. అలాగే, అప్పుడు పిల్లలెలా పాఠాలు నేర్చుకునేవారో చెప్పే ఈ వాక్యాలు చూడండి (పేజి. 301):

    “తెల్లవారుజామున పాఠాలకు ప్రారంభం చేసేవారు. తక్కువ పాఠం వాళ్లకి ముందు ప్రారంభం. ఆ పాఠాన్ని పై తరగతివాళ్లంతా వినడం ఆవశ్యకం. యీ నియమం శాస్త్ర పాఠాలకి మాత్రమే. కావ్య పాఠాల వాళ్లకి గురువుగారు చెప్పడం లేదు. విద్యార్థులలో పెద్దతరగతివాళ్లే చెప్పేవారు. గురువుగారివద్ద చెప్పుకొన్న శాస్త్రపాఠాన్ని క్రిందితరగతి వాళ్లకి పై గ్రంథాలు చదువుకొనే విద్యార్థులు చింతన చెప్పేవాళ్లు. ఆయీ విధంగా కష్టిస్తేనే తప్ప శాస్త్రం స్వాధీనం కాదు. యీ విధంగా అభ్యసించినప్పటికీ యేకొందరికోతప్ప సర్వేసర్వత్ర శాస్త్రం స్వాధీనం కాదు.”

    దీన్నిబట్టి కావ్యాధ్యయనం, శాస్త్రాధ్యయనం వేరువేరని, శాస్త్రాల్ని గురువుగారు చెప్తే కావ్యాల్ని ఇతర విద్యార్థులే చెప్పేవారని తెలుస్తుంది కదా!

    “నేనూ – మా తిరుపతి శాస్త్రుల్లూ” అనే వ్యాసంలో చెళ్లపిళ్ల వారు తాము సంస్కృతంలో ఏమేం చదివిందీ చాలా విస్ఫష్టంగానే రాశారు. ఏ ‘శాస్త్రం’లోనూ తను పండితుణ్నయానని ఆయన ఎక్కడా చెప్పలేదు. తిరుపతిశాస్త్రి తనకన్న ముందుగా సిద్ధాంతకౌముది పూర్తిచేశాడని, వ్యాకరణంలో తనకంటె తిరుపతిశాస్త్రి గట్టివాడని మాత్రం అక్కడక్కడ అభిప్రాయపడటం కనిపిస్తుంది. వాళ్ల ప్రఖ్యాత పద్యంలో “దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ మీసము రెండుబాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా; రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు” అన్నారే కాని పాండిత్యంలో పోటీకి రమ్మనలేదు. ‘కవీంద్రులమని” చెప్పి ‘కవివరుల’తో మాత్రమే పోటీ పడ్డారు. ఈ వ్యాస కాలపరిధిలో కవులు వేరు, పండితులు వేరు. పండితులంటే తప్పక కనీసం ఏదో ఒక సంస్కృతశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవారే. తిరుపతివెంకట కవులు కవులు; పండితులు కారు. కవిత్వం గురించే వారు పోటీ పడ్డారు తప్ప శాస్త్రాల గురించి కాదు. గీరతం, గుంటూరుసీమ, ఇంకా అనేకుల్తో వాదాలు ఇలాటివే.

    ఇంతెందుకు – కథలు గాధలు, 18వ పేజీలో చెళ్లపిళ్ల వారు అతి స్పష్టంగానే చెప్పారు: “పండితులంటే ఆ కాలంలో ఆ బిరుదు రావడం సామాన్యంగా వచ్చేది కాదు. కావ్యనాటకాలంకారాలు పూర్తిగా చదివిన వారికి ఆ బిరుదు ఉండేదే కాదు. సాహిత్య గాళ్లనేవారు వాళ్లని. ఏదో ఒక శాస్త్రంలో పూర్తిగా పాండిత్యం సంపాదిస్తేనే పండితుడనడం.” ఇది సంస్కృతభాషా సందర్భంలోనేనని, తెలుగు గురించి కాదని చెప్పక్కర్లేదు కదా !

    రెండవది – “‘ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయనే నమ్మకం’ మనవారికి ఎన్నడూ లేదు.” అంటూ ఏల్చూరి వారొక sweeping generalization చేశారు. ఇందుకు వారిచ్చిన ఉదాహరణలన్నీ పందొమ్మిదో శతాబ్దికి ముందువే. ఈ ప్రస్తుత వ్యాసానికి సంబంధించిన కాలంలో ఉన్న పరిస్థితికి ఈ ఉదాహరణలు ఎలా అన్వయిస్తాయి?

    “సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు.” ఆంధ్రశబ్దచింతామణి 16-వ శతాబ్ది చివరి కాలం నాటిది. అంతకు మునుపటి కవులకు దాని ఉనికి విషయం తెలిసివుండే అవకాశమే లేదు. ఆ తర్వాతి కవులు మాత్రం దానికి “బలమైన ప్రాధాన్యాన్ని” ఇచ్చారని చెప్పేందుకు ఆధారాలు ఏమున్నాయి?”

    వారి ఈ వ్యాఖ్యలో మొదటిభాగం వ్యాసకాలానికి ముందుది. రెండోభాగానికి ఉత్తరం బాలవ్యాకరణమే ఇస్తుంది. (దీని గురించి కొంచెం ముందు మాట్లాడదాం).

    “పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు.” అనే దానికి అభ్యంతరం వెలిబుచ్చుతూ మళ్లీ వ్యాసకాలానికి పూర్వుల్నే ఉదహరించారు కనుక దీన్ని చర్చించనక్కర్లేదు.

    మూడవది – “ఆంధ్రశబ్దచింతామణి నన్నయే రాశాడని, ఆయనని వాగనుశాసనుడిగా గౌరవించి చిన్నయ సూరి మర్యాదగా తన బాలవ్యాకరణంలో ఒప్పుకున్నాడు.“ చిన్నయ సూరి గారు ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది? “ అంటూ అధిక్షేపించారు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి “రమణీయము”లో సంధి పరిఛ్చేదంలో 13 వ సూత్రం, దాని సందర్భం చూడండి. “వాగనుశాసనులు యదా తదా యని గ్రహించుట ప్రపంచార్థమని యెఱుగునది.” అని ఒక వాక్యం కనిపిస్తుంది. ఈ వాగనుశాసనుడు నన్నయ కాదు, మరొకరికెవరికో కూడ ఆ బిరుదుంది, సూరి మాట్లాడుతున్నది ఆ రెండో వ్యక్తి విషయం, నన్నయ గారి గురించి కాదని అంటారా?

    చివరగా వ్యాసకర్తల పేర్లు ఛందోబద్ధ పద్యాల్లో పడతాయా లేదా అనేది. వ్యాఖ్యకారులు ఒక ఉదాహరణ ఇచ్చారు వ్యాసంలో విషయానికీ దీనికీ ఎంతదూరమో చదివేవాళ్లకి వెంటనే తెలుస్తుంది.

  419. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    09/10/2016 4:20 am

    మాన్యులైన శ్రీ తః తః గారికి
    నమస్కారములతో,

    రచయితల నైకజమైన అభిప్రాయమే గాని, ‘నైజ’మేమీ తెలియవలసి రాలేదు. 🙂 “తెలుగులోనే పనిచేస్తున్నవాళ్లు … కవులే కానీ పండితులు కారు”, “పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్ళే” అన్న నైపథ్యానుసంజనతో ఘట్టితాలైన “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృతపండితులు కారు … అందుచేతనే … ఆశుకవిత్వా(వధానా)దివిద్యల వల్ల … వాళ్ళు తెలుగుకి సంస్కృతం కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు” ఇత్యాదివాక్యాలను పురస్కరించికొని మాత్రమే – తిరుపతి వేంకట కవులు సంస్కృతంలో శాస్త్రపండితులు ఎందుకు కారన్న సంశయాన్ని ప్రకటించటం జరిగింది. నారాయణరావు గారి గురుస్థానీయత, శ్రీనివాస్ గారి బహుముఖప్రామాణికత, ఆ ఉభయుల ప్రభావశీలితల నైజం ఆ ప్రకటనకర్తకు సుజ్ఞాతమన్నది ప్రతిజ్ఞాతమే.

    అట్లాగే, తత్సమమైన ‘అయోమయ’ శబ్దానికి ‘ఇనుముతో నిండి(చేసి)నది’, అన్న ప్రాథమికార్థం తొలగిపోయి, ‘అస్తవ్యస్త పరిస్థితి’, ‘అర్థం కాని స్థితి’ అని తెలుగులో అర్థపరిణామం ఏర్పడిన తర్వాతి (ఇటీవలి?) కాలంలో ఎవరో తెలుగువారే, ఏ సమస్యను ఇచ్చినప్పుడో, ఏ చమత్కారవశాననో ప్రాసంగికంగా చెప్పిన శ్లోకమే గాని, “ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం” అన్నది తెలుగు పట్ల ఈసడింపుగా చెప్పబడిన చాటూక్తి భావమై ఉండదు. ఆ మాట శ్లోకపూర్వార్ధంలో ఆ విధమైన శ్లేషార్థంతో ఉండటమే అందుకు నిదర్శనం.

    ‘గీర్వాణ’ శబ్దం సంస్కృతంలో ‘గీర్బాణ’ శబ్దం నుంచి ఏర్పడినదని “గీరేవ (నిగ్రహానుగ్రహసమర్థా) బాణః అస్త్రం యేషామ్’ అని రామాశ్రమి. ఎవరి వాక్కులు బాణతుల్యములో, వారు గీర్బాణులు. గీరేవ శాపలక్షణా వాణో బాణో వా యేషాం తే వబయో రభేదః’ అని లింగాభట్టీయం. సంప్రదాయస్థమైన ఇదే తెలుగులో ఏర్పడిన అర్థచ్ఛాయకు మూలమని ఊహ్యం. ములుకుల వంటి పలుకులు (బాణతుల్యములైన కఠినోక్తులు) కలవాడు గర్విగా భావింపబడటం సహజమైన అర్థాన్వయమే. అది ఆధునిక సాహిత్యపరిణామగతమైన అర్థాన్వయమో, కాదో ఇంకా పరిశీలింపవలసి ఉన్నది.

    ఇవన్నీ వ్యాసప్రతిపాదితానికి భంజకాంశాలు కావని ముందే విన్నవించటం జరిగింది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  420. జంతువు గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    09/09/2016 11:07 am

    చాలా బావుందండి కవిత, కవితానువాదం రెండూనూ! మనిషి కంటే మాటలు రాని మూగజీవాలు ఎంత గొప్పవో చెప్పిన వైనం అద్భుతం గా వుంది.మనిషికి కనువిప్పు కలిగించేలా వుంది.
    అభినందనలు.

  421. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    09/08/2016 2:46 pm

    మాన్యులు శ్రీ వెల్చేరు నారాయణరావు గారికి, శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
    నమస్కారములతో,

    వ్యాసం ఇంకా పూర్తికాలేదు కాబట్టి, ఇప్పుడే వ్యాఖ్యానించటం భావ్యం కాదు కాని, మీవంటి ప్రభావశీలి ప్రామాణికుల రచనలో అక్కడక్కడ కొన్ని అనంగీకారయోగ్యములైన భావాలను మాత్రమే – అవి మీ వ్యాసతాత్పర్యానికి భంజకాలు కాకపోయినా, కొంత సంబంధించినవే కనుక ఇక్కడ ప్రస్తావింపవలసి వచ్చింది:

    “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు.”

    ఎందుకు కారు? వ్యాకరణ తర్క వేదాంతాది శాస్త్రాలను గురుసన్నిధిని శాస్త్రీయంగా అధ్యయనించి, వేలూరి శివరామశాస్త్రి, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి గారల వంటి అసంఖ్యాతవిద్యార్థులకు సంస్కృతవ్యాకరణం నేర్పి మహావిద్వాంసులను కావించి, కావ్యనాటక ప్రకరణగ్రంథాలను బోధించి, సంస్కృతంలో ధాతురత్నాకర కాళీసహస్రాదులు గాక ఇతరానేకశతశః ప్రౌఢశ్లోకరచనలు చేసిన మహానుభావులు వారు. మామూలు తెలుగు పండితులు వ్రాయలేని ఒక పద్యం, సామాన్య సంస్కృతపండితులు అర్థతాత్పర్యాలు చెప్పలేని ఒక శ్లోకం ఇక్కడ చూపుతున్నాను. రెండూ వారివే. ఇటువంటి ఉదాహరణలను వారి రచనలలో ఒక్కొక్కదానిలోనుంచి ఎన్నింటినైనా చూపవచ్చును:

    కొందరు పచాద్యజంతం
    బందురు; మఱికొంద ఱర్శ ఆద్యంతం బే
    యందురు; మే ముభయం బని
    యందుము నీ నామధేయ మానందనృపా!

    యః పశ్యతి జగత్సర్వం యో న పశ్యతి సర్వతః
    తా వుభౌ పరమాత్మానం పశ్యాపశ్యౌ న పశ్యతః.

    “ఎవరో ఒకరు వ్యాకరణం రాయబట్టి, ఆ వ్యాకర్త వాగనుశాసనుడు కాబట్టి, ఆ తరవాత దక్షవాటిలో వుండే కవిరాక్షసుడు అనే ఆయన ఎవరో మనకి తెలియకుండా ఒక శాసనం చేశాడు కాబట్టి, కవులందరూ ఆ శాసనాన్ని పాటించారని వ్యాకరణ పండితుల వాదన … ఆదిని శబ్దశాసన మహాకవి (పద్యం మొత్తం ఇక్కడ ఉదాహరింపలేదు) … ఈ వాదనకి ప్రధానమైన బలం — ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయి అనే నమ్మకం.”

    అప్పకవి వ్రాసిన ఆ పద్యమే – భారతంలో నన్నయ గారిచే చేయబడిన వ్యవస్థ తప్పించి, వ్యాకరణం పేరుతో సూత్రసంపాదనం అంటూ ఎవరూ చేయలేదు కనుక – అందులో ఉన్న తీరున మాత్రమే – అంటే, ఆ భారత ప్రయోగాలను అనుసరించి మాత్రమే – రచన చేయాలని ఆ కవిరాక్షసుని ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నది. అంటే, ఆ కవిరాక్షసునికి నన్నయగారి పేరిట వెలసిన ఆంధ్రశబ్దచింతామణి సంగతే తెలియదన్నమాట. ఆయన వ్యాకరణానికంటె నన్నయగారి ప్రయోగాన్నే శరణ్యమని భావించాడన్నమాట. (‘కవిరాక్షసుడు’ అన్న పేరే ఆయన సంస్కృత పాండిత్యాన్ని సూచిస్తున్నది; అంతటివాడు వ్యాకరణం కంటె కవిప్రయోగం శిరోధార్యం అన్నాడన్నమాట.)

    “ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయి అనే నమ్మకం” మనవారికి ఎన్నడూ లేదు. ‘ప్రయోగశరణం వ్యాకరణం’ అని ఉండనే ఉన్నది కదా. అతిప్రాచీనాచార్యులు, మునిత్రయం వారు ప్రయోగవిజ్ఞానమే వ్యాకరణానికి మూలకందమని (“అపదం న ప్రయుఞ్జీత” వద్ద వృత్తిని చూడండి) పదేపదే చెప్పారు. పాణిని మహర్షి అష్టాధ్యాయికి మునుపే జాంబవతీ పరిణయం చెప్పిన సంగతీ, అందులో పాణినీయానికే లొంగని ప్రయోగాలున్న సంగతీ సుప్రసిద్ధమే. కావ్యాలు ముందు పుట్టి, వాటిని అనుసరించి వ్యాకరణం వస్తుందనే మనవారి నమ్మకం.

    “సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు.”

    ఆంధ్రశబ్దచింతామణి 16-వ శతాబ్ది చివరి కాలం నాటిది. అంతకు మునుపటి కవులకు దాని ఉనికి విషయం తెలిసివుండే అవకాశమే లేదు. ఆ తర్వాతి కవులు మాత్రం దానికి “బలమైన ప్రాధాన్యాన్ని” ఇచ్చారని చెప్పేందుకు ఆధారాలు ఏమున్నాయి?

    “పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు.”

    ఏనాటి కవుల సంగతి? ప్రాచీనకవులు పాణినిని కంఠస్థం చేసేవారో, లేరో; ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరింపగలిగి ఉండేవారో, లేరో మనకు తెలిసే అవకాశం లేదు. వారి ప్రయోగాలే అందుకు సాక్ష్యాలు. సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంలోనే “శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు” అన్న కవి, “వక్షోముఖాఙ్గేషు” అని సమాసాంతవ్యవస్థ తెలియక అపాణినీయప్రయోగం చేశాడనుకోవాలా? పాణినీయాన్ని పుడిసిట పట్టిన మహాపండితు డనుకోవాలా? తిక్కన శ్రీనాథ పోతనాదుల మాటేమిటి? “యమునాద్గంగము, కృష్ణభూమదిలము” ఇత్యాదులున్న భాస్కర రామాయణం మాటేమిటి? ఆ రోజుల్లో సంస్కృతవ్యాకరణం కంఠగతం కాకుండా కవిత్వం చెప్పిన తెలుగు కవులు అరుదనే చెప్పాలి.

    కాగా, అభినవగుప్తుని పరిచయం 20-వ శతాబ్దికి పూర్వం తెలుగు కవులకు లేకపోవటంలో ఆశ్చర్యం ఉండకూడదు. వ్రాతప్రతులు ఏనాటినుంచో దురుద్ధరంగా ఉండటమూ, తెలుగు కవిత్వం ప్రారంభమయే నాటికి సంస్కృతలాక్షణికులకే ఆ కృతి దుర్లభమైపోవటమూ, తెలుగు కవులెవరూ ఆయనను స్తుతించి ఉండకపోవటమూ అందుకు సాక్ష్యాలు. నాట్యశాస్త్ర ధ్వన్యాలోకాదులను చూసిన తిక్కన శ్రీనాథాదులు సైతం అభినవగుప్తుని వ్యాఖ్యలను చూసినట్లుగా నిరూపించటం కష్టం. “ఎక్కువమంది” కారు; అసలెవరూ ఉండి ఉండరు. ఆధునికకాలంలో మాత్రమే అది అచ్చైనాక ప్రచారంలోకి వచ్చింది. “మామిడి కొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిలస్వామికి మ్రొక్కి … ఈ యభినవధ్వనిధారణ కుద్యమించితిన్” అని రాయప్రోలు.

    జగన్నాథ పండితరాయల వారు క్రీస్తుశకం 1674లో పరమపదించారు. 1700కు తర్వాతనే తప్పించి, తెలుగు కవుల్లో అంతకు మునుపు ఎంతమందికి ఆయన పరిచయం సాధ్యం? అనంతరీయాధునికాలంకారికులలో సైతం ఆయనతో చాలా మందికి తీవ్రవిభేదాలున్నాయి. సంస్కృతంలో ప్రసిద్ధవ్యాఖ్యలు లేకపోవటమే దేశమంతటా దాని వ్యాప్తిలోపాన్ని సూచిస్తున్నది. ఆధునికకాలంలో తాతా సుబ్బరాయశాస్త్రి గారు, గాజులపల్లి హనుమచ్ఛాస్త్రి గారు, వారి తర్వాత పంతుల లక్ష్మీనారాయణశాస్త్రి గారు, వేదాల తిరువేంగళాచార్యుల వారు, జమ్ములమడక మాధవరామశర్మ గారు కళాశాలలలో పఠనపాఠనాలలోకి తేక మునుపు తెలుగుదేశంలోనూ దానిలో కృషిచేసిన ప్రసిద్ధులు లేరు. తెలుగు కవులు ఎప్పుడు పడితే అప్పుడు దానిని ఎట్లా ఉదాహరింపగలరు?

    “ఆంధ్రశబ్దచింతామణి నన్నయే రాశాడని, ఆయనని వాగనుశాసనుడిగా గౌరవించి చిన్నయ సూరి మర్యాదగా తన బాలవ్యాకరణంలో ఒప్పుకున్నాడు.“

    చిన్నయ సూరి గారు ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది?

    “ఉదాహరణకి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు అనే మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఏ తెలుగు పద్యం లోను పట్టవు … పరుచూరి శ్రీనివాసుడు అని చేసుకుంటే కంద పద్యంలో ఇమిడించొచ్చు. వెల్చేరు నారాయణరావు ఏ పద్యంలోను పట్టదు.”

    ఎందుకు పట్టవు?

    “పేరుఁగన్నట్టి వెల్చేరు నారాయణరావు సీసమ్ము నేర్పంగఁ బూని
    పరుచూరి శ్రీనివాస్ పదము డుమంతంబు గామియు, స్వస్థితిన్ గారవించె”

    అని?

    ముందే వ్రాసినట్లుగా, ఇవి మీ వ్యాసప్రతిపాదితానికి భంజకాలు కాకపోయినా, కొంత సంబంధించినవే కాబట్టి ప్రస్తావింపవలసి వచ్చింది. ఏవంవిధ విషయవిమర్శను మీ సహృదయత మన్నిస్తుంది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  422. నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    09/05/2016 9:19 am

    మురళీధరరావుగారు,

    నమస్కారాలు. మీ సహృదయ వ్యాఖ్యకి కృతజ్ఞతలు. ఈ వ్యాసం వ్రాసేటప్పుడే మీరన్న రెండు విషయాలూ – “బాహుదుర్గములు”, “చూడగన్” – నా ఆలోచనాపథంలోకి వచ్చాయి. సాహసించి నాకు బాగుందనిపించిన వివరణని మాత్రమే పొందుపరిచాను.

    బాహుదుర్గములు – రాజ్యానికి రక్షణగా నిర్మింపబడేవి దుర్గాలు. కృష్ణుని కౌగిలి (బాహు మధ్యసీమ) సామ్రాజ్యం అనుకొంటే, అందులో రక్షణ పొందే సత్యభామకి రెండు బాహువులూ రెండు దుర్గాలు అనుకోడం సమంజసంగానే నాకు అనిపించింది. బేతవోలువారు కూడా తమ “పద్య కవితా పరిచయం”లో దీనిని బహువచనంగానే వివరించారు.

    చూడగన్ – ఇది మీరన్నట్టు తుమున్నర్థకంగా అన్వయించడమే ఉచితంగా అనిపిస్తోంది. ఆ క్రియని తుమున్నర్థకంగా గ్రహించినప్పుడు కూడా, శ్రీకృష్ణుడు బహుమాన పురస్సరదృష్టితో చూసాడు అనేది లక్ష్యమానం అవుతోంది. ఆ రెండు క్రియలనూ విడివిడిగా చెప్పకుండా యిలా ఒకే వాక్యంలో కలిపి చెప్పడంలో వారి మధ్యనున్న అనురాగం ధ్వనితమవుతోందన్నది నా భావన.

    నా వ్యాసాలని ఆసక్తితో నిశితంగా చదివి వాటికి వన్నె తెచ్చే యిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది!

  423. నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    09/03/2016 4:22 pm

    మాన్య మిత్రులు శ్రీ కామేశ్వరరావు గారికి
    నమస్కారములతో,

    మొదటి పద్యానికి మీ వ్యాఖ్య, పదప్రయోజనాన్ని వివరించిన తీరు – హృద్యంగా ఉన్నాయి. “దేవీసంతతి” అని మీ ప్రతిలో ఉన్నది కాబోలు. అది తప్పు కాదు కాని, ప్రసిద్ధప్రతు లన్నిటిలో దేవీసంహతి, దేవీసంఘము అనే పాఠాలున్నాయి.

    రెండవ పద్యంలో “బాహుదుర్గములు” అన్న సమాసాన్ని మీరు బహువచనంగా గ్రహించి, ‘బాహువులనే కోటలు’ అని అన్వయించారు. అవి ఒకటి కాదు; రెండు దుర్గాలు అని కూడా వివరించారు. అయితే, ‘బాహువులనెడి దుర్గము’ అని రూపణను ఏకవచనంగా పఠించటమే సమంజసం. శ్రీకృష్ణుని బాహుమధ్యసీమ (విశాలమైన వక్షఃస్థలం) దుర్గోపమమై, దైత్యదానవదుష్ప్రాపం కనుక తనకు రక్షాకరమని సత్యభామ అంటున్నది. ఇక్కడ ఒక్కొక్క బాహువు ఒక్కొక్క దుర్గమన్న అర్థానికి అవకాశం ఉండదు. బాహువులు రెండైనా, నాలుగైనా రిపుదుర్గమమైన దుర్గం ఒక్కటే.

    “త్వం త్వబ్జనాభాఙ్ఘ్రిసరోజకోశ, దుర్గాశ్రితో నిర్జితషట్సపత్నః” అని పంచమ స్కంధంలో (1-19) శ్లోకాన్ని చూడండి: “శ్రీ నారాయణ చరణారవిందంబు లను దుర్గం బాశ్రయించి, యరిషడ్వర్గంబు జయించి” అని గంగనామాత్యుని తెలుగుసేత (5-1-11). అక్కడ ఒక్కొక్క చరణం ఒక్కొక్క దుర్గం కాదు కనుకనే, “చరణారవిందములు అనెడి దుర్గము” – అన్నాడు.

    “శ్రీరమణీ కుచదుర్గ విహారే” – శ్రీదేవియొక్క కుచములనెడి దుర్గమునందు (ఎత్తైన రెండు కొండలున్న గిరిదుర్గము వంటి వక్షఃస్థలమునందు) విహరణము కలవాడు – అని భావం. శ్రీదేవియొక్క కుచములనెడు రెండు దుర్గములందు విహరించువాడు అని చెప్పకూడదు. ఇది “మధుకైటభారేః వక్షోవిహారిణి” అన్న ప్రయోగం వంటిదే.

    “బాహుదుర్గములు” అన్న అపపాఠం వల్ల ఈ అపార్థానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల పద్యాన్ని –

    “దానవు లైన నేమి, మఱి దైత్యసమూహము లైన నేమి? నీ
    మానితబాహుదుర్గ మను మాటున నుండఁగ నేమి శంక? నీ
    తో నరుదెంతు” నంచుఁ గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న
    మ్మానిని, దన్ను భర్త బహుమానపురస్సరదృష్టిఁ జూడఁగన్. (దశమ: ఉత్తర భాగం-155)

    అని సరిదిద్దుకోవాలి. నీయొక్క బాహుదుర్గసీమ అను మాటునన్ = రక్షణస్థానమున ఉండగా, నాకు ఏమి శంక? అని అన్వయం.

    అంతే కాదు. ఆమె మ్రొక్కటమూ, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూడటమూ ఏకకాలంలో జరగలేదు. ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచిన తర్వాత ఆమె మ్రొక్కలేదు. ఆమె మ్రొక్కిన తర్వాత, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచాడని అన్వయించేందుకు వీలులేకుండా, “బహుమానపురస్సరదృష్టిన్ చూడఁగన్” – అన్న వెంటనే, “ఇట్లు మ్రొక్కిన” అన్న వచనం ఉన్నది. అప్పుడు “చూడఁగన్” అన్న అసమాపక క్రియకు ఆమె మ్రొక్కగా, ఆతడు చూడగా అన్న అన్వయమూ సరిపడదు.

    వాక్యంలో “మ్రొక్కె” అన్న సమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “చూడఁగన్” అన్న అసమాపక క్రియను అన్వయించే వీలుండదు. “చూడఁగన్” అన్న అసమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “మ్రొక్కెను” అన్న సమాపక క్రియను చివరిదిగా అన్వయించాలి. తనను భర్త బహుమానపురస్సరదృష్టితో వీక్షింపగా, ఆమె కరతోయజములు ముకుళించి మ్రొక్కెను – అని మాత్రమే పద్యంలో వాక్యాన్వయం వ్యాకరణసిద్ధం. అప్పుడు అర్థం పొందుపడదు. నీతో నేను వస్తాను, నీవుండగా నాకేమి భయం? అని ఆమె అడిగినంత మాత్రాన ఆయన బహుమానపురస్సరదృష్టితో చూశాడనటమూ, అప్పుడామె నమస్కరించినదనటమూ కవి చిత్రణ అనుకోలేము. ఆ పక్షాన కవితాత్మకమైన అభివ్యక్తీకరణమే ఉండదు.

    అందువల్ల, “చూడఁగన్” అన్న క్రియారూపానికి ఇక్కడ తుమున్నర్థంగా మాత్రమే అన్వయం. భర్త తన పలుకులను విని, బహుమానపురస్సరదృష్టితో చూసేందుకే ఆమె అంజలించినదన్నమాట. అది సత్యభామ స్వభావానికి తగిన చిత్రణమే. సాకూతమైన అంజలిబంధం. ముందు ప్రశంస, ఆ తర్వాత ప్రణమనం – రెండూ ఆయన మెప్పుకోసం మాత్రమే అన్నమాట. అదే కవి మనోగతం. “చూడఁగన్ = చూచుట కొఱకు” అని తుమున్నర్థకం.

    ఆ జాణతనాన్ని గుర్తించాడు కనుకనే, ఇట్లు (ఈ విధమైన నేర్పరితనంతో) మ్రొక్కినన్ = ఆమె నమస్కరింపగా, ఆయన భావజ్ఞుడు కదా, దగ్గరికి తీసికొని కౌగలించికొన్నాడని తర్వాత అన్నాడు.

    సహృదయత ఉట్టిపడుతున్న అమోఘమైన మీ వ్యాఖ్యకు పరిపూరకంగా మాత్రమే ఈ మాటలను వ్రాశాను. పోతనగారి భాగవతం ఎంత పరిష్కరణ సాపేక్షమో ఈ సన్నివేశం మరొక్కసారి నిరూపిస్తున్నది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  424. పక్షి గురించి Ramanuja Rao గారి అభిప్రాయం:

    08/17/2016 8:10 pm

    విద్యార్ధి గారూ,
    కవిత బాగుంది. చాల రోజులయ్యింది, మీ మాట విని. ఎలా వున్నరు?

    రామానుజ రావు

  425. ఎవరు చూడొచ్చేరు? గురించి Dadala Venkateswara Rao గారి అభిప్రాయం:

    08/04/2016 3:17 pm

    క్రిస్టీనా రొసెట్టీ (1830-1894) తన కవితలొ గాలిని మనం చూడలేమని తెలిసినా గాలి మనకు ఎందువల్ల కనిపించదొ అని కొణములొ ఎంతో చమత్కారంగా చాలా చక్కగా వర్ణిస్తుంది.

    “గాలిని నీవూ చూడలేదు – నీనూ చూడలేదు.
    అది వ్రేలాడిన ఆకుల తొణికిసలసందుల్లొంచి దూరి వెళ్ళిపోతుంది.
    గాలిని నీవూ చూడలేదు – నీనూ చూడలేదు.
    అది తలవంచిన చెట్లమీదుగా చాల్లగా జారుకుంతుంది”.

    Who has seen the wind?
    Neither I nor you:
    But when the leaves hang trembling,
    The wind is passing through.

    Who has seen the wind?
    Neither you nor I:
    But when the trees bow down their heads,
    The wind is passing by.

  426. నాకు నచ్చిన పద్యం: మాధవపెద్దివారి మధుర స్మృతికావ్యం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    08/03/2016 7:01 pm

    Thanks to the contributors, for making it possible to get to know the Telugu Poet మాధవపెద్ది సుందర రామశాస్త్రి. I did not know him before. I am glad, I do now.

    I like to get into some discussion on the essay. Because genetically I am contentious. But first, in the same spirit of essayist – which is appreciation of poetry- I am presenting this writing on Duvvuri Ramireddy’s literary work/s. (I like Telugu Script. I feel some of the beauty of any language is associated with its script. So I typed this writing of mine – which is originally published in “RTS” in the racchabanda Yahoo groups, in Dec 2006, – now into Telugu, for readers of eemaata.) Please read on, if you wish.

    At some point in my reading I have stopped looking at “పానశాల” as a translation and started looking at it as a love poem.

    పానశాల ఒక ప్రేమ కావ్య ఖండిక. పానశాల ఒక విరహ గీతిక. పానశాల ఖయ్యాము అనువాదముగా భావించటం మాని చదివితే అందులో రామిరెడ్డి హృదయ సాక్షాత్కారం జరుగుతుంది. ఈ రామిరెడ్డి ఒక చక్కని స్వభావం కల యువకుడు. ఒక సంపన్నుడు. ఒక మోతుబరి రైతు. అన్ని విషయములయందు ఆసక్తి ఉన్నవాడు. సైన్సు, సాహిత్యము, సంగీతము, భాషలు, వ్యవసాయం, ఇతనికి ఇష్టంలేని వస్తువులేమున్నాయి. అందమైనవన్ని ఇతనికి ప్రియాలు. చక్కని మేడ కట్టుకున్నాడు. ఆ మేడను అందాల మందిరంగా అలంకరించుకున్నాడు. అందులో తన భార్యతో కాపురం ఉంటున్నాడు. ప్రపంచంలో కొందరు తెలివైన వారయ్యీ, ఆలోచనలో వక్రత లేకుండా పూర్తిగా మధుర భావనలతో నిండిన వారుంటారు. భార్య నిజంగా అందగత్తో కాదో కాని వీరికి అందంగా కనిపిస్తుందేమో. నిజంగా అందమైన భార్యలున్నవారుంటారు. సర్వ సమర్ధులైన భార్యలున్నవారుంటారు. ఐనా ఉత్తమ హృదయం లేని వాడికి భార్య అందం, గుణం మనసుకు పట్టదు. రామిరెడ్డి అలా కాదే! స్వచ్ఛ హృదయుడు. రామిరెడ్డి రాముని వంటి వాడు. తన భార్యను గాఢంగా ప్రేమించిన వాడు.

    కొంతమంది జీవితంలో ప్రేమ అనే భావనే లేకుండా జీవితం గడుపుకోగలరు. వీరికి అన్నీ డబ్బులూ దస్కాలూ, లెక్కలూ డొక్కలూ, సంఘాలూ సంస్కరణలూ కనిపిస్తాయి. ఎవతికి ఎవడిని ఎలా కట్టబెట్టాలి అందులో బాధ్యతలు, బరువులు, లొసుగులు కిటుకులు, ఇదీ వీరి ఆలోచన. సంఘం నియంత్రిస్తే, ఆ చట్టానికి కట్టుబడి ఏదో కర్మకాండలు చేసుకుపోయేవారికి ఈ ప్రేమ సుఖం అనుభవంలోకి రాకపోవచ్చు. మనకు అనుభవం కాని సుఖం లేనే లేదనుకుంటారు కొందరు శుంఠలు. అసలు కొన్ని సుఖాలే దండగ అనుకునేవాళ్లు, అందరినీ బలిపీఠాల మీద కెక్కించగల సమర్ధులు. కొందరు ‘రోఠీ కపడా మకాన్’ మేధావులకు అదే పెద్ద సమస్య. ‘तेरी दो ढकिये की नौकरी में मेरा लाखों का सावन जाये’ ఆలోచన వీరి మెదడులోకి రాకనే పోవచ్చు.

    కానీ ప్రేమికులకు సంఘమే లేదు. వారు ఒకరి కొరకు ఒకరి అందంలో, ఒకరి ఆనందంలో ఇంకొకరు జీవిస్తారు. వారు కలిసి ఉన్న సమయం వారికి స్వర్గం. ఒకరినుండి ఒకరు వేరు పడిన సమయం నరకం. అధిక తెలివితేటలు ప్రదర్శించకుండా, ధనమూలం జీవితం కాకుండా, ఆదర్శాల ప్రదర్శనమే జీవితం అనుకోకుండా, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే స్నేహం, ప్రేమ అనుభవించగల, సొంత జీవితం జీవించగల అదృష్టవంతులున్నారు.

    రామిరెడ్డి అటువంటి అదృష్టవంతుడు. అటువంటి వాడికి చిన్న వయసులో భార్యా వియోగం సంభవించింది. భార్యతో గొప్ప ప్రేమ బంధంలో ఉన్నప్పుడు, వియోగం కలిగింది. ప్రేమ లభించినవాడికి గదా, ప్రేమ చెయ్యి జారినప్పటి బాధ అనుభవానికి వచ్చేది. సంయోగమే లేని వాడికి వియోగమెక్కడిది? దుర్భర దుఃఖంలో అల్లాడుతున్నప్పుడు అతనికి ఖయ్యాము రుబాయీలు సహాయమయ్యాయి. రిబాయత్ అతని శోకాన్ని అతని నుంచి బైటకు దొర్లించింది. “ ఘల్తాన్ ఘల్తాన్ హమీరవిద్ తా బెలగు” అని ఆటలాడుతూ అన్న ఒక చిన్ని బాలుడు పలికినది కవిత్వమై, ఆ పిదప నిర్దుష్టపు రూపు దిద్దుకున్న రుబాయీలు, ఖయ్యాం వంటి శాస్త్రజ్ఞుడు, కవి, మానవ జీవితానుభవమే కవితగా పలికించిన రుబాయీలు – ఎన్నో ఏళ్ల తర్వాత ఎక్కడో తెలుగు దేశం లోని ఒక్క తప్త హృదయాన్ని, ఒక మహా వేదన నుండి గట్టెక్కించాయి. పారశీకము నేర్చుకోడము, అన్ని వందల పద్యాలను మళ్లీ మళ్లీ చదవటము, అందులోని భావమును గ్రహించటము, ఆ చదువులు, ఆ తిరగరాసుకోటాలు, ఇవి అతని మేధకు ఒక పనిని కల్పిస్తాయి. అందులోని వేదాంతము – ఎవ్వరికీ ఏదీ శాశ్వతం కాదని, అన్నీ పోగార్చవలసిందే అనీ, ఏ దుఃఖమూ తనదొక్కడిదే కాదనీ – ఈ విషయాల స్మరణలో కొంత సాంత్వన లభిస్తుంది. పద్యాల లోని మధురతకు అతని మనసు లోని మధురతకు సమన్వయం కుదురుతుంది. అతని నైజం మార్చకుండా, అతను ప్రేమలో అనుభవించిన తియ్యదనాన్ని మళ్ళీ ఇంకోమారు తలపుల్లో నిలిపే, అతని దుఃఖాన్ని మళ్ళీ తియ్యగానే వెల్లడి చెయ్యగలిగే, తానై తలచని, విధి విధించిన అవకాశం అది.

    ఖయ్యామును ఒక కవి ఒకలాగా భావించుకుంటే, ఇంకో కవి ఇంకోలాగా ఊహించుకోవచ్చు. లత ఖయ్యామును అందంగా సొంతగా భావన చేసింది అనిపించింది నాకు. ఆమె మోహనవంశి ఎప్పుడూ గొప్పగా వేరుగా పలుకుతుంది. రామిరెడ్డి ఖయ్యాము, చలం ఖయ్యాము అనుభూతి ఒకటి కాదు, కాలేదు. రామిరెడ్డి పానశాల చలం రాయలేడు. చెలంకు ఛందస్సుతో పద్యాలు రాయడము రాకపోవటమే కాదు. చెలం స్వభావం వేరు. ప్రపంచంతో, స్త్రీతో, అతడి సంబంధం అతడి ప్రేమ మార్గాలు, అనుభవాలు, ప్రకటనలు వేరు.
    రామిరెడ్డి ఖయ్యాము లో, భోగ లాలసత కాదు. ప్రేమ, విరహము, బాధ ఎక్కువ ఉన్నాయి. పానశాల పద్యాలలో రామిరెడ్డి పగిలిన హృదయం ఉంది. పద్యాలు మొదలుకు ఖయ్యామువే కాని, రామిరెడ్డి పానశాల పద్యాలు కూరుస్తున్నపుడు అతని మనసులోని మూర్తి అతని భార్య. అతను కొన్ని కొన్ని రుబాయీలను అతికినప్పుడు, అందులో భావం వెలికి తెస్తున్నానని అనుకున్నప్పుడు వెలికి వచ్చినది అతని మనసులోని వియోగ విషాదమని నా మనసుకు తోస్తూ ఉంది.
    చదువరులు మీరే కింది పద్యాలను చదివి నిర్ణయించండి.

    చెలియ, మనోహర ప్రణయ శీతలతన్ సుఖించు నా మనం
    బలమటతో తపించు నకటా! భవదీయ వియోగ కీలలన్;
    దెలియదొ, సాఖి యార్తులకు తియ్యని మందని, ప్రాణముల్ తదం
    ఘ్రుల విడిపింతు; రమ్ము, బ్రదుకున్ నిలబెట్టెద నెట్టి యాసలన్.

    వలపుల దివ్వె, నీ మృదుల పాద లతాంతము ముద్దుగొందు; న
    న్యల మధురాధరంబులయినం దులతూగవు దాని తోడ; రా
    త్రుల సహవాసకామినయి రోసియు నిన్ గనలేక భగ్నవాం
    ఛల చివురించు లజ్జ పెలుచం బవలెల్లను బుత్తు దీనతన్.

    చెలియరో, నీ వియోగమున చిత్తము చీకి కృశించె; నీవు నే
    వలనికి పోయినన్ విడువ పయ్యెదకొంగు; నిరంతరంబు ని
    న్వలచినవార లెందఱొ వనారిలి కూలిరి నీవు పోవ; నే
    డెలమి దొలంక వచ్చితివి; ఎందఱు నీ బలిపీఠి జత్తురో!

    లలనా, కోమలమైన నీ తనువు నేలన్ లీనమై పోయి య
    వ్వల నానావిధ భాండభాండికల రూపంబెత్తు; తత్త్వజ్ఞులీ
    చల వృత్తంబును నమ్మబోరు; నిరయ స్వర్గాను సంధాన క
    శ్మల చిత్తంబు పురాతనాసవమునన్ స్నానంబు గావింపుమా.”

    All the above appears to me that he is in his own sorrow. He had slipped into his own life and is expressing his agony.
    There are a set of poems he wrote separately on his wife – “భగ్న హృదయము,” “ప్రియా వియోగము” From them I quote:

    కన్నులు విప్పి చూచితిని కాంతశవంబును, జేతితోడనే
    యన్నులమిన్న కాష్టమున కగ్గి రగిల్చితి, నింత చేసియుం,
    జన్న తెఱంగెఱింగియును సంశయమొందును బాడు బుద్ధి! యా
    పన్నుల చిత్తవిభ్రమపు పాటులు నిట్టివియేమొ యెల్లెడన్!

    కలలోన తలంపలేదు గద యో కల్యాణి, నీ కింత లో
    పల నూఱేడులు నిండునంచు, విధి దుర్వారప్రభావంబు మ
    ర్త్యులయత్నంబు నధ:కరించుగద! వైద్యుల్ దివ్యసంజీవి చెం
    బుల త్రావించియు పూర్వ దుష్కృత ఫలంబున్ మార్చలేరైరిగా!

    I see the same loving heart and no big difference in the poems. Do not fault me, if somewhere along the line, in my reading, I have stopped seeing Panasala as Rubaiyat’s translation and I have started seeing it as ప్రేమ కావ్యము. Every poem in Panasala is soft in sound, is singable. But, sorry! You cannot recite or read all of them because your eyes will brim with tears and you cannot read the page anymore.

    ఎందుకో అసందర్భంగా నాకు పానశాలలో ఒక్కో పద్యమునకు, అడవిలో బృహత్కథా సరిత్సాగరము చదువుతూ గుణాఢ్యుడు, ఒక్కొక్క కాగితం మంటలో కాలుస్తుంటే, అడివి జంతువులు వింటూ కన్నీరు కార్చే దృశ్యం స్మృతిలో కనిపిస్తుంది.

    Deeply saddening they are, sadly sweet they are an attempt should be made to sing the whole set of poems of Panasala. Hopefully someone with sweet voice that can speak out the anguish of loss of a love, will recite and record these poems.
    Yes! I like a good singer to sing Duvvuri’s Panasala. Alternately, if one sings Panasala as Duvvuri’s love song, one may become a great singer.

    Thanks,
    Lyla

  427. బోధిచెట్టులో సగంచెట్టు గురించి బండారి రాజ్ కుమార్ గారి అభిప్రాయం:

    07/21/2016 8:21 pm

    అద్భుతమైన దృశ్య కవిత్వం

  428. మరోపువ్వు గురించి madhavi గారి అభిప్రాయం:

    07/19/2016 5:21 am

    మరో పువ్వు తెల్లవారెసరికి ఎంతో బాగున్నట్లు మీ కవిత్వం చాల బాగున్నది. మీకు వందనాలు.

    మాధవి, పాల్వొంచ.ఖమ్మం, తెలంగాన.

  429. కాగితపు అద్దం గురించి Ramanuja Rao గారి అభిప్రాయం:

    07/17/2016 5:23 pm

    కవిత బాగుంది

  430. ఎవరు చూడొచ్చేరు? గురించి haritha గారి అభిప్రాయం:

    07/08/2016 3:50 am

    కవిత నాకు చాల నచ్చింది.

  431. కాగితపు అద్దం గురించి మోహన గారి అభిప్రాయం:

    07/07/2016 9:45 am

    కవిత బావుంది. శీర్షికను కాగితపు”ట”ద్దము అని ఉంచితే బాగుంటుందేమో?
    విధేయుడు – మోహన

  432. కాగితపు అద్దం గురించి మధురశ్రీ అనంతపురము ఎ పి గారి అభిప్రాయం:

    07/05/2016 6:08 am

    Jyotshna madam.

    అక్షరాల నీలి ఆకుల చుట్టూ మెత్తని పాటలు కడతావు. అన్న పదబంధం మీ ఉహ లో చాలా బాగా మెరిసింది మంచి కవితను రాసారు ధన్యవాదాలు సార్ ను మిమ్మల్ని ఇప్పుడు గుర్తు చేసుకొంటున్నాము.

    మధురశ్రీ అనంతపురము ఎ పి

  433. కాగితపు అద్దం గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    07/03/2016 11:07 am

    ముచ్చటైన మంచి కవిత. చాలాచాలా బాగుంది.

  434. ఇది చాలు నాకు గురించి దేవరకొండ గారి అభిప్రాయం:

    06/30/2016 5:38 am

    కనీసం 40 ఏళ్ల క్రితం వరకూ కోస్తా జిల్లాల్లో మంచి నీరు ప్రవహించే కాలువలు ఉండేవి. మంచి నీరు అంటే నా ఉద్దేశ్యం రేవులోకి దిగి దోసిళ్లతో నీరు ఏ సంకోచం లేకుండా అంతా తాగగలిగేది అని. ఆ కాలువల్లో పడవలు, గూటి పడవలు అప్పుడప్పుడు లాంచీలు తిరుగుతూండేవి. వైరముత్తు గారి కవితలను భాస్కర్ గారు ఇంత చక్కని అల్పాక్షరాల్లో అందించి ఒక్కసారి ఎక్కడికో తీసుకెళ్లారు. కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకు…ధన్యవాదాలు భాస్కర్ గారు.

  435. ఇది చాలు నాకు గురించి తః తః గారి అభిప్రాయం:

    06/22/2016 4:25 am

    శ్రీ అవినేని: మీ అనువాద రచన అందం గా ఉంది.

    “చరణాలలో వనమాలి చేసిన అనువాదం అంత గొప్పగా లేదు- శ్రీ కొలిచాల.

    వనమాలికి ఉన్న సినిమా వత్తిళ్ళ వంటివి శ్రీ అవినేనికి లేవనుకుంటాను. మచాడొ చిన్న ( స్పానిష్) ) కవిత ‘Caminante no hay Camino’కున్న రకరకాల అనువాదాలు నన్ను చాలా ఇబ్బంది పెట్తాయి. నాకు స్పానిష్ రాదు. మచ్చుకు రెండు అనువాదాలు చూడండి. చివరకు నాకు నచ్చినది మొదటిది. నేను మొదటి సారిగా చదివినది.

    1 Traveller, the path is your tracks
    And nothing more.
    Traveller, there is no path
    The path is made by walking.
    By walking you make a path…..”

    2 Wayfarer, the only way
    Is your footprints and no other.
    Wayfarer, there is no way.
    Make your way by going farther.
    By going farther, make your way….
    తః తః

  436. అమర కోశం గురించి తః తః గారి అభిప్రాయం:

    06/21/2016 4:21 pm

    [అభిప్రాయాలు రాస్తున్న ముసుగులో మీరు మీ కవితలు ఇలా ప్రచురించుకునే ప్రయత్నం చేయవద్దని, అలా మీరు రాసిన అభిప్రాయాలు ప్రచురించమని చాలాకాలం క్రితమే మీకు చెప్పి ఉన్నాం. ఇప్పుడూ అదే మాట చెప్తున్నాం – సం.]

    చాలా సంవత్సరాల వెనకటి మాట: Punch మాగజిన్ లొ ఒక వ్యాసం మీద ఒకరు తన అభిప్రాయ లేఖలో ఆ వ్యాసం తనెప్పుడో రాసి – ఎక్కడా ప్రచురించని ఒక కవితలాగా ఉన్నదని అంటూ, ఆ కవితని గూడా ఆ లేఖలొ రాసారు. ఆ లేఖని ఆ కవితతో సహా ప్రచురించి పత్రికా సంపాదకులు ఇలా రాసారు: “Now it is published. Do not send any more.”

    తః తః

  437. అమర కోశం గురించి దడాల వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం:

    06/20/2016 2:58 am

    మీ కవిత మాకు ససేమిరా అర్ధం కాదు
    మా అభిప్రాయం “ఈమాట” ప్రచురించదు
    ప్రచురించిన అభిప్రాయాలకు జవాబు ఇవ్వరు
    ఇక అభిప్రాయం తెలియజేసే పక్రియ ఎందుకొ
    అన్న ప్రశ్నకైనా జవాబు దొరికి చస్తుందా
    లేక నాకు చావు లేదు చావుయొక్క బతుకును నేను అంటారా?

    [అభిప్రాయాలు రాస్తున్న ముసుగులో మీరు మీ కవితలు ఇలా ప్రచురించుకునే ప్రయత్నం చేయవద్దని, అలా మీరు రాసిన అభిప్రాయాలు ప్రచురించమని చాలాకాలం క్రితమే మీకు చెప్పి ఉన్నాం. ఇప్పుడూ అదే మాట చెప్తున్నాం – సం.]

  438. ఒక్కతే… మృత్యువు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    06/01/2016 6:16 pm

    ఒక చిన్న కథ:

    ఒక అడివి లో, చింకిపాతల బక్క ఎముకలగూడు దరిద్రుడు, రోజూ పొట్ట పోసుకోటానికై, కట్టెలు కొట్టుకుంటున్నాడు. చెమటలు కారిపోతున్నాయి. కళ్లు తిరుగుతున్నయి. పగలే చుక్కలు కనపిస్తున్నయి. కట్టెలు ఎలాగో మోపు కట్టాడు. అడివి లోంచి బైట పడి ఇల్లు చేరే ఓపిక లేదు. యముడా! ఈ తిప్పలు నేను పడలేనురా. ఎత్తుకు పోటానికి రారా! – అని అరిచాడంట. వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమై, నన్ను తలిచావా? పిలిచావా? అన్నాడట. కట్టెలు కొట్టేవాడు, వెంటనే – ఈ కట్టెలమోపు ఎత్తి నెత్తిన పెట్టి పోతావని సాయానికి పిలిచానయ్యా, నేనే తంటాలు పడతాలే వెళ్లు, వెళ్లు, నీ పని చూసుకో -అన్నాడంట.

    (ఈ కథ పల్లెటూళ్లో, ఇంట్లో పొయ్యి రాజటానికి,తన దొడ్లో,గొడ్డలి తో పేళ్లేసే మా అమ్మనాన నాకు చెప్పాడు. ఈ కథలో నీతి ఏమి టో, అది నాకు ఎక్కిందో లేదో, తెలియదు కాని, ఈ మాట లో ‘మృత్యువు’ గురించి జోరుదారుగా కథలు, కవితలు వచ్చినప్పుడు అవి క్లినికల్ గా సినికల్ గా లిరికల్ గా ఉన్నప్పుడు నాకీ డల్ కాటూరు కట్టెల కథ ఎందుకు గుర్తొస్తుందా? అనుకుంటాను.

    లైలా
    *Watching French Open Tennis Championships. Love human body and its mechanics. Love Neruda – when he opens his poetry with lines like:

    “Body of a woman, white hills, white thighs,
    you look like a world, lying in surrender.
    My rough peasant’s body digs in you…”

  439. ఒక్కతే… మృత్యువు గురించి జ్యోత్స్న గారి అభిప్రాయం:

    05/31/2016 12:22 pm

    ఈ సంచిక ఏడేళ్ళ క్రితందైనా..ఈ మధ్యనే జరిగిన ఒక చర్చ కారణంగా నెరుడా కవితను దాని అనువాదాలను వెతుకుతూ వుంటే పై కవితలు కనిపించాయి.అన్ని అనువాదాలు ఎంతో క్లుప్తంగా కళాత్మకంగా కవి భావాలను ఎన్నో విధాలుగా అన్వయించ వచ్చు అనువదించ వచ్చు అని తెలియజేస్తూ వున్నాయి అదే స్ఫూర్తితో రాసినది ఈ కవిత

    శ్మశానాల,శవ సమూహాల ఉవ్విళ్ళూరే ఒంటరితనం
    ఎండిన ఎముకల నిర్జీవ సమాధుల నిండిన నిశ్శబ్ధం
    అలసిన ఆత్మ పరమాత్మకై ప్రయాణం అగమ్యగోచారం
    గమ్యం చేరే వరకు గూభ్యం,అంధకారం, గాఢ్యాంధకారం!
    రారమ్మంటూ పిలిచే మరణం
    ఆత్మ జీవం పోసుకునే అద్భుత తరుణం !

    మట్టి ముద్దల,మేలిమి బొమ్మల నిండి వున్నది మృత్యువు
    కబళించే కూతలలో,కడ చేరిన కళేబరాలలో
    ప్రతిధ్వనిస్తూ
    ఆత్మ విరహపు ఆవిరి ఆత్మీయుల కన్నుల కమ్మేస్తూ. ..

    కవ్వించే కేశాలు,ముట్టించే కాపర్లు
    న్యాయానుచరిణి,చింతించే తరుణి
    అన్నింటినీ దాటించే వైతరణి
    వెనుకకు లాగే రక్తపు బంధం
    నది దాటిస్తున్న నిశ్శబ్ధం

    పాదం వదిలిన పాదుకలా
    ఆత్మను విడిచిన దేహంలా
    నీకెవ్వరింక నాతో రమ్మని
    నలుదిక్కులా ప్రతిధ్వనించే మృత్యువు నిశ్శబ్ధపు సడి

    అంతమో ఆరంభమో తెలియని అజ్ఞానిని
    భూమిలో ఒదిగి పొమ్మనే,నాచులో కలిసిపొమ్మనే
    ఊదా పూల జోల వలే వినిపించే మృత్యుగీతి

    ఎండిన ఎముకల శిశిర సమాధులని తుడిచేస్తూ
    ‘అహం’కారపు అవశేషాలకై ఆఘ్రాణిస్తోంది
    ఆత్మ పయనానికి అడ్డంకులింకేవని వేటాడే లయకారి!

    శవ పేటికలలో నిగూఢంగా నిదురిస్తూ
    నిశి రేయి నీడలలోంచి ఒక్క నిట్టూర్పుతో
    జీవం పోసుకునే మృత్యువు
    వేచి వున్నది ఆత్మ మరుజన్మకై నిరీక్షిస్తూ!

    చదివి అభిప్రాయాలు తెలుపగలరు ☺
    -జ్యోత్స్న

  440. ఇది చాలు నాకు గురించి వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం:

    05/31/2016 12:07 pm

    ఈ ‘మాట’ లాంటి తెలుగు పత్రిక
    అభిప్రాయాలు తెలియజేసుకునే వేదిక
    ‘ఇది చాలు నాకు’ అనే కవిత
    ఇంతకు మించి ఏంకావాలి మాకు

  441. చిరంజీవి గురించి డా .రాధేయ గారి అభిప్రాయం:

    05/19/2016 11:04 pm

    మానస గారూ! కన్నీళ్ళకు చాలా ప్ప్రేమ కదా, ఆనందాన్నీ తట్టు కోలేదు, ఆవేదననూ భరించలేదు. మీ కవిత లాగా, కవితలో ఇంకిన కన్నతల్లి ప్రేమ లాగా …

    డా .రాధేయ

  442. నిర్ణయం గురించి Seetha గారి అభిప్రాయం:

    05/13/2016 9:28 pm

    మలుపు మలుపులో
    ఎందుకు ప్రాణాన్ని మెలిపెట్టుకుందో
    ఉప్పునీట కలిసే ముందు
    ఏమని మనసును ఒప్పించుకుందో

    ఎంత బాగుందో మానస. మనసు దోచుకుంటున్నారు మీరు మీ అందమయిన కవితతో.

  443. కొండదారిలో! గురించి Seetha గారి అభిప్రాయం:

    05/13/2016 7:04 pm

    మానసగారు, మీరు అనుభవించి వ్రాసారో, ఊహించి వ్రాసారో గాని చాలా బాగా వ్రాసారు. నా బాల్యమంతా కొండల్లోనే.. మీ కవిత నా బాల్యాన్ని గుర్తుచేసింది. ధన్యవాదాలు.

  444. సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:

    05/05/2016 4:13 pm

    వాసు గారూ:

    సుమారు 50+ కవితలతో జూన్‌ నెలాఖరికి ద్విభాషాసంకలనం తేవాలని ప్రయత్నం. అన్ని కవితలూ ఆత్మనేపది పుస్తకం నుంచి కాదు. కొన్ని కవితలు మధ్యపదలోపి సంకలనం నుంచి, మరికొన్ని నఈ పహారా సంకలనం నుంచీ తీసుకున్నాను.

    మీ అభిమానానికి కృతజ్ఞుడిని.

    వేలూరి వేంకటేశ్వర రావు.

  445. చిరంజీవి గురించి ns murty గారి అభిప్రాయం:

    05/03/2016 2:18 pm

    మానసగారూ,

    ఆఖరి నాలుగు పాదాలలోనూ, మనసులో దాచుకున్న ఎంత బాధను చెప్పగలిగారండీ!

    ఇది చాలా గొప్ప కవిత అనడానికి సందేహం లేదు.

    కవిత్వానికి ఇంతకంటే వేరే కొలమానాలక్కరలేదు.

    హృదయపూర్వక అభివాదములు.

  446. ఇది చాలు నాకు గురించి అవినేని భాస్కర్ గారి అభిప్రాయం:

    05/03/2016 2:19 am

    వనజ గారూ, ధన్యవాదాలు.

    కామేశ్వరరావు గారూ,
    “బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు” — మీరన్నది సత్యం! ఈ కవితని మళ్ళీ ఎక్కడైనా reproduce చెయ్యవలసి వస్తే మీరిచ్చిన సూచనలు, మీరు చెప్పిన సవరణలు పాటిస్తానండి. ధన్యవాదములు.

    ~భాస్కర్

  447. ఇది చాలు నాకు గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    05/02/2016 4:33 pm

    చక్కటి అనువాదం, భాస్కర్!

    వైరముత్తు రాసిన ఈ కవితను తమిళ సినిమా కడల్ లో వాడుకొన్నారు. ఇది తెలుగులో కడలి అని డబ్బింగ్ చేసారు. తెలుగు సినిమాలో వనమాలి చేసిన అనువాదం ఇలా సాగుతుంది.

    పచ్చని తోట, పసరుల తావి
    నిశీధి మౌనం, నీ ప్రేమగానం
    పౌర్ణమి రేయి, పొగమంచు అడవి
    ఇవి మాత్రం చాలు… ఇవి మాత్రమే

    చరణాలలో వనమాలి చేసిన అనువాదం అంత గొప్పగా లేదు.

  448. హంస గీతం గురించి sai prasad somayajula గారి అభిప్రాయం:

    05/02/2016 4:09 pm

    చక్కని తత్వ గీతం. జీవన చక్ర గతిని చక్కగా కవితీకరించారు.

  449. ఈ-మెయిలు గురించి sai prasad somayajula గారి అభిప్రాయం:

    05/02/2016 1:38 pm

    మంచి కవిత. మంచి శైలి. అర్ధం. భావం.

  450. ఇది చాలు నాకు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    05/02/2016 1:11 pm

    చాలా బావుంది కవిత, అనువాదం! భావంలో సున్నితత్వాన్ని భాషలో చాలావరకూ జాగ్రత్తగా నిర్వహించారు. ఖయాము రుబాయీలు గుర్తుకొచ్చాయి.

    రెండు మూడు చిన్న సూచనలు (బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు!):

    దిక్కులు లేని అడవి – దిక్కులు తెలియని అడవి
    మితంగా ఒక నవ్వు – సన్నగా ఒక చిరునవ్వు
    కాసిని ఎండు పళ్ళముక్కలు – Dry fruits పదానికి అచ్చమైన తెలుగు అనువాదం లేదనుకుంటా. “కాసిని ఎండుద్రాక్షలు” అంటే బాగుంటుందేమో.

  451. నాకు నచ్చిన పద్యం: శుచిముఖి చెప్పిన మెటా కవిత్వం గురించి మోహన గారి అభిప్రాయం:

    05/02/2016 12:12 pm

    చాల బాగుంది కామేశ్వరరావు గారు! సామాన్యముగా కవులు తమ కావ్యములలో చిత్రకవిత్వాన్ని ఒక భాగముగా వ్రాస్తారు. కాని చిత్రకవిత్వమే కథలోని ఒక భాగముగా చేసిన ఘనత సూరనదే. కవికి గొల్లవానికి ఉండే పోలికలు ఉన్న ఈ పద్యమంటే కూడ నాకు ఇష్టమే –

    విశ్రామ విహతి గావింపక, సార వ-
    త్సాహిత్య సౌమనశ్యంబు లెఱిగి
    సమయంబు దప్పక శ్రవణకఠోరంబు
    లైన శబ్దము లత్యాకులాత్మ
    జేయక సత్పరిచిత సుకుమార వా-
    క్సరళి తాభిత్రాయగా నొనర్చి
    పదబంధ శిథిలత వాటిల్ల గానీక
    యే చందములయందు నేమరిలక

    పరగు కవియు దోహకరుడును, యశము దు-
    గ్ధమును బడయు, నట్లు గానివాడు
    కృతి దురాస మొదవు, గీర్తియు బాలు నీ
    కుంట గాదు, హాసయోగ్యు జేయు … (1.008)

    శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఎలా కావ్యాలలో ఉండాలి అనే విషయముపైన ఈ పద్యమును చదవండి –

    పొసగ ముత్తెపు సరుల్ పోహళించిన లీల
    దమలోన దొరయు శబ్దములు గూర్చి
    యర్థంబు వాచ్య లక్ష్య వ్యంగ్య భేదంబు
    లెఱిగి నిర్దోషత నెసగ జేసి
    రసభావములకు నర్హంబుగ వైదర్భి
    మొదలైన రీతు లిమ్ముగ నమర్చి
    రీతుల కుచితంబులై తనరారెడు
    ప్రాణంబు లింపుగా పాదుకొల్పి

    యమర నుపమాదులును యమకాదులు నగు
    నట్టి యర్థ శబ్దాలంక్రియలు ఘటించి
    కవిత జెప్పంగ నేర్చు సత్కవివరునకు
    వాంఛితార్థంబు లొసగనివారు గలరె … (1.082)

    విధేయుడు – మోహన

  452. లిఖిత: నా చీకటి గురించి Chakradhar Sai గారి అభిప్రాయం:

    04/19/2016 10:11 pm

    చాల బాగుందండి కవిత

  453. రెక్కిటికీ గురించి వాసుదేవ రావు గారి అభిప్రాయం:

    04/19/2016 8:25 am

    ఎలా ఉన్నారు మూర్తి గారూ !
    తః తః కవిత మీద మీ అభిప్రాయం తొ నేనూ ఏకీభవిస్తాను.
    (దురదా తహ తహా వాసుదేవ రావు వి కాదు -‘వాడే వీడు’ కాదు కాబట్టి.)
    నమస్కారాలతో – వాసుదేవ రావు

  454. రెక్కిటికీ గురించి ns murty గారి అభిప్రాయం:

    04/18/2016 3:50 pm

    వాసుదేవరావు గారూ,
    “కులుకులకు కుచ్చిళ్ళు సర్దుతూ”

    “కంద దురదా కత్తిపీట దురదా
    కలిపి కళ్ళకద్దుకుని
    నాలుకకు రాసుకున్న వాణ్ణి”
    ….

    ఇలాంటి సరదా కవితలకి ధ్వని, చమత్కారం, క్లుప్తత అలంకారం. మీ కవితకి ఈ మూడు లక్షణాలూ ఉన్నాయి. అభివాదములతో

  455. నాన్నా తెలుసా గురించి మల్లేశ్వరరావు పొలిమేర గారి అభిప్రాయం:

    04/13/2016 11:29 pm

    ఇంత మంచి, సున్నిత మైన కవిత చూడలేదండి . చాలా బాగుంది.

  456. పద్యంలో ఉప్పెన గురించి S A Rahman గారి అభిప్రాయం:

    04/01/2016 10:02 am

    మరోసారి చదవాలనిపించే చక్కని కవిత.

  457. లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో – గురించి Jaya Reddy Boda గారి అభిప్రాయం:

    03/05/2016 2:39 pm

    చాలా బాగుంది కవిత.

  458. ఇస్మాయిల్‌ గారి కవితా తత్వం గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:

    03/03/2016 4:46 pm

    కవిత్వం ఇంకా పబలపష షపలషబదబlబసబపషకి థవవపథl చెయ్యాలనేది ఆయన ఉద్దేశ్యం కావచ్చు.

    “ఇస్మాయిల్‌ గారు విధిగా పాటించిన మరొక సూత్రం తన కవిత్వంలో ఎక్కడా షపపపషపలధపష లేకుండా జాగ్రత్త పడటం. అంటే, ఆయన వాడే బరథఫపషకిగానీ, సఫపరపషకిగానీ ఏరకమైన పౌరాణిక, చారిత్రక లేదా జానపద కధలు లేదా పాత్రలతో సంబంధం ఉండదు. ఒక పద్యానికి సంబంధించిన విషయమంతా అందులోనే ఉంటుందిగానీ, దానినర్ధం చేసుకోవటానికి వేరే ఏరకమైన పరిజ్ఞానమూ సంపాదించవలచిన అవసరం ఉండదు. షపపపషపలధపష వల్ల పాఠకుడి దృష్టి మరలిపోయే ప్రమాదం ఉంటుందనేది ఆయన ఉద్దేశ్యం కావచ్చు. షపపపషపలధపష లేకపోవటంవల్ల పద్యానికొక సలబహపషషథlబసఱ కూడా ఏర్పడుతుంది. ఐతే, ఇటువంటి షపపపషపలధపష సాధారణంగా ఒక జాతి సంస్కృతితో ముడిపడి ఉంటాయి కాబట్టి, వాటివల్ల పాఠకునికి ఇంకా దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుందని కొందరు భావించవచ్చు. అందువల్ల, ఈ విషయంలో భిన్నాభిప్రాయాలకు ఆస్కారం ఉంది.”

    అచ్చు తప్పులా ఇవి? సరి చెయ్యరూ?

    ఇంద్రాణి.

    [యూనికోడ్ లోకి మార్చినప్పుడు ఇంగ్లీష్ పదాలు ఇలా అయ్యాయేమో. రవిశంకర్ గారి సహాయంతో వ్యాసాన్ని పూర్తిగా సరిదిద్దాము. – సం.]

  459. తత్వం… గురించి S A Rahman గారి అభిప్రాయం:

    03/03/2016 2:15 am

    తత్వం — మంచి కవిత చాలా బాగుంది.

  460. ఫాల్ గురించి వారణాసి నాగలక్ష్మి గారి అభిప్రాయం:

    02/25/2016 10:19 am

    అబ్బ ఎంత బావుందో ! వైదేహి గారూ, చదవగానే ఆ దృశ్యం కళ్ల ముందూ, కవితాత్మ మనసులోనూ ఆవిష్కృతమయింది!

  461. వార ఫలం గురించి Sasi Priya Vangala గారి అభిప్రాయం:

    02/08/2016 1:18 am

    మీరు అనువాద కవితలు ప్రచురించకుండా సృజనాత్మక శక్తిని ప్రోత్సహించాలి.

  462. ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు గురించి anipeddijagannadhasastri గారి అభిప్రాయం:

    02/02/2016 1:03 pm

    కవిత నను ఆకట్టుకుంది. భాష వాడిన తీరుకు విస్తుపొయాను.

  463. నాకు నచ్చిన పద్యం: లీలామోహనుని ముగ్ధ సౌందర్యం గురించి ఇంద్రకంటి పినాకపాణి గారి అభిప్రాయం:

    01/28/2016 5:01 am

    చాలా అద్భుతంగా వర్ణించారు. ధన్యవాదాలు. పోతనకు (ఆ మాటకు వస్తే మరే సంస్కృత కవికైనా ) కృష్ణుడు మొదట భగవంతుడు. తరవాతే పసిబాలుడు అయినా మరేదైనా. కానీ ఎర్రనకు కృష్ణుడు మొదట పసిబాలుడు. ఆ తరువాతే భగవంతుడైనా మరేదైనా.. పై పద్యం నిద్ర లేవంగనే తల్లి కనపడక ఏడుపు అందుకునే ఏ పిల్లవాడికయినా సరిపొతుంది. శ్రీ రమ్యాంఘ్రి యుగంతో సహా. ప్రబంధ స్త్రీల ఏడుపు పద్యాలవలె ఎందుకో పసిబాలుల ఏడుపు పద్యాలు ప్రసిద్ధికెక్కలేదు. అసలు ప్రసిద్ధిలో పోతన పద్యాల ముందు ఎర్రనపద్యాలే నిలబడ లేక పోయాయి. కారణం మళ్ళీ ధూర్జటీ చెప్పిందే. ‘చాలుంజాలు కవిత్వముల్ నిలచునే సత్యంబు వర్ణించుచో’!!… ఇక్కడ సత్యము అంటే భగవంతుడని కాక మూర్తీభవించిన భక్తి భావం అనుకుంటే పొతన భక్తి ముందర ఎర్రన కవిత్వం ఆనలేదు తెలుగు వాళ్ళకి. కానీ కవితా దృష్టితొ చూస్తే ఎర్రనే ‘మెరుగు’ దేలుతాడు. భైరవభట్ల గారికి మరొ సారి ధన్యవాదాలు.

  464. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    01/21/2016 12:14 am

    తెలుగు కవిత్వానికి ఒక వినూత్న విభిన్న దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచిక
    http://eemaata.com/em/category/issues/201001

  465. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    01/18/2016 12:35 pm

    రామయ్య గారు, నేను రాసినదీ, మీ కామెంటూ మళ్ళీ ఓ సారి చూసుకుంటే తెల్సింది. మీరు చెప్పినది పూర్తిగా సరికాదు. ప్రస్తుత పరిస్థితులు, ఇలాగే కొనసాగుతాయి రెండు తెలుగు రాష్ట్రాలలో అని భావించుకుంటే – అబ్బే తెలుగు మాట్లాడేది తెలంగాణా ఒక్కటే, ఆంధ్రాలో మాట్లాడేది తెలుక్కాదు అంటే సరే ఒక రాష్ట్రం అందాం – రాబోయ్యే రోజుల్లో పోతన ఆంధ్ర మహాభాగవతం కనుమరుగవుతుందనుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం ఉన్నట్టు తోచదు.

    మహాకవి, పెజా కవి శ్రీశ్రీ ఎక్కడా? పోతనలాంటి పనికిమాలిన సీసపద్యాలు రాసేవాడెక్కడా? కధ నిజమో కాదో తెలియదు కానీ పోతన భాగవతాన్ని తనకి అంకితం ఇమ్మని ఆ రోజుల్లోనే – ఇప్పట్లాగానే – ఓ రాజ రాజ నరేంద్రుడు పోతనని ఏడిపించుకు తిని ఆ పనికిమాలిన పద్యాలన్నీ భూస్థాపితం చేసాడుట. బుధ్ధిలేని కొంతమంది వాటిని తవ్వితీసిమనమీదకి వదిలారు. ఆ పద్యాలు ఎంతచదివినా మహాకవి రాసే కవితల మూలంగా వచ్చే “అత్యద్భుత సామాజిక స్పృహ” రాదనేది జగమెరిగిన సత్యం. నా తప్పు ఒప్పుకుంటున్నాను. ఆ మధ్య చదివిన మహా కవి కవిత ఇచ్చాను ఇక్కడ. పోతన భాగవతం అయుదు సంపుటాలలో ఎంత వెదికినా ఇటువంటి అణి ముత్యం ఒక్కటీ నాకు కనపళ్ళేదు.

    అరిచే కుక్కలు కరవవు
    కరిచే కుక్కలు అరవవు
    అరవని కరిచే కుక్కలు తరమవు
    కరవని అరిచే కుక్కలు మరలవు
    అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు

    మా ఆఫీసులో పనిచేసే ఒకాయన “సర్వీస్ డాగ్” అనే దాన్ని తీసుకొస్తాడు. అది ఈ అయిదోపాదానికి పూర్తిగా వ్యతిరేకం మరి. అయినా చెప్పాను కదండి, నాకేం తెలుసు వంకాయ పులుసు అనీ?

    మీ భవిష్యత్ దృష్టినీ పెజాకవినీ ఆక్షేపించినందు క్షంతవ్యుడను. మీ వ్యాక్యం ఏమీ అనుకోరని సరి చేస్తున్నాను.

    “పోతన శ్రీమదాంధ్ర మహాభగవతం పద్యాలు ఎలాగైనా సర్వనాశనం అయితీరుతాయి రాబోయ్యే రొజుల్లో కానీ ప్రజా/మహా కవి కవితలు మాత్రం తెలుగు వాడు జీవించి ఉన్నంతవరకూ (అంటే దిబ్బ/మినప రోట్టి మన తెలుగు వాళ్ళు మర్చిపోయే వరకూ) మనగలుగుతాయి”

    నా తప్పు ఒప్పుకుని ఇంక అంతర్జాలం బేండ్ విడ్త్ (అంటే ఏమిటో నాకూ తెలియదు కానీ అందరూ వాడుతున్నారు ఆ మాట, నేనెందుకు వాడకూడదూ అని) చేయనని మీకు నా హామీ. శెలవు.

  466. అజంతా రెండు కవితలు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    01/16/2016 8:08 am

    ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు,

    అజంతా గారి స్వప్నలిపి కవితల పుస్తకం పునుర్ముద్రణ విషయమై నేను త్రిపుర గారి ఆప్త మిత్రులు సాహితీ బందుగు, హైదరాబాదు వాస్తవ్యులు, శ్రీ రామడుగు రాధాకృష్ణ మూర్తి గారికి విన్నవించాను. అలాగే అజంతా గారి మిత్రులు విశాలాంధ్ర పబ్లికేషన్స్ ( ప్రస్థుతం అది నవచైతన్య అని తెలంగాణా రాష్ట్రానికి సంబందించిన మరో ముక్కగా విడివడింది కాబోలు ) శ్రీ ఏటుకూరి ప్రసాదు గారికీ విన్నవించాను. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్న ”స్వప్నలిపి” పుస్తకం దశాబ్దాల అనంతరం తిరిగి పునర్ముద్రణ పొంది నలుగురికీ అందుబాటులోకి వచ్చేలా మీరే చూడగలరు అని వారిని అభ్యర్ధించాను. తమ కమిటీ మెంబరర్లతో యీ విషయం చర్చిస్తానని ఏటుకూరి ప్రసాదు గారు హామీ ఇచ్చారు. (ఇది నేం డ్రాపింగ్, ప్లేయింగ్ టు ద గ్యాలరి ల కింద వచ్చే విషయంలా ఉన్నా మీకు నివేదించాలనే నా ఉబలాటాన్ని ఆపుకోలేకున్నాను). వీలుంటే మీరూ ఓ సమిధ వేస్తారని ఆశపెట్టుకుంటున్నాను.

  467. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    01/14/2016 12:02 am

    శర్మ దంతుర్తి గారికి ఓ విన్నపం.
    ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ గురించి ప్రస్థావించాల్సి వచ్చినప్పుడు “ఫలానా కవిగారు రోడ్డుమీద పోయే ప్రతీవాణ్ణీ అప్పులడిగి సిగరెట్లు కాలుస్తూ తాగుడికి బానిస అయ్యాడు” వంటి వ్యాఖ్యల వల్ల కలిగే ఉపయోగమేవిటి. ప్రజాకవిగా తరతరాల పాఠకుల గుండెల్లో తిష్టవేసుకుని కూర్చున్న శ్రీశ్రీకి జ్ఞానపీఠ్ అవార్డు రాకున్నా వచ్చిన నష్టమేవీలేదు కదా. పోతన పద్యాలు లాగే శ్రీశ్రీ కవితలూ కాల పరీక్షకు నిలిచి చిరస్థాయిగా ఉంటాయి. భగీరధుడు గంగను ఆకాశం నుండి భువికి తీసుకొచ్చినందువల్ల కలిగిన ప్రయోజనం లాంటిదే శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రజలు, ప్రజాఉద్యమాల చేరువకు తీసుకురావటం వల్ల కలిగిందని అనుకునే వారూ ఉన్నారు.

    ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు: “కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది” (వీకీపిడియా నుండి)

  468. అజంతా రెండు కవితలు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    01/13/2016 9:18 am

    ‘అంతా ఒక చిత్కళ ‘ గా భావించిన అతడిముందు మోకరిల్లాను.
    జీవితమే కవిత్వంగా జీవించిన అతడిముందు మోకరిల్లాను.
    అతడు సృష్టించిన ‘స్వప్నలిపి’ముందు మోకరిల్లాను.
    ఆ మహా కవివృక్షం ముందు తలవంచి స్మరిస్తున్నాను,
    నీ “అక్షరం నిండా అన్నీ అద్భుతాలే” అని . . . . కవి యాకూబ్

    1997లో డిల్లీలో జరగనున్న కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం సభకి వెళ్లటానికి శoకిస్తున్న అజంతా గారిని పన్నాల సుబ్రహ్మణ్య భట్టు దంపతులు పట్టుబట్టి డిల్లీకి తీసుకెళ్లారట. పురస్కార ప్రధానోత్సవ సభావేదిక మీదకు వెళ్లటానికి ముందు తన అర్ధాంగికి సమస్కరించి వెళ్లిన అజంతా గారు, సభికులనుద్దేశించి, సభలో ఉన్న శ్రీ శ్రీ గారిని ఉద్దేశించి … ఇది ( స్వప్నలిపి ) కవిత్వం కాదు, కవిత్వం రాయటానికి నేను చేసిన ప్రయత్నం మాత్రమే అని సవినయంగా చెప్పుకున్నారట. అట్టహాస ఆర్భాటాల పురస్కార గ్రహీతలందరి తరువాత చివరగా ముక్తసరిగా జరికిన యీ సంఘటనకి పులకించిన అకాడెమి సెక్రటరీ గారు, సభికుల కరతాళ ధ్వనుల మధ్య అజంతాని ఆప్యాయముగా అక్కున చేర్చుకున్నారట.

    మహాకవి శ్రీశ్రీ కవిత్వ వారసుడిగా పేరొందిన అజంతాని, శ్రీశ్రీని గుండెల్లో పెట్టుకు తిరిగిన అజంతాని, శ్రీశ్రీ మెచ్చిన కవి అజంతాని, సామాజిక సంవేదనని `స్వప్నలిపి’గా మలచిన అజంతాని, సగర్వంగా, సవినయంగా స్మరిస్తున్నాను పరుచూరి శ్రీనివాస్ గారు (ఓ సామాన్య పాఠకుడిగా).

    ఆధునిక కవులు తిలక్, బైరాగి, అజంతా, కాకినాడ పెద ఇస్మాయిల్ గారు, మో, త్రిపుర, నగ్నముని, శివారెడ్డి, వరవరావు ఇంకా అనేక ప్రతిభావంతుల పట్ల మీలాంటి వాళ్లకు ఆశక్తి పెరిగితే అది పదుగురికి లాభిస్తుందనీ ఆశిస్తున్నాను శ్రీనివాస్ గారు.

  469. అజంతా రెండు కవితలు గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    01/11/2016 3:30 pm

    రామయ్యగారు: స్వప్నలిపి పుస్తకం ప్రచురణ ఎలా జరిగిందో నేను కూడా విన్నాను. నాకు ఆధునిక (post-1950s) తెలుగు కవిత్వం గురించి పెద్దగా తెలియదు. ఆసక్తి లేదు అనాలేమో!

    Lyla: I am the wrong guy to discuss modern Telugu poetry with 🙂

  470. అజంతా రెండు కవితలు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    01/09/2016 11:57 pm

    ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు, నమస్కారములు.

    మీకు తెలిసే ఉంటుంది …. అజంతా గారి కవితలని పుస్తకంగా ప్రచురించటానికి త్రిపురని డిస్కవర్ చేసి తెలుగు పాఠకులకి అందించిన విశాఖ డా.అత్తలూరి నరసింహరావు గారు ఎంత ప్రయత్నించినా సాధించ లేక పోయారు కాని,వారి మేనల్లుడు ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ ఆ ఘనకార్యం సాదించాడు. అజంతా గారిని ఒప్పించి “స్వప్నలిపి” కవితల పుస్తకాన్ని తన సొంత ఖర్చులతో ‘కవిత్వం ప్రచురణల’ ద్వారా ఎంతో అందంగా తీర్చిదిద్ది వెలుగులోకి తెచ్చాడు. ఈ కవితా సంకలనం 1997లో సాహిత్య అకాడెమీ కవిత్వ పురస్కారం అందుకుంది.”స్వప్నలిపి” ని అజంతా, త్రిపురల ప్రియనేస్తం ‘మో’ గారు “Dream Script” పేరిట ఇంగ్లీషులోకి ఆనువదించారు.

    ” అక్షరం నిండా అన్నీ అద్భుతాలే అని
    శబ్ద శక్తి సార్వభౌమాధికారం అనాహాతం అని చెప్ప లేదా నేను చెప్ప లేదా”

    “నేను ప్రతి మనిషిలో వుంటాను, నేను ప్రతి మనిషి స్వప్నంలో వుంటాను, స్వప్న సౌందర్యంలో వుంటాను … అధః పతితుడైన మనిషిని ఆప్యాయంగా లేవనెతుత్తున్న కారుణ్య హస్తాలలో వుంటాను ”

    అన్న అజంతా “సజీవ స్వరం” ఈమాట ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ప్రవాసం లోని మీకు, విజయవాడ లోని శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు.

  471. రెండు కవితలు గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    01/07/2016 2:00 pm

    రెండు కవితలు కూడా చాలా బాగున్నాయి.

  472. అక్కరలు గురించి మోహన గారి అభిప్రాయం:

    01/05/2016 2:30 pm

    వ్యాసమును చదివి తమ అమూల్యమైన అభిప్రాయములను తెలిపిన శ్రీమతి సుప్రభ, శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారలకు నా నమస్సులు. ఇది అక్కరలపై వ్యాసము కాబట్టి ఒకటికన్న ఎక్కువగా ఉదాహరణములను చూపలేకపోయినాను.

    శ్రీమతి దోనేపూడి లక్ష్మీకాంతమ్మ “తెలుగు కవిత్వంలో మధ్యాక్కర – ఒక పరిశీలన” అనే PhD సిద్ధాంత గ్రంథములో మధ్యాక్కరలను ఉపయోగించిన తెలుగు కవులపై ప్రత్యేకముగా కొన్ని ప్రకరణములను కేటాయించారు. అందులో ఆ కవులు వ్రాసిన కావ్యములనుండి ఎన్నియో ఉదాహరణములను కూడ ఇచ్చారు. క్రింది మొదటి ఏడు మధ్యాక్కరలను అక్కడినుండి గ్రహించి, ఉదాహరణములుగా ఇక్కడ పొందుపరచినాను. ఎనిమిదవది “వేదనామధ్యాక్కరలు” (లింకు) అనే పుస్తకమునుండి గ్రహించాను. తొమ్మిదవది శ్రీ రవిగారు నేను వ్రాసిన “ఛందస్సుకు ఒక కొండ – కొక్కొండ” (లింకు) వ్యాసమునకు ఒక అభిప్రాయములో తెలిపినారు. విశ్వనాథ మధ్యాక్కరలు ఇక్కడ లభ్యము (లింకు)

    1) తుమ్మల సీతారామమూర్తి చౌదరి – మహాత్మకథ

    ఓ యయ్య ప్రాయోపవేశమునకు – మూనకు, నీవు
    పోయిన మాకు స్వాతంత్ర్య మేల ప్ర-భుత్వ మదేల
    శ్రీయేల జీవిత మేల సౌహార్ద – సిద్ధికై శ్రమము
    సేయుదుమని కమ్మ నంపి రా యోగి-శేఖరు కడకు

    2) ఆరుద్ర – శుద్ధ మధ్యాక్కరలు

    పదమూడు మాత్ర లున్నట్టె – పాదార్ధముల వళ్లు పెట్టె
    తుది ప్రాస లందులో నిలుపు – తూకాన అవి రెండు కలుపు
    మొదలట్లు తొలి ప్రాస వుంచు – ముద్దుగా నాల్గాలపించు
    కుదురైన అందాల గములు – కొత్తవీ మధ్యాక్కరములు

    3) నాయని సుబ్బా రావు – విషాద మోహనం

    పోయిన సూర్యుండు వచ్చు – పోయిన చంద్రుండు వచ్చు
    పోయిన పదునాఱు కళలు – పూర్తిగా విధునకు వచ్చు
    పోయిన తారకత మినుకు – పూవుల గుత్తులు వచ్చు
    పోయిన మోహనా వినయ – భూషణా తిరిగి రావేమి

    4) కోవెల సుప్రసన్నాచార్య – పాంచాలరాయ శతకము

    ఎన్నడు వినుటయే కాని – యెన్నడు కనుటయే లేదు
    ఎన్నడు కాంచుట కాదు – యెన్న డూహించుట లేదు
    ఎన్నాళ్ల కెన్నాళ్ల కయ్యె – యిట్టి మీ దివ్య దర్శనము
    కన్నుల పండువు కాగ – కరుణాబ్ధి పాంచాలరాయ

    5) దాశరథుల బాలయ్య – శ్రీవాసరజ్ఞానసరస్వతీ మధ్యాక్కరలు

    ఒకచేత వీణ ధరించి చిరునవ్వు – లొలుకబోయుచును
    నొకచేతఁ బొత్తమ్ము గొనుచు నంచపై – నొప్పారి రావె
    ప్రకటింతు వేవేల నతులు సకల సౌ-భాగ్యంబు లీవె
    యిక నాకు జ్ఞానసరస్వతీ వాస-రేశ్వరీ దేవి

    6) జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి (శాంతిశ్రీ) – సత్యశాయి మధ్యాక్కరలు

    తల్లి వందురు కొందరు మరి కొందరు – తండ్రి వందురు జ-
    గల్లీల కాని స్త్రీపురుష భేదమ్ము – కలద నీయందు
    తల్లివై లాలింతు వెంతొ తండ్రియై – దండింతు వంతె
    చల్లని మా తల్లి తండ్రి జయ సత్య-శాయీ నమోస్తు

    7) దోనేపూడి వెంకయ్య – చారిత్రకం
    (ఇతడు మధ్యాక్కరను free verse రూపములో యతిప్రాసలను ఎల్లప్పుడు పాటించక వ్రాసినారు)

    ఇష్టదైవము దేశమాత కావలె నీతరమ్మునకు
    ఇష్టకామ్యార్థము లొసగు నీదేవి యీనాడు మనకు
    సర్వ లోకము లేలు తల్లి స్వయముగా సాక్షాత్కరించె
    సర్వావతారాల మూలమౌ పరమావతారమ్ము
    శర్వాణి వాణి వైష్ణవి సకలదైవ సమ్మేళనమ్ము
    ఉర్విలో భరతోర్వి, ఈమె సేవయే ఉత్తమ పూజ

    8) జి. వి. సుబ్బా రావు – వేదనా మధ్యాక్కరలు

    హేమంత మానంద భావ – హేలా మనోజ్ఞమ్ము నగుచు
    చేమంతి విరబూచి నవ్వి – సీమంతినీ కేశ మొదిగి
    భామాంతర ప్రణయ మధు-వాను ప్రియుని హర్ష మొలికి
    హేమంత శీతల జ్యోత్స్న – యిముడదీ కవితాపథాన

    9) పుట్టపర్తి నారాయణాచార్యులు – శ్రీనివాసప్రబంధము

    పార్వతీ పరమేశ మదన – పరవశతావృత్తి జెల్లె
    యోర్వంగ రాక బెక్కేడు, – లుద్రిక్తులై సురలెల్ల
    శర్వుని భంగింపనెంచి, – శతధృతి తోడన గూడి
    పర్వెత్తిరుత్తాల సాల-పంక్తి తుషారాద్రి గుఱిచి

    విధేయుడు – మోహన

  473. ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    01/05/2016 2:07 pm

    మాన్యులు శ్రీ కృష్ణమోహనరావు గారికి
    నమస్కారములతో,

    ఆదరపూర్వకమైన మీ సహృదయ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు ప్రస్తావించిన విషయాలు:

    మొదటిది: రాయలు ‘ఆంధ్రకవి’ అనటం సాభిప్రాయమూ, విశేష హృదయధర్మమే కాని, ఇతరభాషాకవుల మధ్య వ్యవచ్ఛేదకంగా అన్న మాట కాదు. అది పాదపూరకం కాదు. పరివృత్తిని ఎంతమాత్రం సహింపని భావభావన. తెలుగువారిని ఉద్దేశించి తెలుగులో పద్యం చెబుతూ, ‘తెలుగు కవి ధూర్జటి’ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. “ప్రౌఢకవి ధూర్జటి” అనవచ్చును కదా. అష్టదిగ్గజ కవులందరూ తెలుగువారే అయితే, “స్తుతమతి యైన ఆంధ్రకవి” (లేదా, ‘తెల్గు కవి’) అనవలసిన అవసరం అసలే ఉండదు. అక్కడ “ఆంధ్ర” శబ్దప్రయోగం కేవలం భాషాభిమానాన్ని మాత్రమే సూచిస్తున్నదన్నది ప్రతిపాద్యాంశం.
    రాయాస్థానంలో ఉన్నది అష్టదిగ్గజములా? నవరత్నములా? వారిలో అందరూ తెలుగువారు మాత్రమేనా? ఇతరులూ ఉన్నారా? అన్న విషయాన్ని అధికరించి అనేకవాదోపవాదాలున్నాయి. సంస్కృతాంధ్రతమిళకన్నడ కవులవి ఏవేవో పేర్లు విమర్శకుల పరిశీలనకు వచ్చాయి. ఆ కవులలో సుప్రసిద్ధులూ, అప్రసిద్ధులూ ఉన్నారు. ఇదమిత్థమని తీర్పు చెప్పటం సాధ్యం కాదు. కనీసం అందుకు ఆవశ్యకమైన సాధనసామగ్రినైనా సమీచీనంగా సమీకరించటం ఈనాటికీ జరగలేదు.

    రెండవది: ఆముక్తమాల్యదలో ఆ వాక్యం ప్రస్తావింపబడిన తీరును బట్టి “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న నిరుక్తికి రాజకీయ, సాంస్కృతిక కారణాలనేకం తప్పక ఉండి ఉంటాయని విశ్వసింపవచ్చును. అటువంటివేవో ఉండినందువల్లనే అదేదో తన మాటగా చెప్పక క్రీడాభిరామములోని ఆ మాటను త్రవ్వి తలకెత్తి, ప్రార్థితస్వప్నాన్ని భగవద్వాక్యంగా నిరూపింపవలసి వచ్చి ఉంటుంది. కారణం ఏదైనా, ఎంతో అభిమానం లేనిది అసలు ఆంధ్రకావ్యరచనకు ఉపక్రమణమే ఉండదు కదా.

    మూడవది: కావ్యరచన సాగుతున్న కాలంలో కవులు తత్తత్సన్నివేశాలను నలుగురికీ వినిపించటం వింతేమీ కాదు. అది నాడూ, నేడూ జరుగుతున్న దృగ్విషయమే. నా మటుకు నేనే ఎంతోమంది ప్రసిద్ధుల రచనలను అవి సుపరీక్షితాలూ, సుపరిష్కృతాలూ కాకముందే ఉక్తలేఖనదశలో విన్నాను. చదివాను. కావ్యం మానవసమర్పితమైతే, ఆ కావ్యాన్ని నలుగురికీ నాలుగు చోట్ల వినిపిస్తూ, ఎవరికి అంకితం ఇవ్వాలో వ్యక్తిని కుదుర్చుకోవటానికి ఆ రోజుల్లో ఎంతో కాలం పట్టేది. ఆ ‘కృతిభర్త’కు నలుగురి చేత చెప్పింపవలసి వచ్చేది. అంకితం పుచ్చుకొని ఏమివ్వగలడో, ఏమిస్తానంటాడో; అది తనకు అంగీకార్యమో, కాదో తెలుసుకోవాలి కదా. కృతి పూర్తయిన తర్వాత ఒప్పందాలు కుదుర్చుకొని, వంశచరిత్ర సేకరించి, కృత్యాదిని వ్రాయటానికి పడే ఆ అవస్థనే ‘కృతాద్యవస్థ’ అనేవారు. కృతాద్యవస్థ అంటే రచన మొదలుపెట్టేందుకు పడే అవస్థ కాదు; కృతి పూర్తయిన తర్వాత అవతారికను వ్రాసేందుకు పడే అవస్థ.

    శ్రీమహాభాగవతం రచన అద్భుతంగా సాగుతున్నదని విన్న తర్వాతనే కదా, రాజు పోతన గారిని దానిని తనకు అంకితం చేయాలని అడగటమూ, ఆయన ఇవ్వననటమూ జరిగింది? రచనాప్రక్రియ నిర్విఘ్నపరిసమాప్తి పర్యంతం రహస్యంగా ఉంటే ఈ వృత్తాంతాలే సంభవింపవు కదా.

    కావ్యరచన ఎంత గజగర్భపద్ధతి అయినా, అదేమీ ఐకాంతికమైన రహస్యవ్యాసంగం కానేరదు. రచనా ప్రారంభానికి పూర్వపు కృషి మాత్రమే కవికి ఆంతరంగికం. రచన సాగుతున్న దశ, రచన పూర్తయాక అంకితోత్సవానికి లేదా భగవత్సమర్పణకు మునుపు సూర్యాలోకం అన్నవి బహిర్ముఖీనములే. నిండుసభలో ఇంకా పూర్తి కాని కావ్యమధ్యసన్నివేశాన్ని గానంచేయటం గుణగౌరవాన్ని, అందుకొనబోయే గౌరవాన్ని గౌణీకరింపదు సరికదా, రచన సవ్యంగా కొనసాగటానికి, కావ్యప్రశస్తికి మరింత ఉల్లాసదోహదం కాగలుగుతుంది.

    కావ్యాన్ని పూర్తిచేసిన తర్వాతైనా, కావ్యరచనాకాలంలో నైనా కావ్యగానాన్ని కవి తానై స్వయంగా చేసి ఉండటమూ, ఇతరులు కోరగా చేసి ఉండటమూ రెండూ సహజమే. సాహిత్యసభ అన్నాక కొలువుతీరినవారు వారు వారు వ్రాస్తున్న విశేషాలనూ, నాటినాటికి వ్రాసిన విషయాలనూ తెలుసుకోక మానరు కదా. నిజంగా అష్టదిగ్గజాలలో ఉన్నవాడే అయితే, కావ్యాన్ని ఇంట్లో లేఖకులకు చెప్పి వ్రాయిస్తూ, రచన పూర్తయే దాకా శైలి, కథ, కవిత్వం, చమత్కారాలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టటం అసలే వీలుకాదు. కావ్యగానాలు జరుగుతుండేవని, ధూర్జటి ఆలస్యంగా ఆస్థానప్రవేశం చేసి కృష్ణరాయలు అప్పటికింకా సుముఖుడై ఉన్న 1523-1524 ప్రాంతాల కావ్యాన్ని మొదలుపెట్టి రచన సాగిస్తూ, అడిగినప్పుడు నలుగురికీ వినిపిస్తూ ఉండేవాడని, పరిస్థితులు తారుమారయిన కొంతకాలానికి పూర్తిచేసేనాటికి భవపరాఙ్ముఖుడుగా ఉన్నాడని ఊహ్యం.

    ధూర్జటి గారు అష్టదిగ్గజాలలో ఒకరా? అన్న విషయం అనుమేయమే కాని, ఏ సంగతీ నిర్ధారించి చెప్పలేమని వ్రాశాను.

    కందుకూరి రుద్రకవి సాహిత్యజీవితమంతా క్రీస్తుశకం 1550 తర్వాత ప్రారంభమయింది. తొలిరచన నాటికి నలభై యాభై యేళ్ళవాడనుకొంటే, అష్టదిగ్గజకవులలో కాదు సరికదా, మామూలు ఆస్థానకవి కూడా అయివుండడు. ఆయన ఈశాన్య సింహాసనాసీనుడన్నది విశ్వసనీయం కాదు. సంస్కృతంలో ‘రాష్ట్రౌఢ వంశకావ్యం’ ఆయన కృతి అని తెలుగు సాహిత్య చరిత్రకారులు వ్రాసినది సరికాదు.

    ఈ లఘుప్రస్తావికను సహృదయంతో చదివి ఎంతో ఔదార్యంతో ఆశీర్వచస్సులను అందించిన పూజ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి నమస్సుమాంజలి! _/|\_ !
    సౌజన్యమూర్తులు శ్రీ రంగ గారికి, శ్రీ రవి గారికి – ప్రణామాలు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  474. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    01/04/2016 11:47 pm

    ఇక్కడ మరో యుద్ధం మొదలైంది కనక నేనూ ఓ సమిధ వేస్తున్నాను. ముందుగా కొన్ని జెనెరిక్ ప్రశ్నలు. శ్రీశ్రీ కి మహాకవి అని బిరుదు ఎవరిచ్చారు? ఒకట్రెండు కవితలు రాయగానే జ్ఞానపీఠ్ అవార్డు ఇచ్చేయరు. మరింత ముఖ్యం గా చెప్పాల్సినదేమిటంటే అవార్డులు దృష్టిలో పెట్టుకుని రాస్తే అవార్డులు రావు. రాసేదానిమీద ఇంటరెస్టూ, ఇష్టం, శ్రద్ధా ముఖ్యం. అవన్నీ ఉంటే వద్దన్నా అవార్డులు వస్తాయి. మరి అవార్డులిచ్చేటప్పుడు కవిగారి “బయటి” వ్యసనాలు కూడా కమిటీ అంతర్గతంగా తప్పకుండా గుర్తుంచుకుంటుంది – అవి పనికిరాని విషయాలైనప్పటికీ వాటి వల్ల అవార్డు రాకపోవచ్చు. వింతేమీ లేదు. ఫలానా కవిగారు రోడ్డుమీద పోయే ప్రతీవాణ్ణీ అప్పులడిగి సిగరెట్లు కాలుస్తూ తాగుడికి బానిస అయ్యాడు అనేది జ్ఞానపీఠ్ అవార్డు రాకపోవడానికి తప్పకుండా సహకరించే విషయం – ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినాను. మీరే కమిటీలో ఉంటే మీరూ అలాగే ఆలోచిస్తారు. అందుకే రాసేవాడికి సభ్యతా, సంస్కారం అనేది జీవితంలో ఉండాలి. అయినా జ్ఞానపీఠ్ అవార్డు ఇవ్వాలంటే కవితలు సరిపోవు కదా? ఒక కావ్యం రాయాలి – ఒక మాస్తి, ఒక విశ్వనాథ అలా రాసారు కనక వాళ్ళకు ఇచ్చారు. మహా ప్రస్థానం రాసినందుకు నిజంగా శ్రీశ్రీకి జ్ఞానపీఠ్ ఇచ్చి ఉంటే తెలుగు సర్వనాశనం అయిపోయినందుకు అప్పట్లోనే పత్రికలు రాసి ఉండేవి. ఇది నా బోడి అభిప్రాయం.

    ఇకపోతే ఇక్కడ రాసినది వ్యాసమా, కధా అనేది సంపాదకులు వాళ్ల ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తారు. ఇలా కూడదూ అలా ఉండాలి అని చెప్పడానికి తెలుగులో కానీ మరే భాషలో కానీ రూల్స్ లేవు. వ్యాసం అంటే ఏమిటి? గూగిల్ చేస్తే రూల్స్ దొరుకుతాయా? దొరికితే మాత్రం ఆ రూల్స్ రాసినవారెవరు? వాళ్ళు బ్రహ్మ పదార్ధాలా? వాళ్ళూ మనుషులే కదా? అంటే ఒక సంపాదకుడు వాళ్ళు చేసే పత్రిక పని బట్టి నిర్ణయిస్తారు. మీకిష్టం ఉంటే చదవండి లేకపోతే లేదు. ఇలా ఉండాలి అని చెప్పడానికి మీకేమిటి క్వాలిఫికేషన్? మీరు ఎడిటరైతే మీ పుర్రెకి పుట్టినట్టూ మీరు చేస్తారు కదా? ఇది వ్యాసం కింద ప్రచురిస్తే ఇదో వ్యాసమా అనే పెద్దమనుషులు బయల్దేరతారు. మొత్తమ్మీద ఇదో తండ్రీ, కొడుకూ, గాడిద కధలా తయారవుతుంది. ఇంతా చేస్తే ఈమాట సంపాదకుల పని జీతంలేని నౌకరీ. చేతుల దురదా, వచ్చిన చెత్తా చదవడం అనేవి థేంక్ లెస్ ఉద్యోగాలు. తెలుగు మీద మమకారంతో చేస్తామని ఒప్పుకుని ఇలా రెక్కలు ఊడగొట్టుకునే వాళ్ళ మీద ఊరికే నోరు పారేసుకోవద్దు.

    సందర్భం వచ్చింది కనక మరో విషయం. మాగంటి గారు అట్టు గురించి. అది చదివి నవ్వు ఆపుకోలేకపోయాను. ఆ పారడీ ఎందుకు రాయకూడదు? ఇస్మాయిల్ బతికున్న రోజుల్లోనే మాగంటి గారు రాసి ఉంటే దాన్ని ఎడిటర్లు ప్రచురించేవారని నేను ఘంఠాపధంగా చెప్పగలను. నన్ను అడిగితే నాకు అట్టు నా ఆదర్శమే చెట్టుకన్నా బావుంది.

    ఇప్పుడు మీలో ఒక్కోరికీ ప్రశ్నలు.

    కేశవులు గారు: ఎన్నారైలు ఏదో చేయట్లేదు – ఇక్కడ నూతులు చాలవన్నట్టూ …అన్నారు. నేను మొదట్లో ఎన్నార్టీ, ఆ తర్వాత ఎన్నారై. ఎప్పుడూ తెలుగు చదవడం రాయడం అనేవి మర్చిపోలేదు. నెలల తరబడి తెలుగుకి మొహం వాచి ఏమీ దొరకనప్పుడు ఆఖరికి కాయితం తీసుకుని పోతన పద్యాలు గుర్తున్నంతలో కాయితం మీద రాసుకుని తృప్తి చెందిన రోజులున్నాయి. తెలుగుకి ఏదో ఒక రకంగా కృషి ఎన్నారైలే చేయాలా? మాకేం పనిలేదా? మీరు ఎన్నారై అయితే ఏమి చేసుండేవారు? మీరు ఆంధ్ర దేశాలు రెండింటిలోనూ ఏదో ఒకచోట ఉంటే ఏం చేస్తారేం? తెలుగు మాట్లాడే దేశంలోనే ఉంటూ ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చునేకంటే ఎన్నారైలు ఈమాట పత్రిక నడుపుతున్నారు అదే మంచిది కదా? ప్రతీ దానికీ అమెరికా, తానా అని మామీద అరుచుకోవడం కంటే మీరు చేసిన కృషి ఏవిటో శేలవీయండి.

    కటకటా: ఈమాట చదవమని మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు? సంపాదకులు మీ నోరు పెగిల్చి చేదు మాత్ర మింగించారా? టెంప్లేట్లు అంటున్నారు. అంటే అవేమిటో మీకు తెలుసా? ఏది వ్యాసం, ఏది కధ అనేది తేల్చడానికి ఎవరిది హక్కు? ఓ ముఖ్యమంత్రి కమిటీవేసి పెద్ద తెలుగు చదువుకున్న ప్రొఫెసర్లందరి చేతా చెప్పించాలా? ఈ ప్రొఫెసర్లకి డిగ్రీలు ఎలా వచ్చాయో మీకు తెలియదా? వాళ్ళ సిద్ధాంత గ్రంధాలు మీరు ఎప్పుడైనా చదివారా? పక్కనే ఉన్న అద్భుతమైన గ్రంధాలు వదిలేసి శ్రీశ్రీ రాసిన కవితలు (నేనుంటే, నీవుంటే, వాడుంటే, వీడుంటే.. ఇలా నాలుగు లైన్లు) వాటి మీద పి.హెచ్.డి చేసి పారేసి కమిటీలో కూర్చుంటారు. వీళ్ళా రూల్స్ చెప్పేది? వాళ్లకి మీటింగుల్లో తాగడానికింతా, తినడానికింతా అని ఇచ్చేస్తే మన ఇష్టం వచ్చినట్టు రాసి పెడతారనేది జగమెరిగిన సత్యం.

    లక్ష్మణ్ణగారు: ప్రతీ దానికీ ఒక ధన దృక్కోణం, ఋణ దృక్కోణం ఉంటాయండి. ఒక ప్రోబ్లెం ఓరియెంటెడ్ అప్రోచ్, ఒక సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్ కూడాను. గంగ భువికి దిగకుండా అక్కడే ఆకాశంలో ఉండిపోతే ఏవిటి ప్రయోజనం? ఏనుగు లక్ష్మణ కవిగారి అనువాదం బాగానే ఉంది చదువుకుని సరదాగా అనుకోవడానికి. భువిమీదకి దిగేముందు గంగాదేవి “మరి నాలో పాపాలు ఎలా పోగుట్టుకోవాలి?” అని అడిగితే భగీరధుడు చెప్తాడు – అన్నిపాపాలనీ నాశనంచేసే తపస్సంపన్నులుంటారు కదా వాళ్ల స్నానంతో నీవు పవితృరాలివౌతావు అని. ఆకాశంలోనే ఉండిపోతే గంగాదేవికి హరుడి శిరస్సుమీద దిగినందుకు కలిగే పుణ్యం, ఆ తర్వాత అనేక పాపాత్ములని మార్చే అవకాశం లభించి ఉండేవి కాదు. “ఒక్క కుక్క ఆకలితో అలమటిస్తున్నా దాని ఆకలి తీర్చడం కోసం వేయి కోట్ల జన్మలెత్తమన్నా నేను సిద్ధం” అని స్వామి వివేకానంద అంటారు. అందుకే కాబోలు గంగ భగీరధుడి కోరికకి వప్పుకుంది. దానితో అనేక కోట్ల మంది ధన్యులౌతున్నారు యుగాల తరబడి. ఇది నా దృష్టిలో సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్. అదలా ఉంచితే ఈమాట బాగా దిగజారిపోయినట్టు మీకనిపించినట్టు చెప్పారు. పాత సంచికలు ఓ సారి తిరగేయండి. నాకు పెద్ద వ్యత్యాసం కనబళ్ళేదు మరి. ఓ వేమూరి గారి వ్యాసం/కధ మరొకరి కంప్యూటర్ సైన్స్ వ్యాసం వాళ్ళు రాస్తే భలే భలే అనే మీరే ఇలా అనడం వింతగా ఉంది. పోనీ మీరే చెప్పండి – ఏ విధంగా ఈమాట ని పైపైకి తీసుకెళ్ళొచ్చు? ఓ సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్ చూపించండి

    ఇదంతా చేసి నేను సంపాదకులని వెనకేసుకొస్తున్నాని అనుకోకండి. నేనూ వాళ్లమీద కత్తులు నూరుతూ ఉంటా. నేను రాసిన కధకి ఓ సారి వారి కామెంటు చూసి వళ్ళు మండిపోయిండి. “మీరు రాసినది ఎంత అసందర్భంగా ఉందో మీకు తెలియదు. రాస్తూ ఉండండి అనగనగరాగ మతిశయించుచుండు” అన్నారు మరి. చివరిగా మరో మాట. పాతకాలంలో అయితే పత్రికలో ఏదో ప్రచురిస్తే వేసుకునే వారు. దానిమీద వచ్చిన విమర్శలు ఆ పై సంచికలో వేసేవారు. ఆ తర్వాత అంతే. అయితే సంపాదకులనుంచి ఎటువంటి సమాధానం రాదు అప్పట్లో. దానికంటే ఇప్పుడు ఈమాట సంపాదకులు సమాధానం ఇస్తున్నారు కనీసం 24 గంటల్లో. ఏమిటి ఇక్కడ ఉన్న కష్టం మీ అందరికీ?

    పోనీ ఈమాట కట్టేయండి. దరిద్రం వదుల్తుంది. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టూ మీరు నోరు పారేసుకోవచ్చు ఏమంటారు?

  475. ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి మోహన గారి అభిప్రాయం:

    01/04/2016 10:46 pm

    చదువుటకు ఆసక్తి కలిగించే చక్కని వ్యాసము. మురళీధరరావుగారికి అభినందనలు.

    నాకు తోచిన సందేహాలు –

    (1) ఆ కాలములో “అష్టదిగ్గజములు” అని పిలువబడిన కవులందఱు తెలుగు కవులే. కావున ఆంధ్రకవి అని తప్ప మఱెలా ధూర్జటిని పిలువడము? సంస్కృత పదాలను పద్యమంతా ఉపయోగించినా, ఎక్కడో ఒక చోట ఒక చిన్న తెలుగు పదము ఉంటుంది కదా? ఆంధ్ర లేక తెల్గు లేక తెన్గు అని ఉపయోగించాలి అక్కడ. తెల్గుకవి కన్న ఆంధ్రకవి వినుటకు బాగుండినందువలన, ఆంధ్రకవి అని అన్నాడని నా ఉద్దేశము.

    (2) ఇక పోతే కృష్ణరాయల “దేశభాషలందు తెలుగు లెస్స” అనే పాదమునకు ఆ కాలపు రాజకీయాలు కూడ కారణమై ఉండవచ్చును అని వెల్చేరు నారాయణ రావు “Coconut and Honey: Sanskrit and Telugu in Medieval Andhra” అనే ఒక వ్యాసములో తెలిపియున్నారు.

    (3) సామాన్యముగా ఆ కాలములో కవులు తమ గ్రంథములను పూర్తిగా వ్రాసిన పిదప మాత్రమే వాటిని ఇతరులకు వినిపించేవారు అని నా భావన. దానికి కారణము వాటిలోని శైలి, కథ, కవిత్వము, చమత్కారాలు పూర్తి కాక మునుపే ఇతర కవులకు తెలియజేయుటకు ఇష్టపడరు. దానివలన లభించబోయే గౌరవము మున్నగునవి తగ్గవచ్చును. అలాటి సమయములో రాయలకు, ఇతర కవులకు అసంపూర్ణ కావ్యమును ధూర్జటి చూపించి ఉంటాడా అనే సందేహము నాకు కలిగినది.

    (4) ధూర్జటి, రుద్రకవి వీళ్లు అష్ట దిగ్గజములలో ఒకరా అనే ప్రశ్న ఇంకను నిస్సంశయముగా జవాబు లేదని నా ఉద్దేశము. నేను ఈ విషయములో పొరబడినానేమో?

    గౌరవనీయులైన రచయితకు నమస్సులతొ, విధెయుడు – మోహన

  476. అట్టు నా ఆదర్శం గురించి Veluri Vemkateswara Rao గారి అభిప్రాయం:

    01/03/2016 9:02 pm

    మాగంటి వంశీమోహన్ గారూ:

    మహచక్కని పేరడీలు రాసారు;– ఇస్మాయిల్గారి చెట్టు నా ఆదర్శం అనే ప్రసిద్ధ కవిత ఫక్కీలో అట్టు నా అదర్శం అద్భుతంగా ఉన్నది! పేరడీలంటే చెవికోసుకునే నేను మిమ్మల్ని అభినందించకండా ఉండలేను! (కొంతమంది శ్రోత్రియ పరులు మిమ్మల్ని అబి నిందించకండా ఉండలేరు లెండి! ఎవరి భాగ్యానికి ఎవరు బాధ్యులు, చెప్పండి!)

    I whole heartedly envy you!

    మనకి నచ్చిన, మనం మెచ్చిన రచయితల రచనలనే పేరడీ చెయ్యగలం. అది, వారిపై మనకున్న అభిమానానికి, గౌరవానికీ గుర్తు. ఎవడో ‘ కోన్ కిస్సా గొట్టం,’ గాడి రచనలు ఎన్ని ఉన్నా, వాటిపై పేరడీలు ఎవరూ రాయరు. ఎందుకు రాయరో చెప్పటం, ఈమాట మెజారిటీ పాఠకులని అవమానించడం అవుతుంది.

    పేరడీ మనసాహిత్యంలో చాలా పాత ప్రక్రియ. కూచిమంచి జగ్గకవి (18 వ శతాబ్దం)ఆంధ్ర వాఙ్మయం లో పేరడీకి నిర్దుష్ట రూపం కల్పించాడని మాచిరాజు దేవీప్రసాద్(1922-1974)రాసాడు. దేవీ ప్రసాద్ పేరడీలకి పెట్టిన పేరని వేరే చెప్పక్కరలేదు. అతను రాసిన ‘ఏరోడ్డు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,’ చదవంగానే మళ్ళీ మరొకసారి శ్రీశ్రీని చదవాలనిపిస్తుంది. అది పేరడికున్న ఒక గొప్పలక్షణం. మద్రాసులో చదువుకునే రోజుల్లో ఆంధ్రా మెస్సు మీద రాసిన ఈ పేరడీ చూడండి:

    ‘నిజంగానే నిఖిల ఆంధ్రం, నిండు హర్షం వహిస్తుందా?
    భోజనానికి నిజంగానే భోగకాలం రహిస్తుందా?’

    చదవంగానే, శ్రీశ్రీ గుర్తుకి రాకపోతే మనం తెలుగు వాళ్ళమని చెప్పుకోవటం నామర్దా అని నా అభిప్రాయం.

    విశ్వనాథ సత్యనారాయణగారి శైలి మీద జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారు చెప్పిన పేరడీ పద్యం, సత్యనారాయణగారినే కవ్వించి నవ్వించిందని చెప్తారు.

    కించిత్ తిక్త కషాయ బాడబ రస క్షే పాతిరే కాతి వా, అని మొదలై, నాలుగవ పాదంచివర, పాషాణపాక ప్రభూ! అని ముగుస్తుంది, ఆపద్యం.
    (స్థలాభావం వలన పూర్తిపాఠం కామెంట్ల శిర్షికలో ఇవ్వదలచుకోలేదు.)

    ఈ పేరడీ చూడండి:

    ‘గుండు గొంతుకలోన కొట్లాడుతాది
    గుటకేయనీదురా కూసిన్ని కూడ,’ వినంగానే ఎవరి పాట గుర్తుకొస్తుంది?

    అలాగే మరొకటి:

    ‘తొక్కిన వదలని సైకిలు
    పక్కింటి మిటారిపైన పగటి భ్రమయున్
    ఎక్కకె పారెడు గుర్రము
    గ్రక్కున విడువంగవలయు గదరా ….’, చిన్నప్పటి పజ్యం గుర్తుకి రావటల్లేదూ?

    శ్రీరమణ ప్రసిద్ధ రచయితల వచనానికి చక్కని పేరడీలు రాసాడు. మచ్చుకి:

    ‘అది ధూమశకటము. అభిముఖముగ పోవుచున్నది. అతడు మొదటి తరగతి పెట్టెలో నాసీనుడయ్యెను. ప్రథమశ్రేణి మంజూషము సువిశాలముగానున్నది… ‘ ఎవరి శైలిని పేరడీ చేస్తున్నాడు, చెప్మా?

    ఈమాట వ్యవస్థాపకుడు కె.వి.యస్. రామారావు, జాషువ శ్మశాన పద్యాలపై శ్మశాన వాటిక అని పేరడీ ( చూ: ఈమాట, మే 2000) రాసాడు. అలాగే శ్రీశ్రీ కవితలకి కూడా పేరడీలు ( చూ: ఈమాట, సెప్టెంబర్, 2002) రాసాడు.

    ఈ మాట ప్రస్తుత సంపాదకులు స్వోత్కర్షని సెన్సారు చెయ్యరనుకుంటాను. వెల్చేరు నారాయణ రావుగారు వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో మెరికల్లాంటి కొన్ని పుస్తకాలకి ఇంగ్లీషు అనువాదాలే కాకుండా, ఆముఖాలు, ఆఃముఖాలు(అంటే వెనుక మాట అని నేను పెట్టిన పేరు) రాసారని మీలో చాలామందికి తెలుసు. వాటిపై ‘ఎమితిని సెపితివె నారా?’ (నారా అన్న పదం మాధవ్ చెరిపేసి అచ్చు వేసాడు!) అని నేను ఈమాటలోనే రాసాను ( చూ: ఈ మాట మార్చి 2012). నారాయణరావు గారు దానిని చదువుకొని, పొట్టచెక్కలయ్యేట్టు నవ్వి, నవ్వి, నవ్వి ఆయాసపడ్డారని విన్నాను. నవ్వుకి నాబాధ్యత; ఆయాసం ఆయన బాధ!

    ఇంతగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మళ్ళీ మరొకసారి చెప్పాలా?

    ఈ సంచికలో సంపాదకుని తిరస్కరణ లేఖమీద వచ్చిన కామెంట్లు కొన్ని చదివితే, అవి పేరడిలంటే ఏహ్యభావం ఉండబట్టో, పేరడీ అర్థం కాకపోబట్టో రాసిన కామెంట్ల లా కనపడుతున్నాయి. ఆ వ్యాసం చదివింతరువాత, కుక్కచెవుల్లా ముడుచుకొపోయిన పేజీలతో కుట్లూడి చిరిగిపోతూ శిధిలావస్థలో ఉన్న మహాప్రస్థానం పుస్తకం మళ్ళీమరొకసారి మరిచిపోకుండా ఆప్యాయంగా తెరిచి చూద్దామని అనిపించటల్లేదూ! అది పేరడీ మహత్తు.

    ఆఖరిగా మరొక మాట. ఈ మాట స్థాయి దిగజారిపోయింది అన్న వ్యాఖ్య అనుచిత వ్యాఖ్య. It is unfortunate.

    పేరడీలు గొప్పరచయితలపైనే రాయటం ఆచారం. ఈ ఆచారం క్రొత్తదేమీ కాది. రెండు శతాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో పేరడీ ఒక చక్కని ప్రక్రియగా గుర్తించబడిందని విన్నవించుకుంటున్నాను.

    వేలూరి వేంకటేశ్వర రావు

  477. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/03/2016 9:06 am

    “మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు చప్పండి” అని శ్రీశ్రీని ఎవరో అడిగారట ఒక సారి. దానికి వారు “ఒకటి- మహా ప్రస్థానం గీతాన్ని భారతి మాసపత్రిక తిరగ్గొట్టడం. రెండు- కవితా! ఓ కవితా అనే గీతం చదువుతూ ఉంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అశ్రుసిక్త నేత్రులు కావడం” అని అన్నారట.

    20వ శతాబ్దిలో తెలుగు సాహిత్య గమనాన్ని మార్చివేసిన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితను భారతి పత్రిక తిరస్కరించింది! ప్రమాదో ధీమతామపి. తరువాత భారతి తన తప్పిదాన్ని ఒప్పుకొని, “కవితా, ఓ కవితా” ప్రచురించింది. ఇటువంటి తిరస్కారలేఖలు అందుకున్న ప్రముఖ రచనలెన్నో. ప్రముఖ ఆంగ్ల రచనలను మొదట తిరస్కరించిన సంపాదకుల వ్యాఖ్యలకు కొన్ని ఉదాహరణలు:

    “I recommend that it be buried under a stone for a thousand years.” — an editor about Vladimir Nabokov’s Lolita.

    “Nobody will want to read a book about a seagull.” on Richard Bach‘s Jonathan Livingston Seagull

    “The girl doesn’t, it seems to me, have a special perception or feeling which would lift that book above the ‘curiosity’ level.” — about The Diary of Anne Frank .

    “Too radical of a departure from traditional juvenile literature.” on Frank Baum’s The Wonderful Wizard of Oz.

    “An endless nightmare. I think the verdict would be ‘Oh don’t read that horrid book.” on H. G. Wells’ The War of The Worlds

    “An absurd story as romance, melodrama or record of New York high life.” on Fitzgerald’s The Great Gatsby

    “I haven’t the foggiest idea about what the man is trying to say. Apparently the author intends it to be funny.” on Heller’s Catch-22

    “We are not interested in science fiction which deals with negative utopias. They do not sell.” on Stephen King’s Carrie. This book apparently sold 1 million copies in the first year alone.

    “I rack my brains why a chap should need thirty pages to describe how he turns over in bed before going to sleep.” French editor comments rejecting Remembrance of Things Pasts by Marcel Proust.

    “This author is beyond psychiatric help. Do not publish.” Publisher rejects Crash by J.G. Ballard.

    Robert M. Pirsig‘s Zen & the Art of Motorcycle Maintenance is in the Guinness Book Of Records for 121 rejections, more than any other best-seller.

  478. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కేశవరం కేశవులు గారి అభిప్రాయం:

    01/02/2016 10:03 am

    క్రింద కామెంట్లలో సంపాదకులు రాసిన మాటలు చూడకనే ఈ రచన చదివాను. Haughty prima donna లకి ఉండే iconoclastic దురుసుతనం అనిపించింది. శ్రీశ్రీ మీద రాళ్ళురువ్వాలన్న దుగ్ధ కనిపించింది. “నేనొక దుర్గం” అన్నంత మాత్రాన రాళ్ళురువ్వకూడదనేం లేదు గాని, ఇదే సంచికలో ఇలాంటి రచనలు (ఇస్మాయిల్ కవిత్వం మీద ఒక ఎన్నారై కుర్రాడు పాల్పడిన బాడ్ టేస్టు తో సహా కలుపుకుని) రెండు ఉండటం చూస్తే ఇది ప్రత్యేకించి ఈమాట లాంటి ఎన్నారై పత్రికకే అబ్బుతున్న అలవాటుగా తోస్తోంది. రచయితల ప్రవాసం సాహిత్యానికి మంచి చేస్తుందంటారు. దాంతె నుంచి జాయ్స్ దాకా ప్రవాసం వల్ల వారి భాషల సాహిత్యానికి మంచి జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన తెలుగు రచయితల ప్రవాసం తెలుగు సాహిత్యానికి ఏ చేర్పూ చేయకుండా ఇలా పాతవాసనలతో, పాండిత్యప్రకర్షతో కుంగిపోతోందేమా అని బాధ కలుగుతోంది. దూరం వల్ల మాతృభూమి అంతఃసారం ప్రబలంగా బోధపడుతుంది అంటారే. మరి తెలుగు ఎన్నారైలకు వారి దూరం మన తెలుగుతనపు సారాన్ని అవగతం చేసి పెట్టాలి కదా. ఇప్పటి తెలుగునేల పరిస్థితి పట్ల పదునైన పరిశీలనలు రావాలి కదా. దాని పట్ల వ్యంగ్యమో, వేదనో, కరుణో, కోపమో, కనీసం నైరాశ్యమో ఏదో ఒకటి బయటపడాలి కదా. కానీ ఇక్కడి నూతులు చాలవన్నట్టు అక్కడికి వెళ్ళి కొత్త నూతులు తవ్వుకుంటూ, వినపడని మాతృభాష మీద సహజంగా కలిగే నేలబారు మమకారంతో “తెలుగు భాషో! పాత సాహిత్యమో! ఛందస్సులో! పద్యాలో!” అంటూ ఇంకా పాతనే పట్టుకు వేలాడటం చూస్తే ఆశ చల్లారుతోంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా తెలుగు ప్రవాసం నికరంగా మిగిలే ఒక్క రచయితనీ పుట్టించలేకపోవడం చూస్తే ప్రవాసం మంచి చేయటమన్న సిద్ధాంతం తెలుగువారికి నప్పదేమో అనిపిస్తోంది. ఎందుకు నప్పదా అని ఆలోచిస్తే ఒకటి తోస్తోంది: దాంతే, జాయ్స్ లాంటి వాళ్ళకు ప్రవాసమనేది రాజకీయ, తాత్త్విక, వైయక్తిక సంఘర్షణల ఫలితం; కానీ తెలుగు ఎన్నారైలకు మాత్రం అది మామూలు మధ్యతరగతి ఆకాంక్షల ఫలితం. అదలా ఉంచుదాం. పై రచన చదివిన తర్వాత క్రింద కామెంట్లలో ‘ఇది కథే’ అన్న సంపాదకుల వ్యాఖ్యానం చూస్తే – శ్రీశ్రీ మీద రాళ్ళు రువ్వటానికి అసలు ఒక సందర్భమూ, అవసరమూ కనపడక ఈ వేషము ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. అది పిరికి వేషము అనిపించటానికి కారణం ఏమంటే – ఈ గోపాలుని గోవిందరావు ఒక కల్పిత పాత్ర కాబట్టి అతని మాటలకు ఏ జవాబు చెప్పినా అది కేరక్టర్ బేస్డ్ క్రిటిసిజం అయి కూర్చుంటుంది. కానీ శ్రీశ్రీ నిజం మనిషే కాబట్టి ఈ కాస్తా రాయాలనిపిస్తోంది. ఆయన నా అభిమాన రచయితేం కాదు, ‘కవితా ఓ కవితా’ లో పౌనఃపున్య దోషం హెచ్చు, కానీ ఆస్వాదించేందుకు అంతకుమించిన గుణాలూ ఎన్నో ఉన్నాయి.

    ఈ గోగోరా అనే “పాత్ర” ఈ ఉత్తరం సూచిస్తున్న కాలానికి చెందిన సంపాదకునిలా లేడు. నేటి కాలపు pedantic అంతర్జాల తెలుగుపత్రికలు కొన్నింటికి సంపాదకుని వలె ఉన్నాడు (శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ ను తిరస్కరించగలిగేంతటి గొప్ప కంటెంటును అవి అన్యథా ఇవ్వటం లేదన్నది అప్రస్తుతమే అయినా ప్రస్తావనార్హం). ఈ ఉత్తరంలో, “కేవలం సంస్కృతంలో రాసి పారేసే జనం పుట్టగొడుగుల్లా పెరిగి పోతున్నారు” అన్నది ఒక anachronistic వాక్యం. ఎందుకంటే 1937 లో రాసిన ఉత్తరంలో ఒక సంపాదకుడు అలా వాపోతున్నాడూ అనటానికి అంతకుముందేమన్నా సంస్కృత ఛాయలు లేని అచ్చతెలుగు కవిత్వ సంప్రదాయం డామినేట్ చేస్తూ వచ్చిందా? ఆదికవి ఆదిగా దాదాపు అంతా కలగాపులగం బాటే కదా. కాబట్టి సంపాదకుని ఆ అభ్యంతరంలో కథాపరమైన ఔచిత్యం లేదు. అంతేకాదు, ఈ కాలపు ఇంగ్లీషు వర్డుకౌంటు సాఫ్టువేర్ల స్పృహ లేనివాడే అయితే సంధుల కూడికతోనే పదాల లెక్క చెప్తాడు తప్ప, మళ్ళీ సంధులు విడదీస్తే పెరిగే పదాల గురించి ఆలోచించడు. “లోహశ్యేనం”, “ఫిరంగిజ్వరం” వంటి పదాలు ఇస్తున్న అపూర్వ భావచిత్ర సాక్షాత్కారాలకు గుడ్డివాడై అర్థాలు అడుగుతున్న తీరు చూస్తే ఈ గోగోరా కవిత్వంలో పదాల juxtaposition పట్ల కనీస అవగాహన లేనివాడనిపిస్తుంది. అలాగే కొద్దిగా tone deaf కూడా. అలాంటి పాత్రను ఒక సాహిత్య పత్రికకు, అందులోనూ కవిత్వ విభాగానికి సంపాదకుడిగా చూపటం నప్పలేదు. అసలు ఈ కథే వాడి స్థాయిని వెక్కిరించటానికి ఐతే తప్ప.

    “బిగుతైన పద్యం”, “ఓ పదం వేయలేని తీయలేని పద్యం” అన్నవి ఆధునిక భావనలు. కాలగమనంలో వచ్చే ప్రతి మార్పూ అభివృద్ధే అన్నది ఒక భ్రమ. వర్తమానం అంతిమం కాదు. చరిత్ర చక్రరూపం. హోమర్ బిగుతైన కవి కాబట్టి అలరిస్తున్నాడా, రామాయణం ఓ పదం వేయలేని తీయలేని కావ్యం కాబట్టి రమణీయమా? కాదు, “నానృషిః కురుతే కావ్యం” కాబట్టి అవి గొప్పవి. మన జైసేకే తైసే సీజనల్ కవులు వందమందికి “పునరుక్తి”, “దుష్టసమాసం”, “ప్రాసానుప్రాసల” గురించి పాఠాలు చెప్పవచ్చు. కానీ ఋషులకు, ఋషిత్వం నుంచి వలికిన కవితలకూ పాఠాలు చెప్తామా. ఈ కవిత చెప్తున్న కవి – తెలుగు విప్లవరాజకీయాల అంటురోగంతో యోగభ్రష్టుడైన శ్రీశ్రీ కాదు; గుహ వంటి కుటిలో చీకటిలో చిరదీక్షా తపస్సమీక్షణలో స్రుక్కిన శ్రీశ్రీ. అనుభవ తీక్ష్ణతకు తాళ లేక కవిత పొంగినపుడు దానికి లావా లాంటి వేడీ వెలుతురూ ఉంటాయి. దాని దగ్గరకు మూసలు తీసుకుని వెళ్ళటం అమాయకత్వం. మూసలు కమ్మరికొలిమి దగ్గర పనికొస్తాయి, అగ్నిపర్వతాల దగ్గర కాదు.

    వర్డుకౌంటు ద్వారా ఈ ‘గోగోరా’నే పసిగట్టినట్టు ‘కవితా ఓ కవితా’లో ఉన్న నాలుగువందల పైచిలుగు పదాల్లో “పేశలము, శ్యేనము, ఘూకం, భేకం, సర్పం, భేరుండము..” లాంటి ఆరేడు మాత్రమే జంతు సంబంధమైన పోలికలు ఉన్నవి. రోచిర్నివహాలు, ఝంఝూ ప్రభంజనాలు, చేలాంచలాలూ, కుసుమపరాగాలు, రథాలూ, వజ్రాలు, ఫిరంగులూ, మృదంగాలూ, తాగుబోతులూ, పడుపుకత్తెలూ, శిశువులూ, శస్త్రకారులూ, సమ్మెకూలీలు, ఉరితీయబడ్డ శిరస్సులూ ఇలా భూమి నుంచి అంతరిక్షం దాకా లెక్కలేనన్ని ఉపమానాలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ గోగోరా కి కేవలం జంతుసంబంధమైన పోలికలే కనపడుతున్నాయంటే… అవి అతని ఆసక్తులే తప్ప శ్రీశ్రీవి కాదు కదా. “జనానికి మస్కాకొట్టడానికి వాడారా” అంటూ ఆ పదాలకు శబ్దరత్నాకరములో ఉన్న కొన్ని అర్థాలనే ఎత్తిచూపించి వెక్కిరించారు. ఆ పాపం శ్రీశ్రీది కాదు, తెలుగు నిఘంటువులది అని తెలియదా. అర్థాల దుర్బలత్వం ఎరిగిన కవి కనుకనే శ్మశానాల వంటి నిఘంటువులు అన్నాడు. శ్మశానమూ-నిఘంటువూ! ఇలాంటి ఉపమలెన్నో మనకు అలవాటైపోయాయి కాబట్టి బహుశా వాటి పూర్ణభావవిస్ఫోటనం మన చూపుకు అందటం లేదు. “బ్రదుకును ప్రచండభేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం” (కవిత ఒక ప్రచండ భేరుండమై తన రెక్కల కౌగిలింత కింద కవి జీవితాన్ని చుట్టేయడం) అన్న ఒక్క పోలిక చాలదూ అతడ్ని కవిత్వ జ్వరం ఎలా పట్టుకుంటుందో సమర్థంగా చెప్పటానికి? కామాలు వేసుకుంటూ అలవోకగా పేర్చినట్టున్న “అమోఘ, మగాధ, మచింత్య, మమేయం” లాంటి పదాల అర్థాల్ని ఒక్కసారి ఆగి తరచి చూసి వాటిని కవిత్వానికి అన్వయిస్తే కదా వాటి సందర్భశుద్ధి తెలిసేది? “శంఖా రావం, ఢంకా ధ్వానం”, “ఘూకం కేకా, భేకం బాకా” అన్నీ కవిని ఆవహించుకున్న, అతడ్ని పట్టి ఊపుతున్న వాతావరణాన్ని సమర్థంగా పట్టిస్తున్నాయి. ఈ సంపాదకుడు ‘గోగోరా’ పదచిత్రాలకు గుడ్డివాడూ, లయకు చెవిటివాడూ మాత్రమే కాదు – ఉపమ, రూపకం ఇత్యాది కవితాసామాగ్రి పని చేసే తీరు కూడా తెలియని పామరునిగా తోస్తున్నాడు.

    ఏ విషయంలోనైనా చులకన సులువు, వత్తాసు కష్టం. ఈ కవితలో ఊకదంపుడు లేకపోలేదు. అవే దృశ్యాలు వేర్వేరు పదాల ముసుగులో మల్టిప్లికేట్ కావటం కొంత ఉంది. కొన్ని పదాలు అర్థాన్ని జత చేయకుండా వట్టి నాదాన్ని మాత్రమే తెచ్చి పేర్చడం ఉంది. అయిననూ…. ఇందాకే చెప్పినట్టు – పంక్తి పంక్తికీ పట్టిక వేసి గుణ నిర్ణయం చేయటం కొన్ని కవితల విషయంలో సబబే. కానీ కొన్ని కవితల్ని వాటి శరీరం మొత్తంలో ప్రసరిస్తోన్న చైతన్యం ఆధారంగా నిర్ణయించాలి. ఈ కవితల గుణం ఒక్కొక్క పదంలోనూ, ఒక్కొక్క పంక్తిలోనూ ఉండదు. వాటి కూడిక కలగజేసే యావద్భావనలో ఉంటుంది.

    శ్రీశ్రీ ‘మహాకవి’ బిరుదును అంత తేలిగ్గా కొట్టిపారేయనీయకుండా అడ్డుతగిలే కవితల్లో ఇదొకటి. ఈ కవితకి తిరస్కారపత్రం రాసిన సంపాదకుడు నడిపే పత్రికలోని మిగతా రచనలు ఎలా ఉంటాయోనన్న కుతూహలం మాత్రం నాకు లేదు. పాండిత్యం తప్ప రసికత్వం లేదని పైన ఇన్ని నిరూపణలతో తేలుతున్నందువల్ల ఆ పత్రిక స్థితి కళ్ళకుకడుతోంది. చెళ్ళపిళ్ళ వారు ఒకచోట ‘కవి’ – ‘విమర్శకుల’ గురించి మాట్లాడతారు. కవి తప్పనిసరై రాస్తున్నవాడు. విమర్శకునికి ఆ బలవంతం లేదు. కాబట్టి విమర్శకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తను విసిరే ప్రతి రాయికీ జవాబు చెప్పుకోవాలసి ఉంటుంది. అంతేకాదు, అన్ని విసుర్లలో ఏ ఒక్క విసురు నిర్హేతుకమని తేలినా మొత్తం దాడి అభాసుపాలవుతుంది.

    బైబిలులో పాపపంకిలమైన నగరాలు ‘సొడోం అండ్ గొమొరాహ్’ లను నాశనం చేయటానికి వచ్చిన దేవుడ్ని మధ్యలో ఆపి అబ్రహాం అడుగుతాడు: “మొత్తం నగరంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నగరాన్ని నాశనం చేయకుండా వదిలేస్తావా” అని. దేవుడు వదిలేస్తానంటాడు. “మొత్తం నగరంలో 45 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా” అని అడుగుతాడు అబ్రహం. దేవుడు వదిలేస్తాననే అంటాడు. అబ్రహాం లెక్క తగ్గిస్తూ పోతాడు, దేవుడు చివరకు 10 మంది నీతిమంతులు ఉన్నా వదిలేస్తాననే దాకా వస్తాడు. అక్కడితో అబ్రహాం ఆపేస్తాడు. కానీ నా ఉద్దేశంలో 1 నీతిమంతుడు ఉన్నాడన్నా దేవుడు వదిలేస్తాననే అని ఉండేవాడు.

  479. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కటకటా! గారి అభిప్రాయం:

    01/01/2016 4:03 pm

    ఈమాట సంపాదకులకి:

    సంపాదకుని తిరస్కరణలేఖ కథ కాదు. మీరు కథగా అచ్చొత్తించటం అసమంజసము. ఇది “వ్యాసము” అనబడు శీర్షిక పరిథిలో ఉండుట సమంజసము.

    రిగార్డులతో,

    కటకటా!

    [ఒకానొక సంపాదకుడు శ్రీశ్రీ కవితను ఈ విధముగా తిరస్కరించుట రచయిత యొక్క కల్పన. అందవలన ఇది కథయే. ఇది వ్యాసము రాయు తీరు కాదు కదా. – సం.]

  480. ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    01/01/2016 1:28 pm

    శ్రీ రవి గారికి
    నమస్కారములతో,

    అమోఘమైన మహారచనను అద్భుతావహంగా పరిచయం చేశారు. ఇందాక శబ్దతరంగాలలో శ్రీ వెంపరాల వారి కంఠస్వనాన్ని విన్న వెంటనే వచ్చి చదివిన ఈ మీ వ్యాసం నాకు ఎంతో హృద్యమై, అభినందించాలనిపించి సంక్షిప్తంగా వ్రాస్తున్నాను. మీ మాటలలో కొంత పుట్టపర్తి వారి ప్రసంగధోరణి, రాయలసీమ పలుకుబళ్ళు చక్కటి సమన్వయాన్ని పొందాయి. అది బహుధా ప్రశంసనీయం.

    అయితే, సేతుబంధ కావ్యాన్ని అధికరించిన సద్విమర్శలు, ప్రవరసేనుని చరిత్రను గురించిన పెక్కు వాదోపవాదాలు బహుళంగా అచ్చయి అందుబాటులోనే ఉన్నాయి. ఉపాధ్యే గారు, జయస్వాల్ గారు, రాఘవన్ గారు, మానవల్లి రామకృష్ణకవి మహోదయులు, ఇంకా విద్వాంసులనేకులు ఈ విషయమై సాకల్యములైన పరిశోధనలు చేశారు. మీరు కావ్యమాలలో సంకలితమైనదానిని గాక 1959లో అచ్చయిన రాధాగోవింద బసక్ గారి సేతుబంధ ముద్రణను చూచివుంటే ఎన్నో చారిత్రికాంశాలను, సుష్ఠుపాఠాలను గ్రహించే వీలుండేది. వీటి తోడ్పాటు లేకుండానే మీరు చూపిన ప్రాకరగ్రంథాల సమాచారంతోనూ, స్వీయాన్వయసంపత్తితోనూ మీరు ఇంత సహృద్విశదమైన చక్కని వ్యాసరచన చేయగలగటం నిజంగా ముదావహం.

    అంతంలో మీరు ఉదాహరించిన కృష్ణకవి భరత చరిత శ్లోకం ఈ విధంగా ఉండాలి. లేకుంటే అన్వయింపదు:

    జడా(లా)శయస్యాంత రగాధమార్గ మలబ్ధరన్ధ్రం గిరి చౌర్యవృత్త్యా
    లోకేష్వలఙ్కాన్త మపూర్వసేతుం బబంధ కీర్త్యా సహ కుంతలేశః.

    అని. వ్యాసంలో ప్రవరసేనుని పాఠగ్రహణం ఇంకా శ్రద్ధగా చేయవలసి ఉన్నది. ఒక్క చిన్న ఉదాహరణ:

    “దీసఇ విద్దుమఅమ్వం సిన్దూరాహఅగఇన్దకుమ్భచ్చాఅమ్
    మన్దరధాఉకలఙ్కిఅవాసుఇమన్డలనిఅక్కలం రఇవిమ్వమ్.”
    ఛాయ: దృశ్యతే విద్రుమాతామ్రం సిన్దూరాహతగజేన్ద్రకుంభచ్ఛాయామ్
    మన్దరధాతుకలఙ్కితవాసుకిమండలనిశ్చక్రలం రవిబిమ్బమ్.

    అన్నది చూడండి: ఇక్కడ అన్వయం సరిగా లేదని తెలుస్తూనే ఉన్నది. గాథ –
    “దీసఇ విద్దుమఅంబం సిందూరారుణగడందకుంభచ్ఛాఅం, మందరధాఉకలంకిఅ వాసుఇమండలణివకలం రవిబింబం.” అనీ; దాని ఛాయ “దృశ్యతే విద్రుమతామ్రం సిన్దూరారుణగజేన్ద్రకుమ్భచ్ఛాయం, మన్దరధాతుకలఙ్కితవాసుకిమణ్డలవర్తులం రవిబిమ్బం.” అనీ ఉండాలి. లేకుంటే అర్థాన్వయం తప్పవుతుంది. అది సిందూరాహతం కాదు; సిందూరారుణం.

    పైని ఉదాహరించిన రెండు పూర్వముద్రణలలోనూ అపపాఠాలున్నాయి. సేతుబంధానికి సరైన ముద్రణ ఇంకా వెలువడవలసే ఉన్నది.

    కాళిదాసే సేతుబంధ కర్త అన్నది రామదాస వ్యాఖ్యలోనే గాక ఆంధ్రదేశంలోనూ ప్రచారంలో ఉన్నది. ‘మహాకవి కాళిదాసు’ సినిమాలోనూ కాళిదాసు (అక్కినేని నాగేశ్వరరావు) “ఇది నేను వ్రాసిన సేతుబంధ కావ్యం” అంటాడు. ప్రవరసేనుని గురించి ఇతరానేకగాథలనూ ఆంధ్రదేశంలో చెప్పుకోవటం ఉన్నది.

    వ్యాసం చివర మీరు సర్వసేనుని హరివిజయం కాలగర్భంలో అంతరించిపోయిందని ఎందుకు వ్రాశారో, తెలియలేదు. ఉపలభ్యమైనంత మేర అది అచ్చయి ప్రచారంలో ఉన్నదే.

    ఇవి గాక, మీరు ఇక్కడ, ఇతరత్ర లేఖనంలోనూ ప్రత్యయాంతాన్ని “కవిత్త్వము”, “అసాధారణత్త్వము”, “విలక్షణత్త్వము”, “దుష్కరత్త్వము”, “భావుకత్త్వము” అని ఎందుకు వ్రాస్తున్నారు?

    వ్యాసంలో చర్చనీయాంశాలు అనేకం ఉన్నాయి. ఆ చర్చ ఇప్పుడు కాదు. ప్రకృతం మీ కృషి అభినందనీయమని చెప్పటం వరకే.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  481. వెంపరాల వారి సాహిత్య యాత్ర గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    01/01/2016 10:19 am

    శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
    నమస్కారములతో,

    ముప్ఫైఅయిదేళ్ళ క్రితం విజయవాడ ఆకాశవాణిలో ఉద్యోగిస్తుండిన తరుణంలో ఢిల్లీలోని ఆర్కైవ్సుకోసం 1979లో నేను రికార్డు చేసిన ఈ అపరపతంజలి కంఠస్వనాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకు మీ పుణ్యాన వినటం సాధ్యమయింది. దీనిని వెలికితీసి సూర్యాలోకాన్ని కల్పించిన మీకు కృతజ్ఞతతో ఎన్ని మెప్పుల కుప్పలని చెప్పినా తక్కువే.

    శ్రీ శాస్త్రిగారు సర్వం ఆశుగతిని చెబుతుంటే రికార్డు చేయాలని అనుకొన్నాను కాని, వాగ్ధోరణిలో వ్యర్థపదాలు దొర్లవచ్చునని, ఒక్క క్షణంకూడా వృధ కారాదని వారు దానిని ఆనాడు ముందుగా వ్రాసికొని చదవటం జరిగింది. అందువల్లనే వ్యావహారికంలో కొంత గ్రాంథికత తప్పలేదు. శ్రీవారి గురుదేవులైన పూజ్యపాదులు శ్రీ దర్భా సర్వేశ్వరశాస్త్రివరేణ్యుల చిట్టచివరి తరం శిష్యులు మా గురుదేవులైన శ్రీ తమ్మన వేంకటేశ్వరరావు గారు కావటం వల్ల ఆరోజు నేను వారింట శిష్యరూపునిగా వారి ఆతిథ్యానికి నోచుకోగలిగాను. నాకు చిత్రకవిత్వాభిమానం ఉన్నదని ఆరోజు వారు, “నేనూ ఒక నాగబంధమును వ్రాసితినండీ” అంటూ, అనర్ఘమైన ఈ నాగబంధపద్యాన్ని ధారణవశాన అలవోకగా వినిపించారు:

    శివ పరమేశ పావన యజేయగతిక్రమ దాంతమోహనా
    భవ నగచాప దేవబలపాలన భవ్యశరీరకాంతివై
    భవజితపారదా వరకృపాకృతి ధర్మపరా రమాజశా
    త్రవ గిరిజామనోవనజరంజదహస్కర నాగబంధనా.

    అని. ఆ తర్వాత ఇది నాకు లభ్యపడిన వారి ముద్రితకృతులలో కానరాలేదు. ఎందులో ఉన్నదో ఇంకా అన్వేషింపవలసి ఉన్నది. వారి చాటుకృతులు సైతం అచ్చుకావాలి.
    ఆ ఉచ్చారణను, ఆ పలుకుబడిని వింటుంటేనే వశీకృతపాణినీయులై సూత్రకార వృత్తికార భాష్యకార మునిత్రయచరిత్రను వ్రాసిన ఆ మహానుభావుని శబ్దాధికారం ఎటువంటిదో సువ్యక్తమవుతూ ఉన్నది. ఆ మూర్తిని మళ్ళీ మీరు శబ్దతరంగాల రూపాన కన్నులకు కట్టారు.

    దీనిని అప్పుడే ఆకాశవాణి సరిక్రొత్తగా కొనుగోలుచేసిన స్విట్జర్లాండు నాగ్రా టూ ఛానెల్ స్పూలు రికార్డరుతో తొలి రికార్డింగును చేయటం జరిగింది. ఆరోజే శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి అనుభవాలను కూడా రికార్డుచేశాను. అప్పటి క్యూషీట్లు, వారి వారి వ్రాతప్రతులు ఇంకా ఉన్నాయో లేవో. ఇవి పూర్తయిన ఒక వారం రోజులకు అప్పికట్లకు వెళ్ళి శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారి ఇంట్లో రెండు రోజులుండి వారి అనుభవాలూ, జ్ఞాపకాలను రికార్డు చేశాను. మీ కృషిఫలంగా అవీ వెలుగులోకి రాగలవని ఎదురుచూస్తుంటాను.

    అమేయశ్రద్ధతో శుభ్రపరచి దీనిని పునఃశాశ్వతీకరించిన మీకు ధన్యవాద సాహస్రితో,

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  482. మనుచరిత్రము – మాఘములలో పురస్త్రీ విలాసముల పోలిక గురించి రవి గారి అభిప్రాయం:

    01/01/2016 8:51 am

    చాలా అమూల్యమైన వ్యాఖ్య చేశారు.

    >>”పైఁడిగోళ్ళు”

    మీరు చెప్పిన అర్థమే సరిపోతుంది. వావిళ్ళ (శేషాద్రి రమణ కవుల వ్యాఖ్యానం) వారి ప్రతి చూస్తే మీరు చెప్పిన అర్థమే చెప్పారు. పసిడిపూత అన్న అర్థం మరెక్కడో చూశాను. ఇప్పుడు గుర్తు రావట్లేదు.

    సంస్కృతంలో సాధారణంగా ఒక శ్లోకంలో ఒక్క పదచిత్రమే కూర్చడం జరుగుతోంది. తెలుగులో (అచ్చర యొక్క) మూడు నాలుగు విలాసాలను ఒకే పద్యంలో కూర్చడం కనిపిస్తుంది. ఇది తెలుగు కవితలో ఉన్న సౌలభ్యమూ, సంస్కృతానికి భిన్నంగా తెలుగులో ఏర్పడిన కవిత్త్వ రీతి అని అనుకుంటున్నాను. అలాంటివి సంస్కృతంలో లేకపోలేదు కానీ బహుళం కాదు. బహుశా సంస్కృత కవిత్త్వ ఆరంభం/ప్రస్థానం అనుష్టుప్పు వంటి లఘు ఛందస్సులతో జరగటం మూలాన, సంస్కృతంలో ఉన్న కర్మణి ప్రయోగాల వలన ఆ రీతి అక్కడ విరివిగా లేదు. ఇంకా లోతుగా పరిశీలించదగిన విషయం ఇది.

    తెనుగు కున్న ఈ సౌలభ్యాన్ని పెద్దన చాలా ప్రతిభావంతంగా పూర్తిగా పిండుకున్నాడు. 🙂 రసధ్వని కి ఇది ఒక ముఖ్యకారణం కావచ్చు.

  483. మనుచరిత్రము – మాఘములలో పురస్త్రీ విలాసముల పోలిక గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    12/31/2015 10:26 am

    వ్యాసం అద్భుతః! మనుచరిత్ర, మాఘమూ రెండూ రెండే అయినప్పటికీ, పెద్దనగారి రచన కొంచెం ఎక్కువ మనోహరం! మాఘుని వర్ణనలలో అలంకారశైలి ఎక్కువగా కనిపిస్తే పెద్దనగారిది ధ్వనిమార్గం అనిపించింది. మాఘునిలో ఉన్న ధ్వని కూడా వస్తు అలంకార ధ్వనులకి ఎక్కువగా పరిమితమయితే, పెద్దనగారిది చాలావరకూ రసధ్వని! పైగ తేనెలూరే తీయని తెలుగాయె. మధురమూ మనోహరమూ కాక ఏమవుతుంది!

    అందరూ అప్సరలే అయినా ఒకొక్కరూ ఒకో రకం. వేర్వేరు అవస్థలు, వేర్వేరు స్థితులు. ప్రయోగించిన పదాలూ, కట్టిన చిత్రాలూ ఆయావాటికి సరిగ్గా తగినవిధంగా కూర్చడం ఆ కవిత్వంలో సహృదయ పాఠకులు గమనించి మురిసిపోయే అంశం.

    “ఒక నేత్రాంబుజ మొక్క గల్లము” అన్న పద్యంలో ఉన్నది పురంధ్రీరత్నం కాబట్టి, ఆమెకి మిగిలిన అచ్చరల మాదిరి గబుక్కున పరుగులుపెట్టే స్వైరవిహారం లేదు కాబోలు! అయినా రాకుమారుని చూడాలనే మనసు ఉవ్విళ్ళూరుతోంది. అంచేత తలుపు ఓరగా నిలుచుని చూడడం. అలా చూడడంలో కూడా ఒక ఒయ్యారపు లీల ఉంది! అంచేత యిది కూడా నిస్సంశయంగా శృంగారభావమే తప్ప అన్యం కాదు.

    ఇక, నాకు స్ఫురించిన ఒకటి రెండు అర్థాంతరాలు:

    >>”పైఁడిగోళ్ళు” – “వీణ తీవెల తాలూకు పసిడిపూత ఆమె వ్రేలికి అంటుకున్నది.”
    ఇవి వీణ తీగలు మీటేందుకు గోళ్ళకు పెట్టుకొనే తొడుగులని నా భావన.

    >>రాకుమారుని రాక కోసం పడిగాపులు గాచి, అలసినదన్న భావం వ్యంగ్యముగా అవులింతచేత సూచితము.
    పద్యంలో ఉన్నవి ప్రమదాశ్రువులు కదా. పైగా చెదరిన ముంగురులు కూడా వర్ణితం. ఇవి విరహాన్ని కాక, సంభోగ రతి భావాన్నే ధ్వనిస్తున్నాయి. కాబట్టి ఆవులింత కూడా రతిచేత కలిగిన అలసటనే భావించడం ఉచితం అనిపిస్తోంది.

  484. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    12/29/2015 8:26 am

    నేను: “మోహనగారు చెపుతున్నది లయ గురించి, ……..అనిపిస్తోంది”
    తఃతఃగారు: కాదు. అర్థవంతంగా పాడుకోవటానికి వీలుగా సంస్క్ర్త త శ్లొకాల పాదాలు పదాలు విరగకుండా ముగుస్తాయి అన్న విషయాన్ని మోహన తన వ్యాసాలలో పదే పదే చెపుతున్నారు. ఈ అభిప్రాయానికి తోడుగా తెలుగు కవులు పాదాంత యతిని పాటించక పోవటాన్ని (కొంత తక్కువ చేసి) కూడా వారు ప్రస్తావిస్తున్నారు.

    నేను: ఇక్కడ తఃతఃగారు దేని గురించి “కాదు” అన్నారో నాకు అర్థం కాలేదు. మోహనగారు లయ గురించి కాకుండా స్వరం గురించో, లేక రాగం గురించో చెప్పారని వారి అభిప్రాయమా? తఃతఃగారి మిగతా వ్యాఖ్యబట్టి అలా అనిపించడం లేదు. వారు ప్రస్తావించిన పాదాంత యతి కూడా లయకి సంబంధించినదే తప్ప రాగానికి సంబంధించినది కాదు. ముందుగా, మోహనగారు ప్రస్తావించిన “singability” లేదా “గానయోగ్యత” అనే అంశం లయ/తాళానికి సంబంధించినది అన్న విషయం స్పష్టమై, దానిపైన అంగీకారం కుదిరితే, చర్చను ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఇక పదచ్ఛేదయతి గురించి:

    1. ఈ వ్యాసంలో ప్రధానమైన అంశం శ్రీశ్రీ గేయాలు. అవి చాలావరకూ స్పష్టమైన లయతో సాగుతాయనడంలో ఎలాంటి విప్రతిపత్తి లేదు. దీనికి పాదాంతర విరామమూ, పాదాంత విరామమూ చాలా ఉపయోగపడే లక్షణాలన్నది మోహనగారి ప్రతిపాదన. దీనిని నేను అంగీకరిస్తాను. ఎవరైనా అంగీకరించకపోతే, వారి వాదన వివరించవచ్చు.

    2. పదచ్ఛేదయతి గురించి మోహనగారు వ్యాసంలో ప్రస్తావించిన మరొక అంశం – “సంస్కృతములో పాదాంతయతి పాటించబడుతుంది.”. “అదే విధముగా సంస్కృతములో శార్దూలవిక్రీడితము, స్రగ్ధరలవంటి వృత్తములకు పాద మధ్యములో కూడ పదముల విఱుపు ఉంటుంది”.
    ఇవి సాధారణంగా (చాలా ఎక్కువ శాతం) కనిపించే లక్షణాలే తప్ప నూరుపాళ్ళూ నియతంగా పాటింపబడినాయని ఎక్కడా లేదు. బహుశా ఛందస్సులో ఏ నియమాలకైనా అపవాదాలు ఉండనే ఉంటాయి. అందుచేత ఇందులో కాదనడానికి నాకేమీ కనిపించడం లేదు.

    3. మోహనగారు తన వ్యాఖ్యలలో ప్రస్తావించిన అంశం:
    “ఉత్తర భారత భాషలలో, సంస్కృతములో, తమిళ, మలయాళములలో ఎక్కువగా పాదాంతయతిని వాడుతారు. అలా చేసినందువలన వాటికి గానయోగ్యత లభిస్తుంది. తెలుగు కన్నడ భాషలలో (ముఖ్యముగా తెలుగులో) సాహిత్యము రెండు భిన్న రీతులలో రూపొందినాయి. కావ్యములు పఠనీయములు మాత్రమే. అది సంగీతముతో ఎక్కువ సంబంధము లేకుండా రూపొందినది. వాగ్గేయకారులు రచించిన గీతులకు మాత్రమే గేయత్వము లభించినది. కవులు ఎక్కువగా ఈ వాగ్గేయకారులను, యక్షగాన కర్తలను సరకుగొనలేదు. ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.”

    ఇక్కడ కూడా “గానయోగ్యత” అంటే లయాన్వితంగా పాడుకోడమనే అర్థం స్పష్టం. తెలుగులో కావ్యములు పఠనీయములనే మోహనగారు కూడా అన్నారు. అయితే తెలుగు పద్యాలు చదువుకోనేందుకు కాక పాడుకొనేందుకు వీలుగా ఉంటే బాగుంటుందన్నది మోహనగారి అభిప్రాయం. అది వారి అభిరుచికి సంబంధించిన విషయం. దానితో ఏకీభవించడమా లేదా అన్నది మన అభిరుచికి బట్టి ఉంటుంది తప్ప, అందులో చర్చించడానికి ఏమీ లేదు!

    ఇక, తమిళ, మలయాళ భాషల విషయం నాకు ఎక్కువగా తెలియదు కాని, సంస్కృతశ్లోకాలలో పాదాంతయతి వాటి “గానయోగ్యతకి” కారణమయ్యిందా లేదా అన్నది చర్చనీయాంశం. అయితే అది యీ వ్యాసానికి అంతగా అవసరం లేని విషయం. కాబట్టి దాని గురించి యీ వ్యాసంలో/వ్యాఖ్యలలో ప్రస్తావించకుండా ఉండి ఉంటే, చర్చ మోహనగారు కోరుకున్నట్టు వ్యాసంలో అసలు విషయమ్మీద కేంద్రీకృతం అయ్యుండేదేమో!

    అలాగే “ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.” అనే అభిప్రాయం కూడా (అది వ్యక్తిగతమే కావచ్చు!) చర్చనీయాంశమే. అది వ్యక్తిగత “అభిరుచి”కి సంబంధించినది కాదు. అయితే, ఇది కూడా ఈ వ్యాస విషయానికి సంబంధం లేని అంశం. పై రెండు చర్చనీయాంశాలకి సంబంధించి మోహనగారి అభిప్రాయాలను నేను పూర్తిగా అంగీకరించను. అయితే అది వేరే చర్చ కాబట్టి, దాన్ని యిక్కడ కొనసాగించడం నాకు యిష్టం లేదు.

    చివరిగా, నేను నా అసమ్మతిని తెలిపినప్పటికీ ఏదో కారణాలవల్ల అశ్మాచంగారు నన్ను “అండు కో”లో కలపడం మానలేదు. సరే అది వారి ఆనందం! అయితే నేరుగా నన్ను మాత్రమే ప్రస్తావించి సూటిగా ఏదైనా అడిగితే తప్ప వారికి నా దగ్గరనుండి స్పందన/సమాధానం రాదని మాత్రం మనవి చేసుకొంటున్నాను.

  485. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    12/22/2015 5:22 am

    నా అభ్యర్థనని మన్నించిన అశ్మాచంగారికి ధన్యవాదాలు. అయితే, “అండు కో” లో నన్ను కలపడమే కాకుండా, దానికి నన్నే ప్రథముణ్ణి చేసి “కామేశ్వరరావు & కో” అని సంబోధించడం కొండంత ఆశ్చర్యాన్నీ, కాస్తంత చీకాకునీ కలిగించింది. అతిశయోక్తులవల్ల వచ్చే యిబ్బందే యిది! అది అలా పక్కన పెట్టి, ఆయన లైలాగారి వ్యాఖ్యల్లోంచి తీసి చూపించిన రెండు పాయింట్ల గురించి నా ఆలోచనలివి:

    మోహనగారు: గేయము అనగా పాడదగినది. పాటలలో ఏ పంక్తి ఆ పంక్తికి అంతమయితే మాత్రమే గానానుభూతిని పొంద వీలవుతుంది.
    లైలాగారు: I disagree with you…..notes run into one another, musical thought does not break at measures, it over flows…..What does music have to do with sentences? …You are overthinking chandassu

    నేను: ఇక్కడ మోహనగారు చెపుతున్నదీ, లైలాగారు చెపుతున్నదీ వేరువేరు విషయాలని నా భావన. సంగీతం అంటే కేవలం స్వరమూ రాగమే కాదు కదా. లయ, తాళాలు కూడా సంగీతానికి అంగాలే. మోహనగారు చెపుతున్నది లయ గురించి, లైలాగారు చెపుతున్నది రాగం గురించీను అనిపిస్తోంది. జానపదగేయాలకి రాగం కన్నా లయే ప్రధానం. వాటిలో లయకి తగ్గట్టుగానే వాక్యాలు సాగుతాయి, విరుగుతాయి. ఇక్కడ మోహనగారు ప్రస్తావించినది అలాంటి లయ ప్రధానమైన గేయాల గురించే. ఎందుకంటే ఛందస్సు, మరీ ముఖ్యంగా మాత్రాఛందస్సు లయకి సంబంధించినది తప్ప రాగానికి సంబంధించినది కాదు.

    లైలాగారు: ఈ ఛందస్సు 325 విధాలుగా రాయవచ్చని తెలిసి, అన్నీ రాసుకుని, అందులో 78 ఎంచుకొని, ఎక్కడ ఏవి వాడాలో అన్న పరిజ్ఞానంతో, సరిగా అక్కడ అవి వాడినాడని అర్థం వస్తుంది. మీ ఉద్దేశం అదేనా? రకరకాల ఛందస్సులను,display చెయ్యటానికి, శ్రీశ్రీ తన కవిత్వం రాసాడా? ఛందస్సు వద్దు మొర్రో, నాకు నిబంధనలు వద్దంటున్న శ్రీశ్రీ అలాటి పని ఎందుకు చేస్తాడు? అది మీకు నచ్చిన ఊహ. ఆ ఊహను అతని ఛందోపరిజ్ఞానంగా గాని, అతని అభిలాషగా గాని రాయటం, అది true finding ఎలా అవుతుంది? అది మీరు ఎలా నిరూపిస్తారు? నేను ఈ విషయం నిరూపించి చూపాను, అని వ్యాసంలో మీరంటే, శ్రీశ్రీ పరంగా అది సరి ఎలా అవుతుంది? అతని గురించిన అతని మాటలనే ఖాతరు చేసుకోటం లేదే మీరు? ఎవరి మాటల ఆధారంగా ఏమి నిరూపిస్తారు?

    నేను: లైలాగారు అలా అర్థం చేసుకొన్నారు తప్ప, మోహనగారు చెప్పిన దానిలో ఆ అర్థం లేదు. మోహనగారు అన్నది “‘ఛందస్సు సర్పపరిష్వంగము’ నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ ఎన్నో ఛందస్సు విధివిధానాలను పాటించాడు.” “78 విధములను శ్రీశ్రీ పై ఐదు కవితలలో నుపయోగించాడు.”
    ఇందులో శ్రీశ్రీ ఛందశ్శాస్త్రానికి లక్ష్యగ్రంథంగా తన కవిత్వాన్ని సృష్టించాడన్న అర్థం ఎక్కడుంది? శ్రీశ్రీ తెలిసి రాసినా, తెలియక రాసినా, కావాలని రాసినా రాయకపోయినా, అతని కవితల్లో మాత్రాఛందస్సు విస్పష్టంగా కనిపిస్తోంది. మోహనగారు వివరించి చూపించినది అదే. ఇందులో మోహనగారి “ఊహ” అంటూ ఏదీ లేదు. “(అ)త్త సొమ్ము (అ)ల్లుడు దానం”, “అ(త్త) మీద కోపం దు(త్త)మీద చూపించినట్టు” యిలా అధికశాతం తెలుగు సామెతలలో యతి/ప్రాసయతి కనిపిస్తుంది అంటే – దాని అర్థం ఆ సామెతలు పుట్టించిన వాళ్ళు అనంతుని ఛందస్సునో సులక్షణసారాన్నో చదువుకొని, అందులో యతి/ప్రాసయతులన్నిటికీ లక్ష్యాలుగా ఆ సామెతలను ఏర్పరిచారని కాదు అర్థం. తెలుగుసామెతల్లో ఎక్కువగా యతి/ప్రాసయతి కనిపిస్తుంది అన్నది ఒక ఊహా కాదు. అది ఒక observation. మోహనగారు ఈ వ్యాసంలో నిరూపించబూనినది కూడా అలాంటిదే.
    మరొక విషయం – శ్రీశ్రీ వద్దు మొర్రో అన్న ఛందస్సు మార్గ కవిత్వంలో కనిపించే వృత్త పద్యాలకి సంబంధించిన ఛందస్సు అనీ, మాత్రాఛందస్సుపై శ్రీశ్రీకి అమితమైన గౌరవమూ, అభినివేశమూ కూడా ఉన్నాయనీ (కనీసం మహాప్రస్థానం రాసే కాలానికి), శ్రీశ్రీ వచన సాహిత్యం చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. మాత్రాఛందస్సు విషయమై గురజాడనుండి శ్రీశ్రీ ఎలా స్ఫూర్తిపొందిందీ తెలియజేసే కొన్ని శ్రీశ్రీ మాటలు పై వ్యాఖ్యలలో చూడగలరు.

  486. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం గారి అభిప్రాయం:

    12/20/2015 1:28 am

    కామేశ్వరరావు గారు

    పండితుడిని కాను అని మీరెంత గింజుకున్ననూ ఆ మాట, ఆ వాదమూ చెల్లదు. మీరు ఖచ్చితముగా పండితులే. ఈ పత్రికలోని మీ వ్యాసమొక్కటి చదివిన చాలును. మీరు పండితులో సామాన్యులో తోలొలిచిన అరటిపండు వలె విచ్చితెరచుకొనును. సరే అది అలా ఉండనిండు.

    మీరడిగిన పాయింట్ల సెక్షను చూస్తూ ఉంటే మీరు లెక్కల మాష్టారులా ఉన్నారు. అతిశయోక్తి పాయింటు పొలో నుంచి అలంకారం పాయింటు అలో దాకా లంబకోణం సరిగ్గా గియ్యలేకపోతే మీరో మెట్టు కిందకు, నా స్థాయినకు దిగవలసి వచ్చునో ఏమోనని భయము భయంకరముగా పీడించుచున్నది. సరే! నిండా మునిగినాక నీళ్ళైనా ఒకటే పేడైనా ఒకటే. చల్లుకుందాం రండి.

    మీరు పైనుంచి ఓ సారి మళ్ళీ అన్ని కామెంట్లు చదివి సారం తీసుకోండి. కొంత సారం (సార, కుదరకపోతే రం) నేనివ్వటానికి ప్రయత్నిస్తా, మీక్కావల్సింది మీరు పుచ్చుకోండి. ఇదిగో!

    పాయింటు ఒకటిన్నర రాగం, బిళహరి తాళం, ఇంద్రవజ్ర గతి

    మోహనరావు: గేయము అనగా పాడదగినది. పాటలలో ఏ పంక్తి ఆ పంక్తికి అంతమయితే మాత్రమే గానానుభూతిని పొంద వీలవుతుంది

    లైలా: I disagree with you…..notes run into one another, musical thought does not break at measures, it over flows…..What does music have to do with sentences? …You are overthinking chandassu

    కామేశ్వరరావు & కో: good taste is essentially a moral quality.

    అశ్మాచం [లోపల్లోపల]: ఛా!

    మోహనరావు: పదములను సరిగా విడదీసి పదచ్ఛేద, పాదాంత యతులను ఉంచితే పాడుకొనుటకు బాగుంటుంది.అది నా వ్యక్తిగతమైన అభిప్రాయము…. ఇంతకుముందు ఏ ఛందోగ్రంథములో వివరించబడని క్రొత్త నడకను మాలికావృత్తములకు నిరూపించగా, వాటినిగుఱించి ఒక్క ముక్క కూడ ఎవ్వరు వ్రాయకుండుటను గమనిస్తే ఇట్టి పరిశోధనలు అవసరమేనా అనే భావము కలుగుతుంది.

    అశ్మాచం [లోపల్లోపల]: హమ్మయ్య. పోనీలే రచయిత గారు చాంతాడంత కామెంటులో చిటికెడంతముక్క నా అభిప్రాయం అని కనీసం చెప్పినారు.

    కామేశ్వరరావు & కో: అనుభూతి” “అభిరుచి” కి ఎంత దూరం ?

    అశ్మాచం [లోపల్లోపల]: భూతి నుంచి భవభూతి దాకా, పాచి నుంచి పావ్ భాజీ దాకా అనుకుంటా

    కామేశ్వరరావు & కో: Personally, I believe what you are experimenting in prosody is extremely important. Of course, there are always a few people (no personal accusation intended, please!)who might think it is a worthless pursuit. Do you remember what Chalam said to the guy who wondered about looking at “sandhya?”in his preface to SriSri?

    అశ్మాచం [లోపల్లోపల] : What the heck was the argument and where did it begin and what in the world are these answers! Darn! లంబకోణం గురితప్పటమ్మొదలురా అశ్మిగా! లైలాగారడిగిన “ఓవరుఫ్లోకు” సమాధానం చెప్పలేని దాటవేత. రచయిత ఒక మూలగా అర ముక్కలో నా అభిప్రాయము అని చెప్పి తప్పించుకొనె కానీ, ఓవరుఫ్లోకు సమాధానము ఇల్లె. నిజసత్యముగా సమాధానము పూరిల్లె.

    లైలా: శ్రీశ్రీ – ఈ ఛందస్సు 325 విధాలుగా రాయవచ్చని తెలిసి, అన్నీ రాసుకుని, అందులో 78 ఎంచుకొని, ఎక్కడ ఏవి వాడాలో అన్న పరిజ్ఞానంతో, సరిగా అక్కడ అవి వాడినాడని అర్థం వస్తుంది. మీ ఉద్దేశం అదేనా? రకరకాల ఛందస్సులను,display చెయ్యటానికి, శ్రీశ్రీ తన కవిత్వం రాసాడా? ఛందస్సు వద్దు మొర్రో, నాకు నిబంధనలు వద్దంటున్న శ్రీశ్రీ అలాటి పని ఎందుకు చేస్తాడు? అది మీకు నచ్చిన ఊహ. ఆ ఊహను అతని ఛందోపరిజ్ఞానంగా గాని, అతని అభిలాషగా గాని రాయటం, అది true finding ఎలా అవుతుంది? అది మీరు ఎలా నిరూపిస్తారు? నేను ఈ విషయం నిరూపించి చూపాను, అని వ్యాసంలో మీరంటే, శ్రీశ్రీ పరంగా అది సరి ఎలా అవుతుంది? అతని గురించిన అతని మాటలనే ఖాతరు చేసుకోటం లేదే మీరు? ఎవరి మాటల ఆధారంగా ఏమి నిరూపిస్తారు?

    అశ్మాచం [లోపల్లోపల]: ఒకే ఒక్క ఓవరుఫ్లోకే సమాధానం లేనిది, ఇన్ని ప్రశ్నలేస్తే చచ్చింది గొర్రె, ఎక్కింది బర్రె అవుతుందేమో! చూద్దాం!

    సరే ఇలా యోజనసహస్రమైన కామెంటు రాసే ఓపిక లేదు కానీ కామేశ్వరరావు గారు – ఇక ఇక్కడినుంచి ఇదే లెక్కన మిగిలిన కామెంట్లలోని ప్రశ్నలు సమాధానాలు పండితులైన మీరు అందుకొని అల్లుకుపోవచ్చు.

    సమాధానం కుదిరితే లంబం తప్పని అశ్మాచం
    సమాధానం కుదిరకపోతే లంబం తప్పిన అశ్మాచం

    అటైనా ఇటైనా అశ్మాచమే! మృత్తికాచమే!

    ఇక ఈ వ్యాసానికి మీకు నాకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాం ఆనందార్ణేభ్య: అర్ణవమస్తు నిత్యం ఈమాటా: సమస్తా సుఖినోభవంతు!

  487. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి తః తః గారి అభిప్రాయం:

    12/08/2015 3:45 pm

    “దేశమును ప్రేమించు మన్నా, మంచి యన్నది పెంచు మన్నా.” లో కన్నా నాకు “సింహాలకు zoo లుండును ” అన్న అచ్చ తెలుగు మాటల్లో కవిత్వం కనపడుతుంది. . “దేశమును ప్రేమించు మన్నా, మంచి యన్నది పెంచు మన్నా.” కన్నా”ఏ తీరున నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా! ” చాలా మేలనిపిస్తుంది.
    తః తః

  488. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:

    12/07/2015 8:56 pm

    ఛందస్సు రెండు విధములు – వైదిక, లౌకిక ఛందస్సులు. వైదిక ఛందస్సులోని శ్లోకాలను పఠించేటప్పుడు ఊనిక, అనగా stress లేక accent అవసరము. అందుకే అవి శ్రుతులు అయ్యాయి. సామాన్యముగా వైదిక ఛందస్సు కనీసము half octave పరిమితిలో ఉదాత్త, అనుదాత్త, స్వరితములతో సాగుతుంది. గురువు (మనిషి) దగ్గర వీటిని నేర్చుకోవాలి. తరువాత లౌకిక ఛందస్సులో ఈ ఊనికకు బదులు గురు లఘువులు పుట్టాయి. ఈ గురులఘువులే ఇంద్రవజ్ర కాని శార్దూలవిక్రీడితము కాని, ఇతర వృత్తములకు కాని ఇవి ఇటుకరాళ్ల వంటివి. సంస్కృత కావ్యములన్నియు ఇట్టి వృత్తములతో వ్రాయబడినవి. నాటకయుగము వచ్చిన తరువాత నాటకములో జనరంజకత్వానికి గీతములు, గీతములవంటి పద్యములు పుట్టాయి. ఇవి మాత్రాఛందస్సుపైన ఆధారపడినవి. గాథా లేక ఆర్యా, వైతాళీయములు ఇట్టి కోవకు చెందినవి. అంతే కాక తోటకము, దోధకము, స్రగ్విణి, ఇంద్రవజ్రము లాటి తాళ వృత్తములను వీటిలో వాడారు. ఇవన్నీ పాడ దగినవి. గురువు రెండు మాత్రలకు లేక కళలకు సమానము, లఘువు ఒక మాత్ర. ఇవి ఉచ్చరణకు కావలసిన సమయము. కావున మాత్రను syllabic instant అని పిలుస్తారు. లౌకిక ఛందస్సులో accent or stress స్థానమును ఈ గురులఘువులు ఆక్రమించాయి. పాటలలో తాళవృత్తములలో ఊనికకు బదులు pitch or frequency ముఖ్యము. భారతీయులు ఆంగ్లమును మాటలాడు నప్పుడు కూడ ఒకే గొంతుతో మాటలో హెచ్చు తగ్గులు లేకుండ మాట్లాడుతారు. అందుకే పశ్చిమ దేశాలవారికి మన ఆంగ్లమును అర్థము చేసికొనడము కొద్దిగా కష్టమే. ఆంగ్లములో కవిత్వము ఈ ఊనికపైన ఆధారపడినది. భారతీయ భాషలలోని ఛందస్సు అక్షరముల కాల పరిమితి (హ్రస్వ దీర్ఘములు) పైన ఆధార పడి ఉంటుంది. సంగీతములో కూడ ఈ పరిస్థితియే. Decibels తేడా ఎక్కువ ఉండదు. Swinburne’s “A Match” లో మొదటి రెండు పంక్తులు –

    If love were what the rose is, (7 syllables)
    And I were like the leaf, (6 syllables)

    పద్యమంతా ఈ 7, 6 syllables తో మాత్రమే అల్లబడినది. ఈ syllable గురువైనా, లఘువైనా కావచ్చు. ఈ పంక్తులను చదివేటప్పుడు మార్చి మార్చి ఊనిక ఇవ్వబడుతుంది. దీనిని శ్రీశ్రీ ఆనందార్ణవ ఛందస్సుతో పోల్చరాదు. అక్కడ పాదానికి 14 మాత్రలు, పాద మధ్యములో, పాదాంతములో విరామము ఉన్నాయి. ఏ భాషకు ఆ భాష అందము, అంతే!

    నేను ఈమాట పత్రికలో వ్రాసిన రెండవ వ్యాసము శంకరాచార్యుల స్తోత్రములలోని ఛందస్సుపైన, అందులో ఉపయోగించబడిన వృత్తములకు ఉదాహరణములను ఇస్తూ, వాటిని అర్థము చేసికొనుటకై నేను తర్జుమా చేసాను, అంతే. అది కవిత్వమని నేను చెప్పుకోలేదు, అందువలన అందులో కవిత్వము లేదని చెప్పడము చచ్చిన గుఱ్ఱాన్ని లాఠీతో కొట్టడమే!

    శ్రీశ్రీ పాడుకోడానికి అనువుగా ఉండడానికే గేయ రూపములో నియమితమైన మాత్రల సంఖ్యతో వ్రాసినాడు. లైలాగారు అన్నారు – “Sri Sri is not thinking of 6-4-4.” On the other hand, SriSri IS THINKING of 6-4-4!

    “ఆనంద మర్ణవ మైతే,
    భుజాంతర దివ్య మూర్తే,
    హిమాదిక మర్ద యంతే
    జగదేక శరణ్య మూర్తే”

    ఇది నాకు అర్థము కాలేదు, ఒక వేళ వేళాకోళమా? అనుబంధములోని నా ఉదాహరణములను గురించియా? శ్రీవేంకటేశ్వర సుప్రభాతములో ఉండే వసంతతిలక వృత్తములు, తోటక వృత్తములు ఇవి పాడుకొన దగినవే. శ్రీశ్రీ చతుర్మాత్రా ఛందస్సులో తోటక వృత్తపు ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి.

    విధేయుడు – మోహన

  489. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    12/07/2015 2:23 pm

    “In terms of metrics, I feel Sri Sri is thinking more along lines of stressed syllables and end rhymes, of English poetry. ఆనందం అర్ణవ మై తే has Four stresses. So does అనురాగం అంబర మై తే. ‘A match.’ Looks like an Iambic tetrameter to me.”

    Interesting! “end rhymes” I understand, but not “stress”.

    “ఆనందం అర్ణవమైతే” – ఇందులో ఉన్నవి four stresses ఎలానో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి “Stress” అన్నది అచ్చుపైనుండే ఊనిక. ఇంగ్లీషులో ఒక పదంలో సాధారణంగా రెండు syllables కన్నా ఎక్కువ ఉండవు. కాబట్టి ఒక పదంలో సాధారణంగా ఒకటే stress ఉంటుంది. కాని తెలుగు పదంలో ప్రతి అక్షరమూ ఒక syllable. “ఆనందం” అనే పదంలో మూడు syllables ఉన్నాయి. ఇందులో దేనిపై stress ఉన్నట్టు? నాకు తెలిసి తెలుగులో ఆ పదం పలికినప్పుడు మూడింటిపైనా సమానమైన ఊనికే ఉంటుంది. అందుకే తెలుగు భాష ఇంగ్లీషులా Stressed language కాదు. “ఆనందం అర్ణవ మై తే” అన్నదానిలో ఉన్నవి నాలుగు “stops” లేదా “breaks”. అంచేత దాన్ని నాలుగు “మాత్రాగణాల” వాక్యంగా పరిగణించవచ్చు. ఒకో గణమూ కొన్ని మాత్రల సమాహారం. 6-4-2-2 అనే గణాలు. ఇది 6-4-4 అని కూడా అనుకోవచ్చు. ఆ కవితలో తక్కిన పాదాలకి కూడా ఇదే అన్వయం. అదే మోహనగారు చెప్పింది కూడా.

    తెలుగు భాషకి “stress”ని ఎలా అన్వయించవచ్చునో లైలాగారు వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.

    “If you were queen of pleasure
    And I were king of pain”

    నాకున్న కొద్దిపాటి ఇంగ్లీషు పరిజ్ఞానంతో నాకు తోచినదేవిటంటే, యిందులోని రెండో వాక్యం Iambic tetrameter. మొదటిది మాత్రం – x / x / x / x” – tailless iambic pentameter? అనిపిస్తోంది. A Match కవితలో ఈ రెండు రకాల నడకలూ కనిపిస్తాయి. అయితే వాటికి కచ్చితమైన order అంటూ ఏదీ లేదు. శ్రీశ్రీ గేయంలో మాత్రం 99% పాదాలన్నింటా 6-4-4 నడక కనిపిస్తోంది. అలాగే మోహనగారు చూపించిన ఇతర కవితల ఉదాహరణల్లోనూ ఇదే ఛందస్సు ఉంది. మాత్రాఛందస్సు విషయంలో ఇంగ్లీషులో “stress” లాగా పెద్దగా ambiguity లేదు.

    అంచేత “Sri Sri is not doing Traditional Telugu syllabic -One long, one short count.” అని ఎందుకన్నారో లైలాగారు వివరించాలి (లైలాగారి వ్యాఖ్యలో ఆ వివరణ ఉందేమో, నా బుఱ్ఱకి మాత్రం అర్థమవ్వలేదు!)

    కృష్ణశాస్త్రి, విశ్వనాథల ప్రభావం నుంచి తప్పించుకొని గురజాడ మార్గంలో కవిత్వం వ్రాయడం మొదలుపెట్టానని శ్రీశ్రీ చాలాచోట్ల గర్వంగా చెప్పుకొన్నాడు. అలాగే “గణబద్ధ ఛందస్సుల ఫ్యూడలిజం నుండి మాత్రాబద్ధ ఛందస్సుల ప్రజాస్వామ్య యుగానికి ఆంధ్ర సాహిత్య చరిత్ర గమనాన్ని పరివర్తన చేసినవాడు గురజాడ” అని, గురజాడ ప్రత్యేకతను కూడా స్పష్టంగా చెప్పాడు. అంచేత శ్రీశ్రీ గురజాడ ప్రభావంతో తన కవిత్వానికి మాత్రాఛందస్సు స్వీకరించాడనుకోడంలో సందేహం అక్కరలేదు.

    శ్రీశ్రీ పైన పాశ్చాత్యకవిత్వ ప్రభావం చాలానే ఉంది కాని, ఛందస్సు విషయంలో కూడా అది ఉంది అన్న లైలాగారి అభిప్రాయాన్ని ఒప్పుకోవాలంటే, దానికి మరింత విశ్లేషణ వివరణ అవసరం. ఆ దిశలో ఇప్పటికే ఎవరైనా విమర్శ చేసారేమో నాకు తెలీదు. చేసుంటే కనక, అది తెలిసున్నవాళ్ళెవరైనా ఇక్కడ పంచుకొనమని నా వేడుకోలు. లేదంటే, లైలాగారే ఆ పని చేపడితే బహుబాగుంటుంది!

  490. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:

    12/07/2015 12:54 pm

    శ్రీ శ్రీ, స్విన్ బర్న్ ల కవిత్వం , సంగీతం మీద నడుస్తున్న చర్చలో భాగంగా
    రెండు ప్రసంగ వ్యాసాలు :

    శ్రీ శ్రీ మహా ప్రస్థానం: కథనం,కదనం

    మహాప్రస్థానం -సాహిత్యంలో శ్రీ శ్రీ స్థానం

    పుటలు : 18 -24

    తమ్మినేని యదుకులభూషణ్

  491. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    12/06/2015 11:28 am

    కొన్ని ఉదాహరణలు, నా ఆలోచనలు.
    జె. కె. మోహన రావు గారి ఈ పద్య పాదాలను పరిశీలించండి.

    1. కాదంబరిని త్రాగిన మదాలసవతిని
    2. ఎడమ కుచమును తాకు వీణియను మీటెడు
    3. శశికిని సుధకు నక్కా నీకు నా నమస్సులు

    మదాల సవతిని, సుధకు నక్కా -అని చదివి ఆనందించలేము కదా. అసలు అందులో పొయట్రీ నూ లేదు. వాటి ఒరిజినల్స్ కింద చూడండి. ఎంతో వినబుల్ గా పాడబుల్ గా ఉన్నాయి.

    1a. కాదంబరీపాన మదాలసాంగీం
    2b. వామస్తనాలింగిత రత్నవీణాం
    3b. నమోऽస్తు సోమామృతసోదరాయై

    ఈ కింది అనువాదపు మాటలలో మాత్రా ఛందస్సు ఉందేమో కాని, కవిత్వం లేదు. తెలుగు కూడ రమారమి లేదనే అనాలి.

    “తిండి విషము, సరము పాము,
    బట్ట తోలు, బండి ఎద్దు
    నాదు సేవ కొసగ దగిన
    దేమి లేదు నీదు చెంత
    నీదు పాద కమల భక్తి
    నీయు మయ్య శంభు యెపుడు”

    దానికి మూలం ఈ కింది సొగసు రచన అని ఎవరూహిస్తారు?

    అశనం గరలం ఫణీకలాపే
    వసనం చర్మ చ వాహనం మహోక్షః
    మమ దాస్యసి కిం కిమస్తి శంభో
    తవ పాదాంబుజ భక్తిమేవ దేహి

    ఐనా, ఆ తెలుగుసేతలు – ఆయన వ్యాసంలో రాసినపుడు, శంకరాచార్యుని అందమైన రచనలను, రకరకాల ఛందస్సులను పరిచయం చేస్తూ, ప్రతిదానికీ అర్ధం చెప్పక పోతే తెలియని నా లాటి మూఢమతులకోసం జె. కె. మోహన రావు గారు, పెద్ద మనసు చేసి, ఓపికతో, తేలిక భాషలో చెప్పినవి. వాటి ఉపయోగం అంతవరకే ఐనా, అది నా వంటి ఆరంభ దశలోని చదువరులకు చాలా మేలు.

    త్యాగరాజు, అన్నమయ్య, రామదాసులలో, నాకు, సంగీతానికి, సాహిత్యానికీ, త్యాగరాజే గొప్ప. సింపుల్ గా “సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మాకు తండ్రి” అన్న దగ్గరే అది డిసైడ్ ఐపోయింది.:-) క్లాసికల్ సంగీతంలో ఏ మాటల వల్ల, గాయకులకు పాడటానికి ఏం బాధ? పాడ చేత కావాలి. కర్ణాటక సంగీతము పాడే వాళ్లకు, సాహిత్యం అర్థం చెప్పి, సరైన ‘voice training’ ఇప్పిస్తే, ఎన్నో మనసు రంజింప చేసే రచనలు ఉన్నయ్యి. I don’t know the current music publishing software status for Karnataka music. I like to find out.

    Coming to Sri Sri’s poetry, అద్వైతం- The title and some stanzas reflect, he is taking some of the content and theme from Swinburne’s poem – ‘A match.’ For instance:

    “If you were queen of pleasure
    And I were king of pain”
    Becomes
    “హసనానికి రాణివి నీవై
    వ్యసనానికి బానిస నీవై,”

    “If you were April’s Lady
    And I were Lord in May”
    Perhaps becomes
    “వాసంత సమీరం నీవై
    హేమంత తుషారం నేనై”

    In terms of metrics, I feel Sri Sri is thinking more along lines of stressed syllables and end rhymes, of English poetry. ఆనందం అర్ణవ మై తే has Four stresses. So does అనురాగం అంబర మై తే. ‘A match.’ Looks like an Iambic tetrameter to me. To sing somewhat upbeat like – ‘For he is a jolly good fellow, for he is a jolly good fellow.’ Sri Sri is not doing Traditional Telugu syllabic -One long, one short count. He is a beginner poet. All he is doing is trying out to write differently from before. His previously written classical Telugu poems are downright ghastly. He definitely needed something new, to stay in the game. He would not be chanting his poetry in -Venkateswara suprabhatam style, which every Telugu hears every Saturday morning. (A few lines partially randomly used. Don’t start counting syllables.)

    ఆనంద మర్ణవ మైతే,
    భుజాంతర దివ్య మూర్తే,
    హిమాదిక మర్ద యంతే
    జగదేక శరణ్య మూర్తే

    Sri Sri is not thinking of 6-4-4, or, ధృవ తాళము. (He might have favored Gurazäda’s fourteen syllabic count lines. It’s a nice comfortable length.)
    I really don’t like అద్వైతం. It’s poor poetry. Worse than ‘A match.’ The poet is just ‘working’ the words. (To take T.S. Elliot’s expression.) There is no cohesive meaning. Sometimes you get doubts whether there is a man and a woman – two lovers – in Sri Sri’s poem or whether he is addressing a group of people. వేస్తాం, తీస్తాం, పరిహాసిస్తాం, పరిపాలిస్తాం, ప్రపంచమును, భవిష్యమును, all so bombastic and pseudo grand. Well, as I grumbled a few times before, here and there, Sri Sri is not a favorite of mine. He will never be one.
    (But if I sing వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనై -my way, it is getting a new life. I would not mind editing the poem, giving it a track in ‘my Album’)

    When it comes to Gurajada, in the context of this essay, yes, he really wrote a nice Telugu song. “దేశమును ప్రేమించు మన్నా, మంచి యన్నది పెంచు మన్నా.” చక్కని తెలుగు పదాలు, చక్కని భావం. గేయము పాడేవారు పాట సొగసును పెంచవచ్చు. చేతకాకపోతే దించవచ్చు.

    గురజాడ కవి తన ఛందస్సును గురించి చెప్పినాడు. (Thanks Sayee garu for providing an essay.) And I read some poetry of his. “మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కకు, మనుషులంటే రాయి రప్పల కన్న కనిష్ఠం గాను చూస్తావేల బాలా!” It’s nice work. Nice awakening thought. (Someone sang it on you tube. It is downright horrible.)

    Reading this essay, lead me to re-read many more of J.K. Mohana Rao’s essays on chandassu, (I have been reading him for ten years now.) I checked on a few others, namely A.J. Swinburne, (a remarkable rhyming capacity, ‘The Roundel’ is a joy) Tennyson, Shakespeare, some criticisms of Ezra Pound, (beautiful translation by K.V.S. Ramarao, in this magazine.) And excerpts from T.S. Eliot -Sacred Wood. I enjoyed the whole process. (And more so conversations of literary friends in the magazine.) Gained more insights into music and poetry – writing, and reading. Thanks.
    Lyla

  492. ఇస్మాయిల్ అవార్డు-2015 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    12/05/2015 3:30 am

    నరసింహా రావు గారు

    -రెండూ ఒకటి కాదు.
    వాడ్రేవు వీరలక్ష్మి గారు ఇస్మాయిల్ పురస్కారాన్ని గత ఐదారేళ్లుగా పేరుపొందిన కవులకు ఇస్తున్నారు (నామాడి శ్రీధర్ ,వాడ్రేవు చినవీరభద్రుడు, విన్నకోట రవి శంకర్,బివివి  ప్రసాద్,రేణుక అయోల, యాకూబ్ ).

    మరిన్ని వివరాలకు:
    “http://www.andhrajyothy.com/Artical?SID=158444”

    ఒక దశాబ్ద కాలంగా తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డు లభించేది ప్రతిభా వంతులైన యువకవులకే (పూర్తి జాబితా పై ప్రకటనలో ఉంది).

    మరిన్ని వివరాలకు :
    “https://te.wikipedia.org/wiki/ఇస్మాయిల్_అవార్డు”

    తమ్మినేని యదుకుల భూషణ్

  493. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:

    12/03/2015 9:06 pm

    లైలా గారు,

    “ఈ పత్రికలో ‘ముత్యాల సరాలు’ అన్న మకుటంతో ఒక కవిత ఉంది. అది కవి ఏ ఛందస్సులో వ్రాసారు? దాని పేరేమిటి?”

    “ఈమాట” పత్రికలో క్రింది రెండు కవితలు ముత్యాలసరాలుగా వ్రాయబడినవి (ఇంకా ఉందేమో నాకు తెలియదు) –

    జనవరి 2009 – గడ్డిపూవు – హేమ వెంపటి
    జనవరి 2011 – మంచుమనిషి – నేను వ్రాసినది

    విధేయుడు – మోహన

  494. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:

    12/03/2015 6:36 pm

    తహతహ గారు,

    “1. మనసులోనిమ(మా)…..ర్మములు తెలుసుకో (త్యాగరాజు, పల్లవి)
    2. కాలా .. తీత విఖ్యాత (త్యాగరాజు, సామజవరగమన, పల్లవి)
    3. భవచంద్ర కళాధర (త్యాగరాజు, దేవాదిదేవ సదాశివ, చరణం)*”

    నేను మన కవులు పాటలను వాగ్గేయకారులకు వదిలారు, తాళ వృత్తములను అలా వ్రాయలేదని మాత్రమే. ఇకపోతే వాగ్గేయకారులు అలా పదములను విఱువకుండ పాడుటకు వ్రాసినారా అనే ప్రశ్నకు ఉత్తరము మీ వ్యాఖ్యలోనే ఉన్నది. కాని ప్రయత్నించారని చెప్పవచ్చును. నా ఉద్దేశములో అన్నమయ్య, రామదాసు ఈ విషయములో కృతకృత్యులయ్యారు.

    లైలా గారు,

    “కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం?”

    కారణములు – (1) అలా అడగవలసిన బాధ్యత రచయితది లేక సంపాదకులది. (2) ఒక శుభకార్యమునకై ఒక వ్యక్తి అడిగినపుడు, మనకు తెలిస్తే మనము సహాయము చేయాలి. (3) ఆ వ్యక్తి చిరునామా నాకు తెలియదు కావున ఇక్కడే ఆ అభిప్రాయమును చెప్పవలసి వచ్చినది. (4) ఇటువంటి సంబంధము లేని ప్రశ్నలకు సంపాదకులు మఱొక చోటు ఉంచితే బాగుంటుందేమో?

    “తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?”

    శుభలేఖలను తెలుగులో మాత్రమే కాకుండా ఆంగ్లములో కూడ ప్రచురిస్తారుగా, అందువలన దానిని కూడ జత చేసాను.

    “వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression.”

    నా రచనలలోని విషయాలను అనవసరముగా sidetrack చేసినప్పుడు నేను అలా చేయకండని అభ్యర్థించడము సబబే అనుకొంటాను.

    “ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు.”

    శ్రీశ్రీ చెప్పనంత మాత్రాన వ్యాసకర్త అభిప్రాయము తప్పు కాదు. Swinburne వ్రాసిన A match లో 7, 6 syllables ఉన్నాయి. అందులోని సారాంశమును శ్రీశ్రీ గ్రహించాడు, syllabic arrangement కాదు.

    “గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా?”

    అది ఛందస్సు పేరు. నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, సుభద్ర, పూర్నమ్మ అనుబంధము ఇవన్నీ ముత్యాలసరాలు అనే పేరితో ఎమెస్కో వారు ప్రచురించారు. అందులో ముత్యాలసరాలపైన అప్పారావు వ్యాసము ఒకటి ఉన్నది.

    “మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.”

    ఈమాట శ్రీ వేలూరిగారిని కూడ అడగండి, వారు ఒకప్పుడు 20వ శతాబ్దములోని మహాకవులు విశ్వనాథ, శ్రీశ్రీ అన్నట్లు గుర్తు. జగద్గురు మధ్వాచార్యులు మాత్రాఛందస్సును ద్వాదశస్తోత్రములో వాడినారు. కాని జగద్గురు శంకరాచార్యులు మాత్రాఛందస్సును ఎన్నో స్తోత్రములలో వాడినారు, శ్రీశ్రీకి స్ఫూర్తి ఇచ్చినది ఆ రచనలే.

    విధేయుడు – మోహన

  495. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం గారి అభిప్రాయం:

    12/03/2015 6:34 pm

    లైలా గారు

    మీ కామెంటును చూచి, ప్రథమారంభంగా నన్నాకర్షించిన మీ ప్రశ్నలు బట్టి, గట్టిగను పట్టుబట్టి వెతుకు బొత్తాము నొక్కి వెతికితిని. అప్పుడు పంచరత్న లంకెల దర్శనప్రాప్తి జరిగినది. అద్దానియందు ముత్యాల సరములు అని వున్నదాని మీద నొక్కి చదివినాను.

    అదియంతయు చదివిన తరువాత ముత్తెములు సరాలలో కాకుండగా నరాలలో బంధించిన యెడల యమధర్మరాజుకు కాసింత విశ్రాంతి కలిపించినవారమగుదుమని ఒకనాడు ఒకానొక మిత్రుడు నాతో మొఱపెట్టుకొన్న వైనము ఙప్తికి వచ్చినది.

    అయిననూ పొత్తము పూర్తిగా చదివితిని కావున ఆ సరములయందు నను పూర్తిగా కమ్మిన వాక్యములు ఇవియని చెప్పుటలో ఇసుమంత సందేహము లేదు.

    అంతు పట్టని ఊహలన్నీ,
    అంధకారం లాగ కమ్మీ….

    అనిన వాక్యములు కవితావిదారక స్థానములో జగణము భగణము మీద కాక మగణము మీద యమోపచారము పొందినట్లు అనిపించినది. ఇది కూడా ఒక భావనే కావున, కవులైన వారు అర్థము చేసుకొనెదరని భావించుచుంటిని.

    ఏతావాతా చెప్పునది ఏమనగా – ఆ సరములు చదివిన పిమ్మట అద్దానియందున్న మాత్రాఛందస్సు పరిస్థితి ఏమిటో తెలియనైతే లేదు కానీ, మాత్రా బిళ్ళగోలీలు వేసుకొనే పరిస్థితి దాపురించేట్లుగా కనపడటముతో

    అంతు పట్టని రాతలన్నీ
    అంధకారం లాగ కమ్మీ…

    అని ఒక రెండు వాక్యములు నాకు నేనుగా రాసుకొని సమాధానపఱచుకొంటిని.

    ఇక గురజాడ గుఱించి మీరు అంత ప్రియముగా గోముగా అడిగిననూ నేను మాటాడదలచుకోలేదు. ఆయన వలన కాదుకానీ, ఆయన రచనల వలన మన సాహిత్యము, వల్లకాడు దిశగా సాగిపోయినదని నా నిశ్చితాభిప్రాయము. దానికి కారణములు ఇక్కడ వివరించపూనుకునే ఓపిక లేదు. కాకున్న గురజాడ సంగీతమునకు, స్వరములకు సంబంధించిన మీ ప్రశ్నలు చాలా ఉత్సాహపూరితముగా వున్నవి. ఇతర చదువరులెవరన్నా విశదీకరించ పూనుకుంటే అవి చదవవలెనని పూనకముగా వున్నది.

    ఆ సమయము కొఱకు ఎదురు చూచుచు

    అశ్మాచం

    PS: – మీ పి.ఎస్ నందు శ్రీశ్రీ గుఱించిన మీ అభిప్రాయముతో నాకు భేదవిభేదమున్నది కానీ, మిఱుమిట్లు కొలిపినది మీకే కావున ఆయ్యదాంధకార పరిస్థితి మీ వరకే నిలిచి యుండును. అద్దానివలన ఇతరులకు ఇబ్బంది లేదు, వుండకూడదు అని ఆశ. అయిననూ పైన డైగ్రెషనుకు సంబంధించిన మీ ప్రశ్నావివరణకు, స్విన్బర్నుకు సంబంధించి ప్రశ్నకు రచయిత నుండి ఏమి సమాధానము వచ్చునోనని ఆసక్తోత్సాహముగానున్నది.

  496. అద్వైత దర్పణం గురించి Baskar K గారి అభిప్రాయం:

    12/02/2015 9:19 pm

    భావరాజు గారూ!
    కవితలో అద్వైతం అన్న పదం కేవలం నైఘంటుకార్ధంలోనే వాడబడింది.
    ఆధ్యాత్మికత, అధిభౌతికతలాంటివి లేవిక్కడ.
    భాస్కర్

  497. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    12/02/2015 6:11 pm

    In the comments essayist says: “ఇకపోతే లైలాగారు రెండవ అంశములో “2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”చెప్పినవి digression కాక మఱేమిటో?”

    పక్కనే ఇంకో అభిప్రాయ వేదికలో, అశోక వనంలో సీత గురించిన పద్యం శీర్షికలో, విశ్వనాథ పద్యం గురించి వీరు ఏం చర్చ చెయ్యలేదు. పద్యం పైన వ్యాఖ్యను గురించి నోరు మెదప లేదు. కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం? పైగా, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో తనకు నచ్చిన పద్యం అంటూ రాసారు. తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?

    వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression. ఈ మాట మేగజీన్ లో అన్ని అభిప్రాయాలూ అందరికీ కనిపిస్తూనే ఉంటాయి. నిజంగా వేరు వేరు గదుల్లో, గోడలు అడ్డు ఉంటే, ఒకచోట డైగ్రెషన్ అంటూ, అవతలకు వెళ్లి వారు అదే పని చేస్తున్నట్టు అందరికీ తెలియదు కదా.

    In the essay Essayist says: “మహాప్రస్థానంలో ఈ ఛందస్సులో ఐదు గేయములు ఉన్నాయి, అవి – అద్వైతం (అ), ఋక్కులు (ఋ), దేశచరిత్ర (దే), నవకవిత (న), పేదలు (పే). ఈ ఛందస్సు ప్రత్యేకత ఏమనగా – ఇందులో ప్రతి పాదములో 14 మాత్రలు ఉంటాయి. అవి 6, 8 మాత్రలుగా విఱుగుతాయి. రెండవ భాగములోని ఎనిమిది మాత్రలు సామాన్యముగా రెండు చతుర్మాత్రలుగా ఉంటాయి…”

    భారతం, భాగవతం, ప్రబంధాల లోని పద్యాలు చదువుతున్నప్పుడు ఇది చంపకమాల, ఉత్పలమాల, సీసం, అని కవి చెపుతాడు. ఆ పద్య లక్షణాలు వారికి తెలుసు. మహీధర నళినీ మోహన్ –మాత్రా ఛందస్సులో మేఘసందేశం – అన్న తెలుగు పుస్తకంలో -మాత్రా ఛందస్సులో ఆయన ఎంచుకున్న గణములు, పాదములో గణముల సంఖ్య, పద్యం లోని పాదాల సంఖ్య ముందుగానే చెప్పారు. ఆ యా రచనలలో వారి కూర్పుల గురించి ఆ రచయితలు స్వయంగా సమాచారమిచ్చారు.

    ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు. ‘అద్వైతం’ గేయం చివరి దాకా పఠించగలిగితే – అక్కడ ఏ. సి. స్విన్బర్న్ కవికి, ప్రత్యేకంగా A match అనే గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో, 1936(?) – అని మహాప్రస్థానం పుస్తకంలో ముద్రించబడి ఉన్నది. ఏమి మార్గము శ్రీ శ్రీ కవికి -స్విన్బర్న్ నుండి లభించింది అన్న ప్రసక్తే తేలేదే ఈ వ్యాసకర్త? విచిత్రం. కవి చెప్పినది వ్యాసకర్త ఉపేక్ష చెయ్యటం. ఎందువల్ల? వ్యాసకర్త స్విన్బర్గ్ A match చదివారా? అతని ఇతర కవిత్వం చదివారా? శ్రీ శ్రీ కవితలోని వాక్యము -6,4,4 గానే ఎందుకు తను విభజించారో, అలా తీర్మానించుకోటానికి బేసిస్ ఏమిటో, ఈ వ్యాస రచయిత చెప్పాలి. అదంతే, అక్కడ అదే ఛందస్సు ఉంది అనేస్తే చాలదు.

    మేగజీన్ చదువరులకు నా ప్రశ్నలు:

    1. గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా? గురజాడకు సంగీతములో ప్రవేశముందా? అతని కవితలకు అతడు స్వరములు కూర్చాడా?
    2. ఈ పత్రికలో ‘ముత్యాల సరాలు’ అన్న మకుటంతో ఒక కవిత ఉంది. అది కవి ఏ ఛందస్సులో వ్రాసారు? దాని పేరేమిటి?

    Lyla

    P.S: ఓరి నాయనో! మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.

  498. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి Bhavabhuti. K గారి అభిప్రాయం:

    11/30/2015 1:42 pm

    మోహనగారూ,
    వ్యాసం చాలా బాగుంది. మీ వ్యాసాల్ని ఆసక్తితో చదువేవాళ్ళలో నేనూ ఒకడిని. మీరు తరచుగా ఇలాంటి పరిశీలనాత్మక పరిశోధనలు చేస్తే బాగుంటుంది.

    శ్రీశ్రీ ఛందోబందోబస్తుల్ని తెంపేస్తున్నానంటూ చాలా ఛందస్సునే తనకి తెలియకుండానే వాడాడన్నది వెల్లడి అవుతోంది మీ పరిశోధన వల్ల.

    సహజంగా గొప్పకవి, పదవిరించీ అవడం వల్ల అతనికి కలిగే మహోద్రేకంలో చేసి ఉండవచ్చు.

    అయితే ఇది శ్రీశ్రీకి కొత్త కాదు. చెయ్యనన్నది చెయ్యడం, తెగిడినవాటిని మళ్ళీ తన అవసరం కోసం వాడు కోవడం అతనికి అలవాటే.

    ఉదాహరణకి..

    కలకత్తా కాళిక నాలుక, పరమేష్టి జూకాలూ, జగన్నాథరథచక్రాలూ పట్టుకుని పదచిత్రాలు గీయడం లాంటివి….

    ‘శ్రీ అనగా లక్ష్మి’ అని మనకి తన కలం పేరులో గల పెన్నిధిని కూడా వివరించాడు..

    రాయనన్నవాడు ‘అధివాస్తవికుల ప్రవేశం’ అంటూ వృత్తాల్లో గిరికీలు కొట్టాడు..

    ‘కెమెరా కన్ను’ అంటూ చిత్రకవిత్వం చూపించాడు..

    ఆఖరికి తీర్థయాత్రల డబ్బింగు సినిమాలకి మాటపాటలు కూడా రాసాడు.

    గమనికః శ్రీశ్రీ వీరాభిమానులు నాపై ధ్వజం ఎత్తకండి. నేను కూడా బహ్వభిమానినే…అపార్ధం చేసుకోకండి నా మాటలు

  499. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:

    11/29/2015 6:02 pm

    “What does that mean? A misleading sentence right in the beginning of the essay. Neither Gurajada nor Sri Sri wrote poetry to show case matra chandassu.”

    గురజాడవారు వాడుక భాషలో మాత్రాఛందస్సును ఉపయోగించి వ్రాయుమని చెప్పగా, తాను వ్రాసినానని శ్రీశ్రీ చెప్పాడు. అంటే అట్టి మాత్రాఛందస్సుకు అగ్రస్థానము నిచ్చాడనియే కదా దాని అర్థము? అంతకుముందు శ్రీశ్రీ వృత్తములలో, జాత్యుపజాతులలో తన కవిత్వమును వ్రాసియుండెను, అట్టి కవితలకు ఉదాహరణమును ఇక్కడ ( http://eemaata.com/em/issues/201001/1530.html?allinonepage=1 ) చదువ వీలగును. ఇట్టి ఛందస్సును త్యజించి, మాత్రాఛందస్సును మాత్రమే తఱువాత వాడియున్నాడంటే దానికి ఒక ఉన్నత స్థానము ఇచ్చాడనియే అని నేను అర్థము చేసికొన్నాను. ఇతరులు వేఱు విధముగా అర్థము చేసికొని ఉంటే దానిని విశదీకరించడము వారి కర్తవ్యము అవుతుంది.

    ఇకపోతే లైలాగారు రెండవ అంశములో
    “2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”
    చెప్పినవి digression కాక మఱేమిటో?

    పాటలను పాడుకొనేటప్పుడు దాని నడక, లయ – వీటికి తగ్గట్లు పదములు అమరినప్పుడు మాత్రమే శ్రోతలకు గొప్ప అనుభూతి లభిస్తుంది. పదములను గాయకురాలికి తోచినట్లు ఎక్కడిక్కడ నఱికి పాడితే అనుభూతి కలగడము కాదు అసహ్యము కలుగుతుంది. అలా నఱికి పాడిన పాటలు బాగుండవని ఎన్నో మారులు ఎందఱో చేసిన విమర్శలను నేను చదివియున్నాను.

    భారాతాది గ్రంథములలో ఉండే అర్థవంతమైన పద్యాలను చదివి ఆనందించ వచ్చును. అదొక అనుభూతి. కాని అన్నిటినీ పాడుకోలేము, ముఖ్యముగా తాళబద్ధముగా పాడుకోలేము. ఈ ఆనందార్ణవ ఛందస్సు తాళబద్ధమైనది. ఆఱు, ఎనిమిది మాత్రలకు విఱుగుతుంది. శ్రీశ్రీ అలా ఎందుకు వ్రాసినాడంటే, అప్పుడే గేయపు నడక, లయ వాటిలో ప్రతిబింబిత మవుతాయి. శ్రీశ్రీ పాదాంత విరామమును కూడ పాటించాడు. ఇవన్నీ ఆ మహాకవి ఎందుకు చేసినాడంటే, వాటిని జనులు పాడుకొని ఒక క్రొత్త ఉద్రేకాన్ని పొందాలని.

    ఉత్తర భారత భాషలలో, సంస్కృతములో, తమిళ, మలయాళములలో ఎక్కువగా పాదాంతయతిని వాడుతారు. అలా చేసినందువలన వాటికి గానయోగ్యత లభిస్తుంది. తెలుగు కన్నడ భాషలలో (ముఖ్యముగా తెలుగులో) సాహిత్యము రెండు భిన్న రీతులలో రూపొందినాయి. కావ్యములు పఠనీయములు మాత్రమే. అది సంగీతముతో ఎక్కువ సంబంధము లేకుండా రూపొందినది. వాగ్గేయకారులు రచించిన గీతులకు మాత్రమే గేయత్వము లభించినది. కవులు ఎక్కువగా ఈ వాగ్గేయకారులను, యక్షగాన కర్తలను సరకుగొనలేదు. ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.

    అందుకే నేను గానయోగ్యతకు అనువైన వృత్తములను అభ్యసించడములో కృషి చేస్తున్నాను. అంతే కాదు, మనమెఱిగిన మాలికా విక్రీడితములను కూడా తాళబద్ధమును చేయ వచ్చునని నిరూపించినాను.

    ఇతరులు దీనిని అంగీకరిస్తారో, అనుమోదిస్తారో, కనీసము బాగుందని ఒక మాటైనా అంటారో లేదో అన్నది వారికే నేను వదలివేస్తాను. కాని నాకు మనఃతృప్తి లభించినది దీనివలన. అది చాలు నాకు. ఎందుకంటే నేను “ఈమాట”లో వ్రాసిన 50 పైన వ్యాసములను ఇతరులు మెచ్చుకోలేదని అనుకొని ఉంటే అర్జునునిలా అస్త్ర సన్యాసము చేయడానికి ఉద్యమించి ఉండేవాడిని.

    లైలాగారికి, తహతహగారికి, వేలూరిగారికి, అశ్మాచంగారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు!

    విధేయుడు – మోహన

  500. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    11/16/2015 3:29 pm

    1. About the essay
    “నవీనయుగములో మాత్రా ఛందస్సుకు ఒక గొప్ప స్థానము నిచ్చి కవితావ్యవసాయమును చేసినవారిలో గురజాడ అప్పారావు తఱువాత శ్రీశ్రీ అగ్రగణ్యుడు.”
    What does that mean? A misleading sentence right in the beginning of the essay. Neither Gurajada nor Sri Sri wrote poetry to show case matra chandassu.
    శ్రీశ్రీ మాత్రా ఛందస్సు కి గొప్ప స్థానాన్ని ఇవ్వటానికి కవితావ్యవసాయం చెయ్యలేదు. గురజాడ, శ్రీశ్రీ -గురించి చెపుతూ కవితావ్యవసాయము అన్న సమాసమెందుకు? శ్రీశ్రీ తన సమాజం లోని పరిస్థితులను, ఆ కాలంలో రోజూ మాట్లాడుకునే తెలుగులో చెప్పాలనుకున్నవాడు. వాడుక భాష, కలగలుపు మాత్రల (syllables) గుంపులేగా.) “గురజాడ వాడుక భాషలో రాయమన్నాడు. మాత్రా ఛందస్సులను వాడమన్నాడు. నేనందుకే ఉత్సాహంతో, ఉద్రేకంతో ఉద్యమించాను…” – మహా ప్రస్థానం, శ్రీ శ్రీ)
    Those poets are just moving away from one sort of chandassu, which they thought is restrictive, but they are not trying to elevate matra chandassu. That is not their concern or intention.

    2. Now clarification about my previous words “When you are the lyricist, you can request your composer and singer, to sing it the way you like it to be sung. You can compel them, that they need you approval of the sheet music, and the recording, before it is released to the general public. I am sure it will be a smash hit in some circles.”

    (For the love of Mike, I can’t understand how my sentences are read as a condescending remark. And quite unnecessary on the top – by the essayist. He makes it his mission to tell readers of this magazine గేయములు, గాన యోగ్యత in his writing/s.)

    Those are words/ advice I hear in music lectures, workshops, from the musicians. It is common practice in music circles, to sell their lyrics and make money of their songs. And since there are so many styles of music – pop, rap, gospel, metal, country, jazz, light classical, classical, etc. etc. certain lyrics are hot in certain circles. For instance, take this year’s country music association’s (CMA) award winner Chris Stapleton. Over years, Chris had been writing and selling his lyrics to publishing houses, for other singers to sing. Also he sings, releases his own albums now and then. Thus he makes his living. Apparently Chris favors a style of music called blue grass. Millions of people enjoyed Chris and Justin Timberlake performing together, at the CMA’s awards ceremony. I loved their performance of ‘Tennessee Whiskey.’ I really would love to have one or two hit albums myself. One of my several dreams. 🙂

    Here is a song I composed in a minute:

    I have been up all night
    Asshole, you didn’t show your face yet
    I closed my ranch door shut
    Dumbshit, Go suck your mother’s tit.

    (In my mind, as I sing those lines with a drawl, but with vengeance in my heart, three female guitarists will croon,)
    Don’t come back, Don’t come back, Don’t come back.

    If I send this lyric of mine, to Nashville Tennessee, to a talent scout, I probably can sign up with a publisher. It is immaterial to the publisher if I took six months or sixty seconds to write it.

    Instead, if I write
    గోపియె గోవిందం
    గోవిందమె జీవుని అరవిందం
    గోపియె గోవిందం
    Light Classicists, and religious clubs may give a nod of approval, but on a very bad day in Paris, I may be shot dead on the spot.

    Lyla
    Thanks editors for giving a legible letter from the essayist. More later, if my time permits -about the essay, and essayist’s comments in reference to research.

  501. వాన – గులాబీ – పాము గురించి అశ్మాచం గారి అభిప్రాయం:

    11/12/2015 5:41 pm

    ఆహా! ఏమి తూగు, ఏమి ఊగు. ఎంతో నిర్మలంగా, చాలా బాగున్నది ఈ కవిత.

    గాలి గాలి గలిసె గగనంబు గగనంబు
    మన్ను మన్ను గలిసె మంట మంట
    నీరు నీట గలిసె నిర్మలంబై యుండె
    విశ్వదాభిరామ వినురవేమ
    (వేమన పద్య రత్నాకరము – భాగవతుల సుబ్రహ్మణ్యం)

    అన్న వేమనుల వారి పద్యము చప్పున గుర్తుకు వచ్చె

    మీ పత్రికలో వున్న ( సజెష్టివ్ ) సూచిత సౌలభ్యం కూడా చాలా బాగున్నది.

    అశ్మాచం

  502. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:

    11/10/2015 11:44 pm

    వేలూరి వెంకటేశ్వరరావు గారి ప్రోత్సాహమునకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.

    నేను వివరించిన ముఖ్యమైన విషయములపైన చర్చను జరుపక వేఱు విషయములపైన చర్చ జరిగినందులకై ప్రధానాంశములపై చర్చ జరుపమని ప్రార్థిస్తూ అవేవో అన్న విషయమును నేను నా అభిప్రాయములో తెలిపినాను.

    “Thank you …. I am sure it will be a smash hit in some circles.”

    This appears to me to be a condescending remark, quite unnecessary in my opinion.

    “అంటే శ్రీశ్రీ – ఈ ఛందస్సు 325 విధాలుగా రాయవచ్చని తెలిసి, అన్నీ రాసుకుని, అందులో 78 ఎంచుకొని, ఎక్కడ ఏవి వాడాలో అన్న పరిజ్ఞానంతో, సరిగా అక్కడ అవి వాడినాడని అర్థం వస్తుంది. మీ ఉద్దేశం అదేనా? రకరకాల ఛందస్సులను, display చెయ్యటానికి, శ్రీశ్రీ తన కవిత్వం రాసాడా?”

    325 విధములు వ్రాయవచ్చునని మాత్రమే తెలిపినాను. వాటినన్నిటిని శ్రీశ్రీ పరిశీలించి అందులో 78 ఎన్నుకొన్నాడని నేను ఎక్కడ చెప్పలేదు. అతని ఐదు కవితలలో ఉపయోగించబడినవి 78 ఛందస్సులు అని మాత్రమే తెలిపినాను.

    “మీరు చేయగలిగిన పనులు, మీ రచనలలో మీరు చేసి చూపి మెప్పించవచ్చును. ఇతరులు సంకల్పించని, చేయని పనులను, వారు చేసారని చెప్పి, ప్రజలను ఒప్పించ లేరు.”

    నేను వ్యాసపు ముగింపులో ఇలా వ్రాసాను – “శ్రీశ్రీ నేను ఆనందార్ణవము అని పేరుపెట్టిన 6-8 మాత్రల ఛందస్సును ఏ విధముగా సృష్టించాడో మనకు తెలియదు. కాని అది చంపకోత్పలమాలలలో, శార్దూల మత్తేభవిక్రీడితములలో అంతర్లీనమై ఉన్నదని ఇక్కడ నిరూపించినాను.” ఇందులో శ్రీశ్రీ ఏ రీతిగా ఏ ఆధారముతో ఈ ఛందస్సును సృష్టించినాడన్న విషయము మనకు తెలియదని స్పష్టముగా చెప్పాను. అది శ్రీశ్రీ సంకల్పించాడని నేను చెప్పానా?

    “ఒక విధంగా చూసినట్లయితే, గేయములు నిజముగా ఏకపాద వృత్తములు! ఈ విషయము ఆశ్చర్యకరముగా కనిపించవచ్చును కాని ఇది ముమ్మాటికి నిజము.”

    మొదటి అనుబంధములో ఇవి ఇవ్వబడినవి.

    “No one needs that kind of research.”

    Thanks for the kind encouragement. Again, I don’t carry out my research keeping such opinions in my mind. Thank God, I am not receiving any grants for my research from such people!

    విధేయుడు – మోహన

  503. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    11/08/2015 10:06 pm

    “అందుకే పదములను సరిగా విడదీసి పదచ్ఛేద, పాదాంత యతులను ఉంచితే పాడుకొనుటకు బాగుంటుంది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయము.”

    Thank you. When you are the lyricist, you can request your composer and singer, to sing it the way you like it to be sung. You can compel them, that they need you approval of the sheet music, and the recording, before it is released to the general public. I am sure it will be a smash hit in some circles.

    ‘ఛందస్సు సర్పపరిష్వంగము’ నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ ఎన్నో ఛందస్సు విధివిధానాలను పాటించాడు.
    “ఈ ఆనందార్ణవఛందస్సును ఎన్ని విధములుగ కల్పించ వీలగును అనే ప్రశ్నకు జవాబును పరిశీలిద్దాము […]అందులో 78 విధములను శ్రీశ్రీ పై ఐదు కవితలలో నుపయోగించాడు.”

    అంటే శ్రీశ్రీ – ఈ ఛందస్సు 325 విధాలుగా రాయవచ్చని తెలిసి, అన్నీ రాసుకుని, అందులో 78 ఎంచుకొని, ఎక్కడ ఏవి వాడాలో అన్న పరిజ్ఞానంతో, సరిగా అక్కడ అవి వాడినాడని అర్థం వస్తుంది. మీ ఉద్దేశం అదేనా? రకరకాల ఛందస్సులను, display చెయ్యటానికి, శ్రీశ్రీ తన కవిత్వం రాసాడా? ఛందస్సు వద్దు మొర్రో, నాకు నిబంధనలు వద్దంటున్న శ్రీశ్రీ అలాటి పని ఎందుకు చేస్తాడు? అది మీకు నచ్చిన ఊహ. ఆ ఊహను అతని ఛందోపరిజ్ఞానంగా గాని, అతని అభిలాషగా గాని రాయటం, అది true finding ఎలా అవుతుంది? అది మీరు ఎలా నిరూపిస్తారు? నేను ఈ విషయం నిరూపించి చూపాను, అని వ్యాసంలో మీరంటే, శ్రీశ్రీ పరంగా అది సరి ఎలా అవుతుంది? అతని గురించిన అతని మాటలనే ఖాతరు చేసుకోటం లేదే మీరు? ఎవరి మాటల ఆధారంగా ఏమి నిరూపిస్తారు?

    మీరు చేయగలిగిన పనులు, మీ రచనలలో మీరు చేసి చూపి మెప్పించవచ్చును. ఇతరులు సంకల్పించని, చేయని పనులను, వారు చేసారని చెప్పి, ప్రజలను ఒప్పించ లేరు. No one needs that kind of research.

    “ఒక విధంగా చూసినట్లయితే, గేయములు నిజముగా ఏకపాద వృత్తములు! ఈ విషయము ఆశ్చర్యకరముగా కనిపించవచ్చును కాని ఇది ముమ్మాటికి నిజము.”

    అంటే ఏమిటి? ఉదాహరణలు ఇచ్చి వివరించగలరా?

    లైలా

  504. స్నానాల గదిలో గురించి డా. చి. సు. గారి అభిప్రాయం:

    10/21/2015 8:10 am

    ఆవిరి నిండిన ఈ గదిలో
    నేనొక్కదానినే
    అందువల్లే అర్ధాంతరంగా ఆపివేసేరా? బాగున్న కవిత మధ్యలో ఆపివేస్తే, బాగు కంటే చికాకు ఎక్కువ అవుతుంది

    ధన్యవాదములు

    డా. చి. సు.

  505. గుప్పెట్లో తూనీగ గురించి మమత గారి అభిప్రాయం:

    10/16/2015 10:44 am

    చాలా బాగుందీ కవిత.
    ఆ తూనీగని చూడాలని అనిపిస్తోంది:-)

  506. సౌభాగ్య కుమార మిశ్ర: మూడు ఒరియా కవితలు గురించి Jayadev Mettupalli గారి అభిప్రాయం:

    10/15/2015 3:14 am

    గొప్ప కవిత్వం!
    “నా దిగంత దృష్టితో స్పృశిస్తాను
    ఆరిపోయిన అన్ని దీపాలూ
    వెతికి వెలిగించి కూచుంటాను.
    నిస్త్రాణుడనై”
    గొప్ప భావుకత

    సూటిగా గుచ్చుకొనె వాక్యాలు
    “ఆ పూలరేకుల తళతళలో
    తిరిగి చూస్తాను నీ పేరు
    నా మనః ప్రాంగణంలో
    మండిపోయే యాగాగ్ని!”

    అనువాదంలా అనిపించడం లేదు. గొప్పగా వుంది

    జయదేవ్, చికాగో

  507. ప్రార్ధన: నువ్వే నేనవ్వు – 1వ భాగం గురించి రవి గారి అభిప్రాయం:

    10/05/2015 1:10 am

    క్షమించండి. చాలాకాలం తర్వాత చూస్తున్నాను. ఏదో వ్యాఖ్య వ్రాసి ఊరుకోవడం తప్పేమో.

    మహా సముద్రానివి
    ఓడలను ఉయ్యాలూపే
    మహా అలవి
    సముద్రాన్ని వెలిగించే
    అగ్ని మండలానివి
    అగాధాల లోతుల్లో
    చిమ్మ చీకటివి
    నువ్వు
    వెలుగునివ్వు
    స్థిరత్వాన్నివ్వు.

    చక్కనైన ఈ కవిత చదవగానే ఛప్పున గుర్తుకు వచ్చిన సంస్కృతశ్లోకాన్ని ఉదహరించాను.

    వేదాల్లోని ఒక అపురూపమైన మంత్రం అది. సందర్భాన్ని బట్టి అర్థం. పెళ్ళిలో దంపతులను దీవించే సందర్భములో:

    దాంపత్యజీవితమును ఆరంభించబోతున్న మీకు రాజైన వరుణుడు, దేవుడైన బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చయముగా అనేకమైన సంపదలను అందించుగాక!

    దాంపత్యజీవితము – బదులు ఆధ్యాత్మిక/భక్తి ఇత్యాదులను కూడా ప్రతిక్షేపించుకోవచ్చును.

  508. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి చింతా రామ కృష్ణా రావు గారి అభిప్రాయం:

    09/25/2015 12:30 am

    మొరలాలింపుమ! శారదాంబ! సుగుణోత్పూజ్యాఢ్యు లేల్చూరి స
    న్మురళీధారుల సంస్తుతుల్, నతులు, నే మ్రోయంగఁ జాలన్. భవత్
    కరుణన్ నన్ గనఁ జేసి తీవె కొనుమా! కారుణ్య వారాశి! నీ
    సరియెవ్వారలు మమ్ము నిల్ప! కవితా సౌదామినీ! వాగ్ఘృణీ!

  509. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి గంటి లక్ష్మీనారాయణమూర్తి గారి అభిప్రాయం:

    09/18/2015 3:21 am

    మాన్యమిత్రులు శ్రీ ఏల్చూరి మురశీధరరావుగారు సమకాలీన సాహితీ సమాజంలో సమధిక పాండిత్య దీధితీ విరాజితులు. సాహిత్యశాస్త్రంలో కావ్యహేతువుగా నిరూపించబడిన ప్రతిభా,వ్యుత్పత్తి,అభ్యాసములను పుష్కలంగా గలిగిన మహా పండితుడు. సంస్కృత సాహిత్యంలో అలంకారశాస్త్రం మాహార్ణవము. దానిని అవుపాసన పట్టిన అగస్త్యుడాయన. “ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణం”లో కూడా సారాలంకారమును గూర్చి ఇంత చర్చజరగలేదు. ఇంత నిశితమైన పరిశోధనతో ఈ పద్యంలో అలంకారవిశేష చర్చ సారభూతమైనది. పోతన కూడా బహుగ్రంధ, శాస్త్రపరిజ్ఞానముతో వ్రాసిన భాగవతము కాబట్టి శ్రీ కృష్ణపరమాత్మ వలె తానొకడైనా తలకొక రూపై అన్నట్లుగా పద్యమొకటే అయినా తలకొక భావనయై పరిమళిస్తుంది. నాకైతే పోతన గారి ఉపనిషద్విద్యా వైభవం ప్రత్యక్షమోతోంది-అణోరణీయాన్ మహతో మహీయన్-అని. అణిమ్యాది అష్టసిద్దుల జ్ఞానము కూడా ద్యోతకమగుచుతన్నది. అబ్బయామాత్యుల వారన్నట్లుగా “చతుర కవిత్వతత్త్వ పటుసంపద యొక్కరిసొమ్ము గాదు భారతి దయ సౌధవార్ది కవిరాజులమానసముల్ ఘటంబులాయతముకొలంది లబ్దమగు నయ్యమృతంబు……”. శ్రీ మురళీధరరావుగారు ఆ అమృతాన్నిమనతో పంచుకోవడం ఎంతైనా ముదావహం. వారికి నా ధన్యవాదములు.

  510. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి రాఘవ గారి అభిప్రాయం:

    09/10/2015 8:13 am

    అసందర్భమో కాదో తెలియదు కానీనండీ, నాకీ వ్యాసం చదువుతున్నంతసేపూ ఒకటే తలఁపు. “అసలు తెలుఁగు నేర్చుకోవటమే దండుగ, వృథాకాలయాపన, పైసా కూడు పెట్టదు, ఫేఁషన్ కూడా కాదు” అనకునే ప్రజలు అధికులౌతున్న కాలం కదా, తెలుఁగులో కథలో కవిత్వమో మఱొకటో చదివేవారూ, అందులోనూ కాకితఁపు పుస్తకరూపంలో చదివేవారు ఎంతమంది ఉంటారు అని. ఈ చదివేవారి గుంపు జనాభా తగినంత లేకుండా నాణ్యమైన పుస్తకాల ప్రచురణ లాభసాటి బేరం కాఁబోదు కదా? ఈవేళా రేపూ కొందఱు చక్కటి ప్రమాణాలతో ప్రచురిస్తూన్నా అటువంటి తెలుఁగుప్రచురణలు ఎన్ని వెలుగు చూస్తున్నాయి? ఏమిటోనండీ, ఆలోచించటానికే అదోలా ఉంది.

  511. మాటల అక్షరాలు గురించి S A RAHMAN, CHITTOOR. గారి అభిప్రాయం:

    09/09/2015 6:05 am

    సింప్లి సూపర్బ్. చిన్ని కవిత చాలా బాగుంది.
    ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు.

  512. ఒక పద్ధతి ప్రకా…రం గురించి p. vasanta lakshmi గారి అభిప్రాయం:

    09/05/2015 12:13 am

    ఇదేటి కనక పెసాదు బాబూ !
    అచ్చం మా బాసలో ఇటేపా ? అటేపా ? అని అడిగేసినావు . అల్ల కృష్ణ నగర్ లేడీస్ హాస్టల్ అప్పు మీన ఆజానుబాహువుల శాస్త్రి గారిని సూసి , అబ్బ రచైత లింత అందంగా కూడా ఉంటారా ? అని మురిసి ముక్కలైపోయే మా ఇస్టూడెంట్ రోజుల్లోకి చేయట్టుకుని లాక్కుపోనావు ,పెసాద్ బాబూ .. విరసమా ? అరసమా ? నీరసమా ? అని మాకు మూడు చాయిస్లు ఇచ్చిన జ్ఞాపకం మా ఎంసెట్ పేపరులో ..అదే మా జీవితం క్వ్సెస్చన్‌ పేపరులో , మధ్యే మార్గం , అయినా ఏ చాయిస్సూ ,బీ చాయిస్సూ కూడా నే వదలను అంటూ జంట పడవల లో చెరో కాలు వేసి ,లాహిరి లాహిరి అంటూ విశాపట్నం సముద్రమ్లో ఈదినట్టూ కాసిన్ని జ్ఞాపకాలు రేపావు కదయ్యా పెసాదు ..కనక పెసాదూ ..విశాపట్నం డాల్ఫింస్ నోస్ కొండ మీద లైట్ హౌసూ , కనక మహాలచ్చి తల్లీ , రావి శాస్త్రీ , విరసం చలసానీ అలా ఎప్పటికీ ఉంటారు బయ్యా ..అని మనకి తెలియదా ? త్రిపుర ఇల్లు రచైతల ,కవులకి కాశీ బెనారసూ , అక్కడే మోక్షమూ తీర్ధమూ అని మనకి చెప్పాలా ఓకరు ..ఎవరో ఒకరు ,మనకి తెలీదా ఏంటి బయ్యా .. బుక్ సెంటెర్ వరహాలు చెట్టి గారూ , అచ్యుత రామరాజు గారూ రాయలు దర్బారు , సాహిత్యంని పోసించిన రాజులు కాదా ఏటి? మా కంతా తెల్సు బయ్యా .. మేమూ విశాపట్నం ఓసులమే , అల్లా రెల్లి వీధి దిబ్బ మీదే కదా కతలేన్నో రాసారు ..రచైతలు ..స్మైలూ .. వాళ్ళూ ..
    ఆదిభట్ల కైలాసం , సత్యం మాష్టార్లని సీ ఆర్ పి ఎఫ్ వోళ్ళూ సంపేసామని సెంకలు గుద్దుకోగానే రక్తపు బొట్లు కారినట్టు వేల మంది తుపాకీలు భుజాన వేసుకుని అడవుల్లోకి పారిపోయిన వైనాలు ,నక్సలబరీ కి శ్రీకాకుళంకి ఎక్కడబ్బా సుట్టరికం అని జుట్టు పీక్కున్న కథలు మనం వింటూ పె్రిగాం కదా ..
    ఆ రోజులు ,అదే ఏ రోజులు ..ఆ రోజులు ..వీధి వీధి కీ ఓ చైతన్యం , ఓ సూరీడు , ఓ వెచ్చదనం , ఓ రక్తపు బొట్టు దానికో సలమూ ,పతోడూ ఏదో ఓ జెండా మోయడం , రాజకీయ చైతన్యం క్లాసులు కి అటెండ్ అవడం ,నిజం సుమండీ ,అట్టాంటి క్లాసులు కూడా జరిగేవి , ఇలా బందల దొడ్డి కళాసు రూములు కాదు సుమండీ , పేజీలు పేజీలు కవిత్వాలు ఎక్కించడం , పుస్తకాలకీ ఓ గుడి ఉండేది అదే గ్రంధాలయం , అందులో కూకొని చేతిలో ఓ పుస్తకం పట్టుకుని పఠిమచడం అనే పూజ చేసేవాళ్ళం , ఆ పుస్తకం మీద చర్చించి ,వాదులాడీ స్నేహితులతో. మరో నాలుగు పేజీల వ్యాసాలు రాసుకునే వాళ్ళం భలే రోజులు బయ్యా , ఆ గ్రంధాలయం ని బుల్ డోజర్లు పెట్టి కొట్టించి అక్కడో నానా రకాల డబ్బాలు డోళ్ళూ అమ్మే కొట్లూ అవీ కట్టించి , మనకి మేలు సేస్తారుట ..బయ్యా ..అది మటుకు కళ్ళమ్మట నీళ్ళూ తెప్పించేస్తుంది ..వీధి వీధి కి ఆలయాలు కట్టించేస్తున్నారు ,మత్తు మందు బాగా దట్టించి వీభూతి పెడుతున్నారు , పుస్తకాలంటే ఎంసెట్ గైడ్లూ , ఎక్కాల పుస్తకాలే పెసాదు బాబూ ,మా రాజ్యెం లో .. అంతా షేమం అని తూలుతూ జనాలు ఓట్లు గుద్దుతున్నారు , అదీ బాబూ ఈ మాతృ భూమి దృశ్యం ..విరసం ఉండాది ,చలసాని ఉంటారు ..మనకేటీ ? అటో ఇటో , ఏటైనా దూకేయొచ్చు .గోడ కూడా ఉన్నాది …కనక పెసాదూ ..భలే బాగా రాసావయ్యా ..మా బాగా ..వసంత లక్ష్మి .

  513. దృశ్యం గురించి జ్యోతిర్మయి గారి అభిప్రాయం:

    09/04/2015 9:52 am

    అడవిలో కాసిన వెన్నెల
    అద్భుతంగా పండుతుంది.
    ఊరి మీద పడిన వెన్నెలే వృధా అయిపోతుంది.

    అద్భుతంగా ఉంది కవిత.

  514. ప్రార్ధన: నువ్వే నేనవ్వు – 1వ భాగం గురించి కటకటా గారి అభిప్రాయం:

    09/03/2015 4:01 pm

    రవిగారూ!

    అంటే ఏమిటి? సంస్కృతం రాని మాబోటి వాళ్ళకి కాస్తంత తెలుగు లోనో అంగ్రేజీ లోనో అర్థంచెప్పి,ఇంద్రాణిగారి కవితకి ఎలామప్పుతుందో చెప్పండి స్వామీ,మీకు పుట్టెడు పుణ్యం వుంటుంది.

    విధేయుడు,

    కటకటా

  515. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి kasturimuralikrishna గారి అభిప్రాయం:

    09/02/2015 11:14 pm

    వ్యాసంలో ఇచ్చిన సమాచారం బాగుంది. చివరలోని విశ్లేషణలు, కంక్లూషన్స్ అసమగ్రము, అసంపూర్ణమయిన అధ్యయనం ఆధారంగా చేసినట్టనిపిస్తుంది. ఆంగ్ల పుస్తక ప్రచురణకు, తెలుగు పుస్తక ప్రచురణకూ చాలా తేడావుంది. ఆ ప్రామాణికాలు,విలువలు మనకు సరిపోవు. అయితే, ప్రస్తుతం పుస్తక ప్రచురణ వ్యాసకర్తలు తీర్మానించినంత శోచనీయమయిన స్థితిలో లేదు.

    తెలుగులో ఎమెస్కో పుస్తక ప్రచురణ సంస్థ తనదంటూ ప్రత్యేక ప్రామాణికాలను ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రచురణ సంస్థకు సంపాదకుడుంటాడు. ప్రస్తుతం డీ చంద్రశేఖర రెడ్డి గారు ఆ ప్రచురణ సంస్థ సంపాదకుడు. ఆయన ప్రతి అక్షరాణ్ణీ ఎంతగా పట్టిచూస్తారో, ప్రతి వ్యాకరణ దోషాన్ని, వాక్య నిర్మాణ లోపాలను ఎలా ఏరి వేస్తారో ఆయనతో పరిచయమున్నవారందరికీ తెలుసు. అక్కడే తిరుమల రామచంద్రగారి కూతురు, డాక్టర్ నీరజ పనిచేస్తారు. ఆమెకూడా ఇలాంటి విషయాలను ఎంతో జాగ్రత్తగా చూస్తుంది. అలాంటి ప్రతిష్టమయిన వ్యవస్థ వుంది కాబట్టే ఎమెస్కో నేడు తెలుగు ప్రచురణ రంగంలో నంబర్వన్గా నిలిస్తోంది.

    విశాలాంధ్ర, ప్రజాశక్తి ప్రచురణ సంస్థలకూ కమిటీలున్నాయి. సంపాదకులూ వున్నారు. వాహిని ప్రచురణల గురించి, వాటి ప్రచురణలో వై వీ ఎస్సెస్సార్ శాయి తీసుకునే జాగ్రత్తలగురించి ఎన్నారై లకు ఎక్కువగా తెలుసు. హాసం ప్రచురణల విషయంలో ఎంబీయస్ ప్రసాద్ ఎంత పట్టుదలగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడో ఆ పుస్తకాలు చూస్తే అర్థమవుతాయి. అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యంగా పుస్తకాలు ముద్రించటం ఆయన ప్రత్యేకత. కోతి కొమ్మొచ్చి ఆ సంస్థ ప్రచురణే.

    ఇక, వాసిరెడ్డి వేణుగోపాల్ పుస్తకాల ముద్రణలోనేకాదు, పుస్తకాల రచయితలకు సరయిన ప్రచారం కల్పించి, పుస్తకమూ, రచయితా పాపులర్ అయ్యేట్తు చూడటంలో దిట్ట. మామూలు రచయితలు వారి పుస్తకాలుకూడా వాసిరెడ్డి పబ్లికేషన్స్ చేతిలో పడితే సూపర్ హిట్ అవటం తథ్యం. పుస్తకాల ప్రచురణలో ఆయన నిబద్ధత, పట్టుదల, నాణ్యమయిన రీతిలో పుస్తకాలను అందించటంలో ఆయన నైపుణ్యం ప్రస్తుతం తెలుగు ప్రచురణలో ఒక ఫినామినన్.

    వ్యక్తిగతంగా పుస్తకాలు ముద్రించేవారిలో ఖదీర్ బాబు పుస్తకాలు మిగతావారి పుస్తకాలకు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆయన పుస్తకాలను డిజైన్ చేసే తీరు, వాతిని ప్రెజెంట్ చేసే తీరే అతి గొప్పగా వుంటుంది. కోడి హళ్ళి మురళీ మోహన్ ముద్రించే పుస్తకాలు యే అకాడెమ్మీనో రేసెర్చ్ సంస్థనో ముద్రించాల్సిన పుస్తకాలు. వాటిని ఆయన ఎంత ఉన్నత ప్రామాణికాలతో ముద్రిస్తున్నాడో! జింకా నాగరాజు గారి పుస్తకాలపై ఖదీర్ ముద్ర కనిపిస్తుంది. నండూరి పార్థసారథి పుస్తక ముద్రణలో ఏ విషయంలోనూ రాజీ పడరు. సాహిత్య నికేతన్ వారికీ ఎడిటర్ వున్నాడు. కమిటీ వుంది. అలాగే, ఇప్పుడు ప్రతి రచయిత కూడా తన పుస్తకం ముద్రణ తన మనసుతోటి చేస్తున్నాడు తప్ప ఏదో ముద్రించి పారేద్దామన్నట్టు కాదు.జ్యోతి వలబోజు ముద్రిస్తున్న పుస్తకాలు ఉన్నత ప్రామాణికాలు పాటిస్తాయి. ఇప్పుడొస్తున్న ప్రతి పుస్తకం, కథ కానీ, కవిత కానీ, రచయిత హృదయపు తునక. ఈ వ్యాసం చదివితే ఒక్క వాసిరెడ్ది నవీన్, పాపినేని శివశంకర్ ప్రభృతులకు మాత్రమే ప్రచురణల గురించి అవగాహన, నిబద్ధత వున్నట్తు అనిపిస్తుంది. అందుకు భిన్నంగా ఈనాడు తెలుగులో అమ్మకాలతో సంబంధంలేకుండా అత్యద్భుతమయిన రీతిలో పుస్తకాలను ముద్రిస్తున్నారు. ఈ వ్యాఖ్య ఎవరినో దూషించటానికో, కించపరచటానికో కాదు. నిజాలను అందరి దృష్టికీ తెద్దామని. ఈ వ్యాసం తీర్మానాలు, తీర్పులు లేకుండా కేవలం సమాచారాన్ని ఇవ్వటానికి పరిమితమయితే బాగుండేది.

  516. జారిపోయిన కాలం గురించి S A RAHMAN, CHITTOOR. గారి అభిప్రాయం:

    08/16/2015 6:33 am

    జారి పోయిన కాలం చక్కటి కవిత అందించినందుకు రచయిత్రి గారికి సంపాదకులు గారికి ధన్యవాదములు.

  517. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    08/06/2015 3:25 pm

    మాన్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ కృష్ణదేశికాచార్యుల వారి సన్నిధికి

    సప్రశ్రయ నమస్కారములతో,

    సహృద్వాత్సల్యౌదార్యాలు ఉట్టిపడుతున్న మీ ఆశీర్మయవిలేఖితానికి ధన్యవాదాలను విన్నవించికొంటున్నాను. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని ఎంతో దీక్షతో అధ్యయనించిన మీరు అదొక కావ్యసామాన్యం కాదని, అపూర్వమైన వినూత్న లక్ష్యసాగరమని చేసిన ప్రతిపాదన మీ ఆమోదానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. గణపవరపు వేంకటకవి కృతులను పరిచయం చేసేటపుడు తత్తత్కాలాదికాన్ని విపులంగా సమీక్షింపవచ్చునని అనుకొన్నాను. అందువల్ల మీ ప్రశ్నకు సంక్షేపతః ఇక్కడ సమాధానిస్తున్నాను:

    ‘విద్యావతీ దండకం’ 1948లో Bulletin of Govt. Oriental MSS Library (సంపు – 1; సంచిక – 1) లో అచ్చయింది. అది ముద్దళగిరికి అంకితం. ప్రబంధరాజంలో కవి “చండ విద్యావతీ దండక”మని ప్రాసయతి నిమిత్తం అన్నాడే కాని, అది చండవృష్టి దండకం కాదు. నన్నయాదులు ప్రవేశపెట్టిన కామబాణ దండకమే. వీరేశలింగం గారు కవి 1750 నాటివాడనటం సరికాదని; ముద్దళగిరి 1674లో తంజావూరును పరిపాలించినందువల్ల కవి కాలం నిరూపింపబడుతున్నదని కె. వెంకటసుబ్బాశాస్త్రి గారు, నిడుదవోలు వేంకటరావు గారు విద్యావతీ దండకం పీఠికలో వ్రాశారు. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం కూడా తత్సమకాలికమని నిడుదవోలు వారి అభిప్రాయం. అప్పటినుంచి విమర్శకులు కవి కాలాన్ని ఆ విధంగా నిర్ధారించటం జరుగుతున్నది. అది సరికాదు.

    1674లో ముత్తులింగ నాయకుడు (ముద్దళగిరి) తన సవతి అన్న చొక్కనాథ నాయకుని ప్రాపకంతో తంజావూరుకు రాజైనాడు. అప్పటికి అతని వయోవస్థాకాలం పాతిక – ముప్ఫై యేళ్ళకు దరిదాపులలో ఉండి ఉంటుంది. యౌవనోద్రేకం వల్ల, అన్నగారన్న చనవు మూలాన చొక్కనాథ నాయకుని ఏలుబడిలో ఉంటూనే, సమానుడైన స్వతంత్రప్రభువు వలె ప్రవర్తించాడు. శివాజీ సవతి తమ్ముడు ఏకోజీ దండెత్తి, ఒకటి రెండు పర్యాయాల విఫలయత్నం తర్వాత 1676 జనవరి 16-వ తేదీని విష్ణుచక్రం కోటను వశపరచుకొన్నాడు. ఏకోజీ తొలిదండయాత్ర నాటి పరాజయగాథ ‘పెదళ్గిరి విజయము’ మాలికా కావ్యంలో సవిస్తరంగా వివరింపబడింది. (‘పెదళ్గిరి విజయము’ నిడుదవోలు వారన్నట్లు గణపవరపు వేంకటకవి రచన కాదని నేను ఇతరత్ర వేరొక వ్యాసంలో నిరూపించాను.) అప్పటికే అతని ప్రవర్తనతో విసిగి ఉన్న చొక్కనాథుడు అతనికి అండరాలేదు. రాజ్యభ్రష్టుడైన ముద్దళగిరి 1678లో మళ్ళీ అన్నగారి వద్దకు చేరుకొని, అపార్థాలకు క్షమాభిక్షను అర్థించి మధుర వద్ద రాజప్రతినిధిగా ఉన్నాడు. 1678 (కాళయుక్తి)లో మధురలోనూ, 1679 (సిద్ధార్థి)లో శ్రీరంగంలోనూ అతని దానశాసనాలున్నాయి. 1682లో చొక్కనాథ నాయకుడు మరణించిన తర్వాత చిన్నచిన్న అధికారపదవులను చేపట్టి, 1700-1705 (±) ప్రాంతాల కర్ణాటకానికి వెళ్ళి సుమారు యాభై – యాభైఅయిదేళ్ళప్పుడు కుంతూరు దుర్గానికి రాజయ్యాడు. ఎంతకాలం ఉన్నాడో స్పష్టంగా చెప్పలేము. ఆ కాలంలోనే లింగనమఖి శ్రీకామేశ్వరకవి ధేనుమాహాత్మ్య రచన జరిగింది. శ్రీకామేశ్వరకవి ‘సత్యభామా సాంత్వనము’ ముద్దళగిరికి అంకితమైంది. ఈ చారిత్రిక పరిణామాలను గుర్తింపక నిడుదవోలు వారు శ్రీకామేశ్వరకవిని కూడా 1674కు పరిమితం చేశారు. వారిని అనుసరించి తర్వాతివారందరూ వ్రాస్తున్నారు.

    అంతర్గతసాక్ష్యాల వల్ల గణపవరపు వేంకటకవి ‘సర్వలక్షణశిరోమణి’ క్రీస్తుశకం 1700కు పూర్వరచన కాదని నిశ్చయంగా చెప్పవచ్చును. తద్రచనాకాలం కొంచెం ఇంచుమించుగా 1705-1715 (±) కావచ్చును. అందులో ముద్దళగిరి ప్రస్తావన లేదు. అప్పటికి అతని ప్రాపకం లేదన్నమాట. ‘విద్యావతీ దండకం’ ముద్దళగిరికి అంకితం. దాని చివరను “మహాలక్షణగ్రంథ భాషాభిమానప్రథామాధురీసాధురీత్యర్థవ చ్ఛబ్దబంధానుబంధ ప్రబంధాధినాథాప్పయామాత్య రాడ్వేంకటార్య ప్రణీతంబైన” అని ఉన్నది. అంటే విద్యావతీ దండకం సర్వలక్షణశిరోమణికి అనంతరీయం అన్నమాట. ఆ తర్వాత ఒక దశాబ్ది కాలం కృషిచేసి, వందలాది గ్రంథాలనుంచి లక్షణలక్ష్యాలను సమీకరించుకొని ప్రబంధరాజ సంకలనాన్ని మొదలుపెట్టి ఉండాలి. తలకొక్కతీరుగా ఉన్న వ్రాతప్రతులలోని ప్రక్షిప్తాలను తొలగించి సుష్ఠుప్రతిని పరిష్కరింపగలిగితే ప్రబంధరాజ రచనాకాలం 1730 – 1755 (±) కావచ్చునని ఇప్పటి ఆలోచన. ప్రకృతవ్యాసంలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము యొక్క సర్వాంగీణవిమర్శ గాక, తెలుగు సాహిత్యచరిత్రకు అపరిచితమైన ఒక్క అపూర్వమైన విశేషం మాత్రమే అధికరింపబడుతున్నది. అందులో సంప్రయుక్తమైన లక్షణజాతాన్ని గురించి, చిత్రకవిత్వాన్ని గురించి ప్రత్యేకంగా పరిశీలింపవలసి ఉంటుంది.

    వేంకటకవి రచనలో తుల్యసంవాదం ఉంటే ఆ రచన ప్రబంధరాజానికి పౌర్వికమని, వేంకటకవి దానిని పరిశీలించి తన సంకలనంలో చేర్చుకొన్నాడని గ్రహించాలి. ఈ పూర్వాపరాల నిశ్చయం అంత సులభసాధ్యం కాదని వ్యాసంలో నేను మనవిచేశాను. గ్రంథస్థపద్యాల పట్టికను తన్మూలపద్యాల గుర్తింపుతో ప్రకటిస్తేనే కాని అది సాధ్యం కాదు. తెలుగు సాహిత్యచరిత్ర చాల వరకు ప్రామాణ్యభావం లేని ప్రాథమికోహలతో సాగినందువల్ల కావ్యపీఠికలలో నిర్ణయింపబడిన కాలాదికాన్ని ప్రమాణంగా స్వీకరింపక చరిత్రనికషపాషాణపట్టికపై స్వయంగా గీచిచూచి తథ్యమిథ్యావివేకంతో పునారచింపవలసిన అవసరం ఉన్నది.

    మీ ఆత్మీయతకు, ఆదృతికి నమస్సుమాంజలి.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

  518. తోపులో పిల్లలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    07/14/2015 8:56 am

    ఇంద్రాణి:

    నాకు కవితల గురించి ఎక్కువ తెలియదు. కానీ, “ఈమాట” లో మీ కవితలు చదువుతూ ఉంటాను. చదివినప్పుడల్లా ఏదో ఒక మంచి దృశ్యం కళ్ళకి కనపడినట్టు ఉంటాయి మీ కవితలు.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  519. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి గన్నవరపు నరసింహ ముర్తి గారి అభిప్రాయం:

    07/05/2015 4:20 pm

    అద్భుతమైన పరిశోధన సలిపి సోదాహరణముగా శ్రీ గణపవరపు వేంకట కవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో కవితా ప్రవృత్తులను తెలిపారు. చాలా ఆసక్తికరమైన వ్యాసము. వాఙ్మయాభ్యాసము క్లిష్టతరమైనదని అంగీకరించక తప్పదు.

  520. తోపులో పిల్లలు గురించి S A Rahman. గారి అభిప్రాయం:

    07/03/2015 2:01 am

    ఒక్క మాటలో చెప్పాలంటే కవిత ముచ్చటగా చాలా చాలా బాగుంది.

  521. రెక్కిటికీ గురించి అవినేని భాస్కర్ గారి అభిప్రాయం:

    07/01/2015 8:09 pm

    “కులుకులకు కుచ్చిళ్ళు సర్దుతూ
    గేట్ వైపు నడుస్తూ వెళ్ళిపోయింది పిల్ల.” — WoW WoW!

    హాస్యకవిత భలే ఉంది. కవికి నా అభినందనలు!!

  522. గుప్పెట్లో తూనీగ గురించి అవినేని భాస్కర్ గారి అభిప్రాయం:

    07/01/2015 12:54 pm

    తూనిగలా చక్కగా ఉంది కవిత!

  523. అదే నేను గురించి Damu ndm గారి అభిప్రాయం:

    05/22/2015 4:22 am

    రాధా మేడం గారు, నాకు కవితలు గురించి అంతగా తెలియదు, కాని ప్రతిఒక్కరి మనసులో దాగివున్న “నేను” అనే విషయాన్ని ఈ కవిత ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు.

    దాము
    కురబలకోట రైల్వే స్టేషన్

  524. జాషువా – పిరదౌసి గురించి syam గారి అభిప్రాయం:

    05/14/2015 7:56 am

    ఆధునిక కవులలొ సమాజ రుగ్మతలను వెలుగెత్తి చూపిన దీశాలి గుర్రం జాషువా.కరుడుగట్టిన సమాజంలో, సాంఘిక దురాచారాలపై తిరుగుబాటుచేసి, దారిద్య్రం, అస్పృశ్యతపై తన కలం ద్వారా పోరాటం సాగించిన మహాకవి శ్రీ గుర్రం జాషువా. కుల మతాల గీతలతో తలరాతలనే శాసించే కుళ్ళిన సమాజాన్ని దాటి విశాల కవితా సామాజిక జగత్తుకు ఎదిగిన మేటి కవితా ధీరుడు.అస్పృశ్యుడిగా అవమానాలకు గురైనా భూతకాలాన్ని జీర్ణించుకొని,వర్తమానం లోని సవాళ్లను పరిశీలించి, జీవించి, భవిష్యత్తును దర్శింప జెసిన విశ్వకవి.ఆటువంటి గొప్ప కవి రచించిన ‘పిరదౌసి గురించి మీరు రాసిన విశ్లేషణా వ్యాసానికి శిరస్సు వంచి పాదాభివందనం చెస్తున్నా.మీ రచనా శైలి అద్బుతం.

    ధన్యవాదాలు.
    SYAM PRASAD
    ADMIN MANAGER
    SECUNDERABAD

  525. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    05/07/2015 7:03 am

    సంపాదకీయం ఒక మంచి వ్యాసం అయి తీరాలి. ఒక క్రమం, నిర్మాణం అంటూ కనిపించాలి. అయోమయాన్ని ప్రోది చేస్తే అది వచన కవిత్వం అవుతుందే తప్ప చక్కని వ్యాసం కాదు. సాహిత్య సమావేశాల్లో తరచూ చూస్తుంటాము; అరగంట ఉపన్యాసానికి వక్త ఒక విషయాన్ని ఎంచుకొనడం ,ఐదు నిమిషాల్లో ఆ విషయం ముగిసి పోయాక ,తతిమ్మా పాతిక నిమిషాలు అక్కరకు రాని ఉడుకు సోదిలోకి దిగి అందరిని విసిగించడం, జనాలు మర్యాదకు కిమ్మనకుండా వింటూ ఉంటే , ఓహో అని గర్వపడి లోకాభిరామాయణం లోకి దిగి సభకు ఎందుకు వచ్చామురా భగవంతుడా అని అందరూ కునికిపాట్లు పడుతున్నప్పుడు ముగించడం.

    ఇందులో వ్యాస లక్షణాలు సకృతు వచన కవిత్వం/ఉపన్యాసం తాలూకు లక్షణాలు జాస్తి.విమానాశ్రయాలతో మొదలుకొని ఈ మధ్య ప్రతిదీ అంతర్జాతీయమే.

    అంతర్జాతీయ భాష అన్న బ్రహ్మపదార్థం అనగా ఏమిటి దానికి వీలయినంత సమగ్రంగా నిర్వచించే పనికి పూనుకోలేదు, అక్కడినుండి అన్నీ కప్పదాట్లే!

    “Why is English the main international language? Because of widespread ‘official’ and international use (not because of mother tongue use) – Intranationally as a lingua franca, and internationally – as the major language of business, media, technology, diplomacy, etc. etc. How did English become an international language? • Migration by English speakers • Colonialism by the British • The international role and influence of the USA • Commerce, international communications, media, films, etc.” (Critical Issues for 21st Century ELT: What English? Whose methods? Which culture? -Richard Smith University of Warwick, UK)

    తమ ఉపన్యాసాన్ని యూనివర్సిటి నాలుగు గోడల మధ్యకు పరిమితం చేశారు. పైన ఉటంకించిన విద్యావేత్తలా నిలబడి యోచన చేసే ఓపిక లేకపోయింది జంట కవులకు.

    ఈ రచన పీర్ల చావిడికి వెళ్లినట్టు లేదు. ఈ వాక్యాలను చదివి తరించవలెను:

    1. ఆ పుస్తకాలలో వున్న జ్ఞ్ఞానం ప్రపంచం గుర్తించదగినదైతే అది ఇప్పుడు ప్రపంచంలో ప్రచారంలో వున్న భాషల్లోకి అనువాదం కావాలి.
    జ్ఞానం మీద భారం మోపుతున్నారు గనుక పుల్లెలను మెచ్చుకొని పుల్లను విరిచేద్దాం!

    2. చాలామంది తెలుగుకి దూరమై, ఇంగ్లీషు వదువులకి ఎగబాకడం.

    పై వాక్యం నా బోంట్లకు మింగుడు పడలేదు, ఇది అంతర్జాతీయ శృంగారానికి సంబంధించినది కాకూడదని ఆశిస్తాను.

    యునివర్సిటి పండితులకి ,వచన కవులకు గణితంలో శిక్షణ ఇప్పిస్తే తప్ప లాభం లేదు అన్న నా అంతర్జాతీయ అభిప్రాయానికి నా అభిమాన వ్యాసరచయిత వాక్యాన్ని వత్తాసుకు తెచ్చుకొని ఇక జాలింతును (తఃతః గారికి తప్పక తెలిసే ఉంటుంది ఈ సూక్తి)
    .
    If a man’s wit be wandering, let him study the mathematics.(Francis Bacon)

    -తమ్మినేని యదుకుల భూషణ్

    [ఎంత ప్రయత్నించినా కొన్ని అచ్చుతప్పులు దొర్లుతూనే ఉన్నాయి, ఉంటాయి. వాటికి మేము క్షంతవ్యులం. తప్పు చెప్పినప్పుడల్లా సరిదిద్దుకుంటున్నాం కూడా. కాకపోతే అదేదో మహాపరాధం అన్నట్టు ఇంత అసభ్యంగా ఎత్తిచూపడం ఏ రకం సంస్కారమో అర్థం చేసుకోలేకుండా ఉన్నాం, భూషణ్ గారి భాషాలక్షణాలు చిరపరిచితం అయివుండి కూడా. – సం.]

  526. రీ యూనియన్ గురించి Nandamudi venkata subbaeao గారి అభిప్రాయం:

    05/06/2015 11:12 pm

    మేడం…కవిత వాస్థవికతకు దగ్గరె….కాని మా గుంటూర్ మెడికల్ కాలెజీ 40 సంవత్సరాల రి యూనియన్….నమ్మలెంత భిన్నం గా జరిగింది…అది అత్యంత అనందపు పండగ…..

    అభినందనలతొ. ఏన్ వి యెస్.

  527. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Gannavarapu Narasimha Murty గారి అభిప్రాయం:

    05/03/2015 1:43 pm

    శ్రీ వెల్చేరు నారాయణరావు గారు కొన్ని మాసములు నాకు ఏలురులో కట్టమంచి రామలింగారెడ్డి కళాశాలలో తెలుగు ఉపాన్యాసకులు.తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తెలుగుభాషా పరిశోధకులుగా తరలారు .అందుచే వారు నాకు గురువులు. వారికి నా నమస్సులు. వారికి , శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి అభినందనలు. నేను తెలుగు భాషాభిమానిని. తెలుగు ప్రజలు వివిధ దేశాలేగి తెలుగు మాట్లాడుటచే తెలుగు అంతర్జాతీయ భాష అవునో కాదో అనే చర్చ నాకు అనవసరము . తెలుగు ప్రపంచ భాష అవాలనే ఆశ కూడా నాకు లేదు . విద్యార్థి దశలో ఉన్నత పాఠశాల వఱకు ఆంగ్లము ,హిందీ తప్ప మిగిలిన విద్య అంతా తెలుగు మాధ్యమములో చదువుకున్నాను . గణితశాస్త్రము , భౌతికశాస్త్రము , రసాయనశాస్త్రము ,జీవశాస్త్రము తెలుగులో సునాయాసముగా నేర్చుకొన్నాను . కళాశాలలో ఆంగ్లమాధ్యమమవడముచే క్రొత్తలో కొంచెము యిబ్బంది అయినా త్వరలోనే సర్దుకుపోయాము . వైద్యకళాశాలలో విద్యంతా ఆంగ్లములో జరిగినా రోగులతో సంభాషణలు తెలుగులో జరిగేవి. వారి రోగ చరిత్రను ఆంగ్లములో అనువదించి వ్రాసుకొని , వారి రోగము గురించి ,అవసరమయ్యే పరిశోధనల గురించి , చికిత్స గురించి ఆంగ్లములో వ్రాసుకొన్నా వారికి తిరిగి తెలుగులో వివరించి బోధ చేసేవారము .ఆంగ్లభాష పై వ్యతిరేక భావము లేకపోయినా వైద్యశాస్త్ర గ్రంధాలన్నీ తెలుగు భాషలో మనము అనువదించుకుంటే బాగుంటుందనే ఆశ ఎప్పుడూ ఉండేది . ఇప్పుడు వైజ్ఞానిక గ్రంధాలు , న్యాయశాస్త్ర గ్రంధాలు సకలము తెలుగులో అందుబాటులో ఉండాలనే ఆశ ఉంది .
    తెలుగు ఎనిమిది కోట్ల ప్రజానీకానికి మాతృభాష . సంఖ్యాపరముగా ఇటాలియన్ , ఫెంచ్ , జపనీస్, గ్రీక్ , జర్మను ,పోర్చుగీస్ , భాషలకు తీసిపోదు. సంస్కృత భాషా పదజాలము కూడా మిళితమగుటచే విశేషపదజాలము గల భాష .మరి పై భాషలతో సమానముగా తెలుగు ఆధునిక పరిజ్ఞానముతో ఎదగ పోవడానికి అనేక కారణాలున్నాయి. ఫ్రాన్సు ,ఇటలీ , జర్మను ,జపాన్ ల వలె తెలుగు దేశము ( అలాగే వంగదేశము , కర్ణాటక ,తమిళనాడు ) ప్రత్యేక దేశమయితే తెలుగులోనే పరిపాలన పూర్తిగా సాగడమే కాక తెలుగు భాష వికాసము చెంది తెలుగులో వైజ్ఞానిక గ్రంధాలు అనువదించబడి ఉండేవేమో !భారతదేశము విఛ్ఛిన్న మవడము నా ఉద్దేశ్యము కాదు, గాని హిందీతో సమానముగా భారతీయ భాష లన్నిటికీ సమాన ప్రతిపత్తి కలిపించి మాతృభాష లన్నిటినీ అభివృధ్ధి చేసుకో వాలని నా అభిలాష .
    తెలివితేటలు నైపుణ్యములు వ్యక్తులలో విభిన్నముగా గోచరిస్తాయి . కొందఱికి గణిత మలవడుతే కొందఱికి భౌతిక శాస్త్రము, కొందఱికి తెలుగు , కొందఱికి సంగీతము , కొందఱికి నటన సులభముగా అలవడుతాయి . అష్టావధానము చేసే కవులకు గణితశాస్త్రము కొఱకరాని కొయ్య అవవచ్చు. పాండిత్యమున్నా కవిత్వము రాకపోవచ్చును . అందుచే తెలుగు నభ్యసించే వారికి తెలివి లేదని చెప్ప రాదు. తెలుగులో వివిధ గ్రంధాలు ప్రచురించుకోవాలనుకుంటే ప్రభుత్వ పరముగాను , స్వఛ్ఛంద సంస్థల పరముగాను , తెలుగు సంస్కృత పండితులు , తెలుగుపై అభిమానము గల శాస్రజ్ఞులు, వైద్యులు ,న్యాయశాస్త్రా కోవిదులు ,అందఱూ సమిష్టిగా కృషి చెయ్యాలి. దానికి తగిన ప్రణాళిక, నాయకత్వము కూడా అవసరము. ఉగ్గుపాలతో ఆంగ్లమును పోసి ,పాఠశాలలలో తెలుగు బోధనను కుంటుపరుస్తే మనము ఉట్టికెగురలేని అమ్మలమే అవుతాము. పోషణ అన్నిటి కంటే ముఖ్యము. ఒకప్పుడు మనదేశము పేదదేశమే గాని యిప్పుడు మనకు తగిన వనరు లుండడమే గాక సాంకేతికాభివృధ్ధి మాతృభాషల నభివృధ్ధి చేసుకొనుటకు సహకరిస్తుంది.తెలుగు నిఘంటువులు అంతర్జాలములో అందుబాటులో ఉన్నాయి. విశ్వనాథ వారు గొప్పా , శ్రీశ్రీ గొప్పా వంటి చర్చల వలన ప్రయోజనము శూన్యము. సకల సాహిత్య ప్రక్రియలు తెలుగు భాష విస్తృతికి ప్రమాణములు. శ్రీ యెల్లాప్రెగడ సుబ్బారావు గారు తమ ఫోలికామ్లపు పరిశోధనలు తెలుగులో ప్రచురించ లేదు. రవీంద్రనాథ టాగూరు గీతాంజలిని ఆంగ్లములో అనువదించక పోతే ఆయనకు నోబెల్ బహుమానము దక్కేది కాదు. నాకే అధికారముంటే రాచకొండ విశ్వనాథశాస్త్రికి , విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆ బహుమానాలు ప్రదానము చేసే వాడిని. తెలుగు ప్రపంచభాష కానవసరము లేదు గాని స్వంత గడ్డలలో వికాసము చెందవలసిన అవసరావకాశము లున్నాయి. అందఱికీ వందనములు.

  528. సంభాషణ గురించి విన్నకోట నరసింహారావు గారి అభిప్రాయం:

    05/02/2015 4:13 am

    హ హ హ, ఈనాడు చాలా మందికి కలిగే తికమకే ఇది. టెక్నాలజీకి బలయిపోయిన వాటిల్లో మొదటివి సంభాషణాసక్తి (ముఖాముఖీ), సంభాషణా కౌశలం. ఈ దుస్ధితిని నాలుగు ముక్కల్లో చక్కగా చెప్తోందీ కవిత.

  529. మహాలయం గురించి చక్రధర్ గారి అభిప్రాయం:

    04/29/2015 10:05 am

    ఖచ్చితంగా ఆ డం డం లని ఎవరూ సాంతం చదవరు. అలా చూసి వదిలేస్తూ కింద కవితని చదువుతారు. 🙂

  530. వచనానికి ఒక జాబు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    04/22/2015 7:33 pm

    “వయసులో పెద్దవారు, గంగా భాగీరథి సమానులు లైలా”

    So are you, so are you Vamsi.
    ‘ओ गंगा तुम बहती हो क्यौ?’ By Bhupen Hazarika is so gorgeous. So is its predecessor song ‘The Old Man River’ by Paul Robenson in Show boat 1936. Two baritones, singing about humans. One uses the back drop of river Mississippi and the other of river Ganga. Yet, we hear the mighty rivers rolling.

    గంగ వర్ణ చిత్రం మీరు ఇంకా వేసినట్టు లేరు. శివుడిని ‘వర్ణించి’ నంత తేలిగ్గా గంగ బొమ్మ వెయ్యలేరు. రవివర్మ వెయ్యలేకపోయాడు.
    చేతిలో శూలం, మెడలో పాము, నెత్తి మీద గంగ వేసి చూపిస్తే – నర్సరీ పిల్లలు శివుడు, శివుడు అంటారు. ఆర్ట్ లో, ఆభరణాలు అలంకారాలుగా మొదలైనవి, కాలక్రమేణా అవే ప్రతీకలై, ప్రతీకల సహాయంతో మాత్రమే గుర్తించటం అలవాటై, మెల్లిగా అంతర్భావం నశించి, ప్రతీకలే మిగులుతాయి కొందరికి, కొంతకాలంపాటు.
    “నమ్మితి నా మనంబున మిమ్ము సనాతనులైన ఉమా మహేశులన్” – అని పాడుకుంటున్నప్పుడు, అప్పుడు తెలుగు భాష ఎంత expressive అనిపిస్తుంది. అంతకన్నా గొప్ప బొమ్మ ఏ ఆర్ట్ మ్యూజియం లో ఎంత వెదికినా కనపడదు. మీరు చదివిన ఎన్నో మంచి పాత తెలుగు రచనలు నేనింకా చదవనే లేదు. చదవాలని కోరిక. మెల్లిగా చదువుతాను.
    (విచిత్రం!) రాయప్రోలు ‘‘స్నేహలతా దేవి” లో “గంగ” ను గురించి 33, 34 పద్యాలు ఉన్నవి. కావ్యమంతా చదివాను.

    శాయి గారు!
    కొన్నేళ్లుగా, ఎంతో సాహిత్యాన్ని చదివింప చేసారు.
    ‘‘స్నేహలతా దేవి” కావ్యం, కావ్య పద్ధతి ప్రకారం, అన్ని మొక్కుబడులనూ చెల్లించింది. కధ ప్రారంభించక ముందే, కావ్య నాయిక మంటలకు ఆహుతి అవుతుందని, ఒక పద్యం ద్వారా కవి తెలిపినారు. నాకు అర్థమయ్యింది.
    బంగారం లాంటి పిల్ల ఎందుకో స్నేహితురాలితో కలిసి, గంగా స్నానానికి వెళ్లింది. అయ్యో! అప్పుడు ఆ స్నేహితురాలు గంగ లో పడి చనిపోయిన అనేకుల విషాద మరణకథలు వినిపించి ఉండక పోతే, కావ్యంలో ఆ పిల్ల బ్రతికి ఉండేదేమో అనిపించింది.
    ఏమి కావ్యం! ఏమి రచయితలు! దేవతలను, మానవులను కలగాపులగం చేసి, మనిషి చావును రొమాంటిసైజ్ చేసి, వాళ్లు కన్ఫ్యూజ్ ఐ, పాఠకులను కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తారు.
    (ఇంతా చేసి, నేను గ్రహించుకున్న నీతి ఏంటంటే, నేను పరీక్షల్లో ప్రతి answer paper లోనూ ఎక్కడో ఒక చోట “నాకు జ్వరంగా ఉన్నది.” అని పేపర్ దిద్దే వానికి కనిపించే లాగా రాసి ఉండాల్సింది. నాకు ఎక్కువ మార్కులు ఇచ్చి ఉండేవారు. Many Telugu writers come across as sympathy mongers.)

    “మరిక ఆయన యెంచుకొన్న అభినవ కవితామార్గం:” -కొడవళ్ళ హనుమంతరావు

    H! అక్కడ మీరిచ్చిన ఉదాహరణ చూసి చాలా నవ్వాను. ఏం మార్పు. నా బొంద మార్పు. కాని అంత మాత్రం మారటానికి రాయప్రోలు ఎంత గజగజలాడి పోయుంటాడో, ఎన్నేళ్లు పట్టిందో.
    నాకు, ‘పూర్ణమ్మ’, ‘స్నేహలతా దేవి’ ‘The Sorrows of Young Werther’ రాసిన కవులు, నమూనా లో ఒకేలాగా అనిపిస్తారు. వైతాళికులుగా కనిపించరు. I have a problem there.
    Recipe చందమామ కధల్ని రాసిన కొ. కు. ను మీరు సైంటిఫిక్ ఆలోచనలకు ఉదాహరణ గానూ, (He is not a scientist.) “ఎన్ని మెట్లెక్కినా” అను చక్కని నవలనూ, చక్కని కథలు రాసిన రచయిత్రి మాలతీ చందూర్ ని, వంటలక్క గానూ, Alan Turing గురించిన మీరు, మీ వ్యాసం లో చూపినప్పుడు – “నర జాతికి నీతి యున్నదా?” అని తర్వాత అనుకున్నా గాని, ముందు బాగా నవ్వొచ్చింది. నచ్చింది. Couldn’t help it. It was very good.

    లైలా
    Ps: నేను ‘Werther’ అని రాస్తే – Microsoft Word, ‘Weather’ అని మార్చేసింది. నేను స్త్రీ నని నాకు చదువు రాదని పాతకాలం రచయితల రచనలు బాగా ఎక్కి పోయినట్టుంది.

  531. ఉడుత గురించి indrani గారి అభిప్రాయం:

    04/22/2015 12:34 pm

    తః తః గారు :

    ధన్యవాదాలు.

    మీకు గుర్తుకు వచ్చిన పద్యం చాలా బాగుందండి.

    హాయి పద్యం.

    D.వెంకటేశ్వర రావు గారు:

    అది వ్యాసం (పేరా కూడా కాదు) అయితే ఇది కవిత అవుతుందండి.

    మీ
    బుల్లి
    ఉడుత
    కవితను

    కింది
    విదంగా
    రాస్తే
    వ్యాసం
    అవుతుందేమో!

    ఇంద్రాణి.

  532. ఉడుత గురించి తః తః గారి అభిప్రాయం:

    04/20/2015 2:59 am

    ఇంద్రాణి: మీ ‘ రికామి గాలి ‘ ఎప్పుడో రాసిన ,
    ” పువ్వులకున్, కుహూకుహుల పుల్గులకున్ , నడిమింట రేల నేసవ్వడి లేక జిల్గులను జల్లెడబట్టెడి రిక్క చానకున్, దవ్వుల కొండకోసులనుతాకికిలించు రికామి గాలికిన్, నవ్వుమొగాలపిల్లలకు నాకవితల్ వినిపించనెంచెదన్! ” ను గుర్తుకుతెచ్చింది.
    తః తః

  533. ఉడుత గురించి D.Venkateswara Rao గారి అభిప్రాయం:

    04/19/2015 7:31 am

    మీ బుల్లి ఉడుత కవితను ఈ క్రిందివిదంగా వ్రాస్తే వ్యాసం అవుతుందేమో

    క్రీక్ క్రీక్ శబ్దం ఒకటే అక్కడ ఆ శబ్దాన్నిమోస్తూ ఊరికే తిరుగుతో వేడి గాలి
    కళ్ళు విప్పార్చుకుని బరువుగా తూగే సీతాఫలాలతో కులాసాగా ఊసులాడుతో ​చెట్ల నీడలు
    గడ్డిపూల నదిలో చిత్తరువులా నిలబడి కుంచె తోక ఉడుత
    అంతలోనే కంగారు పండొకటి ఎండ మీదకు విసిరి గుబురు కొమ్మల్లోకి గెంతి పోతోంటే దాని నిడుపు చా​ఱ​ల వీపుని రాసుకుంటూ వెనకాలే వెర్రి పరుగుల ​రికామీ గాలి.

  534. వచనానికి ఒక జాబు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    04/12/2015 7:28 pm

    శాయి గారు ఇంకా జవాబివ్వనందున 🙂 1914 ప్రాంతంలో వంగ దేశాన వరకట్న దురాచారానికి నిరసనగా ఆత్మార్పణం చేసుకున్న ఓ యువతి వృత్తాంతం పత్రికలో చదివి, రాసిన విషాద కావ్యం, “స్నేహలత”:

    “ఇల్లు సొచ్చి, ద్వారము మెల మెల్ల మూసి,
    వ్రాసి దాచిన యొక యుత్తరమును తీసి
    వేదికోపరితలమున బెట్టె కన్నె;
    సంతరించె కాబోలు నాసరికె యదియు.

    తాను ధరియించియున్న ఉత్తమ దుకూల
    మవల బడవైచి పూనె కన్యామతల్లి
    స్నేహ కౌశేయ మొకటి కచ్చెలు విదిల్చి
    నారచీర తాలిచిన జానకి విధాన.

    అకట! యేమని పలుక నోరాడు నింక!
    భగవతీ ధ్యానరతి భగ భగ వెలుంగు
    అగ్నిలోన పూర్ణాహుతి యయ్యె నయ్యొ!
    ధన్యగుణవల్లి స్నేహలతామతల్లి.”

    పద్యం గురించిన ప్రస్తావన కావున రాయప్రోలు గురించి కొన్ని వివరాలు. మొదట్లో తను కూడా అష్టావధాన, సతావధానాల మోజులో పడ్డా, 1911 నాటికి ఆశుకవిత్వం పట్ల విముఖత ప్రకటించాడు:

    “తెనుగే తీయని, దందు పద్యపద రీతి క్రీడ లత్యంతమో
    హనముల్ శోభనముల్ తదీయ రసరక్తాలా పనంబుల్ లభిం
    చిన వాగర్థ కళాకలాప జయలక్ష్మిన్ గాలికింబుత్తునే
    జననీ! యేమిటి కింక ఆశుకవితా సన్యాస మిప్పించవే.”

    “రసమో, భావమొ, జీవదర్థ సుకుమార వ్యంజనా మంజుశ
    బ్ద సమాసా రచనంబొ, సాధు హృదయం స్పంద పతిష్ఠా కథా
    వివరంబో! సకలార్థ శూన్యమగు నీ వేగాతి వేగోక్తి దు
    ర్వ్యసనం బేటికి? త్రిప్పు మింక జననీ! రమ్యాక్షర క్షోణికిన్.”

    మరిక ఆయన యెంచుకొన్న అభినవ కవితామార్గం:

    “వంశిన్ వంచి, మృణాళమున్ మెలిచి, పక్వ ద్రాక్ష నెండించి వా
    గంశల్ మార్దవ మాథురీ సుభగ విన్యాసంబు జిల్కన్, దశ
    త్రింశల్లక్ష జనప్రసన్న రసనా దేవాలయాభ్యంతర
    ప్రాంశు ప్రార్థన గీత మైన తెనుగుం బల్కున్ ప్రశంసించెదన్.”

    ఈ ఆదివారం మధ్యాహ్నం పన్నులు కట్టే పనికి బదులు ఓ పుస్తకం [1] చదివించినందుకు లైలా గారికి కృతజ్ఞతలతో,

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “రాయప్రోలు సుబ్బారావు,” యు. ఎ. నరసింహమూర్తి. ద్రావిడ విశ్వవిద్యాలయం, 2008.

  535. మరి నువ్వేమో… గురించి తఃతః గారి అభిప్రాయం:

    04/02/2015 8:40 am

    నిషిగంధ:

    చాలా చాలా సంవత్సరాల క్రితం ‘ద లండన్ మాగజీన్’లొ చదివిన ఒక పద్యంలొ మరచిపోని ఒక చరణం: “…టు మాల(ర్)మె హు హాడ్ ఇన్వెంటెడ్ ఎ స్టైల్ దట్ మేడ్ రైటింగ్ ఇంపాసిబల్.” బాలమురళి పాట విన్నప్పుడొక సారి హఠాత్తుగా ఈ చరణానికి అర్థం స్ఫురించింది. (బాలమురళి హాడ్ ఇన్వెంటెడ్ అ స్టైల్ దట్ మేడ్ సింగింగ్ ఇంపాసిబల్ ఫర్ అదర్స్).

    మీ శైలి సరిగ్గా అటువంటిది. …దట్ మేడ్ రైటింగ్ ‘ఇంపాసిబల్ ఫర్ అదర్స్’. ఇతరులందుకోలేనిది. ఎప్పుడైనా ఎన్ని సారులైనా చదువుకోవచ్చు. చదివిన కొద్దీ అందం ఇనుమడించే కవిత.

    తఃతః

  536. వచనానికి ఒక జాబు గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    03/26/2015 6:05 pm

    వచనమైనా, పద్యమైనా ఎంత క్లుప్తంగా ఉంటే అంత అందం; పద్యంలోనైనా క్లుప్తతను సాధించడం కోసం కవి భావానుగుణంగా తన అవగాహన కొద్దీ, ప్రయోగ సామర్థ్యం కొద్దీ నానా వృత్తాలను వాడతాడు. తరళంలో చెప్పేభావాన్ని మత్తేభంలో లో చెప్పడు.

    అంతేకాదు, మరీ ముఖ్యంగా “వచనం” కూడా వాడతాడు. మోహన గారు తమ ఛందో వ్యాసాల్లో చక్కగా పేర్కొన్నట్టు పద్యం కూడా ఒక పద్ధతికి లోబడి రాసిన వచనమే. పాత కాలంలో వెగటు పుట్టించే పద్యాలు రాసిన వారు ఎంతో మంది ఉన్నారు, లేదంటే ప్రాచీన కావ్యాల్లో కుకవి నింద ఎందుకు ఉంటుంది?? నాకు చూడగా, ఏ కాలంలోనైనా భావానుగుణంగా రాయలేక పోవడం పెద్ద లోపం. భావాంతం, పదాంతం ఒకే సారి జరిగితే కవికి /పఠితకు లాభం. అది లేకపోతే ఉభయ భ్రష్టత్వం సిద్ధిస్తోంది. పుట్టపర్తి, విశ్వనాథ మరి కొద్దిమందిని మినహాయిస్తే గత శతాబ్దంలో చక్కని పద్యాలు రాసినవారు లేరు.రాయప్రోలు లాంటి వారి వృత్తాలు కూడా (గేయాలు కాదు )అతి పేలవంగా కుంటుతూ నడుస్తాయి, ఇక ఇతరుల పద్యాల గూర్చి చర్చించి లాభం లేదు. ప్రాచీనుల పద్యాలు దేవాలయాల్లో శిల్పకళలా స్పుటంగా, మూర్తిమంతంగా ఉంటాయి. ఆ తరహా పద్యకళ విశ్వనాథాదుల దాకా వచ్చి ఆగి పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, భావానుగుణంగా రాయలేనప్పుడు పద్యమైనా, వచనమైనా ఆఖరికి ఏ రచనైనా అందగించదు.

    పునరుక్తి పెద్ద దోషం, మీ వ్యాసం ఉద్దేశం బావుంది, చెప్పిన విషయాలు కొన్ని వ్యంగ్య స్ఫోరకంగా బావున్నాయి, కానీ ఈశ్వర ప్రయోగం ఎన్నిసార్లు జరిగిందో గమనించండి (పాతిక సార్లు), అన్నిసార్లు అవసరమా?? మీకు నచ్చిన కావ్యానికి విశ్వనాథ పీఠిక ఒక్కసారి చదివి చూడండి, పునరుక్తి దోషమున్నదా పరిశీలించండి. వచనమైనా, పద్యమైనా స్ఫుటంగా, బలంగా కరవాలం దూసినట్టు ఉండాలి, దర్భపోచ ఊగినట్టు కాదు. మంచి రచనలో బలహీనతకు తావు లేదు.

    ఇక చవట శబ్ద విచారణ: మీ హృదయోల్లాస వ్యాఖ్య చదివిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు: “చవటకు జారిన కుంకుమ ఈ రోజు కనిపించదు” అన్న వాక్యం, తర్వాతి వాక్యం కూడా చదివాను ఇక్కడ అనుకోకుండా ఊడి పడిన చవట ఎవడు?? కొంపదీసి ఇక్కడ ఏమైనా విపరీతార్థము గలదా ?? నిఘంటువు తెరిస్తే:
    చవట : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
    వి. పనికి రానివాఁడు, శక్తిహీనుఁడు, ఎంబెన్న.
    చవట : మాండలిక పదకోశం (తె.అ.) 1985
    అసమర్థుడు, వ్యర్థుడు, వాజ, వాజమ్మ, అప్రయోజకుడు

    మీ తాజా కలం అనుసరించి రెండో వాక్యం జాగ్రత్తగా చదివాను: “కానీ నుడిటిమీద ఆ పొడువాటి స్టిక్కర్ కూడా” కుంకుమ, స్టిక్కర్ రెండూ కనిపించక పోతే వాడు చవట, ఎంబెన్న క్రింద లెక్క వేయవలెనని భావమా?? ఇదేదో వచన కవిత్వంలోకి దిగబడి మీ వ్యాసం చెప్పని ఫలశ్రుతిని ప్రసాదిస్తున్నదా?? అన్న అనుమానం పొడసూపి, ఆ తర్వాతి వాక్యాన్ని (“ఒక భావాన్ని ప్రతిఫలిస్తుంది, కాదా?”) చదివినా నాకేమి బోధ పడలేదు. మళ్ళీ సదరు రచయిత అభిప్రాయాల్లో ఒక వాక్యం చూసి నాకు ఎటూ పాలు పోలేదు!!

    “నాకు తెలుగు తెలుసు, మామూలు తెలుగు, అందరికి అర్థవయ్యే తెలుగు, మంది మాట్లాడే తెలుగు”. మరి నాకెందుకు అర్థం కావడం లేదు “మావూలు” తెలుగు??
    పద్యాలను దొంగలను తోలిరి, వచనంతో ఇన్ని తంటాలా??

    శ్రీలంకలో సంచార జాతులు మాట్లాడే తెలుగు, తమిళ నాడు నానా తెలుగు పల్లెల్లో మాట్లాడే తెలుగు అర్థం అవుతున్నదే, మరి ఇతగాడి తెలుగుతో వచ్చిన చిక్కు ఏమిటి??

    “మాకు మీ కష్టతరవైన పద్యాలతో పనేవుంది చెప్పండి. కాదనటం లేదు మీకవి నచ్చుతాయి, మిమ్మలని అవి కదిలిస్తాయి, మీకా పద్యం చదివినప్పుడో, విన్నప్పుడో మీరు ఒక నిర్వాణ అవస్తలోకి పోతారు. అది మీకు తెలుసు, మీరు ఆ వ్యవస్తలో సబ్యులు, కానీ దురదృష్టం కొద్ది నూటికి తొంభై తొమ్మిది తెలుగు వాళ్ళవి మేవా బావిలో లో భాగం కాదు”

    ఇక్కడ “మేవా బావి” అన్న పదబంధం చిక్కు ముడిని విప్పింది:

    ఉర్దూ – తెలుగు నిఘంటువు (బి.రామరాజు) 1962
    మేవా : పండు, ఫలము
    మేవా ఫరోష్ : పండ్లమ్మువాడు
    మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970 R
    మేవా :ఎండబెట్టిన పండ్లు. [కరీంనగర్]

    మేవా అన్న ఉర్దూ పదం రచయితకు తెలిసే అవకాశం లేదు, మరీ పాత తరం తెలంగాణా వాసి అయితే తప్ప, మరి మేవా బావి ఎక్కడ గలదు?? “మేమా” అన్న అచ్చతెలుగును ఒక పధ్ధతి ప్రకారం ఖూనీ చేస్తే సిద్ధించే అర్థబోధకు ఏ మాత్రం ఉపకరించని వికృత రూపం అది. అది ఎట్లన్నన్ —
    ఈయన తెలుగు సినిమాల్లో ఇతర మాండలికం మాట్లాడాలని ప్రయత్నించి విఫలమయ్యే పాత్రల్లా, మకారాన్ని వకారం చేసి, రెక్కాడితే డొక్కాడని సగటు జీవిలా చలామణీ అయ్యే ప్రయత్నం చేసి మన కళ్ళల్లో మన్ను కొట్టి పోతున్నారు.అంతే కాదు వత్తుల్లేని వ్యవస్థను లేని “మేవా బావిని” సృష్టించి 99 శాతం మంది తరపున వకాల్తా పుచ్చుకొని పద్యం చదివేవారు బావిలో కప్పలు, తతిమ్మా జనం ఉత్తారాధునికులు అని తెలివిగా తీర్మానిస్తున్నారు. భేష్!!

    వ్యావహారికమున ఉచ్చారణలో కొన్ని సార్లు వకారము మకారము భిన్న అర్థ బోదకాలు కావు (ఉదా : మామా / మాఁవా), దీన్ని పట్టుకుని పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రంలా ఎక్కడ పడితే అక్కడ ప్రయోగించి చివరికి చమట ను చవట గా మార్చి “మేవా బావి” లో లేని సావాన్యులను (సామాన్యులను) ఇలా హింసించడం తగునా ??

    లేదా సంపాదకులు దయ తలచి క్రింది పేరాలో చివరి వాక్యాన్ని గట్టిగా అమలు చేస్తే మేలు.
    “We review comments before they are posted, and reserve the right to edit, remove, or not allow posting of any comment that is off-topic, inappropriate or is of a promotional nature. We also reserve the right to edit comments for clarity, readability or spelling, when appropriate.” (Ameritas అన్న Insurance Company website నుండి సంగ్రహితం).

  537. వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ గారి అభిప్రాయం:

    03/19/2015 1:12 pm

    రవికిరణ్ తిమ్మిరెడ్డి గారూ – హమ్మయ్య, ఖంగారు పడ్డాను కానీ, ఉత్తిదే అని తేలిపోయింది. ఇహ పూర్తిగా అర్థమైపోయింది, నా వ్యాసానికి, అందులోని వాక్యాలకు, రాసిన కామెంటుకు నేను పూర్తి న్యాయం చేసాననిన్నీ… దీనికి ఇంతకన్నా ఎక్కువ చెప్పనక్కరలా. 😉

    పోతే, మీ భాషలో చెప్పాలంటే, మీరన్న మాటలే, మీ వచనంలోని, మీ కవిత్వంలోని మాటలే వాడి చెప్పాలనిపించి, అసలు సంగతి వదిలేసిన మీరు, ఆ చవటలతో, కారిపోతూ ఏవిటి రాసుకోవాలన్నా రాసుకోవచ్చు..నానుంచి ఉపేక్ష్యోలక్ష్యమే! చివరిసారిగా మరొక్కసారి స్వస్తి…

    ధన్యవాదాలతో !
    భవదీయుడు
    వంశీ

  538. వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ గారి అభిప్రాయం:

    03/17/2015 1:54 pm

    రవికిరణ తిమ్మిరెడ్డి గారూ – కామెంటుకు ధన్యవాదాలు. ఆలోచనలు రేకెత్తించే విధంగా వున్నది. ఊరకే ఈ కింది వాక్యం తీసుకొన్నా! దాన్ని మీర్రాసిన మిగతా వాటితో కాస్త కలగాపులగం చేస్తే ఒహ పులగం తయారయ్యింది. ఆలోచనల పులగం. అంతా రాస్తే ఈ వ్యాసానికన్నా పెద్దదవుతుందని, ఆ ఆలోచన పులగంలో ఒకటో రెండో ముక్కలు పంచుకుందామని ఈ ప్రయత్నం.

    >>దాంట్లో పద్యం అసలేవీ లేదు కదా, వచనం తప్ప.

    ఇలా రాసారు కాబట్టి మీకు కాస్త కాకున్నా కాస్తన్నా పద్యమొచ్చని అనుకోలు. పద్యమంటే పాత పద్యం. ఆ స్వరూపం అని అర్థం. అక్కడ పద్యంలో రాస్తే ఎందుకు అర్థమవదోనని ఇక్కడ ఈ వ్యాసంలో మొదటి పేరాలో వివరించిన కారణమే. అంటే సంపాదకులకు అర్థం కాదనా అని మీరు తిమ్మిని బమ్మి చేయబోయి బమ్మిని తిమ్మి చేసే ప్రశ్న వేయవద్దు. అది కాదు ఉద్దేశం అక్కడ. ఆ సంపాదకీయం ఎంతమంది చదువుతారో అంతమందికి నా కామెంటు కూడా అర్థమవాలె కదా.

    పైగా ఆ సంపాదకీయానికి నా కామెంటులో మీకు కవిత్వం కనపడ్డదంటే మీరు సామాన్యులు కాదు. రసిక హృదయులు. రసిక హృదయులున్నచోట కవిత్వం పరిఢవిల్లుతుంది. ఆ సంగతి మీ కామెంటు భాగంలోని స్కర్టు తేటతెల్లం చేస్తోంది. నా వ్యాసానికి సమబంధం, సంబంధం లేని లోదుస్తుల వైపు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారంటేనే మీ మనోఫలకం ఎంతగా కళ్ళు విప్పార్చుకుని వున్నదో నాకు తెలిసింది. పైగా నేను స్కర్టులు అవీ వేసుకుని తిరిగే స్కాట్లాండు వాడినీ కాదు. మీరేవిటి వేసుకుని తిరుగుతారో నాకు అనవసరం.

    మీరు మీ వచనంలో ఏవిటి మాట్లాడారో మీకు మాత్రమే తెలుసుననుకొని ఆ ఆలోచన అలా పక్కనబెడుతూ ఉండగా మీ సంధ్య, ఉషలు కనపడ్డారు. సరే మీ టైపులో చెపుతే మీకర్థవౌతుందని, ఎబ్బెట్టు లేకుండగా ఒహ మాట – మీర్రాసిన సంగతి అర్థం కాలేదనుకునేరు, అల్లాటిదేవీ లేదు కానీ, ఊరకే సరదాకి – అలా సంధ్యగారెవరో కావులించుకుంటే మా ఆవిడ కాళికామాతైపోతుంది. ఆ తర్వాత జరిగే పాపపుణ్యాలకు, లోకకళ్యాణాలకు బాధ్యత మీది మీ స్కర్టుది. అందువల్ల ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండటం మంచిదేమోనని అనుమానం పొడసూపింది.

    ఇహ ఉష కోసం ఎదురు చూసే ఓపిక లేదు. మీర్రాసిన వచనమే ఉష అయితే, ఆ వచనమే కవిత్వమని మీరనుకుంటే ఆ చతుర్ముఖుడు నా తలరాత ఇట్లా రాసాడని ఊరకోటమే. ఈశ్వరానుగ్రహం ఇంతేనని సరిపెట్టుకోటమే. ఏం? ఇది, ఈ వ్యాసం రాసినప్పుడు సరిపెట్టుకోలా? అంతే! అంతే!

    ఇలా చిన్న వాక్యాల్లో రాసింది మీకర్థవయ్యిందో లేదో నాకు తెలియదు కానీ, ఒక మాట, ఇక్కడ రాసింది ఇదే అర్థం కాలేదంటే కష్టతరమైన పద్యానికి వెడితే ఇహ ఇంతే సంగతులు చిత్తగించవలెనేమోనని – వచనమ్విడ్వుము పద్యము చాలున్ అన్న స్వీయవాక్యంతో ఇక్కడికి, మీతో సంభాషణకు స్వస్తి పలుకుతున్నాను….

    మరొక్కసారి ధన్యవాదాలతో
    భవదీయుడు
    వంశీ

    తా.క – మీర్రాసిన దానిలో నాకు నచ్చిన వాక్యం ఇదీ – “చవటకు” జారిన కుంకుమ ఈరోజు కనిపించదు. తర్వాతి లైను చదివినవాడికి అర్థమవుతుంది కానీ, అది చదవక ఇదొక్కటే తీసుకుంటే, దీని మీదే, ఈ వాక్యం తెచ్చే అర్థాలమీదే ఒహ వ్యాసం రాయవచ్చు. అది ఆవు వ్యాసమైపోతుందని భయమేసింది…

  539. వచనానికి ఒక జాబు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/15/2015 2:05 pm

    మాగంటి వంశీ మోహన్ గారే కదా పెరుమాళ్ మురుగన్ గారి గురించి అభిప్రాయం వ్రాసింది. దాంట్లో పద్యం అసలేవీ లేదు కదా, వచనం తప్ప. వ్యాసానికి అభిప్రాయం వచనం లో వ్రాయొచ్చు, మరెందుకో శ్రీ వంశీ మోహన్ గారు కవిత్వం వ్రాశారు. అది పద్యం కాదు, వచనం. అంటే ఆయన భావం, ఆయన ఎమోషన్ ఆ వచనం లో ట్రాన్స్మీట్ అవుతుందనే కదా ఆయన అలా వ్రాశారు.

    “ఈ వ్రాతనూ తిట్టనీండి. ఎట్లాగూ తిడతారు, తిట్టడానికి ఏం దొరికినా. దొరకటం కావాలి వాళ్ళకు. అంతే!” శ్రీ వంశీ మోహన్ గారిని తిట్టడానికే ఈమాట పాఠకులు వున్నారా? “ఈ వచనపాపానికి విరుగుడు పద్యానుగ్రహం ఒకటే!” వొకప్పుడు, నిజవే.
    కానీ లోకం మారిపోతూ వుంటుంది ఎప్పుడూ,
    మొన్నటి విలువలు, నిన్నటి కళలు
    ఈ వొచ్చే వసంతంలో మరో క్రొత్త ఉదయం అవుతాయ్
    నిన్నటి పైటా పావడా ఈరోజు కనుమరుగై పోతుంది
    మళ్ళా రేపెప్పుడో ఇంకొంచం క్రొత్తగా మొలకెత్తడానికి
    చవటకు జారిన కుంకుమ ఈ రోజు కనిపించదు
    కానీ నుడిటిమీద ఆ పొడువాటి స్టిక్కర్ కూడా
    ఒక భావాన్ని ప్రతిఫలిస్తుంది, కాదా?
    పద్యం, పంచలు గతానుభావాలే
    అప్పుడప్పుడూ, ఎప్పుడో విచ్చుకునే పుష్పా సౌరభాలే
    స్కర్ట్ వేసుకున్నా సరే, లంగా తప్ప పేంటీ నాకొద్దంటే ఎలా మోహన్ గారు?
    లోకం మారుతుంది చూడండి, నిన్నటి
    సంధ్య కౌగిలిలోనే చిక్కుకుపోతే ఎలా?
    ఇవాళటి ఉషని కూడా ఆలింగనం చేసుకోండీ.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  540. ఉడుత గురించి వాహెద్ గారి అభిప్రాయం:

    03/11/2015 11:08 am

    వేసవికాలం, పల్లెటూరి పొలాల్లోకి తీసుకెళ్ళిపోయిందండి మీ కవిత.

  541. వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ గారి అభిప్రాయం:

    03/10/2015 4:13 pm

    శ్రీ మోహన – ధన్యోస్మి – Any article that gets a comment from you is blessed. So I say, this essay NOW has officially been blessed. Thank you

    అదలా పక్కనబెడితే, ఇహ ఇప్పుడు వచ్చే, రాబోయే ఒకటో రెండో రాళ్ళకు, ఆ రాళ్ళేసేవాళ్ళకు చివరి పేరా ఒకసారి మళ్ళీ చదువుకోమనిన్నీ – ::P, ఆ పైన వచ్చే మూడో నాలుగో పూలకు, ఆ పూలేసేవాళ్ళకు వ్యాసం చివరలో చెప్పినట్టు ఈశ్వరాశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ…మరొక్కసారి రాళ్ళవారైనా, పూలవారైనా, రెండూ కాక ఇంక వేరేవారెవరైనా అందరికీ కృతజ్ఞతలతో…ఏదైనా బాగుపట్టం కావాలె, అది ఏ రీతిలోనైతేనేమి ? అది, ఆ బాగుపడేది వచన కవిత్వం అయితే బాగుంటుందని కోరిక.

    మంచి భాష వున్నవారు, మంచి కవిత్వం రాసేవారు చక్కగా క్లాసులూ అవీ పెట్టి ఒక ఫ్రేమువర్కు నేర్పిస్తే ఆ తర్వాత అల్లుకుపోయేవాడు అల్లుకుపోతాడు, అలుక్కుపోయేవాడు అలుక్కుపోతాడు… ల వత్తు, క వత్తు తేడాలతో – ఒక్క వత్తు అంత పని చెయ్యగలిగితే, మొత్తం భాష ఎంత పని చెయ్యగలదండీ ?

    క్లాసులూ అవీ పెట్టినా ఈ అహంకారమిదం పుణ్యం ఎక్కువైపోయిన జగత్తులో ఎవడు వస్తాడు, నేర్చుకుంటాడు అన్నది మీ ప్రశ్న అయితే – ఇహ ఓం తత్ సత్ అన్నదే శరణ్యం!

    భవదీయుడు
    వంశీ

  542. ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి bhaithi durgaiah గారి అభిప్రాయం:

    03/10/2015 4:54 am

    ఈ మాట సంపాదకుల గారికి
    నమస్కారములు.
    పత్రిక చాలా బాగున్నది.మీ కృషి ప్రశంషనీయం.నేను “అక్షర సేద్యం ” కవితా సంపుటి ని రచించాను.మీ గ్రంథాలయంలొ పుస్తకానికి అవకాశం ఉన్నదా?
    ఉంటే ఎలా? దయచేసి తెలుపగలరు.

  543. వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ గారి అభిప్రాయం:

    03/05/2015 7:59 pm

    అయ్యా శివశంకర్ గారు – మీకు నచ్చినందుకు , మరి కామెంటుతో మెచ్చినందుకు కృతజ్ఞతలు….కవితాకన్యక మానసంరక్షణము అని ఇంకొక వ్యాసము ఉన్నది, మీకు తీరిక ఓపిక ఉంటే నవంబరు 2013వ సంచికలో చదువుకోవచ్చు

    భవదీయుడు
    వంశీ

  544. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    03/05/2015 4:39 pm

    “ఆడెడు శంభుఁడు” అన్న నిర్దేశం వల్ల పరమశివుని నాట్యమే ఇందులో వర్ణ్యాంశం. పరమశివుడు పుష్పాంజలిహస్తుడై సంధ్యాదేవికి ప్రణమిల్లటం ఆనాటి నాట్యేతివృత్తంలోని భాగమే. ఆయన పుష్పాంజలిహస్తాన్ని పట్టినప్పుడు ఆకాశంలోని తారకలు, మెడలోని పువ్వుల దండలు, ఇలాస్థలి పుష్పవర్షం చేతిలోని అర్ఘ్యంలో ప్రతిబింబించి పువ్వులై తోచాయి. “ఇలాస్థలిఁ బువ్వుల వర్షముల్” అంటే మహీతలాన భక్తులు శివలింగముపై కురిపించిన పుష్పవర్షాలుకూడా ఆయనను చేరుకొన్నప్పుడు శిరస్సుపైనుండి అర్ఘ్యంలో పువ్వులై తోచటం సహజమే. 1. అంబరసీమఁ దారలు, 2. జటాటవి మల్లెవిరుల్, 3. భుజాంతరాళంబున హారసంతతులు, 4. ఇలాస్థలిఁ బువ్వుల వర్షముల్ – అన్నంతవరకు ఒక దళం. ఆ నాలుగూ సత్కృతాంజలిలో “ప్రసూనంబులు అనం దగి” తోచాయి. ప్రసూనములు అయిపోలేదు. నీటిలో ప్రతిఫలించినప్పుడు పుష్పాంజలి వేళ ఉంచిన ప్రసూనములో అన్నట్లుగా తోచాయి. సప్తశతీసారంలో “అర్ఘ్యాఞ్జలౌ పుష్పం వా ఫలం వా నిక్షేప్తవ్యమ్” అని వేమభూపాలుడు చెప్పాడు. అర్ఘ్యాంజలిలో పువ్వో పండో ఉంచమన్నాడు. ఆ అన్వయాన్ని చదువుకొన్న తెలుగు కవి పువ్వులతోపాటు పండ్లనుకూడా ఉంచాలనుకొన్నాడు. అందువల్ల రెండవ దళంలో “మౌక్తిక తుల్య గంగాంబుకణంబులు ఉట్టిపడ” అని చెప్పాడు. గంగాంబుకణాలకు మౌక్తికాలతో తుల్యత్వకల్పనకు ప్రయోజనం అవి ముక్తాఫలములు కావటమే. ముక్తాఫలములతో తుల్యములైన గంగాంబుకణంబులు ఉట్టిపడటం పువ్వులతోపాటు పండ్లను ఉంచటానికే.

    గాథాసప్తశతిలో పరమశివుడు సంధ్యాదేవికి ప్రణమిల్లినప్పుడు గౌరీదేవి ముఖపద్మం ఎర్రబడి ఆయనచే సద్గృహీతమైన అర్ఘ్యపంకజము వలె తోచింది. వేమభూపాలుని వ్యాఖ్యానంలో అంజలిబంధంలోకి పుష్పఫలాదుల ప్రసక్తి వచ్చింది. తెలుగు పద్యంలో నటేశ్వరనాట్యగతమైన పుష్పాంజలి మాత్రమే చిత్రీకృతమయింది కనుక పువ్వు, పండు అన్న అన్వయంకోసం తారకాదులు, గంగాజలకణాలు పరికరించాయి.

    పద్యమంతా (మౌక్తికతుల్య) గంగాంబుకణాల గురించే అనటం సరికాదు. ఆ పక్షాననైనా, మౌక్తికతుల్యగంగాంబుకణాలు = ముత్యాల వంటి అంబుకణాలు – అవి ఎంత తెల్లనివైనా ఆకాశంలో తారకల్లాగా కానరావటం లోకవిరుద్ధం; కవిసమయ విరుద్ధం. ముత్యములను తారకలతో పోల్చటం, నీటిచుక్కలను తారకలతో పోల్చటం సిద్ధకల్పనలు కావు. తారకలు పువ్వులవలె కానరావటం అనేకకవిప్రయుక్తమైనదే. ఆ తారకలు పరమశివుని ఆహార్యంలో ఉన్నవే. ధూర్జటి గారి కవితలో తారకలు అమృతపు బిందువుల శంకను కలుగజేశాయి. అది సహజకల్పన. సమాసంలో “ముత్యాల వంటి నీటి చుక్కలు” అన్నాక, ముత్యాలను విడిచి నీటిచుక్కలను మాత్రమే వ్యస్తంచేసి పఠించటం సాధ్యం కాదు. ముత్యాల వంటి నీటి చుక్కలు తారకల వలె ఉండటమూ, ముత్యాలు తారకలలె ఉండటమూ కల్పనాగతం కాదు. కపర్దం మీదికి చిందిన ముత్యాల వంటి అంబుకణాలు జడలో మల్లెపూలలాగా గోచరించటం లోకవిరుద్ధం; కవిసమయ విరుద్ధం. తెల్లనివన్నంతమాత్రాన జలకణాలకు పువ్వులతో ఉపమానసిద్ధి లేదు. ముత్యాలవంటి నీటిచుక్కలు అన్నాక, అవి పరమశివుని కంఠసీమను ఆవర్తించి వక్షఃస్థలాన హారములవలె కనబడటం కూడా సిద్ధకల్పన కాదు. “ముత్యాల వంటి అంబుకణాలు” (మౌక్తిక తుల్య గంగాంబుకణాలు) అన్నాక, అవి (ఆ ముత్యాలు) సత్కృతాంజలిలో పువ్వులై కనబడటం లోకవిరుద్ధం; కవిసమయ విరుద్ధం.

    మౌక్తిక తుల్య మౌళి గంగాంబుకణాలు అంబరసీమలోని తారకల లాగానూ, (ఆయన) జటాటవిలోని మల్లెపువ్వుల లాగానూ, భుజమధ్యంలోని పుష్పహారాల లాగానూ, (జారవిడిచిన తర్వాత) భూమిపై కురుస్తున్న పువ్వుల వర్షాల లాగానూ, (జారవిడువక మునుపు) సత్కృతాంజలిలోని పువ్వుల లాగానూ ఉట్టిపడుతుండగా నాట్యం చేస్తున్న శివుడు – అన్నప్పుడు తాత్పర్యం ఎలా ఉంటుందో చూడండి. అంబుకణాలకు ఒకసారి తారకోపమానం, ఒకసారి పుష్పోపమానం చెప్పిన తర్వాత, వేరే ఉపమానాలు తోచక మళ్ళీ మళ్ళీ పుష్పోపమానాన్ని ఎందుకు పునరుక్తం చేస్తాడు? భుజాంతరాళంలోనివి పుష్పహారాలు కావు, ముత్యాల దండలు అని చెబితే, ముత్యాల లాంటి అంబుకణాలు ముత్యాల దండల లాగా ఉన్నాయి – అని చెప్పాలి. అది వాక్యపద్ధతేనా? సత్కృతాంజలిలోని పువ్వులు ఇలాస్థలి పువ్వుల వర్షాలు కావటమేమిటి?

    ఇంతకీ పరమశివుడు నాట్యవేళ “సత్కృతాంజలి” (పుష్పాంజలి) ని ఎవరికి సమర్పించాడు? విష్ణువుకో, బ్రహ్మకో, గౌరికో, ఆత్మార్థానికో కాదు. సంధ్యాదేవికి అయితేనే అది సమర్థనీయం. అది వేమభూపాలాదులు చెప్పిన అన్వయమే. సంధ్యాదేవికి సమర్పితమైనది పుష్పాంజలిహస్తంతోడి సత్కృతాంజలి కనుక మూలంలోని గౌరి అసూయను తీసివేసి, వేమభూపాలుడు చెప్పిన అర్ఘ్యంలో ఉంచవలసిన పువ్వులు, పండ్లను మాత్రం నిలిపి తెలుగు కవి ఆలంకారికపరికరాలను అందంగా మలచుకొన్నాడు. సప్తశతిలోని గాథ, సప్తశతీసారంలోని వ్యాఖ్య, ఆ అభిజ్ఞానం శ్రీనాథునికి సంగతం; ఇతరులకు అసాధ్యం కాబట్టి ప్రతిపాదన.

  545. మహాలయం గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:

    03/04/2015 6:09 pm

    చంద్ర కన్నెగంటి గారికి కాళిదాసు తెలుసునని నేనిదివరకే నిరూపించాను; ఆయన ప్రచురించిన కవితాసంకలనం లో కొన్ని పద్యాలని ఉదహరిస్తూ! మానస చామర్తి గారు కూడా కాళిదాసు చదువుకున్నారని నాకు ఇప్పటివరకూ తెలియదు. #Mea Culpa#

    మార్చి 2015 ఈమాటలో వీళ్ళిద్దరి పద్యాల ప్రారంభ శబ్దాలు వినపడగానే – భోజరాజు తన ఆస్థానకవులకిచ్చిన సమస్య – దానికి కాళిదాసు పూరణ జ్ఞప్తికి వచ్చాయి.

    భోజరాజు ఇచ్చిన సమస్య:

    టమ్ టమ్ ట టమ్ టమ్ ట ట టమ్ ట టమ్ టమ్.

    (తెలుగు లో రాస్తే ‘మ్’ అక్కరలేదు; తెలుగు వాడికి చక్కగా సున్న ఉన్నదిగదా!)

    కాళిదాసు పూరణ:

    రాజాభిషేకే మదవిహ్వలా యా
    హస్తా చ్యుతో హేమ ఘటో యువత్యా,
    సోపాన మార్గేషు కరోతి శబ్దమ్
    టమ్ టమ్ ట టమ్ టమ్ ట ట టమ్ ట టమ్ టమ్.

    చాటువు చదివి ఆనందించడానికి ఆ చాటువు పూర్వకథ తెలియాలి. ఇదిగో ఆ అపూర్వ కథ.

    రాజుగారు స్నానం చేయడానికి నీళ్ళు తెమ్మన్నాడట. బంగారపుబిందెలో నీళ్ళు మోసుకొస్తున్న యువతి, రాజుగారి శరీర సౌందర్యానికి సమ్మోహిత అయ్యింది. పుటుక్కున చేతిలో ఉన్న బంగారు బిందెని జార విడిచింది. ఆ బిందె మెట్లమీదపడి టం టం టమ్మన్న శబ్దం చేసిందిట!

    (మిగిలిన వివరాలు మీరు ఉహించుకోండి!)

    వేలూరి వేంకటేశ్వర రావు
    తెలుగులో ఢం ఢం, — ఇక్కడ సంస్కృతంలో సున్నితంగా — టమ్ టమ్.

  546. మహాలయం గురించి S A Rahman. గారి అభిప్రాయం:

    03/03/2015 4:16 am

    ఒక్క మాటలో చెప్పాలంటే చిన్ని కవిత చాలా ముచ్చటగా ఉంది.

  547. ఉడుత గురించి Arun Kumar గారి అభిప్రాయం:

    03/02/2015 5:52 am

    కళ్ళు
    విప్పార్చుకుని
    బరువుగా తూగే
    సీతాఫలాలతో
    చాల బాగున్నది మీ కవిత

  548. జాషువా – పిరదౌసి గురించి జాన్య గారి అభిప్రాయం:

    02/13/2015 10:47 pm

    తెలుగు మాటలు కరువైతున్న రోజులు
    తెలుగంటెనె వదంటుపరుగులుపెడుతున్న రోజులు
    పుస్తకాలు విప్పి చదవలేకపోతోన్నా రోజులు
    వాట్సప్, ఫెస్ బుక్,స్క్యప్ అంటూ పరుగులు పెడుతున్న రోజులు
    ఇలాంటి రోజులలో ఇంత అందమైన కవిత్వపరిభాషలో ‘పిరదౌసి’ ప్రాతిపదికంగా ఆయన జీవితాన్ని, సాహిత్యాన్ని మీదైన కొత్తచూపుతో రూపుకట్టిన మీకు “మానసా”రా అభినందనలు!
    శ్రీ మేగావత్ జాన్య
    జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఇంద్రకల్
    నాగర్ కర్నూల్,మహబూబ్ నగర్ జిల్లా

  549. జాషువా – పిరదౌసి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    02/02/2015 2:13 pm

    చి.సౌ. మానస గారికి,

    “జాషువా” అనగానే పడికట్టురాళ్ళతో నైరూప్యసౌధాల నిర్మిమీష పెరుగుతున్న రోజులలో ఇంత అందమైన కవిత్వపరిభాషలో ‘పిరదౌసి’ ప్రాతిపదికంగా ఆయన జీవితాన్ని, సాహిత్యాన్ని మీదైన కొత్తచూపుతో రూపుకట్టిన మీకు “మానసా”రా అభినందనలు!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  550. జాషువా – పిరదౌసి గురించి Phanindra గారి అభిప్రాయం:

    01/14/2015 1:41 pm

    ఈ వ్యాసం విస్తారంగా, విశ్లేషణాత్మకంగా ఉంది, “ఫిరదౌసి” ని చాలా చక్కగా పరిచయం చేసింది. “ఫిరదౌసి” ని ఇంతలా అనుభవించి చదివినందుకు, ఆ అనుభవాన్నీ, నీ ఆలోచననీ మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు!

    జాషువా గురించి నేను స్కూల్లో తెలుగు పాఠాల్లో మాత్రమే చదివాను. కానీ నన్నతని కవితలు చాలా స్పందింపజేశాయి. అతని శిశువు, రాజు-కవి వంటి కవితలు చాలా నచ్చినా నన్ను చాలా ఆకట్టుకున్నవి మటుకు అతను సామాజంపై వేసిన విసుర్లు. “నా కవితా వధూటి వదనంబును ఎగాదిగ చూసి”, “కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి” వంటి పద్యాలు నాలో చాలా అవేదననీ అభ్యుదయాన్నీ నింపాయి ఆ స్కూల్ రోజుల్లోనే! నీ వ్యాసం ద్వారా మళ్ళీ ఓ సారి జాషువాని తలుచుకున్నాను, థాంక్స్!

  551. కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు గారి అభిప్రాయం:

    01/08/2015 4:01 am

    ఎడిటర్ గారికి, కవిత్వం రాయటం ఎలా అనే విషయం ఇప్పుడే చదివాను. చాఆఆఆఆఆఆఆఆఅలా బాగుంది. కృతజ్ఞతలు.మొన్ననే ఒక కవిత మీకు పంపెను. కాని అది ప్రచురించలేమని మెయిల్ పెట్టేరు. పరవాలేదు. ఎందుకంటే నేను కవిత్వం నా సంత్రుప్తికి రాసుకుంటున్నాను. అదే సమయంలో మరి కొంత మందితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఏది ఏమైనా మీరూ పై వ్యాసంలో చెప్పిన చాల పాయింట్స్ నేను అనుకుంటున్నవే.అందుకే నాకు చాల సంతోషం వేసింది. మళ్ళీ ప్రయత్నం చేయడం తప్పుకాదని అనుకుంటున్నాను.

  552. నిర్ణయం గురించి ప్రసూన రవీంద్రన్ గారి అభిప్రాయం:

    01/03/2015 4:01 am

    వావ్ మానసా. అద్భుతం అన్న మాట చాలా చిన్నది. ఈ కవిత చదివాక ఎంత గొప్ప అనుభూతి కలిగిందో మాటల్లో చెప్పలేను.

  553. జాషువా – పిరదౌసి గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:

    01/02/2015 2:10 pm

    వ్యాసం చాలా బాగుంది. జాషువా కవితాత్మను చక్కగా ఆవిష్కరించారు.

  554. విశాఖ వృక్షయాగం అక్టోబరు 2014 గురించి VSTSayee గారి అభిప్రాయం:

    12/17/2014 1:32 am

    >రవికిరణ్ తిమ్మిరెడ్డి
    >కవిత్వం ఒక అవుట్బస్ట్ దానికి కొలమానపు పరిధిలు ఏవిటి?

    నోటికొచ్చింది రాసిపంపేదానికి, కవులు ఇంటర్వూల్లో ప్రసవవేదనపడతాం, చిత్రికపడతాం అంటుంటారేమిటి.

    ఇంతకీ- హుద్‌హుద్‌ మగా, ఆడా?

    నమస్తే,
    శాయి.

  555. విశాఖ వృక్షయాగం అక్టోబరు 2014 గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    12/16/2014 12:25 pm

    ఇందాకే ఇంటికొచ్చాను. టి.వి లో వస్తున్న చిత్రాలు చూస్తుంటే కడుపు మండిపోతుంది. పిల్లలండి, చిన్న పిల్లలు, పాకిస్తానీ పిల్లలయితే ఏవిటి, ఎవరి పిల్లలయితే ఏవిటి, చిన్న పిల్లలు నూటా నలభై మూడు మంది, ఆ టెర్రరిస్టలకి మాత్రం ఇంట్లో చిన్న పిల్లలు వుండరా, వాళ్ళు మాత్రం వాళ్ళ చెల్లెలినో, తమ్ముడినో, బిడ్డనో ఎప్పుడూ ఎత్తుకుని ముద్దడి వుండరా? అయ్యో, వాళ్ళకి అసలు గ్నాపకాలే లేవా? జంతువుకి కూడా చాతకాదే అంతగా దిగజారి పోవటం, మనిషి మాత్రం అంత హీనంగా ఎలా దిగజారిపోగలడు. డు, ఖచ్చితంగా “డు” నే ఆడవాళ్ళు ఎప్పటికి ఇలా చెయ్యగలరని నేననుకోను. సంఘం లో భాగంగా ఆ చిన్న పిలకాయల రక్థం మన చేతుల మీద కూడా వుంది. మనవేదో తప్పు చేస్తున్నాం, మనిషిని మ్రుగం కన్నా హీనంగా దిగజార్చే తప్పు, వ్యక్తిగా కాదు, కానీ సంఘం గా చేస్తున్నాం.

    ఇప్పుడు కవిత్వాన్ని గురించి, దాని క్లుపత గురించి వ్రాయటం బహుశా పద్దతి కాదు, కానీ ఇంకొక నెల తర్వాత వ్రాస్తే అది పద్దతి అవుతుందా?

    ఇప్పుడు చెప్పండి, క్లుప్తత గురించి ఆ అమ్మలకి, నానలకి, చెప్పండి, మీరు ఒక అరడజను కన్నీళ్ళు మాత్రమే కారచటం మర్యాద, పద్దతి అని. కవిత్వం ఒక ఎమోషనల్ ఔట్ సెర్జ్, దానికి పదాల రేషన్ ఇవ్వటం ఏవిటండి, కారే కన్నీళ్ళకి, ఎగిరిపొయ్యే ఊహలకి పదాల లెక్కలు చెప్పటవేవిటి. చావుకి నాలుగు లైన్ల ఆబీట్యువరి ఇచ్చినట్టు, ఆర్గాసం ని ఒక లైనుకి కుదించినట్టు, కవిత్వం ఒక కోపం, ఒక ఆవేశం, ఒక బాధ, ఒక సంతోషం. కవిత్వం ఒక అవుట్బస్ట్ దానికి కొలమానపు పరిధిలు ఏవిటి?

    -రవికిరన్ తిమ్మిరెడ్డి

  556. బొంగురు గొంతు పాట గురించి indrani Palaparthy గారి అభిప్రాయం:

    12/11/2014 11:58 am

    చంద్ర గారు:

    బావుంది ఈ కవిత.

    ఎందుకు? అంటే వివరించడానికి ఓ వ్యాసం వ్రాయొచ్చు. వ్యాసం సారాంశం మళ్ళా- ఈ కవిత బావుంది అనే.

    పగటికీ పగటికీ మధ్య
    రాత్రి మడతల్లో దాచుకున్న
    కర్పూరపు వాసనలన్నీ ఆవిరవుతాయి
    ఆవురావురుమని కావిలించుకున్నవన్నీ

    మూసిన గుప్పిటలో ఒక్కో వేలూ తెరిచినట్టు
    ఒక్కో రోజూ విచ్చుకుని ఏదీ మర్మమేదీ
    లేదన్న గుట్టు విప్పుతుంది
    కొలతలకందని వెలితి కలత పెడుతుంది

    చలికాలపు చాలీ చాలని దుప్పటిలా
    ఒక బొంగురుగొంతు పాటో
    బొగ్గుగీతల బొమ్మో
    ఆపై అసలేమీ ఎరగనట్టూ ఇంకేమీ పట్టనట్టూ!

    అంటేనూ చాలేమో మొత్తం కవిత భావం అంతా చెప్పెయ్యడానికి, అని అనిపించింది.

    ఇంద్రాణి.

  557. రెండు కవితలు గురించి sreehari గారి అభిప్రాయం:

    12/09/2014 11:22 am

    నిజంగా నిజంగా అభినందనలు మానసా. ఇంత సరళంగా కూడా కవిత్వం చెప్పచ్చా అనిపిస్తుంది, నీ కవితలు చదువుతుంటే.

  558. కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి Maddipati Krishna Rao గారి అభిప్రాయం:

    12/06/2014 4:22 pm

    అందరికీ అర్ధమయ్యేలా చెప్తే అది కవిత్వం కాదన్నారని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటే అది కవిత్వం కాదనడానికి ఎన్ని గుండెలు? హన్నా!

    బియ్యెస్సీ చదివే రోజుల్లో మా కెమిస్ట్రీ మాష్టారు కామేశ్వరశర్మ గారు చెప్పిన ఉదంతం:

    P+F=C+2 అనేది Phase Rule. చివరి అంకె రెండో నాలుగో గుర్తులేక ఒక పంతులుగారు క్లాసులో ఉన్న పిల్లకాయల్ని చేతులెత్తమని నాలుగని తేల్చారట!

    పదిమంది భజంత్రీలను పోగేసుకుంటే మనం చెప్పిందే వేదం మరి. సిద్ధాంతాలెవరిక్కావాలి? మీ పిచ్చిగాని!

  559. రెండు కవితలు గురించి bhanu గారి అభిప్రాయం:

    12/01/2014 10:51 pm

    పసిడికాంతుల లోకాన్ని
    పైట దాచి కవ్విస్తూ…..ఒకే సారి చీకట్లొకి తీసుకెళ్ళీ వెలుతురంతా
    చీకటి మిగిల్చిన
    కథ

    అంటూ చీకటి గొప్ప తనాన్ని అందంగా వర్ణించారు. బాగున్నాయి మానస గారు మీ కవితలు.

  560. రెండు కవితలు గురించి బిక్కి కృష్ణ గారి అభిప్రాయం:

    11/27/2014 7:38 am

    కవిత బాగుంది. ఆకాశంమీద పసివాడు ఎగుడుదిగుడు గీతలు గీసినట్టు కొండలున్నాయనడం కొత్త ఊహ. అలాగే మత్తగజంతో కొండను ఉపమింపజేయడం బాగుంది. కవిత్వానికి భావనా బలం ముఖ్యమంటారు కట్టమంచి. ప్రతీకలు ముఖ్యమంటారు పాశ్చాత్యవిమర్శకులు. ఒక విమర్శకునిగా నీకవితలను చదివాక అటు భావనాబలం, ఇటు ప్రతీకవాదం మీకవితల్లో నాకు కనిపించాయమ్మా… చిన్నవయసులో మంచి కవితలు రాస్తుంన్నందుకు మనసారా అభినందిస్తున్నాను. లాటిన్ అమెరికన్ కవిత్వాన్నో ఆఫ్రికన్ కవితలనో అనుకరించి ఒక్కోసారి యథాతథంగా మక్కిమక్కి కాపీకొట్టి గొప్ప కవిత్వం రాస్తున్నట్టు ప్రచారం కల్పించుకొని అవార్డు పల్లకీల్లో ఊరేగుతున్న మార్కెట్ కవుల యుగానికి మీలాంటి యువకవులు ముగింపు పలక గలరన్న ఒక ఆశ మీకవిత్వం చదివాక నెరవేరుతుందని పిస్తుంది. మంచి భవిష్యత్ ఉంది ఇంకా సాధనతో పట్టుదలతో మరిన్ని కవితలురాసి సంకలనంగా వెలువరిస్తావని ఆశిస్తూ చీకట్లో వెలిగి చీకట్లో మిగిలే మిణుగురులు కవితాపాదం గొప్ప ఫిలాసఫికల్ థాట్. అబినందనలు.

  561. కోరిక గురించి Siva Chakravarthi గారి అభిప్రాయం:

    11/21/2014 1:35 pm

    మీ కవిత చాలా బాగుంది సర్. నా మనసును తాకింది.

    “నా ఉనికిలేనితనాన్ని నేనే
    అనుభవించాలని ఉంటుంది”

    ఈ లైను అద్బుతంగా ఉంది.

  562. రెండు కవితలు గురించి సుధారాణి గుండవరపు గారి అభిప్రాయం:

    11/21/2014 4:29 am

    అర్థరాత్రి.
    అలికిడి.
    తడబడి
    విడివడి
    దూరందూరంగా…
    దూరంగా… దూరంగా.

    బావుంది మీ కవిత.

  563. రెండు కవితలు గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    11/19/2014 7:37 am

    చీకట్లో వెలిగి,
    చీకట్లోనే మిగిలే
    మిణుగురులు

    మంచి భావుకథతో వ్రాశారు రెండు కవితలూ చాలా చాలా బాగున్నాయి.

    ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు – 517 001.

  564. కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి SeshaKumar KV గారి అభిప్రాయం:

    11/12/2014 7:47 am

    శ్రీ మాధవ్ గారి వ్యాసం చురకలంటిస్తూ చక్కగా సాగింది. ఫ్రేము కవితలంటూ “గణిత కవిత్వం/కవిత్వ గణితం” వ్రాసే వారికి ఏకంగా వాతలే పెట్టారు.

    “ఇతరుల రచనలు చదివితే,ఆ ప్రభావం నా రచనల మీద పడుతుంది-వద్దు” అనుకుని వాల్మీకిని చదువకుండానే ఆ తరువాతి వారు (భాసుడు,కాళిదాసు,భవభూతి ఇత్యాదులు) కవిత్వం వ్రాశారా? ఇది కూడా మాధవ్ గారి వ్యంగ్యమే! ఎందుకంటే, గొప్ప రచయిత కావాలనుకుంటే, ముందుగా గొప్ప పాఠకుడు కాక తప్పదు కదా!

    మంచి వ్యాసం. శ్రీ మాధవ్ గారికి ధన్యవాదాలు.

  565. కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి kAmeS గారి అభిప్రాయం:

    11/10/2014 1:17 pm

    మాధవ్ మొదటే చెప్పినట్టు, ఇది ఒక BitsBank, ఇది ఒక guide. అంతే కానీ, సమగ్ర వైగ్నానిక గ్రంధం కాదు. ఆ కొణంలోంచి చూస్తే, కవి కావాలనుకునేవారికి కావలసినంత ఉప్పు, కారం (saltiness, వెటకారం) సమపాళ్ళలో దట్టించి పంచిన సిసింద్రీ ఈ వ్యాసం.

    Style ఎలా ఉన్నా, నిజాల వెలుగులు చిమ్ముతూ అలరించింది. x-np frame కవిత, తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు పాటలని తలపించింది.

    కవితలమాట దేముడెరుగు, ఈ దెబ్బకి సినీ గేయ రచయితలందరూ కళ్ళకద్దుకొనేలా ఒక మహత్తర బృహత్తర కత్తెర దొరికింది. కట్ చేస్తే పవమానా సుతుడుపట్టూ …

  566. కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి కె.వి.గిరిధరరావు గారి అభిప్రాయం:

    11/09/2014 7:17 pm

    వ్యాసం నాకు చాలా నచ్చింది. ఇప్పుడొస్తున్న (ఎప్పట్నుంచో వస్తున్న) కవిత్వాన్ని/కవిత్వ ఫార్ములాల్ని అర్థం చేసుకోవడానికి, ఆకలింపు చేసుకోవడానికి ఉపయోగపడేలా ఉంది.

    ఆమూలాగ్రం అత్యంత శ్రద్దతో, జాగ్రత్తగా పదాల్ని ఎంచుకుని వాక్యాల్ని చెక్కినట్లనిపించింది. మొదటి సారి చదివినప్పటికంటే రెండోసారి చదివినప్పుడు ఈ వ్యాసంలో మరిన్ని క్రొత్త విశేషాలు తెలిశాయి.

    మరో మాట – అప్పర్ సీట్స్ ఆడియెన్స్ చప్పట్లు కొట్టి ఆమోదిస్తేనే రచన గొప్పదవదు. అలాగే వ్యంగ్యమున్నంత మాత్రాన చెప్పిన విషయాలు మరుగున పడి, ఈ వ్యాసం చీప్ సీట్సును అలరించడానికే పరిమితమవదు.

    ఈ వ్యాసంలో కనిపించిన వ్యంగ్యం ఆవేదన నుంచి వచ్చినదనిపించింది.

    ఇది మౌనంగా, అత్యంత జాగ్రత్తగా చదవాల్సిన రచన!

    మాధవ్ – మీకు హృదయపూర్వక అభినందనలు.

    – కె.వి.గిరిధరరావు.

  567. విశాఖ వృక్షయాగం అక్టోబరు 2014 గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    11/06/2014 1:45 pm

    మొదటి రచన, రెండవ రచన అర్ధంలో ఒకటి కావు. కాలేవు.

    మొదటి రచన లోని వేదన తెలిసిన వారు, బాగుంది,చాలా బాగుంది -అని అనలేరు.

    కవిత్వాన్ని, కల్పిత ప్రక్రియగా మాత్రమే తీసుకుని, దాని ఫార్మ్ ఇలా ఉంటే బాగుంటుందంటూ చేసిన చర్య — అందమైన వనం ఱంపపు కోతల పాలవటం సహించలేక గింజుకుంటున్న ఒక ప్రాణిని, నీ ఊళ్లో వృక్షాల సంగతి సర్లే, నీ చిన్ని రచనని నే కత్తిరిస్తా నని ప్రూనింగ్ సిజర్స్ తీసుకొచ్చి మరోసారి హింసించే — బార్బేరియస్ నెస్ గా తోచింది.

    ఆ రెండంచల హింసకు గురై కూడా, ధన్యవాదాలు తెలిపే, ఆ అనామక/ అనిర్వచనీయ స్థితికి రచయితను తేగలిగే సివిలైజ్డ్ రచనా ప్రపంచం మరెంత పెత్తందారు! Dear God!

    “అందాలు సృష్టించినావు, దయతో నీవు; మరలా మరుభూమిగా నీవె మార్చేవుగా…”

    లైలా

  568. విశాఖ వృక్షయాగం అక్టోబరు 2014 గురించి తః తః గారి అభిప్రాయం:

    11/05/2014 3:56 pm

    మిత్రులు క్లుప్తః క్లుప్తః కు:

    1. క్లుప్తతకు రెండు ‘క్లుప్తః’ లేల ఒకటి చాలును గదా!
    2. ఒక బాధా కరమైన సంఘటన నుంచి కవితను తయారుచేయటమన్నది కష్టమైన పని. (నాకు) ఆంత ఇష్టమైన పని కాదు .
    3. “ఆంధ్ర విశ్వకళాపరిషత్ విద్యారణ్యం
    అడితిగా మారిపోయిన వైనం
    మీకు తెలుస్తోందా!
    (మీకు తెలియక పోతే – ఈ గేయం )
    అక్కడి ఱంపపు కోత మోత
    మీకు వినిపిస్తోందా!”
    (- వినిపించిందనిపిస్తోంది.)

    మీ మంచి మాటకి ధన్యవాదాలు.

    నమస్కారాలతో
    తః తః

  569. పునరుత్థానం గురించి padmaja.y గారి అభిప్రాయం:

    11/05/2014 9:43 am

    లేతమొక్కలా కూలిపోయిన నీవు
    నిలబడతావు, నిలబడతావు
    ఒక మహావృక్షపు ఛాయను నీ వెనుక సర్దుకొంటూ
    మేఘాలు నుదుటిని చుంబించేవరకూ నిలబడుతూనే ఉంటావు

    చాలా చక్కటి కవితా ధైర్య వచనం. చాలా బావుంది

  570. విశాఖ వృక్షయాగం అక్టోబరు 2014 గురించి క్లుప్తః క్లుప్తః గారి అభిప్రాయం:

    11/03/2014 11:04 pm

    బాగుంది. చాలా బాగుంది.

    కత్తిరిస్తే ఇంకా చాలా బాగుండేదేమో! క్లుప్తత కవితకి అందం అంటారుకదూ!
    @

    పికిలిపిట్ట పేరు పెట్టుకుని
    సముద్రాన్ని దాటి వచ్చిన
    చక్రవాత వర్షపాతం
    మా ఊళ్ళో
    వృక్షయాగం చేసింది.

    చెట్టులన్నీ కట్టెలు చేసి
    పచ్చదనాన్ని
    మున్నీట ముంచేసింది.

    అటూ ఇటూ చెట్లు
    చెట్టు చెట్టునూ తాకుతూ కొమ్మలు
    కొమ్మ కొమ్మనీ పలకరిస్తూ ఆకులు
    పగలు పందిరి
    రాత్రి వెన్నెల
    పచ్చల చాందిని
    చక్కదనాన్ని ముక్కలు
    ముక్కలు చేసి విసిరేసింది.

    ఆంధ్ర విశ్వకళాపరిషత్
    విద్యారణ్యం
    అడితిగా మారిపోయింది.
    అక్కడి ఱంపపు కోత మోత
    ఇక్కడ వినిపిస్తోంది.

    @

    మిత్రుడు,

    క్లుప్తః క్లుప్తః

  571. నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:

    11/03/2014 9:20 pm

    లైలా గారూ:

    ఛందస్సులోను, ఛందస్సు నడ్డి విరగ్గొట్టి ఎడాపెడా కవితలు రాస్తున్న మీకు
    జార + నలినముఖులు అన్న పదానికి అర్థం చెప్పాలా?

    ఎంతశృంగారకవికయినా మొగపురుగులని, నలినముఖులు, అని వర్ణించే మూర్ఖత్వం ఉంటుందంటారా?

    తామరపువ్వులవంటి ముఖాలున్న మొగ సన్నాసులు ఏమిటండీ విడ్డూరం కాకపోతే!(ఒకవేళ మొగవాళ్ళే ఆడవాళ్ళలాగా వేషంవేసుకున్నా, తిమ్మన గారు, వాళ్ళ Max Factor ముఖాలని, తామరపువ్వులతో పోలుస్తాడా?)

    అయినా కారా గారు మీ (మన)సందేహం తీర్చగల సమర్థుడు!

    నాతెలివికి తాటాకులు కడదామని కోరికుంటే, నే రాసిన కథలనో, వ్యాసాలనో చీల్చి చెండాడండి!
    By the way, we might drop in suddenly at Naples! Best wishes, — వేవేరా

  572. రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    11/03/2014 7:09 pm

    శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు ఓ రెండు తెనాలి రామలింగ కవి పద్యాల నెంచుకొని చక్కని పరిశీలనా దక్షతతో ముద్రారాక్షసములను సవరించి వాటికి అందమైన అన్వయమును సమకూర్చారు. వారి ప్రయత్నము వలన పాఠకులకు రెండు చక్కని పద్యాలు సుందరతర విశ్లేషణా భాగ్యముతో లభించాయి.

    కందర్ప కేతు విలాసములో “మౌనిఁ గెంజడల జొంపము ఫాలపట్టికఁ దీండ్రించు భసితత్రిపుండకంబు” అనే పద్యానికి ఆధారముగా శ్రీ వామన భట్టబాణుని “పాణౌ వేత్రం పవిత్రం భసిత విరచితం పుణ్డ్రకం ఫాలదేశే” అనే సిధ్ధపురుషుని వర్ణన నుదహరించి తమ సవరణలను చక్కగా నిరూపించారు.

    ఓడ్డియాణమునకు ఒడ్డాణ మనే అర్ధము ఆంధ్ర భారతి వారి తెలుగు నిఘంటువులో లభ్యమే ! ఆంధ్ర వాచస్పత్యము ,వావిళ్ళవారి నిఘంటువు , ఆంధ్ర శబ్ద రత్నాకరముల నుంచి వారా అర్ధమును గ్రహించారు. శ్రీ ఏల్చూరి వారెంచుకొనిన

    దర, భజ, గేణ, సింహములు తద్గళ, వే, ణ్యవలోకనద్వయో
    దరముల కోడి, వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులం గుహాం
    తరముల పూన నిక్కఁ, దిన, దాఁగ, స్రవింప, నిటూర్పులూర్చ స
    త్వరముగ నేఁగ, నీడఁగని తత్తరమందఁగఁ జేసి తౌ చెలీ.”

    అనే పద్య మెంత బాగున్నదో! ఈ పద్యములో కూడా వారు సూచించిన సవరణలు సమంజసమే! కాని నా అభిప్రాయములో శంఖము భ్రమించడము కంటె స్రవించడమే సరి యని పిస్తున్నది. నా చిన్నతనమంతా సముద్ర తీరములో గడిచింది. ప్రతిదినము సముద్ర తీరానికి పోయి గవ్వలు, చందమామలు, శంఖములు సేకరించి యింటికి కొనిపోయేవాడిని. లవణ సంగత మవడముచే అవి మరునాడు కూడా తేమ నూరుతూ జిడ్డు జిడ్డుగా నుండేవి. పలు సారులు మంచి నీటితో కడిగి పొడి చేశాకే వాటికా తేమ పోయేది. వారిధి పదంబుల నుండుట చేతను, లవణ సాంగత్యము కలుగుట చేతను శంఖములు (గాలిలో తేమను గ్రహించి ) స్రవిస్తాయి. అంతెందుకు ? సముద్ర తీరములో నుండే మనుజులు కూడా తక్కువ శ్రమకే అధిక ఘర్మజలాన్ని స్రవిస్తారు. అందుచేతనే మా శ్రీశ్రీ సముద్ర తీరానుభవముతో ఘర్మజలానికి, ధర్మ జలానికి, కర్మజలానికి ఖరీదు గట్టే షరాబు లేడొయ్! అని కవిత చెప్పగలిగారు!

    ఏమైనా శ్రీ ఏల్చూరి వారి విశ్లేషణ ఉత్సాహకరముగా, నాకర్షణీయముగా సాగింది.వారికి కృతజ్ఞతాభివందనములు!

  573. కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:

    11/03/2014 4:28 pm

    వ్యంగ్యం పాళ్ళు ఎక్కువై వ్యాసం యొక్క మంచి విషయాలు మరుగునపడిపోయాయనిపించింది. చక్కని ఉదాహరణలు, సూచనలు ఉన్నాయీ వ్యాసంలో. దప్పళంలో కాకరకాయ ముక్కలు వేసినట్లు వ్యంగ్యం మొత్తం రుచిని పాడుచేసింది.

    పి.ఎస్. మీరు నా కొన్ని కవితలను ఈమాట లో వేసుకొనేముందు ఎడిట్ చేసి సరిచేసిన విషయంపై నాకింకా మంచి అభిప్రాయమే ఉంది.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

  574. నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:

    11/02/2014 5:01 pm

    కామేశ్వర రావుగారూ: మీరు రుచిచూపించిన మూడు పద్యరత్నాలూ, ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. అన్నమయ్య శతకం గురించి విన్నానే కాని, శ్రద్ధగా చదివి అనుభవిద్దామని ఇప్పటివరకూ అనుకోలేదు. ఇప్పుడు మీరు ప్రేరేపించారు. సంతోషం.

    కవిత్వానికి,తాత్వికతకూ దీటయిన పద్యం, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఈ క్రింది పద్యం — చాలా అందమైన పద్యం — అని నా
    అభిప్రాయం.

    తరగల్‌ పిప్పలపత్రముల్‌ మెఱుగుటద్దంబుల్‌ మరుద్దీపముల్‌
    కరికర్ణాంతము లేండమావుల తతున్‌ ఖద్యోతకీటప్రభల్‌
    సురవీథీలిఖితాక్షరంబులసువుల్‌ జ్యోత్స్నాపయఃపిండముల్‌
    సిరులందేల మదాధులౌదురొ జనుల్!శ్రీకాళహస్తీశ్వరా!

    మరొక విషయం: ధూర్జటి కూడా”అద్వైతజ్ఞానుల”ను పరిహసించాడు.

    వటవద్రజ్జు భుజంగవ ద్రజత విభ్రాంతి స్ఫురచ్చుక్తి వ
    ద్ఘట వచ్చంద్ర శిలాజపాకుసుమ రుక్సాంగత్యవత్తంచు వా
    క్పటిమ ల్నేర్త్తురు చిత్సుఖంబనుభవింపన్ లేక దుర్మేధనున్‌
    చిటుకన్నందలపోయజూతురధముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!

    మీరు పరిచయం చేసే పద్యాలు, మీవ్యాఖ్యానం అత్యంత శ్రద్ధతో చదివి ఆనందించే వాళ్ళల్లో నేను ఒకణ్ణి.

    Please continue the good work.

    వేవేరా

  575. కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    11/02/2014 1:50 pm

    మాన్యులు శ్రీ మాధవ్ గారికి
    నమస్కరణతో,

    క్షేమేంద్రుని ‘కవికంఠాభరణం’, దేవేశ్వరుని ‘కవికల్పలత’, అక్కిరాజు ఉమాకాంతం గారి ‘నేటి కాలపు కవిత్వం’ మొదలైన రచనలాగా కొంత లాక్షణికత, కొంత అధిక్షేపం, కొంత వ్యంగ్యం మేళవించి (ఇకపైని ‘ఈమాట’కు ఏమైనా రాయాలంటే కొంచెం బెదురు పుట్టేట్లు), ఒకమారు అలిఖితాల అల్లుడి కథను జ్ఞాపకం చేస్తూ, మరోమారు హంసపాదుల అయ్యవారి ఉదంతాన్ని స్మరింపజేస్తూ చాలా బాగా రాశారు.

    తమ కావ్యాదుల సత్కవుల్ “కుకవినిందం జేసి” యంచొక్క భా
    గముఁ గల్పించి రకారణంబ; యది నిష్కార్పణ్యమాత్సర్యభా
    వమె గా కా ఘను లుండకున్న నల దేవానాంప్రియశ్రేణి కె
    ట్లమరుం గీర్తివిశేషపూర్తి యిలఁ గావ్యాసారపూరోత్థమై.
    – దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తండ్రి శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారి ‘రావువంశముక్తావళి’

    “ధ్వని” నా చప్పు డటంచు; “శయ్య” యనఁ దల్పంబంచు; “దోషంబు” నాఁ
    గను బాపం బను; “చర్థ” మన్న సమభాగంబంచుఁ; “బాకం” బటం
    చనినన్ వంట యటంచు “వృత్తి” యనినన్ వ్యాపారమౌ నంచు నే
    ఘనబుద్ధుల్ వివరింతు ర క్కవుల వక్కాణింపఁగా నేటికిన్.
    – దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గారి ‘మహేంద్రవిజయము’

    ఛంద మెఱుఁగుట, శబ్దశాస్త్రము చదువుట
    బహునిఘంటుపరిజ్ఞానపాటవంబుఁ
    గాదు కుకవుల కవితకుఁ గారణంబు
    లుచితలజ్జాపరిత్యాగ మొకటె గాని.
    – దామెరల వెంగళనాయకుని బహుళాశ్వచరిత్ర

    ఇట్లాంటి కవులు ఎట్లా ప్రసిద్ధులు కావచ్చునో చెప్పారు కనుకనే, మీరు వ్యాసం మొదట్లో వారి కవిత్వాన్ని ఒక అసంకల్పిత ‘ప్రతీకార’ చర్య అనటం చాలా బాగుంది!

    🙂

  576. సిరినివాస వృత్తము గురించి మోహన గారి అభిప్రాయం:

    11/02/2014 4:17 am

    శ్రీనివాస్‌గారి దస్తూరితో వారు వ్రాసిన కవితను ఇక్కడ చదువగలరు

    PBS

    (బల్లూరి ఉమాదేవిగారి సౌజన్యముతో)

    – మోహన

  577. సాహిత్యావగాహన: మరొక దృక్పథం గురించి sundaram గారి అభిప్రాయం:

    11/01/2014 8:53 pm

    చాలా ఉపయోగకరమైన వ్యాసం. కొత్త విషయాలు తెలుసుకొన్నాను. థాంక్స్.

    కానీ, ఒక కవితను మంచి కవిత్వమా కాదా అని తెలుసుకొనేందుకు మార్గాలూ చూపించి వుంటే ఇంక ప్రయోజనకారిగా వుండేదెమో.

  578. కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి sundaram గారి అభిప్రాయం:

    11/01/2014 8:32 pm

    చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కవిని ఎట్లా ఆయిపొయి ఫేమస్ కావొచ్చో తెలిసింది. కానీ,ఒక రచన కవిత్వం ఎట్లా ఆవుతుందో చెప్పడం తెలిసి దాటవేశారు.

  579. నిప్పులు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    10/10/2014 2:15 pm

    మాన్యులు శ్రీ మాధవ్ గారికి
    నమస్కారములతో,

    మంచి కవితను చదవగానే మనస్సుకు తోచిన ప్రథమస్పందాన్ని స్వస్పందంగా విన్నవించికొన్నాను. ఇన్నాళ్ళూ నేను వచ్చీరాని ఆంధ్రంలో వ్రాస్తున్న వ్యాసాలను స్వచ్చమైన తెలుగులోకి మారుస్తూ నన్ను ప్రోత్సహిస్తూ, ఆదరిస్తున్న మీరే అందుకు తగినవారు.

    ఆ పైని సుబోధ ప్రబోధాలకు ఛప్పణ్ణయ పరిషత్తు ఉండనే ఉన్నది.

    ఛప్పణ్ణయాణ కిం వా భణ్ణఉ కహకుంజరాణ భువణమ్మి
    అణ్ణో వి ఛేయభణిఓ అజ్జ వి ఉవమిజ్జయే జేహిం. (ఉద్యోతన సూరి)

    “What need be said of ChappaNNaya-s, the prominent poet-scholars, with whom, even to this day (అజ్జ వి), any other commentator of (howsoever) clever saying could be compared in this world?”

    🙂

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  580. పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము గురించి Rammohan గారి అభిప్రాయం:

    10/10/2014 12:50 pm

    నన్నెచోడుని కుమారసంభవం లో పార్వతి తపస్సన్నివేశాన్ని కళ్ళకు కట్టే విధంగా ప్రస్తుతీకరించారు రాధగారు.చదువున్నంతసేపూ పార్వతి ప్రతి చర్యా చూసినట్టు అనిపించడంలో నన్నెచోడునితో పాటు రాధగారి ప్రతిభ కూడా ద్యోతకమవుతుంది. విషయానికి తగ్గ భాషను వాడటం లో రాధగారి నైపుణ్యం తెలిసిపోతుంది. ముఖ్యంగా ప్రకృతి స్వరూపిణియైన గౌరి పలుసందర్భాలలో పలురీతుల ప్రాక్రుతిక రూపాల్లో పొందుపరచిన నన్నెచోడుని రచనా వైభవాన్ని సంప్రదాయ కవిత్వప్రియులకు పసందైన విందులా అందించినందుకు కాశీనాథుని రాధగారిని అభినందిస్తున్నాను. ఫగడాల తీవ పై పరచుకున్న మంచుపొర, వంటి వర్ణనలు ,హృఅదయపాత్రలో ప్రేమచమురుతో పున్నెపువత్తినివెలిగించి ఆకసం పెంకు కు పట్టిన పొగతో మంత్రకజ్జలం తయారు చెస్తుందా అన్నట్లుగా మేఘాలను వర్ణించడం ఓహ్! ఆద్భుతం.సంప్రదాయకవిత్వపు జిగిబిగిని పట్టుకోవడానికి ,పట్టుకుని దానిని మన కందించడానికి రాధగారు పార్వతిలాగా కఠోర తపస్సు చేశారా అనిపిస్తుంది చదువుతుంటే.

  581. నిప్పులు గురించి n s murty గారి అభిప్రాయం:

    10/09/2014 9:04 am

    మానసగారూ,

    ఏల్చూరి మురళీధరరావుగారు కవితలోని ఆంతర్యాన్ని మీరు ఆవిష్కరించిన తీరు చాలా చక్కగా చెప్పేరు. అంతకంటే బాగా చెప్పలేను.

    హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులతో,

    NS మూర్తి

  582. నిప్పులు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    10/08/2014 9:45 pm

    చి.సౌ. మానస చామర్తి గారికి,

    భగవత్కరుణానుభవానికి నోచుకొన్న వాగ్విభూతితో కవితలు వ్రాస్తున్నారు. అజహల్లక్షణగా ఉన్న నాయకుని మనోగతాన్ని వ్యంగ్యం చేసి, ప్రణయినీధర్మాన్ని భావధ్వనిగా నిలిపి, పొయ్యిలో రాజుకోవటం మొదలై శీతమారుతపోతసంస్పర్శతో అంతర్హితాలైన అంగారకణికల ద్వారా శృంగారభణితిని వక్తృప్రౌఢోక్తిసిద్ధంగా నిరూపించారని లాక్షణికులంటారు. ఆ అనువర్తనీయతల మాటకేమి గాని, మనసులకు హత్తుకొనిపోయే మధురిమను మాటలతో మూటగట్టారు!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  583. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    10/06/2014 4:04 pm

    మాన్యులు శ్రీ సూరి సీతారాం గారికి
    నమస్కారములతో,

    మీరన్న ఆ భావాన్ని లాక్షణికులు ౧) శబ్దాపహారము, ౨) అర్థాపహారము, ౩) ఉభయాపహారము, ౪) ఛాయాపహారము, ౫) ప్రతిచ్ఛాయాకరణము, ౬) రేఖాపహారము, ౭) ప్రతినిర్మాణము, ౮) వర్ణనాగ్రహణము, ౯) సర్వగ్రంథచౌర్యము అని పరిపరివిధాల నిరూపించారు. రాజశేఖరుని ‘కావ్యమీమాంస’లోని ఒక ప్రకరణమంతా ఈ విషయవివేకానికే అంకితమయింది.

    ఇది అనువాదవిషయమైనప్పుడు ౧) శబ్దానువాదం, ౨) అర్థానువాదం, ౩) భావానువాదం, ౪) మూలవిధేయం, ౫) మూలాతిక్రమణం అన్న స్వీకార్యాంశాలలో ఏది, ఏ సందర్భంలో, ఏ తీరున గ్రహణీయం అన్నది కవి ప్రతిభాపురస్కృతమై ఉంటుంది. ఆ పట్టువిడుపుల ఒడుపుకు ఉపదేష్టలు కనుకనే కవిత్రయం వారు మనకు ప్రామాణికులయ్యారు. రసప్రతీతి నిమిత్తం కథాసన్నివేశాల వైపుల్య సంక్షేపాదులకు కూడా మనకు వారు చూపినవే దారిదీపాలు. ఇక, ప్రౌఢి అన్నది కవి పాండిత్య(శక్తి)విలసనాన్ని బట్టి, ఔచితీపరిపాటిని బట్టి నిశ్చయింపబడుతున్నది.

    ఈ వ్యాసంలో చర్చింపబడిన ప్రధానాంశం ఇది: వేర్వేరు కథలను కలిగిన కుమారసంభవ – కందర్పకేతువిలాస కావ్యాలలో నన్నెచోడ – తెనాలి రామకృష్ణకవులు కవులు సందర్భావశాన ఒకే భావభావనను, రూపధేయాన్ని కలిగిన పద్యకల్పనను చేశారు. తెనాలి రామకృష్ణకవి స్వయంగా భావనోద్బోధం లేక నన్నెచోడుని నుంచి అర్థచౌర్యం చేశాడని మానవల్లి రామకృష్ణకవి గారు తీవ్రంగా విమర్శించారు. రెండు పద్యాల తీరుతెన్నులు ఒకే ఛందంలో పూర్తిగా ఒకే పదపరిపాటితో ఉన్నందువల్ల, రెండింటి చివరి పాదాలూ పూర్తిగా ఒకటే కావటం వల్ల – అవి యాదృచ్ఛికాలు కావని, ఎవరో ఒకరు మూలకర్త, మరొకరు అనుకర్త అని అంగీకరింపక తప్పని పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణుని పద్యానికి మూలశ్లోకం ఒకటున్నదని, రామకృష్ణుని పద్యం ఆ శ్లోకానికి ఏ మార్పూ లేని సులక్షిత యథాతథానువాదమని ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడింది. వివిధచారిత్రికప్రమాణాల వల్ల ఆ శ్లోకం పూర్వుడైన నన్నెచోడునికి తెలిసి ఉండే అవకాశం లేదని కూడా ఊహింపబడింది. ఆ శ్లోకమొకటి ఉన్నదన్న విషయం తెలియని నన్నెచోడుడు వ్రాసిన దోషపూర్ణపద్యం నిర్దుష్టమైన రామకృష్ణుని పద్యానికి మూలం కాకపోగా దానికే ఒక అసమంజసానుకరణమని నిరూపింపబడింది.

    కుమారసంభవ కందర్పకేతువిలాసాలు ఒకే కావ్యానికి అనువాదాలు కావు. అయినా, సందర్భస్థగితంగా ఒకరిని మించి ఒకరు వ్రాయదలచిన నేపథ్యం కనబడుతూనే ఉన్నది. తిరుగులేని పద్యసాదృశ్యం అందుకు కారణం. నన్నెచోడుని పద్యంలోని లోపజాతం వల్ల నన్నెచోడుడే అనుకర్త అని, ఆ కారణాన తెనాలి కవి కంటె ఆధునికుడని వ్యాసంలో ప్రతిపాదింపబడింది.

    ఈ వ్యాసంలో కవి-కాలాదులకు సంబంధించిన ప్రతికూలసాక్ష్యాలు అన్నిటిని నేను వ్రాయలేదు కాని, కేవలం “అనుకరణ” విషయాన్ని మాత్రమే తీసికొన్నా సుమారు ౨౮౦ – ౩౦౦ నన్నెచోడుని పద్యాలను పదులకొద్దీ తెలుగు కవులు, కన్నడ కవులు (ఆ మాటకు వస్తే సంస్కృత కవులున్నూ) అనుకరించినట్లు కనబడుతున్నది. ఆ అన్ని చోట్ల నన్నెచోడుని పద్యంలో “ఎంతో కొంత లోపం” ఉన్నదని, ఆ అనుసరించిన కవులు దానికి “మెరుగెక్కించా”రని విమర్శకులు అంటున్నారు. ఇంతమంది బహుభాషల మహాకవులు ఆ స్వర్ణనిధి పేరయినా చెప్పకుండా ఆ మెరుగు తరుగున్న ముడిబంగారాన్ని కొల్లగొట్టి నాణ్యమైన నగలుగా మార్చుకోవాలని ఎందుకు ఉద్యమించారో ఊహించటం కష్టం.

    ఇక్కడ వస్తువును, పద్యాన్ని మార్చి వ్రాయటానికి ఆస్కారం లేని నేపథ్యమేదీ లేదు. “అర్థచౌర్యం” నిస్సందేహంగా జరిగింది. అదే కవి కాలనిర్ణయానికి పరికరించింది. ఇప్పటి వ్యాసపరిధి ఇంత మాత్రమే.

    మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  584. తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    10/06/2014 1:03 pm

    ఈ పద్యం చివరి చరణంలో గురువులన్నీ చాలా “తేలికైన”వని స్పష్టమే.

    “తేలికైన” గురువులు అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు, రామారావుగారు వివరిస్తే బాగుంటుంది. ఆ చివరిపాదంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక అక్షరం ఎన్ని రకాలుగా గురువు కాగలదో అన్ని రకాల ఉదాహరణలూ ఆ పాదంలో చూడవచ్చు! (ద్విత్వ సంయుక్తాక్షరాలను నేను ఒకే కేటగిరీగా చూస్తాను) క్లిష్టాక్షరాలతో కూడిన గురువులను రామారావుగారు “బరువైన” గురువులుగా భావిస్తున్నారేమో (తద్విపులవక్షశ్శైల రక్తౌఘ నిర్ఝరముర్వీపతి… మొదలైన చోట్ల ఉన్నట్టు). కాని ఆ బరువు, గురువులకి కాక అక్షరాలకు మాత్రమే ఆపాదించడం సమంజసం. ఉదాహరణకు “నిర్ఝర” శబ్దంలో బరువైన అక్షరం లఘువైన “ర్ఝ”. గురువులలో తేడాలు తేలిక, బరువు అని కాక – “పొడుగు”, “పొట్టి” అనే విధాలుగా చూడవచ్చు. దీర్ఘాచ్చులతో కూడినా గురువులు “పొడుగు” గురువులు (ఆ దీర్ఘం సంబోధనైతే, అది మరీ పొడుగు!). మిగతావి “పొట్టి” గురువులు. పొడుగు గురువులతో పద్యమంతా నిడితే, అది సాగినట్టుగా ఉంటుంది.

    పద్యం చదవడం గురించి గిడుగు సీతాపతిగారి వంటి కొందరు పూర్వం చర్చించారు. ఈ విషయమై చేరాగారి “వచన కవిత్వం – లక్షణ చర్చ:నిర్మాణ మూలాలు, నిర్వచన క్లేశాలు” కూడా చదవవలసిన వ్యాసం. అందులో వారు పద్యానికి మూడు స్థాయిలను చెపుతారు. నిర్వచన స్థాయి, నిర్వహణ స్థాయి, పఠన స్థాయి. ఇవి వృత్తాలలో, జాతులలో, ఉపజాతులలో, మాత్రాఛందస్సులో ఎలా ఉంటాయన్న సంగతి వివరిస్తారు. ఇది నాకు చాలా నచ్చింది.

    వృత్తాలలో(ముఖ్యంగా మాలా విక్రీడిత వృత్తాలలో) పద్యం నడక ఎక్కువగా నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి చంపకమాల మొదటి నాలుగు లఘువులూ ఒకే పదం వాడితే ఆ పద్యానికి వేగం వస్తుంది. ఉదా: “కనుగొని కోపవేగమున”, “అటజని గాంచె” (అట, చని రెండు పదాలైనా సంధి కలిసి ఒకే పదస్ఫురణ అక్కడుంది). అదే రెండు లఘువుల తర్వాత పదం విరిగితే, మెల్లని నడక వస్తుంది. ఉదా: “నను భవదీయదాసుని”.

    పోతన గారు “లలితస్కంథము ..” అని చంపకమాలని ఎందుకు ఎంచుకున్నారో తెలుస్తుంది.

    ఇది చంపకమాల కాదు మత్తేభం.

    “దుర్వారోద్యమ బాహువిక్రమ ..” (ఇది ఎర్రన గారిది)

    ఇది తిక్కనగారిది.

    ప్రమాదో ధీమతామపి! 🙂

  585. చిత్ర కవిత్వం ఒక చిరుపరిచయం గురించి Pavan Santhosh.S గారి అభిప్రాయం:

    09/29/2014 2:43 pm

    వెల్చేరు నారాయణరావు గారి అభిప్రాయాన్ని జత చేయడం చాలా బావుంది. పాఠకులకు శక్తి లేకపొవడం, వారికి శక్తి లేకపోవడం తప్పే కాదన్న వాదనలు బయలుదేరడం ఈ స్థితికి కారణం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాచీనమైన తెలుగు కవిత పోయిన వన్నెచిన్నెలు పట్టి తెచ్చి తన పరిధి ఒప్పిన మేరకూ, కొన్ని సందర్భాల్లో ఒప్పకున్నా ఒప్పించుకుని మరీ ఆ మేరకు తెలుగు సినీ కవిత్వంలో ప్రవేశపెట్టిన వేటూరి పాటల గురించీ వాటికి దక్కిన ఆదరణ గురించీ గుర్తు చేసుకుంటే ఆ సమస్య తేలుతుంది. “ఆరేసుకోబోయి పారేసుకున్నాను కోకెత్తు కెళ్ళింది కొండగాలి” అన్న పల్లవి గణాలే కాక ప్రాసయతి, యతీ కుదిరిన సీస పద్యమని చెప్పినప్పుడు చాలామంది దిమ్మెరపోయి దాన్ని చాన్నాళ్ళు తలచుకోవడం నాకు గుర్తే.(గూఢ కవిత్వం కామోసు) “గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన” కూడా సీసమే. “శృంగారం వాగైనది, ఆ వాగే వైగైనది” అంటూ ఏకంగా నాలుగేసి అక్షరాలు అంత్యంలో ప్రాసచేసి విచిత్రమైన పూర్వ కవుల ఆదరణాపాత్రమైన శబ్దాలంకారాలు.(ఇక్కడ చిత్రకవిత్వమో, బంధకవిత్వమో ఉందని కాదు) చూసినప్పుడు జనం పొందిన ఆనందం దాన్ని ధృవీకరిస్తుంది.

  586. కవుల వాగ్వాదాల్లోంచి కవిత్వం – గీరతం గురించి Pavan Santhosh.S గారి అభిప్రాయం:

    09/29/2014 2:11 pm

    కవిత్రయం ఏం సాధించారో మామూలు ప్రజకి అర్ధం కావడం కష్టం.

    మామూలు ప్రజకి చాలా కాలాల పాటు అర్థమయింది కనుకనే కవిత్రయంగా ఉన్నారు. పురాణ పఠన సంప్రదాయం గురించి బాగా తెలుసుకోండి. ఓ నలభై ఏళ్ళ నుంచి జరుగుతోందే తెలుగు సాహిత్య చరిత్రా కాదు, ఆంధ్ర మహా భారత చరిత్రా కాదు. వెల్చేరు నారాయణరావు గారి “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” దొరుకుతోంది, చదివి చూడండి. కొంతమేరకు అవగాహన కలగవచ్చు – మనకేం తెలియదు అన్న విషయమైనా.

  587. మంజుఘోష గురించి samavarti గారి అభిప్రాయం:

    09/23/2014 1:12 pm

    గౌరవనీయులైన కామేశ్వర రావు గారికి నమస్కారం.

    సందర్భొచితసమాస గ్రథనమే ఇక్కడ జరిగినదని మనవి.”ఇందులొ తిట్లు ఉన్నయ్యేమో” నన్న సందేహంతో నైనా వారిలో ఒకరైనా చదువుతారని అక్కడ ఆసమాసం వేశాను. కవితను మీరు చదివి అభిప్రాయం తెలిపినందుకు వినయపూర్వక ధన్యవాదములు.

    సమవర్తి

  588. మంజుఘోష గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    09/21/2014 10:23 am

    మంజుఘోష చాలా బాగుంది! అయితే యీ ఘోష ఆ కవుల చెవులకు చేరుతుందన్న నమ్మకం నాకు లేదు.

    “రమణీయామృత నవ్యవార్షుక పృషల్లాక్షణ్యవర్ణాదృతి”లాంటి సమాసోద్ధృతి కన్నా, “ములుకు ముట్టి గతించిన జంటకేడ్చు నా పిట్ట యెలుంగు” పలుకుసొబగు ఈ కవితలో నన్ను బాగా హత్తుకొంది.

    కవిత చదివగానే నాకీ దాశరథి పద్యం గుర్తుకువచ్చింది:

    ఏనాడెన్నడు కత్తితో గెలువలేదీ విశ్వమున్; ప్రేమ పా
    శానన్ గట్టుము నాలుగంబది ప్రపంచాలన్, మహాత్ముండిదే
    జ్ఞానోద్బోధను జేసె, నెవ్వడు వినెన్? సాహిత్యసామ్రాజ్యమం
    దైనన్ కొంతగ శాంతి పాదుకొననిమ్మా! నీకు పుణ్యంబగున్

  589. నా గురించి నేను గురించి Pavan Santhosh.S గారి అభిప్రాయం:

    09/20/2014 2:23 pm

    ప్రాచీన కవిత్వం ఎందుకు చదవాలంటే ఎట్లా రాయకూడదో తెలుసుకోవడానికి అని ఎవరో కాదు సాక్షాత్తు శ్రీశ్రీయే అన్నాడు.

    సాక్షాత్తూ శ్రీశ్రీ అని ఆ వాక్యాలకు ఏ విధమైన ప్రత్యెకత ఆపాదించాల్సిన అవసరం లేదు. శ్రీశ్రీ కవిత్వం, ఉపన్యాసాల్లోని మాటలు ఒకే స్థాయిలొ లేవు. కవిగా ఆయన ఔన్నత్యం ఆయన కొటేషన్స్ కి ఆపాదించేసి తెలుగు సాహిత్యంలో కొన్ని తరాలకు తరాలే నష్టపోయాయి. (అతిశయోక్తి కాదు) సహజంగా ఆయన వాక్యాల్లో ఉండే రిథం, రైం, ఒక్కొ చమక్కు వంటివి వాటిని సాహిత్యఅభిలాషులకు దగ్గర చేశాయి.

  590. చేరాతో ముఖాముఖి గురించి satheesh గారి అభిప్రాయం:

    09/18/2014 2:18 pm

    ఛందస్సు పై ఇంగ్లిష్ లో రాయలేదు. బాల ప్రౌఢ వ్యాకరణాలకు కొత్త వ్యాఖ్య రాయలేదు గానీ, ఇంగ్లీష్ లో రెండు వ్యాసాలు రాసారు. ప్రాచీనాంధ్ర భాషా వ్యాకరణం రాయలేదు. తెలుగు వచనశైలికి నమూనాలు సేకరించారు. అక్కడక్కడ వ్యాఖ్యలు రాశారు. కవిత్వం ఎట్లా చదవాలి? అనే దాన్ని ఆయన చాలా వ్యాసాల్లో చెప్పారు. ”A Sketches of Telugu grammar” రాశారుగానీ ఆచూకి దొరకలేదు. ‘తెలుగు వాక్యం’ ఇంగ్లిష్ చేసారు. త్వరలో రాబోతోంది.

  591. చివరకు మిగిలేది గురించి chalasani Srinivas గారి అభిప్రాయం:

    09/14/2014 5:44 am

    ఈ నడి వయసులో సమాజంలో ఉన్నతంగా వ్యవహరించాలని, నడవడికతో ఉండాలని నదిచిన ఆ అడుగుల తడి ఆరకుండా, ఏం సాధించలేకపోతున్నామనే కొంత బాధతో.. ఇప్పుడు మీ కవిత చదివిన తరువాత వచ్చే భవిష్యత్తుపై కొంత బెంగతో… అయినా మొక్కవోని ధైర్యాన్ని అప్పుతెచ్చుకుంటూ…. వడివడిగా అడుగులు వేయలేక…. వెళ్తున్నాం…

  592. పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము గురించి మంగు శివ రామ ప్రసాద్ గారి అభిప్రాయం:

    09/09/2014 1:14 pm

    “పార్వతి తపస్సు–నన్నెచోడుని కుమార సంభవము” అనే వ్యాసంలో మహాకవి వర్ణనా వైభవం వెల్లివిరిసింది. శివుని కోసం పార్వతి చేసే తపస్సులో నన్నెచోడుని కవితా తపస్సు ఇంద్రధనస్సు సప్త వర్ణాలను వెదజల్లింది. ‘వర్ణనా నిపుణ: కవి:’ అనే ఆర్యోక్తి నన్నెచోడునికి పూర్తిగా వర్తిస్తుంది. చక్కటి విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు. ఈ సంధర్భంలో కాళిదాసు ‘కుమార సంభవము’లోని శ్లోకాలతో తులనాత్మక పరిశీలన కూడా చేసి ఉన్నట్లయితే ఇంకా బాగుండేది. ముందుముందు ఇటువంటి సంప్రదాయక సాహిత్య రచనలను ఎన్నో అందిస్తారని ఆశిస్తూ.

  593. ఎడబాటు గురించి రాధ మండువ గారి అభిప్రాయం:

    09/01/2014 12:40 pm

    నాన్నని గుర్తుకు తెచ్చారు. కవిత చాలా బావుంది. అభినందనలు

  594. నిప్పులు గురించి రవి వీరెల్లి గారి అభిప్రాయం:

    09/01/2014 9:53 am

    మానస గారు,
    కవిత చాలా బాగుంది. శ్రద్దగా పెయింటింగ్ వేసినట్టు ఉంది.

    “ఎత్తుపళ్ళు దాచలేని నవ్వుల్తో
    ఏవో ఆశల్ని పరుస్తాడతను.”

    “కంటి చికిలింపుల్లో కథలు దాచుకుంటాయి” భలే!

  595. బిల్హణీయము గురించి venkat.b.rao గారి అభిప్రాయం:

    08/26/2014 3:34 pm

    నా ఆక్షేపణలకు వివరణలను చదివాక, నా సందేహం ఇంకా అదే – ఆయా భాగాలలోని కవిత్వం, ఛందస్సు, వ్యాకరణ శాస్త్రాలలోని సూత్రాలకు పూర్తిగా దగ్గరగా వున్నా, నిత్య జీవితంలోని మానవ సహజమైన ఆలోచనలకు, అనుభూతులకు మాత్రం చాలా దూరంగా వున్నదని!

    (తొలకరి) ‘ఆమబ్బులకై జనులు వేచి ఉంటారనేది ఇక్కడ పరిపూర్ణంగా అప్రస్తుతం, అనవసరం’– అన్నంత మాత్రాన ఆలోచన అటువైపు వెళ్ళకుండా ఆగుతుందా… ఆగదు! మానవ సహజమైన అనుభూతి ఆలోచనను మొదటగా అటువైపే తీసుకెళుతుంది. ‘ఆమబ్బుల యొక్క నల్లదనం మాత్రమే ఇచ్చట ప్రయోజనకరమైన అంశం’ అని అంటే… ఎంతమంది ‘తొలకరి’ అన్న మాటలో మబ్బుల ‘నల్లదనాన్ని’ మాత్రమే గణనలోకి తీసుకుంటారో నా ఊహకు అందని సంగతి.

    ఎక్కడిదాకానో ఎందుకు వివరణలోని ‘అంతవరకు తెల్లగా ఉండే మబ్బులు తొలకరిలో నవ్యమైన నల్లదనాన్ని సంతరించుకొని ఉంటాయి’ అన్న అంతకు ముందు వాక్యంలోనే (బహుశా అసంకల్పితంగా చేయబడి) ‘నవ్యమైన నల్లదనాన్ని సంతరించుకుని’ అన్న ఆహ్లాదకరమయిన వర్ణన వుంది! అందులోని ఆహ్లాదాన్ని పక్కనబెట్టి కేవలం ‘నల్లదనాన్ని’ మాత్రమే తీసుకుని అలాంటి నల్లని మబ్బుల కలతలు అని అర్ధంచేసుకోవాలి పాఠకుడు అనడం… ఏమో? నాకు అర్ధం కాని సంగతి.

    అలాగే, ‘యుగమే యొక దివసోపమ మగుచును’ అనే మాటలలోని భావనలో (అంత) ఉత్కృష్టత్త్వం (నిరూపితమవుతూ ఉంటే) అభిలషణీయమే కాబట్టి, అది అక్కడితో వదిలెయ్యడమే శ్రేష్ఠం!

    ఇక అవగాహనాలోపం/రాహిత్యం అన్న మాటలకొస్తే, “నిజమే, ‘మా కొలది జానపదులకు…’ అది సహజమే!” అన్నది నా విన్నపం.

  596. కనిపించడం లేదు గురించి Abdul hafeez గారి అభిప్రాయం:

    08/26/2014 1:12 pm

    కురిసె వెన్నెలతొ విరిసె మొగ్గలతొ కదిలె ఆకులతొ కలిసి కవిత్వాన్ని చెప్పిన కవయిత్రి మెహ్జబీన్. శీలం ప్రవాస జీవితం గడపదని,విలువలు కొలతల్లొ ఇమడవని , అవి అవ్యక్త భావనలని నిర్ద్వంద్వంగా చెప్పిన ధీర. “ఎదీ పొగొటుకొవలనిపించదు, నిర్లక్ష్యంగా వదిలి వెళ్లలనిపించదు” అన్న అందమైన కవి ఇప్పుదెందుకొ వినిపించడం లెదు.

  597. బిల్హణీయము గురించి venkat.b.rao గారి అభిప్రాయం:

    08/21/2014 10:52 am

    ఇందులోని చివరి గీతంలో కొన్ని పదాల వాడకం సందేహాలను రేకెత్తించేదిలా వుంది.

    గీతం ఎత్తుగడలోనే, పల్లవిలో, ‘కలతల తొలకరిమబ్బులు’ అనే ప్రయోగం.

    సహజంగానూ, మామూలు అనుభవంలోనూ తొలకరి ఎప్పుడూ మేనుకు ఆనందాన్నీ మనసుకు ఆహ్లాదాన్నీ కలిగించేదిగానే వుంటుంది. ‘కలతల తొలకరులు’ ఉండగలవా? అంటే మామూలు అనుభవంలో ఉండడానికి ఆస్కారంలేదనే సమాధానం దొరుకుతుంది. ఏ ఏటికాయేడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటాము కాబట్టి! మరి ఇక్కడ, ‘కలతల తొలకరిమబ్బులు’ అని ఉపమించడం జరిగింది. కారణం ఇదని స్పష్టంగా చూపగలిగితే తప్ప, మామూలు మనసుకు ఇది సహజ విరుధ్ధంగా అనిపించక మానదు!

    అలాగే, చివరినుంచి రెండవ (బిల్హణుని) చరణంలో ‘యుగమే యొక దివసోపమ మగుచును’ అనే మాటలు. ‘దినమొక యుగంగా గడుస్తోంది’ అనుకోవడం వేచివుండాల్సి రావడంలోని బాధను, వేదనను ద్విగుణీకృతం చేసేందుకు సాధారణంగా వాడే అతిశయోక్తి! అదలా వుండగా, ఆ అతిశయోక్తిని తిరగేసి, ఆనందమయంగా గడిచే రోజులు మనవి యుగమొక రోజుగానూ, మాసమొక క్షణంగానూ గడిచిపోవాలని ప్రయోగించడం సహజంగా మానవ హృదయం కోరుకునేదేనా? అసలెవరయినా సంతోషంగా ఆనందమయంగా గడిచే రోజులను క్షణాలలో అయిపోవాలని కోరుకుంటారా? నిజానికి అలాంటి క్షణాలు శాశ్వతంగా నిలిచిపోవాలని గదా కోరుకుంటారు?! అందుకు విరుధ్ధంగా ఇలా కవిత్వీకరించడం సరైనదేనా? అని సందేహం కలగక మానదు.

    ఇలాంటి సహజవిరుధ్ధాలయిన అభిప్రాయాలు, కోరికలు ఇబ్బందిపెడతాయి. ఆయా పాత్రలలోని వ్యక్తులు మనుషులేనా, లేక మానవాతీత వ్యక్తులా అన్న సందేహాన్ని కలగజేస్తాయి.

    ఆ సంగతినలా వుంచితే…

    ఈ సందర్భంలోనే ‘దివసోపమ మగుచును’ అనే ప్రయోగంలో ‘ఒక రోజుతో సమానమై’ అనే అర్ధంలో- ‘ఉపమ’ అనే పదానికి ‘సమానము’ అన్న అర్ధంలో ప్రయోగం నేను చదివినంతలో కనబడలేదు. ఒకవేళ, ఎక్కడైనా ఒకటిరెండు ప్రయోగాలు ఉన్నప్పటికీ, ఇక్కడి ఈ ప్రయోగంలో వ్యాకరణదోషం కూడా ఉన్నదేమోననీ, ‘దివసోపమ యగుచును’ అని ఉండడం సరైనదేమోననీ నా సందేహం. అదీగాక, ఈ సందర్భంలో ‘దివసము’ అనే మాట కూడా అంత ఉచితమైనదిగా తోచదు. ఇన్ని ఇబ్బందులున్న ఈ ప్రయోగాన్ని పక్కనబెట్టి, ‘యుగమే యొక దినసమాన మగుచును’ అని సరళంగా వ్రాసుకోవడంలో ఉన్న సౌకర్యాన్ని ఎందుకు వదులుకోవడం అన్న సందేహం కూడా కలుగక మానదు!

  598. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి Jagadeesh గారి అభిప్రాయం:

    08/14/2014 6:50 am

    ఛాల బాగుంది. కవిత అందరు రాస్తారు కాని కొందరు అందముగా రాస్తారు.

    ధన్యవాదాలు.

  599. ప్రాప్తం గురించి Sasi Priya Vangala గారి అభిప్రాయం:

    07/29/2014 4:53 am

    మా జ్నానానికి మీ కవిత ఒక పాఠం నేర్పింది.

  600. ఇది మరీ బావుంది గురించి Sasi Priya Vangala గారి అభిప్రాయం:

    07/29/2014 4:44 am

    కథని కవిత చేస్తే ఇలాగే ఉంటుంది.

  601. కాలం విలవ తెలీదు గురించి sundaram గారి అభిప్రాయం:

    07/25/2014 8:35 pm

    లలిత గారూ, ఇందులొ కవిత్వం ఎక్కడ వున్నదో వుంటే దాన్ని ఎలా గుర్తించాలొ దయచేసి తెలుపగలరా?

  602. కాలం విలవ తెలీదు గురించి Lalitha P. గారి అభిప్రాయం:

    07/24/2014 10:35 am

    చాలా బాగుంది. చివరి ఆరు వాక్యాలు సూచిస్తున్న మిషనరీ స్కూల్ ప్రిన్సిపల్ గారి మందలింపులోనేకదా కొస మెరుపుంది. అవి తీసేస్తే కవిత ఇంకేముంది? ఈ టీచరమ్మ మొదటి తరం ఉద్యోగిని పాపం. ‘చురుకుతుంది’, ‘ఇవిగోటి’ … మాంచి ఉత్తరాంధ్ర వగరున్నాది కవితలో.

  603. కాలం విలవ తెలీదు గురించి sundaram గారి అభిప్రాయం:

    07/18/2014 5:16 pm

    నారాయణ రావు గారూ నమస్కారం.

    ఫై రచన కవిత్వమేనని, మంచి కవిత్వమని ఎలా తెలుసుకోవచ్చు?

    సుందరం

  604. కొండదారిలో! గురించి Madhavi గారి అభిప్రాయం:

    07/12/2014 1:38 pm

    గాలి ఎక్కువ కదిలిందా, గడ్డి ఎక్కువ కదిలిందా, అసలు కదిలాయా లేదా అని ఆలోచించటానికి ఇది సందర్భం కాదు కదా. ఈ కవిత ఒక అనుభూతికి సంబంధించింది. దాని పరిమళాన్ని ఆస్వాదించటమే గానీ కళ్ళతో చూడాలని ప్రయత్నించటం నిష్ఫలం.

    మానసా… బాగుంది.

  605. కొండదారిలో! గురించి Azeez గారి అభిప్రాయం:

    07/11/2014 1:52 am

    1) గాలి అన్ని దిక్కుల్లోంచి వీస్తూ మొక్కలు అటూ ఇటూ ఊగుతున్నప్పుడు? మొక్కలు ముందుకూ వెనక్కూ పక్కకూ కదలడం, వాటి మధ్యలో నుండి గాలి అంటుకునేందుకా అన్నట్లు పరుగులు తీయడం ఈ అక్షరాలు చూపెడుతోన్న దృశ్యం. ఏ ఆటో తేల్చుకోలేని వాళ్ళ కోసం “కాబోలు” ఎలాగూ ఉంది.

    2) “ఎవరో పేనిన ఊడల ఉయ్యాల” కదూ. గాలికి నిశ్చయంగా ఊగుతుంది. ఊగితే కొమ్మకు కదలిక తప్పదు ? ఇవి నేలలోకి పాతుకుపోయిన ఊడలు కావు. గాల్లో వేలాడుతూండగా ఎవరి చేతుల్లోనో పడి ఉయ్యాలైన ఊడలు అని తోస్తోంది. తమిళనాడు పల్లెల్లో ఇదొక సర్వసాధారణమైన దృశ్యం.

    3) రెండు లేదా అంత కన్నా ఎక్కువ సర్పాలు ఒకే ప్రాంతంలో, ఒకే మైదానంలో కుబుసాలు విడుచుకోవడం విచిత్రమైన విషయం కాదు. అసాధ్యం అసలే కాదు.

    4) “వడివడిగా నడచిపోయిన” – కడియాల చప్పుడు ఎందుకు వచ్చిందో కూడా చెప్పారు కవితలోనే?

    Best Regards.

  606. కాలం విలవ తెలీదు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    07/08/2014 12:45 pm

    ఖచ్చితంగా ఒక అద్భుతవైన కవిత్వం.

  607. కొండదారిలో! గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    07/08/2014 12:10 pm

    అవన్నీ చూసుకున్నా, లేకపోయినా ఎందుకా కవిత? నిజవే కవితలో, కవయిత్రి లో వ్రాయగలిగే, వ్రాతల ద్వారా మనసును చేరగలిగే స్కిల్ మాత్రం వుంది, కానీ అది పదాల మేజిక్ తోనే ఆగిపోయింది ఈ కవితలో. టోకన్ మనసుకి చేరుతుంది, కానీ అది ఖాళీగా వుంది మరి. ఉత్తరం చించితే లోపల తెల్ల కాగితం తప్ప మరేవీ లేనట్టు.

  608. కొండదారిలో! గురించి Sastry గారి అభిప్రాయం:

    07/07/2014 12:42 pm

    మానస గారు:

    కవిత బాగానే ఉన్నది. వీటిని గమనించండి.

    1. అంటుకునే ఆటకి ఆటగాళ్ళిద్దరూ పరిగెత్తాలి లేక కదలగలగాలి. ఇక్కడ కదిలేది గాలి ఒక్కటే కదా?

    2. కొమ్మలు కదిలితే ఊడలు ఊగుతాయి. ఊడలు కొమ్మలని ఊపడం?

    3. పాములు తమ కుబుసాలని జంటగా కూర్చుని విడుచుకోవు?

    4. కడియాలకి చప్పుడు రాదు. అవి ఘల్లుమని మోగవు?

    ఇటువంటి జాగ్రత్తగా చూసుకుంటూ కవిత్వం రాస్తూంటే కొన్నాళ్ళకి మంచి కవిత్వం రాయొచ్చేమో.

    అభినందనలతో
    శాస్త్రి.

  609. బిల్హణీయము గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    07/06/2014 1:28 pm

    చాలా హృద్యంగా రసరమ్యంగా ఉంది! ఆద్యంతం చంద్రునితో అనుసంధానం చేసి సాగిన వర్ణనలు మొత్తం నాటికకి చక్కని నేపథ్యంగా నిలిచాయి. నాటికంతటికీ నాకు బాగా నచ్చిన పద్యం, గొప్ప రసాత్మకమైనది:

    ఆవిమలాత్ముసఖ్యమె మదంగము నెప్పుడు చేతనత్వసం
    భావితముం బొనర్పఁదగు ప్రాణము; తద్రహితాంగ మెన్నఁగా
    జీవములేని కాష్ఠమగు, చేకొని దానముసేయ దాని నిం
    కో వసుధాధినాథునకు యుక్తమె చెప్పుమ మానవేశ్వరా!

    అలాగే, “క్షోణ్యంశ మాఘనశ్రోణి చరించెడు…” అన్న సీసంలో, నాయికకు ప్రయోగించిన సాభిప్రాయ పదాలు ఆ పద్యాన్ని గొప్ప అనువాదంగా తీర్చిదిద్దాయి. బంగారానికి తావి అబ్బగల మహిమని గుర్తించలేని వారు మాత్రమే కవితానువాదాన్ని తక్కువగా చూస్తారు.

    “హా కవిరాజశిఖామణీ! హా నవమోహన! హా మనోహరా!” అన్న పాదంలో గణం తప్పింది. అయినా సందర్భోచితంగానే ఉంది, యామిని తడబాటును వ్యంజింపజేస్తూ!

    ఒక చిన్న సందేహం. “ఆ! మొన్ననే ఆమె రాణిగారి ముందర చాలా చక్కగా తన పాండిత్యం ప్రదర్శించుకుంది” – “ప్రదర్శించు” అనే క్రియను ఇలా ఆత్మనేపద రూపంలో ప్రయోగించడం వ్యాకరణసమ్మతమేనా?

  610. కొండదారిలో! గురించి Velcheru Narayana Rao గారి అభిప్రాయం:

    07/05/2014 6:25 pm

    మీరు మాటల చప్పుళ్లతో బొమ్మ కట్ట గలరు. బాగా రాస్తున్నారు. మీలా రాసేవారు తెలుగులో చాలా తక్కువమంది వున్నారు. మీ కవిత్వం మళ్ళా మళ్ళా చదవాలనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తగా వుంటుంది.–నారా

  611. కొండదారిలో! గురించి navin గారి అభిప్రాయం:

    07/05/2014 3:22 am

    మనసును హత్తుకొనె భావ పరిమళమేదో మీ కవిత్వంలో ఉన్నట్లుంది.అది ఊపిరిలో చేరి మనసుని నీలాకాశం మోసుకెల్లె కడవని చేసింది.

  612. ఈమాట జులై 2014 సంచికకు స్వాగతం! గురించి మోహన గారి అభిప్రాయం:

    07/03/2014 11:14 am

    ఈ సంచిక ఒక సర్వాంగసుందరమైన సంచిక. దేశికాచార్యుల బిల్హణీయ నాటిక నన్ను మొట్టమొదట ఆకట్టుకొన్నది. అందులోని పద్యములు, గీతములు రసవత్తరముగా నున్నవి. మురళీధరరావుగారి పాండిత్యము, తర్కము, భాషాపటిమ వారి వ్యాసములో ప్రతిబింబించుచున్నది. కామేశ్వరరావుగారి వివరణ పద్యమునకన్న మిన్నగా నున్నది. తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్ పైన దిలీప్ గారి పరిచయ వ్యాసము చదువుటకు చక్కగా నున్నది. ఇది భవిష్యత్తులో బహుజనోపాయకారిగా నుంటుందని ఆశిస్తున్నాను. ఇవి గాక ఇతర రచయితల వ్యాసములు, కవితలు, శబ్దతరంగములు మనోరంజితములు. ఇంత చక్కని సంచికను అందజేసిన సంపాదకులకు నా జోహారులు. – మోహన

  613. నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం గురించి రవి గారి అభిప్రాయం:

    07/03/2014 2:56 am

    నేనీ మధ్య కాళిదాసు నాటకం విక్రమోర్వశీయం చదువుకుంటున్నాను. విక్రమోర్వశీయం నాలుగవ అంకంలో ఊర్వశీవిరహతప్తుడైన విక్రముడు అడవిలో తన ప్రేయసి వివరాలను అక్కడ కనిపించే మేఘాలతో, నెమళ్ళతో, జింకలతో, సెలయేరుతో అడుగుతూ వాపోతాడు. ఆ ఘట్తం అంతటా పూర్తిగా స్వభావోక్తి వర్ణనలు, సహజమైన ఉపమలు, ఎక్కువగా దైవసృష్టిలో అంతర్భాగాలు లేదా కనీసం రోజూ కంటికి తారసపడి ఇంపు కలిగించే వస్తువులు. ఆ కావ్యం మాత్రమే కాక కాళిదాసు మిగిలిన కావ్యాల్లో, ఇతరత్రా ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఎక్కువగా ఉపమాన ఉపమేయాల కోసం సహజమైన, మనిషి ఊహకు అనాయాసకరమైన వస్తువులను భావన చేయడం నాకు కనిపించింది.

    అందుకు కాస్త విభిన్నంగా – మనిషి తన బుద్ధిని పదుని పెట్టి, లేదా కాస్త ఆలోచించి తెలుసుకోగల ఉపమలు, ఉత్ప్రేక్షల గురించి ఆలోచించినప్పుడు మొదటగా తట్టింది – చంద్రుని గురించిన వర్ణన – చరమాద్రి దావాగ్ని సంప్లుష్ట సురసారభేయీ కరీషైక పిండము – అన్న వర్ణన. అప్పుడే ఈ వ్యాసం కనిపించింది.

    ఇక్కడ కనిపించే ఈ పద్యానికి సంబంధించిన ఉపమలలో కాస్త బుద్ధికి శ్రమ కలిగించే లక్షణం కనిపిస్తోంది.

    కమ్ముకుంటున్న చీకటి=బురద (ఇక్కడ ఉపమ సహజమైన పదార్థం కాకపోగా కాస్త విముఖత్వం పుట్టించే వస్తువు)

    చీకటి = కార్చిచ్చు తాలూకు పొగ,(కార్చిచ్చును చూసిన వారికి, లేదా ఊహించగలిగిన వారికి, కార్చిచ్చు అనగానే కలిగే భయం, విముఖత్వం అధిగమించి ఆసక్తితో చూడగలిగిన వారికి స్వారస్యం కలిగించే ఉపమానం)

    నేల = మణిని కోల్పోయి, దానికోసం వెతుకుతున్న ఆకాశం లా (ఈ ఉత్ప్రేక్ష కాస్త బుద్ధికి అందుతోంది, అద్భుతంగానూ ఉంది, ఆకాశాన్ని రోజూ చూస్తుంటాం గనుక)

    రాత్రి పూట ఆకాశం = మసిపూత పూసిన ఫలక (ఇది కూడా బుద్ధికి పనిచెప్పే ఉపమ)

    అంధకారం = వృద్ధవేశ్యలకు hair dye లా, జారులకు అదృశ్యాంజనం లా (ఇవీ కాస్త సహజత్వానికి దూరమైన ఉపమలు)

    ఈ ఉపమల్లో కవి కల్పనాశక్తి గొప్పగా ఉందనటానికి విరోధమేదీ లేదు కానీ, సామాజికుడికి, కార్చిచ్చులను, hair dye లాంటి వాటిని భరించలేని సగటు సామాజికునికి కలిగే రసస్ఫూర్తి ఏది అని ప్రశ్న. మరో విధంగా చెప్పాలంటే – కవిత్వంలో స్వారస్యం గ్రహించాలంటే – బహుశా సామాజికుడు బౌద్ధికంగా కాస్త ఎదగాలి. తనను తాను కవికి అనుగుణంగా mould చేసుకోవాలి. అలా చేయలేని నా వంటి అర్భకులకు బహుశా ఈ విధమైన కవిత్వం అచ్చిరాదు!

  614. కాలం విలవ తెలీదు గురించి Velcheru Narayan Rao గారి అభిప్రాయం:

    07/02/2014 11:46 pm

    సుందరంగారూ, అవును ఇది కవిత్వమే. మంచి కవిత్వం.

    కనకప్రసాద్ గారూ. మీరేం అనుకోకపోతే, ఆ చివరి చరణం ఆరు పాదాలూ అక్కర్లేదు, తీసెయ్యండి. పద్యం శీర్షిక అలాగే వుంచండి.

  615. శార్దూలవిక్రీడిత వృత్తము గురించి మోహన గారి అభిప్రాయం:

    07/02/2014 7:34 am

    కవితాప్రసాద్ గారు, వ్యాసము నచ్చినందులకు సంతోషము.

    మేఘవిస్ఫూర్జిత వృత్తమునకు మందాక్రాంతమునకు పోలికలు ఉన్నవి. మేఘవిస్ఫూర్జితములో ముందున్న లగమును (IU) తొలగించగా మనకు మందాక్రాంత వృత్తము లభించును. ఈ విషయమును నేను “ఆషాఢస్య ప్రథమ దివసే” వ్యాసములోని పట్టికలో చూపియున్నాను. ఈ వృత్తమును గురించి నేను 14 ఫిబ్రవరి 2005 తారీకు మందాక్రాంతమును చర్చించు సమయములో తెలిపియున్నాను. అందులోని విషయాలు –

    మందాక్రాంత – 7

    క్రింద ఒక మందాక్రాంతము-

    ఆనందమ్మై – యమితగతితో – నందమై డెంద మూగున్
    శ్రీనాథా నీ – చిరునగవులే – చిత్రజీవంపు చేవల్
    త్రాణమ్మీయన్ – ద్వరితగతితోఁ – దన్వి ధైర్యమ్ముగా రా
    వేణిన్ బెట్టన్ – బ్రియపు సరులన్ – ప్రేమ వేదమ్ముగా రా

    మందాక్రాంతపు లక్షణములను ఇమిడించుకొన్న మఱొక వృత్తము మేఘవిస్ఫూర్జితము. మందాక్రాంతపు పాదమునకు ముందు ఒక లగమును ఉంచినయెడల మేఘవిస్ఫూర్జితము లభించును.

    మేఘవిస్ఫూర్జితము – 19 అతిధృతి 75714
    గణములు – య మ న స ర ర గ
    తెలుగు యతి – 1, 13
    సంస్కృత యతి – 1, 7, 15

    పై మందాక్రాంతమును మేఘవిస్ఫూర్జితము చేద్దామా- (యతి తెలుగు, సంస్కృతము రెంటికి చెల్లునట్లు వ్రాసినాను.)

    మేఘవిస్ఫూర్జితము-

    హరీ యానందమ్మై – యమితగతితో – నందమై డెంద మూగున్
    సిరుల్ శ్రీనాథా నీ – చిరునగవులే – చిత్రజీవంపు చేవల్
    దరిన్ త్రాణమ్మీయన్ – ద్వరితగతితోఁ – దన్వి ధైర్యమ్ముగా రా
    విరుల్ వేణిన్ బెట్టన్ – బ్రియపు సరులన్ – ప్రేమ వేదమ్ముగా రా

    విధేయుడు – మోహన

  616. భావించేవరకూ… గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    07/02/2014 5:59 am

    ముచ్చటైన కవితంటే కాదనకు [కాదనకండి].
    ఇలాంటిదే మరో కవిత కావాలంటే కుదరదనకు [కుదరదనకండి].

    చిన్ని కవితను అందించిన రచయిత్రి గారికి సంపాదకులు గారికి అభినందనలతో:–

    ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు.

  617. కాలం విలవ తెలీదు గురించి sundaram గారి అభిప్రాయం:

    07/02/2014 1:01 am

    ఈ రచన కవిత్వమా ?

  618. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి మోహన గారి అభిప్రాయం:

    06/30/2014 5:33 pm

    మిగిలిన విషయాలు నాకు తెలియవు కాని జయప్రభగారికి కొత్త ఛందస్సులో మాత్రమే కాదు, ప్రాఛీన ఛందస్సులో కూడ ఆసక్తి, ప్రావీణ్యము, గరిమ ఉన్నాయి. ఆమె భావకవిత్వములో స్త్రీపైన మాత్రమే కాదు, అన్నమాచార్యుల రచనలపైన కూడ ప్రచురించియున్నారు. పద్యాలను జ్ఞాపకము చేసికొని అనర్గళముగా గంగాప్రవాహములా వల్లించగలిగే ధారణాశక్తి గలవారు. నా ఉద్దేశములో PhD అనేది ఒక శిక్షణ మాత్రమే. ఆ పట్టా విద్యకు అంతము కాదు, ఒక పునాది మాత్రమే. ఆ పట్టాను పుచ్చుకొన్న తరువాత ఏమి చేస్తారన్నదే ముఖ్యమైన విషయము. ఆ PhD పట్టా లేకుండా కూడ పరిశోధనలను ఇంతకు ముందు చేసారు, ఇప్పుడు చేస్తున్నారు, ఇకపైన కూడ చేస్తారు. PhD degree లేక ఎన్నో విద్యార్థులకు PhD పట్టంకోసం guide చేసిన వారు కూడ ఉన్నారు (ఉదా. రామన్, బోస్). విధేయుడు – మోహన

  619. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి తః తః గారి అభిప్రాయం:

    06/16/2014 10:59 pm

    శ్రీ మోహన: డిగ్రీ ల గురించి ‘ ఇంటి దగ్గరి ‘ ఉదాహరణ

    కవితలు ఆంధ్రప్రశస్తి:
    విశ్వనాథ సత్యనారాయణ
    అంకితము
    మల్లంపల్లి సోమశేఖరశర్మకు
    ……

    ‘డిగ్రీలు’ లేని పాండిత్యంబు వన్నెకు – రాని యీ పాడుకాలానఁ బుట్టి
    నీ చరిత్రజ్ఞాన నిర్మలాంభఃపూర – మూషరక్షేత్ర వర్షోదక మయి ….
    తః తః

  620. దేహాత్మ గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ గారి అభిప్రాయం:

    06/13/2014 6:27 am

    ఆలోచింపచేసే కవిత.
    ఆత్మ లేని శరీరాన్ని ఊహించలేము. శరీరం లేని ఆత్మను నిరూపించుకోలేము!
    ఇంతకీ రసయోగ సిద్ధాంతం అంటే ఏమిటి, ఇదీ మతస్థాయికి దిగిందా? తెలిసినవారు తెలుపగలరు.
    ఎవరిదో ఈ రచన!

  621. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    06/11/2014 4:22 pm

    మాన్యులు శ్రీ శ్రీనివాస్ గారికి, నారాయణరావుగారికి, నమస్కారములతో,

    సౌమ్య వి.బి. గారు మిమ్మల్ని తెలుగు కావ్యాల పరిష్కరణవిధానం గుఱించి అడిగిన ప్రశ్నకు నా వంటి విద్యార్థులకు ఉపకరించే సూత్రాలను కొన్నైనా నిర్దేశింపగలరని ఎదురుచూశాను. అందుకింకా వ్యవధి ఉంటుందని తెలిసి కొంత నిరాశ కలిగింది. మీ బ్రౌన్ దర్శనమీమాంసను అధికరించిన మాటలను ఇప్పటికి వాయిదా వేసి, కొన్ని లఘుప్రస్తావితాల గుఱించిన నా సందేహాలను మాత్రమే విన్నవింపదలిచాను.

    (1)

    ఇది ఇలా వుండగా బ్రౌన్ తరవాత పుస్తకాలు అచ్చు వేసిన వాళ్లందరూ — వావిళ్ల వారు కావచ్చు, వేదం వారు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు — బ్రౌన్ పరిష్కరించిన ప్రతిని వాడుకోలేదని మనకి స్పష్టంగా తెలుసు. అయితే బ్రౌన్ అనుసరించిన గ్రంథ పరిష్కరణ పద్ధతుల్ని వీళ్ళు దాదాపుగా అనుసరించారా? అయినా ఆయన పేరెందుకు చెప్పలేదు?

    ఈ మాటలను మీరు ఏ ఆధారంతో వ్రాశారో నాకు తెలియలేదు. బ్రౌను ‘పరిష్కరించిన ప్రతి’ అన్నారు కాబట్టి. ముఖ్యంగా మనుచరిత్రను, వసుచరిత్రను, ఆముక్తమాల్యదను అచ్చువేసిన వావిళ్ళ వారు; ఆముక్తమాల్యదను, శృంగారనైషధాన్ని ప్రకటించిన వేదం వారు ఆ, ఇంకా తదితరులు ఆయన ప్రతులను వాడుకోలేదని ‘మనకి’ ఎలా స్పష్టంగా తెలుసో నాకు తెలియలేదు.

    1927లో ప్రకటితమైన వేదం వారి ఆముక్తమాల్యదా సంజీవనీ వ్యాఖ్యకు ప్రారంభవాక్యమే ఇది: “మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో ఆముక్తమాల్యదం గూర్చి వ్యాఖ్యలును సూచికలును కొన్ని కలవు. అవియన్నియు కొన్నిభాగములకే వివరణోద్యమములు.”

    ఇందులో వేదం వారు పేరు చెప్పకపోయినా పేర్కొన్న వ్యాఖ్యలు – బ్రౌను హయాంలో సేకరింపబడిన గుడిపాటి వెంకటకవి తాత్పర్యబోధిని, జోగి జగన్నాథరాజు బుధమనస్తోషిణి, శ్రీనివాసకవి శ్రీనివాసీయ వ్యాఖ్య, అజ్ఞాతకర్తృకమైన ఒక టీక మొదలైనవి. అవి ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. వేదం వారు ‘సూచిక’ అని పేర్కొన్నది బ్రౌను దొర సిద్ధం 1849లో చేసిన ఆముక్తమాల్యదా శబ్దసూచి. అది శబ్దరత్నాకర నిఘంటునిర్మాణంలో బహుజనపల్లి సీతారామాచార్యుల వారికి, సంజీవనీ వ్యాఖ్య నిర్మాణంలో వేదం వేంకటరాయశాస్త్రిగారికి ఎంత ఉపకరించినదీ ఆ గ్రంథాలలోని పాఠాలే మనకు సాక్ష్యామిస్తాయి. బ్రౌన్ ప్రతులు వారికి ఉపకరింపలేదనటం సరికాదు.

    వావిళ్ళ వారు బ్రౌను మనుచరిత్ర ప్రతిని ‘వాడుకొన్నారని’ మనుచరిత్రలోని వారి పాఠనిర్ణయక్రమమే వేయినోళ్ళతో చాటుతున్నది. పాఠాలను స్వీకరించి, అర్థనిర్ణయంలో మాత్రం స్వతంత్రమార్గాన్ని అవలంబించారు. మనుచరిత్ర వ్యాఖ్యలో జూలూరి అప్పయ్య గారు ద్వితీయాశ్వాసం ఆఱవ పద్యంలో “పరిమళలహరీ+ హల్లోహల” అని పదచ్ఛేదం చేసి “హల్లోహల = తొట్రువడిన వాక్కులు గల” అని అర్థాన్ని వ్రాయగా, వావిళ్ళ వారు విభేదించి “పరిమళ+లహరీ+ఈహత్+లోహల” అని పదచ్ఛేదం చేసి అర్థాన్ని వ్రాశారు. ఇటువంటివి కోకొల్లలు. బ్రౌనుగారికి అభిమానపాత్రమై బ్రౌణ్యంలోనికి ఎక్కినంతమాత్రాన వావిళ్ళ వారు ఆ అర్థాలను గ్రహింపకపోయినా, చాలా వఱకు బ్రౌను ముద్రణలోని పాఠవ్యవస్థనే అనుసరించారు.

    జాగ్రత్తగా చూస్తే, బ్రౌను మనుచరిత్ర ముద్రణలో తప్ప మఱెక్కడా కనిపించని ప్రయోగాలు (చూ. వెల్చ) శబ్దరత్నాకరంలోకి అడుగుపెట్టాయి. అది సీతారామాచార్యులవారు బ్రౌను ప్రతులను వాడుకొన్నారనటానికి నిదర్శనం. ఆయన స్వయంగా పరిష్కరించిన పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి ‘జైమిని భారతము’, యతిరాజులు నాయుడు గారి ‘జైమిని భారతము’ ముద్రణ – బ్రౌన్ సేకరించిన ప్రతుల మూలకంగా పరిష్కరింపబడినవని తెలుస్తుంది.

    బ్రౌను ప్రతులను వాడుకొన్న ‘ఇంకా ఇతరులు’ అనేకులే ఉన్నారు. బ్రౌను ప్రతులను వాడుకొన్న విద్వాంసులందరూ ఆయన పేరును స్మరింపలేదనటం కూడా సరికాదు. 1895లో తొలిసారి ధూర్జటి కాళహస్తి మాహాత్మ్యాన్ని ప్రకటించిన క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రులవారు, ఆర్. వేంకటసుబ్బయ్యగారు తమ ‘పీఠిక’లో – “దొరతనమువారి లిఖితపుస్తక భాండారంబునందు మెస్తరు బ్రౌన్ దొరగారిచే సేకరింపబడి కడు హెచ్చరికతో వ్రాయింపబడిన ప్రతియొకండు మాకు దొరకె.” అని వ్రాశారు. ఈ మాటలు బ్రౌన్ గారి సేకరణపై వారికేర్పడిన కృతజ్ఞతాభావానికి సూచికలు. 1870లో కస్తూరి రంగకవి సాంబనిఘంటువు కర్నూలు జిల్లా రామళ్ళకోట నివాసి నన్నూరు వెంకటకృష్ణశాస్త్రి గారి టీకతోనూ; 1872లో ధనంజయ నిఘంటువు, 1897లో ఇరుగపదండేశుని నానార్థ రత్నమాల వాందారి పాపన్నశాస్త్రులవారి టీకతోనూ; 1898లో సుజనరంజనీ సీరీస్ వారి 4-వ సంపుటంగా గణపవరపు వేంకటకవి వేంకటేశాంధ్రము; 1898లో పైడిపాటి లక్ష్మణకవి ఆంధ్రనామసంగ్రహము వెలువడ్డాయి. ఇవన్నీ మద్రాసులోని బ్రౌను సేకరణ ప్రతుల ఆధారంగా వెలసినవే అని సులభంగా గ్రహింపవచ్చును.

    1900లో వీటిని మళ్ళీ ఒక సంపుటంగా రూపొందించి కోటి వేంకనార్యుని ఆంధ్రభాషార్ణవముతో కలిపి అమ్మిన పరవస్తు వేంకటరంగనాథస్వామి గారు వీటిని బ్రౌను ప్రతుల ఆధారంగానే అచ్చువేశారని — “మఱియైదు తాటియాకు ప్రతులును, మఱియొక కాకితపు బ్రతియునుగూడ నున్నవి.” అని పేర్కొన్నది బ్రౌను సంచయంలోని అయిదు ప్రతులను గుఱించే. ఇప్పటికీ అవి మద్రాసులో ఆ ప్రకారంగానే ఉన్నాయి. అంతే గాక, ఆయన — “అకారాది శబ్దసూచి (Index) కూడ ద్వరలో ముద్రింప సమకట్టి యున్నాము” అని పేర్కొన్నది బ్రౌన్ దొర వ్రాయించిన ‘ఆంధ్రభాషార్ణవ శబ్దసూచి’ మూలకమే. బ్రౌన్ దొర వ్రాయించిన ఆ ‘ఆంధ్రభాషార్ణవ శబ్దసూచి’ 216 వరుస సంఖ్యతో ఇప్పటికీ అక్కడున్నది.

    ఇవన్నీ బ్రౌను సంచయాన్ని మనవాళ్ళు వాడుకొన్నారనటానికి నేను ప్రస్తుతం నా దగ్గరున్న కొన్ని పుస్తకాలలోనుంచి మాత్రమే ఉదాహరించాను. నా దగ్గర లేనివి ఇంకా ఎన్నో ఉంటాయి.

    (2)

    అయితే బ్రౌన్ అనుసరించిన గ్రంథ పరిష్కరణ పద్ధతుల్ని వీళ్ళు దాదాపుగా అనుసరించారా? అయినా ఆయన పేరెందుకు చెప్పలేదు?

    బ్రౌన్ అనుసరించిన గ్రంథపరిష్కరణపద్ధతులేమిటో మీరు తర్వాత వివరిస్తానన్నారు. అప్పుడు వీళ్ళు దాదాపుగా అనుసరించారో లేదో నిర్ణయించటం సుళువవుతుంది.

    (3)

    తెలుగుని ఉద్ధరించే పనిలో ఉన్నాడు కాబట్టి ఉచ్చారణలో ఆచూకీ లేని బండి-రలు, అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించాడు.

    బ్రౌను తన ముద్రణలలో శకటరేఫలను పూర్తిగా తీసేయించాడన్నది ఎంతవఱకు నిజమో నాకు తెలియదు. మనుచరిత్రలో శకటరేఫలు అసలు లేవనటం సరికాదు. మీరు ఉదాహరించిన ప్రతినే మళ్ళీ చూడండి. నా సొంత ప్రతి ఇప్పుడు హైదరాబాదులో మా ఇంట ఉన్నది కాని, అందులో ఉన్నాయనే నాకు జ్ఞాపకం. మీరు ఉదాహరించిన ప్రతిలోని ఆ తొలిపుటలో శకటరేఫల అవసరం లేదు కాబట్టి అవి అందులో లేవు. నేను నా దగ్గరున్న జూలూరి అప్పయ్య గారి వ్యాఖ్యతో ఉన్న నా సొంత వసుచరిత్ర ప్రతిని ఈరోజు పూర్తిగా పరీక్షించి చూశాను. అందులో నియత శకటరేఫలు నియమానుసారం ఉన్నాయి. కవిత్రయ భారతం తొలినాటి బ్రౌన్ ముద్రణలో ఎట్లా ఉండినదో నేను చెప్పలేను. నా దగ్గరున్న బ్రౌన్ మలిముద్రణలో శకటరేఫ, అరసున్న – రెండూ ఉన్నాయి. మీరు చూడదలచుకొంటే ఒకటి రెండు పేజీలు ఫోటో తీసి పంపించగలను.

    అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించాడు.

    ఈ వాక్యం నాకు బోధపడలేదు. “అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించటం” ఏమిటి?

    బ్రౌన్ దొర బండి-ర లను పాటించినా, మనుచరిత్ర, వసుచరిత్రలలో అరసున్నలను తొలగించి అచ్చువేయించిన మాట నిజమే. అయితే, 1827లో అచ్చువేయించిన ‘ఆంధ్ర గీర్వాణచ్ఛందస్సు’లో అరసున్నలను పాటించాడు, మీరూ చూడండి. ఈ రెండింటి విషయమై బ్రౌన్ ఒక స్థిరనిశ్చయంతో లేరని, వివిధపద్ధతుల ప్రయోగాలను చేస్తూ వచ్చారని – ఈ ఉదాహరణలు వెల్లడిస్తాయి.

    ఆ ప్రతులు ఎవరన్నా వాడుకోదలుచుకున్నా పాఠపరిష్కరణ విషయంలో అవి పనికిరావని చెప్పాం. అందులో అర సున్నలు, బండి రలు పాటించక పోవటం, అందుకు ప్రధాన కారణం.

    అరసున్నలు, బండి-ర లు తాళపత్ర ప్రతులలోనూ ఉండవు. బ్రౌన్ ప్రతులలో అవి లేకపోతే అదొక సమస్య కాదు. అదే సమస్య అయితే, వాటిని చేర్చటం ఒక రోజు పని. బ్రౌన్ ఎన్నుకొన్న పాఠాలకంటె తమకు లభించిన ప్రతులలో మేలైన పాఠాలున్నాయని అద్యతన పరిష్కర్తలు భావించటమే వాటిని ప్రమాణీకరించకపోవటానికి కారణం. ఎమెస్కో వారి కావ్యాల ప్రచురణకోసం పరిష్కర్త శ్రీ తీర్థం శ్రీధరమూర్తి గారు స్వీకరించిన మేలైన పాఠాలన్నీ బ్రౌన్ దొర సంచయం లోనివే. ఆ గ్రంథాలయంలోని నిబంధనల కారణంగా వారు ఆ కావ్యాలపై తమ పేరును వేసుకొనలేదు. ఆ విధమైన కారణం వల్లనే చాలామంది పరిష్కర్తలు, ముద్రాపకులు బ్రౌన్ సంచయాన్ని వాడుకొన్నా, ఆ రోజులలో ప్రాచ్యలిఖిత గ్రంథాలయం వారి ఏవేవో నియమాల కారణంగా ఆ విషయాన్ని పేర్కొనటం జరగలేదు. అది బ్రౌన్ కృషి స్వరూపం తెలియకా కాదు; వారి కృతజ్ఞతారాహిత్యమూ కాదు; బ్రౌన్ సంచయం నిరుపయోగం కావటం వల్లనూ కాదు.

    (4)

    కానీ ములుపాక బుచ్చయ్య వసుచరిత్రకి వ్యాఖ్యానం రాసినప్పుడు బ్రౌన్ నిర్దేశించిన పద్ధతుల్ని అనుసరించలేదు. ఆయన వ్యాఖ్యానం గ్రాంథికంలో ఉంది కాబట్టి ముద్రించలేదని బంగోరె మొదలుకొని ఆరుద్ర వరకు చాలా మంది అన్నప్పటికీ, ఆ వ్యాఖ్యానం కళ్లారా చూస్తే కానీ బుచ్చయ్యగారు అనుసరించిన పద్ధతులేమిటో మనకు స్పష్టంగా తెలియవు. అంతే కాదు, ఆయన అచ్చు వేసిన వసుచరిత్ర, మనుచరిత్ర మొదలైన పుస్తకాలని ఎవ్వరూ తిరిగి అచ్చు వేయలేదు.

    ఆరుద్ర గారు ఈ విషయమై వ్రాసినది సరిగా లేదు. బుచ్చయ్యగారి వ్యాఖ్య అచ్చుపడకపోవటానికి కారణం ‘పరిష్కరణ పద్ధతి’ కాక ఇంకేదో అయివుంటుంది. జూలూరి వారి వ్యాఖ్య గ్రాంథిక-వ్యావహారికాల సమ్మిశ్రణగా, ఆరుద్రగారు అన్నట్లుగా కాక -– సలక్షణమైన అలంకారాది వివేచనతో, సంస్కృత లక్షణోదాహరణలతో భవ్యంగా, భావ్యంగా ఉన్నది. ఆ తర్వాత కాలంలో సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య, తంజనగరం తేవప్పెరుమాళయ్య గారి అద్భుతమైన వ్యాఖ్య, వావిళ్ళ వారి పరివర్ధిత వ్యాఖ్య మొదలైనవి వెలుగుచూశాక అంతగా రసాలంకారభావధ్వని వివృతులు లేని బుచ్చయ్యగారి వ్యాఖ్య ముద్రణ, జూలూరి వారి వ్యాఖ్య పునర్ముద్రణ అవసరం లేకపోయాయి.

    బ్రౌన్ వ్యక్తిత్వాన్ని గుఱించి మీరు వ్రాసిన విషయవిస్తరణతో ఐకధ్యం లేని అంశాలను మఱొకసారి!

    (5)

    బ్రౌన్ పరిష్కరణ సంవిధానం మీరే ఉదాహరించిన ఆంగ్లవాక్యాలను బట్టి, అది సార్థకమై, అంతర్జాతీయప్రమాణాలకు సైతం అనుగుణంగా ఉన్నట్లే నాకనిపించింది. ప్రతులను సేకరించటం, పాఠాంతరాలను గుర్తించటం, కవికి అత్యంతసమీపకాలంలో వెలసిన పాఠాన్ని గుర్తించటం, భావప్రతీతికి దోహదంచేసే మేలైన పాఠాన్ని స్వీకరించటం అన్న ఆయన ‘విధానం’ మీరన్నట్లు ఈనాటికీ మనము అనుసరిస్తున్నదే. అందులో లోపాలుంటే, అవి పరిష్కర్త వైదుష్యలుప్తికి, పరిణతప్రజ్ఞ లేమికి, కావ్యానుభవరాహిత్యానికి మాత్రమే నిదర్శనలు. విధానంలో లోపాలు కావు.

    ఈ విషయమై విద్యార్థిగా అభిమానమూ, జిజ్ఞాస ఉన్న నేను బ్రౌన్ మాటెలా ఉన్నా, ‘తెలుగు భాషకు అనువర్తించే ఆదర్శ పరిష్కరణవిధానం’ గుఱించి మీరు వ్రాయగల ప్రామాణికవ్యాసానికై ఆసక్తితో ఎదురుచూస్తుంటాను.

    సప్రశ్రయంగా,

    ఏల్చూరి మురళీధరరావు

  622. మరి నువ్వేమో… గురించి g srinivas గారి అభిప్రాయం:

    05/15/2014 9:17 pm

    ఈ వెబ్ సైట్ చాలా బాగుంది. తెలుగు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ కవిత్వం కూడా చాల చాలా బాగుంది.

  623. ఆకుపాట – వాసుదేవ్ కవిత్వం గురించి raj గారి అభిప్రాయం:

    05/12/2014 10:24 am

    “ఆకుపాట” పేరే కవిత్వపు కొత్తదనాన్ని చెబుతోంది. ఆకుపాటకు మీ సమీక్ష పిట్ట పిల్లంగోవి ఊదినట్లు చదివినంతసేపూ రెప్పల్ని మంత్రించివేసిందంటే నమ్మండి.పుస్తకమింకా చదవలేదు గానీ ఒక్కచోట మాత్రం మీతో నే విభేదిస్తున్నా.

    “వెన్నెల వెండితెరలో నుండి తొంగిచూస్తూ
    మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా తన వైభవాన్ని
    ముద్రిస్తూ ముద్దు కౌముది” –(ఛాయాగీత్, పు: 43)

    అన్నచోట “మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా” అన్నది ఉపమానమని నా ఊడ్దేశ్యం.’మూన్ బో’అంటూ మీరు లోతుగా ఆలోచించారు. వెన్నెల/కౌముది (కుముదము అంటే కలువలకు ఆనందం కలిగించేది, అంటూ సమర్థించను లేండీ ) మాత్రం ఒకే మీరే కరెక్ట్. కరెక్ట్.

  624. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి తఃతః గారి అభిప్రాయం:

    05/12/2014 6:00 am

    “…అక్కడి విమర్శను పునా రచించాను …”

    శ్రీ ఏల్చూరి: ఒక చర్చ, ఒక వ్యాఖ్య ఒక వ్యాసాన్ని మెరుగు పరుస్తుందన్న దానికి ఈ సన్నివేశం ఒక మంచి ఉదాహరణ. ఏ కవితా, ఏ వ్యాసమూ ఎప్పటికీ ముగియవనీ, రాసిన వారనబడుతున్న వారితో సహా అవి ఏ ఒక్కరి సొమ్మూ కావనీ, అవి ఉమ్మడి ఆస్థి అనీ, ఇందులో వాదోపవాదాలలొ కనపడుతున్నట్టుగా అనిపించే అహంకారాలు కూడా ఆ రచనని మెరుగు పరచటం అన్న క్రతువులో సమిధలేననీ నా భావన. లైలా గారి వ్యాఖ్య లొ ఉన్న ఔచిత్యం దొడ్దది. సౌదర్యపూరితమైనది. ఆవ్యాఖ్యని మీరు గ్రహించిన తీరు బంగారం లాంటి మీ పాండిత్యానికి సన్నజాజుల పరిమళం కూడా ఉన్నదని చెప్పకుండా చెపుతోంది. మీ ఇరువురకూ నా అభివందనములు. తః తః

  625. గూడు గురించి Seetha గారి అభిప్రాయం:

    05/12/2014 5:24 am

    ఎంతో ఆర్ద్రత ఉంది ఈ కవితలో …

  626. నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    05/07/2014 4:01 pm

    లైలాగారూ,

    >>Hope I made it to సహృదయులు list.

    Ofcourse, you are always there in the list! 🙂

    తఃతఃగారూ,

    శతకపద్యాలు చాటుసంప్రదాయంలో భాగమే. శ్రీశ్రీ సిరిసిరిమువ్వ పద్యాలు కూడా అదే బాణీలో ఉంటాయి. అయితే వ్యాప్తి విషయంలో, అవి ప్రజల నాలుకలపై కాక పుస్తకాలకే పరిమితమైపోయాయి కదా!

    వేలూరిగారూ,

    >>భీమకవి ఆదికవికన్నా ముందువాడనేనా?

    ఆ పద్యం నన్నయ్యదే అయితే, అందులో చెప్పిన భీమన వేములవాడ భీమకవే అయితే, భీమకవి నన్నయ్యకు ముందువాడో సమకాలీకుడో అవ్వాలి మరి! ఈ చాటువుకి కూడా పాఠాంతరాలున్నాయి. “కవిజీవితములు” పుస్తకంలో గురజాడ శ్రీరామమూర్తిగారిచ్చిన పాఠం ఇది:

    మతి, ప్రభ, నీగి, పేర్మి, సిరి, మానము పెంపున భీమునిన్ బృహ
    స్పతి, రవి, కర్ణు, నర్జను, గపర్ది, సుయోధను బోల్ప బూన నా
    మతకరి, తైక్ష్ణు, దుష్కులు, నమానుషు, భిక్షు, ఖలాత్ము నెంచ వా
    క్సతిపు, శశిన్, శిబిం, గొమరుసామిని, మేర్వు, నబ్ధి బోల్చెదన్

    ముందువెనకల పరిశోధన అవసరమా అనవసరమా అన్న మాట పక్కన పెడితే, ఇలాంటి చాటువుల ఆధారంగా అలాంటి నిర్ణయం చేయబూనడం కుక్కతోక పట్టుకొని గోదారి యీదడం లాంటిదని నా అభిప్రాయం. ఇంతకన్నా నా దృష్టిలో “వచియింతు వేములవాడ భీమునిభంగి” అనే కాశీఖండంలోని శ్రీనాథుని పద్యం, భీమకవి నన్నయ్య కంటే ముందువాడో, సమకాలీకుడో అయ్యే అవకాశం ఉందనడానికి (కనీసం శ్రీనాథుని కాలానికి అలాంటి నిశ్చయం ఉందనడానికి) ప్రబల సాక్ష్యం.

    మీ రెండవప్రశ్న ఏమిటో అర్థం కాలేదు.

    >>వేములవాడ భీమకవి తరువాత పద్యాలు రాసిన కవులెవరైనా, ఆరవ అక్షరం గా ‘త’ వాడారా? లేదా?

    ఈ ప్రశ్నకి మురళీధరరావుగారు సమాధానం చెప్పేశారు. అయితే మీ ఉద్దేశం తిట్టుకవిత్వానికి కాకుండా, మామూలు పద్యాలలో ఆరవ అక్షరంగా “త”కారాన్ని కవులు వాడారా లేదా అంటే, చాలా చోట్లనే వాడరనుకుంటాను. చప్పున గుర్తుకొస్తున్న పద్యాలు:
    నన్నయ్య – “మద మాతంగ తురంగ”, “నలదమయంతు లిద్దరు”
    ధూర్జటి – శ్రీవిద్యుత్కలితా (శ్రీకాళహస్తీశ్వర శతకంలో మొదటి పద్యమే!)

    దీని గురించి నేను విన్నది – ఆరింట త పెట్టి ఒకరిని తిడితే అది శాపమవుతుంది తప్ప, మామూలుగా ఆ స్థానంలో తకారాన్ని వాడడం అశుభమో ప్రమాదమో కాదు – అని.

  627. నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    05/06/2014 8:59 am

    ఒక చక్కని చాటువు! మరుగున పడి, తెలుగు వాళ్ళు మరిచిపోయిన ఇద్దరు భీముళ్ళకి చాలా చక్కని “చాటింపు.” కామేశ్వరరావు గారికి అభివాదం!

    ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు, ఆచార్య దావీదు షూల్మనుగారూ, తెలుగు,సంస్కృతం, తమిళభాషలనుంచీ కాసిని చాటువులు, అనువదించి A Poem at the Right Moment (University of California Press, 1998) అన్న పేరుతో ప్రచురించారు. అందులో వేములవాడ భీమకవి గురించి ముందుమాటలో ప్రస్తావించారు. ఆ పుస్తకం ఇదివరలో అంతర్జాలంలో పరిచయం చెయ్యబడింది. వాళ్ళు రాసిన 65 – పేజీల నిడివి ఉన్న వెనుక మాటలో చాటువుల గురించి విపులంగా విశదీకరించారు. తెలుగు చాటువులపై తెలుగు మేథావుల శీతకన్నుకి కారణాలు చక్కగా చర్చించారు. ముందుమాటలో మీరు చెప్పిన మాటలే మరికొంచెం గట్టిగా చెప్పారు:

    “A poem, at least a good poem, exists in the memory or on the tongue of living connoisseurs. Its life consists in its oral recitation in some particular context, usually linked to a range of other contexts. … Most poems have a story that goes with them, and each is invariably memorable, a perfectly worked-out expression of skilled composition, though often disarmingly simple. These cāṭus have appealed to, and shaped, the taste of generations of people.”

    ఆ అభిరుచి అడుగంటి పోతున్నదని మీరు బాధ వ్యక్తం చేశారు. మీతో ఏకీభవించనివారు ఉండరని అనుకుంటాను.

    చాటువుల పరంగా నాకు కొన్ని ప్రశ్నలున్నాయి.

    మొదటి ప్రశ్న: వేములవాడ భీమకవి మీద నన్నయభట్టు గారు చెప్పిన చాటువు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, వారి చాటుపద్యమణిమంజరిలో కూర్చిపెట్టారు. అది మీకు తెలిసే వుండాలి. ‘మతిభ్రమ నీగి పేర్మి సిరి మానిత ప్రెగ్గడ భీమునిన్.’ అని. అంటే, భీమకవి ఆదికవికన్నా ముందువాడనేనా?

    హంసపాదు (1): ఎవరుముందు, ఎవరు వెనుక అని పరిశోధన చెయ్యాలని నేను అడగటల్లేదు. అలా అంటే, అది శుద్ధ అనవసర పరిశోధన అని నన్ను దులిపేస్తారని తెలుసు. తెలుసుకుందామనుకునే కుతూహలం ఉండటం తప్పు కాదనుకుంటాను.

    రెండవ ప్రశ్న: బొమ్మకంటి శ్రీనివాసచార్యులు గారు ప్రచురించిన “తెలుగు చాటువు పుట్టుపూర్వోత్తరాలు(1983)” లో, మైలమ భీమన చనిపోయినపుడు 12, 13 పద్యాలలో వేములవాడ భీమకవి రచించిన ‘విలాప గీతం’ (elegy) తెలుగు సాహిత్యంలో అట్టి గీతాలలో మొట్టమొదటిదే కాదు; సాటిలేనిది కూడా. ఆ గీతంలోని ఒక రసగుళిక అని ఈ కింది పద్యం అని రాశారు.

    యాచక ఖేచరుండు సుగుణాంబుధి మైలమ భీము డీల్గినన్
    చూచి వరించె రంభ; ఎడజొచ్చె తిలోత్తమ ; దారి నిద్దరన్
    త్రోచె ఘృతాచి ; ముగ్గురకు దొద్దడి కయ్యము పుట్టె; అంతలో
    నాచుకు పోయె ముక్తి సతి; నవ్విరి అద్దశ జూచి నిర్జరుల్!
    నోచిన వారి సొమ్ము లవి నోమని వారికి వచ్చునే ధరన్?

    (ఆఖరి పాదం నాచన సోముని ఉత్తర హరివంశంలో నిది. చాటు కవితా రసికులు చేర్చిన ప్రక్షిప్తం కావచ్చని అంటారు.)

    హంసపాదు (2): elegy అంటే ‘విలాపగీతం’ అని వేలూరి తెలివితక్కువగా అనువదించాడని తహతహపడి తప్పు పట్టడానికి దూకకండి. కీ.శే. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారు చేసిన అనువాదం అది. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉన్నది.

    మూడవ ప్రశ్న: వేములవాడ భీమకవి ఒకసారి గుడిమెట్టకి వెళ్ళాడట. సాగి పోతురాజు ఆయన గుర్రాన్ని పట్టుకొని విడవకపోతే, వాడిమీద కోపించి చెప్పిన (శాప) పద్యం:

    ‘హయమది సీత, పోతవసుధాధిపుడారయ రావణుండు,..
    … ..నా
    జయమును, పోతరక్కసుని చావును ఏడవనాడూ చూడుడీ!’

    పూర్తి పద్యం చెప్పచ్చుగాని, నా ప్రశ్నకి అది అనవసరం. మొదటి పాదంలో ఆరవ అక్షరం ‘త’. ఈ పద్యం చెప్పిన ఏడు రోజులకి భీమకవి శపించినట్టుగా పోతురాజు మరణించాడనీ ప్రచారంలో ఉన్న కథ. అయితే, వేములవాడ భీమకవి తరువాత పద్యాలు రాసిన కవులెవరైనా, ఆరవ అక్షరం గా ‘త’ వాడారా? లేదా? ఈ ప్రశ్నకి సమాధానం — మీరో, జెజ్జాల కృష్ణమోహనరావుగారో, యేల్చూరి మురళీధరరావుగారో — మాత్రమే చెప్పగలరని నేను అనుకుంటున్నాను. (ఈ ముగ్గురేనా? ఇంకెవరూ లేరా? అని తహతహపడి తప్పుపట్టి నన్ను #mentors, commentors#, తిట్టచ్చు. తిట్లు తినడానికి నేనూ సిద్ధం)

    హంసపాదు(3): ఇది తప్పకుండా చేయదగ్గ పరిశోధనే! కాదని ఎవరన్నా అంటే, వాళ్ళని నల్ల గండుచీమ తప్పకుండా కరుస్తుంది. అంతే కాదు. Side Barకి హంసపాదు అని అనటం నాకు ఇష్టం. తథాస్తు.

    విధేయుడు,
    వేలూరి వేంకటేశ్వర రావు.

  628. ఇది మరీ బావుంది గురించి satish kumar kuchipudi గారి అభిప్రాయం:

    05/06/2014 6:19 am

    అద్బుతం. తెలుగు కవితా సాహిత్య పునర్జీవనానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి నా హృదయ పూర్వక నమస్కారాలు.

  629. గణపవరపు వేంకటకవి శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని గురించి Gannavarapu Narasimha Murty గారి అభిప్రాయం:

    05/04/2014 12:51 pm

    శ్రీ ఏల్చురి మురళీధర రావు గారి వ్యాసము చాలా విజ్ఞానదాయికముగా నున్నది. శబ్దార్ధ చిత్ర కవితల అర్ధ వివరణ రసవత్తరముగాను అద్భుతముగాను సాగింది. ఈ వ్యాసమును చాలా పర్యాయములు పునర్దర్శించుకోవాలి.

    శ్రీ ఏల్చూరి వారికి వందనములు! అభినందనములు!

  630. మోహమకరందం గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    05/04/2014 3:14 am

    మోహ మకరందం మంచి కవిత అందించినందుకు రచయిత్రి గారికి ధన్యవాదములతో-

    ఎస్.ఎ. రహమాన్.

  631. గూడు గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    05/02/2014 6:34 am

    కళ్ళకి కట్టినట్టుంది. ఎంత చక్కటి భాష. మరెంత చింతపెట్టే భావం! ఒక సజీవ సన్నివేశం కళ్లముందు కొచ్చి కదిలిందా, కదిలించిపోయిందా అన్నట్టుంది. కవితాభిమానుల గుండెల్లో నిజంగానే గూడు కట్టుకునే కవిత. వీరి కవితే – ఇంతకుముందొకసారి, ఇక్కడే చదివిన గుర్తుంది.

    కవులిరువురికీ నా అభివందనాలు.

  632. మరి నువ్వేమో… గురించి Prasuna గారి అభిప్రాయం:

    05/02/2014 4:32 am

    ప్రొద్దుటి నుంచీ ఎన్నిసార్లు చదివానో. ప్రతి ఖండికా బాగుంది నిషీ. జీవితంలో ఎన్నింటికో ఈ కవితని అన్వయించుకోవచ్చు. చాలా బాగుంది.

  633. మరి నువ్వేమో… గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    05/02/2014 12:17 am

    ఒక ఆహ్లాదాన్నిచ్చిపోయిన కవిత.
    బహుమతిగా మికిదే నా అభినందన.
    🙂
    శుభాకాంక్షలతో..

  634. మరి నువ్వేమో… గురించి జ్యోతిర్మయి గారి అభిప్రాయం:

    05/01/2014 8:39 pm

    అదృష్టవంతులు…
    బావుందని మళ్ళీ వేరుగా చెప్పనక్కర్లేదు. మీ కవిత కదా!

  635. మరి నువ్వేమో… గురించి Seetha గారి అభిప్రాయం:

    05/01/2014 8:32 pm

    ఆనందాలూ అసహనాల మధ్య
    అడ్డదిడ్దంగా ఆడుకునే నన్ను.

    నేను దిగులు గుబులు నీలి సాయంత్రాలలో
    త్రోవ తెలియని నిశ్శబ్దాన్ని…

    ఎంత బాగుంది ఈ కవిత
    ఏమి ఈ ప్రయోగాలు ?

  636. మరి నువ్వేమో… గురించి అఫ్సర్ గారి అభిప్రాయం:

    05/01/2014 8:23 am

    నిషి: చాలా వున్నాయి నచ్చిన వాక్యాలు! వాక్యాలే కవిత్వం కాకపోవచ్చు కాని, ఎందుకో ముందు వాక్యాల దగ్గిరే ఆగిపోతాను. ఇదిగో, ముందు ఇక్కడ ఆగిపోయాను:

    భద్రతలూ భరోసాల బరువు మాటలేమో కానీ
    నాకోసమే మౌనంగా వెలిగే స్థిమితానివి నువ్వు

    తరవాత మళ్ళీ మిగతా పోయెమ్ మొదటి నించీ చదువుకుంటూ వెళ్లాను. కవిత్వం ఫిలాసఫీ చెప్పడం నాకు అట్టే నచ్చదు. మీరు ఫిలాసఫీ చెప్పరు కానీ, కాసేపు ఆ తాత్విక ఛాయలో నిలబెడ్తారు చదువరిని తెరువరిని చేసి!

    ఇటీవలి మీ కవితల్లో నాకు నచ్చిన కవిత ఇది!

  637. రచయితలకు సూచనలు గురించి pavankumar kodam గారి అభిప్రాయం:

    04/29/2014 6:59 am

    నా కవిత సంకలనం ‘సగం సగం కలసి’ సమీక్షకు పంపాలి. వివరాలు తెలుపగలరు

  638. రామానుజం (1887-1920) గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    04/27/2014 11:45 pm

    ఉభయ కవితా విసర్గులకు నమస్సులు.

    ఈ రెండు వాక్యాల వెనుక చాలా గ్రంథమే ఉంది. రామానుజం తనదైన గణిత ప్రపంచంలో మునిగిపోయినవాడు, అతను లండను వెళ్ళే నాటికి గణిత శాస్త్ర నిరూపణ పద్దతుల మీద అవగాహన లేదు, అంతే కాదు తనకు అవగాహన లేదన్న విషయం కూడా అతనికి తెలియదు. తొలుత ఈ విషయం హార్డీ గమనించాడు. కానీ, సున్నితంగా అతని అసమాన ప్రతిభ కు భంగం కలుగని రీతిలో బోధ పరుస్తూ వచ్చాడు, రామానుజం నెమ్మదిగా ఈ విషయం అర్థం చేసుకున్నాడు ( తన స్నేహితులకు రాసిన ఉత్తరాల్లో ఈ విషయం మనకు విశదం అవుతోంది).

    ——-
    ఈ రెండు వాక్యాలు వీరిద్దరి మధ్య నడచిన చారిత్రక సంభాషణను సూచిస్తాయి
    ——
    పాద పీఠికలు
    హార్డీ ఉవాచ :
    His ideas as to what constituted mathematical proof were of most shadowy description.All his results, new or old, right or wrong had been arrived at by a process of mingled argument, intuition and induction, of which he was entirely unable to give any coherent account.

    లిటిల్ ఉడ్ కొద్ది మాటల్లో :
    “The clear-cut idea of what is meant by a proof ,now a days so familiar as to be taken for granted,he perhaps did not possess at all; if a significant piece of reasoning occurred somewhere, and total mixture of evidence and intuition gave him certainty, he looked no further’
    ——–
    రామానుజం కృష్ణారావుకు రాసిన ఉత్తరంలో (1914, నవంబర్)
    “I am not going to publish any of my old results in my note books till the war is over.After coming here , I have learned some of their methods. I am trying to get new results by their methods”

    సుబ్రహ్మణ్యంకు రాసిన ఉత్తరంలో:
    “I am publishing only my present researches as I have not yet proved the results in my notebooks rigorously”

    తాజా కలం:
    అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే రామానుజం సహజ కవి, అతని హృదయంలోంచి ఉబికి వచ్చింది కవిత్వం. అది లోతైన కవిత్వం అన్న విషయంలో అతని మనసులో ఎటువంటి సంశయాలు లేవు. అది ఏ రకంగా కవిత్వం?? ఏ తరహా కవిత్వం?? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు అతని దగ్గర లేవు. కారణం వ్యుత్పత్తి లోపం, కానీ, హిమాలయశిఖరం అతని ప్రతిభ, హార్డీ లాంటి సహృదయులు సవిమర్శకంగా కవిత్వాన్ని ఆవిష్కరించడం నేర్పారు. అంతే.

    తమ్మినేని యదుకుల భూషణ్

  639. రామానుజం (1887-1920) గురించి తఃతః గారి అభిప్రాయం:

    04/27/2014 2:34 pm

    శ్రీ తమ్మినేని: పది సంవత్సరాల క్రితం రాసిన మీ ఈ కవితని ఇప్పుడే చూశాను. ఈ genreలొ తెలుగులొ కవితలు రాయటం ఒక సాహసం. మీ కలం మీరు చేసిన సాహసానికి నిజాయితీతొ సహకరించింది. ఒక విషయం: ‘నిరూపించనంటావు’ అని అన్నారు మీ కవితలో, రామానుజన్ ఎప్పుడైనా ‘నిరూపించను’ అని స్పష్టంగా అన్నాడా, కాక పోతే హార్డీ మాటలనుంచి అల్లా అనుకొవచ్చా, లేక కేవలం మీ ఊహాత్మక అభిప్రాయమా? (రాసినది పది సంవత్సరాల క్రితమని తెలిసినా అడుగుతున్నాను).

    నమస్కారాలతో – తఃతః

  640. దేవకన్య గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    04/18/2014 7:53 am

    దేవకన్య కవిత మధురంగాను ముచ్చటగాను ఉంది.

  641. పల్లెటూర్ to పట్నం: The Seven Seater గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:

    03/26/2014 10:03 am

    మీ అభిమానానికి ధన్యవాదాలు తః తః గారు. మీ అభిప్రాయన్ని ఎప్పుడో చదివినా నాకున్న అపారమైన బద్ధకం వల్ల ఇప్పుడు రాస్తున్నాను. నా కవిత్వంలో కనిపించే లోటు పాట్లన్నీ నావి,బాగున్నవన్నీ అద్భుతమైన కవిత్వశక్తివి.

    ధన్యవాదాలు
    ఇంద్రాణి.

  642. గద్యములో పద్యములు గురించి రఘోత్తమరావు గారి అభిప్రాయం:

    03/19/2014 10:22 am

    చాలా బావుందండి.

    సంగీతంతో బాటు ఛందస్సు కూడా భక్తి కవిత్వాన్ని సుసంపన్నం జేసేది గావున మీరు వ్రాసిన ఆ ఛందో భాగం చేరితే శ్రీనివాస గద్యం మరింత శోభస్కరంగా ఉండగలదు.

    శ్రీ వాదిరాజతీర్థ (1480-1600 AD) విరచితమైన “దశావతార స్తుతి”ని ఒకమారు చూడగలరు.

    ధన్యవాదాలు.

  643. మాటలు గురించి జ్యోతి గారి అభిప్రాయం:

    03/15/2014 3:04 pm

    చాలా నచ్చింది వైదేహి గారు, మీ కవిత. ఎంతో అపురూప భావానికి అందమైన రూపాన్నిచ్చారు.

    “మనం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం
    ఎప్పుడో ఒక క్షణంలో మాత్రం చందన పుష్పాల్లా
    మాటలు మన మధ్య కొత్తగా గుబాళిస్తాయి”

    నిజంగా నిజం. రోజువారీ మాటల్లో మనసులో నిలచిపోగలవెన్ని ఉంటాయి? కానీ అరుదుగా వచ్చే కొన్ని క్షణాలుంటాయి…కొత్త ఆలోచనలని రేకిత్తించే మాటలు పుట్టే క్షణాలు, మనం take it for granted అనుకునే వ్యక్తులని, మనసులని, ప్రేమలని, మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలో,మళ్ళీ మరొకసారి కొత్తగా మనకు నేర్పించే సమయాలు, ఆ సమయంలో మొక్కుబడిగా కాక మనసులోతుల్లోనుంచి వచ్చే గుప్పెడు మాటలు, కాసిన్ని నవ్వుల చిలకరింపులు.

    “మళ్ళీ మంత్రధూళి రాలే వరకూ” ఆ క్షణాలే కదూ మనల్ని కేవలం బ్రతికించకుండా జీవించగలిగేటట్లు చేసేవి.

  644. దేవకన్య గురించి avinEni bhAskar/అవినేని భాస్కర్ గారి అభిప్రాయం:

    03/10/2014 12:09 am

    దేవకన్యంత అందంగా, చిక్కగా ఉంది కవిత!

  645. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga గారి అభిప్రాయం:

    03/07/2014 3:58 am

    @ఒకడు గారు (and also to Suresh garu – the relevant portions):

    Your comments reflect the state these kind of debates degrade into (including the essay).

    1. For eg, the essayist supporting Wendy has to somehow indirectly defend himself that he is not “anti-Hindu”. Therefore he has to show in some way or the other that he reads scriptures, reads them to his children, etc. These details are unnecessary. This problem happens to the other side also – the ones who question Wendy’s integrity. They have to make a disclaimer that they are not Hindutvaadis, racists, supremacists, etc etc…

    The real issue is lost with these self-imposed boundaries.

    2. This focus on people is done by small minds. For eg, significant portion of the essay is devoted for Wendy’s and Batra’s biography. Is this necessary to know? To analyze the subject matter, and see what are the contentions from Batra’s side and Wendy’s side, one need not know who is Wendy or who is Batra.

    The second part of the essay where the author goes point by point on the petition – this is the most important part of the essay.

    3. To support point 2: The best critique I read so far is Tammineni Yadukula Bhushan’s: “నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు”. This book is a real eye-opener. Whether we agree with the criticism or not is not important but how the ideas are expressed is important. There was absolutely no focus on people. In all his criticism of Papaya Sastri or CNR (and others), no discussion about their personal history, caste or religious affiliations, where they come from, a brief biography happens. However, the criticism is brutal and just focused on the subject matter.

    Similarly, the review of David Shulman (that Bhushan garu himself posted here) also discussed only the subject matter of the book. No needless details about Wendy’s biography is found in that.

    Now that is not small minded thinking. However, in this essay the author’s shenanigans are clearly revealed when he tries to sketch both biographies and attempts to show how high is Wendy in the hierarchy compared to Batra. This elitist bias is clearly revealed also later as pointed by Jayaprabha garu. Then he tries to influence the reader by making a failed to attempt to prove Mr Batra’s guilt by association. By the time reader passes through this introduction of Batra, the context is already framed – that the mighty expert Wendy is being opposed some ill-informed and lowly educated (in comparison) Hindu fanatic. Then there is a rebuttal of the petition (and I think this is the strongest part of the essay).

    So, after having defined a manipulated context, and a strong rebuttal of the petition, the author makes a bizarre conclusion that Hindutva is the reason for restriction of free speech and that we are also becoming like Muslims, etc. This is another failed attempt as the evidence shows otherwise. Others and myself have already discussed this before.

    Even in the conclusion the author laments that because of this case, Wendy’s book has more demand. Now, that again contradicts what he is complaining about. This is very inconsistent. On the contrary Rajiv Malhotra (link posted already) in his interview to Rediff summarized this issue well: Yes, this withdrawl from Penguin may have created more publicity to Wendy. This may have created more demand (which is ok) but it will also create more interest in who are questioning Wendy and make people more educated. More scholars will come in the open to discuss this.

    4. The weakness in this essay is:

    The problem has not been defined properly, focus on people (small minded thinking) than on subject matter, loose vocabulary, confusion about what is the issue – Wendy’s subject matter in the book, Hindutva or free speech or Indian penal code? One can’t get clear answer to what the author is trying to convey here. As someone already pointed out, there is a mix of multiple issues here and a failed attempt to connect them (since there is no evidence that supports this connection).

    The loose vocabulary shows up in the part where the author starts educating the reader on how ancient Hindus were open,etc. Now, this is an oft repeated assertion. Can someone explain what this means? What were the contexts in which they debated, what were the rules, what was the PurvaPaksha tradition? Were misinterpretations considered “alternative” views?

    Ancient Hindus were also non-violent (say for eg – Ahimsa paramodharmah, etc.). Then if you (assuming you are a Hindu) retaliate an attack in self defense, should we say – one should not do so because Hinduism is always about Ahimsa? Loose vocabulary is dangerous. I lost the author also on what he means by Hindutva (what actually it is and what it is according to him). Hindutva has nothing to do with this issue but still since he discusses, he should be clear about it instead of the needless biography details and the introductions how he reads mythology to his children, etc.

    This is why this essay is mediocre. Once the essay is completed, the reader is more confused.

    5. Your points 2 and 3 appear very foolish to me. I read somewhere what SriSri said about criticism in some context , “భోజనం రుచిగా ఉందో లేదో తెలియడానికి వంట రావక్కర్లేదు, తెలియక్కర్లేదు…” . Therefore whether the critics here are also writers or whether they published something before or whether they are as good as the author, is irrelevant. This is again small-minded thinking.

    The only thing that matters what the author is saying. It doesn’t matter what degrees, or publications he has to boot. The same thing applies to Wendy as well. Her degrees, background, books, etc are irrelevant. All that matters is what she says in the book and is it right or wrong. Of course, I don’t blame you. Most people fall into this trap. Even Adi Sankara also fell into this trap as we know from the story of his meeting with the Chandala.

    6. Also your comments that people (hindus) are violently reacting about this book, and that they are attacking the author Suresh garu here is also not making any sense. There is no evidence to support this. Suresh garu also seems to be open to being corrected and engage in a meaningful debate as seen from his responses. So, I guess you can rest assured. Suresh garu can deal with it.

    7. Infact, I’ve learnt a lot from the comments than the essay. One primary take away is that the precision in language and the context are extremely important, and the insights into some commentaries (from both critics of this essay and the author as well). In that sense this, I must admit, this essay has a positive outcome.

    ఇట్లు
    యోగా

  646. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి okaDu గారి అభిప్రాయం:

    03/06/2014 7:52 pm

    ఈ అభిప్రాయాలు (వ్యాసం కాదు) చూస్తూంటే మొత్తమ్మీద నాకు అనిపించిన విషయాలు:

    1. సురేష్ కొలిచాలకి ఏం తెల్సు ఇలా రాయడానికి అని ఆయన్ని ఎటాక్ చేసేవాళ్ళే ఎక్కువగా కనబడుతున్నారు తప్పితే ఆయన వ్యాసంలో ఏం చెప్పదల్చుకున్నారనేది అర్ధం చేసుకుని వాదన లోకి దిగేవాళ్ళు ఎవరూ లేనట్టూ నా మట్టి బుర్రకి అనిపిస్తోంది. దీనిక్కారణం సు.కొ ఇండియాలో లేకపోవడం ఒక కారణం కావొచ్చు. ఆయన సంస్కృతాంధ్ర పండితుడు కాకపోవడం రెండోది కావొచ్చు. మొత్తమ్మీద దెబ్బలాటకే ప్రాధాన్యం గానీ ఆయన చెప్పిన వ్యాసం మీద కాదని అనిపిస్తోంది. ఎందుకంటే ఒకానొక పెద్దమనిషి “మీరు రాసిన భగవద్గీత మీద బ్లాహ్ బ్లాహ్ బ్లాహ్ తప్పు అని ఒప్పుకున్నట్టైతే ఇప్పుడు మీర్ర్రాసిన రామాయణం మీద దాని గురించి దెబ్బలాడుకుందాం రండి” అని బహిరంగంగా చెప్పడమే!

    2. నోటికొచ్చినట్టూ ఏదో రాసి పడేయడంకాక సు.కొ చెప్పేది ఒకసారి పూర్తిగా చదివారా ఎవరైనా? చదివాక మీకున్న నాలెడ్జ్ ఏపాటిది దీని గురించి కామెంటడానికి?

    3. పోనీ బాత్రా గారి గురించి గానీ, వెండీ గారి గురించి గానీ మీకేమైనా తెలుసా? ఏవో రెండూ మూడు కథలూ కవితలూ అచ్చయ్ పోగానే మీకు వీటి మీద కామెంట్ పెట్టే అంతటి నాలెడ్జ్ ఎలా వచ్చింది?

    4. ఆవిడ హిందూ మతం గురించి ఎలా రాసినా మన మతానికీ భగవంతుడికీ ఏమి తేడా వచ్చింది? తేడా కనక వస్తే భగవంతుడెలా అవుతాడు? ఏకం సత్ అన్నారు కదా? ఎవరి పరిజ్ఞానం ఎలా ఉంటే వాళ్ళు అలా అంటూ ఉంటారు. అన్నింటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే వెండీ డానిగర్ ని కోర్టుకీడ్చిన మన హిందూ వాదులు ఇండియాలోనే ఉండి హిందూత్వాన్ని రోజూ ఎండగట్టే నాస్తికవాదులనీ ఏమీ చేయలేకపోవడం. ఇదే రెండు నాలుకల ధోరణి.

    ఆఖరుగా ఒక ప్రశ్న. వెండీ గారు ఇలా రాశారు అంటే మనం – హిందువులం – ఎందుకు అంత వయ్లెంట్ గా రియక్ట్ అవుతున్నాం? ఆవిడ అలా అనుకున్నారు హిందూ మతం గురించి. ఆవిడ అభిప్రాయం మన మీద రుద్దడానికి ప్రయత్నించారా? స్వామి వివేకానంద ఒకసారి అన్నట్టు గుర్తు – “మనం అందరం కొట్టుకోవడానికి రడీ. మనలో ప్రతీవాడూ లీడర్ అయిపోదామనే తాపత్రయం. సేవ చేద్దామనే వాళ్ళేరీ?” ఎందుకింత రాద్ధాంతం దీని గురించి.

    ఇప్పుడు దీనిమీదొచ్చే తిట్లకి నేను రడీ 🙂

    [Post edited – ed.]

  647. వెన్నెల – తిలక్ కవిత గురించి ప్రణవ్ గారి అభిప్రాయం:

    03/06/2014 7:47 am

    కవితామృతానికి వాస్తవికత హాలాహలాన్ని జోడించి సరికొత్త టానిక్ తయారు చేసిన సాహితీ భిషక్… బాలగంగాధర తిలక్!

  648. దేవకన్య గురించి కార్తీక్ గారి అభిప్రాయం:

    03/04/2014 9:03 pm

    మానస గారు… నిజంగా అద్భుతమైన దేవకన్యలా ఉంది కవిత.

  649. మాధవీమధుసేనము గురించి నరసింహారావు గారి అభిప్రాయం:

    02/17/2014 7:37 am

    అత్యద్భుతం ! అలనాటి పెద్దనాదులను తలపించు ఈ కవితాపఠనం మహదానందభరితం.

  650. ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు గురించి mohan naidu గారి అభిప్రాయం:

    02/14/2014 11:43 am

    మీ కవితకన్న ముందు నన్ను ఆకట్టుకున్నది మా వూరి పేరు నెను పుట్తిన చింతాడ. భాష ఏదైనా దేశమెదైన పరిస్థితి ప్రజల స్వభావము ఒక్కలానె వుంటుంది.

  651. పాఠకులకు సూచనలు గురించి S A Rahman,Chittoor. గారి అభిప్రాయం:

    02/05/2014 7:05 am

    గౌరవనీయులైన సంపాదకులుగారికి,

    ఈమాట పత్రిక బాగుంటోంది. కథలు కవితలతొ పాటు జోక్స్ మరేదైన ఇతర శీర్షికలు కూడ క్రోత్తవి ప్రచురిస్తారా? దయచేసి తెలుపగలరు.

    వివిధ రంగుల్లో [సులభమనిపిస్తే] పత్రికను మరింత ఆకర్షణీయంగా తీసుకునిరావచ్చునేమో ప్రయత్నించగలరని ఆశిస్తున్నాను.

    ఎస్. ఎ. రహమాన్.
    చిత్తూరు.

    [ఇవి ప్రచురించాలి, ఇవి కూడదు అనే నిబంధనలేమీ లేవు. ప్రచురణార్హమనుకున్న ఏ సాహిత్య ప్రక్రియనైనా మేము ప్రచురిస్తాము – సం.]

  652. మంచు గురించి మెర్సి మార్గరెట్. గారి అభిప్రాయం:

    01/27/2014 4:42 am

    “అసలు మీరెలా ఉంటారు? ఆర్టో, లిటరేచరో, సినిమానో, భక్తో, పేకాటో, అమ్మాయో, మందో, వల్లకాడో ఏదో ఒకటి ఉండాలి కదా? ఏదీ లేకుండా ఎలా ఉంటారు? చెప్పండి. నిజం చెప్పండి?” అన్నాను తీవ్రంగా.

    నిజం చెప్పమంటారా? ఆ పాత్రలోని వ్యక్తి గురించి నేను కూడా అంతవరకు ఆసక్తిగా చదువుతూ వస్తున్నానా, అలా ప్రశ్నించడం చదవగానే నాకూ నవ్వొచ్చింది.

    చాలా మంది ఈ లోకంలో వాళ్ల కోసం కన్నా ఎదుటివాళ్ల గురించి ఆలోచిస్తూ సమయం గడిపేస్తారు. మొత్తానికి సమయం గడిపేసాము ఇవ్వాళ్టికి అన్నట్టుగా. కాని అనివార్య పరిస్తితుల్లో ఎదుటివ్యక్తుల గురించి తెలుసుకోవడంలో ఉండే ఆ త్రుష్ణే వేరేమో. మొత్తానికి కథలో పేర్లు లేకుండా, చివరి వరకు ఆసక్తిగా కథని నడిపించడం ఒక ఎత్తెతే ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండానే వెనుతిరగడం ఒక లాంటి వెలితి మిగిల్చింది. అదే కథని ఎక్కువ రోజులు గుర్తుంచుకునేలా చేస్తుందేమో.

    మీ కవితలు చదివడం వళ్ల, మీరు రాసిన కథలో కూడా ఆ కవిత్వం నాకు అడుగడుగునా కనిపించింది. ప్రకృతిని మీరు వర్ణించిన తీరు అద్భుతం. నాకు కథ చాలా నచ్చింది. నేనే కథకి ముగింపు నిచ్చేసుకున్నా ఆ వ్యక్తి గురించి తెలుస్కోలేని వెలితితో అదే ఆలోచిస్తూ ఆత్మహత్య వాయిదా పడిపోయి ఉంటుందని. లేదా ఒక అద్భుతమైన కళాఖండం చిత్రించాక ఆ సఫలత విజయంలో తన ఆత్మహత్య మరిచిపోయాడని.

  653. ఇంట్లో ఎవరూ లేరు గురించి bharath గారి అభిప్రాయం:

    01/26/2014 7:29 am

    ఇంద్రాణి గారి కవితలు బాగున్నయి

  654. ఒక తియ్యని కల గురించి S A Rahman,Chittoor. గారి అభిప్రాయం:

    01/24/2014 4:24 am

    వాడిన దండ తీసేసినా..

    ఎంత చక్కగా ఉంది! మంచి కవిత అందించినందుకు సంపాదకులవారికి ధన్యవాదములు.

  655. అసమయాల అమావాస్య గురించి Radha గారి అభిప్రాయం:

    01/13/2014 3:11 am

    సాయి పద్మగారూ, ‘భార్యాభర్తలు కొంత వయసు మళ్లాక పాత అనుభూతులను పంచుకుంటే జీవితోత్సాహం కలుగుతుంది’ అనేది కల ద్వారా చెప్పడం పాత కధే కాని మీరు కవితాత్మకంగా చెప్పడం వలన కథ బాగుంది. అయినా ఇలాంటి కథలు ఎన్ని వచ్చినా బాగుంటాయి. అభినందనలు

  656. సొంతం గురించి ఎలనాగ గారి అభిప్రాయం:

    01/12/2014 10:13 am

    Allusionను ఛేదించలేని మెదళ్ళకు ఈ కవితలో అంతా అయోమయమే కనిపించే అవకాశముంది. కామెంట్లు రాకపోటానికి కారణం అదేననుకుంటా. హెచ్చార్కె గారూ! మీకు అభినందనలు.

  657. ఒక తియ్యని కల గురించి arun గారి అభిప్రాయం:

    01/12/2014 7:50 am

    చాల చాల బాగుంది. చాల రొజుల తరవాత మంచి కవిత చదివాను. ముఖ్యముగ:

    “హద్దులకో పద్దులకో భయపడి
    ఏ మలుపుల్లోనో
    నాటకుండానే వదిలేసిన ఆశల విత్తుల్ని”

    “నావి కాలేకపోతున్న క్షణాలతో
    నేను పడుతున్న ప్రయాసలో”

    బాగ నచ్చినవి.

  658. నాకు నచ్చిన పద్యం: చూపులు పలికించే సున్నిత భావాలు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    01/08/2014 8:52 pm

    కవిత్వం, ముఖ్యంగా కావ్యరచన అనేది శిల్పం లాగా చిత్రలేఖనం లాగా చాలా సాధనతో కూడుకున్న కళ.”

    Sure it is.

    1. Experiencing technical difficulties with the first poem. — మన్మథుడు పంచశరుడు. అతనికి ఉన్నవి ఐదు రకాల పూల బాణాలు మాత్రమే. తమ్మరసమేమిటీ? బాణపు ములుకేమిటీ? Those must be poetic liberties one can take as the chief poet of the court.

    2. Likewise with the second poem. This poem tells me at the time of writing it, Peddana had no experience in painting, or sculpting. If he did, he did not use models. The poem/s immediately following, in Manucarithra, confirm his lack of knowledge. Think of ‘The Thinker.’ Think Rodin.

    Can a woman resting her forehead in one hand, spot a man plucking flowers at a distance? The answer is No. For a woman who is distraught, and has unseeing eyes, Varudhini seems to see a whole lot more than any.

    ప్రశ్న: ప్రవరునికి మీసములున్నవా?

    Lyla

  659. సిరుల సంక్రాంతి గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    01/08/2014 1:05 pm

    అంటే 23 యేళ్ళ కిందటి మాట కదూ మీరు చెబుతోంది ?..ఆ కవిత ఇక్కడ వుంచితే మేము కూడా చదివి ఆనందిస్తాం కదా రావ్ గారు! 🙂 సిరుల సంక్రాతి నచ్చినందుకు ధన్య వాదాలు తెలియచేసుకుంటూ,
    పండగ శుభాకాంక్షలతో.

  660. సిరుల సంక్రాంతి గురించి VNM RAO గారి అభిప్రాయం:

    01/08/2014 9:14 am

    ఎప్పుడో 1990లో కాలేజ్ మాగజైన్‌కి వ్రాసిన సంక్రాంతి కవిత గుర్తొచ్చింది. బావుంది.

  661. తరగని దూరం గురించి Vani గారి అభిప్రాయం:

    01/07/2014 3:04 am

    సావిత్రిగారు,
    నిజమే, దూరాలు పెరిగినా ఫోన్లో మాత్లాడుతున్నాం అనుకుంటున్నాము, కాని మనసుల మద్య అగాధాలు పెరిగిపోతున్నాయి. ఏ మాటా మనసులులో నుండి రాదు. అన్నీ పొడి మాటలే. కవిత చాలా బాగుంది
    – vaaNi

  662. మంచు గురించి పూర్ణిమ గారి అభిప్రాయం:

    01/05/2014 3:28 pm

    కథను గురించి నాదో ప్రశ్న. రచయితగానీ, ఎడిటర్లుగానీ అవసరమనిపిస్తే సమాధానాలు ఇవ్వవచ్చు.

    ఈ కథకు first party narration సరిపోయిందని మీకు ఎందుకు అనిపించింది? ఇందులో అతడు పనిజేస్తున్న రంగం అడ్వర్టైజింగ్ అనీ, చిత్రాలు గీస్తాడో / తీస్తాడో అని చూచాయిగా చెప్పుకున్నాడు. అతడి మాటలే బోలెడంత కవితాత్మకంగా ఉన్నాయి. ఇంతిలా చెప్పగలిగినవాడి ఆర్ట్ పెయిటింగో, ఫొటోగ్రఫీయో ఎందుకు కావాలి? కళాఖండం సృష్టించడానికి, ఆపై ఆత్మహత్య ఆలోచన ఉన్నవాడు, వాటిని గురించి గట్టిగా ఆలోచించకుండా, కేవలం తనకు ఆశ్రయమిచ్చినవాడి దినచర్య గురించి అవసరానికి మించిన కుతూహలం చూపడం ఎలా జస్టిఫై అవుతుంది? ఈ కథ third party narrationలో ఉండుంటే కొంచెం మెరుగ్గా ఉండేదనిపిస్తోంది. మీరేమంటారు?

    కథ ఆసక్తికరంగా ఉంది గానీ convincingగా లేదనిపిస్తోంది నాకైతే! జననం (life) లాగా చావుకి gestation period అవసరం లేదు కదా! ఒక్క క్షణం చాలు, దాని పని అది కానిచ్చుకోవడానికి. మరి అలాంటి మృత్యువుతో సావాసంలో అర్థమేమిటి? లేక, ఆ కొండపైన అతడున్న రెండురోజులు చనిపోయిన తర్వాత అతగాడి afterlife సూచిస్తుందా? అన్నది కూడా బోధపడ్డం లేదు. (ఈ పేరా కథపై నా ఆలోచనలు మాత్రమే! నేను అడగదల్చుకున్న ప్రశ్నలో భాగం కావు.)

  663. పన్నీరు బుడ్డి గురించి సురేష్ రావి గారి అభిప్రాయం:

    01/05/2014 11:36 am

    “తనతో బాటే పెరిగి పెద్దవైన అనుభవం, నైపుణ్యం
    వదల్లేక అగరొత్తి పొగల్లో సుళ్ళు తిరుగుతుంటే
    పెంచి పోషించిన ఆస్తులు మాత్రం
    వారసుల ఇరుకు మదుల్లో వాటాలై విడిపోతుంటాయ్”

    యండమూరి అంతర్ముఖాన్ని ఓ చిన్న కవితలో చూపించారు. హాట్స్ అఫ్ ప్రసాద్ గారూ.

  664. నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు గురించి మోహన గారి అభిప్రాయం:

    01/03/2014 11:29 pm

    గ్రంథసూచిలో చెప్పినట్లు సంగీత సంప్రదాయ ప్రియదర్శిని కాదు, అది సంగీత సంప్రదాయ ప్రదర్శిని. గ్రంథసూచిలోని అంకెలు కొన్ని వ్యాసములో లేవు. సంగీత సంప్రదాయ ప్రదర్శిని ఇక్కడ లభించును. సుబ్బరామదీక్షితులు పరమపదించినప్పుడు మహాకవి సుబ్రహ్మణ్య భారతి తన సంతాపమును తెలియజేస్తూ తమిళములో కవితను కూడ వ్రాసెను, అది కూడ ఇక్కడ లభ్యము. విధేయుడు – మోహన

  665. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    01/03/2014 9:04 am

    * ‘మీ రచన బంతి పూల పడవ మీద పోదాం పదవా’ చదివేను. చదివేను అనడం కన్న అనుభూతికి లోనయ్యేను అని చెప్పాలి. –

    జోగారావు గారు! ఏ రైటర్ కైనా ఇంతకు మించిన అవార్డ్సెందుకనిపిస్తుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలతో.

    * ఎంత అందమైన వ్యాఖ్య రాసి మనసుని రంజింప చేసారు పూర్ణిమ గారూ! మీ అభిమానానికివే నా ధన్యవాదాలు. చక్కని కవిత్వంతో కూడా కథ ని ఇలా ప్రశంసించవచ్చని నిరూపించారు. బావుంది. అచ్చు సంక్రాంతిలా! చివర్లో భక్తురాలు అంటూ చమక్కుమనిపించారు లేఖని. థాంక్యూ.థాంక్యూ! మీకు పండగ శుభాకాంక్షలతో. మీ లేఖాభిమానిని. 🙂

  666. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి శంభర వేంకట రామ జోగారావు గారి అభిప్రాయం:

    01/02/2014 11:52 pm

    అమ్మా శ్రీమతి దమయంతి గారు, నమస్కారములు.

    శుభోదయము. మీ రచన బంతి పూల పడవ మీద పోదాం పదవా చదివేను. చదివేను అనడం కన్న అనుభూతికి లోనయ్యేను అని చెప్పాలి. గొబ్బెమ్మల పైన హుందాగా నిలిచిన బంగారు రంగు బంతి పువ్వు పరమశివుని కేశజాలమునకు తలమానికమైన శశాంకుని తలపింప చేయదూ? ఆ మాటకు వస్తే బంతిపూల పడవ అనడంలోనే కవితాత్మ దర్శనమవుతున్నది.

    రచనకు అభినందనలు.
    భవదీయుడు,
    జోగారావు
    బెంగళూరు

  667. రచయితలకు సూచనలు గురించి పద్మా శ్రీరామ్ గారి అభిప్రాయం:

    01/02/2014 2:36 am

    ఇప్పుడే చూస్తున్నాను ఈ సైట్. నా కవితలు పంపాలన్నా మార్పులు చేస్తే అది నా కవిత అనే ఫీల్ నాకు కలుగదు. సో రీడర్ స్థాయి నాకు చాలేమో ఈ సైట్ లో. మరిన్ని మంచి రచన లాస్వాదించగలనని భావిస్తూ…

    Happy New Year.

  668. గరళం గురించి G.Nagi Reddy గారి అభిప్రాయం:

    01/02/2014 2:18 am

    “వాడికది సులభమని
    నువ్వు కష్టంగా కదులుతుంటావ్
    వాడు నవ్వాడని నువ్వేడుస్తావ్
    వాడినెవడో పొగిడాడని
    మూడు రాత్రుళ్ల నిద్ర ఏట్లో పోస్తావ్”

    ఒకరి గెలుపుని చూసి ఓర్వలేక
    అది బలుపుగా చెప్పుకునే నేటి ప్రపంచానికి
    సరైన సమాధానం మీ కవిత!

  669. కవితావిర్భావం గురించి తః తః గారి అభిప్రాయం:

    12/24/2013 10:44 am

    వైదెహి గారూ మీ ‘కవితావిర్భావం’ ఒక అందమైన భావాన్ని -ఒక అందమైన సత్యాన్ని- ఆవిష్కరించింది. నర్తకి గురువు ఆజ్ణకై కదలని భంగిమగా వేచి ఉండటంతొ పోలిక చాలా గొప్పగా ఉంది. అయినప్పటికీ నాకు తోచిన రెండు మాటలు.

    1. గుండమ్మ గయ్యాళి అని చూపించే ఒకటి రెండు సన్నివేశాలు రాయనా అన్నాడట నరసరాజు చక్రపాణితో. ఎందుకూ సూర్యకాంతాన్ని పెట్టుకున్నాక అని చక్రపాణి. ‘తామరాకు మీద నీటి బొట్లై ‘ అన్న తర్వాత ‘అస్థిరంగా’ అన్నది అలా ఉంది.

    2. గురువు ఆజ్ఞకై వేచి ఉండి నర్తించిన నర్తకి నర్తించిన సర్వస్వం — నా అభిప్రాయంలో గురువు గారి ఆవిష్కరణే. అక్కడ తనను తాను ఆవిష్కరించుకోవడం లేదు.

    తః తః

  670. Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    12/17/2013 8:20 am

    మోహన గారు

    కొంత వివరణ అవసరం. ఇస్మాయిల్ గారు స్వయానా గొప్ప పండితులు. పండితుల పట్ల ఆయనకు గల ఆదరం అందరికీ విదితమే. ఆయన కవిత్వ పక్షపాతి, ఆరుద్ర గొప్ప కవిత్వం రాయగలిగే వారు, అది ఆరుద్ర మాత్రమే చేయగలిగిన పని, ఆరుద్ర తలకెత్తుకున్న పని డొక్కశుద్ధిగల పండితుడు ఎవరైనా సరే చేయగలిగి ఉండేవాడు, అని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ ఉండేవారు. ఇదీ దీనికి గల సందర్భం.

  671. పల్లెటూర్ to పట్నం: The Seven Seater గురించి తః తః గారి అభిప్రాయం:

    12/15/2013 1:28 pm

    పెరటి తోటలో పూల తావులు మోసుకొచ్చే చిరుగాలిలా ఉంటాయి ఇంద్రాణి కవితలు. ఈ కవితలొ ఇంతకు ముందు కనపడని అస్పష్టత చోటు చేసుకున్నదనిపించింది నాకు. ఇంతకు ముందు రెండు సార్లు చెప్పిన అభిప్రాయాన్నే మళ్ళీ చెబుతున్నాను – గరిక పేని ఏనుగును కట్టేయగల కవయిత్రి ఇంద్రాణి.

    -తఃతః

  672. నెమ్మదిగా నాట్యం గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:

    12/10/2013 12:42 am

    ఇది అనువాద కవిత. అప్పట్లో- విశ్వకవిత శీర్షికన నానా కవులను అనువాదం చేస్తున్న రోజుల్లో చేసినది. నేను అనువాదమన్న విషయం పేర్కొన్నాను కూడా.
    ఆ సంగతి, సంపాదకులు పాత సంచికలను కొత్త సాంకేతికరీతులకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో జారిపోయినట్లుంది. మూల కవితకు దారి :
    http://www.davidlweatherford.com/slowdance.html

  673. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి బ్రహ్మేశ్వర రావు మేకా గారి అభిప్రాయం:

    12/09/2013 1:27 am

    శ్రీశ్రీ మహా ప్రస్థానం చాలా ఇష్టంగా ఎన్నోసార్లు చదివాను. మీరన్నట్లు చాలా పదాల అర్థం అప్పుడూ తెలియదు, ఇప్పుడూ తెలియదు నాకు. నిఘంటువులను చూడాల్సిన అవసరం ఉన్నా, బద్దకంతో ఆపని చేయలేదు. ఆ ఉద్ధృతిలో కొట్టుకు పోయాను. ఈ రోజున రాస్తున్న కొన్ని కవితలు జఠిలంగానే ఉంటాయి నావరకు. వీటన్నిటికీ సమర్థులు సరళంగా వ్యాఖ్యానించి రాస్తే బాగుండు.

  674. సుగమం గురించి yaddanapudi Kameswari గారి అభిప్రాయం:

    11/23/2013 12:47 pm

    ఇది ఒక తాత్త్విక మానసికస్థితిని తెలిపే కవిత. విశ్వనాథ వారి భ్రష్టయోగి కవితా సంకలనం లోని, దయాంబుధి అనే కవితలో ఇటువంటి శిల్పం కనిపిస్తుంది.
    ..నా కనుల యెట్ట యెదుటనె నా జనకుని
    జనని కుత్తుకలను కోసి ననుఁనడిగెన
    తండు నే దయాంబుధిని కాదా యటంచు
    ఓప్రభూ ! యగునంటి నొదిగి యుండి” ………..విశ్వనాథ.
    కవితలో అంతగా నిరసించ వలసిన అంశం ఏమీ లేదు. అనుభవంలోకి తెచ్చుకోవటానికి కొద్దిగా సహానుభూతి మాత్రం అవసరం.

  675. చా.సో. తో ముఖాముఖీ గురించి Lalitha P. గారి అభిప్రాయం:

    11/09/2013 4:44 am

    చాలా విలువైన సంభాషణ. సోషల్ మీడియాలో వెల్లువెత్తిపోతున్న అభిప్రాయాలు, కథలు, కవితలు .. వీటిలో మంచి ముత్యాలను ఎంచుకోవటం కష్టమైపోతున్న ఈ రోజుల్లో చాసో అభిప్రాయాలను నవతరం కథకులు కాస్తయినా అందుకుంటే జల్లెడ పట్టుకునే పని పాటకులకు తగ్గుతుంది.

  676. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి Nagaraju Pappu గారి అభిప్రాయం:

    11/04/2013 8:42 am

    వ్యాసం చాలా బావుంది. మీ వచనశైలి అద్భుతం. వ్యాసంలోని ముఖ్యమైన ప్రతిపాదననంతా ఒక్క పేరాలో క్లుప్తంగా చెప్పి ఈ వ్యాసానికి ఒక abstract రాశారు, ఆవిడ వ్యాఖ్యతో జయప్రభగారు. ఆ వ్యాఖ్య చదివాక, వ్యాసం చదివితే సులువుగా అర్థం అయింది.

    సంపాదకులకో మనవి – ఇటువంటి వ్యాసాలలో ఉదాహరించిన పద్యాలకి తాత్పర్యమో, వీలుంటే ప్రతిపదార్థమో అనుబంధంగానైనా ఉంచితే మాబోటి జానపదులు మీకెంతో ఋణపడి ఉంటారు 🙂

    I have a basic question about the methodology used – తెలియకే, సందేహ నివృత్తికోసమై అడుగుతున్నా..

    కవితని, అందులోనూ, ఒకటో/రెండో పద్యాలని తీసుకుని – వాటి రూపం, భావం, ప్రయోగంలో పరిణితి ఆధారంగా, అవి ఏ కవి రాసినవో, ఏ కాలానివో, వాటి బట్టి కర్రృత్వాన్ని నిర్ణయించడానికి కుదురుతుందా? అందులోనూ, ఈ పద్యాలు కథావస్తువుకి సంబంధంలేని వర్ణనలు.

    నా ఉద్ధేశం, ఫిలలాజికల్ అనాలిసిస్, హిస్టారికల్ లింగ్విస్టిక్స్ అవసరంలేకుండా, ఒక రచనతాలూకూ ఎన్నో రాత ప్రతులు, అవి ఎవరివి, ఏ ప్రాంతం నుంచీ వచ్చాయి మొదలైనవి పరిశీలించకుండా, కర్తృత్వ-కాల నిర్ణయాలు చెయ్యడానికి కుదురుతుందా? భాషలో వచ్చిన మార్పులు, భాషా ప్రయోగంలో వచ్చిన మార్పులు చారిత్రకంగా విశ్లేషించి, క్రోడికరించిన నిఘంటువులు తెలుగుకి ఉన్నాయా? అవిలేనిపక్షంలో ఇటువంటి పరిష్కరణలు చెయ్యడానికి కుదురుతుందా?

    ఈ వ్యాసంలో ప్రధానంగా ప్రస్తావించినవి కొన్ని కవిత్వ వర్ణనలు. ఏ కాలంలోనైనా, ఏ సంస్కృతిలోనైనా కొన్ని కవితాత్మకమైన ఊహలు ఏ ఒక్క కవికీ చెందినవి కావు, అవి మొత్తం కవికులానికి చెందినవి. ఠాగోర్ ఈ భావననే “స్ట్రే బర్డ్స్” అంటాడు. ఒకే ఊహ ఎంతో మంది కవులు ఎన్నో రకాలుగా ప్రయోగిస్తూఉంటారు – అది స్వతంత్రంగా గానీ, ఒక వర్ణనని చదివి, దాని ప్రేరణతో చేసినవి గానీ అయ్యుండవచ్చు. అది సర్వసాధారణమే కదా?

    ఒక అరవై, వంద పద్యాలు మూకమ్ముడిగా ఇద్దరు కవుల రచనలలో కనిపిస్తే అప్పుడు ఎవరు, ఎవరినుంచీ కాపీ కొట్టారో చెప్పగలగేమో. ఒకటి రెండు పద్యాల ఆధారంగా ఇటువంటి నిర్ణయాలు చెయ్యగలమా?

    ప్రాచీనమైన, సంప్రదాయమైన, మౌఖిక సంస్కృతులలోంచి వచ్చిన రచనలలో ఎన్నో స్తరాలు ఉంటాయని ఇప్పటి పరిశోధకులు అంటున్నారు కదా? సురేశ్ కొలిచాలగారు ఈ మధ్య భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఒక స్తరానికి చెందినవని ఒక పేపరు రాసారు. ఆయనేమంటారు?

    అదీగాకా, తెనాలి రామకృష్ణకవి పద్యమే మరో కవి కాపీకొట్టాడనుకుందాం – కాపీ కొట్టినవాడు ఆ పద్యాన్ని మరింత మెరుగులు పెడతాడు, అంతేకానీ ఒరిజినల్ లో లేని లోపాలు కావాలని ఎందుకు ప్రవేశపెడతాడు?

    కర్తృత్వానికి సంబంధించిన వాదన పక్కనపెడితే, మిగిలిన వ్యాసం అద్భుతంగా ఉంది – శృంగారతిలకంపై మీ వివరణలు భలే ఉన్నాయి.

  677. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి Rallapalli Sundaram గారి అభిప్రాయం:

    11/04/2013 5:57 am

    మాన్యులైన ఏల్చూరి వారికి నమస్కారాలు.
    నన్నెచోడుని గురించిన మీ వ్యాసంలో మీ పరిశోధన లోతుల్ని మెచ్చుకొని తీరాల్సిందే. కాని అది నన్నెచోడుని కాలనిర్ణయానికి ఏ మాత్రం ఉపకరించదని చెప్పడానికి చింతిస్తున్నాను. నన్నెచోడుని అనుకరించి తెనాలి కవి రాశాడని మానవల్లి వారు చెప్తే తెనాలినే అనుకరించి చెత్త పద్యాన్ని కుమారసంభవ రచయిత తయారుచేశాడని మీరు, కొర్లపాటి వారు అంటున్నారు. మానవల్లి వారే ఒక చెత్త పద్యం రాసి, దాన్నే విమర్శించుకొని, రామకృష్ణుడు దాన్నే అనుకరించాడని నాటకం ఆడారని అర్థం వచ్చేట్లు రాయటంలో అంతరార్థం స్పష్టమవుతూనేఉంది. మానవల్లి వారిని పాత తాటాకుల దొంగగా నిరూపించటానికి కొన్ని వందల పుటలు వ్యర్థం చేసిన వారిని ఏమని ప్రతివిమర్శ చెయ్యాలి? ఒక్క పద్యం పట్టుకొని నన్నెచోడుని కవితాసామర్థ్యాన్ని విశ్లేషించటం చాలా బాగుంది. తంజావూరి ప్రతిని గురించి తిరుమల రామచంద్ర గారు రాసిన విలువైన మాటలన్నీ గాలికి పోయాయి. కుమారసంభవం లోని ప్రతి పద్యాన్ని, పదాన్ని చదివి మాకు పాఠం చెప్పిన దేవళ్ళ చిన్నికృష్ణయ్య గారు నన్నెచోడుని అర్థం చేసుకోలేదనుకోవాలి. ఎవరు ఎవరిని అనుకరించారు, అనుసరించారు అనేందుకు ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉండాలి.కూట శాసనాలను నిర్ణయించేటప్పుడు లిపి పరిణామాన్ని ఆధారం చేసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ణయిస్తారు. కవుల కాలాదులు నిశ్చయంగా తెలిసినప్పుడు పరస్పర ప్రభావాలను నిర్ణయించాలి. ఒకటి రెండు ఉదాహరణలు: అరుద్ర గారు కందం తెలుగు వారి సృష్టి అని రాసినందుకు వారికి కన్నడంతో గాని, ప్రాకృతంతో గాని పరిచయం లేని విషయాన్ని సూచించి రాళ్ళపల్లి వారు పీఠికలో చురక వేశారు. అలాగే నక్షత్రకుణ్ణి తెలుగు వారే సృష్టించారని ఆరుద్ర రాశారు, కాని అంతకంటే ముందే రాఘవాంకుడు కన్నడంలో ఆ పాత్రను ప్రవేశపెట్టాడు. కాని ఈ రెండింటికి మూలం 10వ శతాబ్దికి చెందిన చండకౌశికమనే నాటకంలో ఉందని మరో పండితుడు వెలికి తీశాడు. కుమారసంభవం విషయంలో చాలాసార్లు కొర్లపాటి వారు నాతో చర్చించారు. 12వ శతాబ్దికి తర్వాతి విషయం (భాషాశాస్త్రానికి, వృక్షశాస్త్రానికి,అలంకారశాస్త్రానికి సంబంధించినవి) మానవల్లి వారు గమనించక పొందుపరిచారని నిర్ద్వందంగా నిరూపించగలిగితే మీ వాదం నిలుస్తుందని చెప్పేవాణ్ణి. నన్నెచోడుడు వాడిన ప్రతి పదాన్నీ గమనించి అది 12వ శతాబ్దానిదే అని తేల్చిన ఎల్. బి.శంకరరావు గారి సిద్ధాంత గ్రంథం,మహనీయులు నేలటూరివారు నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడని నమ్మిన అభిప్రాయం పూర్తిగా నిరాధారాలని నేననుకోను. పంప (10వ శ.) ప్రబంధం రాశాడని తెలియక నన్నెచోడుని తెలుగు ప్రబంధ కవులకు దగ్గరగా తీసుకు వచ్చిన వేదం వారి వాదాన్ని అంగీకరించడం కుదరదు.

    ఒక అభిప్రాయాన్ని ముందే ఏర్పరుచుకొని దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు అందరికీ నచ్చవు. కాలం విషయం వదిలేస్తే వ్యాసంలో చాలా విషయాలను సేకరించడం జరిగిందని ఒప్పుకోవచ్చు.
    రాళ్ళపల్లి సుందరం

  678. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి రవి గారి అభిప్రాయం:

    11/04/2013 2:43 am

    చాలా చక్కని పరిశోధన వ్యాసం. అయితే మానవల్లి రామకృష్ణకవి పొరబాటును ఎత్తి చూపిస్తూ ఆవేశానికి లోబడి ఆయనే కుమారసంభవం వ్రాసి నన్నెచోడుడికి కర్తృత్వం ఆపాదించారన్నట్టు ధ్వనింపజేయడం బావోలేదు. మానవల్లి వారికి నన్నెచోడుడిపై అవ్యాజమైన అనురాగము, తెనాలి రామకృష్ణునిపై కోపమో, ద్వేషమో ఉండవలసిన అవసరం ఏమిటో తెలియదు.

    నా వంతుగా కొన్ని వరహాలు.

    >>‘దృష్ట్వా యాసాం నయనసుషమాం వఙ్గవారాఙ్గనానామ్’ అన్నచోట వంగదేశపు వారాంగనల ప్రసక్తి; ‘యేయే ఖఞ్జన మేక మేవ కమలే పశ్యన్తి’ మొదలైన చోట్ల >>వర్ణింపబడిన ఖంజన పక్షి ప్రస్తావన – మొదలైన వాటిని బట్టి, వంగదేశాభిమానం గల సంధాత ఎవరో క్రీ.శ. 14వ శతాబ్ది ప్రాంతంలో దీనిని కూర్పగా,

    – ఖంజన శబ్దం వంగదేశీయులకు మాత్రమే ప్రత్యేకం కాదు. దమయంతి కన్నులను వర్ణిస్తూ శ్రీహర్షుడు చెప్పిన శ్లోకం ఇది.

    నలినం మలినం వివృణ్వతీ పృషతీమస్పృశతీ తదీక్షణే |
    అపి ఖఞ్జనమంజనాంచితే విదధాతే రుచిగర్వదుర్విధమ్ ||

    శ్రీహర్షుడు మేవార్ రాజు జయచంద్రుని ఆస్థానకవి అన్న విషయం స్పష్టం.

    పొద్దున లేవగానే ఖంజరీటం కనబడితే శుభం జరుగుతుందన్న ప్రాచీనశ్లోకం ఒకటుంది. (కర్తృత్వం తెలియదు).

    తురంగమాతంగమహోరగేషు సరోజగోచ్ఛత్రవృశేషు యేన |
    పూర్వే చ దృష్టో ऽ హని ఖఞ్జరీటో నిశ్శంసయం తస్య భవేన్నృపత్వమ్ ||

    పొద్దునపూట గుర్రంపైనో, మహాసర్పంపైనో,ఏనుగుపైనో,సరోజం పైనో, ఆవుపైననో, గొడుగుపైనో వ్రాలిన కాటుకపిట్టను చూస్తే వాడికి రాచపదవి తప్పక లభిస్తుంది.

    అలాగే – శృంగారతిలకమ్ ముక్తకమైనప్పటికీ వఙ్గవారాంగనలవర్ణన వఙ్గదేశీయుడే చేయాలన్న నియమం వర్తించదని నా అభిప్రాయం. కవి స్వదేశానికి చెందని రమణీమణులను వర్ణించిన సందర్భాలు సంస్కృతంలో తక్కువ కాదనుకుంటాను. (ఉదాహరణ: రాజశేఖరుని కేరళ, కున్తల భామినుల వర్ణన) వఙ్గ దేశీయకవిత్వం గౌడీ రీతిగా సుప్రసిద్ధం. శృఙ్గారతిలకమ్ ఓజోభరితంగా, కఠిన సమాసాలతో కాక వైదర్భీరీతిలోనే సాగింది. అలాగే వఙ్గదేశీయులకు అభిమానపాత్రమైన సప్తపర్ణి ఈ కావ్యంలో కనిపించదు.

    పై కారణాల వల్ల శృఙ్గారతిలకసంధానకర్త కాళిదాసు అవునో కాదో కానీ వఙ్గదేశీయుడనడం చింత్యమని నా అభిప్రాయం.

    >>కాళిదాస వాఙ్మయంలో లేని ‘పత్రభంగ’ శబ్దప్రయోగం (‘కస్తూరీవరపత్రభఙ్గనికరో’)

    శ్యామలాదండకంలోని ఈ వాక్యాన్ని పరిశీలనార్థం మీ ముందుంచుతున్నాను.

    ..ప్రోల్లసద్వాళికా మౌక్తికశ్రేణికాచన్ద్రికామండలోద్భాసి”గణ్డస్థల న్యస్త కస్తూరికాపత్రరేఖా”సముద్భూత సౌరభ్యసంభ్రాన్తభృంగాంగనా గీత సాంద్రీభవన్మత్ర తంత్రీస్వరే భాస్వరే..

    ఇంకా ఇతర విషయాలేమైనా తెలిస్తే వ్యాఖ్యల ద్వారా పంచుకుంటాను.

    జిజ్ఞాసువు,
    రవి.

  679. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    11/02/2013 11:42 pm

    చక్కని వ్యాసం, మానవత్వమున్న శాస్త్రవేత్తను పరిచయం చేసిన తీరు హృద్యం. గణితం, కవిత్వం నాకెప్పుడూ ఇరుగూ పొరుగుల్లాగానే కనిపిస్తాయి.గణితంలో ప్రవేశం, అభినివేశం గలవారు కవిత్వానికి మంచి పాఠకులు కాగలరు అన్నది అనుభవైక వేద్యం. వాసుదేవరావు గారి అందమైన వాక్యాల్లో కవిత్వానికి ఉపకరించేవి:

    ఊహను కవిత తోను, నిర్దిష్టతను పాండిత్యంతోను ప్రతిక్షేపించి చదువుకొనండి:

    “ఉపాధ్యాయునిగా మీనాక్షిసుందరం ఊహకు (intuition, imagination) ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చారు. నిర్దిష్టత (rigor) ఎంత అవసరమైనా, మంచి ఊహ నిర్దిష్టతను తప్పకుండా సాధిస్తుందని ఆయన నమ్మిక. ఈ రిగర్‌కీ ఇంట్యూషన్‌కీ యుద్ధం లెక్కల వాళ్ళకు నిత్యోత్సవం. ఒక ఐడియాని ముందుకు తీసుకు వెళుతున్నప్పుడు రిగర్‌ను కొంచెం వెనకాల పెట్టి ఊహను స్వేచ్ఛగా మసలనివ్వాలనీ, ఊహ సరియైన దోవన సంచరిస్తే రిగర్ దానంతట అదే వచ్చి ఊహను సర్దుకుంటూ పోతుందని, మీనాక్షిసుందరం విద్యార్థులకు డిపార్ట్‌మెంట్‌లో జరిగే సమావేశాలలో సూటి గానూ, తను పాఠం చెప్పే పద్ధతి ద్వారా సూచన గానూ, తరచూ యిచ్చిన ముఖ్యమైన సందేశం. ఇటువంటి ధోరణి ఫిజిక్స్‌తో పరిచయం ఉన్న లెక్కలవాళ్ల లోనే కనపడుతుంది అంటే అతిశయోక్తి కాదు. రిగర్ గురించి మరింతగా పట్టించుకునే వాళ్ళను ‘గుడ్డు మీద ఈకలు లెక్కపెట్టేవాళ్ళు’ అని విశ్వకళా పరిషత్‌లో వ్యవహరించటం పరిపాటి.”

    రామాయణంలో పిడకల వేట: రామానుజం ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది కుంభకోణం ప్రాంతాల్లో నైనా, ఆయన చదువుకున్నది తెలుగు మీడియంలనే, జీవిత చరిత్ర కారుడు ఇంత చిన్న విషయాన్ని కూడా వదలకుండా పట్టుకొచ్చినందుకు నేను చాలా ఆనందించాను. (The Man Who Knew Infinity: A Life of the Genius Ramanujan by Robert Kanigel.)

    పైన వాసుదేవ రావు గారు వ్రాసినటువంటి చక్కని వాక్యాలు నాకు G.H Hardy. స్మృతిగ్రంధంలో కూడా కనిపించినాయి.

    తమ్మినేని యదుకుల భూషణ్

  680. ఒక్కో రోజు గురించి Prasuna గారి అభిప్రాయం:

    11/02/2013 3:56 am

    కవిత చాలా చాలా బాగుంది మానసా.

  681. అల్లరి పిచుకలు గురించి mallikarjuna sarma గారి అభిప్రాయం:

    11/02/2013 1:52 am

    ఇంద్రాణి గార్కి,
    ఆలోచనలకి అలవాటుపడ్డ మనసు, బియ్యానికి అలవాటుపడ్డ పిచుకల్లాంటిదే. ధ్యానం లేకపోతే ఆలోచనలాగవు. ధాన్యం లేకపోతే పిచుకలు రావు. రెండోది ఉందన్న ద్వైతభ్రమలో అటు పిచుకలు, ఇటు మనసు, అదిగో అసలైన ‘నేను’ కలగజేసుకుంటేగాని పోవు. మంచి ఆలోచనల్ని కలిగించిన కవిత! అభినందనలు.

    ‘నీ పుస్తకాల అక్షరాల రెపరెప’ అని వుండాలేమో ఒకచోట. నాకు సరిగ్గా అర్థం కాలేదు.
    మల్లికార్జున శర్మ దేవరకొండ.

  682. ఒక్కో రోజు గురించి రవి వీరెల్లి గారి అభిప్రాయం:

    11/01/2013 1:26 pm

    మానసా,

    కవిత చాలా బాగుంది. అభినందనలు!

    రవి

  683. ఒక్కో రోజు గురించి వైబోయిన సత్యనారాయణ గారి అభిప్రాయం:

    11/01/2013 12:14 pm

    జీవన పయనాన్ని లయగా నడిపించే
    నిర్వికల్ప సంగీతమేదో ఆగిపోయినట్లై – అనడంలో తాత్వికతని,
    ఏదో రహస్యం అర్థమయ్యీ కానట్టు – అనడంలో మార్మికతని
    ప్రదర్శించిన మీ కవిత చాలా బాగుంది

  684. అల్లరి పిచుకలు గురించి వాహెద్ గారి అభిప్రాయం:

    11/01/2013 10:26 am

    అద్భుతంగా ఉంది.. కొత్త ప్రయోగాలు..కొత్త ఇమేజరీ..చక్కని కవిత.

  685. అదే నేను గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    10/29/2013 2:46 pm

    కవిత అరమరికలు, ఆడంబరాలు లేని సౌందర్యంతో సాగింది. ఎందుకో “దొంగలా నవ్వుతూ” అన్న పదాలే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఇతరులు ఆశ్చర్యపడితే దొంగలు నవ్వుతారో లేదో కాని, “వెన్నదొంగలా నవ్వుతూ” అనుకుంటే వచ్చిన సందేహం నిస్సం”దేహం”గా మారినట్టు అనిపించింది.
    =======
    విధేయుడు
    _శ్రీనివాస్

  686. నన్నెచోడుని క్రౌంచపదము గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    10/26/2013 2:01 am

    మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి
    నమస్కృతిపూర్వకంగా,

    ఎంతో ఆలస్యంగా, ఈ నాటికి ఈ వ్యాసాన్ని చదవగలిగాను. చదివి ఎంతో ఆనందించాను. నాకు చాలా నచ్చిన విషయం: ఛందస్సును ఒక గణమాత్రావిభజనధర్మి, పద్యలక్షణశాస్త్రం అని కాకుండా, మీరు పరిధిని విస్తరింపజేసి – దానినొక సర్వాంతర్వర్తనీయమైన, వేదాంగశిరోమణిరూపమైన దృగ్విషయంగా మలిచి చూపుతున్నారు. ఆ ప్రయత్నంలో మీరు ఎన్నో సంగీత సాహిత్య ప్రక్రియావిశేషాలను ఒక్క ఛందస్సు గొడుగు క్రిందికి తెచ్చి నూతనదృక్కోణాలను ఆవిష్కరింపగలుగుతున్నారు. షట్ప్రత్యయాలను మీరు వివరించిన తీరు విజ్ఞానశాస్త్రవేత్తగా మీకున్న నైపథ్యానికి ప్రకాశకం. అక్షర మాత్రావృత్తాల లోనూ, చిత్రబంధ గర్భబంధాలలోనూ ప్రత్నగతులను కనుగొంటున్నారు. చిరకాలికమైన ఆ కృషిఫలితంగా మీరు సరిక్రొత్త నడకలను, సార్థక నామవృత్తాలను ఆవిష్కరించటం మీ విద్యావిజయానికి సంకేతంగానే ఉన్నది. ఉత్తమ భావుకతతో కూడిన సలక్షణమైన కవితారచనను చేయగలగటం మీ లాక్షణికతను మరింత అందగింపజేసింది. తెలుగువారిలో ప్రాతఃస్మరణీయులైన ఛందోవిజ్ఞాతల పంక్తిలో మీరున్నారని చెప్పగలుగుతున్నాను.

    క్రౌంచపదాన్ని చారిత్రిక వికాసదృష్టితో అనుశీలించి, దాని పూర్వాపరాలను చర్చిస్తూ ఒకానొక కవి హృదయధర్మాన్ని పరిశీలించేందుకు, ఆయన పౌర్వికతను నిర్ధారించేందుకు మీరు ఈ వ్యాసంలో ప్రవేశపెట్టిన ప్రమాణపరంపర నన్నెంతో ఆకట్టుకొన్నది. నన్నెచోడుని కర్తృత్వాన్ని గురించి, కాలాన్ని గురించి మీచే నిశ్చీయమానాలుగా ఉన్న అభిప్రాయాలతో నాకు ఐక్యానుసంధానం లేనప్పటికీ మీ వాదధోరణి, తర్కసంగతి, సహృదయత నాకు ఆకర్షణీయంగా అగుపించాయి.

    పైని చర్చలో కుమారసంభవం లోని ఈ పద్యం (6-141) ప్రసక్తి వచ్చింది:

    ఆతపభీతి నీడలు రయంబున మ్రాఁకులక్రిందు దూఱెనో
    యా తరులుం దృషాభిహతులై తమ నీడలు దార త్రాగెనో
    భాతి ననంగ నీడ లురుపాదపమూలములం దడంగె గ్రీ
    ష్మాతపమధ్యవాసరములందుఁ జలింపకయుండు నెండలన్.

    ఇందులో “తరులు” – “తృషాభిహతులు” అన్నచోట మహదమహద్వాచకాల సాంకర్యం మాటెలా ఉన్నా, ఆరుద్ర గారు దీని మూలాన్ని జయంగొండార్ కళింగత్తుప్పరణిలో గుర్తుపట్టి సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటంలో ఉదాహరించారు. మీరు జెయన్ కొండార్ మూలాన్ని, ఆరుద్ర గారి అనువాదపాఠాన్ని ఇవ్వటం బాగున్నది.

    ఆడుగిన్ఱ శిఱై వెంబరుంది నిళల్ అంజి యక్కడువనత్తై వి
    ట్టోడుగిన్ఱ నిళలొక్కుం నిఱ్కుం నిళల్ ఓరిడత్తు ముళవల్లవే.
    – కలింగత్తుప్పరణి (80)
    జ్వలియించు దినకరుని చరపు లోర్వగలేక
    పులుగుగమి మేతకై పోవు నీడలు తక్క
    నిలకడగ నిగిడారు నీడ లీ కానలో
    కలయ జూచినమేర కనిపించ నేరవు. (ఆరుద్ర)

    ఆదవంబరుగు మెన్ఱు నిన్ఱ నిళల్ అంగు నిన్ఱు కుడి పోనద-
    ప్పాదవంబునల్ పెఱా దుణంగువన పరుగుం నమ్మైయెన వెరువియే.
    – కలింగత్తుప్పరణి (81)
    తీక్ష్ణాంశు వాకలిచె తినివేయునని వగచి
    వృక్షపాదము లంటి వేడుకొన్నది నీడ
    అక్షీణ క్షుధచేత ఆ తరువు త్రావునని
    వీక్షించుచుండగనె వెడలి పోయినది. (ఆరుద్ర)

    నిజానికి ఈ రెండింటికీ మూలం గాథాసప్తశతి (1-49)లో ఉన్నది:

    థోఅం పి ణ ణీసరఈ మజ్ఝణ్ణే ఉహ సరీర-తల-లుక్కా
    ఆఅవ-భఏణ ఛాఈ వి పహిఅ తా కిం ణ వీసమసి.
    (స్తోకమపి న నిఃసరతి మధ్యాహ్నే పశ్య శరీరతలలీనా
    ఆతపభయేన చ్ఛాయాపి పథిక తత్కిం న విశ్రామ్యసి.)

    దీనికి ‘ఈమాట’లో మీరు ప్రకటించిన అనువాదం:

    నడు దినమున నెండకు భయ,పడి దేహపు నీడ కనుల బడకను దాగెన్
    బడలికతో నీవిప్పుడు, నడువక విశ్రాంతి గొనుము నా గృహమందున్.

    తమిళాంధ్రకవులిద్దరూ ప్రాకృతగాథకు అనుకర్తలే అయితే, జెయన్ కొండార్ అనుసరణ విషయం కుమారసంభవం రచనా కాలనిర్ణయానికి దోహదింపదు.

    ఛందస్సు విషయంలో మీ కృషి మాత్రం విభ్రమాస్పదంగా ఉన్నది. అందుకు మీకు అభినందనలు!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  687. అదే నేను గురించి Radha గారి అభిప్రాయం:

    10/21/2013 4:30 pm

    దేవి గారూ, ధన్యవాదములు. మీ బ్లాగ్ చూశాను. చాలా బావున్నాయి మీ కవితలు, నానీలు. ఆత్మ విచారం చేసుకోవలనే ఆలోచన కలగడమే అదృష్టం. ఒకసారి ఆ మార్గం లో నడుస్తున్నపుడు అస్పష్టత తప్పకుండా తొలిగిపోతుంది. కదా?

  688. అదే నేను గురించి Devi గారి అభిప్రాయం:

    10/21/2013 10:58 am

    చాలా బాగుందండి. మనసులోని అస్పష్టమైన ఆలోచనల్ని ఇంకొకరి రచనల్లో స్పష్టంగా చదవటం చాల హాయినిస్తుంది. ఈ కవితని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  689. అదే నేను గురించి mallikarjuna sarma గారి అభిప్రాయం:

    10/18/2013 3:51 am

    రాధ గార్కి,
    ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మీ బుజ్జి కవితలో ఆ రమణుని పసి కళ్ల చూపులు స్పష్టంగానే హృదయాన్ని తాకుతున్నాయి. అందుకే ఓ సారి స్మరించుకుని, ఆ అవకాశాన్ని కల్పించిన మీకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇంకా ఇలాంటి ఎన్నో రచనలు మీరు చేయాలని, చేయగలరని నమ్ముతూ…
    నమస్తే,
    మల్లికార్జున శర్మ.

  690. అదే నేను గురించి Radha గారి అభిప్రాయం:

    10/15/2013 1:28 pm

    శర్మ గారూ,
    నమస్కారం. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏమిటంటే మీరు ఓం నమో భగవతే శ్రీ రమణాయ! అనడం. ఎందుకంటే నేను ఈ కవితని రమణ మహర్షి ఫొటో చూస్తూ ఆయన్ని అడుగుతూ రాశాను.
    ధన్యవాదములతో,
    రాధ

  691. ఏటి గట్టున ఇల్లు గురించి ఆకునూరి మురళీకృష్ణ గారి అభిప్రాయం:

    09/26/2013 1:37 pm

    ‘కథ బాగుంది’ అని మామూలుగా చెప్పడానికి వీల్లేని కథ ఇది. కథలో ఏదో వుంది. మనసుని కట్టి పడేసేదీ, మనసుకు మాత్రమే అర్ధమయేదీ. దీన్ని కధలా చదవడం పొరపాటు – కవిత్వంలా ఆస్వాదించాలి. కథ కదిలిస్తుంది, ఆలోచనని రేకెత్తిస్తుంది, మహా అయితే మనల్ని ఊపేస్తుంది. కానీ కవిత్వం మనసుని అంటి పెట్టుకుని వుంటుంది. ఇంతకన్నా ఏం చెప్పగలను దమయంతి గారూ?

  692. పల్లెటూర్ to పట్నం: The Seven Seater గురించి mallikarjuna sarma గారి అభిప్రాయం:

    09/24/2013 3:14 am

    ‘రాడా రాడా రాడా రాడా రాడా’ అని ఇంకా ఓ డజన్ సార్లు అంటే కూడా కొత్తవాళ్లకు అర్థం కాదేమో! లింగంపల్లి /మియాపూర్ నుండి వెళ్లేటప్పుడు అది ‘ఎర్రగడ్డ’ అని. అలాగే ‘గుట్టా గుట్టా…’ మలక్పేట దగ్గర అది ‘చాంద్రాయణగుట్ట’. కూకట్ పల్లి దగ్గర అది ‘జగద్గిరిగుట్ట’. ఉప్పల్ దగ్గర అది ‘యాదగిరిగుట్ట’. సందర్భానుసారంగా ప్రజలు అర్థంచేసుకోవలసిన ‘ప్రజాటో’ వాళ్ల భాష ఇది.

    కవిత ఓ మంచి పరిశీలన. పదాల వివరణ ఓ మంచి అలవాటు.

  693. రచయితలకు సూచనలు గురించి శివకృష్ణ.పి గారి అభిప్రాయం:

    09/22/2013 10:13 am

    ఈమాట మాగజైన్‌కు ఎడిటర్‌గారికి నమస్కారం. నాపేరు శివకృష్ణ మొదటి సారిగా మీ వెబ్ సైట్‌ను చూశాను.చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఇలాంటి వెబ్‌సైట్‌ ఉన్నది అనేది నాకు తెలియదు.ఇంగ్లీష్, హీందీ భాషలే ప్రాధాన్యత ఇస్తున్న ఈరోజుల్లో ఇలాంటి మాగజైన్‌ ఉండడం చాలా అభినందనీయం. దేశభాష పట్ల మీలాంటి వారు పెంచుకున్న మమకారానికి, ఆప్యాయతకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి వారివల్ల ఈ సమాజంలో తెలుగు భాష ఇంకా బ్రతికేవుంది అనేది అర్ధమౌతుంది.అయితే నేను చిన్నిమేధాశక్తితో చిన్న కవితలు రాశాను. ఇప్పటి వరకు నాకవితాలు ఏ మ్యాగజైను పంపలేదు. కానీ మొదటిసారిగా మీ మ్యాగజైన్‌ నాకు మీ పంపాలని ఆశపడుతున్నాను.మీ నాకవితలు నచ్చితే ప్రచురిస్తారని నమ్ముతున్నాను.
    ఇట్లు మీ
    ప్రేమతో
    శివ

  694. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    09/21/2013 3:17 am

    యెర్నేని లైలా గారికి
    నమస్కృతులతో,

    మీ సహృదయవాక్యానికి ధన్యవాదాలు. ప్రసక్తింపబడుతున్నది మరువం పువ్వులపై తుమ్మెదలు వాలటం అన్న వాక్యాధికరణం తర్వాత కాబట్టి దానిని పునరుక్తం చేయలేదు. అయినా, లోకసిద్ధంగా భ్రమరావరోహణకు పాత్రంగా మరువానికి పువ్వులుండనప్పటికీ, కావ్యాలలో కవులు మరువానికి పువ్వులను పెద్దవిగా వర్ణింపకపోలేదు. అని నేను సరిగా వ్రాసి ఉంటే, అతివ్యాప్తికి తావుండేది కాదు.

    మీ కొత్తిమీర పువ్వుల ప్రస్తావం, ప్రస్తావన:

    కొత్తిమీర పువ్వుల మైమరపించే సువాసన తనకెంతో ప్రీతిపాత్రమని, అయితే, కొత్తిమీరను నలిపినప్పుడు వచ్చే ఘాటైన వాసన మాత్రం తనకు ప్రాణాంతకంగా అనిపిస్తుందని – రాయప్రోలు సుబ్బారావు గారు అనేవారు. ఇంటర్వ్యూలలో అన్నారు కూడాను. వారితో సహకృతంగా దానిని సౌందర్యద్రవ్యంగా పరిగణించి, “కొత్తిమిరి సొగసును గుస్తరించి” విరివిగా కవితలలో వర్ణించిన తెలుగు కవులు ఇంకొకరిద్దరికంటె ఉండరేమో.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    అస్థానపతితంగా పెద్దలకు ఈ హృదయగతాన్ని కూడా మనవి చేస్తున్నందుకు దయతో మన్నింప ప్రార్థన:

    విమర్శనీయం ఎక్కడ కనుపించినా విమర్శకులు విమర్శించటం సరస్వతీతత్త్వమే అని నేనకొంటాను.

    విమర్శలో తర్కసంగతి వల్ల, వ్యక్తివివేకం వల్ల 1) వాద బలం 2) వాది బలం అన్నవి ఎప్పుడూ ఉంటాయి. వాదబలంలోని సౌష్ఠవం, వాదిబలంలోని నిష్ఠురత – రెండూ విద్యార్థులకు శిక్షాప్రణీతాలే. ఆనందవర్ధనుడంతటి మహానుభావుణ్ణి జయంత భట్టు ‘పణ్డితమ్మన్యః’ అన్నాడు. ఆయన విమర్శ కారణంగానే మనము ఆనందవర్ధనుణ్ణి ఆలంకారిక సార్వభౌమునిగానూ; జయంత భట్ట జగదీశ భట్టులను నైయాయిక సార్వభౌములుగానూ శిరసావహిస్తున్నాము.

    కవి కృతితోపాటు విమర్శను అధ్యయనించటమూ – అదెంత ప్రామాణికమైనా, కాకపోయినా – మనకు “రజతగిరి మీఁద హరిహరారాధనంబు”.

    ఒకవేళ విమర్శకవాక్యంలో అసంగతమైన కటుత్వం, అసహృదయత, నిష్కర్షలో ప్రకర్ష ధ్వనించినదనుకొన్నా, అధ్యయనపరులకోసం కవులు, సహృదయులు ఓరిమితో సమాధానం చెప్పక తప్పదు. అదే విమర్శ కాలాంతరంలోనూ వెలువడవచ్చును కనుక.

    కవితావిమర్శలో కవి – విమర్శకుల చర్చలో సాంయాత్రికుల వాకోవాక్యాలలో పారస్పరికత నిర్నిమిత్తం.

    భక్తునికి సాటి భక్తుల భక్తిని విమర్శించే అధికారం లేదని భక్తిశాస్త్రం అంటున్నది. భక్తిపరులకు సాహిత్యం, విమర్శ క్రమప్రథతో స్వస్వరూపాన్ని అనుసంధించే తుల్యపథాలే.

  695. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి V.Ch.Veerabhadrudu గారి అభిప్రాయం:

    09/20/2013 4:54 am

    ఈ చర్చ ముగిసిపోయిందనుకున్నాను గానీ, ఇంకా కొనసాగుతున్నందుకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకటి రెండు వివరణలు ఇవ్వవలసి ఉందనిపించింది.

    1) బాల్యకాల అనే పదబంధంలో లోపమేమిటో నాకు తెలియలేదు. వైకం బహమ్మద్ బషీర్ గొప్ప మళయాళ రచయిత.ఆయన ఒక రచన పేరు బాల్యకాలసఖి. అది మళయాళ పదబంధమంటారా, తెలుగు మీద ఉన్నదానికన్నా సంస్కృత ప్రభావం మళయాళం మీద మరీ ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే.

    2) మరువం, దవనం అనే పేర్లని నేను ఉద్దేశ్యపూర్వకంగానే వాడాను. కవి మాట్లాడుతున్న సుగంధం కేవలం పుష్పజాతుల సుగంధం మాత్రమే కాదు, అదీకాక, ఈ వ్యాఖ్యలు చదివి చింతిస్తున్న నన్ను రాళ్ళబండి కవితాప్రసాద్ ఇటువంటి పదప్రయోగాలు గతంలో కూడా ఉన్నాయని, వెంటనే తన ధారణలోంచి సురభి మాధవరాయకవి అనే 18వ శతాబ్దపు కవి తన చంద్రికాపరిణయం అనే ప్రబంధంలో నాయిక తన కొప్పులో మరువం తురుముకున్నప్పుడు దాని మీద తుమ్మెదలు వాలాయని రాశాడని అన్నారు.

    3) ఇక తమ్మినేని యదుకులభూషణ్ గారికి నవ్వు తెప్పించిన నా పదప్రయోగం ‘పురాతమైన నీడ’లో నవ్వు తెప్పించిందేమిటో నాకు అర్థం కాలేదు. ఘోష్ట్ అనే పదానికి ప్రేతమనే అర్థమో, దెయ్యమనే అర్థమో గూగుల్ సెర్చ్ చూడకుండా కూడా స్ఫురించేవే. కాని కవి హృదయం అర్థమయితే తప్ప ‘పురాతనమైన నీడ’ అనే అర్థం స్ఫురించదు. కేవలం స్పానిష్ వాచకాన్ని ఇంటర్నెట్ ముందు కూచుని బాబిలోన్ ట్రాన్సలేటింగ్ టూల్ నొక్కితే వచ్చే అర్థం ప్రేతమని మాత్రమే ఉంటుంది. కాని మొత్తం కవిని చదివి కొన్నాళ్ళ పాటు మరే ధ్యాసా లేకుండా గడిపితేగాని ‘పురాతనమైన నీడ’ అన్న మాట స్ఫురించదు.నిజంగానే మహాప్రజ్ఞ చేసే మిరకిల్ ఇది.

    ఇంతకీ తెలుగులో ఇందరు స్పానిష్ మహాపండితులు ఉండి కూడా నాకు ఇన్నాళ్ళ పాటు మచాడో పేరు ఎందుకు తెలియలేదో?

  696. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    09/18/2013 4:20 am

    అనువాదంలో మహా ప్రజ్ఞ మాట దేవుడెరుగు, ఏ మాత్రం పట్టు దప్పినా అర్థం లోయలోకి జారి పోతుంది ద్రోహ వస్త్రాన్ని కప్పుకుని.అనువాదంలో స్వేచ్ఛకు పరిమితులున్నాయి. మూలంలో కవికి భాష పట్ల గల వివేచన మీద అనువాదకుడు శ్రద్ధ వహించాలి. మచాడో వాడుక భాషకు పట్టం కట్టిన వాడు. అలతి అలతి పదాలతో భావాన్ని తేట పరచగల సరళమైన శైలి అతని సొంతం. ఇవన్నీ విస్మరించదగిన అంశాలు కాదు అనువాదంలో. చైనీస్ కవిత్రయం (లీ పో, తో పు, వాంగ్ వీ) లో రస దూరం అధికం. కవితా శక్తిలో వారిని సమీపించగలిగిన వారు నాస్తి నాస్తి అనే చెప్పాలి. నాలుగు పద చిత్రాలు సమ కూర్చిన ప్రతి ఒకడు ఈ ప్రాచీన కవి త్రయంతో తూగలేరు, కారణం, కవిత్వమన్నది ఉన్నత నాగరకతలో భాగం, అలాగే, విజ్ఞానం తత్వ శాస్త్రాలు కూడా, వీటి మధ్య సమన్వయం గొప్ప నాగరికతల్లో (ఉదా చైనా , గ్రీసు, భారత నాగరికతలు) కనిపిస్తుంది. అంతే గాక, ప్రకృతి పరిశీలన అనాదిగా నాగరకతకు పునాది.అమోఘమైన శబ్ద శక్తితో భావాలను నాగరికతల ఎల్లలు దాటించే వాడు అనువాదకుడు కాబట్టి, తేనెటీగల్ని ఎక్కడ బడితే అక్కడ వదల రాదు. మూలాన్ని తరచి చూడకుండా చేసేది అనువాదమే కాదు. గుడ్డెద్దు చేలో పడినట్లు ప్రతీ కవితను అనువాదం చేయాలి అన్న లౌల్యాన్ని వీడి పరిమితులను గుర్తెరిగి చేసిన అనువాదాలు కాల పరీక్షను తట్టుకొని నిలబడతాయి.

    బార్న్ స్టోన్ సంకలనం బంగాళాఖాతం, రాబర్ట్ బ్లై తో (Times Alone) మొదలు పెట్టడం సులువు.The Poem Itself (1962) అన్న పుస్తకంలో మూల భాషలో కవిత, భావానువాదం, కవి పరిచయం ఉండటం వల్ల కొంత అవగాహన పెరుగుతుంది. (ఇందులో మచాడో కవితలు ఉన్నాయి). కావలిసిన పుస్తకాలు, ఉపకరణాలు ఉన్న ఈ శతాబ్దిలో మూల భాషనుండి తెనుగు చేయడం అన్ని విధాలా మంచిది. ఈ అనువాదాల్లో అన్నిటికన్నా నవ్వు తెప్పించినది “Noche de verano కవితకు అనువాదం:

    మూలంలో స్పష్టంగా :
    “Yo en este viejo pueblo paseando
    solo, como un fantasma.”

    ‘పాతవడ్డ పల్లెటూరులో నేను
    ప్రేతంలా ఒంటరిగా తిరుగుతాను’ అంటున్నాడు కవి

    దాన్నే మన బార్న్ స్టోన్ :
    ‘I walk through this ancient village,
    alone, like a ghost ‘

    అనువాదకుల ‘అంతర్గతంగా ఉండే ఒక మహాప్రజ్ఞ’ చేసే మిరకిల్:

    మూలంలోని దెయ్యం కాస్త నీడై కూచుంది, అది కూడా మామూలు అణా కాణీ నీడ కాదు, మూలంలో లేని ఒక పురాతనమైన నీడ

    ఈ ప్రాచీనగ్రామసీమలో
    ఒక పురాతనమైన నీడలా
    నేనొక్కణ్ణే నడయాడుతున్నాను

    చివరికి బొత్తిగా హృదయ కవాటాలు లేని గూగుల్ ఉపకరణం వాడి చేసిన ముక్కస్య ముక్క అనువాదం:

    “నేను ఈ పాత పట్టణంలో వాకింగ్
    ఒంటరిగా, ఒక దెయ్యం వంటి.”

    మూలాన్ని గాలికొదిలేసే అనువాదాలు , మూలాన్ని వదలలేని అనువాదాలు రెండు అతి వాదాలే, కాబట్టి , వీటికి దూరంగా ఇంచుక రసజ్ఞత తో చేసిన అనువాదాలు రాణిస్తాయి. “ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు”

    ఏది ఏమైనప్పటికి ఒక అనువాదమంటూ చేసి అలరించిన వీరభద్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అనువాదంలో స్వేచ్ఛ లాంటి విషయాలు మరొక విడి వ్యాసంలో ముచ్చటిస్తాను

    తమ్మినేని యదుకుల భూషణ్
    ———————————–
    “Noche de verano”
    Antonio Machado

    Es una hermosa noche de verano.
    Tienen las altas casas
    abiertos los balcones
    del viejo pueblo a la anchurosa plaza.
    En el amplio rectángulo desierto,
    bancos de piedra, evónimos y acacias
    simétricos dibujan
    sus negras sombras en la arena blanca.
    En el cénit, la luna, y en la torre,
    la esfera del reloj iluminada.
    Yo en este viejo pueblo paseando
    solo, como un fantasma.

    translated from the Spanish by Willis Barnstone

    “Summer Night”
    A beautiful summer night.
    the tall houses leave
    their balcony shutters open
    to the wide plaza of the old village.
    In the large deserted square,
    stone benches, burning bush and acacias
    trace their black shadows
    symmetrically on the white sand.
    In its zenith, the moon; in the tower,
    the clock’s illuminated globe.
    I walk through this ancient village,
    alone, like a ghost.
    ——————-
    వేసవి రాత్రి
    చాలా అందమైన వేసవి రాత్రి
    ఈ పురాతనగ్రామమైదానానికి
    మేడలు గవాక్షాలు తెరిచిపెట్టాయి
    మనుష్యసంచారం లేని విశాలక్షేత్రం
    రాతిబెంచీలు. చెట్లు, పొదలు
    తెల్లని ఇసుక మీద సౌష్టవంగా
    పరుచుకున్న నల్లనినీడలు.
    దిగంతరేఖ మీద చంద్రుడు
    గంటస్తంభంలో మెరుస్తున్న
    గడియారగోళం
    ఈ ప్రాచీనగ్రామసీమలో
    ఒక పురాతనమైన నీడలా
    నేనొక్కణ్ణే నడయాడుతున్నాను
    ——————

    ఇది ఒక అందమైన వేసవి రాత్రి.
    వారు పొడవైన ఇళ్లు కలిగి
    ఓపెన్ బాల్కనీలు
    anchurosa పాత పట్టణం చదరపు.
    పెద్ద దీర్ఘ చతురస్రం ఎడారిలో
    రాతి బల్లలు మరియు acacias evónimos
    సుష్ట డ్రాయింగ్
    తెలుపు ఇసుక వారి నలుపు నీడలు.
    అత్యున్నత స్థాయికి, చంద్రుడు, మరియు టవర్,
    ప్రకాశవంతమైన గడియార ముఖ.
    నేను ఈ పాత పట్టణంలో వాకింగ్
    ఒంటరిగా, ఒక దెయ్యం వంటి. (గూగుల్ అనువాదం )

  697. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి తఃతః గారి అభిప్రాయం:

    09/18/2013 3:13 am

    రెండవ ఫ్రశ్న :”అభిజ్ఞాన శాకుంతలంలో తుమ్మెద శకుంతల ముఖం చుట్టూ ఎందుకు తిరిగిందండి?”

    సమాధానం RYDER చెపితేనే బాగుంటుంది. నాకూ వినాలనుంది.

    మొదటి ప్రశ్న:’గిరీశం’ లాటి తెలుగు దగుల్బాజీ పోరంబోకు వెధవ ప్రస్తావన ఎలా తెచ్చారండీ?”

    4. శ్రీ వాడ్రేవు రాసింది చదువుతున్నప్పుడు ఒక గొప్ప స్పానిష్ కవి గురించి చదువుతున్నట్లనిపించలేదు గనక.
    3. మచాడో కవితలను తెలుగులో తానొక అనువాదకునిగా చెయలేదని శ్రీ వాడ్రేవు చెప్పారు గనక. [కవి కర్మ కావ్యమైనట్టు అనువాదకుడు చేసింది అనువాదం.]
    2. గిరీశం ‘చమక్కు’ ఇష్టం గనక.
    1. స్పానిష్ తొ పొలిస్తే ‘తెలుగు దగుల్బాజీ’అని నేను అనుకొలేదు గనక.

    తఃతః

  698. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి jayaprabha గారి అభిప్రాయం:

    09/17/2013 11:03 pm

    శకుంతల ముఖ”పద్మం” గనకనే ఆ తుమ్మెద ఆమె ముఖం చుట్టూ పరిభ్రమించింది. ఆమె ముఖం కాస్తా అక్కడ పద్మం లాగా కాక ఏ ఆకులాగానో లేక ఏ కొమ్మ లాగానో ఉండి ఉంటే పరిభ్రమించేది కాదు. కాళిదాసే అయినా పువ్వు మీద తుమ్మెద పోలికని తెచ్చేడు గానీ ఆకుల మీద వాలి నట్టు తేలేదు కదా?

    కన్యాశుల్కం లో తర్జుమా అన్న మాట కి ఒక సందర్భం ఉంది. అక్కడ గిరీశం కాదు ముఖ్యం. ఆ మాట “తర్జుమా” అన్నది మాత్రమే మనం గమనించవలసింది. అనువాదం లో ముక్కస్య ముక్కహ గా చేసినప్పుడు దానిని “తర్జుమా” అనడం తెలుగులో కద్దు. ఎప్పుడైనా “తర్జుమా” లా ఉండకుండా అనువాదం అన్నది అనువదింపబడిన భాషలో సహజంగా వొదగాలి అని తహ తహ గారి భావన అని నాకు అర్ధం అయింది. తెలుగులో అది కవిత కావాలి కానీ తెలుగు పదాలు కనిపిస్తూనే వాక్యాలు మాత్రం మరేదో భాష చదివినట్టు ఉండకూడదు. రెంటికీ చాలా తేడా ఉంటుంది మరి.

    జయప్రభ.

  699. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి తః తః గారి అభిప్రాయం:

    09/16/2013 4:18 pm

    కవిత్వానికి భావోద్వేగమే ప్రధానం అనిపిస్తూంది.”

    పాటకి beat ప్రధాన మనిపించినట్లు. భావొద్వేగం నెససరీ యే గానీ సఫిసియెంట్ కాదు. భాషకు సంబంధించిన ప్రతిదీ గుండెకాయ ఒక్క దాని తోనే కాదు తలకాయకు కూడా సంబంధించి ఉంటుంది. “మరువం, దమనం అనే పేర్లు పాఠకుడిలో రేకెత్తించగల సున్నితమైన సంవేదన ముఖ్యం తప్ప, వాటి బొటానికల్ ఆక్యురసీ కాదు.”అన్న శ్రీ వాడ్రేవు మాటలు నా కంత సబబుగా ఉన్నట్లనిపించటం లేదు. కాల గమనంలో ‘బాల్యకాల’ వంటి పదబంధాలతో చేసిన అనువాదం -అనువాదం అనను, గిరీశాన్ని గుర్తు తెచ్చుకుంటూ తర్జుమా అంటాను. ఇది మచాడో కి అన్యాయం చేసే ప్రమాదం ఉంది. ‘ఇండియాటుడే’లో శ్రీ వాడ్రేవు రాసినవి చదివి వారి అభిమాని నైన వాణ్ణి, అయినా నాకు ఇలా రాయక తప్పటం లేదు.

    నేచర్ కు సంబంధించి యాక్యురసీ ఆఫ్ ఎ సైంటిస్ట్, యాక్యురసీ ఆఫ్ ఎ పొయెట్ ల గురించీ ఈ మాటలు ఒక సారి చూడండి:

    “Kalidasa’s knowledge of nature is not only sympathetic, it is also minutely accurate. Not only are the snows and windy music of the Himalayas, the mighty current of the sacred Ganges, his possession; his too are smaller streams and trees and every littlest flower. It is delightful to imagine a meeting between Kalidasa and Darwin. They would have understood each other perfectly; for in each the same kind of imagination worked with the same wealth of observed fact.”

    from KALIDASA – TRANSLATIONS OF SHAKUNTALA & OTHER WORKS, BY ARTHUR W. RYDER

    తః తః

  700. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి నరసింహ శర్మ మంత్రాల గారి అభిప్రాయం:

    09/15/2013 9:47 am

    “నీ వాడివాడి చూపుల్లో – నా నాడి కొట్టుకుంటోంది”

    దీనిని ఆంగ్లానువాదం చేస్తే… “ఇన్ యువర్ షార్ప్ షార్ప్ లుక్స్ – మై హార్ట్ బీట్స్ ఆల్వేజ్” అని వస్తూంది.

    దీనినే ఇంకోలా చెప్పొచ్చు…

    “The beat of my heart
    May lash in your
    Eyes of lust”

    “కోరలున్న విషనాగులు – కోరాడే కోలాటం” ప్రాసక్రీడలో భావం బలి.

    కవిత్వానికి భావోద్వేగమే ప్రధానం అనిపిస్తూంది.

  701. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి Vadrevu Chinaveerabhadrudu గారి అభిప్రాయం:

    09/15/2013 7:19 am

    సురేశ్ కొలిచాలగారు — నా అనువాదం మీద జయప్రభ వ్యాఖ్యలు నాకేమంత ఆశ్చర్యం కలిగించలేదు గాని ఆ వ్యాఖ్యలకి జవాబు ఇవ్వడానికి మీరు తీసుకున్న శ్రద్ధకి నమోవాకాలు అర్పిస్తున్నాను. నేను ఆ కవితలని ఒక కవిగా గాని, లేదా అనువాదకుడిగా గాని అనువాదం చేయలేదు. ఆ కవిత్వం పట్ల ఆపుకోలేని తమకానికి లోనైన పాఠకుడిగా చేశాను. కాని మీరు రాసిన టీకా చదివాక ద్రోహవస్త్రం అనేమాట ఆ కవితలో మరీ బాగా అమరిందనిపిస్తోంది. మనం అనువాదం చేస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉండే ఒక మహాప్రజ్ఞ చేసే మిరకిల్ అది.

    ఇక మరువం,దమనం పూలుకావు. కాని వేరే దేశాల పుష్పాల పేర్లు మన భాషకి సన్నిహితంగా లేనప్పుడు మనం మనకి సన్నిహితంగా ఉండే పేర్లనే వాడుకోవలసిఉంటుంది. మరువం, దమనం అనే పేర్లు పాఠకుడిలో రేకెత్తించగల సున్నితమైన సంవేదన ముఖ్యం తప్ప, వాటి బొటానికల్ ఆక్యురసీ కాదు. నిమ్మ పొద, కేశ రాశి, ఊట నీరు, వేన వేల జలాలు లాంటి పదాల్లో తెలుగు లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. కాని నేను నిస్సహాయుణ్ణి. ఆ కవితల్ని ఇప్పుడు అనువాదం చేసినా అలాగే అనువాదం చేస్తాను.

    మరోమాట కూడా చెప్పాలి. నా దృష్టిలో ‘మరీముఖ్యంగా ఒక మాఘమాసపుగాలి’ని నేనేమంత గొప్ప అనువాదంగా పరిగణించలేను.

    చినవీరభద్రుడు

  702. కాలాతీతం గురించి PAPARAO గారి అభిప్రాయం:

    09/13/2013 12:44 pm

    జీవతములో అథ్యాత్మిక భావాలు ఎలా విస్తరించుకోవాలో హ్రుద్యంగా చెప్పిన మీ కవిత చాలా బాగుంది

  703. అనంతం గురించి PAPARAO గారి అభిప్రాయం:

    09/13/2013 12:40 pm

    సర్వం నేనే. అంటూ సాగిన మీ కవిత చాలా బాగుంది. ఈ శరీరం పంచభూతాత్మికం అని మీ కవితలో చెప్పకనే చెప్పారు

  704. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి jayaprabha గారి అభిప్రాయం:

    09/12/2013 2:43 pm

    “పొంచివున్న మృగాలు మిమ్మల్ని/ ద్రోహవస్త్రంలో బంధించక ముందే, అల్లరి చిరుత అందిస్తున్న తియ్యటి క్షీరాలు తాగండి నిర్భయంగా!

    ఇది తెలుగు భాష లో ఏమన్నా ఒక అర్ధాన్ని ఇస్తుందా ? ” ద్రోహ వస్త్రం ” ఎమిటీ ?

    “దవనంలో మరువంలో / తేనెటీగలు మైమరిచే తరుణమిది”

    [?] దవనానికీ మరువానికీ పువ్వులుంటాయా? తేనెటీగలు రావడానికి?

    “నిమ్మ పొద, కేశ రాశి, ఊట నీరు, వేల జలాలు, జలాల్లారా!” లాంటివి తెలుగు భాషలొ తెలుగు కవితా వాక్య నిర్మాణంలో ఇమడని కృతక పదబంధాలు కావా?

    వేరే నాగరికతకి చెందిన ఒక కవిని స్వంత భాష లోకి అనువాదం చేయడం ఏమంత సులువైన విషయం కాదు. ఆ ప్రయత్నం చేసిన చినవీరభద్రుని అభినందిస్తూనే, అనువాదం ఎప్పుడైనా కూడా అనువాదం కాబడిన భాషకి ఎంత దగ్గిరగా తేగలిగామన్నది కూడా అంతే ముఖ్యం గనక, ఇప్పుడు నేను పేర్కొన్న ఇలాంటి వాక్యాలు మరొకసారి చూసుకుని ఉంటే వాటిని తెలుగులోకి ఎలా తేవాలో కూడా అనువాదకునికి తెలిసి ఉండేది.

    “మరీముఖ్యంగా ఒక మాఘ మాసపు గాలి” అంటూ ఒక అనువాద కవితని మొదలు పెట్టిన శ్రీశ్రీ ఒక దారి మన ముందుంచాడు, తెలుగు భాషలో ఊరికే భాషా భేషజం లేకుండా తెలుగుకి సహజమైన రీతిలో అనువాదం చేయడంలో! ఎప్పుడన్నా బాగా చేయలేకపోయినా పరవాలేదు గానీ తెలుగులోకి భావాన్ని చెప్పే పద బంధాలు అసహజంగా ఉండకుండా ఉంటే చాలు. చేయబోయే అనువాదాలలో వీరభద్రుడు ఇలాంటి విషయాలలో బహుశా శ్రధ్ధ వహించ గలడని ఆశిస్తాను.

    జయప్రభ.

  705. శ్రీ సూర్యనారాయణా… గురించి jayaprabha గారి అభిప్రాయం:

    09/07/2013 2:50 pm

    కొంచెం ధాటీ గా అయితే ఉంది గానీ కేశవ్ గారి అభిప్రాయం బాగుంది. వేమూరి గారూ కవిత్వం మీద మోజు ఉన్న వాళ్లకి అందరికీ విజ్ఞాన శాస్త్రం మీద కూడా మోజు ఉండాలని లేదు కదండీ? ఉదాహరణ కి నాకు “ఆదిత్య హృదయం” అంటే మహా ఇష్టం! దాన్ని నేను భక్తి తో చదువుతాను. అందులో సూర్యుడిని చూసిన విధానం శాస్త్రీయం గా ఉందో లేదో నాకు అఖ్ఖర లేదు. ఆసక్తి కూడా లేదు. అక్కడ సూర్య నమస్కారం మాత్రమే నేను చూసేది చేసేదీను]. ఆదిత్య హౄదయంలో సూర్యుడిని వాల్మీకి “విశ్వభావన” అని సంబోధించడం నాకు ఎంతో బాగుంటుంది. అది కవితాత్మకంగా ఉంటుంది.

    ఇంక ఎప్పటి నుంచో ఆడవాళ్ళు సూర్యుడిని స్మరించుకునే ఆ తెలుగు పదం లోనూ నాకు కవిత్వమే కనబడుతుంది. మధ్యహ్న బాలుడూ మల్లె పూవూ చాయ.. మల్లె పూవూ మీద మంకెన్న పొడి చాయ అని అన్నప్పుడు అలా పాడిన మా అమ్మమ్మ, మా అమ్మ గుర్తుకి వస్తారు. వాళ్ళు చూసిన చూపించిన ఆ కవితా దౄశ్యం లోంచి నేను అలాంటి ఒక సూర్యుడిని చూసే ప్రయత్నం చేస్తాను. అయితే అది శాస్త్రీయంగా ఉందా లేదా అని నేను ఆలోచించను. నాది కవితా దృస్టి మాత్రమే! విజ్ణాన దృష్టి బహుసా కేశవ్ చెప్పినట్టు వేరుగా వ్యక్తం కావాలి వ్యాసం లో. కవిత్వాన్నీ.. శాస్త్రీయతనీ ఒకటే గాట కట్టి మాట్లాడ కూడదు కదా? ఆచార సంప్రదాయాలలో మనం వల్లించుకునే వాటికి సైతం మీరి “హేతుబధ్ధతని” లేదా ఒక శాస్త్రీయతని ఆపాదించుకోవడం లో సబబు ఏముందీ? అది “సైంటిఫిక్” కాదేమో? మీకు కవి రచయితల మీద అంత చికాకు ఉండడం ఎందుకూ? కవులు విజ్ణాన దృస్టి కలిగి ఉండాలని మీరసలు ఎలా ఆశిస్తారో? కవికి హేతుబధ్ధత ఎందుకూ :)? ఇంక సూర్యుని మీద వచ్చిన కవిత్వం మీద మోజు ఉండటం వేరు, సూర్యుడి మీద రాసిన కవిత్వం లోంచి సైన్సుని చూపించాలని అనుకోవడం వేరూను! కేశవ్ గారి అభిప్రాయం అందుకని నాకు నచ్చింది.

    జయప్రభ.

  706. శ్రీ సూర్యనారాయణా… గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    09/06/2013 6:57 pm

    మన మనుగడకి మూలాధారమైన సూర్యుడిని, భూమిని, దైవ సమానులుగా పూజించి, తండ్రి తోను, తల్లి తోను పోల్చడం హేతుబద్ధమే అని నా నమ్మకం. మనం ప్రవర చెప్పుకునేటప్పుడు, “ఈ పాల సముద్రంలో, ఈ సూర్య మండలంలో, ఈ భూమి మీద, ఈ పశ్చిమ భూభాగంలో….అంటూ గోత్ర నామాలు చెప్పుకుని, “అహంభో అభివాదయే” అంటే సరిపోతుంది. బాగా రాసేరు. మన తెలుగు పాఠకులకి, రచయితలకి, సంపాదకులకి, ప్రకాశకులకి కవిత్వం మీద ఉన్న మోజు విజ్ఞానశాస్త్రం మీద ఉన్నట్లు కనిపించదు.
    – వేమూరి వేంకటేశ్వరరావు

  707. వెన్నెల – తిలక్ కవిత గురించి erathisqatyanarayana గారి అభిప్రాయం:

    09/06/2013 12:33 am

    ” అమృతంకురిసిన రాత్రి “కవిత తిలక్ గారు “కురిపించిన కవితామృతం “

  708. ప్రేమ కవితలు గురించి kesava గారి అభిప్రాయం:

    09/03/2013 12:41 pm

    మీ కవిత చాలా బాగున్నాయి.

    మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. నిజంగా అంత బాగున్నాయి.

  709. మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి Narayana గారి అభిప్రాయం:

    08/16/2013 4:00 pm

    చిన్ని గారు ధన్యవాదాలు.
    ఒక దుర్ఘటనతో ముడిపడిన ప్రస్తావన లు మాత్రమే ఈ కవిత ఉద్దేశ్యాలు.
    N.

  710. మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి chinni గారి అభిప్రాయం:

    08/16/2013 3:17 am

    నారాయణ గారు – మీ కవిత చాలా బాగుంది. అసలు ఎంత బాగా వర్ణించారంటే అంత బాగా వర్ణించారు. మనిషి గురుంచి చాలా బాగా చెప్పారు. మనిషి యొక్క మనో భావాలను చాల చక్కగ వర్ణించారు.
    మీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు!!!

    ఇట్లు
    chinni

  711. నా హృదయం గురించి MV LAKSHMI గారి అభిప్రాయం:

    08/16/2013 12:43 am

    రాధిక గారూ – “నా హృదయం” అన్న మీ కవిత చాలా బాగుంది. సృష్టిలో కెల్లా అత్యుత్తమ ప్రాణి అయిన మనిషి తన హృదయపు ఔన్నత్యాన్ని తెలుసుకుని తదనుగుణం గా ప్రవర్తిస్తే ఈ విశ్వం శాంతినిలయం అవుతుంది కదా!

  712. సిరిపాలుఁడు గురించి శ్రీరామం దగ్గుబాటి గారి అభిప్రాయం:

    08/12/2013 7:08 pm

    శ్రీ దేశికాచార్యులు గారు,

    ఒక చిన్న ఇతివృత్తముతో శాంతి కరుణలను ప్రభావితము చెస్తూ మీరు రచించిన కవిత చాలా చక్కగా యున్నది. నాకు బుద్ధదేవుని వర్ణిస్తూ మీరు చెప్పిన సీస పద్యము “రాగమ్ము భోగమ్ముఁ ద్యాగమ్ము నొనరించి .”…..హృదయాన్ని హత్తుకొని ఆనందాన్ని కల్గించినది. హల్లకంబులు అంటే తామర పూలనుకొంటాను.

    “బుద్ధదేవుని పావనమూర్తిశతమె కానవచ్చెను” ఇక్కడ శతమె అంటే అర్థమేమిటి? ముఖమా లేక పాదములా?

    అభినందనలతో
    శ్రీరామం

  713. నిశ్శబ్దం గురించి D.Venkateswara Rao గారి అభిప్రాయం:

    08/09/2013 8:41 am

    మీ ఆరు ఖండాలు చదివినప్పుడు ఎలా విమర్శించాలా అనుకున్నాను. లైలా గారు వ్రాసిన పంక్తులకు, మీ ఆఖరు కవిత ఖండం జోడించి, మొత్తం ఒకసారి చదివి చూచినప్పుడు ఇక వ్రాయవలసిన అవసరం రాలేదు.

    “ఎదొందలయాభై ఎమ్మెల్ రక్తం లో కలసిపోతే మొహాన నరాలు ఉబ్బిపోతే.
    కానీ ఎప్పుడో వెళ్ళిపోయిన కమలాదాస్ ని ఈ పెంటలోకి
    మనసు మారుమూలల్లో మిగిలిపోయిన …”

    ఫై పంక్తులలొ ‘ఎదొందలయాభై ఎమ్మెల్ రక్తం’ అంటె ఎమిటొ కొంచెం అర్ధమయ్యెలా చెబుతారా రవికిరణ్ తిమ్మిరెడ్డి గారూ?

    దడాల వెంకటేశ్వరరావు

  714. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు గారి అభిప్రాయం:

    08/06/2013 11:33 pm

    శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీ జాషువ గారి గురించి మాట్లాడుతూ శ్రీ జాషువ మహాకవి అనడానికి ఈ ఒక్క ఖండిక చాలు అన్నారు. అంతటి గొప్పఖండికను రచించిన వారు తెలుగువారవ్వడం మన అదృష్టం. ఆయన దురదృష్టం కూడాను, ఎందుకంటే ఆయన వేరే ఏ దేశంలోనైన జన్మించి ఉంటే ఆయన అంతర్జాతీయ కవి కాగలిగి ఉండేవారు. ఆయన కవిత్వం అంతటి మహోన్నతం. గుర్రము జాషువా కవిత కోరి పఠింపని వారు లేరిలన్ అనేది అక్షర సత్యం.

  715. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    08/06/2013 1:16 pm

    జయప్రభగారూ, మోహనగారూ, — నేను చెప్పిన దానిలో కొంత అస్పష్టత తొంగి చూసినట్టుంది. నా ఉద్దేశం, మత సంప్రదాయంలో మరో చారిత్రక కాళిదాసు ఉన్నాడని కాదు. ఎలా అయితే అనేక చాటు పద్యాలు, వాటి చుట్టూ అల్లబడిన కథలూ కవికుల గురువైన కాళిదాసుకి ఆపాదింపబడ్డాయో, అదే విధంగా, ఆ కాళిదాసునే, దేవీ భక్తునిగానూ, చాలా దేవీ స్తోత్రాలు ఆయన రచనలుగానూ నమ్మే సంప్రదాయం ఒకటి ఉంది – అన్నది నా ఉద్దేశం. కాళిదాసు రచనగా బాగా ప్రసిద్ధి చెందిన శ్యామలాదండకమే అతను రచించినది కాదని కొంతమంది పరిశోధకులు తేల్చారు! ఇక మిగతావాటి గురించి చెప్పడానికేముంది. అయినా కొంతమందికి అవి కాళిదాసు రచనలే అని అనుకుంటే తృప్తి. కొంతమందికి రచయితతో పనిలేకుండా వాటిలో కవిత్వాన్ని ఆనందించడమే తృప్తి. కొంతమందికి అసలు రచయిత ఎవరన్నది కూపీలాగడంలో తృప్తి. కొంతమందికి కర్తృత్వం ఎందుకలా ఆపాదింపబడిందో పరిశోధించడం తృప్తి. ఎవరి దృష్టికోణం మేరకు వారు సాగిపోవడమే! 🙂

    అసలు సౌందర్యలహరే ఆదిశంకరులది కాదని వాదించేవారున్నారు! శంకరులు ప్రస్థాన త్రయానికి వ్రాసిన భాష్యాలు, మరి రెండు గ్రంథాలను మాత్రమే పరమ ప్రామాణికంగా తీసుకొనేవారు మిగతా స్తోత్రాలూ, కృతులూ అతని రచనలు కావని వాదిస్తారు. అవి శంకరులు ప్రతిపాదించిన అద్వైతానికి పూర్తి విరుద్ధమని వారి అభ్యంతరం. అవి శంకరులవే అని నమ్మేవారు వాటిని అద్వైత సిద్ధాంతపరంగా అన్వయించి చూపుతారు. దీనికి అంతెక్కడిది!

  716. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి jayaprabha గారి అభిప్రాయం:

    08/05/2013 1:48 pm

    అవును ఇంద్రాణీ! ఎప్పుడైనా నాకు కూడా కవిత్వం కలిగించే అనుభవమే ప్రధానం అవుతుంది. శబ్దమో అర్ధమో! మహిషాసురమర్దిని స్తోత్రపు నడక మామూలుదా? అది చదువుతున్నప్పుడు హృదయస్పందనపు వేగాన్నీ పెంచుతుంది. అదే సమయంలో చిత్తశాంతినీ కలిగిస్తుంది. నీకు మల్లేనే నాకూ ఇవన్నీ ఎంతో ప్రీతిపాత్రమైనవి. మరీ చిన్నతనం లోనే చాలా శ్లోకాలూ, స్తోత్రాలూ నేర్చేసుకున్న అనుభవంతో చెబుతున్నాను ఆ ధ్వనులు అస్పస్టం ఐన ఏవో వాసనలని మనసుకి అందిస్తాయని!

    ఈమాటలో నేను చదివిన కవిత్వంలో నీ ఊహలు ఎంతో వైవిధ్యం గా ఉన్నాయి. అందరూ చూసే ఒక అతి సాధారణ దృశ్యం లోంచి ఒక అసాధారణ దృశ్యాన్ని నీ కవిత్వం చూపిస్తుంది. అందుకోసం నువ్వు ఎంచుకునే పదాలు సైతం బాగుంటున్నాయి. మంచి కవిత్వం అంటేనే అదీ! ఒక కవిత చదివాకా ఏ కారణం వల్ల అయినా అది అలా మనసులో చాలా సేపు సుడితిరగాలి. సుఖాన్నో,దుఖాన్నో కల్గిస్తూ! కవిత్వం నించి నేను ఆశించేది ఇంతే!

    వేళకి అనివార్యంగా ” మల్లేపూల్ మల్లేపూల్..” అంటూ పిలిచే ఒక కొత్త గొంతుకి తెలుగు పాఠకులు అనివార్యంగా ఎదురు చూడాల్సి వచ్చేలా, మరిన్ని మరిన్ని మంచి కవితలు నీ నించి రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం లోని నిత్య సంక్షోభాలు సైతం నీ చూపు దాటి పోకూడదని కూడా కోరుకుంటున్నాను.

    ఆత్మీయంగా.
    జయప్రభ.

  717. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి jayaprabha గారి అభిప్రాయం:

    08/05/2013 3:37 am

    కామేశ్వర రావు గారూ! కాళిదాసుని గురించి మాట్లాడటం చాలా క్లిష్టమైన విషయం! మరీ ముఖ్యంగా నిర్ధారించడం! ఎవరు ఏ అభిప్రాయానికి వచ్చినా అది వారి వారి నమ్మకం తప్ప అన్యం కాలేదు.

    కాళిదాసుని గురించిన విశేషాలలోని అంశాలెన్నో ఇప్పటికీ ప్రశ్నార్ధకమే! ఆయన కాలమే స్పష్టంగా నిర్ధారణ కాలేదు. మౌఖికంగా ఆయనని గురించిన అనేకమైన కధలు ప్రచారం లో ఉన్నవి. అందులో ఎవరికి నచ్చినవి వారు చేర్చుకుంటూ పోయేరు. ఆయన కవిత్వాన్ని ఎందరో ప్రస్తావించేరు. ఆయన ఉపమల గొప్పదనాలని కీర్తించేరు. వల్లభదేవుని మొదలు కోలాచలం మల్లినాధుని వరకూ వ్యాఖ్యానాలు రాసేరు. కర్నాటకలోని ఐవోలు శాసనంలోని కాళిదాసు ప్రసక్తి ఉంది.

    ఇంక అనేకులు అనేక అభిప్రాయాలని వ్యక్తంచేసేరు మరి. అతడు శుంగవంశంలో ఉన్నవాడంటే కాదు ఖచ్చితంగా గుప్తవంశం వాడైన రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్యునిగా బిరుదు పొందిన వాడు ఆయన ఆస్థానంలోని నవరత్నాలలో కాళిదాసు కూడా ఒకడని చెప్పారు. చివరికి కాళిదాసు రచనలని అనుసరించి ఆయన భారత దేశం అంతా బాగా తిరిగాడని భావించారు. ఆయన ఉజ్జయినీ వాడంటే కాదు మిధిల వాడని మరికొందరూ తగువుపడ్డారు. ఉజ్జయినీ ఆయనకి ఎంత బాగా తెలియక పోతే “మేఘ సందేశం” లో అంత బాగా వర్ణిస్తాడనీ అన్నారు. అసలు హిమాలయాలని అంత బాగా వర్ణించేడని అంటేనే ఆయన అక్కడే ఎక్కడో పుట్టి, ఆ తర్వాత ఉజ్జయినీకి వలస వచ్చి ఉండాలీ అని అన్నారు!చివరికి ఆయన సింహళం వెళ్ళాడనీ అక్కడ ఉన్న రాజుకి కాళిదాసంటే మహా ఇష్టమనీ చెబుతూ దానికి సంబంధించిన ఒక గాధని ఆధారంగా చూపిస్తూ, చివరికి కాళిదాసు సింహళ దేశంలో హత్య కావింబడ్డాడనీ ప్రచారంలో ఉన్న కధల్నీ ప్రస్తావించారు. ఆయనని గురించి పరిశోధనలు చేసిన పండితులే ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. ఆయన కాలం తేల లేదు. ఆయన జీవితం గురించిన ఒక స్పష్టమైన విషయమూ మనకి ఆధారాలతో దొరికిందిలేదు ఇప్పటి వరకూ! అసలు ఆయన కవిత్వం సైతం అనేక సార్లు ఎత్తి రాసుకునే క్రమంలో మార్పులూ చేర్పులూ పొంది ఉంటుందనే భావన సైతం పండితులలో ఉంది. ఇన్ని వేల ఏళ్ళలో ఏది మూల ప్రతికి దగ్గరగా ఉన్నదో ఏది ఎన్ని మార్పులు పొంది తయారైనదో సరిగ్గా తెలియలేదు కాళిదాసు రచనల విషయంలో.

    కాళిదాసుని తొలిగా ఇంగ్లీషు వారికి పరిచయం చేసిన విలియం జోన్స్, హెచ్.హెచ్. విల్సన్ లు ఆయన కవిత్వానికి పరవశించిన జెర్మన్ కవి గోథె లాంటి వాళ్ళూ ఉన్నారు. రామచంద్ర తివారీ లాంటి ఆధునిక పరిశోధకులూ కాళిదాసుని గురించి బోలెడంత పరిశోధించి తీర్మానాలు చేశారు. ఇన్ని జరిగినా కాళిదాసు ఒక మిస్టరీ గానే మిగిలిపోయాడు చివరికి.

    ఇంతా చేసి కాళిదాసు అసలు ఎవరూ అన్నదే ఇంకా తేలలేదు. మీరేమో కాళిదాసు ఒక తరహా కాదు ఇంకో తరహా కవిత్వం రాసిన వాడూ ఒకాయన ఉన్నాడని అంటున్నారు. సంస్కృతంలో ప్రసిధ్ధి చెందిన చాలా శ్లోకాలకి కర్తృత్వ నిర్ణయం సాధ్యం కాదని నేను ఇందుకనే అన్నాను సుమా! ఆశు సంప్రదాయం బలంగా ఉన్న సంస్కృతులలో ఉన్న బలమూ ఇదే, బలహీనతా ఇదే! కవి రచన నిలబడుతుంది. కర్తృత్వం నిలబడదు. నమ్మకం ఉంటుంది. నేను మీ నమ్మకాన్ని అర్ధం చేసుకుంటాను కూడా!

    మీరు అశ్వధాటీ వృత్తంలో ఉన్న ఆ దశ శ్లోకీ రచన కాళిదాసుదే అని భావించినా, కాదని ఆది శంకరులదే అని మోహన గారు భావించినా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి గనకా? నమ్మకమే కదా? నమ్మకాలని బాగా ప్రశ్నించమని అంటున్నారు అదిగో ఆ తహ తహ గారు — మరి అలా ప్రశ్నించుకుంటూ మరి కొన్ని కొత్త వెలుగులు ప్రసరించరాదూ మీ అందరూనూ. పాఠకులు మరి కొన్ని కొత్త సంగతులని చదివి సంతోషిస్తారు కద! అందువలన మీకు తెలిసిన కాళిదాసుని గురించి పరిచయం చేయండి.

    జయప్రభ.

  718. దైవం గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:

    08/04/2013 5:43 am

    దేవునిపై కవిత్వం చాలాకాలంగా లేదు. బహుశా అభ్యుదయం కాదంటారని భయమేసి కాబోలు. ఈ మధ్య సూఫీ కవిత్వానికి లభిస్తున్న ఆదరణ మరలా ఆ వైపుకు మనల్ని మరలిస్తుందేమో. మంచి పరిణామమే! కవిత సాదాగా ఉన్నా ఒక మంచి మలుపుకు కారణమౌతుందనిపిస్తుంది.

  719. చిన్నారి – దేవత గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:

    08/04/2013 4:07 am

    అందమైన పద్యం. కథనాత్మక కవిత్వం పట్ల మనవాళ్ళెందుకు విముఖత చూపిస్తారో అర్ధం కాదు. కవిత్వం అంటే మరో ప్లేన్ కి చెందిన వ్యవహారమని దాన్ని జనబాహుళ్యానికి అందకుండా ఎక్కడో ఉంచుతారు. బహుశా అందువల్లనే కథ కవిత్వాన్ని క్రమక్రమంగా ఆక్రమించేస్తున్నది. ఇంత సరళంగా, సూటిగా కథన పద్దతిలో చెప్పే కవితలు ఎక్కువమందిని ఆకట్టుకొంటాయనటంలో సందేహం లేదు.

    శీమాటి అన్న తమిళ పదాన్ని యధాతధంగా ఉంచేసారా అనిపించి, బ్రౌణ్యం చూడగా అది సీమాటి అని, దాని అర్ధం భాగ్యశాలినియైన యాఁడుది అని తెలిసింది. మనం మరచిపోయిన కొన్ని వేల తెలుగుపదాలలో ఇది ఒకటికదా అనిపించింది. మంచి కవితను పరిచయం చేసిన భాస్కర్ గారికి ధన్యవాదాలు.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

  720. నిశ్శబ్దం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    08/03/2013 11:55 pm

    ఎప్పుడో వెళ్ళిపోయిన ఆవెని, అందులోనూ తన లిబరల్ కవిత్వాన్ని, మరే రకవైన ముసుగులూ లేని తన కవిత్వాన్ని, మీరు వ్రాసిన పదాలలోనూ, వాక్యాలలోనూ తప్పులేవి లేవు, కానీ ఆ కాంటెక్స్ట్ లో కమలాదాస్ గారి ప్రస్తావన అసలు బాగలేదు.

    అయినా ఈ విమర్శలు తెలుగు వ్రాతల్లో బూతు అనే దానిమీద ఒక వివరణ, ఒక సవరణ దిశగా పోతాయని నేననుకున్నాను. కానీ ఒకరిమీద మరొకరి కామెంట్లకే పరిమితం అవటం నిజంగా దురదృష్టకరం. అయినా ఎవరికి ఆశక్తి వుంది కనక, ఏ ముగ్గురు నలుగురో అంతే. కానివ్వండి ఈరోజు కాకపోతే, రేపు ఒక సహజవైన వ్యక్తీకరణని బూతని ఎంతకాలం ఆపగలరు.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  721. ఇలైయిల్ తంగియ తూళిగల్ గురించి వలలుడు గారి అభిప్రాయం:

    08/01/2013 11:59 am

    అనువాదం చూస్తూ, కవి గొంతులో తమిళ కవిత విన్నాను.
    అద్భుతం.
    దయచేసి సుబ్రహ్మణ్య భారతి, వాలి వంటి ఇతర కవులవి కూడా ఇలా అనువాదం ఇచ్చే ప్రయత్నం చేయండి.

  722. గతమెంతో ఘనకీర్తి – భవితెంతో భవదీప్తి గురించి తః తః గారి అభిప్రాయం:

    07/29/2013 5:21 pm

    “కానీ గురజాడ వేసిన బాట ఒక శతాబ్దంలో సాహిత్యాన్ని పురోగమన మార్గం పట్టించింది. భావకవిత్వ ధారను చరిత్ర గర్భంలో నిక్షిప్తం చేసింది.” – ఆర్ వి రామారావు

    తిలక్ కవిత్వంలో ‘భావకవిత్వ’ ధార ఉన్నదా లేదా? తిలక్ గురజాడకు -రామారావు గారి రచన కు సంబంధించినంతవరకూ -కాలప్రమాణంలో తగినంత దూరంలో ఉన్నాడా లేడా? ఈ రెండు ప్రశ్నలకూ సమాధానాలు, ‘ఉన్నది’ , ‘ఉన్నాడు’ అనే వస్తాయనుకుంటాను.

    తః తః

  723. మళ్ళీ అదే సంచిక గురించి తః తః గారి అభిప్రాయం:

    07/28/2013 8:57 pm

    నారాయణ బాబు గారికి ధన్యవాదాలు
    “కులికినా
    ఒలికినా
    నా అక్షరాలకు
    నీ రూపమే
    ఇస్తాను
    పేరు ఏమి పెట్టినా
    ప్రేమ కవిత్వమే రాస్తాను” అని
    జులై 12, ‘ఈమాట’ లో
    తః తః

  724. నిశ్శబ్దం గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    07/26/2013 12:36 pm

    న్యాయం
    =====

    నాకు కవితలు ఒక పట్టాన అర్థం కావు. కాబట్టి ఈ కవిత గురించి నేనేమీ చెప్పలేను. అయితే, ఇక్కడ జరిగిన ఒక వివాదం గురించి మాత్రం నా అభిప్రాయం చెప్పాలని వుంది. మొదట్లో, కొన్ని రోజులు, “నా కెందుకులే ఈ గోల”, అని వూరుకున్నాను, పట్టించుకోకుండా. ఇవాళ రవికిరణ్ గారి అభిప్రాయం చదివాక, ఇక వూరుకో బుద్ధి కాలేదు. ఈమాట వారు నా అభిప్రాయాన్ని సెన్సార్ చేసినా సరే, రాసెయ్యాలి అని అనుకున్నాను.

    ఈ వివాదంలో మాత్రం నేను రవికిరణ్ గారితో ఏకీభవిస్తున్నాను స్పష్టంగా. దీనర్థం, ఆయన ఆ బూతు పదం వాడొచ్చని కాదు. ఆ విషయంలో ఆయన మీద కూడా నాకు విమర్శ వుంది. అయితే, ఆయనతో ఏకీభవించేది, ” ఆడవాళ్ళు మాత్రం బూతులని నిరభ్యంతరంగా వ్రాయవచ్చు.” అన్న మాటల్లోని వ్యంగ్యంతో.

    అసలు ఆ పదాన్ని ముందుగా వాడింది లైలా గారు. అలా, లైలా గారు ఆ పదాన్ని వాడడాన్ని, జయప్రభ గారు, “ఆడవాళ్ళు రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి బహుశా లైలా ప్రయత్నం చేశారు.” అని వెనకేసుకు వచ్చారు. “బూతు పదాలు” ఆడవాళ్ళు రాసినా, మగవాళ్ళు రాసినా ఒకే లాగా వుంటాయి. దొందూ దొందే. రెండూ గాడిదలే. లైలా గారు, గతంలో, “ఎఫ్” అక్షరంతో మొదలయ్యే ఒక ఇంగ్లీషు బూతు పదాన్ని కూడా రాశారు ఒక వ్యాఖ్యలో. ఈమాట వారు దాన్ని ఎలా అంగీకరించారా అని ఆశ్చర్యం వేసింది. “సరే, వారి పత్రికా, వారి ఇష్టం. నచ్చితే చదవడం, లేకపోతే వూరుకోవడం” అనుకుని వూరుకున్నాను. ఒక్కరు కూడా ఆ విషయం గురించి అడగలేదు. ఒక స్త్రీ అలా రాస్తే, అడగడం తప్పు అనుకున్నారేమో మరి. తప్పు పురుషుడు చేసినా తప్పే, స్త్రీ చేసినా తప్పే. ఆ తర్వాత రవికిరణ్ గారి కవితకి రాసిన వ్యాఖ్యలో, లైలాగారు ముందుగా ఆ పదాన్ని వాడారు. దాన్ని కూడా ఎవరూ ప్రశ్నించలేదు. పైపెచ్చు సమర్థించిన వారే వున్నారు. లైలా గారు వాడిన ఆ పదం రాసిన వ్యాఖ్య పదాల్లో కలిసి పోయి కూర్చుంది. దానికి రవికిరణ్ గారు ఇచ్చిన జవాబులో, ఆ పదం మొదటి పదంగా కూర్చుని, అందరి దృష్టినీ ఆకర్షించింది. అప్పుడు జయప్రభ గారు చాలా న్యాయమైన ప్రశ్న అడిగారు ఈమాట వారిని, “ఇలాంటి భాషనీ ఇలాంటి అభిప్రాయాన్నీ అచ్చు ఎలా వేశారూ? అని ఒక పాఠకురాలిగా నేను సంపాదకులని అడుగుతున్నాను. దీన్ని అచ్చువేయడం లో మీ ఉద్దేశ్యం ఏమిటీ??” అని. చాలా మామూలుగా గానే వారు మౌనం వహించారు. వారి పత్రికా, వారి ఇష్టం. జయప్రభ గారు లైలా గారిని కూడా విమర్శిస్తే, ఆ పద ప్రయోగానికి, చాలా బాగుండేది. అలా జరగలేదు. రవికిరణ్‌ని మాత్రమే గట్టిగా విమర్శించారు. అప్పటికీ రవికిరణ్ గారు పాపం క్షమాపణ చెప్పుకున్నారు. అయినా వదలలేదు ఆయన్ని. వెంకటేశ్వర్రావు గారు ఆ పదం తీయించే ఏర్పాటు చెయ్యమని బోధించారు. ఇక్కడ, వెంకటేశ్వర్రావు గారిని, “మరి మీరు లైలా గారికి కూడా అలాంటి సలహా ఇవ్వలేదే?” అని ఎవరూ ప్రశ్నించలేదు. ఒకవేళ, ఎవరన్నా ప్రశ్నిస్తే, “మరి లైలా గారు తన తప్పు ఒప్పుకోలేదుగా” అని అంటారేమో, వెంకటేశ్వర్రావు గారు.

    లైలా గారూ, రవి కిరణ్ గారూ – ఇద్దరూ వాడారు ఆ బూతు మాటని. దానికి రవికిరణ్ గారిని మాత్రమే విమర్శిస్తే న్యాయం లేదు. ఎవరు ముందర వాడారూ అన్నది ఒక విషయాన్ని అర్థం చేసుకునేటట్టు చేస్తుందే తప్ప, అంగీకరించేటట్టు చెయ్యదు. రవికిరణ్ గారు ఆ పదం వాడటానికి వచ్చిన సందర్భం అర్థం అయ్యేటట్టు చేస్తుందే గానీ, ఆయన ఆ పదం వాడటాన్ని అంగీకరించేటట్టు చెయ్యదు. రవికిరణ్ గారి చెప్పే సూక్తులు లైలా గారికి కూడా చెప్పాలి.

    నేను ఇలా రాసినందుకు, నా మీద ఎన్నో విసుర్లు వస్తాయని తెలుసు. వాటికి సిద్ధపడే రాస్తున్నాను. మొదట ఈమాట వారు ఈ వ్యాఖ్యని అంగీకరించాలి. ఆ తర్వాత కదా విసుర్లు వచ్చేవి? సరే, ఏమన్నా ఒక పాయింటు వుంటే మాత్రమే, జవాబిద్దాం, లేకపోతే ఆ విసుర్లని భరించి వూరుకుందాము అని నిర్ణయించుకుని, నా అభిప్రాయాన్ని రాస్తున్నాను.

    ప్రసాద్

  725. కథాంతం గురించి cbs venkaramana గారి అభిప్రాయం:

    07/25/2013 1:38 pm

    ఇది కథ ఎలా అవుతుంది? వచన కవిత్వం లాగ ఉంది. ఐతే రూపకం అవాలి. కథ ఐతే మాత్రం కాదు.

  726. వేకువనే మోకరించే ఆమె గురించి Ramarao Vadapalli గారి అభిప్రాయం:

    07/24/2013 5:18 am

    నాకు మదర్ థెరిసా గుర్తుకి వచ్చింది. మంచి కవిత.

  727. తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    07/22/2013 10:15 am

    వ్యాసాన్ని ఆసాంతం చదివి ఎంతో దయతో స్పందించిన శ్రీ కృష్ణమోహనరావు గారికి, రవి గారికి, పి. లలిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    శ్రీ కృష్ణమోహనరావు గారు! తుమ్మల వేణుగోపాలరావు గారి గూఢచిత్ర రహస్యప్రకాశిక భారతీయ భాషలన్నిటిలోని చిత్రరీతులను పరిశీలించి రూపొందించిన ఒక సమగ్ర విజ్ఞానసర్వస్వం. మొత్తం ఆఱు భాగాలుగా సంకల్పింపబడి, సగం మాత్రమే పూర్తయి అచ్చయింది. ఆ కూర్పు కాలంలో శ్రీ తుమ్మల వేణుగోపాలరావు గారు ఒక వారం రోజులు మా ఇంట ఉండి వారి సహృత్సల్లాపాలతో మా ఇంటిని ధన్యధన్యం చేశారు. పైపైని చదివేవారికి కొంత చాదస్తంగా అనిపిస్తుంది కాని, ఎంతో విలువైన సమాచారాన్ని మనకోసం సేకరించి శేఖరించిన మహానుభావులు వారు.

    ఆధునికజీవితం ప్రకృతివిలాసానికి దవీయసమై కవిత్వం అంతర్ముఖీనత నుంచి బహిర్ముఖం కాసాగినపుడు మాఱిన కవిసమయాల నైపథ్యంలో ఇప్పుడు ఇటువంటి పద్యరచనమూ జరగటంలేదు; జరిగినవాటి పద్యార్థమూ తెలియటం లేదు. ఇటీవలి కాలంలో ఇటువంటి విషయాలపై గురుభావం సన్నగిల్లిపోయినందువల్ల చదివేవారూ లేరు; అచ్చువేసేవారూ లేరు.

    గుడారు వెంకటదాస కవి గారి “ప్రబంధశిరోభూషణ ప్రకృష్ట బలరామ చరిత్రము”
    శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారి “కంకణబంధ రామాయణము”
    వఠ్యం పరబ్రహ్మశాస్త్రి గారి “చిత్రకంకణ రామాయణము”
    శ్రీమాన్ గోపాలాచార్యుల వారి “గురుమూర్తి నాయని విలాస చిత్రప్రబంధము”
    అల్లమరాజు రంగశాయి కవి గారి “చంపూ భారతము”
    నాదెళ్ళ పురుషోత్తమకవి గారి “అద్భుతోత్తర రామాయణము”, “కృష్ణానదీ మాహాత్మ్యము”,
    గాదె పాపరాజకవి గారి “చతుర్ముఖ కంద పద్య రామాయణము”
    పోకూరి కాశీపతి గారి “దశాక్షర శ్రీ శేషశైలేలీల”, “త్రింశత్యర్థపద్యరత్నము”
    శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారి “శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిరూష్మ నిర్వచనైకాదశాక్షర శకుంతలా చరిత్రము”
    మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారి “ప్రబంధ సంబంధ బంధ నిబంధన గ్రంథము”
    బండ్ల సుబ్రహ్మణ్యకవి గారి “విద్యుల్లతా బంధ ప్రబంధము”
    వాసుదేవ అద్వైత పరబ్రహ్మశాస్త్రి గారి “మేకాధీశ శబ్ద శతకోటి”

    తెలుగువాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఈ నిధులు ఎన్నని చెప్పను? ఇటువంటి కృతులకు కాలం చెల్లిందని, కాలస్రవంతి గతి మళ్ళిందని సమర్థించుకోవటం ఒక్క తెలుగువాళ్ళకే చెల్లింది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  728. నదిలోని నీరు గురించి D.Venkateswara Rao గారి అభిప్రాయం:

    07/21/2013 2:28 pm

    కవితకు ‘నదిలోని నీరు’ అన్న పేరు ఎందుకు పెట్టారో చెప్ప గలరా స్వాతి కుమారి గారూ?

  729. వేకువనే మోకరించే ఆమె గురించి Mercy Margaret గారి అభిప్రాయం:

    07/21/2013 12:18 pm

    మంచి కవిత. నాకు మా అమ్మను గుర్తు చేసారు అంకుల్. ధన్యవాదాలు.

  730. నిశ్శబ్దం గురించి D.Venkateswara Rao గారి అభిప్రాయం:

    07/21/2013 6:56 am

    కవితలు వాటి అభిప్రాయాలు అందరూ చదువుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  731. నిశ్శబ్దం గురించి jayaprabha గారి అభిప్రాయం:

    07/19/2013 1:06 pm

    ఇలాంటి భాషనీ ఇలాంటి అభిప్రాయాన్నీ అచ్చు ఎలా వేశారూ? అని ఒక పాఠకురాలిగా నేను సంపాదకులని అడుగుతున్నాను. దీన్ని అచ్చువేయడం లో మీ ఉద్దేశ్యం ఏమిటీ??

    దిగంబరుల కవిత్వం తర్వాత మగవాళ్ళు ఎలాపెడితే అలా రాయడాన్నీ ఏ భాష లో నైనా ఆడవాళ్లని గురించి మాట్లాడటాన్నీ తగ్గించుకోవడం తెలుగు దేశం లో జరిగింది. ఆడవాళ్ళు విమర్శలోనీ రచనా శైలి లోనీ ప్రవేశించాకా ఎలా పెడితే అలా మాట్లాడేయడం తెలుగు దేశాన అయితే మళ్ళీ సాధ్యం కాలేదు. మరి అదేతీరులో తిరిగీ మీ పత్రికలో ఈ భాషా విధానం ఏమిటి? మీ పత్రిక వీటిని ప్రచురించి వీటికి ప్రాముఖ్యం ఇవ్వడం ఏమిటి? అలాంటి భాషని వాడటం ఏమి కష్టం గనక? ఎవరన్నా రాయొచ్చునే ? ఆడవాళ్ళు రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి బహుశా లైలా ప్రయత్నం చేశారు.

    రాయాలంటే ఆడవాళ్ళు సైతం అలా రాయడం ఏమీ కస్టం కాదు సుమా అని లైలా చెప్పినట్లయింది. ఆ ప్రయోగం ఆవిడ చేసి చూపిన లక్ష్యం అదే నని నేను అనుకున్నాను. అంత పాటి విమర్శని కూడా ఈ రవికిరణ్ తీసుకోలేకపోయినాడా? ఎంత విషాదం! వెంటనే ప్రతిస్పందనని మరెంత వికారంగా రాసేడో? దాన్ని ప్రచురించి మీ పత్రికకి ఉన్న gender insensitivityని మీరు చాటుకున్నారు. ఇంత చదువుకున్న వాళ్ళున్న మీ పత్రిక కూడా చివరికి ఇంతేనన్నమాట! how sad !

    జయప్రభ.

  732. నిశ్శబ్దం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    07/18/2013 11:03 pm

    సుల్లకాయ
    పెంటా, పియ్యా
    కవిత కావొచ్చు
    ఎదొందలయాభై ఎమ్మెల్
    రక్తం లో కలసిపోతే
    మొహాన నరాలు ఉబ్బిపోతే.
    కానీ ఎప్పుడో వెళ్ళిపోయిన
    కమలాదాస్ ని ఈ పెంటలోకి
    మనసు మారుమూలల్లో మిగిలిపోయిన
    ఈ డయపర్ పియ్యలోకి లాగటవంటే
    బహూశా పదిహేనొందల ఎమ్మెల్
    అయిపోయిన్దేవో కదా?

    [Enough of this please – Ed.]

  733. తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక గురించి మోహన గారి అభిప్రాయం:

    07/18/2013 3:18 pm

    ప్రత్యేక సంచికల విలువలు పూర్తిగా ఆయా సంచికల సంపాదకులపైన ఆధారపడినవి. వాళ్లు ఆ సంచికకు ఎన్నుకొన్న వస్తువుపైన (theme) ఆధారపడి ఉంటుంది. ఈ విలువలను generalize చేయలేము. వారి ఆసక్తి, అనుభవము, ముఖ్యముగా వారికి ఉండే కాలావధి మున్నగువానిపైన ప్రత్యేకముగా ఇవి ఆధారపడి ఉంటాయి. నిడివిలో ఈ ప్రత్యేక సంచిక సుమారు రెండు ఈమాట సంచికల సమానము. అనగా నాలుగు నెలలలో ఈమాట చేయగలిగినది, ఈ సంపాదకులు సుమారు రెండు నెలలలో చేయవలసి ఉంటుంది. అంతే కాక రచయితలు కూడ వివిధ రంగాలలో ప్రావీణ్యముగలవారై ఉంటారు. ఇంకొక విషయము ఏమనగా ఇందులో కొందరు ప్రసిద్ధ రచయితలను ఆహ్వానించి వారి వ్యాసాలను కవితలను ప్రచురించడము ఆనవాయితీ. అటువంటివారి రచనలను బాగున్నా లేకపోయినా మార్చడము అంత సులభమైన పని కాదు. వారి మిగిలిన పనులతోబాటు ఈ సంచికను కూడ వెలుగులోకి తెచ్చినందులకు ఈమాట ప్రచురణవర్గమును మనము అభినందించాలి. విధేయుడు – మోహన

  734. నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    07/18/2013 1:11 pm

    లైలాగారూ,

    ప్రాచీన ఆధునిక కవిత్వాలను పోలుస్తూ ఆధునికకవిత్వపు ప్రతీకలలో కచ్చితత్వం లేదనడంలో, అది అర్థంలేని కవిత్వమనడం నా ఉద్దేశం కాదు. దాశరథి కవిత్వాన్ని తక్కువ చేసే ఉద్దేశం అంతకన్నా కన్నాకాదు. అది ఆధునికకవిత్వానికి గుణమనే నేను నమ్ముతాను.

    ఇక పశ్చిమదిశలో నాట్యమాడే విషయం గురించి మీరిచ్చిన వివరణ కూడా అర్థవంతంగానే ఉంది. అయితే అగ్నిధార, రుద్రవీణతో బాటు మహాంధ్రోదయం, పునర్నవం వంటి మిగతా కవిత్వ సంపుటాలు ఒకటికి రెండుసార్లు చదివినా నాకు మీరన్న అర్థం గోచరించ లేదు. ఇప్పుడు కూడా మీరిచ్చినది ఒక అర్థవంతమైన వివరణగానే నేను భావిస్తాను తప్ప కచ్చితంగా అదే దాని అర్థం అని ఒప్పుకోలేను. కచ్చితమైన ఒకటే అర్థం తీసుకోవలసిన అవసరమూ లేదు.

    అసలు ఎలాంటి అర్థవంతమైన అన్వయమూ వివరణా కుదరని అయోమయ కవిత్వం మీరన్న “real mess”. అయితే అది కూడా ఆధునికకవిత్వంలో పుష్కలంగా కనిపిస్తుంది. దాని గురించి ప్రస్తుతం మాట్లాడ దలుచుకోలేదు.

    ఇక మీరు చివరన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది నేను కాదు. 🙂 The treasure is not mine anymore, so it is not I who locked it up. 🙂

  735. రహస్య సాంగత్యం గురించి రాజా పిడూరి గారి అభిప్రాయం:

    07/17/2013 10:56 pm

    చాలా గాఢంగా ఉందండి మీ కవిత

    ధన్య వాదాలు

  736. నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    07/17/2013 4:03 pm

    అలాగే తూర్పు నవోదయానికీ, పడమర విలయానికీ ప్రతీక కాబట్టి, ఇక్కడ కవి చేయదలచుకున్నది లయమే కాబట్టి పశ్చిమ దిక్కుని పేర్కొన్నాడని కూడా అనుకోవచ్చు.

    “ఆంథ్ర భారతి” వెబ్ సైట్ లో దాశరధి కవిత్వం -“అగ్నిధార,” “రుద్రవీణ” ఉన్నాయి కదా. అందులోని పద్యాలను చదివితే (చూ: ముక్త భూమి, కవాటం ) అప్పుడు తూర్పుదేవుడు శివుడు, పశ్చిమంలో ఎందుకు తాండవమాడ దలిచాడో తేలికగా తెలుస్తుంది. (కవి కాలం నాటి) తెలంగాణ బంగారుఖజానాల బీగాలు, బందూకుల సప్లైకోసం, పాశ్చాత్య పాలకుల /తెల్ల దళారుల చేతుల్లో, నిజాం నవాబు ఉంచాడని కవి ఆక్రోశం, ఆగ్రహం.

    I don’t think it is that difficult to understand this poet. I don’t think he is messing up his metaphors ( used here, by me, synonymous to “Figurative Language”) that bad. For a real mess, you can read Tilak’s Ahalya in this magazine.

    How have you been Kamesh! 🙂 When are we going to read your award winning Telugu poetry. Why is this treasure locked up from us?

    లైలా

  737. నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    07/17/2013 1:22 pm

    జయప్రభగారూ, మోహనగారు, ధన్యవాదాలు.

    మోహనగారూ, శివుడు పశ్చిమ దిశలో నాట్యం చేయడం నేను కూడా వినలేదు. ఇక్కడా విషయాన్ని కవికి తప్ప శివునికి అన్వయించుకోలేము. పశ్చిమ దిక్కే ఎందుకంటే బహుశా పడమటి సంధ్యని స్ఫురింపచేయడానికి అయ్యుండవచ్చు. అపరసంధ్యలోనే కదా శివుడు తాండవమాడతాడని ప్రసిద్ధి. అలాగే తూర్పు నవోదయానికీ, పడమర విలయానికీ ప్రతీక కాబట్టి, ఇక్కడ కవి చేయదలచుకున్నది లయమే కాబట్టి పశ్చిమ దిక్కుని పేర్కొన్నాడని కూడా అనుకోవచ్చు.

    ప్రాచీనుల ఆలంకారిక ప్రయోగాలకూ, ఆధునికుల ప్రతీకలకూ కనిపించే ఒక ముఖ్యమైన తేడా యిదేననిపిస్తుంది నాకు. ప్రాచీన పద్ధతిలో పోలిక (లేదా వక్రోక్తి) వ్యంగ్యాన్ని సృష్టించినా అందులో ఒక కచ్చితత్వం ఉంటుంది. అంటే, ఒక అలంకారం ద్వారా కవి ధ్వనింపజేయాలనుకున్నది ఏదైనా అది కచ్చితంగా ఇదీ అని ఉంటుంది. అది పాఠకులకి అలాగే అందుతుంది. అలా అందకపోవడాన్ని దోషంగా భావించారు పూర్వ ఆలంకారికులు. ఆధునికకవిత్వంలో అది ఒక గుణమై కూర్చుంది! మనిషి మనసులో పెరిగిన సంక్లిష్టతకి ప్రతిబింబమేమో యిది. అందుకే ప్రాచీన పద్యాలని వ్యాఖ్యానించడం సులభం (పైగా వ్యాఖ్యానించే పద్ధతులు కూడా కొన్ని ఏర్పడి ఉన్నాయి). ఆధునికకవిత్వాన్ని వ్యాఖ్యానించడం బహుకష్టం.

  738. అలిఖిత కఠిన శాసనం! గురించి D.Venkateswara Rao గారి అభిప్రాయం:

    07/16/2013 3:05 pm

    మీ కవిత అంతే ఒక శిలా శాసనం
    నా అభిప్రాయం అంతా సాంత్వనం

  739. వేకువనే మోకరించే ఆమె గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:

    07/16/2013 3:01 am

    Dadala Venkateswara Rao గారు

    కవిత్వం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.
    అనుభవాలు, అనుభూతులు వ్యక్తిగతమే అయినా ప్రశ్న వ్యక్తిగతం కాదు (ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో )

    మీ స్పందనకు ధన్యవాదములు.

  740. ఒక వేసవి గురించి manibhushan గారి అభిప్రాయం:

    07/16/2013 1:14 am

    కథ కవితాత్మకంగా ఉంది. మరింత స్పష్టత ఉంటే బాగుండేది. మూడో తరం కాసిన్ని కబుర్లూ, కూసింత ఆప్యాయత కోరుకుంటున్నాయని చెబుతూనే… వాళ్ళు ఫక్తు భౌతికవాదులుగా తయారవుతున్నారన్న ఆవేదనను సైతం వెలిబుచ్చారు. అయితే, కథ పూర్తయ్యాక ఏ ఒక్కరూ మనసులో ఇమడని పరిస్థితి. కథలో మూల వస్తువు (సెంటర్ పాయింట్ మిస్సయ్యారు) కోల్పోయారనిపించింది.

  741. నదిలోని నీరు గురించి Ravi గారి అభిప్రాయం:

    07/15/2013 3:47 pm

    స్వాతీ గారు,
    వెంటాడే కవిత.

    “సంతకం తప్ప మరొక్క అక్షరం కూడా లేని ఉత్తరాల్లాంటి రహస్యాల్ని కనపడ్ద ప్రతీ పొదలోకీ జారవిడుస్తూ సాగుతున్న రాత్రికి ….”

    Too Good.

    Ravi

  742. మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి Ravi గారి అభిప్రాయం:

    07/15/2013 3:38 pm

    నరేన్, కవిత బాగుంది.

    -రవి

  743. కవులు మరిచిపోయారు గురించి jayaprabha గారి అభిప్రాయం:

    07/15/2013 2:56 pm

    ఆశారాజూ! నీ కవిత్వం లోని విషయం నన్ను ఆకట్టుకుంది. ఒక్కరైనా ఈ విషయాన్ని బహిరంగం చేస్తారా అని అనుకున్నాను. శిల్పానికేం గానీ కనీశం మొహమాటం లేకుండా ఉన్నదేదో అన్నావు. అదే పదివేలు.

    మొత్తానికి కవులు కవిత్వం తప్ప మిగిలినవన్నీ చేస్తున్నారన్నమాట! ముఖ్యంగా తమ తమ కవిత్వ “ప్రచారం”! గ్లోబలైజేషన్ అంటే ఇదే మరి 🙂 ఇంతకీ ఆ విమర్శకులు అన్నోటి ముందుమాటలూ అన్నోటి చివరిమాటలూ పోటీ పడి రాసినా అసలాఖరుకి ఒక్కరికైనా వారి రాతల్లోని ఆ ఆ విశేషాలేవన్నా అవగతమైనాయా? ఒక్క పద్యమైనా ఒక్కరి మనసులోనైనా దూరి రహస్యాలేవన్నా మాట్లాడిందా? అంతేనా? ఇలా పుస్తకం అచ్చు అవగానే అలా ఒక అవార్డో? అంతా గూడుపుఠాణీ అంటావా? మరీ ఇన్నీ ఉన్నా పుస్తకాలలో ఆ కవిత్వం ఎటు పోయిందో చెప్పేదెవరా అని? కవీ విమర్శకుడూ కుమ్మక్కై కిక్కిరిసి కూర్చున్న దృశ్యం ఇబ్బందిగా తెలుగు అక్షర ముఖ ద్వారాన్ని అటకాయిస్తోంది అనా? కానీ ఆ మాటని నిజాయితీగా చెప్పే పత్రికలూ లేవే? ఇప్పుడు బేధాభిప్రాయాలు లేవు. ఒకటే అభిప్రాయం. ఒకటే మాట! అంతా గుంభనం , అంతా గప్ చుప్! అప్పుడప్పుడు ఒపీనియన్స్ చేంజ్ చేస్తూంటే గానీ పొలిటీషియన్ కానేరడని చెప్పాడు గిరీశం. అందుకు కవులు మాత్రం అతీతులా? ఇంతకీ ఎంతమంది ఉన్నారూ “కవులు” తెలుగులో? ఓ! కవిత్వాన్ని పక్కన పారేసారని కదూ అన్నావు. కవులున్నారు గానీ కవిత్వం లేదన్నమాట! విమర్శ అటకెక్కినట్టుగానే!

    జయప్రభ.

  744. నిశ్శబ్దం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    07/14/2013 3:20 pm

    ఆడబిడ్డలు లేనిల్లు ఉంటుందా, ఆడబిడ్డలుంటే ఈ కష్టం తెలియని ఇల్లుంటుందా. ఇంత చదువుకున్న, తెలుసుకున్న ఈ “ఈమాట” పాఠకుల్లో ఇంత హిపోక్రసీ నిజవేనా?
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

    ఇళ్ళల్లో ఆడకూతుళ్ళూ ఉంటారు. మొగ కొడుకులూ ఉంటారు. అప్పటికి మీరు చదువుకున్న చదువులు బట్టి, మీకు తోచింది రాశారు. రాసింది మీరూ, హిపోక్రసీ పాఠకులదా? పాఠకులు ఎందరో రచయితలను, ఎన్నో సమాజాలను గమనిస్తుంటారు.

    స్టే హోమ్ డాడీ
    డయాపర్ స్టేషన్ మీదెక్కి
    పంగలు జాపి పొడుకున్న కొడుకును
    పట్టించుకోడు
    “డాడే, డాడే, డయాపర్ నువ్వే మారసాలి
    డాడే!” అని సోకాలు పెట్టే కొడుకుని పట్టించుకోడు
    పిలగాడు పెంట, ఉచ్చ అన్నీ సులకాయంతా
    పులుముకుంటుంటే పట్టించుకోడు;
    ముడ్డీ, నోరూ తెలీని గుంటడు పెంట
    తింటుంటే పట్టించుకోడు;
    కమలాదాస్ కదలు తల్సుకుని
    ఆమె తన తలుపెందుకు కొట్టదా?
    కొడితే తన గింత బోర్ కొట్టదు కదా అని
    ఓడకా లోకి ఏడుసుకుని
    బుజం మీది వేలాడే తువ్వాలుకి ముక్కు తుడుసుకుని
    తలుపు తీసుకుని లోని కొచ్చిన పెల్లాన్ని సూసి
    “ఏవో ఇంతాలీసం అఇందేవో,”
    అంటే,
    పెళ్లం – “ఎలర్జీలా? నేసల్ కంజెషన్?
    ఇదుగో నేసొనెక్స్ సాంపుల్
    యావో, యావయ్యిందో అనకుండా
    ఏమో, ఏమిటో అని స్పష్టంగా అనగలవ్
    క్లీనప్, క్లీనప్, కమ్ సీ మి ఇన్ ద బెడ్రూమ్,”
    అనేసి వెళ్లి పోతే వెంటబడి వెళ్ళి ఆ మొగ కొడుకు

    పై పంక్తులకు, మీ ఆఖరు కవిత ఖండం జోడించి, మొత్తం ఒకసారి చదివి చూడండి.

    లైలా

    PS: Looking forward to the opening of second season of “The News Room” tonight. It is my fancy, that Aaron Sorkin is a notable American writer, who influenced cinema, as well as American politics.

  745. నిశ్శబ్దం గురించి jayaprabha గారి అభిప్రాయం:

    07/14/2013 6:33 am

    “హిపోక్రసీ” అని మెల్లిగా అంటారేమిటీ రవికిరణూ? ఉన్నదంతా అదే కదా??

    మీ కవిత లో ఉన్న వ్యక్తీకరణ తెలుగు సాహిత్యానికి ఏమీ కొత్తది కాదు. చలం రాసేడు.. చండీదాసూ రాసేడు. పాత సాహిత్యం లో పద కవులూ రాసేరు.. ప్రబంధ కవులూ రాసేరు.

    ఎప్పుడన్నా కవిత లో మనం ఏమి రాసేమన్న దానితో పాటు ఎలా రాసేమన్నదే ముఖ్యం. చదివిన వారి మనసులోకి ఆ భావాన్ని ఎలా పంపగలుగుతున్నామన్నదీ కూడా !!

    అయితే కవి ఒక పద్యాన్ని ఎప్పుడూ ముందు తన కోసమే రాసుకుంటాడు. పాఠకులకోసమో.. విమర్శకుల కోసమో కాదు. గనక మీ మనసుకి నచ్చిందా మీకు ఇతరులు ఏమనుకుంటారన్నదే ముఖ్యం కాకూడదు. ఇంక ఈ గొడవ మీ మనసుకి పట్టనే కూడదు. కవిత రాసే వరకే మీ బాధ్యత / మీ తపన / మీ దుఖావేశమూ/ సంతోషమూను. అటు పిమ్మట ఆ కవిత మీద ఇతరులు ఏమని అనుకున్నా అది మీకు అనవసరం కావాలి. రాసిన తరవాత ఇంకా దాన్ని అలా భుజాన మోసే బరువుని మాత్రం కవి పెట్టుకోకూడదు. మీరీ కవితని దాని బతుకుని దాన్ని బతకనిచ్చి ఇంకో కవిత వైపుకి ప్రయాణం కండి! అదీ ముఖ్యం!

    జయప్రభ.

  746. బాల్కనీలో బచ్చలిమొక్క గురించి రత్నశిఖామణి గారి అభిప్రాయం:

    07/14/2013 5:08 am

    అనురాగ మనస్కులయిన అందరిలోనూ మొక్కలపట్ల ఆప్యాయత ఉంటుందనే నిజం మీ స్పందన వలన అవగతమవుతున్నది.
    “విస్తరాకులంత ఆకుపచ్చని పత్రాలతో కొండంత పందిరై దాని నీడన కూర్చుని చదువుకునే నాకు శాంతి నికేతనమైంది ఈ బచ్చలి తీవే!” అని మీరు చెప్పిన తీరు నా ఈ కవితకు మకుటమయింది.
    దమయంతిగారూ, మీకు ధన్యవాదములు.
    స్థలాభావంవల్ల తానా 2013 సంపాదకులు ఈ కవితని కుదించారు.

    రత్నశిఖామణి

    దీని పూర్తి పాఠం ఈ క్రిందివిధంగా వుంది:
    బాల్కనీలో బచ్చలిమొక్క

    బాల్కనీలో బచ్చలిమొక్క భలే బాగా పెరుగుతోంది.
    మేమెవరమూ నాటకుండానే తనకై తానే పుట్టుకొచ్చిందీ బచ్చలి —
    ఈ బచ్చలికీ మాకూ ఏదో ఋణానుబంధం వున్నట్లే వుంది!
    నా చిన్నప్పుడు మా వాకిట్లో నేనొక బచ్చలి మొక్కను నాటినందుకు కాబోలు—
    అంతరిక్షంలోకి తొంగిచూస్తున్న ఇరవైఅయిదో అంతస్తులోని
    బాల్కనీలోకి వచ్చి పడింది బచ్చలి విత్తనం– ఎంత చిత్రం–
    ఎంతో పత్రహరితంగా ఎదుగుతూన్న ఈ బచ్చలికి నామీదెంత ప్రేమో!
    బాల్కనీలో నిల్చున్నపుడల్లా పచ్చని నిగనిగల నగవులు చిందిస్తుంది.
    చెంబెడు నీళ్ళైనా పోయందే తానుమాత్రం
    గంపెడాకుల తీగలతో గగనానికి ఎగబ్రాకుతోంది.
    బాల్కనీలో బట్టలారవేసే తీగలపైకెగబాకి
    బరువుగా ఆలపించిన దరువులా సాగుతుంది.
    ముత్యాల్లాంటి పూలు పూసి మరెంతో మురిపించి పగడాల్లాంటి పళ్ళు కాసి
    పండగనాటి తోరణమై పచ్చటి తీగలతో బాల్కనీ నిండుగా పందిరి వేసింది.
    ఆకాశపుటంతస్తులలో అందంగా పెరిగి మా కింతటి పచ్చదనాన్నిచ్చిన
    ఈ ముత్యాల పగడాల తోరణాల ఒంటరి పందిరి బచ్చలికి
    ఎందుకింత అనురాగం! ఇంతటి కృతజ్ఞత?
    అనంతమనిపించే సతతహరితారణ్యలనే హరించేసిన
    ఈ స్వార్థపూరిత మానవుడు సంకల్పించనిదే, ప్రయత్నించనిదే
    తానుగా ఒక్కగానొక్క మొక్కగా మొలిచి తీగలై పెరిగి
    తన నిస్వార్థమైన అలౌకికానుబంధంతో నన్ను ఆనందింపజేస్తోంది.
    నా మానవజాతి ఈ హరితారణ్యశోభిత ధరణికి చేసిన
    ద్రోహాన్ని తలుచుకొని సిగ్గుపడేలా చేస్తోంది.
    హరితవిప్లవానికి ప్రతీకగా ఉద్భవించింది ఇంతటి ఎత్తైన భవనంలో–
    తరతరాలుగా తన పచ్చదనాన్ని ఆహారంగా ధారబోసి మన రక్తకణాలైన
    ఈ బచ్చలి సంతతి చల్లగా వర్ధిల్లు గాక!
    ఒంటినిండా మెరిసే ఆభరణాలైన ఆ పగడాల విత్తనాలలో
    దాగున్నాయి మరెన్నో పచ్చని “బచ్చలి బయళ్ళు”
    మహావృక్షాల్ని పెంచకపోయినా మొక్కలోనె తుంచకూడదనీ
    పెద్దచెట్టైనా చిన్నమొక్కైనా అది సకలజీవులకు ఆధారమేనని
    జ్ఞానోదయమైంది నాకీ బచ్చలి పందిరికింద.
    దాన్నివండుకోడానికి మాకు మనసొప్పట్లేదు—
    ఈ బచ్చలి తీగెలపై పండిన గింజల్ని ఈ ఆకాశపు బాల్కనీలలో
    విస్తరింపజేస్తే ఎంత బాగుంటుందో కదా!
    ప్రతి ఇంటా ఇంతటి పచ్చదనం వెల్లివిరిస్తే,
    ఒక్కొక్కరూ కనీసం ఒక్క మొక్కైనా తుంచక కాపాడి పెంచితే
    ఈ భూమాత ఎంత సంతసిస్తుందో కదా!
    * * *

  747. అవ్వ – బువ్వ గురించి రత్నశిఖామణి గారి అభిప్రాయం:

    07/14/2013 4:44 am

    కవిత చదివాక మనసంతా ఏదో అభావం ఆవరించింది. అయినా మనసు ఆలోచించక ఉండలేదు కాబట్టి అవ్వకు జరిగిన ఈ వాస్తవ ఘటన ఎందుకు జరగాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇంకా ఎన్నో ప్రశ్నలు, కానీ జవాబులే ఉండవు. అందుకేనేమో ఈ అభావం! ఈ కవిత అంతా మానవ అస్తిత్వానికే ఒక పెద్ద ప్రశ్న అనిపిస్తున్నది. సమకాలీన వ్యవస్థలో కొన్ని ప్రశ్నలకు జవాబే లేదనడానికి ఈ కవిత నిదర్శనమనిపిస్తున్నది. ఈ కవిత మానవ హృదయాన్ని కలచివేసే ప్రశ్నార్థకమయిన వాస్తవ ఘటనాశిల్పం.

    Picturesque speechless!
    ~రత్నశిఖామణి

  748. నిశ్శబ్దం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    07/13/2013 5:35 pm

    చాలా కాలం తర్వాత వ్రాస్తున్నాను ఈ అభిప్రాయాన్ని. మధ్య, మధ్య లో ఈ కవితని చదువుతూనేవున్నాను. ఇప్పటికి కూడా నాకు అభ్భా అనిపిస్తుంది. ఇది అతడు, ఆమె వ్యవహారం అయినా, సహజత్వాన్ని పచ్చి అని ఎవరనుకున్నా, దీంట్లో ఉన్న ఒక అనంతవైన ధుఖ్ఖాన్ని, మన భారతీయ సమాజం లో ఉన్న ఈ అత్యంత సహజవైన ఈ జీవితాన్ని ఎవరూ ఎందుకు గమనించలేదు. ఆడబిడ్డలు లేనిల్లు ఉంటుందా, ఆడబిడ్డలుంటే ఈ కష్టం తెలియని ఇల్లుంటుందా. ఇంత చదువుకున్న, తెలుసుకున్న ఈ “ఈమాట” పాఠకుల్లో ఇంత హిపోక్రసీ నిజవేనా?

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  749. దైవం గురించి Dadala Venkateswara Rao గారి అభిప్రాయం:

    07/13/2013 2:56 pm

    మీ దైవం అగరొత్తుల పొగల్లొ మీ కవిత కడలి అడుగున వెలిగే చేపలా ఉంది.

  750. దైవం గురించి Virupaksha Rao గారి అభిప్రాయం:

    07/10/2013 9:33 pm

    కవిత బాగుంటే బాగుందని చెప్పడానికి ఇంత వీధి బాగోతం అవసరమా? పనిలో పనిగా డొంక తిరుగుడు సొంత గొడవలెందుకు, ఇంకెవరెవరి మీదో తీర్పు లిచ్చే ఏకపక్ష పీఠాధిపత్యాలెందుకు?

  751. పశ్చింగోదార్జిలా తణుకు తాలూకా గురించి indrani Palaparthy గారి అభిప్రాయం:

    07/10/2013 5:47 pm

    ఈ కధ నాకు చాలా నచ్చిన కధ. ఎన్ని సార్లు చదివినా నవ్వు పుట్టించే కధ. అందుకని ఇక్కడ టోరీ రేడియో లో చదివాను.మరికొన్ని నాకు నచ్చిన కవితలు కూడా కలిపి. మధ్యే మధ్యే పాటలు, యాడ్స్ వస్తాయి. ముందుకు జరుపుకుని వినవచ్చు.

    1999 లో రాసిన ఈ కధతో మొదలు పెట్టి 2013 వరకూ వీరి రచనలు చదివితే- బాల్యం, తరువాతీ కధల్లో యువకుడిగాను మళ్ళీ తరువాత కధల్లో భార్యా పిల్లలు ఇలా సాగుతున్నాయి. ఈ పరిశీలన చాలా తమాషాగా తోచింది. ఈ మధ్య భక్తి పాటలు రాస్తున్నారు. ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశలు- రచనల్లో కాలక్రమంగా ప్రతిబింబించడం చూడ్డం బాగుంది.

    నాకు ఈ కధ, ఇసుక, తమాషా దేఖో, డోర్స్ క్లోజింగ్ చాలా ఇష్టం. మిగిలినవి ఓకే. ఓకే.

    వ్యాసాలు తల మీదుగా వెళ్ళిపోయాయి. ఎవరో స్పూర్తి లేకుండా కవిత్వం రాయలేరా అనిపిస్తుంది గబుక్కున. కానీ మాండలికం మీద వీరి పట్టు అద్భుతం. మాండలికం భాషకు పడుచుదనం తెస్తుంది (అని నాకనిపిస్తుంది).

    ఇంద్రాణి.

  752. వేకువనే మోకరించే ఆమె గురించి sailajamithra గారి అభిప్రాయం:

    07/09/2013 8:58 am

    అమ్మ అనే పదమే ఒక కవిత. విశ్లేషణ కావ్యమే. కవిత బావుంది.

  753. అలిఖిత కఠిన శాసనం! గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    07/08/2013 7:24 am

    కవితని ఒక సైన్స్ పీర్ రెవ్యూడ్ వ్యాసం లాగ నేను చూడను.’

    ‘…నాకు నచ్చింది, నచ్చిందని చెప్పడం. కవిత్వం తో సంబంధం లేదు, మనసుతోనే సంబధం, బతుకుతోనె సంబంధం. ‘

    ఈ ఒక్క వాక్యం చాలు, – ఎందరినో ఆలోచింప చేసేందుకు!

    మీరన్నట్టు – గుండెని కాజేసుకుపోయేదే అసలైన కవిత్వం. అందులో సందేహమే లేదు. కొన్ని అక్షరాలకు గుళ్ళు కట్టలేం. వాట్లని వొడిసిపట్టే గుండెలే..గొప్ప దేవస్థానాలు. వొలికే కన్నీళ్ళే పుష్పాభిషేకాలు. రవికిరణ్ గారూ! కవిత్వం పట్ల మీకు గల భావాభిప్రాయాలను – ఎంతో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, మరెంతో హృద్యంగా – వ్యక్తపరచినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరోసారి, మీకు నా మనః పూర్వక ధన్య వాదాలు తెలియ చేసుకుంటూ

    శుభాభివందనాలతో
    -ఆర్.దమయంతి.

  754. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి indrani Palaparthy గారి అభిప్రాయం:

    07/07/2013 8:41 pm

    కమలా దాస్ కవిత్వం కన్నా ఆవిడ ఆత్మ కధే నాకిష్టం.
    హైదరాబాదు లో ఉన్నప్పుడు నాలుగైదు లైబ్రరీల్లో మెంబరుషిప్పు ఉండేది.
    ఎప్పుడు పుస్తకం ఇచ్చెయ్యాలో ఎప్పుడూ చూసుకోను కనుక ఎన్నోసార్లు జరిమానాలు కట్టాను.

    బ్రిటీష్ లైబ్రరీ కి నేను కట్టినన్ని ఫైన్లు ఎవరూ కట్టి ఉండరేమో.కమలా దాసు పుస్తకాలకీ కట్టాను.

    కధలు,కవితలుకన్నా ఆత్మ కధలంటే నాకెంతో ఇష్టం.

    అన్ని రంగాల్లో వాళ్ళవి.దేశీయులవి.విదేశీయులవి.

    వాళ్ళు అంతా నిజమే రాసారని నమ్ముతాను. ఒకవేళ రాసిన వాళ్ళు నిజాలు దాచిపెట్టినా, అబద్ధాలు రాసినా నాకేమీ పర్వాలేదు.వారి కధ నాకు స్ఫూర్తినిస్తే చాలు.

    ఇంద్రాణి.

  755. అలిఖిత కఠిన శాసనం! గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    07/07/2013 2:42 pm

    నాకు తెలీదు, ఒక కవితని, ఒక పీర్ రెవ్యూడ్ వ్యాసంలా చదివి అర్థం చేసుకోవాలని. నాకు తెలిసిన కవిత, కవిత్వం, నా మనసులోనుంచి, నా గుండెల్లోనించి వచ్చిన నా అనుభవాల, లేకపోతే నాకు తెలిసిన ఆ కొంచం వైకారియస్ అనుభవాల వ్యక్తీకరణ. కామెంట్ చెయ్యడం కోసం, ఆ కవితని ఒక సైన్స్ పీర్ రెవ్యూడ్ వ్యాసం లాగ నేను చూడను. చదివినప్పుడు అది నా మనసుని ఒప్పించిందా, నా గుండె కొంచం ఎక్కువగా కొట్టుకుందా. నాకొక చిన్న సంతోషవో, ఒక చిన్న దిగులో అనిపించిందా? అంతే, అదే నాకు కావాల్సింది. నాకు తెలుగు తెలియదు, నాకు కవిత్వం తెలియదు, నాకు తెలిసిందల్లా, నా గుండెని, మనసుని కదిలించగలిగేదే.

    దమయంతి గారు, మీ కవిత్వ బహుశా “నున్నా గారు” చెప్పగలరేవో. నాకు నచ్చింది, నచ్చిందని చెప్పడం. కవిత్వం తో సంబంధం లేదు, మనసుతోనే సంబధం, బతుకుతోనె సంబంధం. అది శ్రీశ్రీ అయినా మీరయినా, నేనయినా, నున్నా గారయినా.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  756. మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి O.V.R.Venugopal Rao గారి అభిప్రాయం:

    07/07/2013 12:51 pm

    మీ కవిత్వం నా మనసుని పిండేసింది. The way death came at Kedarnath even Lord Yama will weep and weep.

  757. వేసవి జ్ఞాపకం గురించి Naren గారి అభిప్రాయం:

    07/07/2013 10:05 am

    వేసవి జ్ఞాపకం కవితలో అపురూప పరిచయాల అల్లికగా వేసవిని భలే ప్రస్తావించారు. ఇండియాలో వేసవంటే సెలవులు, ఆటలు, తాటి ముంజెలు, మామిడి పళ్ళు ఇవి బాగా గుర్తుకొస్తాయి. గుర్తుండీ గుర్తుకు రాని దృశ్యాల-బంధాలను మీ కవిత బాగా గుర్తు చేసింది. ఉదాహరణలుగా ఇవి వ్రాశారు.

    ‘అమ్మమ్మ తడి నూలుచీర ఎన్నిసార్లు చుట్టినా
    సింహతలాటపు ఎర్రని కూజానో’

    ‘పెరట్లో ఎర్రగన్నేరు చెట్టుకింద’

    ‘సూర్యుడు సాయంకాలమయ్యేసరికి
    శాంతించిన ప్రేమికునిలా
    సంధ్య ఒళ్ళో మెల్లగా తలదాచుకుంటాడు
    పెరట్లో విచ్చుకుంటున్న మల్లె మొగ్గలు, విరజాజులు’

    ‘చుక్కల చెమ్కీల కుట్టుపూల చీరను’

    ‘చల్లని పైరగాలిలో నిద్రలోకి జారుకుంటుంది’

    అభినందనలతో,
    నరేన్.

  758. అలిఖిత కఠిన శాసనం! గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    07/06/2013 12:27 am

    1. జ్వలించే ప్రేమల వల్ల కలిగే సంయోగ వియోగాలు అందరి జీవితాల్లో సహజమే కాబట్టి కవిత చటుక్కున బాగుందనిపిస్తోంది.

    * ఇది మీ మొదటి అభిప్రాయం.

    2. కానీ, form దృష్ట్యా, అంటే నిర్మాణపరంగా కవిత ‘అంత మంచి కవిత ‘ అనిపించడం ‘ లేదు.

    * ఇది మీ రెండో అభిప్రాయం. (అయినా, అంత సందిగ్ధత ఎందు కు?)

    3. నా కవిత మాట పక్కన పెడదాం! కనీసం…నా సమాధానం అయినా పూర్తిగా చదవకుండా, ‘విభజనా విధానాన్ని ‘చేపట్టి, లేని పోని స్పర్ధలు రేపి, వినోదించాలనుకోవడం..మీ వంటి పండితులకి తగదు.

    4. కొసమెరుపు గా మీకూ నాదొక మాట! ‘ నా ఈ కవిత వల్ల ‘పాత జ్ఞాపకాలేవో రేగి,”…తాను మరింత ఎక్కవ connect ఐ, ఈ కవిత చదవమని- మీకు మీ మిత్రు రాలు లింక్ పంపారా?

    ( .. బదులివ్వడం – ఒక slap on the face …? – అంటే నాకు అర్ధం కాలేదండి.)

    * ధన్య వాదాలు!
    విధేయురాలు..
    -ఆర్.దమయంతి.

  759. అలిఖిత కఠిన శాసనం! గురించి naresh nunna గారి అభిప్రాయం:

    07/05/2013 9:26 am

    కవిత content వల్ల పాత జ్ఞాపకాలేవో రేగి, ఈ కవిత ఒక రచయిత్రిది కావడంతో మరింత ఎక్కవ connect ఐన ఒక మిత్రురాలు ఈ కవిత చదవమని లింక్ పంపారు. జ్వలించే ప్రేమల వల్ల కలిగే సంయోగ వియోగాలు అందరి జీవితాల్లో సహజమే కాబట్టి కవిత చటుక్కున బాగుందనిపిస్తోంది. కానీ, form దృష్ట్యా, అంటే నిర్మాణపరంగా కవిత అంత మంచి కవిత అనిపించడం లేదు.

    తడారిన గాలి, వడి వడిగా నడుస్తూ నిప్పులోకి దూకుతోంది.
    తన చివరి పరిమళపు జావళిని వినిపిస్తూ ఓ మల్లె
    మట్టిలో రాలిన చప్పుడవుతోంది.
    వీధి కొసన గుడ్డి దీపసెమ్మె తల చుట్టూ చలికొంగు కప్పుకుని,
    బిక్కుపోతున్న ఒంటరి తోవకి తోడుగా, నించుంది.
    గూడు చెదరిన పక్షి తెల్లారడం కోసం తహతహలాడుతోంది.

    ఈ పాదాలు ఈ కవితలో శిఖరాయమానమైనవి. దీని స్థాయిలో మిగతా కవితా పాదాలు లేవు. అయితే, శుద్ధ కవిత్వ వాదిలా, అక్షరమక్షరంలో కవిత్వాన్ని పొంగిపొర్లిస్తూ, సారాన్ని గాలికొదిలేయమని నా ఉద్దేశం కాదు. కదంబ మాల వంటి కవితలో కొన్ని prosaic వాక్యాలుండటం ఎంత కొమ్ములున్న కవికైనా సహజమే. ఆయితే, ఆ వాక్యాలు అందులో ఇమడకపోతేనే ఇబ్బంది. అలా ఇబ్బంది కలిగించిన వాక్యాలే…

    ఈ హృది ఏ శిల్పి చెక్కని శిలా ఫలకం.
    ఇదొక అలిఖిత కఠిన శాసనం!

    …ఈ కవితకి శీర్షిక సరఫరా చేయాల్సి రావడం వల్ల ఈ కవిత బలహీన పడిందనిపించింది. ఇదొక మధురావస్థ. మిధ్య కాని తీపి మరణావస్థ. పాదానికి ముందు బొమ్మకట్టిన భావం వల్ల, ఈ పాదంలో ప్రాస చక్కగా అతికింది. కానీ, జాలి మాలిన కాలం ఓ కనికట్టు. ఏ ప్రేమ గాయాలకీ లేదు లేపనాల కట్టు.

    విరిగిన హృదయానికి విషాదాలే విందులు.
    పగిలిన గుండెకి, గతించిన రోజులే పసందులు.

    వంటి చోట్ల ప్రాసకోసం ప్రయత్నించినట్టు తేలిపోతోంది.

    “ఒకటి చెప్పనా? …”

    వంటి వాటి ద్వారా కవితలో continuity కోసం చూసినట్టు అనిపించి నచ్చలేదు.

    నువ్వంతే! కదలని రాతివి.
    నేనూ ఇంతే! కరగని రాత్రిని

    అన్న చివరి లైన్లు చూస్తే, కవిత ఎత్తుగడ, ఉపసంహారం వంటి ఎకడమిక్ సూత్రీకరణల స్పృహ ఏమైనా ఉందా అనిపిస్తోంది. ‘అనుభవించిన వారికే తెలుస్తుంది….’ అన్న కామెంట్ తో సహానుభవాన్ని పొందుతున్న ఒకానొక పాఠకుడి మమేకత మీద తగు జాగ్రత్తగా కుండెడు నీళ్ళు పోసినట్టు, అనుభవం సొంతం కావొచ్చు. ఊహా జనితమూ కావొచ్చు… అని దమయంతి గారు బదులివ్వడం ఒక slap on the face లాంటి కొసమెరుపు!

  760. దైవం గురించి jayaprabha గారి అభిప్రాయం:

    07/04/2013 9:12 pm

    సాధారణంగా నారాయణ రావు మెచ్చుకున్నాడంటే ఆ పద్యం నిజంగా బాగున్నదై ఉంటుందనే ఆలోచన ఒకప్పుడు గాఢంగా ఉండేది నాకు. అయితే అటు తర్వాత ఆయన అభిరుచి పద్యాలకి సంబంధించి చాలా మారిందని ఆయన రాసిన ఇటీవలి పుస్తకాల చివరిమాటల వల్ల తెలిసి వచ్చింది. ఆ నారాయణ రావు, ఈ నారాయణ రావూ బహుశా ఒకరై ఉండరని అనుకున్నాను.

    చాలా రోజుల తరవాత ఒక మంచి పద్యం చదివానని ఆయన అన్న ఆ మెప్పు మాట చూసి, ఏమిటా ఆ మంచి పద్యం? అని ఉదాశీనంగానే అనుకో, ఆ పాత అలవాటు వల్ల ఇదిగో ఇటుగా వచ్చి ఈ దైవాన్ని చూశాను. ఆశ్చర్యం!! నారాయణ రావు నిజంగా నిజమే చెప్పాడు. ఇంద్రాణీ!! ఇది నిజంగా మంచి పద్యం!! చాలా మంచి పద్యం. తేటగా ఉంది! నారాయణ రావు మాట మీద నమ్మకం పోగొట్టుకుని ఉండి [అనుమానంతో పేజీ తిప్పేసినట్టు] బహుశా నేను చదవక పోయి కూడా ఉండి ఉందును సుమా!! హమ్మో!! ఎంత మంచి పద్యమో!! చాలా బాగుంది. ఆయన అన్నట్టూ.. ఆ ఒక్క ” ట” నిజంగా మరీ బాగుంది.

    “దైవాన్ని” ఇలా చూపించినందుకు!! పైగా ఆయన కళ్లలోకి నువ్వు చూడటం లేదు. నీ ఉలికిపాటు కళ్లలోకి ఆయనే చూస్తున్నాడు. నీ పలుకు అందుకే మెరిసింది మరి! నీ ఇదివరకు కవితలు కూడా నాకు నచ్చినవి ఇంకా ఉన్నా.. ఇది మరీ నచ్చింది. మరొక కవితో పోల్చ వీలులేని స్వంత గొంతుక ఉన్న కవివి నువ్వు ఈ కాలాన!!

    అభినందనలు నీకు,
    జయప్రభ.

  761. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    07/03/2013 6:39 am

    ఈ వ్యాసం చదవగానే వచ్చిన అనుమానం – దీన్ని వ్రాసిన నారాయణ రావుగారూ, కవితా విప్లవాల స్వరూపం వ్రాసిన నారాయణ రావుగారూ ఒకరేనా? అని. 🙂 అయితే యీ వ్యాసం మరో రెండుసార్లు చదివి, ఆ పుస్తకం మరోసారి తిరగేస్తే కాని నేను పొరబడ్డానా, లేక నా అనుమానం నిజమేనా అన్నది చెప్పలేను!

  762. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి jayaprabha గారి అభిప్రాయం:

    07/03/2013 4:44 am

    కవుల జీవిత చరిత్రల్ని వేరే వాళ్ళు కాక ఆ కవులే తమ ‘ఆత్మ కధ’ గా రాసుకుంటేనో? — నారాయణ రావు సిధ్ధాంతం ప్రకారం ఆ జీవితకధని ఆ కవి చెప్పినట్టా? లేక ఆ కవిలో దాగి ఉన్న ఇంకో మనిషి ఎవరో “లౌక్యంగా” చెప్పినట్టా? ఈ ప్రకారం మనం ఏ కవి మాటల్నీ ఎప్పటికీ అసలు నమ్మనవసరం లేదు అనేకదా అర్ధం వస్తుందీ? కవులేనా? ఏ నాయకుల కధల్నీ నమ్మనఖ్ఖరలేదు. అందరూ అసత్యాలో అర్ధ సత్యాలో అయి మిగులుతారు చివరికి లోకంలో! మానవ జాతిమీదే నమ్మకం ఉంచనఖ్ఖర్లేని మాటలు ఇవి. ఇంక కవులు వాళ్ల గురించి వాళ్ళు చెప్పినా నమ్మకూడదు. ఆ కవులని గురించి ఇంకెవరన్నా చెప్పినా నమ్మకూడదు, ఎందుకంటే వాళ్లకి కవి జీవితాన్ని గురించి చెప్పే విషయంలో “ఆర్ధిక పరమైన ఆసక్తి” మాత్రమే ఉంటుంది గనక ఏవో మసాలాలకి ప్రాధాన్యం ఇచ్చి కవి అసలు జీవితాన్ని వదిలేసే ప్రమాదం ఉంది. ఇంక విమర్శకులు అన్న వాళ్ళు మాత్రం తాము సదా తెర వెనకే ఉంటూ వాళ్ల వాళ్ల అస్తిత్వాలని కాపాడుకుంటూనో / దాచుకుంటూనో / చెరిపేసుకుంటూనో వాళ్ల వాళ్ల సిధ్ధాంతాలలోంచి కవులందరి కవిత్వాలని గురించి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు ఎప్పటికీ! దురదృష్టం ఏమంటే ఇలాంటి విమర్శకుల విశ్లేషణలలోంచే వీరిని బట్టే పాఠకులు ఒక కవి కవిత్వాన్నీ.. [మళ్ళీ కవి జీవితాన్ని కాదు సుమా :0] అందులోని అందాలనీ లేదా రహస్యాలనీ పాఠకులు అర్ధం చేసుకోవాలి అదీ కొన్ని వందల ఏళ్ళు గడిచేకా! అయితే ఎప్పుడూ విమర్శకునికి ఒక అస్తిత్వం ఉండదు. అతడు తెరవెనకే ఉంటాడు గనక నిజంగా తన సిధ్ధాంతానికి బాధ్యత వహించాల్సిన పని ఎప్పుడూ ఉండదు. ఒక విమర్శకుడు ఒకలా చెప్పొచ్చు. మరొకరు మరొకలా చెప్పొచ్చు. కానీ కవి తన గురించి చెప్పే మాట మాత్రం అది కవిత్వం రూపంలో ఒకటే ఉంటుంది. దానిని కవి మార్చుకోలేడు / లేదు. ఈ మాటలలో బోలెడన్ని కప్పదాట్లు కాంట్రడిక్షన్స్ కనిపిస్తూంటే నారాయణరావు కొన్ని కధల్ని చెప్పి మిగిలినవి చదివే వాళ్ళే ఎవరికి వాళ్ళు ఊహించుకోవాలీ అని అంటాడు.

    ఐతే నారాయణ రావు ఊహల ప్రకారం అది కవే కానఖ్ఖరలేదు కళాకారులైనా నటులైనా పేరున్న ఏ వ్యక్తికైనా ఈ పరిస్థితి వర్తిస్తుంది. చిక్కు ఎక్కడ వస్తుందంటే, నారాయణ రావు తన వ్యాసంలో చర్చ అంతా తెలుగు సాహిత్యం లోని కవులని గురించి చెప్తూ తాను ఇచ్చిన ఉదాహరణలు మాత్రం అక్కడెక్కడో ఒక అమెరికన్ కవయిత్రిని గురించో లేదా వేల ఏళ్ల వెనకటి కవి విమర్శకుల గురించో ప్రస్తావన చేయడంలో ఉంటుంది.

    బహుశా సమకాలంలో మాత్రమే కవులని వారి వారి గొంతుకలతో ఒప్పుకోవచ్చు. కానీ కొన్ని వందల ఏళ్ళు గడిచేకా ఆయా గొంతుకలు అసలు ఆ కవివో లేక ఆ కవి పేర చెలామణీ అయినవో అయిపోతాయి. ఒక వ్యాసునికి మల్లే / ఒక వాల్మీకికి మల్లే! ఐతే ఇలా ఆధునిక కాలంలో శ్రీ శ్రీ రాసిన కవిత్వంలో సైతం శ్రీ శ్రీ తనని తాను ప్రస్తావన చేసుకుంటూనే మహా ప్రస్థానంలో కవిత్వం చెప్తాడు. పఠాభి సైతం తన పేరుని తన కవిత్వం లోనూ వాడతాడు. మహా ప్రస్థానం కధాకావ్యం కాదు గనక అక్కడ శ్రీ శ్రీ, పఠాభిలు తమ కవిత్వంలో ‘పాత్రలు’ కాకుండా పోయేరా , వ్యాస వాల్మీకుల లాగా? అస్తిత్వ స్పృహ అన్నది ఆధునిక కాలంలో మాత్రమే వచ్చింది. మళ్ళీ కవికి తానుండే సమ కాలం గడిచేకా కొన్ని వందల లేదా వేల ఏళ్ళ పిదప ఈ అస్తిత్వం ఏమీ మిగలదు.

    నారాయణ రావు మాటల ప్రకారం కొన్ని వందల ఏళ్ళ తర్వాత శ్రీ శ్రీ మహా ప్రస్థానం రాసేడో లేదో? అది ఏక కర్తృత్వమో లేక బహుకర్తృత్వమో కూడా కావొచ్చు [బద్దెన/ భీమనల లాగానే]. అలా ఏ కవి రచన అయినా [ఈ విమర్శకుని సిధ్ధాంతం ప్రకారం సుమా] కొన్నేళ్ళ తర్వాత సందేహాస్పదం కావొచ్చు. గమనించండి నారాయణ రావు తన వ్యాసం లోని విషయాన్ని ఒక పక్క సమకాలం చేస్తూ ఉదాహరణల్ని మాత్రం గడిచిన కొన్ని వేల ఏళ్ళ వెనకటివో / లేక తెలుగు సమాజానికి చెందనివో చెప్తాడేమీ? తెలుగు కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు తెలుగు కవులని తీసుకుని మాట్లాడటం కదా సబబు. ఒక కాలం ఒక సమాజం అన్ని కాలాలకీ అన్ని సమాజాలకీ ప్రాతినిధ్యం ఎలా వహిస్తాయీ? పాశ్చ్యాత్య కవయిత్రిని గురించిన సందర్భం తెలుగు కవయిత్రికి/ కవికీ నప్పదు. సంస్కృత ఉదాహరణలు ఇవాళ చెల్లుబాటు కావు. పోనీ కాసేపు ఈ కవుల్ని పక్కన పెడదాం!

    నారాయణ రావూ! నా ప్రశ్న ఏమంటె మరి కొన్ని వందల ఏళ్ల తర్వాత ఏ రచన తాలూకు కర్తృత్వమైనా అంతే కద? అసలు వెల్చేరు నారాయణ రావు అన్న ఒక విమర్శకుడు ఉండి ఉండెడి వాడా? ఒకవేళ ఉన్నచో అతడు నిజంగా అతడేనా? లేక కొన్ని గొంతుకలకి ప్రతీకా? ఏళ్ళ తర్వాత ఆయన “కవితావిప్లవాల స్వరూపం ” స్వరూపం ఏమిటీ? దానిని వెల్చేరు నారాయణ రావే రాSAడన్న ఆధారం ఏమిటీ? ఒక వేళ రాస్తే ఆ రాసింది వ్యక్తిగా వెల్చేరా? లేక ఒక ‘లోపలి వ్యక్తి’గా వెల్చేరా? నువ్వు జవాబు చెప్పవు.

    ఏ రచనకైనా చివరికి వర్తించే ఈ రకమైన సంగతుల్ని ఆయనే మన ముందుకి తెచ్చి ఈ సందేహాలకి పూచీ మాత్రం తనది కాదని అంటున్నాడు. ఆ “నిబ్బరం” తనకి లేదనీ అంటున్నాడు. భలే భలే!

    జయప్రభ.

  763. త్రిపురాత్రి… త్రిపురహిత పగలు… గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    07/02/2013 10:50 pm

    కొన్ని సార్లు అద్భుతవని చెప్పటానికి కూడా మనసు రాదు. ఆ పదం చాలా తేలికగానూ, ఏ మాత్రం భావానికి న్యాయం చేయనట్టు అనిపిస్తుంది. మరొక అద్భుతవైన పదం మీ కవిత మనస్సులో నింపిన నిశ్శబ్ధం నుంచి వెలుపలకి రాదు. పక్షి ఈకల లాటి ఈ పదాలన్నీ మీ కవిత సృష్టించిన ఘాడతలోకి నిశ్శబ్ధంగా జారిపోతాయి.

    -Ravikiran Timmireddy

  764. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    07/02/2013 8:48 pm

    ‘అచ్చమైన కవిత్వం అచ్చమైన సహృదయులకు మాత్రమే అర్థమవుతుంది. ” – కవిత్వాన్ని ఎంత అందంగా, హృద్యంగా నిర్వచించారు! -అభినందనలు.
    -ఆర్.దమయంతి.

  765. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి Velcheru Naraayana Rao గారి అభిప్రాయం:

    07/02/2013 5:28 pm

    నా వ్యాసం మీద ఆలోచనకీ, అంతర్దృష్టికీ పనికొచ్చే ఉత్తరాలు (జయప్రభ, సౌమ్య, భావనారాయణ గార్లవి) వొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాటికి సమాధానాలు నాకు నిబ్బరంగా తెలియవు. పదిమందీ ఆలోచనలూ కలబోస్తే నేను చెప్పే వాటికన్నామంచి సమాధానం దొరకొచ్చు. నాకు తోచిన మాటలు చెప్తాను.

    విమర్శకులు విమర్శాతీతులు కారు. వాళ్ల దృష్టిలోపాలూ, సంస్కారపరిమితులూ అభిమాన దురభిమానాలూ, వాళ్లకి వుంటాయి. ఒక్కసారి నావ్యాసం మళ్లా చూడండి:

    “… చదివేవాళ్ళు, వాళ్ళ మనసులో పొరలు అడ్డం పెట్టుకొని, వాళ్ళ రాగద్వేషాల దారిలో కవిత్వాన్ని చూస్తే దానికి ఇంకొక దుర్వ్యాఖ్యానం వస్తుంది. అందుకనే అచ్చమైన కవిత్వం అచ్చమైన సహృదయులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ బాధ్యత ఒక్క వ్యక్తి మీద పెట్టకుండా కొన్ని తరాల మనుషులు, కొన్ని సంవత్సరాల పాటు ఆ కవిత్వాన్ని చదువుతూ ఉంటే తాత్కాలిక రాగద్వేషాలు, వ్యక్తిగత వైమనస్యాలు క్రమక్రమంగా తొలిగిపోయి కవిత్వమే మిగులుతుంది అని ఒక ఆశ.”

    సహృదయుడు ఒక వ్యక్తి కాదు. అచ్చమైన సహృదయులు కొన్ని తరాల విమర్శకుల సంపుటి. విమర్శకులు వేరే ఒక జాతి కాదు. ఇందులో కవులూ, రచయితలూ కూడా వుంటారు. పైగా, రాగద్వేషాలకి అతీతంగా కవిని/రచయితని అర్థంచేసుకోడం సాధ్యం కాదు. ఎందుకంటే కవిత్వమూ, రచనా రాగద్వేషాల లోంచే వొస్తాయి కాబట్టి. కాని, చదివేవాళ్లు తమ వ్యక్తిగత సంకుచిత రాగద్వేషాలకి అతీతంగా రచనని అర్థంచేసుకోడం సాధ్యం. వాళ్లు కొన్ని తరాల వాళ్లు అయితే ఇంకా తేలికగా సాధ్యం.

    విమర్శకులు, అంటే సహృదయులు, కవుల్లాగ కథలు కట్టి చెప్పుకునే స్థాయికి ఎదగరు. వాళ్లెప్పుడూ అనామకులే, తెరవెనకవాళ్లే. ఎప్పుడో ఒక అభివగుప్తుడో, మమ్మటుడో, జగన్నాథుడో ఆ స్థాయికి వొస్తారు. అదీ వాళ్లు కవులు కూడా కాబట్టి. ఆధునిక కాలంలో కవి జీవిత చరిత్రల రచయితలు కవులకన్న, రచయితల కన్న, ప్రముఖ స్థాయికి రావడం, వాళ్ల వల్లే కవులూ, రచయితలూ అర్థం చేసుకోబడడం గురించే నా అభ్యంతరం.

    కవి జీవితం గురించి తెలిస్తే కవిత్వం, రచయిత బతుకుని గురించి తెలిస్తే ఆ రచయిత రచనలూ ఎక్కువ బాగా తెలుస్తాయనేది ఆధునిక పెట్టుబడిదారీ సమాజం ఏర్పరచిన భ్రమ. కమలాదాస్ కవిత్వానికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇది మీకు రుజువు చెయ్యలేను.

    ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను: 8వ శతాబ్దపు సంస్కృత ఆలంకారికుడు దండి తన కావ్యాదర్శపు ప్రారంభంలో సరస్వతీ ప్రార్థన చేస్తూ

    చతుర్ముఖముఖాంభోజ కలహంసవధూ ర్మమ
    మానసే రమతాం నిత్యం సర్వ శుక్లా సరస్వతీ

    (బ్రహ్మ నాలుగు ముఖాలూ అనే పద్మాలలో (విహరించే) హంస, పూర్తిగా తెల్లగా వుండే సరస్వతి, నా మనస్సులో ఎల్లప్పుడు ఆనందంగా ఉండు గాక) అని రాశాడు.

    ఇది చదివి, విజ్జిక అనే ఆవిడ ఇలా అందిట:

    నీలోత్పలదలస్యామాం విజ్జికాం మా మజానతా
    వృథైవ దండినా ప్రోక్తా సర్వ శుక్లా సరస్వతీ

    (నల్ల కలువ లాగ (అందంగా) వుండే విజ్జిక అనే నన్ను గుర్తించక (ఎరగక) సరస్వతీ దేవి ఎప్పుడూ తెల్లగానే వుంటుంది అని దండి (తెలివి తక్కువగా) చెప్పాడు.)

    దండిని గురించీ, విజ్జికని గురించీ మీ ఇష్టం వొచ్చిన కథ చెప్పుకోండి, కానివాళ్ల నిజ జీవితాలు తెలిస్తే ఈ శ్లోకాలు ఇంకా ఎక్కువ బాగ అర్థం అవుతాయా, లేకపోతే ఆ సమాచారం మీ ఊహకి అడ్డొచ్చి, ఈ శ్లోకాలు దెబ్బతింటాయా?

    ఇకపోతే సూరన, సూరన్నల పేర్ల అక్షర నిర్ణయం గురించి: కళాపూర్ణోదయం, ప్రభావతీప్రద్యుమ్నం గద్యలో ఆయన పేరు సూరయ అని వుంది. అయ్య, అన్న, అప్ప, అయ, అన, అప – ఇవన్నీ సమానార్థకాలుగానే వాడారు. ఇందులో ఛందస్సుకి అనువైన రూపాలు ఆచరణలోకి వొచ్చాయి. పేరులో అక్షరబద్ధత మనకి పూర్తిగా ఆధునిక కాలం లోనే వొచ్చింది. అయితే సూరన పేరులో నకారద్విత్వం ఎంతముందు వాడుకలో కనిపిస్తుందో నేను పరిశీలించలేదు.

    –నారా

  766. త్రిపురాత్రి… త్రిపురహిత పగలు… గురించి ns murty గారి అభిప్రాయం:

    07/02/2013 12:58 pm

    అద్భుతమైన కవిత. భగవంతం గారూ, మీకు మనః పూర్వక అభినందనలు.

  767. అలిఖిత కఠిన శాసనం! గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    07/02/2013 12:54 pm

    ‘అనుభవాన్ని ఇంత చక్కగా అక్షరాల్లో మలచడం ఒక కవితా కనికట్టు.
    ఒక అత్యద్భుతవైన అక్షరాల మేజిక్కు.’

    *అనుభవం సొంతం కావొచ్చు. ఊహా జనితమూ కావొచ్చు.

    చక్కదనం మన భాషలోనే ఇమిడి వుంది. కదూ? మీరన్నట్టు కవిత – కనికట్టు చేస్తుంది. ఈ మాజిక్క్ మాత్రం …అంతా…అనుభూతించే వారి సహృదయతలోనే దాగి వుంటుంది.

    మీ స్పందన నాకెంతో ఆనందాన్ని కలగచేసింది రవికిరణ్ గారూ!
    మీకు నా మనః పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ..
    -ఆర్.దమయంతి.

  768. అలిఖిత కఠిన శాసనం! గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    07/02/2013 11:49 am

    “ఈ రాత్రికిక సెలవీయలేను. రేపటిని స్వాగతించనూ లేను.
    ఇదొక మధురావస్థ. మిధ్య కాని తీపి మరణావస్థ.
    కొన్ని నరకాలు ఎన్ని పూర్వ పుణ్యవరాలో!”

    అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ ఆ అనుభవాన్ని ఇంత చక్కగా అక్షరాల్లో మలచడం ఒక కవితా కనికట్టు. ఒక అత్యద్భుతవైన అక్షరాల మేజిక్కు.

    అద్భుతంగా వుంది దమయంతి గారు.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  769. ఇంకొంచెం అసంబద్ధం గురించి రవి గారి అభిప్రాయం:

    07/02/2013 5:58 am

    కవిత మాత్రమే అసంబద్ధం. భావం ఎక్కడో గుచ్చుతోంది. నిజమే. దేవుడు,పాపాయి, కవి చూస్తూ ఉంటారు. ఆ చూపే ఒక అద్దం అవుతుంది.

    మీ కవిత బావోలేదు. ఎందుకంటే అందులో నిజం ఉంది. 🙂

  770. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి ఆ. సౌమ్య గారి అభిప్రాయం:

    07/02/2013 3:56 am

    చాలా బాగుంది వ్యాసం. అయితే, నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. ప్రతీ కవి కథే అయితే ప్రతీ విమర్శకుడు లేదా కవి జీవిత చరిత్రని రాస్తున్నవాడు ‘కథ’ ఎందుకు కాడు? మీరన్నట్టు కవి జీవితంలో లేని విషయాలని కల్పించి రాసి డబ్బు కోసమో, కీర్తి కండూతి కోసమో తపిస్తున్నవాడిలో మాత్రం కవి, లౌకిక వ్యక్తి అనే రెండు స్వభావాలు ఉండవా? ఒక మాట నాకు బాగా నచ్చింది… కవిత్వం/రచన తరతరాలు చదవాలి. అప్పుడే రాగద్వేషాలు పోయి కవిత్వం మిగులుతుంది అన్నారు కదా. చాలా మంచి మాట చెప్పారు. ఇదే మాట కవి జీవిత చరిత్రలు రాస్తున్నవారికి కూడా వర్తిస్తుంది కదా!!

    కొంతమంది కవుల జీవితగాథలు తెలిస్తే వారి కవిత్వం బాగా అర్థమవుతుంది అన్నదాన్లో కొంత నిజం లేకపోలేదు. నా స్వానుభవంలో… కమలా దాస్ కవితలు చదువుతుంటే ఒకటే ఆవేదన నాకు. ఎందుకు ఈమెకి ఇంత బాధ! ఇంత దుఃఖం! ఎందుకు ఇంత వేదనాభరితమైన కవిత్వం రాస్తోంది! అన్న ప్రశ్నలు వేధించేవి. ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి కొంత తెలుసుకున్నాక ఆవిడ కవితలమీద నా అవగాహన పెరిగింది.

    రాగద్వేషాలకు అతీతంగా కవిని అర్థం చేసుకోవడం, ప్రేమించడం సాధ్యమవుతుందా!! అని. ఎంతో ప్రేమించిన కవి లోని లౌకిక వ్యక్తి, తన సొంత రచనలకు పూర్తి వ్యతిరేకమైన పనులు చేస్తూ/మాట్లాడుతూ కళ్ళముందు కనిపిస్తుంటే ఆ కవి కథని అతని సృజన ద్వారా మాత్రమే ఎలా రూపొందించుకోవడం అని!!

  771. నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి jayaprabha గారి అభిప్రాయం:

    07/02/2013 2:28 am

    బాగా రాసేరు కామేశ్వర రావు గారూ! దాశరధిని గురించి నేను మరి కొంత చెప్పవలసి ఉంది. నిజానికి ఎప్పుడో రాయవలసి ఉండింది. కానీ ఏవో నా రాత కోతల్లో పడి ఎప్పుడూ కుదరలేదు. అలా ఇంకా కుదరనివి ఎన్నో ఉన్నాయి. వాటిని సైతం ఎప్పుడైనా రాయగలనో లేనో? నాకు కూడా దాశరధి ఎంతో ఇshTaమైన కవి. మీరన్నట్టూ పద్యం ఆయన చేతిలో నర్తించింది. కవిత్వంలో తెలుగు భాషని అంత అందంగానూ అంత కవనోద్రేకంగానూ వాడిన వారు అరుదు!

    విశ్వనాధ సూర్యనారాయణతో పాటు నన్ను కూడా తెలుగు కవితా రంగానికి తన ముందు మాట ద్వారా 1980లో పరిచయం చేసినది దాశరధే! ఆయన రాసిన “కవితా సూర్యప్రభ” ఆ రోజుల్లో చాలా మందికి నచ్చిన పరిచయం!

    ఆ రోజుల్లో దాశరధి నాతో చాలా మాట్లాడేవారు. వారానికి ఒక రెండు రోజులైనా ఆయనని హైదర్ గూడాలో వాళ్ళ ఇంటిలో కలిసేదాన్ని. బోలెడన్ని సాహిత్యపు సంగతులు నా ముందు పోత పోసేవారు. కానీ అవన్నీ ఆనాడు నిజంగా నాకు అర్ధమయ్యేయని నేను చెప్పలేను. అప్పటికి నా వయసు చిన్నది. నా సాహిత్య పరిజ్ఞానం అప్పటికి తక్కువ. ఇంకా తెలుగు సాహిత్యపు మూలాలలోకి నేను వెళ్లని కాలం అది. అయినా నామీద ఆయనకి ఎందుకో అపారమైన విశ్వాసం ఉండేది. ఎంతో ఇష్టం ఉండేది. ఆయన వట్టి భోళా మనిషి. ఎంతో ఆత్మీయతతో మసిలేవారు. ప్రధమ కోపమూ ఉండేది. వెనువెంటనే చల్లబడేవారు . ఉద్రేక స్వభావి! అంతే సహృదయుడూనూ!

    జీవిక కోసం దాశరధి కూడా సినిమా పాటల్ని రాసినా మిగిలిన ఆయన కాలపు కవులకి మల్లే నాకు తెలిసీ ఆయన చెత్త పాటల్ని గాని, బూతు పాటల్ని గాని రాయలేదని గుర్తు. సినిమాల్లో ఆయన రాసిన యుగళ గీతాలూ భక్తి గీతాలూ కవిగా ఆయన సున్నిత స్పందనలకి కొనసాగింపుగానే కనిపిస్తాయి. సినిమా రంగంలో మంచి పాటల్ని రాయడం కష్టమైపోతున్న కాలం అప్పటికే వచ్చింది. కానీ దాశరధి మాత్రం ఏవగింపు కలిగే ఏ పాటనీ రాయలేదు. మీరన్నట్టు పద్యం అలవోకగా అతి గాఢం గా నిర్మించగలిగిన నేర్పు దాశరధి స్వంతం! శిల్పిని గురించి ఆయన రాసిన అన్ని పద్యాలూ నాకిష్టం! గాలిబ్ గీతాలకి ఆయన చేసిన అనువాదం నాకు మహా ఇష్టం! ఎన్నో ఉటంకించవచ్చును. కానీ ఒక చిన్న పద్యాన్ని మాత్రం ఇక్కడ చెబుతాను ఆయన భావ విన్యాసానికి మచ్చుతునకగా!

    “ప్రతి వికార శిలయు ప్రతిమయై కనుపట్టు
    పడతివోలె కులికి వలపు రేపు
    నీ కరావలంబ నిభృత మైనపుడెల్ల
    రాతి రాతి లోన నాతి దోచు”

    [ఆయన శిల్పి కవితా ఖండిక నించి]

    “ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
    నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము ”

    తో మొదలు పెట్టి ఆయన అనువదించిన గాలిబ్ గీత మాలిక ప్రతి సుమ సౌరభం!! అందులో నాకిష్టమైనవి ఎన్నో! కానీ ఈ ఒక్క చిన్న పదంతో ముగిస్తాను.

    ” ఆమె తనను గూర్చి అతి గర్వపడుచుండు
    కాన పిలువబోదు తాను నన్ను
    నేను స్వాభిమాన నిరతుడ గావున
    పిలువకుండ పోను; కలియుటెట్లు ? ”

    [ ఆయన “గాలిబ్ గీతాలు” నించి ]

    మీరు చేసిన శ్రీమాన్ దాశరధి కృష్ణమాచార్యుల వారి పద్య ప్రస్తావన ఆయనని గురించిన నా పాత తలపోతలని ఆనాటి కాలాన్నీ తిరిగి నా కంటిముందు నిలిపింది. లేకపోతే బహుశా నేను ఈ మాటలు రాయడానికి మరికొంత కాలం తీసుకునే దానినేమో!! ఇలా దాశరధిని నేను గుర్తు చేసుకునే వీలు కల్పించిన మీకూ ఈమాటకూ నా నిండు కృతజ్ఞతలు.

    జయప్రభ.

  772. త్రిపురాత్రి… త్రిపురహిత పగలు… గురించి naresh nunna గారి అభిప్రాయం:

    07/02/2013 2:02 am

    వస్తు-రూప ద్వంద్వానికి అంతుచిక్కని, నెపం వంటి కేవల రూపాన్ని మించి ప్రచ్ఛన్నంగా పరుచుకొని సారమై నిలిచిన త్రిపుర రాతలలోంచి ఆయన మూర్తిని, మూర్తిమత్వాన్ని ఊహిస్తూ గుట్టలుగా పోగుపడ్డ నా appraisals వల్లనే ఆయనని కలవాలని నేను వెంపర్లాడలేదు. ‘త్రిపుర ఎలా ఉంటారో అన్న కుతూహలం లాంటి ప్రశ్న, త్రిపురని కలవడం కంటే మనోహరంగా ఉండేది నాకు.

    తీరా త్రిపురని కలిసిన తర్వాత, ఆయనని నేరుగా చూడటం కంటే, పొంచి చూడటంలో ఎక్కువ ఆనందాన్ని పొందే వాడిని. అందుకే కలిసిన సందర్భాల కంటే, చూసినవి, పొంచి చూసినవే ఎక్కువ. ఈ దోబూచులాటలకి వీలులేకుండా, ఆయన వెళ్ళిపోయారన్న ఆలోచన ఆవేదనై లోన ఘనీభవిస్తే, దానిని కరిగించి, కన్నీళ్లు చేసి ఒక శుభ్ర వేదనలో నన్ను శుద్ధి చేసిందీ ఎలిజీ. శోకంలో కూరుకు పోవడం, లేదా అందులోంచి విడుదల కావడం అని రెండే పార్శ్వాలు, రెండే ముఖాలు, రెండే మార్గాంతరాలు తెలిసిన నాకు నారింజ క్లేశపు తొనలు వలిచి చూపిందీ స్మృతిగీతం. కాగితం మీద కవిత నక్కిన జాగా పోను, తక్కిన తెల్లని ఖాళీ అంటే- ‘త్రిపుర ఉన్నప్పటి ప్రపంచాన్ని లేనప్పటి ప్రపంచంతో పోల్చుకోవడం’ లాంటిదని విప్పి చెప్పిందీ విలాప విరాళి.

    అట్నుంచి ఏడో నంబర్లోనూ, ఇట్నుంచి పదమూడో నంబర్లోనూ రాడని త్రిపుర నిర్థారించుకొని వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన భగవంతం చెప్పుల్లేని పాదాలకింద పడి నలుగుతున్న పండుటాకుల చప్పుడు ఈ ‘శోక’విత…

  773. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి jayaprabha గారి అభిప్రాయం:

    07/01/2013 3:13 pm

    కవులు… కవిత్వాలు… వారి అంతరంగాలూ… వారి వారి జీవిత విశేషాల మాలికలు. .. అవి ఉత్తరోత్తరా కాలాలు దాటేకా చెందడానికి వీలుండే మార్పులూ… ఇలా చాలా ఆసక్తికరమైన ఈ వ్యాసపు మాటలలో ఎందుకనీ ఎక్కడా “విమర్శకుల” అంతరంగాలూ… వారి రాతలూ… వాటికి భవిష్యత్తులో ఆపాదింపబడే ఊహాజనిత కర్తృత్వాలూ ఇలాంటి వాటి ప్రస్తావన లేదేమో? విమర్శ అన్నది సృజన కాదా? కవులకి ఉండే లాంటి పరిస్థితులు విమర్శ రాసే వారికి మాత్రం ఉండవా? నా ఉద్దేశ్యం “కీర్తి కండూతీ” వగైరాలన్నమాట! మరి ఈ తెగ వారిని గురించి ఒక్క మాటా ఈ విశ్లేషణలో లేదేమా? అని.

    కవిత్వోదయవేళల్లో తానేమిటో తన అంతరంగమేమిటో చెప్పడానికి ఎప్పుడైనా అవకాశం కవికి మాత్రమే ఉంటుంది. కానీ కవి తరుపున కూడా వకాల్తా పుచ్చుకున్నట్టు విమర్శకులే ఈ విషయం మీద మాట్లాడటంలో నిజం ఉండే వీలు లేదు. కవితావిర్భావం గురించి ఆ కవికే తెలియదనడం ఒక విమర్శకుని అవధీ, పరిధీ దాటిన మాట మరి. ఆ మాట చెప్పవలసింది కేవలం కవులు.

    నందో రాజా భవిష్యతి! రేపు ఏం జరగనుందో తెలియదని అనుకున్నప్పుడు అది ఏ సృజన కారులకైనా ఒకటే! అందులో ఏ తరతమ బేధాలూ ఉండలేవు. ఆ సందేహ పరిధి లోకి విమర్శకులూ విశ్లేషకులూ శాస్త్రకారులూ మాత్రం మినహాయింపు ఎలా కాగలరూ?

    జయప్రభ.

  774. అవధారు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    07/01/2013 1:57 pm

    త్రిపురతో మీ జ్ఞాపకాలు హృద్యంగా ఉన్నాయి ప్రసాద్ గారు. త్రిపుర ఒక స్వచ్ఛమైన నదిలాంటి వారు. నదిలోకి చూస్తే మనకి మనమే కనిపిస్తాం. ఆయనతో సంభాషణ కూడా అంతే. ఆయనలా మనుషుల్ని ప్రేమించిన వాళ్ళు అరుదుగా ఉంటారు. వైశాఖ పూర్ణిమ నాడే మన కాలపు బుద్ధుడు కూడా నిర్యాణం చెందడం ఆశ్చర్యం. ఒక జెన్ కవిత గుర్తొస్తోంది.

    My legacy –
    What will it be?
    Flowers in spring,
    The cuckoo in summer,
    And the crimson maples
    Of autumn …

    – Ryokan

  775. ప్రాప్తం గురించి Murali Krishna గారి అభిప్రాయం:

    06/30/2013 10:19 am

    మీ కవిత బాగుంది. ఇప్పుడెందుకిలా కంటే ఇందులో పరిణతి కనిపించింది.

  776. జాతర గురించి maheshbabu గారి అభిప్రాయం:

    06/26/2013 3:09 am

    మీరు వ్రసిన కవిత చాలా బాగుంది. ప్రస్తుత జీవిత ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఉంది. జీవితపు అనుభవాల్లోంచి వచ్చినట్టుగా ఉంది.

    మహేష్

  777. జాతర గురించి సాయి పద్మ గారి అభిప్రాయం:

    06/20/2013 2:06 am

    వనజ గారికి, అఫ్సర్ గారికి, జాన్ గారికి, సత్య గారికి , వెంకటేశ్వర్ గారికి .. ఈ కవిత నచ్చుకున్న మెచ్చుకున్న అందరికీ బోల్డు బోల్డు ధన్యవాదాలు .

  778. ఊపిరిపాటకు చూపేదీ? గురించి రామానుజ రావు గారి అభిప్రాయం:

    06/19/2013 11:01 am

    కవిత చాలా బాగుంది.మీ పత్రిక ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా పాత సంచికల్ని కూడా చూడాలి. పత్రిక పేరు బుక్ మార్క్ చేసుకున్నాను. తీరుబడిగా అన్ని చదవాలి.
    రామానుజ రావు

  779. చతురదూతిక గురించి దేశికాచారి గారి అభిప్రాయం:

    06/16/2013 11:20 am

    లైలాగారికి, దగ్గుపాటిగారికి వారి అభిప్రాయములకై కృతజ్ఞతలు. దీనివల్ల కొందఱైనా ఈ కాలంలో పద్య కవిత్వంపై ఆదరం చూపుతున్నారని స్పష్టమైంది. లైలాగారు లేవనెత్తిన అంశాలకు ఈ క్రింద వివరణ లిస్తున్నాను.

    1. అమరకోశమనేది సుప్రసిద్ధమైన శ్లోకరూపంలో ఉండే సంస్కృతనిఘంటువు. ఇందులో పదిహేను వందల శ్లోకాలున్నవి. సంస్కృతం నేర్చుకొనేవారు మొట్టమొదట కంఠస్థం చేసే గ్రంథమిది. తెలుగు పట్టుబడాలన్నా ఇది నేర్చుకొనవలసిందే.

    2. పద్యాదిలో వ్యంజనముపై సంధివశమున వచ్చిన అచ్చుకే యతి చెల్లింపవలసి యుండగా, అట్లుగాక వ్యంజనమిత్రమైన యక్షరమునకు యతి చెల్లించుట ‘అఖండయతి’ అనబడును.

    3. ‘విద్యుల్లతికను మేఘుఁడు హృద్యంబుగఁ బొదివినట్టు లెదలోఁ బొదివెన్’ అన్న భావం పునరుక్తం కాలేదు. అది ఖండికలో ఒకే ఒకసారి వెలిబుచ్చబడింది. ఈ పద్యంలో మఱొక విశేషం ఉంది. ప్రాసస్థానంలో ద్య అను సంయుక్తమైన శబ్దము, ద తో గాఢంగా కూడుకొన్న య ఒత్తు, ఆ గాఢాలింగనదృశ్యాన్ని వ్రాత ద్వారా, శబ్దం ద్వారా మనకు ప్రత్యక్షీకరిస్తున్నవి. పైగా పద్యంలో ప్రాసస్థానంలో, అంటే రెండవస్థానంలో ఉండే ఈ సంయుక్తాక్షరం, అది ఇర్వురు వ్యక్తుల మధ్య కూడిన గాఢాలింగనం అనే విషయాన్నీ సూచిస్తున్నది. ఇటువంటి కావ్యగుణానికి ‘ఔదార్య’మని పేరు.

    4. శుకరాయబారాలు, హంసరాయబారాలు చర్వితచర్వణములే. అందులో నూతనత్వ మేముంది?

    ‘Where there is risk is there the reward’ దూతి నీవిధంగా పంపి అతని బలహీనతను కూడ ప్రత్యక్షంగా నిరూపించి అతనిని ప్రసన్నం చేసికొనడంలో క్రొత్తదనముంది. ఈ పథకానికి అనుగుణంగా నాయికాదూతికల మనఃస్థితులు ఈ ఖండికలో నిరూపింపబడ్డవి.

    “సుందరదూతికాకృతియు..” అనే పద్యంలో దౌత్యాని కర్హమైన గుణవిశేషములు, అందులో గూఢంగా నిక్షిప్తమై యున్న పథకం వివరింపబడింది. కాని ఇందులో గల ప్రమాదం తరళికకు స్ఫురించకుండా ఉండలేదు. అందుచేతనే, ఆమె ‘ఏమె! జ్యోత్స్నాభిసారికాకృతినిఁ బూని..’ అన్న పద్యంలో ఈ పథకంలో గల ప్రమాదాన్ని నర్మగర్భితంగా వెలిబుచ్చింది. దానికి ‘అతని రాతిడెందము..’ అన్న పద్యంలో ముఖ్యంగా ‘నీదు మేలు గాదటె చెలి నాదు మేలు?’ అన్న వాక్యం ఆమెకు కొంత ఊరట కల్గించింది. పైగా, ‘ఐన మఱవకుము మననెయ్యంపు మాట!’ అన్న పద్యంలో పైమాటకు కట్టుబడి ఉండమని నాయిక దూతికను మెత్తగా హెచ్చరించింది. మొత్తానికి దూతికయందు నాయికకు అపనమ్మకం కంటె నమ్మకమే కాస్త అధికంగా ఉందనే అనుకోవాలి. దూతిక కూడ మానవసహజమైన లోభమునకు అతీతురాలు గాదనే విషయం ‘అదటున నాతఁ డా యువతి నక్కునఁ జేర్పఁగ …’ అన్న పద్యంలో వ్యక్తీకరింపబడింది. ఇది దౌత్యం చేసినందున దూతిక కబ్బిన విశేషఫల మనుకుంటే నష్టంలేదు. కాని దూతిక స్వార్థపరురాలు గాదు. ఈ విషయం ‘అట్లు పారవశ్యము నంది ..’, ‘అట్టు లుద్బుద్ధచిత్తయై..’ అన్న పద్యాల్లో వ్యక్తమైంది. తరళిక ఆమె అందచందాలు, విధేయత్వము తెలిసినది కావుననే ఆమె నీ కార్యమునకు నియోగించిన దని దీనివల్ల స్పష్టమౌతున్నది.

  780. కనిపించడం లేదు గురించి విన్నకోట నరసింహారావు గారి అభిప్రాయం:

    06/12/2013 1:10 am

    ఈ వెబ్ సైట్ ఇటీవలే చూడటం మొదలెట్టాను. ఈ కవిత ఇప్పుడే చదివాను. ఎంత మధురమైన ఊహ. ఎంత అందమైన కవిత.

  781. లెక్కల పాఠం గురించి Muddu venkata lakshmi గారి అభిప్రాయం:

    06/11/2013 10:14 am

    లెక్కల పాఠం లాగే మీ కవిత కూడ అస్పష్టంగా ఉంది. కాలేజీల్లో అమ్మాయిలపై, భార్యలపై జరుగుతున్న అత్యాచారాల గురించి అయితే ధన్యవాదాలు.

  782. మల్లే పూల్ మల్లే పూల్ గురించి Muddu venkata lakshmi గారి అభిప్రాయం:

    06/11/2013 6:19 am

    ఇంద్రాణి గారూ – మంచి పద చిత్రాలు సృష్టించ గల భావుకత ఉంది మీలో. ఇంకా ఇలాంటి కవితలు వ్రాస్తూ ఉండండి.

  783. టోపీలు పెట్టబడును గురించి Muddu venkata lakshmi గారి అభిప్రాయం:

    06/11/2013 3:20 am

    ఈ వ్యంగ్య కవిత బాగుంది. కాని కల్లలు హాయిగా ఎగురుతున్న ఈ కాలం లో “నేల రాలిన కల్లలు” అని ఎందుకు అన్నారో అర్థం కాలేదు సామాన్యుడికి ప్రతి కాలమూ టోపీల కాలమే కదా అన్న పంక్తి వాస్తవికతకు అద్దం పట్టింది.

  784. మంత్ర భాషణం గురించి Mangu Siiva Ram Prasad గారి అభిప్రాయం:

    06/07/2013 2:18 am

    కవిత్వంలో అస్పష్టత ఉంది. ఈ క్రింద పంక్తులలో కవి ఏం చెప్పదల్చుకున్నాడో అగమ్యగోచరం.

    “సూటిదనం మొహం చాటేసి
    ముసుగేసుకున్న పదచిత్రాల కన్నెల
    ముద్దొచ్చే మోహన రూపాలెన్నో –
    జల్లెడ లోంచి జారిపోయే నీళ్లు
    అందనితనపు అశాంతిలో ముంచేస్తయ్”

    కవిత ఆస్వాదయోగ్యం కావాలంటే అది పాఠకుని అవగాహన పరిధిలోకి రావాలి. కవిత్వంలో శబ్దానికి అర్థానికి అవినాభవ సంబంధముంది, అద్భుతమైన పదచిత్రాలు ఆ కార్యాన్ని సాధించలేవు. కవి సహృదయుడై అర్థం చేసుకుంటారని భావిస్తూ…

  785. ప్రేమ కవితలు గురించి swapna గారి అభిప్రాయం:

    06/06/2013 1:57 am

    మీ కవిత నాకు చాలా బాగా నచ్చింది.

  786. ఊపిరిపాటకు చూపేదీ? గురించి రత్నశిఖామణి గారి అభిప్రాయం:

    06/04/2013 10:51 am

    “మురళితోబాటు మహాబలిపురాన్నే
    సంచిలో పెట్టుకున్నాడా”

    “నమస్కార ముద్రలో తడుముకున్నాడు
    వేణువు వొంటిపైన తన ఏడు కళ్ళనీ”

    ఎంత ముద్దుగా ఉన్నాయి ఈ భావాలు! మహాద్భుతం.
    వేకువల్ని వణికించే ఆ వేణువుకి సరి తూగే కమ్మని కవిత ఇది.

    ~రత్నశిఖామణి

  787. జాతర గురించి saidulu గారి అభిప్రాయం:

    06/01/2013 5:30 am

    చాలా బాగున్నావి మీ కవితలు.

  788. స్త్రీ గురించి bindu గారి అభిప్రాయం:

    05/22/2013 3:33 am

    మీ కవిత చాలా బాగుంది.

  789. పై గదిలో ప్రేమికుడు గురించి indrani Palaparthy గారి అభిప్రాయం:

    05/10/2013 2:57 pm

    ఈమాటలో ఇదివరకు సైన్సు/గణితం కు సంబంధించిన వ్యాసాలు కొన్ని రాశానని కానీ పాఠకులనుండి ఆదరణ లేకపోవడం తనను చాలా నిరాశకు గురి చేసిందని పెద్దలు ఒకరు మెయిలు చేశారు నిన్న.

    వారి వ్యాసాలు ఎంతో ప్రతిభావంతంగా ఉంటాయి. వారి బాధని అర్ధం చేసుకోగలను. చదివిన వారు బాగుంది అని రాస్తే రచయితకి ఎంతో సంతోషంగా ఉంటుంది.మళ్ళీ రాయాలనే ఉత్సాహం కలుగుతుంది.

    నా అప్రస్తుత ప్రసంగం:

    నిజానికి ఎవరైనా రాసేది వారి సంతోషం కోసమే అని ప్రశంసలు దానికి బోనస్ లాంటివి అని అనుకుంటాను.

    తన రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచాడు- లాంటి మాటలు వింటుంటాము.ప్రజలను చైతన్యపరచడం కోసం ఎవరైనా రచనలు చేసారంటే/చేస్తున్నారంటే అందులో పెద్దగా నిజం లేదని నమ్ముతాను. ఆ వ్యక్తికి అటువంటి భావాలు ఇష్టం కాబట్టి వాటిని తనకి నచ్చిన విధంగా కథ/కవిత/వ్యాసం రూపంలో బయట పెట్టి ఆనందిస్తున్నాడన్న మాట.

    ఎవరో రచయిత చెప్పినట్టు చాలామంది ప్రేమలో ఉన్నాము అన్న అనుభూతిని అస్వాదిస్తూ ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాము అనే భ్రమలో ఉంటారట. మనకు ఇష్టమైనది రాయడం అయితే లేదా మనవైనా భావాలను ప్రకటించడం అయితే మన సంతోషం కోసం మన జీవితకాలమూ ఆ పని చేస్తూ అనందించడం మంచిది అని నేను భావిస్తున్నాను.

    ఇంద్రాణి.

  790. జాతర గురించి N.Venkateswararao గారి అభిప్రాయం:

    05/10/2013 4:04 am

    మీ కవిత అరణ్య కాండలా ఉంది

  791. లెక్కల పాఠం గురించి తః తః గారి అభిప్రాయం:

    05/09/2013 12:35 am

    వెంకటేశ్వర రావు గారూ

    మీ ప్రశ్నకు సమాధానం ఎవరైనా చెపుతారేమో కాస్త వేచి చూద్దాం. [like in a typical Math class.] Math pedagogy లొ ఉన్న కొన్ని క్లిష్టమైన అంశాల ఆధారం గా ఒక ‘ MATRIX’ లాంటి కవిత ప్రయత్నించానని మాత్రమే నేనిప్పటికి చెప్పగలను.

    ధన్య వాదాలతో
    తః తః

  792. మల్లే పూల్ మల్లే పూల్ గురించి N.VENKATESWARARAO గారి అభిప్రాయం:

    05/08/2013 10:52 pm

    ఇంద్రాణి గారు ఇంకా కొనసాగించ వలసింది బాగుణ్ణు చెవి కమ్మలూ, ముక్కు పుడకలూ వర్షిస్తున్నట్టు? బాగుంది మీ కవిత

  793. ఈమాట మే 2013 సంచికకు స్వాగతం! గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    05/06/2013 4:13 pm

    “నాకు లైలాగారంటే ఎంతో ఇష్టము. వారి రచ్చబండ కవితలను కొన్నిటిని దాచుకొని అప్పుడప్పుడూ చదువుకొంటాను. వారికి ఎందుకు మా వ్యాసముపైన ఇలా కోపము వచ్చిందో తెలియడము లేదు.
    – మోహన ”

    ఇది నా నివాళి యా? -:) నా కొన్ని కవితలనే దాచుకుని చదువుతుంటే మిగతావి బాగాలేవని నాకు కోపం రావాల్నా? బాధ కలగాల్నా?

    Why can’t I dislike one essay? 🙂

    My letter had more in it, and the editors chose to edit it out. By editing it, it acquired a skewed meaning. It no longer expresses what I said. The editors might have thought it would offend more people, if they publish it all. Then they might as well have not published it, all together. They would have been more right.

    If my letter is published as it is, I might be able to answer, ask questions, discuss related topics. Even if they don’t publish all of it, it is O.K. I have no big problems, if I am misunderstood, disliked or not mourned. 🙂

    “[One does not have to attend a funereal if the deceased has no meaning to them. But to insult a mourner is entirely different thing – Ed.] ”

    This comment/నీతి? shows, the editors have taken ‘a side.’ An editor of a magazine can not take ‘a side,’ when multiple readers are expressing their views and opinions. Particularly after editing an opinion.:-)

    Currently watching a very large green chameleon hanging upside down on my window pane. Fascination seems to be mutual, our eyes are locked, tensions are mounting,

    Thanks
    lyla.

  794. ఈమాట మే 2013 సంచికకు స్వాగతం! గురించి మోహన గారి అభిప్రాయం:

    05/06/2013 10:30 am

    నాకు లైలాగారంటే ఎంతో ఇష్టము. వారి రచ్చబండ కవితలను కొన్నిటిని దాచుకొని అప్పుడప్పుడూ చదువుకొంటాను. వారికి ఎందుకు మా వ్యాసముపైన ఇలా కోపము వచ్చిందో తెలియడము లేదు. ప్రస్తుత సంచికలో ఎనిమిది వ్యాసాలలో నాలుగు వ్యాసములు పిబిఎస్ పైన వ్రాయబడినవి. అలాగే ఒకటి రెండు కవితలు కూడ. ముఖపత్రములో ముఖ్యపత్రము కూడ పిబిఎస్ పైననే. సంపాదకులు ఇది నివాళి అని చెప్పి ఉండకపోవచ్చును. అంత మాత్రాన ఒక గొప్ప గాయకుడు, కవి, అంతకంటె ఒక గొప్ప మనిషి చనిపోయిన తరువాత శ్రద్ధాంజలులు అర్పించడము సబబు కాదా? అందుకు కృషి చేయడము తప్పా? సుమారు ఒక వారము రోజులలో వందలాది పాటలను విని అందులో మాకు తోచిన అసంఖ్యాకమైన పాటలను పాఠకులకు, శ్రోతలకు అందించడము భావ్యము కాదా? I am indeed proud of this quilt (termed అతుకుల బొంత) stitched in a prompt manner by all the three of us, of course ably assisted by the editors. గతములో జీవంతులైన వారిపైన కూడ ఈమాట ప్రత్యేక సంచికలను విడుదల చేసినది. అప్పుడు కూడ కొన్ని బాణాల గురినుండి తప్పించుకోలేదు. ఈమాటను ఒక గొప్ప పత్రికగా చేయడములో లైలాగారి వంటి మంచి రచయితలకు కూడ ఒక భాగము, హక్కు ఉన్నది. Funeral services గురించి మాత్రమే కాదు, ఆలయములలో జరిగే wedding services పైన కూడ లైలా గారు వ్రాస్తే నేను చదివి ఆనందిస్తాను. నేను నా అభిప్రాయమును వెలిబుచ్చడానికి కారణము – ఇక్కడున్న పిబిఎస్ గారు వ్రాసిన వ్యాసాలతో బాటు ఇంతకుముందు వారు వ్రాసిన వ్యాసమును కూడ పాఠకులు చదువవచ్చును గదా అనే సదాశయము తప్ప మరేమి లేదు, నమ్మండి. లైలాగారికి నమస్సులతో విధేయుడు – మోహన

  795. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు గారి అభిప్రాయం:

    05/03/2013 3:39 am

    మధుర గాయనులు కీ.శే. శ్రీ పి.బి. శ్రీనివాసు గురించి నాలాటి అజ్ఞానులకు తెలియని మరో పార్శ్వాన్ని హృదయంగమంగా ఆవిష్కరించారు. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి, గాయత్రీ వృత్త స్రష్ట శ్రీనివాసగాయత్రీసాయుజ్యం పొందడం అమరాధిపతి సభలో తన అమరగానాన్ని, కవితా వైదుష్యాన్నీ వినిపించి సకల దేవతలనూ, యక్ష గంధర్వాదులనూ పరవసింప జేయటానికే. వారు గానం చేసిన శ్రీలక్ష్మీ స్తవం, శారదా భుజంగ స్తోత్రం, సాక్షాత్తు ఆ దేవతా మూర్తులను మన ముందు నిలబెడతాయి. వారికి ఆ పరమేశ్వరుడు సద్గతుల నీయాలని అంజలి ఘటిస్తూ:

    అమర గానమ్ము వినిపింప నమర సభను
    దివికి జనినావె ధీయుతా! భువిని వీడి
    నీ మధుర గాన సుధలను నీమమునను
    ద్రావుదుము శ్రీనివాస!ధీ! ప్రణుతులివియె.

    దు. వేం. న. సుబ్బారావు.

  796. జాతర గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:

    05/02/2013 10:04 am

    సాయి పద్మ గారు

    బాగుంది కవిత, ఇందులో మీరు ఉపయోగించిన అభివ్యక్తి నాకు నచ్చింది.

    అభినందనలు

  797. జాతర గురించి Vanaja Tatineni గారి అభిప్రాయం:

    05/02/2013 12:15 am

    జీవితం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో మనసు ఎలా చిక్కబట్టుకోవాలో తెలియజేసే కవిత ఇది. ఆశించిన ఆశాభంగం తప్పదని తెలిసి మసలుకునే జీవనం గూర్చి గొప్పగా చెప్పారు.

    చాలా బాగా నచ్చింది.

  798. పుష్పవివేకము గురించి దేశికాచారి గారి అభిప్రాయం:

    05/01/2013 9:43 pm

    మూలమే లోపభూయిష్ఠముగా నున్నచో బహుశః అది ముద్రణకారుని దోసమై యుండవలెను. అది ఎట్లున్నను, నాకు దోచిన సంస్కరణము లీక్రింద పేర్కొనుచున్నాను.
    పద్యం పంక్తి ఉన్నది ఉండవలసినది
    1 3 ప్రోదను ప్రోడను
    1 4 గుమరైన గొమరైన లేక గుదురైన
    (కుదురైన అనే పదం కొమరైన అనే దానికంటె అర్థవంతంగా ఉంటుంది)
    2 3 ఆర్ద్రభావాత్త స్కృత పథానువర్తి
    ఇందులో స్కృతపథానువర్తి అనునది అర్థరహితంగాను, గణభంగయుతంగాను ఉన్నది. దీనిని పూతపథానువర్తి అని సవరిస్తే బాగుంటుదనిపించింది. కాని ఇట్టి భావం కవిగా రుద్దేశిందో కాదో మరి!
    3 1 చయాసుషక్త చయానుషక్త
    4 1 మెత్తఁగ్రవ్వి మెత్తగఁ ద్రవ్వి
    5 3 క్రియకో క్రియకొ (క్రియకో అంటే గణభంగం)
    6 3 కొండలనో కొండలనొ (కొండలనో అంటే గణభంగం)
    7 2 మెత్తకున్న మొత్తకున్న
    7 2 గౌరవంబు నూ గౌరవంబు సూ (సూచి అంటే సూది)
    9 4 ముద్ధుల్ బుద్ధుల్
    10 4 జెడలేల జెడనేల
    11 4 దలందురో దలంతురో
    12 2 ముందపడుటే ముదంపడుటే
    13 2 నిక్కును నిక్కుచు
    (స్థూలంగా నా వైయక్తికాభిప్రాయం. ఇది నీరసమైన కవిత్వం.దీనిని పుష్పవిలాపంతో పోల్చడం తగదు.)

    [అడిగిన వెంటనే తప్పులు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. – సం.]

  799. పుష్పవివేకము గురించి దేశికాచారి గారి అభిప్రాయం:

    05/01/2013 7:13 pm

    అవధానిగారి పద్యాలను ఈ పత్రికకై ఎత్తి వ్రాయడంలో అనేక లేఖకప్రమాదములు దొర్లినవి. ఇది సక్రమమైన భాషా,ఛందోజ్ఞానము లేని లేఖకుడు వ్రాసినట్లుగా గోచరించుచున్నది. ఈ దోషములు అందమైన ముద్దరాలి ముఖముపై మొటిమలవలె కవితాసౌందర్యమును కించపరచుచున్నవి.

    [మూలము నందు ఎట్లు యున్నదో అట్లనే ఎత్తి వ్రాసితిమి. తప్పులేవియో చూపినచో సరిదిద్దుకుందుము – సం.]

  800. మల్లే పూల్ మల్లే పూల్ గురించి Sandhya గారి అభిప్రాయం:

    05/01/2013 3:59 pm

    మల్లె పూలు చాలా బాగున్నాయి. వేసవి ఎండలలో చల్లని మంచులా ఉంది మీ మల్లె పూల కవిత.

  801. అమ్మ గురించి vijayamadhavi from guntur గారి అభిప్రాయం:

    04/21/2013 2:43 pm

    మంజు గారు
    మీ కవిత నా మనస్సు ను కదిలించింది కరిగించింది
    ఈ జగతి లో అమ్మకు సాటి ఏదీ లేదనిపించింది

  802. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి Dr.Jagan Mohan Reddy గారి అభిప్రాయం:

    04/13/2013 3:08 am

    జాన్ గారు మీ కవిత చాలా బావుంది. ధన్యవాదములు.

  803. దోసిట్లో నక్షత్రాలు గురించి sastry గారి అభిప్రాయం:

    04/11/2013 8:19 pm

    ఇవి కవితలా? మూలా గారి సుభాషితాలా?

    అన్నీ ఏవో ప్రవచనాలలాగా ఉన్నాయి.

  804. ఇటుకలూ అటుకులూ గురించి krk reddy గారి అభిప్రాయం:

    04/11/2013 5:06 pm

    కవితకు ప్రేరణ ఎక్కణ్ణుంచి కంటే కూడ ఎంత చక్కగా చెప్పామన్నది ముఖ్యమని నా అభిప్రాయం. ఇందులొ 100 శాతం సఫలీకృతులయ్యారని నేను భావిస్తున్నాను.

  805. దోసిట్లో నక్షత్రాలు గురించి Seetha kumari గారి అభిప్రాయం:

    04/11/2013 5:21 am

    ఎక్కడికో వెళ్ళిపోయా సుబ్బు… మీ కవితలతో ఎక్కడికో తీసికెళ్ళారు మమ్మల్ని …2, 4, 10, 16, 17 సూపరండి…

  806. గాలి మళ్ళింది గురించి Mangu Siiva Ram Prasad గారి అభిప్రాయం:

    04/03/2013 6:56 am

    వృద్ధాప్యం కొందరికి ఒక వరం, కాని చాలామందికి అది ఒక శాపం. ఒంటరితనం పురుగులా తొలుస్తుంటే మాట్లాడడానికి ధైర్యం చెప్పడానికి తోడు ఒకరుండాలనే భావనని చక్కగా ఈ కవితలో చెప్పారు.

  807. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:

    03/31/2013 8:14 am

    Janaki Padhuka గారు – ధన్యవాదములు

    భాస్ బాపట్ల గారు – ధన్యవాదములు

    అఫ్సర్ గారు – మీ అభిప్రాయం కొంచెం ఆలోచింపచేసింది. అందుకే స్పందనలో ఆలస్యం.

    ఎన్ని సార్లు చదివి నన్ను నేను తర్కించుకున్నా మీరన్నదానిలో — “వాటిల్లో కవిత్వం ఎంత అన్నది తేల్చుకోలేకపోతున్నా. వాక్యాల పదును వేరు, కవిత్వ పదును వేరు అనిపిస్తుంది వాటిని చదివినప్పుడు!” — వాటి మధ్య తేడాను గమనించలేకపోయాను.

    ఇలాంటి ప్రతీకల్తో అరుదుగా రాశాను. ఇలాంటివి రాస్తున్నపుడు ఒక ఉద్వేగం, ఒక ప్రవాహం నన్ను తొందరచేస్తూ వుంటుంది. అదే రాతల్ని పాఠకుడిగా చదువుతున్నప్పుడు వ్యక్తిగా నాకూ సందేహాలు వస్తుంటాయి. మీ సూచనను ముందుముందు దృష్టిలో వుంచుకుంటాను.

    ధన్యవాదములు

  808. దోసిట్లో నక్షత్రాలు గురించి Mangu Siiva Ram Prasad గారి అభిప్రాయం:

    03/30/2013 7:02 am

    సుబ్రహమణ్యం గారు కవిత చాలా బాగుంది. భావజాలానికి అద్దం పట్టే పదచిత్రాలను చక్కగా ప్రయోగించారు. మంచి కవిత చదివిన ఆనుభూతి కలిగీంది.

  809. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    03/24/2013 1:10 pm

    సుమతిశతక కర్త కాలాన్ని గురించి మోహనరావు గారి ఆలోచన ఆలోచించదగింది. ఐతే, ఆయన వాడిన తర్కం వల్ల అతను నన్నయ, నన్నెచోడుడుల తర్వాతి వాడని చెప్పొచ్చు కాని తిక్కనకి తర్వాతివాడు కాడని చెప్పటం సాధ్యం కాదు కదా! అతను తిక్కన లాటి ప్రయోగాలు చేసినంతమాత్రాన తిక్కనకి సమకాలికుడు కాడు, తిక్కన తర్వాతి వాళ్లు ఇంకెవరూ అలాటి ప్రాసలు పాటించలేదని రుజువు చేస్తే తప్ప. కవిత్రయం ప్రయోగాల్ని ప్రమాణాలుగా తీసుకుని తర్వాతి వాళ్లు చాలామంది వాళ్లు ముగ్గురు చేసిన ప్రాసలన్నిట్నీ అనుసరించారని నేను విన్నది. అది నిజమైతే సుమతిశతకం తిక్కన గారి తర్వాత వచ్చిందని తప్ప ఎప్పుడు వచ్చిందో ఈ ప్రాసల బట్టి చెప్పలేం.

  810. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    03/17/2013 1:14 pm

    మూలం చదివాక ఇంతకు ముందు నేను వెలిబుచ్చిన తక్కువ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. నిజానికి దీని వాసి మిగిలిన రచనలకి ఏమాత్రం తీసిపోదు. “తెలుగులో కవితావిప్లవాల” నుంచీ నారా లిఖిత – మౌఖిక పరంపరల్లో ప్రచారమైన రచనల గురించి మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తటం, అనిదంపూర్వమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదించటం చేస్తూనే వున్నారు – ఉదాహరణకి చాటువులు, కాటమరాజు కథ, రామాయణాలు, ఇలా ఎన్నో. సుమతిశతకం విషయంలో ఒక ప్రత్యేకమైన సందర్భమూ, మౌఖిక – లిఖిత మార్గాల కలయికా వల్ల దొరుకుతున్న సమాచారం తనింతకు ముందు చేసిన సిద్ధాంతాలకి ఎలా బలం చేకూరుస్తుందో ఈ వ్యాసంలో చూపారని నా భావన.

    ఒక రచన మౌఖికంగా లేదా లిఖిత మార్గాన మొదలౌతుంది. లిఖిత రచనలకి కర్తృత్వ విషయంలో సందేహాలు కలగటానికి అవకాశాలు తక్కువ. మౌఖిక రచనలకి కర్తృత్వం అనే భావనే పాశ్చాత్యభావాలకి లొంగదు. మౌఖికంగా మొదలైన రచన కొంతకాలానికి లిఖిత రూపం పొందొచ్చు. అలాగే లిఖితంగా మొదలైన రచన (పూర్తిగా కాకపోయినా కొంత భాగమైనా) మౌఖికంగా మారటం కూడ జరిగింది (లిఖిత రచనల్లోని పద్యాలు చాటు ప్రపంచంలోకి రావటం ఒక ఉదాహరణ). సుమతిశతకం విషయంలో ముందుగా ముద్రితమైన రెండు రకాల ప్రతులు, ఒకటి మౌఖిక మార్గం నుంచి, మరొకటి లిఖిత మార్గం నుంచి వచ్చాయని నారా ఈ వ్యాసంలో నిరూపించారు.

    మౌఖిక మార్గం రచనల కర్తృత్వం ఆ రచన ప్రయోజనాన్ని బట్టి, ఆ రచనని తమ సొంతంగా స్వీకరించిన కులాల బట్టి మారుతూ వుంటుందని నారా ఇదివరకే ప్రతిపాదించారు. అది సుమతిశతకం విషయంలో ఎలా నిజమో మరోసారి చూపించారిక్కడ. రామాయణం ఇతిహాసంగా వున్నప్పుడు దాని కర్తగా ఒక ఋషి కావలసొస్తే, అది భక్తి రచన అయాక దాని కర్త దైవప్రేరితుడైన వ్యక్తిగా ఎలా మారాడో, భారత భాగవతాలకి, పురాణాలకి కర్త వ్యాసుడెందుకు అయాడో, ఆ తర్వాత వచ్చిన భక్తి రచనల కర్తలు చాలామంది చుట్టూ అల్లిన కథల్లో నారదాదులు, దేవుళ్లు ఎందుకు కనిపిస్తారో ఈ సిద్ధాంతం స్పష్టంగా వివరిస్తుంది. మౌఖిక సుమతిశతకానికి భీమన, లిఖిత సుమతిశతకానికి బద్దెన, ఎందుకు కర్తలుగా అంగీకరించబడ్డారో ఈ సిద్ధాంతం నిరూపిస్తుంది.

    చివరగా ఒక్కమాట. సినిమా పాటలు ప్రస్తుత కాలంలో మౌఖిక మార్గంలో ప్రచారమయే రచనలకి మంచి ఉదాహరణ. ఒక పాట వినటం తోనే దాని కర్త ఎవరో ఎలా తెలుస్తుంది? ఎందుకు ఒకరు రాసిన పాటని మరొకరెవరో రాశారని అనుకోవటం జరుగుతుంది ? ఆలోచించండి. మౌఖిక రచనల గురించిన నారా సిద్ధాంతాలు వీటికీ వర్తిస్తాయి, పాతకాలపు రచనలకే కాదు.

  811. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి jayaprabha గారి అభిప్రాయం:

    03/16/2013 12:39 am

    ఈ వ్యాసం లోని సారాశం మరికొంచెం పొడిగించి చూస్తే … [తప్పని సరిగా ఛూడాల్సి ఉంటుంది. ఇది ఒక సిధ్ధాంత వ్యాసం, సాహిత్య విమర్శా గనుకాను కవిని గురించిన చర్చ అతడి కర్తృత్వాన్ని గురించిన మీమాంశ కూడా గనకాను!!] అప్పుడేమౌతుందంటే, రాబోయే మరి కొన్ని పదుల లేదా వందల ఏళ్ళ తరవాత పేరున్న ఒక పుస్తకానికి వారే అసలు రచయిత అని అంటేనో/లేదా అలా ఎవరన్నా అనుకుంటేనో అది నిజమే కానఖ్ఖర లేదని ఒక తప్పనిసరి ఆలోచన/ప్రతిపాదన వస్తోంది. ఈ వ్యాసంలో మాదిరే ఒక బద్దెన/ఒక భీమన పాత్రలోకి రేపు మరొక అసలు కవి నాలాంటి వారే ఎవరైనా ఒకరు కేవలం ఒక కల్పిత వ్యక్తిగా మారే/లేదా మార్చే వీలుందని సుమతీ శతకం మీద రాయబడిన ఈ భాష్యం ప్రకారం అర్ధం అవుతోంది. [నేను ఇంగ్లీషు వ్యాసాన్ని చదివే దీన్ని రాస్తున్నాను].

    ఈ వ్యాసం లోని వాదనని అనుసరించి అసలు ఏ కవీ వారి కవిత్వానికి కర్తలు కాగలరా భవిష్యత్తులో? అని సందేహం రాక మానదు. అసలు బద్దెన/భీమన ఏమి, మన నన్నయ్య భట్టు మాత్రం మహాభారత ఆంధ్రీకరణ చేశాడని ఏమిటీ నమ్మకం? అదొక “విశ్వాసం” మాత్రమే కావాలి. ఎందుకంటే అతడి తరువాత కవులు “ఆదికవి” గా ఆయనని స్తుతిచేశారు గనకా?? అంతకు మించి ఆయనని గురించిన వివరాలు మన ముందు ఏమున్నాయీ?? తిక్కన మాత్రం ఎందుకని కల్పితం కాకూడదో?? మనుమ సిధ్ధి ఏమన్నా ఆయనని గురించి శాసనం చెక్కించాడా? లేదే? ఆ పాతవాళ్ళ ఫోటోలా లేవు. వేల తరాలు గడిచిపోయేయి గనక వారికి కుటుంబ వారసులా లేరు. ఇంక మిగిలిన ఆధారాలేమిటీ?? అది అటుంచితే మరి ఇవాళ రాస్తున్న ఈ కవుల సంగతి మాత్రం ఏమిటో?? ఏమిటీ రుజువూ?? అందుకోసం ఈ పుస్తకం నాదేనని “విల్లు” ఏమన్నా రాసి పెట్టుకోవాలా?? ఫొటొ తాలూకు కాలపరిమితి మాత్రం ఏమాత్రం?? కుటుంబపు కాలపరిమితి మాత్రం ఏమాత్రం?? అసలు నేను నేనే అన్న రుజువేదీ??

    ఒక కౌటిల్యుడిని ఒక భరతుడినీ కాళిదాసునీ ఎటూ “కల్పితం” చేసేశాం. ఆ విధానం ప్రకారం రేపు ఈ జయప్రభ మాత్రం ఎందుకని కల్పితం కారాదో ఈ వ్యాస కర్త వివరించవలసి ఉంటుంది మరి. ఆయన వాదానికి గనక ఆయన బధ్ధుడైతే!

    దాతలెవరన్నా విరాళాలిస్తే నాపేర నేనొక శిలాశాసనాన్ని వేయించుకోవాలి 🙂 దాన్ని తప్పని సరిగా నకళ్ళు తీయించి అన్ని అమెరికన్ యూనివెర్సిటీల్లోనీ నాటించుకోవాలి కూడాను. ఎందుకంటే భవిష్యత్తు లోని అపూర్వ పరిశోధనలకి ఉనికిపట్టులు అవే గనక!!

    ఇట్లు,

    కల్పితంకానిచ్చగించని వర్తమాన బద్దెనని అయిన నేను.
    జయప్రభని.

  812. దోసిట్లో నక్షత్రాలు గురించి iqbal chand గారి అభిప్రాయం:

    03/14/2013 9:52 am

    ఖలీల్ జిబ్రాన్ కవిత్వం చదివినంత పవిత్రంగా వుంది. నిజానికి సుబ్బు తెలుగు కవిత్వం పరిధి దాటి తెలుగు కవిత్వం స్థాయి పెంచాడు.

    సూపర్ సుబ్బూ!

  813. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి అఫ్సర్ గారి అభిప్రాయం:

    03/11/2013 7:59 pm

    కవితలోని చివరి పాదం నాకు నచ్చింది, జాన్ గారు!
    “పాదం మోపినప్పుడు
    తడిసే కాలు అబద్దం కాదు కదా! ”

    ఆ ముందటి పాదాల్లో మీరు వాడుకున్న కొత్త సందర్భాలు బాగున్నాయి కానీ, వాటిల్లో కవిత్వం ఎంత అన్నది తేల్చుకోలేకపోతున్నా. వాక్యాల పదును వేరు, కవిత్వ పదును వేరు అనిపిస్తుంది వాటిని చదివినప్పుడు!

  814. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి renuka ayola గారి అభిప్రాయం:

    03/10/2013 1:23 pm

    అబద్దాల వంతెనపై నడుస్తూ
    లాలించడానికో వెన్నెల మొక్కను
    కిటికీకి తగిలించాలనుకుంటాం!

    తప్పదు కొన్ని సార్లు అబద్దాల వెన్నెల చూపించాలి.

    చాలా బాగుంది జాన్ గారు మీకవిత.

  815. దోసిట్లో నక్షత్రాలు గురించి D.Venkateswara Rao గారి అభిప్రాయం:

    03/09/2013 12:10 pm

    మూలా సుబ్రహ్మణ్యం గారు! ధన్యవాదాలు. సృష్టి రహస్యాన్ని 20 సూత్రాలతొ చాలా చక్కగా వర్ణించారు. కవి భావనను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్ధం చేసుకుంటారు. పొడుపుకథల మాదిరిగా ఉండే ఈ కవిత షేక్స్‌పియర్ జీవితాన్ని వర్ణించినట్లుంది.

    1. సూర్యుడు
    2. మేఘం
    3. ప్రేమ
    4. సముద్రం
    5. ఆకాశం
    6. వర్షం
    7.వాయువు
    8. భూమి
    9. పడవ
    10. నది
    11. జీవితం
    12. వృద్ధాప్యం
    13. బాధ
    14. ప్రాణం
    15. పెళ్ళి
    16. ఆలోచన
    17. కలయిక
    18. ఆశ
    19. ఒంటరితనం
    20. మరణం

    దదాల వెంకటెశ్వరరావు

  816. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి అపూర్వ గారి అభిప్రాయం:

    03/08/2013 10:22 pm

    ప్రతీకలను వాడుతూ వ్రాసిన ఈ కవితలో చాలాచోట్ల గ్యాప్ / ఖాళీలు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. వాటిని నింపుకోవడం కొంచెం (ఆలోచన) శ్రమించాల్సిందేనేమో? బహుశ పాఠకులకి వదిలేసారా? లేక చదువరులకు వదిలేసారా అని సందేహం!

    ఆకలి పేగుకు
    అబద్దాల బిర్యానీ రుచించదు
    సాకుల పరదాను చించి
    గొంతు చించుకొని అరుస్తుంది

    ఈ పాదాలు నన్ను అయోమయంలో పడేసాయి. ఎందుకంటే ఆకలిగా వున్నవారు ఆబగా తినడానికే చొరవచూపుతారుకదా! ఇక్కడ “రుచించదు” అని విరుద్దమైన పదాన్ని ఎందుకు వాడారా అని?

    జాన్ గారి నేపద్యంలో బైబిలు ప్రతీకలు కనిపిస్తుంటాయి. ఇక్కడ కొన్ని ప్రతీకలు, కొంత రాజకీయాలు, కొంత వ్యక్తిగతం కనిపిస్తున్నాయనిపిస్తుంది. జాన్ గారో మరెవరైనానో వివరిస్తే బాగుంటుంది తెలుసుకోవడానికి.

  817. దోసిట్లో నక్షత్రాలు గురించి Phanindra గారి అభిప్రాయం:

    03/08/2013 4:38 pm

    సుబ్బు గారూ,

    చాలా రోజులయ్యింది మీ కవితలు చదివి. ఈ రోజు అనుకోకుండా చూశాను. సుతిమెత్తగా మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. అభినందనలు.

    ఫణీంద్ర

  818. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి నూతక్కి రాఘవేంద్ర రావు గారి అభిప్రాయం:

    03/08/2013 5:21 am

    మార్చి 2013 సంచికలొ శ్రీ జాన్ హైడ్ కనుమూరి గారి కవిత “క్షణికమైన భయం మాటున ఒదిగి” చదివాను. గొప్ప సందేశాన్ని చూసాను. చక్కని కవితను ప్రచురించిన సంపాదకులకు ధన్యవాదాలు. “అబద్ధం నిబద్ధతతొ చెప్పేవాడికి సత్యం ఒక సాకుగా వినిపిస్తుంది. అబద్ధం ఒకోసారి అందంగానూ నిజం నిష్టూరంగాను వున్నా సత్యం సత్యమే ఎన్నటికి. కవిత భవ్యం. సమాజానికొ భావ్యతనందిస్తూ… ఎక్కడనుండి వూరతాయండీ మీకీ యోచనలు ?

    అభినందనలు డియర్ జాన్ హైడ్ కనుమూరి

    ..శ్రేయోభిలాషి …

  819. Cathedral – కథ నచ్చిన కారణం గురించి V R Veluri గారి అభిప్రాయం:

    03/07/2013 5:30 pm

    జయప్రభా!

    మాటకి మాట తెగులు; నీటికి నాచుతెగులు అని మీకు తెలుసు. నాకూ తెలుసు. వాక్యానికీ వాక్యానికీ మధ్యలో చూడటం మొదలుపెడితే రాసినవి కనిపించకపోవచ్చు; చెప్పనివి వినిపించవచ్చు. నేను కార్వర్ కథని గురించి చెపుతూ పాఠకులకి సూచించినది, కొన్ని కథలు (నవలలు, కవితలు, నాటకాలూ కూడా!), చట్రం లోనుంచి బయటికొచ్చి చదవవలసిన అవసరం ఉన్నదని, దానికి ఓర్పు, అభ్యాసం కావాలని. ఈ సూచన డయాస్పోరా రచయితలను చదవడానికి వర్తిస్తుందని అన్నాను. తెలుగు “రచయిత”లకి నేనే సూచనలూ చేయలేదు. తెలుగు దేశంలో ప్రపంచ సాహిత్యం చదువుకున్న వాళ్ళు లేరని నేను అనలేదు. సరే! నీతిబోధలు చెయ్యనూ లేదు. ఇకపోతే, నా ‘ధోరణి’ గురించీ, ఈమాట ‘ధోరణి’ గురించీ మీరు రాసిన విషయాలు మీ వ్యక్తిగత అబిప్రాయాలు. Amen!

    హోసే సారమాగో (Jose Saramago) Blindness నవల గురించి మీకు తెలిసే వుంటుంది. ఆ నవల చట్రంలోచి బయటికొచ్చి చదవాల్సిన నవల అని మీకు గుర్తు చేస్తున్నాను. నిజం చెప్పాలంటే, సారమాగో నవలలన్నీ అటువంటివే! అలాగే, అర్జున ‘కథ’ని చదివి ఆనందించడానికి కూడా చట్రం లోనుంచి బయటపడవలసిన అవసరం ఉన్నది కదూ!

    విధేయుడు — వేలూరి వేంకటేశ్వర రావు

  820. కొత్త మలుపు గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/07/2013 4:35 pm

    సంవత్సరం పైగా ప్రేమించినవాడికి ఇంట్లో ముందుగా చెప్పాలన్న సంస్కారం ఉండదు.

    నిజమే! చాలా మంది పిల్లలు తమ ప్రేమ విషయాలు ఇంట్లో తొందరగా చెప్పరు. చాలా కారణాలు వుంటాయి.

    1. తమ ప్రేమ స్థిరమైనదా, కాదా అన్న సంగతి వారికే ఇంకా పూర్తిగా తెలియక పోవడం.
    2. ఇంట్లో వాళ్ళతో ఏదో ప్రేమా, గట్రా వున్నా, వారితో సరైన స్నేహం లేక పోవడం.
    3. పిల్లలు తమ ప్రేమ విషయం పూర్తిగా తమ స్వంత విషయం అనుకోవడం.

    ఇలా, చాలా కారణాలున్నాయి. ఎక్కువ కేసుల్లోని విషయాన్ని చూస్తే, ఆ పిల్లలకి ఇంట్లో వాళ్ళతో సరైన స్నేహం లేకపోవడం అసలు కారణం. ఇది పిల్లలు సరిగా లేక పోవడం వల్లా కావొచ్చు, పెద్ద వాళ్ళు సరిగా లేక పోవడం వల్లా కావొచ్చు. ముఖ్యంగా తల్లీదండ్రుల మధ్య సయోధ్య లేని కుటుంబాల్లో స్నేహం వుండదు. పిల్లలు ఎప్పటికో గానీ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పరు. సంస్కారం లేక పోవడం అసలు కారణం కాదు.

    ఈ కధలో కొడుకు చాలా సంస్కారవంతంగా ప్రవర్తించాడు నిజానికి. తల్లి విషయం లోనూ, ఇష్ట పడ్డ యువతి విషయం లోనూ, ఆ అమ్మాయి తల్లిదండ్రుల విషయం లోనూ, చాలా సంస్కారవంతంగా ప్రవర్తించాడు. చెడ్డ తండ్రి సరిగా ప్రవర్తించనప్పుడు కూడా చాలా కాలం సహనం చూపాడు. ఆ చెత్త తండ్రి లేక పోయినా, ఆ కొడుకు తన ప్రేమ విషయం ఇంట్లో తల్లికి అంత తొందరగా చెప్పి వుండే వాడు కాదు. కారణం, తల్లి మీద ఎంతో ప్రేమ వున్నా, ఆవిడతో స్నేహం లేక పోవడమే. “అమ్మా, ఫలానా అమ్మాయి అంటే నా కిష్టం” అని కొడుకు, తన మనసులో ప్రేమ మొగ్గ తొడిగినప్పుడే చెప్పాలంటే, తల్లి మీద వుండే ప్రేమ చాలదు. మంచి స్నేహం కూడా కావాలి.

    ఎంత సేపటికీ తిరుగుబాటే సమాధానం అని అంగీకరిస్తే అన్ని ఇళ్ళూ ఈ విధంగా కూలిపోవటమే సమాధానం.

    తుమ్మితే, చీదితే వూడి పోయే ముక్కు వుంటే ఎంతా, వూడితే ఎంతా? ఈ విధంగా వున్న ఇళ్ళు, ఈ విధంగా కూలిపోవడమే చాలా మంచిది. అప్పుడైనా మంచి ఇళ్ళు రావడానికి అవకాశం వుంటుంది. నిజానికి, “ఎంత సేపటికీ చెత్త పరిస్థితులకి తిరుగుబాటే సమాధానం” అన్నది చాలా కరెక్టు. చెత్త మనుషులు ఎప్పటికీ మారరు. “ఊహ” కోసమనీ, “గొప్ప పాజిటివ్‌నెస్‌ ” కోసమనీ, ఏదో “మంచి నిర్మాణాత్మకత” కోసమనీ, లొంగుబాటుని నేర్పితే, సమాజం ఈ నాటికి ఈ స్థితికి వచ్చి వుండేది కాదు. సమాజంలో ప్రతీ మంచి మార్పూ తిరుగుబాటు వల్లే వచ్చిందని గ్రహించాలి, సమాజ చరిత్రని పరిశీలించి.

    ఒక సమస్య తర తరాలుగా వుంటూనే వున్నప్పుడు, ఆ సమస్య మీద కధలూ, వ్యాసాలూ, కవితలూ, వగైరా వస్తూనే వుండటం చాలా మంచి విషయం సమాజానికి. ఎప్పుడో ఒక సారి చెప్పేశాము కదా అని, పరిష్కార మవ్వని సమస్యలని కూడా వదిలెయ్యక్కర లేదు. అలా చెబుతూ, చెబుతూ, చెబుతూ వున్నప్పుడే, కొంత మంది బుర్రల్లోకి నెమ్మదిగా, నెమ్మదిగా, నెమ్మదిగా ఎక్కుతూ వుంటుంది. ఎప్పటికో వారు తిరగబడటం నేర్చుకుంటారు.

    సామరస్యంగా సమస్యలని పరిష్కరించడం అనేది మూడు గంటల సినిమా లోనే సాధ్యం, నిజ జీవితంలో కాదు. చెత్త మనుషుల్ని ఎవరూ బాగు చెయ్య లేదు. వారిని వదిలి పెట్టడమే తక్షణ కర్తవ్యం.

    ప్రసాద్

  821. అర్జున గురించి ravikiran గారి అభిప్రాయం:

    03/05/2013 3:38 pm

    జయప్రభ గారు,

    ఒక అద్భుతవైన ఎమోషనల్ స్టేటస్ కి తీసుకపోగలిగే శక్తి మీ రచనకి వుంది. అద్భుతంగా వ్రాశారు. అది కథా, కవితా? ఆ డిబేట్ అనవసరం, కానీ ప్రసాద్ గారి అభిప్రాయం నాకు చాలా బాగనిపించింది. మీ కథ (కవిత) చదువుతుంటే నేనెప్పుడో దాదాపు పాతికేళ్ళ క్రితం చదివిన ఒక నవలలో ఆ పది, ఇరవై పేజీలు మళ్ళా గుర్తుకి వస్తున్నాయి.

    హెర్మెన్ హెష్ వ్రాసిన “సిద్దార్ధ” ఆ నవల. బతుకులో అన్ని అనుభవాల్ని(?) చూసిన తర్వాత సిద్ధార్ధ ఒక పడవ నడిపే వాడిగా ఒక నది వడ్డున సెటిల్ అయిపోతాడు. ఆ నది తన హితిడు, స్నేహితుడు, గురువు. నదికి ప్రవహించడం తప్ప మాట్లాడటం తెలీదు కదా. ఇవి సిద్దార్ధుడి ఆలోచనలే, అవి తన అవగాహనే, అంటే అది హెర్మన్ హెష్ అలోచన, అవగాహనే. “చాలా సార్లు రచయిత కల్పనావరణాన్ని అతిక్రమిస్తాయి పాత్రలు. అన్నిసార్లూ రచయిత స్వతంత్రుడని / రాలు .. అని మాత్రం అనుకోబోకండి. అలా అంతా రచయిత స్చాధీనం లోంచే తయారయ్యే రచన ఉంటుందని చెప్పలేం కనీశం నావరకూ నేను అలా చెప్పలేను.” కాదండీ పాత్రలు ఎప్పుడూ రచయిత(త్రి) స్వాధీనం లోనే వుంటాయి, ఎందుకంటే అవి రచయిత(ఈ “త్రి “నేను వ్రాయలేను, నన్ను మన్నించండి) మనసులోనుంచే వస్తాయి. ముఖ్యంగా ఇలాటి మ్యూజింగ్స్ తరహా రచనలు. సిద్ధార్దుడి ఆ నది హెర్మెన్ హెష్, ఈ అర్జున జయప్రభ గారే.

    ఆ పది, ఇరవై పేజీల్లో హెర్మెన్ హెష్ ఒక గొప్ప ఫిలాసఫీని ఆవిష్కరిస్తాడు, మీ ఈ కథలో లాగే (But in his novel there is no demarcation and discrimination that is so obvious in your story as noted by Mr. Prasad). మీ కథ ఆ పది, ఇరవై పేజీలకి అనుకరణలాగా నాకనిపించింది. ఒకవేళ నేను తప్పయి వుండొచ్చు జయప్రభగారు, కానీ నేను చదివింది, నా మనసుకి అనిపించిన ఆ అనుభూతి నాకు తెలుసుకదా. బహుశా, ఒక్క భాష మాత్రవే కాకుండా, నాలుగు బతుకుల్ని కూడా చూసిన గొప్ప రచయితలకి కొంచం సిమిలర్ ఆలోచనలే వస్తాయేవో, ఏవో నాకు తెలీదు.

    ఏం పిల్డో ఎల్ఎల్దమొస్తవా కలకత్తా కొస కారు కొండకి
    ఏం పిల్డో ఎల్దమొస్తవా, సిలకలు కత్తులు దులపరిస్తయట

    ఆయనకి పులి మీద కోపం, కాకపోతే పొట్టేలు మీద ప్రేమ కాదండీ. బతుకుమీద ప్రేమ, అవగాహన. నిజవే మనకు కూడా బతుకు మీద ఆ ప్రేమ, అవగాహన వుంది. కానీ మన బతుకుకు, వంగపండు గారి బతుకు వేరే అండీ. అసలేవిటి, ఈ ఆకలి ఏవిటి తెలుసుకోవాలని నేను ఒక మూడు రోజులు నిజంగానే ఒక్క మంచి నీళ్ళు తప్ప అసల ఏవీ తినటం మానేసేను, కానీ మూడో రోజు నాకు అర్థవయ్యింది. సరే ఇప్పుడు నేను కావాలనుకుంటే నాకు కడుపునిండా నాకు కావాల్సిన భోజనం దొరుకుతుంది. ఆకలంటే, ఆకలంటే, నాకు కావాలనుకున్నప్పుడు అది దొరంకందే ఆకలి. వెంటనే మానేసేను నా నిరాహార ధీక్ష. నాకెప్పటికీ ఆ ఆకలనే నిజం తెలియదు, నిజంగా తెలియదు. ఇంతకు ముందు నాకు తెలీదు, ఇక ఇప్పుడు బహుశా నాకు తెలీదు (తెలిస్తే బాగుండు). మనందరికీ మంట కాలుతుందని తెలుసు, కానీ మనం ఎప్పుడూ, మనం ఎప్పుడూ ఆ మంట మీద చెయ్యి పెట్టి, చెయ్యి కాల్చుకున్నవాళ్ళం కాదు. మనవి కడుపు నిండిన బతుకులండీ. మనకేవి తెలుసు ఆ పావు, ఆ పులి, ఆ పిట్ట, ఆ చేప ఆకలి?

    వంగపండు గారు సరే ఆయన ఈ మధ్య రాజశేఖర్ రెడ్డి గారి మీద పాటలు వ్రాసుండొచ్చు. కానీ ఆ “ఏం పిల్డో” పాటలో ఆయన మీరు చెప్పని, మనకు తెలియని ఒక బతుకుని చెబుతున్నాడు. ఒక టోటల్ గా వేరైన ఒక ఫిలాసఫీని చెబుతున్నాడు. అది, మీరు, హెర్మన్ హెష్ గారు చెప్పిన కడుపునిండిన ఫిలాసొఫీ కాదు. అది నది, అర్జున చెట్టు కాదు, అది మనిషి, కడుపు నిండని ఆకలితో వున్న మనిషి. కలకత్తా కొస కారు కొండలో సిలకలు కత్తులు దులపరిస్తయట, అదొక ఆశ, బతుకు కోసం ఒక ఆశ, మెరుగైన బతుక్కోసం ఒక కంప్లీట్ గా టోటల్ గా మీరు చెప్పేదానికి ఒక డిఫెరెంట్ ఫిలోసఫీ. దానికి భాషకి సంబధం లేదు. అది ఆకలిలోనించి, అవమానం లో నించి, నాకొక మామూలు బతుకు కావాల, నా పెళ్ళాం రొమ్ముల్లో నా బిడ్డకి పాలే కాదు, మా ఇంటి చట్టిలో నా బిడ్డకి నాలుగు మెతుకులు కూడా కావాల అనే ఫిలాసఫీ.

    ఆకలి మీకు, నాకు, ఈ ఈమాట పాఠకులకి ఎలా తెలుస్తుందండీ, చెప్పండి పోనీ మీరే. మంచిది, మన కడుపు నిండిన మన హిపాక్రసీ లో మనం మనకున్న ఈ భాషా పాండిత్యాన్ని పండించుకుందాం. బాగుంది నా కడుపునిండిన నా మనసుకి మీ కథ, కవితా అద్భుతంగా నచ్చింది.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  822. Cathedral – కథ నచ్చిన కారణం గురించి jayaprabha గారి అభిప్రాయం:

    03/05/2013 2:56 pm

    వేలూరీ ! ఈమాటలో మరీ అతిగా నాకు కనిపిస్తున్న ఒక ధోరణి ఏమంటే తెలుగు దేశం లోని పాఠక సమూహాన్నీ రచయితల కవుల సమూహాన్నీ కూడా సాధారణీకరించి చేసే వ్యాఖ్యానాలు. మీరు చెప్పదలుచుకున్నవి మీరు చెప్పొచ్చు. విమర్శ చేయదలుచుకున్నప్పుడు స్పష్టంగా మాట్లాడటం హుందాగా ఉంటుంది. అంతే గాని కొందరు రచయితలు… అనడం వలన ఏ వివరమూ ఎవరికీ అర్ధం కాదు. మీ తపన డయాస్పోరా తెలుగు కధలు మిగిలిన తెలుగు సమాజం లోని పాఠకులకీ రచయితలకీ సరిగా అర్ధం కావడంలేదనీనీ.. తెలుగు వారు ‘కధ’లో అరిగిపోయిన విధానాలలోనే రచన చేస్తున్నారనీ నాకు మీరు ఈ కెథెడ్రెల్ కధ నచ్చిన కారణాన్ని గురించి మీ మాటలలో చేసిన వ్యాఖ్యానం ద్వారా తెలుస్తోంది. ఇలా మాట్లాడటమూ ఒక లాంటి ముతక పధ్ధతే!

    Dirty realism నించి magic realism దాకా ఆధునిక కధ ప్రపంచంలో ప్రయాణం చేసింది. విమర్శ పెట్టె ముందు నాలుగు రకాల కధల్నీ నాలుగు భిన్నమైన రచయితల్నీ ముందు పెట్టుకుని ఉదాహరిస్తూ చేయాల్సి ఉంటుంది. ఊరికే పొడి పొడి మాటల్లోంచి మీ మీ అసహనాలని వెళ్లగక్కినందువలన ఏమవుతుందీ? నాకు విమర్శలో గుంభనం అంటే పడదు సరి కదా అది పాత తరం వాళ్ల దెప్పుడు మాటల్లాగా వినిపిస్తుంది. డయస్పోరా ఈ గుణం నించి బయటపడే మార్గం ఉంటే చూడండి.

    చివరగా రేమండ్ కార్వర్ కధ మొత్తం చదివేను. కళ్ళున్నవాడు కళ్ళు లేని వాడిని గురించి అనుకున్న భావాలన్నీ ఎదురు తిరగటం కళ్ళు లేని వాడు కళ్ళున్న వాడికి ఊహని పరిచయం చేయడం. అమెరికన్ తరహా సెన్సాఫ్ హ్యూమర్ ఉంది కధకుడి మాటలో. ముగింపు మీద అనేక రకాలు గానూ అనుకోవచ్చు. ఇద్దరి మగవారి అహంకారాల పరీక్ష కూడాను. చూడగల్గిన వాడు చూడలేకపోవడమే కధ లోని ట్విస్ట్ అని అనుకుంటే అది ఇవాళ మరీ అంత అనూహ్యమైన మలుపేమీ కాదు 🙂

    కధని చదువుతాం. ఒక అభిప్రాయం తప్పక కలగాలని రూలేం ఉండదు. నా వరకు నాకు అమెరికన్ రచయితలకన్నా లాటిన్ అమెరికన్ రచయితలే కధనంలో ముందుంటారు అనిపిస్తుంది. దీనివలన తేలే దేమంటె మీరింకా ఆ ఎనభై దశకంలోనే నిలబడిపోయినట్టున్నారు. కొత్తకధల్లోని వరవడి మీ కార్వర్ ని దాటిందేమో తెలుసా మీకు? కధలోనే కాదు కవిత్వం లోనూ టోన్ డౌన్ చేసి మాట్లాడటం ఇంగ్లీషు వారి పధ్ధతి. అయినప్పటికీ అది అన్నివేళలా నిజం కాదు. బ్లాక్ పోయిట్రీ మళ్ళీ అంతే లౌడ్ గా ఉంటుంది. ఇవన్నీ వివరంగా మాట్లాడాలీ అంటే అందుకు ఒక కాలాన్ని ఎంచుకుని ఆయా సమాంతర రచనల సమాంతర సమాజపు జీవిత విధానాల మీద పరిశీలన చేసి చెప్పాలి ఒక స్పష్టత కోసం. అది చాలా అవసరం. ఆ పని మాత్రం జరగడం లెదు చాలినంతగా ! పొరుగింటి పుల్ల కూర రుచి అనడం మనకి కొత్తేం కాదు. తనకి నచ్చిన రచయితని గురించి మాట్లాడటం వేరు . ఆ సందర్భాన్ని వట్టి అసందర్భపు విమర్శకి ఉపయోగించుకోవడం వేరూను. తెలుగులో దేశం లో ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్న వారు చాలా మందే ఉంటారనీ మీరు మాట్లాడే పేరు లేని నీతి బోధలు చాలా మందికి నవ్వూ తెప్పిస్తాయనీ బహుశా మీకు తెలియదు. ఎప్పుడైనా మనకి నచ్చింది చెప్పడం… వచ్చింది చెప్పడం మేలు కదా, ఇతరులకి ఏవీ అర్ధం కాదని వాపోయే కన్నా అని నా బాధ. ఆలోచించుకోండి మరి మీరు కూడా. మీరు అపార్ధం చేసుకోరన్నది నా నమ్మకం.

    జయప్రభ.

  823. ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/05/2013 10:23 am

    వ్యాసం చాలా బావుంది.

    చిత్ర కళ మీద తెలుగులో విశ్లేషణాత్మక వ్యాసాలు చాలా తక్కువ. చాలామందికి illustrative artist కీ, realistic or abstract artist కీ తేడాలు తెలియవు. చిత్రకళనీ, చిత్ర్రాలనీ ఎలా చూడాలీ అన్నవాటిపై తెలుగులో వ్యాసాలు చాలా చాలా అరుదు. రాసినా ఎవరికీ పట్టదు. చిత్రకళ తెలుగు సాహిత్యమ్లో భాగమేనా? మనకి కథలకీ, కవిత్వాలకీ బొమ్మలు వేయడానికీ, పుస్తకాల అట్టలకీ, అప్పుడప్పుడు పత్రికల అట్టలకీ మాత్రమే చిత్ర కళ అన్న ధోరణి ఎక్కువ.

    చిత్ర కళ పరంగా స్త్రీ చిత్రీకరణలో చిత్రకారుడి దృక్కోణం చూపించడం బావుంది. అన్నీ వెస్ట్రన్ చిత్రకారులవే ( ఒక్క రామారావు గారివి తప్ప ) విశ్లేషించారు. హుస్సేన్ గురించి ఒక్క మాట చెప్పుంటే బావుండేది అనిపించింది.
    ఈ MF Hussain చిత్రం (హుస్సేన్ చిత్రం) నాకు చాలా ఇష్టమైనది. ఇందులో కూడా స్త్రీ యొక్క వివిధ మానసిక స్థితులనీ, దేహపరంగా చూపించాడనిపించింది.

    పరిశీలంగా చూస్తే మగమృగం కూడా ఉంది. అది శరీరం క్రిందభాగంలో అంటే కాళ్ళ మధ్యన చిత్రీకరించడంలో స్త్రీ యొక్క మానసిక స్థితితో పురుషుడికున్న చులకన అభిప్రాయంకూడా కనిపిస్తుంది. చివరగా స్త్రీ ముఖం చూపించకపోవడం ఈ చిత్రంలో ప్రత్యేకత.

    -సాయి బ్రహ్మానందం

  824. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి D.Venkateswara Rao గారి అభిప్రాయం:

    03/05/2013 9:45 am

    జాన్ హైడ్ కనుమూరి గారికి ధన్యవాదాలు. ఒక మంచి విషయం మీద కవిత వ్రాశారు. మీ కవిత చదివిన తరువాత నా అభిప్రాయం ఇలా వ్రాయాలనిపించింది.

    నిజాన్ని అబద్దంగానూ అబద్దాన్ని నిజంగాను మార్చె శక్తి మానవులకే వుంది. అబద్ధాల రాజ్యములో ధర్మరాజు నిజాన్ని చెప్పితే ఎంత చెప్పక పొతే ఎంత? రామాయణం రంకు భారతం బొంకు అనే నానుడి కూడా ఉంది కదా. ‘యేసు’గురించి నలుగురు శిష్యులు ఒకేలాంటి నిజాలు వ్రాయలేకపొయారు. అప్పటి శిష్యులే ఆయన తిరిగి లేచాడంటే నమ్మలేదు.

    నిజం వేరు నమ్మకం వేరు కాదుకదా ఎన్నోమహిమలు(అబద్దాలు) నిజమని నమ్ముతాము. నమ్మిస్తాము నమ్మడానికి ప్రయత్నిస్తాము. నిజాన్ని ఒప్పుకుంటూనే కాళ్ళకు తడి అంటకుండా ఎదుటి వారి తలలమీద నడిచే వారికి నిజానికి అబద్ధానికి తేడా ఎలా తెలుస్తుంది?

  825. అర్జున గురించి రవిశంకర్ గారి అభిప్రాయం:

    03/04/2013 9:32 pm

    చెట్టు ఆత్మకథ చెప్పటం, అదీ కవితాత్మకంగా చెప్పటం, చాలా నచ్చింది. దీనిని చదివినప్పుడు నాకు కూడా “ఒక పువ్వు పూసింది” కథే గుర్తుకు వచ్చింది. చెట్టుకి, నదికి మధ్య చెలిమి కూడా బాగుంది. ప్రకృతిలో హింస సహజమే అయినా, బాధ కలిగిస్తుంది. The Earth సినిమాలో, అమాయకమైన గున్న ఏనుగుని చుట్టుముట్టి చంపే సింహాల గుంపుని చూసినప్పుడు, అప్పుడే పుట్టి సముద్రం వైపుకి నడుస్తున్న చిట్టిచిట్టి సముద్రపు తాబేళ్ళని నోట కరుచుకుపోయే పక్షుల్ని చూసినప్పుడు విపరీతమైన కోపం, బాధ కలుగుతాయి. ఇది తప్పదు. చెట్టు మనిషి స్వరంతో మాట్లాడుతోంది కాబట్టి, దానికి కూడా మానవ స్పందనల్ని ఆపాదించటం సమర్థనీయమే.

    ఇందులో వాడిన రెండు పదాల గురించి చిన్న సందేహం. అడవి దున్న అనే పదం జండర్‌తో సంబంధం లేకుండా వాడతారా? పెంపుడు జంతువుల్లో అయితే, దున్న అని “మగ పశువు”ని మాత్రమే అంటారు కదా? అలాగే, “… చరాచరాల్నీ అడిగాము. వాటికి కూడా భ్రమణం తప్ప మరింక ఏ గతీ తెలియవని అన్నాయి.” అన్నారు – భ్రమణం చరాలకు మాత్రమే ఉంటుంది, అచరాలకు కాదు. – రవిశంకర్

  826. అర్జున గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/03/2013 2:16 pm

    జయప్రభ గారూ,
    మీకు నా వ్యాఖ్యలో “అసహనం” ధ్వనించిందా? అయ్యయ్యో! సారీ అండీ! నా ఉద్దేశ్యం అది కాదు. నేను సంయమనంతోనే రాసేననుకున్నాను. అంటే, అలా నేను అనుకుంటే చాలదూ, నా వ్యాఖ్య చదివే వాళ్ళు కూడా అలా అనుకోవాలీ అని అర్థం అయింది. అంటే, అలా ఏడిసిందన్న మాట నా సంయమనం. ఇక మీదట ఇంకా సంయమనంతో రాయాలి ఏదైనా వ్యాఖ్య రాస్తే.

    చలం గారు రాసిన “ఒక పువ్వు పూసింది” నాకు అస్సలు గుర్తు లేదు. అసలు చదివానో, లేదో కూడా. చలం గారు స్త్రీల స్వేచ్ఛ గురించీ, వారి ఆత్మ గౌరవం గురించీ, సమాజంలోని కుళ్ళు గురించీ, కపటత్వం గురించీ ఎన్నో గొప్ప విషయాలు, ఎవరూ ఏమీ చెప్పని రోజుల్లో, చెప్పిన మహానుభావుడు కాబట్టి, ఆయన ఏ తప్పు రాసినా, ఏ తప్పు చెప్పినా, దాన్ని వెనకేసుకు రానండీ. “ఒక పువ్వు పూసింది” కధ కూడా ఈ కధ లాగే వుంటే, “ఇది కధా” అనే అనిపిస్తుంది నాకు.

    కధల్లో కవిత్వం వుండకూదదని అని నేననలేదు. అసలు ఒక రాత ఇలా వుంటేనే దాన్ని కధ అనాలీ అనే నిర్వచనం చెప్పేంత జ్ఞానం కూడా నాకు లేదు. ఒక మామూలు మనిషిగా, ఒక కధ చదివితే, అప్పుడప్పుడు, “ఇది కధా” అని అనిపిస్తుంది. కధల్లో జంతువులు మాట్టాడ్డం సరి కాదు అని నేననుకోను. వాటి పేర్న రచయిత(త్రి) ఏం చెప్పారా అనే చూస్తాను. కొన్ని కల్పిత లక్షణాల్ని నేనేమీ వ్యతిరేకించను. “కులాలు నశించాలీ” అని విష్ణు శర్మ ఆ కరటక దమనకుల చేత చెప్పించాడనుకోండీ, అప్పుడు ప్రశ్నలు వస్తాయి. చెట్టు, పక్షి పిల్లల్ని పాము నించి కాపాడే విషయం ఒక సన్నివేశంగా వచ్చినా, నాకు అలా అనిపించేది కాదేమో.

    ఏమైనా, మిమ్మల్ని నొప్పించాలని కాదండీ.

    ప్రసాద్

  827. అర్జున గురించి jayaprabha గారి అభిప్రాయం:

    03/03/2013 6:39 am

    ప్రసాద్ గారూ!! నా కధ పట్ల మీ అసహనం నాకు బాగా నచ్చింది. థాంక్యూ!

    ఇది కధా? కాబోలు. చలం రాసిన “ఒక పువ్వు పూసింది” గనక కధే అయితే ఇదీ కధే! ఇంక కవిత్వానికి వేరే సూత్రాలూ కధలకి మరొక తరహా సూత్రాలూ అంటూ ఉండవనుకుంటాను. కరటక దమనకులు అలా మాట్లాడతాయా అవేమన్నా మనుష్యులా అని అంటే విష్ణుశర్మ ఏమని జవాబు చెప్పి ఉండేవాడో ? 🙂

    భాస్కర రావు గారూ, మూలా గారూ, మోహన గారూ: చెట్టు కధని అర్థం చేసుకున్నందుకు నచ్చుకున్నందుకూ మీకు నా వందనాలు.

    జయప్రభ.

  828. అడవిదారిలో గాలిపాట – పుస్తక పరిచయం గురించి రవి వీరెల్లి గారి అభిప్రాయం:

    03/02/2013 7:27 pm

    సమీక్ష బాగుంది.
    ఇంద్రాణి గారి కవితలు కొన్ని చదివాను. నచ్చాయి. వెంటనే పుస్తకం కొని మిగతావి చదవాలి.

  829. అడవిదారిలో గాలిపాట – పుస్తక పరిచయం గురించి indrani Palaparthy గారి అభిప్రాయం:

    03/02/2013 7:24 pm

    ఎంతో దయతో ఈ సమీక్ష రాసిన మోహన రావు గారికి పాదాభివందనాలు.

    ఎంతగానో అభిమానించి ఆదరించే పాఠకులకి అనేక నమస్కారాలు.

    ఈ పుస్తకంలోని చాలా కవితలు ఈమాటలో ఇదివరకు వచ్చినవే.

    ఈమాట వారికి ధన్యవాదాలు.

    పాలపర్తి ఇంద్రాణి.

  830. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి తః తః గారి అభిప్రాయం:

    03/01/2013 10:53 pm

    శ్రీ జాన్ హైడ్ కనుమూరి: చాలా గొప్ప కవిత. అక్షరం అక్షరం బావుంది. ఇక దీన్ని మరచిపోవటం సాధ్యం కాదు.
    తః తః

  831. అర్జున గురించి మోహన గారి అభిప్రాయం:

    03/01/2013 8:03 pm

    వచనములో కూడ కవిత్వము ఉంటుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. దీనికే విరామాలు ఇచ్చి వ్రాస్తే ఇది ఒక దీర్ఘ కవిత అవుతుంది. ఇది కథ కాదు, కాని ఒక చెట్టు ఆత్మకథ అనుకోవచ్చు గదా! కాకుంటే ఇట్టి రచనలను ఒక మూసలో పెట్టడము కష్టము. ఇది కవిత కాదు, కాబట్టి దీనిని ఎక్కడ ఉంచడము, అందుకే ఇది కథగా మారినది. ఒకప్పుడు దమయంతిగారి ఒక రచనను గురించి కూడ ఇలాటి చర్చ జరిగినట్లు నాకు జ్ఞాపకము. జయప్రభగారికి అభినందనలు. విధేయుడు – మోహన

  832. అర్జున గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/01/2013 3:19 pm

    ఇది కధా? ఈ వచనంలో చాలా అద్భుతమైన వర్ణనలు వుంటే వుండొచ్చు. ఎన్నెన్నో నిగూఢ పోలికలు జీవితంతోనో, మరోదాని తోనో వుంటే వుండి వుండొచ్చు. ఈ వచనాన్ని కధ అంటే, నాకు బొత్తిగా అర్థం కాలేదు. కధ అంటే ఏదో ఒక సంఘటన అయినా వుండాలి కదా? వర్ణనలు పూర్తయి, ఆఖరికి కధేదో మొదలవుతుందని ఎదురు చూస్తే, అంతా పూర్తయిపోయింది. కధేమిటీ అంటే, చెప్పడానికి ఒక్క ముక్క కూడా దొరకలేదు.

    బహుశా, ఈ కధ లాంటిది గొప్ప మేధా వర్గానికి మాత్రమే ఉద్దేశించి రాసినది అయి వుండొచ్చును. నా లాంటి మామూలు పాఠకుల కోసం అయి వుండదు. అలా అయితే, నాకు ఏదో ఒక్క ముక్కన్నా కధ గురించి అర్థం అయి వుండేది కదా? “అలా కాదూ, నువ్వు మామూలు పాఠకుడి కన్నా కూడా తక్కువ స్థాయి వాడివీ, అందుకే ఈ కధ లోని కధా, గొప్పతనం, ఇందులోని విషయాలూ నీకర్థం కాలేదూ” అని ఎవరన్నా అంటే, “హతోస్మి” అని అనడం తప్ప, మరింకేమీ చెయ్యలేను.

    సరే, ఇది కధ అవునా, కాదా, లేక ఇది మరొకటా అన్న విషయం వదిలేస్తాను. నాకు అర్థం కాని దాని గురించి చర్చ వ్యర్థం.

    ఒక విషయం మాత్రం చెప్పాలని వుంది. పక్షి నది లోని చేపలని పట్టి తింటుంది. పిల్లలకి పెడుతుంది. పాము పక్షి పిల్లలని తింటుంది. ఇది ప్రకృతికి సంబంధించిన విషయం. జంతువులు ఆకలి తీర్చుకోవడం కోసం, ఒక దాన్ని ఇంకొకటి తినడం ప్రకృతి విషయం. ఇందులో, మంచీ, చెడూ అనేవి వుండవు. పాము చెడ్డది అయితే, పక్షి కూడా చెడ్డదే అవుతుంది. ఏవేవో పురుగుల్ని తినే చేపా చెడ్డదే అవుతుంది. చెట్టు, పక్షి పిల్లల్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తే, నది, చేప పిల్లల్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తుంది. అర్థం పర్థం లేని విషయం ఇది.

    “పులి తినేయగా మిగిలిన కళేబరాన్ని ఆరగించేటందుకని మూకలుగా వచ్చిన రాబందులు ఆవేళ నా కొమ్మల మీదనే కూచుని దున్నని తలుచుకుని దుఃఖించాయి. అది చాలా వింతగా విశేషంగా అనిపించింది నాకు.” – ఈ రాబందులు కూడా మనుషుల్లాగా కపటత్వం (హిపోక్రసీ) కలిగినవై వుంటాయి. మరి మనుషులు కూడా, చేపల కూరా, చేపల పులుసూ హాయిగా, ఆనందంగా ఆరగిస్తూ, “ఫైండిగ్ నీమో” లాంటి సినిమాలు చూసి, కళ్ళ నీళ్ళు పెట్టేస్తూ వుంటారు కదా? అందుకని.

    ప్రకృతినీ, సమాజాన్నీ కలగా పులగంగా కలిపేసి మాట్టాడ కూడదు. ఈ రెంటికీ చాలా తేడా వుంది. సమాజంలో మంచీ, చెడూ వుంటాయి. ప్రకృతిలో అలాంటివి వుండవు. ప్రకృతిలోని విషయాలకి లేని పోని ఉదాత్తత అంట గట్టేస్టే, కవిత్వానికి పనికొస్తుందేమో గానీ, అర్థం పర్థం లేనిదిగా వుంటుంది. ప్రకృతి లోని విషయాలు ఎప్పుడూ మారవు. అవి వాటి సూత్రాలతో సాగి పోతూ వుంటాయి. సమాజంలోని విషయాలని మార్చుకోవచ్చు.

    ప్రసాద్

  833. తుఫాను ముగిసింది గురించి ravi గారి అభిప్రాయం:

    02/22/2013 8:57 pm

    మీరు చెప్పే ఆ కవిత్వ మూలాల్లోకి బహుశా నేను పోలేనేవో భూషణ్ గారు. నాకు కవిత్వం కొద్దో గొప్పో తెలుసు. కవిత్వం తెలుసంటే నాకు తెలుగు తెలుసని కాదు, నాకు బతుకు తెలుసని, అంతే. అనుమానం లేదండీ నాకు తెలిసిన తెలుగు పన్నెండో తరగతి వరకు నేను చదువుకున్న తెలుగే, అది కూడా లీలా మహల్ల్లో ఆంగ్ల సినిమా లేకపోతేనే, ఉంటే మా తెలుగు లెక్చరర్లు అదృష్టవంతులు. ఎందుకంటే మేవు క్లాస్ కి వస్తే పాపం వాళ్ళు చాలా దిగులు పడే వాళ్ళు. మా తెలుగు అంతవరకే పరిమితం. కాకపోతే బతుకు చాలా విస్తృతం కదండీ. కొందరు బతుకు ఒక వైపునే చూడగలరు, కానీ ఆ కొండనీ ఆ లోయనీ రెండిటినీ చూడగలగటం అందరకీ కుదరదు కదా.

    నేను ఇంతకు ముందు వ్రాసిన కవితలు కానీ, ఒకే ఒక కథ కానీండి, అది నాకు తెలుగు తెలుసు అని వ్రాసింది కాదండీ భూషణ్ గారు. బతుకు తెలుసని వ్రాసినవండీ అవి. అయ్యో నాకు తెలుగులో ఓనమాలు, ఇవి కూడా తప్పుగా వ్రాస్తున్నాను, తెలియవండి. కానీ నాకు తెలిసింత వరకు నేను తప్పు కావచ్చు, కవితగానీ, కథగానీ భాషలోనించి రాదండి, అనుభవంలోనించి వస్తుంది, బతుకులోనించి వస్తుంది.

    అమ్మా, కడుపులో ఎండకాస్తున్నట్టుందమ్మా అని వ్రాశాడు నామినీ ఒక కథలో. మిరక్కాయలు (మీరు మిరపకాయలు అంటారేవో) పచ్చడితిని, ఆ పిలగాడు బయట ఎండ కాసినట్టే ఆ కడుపులో మంటని అమ్మా కడుపులో ఎండకాసినట్టుందమ్మా అని చెప్తాడు అమ్మకి. ఇది తెలుగు భాష తెలుసు కాబట్టి రాదు, ఇది అనుభవం నించి వస్తుంది, ఇది బతుకునించి వస్తుంది. నాకు తెలియదండీ నాకు మాత్రం ఇంతగొప్ప వాక్యం, భాష మాత్రమే తెలిసిన వాళ్ళు వ్రాయలేరు, బతుకు తెలిసిన వాళ్ళు మాత్రమే వ్రాయగలరు. అమ్మా కడుపులో ఎండకాస్తున్నట్టుందిమా. కడుపులో ఎండకాస్తున్నట్టుందట. మీరు తప్పు పట్టదలచుకుంటే మొత్తం పచ్చనాకు సాక్షినే తప్పు పట్టేయ్యగలరు మీరు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, రచయిత వ్యక్తిగత జీవితం వాళ్ళ రచనలకి మూలం భూషణ్ గారు. తెలిసీ తెలియని అనుభవాల్ని, అనుభవం కాని బతుకుని కవిత్వీకరించడం కన్నా అబద్దం వుందా?

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  834. గురువు గురించి Perumalla గారి అభిప్రాయం:

    02/21/2013 11:23 am

    చాలా బాగుంది. కవిత అంటే ఇలా ఉండాలి.

  835. తుఫాను ముగిసింది గురించి Bhavani గారి అభిప్రాయం:

    02/21/2013 4:29 am

    కవిత్వ మూలాలు కనుక్కోవడం అంత సులభం కాదు. వస్తువు ఏదైనా కవిత్వం రాయడం ముఖ్యం. దేని మీద కవిత్వం రాయాలో కవికి ఇతరులు ట్యూషన్ చెప్పే అవసరం లేదు. దేని మీద పడితే దాని మీద రాయడానికి కవిత్వం ఆవు వ్యాసం కాదు కదా.

    ఈ అభిప్రాయంలో కవి నిరంకుశత్వం పట్ల సమర్థన కనిపిస్తోంది. విమర్శ సరే, పాఠకుల అభిప్రాయాన్ని కూడా సహించలేని వారు ఈ కాలంలో కూడా వున్నారా అని ఆశ్చర్యం కలిగింది నాకు.

  836. ఈ సంచిక గురించి… గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    02/21/2013 2:45 am

    ఎన్నో విలువైన రచనలున్న విశేష సంచిక మీద పాఠకుల/రచయితల స్పందన అరకొరగా ఉండటానికి కారణాలు అనేకం. ముఖ్యంగా, మనకు ఒక విషయం మీద సవ్యంగా ఆలోచించి సమగ్రంగా రాయడానికి, చర్చించడానికి వలసిన వాతావరణం లేదు. దాన్ని సృష్టించుకోవడం ఒక రోజులో అయ్యే పని గాదు. అటువంటి వాతావరణం ఏర్పడటానికి , ఎన్నో పత్రికలు/ఎందరో వ్యక్తులు పూనుకొంటే కనీస పక్షం ఒక దశాబ్దం పట్టవచ్చు.

    వ్యాసం రాయడం అందునా జనరంజకంగా రాయడం అంత సులభం కాదు. పత్రికల్లో వ్యాసాల సంఖ్య బాగా పెరగాలి. అప్పుడు గాని పాఠకుల్లో వ్యాసాల పట్ల అభిరుచి కలగదు. కవిత్వం పేరిట అడ్డమైన చెత్త పోగు చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. ప్రక్రియా పరమైన అయోమయాన్ని విమర్శ ద్వారా నిర్దాక్షిణ్యంగా ఎదుర్కోవాలి, వ్యాసం కావలసిన సరుకును కవితలో చుట్టి కవి బాధ పడి, ప్రపంచాన్ని బాధ పెట్టే ప్రయత్నాలను మొగ్గలోనే తుంచివేయాలి. ఆంధ్ర దేశం నుండి వస్తున్న పత్రికల సంపాదకులతో గోష్ఠి ఏర్పరచి దినపత్రికల్లో వార్తాకవిత్వాన్ని, గాలి పోగు చేసే అస్తిత్వ వాద సాహిత్యవ్యాసాలు ప్రచురించే స్థలంలో చక్కని వ్యాసాలు ప్రచురించవలసిన చారిత్రిక అవసరం ఉందన్న విషయాన్ని వారి తలకెక్కేలా బోధ పరచాలి. నిజానికి మన భాషలో ఒక చక్కని వ్యాసం చదివి ఎంత కాలమైందో!!

    మన దోషమల్లా ఆధునికతను సరిగా అర్థం చేసుకొని, ఆహ్వానించక పోవడంలోనే ఉంది. మన భాషలో ఎన్ని రంగాల్లో ఎంత మంది మేధావులు లేరు?? వారిలో వ్యాస రచనకు పూనుకొనే మహానుభావులు ఎందరు?? ప్రతి ఒక్కరు కవిత్వంలో దూకి కుప్పి గంతులు వేసేవారే. సంపాదకులు పూనికతో తమకు తెలిసిన శాస్త్ర నిపుణులతో పలు విషయాలపై చక్కని వ్యాసాలు రాయించాలి. ఈమాట వరకు కనీసం ఇంతకాలం వచ్చిన వ్యాసాల్లో ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి ఒక పుస్తకంగా తీసుకు రావచ్చును. ప్రతి సంవత్సరం వచ్చిన వ్యాసాల్లో ఉత్తమ వ్యాసాన్ని నిర్ణయించి ప్రకటించి వ్యాసకర్తను తగురీతిన గౌరవించ వచ్చు. చీకటిని తిడుతూ కూర్చోక ఒక చిరు దీపం వెలిగించే ప్రయత్నం ఎవరైనా చేయవచ్చును.

    తెలుగునాట పుట్టిన మేధావి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గతంలో, గద్య వ్యాప్తికి కంకణ బద్ధుడై, పద్యాలు తన పత్రికలో ప్రచురించనని ప్రతిజ్ఞ పట్టారు. ఈనాటి పత్రికాధిపతులు ఒక దశాబ్దం ఆ పని చేస్తే దేశం బాగుపడుతుంది. కవులు కవిత్వం పేరిట వారు పోగు చేసే చెత్త, దాని కోసం వారు చేసే దివాలా కోరు ఉద్యమాలు అన్నీ మూలాన పడి, అందరూ కాస్త చదవడం, రాయడం మొదలు పెట్టి గద్య వ్యాప్తికి తోడ్పడతారు. నడక వచ్చాకే నాట్యం, సవ్యంగా గద్యం రాయడం వస్తే కవిత్వంలో దోషాలన్నీ కుదురుకుంటాయి. గద్యం, పద్యం మూడు పూవులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతాయి. అందరికీ బ్రహ్మానందం సిద్ధిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.

    తమ్మినేని యదుకుల భూషణ్.
    ఆఖరు మాట: ఈ సంచికలో కేవలం వ్యాసాలు మాత్రమే ఉంటే నేను మరింత సంతసించే వాణ్ణి.

  837. తుఫాను ముగిసింది గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    02/20/2013 5:08 pm

    సాధారణంగా వైదేహి గారి కవిత్వంలో భావుకత ముగ్ధమోహనంగా వుంటుంది, ముచ్చట కలిగిస్తుంది. ఇది అలాటి కవిత కాదు. చివరి మూడు పాదాలు తప్ప ముందంతా నాకు కవిత్వచ్ఛాయలే కనిపించలేదు.

  838. తుఫాను ముగిసింది గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    02/20/2013 1:35 pm

    కవిత /రచన నచ్చకపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. ఎందుకు నచ్చలేదో చెప్పడం ఒక పధ్ధతి- దాని వల్ల కొంత ప్రయోజనం ఉంది. ఇతరులకు సదరు పాఠకుని అభిరుచి గురించి తెలుస్తుంది. ఆ అభిరుచి స్థాయి గురించి కవి /పాఠకులు కొంతలో కొంత అంచనా వేయగలరు.ఇక్కడ ఆ ప్రయత్నం జరిగినట్టు కనిపించదు. అంతేగాక, కవి /రచయిత వ్యక్తిగత జీవితాన్ని రచనకు /కవిత్వానికి ముడిపెట్టే అనవసరమైన ప్రయత్నం ఒకటి కనిపిస్తుంది. దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో నా బోంట్లకు బోధ పడలేదు.

    కవిత్వ మూలాలు కనుక్కోవడం అంత సులభం కాదు. వస్తువు ఏదైనా కవిత్వం రాయడం ముఖ్యం. దేని మీద కవిత్వం రాయాలో కవికి ఇతరులు ట్యూషన్ చెప్పే అవసరం లేదు. దేని మీద పడితే దాని మీద రాయడానికి కవిత్వం ఆవు వ్యాసం కాదు కదా. ఈ తరహా అలోచనలకు మన పత్రికలు కొంత కారణం. వార్తా పత్రికల్లో కవిత్వాలు ప్రచురించే అలవాటు ఇటు కవిత్వానికి, అటు కవిత్వంలో సగటు పాఠకుని అభిరుచికి తీరని అన్యాయం చేసింది. ఎక్కువ పాళ్ళు వార్తా పత్రికల్లో స్పందించి రాసే కవిత్వానికే పెద్ద పీట. గట్టిగా మాట్లాడితే వార్తలకు కవిత్వానికి అట్టే తేడా లేదు. అటుదిటు కావడం సర్వ సాధారణం. కవిత్వానికి ప్రత్యేకించి సంపాదకులు ఉండటం అన్న ఊహే రాదు మనకు. బొడ్దూడని సబెడిటర్ కవిత్వ నిర్దేశం చేయగల మహా కవి, మహా విమర్శకుడూనూ. కనీసం ఈ-పత్రికల్లో వార్తాకవిత్వం నుండి పాఠకులకు విముక్తి లభించాలని కోరుకోవడం అత్యాశ కానేరదు.

    రామాయణంలో పిడకల వేట: పాఠకుని లేఖలో ఒక నియమంగా మ కారం వకారం గా రాయడం ఉదా: ఏమని /ఏవని (కనీసం అర సున్న పెట్టినా కొంతలో కొంత నయం: ఏవఁని) చెప్పలేనంత చీకాకు కలిగించింది. అయినా, సంభాషణలకు పరిమితం కావలసిన వాడుక ఉత్తరాల్లో కనిపించడం మంచి ప్రమాణానికి ప్రాతిపదిక కాబోదు. సంపాదకులు ఆలోచించగలరు.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  839. తుఫాను ముగిసింది గురించి ravi గారి అభిప్రాయం:

    02/17/2013 12:35 am

    ఇది మళ్ళా వ్రాస్తున్నాను. నేను వ్రాసింది ఏవయ్యిందో నాకు తెలీదు పోయింది, నేను సబ్మిట్ నొక్కిన తర్వాత.

    లైలా గారు,

    మీరు వ్రాసిన కవిత ఆంగ్లంలో నాకు చాలా నచ్చింది, అయితే ఎందుకో నాకు కొంచం — ఆక్షేపణ అనికాదు — ఎక్కడో ఎందుకో నాకు కొంచం సరిగ్గా అనిపించలేదు. నాకు తెలియదు మీరెవరో, మీరు ఫిజీషియనా? నేను స్టే హోం డేడ్ అండీ. కానీ నా పెళ్ళాం ఫిజీషియన్. నాకు తెలుసు తన కష్టవేవిటో. తను ఇంటికొస్తే తన హాస్పేటల్‌లో పేషంట్ల దగ్గరకి వెళ్ళిపోతాను నేను. అబ్బా, వీళ్ళు ఎలా భరిస్తారురా అంత కష్టాన్ని, అంత దుఃఖాన్ని అనిపిస్తుంది నాకు. అంత వత్తిడిలో వ్రాయటవంటే చిన్న విషయం కాదు కదా.

    తెల్లగా, హయిగా, మెత్తగా పడే ఆ స్నో మీద వైదేహి గారు వ్రాయగలదు, అప్పుడే విచ్చుకున్న ఆ పువ్వు మీద వ్రాయగలదు, జలజల పారిపోయే ఆ క్రీక్ మీద వ్రాయగలదు, కానీ కారిపోయే ఆ కన్నీళ్ళ మీద (ఒక సారి తను వ్రాసేరు సబ్ వే లో ఒక ఆమెని చూసి) కూడా వ్రాయాలి కదండీ. బతుకంటే అన్ని అనుభవాలు ఉంటాయి కదా. కష్టం. సుఖం, నవ్వు, ఏడుపు అన్నీ ఉంటాయి కదా.

    ఆవిడ కవిత్వం నాకు భలే ఇష్టవండీ, కానీ ఏదో లోటు కనిపిస్తుంది. తను బతుకులో ఒక భాగాన్నే చూస్తుందేవో అనిపిస్తుంది. బొమ్మ వెనకే బొరుసు కూడా ఉంటుందండీ. మీకు షాంపేను లాగే నాకు ఓడ్కా అంతే.
    -కిరణ్

  840. తుఫాను ముగిసింది గురించి ravi గారి అభిప్రాయం:

    02/08/2013 9:29 pm

    నాకు తెలీదు ఏవని చెప్పాలో. మీరు చాలా అద్భుతంగా వ్రాస్తారు కవితని. కానీ ఈ కవిత (?) మాత్రం అస్సలు బాగ లేదు. బహుశా మీకు మీ ఫిజీషియన్ వర్క్ మిమ్మలని ఓవర్ వెల్మ్ చేస్తుందేవో! నిజంగానే అసలు ఈ కవిత ఏవీ బాగలేదండీ. నిజంగా బాగలేదు. ఒకవేళ నేను తప్పేవో, అయ్యుండొచ్చు, కానీ మీరిలాటి కవిత వ్రాయడవా!
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  841. మృత్యు వృక్షం గురించి గురునాథ రావు దిక్కల గారి అభిప్రాయం:

    02/01/2013 12:34 am

    అద్భుతమైన కవితలు అందించినందుకు ధన్యవాదాలు.

  842. జన్మజన్మల స్పృహ గురించి adityareddi గారి అభిప్రాయం:

    01/27/2013 8:56 pm

    నారాయణ గారూ మీ కవిత బాగుంది. పుస్తకాల పట్ల ప్రేమని ఆశక్తిని కలుగ జేస్తోంది .అభినందనలు.

  843. అయినా సరే… గురించి తః తః గారి అభిప్రాయం:

    01/24/2013 11:11 pm

    శ్రీ బండి : మీ కవిత చాలా బావుంది
    నమస్కారాలతొ
    తః తః

  844. అయినా సరే… గురించి gopagani ravinder గారి అభిప్రాయం:

    01/22/2013 10:15 pm

    మీ కవిత బాగుంది

  845. అంబఖండి నుంచి అట్లాంటా దాకా… గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    01/20/2013 10:47 pm

    ఇలాటి విషయాలు చెప్పటం వేలూరి గారొక్కరికే సాధ్యమయే పననుకుంటాను. నారాయణరావు గారితో ఇంత చిరకాల అనుబంధం వున్నవాళ్లు ఇంకెవరూ లేరేమో ! అభ్యుదయ కవిత్వపు తొలిరోజుల్లో అందులోని ముఖ్యులు చాలామందితో ప్రత్యక్షపరిచయాలు నారాయణరావు గారికున్నాయని తెలుసును. వేలూరి గారికి కూడ ఉండివుండవచ్చు. ఆనాటి సాహితీ వాతావరణం గురించి, అందులో జీవించిన వ్యక్తుల గురించి వారు వివరిస్తే వినాలనే ఆసక్తి నాకూ వుంది.

    ఇంత చక్కటి ప్రత్యేకసంచికని తెచ్చినందుకు వేలూరి గారిని, రచనల్ని పోగుచెయ్యటానికి కాలికి బలపం కట్టుకుని తిరిగిన పరుచూరి శ్రీనివాస్ గారిని మనసా అభినందిస్తున్నా.

  846. ఈ సంచిక గురించి… గురించి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    01/18/2013 11:43 pm

    మోహన రావు గారూ,

    మామూలు పాఠకుల సంగతి అర్థం చేసుకోగలను. కానీ – వెల్చేరు గారి చేత ముందు మాటలూ, వెనుక మాటలూ, రాయించుకున్న వాళ్ళూ, దగ్గరుండి ఆప్త వాక్యాలు అల్లించుకున్న వాళ్ళూ, మధ్య మధ్యలో ఉత్తుత్తి మాటలు చెప్పించుకున్నవాళ్ళూ, కవిత్వాన్ని గుట్టలుగా పోసిన వాళ్ళూ, కవిత్వాన్ని దిద్దించుకున్న వాళ్ళూ, వాక్యాలు రాయడం నేర్చుకున్నవాళ్ళూ, పాఠాలు చెప్పించుకున్న వాళ్ళూ, కలిసి సాహిత్య చర్చలు చప్పరించిన వాళ్ళూ – అందరూ ఒక్క సారి మాయమై పోయారేమిటబ్బా? అన్నదే నా బాధ. మామూలు పాఠకులకి మొహమాటాలుండవు. నచ్చడం నచ్చకపోవడం తప్ప. అసలు సమస్యంతా సమకాలీకులతోనే! నాకు తెలిసి సగానికి పైగా రచయితలు ఆయన పుస్తకాలు చదివుండరు. ఊరికే వచ్చుంటే చదివుండేవారేమో? ఏదేమయినా – తిట్టడానికి ధైర్యం అవసరం లేదేమో కానీ, మెచ్చుకోడానికి చాలా పెద్ద మనసు కావాలి. కాదంటారా? నా వ్యాఖ్యపై స్పందించినందుకు థాంక్స్!

  847. ఈ సంచిక గురించి… గురించి మోహన గారి అభిప్రాయం:

    01/17/2013 12:58 pm

    నారాగారిపై ప్రత్యేక సంచిక నందించిన “ఈమాట”కు జోహారులు!

    బ్రహ్మానందం గారు, మీ ఆవేదన నాకు అర్థమయినది. సుమారు ఐదేళ్లుగా పాఠకుడుగా, రచయితగా నా అనుభవాలనుగురించి ఒక రెండు మాటలు – పాఠకులు ఎక్కువగా ఇష్టపడేది లలిత సంగీతముపైన, చిత్ర సంగీతముపైన, ప్రముఖ గాయకులపైన రచనలు. ఇవి పాఠకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. దాని తరువాత కథలు. అటుపైన వచన కవితలు. వీటన్నిటిని శ్రమలేకుండ చదివి, విని ఆనందించవచ్చును. పాఠకులకు వ్యాసాలంటే అంత యిష్టము లేదు, ముఖ్యముగా సాహితీ వ్యాసాలు (ఏ కొందరికో తప్ప) కొరకరాని కొయ్యలే. చిట్టచివర పద్య కవితలు. ఈ పరిస్థితిలో వీటి రచయితలు నిరుత్సాహ పడడములో తప్పు లేదు.

    రచనలు ప్రచురించబడిన తరువాత అట్టి రచయితలకు mental depression తప్పని సరియే. అసలు ఎందుకు వ్రాయాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అప్పుడే భగవద్గీత ప్రత్యక్షమవుతుంది, శ్రీ భగవానువాచ – ఓ రచయితా, నీ పని వ్రాయడము మాత్రమే, మెచ్చుకోలు అనే ఫలాన్ని ఎదురుచూడడము సరికాదు, తప్పు పాపము కూడ. ఈ పరిస్థితి ఇప్పటిలో మారదు అనే నా ఉద్దేశము. రాలిపోయే పువ్వులా దొర్లిపోతున్నాయి రోజులు, ఒక నాడు ఈ పువ్వు కూడ రాలిపోతుంది. ఉంటాను.

    విధేయుడు – మోహన

  848. నీటి ఊహ గురించి dr. bandi satyanarayana గారి అభిప్రాయం:

    01/17/2013 11:32 am

    కవిత్వాన్ని ఆస్వాదించాలంటే మీ లాంటి వారి కవిత్వం చదవాలి. మీకు అభినందనలు.

  849. God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India గురించి మోహన గారి అభిప్రాయం:

    01/05/2013 6:26 pm

    చివర నుదహరించిన Distant Rivers Reach the Sea చదివినప్పుడు నాకు ఏక్‌నాథ్ ఈశ్వరన్ వ్రాసిన God makes the rivers to flow – Passages for meditation అనే పుస్తకము జ్ఞాపకానికి వచ్చినది. నదీనాం సాగరో గతిః అంటారు అందుకే. ఆ కవితకు ఖండగతిలో (ఐదు మాత్రలతో) సాగే నా తెలుగు సేత క్రింద ఇస్తున్నాను –

    దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద

    దూరముగ నుండుటయు దగ్గరగ నుండుటయె
    దూరమున నుండియును దలతు నే నతనినే
    దూర మా సూరీడు తామరకు గాదు గద
    దూరములు హెచ్చగా ప్రేమయును హెచ్చు గద

    దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద

    నన్నతడు జూడగా నే నతని జూతుగా
    నా మొగ మ్మతనిపై కేంద్రీకృతమ్ముగా
    వనములో నెమలు లా మేఘముల జూచుగా
    చూపులే నాలోని యాశలకు పాశములు

    దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద

    మదిలోని కోర్కెతో దగ్గరైనట్టులే
    నేలపై నేనిందు కొండలకు ఱేడందు
    మేమిర్వురము కూడి యేకమైనాముగా
    అద్భుతము యీ వింత మేనిలో బులకింత

    దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద

    విధేయుడు – మోహన

  850. స్వప్నభంగం గురించి dr. bandi satyanarayana గారి అభిప్రాయం:

    12/29/2012 12:24 am

    రవిశంకర్ గారు, కవిత సూటిగ చక్కగ చాలా బాగుంది.

  851. స్వప్నభంగం గురించి k.v.rama krishna గారి అభిప్రాయం:

    12/25/2012 1:47 pm

    కవిత చాలా బావుంది.

  852. తిరణాల గురించి Rammohan rao Thummuri గారి అభిప్రాయం:

    12/16/2012 6:00 pm

    కవిత్వం పట్టు ఇంద్రాణి గారి ప్రత్యేకత .

  853. స్వప్నభంగం గురించి jayaf గారి అభిప్రాయం:

    12/12/2012 10:18 am

    చాలా బాగుంది ఈ కవిత.

  854. కవిత్వంలో భావ సాంద్రత గురించి తః తః గారి అభిప్రాయం:

    12/11/2012 10:24 am

    కనీసం రెండు మూడు సార్లు చదవాల్సిన వ్యాసం. ఆలస్యంగా నైనా చదివినందుకు నన్ను నేను అభినందించుకున్నాను.

    రచయితకు కవిత అంటే సూటిగా చెప్పడం కాదు అన్న సామాన్యమైన అపోహ లేదు. [సూటిగా చెప్పితే కవిత కాదు అనటం వేరు. వేటూరివి అందమైన జాను తెలుగు పదాలతొ చెప్పిన అందమైన భావాలు ఎన్నో ఉన్నా, ఆత్రేయ “మెల్ల మెల్ల మెల్లగా …మెత్తగ అడిగితే లేదనేది లేదుగా” నాకు ఇంకా అందంగా వినపడి, మరీ అందంగా కనపడుతుంది.]

    తీసుకున్న వస్తువును బట్టి చెప్పటానికి ఎంచుకున్న భాష, ఆ భాషలో చెప్పిన తీరుతొ – కవిత్వంలొ తలకాయకి పని లేదనుకొకుండా – గుండెని తాకుతూ, [మంచి] కవిత కేవలం అనుభూతిని వ్యక్తీకరించడమే కాకుండా ఒక విశ్లేషణని గూడా ప్రసాదిస్తుందని నా అభిప్రాయం. ఆలొచనామృతంగానూ ఆపాత మధురంగానూ ఉండేటట్లుగా ఒక రచనని రూపొందించే ప్రక్రియ ఆల్కెమీ కాక ఏమవుతుంది. అందుకే చేసి చూపించి ఇక అప్పీలు లేకుండా కవిత్వం ఒక ఆల్కెమీ అనేశాడు తిలక్.

    శ్రీ భాస్కర్ — మీరు చూపించిన ఉదాహరణలు చాలా మంచివి. మీరు చెప్పదలుచుకున్న దాన్ని చెప్పి అవి మీ పనిని అవి పూర్తిగా నెరవేర్చాయి.

    ఈ వ్యాసం మీద ఇప్పటివరకూ అభిప్రాయాలేవీ కనబడక పోవటం ?!?!
    తః తః

  855. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    12/05/2012 7:12 pm

    నేను చర్చను ఆసక్తితో చదువుతున్నాను. ఈ సందర్భములో రాళ్ళబండి కవితాప్రసాద్ గారు “అవధానవిద్య – ఆరంభవికాసాలు” అనే తమ సిద్ధాంత గ్రంథాన్ని పుస్తక రూపములో 2006లో ప్రచురించారు. ప్రాప్తిస్థానం – సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్లు. అవధాన విద్యలాగే చిత్రకవిత్వాన్ని కూడ చాల మంది నిరసిస్తారు, దానిపైన పుస్తకాలు వ్రాసినవారు కూడ. చిత్రకవిత్వాన్ని అప్పుడప్పుడు వ్రాసే నాకు ఇది చాల కష్టాన్ని కలిగిస్తుంది. అవధానుల బాధను నేను అర్థము చేసికొనగలను. విధేయుడు – మోహన

  856. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి తః తః గారి అభిప్రాయం:

    12/05/2012 4:03 pm

    “…దీని నొక
    చోద్యముగా గణియింప బోక
    సత్సమ్మతిగా నెసంగు కవి
    తా రసమున్ జవిచూడు భూవరా”

    అన్న దానికి అర్థం “పాండిత్య విన్యాసాల ప్రదర్శన విద్యగా కాక, కవిత్వ దృష్టి ఏ మాత్రమైనా ఇందులో ఉండాలిరా నాయనా!అని వాపోవడం…” అని ఎలా చెప్పారొ లక్ష్మన్న గారు తెలియటం లేదు. విన్యాసంగా మాత్రమే చూడవద్దు, ఇందులొ కవిత్వం గూడా ఉంది. రాజా ఆ కవిత్వ రసాన్ని [సత్సమ్మతిగా నెసంగు కవితా రసమున్] చవి చూడుమని స్పష్టంగా లేదా? పైగా “చోద్యముగా గణియింప బోక ” అన్నారు. అంటే ”దొమ్మరి’తనాన్ని downplay చేశారు చెళ్ళపిళ్ళ.

    అవధానం అయి వెళ్ళేప్పుడు “ఆహా! ఆ పద్యం ఎంత బాగా వచ్చింది!” అనుకునే ప్రేక్షకుల్ని ఇంతవరకు చూడలేదు నేను” – [కామేశ్వర రావు గారితో ఏకీభవిస్తూ] వ్యాసం లోని కొన్ని ఇతర ముఖ్య విషయాలతొ పాటు ఈ విషయాన్ని గూడా ఒప్పుకోలేకనే నేను ప్రచురించే ముందు ఈ వ్యాసాన్ని [వేరొక] అవధానికి ఎవరికైనా చూపించారా అని అడిగాను.

    తః తః

  857. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    12/05/2012 4:52 am

    అవధానాన్ని యిష్టపడే ఒక పామరునిగా నా అభిప్రాయాలివి:

    1. కవిత్వం అనే బ్రహ్మపదార్థానికి కాలానుగుణంగా అర్థం మారుతూ వచ్చింది. అంచేత ఒకప్పుడు ఆశువు, అవధానమూ కవిత్వంగా, కవిత్వవిద్యగా చెలామణీ అయి ఉండవచ్చు, అందులో ఆశ్చర్యమూ అసంగతమూ ఏమీ లేదు. ప్రస్తుతం కవిత్వమంటే ఉన్న అవగాహన (“మేధావి” వర్గానికి) మేరకు అది కవిత్వం కాదన్నది కచ్చితమే. అయితే అందులో అక్కడక్కడా కవిత్వఛాయలు కనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది, అది వేరే సంగతి. అవధానికీ, పృచ్ఛకులకూ, ప్రేక్షకులకూ కవిత్వదృష్టి ఉంటే అందులో కొంత కవిత్వం పండే అవకాశం ఉంది. లేకపోతే లేదు. అయితే ఆ విద్య ప్రాధాన్యం అది కాదు.

    2. అవధానానికీ దొమ్మరి ఆటకూ పోలికలుండడమూ వాస్తవమే, అందులో వాదనకి తావు లేదు. అయితే, దొమ్మరాటను “తక్కువ”గా చూడాల్సిన అవసరం ఏముందో నాకు బోధపడటం లేదు. అది కూడా కష్టించి సాధించాల్సిన ఒక విద్య. మనుషులకి ఆహ్లాదాన్ని కలిగించే ప్రక్రియ. దానివల్ల సమాజానికి నష్టమేమీ లేదు. అలాంటి ప్రక్రియ జనాదరణ పొంది అభివృద్ధి చెందితే మంచిదే కదా. అవధానమూ అంతే.

    ఇక వ్యాసం చివరలో పేర్కొన్న కొన్ని విషయాల గురించి, పృచ్ఛకునిగా కొన్ని అవధానాలలో పాల్గొన్న అనుభవాల ఆధారంగా, నా అభిప్రాయాలు:

    1. పృచ్ఛకులను గద్దించో బతిమాలో ఒక క్లిష్ట సమస్యని మార్చడం అనేది నేను చాలా కొద్ది సందర్భాలలో మాత్రమే చూసాను. అంచేత అది ఒక “టెక్నిక్”గా ఎక్కువ ఉపయోగపడక పోవచ్చు, కేవలం అరుదైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప.
    2. “అవధాని గారికి కోపం వస్తే శాపం పెట్టేస్తారేమో!” అనే అనుమానం ఇతరుల మనస్సుల్లో కలిగించగలిగిన అవధానికి ఇంక ఎలాటి ఢోకా లేదు. – ఇలాంటిది నా కొద్ది అనుభవంలోనూ ఎప్పుడూ చూడలేదు.
    3. “మొదటిది పృఛ్ఛకుల్ని మంచి చేసుకోవటం. అవధానం మొదలుకావటానికి ముందుగా వాళ్ళని పలకరించి ఎవరు తనని పరీక్షించటానికి వచ్చారో ఎవరు తన మిత్రులో తెలుసుకుని మొదటి వర్గంలోని వాళ్ళని తనకు అనుకూలంగా తిప్పుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి.” – ఇలాంటిది కూడా నేనుప్పుడూ చూడలేదు.

    4. “అవధానం అయి వెళ్ళేప్పుడు “ఆహా! ఆ పద్యం ఎంత బాగా వచ్చింది!” అనుకునే ప్రేక్షకుల్ని ఇంతవరకు చూడలేదు నేను” – అలా అనుకున్న ప్రేక్షకులలో నేను ఉన్నాను. (వ్యాస రచయిత నన్ను “చూడలేదు” కాబట్టి అతనన్నది ఇప్పటికీ నిజమనే అనుకోవచ్చు :-)) నేనిచ్చిన ఒక సమస్యను గరికపాటివారు పూరించిన విధానమూ, న్యస్తాక్షరిని కడిమెళ్ళవారు పూరించిన విధానమూ చూసి, ఎంత బాగా వచ్చాయి పద్యాలు అని అనుకున్నాను.

    6. “ఇటీవలి కాలంలో జరుగుతున్న అవధాన కార్యక్రమాల వల్ల భాషకు ఏమీ ఉపయోగం కలక్కపోగా ఒకరకమైన కీడు కూడ జరుగుతున్నదేమో అనిపిస్తున్నది.” – ఎలాంటి కీడు జరుగుతోందో వివరిస్తే బాగుంటుంది.

    5. “ఏమైనా అవధాన ప్రక్రియ వల్ల భాషాసాహిత్యాల మీద ఉండే ప్రభావం గురించి ఎవరైనా సాధికారికంగా పరిశోధిస్తే బాగుంటుంది.” – అవును బాగుంటుంది. అలాంటి ప్రభావం (మేలు కాని, కీడు కాని) చాలా తక్కువ అని అభిప్రాయం. బహుశా ప్రేక్షకులకి పద్యాల మీద కొంత ఆసక్తిని పెంచే అవకాశం ఉంది, అంతే. అవధాన స్వరూపంలోనూ, సమస్యల పూరణల స్వరూప స్వభావాలలోనూ, కాలానుగుణంగా చాలా మార్పు వచ్చింది. అవధానం గురించిన ఏ పరిశీలన అయినా దీన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. గరికపాటివారి అవధాన పద్యాలు కొన్ని పుస్తకాలుగా వచ్చాయి. వాటిని పూర్వ కవుల అవధాన పద్యాలతో పోలిస్తే తేడా చక్కగా బోధపడుతుంది. వీటి ఆధారంగా యీ వ్యాసంలో పేర్కొన్న కొన్ని అంశాలని పునస్సమీక్షించు కోవలసిన అవసరం ఉంది.

  858. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/04/2012 3:48 pm

    లక్ష్మన్న గారూ !!

    ఇక్కడ చర్చ “అవధానాలలో కవిత్వం ఉందా లేదా” అన్నది కాదు. అవధానాల పరిమితీ ప్రయోజనమూ కూడా కాదు. అది దొమ్మరి ఆటే అయినా అందులో కవితా రసం చిప్పిల్లక పోయినా అది ఒక మేధో ప్రదర్శన. దాని సామాజిక ప్రయోజనం గురించి కాదు మనం చర్చించుకుంటున్నది. అది జెమినీ సర్కస్సే అయినా కూడా అందులో అందరూ పాల్గోలేరే? ఆ విద్యా ప్రదర్శనని అందరూ చేసెయ్యలేరే? ఆ “వీటి విద్యకి” కూడా దానిదే అయిన పరిమితీ ప్రయోజనమూ ఉన్నాయి. ఈ స్పష్టత దానిని గురించి చర్చ చేసేవారికీ దానిని విమర్శించే వారికీ దానిని అర్ధం చేసుకుని విశ్లేషణ చేసేవారికీ ఖచ్చితంగా ఉండాలి మరి.

    అవధానాలలో వారు కవిత్వం చెప్పుతున్నట్టు మాట్లాడినప్పుడు మాత్రమే మీరన్న ఇటువంటి మాటలకి చోటు. కాని అది కేవలం “పామర” రంజన కోసమే అయినా అప్పుడు కూడా అది ఒక కళే! దానిని సైతం అందరూ చేయలేరు. దానికి పద్య విద్యలోని మెలకువలు తెలియాలి. సమయస్పూర్తి ఇత్యాదులు అవసరం! ఒక పక్క తెలుగు భాషే అనేకానేక పరిణామాలలో గిరిగిళ్ళు తిరుగుతూ ఉంటే ఆ అవధానాలు అన్నవి ఏవో అందరూ చేసేయగలిగినట్టు, అదేమంత బ్రహ్మ విద్య కానట్టు దానిని బహిష్కరించేటంతటి తీవ్రతని చూపనఖ్ఖరలేదు. వీరేశలింగంపంతులు గారు ఒక పాపులర్ ఆర్ట్ గా దానిని ప్రదర్శించబోయి దాని పట్ల విసుగొచ్చి మానేసి ఉండొచ్చు. దానిని” దొమ్మరి ఆటగా” చెప్పిన చెళ్లపిళ్ల కవిద్వయం (ఇవాళ్టి యెన్నారైలు అమెరికాకి టికెట్టు ఇస్తే నాలుగు డబ్బులకోసం అవధానులు వెళ్ళినట్టే…) ఆనాడు “నానారాజ సందర్శనం” చేసుకుంటూ ఆ విద్య ద్వారానే నాలుగు డబ్బులు గడించుకునే పని చేశారు మరి.

    మనం వినోదం కోసం అని సర్కస్ చూసేందుకు పోమా? కానీ మనకి మనమే ఆ గెడ మీదికి ఎక్కి అదుపు తప్పకుండా నాలుగు అడుగులు వేయలేమే? ఆ అడుగులు వేసే అమ్మాయి కూడా సంవత్సరాలు శిక్షణ చేస్తేనే వచ్చిన వారికి ఇంత సంరంభాన్ని పంచగలదు. అందువలన మనం చేయలేని ఆ “దొమ్మరి ఆట” కూడా ఒక కళే. అక్కడ గడసానులున్నట్టే ఇక్కడ అవధానులూ ఉన్నారు అనే అనుకోండి పోనీ!! (ఆ గడసానులు) అదే ఆ అవధానులు ఆనాడు పంతులుగారు, వేంకటశాస్త్రి గారూ కావొచ్చు. ఈనాడు మరొకరు కావొచ్చు. దానివల్ల ఆనందం పొందే వారున్నారు కదా? అందులో “పండితులూ” “కవులూ” “మేధావులూ” లేకపోతే అక్కడ కూర్చుని ఆ అక్షర విన్యాసానికి అబ్బురపడుతూ వాటిని వీక్షించే వారికి కలిగే ఆనందానికి వచ్చే లోటేమీ లేదే? అలాంటప్పుడు ఆ “కవులూ మేధావులూ” వాటి పట్ల అంత గాఢమైన అసహనాన్ని మాత్రం ఎందుకూ కలిగి ఉండడం?

    తెలుగులో ఎక్కాలూ కిందినించి పైకి అప్పచెప్పే వాళ్ళున్నారు. ఇంగ్లీషులో స్పెల్లింగులు చెప్పే వాళ్ళున్నారు ఒక్క తప్పు రాకుండా. అలాంటి వాళ్లకి మీ అమెరికాలో డాలర్లలో ప్రైజ్ మనీలు సైతం ఉన్నాయి. వాటికి ఇంగ్లీషులో మెప్పు కూడా ఉంది. రష్యాలో జిమ్నాసిజం ఎంతో ఆదరణ ఉంది. మరి అలాంటి ఒక పనిని భాషని వాహికగా వాడుకుని “పామరులని” రంజింపజేయడానికే అనుకుందాం పోనీ, ఆ అవధాని గనక ప్రయత్నిస్తే దాన్లో ఎవరికైనా ఏమిటీ ఇబ్బందీ? ఒక సర్కస్ చూసినట్టే ఒక అవధానాన్నీ చూడండి. ఆ కళ “మనలాంటి వాళ్ళకోసం కాదు” అని అనుకునే “మేధావులు” వెళ్ళకండి. అంతేగానీ అవధానాలలోని అక్షరాల గారడీ మీద “మేధావులకి” దేనికీ వైరం? అవధానులనీ వారి విద్యనీ ఎకసెక్కెం చేసి “అబ్బే అందులో ఏముందీ” అని అనుకునే ముందు, “నేర్చుకుని అందరూ ఆ అవధానాలని చేసేయగలరని” రాసేసే ముందు .. అసలు అలాంటి ఒక విద్య కేవలం తెలుగులోనే ఉందనీ అది తెలుగు భాషకి మాత్రమే సాధ్యమైన ఒక అక్షరాల గారడీ అని కూడా గుర్తించండి.

    ఒకనాడు ఎంతో ఘనత వహించిన విప్రవినోదుల విద్యలు ఆదరణ లేకనే కదా కనుమరుగై పోయాయి! అలాగే ఎవరూ పట్టించుకోకపోతే ఈ అవధానాలూ కొద్ది కాలానికి కొట్టుకు పోవచ్చు. సూడో వెస్ట్రన్ ప్రభావంతో వాదనలు చేసుకుంటూ ఒక విద్యని పోగొట్టుకుని ఎవరైనా సాధించేది ఏముందీ? నిలుపుకోవడంలో గొప్పదనం ఉంది గానీ? ఆదరించడంలో ఘనత ఉందిగానీ! ఇలా మహా ఘనమైన పని చేసినట్టూ విద్యల్ని ఎగతాళి చేసే “మేధావుల” కన్నా విద్యల్ని తమదైన రీతిలో నిలుపుకునే “పామరులు” గొప్పవాళ్ళు కాదా? అలాకాదూ పోనీ అంతకన్నా మేలుగా ఆ విద్యని తీర్చి దిద్దుకోవడం ఎలాగో దాని గురించి ఆచరణ లో చేసికదా చూపాలీ? ఎప్పుడైనా ఒక మెరుగైన విమర్శ వలన ప్రయోజనం ఉంటుంది గానీ నిస్సారమైన విమర్శ వలన ఒక కళకీ మేలు లేదు. విద్యకీ లేదు. భాషకీ లేదు. అలాంటి విమర్శ దృష్టిలో వ్యతిరేకమైనది. దానివలన ఒరిగేదేమీ ఉండదు ఎవరికైనా!! ఆలోచించి చూడండి మీరు కూడా ఏ ధోరణి మంచిదో!!

    రమ

  859. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    12/02/2012 12:56 pm

    అవధానాల మీద ఇంత చర్చ జరుగుతోంది కదా అని కొన్ని పాత పుస్తకాలు తిరగేసాను.

    అవధాన శిరోమణులుగా ప్రసిద్ధి పొందిన తిరుపతి వేంకట కవులు 1891 లో తొలిసారిగా కాకినాడలో సంపూర్ణ శతావధానముతో రంగప్రవేశం చేయడానికి పదిహేడేళ్ళ ముందే అవధాన విద్యలో బుద్ధి పెట్టినట్టు వీరేశలింగం పంతులుగారి “స్వీయచరిత్ర” చెపుతోంది. వీరేశలింగం గారి కంటే కొంచెం వయస్సులో పెద్ద అయిన మాడభూషి వెంకటాచార్యులు గారు 1855 ప్రాంతాలకే అష్టావధానం చేసారని వినికిడి.

    పంతులుగారి “స్వీయచరిత్ర”లోని ఈ వ్యాఖ్య చూడండి.

    “ఊరక పామరుల వేడుక కొరకు దక్క దీని వలన లోకమునకు గాని, నాకు గాని, నిజమైన ప్రయోజనము లేదని భావించి తరవాత ఎందరెన్ని విధముల బ్రార్ధించినను మేధస్సునకు వేదనాకరమైన యష్టావధానమును జేయమానితిని” [స్వీయ 1936 సం. ముద్రణ. 93 వ పేజీ]

    తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్తిగారి ‘కథ-గాథలు’ రెండవ సంపుటంలో ” అష్టావధానమంటే?” అన్న వ్యాసంలో ” చిరకాలంనాడే మాకీ విద్య యందు అనాదరం” అని స్పష్టంగా ఉంది. అని చెపుతూ –

    దొమ్మరసాని యెంతయును
    దుడ్కుమెయిల్ గడనెక్కి యాడు పో
    ల్కిమ్మడి బల్మికల్మి కడు
    గీరీతికై యధానముం బొన
    ర్చు మ్మనుజుండు దీని నొక
    చోద్యముగా గణియింప బోక
    సత్సమ్మతిగా నెసంగు కవి
    తా రసమున్ జవిచూడు భూవరా!

    పాండిత్య విన్యాసాల ప్రదర్శన విద్యగా కాక, కవిత్వ దృష్టి ఏ మాత్రమైనా ఇందులో ఉండాలిరా నాయనా! అని వాపోవడం ఇక్కడ కనిపిస్తుంది.

    “సంచలనం” అన్న వ్యాసం సంపుటిలో శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు ‘అవధానం పామరులకే’ అన్నవ్యాసాన్ని ఈ క్రింది వాక్యాలతో ముగించారు.

    ” పద్యాన్ని ఆశువుగా చెప్పడాన్ని విని ఆశ్చర్యంగా తల ఊగించి ‘కవిత్వ భ్రమ’ తో దణ్ణం పెట్టే శ్రోత నిస్సంశయంగా పామరుడే!”

    విష్ణుభొట్ల లక్ష్మన్న

    Lucky.Vishnubhotla@Globalfoundries.com

  860. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/30/2012 12:46 am

    సామెతల ఆమెతల ప్రస్తావనలు మీకే కాదు కేవీయెస్ రామారావు గారూ!! అది మీలాగానే తెలుగు భాష వచ్చిన వారికందరికీ తెలుసు. మీ నోటి జోరు చెబుతున్నది మీకు వచ్చిన అసహనం వెనక మీరు చేసిన హేళన ఎంతగా మీకు స్వాభావికమో !! అలాంటివి మీకు బహుశా సహజం కావొచ్చును. మీ వ్యాసం మీద ప్రతిస్పందించేందుకు కుదరదని ఈమాట వారు ఏమీ చెప్పలేదు గనక పాఠకురాలిగా నేను నాకు అనిపించిన సంగతులని రాసేను. మీవ్యాసం ప్రచురించేరూ అంటేనే దాని మీద మిగిలిన వారికి కలిగిన భావాలని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అని. అయితే అవి మీకు నచ్చినట్టో… లేదా మీకు కావలసినట్టో ఉండvu కద? మీరు విమర్శని తీసుకోలేని అతి సున్నితమైన వారైతే అందుకు పాఠకులు ఏమి చేయగలరూ?? నా విమర్శ నా మాటలూ మీకు ఎలాగ అర్ధం అయ్యేయో అది మీ భావనలకి మీ సంయమనానికీ సంబంధించినది. ప్రతీ వ్యాఖ్యకీ ఒక సందర్భం ఉంటుంది. మీ వ్యాసమూ అక్కడే ఉంది. నా అభిప్రాయమూ అక్కడే ఉంది. కదా? “ఉలుకు” అంతగా మీరు పడనవసరము లేదు. నేను ఉన్న మాటే అన్నాను.

    ఇంక నేను- కవిత్వమూ వగైరాలు అందరికీ నేర్చుకుంటేనే పట్టుబడతాయని విష్ణుభొట్ల లక్స్మన్న గారన్న మాట మీద నా అభిప్రాయంగా నా జవాబు లో స్పష్టం గానే చెప్పాను. లక్ష్మన్న గారి వ్యాఖ్య మీద అది నా అభిప్రాయం. దాని పట్ల మీ “ట..” లతో మీరు ఏవేవో వదిరితే అది మీ స్వభావాన్ని చెబుతుందే తప్ప మరింకేం కాదు. అటువంటి నీరసమైన జవాబుని నేను లక్ష్య పెట్టను. నాకు విషయం ముఖ్యం. అన్ని “విద్యలూ అందరికీ అబ్బవు.” ఇది వాదనతో తేలే సంగతి కాదు. మీరు దీన్ని నిరూపించదలుచుకుంటే వ్యాసాలు రాయడం మాని ముందు దాన్ని నిరూపించడానికి ఆ అవధానాలేవో చేసి చూపండి. అప్పుడు కదా తెలిసేది అది అందరూ చేయగలరో లేక అది కూడా కొందరు మాత్రమే చెయ్యగలరో!! ఇందుకు ఈ మిగిలిన మాటలెందుకూ? నేను నమ్మడం లేదు అన్ని కళల్నీ లేదా అన్ని “విద్యల్నీ” అందరూ చేయగలరూ “నేర్చుకుని” అని. కాని దాన్ని మీరు నమ్ముతున్నారు కదా? అందుకే కద ఆ వ్యాసం రాశారు. మరి మీరు వెనకాడ్డం దేనికీ మీ మాటల్ని నిరూపించుకోవడానికీ?? మేము కూడా ఎదురు చూస్తాం అమెరికాలో ఉన్న ఆ ఒక చిన్న తెలుగుదేశాన తయారు కాగల ఒక మేలైన అవధాని కోసం!! ఆయన చతురతా ఇంకా అందులో తొణికే ఆ సమయస్పూర్తిల కోసం! ఆయన నోట చిందబోయే ఆ భాషా పాటవం కోసమూను. కానివ్వండి మరి.

    ఇంక, ఆ గురివింద సామెత అదేదో అది ఈ సందర్భంలో మీకే ఎక్కువ అతికినట్టు ఎక్కడా మీకు తెలియకపోవడం ఇంకా హాస్యాస్పదం కాదూ! మాటలు విలువైనవి. ఎప్పుడైనా వాటిని జాగ్రత్తగా వాడండి.

    రమ.

  861. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/29/2012 1:28 pm

    నాకు స్పష్టంగా అర్ధం కాని అనేక అంశాలలో ఇదీ ఒకటి లక్ష్మన్న గారూ!! “అమెరికా సందర్శన భాగ్యం”?? నాకు తిరుపతి వేంకట కవులన్న మాట “నానా రాజ సందర్శనం” గుర్తుకొస్తోంది. ఆ నానారాజ సందర్శన “భాగ్యాన్ని” ఇవాళ్టి ఈ యెన్ ఆర్ ఐ సంస్థలూ వ్యక్తులూ కాని ఆక్రమించలలేదు కదా ?? 🙂 రామారావు గారి గొంతు ఆ వ్యాసంలో ఒక హేళన ధ్వనితోనే ఉన్నదని ఒక పాఠకురాలిగా నేను చెప్పగలను. అదే నాకు అభ్యంతరకరం. ఇంక ఎవరో ఒకానొక అవధాని చేతల మీదా దాని పర్యవసానం మీదా మనం దానిని అవధాన విద్యకి అనుసంధానంగా చూడకూడదని అనుకుంటాను. మనం ఒక కళని ఒక కళగా మాత్రమే చూడాలి. అంతవరకే విమర్శకుని బాధ్యత. వ్యక్తుల మీద కలిగిన కోపాన్ని లేదా ఏహ్యతనీ ఆ కళారూపం మీద చూపడం సరి అయినది కాదు.

    ఇంక “సంగీత సాహిత్యాలు కొందరికి మాత్రమే పట్టుబడతాయి అన్న వాదనను ఖండించడానికి” ఈ మీ మాట సైతం కేవీయెస్ రామారావు వ్యాసం లోని గొంతు లాగానే ఉంది. 🙂

    నేను సంగీత సాహిత్యాలు అందరికీ పట్టుబడేవి కావని నమ్ముతాను. అవి నేర్చుకుంటేనే అబ్బేవి కావు కూడాను. పూర్వ జన్మ సుకృతమో కాదో నాకు తెలియదు గానీ 🙂 అందరూ ప్రయత్నం చేసేస్తేనే కవులూ గాయకులూ మాత్రం అయిపోలేరు. అలాగే విమర్శకులు కూడా! అది వ్యక్తిలో అంతర్లీనంగా ఉన్న ప్రజ్ణ, లేదా ప్రతిభకి సంబంధించిన విషయమే!! మనం ఒప్పినా మానినా ఇది నిజం!! మనకి నచ్చినా నచ్చకున్నా కూడా ఇది నిజం!! అందరూ పోటీపడితేనే అబ్బేవి కావు కళలూ కవిత్వాలూ సంగీతాలూను. అలా ఎవరన్నా భావిస్తే దానిని ఒక ఉడుకుమోతుతనం గానూ ఒక అసూయాపరత్వం గానూ మాత్రమే అనుకోవాలి తప్ప యదార్ధంగా నిరూపించలేము. అదే నిజమైతే తెలుగు దేశానా ఈ పాటికి అల్లసాని పెద్దనలూ కృష్ణ శాస్త్రిలూ పుంఖాను పుంఖంగా తిరుగుతూ ఉండేవారే 🙂 యుగానికి ఒక మహా కవి ఉదయిస్తాడు. సూర్యుని లాగే!! మిగిలిన వారు ఆ చాయాపహారులు మాత్రమే!!

    ఇంక అవధానుల మీద కలిగిన కోపాన్ని అవధాన విద్య మీదికి మళ్ళించుకోవడం అర్ధం లేని పని. “రోషము కల్గినన్ మమ్ము గెల్వుడు” అన్న చెళ్లపిళ్ల కవుల పద్యమే అవధాన విద్యా గరిడీలో విసిరిన సవాల్! అలాంటి సవాల్ విసరకల్గిన అవధానులు ఇవాళ లేకపోతే అది అవధానుల సమస్య కానీ ఆ విద్యది కాదు. ఇంక అమెరికాకి ఆహ్వానాలూ వారికి “అబ్బిన” లక్ష్మీ కటాక్షాలూ వారిని పిలిచిన వారికి తెలిసిన విషయాలే!! అదేమన్నా సంభావనలా?? వారు [అవి ఎలా చేసినా సరే :)] అవధానాలు చేయించుకుని మెచ్చి ఇచ్చిన కానుకలే కదా?? అంత సునాయాసమైనదే అయితే ఆటాలూ తానాలూ ఆయా అవధాన్లని పిలవడం దేనికీ?? వారిలో ఎవరో ఒకరు అవధానాలు మొదలెట్టి అందరూ సునాయాసంగా అవధానం చేయవచ్చును అని నిరూపించి ఉండవచ్చును కాదా?

    రమ.

  862. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/26/2012 2:30 pm

    అవధానాలని గురించిన పరిచయం కన్నా అవధానాలు చేయడం ఏమంత బ్రహ్మ విద్య కాదు సుమా అన్న గొంతుని ధ్వనిస్తూ కాస్త ఎగతాళి గొంతుతో రాసినట్టున్న వ్యాసం లాగా ఉంది. మొదటగా అసలు అవధానం అన్నది ఒక క్రీడ మాత్రమే అన్నది గుర్తుంచుకున్నప్పుడు ఇంత హేళనాస్వరం ఆ అక్షర క్రీడ మీద ఉండనవసరం లేదు. ఏ అవధానీ తాను అవధానం చేస్తున్నప్పుడు అపూర్వమైన కవిత్వాన్ని అందిస్తున్న భ్రమలో ఉండడనే అనుకుంటాను. ఆశువుగా పద్యాన్ని అల్లి ప్రేక్షకులని తెనుగు భాషా చాతుర్యంతో రంజింపజేయడం మాత్రమే అవధాన విద్య లోని సాఫల్యం అని అనుకోవాలి. ఆ మేరకు అవధాని తన రంజనలో ఎంత నైపుణ్యాన్ని చూపిస్తే అంత విజయం పొందినట్టే లెఖ్ఖ! పైగా అవధాన విద్య తెలుగువారి సొత్తు. అందులోని సొగసులని ఎత్తి చూపగల చతురత ఈ వ్యాస కర్తకి అంతగా పట్టుబడినట్టు లేదు. అవధానం అప్పటికప్పటి కాలక్షేపం మాత్రమే! అందులో మంచి పద్యం రూపు గడితే అది గొప్ప విషయమే అయినా అవధాన విద్య మంచి కవిత్వానికో లేదా మంచి పద్య విద్యా ప్రదర్శనకో ఉద్దేశ్యించబడినది కాదు గనక అందులోంచి లేని వాటిని లేవంటూ వాపోవడం దండగ 🙂 మొత్తం వ్యాసం అవధానం “ఏమంత గొప్పవిద్య కాదని” చెప్పడం కోసమే అయితే అసలీ వ్యాసం ప్రయోజనమే శూన్యం! పైగా అవధానం చేసేవారికి ఉచిత సలహాలతో వ్యాసం రాయడం చాపల్యం లాగా గోచరిస్తోంది. ప్రతీ విద్యకీ దానిదైన ఆహ్లాదమూ దానిదైన ప్రయోజనమూ దానిదే అయిన శ్రోతల సమూహమూ ఉంటుంది. మనం అందులో భాగం కానంత మాత్రానికే అందులో ఏమీ గొప్ప లేదని అనుకోనేలా?? అవధానాలు క్రమంగా కనుమరుగైపోతున్న విద్యగా చూడాల్సిన కాలం వచ్చేసినప్పుడు ఆయా విద్య మరి అందుకు తగిన ఆయా శ్రోతల కోసమే కదా రూపొందుతుంది? అందుకు అవధానిదే నీరసత్వం ఎలా అవుతుందీ?? పాండిత్య ప్రకర్షకి తగిన పృచ్చకులు కూడా ఉంటే కదా అది రక్తి కట్టగలిగేదీ??

    ఇహ అంత గొప్ప విద్యగా వ్యాస కర్తకి అనిపించనట్టున్న ఈ అవధానంలో కవయిత్రులు ఎక్కడా కనిపించరని వ్యాసకర్త పరిశీలించి అందుకోసం ఎదురుచూడటం దేనికో? అప్పుడు కవయిత్రులు ఎలా అవధానాలు చేయడానికి చాలరో తేల్చి చెప్పడానికి మరో వ్యాసం రాయడానికి కాబోలు! ఒక పక్క అవధానాలు పెద్ద కష్టమైనవి ఏమీ కావని చెబుతూ వాటి పని పట్టడానికే అన్నట్టు వ్యాసాన్ని రూపొందించి మళ్ళీ అలాంటి అవధానాలలో స్త్రీలు కొరవడినట్టు చూపించి వారి రాక కోసం ఎదురుచూడటమ్లోని ఈ “ఆత్రుత” మాత్రం వ్యాసకర్త లోని ద్వంద్వ వైఖరికి ఒక నిదర్శనం లాగా ఉంది. మరి కేవీయస్ రామారావు ఈ సారి అవధానం చేయడం లోని క్లిష్టతా, ఘనతల మీద మరొక మంచి వ్యాసం రాస్తేనో లేదా గొప్ప అవధానాన్ని తానై నిర్వహించి రక్తి కట్టిస్తేనో తప్ప మరి ఈ లోటు తీరదు. అందాకా నచ్చినా నచ్చకున్నా ఉన్న అవధానులతో సరి పెట్టుకోక తప్పదు. ప్రపంచమ్లో మరెక్కడా కనిపించని అవధాన విద్య తెలుగు వారికే చెందినదన్న ఒక్క వాస్తవాన్ని గాని, ఒక్క సంతుష్టి వాక్యాన్ని గానీ ఈ వ్యాసం ప్రతిఫలింప జేయలేకపోవడమే ఈ వ్యాసంలో కొట్టొచ్చినట్టు కనిపించే లోటు. రామారావు తదుపరి వ్యాసాలలో ఇటువంటి కేవల రంధ్రాన్వేషణా దృష్టిని తగ్గించుకుంటారని అనుకుంటాను.

    రమ.

  863. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    11/24/2012 11:36 pm

    [This post was edited – Eds.]

    కథలు, వ్యాసాలు, కవితలు, ఎడిట్ చేసినప్పుడు పాఠకులకు చెప్పరు కదా! మరి ‘అభిప్రాయాలు’ ఎడిట్ చేసినప్పుడు ఆ విషయం ప్రత్యేకంగా వెల్లడి చెయ్యటానికి కారణం?

    లైలా

  864. తిరణాల గురించి తః తః గారి అభిప్రాయం:

    11/21/2012 4:14 pm

    ‘కొబ్బరి నూనెల ఆడ పిల్లలు
    చుట్టూ గాలిలో గేలాలెన్నో”

    కాసేపు మీరూ ఒక కొబ్బరి నూనె ఆడ పిల్లై రాశారు ఇంద్రాణీ. చాలా అందంగా ఉంది. ఇంతకు ముందొక సారి ఈమాటలొ మీ కవిత చదివి ‘ గరిక పేని ఏనుగును కట్టేయగల కవయిత్రి ఇంద్రాణి’ అని నా అభిప్రాయం చెప్పినట్టు గుర్తు. ఇప్పుడూ అంతే.
    అభినందనలతొ
    తః తః

  865. నువ్వూ – కాలం గురించి satish గారి అభిప్రాయం:

    11/19/2012 7:00 am

    చాలా బాగుంది సార్ మీ కవిత. మీ కవిత చదివిన నాకే ఇంత ఉత్సాహంగా ఉంటే రాసేటపుడు మీ ఉత్సాహం కొలవటానికి కొలమానం ఉంటుందా. కవిత అంటే ఏమిటో తెలియని నా లాంటి వారిని సైతం కదిలించిన మీ కవితా శైలిని పొగడడానికి నాకు పదాలు రావటం లేదు. నా అభిమానం తెలపటానికి ఇంతకన్నా ఏమి రాయాలో ఎలా రాయాలొ అర్ధం కావటం లేదు.

  866. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    11/14/2012 5:52 pm

    శ్రీశ్రీ గురించి ఈ పొగడ్తలు చూసినప్పుడల్లా, అదే ఆశ్చర్యం కొత్తగా మళ్ళీ మళ్ళీ కలుగుతూ వుంటుంది.

    అక్టోబరు 29, 2012 నాటి ఆంధ్రభూమి సాహితీ పేజీలో, మణి మేఖల గారి, “శ్రీశ్రీని మోసే వీర భక్తులూ…. ఆలోచించండి!” వ్యాసం చూడండి మరి కొన్ని వివరాలకి. ఈ వారం ఎ. రజాహుస్సేన్ రాసిన వ్యాసం కూడా చూడండి ఆంధ్రభూమిలో. శ్రీశ్రీ రాసిన గొప్ప కవిత్వానికి ఎలా మెప్పుదలలు లభిస్తాయో, అలాగే ఆయన రాసిన చెత్తకీ, చేసిన చెత్త పనులకీ విమర్శలు లభిస్తాయి.

    శ్రీశ్రీ రాసిన “అనంతం” పుస్తకం విషయంలో రంగనాయకమ్మ గారు రాసిన ఉత్తరం, దానికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన అవక తవక జవాబూ, దానికి రంగనాయకమ్మ గారి స్పందనా – ఈ విషయాలన్నీ, రంగనాయకమ్మ గారు రాసిన, “మానవ సమాజం (నిన్నా – నేడూ – రేపూ)” పుస్తకంలో వున్నాయి (పేజీలు: 231-233). శ్రీశ్రీ, ‘అనంతం’ పేరుతో ‘ప్రజాతంత్ర’ వార పత్రికలో 1975 నించీ చాలా కాలం పాటు ‘ఆత్మ కధ’ రాశారు. అందులో ఒక వారం శ్రీశ్రీ రాసిన విషయాలు చూసి, రంగనాయకమ్మ గారు ఆ పత్రిక లోనే నవంబరు 1, 1975 సంచికలో ఒక ఉత్తరం రాశారు. దానికి శ్రీశ్రీ ఇచ్చిన జవాబు జనవరి 25, 1976 సంచికలో వచ్చింది. ఆ జవాబు చూసి, రంగనాయకమ్మ గారు మళ్ళీ ఫిబ్రవరి 8, 1976 సంచికలో ఇంకో ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాల్లో, శ్రీశ్రీ చేసిన వ్యభిచారం గురించీ, శ్రీరంగ నీతుల గురించీ, మార్క్సిస్టు పేరుతో చేసే మోసాల గురించీ ప్రశ్నలున్నాయి. వాటికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన దొంగ జవాబు ప్రస్తావనా, ఆ జవాబుపై వచ్చే ప్రశ్నలూ, అన్నీ వున్నాయి. “అనంతం” పుస్తకంలో, మణి మేఖలు గారు ప్రస్తావించిన వాటి కన్నా ఘోరమైన విషయాలు వున్నాయి. “పాఠకులందరూ తెలివి తక్కువ వాళ్ళూ, ఏం రాసినా, ఏం చేసినా అడగరూ, పైపెచ్చు భక్తితో గొప్ప భజన చేస్తారూ” అనే ధీమా ఈ పుస్తకంలో అడుగడుగునా కనబడుతుంది.

    రాతల్లో మాత్రమే అభ్యుదయాన్ని చూపుతూ, ఆచరణలో దాన్ని పట్టించు కోకుండా వుండే రచయితలకూ, కవులకూ భజనలు దొరుకుతాయేమో గానీ, నిజమైన గౌరవం మాత్రం దొరకదు. వారిని పాఠకులు కల కాలం నమ్మరు. వారు ఎంత గొప్ప గొప్ప విషయాలను చెప్పినా సరే, చెప్పిన విషయాలను వారే పాటించ నప్పుడు, “గొప్ప చెప్పారులే, గొప్ప గొప్ప కవితాత్మక పద్ధతుల్లో, ఎవరూ కని పెట్టని విషయాలని!” అని తీసి పారేయాలనిపిస్తుంది. రాసే వారికి చేతలు ఎంత ముఖ్యమో అర్థం కాకపోతే, ఈ అగౌరవాలు తప్పవు.

    జె. యు. బి. వి. ప్రసాద్

  867. నువ్వూ – కాలం గురించి mangu sivaram prasad గారి అభిప్రాయం:

    11/09/2012 12:30 pm

    “కాలం నవ్వే ముసిముసి నవ్వులు /నీకెప్పటికీ వినబడవు,” అనే మాటలో కాలం యొక్క స్వరూప స్వాభావాలను అర్థం చేసుకోవడంలో మనిషి విఫల మైయ్యాడనే ధ్వని ఉంది. కవిత్వం అందమైన పదాల
    పోహళింపు మాత్రమే కాదు, శబ్ధార్ధాలకు శయ్యాసౌభాగ్యం ఉండాలి. అప్పుడే కవిత అలరారుతుంది.

  868. 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    11/08/2012 9:30 pm

    మరో కవిత అందించు:-), అదే నీ రిప్లై తులసి!

  869. 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి ANJU RAJ గారి అభిప్రాయం:

    11/05/2012 5:26 am

    హలొ తులసి నీ కవితలు మొదటి సారిగ చదివాను. చాల బాగున్నవి అనే మాట చాల చిన్నది. మనసు లోతుల్లోని ఏవో జ్ఞాపకాలను గుర్తుతెస్తున్నవి. నాకు ఇంతవరకు తెలియదు, నీవు కవిత రాస్తావని. 2012 బ్రౌన్ అవార్డ్ కు గాను నీకు నా అభినందనలు. నీ కవితలు చదివిన తరువాత నీ లోని భావుకతకు నేనేమని వర్ణించిన అది వెలవెలపోతుంది. మా అందరి శుభాభినందనలు.
    ప్రేమతొ
    బుజ్జి వదిన

  870. నువ్వూ – కాలం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    11/04/2012 9:36 pm

    మూలా గారు,

    “ఆకులన్నీ రాల్చేసుకున్న చెట్టుకొమ్మలా
    ఆకాశాన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటావు”

    బహుశా ఆకులన్నీ రాల్సేసుకున్న ఆ చెట్టు కొమ్మ ఒక యోగ నిద్రలోకి వెళ్ళిపోయిందేవో నండీ. మళ్ళా వచ్చే ఆ వసంతం లో తన గ్నాపకాలని చిగురెయ్యడానికి. ఆకాశంతో దానికి పనేవిటట? ఇక ప్రశ్నలు ఎక్కడ. ఆకురాలు కాలం లో చెట్లన్నీ వెలుగుల్నీ, చీకట్లని వదిలేసి ఒక మహా సుషుప్తిలోకి వెళ్ళిపోతాయి కదా, వాటికి టార్చిలైట్లతో పనేవిటి? చీకటి, వెలుగు తెలియని ఆ లోకంలో నిన్నటి గ్నాపకాలని రేపటి కలలుగా మార్చే కాలం లో చెట్టయినా, మనిషయినా, దేవుడయినా, దెయ్యవయినా ఆ నిర్వాణపు స్టేటస్ లో ఒక రేపటి కలని సృజిస్తారు కదా. నలుపు, తెలుపు, రాత్రి, పగలు, ఎదురు చూపులు, ప్రయాణాలు అన్నిటినీ విసర్జించిన ఆ స్థితి కాలం నవ్వులని గమనిస్తుందా?

    అందం వుంది, కానీ నాకు అర్థం మాత్రం దొరకలేదు మీ కవితలో.
    -కిరణ్

  871. తిరణాల గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    11/04/2012 1:48 am

    ఇంద్రాణి గారు, చాలా బాగుందండీ మీ కవిత, అయితే
    మీరు మర్చిపొయ్యారని నేననను. కానీ మీరు ఆడ పిల్లలు కదా,

    అర్థ్దణా అణా నుంచి, పావలా అర్థ దాకా డైమన్ డప్పాలు,
    దేవుడి బొమ్మల మీద పందాలు, మూడు కప్పుల
    క్రింద కుదేలయ్యే జోబీలో డబ్బులు, నిముషం లో
    ఆవిరయిపోయే రకరకాల జూదాలు, తళ తళ మెరిసిపొయ్యే
    లైట్ల మధ్యలో వెలిగి నలిగి పొయ్యే అందాలు, తెలిసీ తెలియని
    వయస్సులో వున్న కుర్రాళ్ళం కదా కళ్ళతో చూసి
    నోటితో జొల్లు కార్చుకోవటవే, వీధి వీధి వెలిగిపోతున్న
    ఆ క్షణం లో బతుకులో ఒక గ్నాపకాన్ని
    సేవ్ చేసుకుంటూ, నిద్రే రాని ఆ తిరుణాళ్ళ రాత్రిని
    ఏటికేడంతా గుర్తు చేసుకుంటూ, ఈ అమెరికాలో
    ఆ గ్నాపకపు గుర్తులు నేను చెబుతాను
    అయినా ఈ పిల్లకాయలకి అవి అర్థం కావు కదా
    అదొక విరసిన స్వర్గం, అదొక రాలిన మననం
    -కిరణ్

  872. నువ్వూ – కాలం గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    11/02/2012 8:00 pm

    ***ఆకులన్నీ రాల్చేసుకున్న చెట్టుకొమ్మలా
    ఆకాశాన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటావులేదా
    టార్చిలైటు వేసి
    చీకటిని వెతుక్కుంటుంటావు ****
    అద్భుతమయిన కవిత!

  873. 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి కెక్యూబ్ వర్మ గారి అభిప్రాయం:

    11/02/2012 12:32 pm

    మా ఆలూరి భుజంగ రావు గారికి బ్రౌన్ పురస్కారమిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. విరసం సభ్యుడిగా వున్న ఆయన నిబద్ధత గల అనువాదకులు రచయిత. వృద్ధాప్యంలో వున్న ఆయనకు ఈ గుర్తింపు మంచి ఆసరా.

    తులసి గారికి ఇస్మాయిల్ అవార్డ్ రావడం సంతోషదాయకం. మీరు స్పృశించిన కవితా పాదాలు మనోహరంగా వున్నాయి. తులసి గారికి శుభాభినందనలు.

  874. 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి prasuna గారి అభిప్రాయం:

    11/02/2012 9:04 am

    హృదయ పూర్వక అభినందలు తులసి గారూ. మది స్పందనల్లోంచి పొంగే కవిత్వం ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ కవిత రాసినా అందులో మది స్పందనలు స్పష్టంగా కనిపించి పాఠకులని కూడా ప్రభావితం చేస్తాయి. మీకు ఇస్మాయిల్ అవార్డ్ రావటం ఎంతో సంతోషంగా ఉంది.

  875. నువ్వూ – కాలం గురించి రఘోత్తమ రావు గారి అభిప్రాయం:

    11/02/2012 2:40 am

    //ఏవి చేరాల్సిన చోటికి
    వాటిని చేరుస్తూ కాలం//

    ఇది తెలిసిన నిజమే ఐనా మళ్ళీ తెలుసుకోవడంలోను అందులోనూ కవిత్వం ద్వారా తెలుసుకోవడంలో ఓ గమ్మత్తు ఉంది.

    కవిత బావుంది సుబ్బూ!

  876. 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి Tulasimohan గారి అభిప్రాయం:

    11/01/2012 12:58 pm

    భూషణ్ గారు
    ధన్యవాదాలండి.
    తులసిదళాల్లో మీరెన్నుకున్న వాక్యాలన్నీ నాకెంతో తృప్తినిచ్చినవి, సరిగ్గా నా భావానికి పదాల జతొచ్చినట్టుగా అనిపించినవి. నిజమైన భావం నుండే సిసలైన కవిత్వం వస్తుంది. అప్పుడే పాఠకుడిని సూటిగా చేరుతాయి అనేది నేను నమ్మేవాటిల్లో మొదటిది కవిత్వపరంగా. మీరు కూడా అవే ఎంపిక చేసుకోవడం తో మరోసారి నిరూపింపబడింది

  877. భిక్షువు గురించి haribabu గారి అభిప్రాయం:

    10/23/2012 2:59 am

    మీ కవితకు నేను దాసోహం
    పనిని సైతం త్యజించి
    పట్టెడు అన్నం పెట్టమని
    గుండె పిండి మరి చెప్పారు

  878. ఇటు నేనే – అటు నేనే గురించి తః తః గారి అభిప్రాయం:

    10/22/2012 11:20 pm

    తీరూ, తీరమూ కవితలొ ఉన్నాయి పడవా, తెడ్దూ చదివే వాళ్ళు తెచ్చుకొవాలి

  879. ఇటు నేనే – అటు నేనే గురించి TRK గారి అభిప్రాయం:

    10/22/2012 5:14 pm

    వచన కవిత్వం వొక పట్టాన అర్ధంకాదు. కవి హృదయం పట్టటం కష్టమే!! వచన కవిత్వానికి వొక తీరే లేదా??

  880. భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్ గురించి P.LakshmiNaryana గారి అభిప్రాయం:

    10/18/2012 9:47 am

    భావ కవిత్వ పంథాని తప్పు పట్టిన సమయంలో తాను ఇంకా గొప్ప కవిత్వాని రాసుండచ్చు అనేది నా అభిప్రాయం.

    అహంకారం మనసు పొరల్లో ఉందా లేదా అనే విషయాలను పక్కన పెడితే, అది భావమో లేక అహంభావమో కాదేదీ కవిత కనర్హం, అనే విషయాన్నే పరిగణలోకి తీసుకుంటాడు కవి.

    ఒక కవిత్వం అంటే ఏంటి? ఒక భావన, జీవితంలో ఆ క్షణంలో పొందిన ప్రేరణ, ఆ క్షణంలో కవి పొందిన భావన మనం పూర్తిగా పొందలేకపోయినా, తాను ఆ క్షణంలో పొందిన భావాన్ని చెప్పడమే కవి బాధ్యత.
    దాన్ని పట్టుకుని అనుభవించక, ఇది భావ కవిత్వం అని మసిపూసి మాట్లాడడం ఒక వ్యర్థం. ఈసడింపులను సడలించి, కవిగా బతకడం మిన్న. పట్టాభి కవిత బాగాలేదు అనడం లేదు. నా అభిప్రాయంలో ఒక మార్గాన్ని దూషించి చేసే మార్గం వ్యర్థం, కవిత్వం బాగుంటే అది అమోఘం కానీ దాని మార్గం వ్యర్థం అనడం కూడదు.

    //ఫిడేల్ రాగాల డజన్ భావకవిత్వానికి ‘దహన సంస్కారం’ చేసింది. ఇంక ఆ తరువాత ప్రతిభావంతులెవ్వరూ భావకవిత్వం రాయలేదు.// ఇది తప్పని నా భావన, భావ కవిత్వం అనేది మనస్సులో ఉండిపోయింది. అయినా ఒక కవిత్వాన్ని లేదా ఆర్ట్-ని దహన సంస్కారం చేసే శక్తి దేనికీ ఉండదు. ఆఖరికి దాని సొంతానికే ఉండదు. పట్టాభి కవిత్వంలో అర్థాన్ని ఆస్వాదించడం మంచిది, దాన్ని పట్టుకుని ఏదో భావ కవిత్వాన్ని ధ్వంసం చేసింది అనుకోవడం ఒక పక్షపాత భావనే.

    – ప్రతి దాన్నీ ప్రేమించే శక్తి కొన్నింటికి ఉండదు ,కొన్నిటికి ఉంటుంది – ఉన్నది కవిత్వం లేనిది పైత్యం.

  881. ఇటు నేనే – అటు నేనే గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    10/17/2012 12:30 pm

    నా వ్యాఖ్య పానకంలో పుడకలా అనిపించొచ్చు కాని కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, కవితలోని “ఆచార్య సోమనాథ” ఎవరు? చుక్క గుర్తు పెట్టి మరీ యిస్తే ఆసక్తి కలిగింది.

  882. ఒక సరళ నిర్వచనం గురించి NARAYANA గారి అభిప్రాయం:

    10/01/2012 9:54 pm

    ఆదిత్య గారు,

    ఎంతో ఓపికగా నా కవితను సమీక్షించడమే కాక, మరొక చక్కని కవితను ఉదాహరణగా ఇచ్చారు. ధన్యవాదాలు. చక్కని చిక్కని ఉపమానాలను పదచిత్రాల పూర్వకంగా బాగా అల్లింది. నేను తప్పకుండా మీరు చెప్పిన విషయాలను పరిశీలిస్తాను.

    ధన్యవాదాలు.
    నారాయణ.

    గౌతం గారు,

    మీ తెలుగు భాషాభిరుచికి జోహార్లు. మీ అభిరుచికి ఈమాట ఒక మంచి వేదిక. ఫేసుబుక్కులో మీరు కేవలం లింక్ (URL) ని మాత్రమే షేర్ చేసుకుంటారు కాబట్టి ఈమాటకు మరియు రచయిత (లేదా) కవి కి ఏమీ అసౌకర్యం ఉండదనే అనుకుంటున్నాను.

    ధన్యవాదాలు,
    నారాయణ.

  883. ఒక సరళ నిర్వచనం గురించి gouthampullela గారి అభిప్రాయం:

    10/01/2012 3:19 am

    నారాయణ గారు ,
    చాలా ఆనందంగా ఉన్నది “ఈమాట” చూసిన తర్వాత. నేను మీలా మేధావి వర్గానికి చెందిన వాడను కాను. మీలా కవితలు రాయలేను, పద్యాలు రాయలేను, పదాలని కూర్చలేను, నాకు తెలిసినదల్లా తెలుగు భాష నా మాతృభాష. నా తెలుగు తల్లికి నాకు చేతనయినంత చెయ్యాలన్న ఒక్క సంకల్పమే ఈ రోజున నన్ను ఇక్కడ ఉంచింది. మీరు అనుమతి ఇస్తే నేను ఫేస్‌బుక్ లో మీ ఈ కవితలని, పద్యాలని రచనలని తెలుగు జాతికి మరింత చేరువ చెయ్యటానికి ప్రయత్నం చేస్తాను.

  884. ఒక సరళ నిర్వచనం గురించి aditya reddi గారి అభిప్రాయం:

    09/30/2012 8:01 pm

    నారాయణ గారు ,మీరు దృశ్యాలను స్పురింప జేసే పదజాలం విరివిగా వాడిన మాట నిజమే.

    మనుషులంటే…
    అక్వేరియంలో ఈదులాడే
    ….
    పగటికి రంగులు నింపే సీతాకోకచిలుకలు
    చీకటిని వెలిగించాలని తాపత్రయపడే
    మిణుకు మిణుకు మిణుగురు పురుగులు

    స్వేచ్ఛగా రెక్కలు విప్పిన పావురాళ్ళు… వగైరా వగైరా.

    నేను విన్నది… ఒక మిత్రుడి కవిత కొంత భాగం:

    లోకం …వెలుగు చీరను విడిచి
    చీకటి పాతను చుట్టుకుంటున్న సమయం
    తనపిల్లలను తనేతినే పాములా
    అలల నాలుకలతో
    బుసలు కొడుతుంది సముద్రం
    తీరం పై
    పగిలిన దాక లాంటి గుడిశ లో
    ఎండు చేపల్లా ఉండచుట్టుకు పడుకున్నపిల్లలు
    కడుపాకలి కంట్లో యిసుకై కరకర లాడుతుంటే
    ….
    నీటిపై తాబేలులా కదలాడిన పడవను
    తెడ్డు సాయం తో ఒడ్డుకు చేర్చే సరికి
    చచ్చిన ఏనుగులా చతికిలబడింది

    ఉపమానం వాడటంలో మెళుకవలు, సందర్బోచితంగా వాడటము ,కొత్త కొత్త ఉపమనాలు వాడటము కవితను బలపరుస్తాయి, కదా.

  885. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    09/29/2012 1:04 pm

    శ్రీధర్ గారూ, శ్యాం గారూ! మీ అభిప్రాయంలో ఆవేశం పాలు మరీ అధికమైనందువలన కాబోలు, మీరు వ్యక్తపరిచిన విషయం సంపూర్తిగా అర్థస్ఫూర్తిని ఇవ్వడం లేదు.

    సాహిత్యం అన్న పదం ఏ రకమైన సాహిత్యానికైనా వర్తిస్తుంది. కీర్తన కారులు రాసిన మాటలకి వేరే మరో పేరంటూ ఉండదు కదా?? అందునా ఆ వాగ్గేయకారుడు మహా కవులని తలదన్నిన మహా “మాటలెన్నో” [ ఇది మీరు వాడిన మాట సుమా ! ] వాడి వేల సంకీర్తనలని పాడినప్పుడు వాటికి ఒక సాధారణ మైన ఏదో “మాట” ఒకటి వాడటం పొసగదు. తెలుగులో లిరిక్ కి దగ్గరగా ఉన్న మరో పదబంధం వాడినా కూడా ఆయన రాసింది గాఢమైన కవిత్వం. అందువలన గేయ/ పద/పాటల/కృతుల సాహిత్య కారుడిగా కూడా అన్నమాచార్యుడు ముఖ్యమైన వ్యక్తి, తెలుగు సాహిత్యంలో! అందువలన ఏ రాగంలో ఆయన అక్షరాలకి సంగీతకారులు నిరాకార సంగీతాన్ని సమకూర్చినా ఆయన పాడీన ఆ సాకార భావం/కల్పన, విన్న/చదివిన వారి మనసుని గాఢంగా వశపరుచుకుంటాయి. దీన్ని రాళ్లపల్లి వారు స్పష్టంగానే గుర్తించారు. శ్రీపాద వారు అంతగా గమనించలేదు. ఇందుకు కారణం రాళ్లపల్లి సాహిత్యం తెలిసిన పండితులు. శ్రీపాద ఒక్క సంగీతంలో మాత్రమే పండితులు.

    ఇక్కడ అసలు విషయం మరుగున పడిపోయి వేరే విషయాలు ముందుకి చర్చకు వస్తున్నట్టు గా అనిపిస్తున్నది. మీభావం ప్రకారం సైతం మీ వాక్యాలలో ఉన్న అనేక “ఏమో” లు ఇవే చెబుతున్నాయి. మీరు కూడా సాహిత్యాన్ని పక్కకి పెట్టడం భావ్యం కాదనే కదా అంటున్నారు. మరి గొర్తి బ్రహ్మానందం సైతం అదే కదా అన్నది. మీరు ఆయనతో ఎక్కడ విబేధించారూ? బహుశా రాళ్లపల్లి వారి మీద ఆయన అన్నమాట కేమో!

    ఆమాటలో తప్పనిసరిగా తొందరపాటు వినిపిస్తోంది నిజమే! కానీ అది సాహిత్యాన్ని పక్కకు పెడితే కవులకి లేదా కవితాభిమానులకి వచ్చే కోపంలో భాగం గా మాత్రమే కదా గ్రహించాలీ? శ్రీపాద పినాకపాణి గారికి సంగీతం ప్రధానమూ, కృతి లోని సాహిత్యం అటు తరవాతాను. కానీ తెలుగు కృతి మీద ప్రేమ ఉన్న ఎందరికో సంగీతంతో పాటు అందులోని సాహిత్యమూ అంతే ముఖ్యమైనదని ఈ చర్చల పర్యవసానం! ఇందులో “సాకార భావం” సైతం ఆస్వాదించ గలిగిన తెలుగు వారు తప్పనిసరిగా సాహిత్యం వైపు మొగ్గే వీలుంది. శ్రీపాద పినాక పాణి గారు మొగ్గలేదు. అందుకు పైన ఒక అభిప్రాయంలో అరుణ గారు చెప్పినట్టు ఆయన మీద తంజావూరి బాణీ, అలాగే ఆయన మిక్కిలి గౌరవించిన ఆ అయ్యర్ గురువుల ప్రభావమూ రెండూ మరీ అధికం గా ఉండటమే! ఈ విషయం లో వారు తెలుగు భాష కన్నా, తమిళుల రాగ భావం వైపు/ నిరాకార భావం వైపే మొగ్గారు మరి. తమిళులు ఎలా అయితే తెలుగు భాష మీద శ్రధ్ధ చూపించరో అలాగే శ్రీపాద పినాక పాణి గారు సైతం శ్రధ్ధ చూపించలేదు అని ఆయన అన్నమాటలు మనకి చెబుతున్నవి కావా??

    మీరు ఇచ్చిన నిర్వచనం ప్రకారమే సాహిత్యం లో ఉపమానాలు కల్పన వగైరాలు ముఖ్యమైనవి. అవే పదకర్త అయిన అన్నమయ్యకి ప్రేరణని ఇచ్చిన విషయాలు. అన్నమయ్య గారు కల్పనని / ఊహనీ భగవంతునికి మారుగా ప్రతిపాదించాడు తన ఉపమానాలలో తన పదాలలో. మరి ఆయన రాసింది అత్యుత్తమ సాహిత్యమేనని మీకు కూడా మీ నిర్వచనం ప్రకారమే స్పష్టపడి ఉంటుంది. ఆయన తన పదాలలో “నిరాకార భావానికన్నా” అలా “సాకార భావానికే” ఎక్కువ ప్రాధాన్యమిచ్చినాడు అందులకే! అచ్చమైన తెలుగు కవిగా !!

    రమ.

  886. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి శ్రీధర, శ్యాం గారి అభిప్రాయం:

    09/28/2012 7:20 pm

    “రాళ్ళపల్లీ, శ్రీపాద వారి వారి రంగాల్లో మేధావులే, ఎవరూ కాదనరు. కానీ వారేం చెప్పినా అదే వేదం, ప్రమాణం అని అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు.”

    రాళ్ళపల్లి వారు సంస్కృతాన్ధ్ర ప్రాకృత కన్నడ భాషా పండితులు, కవి, వాగ్గేయకారుడు, సంగీత శాస్త్రజ్ఞుడు. ఆయన విషయ జ్ఞాన పరిధి, లోతు రెండూ ఎక్కువే. (అయినా కూడా ఆయన అభిప్రాయం వేదంగా తీసుకోనవసరం లేదు, మన ఆలోచన స్వేచ్ఛ మనది).

    సంగీతం లో సాహిత్యం పై ఆయన AIR ముఖాముఖిలో క్లుప్తంగా “రామ నీ సమానమెవరు” పంక్తితో ఉదహరించినారు.

    భావం అనేది నిర్వికారం. దానిని వ్యక్తపరచడానికి భాష కావాలి. రాళ్ళపల్లి వారు మహా పండితులు, అన్నమాచార్యుల “project” కు ఒక రూపు ఇచ్చిన భక్తి సంపన్నులు, కాబట్టి “రామ నీ సమానమెవరు” ఎన్నుకున్నారు. (ఈ రెండు గుణాలు ఏ కోశాన లేని నేను) దీనికి ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, మన గద్దర్ పాటలు శుభపంతువరాళి లో పాడుతే రక్తం ఉడికి ఉఱ్ఱూతలు ఊగదు సరి కదా, నేనైతే పోయి గద్దర్ ను తిరిగి కొట్టిఉండే వాడిని. పోనీ, గద్దర్ పాడినట్లుగానే, అదే ఊపుతో “గోంగూర పచ్చడి” గురించి పాడుతే, నీ రక్తం మరగదు కదా, కాబట్టి సాహిత్యం ప్రధానం, అని ఇచట సాహిత్య పిపాసులు అడగవచ్చు! కానీ, ముందుగా చెప్పినట్లు భావం ప్రధాన్యం, ఆ ఆక్రోశం పెల్లుబికడానికి ఆ భావం మాటలను/పదాలను/వాక్యాలను నిర్దేశిస్తుంది, కాబట్టి ఆ భావానికి వ్యక్తపరచ తగు మాటలు ఎన్నుకోబడతాయి. (గోంగూర పచ్చడి లో కారం దట్టిస్తే, రక్తమేమి, పంచ ప్రాణాలు మరగవచ్చు, అది వేరే చర్చ!) అందువల్లే, ప్రసిద్ధ వాగ్గేయకారులు చాలా మటుకు స్వరాలను బట్టి సాహిత్యం కూర్చారు అని వింటూఉంటాము.

    భావ ప్రకటనకు అనేకులు అనేక సాధనాలు వాడుతారు, కవిత్వం, చిత్రలేఖనం, శిల్పాలు చెక్కడం, నాట్యం, సంగీతం ఇత్యాదివి.

    నాట్యానికి, సంగీతానికి ఒక చిక్కు ఏమిటంటే, అవి ఒక సకార/సగుణ సందేశం ఇవ్వదలుచుకుంటే, భాష అవసరమవుతుంది. నీళ్ళు, మంచు గడ్డ ల వలె, సంగీతానికి సాహిత్యం సకార రూపం ఇస్తుంది. కేవలం నిరాకార సంగీతానికి సాహిత్యం అనవసరం.

    సంగీత ప్రదర్శనలోని ముఖ్యాంశంలో, సింహ భాగం ఆలాపన, నెరవు, స్వరవిస్తారాలవే. పాడే సాహిత్యం లో కూడా పల్లవి లోని పదాలను రకరకాలుగా విరిచి, స్వర గమకాలతో వేరు వేరు కాలాలలో సంగీత విన్యాసాలతో అలంకరించి గాని అనుపల్లవి, చరణాలకు పోరు. అంటే ఆలాపన (నిరాకార రూపం) తో ఒక విస్తారమైన వేదిక ను ఏర్పాటు చేసి, దానిపై (సకార రూపం) సాహిత్యాన్ని ప్రవేశ పెట్టి, తరువాత స్వరకల్పన (మళ్ళా నిరాకార రూపం) తో ముగిస్తారు.

    అసలు “సాహిత్యం” అనే పదమే ఒక పెద్ద చిక్కు. “సాహిత్యం” అనే ప్రౌఢ శబ్దం వినగానే నాకైతే, ఛందస్సులు, అలంకారాలు, ఉపమానాలు, సమాసాలు ఇవన్నీ గుర్తొచ్చి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. (ఈ సంచిక జెజ్జాల మోహన వ్యాసానికి గగుర్పాటు కూడా వచ్చింది). “సాహిత్యం” బదులు lyrics/మాటలు అనే కొంచం సాధారణ పదం వాడి ఉంటే, సాహిత్య పండితులు, పాటలలో తద్ సాహితీ సూక్ష్మాలు, విశేషాలు శోధించే వారు కారేమో!

    అన్నమయ్య కీర్తనకారుడు, కాబట్టి ఆయనను ఈ చర్చలోకి లాగకూడదేమో!

    ఇహపోతే, భావం ముఖ్యం, మిగతాది బావి లోకి అనేది కూడా పూర్తిగా సమర్థనీయం కాదేమో, ఎందుకంటే కృతికర్త యొక్క సందేశం సాహిత్యం లో పొసిగి ఉంటుంది. కాకపోతే భాషేతరులలో స్వల్ప సాహిత్య దోషం సంగీత దృష్టితో చూడాలి.

  887. జీనో పేరడాక్సు గురించి తఃతః గారి అభిప్రాయం:

    09/23/2012 8:45 pm

    శ్రీయుతులు మాధవ్, మోహన లకు ధన్యవాదాలు.

    శ్రీ వేలూరికి అభివందనలు. 1972 లోనే చదివాననుకుంటాను మీ అనువాదం. గుర్తు ఉండిపోయింది, నేనన్నవన్నీ అందులొ లేకపోయినా. మీరు హొలుబ్ పేరు చెప్పింతర్వాత ఆయన కవితలు కొన్ని చదివాను ‘ఈగ’ మొదలైనవి. అనువాదాలుగా కాకుండా తెలుగులో ఇటువంటి కవితలు వస్తాయా? అటువంటి బుద్ధి వికాసం తెలుగు వాళ్ళకు, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే, ఎప్పటికీ రాదేమోనని అనిపిస్తొంది.

    తః తః

  888. ఒక సరళ నిర్వచనం గురించి Narayana గారి అభిప్రాయం:

    09/23/2012 5:09 pm

    ఆదిత్య గారు,

    మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలకు ధన్యవాదాలు. ఇవి నాకు చాలా విలువైనవి. ఐతే, ఈ కవితలో నేను నిచ్చెన మెట్లు, పనిముట్లు, లబ్డబ్ గుండెలు మొదలైన దృశ్యాల్ని స్పురింపజేసే పదాలని ఉపమానాలుగా విరివిగా వాడానన్న అభిప్రాయంలో ఉన్నాను.

    పదచిత్రాలు, ఉపమానాలకు ఉదాహరణగా ఒక కవితను (టైటిలు, కవి పేరు) తెలియజేస్తే నాకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది.

    Thank you.

  889. జీనో పేరడాక్సు గురించి తఃతః గారి అభిప్రాయం:

    09/23/2012 9:56 am

    కామేశ్వరరావు అభిప్రాయం”దీని వల్ల తెలుసుకోవలసిన నీతి: మాంత్రికుడితోనైనా పెట్టుకోండి కాని ఎప్పుడూ మేథమెటీషియన్ తో పెట్టుకోవద్దు! ”

    కామేశ్వర రావు గారూ మీరాస్లోవ్ హొలూబ్ కవిత చెప్పన నీతిగూడా మహారాజశ్రీ మాంత్రికుడు గారూ పిల్లవాడైనా మథమాటిషియన్ తొ పెట్టు కొవద్దనే. మీరు డొమైన్ మార్చి ఆ బడి పిల్ల వాడికి తెలిసిన దాని కన్నాపెద్దలైన గణిత శాస్త్ర వేత్తల ను ఉట్టంకిస్తూ చెపుతున్న నీతి కూడా అదే. “ఆ మాయా జాలం తెలియాలంటే ” అని అంటం లొ మీరు మాంత్రికుణ్ణి సమర్ఢిస్తున్నారేమో నని భయం వేసింది. కాంప్లెక్స్ వేరియబుల్ మాంత్రికునికి తెలిస్తే ఆయన్ను అందులోనే ఓడించవచ్చు ఎందుకంటె అతని ప్రవృత్తి జాలం గానీ శాస్త్రం కాదు కాబట్టి. Thank God, you even with your counter example supported the spirit of Miroslav Holub’s poem.

    నీతిని కొద్దిగా విస్తరిస్తే మాథమాటీషియన్ తొ నైనా పెట్టు కొవచ్చేమో గానీ అప్లయిడ్మాథమాటీషియన్ తొ అసలు పెట్టుకో కూడదు.

    రిగార్డులతో
    తఃతః

  890. జీనో పేరడాక్సు గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    09/23/2012 5:42 am

    “సీతారామరాజును ఎందుకు ఎంచుకున్నాడు?” అంటే నాకు తోచిన కారణం ఇది – సెబాస్టియన్ని గుంజకి కట్టేసి తనపై బాణాలొదిలారట. సీతారామరాజును చెట్టుకు కట్టి కాల్చి చంపారనే కదా మనం చెప్పుకునేది.

    “భక్తి తలకెక్కిన చరిత్రకారుడు” అనడం – Hagiographer అనే మాటకి చేసిన అనువాదమే కానీ అందులో వ్యంగ్యమేమీ లేదనుకుంటా. మూలకవిత “One hagiographer compared him to a hedgehog bristling with quills.” అని matter of factగా ముగుస్తుంది. మాధవ్ గారి అనువాదంలో భూతకాలం బదులు వర్తమానకాలం వాడినందుకు “భక్తి తలకెక్కిన చరిత్రకారుల ధోరణి ఇది” అని చెప్పినట్లనిపిస్తుంది.

  891. ఒక సరళ నిర్వచనం గురించి aditya reddi గారి అభిప్రాయం:

    09/22/2012 9:20 pm

    నారాయణ గారు,

    మీ కవిత బాగుంది. సరళంగా సూటిగా స్పష్టంగానూ ఉంది.

    నాగరికత అనబడే నేటి జీవన విధానంపై నిరసన, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే పదచిత్రాలు, ఉపమానాలు చేరితేతప్ప కవిత బలంగా తాకదు. గమనించగలరు.

    అభినందనలు.

  892. జీనో పేరడాక్సు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    09/22/2012 1:49 pm

    బాగుందండీ తహ తహ గారూ !! వేలూరి గారూ !! మీరేమో ఒక కవితను గురించి ముచ్చటలాడుకుంటూ దానిని ఒకటే ప్రశంసిస్తూ .. అందుకోసం ఈమాట స్థలాన్ని గురించి బాగా పొగుడుతూ, తీరా హోలూబ్ ని చదవడం విషయం వచ్చేసరికి మాత్రం ఒక్క మీరిద్దరే వ్యక్తిగతంగా ఈమైల్స్ లో దానిని ఇచ్చిపుచ్చుకుంటే ఏలాగూ ?? మిగిలిన పాఠకులం మేం ఏమవ్వాలీ ?? అప్పుడెప్పుడో వేలూరి ఒక ముఖ్యమైన కవితని తెనుగున అనువాదము చేయుటా… దానిని ఆనాటి భారతిలో ప్రచురించుటా వంటి సంగతులు కేవలం ఇలా కబుర్ల వరకైనా మాకు తెలియవలసినవి. ఆ కవిత మేము మాత్రం చదవకూడదా ఏం ?? కావున శ్రీమాన్ వేలూరి మహాశయా!! మీ ఆ కవితానువాదమును మీ పత్రికలోనైనా పునహ్ ప్రచురించండి. అప్పుడు మీ తహతహ గారి తో సహా మా తహతహా తీరుతుంది అదేమిటో తెలుసుకోవడంలో !! మీ కవితానువాదం చదవాలని ఎదురుచూడవచ్చునా మేము సైతం? [పదుగురితో అప్పటి మీ అనువాదమును తిరిగి పంచుకుందుకు మీకు ఇబ్బంది లేకపోతేనూ.. భయం లేకపోతేనే సుమా !! 🙂 ].

    రమ.

  893. విశ్వనాథగారితో వేదాంత చర్చ గురించి ramamurthy గారి అభిప్రాయం:

    09/22/2012 1:18 pm

    ఈ మ్యాగజైన్ చాలా బాగుంది. దీర్ఘకావ్యము లేదా దీర్ఘకవిత గురించి చర్చ ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను.

  894. జీనో పేరడాక్సు గురించి తఃతః గారి అభిప్రాయం:

    09/22/2012 8:13 am

    నమస్కారాలు శ్రీ వేలూరి – చాలా సంతొషంగా ఉంది. ఈమాట ఈ ప్రపంచాన్ని ఎంత చిన్నది చేసింది! దయచేసి పంపించండి. ఆ కవిత గురించి నేను ఎంత మందికి చెప్పానో. నమ్మండి యెందుకో తెలీదు ఆ కవిత గురించి వివరాలు ఈమాట ద్వారా తెలుస్తాయని చాలా తీవ్రంగా అనిపించింది.

    మీరాస్లోవ్ హొలూబ్ కి నా నివాళి

    మిత్రుడు
    తఃతః

  895. జీనో పేరడాక్సు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    09/22/2012 1:57 am

    🙂 బీవీకే గారి గ్రాంధికము కడు రమ్యముగానున్నది. నన్ను కొంచెము తడవ జయంతి రామయ్య పంతులుగారి కాలమునకు మళ్ళించినది. మీరనినదియునూ సత్యమే !! సృజనలో స్వేచ్చ కవికి కలదు. కానీ ఇక్కడ ఇది యొక సిధ్ధాంతము కూడాను గనుక, ఆ వైవిద్యములను[ అయా పారడాక్సులను ] గురించియే తిరునగరి ముచ్చటించినారు అని నేను భావించియున్నాను. ఇంక వారు వామ పక్ష భావజాలముతో ఆ విధముగా సమర్ధించియున్నారని నాకనిపించియుండలేదు. ఇందు గల సత్యమెద్దియో ఆ తిరునగరివారే సమాధానము నొసగవలయును. నేనేమి చెప్పగలదానను? కానీ తిరునగరి వారి తర్కము సైతము బుధ్ధికి కడుంగడు సమర్ధనీయముంబుగానే యుండుట ఇక్కడ ఆసక్తి కారణము కానైనది. అది అట్లుం డనిచ్చిననూ అసలు జరిగిన ఘటనలలో ” చరిత్ర యెద్దియో.. అందు సత్యమెద్దియో ఏ కాలమునందైననూ చెప్పగలవారు ఒకరు నమ్మశక్యముగా యుంటిరా?? అనుమానమే కదా ? అటులనుకొనిన మనము దేనినైననూ నమ్మనఖ్ఖరలేదని తేలుచున్నది. అప్పుడింక వైవిధ్యమునకు [ పార్డాక్సునకు ] సయితం తావే లేదనియు తేలుచున్నది కాదా?? ఇటుపైన మనము కృష్నదేవరాయని పరాక్రమమునూ ఒప్పుకోనవసరము లేదు. తిమ్మరుసు అమాత్య పదవినీ నమ్మనవసరము లేదు. గతకాలములలో ఏమి జరిగినవో అందు అసలు నిజమెంతయో ఎవరికి ఎరుకా?? కొన్నేళ్ళకు ఈ కవితానువాదమునూ అట్టిదే కాదా అని నా సంశయము. దీనికేమందురూ?? ఇదికూడ ఒక పారడాక్సు కావలెను. తార్కికముగానయినచో మరి అంతయే కద. కొన్నాళ్లకు సెబాస్టియనూ లేడు. బిల్లీకాలిన్సూ లేడు. ఉన్నదంతయూ తర్కము మాత్రమే !!

    చివరిగా నాది మరియొక సందేహము అది ఏమనిన , సీతారామరాజు పేరును శీతారామరాజుయని వ్రాయుటయూ స్వేచ్చాసూచకమేనా ?? లేక దీనికేమైననూ తార్కిక నామమున్నదా?? ఇది ఏ పారడాక్సులో భాగము. తెలుపగలరు.

    రమ .

  896. జీనో పేరడాక్సు గురించి vrveluri గారి అభిప్రాయం:

    09/21/2012 11:50 pm

    తహ తహ గారూ:
    మీరు ఉదహరించిన సైన్ తీటా కవిత రాసింది, మీరాస్లోవ్ హొలూబ్. కవిత పేరు “జీతో ది మెజీషియన్.” దాన్ని ఎప్పుడో ధాత నామ సంవత్సరంలో తెలుగు చేసి భారతి లో ప్రచురించింది నేనే! అనువాదకుడిని నేనని తెలిసిన తరువాత కూడా ఇంకా మీకు చదవాలనే కోరిక మిగిలి వుంటే ఆ కవిత వెతికి (పాత భారతి పత్రికలు వెతికితే బహుశా దొరకచ్చు!) పోస్ట్ చెయ్యటానికి ప్రయత్నిస్తాను. మీరాస్లోవ్ హొలూబ్ ఇండియా వచ్చాడు కూడాను! (అయితే, అతన్ని నేను కలవలేక పోయాననుకోండి.) వృత్తి పరంగా అతను వైద్యుడు. ప్రవృత్తి పరంగా కవి. అతను మరణించి చాలాకాలం అయ్యింది!

    రిగార్డులతో, వేలూరి వేంకటేశ్వర రావు.

  897. జీనో పేరడాక్సు గురించి B.V. Krishnamurthy గారి అభిప్రాయం:

    09/21/2012 4:24 pm

    కవిత ఇంతకు మునుపే చదివినాను. ఇప్పుడీ అభిప్రాయములు వింతగా అనిపిస్తున్నాయి. మళ్ళీ వ్రాయమనడమేమిటి? ఎందుకు రాయాలి?

    ఇది రచయిత తన –స్వీయ ఇచ్ఛానుసరణ –అని చెప్పినారు కదా. అందువల్ల వారు తెలుగు పాఠకులకు పరిచయమైన ఏ చారిత్రక వ్యక్తినైననూ తీసుకొనే సదుపాయం వారికి ఉన్నది. సెబాస్టియన్ కీ శీతారామరాజు కీ ఒక పోలిక మాత్రము ఉన్నది. ఏలాగునంటారా. చనిపోయిన పిదప వచ్చిన అమరత్వము. సెబాస్టియన్ పోయినాడు. ఆయనను క్రైస్తవులు సెయింటు గా చేసినారు. శీతారామరాజు పోయినాడు. అతనిని బ్రిటీషు దొరల గుండెలలో నిదురించిన సిమ్హముగా తెలుగువారు అమరుని జేసినారు. ఇప్పుడు కొందరు చనిపోయిన వారిని, వీరు నిజముగా ఎట్టివారు అనే చారిత్రక సత్యమేమీ తెలియనీయకుండగనే వీరులుగా కీర్తించుతుంటారు విప్లవ వాదులు, రాజకీయ, మత, నాయకులున్నూ. శివాజీ పై చారిత్రక పరిశోధన పుస్తకముగా రాగానే మరాఠాలు ఎట్లా ప్రతిస్పందించినది మనకు ఎరికయే గదా. శీతారామరాజు గురించి తిరునగరి సత్యనారాయణ గారు ప్రతిస్పందించిన విధము ఈ ధోరణి లోనిదే కదా. శీతారామరాజుని తమ అభిప్రాయములో కీర్తించినారు తిరునగరి గారు. కానీ, ఇది జనబాహుళ్యమైన కథానికయే గాని, చారిత్రక సత్యమేమో మనకు ఇదమిత్థముగా తెలియదు. ఉదాహరణకి శీతారామరాజు ఎట్లా చనిపోయినాడో, భిన్నాభిప్రాయములు ఉన్నాయి కదా. అందువలన శీతారామరాజుని సంగ్రామ సింహముగా చూపిన చరిత్రకారులు నిజముగా చరిత్ర రాసినారో లేక భక్తితో రాసినారో అనే సందేహము కలుగుట సహజమే. ఆ విధముగా చూసినప్పుడు హేజియోగ్రఫరులు భక్తి తలకెక్కిన చరిత్రకారులే కదా. తేడా ఇంకెమున్నది. లేదు. ఇందుగా మనకు తెలియగలది ఏమిటంటే, మనకు ఇష్టమైన, మనము గౌరవించే వ్యక్తులని సాధారణీకరణం చేస్తే మనకు నచ్చదు అని. తిరునగరి గారి విప్లవ వామపక్ష భావములు గాయపడి ఉండి వారు అలా రాసి ఉంటారు. నా మటుకు నాకు, ఇటువంటి విషయములలో, వామపక్షీయులైన గాని, మత ఛాందస వాదులైన గాని, ఒకే విధమున ప్రతిస్పందిస్తారని యొక అవగాహనతోనే రచయిత శీతారామరాజుని ఎంచుకున్నాడని నాకు కలిగిన అభిప్రాయము. ఏ ఉద్దేశముతో రచయిత శీతారామరాజుని ఎంచుకునినాడో ఆ ఉద్దేశమును తిరునగరి గారు తన ప్రతిస్పందనతో సత్యముగా నిరూపించినారని నాకు తట్టిన మాట వాస్తవము. నమస్తే – బీవీకే.

  898. జీనో పేరడాక్సు గురించి తఃతః గారి అభిప్రాయం:

    09/21/2012 2:44 pm

    కవితకి ‘జీనొ పారడాక్స్’ అన్న పేరు చూసి చాలా ఆశ్చర్య పోయాను. తెలుగులో ఇటువంటి వస్తువుల మీద కవితలా అని. వెంటనే చదవటం మొదలు పెట్టి ఇంకొంచెం ఆశ్చర్య పోయాను ఇంత తేలికగా ఎలా చెప్పారు అని. దీనికి ఇంగ్లిష్ కవిత ఆధారం అని తెలిసింతర్వాత గౌరవం తగ్గలేదు. బాగా అనువదించారనిపించి అభిప్రాయం రాసేను. ఇటువంటి స్వేచ్చానువాదాలే ఉండాలని నేను కూడా అనుకుంటాను.

    ఇంకొంచెం నిజం చెప్పాలంటే కాల్వినో కథలని అనువాదాలు అని అనచ్చా? పాత్రల, స్థలాల పేర్లు మార్చేస్తే అని రెండు రొజులుగా అనుకుంటూ మాధవ్ రచనల జాబితా చూస్తూ జీనొ దగ్గరికి వచ్చాను.

    చాలా సంవత్సరాల క్రితం భారతిలో – భారతి అన్న విషయం రూఢి – ఒక ఈస్ట్ యూరొపియన్ కవిత అనుకుంటాను, ఆ కవితకి తెలుగు అనువాదం వచ్చింది, కవిత రూపం లొనే. అది Sin(తీటా) విలువ యే (తీటా) కైనా సరే ఒకటికి మించదన్న గణిత శాస్త్ర విషయం మీద ఆధార పడిన చక్కని కథా కవిత. ఒక రాజాస్థానానికి ఒక ఇంద్ర జాలికుడు వచ్చి మీకు కావాలిసిన యే వస్తువునైనా సృష్టించి ఇస్తానంటాడు. తను అలా సృష్టించ లేకపోతే ఒక భీకర ప్రతిన. తనను యెవరూ ఓడించ లేక పోతే ఒక దుర్మార్గమైన కోరిక తీర్చాలనడం లాంటివి. ఎవరూ అతను సృష్టించలేనిది అడగ లేకపోతారు. రాజు బిక్క మొహం వేస్తాడు. అప్పుడు ఒక బడి పిల్లాడు “ఒకటికి మించిన విలువను Sine ఫంక్షన్ కి ఇవ్వగలిగిన తీటా ను సృష్టించమని అడుగుతాడు.

    కవిత పేరు, సంచిక వివరాలు, కవి పేరు, అనువాదకులు ఇవేవీ గుర్తులేవు.

    గుర్తుంటే ఎంత బాగుండేది.
    తఃతః

  899. జీనో పేరడాక్సు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    09/21/2012 3:26 am

    తిరునగరి అభిప్రాయం బాగుంది. మాధవ్‌కి కొంచెం కష్టమైన స్థితే సంభవించింది. సీతారామరాజుని అక్కడ ఉపమ గా ఎన్నుకోవడం వలన వచ్చిపడిన పరిస్థితి ఇదీ 🙂

    కాకపోతే అనువాదపు తీరు బాగా వచ్చింది. వీలుంటే మాధవ్ ఆ ఉపమానాన్ని మార్చి మరొక సారి అనువాదం చేసే ప్రయత్నం చెయ్యొచ్చును. తప్పులేదు. మంచి కవితని జారవిడవడం మాత్రం ఎందుకూ?? ఏం మాధవ్? మరో పాఠం తయారు చెయ్యకూడదూ?? ఆలోచించండి. సెబాస్టియన్, సీతారామరాజు లకి పొంతన కుదరదు గనక, మీరు ఇంకోసారి ఇంకొక ఉపమానంతో ఈ కవితని రాసి చూడండి మళ్ళీ !

    రమ.

  900. జీనో పేరడాక్సు గురించి తఃతః గారి అభిప్రాయం:

    09/20/2012 2:58 pm

    తలవని తలంపుగా ఈ కవిత ఇప్పుడే చదివాను. మీ స్వేచ్చ చాలా సహజంగా తనను తాను ఈ గేయంగా వెలయించుకుంది. మీరు చివర్లొ చెప్పేదాకా ఒక మాతృక ఉన్నట్టు అనిపించలేదు. జీనొ నాలుగు ఆర్గ్యుమెంట్లను “..Immeasurably subtle and profound..” అన్నాడు రసెల్. మీరు మీ కవితలో జెనో పారడాక్స్ ను తేలికగా తెలిసే విధంగా కవితా సౌందర్యం ఏమాత్రం చెడకుండా చెప్పేరు.
    అన్నట్టు జీనొ కూడా ఇటాలియనే.

    మరోమాట కూడా చెప్పాలి. మాతృకను చదివిన తిరునగరి సత్యనారాయణ గారి అభిప్రాయం ఆలోచింపజేసింది.

    తఃతః

  901. నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    09/20/2012 1:03 pm

    ఆకెళ్ళ రామ కృష్ణ గారూ! ఆలశ్యంగా చూసాను మీ అభిప్రాయాన్ని. మీ బాధ పట్ల ప్రతిస్పందించాలనిపించి ఈ అభిప్రాయం! మీ బాధతో నేను ఏకీభవిస్తూనే, నా కొన్ని గ్రహింపులు ఇవని చెబుతున్నాను. తొలిగా [కొంచెం ముందువెనకలుగా ప్రక్రియా పరంగా] “పద్యం” నన్నయ్య కాలానిది. అప్పుడు తెలుగునే కవిత్వం చెప్పడం అంటే అదొక సాహసమైన సంగతి తెలుగు కవులకి. సంస్కృతం అన్నికాలాలలోనూ భారత దేశంలో చదువుకున్న వారి భాష . అటువంటి స్థితిలో సంస్కృతాన్ని కలుపుకుంటూనే తప్పనిసరిగా తెలుగుని వాడవలసిన ఒక సామాజిక సన్నివేశం కవులముందు మొదట్లో ఉంది. దానిని నన్నయ్య చెప్పేరు కూడాను. ఇంక తెలుగు పదాలని కనిపెట్టటం అన్నది బహుశా ఇప్పటి మీ ఆలోచన! పుష్కలంగా తేట తెనుగు సమాజంలో ఎప్పుడూ ఉంది. గమనించండి. వెయ్యేళ్ళ కిందట అయితే అది మనకి ఆనాటి దేశి చ్చందాల్లో ఉంది. ఆనాటి ద్విపదల్లో ఉంది. పాల్కురికి సోమన గారి బసవపురాణం చదివి చూడండి. అన్నమయ్య పదాలని చదివి చూడండి. తిక్కన గారి కంద పద్యాన్నీ చదివిచూడండి. సమాజంలో ఉన్న సొంపైన తెనుగుకి వాళ్ళు తమ సృజనలో చోటిచ్చారు. కావాలనే తెనుగునే వాడుతామని అమలుచేసి చూపారు. నన్నయ్య గారికి ఆ సులువు లేదు.

    ఇకపోతే మణిప్రవాళ శైలి ఒక్క తెనుగులోనే లేదు. ఆ కాలం నాటి ప్రాంతీయభాషలన్నిటినీ ఈ శైలి వశపరచుకొంది. తెలుగేమీ ఇందుకు మినహాయింపు కాదు. అయితే సంస్కృతం తాలూకు అందం సంస్కృతానిది. అది బాగుందని అనుకున్నందువల్ల తెలుగు వెనకబడనఖ్ఖరలేదు. ప్రతీ భాషకీ దానిదే అయిన ఒక సౌందర్యం ఉంటుంది కదా?

    కవులని అటుంచండి. బాగుందని మెచ్చుకున్నవారినటుంచండి. మనకి తెలిసిన తెలుగు పదాలు చాలానే ఉన్నా, ఇవాళ మనం ఎందుకూ ఇంగ్లీషుని అతిగా వాడి పరమ కటువుగానూ, కృతకంగానూ, బాధ్యత లేకుండా తేలిక భావంతో ఎలా పడితే అలా తెలుగుని మాట్లాడుతున్నాం? గురజాడ గిరీశాన్ని దాటి తెలుగు వాక్యం వాడకంలో మనం అసలు ఏం ముందుకెళ్ళాం గనకా? ఎందుకని కనీశం మనకి తెలిసిన తెలుగునైనా తనివితీరా మాట్లాడే ప్రయత్నం నిజాయితీగా చేయలేకపోతున్నాం? అప్పుడు సంస్కృతం తప్పనట్టే, ఇప్పుడీ ఇంగ్లీషూ తెలుగుకి ఒక తప్పనిసరి అయ్యిందేమి? ఇది ముందు తెలుగు వాళ్ళకి తెలిస్తే, ఏ భాషా వాళ్ల నెత్తిన ఎక్కి స్వారీ చెయ్యలేదు కదా. కాదంటారా? రుజువైన సంగతి ఏమంటే సమాజంలోని తెలుగువారికి ఆత్మన్యూనత ఎక్కువ. అందుకే, ఎంతమంది కవులు ఎంత చక్కని తెలుగు రాసినా, మరెంతమందో సొగసైన తెలుగుని మాట్లాడమని చెవినిల్లు కట్టుకుని పోరినా, ఏదీ ఎప్పుడైనా సమాజంలో బతికే తెలుగువారు తమ నిత్య వ్యవహారంలో దాని విలువని గుర్తించారా? చక్కటి తెలుగులో మనస్పూర్తిగా ఏ అంశం మీదనైనా స్పందించారా? అందుకు పాపం ఆ పద్యాలు రాసిన కవులేమి చెయ్యగలరూ? వాటిని చదివే తెలుగు సాహిత్యాభిమానులు మాత్రం ఏమి చెయ్యగలరూ? కుప్పపోసినంత అచ్చతెనుగు అక్కడ ఉంది. ఏదీ ఎవరైనా ఒక గుప్పెడన్నా ఏరుకుని తమ మాటల్లొకి పొదుగుతారేమో చూడండి.

    రమ.

  902. వర్ష రచన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    09/11/2012 5:51 pm

    రాగాలకు వర్షం కురుస్తుందంటారు. కవితకు, కాదు, గీత రచనకు కూడా వాన పడుతుందనే ఆశ ఆకాంక్ష కొత్తగా ఉంది. ఎవరో కవి అన్నదానికి ఇంకొన్ని లైన్లు కూర్చి ఇది రాయడానికి స్ఫూర్తినిచ్చింది.

    “జ్వలిస్తే గ్రీష్మం
    కురిస్తే వర్షం
    ‘చలి’స్తే శిశిరం
    విరిస్తే వసంతం”
    చెట్లు నాటుతే శుభం
    ఉన్నవి నరికితే క్షామం
    ఉల్లాసపరుస్తే కవిత్వం
    లేకపోతే నీరసం!
    ========
    విధేయుడు
    _శ్రీనివాస్

  903. ప్రేమ కవితలు గురించి pournami గారి అభిప్రాయం:

    09/10/2012 3:24 am

    మీ కవితలు చాలా బాగున్నాయి. మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది.

  904. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    09/06/2012 2:28 pm

    నండూరి పార్ధసారధి గారు శ్రీపాద పినాక పాణి గారిని చేసిన ఇంటర్వ్యూ ఆసాంతం చదివాకా నాకు అర్ధమైన విషయాలు ఇవి. సాహిత్యం గురించి తక్కువగా శ్రీపాద వారు ఏమీ అనలేదు. ఆయన ఆ మాటల్ని అన్న సందర్భం అక్కడ పూర్తిగా వేరు. సంగీతకారులకి రాగం పాడేటప్పుడు దాని మీద ఎక్కువ శ్రధ్ధ ఉంటుందే తప్ప ఆ రాగానికి సహాయకారిగా ఉన్న అక్షరాల మీద ఏమాత్రమూ కాదు అన్నది శ్రీపాద పినాకపాణి గారి భావన. ఇది కృతుల లోని సాహిత్యానికి సంబంధించిన విషయమే గానీ విడిగా సాహిత్యం మొత్తానికి గానూ లేదా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులని గురించి గానీ ఆయన చేసిన వ్యాఖ్య కాదు. అలాగే సాహిత్య ప్రేమికులైన వారి అన్నగారు సైతం కావ్య సాహిత్యాన్ని కవిత్వాన్ని గురించి అన్నది కాదది. వాగ్గేయకారుల రచనలని మాత్రమే ఆయన ప్రస్తావన చేశారు “సాహిత్యం” అని అన్నప్పుడు. ఆయనకి కూడా – గానం లోని రాగ స్వరూపమే ముఖ్యం అంతే! అందుకు ఉపయోగపడే అక్షర సముదాయం కాదు. అందుకే సాహిత్యానికి ఎంతో అభిమాని అయిన ఆయనే వారి అమ్మాయి “డుబుక్కు” 🙂 లని పాడుతూ ఉంటే ఏమాత్రమూ పట్టించుకోలేదు. అందుకు ఇబ్బంది కూడా పడలేదు. “వాగ్గేయకారుల రచనలలో కవిత్వం గురించి వెతకడం దండగ” అన్న అభిప్రాయాన్ని ఈ శ్రీపాద బ్రదర్స్ వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు.

    అందువలననే త్యాగరాజు మంచి సంగీతకారుడే గాని మంచి కవి కాదు అని వారు అనుకున్నారు. ఇందులో అంతగా విబేధించవలసిన అవసరం నా వరకూ నాకేమీ కనిపించలేదు. చాలా సార్లు ఆయన రచనలని విన్నప్పుడు అది నిజమే కూడాను అని నాకు అనిపించినది సత్యమే! అయితే అక్కడ త్యాగరాజు గారి ప్రధాన ఉద్దేశ్యం కూడా తన సంగీతమే తన రామ భక్తే! ఆయన కవిత్వం రాస్తున్నానని బహుశా అనుకోలేదేమో? లేదా ఆయనకి శక్తి చాలకనే కవిత్వం రాయలేదో లేక సంగీతానికి అవసరమైనంత అక్షరాలని చాలు లెమ్మని అనుకునే రాయలేదో మనం ఇవాళ చెప్పలేకపోయినా, సాహిత్యం దృష్ట్యా చూస్తే మాత్రం త్యాగయ్య తప్పక కిందిశ్రేణి కవి గానే అనిపించక మానడు. ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను శ్రీపాద వారి అభిప్రాయం కేవలం కృతులలోని కీర్తనలలోని సాహిత్యం మాత్రమే! ఆయనకి ఒక గాయకునిగా తాను పాడే కృతిలోని సంగీతమే ముఖ్యం గానూ సాహిత్యం ఆ తరువాతిది గానూ అనిపిస్తే అందులో విడ్డూరం నాకేమీ కనిపించలేదు మరి.

    అయితే ఇది వాగ్గేయకారుల అందరి రచనలలోనూ పూర్తిగా నిజమా? అందులో కవిత్వం ఉండదా అంటే చాలాసార్లు ఉండకపోవడాన్నే మనం గమనించవచ్చు. ఒక్క అన్నమయ్య మాత్రమే ఇందుకు మినహాయింపు. అయితే ఒక సాహిత్య స్వరూపాన్ని సంపూర్తిగా ఆవిష్కారం చేయాలీ అంటే అది సంగీతపు జంజాటం లేని పక్షం లోనే సాధ్యం అని కూడా మనం చెప్పవచ్చు. అందువలననే సంగీతం కోసం పాడుతున్నప్పుడు సాహిత్యం గురించి పట్టించుకోనవసరం లేదని వారు అనుకున్నదీ, అన్నదీను. ఈ రెండూ రెండు రకాలైన విషయాలు.

    ఐతే మరి మనకెందుకని సంగీతం పాడేవాళ్ళు అక్షరాలని చిత్రవధ చేసి పాడుతున్నప్పుడు చెప్పనలవి కాని బాధ కలుగుతున్నాదీ అంటే తెలుగు భాష లోని వాళ్ళకి ఆ భాష మీద ఉండే మమకారం అత్యంత సహజం! మనం దాని ఉచ్చారణలో ఎటువంటి అపసవ్యతనీ సహించలేం! కష్టం అది మనకి. అయితే అది సంగీతం పాడేవారికి మాత్రం సమస్య కావడం లేదు. అక్కడ వారి దృష్టి వేరు. గాయకులుగా వారు రాగానికే బాధ్యులు గానీ అక్షరానికి కాదలుచుకోవడం లేదు. వాళ్ళకి సంగీతపు పానం చేయడంలో రాగపు రసం గ్రోలాలి. సాహిత్యాన్ని పిప్పిగా పక్కకి పడేయడానికి వాళ్ళు వెనకాడటం లేదు అని మనకి పినాకపాణి గారి మాటలు తెలియజేస్తున్నాయి అయితే ఇక్కడ మళ్ళీ ఒక తేడా చాలా స్పష్టం గానే మనముందుకి వస్తూంది. అదేమంటే ఈ ఉచ్చారణా రీతి తెలుగు వచ్చిన వారిలో ఒక తీరుగా ఉండి మళ్ళీ పరాయి భాష వారి గాత్రంలో అదే కృతి మరొక తీరున పలకడం. ఇందుకు మాతృభాష అయిన వారు మరీ అంతగా తప్పులని పలకలేకపోవడాన్నే మనం కారణంగా అర్ధం చేసుకోవాలి.

    అయితే ఇక్కడ భక్తి అన్న అంశం కూడా అంతే ముఖ్యమైనది. ఆ రామ భక్తే తనని నడిపించకపోయి ఉంటే అంతటి త్యాగయ్య కేవలం సంగీతం కోసమే ఏవో కృతులూ వర్ణాలూ అంటూ అల్లేవారా? త్యాగయ్య సంగీతానికి మూలమైన రామ భక్తిని మనం తక్కువ అంచనా వేయలేము. అయితే మళ్ళీ భక్తి భావం వేరు. సాహిత్యపు స్థాయి వేరూను. మనం ఈ రెండింటినీ కలిపి చూడకూడదనే నేననుకుంటాను.

    అందువల్లనే “సాహిత్యం కావాలని అనుకునే వాళ్ళు సంగీతం వినడానికి రావడం దండగ” అని పినాకపాణి గారు అక్కడ అలా అన్నది. అది బయటకి కొంత కరుకుగా వినిపిస్తున్నా వారి సంగీతపు పరిమితి లోని సాహిత్యానికి సంబంధించి అది అక్కడ సత్యమే మరి. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తూందంటే వారన్న “సంగీతమూ సాహిత్యమూ రసమూ పిప్పీ” లాంటి పోలికలని ఒక విస్తృతార్ధంలో మొత్తం సాహిత్యానికి కాక పరిమితమైన అర్ధంలో కేవలం సంగీత రచనల వరకూ మాత్రమే అని మనం అర్ధం చేసుకోవాలి. అప్పుడు శ్రీపాద వారి అభిప్రాయం పట్ల అంత కోప ప్రకటన సాహిత్యం మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేయనవసరం లేదని తెలుస్తుంది.

    అయితే గాయకులు ఎక్కువాను కవులు తక్కువానా? అన్నారు మోహన గారు. మోహన గారూ! పినాకపాణి గారి మాటలని మీరు మిగతా చోట్లకి అంతగా విస్తృతపరిచి చూడనవసరం లేదు. వారు మంచి కవులు అయినప్పుడు వారు ఏది రాసినా బహుబాగుగా రాయగలరు. అక్కడ అది ఏ చోటైనా ఏ ప్రక్రియ అయినా ఎప్పుడైనా కవిత్వానిదే పై చేయి అవుతుంది. అలాంటి రచనల విషయంలో శ్రీపాద పినాకపాణి గారు కాదు కదా ఎవరేమన్నా అది ఒప్పదు. అలాగే ఆ రాసే వారి లోని ప్రతిభ అందుకు తగిన స్థాయిలో లేదంటారా అక్కడ అక్షరపు ప్రభావం ఏమీ ఉండదు. ఇంక సినిమా రంగమూ అక్కడి పారితోషికాలూ సంగీతపు సాహిత్యపు తూనిక రాళ్ళు కానేరవు. సినిమా రంగాన వారు ఉత్తమ కవులనైనా తక్కువగా కొనగలరు. డబ్బులు వస్తాయని అనుకుంటే ఒక డబ్బా సంగీత దర్శకుని ముందు డబ్బులు కుమ్మరించనూగలరు.

    కాకపోతే పినాకపాణిగారు అన్నమయ్య విషయంలో మాత్రం అన్నమయ్య అక్షరం గురించి సరిగ్గా తెలియక నోరు జారారనే అనుకోవాలి. పినాకపాణి గారికి తెలుగు భాషా సాహిత్యాల గురించేమీ అంతగా తెలిసినట్టు లేదు. అన్నమయ్య గురించి అంటూ “ఆయన అచ్చతెనుగు రాసేడు” అనో లేదా త్యాగయ్య అక్షరాన్ని గురించి చెబుతూ ” త్యాగయ్య సంస్కృతమూ తెలుగూ కలిపి రాసేడు” అనో అన్నమాటలు మనకి ఏమీ ప్రత్యేకంగా చెప్పవు. దానికీ అన్నమయ్య గారి కవితా బలానికీ ఏమి సంబంధం? అన్నమయ్య గారు తన పద్నాల్గు లైన్ల పదాలలో అంత గొప్ప కవిత్వాన్ని పలికించడం అన్నది తప్పకుండా ఆయన అసమాన ప్రతిభకి తార్కాణమే! అన్నమయ్యకి బహుశా తన భావ ప్రచారం ప్రధానమూ సంగీతం అటు తరవాతా అయి ఉండాలి. లేదూ సహజం గానే కల్పనాచతురుడై ఉత్తమ భావుకుడైన ఆయన పరిమితమే అయిన తన పద చట్రంలోనే కవిత్వాన్ని అంత అలవోకగా ఒలికించి ఉండాలి. అన్నమయ్య గారి సాహిత్యం విషయం లో మాత్రం శ్రీపాద పినాకపాణి గారి అభిప్రాయం అయోమయంగానూ కాస్త తొందరపాటుగానూ అపరిపక్వంగానూ మిగిలిపోతుంది.

    రమ

  905. ఒక సరళ నిర్వచనం గురించి నారాయణ. గారి అభిప్రాయం:

    09/05/2012 8:55 pm

    రవికిరణ్ గారు మరియు శివశంకర్ గారు, మీ అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి. ధన్యవాదాలు.

    రవికిరణ్ గారు, మీరు కవితాత్మకంగా ఉదహరించిన మనుషులు బాగున్నారు.
    నారాయణ.

  906. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి మోహన గారి అభిప్రాయం:

    09/05/2012 4:16 pm

    తః తః గారు,
    సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం.
    నేను నా అభిప్రాయాన్ని క్రింది శ్లోకముపైన ఆధారము చేసికొని వ్రాసినాను –
    సంగీత మపి సాహిత్యం
    సరస్వత్యా స్తనద్వయం
    ఏక మాపాత మధురం
    అన్య దాలోచనామృతం
    నా ఉద్దేశములో ప్రజలు ఎక్కువగా సంగీతాన్ని ఎందుకు ఆదరిస్తారంటే, దానిని వినేటప్పుడు సామాన్యముగా మరే ఆలోచన చేయనక్కరలేదు. కాని సాహిత్యపు సంగతి అలా కాదు. చదివేటప్పుడు కాని, వినేటప్పుడు కాని కొద్దిగానైన ఏకాగ్రత చూపాలి. లేకపోతే ఏమి అర్థము కాదు. నా ఉద్దేశములో కవిత్వము పాడుటకు ఉపయోగపడేటట్లు మాత్రమే వ్రాయాలి. సంగీతము ఆ పాటలోని భావాన్ని బాగుగా బహిర్గతము చేయాలి. అప్పుడే ఆ సరస్వతీదేవికి సంతృప్తి కలుగుతుంది. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అంటే ఆ తల్లిని అవమానించినట్లే. విధేయుడు – మోహన

  907. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి తఃతః గారి అభిప్రాయం:

    09/05/2012 2:24 am

    శ్రీ మోహన: సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం. గాయకులను నట విటుల్లొ కలిపేశారు. ముఖ్యంగా మన దక్షిణాది సంప్రదాయంలో గాయకులకు గౌరవం వారు పాడు తున్న భక్తి సాహిత్యం నుంచి వచ్చింది. వారు భాగవతారులుగా పరిగణింపబడ్డారు.

    వేదాన్ని పాడకూడదన్న నియమం ఉన్నదనీ, కవి అన్న పదం వేదంలో సాక్షాత్తూ భగవంతుని సూచించే పదంగా ఉన్నదనీ కవిని స్వయంభువుగా పరిభువుగా వేదం అభివర్ణిస్తుందనీ పెద్దల నుంచి విన్నాను. [ఈ కారణంగానే పద్యాలను రాగాలు తీసి పాడేవాళ్ళంటే నాకు కొంత చిన్న చూపు. పౌరాణిక నాటకాలలో నటుల్లొ పీసపాటి వారి పద్ధతి నాకు చాలా ఇష్టం ]

    సంగీతాన్ని పొగుడు తున్నప్పుడు సాధారణంగా దొర్లించే, ” శిశుర్వేత్తి …” నిజానికి సాహిత్యం యొక్క గొప్పదనాన్ని సంగీతంతో పోల్చి చెప్పినది. కృష్ణ శాస్త్రి గారి ఒక పాటకు వరస చేసి శాస్త్రి గారికి పాడి వినిపిస్తున్నప్పుడు శ్రీ వోలేటి శాస్త్రి గారి పాదాల చెంత కూర్చున్నారని విన్నాను. సచిన్ దేవ్ బర్మన్ తో సాహిర్ లూధియాన్వీ ప్యాసా పాటల విషయంలో ఈ కారణంగానే విబేధించాడు.

    మనోధర్మ [కర్ణాటక] సంగీతం అంటె నా అభిప్రాయంలో సాహిత్యాన్ని మనసుకు ఎక్కించుకుని తదనుగుణంగా పాడేదే. “సామజ వర గమన ” అంటే అర్థం తెలీకుండా సంగీతం నేర్పే వాళ్ళను -పెద్ద సంగీత సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను – నేను చూశాను అటువంటివాళ్ళు యెంత ‘మనోధర్మ’సంగీతం పాడతారా అన్నది నా మనో ధర్మ సందేహం.

    सुकविता यद्यस्ति राज्येन किम् ॥
    “సుకవితాయద్యస్తి రాజ్యేన కిం”

    నమస్కారాలతో
    తఃతః

  908. చెట్టు కింది మనుషులు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    09/04/2012 9:33 pm

    ఇంద్రాణి గారు,

    ఎలా చెప్పాలో తెలీదు, మీ కవితకి హేట్స్ అప్ చెప్పడం తప్ప. అద్భుతంగా వుందండి. కవిత ఎంత సరళంగా వుందో, మీ ధ్రుక్కోణం అంత నిశితంగా వుంది. చాలా బాగుంది.
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  909. ఒక సరళ నిర్వచనం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    09/04/2012 9:16 pm

    గరిమెళ్ళ గారు,

    కవిత బాగుంది. మీ అనాలసిస్, మీ వ్యక్థీకరణ బాగున్నాయి. కానీ మీరు ఇంకా కొంత మంది మనుషుల గురించి కూడా వ్రాయవలసింది. ఇది మీ కవిత నేను యుసర్ప్ చెయ్యటం పద్దతి కాదు. కానీ మీరు పిలుపిస్తే మన ఈమాట పాఠకులు ఇంకా చాలా మంది, ఇంకా చాలా రకాల మనుషుల గురించి చెప్పగలరు. మచ్చుకి, వీళ్ళు….

    వీళ్ళకి ఒక అబిప్రాయం అంటూ వుండదు
    ఏ గాలి బలంగా వుంటే ఆ గాల్లో కొట్టుకపోతారు
    డ్రాయింగ్ రూం లో పులులైపోయే వీళ్ళు
    బయట పిల్లులుగా కూడా వుండలేరు
    బొద్దింకలై పారిపోతారు
    పిల్లలకి నీతుల్ని నూరి పోస్తారు
    బతుకంతా అవినీతికి అవకాశం ఇస్తారు

    వీరు ఋషుల్లాటి వారు, కళ్ళు మూసిన వారు
    వారు మూసిన కళ్ళు మాత్రం దేవుడి కోసం కాదు
    వారు నీతులు చెప్పరు, చెయ్యగలిగింది ఏదో చేస్తారు
    మనం తప్పు చేసినా వారు చలించరు
    తామరాకు మీద నీటి బొట్లు వారు
    మనుషులతో, సంఘం తో వారికి పనిలేదు
    వారి మూసిన కళ్ళకి అందరూ దొంగలే
    వీరు పైవాళ్ళ కంటే కనిష్టులు

    వీళ్ళకి రెండు చేతులు, కాళ్ళు,
    వాటి మధ్య ఎప్పుడూ కరకర లాడే పొట్ట
    బుర్రలో అందరి లాగే గుజ్జున్నా
    ఏ అవకాశం, ఎప్పుడూ ఏ కిటికీ
    కూడా వీరి కోసం తెరుచుకోదు
    నవ్వనేది మనిషికి తప్పదు కానీ
    బతుకంతా కలిపినా ఒక దోసిడు
    కూడా నింపలేరేవో వీరు

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  910. చెట్టు కింది మనుషులు గురించి Seetha kumari గారి అభిప్రాయం:

    09/04/2012 7:11 pm

    చక్కని పదచిత్రం. ఎప్పటిలానే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉంది మీ కవిత.

  911. విన్నకోట రవిశంకర్ ‘రెండోపాత్ర’: ఒక పరిచయం గురించి G.Girija Manohara Babu గారి అభిప్రాయం:

    09/02/2012 10:09 am

    శ్రీ విన్నకోట రవిశంకర్ గారి కవితా సంకలనం చాలా గొప్పగా ఉంటుంది. ఈ సంకలన సమీక్ష చక్కగా ఉంది. రవి శంకర్ గారి రచన లాగానే ఇది కూడా ఇంచుమించు సమగ్రం గానే ఉంది. ధన్యవాదాలు.

    జి. గిరిజా మనోహర బాబు

  912. ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి jayaprabha గారి అభిప్రాయం:

    08/25/2012 1:13 am

    ఈమాట సంపాదకులకీ, పాఠకులకీ,

    నిన్న కరీంనగరం లో తన 83వ ఏట జువ్వాడి గౌతమ రావు గారు కాలం చేశారు అన్న విషయాన్ని ఈమాట వారికి తెలియజేస్తున్నాను.

    విశ్వనాధ సత్యనారాయణ గారికి సన్మిత్రుడూ, రామాయణ కల్పవృక్షానికి నిత్యమూ సాగిలిపడి మొక్కిన భక్తుడూ, విశ్వనాధ సత్యనారాయణ గారి రచనలకి తన జీవిత పర్యంతమూ అండదండలని అందించినవారూ జువ్వాడి గౌతమరావు గారు. గౌతమరావు గారి చేతి రాత చాలా పొందికైనదీ అందమైనదీను. సత్యనారాయణ గారి రచనలకి లేఖకుడుగా కూడా గౌతమరావు గారు ప్రసిధ్ధులు. ఆయన గళం సహకరించినంత కాలం ఆయన సత్యనారాయణ గారి పద్యాలని తన చక్కని గొంతుతో చదివేవారు. ఆయన తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషలతోనూ, ఆయా భాషలలో వచ్చిన సాహిత్యాలతోనూ సుష్తుగా పరిచయం ఉన్నవారు . కేవలం నేను కోరిన కారణానికి మృచ్చకటికం నాటకాన్ని సంస్కృతం నించి తెలుగు లోకి అనువాదాన్ని చేసి ఆ అనువాదాన్ని నాకు స్వదస్తూరితో రాసి పంపించినవారు.

    1929, ఫిబ్రవరి 1న ఆయన జన్మించారు. రామమనోహర్ లోహియాకి కూడా ఆయన అత్యంత సన్నిహితుడు. తెలుగునాట రాజకీయ సభలలో, లోహియా ఉపన్యాసాలని ఆయన తెలుగులోకి వ్యాఖ్యానం చేస్తూ ఉండేవారు! రాజకీయంగా సోషలిస్టూ, సాహిత్య పరంగా విశ్వనాధ సత్యనారాయణ గారికి ఆప్తుడు మిత్రుడు భక్తుడూ సోదరుడిగా అన్నీ తానే అయిన వారు జువ్వాడి గౌతమ రావుగారు. సత్యనారాయణ గారి కల్పవృక్షాన్ని తెలుగునాట ప్రచారం చేయడానికి దాని రహస్యాలని మాట్లాడడానికీ తెలుగునేల నాలుగు చెరగులా ఆయన సదా ముందుండి నడిచినవారు. అధికార అనధికార పబ్లిసిటీ మేనేజరు అన్నమాట గౌతమరావు గారు రామాయణ కల్పవృక్షానికి.

    తెలుగు సాహిత్యం విషయంలో ఆయనకి చాలా నిశ్చితాభిప్రాయాలు ఉండేవి. ఆయనకి కొందరు రచయితలు ఎంతగా నచ్చేవారో మరి కొందరు అతి ముఖ్యమైన కవిరచయితలు సైతం పెద్దగా మనసు కెక్కేవారు కారు. సాహిత్యం విషయంలో అంతటి నిక్కచ్చి మనిషి ఆయన. జీవితంలో కూడా నచ్చని వాటి విషయంలో శషభిషలు లేకుండా తన అభిప్రాయాలని చెప్పే స్వభావం కలిగిన వారు!!

    నా “ది పబ్ ఆఫ్ వైజాగ పట్నం” కవితా సంకలనాన్ని నేను జువ్వాడి గౌతమరావు గారికి అంకితం చేశాను. కల్పవృక్షానికి అంతటి భక్తుడైన ఆయన నా కవిత్వం పట్ల కూడా అంతే మక్కువని చూపడం నాకు గర్వకారణంగా భావిస్తాను.

    ఆయన మృతి సాహితీ రంగానికి గొప్ప లోటు.

    జయప్రభ.

  913. ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    08/23/2012 3:05 am

    రంజని – విశ్వనాథ పద్య కవితా పోటీలు :2012.

    అకౌంటేంట్ జనరల్ గా పదవీ విరమణ చేసి అమెరికాలో ఉంటోన్న శ్రీ ఎ.సత్యవర్ధన ఐ.ఎ.ఎస్. గారి సౌజన్యంతో రంజని, తెలుగులో ప్రథమ జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ పేరుతో 2008 నుంచీ ‘రంజని-విశ్వనాథ పద్య కవితా పోటీలు’ నిర్వహిస్తోంది. 2012 సంవత్సరానికి ‘నేటి నిజం’ దిన పత్రికతో కలసి ఈ పోటీలను సమ్యుక్తంగా నిర్వహిస్తోంది.

    ప్రధమ బహుమతి 2,000 రూ.లు. ద్వితీయ బహుమతి 1,500 రూ.లు. మూడు ప్రత్యేక బహుమతులు 1,500 రూ.లు + యోగ్యతా పత్రాలూ.

    నిబంధనలు:
    *ఏ చందస్సులోనయినా ఒక అంశం మీదే 12 పద్యాలకు తక్కువ కాకుండా ఉండాలి.
    * ఇంత వరకూ ప్రచురణ, ప్రసారం కానివై వుండాలి.
    * ఎన్ని శీర్షికలైనా పంపొచ్చు.
    * పద్య కవితని, హామీ పత్రాన్నీ వేరు వేరు గా రాసి పంపాలి. పద్య కవిత ఉన్న కాగితం పై పేరు, విలాసం ఏదీ రాయకూడదు.

    ప్రధాన కార్య దర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి, ఏ.జి. ఆఫీస్, హైదరా బాద్ – 500 004 అనే చిరునామాకి 31.8.2012 లోగా అందేలా పంపాలి.

    చీకోలు సుందరయ్య (అధ్యక్షులు)
    90300 00696

    మట్టిగుంట వెంకట రమణ
    ప్రధాన కార్యదర్శి
    93968 40890.

  914. స్మృతి గురించి Kalyan గారి అభిప్రాయం:

    08/17/2012 10:46 am

    హృదయం లో బాధ యధాతధంగా కవిత రూపం లో ఆవిష్కృతమైంది

  915. ఆఖరి మనిషి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    08/07/2012 6:21 am

    పంతొమ్మిదివందల డెబ్భయిల్లో కాబోలు – బహుశా మల్లాది శివరాం రచన అనుకుంటాను – ఆకాశవాణి నించి ఒక పాట ప్రసారం అయ్యేది. ఆ పాట వినీవినగానే నన్ను ఆకట్టుకుంది. నా యుక్త వయసులో నాకు బాగా ప్రేరణనిచ్చిన పాటగా నేను దీన్ని గుర్తుంచుకున్నాను. ఇప్పటికీ ఈ పాట నాకిష్టమైన పాటల్లో ఒకటి. ఎప్పుడూ సన్నగా కూనిరాగం తీసుకునే పాటగా నా గొంతులో ఉంటుంది. ఆ పాట ఇలాంటి మాటల్లోంచి నడుస్తుంది. జీవితాన్ని మల్లాది శివరాం ఇలా పాడారు. అందులోంచి ఆయన మరణాన్ని ఇలా చూపించారు. పాట ఇదీ!

    ఈ లోకంలో ఈ నా దేశంలో ఈ నా ఇప్పటి దేహంతో
    ఎన్నాళ్ళైనా బతకడమిష్టం ఎపుడు రాలినా ఇష్టం!

    పొరపాటునా మోక్షం వస్తే పుట్టుక లేకుండా పోతే
    ఇలా తలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం /ఈ లోకంలో/

    సంసారం సాగరమైతే జలక్రీడగా జీవనమిష్టం
    తిరిగిపుట్టుటకె మరణంబైతే మరణం అంటే మరి మరి ఇష్టం /ఈ లోకంలో /

    నిత్యం తలుచుకోబుద్ధయ్యే ఈ పాట తరవాత ఇక్కడ ఉన్న రవిశంకర్ కవిత చదివేకా ఒక్కో కవి బతుకుని ఎలా చూస్తాడో ఎలా చూపిస్తాడో కదా అని మాత్రం అనిపించింది. అంతే !! 🙂

    రమ.

  916. నన్ను కాదు గురించి Sowmya గారి అభిప్రాయం:

    08/06/2012 8:30 am

    “First they came for the communists,
    and I didn’t speak out because I wasn’t a communist.
    Then they came for the trade unionists,
    and I didn’t speak out because I wasn’t a trade unionist.
    Then they came for the Jews,
    and I didn’t speak out because I wasn’t a Jew.
    Then they came for me
    and there was no one left to speak out for me.”
    -చిన్నప్పుడు స్కూల్లో ఈ కవిత ఉండేది పాఠ్యాంశంగా. అది గుర్తొచ్చింది ఈ కథ చదువుతూ ఉంటే.

  917. చందవరం, ప్రకాశం జిల్లా గురించి అనంత్ మల్లవరపు గారి అభిప్రాయం:

    08/03/2012 1:02 pm

    బహు బాగుంది చందవరపు కవిత. మా చిన్ననాట తాత గారి ఊరిలో నులక మంచాలు గుర్తుకు తెచ్చారు!

    “బజనలు చేయుట మా బారం
    మా బాదలు తీర్చుట మీ బారం”

    “భజనలు చేయుట మా భారం
    మా బాదలు తీర్చుట మీ భారం”

    వత్తులు తీసి కాస్త భారం తగ్గించారు.

  918. ఆఖరి మనిషి గురించి ananth mallavarapu గారి అభిప్రాయం:

    08/03/2012 12:11 pm

    కవిత బాగుంది! కాకపొతే కాస్త భారంగా గంభీరంగా ఉంది.
    ఆఖరి మజిలి అందరికి చావే కాబట్టి, తప్పని మరణాన్ని తలుచుకుంటూ కుచించుకు పోవడం కన్నా,
    ఉన్నన్ని రోజులూ ఉత్సాహంగా, ఉల్లాసంగా బతకడమే ఉత్తమం.

  919. ఇటు నేనే – అటు నేనే గురించి ananth mallavarapu గారి అభిప్రాయం:

    08/03/2012 11:53 am

    తః తః గారి కవిత తహ తహ లాడుతూ చదివాను.
    కొంత కవిత్వం, మరికొంత పైత్యం , కాస్త సామాజిక స్ప్రుహ కనిపించింది ఈ కవిత గాని కవితలో!
    “గలీ గలీ గలీజుకు లీజు కిచ్చేశారు” – బాగుంది!

  920. ఇటు నేనే – అటు నేనే గురించి bollojubaba గారి అభిప్రాయం:

    07/31/2012 9:54 pm

    ఇది నాకు కవిత్వం లా అనిపించటం లేదు. వెనుకబడిన వారిపై వేసిన సెటైర్ అభ్యంతరకరంగా ఉంది. సంపాదకులు ఎడిట్ చేసి ఉండాల్సింది

  921. ఆఖరి మనిషి గురించి తః తః గారి అభిప్రాయం:

    07/26/2012 12:37 am

    రవిసంకర్
    మీ కవిత చిన్నప్పుడు పదకొండవ తరగతి లొ చదువుకున్న
    T Moore రాసిన The Light of Other Days అన్న పద్యాన్ని – అందులొ లొ రెండొ భాగాన్ని ముఖ్యం గా -గుర్తు కు తెచ్చింది.
    OFT in the stilly night
    Ere slumber’s chain has bound me,
    Fond Memory brings the light
    Of other days around me:
    The smiles, the tears
    Of boyhood’s years,
    The words of love then spoken;
    The eyes that shone,
    Now dimm’d and gone,
    The cheerful hearts now broken!
    Thus in the stilly night
    Ere slumber’s chain has bound me,
    Sad Memory brings the light
    Of other days around me.

    When I remember all
    The friends so link’d together
    I’ve seen around me fall
    Like leaves in wintry weather,
    I feel like one
    Who treads alone
    Some banquet-hall deserted,
    Whose lights are fled
    Whose garlands dead,
    And all but he departed!
    Thus in the stilly night
    Ere slumber’s chain has bound me,
    Sad Memory brings the light
    Of other days around me.
    తః తః

  922. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/19/2012 3:39 am

    ఎప్పుడో 2006 ప్రాంతంలో చెప్పిన ఇక్కడి భావాలని ‘సప్రర’ గారి వ్యాఖ్యకి మూలమేమిటా అని వెనక్కి వచ్చి ఇప్పుడే చదివాను. దీని మీద ఇవాళ మాట్లాడడానికి ఈ చర్చ లోని విషయాలు వెనకబడి పోయినవి ఇప్పటికీ ఏవీ లేవు గనక ఆరేళ్ళ తరవాత కూడా ఈ సంగతులమీద చర్చ చేయవచ్చుననే నేను అనుకుంటున్నాను. అయితే నేను 2006 కాదు కదా ఇవాళ్టికీ తెలుగు పత్రికలనీ అందులో వచ్చే సంగతులనీ శ్రధ్ధగా చదవడం లేదు గనక తెలుగు పత్రికలలో వచ్చే సాహిత్య వాద వివాదాల గురించి నాకు తెలియదని మాత్రం ఒప్పుకుంటూ, నేను గుడిపాటి, ఇంకా వెల్చేరుల భావాలని కూడా చదవలేదని చెప్పుకుంటూనే నాకు తొచినవీ నాకు అర్ధమైనవీ చెప్పడానికి ఈ నాలుగు మాటల్నీ రాస్తున్నాను.

    ఇక్కడి అభిప్రాయాలలో వ్యక్తమైన భావాలలో అందరి భావాలలో కూడా కొన్ని మంచి సూచనలు ఉన్నాయి. మరి కొన్ని వట్టి భావోద్వేగాలకి సంబంధించీ ఉన్నాయి. ఇందులో ఎక్కువ బాగున్న అభిప్రాయం కొడవళ్ళ హనుమ గారిదే అని చెప్పాలి. ఆయన అంటున్నది ఏమంటే ఎవరు దేని గురించైనా మాట్లాడండి గానీ, సోదాహరణగా మాట్లాడండి. అప్పుడు చదివే వాళ్ళకి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుందీ అని. ఆ అలవాటు తెలుగులో వ్యాసాలు రాసే చాలా మందికి లేకపోవడం అన్నది తెలుగు విమర్శనా వ్యాసాలు చదివే వారికి తెలియని సంగతి ఏమీ కాదు.

    ఇంక వెల్చేరు అన్నది విమర్శని కవిత్వాన్నీ నేర్పే వ్యవస్థ ఒకటి తెలుగున ఏర్పడాలని. బహుశా ఆయన ఉద్దేశ్యం – పశ్చిమ దేశాల్లోని ఉండే వ్యవస్థ నమూనా లాంటిది. అక్కడి విశ్వవిద్యాలయాలలో ఉండే creative courses లాంటివి తెలుగు నేల మీద కూడా ఏర్పడాలని. [యూనివెర్సిటీలలోనో ఇతరత్రానో అని కాబోలు.] కానీ తెలుగులో విశ్వవిద్యాలయాలలో బోధనాభాషగానే తెలుగుకి గతి లేని స్థితి లో ఈ పనిని ఊహించే వాళ్ళెవరు. ఇందుకు డబ్బులు సమకూర్చే వారెవరు? ఇవన్నీ జరిగినా వీటిని బోధించే అర్హతలున్న వారెందరూ? అన్నవి ముందుకొచ్చే విషయాలు. కార్యాచరణ కావాలి అంటే అందుకు మరి ఇన్ని విషయాలూ మాట్లాడాలి. అయితే ఆ పనిని ఎవరు చేస్తారో చెప్పకుండా, పైగా రాసే వారే వీటిని ఏర్పాటు చేసుకోవాలనే అర్ధంలో కాబోలు కవులనీ, విమర్శకులనీ ఇందుకు పూనుకోమన్నట్టు ఆయన సూచన చేస్తున్నారు. ఇందులో క్లారిటీ కనబడటం లేదు. కట్టకలిపి కవులూ రచయితలూ కొండొకచో విమర్శకులూ అన్నవారు ఏమి చెయ్యాలని వెల్చేరు అనుకుంటున్నారూ? స్కూళ్ళు పెట్టుకోవాలా? తామే నడుపుకోవాలా? నాకు బోధ పడలేదు. అయోవా యూనివెర్సిటీ లాగా తెలుగున [ఇవాళ తెలుగు ప్రపంచ భాషగా ఎదుగుతోందట గనక] ప్రపంచంలోని పెద్ద విశ్వవిద్యాలయాలలో ఏవైనా వచ్చి ఒక కోర్సుని ఇక్కడి స్కూళ్ళలో మొదలుపెడతాయా? తెలుగులో ప్రొఫెషనల్ రీతిలో కవిత్వాన్నీ విమర్శనీ రాయాలని ఆశించే వారు ఎవరన్నా అసలు తెలుగులో రాస్తున్న వాళ్ళు ఏయే రంగాలలోంచి వచ్చి తెలుగున రాస్తున్నారూ అన్నది సైతం చర్చని చేయాలి కదా? వాళ్ళ భాషా పరిజ్ఞానం అందుకు చాలుతోందా అన్నది కూడా చర్చ చేయాలి కదా? ఒక విషయంలోనేమో ఉదార స్వభావాన్నీ మరొక విషయం లోనేమో ప్రొఫెషనల్ స్థితినీ చెప్పడంలో, లేదా అలా ఆశించడంలో అయోమయం లేదా??

    అసలు ఇన్నీ చేసి ఇటువంటివి అంటే మంచి కవిత్వం లేదా ఉత్తమ విమర్శ అన్నవి తయారు చేయడానికి తగిన పాఠ్యాంశాలు ఏవి? వాటిని ఎవరు రూపొందిస్తారు? వాటిని ఎవరు బోధిస్తారు? అందుకు ఉండే అర్హతలు ఏమిటి? ఇవన్నీ బహుశా ఇంకా రాబోయే చర్చలలో వెల్చేరు గానీ వీటిని చెప్పిన ఇతరులు గానీ చెబుతారు కాబోలును. అందుకు వేచి చూడాల్సి ఉందన్నమాట.

    కొన్ని విషయాలు బోధన చేస్తేనో లేదా అటువంటి వాటిలో శిక్షణ నిస్తేనో వచ్చేవి కావనీ ఎందులోనైనా వారిలో సహజంగా ఉండే కల్పనా శక్తీ, తార్కిక శక్తీ బోధన వలన అబ్బవనీ ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఒప్పుకున్న విషయాలే! ముఖ్యంగా మేలైన కవులు విశ్వవిద్యాలయాలలోంచి పుట్టుకు రాలేరు. జీవితం లోంచి రావాల్సిందే! విమర్శకి సైతం విశ్వవిద్యాలయాలు చాలలేదని కుప్పతెప్పలుగా – సాహిత్య రంగాలని అటుంచండి వాటిలో డిగ్రీలకి విలువ పోయి బహుకాలమైంది – ఇతర రంగాలలో సైతం ఇవాళ ఇదే స్థితి ఉంది అక్కడ. ఇంక “ప్రమాణం” అన్నదానికి చోటు ఏదీ?

    అప్పటికే తయారై ఉన్న దాని లోని మంచి చెడులని తర్కించక, అటువంటి రచనలని పక్కన పడేసి లేని దాని వైపు చర్చని నడపడంలో ఫలితం ఎప్పుడూ ఉండదు. తెలుగులో వచ్చిన మంచి పుస్తకాలని గురించి మనస్పూర్తిగా మాట్లాడడం చేయలేని వారు, లేని వాటిని గురించి వాపోవడంలో అర్ధం లేదు. అలా ప్రవర్తించడం సైతం తెలుగులో రాస్తున్న వారి పట్ల సరైన గౌరవ మర్యాదలని చూపక పోవడమే అవుతుంది. రాస్తున్న వారిని, వారి రచనలనీ మేము మాట్లాడము, రాయని వాటినీ, పసలేని రచనలనీ ముందు పెట్టుకుని చర్చలు నడుపుతామూ విమర్శిస్తామూ అన్న వైఖరి వలన సమకాలంలోనూ మీకు రచయితల పట్ల సహృదయత లేదనీ, రాబోయే వారి పట్ల అసలే ఉండదనీ మాత్రం అర్ధం అవుతుంది. ఎందుకంటే ఆ రాబోయే రచయితలు మీరు ఊహించే వ్యవస్థాగతమైన స్కూళ్లలోంచి వచ్చి తెలుగు సాహిత్యాన్ని ఉధ్ధరించాల్సి ఉంది ఇంకా! అప్పటికి ఇంకా ఈ నేల మీద తెలుగు మిగిలి ఉంటేనూ! మీ పాశ్చాత్య భావనలతో మీరు, కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఇక్కడ మిగిలిన తెలుగుని అసలు మననిస్తేనూ, అప్పుడు కదా!

    రమ.

  923. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి saprara గారి అభిప్రాయం:

    07/18/2012 12:30 am

    మన కవులు చాలా మందికి ఒక లక్ష్యం లేదు. కవిత్వం కోసం కవిత్వం కాదు కదా! సామాజిక చలనం లో తన వంతు పాత్రని ప్రతి సృజన పోషించాలి. ఆ దృష్టి లేని కవిత్వం అడవి కాచిన వెన్నెలె.

  924. ఆఖరి మనిషి గురించి రవిశంకర్ గారి అభిప్రాయం:

    07/16/2012 9:16 pm

    రవీందర్ గారు – మీ ప్రయత్నానికి ధన్యవాదాలు. భావం తెలుస్తోంది. మరికొంత మెరుగుపరచవచ్చునేమో చూడండి.
    వ్యాఖ్యలు రాసిన ఇతరులకు కూడా ధన్యవాదాలు. ఒక చిన్న వివరణ. ఒక తరంలో ఆత్మీయులు, సహచరులు, తాము ఆరాధించిన సెలబ్రిటీలు ఒకరొకరుగా వెళ్ళిపోయాక, మిగిలిన మనుషుల అంతరంగచిత్రణ కోసం చేసిన ప్రయత్నం ఈ కవిత. ఇక్కడ ఆఖరి మనిషి అంటే అర్థం అదే. అంతేగాని, మానవజాతి నశిస్తుందని నా ఉద్దేశం కాదు. – రవిశంకర్

  925. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి నాగరాజు రవీందర్ గారి అభిప్రాయం:

    07/15/2012 12:12 am

    చాలా బాగుంది కవిత ఇంద్రాణి గారూ!
    ఆలస్యమైనా దీనిని నేను ఇప్పుడే చదవడం జరిగింది. ఈ కవితను నేను ఆంగ్లంలోకి తర్జుమా చేయాలనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా!?
    మీ అనుమతి కావాలి.

  926. ఆఖరి మనిషి గురించి నాగరాజు రవీందర్ గారి అభిప్రాయం:

    07/14/2012 12:46 pm

    మీ కవిత చదవగానే నచ్చింది. దీనిని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపించి వెంటనే చేసేయడం జరిగింది. చదివి మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూ…

                     The last human 

    Gradually adapting to the death only
    Becomes the way of life
    Instead of pigeons “theetuvu ” birds
    Start carrying the letters.

    They find their own photo
    And go away –
    Those who flashed smiles 
    In their childhood group – photograph. 

    Not only the actors but also the 
    Audience leave one by one. 
    There wont be anyone to shed the tears 
    together on both the sides 
    For the trajedy on the stage

    Along with the leaves this “samsara vrkhsham”
    Loses its roots one by one

    After all the knots get loosened
    And after all the strings get broken
    The emaciated body would be left behind
    Like a single thread connecting with the world. 

  927. స్మృతి గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    07/12/2012 1:57 am

    కవితలో ఆర్ద్రత ఉంది.

  928. వేసవి గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    07/12/2012 1:38 am

    మీలో ఎంత భావుకత్వమో సుమా! ఎంత బాగా వ్రాసారంటే ప్రతి చిన్న విషయాన్నీ కదలికనూ ఎంతో కవితాత్మంగా… Keep writing. All the best.

  929. రెండు కవితలు – ఇద్దరు కవులు గురించి Dadala Venkateswara Rao గారి అభిప్రాయం:

    07/08/2012 1:34 pm

    రెండు కవితలు వ్రాసి వాటిని
    రెండు చెవుల్లో గింగిరాలు తిరుగుతూ,
    రెండు కళ్ళలో నిలిచిపొయెలా చెయనా .
    గిరిధరుణ్ణి తేనీటి వీందుకి పిలిచి
    తేనీటి దాతా సుఖీభవ! అనిపించుకొనా

  930. ఇటు నేనే – అటు నేనే గురించి aditya reddi గారి అభిప్రాయం:

    07/06/2012 8:00 pm

    త.త గారు మీ కవిత లాంటి తవిక చదివేను. 17వ శ తాబ్దంలో యిలాంటి చిత్ర కపిత్వం వచ్చేదని విన్నాను. బహుశ వారు కడుపులు ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీ కవిత్వం రాసేవారు. (నిండా ఉంటే శృంగార కవిత్వమే రాద్దురు. యివాల కవులకు ఎసిడిటీ ప్రొబ్లమనుకుంటా ను. ‘వెనుకబడీ’ కడుపు మంట వచ్చినపుడల్ల కవిత్వం రాసేస్తున్నారు.

    [అభిప్రాయాలు వెలిబుచ్చే వారు, చర్చించేవారు, దయచేసి అభిప్రాయం పంపే ముందు అచ్చు తప్పులు సరిచేసుకోమని సవినయంగా మనవి చేస్కుంటున్నాం. – సం.]

  931. స్మృతి గురించి thummuri rammohan rao గారి అభిప్రాయం:

    07/06/2012 1:33 pm

    సావాసపు చెరగని స్మృతి, సంవేదనాభరితమై, కన్నీటి కెరటమై, కవితా తరంగమై, నాయని వారిని గుర్తుకు తెచ్చింది.

  932. వేసవి గురించి thummuri rammohan rao గారి అభిప్రాయం:

    07/06/2012 12:58 pm

    గ్రీష్మతాపోపశమన కవిత. చిన్న మార్పులు చేస్తే నిర్దుష్టంగా వుంటుంది.

    1st లైనులో – రయ్యిమనే, 5th లైను – రెక్కలను; 9th లైను – మండే ఎండను; 12th లైను – కాయలతొ

    లయాత్మక కవిత శ్రీశ్రీ గారి దారిలో ఉంది.

  933. ఆఖరి మనిషి గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    07/05/2012 6:46 pm

    బ్రతుకు నాటకం ముగిసాక, రంగు కడిగేసిన పాత్ర కి ప్రతిబింబం – ఈ కవిత..
    జీవితం అంటే – ‘ అసలైన విషాదాన్ని ‘ తెలుసుకోడం!

  934. నైరూప్యచిత్ర కళాయాత్రికుడు గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    07/04/2012 5:47 am

    మా గురువు గారు సంజీవ దేవుల సమక్షంలో చిత్ర కళారంగంలో దిద్దుకున్న ఓనమాలు ఇంతకాలం వెన్నంటి ఉన్నాయంటే అది వారి గొప్పతనమే.వారి ముఖతః రామారావు గారి గురించి విన్నాను. మో మొదటి కవితా సంకలనం చితి- చింత ముఖచిత్రంగా వారి నైరూప్య చిత్రం ఆకట్టుకొనేది.ఇంత కాలానికి ఈ మాటలో గొప్ప చిత్రకారుల మీద ఇంత పెద్ద వ్యాసం ప్రకటించడం అభినందనీయం.వేలూరి వారు ముందు ముందు ఇంకొన్ని వ్యాసాలూ రాసి అలరించ బోతున్నందున ముందు జాగ్రత్తగా నాలుగు వాక్యాలు కుదురుగా రాయబోతాను.

    అనువాదం ఎవరు చేశారో ఏమో గాని ఈ బృహత్ వ్యాసం కొరకరాని కొయ్య అయి కూచుంది. పీర్లు ఫకీర్లు వారి నెమలీకల మంత్రదండం ఏమైపోయింది ? అచ్చుతప్పులు కోకొల్లలు సరే! అవి అలా ఉండనిద్దాం. అక్కడక్కడ అన్వయం లేని వాక్యాలు (మచ్చుకు రెండు:)

    రామారావు చిత్రాలలో ఈ ప్రాక్పశ్చిమాలు కలిసి ఒకటిపోయాయి.” (ఇంకా నయం , ఒకటికి పోయాయి, అని పడలేదు, అదే జరిగుంటే , పాఠకుడికి పిచ్చి కుదిరేది )
    ఎంతటి చిత్రకారుడైనా తన చిత్రాల్లో నలుపుని నియంత్రించేటప్పుడు కొంచెం జంకుతారు.

    కాపీ ఎడిటింగ్ లోపాలు అని వీటిని సరిపెట్టుకుందాం. ఈ వ్యాసానికి ఆయువు పట్టు అన దగ్గ పారిభాషిక పదాల ఎంపికలో తబ్బిబ్బు కనిపిస్తుంది. వ్యాసంలో ఒక భావానికి ఒక పదాన్ని చివరి కంటా ఒకే విధంగా వాడితే కాని పాఠకుడికి అర్థబోధ జరగదు.

    చిత్ర కళ ఎక్కువ సార్లు సారూప్యం (representive/figurative ), కొండొకచో వైరూప్యం (distortion), బహు సకృతుగా నైరూప్యం (abstraction) కావచ్చు. తెలుగులో చిత్ర కళా విమర్శకు ఆద్యులు సంజీవ దేవ్ గారు representativeను సారూప్యంగా అనువదించి వున్నారు. ఇంకా లోతుకు వెళ్లి, సారూప్యం, వైరూప్యం, నైరూప్యం రస శాస్త్రంలోని అభిద , లక్షణ, వ్యంజనలతో తూగుతాయి అని ఎంతో మీమాంస చేసి వున్నారు. చిత్రకళ రూపానికి సంబంధించినది, కాబట్టి, representative కు సారూప్యం అని ఇదివరకు ఉన్న పారిభాషిక పదాన్ని వాడటమే సబబు. ప్రాతినిథ్యం అనడంలో పాత మార్క్సిస్టు తొంగి చూస్తున్నాడు. అంతేగాక, సారూప్యం, వైరూప్యం,నైరూప్యం అన్నీ రూపంతో ముడివడిన రూపాలే., కాబట్టి, ఇది వరకు పెద్దలు ఏర్పరచిన పారిభాషిక పదాలను వాడటం వల్ల ఎంతో గందర గోళం తప్పుతుంది. ఇక్కడ తమాషా ఏమిటంటే , వ్యాసం చివరి పేజీలో ఒక వాక్యంలో ” నైరూప్యం నుండి సారూప్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలగక పోదు ” అన్న వాక్యంలో representative ని సారూప్యంగానే పట్టుకొచ్చారు. ఇదే , వాక్యాన్ని ” నైరూప్యం నుండి ప్రాతినిథ్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలుగక పోదు ” అని రాసి చూస్తే, మాట్లాడుతున్న విషయం చిత్రకళ కాదేమో అనిపించ వచ్చు.ఇటువంటి వాక్యం ఒకటి ఈ వ్యాసంలో ఉన్నది కూడా “రామారావుకు ప్రాతినిధ్య కళ నుండి నైరూప్య కళకు జరిగిణ పరిణామం ఖచ్చితమైన రూపు తీసుకున్నది అతను స్లేడ్ స్కూల్‌లో వున్న చివరి సంవత్సరం (1964) లోనే.

    మరో రెండు ముఖ్యమైన పారిభాషిక పదాలు: impression అంటే మానసిక ముద్ర , expression అంటే అభివ్యక్తి expression భావ ప్రకాశంగా అనువదించడం కొంత గందరగోళానికి దారి తీసే విషయమే. abstract expressionను నైరూప్య భావ ప్రకాశత గా పట్టుకు రావడం ఏమంత బాగాలేదు. నైరూప్య అభివ్యక్తి అంటే సరిపోయే దానికి ఇంత ద్రవిడ ప్రాణాయామం అవసరమా?

    abstract painter (నైరూప్య చిత్రకారుడు) అంటే చాలు, నైరూప్య భావ ప్రకాశ చిత్రకారుడు అనడం దాన వీర శూర కర్ణ అనడం కన్నా వేయి రెట్లు బరువుగా ఉంది. అలాగే , ప్రతిమా రూప చిత్రాల్లో అనకుండా చిత్రాల్లో అంటే చాలు. ఆంగ్లం లా, తెలుగు విశేషణ బహుళమైన భాష కాదు. అనువాదకులు ఇంత ప్రాథమిక విషయాన్ని విస్మరిస్తే పని జరగదు.

    ‘భావ ప్రకాశత నుంచి నైరూప్యతకు సాగించిన యాత్ర’ అనడం కూడా trపొసగలేదు. సారూప్యం నుంచి నైరూప్యానికి సాగించిన యాత్ర అనడం అర్థవంతం. ప్రాథమిక భావనల పట్ల అవగాహన లోపిస్తే రచయిత / అనువాదకుడు ఏమి చెప్ప దలచుకోన్నారో ఒక పట్టాన అర్థం కాదు.

    “1964లో అనామిక అన్న ఈ చిత్రం ప్రాతినిధ్య కళ నుంచి పూర్తిగా వైదొలగి తన అభివ్యక్తతకు ఒక రూపంగా రూపరాహిత్యాన్ని ఎంచుకున్న తీరును తెలియజేస్తుంది.”
    “ఒక సృజనాత్మకుడైన వ్యక్తికి తన అంతరంగంలోని జ్ఞానిని ఏ విషయమైతే మరుగు పరుస్తుందో, మొదట దాన్ని అన్వేషించడం ప్రధాన లక్ష్యమౌతుంది. ఆ తరువాతే అతను తన మదిలోని శక్తిని కూడగట్టుకుంటాడు”

    ఇవన్నీ తెలుగు వాక్యాలేనా ?? అన్న సందేహం రావడంలో అనుమానం లేదు. ఈ ఒక్క వ్యాసంతో, అయోమయంలో మూడు లాంతర్ల కనక ప్రసాద్ ను జయించ గలిగారు ఈమాట ప్రధాన సంపాదకులు.
    ఫిజిక్స్‌ డిగ్రీ వచ్చింతరువాత కొన్నాళ్ళపాటు నిరుద్యోగిగా ఉండవలసిన అవసరం వచ్చి, ఊసుపోక ఆడిట్ చేసిన మోడర్న్ ఆర్ట్ అప్రీషియేషన్ కోర్సులు బహుశా ఇప్పుడు నాకు పనికి రావచ్చు. – వీవీఆర్”.

    దీనికన్నా చిత్రకళా విమర్శ లో సంజీవ్ దేవ్ గారి వ్యాసాలను చదువుకొంటే రచయితకు, పాఠకులకు ఉభయతారకంగా ఉంటుంది అని ఈ బుధజన విధేయుడి అభిప్రాయం.

    లోకాస్సమస్తా స్సుఖినో భవంతు సర్వేజనా స్సుఖినో భవంతు!!

    తమ్మినేని యదుకుల భూషణ్.

    [ఒక అచ్చుతప్పుని పట్టిచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలు – సం.]

  935. ఇటు నేనే – అటు నేనే గురించి మోహన గారి అభిప్రాయం:

    07/02/2012 10:33 am

    పఠించాను పఠాభి కూర్పుల నేర్పుల తీర్పులతో తహతహలాడుతూ తఃతఃగారి కడుపుబ్బ కవ్వించే విత కాని కత కాని కవితను. సులోచనాల లోచనాలతో చదివిన పదాల ఆ ముదాలు, ఆముదాలు, ఆసాముల ఆ సాములు, మాయల లోయలలోకి తీయగా తీసికొని వెళ్లింది. గ్రే ఫుల్లీ గ్రేస్‌ఫుల్లీ ఆర్ డై ఫుల్లీ – ఇవి రెండు చెయ్యలేను. బహుశా విత్ గ్రేస్ ఫుల్లీ డై ఫుల్లీ విల్లీనిల్లీ. మంచి కొమ్మంచి కవితకు జోహారులు. విధేయుడు – మోహన

  936. అంతరం గురించి మోహన గారి అభిప్రాయం:

    07/02/2012 9:20 am

    కథావస్తువు మామూలే అయినా, కథారచన ప్రశంసనీయము. నేను పుట్టాక, నా జీవితంలో మొదటి సారిగా అమ్మా, నేను వేరయ్యాం. మావి వేర్వేరు శరీరాలయ్యాయి. ఇది నాకు అమ్మకి మధ్య మొదటి ఎడబాటు. వంటి వాక్యాలు చిన్న కవితలే. కథారచయిత శివ్ గౌతం గారికి, అనువాదకులు సోమశంకర్ గారికి అభినందనలు.
    విధేయుడు – మోహన

  937. ఆఖరి మనిషి గురించి Narayana Ga. గారి అభిప్రాయం:

    07/01/2012 10:13 pm

    రవిశంకర్ గారు,

    ఎప్పుడూ మృదువుగా తాకే మీ కవిత్వానికి ఎప్పటిలాగే జోహార్లు. ఈ ఆఖరిమనిషి ‘తన ఆఖరి రోజులలో మనిషి ‘ అనుకోవాలా? లేక ‘ఆఖరిగా పోయే మనిషి ‘ అనుకోవాలా? నాకు తెలియకుంది.

    గ్రూప్‌ఫోటోలోనే కాదు అనేకానేక జ్ఞాపకాలలో సజీవంగా నిలిచిపోయిన మితృలంతా కూడా ఎప్పటికీ సజీవంగానే చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోతేనే బాగుండుననిపిస్తుంది.

    చావు మాత్రమే ఆఖరి మజిలీ అని తెలిసినా అంతులేని ప్రేమ, వ్యామోహం పరిచయమైన ప్రతి సజీవ తలంపులపైనా ఉండిపోతోంది.

  938. అంతరం గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:

    07/01/2012 8:13 pm

    ఏదో కవిత్వం చదువుతున్నట్టు అనిపించింది, అభినందనలు.

  939. క్రీడాభిరామము:1 వ భాగం గురించి గంటి లక్ష్మీ నరసింహమూర్తి గారి అభిప్రాయం:

    06/29/2012 8:05 am

    క్రీడాభిరామామనే శృంగార గ్రంధాన్ని నెట్ లో పెట్టి అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు చాలా సంతోషం (ఈ కృతి తొలి ప్రతులు పండితులకు మాత్రమే పరిమితం.) ఈ నెట్లో ప్రచురణకు మూలం ఏదో తెలియ జెయ్య లేదు.శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారి పరిష్కారంతో ప్రచురించిన మణిమంజరి వారి ముద్రణ ప్రామాణికమని పండితాభిప్రాయము.

    శ్రీఎమ్.ఎస్.ప్రసాదుగారన్నట్లుగా క్రీడాభిరామ కృతికర్త శ్రీనాధుడనే బహుళ ప్రచారంలో యున్నది. దానికి కారణం ఈ గ్రంధాన్ని క్షుణ్ణంగా చదివి, నిశితంగా పరిశోధించిన పండితులు ఈ కృతిలో శైలి పదగుంభనములు మెదలుగునవి శ్రీనాధుని ఇతర కావ్యములతో పోల్చి చూసి పుంఖానుపంఖాలుగా ఉదాహరణలు లభించుటచే ఈ గ్రంధము శ్రీనాధుని రచనయే అని నిర్ధారణకు వచ్చుట. వల్లభుని ఇతర కావ్యములు లభ్యము కాక పోవుట. ఇంకా కొన్ని ఇతర కారణముల చేత వల్లభుని పేరు మరుగున పడుట చేత.

    సరివత్తురీవ అని మొదలయ్యే పద్యంలో జలద అనే యున్నది. అట్లాగే మందార వారుణీ అని మొదలయ్యే పద్యంలో మూడవ పాదం వెలఁది కోఱల మోము వేల్పు చేత అని యున్నది. గంధవతీ ప్రతీర పుర ఘస్మర అని మొదలయ్యే పద్యంలో చివరి పాదంలో బైచన మల్లన తిప్ప మంత్రులన్ అన్న వాక్యంలో మల్లనకు బదులుగా వల్లభుడు అని యుండాలని శ్రీ శాస్త్రి గారు సూచించేరు. అట్లాగే దాని తర్వాతి పద్యంలో చివరి పాదంలో డర్మవణికి బదులు డార్యమణి యనియుండాలని వారు సూచించేరు.

    శృంగార కవిత్వం వ్రాసినంత మాత్రాన మనం శ్రీనాధుని ఏహ్యభావంతో చూడవలసిన పనిలేదు. అతడు ఈశ్వరార్చన కళాశీలుడు.బ్రాహ్మీదత్తవరప్రసాదుడు. సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్య భాషా పరిజ్ఞాన పాటవంబు కల్గినప్పటికి దేశభాషలందు తెలుగు లెస్స యని తెలుగు వారి భాషా సంస్కృతులను ఢంకా మీద దెబ్బకొట్టి మరీ చాటి చెప్పిన మహాకవి. తెలుగువారిగా మనందరికి ఆయన గర్వకారణం.

    -గంటి లక్ష్మీ నరసింహమూర్తి.

  940. ఒక పుస్తకం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    06/26/2012 9:31 pm

    ఇవి నానీలా హెచ్ అర్కే గారు? ఇవి నానీలయితే ఒకటి రెండు బాగున్నాయి, కానీ ఇది కవిత అయితే మాత్రం మీ మనసులో తోచిన భావం మా మనసులకి చేరలా. మీరు చెయ్యి తిరిగిన గొప్ప కవితా పెయింటర్ అయుండొచ్చు, నిజంగానే అంత గొప్ప కవులే మీరు, కానీ మీ భావం మీ కవిత లో షార్ట్ సర్క్యూట్ అయిపోయి, పాఠకులని చేరకముందే డిసిపేట్ అయిపోయినట్టుంది.
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  941. దీవి సుబ్బారావు “మాటన్నది జ్యోతిర్లింగం” గురించి chavakiran గారి అభిప్రాయం:

    06/20/2012 8:25 pm

    మాటన్నది జ్యోతిర్లింగమే బాగుందండి.
    పేరులోనే ఎంత కవిత్వం ఉందో చూడండి.

  942. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    06/17/2012 3:05 pm

    జయప్రభ, దిగంబరకవిత్వం మీద విపులమైన చర్చ చేసి వారి కవిత్వాన్ని విశ్లేషణ చేసి [1993 లోనే] రాసిన వ్యాసం ఉంది. [మార్గము- మార్గణము అన్న పుస్తకం లో అది చదవడానికి వీలుగా లభిస్తుంది కూడా!] -రమ.

    Thanks for the information. I read this essay, in the above mentioned book. I like it.

    The essayist’s ability to get her thoughts across to a reader with such clarity and coherence (especially, when the subject she has to deal with – itself is – muddled thought and its base expression in a particular period poetry,) is impressive.

    I will proceed to read the other literary essays in that book by Jayaprabha. That will be a part of this summer reading of mine.

    లైలా

  943. ఓ నాలుగు చిన్న కవితలు గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:

    06/16/2012 11:19 pm

    ‘ పేచీ’ కవిత బాగుందండి..
    పిల్ల ఆటలతో – మనుషుల బ్రతుకు తీరును పోల్చి చెప్పిన ఓ ఆంగ్ల కవి గుర్తుకొచ్చాడు

  944. దీక్షా లాక్షా రాగ రేఖ గురించి తః తః గారి అభిప్రాయం:

    06/14/2012 12:52 pm

    ప్రసాద్ గారూ:

    అతిశయోక్తిలొ కూడా ఒక తర్కాన్నీ అందాన్నీ సాధించవచ్చు. ఒకరకంగా కవిత్వం చేసే పని అదే. విమర్శ తోట లోకి తీసుకుపోయే బాట లాగా లేకపోయినా లోపల ఏముందో చూడటానికి వీలు లేకుండా చేసే ముళ్ళ కంచెలా ఉండకూడదు. బాటసారులకు నీడనిచ్చే చెట్టులా లేకపోయినా దోవకు అడ్డమొచ్చే తుమ్మ మొద్దు లాగా ఉండకూడదు. అద్వైతం గారు తన అభిప్రాయం -అది ఎటువంటిదైనా – చెప్పిన తర్వాత, రమగారు తన అభిప్రాయం చెప్పిన పద్ధతి (“ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు”) ముఖ్యంగా ఒకరు భోజనం చేస్తున్నప్పుడు “చీ ఇలాంటి తిండి ఎవరు తింటారు” అన్నట్టుగా ఉంది. Fools tread where angels fear to step in అన్నట్టుగాఉంది

    నేను చాలావరకూ నా వ్యాఖ్య అద్వైతం గారికి క్షమాపణలుగా రాసాను. నాకు తెలిసిన తర్క మొకటే- ‘కైత’వం.

  945. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి rama bharadvaj గారి అభిప్రాయం:

    06/13/2012 9:35 pm

    ప్రసాద్ గారూ! జయప్రభ, దిగంబరకవిత్వం మీద విపులమైన చర్చ చేసి వారి కవిత్వాన్ని విశ్లేషణ చేసి [1993 లోనే] రాసిన వ్యాసం ఉంది. [మార్గము- మార్గణము అన్న పుస్తకం లో అది చదవడానికి వీలుగా లభిస్తుంది కూడా!] అది రాసి దాదాపు ఇరవై ఏళ్ళు కావొస్తోంది కదా! అందులో ఆమె కూలంకషంగా దిగంబరుల దృస్టినీ.. వాటిని సమర్ధించిన విమర్శకుల దృస్టినీ సైతం విశ్లేషణ చేసి ఉన్నారు కదా! ఆ చర్చ తరవాత కూడా.. ఆమె ఆ వ్యాసం రాసిన తరవాత కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి ..వేలూరి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయన దృస్టిని చెబుతోంది. వేలూరికి ఆ సాహితీ సందర్భం తెలియకుండా ఉంటుందని నేను అనుకోవడం లేదు. అందువలన ఆయన అభిప్రాయం రాసిన తీరు ఈ విషయంలో తప్పక గర్హించతగినదే !!

    రమ.

  946. దీక్షా లాక్షా రాగ రేఖ గురించి ప్రసాద్‌ గారి అభిప్రాయం:

    06/13/2012 7:21 pm

    పై అభిప్రాయాల్లో, విషయాలు చాలా వరకూ అర్థమే కాలేదు. అసలు కవితే అర్థం కాలేదు నాకు. పోనీండి. ఈ కవిత, భాషా పండితులకే గానీ, నాలాంటి తెలివి తక్కువ వాళ్ళకి కాదు అని వదిలేశాను. అయితే, ఒక చిన్న తర్కం మాత్రం బాగా అర్థం అయింది.

    “ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు 🙂 :).” అన్న రమా భరద్వాజ్ గారి వ్యాఖ్యని, తః తః గారు చాలా యాంత్రికంగా అర్థం చేసుకున్నారు. అందువల్లనే, చదివిన వాళ్ళు కనీసం ఒక్కరని (వారు రాసిన అభిప్రాయన్ని బట్టీ) తేల్చి, రమా భరద్వాజ్ గారు తప్పని రుజువు చేసేశారు. ఇందులో యాంత్రికత్వం తప్పితే, వేరే తర్కం ఏమీ లేదు. మొదటగా, రమా భరద్వాజ్ గారు ఈ కవిత చదివే కదా, అలా విమర్శించిందీ? అంటే, రాసిన వాళ్ళు కాకుండా, ఇంకొకరు చదివినట్టేగా? ఆ వ్యాఖ్య అర్థం అలా యాంత్రికంగా తీసుకోకూడదు. “ఇలాంటి రచనని ఎక్కువ మంది చదవలేరు” అన్న అర్థాన్నే తీసుకోవాలి. విమర్శించేటప్పుడు, అలా వ్యంగ్యంగా అనడం, ఒక అతిశయోక్తికి చెందిన పద్ధతి. ఈ యాంత్రికత ఒక్కటే అర్థం అయింది, ఈ చర్చలో.

    ప్రసాద్

  947. మూడు లాంతర్లు -11 గురించి rama bharadvaj గారి అభిప్రాయం:

    06/13/2012 3:24 pm

    మాధవ్!! “మూఢానురాగం” అన్నదానిని మనం నిజంగా నిరూపించలేమని అనుకుంటాను. నాకు “ఆదివారం మధ్యాహ్నాలు” చదవడానికి అక్కడ క్లిక్ చేస్తే ఆ లింకు తెరుచుకోవడం లేదు. కారణం తెలీదు. ఏదైనా ఆ కవిత ఏమో ఏమిటో ..నేను చదవలేదు.

    “ఔద్వేగిక ” అన్న పదాన్ని మరీ వ్యాసాల్లో అతిగా వాడి దాన్ని మోతాదుకి మించి అరగదీసేస్తున్న కనక ప్రసాదూ!! ఆ పదాన్ని మీ వ్యాసాల్లో మీరు వాడకుండా ఉండాలంటే మేము ..పాఠకులం ఏమి చెయ్యాలో కాస్త చెబుతారూ?? చదువుతూ ఉంటే పంటికింద రాయి కన్నా కటువుగా ఉంది మరి. అంతకన్నా “ఉద్వేగం” అనడం మెరుగు కదా?? నేను ఎడిటర్ ని అయ్యుంటే ముందు మీ వ్యాసం లోని వాక్యాలని చాలా వరకూ పదాలని సవరించి ఉందును 🙂 మీ పదాల మీద మీకు “మూఢానురాగం” లేకపోతేనే సుమా!! 🙂

    మాధవ్! సినీమా దర్శకుడికీ ..ఎడిటర్కీ ఉన్న సంబంధం లాంటిది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను కవిత్వానికి సంబంధించి. సినిమాకి ఒక కాల వ్యవధి ఉంది. దాన్ని మీరన్నట్టు తప్పనిసరిగా “ముస్తాబు” చేయాల్సి ఉంది. లేకపోతే డబ్బులు రావు మరి:) అందువలన అక్కడ దర్శకుడు తన ఊహని తగ్గించుకుని లేదా పక్కకి తప్పుకుని నచ్చో నచ్చకో [అది అటుంచితే..] విధిగా కత్తిరించే వాళ్లకి తన ఫిల్ముని తప్పనిసరిగా అప్పగించాలి. మంచి ఎడిటర్ ఆ దర్శకుని ఊహని “ముస్తాబు” చేసి ప్రదర్శనకి సిధ్ధం చేయాలి.

    అయితే ఇదే ఇలాగే యధాతధంగా కవిత్వం విషయంలో నప్పదు. ఇందుకు కేవలం కవికి తన రచన మీద ఉండే “మూఢానురాగం” కారణం కాదు. తన ఉద్వేగాల లోంచి కవి తాను చూసే దౄశ్యాలని విమర్శకుడు చూడలేకపోవడమే! మనకి కవిత నచ్చవచ్చు లేదా ఇంకొక మాట వాడితే మరింత బాగుండునేమో అని అనిపించనూ వచ్చు. కానీ అలా ఎవరైనా చెయ్యి చేసుకుంటే అప్పుడు అది మరొక కవిత అవుతుందే తప్ప కవి రాసినదో లేదా ఊహించుకున్నదో కాలేదు. అలా మరొకరు సూచించే మార్పులతో కవి తాను తన రచనని మార్చుకోగలడా/దా?? ఈ సందర్భంలో కవి ఏమి చెయ్యాలీ అన్నది ముఖ్య మైన ప్రశ్న అవుతుంది. ఇందుకు కవుల జవాబు మనకి చాలా ముఖ్యం. వారి తోడ్పాటు లేకుండా చర్చించగలిగిన సంగతి కాదు ఇది. అది అలా ఉంచుదాం!! సృజనలో సామూహిక దృస్యాన్ని కాసేపు ఊహిద్దాం!!

    అప్పుడు ఇంక ఒక కొత్త వరవడి మొదలవ్వాలి. అదెలాంటిదంటే సామూహిక రచన. ఇందులో మొదట ఒక ఊహని కవి ఆవిష్కరించగా, దానికి మొదట విమర్శకులో ఆ తరవాత పాఠకులో తమకి నచ్చే విధంగా కవి రాసిన దానికి మెరుగులు దిద్దుకుంటూ పోవడం. అప్పుడు అది ఎవరి ఊహ అవుతుందీ? కవి రచనగా అది మిగులుతుందా? ఇందుకు కవికి మనసు వొప్పుతుందా? మీరన్నట్టుగానే ఏ తల్లికీ తన పిల్ల మీద పరాయి వాళ్ళ అజమాయిషీ నచ్చనట్టే 🙂 అది స్వాభావికం కదూ? పైగా కవి మాత్రమే అసలు “తొలిగా” ఎందుకని రచన చేయాలీ?? ముందుగా విమర్శకులే చెప్పి పాఠకులే పాల్గొని చివరగా కవే తన ఊహతో దానిని ఏల సరిదిద్ద రాదూ?? రచన అన్నది సామూహిక కృషిగా మారుతున్నప్పుడు తొలి అడుగు కవి మాత్రమే ఎందుకూ వేయడం?? మళ్ళా ఆ పాత్ర లేదా ఆ బాధ్యతా కవే నిర్వహించాలా ఏం? పోనీ కవే మొదటి ఊహ చేసి రచనని మిగిలిన వారికి అందించాదని అనుకుందాం. దాని మీద విమర్శకులు తమకి తోచిన మార్పులని చేశారనుకుందాం!

    చివరికి ఇంతా చేసి అసలు విమర్శకుడు /రాలు చేసిన మార్పులు పాఠకులికి నచ్చక పోతేనో?? అంటే మళ్ళీ ఆ మార్పులు చేసే వాళ్ళకి తప్పనిసరిగా ఏదో ఒక స్థాయీ ఒక అర్హతా ఉండాలన్నమాట. దాన్ని దేని ఆధారంగా నిర్ణయిస్తారూ?? ఎవరు నిర్ణయిస్తారూ?? ఇంతాచేసి అది ఏమన్నా సృజన విషయం లో అంతిమ తీర్పా?? అంటే ..చివరికి తేలేదేమిటీ?? సృజన ఎప్పుడైనా వ్యక్తి నిస్టమే కావాలి అనే!! మీరిచ్చిన సినిమా దర్శక ఎడిటర్ల పోలిక కవిత్వానికి నప్పదనే!! సౄజన అచ్చంగా పిల్లల్ని కనడం లాంటిదే!! వాళ్ళ రూపురేఖలు పక్కవాళ్లకి నచ్చడం కాదిక్కడ ముఖ్యం. దాన్ని సృస్టించిన వాళ్ళకే దాని మీద సర్వంసహా అధికారం ఉంటుంది. అది వాళ్ళ రక్త నిస్టమైనది.

    సృజనే ముఖ్యం! సృజించే వారి శక్తి కొలది మాత్రమే కల్పన వర్ధిల్లుతుంది. బాగున్న ఊహ బాగుంటుంది. బాగులేనిది మరుగున పడిపోతుంది. అందరూ కల్పన చేయలేరు. కొందరే చేయగలరు. దాని రహశ్యం తెలిసిన వారే కవి శబ్దానికి తగుదురు. మిగిలిన వారు యధాశక్తి కవులు. ఇంక ఇటువంటి మాటలంటారా?? మాట్లాడుకోవడమే 🙂

    రమ.

  948. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి ప్రసాద్‌ గారి అభిప్రాయం:

    06/13/2012 2:47 pm

    లైలా గారు లేవనెత్తిన సాంఘీక అంశాలని, “లోకో విభిన్న రుచిః” అనే ఆర్యోక్తితో, వేలూరి గారు ఎగర గొట్టడం సబబుగా లేదు. ఇదేమీ, “ఒకరికి బంగాళా దుంప ఇష్టమైతే, ఇంకొకరికి టొమాటో ఇష్టం” లాంటి విషయం కాదు. విప్లవ కవులు అని చెప్పుకునే వారు, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఎంత బండతనంతో వుంటారో, వారిని అవమానించే మాటలను, వేరే ఆలోచన లేకుండా, ఎలా తమ విప్లవ కవిత్వంలో వాడుకుంటారో తెలియజేసే విషయం ఇది. దీని రుచి సమాజంలో అందరికీ ఒకేలాగా వుండాలి కదా? ఈ బూర్జువా సమాజంలో, పురుషులు ఇతర పురుషులను తిట్టే తిట్లు, ఎక్కువగా ఆ పురుషులకు సంబంధించిన స్త్రీలని అవమానం చేసే మాటలే. స్త్రీ వివక్షకి సంబంధించిన విషయాలు, అభ్యుదయ వాదులకు ఒకే రకంగా రుచించాలి.

    ప్రసాద్

  949. దీక్షా లాక్షా రాగ రేఖ గురించి rama bharadvaj గారి అభిప్రాయం:

    06/12/2012 2:02 pm

    వేలూరి గారూ !! మీరే కవిత్వం రాస్తానంటే ఇహనేం 🙂 తప్పక ఎదురుచూస్తాను . కవులని వెక్కిరిస్తూ..స్తూ.. స్తూ.. మీరు కవిత్వం వేపు మళ్ళడం, ఇలా మీరు కవిత్వానికి లొంగడం ..ఆసక్తి దాయకమైన విషయమే కదా !! రాయండి రాయండి. నాలాంటి వారికి కాస్త కవిత్వాన్ని గురించి కొత్త సంగతులని చెప్పిన వారవుతారు 🙂 ధన్యోస్మి !!

    తహతహ గారూ !! నా ఉద్దేశ్యం లో ఏ కవిత అయినా దానికదే స్వతంత్రం గా నిలబడాలి. మంచికైనా ..కానిదానికైనా !! ఇంకొకరు మెచ్చినందువల్లా కాదు నొచ్చినందువల్లా కాదు. సమర్ధింపుకేమి . దేన్నైనా సమర్ధించవచ్చు. చివరగా ఏదైనా మాటల గారడీ వే కద 🙂 అందువలన మీ కవితలోని భాషా భేషజానికి తిరిగీ నేను సిఫార్సు చేసే పని పడదు లెండి. ఈమాట పత్రికే చాలు . అన్ని సిఫార్సులకీ !! వేలూరి ఆ పనిని అప్పుడే మొదలెట్టారుగా !!

    ఇంతకీ , నాకు అనిపించిన అభిప్రాయం నేను రాసేను. అలా కాకుండా మీ” భావావేశం” నా” విమర్శకావేశా”న్ని గనక మించినదే అయితే మంచిదే కద !! ఇలాగే రాస్తూండండి. అయితే నా అభిప్రాయం మాత్రం ఇప్పటికీ ఇదివరకటిదే !!

    రమ.

  950. దీక్షా లాక్షా రాగ రేఖ గురించి తః తః గారి అభిప్రాయం:

    06/08/2012 10:02 am

    నా ప్రతిస్పందనలతో అభిప్రాయాల సంఖ్య పెంచటం ఇష్టం లేక అభిప్రాయాలు తెలిపిన వాళ్ళందరికీ ఒకేసారి జూన్ చివరలో జవాబులు రాద్దామనుకున్నాను. కానీ రమ భరద్వాజ్ తన అభిప్రాయంతో నన్ను ఉత్తేజపరిచారు.

    అద్వైతం గారికి: ముందుగా మీకు నా ధన్యవాదాలు. ప్రచురణ వచ్చిన మరునాడే మీరు చదివి వెలిబుచ్చిన అభిప్రాయానికి నేను వెంటనే జవాబు -పైన చెప్పిన కారణాన- ఇవ్వనందుకు మన్నించండి. రమ గారి అభిప్రాయంలో మొదటి భాగం నా రచన మీద చెప్పినది. అదులో “ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు 🙂 :)” అన్నది చూసినప్పుడు రమ గారిని ‘సరదాగా’, మీరు మీ అభిప్రాయాన్ని ఈ రచనని చదివి రాశారా, [బ్రహ్మదేవుడు కూడా చదవలేడు కాబట్టి] చదవకుండానే రాశారా అని అడగాలనిపిస్తోంది.

    అద్వైతం గారు ఈ రచనని చదివిన తరవాతే తమ అభిప్రాయాన్ని తెలిపి ఉంటారనుకోవటంలో పెద్ద తప్పేమీ ఉండదు కాబట్టి [అద్వైతం గారికి క్షమాపణలతో] అద్వైతం గారు రమ గారన్నమాటకి [కనీసం] ఒక counter example ఈ మాటలు నేను, తః తః, అద్వైతం వేరు వేరు వ్యక్తులు అని చాటి చెపుతూ రాస్తున్నాను ఒకే వ్యక్తి అయితే రమ గారి మాట నిజమయే ప్రమాదం ఉంది.

    అద్వైతంగారు వారు ఈ రచనని చదివిన తరువాతే చెప్పిన -అభిప్రాయం ముందు ఉండగా రమగారు ఈమాట అనడం రమగారు అద్వైతం గారి అభిప్రాయాన్ని చదవ కుండానే – కనీసం చూడకుండానే- ఈమాట రాశారానుకోవాల్సి వస్తోంది అయినా రమగారి మిగతా విమర్శావేశానికీ జవాబు రాస్తున్నాను.

    శ్రీనాధుని శీర్షిక లో అరువు తెచ్చుకున్న లౌల్యమొకటి.: శ్రీనాథుడి పదబంధాన్ని అరువు తెచ్చుకోలేదు. అచ్చం గానే తెచ్చుకున్నాను. అరువు తెచ్చుకుంటే ఏదో రూపంలొ తిరిగి ఇచ్చేయాలి. పూర్వ కవుల భాషా సంక్రాంత ఋణాన్ని నేను తీర్చలేను. లాక్షా రాగరేఖ శ్రీనాథుడి నాయిక అపర్ణ పారాణి. ఈ కవితా వస్తువుకు తగినట్టుగా దీక్షను నా కవితా నాయిక లాక్ష గా చేసి ఆమెను దీక్షా లాక్షా రాగ రేఖ గా personify చేశాను.
    కాళిదాసు ఇందుమతి సంచారిణీ దీపశిఖయై ఒక్క మొగాన్ని మాత్రం వెలిగించి మిగతా వాటినన్నిటినీ చీకట్లోకి నెట్టేస్తే ఇక్కడ నాయిక తన నాయకుడి జీవితాన్నీ ఆశయాన్ని పంచుకుని పలువురి పాలిపోయిన కళ్ళల్లో ఎర్ర జీరలు తేవటానికి చైతన్య దీపశిఖగా వస్తుంది.

    ‘మహర్వాటి’ ని పోతన నుంచి తెచ్చుకుని ఆ వాటికి మహాద్వారం నిర్మించి ఆ మహాద్వారానికి పలకరించుకునే పక్క పక్క ఆకులతో తోరణం కట్టాను. సంధ్యానిల[సంధ్యా సమీర ప్రసారాల] షడ్జమాన్ని శ్రీ శ్రీ నుంచి తెచ్చుకుని గీతాలాపనకు షడ్జమంతో పాటు పంచమం కూడా కావాలి కాబట్టి ఆ పంచమాన్ని ప్రత్యూష పవనాలనుంచి ఏరుకోండన్నాను.

    తిలక్ నాయకుడు తన చెలి అభ్యంగానావిష్కృత వినీల శిరోజాల తమస్సముద్రాలు పొంగితే చూసి పొంగిపోతే ఇక్కడి వాడు తన నాయిక ఆగమనావిష్కృత సుహృల్లతా వనాంతానిల పరీమళ వ్యాపృత వసంతం వస్తున్న క్షణాలను ఆహ్వానిస్తున్నాడు ఇది తిలక్ కు శక్తివంతమైన అనుసరణే గానీ [బలహీనమైన] అనుకరణ కాదనే అని అనుకుంటున్నాను . ఇందులో ‘పరీమళ వ్యాపృత’ విశ్వనాథ ది ‘నాకుటీర మానంద వాయువీచీ ప్రసార శత సహస్ర పరీమళ వ్యాపృతమ్ము’ అంటాడు విశ్వనాథ ఒక చోట.

    ఇలా’ పోగుచేసి రచించిన’ గేయం ఇది. ఇంకా రాయొచ్చు గానీ ఇక్కడితో ఆపేస్తాను .ఇందులో ఏమైనా స్వోత్కర్ష ధ్వనిస్తే అది మీరన్న ‘ధీమా’యే.

    Ms Rama Bharadwaj: The piece is clearly utopian. It is extremely difficult if not impossible to give expression to utopia in words commonplace. In a way utopia is myth and it might at least serve an inspirational purpose if mythical images and characters appear in florid hues and flashy robes. If you choose to describe the work as verbose I do appreciate your aesthetic choice.

    warmest regards
    తః తః

    తా.క. రమ గారు ఒక అభ్యర్ధన: మీ అభిప్రాయాలను చాలా చదివి ఉన్నాను. వాటినుంచి మీకు సాహిత్య వ్యాసంగం బాగానే ఉన్నట్టనిపిస్తోంది. ఏ వ్యాసంగాన్నయినా ఉదాహరణలూ (యెంత పెద్దవైతే అంత మంచిదన్న భావన ఒకటి బాహుళ్యం లొ ఉంది), ప్రత్యుదాహరణలూ (చిన్నదయినా ఒక్కటయినా చాలు) పరిపుష్ఠం చేస్తాయి. మీకు సందర్భం ఎదురయినప్పుడల్లా నా ‘దీక్షా లాక్షా రాగ రేఖని’ భాషా భేష జానికి ఒక పెద్ద ఉదాహరణగా పేర్కొనడం మరిచిపోకండి.

  951. ఈమాట మే 2012 సంచికకు స్వాగతం! గురించి Prasad గారి అభిప్రాయం:

    06/02/2012 4:37 am

    ఒక వేళ, నేను ఏమైనా కథలు లేదా కవితలు మీకు పంపాలంటే, పద్ధతి ఏమిటొ తెలుపగలరు.

    [రచయితలకు సూచనలు అన్న పేజీలో అన్ని వివరాలు ఇచ్చాము – సం.]

  952. నిద్రపోతు జాతి గురించి a.satyanarayana గారి అభిప్రాయం:

    05/24/2012 8:44 pm

    సమాజం మీద సంధించిన అక్షర బాణం
    అల్పుల హృదయాల పై నిలిచి ఆలపించిన కవితా గానం.

  953. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    05/24/2012 3:19 pm

    వేలూరి కొంత కాలంగా -అపరాధులను క్షమించే అమెరికా ప్రెసిడెంట్ మోడ్ లో ఉన్నారు. ఒక్కో కథ, కవిత చదివి -వీరిని క్షమించాలి, వారిని అర్థం చెసుకోవాలి, ఈ కథలో వారిని సానుభూతితో చూడాలి, అని ఉదారులై పోతుంటారు. వేలూరి తరుణ హృదయులు. తరచి చూస్తే, ఉదారత ఎల్ల వేళలా మంచిదే. క్షమాగుణం సర్వత్రా మంచిదే.

    కాని,

    ” దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
    అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది ” – అనే విప్లవకవి చెఱబండ రాజు కవిత ఆయనకు ప్రార్థనా పద్యంలాగా వినిపిస్తుంది.

    ‘వేలూరి’ ఉద్దేశంలో – ” విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు.” (చూడు: “మూడు ప్రార్థనా పద్యాలు” ఈ మాట)

    That’s one hell of a topsy turvy hypothesis. – I think.

    The utterly selfish, give me give me, irresponsible, సోంబేరి graffiti in this poem makes my skin crawl.

    ప్రేమ, అనురాగం భాష అదేనా? దేశాన్ని తల్లిగా ఊహిస్తూ, మళ్ళీ ఆ తల్లిని వేశ్యగా ఊహిస్తూ బూతులు తిడుతున్నది, ఈ కవితలో ఉన్న వ్యక్తి -ఒక చిన్ని బాలుడు కాదు. (శైశవ క్రీడగా తల్లి స్థనాలతో ఆడుకునే చిన్ని mythological వినాయకుడు కాడు.) అసలు చిన్ని బాలుడికి తల్లి గురించి అట్టి ఘటియా ఊహలు రావు. ఆ కవితలో ఉన్నది నిజమైన దేశంలో, ఒక ఎదిగిన పౌరుడు. దేశం మట్టీ కాదు. మశానం కాదు. తల్లీ కాదు తండ్రీ కాదు. దేశం పౌరులే.
    “Ask not what the country had done for you, Ask what you have done for the country” – అన్న ధోరణిలో ఆలోచించే పౌరుడు, ఈ కవి కాడు. Entitlement మరిగిన ఒక మనిషి. దేశ వ్యవహారాలలో తన బాధ్యత ఏమిటి అని ఆలోచించకుండా – కవిత్వం లో దేశాన్ని personify చేసి – అందునా ఒక స్త్రీగా, కులటగా ఊహించుకుని, నీ గమ్యం ఏమిటి తల్లీ? – అని విచారపడి పోతూ ఉంటాడు.

    ఇది చదివే నాకు; తల్లి పడుపు వృత్తి చేస్తూ సంపాదించుకు వస్తుంటే, ఆ సంపాదనకోసం నోరు తెరుచుకుని ఎదురు చూసే బడితె, -వాడెలాటి కొడుకు? అతడే పని చేస్తున్నట్టు లేదేం, దుష్టపు ఊహలు ఊహిస్తూ తల్లి మీదే రాళ్ళు విసురుతూ నోరు పారేసుకోటం తప్పించి.- అన్న ఆలోచన వస్తుంది. నాకు ఈ కవి నచ్చడు.

    వేలూరికి ఈ కవీ నచ్చుతాడు. తిలక్ కవీ నచ్చుతాడు. అదెలా? అది నా కర్థం కాదు.

    గమనిస్తే ఈ దిగంబర కవికీ , తిలక్ కూ ఆలోచనల్లో ఎంతో తేడా ఉంది. పాఠకులు గమనించవలసినది ఆ మానవత్వపు తేడాలే. తిలక్ కథలు చదివిన వారికి సవ్యమైన ఆలోచన తెలుస్తుంది. సంస్కృతి. సంప్రదాయము , చట్టుబండలు ఆలోచనలు కావతనివి. తిలక్ కథలూ కవితలూ కొన్ని చదివాక – ఇది కథా, కవితా, ఎలాటిదీ శైలీ, అన్న మీమాంస కాదు, అతను రాసే విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు పాఠకులు. ఇవ్వాలి.

    Ron Paul (నాయకుడిగా ఎన్నిక అవడు) ఇటీవలి రిపబ్లికన్ డిబేట్లలో -ఒక డాక్టర్గా, యుద్ధమ్లో స్వయంగా పాల్గొన్న వాడిగా – మనిషి జీవితం ఎంత విలువైనదో, పదే పదే చెప్పాడు. సంవత్సరాల తరబడి -పగ, విద్వేషాలూ, యుద్ధాలలో ఇరుక్కుని ప్రాణ నష్టం, అంగ వైకల్యం పౌరులకు జరగరాదు అని మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడు. నిజంగా యుద్ధానికి పంపబడే యువకులు గమనిస్తున్నారు. ఆలోచించుకుంటున్నారు. వారు తప్పక ఆలోచించుకోవాలి. జీవించవలసిన వయసులో జీవించాలి. శృంగారం అనుభవించవల్సిన వయసులో, విడదీయబడి, విరహ కావ్యాలు రాసుకుంటే వారికేం లాభం? వికలాంగులైతే ఏంటి దారి? ఎంత పెన్షన్ ధనం ఆ లోటు తీరుస్తుంది?

    కానీ, కొందరు నాయకులు, ఇప్పటికీ, యుద్ధ సైనికులు హీరోలనీ, వీరులనీ, వీర మరణాలనీ, అమరులనీ – అదో పిచ్చికవిత్వ భాష మాట్లాడుతుంటారు. తిలక్ రచనలు – అట్టి nonsensical talk and thought నుండి liberate చేస్తాయి. విభజించి ఆలోచించటాలు, నాయకులను వెర్రిగా నమ్మటాలు, తిలక్ రచయితగా మానేశాడు. యుద్ధాలు, మనుషులకు చేటని తిలక్ కు స్పష్టం.

    రాజకీయ నాయకుడు అనే పాత్ర ధరించిన వాడి జీవితం, ప్రవర్తన, evolution, progression, ఎలా ఉంటుంది అన్న ఒక చక్కని study- ‘అద్దంలో జిన్నా’ అన్న రచన. జిన్నా గుండెపై రక్తపు మరకలు – Macbeth చేతులపై రక్తపు మరకలు లాగానే ఎంత కడిగినా పోవు. ఈ తిలక్ కథలు చదివాక, ఏ జిన్నాల -కోట్లు చూస్తానికి, ఊరికే దేశం మీద పడి అరిచే ‘ దిగంబర కవిత్వం’ వింటానికీ – కొందరు ప్రజలు పోరు.

    ఇది కవిత్వమా? కథా? అన్న ప్రశ్న తిలక్ కధ విషయంలో, విమర్శకుడికి ఎందుకు? తోటి ప్రజలను గురించిన ఆలోచన మాని, నాయకుడి పై సానుభూతి చూపుదామా – అంటూ – ఆలోచన దారి మళ్ళించటం ఎందుకు? I am sorry. నా కర్థం కాదు. Pardon me too.

    లైలా

  954. చందవరం, ప్రకాశం జిల్లా గురించి శారదా కిషోర్ గారి అభిప్రాయం:

    05/23/2012 4:55 am

    1. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ముక్కలు జిగురు రాకుండా, అడుగున అంటుకోకుండా ఉండాలంటే వేపుడు చేసే పాత్రలో కొంచెం ఇంగువ వెయ్యాలి.
    2. క్యాబేజి వండేటప్పుడు చెంచా నిమ్మరసం వేస్తే వాసన రాకుండా ఉంటుంది
    3. అనీజీ (uneasy) గా ఉన్న టైంలో మళ్ళి ప్రశాంతంగా అవ్వాలంటే ఇంద్రాణి గారి కవిత చదవాలి

  955. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన గారి అభిప్రాయం:

    05/11/2012 11:09 am

    తఃతః గారు,

    రగడలు దేశి ఛందస్సు, అవి మొట్టమొదట రఘటాబంధమని నాగవర్మ ఛందోంబుధిలో పేర్కొన్నాడు. కన్నడములో వీటిని ఉత్సాహ (మూడు మాత్రలు), మందానిల (నాలుగు మాత్రలు), లలిత (ఐదు మాత్రలు) రగళె అంటారు. దాని సామాన్య లక్షణము –

    కం. గణనియమ విపర్యాసదొ-
    లేణెవడెదొళ్పెసెదు మాత్రె సమనాగె గుణా-
    గ్రణియ మతదింద తాళద
    గణనెగొడంబట్టు దదువె రఘటాబంధం (నాగవర్మ)

    ఇవి మాత్రాగణాలతో ఉంటాయి, ప్రతి పాదములో మాత్రల సంఖ్య సమానము, ఇది ద్విపద, ఇది తాళబద్ధమైనది. చివరి గుణము అంటే రగడ తాళబద్ధమైనదని చెప్పడము చాల ముఖ్యము. జయకీర్తి ఛందోనుశాసనములో ఇలాగంటాడు –

    స్వచ్ఛంద సంజ్ఞా రఘటా మాత్రాక్షర సమోదితా
    పాదద్వంద్వ సమాకీర్ణా సూశ్రావ్యా సైవ పద్ధతిః

    ఇది స్వచ్ఛందము, మాత్రాగణయుక్తము, ద్విపద, సుశ్రావ్యము, ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి పజ్ఝటికా (యశస్తిలక చంపువులో పజ్ఝటికా ఉన్నది) నుండి వచ్చినదని భావన. రగళెను (తెలుగులో రగడ) మొదట పంపకవి తన భారతములో ఉపయోగించాడు. కవిజనాశ్రయకర్త దీనిని ఉదహరించలేదు. అంటే తెలుగులో దీని వాడుక తరువాతి కాలములో. కానీ తెలుగులో రగడను పోలిన ఒక పురాతన శాసనము ఉన్నది. తెలుగులో తొమ్మిది రగడలు ఉన్నాయి. వృషభగతి రగడలాటి మిశ్రజాతి రగడ కన్నడములో లేదు, అది భామినీషట్పదిగా అందులో ఉన్నది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రగడలకు ముఖ్యప్రాణము అవి మాత్రాబద్ధము, తాళబద్ధము. అందుకే తెలుగులో ఇవి యక్షగానాలలో, ఉదాహరణకావ్యములలోని కళికోత్కళికలలో, కావ్యాలలో కొన్ని వర్ణనలలో వాడబడ్డాయి. త్యాగరాజకీర్తనలు మున్నగు వాటిని పదాలను విరిచి పాడితే బాగుండడము లేదని తరచుగా వింటూ ఉంటాము. రగడలు కూడ పాడదగినవే. అందుకే వీటిని విరిచి వ్రాయడము బాగుండదనే నా భావన. ముఖ్యముగా రెండు నాలుగు మాత్రలను ఒక ఎనిమిది మాత్రలుగా (ఉదా. IIIUIII) వాడడము సరికాదనే నా అభిప్రాయము. కవులు నిరంకుశులు, ఎలాగైనా వ్రాసికోవచ్చు. కాని అవి అన్నీ సరి కావు. ఉదాహరణగా, పాల్కురికి కొన్ని సంస్కృత ద్విపదలలో, విశ్వనాథ ఒక తెలుగు ద్విపదలో పాదాంత యతిని పాటించలేదు. వారిద్దరూ మహాకవులే. అంత మాత్రాన వారి ఈ దోషాన్ని గుణముగా అంగీకరీంచకూడదు అనే నా ఉద్దేశము. ఇవి వారి కవిత్వపు వాసినిగాని, వారి విద్వత్తును గానీ అవమాన పరచడము కాదు. వైయక్తికముగా, నేను కవిని గాను, ఒక లాక్షణికుడు మాత్రమే. లక్షణాలను వివరించడానికి పద్యాలను ఉదాహరణలుగా వ్రాస్తాను. మహాకవులను ఎత్తి చూపే పాండిత్యము, కవిత్వము నాలో లేవు.

    విధేయుడు – మోహన

  956. మూడు లాంతర్లు -11 గురించి Madhav గారి అభిప్రాయం:

    05/11/2012 10:59 am

    ప్రసాద్ గారూ,

    అ. బండరాళ్ళ ప్రదేశాల్లో ఉండేవాళ్ళకి కొన్ని రాళ్ళ మీద చట్టులా ఉండి, అందులో నీరు నిలవడమూ, ఆ నీటి కోసం కాకులు ఆ బండ మీద చేరడమూ ఒక దృశ్యానుభవం. లేదూ ఆ బండ ఒక బావి బండగా, ఆ చట్టు బిందెలు, కుండల ఒరిపిడి వల్ల వచ్చినదీ కావచ్చును. ఆ చట్టులో నీరెండిపోయినా కూడా కాకులు అలవాటుగా దాహమేసినప్పుడల్లా ఆవైపుకు రావడం, బండ మీద వాలడం, లేకపోతే ఒకసారి బండ చుట్టు తిరిగి వెళ్ళిపోవడం కూడా పరిచయమైన దృశ్యమే. ఇంకెక్కడా నీళ్ళు దొరకని కాకి నీరున్నా లేకపోయినా ఈ బండమీదే చివరికి వాలిపోతుంది. ఈ అనుభవం ఉన్న పాఠకుడికి బండమీద కాకులు చచ్చెను అన్న పాదం వేసవి గురించిన కవితలో అసహజంగా కనిపించదు సరికదా ఎంతో ఔచిత్యంగా కనిపిస్తుంది. అంతే కాకుండా, పాదభావాల పునరుక్తితో గతిని సాధిస్తున్న కవి, ఎండనూ చావునూ ఆ తర్వాత వచ్చే పాదాల్లో మళ్ళీ కలిపే వాడుకోవటం ద్వారా కవిత నిర్మాణంలో కూడా ఎంతో శ్రద్ధ చూపించాడని అనిపిస్తుంది. ఇందువల్ల కవిత్వానుభవపు లేమి కవి లోపం కాక, పాఠకుని వైయక్తిక పరిమితిగా కూడా పరిశీలించవచ్చునని నాకనిపిస్తున్నది (ప్రత్యేకించి, ఇతరత్రా పకడ్బందీగా ఉన్న కవితలో.)

    ఆ. ఇకపోతే, ఔచిత్య భంగానికి –

    లౌక్యంగా బయటి సామాజికులు – అంటే విమర్శకులు, పాఠకులు, సంపాదకులు వంటివాళ్ళను దృష్టిలో ఉంచుకొని శిల్పాన్ని పూర్తిచేసేడా లేక కేవలం తనకు చాల ఆంతరంగికమైనది, తనదైన సృజనానుభవానికే బద్ధుడై, దాన్నే మళ్ళీ మళ్ళీ తరచి చూసుకుంటూ చిత్రణ పూర్తిచేస్తున్నాడా, అసలు శ్రద్ధ పెట్టి పని పూర్తి చేసేడా లేదా అనేది పట్టి చూస్తే తెలిసిపోతుంది.

    – అన్న అభిప్రాయం పూర్తిగా సరి కాదని నాకనిపిస్తున్నది. బైటివారినెవరినో దృష్టిలో ఉంచుకొని సృజననీ, శిల్పాన్నీ ఎవరైనా ఎలా ప్రయత్నిస్తారు? (రిటైర్మెంట్ ఫంక్షన్‌లో అలవాటుగా ఇచ్చే గడియారపు ఫలకం మీద అచ్చేయడం కోసం మా బాబాయి చేత అందరూ రాయించుకునే పంచరత్నాలు అనే ఐదు వృత్త పద్యాలు మినహాయింపు, ఇందుకు.) ఈ కారణం వల్ల ఔచిత్య భంగం జరిగిందనే ఊహకు ఆధారమేమైనా ఉన్నదా?

    లౌకిక కల్మషంలేని సృజనలో కూడా ఔచిత్యభంగానికి, ఉద్వేగపులేమికి నాకు కనిపించిన రెండు కారణాలు.

    1. మీరు చెప్పినట్టు కాకుండా మొదట ఔద్వేగిక ప్రధానంగా, దాదాపు అప్రయత్నంగా వెలువడిన సృజనకు మెరుగులు చెక్కే పని అన్నది అసలు ఒకటుందనీ, అది చాలా శ్రద్ధతో చేయాలనీ తెలియకపోవడమే కాదు, అంతకు మించి ‘ఔద్వేగిక ప్రధానంగా దాదాపు అప్రయత్నంగా వెలువడినదే‘ నిజమైన కవిత్వమనీ, దానినేమాత్రం సవరించబోయినా, భావావేశం చచ్చిపోయి అది కవితే కాకుండా పోతుందనీ ఒక బలమైన అపోహ ఎంతోమందిలో (ఎంతో చదువుకున్న వారిలో కూడా) ఉండటం వల్లనే రచనలో అపరిపక్వత, దాని వల్ల ఔచిత్యభంగం కలుగుతున్నది. ఈ అపోహ మరీ అరుదైనది కాదని ఎక్కువ శ్రమపడకుండానే నిర్ధారించుకోవచ్చును.

    2. ‘బైటివారి కోసం’ శిల్పాన్ని పూర్తి చేయడం కంటే ‘బైటివారికి దూరంగా’ అనేది ఇంకో కారణం. …కేవలం తనకు చాల ఆంతరంగికమైనది, తనదైన సృజనానుభవానికే బద్ధుడై, దాన్నే మళ్ళీ మళ్ళీ తరచి చూసుకుంటూ చిత్రణ పూర్తిచేస్తున్న కవి, ఆ సృజనపై ఒక మూఢానురాగాన్ని పెంచుకోవడం ఇది. గుడ్డిప్రేమ అని అంటారే అలా, తన రచనలో (తనలో) లోపాన్ని తనే గమనించలేకపోవడమూ ఉన్నది. నాకు పుట్టి నేను పెంచిన బిడ్డ బాగోగులు నాకంటే బాగా ఇంకెవరికీ తెలియవు అని బలంగా నమ్మే ఒక తండ్రి లేదా తల్లి మనస్తత్వం ఇలాంటిదే. విమర్శలకు, సలహాలకు వెఱపు ఇందువల్లేనని నా అభిప్రాయం. దానివల్ల, తన రచనను తాననుకున్న విధంగా మాత్రమే కాకుండా ఇంకోరకంగా కూడా ముస్తాబు చేయడానికి, ఆ రచనలో తానుద్దేశిస్తున్న ఉద్వేగాన్ని ఔచిత్యాన్ని, తానూహించినదానికి భిన్నంగా, మరింత బలపర్చడానికి వెసులుబాటు ఉండవచ్చునని నమ్మలేక పోవడం వల్ల, ఎంతో శ్రద్ధ పెట్టి చిత్రణ పూర్తి చేస్తున్నా కూడా ఔచిత్యభంగం కలుగుతూనే ఉన్నది. ఈ ప్రవృత్తి అహం లానే పైకి కనిపించినా నిజానికి కాదు. అహం కూడా కొంతమందిలో ఒక కారణమైనా, అది లౌకిక తత్వ సంబంధి కాబట్టి అప్రస్తుతం.

    నాకు చాలా కాలం క్రితం సినిమాలకి ఎడిటర్, డైరెక్టర్ వేరే వేరే ఎలా ఉండగలరు, అని సందేహం పట్టి పీడిస్తుండేది. తీసే సినిమా మొత్తం (కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం) దర్శకుడి సృజన అయినప్పుడు, ఆ సృజనను ఎలా ఆవిష్కరించాలో, ఎలా సమర్పించాలో అతనికంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అందువల్ల డైరక్టరే ఎడిటర్ కూడా కావాలి కదా. మరి అలాంటప్పుడు, వేరే వ్యక్తి ఎలా ఆ సినిమాను ఎడిట్ చేయగలడు? కానీ ఎంతోమంది గొప్ప దర్శకుల సినిమాలకు కూడా ఎడిటర్లున్నారు. తన సృజనకు (దీటైన భాగస్వామిగా) చక్కగా మెరుగు పెట్టగలడన్న నమ్మకం తన సాధ్యాసాధ్యాలను తెలుసుకున్న దర్శకుడికి ఉండటం వల్లనే కదా ఇది సాధ్యం; లేని పక్షంలో పైన చెప్పిన మూఢానురాగం ఇందుకు అడ్డుపడి ఉండేది. సృజనకు, ఆ సృజన మూలాన్ని తత్వాన్ని గుర్తించి చక్కగా ముస్తాబు చేసి సమర్పించడం అనే ప్రక్రియకు ఉన్న నాజూకైన తేడా గమనికకు రావడంతో ఆ సందేహం నాకు తీరిపోయింది.

    దిశానిర్దేశం చేయగలిగిన విమర్శకులు, పాఠకుల తోడ్పాటు లేకపోవడం అనే లోటుని కూడా నేను గమనించాను. ఉదాహరణకి, ఆదివారం మధ్యాహ్నం కవయిత్రికి మీలాంటివారు పరిచయమై ఉండి, (ఆమె కేవలం ఔద్వేగిక / అప్రయత్న కవి కాకపోయి ఉండి) మీ విమర్శ తోడ్పాటు ఆమెకు ఉండి ఉన్నట్టయితే, ఆ కవిత మరింత బలంగా ఉండేది కదా! అలా జరిగిందో లేదో (అంటే ఆ కవితను ముందుగానే చదివి ఆమెకు ఎవరైనా విమర్శ, సలహా ఇవ్వడం వంటివి) నాకు తెలియదు కాబట్టి, ఇది కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను.

    మాధవ్

  957. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి TahaTaha గారి అభిప్రాయం:

    05/10/2012 9:13 pm

    మోహన గారికి నమస్కారాలు. గణాలకు తగ్గట్టుగా విరిచి రాయడమా రాయక పోవడమా అన్నది (ప్రతిభా వంతుడైన ) కవి ఇష్టం. ‘పీరులు’/ విమర్శకులు /అధ్యయనశీలురు, కవితా గుణావగుణాలను కాక ఛందస్సును మాత్రమే పరిశీలించటానికి పూనుకున్నప్పుడు ఆ పరిశీలనలో భాగంగా, ‘తెలుగులో సంస్కృత ఛందమయిన రగడను వాడినా కొన్ని చోట్ల గణాలకు తగ్గట్టుగా విరిచిరాయక పోవడం కూడా ఉంది’
    అని అనవచ్చేమో గానీ ‘పెద్ద లోటు’అన్న ఒక ‘విలువ’ ను ఆపాదించటం సబబేనా? ఇది ఛందానికి కూడా లోటు కాక పోవచ్చు దాన్ని తెలుగులో విరుపులు లేకుండా ఉపయోగించుకోవటంలో కవి కొన్ని కొత్త అందాలను కూడా తెచ్చిపెట్టి ఉండవచ్చు.

    మిత్రుడు
    తః తః

  958. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి రవి గారి అభిప్రాయం:

    05/10/2012 5:30 am

    యే భాషలోనైనా యేదైనా ప్రక్రియకు ఐనా మొట్టమొదట అనుసరించినవారి మార్గమే తర్వాతి వారికి అనుసరణీయమవుతుంది. ఆ తర్వాత మార్పు వచ్చినా ఆ మార్పు మొదటి మార్గానికి అనుబంధంగా ఉండడమే కద్దు తప్ప పూర్తి భిన్నంగా ఉండడం చాలా అరుదు. ’యతివిరామం’ పాటిస్తూ కావ్యరచన చేయడం తెలుగుకు నప్పదనో, అలా చేస్తే కావ్యసౌందర్యం సాధించటం కష్టమనో వ్యక్తిగతంగా నాకు నమ్మకం కలుగడం లేదు. వేమన ఒక చక్కని ఉదాహరణ. వేమన పద్యాలు ఒక కావ్యం తాలూకు భాగాలు కాకపోయుండవచ్చు, ప్రబంధవర్ణనలు లేకపోయుండవచ్చు, అయితే ’అక్షరసామ్యం’ లేదా ’ప్రాసయతి’ అనే తద్దినాన్ని అమలు జరుపుతూనే సాధ్యమైనంతవరకూ యతివిరామం పాటించి చూపించాడాయన. ఈ విషయం మీద వేమన వ్యాసాలలో రాళ్ళపల్లి వారు కొంత చర్చించారు. ఇక సంస్కృతసమాసాలతో, పదాడంబరత్వంతో ప్రయోగాలు చేసి, సమర్థించుకుందుకు ప్రౌఢివాదాలు చేసిన తెలుగు కవులు నాడూ నేడూ తప్పక కనిపిస్తారు.

    >>అదే కాళిదాసు రఘువంశంలోనూ, కుమారసంభవంలోనూ అనేక వృత్తాలు ఎందుకు వాడవలసి వచ్చింది? అవి కథా కావ్యాలు కాబట్టి.
    >>అందులో వివిధ సన్నివేశాలు, పాత్రలు, రసభావాలు ఉంటాయి కాబట్టి.

    మరి రామాయణాన్ని, బసవ చరిత్రను, భాగవతాన్ని తదితర కావ్యాలను ద్విపదకావ్యాలుగా లేదా ఒకే వృత్తంలో చివరివరకూ మలచిన వారున్నారు కదండి? వాటిలో రసం కొఱవడిందని చెప్పడానికి వీలులేదు. అలాగే తెలుగులో వృత్తాలు లేకపోతే సంగ్రహత్వం సాధించడం కష్టం అన్నది కొంతవరకూ నిజం అయినా, సంగ్రహంగా దేశీఛందస్సులలో చెప్పగలిగిన భావాలను క్లిష్టంగా, ప్రౌఢంగా తీర్చిదిద్దడానికో, పాండిత్యప్రకర్షకో కవులు వాడుకుని, సామాన్యులకు దూరంగా తీసుకువెళ్ళటానికి కంటికెదురుగా నిదర్శనాలు కనిపిస్తున్నా ఎలా కాదనగలం?

    ఈ పరంపర ఇలా కొనసాగడం వల్లే దేశీ ఛందస్సులలో సులభంగా ఇమడగల గాథాసప్తసతి వంటి కావ్యాలను శ్రీనాథుని తర్వాత ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోలేదు. (రాళ్ళపల్లి వారి అనువాదం 300 పద్యాలవరకే ఉంది. శ్రీనాథుని కావ్యం ఇప్పుడు అలభ్యం)

    >>యతిప్రాసల నియమాలు పాటించడం వల్ల కవిత్వం పలచబడడం, వాటిని పాటించకపోవడం వల్ల గొప్ప పద్యాలు సృష్టింపబడటం
    >>జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవు.

    ఆ నియమం పాటించకపోవడానికి తగినంత స్వేచ్ఛాయుతవాతావరణం లేనప్పుడు, ఆధారాలు ఎలా వస్తాయండి?

  959. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    05/09/2012 2:35 pm

    శ్యామలరావుగారు,

    మీ వ్యాఖ్యలో కొన్ని విషయాలను మరికొంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

    “బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యితర వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది.”
    “తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు.”

    వృత్త వైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం సంస్కృత కవులలో కూడా ఉన్నదే. ఒక కావ్యంలో భిన్న భిన్న వృత్తాలు వాడడం సంస్కృత కావ్యాలలో కూడా కనిపిస్తుంది కదా. మీరన్న వృత్త చతుష్కం కన్నా కూడా కందాలు తెలుగు కవులు ఎక్కువ వాడారు. అలాగే ఆటవెలది తేటగీతులు కూడా. సందర్భానుసారంగానే సీస పద్యాలు, అక్కడక్కడ ఇతర దేశి ఛందస్సులూ కూడా వాడారు. ఇతర వృత్తాలను అరుదుగానే వాడారు. అయితే వాటిని విరివిగా ఎందుకు వాడలేదు అనే దానికి కారణాలను వెతికితే మనకి కొంత విషయ పరిజ్ఞానం కలగవచ్చు. కాని, వాళ్ళ తెలివితక్కువ తనం వల్ల, స్పృహ లేని కారణంగా మానేసారని సమాధాన పడితే దాని వల్ల ఒరిగే ప్రయోజనమేమీ లేదు. వాళ్ళు నిజంగా ఎందుకు వాడలేదో మనకి కచ్చితంగా తెలిసే అవకాశం ఎలాగూ లేదు.

    వృత్తౌచిత్యమన్నది రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి – చెప్పే విషయం, రెండు – చెప్పే భాష. ఉదాహరణకి మందాక్రాంత వృత్తాన్నే తీసుకుందాం. మొదటగా, చెప్పే విషయం. కాళిదాసు మందాక్రాంత వృత్తంలోనే మొత్తం ఒక కావ్యం వ్రాసాడంటే, ఆ కావ్యం ఎలాంటిది? అది కథా కావ్యమా? కాదు. అందులోని వస్తువూ, రసమూ, పాత్రలూ ఇంచుమించుగా మొదటి నుండి చివర వరకూ ఒకటే విధంగా ఉంటాయి. అంచేత ఆ కావ్యమంతా ఒకే వృత్తంలో రచించడంలో ఔచిత్యం ఉంది. అదే కాళిదాసు రఘువంశంలోనూ, కుమారసంభవంలోనూ అనేక వృత్తాలు ఎందుకు వాడవలసి వచ్చింది? అవి కథా కావ్యాలు కాబట్టి. అందులో వివిధ సన్నివేశాలు, పాత్రలు, రసభావాలు ఉంటాయి కాబట్టి.

    కాబట్టి, తెలుగులో మందాక్రాంత విరివిగా ఎందుకు వాడబడ లేదు అనే ప్రశ్న వేసుకొనే ముందు, తెలుగులో మేఘదూతం వంటి కావ్యాలు ప్రాచీన కాలంలో ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకోవాలి. అది వేరే చర్చ, కాబట్టి దానిలోకి నేను వెళ్ళడం లేదు. అలాంటి కావ్యాలు రానందువల్ల, ఆ వృత్తం అంత విరివిగా వాడబడలేదు. అది మొదటి కారణం. ఇక రెండవ కారణం భాష. మోహనరావుగారు, మీరూ చెప్పినట్టుగా మందాక్రాంత వృత్తం మొదటి నాలుగు గురువులూ తెలుగుకి ప్రతిబంధకం. గురువు లఘువుల సంఖ్యే కాదు, వాటి క్రమంలో కూడా వివిధ భాషల స్వరూపంలో తేడా ఉంటుంది. వృత్త చతుష్కం కాక మిగిలిన వృత్తాలు తెలుగులో విరివిగా లేకపోవడానికి యిది కూడా కారణమేమో పరిశీలించాలి.

    “మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?”

    వృత్తాన్ని విరుపులతో వ్రాయాలనే తాపత్రయం లేదు కాబట్టే తెలుగులో యతి విరామ స్థానంగా కాక అక్షర సామ్యంగా మారింది. కావ్యం మొత్తమూ పద్యాల విరుపుల అందం ఒక్కటే ఉంటే సరిపోదని మీకు నేను చెప్పనక్కరలేదు. సంస్కృతంలో కూడా రామాయణ భారతం వంటి కావ్యాలు ఇంచుమించు పూర్తిగా, కేవల పాదాంత విరామం మాత్రమే ఉన్న అనుష్టుప్పుతో నడిపించారు. ఇతర కావ్యాలలో కూడా కథా గమనం కోసం అలాంటి ఛందస్సే వాడబడింది. మందాక్రాంత వంటి అనేక విరుపులున్న పద్యాలు మేఘదూతం వంటి కొన్ని కావ్యాలలో మాత్రమే ఇంత విరివిగా వాడబడింది. తెలుగులో కూడా సందర్భం వచ్చినచోట చక్కని విరుపులతో హొయలుపోయే కందాలూ, సీసాలు మొదలైన మన దేశి ఛందస్సులో వ్రాసిన పద్యాలు ఉన్నాయి. మందాక్రాంత, మత్తకోకిల, లయగ్రాహి మొదలైన పెద్ద వృత్తాలకి విరుపులు లేకుంటే పద్యం అందం చెడిపోతుంది. తెలుగు కవులు ఈ వృత్తాలను వాడిన కొన్ని చోట్ల యీ అందాన్ని దృష్టిలో పెట్టుకో లేదన్నది మాత్రం నిజమే. కథాగమనం కోసం వృత్త చతుష్కంలో పద్యాలు వాడినప్పుడు వాటికున్న ఒక్క విరామ స్థానం అవసరం మన కవులకి కనిపించ లేదు. అందుకే వాటిని పాటించలేదు. పైగా, వాటికి మందాక్రాంత వంటి నిర్దిష్టమైన (మూడు విరుపులతో కూడిన) నడక లేకపోవడం వల్ల, ఆ ఉన్న ఒక్క విరామాన్ని పాటించకపోవడం వల్ల పద్య సౌందర్యానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అలా విరామ స్థానంలో విరుపు పాటించనవసరం లేని వృత్తాలనే తెలుగు కవులు ఎన్నుకున్నారనీ, అవే వృత్తచతుష్కమనీ నా ఊహ.

    కొంతమంది మరొక అభియోగం చేస్తూ ఉంటారు. కథా గమనానికీ సంభాషణలకీ సంస్కృతంలో లాగా చిన్న చిన్న పద్యాలు వాడకుండా యీ చాంతాడు వృత్తాలని తెలుగులో వాడారన్నది. ఇది కూడా అంత సమంజసంగా అనిపించదు. ఒకటి, తెలుగు కవులు కూడా చిన్న పద్యమైన కందాన్ని విస్తృతంగానే వాడారు. రెండు, సంస్కృతానికీ, తెలుగుకీ భాషా స్వరూపంలో చాలా తేడా ఉంది. పదాలలో, వాక్యాలలో సంక్షేపము (brevity) ఎక్కువగా సాధించే లక్షణం సంస్కృతానికి ఉంది. అది ఒక రకంగా formal language కాబట్టి దానికా గుణం ఉంది. తెలుగు భాషా స్వరూపం వేరు. ఇది పూర్తిగా వాడుక భాష. నిత్యవ్యవహారంలో సంక్షిప్తంగా మాట్లాడడం అన్నది సహజమైన విషయం కాదు. అందుకే సంస్కృత భాషలో సాధించ గలిగే సంగ్రహత్వం తెలుగులో సాధించడం సాధ్యం కాదు. అలా సాధించాలని చూస్తే అది సహజ సౌందర్యాన్ని కోల్పోయి కృతకంగా తయారవుతుంది. అంచేత కథ చెప్పడంలోనైతే నేమి, సంభాషణల్లోనైతే నేమి, కొన్ని చోట్ల మనకి పెద్ద వృత్తాలు అవసరం అవుతాయి. ఈ సంగతులన్నీ ఆలోచించకుండా, సంస్కృతంతో పోల్చి, తెలుగు కవిత్వంలో సంక్షిప్తత తక్కువ అని పెదవి విరిచెయ్యడం సరి కాదు.

    “అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.”

    వృత్త విరామాల గురించి పైన చెప్పాను. ఇక యతి ప్రాసల నియమాలు వదిలి పద్య రచన చేసే సాహసం గురించి. ఎందుకు చెయ్యలేదూ, అలాంటి సాహసాలు కవులు చేసారు! ఈ వ్యాసంలోనే మోహనరావుగారు పేర్కొన్నట్టు రాయప్రోలు సుబ్బారావుగారు మేఘదూతానికి అనువాదమయిన దూతమత్తేభమనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని మత్తేభాలతో రచించారు. అలాగే మల్లవరపు విశ్వేశ్వరరావుగారు చిత్రాంగద అనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని పద్యాలతో రచించారు. యతి ప్రాస నియమాలు పాటించని కందాలు శ్రీశ్రీ సిప్రాలిలో కూడా మనకి కనిపిస్తాయి. ప్రాచీన కవులు ఎందుకలా రాయలేదు అంటే, బహుశా వాళ్ళకా ‘అవసరం’ కనిపించకపోయి ఉండవచ్చు. యతిప్రాసల నియమాలు పాటించడం వల్ల కవిత్వం పలచబడడం, వాటిని పాటించకపోవడం వల్ల గొప్ప పద్యాలు సృష్టింపబడటం జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవు. అక్కిరాజు ఉమాకాంతంగారు అలా జరిగిందని అభిప్రాయపడ్డారు కాని, అది పైన చెప్పినట్టుగా సంస్కృతంతో పోల్చడం వల్ల ఏర్పడిన అభిప్రాయమే అని నేననుకుంటాను. యతిప్రాసల నియమాలు కవికి ఒకోసారి ఎలా ఉపయోగపడతాయో కూడా చక్కగా వివరించే వ్యాసం, ఈమాటలోనే యిక్కడ ఉంది.

  960. తేనీటి సమయం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    05/09/2012 12:41 pm

    ఆ మూలనున్న కుండీలో ఎర్రటి మొక్క, కిటికీలోంచి కనపడుతున్న విచ్చిన మొగ్గల మేగ్నోలియా, నిశ్శబ్దంగా నిటారుగా నిలబడి వొంటి కాలుపై తపస్సులో మునిగిపోయిన ఆ పైన్ చెట్లు, వీటి మధ్య కాలం గలగల పారే సెలయేరులా కాకుండా మెత్తగా పాకి పైకి పోయే పొగమంచులా కరగిపోతుందేవో కదా. బావుందండీ మీ కవిత, నేనైతే ఆ టీ కప్పు గ్లాస్ కి తగిలే శబ్దం కూడా రాకుండా మడతేసిన పేపర్ నేప్కీన్ ని టేబుల్ పై పెట్టుకుంటాను. కొన్ని సార్లు నిశ్శబ్దం ఒక గొప్ప కమ్యూనికేటర్ కదా!
    -తిమ్మిరెడ్డి

  961. చందవరం, ప్రకాశం జిల్లా గురించి అజ్ఞాత గారి అభిప్రాయం:

    05/09/2012 12:49 am

    ఈరకం కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. రచయితని ‘మామూలు మాటలని కవితలుగా మలచగల అద్యుభయ కవయిత్రి’ అనచ్చు

  962. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:

    05/07/2012 9:45 am

    మోహనరావు గారి వ్యాసం చాలా బాగుంది నాకు.

    శ్రీవక్కలంక లక్ష్మీపతిరావు గారు కూడా మేఘసందేశానికి ఒక తెలుగు అనువాదం వెలువరించారు. గత 70వ దశకంలో డిగ్రీ విధ్యార్థులకు అది పాఠ్యగ్రంథంగా కూడా ఉండేది. నేను కూడా అది అలా చదివాను. అయితే నాకు అందులో మూలకావ్యంలోని సొగసు కనుపట్ట లేదు. నాకు గుర్తున్నంత వరకు, వక్కలంకవారు ‘ఆ కాళిదాసు మన తెలుగువాడైతే యెట్లా వ్రాసి యుండేవాడో నని అట్లాగు వ్రాసాను’ అనటం నాకు రుచించ లేదు.

    బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యిత వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది. అలాంటిదే మరొక తప్పుడు స్పృహ సంస్కృత పాండిత్య ప్రదర్శన యెంత హెచ్చుగా చేస్తే అంత మంచిదీ, సమాసదైర్ఘ్యంతో అదరగొట్టటం ద్వారా కవిత్వానికి అందమూ కీర్తీ వస్తాయని భావించటం. ఇటువంటి పనులవలన తెలుగు కవిత్వంలో తెలుగు తరచుగా చులకనయింది, ప్రజలకు ఆ తెలుగు(?)కవిత్వం దూరంగా జరిగింది!

    మందాక్రాంతంలో పూర్వపాదాంత్యాక్షరంతో కలిపి వరసగా అయిదు గురువులు వచ్చేటట్లు తెలుగులో వ్రాయటానికి పెద్దప్రతిబంధకం. అలాగే మందాక్రాంతం అందమంతా పాదంలో నిర్దిష్టమైన చోట్ల మూడు విరుపులు రావటంలో ఉంది. మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?

    తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు. అంతే. అలాగే కొన్ని మందాక్రాంతాలూ ఉన్నాయి.

    అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.

  963. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన గారి అభిప్రాయం:

    05/06/2012 7:20 pm

    1) బ్రహ్మానందం గారు, నచ్చిన విషయాలను ఎప్పుడు నచ్చాయి అనే చెప్పాలి. అందువల్ల మనము తక్కువ కాము. నేను చిన్నప్పుడు Yussouf by James Lowell లో చదివిన క్రింది పంక్తులు మెదడులో తేలుతున్నాయి –
    As one lamp lights another, nor grows less,
    So nobleness enkindleth nobleness.

    2) జయప్రభ గారు, మీరు చెప్పినది నిజమే. నాకు ఎంతో యిష్టము కాబట్టే, ఛందశ్శాస్త్రములో నేను పరిశోధనలు చేస్తున్నాను. ఇవి ఎవరు బావుంది, బాగా లేదు అని చెప్పినా, వ్యాసాలు వ్రాయకున్నా కూడ ఆపను. ఎందుకంటే ఈ శాస్త్రములో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థము చేసికోవడానికి, నన్ను జ్ఞానవంతుడిని గావించుకోడానికి. మీ సలహాలకు కృతజ్ఞుడిని.

    3) లైలాగారు, కాళిదాసు నివసించిన కాలమునుగురించి ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఇతడు క్రీస్తు పూర్వమే ఉన్నాడంటారు. మరి కొందరు నేను తెలిపినట్లు నాలుగవ శతాబ్దపు వాడంటారు. ఇతని కవిత్వములో అశ్వఘోషుని కొన్ని అనుసరణలు, అనుకరణలు ఉన్నాయి. కాళిదాసులాటి కవికి మిగిలినవారిని ఎందుకు అనుసరించాలి అనే వాళ్లు ఇతడు అశ్వఘోషునికి పూర్వకవి అంటారు. నా ఉద్దేశములో మందాక్రాంతమును వాడిన మొట్టమొదటి కవి కాళిదాసు హరిసేనుడివల్ల ప్రభావితుడై ఆ వృత్తాన్ని మేఘదూత రచనకు ఎన్నుకొన్నాడని అనుకొంటాను. ఇక పోతే, సముద్రగుప్తుని ప్రయాగ ప్రశస్తి శిలాక్షరాలు కాబట్టి ఇందులో ఎట్టి సందేహము లేదు. కావున నేను కాలిదాసు నాలుగవ శతాబ్దపు వాడనే నమ్ముతాను. సముద్రగుప్తుడన్నది ఒక బిరుదు మాత్రమే. ఇతని అసలు పేరు వేరైనది.

    కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు. మీరు ఉదహరించిన ఘటకర్పరునికి పేరు అది కాదు, అదేమో తెలియదు. కాని సందేశకావ్యములలో ఇతడు వ్రాసిన ఘటకర్పరము ఉన్నది. ఇది ఒక యమక కావ్యము కూడ. కొందరు దీనిని చూచిన తరువాతే కాళిదాసు మేఘదూతాన్ని వ్రాసినాడంటారు.

    4) రవి గారు, రాజగోపాల శర్మ వ్రాసిన పుస్తకములో (గ్రంథసూచిలో ఎనిమిదవది, ఇది DLI – IISc లో లభ్యము) తెలుగులో కొటికలపూడి వేంకటకృష్ణ పండితులు 1790లో అనువదించారు, అది నేడు దొరకడము లేదు. లభ్యమయిన పుస్తకాలలో వడ్డాది సుబ్బరాయకవి 1884లో చేసిన అనువాదము మొదటిది. సుమరు 50 అనువాదాలు ఇందులో పేర్కొనబడ్డాయి.

    5) నిడదవోలు వేంకటరావుగారికి కన్నడ ఛందస్సుతో బాగుగా పరిచయము ఉన్నది. ఆందువలన వీరు భామినీషట్పదిని ఎన్నుకొన్నారేమో లేక కామేశ్వరరావుగారన్నట్లు ఈ ఛందస్సు తెలుగులో కూడ పరిచితము కాబట్టి ఎన్నుకొన్నారేమో? మిశ్రగతిలో సాగే ఈ ఛందస్సుకు ఒక తూగు ఉన్నది. వ్యక్తిగతముగా నా ఉద్దేశములో అది వ్యధకు, బాధకు, విరహానికి సముచితము కాదేమో? దానికి బదులు ఖండగతిలో ఐదు మాత్రలతో ఉంటే అది బరువును సూచించగలదు. ఈ విషయాలను నేను చర్చించలేదు, ఎందుకంటే నా గురి మందాక్రాంతవృత్తము మాత్రమే కావడమువల్ల. నా ఉద్దేశములో పాదాలలోని పదాలకు సరిగా విరుపును కలిగించి ఉంటే మందాక్రాంతములో కూడ పై 50మంది కవులలో ఏ కొందరైనా దీనిని తప్పకుండ సాధించి యుంటారు. నావంటి అల్ప భాషాజ్ఞానియే దీనిని ప్రయత్నము చేసినప్పుడు, సంస్కృతాంధ్రములలో పాండిత్యము ఉన్నవారికి ఇది నల్లేరుపై బండి నడకే.

    6) కామేశ్వరరావుగారు, సంస్కృత యతిని గురించి ఒక రెండు వాక్యాలు. నాట్యశాస్త్ర రచయితవంటివారు యతిని పూర్తిగా అంగీకరించలేదు. మిగిలినవారు కూడ మొట్ట మొదట తప్పకుండా పాటించినా, తరువాత పదాలను సంధితో యతిస్థానము వద్ద కలపడము ఒక ఆభరణములాటిది అనుకొన్నారు. దీనికి కాళిదాసాదికవులను పొగిడారు కూడ. నావరకు నేను యతి స్థానము వద్ద విరుపు లేక సంధి అవసరమని భావిస్తాను. పదాలను యతి స్థానములో దూసుకొని వెళ్లేటట్లు వ్రాయడము, పాదాంత యతి లేకుండ వ్రాయడము నాకు రుచించదు. పాదాంతయతి ఉపజాతులలో తప్పక అందరు పాటిస్తారు, కందములో రెండవ పాదానికి పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు యిది నియతము. ఇక పోతే ఆషాఢస్య ప్రథమదివసే అనేటప్పుడు స్య గురుతుల్యమే. ఉదాహరణగా సంస్కృతములో పాదాంత లఘువును గురువుగా అంగీకరిస్తారు, ఎందుకంటే అక్కడ విరామము వస్తుంది కనుక. విరామము ఉన్నప్పుడు సంస్కృతములో లఘువు సామాన్యముగా గురుతుల్యమే.

    పాదాంత యతి ఉన్నప్పుడు, పాదారంభములో అచ్చులను వాడుతారు, సంధి లేకుండా కూడ. ఇక మధ్యలో సామాన్యముగా అచ్చులను య-కారముతో తెలుపుతారు.

    7) కామేశ్వరరావు గారు, నేను ఇంకా మందాక్రాంత వృత్తరచనను అభ్యాసము చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారు 30 వ్రాసినాను, మందాక్రాంతపు లయతో సుమారు 15 పద్యాలు, జాతి పద్యముగా సుమారు 25 వ్రాసియున్నాను. ఇందులోని కిటుకులను ఇంకా నేర్చుకొంటున్నాను. వీలు దొరికినప్పుడు వీటిని అంతా ఒకే చోట ఉంచడానికి ప్రయత్నము చేస్తాను.

    ఇదే ఒక చిన్న వ్యాసములా తయారైనందులకు సంపాదకులు మన్నిస్తారనే ఆశతో

    విధేయుడు – మోహన

  964. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    05/06/2012 6:13 pm

    మోహనరావు, బ్రహ్మానందం, జయప్రభ పాఠకస్పందన గురించి చాలా లోతైన విషయావలోకనకి దారితీసే అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ వ్యాసానికి నేరుగా సంబంధించకపోయినా ఈ “పాఠకస్పందన” గురించి నాకు కలిగిన కొన్ని సాధకబాధకాల్ని “ఈమాట” పాఠకుల ముందుంచుతాను.

    1. రచనలో రచయిత పాత్ర. మీరు ఒక సాంకేతిక పరిశోధనాపత్రం రాసి ప్రచురించదల్చుకున్నారనుకోండి. దాన్లో విధిగా మొదల్లోనో (కొన్నిట్లో చివర్లోనో) ఆ విషయం మీద అంతవరకు జరిగిన ముఖ్యమైన పరిశోధనల్ని క్లుప్తంగా వివరించి, మీరు చేస్తున్నపని వాటికన్నా ఏ విషయాల్లో భిన్నమైందో, ఎలా ఆ సమస్య పట్ల మన అవగాహనని విస్తృతం చేస్తుందో, మీరు చేస్తున్న ముఖ్యమైన contributions ఏమిటో ఏకరువు పెడతారు. అప్పుడు ఆ పత్రాన్ని పరిశీలించే పరిశీలకులు (reviewers) మిగిలిన వాళ్ల, మరియు మీసొంత contributions గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతవరకు సత్యాలో కాదో నిర్ణయించి, మీ contributions విలువ మీరు ప్రచురించ ప్రయత్నిస్తున్న పత్రిక (journal, conference proceedings etc) స్థాయికి సరితూగుతుందా లేదా అని బేరీజు వేసి ఆ పత్రాన్ని ప్రచురణార్హమైందో కాదో తేలుస్తారు. ఆ పరిశీలకులు మీరు పనిచేస్తున్న అంశం లోనో, దానికి దగ్గరగా వుండే అంశాల లోనో ఉద్దండులు కనుక ఈ పని చెయ్యగలుగుతారు (ఎప్పుడూ కాకపోవచ్చు కాని అత్యధిక శాతం విషయంలో ఇది నిజం).

    కవితల్నీ కథల్నీ బావుందనో లేదనో చెప్పటానికి విస్తృతమైన పాండిత్యం పనికొస్తుందేమో కాని అవసరం మాత్రం కాదు, ఎందుకంటే వాటిని బేరీజు వెయ్యటం హృదయసంబంధి విషయం. వ్యాసాలు అలా కాదు. అవి మేధోసంబంధితాలు. (చాలా మంది తెలుగు కవులు ఈ తేడా తెలియక వ్యాసాల్ని కవితల్లా రాయటానికి ప్రయత్నించటమూ కవితలరూపంలో అప్రయత్నంగానే వ్యాసాలు రాయటమూ మనకు కొత్తకాదు గాని, అది ప్రస్తుతం అప్రస్తుతం.) కనుక ఒక వ్యాసాన్ని చదివినప్పుడు ఆ రచయిత contribution ఏమిటో ముందు మనకు తెలియాలి. ఉదాహరణకు, (అ) ఎవరో రాసిన విషయాన్ని తన మాటల్లో మళ్లీ రాశాడా, (ఆ) రకరకాల పుస్తకాల్లో ఉన్న విషయాల్ని క్రోడీకరించి ఒకచోట చేర్చాడా, (ఇ) అదివరకు ఉన్న విషయాల్ని తీసుకుని వాటికి కొంత కొత్త అవగాహనని కలిపాడా, (ఈ) ఇదివరకు ఎవరూ చూడని ఒక కొత్త కోణం చూపిస్తున్నాడా, (ఉ) ఇదివరకు ఎవరూ ఊహించని కొత్త ఊహతో అదివరకున్న అవగాహనని తల్లకిందులు చేశాడా, (ఊ) అదివరకు అవగాహనే లేని విషయానికి ఒక సిద్ధాంత ప్రాతిపదికని కల్పించాడా,.. ఇలా ఎన్నో levels ఉన్నాయి. ముందే అనుకున్నట్టు సాంకేతిక రంగాల్లో ఐతే తను చేసిన పని ఏమిటో ఈ విశాల రేఖ మీద దాని స్థానం ఎక్కడని తను నమ్ముతున్నాడో చెప్పటం రచయిత పని. అతని ఆ అవగాహన ఖచ్చితమైందో కాదో నిశ్చయించటం పరిశీలకుల పని.

    తను చేస్తున్న పని ఏమిటో చెప్పటం మన రచయితలకు అలవాటు లేదు. ఆ పని స్థాయి ఏమిటో చెప్పగలిగే పరిశీలకులు సాహిత్య ఔత్సాహికుల్లో చాలా కొద్దిమంది.

    2. దేని గురించి రచయితని అభినందించాలి? ఒక వ్యాసంలో రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు ఆ రచయితని దేని గురించి అభినందించాలి? ఉదాహరణకి ఒక రచయిత చేసిన పని ఎన్నో చోట్ల ఉన్న విషయాల్ని సంగ్రహించి క్రోడీకరించి సంక్షిప్తీకరిచటం అనుకోండి. అప్పుడు అవసరమైన అన్ని విషయాల్ని సంగ్రహించాడా లేక ఏవైనా ముఖ్యమైన వాటిని సంప్రదించలేదా, క్రోడీకరణమూ సంక్షిపీకరణమూ సరిగా ఉన్నాయా లేవా అని వాటి గురించి అభినందనలో చీవాట్లో అవసరాన్ని బట్టి ఇవ్వొచ్చు. రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు, అది తెలుసుకునే జ్ఞానం పాఠకుడికి లేనప్పుడు, చేసే వ్యాఖ్యలు గుడ్డివాడి చేతిలోని రాయి వంటివే ఔతాయి కదా.

    3. ఎవరు సరైన వ్యాఖలు చెయ్యగలరు? రచయితా, పరిశీలకులు పాఠకుడికి ఎలాటి సమాచారమూ ఇవ్వనప్పుడు బాధ్యతంతా పాఠకుడి మీదే పడుతుంది. పాఠకుడే ఆ రచనలో రచయిత తెచ్చిన కొత్త అవగాహన ఏమైనా వుందా? ఉంటే అదేమిటి? దాని విలువేమిటి? ఆ విలువ స్థాయి ఏమిటి? మిగిలిన వాటితో పోలిస్తే ఇది నేలబారుదా, సామాన్యమైందా, సగటుదా, ఉన్నతమైందా, అత్యున్నతమైందా, అద్భుతమైందా – అని బేరీజు వెయ్యగలగాలి. మామూలు పాఠకులకి ఇది సాధ్యం కాదు. కనుక ఏదో అనాలి కదా అనటమో లేకపోతే లేని పెద్దరికాన్ని మీద వేసుకుని తెలియని విషయాల్ని తెలిసినట్టు నటించటమో లేదా అలాటి నటన అలవాటైపోయి నిజంగానే పండితుణ్ణని భ్రమించటమో జరుగుతుంది.

    4. అందరూ ఔత్సాహికులే ఐనప్పుడు. “ఈమాట” లాటి పత్రికల్లో వ్యాసాలు రాసేవారు (ఏ నారాయణ రావు లాటి వారో తప్ప) ఔత్సాహికులు. అలాటి వారు తమకున్న అనేక ఇతర వ్యాపకాల నుంచి సమయం వెచ్చించి ఏదో ఒక విషయం మీద వ్యాసం రాయటమే గొప్ప విషయం. కనుక అలాటి వారు రాసే వ్యాసాలకి professional స్థాయి ప్రమాణాలు వర్తిస్తాయా? వర్తించాలా? అది సాధ్యమా? కొంత lenience అవసరం అని బహుశా అందరూ ఒప్పుకోవచ్చుననుకుంటాను. ఐతే, ఎంత? ఉదాహరణకు, ఒక professionalకి “ఉన్నత” స్థాయి ఔత్సాహికుడి “సగటు” స్థాయికి సమానం అనొచ్చా? అంటే, professional scale మీద “సగటు” స్థాయిని చేరే వ్యాసాన్ని ఒక ఔత్సాహికుడు రాస్తే, దాన్ని “ఉన్నత” స్థాయి అని లెక్కవెయ్యొచ్చా? మరోవిధంగా చెప్పాలంటే, professionalకి, ఔత్సాహికుడికి తేడా “ఒక స్థాయి” అన్నమాట. కాదు, అది మరీ దగ్గర, రెండు స్థాయిల తేడా ప్రమాణం ఐతే బాగుంటుంది అనొచ్చు. ఏదో ఒకటి, ఒక ప్రమాణం ఒప్పుకుంటే అప్పుడు professional scale ని కొలమానంగా తీసుకుని ఔత్సాహికుల రచనల విలువని అంచనా కట్టొచ్చు.

    చివరగా: మంచి రచనల్ని, మంచివి కాని వాటిని విడదియ్యలేనప్పుడు ఇటు వాసి రచయితలకూ అటు నాసి రచయితలకూ మరోవైపు పాఠకులకూ మంచి జరగదు. నాసి రచయితలు గొప్పవాళ్లమని విర్రవీగి విజృంభించటం, వాసి రచయితలు నీరుగారి నీరసించటం, పాఠకులు చెత్తలో కూరుకుపోయి ఆక్రందించటం జరుగుతాయి. తెలుగు సాహిత్యరంగంలో అలా విడదియ్యటానికి ఇప్పుడు కాలం అనుకూలం కాదు. ఈ జటిలసమస్యకి పరిష్కారం నాకు తెలియదు.

    ఎందరో పెద్దవాళ్లు చెప్పినట్టు, రాయగలిగిన వాళ్లు రాస్తూ వుండాలి. ప్రతివారు చేసే ప్రతి రచన కళాఖండం కాదు కాని అభ్యాసంతో ఎప్పుడైనా ఒకటి బయటకు వచ్చే అవకాశం వుంది. “అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు”. ఈ విషయం రచయితలూ పాఠకులూ గ్రహిస్తే అందరికీ హాయి.

    వారి వ్యాసంతో సంబంధంలేని విషయాల్ని రాసే అవకాశం ఇచ్చిన మోహనరావు గారి వ్యాసానికి అభినందనలు.

  965. ప్రేమ కవితలు గురించి kambala rajendra గారి అభిప్రాయం:

    05/06/2012 5:11 pm

    మీ కవిత నాకు చాలా బాగా నచ్చినది

  966. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన గారి అభిప్రాయం:

    05/04/2012 1:59 pm

    బ్రహ్మానందంగారికి, వికాస్ గారికి, మీ అభిప్రాయలకు కృతజ్ఞతాపూర్వక వందనాలు.

    వికాస్ గారు – మీరు ముందుంచిన విషయాలు చాల ముఖ్యమైనవి. నా అనుభవమువల్ల నేను నేర్చుకొన్న కొన్ని పాఠాలను మీముందు, అలాగే మిగిలినవారి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. (1) ప్రతిరోజు ఒక గంట లేక గంటన్నర ఏదో ఒక సాహితీ పుస్తకాన్ని చదివితే ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. ఒక గంట చాల తక్కువ సమయములా తోచవచ్చును. కాని 20, 30, 40 యేళ్ల కాలములో ఇది తక్కువ కాదు. ఎన్నో కొత్త పుస్తకాలు చదవడానికి వీలవుతుంది, ఎంతో నేర్చుకోడానికి వీలుపడుతుంది. ఇలా చేస్తే ఒంటరిదనము కూడ మరచిపోవచ్చును. (2) చదివేటప్పుడు అర్థము కాని పదాలు కనబడినప్పుడు, నిఘంటువును సంప్రదించి అర్థాలు తెలిసికోవాలి. సుమారు ఒక వేయి పుటలకన్న తక్కువగా ఉండే నిఘంటువు చాలు ఈ కార్యానికి. మిగిలినవాటికి ఆంధ్రభారతివారి నిఘంటువు సైటును చూడవచ్చును. మొట్టమొదట పదాలకు అర్థాలు వెదకడములోనే సమయమవుతుందని బాధపడవచ్చును. కాని కొన్నాళ్లకు చాలా పదాలకు అర్థాలు తెలియడమువల్ల ఇలా వెదకడము తగ్గుతుంది. (3) పాత కవిత్వమయినా, కొత్త కవిత్వమయినా దేనినయినా చదవడానికి ఎన్నుకోవచ్చును. శ్రీశ్రీ కవితలలోని కొన్ని పదాలకు నిఘంటువు తప్పని సరి ఇప్పటికీ. కావ్యాలకన్నా, అందులోని కొన్ని భాగాలను పఠనీయాంశాలుగా ఎన్నుకోవచ్చును, ఉదా. నన్నయ దుష్యంతుని కథ, తిక్కన ఉత్తరగోగ్రహణము, శ్రీనాథుని హంసదూతము, పోతన రుక్మిణీ కల్యాణము, శ్రీరామచరిత్ర,, పాపరాజు కుశలవుల రామాయణ గానము, మున్నగునవి. (4) అంతర్జాలములో ఎన్నో పుస్తకాలు ఉచితముగా లభ్యము. టీకాతాత్పర్యాలతో చాల పుస్తకాలు ఉన్నాయి. వాటిని సులభముగా ఇక్కడినుండి, ఇక్కడినుండి దిగుమతి చేసికొనవచ్చును. ఇవి కొన్ని సలహాలు మత్రమే. మిగిలినవి ఆసక్తిపైన ఆధారపడినవి.

    విధేయుడు – మోహన

  967. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి vikas,vinnakota గారి అభిప్రాయం:

    05/04/2012 4:38 am

    గౌరవనీయులు జెజ్జాల కృష్ణ మోహన రావు మరియు సంపాదకులకు నామస్కారం

    నేను, అమెరికాకి వచ్చి రెండేళ్ళు అయ్యింది, చిన్నపుడు 10వ తరగతి నుంచి మొదలు పెట్టిన వృత్తి విద్యలొ పట్టా కోసం వేట ఈమధ్యే పూర్తి అయ్యింది. నాకు జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసాలు చదివినప్పుడు ఒక రకం ఐన depression వస్తుంది. Sir, మీ వ్యాసాలు నాకు అర్ధం కాక పోయినా, తెలుగు భాషలో నా తెలియనితనం అజ్ణానం తేటతెల్లం అవుతోంది. ఈమధ్య ఎందుకో, దూరంగా ఉంటున్నందుకో ఏమో భాష మీద మమకారం, నేర్చుకోవాలన్న తాపత్రయం పెరుగుతోంది, కాని మీరు రాసిన ఋతుపర్ణము, కామవేదం లాంటి కవితలు లేదా మీరు ఎంతో శ్రమకోర్చి, పరిశోధించి రాసే వ్యాసాలు ఐనా సరే, పూర్తిగా కాదు కదా పావు వంతు ఐనా నాకు అర్ధం కావడం లేదు. దయచేసి తప్పుగా అర్ధం చేసుకొకండి. భాష సంస్కృతి అంటూ పెద్ద మాటలు పక్కన పెడితే ఆఖరికి సినిమా పాటలు కూడా కొన్ని సార్లు అర్ధం కాని పరిస్థితిలొ ఉన్న నాలాంటి వాడు తెలుగు నేర్చుకోవాలి అంటే అసలు వీలు పడుతుందా?

    ఈ ఒక్క సందర్భమే కాదు ఎప్పుడన్న పైత్యమో భక్తో ప్రకోపించి ఏ రుద్రమో, శంకర భాష్యాల అనువాదాలో netలో వెతికి పట్టుకున్నా నాలాంటి వాడికి ‘ఒం” ‘నమహ్’ తప్ప ఇంకో ముక్క అర్ధంకావు. వాటికి అర్ధాలు తెలియవు.

    ఈసారి, India వెళ్ళినప్పుడు ఊరగాయలు కాకుండా, ఓ నాలుగు పుస్తకాలు కొనుక్కుంటే చాలు, కాని ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టలి అన్నదే ప్రశ్న? మీ వ్యాసానికి ఏరకంగాను సంబంధం లేక పొయినా దయచేసి నాకు దైవపరమైన పుస్తకాలు, భాష బాగు పడడానికి ఉపయుక్త కారమైనవి ఏమన్న సుచించమని మనవి.

    అలాగే పత్రికా ముఖంగా మరొక్క మనవి, ఈ-మాట గ్రంధాలయంలో కొంచం పురాణ వాఞ్ఙయాలని చేరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, నాబోటి వాళ్ళు ఏమన్న అర్ధం కాక పొయినా అనుమానాలు, అర్ధం కాని విషయాల వ్యక్తం పెద్దలు వివరించగలరు అని ఆశ పడుతున్నాను.

    పెద్దలు, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే అది నా చిన్నతనం అని మన్నించగలరు.

    వికాస్ విన్నకోట

  968. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    05/04/2012 12:02 am

    మోహన రావు గారూ,

    మీ వ్యాసం చాలా బావుంది. మీలా చందస్సులో పరిశోధన చేసి వ్యాసాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికెంతో శ్రద్ధా, అభిరుచీ, కోరికా వుందాలి. అంతకుమించి కాలం కూడా వెచ్చించగలగాలి. చందస్సు అవసరం లేదనుకునే నేటి కవులు చందస్సు దాటి కవిత్వాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. చందస్సు ఒక చట్రమనుకునే వారికి లయతో కూడిన చాలా అల్లికలున్నాయన్న సంగతి తెలీదు. చందస్సుని వాళ్ళు వదిలేసారు. కవిత్వం వాళ్ళనొదిలేసింది. అందుకే వచన కవిత్వంలో వచనం కవిత్వాన్ని రెండో స్థానానికి నెట్టేసింది.

    మీలా చెప్పే వారు ఆంధ్రాలో కూడా తక్కువే!

    “సృజనాత్మక వ్యాసాలను చదివి ఆనందిస్తే చాలదు. అందులోని బాగోగులను విమర్శించి రచయితకు ప్రోత్సాహమిస్తే అది రచయితకు, కవికి నవపథములో నడవడానికి చేయూత నిచ్చినట్లుంటుంది,” అని మీరు చెప్పింది నాకూ వర్తిస్తుంది. మీ వ్యాసాలు క్రమం తప్పకుండా చదువుతాను. బావుందని చెబుదామనుకుంటూ వాయిదా వేసిన సందర్భాలే ఎక్కువ. ఎందుచేతనో చాలామంది ( నాతో కలుపుకుని ) చదివి మంచీ చెడూ చర్చించరు. ముఖ్యంగా రచయిత బిళ్ళ మెళ్ళో వేసుకునేవారు. చెడు చెప్పాలంటే మొహమాటం అడ్డొస్తుంది. బావుందని చెప్పాలంటే అహం అడ్డొస్తుంది. ఇంకా గట్టిగా అంటే మరలా తమ రచనలమీద మిగతా వారెక్కడ విరుచుకు పడతారోనన్న భయం ఉంటుంది. పైగా పక్కవాణ్ణి పొగిడితే మనం ఒక మెట్టు క్రిందకి పడిపోతామన్న న్యూనతా భావం వుంటుంది. ఇంతకుమించి తమ రచనలని ప్రేమించినట్లుగా ఇతరుల రచనలని గౌరవించ లేకపోవడం వుంటుంది. ఇలా సవాలక్ష కారణాలు వెతక్కుండానే రోజూ కనిపిస్తూ ఉంటాయి.

    సెక్స్ శీర్షికలకీ, సినిమా వ్యాసాలకున్న గిరాకీ చందస్సు వ్యాసాలకుండదు సారూ! సాహిత్యమయినా, సంగీతమయినా సినిమా శంఖంలో పోస్తే కానీ తెలుగువారికి రుచించదు.

    -బ్రహ్మానందం గొర్తి

  969. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Phaneendra గారి అభిప్రాయం:

    05/03/2012 6:56 am

    తిలక్ కవిత్వంలో కథా లక్షణాలూ, ఆయన కథల్లో కవిత్వ చాయలూ ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. మానసిక సంఘర్షణను ఇంత శక్తిమంతంగా చూపిన రచన నా పరిమిత పఠనా జీవితంలో తారసపడలేదు. రచయిత ఉద్దేశాలతో అభిప్రాయ భేదాలున్నా ఆ శైలిని మోహించకుండా ఉండలేను.

  970. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Madhava Murthy గారి అభిప్రాయం:

    05/02/2012 2:11 pm

    కవిత కానీ, కథానిక కానీ కొన్ని సంవత్సరముల తరువాత మరల చదివినప్పదు, మనకు ఇంకా బాగా రచయిత భావాలు అర్థమవుతాయి. మాయాబజార్ సినిమా చూచిన ప్రతిసారి మనం కొంత కొత్తది తెలుసుకుంతాము. ఇక్కడ జిన్నా గురించి రాసిన కథలొ మార్పులేదు, మార్పు మన ఆలోచనలలొ.

  971. చందవరం, ప్రకాశం జిల్లా గురించి nadeem ansari గారి అభిప్రాయం:

    05/02/2012 9:23 am

    చక్కని కవిత్వం చాలా రోజులకు. కోస్తావాండ్లకు తెలుగు వచ్చుననే అనిపించుచున్నది. పలుకుబడిలో కాకున్నా కవుల మనసులలొ తెలుగు ఉన్నది. కవికి ధన్యవాదాలు.

  972. చందవరం, ప్రకాశం జిల్లా గురించి బొక్కా ప్రేమ్ కుమార్ గారి అభిప్రాయం:

    05/02/2012 6:44 am

    పురుగును పొడుస్తుంది
    బిత్తర చూపుల కోడిపుంజు.

    కోడిపుంజు బిత్తర చూపులు కూడా క్యాచ్ చేసి కవిత రాయడం కేక.

    అత్తకు యముడు-అమ్మాయికి మొగుణ్ణి
    తీరుబడిగా నెమరువేస్తుంది ఆవు.

    రాయెత్తి కొట్టకుండా.. దీనికి అర్ధం ఏంటో వివరిస్తారా?

    సాయంకాలం పూట
    నాసిరకం పుణుగులు పొంగణాలకి
    గలగల్లాడతాయి రూపాయలు

    ఏసీ హోటల్లో కూకోని..కయితలు రాసేవారికి నాసిరకం ఏమో కాని, తినేవాళ్ళు నాసిరకం తింటున్నాం అని అనుకోరు.

    ఇంకా ఏమన్నారు మీరు

    పొద్దుటి పూట
    పొగలు కక్కే చౌకరకం తేనీరు
    ఆరారగా తాగుతుంది ఊరు

    మీరు షుగర్-ఫ్రీ బూస్టు తాగుతూ రాసుంటారు ఈ లైను

    మొత్తానికి మీ ఈ కయిత కెవ్వు కేక కేకస్యః

  973. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Purnima గారి అభిప్రాయం:

    05/01/2012 2:53 pm

    నాలుగేళ్ళ కిందట తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసుకునే రోజుల్లో తిలక్ కథలు చదివాను. అందులో నాకు ఈ ’అద్దంలో జిన్నా’ కథ బాగా నచ్చింది. మీరు రాసినదాంట్లో ఓ రెండు విషయాలు ’నా అభిప్రాయాలే’ అని అనిపించాయి.

    >> కథలని కొన్ని లక్షణాల చట్రాలతో బిగించి కట్టుదిట్టంగా చూసే అలవాటున్న వారికి, ఇది ఒక స్కెచ్‌. సైకలాజికల్‌ స్కెచ్‌గా కనిపించవచ్చు.

    ఈ కథ నాకు చాలా నచ్చటానికి ఇదే ముఖ్యకారణం. ఈ కథను చదివిన కొందరు ఇది చాలా అసంబద్ధమైన కథనీ, ఒక పట్టాన అర్థంకాదనీ అంటారు. కానీ నన్ను అడిగితే, కథాకాలంనాటి దేశరాజకీయ పరిస్థితులు అంతగా తెలియకున్నా కూడా ఈ కథ బలంగా తాకింది నన్ను.
    తిలక్ ఏమంత గొప్ప కథకుడు కాదన్న వాదననూ విన్నాను. కానీ నేను చదివిన అతికొద్ది మంది తెలుగు కథకుల్లో తిలక్ కథలు ఒకట్రెండు నాకు చాలా నచ్చేవి ఉన్నాయి. నాకాయన కవిత్వంకన్నా కథలమీదే ధ్యాస ఎక్కువ.

    >> లబ్ధప్రతిష్టులైన కవులు కథ రాసినా, కవిత్వం రాసినా కవిత్వం లాగానే కనపడుతుంది. చదివితే కవిత్వంలా వినిపిస్తుంది.

    మీ మటుకు మీకే కాదు, నేను కూడా మీ జట్టే ఈ విషయంలో. జనరలైజ్ చేసే ఉద్దేశ్యం నాకూ లేదుగానీ, దాదాపుగా నేను చదివిన కవుల prose కూడా కవిత్వంలానే చదివిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది. తెలుగులో శ్రీశ్రీ, బైరాగి కథలు అలా అనిపించాయి నాకు.

  974. శిలాలోలిత : విషయ సూచిక గురించి NS Murty గారి అభిప్రాయం:

    04/24/2012 2:55 pm

    రేవతీదేవి కవితల్లో నచ్చినవి అనువాదం చేసుకుని నా బ్లాగులో వేసుకో వచ్చా? వాటికి వేరే అనుమతి కావాలా? లేక ఈమాటలో ముందు ప్రచురించాలా తెలుపగలరు.

    [ఈమాటలో ముందు ప్రచురించాలన్న నియమమేమీ లేదు. శిలాలోలిత పుస్తక ప్రచురణకర్తలను వేరే ఏమైనా అభ్యంతరాలేమైనా ఉన్నాయేమో సంప్రదించండి. మా దగ్గర ఈ సమాచారం లేదు – సం.]

  975. స్నానాల గదిలో గురించి శారదా కిషోర్ గారి అభిప్రాయం:

    04/20/2012 5:09 am

    ఆవిరి నిండిన ఈ గదిలో నేనొక్కదానినే

    ఈ లైను. ఎవరికయినా యిక్కడ దొరికే ఏకాంతం మరెక్కడా దొరకదు. నీటితొట్టెలో నీళ్ళోసుకుంటూనే అర్కేమేడీసు పెద్ద ఫార్ములా కనిపెట్టాడు. ఈ కవిత ఆశు కవిత్వం లాగ ఉంది. ఇలాంటి కవితలు మరిన్ని రాస్తారని ఆశిస్తూ…

  976. మూడు లాంతర్లు – 10 గురించి కనక ప్రసాద్ గారి అభిప్రాయం:

    04/17/2012 12:49 pm

    బ్రహ్మానందం గారు,

    మీరు ప్రతిపాదించిన విషయం, చెప్పిన కారణాలు చాల సబబుగా ఉన్నాయి. ఇవి నేను ముందుకి రాయాలని అనుకున్నవి; మీరే అన్నారు. మీరు వర్ణిస్తున్నది లోకంలో సాధారణమైన మన:స్థితి. లౌక్యుల పద్ధతి అని నేనంటున్నది. మంచి పాఠకుడివి కావాలంటే ఇలాంటి పరిమితుల్ని అధిగమించాలి అని రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ అన్నారన్నాను కదా?! ఈ పరిమితుల వలన సంకుచితం కానివి, భిన్నమైన వ్యక్తిత్వాలుంటాయి. జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువారు వంటి ఊహలు అలాంటి మనుషుల్ని చూసి వచ్చి ఉంటాయి. వాళ్ళు వ్యక్తిగతమైన పరిమితుల్ని తమ వ్యక్తిత్వ బలం వలన అధిగమించగలుగుతారు. సుహృద్భావం, ప్రజాస్వామ్యం కోసం కాదు. Because of who they are. వాళ్ళకు మీరు వర్ణించే పరిమితులు వర్తించవు. అలాంటి మనుషుల్ని నేను ఎక్కడున్నా వేటాడి, వెంటాడి పట్టుకుంటాను. ఒదలను. అందుకే నాకు తెలుసు. త్రిపుర అలాంటి మనిషి. ఆయన కధలూ కవిత్వం అవీ నాకు అక్ఖల్లేదు. ఆయనకీ తెలుసు. ఆయన ఏది రాసినా నాకు ఒప్పుతుందని మీరనుకున్నది నిజం కాదు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. బ్రహ్మానందం గారు, కళలో తన్మయమైన కళాకారులకు ఎవరి అభిప్రాయాలతో ఖాతరు లేదు. లోకం అనుకునేది వాళ్ళకు ఈకముక్కా బరాబర్. నామిని ఉన్నారు కదా?

    Art Spirit అని ఒక పుస్తకం ఉంది. Robert Henri రాసేరు. ఆయన ఈ మన:స్థితిని వర్ణిస్తారు.

    నిఖిల్ బెనర్జీ అని ఒక సితార్ విద్వాన్. ఆయన ఇలా ఉండేవారట. లౌక్యం, తర్కం, మర్యాదా కళాకారుని మనసును అర్ధం చేసుకోలేవు. వాటికి అనుభవం లేదు, హంగులే ఉన్నాయి – social trappings. మీరన్న సుబ్బారావు గనక కళాకారుడైతే ఆయన కూడా అంతే. ఎవరి స్థిరాభిప్రాయాలు, చరాభిప్రాయాలూ ఖాతరు చెయ్యడు. అతనిలోని దయ్యం (సరస్వతీదేవి) అభిప్రాయం తప్ప. మీరు లేవనెత్తిన సంఘర్షణ ఆ ఒక్కలా తప్ప ఇంక ఎలాగూ, ఎవరి వలనా నివారణ కాదు.

    కనకప్రసాద్

  977. స్నానాల గదిలో గురించి peddadasatyaprasad గారి అభిప్రాయం:

    04/09/2012 9:19 am

    ఇంద్రాణిగారూ మీ కవిత చాలా బాగుంది. కవిత్వమనే సూరీడుకి ఎక్కడైనా లోకమే. ఏదైనా చూడగలడు. మీ సాహిత్యం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ పెద్దాడ సత్యప్రసాద్., viSaaKapaTnam.

  978. స్నానాల గదిలో గురించి Radha Krishna Bojja గారి అభిప్రాయం:

    04/04/2012 4:41 am

    నాకు ఇలాంటి సరదా కవితలంటే చాలా ఇష్టం …
    పైగా మీ కవిత చాలా సరళంగా అందరికీ (ముఖ్యంగా నాకు) అర్థమయ్యే విధంగా ఉండడంతో నా వోటు మీకే !!!

  979. మల్లెపూల మధూలిక గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:

    03/27/2012 11:55 am

    సురేష్ గారూ! మీ స్పందన మొత్తం చదివాను. చాలా బాగా రాసారు. అందుకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపనీయండి. మీరు విమర్శించినందుకో, ప్రశంసించినందుకో కాదు, కానీ, ఒక పాఠకుడిగా మీ అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచినందుకు సాటి తెలుగు వారిగా మిమ్మల్నిఆనందంగా – అభినందిస్తున్నా..(ఎందుకంటే చాలా మంది చదువుతారు..కాని చెప్పరు..హార్లిక్స్ ప్రకటనలో లా….) అందుకే మీ ఒకో సందేహానికి ఒక్కో సమాధానాన్నిక్కడ పొందుపరుస్తున్నాను.
    @ ” మిమ్మల్ని కాని మీ కవితని కాని ఉద్దేశించి అనటంలేదు కానీ” …
    *.. అంటూ ఆగారే! ఇందులో వెనకాడేందుకేముందీ?.. మీరు నా కవిత నుద్దేశించే ఇదంతా రాశారు. (లేకపోతే నేనింత గా ప్రతిస్పందించే అవకాశం నాకెక్కడిదనీ !?)
    @ ‘ ఒకసారి మీ కవితని ‘చదివినవెంటనే ‘ అభిప్రాయాన్ని రాయటం మొదలుపెట్టాను. కానీ ‘ మరలా పైనుంచి కొసదాక చదివాను’ భావాన్ని ఎలా ప్రవహింపచేసారా అని.,,’
    * చాలా తక్కువమందికి మాత్రమే అలవడే ఒక మంచి అలవాటు ఇది. (నాకు లేని మంచి లక్షణాలు ఎవరిలో వున్నా మెచ్చుకోకుండా వుండలేను మరి! .)
    ముందొచ్చే ఆలోచన్లన్నీ – సముద్రపు తుఫాన్లు. ఆ వెనకొచ్చేవే అసలైన తేట తనపు ప్రవాహాలు. – ఇలా రెండో ఆలోచన దగ్గర ఆగి, ఆలోచించి రాసే వారి మాటలే నిజానికి – అందర్నీ ఆలోచింపచేస్తాయి. అందుకే మాట్లాడేటప్పుడు…తెలివైన వారు మాత్రమే – కాసేపాగి, నిదానించి సమాధానమిస్తారు.

    @ ” మీ విధానం, పదాలు, అల్లిక బాగుంది.’
    * నిజమే. కవిత్వం అంటే – మంచుదారాల పోగులు, మలయ పవనాల పరిమళాలు – కలిపి నేసిన విరిమబ్బుల కోక వంటిది. థాంక్యూ!

    @ ‘చదువుతున్నపుడు ప్రతి పాఠకుడు తనకర్ధమైనంతవరకు వాక్యంలో రచయిత పొందుపరిచిన భావానికి లోనవుతాడు..’
    * అప్పుడే రచయిత గుర్తుండిపోతాడు. మన తెలుగు లో అలాంటి వారిని వేళ్ళమీద లెక్కించొచ్చు.. (ఆ వరసలో చేరాలనుకోవడం – నా వరకు నాకు ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. కాదనను. కాని, ప్రయత్నించడంలో తప్పు లేదు కదా అని..)

    @ “ఒక వాక్యం నుండి మరో వాక్యానికి, ఒక పాదం నుండి మరో పాదానికి దాటుతున్న గ్రాహకుడికి, ఒక ప్రయాణీకుడు మజిలీలు మజిలీలుగా పల్లకిలో పయ నించి గమ్యాన్ని చేరుకున్న అనుభవం కలగాలి.”
    * అంటే మీ వుద్దేశం లో – అక్షరాలు పల్లకీలు, భావాలు మనసుని మోసే బోయీలూ కా వా లంటారు.. అవునా!?
    @ “ఒక్కోకవితలో నవరసాల్ని పండించవచ్చు ఐతే భాషతో పాటు భావాన్ని చక్కగా పరచగలిగితే. మన తెలుగు అందుకు ప్రసిద్ధం.”
    * మీరంటోంది నిజమే! నేనూ ఒప్పుకుంటాను. మన తెలుగు భాషకున్న విశిష్టత ఏమిటంటే – రచనల్లో నవరత్నాల్ని గుమ్మరించ వచ్చు.. పున్నమి గుత్తులనూ పూయించనూవచ్చు..

    @ ‘ఓ పాఠకుడిగా నా అభిరుచిని వ్యక్తపరుస్తున్నానంతే.’
    * అంతే అనకండి. ఇంత అద్భుతంగా..అందరూ వ్యక్త పరచలేరు! మంచో, చెడో..తప్పో..ఒప్పో..నిష్టూరమో..నిగ్గదీయడమో..ఏదో ఒక దాని గురించి మన తెలుగు వాళ్ళం స్వేచ్చగా మాట్లాడుకోవాలి. సాహిత్యపరమైన విషయాలు చరిచించుకోవాలి. అభిప్రాయాలు, వ్యక్తపరచుకోవాలి. విస్తృత పరిధిలో వెల్లడించుకోవాలి. అసలిందుకే గా – ఈమాట నిర్వాహకులు మనకిక్కడ ఈ స్పేస్ ఇచ్చింది? మీకు దొరికిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అభినందనలు.
    @ “తప్పులుంటే క్షమించాలి.’
    * ఎందుకండీ..అంత పెద్ద మాట!..సాహితీ ప్రియుల అంచనా మేరకు రాయలేకపోతున్నందుకు.. ఇలా – నేనే అడగాలేమో! .( రాయకుండా నన్ను నేను బాధపెట్టుకుంటే సరిపోయేదానికి..రాసి అందర్నీ బాధిస్తు న్నానేమో ననే శంక కలుగుతూ వుంటుంది అప్పుడప్పుడు!
    మూల్గుతున్న నక్క మీద తాటి పండు .. అన్న సామెత చందంలా..- ఈసారి సంపాదకుల వ్యాసం ‘ ఎమితిని సెపితివె.’. చదివాక నా భయం మరింత హెచ్చిందంటే నమ్మండి!)
    సురేష్ గారూ! అందరి రచన్ల మీదా.. మీ అభిప్రాయాల్ని – నిర్భయంగా, నిర్మొహమాటంగా మీరిలాగే అభివ్యక్తీకరించాలని అభిలషిస్తూ…
    ముందు కాలంలో కూడా మీ విలువైన అభిప్రాయాలను ఈ రీతిలోనే మాకందచేస్తారని ఆకాంక్షిస్తూ..
    మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..మరి వుంటాను.
    నమస్సులతో –
    – ఆర్.దమయంతి.

  980. స్నానాల గదిలో గురించి సురేష్ గారి అభిప్రాయం:

    03/26/2012 6:43 am

    ఆడపిల్లా, అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిల్లా కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లు, బావుంది
    మీ కవితా వస్తువూ, ప్రేంకుమార్ చమక్కు.

    సురేష్

  981. మల్లెపూల మధూలిక గురించి సురేష్ గారి అభిప్రాయం:

    03/26/2012 6:33 am

    మిమ్మల్ని కాని మీ కవితని కాని ఉద్దేశించి అనటంలేదు కానీ అంటూ ఒకసారి మీ కవితని చదివినవెంటనే అభిప్రాయాన్ని రాయటం మొదలుపెట్టాను. కానీ మరలా పైనుంచి కొసదాక చదివాను భావాన్ని ఎలా ప్రవహింపచేసారా అని. మీ విధానం, పదాలు, అల్లిక బాగుంది. చదువుతున్నపుడు ప్రతి పాఠకుడు తనకర్ధమైనంతవరకు వాక్యంలో రచయిత పొందుపరిచిన భావానికి లోనవుతాడు. ఒక వాక్యం నుండి మరో వాక్యానికి, ఒక పాదం నుండి మరో పాదానికి దాటుతున్న గ్రాహకుడికి, ఒక ప్రయాణకుడు మజిలీలు మజిలీలుగా పల్లకిలో పయణించి గమ్యాన్ని చేరుకున్న అనుభవం కలగాలి. ఒక్కోకవితలో నవరసాల్ని పండించవచ్చు ఐతే భాషతో పాటు భావాన్ని చక్కగా పరచగలిగితే. మన తెలుగు అందుకు ప్రసిద్ధం.

    ఓ పాఠకుడిగా నా అభిరుచిని వ్యక్తపరుస్తున్నానంతే. తప్పులుంటే క్షమించాలి.

    సురేష్

  982. మల్లెపూల మధూలిక గురించి సోమార్క గారి అభిప్రాయం:

    03/19/2012 7:03 am

    దమయంతి గారూ!అత్యద్భుతం మీ ఉగాది కవిత.నిజంగా మధు మాసం రాకుండానే మల్లె పూల సౌరభాన్ని గుబాళించింది మీ “మల్లెపూల మధూలిక.”నా హృదయ పూర్వక ప్రశంసలు.

  983. బిచ్చగత్తె శిశువు గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    03/11/2012 10:23 pm

    రవి గారి కవిత మనోజ్ఞము.

  984. తడిస్తే కదా తెలిసేది! గురించి Venkateswara Rao .D గారి అభిప్రాయం:

    03/09/2012 11:25 am

    గన్నవరపు నరసింహమూర్తి గారు,

    మీరు రాసిన “భారతి, భావాంబర వీధి విశ్రుతి విహారి” అన్న ఒక్క మాట చాలు, వచన కవిత్వమైనా ఛందోబద్ధ కవిత్వమైనా ఒకటే నని. ఆ అమ్మ కృపతొ మన ఈ తెలుగు భాష రోజు రోజు క్రొత్త పుంతలు తొక్కుత్తున్నది. వాఙ్మయం నుండి ప్రబంధ కవిత్వము నుండి, గురజాడ, గిడుగు వారి నుండి, శ్రీ శ్రీ నుండి భారతి, భావాంబర వీధి విశ్రుతి విహారి! వాగర్ధావివ సంప్రుక్తౌ, వాగర్ధౌ ప్రతిపత్తయెత్ అన్నట్టు……

  985. స్నానాల గదిలో గురించి బొక్కా ప్రేమ్ కుమార్ గారి అభిప్రాయం:

    03/09/2012 7:18 am


    ఆవిరి నిండిన ఈ గదిలో
    నేనొక్కదానినే

    మునివేళ్ళతో నీళ్ళని తాకి చూస్తాను
    తేనీటి కప్పుని పెదవులకి ఆనించినట్టు.

    కవిత అర్ధాంతరంగా ఆపేసినట్టు ఉంది, ఇంకా కంటిన్యూ చేస్తే బావుండేది.

    – బొక్కా ప్రేమ్ కుమార్

  986. వెల్చేరు కవితలు కావలెను గురించి afsar గారి అభిప్రాయం:

    03/08/2012 1:55 am

    హెచ్చార్కే: ఆ కవిత మా దగ్గిర వుంది. అది ఇతర సంకలనాల్లో కూడా వచ్చింది కదా! అవి కాక, ఇంకా ఏమయినా వుంటే చెప్పండి.

  987. వెల్చేరు కవితలు కావలెను గురించి హెచ్చార్కె గారి అభిప్రాయం:

    03/06/2012 1:52 pm

    అఫ్సర్, సృజనలో అనుకుంటా వెల్చేరు కవిత ఒకటి చదివి వావ్ అనుకున్నాను, సుమారు 1973-74 ప్రాంతాల్లో. పదాలు సరిగ్గా గుర్తు లేవు. ‘మనది గొప్ప జాతి / నాకు ఆకలేస్తోంది// మన సంస్కృతి చాల గొప్పది…. ../ నాకు ఆకలేస్తోందిరా// నన్నయ ఫలానా./రేయ్ నాకు ఆకలేస్తోందంటే వినవేం’ ఇలా‍ ఉంటుంది. ఇలా కాదు, ఈ పదాల కన్న చాల బాగుంటుంది. ఇది ఇప్పటికే మీ దగ్గరుండొచ్చు. మీ దగ్గర లేక పోతే, ఎన్. వేణు దగ్గరున్న సృజన బైండింగ్స్ లో దొరకొచ్చు.

  988. కొక్కొండ: అనుబంధం-1 గురించి తాడేపల్లి గారి అభిప్రాయం:

    03/04/2012 2:43 pm

    నాకు చాలా నచ్చిన వ్యాసమిది. బెజ్జాలవారికి నెనరులు.

    ఛందస్సులంటే నాకు చిన్నప్పట్నుంచీ చాలా ఆసక్తి. ఎక్కువగా సుప్రసిద్ధమైన ఆ నాలుగువృత్తాలే వ్రాస్తూంటాను. కానీ ఎప్పుడూ అవేనా ? అనే విసుగు కూడా ఓ మూలన లేకపోలేదు. అయినా వాటితోనే సరిపుచ్చుకోవడం. కారణం – వాటిని మించిన సర్వసందర్భోపయోగివృత్తాలు చాలా తక్కువ. మహా అయితే వెరైటీగా ఒక తరళమో, మత్తకోకిలో, ఉత్సాహమో ప్రయత్నించవచ్చు. అంతకంటే లేవు. కథాకథనానికీ, సంభాషణలకీ ఉత్పల, చంపకాలతో, మత్తేభ, శార్దూలాలతో సమానమైన గతి గల వృత్తాలు కావాలి. అలాంటివి (ప్రత్యామ్నాయాలు) ఇంతవఱకూ నాకెక్కడా దొఱకలేదు. ఈ వ్యాసంలో కూడా అలాంటివి మఱీ ఎక్కువ లేవు.

    అయితే ఈ వృత్తాలతో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి. ఒకటి – నాలుగుపాదాలూ వ్రాసితీఱాలనడం. చెప్పడానికి మన దగ్గఱ మేటర్ అంత లేకపోతే ఏం చేయాలి ? పూర్వీకులు ఇలాంటి సందర్భాల్లో చంపూశైలిలోకి దిగేవారు. నా అభిప్రాయంలో రెండుపాదాలే చాలునన్నప్పుడు యావత్తు కథనాన్నీ పద్యాల్లోనే నడపొచ్చు. చంపూశైలి అవసరం లేదు. అందుచేత రెండుపాదాల వృత్తాలక్కూడా ఛందశ్శాస్త్రంలో వెసులుబాటుండాలి. రెండోది -యతిప్రాసలలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుందనే వెసులుబాటు కూడా రావాలి. రెండూ కావాలనే రసికులు తమ స్వసంకల్పానుసారంగా ఆ జమిలినియమాన్ని పాటిస్తారు. ఇతరుల మీద నిర్బంధం వద్దు. అందుమూలాన ఛందోబద్ధకవిత్వాన్ని యువతలో ప్రచారం చేయడం కష్టమవుతోంది.

    మూడోది – ఈ వ్యాసంలో పేకొన్న వృత్తాల్లో అధికభాగం లఘువులకే స్థానమిస్తున్నాయి. అది అచ్చతెలుక్కి నప్పుతుందేమో గానీ ఆంధ్ర-గీర్వాణ మిశ్రశైలికి తఱచుగా పనికిరాదు. గురులఘువులు రెండూ సమానసంఖ్యలో గల వృత్తాలు ఉత్పల, చంపకాదుల్లా కథాకథనానికీ, సంభాషణలకీ పనికొస్తాయనేది నా అనుభవం.

  989. ఛందస్సు కొక కొండ కొక్కొండ గురించి మోహన గారి అభిప్రాయం:

    03/03/2012 11:32 pm

    1) కొక్కొండ వేంకటరత్నంపంతులుగారు సృష్టించిన రెండు పద్యములను ఇతరుల గ్రంథములలోని ఉదాహరణలుగా కవితాసాగరములో ఇవ్వబడినవి –

    కల్యాణ –
    పాపశిక్షకా నత భక్తరక్షకా పరాత్పరా వరాక్షరాకా పావశిక్షకా
    ఆపదుద్వహా జగదాదిధూర్వహాహతారిగేహకోమలదేహా మహామహా
    శ్రీపతీ సతీపతిసేవితోన్నతీ శ్రితార్తిభంజనేష్టమతీ శిష్టహృద్గతీ
    దీపికోపమాధికతేజ ఉద్గమాస్థిరోద్యమాऽగమానుగమా తే నమోనమః
    – శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి, శ్రీపాదభాగవతము

    రత్నావళి –
    అళుల లతాంత మధుర మధుపానము హాయిగఁ జేసి మదించె; లతా-
    వళి నగవరయుతమై తనరారెను స్వాధీనపతికపగిది నహా
    యిలాజాతములు కిసలయములతో నింపుగఁ గనుఁగొన నయ్యెను; గో-
    కిలములు శ్రుతిహితముగఁ బాడఁ దొడంగెను జూతకిసలములఁ దినుచున్
    – శ్రీవిక్రమదేవవర్మ, మానవతీ చరిత్రము

    2) తెలుగు లాక్షణికులకు, కవులకు నచ్చనివి రెండు – చంద్రగణములతో పద్యములను వ్రాయుట, లఘువు పైన యతి నుంచుట. నేను ఎన్నో పుస్తకాలను వెదుకగా నాకు దొరకినవి వ్రేళ్లపైన లెక్క పెట్టగలిగిన అక్కరలు మాత్రమే. అందులో ఒక రెండు క్రింద ఇస్తున్నాను. మధ్యాక్కర తప్ప మిగిలిన అక్కరల ఉపయోగము శాసనయుగముతో అంతరించింది. నవీన యుగములో విశ్వనాథ సత్యనారాయణ అక్కరలను తమ కల్పవృక్షములో వాడారు. చంద్రగణములతోడి తెలుగు షట్పదలను కూడ కవులు వాడలేదు.

    మధురాక్కర – సూ-ఇం-ఇం-ఇం-చం, యతి (1.1, 4.1)

    తనర జనకుండు, నన్నప్రదాతయును, భయత్రాత
    యును, ననగ నింతులకు మువ్వు రొగిన గురువులు, వీర
    లనఘ యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
    ననఁగ బురుషున కియ్యేవు రనయంబును గురువులు
    – నన్నయ, ఆదిపర్వము, 4.49

    కలదు దేవగుహ్యం బని కమలబాంధవుఁడు గర్ణుఁ
    బలికె నని చెప్పి తది యెద్ది, బలియుఁ దా సూరజుండు
    లలితకవచంబు మణికుండలములు నెమ్మెయిఁ బడసి
    వెలసె, నవ్విధ మింపుగ వివరింపవలయు నాకు
    – ఎఱ్ఱన, అరణ్యపర్వము, 7.309

    అల్పాక్కర – ఇం-ఇం-చం యతి (1.1, 3.1)

    మీరిందు శంబరు మెచ్చిచూడ
    నారూఢి నేనొక్క హయము నెక్క
    చూరించి పోవన దుర్గభూమి
    భారంబుగా జొచ్చె నాజి వేగ
    – మడికి సింగన, వాసిష్ఠ రామాయణము

    3) రావూరి దొరసామి శర్మ ఒక గొప్ప లాక్షణికుడు. వీరు ఎన్నో లక్షణగ్రంథాలను (ఉదా. సులక్షణసారము, కవితసాగరము) పరిష్కరించారు. ఛందస్సుపై వీరు వ్రాసిన “తెలుగు భాషలో ఛందోరీతులు” అన్న పుస్తకానికి గిడుగు సీతాపతి పుస్తకముతోబాటు ప్రథమ బహుమతి లభించినది. వీరి పలుకులను క్రింద వీరి వాక్యాలలోనే తెలుపుతున్నాను –
    “సీసమేల సువర్ణసిద్ధి గలుగ నన్నారు కొక్కొండవారు. పరుసవేది సోఁకినఁ జౌకలోహము బంగారమగును. సీసమును బంగారముగా మార్చు స్పర్శవేధి చంద్రగణము. కాని సీసపు నడకలోని గాంభీర్యము బంగారు పద్యమునఁ గుంటువడినది. పద్యము పేరు బంగారే కని యందు సువర్ణత్వము ప్రకాశింపలేదని నా యభిప్రాయము. ఈ వెండి బంగారములకు (పద్యములకు) ధారాశుద్ధి శూన్యము.”

    4) సూర్యగణము, చంద్రగణము విడివిడిగా నుండక ఒక పదము ద్వార చేరితే ఇలాగుంటుంది –

    సుమపదైక భేద మమరు నంతనె వస్తువు మఱివేఱె
    – బిల్వేశ్వరీయము – 6 తృతీయభాగము, కల్యాణరసజ్ఞ పర్వము, 83

    ఇది ఒక తేఁటిబోటి (ఆటవెలది బేసి పాదముతో చంద్రగణము) పాదము. దీనికి గణవిభజన ఇలాగుంటుంది –

    సుమప (సూ) దైక (సూ) భేద (సూ)
    మమరు నం (ఇం) తనె వస్తు (ఇం) వు మఱివేఱె (చం)

    వస్తువులోని మొదటి రెండక్షరాలు సూర్యగణములో తరువాతి వు చంద్రగణాదిలో ఉన్నవి యిక్కడ.
    నా ఉద్దేశములో దేశి ఛందస్సులో ఇలా గణాలను ఇలా వాడితే సొగసు చెడుతుంది.

    విధేయుడు – మోహన

  990. చిరునవ్వుగాది గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/03/2012 1:05 am

    “పర్వపర్వమునకు పద్యాలు పచరించి
    పత్రికలకు పంపువాని విడచి ”

    మీరు రాసింది కూడా పత్రికకి పంపితేనూ ఈ మాట చెప్పి .. సరదాగా అనిపించింది.
    ఫిడేల్ రాగాల డజన్ లో[ పంతొమ్మిదవ ముఫ్ఫై దశకంలోనే.. వసంతం అన్న కవితలో..] ఇలాంటి భావాల్ని [ ఉగాది ని గురించే] ఇదివరకే పఠాభి చెప్పి ఉన్నారు.

    రమ.

  991. ఎమితిని సెపితివె? గురించి కనకన ప్రసాదు గారి అభిప్రాయం:

    03/01/2012 11:25 pm

    బితిరీలకి జలుబు చేసి పదమూడేళ్ళు
    పేరడీల్ని గురించి పేరడీలాంటి మాటల్లో తప్ప ఇంకోరకంగా మాట్లాడ్డం యమా యాతన. బహుశా అసాధ్యం. నాకు తెలిసిన పుస్తకాలన్నీ అవతలిసిరీసి ఉంచుకున్న రెండు పుస్తకాల్నే (An Anthology of Modern Telugu Poetry; బేంక్ ఆఫ్ అమిరికా పాస్‌బుక్) ఇలాగా అలాగా ఎన్నిసుట్లు ఎంత తిరగేసినా మిగిలింది ఇలాట ఇగటాలే. వీటిని మా సైడు – అంటే అంపఖండి, పురుషోత్తపురం అటీపు – బితిరీలు అంటారు. నీకు ఇగటాలాడ్డం తెలియకపోతే, ఇగటాలు తెలీదు. మనిషి నడకబట్టి ‘వీరు పూజ్యులు. పెద్దవారి బితిరీలంటే ఇలాగే గావాల!’ అనీసి నువ్వు పట్టీసుకోలేకపోతే నువ్వు ఇంక బితిరీలు పట్టుకోలేవు. అంటే, పెద్దవారి ఎచ్చులంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి అలాట పెద్దలే స్వయంగా చిలకట్లెగ్గట్టుకోనొచ్చి చెప్పకపోయినా తెలుసు. బితిరీలు పోల్చుకోలేని వారికి మరి ఎందరు పెద్దలొచ్చి ఉవాచ చేసినా మరింక తెలీదు. వారు పెద్దలు ఏ ముక్క చెప్పినా ‘మరే! మనందరి తరుఫునా మాష్టారు అధ్యయనీకరించేసారుగా! చారిత్రక సత్యాల్ని విస్మరిస్తే ఎట్లా?!…!!’ అని భక్తితో పల్లకుంతారు.

    అయితే మరి ఇది ఎందుకు రాస్తున్నాను? నా కడుపుబ్బరం ఉగ్గబట్టుకోలేక. నాకు వేలూరి రాసిన పేరడీలు చదవగానే ‘మీకు అట్టాగనిపించిందీ? నాకూ అట్టాగే అనిపించింది!’ అనిపించింది. కాని ‘ఆఁ … ఎవరెట్టాపోతే నాకేం!’ అనిపించలా. ఎందుకట్టా అనిపించలేదు చెప్మా? అని నవ్వి నవ్వి లుమ్మచుట్టుకుపోయి నా నాభి లోపల్లోపలకి నేనే అస్తమానం చూసుకోలేక అవస్తలు పడుతుంటే బితిరీలు కితకితలుగా మారి ఎక్కిళ్ళలోకి దిగి ఇవి ఇలాటలాట బితిరీలు కావు, ఇగటాలకే మొగలాయీలు ఈ చెతుర్లనీసి పరమ నిదానంగా బోధపట్టం మొదలెట్టీసింది అనీసి నేనెరుగుదును. వేలూరి ఈ ప్రత్యేకత ఎలా సాధించుకున్నాడో నాకు తెలీదు. బహుశ వారి పెద్ద మేష్టారు నేర్పిన విద్యయే అయ్యుంటాది. కాని వారినుండి ఇలాట కులాసాలు చూట్టాలు, కవితా దేవర దేవతా వస్త్రాల్ని పోల్చుకోడాలు మాత్రం మాసైడు మరి ఇదే మొదటిసారి…!

    నాలో ఉన్నాయని నాకే తెలియని ఫన్నీ బోన్స్ అన్నింటిలోకీ ఈ వేళాకోళాలు వేళాపాళా లేకండా ప్రవేశించీసి మాయావిడ ‘ఆపుబే నీ యబ్బా..! వాకింగ్కెల్దామా?!’ అని తిట్టడాలవరకూ వచ్చింది. నా కడుపులో ఇన్నిగటాలున్నాయనీసి నాకు ఇంతకుముందు తెలీదు. నిజంగానే భాషకి జబ్బు చేసి నలభయ్యేళ్ళు అయ్యిందనే నీను కూడా అనుకుని ఊరుకున్నాను. అంతేకాదు; ఆ మరుసట్నాడు వ్యాకరణానికి జలుబు చేసి పదమూడేళ్ళు అనీసి మాయావిడితోటి అన్నాను. అది “అక్ఖల్లేని బితిరీలన్నీ నీకెందుకురా? నోర్మూసుకుని చేతులు గట్టిగా ఊపుతూ, ఒక కన్ను సగం తెరిచి, ఒక కన్ను సగం మూసుకుని, మిగిల్నవన్నీ పూర్తిగా మూసుకుని, నిదానంగా వాకింగ్ చెయ్యి…!” అని వాకింగ్ ఎట్లా చెయ్యాలో ఉవాచల్లోకి దిగిపోయింది. ఆ బితిరీలు నేను ఒద్దంటున్నా వినకుండా ఎవరు పిలిచారని అడగడానికి వీల్లేకుండా నాలోపలికొచ్చీసేయి. ఎంతలా అంటే నా ఊహల్ని నిబ్బరంగా నిలబెట్టే వచనాన్నుండి తప్పించీసుకుని, జాగింగ్ ట్రెయిల్ చుట్టూ అడ్డంగా ఒకసారీ నిలువుగా ఒక సారీ ‘నడువూ నడువూ తిమ్మప్పా! నవ్వాకోయీ తిమ్మప్పా!! పెద్దావారు తిమ్మప్పా! పెదవికి చేటు తిమ్మప్పా!! ‘ అని మాష్టారు చెప్పినట్టు తలూపి బుద్ధిగా నడిచే కవితా బాల వలె!

    మనస్సు, మెదడు, భాష, వ్యాకరణం బితిరీలకి బానిసలైపోతాయి. ఆ బితిరీల్ని వొదుల్చుకుని ఏ కొత్త గడుసు లోకాల్లోకీ మాటకారితనంగా పెత్తనం చెయ్యకుండా ఊరుకోడానికి ఒక పట్టాన మనం ఒప్పుకోం. ఒకవేళ మనం ఒప్పుకున్నా, మనలోని పెద్దవారికి ‘మనసు మాట వినదు.’ వేలూరిని వేలూరి అనీసే నేను ఎరుగుదును. కాని ఇలాగ వెవ్వెవ్వేలూరిగా తెలీదు.

    ఈ పేరడీని పెద్దవారి ఎచ్చుల్నీ, వారి బితిరీలకి మనం నమస్కారం చెయ్యడాల్నీ, ఇంకా వారి ఉవాచల వెనుక సంకల్పాల వికల్పాలన్నింట్నీ తెలుసుకోకుండా గనక మీరు చూసారా, మీకు ఈ ఇగటం అర్ధం కాదు. పెద్దల్ని వొదిలెయ్యండి. పెద్దవారి ఎచ్చుల వల్ల వచ్చే ఇగటాల్ని ఎవరూ చూడకుండా దొంగచాటుగా ఎంజామెంట్ మాత్రం చేసుకోండి. పెద్దవారి ఎచ్చులు భాషంత అనాది అని, వారి ఆలోచనలకి కూడా ఎప్పుడే నా జలుబు చేస్తుంటుందనీ వారి ఉవాచలే మీలో కొన్ని ఇగటాల్ని పొగబెడతాయి. అప్పుడు వెవ్వెవ్వేలూరి ఇగటానికీ స్నేహానికీ పోషకుడూ విదూషకుడూ అయిన మనిషి కనిపిస్తాడు. ‘అబ్బ ఇదుగో ప్లీజ్! ఒద్దువై, వెవ్వె.. వెళిపోవై!’ అని చెప్పినా వినకుండా. ఆయన ఇగటాలకి అర్ధం పర్ధం ఏమైనా ఉన్నాయో లేవో మీ అంతట మీరు ఆలోచించుకోకుండా ఎవరైనా పెద్ద మేషార్ని కనుక్కోవాలని మళ్ళీ బూకరించుకుంటారు మీరు. భాషకి ఎన్నేళ్ళాయి జబ్బు చేసిందో, నెలకో దినం తక్కువ చేసి ఛందస్సుకి మేహవాతం ఒస్తునాదో లేదో, వ్యాకరణానికి జలుబు చేస్తే ఎట్లా ఒదలగొట్టాలో ఒక సుహృద్భావపూరిత మేధో ఆవరణంలో మీరు మర్యాదగా చర్చించ గలుగుతారు. అట్లా చర్చించినవన్నీ ఎవరైనా సాహితీ మిత్రులతో బుక్కుగా వేయించుకోండి. ఆ పని చాలా నిదానంగా, లేని పద్యాన్ని ఉన్నట్టు రూపించినంత నిబ్బరంగానూ చెయ్యాలి. దానికి ‘మధ్య మాట’ ఎవరు రాయాలో ఈ సుట్టు మొదట వేలూరినే అడగండి. ఎందుకేనా మంచిది …!

  992. మల్లెపూల మధూలిక గురించి మోహన గారి అభిప్రాయం:

    03/01/2012 9:07 pm

    జగ మొక నందనము, మన సొక బృందావనము, నందన మందిస్తుంది ఆనందాన్ని సుఖశాంతులను, మీకు, ఈమాట పాఠకులకు తప్పక! కవిత బాగుంది. మరి, చెట్టు ఆకులను రాల్చడము ప్రకృతి ధర్మము గదా, ఏమంటారు? విధేయుడు – మోహన

  993. స్నానాల గదిలో గురించి మోహన గారి అభిప్రాయం:

    03/01/2012 8:59 pm

    గదిలో కలిగిన భావాలను మదిలో పదిలపరచుకొని, మదిలో మెదలిన భావాలను గదిలో పదిలపరచుకొని చక్కగా కవితను అల్లారు. మీ ఊహాగానానికి జోహారులు. కాని ఆవిరితో నిండిపోయిన నీటిని తేనీరనుకోకండి, నాలుక నల్లబడుతుంది 🙂 విధేయుడు – మోహన

  994. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    02/26/2012 11:56 pm

    “Ode to the Medieval Poets”
    ఎక్కడో ఇస్మాయిల్ గారనుకుంటా, మన పాత కవిత్వమంతా ఆర్భాటమయం, మామూలు మనుషులు అసలు కనిపించరు అన్నారు . కాని, ఈ పద్యం విని, మీ విశ్లేషణ చదివితే, మన భాష మీద గర్వంతో ఉప్పొంగి పోకుండా ఉండలేము.

    నాకీ మధ్యనే Garrison Keillor పుణ్యమా అని తెలుసుకున్న Auden పద్యం గుర్తుకొచ్చింది:

    “Chaucer, Langland, Douglas, Dunbar, with all your
    brother Anons, how on earth did you ever manage,
    without anaesthetics or plumbing,
    in daily peril from witches, warlocks,

    lepers, The Holy Office, foreign mercenaries
    burning as they came, to write so cheerfully,
    with no grimaces of self-pathos?”

    “I would gladly just now be
    turning out verses to applaud a thundery
    jovial June when the judas-tree is in blossom,
    but am forbidden by the knowledge
    that you would have wrought them so much better.”

    కవిత్వపు తామరాకు మీద నీటిబొట్టు లాగా నిల్చిన కవి,” అన్నారు మీరు. “తిక్కన ప్రతిభ” అన్న ప్రసంగంలో, కృష్ణశాస్త్రి, “ఇది కవి కెంత కష్టమైన పనో తెలుసునా? తన్ను తాను పూర్తిగా లేకుండా తుడిచేసుకోవడమన్న మాట. లోకంలో వాడై కూడా దానిలో లేనట్లు తటస్థుడుగా, ఒడ్డున సాక్షిగా కూర్చోవడన్న మాట!” [1]. ఆ ప్రసంగాలు పుస్తకరూపంలో వచ్చినట్లే, మీ ఈ వ్యాఖ్యానాలు కూడా ఓ పుస్తకంగా వస్తే మరింక ఎక్కువ మంది తెలుగు వాళ్ళకి మన పాతకవుల గొప్పదనం చాటినట్లవుతుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] కృష్ణశాస్త్రి వ్యాసావళి-1, కవి పరంపర. రాజహంస ప్రచురణలు, 1982.

  995. రెండు కవితలు గురించి నవీన్ నంబూరి గారి అభిప్రాయం:

    02/26/2012 3:36 pm

    ఇంట్లో తూనీగలో మీ ఇదివరకటి కవితలు పిల్లలు నిద్దరోతున్నారు, వానకు తడిసిన పువ్వొకటి లోని మ్యాజిక్ కనిపించకపోయినా శైలి ఎప్పటిలాగే ఉంది. రోజువారీ జీవితం మీ లెన్సులోంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది 🙂 యాపిల్లోంచి యాపిల్ ఊహ బావుంది. గేయంలా మా అమ్మాయితో కలిసి పాడుకోడానికి వీలుగా ఉంది. కృతజ్ఞతలు.

  996. ప్రేమ కవితలు గురించి pradeep గారి అభిప్రాయం:

    02/03/2012 3:10 am

    మీ కవిత చాలా బాగున్నాయి. మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. very nice

  997. నన్ను ఎవరో చదివారు గురించి swatee Sripada గారి అభిప్రాయం:

    01/31/2012 11:47 am

    కళ్ళకు కనపడని గుండె కవాటాల మూలల్లో
    ఎక్కడో దాగిన
    గురువుల కంఠస్వరాన్ని వినిపించారు
    వారి స్వరాల భుజాలపై నే వూరేగుతున్నాను

    చాలా బాగుంది.

    హృదయపు పలకపై చెక్కిన అక్షరాలు
    ఎన్నడూ నే గమనించకున్నా
    శిలా శాసనాలై జీవితాన్ని నడిపిస్తున్నాయి
    సముద్రాల ఆవలితీరాలను ముడివేస్తున్నాయి

    వీటిల్లటికవి మనసు కనిపిస్తోంది
    ప్రతి అక్షరం కవిత్వంలో ఊరి మురిపిస్తోంది.

  998. వేణునాదం ఆగింది! గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:

    01/12/2012 9:33 pm

    మాన్యులు శ్రీ రోహిణీప్రసాద్ గారి నివాళిని చదివి, ఆయన అనుసంధించిన ఆ స్వరలహరిలో తేలియాడుతుంటే మైమఱపు కలిగి, కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. మా చిన్నప్పుడు – ఆయన పేర్కొన్న ఆ కార్యక్రమం జరిగిన తర్వాత – మా బాబాయిగారు, పిన్ని మద్రాసులో మా ఇంటికి వచ్చినప్పుడు ఆ సంఘటనను గుఱించి మా అందరికీ వివరించి చెప్పటం, మా పిన్ని శ్రీ రోహిణీప్రసాద్ గారిని గుఱించి ఎంతో ఆప్యాయనంగా మాట్లాడటం నా కింకా గుర్తున్నది. తెలుగు సాహిత్యాన్ని వేలుపట్టుకొని నడిపించిన మహామహుని తనయునికి ఆయన సంగీతాభిమానమంతా సంక్రమించినదని మా పిన్ని అనటం వల్ల నాకప్పుడు శ్రీ రోహిణీప్రసాద్‌గారి పేరు తెలిసింది. వారిని నేనెన్నడూ కలుసుకోలేకపోయినా – మా బాబాయిగారు, నాన్నగారల ద్వారానూ; వారి అక్కగారు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శాంతసుందరిగారు, బావగారు సుప్రసిద్ధకథకులు శ్రీ రామవరపు గణేశ్వరరావు గారల ముఖతః వారిని గుఱించి తెలుసుకొనే అవకాశం కలిగింది. వారి స్మృత్యంజలి మా ఇంటిల్లిపాదినీ కదిలించిందని చెప్పటానికే ధన్యవాదపురస్సరంగా ఈ నాలుగు మాటలూ వ్రాశాను.

    వ్యక్తితో అనుబంధం, ఆత్మీయత అల్లుకొన్నవారి రచనలెప్పుడూ ఆ వ్యక్తితో తమకు గల పరిచయాన్ని నెమరువేసుకొంటూ ఈ విధంగానే ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు పరమపదించినప్పుడు అల్లసాని పెద్దనగారు నిఃస్పృహులై, “మనుచరిత్రం బందుకొనువేళ యెదురేఁగి పల్లకి తన కేలఁ బట్టి యెత్తె”, “ఆంధ్రకవితాపితామహ! అల్లసాని పెద్దనార్య! అని నన్నుఁ బిలచునట్టి కృష్ణరాయల తోడ దివి కేఁగలేక బ్రదికియున్నాఁడ” అన్న వాక్యాలు స్వోత్కర్షలు కావు.

    సాహిత్యాభిమానులు అందులో చరిత్రశకలాలను గుర్తించి, వ్యక్తిజీవితాన్ని పునర్నిర్మించుకొంటారు.

    చాలాకాలంగా భారతదేశవాసానికి, ఈనాటి ప్రచార భేరీభాంకారాలకు దూరంగా ఉండటం వల్ల మా బాబాయిగారిని గుఱించి ఈ తరానికి అంతగా తెలియకపోవటం జరిగింది. వారు స్వర్గస్థులైనప్పుడు నేను మా కుటుంబానికీ, బాబాయిగారికీ ఆప్తులైన శ్రీ మందలపర్తి కిషోర్ గారికి తెలియజేయటమూ, వారు సాక్షి దినపత్రికలోను, సాక్షి టివిలోనూ వెల్లడించటం జరిగింది. తర్వాత శ్రీ రవిబాబుగారు సహృదయంతో గౌరవపూర్వకంగా నెమరువేసుకొన్నారు.

    ఈ లేఖావళిని ఈరోజే చూడటం మూలాన ఆలస్యంగా స్పందించినందుకు మన్నింప ప్రార్థన.

    వారి జ్ఞాపకాలను మఱెప్పుడైనా వ్రాసే ప్రయత్నం చేస్తాను. శ్రీ రోహిణీప్రసాద్ గారికి ధన్యవాదాలు.

    సవినమ్రంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  999. వేణునాదం ఆగింది! గురించి సుజాత గారి అభిప్రాయం:

    01/12/2012 7:12 am

    చివరకు “నరసరావుపేట” అన్న బ్లాగు (అది ఆయన స్వస్థలం) నడిపేవారికి కూడా ఈ వార్త తెలిసినట్లు లేదు. వెటకారం బహు బాగానే ఉంది కానీ లాభం లేదు! నిజమే! నాకు కూడా తెలీలేదు. ఆయన నాకు (మా అత్తింటివారి వైపు నుంచి)దూరపు బంధువు కూడా అవుతారు. అయినా తెలీలేదు. బంధుత్వాలిలా ఉన్నాయని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలన్నమాట! :-))

    ఆయనతో కలిసి పని చేసి, కచేరీలు నిర్వహించి, సంగీత దర్శకత్వాలు వహించి, ఎంతో కొంత స్నేహం, పరిచయం ఉన్న వారికే ఏదో ఒక పత్రిక చూస్తే తప్ప తెలీలేదంటే కేవలం నరసరావు పేట సంగతులతో బ్లాగు నడిపే వారికి ఈ విషయం తెలీక పోవడంలో ఆశ్చర్యం ఉందని అనుకోడం లేదు గానీ, బంధువులెవరూ ఈ విషయాన్ని పంచుకోకపోవడం.. కొంత విషాదం! పైగా ఆయన కుటుంబంతో నాకు పరిచయం తక్కువ.

    నాకు తెలిసిన ఆయన జ్ఞాపకం! నరరసరావు పేట ద్విశతాబ్ది ఉత్సవాలు జరిగినపుడు ఆయన్ని అహ్వానించగా ఆయన అమెరికా నుంచి వచ్చారు. మా వూరి నడి బొడ్డులో ఆయనకు సన్మానం జరిగింది.ఆ సభలో ఆయన,తన వేణువుని సవరించి అందరికీ వీనుల విందు చేశారు. చాలా ఉద్వేగ భరితులై మాతృభూమి గురించి ఆశువుగా కవిత్వం చెప్పారని చదివాను. వీలైతే ఆ నాటి వార్తా పత్రికలు సంపాదించడానికి ప్రయత్నిస్తే తెలుస్తుందేమో!

    నా వద్ద వారి కవితా సంకలనం “అంతర్వాణి” ఉంది. మరి కొన్ని విశేషాలు సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారిని సంప్రదిస్తే చెప్పగలరు.

  1000. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    01/11/2012 3:44 pm

    “ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో అమ్మలక్కలు మండువా లోగిళ్ళలో పాడుతుండగా విన్న ఊర్మిళాదేవి నిద్ర పాటల శైలి ఇప్పటికీ ఇంకా నాకు బాగా గుర్తుంది. (ఎవరికైనా వినే దమ్ముంటే పాడగలను కూడా!).” -Krishna Rao Maddipati

    పాడండి. ఆకస్మిక ప్రసారం చెయ్యటం ఈ పత్రికకు సాధ్యమే అని తెలిసింది. కృష్ణారావ్! మీపాట ఎందుకు మమ్మల్ని విననీయరు. కవిత్వాలు వ్యాసాలు రాసుకుంటే, రాయటం వస్తుందేమో కాని సంగీతం రాదు. సంగీతం వింటే వస్తుంది. పాడితే వస్తుంది. అని రోహిణీ ప్రసాద్ చెప్పింది చాలా నిజమే.

    మీరు పాడండి. నాకు వినాలని ఉంది.

    కొత్త సంవత్సరం సందర్భంగా ఎక్కడో భారతంలో ఒక చలి ప్రాంతం నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆమె వైణికురాలు. ఏమి వాయిస్తున్నాదీ ఇప్పుడు అని నేను అడిగి తెలుసుకుంటుంటే, పినాక పాణి పుస్తకం నుంచి కొన్ని కీర్తనలు నేర్చుకుంటున్నా, నువ్వు రా, నేను వినిపిస్తానంది.

    ఇప్పుడు ఫోన్లో వినిపించమన్నాను. అప్పుడు నాకు అర్థరాత్రి.
    నీకు నిద్ర పోయే సమయం. ఇప్పుడు కాదు -అంది ఆమె.
    లేదు నే వింటానన్నా.
    ఆమెకు హఠాత్తుగా గుర్తు వచ్చింది. నా వీణకు ఒక తీగ తెగిపోయి ఉంది. మార్చాలి.-అంది
    ఎంత సేపు పడుతుంది. తీగ మార్చటానికి? -నా ప్రశ్న
    ఒక అరగంట ఇవ్వు. తీగ మార్చి కొంచెం సాధకం చేసుకుని వినిపిస్తా నంది.
    నేను మళ్ళీ ఫోన్ చేసే లోపలే, తనే ఫోన్ చేసి,

    “వందే వాసుదేవం, శ్రీ హరిం
    వందే వాసుదేవం
    బృందారకాధీక వందిత పదాబ్జం
    వందే వాసుదేవం
    ఇందీవరశ్యామ మిందిరా కుచకటీ
    చందనాంకిత లసచ్చారు దేహమ్
    మందార మాలికా మకుట సంశోభితం
    కందర్ప జనక మరవింద నాభమ్…”

    వీణతో, తన కంఠస్వరం కలిపి పాడితే, నే విని ఈమె నాకు తెలిసిన వ్యక్తేనా అని ఆశ్చర్య పోయాను. నిజంగా చెప్పాలంటే ఆమె నాకు తెలియదు. పదిహేను ఇరవయ్యి సంవత్సరాల పైగా సాధన చేసి వైణికురాలైన ఆమె నాకేం తెలుసు? ఏదో దగ్గిర చుట్టంగా ఆ చనువుతో తెలుసు. ఆమె ఇంకా ఏమేమిటో? నిజంగా నాకేం తెలుసు?

    ఆమెకు తన వీణ నేను వినాలనీ, తను వేసిన బొమ్మలు నేను చూడాలనీ ఎంతో ఉబలాటం. ప్రకృతి అందమైన దృశ్యాలు తనతో పాటు నేను చూడాలని ఆమె ఆశ. వీణ వాయించుకోటం ఆమె నిత్యకృత్యం. ఆమెకు గుర్తింపు అంటే ఏమిటో తెలియదు. పద్మశ్రీల సెరిమొనీలు ఆమెకు పట్టవు.

    మా సంభాషణలో, -అన్నమయ్య కీర్తనలలో మాటలు నాకు అన్నీ అర్థం కావు- అని తను అన్నప్పుడు, జయప్రభ రాసిన రెండు పుస్తకాలను నువ్వు తెప్పించుకుని చదువుకోవాలని తనకి చెప్పాను. తప్పకుండా చదవాలి. అప్పుడు నువ్వు ఇంకా బాగా వాయిస్తావు. నీ ఆనందం ఇంకా ఎక్కువవుతుంది, అని నేను చెప్పాను.

    కృష్ణారావ్! మీ పాట “ఈమాట” లో ప్రసారం కోసం నేను ఎదురు చూస్తాను.

    లైలా

  1001. వేణునాదం ఆగింది! గురించి మోహన గారి అభిప్రాయం:

    01/10/2012 11:52 pm

    విజయరాఘవరావుగారిని గురించి మరి కొన్ని విశేషాలు – భారతదేశానికి స్వాతంత్ర్యము సిద్దించినప్పుడు ఎఱ్ఱకోటలో మొట్టమొదట 1947 ఆగస్టు 15 రోజు ఆర్చెస్ట్రాను కండక్టు చేసినది వీరే. ఇతని ఒక పెన్సిలు రేఖాచిత్రాన్ని యిక్కడ చూడగలరు. ఇతని ఒక LP రికార్డు చిత్రాలను యిక్కడ చూడ వీలగును. వీరు వ్రాసిన పుస్తకాలలో విజయాంజలి (ఈ పుస్తకాన్ని మానవాళికి అంకితము చేసారు), అభ్యుత్థానము ఉన్నాయి. వీరి కథాసుధ అనే ఒక కథను ఇక్కడ చదువవచ్చును. అతడు వ్రాసిన ఒక కవిత

    ఔనమ్మా సంగీత తరంగాలు
    గాలిలో తేలుతున్నాయి
    తాన్సేనులు, టాగూరులు
    గాంధీలు, నెహ్రూలు
    వాళ్లేనమ్మా నీ దిగ్దర్శకత్వంలో
    ఈ జీవిత సంగీతపు
    మల్‌హారులు, హిందోళాలు

    విధేయుడు – మోహన

  1002. కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం గురించి k s hareesh kumar గారి అభిప్రాయం:

    01/10/2012 11:06 am

    రావు గారు వ్రాసినది నిజము. Sri Sri కవిత ప్రస్థానము మహా ప్రస్థానముతొనె ఆగిపొయినది. I fully agree with the views of Sri Rao. We do not know much about his earlier works. So therefore, it can be safely concluded that other than Mahaprasthanam, there is vacuum pre- Mahaprasthanam and Post -Mahaprasthanam. It’s a great analaysis by Rao. It would have been useful for the readers had he analyzed the reasons for which Sri Sri could not or did not produce anything worth after Mahaprasthanam. I have read about the life journey of Sri Sri from various angles and the reasons for such a vacuum in my opinion are as under: (of course, everyone of us knew about it-but for recapitulation).

    Sri Sri had struggled to make his both ends meet. Except for showering empty praises on him by the people, nothing has been done by any one to come to his rescue. He was being called as a Mahakavi when he was in terrible penury. If he were not born as a Telugu, probably he would have lived a dignified life. So, it is purely because of our Telugus that we could not get any thing more than Mahaprasthanam from Sri Sri. We have to blame ourselves for that. So, in the melee, he had lost himself and could not produce any literature that is worth. Sri Sri lived from hand to mouth before entering cinema field. He could make money on entering cinema industry but lost his poetic glory and had to confine himself to routine cinema stuff and involve himself in nitty gritty of film making. In the process, he had alienated himself from main stream poetry and has become a part-time poet.

    The other reason for the downfall of Sri Sri was his staunch belief in Communism/Marxism etc., He thought them to be panacea for all problems. But, I believe, he was not a practicing communist. This conflict also added to his confusion. Mahaprasthanam had become a great work since it was an outcome of his heart felt feelings whereas Post-Mahaprasthanam, he was being identified as a Communist and not as a Poet. So, he stooped to the level of a communist from poet and therefore he did not contribute anything thereafter.

    This is my opinion. I would request the author Mr.Rao himself to evaluate the reasons for his degeneration as a poet.

  1003. కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు గురించి రవి గారి అభిప్రాయం:

    01/09/2012 7:03 am

    “నియమ కవిత్వం” అని అన్నప్పుడు పాటించవలసిన నియమాలు అందులోనే ఉన్నై కదండి. ఛందోభంగం సూచించడమే పీర్ల ఉద్దేశ్యం అయితే మంచిదే, కానీ రివ్యూ పేరిట కవిభావంలో ఇతరులు కల్పించుకోవటం భావస్వాతంత్ర్యానికి అడ్డుచెప్పటమే అవుతుంది.

  1004. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    01/08/2012 7:40 pm

    క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను.

    ముఖ్యంగా మౌఖిక సాహిత్యవిశ్లేషణ కేవలం లిఖిత సాహిత్యం చదివే పద్ధతుల్లో సాధ్యం కాదు. ఈ రకమైన సాహిత్యాన్ని విశ్లేషించడానికి కొన్ని శాస్త్ర పద్ధతులున్నాయి. ఈ పరిశోధనలన్నిటి వెనకా ఎంతో విస్తారమైన ఫీల్డ్ వర్క్ ఉంటుంది. మౌఖిక సాహిత్యం మీద విస్తారమైన పరిశోధనలు జరిగాయి కాబట్టి ఒకటీ అరా పుస్తకాల పేర్లు చెప్పడం కష్టం. తెలుగులో మొదటిగా ఈ రకమైన సాహిత్యాన్ని విశ్లేషించే పద్ధతుల గురించి నారాయణరావుగారు 1978లో “తెలుగులో కవితా విప్లవ స్వరూపాలు”లో చెప్పారు (3.ed. 2011). యూరోప్‌లోను, అమెరికాలోను మౌఖిక సాహిత్యంమీద పరిశోధనల్లో Albert Lord, Walter Ong లాంటివారి సిద్ధాంతాలు బలంగా వున్నాయి. 1970ల నుండి 80ల దాకా A.K. Ramanujan, Peter Claus, Brenda Beck, V. Narayanarao లాంటి చాలామంది భారతదేశంలో మౌఖిక సాహిత్యాల మీద పని చేశారు. పాశ్చాత్య మౌఖిక సాహిత్యానికోసం ఏర్పరుచుకున్న ఈ ప్రమాణాలు భారతీయ భాషల్లో మౌఖిక సాహిత్యాన్ని విశ్లేషించడానికి సరిపోవనీ, ఇందుకోసం కొత్త పద్ధతులు ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనలు వీరి పరిశోధనలవల్లే బలపడ్డాయి.

    ఇంత విస్తారమైన నేపథ్యం కలిగిన ఈ సాహిత్యం గురించి చర్చించబోయేముందు, ఇలాంటి వ్యాసాలను ఒక వ్యసనంగా, చులాగ్గా విమర్శించేవాళ్ళు కాకపోయినా, వీటి గురించి అర్థం చేసుకొనాలనుకునే వాళ్ళు, ముందుగా మౌఖిక సాహిత్యం మీద జరిగిన పనిని గురించి కొంచెం తెలుసుకుంటే బాగుండేది. పైన “ఊర్మిళనిద్ర” వ్యాసంలో చివరగా ఇచ్చిన రిఫరెన్సులు (రెండూ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నవే.), కనీసం #A ramayana of their own# వ్యాసం, అందులో వివరంగా ఇచ్చిన పాదసూచికలు చదివినా చాలనుకుంటాను.

    కామేశ్వరరావుగారు ప్రస్తావించిన అంశాలకు వస్తే:

    1. భర్త తన పేరు భార్యకి చెప్పడం అనేది మనకు ముందునుంచీ ఉన్నదే అని మీరనుకుంటున్నారా? ముఖ్యంగా అగ్రవర్ణాలలో! మీ పెద్దవారిని అడిగి చూడండి ఒకసారి.

    2. ఈ పాటను గురించి కొందరు స్త్రీలను అడిగినట్లు వాళ్ళు అలాగే ఈ పాటను అర్థం చేసుకున్నట్లు మీరు చెప్పారు. వారి నేపథ్యం తెలియని కారణంగా వారు అర్థం చేసుకున్న తీరుని గురించి నేను చర్చించను. కానీ ఇల్లిందల సరస్వతీదేవిగారు 1951లో రాసిన “జాతి రత్నాలు – స్త్రీల పాటలు, కథా వైచిత్రి” అన్న పుస్తకంలో ఈ పాటను గురించి చర్చించారు. అందులో మీరు ప్రశ్నిస్తున్న అంశానికి సంబంధించి ఒక్క పేజీని (72పే.) ఈమాటలో ఉంచుతున్నాను. (ఈ పుస్తకం DLI లో లభ్యం అవుతుంది.) అక్కడ మీరు ప్రశ్నిస్తున్న పంక్తులు విడకొట్టి మరీ ఎలా ఇవ్వబడ్డాయో చూడండి.

    ల: శ్రీరాము తమ్ముండనే –
    ఊ: అతడనగ – నొకరు గలరా?
    ల: జనకునల్లుని గానటే –
    ఊ: భూమిలో జనకులనగా నెవ్వరు?

    2A. “చిత్తమొకదిక్కునుంచీ” అన్న పాదం దగ్గర మీరు మరొక వ్యాఖ్యానం చేసారు. “లక్ష్మణుడు ఎవరిపై మనసుపెట్టాడు? ఊర్మిళని నలుగురిలో ఎప్పుడు చిన్నబుచ్చాడు? అన్నమీద మనసుతో తనని విడిచి అడవికి వెళ్ళడం తనని చిన్నబుచ్చడమా? మరి “సమయమున” చిన్నబుచ్చడమేమిటి?” అని మీరు అడగడం మరీ అమాయకంగా వుంది. తనని చేసుకున్న లక్ష్మణుడు తనని వదిలేసి అన్నగారి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ అన్నగారు తన భార్యని తనతో రానిచ్చాడు. ఇది ఊర్మిళకి లక్ష్మణుడు తన చిత్తాన్ని అన్నగారిమీద పెట్టుకున్నట్టు, తన తోటికోడళ్ళ దగ్గర తనని చిన్నబుచ్చినట్టు అర్థమవ్వడంలో ఆశ్చర్యమేముంది.

    3. ఆకొమ్మ తమకమున వణకదొడగే

    హెచ్చయిన వంశానికీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ
    కీర్తి గల ఇంట బుట్టీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ

    వణకదొడగే , నేనేమిసేతూ, నేనేమిసేతూ అన్న మాటలలో మీకు స్త్రీ అసహాయ స్థితి కనబడలేదా?

    3A. “కథ ఒక్కసారిగా మారుతుంది. అంతవరకూ ప్రశాంతంగా వున్న వాతావరణం చెల్లాచెదురైపోతుంది. రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది.” దీనిమీద విమర్శగా “పటాపంచలమైన (sic) రామరాజ్య ధర్మమేమిటో నాకు బొత్తిగా బోధపడలేదు! ” అన్నారు మీరు. … రామరాజ్యం గురించి యుద్ధకాండ చివరి సర్గలో వాల్మీకి వర్ణించిన “సర్వం ముదితమేవ ఆసిత్ (అందరూ ముదితులై ఉన్నారు)”, “ఆసన్ .. నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి (నిరామయులై, శోకరహితులై రామరాజ్యంలో ప్రజలు ఉన్నారు)” వంటి శ్లోకాలు చదవండి. (verse 99-105).

    4. మీరు కూడా “విపరీత వ్యాఖ్యానం”, “అతిశయోక్తి” లాంటి పదాలను వాడడం శోచనీయం.

    ఇక పోతే కర్తృత్వం గురించి వచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నేనెక్కువ శ్రమపడక్కర్లేదు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు వాళ్ళు ప్రచురించిన “స్త్రీల రామాయణపు పాటలు”లో (1.ed. 1955, 2.ed. 1986) “కౌసల్య వేవిళ్ళు, సీత సమర్త, సీత వసంతం”, లాంటి పాటలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా “కౌసల్య వేవిళ్ళు” అనే పాటలో కౌసల్య పురుటి నెప్పుల గురించి చాలా వివరమైన వర్ణన వుంది. A Ramayana of their own అన్న వ్యాసంలో ఈ విషయంపై వివరమైన చర్చ ఉంది. ఇవి స్త్రీలు రచించిన పాటలే అని చెప్పడానికి ఇంతకన్నా ఎక్కువ రుజువు అక్కర్లేదనుకుంటాను.

    భవదీయుడు,
    శ్రీనివాస్

  1005. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి రవి గారి అభిప్రాయం:

    01/06/2012 5:55 am

    నా దృష్టిలో ఉచితజ్ఞత అనేది తిక్కన మహాకవి కవిత్వంలో స్పష్టంగా గోచరించే సుగుణం.

    చక్కని విషయం వెలికితీశారు. సంస్కృత అలంకారికులలో ఒక్క క్షేమేంద్రుడు తప్ప ఈ విషయం గురించి కాస్తంతైనా ఆలోచించిన వారు కనబడరు.

  1006. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి మోహన గారి అభిప్రాయం:

    01/03/2012 3:16 pm

    నేను విమర్శకుడిని గాను, నాకు కవిత్వతత్త్వవిచారములు అంతగా తెలియవు. ఊర్మిళనిద్ర పాటలోని ఛందస్సును గురించి మాత్రమే ఈ అభిప్రాయము. పాటంతా మాత్రాఛందస్సులో ఉన్నది. ప్రతి పాదములో (5-7)-(5)-(5-7) మాత్రలు ఉన్నవి. మొదటి భాగము, చివరి భాగము మాత్రల అమరికలో ఒకే విధముగా ఉన్నది. మధ్య ఉండే ఐదు మాత్రలు వీటిని కలుపుతుంది. ఏడు మాత్రల అమరిక 2-5 లేక 3-4 లేక 4-3 గా ఉంటుంది. మొదటి భాగపు, చివరి భాగపు చివరి అక్షరము లఘువైనా పాడేటప్పుడు అది గురుతుల్యమే. అందుకే భూపాలుడు పాడేటప్పుడు భూపాలుడూ అవుతుంది. మాత్రల అమరిక కోసం కొన్ని చోట్లలో దీర్ఘము కత్తిరించబడుతుంది, ఉదా. నిద్రాహారములకు బదులు నిద్ర హారము లెరుగనే. ఈ పాట అమరిక కస్తూరి రంగ రంగా నా యన్న కావేటి రంగ రంగా వంటిదే. ఛందస్సులో, పాదములో ఒకే అమరికతో ఉండే మొదటి చివరి భాగాలు మధ్యన ఉండే ఒక చిన్న గణముతో కలుపబడి ఉండుట మనకు తరచుగా కనబడుతూ ఉంటుంది. ఉదాహరణగా మత్తకోకిల, మానినీ వృత్తాలను తీసికొనవచ్చును. దీనిని గురించి అప్పుడప్పుడు ఛందస్సు, రచ్చబండ గుంపులో నేను ఎన్నో సందేశాలను వ్రాసి ఉన్నాను. విధేయుడు – మోహన

  1007. ఒక నేను, కొన్ని నువ్వులు గురించి మోహన గారి అభిప్రాయం:

    01/02/2012 6:43 pm

    మంచి రచన, ఒక చక్కని వచన కవితలా ఉంది. కాని ఒక కథ చదివినప్పుడు కలిగే అనుభూతి కలుగలేదు. విధేయుడు – మోహన

  1008. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి Krishna Rao Maddipati గారి అభిప్రాయం:

    01/02/2012 1:01 pm

    ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో అమ్మలక్కలు మండువా లోగిళ్ళలో పాడుతుండగా విన్న ఊర్మిళాదేవి నిద్ర పాటల శైలి ఇప్పటికీ ఇంకా నాకు బాగా గుర్తుంది. (ఎవరికైనా వినే దమ్ముంటే పాడగలను కూడా!). అవి ఉబుసుపోకకోసం పాడుకునే పాటలుగానే తెలుసుగానీ, ఇంత విశదంగా ఆలోచించే అవకాశం కలగలేదు. ఇందులోని కవితా్వని్ని, సామాజికస్పృహను విశదీకరించిన వెల్చేరు మాష్టారికి కృతజ్ఙతలు. ఈ పాటలు monotone లో పాడినా కవిత్వం గొప్పదనంతో ఎంతసేపు విన్నా విసుగనిపించదు. ఇదే శైలిలో బాలవర్ధిరాజు కథ కూడా పాడేవారు. ఇంకా వేరే కథలు కూడా పాడేవారు గానీ అవేవీ ఇప్పుడు గుర్తుకు రావడంలేదు. ఇలాంటి సాహిత్య సంపదను పరిష్కరించుకుని, పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  1009. కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు గురించి జె. యు. బి. వి. ప్రసాద్‌ గారి అభిప్రాయం:

    01/01/2012 3:43 pm

    ఈమాట సంపాదకులకు,

    మీరు, “ఈ మాటలో ప్రచురించబడ్డ కథలు, కవితలు, వ్యాసాలు ఆంధ్రదేశంలో అచ్చుపత్రికలలోను, తిరిగి పుస్తక రూపంలోనూ అచ్చు వేయించుకునే రచయితలు, ఈ మాట పీర్లు చేసిన మార్పులని తిరిగి మార్చివేసో, లేదా పూర్తిగా తీసివేసో ప్రచురించుకుంటున్నట్టుగా మాకు చూచాయగా తెలియవచ్చింది. ఇది ఎంతమాత్రమూ సహించరాని నైతిక నేరం.” అని రాశారు.

    నేను ఒక యేడాది కిందట, ఒక కధా సంకలనం ప్రచురించాను. అందులో, ‘ఈమాట’లో వచ్చిన నా కధలు కూడా కొన్ని వున్నాయి. స్పష్టంగా అదీ, ఇదీ అని చెప్పలేను గానీ, నా కధలని తిరిగి ప్రచురించేటప్పుడు, వాటిని మళ్ళీ చదవడమూ, తప్పులు దిద్దుకోవడమూ, కొన్ని మార్పులు చెయ్యడమూ చేశాను. అలా చెయ్యడానికి, రచయితగా నాకు నైతిక హక్కు వుంది. అది ఎంత మాత్రమూ ‘నైతిక నేరం’ కాదు. ఒక రచన మీద నైతికంగా పూర్తి హక్కులు ఎప్పుడూ ఆ రచయితకే వుంటాయి. అయితే, ప్రతీ కధ కిందా, అది మొదటి సారి ఎప్పుడు, ఎక్కడ ప్రచురించారో చెప్పడం సంస్కారవంతమైన నైతిక బాధ్యత. దాన్ని నిర్వరించాను. అంతే గానీ, ఒక రచయితకి, తన రచనను పునర్ముద్రించేటప్పుడు, దాన్ని దిద్దుకునే హక్కు లేదనడం నిరంకుశత్వమే.

    అయితే, ‘ఈమాట” పత్రిక్కి ఒక హక్కు వుంది. “ఇక ముందు నుంచి, మీరు పంపే హామీ పత్రంలో అటువంటి మార్పులు ససేమిరా చెయ్యం అని సంతకం చేయాలి. అంతే!” అని రాశారు. అది మీ నియమం. దాన్ని ఇష్టపడే వాళ్ళే, మీకు రచనలు పంపుతారు. లేని వాళ్ళు వూరుకుంటారు. పంపరు. ఇలాంటి నియమం పెట్టడానికి మీకు హక్కు వుంది. అయితే, అలా ఒప్పుకోని వాళ్ళని, ‘నైతిక నేరం’ చేశారని అనడానికి మీకు హక్కు లేదు.

    ఒక రచయిత, తాను రాసింది ఎప్పుడూ తిరిగి చూసుకుంటూ వుండాలి. తప్పు విషయాలు చెప్పినట్లయితే మార్చుకోవాలి. దిద్దు కోవాలి. కావాలంటే, చిన్న సంఘటనలు కలుపుకోవచ్చు, లేదా తీసెయ్యొచ్చు. ఇతరులు ఇచ్చిన సలహాలు సరి కాదనుకున్నప్పుడు, వాటిని మార్చుకునే హక్కు, ఆ రచయితకి ఎప్పుడూ వుంటుంది. వీలైతే, ఈ విషయాలన్నీ తన ముందు మాటలో ఆ రచయిత చెప్పుకోవచ్చు. ఇలా మార్చుకోవడం ఎప్పుడూ అభివృద్ధికరమైన విషయం. దాన్ని ‘నైతిక నేరం’ అని అనకూడదు. మొదటి సారి ప్రచురించినప్పుడు ఎలా వుందో, అచ్చు అలాగే ఎప్పుడూ వుండాలని అని అనడమే ‘నైతిక నేరం’ అవుతుంది.

    – జె. యు. బి. వి. ప్రసాద్‌

  1010. ఎగిరే కొబ్బరి చెట్టు గురించి తఃతః గారి అభిప్రాయం:

    12/22/2011 8:22 am

    మూలా గారూ నమస్కారాలు.

    మీ కవితలో ఒక ఆనందం ఉంది. నేను పెద్ద కవినీ కాను, గొప్ప విమర్శకుణ్ణీ కాను కానీ ఒక విషయం. మీ కవితలొ ‘యెగిరే కొబ్బరి చెట్టు’ యెగిరి మీ గుండెల్లొకి రాలేదు నడుస్తూ వచ్చింది. వచ్చి లోతుగా పాతుకుపోయింది. (అంటే మీ కవితలొ కొబ్బరి చెట్టు అసలు ఎగరనే లేదు.) కవిత్వాన్ని ఇలా చూడవచ్చో లేదో నాకు తెలీదు.

    “He is no God who merely satisfies the intellect” అన్నారు గాంధీ. నేను దాన్ని కాస్త తిరగేసి “it is no poetry which merely touches the heart” అని కూడా చదువుకుంటూ ఉంటాను.

    నొప్పిస్తే క్షమించండి.
    ఉంటాను

  1011. ఎగిరే కొబ్బరి చెట్టు గురించి Gangi Setty గారి అభిప్రాయం:

    12/21/2011 11:33 am

    కిరణ్ గారూ! కవిత చాలా బాగుందండీ. అప్పుడప్పుడు అనిపిస్తుంటూంది. ఇక తెలుగు సాహిత్యానికి పాతర వేయాల్సిందేనా అని. మీ కవిత చూశాక అనిపించింది. ఈ తెలుగు గడ్డపై తెలుగు కు ప్ర్రాణం పోసే మీలాంటి వారు ఉన్నారని.
    నమస్కారం

  1012. ఎగిరే కొబ్బరి చెట్టు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    12/19/2011 10:59 am

    బాబా గారికి,
    నేల బారు కవిత్వానికి, నేల మీద నిలబడి వ్రాసే కవిత్వానికి చాలా బేధమ్ వున్నది కదా. కవి తను ఏవి వ్రాయాలనుకుంటే అది వ్రాసే హక్కు వారికి వుంది. అలానే పాఠకుడు నాకిది ఇష్టమ్ అని చెప్పే హక్కు కూడా వుంది. బాగుండు అని అన్నానే గాని, ఇలానే వుండాలని చెప్పలేదు కదా బాబా గారు.

  1013. ఎగిరే కొబ్బరి చెట్టు గురించి రవి వీరేల్లి గారి అభిప్రాయం:

    12/18/2011 1:10 pm

    సుబ్రహ్మణ్యం గారు,
    బావుంది మీ కవిత. చదివాక నా ముందు నుండి కూడా ప్రపంచం, కంప్యూటరు మాయమైపోయాయి. ఎక్కణ్ణుంచో.. తియ్యటి నీరు! ఇక మీ ఏటి ఒడ్డుకు రావాలి.. ఇంకింత తియ్యటి నీరు కోసం!

  1014. ఎగిరే కొబ్బరి చెట్టు గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:

    12/15/2011 8:40 am

    తిమ్మి రెడ్డి గారు
    నమస్తే
    “మూలా గారు నేల మీద కాళ్ళు పెట్టగలిగితే బాగుండు.” అనటం మీకు భావ్యమా సారూ?
    అందరూ నేలమీద నడిస్తే ఇక లోలోకాల్ని చూపించేదెవరు సారు?
    మూలా గారి శైలి అంతఃసౌందర్యాలను పట్టిచూపుతుంది.
    ఆయన అలానే రాస్తారు బహుశా ఎప్పటకీ.
    నేల మీదకు చూడండి, నింగిని కూడా పట్టించుకోండి, చమటను తడమండి, రక్తాన్ని చిందించండి అంటే పాపం ఆయనేమైనా పచారీ కొట్టా కావలసింది కట్టివ్వటానికి?
    వైద్యుల్లో స్పెషలిస్టులలానే కవుల్లో కూడా స్పెషలిస్టులు ఉన్నారు కదా. మీకు నేల కవిత్వం కావాలనుకొంటే, ఆంధ్రదేశంలో నేలబారు కవులకేం కొదవలేదు.
    ఆయన్ని అలానే రాయనిద్దాం. ఇలా రాయి అలా రాయి అని అనకుండా ఉండటమే మంచిదేమో. ఆయనకీ మనకీ కూడా.
    బొల్లోజు బాబా

  1015. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    12/08/2011 3:59 pm

    ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందించినందుకు కృతజ్ఞతలు.

    “త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.
    త్యాగరాజు కృతుల్లో కాదు, త్యాగరాజు మనసులో (రామ) భక్తి తప్ప ఇంకేమీ లేదనిపిస్తుంది. తనకుతాను తాదాత్మ్యం చెంది పరవశంతో పాడినవే గాని, ఫలానాది రాయాలన్న తహతహ గాని సంకల్పంగాని కనీసం రాసానన్న కర్తృత్వ భావం సైతం కనిపించదు. కీర్తనలలో కనిపించే “త్యాగరాజనుత” ముద్ర సైతం తనను తానే సాక్షీభావంతో third person గా చూస్తూ విన్నవించుకుంటున్నట్టు గానే ఉంటుంది, ఎక్కువ చేసుకున్నట్టుగా ఉండదు.

    చిన్నబిడ్డను ఎత్తుకునేటప్పుడు తల్లి పాత్రలో ఉన్న గొప్ప నటి, అనుగుణమైన దుస్తులు జోడించి, తగిన అలంకారాలు, ఆభరణాలు తొడిగి ముచ్చటపడడం ఒక ఎత్తు. కన్నబిడ్డను ఎత్తుకునేటప్పుడు సాదాసీదా తల్లి సైతం అంతే ఎరుకతో, అనుగుణమైన దుస్తులు జోడించి నప్పిన అలంకారం ఆభరణాలు తొడిగి ఎత్తుకోవడం ఇంకో ఎత్తు, ఏదో గమ్మత్తు. మొదటి సందర్భంలో బట్టలు నగలు పెట్టాననే స్పృహ ఎంత ఎక్కువో, రెండవదానిలో అంత తక్కువగా, అసలు పెట్టాననే భావంకన్నా బిడ్దకు తాను పెట్టుకున్నాననే సంబరమే ఎక్కువ, అసలు బిడ్డ పైనే మక్కువ. అంటే మిగితావి లేవనికాదు, అంతగా ప్రేమించే బిడ్డకు మంచి బట్ట నగ ఎందుకు పెట్టుకోదు, తనివితీరా పెట్టుకుంటుంది, అయినా బిడ్డే ప్రధానం. అట్లే ఆశ్చర్యమో లేక అంత ఆశ్చర్యం కానిదో- నిజమైన భక్తితో పలికిన కృతులలో కవిత్వం, విప్లవ సందేశాలు, స్ఫూర్తి సందేశాలు అవంతట అవే పెట్టని ఆభరణాలుగా చేరుతూండడం ఎప్పటికప్పుడు అబ్బురపరచే అంశం. అందుకే ఎన్ని ఏండ్లు గడిచినా, కాలం, పరిస్థితులు, భాష సైతం ఎంతగా మారినా, ఆ పదాలలో ప్రతి గుండెను ఇప్పటికీ తాకే ఏదో గమ్మత్తు సజీవంగా ఉందేమో అనిపిస్తుంది.
    _____________
    విధేయుడు
    _శ్రీనివాస్

  1016. రెండు కవితలు గురించి TahaTaha గారి అభిప్రాయం:

    12/03/2011 3:23 pm

    Fairy Tale కవిత Apple లోంచి Apple బాగుంది. బొమ్మ వేయించి నట్లైతే ఇంకా బాగుండేది.

  1017. మృత్యు వృక్షం గురించి జగన్నాధ రాజు గారి అభిప్రాయం:

    11/30/2011 4:36 am

    కవితలన్నీ అందించినందుకు చాలా కృతజ్ఞతలు..
    మేము ఇస్మాయిల్ మిత్ర మండలి పేరిట ఓ బ్లాగ్ పెట్టాం., దానిలోకి ఈ కవితలని కాపీ చేసుకుంటాం…
    చొరవకు క్షమించాలి., ఇస్మాయిల్ గారి రచనలన్నిటిని ఒక చోటకు చేర్చే పనిలో మీ సాయం మాకు కావాలి..
    … రాజు (కాకినాడ)

  1018. తిక్కన భారతంలో పలుకులపొందు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/22/2011 2:04 pm

    మంచి వ్యాసం! మనకి “దీపకళిక” అనడమ్ తెలుసు. కానీ తిక్కన “ఘర్మాంబుకళిక” అని వాడటం అపురూపమే!! పొడవు కొండ అని ఉండటం బహుశా అచ్చుతప్పు కావొచ్చు. అది పొడుపుకొండ ఏమో? “పొడుపుకొండమీద పొడుచుటమొదలుగా పరువుపెట్టి ఇనుడు పశ్చిమాద్రి… అన్న పద్యం లోనూ ఈ ప్రయోగం ఉంది. “ఆవులనేయి” లాగే ఆ అర్ధంలో లక్ష్మణ వజ్జల ఇంట ఒకరూకకి దొరికే భోజనాన్ని గురించి రాస్తూ, క్రీడాభిరామ కర్త “ఆలనేయి” అని వాడాడు.

    భాషా శాస్త్ర పండితులు రాయవలసిన వ్యాసాలు ఇలాంటివి చాలా బాకీ ఉన్నాయి. తెలుగు వాడకానికి సంబంధించి అన్నమయ్య సంకీర్తనల భాష మీద కూడా ఈ తరహా వ్యాసాలు చాలా రావాల్సిఉంది. క్లుప్తత కలిగిన వాక్యాలూ ..స్పష్టమైన వాక్యాలూ ఉన్న ఈ వ్యాసం చదవడానికి బాగుంది కూడా!

    అమూర్త మైన ఊహలు చేసిన ఆధునిక కవులూ ఉన్నారు. కానీ సంఖ్యలో బహుతక్కువే! వాల్మీకి చేసినపోలికలు చాలా గొప్పవి.

    ఇంక బాగులేని దానిని చెప్పడం కోసమ్ వారు చేసిన విమర్శ ఆ పోలికలూ కొంచెం కటువైనవే అయినా ఆలోచించవలసినవే! మగవారు గనక వారు నిస్సందేహంగా చెత్త రాసిన కవులని పోలికలతో చెండాడారు. ప్రాచీన కాలంలో ఒక్క కవులే ఎక్కువ ఉండటం అసలు కవిత్వమే రాయని స్త్రీలు ఉండగా అందునా చెత్త కవిత్వం అన్నదానికి మరివీలే లేదుగనక కాబోలు కుకవులని విటులతో పోల్చిన ఉదాహరణలున్నాయి. కానీ కవయిత్రులని వాళ్ళు వదిలేసేరు. మరి ఇవాళ ఈ ప్రజాస్వామిక యుగంలో .. కవిత్వం పేర చెత్త రాసే వారిని సంబోధించడానికి ఏ కొత్త పోలికలు చేయాలో ..అదీ కాక “కు విమర్శక” వర్గం కూడా పుష్కళంగా ఉన్న ఇవాళ ఒక తీరూ తెన్నూ లేకుండా మెచ్చుకుంటూ … ఓహోహో !! అనే బాకాసుర విమర్శకవర్గాన్ని ఏ రకమైన సంబోధనతో సంభావించాలో మనకి ఈ కాలపు భాష చెప్పడంలేదు. దూర్జటి “చదువులునేర్వని పండితాధములు” అని అన్నాడు. గనక ప్రస్తుతానికి దానితో సరిపెట్టుకోవాలి.

    రమ.

  1019. కొనసాగింపు గురించి Seetha Kumari Botcha గారి అభిప్రాయం:

    11/17/2011 8:54 am

    చదువుతుంటే అలా కళ్ళ ముందు కనిపించింది దృశ్యం….మంచి కవిత ఇచ్చినందుకు ధన్యవాదాలు….

  1020. మల్లె అంటు గురించి Seetha Kumari Botcha గారి అభిప్రాయం:

    11/17/2011 3:48 am

    ఎంత చక్కని కవిత….

  1021. నయాగరా గురించి aditya గారి అభిప్రాయం:

    11/14/2011 9:46 pm

    సార్ మీ కవిత ప్రారంభము అర్ధమ్ కాలెదు. ఏది కరిగిపోయింది. ఎందుకు కన్నీరయింది.

  1022. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/10/2011 3:21 am

    కొంపెల్ల గారూ !! మీ ప్రశ్నకి గొర్తి బ్రహ్మానందం గారు ఏమని జవాబు చెప్తారో వింటాను. అంతకు ముందు నావి కొన్ని సందేహాలూ.. సమర్ధింపులూ.. వివరణలూ.. విబేధాలూను:)

    మనకున్న భక్తి సాహిత్యం చాలా గొప్పది. మీరన్నట్టూ భక్తి అంతస్సూత్రమ్ ఏ భక్తి రచనకైనా !! ఆ భావం లోని గాఢత వల్లనే దానికి ప్రాశస్త్యం వచ్చేది. దానికి ప్రత్యేకతా తెలిసేదీ. బాలమురళీ గారి అభిప్రాయం ఆయన గురించి ఆయన చెప్పుకున్నది. త్యాగ రాజు కీర్తనల లోని సాహిత్యం గురించి బాల మురళీనే కాదు అలా అభిప్రాయ పడిన వారు ఎందరో ఉన్నారు. మనం భక్తి రసాన్నీ సాహిత్య బలాన్నీ కట్టకలిపి ఆలోచించకూడదు కదా?? భక్తి భావం వేరు, వ్యక్తీకరణలో ఆయన ఎన్నుకున్న సాహిత్య విధానం వేరు. సాహిత్యం అన్నాకా దాన్ని తప్పని సరిగా సాహిత్యానికి సంబంధించిన అంచనాల తొనే మనం బేరీజు వేయాలి. ఇది అనివార్యం.

    అన్నమయ్యకి ఇవాళ పేరు వచ్చీసింది గనక ఆయన రాసిన వాటిని భక్తిగా ఒప్పీసుకుని సరే అని అనే దశకి వచ్చేరేమో భక్తులు నాకు తెలీదు. కానీ, త్యాగయ్య రాసిన లాంటి పదాలు కావు అన్నమయ్యవి. అది మీకు అర్ధం కావాలంటే విపులంగా వారిద్దరి రచనలనీ కలిపి పరిశీలించి చూడండి.

    మనకి భాష చాలా పరిమితM; అందరూ కవులే!! అలాకాక మనం ఇంకొకలా మాట్లాడడానికి భాష చోటు ఇవ్వదు. కవితా సామగ్రి అని ఒకటి ఉంటుంది. సామగ్రి అని నేను అంటున్నప్పుడు భాషా పరంగా వ్యక్తం అయ్యే స్పందనని కలుపుకునే అంటున్నాను. ఈ స్పందన కవితాలక్షణాలతో ఎక్కువ వ్యక్తమ్ అయిన పదాలు అన్నమయ్యవి కాగా ..కేవలం భక్తి భావానికి మాత్రమే పరిమితమైనవి త్యాగయ్యవీ, రామదాసువీను. అదే భక్తిని జయదేవుడూ అన్నమయ్యా ఆ సరిహద్దుని దాటించి వారి భావ ప్రకటనని విశాలం చేసుకున్నారు. త్యాగయ్యా రామదాసు చేసుకోలేదు. చేసుకోదలచలేదా? చేసుకోలేకపోయారా? అన్నది చెప్పడానికి వాళ్ళు మన మధ్య లేరు గనక వారి రచనల ఆధారంగా గనక మనం చూస్తే, వాళ్ళ మార్గం వేరని మాత్రం చెప్పగలం. సాహిత్య ప్రమాణాలన్నవి ఏ సాహిత్యానికైనా వర్తిస్తాయి. దానికి మినహాయింపులు ఉండవు. కానీ, పోనీ ఉండవు. త్యాగయ్య కీర్తనలలోని భక్తి మనసుకి హాయిని ఇస్తుంది. అందులో సందేహం లేదు. కానీ సాహిత్యం ఇచ్చే సుఖం మీకు అందులో దొరకదు. అది దొరకాలీ అంటే మీరు అష్టపదులని వినాలి. అన్నమయ్య సంకీర్తన వినాలి. మనసుని అనేకానేక భావోద్రేకాలకి గురిచేయగల లక్షణం వీరి రచనలకి ఉన్నట్టుగా త్యాగరాజు గారి సాహిత్యానికి లేదు. అవి సంగీతం కోసం రాయబడినవి. బహుశా త్యాగయ్య గారి లక్ష్యం కూడా సాహిత్యం కాకపోయి ఉండవచ్చు. ఆయన సంగీతం లోంచి రాముడిని కొలిచినవాడు. ఆయన ఈ లక్ష్యానికి అనువైన సాహిత్యాన్ని వాడుకున్నాడే గాని సాహిత్యం ఆయన ఎన్నుకున్న ముఖ్య మార్గం మాత్రం కాదని ఆయన రచనలు స్పష్టం గానే చెబుతాయి. తప్పని సరిగా సాహిత్యపు విలువలు వేరైనవి సుమా! వాటి ఆధారం గానే దీనికన్నా ఇది బాగుంది అని మనం చెప్పగలిగేది. అభిరుచి అన్నది ఒకటి ఉంటుంది కదా? పిడుక్కీ బియ్యానికీ ఒకే కొలమానాలుండవు ఆ వ్యక్తి మనకి ఎంత ఇష్టమైన వారైనా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా! సాహిత్యపు విలువ వలననే “ఏమొకొ చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను.. భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా?” అన్న పదం అంతగా కొనియాడబడింది.

    ఊహా భాషా ఉపమా ముప్పేటలుగా కలిసి సాగే రచనకీ అది కొరవడినరచనకీ చాలా తేడా ఉంటుంది మరి. అయితే త్యాగయ్య రచనలకి ఉన్న విలువ ఏమిటన్న ప్రశ్న ఉంటుంది. అవి భక్తితో నిండినవి గనక భక్తితో పాడుకున్నప్పుడు ఉపయోగపడతాయి. సంగీతం కలిసి ఉన్నందువలన సంగీతప్రియులని అలరిస్తాయి. కానీ సాహిత్యమ్ అంటే అది వేరే ప్రమాణమే!!

    ఇంక బాలమురళీ అభిప్రాయం ఆయన గురించి ఆయన చెప్పుకున్నదే అయినా.. అసలవి సాహిత్యమా అన్నది ముఖ్య ప్రశ్న. అవి సాహిత్యం అయితే అప్పుడు వాటి గురించి మాట్లాడవచ్చు. కానీ ఆయన రాసిన వాటిల్లో ఎక్కడా ఆ వాసనలు లేవు. ఆయన గొప్ప గాయకుడు అన్నదే నిలుస్తుంది. ఇంక ఆయన కవి కావాలని అనుకున్నాడు అని మనకి అర్ధమవుతుంది.

    రమ.

  1023. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Paramjyothi Kompella గారి అభిప్రాయం:

    11/09/2011 3:52 pm

    “త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.”

    సాయి గారు,
    త్యాగరాజ కృతులలో భక్తే ప్రధానం. అదే ఆయన ఎన్నుకున్న మార్గం. చేతకాక కాదు. (నిజానికి అందరు వాగ్గేయకారుల కృతులలో నూ ఇదే పరమప్రయోజనం). సాహిత్య పరంగా చూసినా కొన్ని కృతులు “జగదానందకారకా”, “బాల కనకమయ చేల” మొదలైనవి ఎన్నో కనిపిస్తాయి. త్యాగరాజ సాహిత్యం అంతా రామ మయం, ఇంకొక రామాయణం. అందంగా అనిపించడానికి , “భలే వేసారు ఇక్కడ ఈ పదాల కూర్పు” అనిపించుకోడానికి చేసిన ప్రయోగాలు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పోతన గారి అంత్యానుప్రాస ప్రయోగ్రం ఎక్కువగా త్యాగరాజ కృతులలో కనిపిస్తుంది. ఎన్నో కావ్యాలు, కీర్తనలు అనేకమంది ప్రభువుల మీద, వారి భార్యల మీద, వారి ప్రేమికుల మీద రచించారు, సాహిత్య పరంగా మంచి విలువలు ఉన్నవి, రాగాలపరం గా వినసొంపుగా ఉండేవి. కాని అవేవి నిలబడలేదు. భారతీయ సంగీతానికి లక్ష్యం పరమాత్మని అందుకోవడమే. దానికి నవవిధ భక్తి ని ప్రమాణం గా తీసుకున్న వారి కృతులే అజరామరం గా నిలుస్తాయి. ఒక అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు మొదలైనవి. కవిత్వం ఎంత గొప్పగా ఉన్నా, భక్తి లేనిది కేవలం వ్యర్ధమే….

    బాలమురళి గారి గానం నాకెంతో ఇష్టం. కొన్ని కీర్తనలు భావం ఎరిగి ఆయన పాడినట్లు ఇంక ఎవరూ పాడ లేరేమో అని అనిపిస్తుంది. ఆయన కృతులు కూడా చాల బాగుంటాయి, బాలమురళి గారు కేవలం భక్తే కాకుండా విప్లవం, స్ఫూర్తి కూడా జోడించాను అన్నారు. నిజానికి వెతికితే త్యాగరాజ కృతులలో అవి కూడా కనిపిస్తాయి. “యజ్ఞాదులు సుఖమనువారాల” , “తెలియలేరు రామ”, మొదలైనవి. భక్తి ప్రధానం గా ఉండి మిగిలినవి అంతర్లీనం గా ఉంటె అది గొప్ప సంగీత సాహిత్యం అవుతుంది. కేవలం సాహిత్య విలువల కోసం ఒకరి కీర్తన కంటే ఇంకొకరిది బాగుంది అని, వీరి కృతులలో కంటే వీరి కృతులలో సాహిత్యం బాగుంది అని ఎలా అనగలం?

  1024. ఒక (అ)నాగరిక ఆనందం గురించి ramakrishna గారి అభిప్రాయం:

    11/08/2011 7:06 pm

    నారాయణ గారు,మీ కవిత మొత్తమగా ఏమి చెపుతోంది,ఆధునికమయిన ప్రయాణములొ కూడ ప్రకృతిని చూసేటప్పటికి మనసు పరవశించి గతము వైపు పరుగెడుతోంది (లేదా బాల్యము వైపు). ఇది రెండు వ్యతిరేక దిశల ప్రయాణము. కాబట్టి దానిని స్ఫురించే విధంగా శీర్షిక ఉండాలని అనుకుంటాను.అది పొయిటిక్ గా కూడా ఉండాలని అనుకుంటాను. కనుక నేనైతే ఎండ_ నీడ అని పెడతాను.
    అభినందనలతో
    రామకృష్ణ

  1025. రెండు కవితలు గురించి బొక్కా ప్రేమ్ కుమార్ గారి అభిప్రాయం:

    11/08/2011 6:47 am

    పాలలో నీరుందని ఎలా తెలుస్తుంది ?
    తోడేసి మజ్జిగ చిలికే దాకా..

    ఏటిలో చిరుచేప ఎలా ఈదుతుంది?
    మొప్పలోని సత్తువ అయ్యేదాకా..

    మండుటెండలో దాహం ఎలా తీరుతుంది..
    చల్లదనం అందించే కోకు దొరికే దాక

    గుండె లోతుల్లొ ఏముందో ఎలా తెలుస్తుంది.
    తలుపుతట్టె ఆత్మీయత లభించే దాక…

    కవితకు ప్రశంస ఎలాదొరుకుతుంది
    చదివి స్పందించే కవి హృదయం దొరికేదాక…..

  1026. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    11/07/2011 11:04 am

    “త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.”

    ఒకసారి రవీంద్ర భారతిలో “…స్వాతంత్ర్యమన్నా…” అని బాలమురళి గారు పాడగా విన్నాను. సాహిత్యమే కాదు, సంగీతమూ పెద్దగా ఆకట్టుకోలేదు.

    భక్తి, శృంగారాలు కాకుండా మిగతా రసాలను పట్టించుకుని కచేరీలలో పాడి ఒప్పించి, మెప్పించిన కర్ణాటక సంగీతకారులున్నారా?

    మరో ప్రశ్న: బాలమురళి ప్రభృతులు సమకాలీన/పూర్వ కవుల రచనలను ప్రచారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించలేదా (భక్తి చట్రానికి అవతల)?

    సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదా?

  1027. ఒంటిచెట్టు గురించి మోహన గారి అభిప్రాయం:

    11/04/2011 11:24 am

    చాల బాగుంది మీ కవిత. మీరిలాగే వ్రాస్తూ ఉండండి, మీకు నా జోహారులు. విధేయుడు – మోహన

  1028. ఎగిరే కొబ్బరి చెట్టు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    11/03/2011 12:43 pm

    బాగుంది. అసలు మనం గమనించని అతి చిన్న విషయం ఒక్కో సారి ఎంత ఘాడవైన జ్ఞాపకంగా మారగలదో కవి చాలా బాగా చెప్పేడు. కానీ ఈ అందవైన జ్ఞాపకాల కవితల్లోంచి నిజవైన బతుకుని, ఆ కష్టాన్ని, సుఖాన్ని కవి కవితా వస్తువుగా మార్చగలిగేదెప్పుడో! మూలా గారు నేల మీద కాళ్ళు పెట్టగలిగితే బాగుండు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  1029. రెండు కవితలు గురించి suvarna గారి అభిప్రాయం:

    11/03/2011 3:41 am

    తూనీగ కవిత చాలా నచ్చింది.
    యాపిల్ కవిత తమాషాగా అనిపించింది.
    మొత్తంగా కవితల్లో కొత్తదనం ఉన్నది.
    అభినందనలు.

    సువర్ణ.

  1030. ఒక (అ)నాగరిక ఆనందం గురించి ramakrishna గారి అభిప్రాయం:

    11/02/2011 8:15 pm

    నారాయణ్ గారు మీ కవిత బాగుంది. అభినందనలు. శీర్షిక నచ్చలేదు.

  1031. కొనసాగింపు గురించి naren g గారి అభిప్రాయం:

    11/01/2011 7:17 pm

    చాలా బాగుంది రవిశంకర్ గారు.

    ఎక్కడా కారు, వాహనాలు అనే పదాలు వాడకుండా ‘ఇనప పెట్టె ‘ అనే భాషలోనే కవిత అంతా ఉంటే ఎలా ఉండేదో?
    దీనినే గమ్యం పేరుతో ఒక చక్కని కధగా కూడా వ్రాయొచ్చనిపిస్తోంది.

  1032. నివాసం గురించి sree rama murthy గారి అభిప్రాయం:

    10/07/2011 9:37 am

    కవిత చాలా హృద్యంగా ఉంది. మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని ఎంత నిర్లక్ష్యం చేస్తాడో,ఎంత
    అనాగరికంగా వ్యవహరిస్తాడో సున్నితంగా చెప్పారు.
    ఆశీర్వాదాలు.

  1033. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    09/14/2011 2:11 pm

    “తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది” అని అన్నది చిన్నయసూరి, చెళ్ళపిళ్ళ కాదు. ఇకపోతే నేను “నునుపారు” లోని ఆరు కి అర్ధం చెప్పలేదు. నునుపు+ ఆరు అని విరిచినట్టుగానే నూగు+ఆరు ని విరవమని సూచన చేసాను. కామేశ్వర రావుగారి వివరణ మరీచులు అన్నది ఒప్పు. మనం నిఘంటువులని అర్ధ వివరణ కోసం మాత్రమే చూస్తున్నాం తప్ప వాటిని సవరించుకోవడమ్ దిశగా గాని, పదాల సంఖ్యని పెంచుకోవాలని గానీ ప్రయత్నమ్ పెద్దగా చెయ్యలేదు. అదునా ఆధునిక కాలంలో ఆసక్తీ అర్హతా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వేరే వృత్తులకి బతుకుతెరువుకి వెళ్లడమూ. ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ పనులకి సరిపడా శ్రధ్ధా సామర్ధ్యాలను చూపకపోవడమూ కారణంగా ఉన్న నిఘంటువులతో కుస్తీలు పట్టుకోవలసి వస్తోంది.

    పాత తెలుగుతో పనిచేసే క్రమంలో నిఘంటువులతో పనిచేసే వారికి అందరికీ కొలిచాల లాగే ఈ విషయాలు అనుభవంలోకి వస్తాయి. కవిత్వం విషయంలో మనం కవి హృదయాన్ని అనుసరించాలి తప్ప ముక్కస్యముక్కహ అన్న రీతిలో అర్ధాలని చూడకూడదు కూడాను. అక్కడ ఒప్పైన అర్ధాన్ని మనం తీసుకోవాలి. నూగారు లోని ఆరు సంఖ్యా పదం లోని ఆరు ఒకటి కావు గనక ఇది వేరే విషయం. నూగు అన్నదానికి నేను నూగు+ఆరు గానే విభజించుకుంటాను. మనకి ఇవాళ అరసున్నలూ.. ఖండబిందు పూర్ణబిందులూ.. మామూలు ర బండి ర లూ చాలా తికమకతొ కలిసిపోయి ఉన్నాయి. అందులో సరైనవి ఏవో కానివి ఏవో నిఘంటువులూ ఇవ్వడం లేదు. ఎవరి తోవని అనుసరించి దేన్ని సాధించాలో స్పస్టమైన రీతి ఒకటి ఉన్నట్టు కనబడని సందర్భాలు చాలా ఎదురౌతాయి. చూద్దాం ఇతరులు ఇంకేమంటారో??

    రమ.

  1034. జపనీస్‌ పైన్‌ చెట్టు గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:

    09/03/2011 10:49 pm

    .

    ఎంత ఎదిగి పోయావయ్యా !
    ***

    మార్చ్ 11 న జపాన్ లో జరిగిన బీభత్సం తర్వాత..ఆ వూళ్ళో ఏమీ మిగ ల్లేదు. ప్రాణ నష్టం, తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు నిరాశ్రయులయ్యరు. ఇల్లూ వాకిలీ లేదు. వర్తకాలు లేవు, వుద్యోగాలూ లేవు. పరిస్థితి ఎప్పుడు కుదుట పడుతుందో తెలీదు. కాలూ చేయీ ఎప్పటికి కూడుతుందో తెలీదు. సునామీ సృస్ఠించిన విధ్వంసానికి ప్రత్యక్ష మూగ సాక్షి లా మిగిలింది ఆ వూరు.
    నిజమే, ఆ వూరు వూరంతా నీరవుతోంది. కన్నీరు మున్నీరౌతోంది. ఐతే, వాళ్ళు విలపిస్తోంది. తమకు జరిగిన అన్యాయానికి కాదు!
    సముద్ర తీరాన వందడుగుల ఎత్తులో రెండొందలేళ్ళ చరిత్ర గల్గిన డెభై వేల దేవదారు వృక్ష సమూహాల చిక్కని తోపుని – సునామీ వొచ్చి ఆ పళంగా తుడుచిపెట్టుకు పోయినందుకూ కాదు!
    మరెందుకంటే- తమను సైనికుల్లా కాపాడిన దేవదారు సైన్య దళం మొత్తం ప్రాణ త్యాగం చేసి పోతూపోతూ సెల్యూట్ గా మిగిల్చి పోయిన ఒకే ఒకే ఒక్క చెట్టుని..చూస్తూ..దుఖిస్తున్నారు.
    తమ ప్రాణాలు ఒడ్డి ఐనా సరే దాన్ని బ్రతికించుకోవాలని తపిస్తున్నారు. అందుకు ఒక రిటైర్డ్ మాస్టారు తన సర్వ శక్తిని ధార పోస్తున్న వైనం..ఈ వ్యాసం.
    ఎంత అద్భుతం! ఇంతద్భుతమైన సజీవ కథని ఈ మధ్య కాలం లో విని వుండం!
    ఇన్ని వేల కళ్ళ చెమరింపుకి… ఇన్ని కోట్ల హృదయ స్పందనలకి అతని గుండె చప్పుడొక్కటే కారణం.. అంటే అతిశయోక్తి కాదు.
    ఈ వొంటరి వృక్షాన్ని చూస్తూ వుంటే. రణ భూమిలో అయిన వారందర్నీ పోగుట్టుకున్న అర్జుని విలాపం గుర్తోస్తోంది.
    దాని దుఖాన్ని చూస్తే – ఆత్రేయ తన సాహిత్యాన్ని తిరగ రాసుకునే వాడే మోననిపిస్తుంది. (మానూ, మాకును కాను..అనే పాట)
    కష్టాలు కుంగదీయడం, దుఖాలు కమ్ముకోడం..హఠాత్తుగా ఒక్కరమై మిగిలిపోడం…అసలివేవి కావు విషాదకరాలు..అలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం పక్కనెవరూ లేక పోడమే నిజమైన విషాదం మనిషికి! అలాంటి దుర్దశకు, దురవస్థకు, నిరాశకు, నిస్పృహ కు లోను కాకుండ అతను- ఆ చెట్టు కి చేయూత నివ్వడమే ఇక్కడ మనల్ని కదిలించే విషయం, సన్ని వేశం!
    ఇప్పుడా చెట్టుకి అతనొక సేవకుడు. ఒక తండ్రి. ఒక నేస్తం. ఒక ఆయువు. ఒక ఆత్మీయుడు. ఒక మానవుడు. ఒక దేవుడు. అదిన్నాళ్ళు తన ఎత్తు చూసి మురిసింది కానీ, తనకంటే ఎత్తైన మనిషి ఒకడున్నాడనీ, అతని హృదయ వైభవాన్ని చూడ్డం కోసమే తను మిగిలున్నాని అనుకుంటుందేమో ఆ చెట్టు !
    ఈ ఒక్క చెట్టే కాదు, హృదయమున్న ప్రతి వారూ ఆ మాష్టర్ గార్ని అభినందిస్తారు.ఆ ఊన్నత హృదయానికి వందనమంటారు.
    కొన్ని ప్రత్యేకమైన్ శాస్త్రీయ పద్ధతుల ద్వారా..ఈ వృక్ష జాతి మొక్కలు నాటుకుంటున్నాయి నర్సరీ లో. కొత్త ప్రాణాలు పోసుకుంటూ, కొత్త మొక్కలవుతున్నాయి. వాటిని మళ్ళీ ఈ తీరాన నాటి, దట్టమైన దేవదారు వనం చేయాలని అక్కడి ప్రజ కంకణం కట్టుకుని వుంది.అది అడవిలా విస్తరిస్తుంది. పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఐతే, ఇదంతా జరగడానికి మరో ఇరవై యేళ్ళు పడుతుంది. సందేహంలేదు. కాని, జపాన్ చరిత్ర లో మాత్రం జరిగిపోయిన విషాద సంఘటన కంటే, మాస్టారి మానవత్వపు విలువే గొప్పదిగా నిలిస్తుంది అని చెప్పాలి. !
    ఆ దుర్ఘటనలో తాను ఇల్లూ, కారూ , సర్వం కోల్పోయినా…నిలువ నీడ లేకున్నా…..ఆ చెట్టు క్షేమం కోసం నిలువునా కృషి చేస్తున్న ఆ మాస్టారి సేవకు అందరూ జోహార్ అనక తప్పదేమో!మనిషి హృదయ వై శా ల్యాన్ని కొలిచేం దుకు ఒక్కో సారి ఆకాశం కూడా వెనకాడుతుంది . లేకుంటే, వందడుగుల దేవదారు, వొంగి వందనం చేయగలదా ఆ మాష్టారికి!?
    ఇన్నాళ్ళు ఆ భూమి – నూరడుగుల చెట్లతో ఆకాశం మీద కవితలు రాసుకునేదిట! ఇప్పుడతని పేరు రాస్తుందేమో!!

    నిజానికి ఈ జపాన్ పైన్ ఒక చిన్న వార్త. మన వార్త పత్రికలోమహా ఐతే ఒక బాక్స్ ఐటం కూడా కాదేమో! ‘ఒక వార్తని వార్త లా చెప్పడం వల్ల అది కేవలం చదివించడం వరకే పనికొస్తుంది. కాని, అదే ఒక కధ లా చెప్పడం వల్ల, ఆ వార్త ఎంతమందినో కదిలిస్తుంది. ఆలోచింపచేస్తుంది. ప్రతిస్పందింపచేస్తుంది..సమాజ ప్రయోజనానికి ఉపకరిస్తుంది’ అని చెబుతూ వుండే వారు జర్నలిజం క్లాస్ లో మా మాస్టార్! ఆయన మాటలు అక్షర సత్యాలులా తోస్తున్నాయి ఇప్పుడిది చదువుతూ వుంటే!
    మీ జపాన్ పైన్ చదివుతూనే..జపాన్ ని నాలుగు చెఱగులా చదివొచ్చా. పని లో పని గా ‘క్లబ్బు చప్టా సమాధి’ లో ఇంకా సజీవంగా వున్న ‘నిద్ర గన్నేరు నీ’ చూసొచ్చా. బావుంది. కొత్త పాఠకులకు మీరిలాంటి సౌలభ్యాన్ని కలిగిస్తున్న ఈ ప్రయోగమూ బావుంది. !
    ఒక నిజ సమాచారం తో బాటు ఒక సందేశాత్మక మైన వ్యాసాన్ని అందించిన సంపాదకులకు అభినందనలతో..
    – ఆర్.దమయంతి.

  1035. నివాసం గురించి krishna గారి అభిప్రాయం:

    09/03/2011 6:40 pm

    ఈ మధ్య తెలుగు కవితలు చదివి చాలా రోజులయ్యి ఏదో కవితాలోకంలో కాసేపు విహరిద్దామని కవితలు చదవదడం ఆరంభించా. కొన్ని పంక్తులు చదివాక నేను చదువుతున్నది కవితో కథో అర్థంకాలేదు. ఏమిటో! కవితలంటే ఇప్పుడు ఇంతేనేమో.

  1036. వేటూరి పాట గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:

    08/22/2011 8:08 pm

    పాఠకులు కొందరు, రచయితకి వేటూరి నచ్చరు అన్న అభిప్రాయానికి వచ్చినట్టు కనబడుతోంది. ఒకరు, “నాకూ నచ్చరు” అన్నారు..

    రచయిత వేటూరి కవితారీతిలో తాను గమనించిన దాన్ని వివరించారని నా అభిప్రాయం. రచయిత వేటూరిపై అయిష్టాన్ని ప్రదర్శించారని అనిపించలేదు.

    “తరాలు మారినప్పుడు స్థాయి మారుతుందేమో” అన్నారు రోహిణీ ప్రసాద్ గారు. అనుమానమేమీ లేదు దాంట్లో. అయితే ఈ తరాలు వస్తున్న మార్పులను అంగీకరించగలవా లేదా అన్నదే ముఖ్యం. ఇక స్థాయి విషయానికొస్తే, కాళిదాసు చెప్పినట్లు పాతదంతా గొప్పదీ కాదు, కొత్తదంతా చెడ్డదీ కాదు. (పురాణమిత్యేవ న సాధు సర్వం…)

    పదాలతో బొమ్మలు చెక్కడం అన్నదాన్ని వేటూరి నమ్మారు. రంగులతో అరూపభావాల్ని చిత్రకారులు ఒకవిధమైన కళారూపంలో అవిష్కరింప ప్రయత్నించినట్లే, వేటూరి ఒక ప్రక్రియను చేపట్టారు. అలాంటి పెయింటింగ్స్ ని పిచ్చిగీతలని వదిలేసి నట్టే, ఈయన కవితల్ని కూడా వదిలేసే వారుంటారు. అది కవి తప్పూ కాదు.. పాఠకుడి తప్పూ కాదు. ఇందాకా అనుకునే స్థాయీభేదమే దానికి కారణం కావచ్చు.

    సినీకవి ఒక్క వర్గాన్నే దృష్టిలో పెట్టుకుని పాటలు రాయడు. వేటూరి అన్ని వర్గాలకీ రాయబోయి, చాలా మంచి పాటలు “న భూతో న భవిష్యతి” అనేలా రాసికూడా (అన్ని వర్గాలకీ) అందరి చేతా ఏదో ఒక దానికి నిరసించబడ్డాడు.

  1037. వేటూరి పాట గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    08/22/2011 8:30 am

    జీబ్రాకి algebra చిహ్నాల
    లాంకోటూ పాంకోళ్ళూ తొడిగి
    సాహిత్య పౌరోహిత్యం ఇస్తే
    వెర్రికాదు వేటూరి పాట సోదరా!

    అధివాస్తవిక రచన అంటే మనస్సంచారంలోని అసంలక్ష్యక్రమాన్ని పైకి తేవడం అని శ్రీశ్రీ నిర్వచించాడు. అప్రయత్న రచనలో ఆవిష్కృతమైతున్న చిత్రవిచిత్ర వస్తుజాలమే ఆనందానికి కొంత కారణం అంటూ “మంట, ముళ్ళడొంకలు, నెక్‌టై, టైపురైటర్, హంస ఇవి ఎందువల్లనో వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా నా మనస్సులో దొర్లుతూ క్షణంలో కనబడి, మరుక్షణం మాయమైనవి” అని తన ‘మాటల మూట’లో చెబుతాడు శ్రీశ్రీ.

    హద్దులు లేకుండాఎగిరే స్వేచ్ఛాభావాల్ని అస్పష్టమైన పద చిత్రాల ద్వారా, శబ్దం ద్వారా ఆవిష్కరించడం కూడా అధివాస్తవితకే అయితే, వేటూరి అచ్చమైన అధివాస్తవిక కవి. చేతనావస్థలోనో, సుప్తచేతనలోనో తనలో కలిగే అలోచనల అలజడిని పాఠకులలో/శ్రోతలలో కూడా కలిగించడమే కవిత్వానికి పరమావధి అయితే వేటూరి ఆ విషయంలో కృతకృత్యుడయ్యాడనేచెప్పవచ్చు. అదీకాక, ఈ అసంబద్ధ భావాల కుమ్మరింపు వల్ల ఆ పాట భావం చప్పున అర్థం కాకపోవడంలోనే కొంత ఆకర్షణ ఉందని నేనూ భావిస్తాను.

    వేటూరి పాట గురించి రామారావు గారు ప్రతిపాదించిన కొన్ని ప్రాధమిక సూత్రాలు పూర్తిగా అధివాస్తవికతా కవిత్వ లక్షణాలేనని నా అభిప్రాయం. అధివాస్తవికత ఒక మానసిక రుగ్మత అన్నవారున్నారు. ఒక భావచిత్రాన్ని గీస్తూ అర్ధాంతరంగా, పరధ్యానంతో మరో భావచిత్రపు కొమ్మ పైకి గెంతడం మానసిక రుగ్మతే అయితే, ఆ ‘శాఖాలంఘన’ లక్షణాలు వేలూరి పాటల్లో పుష్కలంగా కనిపిస్తాయి.

    అయితే, వేటూరి రాసిన అన్ని పాటల్లో ఈ రకమైన అస్పష్ట కవిత్వం ఉంటుదని చెప్పలేం. ఉదాహరణకు, రామారావు గారు ప్రస్తావించిన శంకరాభరణం సినిమాలోని ‘రాగం, తానం, పల్లవి’ తీసుకోండి. “శబ్దాలంకారాలు పుష్కలంగా ఉండి చెవికింపుగా హాయిగా వినిపించే ఈ పాట, అర్థాన్ని అడివికి తోలేసి శబ్దాన్ని చంకనెత్తుకోవటానికి ఒక మంచి ఉదాహరణ” అని రామారావుగారు అన్నారు. I beg to disagree.

    “కృష్ణాతరంగాల సారంగరాగాలు
    కృష్ణలీలాతరంగిణీ భక్తిగీతాలు

    సస్యకేదారాల స్వరసగాంధారాలు
    సరసహృదయక్షేత్ర విమలగాంధర్వాలు

    క్షీరసాగరశయన దేవగాంధారిలో
    నీపద కీర్తన సేయగా”

    ఈ చరణంలోని అర్థాన్ని వివరించడం అంతకష్టమేం కాదు. ఈ చరణానికి సాధారణ అర్థం: కృష్ణాతరంగాల ధ్వనులు, కృష్ణానది ప్రాంతం వాడైన నారాయణ తీర్థులు రాసిన కృష్ణలీలాతరంగిణి లోని భక్తిగీతాలు, పంట పొలాలు వినిపించే గాంధార స్వరం, రసజ్ఞుల హృదయక్షేత్రంలోని విమల సంగీతం, ఇవన్నీ, నీ పాదకీర్తనమే చేస్తున్నాయి, ఓ క్షీరసాగర శయన!

    అయితే, ఈ చరణంలో రామారావు గారు ప్రస్తావించని ఎన్నో సంగీత పరమైన రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ‘రాగం, తానం, పల్లవి’ ని రాగమాలికలో స్వరపరిచారు. సాధారణంగా రాగమాలిక అంటే, పాట మొత్తానికి ఒకే రాగం వాడకుండా, పల్లవి, అనుపల్లవి, చరణాలొక్కొక్కటినికి ఒక్కో రాగంలో స్వరపరచడం. ఇటువంటి రాగమాలికను ఉపయోగించిన సినిమా పాటలకు ఒక మంచి ఉదాహరణ హాయిహాయిగా ఆమని సాగె. అయితే, ‘రాగం, తానం, పల్లవి’ పాటలో ఒక్క చరణంలోని వేర్వేరు పంక్తులనే భిన్న రాగాతో స్వరపరిచాడు మామ (మామ అంటే మహదేవన్ అన్న మాట).

    మనం చర్చిస్తున్న చరణంలో మొదటి రెండు లైనులు సారంగ రాగంలో, మధ్యలో రెండు లైన్లు కేదార రాగంలో, చివరి రెండు లైన్లు దేవగాంధారిలో వినిపిస్తాయి(ట) (సంగీతంలో నాకు వినికిడి జ్ఞానమే తప్ప ఏ శిక్షణ లేదు. సంగీతం బాగా తెలిసిన వారు నన్ను సవరించవచ్చు). అంటే వేటూరి, సారంగ, కేదార, దేవగాంధారి అన్న రాగాల పేర్లను దత్తపదిలో ఇచ్చిన పదాలుగా కూర్చి రాసిన చరణమిది. అంతేగాక, కేదార రాగంలో సున్నితంగా వినబడే గాంధారం (గ స్వరం) గురించి, దేవగాంధారి రాగం అనగానే గుర్తుకువచ్చే ‘క్షీరసాగరశయన ‘ అన్న త్యాగరాజ కృతి గురించి తెలిసిన సంగీతజ్ఞులు ఈ చరణం వినగానే ఆనందంతో చప్పట్లు కొడతారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మళ్ళీ చదవండీ ఈ పాదాలను. చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టండి!

    “కృష్ణాతరంగాల సారంగరాగాలు
    కృష్ణలీలాతరంగిణీ భక్తిగీతాలు

    సస్యకేదారాల స్వరగాంధారాలు
    స్వరసహృదయక్షేత్ర విమలగాంధర్వాలు

    క్షీరసాగరశయన దేవగాంధారిలో
    నీపద కీర్తన సేయగా”

    *

    అలాగే రామారావు గారు సిరిసిరిమువ్వ సినిమాలోని ఈ కింది పాటలో “చివరి ఏడు పాదాల్లోను ఏం రాయాలో తోచక గిలగిలలాడటం స్పష్టంగా కనిపిస్తుంది” అని నిష్కారణంగా వేటూరిని నిందించారని నా అభిప్రాయం!

    సతీ వియోగము సహియించక – దు
    ర్మతియౌ దక్షుని మదమడంచగా
    ఢమ, ఢమ, ఢమ, ఢమరుక ధ్వనుల
    నమక చమక యమ గమక లయంకర
    సకల లోక జర్జరిత భయంకర
    వికటనటస్పద విస్ఫులింగముల
    విలయ తాండవము సలిపిన నీవే
    శిలవే అయితే పగిలిపో-
    శివుడే అయితే రగిలిపో-

    కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన తైత్తరీయ సంహితలో నాలుగో కాండంలోని 5వ అధ్యాయాన్ని నమకం అని 7వ అధ్యాయాన్ని చమకం అంటారు! ఇవి రెండు మన వేదవాఙ్మయంలో రుద్రుడిని కీర్తిస్తూ రాసిన వాటిలో అతి ప్రశస్తమైనవి. స్వరాన్ని (tone) అతి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో యమ ( < యమము=control) అనిపిలిచేవారు. యమ, గమక, లయలు -- ఇవన్నీ ప్రాచీన కాలం నుండీ సంగీతానికి సంబంధించిన పదాలు (See: "Hidden faces of ancient Indian song" By Solveig McIntosh, p. 75 and also "The Ragas of Early Indian Music" by Widdess, Richard (1995), p 404).శివుని తాండవంలో నమక చమకాలలో వినిపించే యమ, గమక, లయలుంటాయి, అలాగే, లోకాలను లయం చేసే విస్ఫులింగాల వికటనటన ఉండుంది. నువ్వు శిలవో, శివుడివో నిరూపించుకునే సమయం ఆసన్నమయ్యిందని దేవుడినే సవాలు చేస్తున్న వాక్యాలు నాకు చిన్నప్పటినుండి అద్భుతంగా అనిపించేవి. ఆయనకు మాత్రాఛందస్సులపై అంతగా పట్టు లేదన్న విషయం ఆయన రాసిన డబ్బింగ్ పాటలు చూస్తే బోధపడుతుంది. వేటూరి డబ్బింగ్ పాటలపై ఒక ఆసక్తికరమైన చర్చను మీరు తెరచాటు చందమామ అన్న బ్లాగులో చదవవచ్చు!

    ఇంకా వేటూరి పాట గురించి ఎంతో రాయాలని ఉంది కానీ, మరింకెప్పుడైనా!

    సురేశ్.

  1038. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి Jagannadham Alapati గారి అభిప్రాయం:

    08/22/2011 6:39 am

    హృద్యానికి ఈ కవిత సోదాహరణలా ఉంది!
    …జగన్నాథం ఆలపాటి

  1039. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి రాణి. గారి అభిప్రాయం:

    08/19/2011 5:30 am

    శాస్త్రి గారూ,
    మీ మాట అక్షరాలా నిజం. శ్రీశ్రీ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. ఆయన దురదృష్టం అనను గానీ.., ఆయన తెలుగువాడు కావడం వల్లే తగినంత గుర్తింపు రాలేదనేది మాత్రం నిజం. సాహిత్యం వెనుక దాన్ని సృష్టించిన కవి వుండచ్చుగానీ. ఆ కవిని అంచనా వెయ్యడానికి మాత్రం వైయక్తిక జీవితాన్ని పరిగణించకూడదు. ఎందుకంటే ఏ బలహీనతా లేకుండా ఎవరైనా ఒక కవో సాహిత్యకారుడో అయితే అతనికి వున్న మొదటి బలహీనత పేరు కవిత్వం అవుతుంది. అదీ కాకుండా మనిషి బలహీనతల్తోనే సహజీవనం చేస్తాడు. అలాంటి మనిషి బలహీనతలని పదే పదే ఎత్తిచూపిస్తున్నారూ అంటే అదీ ఒకవిధమైన బలహీనతే. దానిపేరు ఓర్వలేమితనం. అదే తెలుగువాడి జాతీయలక్షణం.

  1040. సువర్ణభూమిలో … గురించి తాడేపల్లి హరికృష్ణ గారి అభిప్రాయం:

    08/19/2011 4:35 am

    “కవి”కీ “పాఠకుడికీ” ఉన్న “స్థాయీభేదాన్ని” పాఠకుడే అధిగమించాలని ఇక్కడో గీతాప్రవచనం. ఏమిటా స్థాయీభేదం? అచ్చు అందుబాటులో వున్నవాడు పైస్థాయి వాడు; అది కాక వట్టి చక్షువులతో వెళ్ళదీస్తున్న వాడు క్రీస్థాయి వాడూనా? ఇక్కడున్నదల్లా అనుభవవ్యత్యాసం మాత్రమేను. తన అనుభవాన్ని పైకి అక్రోశించగలవాడు కవి, రచయితానూ. అది చెయ్యలేని వాడు చదువరి, ప్రేక్షకుడు. ఎక్కడో Random Harvest (James Hilton?) అనే నవలలో అన్నట్టు – స్టేజీ మీద సిల్కు అంగీలతో బిచ్చగాడొచ్చి పాటలు పాడి వెళితే అంతా వినోదంగా అనుభవయోగంగా వుంటుంది. కానీ నిజజీవితంలో బిచ్చగాడు పాటలు పాడడూ, కావ్యభాషలో ఆక్రోశించడూ. మౌనంగా పడుకుంటాడు. కయ్యానికీ వియ్యానికీ నెయ్యానికీ సమవుజ్జీ వుండాలని పాత లోకనీతి. కావ్యానిక్కూడా అది అంతే నిజమేమోను. వాల్ పోస్టర్ మీద లక్ష రూపాయల డైమండ్ నగ ప్రకటన వుంటుంది. కానీ అది కొనగల తాహతు ఉన్నవారినుద్దేశించినది. తక్కిన వారికవి పొల్లు మాటలు మాత్రమేను. కవిత్వం కూడా అంతేనేమోను. నా అనుభవసామగ్రి నీ దగ్గర లేందే నా కవిత్వమెవడు చదవమన్నాడు నిన్ను? అని పరోక్షంగా నిలదీస్తున్నారు ఇలాటి రసహీనమైన పద్యాన్ని గాలికి వదిలి. ఫెర్మా సిద్ధాంతంతో సామ్యం కృత్రిమం. ఫెర్మా సిద్ధాంత నిరూపణ చెప్పకుండా ఫెర్మా సిద్ధాంతాన్ని హైస్కూలు విద్యార్ధికి చెప్పొచ్చును. కానీ ఇలా పేజీల పేజీల వ్యాఖ్య లేందే ‘కవి’ చెప్పదలచిందేంటో ఆ బ్రహ్మ పదార్ధాన్ని పట్టుకోడానికి 46 వ్యాఖ్యల తరవాత కూడా తేల్చలేక పోయారు. అది కవికి గర్వకారణం కావచ్చును. కానీ జాగ్రత్తగా పరిశీలించినట్లైతే ఈ పధ్యాల భావాన్ని ఒక విధమైన వోటింగ్ పద్ధతి ద్వారా మెజారిటీ బలంతో నిర్ణయించాల్సి వచ్చింది. ఇదేనా కవి నిజంగా కోరుకుంటున్నది?

  1041. వేటూరి పాట గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:

    08/17/2011 1:16 pm

    నాగ మురళి గారికి:
    పాట పాడినప్పుడు, ఎస్పీగారు “ప్రమథాలోక” అని సంగీతపరమైన కారణాలవల్ల పాడారు గాని, కవితాపరంగా
    “కైలాసాన కార్తీకాన శివరూపం
    ప్రమిదే లేని ప్రమథ లోక హిమదీపం”
    (కార్తీకం, చలికాలం, హిమాలయంలోని కైలాసం, మంచు – శివుడు తెల్లని వాడు, స్వయం జ్యోతిస్వరూపుడు – ఇంధనం అక్కర్లేని దీపం – ప్రమిదే లేని దీపం – ఆ దీపం చల్లనిది , వెచ్చనిదికాదు. )
    పదాల ఉచ్చారణ ఇలా మారడం, అర్ధాలు మరుగుపడడం ఇదివరలో కూడా జరిగింది.. (” లాహిరీ నడి సంద్రములోనా, లంగరుతో పని లేద” న్నప్పుడు కూడా)

    ఓ పాపా లాలి అన్న పాట.. సినిమాలో సందర్భంతో అర్ధం చూస్తే మంచి భావప్రదమైన పాట.

    నార్ల దగ్గర పాత్రికేయుడిగా పని చేసిన వేటూరి, అర్ధాన్ని విస్మరించారని అనుకోలేం. కవితావేశంలో అనర్ధాలు కవులకి మామూలే.

    “ప్రతి భారత సతి మానం
    చంద్రమతీ మాంగల్యం”
    లాంటి భావాల్ని వెదజల్లిన కవులెంతమంది మన తెలుగులో..

  1042. ప్రేమ కవితలు గురించి ajaykumar గారి అభిప్రాయం:

    08/16/2011 4:34 am

    మీ కవిత చాలా బాగున్నాయి.

    మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. నిజంగా అంత బాగున్నాయి.

  1043. గానభారతి గురించి మోహన గారి అభిప్రాయం:

    08/13/2011 3:09 pm

    కొందరికి సాంప్రదాయిక సాహిత్యములోని పద్యములయందు వాడెడి భాష సులభముగా అర్థము కాకపోవచ్చు. వాటిని అర్థము చేసికొనడానికే నిఘంటువులు, పదకోశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక సంగతిని గుర్తు ఉంచుకోవాలి. కొన్ని కథలలోని మాండలికాలు కూడా చదవడానికి, అర్థము చేసికొనడానికి కష్టముగా ఉంటుంది. అందుకని వాళ్లు వ్రాసిన మంచి కథలను చదవకుండా ఉండడము లేదు. కవిత్వ భాష కూడ ఒక మాండలికమే. ఈ మండలము కవుల మండలము. కథలలోని మాండలికాన్ని ఆదరించే వాళ్లు కవితామాండలికాన్ని ఆదరించడానికి ఎందుకు ఉత్సాహము చూపడము లేదో? శ్రీశ్రీలాటి కవుల భాష కూడ సులభమైనది కాదు. కవితలోని క్రియాస్వరూపాలు అర్థమైనా నామవాచకాలకు, విశేషణాలకు కొన్ని చోట్లలో నిఘంటువులను వెదకక తప్పదు. ఇక పోతే వృత్తాలను, జాత్యుపజాతులను కూడ వ్యావహారిక భాషలో వ్రాయవచ్చును. ఛందస్సు ఒక చట్రము మాత్రమే. అది ఒక సీసావంటిది. ఆ “సీసాల”లో ద్రాక్షారసాన్ని నింపవచ్చు, ఆముదాన్ని నింపవచ్చు. అది వైయక్తికము. విధేయుడు – మోహన

  1044. గానభారతి గురించి yasasvi గారి అభిప్రాయం:

    08/13/2011 3:07 am

    దేశికాచారి గారూ! “గానభారతి” మీదకి చర్చని మళ్ళించినందుకు మీరు నన్ను మెచ్చుకోవాలి:) ఇటువంటి చర్చ అనివార్యంగా కవితారూపం మీదకి మళ్ళే పరిస్థితి వస్తుంది. పద్యం రాసే వారిగా మీకు పద్యరూపం మీద ఇష్టమ్ ఎక్కువ ఉండటం సహజమే అయినా మీరు మీ వ్యక్తీకరణ పరిమితులని కూడా తప్పక ఒప్పుకోవాలి.

    తెలుగువారికి గర్వకారణమతాది పద్యం. అందులో ఎటువంటి విభేదమూ లేదు. కానీ ప్రతీ అంశమూ పద్యానికి వ్యక్తీకరణలో నప్పదన్నదే నా అభిప్రాయం. అలాగే పద్యంలో రాసినదంతా కవిత్వమేనన్న ఊహ పొరపాటు అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంక కధలకి “పద్యాన్ని” వాడటం కొత్తేముందీ?? మన మహాభారతం మొదలుకుని కొనసాగిన ప్రాచీన తెలుగు సాహిత్యం అంతా కధల్ని ఛందోరూపంగా గద్య పద్యాత్మకమైన రీతిలోనీ మణిప్రవాళ భరిత భాష లోనీ చెప్పినదే కద!! మీరు ఇతివృత్తం ఆధునికం కాలం రీత్యా అని చెప్పడమే తప్ప కధని చెప్పడం పద్యాల్లో కొత్త ఏమీ కాదు.

    కాలంలో మార్పు అనేక విషయాల్లోనూ మార్పుకి కారణమ్ అయితీరుతుంది. దాన్నించి.. ఏ కళారూపమూ తనతీరుని మార్చుకోకుండా ఉండలేదు. శ్రీనాధుడి కవితా వస్తువునించి విడివడడానికే పెద్దన కొత్తదైన వస్తువుని ఎన్నుకోవలసి వచ్చింది. దానికి ఒక కొత్త పేరునీ పెట్టుకుని తనకవిత్వమ్ తత్పూర్వమ్ కన్నా భిన్నమైనదని చెప్పుకోవలసీ వచ్చింది. ఇది కాలంరీత్యా వచ్చిన రాక తప్పని మార్పై కన్పిస్తుంది సాహిత్యంలో !! అయితే వస్తువులో కొత్త అడుగు వేసిన అల్లసాని కవితా రూపంలో మాత్రం కొత్త అడుగు వేయలేకపోవడానికి కారణం తత్భిన్నమైన కవితా రూపం ఒకటి తేవొచ్చని తెలియకపోవడమేనని అనుకోవాలి. అలా తెలియడానికీ వస్తువులోనూ కధని చెప్పవలసిన ఒక తప్పనిసరి పరిస్థితిని వదుల్చుకోవడమ్ లోనూ ఆధునిక కాలం, ఇతర దేశాల సంపర్కం ఉపయోగపడ్డాయి 19వ శతాబ్దపు కవులకి. కధన రితిని వారు విసర్జించి భావప్రధానమైన వస్తువుని కవిత్వంలో తీసుకుని రావడమూ, రూపంలో సైతమ్ ఎంతోకొంత మార్పుకి తొలినాళ్ళలో ప్రయత్నించడమూ భావకవులు చేసారు. అది కూడా ఒక మూసగా మారిన స్థితిలోనే పఠాభి ఆరీతి మీద తిరుగుబాటు కవిత్వమ్ రాసేడు. వీళ్ళంతా పద్యాలు రాయలేక కాదు వచనకవిత్వమ్ వేపు మళ్ళింది. శ్రీశ్రీ గాని పఠాభి గాని కృష్ణశాస్త్రి గానీ చాలా మంచి పద్యాలు రాయగల్గినవాళ్ళూ.. రాసినవాళ్ళే! వాళ్ళు కవితా రూపాన్ని మార్చుకోవలసిన ఆవశ్యకతని గుర్తించారు గనక మారేరు. ఇది ఒక సాహిత్య వాస్తవం! పద్యం ఎన్నిటికో అనువైనది కాదు.ఆధునిక జీవితలోని సంక్లిష్టతకి ఆ కవితా రూపం ఏమీ నప్పలేదు. చందస్సుల నడ్డి విరగ్గొడతానని పఠాభి ప్రకటించింది ఆ ఇరుకునించి తన భావప్రకటనా విధానాన్ని తప్పించుకుందికి మాత్రమే! అంతేగానీ పద్యరూపం ఆయనకి తెలియకా కాదు. పద్యం రాయలేకా కాదు.

    ఈ తెగతెంపు వల్ల కవితావస్తువులోనీ కవితా వ్యక్తీకరణలోనీ కవికి అపారమైన స్వేచ్చ లభించడమ్ వల్లనే మనకి ఆధునిక కవిత్వంలో ఎన్నో ప్రయోగాలూ ఎన్నో మంచి వచనకవితలూ కూడా రాగలిగాయి. అయితే వచన కవితా రూపాన్ని సైతమ్ ఒక నిరర్ధక స్థితికి కవులు తీసుకు రాలేదా అన్న ప్రశ్న వస్తే అందుకు ఔననే జవాబు చెప్పాలి. ఎలాగైతే చంధస్సులో రాసినదంతా కవిత్వం కాదో రూపాన్ని మార్చుకుని వచనకవిత్వాన్ని స్వీకరించి రాసినదంతా కూడా కవిత్వమ్ కాలేదు. అందుకు కవుల భావన, ఊహల లోపమ్ కారణమ్ తప్ప కవితా రూపం కారణమ్ కాదు. మంచి చంధో నిబధ్ధ పద్యమూ రాయవచ్చు. మంచి వచన కవితా కూడా రాయవచ్చు. వ్యక్తీకరణ ఊహా భాష గొప్పవి అయితే!! కాలం రీత్యా కవితా రూపం మారడమ్ కారణంగా అనేక వర్గాల వారూ అనేక జాతుల వారూ తమ తమ వ్యక్తీకరణలని స్వేచ్చగా సాహిత్యం లోకి తీసుకుని రాగలిగారు. అలాగే ఆ సందర్భాన్ని నిరుపయోగం కూడా చేసుకున్నారు.

    దానాదీనా చెప్పొచ్చేదేమంటే ఆధునిక భాషని వాడడానికి చాలని కవితా రూపంలో ఆధునిక కధానిక మీరు రాస్తే అది మీ శ్రమని వృధా చేసుకోవడమే తప్ప “బాగా” రాయగలగడం ఏమంత వీలు కాదు. అయితే రాసే స్వేచ్చ మీకుంటుంది. కానీ మీరు ఇతరత్రా రాసిన పద్యాలంత బలమ్ ఇందులో ఉండే వీలు లేదు.

    కాలానికీ సాహిత్య రూపానికీ ఉన్న సంబంధాన్ని మీరు గానీ నేను గానీ కాదని అనలేము మరి.

    యశస్వి.

    [యశస్వి గారూ – తెలుగులో సున్నా రావాలంటే m కాకుండా M టైపు చేయండి. అలానే మీరు రాసిన అభిప్రాయం మీరే మరొక్కసారి చదివి ఒక్కసారి అచ్చుతప్పులు దిద్దుకుంటూ వుంటే మాకు ప్రతిసారీ శ్రమ కొంచెం తప్పించినవారవుతారు. -సం]

  1045. గానభారతి గురించి దేశికాచారి గారి అభిప్రాయం:

    08/12/2011 5:08 pm

    గానభారతి ఇటువంటి చర్చలకు మూలం కావడం ముదావహంగానే ఉన్నది. నేను పేర్కొన్నట్లుగా కాల మేదైనా మానవుల ప్రకృతులు కాలాతీతములు. యశస్వివంటివారు ఇటువంటి ఇతివృత్తం గల కథను ఇంకా వివరంగా “తెల్గీషు” గద్యంలోవ్రాస్తే ఆనందిస్తారనటంలో సందేహంలేదు. కాని ఒకవిషయం గమనించాలి. తెల్గీషులో చదివి ఆనందించవలసిన భాషా సౌందర్యం గాని, పదశిల్పంగాని, ఆలంకారికప్రయోగాలు గానీ, వర్ణనావైదగ్ధ్యం గాని, లయవిన్యాసాలు గాని వెతకడం పొరపాటే ఔతుంది. అట్లాగే గానభారతివంటి కవితా కథానికలలో ఈ అంశాలను విస్మరించి, తెల్గీషుభాషలో పద్యం వ్రాయలేదే అని వాపోవడంకూడ పొరపాటే ఔతుంది. అందుచేత వ్రాసిన మాధ్యమంలో ఆ మాధ్యమానికి లక్షణభూతమైన అంశాలను దృష్టిలో నుంచుకొని అందాన్ని ఆస్వాదించడం సహృదయుల ధర్మం. ఉదాహరణానికి పొడిమాటలతో సాగే డ్రామాను ఓపెరాగానో, బ్రాడ్వే సంగీతరూపకంగానో వ్రాసినప్పుడు వీనిని ఆస్వాదించే ప్రేక్షకులు, వాటిని తోలనంచేసే ప్రమాణాలూ వేఱుగా ఉంటాయి. గద్యేతర కవితామాధ్యమంలో కథను వ్రాసినప్పుడు (ఈనాటి వ్వవహారికభాష వాడటం లేదే అని వాపోకుంటే) ఈనాటి వచనకవిత్వంకంటె పద్యమే కథాకథనానికి సమర్థంగా, హృద్యంగా ఉంటుందనటంలో సందేహం లేదు. నేను వ్రాసినది సమర్థంగా ఉన్నా లేకున్నా ఇటువంటి కవితాకథానికా ప్రయోగాలు ఇంకా విరివిగాసాగాలనే ఉద్దేశ్యంతోనే నేనీ ప్రయోగాన్ని చేస్తున్నాను.
    లైలాగారి సందేహాలకు సమాధానాలు:
    1. రోమంథము = నెమరువేయుట . పోతనభాగవతంలోను, ముక్కుతిమ్మనగారి పారిజాతాపహరణంలోను ఈ పదం థకారయుక్తంగా ఉన్నది గాని సూర్యరాయాంధ్రనిఘంటువులో రోమంధము అని ధకారయుక్తరూపమున్నది. ఈ పదాన్ని వాడిన శ్రీకృష్ణమురళీగానపరవశములైన గోవులను వర్ణించే పోతనగారి పద్యం:

    మమతన్ మోములు మీఁది కెత్తుకొని, రోమంథంబు సాలించి, హృ
    త్కమలాగ్రంబులఁ గృష్ణు నిల్పి, మురళీగానామృతశ్రేణి క
    ర్ణములం గ్రోలుచు మేఁతమాని, గళితానందాశ్రులై చిత్రితో
    పమలై గోవులు చూచుచున్న వదిగో పద్మాక్షి! వీక్షించితే!

    2. సత్సంప్రదాయముకురాయితమైన = సత్సంప్రదాయమునకు అద్దమువలె నాచరించుచున్న, అనగా సత్సంప్రదాయమునకు అద్దము బట్టినట్లున్న, ముకుర మనగా అద్దము.

    3, గానభారతిలో దౌహృదవర్ణనపద్యాన్ని మార్చి నేను మాదవ్ గారికి సంస్కృతప్రతిని జూలై సంచిక రాకముందే పంపినాను గాని, ప్రాతప్రతియే అంతర్జాలంలో వారు ప్రచురించినారు. ఈ సంస్కృతపద్యరూపాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో దౌహృదవర్ణన వాచ్యంగా కాక చాలా మట్టుకు సూచ్యంగా మార్చబడ్డది.

    ఆ మఱునాఁటినుండియె మదంగమునం దెవొ నూత్నచిహ్నముల్
    గోముగఁ గాననయ్యెఁ, బలుగొంచెపుఁగౌఁను క్రమక్రమంబుగా
    లేమినిఁ బాయఁజొచ్చె, లవలీదళపాండురమయ్యె గండముల్,
    కామవరప్రసాదమనఁగన్ సమకూడిన గర్భమందునన్.

    4.విశ్వనాథవారు చెప్పినది అక్షరాలా నిజం. “తినగ తినగ వేము తియ్యనగును” అనే వేమనలైనుకూ ఇదేఅర్థం.

  1046. నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం గురించి yasasvi గారి అభిప్రాయం:

    08/12/2011 2:17 am

    “తెలుగువారి సంగీతాభిరుచి పెరగాలంటే వారు సాహిత్యం పై శ్రధ్ధ పెట్టడం తగ్గించి…” ఇదేం వ్యాఖ్యానం ?? సంగీతం మీద అభిరుచిని పెంచుకోవడానికీ సాహిత్యాన్ని పట్టించుకోనఖ్ఖరలేదని ఓ సలహా పారేసే ముందు అసలు ఆ వాక్యానికి ఉన్న బలం ఏమిటోనన్నా ఆలోచించుకోలేదే రోహిణీ ప్రాసాదు గారు? సరిగ్గా ఆయన అభిప్రాయానికి భిన్నంగా ఉన్న జయప్రభ గారి అన్నమయ్య విశ్లేషణ పదంలోని సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో చెప్పకనే చెబుతోంది మరి!! సంగీతంలో ఎప్పుడైనా రాగాలూ స్వరాలూ ఇవి మాత్రమే ముఖ్యమైనవట!! దీని అర్ధమేమో రోహిణీ ప్రసాదు గారు వివరించాలి. ఆయన సాహితీ విశ్లేషకులని చూసి ఇబ్బంది పడుతున్నారా?? లేక సంగీతానికి ఆ పదాల్లోని సాహిత్యం ప్రతిబంధకం అని అనుకుంటున్నారా?? ఆయన సమస్య ఏమిటో నాకు స్పస్టం కాలేదు.

    ఒకసారి రాజమండ్రిలో పద్యనాటకాల ప్రాభవం బాగా ఉండే రోజుల్లో సంగీతం ముఖ్యమా? సాహిత్యం ముఖ్యమా అని చర్చలు చేసుకునే రోజుల్లో భమిడిపాటి కామేశ్వరావు గారు స్టేజీ మీద ఏకబిగిన రాగాన్ని ఆలాపన చేసి ఊరుకున్నారట!! పద్యం పాడటం అయిపోయింది అని చెప్పేసేరట. అదేమిటీ పద్యం అంటే సాహిత్యం ఏదీ అది వినిపించకపోతే ఇంక అందులో సొగసేమిటి పద్యం చదవండి మొర్రో అని జనం మొత్తుకున్నారట!! అలా ఆయన సంగీతంలో రాగం చాలు సాహిత్యం అనవసరమ్ అని భావించేవారికి తనదైన తరహాలో జవాబు చెప్పి ఉన్నారు. ఇది ఏనాడో ముగిసిపోయిన చర్చ. అలాగే ఘంటసాల గారికి ప్రియ శిష్యుడైన సంగీతరావు గారు సాహిత్యం లో ఉండే ప్రాముఖ్యతకి సదా ముగ్ధులైన వ్యక్తి. పాట తాలుకు బలం అంతా ఆ పాటలోని సాహిత్యానిదే నని తాను స్వయంగా సంగీతకారుడై ఉండిన్నీ.. గాయకుడై ఉండిన్నీ బలంగా నమ్మిన వ్యక్తి. సాహిత్యం తాలుకు ప్రాభవం అంత సరిగ్గా తెలియని వారెవరో అక్షరాన్ని గురించి ఆలోచించలేకపోయి ఉంటారు. కానీ సంగీతంలో అక్షరమే ముందు నడిచేదనీనీ స్వరం ఎప్పుడైనా దాన్ని అనుసరించే సాగవలసినదనీనీ సాహిత్యం తెలిసిన వారెవరైనా భావిస్తారు. అందుకనే అన్నమయ్య సాహిత్యం అంత ప్రాచుర్యం పొందగలిగింది. ఆయన పదాన్ని ఎవరేయే రాగాలలో.. పాడుకుంటున్నా కూడా ఆయన పదాలలోని ఆ కవితామాధుర్యమే చెవికింపుగానూ మనసుకి సుఖంగానూ ఉంటుంది. అక్షరాన్ని మినహాయించే సంగీతం మనలేదు. అందువల్ల రోహిణీప్రసాదు గారు ఒక పక్షపాత ధోరణితో ఆ మాటలు అన్నారని భావించేలా ఉంది. ఆయనకి సాహిత్యం మీద మక్కువ లేనంత మాత్రాన తెలుగువారికందరికీ ఉండకూడదని ఏమీ లేదు.

    యశస్వి.

  1047. గానభారతి గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    08/11/2011 12:51 pm

    విశ్వనాథ సత్యనారాయణ వసుచరిత్రము (ఎమెస్కో ప్రచురణ) కు పీఠిక రాస్తూ, వసుచరిత్ర కావ్యము చదవటానికి ఇప్పటి పాఠకులు అధ్యైర్య పడనక్కరలేదనీ, – “మానవజాతిలో నది యొక అవివేకము. ప్రతివాడును తనకేమియు తెలియదనుకొనును. ఆ యనుకొనుట మానివేసినచో మన కావ్యములు కూడ చాలవరకు మనకు తెలియగలవు. నాల్గు మాటలు చదివిన తరువాత నైదవమాట కర్థము తెలియదు. నాకు తెలియుటే లేదని యా పుస్తకము నవతల పారవేయును. ఆ మాట యర్థము కానిచో తక్కిన మాటల కర్థమేమి? పద్యమంతయు చదివినచో నేదో కొంత తెలియదా? ఒక పద్యము తెలియలేదు. రెండవ పద్యము తెలియదా?” – అంటూ కావ్యాలు తప్పక చదవమని సలహా ఇస్తారు.

    విశ్వనాథ సలహా నాకు నచ్చింది. ఆయన ఎంతమంది విద్యార్థులకో చదువు చెప్పిన పంతులయ్యె. నేను పద్యాలు అలాగే చదువుతున్నాను. చదివిన కొద్దీ అర్థమవుతున్నయి.

    దేశికాచారి గారి పద్యాలు మధురంగా ఉంటాయి. నేను చదువుతున్నా. ఇందులో అన్ని పద్యాల్లో అన్ని మాటలూ అర్థం కాకపోయినా, కథ అర్థమయ్యింది. ఇది ఇప్పటి కాలపు కథ కాదంటానికి వీల్లేదు.

    కొంచెం బాగోనట్టు ఎక్కడ అనిపించిందంటే; 🙂 కవితో కథానాయిక .. ఆమె… ఆమె…. – O! What the hell. I will say that horrible word in Telugu – ఆమె తన గర్భిణీ చిహ్నాలను వర్ణించి వర్ణించి చెప్పినప్పుడు. ఈ కాలపు స్త్రీ, ఆ సోదంతా అంత వివరంగా కవికి ఒక లతా నికుంజంలో ఎందుకు చెపుతుంది? అంతకు ముందెప్పుడో తన గైనకాలజిస్ట్ కి హాస్పిటల్లో చెప్పి ఉండొచ్చు.

    అంతే. అందుకని. అంతకు మించి నచ్చనిది ఏం లేదు.

    ఒంటరిగా, విచారంగా, ఉన్న ఒక స్త్రీని “ఏమిటమ్మా నీ కష్టం?” అని ఒక మగాడు కల్పించుకుని అడగటం ఈ రోజుల్లో జరగదా? అంటే జరుగుతుంది. సరే, కవి తర్వాత కుంచెం, వైద్యుడు, సలహాదారుగా ప్రవర్తించాడు అనుకోండి. అది ఈ రోజుల్లో ఆశ్చర్యం కలిగించే విషయమా అంటే అదీ కాదు. అలా రోజూ ఎడా పెడా లక్ష సలహాలు ఇస్తూనే ఉంటారు చాలామంది మనుషులు. కాని ఇక్కడ ఇచ్చిన సలహా అంత చచ్చుగానూ లేదు. నా కర్థమైనంత వరకూ ఆ కవి, ఆమె మనసు నొచ్చుకునే మాటలు అన్నట్టు లేదు. ఆమెను ఏ చెరువులోనూ దూకించలేదు. పైగా ఆమె కిష్టమయ్యి, ఆమె అదే పొదరింట్లో మరొకరితో సంభోగించితే , కవికి కష్టం కలిగేట్లూ లేదు.

    అందువల్ల కవి సహృదయుడు అనిపిస్తున్నది.

    అరే! ఒకటి రెండు కూజితాల్లోనే ఆమె కోయిల అని కవికి ఎలా తెలిసింది? అంటే – అదీ అంత నమ్మలేని విషయంలా అనిపించటం లేదు. 🙂 “తాళ్” సినిమాలో ‘మానవి’ /ఐష్వర్యారాయ్ సందేహిస్తూ “జీ. మై క్యా బోలూ” అనంగానే ఆ ధ్వనికి మురిసి ఆమె బాగా పాడుతుందని, స్టార్ క్వాలిటీ అని అనిల్ కపూర్కి తెలిసిపోయి, తన సంగీతం డాన్స్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చెయ్యమనలా:-)

    ఐతే ఈ కథలో కవి, తన సలహానే ఆ స్త్రీ పాటించి, అందువల్లే ‘గానభారతి’ ఐపోయిందని, మనసులో అనుకున్నాడా? ఏమో మరి. తెలియదు. కానీ, సలహా ఇచ్చినప్పుడు సంగీతం ఆవిడకు మర్నాటికల్లా వస్తుందని అపోహ మాత్రం పడలేదు. కడుపొచ్చినంత సులువుగా సంగీతం రాదు. సంవత్సరాలు పడుతుందనే అనుకున్నాడు. “ఈ మాట” లో సంగీతం వ్యాసాలు రాసే రచయితలు మాత్రం, – వద్దులెండి, ఇక్కడ ఆ సంగతులు – వాళ్ళు రెండు దరువులు వేస్తే, నే బేరుమంటే, మళ్ళీ సుకవులు … 🙂 ఎందుకు గానీ ‘రోమంధము’, ‘ముకురాయితమైన’ అన్న మాటలకు అర్థాలు చెపితే, ప్రస్తుతానికి చాలు.

    లైలా

  1048. మూడు లాంతర్లు – 6 గురించి yasasvi గారి అభిప్రాయం:

    08/04/2011 4:00 pm

    ఒక్క త్రిపురేనా పఠాభి కూడా అలాగే !! రాయాలనుకున్నది రాసేడు. రాస్తాడేమో అని అనుకున్నాకా అసలేమీ మరి రాయలేదు. ఏ ప్రశ్నకీ ఏ జవాబు లేకుండా తన మౌనంలో బతికేడు చివరిదాకా !! ఎవరిమీదా…[ అంతరంగానూ బాహ్యంగానూ].. ఏయే ప్రభావాలన్నా ఉండనివ్వండి గానీ తనదే అయిన ఒకానొక అస్తిత్వం తొణికిసలాడందే అతడు/ఆమె చెప్పే ఏ విషయానికైనా ఏం బలం ఉంటుందీ కనకప్రసాదూ??

    “ద్రవ్యం” ఎన్నిరాసి కూడబెట్టుకున్నా..ఏ లబ్ధప్రతిష్టులమెప్పు సంపాదించి ఎంత ధనవంతులే అయినా లేక కవితావంతులే అయినా అసలు ఆ ఉండాల్సినదేదో లేకపోతే ఏ లబ్ధప్రతిష్టులు ఏయే కితాబులిస్తే మాత్రం అవి నిలిచేనా?? అలా కితాబులిచ్చిన వాళ్ళ పరువు పోయేను గానీ 🙂

    మీరు రాసే దాంట్లోని యాస నాకు బాగా అర్ధమయ్యే యాస గనక నాకు సుఖంగా ఉంటుంది. ఒక నలభై ఏళ్ళ వెనక్కి వెళ్ళీ ఆ వీధులన్నీ ఆ పేటలన్నీ తిరిగినట్టే ఉంటుంది. “మట్టీసి” పదాన్ని విని ఎన్నాళ్ళైందో?? మీలో ఇంకా మరీ నాగరీకం ప్రవేసించినట్టు లేదు కాబోలు. ఇంకా ఇవన్నీ గుర్తున్నాయి. అయితే గుర్తుండన్నంతమాత్రాన ఆ భాష “జూటా” ఏమీ కాదుగానీ ..యాస దారి యాసది. మీరు రాసినవన్నీ చదువుతున్నానా అయినా సరే మీ సమస్య నాకు ఏమీ ఎక్కడం లేదు. మీకు సరిగా చెప్పడమే రావడమ్ లేదో?? లేక నాకు మిమ్మల్ని చదవడమే రావడం లేదో??

    యశస్వి.

  1049. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    07/29/2011 7:06 am

    మీ కవిత్వం ఎప్పుడూ మనసుకి హత్తుకుంటుంది…ఎతో సున్నితంగా వ్రాస్తారు….మీరు ఎల్లప్పుడూ మంచి కవిత్వం అందిస్తూ ఉండాలని కోరుకుంటుంన్నాను…..

  1050. వేటూరి పాట గురించి పాటూరి గారి అభిప్రాయం:

    07/28/2011 6:56 am

    స్వరసగాంధారాలు కి ఇంకా అర్థాలు చెప్పుకోవచ్చండీ.

    స్వ + రస గాంధారాలు – తమయొక్క రసవంతమైన సంగీతం. (గాంధారం అంటే ఒక స్వరమే అయినా, సంగీతం అన్న విస్తృతార్థంలో కవి వాడి ఉండొచ్చు.)

    పొలాలు సస్యశ్యామలంగా ఉండి రసవంతమైన సంగీతాన్ని తలపింపజేస్తున్నాయి.

    సు + అరస గాంధారాలు – అరసం అంటే ప్రదోష కాలం అనీ, హర్షము అనీ అర్థాలున్నాయి.
    ‘ఆ పొలాల యొక్క మంచి హర్షపూర్వకమైన సంగీతం’ అని అర్థం చెప్పుకోవచ్చు.

    సినిమా కవిత్వానిదేముందండీ, ఏమైనా రాసెయ్యొచ్చు. మన సరస హృదయ క్షేత్రాల్లో అర్థాలు పండించుకుంటూ ఉండడమే.

  1051. ప్రేమ కవితలు గురించి rajana srinivasarao గారి అభిప్రాయం:

    07/16/2011 7:15 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  1052. సన్మానానికి రెండు సీ.వీ.లు గురించి swamy గారి అభిప్రాయం:

    07/12/2011 8:30 am

    ఈ కథకు కామెంటు రాయడం కూడా దండగే.

    గతంలో మారుపేర్ల మాయువు అని వేలూరి వెంకటేశ్వర్రావు గారు ఈ మాటలో ఒక వ్యాసం రాసారు. అఫ్సర్ కవితా సంకలనం ఊరిచివర్ని ఎవరో మారుపేరుతో విమర్శించినందుకు సంపాదకుడితో సహా ఈ మాట పాఠకులెవరూ ఆ మారుపేర్ల మాయువుని క్షమించలేదు. ఇంతకు మించి ఈ మాయువెవరో కూడా నాకు తెలియదు. ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఈ కథని “అనానిమస్సు” అన్న పేరుతో ఎలా అనుమతించారు? ఈ కథ మరియు కథకుడి మారుపేరు ఈమాటకు తగినట్లుగా లేదు. ఒకరికి మించి ఎక్కువ సంపాదకులున్న ఈమాటకు ప్రచురణకు ముందు రివ్యూ ఉండదా? మీ పత్రికకేమన్నా కథలకు లోటున్నదా? మీకు ప్రెజుడిసెస్ ఉండటం ఆశ్చర్యకరం.

    ఇక ముందు ఇలా జరగదని ఆశిస్తూ..

    వీరాస్వామి

  1053. రీ యూనియన్ గురించి yasasvi గారి అభిప్రాయం:

    07/09/2011 12:20 pm

    అమ్మా !! ఎర్నేనీ !! అసలే గురజాడ అప్పారావు గారి గిరీశం పుణ్యమా అని తెలుగు ఇంగ్లీషు కలిపిన పదాలతో తెలుగులో వాక్యమ్ స్థిరపడిపోయింది. మీరు మీ జోరులో చివరికి కవిత్వాన్ని సైతమ్ తెలుగులోనే మొదలుపెట్టినా ముగించే వేళకి పూర్తిగా ఇంగ్లీషులోకి మారిపోయేరు. ఇది అభిప్రాయమా? ఆవేశమా?? కవిత్వమా?? ఉభయభాషల సంపర్కమా??;) ఏదైనా వైదేహి ఊహించిన “రీయూనియన్ ” మాత్రం మీ సటైర్ కింద తునాతునకలైపోయింది. ఆ కవయిత్రి మృదుత్వాన్ని మీరు మీ భావమ్ తో చెల్లాచెదరు చెసేసేరే? పైగా భలే బాగా చేశారు. ఎంత బాగుందో? ఆ ఇంగ్లీషు కాకుండా మొత్తమే తెలుగులో రాయొద్దా?? మీరు మరీను.

    వైదేహి కవిత్వమ్ లో ఉపమించటం మరీ ఎక్కువైపోయింది. అద్భుతమైన రాగాలు అన్నాకా అపశృతులు చాలు కదా?? రాగం కి ప్రతిగా ‘అపశృతి” ఉండగా మళ్ళీ “కీచురాళ్ళు” ఎందుకూ అదనంగా ??కొత్తగా ఏమీ చెప్పని ఒక పదమ్ కవిత్వానికి గుదిబండలాంటిది మరి.
    అలాగే ఆ అపశృతే అప్రతిభుల్ని చేయడం కదా?? ప్రత్యేకంగా అప్రతిభుల్ని చేస్తాయి అని మళ్ళీ దాన్నేలౌడ్ గా వాచ్యం చేయడం అవసరమా? క్లుప్తత చాలా ముఖ్యమ్ కదా కవిత్వమ్ లో? వాక్యాలని అనవసరమైన అతి ఉపమానాల బరువుకి వదిలేస్తే చివరికి భావం చస్తుందే?? వైదేహి కి కొత్త పలుకు {డిక్షన్ } బహుశా అవసరం ఇంక.

    యశస్వి.

  1054. తెలుగు సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం మొదలవుతోందా? గురించి yasasvi గారి అభిప్రాయం:

    07/08/2011 1:29 am

    ఈ ఆర్టికల్ చదివిన వాళ్లకెవరికీ ఈ రచయిత వేటిని గురించి మాట్లాడుతున్నాడో అర్ధం కాదు. ఎందుకంటే ఉదాహరణలు ఏవీ లేవు. అన్నీ అందరూ చదివేస్తేనూ అన్నీ అందరికీ తెలిసివుంటేనూ మాట్లాడుకున్నట్టుగా పొడిపొడిగా ఉంది రాసింది. రచయిత ఆవేదన తప్ప మిగతాదేదీ అర్ధం కాలేదు. ఆయన ఇటీవల ట్రెండ్స్ ఏమిటో ఎట్లా సాగుతున్నాయో కూడా కొంచెం ఉదాహరిస్తే పాఠకులకి కాస్త సులువయ్యేది విషయం. ఈమాట వాళ్ళు అనుభవం లేని రచయితలకి కాస్త వర్క్ షాప్ లు నిర్వహించి తమ పత్రికకి కాస్త సిస్టమాటిక్ పధ్ధతిలో రచనలని రప్పించుకోవచ్చును. ఈ విషయంలో ఈమాటలో ఏమంత దృస్టి ప్రత్యేకమైనది కన్పించదేమో??

    “క్షీణయుగం” లాంటి మాటలు చాలా పాతవి. రచయితల్లో పస ఉన్న రచయితలూ లేని రచయితలూ అన్ని కాలాల్లోనూ ఉంటారు. మంచి సాహిత్యం ఎప్పుడూ రాశి లో తక్కువే వస్తుంది. రచనల పేర మనకి కన్పించే చాలా భాగం వట్టి ఊక… పొల్లూను. ఆ సంగతి ఆ రాసేవాళ్ళకీ తెలుసు. వాటిని చదివే వాళ్ళకీ తెలుసు. కొత్త ప్రశ్నలు పుట్టుకు రావడం ఎంత సహజమో మరి కొందరిలో ఇంకా పాత చీకటి మిగిలిపోయి… వారు అందులోనే తిరుగాడటమూ అంతే సహజమ్. చాలా అభ్యుదయమైన మాటలు పైకి మాట్లాడే మగవాళ్ళు చాలా మంది తమ చేతల్లో ఎంత నిరంకుశంగా ఉంటారో ఆడవాళ్ళకెందరికో అనుభవేకవేద్యం. రచయితలు సైతం ఇందుకు భిన్నం కాదు. ఇది సమాజం లోని అభ్యుదయ రాహిత్యాన్ని పట్టిస్తుంది. అదే వారివారి రచనలలోనూ ప్రతిఫలిస్తుంది. ఆ రాతల ద్వారా వారి పరువుని వారే చేజేతులా ధ్వంసం చేసుకోదలుచు కున్నారన్నమాట. చరిత్ర అన్నది ఒకటి మన ప్రమేయమే లేకుండా సాహిత్యాన్ని విశ్లేషిస్తుంది కదా? అప్పుడు స్త్రీలని దుర్భాషలాడిన వాళ్ళు ఏ వర్గంలో మిగలగలరో ప్రత్యేకంగా చెప్పాలా ఎవరైనా?? క్లుప్తాతిక్లుప్తంగా ఒక్కటీ ఉదాహరించకుండా ఇవాళ్టి కవిత్వపు తీరుతెన్నులని గురించి అస్పస్టంగానూ.. అతి సాధారణం గానూ తొందరతోనూ రాసేసినట్టున్న వ్యాసం[?] లా ఉంది ఇది.

    అయితే తమ వ్యక్తీకరణలకీ అనువైన వేదిక ఒక్కటీ లేదన్నది కవులలో చాలామందికి తెలుసనుకుంటాను. ఎక్కడ రాయాలో తెలియకపోవడం..ఇదివరకటి పత్రికలు కూడా ఇవాళ సాహిత్యానికి ప్రాముఖ్యతనిచ్చేవి ఏవీ తెలుగునాట లేకపోవడం అన్న కొన్ని ముఖ్యమైన కారణాలని నందివాడ ప్రస్తావన చేయడం గమనించవలసిన విషయమే!! ఇది తెలుగులో క్రమేపీ రచనల కొరతకీ.. రచయితల కొరతకీ కూడా ఉత్తరోత్తరా ఒక కారణం కావొచ్చునేమో?? ఎందుకంటే ఆదరణలేని చోట ఏదీ పుట్టి వికసించదు.ఇందుకు ఉద్యమాలు లేకపోవడమ్ ఉండటమ్ అన్నది ఒక్కటే కారణం కాదు. సమాజంలోనే కవిత్వమ్ పట్ల తెలుగు సాహిత్యం పట్ల ఒక ఉదాశీనత ప్రబలడమ్ …రాయడమ్ అన్నది వెనకబడటం సమాంతరంగానే జరుగుతాయి. ఇక మందగించడం అన్నది నిజంగా జరిగిందా లేదా వేరే వర్గపు తీరు వ్యక్తీకరణలో మారి అది పాఠక వర్గపు రుచికి భిన్నంగా ఉండి నలుగురి దృష్టినీ చేరకుండా మిగిలిందా? అన్నది కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా రచనలో సత్తా ఉంటే అది స్వతహాగానే దృస్టిని ఆకట్టుకుంటూందనీ లేనిది ఎవరెన్ని కితాబులిచ్చినా.. దానికదే జారిపోతుందనీ అనుకోగలమే గానీ మంచి రచనని మనమ్ రప్పించనూలేము. అది దానికది రావాల్సిందే!! అలాగే చెత్త రచనలని ఆపనూలేము.

    యశస్వి.

  1055. తెలుగు సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం మొదలవుతోందా? గురించి m.srinivas గారి అభిప్రాయం:

    07/07/2011 6:16 am

    ఇప్పుడొస్తున్న సాహిత్యంలో కొన్ని మంచి రచనలు లేకపోలేదు. వస్తువు విషయంలో గానీ, వ్యక్తీకరణలో గానీ, తెలుగు రచయితలు ఇదివరకటికన్నా గాఢతనూ, పరిపక్వతనూ సాధించారు. మూస పోసినట్లు కాకుండా భిన్న కోణాల్లోంచి జీవితాన్ని చూడడం చూపించడం ఇటీవలి రచనలలోనే ఎక్కువ కనబడుతోంది. Post Modernism , magic realismవంటి ధోరణుల ప్రభావం తెలుగు సాహిత్యం మీద కొంత మేరకు పడి మనకు కొంత మంచి సాహిత్యాన్నిచ్చింది. అలాగే వ్యక్తిగత అనుభవాలనూ, అనుభూతులనూ కథల్లోనూ కవిత్వంలోనూ బలంగా చిత్రించడం ఇటీవల బాగా ఎక్కువగా కనబడుతున్న పరిణామం. అనుభూతివాదులు ఎప్పట్నుంచో ఈ ధోరణిలో రాస్తున్నా, 90వ దశకం వచ్చే వరకూ దానికి తగినంత గుర్తింపులేదు. వైయక్తిక అనుభవాలను తమ సిద్ధాంతాలకు వాహకంగా దళిత స్త్రీవాద సాహిత్యకారులు వాడడం వల్ల వాళ్ళ సాహిత్యంలో ఒక గాఢత, ఒక చిక్కదనం కనబడ్డాయి. అందువల్లే ఇవాళ ఈ తరహా సాహిత్యానికి ఒక కొత్త ప్రాముఖ్యత ఉంది.

  1056. మూడు లాంతర్లు – 6 గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    07/06/2011 7:04 am

    కనకప్రసాద్ గారు,

    వ్యాసం ఎప్పటిలాగే బావుంది. వారం క్రితమే నేను త్రిపుర గారిని మొదటి సారి కలవడం వల్ల మీరు చెప్తున్న విషయాలు ఇంకా బాగా అనుభూతి చెందగలిగాను. ఐతే నాదో సందేహం..

    “ఇప్పుడు నేను కధలూ కవిత్వాలూ గట్టా రాస్తే గనక అవి ‘జూటా’ కాకుండా ఉండాలంటే కొంతమటుక్కైనా ఇంగ్లీషులో నడవాలి, అందులోకి అమెరికన్లు, యూరోపియన్లు, ఇంకా ఈ అందరు జాతులవాళ్ళూ, బీదవాళ్ళూ గొప్పవాళ్ళూ, గొప్ప పండితులు, వెర్రోళ్ళు, లేబరు వీళ్ళందరూ దిగాలి”

    దీన్నిబట్టి చూస్తే కాల్పనిక సాహిత్యం, చారిత్రాత్మక నవలలు ఇవన్నీ మొత్తం “జూటా” లేనా? మన ఆత్మకథ ఒక్కటే మనం రాయగలిగిన సత్యమా? వివరించగలరు.

    – సుబ్రహ్మణ్యం.

  1057. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి తృష్ణ గారి అభిప్రాయం:

    07/06/2011 1:30 am

    చిన్ననాటి జ్ఞాపకాలని కదిలించిందండి కవిత.. చాలా బాగుంది.

  1058. రీ యూనియన్ గురించి రాజేష్ దేవభక్తుని గారి అభిప్రాయం:

    07/05/2011 4:59 am

    వైదేహి శశిధర్ గారు

    కవిత చాల బాగుంది. ముఖ్యంగా ఈ లైను నాకు బాగా నచ్చింది. ” ఇప్పటి మనలో అప్పటి మన ఛాయల్ని పరస్పరం వెతుక్కుంటూ
    తెలియని అసంతృప్తిని అశాంతిగా మోసుకుని మనిద్దరం మౌనంగా సెలవు తీసుకుంటాం. “

  1059. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి నరేష్ నందం గారి అభిప్రాయం:

    07/05/2011 3:11 am

    చాలా బాగుంది. కొంచెం గమనించాలే గానీ.. లోకమంతా కవితాత్మతో నిండి ఉన్నట్లనిపిస్తోంది. అందుకే శ్రీశ్రీ అన్నారు.. కాదేదీ కవితకనర్హం!

  1060. అర్థంకాని కవిత్వం గురించి N.VIJAYARAMULU గారి అభిప్రాయం:

    07/04/2011 10:12 am

    వ్యాసం బాగుంది.విశ్లేషణ అంత లోతుగా లేదనిపిస్తుంది.ఆధునిక కవిత్వంలొ ఉన్న అస్తిత్వవాదాల మూలాలకు వెళ్లగల్గితే బాగుండేది.

  1061. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    07/04/2011 5:32 am

    మీ వ్యాసాల్లో మాటి మాటికీ ప్రస్తావించే “కపటంలేని కాల్పనిక ధార”కి గొప్ప ఉదాహరణగా నిలుస్తుందీ కథ! కళ్ళ ముందు మిరుమిట్లుగొలుపుతూ ఆవిష్కృతమయ్యే ప్రపంచాన్ని అక్షరాల్లోకి పట్టడమెలాగో తెలీక , అందుకు తగ్గ భాషనీ, పదచిత్రాల్నీ సమకూర్చుకోలేక చతికిలపడ్డ సందర్భాలెన్నో! “ఊహ కందే సంగీతంలో పాట కందేది శతసహశ్రాంసం ఉండదు” అన్నారు “కానుక” కథలో ముళ్ళపూడి వారు. మీ ఊహకందే జీవితం మీ కథల్లో దాదాపు ఉన్నదున్నట్టుగా ఆవిష్కరించగలుతున్నందుకు మీరు ధన్యులు. అందుకే మీ కథలు, కవితలు అంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం, గౌరవం. తప్పక రాస్తూ ఉండండి.

  1062. చేరాతో ముఖాముఖి గురించి Vidya గారి అభిప్రాయం:

    06/08/2011 12:59 am

    చేరా గారితో ముఖాముఖి చదివాను. ఆయన చేయదల్చుకున్నవి(తెలుగు ఛందస్సుపై ఇంగ్లీషులో పుస్తకం, బాల ప్రౌఢ వ్యాకరణాలకు కొత్త వ్యాఖ్య, ప్రాచీనాంధ్ర భాషా వ్యాకరణం ఇంగ్లీషులో, తెలుగు వచనశైలికి నమూనాలు ఏరి analyze చెయ్యటం, కవిత్వం ఎట్లా చదవాలి?) ఇప్పటికే(2011) చేసారొ, ఇంకా చేయలేదొ. పై విషయాలు కి సంభందించిన గ్రంధాలు ఏమైనా వుంటే వాటి వివరాలు తెలుపగలరు.

  1063. మధ్య వ్యవధిలో నీడలు గురించి Hanuma Kodavalla గారి అభిప్రాయం:

    06/04/2011 11:47 pm

    బైరాగి కవితా సంపుటి “చీకటి నీడలు” మొదటి పేజీ నుండి,
    “ఊహకీ వాస్తవానికీ,
    క్రియకీ కదలికకీ
    మధ్య వ్యవధిలో
    నీడలు పడుతున్నయ్”

    కొడవళ్ళ హనుమంతరావు

  1064. మధ్య వ్యవధిలో నీడలు గురించి Chandra గారి అభిప్రాయం:

    06/03/2011 2:19 pm

    ఆ పేరు ఆలూరి బైరాగి నుంచి ఎత్తుకొచ్చినది.
    నేను పొరబాటున అనుకున్న సందర్భం ఇదీ:
    “బోలు మనుషులు” లో
    భావానికీ భవానికీ మధ్య
    కదలికకూ, క్రియకూ మధ్య నీడ పడుతున్నది
    భావనకూ, సృజనకూ మధ్య
    ఆవేగానికీ, అనుక్రియకీ మధ్య నీడ పడుతున్నది
    (Between the idea
    And the reality
    Between the motion
    And the act
    Falls the Shadow

    Between the conception
    And the creation
    Between the emotion
    And the response
    Falls the Shadow – From “The Hollw Men)

    ఇది ఆయనదే మరో కవిత మకుటమయి ఉండాలి. ముఖ్యంగా వూహకీ మాటకీ, మాటకీ చేతకీ మధ్య అవాంతరాన్నీ, అంతరాన్నీ సూచించదలచుకున్నా మరో అర్థమూ ధ్వనించడానికి తావుందన్న ఆలోచనతో ఆ పేరు ఎన్నుకున్నాను.

  1065. నువ్వు గురించి rajashaker గారి అభిప్రాయం:

    05/31/2011 11:30 pm

    మీరు రాసిన కవితలు చదివాను. నిజానికి దగ్గరగా ఉన్నాయి.

  1066. పిల్లల కోసం గురించి Vidya గారి అభిప్రాయం:

    05/31/2011 10:21 pm

    మొదటి రెండు కవితలు నాకు బాగా నచ్చాయి.

  1067. పిల్లల కోసం గురించి buddana veena గారి అభిప్రాయం:

    05/31/2011 2:39 am

    చాలా బాగున్నాయి మీ కవితలు…చాలా ఆహ్లాదాన్ని కలిగించాయి.

  1068. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి jayaprabha గారి అభిప్రాయం:

    05/29/2011 3:27 pm

    లవణరాజు కల లోని భోజనమ్ గురించి వ్యాసకర్తల ప్రస్తావన అయినప్పటికీ… అప్పారావు గారి తోకచుక్క లోని “చాపకూటి” ప్రస్తావనని అలాగే తోకచుక్క లోని యువకుని భార్య అన్న మాటల ప్రస్తావననీ నేను గుర్తు చేయడం – మార్పులని వాళ్ళు పైపైననే కాక వాటీ మూలాలని గురించి కూడా ప్రస్తావన చేసారు సుమా అని చెప్పడానికి మాత్రమే!! రాయప్రోలు సుబ్బారావుగారు రాసిన లాంటి దేశభక్తీ అప్పారావుగారు రాసిన దేశభక్తీ ఒక్కలాంటివి కావు. వాళ్ళ గొంతుకలు వేరు. వాళ్ళ ఊహలు వేరు. వాళ్ల ఆదర్శాలూ వేరు. అప్పారావు గారు భావకవిత్వానికి ప్రేరకుడూ కాడు. ఆద్యుడూ కాడు.

    మనవాళ్ళు కాశీమజిలీకధలూ ..హంసచెప్పినకధలూ చిలకచెప్పినకధలూ ఇవన్నీ జానపద విభాగంలో భాగంగా చేసి ఉండకపోవచ్చు. ఈ రకమైన పేర్లు ఇంగ్లీషు వాళ్ళు ఆ తర్వాత పెట్టినవి కావొచ్చు. కానీ ఆ తరహా సాహిత్యం మనకి కొన్ని వేల ఏళ్లుగా ఉన్నప్పుడు తిరిగీ దానిని గురించి మాట్లాడటమ్ కేవలం ఇంగ్లీషు ప్రభావం వల్లనే జరిగిందని అనడం పరిధిని కుదించి వ్యాఖ్యానించడమే!!. ఇందుకు అలాంటి మాటలు ఇంగ్లీషువాళ్లకి ముందులేవని చెప్పే ఆధారాలు ఏమన్నా ఉండాలి. సాహిత్యం ఉండీ దానికి ఒక ప్రత్యేకమైన పేరు లేకపోతేనే అంతమాత్రానికే అది ఇంగ్లీషు ప్రభావమ్ అని అనేయగలమా?అన్నది ఒక ప్రశ్న.

    మనవాళ్ళు సంధ్యావందనమ్ చేస్తూ చెప్పే సంకల్పమ్ ఏళ్ల వెనకటిది. ఇటీవలది కాదు.అప్పుడు వాళ్ళు “భరతఖండే” అని అన్నారు కద. అంగ ఖండే వంగఖండే కాశ్మీర ఖండే అని సంకల్పం చెప్పలేదు కద? ఇది ధార్మికంగా హిందూ సంస్కృతి ఏకమన్న నమ్మకానికి మంత్రరూపమేనని అనుకోకపోడానికి ఏమి కారణం?? వేమన బ్రౌన్ దొర మెచ్చుకుంటాడని శతకం చెప్పలా! వేమన హిందువులనీ ..ముఖ్యంగా భ్రాహ్మలని వారి ఆచారాలనీ విమర్శించినందుకు మాత్రమే క్రైస్తవుడైన బ్రౌన్ కి ఆ శతకం ఎక్కువ నచ్చింది. ఆయన వేమనని అనువాదం చేయపూనుకోడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం.

    రాయవాచకలోకాబోలు ఒకచోట పురుషోత్తమ గజపతిని తిమ్మరుసు సాటి హిందూ రాజుగా ఆయన ధర్మనిరతిని గురించి రాయల దగ్గర మెచ్చుకున్నట్టూ… నరపతులకీ గజపతులకీ వైరం ఉన్నా అది సుల్తానులతో ఉన్న వైరంలా ఉండకుండా ఉండాలని కాంక్షించి అలా రాయలు ప్రవర్తించేలా ప్రేరేపించినట్టు ఒక ప్రస్తావన ఉండటం గమనించ వలసిన అంశమే!! హిందూదేశ ఏకతకి బ్రిటీషు వ్యతిరేకత ఎంత పనిచేసిందో ఈ దేశంలో ఉన్న సంస్కృతీ ఏకత కూడా అంతే పనిచేసిందన్నది అంతే ముఖ్యమైన అంశం అవుతుంది. అందునా రాజుల కన్నా ప్రజల మధ్య ఈ ఏకత వివాహాది విధానాల ద్వారా ఇచ్చిపుచ్చుకోవడాల ద్వారా బలపడింది. భాస్కర్ గారన్నట్టు అంగవంగకళింగదేశాల లోని పిల్లలపట్ల వివాహాలకి లేని అభ్యంతరం మ్ళేచ్చజాతుమ్ళేచేయడం పట్ల ఉండటం భరతఖండంలో ఉన్న ఏకత కి నిదర్శనమే కద.

    ఇకపోతే కాశ్మీరం నించి కేరళ దేశం దాకా పదకొండవ శతాబ్దం లోనే జయదేవుని అష్టపదులకి నకళ్ళు రాయిచుకుని ప్రాంతీయ భాషలలోకి తర్జుమా చేసుకుని ఆనందించినట్టు మనకి సంస్కృత సాహిత్య చరిత్ర చెబుతోంది. నేపాల్ తో సహా! ఇలాంటి సారస్వత ఆదాన ప్రదానమ్ ఇంగ్లీషు వారి రాకతో సంబధం లేకుండానే జరిగింది. మనకి ఉన్న ఒక సమైక్యత ఇంగ్లీషువాళ్ళ వల్లనే వచ్చిందని అనుకోవడం మనకి ఉన్న సంస్కృతీ నేపధ్యాన్ని కాదనడమే ఒకరకంగా !! అలా భావించడం బహుశా ఇటీవలి మార్పేమో !!

    నిన్న విపులంగా రాయడానికి కుదర లేదు. అందుకు మళ్ళీ ఈ మాటలని జోడిస్తున్నాను.

    జయప్రభ.

  1069. ప్రేమ కవితలు గురించి umar గారి అభిప్రాయం:

    05/28/2011 2:50 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  1070. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి jayaprabha గారి అభిప్రాయం:

    05/27/2011 2:33 pm

    చాలా ఆలస్యంగా చదివాను ఈ వ్యాసాన్ని. నా ముందు అభిప్రాయాలు చెప్పిన వారన్నట్టు ఈ వ్యాసం బలహీనమైన వాదనతోనూ అనవసరమైన ఒక తొందరతోనూ హడావిడిగా ముగిసింది. దానిని అటుంచి వెల్చేరు గురజాడని ఉదాహరణగా తీసుకుని చేసిన వ్యాఖ్య సరి కాదు. మనం ఒక కవిని గురించి సగం సగం మాత్రమే ఉదాహరిస్తే తద్విరుధ్ధమైన మాటలు కూడా అదే అప్పారావు గారి కవిత్వంలో ఉంటాయి. ఉదాహరణకి ఆయన రాసిన తోకచుక్క గేయంలో యువకుని మాటలకి ఆయన వెళ్ళి వచ్చిన చాపకూడుకి [ఇది మధ్య తరగతి భోజనం అని మనకి అప్పారావు గారేమీ పదార్ధాల వివరణని ఇవ్వలేదే? మరి నారాయణ రావుకి ఆ భోజనం మధ్యతరగతిది అని ఎందుకని తోచిందో?] గానూ ఆ గేయం లోని యువకుని భార్య ఒక మాట అంది మరి. ఏమంటే “కలిసి మెసిగిన యంత మాత్రమే కలుగబోదీ ఐకమత్యము మాల మాదిగ కన్యనెవతెనొ మరులు గొనరాదో?” అని ఆమాట. దానికి అర్ధమ్ కేవలం చాపకూటి వల్లనే ఏం మార్పు వస్తుందీ వర్ణాంతర ప్రేమలూ లేదా వివాహాలు జరగనిదే అని. ఇది భావకవుల పరిధిలో నారాయణ రావు చెప్పిన అభిప్రాయాలకి పొసగదు. గురజాడని అంచనా వేయడం ఏమంత సులభం కాదు. దీనిమీద మరింత విపులమైన చర్చ నా పుస్తకమ్ “ప్రతికూలపవనాలు” లో ఉంది. ఆసక్తి ఉన్నవారు దానిని చదవవచ్చు. పైగా గురజాడ భావకవి కాడు. ఆయన కవిత్వంలో వెల్చేరు రాసిన “దేశభక్తి” లేదు సరికదా గురజాడ రాసిన కవిత అయిన “దేశభక్తి” లో ఉన్నది విశ్వమానవ భక్తి. ఇలా ఏదేమైనా చాలా అసమగ్రమైన, అపక్వమైన అభిప్రాయాల మయమ్గా ఉన్న ఈ వ్యాసం నిరుత్సాహాన్నే ఇచ్చింది నాకు.

    మీ ఈమాట మూల సర్వర్ల, వాటి హాకర్ల చేతినించి బయటపడినందుకు సంతోషం. అందుకోసమ్ కష్టపడిన సురేష్ కొలిచాలకీ, ఇంద్రగంటి పద్మకీ నా అభినందనలు.

    జయప్రభ.

  1071. ప్రేమ కవితలు గురించి vani గారి అభిప్రాయం:

    05/13/2011 8:14 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  1072. పిల్లల కోసం గురించి Prasuna గారి అభిప్రాయం:

    05/03/2011 2:43 am

    మొదటి రెండు కవితలూ చాలా బావున్నాయండీ.

  1073. పిల్లల కోసం గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    05/02/2011 5:39 am

    ఎంత బాగున్నాయో….. మీ కవితలు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటాయి….

  1074. ప్రేమ కవితలు గురించి mani kumar గారి అభిప్రాయం:

    04/30/2011 5:44 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  1075. అనుభూతి కవిత్వం గురించి indrani Palaparthy గారి అభిప్రాయం:

    04/14/2011 3:43 am

    మొన్నామధ్య విజయవాడ వెళ్ళినప్పుడు అటక మీద నా పాత కవితల పుస్తకం దొరికింది.
    నాకు పదేళ్ళ వయసప్పుడు రాసిన కవితలు,కొన్ని కధలు,బొమ్మలు ఉన్నాయందులో.

    వ్రాద్దామని కలం తీయగా
    స్ఫురించింది ఇంకు లేదని
    పోద్దామని సీసా తీయగా
    గుర్తుకొచ్చింది అయిపోయిందని
    కొందామని షాపుకెళ్ళగా
    ఙ్ఞాపకమొచ్చింది ఆదివారమని
    ఇంటికొచ్చి లైటు వేయగా
    తెలియజొచ్చింది కరెంటు లేదని
    అప్పుడు తెలిసింది
    తాను ఏమీలేని బికారినని
    ఇది తన కల మాత్రమేనని. (30.06.87)

    మనస్సు మందిరంలో మరచిన సత్యం
    గుండె గదుల్లో ప్రతిధ్వనించగా
    ఉప్పొంగిన ఆవేశం
    ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
    అదుపు తప్పిన మనసును
    ఆపలేకపోతుంటే
    గుండెల్లో బరువు
    భరించలేక
    విశ్రాంతి కోసం నేను
    మృత్యు మందిరంలోకి
    వెళ్ళిపోయాను. (5.07.87)

    ఇది చదువుకుంటుంటే భలే నవ్వు వచ్చింది.మనస్సుకొక మందిరం,మృత్యువుకొక మందిరం.
    రెండు మందిరాలు కట్టించాను!

    మూతి మీద మీసకట్టు
    చేతిలో కిళ్ళీ పాకెట్టు
    ఎందుకోయి ఈ కనికట్టు
    తిన్నావా పెసరట్టు
    నీ అబద్ధ్హాలు కట్టిపెట్టు
    వెళ్ళి రుబ్బురోలు పట్టు
    ఇడ్లీ ప్యాకెట్టు కట్టు
    ఇక మీద ఈ వేషాలు కట్టు
    మళ్ళీ వచ్చావో పడతా నీ పట్టు!
    (11.06.87)

    ఇలాంటి మాటల గారడీలు ఇంకా బోలెడున్నాయి.

    వాన-వాన-వాన
    చిన్నారి వాన-పొన్నారి వాన
    వాన-వాన-వాన
    చక్కటి వాన-చుక్కల వాన
    పూల వాన-నీళ్ళ వాన
    వాన-వాన-వాన
    చిన్నారి చినుకులు లేపెలే జగమును
    నదులను,చెరువులను నింపుతూ వచ్చెలే
    నెమ్మిలి తకధిమి నృత్యం చేసే
    చిన్నారి లేళ్ళు గంతులు వేసే
    కప్పలు సైతం తెలిపె సంతోషం
    బెకబెకమంటూ ఆనందపడెను
    వాన-వాన-వాన
    చిన్నారి వాన-పొన్నారి వాన
    చక్కటి వాన-చుక్కల వాన
    పూల వాన-నీళ్ళ వాన.
    (30.06.87)

    పూల మీద,సూర్యుడి మీద,చెట్ల మీద ఇంకా బోల్డు కవితలు.

    దీని “తవికలు” మళ్ళీ తెచ్చింది బాబోయ్! అని మా మేనత్తలు ఎగతాళి చేస్తున్నా,”నాయనా, ఇంద్రా,నీ కవిత ఏదీ వినిపించు” అని అడిగే తాత గారి కోసం,ఆయన పక్కన కూచుని,ఆయనకే కాకుండా ఇంట్లో ఉన్న అందరూ తమ తమ పనులు వదిలిపెట్టి పరిగెత్తుకు వచ్చేలా గట్టి గట్టిగా ఈ పుస్తకంలోని కవితలు చదివి వినిపించేదాన్ని.

    పుస్తకంలో పేజీలు పసుప్పచ్చ రంగుకి తిరిగిపోయాయి.

    దాన్ని తిరిగి బస్తాలో పెట్టేసి,బస్తా మూతి బిగించి అటక మీద పారేసాను.

    పాలపర్తి ఇంద్రాణి.

  1076. భాషల ఋతువు గురించి Sowmya గారి అభిప్రాయం:

    04/13/2011 2:59 pm

    “బలానికి పాలు
    జేబులో బలపాలు”
    – :)) పైన శ్రీనివాస్ గారు అన్నట్లు, నాకూ ప్రకటనలాగానే అనిపించింది.
    ఆనంద్ కుమారస్వామి వంటి వారు రాస్తే, ఈ కవితే దీర్ఘ కవిత ఔతుందేమో! (ఆయనకి అన్ని భాషలు వచ్చునట మరి!!)

  1077. కుండీలో మర్రిచెట్టు గురించి vengal rao గారి అభిప్రాయం:

    04/13/2011 6:36 am

    నమస్కారములు. మీ కవిత బాగుంది

  1078. రెండు కవితలు గురించి అవినేని భాస్కర్ గారి అభిప్రాయం:

    04/10/2011 6:36 am

    మీ కవితలు భలే బాగున్నాయండి. మీ బ్లాగు పేజీలో కూడా మఱికొన్ని కవితలు చదివాను. బాగా రాస్తున్నారు! మీ చేత ఇంకా ఇంకా మదిని ఆకట్టుకునే ఆనందమైన కవితలు రాయగలిగించే సంఘటనలు మీ జీవితంలో చోటుచేసుకోవాలని ఆశిస్తూన్నాను 🙂

    -ఆవినేని భాస్కర్.

  1079. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/29/2011 2:01 pm

    మనకి అన్ని కాలాల్లోనూ popular art forms ఉన్నాయి. అలాగే fine arts ఉన్నాయి. ఈవ్యాసంలో మొదలుపెట్టిన గొంతు వ్యాసం మొత్తం మీద లేదు. సినిమా పాటల విషయంలో కాలాన్ని గురించి అంత సానుకూలతని ప్రదర్శించిన వీరే గ్రూప్ డాన్స్ ల విషయాని కొచ్చేసరికీ చాదస్తపు గొంతుని విన్పించారు.

    ఎప్పుడైనా ఒకే కాలంలో జనసామాన్యపు అభిరుచి [డబ్బులొస్తుందనుకుంటే..] popular art forms లో ఎక్కువ చోటు చేసుకుంటుంది, mass media ల్లో! సినిమా ఎప్పుడూ మాస్ మీడియానే. పైగా డబ్బులు సంపాదించుకుందికి అత్యధిక మొత్తంలో సొమ్ములని వెచ్చించి జూదం ఆడిన పధ్ధతిలో ఒక మూసలో నడిచే కళ కూడా!! అక్కడ డబ్బు మాత్రమే ప్రధానం మిగతావాటికన్నా!! ఆత్రేయ రాసినా, వేటూరి రాసినా, సీతారామ శాస్త్రి రాసినా.. ఇంకా మిగిలిన సినిమా కవులెవరన్నా రాసినా డబ్బుకోసమే!! అంచేత డబ్బులు తెచ్చే విధంగా మాత్రమే రాయమని వారిని ఆ నిర్మాతలు అడగడం తప్పదు. వీరు రాయకా తప్పదు. అందులో మంచివీ జనరంజకమైనవీ ఉంటాయి. కానివీ ఉంటాయి. డబ్బులు ఎక్కువ వచ్చేది నాటు శృంగారంలోనే గనక చినమా కవులు ఎక్కువగా ఆయా అర్ధాలని వచ్చే విధంగా రాయడం తప్పనిసరి. ఈ విషయం ఆ రాయమనే వారికీ తెలుసు. ఈ రాసే వారికీ తెలుసు. ఇక్కడ ఎవరూ అమాయకులు కారు.పాతకాలంలో కేతిగాడూ, బంగారక్కా లాంటి వీధిబాగోతాల పాత్రలు సినిమాల్లో సమకాలీన అవసరాలని తీర్చేలాగా రూపొందాయి. అయితే సినిమా మాధ్యమం targeted audience ఎవరు అన్నదాని ఆధారం గానే వాడే భాషా, పాటల్లోని అర్ధాలూ, సంగీతమూ ఉంటాయని ఖచ్చితంగా ఏమీ చెప్పలేం. ఎలాగైతే సినిమాలోని హీరోయిన్ వాడే సంభాషణలూ, వొలకబోసే వయ్యారమూ ఆమె అవన్నీ నచ్చి చేస్తోందని మనం చెప్పలేం. అది ఆ సినిమా దర్శక నిర్మాతల అభీష్టం బట్టి రూపొందుతుంది.

    పాపులర్ కళ ఉన్నా సమాంతరంగా మనకి ఇతర కళలు కూడా అవసరమై ఉంటూనే ఉన్నాయి. వాటిలో డబ్బుకి ఉండే స్థానం రెండవదీ, కళాత్మకత మొదటిదీ. అందువలన ఇతర లలితకళలన్నీ అన్నికాలాల్లోనూ కొనసాగుతూనే ఉన్నాయి. సమకాలము మాత్రమే సాహిత్యానికీ సంగీతానికీ కొలమానం అయితే “ఈమాట”లో త్యాగరాజు మీద వ్యాస పరంపర అవసరం ఉండదు. అలాగే గడిచిపోయిన రచయితల రచనలని గురించిన చర్చా ఉండదు. ఇవాళ్టి వాళ్ళ కవిత్వం మాత్రమే వేసుకుని పత్రిక నడుపుకోవచ్చు కదా? కానీ అలా చేయడం లేదెందుకనీ? చాదస్తం వల్లనేనా? కాదే? అలాగే సినిమాల విషయంలో సైతం అభిరుచి అన్నది ప్రమాణం అయితే ఇవాళ్టి సినిమా ఎవరి అభిరుచిని ప్రతిబింబిస్తోంది అన్నది ముఖ్యమైన ప్రశ్న అవుతుంది. ఈ వ్యాస రచయితా త్రయం చదువుకున్నవారే అయి ఉండి సినిమా పాటకి “సామాజిక అంతరాలూ, ఆడామగా తేడాలూ లేవు” అని చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. ఎందుకు లేవూ? ఖచ్చితంగా ఉన్నాయి. ఏ ఆడపిల్లా వేటూరి గొంతు పెట్టుకుని “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ” అని పాడదు. అలాంటి పాట వేటూరిది. అమ్మాయిల మనోభావాలని అనుసరించి వచ్చింది కాదు. అమ్మాయికి స్వేచ్చ ఉండి పాడుకోగలిగితే మరి ఇంకెలాగైనా పాడుకునేదేమో గానీ.. వేటూరి సుందర్రామ్మూర్తి రాసినట్టు కాదు. అలాగే ఇతర వర్గాల తేడాలు కూడా!! సినిమాల్లోని భాష ఏ వర్గపు అవసరాలు లేదా ఆశయాలూ ముఖ్యమో వాటిని నెరవేర్చడానికే తయారైనది. అమాయకంగా ఏమీ రూపొందింది కాదు. త్యాగరాజ కీర్తనలకి డిమాండ్ ఉండి డబ్బులొస్తాయని అనుకుంటే మన డిస్ట్రిబ్యూటర్లూ మన ఫైనాన్సర్లూ దానికే డబ్బుపెడతారు. డబ్బులకోసం రాసే పాటలో ఎప్పుడూ ఉత్తమ విలువలు ఉండలేవు. దీనికి కాలం కాదు ప్రతిబంధకం! సమకాలపు అభిరుచి కూడా కాదు. వీళ్ళు ఇన్ని సినిమా పాటలని వివరించి రాసేరు. నేను మరి ఇవాళ్టి కాలానికి చెందిన దాన్నే గానీ వీళ్ళ లిస్టులోని చాలా పాటలు మరి నాకు తెలీదు. నేను సినిమాలని తెగ చూసే అలవాటున్నదాన్నీ కాను.

    ఏతావాతా చెప్పొచ్చేదేమంటే జనం అభిరుచి అంటూ ఉండదనీ వాళ్ళు తీసేది వాళ్ళు రాసేదీ జనం అనబడు వారు తమ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చూడటమో వినడమో చేయవచ్చు కానీ అవన్నీ “సమకాలము వారి అభిరుచిని” ప్రతిఫలిస్తున్నాయని మనం సాధికారంగా ఏమీ చెప్పలేమనీ నా ఉద్దేశ్యం. తాడేపల్లి హరికృష్ణ గారన్నట్టూ పద్యనాటకాలకీ ఇతర కళారూపాలకీ వచ్చే జనమూ ఇవాళ్టి కాలం వాళ్ళే!! చాయిస్ అని ఒకటుంటుంది మరి. దాని ప్రకారమే బతకడానికి సమకాలం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ఎప్పుడూ కూడా ఈ “చాయిస్” అన్నది తక్కువగా దొరుకుతుంది ఏ కాలంలో బతికిన వారికైనా!! సినిమా పాటా మాటా ఆటాతో సహా!

    రమ.

  1080. ప్రేమ కవితలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/28/2011 1:16 pm

    హమ్మయ్య ..ఇన్నాళ్ళకి ఒక్క గొంతు “ఈమాట” లో అచ్చయ్యే చాలా చెత్త కవితలమీద ఒక పేరడీ విన్పించింది. అందుకు ముందుగా శశికి అభినందనలు. ఈమాట వాళ్ళు “పీర్” రివ్యూ పధ్ధతిని పాటిస్తూ పైగా తమ అత్యుత్తమ విధానం లోంచి మరీ “ఎంపిక” చేసుకున్న గొప్ప కవితలు ఎంత నాసిగా ఉన్నాయో వారెప్పుడూ పరికించి చదువుకున్నట్టు లేదు. ఎవరేం రాస్తే దాన్ని అచ్చు వేసేస్తూ పేద్ద పేద్ద మాటలెందుకో మరి చెప్పేది? ఉదాహరణకి ఈ కవితనే చూడండి.మూడో స్టాంజా చివరి లైన్లూ.. నాల్గో స్టాంజా మొత్తంగా చెత్త. అర్ధం పర్ధం లేదు. అయినా ఆహా ఓహో అంటూ ఏకవాక్య మెచ్చుకోళ్ళూను. ఈమాట అంతా నిండి అనేకమైనవి …భాష లో బెండు లాంటివీ.. ఊహలో ఊక లాంటివీ ఎన్నో! అన్నీ కవితలే కవితలు కవితలు ..తక్కెడ కొలతన.:)

    రమ.

  1081. మేఘాంగన గురించి GSCS Siddhartha గారి అభిప్రాయం:

    03/28/2011 3:42 am

    పదస్వరూపాలు తెలుసుకోకుండా కవిత్వం రాసింది కాకుండా పాఠకులకు పదస్వరూపాలు తెలియవనీ అవేవీ తెలియకుండానే కవిత్వాలు చదివి అభిప్రాయాల్ని వెలిబుచ్చేస్తారనీ దానివల్ల చాలా మందిలో అపోహలు తలెత్తేస్తాయనీ, కవిత్వాన్ని కవిత్వం కాదని తేల్చేస్తారని అందుకే వివరణ ఇస్తున్నాననీ అని అనడం దురహంకారానికి నిదర్శనం.

    పాఠకులు యుక్తాయుక్త వివేచన లేనివారనుకోవడం పెద్ద తప్పిదం. నేను లేవనెత్తిన సందేహాలు, మీరు ఇచ్చిన వివరణలు యథాతథంగా వదిలేసి పాఠకుల్ని మీ భాషా సాహిత్య విషయిక వాదనల్లోని పసని నిగ్గుతేల్చమందాం.

    ఏ కారణం చేతైనా స్పందన రాకపోతే నాలుగైదు రోజులు ఆగి నేనే రియాక్టవుతా. బై!

  1082. వాళ్ళు రాక ముందు గురించి yedukondala swamy గారి అభిప్రాయం:

    03/28/2011 12:04 am

    కవిత బాగుంది ఊహని కలిగిస్తుంది మరింత ముందుకు సాగితే బాగుండేది.

    ఏడుకొండలస్వామి
    తిరుపతి

  1083. ప్రేమ కవితలు గురించి sasi గారి అభిప్రాయం:

    03/27/2011 2:32 am

    కవితలు కవితలు కవితలు కవితలు…
    ఎక్కడ చూసిన తక్కెడ కొలతన
    అక్కడ ఇక్కడ అంతా కవితలు.

    ప్రేమ ఫలిస్తే, వాన కురిస్తే,
    చిటికెన వేలుకు చీమ కరిస్తే…
    ఎక్కడ చూసిన తక్కెడ కొలతన
    అక్కడ ఇక్కడ అంతా కవితలు.

  1084. స్వేచ్ఛ? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/26/2011 1:44 am

    ఠాగూర్ ప్రతి వాక్యాన్నీ ఇంత విధ్వంసం చేసి చూడనఖ్ఖరలేదనుకుంటా.

    కవికి కూడా ఏమీ ఆశ లేనే లేకపోతే నిజంగానే భయపడవలసిన విషయమ్ అది. మనకి స్వాతంత్రమ్ వచ్చి ఇంకా కొన్ని పదులు గడిచింది లేదు. దాన్ని అర్ధమ్ చేసుకోకుండా ఇంత నిరాశ నింపుకోవడం అందునా యువతరానికి చెంది ఉండి అది ఏం సబబు? పోరాట పటిమ లేనట్టుగా ఉంటే అదేం సందేశం? అందుకు దేవుడేం చేస్తాడమ్మాయీ??

    ఈ అరవై ఏళ్ళ ప్రస్థానంలో ఇండియా ఎంత సాధించిందో ఎవరైనా గమనించారా?? ప్రతీ కాలం లోనూ అవినీతి లంచగొండితనం రౌడీయిజం బానిసత్వం అధికారం కోసం పాకులాటా లేవా?? సంతోషించాలి మనం. గడిచిన ఎన్నో కాలాలకన్నా కూడా ఎంతోకొంత నోరువిప్పి మాట్లాడగలిగిన యుగంలో ఉన్నాం. ప్రశ్నలు వేయగలుగుతున్నాం! ఉన్నవాటిని గమనించగలగాలి. లేని వాటిని గుర్తించి వాటిని మార్చగలగాలి. యువతరానికి ఉండవలసిందే ఒక ఉడుంపట్టు, అవిశ్రాంత పోరాట పటిమానూ. ఇలాంటి నస కవితల వల్ల ఏమీ ప్రయోజనం లేదు.

    ఇకపోతే దారుణాల మారణాలు ఎందుకూ? మొదటిపదంలో బహువచనం అవసరం ఏమీ లేదే?? దెబ్బలాడండి. ఒక ఉత్తేజంతో కదలండి. కానీ ఊరికే ఇలా “భావహీను”లవకండి.

    రమ.

  1085. అన్నీ చెప్పగల భాష గురించి Prashant Gundavarapu గారి అభిప్రాయం:

    03/24/2011 4:23 am

    కవితలో, పద్మలతగారు అసలు ఏంచెప్పదలుచుకున్నదీ స్పష్టపడలేదు. తన కవిత్వపు భాషకి ఎంత పెంకితనముందో మొదటగా ఉపమించి చెప్పిన కవయిత్రి, ఏదీ? ఆ పెంకితనాన్ని మిగతా కవిత మొత్తం మీద ఎక్కడా చూపించనే లేదే.. మరి..ఇదేమి కల్పనా? ఏదో రాసేద్దామన్న తొందర తప్ప.. ఈ కవితలో తాను చెప్పాలనుకున్న విషయాన్ని గురించి ఈమె ఒక నైపుణ్యాన్ని చూపించలేకపోయింది. శ్రీరామ్మూర్తిగారన్నట్టూ.. ఇది ఒక అతిమామూలు వ్యక్తీకరణ. “అన్నీచెప్పగల భాష” లోంచి ఏమీ చెప్పలేకపోవడమే ఈ కవిత ప్రత్యేకత అంతా! ఎందుకంటే, ఈ కవితలోని ఉపమానాల్లో ఒక పొందిక లోపించింది. ఈమె తన కవిత మొదట్లో చెప్పుకున్నట్టు తనది” పెంకితనమైన భాషే” అయితే గనక, దాని వ్యక్తీకరణే వేరు. దాని పదునే వేరు. కానీ ఈ కవిత ఊహ చాలని భావాల కలగలుపు .పాపం “ఈమాట” వారు ఏదో కొత్తవారిని ప్రోత్సహించాలని వేసినట్టుంది దీన్ని.

    కొంపదీసి, ఇలాంటి అనేక కవితల సంకలనమేనా ఏమిటి.. ఈ “అనేక పదేళ్ళ కవిత్వ సంకలనం” ఎవరా ప్రచురణకర్తలూ? అయితే, తెలుగు కవిత్వ పాఠకుల నెత్తిన ఇలాంటివి, పైగా అనేక పదేళ్ళవి… ఎన్నో ఘాటైన మొట్టికాయలేనన్నమాట.

    ప్రశాంత్ .

  1086. అన్నీ చెప్పగల భాష గురించి జాన్‌ హైడ్‌ కనుమూరి గారి అభిప్రాయం:

    03/23/2011 1:11 am

    కవిత అనేక పదేళ్ళ కవిత్వ సంకలనంలో చోటు చేసుకున్నది.
    అభినందనలు

  1087. బైపోలార్ భూతం గురించి జాన్‌ హైడ్‌ కనుమూరి గారి అభిప్రాయం:

    03/23/2011 1:04 am

    కవిత అనేక పదేళ్ళ కవిత్వ సంకలనంలో వచ్చినది.
    అభినందనలు

  1088. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి yaddanapudi kameswari గారి అభిప్రాయం:

    03/22/2011 1:22 pm

    నేను ఒక సాహిత్య విద్యార్థిని. 1984లొ ,అమృతం కురిసిన రాత్రి-వాక్యలయ భావపోషణ అన్న అంశంపై ఎంఫిల్ కేంద్రవిశ్వవిద్యాలయం నుండి పొందాను. ఆధునిక కవిత్వంలో ‘నేను’ అనే అంశంపై 1990 లో అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేశాను. నావద్ద ఈ చర్చకు సంబంధించి నేను రాసినవి, మంచి వ్యాసాలు, మీ సందేహాలను తీర్చగలవి ఉన్నాయి. నాఅచ్చైన పుస్తకాల నుండి మీకు ఎలా పంపాలో నాకు తెలియటం లేదు. ముఖ్యంగా వచన కవిత్వంలో పాదవిభజనకు సంబంధించి నా గమనింపులు కొన్ని ఉన్నాయి. నా లాప్‌టాప్ లో కీమాన్, ఐలీప్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఆ వ్యాసాలను పంపటం సాధ్యమేనా?

    పద్యం అనే మాట ను నేను కవితలోని స్టాంజాగా స్వీకరించాను. కవితలో కొన్ని పద్యాలు ఉండటంలో ఎవరికీ అభ్యంతరం ఉండదనుకుంటాను. పాదవిభజన సాధారణంగా భావ విశ్రాంతిని అనుసరించి ఉండటం నేను గమనించాను. ఇక ఒక పాదాన్నో, మాటనో, పునరావృతం చేసి, హైఫన్ ను ఉపయోగించి, లేక ఒకేపదాన్ని ఒకపాదంగా చేసి , కవులు తాము చూపదలచుకొన్నప్రభావాన్ని చూపుతున్నారు. బైరాగి ‘నాక్కొంచం నమ్మకమివ్వు లో హైఫన్ను ఉపయోగించుకొన్నాడు ఆ కాలంలోనే. ఇక కవిత్వంలో శబ్దం నిశ్శబ్దం అనే వ్యాసంలో నేను వచనకవి వాడుతున్న ఎన్నో సాంకేతిక విన్యాసాలను చర్చించాను. ఆ వ్యాసాన్ని మీకు ఎలా పంపాలో నాకు తెలియటంలేదు. వ్యాసంలో అయితే ఒక్కొక్కొక్క విషయం క్రమపద్ధతిలో ఉంటుంది.
    డా.వై. కామేశ్వరి.

    [ఒకసారి ప్రచురితమైన సమకాలీన రచనలకు సామాన్యంగా ఈమాటలో స్థానం లేదు, కొన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో తప్ప. మీ వ్యాసాలను ఈమాట చర్చావేదికలో పంచుకోండి. ఈ విషయంలో మీకు సహాయం కావాలంటే editors@eemaata.com చిరునామావద్ద మాతో సంప్రదించండి … సం.]

  1089. తెలగాణెము గురించి vageesh గారి అభిప్రాయం:

    03/19/2011 4:31 pm

    అయ్యలారా, అమ్మలారా

    నేను తెలగాణ విఫలాంధ్రప్రదేశ్ అనే పుస్తకం రాసిన. కృష్ణదేశికాచార్యుల వారి ఫ్రాంతీయిడినే . వారి విద్వత్ప్రతిభ అసామాన్యం. వారి కవిత్వంలో తెలుగుల ఐక్యతాభివ్యక్తి ఉన్నది. అది ఎదుకు సాకారము కాలేదు అన్నది ప్రశ్న . శ్రీనివాస్ గారు, తదితరులు జవాబులు చెప్పినారు .
    నేను రాజనీతి శాస్త్ర విద్యార్థిని . ఆసక్తి గల ఈ మాట చదువరులు ఈ లంకె ను చూడగలరు: http://www.clatgyan.com/Telangana-Viphalandhra-VageeshanHarathi.pdf

    మీ అభిప్రాయాలను తెలియ గొరుతున్న.
    విధేయుడు

    హారతి వాగీశన్

  1090. సువర్ణభూమిలో … గురించి జాన్‌ హైడ్‌ కనుమూరి గారి అభిప్రాయం:

    03/15/2011 8:52 am

    కవిత అనేక పదిసంవత్సరాల సంకలనలో చేర్చారు

    కవికి, ప్రచురణ కర్తలకి అభినందనలు

  1091. ధ్యానం గురించి జాన్‌ హైడ్‌ కనుమూరి గారి అభిప్రాయం:

    03/15/2011 8:41 am

    కవిత అనేక పది సంవత్సారాల కవిత్వంలోకి ఎంపిక అయ్యింది.

    కవికి, ప్రచురణ కర్తలకు అభినందనలు

  1092. ఈమాట గురించి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/14/2011 12:39 pm

    సంపాదకులకి,

    ఇది ఈమాటకి కావలసిన సంగతో.. అఖ్ఖరలేని సంగతో నాకు తెలీకపోయినా ఇక్కడ జరిగిన ఈ సంఘటన గురించి ఈమాట పాఠకుల దృష్టికి తీసుకుని రావడానికి ప్రయత్నంగా దీన్ని భావించండి.

    తెలంగాణా రాజకీయనాయకుల పోరాటంలో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెరాస వారి ఆధ్వర్యంలో మార్చ్ 10 న హైదరాబాద్ లో జరిగిన “మిలియన్ మార్చ్ ” చివరలో వికటించి, టాంక్ బండ్ మీద ఉన్న తెలుగుజాతి వైతాళికుల విగ్రహాలన్నీ తలలూ మొండేలూ తెగిపడి..మెడకి ఉరితాళ్లతో బిగించి లాగినట్టుగా కిందికిలాగబడి పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్ లో తోసివేయబడ్డాయి. అందులో కవిత్రయం వారూ అన్నమయ్య గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం, గుర్రం జాషువా వంటి కవి రచయితలూ ఇంకా మిగిలిన సంస్కర్తలూ ఉన్నారు. వీరంతా ” సీమాంధ్ర రచయితలట”. దీనిమీద నిరసన ప్రకటనలు వెలువడ్డాయి. ” తెలంగాణా కోసమ్ 600 మంది విద్యార్ధులు చనిపోతే మీరు బాధని ప్రకటించలేదుగానీ ఏవో కొన్ని విగ్రహాలు కూల్చినందుకే అంత బాధ ఎందుకు పడిపోతున్నారంటూ “..తెరాస నాయకులు ఎద్దేవా చేయడం వగైరాలన్నీ గత మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనలు. మీది సాహిత్య పత్రిక గనక… ఈ విషయమ్ మీద మీరు కూడా ఏమన్నా ప్రతిస్పందిస్తారేమోనని… మీకు ఈ సంగతిని తెలియజేస్తున్నాను.
    రమ.

  1093. About eemaata గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/14/2011 2:56 am

    మీ పత్రికలోని రచనా నిర్వహణలో ” పీర్ రివ్యూ” ముఖ్యమైన విధానంగా ముందునించీ మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఆ “పీర్ “లు ఎవరో… సృజనని తీర్చిదిద్దటంలో వారి వారి స్థాయి ఏమిటో మాత్రం మీరు ఎప్పుడూ స్పస్టం చేయలేదు. మీ పత్రికా నిర్వహణ గురించి మీరు ఏం చెప్పుకున్నా… ఆ పధ్ధతిలోని ప్రత్యేకత మీ పత్రికలో ప్రత్యక్షంగా కనిపించాలి. ఈసారి దమయంతి కవిత చూస్తే ఆమె రచనలో పదాల తప్పులని కూడా సవరించలేని ఆ పీర్ రివ్యూదారులెవరు? అని గానీ..లేదా మీరసలు నిజంగా మీరు చెప్పుకున్న విధానం లోనే మీ పత్రికని నిర్వహించగలుగుతున్నారా? అనిగానీ …చదువరులకి సందేహాలు తప్పక వస్తాయి. రచనలోని ప్రాధమిక దోషాలని కూడా సవరించలేనప్పుడు మీ సంపాదకమండలి.. అలాగే ఆ రచనని చదివి దాని గురించి చెప్పడానికి పూనుకున్న ఇతరులు పత్రికమీద అయితే తగిన శ్రధ్ధనైనా చూపించడం లేదని అనుకోవాలి. లేదా తప్పులని గుర్తించగలంత భాష …ఈ అందరిలోని కూడా లేదని అనుకోవాలి పాఠకులు.

    రమ.

    [ఈ సంచికలో అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు మేమూహించని విధంగా మామూలు కంటే ఎక్కువగానే ఉన్నాయి. క్షంతవ్యులం. – సం.]

  1094. భాషల ఋతువు గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    03/12/2011 12:34 am

    సరళంగా ఉంది.బావుంది కూడా.

    పలచగా కూడా ఉందేమో…

    “బలానికి పాలు/జేబులో బలపాలు”? హార్లిక్స్‌ ప్రకటన గుర్తుకువస్తున్నది.

    “ఎన్ని విస్ఫోటనాలెదురైనా సరే ఇక దీన్ని తలకెత్తుకోక తప్పదు” అన్నంత తప్పనిసరితనంలో పుట్టలేదనుకుంటా ఈ కవిత.

  1095. ఫాదరు జోజి గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    03/10/2011 3:55 am

    ఫాదరు జోజి ఎవరా అని వెదుక్కుంటే…హైదరాబాదు ఆర్చిబిషప్పుగా పని చేసి ఇటీవలే మరణించిన జోజి బాబు గారి పేరు తారస పడింది. ఆయన స్మృతిలో రాసిన కవితా ఇది?

    “నేలబారు గద్ద / నిడుపు సూపు నేను / నేలమీద లేను / ధూళి రేగుతాను.” అన్న చరణం కవితా సందర్భంలో, మిగతా మృదు పద చిత్రాల నడుమ బాగా అతికినట్లు అనిపించలేదు.

  1096. భాషల ఋతువు గురించి kiran babu గారి అభిప్రాయం:

    03/09/2011 1:15 pm

    చాలా బాగుందీ కవిత.

  1097. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/08/2011 2:57 pm

    లైలా గారూ,

    మీరు కథలూ, కవితలే రాస్తారనుకున్నాను. పాటలు కూడా రాస్తారన్నమాట. ఇలా ఓ పాట పాడుకోండీ, లేదా వాయించుకోండంటూ నాలుగు వాక్యాలు మా ముందు కుమ్మరిస్తే ఎలా? ట్యూనిచ్చుకు కొట్టండి. లైలా విరచత అని చివర్లో చేర్చి మరీ హాయిగా పాడుకుంటాం. goose bumps రాకపోతే అప్పుడడగండి.
    ప్రేమ పాటలు తప్ప పాడుకోకూడదా ఏం?
    ప్రకృతి ధర్మాన్ని తప్పించుకోడం ఎవరి వల్లా కాదు. త్యాగరాజు కూడా మనలాగా ఉప్పూ కారమూ రుచులు తెలుసున్నవాడే!
    మీ కోసం త్యాగరాజు రాసిన ప్రేమ గీతం. శృంగారంపాలు ఎవరికి కావలిసినంత వారు రంగరించుకోవచ్చు.
    ఈ పాట చదివి ( మీ పాట లాగ )మీరు శాంతిస్తారని ఆశిస్తూ –

    శృంగారించుకొని వెడలిరి శ్రీ కృష్ణునితోను
    అంగ-రంగ వైభోగముతో
    గోపాంగనామణులెంతో సొగసుగ (శృ)

    నవ్వుచు కులుకుచునొకతె కొప్పున
    పువ్వుల ముడుచుచునొకతె
    దువ్వుచు కురులనునొకతె కృష్ణుని
    రవ్వ జేయుచునొకతె వేడ్కగ (శృ)

    మగడు వీడనుచునొకతె రవికయు
    బిగువున జేర్చుచునొకతె
    తగును తనకనుచునొకతె పాద
    యుగములనొత్తుచునొకతె వేడ్కగ (శృ)

    సొక్కుచు సోలుచునొకతె కృష్ణుని
    గ్రక్కున ముద్దిడునొకతె
    పక్కగు రమ్మనుచునొకతె మడుపుల-
    నక్కరనొసగుచునొకతె వేడ్కగ (శృ)

    పరిమళములందుచునొకతె శ్రీ
    హరి హరియనుచునునొకతె
    ఉరమున జేర్చుచునొకతె పయ్యెద
    జరిపి వేడుకొనుచునొకతె వేడ్కగ (శృ)

    సారసాక్షయనుచునొకతె కను
    సైగను పిలుచుచునొకతె
    రారాయనుచునునొకతె త్యాగ-
    రాజ సఖుడనుచునొకతె వేడ్కగ (శృ)

    నౌకాచరిత్రం వినండి. మనసు కాస్త కుదటపడుతుంది. పాపం, త్యాగరాజుకీ తప్పలేదు ఈ ప్రేమగోలని తెలుస్తుంది.

  1098. నిరాశకై ఆశపడుతూ… గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/07/2011 3:04 pm

    “ప్రిదిలి” లాంటి మాటలని తెలుగు కవిత్వంలో వాడటమ్ ఏనాడో మానేసారు. అలాంటి మాటలకి భేషజమ్ తప్ప మరింకే భావమూ లేదివాళ సాహిత్యంలో!! ఇంతకీ… “పయ్యధరం” అంటే ఏంటీ?? “పై అధరం” అని కాబోలు. అదే అయితే పై అధరమ్ అనే అవుతుంది కానీ ఇలా పయ్యధరమ్ అవదు. అలాంటి పదమ్ లేదు. అసలంత ప్రయాస ఎందుకూ?? తేలిగ్గా సునాయాసంగా..సామాన్యంగా.. తప్పులకి చోటులేకుండా వాక్యమ్ రాయొచ్చును కదా?? ఏనాటిదో [అరిగిపోయిన] భావకవిత్వం శైలిలో ఇలా ఏమిటీ చెప్పడం??

    ఒక పదం మరో పదం అర్ధవంతంగానూ అంతే సయోధ్య తోనూ కలగలిసిపోతేనే ఎప్పుడైనా ఒక కవితావాక్యమ్ విరాజిల్లుతుంది. అంతేగానీ చదువుతూంటే పంటికింద రాయిపడ్డట్టుండటమ్ వల్ల నొప్పేనొప్పి ..చికాకూను.

    ఇంకా ఈవిడ కొత్తగా రాస్తున్నట్టుంది గనక రాబోయే కవితల్లో తన రచనలో మరింత నిలకడ..మరింత నైపుణ్యమ్ చూపించగలరని ఆశించవచ్చు. పైగా ఈమెకి రాయడమ్ కన్నా చదవడం మీద ఎక్కువ మక్కువ గనక మంచి రచనలని చదివి నేర్చుకునే సంయమనం ఉంటుందని నమ్మొచ్చు కూడాను.

    రమ.

  1099. వాళ్ళు రాక ముందు గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    03/07/2011 7:10 am

    చక్కని దృశ్య కవిత

  1100. భాషల ఋతువు గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    03/07/2011 7:08 am

    చాలా మంచి కవిత….ఎంతో నచ్చింది..

  1101. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    03/06/2011 3:55 am

    కిషోర్ గారూ,

    మీ సందేహం సబబుగానే వుంది. మీరు చెప్పిన కీర్తనలో సూచించిన “గరా” అన్నది అనుప్రాసలో క్రిందకే వస్తుంది.
    ఈ “వందనము రఘు నందనా” కృతిలో చాలా అనుప్రాసలున్నాయి. నేను ఒక్కొక్క శబ్దాలంకారానికీ ఒక్కో కృతే తీసుకున్నాను. చాలా కృతుల్లో ఇవి కనిపిస్తాయి. మీరు చెప్పిన కృతే తీసుకోండి.

    వందనము రఘు నందన సేతు
    బంధన భక్త చందన రామ

    శ్రీ-దమా నాతో వాదమా నే
    భేదమా ఇది మోదమా రామ (వ)

    శ్రీ రమా హృచ్చారమా బ్రోవ
    భారమా రాయ-భారమా రామ (వ)

    వింటిని నమ్ముకొంటిని
    శరణంటిని రమ్మంటిని రామ (వ)

    ఓడను భక్తి వీడను ఒరుల
    వేడను నీ-వాడను రామ (వ)

    కమ్మని విడెమిమ్మని వరము
    కొమ్మని పలుకు రమ్మని రామ (వ)

    న్యాయమా నీకాదాయమా ఇంక
    హేయమా ముని గేయమా రామ (వ)

    చూడుమీ కాపాడుమీ మమ్ము
    పోడిమిగా కూడుమీ రామ (వ)

    క్షేమము దివ్య ధామము నిత్య
    నేమము రామ నామము రామ (వ)

    వేగ రా కరుణా సాగరా శ్రీ
    త్యాగరాజ హృదయాగారా రామ (వ)

    ప్రతీ చరణంలో అనుప్రసాలున్నాయి. “ఓడను, వీడను, వేడను, వాడను” ఒకే రకమైన అక్షరాలతో పలికే విభిన్న పదసముదాయమది. మొత్తం కృతినిండా ఇలాంటివే వున్నాయి. వెతికితే మిగతా కృతుల్లోనూ ఇలాంటివి కనబడతాయి. త్యాగరాజు శబ్దాలంకారాలకి చాలా ప్రాముఖ్యత చూపించాడు. ముఖ్యంగా సంగీతాన్ని కర్ణపేయంగా చేయడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయో, సంగీతానికివెంత అవసరమో చూపించాడు. అన్ని కవితా ప్రక్రియల్లోకీ పాట రాయడం చాలా కష్టం. రాసి మెప్పించడం మరీ కష్టం. సశాస్త్రీయంగా రాయడం బహు దుర్లభం. అందుకే చాలా మంది కవులు కవిత్వంతోనే సర్దిపెట్టుకుంటారు. పాటలజోలికి పోరు. పోయినా శాస్త్రీయ సంగీతం వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడరు. త్యాగరాజు తరువాత మనకు మిగిలిన ఒకే ఒక పెద్ద వాగ్గేయకారుడు బాలమురళీకృష్ణ. తెలుగువారు ఆయనకెంత గౌరవం ఇస్తారో అందరికీ తెలుసున్నదే!

  1102. భాషల ఋతువు గురించి అచంగ గారి అభిప్రాయం:

    03/04/2011 8:24 am

    సాంఘిక జీవనములో, అదీ నేటి ప్రపంచములో ఇతరభాషల సాయం అత్యవసరమే…… తెలుగువారందరమూ ఒక్కవిషయం ఆలోచిద్దాం. శబ్దములో శ్రావ్యతా, రూపములో ఆధునికతా ఉన్నా ఎందుకు మనకి ఈ పర భాషల మోజు? సమకాలీన రచయితల రచనలలో మరీ ముఖ్యంగా కవితలలో కూడా ఆంగ్లపదాల విరివి నన్ను బాధించింది.
    అదృష్టవశాత్తూ చాలా పెద్ద విషయాన్ని మూడుముక్కల్లో చెప్పారు.

  1103. తవ్విపోత గురించి perugu.ramakrishna గారి అభిప్రాయం:

    03/02/2011 2:27 am

    మంచి కవిత, John.

  1104. తవ్విపోత గురించి kasinadhuni గారి అభిప్రాయం:

    03/01/2011 12:53 pm

    కనుమూరి గారు,
    మీ కవిత చదువుతున్నప్పుడు సరిపల్లి కనక ప్రసాదు గారి “Doors closing” కథ గుర్తుకొచ్చింది. బాగుంది.
    రాజాశంకర్

  1105. తవ్విపోత గురించి మోహన గారి అభిప్రాయం:

    02/26/2011 7:06 pm

    బాగుంది కనుమూరి గారూ, ఆటోగ్రాఫ్ సినిమా జ్ఞాపకానికి వచ్చింది ఈ కవిత చదివేటప్పుడు.
    – మోహన

  1106. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి V.L.RAGHAVA RAO గారి అభిప్రాయం:

    02/18/2011 6:50 am

    ఆధునిక తెలుగు పద్యమునకు కరుణను,పాపాయితనమును,తెనుగుయెదతేనెను,లాలిత్యమును,తెనుగుసొగసును ప్రసాదించిన కవికోకిల, కవితాచక్రవర్తి గుర్రం జాషువ.
    పద్య కవితకు ప్రాణము;పదపదునుకు
    రూపము;కరుణ మదిలోని జపవిలాస
    తేజము;తెలుగు తల్లికి దివ్యజగము
    జాషువాయన్న సత్యము జయముజయము
    వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
    మధురకవి,ఉభయభాషాబంధు,భారతీయగణితబ్రహ్మ,వేదగణితబ్రహ్మ
    9849448947లేదా 7416624885్ లేదా7569073645

  1107. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    02/14/2011 1:29 am

    ధన్యవాదాలు
    *
    శ్రీ మోహన,
    శ్రీ యదుకుల భూషణ్ గారికి,
    నమస్తే.
    ముందుగా మీ ఇరువురికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.
    మోహన గారూ!
    మీరు అన్నదీ నిజమే. వచన రచనలో ఒక మూడ్, ఆ నీడల ప్రభావం కవిత మీద జీరాడుతూ వుంటాయి.

    యదుకుల భూషణ్ గారూ! మీ ప్రశంస నాకొక బహుమతి లాంటిది.అంతే కాదు, బహు స్ఫూర్తిదాయకం కూడా!

    కృతజ్ఞతాభినందనలతో-
    ఆర్.దమయంతి.

  1108. చేరా కు ఒక శతమానం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    02/13/2011 7:02 am

    ఏంటో లైలా గారూ !! మీరు భలే వారు సుమా !! ఆయన రాసినది కMదపద్యమేనా?? అందులో కవిత్వం ఉందా?? వగైరా నానా ప్రశ్నలూ వేయగలరు తెలిసిన వారు చెప్పండి అని ఒక ప్రశ్న సంధించ గలరు. తీరా ఆయన రాసిన ఆ కంద పద్యాలు నాకు మాత్రం చాలా బాగున్నాయి అని ఒక జవాబు కూడా చెప్పగలరు. కోవెల సంపత్కుమార గారు రాసిన ఆ పద్యాలు మీ లాంటి వాళ్ళకి నచ్చుతాయనే కదా మరి సంపాదకులు వాటిని మళ్ళీ ప్రచురించినదీ ?! బహుబాగు.

    ఇకపోతే మీ అభిప్రాయం లోని మరో సందేహం గురించి నా సందేహం మరొకటి. ఏమంటే అసలు తెలుగులో ఎవరైనా ఆడా మగా మధ్య ఎప్పుడైనా స్నేహం అని ఒకటి ఉంటుందని అనుకున్నారా?? అలా అనుకుని అభిప్రాయపడి ప్రశ్నలు సంధించిన వాళ్ళు ఉన్నారా?? ఒక్క మీకే ఇంత చక్కని అనుమానాలు ఎట్లా వస్తాయో నాకు వచింపరాని ఇష్టం;)

    తెలుగు వాళ్ళు …అయితే, ఇద్దరు ఆడాళ్ళ స్నేహాన్నో లేదా ఇద్దరు మగాళ్ళ స్నేహాన్నో ఇబ్బంది లేకుండా ఒప్పుకుంటారు. అది ఖచ్చితంగా “అమలినంగా “మాత్రమే ఉండవచ్చని బహుశా వారి ప్రగాఢ నమ్మకం కాబోలు. రాయప్రోలు సుబ్బారావు గారి పంథాలోని తరహా స్నేహం స్త్రీ పురుషుల మధ్య ఇద్దరు రచయితల మధ్య కొనసాగడం తెలుగు వారికి ఇష్టమైన నమ్మకం ఇప్పటికీని. చాలా షరతులూ చాలా శీల పరీక్షలూ అందులో ఉండనఖ్ఖర లేదు. అలాగే .. ఇద్దరు స్త్రీలో లేదా .. ఇద్దరు పురుషులో అయితే కూడా ఈ బాదరబందీ ఉండనఖ్ఖరలేదన్నది అటు రచయితలకీ ఇటు విమర్శకులకీ కూడా స్పష్టంగానే తెలుసు. అలాంటి స్నేహాన్ని కీర్తించడంలో ఎప్పుడూ ఒక సుఖముంటుంది వీరందరికీను కదా?? మరి తెలిసి తెలిసీ.. అలాంటి సుఖాన్ని చీకాకు పరిచే తరహా ప్రశ్నలు మీలాంటి వాళ్ళెందుకు వేస్తుంటారో ఏంటో?? పాపం!! మీకు సాహిత్య రంగం ఇలా ఎప్పటికీ సుఖ శాంతులతో వర్ధిల్లడం ఇష్టం లేదు కామోసు!!

    రమ.

  1109. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి మోహన గారి అభిప్రాయం:

    02/12/2011 12:58 pm

    దమయంతి గారు, మీ అభిప్రాయములోనే కవిత్వం ప్రవహిస్తుంది. మరే లక్షణాలు అక్కర్లేదు. ఒక “వచన” రచనను చదివితే అది కవితో కాదో అర్థమవుతుంది. దాని లక్షణాలు ఎలాటివో తరువాతి కసరత్తు. ఈ కసరత్తు లేకపోయినా కవితకు వచ్చిన లోటేమీ లేదు. వచన రచనను ఎలా వ్రాయాలో చెప్పడం కష్టమే. కానీ ఒక వచన “కవితను” చదివితే అది కవితో కాదో చెప్పడము కష్టం కాదు. ఒకే కవి తన కవితనే వేరు వేరు సమయాలలో వేరు వేరు విధంగా పంక్తులుగా అమర్చగలడంటే అది అతిశయోక్తి కాదు. విధేయుడు – మోహన

  1110. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    02/11/2011 7:54 am

    వచన కవిత్వానికీ ఒక సిలబస్ వుంటే బావుణ్ణు
    ***

    గుండె , వొణికినప్పుడో, తొణికినప్పుడో
    మనసు ముసురేసినప్పుడో,, మురిసిపోయినప్పుడొ..
    కవిత్వం పుడుతుంది.
    ఉప్పొంగిన హృదయానికి కవిత్వం – ఒక ఆహ్వానం. ఒక ఆశ్రమం. ఒక ఆశ్రయం.
    ఆకాశమంత ఆవేశం – అరచేతిలో ముత్యంపూస లా మెరవడమే కవిత్వం.
    ఎంత దాహార్తికైనా..గంగాళమెత్తి వొంపము కదా నీళ్ళని?
    సాగర సౌందర్యాన్ని తిలకించాలనుకునే వారికి అలల ముద్రలే అందం. (సముద్రపు పోటు కాదు.)
    వనమల్లా పూలున్నా,, మరువమేసి కట్టిన మల్లెఫూ దండే మురిపెం.
    వజ్రం ఎంత విలువైనదే ఐనా..ఆభరణంలోనే దాని అందం.
    కవిత్వమూ అంతే. దాని కున్న ఒకానొక దివ్యాకృతిలో రూపు దిద్దుకున్నప్పుడే, ఆ సౌందర్యం, గుండెల్ని రాజేస్తుంది
    అక్షరాలెన్నున్నా..ఏర్చి కూర్చిన పద సంపద -కవితా సిరి అవుతుంది.’భావం ఒక పొంగు. అది భాషలోనె వొదిగి వుండు’ అనే చందాన..

    భావ దర్పానికి భాషా పరిధి ఒక హోదానిస్తుంది అని నా నమ్మకం. కవి తన సృష్టిని అక్షరాలలో నింపి, మనముందు ఒక చిత్ర పటాన్నుంచుతాడు. అదోఅక్షరాల వర్ణ చిత్రం. కవితాక్షరాలలో నక్షత్రాలను మెరిపించడానికి, వెన్నెలను కురిపించడానికి ఒకే ఒక మార్గం. వ్యాకరణం -.ఐతే, దాని ఆవశ్యకత వచన కవిత్వంలో ఎంత అని మాత్రం చెప్పలేను. (నాకు తెలుగు వ్యాకరణం తెలిసి వుంటే, మంచి వచన కవిత్వం రాసి వుండేదాన్నని ఇప్పటికీ భావిస్తా.).

    కారు ఓనర్ కి డ్రైవింగ్ తెలిసి వుండాలా?, అఖ్ఖర్లేదా?.. అన్నట్టె వుంటుంది. ఈ విషయం మీద చర్చించుకుంటే!

    తెల్ల దారాలు పోసి నేత నేసే నేతగాడికి- రంగులపోగులు, కల్నేతల కూర్పులు, అంచులకు జరీ పోతలూ తెలిస్తే- ఆ కోక (వస్త్రం) ఎంత వన్నె తేరుతుందో. కవిత్వ లక్షణాలు, గుణాలు, విధానాలు, పరిధులు తెలియడం వల్ల, అక్షరాల నేతలో కవిత్వమూ సింగారాల ‘సీతా కోక’ అవుతుందని నా భావన. అది పద్యమో, గద్యమో, గీతమో, గేయమో, స్తోత్రమో, శతకమో, వచనమో, దేనికైనా ఒక స్పష్టతను తెచ్చిపెట్టే శక్తి ఈ సిలబస్ కి వుంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం..

    గాయకునికి సంగీతం తెలిసి వుంటె, ఆ గాత్రం ఎలా గాంధర్వమౌతుందో, అలాగే- కవిత్వంలో – లయల హొయలు, పాద విభజనలో భావ భంగిమలూ వుంటే కవితా శిల్పం కూడా అత్యంతద్భుతంగా వుంటుందని నా అభిప్రాయం.
    పాటలెలా పాడాలో పాఠాలుగా చెబుతున్నారు. చూస్తున్నాం..
    రచనలెలా చేయాలో సూచిస్తున్నారు. చదువుతున్నాం..
    పద్యాలెలా రాయాలో వివరిస్తున్నారు. నేర్చుకుంటున్నాం.
    అలాగే,’వచన కవితలెలా వుండాలో తెలిపే ఒక గైడెన్స్ కూడ వుంటే బావుణ్ణు’ అని నేనెన్నాళ్ళణ్ణుంచో చూస్తున్నా.

    కవిత్వం’ అనే వస్తువుకి సంబంధించిన ఒక విలువైన సమాచారాన్నిస్తోంది ఈ చర్చ. ఏ సమాచారమైన సరే, అందుబాటులో వున్నప్పుడు తెలుసుకోవడం వల్ల తెలీని తనాన్ని తగ్గించుకోవచ్చేమో! కవిత్వం రాసే వారికి, ఆస్వాదించే వారికీ, ఈ చర్చ ఉపయోగకరంగా వుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    అందరికీ, అభివందనాలు.
    ఆర్.దమయంతి.

  1111. చేరా కు ఒక శతమానం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    02/08/2011 7:54 pm

    …సంపత్కుమార రాసిన పద్యాలు కవిత్వమని ఎవరూ అనుకోరనుకుంటాను.
    రమ.

    … సంపత్కుమారులే ఇది సరదా రచన అని చెప్పుకొన్నారు. …ఈ పుస్తకాన్ని ఆచార్యులు చేరాగారి సతీమణి శ్రీమతి రంగనాయకికి అంకితమిచ్చారు. ఈ శతకాన్ని ఆధారం చేసికొని ఆచార్యులను అంచనా వేయడము తప్పని నా వైయక్తిక భావన. విధేయుడు – మోహన

    రమ, మోహన, -విషయాలు కొన్ని తెలియ చెప్పినందుకు సంతోషం.
    Reading in between the lines, I get the impression neither of the two, think much of these poems.

    నాకు ఈ పద్యాలు బాగున్నయ్యి. సరదాగా ఉన్నయ్యి. పండితులకు ‘సరదా’ ఉండకూడదని నిషేధం ఏం లేదు కదా. కంద పద్యానికి విధించుకున్న నియమాలు ఉల్లంఘించారో, లేదో – అది నాకెలాగా తెలియదు. కాని సం -లు ఎంచి ఇచ్చిన ఈ పద్యాలలో నవ్వు ఉంది. నిజమూ ఉంది. మకుటంలో ‘దోస్తూ’ ‘నేస్తూ’ అన్నా, ‘చేరా’ ‘యారా’ అన్నా, పద్యంలో విషయముంది. చెప్పదల్చుకున్న విషయాలు పద్య్ర రూపంలో సంపత్ చెప్పగలిగారు. మేధావులనుంచి ప్రజలకు వచ్చే బాధలూ చెప్పారు. సమకాలీన కవులను గురించీ నవ్వారు. పిల్లలు వేళకు తిన్నారో లేదో అని పట్టించుకోక, బహుమతుల మోజులో, పిల్లల్ని ప్రైజు పిగ్గు ల్లాగా పెంచుకొనే రివాజు గురించీ చెప్పారు. అట్టి అమ్మానాన్నల పాలనలో పిల్లలకన్నా దళితులెవరురా నాయనా! -అన్నారు. మీవారూ మావారూ సాంబారు కాసుకోటానికి తప్ప నీ నా రాతలు ఎంత చేసేను – అని నవ్వుకుంటూ అంటున్నారు.

    నవ్వుతూ నవ్వుతూ రాసిన ఈ పద్యాలు నాకు బాగున్నయ్యి.

    పద్యాల్లో మైత్రి గురించి:

    ఈ పద్యాలు, ఒక మగవాడు ఇంకో మగవాడికి రాసినవి. వీరి మైత్రి ఒకటో రెండో పద్యాల్లో సూచితము. సంపాదకులు, ఇతరులు కూడా, వీరి మైత్రిని కొంత కవిత్వీకరించారు.

    Jumping to a generalisation quickly (fortified from prior reading of a few other writings in this magazine,) my impression is, friendships mostly existed ( and exist ) between ‘male’ writers. What I mean is -they are unisex friendships. There are no cross gender friendships among writers.

    డాబా మీద కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్నా, కాలవ గట్టులకు షికారెల్లినా, ఒక కవి ఇంకో యువక కవిని రిక్షా కట్టించుకుని చూస్తానికి వచ్చినా, ఇవన్నీ మగ-మగ స్నేహాలే. (ఈ పత్రికలో ఏ రాతల్లోనూ, మగ ఆడ రచయితల మధ్య సాహిత్యపరంగా, స్నేహం వ్యక్తం చెయ్యబడలేదు.)

    What prevails is ‘homophilia’ among male writers and poets. Telugu (Indian) people are very comfortable with such social behaviours. In life. In portraying them in arts. They understand and accept these ‘male’ friendships. There is never any suspicion of homosexuality. నేను అపోహ ప్రవేశపెడుతున్నానని అనుకోకండి. I don’t have the slightest inclination to do so. I really don’t expect it of Telugu. తెలుగులో చెప్పాలంటే – అంత సంబడం కూడానా.:-) I don’t think in Telugu, there are or there will be love sonnets from one male to the other, like from Shakespere to his young friend.

    In these Telugu poems, from one male to the other, there are no homoerotic overtones. In this set of poems, there is a sexual void.

    Overall, I am making an observation of prevalance of male friendships in Telugu writers and absence of sexuality in their writings.

    పుస్తకాల్లో, పత్రికల్లో, అంకితాల సంగతి, మరెప్పుడైనా.

    మళ్ళీ రాస్తాను.

    (‘ఆచార్యులు’ ‘ఆచార్యులు’ -అంటున్నారు మాటల్లో అక్కడక్కడా. అది ‘డా’ కి పర్యాయపదమనీ, ఈ రచయిత పేరులో భాగం కాదనీ, నా ఊహ. తప్పైతే, చెపుతారుగా.:-))

    లైలా

  1112. మెరుపు గురించి akella ravi prakash గారి అభిప్రాయం:

    01/30/2011 8:17 am

    మీ కవిత బాగున్నది. అన్నిటికన్నా మీకవిత నచ్చింది.

  1113. కవిత్వ మీమాంస గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    01/29/2011 12:15 pm

    చాలా బాగుందండి వ్యాసం. కవిత్వం గట్రా ఏమైనా వ్రాస్తుంటే గాని, ప్రతికొన్ని నెలల కొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుని, ఆలోచించుకుని, బుర్ర మళ్ళీ సరిగా ట్యూన్ చేసుకోవల్సిన వ్యాసం.

    థాంక్స్.

    లైలా

  1114. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    01/29/2011 7:34 am

    ఈ విషయం మీద నేను చాలా చోట్ల చర్చించాను కాబట్టి చర్విత చర్వణం అవుతుంది అని చర్చలోకి ప్రవేశించ లేదు.
    కవిత్వ మీమాంస అన్న వ్యాసంలో రెండవ భాగం కవిత్వ మీమాంస అన్న శీర్షిక కింద నా ఆలోచనలు చూడగలరు.అలాగే ఈ సంభాషణలో మూడవ ప్రశ్నకు నేనిచ్చిన జవాబు కొంతవరకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.

    చేరా ఆచార్యుల గారి చర్చ గురించి నేను చాలా విన్నాను. కానీ, ఆ పుస్తకం సంపాదించి చదివినప్పుడు (1990 లలో) నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ‘vers libre ‘(free verse) గురించి వీరిద్దరూ పట్టించుకోక పోవడం. చారిత్రక నేపథ్యాన్ని విస్మరిస్తే చర్చలో పదును పోతుంది, ఎన్ని విలువైన విషయాలను ప్రస్తావించినా. సమస్య మూలాలను వదిలి అనేకానేక విషయాలు చర్చించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఏది ఏమైనా ఈ చర్చ చరిత్రలో భాగమే కనుక తప్పక చదవ వలసిందే.

    శుష్క వచనాన్ని, శుద్ధ కవిత్వాన్ని విడదీసేది భావనా శక్తి. వచనంలో మామూలు తర్కంతో బండి నడుస్తుంది.ఎక్కువ ఖాళీలు ఉండవు. పాఠకుని ఊహా శక్తికి మేత వేయడు రచయిత. దానికి భిన్నంగా కవి పాఠకుని భావనా శక్తిని పరీక్షిస్తాడు. కవిత్వంలో తర్కం లేదు అన్న వితండ వాదం చేయడం లేదు నేను. తర్కాన్ని మించిన భావనా బలం కవితకు ప్రాణం. దాన్ని పాఠకునిలో స్ఫురింప చేయడానికి పాదకల్పన అవసరమవుతుంది. పాదకల్పన కంద పద్యాల్లోనో ఆటవెలదిలోనో ఉన్నట్టు కాకుండా స్వేచ్చగా ఉంటుంది. పాఠకునికి కవి తాను చూసిన జగత్తును చూపి తద్వారా తాను పొందిన అనుభవాన్నిసూచించడానికి సాధనం పాదకల్పన. పాద కల్పన లేకుండా , వాక్యం తరువాత వచ్చే వాక్యం ఒక తర్క ధోరణిలో పడి పోతుంది. వాక్యాల మధ్య అన్వయం హేతుబుద్ధికి అందుతుంది. కవిత్వంలో వాక్యాల మధ్య అన్వయం
    హేతుబుద్ధిని దాటిన భావనా శక్తికి సంబంధించినది.దాన్ని సాధించడానికి ఒక సాధనం పాద కల్పన.కవితకు ఒక క్రమం, నడకా,నిర్మాణం ఉన్నాయి మరి. అంతేకాదు,పాదకల్పన లేకుండా కవితలోని ఎత్తుగడ అర్థం కాదు.లయ అవగతం కాదు.

    చివరికి చెప్పేదేమిటంటే వచనం రేఖీయం(linear). కవిత వృత్తం. అది ఎలాంటి వృత్తం? దాని గణితం జోలికి పోవడం అభిప్రాయాన్నిమించిన చర్చ.

    ఈ విషయంలో ఇస్మాయిల్ గారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉపయోగిస్తుంది.

    “ఆధునిక కవిత్వానికి వచన కవిత్వ మనే దౌర్భాగ్యపు పేరు ఎవరు పెట్టారో కాని,నిజమే ననుకొని శుష్క వచనం రాసేస్తున్నారు చాలామంది.వచనంలాగే కవిత్వానికి ఒక క్రమం, నడకా,నిర్మాణం అవసరం లేదని వీళ్ళ అభిప్రాయం.ఆ మాట కొస్తే,వచనానికి కూడా క్రమం, నిర్మాణం కావాలి కదా!మనం మాట్లాడే భాషే మన అనుభవాన్ని,ఆలోచనల్నీ క్రమబద్ధం చేసే ఉపకరణం.కవిత్వం జీవితానుభవాన్ని క్రమబద్ధం చెయ్యటమే కాదు, వాటి చాటునున్న అర్థవత్వ్తాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.” (నిశ్శబ్దంలో నీ నవ్వులు, నా కవితా సంకలనానికి రాసిన ముందుమాట , భూషణీయం నుంచి.)

    కామేశ్వర రావు గారూ ,
    ఇప్పటికి మీ మొదటి ,మూడవ ప్రశ్నల కు సమాధానం వచ్చిందే అనుకొంటున్నాను. ఇక మిగిలింది రెండవ ప్రశ్న.
    ౨.
    ” అ.ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని,
    ఆ. పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?”
    ( అ. ఆ లు నావి , స్పష్టత కోసం )

    ‘vers libre ‘(free verse ) స్ఫూర్తితో ఆలోచిస్తే (ఆ )సమంజసం కాదు. కానీ, ‘vers libre ‘(free verse ) పాద కల్పనకు వ్యతిరేకం కాదు. ఫ్రెంచి కవులు బిర్ర బిగుసుకుపోయిన ఛందో నియమ నిబంధనలను అతిక్రమించి వాటిని పాటించడమే కవిత్వం కాదు వాటికి బయట కూడా కవిత్వం ఉంటుంది అని చెప్ప దలుచుకున్నారు. (మోహన గారి విలువైన అభిప్రాయం చూడండి పద్యం కూడా ఒక రకమైన వచనమే).ఈ స్ఫూర్తిని గ్రహించిన కవులు చాలా వరకు అన్ని భాషల్లోనూ వారికి తోచిన రీతిలో పాద కల్పన పాటించారు. జర్మన్ , రష్యన్ లో అంత్య ప్రాసలు వదులుకో లేదు అక్కడి కవులు.(ఈ విషయంలో ఈ నాటికీ రష్యన్లు అమెరికన్ లను ఎద్దేవా చేయడం నేను ప్రత్యక్షంగా చూసిన విషయం.) సారాంశం ఏమంటే ఈ స్ఫూర్తిని గ్రహించి, నీ భాషకు ఏది అందమో దాన్ని వదలకుండా కవిత్వ రచన చేయాలి.

    ఇక మిగిలింది prose -poem . కవిత్వాన్ని బహువచనాల బారీ నుండి కాపాడడానికి పుట్టుకొచ్చింది అంటారు Robert Bly. శ్రీ శ్రీ కవిత్వం తీసుకోండి పతితులారా భ్రష్టులారా ..అన్నీ బహువచానాలే. రాజకీయ కవిత్వంలో ఇది తప్పదు. కానీ , ఇది కవిత్వానికి చేటు చేస్తుంది. మనం చూసేది ఒక్కొక్క వస్తువునే. వస్తు సముదాయాలను కాదు. ఈ ఎరుకతో రాసేది prose -poem ఇది కూడా ముందు ఫ్రెంచి కవులే సాధించి చూపారు. ఎక్కువ వివరాలకు Talking All Morning, పుస్తకంలో On Writing Prose Poems అన్న ఇంటర్ వ్యూ (1975 లో వచ్చింది.). అలాగే తొలినాటి ఫ్రెంచి కవుల కవితా సంగ్రహం సవిమర్శకంగా చదవాలి.

    మన విమర్శకులకు పరభాషా సాంగత్యం లేక చాలా చేటు జరిగింది. పట్టు మని పది భాషల్లో వచ్చిన విమర్శలు చదవరు. అనువాదాల మీద శ్రద్ధ లేదు.చరిత్ర తెలుసుకోరు.ఆధునిక కవిత్వం దాని విమర్శ ఒక ప్రత్యేక విభాగం అన్న స్పృహే లేదు. పిండి కొద్దీ రొట్టె. శుష్క వాదాలు శూన్య హస్తాలు. ఇక జాలింతును; స్వస్తి.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  1115. చేరా కు ఒక శతమానం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/29/2011 4:19 am

    లైలా గారూ !! మీ సందేహం సబబైనది. అయితే ఇలాంటి సందేహం ఇప్పటివరకూ ఈమాట చర్చల్లో ఇంకెవరూ వ్యక్తపరచకపోవడం ఆశ్చర్యమే !!నాకు పద్య స్వరూపం మీద చాలా అభ్యంతరాలే ఉన్నాయి దాన్ని చందస్సుగా చూడగలమే గానీ పద్యాల్లో ఉన్నదంతా ” కవిత్వమని ” ఎవరన్నా అనుకుంటూంటే నా వరకు నాకు హాస్యాస్పదంగా అన్పిస్తుంది.చందస్సు ఒక పనిముట్టు మాత్రమే . చేతిలో పనిముట్టు పట్టుకున్న వాళ్ళంతా కళాకారులు కానట్టే …చందస్సు తెలిసిన వారంతా మంచి పద్యాలు రాసేయలేరు. మంచి పద్యాన్ని చదివే అనుభవం ఉన్న వారెవరన్నా దీన్ని గుర్తు పట్టగలరు కూడా!!

    సంపత్కుమార రాసిన పద్యాలు కవిత్వమని ఎవరూ అనుకోరనుకుంటాను. వారు చనిపోయిన సందర్భం గనక వారిని తెలిసిన వారు వారిని గుర్తు చేసుకునే సందర్భంలో వీటిని నలుగురి ముందుకీ తెచ్చారని మనం అనుకోవాలే తప్ప వాటిలోని “కవిత్వాంశ” ప్రకారం బహుశా అయిఉండదు.

    సంపత్కుమారగారి పద్యాలని అటుంచండి. వెయ్యేళ్ళ మన పద్య కావ్యాలలోనే భావుకత కల్గిన పద్యాలు తక్కువ. మనం వాటిలోని భాషా చతురతకో వారు వాటిని నడిపిన తీరుకో వాటిని జ్నాపకం పెట్టుకున్నామే గానీ కవిత్వానికి కాదు. పెద్దన మనుచరిత్రం లో మొదటి రెండు ఆశ్వాసాలూ పూర్తయ్యాకా మిగిలిన పుస్తకాన్ని ఓపికగా పూర్తి చేయాల్సిందే !! పోతనగారి భాగవతంలో భక్తి ప్రధానమే తప్ప ఆయన రాసినదంతా మంచి కవిత్వమని అనుకోవడానికి కుదరదు. అంత్యప్రాసలూ అనుప్రాసలూ చదివేసి వాటినే కవిత్వంగా అనుకునే వారే ఎక్కువ కూడా !! ఇలా చాలా మంది పద్యకవుల రచనలు కధని చెప్పడంలో భాగంగా పసలేని పద్యాలని బహుళంగానే కలిగిఉన్నాయి. అందువలన సూత్రాలని పాటిస్తూ వారు గణాలని వాడుతూ సరిగ్గా ఉత్పలమాలలో మిగతా వృత్తపద్యాలో రాసినందుకు ఆయా కవులని ఆ కాలంలో మెచ్చుకున్నారే తప్ప వారు రాసినవన్నీ కవిత్వంగా పరిగణించి కాదనుకుంటాను. ఇది పద్యాలలో విలసిల్లే కవిత్వం గురించి.

    ఇహ ఇక్కడ ఉన్న కందాల్లో కోవెల సంపత్కుమార చేరాని ఉద్దేశ్యించి రాసినదాన్ని ఆయన సరదాకి గుర్తుగా మనం భావించాలే గానీ అందులో కవిత్వం చిప్పిల్లుతోందని కాదు. ఆయన రాసిన ఏ పద్యం లోనూ కవిత్వాంశ పూజ్యం !!

    కందపద్యం ఒక తేజంతో నడిపిన వాళ్ళలో ఆధునిక కాలంలో శ్రీశ్రీని మాత్రమే పరిగణించాలి. మిగిలిన ఎందరో యధాశక్తి కవులు.

    రమ.

  1116. కలిశాం గురించి Narayana గారి అభిప్రాయం:

    01/29/2011 3:58 am

    “నిశ్శబ్దంలో నీ నవ్వులు” తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి పదేళ్ళైన సందర్భంగా పుస్తకం.నెట్లో గరికపాటి పవన్ కుమారు గారి సమీక్ష చూసి ఇటొచ్చా. “అరటితొక్క కాలు జారి పడేవాళ్ళ గురించి ఎదురుచూస్తుంది. అగ్గిపుల్ల బుర్ర మండించే వాళ్ళ గురించి బెదురుచూస్తుంది” అబ్బో.. చదివి తరించాల్సిన కవిత్వమే. అనుమానం లేదు. సమీక్షలో గరికపాటి వారు శెలవిచ్చినట్టు హృదయప్రకంపన కాదు. భూకంపమే!

    అలా కవితలన్నీ చదువుతూ ఈ కవిత దగ్గరకొచ్చాను. చూస్తే “పవన్” కు అని ఉంది. చిక్కుముడి కాస్త విడిపోయింది. ఎవరీ గరికపాటి పవన్ కుమారు? నక్షత్రాలు రాత్రి మాత్రమే మెరిసినట్టు ఈయన కేవలం తమ్మినేని యదుకుల భూషణు గారికి సంబంధించిన వ్యాసాలు, కవితల్లోనే మెరవడం వెనక కథా కమామిషు ఏవిటి చెప్మా అని చాలా రోజులుగా తలకొట్టుకుంటున్నా. తమ్మినేని వారిపై ఈగ వాలనివ్వని ఇతన్ని చూస్తే చాలా ముచ్చటేసింది. ఈ లింకులో ఇతని పేరు చూసి ఎంత ఆనంద పడ్డానో.

    ఆప్యాయతా, అనురాగాలతో కూడిన వీరిద్దరి స్నేహం ఇలాగే పదికాలాల పాటు కొనసాగాలనీ, అరటితొక్కల మీదా, చాక్లెట్ ముచ్చుల మీద, సిగరెట్ పీకల మీదా తమ్మినేని వారు మరెన్నో అద్భుతమైన కవితలు అల్లాలని ఆశిస్తున్నాను.

    విధేయుడు,
    నారాయణ

  1117. చేరా కు ఒక శతమానం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    01/28/2011 7:41 pm

    ఇందులో, ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తితో పద్యాల్లో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారా? ఈ పద్యాలు రాసినపుడు అవతలి వ్యక్తి, మధ్యలో మధ్యలో కందంలోనో ఇంకేదైనా పద్యంలోనో, తిరుగు సమాధానాలు రాశారా?

    ఈ కంద పద్యాలలో కవిత్వం ఉన్నదా? ఉంటే, అది అన్ని పద్యాల్లోనూ ఉందా? కొన్నిట్లోనే ఉందా? వాటిల్లోనూ వేరు వేరు రకాలుగా ఉందా? ఈ వివరాలు తెలిసిన వారు చెపుతారా?

    థాంక్స్
    లైలా

  1118. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Madhav గారి అభిప్రాయం:

    01/28/2011 11:14 am

    అందుకే గదండీ దానిని దూరపు ఉదాహరణ అన్నదీ! 🙂 ఆసక్తికరం కాదు, అంతగా అతకని ఉదాహరణ అనుండాల్సింది. ఇకపోతే…

    1. వచన కవిత్వం అనేది నియతమైన పద్యం నుండి ఒక క్రమంలో పరిణమించింది అనుకుంటే (అలానే ఆంగ్లంలో వెర్స్ నుంచి ఫ్రీవెర్స్), పాద విభజన వల్ల వచ్చే “స్ఫురణ” కు కారణం అప్పటికే మనం పద్యాలని అచ్చులో చూడడం అని ప్రతిపాదించవచ్చునేమో. ఎందుకంటే, అచ్చులో పద్యకవిత్వమంతానూ పాదబద్ధంగానే ముద్రించబడింది కాబట్టీ కవిత్వం అనగానే పాదాలలో ఉండటమనే భావన ఒకటి అస్థిమూలగతం కావడానికి ఆస్కారముంది. వచన కవిత్వ పాదాలను ఛందోబద్ధమైన నియమాలను ఉల్లంఘించి వ్రాయడం, ఛందోపద్యపు శృంఖలాలనుండి వెలువడ్డంగా కవులు భావించి ఉండవచ్చును.

    2. పాదవిభజన కాలగతిలో చెరిగిపోతుందని నేను అనుకోటంలేదు. పాదవిభజనని ఒక ప్రయోజనంతో వాడుకున్నవారూ ఉన్నారు. అప్రయత్నంగా, అనాలోచితంగా చేస్తున్నవారూ ఉన్నారు. అది మౌలిక లక్షణం కాకపోయినా దానినుంచి ఒక ప్రయోజనాన్ని కొందరు కవులు రాబట్టుకోగలిగేరు. అంటే ఇది కవి మీద ఆధారపడ్డ లక్షణం. అందువల్ల (మీ అభిప్రాయం చూడగానే) నాకు కలిగిన ఆలోచన ఇది: పాదవిభజన వల్ల “ఇంకే ప్రయోజనం ఉంది?” అని కాక “ఇంకే ప్రయోజనం లేదు!” అనే ప్రతిపాదనని పరిశీలించడం.

    3. పాదవిభజన అనేది ఇలా పరంపరగా వచ్చిన ఒక స్వభావమే తప్ప లక్షణం కాదు అనుకుంటే, ఆ పాదవిభజనకి ఒక ప్రయోజనమూ, లక్షణమూ ఉండాలనే నియమం కూడా ఉండదు. అప్పుడు, కవి తన ఇష్టారాజ్యంగా పాదవిభజన చేసుకోవచ్చు, ఏ కారణమూ లేకుండానే. సకారణంగా చేస్తే మంచిదే కానీ అలా ఎందుకు చేయలేదు అనే నిర్బంధం కవి మీద ఉండదు. అప్పుడు వచన కవిత్వం నిర్మాణ విషయంలో మరింత సులువవుతుంది. కవికి మరింత వెసులుబాటు వస్తుంది. పాదవిభజన అనాలోచితంగా పారంపర్యంగా చేస్తున్నదే కానీ దానిపై స్పష్టత ఉండాలనే నిర్బంధం ఉండదు. వచన కవిత్వానికి నిర్మాణ లక్షణాలు అంటూ ఏమీ ఉండవనే దిశగా మనం పోవలసి ఉంటుంది. అందువల్ల చదువరి ఒక కవితను అనుభవించే తీరు మరింతగా వైయక్తికమవుతుంది. పాదవిభజన అనేది కేవలం ఒక రెలిక్ లాగా ఏ ప్రాధాన్యమూ లేనిదిగా మిగిలిపోతుంది. (ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్నది చాలామటుకూ అదే అని నాకనిపిస్తుంది).

    4. అలా అయిన పక్షంలో , వచన కవిత్వంలో లయ, గతి శబ్ద భావ సౌష్టవమూ తదితరాల వాడకమూ, వాటి ప్రభావమూ కవ్యుద్దిష్టాలే కానీ, వచనకవితా నిర్మాణంలో పాత్ర పోషించవు. వీటి ద్వారా కవిత మరింత పౌష్టికమవుతున్నది అనే అభిప్రాయం చదువరి సాహితీశిక్షణ వల్ల వస్తుండవచ్చు. అప్పుడు, కవితానిర్మాణం ఒక కవితని పాఠకుడు అనుభవించడంపై ప్రభావం చూపుతుంది అని నేనన్నది కేవలం ఈ సాహితీశిక్షణపై ఆధారపడినదానిగా, కేవలం వ్యక్తిగత అభిరుచిగానే తీసుకోవాల్సి వుంటుంది తప్ప ఒక నిర్మాణలక్షణంగా ప్రతిపాదించలేను.

    అందువల్ల నిర్మాణ, స్వరూప లక్షణాల గురించి కాకుండా వచన కవిత్వాన్ని వచనం నుంచి వేరు చేసే మర్మమేమిటో ఆలోచించవచ్చునేమో. అలా అని లక్షణచర్చకు ఏ ఉపయోగమూ లేదని నేననుకోను. ఆ చర్చ కవికి తన కవితానిర్మాణంలో సహకరిస్తుందనే (కవి సకారణంగా పాదవిభజనని తన కవితలో వాడుకోదలచుకుంటే) ఇప్పటికీ నాకు అనిపిస్తుంది.

    మాధవ్

  1119. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/28/2011 10:22 am

    అయ్యా!! కవిత్వానికి పాఠకురాలిగా నాకు మీకొచ్చిన సందేహాలు రాలేదు. అసలు వచనకవిత్వం విషయంలో పాద విభజన లోని ఇబ్బందులు నన్ను ఏనాడూ బాధించలేదు. ఇబ్బందీ పెట్టలేదు. పద్యం అన్న పదాన్ని కవులు కవిత్వపరంగానే వాడుక చేస్తున్నారని మీరు గ్రహించాకా మీకింక లక్షణ చర్చ ఉండనఖ్ఖరలేదు. మీరు ఇంకా ఆ వలయంలోనే భ్రమిస్తూంటే దానికి జవాబు ఎక్కడినించి దొరకాలీ??

    పఠాభి పదాలని ముక్కలు ముక్కలుగా విరిచి రాసినప్పుడూ ఇదేం పోకడా అంటూ సాంప్రదాయవాదులు విసుక్కున్నారు. లయ మీద మాంచి పట్టున్న పఠాభి పనిగట్టుకుని లయని ..పదాల అందాలనీ ధ్వంసం చేస్తూ కవిత్వం రాసినప్పుడు అది అసలు కవిత్వమే కాదని అనుకున్న వాళ్ళూ ఉన్నారు. కానీ వాళ్ళ విసుగుని పట్టించుకోలేదు తదనంతర కవులు.

    ఇంక మొన్న కనక ప్రసాద్ గారి వ్యాసంలో గానీ లేదా కొంత మాధవ్ అభిప్రాయంలో గానీ అసలు వచన కవిత్వం అన్నదానికి మొదలెట్లా కొనసాగింపు ఎట్లా.. దాన్ని ముగింపు ఎట్లా.. దానికేమన్నా నియతి ఉన్నదా? అన్న సందేహాల చుట్టూ వారి ప్రశ్నలు నడిచాయి. ఈ ప్రశ్నలకి కవులెవరన్నా బదులు చెపుతే మీ అందరితో పాటూ నేనూ ఆసక్తిగానే చదువుతాను. కానీ అసలు అలాంటి ప్రశ్నలకి జవాబులు కవులైన వాళ్ళు చెప్పగలరా అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్నని ఎవరన్నా ప్రాచీనకవులని వేసారా?? అందుకు వారేమని బదులు ఇచ్చారో మీరేమన్నా చెప్పగలరా?? పాత కవిత్వం అంతా కధా ప్రధానమూ.. వర్ణనల మయమూ చంధోమయమూ కదా?? అసలు అందులో క్వాచిత్కంగా తప్ప కవిత్వం ఉన్న సందర్భాలేవీ?? వారికసలు కధచెప్పడంలో ఉన్న దృష్టి లేదా స్వేచ్చా కవిత్వం రాయడంలో లేనే లేదే?? ఇవాళ గణాల దారిని వదిలి పెట్టి భావానికి పెద్ద పీటవేసి ఏ అంశం మీదనైనా తమతమ భావాలని రాయడానికి చందోరహిత మార్గాలలోంచి వచన పద్యం అనో వచన కవిత అనో పేరు పెట్టి… కవితా వస్తువుని “కధా చట్రం” నించి విడిపించి… ఒక భావస్వేచ్చని సాధించినది ఇవాళ్టి ఆధునిక కవులు కాదా?? మీ అందరి ప్రశ్నలూ లేదా సందేహాలూ గనక ఈ కవిత్వానికి లక్షణ నిర్దేశం చేయడం కోసమే అయితే అందుకు ఈ కవితాప్రక్రియలో చేయితిరిగిన వారి పద్యాలని 🙂 అదే “వచన పద్యాలని” మీలాంటి వారెవ్వరైనా పరిశీలించి కొన్ని లక్షణాలని కనుగొనవచ్చునే?? అందుకు మీకు కవిత్వం కావాలీ గానీ… కవుల సృజన ప్రక్రియ తాలూకు రహస్యాలతో ఏంపనీ?? ఈ ప్రశ్నని కవులని అటుంచండి కాసేపు. అసలు ఏ కళాకారులనైనా మీరడిగినా వాళ్ళు నిజంగా వివరించగలరా అన్నది నాకు సందేహమే!!

    ఇంతమంది స్త్రీలు ఇన్ని వేలతరాలుగా పిల్లల్ని కంటున్నా పురిటి నొప్పులు ఇలాంటివని గానీ పిల్లల్ని తొలిగా ముద్దాడినప్పటి అనుభవం ఇలాంటిదనిగానీ విడమరిచి చెప్పగలిగారా?? అందుకు అసలు ఒక భాష ఉందా?? అలాంటి ప్రశ్నలకి వచ్చే జవాబులు నిజంగా మీ సందేహ నివృత్తికి చాలుతాయా?? అసలీ ప్రశ్నలకి జవాబులు ఏ కవికైనా తెలుసునా?? చెప్పగలరా?? మీరే ఆలోచించండి ఒకసారి.

    ఇంక లక్షణ నిర్దేశమే చేయజాలని వచన కవితావాక్యంలో మీరు పాద విభజన కోసం చూస్తున్నారు.అసలు మీకు భావ ప్రధానమైన కవితావాక్యంలో భాషకి ముఖ్యమైన వాక్యం తాలూకు రూపాన్ని వెదుకుతున్నారే?? అది కుదిరే పనేనా?? వచన కవితని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చదవ వచ్చునేమో?? దాన్ని ఇక్కడే విరవాలని ఒక నియమంగా ఆ వాక్యాన్ని విభజించనేలేమేమో?? చదివే వారి గొంతుని అనుసరించి భావం ఎప్పుడూ కొత్తగా వినిపించే అవకాశం ఉన్న కవితా ప్రక్రియ వచన కవిత్వం కాగా అది మనకి అలవాటైన వాక్యాల్లో ఉందనే కదా దాన్ని మీరు విభజించను వీలులేదని అనుకుంటున్నారు?? ఇన్ని సమస్యలని ముందుపెట్టుకుని చందస్సుని మనసులో పెట్టుకుని ఆ దృష్టితో వచన కవిత్వానికి కూడా లక్షణ నిర్దేశం చేయచూసినప్పుడు తిప్పలు తప్పవు. వచన కవిత్వంలో పాదవిభజన భాష ప్రకారమో లయ ప్రకారమో జరిగితే మీరన్న చర్చ సులువు. కానీ మీరే వచన పద్యాన్నైనా లోపలో బయటో చదివి చూడండి. అది భావాన్ని అనుసరించి గాని నడవదు. ఎవరి పద్యాన్నైనా సరే !! ఒకరి భాష మరొకరిది కాదు. వాక్యవిన్యాసం ఎప్పుడూ భావస్పోరితంగా మాత్రమే నడుస్తుంది. ఇందుకు మీరు లక్షణ నిర్దేశమే చేయగలిగితే అప్పుడు మీకు ఇప్పటి వరకూ అమలులో ఉన్న నియమాలు పనికిరావు. కొత్త లక్షణ సూత్రాలు అనువర్తిస్తాయి. వాటిని తయారుచేసుకోవాలి. అది ఆలంకారికుల పని. మనకి కొత్త కవిబృందం తయారై ఉంది గానీ మరి ఈ ప్రక్రియకి కొత్త ఆలంకారికులు లేదా అలాంటి వారెవరో వారు మాత్రం ఇంకా తయ్యారవలేదు. సంపత్ కుమార శిక్షణ పాత సంప్రదాయం లోనిది. ఆయన ఆలోచనలు అందులోంచి తయారైనవి. అందుకే ఆయన వ్యాఖ్యానాలు గానీ లేదా ఆ తరహా ఇతరులు వేస్తున్న ప్రశ్నలు గానీ మారిన ఇవాళ్టి కవితావాక్యానికి నప్పడం లేదు. అలాగే మాధవ్ వ్యాసం నిండా కూడా బోలెడన్ని అవకతవక వాక్యాలున్నాయి. అవన్నీ అయోమయమైన ప్రకటనలే చాలావరకూ!! అందువలన వచన కవులనించి వారి సృజనకి సంబంధించిన ప్రశ్నలకి జవాబులనీ రాబట్టే దిశగా కన్నా… ఉన్న కవిత్వానికి కొత్త నియమాలున్నాయేమో అనే దిశగా కొత్త ఆలోచనలు చేస్తే మంచిది బహుశా .

    మీలాంటివారెవరైనా ఇందుకు ప్రయత్నించవచ్చు. ప్రయత్నించండి మరి.

    రమ.

  1120. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/28/2011 2:20 am

    రమగారూ,
    నేనసలు కవుల జోలికే పోలేదండి! తమ కవిత్వంలో పదాలని రకరకాల అర్థాలలో ప్రయోగించే స్చేచ్ఛ కవులకి ఎప్పుడూ ఉంది. అది లేకపోతే కవిత్వమే లేదు. నేను చెప్పినది విమర్శలు, లక్షణ చర్చల విషయంలో. అందులోని పరిభాషకి స్పష్టత నిర్దిష్టత అనివార్యం కదా.
    ఈ చర్చని ఈనాటి వచన కవులు చదవలేదంటే అది ఆ కవుల తప్పు కాదా? ఇందులోని అభిప్రాయాలని పరిగణించాల్సిన అవసరం లేదు. కాని విషయం ముఖ్యమైనది అనుకున్నప్పుడు, దాని గురించి తమ అభిప్రాయాలని చెప్పాలి కదా. వచనకవిత్వ రూపాన్ని గురించి, పాదవిభజన గురించి మరింత అవగాహన కవులకి, పాఠకులకి అవసరమని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అలాంటప్పుడు కనీసం ఈ చర్చ ద్వారానైనా కవులు ముందుకువచ్చి తమ అనుభవాలనూ, ఆలోచనలనూ పంచుకుంటే బాగుంటుంది కదా?

    మాధవ్ గారూ,
    పద్య నిర్మాణపు చట్రం గురించి మీరు ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. పాటకి స్వరం మౌలిక లక్షణం. మీరు చెప్పిన ఇతర “గీత” లక్షణాలు “పాట”లన్నిటికీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ దాన్ని పాటగా “స్ఫురింప”జెయ్యడం అంటూ ఏమీ లేదు. అది ముమ్మాటికీ సిసలైన పాటే! పాదవిభజన కవితకి అలాంటి మౌలిక లక్షణం కాదని నేను భావిస్తాను. అయినా మీరు “స్ఫురణ” విషయంలో చెప్పింది నాకు అర్థమయ్యింది. పాదవిభజన చెయ్యడం వలన అది కవిత అన్న స్ఫురణ ఎందుకు కలుగుతోంది అన్న విషయమై ఆలోచించాలి. కేవలం పరంపరగా కవిత్వం పాదబద్ధం కావడం మూలాన ఆ స్ఫురణ కలుగుతోందంటే, అది అంత విలువైన విషయం కాదు. కాలాగతిలో అది చెరిగిపోతుంది. అంతకన్నా విలువైన ప్రయోజనం ఉందా అని ఆలోచించాలి.

  1121. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/27/2011 1:03 pm

    కామేశ్వరరావు గారూ !!

    మీరు నా అభిప్రాయం విన్న తర్వాత కూడా “పద్యాన్ని” ఇంకా రూప పరంగా చూస్తున్నారు. వచనకవితా ప్రక్రియ ఆధునిక కాలంలో గణనీయమైన పాత్రనే పోషించిన విషయం ..ఆధునిక కవులు “పద్యాన్ని” రూపపరంగా వాడుక చేయకపోవడం నేను ఈ సరికే ప్రస్తావించి ఉన్నాను. ఇక్కడ మీరు అంటున్న ” అయోమయం” ఈ పదప్రయోగం చేస్తున్న కవులకి లేదు. “శాస్త్రీయత” అని మీరు అనడం నాకు వింతగా అన్పించింది. ఏది శాస్త్రీయతా?? ప్రయోగాలు సృజనకారులే కదా చేస్తారూ?? భాషలో గాని..ఊహల్లో గానీ!! నువ్వు మూడు వక్ర రేఖల్లో ఆడదాని బొమ్మ ని గీస్తావేమయ్యా అని ఎవరన్నా పికాసో ని ప్రశ్నిస్తే పికాసో ఏం జవాబు చెప్పాలీ?? లేదా అసలు ఏమన్నా ఒక జవాబు ఆయన ఇచ్చి ఉండేవాడా?? శాస్త్రాన్ని దాటి తన స్వాతంత్రాన్ని చూపేవాళ్ళే సృజనశీలులు.

    అసలింతకీ నాదో సందేహం సుమా !!. ఈ చేరా.. సంపత్కుమారల చర్చని ఎంతమంది ఇవాళ్టి వచన కవులు చదివేరూ?? ఎంతమంది వీరి అభిప్రాయాలని పరిగణించారూ?? ఒక చర్చ నిజంగా అది ఉద్దేశ్యించిన వర్గానికి గనక అందకపోతే చర్చగా అది బోల్తాపడ్డట్టే కదా!! పాయింట్లు చాలని చర్చని ఎంత సాగదీస్తే మాత్రం ఫలితం ఏముందీ??

    రమ.

  1122. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Madhav గారి అభిప్రాయం:

    01/27/2011 12:21 pm

    కామేశ్వర రావు గారూ – నా ఉద్దేశాలని స్పష్టంగా చెప్పనందుకు క్షమించండి.

    1. ఒక రచన బారుగా కాకుండా పొట్టీ పొడుగు పాదాలుగా విరక్కొట్టి రాయబడ్డది చూడగానే అది కవిత్వ రచన (లేదా ఈ రచన కవిత అని రచయిత ఉద్దేశిస్తున్నాడు) అనే స్ఫురణ రావడం సహజం. దూరపు ఉదాహరణ ఒకటి: గుల్జార్ పాటలు కొన్ని శుద్ధవచనాలు. అంటే గీతలక్షణాలు – ప్రాస, పల్లవి, చరణం ఇలా – లేనివి. ఏ బర్మనో, రహ్మానో వాటికి స్వరం ఇచ్చి పాటగా వాటిని స్ఫురింపజేశారు. (మేరా కుచ్ సామాన్ పాటకే అనుకుంటాను, ఆ సాహిత్యం చదివి ఆర్.డీ. బర్మన్ గుల్జార్‌తో “రేపు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వార్తలకి నన్ను ట్యూన్ కట్టమంటావు” అని అన్నాడని ఒక పిట్టకథ.) పద్య నిర్మాణ చట్రం అని నేనన్నది ఈ స్ఫురణను కలిగిస్తున్న రూపం. ఈ స్ఫురణనే నేను కవితా లక్షణం అన్నది. ఎందుకంటే ఒక్కసారి ఆ స్ఫురణ కలిగినతర్వాతే గదా మనం ఆ రచనని కవిత అన్న దృష్టితో చదువుతాం. అందువల్లనే పాదవిభజన లేదా బద్ధత వచన కవితకి ఒక నిర్మాణ లక్షణం (ఆభాసమైనది) అని నాకు తోచింది. అయితే ఇది నియతం కాదు. కవి ఇష్టాఇష్టాలపై ఆధారపడింది. పాదబద్ధత అనేది నియతమైన నిర్మాణలక్షణంగా అనిపిస్తున్నదేమో. అందుకని పాదవిభజన అని మాత్రమే వాడతాను.

    ఈ పాదవిభజన మీరన్నట్టే కవిత కవితకీ ప్రత్యేకం. అది కేవలం కవ్యుద్దిష్టమే. సందేహమేమీ లేదు. ఉండచ్చూ, ఉండకపోవచ్చు కూడా. చంద్ర దుఃఖం కవిత పాదవిభజన లేకపోవడం వల్ల మరింత తీవ్రమయింది. అదేవిధంగా ఆయన ఇతర కవితల్లో చేసిన పాదవిభజన. అందువల్ల కవికి తన ఏ కవితను ఏ రూపంలో ప్రచురించాలీ అన్న విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నదని తెలుస్తున్నది. మీరుదహరించిన కవితలో భూషణ్ కూడా ఒక కారణం తోటే ఆ పాదవిభజన చేసుండాలి. పాదవిభజన చేస్తున్నప్పుడూ, చేయనప్పుడూ కూడా కవికి తన కవిత నిర్మాణంపై స్పష్టత ఉండాలని మాత్రమే నేనంటున్నది.

    2. “పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా!” – ఈ వాక్యం రాస్తున్నప్పుడే ఇది అపోహకి తావిస్తుందనే అనుమానం నాకొచ్చింది. అప్పుడే సరిదిద్దుకోపోవడం నేను చేసిన తప్పు. నా ఉద్దేశం సంపత్కుమార భావగణాలు చదువరికి విరామం ఇవ్వడానికి ఉద్దేశించారని కాదు. భావగణాలను ఆయన ఏ రకంగా ఉద్దేశించారో అర్థం చేసుకుంటే ఆ రకంగా కూడా ఆలోచించడం ద్వారా కవికి తన పాదాల విరుపులో (కవిత నిర్మాణంలో) మరికొంత స్పష్టత రావడానికి ఆస్కారముంది, అని నా ఊహ. కేవలం అంతే.

    3. సాధారణీకరణ గుఱించి ఆలోచించే కన్నా, ఒక కవితలో సౌష్టవం తగినంత పాళ్ళలో ఉందా లేదా, కవితా నిర్మాణం అందులోని భావాన్ని పాఠకులకి అందించడానికి సహాయపడుతోందా లేదా అన్నదే ఆలోచించడం మేలని నేననుకుంటున్నాను.

    కవితానిర్మాణం – పాదవిభజనతోనో, లేకుండానో, సౌష్టవం, లయ, గతులతోనో, అవేమీ లేకుండానో, మరేదైనానో – ఒక కవితని పాఠకుడు అనుభవించడంపై ప్రభావం చూపుతుందని నా అభిప్రాయం. అందువల్ల కవులు ఈ నిర్మాణంపై మరింత శ్రద్ధ చూపాలని, అందులో మెళకువలు అర్థం చేసుకోవాలనే నేనంటున్నది కూడా. అయితే, ఈ లక్షణాలని సాధారణీకరించమనిగాదు నా ఉద్దేశం. సాటి కవులు లేదా విమర్శకులు, ఏ కవి తన ఏ కవితలో ఎటువంటి నిర్మాణాన్ని వినియోగించాడు, అందువల్ల కవితకి మేలు జరిగిందా, హాని జరిగిందా? ఎలా? అని చర్చిస్తే, ఒక నిర్ధారణకు వచ్చినా లేకున్నా, ఆ చర్చలు ఈ విషయంలో ఇతర కవులకి, ఔత్సాహికులకీ ఉపయోగపడతాయని నేనన్నది. కవిత్వ విమర్శలో ఈ నిర్మాణ ప్రసక్తి లేకపోవడం ఒక లోటే (రూపవాదులని ఆక్షేపిస్తారని భయం కాబోలు). ఆ లోటు తీరాలనే నా కోరిక.

  1123. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/27/2011 5:37 am

    రమగారూ,
    “పద్యం” అన్న పదాన్ని “కవిత” అనే అర్థంలో కొంతమంది కవులు, విమర్శకులు వాడారన్న విషయం నాకు తెలుసు. అయితే అది శాస్త్రీయం కాదన్నదే నా అభిప్రాయం, దానికే నా ముందు వ్యాఖ్యలో హేతువులు చూపెట్టాను. ముఖ్యంగా అలాంటి వాడుక అయోమయానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటి చర్చాంశమైన వ్యాస పరంపరలో, “వచన పద్యం” అన్న పదంలో పద్యం అంటే పాదబద్ధత ఉన్న రచన అనే ఉద్దేశ్యంలోనే తీసుకున్నారు కాని కేవలం “కవిత” అనే అర్థంలో తీసుకోలేదు. వచనకవితలని వచనపద్యాలు అనుంటున్నాం కాబట్టి అవి కచ్చితంగా పాదబద్ధం కావలసిందేనని సంపత్కుమారగారన్నారు. దాన్ని చేరాగారు కూడా ఖండించ లేదు! కవిత అనే అర్థంలో మాత్రమే “వచనపద్యాలు” అని, అవి వచనపద్యాలు కాబట్టి వాటికి పాదబద్ధత ఉండాలనడం సరైన వాదన కాదు కదా!

    వచనకవితా స్వరూపాన్ని గురించి వచనకవులు మరింతగా చర్చించాలన్న విషయమై మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నా వ్యాఖ్యలోకూడా అదే అన్నాను. అలాంటి చర్చ చెయ్యడానికి అడ్డంకి ఏముంది? ఈమాటలో వ్రాసే/ఈమాటని చదివే వచనకవులు/కవయిత్రులు ఇప్పటికీ ఈ చర్చలో ఎందుకు పాల్గొనటం లేదో మరి!

    మాధవ్ గారూ,
    “ఎంత అకవిత్వమైనా, పద్య నిర్మాణపు చట్రంలో ఉండటంతో దానికి కొంత కవితాలక్షణం వస్తుంది.” ఇక్కడ “పద్య నిర్మాణపు చట్రం” అంటే ఏమిటన్నది నాకు పూర్తిగా అర్థమవ్వలేదు. పాదబద్ధతా? లేక అక్షర, గణ, మాత్రా ఛందస్సా? అలాగే ఆ చట్రంలో ఉండటం వల్ల వచ్చే “కవితాలక్షణం” ఏమిటన్నది కూడా స్పష్టం కాలేదు.

    “పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా!”. రెండిటికీ తేడా ఉంది. ఎక్కడ విరామం ఇవ్వాలన్నది కవి ఊహబట్టి, కవిత బట్టి ఉంటుంది. దాన్ని భావము, భావాంశము అనే చట్రంలో బిగించడం సాధ్యం కాదు. ఒక కవితలో ఒక భావం పూర్తి కాకుండానే సగంలో పాఠకుణ్ణి హఠాత్తుగా ఆపాలని కవి అనుకుంటే, అక్కడ మధ్యలో పాదాన్ని ఆపవచ్చు. అది సంపత్కుమారగారు నిర్వచించిన “భావాంశం” అని చెప్పలేం. ఉదాహరణకి ఈ నెల ఈమాటలో వచ్చిన భూషణ్ గారి “శిశిరచిత్రాలు” కవితలో ఈ పంక్తులు చూడండి.

    కలిసిన రోజుల
    రంగురంగుల
    జ్ఞాపకాల ఆకులను
    పెళుసు కొమ్మలతో
    దులుపు కోవడమే
    మేలు.

    ప్రేమగా వీచినా అసలు
    ఆకులు రాల్చనంది

    ఇక్కడ “రంగురంగుల” అన్నది ఏ కోశానైనా భావాంశం అవుతుందా? “ప్రేమగా వీచినా అసలు” అన్న వాక్యంలో భావం కాని భావాంశం కాని పూర్తయ్యిందా? అయినా కవి పాదాలని అక్కడ విరిచాడంటె ఎందుకు? సంపత్కుమారగారు ఇలాంటి వాటిని exceptionsగా లేదా ఛందోదోషాలుగా పరిగణించారు. ఒక చట్రాన్ని ఊహించి దానికి లొంగని వాటిని దోషాలుగా పరిగణించడం కన్నా, ప్రతి కవితకీ తనదైన చట్రం కవి గీసుకుంటాడని అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీరు ప్రస్తావించిన సౌష్టవం విషయమై కూడా నాదిదే అభిప్రాయం. సాధారణీకరణ గుఱించి ఆలోచించే కన్నా, ఒక కవితలో సౌష్టవం తగినంత పాళ్ళలో ఉందా లేదా, కవితా నిర్మాణం అందులోని భావాన్ని పాఠకులకి అందిచడానికి సహాయపడుతోందా లేదా అన్నదే ఆలోచించడం మేలని నేననుకుంటున్నాను. ఇంగ్లీషు సాహిత్యంలో కవితా నిర్మాణం గురించి సాధారణీకరణలేమైనా చేసారేమో అందులో పరిచయమున్నవారెవరైనా చెప్పాలి. అది మనకి ఉపయోగపడే అవకాశం ఉంది.

  1124. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/26/2011 3:38 pm

    లయ నీ .. కవిత్వ భావావేశాన్నీ.. కవితా రూపాన్నీ కట్టగలిపేసుకుంటూ మాట్లాడుకుంటూంటే అనేకమైన ఇబ్బందులు వస్తాయి. కవితావ్యక్తీకరణకి అవసరమైన రూపం ఆయా కవులు బతికిన కాలానికి అనుగుణం గానే రూపుదిద్దుకుంటుంది.మన ఇస్టాయిస్టాలతో ప్రమేయం లేకుండా కవితా రూపం మారుతూ వచ్చింది అన్ని కాలాల్లోనూను. చర్చ ఆ దిశగా సాగితే ఆధునిక కవితా రూపానికీ ఆధునిక కాలానికీ ఆధుని భావ వ్యక్తీకరణకీ ఉన్న లింకు దొరకొచ్చు.

    ఇకపోతే కవిత్వం రాయడం వరకూ కవుల పాత్ర గానీ అది అలాగే ఎందుకుందో..ఇంకెలాగో ఎందుకులేదో “వివరించడం”..విశ్లేషించడం” వగైరాలు కవులు చేసితీరవలసిన విషయాలు కావు. ఆ సమస్య అంటూ ఒకటి ఉంటే అది ఆ రూపాన్ని గురించి తర్జనభర్జనలు పడుతున్నవారిది మాత్రమే అవుతుంది. సృజనకారుల స్వభావం సృజనకి సంబంధించినంత వరకే!! వారి సృజనని గురించి వివరణలూ వ్యాఖ్యానాలు ఇచ్చుకోవడం కాదు.

    అలాగే మోహన గారు చెప్పినట్టు వాక్యాల్లో సైతం చందస్సుంటుంది. పద్యాలు సైతం వాక్యాల్లోనే ఉంటాయి. మామూలు వాక్యానికీ కవితా స్పురణతో ఉన్న వాక్యానికీ ఉన్న తేడావే సృజనలోని అందం అంతాను.ఇందుకు కవిత్వాన్ని తీసుకుని వివరిస్తూ చెప్పడం ఒక్కటే దారి. అయితే ఆ దారిని తీసేవాళ్ళు ఎవరైనా కావొచ్చు. కవులుకూడా కావొచ్చు. కవులుమాత్రమే కానవసరమూ లేదు. ఇది ఆసక్తికీ ఓపికకీ కలిపి సంబంధించిన విషయం గనక ఆ రెండూ పుష్కలంగా ఉన్న వారు ఇందుకోసం శ్రమించవచ్చు. చిట్టచివరికి అలాంటి వారికి తెలిసిన విషయం ఏమైనప్పటికీ అందువలన కవితా వస్తువూ కవితా రూపమూ మాత్రం ఏమీ ప్రభావితం మాత్రం కావు.

    రమ.

  1125. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి మోహన గారి అభిప్రాయం:

    01/26/2011 1:19 am

    తెలుగులో చంపూ కావ్యాలలో వచనము ఒక ముఖ్య భాగమే. కొన్ని వచనాలు పద్యాలంత అందంగా ఉంటాయి. వచనం వేరు, గద్యం వేరు. ఆశ్వాసాంతాలలో వచ్చేవి గద్యాలు, మిగిలిన పద్యేతరములు వచనములు. గణపవరపు వేంకటకవి వంటివారు వచనాలలో పద్యాలనే చొప్పించారు. ఎన్నో నవలలలో కొన్ని వర్ణనలు పద్యాలవలె అందంగా ఉంటాయి. ఆధునిక యుగంలో వచన కవితలనే వచన పద్యములని భావించవచ్చు. పద్యాలు కూడ ఒక విధంగా చూస్తే ఛందస్సు అనే చట్రములో రాయబడిన వచనాలే. పోతే పాద విభజన అనేది చదివే విధానంపైన ఆధారపడి ఉంటుంది. ఈ వచన పద్యం అనే పేరు ఆంగ్లములోని prose poem అనే పదానికి భాషాంతరీకరణ మేమో? వచన పద్యాన్ని గట్టిగా చదివితే పాద విభజన మనకు అవగతము కావచ్చు. ప్రతిరోజు Garrison Keillorగారి Writer’s Almanac చివర పద్యం వారు చదివేటప్పుడు వచన పద్యం నాకు జ్ఞాపకం వస్తుంది. ఛందఃపరముగా వచన పద్యపు పాదాన్ని ఒకే నిడివి లేని గణాల సముదాయమని భావించవచ్చును, ఒక విషమ వృత్తములాటిది. దీనిని గురించి నేను ఒకప్పుడు రచ్చబండ, ఛందస్సు సదస్సులో చర్చించాను. దానిని ఇక్కడ చదువగలరు. భావగణాలు వచనపద్యంలో మాత్రమే కాదు, పద్యాలలో, గేయాలలో కూడా ఉన్నాయి. భ-ర-న-భ-భ-ర-వ త్రిక గణాలతో రాయబడిన నాలుగు పాదాల ఉత్పలమాలను కూడ భావగణాలుగా విడదీయవచ్చు, దండాన్వయము ఒక విధముగా చూస్తే ఇలాటిదే.

    విధేయుడు – మోహన

  1126. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Madhav గారి అభిప్రాయం:

    01/25/2011 4:25 pm

    చక్కగా చెప్పారు కామేశ్వరరావు గారూ! ఈ చర్చ ద్వారా తెలుసుకునే కొసరు విషయాలే ఎక్కువ. లక్షణ నిరూపణమే ప్రధానమైన ఈ చర్చలో పాదవిభజన ప్రయోజనం గురించి చర్చ లేదు. అయినా, ఆ దిశలో ఈ చర్చ కొన్ని కొత్త ఆలోచనలకు ఆస్కారమిస్తుంది. ఈమధ్యనే వెల్చేరుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకమాటన్నారు. (ఇది నామాటల్లో) ఎంత అకవిత్వమైనా, పద్య నిర్మాణపు చట్రంలో ఉండటంతో దానికి కొంత కవితాలక్షణం వస్తుంది అని. ఆధునిక వచన కవిత్వానికి పాద బద్ధత ప్రయోజనం కూడా అదేనని నాకనిపిస్తుంది. ఇంగువ కట్టిన గుడ్డకి ఆ వాసన అంటినట్టు, పాద విభజన ద్వారానో, పద్యరూపం ద్వారానో కవితగా ఒక రచనని కనీసం స్ఫురింపచేయవచ్చు. ఇది రూపానికి సంబంధించిన వివరమే గానీ కవితాంశ (poesy)కు సంబంధించింది కాదనుకోండి.

    పాదబద్ధత లేని వచనకవిత్వం అనగానే నాకు చప్పున గుర్తుకొచ్చింది కన్నెగంటి చంద్ర రాసిన దుఃఖం కవిత. ఆయన ఆ కవితని ఒక పేరాగ్రాఫులా రాశారు. (కానీ అందులో కామాలు పాదాంత విరామాలుగానూ, పాదాంతాలు అంత్యప్రాసతోనూ ఉంటాయి. అందువల్ల అది పేరాగ్రాఫులా ఉన్నా చదివేటప్పుడు ఒరవడి ద్వారా ఒక అంతర్లయ ఆ కవితలో స్పష్టమవుతుంది.) ఇంకో ఉదాహరణ, శ్రీకాంత్ అనే కవి కొంతకాలం కింద ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురించిన కవితలు, పూర్తి వచనంలా రాయబడినవి. ఇలా పాదబద్ధత ఏ మాత్రమూ లేని కవితలని ఉదాహరణలుగా చూపించి పాదవిభజన కేవలం కవి ఐచ్ఛికమే అని ఒప్పుకోవచ్చు. కానీ, సంపత్కుమార ప్రతిపాదించిన భావగణాల వివరణ, ఒక కవి పాదవిభజన – ఐచ్ఛికంగానే – చేయదలచుకుంటే, ఆ విభజనలో కవికి కొంతైనా సహాయపడుతుందని నాకనిపిస్తుంది. కానీ, ప్రయోజనం అన్నమాట వచ్చేటప్పటికి కవికి తన రచనపైన స్పష్టత ఉండాలనేది నిర్వివాదం.

    నాకిప్పటికీ ఎంతో ఆశ్చర్యాన్ని (కించిత్తు బాధనీ) కలిగించే విషయం ఒకటుంది. అది కవిత్వం అనేది హృదయాన్నుంచి ఒక భావావేశంలో ఉబికేదనీ, అందువల్ల దానికో సహజమైన స్వరూపం ఉంటుందనీ దానికి ఏరకమైన మార్పులు, పరిష్కరణలు చేసినా (అంటే మేధని ఉపయోగించడంతో) ఆ ఉద్వేగం పోతుందనీ ఇప్పటికీ నూటికి తొంభై మంది (ఎక్కువమంది కవులే) పైనే నమ్మడం. ఆవేశంలో తడబడుతూ మాట్లాడినప్పుడు, తన తడబాటు తనకే తెలియటం లేదనీ, కవి ఆవేశం మనకు అర్థమయినా తను ఏం మాట్లాడుతున్నాడో మాత్రం అర్థం కాదనీ, ఈ రెంటికీ తేడా ఉందనీ గమనించకపోవడం. అంటే చెప్పాలన్న ఆవేశమే తప్ప ఎలా చెపితే బలంగా ఉంటుంది అన్న విషయాన్ని విస్మరించడమే.

    కవితాంశను పక్కనపెడితే, ఈ నమ్మకం వల్ల కలిగే పెద్ద నష్టం, కవిత నిర్మాణంలో కొట్టొచ్చినట్టు కనపడే లోపాలు, అస్పష్టతానూ. ఉదాహరణకి, మీరన్నట్టే పాద విభజన ఒక విరామం కోసం అనే అనుకున్నా, అది కవి ఒక స్పష్టమైన ఆలోచనతో చేయవలసిందే కదా! అందరి విషయంలో కాకపోయినా, కవిత్వమనేది కేవలం హృదయ సంబంధి అనే నమ్మకం వల్ల, ఈ స్పష్టత కవికి అవసరం లేదు అని తప్పించుకునే వీలు ఒకటి ఏర్పడింది. పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా! (పాదవిభజన నియతమైనంత మాత్రాన వచన కవిత్వం ఛందోబద్ధమైనదన్న వాదన నాకు మింగుడు పడని విషయం.) అందువల్ల, ఈ చర్చ కవికి తన కవితను నిర్మాణ సంబంధమైన దృష్టితో మరొక్కసారి పరిశీలించడానికి, ఆ నిర్మాణాన్ని సరిదిద్దుకోడానికీ (అది ఎంత ఐచ్ఛికమైనా) కొంతైనా తోడ్పడుతుందని నా అభిప్రాయం. (నా స్నేహితులు వాళ్ళ కవితలని నాకు చూపించినప్పుడు, నేను గమనించే ఒక లక్షణం పాదం ఎక్కడ ఎందుకు విరిచారా అని. నేను అర్థం చేసుకోలేని ప్రతిసారి, ఆ విరుపు వెనకాల గల కారణాన్ని వివరించమనీ అడిగేవాణ్ణి. నాకు అర్థమైనా కాకపోయినా కవికి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలన్నది నా అభిప్రాయం.) మొదటిసారి చదివినప్పుడూ, మళ్ళీ ఈ సంచికకోసం తయారు చేస్తున్నప్పుడూ, వచన కవిత్వ రూపంపై నా ఆలోచనలకి మరికొంత స్పష్టతనిచ్చింది ఈ చర్చ.

    ఉదా: వచనకవిత్వానికి ప్రాస, గతి, లయ ఇత్యాది నియమాలేవీ లేవు కాబట్టి అవి స్పష్టంగా ఉన్నా, అంతర్లీనంగా ఉన్నా పట్టింపేమీ లేదు అనుకోవచ్చు. అసలు లేక పోతే ఏ నష్టమూ లేదు. కానీ ఉన్న పక్షంలో కవితలో వాటికి ఒక సౌష్టవం ఉండాలా, అక్కర్లేదా? సౌష్టవం కేవలం శబ్దసంబంధిగానే కాదు, భావసంబంధిగా కూడా. ఒకే భావం లేదా పదం లేదా ఒక ఎక్స్‌ప్రెషన్ రికర్సివ్ ఎలిమెంట్‌గా ఉంటే ఆ రికరెన్స్ లో యూనిఫార్మిటీ ఉండాలా? అక్కర్లేదా? అలాగే, ఒక కవిత మొత్తం వేర్వేరు అలంకారాలతోనో, భావవ్యక్తీకరణలతోనో ఒకే అంశం గురించి పునః ప్రస్తావించే సందర్భాల్లో ఈ సౌష్టవం రూపంలోకానీ భావపునశ్చరణలో గానీ ఉండటం అవసరమా? ఉంటే అందువల్ల నిర్మాణం మరింత బలంగా ఉంటుందా? ఇది సౌష్టవం వల్ల స్ఫురించే లయ ప్రభావమా? (నిర్మాణం బలంగా ఉండటమంటే, కవి ఉద్దేశించిన భావం పాఠకుడికి మరింత స్పష్టంగా చేరడానికి సహాయపడేట్టుగా ఉండటం.) కనకప్రసాద్ గారి భాషలో చెప్పాలంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో తక్కువవుతుందా? ఇలా ఎన్నో.

    వచన కవిత్వ రూపం గురించి మరింత చర్చ జరగాలన్న మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే, ఇందుకు ముందడుగు వేయాల్సింది కవులు. (రమ గారనుకుంటున్నట్టు వారినెవరూ ‘అటుంచ’లేదు, ‘అడగకుండా ఉండా’ లేదు. వారే ఏమీ మాట్లాడ్డం లేదు ఈ విషయం గురించి. ఎవరైనా మాట్లాడి వుంటే నాకు తెలిపితే చాలా సంతోషిస్తాను.) సమర్ధులైన కవులకి ఇవన్నీ సహజప్రతిభతో అర్థమయిన అంశాలై, అవి వారి కవితల్లో ప్రతిఫలిస్తాయని అనుకుందాం. అటువంటి కవితల నిర్మాణాన్ని పరిశీలించి విమర్శించాల్సిన బాధ్యత సాటి కవులదే ముందుగా. అయితే చేరాగారన్నట్లు కవిత్వం గురించి కవిత్వంలొ చెప్తే అది లక్షణం కాదు. ఆ విమర్శల ద్వారా ఏ నిర్మాణ లక్షణాలని ఉపయోగించుకోడం ద్వారా కవిత మరింత బలంగా తయారవుతుందో సామాన్య కవులకు, ఔత్సాహికులకు అర్థమవుతుంది. (కవులు అంటే కవితలు అచ్చువేసినవారే అని కాదు, కవిత్వాన్ని ఆనందించి, దాని లక్షణాలను గురించి ఆలోచించేవారు కూడానూ.) ఈ నిర్మాణ లక్షణాలని వాడినంత మాత్రాన ఇత్తడి బంగారమవదు. కానీ, బంగారం ఇత్తడిలా కనిపించకుండా పోడానికి చిన్న ఆస్కారం ఉంటుంది.

  1127. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/25/2011 2:28 pm

    “నా ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
    పద్యాల నడుముల్ విరుగదంతాను:” [ ఆత్మకధ అనే తన వచన పద్యం లో పఠాభి]……………….అని పఠాభి అన్నప్పుడూ లేదా అదే అర్ధం లో మిగతా వచనకవులు అన్నప్పుడూ పద్యాన్ని “కవిత్వం” అనే అర్ధం లోనే వాడుతున్నట్టుగా అర్ధం అవుతుంది.

    పద్యాలకి చందస్సులోరాయబడినవన్న ప్రముఖమైన అర్ధం ప్రచారంలో ఎలా ఉందో అలాగే ఉదాహరణకి తిక్కనగారు మంచి పద్యాలు రాసేరు” అని అన్నప్పుడు అలాంటి వాక్యాలనించి ఆయన మంచి చందస్సుని రాసేరు అనేదాని కన్నా మంచి కవిత్వం రాసేరు అనే అర్ధమే వస్తుంది. అంటే అలాంటి మెచ్చుకోలు వాక్యం ఆయన కవిత్వానికి సంబంధించినదే అవుతుంది.. ఇది వ్యవహారంలో వాడుకకి సంబంధించినది. ఒక పదాన్ని ఒక కాలంలో దాని అర్ధాన్ని విస్తరించి వాడితేనో..లేదా కవిత్వం అన్న అర్ధ స్పురణలో దాన్ని ప్రయోగిస్తూ దాన్ని కవిత్వానికి పర్యాయంగా వాడుతున్నట్టుగా సూచన చేస్తూ దానికి ఉన్న చందోలక్షణాన్ని దాటి వాడుతున్నట్టు ఆ సూచనలో నే ఆ పదానికి ముందు “వచన” అన్న విశేషణాన్ని కూడా చేర్చి ప్రాచుర్యంలోకి తెచ్చినప్పుడో మరింక కామేశ్వరరావుగారి సందేహానికీ..లేదా అభ్యంతరానికీ అక్కడ చోటు లేదు.

    ఇక వచన కవిత్వానికి ఇంకా సరైన లక్షణ నిర్దేశమే స్పష్టంగా జరగకుండానే..దాని రూపం మీద ఇధమిథ్థమైన అభిప్రాయానికి కూడా రాకుండానే అది పొడుగూ పొట్టి వాక్యం … ఫ్రీ వెర్స్ ని “పొలై పొలై” కవిత్వం అన్న అబ్బూరి వ్యంగ్యం …అలాగే వచన కవిత్వం అన్న మాటే “మిల్లు ఖద్దరు” లాంటిదంటూ అబ్బూరి వరద వెక్కిరించిన రీతి లోనే…చందస్సుని అభిమానించేవారూ..అటువంటి తోవలో నడిచేవారూ భావించడమే తప్ప..అసలు వచన కవిత్వం తాలూకు ఉద్దేశ్యమూ.. అది సాధించిన ప్రయోజనమూ..ఆధునిక జీవితంలో ఈ ఆధునిక కవితాప్రక్రియ తెచ్చిన పఠనానుభవమూ వీటిని నిగ్గుతేల్చే దిశగా జరిగిన ప్రయత్నాలు ఇప్పటికీ తక్కువే !!

    ఇంక ఈ కవిత్వంలో ప్రధాన పాత్ర అయిన కవులని అటుంచి ఈ చర్చలు ఎన్ని చేసినా ఏమిటీ ప్రయోజనం?? అసలు కవులైన వాళ్ళు మాట్లాడవలసిన విషయాలని వారితో సంబంధం లేకుండానే తమలోతాము చర్చలు చేసుకుంటూ ఇలా ఎన్ని ప్రశ్నలు లేవనెత్తినా మాత్రం ఏమి ఫలితం ఉంటుందీ??

    అదీ కాదూ..ఆధునిక వచన కవిత్వంలో ముఖ్యమైన కవులనీ వారికవిత్వాన్నీ ఆయా కవుల మనోభావాలనీ [ ఆ కవితా నిర్మాణంలో] ముఖ్యంగా పరిగణించినప్పుడుకదా కొంతైనా వీలుచిక్కేది ఈ సందేహాలకి. ఆ దిశగా ఏ విమర్శకులూ ఎందుకని ప్రయత్నాలు చేయలేదూ??

    ఒక అంతర్ లయ ఎలాంటి భావనకైన వ్యక్తీకరణలో ఉందేమో గమనించాల్సి ఉంటుంది ముందు. వచనకవితానిర్మాణపు వాక్యాల వ్యాకరణ చట్రాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాల్సిఉంటుంది. సమస్య ఏమంటే సమకాలం లో ఉన్న కవులని పక్కకి నెట్టి వారిని తమ సందేహ నివృత్తి చేయమని ఒక్క విమర్శకుడూ అడగకుండానే ఇలాంటి చర్చలు నడపడం విమర్శకుల చర్చల్లోని పాక్షిక దృష్టికి ఒక మచ్చుతునక తప్ప వేరుకాదు మరి. అందువలన ఇటువంటి చర్చలు చేసిన వాళ్ళూ ..వీటిపై తమతమ సగంసగం సందేహాలతో ప్రశ్నలు గుప్పించేవాళ్ళూ కూడా వచనకవిత్వం పట్ల వచనకవిత్వం రాసిన వారి విషయంలోనూ అపరిణితమైన సంకల్పం కలిగి ఉన్నట్టు కనిపిస్తూంది.

    రమ.

  1128. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/25/2011 9:15 am

    సంపత్కుమార, చేరాగార్ల యీ చర్చ కొద్ది కాలం కిందటే నేను చదివాను. దాని వల్ల అసలు విషయం కన్నా కొసరు విషయాలు అనేకం తెలుసుకున్నాను. ముఖ్యంగా, వృత్తాలకి “భరనభభరవ – ఉత్పలమాల” అన్నట్టుగా చిన్నప్పటినుంచీ నేర్చుకున్న లక్షణం, ఈ వ్యాసాలు చదివాకే అనుకుంటాను, అది కేవలం వెసలుబాటుకే తప్ప అసలు లక్షణం గురులఘు క్రమమే అన్న realization కలిగింది! అలానే మరెన్నో ఛందోవ్యాకరణాంశాలు కూడా తెలిసాయి. ఇక అసలైన, “వచన పద్య లక్షణం” విషయానికి వస్తే, దాని గురించి నా అభిప్రాయాలివి:

    1. అన్నిటికన్నా ఈ చర్చలో నన్ను ఆశ్చర్యపరచిన విషయం, “వచన పద్యం” అన్న పేరుకి చేరాగారు కాని నాగరాజుగారు కాని పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం. నాకున్న పెద్ద అభ్యంతరం ఆ పేరు! “పద్యం” అన్నది ప్రక్రియా రూపాన్నే కాని కవిత్వాన్ని సూచించే పదం కాదన్నది అందరూ అంగీకరించే విషయమే. ప్రాచీన సాహిత్యంలో కూడా పద్యాలలో శాస్త్రాలవంటి కవిత్వేతర రచనలూ, అలాగే గద్యంలో కావ్యాలూ ఉండనే ఉన్నాయి. మరి “వచన” అన్న పదం కూడా అది కవిత్వం అన్న విషయాన్ని సూచించదు. అది దేన్ని సూచిస్తుందో ఈ వ్యాసాల్లో స్పష్టంగా ఎవరూ నిర్వచించినట్టు లేదు. వాడుకలో “ఛందోబద్ధము కాకుండా మాటలుగా వ్రాసినది, గద్య” అన్న అర్థం ఉంది. అంటే ఇది కూడా రూపాన్నే సూచిస్తోందన్న మాట. ఇందులో “కవిత్వం” అని సూచించే పదమే లేకపోతే ఈ ప్రక్రియకి కథ, నవల మొదలైన ఇతర ప్రక్రియలతో ఉన్న తేడా ఎలా తెలుస్తుంది? అంతే కాదు, “వచన”, “పద్యం” అనే పదాలకున్న వ్యతిరేకార్థాల వల్ల ఆ రెండూ కలిపిన పదం ఒక oxymoron అవుతుంది! వచన కవిత్వానికి పాదబద్ధత మౌలికమైన లక్షణం అనుకుంటే, అది ఇప్పటి వరకూ ఉన్న ఛందస్సు కన్నా విభిన్నమైనది అనుకుంటే, అలాంటి ఛందస్సుకి ఒక కొత్త పేరు పెట్టుకోవాలి – వృత్తాలు, జాతులు, ఉపజాతులు, గేయాలు (మాత్రా ఛందస్సులోని పద్యాలు) అన్న పేర్ల లాగా. ఉదాహరణకి భావుకములు అందాం (భావ ప్రాధాన్యం కలిగినవి కాబట్టి). ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన పద్యాలు కలిసి పద్య కవితా ఖండిక అయినట్టుగానే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన భావుక పద్యాలు కలిస్తే మనం మామూలుగా చెప్పే “వచన కవిత” అవుతుంది. అందువల్ల, “వచన కవిత”కి “వచన పద్యం” అన్న పేరు సమంజసం కాదు.

    2. నాకు ఆశ్చర్యంగా తోచిన మరొక విషయం అందరూ ఆధునిక వచన కవిత్వానికి పాదబద్ధతని అంగీకరించడం. వచన కవిత్వంలో కనిపించే పాదా విభజన ఐచ్ఛికమా, నియతమా అని ఎవరూ ప్రశ్నించినట్టు లేదు! పాద నిర్మాణానికి నిర్దిష్ట నిర్వచనం సాధ్యమవ్వదు అన్న చేరాగారు కూడా, పాదవిభజన మాత్రం తప్పనిసరే అనుకున్నట్టుగా నాకు అనిపించింది. బహుశా అప్పట్లో వచ్చిన కవిత్వం (ఇప్పటికీ కూడా) చాలా వరకూ పాదాలుగా విభజించబడే ఉండడం దీనికి కారణం కావచ్చు. నా దృష్టిలో అలంకారాల మాదిరిగానే, పాద విభజన కూడా వచనకవిత్వంలో ఐచ్ఛికమే తప్ప కచ్చితంగా పాటించాల్సిన నియమం కాదు. కాబట్టి వచన కవితలు అసలు పద్యాలు అవ్వాల్సిన అవసరమే లేదు. ఆధునికంగా వచ్చిన వచన కవిత్వానికి ఊపిరే స్వేచ్ఛ. ఛందస్సు (కొండొకచో వ్యాకరణ) శృంఖలాలను తెంచుకోడమే వాటి వెనకనున్న స్ఫూర్తి. కాబట్టి, ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని, పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?

    3. నా ఉద్దేశంలో ఈ చర్చలో ప్రస్తావనకి నోచుకోని అతిముఖ్య విషయం ఒకటుంది. వచన కవితల్లో పాదవిభజన ప్రయోజనం ఏమిటి అన్నది. వచన కవితలు చాలా వాటిల్లో పాదవిభజన కనిపిస్తుంది. దానికి నిర్దిష్టమైన సూత్రాలు లేకపోయినా, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించి కవులీ పాదవిభజన చేస్తారు? పాదవిభజనతో కూడిన రూపం, కవితకి ఎలాంటి అదనపు విలువని చేకూరుస్తుంది? వచన కవిత్వ రూపానికి సంబంధించిన ఇలాంటి ప్రశ్నలు విమర్శకుల దృష్టికి అంతగా వచ్చినట్టు లేదు. దీనివల్ల అటు వచనకవిత్వం రాసే కవులకి గాని, దాన్ని చదివే పాఠకులకి గాని ఈ విషయమ్మీద సరైన అవగాహన ఏర్పడ లేదనిపిస్తుంది. వచనకవిత్వ రూపమ్మీద జరిగిన ఈ చర్చలో ఈ విషయాన్ని పరిశీలించడానికి చక్కని ఆస్కారం ఉన్నా, కేవలం లక్షణ నిరూపణ వైపే దృష్టంతా కేంద్రీకరించడం వల్ల, అది జరగలేదు. ఇప్పటికైనా దీనిపై ఎవరైనా, ముఖ్యంగా వచనకవిత్వం రాయడంలో చెయితిరిగిన కవులు, దృష్టి పెడితే బాగుంటుంది. అప్పుడు వచనకవితా రూపంలో పాదవిభజన ఒక శక్తివంతమైన పరికరంగా మారే అవకాశం కలుగుతుంది. పాదవిభజన వల్ల నాకు కనిపించే రెండు సాధారణ ప్రయోజనాలు ఇవి:

    ఒకటి, ఆ పాదంలో చెప్పిన విషయం పాఠకుడి మనసుకి పట్టేందుకు ఒక విరామం ఇవ్వడం. ఇది పాదవిభజన లేకుండా కామా, ఫుల్స్టాప్ వంటి గుర్తులతో కూడా చెయ్యవచ్చు. అయితే, అచ్చులో కవితని చదివేటప్పుడు, ఈ రెండు చిహ్నాలు కన్నా కూడా మొత్తం వాక్యాన్ని ఆపి వేస్తే చదువరి మరింత ఎక్కువసేపు అక్కడ విరామమిచ్చే అవకాశం ఉంటుంది.

    రెండు, సాధారణ వచనంలోని వాక్యాలు వ్యాకరణబద్ధంగా ఉంటాయి. కాని, ఆధునిక కవిత్వంలో వ్యాకరణ అతిక్రమణ చాలా చోట్ల కనిపిస్తుంది. అంచేత అది మామూలు వచనంలాగా రాసుకుంటూ పోతే చదివే పాఠకునికి చిరాకు కలిగే అవకాశం ఉంది. అదే పాదవిభజనతో రాస్తే, అవి వాక్యశకలాలుగా అనిపించి పాఠకుడికి చిరాకు కలగదు.

    ఈ సాధారణ ప్రయోజనాలు కాకుండా కవి ప్రత్యేకమైన ప్రయోజనం కోసం పాదవిభజనని వాడుకోవచ్చు. అలాంటి సందర్భాలుంటే వాటిని పాఠకులు, విమర్శకులూ గుర్తించగలిగే మార్గాలు అన్వేషించాలి.

  1129. మూడు లాంతర్లు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/21/2011 1:26 am

    కనక ప్రసాద్ గారూ !!

    “ఇంకా ఉంది ఇంకా ఉంది ” అన్న మీ మాట వల్ల అంతా ఒక సారే చదవొచ్చు లెమ్మని ఊరుకుంటూంటే మీరు నా సహనానికి పరీక్ష పెడుతున్నారు. మీ మొత్తం చదివినా నాకు కలిగే సరికొత్త జ్ఞానమ్ ఏదో ఒహటి ఉంటుందనే నమ్మకం నాకైతే కలగడం లేదు గనక నాకు మీ అభిప్రాయాలు చదువుతూంటే కల్గిన అభిప్రాయాల్ని క్లుప్తంగా చెప్పడం ఉచితం అని అన్పించింది. గనక ఈ నాలుగు మాటలూను.

    దేవుడి సృష్టి ని గురించిన ప్రశ్నలకి మనకి దొరికే జవాబుల్లో ఎంత స్పష్టత దొరుకుతుందో కవి సృజన వెనుక లోపలి కారణాలని వెతికి పట్టుకునే పని లోనూ అంతే దొరుకుతుంది. కవి తనకే స్పష్టంగా తెలియని తన సృజన కార్యాన్ని గురించి ఇధమిథ్థంగా చెప్పగలుగుతారన్నది [ఇది వరకు కవులంతా మగవాళ్ళే గనక “డు” వాడేయడం సాధ్యమయ్యేది. ఇప్పుడది అసాధ్యం. గనక “కవి” శబ్దాన్నిక్కడ బహువచనంగా స్వీకరించండి వాక్యంలో!!:)] ఎదురు చూడగలిగే విషయం కాదు. మీరు రాసిన పాటల్లోని వాక్యాలతో పోలిస్తే మీ వచనంలోని వాక్యాలు చాలా మేలు! కనీసం అర్ధమయ్యేలా ఉన్నాయి మీ ఊహలు. మీ కవిత్వం “బొమ్మకన్నో” మరో కన్నో గాని పాఠకుల కన్నుకి కూడా అందితే బాగుణ్ణు.

    దీన్ని అలా ఉంచితే ఇంగ్లీషు వాడికి మార్మికత తెలీదు. “పెంజీకటికావల” ఒక మూర్తిని అతగాడు రాయనూ లేడు ..ఊహించనూ లేడు. గనక వాళ్ళది మేలైన కవిత్వమో మనది మేలైన కవిత్త్వమో చెప్పడం ఎప్పుడూ కుదిరేది కాదు.

    మీరే అన్నట్టు ఇవన్నీ “భాషంత పాతవే”!! వీటికి జవాబులు త్రిపురా నారాయణరావు లు గానీ మీ స్నేహితుడు బిపిన్ గానీ నిజంగా తీర్చగలవి అవునని నాకు అన్పించదు. అయితే ప్రశ్నలు అనాదిగా కలుగుతూంటాయి. వాటికి జవాబులు సైతం మీరంతా అనాదిగా వెతుక్కుంటూనే ఉన్నారు.

    ఈ ప్రశ్నల కన్నా మనసు దానిదైన ఒక వివేకంతో తనకి బాగున్న కవిత్వాన్నీ అలాగే ఏమీ పసలేని భావాన్నీ కూడా చప్పున పోల్చుకుంటుంది సహజంగానే !! అందుకే ఎక్కడైనా ఏ కాలంలోనైనా మనకి కవిత్వం అన్నది మిగిలే ఉంది. కవిత్వం కానిది సహజంగానే జారిపోతుంది. గనక మనకి కవులైన అన్నమయ్యలు శతాబ్దాల తరబడి మిగిలి ఉన్నారు. ఉంటారు కూడాను. ఉన్నతమైన సృజన అనేక కారణాలకి బాగుంటుంది. ఏ ఒక్క కారణానికో కాదు.

    రమ.

    రమ.

  1130. చెప్పులు గురించి Mahesh గారి అభిప్రాయం:

    01/16/2011 5:07 am

    JUBV గారి కథ చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు ఒచ్చేసేలా ఉంది.
    కవిత గారు,
    పేదరికం లో, కష్టాల్లో ఉన్న ప్రతి విద్యార్థి అలాగే ఉంటారండి.
    ఆ టైం లో ఆ పుస్తకం, చెప్పులు ఎంత అవసరమో చాలా స్పష్టంగా ఉంది కథలో.
    అలాంటి టైం లో అక్క, అమ్మ చేసిన త్యాగాలకి వాళ్ళకి తర్వాత అది చేద్దాం, ఇది చేద్దాము అనుకోవటం చాలా సహజం.
    పుస్తకం, చెప్పులు అంత అవసరం కాబట్టే కధానాయకుడు కూడా వాళ్ళ త్యాగాలకి సిద్ధం అయ్యాడు.
    అదే BUS PASS కి త్యాగం చేస్తానంటే కధానాయకుడు ఆలోచించేవాడు.
    కవిత గారు మీరు బహుశా డబ్బులో పుట్టి పెరిగి ఉంటారు. ఇక్కడ కామెంట్స్ రాసిన చాలా మంది ఇంలాంటి కొన్ని అనుభవించి ఉంటారేమో…అందుకే ఇది వాళ్ళని అంత కదిలించిదేమో…!!!

  1131. రవీంద్రధనుస్సు గురించి Venu Dasigi (VEDA) గారి అభిప్రాయం:

    01/08/2011 1:24 am

    వాడపల్లి శేషతల్పశాయి గారు 45 యేళ్ళనాటి వ్యాసాన్ని పరిచయం చేసినందుకూ, ఆంధ్రభారతి వారు ఆవ్యాసాన్ని అందించినందుకూ వారికి చాలా కృతజ్ఞతలు!

    అప్పటికీ ఇప్పటికీ యీకవిత మీద ఆసక్తి ఏమాత్రం తగ్గకపోవడం రవీంద్రుని ప్రతిభకు తార్కాణమైతే, ఆవ్యాసంలోనూ, నావ్యాసంలోనూ అదే కవులు ఎక్కువమంది కనిపించకపోవడం మరొక విధంగా రవీంద్రుని ప్రతిభకు అంజలి పట్టడమేననుకోవచ్చు. భారతి వ్యాసాన్నిబట్టి ఆదిపూడి సోమనాథరావు గారి అనువాదం ఇప్పటికి దాదాపు 85 యేళ్ళ క్రిందటి నాటిదన్నమాట. మరి అది ఆవ్యాసరచయిత శ్రీవాత్సవగారికి ఎందుకు నచ్చలేదనంది నాకు కొంచెం ఆశ్చర్యకరమే.

    — వేణు దశిగి (వేద)

  1132. మూడు లాంతర్లు గురించి indrani Palaparthy గారి అభిప్రాయం:

    01/07/2011 3:21 am

    కనక ప్రసాదు గారు:

    ఆట చాలించి కామెంటరీ/విశ్లేషణకి దిగడం ఆటగాళ్ళకి శారీరకపరిమితులదృష్ట్యా అవసరం. సృజనకారులకెందుకీ గోల? కనకప్రసాద్ గారు, ఈ telling మానేసి showingలోకి వచ్చేద్దురూ.

    విభు గారితో ఏకీభవిస్తానండీ.

    వ్యాసాలు చాలా శక్తివంతంగా, ఆలోచింపజేసేవిగా ఉన్నాయి కానీ వీటిల్లో పడి కమ్మకమ్మగా, కారం కారంగా మిరపకాయ బజ్జీల్లా ఉండే మీ కధలు,ఎండాకాలంలో చల్లని గోళీ సోడాల్లా జిల్లుమనిపించే మీ కవితలు రాయడం మానేయకండే…

    పాలపర్తి ఇంద్రాణి.

  1133. ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం గురించి మోహన గారి అభిప్రాయం:

    01/05/2011 1:35 pm

    ఇలాటి ప్రత్యేక సంచికలు ఉండాలా ఉండకూడదా అనే దానిపైన కాదు ఈ అభిప్రాయం. పాత సంచికలు తిరగవేసి అందులో ఇలాటివి ఎన్ని ఉన్నాయో అనే విషయాన్ని తెల్పడమే దీని ఉద్దేశం. జనవరి 2007 నుండి విడుదలయిన ఈమాట సంచికలను ఇందుకై ఎన్నుకొన్నాను. జనవరి 2008లో భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ జన్మదినోత్సవము సందర్భముగా దీనిని ప్రచురించారు. చనిపోయినవారిపయిన మాత్రమే కాదు బతికిఉన్న వాళ్లపయిన కూడ సంచికలను ప్రచురిస్తారు అన్నదానికి ఇది నిదర్శనము. తరువాత నవంబరు 2008లో స్మైలుపైన ఒక సంచిక వచ్చింది. నవంబరు 2009 నుండి ప్రత్యేక సంచికలు కొన్ని ఎక్కువే. అయితే దానికి ఒక కారణము ఉంది. నవంబరు 2009 సంచిక కొ.కు.ను, జనవరి 2010 సంచిక శ్రీశ్రీని వారి శతజయంతి సందర్భముగా సంస్మరిస్తూ ప్రచురించినవి. జూలై 2010 సంచిక శ్రీకృష్ణదేవరాయల సింహాసనారోహణమయి 500 సంవత్సరాలు కాలం గడచిన సందర్భముగా వెలువడింది. కృష్ణరాయలను కన్నడిగులకన్న తెలుగువారు “మనవాడు” అనుకొంటారు, అందులకు ఇది నిదర్శనము. ఈ నెల సంచిక దివంగతులు సంపత్కుమారులను సంస్మరిస్తూ వెలువడింది. సామాన్యముగా ఇటువంటి పండితులను పండితులు, పరిశోధకులు తప్ప మిగిలిన వారెవ్వరూ పట్టించుకోరు. అట్టివారు కూడ తెలుగు భాషకు గొప్ప సేవ చేస్తూ ఉన్నారని ఈ సంచికను చూస్తే మనకు విదితమవుతుంది. అదీ కాక ఇందులోని వచన కవిత పద్యమా కాదా అన్నది ఇప్పుడు కూడ ఒక పెద్ద ప్రశ్నే. పై సంచికలకు భిన్నముగా ఊహించని కారణముగా వెలువడిన ఒకే ఒక సంచిక సెప్టెంబరు 2010 సంచిక. ఇది మహాకవి తిలకును గురించినది. ఈ నా అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయమని అడుగలేదు. నేనే వెదకి వ్రాసినది. మరో విషయం – ఈమాటలోని అన్ని విషయాలు అందరికీ నచ్చక పోవచ్చు, కాని ఇందులోని ఒక్కొక్కటి కొందరి కయినా తప్పక నచ్చుతుంది అనుకొంటాను. ముఖ్యముగా తెలుగుజాతి మరచిపోయిన, మరచిపోతున్న కొన్ని సాహిత్య, సంగీత, లలితకళల విలువలను వీరు ప్రోత్సాహం చేయడము ఎంతో ముదావహము. ఇది ముత్యాలసరము అంగడిలో కొనుక్కోవచ్చు అనుకొనే కాలం వాళ్లకు ఎంతో ఉపకరిస్తుంది.

    విధేయుడు – మోహన

  1134. కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం – మరో కోణం: విమర్శలు – పరామర్శ గురించి మోహన గారి అభిప్రాయం:

    01/05/2011 11:52 am

    గురజాడవారి కాలములోని జాతి, వర్గ రాజకీయాలు నాకు ఎక్కువ తెలియవు కానీ నన్నయ కాలములో ఈ కాలములోవలె వైదికులు, నియోగులు ఉన్నారా అనే సందేహము నాకు కలుగుతుంది. బాటసారిగారూ, మీరు నన్నెచోడుని కుమారసంభవము కుహనా కవిత్వమని, మానవల్లి రామకృష్ణకవి వ్రాసి నన్నెచోడునికి ఆపాదించారు అనే వాదాన్ని ఏ ఒకరో ఇద్దరో తప్ప తెలుగు కవులు, పండితులు, పరిశోధకులు అందరూ నిరాకరించారు. వారి వాదన అంతా నన్నెచోడుని కాలము గురించే. ఇంతకూ నన్నెచోడుడు వైదికుడు కాడు, నియోగి అసలే కాడు, ఒక క్షత్రియుడు. వివరాలకు నేను వ్రాసిన కవిరాజశిఖామణి, క్రౌంచపదము వ్యాసాలను చదువుతారని ఆశిస్తాను.

    విధేయుడు – మోహన

  1135. శిశిర చిత్రాలు గురించి Anand గారి అభిప్రాయం:

    01/03/2011 7:15 am

    చాలా బాగుది మీ కవిత.

  1136. శిశిర చిత్రాలు గురించి మోహన గారి అభిప్రాయం:

    01/02/2011 4:43 pm

    చాలా అందంగా ఉన్నాయి మీ శిశిర చిత్రాలు. ఆకుల ఆకులపాటు వ్యాకులాన్ని కూడా కలిగిస్తుంది. వెనుక ఆనందమయమైన వసంతగ్రీష్మాలు, ముందు హేమంత నిశాంతాల అనంత ఖేదాలు. శిశిరము ఒక సంధి కాలమే. మంచి కవితను అందించినదులకు అభినందనలతో – మోహన

  1137. మూడు లాంతర్లు గురించి విభు గారి అభిప్రాయం:

    01/02/2011 2:33 am

    ఆట చాలించి కామెంటరీ/విశ్లేషణకి దిగడం ఆటగాళ్ళకి శారీరకపరిమితులదృష్ట్యా అవసరం. సృజనకారులకెందుకీ గోల? కనకప్రసాద్ గారు, ఈ telling మానేసి showingలోకి వచ్చేద్దురూ.
    వ్యాసం మొదటి భాగం తెలుగు పాఠకులు ఇంతకు ముందుఇస్మాయిల్ రాతల్లో/కవితల్లో చూసిందే. వాలకం చూస్తే రెండవభాగంలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చదవడానికి మరో నాలుగునెలలయ్యేట్టుంది. వ్యాసాలను ధారావాహికలుగా ప్రచురించటంలో ఏమిటి పరమార్థం?

  1138. పెండ్లి కల గురించి మోహన గారి అభిప్రాయం:

    01/01/2011 6:06 pm

    చాల బాగుంది ఈ కవిత. విశ్వనాథవారిపైన ఉండే వారి గురుభక్తి ఐదవ పద్యములో ప్రకటితమైనది. ఇది మధ్యాక్కర, దీనికి నన్నయలా, విశ్వనాథలా ఐదవ గణానికి యతి నుంచారు. విశ్వనాథలా నాల్గవ, ఐదవ గణాలకు రెంటికీ ఎందుకు పెట్టలేదో? ఆచార్యులు తిరుప్పావై కూడ గద్యముగా తెలిగించారు. ఇది అభినవ ప్రచురణలు 2003లో ప్రచురించిన ‘చింతయంతి’ పుస్తకములో గలదు. గోదా దేవి కాలము (అంటే తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి రచించబడిన కాలము) తొమ్మిదవ శతాబ్దపు ఉత్తరార్ధము. ఆ కాలానికి ఇంకా రామానుజుడు అవతరించలేదు. కాబట్టి విష్ణుభక్తులు కూడ విభూతినే ధరించేవారు. కాబట్టి వారి పెళ్లిళ్లు కూడ (గోదా దేవితో సహా) ఆ పద్ధతిలోనే (స్మార్త పద్ధతిలో) జరిగి ఉంటుంది. రామానుజుని కాలంలో అతడు తిరుప్పావై వల్ల ప్రభావితుడై దీనిని ధనుర్మాసములో పాడాలనే నియమాన్ని ప్రవేశ పెట్టారని తలుస్తారు. అంతే కాక ఆండాళులా వధువుకు కూడా కేశాలంకరణ చేస్తారు వివాహసమయములో. విధేయుడు – మోహన

  1139. 2010 ఇస్మాయిల్ అవార్డు, బ్రౌన్ పురస్కారం గురించి Ravi గారి అభిప్రాయం:

    12/28/2010 3:53 pm

    భూషణ్ కు అభినందనలు, మిగతా కవితలు 2, 3 స్దానాలు అర్హత గల కవితలు కూడా ప్రచురిస్తె బాగుంటుంది.

    -రవి.

  1140. రచయితలకు సూచనలు గురించి పద్మకళ గారి అభిప్రాయం:

    12/14/2010 12:43 pm

    చాలా బాగుంది.మంచి మంచి రచనలతో పాటు అనుభవజ్ఞుల సలహాలు పొందుపర్చటం హర్షణీయం. నా పేరు పద్మకళ. కవితలు,కథలు,వ్యాసాలు రాస్తూ ఉంటాను. మీకు పంపిన కథ మీ వెబ్సైట్ లో పెట్టేదీ లేనిదీ మాకు ఎలా తెలుస్తుంది? ఒక వేళ మీరు తిరస్కరించిన రచనల గురించి ఆయా రచయితలకు వెంటనే తెలియ జేస్తారా? పుస్తక సమీక్షలకి ఏ చిరునామాకి పంపాలి? సందేహ నివౄత్తి చేయగలరని ఆశిస్తున్నాను.

    నమస్కారములు.
    పద్మకళ

    [1. తిరస్కరించినా, ప్రచురణకు తీసుకున్నా రచయితకు వెంటనే తెలియజేస్తాము. 2. ప్రచురణ ఏ సంచికలో ఉండేదీ రచయితకు తెలియజేస్తాము. ఇది సాధారణంగా ఆ తర్వాత రాబోయే సంచిక అయివుంటుంది. 2. మా అంతటమేము, సంపాదకులుగా, పుస్తక సమీక్షలు చేయము. మాకు వచ్చిన సమీక్షలను పరిశీలించి ప్రచురించటం వరకే. మా ప్రచురణ నిబంధనల కోసం పై వ్యాసం చూడండి – సం.]

  1141. జయప్రభశబ్ద కవిత్వం గురించి అనురాగ్ శర్మ గారి అభిప్రాయం:

    12/13/2010 8:40 pm

    అయిదు పేరాల అభిప్రాయాన్ని, అవతలి వారి తప్పులెన్నడానికి గుప్పించిన రమ గారికి, రెండు లింకులు క్లిక్ చేసేందుకు తీరికా, ఆసక్తి లేవట. ఆసక్తి తప్పక ఉండదు కొంతమందికి తమ తప్పులు తెలుసుకునేందుకు.

    ఎవరో భూషణ్ ఎవరో ప్రభ కవిత్వం మీద వ్యాసం రాస్తే, ఎంతో ఆసక్తితో, తీరికతో అభిప్రాయలిచ్చిన రమ గారు. లాజిక్కు మాట్లాడేప్పటికి “అత్తా కోడళ్ళ మధ్య సంభాషణ” ( మనది ప్రజాస్వామ్యం గనక అందరూ అభిప్రాయాలు చెప్పేయవచ్చును. కాదన్నదెవరూ?? పైగా అదుపులేనంత చోటొకటి ఉండనే ఉంది కూడా కదా?? బోలెడంత రాయడానికీ!! రాసుకుపోతే సరి!! భూమ్మీద ప్రతివారికీ చోటుందాయె !) వంటి సూటిఫోటి వ్యాఖ్యలకు దిగారు.

    సరే రమ గారికి కాకపోయినా పాఠక లోకానికి నిజాలందించానన్న తృప్తి నాకు మిగిలింది. “ఈ భూమ్మీద కాసింత చోటిచ్చిన” ఈ మాట సంపాదకులకు కృతజ్ఞతలు.

    అనురాగ్ శర్మ

  1142. జయప్రభశబ్ద కవిత్వం గురించి అనురాగ్ శర్మ గారి అభిప్రాయం:

    12/10/2010 1:56 pm

    “ఈ వ్యాసం రాసి ఇన్నేళ్ళు గడిచినా దీనిమీద నేను ప్రతిస్పందించే దాకా ఒక్క అభిప్రాయం కూడా లేదంటేనే ఈయన మాటలకి పాఠకులు ఏపాటి విలువనిచ్చారో అర్ధమౌతూంది మరి.”

    రమ గారు

    పాఠకుల అభిప్రాయాలా రచన ఘనతను నిరూపించేవి ?? ఇదెక్కడి వితండ వాదం ??

    గతంలో ఈ మాట అతిథి పుస్తకాలను వాడేది.మే 2006 నుండి మనం వాడుతున్న “పాఠకుల అభిప్రాయాలు” (ఈ మాట సంపాదకుల మాటల్లో చెప్పాలంటే -“ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.) అందుబాటులోకి వచ్చింది. పాత అభిప్రాయాలకు సంపాదకులు లింకు ఇచ్చారేమో నాకు తెలియదు. ఈ సంచికలోని వ్యాసాలు సాంకేతిక కారణాల వల్ల చాలా కాలం అందుబాటులో లేవు అన్న విషయం పక్కన పెడితే, “జయప్రభ శబ్ద కవిత్వం” వచ్చిన సంచిక పై పాఠకుల అభిప్రాయాల లింకు, ఆసక్తి గల పాఠకుల కోసం పాత అతిథి పుస్తకాలకు లింకు ఇస్తున్నాను.

    మీరు కొనియాడే జయప్రభ గారి వ్యాసం మీద గత పదకొండేళ్ళలో ఒక్క వ్యాఖ్యయినా లేదు. ఆ వ్యాసానికి పాఠకులు విలువ నివ్వలేదనా?? లేదా ఇది మగ దురహంకారుల కుట్రలో భాగమా?

    అదిగాదు ఆలోచించే తీరు, అప్పటి అభిప్రాయాలు వచ్చిన పేజీలు ఎక్కడో ఉండి ఉంటాయి, వాటిని వెతికి పట్టుకోవాలి, అంతే.

    అనురాగ్ శర్మ

  1143. జీనో పేరడాక్సు గురించి madhukar గారి అభిప్రాయం:

    12/09/2010 3:34 pm

    కవిత నడక,ఎత్తుగడ అంత చాలా బాగున్నై.(నాకు ఒరిజినల్ వర్షన్ తెలియదు) వస్తువు ఎన్నిక లో వైవిధ్యం, సమస్యల చిత్రించే తీరు బాగున్నై.మీలోని సామ్య వాద నిబధ్ధత ధ్వని గర్భితంగా ఉంది. ఏమంటారు???

  1144. మొలక గురించి madhukar గారి అభిప్రాయం:

    12/09/2010 3:13 pm

    కువకువల కిలకిలల
    గోరువెచ్చని
    పాల మీగడల
    మృదుత్వ నిర్మలత్వంలోకి పద ప్రయోగం చిన్నారుల సంకేతాలుగా సున్నితంగా లలిత మనోహరం గా ఉన్నై. మీ కవితలో స్వాత్మయీకరణ శక్తి ఉంది.(జనులు తాము కవి తో మమేకమయ్యి అదే భావ స్థాయి చేరుకోవడం)

  1145. నా అందం ఏమయింది? గురించి vani గారి అభిప్రాయం:

    12/08/2010 5:39 am

    ఉదయ భానుని కిరణాలలో ఎంతటి ఆహ్లాదము ఉందో
    ఉదయకళ కవిత లో అంతటి అందం ఉట్టి పడుతుంది
    తొలకరి చినుకులకు తడిచిన ధరణి మేను ఎంత అందంగా ఉంటుందో
    ఉదయకళ కవిత లో అంతటి అందం తొణికిసలాడుతుంది

  1146. జయప్రభశబ్ద కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/04/2010 2:45 pm

    యశస్వి గారికి ఈ వ్యాసంలో అంతా సవ్యంగానే కన్పించడమ్ వారి భావ సానుకూలతకి నిదర్శనంగా అనుకుంటాను. నాకు వ్యాసం అర్ధమ్ అయిన తీరు మీదనే నేను ప్రతిస్పందించినది.

    మనకి నప్పని ఆహార్యాన్ని ధరించి ప్రదర్శనని మొదలుపెడితే అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఈ వ్యాసమూ అలాగే ఉంది. ఇంత వాచాలత్వాన్ని తన వ్యాసంలో చూపించిన యదుకులభూషణ్ తన కవిత్వంతో ఎందరిని ఆకట్టుకున్నాడో.. తన విమర్శనాచతురతతో ఎందరికి జ్ఞానం కల్గించాడో ఎవరైనా వివరిస్తే సంతోషిస్తాను. జయప్రభ గారి కవిత్వాన్ని ఇష్టపడ్డవారంతా మరి ఈయన అంచనా ప్రకారము అజ్ఞానులూ, శబ్దలోలులూ అకవిత్వానికి పోషకులూను. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక్క యదుకుల భూషణుడే మరో ఉమాకాంతుడూనూ !!

    అంతటి ఉమాకాంతవిద్యాశేఖరులకే దిక్కులేకపోయింది. ఆయన ఎంత తిట్టినా కృష్ణశాస్త్రినే నిలబెట్టుకుంది గానీ తెలుగు సాహిత్యం ఆయన విమర్శని కాదు. ఎప్పుడో కాలంచెల్లిన భావాలని జనం దృష్టిని తనవైపుకి తిప్పుకోడానికి కాబోలు ఈయన ఈ వ్యాసంలో చాలా ప్రయత్నమ్ చేసాడు. పద్యాల్ని తెగ ప్రస్తుతించేశాడు:) ఈ వ్యాసం రాసి ఇన్నేళ్ళు గడిచినా దీనిమీద నేను ప్రతిస్పందించే దాకా ఒక్క అభిప్రాయం కూడా లేదంటేనే ఈయన మాటలకి పాఠకులు ఏపాటి విలువనిచ్చారో అర్ధమౌతూంది మరి.

    రమ

    [comment edited – Eds.]

  1147. జయప్రభశబ్ద కవిత్వం గురించి yasasvi గారి అభిప్రాయం:

    12/04/2010 1:10 pm

    రమగారి ప్రతిస్పందనలో ఉన్న జోరు ఎందుకని ఎక్కువగా ఉందో నాకు సరిగ్గా అర్ధమ్ కాలేదు. యదుకుల భూషణ్ గారు జయప్రభ గారి కవిత్వమ్ నించి తనకి నచ్చిన కొన్ని పద్యాలని ఎంచుకుని వానిలోని అందచందాలనో ఇబ్బందులనో విశ్లేషణ చేసారు. అందులో ఆయన దృష్టి మిగతా వారి దృష్టి కన్నా భిన్నమైనది కావొచ్చు కదా?? అందులో రమ గారు చెప్పిన భావాలేమీ లేవే?? అయితే జయప్రభ గారి కవిత్వంలో భిన్న కోణాలున్నాయి. వాటిని యదుకులభూషణ్ గారు చూపించలేకపోయి ఉండొచ్చు. కానీ నాకైతే ఈ విమర్శలో యదుకులభూషణ్ ని జ్వాలాముఖితో పోల్చదగ అంశమేదీ చూపుకు తోచలేదు. పైగా ఆయన ఎంపిక చేసి ఇచ్చిన జయప్రభ గారి కవితలన్నీ చదవడానికి ఇంపుగాఉన్నాయి కూడా!! అందుకు యదుకులభూషణ్ గారి అభిరుచిని రమ గారు మెచ్చుకోక తప్పుపట్టడమ్ ఎందుకని జరిగిందో??

    యశస్వి.

  1148. జయప్రభశబ్ద కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/04/2010 1:12 am

    రాజకీయాతీతమైన దృష్టి ఉన్నవాడు అరాచకీయమైన తూకానికి పూనుకుంటే సరిగ్గా ఇదిగో ఈ విమర్శ లాగే ఉంటుంది. జయప్రభ కవిత్వం మీద ఇలాంటి వ్యాఖ్యానాలని చేసిన వాళ్ళలో ఈ యదుకుల భూషణ్ మొదటివాడేమీ కాదనుకుంటాను. జయప్రభ కవితాసంకలనాల మీద మగవాళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుని ఇలాంటి రాతలు రాసి ఏదో ఒక తరహా గుర్తింపుకోసం ప్రయత్నించడం చాలాసార్లు జరిగింది కూడా !! ఈయనకి స్త్రీవాదమో లేక మరో వాదమో నచ్చలేదు గనక వాటిని కవిత్వంలోంచి ఎంచి ఖండించడానికి పూనుకుంటే ఆ విమర్శ ఏ తోవలో సాగాలో ఆ తోవలోనే సాగింది ఇది కూడా !! జ్వాలాముఖి మొదలుకుని మరి కొందరు కుర్ర జ్వాలాముఖుల దాకా ఈ తరహా గొంతు ఆమె కవిత్వం విషయంలో “విమర్శ” పేరున రావడం కొత్త ఏమీ కాదు కూడాను. అయితే అవన్నీ ఎంతమేరకి నిలబడ్డాయో దీనికీ అంతే స్థానం ఉంటుంది.

    ఆవిడ కవిత్వాన్ని విమర్శ పరిధిని కూడా దాటిపోయి ఆరుద్ర రివ్యూ పేర బోలెడంత తిట్లు కుమ్మరించిన సందర్భమ్ ఉంది. ఆరుద్ర దృష్టి ఏ తోవలో నడిచిందో అది చూపించి ఆయన నీరస దృష్టికి ఆ రాత నిదర్శనంగా నిలిచిందే తప్ప ఆ అభిప్రాయం జయప్రభ కవిత్వాన్ని తక్కువ చేయలేకపోయింది. పాక్షిక దృష్టితో రాసిన ఎన్నో రాతలు ఆవిడ కవిత్వం మీద ఇదివరలో కూడా రాకపోలేదు. ఆ తరహా రాతల్లో ఇది ఒకటి. ఐతే స్త్రీవాదులు ఇటువంటి రాతలని పరిగణన లోకి తీసుకుంటారా?? అన్నదానికి సైతం వాళ్ళ అనేక ప్రతిస్పందనలు జవాబులుగా ఉన్నా ఇంకా ఇటువంటి స్త్రీల రాజకీయ కవిత్వాలని వ్యతిరేకించే వాళ్ళున్నారంటే ఇంకా తెలుగు సాహిత్య రంగంలో తరవాతి తరాలలో సైతం ఎంత వెనకబాటుతనం ఉందో స్పస్టపడుతోంది.

    మనకి అన్నా అఖ్మతోవా నచ్చుతుంది. కానీ మన సమకాలంలో మనతో పాటు నడిచే ఒక అన్నా అఖ్మతోవా, ఒక మాయా యాంజిలో నచ్చలేదు. అది తెలుగువిమర్శలో ఉన్న ఒక జాఢ్యం. పేరొచ్చిన వారిని విమర్శించి తానూ పేరు తెచ్చుకోవాలన్న ఒక అతి పాత పాత జాఢ్యం. అందుకు అనేకసార్లు అనేక మందికి జయప్రభ కవిత్వం ఎంతో ఉపయోగపడటం అన్నదే ఆమె కవిత్వానికి ఉన్న బలాన్ని చెప్పకనే చెబుతోంది. ఏమీ లేని పుస్తకాన్ని చదివి అవతల పడేయాలి. కానీ దాన్ని అంత సుదీర్ఘంగా అంత బలంగా కాదని అనవలసి రావడమ్ అంటేనే అందులో ఉన్న విశిష్టతని ఒప్పుకోవడం అన్నమాట. పండితుని వేషం వేసుకున్న వాడు పండితుడు కానట్టే ఈ తెచ్చికోలు హడావిళ్ళూ ఈ డొల్లమాటలూ సైతమ్ అతుకులబొంతలాంటివని అర్ధమ్ అవుతుంది. రాజకీయాతీతమైన జీవితమూ లేదు. రాజకీయాతీతమైన కవిత్వమూ ఉండదు. అది అఖ్ఖరలేని వాళ్ళు ఆ తరహా కవిత్వాన్ని విమర్శించపూనుకోవడం లోనే వారి చూపు లోని అంతరార్ధమ్ అర్ధమవుతుంది ఎవరికైనా !!

    అయితే ఈ పరిస్థితి ప్రపంచ సాహిత్యంలో స్త్రీల వ్యక్తీకరణల మీద నిందాపూరిత స్వరాలతో విమర్శ పేరు పెట్టుకుని జరగడం అనేకసార్లు జరిగింది. ఇక్కడ మళ్ళీ జరిగింది. పురుష సాహిత్య ప్రపంచంలో మళ్ళి మళ్ళీ జరుగుతూనే ఉంటుంది కూడాను. ఈ తరహా సాహిత్యమ్ వచ్చిందీ అంటేనే దాని అవసరమ్ ఉందీ అని అర్ధం ! అది ఈ అరాజకీయ వాదులకి ఒప్పుదల అయ్యిందా కాదా అన్నదానితో కవయిత్రులకి ఏమీ ప్రమేయం లేదని వాళ్ళు ముక్తకంఠంతో ఇదివరకే చెప్పేసారు కూడా !!

    కవిత్వం అనేక తరహాల్లో బయటికి వస్తుందని ..”శిల్పం” సారంలోనూ రూపం లోనూ భిన్నం గా ఉంటుందనీ కవితా శిల్పం నిజంగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకు సహృదయతా ఉండాలి. సంయమనమూ ..సహనమూ ఉండాలి. కానీ ఈ విమర్శలో అది కొరవడింది. ఇందులో యదుకుల భూషణ్ కి నచ్చినవి కొన్ని ఉన్నట్టే మిగతా తరహా వ్యక్తీకరణలు నచ్చిన వాళ్ళూ మరికొందరుంటారు. విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కవులు వారి తోవన వారు పాడుతూనే ఉంటారు.

    రమ.

  1149. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/03/2010 2:58 pm

    కవిత్వాంశ అన్నది ఏ కోశానా లేని దీన్ని ప్రచురించడం “శేషేంద్రశర్మ కి నివాళి గా” అంటూ పైగా…అది ఈమాట వాళ్ళ లోపం !! ఎన్నో కవితలు శేషేంద్ర శర్మ గారివి మంచివి ఉన్నాయి. అయినా దీన్ని ఎన్నుకోవడం చేసారూ అంటే అది సంపాదకుల అభిరుచికి మాత్రమే నిదర్శనం. కవి రాసిన ప్రతీ అక్షరాన్నీ అత్యుత్తమ స్థాయిలో ఉందనో లేదా ఉండాలనో అనుకోవడం కవిత్వతత్వం తెలియనివారనుకోవచ్చు. కానీ బాధ్యత కల్గిన పత్రికా సంపాదకులు అలా చేయకూడదు. ఎంపిక చేసి శేషేంద్ర శర్మ రాసిన ఏ మంచి కవితనైనా ఆయనకి నివాళిగా ఇచ్చి ఉండవచ్చు. ఇలాచేయడం పోయిన ఒక కవిని ప్రస్తుతించడం కిందకి రాదు సరికదా..ఆయన ఊహాశక్తి మీదో ఆయన శబ్దశక్తి మీదో ఒక వెక్కిరింత లాంటిది గుప్పించడమే !! ఐతే, అందువలన కవిగా శేషేంద్ర శర్మ గారికి వచ్చిన నష్టమూ ఏమీ లేదు. ఆయన కవిత్వం చదివిన వారు ఆయన మంచి కవిత్వం రాసినట్టు కూడా గుర్తించగలరు.

    ఇంక ఈ రాత కవిగా మరింక ఆయన స్పందనలన్నీ ఉడిగిపోయిన తరువాత రాసి ఉండొచ్చు. చెప్పడానికి ఇవాళ ఆయన లేనప్పుడు ఈ ప్రశ్న కి జవాబూ రాదు.పాపం ఆయన మాత్రం ఏంచెప్పగలడూ?? అయితే అది కవికేనా వర్తించేదీ?? పస లేకపోయినా విమర్శ పేరుతో తమ రాతల్లోనానా చెత్తని చెలామణీ చేయడం లేదూ విమర్శకులూనూ?? ఏంచేస్తాం? చదివేసి
    చాదస్తం అని ఊరుకుంటాం అంతే !!

    రమ.

  1150. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి వంశీ గారి అభిప్రాయం:

    12/03/2010 11:10 am

    చాలా దుర్భరంగా ఉంది కవిత. ఆయనే రాసాడా అనేది నా అనుమానం..

  1151. జీనో పేరడాక్సు గురించి madhurasree గారి అభిప్రాయం:

    12/03/2010 1:43 am

    కవిత చాలా బాగుంది

  1152. ఒకే ఒక్క ఇస్మాయిల్‌ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/03/2010 1:32 am

    అవును ఇస్మాయిల్ తత్వశాస్తమే బోధించినట్టు ఇప్పుడు గుర్తొస్తోంది. సవరించినందుకు యదుకుల భూషణ్ కి థాంక్స్. అలాగే ఏ కవీ శబ్దాన్ని తక్కువ చేయలేడనే నేను అనేది కూడాను.

    ఇకపోతే సాహిత్యం లో ఎవరి దగ్గరా “అంకెలూ..సంకెలూ” ఉండవు. కానీ ఒక శ్రీశ్రీ కవితో ఒక తిలక్ కవితో నోటికొచ్చినట్టు చప్పున ఇస్మాయిల్ కవితాపంక్తులు నోటికొచ్చిన వారు సంఖ్యలో తక్కువే ఉంటారు. ఉంటారన్నది ఒక స్పృహ. వాదనకోసం నాలుగు వాక్యాలు రాయడం వట్టి కుర్రతనం. దానికి నేను ప్రతిస్పందించను.

    ఇకపోతే యదుకులభూషణ్ చెప్పిన “పద్యం మనసులో రూపుదిద్దుకోవడం” అన్నది సరైన మాట. పరికరాలు అన్నవి కాదు నిర్ణయించిన విషయాలు. ఇవాళ కంప్యూటర్ ఉంది. కాయితం ఉంది. అంతకన్నా ముందు తాటాకుంది. ఇవి కాలానుగుణంగా వచ్చిన సదుపాయాలు మాత్రమే !! పాతరోజుల్లో కూడా పుస్తకాలకి నకళ్ళు తీయిచుకోవడం అన్నది ఉంది. అందరికీ పుస్తకం అన్నది అందుబాటులో లేదు గనక ఒకరు చదవడమో పదిమంది వినడమో జరిగి ఉండొచ్చు. అచ్చుయంత్రం వచ్చాకా సైతమ్ కవిత్వాన్ని అందరూ లోపలే చదువుకున్నారని ఏమీ చెప్పలేము. విషయం అది కానే కాదు.కవితా స్పందనలో దాని పాత్ర ఏమీ గణనీయమైనదీ కాదు.

    ఇంక ఇస్మాయిల్ గారి కవిత్వానికి సంబధించి వెల్చేరు చెప్పిన మిగతా థియరీ అంతా కృతకంగా ఉంది. నేను చేసిన వ్యాఖ్య దానికి సంబంధించినది. కవులు అనేక రకాలైన వ్యక్తీకరణలు చేసారు. అందులో ఇస్మాయిల్ తరహా వ్యక్తీకరణ ఒకటి. దాని లోతుపాతులేమైనా అవి నారాయణరావు చెప్పిన కారణాలకి మాత్రం కాదు అన్నది నా భావం.

    అతి ఆంగ్లత్వం అన్నది ఒకటుంది ఆధునిక కాలంలో! వెనకటికి నా మిత్రుడు అంటూండేవాడు. తెలుగులో పదజాలం అమితం. అంత వొకాబులరీ అనవసరం. సగం పదాలు వదిలేయడం మంచిదీ అని.
    ఇది అనువాదాలు చేసేవాళ్ళకి వచ్చే ఇబ్బందులని చర్చించినప్పుడు వచ్చిన మాట అన్నమాట. ఏతావాతా చెప్పేదేమంటే… అనువాదకులకి బాగుంటాయని కవులు “క్లుప్తం” గానూ రాయరు. విస్తరించీ రాయరు.

    సాధారణంగా కవితలో భావాన్ని”లౌడ్” గా చెప్పడం అన్నది ఇంగ్లీషు యూరోప్ దేశాల వెరసి పశ్చిమ దేశాల సాహిత్యానికి ఇమిడే విషయం కాదు. వారికి “క్లుప్తంగా” ఉన్న భావం చప్పున అందుతుంది. అందువలన ఇస్మాయిల్ కవితని అనువాదాలనించి కూడా వాళ్ళు నచ్చుకుని ఉండిఉండొచ్చు.కానీ కవితని పశ్చిమ దేశాల వారు మెచ్చుకోవడం అన్నది ఆ కవి గొప్పతనానికి నిదర్శనమూ కాదు.లేదా ఆ కవి కవితకి అదొక అదనపు అర్హతా కాదు. కేవలమ్ కవిత్వలో క్లుప్తత అన్నది పాశ్చ్యాత్యుల సెన్సిబిలిటీస్ కి దగ్గరగా అన్పించడానికి అవకాశం ఉంది. అంతమాత్రమే !! ఇంగ్లీషు ప్రభావమో లేక తాను బోధించిన తత్వశాస్త్ర ప్రభావమో కూడా ఇస్మాయిల్ గారి మీద లేదనీ అనలేం !! దానికనుగుణంగా ఆయన వ్యక్తీకరణ సాగిందా అన్నది చూడొచ్చు. నారాయణరావు దాన్ని కవిలోని ఒక “గడుసుతనం” గా అభివర్ణిస్తున్నారు. అది నారాయణరావు గారి వ్యాఖ్యానమే తప్ప ఇస్మాయిల్ గారి దృక్పధం అయి ఉంటుందని అనిపించదు. ఏ కవీ “పనిగట్టుకుని “గడుసు” గా కవిత్వం రాయడనుకుంటాను.. కానీ విమర్శకుడు మాత్రం తనలోని “గడుసు” తనంతో కవిలో లేని అలాంటి కొన్ని”గడుసుతనాలని” తన సిధ్ధాంతంలోంచి చూస్తాడు. దాన్నే ఆ కవికీ ఆపాదిస్తాడు. కానీ పాఠకులకి వాటితో ఏ ప్రమేయమూ ఉండదు. ఒక కవి కొందరికి నచ్చడానికీ మరి కొందరికి అంతగా ఆస్వాదయోగ్యం కాకపోవడానికీ ఉండే కారణాలు రకరకాలు.

    రమ

  1153. ఒకే ఒక్క ఇస్మాయిల్‌ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    12/01/2010 4:49 pm

    ఈ అభిప్రాయంలో ఆధారం లేని వ్యాఖ్యలు అనేకం. మచ్చుకి రెండు :

    ౧. ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది.

    ఆయన జీవితకాలం బోధించింది తత్వ శాస్త్రం. ఆయన సన్నిహితులకు , ఆయన కవిత్వం సీరియస్ గా చదివిన అందరికీ ఇది తెలిసిన విషయమే.
    మరిన్ని వివరాలకు ఇంద్రగంటి గారి అమ్మాయి ఇస్మాయిల్ గారు బ్రతికుండగానే చిత్రీకరించిన ఆయన ఆత్మకథ DVD చూడండి. లేదా ” కవిత్వంలో నిశ్శబ్దం” వ్యాస సంపుటిలో రమణారెడ్డి గారికి ఇచ్చిన బదులు చూడండి.

    ౨. ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.

    ఎవడా పాఠకుడు? ఏమా కథ ?? సదరు పాఠకునికి ఇతర కవులు ఆమోద యోగ్యమన్న విషయం మీకెలా తెలిసింది ?? మీకేమైనా కర్ణ పిశాచి ఉందా ?? పై అభిప్రాయం మీ అభిప్రాయం లాగే ఉంది. తప్పు లేదు.పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.

    ఇక అసలు వ్యాసం విషయానికొస్తే -పొసగని విషయాలు అనేకం , మచ్చుకు రెండు :

    ౧.ప్రసార మాధ్యమాల పాత్రను అతిగా అంచనా వేశారు.
    ౨. శబ్దార్థాలను అర్థం చేసుకున్న తీరులో గందరగోళం ఉంది.,


    ” పద్యం రాతలో కనిపించడానికీ మాటల్లో వినిపించడానికీ మధ్య చాలా తేడా వుంది. ఆనందవర్ధనుడి కాలంలో పద్యం ప్రధానంగా మాటల్లో వినిపించేది. అచ్చుయంత్రం వచ్చేదాకా పద్యం రాతలో కనిపించలేదు. చప్పుడు వినకముందే మాటని కాగితం మీద చూడడం మనకి మాత్రమే సాధ్యపడింది. అచ్చుయంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కవిత్వంలోనే శబ్దం అప్రధానమయ్యే పరిస్థితికి అవకాశం ఏర్పడింది. అవకాశం ఏర్పడింది కదా అని దాన్ని వెంటనే అందరూ అందిపుచ్చుకోలేదు. కావ్యంలో శబ్దాన్ని వదిలెయ్య వచ్చునని తెలిసి, అందులో ప్రయోజనం వుందని గమనించి, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న కవి మనకి ఇస్మాయిల్‌ ఒక్కడే.”

    ప్రాచీన కాలం నుండి నానా విధాల మాధ్యమాలు వచ్చాయి: వెదురు బద్ద, గట్టి ఎముక,మట్టి పలక, పట్టు వస్త్రం ,తాటాకు..నానా రకాల కాగితాలు ,ఇప్పుడు ఈ రీడర్లు. మాధ్యమాలు కవికి ఎటువంటి
    అవకాశాన్ని ఇవ్వవు.అవి కేవలం మాధ్యమాలే.పద్యం రూపు దిద్దుకోనేది కవి మనసులో.ఆ తర్వాత, ఏదో ఒక మాధ్యమం ద్వారా అది పాఠకుని మనసు చేరుతుంది. అంతవరకే దాని పాత్ర.పద్యం చేరవలసిన చోటు చేరిన తర్వాత మాధ్యమంతో ఇక పని లేదు. అది , పాఠకుని మనసులో స్వతంత్రంగా మనగలదు అన్నది మనకు అనుభవంలోని విషయం. ఆసక్తి ఉండాలే గాని, ఎన్నో పద్యాలు గుర్తుంటాయి.
    కాబట్టి శబ్దం అప్రధాన మయ్యే ప్రసక్తే లేదు. అచ్చు యంత్రం రాక ముందు కూడా లేఖకులు ఉండే వారు , కావలసినన్ని ప్రతులు తయారయ్యేవి , చలామణీ లోకి వచ్చేవి. చైనా లోని సమాధులు తవ్విన ప్రతి సారి సదరు వ్యక్తికీ ఇష్టమైన పుస్తకాలూ పట్టు వస్త్రం పై రాసినవి దొరుకుతూనే ఉన్నాయి. ( క్రీ.పూ రెండవ శతాబ్దం నాటి ప్రతులు లభ్యం ) ఇంకా ముందుకు వెళితే వెదురు ( క్రీ.పూ నాల్గవ శతాబ్దం )కూడా వాడారు.( వాటి పరిష్కృత ప్రతులు నా దగ్గరున్నాయి.)

    ” తన కవిత్వంలో, శబ్దప్రమేయం లేకుండా కాగితం మీద రాసిన అక్షరం తిన్నగా అర్థానికి దారి తీయగల విలక్షణమైన ప్రజ్ఞని ఆయన సంపాదించారు. ఆయనపద్యం చదువుతుంటే మన కంటికి అక్షరాలు కనిపించే మాట నిజమే. కాని ఆ అక్షరసముదాయం శబ్దసముదాయంగా మార్పుచెందక ముందే మన కళ్ళ ముందు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ అర్థాలు గీసిన బొమ్మే కాని శబ్దాలు గీసిన బొమ్మ కాదు. భాషకి వున్న శబ్దశక్తిని నిశ్శబ్దంగా వాడుకోగల సామర్య్థాన్ని ఇస్మాయిల్‌ అపూర్వంగా సాధించారు “

    ఇస్మాయిల్ శబ్దానికి పట్టం కట్ట లేదు అంటే నిలువునా నిశ్శబ్దంలోకి దూకారని కాదు.మాటలు ఎక్కడ ఆపాలో గ్రహించారు. అక్కడి నుండి మౌనం ప్రవేశిస్తుంది.( అది తూర్పు దేశాల కవులు వేల ఏళ్లుగా
    చేస్తున్నదే.). శబ్దాన్ని అనుసరించే ఉంటుంది అర్థం. కాబట్టే, ఇమేజ్ ని పదచిత్రం అన్నారు కాని అర్థ చిత్రం అనలేదు.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  1154. ఒకే ఒక్క ఇస్మాయిల్‌ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/01/2010 1:08 am

    వెల్చేరు గారు ఈ వ్యాసంలో కవిత్వమ్లో ఉండే “నిశ్శబ్దాన్ని” నిర్వచించడంలో వెనకబడ్డారో.. లేక ఆయనకే ఆ విషయం లో సరైన స్పష్టత లేదో నాకు బోధపడలేదు గానీ మొత్తంగా ఇస్మాయిల్ ని కవిగా చూపించడంలో వెల్చేరు ఎక్కడో తోవమరిచినట్టున్నారు.

    “క్లుప్తత” అన్నదానికి ఎక్కడైనా దానిదైన చోటుంది. కవిత్వం లోనూ జీవితం లోనూ కూడా!! జపనీయుల “హైకూ” లు ఇటువంటి క్లుప్తతతో బొమ్మలంటి రేఖాచిత్రాలని కవిత్వంగా గీసినవే!! అది ఒక తరహా కవిత్వం!

    మాటలని మించిన మౌనానికి భాష లేదని నేనను గానీ అది “క్లుప్తత” అయితే కాదు. అదొక తాత్వికత. దాన్ని ఇస్మాయిల్ కవితలో ఎలా చూసారో మరింత వివరంగా వెల్చేరు చెప్పగలిగితే బాగుండేదేమో? అలాంటి కవి ఇస్మాయిల్ అవునో కాడో స్పష్టపడేది కూడాను.

    ఇకపోతే కవిత్వంలో ” మాటల” ప్రయోజనం లేదని అనడానికి కూడా కుదరదు. విస్తరించ వలసిన చోట భావంలో “క్లుప్తత” అంతే చికాగ్గా ఉంటుంది.ఈ తారతమ్యం చూపించడంలో విమర్శకుడు విఫలమ్ కావడమ్ తరుచూ జరిగింది. ఇందుకు విమర్శకులు విమర్శకన్నా మించి కవులకి ఎక్కువ ప్రాధన్యం ఇవ్వడం ఒక కారణమ్ బహుశా!! వీళ్ళ మెచ్చుకోళ్ళలోనూ లేదా వీళ్ల దాటివేతలోనూ కూడా ఏ అంతస్సూత్రమూ కనిపించకపోవడం అన్నది విమర్శలోని పెద్ద లోపం !!

    నారాయణరావు గారి అభిప్రాయాన్ని అనుసరించామా ” శ్రీశ్రీ” కవి కాడు. “తిలక్” కవి కాడు. అజంతా అసలే కాడు. అలాగే మరి కొందరు మిగతా కవులు కూడాను. శ్రీశ్రీ ” ఆహ:” తప్ప కవితా ఓ కవితా అన్నది కవితే కాకూడదు. అది శబ్ధమయమూ.. మాటల మయమూను. భాషని అతి చిక్కగా తన ఊహాచిత్రాలకి అతికించిన తిలక్ కవిత్వం ఈ లెఖ్ఖన వట్టి మాటల పోగులాగా మారిపోయే పరిస్థితి ఉంది మరి. ఒక కవిది ఒక తరహా కవిత్వం అని చెప్పడమ్ వేరు. అదులోని విశిష్టతని వివరించడమ్ వేరు. మాట ద్వారా ..ధ్వని ద్వారా అందవలసిన ఊహ దగ్గర కవిత్వంలో క్లుప్తతకీ నిశ్శబ్దానికీ పెద్దపీట వేయడమ్ వేరు.అది అన్ని చోట్లా నిజమ్ కాదు గనక. క్లుప్తతని ముందుకు తీసుకుని రావడం కోసం శబ్దశక్తిని తక్కువ చేయనఖ్ఖర లేదు. అయితే తన విమర్శనా శైలిలో ఇలాంటి దూకుడు విమర్శకునిగా వెల్చేరు చూపించడం కొత్త విషయమేమీ కాదు.

    ఒక్కోసారి సాదా సీదా వచనంలో “మాటల్లో” సైతం మనసుని మేల్కొలిపే ఒక చిత్రిక పట్టిన భావం మృదువుగా తాకకపోదు. మాట అవసరమ్ ఎంత అని తెలిసి వాడగలగడమే కవితా నాణ్యతకి గుర్తు. అంతే గానీ పికాసా గీతల్లోలాగా మూడే మూడు మాటల్లో చిత్రం గీయడం కవికి అవసరం లేదు. కవి చిత్రకారుడి పాత్రలోకి వెళితే చిత్రకారుడు మాటల్లోంచి చెప్పినట్టు పాఠకునికి చెప్పాలీ అంటే ఎక్కువ రంగులు వాడాలి కాబోలు. అప్పుడక్కడ అదీ ఎబ్బెట్టుగానే ఉంటుంది కాదా??.

    మాటకీ మాటకీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం కవికి సహజంగా తెలుస్తుంది. అప్పుడే మంచి కవిత పుడుతుంది. సరైన మాటలు వాడటమే కవిత్వం!! అందువలన క్లుప్తతా.. నిశ్శబ్దమ్ కవితాస్వాదనకి చాలాసార్లు ప్రతిబంధకాలే అవుతాయి!!

    ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.

    ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది. తన భావ వ్యక్తీకరణకి ఆయన తెలుగు భాషని ఎన్నుకోవడమ్ అన్నది ఆయనకి మరి ఎందుకని అవసరం అయ్యిందో??

    రమ.

  1155. పాప మనసు గురించి ns murty గారి అభిప్రాయం:

    11/25/2010 12:29 am

    చాలా బాగుంది. పిల్లలను అర్థంచేసుకుందికి చాలా పెద్ద మనసుండాలి.
    మీ కవిత లో ఆర్గ్రత కనిపిస్తోంది.
    అభినందనలు

  1156. ఇస్మాయిల్‌ గారితో నా పరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/24/2010 9:54 pm

    ఈ అభిప్రాయాలలోంచి ఈవ్యాసకర్తకి ఇస్మాయిల్ గారన్నా ..ఆయన కవిత్వమన్నా ఎక్కువ ఇష్టమన్న సంగతి అర్ధమవుతూందే గానీ ఆయన నిర్వచించిన కారణాలకే ఇస్మాయిల్ గారి కవితా విశిష్టత నిజంగా బోధపడదు. ఎప్పుడైనా కవితాభిమానం వ్యక్తిగత అభిరుచికి సంబంధించినదే గనక అది అన్నిసార్లూ అందరికీ సంబంధించిన సత్యమ్ కానేరదు. స్థాయి అన్నది కూడా అలాంటిదే గనక దాన్ని గురించి నిర్వచించడమ్ అంత సులువేమీ కాదనుకుంటాను.

    రమ.

  1157. ఇస్మాయిల్‌ గారితో నా పరిచయం గురించి రవిశంకర్ గారి అభిప్రాయం:

    11/24/2010 5:46 pm

    ఇస్మాయిల్ గారి వర్ధంతి దగ్గరపడిన రోజుల్లో ఈ వ్యాసాన్ని మళ్ళీ గుర్తుచేసి, ఆయనను తలుచుకొనే అవకాశం కల్పించినందుకు సుధీర గారికి ధన్యవాదాలు. ఇస్మాయిల్ గారు మంచి స్నేహశీలి. మీవంటివారు అభిమానంతో కలిస్తే తప్పక సంతోషించేవారు.

    రమ గారి వ్యాఖ్యల విషయానికొస్తే , ఈ వ్యాసం ఇస్మాయిల్ గారు మరణించినప్పుడు ఆయనకు నివాళిగా, ఆయనతో నాకున్న సాన్నిహిత్యాన్ని తలుచుకొంటూ రాసినది. అంతేగాని కవులతో నాకున్న పరిచయాలగురించి గొప్పగా చెప్పుకోవటానికి రాసినది కాదు. నివాళిగా రాసినా ఇందులో అతిశయోక్తులేమీ లేవు. దాదాపు ఇవే అభిప్రాయాలు ఆయన బ్రతికుండగా రాసిన వ్యాసాలలో కూడా ప్రస్తావించాను. ఈ మాటలోనే 1999 జూలైలో వచ్చిన వ్యాసం చూడవచ్చు. కరుణ ముఖ్యమన్నది ఎంతమందికి తెలిసినా, దానిని జీవితంలో, కవిత్వంలో ఒక స్థాయికి చేర్చి నిర్వహించినవారు అరుదుగా ఉంటారు. వ్యాసంలోనే సూచించినట్టు సృష్టిలోని చరాచరాలతో సంస్పందించగలిగే ఒక మానసిక స్థితిని ఇస్మాయిల్ గారు సాధించారని నేననుకుంటాను. అందువల్ల, నా ఉద్దేశంలో ఆయన స్థాయి కేవలం ఒక మంచికవి అనేదానికంటె ఉన్నతమైనది.

  1158. ఏ నడలో ఏ ఎడలో! గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/24/2010 4:16 pm

    ఈ కనక ప్రసాద్ గారు రాసేవన్నీ తెలుగు అక్షరాలలోనే ఉంటాయి. నాకు తెలుగు వర్ణమాలా .. తెలుగు పదాలూ.. కవితా వాక్యాలూ కూడా చదవడంలో కొంచెం శిక్షణ సైతం ఉంది. కానీ నా సమస్య ఏమంటే ఈయన రాసినవేవీ నాకు అర్ధమవటమే లేదు. బుధజనులెవరైనా వీటికి ఇంత టీకా..తాత్పర్యాలు దయచేస్తే మాలాంటి వారికెందరికో.. ఇంత తెలుగు జ్నానాన్ని అలాగే ఈ కవిహృదయాన్నీ కూడా మరింత విశదంగా అందిచిన వారవుతారు కదా అని నా ఆశా ..నా విన్నపమూను.

    ఈ పాట నా చిన్నఫ్ఫుడు ప్రేమ సమాజం వాళ్ళు పాడిన వరసల్లో బాగా ఇమిడి పోయి ఒక్కసారి ఆ “తలపులని” తలపుకు తెచ్చింది . అందుకు కవిగారికి.. స్వరపరిచిన వారికీ.. పాడిన వారికీ కూడా నా కృతజ్నతలు.

    రమ.

  1159. ఇస్మాయిల్‌ గారితో నా పరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/23/2010 2:04 am

    ఏమిటో ఈ మధ్య మీ ఈమాటలో కవులతో తమకున్న బంధాల్నీ.. అనుబMధాల్నీ చెప్పుకునే వాళ్ళు పెరిగారు. అలా చెప్పుకున్న వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు కూడాను. ఎవరి అభిప్రాయంలోనైనా కూడా తమకు నచ్చినప్పుడు అన్నీ “అద్భుతంగానూ..”, “గొప్ప” గానే ఉండటమ్ సహజమే అయినా ఈ అభిమాన .. అనురాగామృతాలన్నీ ఆ కవులు ఉన్నప్పుడు తక్కువగానూ.. పోయాకా ఎక్కువగానూ వ్యక్తమవడమ్ ఒక్క తెలుగులోనే గమనిస్తాం !!

    ఉదాహరణకి ఈ వ్యాసంలో కవిగా ఇస్మాయిల్ దృస్టిలో “కరుణ” కున్న ప్రాముఖ్యాన్ని కొసమెరుపు చేయడాన్ని గమనించవచ్చు. అది ఇస్మాయిల్ గారి కి మాత్రమేనా ప్రత్యేక లక్షణం?? భవభూతి నించి ఉన్నదే కదా?? కరుణ లేని ఎవరైనా ఉత్తమ మానవుడే కాలేరే?? కవి అన్న వాళ్లలో ఆ దృక్పధం మరింతగా ఉండాల్సినది కదా?? మరి కవి అన్నప్పుడు అతడు ఉత్తమ మానిసీ.. ఉత్తమ ద్రష్ట కూడా కావలసిన వాడు కదా??

    మంచి కవిత్వాన్ని నిర్వచించడమ్ కష్టం. అందులో సహజంగా కలిసిపోయి” భాషా.. ఊహా.. సరళతా” …ముప్పేటలుగానే ఉంటాయి. ఒకటి ప్రస్పుటంగా ఉండి మిగతావి లోపిస్తే దాన్ని మంచి కవిత్వంగా గుర్తు పెట్టుకోలేము. ఇస్మాయిల్ గారు అలాంటి ఒక మంచి కవి అని రవిశంకర్ అభిప్రాయ పడుతున్నారు. కాబోలు.
    రమ.

  1160. రవి గాంచిన కవి: విన్నకోట రవిశంకర్ కవితా సంకలనాల పరామర్శ గురించి నరేన్. గారి అభిప్రాయం:

    11/20/2010 12:08 am

    అమోఘమైన ప్రేమని కవితల్నిండా కుమ్మరించి పంచి పెట్టినందుకు రవి శంకర్ గారిని,
    అందులోనూ ఆణిముత్యాలని సమీక్షించినందుకు మీకు ధన్యవాదాలు.
    నరేన్.

  1161. జీవితం గురించి naren గారి అభిప్రాయం:

    11/17/2010 10:33 pm

    రాత్రిని రెండు తరాల కోణాల్లోంచి చూస్తూ జీవితాన్ని బాగా నిర్వచించారు.
    కవిత కి టైటిల్ జీవితం-1 అని అనుకుని మిగిలిన పార్శ్వాలని కూడా ఆవిష్కరించవచ్చు.
    ఉదాహరణకు, పిల్లల భవిష్యత్ గురించి పెద్దలు తపిస్తారు. కాని పెద్దైన పిల్లలు
    కన్న వాళ్ళను భారంగా భావిస్తున్నారు. ఇది కూడా నిత్య పరంపర, జీవితానికి మరో నిర్వచనం.

  1162. జీనో పేరడాక్సు గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    11/14/2010 7:52 pm

    ఎన్నో ఏళ్ళ క్రింద మా కొలీగ్ మాధమేటిక్స్ హెడ్ చెప్పగా విన్నాను ఈ జీనో పారడాక్స్ గురించి.తమాషాగా ఉందే అనుకున్నాను.దీన్ని కవితా వస్తువుగా తీసుకుని హింసను నిరసిస్తూ, సామాజిక స్పృహను,కరుణామయ మానవీయతను ఆవిష్కరించిన తీరు బావుంది. మాధవ్ గారికి అభినందనలు.

  1163. జ్ఞాపకం గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/14/2010 2:20 pm

    “జ్ఞాపకం ” యెప్పటికీ ఒక మంచి కవితా వస్తువే కదా… Like Edgar Allan Poe said ” Lost of a beautiful women” is always a everlasting topic for poets..
    Life swirls and drills in and out within the mind with it’s memories.. I sometimes wonder how many gigabytes of memory it require to shell out all these..

    I like your style ” simplicity”.. Keep writing

    Reg
    Siva

  1164. రామప్ప సరస్సు గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/14/2010 2:09 pm

    చని పోయిన మా అక్క గుర్తుకు వచ్చింది అండీ మీ కవిత్ చదివాక.
    “నన్ను నిలువెల్లా కుదిపేసిన నిశ్చలతని

    ఎలా చూడగలిగాం !” జీవతం లో యేదో ఒక రోజు ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా దీన్ని చవి చూడ వలసిందే కదా!

  1165. నిద్రానుభవం గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/14/2010 1:58 pm

    లాగి లెంపకాయ కొట్టినట్టు నాకు అచిపించింది అండి మీ కవిత. మనస్సు తనువు రెండూ స్పందించాయి మీ కవిత చదివాక…

  1166. కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/14/2010 1:30 am

    మంచి ప్రయత్నం. కాని పేరు నిరపేక్షంగా (impersonal గా) ఉంది. “నాకు నచ్చిన కథ” అంటే క్లుప్తంగా బాగుంటుంది. పాత కథలయినంత మాత్రాన అందరూ పదే పదే చెప్పే గొప్ప పేరున్న కథకులవే అయి ఉండాలని లేదు. పూసపాటి గారి గురించి ఎంతమందికి తెలుసు?

    నచ్చిన కారణంతో కేవలం పరిచయం చేసేదిగా కాక, వ్యాసం కథకి వన్నె తెచ్చేదిగా ఉంటుందని ఆశిద్దాం. నేను కొన్నేళ్ళ క్రితం షాపులో చూసి వెంటనే కొన్న పుస్తకం, Touchstones [1] గుర్తొచ్చింది. ఈ కాలపు కవులు, బాగా పేరున్న వాళ్ళూ, అంతగా లేని వాళ్ళూ, ఒక్కొక్కరు తమకి నచ్చిన ఓ కవిత, వేరే వాళ్ళు రాసినది, పాతదైనా కొత్తదైనా, ఎందుకు నచ్చిందో రాశారు. కవితలే కాక వ్యాసాలు కూడా గుర్తుంచుకోదగ్గవి. పుస్తకం అంతా ఒక్క పట్టున చదవనవసరం లేదు.

    ఇవాళ దాంట్లో Maxine Kumin వ్యాసం చదివాను. తన భుజాల్లో, వెన్నుపూసలో బాధ ఎందుకో కనుక్కోడానికి ఆవిడని డాక్టర్లు MRI scan కి పంపించారు. ఆ పరీక్ష చావుకి దరిదాపుల్లో ఉంటుంది. దాన్ని భరించడానికి తను కంఠస్థం చేసిన కవితలని గుర్తు తెచ్చుకున్నాననీ, వాటన్నిటిలోకీ బాగా పనికొచ్చినది AE Housman కవితXXVII,” అన్నది. “We are all mortal, but it is the poet who shivers most articulately under the thin blanket of mortality,” అని ముగించిన వ్యాసం, “Trochee, Trimeter, and the MRI,” నన్నాకట్టుకుంది. నేనూ ఒకసారి MRI తతంగం పాలయ్యాను, అప్పటికిది చదివుంటే బాగుండేది.

    తెలుగులో Touchstones లాంటి పుస్తకాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “Touchstones: American Poets on a Favorite Poem,” edited by Robert Pack and Jay Parini. Middlebury College Press, 1996.

  1167. పరిశోషణం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/14/2010 12:04 am

    జమిలిగా వైదేహీ ఉదయకళలకి,

    ఈ సంచికలో వైదేహి కవిత .. ఉదయకళ కవిత కూడా వ్యక్తీకరణ లో వేరే తోవ అయినా…. థీమ్ లో ఇంచుమించుగా ఒకేలాంటి భయాన్ని తమ భావనల్లో తొణికిసలాడించడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది.

    వయసుజారిపోయే వేదన అనేది ఒకటి ఉంటుందని అది ఆడవాళ్ళకే ఉంటుందనీ అన్పించేలా సాగాయి ఈ కవితలు. మగవాళ్ళకి అవసరంలేని ఈ అభద్రత ఇలా ఈ కవయిత్రులకే ఎందుకో?? అమ్మాయిలూ అన్ని వయసుల్లోనూ అంతర్లీనంగా ఒక అందం ఉంటుందనీ..ఒక హుందాతనం ఉంటుందనీ మీరు నమ్మలేకపోవడం ఏం బాలేదు . నా అందం ఏమయ్యిందో అని ఇప్పుడే ఈ చిన్న వయసులోనే బేజారైపోతే ఇహ నడి వయసులోకి అడుగుపెట్టాకా మరింకేం విశ్వాసం ఉంటుందీ ఊహించడానికీ??

    అంచేత ఇప్పట్నించే ఈ ముసలి మాటలు ఊహల్లోకి రానివ్వకండి. మీరింకా మంచిమంచి వయసు ఊహలు బోలెడన్ని చేయాల్సే ఉంది:)

    రమ.

  1168. పరిశోషణం గురించి మోహన గారి అభిప్రాయం:

    11/13/2010 9:20 pm

    రాలిపోయే ఆకుల్లా దొర్లిపోతుంటాయి రోజులు. కలశంలోని అమృతం ఆవిరై పోతే, చివరకు మిగిలేది కలశం మాత్రమేగదా! కానీ ఈ అమృతం మళ్లీ మరో పాత్రను అంచులదాకా నింపుతుంది. చాలా బావుంది మీ కవిత. – మోహన

  1169. ఇప్పుడెందుకిలా? గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:

    11/11/2010 1:09 pm

    ఘాడమైన అనుభూతితో నిండిన భావ తీవ్రత ఉందీ కవితలో. నాకు నచ్చింది.

    గరికపాటి పవన్ కుమార్

  1170. దుప్పట్లో ముడుక్కున్నా గురించి నరేన్ గారి అభిప్రాయం:

    11/10/2010 12:02 am

    బాగుంది. కానీ మీ ‘వానకు తడిసిన పువ్వొకటి ‘ అంత క్లుప్తమైన సునిశిత పరిశీలన ఇందులో కనిపించట్లేదు. అలాంటి కవితలు ఆశిస్తూ….

  1171. కవిత్వీకరణ కొన్ని సంగతులు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/08/2010 7:19 pm

    ” పద్యం ఎత్తుగడ ముగింపూ ..” వంటివాటి గురించి..పద్యం రాసినప్పటి లేదా చదివినప్పటి కూడా “మానసిక వాతావరణాన్ని గురించి మాట్లాడుకోవడానికీ ఆ పద్యంలోని రాయబడ్డ వస్తువుకీ అందులోని “వాదానికీ”..ఏమీ సంబంధం ఉండనఖ్ఖరలేదు. బాగున్న ఏ పద్యాన్ని గురించైనా కూడా దాని ఎత్తుగడ ముగింపూ ఇతర వాతావరణాన్ని గురించీ అంతే స్పస్టం గా మాట్లాడుకోవచ్చును. వస్తువు ఒక అంశం మాత్రమే!! పోనీ వాదం వగైరాలు. అవేవైనా. కదా!!

    రవిశంకర్ గారికి వాదాలని గురించీ లేదా అవి వచన కవిత్వానికీ దాని రూప సారాలకీ చేసిన మేలూ..కీడులని గురించీ నిర్దిష్ట మైన అభిప్రాయాలు గనక ఉంటే వాటిని గురించి కూడా ఈ వ్యాసంలో చర్చకి పెట్టి ఉంటే బాగుండేది. కానీ ఆయన వాటి జోలికి పోకుండా కొన్ని పొడిపొడి మాటలు మాత్రమే అని ఊరుకున్నారు..ఏలనో??

    ఆయన ఒక కవిగా మాట్లాడేరో లేక పాఠకునిగా మాట్లాడేరో…విమర్శకునిగా ముందుకొచ్చి .. ఈ అభిప్రాయాలు చెప్పేరో నాకు అర్ధం కాలేదు. ఆయనలో ఈ పాత్రలు అన్నీ కలగాపులగం అయిపోయినట్టుగా నాకు దృశ్యమానం అయింది మరి.

    ఆయన చేసిన ఒక సూచన మాత్రమ్ నాకు చాలా నచ్చింది.ఎవరైనా ఒక కవి తాను ఒక కవితా దృశ్యాన్ని ఆవిష్కరింప పూనుకున్నప్పుడు ఏయే మానసిక స్థితులకి లోనవగలిగిందీ చెప్పాలని అనడం!! అది సాధ్యమేనని ఆయన భావించినట్టుగా ఈ వ్యాసంలో సుస్పస్టం అయింది గనుక ఆ ప్రయత్నానికి కూడా ఆయనే శ్రీకారం చుట్టడం బాగుంటుంది . కవిగా ఒక కవిత రాసే ముందూ..రాస్తున్నప్పుడూ..రాయడం పూర్తయిన తర్వాత తన మానసిక విశ్లేషణ ని ఆయన చేయగలరని నేను ఎంతో కుతూహలంగా ఉన్నాను ఒక పాఠకురాలిగా చదివేందుకు సిధ్ధంగానూ ఉన్నాను.
    రమ.

  1172. నా అందం ఏమయింది? గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/06/2010 4:05 pm

    మీ కవిత చాలా నిజాయితీగా చాలా స్వచ్చంగా ఉంది. భావ ప్రకటన చాలా సున్నితముగానూ ఆలోచనా యుక్తముగానూ ఉంది. మనస్సు స్పందించింది.

  1173. జీనో పేరడాక్సు గురించి ns murty గారి అభిప్రాయం:

    11/05/2010 3:36 am

    జీనో పేరడాక్స్ ను ప్రాతిపదికగా అల్లిన అందమైన కవిత. చక్కని నేటివిటీ తో అనువాదం చాలాబాగుంది(స్వేఛ్ఛానువాదమైనా). మనః పూర్వక అభినందనలు.

  1174. నా అందం ఏమయింది? గురించి Bharath గారి అభిప్రాయం:

    11/03/2010 2:05 pm

    మీ కవిత చదివిన తరువాత నాకు ఇండియా లొ వున్న నా కూతురు, భార్య గుర్తొచ్చారు.

  1175. విన్నకోట రవిశంకర్ ‘రెండోపాత్ర’: ఒక పరిచయం గురించి Rakesh గారి అభిప్రాయం:

    11/03/2010 5:46 am

    నాకు అత్యంతప్రీతికరమైన కవి, శ్రీ విన్నకోట రవిశంకర్!
    ఆయన కవిత్వంలోని గాఢతా, ఆర్ద్రతా గురించి నాలాంటి అభిమానులు ఎంత రాసినా – అది తక్కువే…..

  1176. జీనో పేరడాక్సు గురించి narEn గారి అభిప్రాయం:

    11/02/2010 8:57 pm

    నిజమైన కవి తత్వాన్ని కూడా తనకు ఆసరాగా తీసుకుని లోకాన్ని చుట్టుముట్టి వస్తాడు. జీనో కవిలాంటి
    తత్వవేత్త. డిస్క్రీట్ ప్రయాణాలు అనంతము అనడానికి ఎంత స్ప్రుహ కావాలి? బిల్లీకాలిన్స్ తత్వాన్ని జీర్ణిచు కున్న కవి. ఇంత మంచి కవితని తలకెత్తుకుని మంచి పని చేశారు. సమకాలీనమే కాదు, జీవితము మీద, విశ్వం మీద గతిజ స్తితిజ శక్తుల ప్రమేయమున్నంత వరకూ ఈ కవిత అప్లై అవుతూనే ఉంటుంది.

  1177. జలప్రపాతము గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    11/01/2010 4:01 pm

    అందముగ జారె జలపాత మవని పైన
    కొండ పైనుంచి గాంచెనొ గూర్చె గవిత
    చారు రశ్ముల సుత్రామ చాప మొప్ప
    తీర్చె మెఱుగులు తిరుమల దేశికుండు

    తిరుమల దేశికాచార్యుల వారి కవితయె ఒక జలపాతము. ఇంద్రధనస్సు ఆయన కుంచె.అందముగా చిత్రించారు.ఆయనకు నమస్కృతులు.

  1178. ఇప్పుడెందుకిలా? గురించి maddirala siddardha గారి అభిప్రాయం:

    10/22/2010 12:48 pm

    మీ కవిత చాలా బాగుంది

  1179. ప్రేమ కవితలు గురించి venkat గారి అభిప్రాయం:

    10/17/2010 10:11 am

    మీ కవితలు సూపర్.

  1180. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి Aditya Bhagavan Dhulipala గారి అభిప్రాయం:

    09/29/2010 2:47 am

    శ్రీ శ్రీ కవిత, బాపు బొమ్మ..భావ కవిత్వానికి సౌందర్య వర్ణనం..అద్భుతం ఈ శీర్షిక.

  1181. వెన్నెల – తిలక్ కవిత గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    09/26/2010 8:10 am

    ఈ కవి తిలకం గురించి మళ్ళీ ప్రస్తావించుకొంటుంటే , దర్శకుడూ, నిర్మాత కేబీ తిలక్ మరణ వార్త రావడం ఆశ్చర్య పరచింది. ఈయనా వెన్నెల మీద పాటలు చిత్రీకరించిన వారే. ఇక్కడ ఒక అరుదైన కవిత ఆ కవి చదువుతుండగా విన్పించటం, శ్రీనివాస్ గారి చక్కటి ప్రయత్నాల్లో ఒకటి. 1968 లో ముద్రితమైన ‘అమృతం కురిసిన రాత్రి’ రెండవ కూర్పులో ఉన్న ‘వెన్నెల’, ఇక్కడ తిలక్ చదివిన ‘వెన్నెల’ ఒక్కటే.
    తిలక్ శైలియే అంత. ఒక కన్ను కృష్ణ శాస్త్రి, మరో కన్ను శ్రీశ్రీ.. రెంటి సమతూకమే ఆయన చూపు.
    -డా. తాతిరాజు వేణుగోపాల్

  1182. Edward Hirsch, “How to read a poem” గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/23/2010 2:15 am

    “Mere Air, These Words, but Delicious to Hear”

    మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు రామారావు గారికి కృతజ్ఞతలు. పండితులూ (అరవై పేజీల glossary ఉంది) పామరులూ కూడా చదివి ఆనందించవచ్చు. ముందుగా తెలుగు కవులని ప్రస్తావించి, వారి స్థాయి అధోలోకానికి చేరిందని వాపోయారు. ఎలాంటి ఆధారాలూ, ఉదాహరణలూ చూపకుండా చేసే ప్రకటనల వలన ఏమిటి ఉపయోగం? సౌభాగ్య, “ఈ కాలం కవులు,” [1] చూస్తే, మన కవుల స్థితి రామారావు గారన్నంత దౌర్భాగ్యంగా అనిపించలేదు. అయితే, కవితా సంపుటాలకి సంబంధించి నేను అల్ప సంతోషిని – గుర్తుంచుకోదగ్గ కవితలు రెండు మూడున్నా చాలు నాకు.

    అసలు విషయానికొస్తే, Hirsch కవితలని వివరించే తీరూ, సందర్భోచితంగా చెప్పే ఇతర విషయాలూ నాకు నచ్చాయి. Elizabeth Bishop, “One Art,” ని విశ్లేషిస్తూ, అదొక villanelle అని దాని లక్షణాలు వివరించాడు: పందొమ్మిది పాదాలతో ఆరు భాగాలుగా, అయిదు భాగాలు మూడు పాదాలతో, మిగిలినది నాలుగు పాదాలతో … అవన్నీ ఆరితేరిన పాఠకులకే గాని, నాకు ఒంటబట్టవు. ఆధునిక vilanelles అంటూ మరికొన్ని చదవదగ్గవి ఇచ్చాడు.

    కవితలో Bishop తాళం చెవి మొదలు ఖండాల దాకా వెళ్ళి, చివరకి ప్రేమతో ముగించే తీరు చాలా బాగా విశ్లేషించాడు. ఈ కవితలో ఉన్న ఆశ్చర్యార్థకాన్ని పట్టుకొని, William Maxwell, రచయిత ఆ సూచికని రెండు సార్లు మాత్రమే వాడవచ్చు – తన జీవిత కాలంలో, అని చెప్పాడన్నాడు. ఈ Maxwel ఎవరో మరీ నిరంకుశుడు అనుకున్నాను.

    మార్చి “The New Yorker” లో Patricia Marx, “Four Eyes,” అని కళ్ళజోళ్ళ మీద సరదా కాలమ్ రాసింది. అయుదు పేజీల చక్కని రచనలో ఒక్కసారి కూడా ఆశ్చర్యార్థకాన్ని వాడినట్లు గుర్తు లేదు. ఈవిడ ఎవరో Maxwell సూత్రాన్ని ఒంటబట్టించుకున్నదే అనుకొని, అసలీ Maxwell ఎవరా అని వెతికితే తెలిసింది: నలభై ఏళ్ళ పాటు ఆ పత్రికకి సంపాదకుడుగా పనిచేశాడని. ఇప్పుడు నేనా సూచికని వాడాలంటే భయం. Maxwell ని గుర్తుచేసుకుంటూ [2] Updike కవిత, “Stolen”:

    “The boat tilts frozen on the storm’s wild wave.
    The concert has halted between two notes.
    An interregnum, sufficiently extended,
    becomes an absence. When wise
    and kindly men die, who will restore
    disappeared excellence to its throne?”

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “ఈ కాలం కవులు,” సౌభాగ్య, 2006.
    [2] “A William Maxwell Portrait: Memories and Appreciations,” Edited by Baxter, Collier and Hirsch. WW Norton & Company, 2004.

  1183. మిడిల్ డ్రాప్ గురించి sudha rani గారి అభిప్రాయం:

    09/21/2010 12:01 am

    ఇటీవల ఈ కవిత కాపీ, మా నాన్నగారు రాసి పెట్టుకున్నది దొరికింది. కవిత చాలా బాగుందని నా బ్లాగులో ఓ టపా రాసి దానిని ప్రచురించాను. ఈ కవిత ఇక్కడ కూడా ప్రచురించబడిందని ఇప్పుడే చూస్తున్నాను. శ్రీ వెల్చేరు నారాయణరావుగారికి అభినందనలు

  1184. వెన్నెల – తిలక్ కవిత గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    09/20/2010 5:31 pm

    బాగుంది. పుస్తకంలో చదవటానికీ, పైకి చదివితే వినటానికీ కూడా బాగుంది.

    ఐతే, దాదాపు చివరి ఇరవై పంక్తులు – ఇంకో కవితను తెచ్చి అతుకు వేసిట్లుగా ఉంది. కవిత లయ మారింది. లయ మారితే మారింది. కవిత విషయం కూడా మారింది.

    అప్పటివరకు వెన్నెలను ప్రయివేటుగా అనుభవిస్తున్న మానవుడు, అకస్మాత్తుగా 🙂 “ఎవరో” – వెధవా! నీ ఒక్కడి కోసమే నీ దొడ్లోనే కురుస్తాందా వెన్నెల? వెన్నెల అందరిదీ కాదూ. అది అన్నిచోట్లా కురవదూ? అని కొరడా పెట్టి కొట్టినట్లు; సన్నాసీ! కవిత్వంలో ఏవి తప్పక రాయాలో మర్చిపోయావా -అని కోప్పడితే ఢమిక్కిన గుర్తుకు వచ్చినట్లు; అక్కణ్ణుంచీ కవితలో -“ధనికులు, నిరుపేదలు, ఊరిపక్క కాలువ అద్దపు రొమ్ములు, ఊరి బైట కాలీకాలని చితికీలలు” -వచ్చి పడ్డాయి.

    నా ఉద్దేశంలో, ‘వెన్నెల’ ఇతివృత్తంగా తీసుకుని రాసిన రెండు వేరు కవితలు ఒకదాని తర్వాత ఒకటి పేర్చబడి – ఒకటి చేయబడ్డాయి. ఆ పని కవి సొంతగానే చేసుకున్నాడో, లేక ఇతరుల ప్రోద్బలం వల్ల జరిగిందో, ఊరికే పోనివ్వడమెందుకు ‘వెన్నెల’ మీద ఉన్న బంతులన్నీ ఒక కవితలోనే ఒక ప్రసారంలోనే వినిపించేద్దాం, పనై పోతుంది – అని ప్రసారకర్తలో, ప్రచురణకర్తలో అనుకున్నారో మరి.

    ధోరణి వేరైన -రెండు రచనలనూ విడగొట్టి -మొదటి కవిత ధనికుల పెట్టెలోనూ, రెండోది పేదల పొట్టలోనూ వేస్తే రెండూ నిండుతాయి. 🙂 కాదా.

    కవితలో కొన్ని పంక్తులు తిలక్ రెండుసార్లు చదవటం నచ్చలేదు. అవి సంగీతంలో సంగతుల వంటివి కావు. రెండో సారి చదివినంతనే వాటి రుచి పెరగలేదు. ఏ వాక్యానికీ రెండో సారి చదవవలసిన అదిక ప్రాముఖ్యతా లేదు.

    తిలక్ – హాయిగా వెన్నెల అనుభవించటం అర్ధాంతరంగా మానేసి – హడావిడిగా పెన్నూ కాగితం తెచ్చేసుకుని-

    ” నా రచనగా తానై పోయింది
    వెన్నెల వంటి నా ఉద్రేకానికి
    తెలుగు భాష శరద్వియ
    ద్విహార వనమై నడచిపోయింది ”

    అని రాయటం కూడా మానేసి ఉండాల్సింది.

    ఏమంటారు చదువరులు? శ్రోతలు?

    లైలా

  1185. ప్రేమ కవితలు గురించి Nagaraju.Voore గారి అభిప్రాయం:

    09/18/2010 7:09 am

    మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. నిజంగా అంత బాగున్నాయి.

  1186. “అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    09/17/2010 11:30 pm

    కామేశ్వరరావు గారూ,
    రారా విమర్శపై నేను వ్రాసిన ప్రతివిమర్శ, ఆయన విమర్శకు మాత్రమే పరిమితమై వ్రాసినది.అభ్యుదయ కవిత్వాన్ని తన “అమృతం కురిసిన రాత్రి” పై సమీక్ష లోకి లాగింది రారానే, నేను కాదు. విమర్శ లో చెప్పిన విషయాలపై స్పందించటమే కదా ప్రతివిమర్శ. నేను చేసింది అదే. దానిని మీరు అసమంజసం అన్నారు. ఇది అసమంజసం ఎలా అవుతుంది?

    భావుకత్వం పరిపుష్టంగా ఉన్న కవి ఏ అనుభూతిని కవిత్వీకరించినా అది కదిలించే శక్తిని సంతరించుకుంటుంది. తరతరాలుగా సాహిత్యంలో స్థిరపడిన విషయాలమీద మనం పునరాలోచన చేస్తూనే ఉన్నాం కదా. భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే వర్గీకరణ కృత్రిమమైనదే. నినాదప్రాయాలైన రచనల నాధారంగా కవులు కానివారికి కవులుగా అస్తిత్వాన్ని చేకూర్చాలనే వ్యర్ధప్రయత్నం అని నేను నమ్ముతున్నాను. ఒకవైపు మీరు ఈ వర్గీకరణను అంగీకరిస్తూనే, ప్రతి కవినీ, ప్రతి కవితను వర్గీకరణలలోకి బలవంతాన ఇరికించటం సమంజసం కాదు అంటున్నారు. ఇందులో నాకు వైరుధ్యం కనబడుతుంది . అంతేకాక, పదిమంది మెప్పుకోసం పాప్యులర్ విషయాలమీద కవిత వ్రాసినంతమాత్రాన అది కవి యొక్క హృదయతత్వంగా తీసుకోవటానికి వీలు లేదని నా అభిప్రాయం.కారణం, తాను కవిత్వం లో వెలిబుచ్చే అభిప్రాయాల యెడల తన నిత్యజీవితంలో నిబద్ధత కనిపించినపుడే అది అతని “హృదయతత్వం” అవుతుంది.

    అందంగా వ్రాయటమంటే ఆకట్టుకునేలా ఏ రకమైన అనుభూతినైనా వ్యక్తీకరించటం అనేది నా నిర్వచనం అన్నారు.అందానికి రారా నిర్వచనం వేరన్నారు.అదేమిటో చెప్పలేదు.

    నిజమే ,ఆకట్టుకునేలా వ్రాయకపోతే ఉత్తేజితులెలా అవుతారన్నాను. ఆకట్టుకున్నంతమాత్రాన ఉత్తేజితులని చెయ్యలేదని రారా ఉద్దేశ్యమన్నారు మీరు. బ్రతకాలంటే పుష్ఠికరమైన ఆహారం తినాలి. తిన్నాక కూడా బ్రతకకుండా ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు.

    నా నిర్వచనం ప్రకారం అభ్యుదయ కవులు, విప్లవకవులు అందానికి వ్యతిరేకులు కాదన్నారు. సంతోషం. వారు అందానికి వ్యతిరేకులయ్యేంత సంకుచితమైన నిర్వచనం రారా “అందానికి” ఇచ్చారా ?

    కవిత్వానికి,సాహిత్యానికి అలంకారికులు చెప్పే రసానందమే అస్తిత్వాన్ని ఇస్తుంది. ఆకట్టుకోవటానికి ,ఉత్తేజితులను చేయటానికి ప్రేరకాలు ఆహ్లాదం,ఆనందం.

    “నా గీతం గుండెలలో……..” నేననేదీ అదే . ఆయన చెప్పవలసినది తోటి జనుల ఆశలను, ఆశయాలను,ఆకాంక్షలను తన గీతం లో ప్రతిఫలింపచేస్తానని. కానీ ఆయన చెప్పింది తన గీతం జాతి జనుల గుండెలలో మ్రోగాలని. తనకు ప్రాధాన్యత ఆపాదించుకోవటం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందే! తనకు నమ్మకంలేని ‘మంత్రం’ ప్రస్తావన ఎందుకు ?త నను తన జాతి జనులు అనుసరించటం కాదు, వారిని తాను అనుసరించి వారి ఆకాంక్షలు తన గీతం లో ప్రతిబింబించి, వారిని ఉత్తేజితులను చేయటం. ఆ విధంగా తన గీతాన్ని వినిపించడం జరగాలి.

    కవిత్వం వాస్తవ జీవితానికి దూరమవ్వటంలోనే, దాన్ని(వాస్తవజీవితాన్ని) విస్మరించటం ఇమిడి ఉంది.ఇంక మరలా ఉదాహరణలు అవసరం లేదనుకుంటాను.

    ఆనందం (కవిత ఇచ్చే రసానందం), ఉత్తేజం ఒకే అనుభూతికి రెండు పార్శ్వాలుగానూ, పరస్పరాశ్రయాలు గానూ ఉండవచ్చు. ఒక చిన్న వివరణ: ఏ బలీయమైన అనుభూతి అయినా, ఉత్తేజానికి ప్రేరకంగా ఉండవచ్చు. ఏదో చేయాలని పురికొల్పటం కాన్షస్ గా చేసే ప్రయత్నం. ఇది కళకు విరుద్ధం. కవి బలీయంగా అనుభూతిని వ్యక్తీకరించటం మాత్రమే చేయాలి. “ఆర్ట్ లైస్ ఇన్ కన్సీలింగ్ ఆర్ట్”.

    రుచి,శుచి విషయంలో కూడా పైన చెప్పిన విషయమే వర్తిస్తుందనుకుంటాను: బ్రతకాలంటే తినాలి.కానీ తిన్నాక కూడా బ్రతకకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి.

    “వెన్నెల సముద్రాలు” మొదలగునవి అందంగా వ్రాయటానికి సంకేతాలు అని స్పష్టంగా తెలుస్తుంది.వాటిలో అన్వయకాఠిన్యం లేదు. మరి రాబందుల రెక్కల చప్పుడు వగైరాలు దేనికి ఏది సంకేతం? ఎలా వీటిని అన్వయించటం? వీటిగురించి ప్రస్తావనకు కారణం, మీరనుకుంటున్నట్లు అసంగతంగానేనైనా రారా, శ్రీశ్రీ కవితా పంక్తులని కోట్ చేయటం. దీనిలో అర్ధం కాకపోవటానికేముంది?

    ఇక లాలిత్యాన్ని గురించి:ఇది కడుపు నిండినవాళ్ళ కవిత్వంలోనే ఉంటుందని అనుకుంటే, అభ్యుదయభావాలతో కవిత్వం వ్రాస్తున్నవారందరూ పస్తులు పడుకుంటున్నవాళ్ళా? పీడితప్రజల విముక్తి పోరాటాలకు కలంతో పాటు కత్తిపట్టి దన్నుగా నిలుస్తున్నవారా? ఎవరో చెరబండరాజు లాంటి వారు కోటికొకరు మినహా!

    “వచనగేయపు శైలి లలితమైన (లిరికల్) ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని,గంభీరమైన ఇతివృత్తాలకు సముచితంగా ఉంటుదని స్పష్టంగా అర్ధమవుతుంది” – లలితమైన అన్నమాటకు సమానార్ధకంగా లిరికల్ అనే మాటను బ్రాకెట్లో వాడారు, రారా. వచనగేయపు శైలిని గురించి, రెండు రకాల ఇతివృత్తాల గురించి మాట్లాడారు. మీరనుకున్నట్లు రెండు రకాల శైలీ విశేషాలగురించి మాట్లాడలేదు.

    మీరు ఆరోపించినట్లు, భావకవుల వేదనను నేను సాంద్రత లేనిదనికానీ, కృత్రిమమైనదని కానీ అనలేదు.వారి వేదనా ప్రియత్వాన్ని మాత్రమే కృత్రిమం అనడం జరిగింది. వేదనలో అనుభూతి సాంద్రత తప్పనిసరిగా ఉంది, కృత్రిమత్వం లేదు. వేదనా ప్రియత్వంలో కృత్రిమత్వం ఉంది,అనుభూతిసాంద్రత లేదు. పాక్షికదృష్టి ఎవరిలో ఉన్నా, బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఎవరు చేసినా అభిలషణీయంకాదు. ఇవి సాహిత్య విమర్శకు వన్నె తెచ్చేవి ఎంతమాత్రమూ కావు.

  1187. మంచి కవి, మంచి స్నేహితుడు గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    09/17/2010 1:50 pm

    నారాయణరావ్!

    నీకు మంచి స్నేహితులు ఉన్నారయ్యా! నువ్వదృష్టవంతుడివి.

    “నా కవిత్వంలో నేను దొరుకుతాను” అన్న తిలక్ కవితలో :

    “నీ కవిత్వం పుస్తకానికి ఎవరిచేతా పీఠికా పరిచయమూ
    వగైరాలు రాయించవద్దు అన్నాడు-
    నాలుగేళ్ళక్రితమే నా చిరమిత్రుడు శ్రీపాదకృష్ణమూర్తి
    సరీగా అలానే అన్నాడు నా యువమిత్రుడూ కవీ
    వెల్చేరు నారాయణరావు కూడా…”

    “పైగా నా మీద నన్నే రాసుకోమన్నారు..”

    అని ఉన్నది.

    మంచి సలహా ఇచ్చారు. పీఠికలు, సమీక్షలు ఇత్యాదులు లేనప్పుడు, కవి, శ్రోత ఒకరికొకరు దగ్గరగా వస్తారు. అది middle man లేని ఒక చక్కని direct transaction. ఏ మనిషిని అర్థం చేసుకోవాలన్నా ‘one on one’ సంభాషణ ఉత్తమం.

    ఐతే నేను – పీఠికలు, పరిచయాలు, ముందుమాటలు, సమీక్షలు… – చదవనా అంటే చదువుతాను. చాలా ఆసక్తితో చదువుతాను. అవి రాసినవారిని అర్థం చేసుకోటానికి అవి పనికొస్తాయి.:-)

    లైలా

  1188. “అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    09/17/2010 10:19 am

    సి. ఎస్. రావుగారూ,

    మీ ప్రతివిమర్శపై కూడా నాకు కొన్ని అభ్యంతరాలున్నాయండి. ఎలా అయితే రారా విమర్శలో పాక్షిక దృష్టి కనిపించిందో, అంత మోతాదులో కాకపోయినా, కొంత మీ ప్రతివిమర్శలోనూ కనిపించింది. దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు రారాని అర్థం చేసుకోడంలో కొన్నిచోట్ల పొరపాటుపడ్డారని కూడా అనిపించింది. నేనెలా అర్థం చేసుకున్నానో కూడా వివరిస్తాను.

    “భావుకత్వం ఏ ఉత్తమ కవికైనా ఉండవలసిన ముఖ్యలక్షణం అని అన్న తరవాత మరలా ఎవరినో భావకవి అనడం ఏమిటి? భావుకత్వం లేనివాడు కవే కాడుగా?”

    – ఇక్కడ “భావకవి” అంటే “భావుకత్వం” ఉన్న కవి అన్న ఏకవాక్య నిర్వచనం మీరు తీసుకున్నారు. రారా ఉద్దేశం ఇది కాదు. ఈ రెండు పదాలనీ రారా వాడారు కాని స్పష్టం చెయ్యలేదు. శ్రీశ్రీ తర్వాత అంత భావుకత్వం ఉన్న కవి తిలక్ అని రారానే అన్నారు. అయినా శ్రీశ్రీ “భావకవి” కాదు అన్నది స్పష్టం కాబట్టి ఈ రెంటి మధ్యనున్న తేడా మనం గమనించాలి. “భావకవి” అనేది ప్రధానంగా “భావకవిత్వం” వ్రాసిన కవి అని అర్థం చేసుకోవాలి. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్ళలో వచ్చిన ఒక రకమైన కవిత్వానికి “భావకవిత్వం” అన్న పేరు సాహిత్యంలో స్థిరపడిన విషయం ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చాలా మంది విమర్శకులు దాని లక్షణాలను వివరించారు. దాన్ని కూడా ఇక్కడ నేను ఉటంకించక్కర లేదనుకుంటాను. అలా స్థిరపడిన రూడ్యర్థంలోనే రారా కూడా “భావకవి”, “భావకవిత్వం” అన్న మాటలు ప్రయోగించారు కాని “భావుకత గల కవి” అన్న అర్థంలో కాదు అన్నది సుస్పష్టం.

    కవిత, వస్తువు ప్రాతిపదికగా, లేదా కవి హృదయతత్వం మీద ఆధారపడి వర్గీకరించటం ఏ మాత్రం సబబు? ఇన్ని విభజనలు చేయాలా?”

    – కొన్ని సందర్భాలలో అలాంటి విభజనలు కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలని చేకూరుస్తాయి. కాకపోతే ప్రతి కవినీ, ప్రతి కవితనీ అలాంటి వర్గీకరణల్లోకి బలవంతాన ఇరికించడమే సమంజసం కాదు.

    “అందంగా వ్రాయటం అంటే”, “ఆకట్టుకునేలా అనుభూతిని, ఏ రకమైన అనుభూతినైనా వ్యక్తీకరించటం.”

    – అని మీ నిర్వచనం. అందానికి రారా నిర్వచనం వేరు.

    “రారా అన్నట్లు పాఠకులను ఉత్తేజితులని చేయాలన్నా, వారిని ఆకట్టుకునే విధంగా వ్రాయకపోతే ఉత్తేజితులెలా అవుతారు?”

    – ఉత్తేజితులని చెయ్యాలంటే ఆకట్టుకోవాలి. కాదని రారా అనలేదు. ఆకట్టుకున్నంత మాత్రాన ఉత్తేజితులని చెయ్యలేదు అన్నది రారా ఉద్దేశం.

    “తిలక్ తన కవిత్వం గురించి వ్రాసిన పంక్తులలోని వెన్నెల సముద్రాలు, మణిస్తంభాలు, అత్తరు దీపాలు కేవలం అందంగా వ్రాయటానికి సంకేతాలు.”

    – నిజమే. కాని “అభ్యుదయ” కవిత్వపు సంకేతాలు ఇవి కావన్నది రారా పాయింటు.

    “అభ్యుదయ కవులనబడే వారు, విప్లవకవులనబడే వారు అందానికి వ్యతిరేకులా? చెప్పదలచుకున్న విషయం, వ్యక్తీకరించదలచుకున్న అనుభూతి అందంగా వ్యక్తీకరించక పోయినా వారు పాఠకులని ఉత్తేజితులని చేయగలరా?”

    – మీరు అందానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం వ్యతిరేకులు కారు. రారా దృష్టిలో “అందానికి” కచ్చితంగా వ్యతిరేకులు. రారా దృష్టిలో మనసుకి ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ(ఇక్కడ ఆనందం అంటే మన అలంకారికులు చెప్పిన “రసానందం” కాదు) ఇచ్చేదే అందం. అభ్యుదయకవిత్వం పాఠకులని ఆకట్టుకోగలదు, ఉత్తేజితులనీ చెయ్యగలదు. కాని అది ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ ఇవ్వలేదు.

    “నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని” అభ్యుదయకవి తనకు ఇంతటికి ప్రాముఖ్యతను కోరుకుంటాడా?”

    – మీకీ వాక్యాల్లో కవి తన ప్రాముఖ్యాన్ని కోరుకోవడం కనిపించిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది! తన జాతి జనుల స్పందనలని తన గీతంలో పలికించాలనీ, ఆ గీతం జనులు పాడుకుని వాళ్ళు మరింత శక్తివంతులు అవ్వాలనీ నాకు అర్థమయ్యింది. కవి తన జాతి జనులతో మమేకమై ఆ ఏకత్వంలోంచి తనలోంచి వచ్చిన గీతం తిరిగి జనాలకి అందివ్వాలన్నది కవి ఆకాంక్షగా నేను అర్థం చేసుకున్నాను. “మంత్రం” ఎందుకంటే అది వాళ్ళని శక్తిమంతం చెయ్యాలన్న ధ్వని కోసం. అలాగే మీరుదహరించిన మరో వాక్యమూను. జాతి జనుల అవసరాలు తనలో మాత్రం మ్రోగి ఊరుకుంటే సరిపోదు, అది తిరిగి జనాలలో మార్మ్రోగాలన్నదే కవి ఆశయం. అప్పుడే అభ్యుదయం సాధ్యమవుతుందన్నది కవి విశ్వాసం.

    ఇంతకీ ఈ ప్రతి విమర్శలో అభ్యుదయ కవిత్వాన్ని లాగడం పూర్తిగా అసమంజసమని నా అభిప్రాయం. ఇది రారా చేసిన పొరపాటును కొనసాగించడమే!.

    “వాస్తవ జీవితానికీ,కవిత్వానికీ మధ్య అఖాతం విస్తరించేకొద్దీ జీవిత వాస్తవాన్ని విస్మరించటమే కవిత్వధ్యేయం అవుతుంది”

    – ఇందులో నాకెలాటి లాజికల్ తప్పూ కనిపించలేదు. ఎప్పుడైతే కవిత్వం (తన వస్తువులోనూ, రూపంలోనూ) వాస్తవ జీవితానికి దూరమవ్వడం మొదలుపెడుతుందో, అప్పుడు క్రమేపీ ఆ కవిత్వ ధ్యేయమే జీవిత వాస్తవాన్ని మరిచిపోవడం అవుతుందని అంటున్నారు. ఇది “తిలక్ భావనలో అభ్యుదయవాది, శైలిలో భావకవీ” అన్న కుందుర్తి అభిప్రాయాన్ని ఖండించడానికి చెప్పిన మాట. “జలుబు తలనొప్పి మొదలైతే అది క్రమేపి జ్వరంగా మారుతుంది” అనడం లాంటిది. లేదా “జలుబు తలనొప్పి – జ్వరం రాబోతోందనడానికి సూచనలు” అనడం.

    “ఉత్తేజంలో ఆనందం అంతర్లీనంగా ఉండి తీరుతుందే? ఆనందం అంటే ఇక్కడ కవిత ఇచ్చే ఆనందం. అది వ్యక్తీకరించే అనుభూతి స్వభావం ఏదైనా హృదయానికి హత్తుకునే విధంగా, హృదయం ఆర్ద్రమయ్యే విధంగా చెప్పటంద్వారా కలిగించే ఆకర్షణ. ఆ ఆకర్షణే ఆనందం. ఇది లేనప్పుడు ఉత్తేజం సాధ్యం కాదు. ఆనందం, ఉత్తేజం వేరు వేరు అనుభూతులుగా సిద్ధాంతీకరింపబూనటం గందరగోళానికి గురిచేయటమే.”

    – ఆనందాన్ని, ఉత్తేజాన్ని ఒకే అనుభూతిగా సిద్ధాంతీకరింప బూనారు మీరు. అదే గందరగోళానికి దారితీస్తుందని నా అభిప్రాయం. “ఉత్తేజం” అంటే రారా తన వ్యాసంలో చెప్పకనే చెప్పారు. మనిషిలో ఏదో చెయ్యాలనే ఒక బలమైన కోరిక పురికొల్పడం ఉత్తేజం. ఆనందం అంటే రారా దృష్టిలో ఆహ్లాదం, సంతోషం కలిగిన మానసిక స్థితి. ఈ రెంటికీ తేడాని గుర్తిస్తేనే, అంగీకరిస్తేనే రారా చెప్పిన విషయం అర్థమవుతుంది. ఆ దృష్టితో కాక రెండూ ఒకటే అన్న దృఢ నిశ్చయంతో రారా విమర్శని వ్యాఖ్యానించడం – కేవలం మన దృష్టితో రారా విమర్శని చూడ్డమే అవుతుంది కాని రారాని అర్థం చేసుకునే ప్రయత్నం అవ్వదు.

    “ఆహారం ఆరోగ్యం కోసం, బలం కోసం. సందేహం లేదు. కానీ అది చక్కగా తినాలంటే రుచి, శుచి ఉండాలి కదా!”

    – నిజమే. కాదని రారా అనలేదు. రుచి, శుచి ఉన్నంత మాత్రాన అది ఆరోగ్యం బలం ఇవ్వాలని లేదు అన్నదే రారా చెప్పింది.

    “రాబందుల రెక్కల చప్పుడు…”

    – రారా ఎలా అయితే “వెన్నెల సముద్రాలు, మణిస్తంభాలు,…” మొదలైనవాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదో, అలానే మీరుకూడా ఈ సంకేతాలని సరిగా అర్థం చేసుకోలేదని నాకనిపించింది. దాని గురించి ఇక్కడ వివరణ అనవసరం. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు, తిలక్ కవిత్వం గురించి మాట్లాడుకొనేటప్పుడు మధ్యలో శ్రీశ్రీ కవిత్వాన్ని గురించిన చర్చ పూర్తిగా అనవసరం.

    కవిత్వం హృదయసంబంధి: లాలిత్యం హృదయాహ్లాదకరమైనది. దానిమీద తిరుగుబాటు దేనికి? లాలిత్యంలో దుర్మార్గపు దోపిడీగుణం ఏమైనా అంతర్లీనంగా ఉందా?”

    – నాకర్థమైనంతవరకూ, లాలిత్యం కడుపునిండిన వాళ్ళ కవిత్వంలోనే ఉండగలదనీ, వాళ్ళే లలితమైన భావాలతో, పదాలతో జీవితమెంతో అందమైనదని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని అలా మభ్యపెట్టే నిరుపేదలని దోచుకుంటారనీ రారా (అభ్యుదయ, విప్లవ వాదాల) సిద్ధాంతం. ఇందులో కొంచెం నిజం దాగి ఉంది. ఇది తిలక్‌కి వర్తిస్తుందా లేదా అన్నది వేరే విషయం.

    “వచన గేయపు శైలి లలితమైన (లిరికల్)ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని, గంభీరమైన ఇతివృత్తాలకు సముచితంగా ఉంటుందని స్పష్టంగా అర్ధమవుతుంది”.

    – ఇక్కడ రారా వచనగేయపు శైలినీ, “లిరికల్” శైలినీ వేరుగా చూపించారన్నది స్పష్టం. మీరు వచనగేయపు శైలి అంటే, ఛందస్సు లేకుండా రాయడమన్న అర్థాన్ని తీసుకున్నారు. కాని రారా తీసుకున్న అర్థం అది కాదు. అయితే అది రారా ఈ వ్యాసంలో పూర్తిగా స్పష్టం చెయ్యకపోవడం బహుశా అతని లోపమే. లేదా అప్పట్లో ఇవి విమర్శకులకి బాగా తెలుసున్న పదాలన్న ఉద్దేశంలో రారా వివరించకపోయి ఉండవచ్చు. వచన కవిత్వపు శైలీ భేదాలని “కవితావిప్లవాల స్వరూపం”లో నారాయణరావు గారు వివరించినట్టు గుర్తు.

    “భావకవుల వేదనా ప్రియత్వంలో అనుభూతి సాంద్రత ఎక్కడుంది? అది ఒకరకంగా కృత్రిమమైనది.”

    – ఇది మీ పాక్షిక దృష్టినే సూచిస్తోంది కాని సరైన విమర్శ అనిపించుకోదు. అనుభూతి సాంద్రమైన భావకవిత్వం నేను చదివాను. మొత్తం భావకవుల వేదనా ప్రియత్వాన్ని కృత్రిమం అనడం అసమంజసం. కవిత్వం విషయంలో ఇలాంటి blanket statements ఎప్పుడూ తప్పే అవుతాయి.

    ఇవి తప్ప మీ వ్యాసంలో మిగతా అన్ని విషయాలతోనూ నేను పూర్తిగా ఏకీభవిస్తాను.

  1189. రచయితలకు సూచనలు గురించి kameswari గారి అభిప్రాయం:

    09/16/2010 2:30 pm

    ప్రతి శీర్షికకీ అభిప్రాయాల పెట్టె ఉన్నట్లే ,పత్రికలో ప్రచురణకోసం కవితల కు ఒక పెట్టె, కథలకు ఒకపెట్టె, వ్యాసాలకు ఒకపెట్టె ఉంచితే రచయితలకు రచనలను పంపటం తేలిక అవుతుంది కదా!
    యద్దనపూడి కామేశ్వరి

  1190. మంచి కవి, మంచి స్నేహితుడు గురించి kameswari గారి అభిప్రాయం:

    09/16/2010 2:18 pm

    ఆధునిక కవిత్వ పరిణామంలో పద్య గేయ కవిత్వాల నుండి వచన పద్యం రూపు దిద్దుకొనేవేళ, ఆ ప్రక్రియకొక అందమైన వెన్నెల జలతారు చీర కట్టి వచనకవితకొక స్థిరమైన రూపునిస్తూ, అదే సమయంలో తనకంటూ ఒకశైలిని ఏర్పరచుకొన్న ఆధునిక కవితా మాంత్రికుడు తిలక్ . మంద్రంలో ప్రారంభమై క్రమక్రమంగా ఆరోహణం సాగించి తారస్థాయిని అందుకోవటం వారి కవిత్వంలో భావవిన్యాసపు సామాన్యలక్షణం. గాఢానుభూతిని సంస్కృతసమాసాల జరీ పనితనంతో అలంకరించటం అతనికి ఇష్టం. అది అతని భావనాస్థాయికి గాఢత్వాన్ని కలుగజేస్తూ ఉండటం ఇంచు మించు అలాటి అలంకరణ ఉన్నఅన్ని కవితలలో కనిపిస్తూ ఉంటుంది. తన కవిత్వపు ఒరవడితో ఆధునిక కవిత్వానికొక ఉరవడిని కల్పించిన ఆధునిక కవితాబ్రహ్మ తిలక్ కవిత్వాన్ని మరొక్కమాటు చదివించినందుకు ధన్యవాదాలు.
    యద్దనపూడి కామేశ్వరి

  1191. ప్రేమ కవితలు గురించి lalitha గారి అభిప్రాయం:

    09/15/2010 7:04 am

    నా మనసులొని భావాలు మీ కవితలొ వెల్లువెత్తాయి
    నా ప్రేమ కలలు మీ కలమున జాలువారాయి
    ప్రేమను ప్రేమతొ ప్రేమిస్తున్న ఓ నేస్తమా నీకు నా జోహార్లు

    …నేను మీలాగే ఒక ప్రేమ పిపాసిని,
    నా ప్రియుని కోసం ఇలాగే కవితలు రాస్తున్నాను.

    లలిత

  1192. ప్రేమ కవితలు గురించి anitha గారి అభిప్రాయం:

    09/14/2010 5:00 am

    మీ కవిత చాలా బాగుంది.

  1193. తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    09/13/2010 6:10 pm

    ఎవరి వ్యక్తిత్వానికైనా నిస్సందేహంగా వన్నె తెచ్చే లక్షణం నిబద్ధత.అది ఒక తాత్విక/రాజకీయ సిద్ధాంతానికి అవవచ్చు,జీవన విధానానికి అవవచ్చు,నైతికవిలువల పట్ల అవవచ్చు ,మానవీయ సంబంధాలు/ అనుబంధాల పట్ల అవవచ్చు.అయితే వ్యక్తులుగా మనం బద్ధులమయ్యే సిద్ధాంతాలు/ఇజాలు/వాదాలు, వాటికి భిన్నమైన మూలాలుకల సాహిత్య రూపాలు,సాహిత్యప్రక్రియల సాహితీ విమర్శను ఏమాత్రం ప్రభావితం చేయకూడదు.అరుదైన విమర్శనాశక్తి,సునిశితమైన వివేచన,నిష్పాక్షికత,సాహితీ నిబద్ధత ఉన్న రారా వంటి ప్రతిభావంతులైన విమర్శకుల పరిశీలనా దృష్టిని ,విశ్లేషణాపరిధిని కూడ సిధ్ధాంత చట్రాలు ఇంతగా పరిమితం చేయటం దురదృష్టకరం.తెలుగువచనకవితను అద్వితీయంగా పరిపుష్టం చేసిన తిలక్ కవిత్వానికి ఈ సమీక్ష
    న్యాయం చేయలేదనే చెప్పాలి.

  1194. తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి సంపాదకుల ప్రకటన గారి అభిప్రాయం:

    09/13/2010 9:32 am

    “ఒక్కొక్క యుగంలో జీవితం గురించి ఆనాటి జనులకు ఒక్కొక్క అవగాహన ఉంటుంది.” రారా గొప్పదనమిదే. మంచి అవగాహన. చారిత్రక పరిణామంలో విలువల అస్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవటం. అంటే కవిత్వావగాహన సాపేక్షమని. అంతవరకు బాగానే ఉంది. కానీ, “వాస్తవ జీవితానికీ,కవిత్వానికీ మధ్య అఖాతం విస్తరించేకొద్దీ జీవిత వాస్తవాన్ని విస్మరించటమే కవిత్వధ్యేయం అవుతుంది” అనడంలో ఒక లాజికల్ ఫ్లా ఉంది. ఈ వాక్యం మరొకసారి చదవండి.వాస్తవ జీవితానికీ కవిత్వానికీ మధ్య అఖాతం ఎందుకేర్పడింది? దానికి కారణం ఏమిటి? కవిత్వం జీవిత వాస్తవానికి దూరంగా జరగటమే. అంటే అంతటితో ఈ ప్రాసెస్ అయిపోయింది. అఖాతం ఏర్పడటం లోనే, విస్తరించటంలోనే విస్మరించటం ఉంది. ఇంక విస్మరించటం ధ్యేయం కావటం ఏంటి?

    – సి. ఎస్. రావ్.

    [రా.రా సమీక్షపై సి. ఎస్. రావ్ గారు వ్రాసిన ప్రతిస్పందన నిడివి, పరిశీలన, వ్యాసానికి సరిపోయినంతగా వుండటంతో వారి లేఖను ఒక పూర్తి వ్యాసంగా ఈమాటలో ప్రచురించాము. ఇలా ఆలస్యంగా ప్రచురించడం మా నియమ భంగమే అయినా సబబైన నిర్ణయమనే మా అభిప్రాయం – సం.]

  1195. ప్రేమ కవితలు గురించి O.D.kondal Rao గారి అభిప్రాయం:

    09/09/2010 7:47 am

    మీ కవిత చూస్తుంటే మీరు ఎవ్వరినో బాగా ప్రేమించినట్లున్నారు. చాల బాగుంది. హృదయాన్ని తాకింది.

  1196. బందీ గురించి prasuna గారి అభిప్రాయం:

    09/09/2010 5:54 am

    నయాగరా గురించి అని తెలిశాక మరలా కవిత చదువుతుంటే ఎంత బాగా వర్ణించారు అని ఇంకా అనిపిస్తోంది.

  1197. ఆత్మ ఘోష గురించి Vamsi Krishna Prakhya గారి అభిప్రాయం:

    09/09/2010 1:59 am

    చాలా చక్కని-చిక్కని భావాన్ని కవితగా అందించినందుకు ధన్యవాదాలు. మంచి కవితల కోసం ఎదురుచూస్తున్న నన్ను పన్నీటి జల్లులా ఈ కవిత ఒక్కసారి తట్టిలేపింది. ప్రతి పాదంలోను అద్భుత ప్రయోగాలున్నాయి.

    అత్తరు వేసిన నీ ఆలోచనల తొక్కిసలాటలో
    నూర్పిడి మిట్టనై నలిగిపోతున్నా

    ఇది చాలా అద్భుతమైన ప్రయోగం.
    – వంశీకృష్ణ ప్రఖ్య

  1198. బందీ గురించి Gandhi గారి అభిప్రాయం:

    09/08/2010 11:28 pm

    నారాయణ గారు,
    కవిత చదువుతుంటే మొదట్లో వస్తువు గురించి చాలా ఊహలు చేసాను.
    చాలా బాగుంది. ఇంకా ఎన్నో వ్రాస్తారని ఆశిస్తున్నాను.
    ఆశీర్వాదాలు.. గాంధీ.

  1199. నేను పులిని గురించి perugu.ramakrishna గారి అభిప్రాయం:

    09/07/2010 9:34 am

    అంతరించి పోతున్న అసలు పులులకంటే ,స్వార్ధపు జనారణ్యంలో తిరిగే మానవ మృగాలే అధికమైపోతున్నాయని తెగేసి చెప్పిన మంచి కవిత.. చాల బాగా మలిచారు సర్.. అభినందన శుభాకాంక్షలు ..మరిన్ని కవితలకు ఎదురు చూస్తూ …నమస్సులతో..

  1200. తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    09/07/2010 5:57 am

    హెచ్చరిక: రారాగారి వ్యాసంలాగానే, నా యీ పొడుగాటి వ్యాఖ్యలోనూ తిలక్ కవిత్వం గురించి ఏమీ లేదు. కాబట్టి తిలక్ కవిత్వాన్ని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు దీన్ని చదవనక్కర లేదు.

    తామొక చట్రంలో ఇరుక్కోడమే కాక తాము చదివిన కవులనీ కవిత్వాన్నీ కూడా అలా చట్రాల్లోకి ఇరికించే ప్రయత్నం చేస్తే అది ఎంత వెగటుగా ఉంటుందో రారాగారి ఈ విమర్శ నిరూపిస్తుంది. అంత మాత్రం చేత రారా అంటే నాకు గౌరవం లేదనీ కాదు, ఇదొక చచ్చు విమర్శ అనీ కాదు. కవుల్లాగే విమర్శకులు కూడా కాలానికీ, ఆయా కాలాలలో ప్రాచుర్యం పొందిన భావజాలాలకీ ప్రభావితులవుతారు. ఆ కాలంలో పాఠకులకి అది గొప్ప విమర్శగా అనిపించవచ్చు, వారూ చాలావరకూ ఆ చట్రాల్లోనే ఉంటారు కాబట్టి. తర్వాత కాలాల్లో అలాంటి చట్రాల్లో లేని వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది.

    ఈ వ్యాసంలో నాకు తిలక్ కవిత్వం కంటే కూడా అభ్యుదయ కవిత్వం గురించిన వివర విశేషాలే ఎక్కువగా కనిపించాయి. తిలక్ అభ్యుదయ కవి కాడు అని నిరూపించడానికి అభ్యుదయ కవిత్వం గురించి అంత వివరణ అనవసరం అని నాకనిపించింది. అది కాక మిగిలినదంతా, తిలక్ భావకవి అని అంతకన్నా కూడా అథమస్థాయికి దిగజారాడని, నిరూపించడానికే సరిపోయింది. ఎంతసేపూ “అభ్యుదయ”, “భావ” కవిత్వాలు అనే చట్రాల్లోకి తిలక్ కవిత్వం ఒదుగుతుందా లేదా అనే తపనే కాని, ఒక కవిగా అతని కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ధ్యాస లేకపోవడం దురదృష్టకరం.

    “శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి బహుశా లేడేమో” అని అన్నారు కాని, శ్రీశ్రీ కున్న భావుకత్వానికీ తిలక్ భావుకత్వానికీ మధ్యనున్న ఆంతర్యం ఏమిటన్న ఆలోచన చెయ్యలేదు. ఇద్దరూ గొప్ప భావుకులే. ఇద్దరికీ గొప్ప శబ్దశక్తి ఉంది. కాని వాళ్ళిరువురూ అంత భిన్నమైన కవిత్వాన్ని ఎందుకు రాసారు?

    “దుఃఖితుల పట్లా బాధితుల పట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట ఎవరూ కాదనరు. కాని ఆ కరుణ అభ్యుదయ హృదయ స్పందనగా కనిపించదు. ఆ కరుణ దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురనూ, కర్యవ్యోన్ముఖులనూ చేసేది కాదు. కనీసం వాళ్ళకు ఊరట కలిగించేది కూడా కాదు.” అన్నప్పుడు దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురని చేసేది మాత్రమే “అభ్యుదయ స్పందన” అవుతుందనే ఒక prejudice అందులో దాక్కుంది. పైగా “ఆ కరుణ కేవలం భావకవి కుమారుని ఏకాంత సౌందర్యంగా, కవితానంద హేతువుగా మిగిలిపోయింది” అని అన్నప్పుడు ఆ కరుణ అభ్యుదయం కాకపోతే భావుకవిత్వమే అవ్వాలన్న సంకుచిత దృష్టి కనిపిస్తోంది. తిలక్ కరుణ భావకవులకి మల్లే పూర్తిగా వ్యక్తిగతమైనది కాదు. భావకవుల్లా దుఃఖంలో అతను సౌందర్యాన్ని చూసాడనడమూ సహేతుకం కాదు. తిలక్ శ్రీశ్రీలా ఆవేశపరుడు కాదు. అందుకే అతను ఎంత భావుకుడైనా అతని కవిత్వంలో మృదుత్వం తప్ప రారా అన్న “ఉత్తేజం” కనిపించదు. శ్రీశ్రీ ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అతన్ని మరింత ఆవేశపరుణ్ణి చేసి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు తిలక్ కి లేనందువల్ల అతనిలో ఆ ఆవేశం కలిగే అవకాశమూ రాలేదు. అంత మాత్రం చేత తిలక్ కరుణని ఆవేదనని భావకవుల ఏకాంత సౌందర్యంగా జమకట్టెయ్యడం తప్పు. తిలక్ పీడితతాడిత జనాలని క్రియాశీలురని చెయ్యడానికి కంకణం కట్టుకోలేదు. వాళ్ళ బాధలకి నిజాయితీగా స్పందించాడు. అది భావకవిత్వంలో ఎక్కడా మనకి కనిపించదు.

    “ప్రజాశక్తుల పట్ల భావకవి హృదయంలో స్వచ్ఛందమైన సానుభూతి ఉంది కానీ, ప్రజాశక్తులతో తాదాత్మ్యం చెందే అభ్యుదయకవి హృదయం కాదది” అన్నారు. తిలక్ భావకవి అని ముద్రవేసి అతని కవిత్వంలో ప్రజాశక్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ సానుభూతిని భావకవులందరికీ కట్టబెట్టేసారు. కాకపోతే, అసలు అంతకుముందు వచ్చిన భావకవిత్వంలో “ప్రజాశక్తుల” ప్రస్తావన ఎక్కడైనా ఉందా? ఇక ప్రజాశక్తులతో “తాదాత్మ్యం” అభ్యుదయ కవుల్లో ఏ కొద్దిమందికో మాత్రమే ఉన్నది. అభ్యుదయ కవిత్వం పేరుతో వచ్చిన చాలా కవితల్లో ఆ తాదత్మ్యం లోపించే అవి శుష్క నినాదాలుగా మిగిలిపోయాయి.

    స్త్రీ గురించి “పెద్దపులి” అనడమూ, “ప్రవహ్లిక”తో పోల్చడమూ ఏ ఇజాలకీ లొంగక పాపం రారాగారికి అస్సలు మింగుడుపడలేదు! ఆఖరికి ఏదో తనకి తెలిసిన ఒక ఆర్యోక్తితో ముడిపెట్టే ప్రయత్నం చేసారు. ప్రతిదాన్నీ ఏదో ఒక ఇజంతో ముడిపెట్టాలన్న ఈ తహతహ ఎందుకసలు? ఒక పురుషుడిగా స్త్రీ వ్యక్తిత్వంలో తనకి తెలియని లోతులు కనిపిస్తే దాన్ని కవిగా తనదైన రీతిలో వ్యక్తం చేస్తే ఆ కవిత్వాన్ని కవిత్వంగా ఎందుకు అర్థం చేసుకోకూడదో నా మట్టి బుఱ్ఱకి తట్టటం లేదు.

    ఇక స్త్రీల వర్ణన గురించి ప్రస్తావించి, అది భావకవిత్వం కన్నా దిగజారి ప్రబంధకవిత్వ స్థాయికి చేరుకుందని కొన్ని కవితలు ఉదహరించారు.తిలక్ చేసిన అంగాంగ వర్ణనలని ఆక్షేపిస్తే నాకు పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కాని భావకవిత్వంతో పోల్చి, అంతకన్నా దిగజారిందనడం పూర్తిగా అనవసరం, అర్థ రహితం. భావకవుల కవిత్వంలో కూడా మనకి ఇలాంటివి కనిపిస్తాయి. బాపిరాజుగారి “నగ్న” కవితాఖండిక దీనికి మంచి ఉదాహరణ. ఇంకా కాళ్ళకూరి గోపాలరావు కవిత్వం, కవికొండల గీతాలు మొదలైనవాటిల్లో స్త్రీ అంగాంగ వర్ణన కనిపిస్తుంది. “భావకవిత్వంలో స్త్రీ” పుస్తకంలో జయప్రభగారు దీని గురించి వివరించారు. అంచేత స్త్రీల వర్ణన విషయంలో తిలక్ భావకవిత్వం కన్నా దిగజారుడుతనం చూపించాడన్నది అర్థం లేని ఆక్షేపణ.

    అలాగే స్త్రీ పురుష సంబంధాల గురించి, భావకవులది “ఉదాత్త ప్రణయమ”నీ, ఇంద్రియవాంఛ, శరీరదాహం సిగ్గుమాలినతనమనీ వ్యాఖ్యానించడం ఇప్పుడు చదివితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే “అమలిన శృంగారం” అన్న “ఉదాత్తమైన” ప్రణయాన్ని భావకవుల్లోనే అందరూ ఆదరించిన దాఖలాల్లేవు. అభ్యుదయవాద చట్రంలో ఇరుక్కున్న రారాగారికి అది “ఉదాత్తంగా” కనిపించడంలో వింతలేదు, కాని తర్వాత వచ్చిన స్త్రీవాదులు దాన్ని పూర్తిగా ఖండించడం ఒక విశేషం!

    రారాగారు ఎంతగా సిద్ధాంత సర్పపరిష్వంగంలో ఇరుక్కుపోయారంటే, సూత్రాలకీ సిద్ధాంతాలకీ కట్టుబడని తిలక్ మనస్తత్వాన్ని “మానసిక అరాజకత్వం” అనేంతగా! అల్లాంటి ఇరుకుదనమే సంకుచితత్వానికీ, నిరంకుశత్వానికీ దారితీసింది . కలల గురించి కవిత్వం రాసిన కారణానికి తిలక్ ని పిచ్చాసుపత్రికి దగ్గరగా ఉన్నాడని అనేంతగా అతని విమర్శని దిగజార్చింది!

    ఇది ఏదైనా కావచ్చును కాని తిలక్ కవిత్వాన్ని గురించిన “సమీక్ష” మాత్రం ఖచ్చితంగా కాదు.

  1201. నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    09/05/2010 7:38 pm

    అపారమైన తెలుగు సాహిత్య చరిత్రలో కొద్దిమంది కవులు ,బహుశా ఒక కవయిత్రి పేరు మాత్రమే ప్రసిద్ధి కెక్కాయి. కవిత్రయము,పోతన,శ్రీనాధుడు,అష్టదిగ్గజములు,మొల్ల పూర్వకవులలో ఆ అదృష్టమునకు నోచుకొన్నారు. వైయాకరుణులు పోతన కవిత్వంలో కూడా బోలెడు దోషాలు పట్టారు. నన్నయ, తిక్కనల భాషలో కూడా తప్పులు పట్టి ‘ఆర్యదోషంబు గ్రాహ్యంబు’ అని ఓ వ్యాకరణ సూత్రము తగిలించారు. అందుచేత కవయిత్రి మొల్లను స్త్రీ అనో అగ్రకులమునకు చెందక ఫొవటము వలననో ఆ కాలపు పెద్దలు గౌరవించ లేదని చెప్పడము భావ్యము కాదేమో. అది నిజమయితే అగ్రకులస్థులే ఎక్కువగా సాహిత్య పఠనం చేస్తున్న కాలంలో ఆవిడకు ఆ ఖ్యాతి ఎలా వచ్చింది?
    మొల్ల సహజ కవయిత్రి. భాషాధ్యయనము చేయలేదని, ఈశ్వర ప్రసాదముచే కవిత్వము వచ్చినదని ఆవిడ చెప్పారు. నిఘంటువు అవసరము ఎక్కువగా లేని రీతిలో తేనెసోకునటుల తియ్యని మాటలతో కవిత్వము వ్రాసారు. రాజుల వర్ణన బాగుంది. కాని నన్ను ఆకట్టుకొన్న పద్యము

    చం. కదలకుమీ ధరాతలమ, కాశ్యపి బట్టు ఫణీంద్ర ,భూవిషా
    స్పదులను బట్టు కూర్మమ ,రసాతల,భోగి ఢులీ కులీశులన్
    వదలక పట్టు ఘృష్టి, ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
    బొదువుచు బట్టుడీ కరులు భూవరుడీశుని చాప మెక్కెడిన్ .

    శ్రీరాముడు శివధనస్సు ఎత్తుతుంటే భూకంపము రాకుండా చూడమని లక్ష్మణుడు చెప్పిన పద్యము నాకు నచ్చినది. (మూడవ పాదములో యతి కలసి నట్లు లేదు. పెద్దలు వివరించ గలరు. మనకు నచ్చినప్పుడు యతి కలవక పోతే యేమి ? )

  1202. బందీ గురించి Jagannatha Rao గారి అభిప్రాయం:

    09/03/2010 7:42 am

    బందీ కవితలో నింద మిషతో స్తుతించడం బాగుంది. ఇది వ్యాజ స్తుత్యలంకారం.

  1203. మహామంగళప్రవచనము గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    09/03/2010 12:43 am

    దేశికాచారి గారి కవిత్వం ఎప్పటి వలనె రసానుభూతి కలిగిస్తూ మధురంగా వుంది. దేశికాచారి గారికి చెందవలసిన కీర్తి, ప్రఖ్యాతి ఆయన్నింకా వరించలేదేమోనని నేను భావిస్తున్నాను. ఆయన కవిత్వంని అందిస్తున్నఈమాటకు కృతజ్ఞతలు.

  1204. ఆత్మ ఘోష గురించి Ramchandar Chebolu గారి అభిప్రాయం:

    09/02/2010 2:52 pm

    రవి,
    నాకు తెలియదు నీలో ఇంత కవిత్వం వుందని. చాలా బాగుంది.
    రామచంద్ర.

  1205. గోరువంకలు గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    09/02/2010 1:48 pm

    నాకేదో పెద్ద తెలుసని కాదు కానీ… అచ్చుతప్పులని తెలిసి మరీ అలాగే ఉన్నదున్నట్లు పునర్ముద్రించారా? నిజంగానే?

    [ కొన్ని అచ్చుతప్పులని రూఢిగా తెలిసినవి సవరించాం. ఉదా: నిసణ్ణ – నిషణ్ణ, సవ్వయి – సవ్వడి, ఇలా. (వెల్చేరు వ్యాసంలో ఉటంకించిన ఒక కవితలో తిలక్ సంయమం అన్నాడా సంయమనం అన్నాడా అని చాలా చర్చ కూడా అయింది. రెండిటికీ అర్థం ఒకటే అయినా కవి వాక్కును మార్చకుండా ఉంచాలి గదా.) అంతకు మించి పరిష్కరించడం ఛందస్సు, తిలక్ కవిత్వం రెండూ బాగా తెలిసిన పండితుడు మాత్రమే చేయగలడు అని మా ఉద్దేశం. విశాలాంధ్ర తిలక్ రచనల ముద్రణలో విపరీతమైన నిర్లక్ష్యం కనిపిస్తుందనేది జగమెరిగిన సత్యమే. – సం.]

  1206. తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి వేణు గారి అభిప్రాయం:

    09/02/2010 1:25 pm

    తిలక్ కవిత్వం గురించి రాసిన ఈ వ్యాసాన్ని కొన్నేళ్ళ క్రితం చదివాను. ముఖ్యంగా ‘నన్ను కౌగలించుకున్న పెద్దపులివి’ అనే వాక్యం గురించి రా.రా. నిశిత విమర్శ బాగా గుర్తుంది. ఇంత విలువైన వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

    ఓ సందేహం. ‘నా అక్షరాలు ప్రజాశక్తుల నావహించే విజయ ఐరావతాలు’ అంటూ రా. రా. ఉటంకించారు. ‘అమృతం కురిసిన రాత్రి’ పుస్తకంలో ఉండే ‘ప్రజాశక్తుల వహించే’ ఎటూ తప్పే. అన్వయంలో స్పష్టంగా కనిపించే ఈ దోషాన్ని పట్టించుకోకుండా యండమూరి వీరేంద్రనాథ్ లాంటి వారి నుంచి చాలా మంది వరకూ దీన్నే యథాతథంగా కోట్ చేస్తుంటారు.

    ‘ప్రజాశక్తులావహించే’ అనే వర్షన్ కూడా ఓచోట చదివాను. ఇంతకీ ఏది సరైనదో!

    [తెలుగు, సంస్కృత నిఘంటువుల ప్రకారం లావహించే అనేది సరైనదండీ. ఐరావతాలు కాబట్టి అధిరోహించే (ఆరోహించే) ఎందుకు కాగూడదో అనే సందేహంతో మేమూ మార్చే సాహసం చేయలేదు. – సం.]

  1207. మహామంగళప్రవచనము గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    09/02/2010 10:19 am

    చిక్కని పద్యాలలో చక్కని కవిత్వం, చాలా బాగుందండీ!
    “అంభోవాహస్వనితానుకూలనటనంబూనె న్మయూరంబులున్” : మేఘధ్వనికి నెమళ్ళు నాట్యం చెయ్యడం మామూలే, ఆ ధ్వనికి అనుగుణంగా నాట్యం చేసాయనడం విశేషం!
    “తారలు క్షపాకరుడుం గనరాకయుండఁ గాలయవనికాంతరస్థనటులం బలె” : కొత్త ఊహ!
    “కరుణానిధి”, “కరుణాంబుధీ” లాంటి పదాలు వినివిని అరిగిపోయాయి 🙂 “అనుకంపాబ్ధీ!” : చాలా బాగుందీ పదం!

    “రస” విషయికంగానే కొంత నిరుత్సాహం కలిగింది. కథ తెలిసినవాళ్ళకయితే ఫరవాలేదు కాని, తెలియని నాలాంటి వాళ్ళ విషయంలో చివరకి వచ్చేసరికి హఠాత్తుగా ముగిసిపోయినట్టనిపిస్తుంది. అంత గొప్ప వర్ణనలతో ఆ వాతావరణాన్నీ, ఆ సురాంగన దిగిరావడాన్ని వర్ణించిన తీరులో అద్భుత రసాన్ని పోషించి, వెనువెంటనే శాంత రసస్ఫోరకాలయిన బుద్ధుని మాటలు వచ్చెయ్యడం ఒక రకంగా రసభంగమైనట్టు అనిపించింది. అక్కడ మరికొంత కల్పన ఉంటే మరింత రక్తి కట్టి ఉండేదని అనుకుంటున్నాను.

    ఏదైనా ఈ కాలంలో ఇంత మంచి పద్యకవిత్వాన్ని చదవడం అదృష్టమే! వీటిని దేశికాచారిగారి గళంనుంచి కాని, లేదా వేరెవరి మధుర గళంనుంచైనా కాని వినగలిగితే మరింత ఆనందంగా ఉంటుంది. ఇది ఈమాటలాంటి ఇంటర్నెట్ పత్రిలలకి పెద్ద పనేం కాదు కదా!

  1208. ఆత్మ ఘోష గురించి chavakiran గారి అభిప్రాయం:

    09/02/2010 6:53 am

    కవితల క్వాలిటీ బార్ ఏమన్నా కిందికి దింపారా ఏమిటి ఈ మాట వారు 🙂

  1209. మంచి కవి, మంచి స్నేహితుడు గురించి Sowmya గారి అభిప్రాయం:

    09/01/2010 8:12 am

    ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు ‘అమృతం కురిసిన రాత్రి’ కనిపిస్తే, కొన్ని కవితలు చదివాను. ఆపై, ఆమధ్య ఒకరోజు కూడా ఒకటీ అరా చదివే సందర్భం వచ్చింది. చిన్న వయసులో చదివినందుకో ఏమో కానీ, నాకంత బుర్రకెక్కలేదు అప్పుడు. ఈ వ్యాసాలన్నీ చూస్తూంటే ఇప్పుడు చదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు. 🙂

  1210. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి narEn గారి అభిప్రాయం:

    08/28/2010 10:52 pm

    శ్రీ రవికిరణ్ తమ్మిరెడ్డి గారు,

    మీ కవిత చాలా బాగుంది.

    ఇండియా లో కోల్పోయిన కొంత మంది కవిమిత్రులు గుర్తుకు వచ్చారు.

    ఒక మూగవాని పిల్లనగ్రోవిలో ఉన్న ఆర్తి మీ కవితలో కూడా కనిపించింది.

    నరేన్.

  1211. ప్రేమ కవితలు గురించి murari గారి అభిప్రాయం:

    08/21/2010 2:50 am

    నమస్తె అన్న నీ కవిత సుపర్……..
    మురారి
    8008298031

  1212. నువ్వు గురించి sreekanth.vemulapalli గారి అభిప్రాయం:

    08/12/2010 8:24 am

    మీ కవిత చాలా bagundi i dont know 2 type in telugu sorry bye

  1213. దివ్వెలు గురించి Madhu Anneboina గారి అభిప్రాయం:

    08/06/2010 3:50 am

    చాలా బాగుంది చంద్ర గారూ… మీ కవిత.

  1214. నువ్వు గురించి రాజా బాబు గారి అభిప్రాయం:

    08/01/2010 7:38 am

    ఎదురుచూపులో వున్న అవ్యక్తానుభూతి
    విరహంలో వున్న తీయని బాధ
    కలగలిపిన ఈ కవిత చాలా బాగుంది
    – రాజాబాబు

  1215. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    07/25/2010 4:06 pm

    నచ్చిన దాని గురించి కాక నచ్చని వాటి గురించి మాత్రమే మాట్లాడటం భావ్యం కాదని మరో నాలుగు మాటలు. నాకు నచ్చిన కవిత సరిగంగ స్నానం. అసలా మాట విని శతాబ్దాలయింది; పల్లెటూరి జీవితం గుర్తుకి తెప్పించింది:
    “తానే మనసారా వొక ఏరయి పోయి
    చిన్న చిన్న వూళ్ల
    పక్కటెముకల్నించి ప్రవహిస్తున్నాడు ఈ కవి హఫీజ్‌.”

    పర్షియన్ మహాకవి హఫీజ్‌ కవితకి అనువాదం అని ఉన్నది కాని మూలం లేదు. “ఉప్పొంగి వస్తోంది గంగానమ్మ తల్లిలా,” అన్నది చూసి, మూలంలో ఏముందో తెలుసుకోవలని కుతూహలం కలిగింది.

    అదీగాక, నేనింతకు ముందు హఫీజ్‌ కవిత్వమేమీ చదవకపోయినా, గతనెలలో ఓ సగం ధర పుస్తకాల షాపులో తచ్చట్లాడుతూ, అందంగా ఉన్న అట్ట బొమ్మని చూసి,

    “The stuff produced in the factories of space and time
    Is not all that great. Bring some wine, because
    The sweet things of this world are not all that great.”

    అన్నది చదివి, హఫీజ్‌ కవితల పుస్తకం [1] కారుచవగ్గా వస్తుంటే కొన్నాను. దాంట్లో సరిగంగ స్నానం ప్రస్తావన లేదు కాని డెక్కన్ సుల్తాన్ ఆహ్వానం మీద హఫీజ్‌ మన దేశం రావాలని బయల్దేరి, దారిలో తుఫాను రావడంతో మానుకున్నాడట:

    “Hidden inside the crown of a king there’s always
    A fear of assassination; a crown is a stylish hat,
    But a head is too much to pay for it.

    It seemed quite easy to put up with the ocean
    And its torments to receive a proft, but I was wrong;
    A hurricane is too much to pay for a hundred pearls.”
    — Deciding Not To Go To India.

    వేరే అనువాదాలేవైనా ఉన్నాయా అని నిన్న వెతికితే, ఓ షాపులో Daniel Ladinsky అనువాదం “Like the Ganges” [2] కనబడింది. దానికి సరిగంగ స్నానం చాలా దగ్గరగా ఉంది. Ladinsky మన దేశంలో మెహర్ బాబా ఆశ్రమంలో గడిపినప్పుడు హఫీజ్‌ ప్రభావంలో పడ్డాడట. ఓహో అనుకొని ఈ విషయాన్ని పక్కన పెట్టబోతుంటే ఓ చిక్కు వచ్చి పడింది. Ladinsky చేసినవి అనువాదాలు కాదు, ఆయన సొంత కల్పనలు అన్న వివాదం ఉందట!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “The angels knocking on the tavern door : thirty poems of Hafez,” translated by Robert Bly and Leonard Lewisohn. HarperCollins, 2008.
    [2] “The Subject Tonight Is Love, 60 Wild and Sweet Poems of Hafiz,” Daniel Ladinsky (Translator). Penguin Group, 2003.

  1216. నువ్వు గురించి radhakrishna గారి అభిప్రాయం:

    07/24/2010 3:33 am

    మీ కవిత చాలా బాగున్నది. మైదానము లొ చలమ్ చెప్పినవి గురుతుకు వస్తున్నవి. భావమ్ చాలా బావున్నది.

  1217. ఎలిపోమను గురించి సుబ్రహ్మణ్యం మూలా గారి అభిప్రాయం:

    07/21/2010 5:23 am

    మీ “గుండు గొమ్ములనుమానం” కవితగా రాసినట్టుంది! చరణాల్లో భావ పునరుక్తి ఉన్నప్పటికీ ఎక్కడా విసుగు పుట్టించ లేదు. ఉత్తరాంధ్ర మాండలికం మీద మీకున్న పట్టు అబ్బురపరుస్తుంది. తప్పక రాస్తూ ఉండండి.

  1218. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    07/16/2010 3:58 am

    “తెలుగు”కు “తిట్టు” కు యతిమైత్రి మాత్రమే ఉందనుకున్నాను.
    రామారావుగారు చెప్పిన తరువాత- విప్పి చెప్పడం విమర్శ, కప్పి చెప్పడం కవిత అన్నదీ తప్పేమో.
    మన తెలుగు సాహిత్యంలో తిట్టు కవిత ఒక భాగం!
    మన ఆధునిక సాహిత్యంలో తిట్టు విమర్శ సింహ భాగం!?
    అయ్యిందో, అవుతుందో Web 2.0 నిజం చేస్తుందో తెలియదు.
    ==================
    విధేయుడు
    _శ్రీనివాస్‌

  1219. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/15/2010 2:07 pm

    కొడవళ్ల హనుమంతరావు గారి కామెంట్ సూటిగా, సరళంగా, నిరావేశంగా, బాగుంది. వారు Web 2.0 గురించి అన్న మాటకు చిన్న స్పందన: వారన్నది “పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.” అని. ఇందులో చివరివాక్యం నేనన్న దానికి సంబంధం లేనిది. రచనాసందర్భం మారటం వల్ల కొత్తరకమైన కవిత్వం వస్తుందనే prediction సాధ్యం తప్ప అది ఉత్తమకవిత్వానికీ సృజనతీరులో మార్పులకీ దారితీస్తుందన్నది కాదు. ఏ కవితామార్గం లోనైనా ఉత్తమకవిత్వం రావొచ్చు. ఉదాహరణకు పురాణమార్గంలో వచ్చిన ఉత్తమకవిత్వంగా కొందరు “రామాయణ కల్పవృక్షా”న్ని ఎంచవచ్చు, అది వచ్చింది భావకవిత్వం/అభ్యుదయ కవిత్వం ప్రధానకవితామార్గాలుగా వున్న రోజుల్లోనైనా. అలాగే, “కళాపూర్ణోదయం” సృజనతీరులో మార్పుని చూపే కావ్యంగా నేను భావిస్తాను, అది ప్రబంధమార్గం లోని ఉత్తమకావ్యం కాకపోయినా. ఒక కొత్తకవితావిప్లవం రావటానికి, ఉత్తమ కవిత్వము, సృజనతీరులో మార్పులకీ పరస్పర ఆధార సంబంధం లేదనటానికి ఇవి ఉదాహరణలని నా ఉద్దేశ్యం.

    రమా భరద్వాజ్ గారి most recent comment గురించి ఒక చిన్న observation తో ముగిస్తాను. వారు ప్రతిస్పందించిన నా కామెంట్ లో నేను ఎక్కడా “తిట్టు” లేదా “తిట్లు” అనే పదాల్ని వాడలేదు. విమర్శకుల్ని వారు విమర్శించారన్నాను. వారన్నదాన్ని బట్టి ఇప్పుడు తెలుగుకవిత్వానికి సంబంధించిన వాడుకలో “విమర్శ”, “తిట్టు” పర్యాయపదాలుగా వాడుతున్నట్టు (కనీసం వారనుకుంటున్నట్టు) అర్థమౌతున్నది. ఇది నేను ఇప్పుడే తొలిసారిగా తెలుసుకుంటున్న విషయం. ఐతే, దీంతో నాకున్న ఒక సందేహం నివారణ అయింది – అది తెలుగుకవులు, విమర్శకులు “విమర్శ” కు దూరంగా ఎందుకు పారిపోతున్నారనేది. విమర్శ, తిట్టు ఒకటైనప్పుడు అలా జరగటం సహజమే కదా ! అలా ఐతే “విమర్శకుడు” అంటే “తిట్టేవాడు” అనే అర్థం రావటం తప్పదు కాబట్టి, వారు నేను విమర్శకుణ్ని కానని స్పష్టం చేసి పుణ్యం కట్టుకున్నారు. ఇందుకు వారికి ఇంకా థేంక్స్.

  1220. నేను పులిని గురించి V. Harsha Vardhan గారి అభిప్రాయం:

    07/15/2010 6:22 am

    ఈ మధ్య టైగర్ రిజర్వ్ లకు వెల్లి చూసినా పులులు కనిపించడం లేదు. కారణం ఇదన్న మాట. జంతువులు అంతరించిపోవడానికి మానవ స్వార్థం కారణమన్న కవితాత్మక వివరణ బాగుది

  1221. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    07/15/2010 2:34 am

    సమీక్ష నచ్చింది. కాని 48 కవితల్లో నన్నాకట్టుకున్నవి నాలుగయిదు మాత్రమే. ఎక్కువ భాగం నచ్చకపోవడానికి ఓ ముఖ్య కారణం పదేపదే కనిపించే కొన్ని పదాలు. అఫ్సర్ పదాల ప్రాముఖ్యత తెలియని కవి కాదు:

    “చిత్రిక పట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా శవానికి సైతం కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య.”

    “మరీ ఇంత సున్నితంగా మాట్లాడకు ఈ పూట … కాసింత ముల్లు గుచ్చుకున్నట్లుగా వుండాలి ఈపూట.”

    ఎంత గరుకు మాటలు వాడినా చివరకు కవిత చదివేవానిలో సున్నితత్వాన్ని పెంచాలి కదా. “నెత్తురంటిన మాటలు” కవితల్లో చాలా ఎక్కువై పోయి నాకు వెగటు కలిగించాయి. నిజానికి నెత్తురు మాట చదివినప్పుడల్లా, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం చదివిన నెరూడా చెప్పిన మాటల ప్రాముఖ్యత గుర్తొచ్చి, “నెత్తుటి కడవల” దోషం కొట్టొచ్చినట్లయింది:

    “I leave them in my poem like stalactites, like slivers of polished wood, like coals, pickings from a shipwreck, gifts from the waves. Everything exists in the word.” [1]

    ఇటీవలే తిరిగి ప్రచురితమైన వెల్చేరు పుస్తకానికి [2] KVS రామారావు గారు ఇచ్చిన కితాబు: “నాకెంతగానో నచ్చిన మరొక అంశం, రచయిత రాసిన వచనం. శాస్త్రీయ, విశ్లేషణాత్మక విషయాలను కూడా సూటిగా, స్పష్టంగా, పదునుగా, అందంగా చెప్పవచ్చునని చూపించారు.” నేను కొన్ని భాగాలే చదివాను. ఈ విషయంలో నేనూ మెచ్చుకుంటాను.

    వెల్చేరు సిద్ధాతం ప్రకారం, రచనా సందర్భం, సామాజిక సందర్భం మారినప్పుడు కవితా స్వరూపం కూడా మారుతుంది. ఆశు రూపం నుంచి శ్రవ్య రూపానికీ, పిదప పాఠ్య రూపానికీ మారడానికి కారణం – రచన చేసే పరికరాల్లో మార్పు రావడమే. (పదో అధ్యాయం)

    KVS రామారావు గారుWeb 2.0 కూడా కొత్త రచనా సందర్భమనీ, దీని మూలంగా కొత్త కవితా రూపాలొచ్చే అవకాశముందనీ అంటున్నారు. దానితో నేను విభేదిస్తాను. పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.

    ఈ సందర్భంలో Richard Rorty గుర్తొచ్చాడు:

    Question: The Internet, and in general the information revolution, has already revolutionized our world, and it will continue to do so in even more radical ways, as … suggest. Do you think that philosophy, or let us say, critical thinking, will have a whole new spectrum of questions to deal with, and that we might have to begin a new sub-discipline named something like cyber-philosophy?

    Rorty: Maybe, but I see no special reason to think so. The telephone and telegraph didn’t create a tele-philosophy, so I am not sure that the Internet will produce a cyber-philosophy. I think a lot of the stuff about the information revolution is media hype.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “Memoirs,” Pablo Neruda.
    [2] “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం,” వెల్చేరు నారాయణరావు. తానా ప్రచురణ, 2008.
    [3] “Take care of freedom and truth will take care of Itself: interviews with Richard Rorty,” edited with an Introduction by Eduardo Mendieta. Stanford University Press, 2006. Page 111.

  1222. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/14/2010 1:49 pm

    రామారావు గారూ!! నా ఆ అభిప్రాయాన్ని ఎడిట్ చేసి వేయడం కారణంగా మీకు కలిగిన పొరపాటు అభిప్రాయం మాత్రమే అది. అందుకు నా బాధ్యత ఏమీ లేదు. గమనించండి. నేను మిమ్మల్ని ఒక “విమర్శకునిగా” ఆ నా అభిప్రాయంలో పేర్కోలేదు. నాకు తెలీదు మీరు విమర్శ ఏమన్నా రాసేరని. అభిప్రాయాలు మీరు ఒక పుస్తకం మీద చెప్పినట్టే అందరికీ ఉంటాయి. నా అభిప్రాయం మీకు ఒప్పుదల కాకపోయినంత మాత్రాన దానిని “తిట్టుగా” భావించనక్కరలేదు. నేను పేర్కొన్న అభిప్రాయం అభిప్రాయం మాత్రమే . “తిట్లు” కావు. నేను రాయని అభిప్రాయాలని నాకు ఆపాదిస్తే అందుకు నేను ప్రతిస్పందించనక్కర లేదు. నా భావం వీళ్లకి అర్ధం కాలేదు అనుకుని ఊరుకుంటాను.

    చర్చని “కవితావిప్లవాల స్వరూపం” మీదకి మళ్ళించవలసిన ప్రశ్నలని మీరు వేసేరు. అది వేరే చర్చ అవగలదు. ఆ చర్చని చేసే ఆసక్తి మిగిలిన వారికి ఉండాలి. కదా? మీరు వేసిన అన్ని ప్రశ్నలూ సమంజసగానే ఉన్నాయి. ఆలోచనాత్మకమైన అభిప్రాయాలని గుర్తించగలిగిన మీకు వాటికి జవాబులు అన్వేషించడమూ ఏమంత కస్టం కాకపోవచ్చు. నేను ఇదివరకూ చెప్పిన అభిప్రాయామూ..మీకొచ్చిన సందేహాలతో సహా ఆ పుస్తకానికి సంబంధించి మరోసారి ఒప్పుకుంటున్నాను. నేను తొందరపడి అభిప్రాయాలు ఏర్పరుచుకోను. ఏర్పడిన అభిప్రాయాలని సరైన మరొక కారణం లేకుండా మార్చుకోను.

    రమ.

  1223. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/13/2010 2:43 pm

    “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” గురించి రమా భరద్వాజ్ గారి వ్యాఖ్యలు ఆలోచనాత్మకాలు. ఐతే వారు ఆ గ్రంథం నుంచి ఆశిస్తున్నవి దాని పరిథిలోవి కావనుకుంటాను.

    1. వారు ““రచనా సందర్భం” మారితే వచ్చే అవకాశాలనీ.. అంటే వీలూ సాలూ అంటాం తెలుగులో వాటి గురించి మాట్లాడుకుందికి ఉపకరిస్తుందేమో గానీ అది మంచి కవిత్వమా కాదా అని గుర్తించడానికి ఎందుకూ ఉపకరించదు.” అన్నారు. నాకు అర్థమైనంతవరకు ఏది మంచి కవిత్వమో ఏది కాదో గుర్తించటం కాదు ఆ పుస్తకం చేస్తున్న పని; తెలుగు కవిత్వంలో పెనుమార్పులు ఏవో, వాటి వెనక వున్న కారణాలు ఏమిటో గుర్తించటానికి ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించి ఆ సిద్దాంతం ద్వారా వేటిని పెనుమార్పులుగా గుర్తించవచ్చో చూపించింది, అంతే.

    2. మరో చోట “కవితావిప్లవాల స్వరూపాన్ని దాటి ముందుకెళ్ళవలసిన “సందర్భం” కూడా ఏనాడో వచ్చింది. నారాయణరావు గారి థియరీ భాషలో చెప్పాలీ అంటే విమర్శా సందర్భం ఏనాడో మారింది. ఆ దృష్ట్యా కవితా విప్లవాల స్వరూపం ఒక పాత పుస్తకం. ఇవాళ్టికాలపు అవసరానికి అది ఎందుకూ ఉపయోగపడదు. ” ఇక్కడ వారు వాడిన తర్కమార్గం సుగమంగా లేకపోయినా, దీన్ని నేను ఇలా అర్థం చేసుకుంటున్నాను (ఇది పెడదారైతే అసలు దారేదో తెలుసుకోవాలని వుంది): ఇది ఒక విమర్శాగ్రంథమనీ, కవిత్వానికి లాగానే విమర్శాసందర్భంలో మార్పు వల్ల విమర్శలో కొత్తవిప్లవం వచ్చిందనీ, ఈ గ్రంథం పాతవిప్లవం తాలూకుదనీ. విమర్శకు సంబంధించి అలాటి సిద్ధాంతం ఒకటి వున్నట్టు, దాని ప్రకారం ఈ పుస్తకం ఒక పాతవిప్లవంలోదని ఆ తర్వాత మరొక రచన లేదా రచనలు కొత్త విప్లవం లేదా విప్లవాలకు దారి తీసినట్టు నిరూపణ అయిందని నాకు తెలియదు; కాని ఈ చర్చ కోసం అలా జరిగిందని ఒప్పుకుందాం. అలా ఒప్పుకున్నా, ఈ పుస్తకం చదవవలసిన అవసరం తీరిపోయిందని దాన్నుంచి ఎలా నిర్ధారణ చెయ్యటం? ఇక “ఇవాళ్టికాలపు అవసరం” అనేది. ఈ అవసరం ఏమిటో ఎక్కడా స్పష్టంగా చెప్పకుండా దానికి ఇది ఎందుకూ ఉపయోగపడదు అంటే అర్థం చేసుకోవటం కష్టం. ఈ వాక్యసందర్భాన్ని బట్టి ఆ అవసరం సైతం ఏదో ఈ పుస్తకపరిథిలో లేనిదే అయుంటుందని అనిపిస్తున్నది. నాకు మూడు సాధ్యమయే అర్థాలు కనిపిస్తున్నాయి:

    అ) “చాలా కొత్త విప్లవాలు వచ్చాయి, వాటిని ఈ పుస్తకం లోని సిద్ధాంతం గుర్తించలేదు”
    ఆ) “ఈ పుస్తకంలో చెప్పిన కారణాలు కాకుండా కవితావిప్లవాలకి ఇంకొన్ని కొత్తకారణాలు కనుక్కున్నారు”
    ఇ) “ఈ సిద్ధాంతం తప్పని నిరూపించబడింది”

    వీటిలో ఏది జరిగివున్నా, అలా జరిగినట్టు నాకు తెలియదు. దయచేసి అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో ఎవరైనా చెప్తే తెలుసుకుంటాం.

    చివరగా, నేను చేసిన పాడు పనికి విమర్శకులందర్నీ విమర్శించటం ఎందుకు? (అలాగే, నన్నొక విమర్శకుడిగా లెక్క వేసినందుకు రమ గారికి థేంక్స్, నేను కాకపోయినా.)

  1224. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    07/13/2010 11:09 am

    సోదాహరణంగా కవితా పంక్తులు ఎత్తి చూపుతూ, పదేళ్ళ కిందటి ఇంకో సంకలనంతో సందర్భానుసారంగా పోల్చుతూ సమీక్షంచడం ఎంతో పరిశీలన, ఓపిక,సహృదయంతోనే సాధ్యం. వేలూరిగారికి కృతజ్ఞతలు.

    ఒకే వస్తువు ఎన్ని రకాల అనుభూతులకు అద్దంపడుతుందో ఎన్ని సార్లు చూసినా నిరంతరం ఆశ్చర్యపరుస్తూ ఉండే నిజమేమో.
    “తొలకరి వాన కొండల్ని తలబాధుకొని ఏడుస్తుంది”
    “నిశ్శబ్దంలా వాన సుధీర్ఘమౌనానికి నిరసనలా వాన ఇవ్వాళింక తెరపిలేదు”

    చదివితే,ఎదలో హర్షం కురిపించే వర్షం, ఆవేదనలు సైతం గుప్పించడం గుర్తుచేస్తుంది. వర్షమే కాదు, కామెంట్ల వర్షం అని ఇక్కడ తెలిసింది.

    “కదులుతున్న ఉరికంబం నా వూరు,
    సూర్యచంద్రుల్ని వెలేసిన ఆకాశం నాది”

    తెలంగాణా పల్లెల దైన్యాన్ని అక్షరీకరించినట్లున్నా,మొక్కవోని స్థైర్యానికి పోరాటపటిమల పురిటిగడ్డను ప్రతిబింబించినట్టుగా లేక ఎందుకో గుచ్చుకుంది.
    “ఉగ్రమైన వేసంగి గాడ్పులు ఆగ్రహించిపైబడినా అదిరి పోవకు
    ఒక్కుమ్మడిగా వర్షా మేఘం వెక్కి వెక్కి రోదించినా లెక్క చేయకు”
    అన్న దేవులపల్లి మాటలకు
    “కదులుతున్న చైతన్యం నా వూరు,
    సూర్యచంద్రులకు సైతం అవకాశం ఇచ్చిన ఆకాశం నాది” అనాలనిపిస్తుంది.
    ============
    విధేయుడు
    _శ్రీనివాస్‌

  1225. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    07/13/2010 10:31 am

    శ్రీనివాస్ కందాళం గారూ,

    మీ పూర్తి పేరు, అదీ కేవలం గుర్తించడానికి వీలు కోసం, అడిగాను తప్ప వేరే వుద్దేశ్యమేమీ లేదు. మీ పూర్తి వివరాలు నేను అడగలేదు. ఈ వ్యాఖ్యల్లోనే మీ పేరున్న రెండు కామెంట్లు వచ్చాయి. పలానా అని తెలుసుకోడానికే పూర్తి పేరడిగాను. అదే నే చేసిన తప్పయితే క్షమించండి.
    మారుపేర్లతో కామెంట్లు రాసేవారి ఇష్టం వారిది. అవి ఎవరైనా సులభంగానే గుర్తించగలరు. సరే, అదొదిలేద్దాం. మిమ్మల్ని వివరాలడిగి వూరికే బాధ పెట్టడం నా అభిమతం కానే కాదు.

    ఇహ – అఫ్సర్ కవిత్వమంటే నాకిష్టమే! నేను ఊరిచివర లో కొన్ని కవితల్ని చాలా ఇష్టంగా చదివాను. కానీ అన్నీ కాదు; ముఖ్యంగా నినాద కవిత్వం. ఏ డొంకతిరుగుడూ లేకుండా కవితలన్నీ సూటిగా, స్పష్టంగా వుంటాయి. అనవసర భావ పటాటోపం కనిపించదు. అఫ్సర్ ఒక మంచి ఆధునిక కవనే నా అభిప్రాయం.

    మీరు అమెరికన్ తెలుగు రచయితలన్న పదం నేను మొదట వాడిందిగా చెప్పారు. కాదు. అఫ్సర్ గారి కామెంటు మరోసారి చూడండి.
    “ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో! ” అని రాస్తే దానికి నేను స్పందించాను తప్ప ఆ ఆలోచన నా బుర్రలో పుట్టింది కాదు. ఇక్కడకి ( ప్రస్తుతానికి అమెరికా అనుకుందాం ) వలస వచ్చిన వారు అమెరికా తెలుగు రచయితలెలా అవుతారో, అదేవిధంగా అఫ్సరూ కదా అన్న భావనతో అడిగాను. ఇందులో వెటకారమూ, వెక్కిరింతా లేవు. తీరి కూర్చుని ఇతరులని బాధ పెట్టే నైజం నాకు లేదు. కానీ నా వ్యాఖ్యలు మీకలా అనిపించకపోతే మరోసారి క్షమించండి.

    ఎక్కడో మొదలయిన చర్చ మరెక్కడికో పోతోంది. ఇహ నేను ఇందులోంచి తప్పుకుంటున్నాను.

    సెలవ్
    -బ్రహ్మానందం.

  1226. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి srinivas kandaalam గారి అభిప్రాయం:

    07/12/2010 10:09 pm

    బ్రహ్మానందం గారు:

    నేను చర్చని తప్పు దారి పట్టించడం లేదు. అందులో అనుమానమే లేదు. అఫ్సర్ ని అమెరికా తెలుగు కవి అన్నది మీరె కదా?! ఇదిగొ ఇదీ మీ మాట:

    చివరగా పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీరూ అమెరికన్ తెలుగు రచయితల కోవలోకే వస్తారని నా నమ్మకం.

    అమెరికన్ తెలుగు రచయిత అనే మాట మీది కూడా. కాదని ఎలా అంటారు? పైగా, ఆ “శతకోటి నమస్కారాల” వెటకారం హేమిటో నాకు అర్ధం ఆవలేదు.

    అది అవతల పెట్టండి. కాని, కవిత్వ విమర్శకుడిగా మీ ఆలోచనల మీద ఇష్టం వుండబట్టే, నెను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను తప్ప మిమ్మల్ని గిచ్చి సంతసిద్దామని కాదు. రమా భరద్వాజ గారి లాగానె నాకూ మీ రచనలు అంటే ఇష్టమే. అఫ్సర్ గారి కవిత్వం గురించి మీ మాట వినాలన్న వుత్సుకతతో మాత్రమే అడిగాను.

    నా ప్రవర అడిగారు కదా మీరు? మారుపేర్లతో రాసే అందరినీ కూడా అలా ప్రవర అడిగే సాహసం చెయ్యగలరా, మీరు గానీ, ఈమాట సంపాదకులు గాని?

    గత పదేళ్ళుగా నేనూ, నా మిత్రులం ఈమాట చదివి, అందులో విషయాలు చర్చించుకునే అలావాటు చేసుకున్నాం. చదవడమే గాని, ఎప్పుడూ ఒక ముక్క రాసే సాహసం చెయ్యలేకపొయాము. ఇప్పుడు ఈమాటలో కామెంటడానికి అర్హత ఏమిటో ఇక్కడ కొందరి వ్యాఖ్యలు చదవిన తరవాతే తెలిసింది. అంతకు ముందు ఈమాట లో ఒక్క అక్షరం పడ్డా కళ్ళకి అద్దుకుని చదువుకునే వాళ్ళం నేనూ, నా నిజామాబాద్ మిత్రులం! అలాంటిది, ఇప్పుడు ఈ రాతలకి అర్ధమే లేని స్థితి వచ్చే సరికి బాధ పడి, ఇక తప్పని సరయి రాస్తున్నాను.

    అయినా మీరు అడిగారు కాబట్టి, మీ మీది గౌరవంతో ఇదీ నా ప్రవర. నా పేరు శ్రీనివాసాచార్యులు కందాళం. నేను ఒక కాలేజీ లెక్చరర్ని. సాహితీ చైతన్య స్రవంతి సభ్యుడిని. ఈమాట పాఠకుడిని అని చెప్పుకోవడం నాకు ఒక ఇష్టం. నేను నా విద్యార్ధులకి కూడా ఈ వెబ్ పత్రిక గురించి చెబుతూ వుంటాను. కవిత్వం రాయను కాని ఇష్టంగా చదువుతాను, విద్యార్ధులకి వినిపిస్తాను. నా చిరునామా ఇతర వివరాలు కూడా కావాలా?

    [Post edited – Eds.]

    [ఈమాటలో కామెంట్లు అసభ్యంగా ఉంటున్నాయని బాధపడుతూనే, వ్యక్తిగత దూషణలకి పూనుకోడంలో అంతరార్థం మాకు అంతుపట్టడం లేదు. దయచేసి ఎవరికి వారు, వారి కామెంట్లను నియంత్రించుకోండి. – సం.]

  1227. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Srinivas Chilakapati గారి అభిప్రాయం:

    07/12/2010 5:26 pm

    మనిషి ఎదుగుదలలో సాహిత్యం పాత్ర over rated అన్న నా నమ్మకాన్ని సాహిత్యంపై చర్చలెప్పుడూ బలపరుస్తూనే ఉంటాయి. ఈ విసుర్లూ, కసుర్లూ, “ఆహా! ఏం కొట్టాను దెబ్బ”లూ (దీన్ని కూడా 🙂 పక్కన పెట్టేసి సామరస్యంగా చర్చించుకోలేమా? వ్యక్తుల్ని వదిలేసి విషయం మీద దృష్టి పెట్టలేమా?
    మంచి కవిత్వానికి అందరూ వొప్పుకునే ఒక నిర్వచనముందా? మంచి కవిత్వమేదో గుర్తించడానికి ఆ నిర్వచనం తెలిసి ఉండాలా? ఏది మంచికవిత్వమో సాహిత్య పూర్వాపరాలు తెలిసినవారు నిర్ణయిస్తారా? అంత తేలిగ్గా మంచికవిత్వమేదో నిర్ణయించగలిగినప్పుడు కవిత్వానికంతా గ్రేడింగు చేస్తే కొత్త పాఠకులకు పని సులువు కాదా? ఈ కొలబద్దలేవీ లేవు, మనసును తాకిందే కవిత అనుకున్నప్పుడు ఒకరి కవిత్వం మరొకరికకవిత్వమవుతుందనీ అంగీకరించక తప్పదు కదా? ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు వెలిబుచ్చుకోగలం కానీ భిన్న మనస్తత్వాలూ, జీవితానుభవాలూ గల ఇంతమంది ఏకాభిప్రాయానికి రావాలని ఎలా అనుకోగలం? ఒక కవిత నచ్చితే ఎందుకు నచ్చిందో చెప్పడం, లేదా చెప్పలేకపోయినప్పుడు బావుందని మాత్రం చెప్పడం, నచ్చనప్పుడు ఎందుకు నచ్చలేదో చెప్పడం మాత్రమే కదా మనం చేయవలసింది? రుజువులేవీ లేనప్పుడు అభిప్రాయాల్ని సార్వజనీన సత్యాలుగా ఎందుకు చలామణీ చేయాలని చూడడం?

    -ఇంకో శ్రీనివాస్

  1228. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    07/12/2010 9:47 am

    శ్రీనివాస్ గారూ,

    మీరు అఫ్సర్ గారి వ్యాఖ్యా, ఆ తరువాత నే చేసినదీ మరోసారి చదవండి. నేను ఊరిచివర కవిత్వంపై విమర్శ చెయ్యలేదు. అఫ్సర్ గారు రాసిన వ్యాఖ్య దురుసుగా అనిపించి దానిపై రాసాను. మీరు అది వదిలేసి, కొత్త కొత్త తెలివైన ప్రశ్నలేస్తే జవాబిచ్చే సత్తా, ఓపికా నాకు లేవు.

    అఫ్సర్ గారు అక్కడ కవిత్వం రాసినా, ఇక్కడ కవిత్వం రాసినా నాకభ్యంతరం లేదు. నాకొరిగేదీ ఏమీ లేదు. బావుంటే చదివి ఆనందిస్తాను. లేదంటే చదివినంత వేగంగానే మర్చిపోతాను. అక్కడా, ఇక్కడా అంటూ గీత గీసింది అఫ్సర్ గారు. ఆయన్నొదిలేసి నన్నడిగితే నా దగ్గర సమాధానం లేదు. కాబట్టి మీరు ఆయన్ని సంప్రదించాలి. నన్ను కాదు.

    మీరిచ్చిన వలస కవులూ, రచయితల లిస్టు నాకూ తెలుసు. వారందరూ ఇక్కడే ఉండిన అక్కడి వారయితే, ఇక్కడే ఉండిన ఇక్కడి తెలుగువారెవరూ ఉండరు. ఈ వసుధైక కుటుంబంలో వలస పక్షులు కానిదెవరు?

    మీరు చర్చని తప్పుదారి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు.

    చివరగా – గతంలో ఆంధ్రాలో ” సుబ్బారావూ” అని రోడ్డు మీద అరిస్తే కనీసం పదిమందైనా వెనక్కి చూసేవారు. ప్రస్తుతం సుబ్బారావుని శ్రీనివాస్ పేరు ఆక్రమించుకుంది. మీ పూర్తిపేరుతో వ్యాఖ్య రాస్తే పలానా అని తెలిసేది. :)- ఆ అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలేసి తప్పించుకున్నారు. :)-

  1229. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/12/2010 12:52 am

    రామారావు గారి “నిస్సంకోచమైన విన్నపం” వలన కవితా విప్లవాల స్వరూపపు పుస్తక కాపీలు మరికొన్ని అమ్ముడైతే నాకు సంతోషమే గానీ .. “రచనా సందర్భం” మారితే వచ్చే అవకాశాలనీ.. అంటే వీలూ సాలూ అంటాం తెలుగులో వాటి గురించి మాట్లాడుకుందికి ఉపకరిస్తుందేమో గానీ అది మంచి కవిత్వమా కాదా అని గుర్తించడానికి ఎందుకూ ఉపకరించదు. మనం చాలా సార్లు తెలివైన మాటల వెనక తచ్చాడి తప్పుకుంటూంటాం..అంతే!! కవితా విప్లవాల స్వరూపం ప్రకారం భావకవిత్వమేనా, “దిగంబర కవిత్వమూ” ఒక గొప్ప మార్పుకి సంకేతంగానే గుర్తించాడాయన. కానీ అది ఎటువంటి మార్పో కాలం చెప్పనే చెప్పింది. కవితావిప్లవాల స్వరూపాన్ని దాటి ముందుకెళ్ళవలసిన “సందర్భం” కూడా ఏనాడో వచ్చింది. నారాయణరావు గారి థియరీ భాషలో చెప్పాలీ అంటే విమర్శా సందర్భం ఏనాడో మారింది. ఆ దృష్ట్యా కవితా విప్లవాల స్వరూపం ఒక పాత పుస్తకం. ఇవాళ్టికాలపు అవసరానికి అది ఎందుకూ ఉపయోగపడదు.

    ఇంక ఆ థియరీని పొడిగించి చూస్తే “టెక్నాలజీ” వాడకం కవిత్వాన్నీ లేదా ఇతర సృజనాత్మక కళలనీ ఏమన్నా ప్రభావితం చేస్తుందా అన్నది చర్చనీయాంశం కావాలి. భావకవిత్వం కాలంలో ఏకాంతం కవికీ పాఠకుడికీ ఒక వెసులుబాటు కల్పించిందన్న ఊహకి కొనసాగింపుగా!! అది ఇవాళ “ఇంటరాక్టివ్ టెలివిజన్” ఇంకా ఓట్లు అడిగి వారి వారి కళలకి ఆయా కళాకారులు గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి లాంటిది. దానిని కవిత్వానికి అన్వయించి చూడాలి.అప్పుడు కవితాసందర్భం ఎలా మారుతుందీ అన్నది. మీరంతా ఈ విషయంలో నిష్ణాతులే గనక ఊహించండి. ఇన్ని లక్షల “బైట్స్” కారణంగా ఇన్ని అభిప్రాయాలని మీరు ఇబ్బంది లేకుండా అచ్చువేసేస్తున్నారు. స్పేస్ కావలసినంత ఉంది గనక. ప్రింట్ మీడియాకి పాపం ఆ వీలు లేదు గనక వాళ్ళు ఈ విషయం లో “పొదుపు” గా ఉండాలి. మీకు ఆ పొదుపు అవసరం ఇంకా పడలేదు.గనక పస ఉన్నా లేకపోయినా రాసేవాళ్ళ అన్ని అభిప్రాయాలనీ పొందుపరుచుకుపోతున్నారు.

    జపాన్ లో కాబోలు ఈ తొందర కాలంలో చదవడానికి అనువుగా యస్ మ్ యస్ నవలలు రోజుకో పేరా చొప్పున మొబైల్ ఫోన్స్ ల్లో ఇస్తూ “మార్కెటింగ్” చేసుకుంటున్నారని విన్నాను. అలా ఇవాళ ఈ బ్లాగుల వెసులుబాటు రానే వచ్చింది. అందులో ఎవరి రచనలని వాళ్ళే ప్రచురించుకోవచ్చు. [ఈమాట వంటి పత్రికలకి కూడా కాలం చెల్లుతుందేమో ఇటుపైన.. వాళ్ళకి ఎడిటర్ ల బెడద కూడా ఉండదాయె!!] అలా కొత్త కవిత్వం అంటే యస్ మ్ యస్ కధలూ నవలలూ కవిత్వాలూ రావొచ్చు. సృజన కొత్త పుంతలు తొక్కవచ్చు. కొత్త తరహా ప్రక్రియలూ పుట్టుకు రావచ్చు. అయితే అప్పుడు కూడా చిరస్మరణీయమైన కవిత్వమూ లేదా అలాంటి భావాలే కదా మనం మాట్లాడుకుందికి మిగలవలిసింది? ఇంటర్నెట్ లో కాళిదాసులూ భారవి లూ ఉదయిస్తారనీ మారిన ఆ రచనా సందర్భం లోంచి రాబోయే ఆ సృజనమీద మరో కవితావిప్లవాల స్వరూపాన్ని మీరంతా ఆశించి ఎదురు చూడనూ వచ్చు. తప్పేమీ లేదు. కానీ నాకు అంత ఓపిక లేదు. అప్పుడు కూడా నేను నాకు నచ్చిన కాళిదాసులకోసం మాత్రమే వెతుక్కుంటాను. లేదా వెనక్కి వెళ్ళి కాళిదాసునే చదువుకుంటాను మళ్ళీ.!! ప్రతీ కాలంలోనూ సృజనాత్మకులైన కవి, రచయితలు కొందరే ఉన్నారు. ఉంటారు. అన్ని కాలాల్లోనూ కూడా!! అన్ని దేశాల్లోనూ కూడా!! అయితే మిగతా వాళ్ళూ రాసి పుస్తకాలు వేసుకోరా? అంటే వేసుకుంటూనే ఉంటారు. విమర్శకులు మారే ” రచనా సందర్భం” కోసం అలా ఎదురుచూస్తూనే ఉంటారు. అప్పటి ఎప్పటి పుస్తకాలనో చదవమని ఇలా చెప్తూనే ఉంటారు.

    రమ.

  1230. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    07/11/2010 9:31 am

    అయితే, రమా భరద్వాజ గారు మిగతా వాళ్ళని చదవకుండా తిట్టిపోస్తారన్న మాట. బాగుందండీ వరస! “ఊరి చివర” మీరు చదివిన ఆధారాలు మీ మాటల్లో లేవు.

    సరే, పెడసరం రమ గారు సెలవు పుచ్చుకున్నారు కనుక, ఇక్కడ ఇప్పుడు వేలూరి కి, కాకపోతే సాయి బ్రహ్మానందం గారికి ఒక ప్రశ్న. “ఊరి చివర”లో అఫ్సర్ గారి అమెరికా పద్యాలు వున్నాయా? వుంటే, అవి డయాస్పోరా గురించి మాట్లాడే వేలూరి గారి కంటిలో ఎందుకు పడలేదు? అఫ్సర్ గారి కవిత్వాన్ని శ్రద్ధగా చదివే బ్రహ్మానందం గారు అఫ్సర్ గారిని అమెరికా తెలుగు కవి అని అనడానికి ఆధారాలు చూపగలరా?

    నాకు రామారావు గారు చెప్పింది కొంత నిజం కావచ్చుననిపిస్తున్నది. అఫ్సర్ గారికి “అక్కడి” దృస్టి ఎక్కువ. ఆయన తెలంగాణా, దలిత, ముస్లిం కవితలు అట్లా కనిపిస్తాయి. నేను పాఠకుడిని మాత్రమే. విశ్లేషణ చెయ్యలేను. పెద్దలు వేలూరి గారు, బ్రహ్మానందం గారు, ఇంకా ఎవరయినా చెప్పాలి.

    ఈ విషయం విమర్శ వైపు నించే కాక, చాలా కాలం ఆంధ్రాలో వుండి, అమెరికా వలస వచ్చిన కవులు- స్వామి, రవి శంకర్, కన్నెగంటి చంద్ర, రవికిరణ్, మరువం ఉష, యదుభూషణ్, కల్పనా రెంటాల, కె.గీత – వంటి వారున్నారు.

    అఫ్సర్ గారు “అక్కడి” పక్షం ఎక్కువ వున్నారా? “ఇక్కడి” అనుభవాలని లోకువ చేస్తున్నారా? “ఊరి చివర” లో “ఇక్కడి” అనుభవం ఎంత?!

  1231. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    07/11/2010 7:50 am

    సమకాలీన కవిత్వం మీద లోతైన విమర్శ రాక పోవటానికి కారణం కవి నామధేయులు విరుచుకు పడతారన్న భయం అన్నది వట్టి మాట. సమకాలీన వచన కవిత్వం పట్ల ఏక వాక్య అభిప్రాయాలు వెలిబుచ్చటమే తప్ప విమర్శించటానికి కావలసిన పరికరాలు ఎవరిదగ్గరా లేవు. అవి తయారు చేసుకోవటానికి మనకున్న సాంప్రదాయాల పట్ల అవగాహన ఉండడం ఎంత అవసరమో మారుతున్న సందర్భం పట్ల అవగాహన కూడా అంటే అవసరం. ఈ రెండింటినీ అనుసంధానం చేయవలసిన బాధ్యత అందరిమీదా ఉంది. ఈ మాట పాఠకులలో చాలా మందికి సాహిత్యపు పూర్వాపరాలు తెలియవు అని రమ గారు అన్న మీదట ఆ అభిప్రాయానికి కారణమేమిటి అని సంపాదకులు అడిగితే కారణం చెప్పకుండా తమకు నచ్చే రచయితల జాబితా ఇచ్చారు రమగారు. వీరంతా పూర్వాపరాలు తెలిసిన వాళ్ళని వారి అభిప్రాయం కావచ్చు. చూడబోతే ఆ జాబితాలో సాహిత్యపు పూర్వం తెలిసిన వారు చాలా మందే కనపడ్డారు కానీ పరం గురించి బలమైన అభిప్రాయాలు వెలిబుచ్చిన వారెవరూ అందులో నాకు కనపడలేదు. ఇది ఆ జాబితాలో ఉన్న వారి పట్ల అగౌరవంతో అంటున్న మాట కాదు. మనమున్న సందర్భం అటువంటిది.

    ముతక సామెతలూ, నాసి రకం అభిప్రాయాలూ, అరకొర విషయ పరిజ్ఞానంతో, సాహితీ పరురాలమురా అన్న ఆలాపనతో అసహన ప్రకటనలు గుప్పించడం తమ హక్కు అని ఎవరైనా అనుకుంటే వేపకాయంత వెర్రి లేని వారెవరులే అని ఊరుకోవచ్చును. కానీ దానికి హద్దులు ఉండాలి..

    ప్రాంతీయత అన్నది (ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమా కావచ్చును) ప్రామాణికంగా చలామణీ అవుతున్న సాంస్కృతిక నిర్మాణాలకి భావ జాలాలనీ ప్రశ్నించటానికి పుట్టుకొచ్చినది. దాన్ని ఆధారంగా చేసుకుని ఎగబాకటానికి ప్రయత్నం చేసిన నేల బారు మనుషులూ ఉన్నారు. దాన్నే ఆధారంగా చేసుకుని అద్భుతమైన సార్వజనీనతని కనుగొన్న వారూ ఉన్నారు. ఏది ఏమిటో సోదాహరణంగా చర్చించుకోవలసిన అవసరం ఉండగా – అసలు ప్రాంతీయత అన్నదే సర్వారిష్టాలకూ మూలం అన్నట్టు కొట్టి పారేస్తే – ఇదంతా ప్రామాణికంగా చలామణీ అవుతున్న (కాళోజీ మాటల్లో చెప్పాలంటే) రెండు జిల్లాల ప్రాంతీయతలోని నేలబారు తనమేననీ అనుకోక తప్పదు.

    ఇంత పొడుగ్గా రాద్దామని నేను అనుకోలేదు కానీ కృష్ణదేవరాయల మీద జరిగిన చర్చలో – ‘తురకలను’ నమ్మరాదని కృష్ణదేవరాయలు తెలుసుకున్నాడు – అన్న మాటని ప్రస్తుత సందర్భంలో ఎడిట్ చేయవలసిన అవసరం ఉన్నదన్న విషయాన్ని సంపాదకవర్గం గుర్తించక పోగా అది మరెవరి దృష్టికీ కూడా రాక పోవటంతో సమస్య చాలా తీవ్రంగానే ఉన్నదనిపించి రాయవలసి వచ్చింది.

    [సంపాదకులు గమనించినా ఎడిట్ చేయలేదు. అందుకు కారణం వేరేగా ఇక చెప్పక్కర్లేదు కదా! – సం.]

  1232. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    07/11/2010 12:57 am

    రమా భరద్వాజ గారికి,

    పేర్లో ఏవుంది, ఇంకా పీర్లలో నైనా కాస్త నమ్మకవుంది జనాలకి. నేను బళ్ళో చదువుకుని నాకు తెలిసి, గ్నాపకవున్నది కొంచం ఇంజినీరింగ్, కొంచం కంప్యూటర్ సైన్సు. దాంట్లో కూడా నేను గొప్పవాడ్ని కాదు, మామూలు ఏవరేజోడినే. పన్నెండో క్లాసు దాకానే నా తెలుగు చదువు. అది కూడా తెలుక్లాసంటే లీలా మహల్లో ఇంగ్లీషు సినిమా లేకపోతేనే. అందుకని నేనొక సాహిత్యవేత్తనని నేను అనుకోను, కనీసం నలుగురిముందు ఫోజెయ్యను. కానీ నాకు తెలుగు క్లాసులెగ్గోట్టినా తెలుగంటే నా కిష్టవే. కావ్యాలు, ప్రభందాలు, మీకు తెలిసినంతగా సాహిత్య పూర్వపరాలు నాకు ఖచ్చితంగా తెలియవు, బహుశా మీకు తెలిసినదాంట్లో 10% కూడా తెలియవు. కానీ నాకేది ఇష్టవో, ఏది కాదో నాకు తెలుసు. నా బతుకు నాకిచ్చిన అనుభవాన్నుంచి నాకు తెలిసిన మంచేదో, చెడ్దేదో నాకు తెలుసు. తెలుగు కవితని చదివి నచ్చితే ఆనందించడానికి, నచ్చకపోతే విమర్సించడానికి, మరీ మనసులో అలజడి పుడ్తే, ఆ అలజడిని అక్షరాల్లోకి అనువదించడానికి (మీ మెప్పు కోసం కాదు), తెలుగులో పిహెచ.డి, కాకపోతే అమరకోశాలు, వాటి దుంపదెగా అవేవిటో అవన్నీ చదివిన అమ్మా నాయన్లు వుండాలని మీ ఉద్దేశంలాగుంది. వైద్య్హ శాస్త్రం తెలియకపోతే వైద్యం చెయ్యొద్దన్నట్టే, పాకశాస్త్ర పూర్వ పారాలు, దాంట్లో నైపుణ్యం లేకపోతే తిండి మానెయమన్నట్టుంది. మాకు చెప్పుకోడానికి మాకు చెప్పుకోదగిన గురువెలెవరూ లేరు తెలుగులో, కానీ మా అధ్యాయనం గురుముఖతా కాకుండా, మా అనుభవాల్లోంచి, మా బతుకుల్లోంచి, అది మీకు విచిత్రంగా అనిపించినా సరే. అందుకని మా రచనలు, మా విమర్శలు మీకు తెలిసిన, మీరు చదివిన, మీకు ప్రామాణికవనిపించే మీ పరిధి నుంచి కాకుండా మాకు అనుభవైన మా బతుకుల నుంచి వస్తాయని గమనించండి. మీ విమర్శలు మాకు నచ్చనందువలన మీ గురించి అర మాటలు మేవు మాట్లాడవు. మా అభిప్రాయాలు రచనలు, విమర్సలు మీకు నచ్చకపోయినందువలన ప్రపంచవేవీ మునిగిపోదు కానీ మీరు కూడా కనీసం మా వానా కాలపు తెలుగు చదువుల సభ్యతనన్నా చూపించండి మీ వ్రాతల్లో. వీధికి పెద్దకావడం పెద్ద పని కాదు, కానీ ఆ పెద్ద కాకపోవడవే గొప్పేవో ఒక సారి ఆలోచించండి.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  1233. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/10/2010 5:13 pm

    వెల్చేరు నారాయణరావు గారు “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” అనే గ్రంథంలో కొత్త రకమైన కవిత్వం రావటానికి “రచనా సందర్భం” అనే అంశాన్ని ఒక మఖ్య ప్రేరకంగా గుర్తించారు. (ఈ పుస్తకాన్ని చదవమని ఈమాట పాఠకులందరికీ నిస్సంకోచంగా విన్నవిస్తున్నాను.) ఉదాహరణకు, ప్రింటింగ్ ప్రెస్ రాకతో ఓ పుస్తకాన్ని ఎవరికి వారు ఓ కాపీ కొనుక్కుని చదువుకునే అవకాశం కలిగింది; ఆంగ్లవిద్యా విధానాలతో విద్యార్ధులు తమ కుటుంబాల నుంచి దూరంగా వెళ్లి ఉండటం జరిగింది; ఈ రెండూ కలిసి ఏకాంతంగా ఎవరికి వారే చదువుకుని ఆనందించగలిగే కవిత్వానికి (భావకవిత్వం) దారి తీశాయి. ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ , ఆంగ్లవిద్యాలయ వ్యాప్తి – వీటి నుంచి ఒక కొత్త రచనా సందర్భం తయారైందన్నమాట.

    ఇప్పుడూ ఒక సరికొత్త రచనా సందర్భం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది Web 2.0 వల్ల కలిగింది. ఎవరికి వారు ఓ కవితని చదువుకున్నా, దాని గురించిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా వున్న పాఠకుల మధ్య జరగటమే కాదు, కవికి కూడ అవి ఎప్పటికప్పుడు అందుతున్నాయి. సాహిత్యచరిత్రలో ఇదివరకు ఎప్పుడూ ఇది సాధ్యపడలేదు. ఈ కొత్త రచనా సందర్భం తెలుగులో ఎలాటి కొత్త కవిత్వానికి దారితీస్తుంది అనేది ఇంకా స్పష్టంగా లేదు. అలాగే అందులో పాఠకుల, వారి చర్చల పాత్ర ఏమిటనేది కూడ తెలియదు. ఐతే ఈ కొత్త కవితాప్రపంచంలో పాఠకులకు ఇదివరకెప్పుడూ లేని పెద్దపాత్ర వుంటుందనిపిస్తున్నది.

    ఒక ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే – ఈ కొత్త రచనాసందర్భం, నాకు తెలిసినంతవరకు, ఆంగ్లసాహిత్యం మీద పెద్ద ప్రభావం చూపలేదు; ముఖ్యంగా అమెరికాలో ఇంటర్నెట్ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుంటున్న కవులు చాలా తక్కువగా కనిపిస్తారు. (ఈ విషయం నాకన్నా బాగా తెలిసిన వారు ఎందరో వుంటారు. వారి నుంచి ఇంకా అధికారికమైన సమాచారం వినాలని వుంది)

    నారాయణరావు గారి సిద్ధాంతం ప్రకారం రచనా సందర్భాల మార్పుని గమనించలేని తక్కువరకం కవులు పాతకవిత్వమే రాస్తారు. నిశితదృష్టి వున్న కవులు ఈ మార్పుకి అనుకూలమైన కొత్తరకం కవిత్వం సృష్టిస్తారు.

    ఇలా ఒక విప్లవాత్మక సమయంలో పాఠకులం కావటమే కాదు, నారాయణరావు గారి కవితావిప్లవకారకాల సిద్ధాంతం భవిష్యత్తుని ఎంతగా predict చేస్తుందో చూసే ఒక ఆసక్తికరమైన కాలంలో వున్నాం మనం.

    ఈ సంధికాలంలో రకరకాల ప్రయోగాలు తప్పవు. వాటిలో చాలాభాగం విఫలం కావటమూ తప్పదు. ఇప్పుడు ఈమాట లోనూ, ఇతర వెబ్ పత్రికలలోనూ జరుగుతున్నవి ఇలాటి ప్రయోగాలే. నా ఉద్దేశ్యం – వీటిలో ఫలానావి మంచివీ ఫలానావి కావు అని చెప్పగలిగే స్థితి ఇంకా రాలేదు గనుక, తొందరపడి పాఠకులు కాని సంపాదకులు గాని వేటినీ ఆపటం, అడ్డుపెట్టటం మంచిది కాదేమో (వ్యక్తిగత దూషణలు మరీ శృతి మించుతుంటే తప్ప).

  1234. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/10/2010 4:38 pm

    మీ కోరికని తీర్చాలీ అంటే నేను మీ పత్రికలో పాఠకుల లోతులేని అభిప్రాయాలని..వారి వారి సాహిత్య పరిజ్ఞాన లేమినీ ఉదాహరణ పూర్వకంగా పోల్చిచూపించాలి. అది నాకు చికాకైన పని. అటువంటి ఏకవాక్య అభిప్రాయాలు రాసే పాఠకుల అతితెలివి భావాలని పక్కకిపెడితే..మీ పత్రికలో తెలివైన అభిప్రాయాలు, కాస్త చదవాలి అన్న అభిప్రాయాలు రాసే పాఠకులు నేను గమనించినంత వరకూ వీళ్ళు – మీరు అడిగినతర్వాత మీకు తెలుసుకోవాలీ అన్న కోరిక కలిగిన తర్వాత ఎంతోకొంతైనా చెప్పడం నా ధర్మం గనక మాత్రమే చెబుతున్నాను – ఈమాట ప్రధాన సంపాదకులనీ..ఓపికగా పత్రికని నిర్వహిస్తున్న ఇతర సంపాదకవర్గాన్నీ మొదటగా చెప్పాలి. వీరి తర్వాత బెజ్జాల కృష్ణమోహనరావుగారు, సురేష్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్, లైలా ఎర్నేని, చీమలపర్తి బృందావనరావుగారలూ..ఇంకా కొడవళ్ళ హనుమంతరావు..బాబ్జీలు..కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ,గొర్తి బ్రహ్మానందం, కామేశ్వర రావు గారలూ .వీరి వ్యాసాలూ..కవిత్వంలో వైదేహీ శశిధర్, ఉదయకళ, శ్రీవల్లీ రాధిక, పాలపర్తి ఇంద్రాణీ..వీరి కవితలూ నేను చదివినప్పుడు ఆస్వాదించగలిగాను. అభిప్రాయాలు సైతం నేను ఎక్కువ చదివేది వీరినే!! వీళ్ళుమాత్రమే మీ పత్రిక పాఠకులు కారు కదా?? ఇంక మిగతా అభిప్రాయాలలో నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించేవి పెద్దగా కనిపించలేదు. లోతులేని తెలిసీతెలియని భావాలు తప్ప. మీ పత్రికలో మాత్రమే పద్యానికి నిజంగా ప్రాముఖ్యతని ఇస్తున్నారు. కృష్ణదేశికుల వారి పద్యాలని నేను ఇస్టంగా చదువుతాను.

    నేను పైన ప్రస్తావన చెప్పిన వీరివికాక నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన రచన గానీ ముఖ్యమైన అభిప్రాయంగానీ లేదు అనే చెప్పాలి. వచనకవిత అనే ప్రక్రియని తెలుగుదేశంలోనూ మీదేశంలోనూ చతురతతో నడపగలిగిన వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే అని చెప్పగలను. వచన కవిత్వం రూపాన్ని సులువుగా వాడుకునీ లోతులేని ఊహసాగని అయోమయపు భావాలని రాసి పుస్తకాలుగా అచ్చేసి చాలా మది కవులుగా చలామణీ అయిపోతున్నారు. కవిత్వం బాగుంటే దాన్ని విశ్లేషించి అది ఎందుకు బాగుందో వివరంగా చెప్పవచ్చు. కానీ అకవిత్వాన్ని విశ్లేషించే పని ఎవరు చేసినా అది దండగ వ్యవహారం మాత్రమే!! నాకు తెలుసు నేనీ మాట అన్నప్పుడు తెలుగు దేశంలోనూ ఇంకా మీదేశంలోనూ “కవి” నామధేయులకి ఎందరికో కోపం వస్తుందని. ఇందుకు భయపడే..ఇబ్బందిపడె సమకాలీన వచనకవిత్వం మీద ఎవరూ విమర్శకి పూనుకోవడంలేదు. నా మాట అటుంచండి. సాహిత్యం మీద ఆసక్తి లేదా అభినివేశం ఉన్న ఎవరైనా ఇవాళ కవిత్వం పేర అచ్చవుతూన్న వాటిలో నిజంగా కవిత్వం ఏమేరకి ఉందో చెప్పండి. ఈ అవకాశాన్ని వాడుకుని ఎందరు కవిత్వమే రాయలేని వాళ్ళు కవులుగా చెలామణీ అయిపోతున్నారో చూడండి. తెలుగులో మంచి కవులకన్నా వీళ్ల హడావిడి ఎక్కువ. నిజంగా చూద్దామా అంటే చెప్పుకోదగ్గ ఒక్క కవిత ఉండదు. ఇది పాఠకులకీ తెలుసు..సమీక్షకులకీ తెలుసు..విమర్శకులకీ తెలుసు. వాళ్ళు చెప్పిన చాలా కారణాలకి వాళ్ళు పేర్కొన్న ఎన్నో వచనకవితలు నిజంగామిగలలేకపోయాయని. ఇది ఒక నిశ్శబ్ద అసహనం. నేను దానికి మాటని ఇచ్చాను అంతే!! ఒక కవిత్వాభిమానిగా అకవిత్వాన్ని ఊరికే రెపరెపలాడిస్తూంటే మరి నా వల్ల కాక బయటికి చెప్పిన అభిప్రాయం. ఏది ఎందుకు మంచికవితో నేను చెప్పగలనేమో గానీ మంచి కవిత కాని దాని గురించి మాట్లాడి నా సమయాన్నీ ..మీ సమయాన్నీ నేను వృధా చేయలేను. నాకు నచ్చిన ఆధునిక కవులలో మోహన ప్రసాద్ ..అజంతా..త్రిపుర..పాటల రచయితలలో గద్దర్ వంగపండు[ 20 ఏళ్ళకిందట..ఇప్పుడుకాదు] ఇప్పుడు ..గోరటి వెంకన్న..లాంటి వాళ్లు తప్ప ఇవాళ్టి కాలంలో నాకు నిజంగా చదవ వలసిన వాళ్ళూ ..వినవలసిన వాళ్ళూ ఉన్నారని అనుకోను. మీరు అడిగిన కారణానికి నేను నా భావాలని వివరంగా చెప్పక తప్పింది కాదు మిగతా అనేక వాదాల మీదా ..ఇజాల మీదా రాజకీయంగా నాకు ఆసక్తి ఉందే గానీ వాళ్ళ వాళ్ళ కవితా వ్యక్తీకరణలమీద నాకు ఆసక్తి లేదు. తెలుగులో భాషా పరంగాగానీ..భావపరంగా గానీ డొక్కశుధ్ధి లేని వాళ్ళు సైతం కవిత్వం రాసేస్తున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి లేదు..ఇప్పటికైనా సరైన సాహిత్య విమర్శ ఆధునిక కవిత్వమ్ మీద గనక రాగలిగితే [ఎలాంటి మెరమెచ్చులూ లేకుండా.. నిష్పక్షపాతంగా]..మంచి సాహిత్యం మిగులుతుంది. సాహితంగా చెలామణీ అవుతున్న పొల్లు పోతుంది. సాహిత్య పత్రికలు అందుకు దోహదం చేసి ..మంచి రచనలని మరొకసారి అయినా ఈ తరం పాఠకులకి పరిచయం చేయాల్సి ఉంది.. పలుకున్న కవులూ..రచయితలూ మరోసారి పాఠకులకి తెలియడం వలన పాఠకులు ఎక్కువ లాభపడతారు. మరింతగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళు పదును పెట్టుకుంటారు. అలాగేమంచి కవిత్వాన్నీ మంచి విమర్శనీ మెచ్చుకోగలవాళ్ళు సైతం మరింతగా పెరుగుతారు. నేను వీలైనంత క్లుప్తంగానూ..అదే సమయంలో స్పస్టంగానూ మాట్లాడాలని ప్రయత్నంచేసాను. ఇప్పటికిది చాలునని అనుకుంటూ..

    సెలవు,
    భవదీయ..
    రమ.

  1235. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కృష్ణ గారి అభిప్రాయం:

    07/09/2010 6:45 pm

    ఉష గారి బాధ అర్ధమవుతున్నది. కాని, కొంచెం స్పష్టంగా చెప్పవచ్చు కదా అనిపించింది. ఈమాటలో అందరి వ్యాఖ్యలూ కాదు, రమా భరద్వాజ పేరిట వస్తున్న వ్యాఖ్యలు మాత్రమే పెడసరంగా వుంటున్నాయి. ఆవిడ గారు పనికట్టుకుని కొందరి మీద రాళ్ళు రువ్వే పని పెట్టుకున్నట్టు, ఆ రాళ్ళన్నీ ఈమాట వైపే రువ్వుతున్నట్టు అనిపిస్తున్నది.ఆవిడ ఇంకెక్కడా కనిపించరు కనుక ఈ మాట అనవలసి వస్తున్నది. అన్యధా భావించరాదు.

    చర్చ అఫ్సర్ పుస్తకం “వూరి చివర” గురించి. పుస్తకం చదివిన వేలూరి గారు ఆయనకు తోచింది రాసారు. అందులో విమర్శ కూడా వుంది. రమా భరద్వాజ గారికి ఆ విమర్శ కనిపించలేదు. అఫ్సర్ ని వేలూరి పొగిడారో అని చిన్న పిల్లలాగా ఉక్రోషం పట్టలేక యాగీ చేస్తున్నారు. రమ గారూ: చర్చని పుస్తకం మీద పెట్టి, అందులో అకవిత్వం ఏదో చెప్పగలిగితే బాగుంటుందేమో చూడండి. ఆ విధమ్మున అఫ్సర్ ని అకవి అనాలన్న మీ వుద్దేశం తీరుతుంది. ముందు అఫ్సర్ ని శుభ్రంగా వుతికి ఆరేసిన మీదట ముకుంద రామారావుకి మహాకవి అన్న అచ్చోసి వదులుదాం.

  1236. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి ఉష గారి అభిప్రాయం:

    07/09/2010 8:41 am

    ఈమాటని గూర్చి నా “మరువం” బ్లాగులో మంచు మీద రాసిన ఓ కవితకి ఒకరి వ్యాఖ్య ఆధారంగా మొదటసారి సంవత్సమున్నర క్రితం మీ పత్రికలో చూడటం సంభవించింది. అప్పటినుంచీ సంచికల ఆధారంగా కాక సమయాన్ని బట్టి రావటం, ఈమాట రచయితలు అన్న టాబ్ నుంచి ఒకరిని ఎంచుకుని చదవటం. కనుక పాఠకురాలిగా మీ పత్రిక వయసులో నాది ఇరవై శాతం లోపే. అలాగే రచయితలనీ ఓ పాతికశాతం పూర్తిచేసాను. నా అభిరుచి కవితలు, పరిశోధనా వ్యాసాలు, కథలు కనుక అవి పట్టి పట్టి చదవటం అలవాటు. చదవటం ఒక కాలక్షేపంగా, జీవితానికి నేపథ్యంలో వున్న అభిరుచి మాత్రమే. అలాగే నా రచనలూను. అవి నా జీవితాన్నల్లుకున్న పడుగుపేకలు కాకపోయినా నాకత్యంత ప్రశాంతత దొరికేది వాటి వలననే. అన్నీ సగటు స్థాయిలో ఉన్న ఓ సాధారణ వ్యక్తిని. ఇది నా గురించిన స్వపరిచయం. ఇక ఈ వ్యాఖ్య ఈ ఒక్క రచనకే కాదు, నేను గమనించిన ఓ తీరు తెలుపటానికే, మీరు ఇది ప్రచురించకపోయినా వాటిల్లే నష్టం ఏమీ లేదు.

    * * * * *

    మీ పత్రిక ఒక చక్కని సాంప్రదాయంలో కొనసాగుతుంది. రచనలను గూర్చి కాక వ్యాఖ్యలను/విమర్శలను గూర్చీ ఈ మాట. ప్రింటు పత్రికల్లో ఒక రచనకి సంపాదకునికి లేఖగా – ప్రశంస/విమర్శ అందుతాయి. ఇక్కడ కొన్నిసార్లు ఒక రచనని చక్కని వ్యాఖ్యారూప వనరులు కలిపి మరింత సంపూర్ణం చేసేవారున్నా, కొన్ని కేవలం ఒక చర్చ, రచ్చగా అవుతున్నాయి. విమర్శలు చదవకుండా వెళ్ళొచ్చా అంటారా, అవి ఒక్కోసారి బంగారు నగకి రతనాలు పొదిగినట్లుగా ఉండబట్టే అట్టి చక్కటి చదువరులు/విమర్శకులు కనపడబట్టే చదివేది. మరికొన్ని ఇక్కడ నుండి వెళ్ళేసరికి అసలు రచనని చిల్లులకి అతుకేసి కుట్టిన చింకిపాతలా తోచేలా చేస్తున్నాయి. కొన్ని ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, రచయిత చేత “అగత్యం” పట్టింది అని అనిపించేంత. మరి కొన్ని రచయితని ఒంటరిని చేసి అంతా కలిసి యుద్దం చేసినంత. పత్రికకి నిష్పక్షపాతం, అభిప్రాయాల పట్ల సహనం ముఖ్యమే కానీ వాటి తీరు వ్యక్తిగత దూషణగా మారినప్పుడు మీ బాధ్యత లేదా? ఒక్కోసారి 1:on:1 లేదా ఒక్కరిదే విలువిద్యాప్రదర్శన లా అవుతుందిక్కడ. పోటాపోటీగా back to back మాటలు రువ్వేస్తూ, అస్త్రాలు ముందే అరచేత బిగించి ఆవలీలగా వేళ్ళతో అక్షరబాణాలు సంధిస్తూ అన్నట్లుగా.. మరి అది అన్ని రచనలకా అంటే అలా లేదు. అసలు కొన్ని రచనలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అని ఆలోచించేలా ఉంటాయి. వాటికి ప్రశంసలు మరింత తికమక పెట్టేలా ఉంటాయి. కనుక ఇక్కడి ప్రశంసలు లేదూ కనీసం రచయిత కృషి పట్ల సదభిప్రాయం [చాలా తక్కువ మోతాదులోనైనా] విమర్శలు [సద్విమర్శలా/కువిమర్శలా ఆయా వారికే తెలియాలి] ఊహాతీతం. ఇలా రాస్తున్నానని నేను ఎవరికీ సానుకూలురాలినీ, సానుభూతిపరురాలినీ కాదు. అస్మదీయులు, తస్మదీయులూ లేరు. నిజానికి ఓ అనాథ పాఠకురాలిని. ఇక్కడ ఓ లోకం వెదుకుతున్నదాన్ని. ఒక రచయితని/ఒక రచనని సానబట్టి, ఆ ప్రక్రియలో రచయిత చేత లోతుగా ఆలోచింపచెయ్యడం సర్వదా అభిలషనీయం. నొప్పించడం ఎవరి ఉద్దేశం కాకపోయినా, ఒక పద్దతిగా అది జరగాలని మాత్రమే నా ఉద్దేశం. నేను ఈ అనంత సాహితీవాహినిలో ఓ బిందువునే. మన వెనక పుట్టి మనని దాటి వెళ్ళే సాహిత్యానికి నా వంతు ఏముందా ఇవ్వనూ అని యోచించేదాన్ని మాత్రమే. “ఔరా పిల్లకాకి/కాకిపిల్లా!….” అన్నా నాకు ఆనందమే.

    పైన చెప్పినట్లుగా పాతిక శాతం పాఠకురాలిని, ఇలా నాలుగు దారుల కూడలిలో ఉన్నాను. నేను నడిచి వచ్చిన దారి నన్ను అయోమయంలో పడేస్తుంది. రచన చదివి పోవటమా/విమర్శలని పట్టించుకోకపోవటమా/ “ఈమాట” అంటే ఇది అని అవగతం అయ్యేంత వరకూ ఇలా కొనసాగటమా మిగిలున్నాయిక. నా ఈమాట మీ “ఈమాట” లో వెలుగు చూడకపోయినా దాదాపుగా ఆర్నెల్ల పాటుగా సందిగ్ధంలో పడి ఆగిన మాట వెలికివచ్చింది.

  1237. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి రాఘవ గారి అభిప్రాయం:

    07/08/2010 8:26 am

    ప్రస్తుతానికి శేషేంద్రశర్మగారి సాహిత్యకౌముది చదువుతున్నాను. అందులో ఆయన ఉటంకించిన

    లతాం పుష్పవతీం స్పృష్ట్వా స్నాతో విమలవారిషు పునస్సంస్పర్శంశఙ్కీవ మన్దం చలతి మారుతః

    అన్నది గుర్తొచ్చింది, ఈ కవిత చదివితే.

  1238. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    07/07/2010 7:54 pm

    ఒక కవిత ఏ విషయం మీద వ్రాసినా ,వ్యక్తీకరింపబడిన అనుభూతి ఏదైనా ,మహాబలీయమైన ముద్ర పాఠకుడి మీద వేసి “ఎంత బాగుంది” అని పదే పదే పలవరించేట్లు చేయాలి. అనేక మార్లు తరగని ఆనందంతో చదువుకునేటట్లు జేసి, దాన్ని కంఠవశం చేసుకోవాలనే తపనను కలిగించకపోతే ఆ కవిత కవితే కాదు.దాని ఆయుఃప్రమాణం అతి స్వల్పం: దాని ఎఫెక్ట్ , ఎఫిమిరల్. కవిత గొప్పదా,కాదా అనే విషయానికి సంబంధించి ఇది నిజమైన టెస్ట్ లా భావించవచ్చుననుకుంటాను.

    వ్రాసేది కవిత కావాలి. అంటే పైన చెప్పిన శక్తిని అది సంతరించుకోవాలి. వ్రాసే వ్యక్తి కవి కావాలి. అంటే కేవలం మాటలు పేర్చటం మాత్రమే తన పనిగా భావించే వ్యక్తి కాకూడదు. ఒక బలమైన అనుభూతికి లోనై వ్రాయాలి.

    ప్రాచీన ఛందో రీతులలో వ్రాసిన పేరడీ పద్యాలు కూడా కంఠవశం అయ్యే గుణం కలిగి ఉంటవి. అంత మాత్రం చేత అవి కవిత్వం అయిపోవు. ఆ కంఠవశం అయ్యే గుణాన్ని అవి కలిగి ఉండటం మన ప్రాచీన ఛందో రీతుల గొప్పదనం, వాటి వైశిష్ట్యం. కంఠవశం అయ్యే గుణం లేకపోతే మంచి కవిత్వం కాదన్నాము గానీ, కంఠవశం అయ్యే ప్రతిదీ మంచి కవిత్వం అనటం సాధ్యం కాదు.

    వచనకవితలో కంఠవశం అయ్యే గుణం సాధించటం చాలా చాలా కష్టం. వచన కవి చాలా ప్రజ్ఞావంతుడై ఉండాలి. కవితా రసవిద్యా రహస్యం తెలిసినవాడై ఉండాలి. శక్తిమంతమైన,రసస్ఫోరకమైన పదచిత్రాలను,వైరుధ్యాలు లేని మెటఫర్ల సమాహారాలను, సంకేతాలను తనదైన, ప్రగాఢమైన అనుభూతిని ఆవిష్కరించటానికి, కవిత్వీకరణ మాధ్యమాలుగా సున్నితంగా మలచుకోవాలి. అంతేకాదు, కవితా పంక్తులలో ఒక మనోజ్ఞమైన, లయబద్ధమైన నడకను, పదబంధప్రయోగంలో శబ్దసారూప్యత వల్ల జనించే రమ్యమైన రిధంను అతను సాధించాలి. అప్పుడది గొప్ప కంఠవశమయ్యే గుణాన్ని, ప్రబలంగా ఆకట్టుకునే శక్తిని సంతరించుకుని ఎప్పుడూ మన మనస్సుని అంటిపెట్టుకుని ఉంటుంది. గొంతెత్తి పరవశంతో చదువుకునేటట్లు చేస్తుంది.

    నాకు తెలిసినంతవరకు,నా అనుభవంలోకి వచ్చినంతవరకు వచనకవిత సమగ్ర సర్వాంగ సుందరంగా వ్రాసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మాత్రమే. వేరే వాళ్ళ కవితాపంక్తులు మూడు నాలుగు కంటే ఎక్కువ గుర్తు ఉండవు. తిలక్ కవితలు మనసులో మార్మోగుతూనే ఉంటవి. చాలా వరకు వారికవితలు ఆమూలాగ్రం ఇట్టే అవలీలగా కంఠవశం అవుతవి. పలుమార్లు పంక్తులకు పంక్తులు, కవితలకు కవితలు గొంతెత్తి చదువుకుంటూ పులకింతలు పోవటం నా స్వానుభవం.ఇది నూటికి నూరుపాళ్ళు సత్యం.

    కవిత్వం వ్రాసే వాళ్ళు మానవ జీవితానుభవాలలో దేనిమీదైనా వ్రాయవచ్చు. ఒక తాత్విక చింతనను కానీ,సామాజిక స్పృహను కానీ సాంఘిక,ఆర్ధిక,రాజకీయ దురన్యాయాన్ని కానీ దోపిడీని కాని కవితలో ఆవిష్కరించవచ్చు. కానీ అది కవితామయం గానే జరగాలి. కవిత యొక్క వస్తువిశేషము కవిత యొక్క గొప్పదనం మీద ప్రభావాన్ని చూపలేదు. కవిత రచనా రీతికి సంబంధించినది; వస్తుప్రాధాన్యతకు సంబంధించినది కాదు. అయితే, కవిత్వానికి సాహిత్యానికి సామాజికప్రయోజనం లేదని కానీ, ఉండకూడదని కానీ కాదు. కవిత్వం, తక్కిన సాహిత్య ప్రక్రియలన్నీ రససిధ్ధి ద్వారా పాఠకులని ఉత్తమ మానవీయత వైపు నడిపించాలి. పునరుక్తి దోషంగా భావించవద్దు :ఇది రససిద్ధి ద్వారానే జరగాలి.

    ఇకపోతే కవిత్వ విమర్శ కవితల గుణదోషపరిశీలనకు మాత్రమే పరిమితమై ఉండాలి. అటువంటి పరిశీలన ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ లో ఎనలిటికల్ గా మాత్రమే జరగాలి. వ్యక్తిగత విమర్శలకు, అవహేళనలకు, నిందలకు దిగజారకూడదు. కవిత కవితై ఉండాలి; సాహిత్యవిమర్శ సాహిత్యవిమర్శ మాత్రమే అయి ఉండాలి. అలా మన స్థాయిని పెంచుకునే సామర్ధ్యం మనకు ఉంది, ఆ అవసరం కూడా ఉంది.

  1239. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Sai Brahmanandam గారి అభిప్రాయం:

    07/07/2010 7:38 pm

    అఫ్సర్ గారంటే నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే ఆయన సౌమ్యంగా మాట్లాడడమే కాదు, మాటల్ని ఆచి తూచి వాడతారు. అలాంటి వ్యక్తి ఇలాంటి దురుసుతనంతో కూడిన వ్యాఖ్య చేస్తారని ఊహించడం కష్టం.

    అఫ్సర్ గారి దృష్టిలో అమెరికా పాఠకులన్నా, రచయితలన్నా చాలా చాలా చిన్న చూపుందని ఇప్పుడే అర్థమయ్యింది. ఇక్కడి తెలుగు పాఠకుల, రచయితల అభిరుచులన్నీ ఫ్రోజన్ బ్రతుకులని చిటికలో నిర్ధారించేసారు.
    రామారావు గారేమన్నారు? ఎవరికోసమో కాకుండా వాళ్ల కోసం వాళ్లు రాసుకునే గుర్తింపు, సాహసం మన విదేశ తెలుగురచయితలు / కవులకు ముందుముందైనా వస్తాయని ఆశ పడ్డారు. అంతే ఒక్కసారి విరుచుకు పడిపోయారు క్షణంలో అమెరికాలో ఉన్న తెలుగు పాఠక, రచయితల సమూహాన్ని ఒక్క చేత్తో ఫ్రోజన్ రాటకి కట్టేసారు. ఆంధ్రాలో పాఠకోత్తముల స్వభావాలు మారిపోయాయట. రచయితలూ మారిపోయారట. వారిని అందుకోవడానికి అమెరికా తెలుగు వారికి కొన్ని తరాలు పడుతుందట. అమెరికా తెలుగు వారికి ఇదీ అఫ్సర్ గారి కితాబు.

    ఇరవై ఏళ్ళ క్రితం తెలుగు సాహిత్యం అమెరికాలో అందుబాటులో లేదంటే నమ్మొచ్చు. ఇంటర్నెట్ వచ్చాకా తెలుగు సాహిత్యం గురించీ, పత్రికల గురించీ తెలియదంటే ఎవరూ నమ్మరు. ఏఏ పత్రికల్లో ఏఏ వాదాల సాహిత్యం వస్తుందో, ఎవరి రచనలు అచ్చవుతాయో అందరికీ తెలుసు.

    అఫ్సర్ గారు అమెరికాలో ఈ ఫ్రోజన్ సమాజాలకి దూరంగా వుంటూ ఆంధ్రాలో తెలుగు పాఠకుల మార్పుని ఎలా తెలుసుకున్నారో తెలుసుకోవాలని ఉత్సాహంగా వుంది. ఎవరికయినా ఇంటర్నెట్టూ, లేదా ఒకరిద్దరితో ఫోను సంభాషణలూ తప్పించి వేరే మార్గాలేమిటా ఆన్నది తెలుసుకోవాలనుంది. విప్లవ రచయితల్ని తిట్టే వారూ వున్నారు. ఇతర రచయితల్నీ తూలనాడే విప్లవ మేధావులూ వున్నారు. ఇందులో ఎవరికెవరూ తీసిపోలేదు. సాహిత్యం వాదాలకీ, ప్రాంతాలకీ అంకితమై పోయింది కాబట్టే ఈ ఉనికి వివాదాలూ, నడ్డి గోకుడు గ్రూపులూ పుట్టుకొచ్చాయి. ఏ వాదమయినా మంచి కవిత్వం మంచి కవిత్వమే! దానికి ఎవరి భుజాలూ, బాకాలూ అవసరం లేదు. ఆంధ్రాలో వచ్చిన సాహితీ మార్పులు తెలుసుకోలేదని అఫ్సర్ గారు ఎలా నిర్ధారణ కొచ్చారో తెలియ పరిస్తే తెలుసుకోవాలనుంది. ఇప్పటికీ అమెరికా రచయితలకంటే ఓ మెట్టు మేమే పైనున్నామన్న బలమైన అభిప్రాయం ఆంధ్రా రచయితల్లో నాటుకుపోయింది. కథయినా, కాకరకాయయినా వారే వండాలి, వడ్డించాలన్న ధోరణి బలంగా కనిపిస్తూ వుంటుంది. బహుశా ఇదే అభిప్రాయం పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్న అఫ్సర్ గారికీ స్థిరపడిందా అన్న అనుమానం ఆయన వ్యాఖ్యల్లో కనిపించింది.

    చివరగా “ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో!” అని బ్లాంకెట్ స్టేట్మెంటు చేసేసారు. ఇలాంటి దురుసు వ్యాఖ్యలతో సాహిత్య సాంద్రత పెరుగుతుందేమో తెలీదు.
    అఫ్సర్ గారూ మీరు మీ గురించి చెప్పండి. శ్రద్ధగా వింటాం. కవిత్వంలో విప్లవ కక్కులు ఉన్నాయని ఒక వ్యాఖ్య వస్తే మీరు అందర్నీ దూషించడం పెద్దరికం అనిపించుకోదు. చివరగా పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీరూ అమెరికన్ తెలుగు రచయితల కోవలోకే వస్తారని నా నమ్మకం. కాదంటారా? మీకు శతకోటి నమస్కారాలు.

  1240. పసిఁడిపల్లకి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    07/07/2010 12:24 pm

    మంచి ధారతో మాధుర్యంతో పద్యాలందించినందుకు కృతజ్ఞతలు.
    ఇంత పెద్ద పద్యకవిత “ఈ మాట”లో చూడడం ఇదే మొదటిసారి,నాకైతే. ఇటువంటివి అందుకొని ఆనందించే అదృష్టవంతులకన్నా అందుకోలేని ఈనాటి ఈమాట పాఠకులే ఎక్కువేమో అని అనుమానం.

    ఎన్నో ఇతర ఉపమానాలు వాడినప్పటికీ, వరుసగా మూడు పద్యాలలో పెద్దనను కవిచంద్రుడు కవిసింహుడు కవివృషభుడు అనడం వర్ణన అందాన్ని అతిశయోక్తి కబ్జా చేసినట్టుంది.

    వ్యాసునితో పోల్చిన బ్రహ్మగా తోచిన పెద్దన, కృష్ణరాయలే చతురవచోనిధి ఆంధ్రకవితాపితామహ అనిపిల్చిన కవి, రాయల అస్తమయంతో తనకు యిచ్చిన పైసలు,సంపద, చేసిన సన్మానాలే తలుస్తూ రాయలతో పోలేక జీవచ్చవంబుగా బతుకుతున్నాననడం పెద్దన తనను చిన్నగ చేసుకున్నట్లుంది.
    ఆ పద్యం పెద్దననే కాదు ఖండికను సైతం నీరుగార్చిన ముగింపు. నాకింత చేసాడనే కాని,రాజ్యానికి ప్రజకు కల్గిన లోటు ఊసెత్తకపోవడం సామాన్యులకు అలంకారమే కాని కవిచంద్రునకు మచ్చ.

    పసిడి పోయె వెంట పల్లకియును పోయె
    రాజ్యమంతరించె రాజుతోడ
    కావ్యపరిమళాలు కాంతులీనుచు నిల్చె
    పసిడి కబ్బి నట్లు పరిమళంబు
    ===========
    విధేయుడు
    _శ్రీనివాస్‌

  1241. నువ్వు గురించి Bharath Yadlapalli గారి అభిప్రాయం:

    07/07/2010 9:10 am

    నిజంగా మీ కవిత చాలా బాగుంది. కానీ ఒక చిన్న సలహా. “సితా చిలుక” అనడం కంటే “సితాకోక చిలుక” అనడం మరింత బాగుంటుందని భావిస్తున్నాను. నేను కవిని కాదు, కేవలం నా అభిప్రాయం వ్యక్త పరుస్తున్నాను అంతే!

    (ఇది పొరపాటు. సీతాకోకచిలుకగా తప్పు సరిదిద్దాము. పట్టించినందుకు కృతజ్ఞతలు. – సం.)

  1242. నువ్వు గురించి Meghadhutha గారి అభిప్రాయం:

    07/07/2010 4:30 am

    బాగుంది. కాని అది విరహమా, వ్యామోహమా, వైరాగ్యమా, విరక్తా, ప్రేమా, పారవశ్యమా లేక యీ అన్ని భావనలు కలబోసుకున్న అయోమయమా అన్నది మాత్రం తెలియడంలేదు. కవిత్వం లోతయిన భావాలను సరళతరం చేయాలని నా అభిప్రాయం.

  1243. ప్రేమ కవితలు గురించి annam naidu గారి అభిప్రాయం:

    07/06/2010 11:06 am

    ఈ మాటలోని కవితలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ కవితలు నాతో పాటు మిగతా పాఠకులకు కూడా ఆకట్టుకుంటున్నాయని అనుకుంటున్నాను. మరియు ఇంకా ఇలాంటి మంచి కవితలు పంపే ప్రేమికులు స్వచ్ఛంగా వాళ్ళ ప్రేమను గెలిపించుకోవాలని ఆశిస్తూ,

  1244. ప్రేమ కవితలు గురించి reddy గారి అభిప్రాయం:

    07/06/2010 2:58 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  1245. పసిఁడిపల్లకి గురించి గన్నవరపు వరాహ నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    07/05/2010 2:01 pm

    కవితని మళ్ళా చదువుతూ అంటే నవ్వొచ్చింది. నేనే కాదు,మరల మరల చదివే వాళ్ళుంటారని. వృధ్ధి సంధి ఏదో పద్యంలో తిక్కన వారు కూడా చేయక ఓ కారము గుణ సంధి లాగ చేసారని చదివా. బహుశా కామేశ్వర రావు గారికి తెలుసు. దేశికాచార్యుల వారు గాని, కామేశ్వర రావు గారు గాని వివరిస్తారని ఆశిస్తాను. ముందుగానే వారికి కృతఙ్ఞతలు సమర్పించుతున్నాను.

  1246. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    07/05/2010 7:58 am

    కవిత్వం ‘డెమాక్రటైజ్’ అయ్యింది” అన్నమాటకి నేను “కవితావస్తువు ప్రజల జీవితానికీ, ఆశయాకాంక్షలకీ చేరువయ్యిం”దని అర్థం చెప్పుకున్నాను. కాదా?

    ఆ వ్యాఖ్యా, అంతకు ముందు పారాగ్రాఫూ మీ సమీక్షలో ఇమిడినట్లు నాకనిపించలేదు.

  1247. పసిఁడిపల్లకి గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    07/05/2010 12:44 am

    కవితని మళ్ళా చదువుతూ ఉంటే రెండు చిన్న అనుమానాలు వచ్చాయి.
    “ధవళపట్టంబరంబు” – ఇక్కడెందుకో “పట్టు” పదం “ధవళ” “అంబర” పదాల మధ్య సరిగా అతికినట్టు లేదు. పట్టు తత్సమ పదం కాదు కదా. అలా సమాసం చెయ్యవచ్చా? అది “పట్ట” అనుకుంటే “పట్టాంబరంబు” అవ్వాలి.

    “కంఠీరవోజస్సె” – ఇక్కడ వృద్ధి జరిగి “కంఠీరవౌజస్సె” అవ్వాలి కదా? ఈ పద్యంలో మొదటి రెండు పాదాల్లోనూ “ఇంద్రుడు”, “బృహస్పతి” ఉపమానాలు సరిగా సరితూగాయి. తర్వాతి రెండు పాదాల్లో ఆ తూకం తప్పింది. పెద్దనని బ్రహ్మతో పోల్చారు కాబట్టి అక్కడ రాయలని విష్ణువుతో పోలిస్తే ఇంకా బాగుండేదనిపించింది.

  1248. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/05/2010 12:38 am

    చిలక జోస్యాలు చెప్పడంలో నేను ప్రవీణురాలిని కాను. నేను తప్పులూ ఎన్నడమ్ లేదు. విమర్శని స్వీకరించడం చాలా మందికి కస్టం అని నేనెరుగుదుమను. నేను చెప్పింది సాహిత్య పరిధి విస్తృతం గురించి. దానికి నేను ప్రత్యేకంగా ఋజువులు చూపించడం ఎందుకూ?? కవిత్వం పేరుతో అచ్చవుతున్న అనేకమైన సరుకులు ఉదాహరణలే!! వాదనకోసం ఎంతైనా వాదన చేయవచ్చును . దానికేం?? కానీ ప్రతిభావంతమైన సాహితీ కారులు కావాలీ అంటే మాత్రం వాళ్ళకి వాళ్ళు వ్యక్తీకరించుకున్న ప్రక్రియ మీద మంచి పట్టూ..భాష మీద అధికారమూ సాహిత్యం మీద సాధికారతా అన్నవి తప్పనిసరి. ఇవాళ్టి చాలా మంది కవి నామధేయులకి అవి పూజ్యమన్నది తేటతెల్లమైన సంగతి. వారి వారి రచనలే ఇందుకు సాక్ష్యం. ఇందుకు ఎలాంటి జోస్యాలూ అవసరం లేదు. ఇకపోతే మాకు ఇవన్నీ కవితలే అని అనేవాళ్ళూ ఉంటారు. అనడానికి ఇబ్బందిలేని కాలంలో ఉన్నవాళ్ళం గనక. వాళ్ళు “ప్రజాస్వామ్యబధ్ధమైన వచన కవితా ప్రక్రియ” లోని సులువులని వాడుకుని అదంతా కవిత్వమనే దబాయించి బతకొచ్చు. కాదని అంటే వాళ్ల కులాలనీ వాళ్ళ వర్గాలనీ వాళ్ళ మతాలనీ ఎత్తి చూపి బెదిరించే పనికి పూనుకోనూ వచ్చు. ఇవాళ చాలా సందర్భాల్లో తరుచూ జరిగేది ఇదే!! అందువల్లనే ఇంత అసహనం కన్పిస్తూంది విమర్శ మీద.

    రామారావుగారి సర్వే చాలామటుకు నిజం కవిత్వ పుస్తకాలకి సంబంధించి.
    తెలుగున కవిత్వం అమ్ముడయ్యే సరుకు కాదు. కవులు స్వంతంగా అచ్చు వేసుకుని నలుగురికీ పంచిపెట్టుకుని తాము కవులమని చెప్పుకుందికి ఉపయోగపడే ఒక సాధనం. అయితే ఈ పరిస్థితి కవిత్వానికే కాదు కధలకీ ఉంది. నిజానికి సాహిత్యం మీద ఆసక్తితో పుస్తకాలు కొనేది చాలావరకూ పాత సాహిత్యాన్నే!! కొద్దోగొప్పో పుస్తకాలు కొనేవాళ్ళు ఎక్కువగా భారత రామాయణాలనీ ప్రబంధాలనీ కొంటుంటారు. వీటికే మార్కెట్ ఉందని ప్రచురణకర్తలూ అంటారు.

    ఆధునిక కవిత్వం లో అమ్ముడయ్యే కొద్ది పుస్తకాలు ఉండొచ్చునేమో!! కానీ ఎక్కువ పుస్తకాల పరిస్థితి ఇదే!! మరి ఇలాంటప్పుడు దీనిని గురించిన వాస్తవాల ప్రస్తావన ఎవరన్నా చేస్తే…ఆ చేసిన వాళ్ళని కాదు తప్పుపట్టాల్సింది. వాస్తవాలని గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. అబ్బే నిజాలు ఉంటే ఉండనీండి మీరు మటుకు మాట్లాడకండి అని అనేలాంటి ప్రయత్నాలు చర్చించే వాళ్ళ నోరుమూయించడం..కోసం చేసేవి.అవి ఎలా చేసినా. ఎవరెవరు చేసినా.. ఏయే కారణాలకి చేసినా..!అందువలన లాభపడే వాళ్ళూ ఎవరైనా.. నస్టం ఎప్పుడూ సాహిత్యానికే జరిగింది. జరుగుతూ ఉంది.

    రమ.

  1249. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhan గారి అభిప్రాయం:

    07/04/2010 9:50 pm

    ఈ వ్యాసపు ముఖ్య విషయం రాయల కొలువులో తెలుగు కాని ఇతర భాషలలో సాహిత్యం ఎలా వర్ధిల్లిందో అన్న విషయాన్ని వివరించడమే. కాని అభిప్రాయాలు ఆముక్తమాల్యదపైన వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక విషయం మనవి చేస్తున్నాను. తెలుగు కవులు సామాన్యముగా ఆశ్వాసాంతములో ఒక గద్యం వ్రాస్తారు. ఉదాహరణకు పెద్దన ఇలా వ్రాసారు –

    ఇది శ్రీమదాంధ్రకవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్షపాదాంబుజాధీనమానసేందిందిర నందవరపురవంశోత్తంస శఠకోపతాపసప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లి కాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్యప్రణీతంబైన స్వారోచిషమనుసంభవం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము

    (ఇది శ్రీమదాంధ్రకవితాపితామహుడని బిరుదుగలవాడు, సర్వతోముఖాంకుడనే బిరుదుగలవాడు, విష్ణుమూర్తి పాదపద్మాల మకరందాన్ని గ్రోలె తుమ్మెదవలె నుండువాడు, శఠకోపయతిచే ప్రసాదించబడిన శ్రేష్ఠమైన చతుర్విధ కవిత్వములు అభ్యసించినవాడు, అల్లసాని చొక్కయమంత్రి కుమారుడు ఐన పెద్దనార్యుడు వ్రాసిన స్వారోచిషమనుసంభవము అనే మహాకావ్యములో రెండవ ఆశ్వాసము.)

    కాని ఆముక్తమాల్యదలో ఆశ్వాసాంతములు గద్యాలు కావు, పద్యాలు. ఉదాహరణకు –

    ఇది సింహాచలదంభకేసరిపదాభీష్టార్చనాపుణ్యల-
    బ్ధదురుట్టంకణ పొట్టునూరివిజయస్తంభోపలోట్టంకితాం-
    కదృఢేష్టాక్షర కృష్ణరాయనృపసంజ్ఞాన్మత్కృతాముక్తమా-
    ల్యద నాశ్వాసవరంబు నాలవది హృద్యంబై మహిం బొల్పగున్
    – శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద, 4.289

    (ఇది సింహాచలములో ఉండే మాయనరసింహస్వామి పాదాలను కొలువగా సంక్రమించిన పుణ్యఫలమువల్ల పొట్టునూరి జయస్తంభములో పేర్కొనబడిన కృష్ణరాయనృపతి వ్రాసిన ఆముక్తమాల్యద కావ్యములో నాల్గవ ఆశ్వాసము అందరికి ప్రీతిగా విరాజిల్లును.)

    సంస్కృతకవులు ఇలాగే వ్రాసేవారు. ఉదాహరణకు నేను వ్యాసములో పేర్కొన్న రుక్మిణీశవిజయమునుండి ఒక సర్గాంత పద్యము –

    రోమ్ణాం హర్షణకారిణీ శ్రవణతః పాపౌఘవిధ్వంసినీ
    ప్రేమ్ణా చింతయతాం విచిత్రవిమలశ్లాఘార్థసందాయినీ
    సంజాతే భువి రుక్మిణీశవిజయే సద్వాదిరాజోదితే
    సంజాతః సురమండలీషు మహితః సర్గో ముదాం సప్తమః

    (రోమాంచితమయ్యేటట్లు సంతోషమిచ్చేది, వినగానే పాపాలను నిర్మూలించేది, విచిత్రమైనది, నిర్మలమైనది, అర్థవంతమయినది అయి వాదిరాజయతిచే వ్రాయబడిన రుక్మిణీశవిజయ కావ్యములో ఏడవ సర్గ సురమండలముచే పొగడదగినదైనది.)

    ఆముక్తమాల్యదలో ఉపయోగించబడిన చాల సంస్కృతపదాలకు సామాన్యమైన అర్థాలు ఉండక కొద్దిగా మామూలుగా లేని అర్థాలు ఉంటాయి. రాయలే వ్రాసారో, మరెవరు వ్రాసారో కాని రచయితకు మాత్రం కొబ్బరికాయలంటే ఎంతో ఇష్టమనిపిస్తుంది 🙂

    విధేయుడు – మోహన

  1250. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/04/2010 2:26 pm

    ఈ విషయం మీద నేను చెప్పదల్చుకున్న విషయాలు ఐపోవచ్చాయి. చివరగా అఫ్సర్ గారు అడిగిన “ఊహాపాఠకుల” విషయం కొంత స్పృశించి ముగిస్తాను. నా “అశాస్త్రీయ సర్వే” పద్ధతి ఇది – నేను సామాన్యంగా రెండేళ్లకోసారి ఇండియా వెళ్తాను; అలా వెళ్లినప్పుడు నవోదయ లో గత రెండేళ్లుగా వచ్చిన కవిత్వపుస్తకాలు అన్నీ ఒకో కాపీ కొంటాను; (వాటిలో ఏవీ వెయ్యి కాపీలకు మించి ప్రచురించబడవు); అప్పుడు వాళ్లని ప్రతిసారీ అడుగుతాను – వాటిలో ఏయేవి ఎలా అమ్ముడు పోతున్నాయని. మొదల్లో కొంత మొహమోటపడ్డారు గాని తర్వాత వాళ్లు చెప్పేది NRI లు తప్ప ఎవరూ కొనరూ అని; ఇక చాలా మంది కవులు సొంతంగా ప్రచురించుకుని తెలిసిన వాళ్లకు అంటగట్టటమో ఊరికే ఇవ్వటమో చేస్తారనేది నాకు తెలిసిన కొద్దిమంది కవులు స్వయంగా చెప్పిన విషయం. ఊరికే ఇచ్చినవి చదివేవాళ్లు చాలా కొద్దిమంది అన్నది ఏ సర్వేలూ అక్కర్లేకుండానే చెప్పొచ్చు. కొన్న ఒక్కో ప్రతినీ ఈ కాలంలో ఒకరికి మించి చదవరు అనేది నా ప్రతిపాదన. కనుక మొత్తం మీద ఓ కవితాసంకలనాన్ని వెయ్యిమందికి మించి చదవరు (మొదటి నుంచి చివరదాకా చదివేవాళ్లు ఇంకా తక్కువ). అంతేకాదు, పై సమాచారాన్నుంచి వీళ్ళు ఎలాటివాళ్లో కూడా derive చెయ్యొచ్చు – వీళ్లు నాలుగు రకాల వాళ్లు: 1) ఇతర కవులు, 2) ఆ సంకలనకర్త బంధువులు, స్నేహితులు, 3) విమర్శకులు, 4) చాలా కొద్దిమంది కవితాసక్తి వున్నవాళ్లు (వీళ్లలో చాలా ఎక్కువభాగం గుప్తకవులు). ఇకపోతే ఆ కవితలు పత్రికల్లో వచ్చివుండొచ్చు. ఆ పాఠకుల మాటేమిటి? నేను చేసుకున్న మరొక ప్రతిపాదన వాళ్లు కూడా పై నాలుగు రకాల వాళ్లేనని. ఏతావాతా తేలేదేమంటే ప్రస్తుత కవిత్వానికి “ముఖ్యమైన” పాఠకులు ఎక్కువభాగం ఇతరకవులే నని.

    వీళ్లు కాక ఇంకెవరినైనా ఒక కవి తన పాఠకులుగా భావిస్తే వాళ్ళు ఊహాపాఠకులు. ఇదీ నా definition. ఇతరులు అంగీకరించొచ్చు, రించకపోవచ్చు. అఫ్సర్ గారి శాస్త్రీయ సర్వే ఫలితాల కోసం వేచి చూస్తాను.

  1251. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/04/2010 2:04 am

    కెవీయస్ రామారావుగారూ!! ఆధునిక తెలుగు కవిత్వాన్ని గురించిన చర్చ ఎప్పుడు జరిగినా సరిగ్గా ఇలాంటి సందర్భాలే నడుస్తూ వచ్చాయి. అది ఒక లాంటి రక్షణ అకవులకి. ఎవరి కవిత్వానికి చెల్లుబాటు కాదని భయం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ దబాయించి బతకాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. సాధారణంగా ఒక పుస్తకం అచ్చు అయ్యాకా ఆ రచయిత తన పుస్తకాన్ని భుజానికెత్తుకుని తిరిగే కార్యక్రమానికి దిగకూడదు. తానే పూనుకుని చర్చల్లో తలదూర్చడం చేయకూడదు. అలా ఎవరు చేసినా వాళ్ళకి వాళ్ళ రచనల మీద నమ్మకం లేదనే అర్ధం.

    ఇకపోతే ఇటీవల వీళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్న “ప్రాంతీయ – కుల -మత” చైతన్యాలు ఉత్తరోత్తరా పురోగతికి నిదర్శనమా?? తిరోగతికి నిదర్శనమా?? అన్నది సాహిత్య రంగంలో జరూరుగా చర్చ చేయాల్సిన విషయమే!! రచయితలుంటారు. కవులుంటారు. వారు ప్రభవించిన ప్రాంతాలు ఒక పార్శం మాత్రమే!! అది ఆ రచయితని గురించిన బయోగ్రఫీలో ముఖ్యమైన విషయం అవుతుందేగానీ వారి సాహిత్యానికి ఉద్దేశ్యించిన లక్ష్యాలకి.. ప్రయోజనాలకీ కాకూడదు. మంచి కవులు ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కావలసిన వాళ్ళే కావాలి. రచయితలకి ప్రాంతీయ తత్వాలు ముఖ్యం కావడం ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ రచయితకి ఆ ప్రాంతం వలన ఏదైనా ఆశించే ఒక ప్రయోజనం ఉంటేనే!! అలాంటి ఆశ ఉన్న ఉత్తర క్షణమే అతడిలోని మీరన్న “నిజాయితీ” చచ్చిందనే అర్ధం.

    రవికిరణ్ సవాలు నన్నయ్య నాటి నించీ ఐతే ఆనాటికి ఈ స్థితి లేదు గనక మీరన్న మాటలో ఇలాంటి అర్ధాలు రావనీ…. మీరు ఇటీవలి కాలాన్ని మాత్రమే లక్ష్యంగా మాత్లాడేరనీ అతనికి తెలియనంతటి నిగూఢమైన విషయమేమీ కాదు నిజానికి. రాజకీయ పరిభాష కి వీళ్ళంతా ఎంతగా అలవాటు పడిపోయేరంటే అది వీళ్లకి ఒక ఊత కర్ర లాంటిది. ఆ పరిభాష లేనిదే వీళ్ళు నడవలేరివాళ. అదుకే వీళ్ల ఆలోచనా పరిధీ..తద్వారా వీళ్ళ సాహిత్య పరిధీ విస్తరించలేకపోవడం.

    రమ.

  1252. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/04/2010 1:32 am

    చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా ఇంగ్లీషు సాహిత్యలో కీట్సు , షెల్లీ ల కవిత్వాన్ని ప్రచురణకర్తలూ.. సమీక్షకులూ ఎలా నిర్లక్ష్యం చేసారో వారి జీవితకాలంలో ఆయా కవులు ఎలా నిరాదరించబడ్డారో.. వెంకటేశ్వరావుగారికి తెలియదని నేను అనుకోను. అలాంటి రివ్యూదారులు ఒకలాంటి వాళ్ళైతే మరొకరకం ..చెత్తకవిత్వాన్ని పైకెత్తుకునే రివ్యూదారులూ ..అనువాదకులూను. ఉత్తమ కవులని పక్కకు పెట్టి వారి వారి వ్యక్తిగత కారణాలకి గానూ నాసిరకం రచయితలని ముందువరసలో చూపించిన పనిని అన్ని కాలాల్లోనూ పత్రికలూ చేసాయి. విమర్శకులూ చేసారు. అనువాదకులూ చేసారు. చేస్తున్నారు.

    రమ.

  1253. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి vElUri veMkaTESvara raavu గారి అభిప్రాయం:

    07/03/2010 10:20 pm

    అఫ్సర్, ముకుందరామారావుల కవితా సంకలనాలపై నేను రాసిన సమీక్షల మూలంగా నాపైవచ్చిన వ్యాజస్తుతి ( నిందాస్తుతి, స్తుతినిందా తో సహా!) కాస్సేపు పక్కకు పెట్టి, ముందుగా నాదొక ప్రశ్న. ఈ ప్రశ్నవెయ్యడానికి కారణం, కేవలం తెలుసుకోవాలనే కుతూహలమే!

    రమ గారు ఇలా రాసారు:
    ” పాశ్చాత్యదేశాల్లో పత్రికలు ఇంకా ప్రచురణకర్తల మీదా ఒక ముద్ర ఉంది. అదేమంటే అక్కడ వాళ్ళు కావాలంటే అకవులని హడావుడి చేసి కవులుగా ప్రచారం చేయగలరు..లేదా కవులని తయారూ చేయగలరు. అలాగే ఒక మంచి పుస్తకాన్నీ ఒక మంచి రచయితనీ కావాలనుకుంటే నొక్కేయనూగలరు అని. దీనికి సంబంధించి పశ్చిమ దేశాల పత్రికల మీదా ప్రచురణకర్తల మీదా బోలెడన్ని సంఘటనలూ ..కధలూ ప్రచారంలో ఉన్నాయి, ” అని.
    రమ గారు ఈ ” బోలెడన్ని సంఘటనలూ … కథలూ ” ఎక్కడ చదివారో, కనీసం కొన్ని ఆధారాలు ఇచ్చి ఉంటే, బాగుండేది.
    ఏ ఆరోపణకైనా ఆధారాలుండాలనుకుంటాను.

    వేలూరి వేంకటేశ్వర రావు

  1254. శ్రీకృష్ణదేవరాయలు గురించి గన్నవరపు వరాహ నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    07/03/2010 9:09 pm

    గుఱ్ఱపు జాషువా కవిత గొంటెగ వేయదు తప్పు గెంతులున్
    వెఱ్ఱగు గబ్బిలమ్మటనె వేసఁగి కమ్మగ గూయు కోయిలే
    తొఱ్ఱల దాగియుండునునె దోయజ మందలి తేనె సోకుచున్
    ఎఱ్ఱనె నవ్యతాంధ్రమున నెన్నగఁ బాడెనె నింపు గీతముల్ .

  1255. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    07/03/2010 7:42 pm

    ఎవరి మెప్పుకోసవో వ్రాసే రాతల్లో నిజాయితీ ఉండదని రామారావు గారన్న మాట బాగుంది. నిజాయితీ లేని కవిత్వం ఎలాగు పాఠకులని మనసులకి చేరదు. కానీ ఆ నిజాయితీ ఒక్క అమెరికాంధ్రులకు మాత్రవే ఎందుకు పరిమితవో నాకు తెలీదు. అసలాంధ్రుల కవిత్వవంతా కూడా ఆది కవి నన్నయ్య ముందునుంచి అమెరికాంధ్రులవరకునిజాయితీ లేని కవిత్వవేనా? ఎవరో కల తెలుసుకున్న ఐదు అంతకు తక్కువ తెలివిమంతులు తప్ప. కానీ ఈమాట ఐదుగురు అంతకు తక్కువ రచయితలతో నడవదు కదా. పాపం ఈమాట కూడా నిజాయితీ లేని రచనల్ని ప్రచురిస్తూ ఎలాగో ఒకలా గడిపేస్తున్నదనమాట.

    ఇక్కడొక మాట. రచనలు చేస్తున్న, చదువుతున్న అమెరికాంధ్రులంతా కూడా ఖచ్చితంగా అమెరికాలో మొదటితరవే. రెండో తరపు ఆంధ్రులు తెలుగు మాట్లాడటవేగొప్ప. సగంకన్నా ఎక్కువ బతుకుని తెలుగూర్లలో గడిపిన ఆ అనుభవాలే కదా ఈరోజు అమెరికాంధ్రుల రచనలకి ఆలంబన. ఇప్పటికీ ఇడ్లీ, దోశలు, పచ్చళ్ళు, ఆవకాయలు, కంచం నిండా అన్నాలు, వారానికి కనీసం రెండు మూడు సార్లు ఇంటితో (తెలుగు దేశంతో) ఫోను పలకరింపులు. అక్కడి ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇక్కడ పెరిగే, తరిగే రక్తపోటులు, భౌతికంగా ఇక్కడున్నా, మనసంతా అక్కడే కదా. మరి రచయితలు, వారి రచనలు, వారి పాఠకులు మాత్రం వేరుగా ఎలా? అమెరికాంధ్రులైతేనేం, అసలాంధ్రులైతేనేవి. ఇద్దరూ ఒకటే కదా. రామా రావు గారేమో అవన్నీ నిజాయితీ లేని రచనలు అంటున్నారు ఒక్క ఐదు అంతకు తక్కువ రచయితలవి తప్ప. మరా ఐదు అంతకు తక్కువున్న ఆ రచయితలు అమెరికాలో తమ చుట్టూ ఏ గోడలు కట్టుకున్నారో, ఏ గూట్లో దాక్కున్నారో ఆ గాడినీ, వేడిని, వాదాల్ని, విప్లవాల్ని వదిలించుకుని ఏ తత్వాన్ని ఒంటపట్టించుకున్నారో?ఇంతకీ ఆ ఐదు అంతకు తక్కువైన ఆ రచయితలు ఎవరో, ఎవరో ఆ గాడి వదిలిన కవులు, ఎవరో ఆ చక్కని నిజాయితీపరులు, ఎవరో వారు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  1256. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/03/2010 6:25 pm

    అఫ్సర్ గారు ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు – ” మీరు ఏ శాస్త్రీయ సర్వే ప్రకారం ఈ ఊహలు చేశారు, రామారావు గారూ?” అని. అఫ్సర్ గారూ, అసలలాటి సర్వేలు జరిగినట్టు కూడా నాకు తెలియదు. దయచేసి వాటి ఫలితాల్ని మా అందరితో పంచుకోండి. ఎంతో మేలు చేసిన వారౌతారు. ముఖ్యంగా మీరన్నట్లు ఇరవై ముప్ఫై ఏళ్ల నాటి అనుభవాల మీద ఆధారపడి ఊహాగానాలు చేస్తున్న వాళ్లకు.

    తెలుగు కవిత్వాన్ని చదివే పాఠకుల సంఖ్య ఎంత? రాసే కవుల సంఖ్య ఎంత? ఏ కవుల రచనల్ని ఎంతెంత మంది పాఠకులు చదువుతున్నారు? ఎంతెంత మంది పాఠకులు ఎలాటి కవితలు వస్తే ఇష్టంగా చదువుతామని చెప్తున్నారు? పాఠకుల్లో ఎంతమంది ఏయే రకం కవిత్వాలు తమ జీవితాలకి అనుభవాలకి దగ్గరగా ఉన్నాయంటున్నారు? పాఠకుల ఇష్టానిష్టాలు ఏమిటి? ఇంకా ఎన్నో ఇలాటి సందేహాల్ని మీరు చూసిన/చేసిన సర్వేలు నివృత్తి చేస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నాను. దయచేసి అందరికీ అందించండి. కవులకూ విమర్శకులకూ సాహిత్యాభిమానులకూ ఎంతగానో ఉపయోగించే ఇలాటి సమాచారం మీ దగ్గరే దాచుకోవటం అన్యాయం అండీ.

    విదేశీరచయితలు చెయ్యవలసిన సాహసం ఒక్కటేనండి – ఇంకెవరినో మెప్పించటం కోసం కాకుండా తమకు అనుభవంలో వున్న విషయాల గురించి తమ దృష్టిపథాన్నుంచి రాయటం. మీరన్నట్లు బహుశ నా మునుపటి కామెంట్ ఇందుకు వ్యతిరేకం అయుండొచ్చు. మీరు సర్వే ఫలితాలు పంపిన వెంటనే నా తప్పుల్ని సరిదిద్దుకుంటాను.

    అలాగే సాహిత్య సాంద్రత గురించి కూడ సర్వేల్లో ఏం తేలిందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉందండి. ఆంధ్రదేశంలోని ఏయే కవుల కవిత్వం సాంద్రత ఎంత ? ఇండియాలోని ఇతర భాషల కవిత్వసాంద్రతతో పోలిస్తే మన మహాకవుల సాంద్రత ఎంత?

    అసలు సర్వేలతో సాహిత్యం బరువు తూసెయ్యొచ్చునని ఇన్నాళ్లూ తెలియక సాహిత్యాన్ని చదివీ దాని గురించి ఆలోచించీ ఎంత కాలం వృధా చేసేశానో కదా.

    చివరగా, అక్కడి సాంద్రతని అందుకోవటం అమెరికన్ తెలుగు రచయితల లక్ష్యం కావాలని నేననుకోనండి. ఎవరి బతుకులు వాళ్లవి, ఎవరి అనుభవాలు వాళ్లవి. సొంత అనుభవాల్నుంచి పుట్టి హృదయాన్నుంచి వచ్చే సాహిత్యం సర్వేల్లో తేలేంత సాంద్రత లేనిదైనా ఫర్వాలేదండి, కనీసం అరువుబరువు కాదు.

  1257. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి తెలుగు యాంకి గారి అభిప్రాయం:

    07/03/2010 5:49 pm

    ఇక్కడ వ్యాఖ్యలుంచిన వారిలాగ నాకు కవిత్వము ఎలా చదవాలో బహుశ తెలియకపోవచ్చు. వారందరిలాగ చెత్త సంకలనాలను చదివి విసిగి ఉండకపోవచ్చు. కానీ ఒక మంచి కవిత కనబడితే గుర్తించగల శక్తి మాత్రము నాకు ఉందనుకుంటున్నాను.

    అఫ్సర్ ‘నాలుగు మెతుకులుకవితలో అన్నట్టు “భాష్యాలు ఎప్పుడూ వోడిపోతూనే ఉన్నాయిలే, లోగొంతుకల్న తోడిపోసే చేదలేదుగా చేతల్లో” , ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగి ఉండవచ్చు. వెంకటేశ్వరరావుగారి సమీక్షలో ఇచ్చిన కొన్ని కవితా భాగాలు చదివి ఈ పుస్తకమంతా అలాంటి కవితలే ఉన్నాయి అని బహుశ వీరు భావించి, గుఱ్ఱాన్ని గాడిదను ఒకే గాటికి కట్టేసినట్టున్నారు. ఈ సంకలనములో అఫ్సర్ కేవలము తిట్టు కవిత్వము మాత్రమే రాసాడు అని అనుకోవటము చాలా పొరబాటు. మరల మరల గుర్తుకొచ్చేటువంటి చక్కటి చిక్కటి కవితా పంక్తులెన్నో ఉన్నాయి ఈ పుస్తకములో. రెండు మూడు ఉదాహరణలు..

    జాంచెట్టు కవితలో
    దాని కొమ్మల్లోంచి రాలిపడే కిరణాల్ని కళ్ళలోపల దాచుకొని
    పొద్దుటా, మధ్యాన్నం, రాతి్ర పూటా ఆ వొకే వొక్క జాంచెట్టు
    దాని నీడ నేనయ్యానో అది నా నీడ అయ్యిందో?!

    జంగమం” నాకు బాగా నచ్చిన కవితలో..
    అనుక్షణం మారే నా ఇంటి నంబరు నా పత్తా చెప్పనే చెప్పదు
    జంగమం నా నిజ స్థావరం
    స్థావరం నా సమాధి పలకం
    జంగమ కల నా ఇలాకా..

    అలాగే తేలికగా మాటలు జారటముగురించి అఫ్సర్ ఇలా అంటాడు..
    మాట రక్త మాంసాల సరస్సులో పుట్టిన పువ్వు
    అది నీ వికార పెదాల మీద నిరాకార శకలం

    ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి. మరో టపాలో వివరముగా రాస్తాను త్వరలో.
    చివరగా.. నా ఉద్ధేశ్యములో కవి అంటే
    “ఊరి మధ్యనున్న సుందర కాసారములోని సరోజాలగురించీ, వాటి లోని అందానికి మకరందానికి ఆశ పడుతూ వాలే భృంగాల గురించీ అందమైన పదబంధాలతో వివరించే వాడు మాత్రమే కాదు. ఊరిచివరున్న ఎండి నెఱ్ఱెలు పడ్డ చెరువు గురించి కూడా కదిలించేట్టుగా చెప్పగలిగి ఉండాలి”

  1258. పసిఁడిపల్లకి గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    07/03/2010 4:56 pm

    మీ కవితా మహద్విహగ మెక్కి ప్రయాణముజేసినాడ నే
    నా కమనీయ రాట్సభకు నా హృదయమ్ము రసార్ద్రమయ్యె బా
    ష్పాకలితంబులయ్యె కనుపాపలు; తెల్గు కవిత్వ ధీధితుల్
    ప్రాకె దిగంతముల్ పసిడిపల్లకి రాయలు పట్టి యెత్తగా

    పెద్దన కృష్ణరాయల అనుబంధం అపురూపమైనది. పెద్దన పద్యంలోని ఆర్తి, ఆ అనుబంధంలోని గాఢతని పట్టిస్తుంది..

    మీ కవిత్వ దీపశిఖ కాంతులు ఈమాటని ఇలా దేదీప్యమానం చేస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

  1259. నువ్వు గురించి kalyan గారి అభిప్రాయం:

    07/03/2010 7:47 am

    తల్లి నీకు మంచి భవిష్యత్తు ఉంది, ముందుకు వెళ్ళు, మంచి రచయిత నీలో ఉంది … కవిత నాకు చాలా నచ్చేసింది.

  1260. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/03/2010 3:23 am

    ఈ పుస్తకం గాని, అఫ్సర్ గారి పుస్తకం గాని చదవకుండా రాస్తున్న అభిప్రాయం ఇది. లైలా, రమ గార్ల అభిప్రాయాలు ఆలోచనా ప్రేరకాలుగా వుండటంతో చేస్తున్న సాహసం.

    మామూలుగానే కవిత్వసమీక్ష కత్తిమీద సాము. దానికితోడు ఒక పత్రిక సంపాదకుడే ఆడా పాడా మద్దెల కొట్టా అన్నట్టు ఆ పని కూడ చెయ్యాల్సి వస్తే ఇంకా ఇరకాటం. చూస్తూ చూస్తూ బాగా తెలిసిన, తమ పత్రికలో అప్పుడప్పుడు ప్రచురిస్తున్న, ఒకరి రచనని గురించి ప్రతికూలంగా రాయలేరు. అదీ లబ్ధప్రతిష్టులైన రచయితలైతే మరీ కష్టం. ఇది వేలూరి గారి పరిస్థితిలో ఉన్న చిక్కు.

    సాధారణంగా సమీక్షకులెవరైనా ఒక రచన గురించి వాళ్లు చూపే సానుభూతికీ, వాళ్లకీ ఆ రచయితకీ ఉన్న ప్రత్యక్ష పరిచయానికీ డైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ (తెలుగు పదాలు గుర్తుకురావటం లేదు) ఉంటుందని నా నమ్మకం. అలాటి సానుకూల సమీక్షలలో నిజంగా అర్హమయే రచనలే లేవని అనలేము కాని చాలా తక్కువ శాతం. ఐతే మనకు తెలియని వారి గురించి ప్రతికూలంగా అనటం తేలిక కదా !

    ఎవరి మెప్పు కోసమో రాసే కవిత్వంలో నిజాయితీ ఉండదని, అది మాటలపేర్పు తప్ప గుండెలోతుల్లోంచి వచ్చి పాఠకుల మనసు పొరల్ని స్పృశించలేదనీ చెప్పనక్కర్లేదు. అలా ఇతరుల మెప్పుని ఆశించకుండా రాసుకోగలిగే అవకాశం విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో వుండే రచయితలు/కవులకు ఉన్నది. (అలాటి వారిని ప్రోత్సహించటం “ఈమాట” మౌలికలక్ష్యాల్లో ముఖ్యమైందని మరోమారు గుర్తుచేసుకోవటం తప్పుకాకపోవచ్చు.) ఐతే దురదృష్టం ఏమిటంటే చాలా కొద్దిమంది – మహా ఐతే ఒక చేతి వేళ్లమీద లెక్కించగలిగేంత మంది – మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు భౌతికంగా ఎక్కడ వున్నా వాళ్ల ఊహాపాఠకులు మాత్రం ఆంధ్రదేశంలో వున్నవారే. వాళ్ల మెప్పు కోసమే వీళ్ల రాతలు. అందుకే వీటికీ అక్కడ వస్తున్న వాటికీ తేడా వుండదు – అవే భావాలు, అవే బాధలు, అవే విప్లవాలు, అవే వాదాలు, అవే నినాదాలు. అదే గాడి, అదే వేడి, అదే ఒరవడి.

    ఎవరికోసమో కాకుండా వాళ్ల కోసం వాళ్లు రాసుకునే గుర్తింపు, సాహసం మన విదేశ తెలుగురచయితలు / కవులకు ముందుముందైనా వస్తాయని ఆశ.

    ఆంధ్రదేశంలో వున్న వారు ఎలాగూ రమ గారు చెప్పిన నానా ఒత్తిళ్ల మూలాన ఈ పని చెయ్యలేరు. ఆ ఒత్తిళ్లు లేని వారు వాటిని కొనితెచ్చుకుని మరీ ఆ ఇరుకు పరిధుల్లోనే గుడుగుడు కుంచాలాడుకోవటం ఎందుకు? విశాల ప్రపంచాన్ని చూశాక కూడ రచనలు చెయ్యబోయేసరికి ఉష్ట్ర దృష్టి ఎందుకు?

  1261. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/03/2010 2:24 am

    ఇదేమరి విమర్శని తీసుకోలేకపోవడం అంటే . విమర్శ చేస్తే ఆ చేసిన వాళ్ళంతా భోగలాలసులు ..కష్టజీవుల కష్టాలు పట్టని వాళ్ళూ ..సమర్ధించిన వాళ్ళంతా వీర విప్లవవాదులూ అన్న బుకాయింపు. ఎన్నాళ్ళీ hipocracy?? విమర్శించిన వాళ్ళు పట్టుచీరల్లో తిరుగుతూంటే సమర్ధించినవాళ్ళూ గోచీలు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారా?? హంబక్ రాతలతో false arguments చేస్తూ ఎలా ఒప్పించగలరూ ?? ఏం రాస్తున్నారన్నదే కాదు ఎలా రాస్తున్నారన్నది ఇక్కడ విషయం. మనసుకి ఎక్కని రాతని ఓహో!! అని మెచ్చుకుందికి తెలుగుదేశాన కోకొల్లలున్నారు. విమర్శ అన్నది లేదు గనకే ఏది బాగులేదో ఎందుకు బాగులేదో ఎవరూ మాట్లాడడం లేదు గనకే పుట్టగొడుగుల్లా కవిత్వం పేర పుస్తకాలు పుట్టుకు వస్తున్నాయి. చెప్పిన వాళ్ళని తిట్టే కార్యక్రమం లేదా ఇప్పుడీ ఇస్మాయిల్ చేసిన పధ్ధతిలో ఇటువంటి కామెంట్స్ కి పూనుకోవడం వల్లనే ఆధునిక కవిత్వపు మంచిచెడ్డలు అన్నది ఎవరూ ముట్టని అంశం అయింది. ఆధునిక కవిత్వం అంటే ఒక హేళన అందువల్లనే స్థిరపడింది. తెలుగులో ఒక సామెత ఉంది “తలపాగా చుట్టుకోడం రాక తల వంకర అన్నాట్ట” అని. అలాంటిదే ఈ ఆధునిక కవితావ్యాపారంలో ఉన్నవాళ్ళవైఖరి. తమకి తోచదు. చెపితే ఆలోచన చేయరు. ఎవరన్నా ఒక కవితని పాఠకుల మనసులలోకి ఎలా బలంగా పంపించగలమా అని ఆలోచన చేయాలి అంతే గానీ బాగులేదని విమర్శించినవాళ్ళని పిల్లిశాపనార్ధాలు పెట్టడం కాదు. వెనకటికి ఒక విమర్శకుడు అంటూండే వాడు మనకి నచ్చంది మరొకరికి నచ్చవచ్చు అని. కానీ బాగున్న కవిత అది దేనిగురించిరాసినా ఎందరినో ఆకట్టుకోగలదు మరి. అలా ఆకట్టుకున్నవి నిలబడ్డాయి. ఆకట్టుకోలేనివి ఎవరెన్ని కితాబులిచ్చినా బోల్తాపడ్డాయి.
    రమ.

  1262. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కెక్యూబ్ గారి అభిప్రాయం:

    07/02/2010 10:45 pm

    రమ, లైలా గార్లు మీరు కవిత్వంగా భావించే నాలుగు వాక్యాలు రాస్తే బాగుణ్ణు. ఎంతకాలం చీకటికి రంగులద్ది బతుకుతారు. లేని స్వర్గాన్ని ఊహించుకొని మత్తులో జోగడం కవిత్వమా? 90 శాతం బహిష్కృతుల గురించి, కోల్పోయిన దానిని గురించి, వేదనను పంచుకోవడం మీకు కవిత్వంగా కనపడదా?

  1263. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/02/2010 2:10 pm

    లైలా గారూ !! భలే రాసారు మీరు. మీతో నా గొంతు కలుపుతున్నా!! అయితే ఆంధ్రదేశంలో ఇలా బలవంతపు విప్లవ కక్కులు ఒక తప్పనిసరైపోయిది. మీకు తెలుసోలేదో గానీ మీలా ఎవరన్నా ఉన్నమాట అన్నారో వారికి రకరకాల బిరుదులు రెడీ. మిమ్మల్ని వారి తిట్ల తో “ఎండగడ్తారు” మీకు సరైన “సామాజిక స్పృహ” లేదని తీర్మానించేస్తారు. వెంకటేశ్వర రావు గారు కవిత్వంలో ఎక్కువ పుస్తకాలు రావడానికి కవిత్వం కాదు కవిత్వాన్ని “డెమోక్రటిసైజ్ ” చేయడం అని ఎవరో చెప్పేరని విని హాశ్చర్య పడ్డారా? ఆ అభిప్రాయం పచ్చి నిజం. ఎందుకూ ఏమిటీ అన్న ప్రశ్నలు అడిగే వాళ్ళు లేరు. అలా వచ్చే కవిత్వాన్ని ఎవరూ పట్టించుకోరు. పుస్తకాలు ఎన్నైనా అచ్చుకానివ్వండి వాటిని గురించి ఆ కవులు పంచిపెట్టుకోవడమే తప్పించి అమ్ముకుని ఎరగరు. అంతా తీవ్రాతితీవ్రమైన పదాలతో “విప్లవాల” రాతలు రాసేసేవాళ్ళే!! కానీ సుఖంగా బతుకుతూనే ఈ కడుపుమంట రాతలన్నీ రాస్తారు.

    కాదంటే తిడతారు. సాహిత్య రౌడీయిసమ్ లాంటిది. మీకు విసుగు కలిగిందీ అంటే అది సమంజసమే!!

    మీరు జీవితాన్నీ అనుభవస్తానూ అని అన్నారా అంటే మీరు వట్టీ “బూర్జువా” అన్నమాట . ఇది మరొక తిట్టూ. ఒక వేళ మీరేమన్నా కొన్నాళ్ళూ విప్లవాలు రాసి మానేసి ఇలాంటి మాట గాని అన్నారా మీరు ” రెనగేడ్ “. అపుడే భయపడకండి. మా బాధలు ఏం చెప్పమంటారు?? ఇక్కడ ఎంత తిట్టూ కవిత్వం రాస్తే వారికి అంత సదుపాయం. అది ఒక షోకు. ఇలా తగలడింది ఎక్కువ శాతం “వచన కవిత” ఎక్కడా వస్తు వైవిధ్యం ఉండదు. వ్యక్తీకరణలూ అంతే. భాష పదబంధాలూ మరి అడక్కండి. కావాలంటే ఓపిక ఉన్న ఎవరన్నా ఒక పుంజీడూ పుస్తకాలని చదివి చూడండి. నాలాగే లైలా తో మీరుకూడా అవునంటూ గొంతు కలుపుతారు. మేం రకరకాల గ్రూపుల రకరకాల భావజాలాల బాధితులం!! కవితా సంకలనాలలో కవిత్వమ్ తప్ప ఇంకేదైనా ఉన్నా దాని గురించి ఎక్కడా మాట్లాడలేని వాళ్ళం!! మెరమెచ్చు మాటలు అనడానికీ వినడానికీ అలవాటు పడి ఉన్నవాళ్ళం. ఉన్నమాట అనడం ఎలాగో కూడా మరిచిపోయిన వాళ్ళం!! మేం తెలుగు కవితా పాఠకులం!! మాయదారి రాతల తలరాతల బరువుని మోస్తూ నడుస్తున్న వాళ్ళం. ఇలాంటి ఎన్ని పుస్తకాల మోతని మోస్తున్నామో ఆ జగన్నాధునికెరుక. ఇంక కవిత్వమ్ ఏ సన్నటి గొంతుతోనో ఉన్నా ఈ మోతలో పడి అది చాలా దూరంగా పారిపోతూంటే పట్టి తెచ్చుకోలేక నిస్సహాయంగా చూస్తున్నవాళ్ళం!! బతుకు రుచిని వీళ్ళు మరిచిపోయి అలాంటి ఆనందం జీవితంలోంచి పోయినట్టూ బొల్లేడ్పులు ఏడుస్తున్నారు. అదువల్ల మీ ఉన్నమాట మీరన్నమాట నాకు మహా సుఖంగా ఉంది సుమా!!

    రమ.

  1264. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    07/02/2010 12:40 pm

    ఈ సంకలనానికి ఉద్దేశించిన అఫ్సర్ కవితలన్నీ తను చదివి -ఈ పుస్తకానికి, ముందుమాట రాసేసరికి నెల్లుట్ల వేణుగోపాల్ అన్న వ్యక్తికి అప్పటికే ఆంధ్రాలో ఉన్న కష్టాలు చాలక , ఇప్పుడీ పద్యాలన్నీ చదివి బాధ పడగలనా -అని అనిపించినట్లూ, అతని మనసు ఇంకా పాడయినట్లూ నాకు తోచింది. ఆ ముందుమాట అతి దీనం గానూ, ఎంతో భారంగానూ, ఘోరంగానూ, నాకెందుకు అప్పచెప్పారు సంపాదకులీ పని, దీని నుండి నన్ను విముక్తుడిని చెయ్యండి బాబూ -అని వేడుకున్నా, ఆయనకు తప్పనట్లుగా ధ్వనించింది.

    అరే, అఫ్సర్ ఏం రాసిఉంటాడు, ఈయనకు ఇంత డిప్రెషన్ రాటానికి- అనుకున్నా.

    ఆ ‘ముందుమాట’ చాలా బాగా రాశారనీ, అసలు బాగా రాయలేదనీ, బాగాలేదు అన్నవాళ్ళు సంస్కారం లేని వారనీ, అసలు కవీ, ముందు మాట రాసిన జర్నలిస్టూ ఎన్నేళ్ళనుంచో స్నేహితులు – స్నేహితులు స్నేహధర్మం నెరపుకుంటుంటే మధ్యలో బైటి వాళ్ళు మాట్లాడటమేంటనీ – ఇలా చాలా ఆశ్చర్యకరమైన కామెంట్లు నేను పుస్తకం.కమ్ లో కొన్ని నెలల క్రితం చదువుకున్నాను.

    ఇప్పుడు వేలూరి సమీక్ష – మచ్చుకి పరిచయం చేసిన కవితలు చదివితే- ఈ కవితల సంకలనం నాకు చదవబుద్ది కాదు. అప్పటి ఆ ముందుమాట, ఈ సమీక్ష చదివినందువల్ల ఇప్పటికిలా అనిపిస్తున్నది.

    ఇందులో
    ప్రతి ఆలోచనా గరళం
    ఎవరో గిచ్చారంటు గిలగిలలాడె గళం
    తన్ను తాను తన్నుకుంటూ
    ఓదార్పుకై అందరి కాళ్ళ చుట్టూ
    చేతుల సంకెళ్లెందుకో మెలెయ్యటం
    ఎందుకో ఇతనికి
    ఏదీ నచ్చదు
    ఎవరూ నచ్చరు
    ఏదో వేదన ఏదో నిస్పృహ
    ఎవరిమీదో కక్కలేని మింగలేని ద్వేషం
    తనపై ఇంకొందరిపై ఎంతో ఎంతో జాలి, సానుభూతి.
    ఇలా సొంతంగా వెలి వేసుకుంటూ, దుఃఖాలని పోగేసుకుని
    మెలివేసుకుని మెడకు వయొలిన్ తీగల్లా
    ఉరేసుకుంటే చస్తే సైగల్ సంగీతం పలకదు,
    పంకజ్ మల్లిక్ “ఎ రాతే ఏ మౌసమ్ ఎ హసనా హసానా
    ముఝే భూల్ జానా, ఇన్హేనా భులానా భులానా భులానా”
    మృదుత్వాన్ని ప్రేమించి తరించే భాగ్యం అబ్బదు
    గరుకు మాటలు, గరుకు గడ్డం, నిజమే అవీ బాగుంటాయ్
    ఎప్పుడంటే అతని కళ్ళూ, పెదాలూ, మనసూ ప్రేమను వర్షిస్తున్నప్పుడు.
    బార్లనుండీ , పీర్లనుండీ, వార్తాలయాలనుండీ బార్బర్ పార్లర్ల
    నుండీ కవిత్వానికి గరుకు పదాల కోసం కవి వెదక వచ్చునా.
    యక్, షరమ్. షరమ్.
    ఊరి మంగలాడి మొద్దుకత్తి లోతుకు, గడ్డం తెగి ఏదో ఇంత నెత్తురు రావచ్చు
    తుప్పుకోతకు టెటనస్ రావచ్చు
    కవిత్వపు నాజూకు మెహబూబా రాదు కాక రాదు.
    శరీరం బైట ప్రవహింపజేసే రక్తంలో శక్తి లేదు. ఆకర్షణ లేదు.
    జీవితం మధురిమను ప్రేమించేవారికి నల్లనెత్తురు రోత సుమా!
    రోజూ రాతల్లొ చచ్చేవాడికి ఏడ్చేదెవడు
    నవనవలాడే బ్రతుకుకూ, కవితకూ
    ఊరి చివర ఏం పని
    కనిపించే దక్కడ కట్టెలూ, కాష్టాలూ,
    ఏడుపు సంకేతమిస్తే చాలు ఎగిరొచ్చే కాకులూ
    వినిపించే దక్కడ కుళ్ళు రుచి మరిగిన
    రాబందుల రెక్కల తటతటలు.

    క్షమా కీజియే. It is a matter of life and death. వెంటనే నా ‘పూలరధం’ మళ్ళించి, ఎక్కడ ఉద్యానవనాలు, ఎక్కడ సితారు ధ్వనులు, సుందర భావనలు ఉన్నవో అక్కడికి వెళ్ళి పూలగాలులు పీల్చి జీవించాలి.

    లైలా

  1265. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/02/2010 1:47 am

    ముకుందరామారావు పదచిత్రాలు అనేకమ్ కొత్తగా ఉన్నాయి. అఫ్సర్ రాసిన కవిత కన్నా మెరుగైన భావాలున్నా మరెందుకనో వేలూరి వారు అక్కడ ఒక గొంతుకతో మాట్లాడి ముకుందరామారావు కవిత్వమ్ పుస్తకాన్ని సమీక్షచేసేటప్పటికి మాత్రమ్ ఒకలాంటి ఉదాశీన వైఖరిని తన సమీక్షలో చూపించారు.ఇదీ సమీక్ష చేసేవారి వైఖరి. అయినా పుస్తక సమీక్షలు తెలుగున వాస్తవంగా ఉన్నదెప్పుడు గనకా??

    రమ.

  1266. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/02/2010 1:28 am

    పాశ్చాత్యదేశాల్లో పత్రికలు ఇంకా ప్రచురణకర్తల మీదా ఒక ముద్ర ఉంది. అదేమంటే అక్కడ వాళ్ళు కావాలంటే అకవులని హడావుడి చేసి కవులుగా ప్రచారం చేయగలరు..లేదా కవులని తయారూ చేయగలరు. అలాగే ఒక మంచి పుస్తకాన్నీ ఒక మంచి రచయితనీ కావాలనుకుంటే నొక్కేయనూగలరు అని. దీనికి సంబంధించి పశ్చిమ దేశాల పత్రికల మీదా ప్రచురణకర్తల మీదా బోలెడన్ని సంఘటనలూ ..కధలూ ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ వేలూరి వేంకటేశ్వర రావు గారి సమీక్ష చదవగానే “ఈమాట” మీద కూడా అలాంటి ప్రభావం ఏమన్నా ఉందా? అన్న సందేహం వచ్చింది నాకు. అఫ్సర్ రాసిన కవిత్వం సమీక్షకుడు చెప్పిన చాలా అభిప్రాయాల్లోకి ఏకోశానా ఇమడలేదు. కవిత్వం పేరుతో ఉత్త హడావుడి తప్ప మనసుని కదిలించి చాలాకాలం పాటు వెన్నాడి గుర్తుపెట్టుకోగల ఒక్క వాక్యమైనా లేని ఈ పుస్తకాన్ని అందరూ తప్పక సేకరించుకోవలసిన పుస్తకంగా సమీక్షకుడు కితాబు ఇవ్వడం చాలా కృతకంగానూ pompus గానూ ఉంది.

    రమ.

  1267. నువ్వు గురించి ప్రదీప్ గారి అభిప్రాయం:

    07/01/2010 8:03 am

    కవిత చాలా బాగా రాసారండి 🙂 నాకు చాలా నచ్చేసింది. Super అంతే.

  1268. కవితావిర్భావం గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    06/30/2010 2:47 pm

    కవితావిర్భావం ” పై తమ అభిప్రాయం తెలిపిన సాహితీ మిత్రులందరికీ
    కృతజ్ఞతలు.

  1269. ప్రేమ కవితలు గురించి purna(mani) గారి అభిప్రాయం:

    06/24/2010 12:33 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  1270. ప్రేమ కవితలు గురించి chandu గారి అభిప్రాయం:

    06/21/2010 6:33 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  1271. తడిస్తే కదా తెలిసేది! గురించి SATYA NARAYANA గారి అభిప్రాయం:

    06/20/2010 4:47 pm

    మీ కవిత చాలా బాగుంది. Very good కవిత. ఇలాగే continue చేయండి.

  1272. జీలకర్ర – బెల్లం గురించి B.Narendrababu గారి అభిప్రాయం:

    06/16/2010 3:30 am

    అద్భుతం. అవును నిజం. ఇన్ని రోజులు ఈ కవిత ఎందుకు చదవలేకపోయానా అనిపించింది.

  1273. శరణాగతి గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    06/07/2010 3:52 am

    చాలా కాలం తర్వాత భావకవిత్వపు పోకడలతో మళ్లీ ఇలాటి పద్యాలు రావటం ముదావహం. వెల్చేరు గారు నన్నయ గారి నుంచి నేటి వరకూ వచ్చిన అన్ని రకాల పద్యరచనా ప్రక్రియలు ఏకకాలంలో కనిపించే సాహిత్యం బహుశా తెలుగుభాషలోనే వున్నదని ఒకచోట అన్నారు. ఈ పద్యాలు చదువుతుంటే “వైతాళికులు” సంకలనం లోని అనేక ఖండికలు గుర్తుకొచ్చాయి. ఐతే ప్రస్తుత ఖండికలో వాడిన సాధనాలలో కొత్తదనం లోపించిందనే అనిపిస్తున్నది. ఉదాహరణకు, ప్రేయసి కోసం ప్రకృతి లోని వృక్ష పక్ష్యాదులని అర్థించటం, అవి ఆమె మాకన్నా సుకుమారి అని, కళామూర్తి అని బదులివ్వటం, కథంతా గడిచాక అది కల అని ముగించటం – ఇది ఎన్నో సార్లు నడిచిన దారే. ఛందస్సులో ప్రయోగాలు చెయ్యటం కూడ అలాటిదే. భావాలు కూడ పాతవే అనిపిస్తున్నాయి. అంటే, అవే కవిసమయాలు, పద సంపుటుల ప్రయోగాలు. ఈ ఖండికను తక్కువ చెయ్యటం కాదు కాని ప్రతిభావంతులైన దేశికాచారి గారు భావ కవితా మార్గాన్ని ఇంకొన్ని కొత్త పుంతలకు విస్తరిస్తే ఇంకా బాగుంటుందేమో !

  1274. శరణాగతి గురించి Gannavarapu Narasimha Murty గారి అభిప్రాయం:

    06/05/2010 9:14 pm

    అళి అంటే తుమ్మెద. మదాళి రవంబులు అంటే మదించిన తుమ్మెదల ఘోష అని నేనర్ధం చేసుకొన్నాను.
    ప్రతి దినము ద్రాక్షే ఎలా తినగలము? కష్టమయినా నారికేళ పాకము బాగుంటొంది. విరివిగా భాషలో పదజాలమున్నపుడు విన్నా,వాడినా, అలవడి అవుతొంది. అందులో గమ్మత్తుంది. శ్రీశ్రీ గారి కవితలకు కూడా నాకు నిఘంటువు సహాయము కావాలి.
    దేశికాచార్యులు గారూ మీ కవితల సౌధానికి తాళాలు యిచ్చినందులకు ధన్యవాదములు.

  1275. ఇంకా ఎందుకు మిగిలావు గురించి Raghuram గారి అభిప్రాయం:

    06/01/2010 3:18 pm

    ఇస్మాయిల్ కవిత్వపు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయొ చెప్పగలరా దయచేసి…!!

  1276. ఇంకా ఎందుకు మిగిలావు గురించి gana గారి అభిప్రాయం:

    05/28/2010 12:33 pm

    కవితాత్మక నింద లేక నిరసన.

    ‘ఆది భిక్షువు వాడినేది కోరేదీ’ లేక
    ‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ‘ కన్నా
    మీ కవిత ఘాటుగానే ఉంది.

    ఏదనుకున్నా బాగా వ్రాసారు.

  1277. మరో ప్రపంచం పిలిచింది గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    05/28/2010 11:52 am

    1979లో బరంపురంలో అఖిలాంధ్ర రచయితల సమ్మేళనం మార్చి 20-22 ల మధ్య జరిగినప్పుడు మహాకవి ‘ అల్లూరికి వారసుడా శ్రీశ్రీ కవితా లాలసుడా, దేర్ ఫోర్ ఊగరా ఊగరా’ అని ప్రసన్న వదనంతో చదవడం, ‘ఒక్క మతితోనే సతమతమౌతుంటే నాకీ బహు మతులెందుకూ’ ‘ అన్న పానుగంటి వారి జోక్ ని వినిపించి ‘సాక్షి’ వ్యాసాలు ప్రస్తావించడం- ఇవన్నీ మననం చేసుకుంటుంటే అటువంటి ‘మూవింగ్ ఎన్ సైక్లోపీడియా’ కవి 20వ శతాబ్దంలోనే కాదు, ఇప్పుడూ లేడు అనిపిస్తుంది. మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది- ఈ గేయం ఎన్నో రూపాలతో సినీ గీతంగా మళ్ళీ మళ్ళీ శ్రీశ్రీ కలంనుండే రావడం బహుశ: గిన్నీసు వారి దృష్టికి రాలేదేమో. రణ భేరి చిత్రంలో కొంత భాగం ‘మార్చింగ్ సాంగ్’ గా, మిగతా భాగం బుర్ర కథ గా మలిచారు. ఇవన్నీ ఒక చోటికి తీసుకు రాగలిగేది, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, ఈ మాటే!
    -వేగోతారా

  1278. సుగమం గురించి రాజేష్ దేవభక్తుని గారి అభిప్రాయం:

    05/20/2010 11:08 pm

    ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు మరియు ఇప్పటి మానవ సంబంధాలను అద్దం పట్టిన కవిత. ఈ కవిత చదవడం నాకు బహుగా నచ్చింది. చాల బాగుంది.

  1279. సుగమం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    05/16/2010 11:04 am

    సంపాదకులకు:

    టి. శ్రీవల్లీ రాధిక -కవితలన్నీ బాగున్నాయి. వీరు రాసిన “అర్హత” కథ ఇంతవరకూ ఈ పత్రికలో చదివిన కథలన్నిటిలోకీ నాకు నచ్చిన కథ.
    “నా స్నేహితుడు” అన్న కథ ఇక్కడ ప్రచురించగలరా? థేంక్స్.

    లైలా

  1280. ఉత్తమాయిల్లాలు గురించి చాకి రేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    05/15/2010 8:54 pm

    మాలతి గారూ అడిగారు కాబట్టి చెప్పే సాహసం చేస్తున్నాను.
    ఈ కథలో – పైనించి కింద వరకు కనపడేది రంగశయనం వ్యక్తిత్వం. మిగిలిన వారందరూ కూడా రంగశయనం మీద ఒక సారి టార్చి లైటు వేసి మనకు చూపించి వెళ్లిపోతారు. ఇంతమంది భుజాల మీదుగా రంగశయనం మీద దాడి చేశారు కాబట్టి మీకు రంగశయనం పట్ల చాలా అయిష్టం ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను. రంగశయనాన్ని మూర్ఖుడుగా చూపించటం వరకే ఈ కథ పరిమితమయితే చెప్ప వలసినదేమీ ఉండదు. కానీ కథ చివర్న ఆ యువకుడి అభిప్రాయం ఆ పెద్దమనిషికి అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు అన్న మాట వచ్చింది కాబట్టి, ఆ మూర్ఖత్వానికి కారణం ఆయన ఒక తరానికి చెందిన మనిషి కావటం అన్న అభిప్రాయం కలుగుతుంది. నిజానికి కథలో ఆయన తరానికి చెందిన వారు మరెవరూ కనపడరు. ఎదురింటి ఎల్లమ్మ అనే ఒక మనిషీ, పక్కింటాయన ఇంకొకరెవరో తప్ప! స్పష్టా స్పష్టమైన జ్ఞాపకాల ద్వారా తల్లి వ్యక్తిత్వమేమిటో కొంత కనపడుతుంది. (అది కథ చివర్లో కొడుక్కి సాక్షాత్కారమవుతుందని మీరంటారు – ఆ మాటని మీ మాట భరోసా మీద తీసుకుంటాను) ఆ అభిప్రాయం కలగగానే మళ్ళీ చదివితే దాన్ని నిరూపించే ఆధారాలు ఇంకేవీ కనపడవు. చివరికి రంగశయనం పట్ల మీకు తీవ్రమైన అయిష్టమో అసంతృప్తో ఉన్నదని , అందువల్లనే మీరు ఆ పాత్రని పరమ మూర్ఖుడిగా, స్వార్ధ పరుడుగా చిత్రీకరించారనీ అనిపిస్తుది. ఇతర పాత్రల పట్ల మీకు శ్రద్ధ లేదనీ అనిపిస్తుంది. వాళ్ళ పేర్లు కూడా వెతుక్కుని చూసుకుంటే తప్ప తెలియవు. ఈ కథని నేను రాస్తానని అనుకోను కానీ, ఇలాంటి కథ రాసే పని పడ్డప్పుడు, పాత్రల పట్ల నాకున్న రాగద్వేషాలకు మూలం ఏమిటో తేల్చుకున్నాకనే రాస్తాననుకుంటాను.

    ఇక పోతే, రివ్యూ విషయం లో – నిజానికి కథలకి పీర్ రివ్యూ సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. కథలకి నప్పేది వర్క్ షాపు పద్ధతి. కథల్లోనూ కవితల్లోనూ రచయితలు తనకి చాలా ఆంతరంగికమైన విషయాలతో పని చేస్తారు. వాటిని మలిచే ప్రయత్నంలో ఇంకొకళ్లెవరైనా పాల్గొనాలంటే – దానికి తగిన వాతావరణం చాలా జాగ్రత్త గా ఏర్పరుచుకోవాలి. పీర్ రివ్యూ తప్ప మరొక మార్గం లేదనుకుంటే – మీకు ఎటువంటి విమర్శో, అభిప్రాయమో కావాలన్నది ఆలోచించుకుని ముందుగానే మీరు చెప్తే ఇతరులకి తమ తమ హద్దులు పరిమితులు, దేని గురించి మాట్లాడ వచ్చును, ఏది అంగీకారం కాకపోవచ్చును ఇట్లాంటివి తెలుస్తాయి. ఆ పైన మీకు పనికొచ్చే విధంగా విమర్శించటానికి వీలవుతుంది.

    ఉదాహరణకి, ఈ కథ గురించి నేను పైన చెప్పినది మీకు ఏరకంగానూ ఉపయోగ పడక పోవచ్చును. మీరు రాసిన కథ పట్ల అందులో పాత్రల పట్ల మీకు ఏ అభిప్రాయం ఉందో, మీరు విమర్శనించి ఏమీ ఆశిస్తున్నారో నాకు తెలియక పోవటం వలన వచ్చిన చిక్కు ఇది. 🙂

    ముందే చెప్పినట్టుగా, అడిగారు కాబట్టి చెప్పే సాహసం చేశాను. అన్యధా భావించరనే ఆశ.

  1281. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    05/14/2010 12:27 am

    బాబ్జీలు గారూ

    3. నాగార్జున కవిత్వాన్ని పరిచయం చేసే చిన్న వ్యాసంగానే మొదలు పెట్టాను. మొదట్లోనే ఒక ప్రశ్న ఎదురయింది. నాగార్జుననే ఎందుకు పరిచయం చేస్తున్నాను అని. అది తేల్చుకునే సరికి, తెలుగు కవుల రామాయణంలో నా పిడకల వేట ఏమిటి అని అనుమానం వచ్చింది. ఇదంతా సాఫీగా చిక్కులు లేకుండా రాయటానికి ఉన్న టైము చాలా తక్కువ. మే నెల సంచికకి పంపక పోతే ఇది మళ్ళీ రాయలేను అనిపించింది. పీట ముడితో సహా పంపించేశాను. చదవటానికి వీలుగా లేక పోతే సంపాదకులు చెప్తారు, అది దాటితే, చదివిన వాళ్ళలో ఎవరో ఒకరు ముడి విప్పటానికి సహాయం చేస్తారులే అన్న మొండి ధైర్యం తప్ప వేరే ఏమీ సంజాయిషీ చెప్పుకోలేను. క్షమార్హం కాదంటే చెప్పండి.

    5. బతుకునీ కవిత్వాన్నీ కేవలం మార్క్సిస్టు దృక్పథం తోటే అర్ధం చేసుకోవటం సాధ్యం కాదు అనే కదా బాలగోపాల్ చెప్పినది కూడానూ?

    చెట్టంత కొడుకు చచ్చిపోతే కుమిలి పోతున్న తండ్రికి గతి తార్కిక భౌతిక వాదం ఎందుకు పనికొస్తుంది అని అడగొచ్చు. నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు, మా నాన్న ఎందుకు అప్పుల్లో మునిగి పొయాడు అని అడిగే రైతు కొడుకుకి ఏదో ఒక విశ్లేషణ (మార్క్సిజమే కానక్కరలేదు) లేకుండా సమాధానం ఎట్లా చెప్తావు అని కూడా అడగొచ్చు. అప్పుల వాళ్ళు చేసిన అవమానం భరించలేక తండ్రి ఉరి వేసుకుంటే ఆ కొడుక్కి సమాధానం చెప్పాలంటే మన దగ్గర ఏమున్నది అన్నది ప్రశ్న అయితే – దేన్ని ఎట్లా అనుసంధానం చేసుకోవాలి అన్న ప్రశ్న తప్పని సరే కదా?

    మీ ప్రశ్నలు 2 & 4 లకి జవాబు కొంచెం తీరుబడిగా చెప్పాలి. ఒకటి రెండు రోజుల్లో. 🙂

  1282. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి baabjeelu గారి అభిప్రాయం:

    05/13/2010 11:06 am

    ఉపేంద్ర గారూ,
    సంభాషణని తెలుగులో “డైలాగు” అంటారని మర్చిపోయేను. క్షమించండి.
    కానీ “డైలాగు” ఇద్దరి మద్దెనే కదా నడుస్తుంది? ఇదీ వొదిలీయండి.
    మీరిచ్చిన లింకులు చూసేను. మంచి లింకులు.

    1. గులాబీ ఛూడియాఁ: బాబా కవిత చదవడం మొదలెట్టకముందే ఆ పిల్ల తల్లి చనిపోయిందని చెప్పీసేరు. దాంతో “మున్నీ కా అమానత్” అంటే కొంచెం అర్ధఁవయ్యింది. ఇది మీరిచ్చిన లింకు చూడక ముందు “క్రిస్టల్ క్లియర్” గా అర్ధవఁవ్వలేదు. ఇది చూసేక ఈ మాట లొ ప్రచురించీ కవితలని పాత భారతి టైపులో కాకుండా ఆడియో వో వీడియొ వో ఇస్తే, అందులో ఆ కవి పూర్వా పరాలు చెప్పి కవిత చదివితే లేపోతే ఇంకోళ్ళతో చదివిస్తే బాగుంటుందేమో? ఇదీ వొదిలీయండి. ఇది వేవే గారు చూసుకోవాలి.

    2.బాలగోపాల్ గారి లింకు(లు): చరిత్ర గట్రాల వేపు వెళ్ళలేదు, దమ్ము లేక. రెండో దాంట్లో (ఎవరో శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ) కన్యాశుల్కం మీద ఆయన అభిప్రాయం (తెలుగులో కామెంటు) మీద మీ అభిప్రాయం? అంటే మీరేవంటారూ అని. ఏదో ఒకటి అనండి దయచేసి. మనద్రుష్టవేఁవిఁటంటే మనం కన్యాశుల్కాన్నీ, మహాప్రస్ఠాన్నీ దాటి కరెన్సీ లోకి రాకపోవడం. లేపోతే ఆ రెండూ ఇంకా కరెన్సీ గా చెలామణీ లో వుండడం. సరిగ్గా రాయలేకపోతున్నాను. సాధన చేస్తాను, సరిగ్గా రాయడం. కానీ అర్ధం చేసుకుని ఈ “తీరని దాహాన్ని” తీర్చడానికి ప్రయత్నించండి అంటే తెలుగులో ట్రై చెయ్యరూ, మరోసారి దయచేసి!

    3. మీరు మామూలుగా నాగార్జున గారి కవిత్వాన్ని పరిచయం చేసి వుంటే ఈ వ్యాసం మరోలా వుండును. దానిని ” ఆ రెండు డైలాగు” లతో ముడి పెట్టి పీట ముడి వేసేరని అనుకుంటున్నాను. కాదని మీరనుకుంటే మా అద్రుష్టం.

    4. మిగిలిన భారతీయ భాషల్లోని కవులు: మీరన్నట్టు తెలుగు లెస్స అన్న గీర కాదు వాళ్ళని పట్టించుకోపోవడం. వారందరికన్నా మన తెలుగు కవులు; అస్మదీయులైనా, తస్మదీయులైనా; ఒకాకు ఎక్కువే. కాదని నిరూపించండి. దండగ అని వొదిలీకండి దయచేసి.

    5. చివరగా: బతుకునీ, కవిత్వాన్నీ మారని మార్క్సిస్టుల ద్రుక్పధం తోనో, మారిన మార్క్సిస్టుల ద్రుక్పధం తోనో చూడ్డం తప్ప వేరే దారి లేదా?
    బాబ్జీలు

  1283. కవితావిర్భావం గురించి Satya గారి అభిప్రాయం:

    05/13/2010 9:44 am

    కవికి కవిత్వం, రచయితకు కథ, ఆటగానికి మైదానం, నాట్యానికి పాటగానికి వేదిక… దేనికైనా అవకాశం, సమయం, సందర్భం కావాలి…అప్పటిదాకా సుషుప్తావస్థలో వున్నవి వెలుగులోకి రావాలి. వచ్చిన అవకాశం చేజారనీయకూడదు, చేజారినా పట్టు విడవకూడదు.

    కవిత చాలా బాగుంది.

    –సత్య

  1284. మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి Gannavarapu Varaha Narasimha Murty గారి అభిప్రాయం:

    05/11/2010 10:42 pm

    చంద్ర గారి కవిత బాగుంది.

    మిణుగురు పురుగుల దివ్వెలఁ
    ప్రణయంబులు ప్రజ్వరిల్లి పరిణతి జెందున్
    తృణముల నిసుకల తిన్నెల
    మణిమయ ప్రభవమ్ము లవియె మమతలు పొంగన్.

  1285. సుగమం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/10/2010 10:55 am

    బాధాతప్త కలత, కాదు కవిత చదివాక రెండు మాటలు రాయాలనిపించింది.

    మలినం లేని స్నేహం దొరకనప్పుడు కాదు
    తానొరులకు పంచినప్పుడే్ మహిలో
    మహర్జాతకం అనిపిస్తుంది

    మరణానికి ముందు కాదు తరువాతైనా
    మనుషులను వదలక నడిపించే ఆత్మీయతే
    మానవత్వానికి దారి సుగమంచేసే మహద్భాగ్యం అనిపిస్తుంది
    ===========
    విధేయుడు
    శ్రీనివాస్‌

  1286. శరణాగతి గురించి sesha kumar kv గారి అభిప్రాయం:

    05/10/2010 3:47 am

    తిరుమల కృష్ణ దేశికుడు దివ్యము గానొక అంశముం గొనిన్
    తరుణి తలంపు తోడ కవితామృత ధారను చిల్కరించె నీ
    సరణిని వ్రాసి సత్కవులు ఛందము కందము గూర్చు చుండగా
    స్థిరముగ నాంధ్ర పద్యకళ తేజము లీనదె శారదాంశమై

    చక్కని భాషయు భావము
    మక్కువ పెన వేసి కొనగ మకరందము గా
    దక్కిన దేశికుని కవిత
    నిక్కము గా తెన్గు తీపి ‘ఈమాట’ కిడెన్

    శ్రీమాన్ తిరుమల కృష్ణ దేశికా చార్యుల వారికి,వారి కవితకు సాష్టాంగ ప్రణామములు
    కే.వీ.శేష కుమార్

  1287. సుగమం గురించి sivasankar గారి అభిప్రాయం:

    05/09/2010 10:01 am

    అస్తవ్యస్తముగా ఉన్న ప్రస్తుత మానవ సంబధాలకి ఈ కవిత ఒక నిదర్శన లా ఉంది.
    బాగుంది అని చెప్పి సిగ్గుపడాలా??
    యేది యేమైనా రాసిన వారికి ధన్యవాదములు.

    శివ

  1288. ప్రేమ కవితలు గురించి J.sudha sekhar గారి అభిప్రాయం:

    05/09/2010 4:24 am

    నాకుఈ కవితలు… మరిచిన క్షణాలు…మల్లి క్షణాలుగా గుర్తుకు వస్తునాయ్. ok T…..you.

  1289. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    05/08/2010 11:57 pm

    @ వంశీ గారు
    థాంక్స్. దేవనాగరి లిపి చదవగలిగితే నాగార్జున కవిత్వం అంతర్జాలంలో చాలానే దొరుకుతుంది. వ్యాసం చివరన ఉన్న వీడియో లింకులు చూడండి. కవిత్వానికి దృశ్యాలు జోడయితే, అదీ ఎవరయినా చదువుతుంటే వినగలిగితే, ఆ కవిత వెనక ఉన్న కథలు ఏమిటో తెలుసుకోగలిగితే – లిపిలో అర్ధం కానీ విషయాలు చాలా మనసుకి పట్టుకుంటాయి.

    @ బాబ్జీలు గారు

    మీ మొదటి ప్రశ్నకి సమాధానంగా ‘నా ప్రాణం కుదుట బడుతుంది’ అని చెప్తే ఊరుకుంటారా? 🙂

    క్లుప్తంగా చెప్పాలంటే సమాధానం అదే. కవిత్వం ఎట్లా చదవాలి, అర్ధవంతంగా ఎట్లా బతకాలి అని నేను పడే ఆరాటంలో నాకు పనికొస్తాయనిపించి నేను పేర్చుకుంటున్న సంభాషణలు అవి. సంభాషణలు అంటే నా దృష్టిలో కలిసి వెతుక్కోవటం. యుద్ధంలో కూడా సంభాషణ – సంవాదం అవసరమే అన్న మాటకి ఎంతో దూరం వెళ్ళనక్కర లేదు, మన పురాణాల నిండా దానికి ఉదాహరణలు కొల్లలుగా దొరుకుతాయి. పంచాయితీలో జరిగేది కలిసి వెతుక్కోవటం కాదు. ఇరు పక్షాలూ వారి వారి వాదనలు గెలవాలని అనుకుంటారు. అక్కడ ఎవరో ఒకరు తీర్పు చెప్పవలసిన అవసరం ఉంటుంది. సంభాషణల మీద కూడా తీర్పు అవసరం అనే విచిత్ర వైఖరి మనలో ఇంత లోతుగా ఎట్లా పాతుకు పోయింది అన్నది ఆలోచించ వలసినదే.

    కవిత్వం చదవటానికీ రాయటానికీ అన్నీ వేళలా, అన్నీ చోట్లా ఒకే మార్గం ఉండదు కదా! మరి అట్లాంటప్పుడు – ఈ రోజున మనకి ఇక్కడ పనికొచ్చే మార్గాలని ఎట్లా తయారు చేసుకోవాలి? అవి అందరికీ పనికొస్తాయని ఎట్లా చెప్పగలము – అన్న ప్రశ్నకి సమాధానం పెద్ద కష్టం కాదు. వెతుక్కుంటూ పోతుంటే, నలుగురూ మాట్లాడుటూంటే, ఆ సంభాషణల్లోంచి కొత్త దారులు వస్తాయి అవి నలుగురికీ పనికొస్తాయి. నాకు తోచేదేమంటే, అసహనం, ఏదో ఒకటే రుజుమార్గం ఉంటుందనీ అది మన లోపల్నించి తన్నుకుంటూ వస్తుందనీ అనుకోవటం పొరపాటు అని. కుటుంబరావు గారు – ఐశ్వర్యం నవల లోనే చెప్పేశారు కదా – మా పిల్లల తలల్లో వాల్వులుంటాయి. అందులోంచి ఐడియాలు బయటికి వస్తాయే కానీ లోపలికి వెళ్ళవూ అనీ. ఆ పిల్లలు ఎవరో కాదు. మనమే. దానికి విరుగుడుగా సంభాషణ అన్నదే ఒక సామాజిక ప్రక్రియగా సాధన చేయ వలసిన అవసరం చాలా ఉందనుకుంటాను.

    మీరు అడిగినది – సంభాషణల్లోని విషయం గురించి కాదు కాబట్టి – ఇంత కన్నా ఏమీ చెప్పాలో నాకు తోచటం లేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నా గురువుల్లో ఒకాయన అప్పుడప్పుడు ఒక మాట చెప్తూంటాడు. 1990 ప్రాంతంలో ఎవరో ప్రపంచ పటం అనే జీగ్ సా పజిల్ ని అమాంతంగా పైకి విసిరేశారు. కింద పడ్డ ముక్కలు ఏరుకుని మళ్ళీ ఎట్లా కూర్చుకోవాలా అన్నదే అసలు ప్రశ్న అని. ప్రపంచ పటం ముక్కల్ని మళ్ళీ పేర్చుకోవటం అంటే మనల్ని మనమే మళ్ళీ పేర్చుకోవటమే కదా? కవిత్వాన్ని చదవటం కొత్తగా నేర్చుకోవటమన్నా, రాయటం కొత్తగా నేర్చుకోవటమన్నా – ఆ ప్రయత్నంలో భాగాలే. మేము దీనికి అతీతులమని ఎవరయినా అనుకుంటే ఏమి చేయగలుగుతాము? అలాంటి భ్రమలని శాశ్వతంగా పట్టుకుని వేళ్ళాడటం ఎవరికీ సాధ్యం అవుతుందనుకొను.

  1290. కవితావిర్భావం గురించి మోహన రావు గారి అభిప్రాయం:

    05/08/2010 7:52 pm

    చాలా బాగుంది మీ కవిత. వేచి ఉన్న కవితా తరంగం లేచి వచ్చే క్షణాలకై ఎదురు చూడడం కూడా ఓర్పులో ఒక నేర్పే. చివరి పదం ఆకాశం కన్నా భూమి అంటే బాగుంటుందేమో? విధేయుడు – మోహన

  1291. గుండుగొమ్ములనుమానం – 3 గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    05/08/2010 6:15 pm

    నాకు చాలా నచ్చిన అతికొద్దిమంది తెలుగు కథకుల్లో కనకప్రసాద్ ముఖ్యులని ఇదివర్లో చెప్పాను. అదేమాట మరోమారు అనేందుకు ఇది అవకాశంగా తీసుకుంటాను. అతని సునిశిత పరిశీలన, దాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించటానికి అతను ఎంచుకునే భాష మిరుమిట్లుగొలిపిస్తాయి. తొలిసంచిక లోని “బర్సాత్ మే బిల్లీ” నుంచి నేటివరకూ అతని కథల్లో పాత్రలు, వాటి పరిసరాలు ఎంత పరిపూర్ణంగా, మల్టీ డిమన్షనల్ గా వుంటాయో ! అలాగే అతని కవితలూ. ముచ్చటగొలిపే పదాలు, పదబంధాలు, భావాలు.

    ఇక ప్రస్తుతానికి వస్తే – బహుశ సాహిత్యం మొదలైనప్పట్నుంచీ వున్న ప్రశ్నేనేమో “ఏది నిజమైన సాహిత్యం? ఏది ఉత్తమం? ఏది కాదు?” అనేది. నా మట్టుకు నా అనుభవం ఉన్నతసాహిత్యసృష్టి ఒక అలౌకికక్రియ అని, అలా సృష్టి ఐన సాహిత్యాన్ని అనుభవించటానికి పాఠకుడు కూడ ఎంతో కొంత అలాటి స్థితిని పొందాలని. అలా సృష్టికర్తా సృష్టిద్రష్టా ఒకే అనుభూతిస్థితిని కొంతవరకైనా కొన్నిక్షణాలపాటైనా పంచుకుంటారని. ఇలా సృష్టి ఐన సాహిత్యం నా దృష్టిలో “అప్రయత్నపూర్వకంగా” వచ్చినది, అలా కానిది “ప్రయత్నపూర్వకంగా” వచ్చినది. మొదటిది బుద్ధిజనితమైతే రెండోది మేధోజనితమో మనోజనితమో ఔతుంది. ఈ చివరి రెంటిలోనూ మేధోజనితం మనోజనితం కంటే ఉన్నతంగా వుంటుందని నేను అనుకుంటాను.

    కనుక, పాఠకుడిగా ఒక రచనని చదువుతున్నప్పుడు ఎవరికి వారే బహుశ అసంకల్పితంగా ఎక్కడెక్కడ అది ప్రయత్నపూర్వకమో ఎక్కడెక్కడ అప్రయత్నపూర్వకమో “గ్రహిస్తారని” నా నమ్మకం. (కనకప్రసాద్ అనే జూటాకోరుతనం ప్రయత్నపూర్వకంగా ఎవరి మెప్పు కోసమో లేక మరెవరి భయం వల్లనో లేక తలియని విషయాన్ని తెలిసినట్టు బుకాయిస్తూనో రాసేరాతలలో కనిపిస్తుందని నేననుకుంటాను.) అలాటి గ్రహింపు నుంచే ఎవరికి వారు ఆ రచన గుణాగుణాల గురించిన అభిప్రాయాలు ఏర్పాటుచేసుకుంటారు. అనుభవజ్ఞులైన విమర్శకులు, నిశితశోధన వున్న పాఠకులూ అలా గ్రహించిన రచనాభాగాల గురించిన వారి అనుభూతిని మామూలు భాషలోకి తర్జుమా చేసి ఇతరులతో పంచుకోగలుగుతారు (సోమరిపోతులు ఇతరుల అభిప్రాయాలు విని వాటినే మళ్లీ తమ భాషలోనో లేక అంత ఓపిక కూడా లేకపోతే ఇతరుల భాషలోనో వెళ్లగక్కుతారు).

    ఏతావాతా ఏ రచనా సార్వత్రికంగా సార్వకాలికంగా పాఠకులందరికీ ఒకే విధంగా అనుభూతినివ్వటం అసాధ్యం అని నేను అనుకుంటాను. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఒక రచనకి “నిజమైన” – అంటే దాని సృష్టిస్థితితో కొంతైనా తాదాత్మ్యం చెందగలిగిన – పాఠకులు చాలా కొద్దిమందే. కొండొకచో ఎవరూ లేకపోవచ్చు కూడా – ఓ కవిగారు తన కవిత గురించి వ్యాఖ్యానిస్తూ “అది రాసినప్పుడు ఇద్దరికి అది తెలుసు – ఒకరు నేను, మరొకరు దేవుడు; ఇప్పుడు ఒకరికే తెలుసు, అది నేను కాదు” అన్నట్టు. ఒక రచన విషయంలోనే ఇలా వుంటే ఇక ఒక రచయిత లేదా కవి తన జీవితకాలంలో చేసే రచనలన్నింటినీ కలిపి టూకీగా గుణనిర్ణయం చేసెయ్యటం దుడుకుతనం అని నా ఉద్దేశం. అలా చేసెయ్యటమే కాకుండా మిగిలిన పాఠకులంతా ఆ నిర్ణయాన్ని ఆమోదించి తీరాలనీ, ఆమోదించకపోవటం వాళ్ల సాహిత్యాస్వాదనాదారిద్ర్యానికి నిదర్శనమనీ తిట్టిపొయ్యటం ఘోరం, దౌర్భాగ్యం, దౌర్జన్యం.

    ఒక చక్కని విషయాన్ని లేవనెత్తి దాని గురించి అద్భుతమైన వ్యాసాన్ని రాసిన కనకప్రసాద్ ని ఎంతగానో అభినందిస్తూ –

    రామారావు

  1292. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి baabjeelu గారి అభిప్రాయం:

    05/08/2010 7:15 am

    ఉపేంద్ర గారూ,
    “ఆ రెండు” సంభాషణలూ సవ్యంగా జరిగితే ఏవిఁటవుతుంది?
    కవిత్వం ఎలా చదవాలో తెలుస్తుందా? కవిత్వం ఎలా రాయాలో తెలుస్తుందా?
    “ఆ రెండు” సంభాషణలూ ఎవరు చేయాలి?
    అసలు ఎందుకు చెయ్యాలి? చెయ్యకపొతే ఏవిఁటి నష్టం?
    ఆ పంచాయతీ తీర్పు ని ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోకుండా కవిత్వాలు రాసీవాళ్ళని ఎవరేం చెయ్యగలరు?

    బాబ్జీలు

  1293. ‘వికృతి’ ఉగాది గురించి sesha kumar kv గారి అభిప్రాయం:

    05/08/2010 6:13 am

    వ చ న కవిత్వమా లేక కవిత్వ వచనమా అనిపించింది కవిత చదివాక. భాషాసృష్టి గమ్మత్తు గా ఉంది. English Literature లో PROEM అనే మాట ఉంది. PROSE+POEM కు బదులుగా వాడుతారు, అలా ఉంది. “విపరీతపు లోతులలో భాషా ప్రయోజనము” ఏమిటో!.నేను రమ గారితో ఏకీభవిస్తున్నాను.

  1294. పాఠకులకు సూచనలు గురించి Madhu గారి అభిప్రాయం:

    05/08/2010 12:18 am

    నేను కూడా ‘ఈ మాట’ కు నా కవితలు పంపాలనుకుంటున్నాను. ఎలా పంపాలో వివరాలు తెలియజేయగలరు. కృతజ్ఞుణ్ణి.

    [‘రచయితలకు సూచనలు’ చూడండి. – సం]

  1295. ఇంకా ఎందుకు మిగిలావు గురించి Madhu గారి అభిప్రాయం:

    05/08/2010 12:07 am

    విశ్వ సాహితి గారూ…. చాలా బాగుంది మీ కవిత

  1296. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    05/07/2010 5:59 am

    “పాడిందే పాడరా…” అన్న శీర్షిక వ్యాసానికే కాకుండా కామెంట్లకి కూడా సరిపోయింది! 🙂 చాలావరకూ అందరూ ఒక్క “పీర్ రివ్యూ” విషయం మీదనే ఎందుకంతగా మల్లగుల్లాలు పడుతున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి ఇంటర్నెట్లో ఒకటిరెండు ఇతర తెలుగు పత్రికలు కూడా ఈ పీర్ రివ్యూ పద్ధతిని పాటిస్తున్నాయి. ఇది ఈమాటకే ప్రత్యేకమైన విషయం కాదు.
    ఆలోచించాల్సిన ముఖ్యవిషయాలు మరికొన్ని కూడా ఉన్నాయ్‌. నాకు తోచినవి కొన్ని ఇక్కడ వివరిస్తాను. కిందనంచి మొదలుపెడతాను. వేలూరిగారు చెప్పిన కథ తమాషాగానే ఉన్నా, దానిబట్టి నాకర్థమైనదేమిటంటే, కొత్తదనమంటే వారి దృష్టిలో వాంతి మందులాంటిదని! నిజంగా వారికిలాంటి దృష్టి ఉండకపోవచ్చు. కాని ఆ కథని, దాన్ని చెప్పిన సందర్భాన్ని బట్టి నాకదే అనిపించింది. నాకే కాదు చాలామందికి అలా అనిపించే అవకాశం ఉందని నా బలమైన అనుమానం. ఇందులో సంపాదకుల నిరంకుశ ధోరణి తొంగిచూస్తోంది.
    ఈమాటకి కొత్త రచయితలు కొరవడడానికి ఈ ధోరణి ముఖ్యకారణమని నేననుకుంటున్నాను. దీనికి సహేతుకమైన కారణాలు నేనిక్కడ వివరించలేను. దీనికి ఈ వ్యాసంలోనే మరో ఉదాహరణ, “బొబ్బర్లంకనుంచి ప్రచురించబడుతున్న పత్రికలా ఉన్నదికాని,” అన్న వ్యాఖ్యపై స్పందన. ఈ వ్యాఖ్య ఆంతర్యమేమిటో నాకు స్పష్టంకాలేదు. సంపాదకులకి కూడా లేకపోతే అది చేసిన సదరు వ్యక్తిని అడిగి తెలుసుకుంటే బాగుండేది. అంతేకాని గోదవరి జిల్లాల్లోని వేదపండితుల ప్రసక్తి తెచ్చి వారి ఆదరణగురించి చెప్పడంలో సంపాదకుల ఆంతర్యమేమిటో అసలే బోధపడలేదు. నేనా వ్యాఖ్యని అర్థం చేసుకున్నది పత్రికలో “సమకాలీనత” కొరవడిందని. పత్రికలోని కంటెంట్‌ విషయంలో ఇది నిజమనే నాకూ అనిపిస్తోంది. గత రెండు మూడేళ్ళగా ఈమాటలో వచ్చిన వ్యాసాల్లో ఎంత శాతం ప్రస్తుత తెలుగు సాహిత్యానికి (పోనీ 1980 తర్వాత వచ్చినది) సంబంధించినవి ఉన్నాయో లెక్కకడితే ఈ విషయం స్పష్టమవుతుంది. దీనికి ఏమిటి కారణం? ఈమాట పాఠకులకి సమకాలీన సాహిత్యం మీద అంతగా ఆసక్తి లేకపోవడమా? ఆ సాహిత్యమ్మీద రాయగలిగే రచయితలు ఈమాటకి రచనలు చేయకపోవడమా? ఈ విషయంపై సంపాదకులు దృష్టి పెడితే బాగుంటుంది. నాకు తోచిన మరికొన్ని విషయాలు:

    1. గ్రంధాలయం, శబ్దతరంగాలు ఈమాటకే ప్రత్యేకమైన అంశాలు. వీటిని ఇలాగే కొనసాగించాలి. ఈమాటలో వచ్చే వ్యాసాలలో సాహిత్యంతో పాటు సైన్సు, సంగీతం మొదలైన విషయాలపై కూడా ఉంటున్నాయి. ఇదికూడా తప్పకుండా కొనసాగించాల్సిన అంశమే.
    2. సమకాలీన భారతీయ/విదేశ సాహిత్యాన్ని పరిచయం చేసే వ్యాసాలు, అనువాదాలు రెగ్యులర్ ఫీచర్‌గా ఉంటే బాగుంటుంది.
    3. ఒకటే పత్రిక ఉన్నప్పుడు దాని పరిధి చాలా విసతృతంగా ఉండవచ్చు. కాని ఇప్పుడు ఇంటర్నెట్లో అనేక పత్రికలు వచ్చాయి. ఒకో పత్రికపైనా ఒకో రకమైన రచయిత/పాఠకులు మొగ్గుచూపుతారు . కాబట్టి, ఈమాట ఆశయాలని మరొకసారి సమీక్షించుకొని, ఎలాంటి అంశాలకి ఫోకస్ ఇవ్వాలి, ఎలాంటి పాఠకులకోసం పత్రిక నడపాలి అన్న విషయం పునర్నిర్వచించుకుంటే మంచిదేమో.
    4. పాపులర్ పత్రికగా కాక తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక అంశాలలో ఒక ఉత్తమ స్థాయి పత్రికగా నడపడం ఆశయమైతే, ఇందులో తెలుగు విశ్వవిద్యాలయమూ, ఇతర విశ్వవిద్యాలయాలలో తెలుగుశాఖల వారితో ఈమాట వర్గం ఏమైనా ఇంటరేక్టవ్వగలిసి, ఆదానప్రదానాలు(వారు ఈమాటలో రచనలు చెయ్యడం, వారూ వారి విద్యార్థులు ఈమాట పాఠకులవ్వడం వంటివి) జరిగితే చాలా బాగుంటుంది.
    5. మంచి రచనలని, రచయితలని ప్రోత్సహించడానికి, ఏడాదికొకసారి, ఆ ఏడు ఈమాటలో ప్రచురించిన కవిత, కథ, వ్యాసాలలో ఒకో ఉత్తమమైనదాన్ని ఎంచి బహుమతులు ప్రకటిస్తే బాగుంటుంది. బహుమతి మంచి పుస్తకాల రూపంలో ఉంటే మరీ బాగుంటుంది! దీని ఖర్చు ఈమాట అభిమానులు తప్పక భరించవచ్చు. ఇచ్చే బహుమతి ముఖ్యం కాదు, ఈమాట బహుమతి గెలవడం ఒక గౌరవంగా చెప్పుకొనే స్థాయి దానికి ఉంటే బాగుంటుంది.
    6. ఈమాటలో రచనలపై కామెంట్లు, రచయితలకి ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయో నాకు చాలా అనుమానం. వాటివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోదేమో అని నాకనిపించిన విషయం. ఎలాగో చర్చా వేదికలున్నాయి కాబట్టి, ఇలాంటి విషయాలు ఏమైనా చర్చించ వలసినవి ఉంటే వాటిలో చర్చించ వచ్చు. పాఠకులకి ఏమైనా తీర్చుకోవలసిన సందేహాలు కాని, అవసరమైన సమాచారం కాని కావలసినా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా వ్యాసంపై ప్రత్యేకమైన చర్చ అవసరమనుకున్నా (రచయిత కాని సంపాదకులు కాని) చర్చావేదికనే ఉపయోగించుకోవచ్చు. అంచేత కామెంట్ల సౌకర్యం తీసి వేస్తే బాగుంటుందని నా (చివరి) సలహా.

  1297. కవితావిర్భావం గురించి Phani Dokka గారి అభిప్రాయం:

    05/06/2010 10:34 am

    వైదేహి గారూ,

    చాలా కాలం తరవాత చూస్తున్నాను ఈమాట. మీ కవిత చక్కగా ఉంది. ” తనని తాను ఆవిష్కరించుకునే ఓ అద్భుత క్షణం కోసం వేచిఉండడం ” అన్న మాటలో ఎంతో నిజం ఉంది. కథావిర్భావానికి కూడా ఇంతే.

    నెలరోజులుగా ఒక కథ రాయాలని ప్రయత్నం. మనసులో ఎన్నో సార్లు రాసి చెరిపేసుకున్నాను. ఎంతో సహనంతో వేచి చూడగా చూడగా, నిన్న రాత్రి అనుకోకుండా కథ పూర్తయింది. టైము చూస్తే తెల్లవారుఝామున నాలుగు!!

    చక్కని కవిత రాసినందుకు అభినందనలతో,
    డొక్కా ఫణి.

  1298. మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి కామేశ్వర రావు గారి అభిప్రాయం:

    05/06/2010 2:41 am

    మళ్ళీ ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు ఈమాటలో మీ కవిత 🙂 చాలా బాగుంది. అవును, జ్ఞాపకాల మిణుగురులకి వెలుగు తప్ప వేడిమెక్కడిది!

  1299. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    05/05/2010 4:46 pm

    “పియర్ రివ్యూ” ని ప్రవేశపెట్టిన ఇంతకాలానికి దానిగురించిన సుదీర్ఘచర్చ ఆసక్తికరంగా వుంది. నాకు తెలిసిన చరిత్రని కూడ ఈ చర్చలోకి ప్రవేశపెడితే ఇంకొంత మంచి జరుగుతుందేమోనన్న కుతూహలంతో ఈ చిన్నప్రయత్నం.

    “ఈమాట” తొలిసంచిక నుంచీ పియర్ రివ్యూ అమలులో వుంది. కథల విషయంలో అప్పటి సంపాదకులం – నేనూ, కొంపెల్ల భాస్కర్ , విష్ణుభొట్ల లక్ష్మన్న, కొలిచాల సురేశ్ – ఎవరమూ నిష్ణాతులం కామని మాకు స్పష్టమే కనుక చాలా మంది రివ్యూయర్లు చేయూత నిచ్చారు. నాకు బాగా జ్ఞాపకం వున్న పేర్లు – జంపాల చౌదరి, కన్నెగంటి చంద్ర, మాచిరాజు సావిత్రి, నాసీ, వేలూరి వేంకటేశ్వరరావు, విప్లవ్ ,వేమూరి వేంకటేశ్వరరావు. ఇంకా భట్టిప్రోలు అక్కిరాజు, డొక్కా ఫణికుమార్ కూడ చెయ్యివేసిన గుర్తు. ఆ రోజుల్లో కొందరు కథల్ని “స్నెయిల్ మెయిల్ “లో పంపడంతో రివ్యూలు కష్టమయేవి కూడ. ఐతే మా సంపాదకవర్గానికి కొంతవరకు నచ్చితే వాటిని ముందు తెలుగులో టైప్ చేసి ఎలెక్ట్రానిక్ కాపీలు రివ్యూయర్లకి పంపేవాళ్ళం. ఇక కవితల విషయంలో కన్నెగంటి చంద్ర, నందివాడ ఉదయభాస్కర్ , విన్నకోట రవిశంకర్ , మాచిరాజు సావిత్రి, విప్లవ్ , కనకప్రసాద్ , (మరొకరు – పేరు గుర్తు రావడం లేదు, మైక్రోసాఫ్ట్ లో పనిచేసేవారు), తమ్మినేని యదుకులభూషణ్ నాకు గుర్తున్నవారు. ఇంకొందరు కూడ సహాయం చేసిన గుర్తు. వ్యాసాలకు వస్తే “బరువైన” వాటి భారం వెల్చేరు నారాయణరావు గారి మీద వేసేవాడిని. వేలూరి వేంకటేశ్వరరావు, జంపాల చౌదరి, ఇండియా నుంచి వచ్చిన వాటిని ద్వానా శాస్త్రి, ఇక్కడ విన్నకోట రవిశంకర్ , తమ్మినేని యదుకులభూషణ్ చాలా రివ్యూ బాధ్యతల్ని మోసినవారు. కొందరి పేర్లు నేను మర్చిపోయే వుంటాను, వారు నన్ను క్షమిస్తారని ఆశ.

    మరీ పత్రిక రిలీజ్ కి ముందురోజు వస్తేనో, లేక స్పష్టంగా ప్రచురణార్హంగా కనిపిస్తూంటేనో రివ్యూయర్లకి పంపకుండా సంపాదక వర్గమే నిర్ణయించిన సందర్భాలు వున్నాయి కాని అంత ఎక్కువ కాదు. అలాగే స్పష్టంగా నేలబారుగా కనిపించిన వాటిని కూడా మేమే నేరుగా తిరస్కరించటం అప్పుడప్పుడు జరిగాయి.

    తొలిసంపాదకవర్గం లోని నేనూ, భాస్కర్ , లక్ష్మన్న – మాకు అంతకుముందు ఎన్నో ఏళ్లుగా టెక్నికల్ పబ్లికేషన్ , దాని మెలకువలు అనుభవమే కనుక పియర్ రివ్యూ “ఈమాట” పునాదుల్లో ఒకటిగా ఉండాలని ఎలాటి చర్చా లేకుండానే నిర్ణయించుకున్నాం. దాని కారణంగా ఏ కథా లేకుండా ఒకటి రెండు సంచికలు వచ్చిన గుర్తు కూడ. “ఎక్కువమంది రచనలు చేసేవారు లేనప్పుడు పియర్ రివ్యూ అనవసరం” అన్నవాదన అందువల్ల నాకు సమంజసంగా తోచదు. అలాగే, ఇది ఇక్కడి పత్రికలను అనుసరించాలనీ అనుకరించాలనీ చేసిన నిర్ణయం కాదు, ఇక్కడి టెక్నికల్ పబ్లిషింగ్ లో పియర్ రివ్యూ వల్ల జరిగే మంచిని చూసి, అప్పట్లో ఇక్కడ వస్తున్న ఇతర పత్రికల, ప్రచురణల గుణహీనతకి కారణం పియర్ రివ్యూ లేకపోవడం అన్న ప్రతిపాదన తోటి, ఇలా చేస్తే మంచి రచనలు వస్తాయనే భావనతో చేసిన పని. అందువల్ల తిరస్కరించిన రచనలకి, అలాగే మార్పులు చెయ్యవలసిన రచనలకి రివ్యూయర్ల అభిప్రాయాలని పంపేవాళ్లం.

    ఇదంతా 2006 వరకు, నేను సంపాదక బాధ్యతలు వహిస్తున్న కాలంలో విషయం. ఇప్పుడు రాసేవారు చాలా పెరిగారు గనుక రివ్యూయర్ల సంఖ్య కూడ పెరిగేవుంటుంది. ఐతే ప్రత్యక్షంగా నాకు తెలియని విషయాల్లో తలదూర్చటం సాహసం గనుక అటు వెళ్లను.

  1300. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    05/05/2010 4:08 pm

    పీర్ రివ్యూమీద చాలామందికి సదభిప్రాయం లేదని వచ్చిన కామెంట్లు చూస్తుంటే అనిపిస్తోంది. కొన్ని వ్యాఖ్యల్లో ఎంతో అసహనం కనిపిస్తోంది. నాకనిపించినవి కొన్ని చెబుతాను.

    ఒక రచనని ప్రచురణకి ముందుగా నలుగురైదుగురు చదివి అభిప్రాయాలు లేదా సలహాలొ ఇవ్వడంలో తప్పు లేదుకదా? ఒక్కో సారి ఆ రచన మెరుగు పడచ్చు. రచయిత గుర్తించని తప్పులు దొర్లితే సరిదిద్దే అవకాశం రావచ్చు. లేదా రచయిత చూడని మరో కొత్తకోణం కనిపించచ్చు. ఈ ప్రక్రియవల్ల మంచే జరుగుతుందని నా అభిప్రాయం.

    ఈ పీర్ రివ్యూ అనేది వెస్ట్రన్ పద్ధతే కావచ్చు. మనకి అలవాటు లేని విషయం. ఎందుకంటే తమ రచనలవరకూ వచ్చేసరికి రచయితలకి (నాతో కూడా కలుపుకొని ) కాస్తో కూస్తో పొగరూ, తలబిరుసుతనమూ ఉంటాయి. అహం పాలు ఎక్కువగానే ఉంటుంది. కాదని పైకి అన్నా ఇది మాత్రం నిజం. ఎదుటవారు చెప్పే విషయమ్మీద గౌరవం లేనప్పుడు అర్హతలూ, యోగ్యతలూ ముందుకొస్తాయి. దాంతో రచనమీద జరగాల్సిన సమీక్ష వ్యక్తుల మీదకి మళ్ళుతుంది (ఎవరు సమీక్షకులో తెలియకపోయినా). ఇహ కాస్తో కూస్తో పేరొచ్చిన రచయితలయితే చెప్పనవసరం లేదు. నువ్వెవడివి మా రచన్ని సమీక్షించడానికన్న ధోరణి వ్యక్తమవుతుంది.

    ఇది పీర్ రివ్యూ ప్రక్రియ మీద ఉన్న దురభిప్రాయం కంటే కూడా అది చేసే వారి యోగ్యత లేదా అర్హత మీదే నమ్మకం లేనట్లుగా వుంది.

    అంతెందుకు? తెలుగునాట పత్రికల ఎడిటర్లూ వచ్చే రచనలకి చక్కగా అంట కత్తెర్లు వేస్తారు. గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే (సాధారణంగా ఎవరూ అడిగే ధైర్యం చెయ్యరు ), స్థలాభావం అన్న వంక చూపిస్తూ తప్పించుకుంటారు. రచయిత రాసింది రాసినట్లు అచ్చేసిన పత్రిక తెలుగునాట ఉందంటే నేను నమ్మను. కాస్తో కూస్తో చేయి చేసుకోకుండా అచ్చెయ్యరు. పైగా మార్పులూ, చేర్పులూ చేస్తున్నట్లు చెప్పే సాంప్రదాయం ఎలాగూ పాటించరు. కాబట్టి గొడవే లేదు. రచనలని పలానా సంచికలో వేస్తున్నామనే చెప్పే అలవాటే కనిపించదు. కథలూ, వ్యాసాలూ కత్తిరింపులు లేకుండా వుండవన్నది అందరికీ తెలుసున్నదే. కవితలొక్కటే దీనికి మినహాయింపు. ఒకవేళ ఎందుకు మార్పులు చేసారని అడిగినా జవాబిచ్చే తీరికుండదు వారికి. మరి అక్కడ లేని అభ్యంతరం (అంటే అచ్చయ్యి పోయాకా ఏమీ చెయ్యలేరు కనుక ) ఇక్కడ ఎందుకు?

    ఈ పీర్ రివ్యూ పద్ధతిలో ఒక్కోసారి ఘర్షణ జరగచ్చు. మనస్తాపాలు కలగచ్చు. కాదనను. అయినా ఒకరిద్దరు చదివి, మంచీ, చెడులు చెబితే తప్పులేదని నా అభిప్రాయం. పైగా ఈ సమీక్షకులు కూడా తోటి రచయితలే కదా? రచనా వ్యాసంగమ్మీద కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారే కదా?

    అనవసరంగా ఈ పీర్ రివ్యూ మీద అసహనం అర్థం లేదనిపిస్తోంది. విమర్శనేది మనకి మింగుడు పడని విషయం. అందువల్ల కూడా కావచ్చు.

    ఇహ పీర్ రివ్యూని విజయవంతంగా చేస్తున్నా పసలేని రచనలొస్తున్నాయని రమగారి ఆరోపణ. నాకు తెలిసి ప్రతీ పత్రికా మంచి రచనలు మాత్రమే వేస్తున్నామన్న భ్రమలో పనిజేస్తాయి. ఇక్కడ మంచిదన్నది సాపేక్షికం. ఎవరి స్థాయీ, అవగాహనా, అభిరుల్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడొచ్చిన ప్రతీ రచన్నీ చెత్తబుట్టకి పరిమితం చెయ్యడం ఎంతవరకూ సమంజసం?

    అసలే పీర్ రివ్యూకి జడిసి కొంతమంది ఇటువైపు చూడ్డమే మానేసారు. వాళ్ళు రాసిచ్చింది కళ్ళు మూసుకొని వేసే ( అచ్చుతప్పులతో సహా ) పత్రికలవైపే చూస్తున్నారు. కాబట్టి ఉన్నవాటిలో ప్రచురణకి బావుందనిపించినవే వేస్తున్నారని నా అభిప్రాయం. అవన్నీ పసలేని నాసిరకం రచనలుగా అనిపిస్తే ఎవరేం చెయ్యగలరు? పత్రిక మూసెయ్యటం తప్ప.

    తెలుగునాట ప్రత్రికల్లో ఈ మాత్రం కూడా వ్యాసాలు రావు. కొన్ని పత్రికలయితే అసలు సాహితీ వ్యాసాల దరిదాపులక్కూడా పోవు.
    రచయితలూ ఈ పీర్ రివ్యూ పద్ధతిమీద కన్నా రచనలమీద శ్రద్ధపెడితే మంచివి వచ్చే అవకాశం వుంది. వెబ్ పత్రికల్లో ఈమాట చాలా నయం. కేవలం హిట్లూ, విజిట్లూ పత్రికల ప్రాచుర్యానికీ, విజయానికీ కారణం కావని అందరికీ తెలుసు. రచనలమీదా, వ్యక్తిగత అభిప్రయాలమీదా ఈ మాత్రం చర్చకూడా మిగతా పత్రికల్లో జరుగుతుందని అనుకోను.

  1301. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/04/2010 11:41 pm

    ఉపేంద్రగారూ!!

    తెలుగున అదేదో ఒక మోటు సామెత ఉంది ..అందరికీ తెలిసినదే గనక నేను దానిని ప్రస్తావన చేయ పనిలేదు కానీ.. నాకు తెలుగు వారి కి మహా కవులని గురించి పరిచయం చేసే శక్తీ ..ఆసక్తీ రెండూ లేవు. అందుకే మీరు చేసే ప్రయత్నాన్ని అభినందించాను. ఆ పని మీరు మరింత శ్రధ్ధగా చేయగలిగితే బాగుంటుందని సూచన చేసాను. కవిత్వాన్ని అనువాదంచేసే భాష విషయంలో!! కవితా వాక్యాలు చాలా శక్తిమంతమైనవి గనక..వాటి విషయంలో శ్రధ్ధ అవసరం..కానీ ఇది వారి శక్తికి సంబంధించిన విషయమ్ నిజానికి. అందువలన ఆశించగలమే గానీ నిజంగా ఎంత చక్కగా రాయగలరూ.. అన్నది సందేహాస్పదమే!! ఔను.. నాకు చాలా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి కొన్నిటి విషయంలో . అందులో ముఖ్యమైనది “చదివించే గుణం” అన్నది. వచనంలో విషయమ్ క్లుప్తంగా..సూటిగా ఉండాలి అన్నది. నస వాక్యాలని నేను చదవలేను. నాకు విసుగు . గనక సాధారణంగా చదవడానికి అంత ఉత్సాహం చూపించను. అందునా విప్లవ సంఘాల వారి తెలుగు వచనం అంటే చెప్పలేని చికాకు. వారు నలుగురికీ తెలియవలసిన ముఖ్య విషయాలని కూడా తమ పడికట్టు వాక్యాలతో పాఠకులని విషయానికి దూరంచేసి పారిపోయేలా చేయగల సమర్ధులు మరి.

    రమ.

  1302. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    05/04/2010 9:37 pm

    రమగారూ,

    నెలకి ఒక కవిని పరిచయం చేసినా సంవత్సరానికి 12 మంది భారతీయ కవులని తెలుగు పాఠకులకి పరిచయం చేయవచ్చును. తెలుగు వారు అజ్ఞానులు అని పది సార్లు జపించే బదులు ఈ దిశ గా మీరు ప్రయత్నమ్ చేస్తే బాగుంటుంది.

    తెలుగు కవితా భాషలోనూ , అనువాదంలోనూ సాధన చేయటానికి కావలసిన వెసులుబాటు నాకు ఉండదు. ఇప్పటికైనా నాగార్జు న పేరు తెలిసింది, ఆయన చేసిన పని గురించి తెలిసింది కాబట్టి సమర్థులైన వాళ్ళు , ఆసక్తి ఉన్న వారూ ఆ పనికి ఎప్పుడో అప్పుడు తప్పకుండా పూనుకుంటారనే నా ఆశ.

    మూడు దశాబ్దాల కాలంలో బాలగోపాల్ వ్రాసిన సాహిత్య సాంస్కృతిక విమర్శని సమీక్షించే సందర్భంలో ఆయన తెలుగు కవులని కవిత్వాన్నీ ఎట్లా పట్టించుకున్నాడో ఎట్లా పట్టించుకోలేదో అంచనా వేయటం అవసరమే. నేను వ్రాసినది సమీక్షా వ్యాసం కాదు కాబట్టి నేను ఆయన చేయని పనులు ఏమిటి అన్నది నేను ఈ సందర్భంలో ఎత్తలేదు. నేను చేసినది ఆయన తాత్విక చింతనలో తెలుగు కవులకి పనికొచ్చే విషయాన్ని ఎత్తి చూపించడం. సరళంగా, స్పష్టంగా రాయటం అవసరమే. నాకుండే పరిమితులకు లోబడి తప్పకుండా ప్రయత్నం చేస్తాను .

    మీకు విసుగు పుట్టించకుండా వ్రాయటం అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఆ దిశగా నేను ప్రయత్నం చేయ దలుచుకోలేదు. మీ వ్యాఖ్యని బట్టి చూస్తే ఈ విషయం పట్ల మీకు బలమైన అభిప్రాయాలున్నట్టు కనపడుతోంది. అదేమిటో మీరు విశద పరిస్తే బండి ముందుకి కదులుతుంది.

  1303. ‘వికృతి’ ఉగాది గురించి Sarada Purna Sonty గారి అభిప్రాయం:

    05/04/2010 11:33 am

    చాలా కాలం పట్టింది. ఇన్నాళ్ళకి కొద్ది కొద్దిగా ధైర్యం వస్తోంది పెద్దలకి కవితలు వినిపించాలంటే! రమ గారూ! అర్థం అయింది మీ మాట! వేలూరిగారూ! కృతజ్ఞతలు.
    శారదా పూర్ణ

  1304. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/03/2010 2:40 pm

    మీ అన్ని బాధలూ చదివిన తర్వాత కూడా “పీర్ రివ్యూ” అన్న పధ్ధతి ఒకటి మీరు అమలు చేస్తూ ముగ్గురు మహామహుల వడపోత తరవాత కూడా ఈమాటలో చెత్త కవితలూ నాసిరకం వ్యాసాలూ ..కధ అన్న పేరులోకి, ఆ పరిధి లోకి కూడా రాని “కధలు” మరి ఎందుకు వస్తున్నట్టూ?? ఎక్కడ లోపం?. మీ లక్ష్యం మంచి రచనలు కదా అచ్చువేయడం? కానీ మీ స్థాయి ప్రకారం పీర్ రివ్యూ లో అంతమంది పాల్గొని రచనలని సంస్కరించి వాటిని ప్రచురణార్హం చేసిన తరవాత కూడా ఇంకా మరి పస లేని రచనలే ఎక్కువగా ఉంటున్నాయీ అంటే ఆ రివ్యూ చేసే వాళ్ళకి ఆ కళ పట్టుబడనట్టా..లేక అసలా “పీర్ రివ్యూ” విధానం లోనే ఒక ఫైల్యూర్ ఏదో ఉన్నట్టా??

    ఇత్యాది ప్రశ్నలు మీరూ మీ ఇతర సంపాదక మిత్రులూ మరి ఆలోచించలేదా?? వెంకటేశ్వర రావు గారూ!! ఆశయం ఉన్నతమైనదిగా ఉండటం వేరు..దాన్ని అమలు చేయడంలో మీరు ఎక్కడ బోల్తాపడుతున్నారో తెలుసుకోవడం వేరు. ఆశయం మరీ బరువైనదైపోతే ఆచరణ సాధ్యం కాకపోతే అసలు లక్ష్యమే దెబ్బతినగలదు. ఈ కోణంలోకూడా చూడండి ఓ సారి మరి.

    చదివించే గుణం రచన అది ఏ ప్రక్రియ అయినా కూడా దానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. అది లేనప్పుడు మీరు ఎన్ని మార్పులు చేసినా ఫలితం ఏముంటుంది. మీరు రాయండర్రా అని అడిగి రాసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా?? రచయితలని మీరు తయారు చేయగలం అనే నమ్మకంతో ఉన్నారా?? మీ పత్రిక మీ ఆశయాలనీ.. దానికి సరిపడిన పీర్ గ్రూప్ నీ అలాగే మంచి రచయితలనీ కవులనీ తయారు చేయగలిగిందా?? అది సాధ్యమో..అసాధ్యమో మీకు మీ ఇన్నాళ్ళ అనుభవం ఏమీ చెప్పనే లేదా?? ఇవి మీ మాటలు చదివాకా నాకొచ్చిన అనుమానాలు. చిత్తగించగలరు.

    రమ.

  1305. దారి కాదు గురించి సుబ్రహ్మణ్యం మూలా గారి అభిప్రాయం:

    05/03/2010 2:52 am

    చాలా బావుంది. మీ “భ్రంశధార” కవితకి దగ్గరగా ఉంది.

    కవితలో ఒక మాండలికాన్ని వాడేటప్పుడు అన్ని వాడుకలూ అదే మాండలికంలో ఉంటే బావుంటుందేమో

    గుడి కూలిపోయింది — గుడు కూలిపోనాది
    తోవ లేదు — తోవ నేదు

  1306. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/03/2010 1:22 am

    ఉపేంద్ర గారూ!!

    మైథిలీ భాష అనే కాదు భారతీయ భాషలలోనే నాగార్జున చాలా గొప్పకవి. ఆయన కవితా ప్రపంచం గురించి తెలుగు వారికి తెలిసింది ఏమీలేదు. ఆ మాటకొస్తే చాలా మంది మంచి కవులని గురించి తెలుగు సాహిత్య ప్రియులకి నిజంగా తెలిసింది తక్కువ. అసలు తెలుగులో వచ్చిన మంచి కవిత్వం గురించి మాత్రం ఏమంత తెలుసు గనకా?? మీరు నాగార్జునని గురించి పరిచయం చేయడానికి పూనుకోడం సంతోషించవలసిన విషయం. ఐతే మీ కవితా భాష అనువాద శైలీ తెలుగు కవిత్వానికి అంతగా ఒదగలేదు. సాధన వల్ల మరింత సాధ్య పడొచ్చును.

    ఇంక బాలగోపాల్ ని గురించి మీరు రాసిన భాగం అస్సలు చదవనిచ్చేలా లేదే?? విసుగు కలిగించేలా ఉంది. ఇకపోతే బాలగోపాల్ ని గురించి తెలుగు కవులు పట్టించుకోలేదని మీరు అనడానికి ముందు తెలుగు కవులనీ తెలుగు కవిత్వాన్నీ బాలగోపాల్ ఏమాత్రం పట్టించుకున్నాడని మీరు ఆలోచించలేదే!? ఆశ్చర్యం!!

    వ్యాసం రాయడం ముఖ్యమే కానీ వాక్యాలలో స్పస్టతా.. ఎడిటింగూ.. కూడా అంతే ముఖ్యం కదా?? అది మీ ఈ వ్యాసమ్ లో స్పష్టంగా కన్పిస్తున్న లోపం. మీరు రాయబోయే ముందటి వ్యాసాలు ఈ లోపాలతో లేకుండా ఉండాలని కోరుకుంటాను.

    రమ.

  1307. ‘వికృతి’ ఉగాది గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/03/2010 1:05 am

    కవితలల్లుటన్న తీపి భేషజమా వాదరమా
    మాటల మూటలని విప్పి పేర్చుటలా వదరుటలా”

    ఈ మాటలు బాగున్నాయి. ఈ కవితకి చక్కగా సరిపోతున్నాయి.

    రమ.

  1308. ‘వికృతి’ ఉగాది గురించి mOhana గారి అభిప్రాయం:

    05/02/2010 7:48 pm

    బాగుంది కవిత! ఈ వి పదాలతో వచ్చిన గొడవే ఇది. మల అంటే కుళ్లు, కాని విమల, అమల రెంటికీ ఒకటే అర్థము. అదే విధంగా వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు. కానీ కృతికి వి చేరిస్తే విశిష్టమైన కృతి కాక వికారమయింది. కానీ జ్ఞానికి వి చేరిస్తే వచ్చిన విజ్ఞానము విశేషమైన జ్ఞానమే. ఒహొరే ఒహొరే బ్రహ్మ దేవుడా, నీవెంత బుద్ధిశాలివయ్యా బ్రహ్మదేవుడా! విధేయుడు – మోహన

  1309. మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/02/2010 12:55 am

    జ్ఞాపకాల మిణుగురులు అంటుకుని దీపాలు వెలగవు.ఆడంబరం ఎక్కువ తప్ప అనుభవం అందివ్వని కవిత ఇది.

    రమ.

  1310. సుగమం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/02/2010 12:51 am

    రాధికా!! మనసు బరువయ్యింది. మార్గం సుగమం చేసిన తరవాత ఆ కన్న తల్లి ఏమనుకున్నా పిల్లలు ఎంత సిగ్గుపడాలో కదా!!
    కవిత బాగుందని చెప్పనా?? కలిగిన బాధ బాగులేదని చెప్పనా??
    రమ.

  1311. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి Dr.kameswari yaddanapudi గారి అభిప్రాయం:

    05/01/2010 2:33 pm

    ఈమాట చాలా బాగుంది. ఆధునిక కవిత్వం 1910లో గురజాడ లంగరెత్తుముతొ ప్రారంభం అయిందని మనకు తెలుసు. కవిత్వ ప్రేమికులుగా శతాబ్ది ఉత్సవాలను చేసుకుందామా?

  1312. గాలిపటం గురించి KC గారి అభిప్రాయం:

    04/30/2010 3:13 pm

    సమీర్ గారు కవిత చాలా బాగున్నది, అర్థము అయితే ఇంకా చాలా బాగుండేది!

  1313. తెలగాణెము గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    04/23/2010 10:11 pm

    మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం ,విద్వేషాలను పెంచడం ,చివరికి విభజనకు పట్టు బట్టడం. ఇదీ అయాచితంగా అధికారం చేజిక్కించుకోవాలనే నేతల తీరు. వారికి సమాజం సంస్కృతి,భాషలు సర్వనాశనమైనా చీమ కుట్టినట్టయినా ఉండదు. ఈ తరహా రాజకీయాలు ముస్లిం లీగుతో మొదలైనాయి.’సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా ‘అన్న కవిత రాసిన ఇక్బాల్ ఇటువంటి విభజన ఊహలకు బీజం వేశాడు అంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగ వచ్చు. తర్వాత బ్రిటిష్ అండదండలతో జిన్నా తన చిరకాల వాంఛితాన్ని నెర వేర్చుకొన్నాడు. తర్వాత పాకిస్తాన్ వేర్పాటు ఇరుదేశాల ప్రజలకు ఎన్ని కష్టాలు కొని తెచ్చిందో అందరికీ తెలిసినదే. ఠాగోర్ నోబెల్ ఉపన్యాసం చూడండి ,ఈ జాతీయవాదం ఎంత దూరం పొగలదో దర్శించాగలిగాడు అనిపిస్తుంది. గాంధి విభజన కు చివరిదాకా వ్యతిరేకి. దానివల్ల జరిగే ఉత్పాతం ఆయన దర్శించగలిగాడు ;దార్శనికులైన కవులు రాజకీయ వేత్తలు తెల్ల కాకుల లాంటి వారు. విభజన ,రక్తపాతం కోరే కవులు మేధావులు నాయకులు వీధికుక్కల్లా ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తారు.

    తెలంగాణా గురించి మాట్లాడితే దేశ విభజన గురించి మాట్లాడటం ఏమీ బాగా లేదు ,అది వేరు ఇది వేరు అనవచ్చు. ఈ రెంటికి వెనుక ఉన్న ఆలోచన ఒక్కటే .”మేము వేరు మీరు వేరు ;మనమందరం కలిసి బ్రతకలేము. మీరు మా నేలను వదిలితే ఆస్తులు మావి ఉద్యోగాలు మావి మా పెత్తనం మాది “ఇదీ వరుస . దేశంలో ఉన్న సమస్యలు చాలు ;పనిలేని నేతల పుణ్యమా అని లేనిపోని సమస్యలు తెచ్చి పెడుతున్నారు సామాన్యులకు . విభజన అన్న ఊహ చాలా ప్రమాదకరమైంది అని చెప్పడానికి ఇదంతా. ఇది తెలంగాణాతో అంతం కాదు.దీని కూకటి వేళ్ళను కదిలిస్తే దేశమే కదిలిపోతుంది.

    అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో నాలుగు డబ్బులు వెనుకేసుకుని ,కాస్త తీరిక ఉన్న వాళ్ళు అరాచక శక్తులకు అండ దండలు అందించడం చూస్తూనే ఉన్నాము. అక్కడ విద్యార్థులను రెచ్చగొట్టి వారు చనిపోతే కవితలు రాసే కవిరాబందులకు నిజాయితీ , నైతికత అన్నది చాలా పెద్ద మాట. చేతనైతే ఒక చెట్టు నాటండి ;ఇంకా స్థోమత ఉందా ఒక గ్రంథాలయం మొదలు పెట్టండి.ఒక బడిని ఆసుపత్రిని నిర్వహించండి.ఇందులో ఆకర్షణ లేదు. నానా దేవుళ్ళకు గుళ్ళు కట్టించడం ,మార్క్సుమావోలకు ఇక్కడినుండి జేజేలు కొట్టడం ఇదీ మనవారి తీరు. ఆలోచనను పెంపొందించే ఏ పని చస్తే తలకెత్తుకోరు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది మన వారికి చాలా పెద్ద మాట.

    భారత ప్రజాస్వామ్యం నాగాలాండ్ ,పంజాబ్ లాంటి సమస్యలనే చల్లార్చింది.ఇక తెలంగాణా అనగా ఎంత ?? ఈ సమస్య పరిష్కారానికి ఎంతో దూరం లేదు అని నా అంచనా ..సమస్య కు పరిష్కారం లభించే లోగా కుహనా కవులు ,ప్రాంతీయవాదులు ,రాజకీయ నాయకులు జన జీవితంలో ఎంత చెత్తను పేరుస్తారో తలచుకోవడానికే మనసొప్పడం లేదు.
    చివరిగా, రచయితలలో మేధావిగా గుర్తింపు పొందిన కొ. కు అభిప్రాయం తెలంగాణా మీద “తెలంగాణ చీలదు .చీలితే తెలంగాణ పాట్లు కుక్కలు నక్క పడవు”(కొ. కు లేఖలు పే.101).

  1314. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి jayaprabha గారి అభిప్రాయం:

    04/23/2010 3:11 pm

    ఏమండీ వేంకటేశ్వరరావుగారూ!! “కౌస్ కౌస్ ” అంటూ కవులని వెక్కిరించే మీరేనా కవిత్వం గురించి ఇంత శ్రధ్ధగా పఠనాశక్తితో ప్రతిపదార్ధ సహితంగా అవి అచ్చులో పునర్ముద్రణ జరగాలని ఆశిస్తున్నదీ!! మీరు ఇంతగా మారారా? మంచిమార్పే!! అయితే ఆ పుణ్యకాలం ఏదో గడిచిపోకుండా ఆ ప్రతిపదార్ధాలూ..వివరాలూ కవితా రహస్యాలూ చెప్పగలవారుండగానే మీ కోరికని కార్యరూపంలోకి అనువదించరాదో!! తెలుగులోని భావి కవితా ప్రియులు తరిస్తారు కదా మీ పేరు చెప్పుకుని.

    ఈ మద్య నా “క్షణ క్షణ ప్రయాణం” కవితా సంకలనంలోని కొన్ని పద్యాలలోని పదబంధాలు అర్ధం కావడం లేదంటూ ఓ ఆకాశరామన్న పాఠకుడు అందులో నేను ” అగ్రహారం “భాష రాసేనని ఓఘాటైన విమర్శ రాసేడు. ఆయన ఉద్దేశ్యం నాకైతే అర్ధమ్ కాలేదనుకోండి. అయితే నేను అతగాడు రాసిన ఆ విమర్శని చదివే వీలులేదని అనుకున్నట్టున్నాడు..దానిని ఒక ఫొటోకాపీ తీయించి మరీ [ పేరూ అడ్రస్సూ లేకుండానే సుమా!]] నాకోసం శ్రమపడి మరీ పోస్టులో పంపించాడు.ఐతే ఇప్పుడు మీమాటలు చదివాకా శ్రీశ్రీ మహాప్రస్థానం అర్ధం కావడం కస్టమ్ అనిమీరు అనుకుంటున్నట్టుగా నాకర్ధమ్ అయ్యింది. అయ్యా!! నా కవిత్వంలోని భాష కూడా
    అర్ధం చేసుకోవడానికి ఏమంత వీలుగా లేదట!! మరి మహాప్రస్థానం అర్ధంకాకపోతే గనక ఆశ్చర్యం ఏముందీ?? ఆమధ్య ఒకసారి కవి శివారెడ్డి నా ప్రేమకవిత్వాన్ని చదివి ఒక మాట నాతోనే స్వయంగా ఇలా అన్నాడు. ఆతనికి నా భావాలు చాలా బాగున్నాయి ట! ఐతే ఆయన అన్నదేమంటే.. జయప్రభా!! మీ కవిత్వంలోని భాష నాకే సరిగ్గా అర్ధం కావడం లేదు. మరి ఇవాళ్టి తరం వారికి అర్ధమ్ అవుతుందంటారా?? అని. దీన్ని బట్టి మీరే ఊహించుకోండి.. అర్ధంచేసుకోండి ఇవాళ్టి కవిత్వ పాఠకులు ఎవరో.. వారు చదువుతున్న కవిత్వాల [ రాస్తున్న కవిత్వాల స్థాయి కూడా] భాషా పరంగా ఏ దశలో ఉందో!! కవిత్వమ్ మీద అభిమానమే ఉంటే అటువంటి వారికి కవి ఊహా అర్ధం అవుతుంది.కవి భాషా అర్ధమ్ అవుతుంది.అందులోని ఆనందమూ అనుభవంలోకి తప్పక వస్తుంది.

    జయప్రభ.

  1315. తెలగాణెము గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    04/23/2010 2:16 am

    పద్యాలు అన్నీ చక్కగా వినసొంపుగా ఉన్నాయి. అన్నిటినీ, ఆపైన అభిప్రాయాలనీ ప్రచురించిన ఈమాటకి ధన్యవాదాలు.

    దేశికాచార్యులు గారి పద్యాలు చదివితే తెలంగాణ నాయకులలో నీచమైన స్వార్ధ పరత్వమున్నదని తెలుస్తుంది కానీ తెలంగాణ వాదంలో ఆకలి గొడవ ఒకటున్నదని కానీ, గత నాలుగు నెలలుగా చెవులు దిబ్బళ్ళు పడేలా సమైక్యవాద హోరు వినిపించిన నాయకులను నడిపించినది కూడా నీచమైన స్వార్ధమేననీ అనుమానం ఎవరికీ కలుగదు. (బలంగా ఉంటుందని కాబోలు, సమైక్య వాద నాయకులందరూ తాము సమై’ఖ్య’ వాదులమని చెప్పుకుంటారు. తప్పుడు ప్రయోగం ఎక్కడున్నా దాని వెనకాల తప్పుడు చేతలు ఉంటాయని బాలగోపాల్ చాలా కాలం క్రితం చెప్పి ఉన్నాడు.)

    శ్రీనివాస్ గారి పద్యాలు చదివితే తెలంగాణ ఆకలి చావులున్నాయని తెలుస్తుంది కానీ, తెలంగాణలో ఎక్కడా కనిపించనంత ఆకలీ హింసా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో చాలా చోట్ల ఉన్నాయని ఎవరికీ తెలిసే అవకాశం లేదు.

    యదుకుల భూషణ్ గారు చెప్పినది చూస్తే , రవి కాననిచో కవి గాంచునన్న మాట ఉత్తిదే నేమో ననిపిస్తుంది. నిఖార్సైన నిజా నిజాలు తెలుసుకోవడానికి గణాంకాలొక్కటేనా మార్గం ? కవి పూనుకుని ఏ ఒక్క రోజు కూలీ జీవిత కథనం వివరంగా అడిగి విన్నా ఒక కొత్త సత్యాన్ని ఆవిష్కరించలేడా ?

    రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలలోనూ పేద ప్రజలను ఎవరిని కదిలించినా నీటి కోసం ఉద్యోగాల కోసం కటకట పడుతున్న చరిత్రలూ, పోలీసులూ అధికార యంత్రాంగమూ, వ్యాపారులూ , వైద్యులూ పెడుతున్న హింసలూ చెప్తారు. చాలా సందర్భాలలో హింసని అనుభవించడం మామూలు అయిపోయి, దాన్ని హింసగా గుర్తించే వివేకం కూడా కోల్పోయి ఉన్నారు. (లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరు జిల్లాలో అంత మంది స్త్రీల శరీరాల్లోనించి గర్భ సంచీలు తీసివేశారన్న వార్త బయట పడటానికే ఇన్నేళ్ళు పట్టడం ఎట్లా సాధ్యం ?)

    ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ సమస్యలు తీరుతాయి అని తెలంగాణలో చాలా మంది పేద ప్రజలు అనుకుంటున్నారు. (లక్షలాది మంది హాజరయ్యే ఉజ్జీవ సభలను చూస్తే – యేసు ప్రభువుని నమ్ముకుంటే తమ వెతలు తీరుతాయని ఆంధ్ర ప్రాంతంలో చాలా మంది పేద వాళ్ళు అనుకుంటున్నారని పిస్తుంది కానీ అది వేరే విషయం). అదే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదులో మరి కొంత మంది పేద ప్రజలు ధనవంతులైన ఆంధ్ర ప్రాంతపు ప్రజలు తరలి పోతే ఈ మాత్రం కూడా జరుగుబాటు ఉండదేమో నని అనుకుంటున్నారు.

    రాష్ట్రం ఏర్పడితే తమకి దగ్గర్లో ఉండే నగరాలు అభివృద్ధి చెందుతాయి కదా అని ఆంధ్ర లోనూ సీమలోనూ కొంత మంది పేదలు అనుకుంటే, హైదరాబాదుకి దారులు మూసుకు పోతాయెమో, అదే జరిగితే ఈ పాటి అవకాశాలు కూడా పోతాయెమో నని అక్కడే మరి కొంత మంది పేదలు ఆందోళనతో గుండె పగిలి చస్తున్నారు.

    ప్రజాభిప్రాయం తమకి ఎట్లాగూ తెలిసే అవకాశం లేదనీ, అందుచేత తమ స్వంత అభిప్రాయాలకి కట్టుబడి ఉండి ధైర్యంగా వాటిని ప్రకటించ గలిగితే చాలు అని ఎవరైనా అనుకుంటే అది వారి శక్తికీ, అభిరుచికీ సంబంధించి విషయమే అవుతుంది కానీ దాన్ని మొత్తం గా కవిత్వానికే పరిమితి గా చెప్పుకోవలసిన అవసరం లేదేమో ? !!

  1316. తెలగాణెము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    04/21/2010 12:58 pm

    “కవులు తమకు వెన్నెముక ఉందని వానపాములకూ తమకు భేదం ఉందని నిరూపించుకునే తరుణం ఆసన్నమయింది.”
    పద్యాలొదిలేసి, పదకొండు లైన్ల సత్యనారాయణగారి అభిప్రాయానికి యాభైలైన్లకు మించిన భూషణ్‌ గారి స్పందన ఆశ్చర్యం విస్మయం కలిగించింది.

    అసలు కవులంటే నాకు భయం. కవులు కూడా నిరూపించుకోవడం మొదలుపెడితే ఇంకా భయం.కవి వర్ణనలంటేనే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఉపమానాలు,అతిశయోక్తులు,అలంకారాలు వగైరా. ఇక వాటితో కవులు నిరూపణలు సైతం మొదలుపెడితే కవితాసౌందర్యం మాటేమో కాని, వాస్తవాలు నిజాలు హుష్ కాకి అని చచ్చేంత భయం. అయినా కవులను ఆదరిస్తున్నారంటే తెలుగువాళ్ళు ఎంత మంచివారో లేక ఎంతటి అమాయకులో!
    ======
    విధేయుడు
    _Srinivas

  1317. తెలగాణెము గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    04/21/2010 10:26 am

    “కవి గారు సిసలైన తెలంగాణ వాడినని చెబుతూనే తెలంగాణా ప్రజానీకం ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కవిత్వం చెప్పారు. “

    మీకు గాని కర్ణ పిశాచి గాని ఉందా ?? తెలంగాణా ప్రజానీకం మనసులో ఏముందో తెలుసుకోవడానికి ?? .తెలంగాణా ప్రజల మనోభీష్టం గురించి మీకు ఎంత తెలుసో /తెలియదో ఇతరులకు కూడా అంతే తెలుసు /తెలియదు అని తెలుసుకోవడమే అసలు సిసలు ప్రజాస్వామికం.ప్రజలు పట్టం గడితే గానీ ప్రభువులు కాలేరు ,అదే ప్రజాస్వామ్యం.మనది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం.ఒకప్పటి రష్యా ,ఇప్పటి చైనాలా ఏకశిలా పార్టీ (ప్రజా స్వామ్య?) వ్యవస్థలో ఇటువంటి అవకాశం లేదు. కావున, ఎటువంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు తిరునగరి సత్యనారాయణ గారు ?? స్వేచ్చకు తావులేని ఏక పార్టీ ఏకాభిప్రాయం గల అప్రజాస్వామిక వ్యవస్థా ?? బహుళ పార్టీ బహుళాభిప్రాయాలు గల ప్రజాస్వామిక వ్యవస్థా ?? నాకు చూడగా తిరునగరి సత్యనారాయణ గారు మొదటి దారినెంచుకొన్నట్లే కనిపిస్తుంది. అది ప్రమాదకరమని వేరే చెప్పాలా ?? భారత రాజ్యాంగం ఒకసారి కూడా తెరిచి చూడని వారు ప్రజాస్వామ్యం అన్న పదాన్ని తోచిన రీతిలో వాడటం వారి రాజకీయ అపరిపక్వతనే సూచిస్తుంది.

    “ఇవాళ్ళ తెలంగాణా పల్లె పలెనా ప్రతి మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవి కావని కవిగారు గుర్తెరిగారా? లేక గుర్తించినా తమ అభిప్రాయంగా, ప్రజల అభీష్టానికి భిన్నంగా పద్యం చెప్పారా?”

    కవి గణాంక శాస్త్ర వేత్త కాలేడు; కావున ఎన్ని పల్లెల్లో ఎందరు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో గణించి పట్టీలు కట్టడానికి.పోనీ సత్యనారాయణ గారు ఆ పని చేశారా అంటే అదీ లేదు.అయినా సరే , “పల్లె పల్లెనా మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవే” అని ప్రకటిస్తున్నారు. నా ప్రశ్న అసలు మీకు ఆ అభిప్రాయం ఎలా కలిగింది ?? ఏ ధైర్యంతో అలా ప్రకటిస్తున్నారు ?? ఆ అభిప్రాయం ఏర్పరచుకోవడానికి మీరు అవలంబించిన శాస్త్రీయ పద్ధతులు ఏవి ??

    నేను తెలంగాణా లో ఇటీవల జరిపిన పర్యటనలో దినకూలీలతో భేటీ అయ్యాను. వారు తెలంగాణా భావననే తిరస్కరిస్తున్నారు. రాజకీయ నాయకులను వారికి వత్తాసు పలికే మీడియాను అసహ్యించు కొంటున్నారు. అంత మాత్రం చేత తెలంగాణాలో అందరూ తెలంగాణాను వ్యతిరేకిస్తున్నారు అని నేను అన వచ్చునా ?? నా శాంపిల్ స్పేస్ సరిపోదు, ఆ నిర్ణయానికి రావడానికి. ప్రజల అభీష్టం తెలిసేది ఎన్నికల ద్వారా ; అంతవరకూ ,కర్ణ పిశాచి ఉన్నా సరే, ప్రజాభీష్టం తెలిసినట్టు ఫోజు పెడితే అబోరు దక్కదు. కాబట్టి , ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా / అనుకూలంగా కవిత్వం చెప్పారా అన్న ప్రశ్నే ఉదయించదు.

    “పద్యం ఎంత అందంగా చెప్పినా, అది రాయప్రోలు వారిని గుర్తు తెచ్చినా పద్యం లోని భావం (వస్తువు) రాజకీయ పరమైనది, అదీనూ తెలంగాణ ప్రజల రాజకీయానికి వ్యతిరేకమైనది. బహుశ అందుకేనేమో ఈ వస్తువు పద్య రూపాన్ని ఎంచుకున్నది . తెలంగాణ కోరుతూ సమకాలీన కవిత్వం రాస్తున్న వారంతా జానపదుల పాటను (వచన కవిత్వం తో పాటు) ప్రధానంగా ఎంచుకుంటున్నారు. వస్తువు రూపాన్ని నిర్ణయిస్తుంది అనడానికి ఇది మంచి ఉదాహరణ.”

    వచన కవిత్వం రాయడం తెలంగాణా ఉద్యమ స్ఫూర్తిలో భాగం అని చాలా విలువైన మాటను తెలిపారు. దేశికాచారి గారు ఆదినుండి పద్యకవి ; ఆయనకు పద్యరూపంలో రాయడంలోనే నేర్పు గలదు. ఇవాళ కొత్తగా ఆయన పద్యాన్ని చేపట్టి ఉంటే మీ సిద్ధాంతానికి బలం చేకూరేది. మరి , ఆయనను ఖండిస్తూ పద్యాలు రాసిన శ్రీనివాసులో ఉద్యమస్ఫూర్తి కొరవడిందా ??

    మీ అభిప్రాయాన్ని వచనంలో ఎందుకు రాశారు; ఏదైనా జానపదుల వరుసలో పాట కట్టి ఉంటే ఉద్యమస్ఫూర్తి వెలిగి పోయేది కదా. ఎవరి మనసుకు తోచినట్టు వారు రాసుకొంటారు. అదే రీతిన విమర్శ ,ప్రశంస వస్తాయి. నీవు వచన కవిత్వం రాసి ఊదర కొడితేనే / పాట రాసి గజ్జె కట్టి ఆడితేనే ఉద్యమ స్ఫూర్తి ఉన్నట్టు. వచన కవిత్వం , పాట వదిలి వచనంలోనో ,పద్యంలోనో రాస్తే ఉద్యమ స్ఫూర్తి లేనట్టు అనడం అసలు సిసలు అర్థంలో అప్రజాస్వామికమే కాదు మిగుల అజ్ఞాన జనితం.

    భావ ప్రకటనా స్వేచ్చ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ. దాన్ని దెబ్బ తీసే ఉద్యమాల మీద ,వాటి వెనుక ఉన్న అరాచక శక్తుల పట్ల సానుభూతి చూపడం ప్రమాద కరం. బాధ్యత గల కవిగా దేశికాచారి గారు దారి చూపారు. కవిదాటు ,గొర్రెదాటు ఒకటి కాదు అని నిరూపించడం బాధ్యత గల తెలంగాణా కవులు సాహిత్య వేత్తలు చేయదగిన పని. గుంపులో గోవింద కొట్టే వాడు ఎన్నటికి కవి కాలేడు అని తెలుసు కోవడం మంచిది. కవులు తమకు వెన్నెముక ఉందని వానపాములకూ తమకు భేదం ఉందని నిరూపించుకునే తరుణం ఆసన్నమయింది.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  1318. తెలగాణెము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    04/20/2010 10:58 pm

    ఇది వొట్టి అభిప్రాయవేదిక కాబట్టి వ్రాసిన కవితకు స్పందన ప్రతిస్పందనలు సమంజసమే. రాష్ట్రం అన్నది ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా వేర్పాటు కాదు, ఏర్పాటు మాత్రమే, ఒకే దేశంలో ఏర్పాటు చేసుకున్న, చేసుకునే పాలక వ్యవస్థ. ఒక రాజకీయ పరమైన పాలక వ్యవస్థకు అంతకు మించి ప్రాముఖ్యతను ఇవ్వడం సమర్థనీయం అనిపించదు. ముఖ్యంగా ఇటువంటి వేదిక మీద.
    ===========
    విధేయుడు
    _Srinivas

  1319. ఈమాట గురించి గురించి jayaprabha గారి అభిప్రాయం:

    04/15/2010 8:00 am

    సంపాదకులకి! భారతీయ భాషలలొ వచ్చిన కవిత్వాన్ని జర్మనీ భాషలోకి అనువాదమ్ చేసి తెచ్చిన కవితా సంకలనమ్ వచ్చింది. దాని పేరు “Nachtregen”[ night rain అని అర్ధం.] ఈ పుస్తకంలో శ్రీశ్రీవి, నావీ కవితలున్నాయి. మిగతా భారతీయ భాషలకి సంబంధించి ఆయా భాషల్లో ప్రసిధ్ధులైన కవులు కూడా ఈ సంకలనం లో ఉన్నారు. ఇది హైడెల్ బెర్గ్ నించి వచ్చింది. అనువాదమూ.. సంపాదకత్వమూ draupadi verlag, ఇంకా jose punnamparambil చేసారు.

    జయప్రభ.

  1320. తడిస్తే కదా తెలిసేది! గురించి తవ్వా ఓబుల్ రెడ్డి. గారి అభిప్రాయం:

    04/13/2010 8:05 am

    మండుటెండలో మంచు బిందువులను కురిపించింది, మీ కవిత. అభినందనలు!

  1321. అంధకారం గురించి kothapalli ravi babu గారి అభిప్రాయం:

    04/08/2010 8:25 pm

    గరిమెళ్ళ కు,
    కవితే ఇది. ఇంకా రాయండి.
    రవిబాబు

  1322. ప్రేమ కవితలు గురించి b.laxman rao గారి అభిప్రాయం:

    04/08/2010 7:30 am

    ఊహల ఒత్తిడి ఒలికితే కవిత్వం అనుకున్నాను ….కానీ మీరే కవిత్వం అనుకోలేదు
    మీ కవితా హృదయానికి నా జోహార్లు…
    బి.లక్ష్మణ్ రావ్,ఐఐఐటి
    బాసర్,అదిలాబాద్
    ఫోన్9603088598

  1323. అంధకారం గురించి జి ఎన్ గారి అభిప్రాయం:

    04/07/2010 11:04 pm

    సత్యనారాయణ గారు,

    మీ అబిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ క్రింది విషయాలు గమనించండి.

    1. నేను ఈ కవితను ఎంత మాత్రం మీరు చెప్పిన సున్నితమైన సమస్యను, దానికి సంబంధించిన ఎవరినీ ఉద్దేశ్యించి వ్రాయలేదు. అలా అనిపించి ఉంటే అది యాద్రుచ్చికము తప్ప ఇతరత్రా కాదు.

    అంత విస్త్రుతమైన విషయాల పట్ల నిజంగానే నేను ఏదైనా వ్రాయలనుకుంటె అది ఆంధ్ర భూమి, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ లాంటి ఎక్కువమంది చదివే పత్రికలకు పంపుతాను.

    ఈ మాట లాంటి పత్రికలు కేవలం నెటిజన్లకు మాత్రమే అందు బాటులో ఉంటాయి.

    2. నా స్వానుభవంలోని విషయాల పట్ల స్పందించి మాత్రమే వ్రాసాను.

    3. ఈ కవితను ప్రచరణకు తీసుకున్నప్పుడే ప్రశంసా పుర్వకముగా ఆ విషయాన్ని తెలియజేసారు. అందువలన ఇందులో కవితా విలువలు ఉన్నాయనే నేనూ నమ్ముతున్నాను.

    మీరు చెప్పిన సున్నితమైన విషయాలను ఈ కవిత రూపములో ప్రస్తావించే ఉద్దేశ్యం నాకు ఎంత మాత్రము లేదు. మరొక్కసారి చదివితే మీకే తెలుస్తుందని నమ్ముతున్నాను.

  1324. ప్రేమ కవితలు గురించి Ram sai ganesh గారి అభిప్రాయం:

    04/07/2010 2:52 am

    చాల చక్కగా ఉంది మీ కవిత

  1325. అంధకారం గురించి తిరునగరి సత్యనారాయణ గారి అభిప్రాయం:

    04/06/2010 12:21 pm

    రెండు ప్రశ్నలు:

    1. ఇది కవిత్వమా? ఇందులో కవిత్వం అని చెప్పుకోదగ్గదేమైనా ఉన్నదా? మంచి కాదు కదా కనీస సాహిత్య స్థాయి కానీ కవిత్వ స్థాయి కానీ లేని దీన్ని (ఏమనాలో తెలియడం లేదు) ప్రచురించి ఈ మాట తన స్థాయి మరచి పోయిందా? ఏ సాహిత్య ప్రమాణాలు దీనికి వర్తిస్తాయో, ఎట్లా ఇది కవిత్వమవుతుందో ఎవరైనా విడమర్చితే సంతోషిస్తాను.

    2. ఇది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు వ్యతిరేకంగా రాసినట్టుంది. కవిత బలహీనత వల్ల అది తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఇంత చవకబారు కవిత్వంతో అవమాన పర్చడం సమంజసమా? ఈ మాట సంపాదక వర్గానికి అభిప్రాయాలెట్లున్నా, తెలంగాణ ఆకాంక్ష ప్రజలది అనీనూ, ఏదో స్వార్థ రాజకీయ నాయకులది కాదనీ చాలా స్పష్టంగా తెలుసనే అనుకుంటున్నాను. స్వార్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఎన్ని సార్లు మోసపోయినా తెలంగాణ ప్రజలు తమ ప్రజాస్వామిక ఆకాంక్షను పదే పదే వ్యక్తం చేస్త్తూనే ఉన్నారు. పోరాడుతూనే ఉన్నారు. అట్లాంటప్పుడు ఇది ప్రచురించడం ఆ ఆకాంక్షను అవమానపర్చడం కాదా?

  1326. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    04/06/2010 10:44 am

    మీ కవిత ఏదైనా మనసుకు హత్తుకునేలా ఉంటుంది….మంచి పద చిత్రాలు వేస్తారు మీరు..

  1327. తెలగాణెము గురించి తిరునగరి సత్యనారాయణ గారి అభిప్రాయం:

    04/05/2010 8:14 pm

    కవి గారు సిసలైన తెలంగాణ వాడినని చెబుతూనే తెలంగాణా ప్రజానీకం ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కవిత్వం చెప్పారు. ఇవాళ్ళ తెలంగాణా పల్లె పలెనా ప్రతి మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవి కావని కవిగారు గుర్తెరిగారా? లేక గుర్తించినా తమ అభిప్రాయంగా, ప్రజల అభీష్టానికి భిన్నంగా పద్యం చెప్పారా? పద్యం ఎంత అందంగా చెప్పినా, అది రాయప్రోలు వారిని గుర్తు తెచ్చినా పద్యం లోని భావం (వస్తువు) రాజకీయ పరమైనది, అదీనూ తెలంగాణ ప్రజల రాజకీయానికి వ్యతిరేకమైనది. బహుశ అందుకేనేమో ఈ వస్తువు పద్య రూపాన్ని ఎంచుకున్నది . తెలంగాణ కోరుతూ సమకాలీన కవిత్వం రాస్తున్న వారంతా జానపదుల పాటను (వచన కవిత్వం తో పాటు) ప్రధానంగా ఎంచుకుంటున్నారు. వస్తువు రూపాన్ని నిర్ణయిస్తుంది అనడానికి ఇది మంచి ఉదాహరణ.

  1328. వానా వానా… గురించి telugu4kids గారి అభిప్రాయం:

    04/05/2010 12:21 pm

    కవిత వీడియోగా ఇక్కడ చూడగలరు. తొందరలోనే తెలుగు4కిడ్స్ వెబ్ సైటులో ఆణిముత్యాలలో చేరుస్తాను.

    తెలుగు4కిడ్స్ లో కొన్ని పేజీలు ఇంకా ఆకర్షణీయంగానూ, అనువుగానూ తయారు చేయవలసి ఉంది. మాలతి గారి సాయంతో ఈ మధ్యే సామెత కథలు మొదలు పెట్టాము.

    చిత్రీకరణ పై మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలుగు4కిడ్స్ ద్వారా తెలియ చేయగలరు.

  1329. తడిస్తే కదా తెలిసేది! గురించి gana గారి అభిప్రాయం:

    04/03/2010 12:35 am

    హరీష్ గారు,

    గురజాడ గారు ప్రసాదించిన వచన కవిత్వ వరాన్ని వదులుకోమంటారా? అనుభూతి రూపాంతరం చెంది కవిత్వం కావడమే ముఖ్యమని నా ఉద్దెశ్యం. వార్తలు, వ్యాసాలు మరియు కధల తో పోలిక లేకుండా పంచే స్వేచ్చా మాధుర్యపు వచన కవిత్వానికి మళ్ళీ గోడలా?

    దయచేసి ఆలోచించండి.

  1330. రెండు అమెరికన్ రుతాలు గురించి naMdivADa udaya BAskar గారి అభిప్రాయం:

    04/02/2010 10:19 am

    హెచ్చార్కె కవిత అద్భుతంగా ఉంది.

    “భూమికి అటువేపు
    నాకోసం చూసి చూసి
    రాలి ఎండిన కొండ రేగుపళ్ళు
    జేబుకింద
    కదుల్తూ ఒక పద్యం”

    పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడు చెట్టు తొర్ర్ల్లల్లో చిప్‌మన్‌కులు, లాన్ మీద మొలిచిన డాండెలియన్‌లు, మేపుల్ చెట్టుకొమ్మల్లో పక్షులు జరుపుతున్న చర్చాగోష్టులు తన కవి హృదయమ్మీద చేస్తున్న దాడిని తట్టుకుని తన చిన్ననాటి రేగుచెట్టు నీడకి సురక్షితంగా చేరుకుంటానని తనకి తాను భరోసా ఇవ్వడం నిజంగా అభిమన్యుడు వినని కధే.

    Hats off హెచ్చార్కే!

    ఇది నిజమైన diasporic కవిత. Keep it coming!

    ఉదయ్

  1331. తడిస్తే కదా తెలిసేది! గురించి hareesh గారి అభిప్రాయం:

    04/02/2010 5:12 am

    ఇది కవిత్వం అంటే నేనొప్పుకోను. నా ఉద్దేశం ప్రకారం కందంలో రాశేవాడే కవి. అంటే వచనం ఎప్పుడూ కవిత్వం కాదు, భావం ఎంత బాగున్నా. This is not to discourage the above poet(?), but I would like people to recognize the need to develop writing in proper chandassu. I hope “Eemaata” would train people who are interested in developing the skill of writing chando badda kavitvam.

  1332. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి Kameswari. Bhamidipati గారి అభిప్రాయం:

    03/24/2010 8:11 pm

    ”ఇరవయ్యవ శతాబ్దములో అమెరికా తెలుగు కధానిక మరియు అమెరిక తెలుగు సాహితీ వేత్తల పరిచయ గ్రంధము” పై ఈమాట, కౌముది వెబ్ సైట్ల వారి సమీక్షలు చదివిన నాకూ కొన్ని మాటలు రాయాలనిపించింది. నేను అతిరధ మహారధ కవయిత్రుల కోవలో దాన్ని కాను.ఏదో రాయాలనిపించి రాస్తున్నాను, నేనేమైనా పొరపాటు చెప్తే మన్నించి అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను.

    కధానికలు ,కవితలు వ్రాయడానికి అందరూ పండితులే కానక్కరలేదేమో ,శాస్త్రబద్ధ్హంగా ఛందస్సు, యతి ప్రాసలతొ కావ్యములల్ల గలిగిన వారూ, తేలికపాటి భాషలో తమకు తోచిన భావాలు, చూసిన సంఘటనలు, స్వానుభవాలు కొన్ని ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు పాఠకులతో పంచుకోవాలని కుతూహల పడతారు. పత్రికలకి పంపుతారు, పాఠకులతో వారి భావాలను పంచుకుంటున్నారు. అప్పుడప్పుడు కొందరికి బహుమతులు కూడా వస్తాయి వారికధలలోని చిత్ర విచిత్ర మలుపులు, సారాంశము గ్రహించి కొంతమంది వాటిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాలను సుగమ మార్గాల మలుచుకునే వీలు కలుగుతూంది. అందుచేత వీలయితే చెయ్యగలిగితే ప్రోత్సహించాలి, వారిని ప్రోత్సహించి వెలుగులోనికి తెచ్చి మహాత్తరకార్యముల చేయువారి చిన్నతప్పులు వుంటే చెప్పవచ్చు కాని మరీ అంత దుయ్యబట్టడము సమంజసము కాదని నాభిప్రాయము. నేటి మహా,మహా కవులు కవయిత్రులూ ఒకనాడు ఓనమాలతో మొదలెట్టినవారే.

    అమెరికా, అయినా ఆముదాలవలసైనా, ఆంద్ర ప్రదేశైనా అలవాట్లు , ఆచార వ్యవహారాలూ మారిన ప్రతీ మనిషికీ కష్ట సుఖాలు, మనోభావాలు ఒకే తీరున వుంటాయి. ఏ సంఘటన కధగా మలచినా చదవడానికి బాగానే
    కాలక్షేపమవుతుంది. ఇంకొక విషయము – వంగూరి ఫౌండేషన్స్ వారు ఎన్నో శ్రమలకోర్చి ఒక్కోసారి కుటుంబ భాద్యతలను కూడా విస్మరించి సంవత్సరాల తరబడి కావ్య సీమకు చేస్తున్న సేవాకార్యక్రమాలు అపురూపం. ఈ గ్రంధప్రచురణకు వచ్చిన కధలను ఎందఱో ఎడిటోరియల్ కమిటి వారు రాత్రింబగళ్ళు శ్రమించి సమీక్షించి ఈ గ్రంధానికి రూపు దిద్ది 2010లో మరొక పుస్తక ప్రచురణ సన్నాహాల వేళ, అంతటి భుహత్తర కార్యం సాధించడము సామాన్యముకాదు. అయినా ఒక మ౦చి కార్యము చేసినప్పుడు కొన్ని ఘాటైన విమర్సలూ ఎదురు దెబ్బలూ ఎదుర్కోక తప్పదు. అయినా ధీరో దాత్తు లెవరూ విమర్శలకు లొంగి భ్రుహత్కార్యముల వీడి వెనుదిరగరు. అన్ని శ్రమలూ విమర్శలూ ఎదుర్కొని ఈ పధకాన్ని అమలు చేస్తున్న చిట్టెన్ రాజు గారికి అభినందనలు. నిజంగా కిరణ్ ప్రభ గారు పేర్కొన్నట్టు ఈ గ్రంధము తరతరాలకు పదిల పరచవలసిన గ్రంధము.

    తప్పులున్న మన్నించగలరు.
    కామేశ్వరి భమిడిపాటి

  1333. కలైన గోర్వెచ్చని పాట గురించి gnanaprasuna గారి అభిప్రాయం:

    03/22/2010 12:47 am

    కవిత సహజంగా వుంది. ఉత్తరాదివాళ్ళు నులకమంచాలు ఇంకా వాడుతూనె వున్నారు. చలికడిములో వాళ్ళ్కి సగం రోజు ఆ నులకమంచాలమీదె. వాకిటిలొ గుడ్డి ఎండలొ కూర్చుని నులకమంచం మీదె చాయ తాగుతూ గడిపేస్తారు.

  1334. *ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి…. గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/11/2010 2:47 pm

    నేను ద్రొపది నవలని గురిచి మట్లాడటమ్ లేదు. మాట్లాడే ఆసక్థి కూడా లేదు. ఎదుకో ఒక కారణమ్ చెప్తాను. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఒక చవకబారు వ్యవహారమ్ గా మారిపోయేయి ఎప్పటినుంచో!! సాజహిత్య అకాడెమీ ఇచ్చిన బహుమతులలో ఎక్కువ శాతం నాసిరకం కవి రచయితలకి రావడాన్ని గమనించండి! కాళీపట్నం రామారావు గారిలాంటివాళ్ళకి మరి ఇవ్వక పోతే పరువు పోతుందని అనుకున్నాకా లేటు గా ఇచ్చారు. అదే ఒక్కోసారి వాళ్ళు అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు గమనించి చూస్తే అసలు ఇలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఎలా ఇచ్చారన్న సందేహం ఎవరికైనా వస్తుంది. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులకీ ..అవార్డ్స్ కమిటీ వాళ్ళ సంకుచిత దృష్టీ ..ఆశ్రిత పక్షపాత వైఖరీ కారణాలుగా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది.

    ఇలాంటి పరిస్థితి బెంగాల్ , కేరళ్ ఇంకా మరాటీ చివరికి అస్సామీ వంటి భాషల్లో కనిపించదు. ఎందుకంటే అక్కడ అవకతవకలు జరిగితే మీడియాలో ఏకిపడేస్తారు. కానీ అదే మన భాషలో ఇదేమిటి అని అడిగిన సందర్భమ్ ఒక్కటి కనిపించదు. మంచి రచయితలకి చాలామందికి బహుమతులు రాకపోవడమూ..అదే మీడియోకర్ కవి రచయితలకి లాబీయింగ్ చేసుకోవడం వల్ల మాత్రమే అవార్డ్స్ రావడమూ సర్వ సాధారణమైపోయింది.

    ఆధునిక కవిత్వం గురించి ఓనామ రాని ఒక భాషా శాస్త్రజ్ఞుడో..కల్పన గురించి కనీసంగా తెలియని మరొక యూనివర్సిటీ ప్రబుద్ధుడో అక్కడ ఏళ్ల తరబడి తిష్ట వేసుకుని కూర్చుని సాహిత్య రాజకీయాలు నడుపుతూ తమతమ కుర్చీలు ఎలా కాపాడుకోవాలా అని అన్నిరకాల కుయుక్తులు చేస్తుంటారు. ఇది బహిరంగ రహస్యం. ఢిల్లీ లో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళగురించి తెలుసు. తెలుగు వాళ్ళు నిలదీసి అడగందే మేమేం చేయగలం అంటారు వాళ్ళు. ఒక జాతి గౌరవాన్ని తమతమ చిన్నపాటి బుధ్ధులతో ప్రతీసారీ రచ్చకీడుస్తున్న కమిటీలని ముందు ప్రశ్నించే వీలుండాలి.లాబీలు చేసుకుంటేనే బహుమతులు వస్తాయి మీకు అన్న ఒక అప్రకిటిత విధానం తెలుగున స్థిరపడేలా చేసేరు. బయటికి చూడడానికి ప్రజాస్వామ్య పంథాలో నడుస్తున్నట్టు ఒక ముసుగు ఉంటుంది. కానీ అదంతా బూటకమేనన్నది అందరూ ఎరిగిన సంగతి! ! unfortunately we are celebrating mediocrity.

    రమ.

  1335. అమ్మ గురించి jaideep గారి అభిప్రాయం:

    03/10/2010 11:24 am

    మంజు గారు – నిజంగా ఈ కవిత చాలా బాగుంది.

  1336. తడిస్తే కదా తెలిసేది! గురించి SADASIVARAO గారి అభిప్రాయం:

    03/10/2010 11:03 am

    వాస్తవమ్ చెప్పారు. కవిత చాలా బాగు.

  1337. వానా వానా… గురించి telugu4kids గారి అభిప్రాయం:

    03/09/2010 10:36 am

    చాలా బావుంది. ఇలా రాయాలి కదా పిల్లల కోసం!
    కవితను telugu4kids లో పరిచయం చెయ్య వచ్చా?
    http://telugu4kids.com/TeluguPaatalu.aspx లో “పాప”, “పువ్వులు”, “హరివిల్లు” పరిచయం చేసినట్లు?

    [ఈమాట నుంచి తీసుకోబడింది అని లింకు ద్వారా ప్రస్తావించి మీరు మీ వెబ్‌సైట్లో ఈ కవితను పరిచయం చేసుకోవచ్చును – సం.]

  1338. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/07/2010 2:58 pm

    ఉపేంద్రగారూ!!

    ఈ విషయం మీద మనమిద్దరమే కాకుండా ఇంకెవరైనా అభిప్రాయాలు చెప్థారేమో చూద్దాం!! ఉన్న కధల గురించే మాట్లాడగలం గానీ రాయని కధల్ని గురించి మాట్లాడలేం! నేనన్నది కధలో సిధ్ధాంతం సూటిగా కన్పించకూడదు అని. నేను యజ్ఞం కధలో సూటిగా సిధ్ధాంతం చొరబడి ఉన్నదని అనుకోవడమ్ లేదు. మార్క్సిస్ట్ రచయితని మీకు తెలుసు గనక మాత్రమే వర్గీకరిస్తున్నారు. అంతే గానీ కధలోంచి మనకి నేరుగా పార్టీ పలుకులు ఏమీ వినిపించవు. నేనన్న విషయం అదీ!! గాబ్రియల్ మార్కస్ కధల్లాంటివి తెలుగులో రాలేదు ఇంకా! ఊహలో పేరెన్నికగన్నవారు కన్పించడంలేదు మరి.

    అవును తెలుగువాళ్ళు పట్టణ వాతావరణాన్ని వంటబట్టించుకున్నవాళ్ళు కారు. తెలుగుదేశంలో మాత్రమే కాదు. డయాస్పోరా సైతమ్ తెలుగులో ఇంగ్లాండ్ లో ఉన్నా ..లేక న్యూయార్క్ లొనే ఉన్నా కూడా! పల్లెటూరుకి కొనసాగింపే!![పొట్టి పాంట్లు..జీన్ లూ గట్రా వేసుకున్నా కూడా అది బయటి వేషం మాత్రమేస్మీ!!]! కాస్మోపోలిటిన్ సంస్క్రుతి ఇంకా తెలుగు వాళ్ళలో కనీసం సాహిత్యమ్ సాక్ష్యం గా అయితే మాత్రం కనబడదు.విప్లవ భావజాలాలు ఎన్నో మాత్రం ఇటు కవిత్వాల్లోనూ అటు కధల్లోనూ కూడా నిజాయితితో కాక అలవాటుగానూ..బోలుగానూ.. కృతకంగానూ భేషజంతోనూ[pompus] ఇప్పటికీ కనిపిస్తాయి.

    వస్తువైవిధ్యం లేకపోయినా..లేక వ్యక్తీకరణలొ వైవిధ్యమ్ లేకపోయినా నేను దాన్ని సృజనలేమి గానే చూస్తాను.

    ఇటీవల ఖదీర్ బాబు కధ “కిందనేల ఉంది” అన్నది. డయాస్పోరాకి భిన్నమైన తెలుగు కధ. మొగుడు బయటి దేశంలోనూ పెళ్ళాం తెలుగు నగరంలోనూ ఉన్నప్పుడు ఏర్పడిన మానసిక క్లిష్టతలని చాలా బలంగా చెప్పిన కధగా నేను ఆ కధని గురించి అనుకుంటున్నాను.

    తెలుగు సాహిత్యంలో ఈ ప్రత్యక్ష ‘విప్లవ’ పరిభాష పోయినప్పుడూ.. రచయిత తాను లక్ష్యంగా కాక కేవలమ్ పాఠకులు అనే వాళ్ళని దృష్టిలో ఉంచుకుని రాసే అలవాటుని వదులుకున్నప్పుడూ బహుశా మంచి సాహిత్యం రాడానికి అవకాశమ్ ఉంటుంది. expected stories తగ్గుతాయన్నది ఇక్కడ నా భావం! లేదా మీరన్నట్టూ ఒక కొత్త పాఠకవర్గాన్ని ఏర్పరుచుకుందికి కూడా బలమైన వస్తు వ్యక్తీకరణతోనూ కాల్పనికతతోనూ.. శైలి తోనూ రచయతలు సొంతనేల మీద అది తెలుగు దేశమైనా లేక వేరే దేశమైనా కూడా నిజాయితీగా ప్రయత్నమ్ చెస్తే కూడా మంచి కధలు వచ్చే వీలుంది. అంటే అత్యధికంగా ఇవాళ రాస్తున్న వాళ్ళ నిజాయితీని అలాగే వారి సాహిత్యనిబధ్ధతనీ మీరు అనుమానిస్తున్నారా? అని మళ్ళీ ఎవరన్నా నా వాక్యాల్ని బట్టి తిరిగి నన్ను ప్రశ్నిస్తే మాత్రం ఇప్పటిమటుకు నేను ఔను అనే అంటూ సెలవు తీసుకుంటున్నాను.

    రమ.

  1339. వానకూడా వింతే! గురించి మారేపల్లి భిక్షం గారి అభిప్రాయం:

    03/07/2010 6:21 am

    నేను ఒక సాహిత్యాభిమానిని.ఎంత కాలమో ఈ అన్వేషణ ఇలాంటి వెబ్ సైట్ కోసం అనుకున్నాను .కాని చాల అ తొందరగా లభించింది.నేను ఇలాంటి సుందర వర్ణణాతితమైన కవితల కోసం ఎదురుచూస్తున్నాను.
    వాన గురించి వర్ణన ఒక వింతగా అనిపించింది.చాలా చక్కటి వర్ణనలతో వర్ణించారు.

  1340. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    03/05/2010 2:26 am

    ఈ సంకలనాన్ని నేను ఇప్పట్లో చదివే అవకాశం లేదు. నేను ఈ క్రింద రాసినది కేవలం ఈ సమీక్షా వ్యాసానికి స్పందన మాత్రమే. అది కూడా, బ్లాక్ అట్లాంటిక్ , తెలుగు డయా స్పోరా, హెమింగ్వే మూడూ ఒకే వ్యాసంలో చోటుచేసుకోవటం ముచ్చటగా అనిపించినందు వల్లనే.

    వెబ్ పత్రికల్లో స్థలాభావం అన్న సమస్య వుండదు కాబట్టి వెంకటేశ్వరరావు గారు కొంచెం వివరంగా చెప్పి వుండవలసిన ది . బ్లాక్ అట్లాంటిక్ పుస్తకం , ‘దేశము’ అనే భౌగోళిక ఎల్లలను దాటే జీవితానుభవాలలో ( బానిస వ్యాపారాల ద్వారా నయితేనేమి, బానిసత్వాన్నించి బయట పడటంలో నయితేనేమి), నల్లజాతీయులు పడిన ఘర్షణలో చైతన్యపు పొరలు ఎట్లా ఏర్పడ్డాయి అన్నది తవ్వి తీసే పుస్తకం. జాతి, దేశము ఈ రెండూ కూడా చరిత్ర గమనములో ఏర్పడిన శిలాజాలే తప్ప వాటికి కాలాతీతమైన వునికి ఏమీ వుండదు అన్న జ్ఞానం , బ్లాక్ అట్లాంటిక్ పుస్తకానికి వుపోద్ఘాతంగా చెప్పుకోవచ్చును. అక్కడినించి ఎత్తుకుని, పాల్ గిల్రాయ్ ఈ నల్లజాతి చైతన్యపు పార్శ్వాలను తడుముకుంటూ దాని రూపు రేఖాలను పునర్నిర్మిస్తాడు. ఇక్కడ ‘పునర్నిర్మిస్తాడు’ అన్న మాట కావాలని వాడుతున్నదే. సాంస్కృతిక విమర్శ అయినా సాహిత్య సృష్టి అయినా మనిషి చైతన్యాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలే — ఒక్కొక్క సారి అవి విజయవంతంగా, అందరికీ పనికొచ్చేలా జరిగితే, ఒక్కొక్క సారి ప్రయత్నం కూడా చేయకుండా విఫలమైపోతాయి.

    పాల్ గిల్రాయ్ రాసిన బ్లాక్ అట్లాంటిక్ పుస్తకాన్ని కానీ, హెమింగ్వే కధల్లోనూ, జర్నలిస్టుగా నూ ఆవిష్కరించిన సత్యాలను కానీ, మనకి పనికొచ్చేలా అన్వయించుకోవాలంటే, ప్రయత్న పూర్వకంగా మనం చేయాల్సిన పని చాలా వుంది. వేంకటేశ్వర రావు గారు, చూచాయగా చెప్పి వదిలేసిన విషయాన్నే తీసుకుందాము. తెలుగు వారు అమెరికాలో వుంటున్నా ఆంధ్రలో వుంటున్నట్టే ఎందుకు కనపడతారు ? ఇది తెలుగు వారో, వారి తరఫున , తెలుగు కథలూ కవిత్వమూ రాసే వారో తమ ధోరణి కొంచెం మార్చుకుంటే మారిపోతుందా ? తెలుగు లో అమెరికా లో వస్తున్న కథలూ, ఆంధ్ర ప్రదేశ్ లో వస్తున్న కథలూ ఒకేలా వుండటానికి కారణం కేవలం వూహా శక్తి లోపించటమే మరేమైనా వుందా ?

    ఇలాటి ప్రశ్నలకు తెలుగు భాష మాట్లాడే వాళ్లంతా ఒక జాతికి చెందిన వారు అన్న అభిప్రాయం ఎప్పుడూ ఎలావచ్చిందో అన్న దగ్గర మొదలు పెట్టుకోవచ్చును. ఈ తెలుగు జాతి అన్న శిలాజంలో జిల్లాల వారీగా కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఏ యే సంఘర్షణల చిహ్నాలు కనిపిస్తాయి అన్నది కూడా ఆలోచించ వలసిన విషయమే. వేంకటేశ్వర రావు గారు సూచించిన కాల పరిధి లో ఆంధ్ర ప్రదేశ్ లో సాంఘిక జీవనంలో చాలా పెద్ద ఎత్తున తుఫానులు వచ్చాయి. నాగార్జున సాగర్ కట్టడంతో – గుంటూరు జిల్లా గుర్తు పట్ట రానంతగా మారిపోయింది.

    కొద్ది రోజుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లా జంగా రెడ్డి గూడెం నించి, మద్రాసు పాండీ బజారు వరకూ, గుంటూరు జిల్లా పిడుగు రాళ్లనించి హైదరాబాదు శివార్లలో ఈ మేడ్చల్, హైదరాబాదులోనే ఏ యెస్ రావు నగర్ నించి యెల్బీ నగర్ వరకూ ఇటు తిరిగి ఇటు తిరిగీ అమీర్ పేట నించి డెట్రాయిట్ వరకూ ఈ మార్పుల తాలూకా ప్రభావం కనిపిస్తుంది.(ఇక్కడ శిలాజం అన్న మాట ఇంగ్లీషులో ఫాసిల్ అన్న మాటకి తత్సమంగా వాడుతున్నట్లు అనిపించొచ్చు. సామాజిక రూపాలు పూర్తిగా ఫాసిల్స్ గా ఎప్పుడూ వుండవు. పొలం గట్ల లాగా అవి నీరు పారటానికి మార్గాలు చూపించినా ఎప్పటికప్పుడు ప్రయత్న పూర్వకంగానో అప్రయత్నంగానో మారుతూనే వుంటాయి. )

    అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవన చరిత్ర వేంకటేశ్వర రావు గారు చెప్పినట్లు – అంతా కలిపి నలభై ఏళ్లు కూడా వుండదు. అమెరికాలో పంజాబీల చరిత్ర దాదాపు వంద సంవత్సరాలుంటుంది. అమెరికాలో గుజరాతీల రోజు వారీ జీవితం , వ్యాపార రంగం ద్వారా అమెరికన్ నాగరికుల రోజు వారీ జీవితంతో కలిసి వుంటుంది. బెంగాలీల సాంస్కృతిక జీవనం – అమెరికన్ యూనివర్సిటీల మేధోత్పాదనలో — ప్రత్యేకించి – లిటరేచర్ , హిస్టరీ , ఇలాటి డిపార్టుమెంట్లలో పెద్ద పాత్ర వహిస్తుంది. ఈ భాషలు మాట్లాడే వాళ్లంతా ఈయీ పనులే చేస్తుంటారని కాదు కానీ, వారి చైతన్యంలో ఈ అనుభవాల ప్రభావం చాలానే వుంటుంది. వేంకటేశ్వర రావు గారు సూచించినట్లు – అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవనంలో ఆఫీసుల్లో , ప్రత్యేకించి ఐటి రంగంలో పనులు చేసుకోవటం, గ్రీన్ కార్డు సంపాదించుకోవటం, కట్నం మాట్లాడుకోవడం , పెళ్లిళ్లు చేసుకోవడం, హైదరాబాదులాంటి చోట ఇల్లో స్థలమో కొనుక్కోవడం, తెల్ల అమెరికన్ సబర్బన్ లైఫ్ లో ఒక చిన్న చోటు వెతుక్కోవటం, ఇలాటివి చాలా ముఖ్యమైన ఘట్టాలు. ఇక్కడా అక్కడా కూడా నగర జీవితంతో సంబంధం లేకుండా , పెళ్లిళ్లూ కట్నాల ద్వారానో , వ్యవసాయమూ – దాన్ని అంటుకునుని వుండే ఇతర రంగాలనుండి కుటుంబాలు మిగుల్చుకున్న డబ్బులతోనో – తల్లి తండ్రులు గుట్టు గా సర్కారీ వుద్యోగాలు చేసుకుని మిగుల్చుకున్న డబ్బులతోనో, అమెరికాకి పోవటం అన్నది సర్వత్రా జరిగింది.

    హైదరాబాదు లో ఏదో కొన్నేళ్ళు వుండి , అక్కడ కొంత ఆధారం సంపాదించుకున్నాకూడా, ఇలాటి ప్రవాసులలో ఎవరూ కూడా – తమ చుట్టూ కమ్ముకు వస్తున్న పెను మార్పులని గమనించేటంత వోపిక వున్న వాళ్ళు కాదు. అమెరికా దాకా ఎందుకు – గ్రామం వదిలి, చిన్న పట్టణం, చిన్న పట్టణం వదిలి హైదరాబాదు నగరం , హైదరాబాదు నగరం నించి అమెరికాకో, యూరప్ కో ఎగిరి వెళ్ళటం — ఈ క్రమంలో కూడా ఎక్కడా కూడా కొంచెం వూపిరి పీల్చుకుని, తమ చుట్టూ ఏమీ జరుగుతోందో తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది వుంటారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ముందు పరిస్థితి ఇంత ఇరుకుగా వుండేది కాదనుకుంటాను. తెనాలి లో వున్నా, విజయవాడలో వున్నా, వరంగల్లు లోనో , హైదరాబాదులోనో వున్నా తమ చుట్టూతా ఏమి జరుగుతోందో తెలుసుకోక తప్పేది కాదు. బతుకు తెరువుకోసమే అయినా బొంబాయికో, మద్రాసుకో వెళ్ళే వాళ్ళు. ఆ వెళ్లిన అనుభవానికి కేవలం వ్యక్తిగత పరిధిలో కాకుండా పెద్ద కాన్వాసులో భాష్యం చెప్పుకునే వాళ్ళు.

    ఎమెర్జెన్సీ తరవాత – ప్రత్యేకించి, ఈనాడు పత్రిక బలంగా ఎదిగిన తర్వాత, తెలుగు దేశం పార్టీ ఉవ్వెత్తున వచ్చిన తర్వాత దేశ రాజకీయాలలో తెలుగు సాంఘిక జీవనమూ, ఆంధ్ర ప్రదేశ్ లో కుటుంబ జీవనమూ పూర్తిగా అంతర్ముఖమైపోయినాయి. జీవితాన్ని , సాహిత్యాన్ని అనుభవించడం కాకుండా వినిమయం చేసుకోవటం పాతుకు పోయింది. సినిమాలు ఈ విషయంలో చాలా కృషి చేసాయనే చెప్పుకోవాలి. ( గుంటూరు జిల్లా వ్యవసాయపు మిగులు ధనం మద్రాసు వెళ్ళి పనికిమాలిన చెత్త ఎట్లా ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిందో – బాలగోపాల్ ఎక్కడో చాలా చక్కగా చెప్పినట్టు గుర్తు). తెలుగు మాట్లాడే వాళ్ళ జ్ఞానేంద్రియాలకి ఆవకాయకీ, ఆత్మకధకీ తేడా తెలియకుండా అయిపోయింది. ఒకే తూనిక రాయి — ఎంత మంది కొన్నారు, ఎంత మంది ఆమోదించారు, ఏ సెలెబ్రిటీ ఎండోర్స్ చేశారు – ఇదీ లెక్క.

    అది జరుగుతుండగానే విప్లవ రాజకీయాల పట్ల ఏదో ఒక రోమాంటిక్ వూహాలుండటమూ , అలా మాకు వున్నాయని – అది లేని వాళ్ళందరూ ఉదారవాద మూర్ఖులో, వర్గ శత్రువులో అయి వుంటారని బూకరించటం లోనే సాహిత్య విమర్శకులకు తీరిక లేకుండా పోయింది. మొదట్లో విమర్శకులు చేసిన ఈ పనిని, తరవాత తరవాత రచయితలూ, రచయిత్రులూ, కవులూ, కవయిత్రులూ వాళ్ళని సమర్ధించే వాళ్లూ కూడా అలవాటు చేసేసుకున్నారు. ఇటువంటి సంస్కృతిలో ఎవరికీ దేని పట్లా జవాబు దారీ తనం వుండదు. కష్ట పడి పని నేర్చుకోవలసిన అవసరమూ వుండదు. బుకాయించటం, బూకరించటం వస్తే చాలు. మహా అయితే, తమ కులానికో, తమ వీధికో, తమ జిల్లాకో సంబంధించిన కొంత పనికి మాలిన జ్ఞానం సంపాదించుకుంటే చాలు.

    బతకడానికి సరిపోయే దినుసులే ఇట్లా వుంటే ఇందులోంచి సాహిత్యం పుట్టించాలంటే దానికి కావలసిన పనిముట్లు ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సిన అవసరం వుంది. విమర్శకులు చేయ వలసిన పని అది.

    తెలుగులో మంచి కధ ఎట్లా వుండాలి అని చెప్పే కన్నా, మనకు కనపడుతున్న సాహిత్యంలో ఏవి మంచి ధోరణులు — అన్నది చెప్పుకోవలసిన అవసరం వున్నది అని మాలతి గారు అడగటం సబబే. కానీ , దానికి సమాధానం ఇప్పుడు వస్తున్న తెలుగు కధల్లోనించే వెతుక్కో నవసరం లేదు. తెలుగు సాహిత్యం మొత్తం నించే కాక ఇతర భారతీయ భాషలనించో ప్రపంచ సాహిత్యంలో ఎక్కడినించో నయినా చూపించుకోవచ్చును. అసలు కధల వూసే ఎత్తకుండా తెలుగు వారి సంస్కృతులని నిర్మొహమాటంగా విమర్శించి చెప్పుకున్నా చాలు.

    రోజు వారీ జీవితంలో లేని లోతుని పాఠకులకి అందు బాటులోకి తేవటం రచయిత చేయవలసిన పని. దానికి కావలసిన నైపుణ్యం షెల్ఫ్ మీద దొరకదు. తయారు చేసుకోవాలి. తెలుగు డయాస్పోరా రూపు రేఖలూ, దాని చైతన్యానికి ఆయువు పట్లూ ఇలాటి వాటి గురించి మాట్లాడుకోవటం ఆ దిశగా ఒక మంచి అడుగే. ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. సమస్యకి మూలం ఎక్కడో స్థూలంగానానయినా గుర్తించ గలిగితే, ఆ తరువాత దానికి పరిష్కారాలు అందులోంచే దొరుకుతాయి.

  1341. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/04/2010 1:18 am

    వేంకటేశ్వరరావుగారూ!!

    మీ పరిశీలన బాగుంది. అయితే మూర్తిగారు చెప్పినట్టు అది తెలుగుదేశమైనా.. లేక అమెరికా అయినా వస్తువైవిధ్యమూ ఉండటం లేదు. శిల్పవైవిధ్యమూ ఉండటం లేదు.

    వచన కవిత్వం వచ్చేకా..రాసేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టే..కధలు రాసేవాళ్ళుకూడా సంఖ్యలో పెరిగారు. అయితే “కల్పన” అన్నది ఆ రాస్తున్నవాళ్ళలో సహజంగా ఉండాలి. అది లేని వాళ్ళు జీవితాంతం రాసినా వాళ్ళ సమకాలంలోని పరిచయాలవల్ల “రచయితలు” అని ఒక ముద్ర వేయించుకోగలరేమో గాని..వాళ్ళు పోఏకా వాళ్ళమీద ఉన్న ముద్రా పోతుంది. మీరు డయాస్పోరా తెలుగుకధకి చెప్పిన లక్షణాలన్నీ కాస్త అటూ ఇటుగా తెలుగుదేశం లోని “కధలు” అనబడే వాటికి కూడా వర్తిస్తాయి.

    ప్రధానమైన సమస్య సమకాలీన సాహిత్యం మీద రావలసిన “విమర్శ” రాకపోవడమే!! అద్దంలో మనముఖం మనకి బాగానే ఉన్నట్టుగా కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా రాసిన వాళ్ళకి ఆ రచన బాగా ఉన్నట్టే అన్పిస్తుంది కూడా!!కానీ అది మంచి కధ కాదని ఆ రచయిత కి చెప్పగల విమర్శ చాలాసార్లు ఉండదు. ఇందుకు కారణం ఒకటి విమర్శకుల జాతి సంఖ్యలో తక్కువ రచయితల సంఖ్యతో పోలిస్తే! రెండోది మన దగ్గర ఎవరూ కూడా వ్యక్తులపట్ల నిబధ్ధత కల్గిన వాళ్ళేగానీ..నిజంగా సాహిత్యంపట్ల నిబధ్ధత కల్గిన వాళ్ళు కన్పించరు. చాలామందికి చాలా రకాల మొహమాటాలు. ఆ కధ వాళ్ళకి తెలిసిన వాళ్ళు రాసినదైతే వీళ్ళు దాని మంచిచెడ్డల్ని నిజాయితీగా చెప్పలేరు.

    అనిటికన్నా ముఖ్యం creativity అన్నది స్వతహాగా ఉండాలి. రకరకాల కారణాలకి వేరేపనులు మాత్రమే చేయగల్గిన వాళ్ళూ రచనలో రాణించలేని వాళ్ళూ కూడా కావులుగానూ..రచయితల గానూ చెలామణీ కావడానికి తెలుగున ఈ అన్నిటి కారణాలవలనా అవకాశం ఎక్కువ. మీరు ఎన్ని రాసినా మీలో రచయితకాగల్గిన లక్షణాలు లేవయ్యా అని ఎవరూ చెప్పరు గనక అలాంటి వాళ్ళు రాస్తూనే ఉంటారు. అంతే కాదు అలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఆచ్చువేయడానికి పూనుకుంటే దొరికే రచనల సంఖ్య కూడా ఈ పరిమితిలో ఉండక తప్పదు కదా!!

    చివరగా నాకు ఎప్పుడూ ఉన్న ప్రశ్నే అనుకోండి. నేను ఇదివరకూ కూడా వేసాను. మళ్ళీ అడుగుతున్నాను. తెలుగు డయాస్పోరా తమ రచనలని తెలుగులోనే ఎందుకు రాస్తున్నట్టూ?? ఝుమ్పా లాహిరి లాగా అక్కడి దేశంలోని వాళ్ళకోసం ఎందుకు రాయడంలేదూ??

    దయాస్పోరా తెలుగువారినించీ వేరే భాషల్లో చేసే రచన రావాలని..వాళ్ళకి కూడా ఒక బుకర్ ప్రైజ్ , ఒక పులిజర్ ప్రైజ్ రావాలని కోరుకుంటాను. అది రానన్నాళ్ళూ తెలుగులో వస్తున్న”దళిత కధలు..మైనారిటీ కధలు” లాఅగానే “ప్రవాసాంధ్రుల కధలు” అన్న ఒక విభాగమ్ తెరుచుకుని అమీరికాంధ్రుల కధలు ఓ మూల కూచుంటాయి. అంతే!!
    రమ.

  1342. తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    03/03/2010 2:23 am

    వాదం వచ్చిన ప్రతిసారీ ఇంత భయంకరంగా వుండనవసరం లేదు వేణుగోపాల్ గారూ. 🙂

    చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో లో వార్తలు చదివే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయి వుంటారనుకుంటుండే వాడిని. ఒక సారి ఒక అనౌన్సర్ పొరపాటున ‘సిబ్బంది’ అనడానికి బదులు ‘సిద్దంబి’ అనడం నేను స్పష్టంగా విన్నాను. ఆ రోజంతా కనపడ్డ వాళ్లందరికీ రేడియో లో వార్తలు చదివే ఆయన చేసిన పొరపాటు గురించి చెప్పుకుంటూ తిరిగాను. నేను అట్లా ప్రచారం చేసినందు వల్లన ఆ అనౌన్సర్ ఖ్యాతికి ఏమీ నష్టం వచ్చి వుంటుందనుకొను. నిజానికి ఆ పొరపాటు పట్టుకోవటం వలన నా దృష్టిలో కూడా అనౌన్సర్లు గొప్ప వాళ్ళు అయి వుంటారన్న నమ్మకం కూడా ఏమీ తగ్గలేదు. కాక పోతే, గొప్ప వాళ్ళు కూడా మామూలు మనుషులే అన్న జ్ఞానం మాత్రం నాకు వచ్చింది.
    అట్లాగే, శ్రీశ్రీ రాసిన పాటలో పొరపాటు దొర్లిందట అని ఒక పది మంది వింతగా చెప్పుకుంటే అందులో పెద్ద నేరమేమిటో నాకు అర్ధం కావటం లేదు. దాని వలన శ్రీశ్రీ కి వచ్చిన నష్టమేమీ లేక పోగా, ఒకరికో ఇద్దరికో శ్రీశ్రీ కూడా మానవమాతృడే అన్న స్పృహ కలుగుతుంది. అది మంచిదే.

    అట్లా చెప్పుకునే వాళ్ళ మీద తెలిసిన వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు విరుచుకు పడితే – ఆహా , ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద నేరంగా లెక్క కట్టి ఇంత వుద్రేక పడుతున్నారంటే, అసలు విషయం ఇంకెదో వుంది వుంటుంది అన్న అభిప్రాయం కలిగే ప్రమాదం కూడా వుంటుంది.

    ఇక పోతే, అచ్చు తప్పులు , వ్యాకరణ పొల్లులూ దిద్దుకోవడం రచయితకి కనీస బాధ్యత. రచయిత గొప్పదనానికి అదేమంత పెద్ద తార్కాణం కాదు.

    శ్రీ శ్రీ , ఒకటీ రెండూ కాదు, ఏకంగా కొన్ని తరాల తెలుగు యువతీ యువకులని ప్రభావితం చేసిన కవి. ఇది ఎలాటి ప్రభావమూ, ఈ ప్రభావం మంచికొచ్చిందా చెడ్డకొచ్చిందా, ఏ కవితా ఎప్పుడూ ఏ ప్రయోజనాన్ని సాధించింది, ఇలాటి విషయాలని మాట్లాడుకోవలసిన అవసరం ఈ రోజున వున్నది. అవకాశం కూడా కొద్ది కొద్దిగా కనపడుతోంది.

    బాధ్యత కల మనుషులు, ఆ అవకాశాన్ని చేజారనీయకుండా మాట్లాడాలి. మాకు తెలుసు, మీకు తెలియదు, మాకున్న రసజ్ఞానం మీకు లేదు, శ్రీశ్రీ ని అంచనా వేసే టంత గొప్పవాళ్ళా మీరు ? అంటూ శ్రీశ్రీ వ్యాకరణ దోషం గురించి చెప్పుకున్న వాళ్లంతా రాళ్ళు విసురుతున్న అలాగా జనం అన్నట్టు కలియబడితే, జవాబు చెప్పక తప్పదు.

    పి.ఎస్.
    మొసళ్ళ గుంపుల మధ్య అలవోకగా బ్రతకడం అలవాటయిపోయిన వాడిని కాబట్టి నామీద వేస్తే సంభాళించుకోగలిగాను కానీ, మీరిలాగ అలవాటుగా ఇంటి పేర్లతో గాలాలు వెయ్యరనే ఆశిస్తున్నాను. విషయం శ్రీరంగం వదిలిపెట్టి కంచి దోవ పట్టటం ఎవరికి మాత్రం మంచిది ?

  1343. తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/03/2010 1:51 am

    వ్యాకరణం కన్నా కవిహృదయానికి ప్రాముఖ్యతనివ్వడం అన్నది ఒక సరసగుణం! ! నేను శ్రీశ్రీవిషయంలో చెప్పినది అదే!! పైగా శ్రీశ్రీ తాను స్వయంగా వివరణ ఇచ్చాకా మరింక అది చర్చకి రాకూడదు. అది ఒక మర్యాద.

    సాహిత్యంలో వ్యాకరణ దోషాలు ఎన్నుకుంటూ పోతే మహామహులు చాలరు. “ఎమితిని సెపితివి కపితము” అని అల్లసాని పెద్దనని రామలింగడు వెక్కిరించాడని ప్రతీతి. అందువల్ల పెద్దన కవిత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయింది.

    అలాగే అన్నమాచార్యులవారి వేల సంకీర్తనలలో వ్యాకరణ దోషాలు మెండుగానే దొరుకుతాయి. కానీ ఆయన పదాల ప్రాముఖ్యతకి అవేమీ అడ్డురాలేదు. రావు.

    కవితా సంపన్నత ముందు ఇలాంటివి బహుచిన్నవని..లోకంవాటిని పట్టించుకోదనీ చెప్పడం నా ఉద్దేశ్యం!

    శ్రీశ్రీకున్న అపార భాషా పరిజ్నానం తెలిసిన వారు “శ్రీశ్రీ తప్పుచేసేడోచ్ ” అని చాటనఖ్ఖరలేదు అన్నది నా భావం! తప్పు అన్నది ఒప్పు చేసే ప్రయత్నం నేను చేయలేదు. ఆయన మిగతావి అన్నీ “బహువచనం”లో పదాలని రాసేడు గనక అది వ్యక్తి గురించి కాక సమిష్టి పోరాటానికి ఆయన ఆ పాటని లక్ష్యించాడు గనక
    ఆ “ప్రతి మనిషి ని ” మందికి గుర్తుగా గ్రహిస్తే చాలు అన్నది నా సూచన.
    నేను కవితాసౌదర్యానికి వశురాలిని. దాని ముందు ఇతర దోషాలు నాకు ఎక్కవు. ఉత్తమ కవులందరికీ ఉత్తమ భావుకులకందరికీ ఇది అనుభవంలోకి వచ్చే విషయమే!!

    రమ.

  1344. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి bollojubaba గారి అభిప్రాయం:

    03/02/2010 2:54 pm

    జాషువా గారు గొప్ప కవి. స్థూలంగా వారి కవిత్వాన్ని స్ప్రుశించిన ఈ వ్యాసం బాగుంది. మరింత విపులంగా మరో వ్యాసాన్ని బృందావనరావు గారి కలం నుండి వెలువడుతుందని ఆశిస్తున్నాను.

    బొల్లోజు బాబా

  1345. తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/01/2010 12:34 am

    వ్యాకరణాభిలాషులు గారికి!! నేను చాలా క్లుప్తంగానే జవాబు చెప్పేను. దాని మీద మళ్ళీ నాకు చాటభారతమ్ అంత వివరణలతో ఏమీ పని లేదు. ఇంక జ్నానమ్ అజ్నానమ్ ల ప్రసక్తి తమరే తెచ్హారు. మిమ్మల్ని మీరు అజ్నాత పాఠకుని గాను.. అజ్నాన పాఠకుని గానూ చెప్పుకున్నారు.

    చాకిరేవు వారికి,!! మీ అభిప్రాయం మీద కూడా నాకు మళ్ళీ కొత్తగా చెప్పే అదనపు భావాలేమీ లేవు. నా అదృష్టం కొద్దీ [దురదృష్టంగా మాత్రం కాదు] మీ లాగే నేను సైతం ఇతర భాషా కవిత్వాలని క్షుణ్ణంగా చదువుకున్నదాన్ని. అందువలన శ్రీశ్రీ విలువ నాకు ఎక్కువ తెలుసు.

    రమ.

    [ఈ కామెంట్ ఎడిట్ చేయబడింది – సం.]

  1346. తెలుగు వీర లేవరా గురించి ఒక అజ్నాత(న) పాఠకుడు గారి అభిప్రాయం:

    02/28/2010 6:11 pm

    “ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి..చురకత్తులు పదును పెట్టి…”

    అ. ప్రప్రథమంగా విన్నవించవలసింది, తెలుగు భాష వ్యాకరణం ప్రకారం, “తొడలు”, “శృంఖలాలు”, “చురకత్తులు” అనేవి విశేషణాలు కావు. అవి కర్మలు (direct objects). ఇది ముందుగా అర్థం జేసుకోవలయును. “గొట్టి”, “పగులగొట్టి”, “పదును పెట్టి” అనేవి క్రియలు. ఒకే కర్తకు బహు క్రియలు గలవు. ఇది చాలా సరి అయిన విషయమే. అటులనే విశేషణానికి ఏకవచనం, బహువచనం అనేవి వుండను. వచనం అనేది నామవాచకానికి (noun) మాత్రమే ఉండుని. కర్త యొక్క వచనాన్ని అనుసరించి, క్రియా రూపంలో తేడా ఉండును. “రాముడు అరటిపళ్ళు తినెను”, “రాముడూ మరియూ కృష్ణుడూ అరటిపళ్ళు తినిరి” అనే వాక్యములో కర్త వచనము బట్టి, క్రియా రూపములు, “తినెను”, “తినిరి” అని వుండును. గావున విశేషణానికి వచనం లేదు.

    ఆ. ఒక వాక్యములో కర్త ఏక వచనంలో వున్నప్పుడు కర్మ అదే వచనంలో వుండనక్కర లేదు. కర్తా, క్రియా రూపం మాత్రమే ఒకే వచనంలో వుండవలయును. “రాముడు అరటిపళ్ళు తిన్నాడు” అన్న వాక్యంలో వున్న కర్మ బహువచనంలో వుంది. అది సరి అయినదే. తప్పు ఎంత మాత్రమూ కాదు. “రాముడూ మరియూ కృష్ణుడూ కలిసి ఒక బొమ్మను తయారుజేసెను” అన్న వాక్యంలో కర్త(లు) బహువచనం. కర్మ (బొమ్మ) ఏకవచనం.

    ఇ. ఒక మనిషికి రెండు తొడలు గలవు. ఒక మనిషికి కాళ్ళకూ, చేతులకూ వేరు వేరు శృంఖలాలు వుండగలవు. ఒకే ఒక చురకత్తి బదులు, బహు చురకత్తులు పదును బెట్టవచ్చును ఒక దాని తరువాత ఒకటిగా. ఏకవచనంలో వున్న కర్త (మనిషి)కి బహువచనంలో కర్మలు వుండటం తప్పు కాదు.

    ఈ. ఇచ్చట ఉదహరింపబడిన వాక్యంలో ఎటువంటి తప్పూ లేదు. వాక్యం చక్కగానే వున్నది. నేను వ్యాకరణం ప్రకారం “ప్రతి మనిషి” అనేది ఏకవచనం మాత్రమే ననియూ, బహువచనం ఎంత మాత్రం కాదనియూ మాత్రమే ఉటంకించాను. ఇది ఒక భాషకు సంబంధించిన విషయం గావున, భాషా జ్నానం ప్రకారం నేనట్టు చెప్పి ఉంటిని.

    ఉ. మీరు, “శ్రీశ్రీ ఆంగ్ల వ్యాకరణముననుసరించి తెలుగు వాక్యములు రాసిన కవి కాడు గావున ఆయనని తెలుగు భావుకునిగా గ్రహించి మీరు తరింతురు గాక! ” అని అని ఉంటిరి. ఆంగ్ల వ్యాకరణం అనుసరించి తెలుగు వాక్యములను కవి రాయవలెను అని నేను ఉటంకించలేదు. మీరట్లు అపోహ పడి నా మీద ఇటువంటి ఆభాండములు వేయుట విజ్నులయిన మీకు భావ్యము కాదు. అర్థము తెలియజేయగలందుకు మాత్రమే ఆంగ్ల వ్యాకరణం కూడా ఉదహరించితిని. అంతెయును గాక, కర్త, క్రియ, కర్మ, విశేషణం, వచనం వంటి విషయాలలో రెండు భాషల వ్యాకరణం ఒకదానిని ఒకటి పోలి ఉండును. సులభంగా గ్రహించుటకు మాత్రమే అంగ్ల భాషా వ్యాకరణమును వివరించితిని. అందువలన ఇటువంటి వ్యక్తిగత దూషణలు మీకు శోభ నివ్వవు. సాహిత్య చర్చలో కొంచెం సంయమనం అవసరం.

    ఊ. ఆఖరుగా మీరు, “మీకు వ్యాకరణమ్ మీద చాలా పట్టు ఉన్నట్లైతే మీరు కవిత్వాన్ని చదవడమ్ మానేసి చిన్నయ సూరి గారిని అను నిత్యమూ పఠింతురు గాక!!” అని నన్ను వ్యక్తిగతంగా దూషించితిరి. ఇది నాకు మిక్కిలి ఖేదము కలిగించెను. నా వ్యాఖ్యానంలో నేను మిమ్ములను ఒక చిన్న మాట చేత కూడా దూషించలేదు. నన్ను దూషించుటకు మీకు ఎటువంటి హక్కు కలదో నాకు ఈ జన్మమున అర్థము కాదు. నాకు సలహా ఇచ్చే ఆగత్యం మీకు ఎంత మాత్రమూ లేదని నేను ఎంత గానో నమ్ముతూ ఉన్నవాడను. మీరు సాహిత్య సంయమనం పాటించకుండా, ఇటుల రహాదారి మీద ఒకరితో ఒకరు కలియబడి, కలహించుకున్నట్లు చర్చించిన, మీ మీద ఈమాట సంపాదక వర్గానికి ఆరోపణ చేయడం తప్ప వేరే మార్గము లేదు.

    ఋ. అజ్నాత పాఠకులకు కూడా అభిప్రాయములు ఉండుననియూ, అవి వెలిబుచ్చు హక్కూ, అర్హతా వారికి ఉండుననియూ మీరు గమనించకపోవుట బహు శోచనీయమైన విషయము. ఒకరిని అవమానించే హక్కు ఎవరికీ ఎంత మాత్రమూ లేదు. కావున మీరు ఇక మీ వాఖ్యలు విషయమునకు మాత్రమే పరిమితం జేయగలరని ఆశిస్తున్నాను. ఒకరు తమకు ఎంత జ్నానం కలదు అని నమ్మినా, లేని జ్నానం ఎంతో ఉండి ఉంటూనే ఉండును. ఏ ఒక్కరూ సర్వ జ్నాని కాలేరు అని నేను బాగుగా నమ్మువాడను. ఎవరి జ్నానమునకు తోచినట్టు వారు వారి అభిప్రాయములను వెలిబుచ్చుట, అటులనే ఇంకొకరు వెలిబుచ్చిన అభిప్రాయములను గౌరవించుట నాగరీక లక్షణమని నేను వేరే నొక్కి ఒక్కాణించవలసిన ఆగత్యం ఎంత మాత్రమూ లేదు. ప్రతి ఒక్కరి వాఖ్యలూ విషయమునకు మాత్రమే పరిమితం అయి ఉండవలయు. అది వ్రాసిన వారికి సంబంధించి ఉండి ఉండకూడదు. ఇది మీరు గ్రహించగలరని ఆశిస్తున్నాను.

    ఇట్లు,
    నమస్కారములతో
    అజ్నాత(న) పాఠకుడు.

  1347. తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    02/28/2010 6:51 am

    రమగారూ,

    తనమీద తనకు నమ్మకం లేని వాళ్ళు, ఇతరుల మీద పువ్వులు వేసి పూజించో, రాళ్ళు వేసి నిరసించో తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవటానికి తాపత్రయపడతారు. ఎవరు ఏమి చేస్తున్నారో సర్వే చేసి నిరూపించటానికి సాధ్యం కాని విషయం కాబట్టి వదిలేస్తే మంచిది.

    నటశేఖర కృష్ణ , టికెట్లు కొనుక్కుని సినిమా చూసిన ప్రజలు – ఈ రెండు కాగడాల మధ్యన ప్రజ్వరిల్లుతున్న అఖండ జ్యోతి శ్రీ శ్రీ రాసినపాట అనటమే తప్ప, ఈ పాట గురించి మీకున్న అవగాహన ఏమై వుంటుందా అని ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. మహాకవి సృష్టిని బేరీజు వేయటానికి మీరు వాడే కొలమానాలు ఇంత పేలవంగా వుంటే ఏమి మాట్లాడాలో తెలియక, మీరు కిందటిసారి రాసిన అభిప్రాయానికి నేను జవాబు చెప్పలేదు. ఇంకొంచెం వూరుకుంటే అన్నమాచార్యుల దగ్గర నించి ఇంకా వెనక్కి వెళ్ళేటట్లున్నారు కాబట్టి మాట్లాడ వలసి వస్తోంది.

    తెలుగు వీర లేవరా అన్న పాట తెలుగు భాషా పరమైన జాతీయతని వు ద్బోధించే గీతం. ఆ పాట రాసే నాటికి ఆయన తెలంగాణ ప్రాంతంలో వావిలాల గోపాల కృష్ణ గారితో కలిసి తెలంగాణ వుద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వున్నారు. విరసం సంస్థకి అధ్యక్షుడైనాడు. ఈ కారణాలన్నిటి వలనా, ఆ పాటని ఆనాటి రాజకీయ నేపథ్యంనుంచి వేరు చేసి చూడటం నా వల్ల కాదు. అలాగచూడమని ఆయన కూడా కోరుకునే వాడు కాదనుకుంటాను. మీరు అలాగని కోరుకోక పోవటమే కాక, అట్లా చూడటానికి నిరాకరించిన వాళ్లంతా నిరక్షర కుక్షులయి వుంటా ర నుకుంటున్నారు. అంధకారం కమ్ముకుని వస్తున్న రోజులు అవి. వచనంలో 1970 ల వరకూ కుటుంబరావు గారి లాంటి వాళ్ళు నిర్వహించిన పాత్ర ఆ తరువాత దాదాపుగా మాయం అయి పోవటం ఆ అంధకారంలో ఒక భాగమే. కొత్త దీపాలు వెలగలెదని కాదు కాని ఆ చీకట్లలో ఎవరు ఎలాటి దీపాలు వెలిగించారు అన్నది అడగడానికి ఇప్పటికింకా చాలా మంది తటపటాయిస్తారు. ఇన్నేళ్ల తరవాత రాళ్ళు విసరడమా అన్నది కాదు. అలాటి లెక్కలు కట్టడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది అన్నది .ఆలోచించ వలసిన విషయం అని నేనను కుంటే ఆలోచించ వలసి రావటమే మీకు వింతగా వున్నట్లుంది. కనుకనే సంభాషణ ముందుకి సాగడం లేదు.

    మీ అభిప్రాయాలు చూసిన తరువాత దేశమంతా ఇన్ని సాయిబాబా గుళ్ళుండగా లేనిది , శ్రీ శ్రీ కి కూడా ఒక దర్గా కట్టి మొక్కుకునే భక్తులుంటే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి లే అనిపిస్తోంది.

    విషయం సజావుగా సాగి వుంటే, శ్రీశ్రీ కవిత్వాన్ని అప్పుడప్పుడు తెలుగు రాని వాళ్ళకి వినిపించి సంతోష పడి వూరుకునే వాడిని. నా కర్మ కొద్దీ, ఆయనకి సమకాలికులైన ఇతర భాషల్లోని కవులు కొంత మందిని చదివాల్సి రావడమూ, ఏవో కారణాల వలన ఎప్పుడో కంఠస్థం చేసి వదిలేసిన తెలుగు ప్రబంధాలలోనివీ, తమిళ దివ్య ప్రబంధంలోనివీ ముక్కలు తెరలు తెరలుగా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవలసి రావటం, ప్రత్యేకించి తెలుగు భాషలో దేశభక్తి గురించి, సంకుచిత ధోరణులూ, అభ్యుదయ ధోరణుల గురించి అడపా దడపా ఏదో చర్చ రావడం ఇలాటి వాటి వలన శ్రీశ్రీ గురించి మళ్ళీ ఆలోచించ వలసి వచ్చింది.

    ఈలోపల, తెలుగు భాష ఏనాటికైనా జాతీయ అధికార భాషగా గుర్తించబడుతుందని ఆయన చెప్పిన మాటలు కూడా కళ్ళ బడ్డాయి. (అది చదివి కళ్ళు తిరిగాయి అని కూడా చెప్పాలి. నా మాతృభాష జన జీవనానికి చలన సూత్రం కావాలి అని ఒక కవి అంటే సంతోషించాలి కానీ, నా మాతృ భాష ఇతర మాతృ భాషలు మాట్లాడే వాళ్ళ జీవితాలను కూడా శాసించాలి అని ఒక కవి కోరుకుంటే ఆయన కవిత్వాన్ని ఆమోదించే ముందు కొంచెం జాగ్రత్త గా చదవాలి అని నా గుండె చెప్తుంది. )

    కాల క్రమేణా, నేను నిర్మించుకున్న మనో ప్రపంచంలో శ్రీ శ్రీ ని ఒక పది మెట్లు కిందికి దించక తప్పలేదు.

    నేను రాసిన మొదటి సారే స్పష్టంగానే చెప్పానని అనుకున్నాను. సరిపోలేదోమో నని వివరించి మళ్ళీ చెప్పాను. ఏకవచన బహు వచనాలూ, వాస్తవికతా ఇట్లా తప్పులు లెక్కించు కుంటూ పోతే ఎప్పటికీ తేలదు కానీ, ఈ పాటలో వున్న అసలు సమస్య ఇందులో వున్న భావజాలంలోని సంకుచితత్వం. ఆ సంకుచితత్వానికి పూర్తి కారణం శ్రీశ్రీ కాదు. ఆయన పాఠకులూ, ఆయన శ్రోతలూ , ఆయనని అభిమానించినవారూ, ఆయన పాటలు రాసిన సినిమాల నిర్మాతలూ కూడా పెద్ద ఎత్తున బాధ్యత వహించ వలసి వస్తుంది. అందుకే నేను వేసిన ప్రశ్నలకి ఆయనే సమాధానం చెప్పుకోవలసిన పని లేదు. తప్పు మీది. మీరు జవాబు చెప్పలేక ఆయన మీదికి తోసేస్తున్నారు.

    కేవలం నా వునికిని నిరూపించుకోవడానికి సాహిత్య రంగంలో చెయ్యి చేసుకునేంత వెసులుబాటు వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా కూడా రొజు వారీ జీవితంలో వుండని వాళ్ళలో నేనూ ఒకడిని. రాయక తప్పని పరిస్థితి వచ్చిన రోజు, రాయ వలసిన పద్ధతిలో, బాధ్యతగానే దీస్ని గురించి మళ్ళీ రాస్తాను. అప్పటివరకూ, సెలవు.

  1348. తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    02/28/2010 12:34 am

    అజ్నాత పాఠక మహాశయునకు !! అక్కడ వాక్యం “ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి..చురకత్తులు పదును పెట్టి…” అన్న దానిలోని ప్రతీ విశేషణమ్ కూడా బహువచనలోనే కవి ఎందుకని రాసేడో చూడాలి. ఆయన ఏకవచనమ్ ప్రకారమే అయితే “తొడలు” అనీ..శృంఖలాలు” అనీ ” చురకత్తులు” అనీ అన్నిటినీ బహువచనంలో నిర్వహించడు. ఆ వాక్యం బహువచన సూచిక మాత్రమే!! అక్కడ ప్రతి వ్యక్తీ అన్నది బహువచనము లోనే కవి ఉద్దేసించాడని ఆ విశేషణాలు మొత్తం చెబుతూనే ఉన్నాయి. మనం చేయవలసిందల్లా దాన్ని గ్రహించడమే!! శ్రీశ్రీ ఆంగ్ల వ్యాకరణముననుసరించి తెలుగు వాక్యములు రాసిన కవి కాడు గావున ఆయనని తెలుగు భావుకునిగా గ్రహించి మీరు తరింతురు గాక! మీకు వ్యాకరణమ్ మీద చాలా పట్టు ఉన్నట్లైతే మీరు కవిత్వాన్ని చదవడమ్ మానేసి చిన్నయ సూరి గారిని అను నిత్యమూ పఠింతురు గాక!!

    రమ.

  1349. తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    02/26/2010 2:27 pm

    వేణుగోపాల్ గారూ మీరన్నది నిజం. భాషా విరించి అయిన శ్రీశ్రీకి ఏకవచనమూ..బహువచనమూ గురించి తెలియదని ఎత్తిపొడుపుగా అనడం తెలిసిన వారికీ, తెలియని వారికీ మధ్య ఉన్న తేడాని చెబుతుంది.
    తెలుగు లిఖిత సాహిత్యం ఒక ఎత్తుగా పెట్టి తన సంకీర్తనా సాహిత్యాన్ని దానికి మించి సృష్టించిన అన్నమాచార్యుడు తన పదాలలో భాషలో , వాక్య విన్యాసాలలోనూ చూపించిన స్వతంత్రత ఎంతో ధీటైనది. కవికి మిగిలిన వారికన్నా ప్రయోగాలు చేయడంలోనూ.. పోనీ కొన్ని రకాల”తప్పులు” చేయడంలోనూ తన కవిత్వంలో సాధ్యం! అతని ప్రభుత్వమ్ అక్షరాల మీద ఘనమైనది. దాని గురించి మహా అయితే చర్చించుకోవలసిందే తప్ప అంతకుమించి నెరసులు ఎన్నే పనిని ఎవరూ చేయరు. అలా చేయకపోవడం అనేదికూడా ఒక సాహిత్య మర్యాద. శ్రీశ్రీనికూడా మేం అనగలం అని చెప్పుకోవాలనే సరదా కొందరికి ఉండొచ్చు. కానీ వారి తప్పులెన్నే గుణాలకన్నా మించినది శ్రీశ్రీ అక్షరం! “మనిషి” అన్నదాన్ని బహువచనంలో గ్రహించడానికి అక్కడ అవకాశం ఉందని ఎవరికైనా తెలుస్తుంది.అయినా లౌల్యం వారిచేత ఆ పని చేయనివ్వదు. అందువలన శ్రీశ్రీని ఏదైనా అని కాసింత గుర్తింపు పొందుదామన్నది ఒక ఆశ.

    ఒప్పుకుంటే ఇలాంటి వారు అన్నమయ్య గారి వాక్యాలనీ..ఆయన వాడిన “దుష్ట సమాసాలనీ” అలాగే తనదైన పధ్ధతిలో[ వ్యాకరణం ఒప్పని పధ్ధతిలో] అన్నమయ్య రాసిన వాక్యాలనీ కూడా వీళ్ళు మార్చేద్దామని ఉబలాట పడనూ వచ్చు!”తప్పులెన్నువారు తండోపతండంబులు”కదా?
    కవిత్వంలో కవి భావప్రేరితుడే గానీ..భాషాపీడితుడు కాలేడు. కవిత్వం గురించి తెలిసిన వారికీ..కల్పన గురించి తెలిసిన వారికీ ఈ సంగతులు తెలుస్తాయి. మిగతా వారికి తెలియవు. వాళ్ళకి మహా కవిత్వాలలోని “కల్పన”- పెళ్ళాల దగ్గర విషయాలని దాచి కాకమ్మ కబుర్లుల చెప్పే మొగుళ్ళ అబధ్ధాలూ..పొట్టకూటికి చెప్పే అబధ్ధాలూ..దొంగలెఖ్ఖలు చెప్పే వారి అబధ్ధాలూ కూడా ఒక్కలాగే కన్పిస్తాయి. “కల్పన” అన్నది అంత తేలికగా కన్పించే వారికీ..అందులోని తారతమ్యాలు తెలియని వారికీ వచ్చే సందేహాలు మరి ఈ స్థాయిలోనే ఉంటాయి. నవ్వుకుని ఊరుకోవాలంతే!! తన “ప్రజ” లో ఇలాంటి ప్రశ్నలని తీసుకుని శ్రీశ్రీ చాలా హాస్యంగా జవాబులు చెప్పనే చెప్పాడు కూడా!!
    రమ.

  1350. కలైన గోర్వెచ్చని పాట గురించి siva rama prasad గారి అభిప్రాయం:

    02/24/2010 2:37 pm

    బాగున్నది మీ కవిత. దాలి అంటె? నిఘంటువు వెదికితే పాలు మరిగించడానికి పిడకల ప్రోవు అని ఉంది. బాప్ప అంటె అత్త కద. మా కళింగాంధ్రలొ అత్త. నిజమే, నులక మంచాలు పట్టె మంచాలు మరచి పొయాము. ప్లై ఉడ్ మంచాల షోకు వచ్హినది. ఆ అల్లిక ఎంత (artistic) కళాత్మకంగ ఉండేది diamond shape తొ రెండేసి వరసలతొ చిత్రం గీసినట్టుగా. పోయిన రోజుల్ని గుర్తుకు తెచ్చారు.

  1351. శ్రీశ్రీ ఉపన్యాసం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    02/23/2010 12:49 am

    ముందు రవ్వంత మొహమాటంగా మొదలెట్టి పక్క సీట్లో సినారె ఉన్నందు వల్ల కాబోలు..యూనివర్సిటీలలోని పిహెచ్ .డి లని గురించి కూడా ప్రస్తావించి….తెలుగు ఉపన్యాసకుడిలాగా మాట్లాడటమ్ మొదలుపెట్టిన ఆ మహాప్రస్థాన కారుడి నెమ్మదితనం ముందు కొంచెం అసహజంగా అన్పించింది..కానీ మెల్లగా ఆయన కవిత్వం వేపు మళ్ళాకా మాత్రం ఆయన తన ముద్రని అక్కడి శ్రోతల మనసులమీద వేసాడు. “ప్రతిజ్ఙ” కవితని చదివి ముగించాకా అక్కడి వాళ్ళు కొట్టిన చప్పట్లు తరవాత ఆయన ముఖంలోని చిన్నపిల్లవాడి ముఖంలోని ఆ అమాయకపు నవ్వుని గమనించగలిగితే [కవిగా ఆయన ఎంత తేటగా ఉన్నాడో ఆ వయసున కూడా] అన్న సంతోషం కలుగుతుంది.

    ఆయన చదివిన మహాభారతంలోని పద్యాలన్నీ బాగా ప్రసిధ్ధికెక్కిన పద్యాలే!! కానీ వాటిని ఆయన ధాటీగా అనర్గళంగా చదవడం ఆయన పద్యాలని ధారతో గుర్తుపెట్టుకోవడం ఆయన మీద ఉన్న చందస్సు ప్రభావం ..పద్యం మీద ఆయనకున్న పట్టుని కూడా చెపుతోంది.

    మొత్తానికి శ్రీశ్రీ నించి క్లుప్తంగా ఆయనపైని కవిత్వ ప్రభావాలనీ..తెలుగు కవిత్వాన్ని ఆయన అంతే క్లుప్తంగా అక్కడి శ్రోతలకి చెప్పడాన్నీ ఈవీడియో ప్రదర్శించింది.ఆయన “దహ్యప్రభావానల …సలిపిరి దీర్ఘ వాసర నిశల్ ” అన్న మహాభారత పద్యం చదువుతూంటే మాత్రం ..”కన్యాశుల్కం”లో “అట్టె అట్టె దహ్య ప్రభవానలము అంటే అర్ధమేమిటిరా?” అని కరటకశాస్త్రులు వెంకటేశాన్ని అడిగినప్పుడు గిరీశం కల్పించుకుని “ఇప్పటి మటుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు….అంటూ వెంకటేశాన్ని కరటక శాస్త్రినించి తప్పించడానికి పడ్డ తమాషా గుర్తొంచింది.

    శ్రీశ్రీ పక్కన కూచున్న నారాయణరెడ్డి అలా కుర్చీలో కదులుతూ ఉండటం మాటిమాటికీ కళ్లజోడుని తుడుచుకుంటూండటం..జుట్టుని సవరించుకోవడమ్ లాంటి అసహజ కదలికలు చూపుకి చికాగ్గా ఉన్నా శ్రీశ్రీని క్లోజ్ అప్ షాట్ లోకి పెట్టాకా ఆ బెడద వదిలి మిగతా శ్రీశ్రీ మాటల్ని స్థిమితంగా ఆస్వాదించడానికి వీలయ్యింది.

    మద్దిపాటి కృష్ణారావు, ఇంకా వడ్లమూడి బాబులకి సంతోషాన్ని తెలియజేస్తూ..
    రమ.

  1352. తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    02/08/2010 11:53 pm

    రమ గారూ, కల్పన అన్నది ఒకటి కాదు, చాలా వుంటాయి.

    నా చిన్నప్పుడు మా తాత వీపు తొక్కుతూ నేను చెప్పిన నలభై రోజుల ధారా వాహిక కూడా కల్పనే. అది నాకూ, మా తాతకీ తప్ప మరెవరికీ ఆసక్తికరంగా వుండదు. సోదమ్మలూ, సోమిదేవమ్మలూ చెప్పేవి కూడా కల్పనలే. అభూత కల్పనలూ వుంటాయి, కవిత్వాలూ వుంటాయి, దెయ్యం కథలూ, బూతు కథలూ కూడా కల్పనలే. ఆఫీసునించి లేటుగా రావటానికి భర్తలు చెప్పే కారణాల్లోనూ, నెలవారీ ఖర్చుల్లోంచి పొదుపు చేసే భార్యలూ, పీకలదాకా నష్టాల్లో కూరుకు పోయినా షేరు మార్కెట్లో నిలదొక్కుకోవటానికి సీయీవోలు చార్టర్డ్ అక్కౌంటెంట్లూ పడే తంటాలూ కల్పన మీద ఆధార పడేవే.

    సమస్య అదికాదు. సినిమాల్లో నేపథ్య గానాలున్నట్టుగా నిజ జీవితంలో ఎక్కడా మనము పాటలు పాడుకోక పోయినా, సినిమా అన్న కళామాధ్యమంలో నేపథ్య గానానికి వుండే విలువని మనమందరమూ గుర్తిస్తాము. ఇక్కడ విషయం పాటా సినిమా నమ్మదగ్గవిగా వున్నాయా లేదా అన్నది కాదు.

    సూక్ష్మంగా చెప్పాలంటే, తెలుగు వీర లేవరా అన్న పాట శ్రీ శ్రీ రాసిన పాటల్లో అంత గొప్పదేమీ కాదు అన్నది నా వ్యాఖ్య. ఆమాటకొస్తే ఇదే సినిమాలో పాటలు రాసిన ఆరుద్ర, కొసరాజులు కూడా ఇందులో పాటల కన్నా చాలా చక్కటి సినిమా పాటలు రాసిన సందర్భాలు చాలానే వున్నాయి అన్న విషయం మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ వ్యాఖ్య వ్రాసినప్పుడు దానిని ఒక విమర్శగానో వివరించవలసిన అభిప్రాయంగానో అనుకోకపోవటం నా పొరపాటే.

    కొంచెం వివరంగా చెప్పాలంటే , కథ మరొక దగ్గర మొదలు పెట్టక తప్పదు. అల్లూరి సీతారామరాజు సినిమాకీ, అందులో జాతీయ అవార్డు వచ్చిన ఈ పాటకి మనం విస్మరించరాని చారిత్రక భౌగోళిక నేపథ్యం వుంది. సినిమా విడుదల అయినది 1974 లో. విశాలాంధ్ర అవతరించి గట్టిగా ఇరవయి సంవత్సరాలు కూడా కాకుండానే, అప్పటికి అయిదు సంవత్సరాలుగా తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంలో మూల మూలలా భాషా సంస్కృతులలో భేదాల పేరు మీదనే చెలరేగిన తీవ్రమైన అశాంతి (జై తెలంగాణ, జై ఆంధ్రా వుద్యమాలు) ఇంకా సద్దుమణగలేదు. పోలీసు కాల్పుల్లో నాలుగు వందల మంది చని పోయి వుంటారని అంచనా. వేలాది మంది విద్యార్థుల చదువులు, జీవికల మీద ఆశలూ కోల్పోయారు.

    అప్పటికి నాలుగు సంవత్సరాల క్రితమే, మైదాన ప్రాంతపు ప్రజలు మన్య ప్రాంతాలలో గిరిజనుల భూములను ఆక్రమించుకుంటున్నారని , దాన్ని అరికట్టక పోతే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వచ్చే ప్రమాదం వుందనీ భావించి రాష్ట్రపతి ద్వారా గిరిజనుల భూములను మైదాన ప్రాంతపు ప్రజల నించి రక్షించటానికి వన్ ఆఫ్ సెవెంటీ (1970 సంవత్సరంలో వచ్చిన మొదటి ఆదేశాలు కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ అన్న మాట) ఇప్పించవలసి వచ్చింది. (ఎవడు వాడు, ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెలుగు వాడు అన్న శబ్దాలు వినపడుతుంటే క్షమించండి.. మాట వచ్చింది కాబట్టి చెప్పక తప్పలేదు. అవే మన్య ప్రాంత భూములని, అదే వన్ ఆఫ్ సెవెంటీ ఆదేశాలకి వ్యతిరేకంగా గత పది సంవత్సరాలలో మైనింగ్ లీజులకింద, సినిమా నిర్మాతలకి స్టూడియోలూ గట్రా నిర్మించుకోవడానికి లీజులకిందా ఇస్తూ పోతున్నారనీ చాలా కేసులు హై కోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ పడి వున్నాయి).

    సినిమా రిలీజయిన నాటికి, దేశ భద్రతకి అంతర్గతంగా విచ్ఛిన్నకర శక్తులవల్లనూ, బాహ్య శక్తుల కుట్ర వల్లనూ ప్రమాదం పొంచి వుందని చెప్పి, శ్రీమతి ఇందిరా గాంధీ నెమ్మది నెమ్మదిగా అధికారాన్ని అంతటినీ తన చేతిలో కేంద్రీకృతం చేసుకుంటూ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లోనే రాష్ట్రపతి పాలన విధించవలసిన అగత్యం వుందని అప్పటికే చేసి చూపించింది.

    ఇటువంటి కల్లోల పరిస్థితిలో, అనేకానేక చారిత్రక భౌగోళిక కారణాల వలన తునా తునకలయిన ప్రజల ఐక్యత నేపథ్యంలో, అల్లూరి సీతారామరాజు సినిమా విడుదలయింది. అటువంటి సందర్భంలో మన్య ప్రాంతంలో మైదాన ప్రాంత ప్రజల వీరోచిత సేవని నిరూపించటంలోనో, నిజ జీవితంలో సాధ్యం కానీ ఐక్యతని సినిమా ద్వారా చూపించటంలోనో నిర్మాతకి ఏదో తక్షణ స్వార్ధం వున్నదని అంత క్రూడ్ గా చెప్పుకోవలసిన పని లేదు కానీ, ఆ నేపథ్యంలో ఈ సినిమా ఏం సాధించింది? ఎందుకు అంత గుర్తింపు పొందింది, ఈ సినిమాని ఏ ప్రజలు ఎందుకు ఆదరించారు? అందులో శ్రీ శ్రీ పాట పాత్ర ఏమిటి అన్న ప్రశ్నలు వేసుకోవటం అవసరం. ఆ ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు, రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఈ రోజు నెలకొన్న పరిస్థితులేమిటి అన్న గ్రహింపు కూడా వుండడం అవసరం.

    ఇంతకు ముందు నేను సూచన ప్రాయంగా చెప్పిన నేపథ్యం అంతా శ్రీ శ్రీ కి బాగానే తెలుసును. అటువంటి పరిస్థితులలో తెలుగు వీరత్వాన్ని, శూరత్వాన్ని, బాహ్య శత్రువుని తరిమి తరిమి కొట్టమని ఉద్బోధిస్తకీ భాష పాట రాయాలంటే శబ్దాడంబరం ద్వారా, భాష పేరిటా, సంస్కృతి పేరిటా, జాతి పేరిటా , మగతనం పేరిటా క్షణికావేశం సృష్టించడం తప్ప వేరే మార్గం లేదు. శ్రీ శ్రీ ని అందుకు మనం తప్పు పట్టనవసరం లేదు కానీ, పాటకు లేని గొప్పదనాన్ని ఆపాదించనవసరం కూడా లేదు.

  1353. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    02/08/2010 1:49 pm

    హనుమంతరావు గారు,

    నాకు చెప్పడానికి చేతగాని విషయాన్ని మహా బాగా చెప్పేరు. ఖచ్చిత తత్వం చేరిన తర్వాత కవిత్వం లుప్తమైపొయ్యేపనైతే, మన ప్రాచీన సాహిత్యంలో అసలు కవిత్వవే లేదనుకోవాలేవో. నేనేవీ ప్రాచీన సాహిత్యాన్ని ఔపోసన పట్టలేదు కానీ ఆ ఖచ్చిత తత్వం తర్వాత కవిత్వం లేదంటే, పాపం నైషధ కర్తలనించి, లేదు, లేదని మహా ఖచ్చితవైన అభిప్రాయాలు కల ఇస్మాయిల్ గారిదాకా అందరూ కవులు కాకుండా పోతారేవో. అదేందో అంటారు చూడండి, కొని తెచ్చుకోవటవని అలాగుంది రవి శంకర్ గారి వాదం. ఖచ్చిత తత్వం వుంటే కవులుగారని వారు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. పాపం కవి ఏ అభిప్రాయాలు లేకుండా, ఏ నమ్మకాలూ లేకుండా, ఏమాత్రం ఏ మానవ లక్షణాలు లేకుండా, ఏ చెట్టుగానో, ఏ పువ్వు గానో, లేకపోతే, పచ్చ, పచ్చగా ఎండలో మిల, మిల మెరుస్తూ ఎండుతున్న ఏ పిడగ్గానో అయ్యుండాలేవో.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

    [ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది – సం.]

  1354. తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి గురించి Geddapu Lakshmi Prasad గారి అభిప్రాయం:

    01/31/2010 12:25 pm

    సోదాహరణంగా మౌలిక కవితా లక్షణాలను వివరించడమే కాకుండా, ప్రక్రియా భిన్నత్వం లో లక్షణాపరమైన ఏకత్వం ఉంటుందని ఆ లక్షణాలను పాటించడం వల్లే ఏ రచనైనా కవితా స్థాయిని పొందగలుగుతుందని చాలా చక్కగా విశ్లేషించారు. ఆధునిక కవితలు వ్రాయడానికి, ప్రాచీన కవితా “స్పృహ” (కనీసం) అక్కరలేదనీ, పద పరిజ్ఙానం అవసరం లేదని, భావించే నేటి వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని నిలవాలని నా ఆకాంక్ష!

  1355. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి రవిశంకర్ గారి అభిప్రాయం:

    01/30/2010 7:30 pm

    శ్రీశ్రీ కవిత్వం పై థీసిస్ రాసింది రామకృష్ణగారే. ప్రసంగంలో రామకృష్ణగారి గురించి, ఆయనకు డాక్టరేటు రావటం మీద శ్రీశ్రీ చేసిన చమత్కారం గురించి చెప్పానుగాని, వ్రాతప్రతిలో పేరు రాసేటప్పుడు పొరపాటు దొర్లింది. క్షంతవ్యుణ్ణి. – రవిశంకర్

  1356. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/29/2010 2:33 am

    రెండు మూడు తెలిసీ తెలియని విషయాల గురించి నాలుగు మాటలు.

    శ్రీశ్రీ మీద థీసిస్ చేసింది మిరియాల లక్ష్మీపతి గారన్నారు; రామకృష్ణ గారని గుర్తు.

    “నిరాశ అన్నది తాత్కాలికమైన మానసిక పరిస్థితేగాని, కవులతోబాటు ప్రతిఒక్కరు దీనికి లోనుకావటం సహజమే. మహాప్రస్థానం తరువాతి శ్రీశ్రీ పద్యాల్లో ఎక్కడా ఇటువంటి ఉదాహరణలు కనిపించవు. ఎప్పుడైనా నిరాశ వ్యక్తిగతమే.”

    శరచ్చంద్రిక రాసింది మహాప్రస్థానం తర్వాతేననుకుంటాను. దాంట్లో నిరాశ తోనే మొదలెడతాడు కాని ఆశాభావంతో ముగిస్తాడు. ఇక్కడే కాక కొన్ని ఇతర పద్యాలలో కూడా ఈ నిరాశా నిస్పహలకి కారణం తన వ్యక్తిగత జీవితం కాదు, సామాన్యుని వాస్తవ జీవితం.

    “నువ్వో … కావాలంటే ముందుగా కమ్యూనిస్టువి కావాలి,” అన్నదానిని చవకబారు కవిత్వమంటే ఒప్పుకోవచ్చు కాని, “నిజానికి ఏ సందేహానికైనా నిశ్చయమైన, ఖచ్చితమైన సమాధానం లభించిందని సంతృప్తిపడితే రచన ఆగిపోవటమే జరుగుతుంది,” అన్నదానికి ఇంకాస్త ఆధారాలు కావాలి. “కలడు కలండెడు వాడు కలడొ లేడో” అన్న కవి “ఇందుగలడందు లేడను సందేహము వలదు” లాంటిది రాస్తే అది కవిత్వం కాకుండా పోతుందా?

    శ్రీశ్రీ జీవితాంతమూ కవిగా అన్వేషణ తోనే గడిపానని చెప్పుకున్నాడు. ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మినంతనే, ఇక తన జీవితంలో వేరే అన్వేషణే లేదనడం సరికాదు.

    ఇస్మాయిల్ గారు కూడా, మహాప్రస్థానంలోని గీతాలన్నీ శ్రీశ్రీ మార్క్సిజం గురించి తెలుసుకోక మునుపు రాసినవే నన్నారు. కాపిటల్ చదవలేదేమో కాని, 1930 ప్రాంతాల్లో ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలో చదవదగ్గ పుస్తకాలన్నీ చదివానని చెప్పుకున్న కవికి మార్క్సిజం గురించి తెలియదంటే నమ్మడమెలా? కాస్తోకూస్తో తెలియకుండానే “దేశచరిత్రలు” రాసి ఉంటాడా?

    మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ రాసినవన్నీ మరీ దసరా పద్యాల స్థాయిలో ఉన్నాయనుకోను. వాటిల్లో చెప్పుకోదగ్గవీ, మహాప్రస్థానం గీతాలతో పోల్చదగ్గవీ, వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చునంటే ఒప్పుకంటాను. మరి డెబ్భై ఏళ్ళకి పైగా బ్రతికి, చివరిదాకా ఏదో ఒకటి రాస్తూ ఉన్నశ్రీశ్రీ కవిత్వంలో చెప్పుకోదగ్గది దాదాపు అంతా మూడు పదులు నిండక ముందే రాయడానికి కారణం, ఆ తర్వాత ఆయన మార్క్సిజం తీర్థం పుచ్చుకోవడమేనని రవిశంకర్ గారు స్పష్టంగా చెప్పకపోయినా సూచనప్రాయంగా అన్నారు.

    సృజనా శక్తి వయసుతో, అనుభవంతో, జ్ఞాన సముపార్జనతో పెరుగుతుందా? ఇది సాహిత్యంలోనేనా, అన్ని రంగాల్లోనూ సహజమా? అన్న సందేహముంది నాకు. హార్డీ తన “సంజాయిషీ” లో [1] రామానుజన్ ముప్ఫై రెండేళ్ళకే చనిపోవడాన గణితానికి వచ్చిన నష్టమేమీ లెదన్నాడు! ఆ వయసు తర్వాత ఏ గణితవేత్తయినా పెద్దగా సాధించేదేమీ లేదని హార్డీకి గట్టి నమ్మకం.

    S. చంద్రశేఖర్ కి సృజన తీరు మీద కుతూహలం కలిగి ఓ మంచి ఉపన్యాసం [2] ఇచ్చాడు. షేక్స్పియర్, బీథోవన్ ల సృజనా కౌశల్యం పెరుగుతూ జీవిత చరమదశ దాకా పరిపక్వత చేరిందంటాడు. వాళ్ళతో పోలిస్తే, సృజనా పరంగా మహోన్నతమైన గురుత్వాకర్షణ సూత్రాల ని న్యూటన్ కనుగొన్నది పాతికేళ్ళ వయసు లోపలే!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “A Mathematician’s Apology,” by G. H. Hardy. Cambridge University Press, 1967. గణితమంటే ఇష్టమున్నా లేకపోయనా, కవత్వమంటే ఆసక్తిగల వాళ్ళు చదవాల్సిన పుస్తకం.

    [2] Shakespeare, Newton, and Beethoven, or Patterns of Creativity. Nora and Edward Ryerson lecture delivered at the University of Chicago, Center for Public Policy on 22 April 1975. Published in “Truth and Beauty: Aesthetics and Motivations in Science,” by S. ChandraSekhar. The University of Chicago Press, 1987.

  1357. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి siva rama prasad గారి అభిప్రాయం:

    01/26/2010 5:58 am

    శ్రీ శ్రీ కవితకి బాపు బొమ్మలు అద్భుతంగా వున్నాయి. రంగులు చాలా అందంగా ఉన్నాయి.

  1358. రాత్రి నృత్యం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/25/2010 12:59 am

    ఇంద్రాణీ!! కవిత మాంఛి ఉత్సాహం గా ఉంది. బాగా రాస్తున్నావు.
    రమ.

  1359. గాలిపటం గురించి Ch J Satyananda Kumar గారి అభిప్రాయం:

    01/23/2010 1:56 pm

    మిత్రమా,

    గాలి పటం కవిత చాలా బాగుంది. దాన్ని ఇంగ్లీషులో అనువదించి ఈ క్రింద ఇస్తున్నాను. museindia.com లో కూడా వేస్తాను రెండు దినాల్లో.

    Don’t know why that kite is
    Flying away skyward
    Driven by western winds
    Soaring high upward

    In the past too while many kites
    Like wing stretched birds
    Like dashing planes
    Zipped fast
    In their flights to kiss the heavens
    Somersaulting and rumbling

    Here on land
    despite losing spirits
    Pooled-up all energies and
    Stabilized their every movement..

    In the revelry
    Of reaching distant coasts, when
    Left the hands that guided
    Severed the umbilical cord

    Drifted like dry leaves distanced from the tree branch
    Lost vigor and blown away like torn waste paper pieces
    Didn’t they caught-up in thorny bushes….?

    మిత్రుడు
    సత్యానంద కుమారు

    Then why that kite is
    exulting
    Driven by western winds it is
    exciting

  1360. కలైన గోర్వెచ్చని పాట గురించి rajendra kumar devarapalli గారి అభిప్రాయం:

    01/19/2010 1:17 am

    ఈ మధ్య కాలంలో చదివిన కవితల్లో అత్యంతాఅహ్లాదాన్ని పంచిన కవిత ఇది.నులకమంచం పేనటం ఏ రాజభవనాల్లోని తివాచీలకూ తీసిపోదు,కలలు చెదరకుండా ఆకులు చుక్కలు కావలి కాయటం అన్నభావనే ఎంతో ఆత్మీయంగా ఉంది.కానీ జాన్ గారు మీరు ఇకపైన నులకకౌశలం కోసం వెతుకుతూనే ఉండాలేమోనండి!ఇంకెక్కడి నులక మంచాలు?
    మంచి కవితను మాచే మరలామరలా చదివింపజేసినందుకు గాను ధన్యవాదాలు.

  1361. మరో ప్రపంచం పిలిచింది గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/11/2010 1:09 am

    శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని గూటాలకృష్ణమూర్తిగారు విదేశాంధ్ర ప్రచురణల పేర 80వ దశకంలోనే లండన్ నించి ప్రచురించారు. ఈ పుస్తకం తాలూకు ప్రత్యేకత మహాప్రస్థానం లోని గేయాలని శ్రీశ్రీ చేతిరాతతో ప్రచురించడం! ఇందులోని కొన్ని కవితలకి బాపు బొమ్మలు వేసారు. ఈ పుస్తకంతోపాటుగానే శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థానం గీతాల ఆడియోకేసెట్ కూడా ఉంటుంది.

    ఈమాట సంపాదకవర్గం గూటాల కృష్ణమూర్తిగారిని సంప్రదించి ఈ శ్రీశ్రీ ప్రత్యేక సంచికలో ఆ ప్రతినీ చేర్చి ఉంటే బాగుండేది.ఈమాట పాఠకులకి శ్రీశ్రీ చేతిరాత శ్రీశ్రీ గొంతుకనించి మహాప్రస్థానం .. రెండూ లభించి ఉండేవి..మరి ఆ ప్రయత్నం ఎందుకని జరగలేదో!?

    రమ.

    ఆ ప్రయత్నం జరిగింది, కానీ ఫలించలేదు …[సం.]

  1362. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి kayakay గారి అభిప్రాయం:

    01/07/2010 3:43 am

    కధ చాలా బాగున్నది ! ఏది చూడాలనుకున్న వాళ్లకి అది! ఆ వ్యక్తి నిషా షామల్ ఊహల్లొ నుంచి ఆ రాత్రి కవితా రూపంలొ వొచ్చిన కీట్స్ !

  1363. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/07/2010 1:08 am

    పరుచూరి శ్రీనివాస్ గారు రాసిన పేర్లకి మరికొన్ని ముఖ్యమైన జోడింపులు.

    తెలుగులో భావకవులనీ..అభ్యుదయా కవులనీ ఇంగ్లీషులోకి తొలిగా అనువాదంచేసిన ఒక మంచి అనువాదకుడు శ్రీనివాస్ రాయప్రోల్ గారు. ఆయన జయప్రభ గారి కవిత్వాన్ని కూడా ఇంగ్లీషు లోకి అనువదించారు. ఇంగ్లీషులో కవిగా అంతర్జాతీయ గుర్తింపు కల్గిన వారు శ్రీనివాస్ రాయప్రోల్ . american poet willims carlos willims వంటి వారితో ఆయనకి మంచి స్నేహం ఉండేది.

    శ్రీనివాస్ రాయప్రోల్ తెలుగు కధల్ని కూడా ఇంగ్లీషులోకి అనువాదం చేసినవారు. అలాగే తెలుగు కధలని ఇంగ్లీషులోకి అనువాదం చేసిన మరో అనువాదకుడు రంగారావుగారు. ఆయన అనువాదాలని penguin సంస్థ ప్రచురించింది. అలాగే డి.కేశవరావు గారు కూడా తెలుగు ఆధునిక కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన వారు.

    ఇంక శ్రీనివాస్ పరుచూరి చేసిన వ్యాఖ్య”బాగా” అన్నది..ఈ సరికే చర్చింపబడి ఉంది. ఎవరికి “బాగా” అన్నది ముఖ్యం. అనువాదం చేసినవారికా?? లేక ఆ అనువాదాలని చదివిన వారికా?? అని. ఏ భాషలోకి అనువాదం అవుతున్నాయో ఆ భాషలోని నుడికారంతో ఆ భాషకి సొంత కవిత్వంలాగా అన్పించేది మంచి అనువాదంగా అనుకోవాలి. ఇందులో చర్చకి అవసరమైన విషయాలు అనేకం ఉంటాయి.మూలంలోని ప్రాణశక్తి అనువాదంలోకి రాగలగాలి.

    శ్రీశ్రీ కవిత్వం బహుశా భారతీయ భాషలలోకి అనువాదం బాగా అవుతుందేమో గానీ ఇంగ్లీషులోకి అనువదించినప్పుడు అంత బాగా చేయడం కొంచెం కష్టమైన విషయమే ఏ అనువాదకుడికైనా!! ఇవన్నీ అనువాదం చేసేవారి ముందున్న సమస్యలు. అలాగని అనువాదాలు చేయకుండా కూడా ఉండడం సరికాదు. తగినంత శ్రధ్ధ ఉండాలి అనువాదంచేసేవారికి. తగినంత నైపుణ్యం కూడా ఉండాలి. తగినంత సమయాన్ని వారు వెచ్చించ గలిగి కూడా ఉండాలి. అలా పని చేసేవారికి ఆర్ధికమైన వనరులు కూడా సమకూడేలా ఉండాలి. అప్పుడు మాత్రమే అనువాదాలు చేయడానికి వ్యక్తులు మరింతగా ముందుకి వచ్చే వీలుంది.
    రమ.

  1364. వెదురు వేది గురించి mOhana గారి అభిప్రాయం:

    01/06/2010 3:05 pm

    చక్కని కవిత! విధేయుడు – మోహన

  1365. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    01/06/2010 1:55 pm

    ఓపికతో ఒక్క చోట పుస్తక వివరాలిచ్చినందుకు వేలూరిగారికి కృతజ్ఞతలు. వాటి (చాలా మటుకు?) గురించి “రచ్చబండ”లో వేలూరిగారు, పరుచూరి గారు పరిచయం చేసినట్టు గుర్తు. వేల్చేరుగారి “after word” మొదటగా చదివింపజేసే పుస్తకాల పట్టికలో మనపూర్వకవులవే ఎక్కువగా ఉండడం కాకతాళీయం కాక, వారు చెప్పకుండా చేసే ఇంకో విమర్శేమో అనిపిస్తుంది!

    పరుచూరిగారి ప్రశ్న “వాటిపైన ఆ దేశాల్లో స్పందనెలా వుదో మరి? అలాగే అనువాదం ఎంత *బాగా* వుంది అనేది మరో ప్రశ్న” నాది కూడా. శ్రీశ్రీకి మాత్రమే వర్తింపజేస్తూ, “తెలుగునుండి అనువాదాల” గురించి ఒక్క మాట.

    సాధారణ పదాలను అసాధారణంగా వాడడం, శబ్ధాల లయ, ఊగులతో కవితనుర్రూతలూగించడం శ్రీశ్రీ కవితల్లో “కొట్టి”నట్టు కనపడుతుంది. అందుకు శ్రీశ్రీ గారి కవితలు మనకెంతగా నచ్చుతాయో, అందుకే వాటి భారతీయేతర భాషల అనువాదాలు ఎవరివైనా సరే అంతగా నచ్చవేమో అని (చెడ్ద)పెద్ద అనుమానం. భారతీయ భాషల్లో కనిపించే పదాల జిగిబిగి, శబ్దాల లయవిన్యాసం, భారతేతర భాషల్లో (సులభంగా) సాధ్యం కాదని అనిపిస్తుంది. అదీకాక, భాషపైనున్న పర్వతమంత ప్రతిభ శ్రీశ్రీ భావాలలో లోతులేకపోవడం కూడా ఒక కారణమేమో.
    =======
    విధేయుడు
    _Srinivas

  1366. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    01/06/2010 11:29 am

    చాలా కాలంక్రితం అంపశయ్య నవీన్ వెల్చేరు గారి “Hibiscus in the Lake” – Twentieth Century Telugu Poetry From India” పుస్తకంపై సమీక్ష రాస్తూ – “అనువాదం అనుసృజనగా మారితేనే అది రక్తి కడుతుంది” అని చెబుతూ ఆంధ్రజ్యోతిలో (“ఇంగ్లీషు కొలనులో తెలుగు మందారం” – 2006 లో.) వ్యాసం రాసారు. ఆ వ్యాసంలో చెప్పిన విషయాలు ఖండిస్తూ అనువాదాల గురించి”మనం అక్కడ మొదలు పెట్టలేమా” అని వేలూరి గారు మరో వ్యాసం రాసారు. అందులో అనువాదాల గురించున్న (ముఖ్యంగా ఇంగ్లీషు అనువాదాలపై ) అపోహల గురించీ, అపార్థాల గురించీ చర్చించారు.

    కవితకవితా ” పద్యానికి శ్రీశ్రీ అనువాదాన్నీ, వెల్చేరు గారి అనువాదాన్నీ పోల్చి చూపిస్తూ, శ్రీశ్రీ గారి ఇంగ్లీషు అనువాదమే గొప్పదన్నట్లుగా నవీన్ రాసారు. వెల్చేరు గారి అనువాదం శ్రీశ్రీ అనువాదంకన్నా చాలా మెరుగునీ వేలూరి గారు సమాధానం ఇచ్చారు. ఆ రెండు వ్యాసాల్లో అనువాదాల గురించి చాలా మంచి చర్చా వస్తువుంది. అనువాదాల గురించి వెల్చేరు గారి వ్యాసం ఈమాటలో ప్రచురించారు.

    -సాయి బ్రహ్మానందం.

  1367. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    01/06/2010 5:45 am

    అట్లే మన మహాకవుల కవితలు ఎక్కువగ పాశ్చాత్య్ల భాషల్లోకి ఎందుకు ఎక్కువగా అనువదింపబడటంలేదో>>
    ఎక్కువగా అంటే! వేలూరిగారు పైన కొన్ని ఉదాహరణలు చెప్పారు. ముఖ్యంగా ఇరవయ్యవ శతాబ్దపు కవిత్వాన్ని చాలామంది అనువాదం చేశారు. ఉదా: S.S. Prabhakararao, Post-independence Telugu poetry, Writers workshop, Calcutta, 1993. అలాగే B.V.L.N. రావు గారు అరవయిల్లో కొన్ని క్షేత్రయ్య పదాలు, కొన్ని వేమన పద్యాలు చేయడం జరిగింది. ఈమధ్య కాలంలో శిష్ట్లా శ్రీనివాస్ గారు కొంత pre-19th century (సుమతి, పెద్దన, రాయలు) సాహిత్యాన్ని అనువదిస్తున్నారు. ఏమయినా అధికభాగం ఆంగ్లంలోకి మాత్రమే అనువదించబడుతున్నాయి. కొన్ని స్పానిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ లలోకి కూడా (వీటిలో కొన్ని శ్రీశ్రీ కవితలున్నాయి.) వెళ్ళాయి. వాటిపైన ఆ దేశాల్లో స్పందనెలా వుదో మరి? అలాగే అనువాదం ఎంత *బాగా* వుంది అనేది మరో ప్రశ్న.

    ప్రతిదీ కాకపోయినా కవితలు బానే అనువదించబడుతున్నాయి. (శ్రీశ్రీగారే స్వయంగా తన మహాప్రస్థానంలో కవితలన్నీ అనువాదం చేసుకున్నారు.) తెలుగునుండి కూడా. కొందరి (వారసుల)తో కాపీరైట్ల సమస్యలున్నాయి.

    ప్రస్తుత వ్యాసం శ్రీశ్రీ వేరే భాషలనుండి చేసిన అనువాదాలపైన కాబట్టి, తెలుగునుండి యితర భారతీయేతర భాషల్లోకి జరిగిన అనువాదాల గురిచి మరోసారెక్కడైనా రాయ ప్రయత్నిస్తాను.

    — శ్రీనివాస్

  1368. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/06/2010 2:50 am

    శ్రీనివాస్ గారూ!! పాతకాలంలో ఎక్కువగా భారతీయ భాషల్లోకి ప్రపంచ భాషలనించి కవిత్వం ఇంకా నాటకాలూ అనువాదం జరిగిన మాట నిజమే. మన భారతీయ భాషలనించి పరాయి దేశస్థులు సంస్కృత నాటకాలని తొలిగా అనువాదాలు చేసుకున్నారు. అయితే ఇటీవలకాలంలో వారు మన సమకాలీన సాహిత్యంవేపు కూడా దృష్టి సారిస్తున్నారు. భారతీయ కవుల కవిత్వాలని ఇంగ్లీషు నించి వారివారి భాషల్లోకి అనువాదం చేసుకుంటున్నారు. అందులో ఒక్కోసారి పూర్తిగా వారి దేశం వారే ఉండగా ఒక్కోసారి ఆయా దేశాల భాషలు వచ్చిన భారతీయులే ఇందుకు ముందుకువస్తున్న దాఖలాలూ కన్పిస్తున్నాయి. అనువాదాలు జరగాలన్న ఆలోచనలు మొదలయ్యాయి. అది స్వాగతించవలసిన విషయమే!!

    వేలూరి వారుబహుశా తెలియక చేర్చినట్టులేదు. పీ.వీ.నరసింహారావు గారు జయప్రభగారి ప్రేమ కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసారు. penguin india వారు ఆ పుస్తకాన్ని ద్విభాషా సంకలనంగా “unforeseen affection and other poems” అనే పేర 2005 లోనే ప్రచురించారు.

    రమ.

  1369. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి V R Veluri గారి అభిప్రాయం:

    01/05/2010 10:32 pm

    శ్రీనివాస్‌ గారు కామేశ్వర రావుగారిని అడిగినా, చొరవచేసుకొని నాకు తెలిసిన వివరాలు చెప్పుతాను. ఇదివరలో తెలుగు కవిత్వం నుంచి ఇంగ్లీషులోకి వచ్చిన అనువాదాలు ఏమీ లేవనే చెప్పాలి.

    గత పాతిక సంవత్సరాలుగా, వెల్చేరు నారాయణ రావు తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదాలు చేస్తున్నారు. ఆయన స్వయంగాను, డేవిడ్ షూల్ మన్, హాన్క్ హైఫెట్జ్ తోను కలిసి చేసిన కొన్ని అనువాదాలు మనవి చేస్తాను.

    1. For the Lord of the Animals – Poems from the Telugu, The Kaalahastiswara Satakamu, by Dhurjati ( University of California Press, 1987), with Hank Heifetz.

    2. Twentieth Century Telugu Poetry , An Anthology ( Oxford University Press, 2002) .

    3. Hibiscus on the Lake, Twentieth Century Telug Poetry from India
    ( University of Wisconsin, 2002)

    4. Classical Telugu Poetry, An Anthology ( Oxford University Press, 2002), with David Shulman.

    5. A Lover’s Guide to Warangal, The Kridabhiramamu by Vinikonda vallabharaaya ( Permanent Black, Distributed by Orient Longman Ltd., 2002) with David Shulman.

    6. The Sound of the Kiss, Pingali Surana’s Kalapurnodayam (Columbia University Press, 2002) with David Shulman.

    7. The Demon’s Daughter, Pingali Surana’s Prabhaavati Pradyumnamu (State University of New York Press, 2006) with David Shulman.

    8. When God is a Customer, Telugu Courtesan Songs by Kshetrayya and Others ( University of California Press, 1994) with A. K. Ramanujan and David Shulman.

    9. God on the Hill, Temple Poems from Tirupati, Annamayya (Oxford University Press, 2005) with David Shulman.

    10. A Poem at the Right Moment, remembered verses from premodern South India ( University of California Press, 1998) with David Shulman.

    I have very reliable information from one of the translators that the Manucaritra by Allasani Peddana is ready for publication.

    I haven’t mentioned Narayana Rao’s other translations ( from Telugu prose works and Sanskrit poetic works).

    Most of these books are available at Amazon.com

    Regards,

    Veluri Venkateswara Rao

  1370. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    01/05/2010 2:45 pm

    ఎప్పటిలాగానే కామేశ్వరరావుగారు, మంచి ఆసక్తికరమైన వ్యాసాన్ని, అనువాదంలోని ఎన్నో విషయాలను ఓపికతో ఎత్తి చూపించి విశ్లేషించినందుకు చాలా కృతజ్ఞతలు.

    వీలైతే, మరొక్క అంశంపై మీ ఆలోచనలు తెలియజేయ మనవి. మనం శ్రీశ్రీ కవితలు, ఇంగ్లీషు,ఇతర భాషలనుంచి శ్రీశ్రీ అనవాదాలు చదువుతున్నాం కదా ప్రధానంగా (ఈ సంచికలో కూడా). అట్లే, శ్రీశ్రీ కవితలను భారతేతర భాషలు (English, French etc) లోకి అనువాదాలు చేసారా, చేస్తే ఎట్లున్నాయి, చేయకపోతే దానికి కారణాలు_ ఇట్లా ఏమైనా దానిగురించి చెప్ప మనవి.

    మోహనగారు మహాప్రస్థానం కన్నడ అనువాదం తెలిపారు. రవీంద్రుని కవితలు, తిరుక్కురళ్ వంటివి కొన్ని తప్ప, భారతీయ భాషల్లోని కవితలేవీ కూడా పెద్దగా పాశ్చాత్య భాషల్లోకి అనువదింపబడలేదేమో అని అనుమానం. మన కవులు ఫలానా కవిత ఏ English, French నుంచో బాగుందనిఎన్నుకొని, సొంతానికి అనువాదాలు చేసారో, అట్లే మన మహాకవుల కవితలు ఎక్కువగ పాశ్చాత్య భాషల్లోకి ఎందుకు ఎక్కువగా అనువదింపబడటం లేదో తెలియదు. అవి సార్వజనీనం కావు అని అనుకోవాలో కూడా తెలియదు.
    ======
    విధేయుడు
    _Srinivas

  1371. గాలిపటం గురించి Vamshi గారి అభిప్రాయం:

    01/05/2010 4:08 am

    మీ కవితలో చాలా లోతైన భావం ఉన్నది….

  1372. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    01/04/2010 3:47 pm

    “కవికి ఒకరి మరణం కంటే ఆ మరణంపై ప్రపంచం కనబరచిన ఉదాసీనత ఎక్కువ బాధకలిగిస్తుంది.” దానికి రవిశంకర్ గారిచ్చిన ఉదాహరణలు చక్కగా ఉన్నాయి. ఐతే రవిశంకర్ గారు వారి పరిశీలనని అక్కడతోనే ఆపెయ్యకుండా మరికొంచం ముందుకుపొయ్యుంటే, శ్రీశ్రీ గారి మరో కోణం, సహజంగా కవులని చెప్పుకునే వాళ్ళలో కనపడని మరో ఒకట్రెండు లక్షణాలు తెలిసుండేవి. అవేవిటంటే శ్రీశ్రీ ప్రపంచపు ఉదాసీనత వల్ల మనిషిగా తనకు కలిగిన బాధని కవిగా వ్యక్తం చెయ్యడంతోనే ఆగిపోకుండా, ఆ వ్యక్తం చెయ్యడంలో కూడా ఆ బాధమీద సున్నితవైన కవిత్వపు మేలిముసుగులు కప్పకుండా, చావు ఎంత భయంకరవైనదో తన కవిత్వంలో చూపించాడు. ఆ చావుకన్నా భయంకరవైన ఆ ఉదాసీన ప్రపంచాన్ని, చొక్కా పట్టుకుని ప్రశ్నించాడు. ఆ చావుకి కారణవెవరో చెప్పమని, ఆలోచించమని తన కవితని పెనుప్రశ్నగా మలచాడు.
    “కొంపెల్ల జనార్ధనరావు కోసం” లో
    మా బురద రోజూ హాజరు
    మా కాళ్ళకు డెక్కలు మొలచాయి
    మా నెత్తిన కొమ్ముల లాగే!
    …….

    నిన్న వదిలిన పోరాటం
    నేడు అందుకొనక తప్పదు!
    కావున ఈ నిరాశామయ లోకంలో
    కదనశంఖం పూరిస్తున్నాను!

    “అట్లాగే భిక్షు వర్షియసి” లో
    ఆ అవ్వే మరణిస్తే
    ఆ పాపం ఎవ్వరి”దని
    వెర్రిగాలి ప్రశ్నిస్తూ
    వెళ్ళిపోయింది

    అని చెప్పడంలో ఉదాసీన లోకానికి తన కవిత్వపు షాక్ ట్రీట్మెంట్ రుచి చూపించాడు. అందువలననే గురజాడ రచనలో మీక్కనిపించిన గోప్యత శ్రీశ్రీ బాటసారిలో కనిపించదు.

    బాటసారి కళేబరంతో
    శీతవాయువు ఆడుకొంటుంది
    పల్లె టూళ్ళో తల్లికేదో
    పాడు కలలో పేగు కదిలింది.

    రవిశంకరు గారు చెప్పినట్టు శ్రీశ్రీ మరణాన్ని ఎక్కడా కీర్తించలేదు. “ఊగరా, ఊగరా, ఉరికొయ్య నందుకుని ఊగరా” అన్న కవితలో వీరుని మరణాన్ని సందేహం లేకుండా కీర్తించారు. ఐతే ఆ వీరుని మరణం పదిమంది బతుక్కోసం చేసిన త్యాగవని మనం గుర్తుంచుకోవాలి. ఆ రకంగా అది బతుకుని కీర్తించడం గానే నాకనిపిస్తుంది. పదిమందికి మంచి బతుక్కోసం తపనగానే నా మనసుకి తెలుస్తుంది.

    చేదుపాట, కేక, దేనికొరకు గీతాల్లో శ్రీశ్రీ వ్యక్తిగత ఆశ, నిరాశల దోబూచులాట కనిపిస్తుందని చెప్పేరు రవిశంకర్ గారు. నాకు మాత్రం ఆ గీతాలు ఆ కాలపు (ఈ కాలం కూడా) ఒక సామాన్యుడి, బతుకుబాటలో నడుస్తూ, ఆ బాట, తనలాటి సామాన్యులకి ముళ్ళబాట ఎందుకైందో తెలుసుకునే నేపధ్యంలో, ఆ కారణాలేవో తెలుసుకుని వాటిని మార్చే పోరాటానికి సమాయత్తవయ్యే తరుణంలో ఆ కాలపు కవి శ్రీశ్రీ నే కాదు, ఏ కవిత్వం వ్రాయని సామాన్య శ్రీశ్రీలు మార్పు కోసం, మంచి కోసం, పదుగురి మంచికోసం స్టేటస్ కోను ప్రస్నించపూనుకున్న ఇకనోక్లాస్ట్ మనస్తత్వవే నాక్కనిపిస్తుంది.

    శ్రీశ్రీ కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళల గురించి కవిత్వం వ్రాయలేదన్నారు మీరు. కానీ శ్రీశ్రీ వ్రాసిన కవిత్వం దాదాపు అంతా కూడా వాటి గురించే కదా రవిశంకర్ గారు. సమాజంలో హీనాతి హీనవైన బతుకు బతుకుతున్న సామాన్యుడి గురించే కదా ఆయన కవిత్వవంతా, ఆయన తపనంతా. తమలోతు కనుక్కోమనే ఆ అత్యంత హీనవైన బతుకు నిజాల్ని ఆవిష్కరించడవే కదా ఆయన కవిత్వం చేసింది.

    వాక్యం వాక్యం విమర్సించడం నా ఉద్దేశం కాదు. ఆఖరగా ఒక విషయం, అన్వేషణ కట్టిపెట్టి, ఒక ఖచ్చితత్వం వైపు ప్రయాణిస్తే కవిత్వం దెబ్బతింటుందన్నారు మీరు. కానీ ఒక ఖచ్చిత తత్వం వైపు ప్రయాణించడవంటే కళ్ళకు గంతలు కట్టుకోవడం కాదు కదా. ఆ ప్రయాణపు బాట పట్టడానికి, ఎంత అన్వేషణ, ఎంత సంఘర్షణ, ఎంత పరిశీలన, ఎన్ని ప్రశ్నలు, ఎంత ప్రయత్నం. నిస్చయత్వం అనేది ఒక సాపేక్షవైన విషయవే కాదా? కవి కూడా సంఘంలో ఒక మనిషే, అందరితోబాటూ కవిక్కూడా, కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, మంచిచెడులుంటాఅయి. నిశ్చితానిశ్చయాలుంటాయి. బతుకుబాటలో అందరిలాగే అన్నిరకాల సంఘర్షణలుంటాయి. రాజకీయాలు, రాజకీయ తాత్వికత కూడా అందులో భాగవే. అవి లేని కవి కవి కాలేడేవో. నాలుగు పదాలని నగిషీచెక్కడం నేర్చుకోవటవే కవిత్వవయితే మీరు చెప్పింది నిజవే, కానీ నలుగురు మనుషుల మనసుల్నిచెక్కాలంటే కవి మనిషై వుండాలి, ఒపీనియేటెడ్ అయ్యితీరాలి. అందువలనే మిగిలిన వాళ్ళు కవులయ్యేరేవో గాని శ్రీశ్రీ అసంఖ్యాక కవుల్ని సృష్టించ గలిగేడు, మహా కవికాగలిగేడు.

    శ్రీశ్రీని చూడడానికి అద్దాలెందుకు సార్ మనచుట్టూ మనం కళ్ళు తెరిచి చూస్తే శ్రీశ్రీ కనిపిస్తాడు. మనం పుట్టిపెరిగిన ఊర్లని, మనతో పెరిగిన మనషుల్ని చూస్తే మనకు శ్రీశ్రీ కనిపిస్తాడు. శ్రీశ్రీ నిశ్చితాభిప్రాయాలు ఆయన కవిత్వాన్ని అపేయోలేదో గాని, మన కళ్ళ గంతలు తీస్తే శ్రీశ్రీ కపడతాడు. శ్రీశ్రీ కవిత్వాన్ని, శ్రీశ్రీ కవిత్వంలో వ్యక్తవైన తాత్వికతని, ఆ తాత్వికతకి కారణవైన దేశకాల పరిస్థితుల్ని వదిలేసి, శ్రీశ్రీ ని మాత్రం వేరుచేసి చిన్న అద్దం ముక్కలో ఆయన్ని మీరు చూపించ ప్రయత్నించారు. కానీ ఆ అద్దం ముక్క మసిబారి, మకిలిపట్టిపోయింది మీరు గమనించలేదేవో రవిశంకర్ గారు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  1373. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/04/2010 3:08 am

    కామేశ్వరరావు గారూ!!

    ఏ విషయాన్ని తేల్చడానికీ ఎవరిదగ్గరా ఖత్చితమైన data అంటూ ఉందా?? అదీకాక “ఆనాటికాలంలో” సైతం కవిత్వం పట్ల ఆ మాటకొస్తే సాహిత్యం విషయంలోనూ నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళ శాతం ఎంతా??ఇవేవీ ఎవరి లెఖ్ళకీ తేలేవికావు. ఇవాళ్టికీ కవిగా శ్రీశ్రీ పేరే ఎక్కువగా కుర్రకారుకి తెలుసన్నది [సాహిత్యం గురించి కాస్తగా తెలిసిన కుర్రకారు] అర్ధమౌతున్న విషయం!

    otto reno castillo కవితనికూడా ఒకదానిని[మెక్సికన్ కవి అనుకుంటాను]శ్రీశ్రీ తెనుగున అనువాదంచేసాడు. కానీ ఆ అనువాదం కూడా ఏమంత బాగా అన్పించదు. కానీ అదే శ్రీశ్రీ ” మరీముఖ్యంగా ఒక మాఘమాసపు గాలి” అని పూర్తిగా తెలుగువాతావరణం తీసుకొచ్చి కవితని ఎత్తుకున్నప్పుడు మాత్రం అలా ఒక్కశ్రీశ్రీవే చేయగలడు అనికూడా అన్పించకపోదు.కవులు కూడా మానవమాత్రులే గనక ఆ క్షణంలో వాళ్ళలోని భావుకత స్థాయిని అనుసరించే ఆ అనువాదం రూపొందుతుంది. ఒక్కోసారి అత్యధ్బుతమైన మెరుపులు కురిపించగల్గిన వారే ఒక్కోసారి యాధాలాపంగా సరిచూసుకోకుండా కూడా వాక్యనిర్మాణం చేయడాన్ని మనం గమనించవచ్చు.అది సహజం కూడా!కవి తాలూకు సృజన ఐనా లేదా అనుసృజన ఐనా అన్నిసార్లూ ఆహా!! అని అన్పించేలా ఉండదు…అని మనకి శ్రీశ్రీ ఇంకా ఇతర కవుల కవిత్వం చదివినప్పుడు స్పస్టంగానే తెలుస్తుంది. అయితే సృజన అన్న అనుభవం తెలిసినవారు కవిలోని ఉత్తమోత్తమమైన ఊహలనీ కవితావాక్యాలనీ గౌరవించి అంతగా బాగారాని వాటిని ఆ కవి కవితాపటిమ మీదున్న గౌరవం తో ఉపేక్షించి లేదా సహించి వారు రాసిన ఆ గొప్పకవిత్వానికి కైమోడుస్తారు. ఇది అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ సాహిత్యకారుల పట్ల ఆ ప్రాంతపు ప్రజలు అనుసరించిన ఒక గౌరవం!! వారి అక్షరానికి చేసిన ఒక మన్నన.

    రమ.

  1374. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/03/2010 1:30 pm

    రోహిణీప్రసాద్‌గారూ, రమగారి అనుభవం బట్టి శ్రీశ్రీ కవిత్వం ఈనాటి యువతని కూడా అప్పటి కాలంలో లాగానే ఉర్రూతలూగిస్తుందని నిశ్చయించలేము కదా. రమగారు అన్నట్టు, ఈనాటి యువతకి కూడా ఆసక్తి కలిగించే విషయాలు ఆ కవిత్వంలో ఏమిటన్నది పరిశీలించాల్సిన అంశం.

    సౌమ్యగారూ, అవును. శ్రీశ్రీ కవిత్వేతర సాహిత్యాన్ని కూడా అనువదించాడు. ఈ వ్యాసం, మొదటి పేరాలో చెప్పినట్టు, కవిత్వ అనువాదాలకే పరిమితం.

    రవిశంకర్‌గారూ, మీ అనువాదం నాకు శ్రీశ్రీ అనువాదం కన్నా నచ్చింది. దీనికి ఒక ముఖ్య కారణం ఆంగ్ల మూలంలో ఉన్న తేడా అయ్యుండవచ్చు. ఈ వ్యాసం రాసిన తర్వాత వెతుకుతూ ఉంటే, మరో ఆంగ్ల అనువాదం కనిపించింది. శ్రీశ్రీ అనువాదానికి ఇదే మూలం. ఇది Nanors Valaoritis and Bernard Spencer చేసిన అనువాదం.

  1375. గుండుగొమ్ములనుమానం – 1 గురించి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం:

    01/03/2010 11:29 am

    త్రిపుర గారిని కలవకపోయినా కథల ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని చాలా వరకూ ఊహించాను. ఇప్పుడు మీ వ్యాసంతో నేనూహించింది నిజమే అని తెలీడంతో చాలా ఆనందం కలిగింది. త్రిపుర తన కథల్లో , మాటల్లో ఎంత చెప్తాడో, మాటల మధ్య విరామాలు, పదాల్ని కోట్స్ లో పెట్టడం, చుక్కలు ఇలా వీటితో అంతకంటే ఎక్కువే చెప్తాడు. సముద్రపు హోరులో కెరటానికీ కెరటానికీ మధ్య ఉండే నిశ్శబ్దాన్ని తన కథల్లోకి ప్రవేశ పెట్టగల ప్రజ్ఞ ఆయన సొంతం. త్రిపుర గారంత డిటాచ్మెంట్‌తో రాసిన వాళ్ళు బహుశా తెలుగులో ఎవరూ లేరేమో! ఆయన కథల్లో అంతర్లీనంగా ఉండే జెన్ తాత్వికత గురించి ఎప్పటినుంచో రాద్దామనుకుంటున్నాను. చూడాలి.

    ఇక మీ ప్రశ్న “కవిత్వం, కథలు ఎందుకు?” అన్నది నన్ను కూడా చాలా రోజులు వేధించింది. ఇస్మాయిల్ గారి “కరుణ ముఖ్యం”లో చాలా చోట్ల ఈ ప్రస్తావన ఉంది. ఆయన చెప్పిన విషయాలు నన్ను చాలావరకు సంతృప్తి పరిచాయి. ఒకానొక ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ గారిని అడిగిన ప్రశ్న దానికి ఆయన సమాధానం కింద ఇస్తున్నాను.

    “కళ కళ కోసమే” అన్న వాదన మళ్ళీ ఎదో వొక రూపంలో బహిర్గతమవుతుంది. కారణం? “శుద్ధకళా” వాదన మనుగడకు పరిస్థితులున్నాయా?

    జ. “కళ కళ కోసమే” అనే వాదన తలెత్తిందని నేననుకోను. ఈ మధ్య నేను ఎక్కడా వినలేదు. “కళ కళ కోసమే” అనే వాదనా, “కళ సాంఘిక రాజకీయ ప్రయోజనాల కోసం” అనే వాదనా – రెండూ అతి వాదాలే! ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏదీ వుండదు. ఐతే దేని ప్రయోజనం దానికుంటుంది. ఇది గుర్తించడం ముఖ్యం. ప్రపంచాన్ని అవగాహన చేసికోవటమూ, తద్వారా ప్రపంచంతో అనుభౌతిక అనుసంధానం (emotional adjustment) సాధించటమూ – అనాది నుంచీ కళా ప్రయోజనమని అనుకుంటున్నాను.

    చాలా రోజులకి మీనుండి ఒక సమగ్రమైన వ్యాసపరంపర మొదలవడం ఆనందంగా ఉంది. మీ తదుపరి వ్యాసాల కోసం ఎదురుచూస్తూ..

    — సుబ్రహ్మణ్యం

  1376. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి V Chowdary Jampala గారి అభిప్రాయం:

    01/03/2010 3:50 am

    ఈ సంకలనంలో శ్రీశ్రీ సంధ్యాసమస్యలు కవితకి బాపు వేసిన చిత్రం లేదు. ఆంధ్రజ్యోతికోసం వేసిన చిత్రాల పరంపరలోని ఈ చిత్రం తానా తెలుగు పలుకు (10వ సంపుటం, చికాగో, 1995)లోనూ, తెలుగునాడి జూన్‌ 2009్ సంచికలోనూ పునర్ముద్రించబడింది.

    – జంపాల చౌదరి, మండలీన్‌, ఇల్లినాయ్‌.

    [నిజమే. అది బొమ్మల స్కాన్లను ఒకటే డాక్యుమెంటుగా సంకలించడంలో జరిగిన పొరపాటు. ఆ బొమ్మను కూడా ఈ సంకలనంలోకి జత చేశాం. పొరపాటు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు – సం.]

  1377. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి వేణు గారి అభిప్రాయం:

    01/03/2010 12:50 am

    శ్రీశ్రీ కవితలకు బాపు బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు!

    ‘ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన ఒంటె’ కవితకు (బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను) ఆంధ్రజ్యోతి వారపత్రికలోనే వచ్చిన బాపు బొమ్మ మిస్సయింది, ఈ సంకలనంలో! అయితే ఆ బొమ్మ.. కవితలోని పదచిత్రానికి తగ్గట్టుగా లేదని రా.రా. తన‘అనువాద సమస్యలు’లో ప్రస్తావించారనుకోండీ:)

    [ఆంధ్రజ్యోతి పత్రికలో బొమ్మలు, ఎప్పుడో టెంత్‌లోనో ఇంటర్‌లోనో మా సంపాదకులొకరు సేకరించుకున్నవి. మీరు ప్రస్తావించిన బొమ్మ వాటిల్లో లేదు. ఎవరైనా పంపినా లేదా ఎవరిదగ్గరైనా ఉంటే తెలిపినా వారి అనుమతితో ఆ బొమ్మను కూడా ఈ సంకలనంలో చేర్చగలం. ఈ విషయం చెప్పినందుకు కృతజ్ఞతలు – సం.]

  1378. శ్రీశ్రీ ఉపన్యాసం గురించి mOhana గారి అభిప్రాయం:

    01/02/2010 8:19 pm

    శ్రీశ్రీ చేసిన ఈ ప్రసంగము అందరూ తప్పక విని, ఆనందించి, ఆలోచించవలసినట్టిది. వారు ఆధునిక కవియైనా, ప్రాచీన సాహిత్యాన్ని కూలంకషముగా చదివి, అందులోని విషయాలను అవగాహన చేసికొని ముందడుగు పెట్టారు. భారత కవులు రాసిన పద్యాలను ఉత్సాహంతో చదివి అందులోని లోతులను తెలియ బరచారు. కాని తన దృష్టిలో తిక్కన, వేమన, గురజాడలే కవిత్రయమని వివరించారు. తిక్కన నాటకీయత, వేమన అప్పటి సమాజములోని కుళ్ళును చూపి తన పద్యాలతో ప్రజలను చైతన్య పరచుట, గురజాడ పాత జమిందారి కవిత్వపు ఛాయలను త్యజించి ప్రజల వాడుక భాషలో పాడుకోతగ్గ మాత్రా ఛందస్సులో వ్రాయుట ఇందులకు కారణాలు. తాను కూడా భావ కవిత్వం వ్రాసిన తరువాతే అభ్యుదయ కవిత్వం రాశానని, ఆ కాలపు పరిస్థితులు (ఆర్థిక మాంద్యము, స్పానిష్ సివిల్ వార్, ఫాసిసం) తన్ను ఉద్రేక పరచాయని వివరించారు. వారి గళములో పొలాలనన్నీ హలాల దున్నీ … గేయాన్ని విని ఉప్పొంగిపోవచ్చు. ఈ కానుక నందిచ్చిన మద్దిపాటి కృష్ణారావుగారికి, వడ్లమూడి బాబుగారికి మనం ఋణపడి ఉన్నాము.

    విధేయుడు – మోహన

  1379. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి రవిశంకర్ గారి అభిప్రాయం:

    01/02/2010 6:24 pm

    మీ విశ్లేషణ బాగుంది. శ్రీశ్రీ అనువాదాల్లో కొంత స్వేచ్చ తీసుకున్నాడని భావించటం సమంజసంగా ఉంటుంది. ఖడ్గసృష్టిలో వీటిని అనువాదాలని గాక, అనుసృజన అనే పేర్కొన్నారు. ఆ కవితలన్నిటిలోను The Snows of Yester Year కి చేసిన అనుసరణ ఎక్కువ ప్రసిద్ది పొందిందనుకుంటాను.

    పిచ్చిదానిమ్మ చెట్టు గురించి ఒక మాట. సుమారు మూడు సంవత్సరాల క్రితం ఎలీటిస్ కవిత్వం చదువుతున్నప్పుడు ఈ కవిత విపరీతంగా నచ్చటం వల్ల నేను కూడా ఇదే పేరుతో దీనిని అనువదించాను. ఆసక్తి ఉన్నవారు ఆ అనువాదాన్ని చూడవచ్చు:

    అప్పటికి నేను శ్రీశ్రీ అనువాదం చదవలేదు. ఇది ప్రచురితమయ్యాక, చలసాని ప్రసాద్ గారు శ్రీశ్రీ అనువాదాన్ని గుర్తుచేస్తూ, ఈ అనువాదం తేడాగా ఉందని ఆ పత్రికకి ఉత్తరం రాసారు. శ్రీశ్రీ కూడా ఆంగ్లం నుంచే అనువదించి ఉంటారని భావిస్తాను. ఆయన ప్రామాణికంగా తీసుకున్న ఆంగ్లానువాదం – అంటే 1949 కి ముందు ఈ కవితకి వచ్చిన ఆంగ్లానువాదం – దొరికితే శ్రీశ్రీ పాటించిన భేదాలు అందులోనే ఉన్నాయేమో పరిశీలించవచ్చు.

  1380. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Sowmya గారి అభిప్రాయం:

    01/02/2010 1:05 am

    వ్యాసం ఆసక్తికరంగా ఉంది. అయితే, శ్రీశ్రీ అనువాదాలు అన్నాక, కవిత్వం మాత్రమే చెప్పారే… శ్రీశ్రీ అనువాద కథలు కూడా చాలానే ఉన్నాయి కదా… శ్రీశ్రీ కథలు సంకలనంలో కూడా చాలా అనువాదాలు ఉన్నాయి.
    రో.ప్ర గారు అన్నట్లు – చివరి వరకూ ఆక్టివ్ గా జీవించారనిపిస్తుంది… అధివాస్తవిక కవిత్వాన్ని అనువదిస్తే ఎలా ఉంటుందో…కుతూహలం కలిగించారు. ధన్యవాదాలు.

  1381. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/01/2010 8:55 pm

    “ఆ కాలంలో యువతరాన్ని ఉర్రూతలూగించినంతగా అతని కవిత్వం ఈ కాలపు కుర్రకారును ప్రభావితం చేస్తుందని నేననుకోను.”
    పై వ్యాఖ్యకు ఇటీవలి రమా భరద్వాజ్ అనుభవం కొంతవరకూ సమాధానమిస్తుంది.
    శ్రీశ్రీ చేసిన వచన అనువాదాలూ ఉన్నాయి. మిఖయీల్ షోలఖొవ్ రష్యన్ నవలిక వాటిలో ఒకటి. (పేరు గుర్తులేదు). తనకు నచ్చినవీ, ప్రభావితం చేసినవీ అనేక రచనలను ఆయన అనువదిచాడు. చివరిదాకా నీరసపడకుండా, active గా జీవించాడు. ఇది మనమ్ గుర్తుచుకోవలసిన విషయం.

  1382. రెండు శ్రీల కవి గురించి mOhana గారి అభిప్రాయం:

    01/01/2010 4:20 pm

    మలయాళంలో ఉందో లేదో తెలీదు కానీ, కన్నడములో మహాప్రస్థానం అనువదించబడినది. మచ్చుకు ఒక ఉదాహరణ –

    శ్రీశ్రీయవర మహాప్రస్థాన మత్తొందు ప్రస్థాన – ఆయ్ద కవితెగళు నుండి
    (అనువాదం – ఎచ్ ఎస్ శివప్రకాశ్, బంజగెరె జయప్రకాశ, రాఘవేంద్ర రావ్
    ప్రచురణ – సాహితీ మిత్రరు, బెంగళూరు, 1991)

    ఒందు రాత్రి (ఒక రాత్రి)

    గగనవెల్లా తుంబి
    హొగె హొగెయంతె హరడి
    బహుళపచమి జ్యోత్స్న
    భయపడిసువుదు నన్న

    ఆకాశద మరుభూమి
    ఎల్లెడె, అకటా!
    ఈ రాత్రి కెరళిదె
    మరళ బిరుగాళి!

    గాళియలి గోచరిసద
    గడసు దెవ్వగళు
    భూ దివగళ మధ్యె
    ఈజుతలివె!

    బాయ్తెరెదు, ఘోషిసి
    ఉక్కువుదు సాగర!
    మదగజద కళేబరదంతె
    చలిసద బెట్ట!

    అంబరద మరుభూమియలి
    కాలు కత్తిరిసి హోద
    ఒంటె ఒంటెయంతె
    ఇహుదు చంద్రమ!

    విశ్వవెల్లా హరడి
    బెళ్ళదిబూదియ తెరది
    బహుళ పంచమి జ్యోత్స్న
    భయ పడిసువుదు నన్న!

    విధేయుడు – మోహన

  1383. రెండు శ్రీల కవి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/01/2010 2:38 pm

    రేఖామాత్రంగా నారాయణరావు గారు శ్రీశ్రీ గురించి శ్రీశ్రీ కవిత్వం గురించి చేసిన కొన్ని ఊహలమీద రేఖామాత్రంగా నాలో కల్గిన సందేహాలు క్లుప్తంగా ఇలాంటివి.

    ఇటీవల హైద్రాబాద్ లో పుస్తకప్రదర్శన జరిగింది. అందులో నా దృష్టిలో పడిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇలా ఉన్నాయి.

    తెలుగు సరిగ్గా చదవనుకూడా తెలియని..అర్ధంకాని కొందరు కుర్రకారు పనిగట్టుకుని పుస్తకాల షాపుల్లో అడిగి మరీ శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని కొనుక్కోవడం. నేను వారిని ఆ పుస్తకాన్ని ఎందుకు కొంటున్నారని అడిగాను. అందులో మెడిసన్ ఆఖరు సంవత్సరం చదివే ఒక అమ్మాయి నాతో చెప్పిన జవాబు ఇదీ!! “మామ్ నాకు మహాప్రస్తానం భాష ఏమీ బోధ పడదు. కానీ ఆ పోయెమ్స్ చదివితే నాకు బాగుంటుంది. ఒక ఆకర్షణ ఏదో ఆ మాటల్లో ఉంది. అందుకని కస్టపడి అయినా నేను మహా ప్రస్తానాన్ని చదవాలని అనుకుంటున్నాను అంది.

    నేను ఇప్పుడు చెప్పిన అమ్మాయి విప్లవ సంస్థల్లో పనిచేసే అమ్మాయి కాదు. మహాప్రస్థానపు పూర్వాపరాలేవీ ఆ అమ్మాయికి తెలియవు. ఆ అమ్మాయి ఆరుద్రని గాని విరసం ఆవిర్భావాన్ని గానీ ఎరగదు. వాటివేటిమీదా ఆ అమ్మాయికి ఆసక్తి కూడా ఉన్నట్టు లేదు.

    ఒకానొక రాజకీయ సంక్షుభిత కాలం గడిచిపోయేకా నారాయణ రావు అభిప్రాయం ప్రకారం మహాప్రస్థానం నాటి ఆవేశాలు సంపూర్తిగా చల్లారాకా నిజానికి ” మరోప్రపంచం” లాంటి కవిత్వపు అవసరం లేని కాలానికి ఆ కవిత్వం మీద ఆసక్తీ లేదా అనురక్తీ కలగడానికి మరి వీలు లేదు. చాలావరకూ “అభ్యుదయ కవిత్వపు స్పందనలు అలా ఎన్నో అలా చల్లారిపోయినవి ఉన్నాయి కూడా!! కానీ మహాప్రస్థానం విషయంలో ఆనాటి రాజకీయ సందర్భం ప్రపంచంలో మారిన ఈనాటికీ ఆ సంకలనం మీద మాత్రం ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేక పోవడాన్ని మనంచూడవచ్చు.

    నారాయణరావుగారు ఏ వయసులో శ్రీశ్రీ మహాప్రస్థానం చేత ప్రేరణ పొందారో ఆ వయసులోని యువతీ యువకులు ఈనాటి తరం వాళ్ళు సైతం ప్రేరణపొందటం వెనక గల కారణాన్ని కేవలం “జాంతవమైన ప్రేరణ గా మాత్రమే” క్లుప్తీకరించి మాట్లాడలేం!! ఈనాటి తరానికి కూడా ఆ పుస్తకంలో కావలసినదేదో ఉందన్న అంచనాకి రావాల్సి ఉంటుంది.

    శ్రీశ్రీతో తన నడివయసు దాకా సరిపడా పరిచయం కల్గిన నారాయణరావు సూటీగా తనకి కల్గిన అనుమానాలనీ..లేదా తన పరిశీలననీ శ్రీశ్రీతోనే ఎందుకు ప్రస్తావన చేయలేకపోయారన్న ప్రశ్నకి ఇక్కడ చోటుంది. అది అటుంచితే.. శ్రీశ్రీ జతించిన ఒక పాతిక ఏళ్ళకి నారాయణరావుకి మహాప్రస్థానం లోని గేయాలు రష్యా మీద రాసిన దానితో సహా ” నవ్వొచ్చేలా ఉండి ఉండొచ్చు”. కానీ ప్రపంచానికి రష్యా ఒక కాల్పనికమైనదే అయినా ఒక స్వప్నాన్ని అందించిన మాట వాస్తవం. ప్రపంచ సాహిత్యానికి రష్యన్ రచయితలు ఎన్నో రకాలుగా ప్రేరణని ఇచ్చారన్నది ఒక వాస్తవం. ఇక్కడ రష్యా అన్న దాని ఉథ్థాన పతనాలు మనం చూసాము గనక ఆ మాట అనగలుగుతున్నాం!! అది మనకి సమీప కాలంలో జరిగిన రాజకీయ ఘటన. అదే మనకి సుదూరమైన రోమన్ గ్రీక్ రాజకీయ సాహిత్య ఘటనల మీద మనం ఇలాంటి వ్యాఖ్యానాలు చేయగలమా?? రాజకీయ సంక్షోభం సంభవించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆనాటి కాలంలో దానికి సంబంధించిన సాహిత్య స్పందనలు వస్తాయి.ఆనాటికి అవి సత్యం అవి ఆనాటికి ఒక ఆదర్శం! శ్రీశ్రీ మహాప్రస్థానం తో సహా!!

    ఇంక శ్రీశ్రీ సృజనలోని నిజాయితీని మనం ఇవాళ శంకించడంలో అర్ధంలేదు. ఆయన మార్క్సిస్ట్ గా మారి వాటిని రాసాడా లేదా కేవలం నిబధ్ధత లేని ఉత్తుత్తి తెచ్చుకోలు ఉద్రేకాన్ని ప్రదర్శంచాడా అన్నది ఏ రుజువులకీ దొరకనిది.అలాంటి ప్రకటనలకి ఏ చెల్లుబాటూ ఉండదు . అలాగే ఆయన నాయకత్వం మీద కూడా!!

    శ్రీశ్రీ ప్రభావం అన్నది ఒక వాస్తవం. శ్రీశ్రీ సాహిత్యం ఒక అవసరం అయిన మాట వాస్తవం.ఒక తరానికి కాదు రెండు తరాలకి కాదు. ఈనాటికీ ఆయన సాహిత్యంలో ఉత్తేజ పూరితమైన ఒక ప్రాణశక్తి కవిత్వ పిపాసువులకి దొరుకుతోంది. నారాయణరావుగారికి అర్ధ రహితంగా కన్పించి ” నవ్వుతెప్పిస్తూన్న’ విధానంలో కాకుండా శ్రీశ్రీ గేయంలోంచి తమతమ ఆవేశాలకి తమతమ ప్రేరణలకి మార్గాలు వెతుక్కుంటున్న ఈనాటితరం శ్రీశ్రీలో చూస్తున్నదేమిటి అన్నది అర్ధం చేసుకోవాల్సి ఉంది.

    శ్రీశ్రీ కాలంనాటి వ్యక్తిగత స్పర్ధలతో సంబంధం లేని తరాలు ఆయన కవిత్వంలో ఏమిటి వెతుక్కుంటూ ఇవాళ్టికీ మహాప్రస్థానాన్ని కొనుక్కుంటున్నారో గమనించవలసి ఉంది. అది తెలియందే అతి సునాయాసంగా శ్రీశ్రీని అంచనా వేయడం కస్టం. కవితాస్పందన వేరు. అకడమిక్ విశ్లేషణ వేరు. శ్రీ శ్రీ కవిత్వం మెదడు పైపై పొరలనే తాకిందో..మరింతగా ఇంకి ఈనాటికీ మనసులోతులనే అంటిందో తెలుసుకోగల కొలమానం ఒక్క శ్రీశ్రీ కవిత్వమే!! దానికి సాటి అయినది అది మాత్రమే!! ఆకాశానికి సాటి అయినది ఆకాశమే అయినట్టూ..సముద్రానికి సాటి అయినది ఒక్క సముద్రమే అయినట్టు!!

    రమ.

  1384. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/01/2010 11:35 am

    బొంబాయిలో సాహిత్యాభిలాషగల కేరళ మిత్రులు కొందరు శ్రీశ్రీ కవితల ఇంగ్లీషు, మలయాళం అనువాదాలను తాము చదివి ఆనందించామని నాతో అన్నారు. శ్రీశ్రీకి తెలుగుభాష మీద ఉండిన పట్టు వారికి తెలియదు కనక కవితావస్తువూ, భావనలే వారిని ఆకట్టుకుని ఉండాలి. రావిశాస్త్రి అన్నట్టు శ్రీశ్రీ గొప్పతనానికి ముఖ్యకారణం ఆయన ప్రజలపక్షాన నిలబడడమే.

  1385. సువర్ణభూమిలో … గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    12/10/2009 5:20 pm

    “సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు…. ”

    “ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్‌ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.”
    ఆరి సీతారామయ్య అభిప్రాయం: December 2, 2008 3:11 pm

    ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ ఈ కవిత, ఈ అభిప్రాయాలు చదువుకుని, ఈ పై అభిప్రాయం వెలిబుచ్చినవారికి, ఈ నా ప్రశ్న.

    కవితలో, ఏ పంక్తుల్లో ఉన్న సమాచారాన్ని వాడి, పాఠకులు ఈ కవితను అర్థం చేసుకోవాలో మొదట్లో చెప్పి, చివరికి ఆ పంక్తులే ఈ కవితకు అనవసరమని చెప్పి ముగించారు.

    గమనిస్తారా?
    పొరపాటా? కాదా?
    సమాధానం చెబితే, అప్పుడు నా రెండో ప్రశ్న అవసరమైతే ఆడుగుతాను.

    లైలా.

  1386. నాయినమ్మ యిల్లు గురించి rajeshwari గారి అభిప్రాయం:

    12/09/2009 7:58 pm

    మీ కవిత బాగుంది.

  1387. ఒక్కతే… మృత్యువు గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:

    12/08/2009 11:08 pm

    ఈ క్రింది లింకులో ఇదే కవితకు శ్రీశ్రీ చేసిన అనువాదాన్ని చూడవచ్చును

    http://sahitheeyanam.blogspot.com/2009/12/blog-post_09.html

    బొల్లోజు బాబా

  1388. రెండు అమెరికన్ రుతాలు గురించి TADANKI RAMAKRISHNA గారి అభిప్రాయం:

    11/27/2009 2:46 am

    వసంత రుతువు మీద అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కవులు కవితలు చెపుతూనే వున్నారు. ఇక ఈ కవితలో :

    వసంతం వచ్చేసిందిక ఏదీ బ్లాక్ అండ్‍ వైట్‍గా వుండదు
    పొద్దున్నేతలుపు తీయగానే చెవులకు మంచి బ్రేక్ ఫాస్ట్

    “బ్లాక్ అండ్‍ వైట్‍గా వుండదు” బదులు “ఏదీ స్తబ్దుగా వుండదు.”
    “చెవులకు మంచి బ్రేక్ ఫాస్ట్” బదులు “చెవులకు మంచి విందు” అనచ్చు.

  1389. కుండీలో మర్రిచెట్టు గురించి rajeshwari గారి అభిప్రాయం:

    11/26/2009 12:51 pm

    నమస్కారములు. మీ కవిత బాగుంది. ముఖ్యంగా, ” రెండు పిడికిళ్ళ మన్నులో నీటికై వెదుకాడే కళ్ళలోకి ” చాలా బాగుంది.

  1390. ప్రయాణం గురించి ajay గారి అభిప్రాయం:

    11/19/2009 6:27 am

    ఈ కథ బాగా ఉంది. బుచ్చిబాబు కథ లా అనిపిచింది అంటే కోపం వస్తుందేమో. భూషణ్ గారు మీరు కేవలం కవిత్వాన్ని, కవిత్వ విమర్శని పట్టించుకుని కథకు అన్యాయం చేస్తున్నారు. ఇన్కా కథలు రాయొచ్చుగా.

  1391. ప్రేమ కవితలు గురించి DEVI గారి అభిప్రాయం:

    11/18/2009 3:24 am

    కవితలు చలా బాగున్నాయీ చాలా చాలా

  1392. ప్రేమ కవితలు గురించి sravan గారి అభిప్రాయం:

    11/17/2009 5:15 am

    చాల చక్కగా ఉంది మీ కవిత.

  1393. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి బొల్లోజుబాబా గారి అభిప్రాయం:

    11/11/2009 1:42 am

    అంతే అంతే
    మనం ఏం చూడాలనుకుంటామో అవే కనపడతాయి. సాహిత్యంలోనైనా, జీవితంలోనైనా!
    కధ నాకు నచ్చింది. కవిత్వం నిండిన కధలు చదివి చాన్నాళ్లయింది.
    బొల్లోజు బాబా

  1394. ముగ్గురు ముసలమ్మలు గురించి బొల్లోజుబాబా గారి అభిప్రాయం:

    11/07/2009 2:57 pm

    కథనం బాగుంది. కధలోని నేపథ్యం మన తెలుగునాడు కాదు కనుక అన్వయం కొంచెం కష్టంగానే ఉంది.
    రవికిరణ్ గారి వాఖ్య కొంచెం పంజెంట్ గాఉంది. కానీ ఒక పరిశీలన ప్రతిఒక్కరూ తనచావు ప్రశాంతంగా శివశివా అనుకొంటూ పోవాలని కోరుకొనేవారే. ఆఖరుకు మంచంపట్టిన వారుకూడా.
    కానీ వాస్తవానికి మరణ శయ్యపై ఉన్నవాని ఆలోచన అలా ఉంటుందా? మరికొంత కాలం బతకాలన్న ఆశ ఉండటం సార్వజనీనమేమో.

    అలాగని చావును ఈ కథలో మూడో ముసలమ్మ ఎదుర్కొన్నట్టుగా వీరోచితంగా ఎదుర్కోవటం అనేది చాలా డ్రమాటిక్ గా అనిపిస్తోంది. ఇక్కడ అప్రస్తుతమైనా ఎప్పుడో చదివిన చిన్న కవిత

    చిన్నప్పుడు తడబడుతూ రోడ్డు దాటుతున్న
    ముసలివానిని చూసి దేముడా నాకు అట్లాంటి దుస్తితి
    రాకుండానే తీసుకుపో అని కోరుకొన్నాను.

    ఇప్పుడు అంత ముసలివాడినయ్యాక మరలా దేముడిని ప్రార్ధిస్తున్నాను
    దేముడా నన్ను ఇప్పుడే తీసుకెళ్లకు ఈ రోడ్డు దాటనీ”

    కవి పేరు గుర్తుకులేదు వాక్యాలు కూడా అవే కాకపోవచ్చు.

    ప్రతిఒక్కరూ ప్రశాంతంగా శివ శివా అని వెళిపోవాలి అన్న కోరికమీద నిర్మించిన కథ ఇది. దీనిలోని పాత్రలూ, సంఘటనలూ, సంభాషణలూ ఆ సెంట్రల్ డోగ్మా ను అనుసరించి పేర్చుకొంటూ పోయినవే అని నాకనిపిస్తూంది. అంతకు మించి మరోలా ఉండటం వీలుకాదేమో!

    బొల్లోజు బాబా

  1395. ప్రేమ కవితలు గురించి N. Rambabu గారి అభిప్రాయం:

    11/04/2009 6:19 am

    ఈ మాటలోని కవితలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ కవితలు నాతో పాటు మిగతా పాఠకులకు కూడా ఆకట్టుకుంటున్నాయని అనుకుంటున్నాను. మరియు ఇంకా ఇలాంటి మంచి కవితలు పంపే ప్రేమికులు స్వచ్ఛంగా వాళ్ళ ప్రేమను గెలిపించుకోవాలని ఆశిస్తూ,

    రాంబాబు,
    కొండాపురం
    శ్రీకాకుళం.

  1396. నింగి-నేల గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    11/03/2009 2:18 am

    మంచి కవిత్వం రాసే అతికొద్ది కవుల్లో రవిశంకర్ గారొకరు. ఆయన పేరు చూడగానే మంచి కవిత చదువబోతామన్న ధీమా వస్తుంది. కానీ ఈ కవితలో అగమ్యగోచరమైన ఖాళీ వుంది. అసంపూర్ణమైన పోలికలు కనిపించాయి.

    మోహన రావుగారికొచ్చిన సందేహమే నాకూ వచ్చింది. ఒక పాదంలో ఇద్దరు వనితలంటూ చెప్పి, చివరి పాదంలో ఇద్దరు ప్రేమికులుగా చెప్పడంతో, నేలా, నింగీ లని స్త్రీ, పురుష ద్వయంగా వర్ణించారేమిటా అని అనుకున్నాను. ( ఇద్దరు స్త్రీలు ప్రేమించుకోకూడదా? అని మాత్రం నన్నడగకండి) పోలికలు గతిభేదం తప్పినట్ట్లుగా అనిపించిది.

  1397. వానకూడా వింతే! గురించి yadlapalli Bharath kumar గారి అభిప్రాయం:

    10/31/2009 2:39 am

    నేను తెలుగు సాహిత్యాభిమానిని. చాలా రోజుల నుండి ఇలాంటి మంచి సాహిత్యం ఉన్న ఒక వెబ్ సైట్ కోసం వెతుకుతున్నాను. దాదాపు అన్ని అంశాలు నాకు నచ్చాయి. మీ కవిత చాలా సరళమైన పదాలతో వుండటం వలన నాకు బాగా నచ్చింది.

  1398. About eemaata గురించి Mahendra గారి అభిప్రాయం:

    10/25/2009 2:12 pm

    సాహితీ మిత్రులందరికీ వందనాలు,
    నేను చాలా కాలంగా ఇటువంటి వేదిక కోసం చూస్తున్నాను. కొంత ఆలస్యంగా నైనా ఈరోజు “ఈమాట” చూడడం జరిగింది. చాలా సంతోషం వేసింది. ఇంతమంది సాహితీ మిత్రులని ఒకచోట చూడడం చాలా సంతోషంగా వుంది. మన మాతృభాష ఇంకా పదికాలాలపాటు జీవిస్తుందని ధైర్యం కలిగింది. ,
    నేను చిన్నతనం నుండి తెలుగు సాహిత్యం ఇష్టంగా చదివేవాడిని. కొంతకాలం కవితలు కూడా రాశాను. గత కొద్ది కాలంగా పలు కారణాల వల్ల సాహిత్య లోకానికి దూరంగా వున్నాను. ఈరొజు “ఈమాట” చూసిన తరువాత నేను కూడా ఈ సాహితీస్రవంతిలో భాగం కావాలని అనుకున్నాను.

    ఇది నేను తెలుగులో రాసిన మొట్టమొదటి ఈమెయిల్. చాలా సంతోషంగా వుంది.

    నేను రాసిన కొన్ని కవితలు మీతో పంచుకుందామనుకుంటున్నాను. ఎలా పంపాలో తెలుపగలరు.

    ధన్యవాదాలు,
    మహేంద్ర గొట్టిపాటి

    [దయ చేసి ఈమాట ముందుపేజీలో రచయితలకు సూచనలు చదవగలరు – సం.]

  1399. నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    10/22/2009 9:32 pm

    సమంజసం కానిది విశ్వనాథ వారి కవితావైభవాన్ని చెప్పడానికి ఎన్నో గొప్ప పద్యరత్నాలున్న కావ్యంలోనుంచి “చున్‌కే చున్‌కే” ఈ పద్యాన్నేఎన్నుకోవడం. సమంజసం కానిది, సరదాకో దురదకో ఎక్కడో ఉన్న ఇట్లాంటి పద్యాన్ని పట్టుకొని విశ్వనాథ కవిత్వాన్ని, చాతుర్యాన్ని తెలుసుకోవడానికి ఇదొక మెతుకువంటిదని ఎత్తిచూపడం. సమంజసం కానిది, “నిర్వీర్యం” అన్న పదానికి లింగవివక్షతను ఆపాదించడం. సమంజసం కానిది, పద్యాన్ని వొదిలేసి ఇంకొకరి బుద్ధి ఎటు పారలేదో, పారాలో చర్చించడం.

    “తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచు బ్రదుకులు తనవిగాన
    చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనది గాన
    తలచిన రామునే తలచెదనేనును, నా భక్తి రచనలు నావి గాన”
    అని పదికాలాల పాటు గుర్తుండేటట్లుగా చెప్పిన విశ్వనాథ గారి పద్యం చదివిన తరువాత, అంతకంటే సమంజసమైనది,తలచినప్పుడల్లా పరవశింపజేసేది, ఆలోచనామృతాన్ని అందజేసేది, కలకాలం నిలిచిపోయే “రామచరితమానస”లో తులసీదాసు చెప్పిన మాటలు.

    “నిజ గిరా పావని కరన కారణి రామ జసు తులసీకరో
    రఘువీర చరిత అపార వారధి పార కవి కౌనేరయో”

    నా వాక్కును (గిరా) పావనం చేసుకోవడం కోసమే రాముని చరితను చెప్పడం. అపారమైన సముద్రం వంటి రఘువీరుని చరితను ఏ కవి అయినా, కాదు, ఎందరు కవులైనా సరే, (వర్ణించి) దాటగాలరా?!”
    __________
    విధేయుడు
    -Srinivas

  1400. మరోపువ్వు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    10/09/2009 8:55 pm

    చక్కని భావం. రవీంద్రుని కవితలను గుర్తుకుతెచ్చింది.

    ఎత్తులో కదిలే మేఘాలు, కొంచెం క్రిందగా ఎగిరే చిన్ని పక్షులు, ఇంకా కిందగా మొక్కపై చిన్న పువ్వు- నడిపించిన క్రమం- పరిNaతితో పాదాలు చేరడం, కాదు, చేర్పించడం రమ్యంగా ఉంది.
    ____________
    విధేయుడు
    _Srinivas

  1401. జవాబు ఫలితం గురించి pantula Jogarao గారి అభిప్రాయం:

    10/08/2009 9:52 pm

    శ్రీనివాసరావు గారూ, నమస్కార౦. మీ చిన్న కవిత మరో సారి చదివాను. నన్ను కదిలి౦చి౦ది.క్లుప్తత ఆ కవిత కి గొప్ప అల౦కార౦గా విలసిల్లి౦ది. మరో సారి మనసారా అభిన౦దల౦దుకో౦డి.

  1402. మరోపువ్వు గురించి రాకేశ్వర రావు గారి అభిప్రాయం:

    10/06/2009 1:21 pm

    ఆఖరి పద్యం చాలా బాగుంది.
    మీ కవితలతో నాకెప్పుడూ వుండే మొఱ ఒకటే. నిడివి.
    రుచి చూపించి వదిలేసినట్టుంటుంది.

  1403. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి సర్పవరపు రమణి గారి అభిప్రాయం:

    10/04/2009 8:47 am

    విరామ చిహ్నాలు తెలియకుండా మహాకవులు గావచ్చు.
    అసలేమీ చదవకుండా ఆధునిక కవిత్వాలు అప్రయత్నంగా
    అర్థమవాలనుకునే అసాధరణ పాఠకులు కావచ్చు.ఘనంగా
    సినిమా పాటలు రాసుకుంటూ జ్ఞానపీఠం బడయవచ్చు.
    ఇవన్నీ ,మన ఒక్క తెలుగులోనే సాధ్యం సుమా !!

    సర్పవరపు రమణి.

  1404. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/23/2009 2:52 am

    ముందు రమ గారు, రవికిరణ్ గారు, పురాణాల, కవిత్వాల ప్రస్తావనపై లేవనెత్తిన అభ్యంతరాల గురించి ఓ రెండు మాటలు. విశ్వం గురించి మానవుడు అనాదిగా ఆలోచిస్తూ ఉండాలి. ఆ భావనలు కొన్ని పురాణ గాథల్లో, మత గ్రంథాల్లో ఏదో ఒక రూపంలో ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాటి పరిణామం గురించి రాసేటప్పుడు ఆ కథలని ప్రస్తావించడంలో తప్పు లేదు. వాస్తవానికి ఇది పాపులర్ సైన్సులో వాడుక కూడాను. కాల స్వరూపం గురించి రాస్తూ Hawking ఏమంటాడో చూడండి [1]:

    “In Newtonian theory, where time existed independently of anything else, one could ask: What did God do before He created the universe? As Saint Augustine said, one should not joke about this, as did a man who said, “He was preparing Hell for those who pry too deep.” It is a serious question that people have pondered down the ages. According to Saint Augustine, before God made heaven and earth, He did not make anything at all. In fact, this is very close to modern ideas.”

    అంత మాత్రాన Saint Augustine సైంటిస్టయిపోడనుకోండి. కాని చరిత్రా, చమత్కారమూ కలిస్తే సైన్సు మీద ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది.

    అదే పుస్తకంలో, విశ్వానికి అనేక చరిత్రలు, ఒక దానిలో మరొకటి ఇమిడి ఉన్నాయనే సిద్ధాంతాన్ని వివరించడానికి, Hamlet మాటలు వాడుకున్నాడు: “I could be bounded in a nutshell and count myself a king of infinite space.” ఆ అధ్యాయాన్ని ముగిస్తూ, “In this chapter we have seen how the behavior of the vast universe can be understood in terms of its history in imaginary time, which is a tiny, slightly flattened sphere. It’s like Hamlet’s nutshell, yet this nut encodes everything that happens in real time. So Hamlet was quite right. We could be bounded in a nutshell and still count ourselves kings of infinite space.”

    Shakespeare కి modern physics తెలుసని కాదు; భావాల్లో కొంత సారూప్యం ఉంది; మనసుకి హత్తుకునేట్లు కవులకి మించి మరెవరూ చెప్పలేరు కనుక వాళ్ళ భాష వాడుకోవడం మంచిదే. ఏమాటకామాటే చెప్పాలి, వేమూరి గారిచ్చిన మన పురాణాలలోని వివరాలు Hawking సోదాహరణాల్లా హత్తుకునేటట్లు లేవు.

    ఇక అసలు విషయానికొస్తే, సైన్సు విషయాలని ఆసక్తికరంగా చక్కటి తెలుగులో రాసేవారిలో చెప్పుకోదగ్గవారు వేమూరి. ఈ వ్యాస విషయం సైన్సు చదివిన వాళ్ళకి కూడా అంత సులభంగా కొరుకుడు పడేది కాదు. అంత క్లిష్టమైన దానిని వివరించడం మెచ్చుకోదగ్గ ప్రయత్నం. దానిపై ఇంకాస్త విపులంగా తీరిక దొరికినపుడు రాస్తాను.

    కొడవళ్ల హనుమంతరావు

    [1] “The Universe in a Nutshell,” by Stephen Hawking. Bantam Books, 2001.

  1405. జమ్మిబంగారం చెట్టు గురించి v v b rama rao గారి అభిప్రాయం:

    09/16/2009 5:46 am

    మీ కవిత బాగుంది.
    ప్రాచీనభావం మంచిదైనప్పుడు ప్రాచీనమని వదులుకోనక్కర లేదు.
    వీ వీ బీ రామా రావు

  1406. జమ్మిబంగారం చెట్టు గురించి డా. దార్ల గారి అభిప్రాయం:

    09/14/2009 1:09 am

    మీ కవిత బాగుంది. కానీ కవిత వచనంలో ఉన్నా విధిని నమ్మే ప్రయత్నం ప్రాచీన భావనగానే కొనసాగుతుంది.
    మనిషి అస్తిత్త్వ ఊగిసలాట మీ కవితలో కనిపిస్తుంది.

  1407. జమ్మిబంగారం చెట్టు గురించి ఉష గారి అభిప్రాయం:

    09/12/2009 2:19 am

    ఇన్నాళ్ళుగా చూసాను. మీ కలం నుండి క్రొత్త కవిత రావటం నిజంగా ముదావహం. సమ్మేళనం బాగుంది.
    “జయించామా! ఓడిపోయామా!
    బతికున్నపుడు అదే
    అసలు ప్రశ్న ఔతుంది”

    ఆ ప్రశ్ననుండి పూర్తి విశ్వాసంతో వెలికి రాని సమాధానం నుండే మరో ప్రశ్న వరకు నడక సాగుతుంది. జమ్మిచెట్టు ఎంత బాగా వాడారీ కవితలో.

  1408. జమ్మిబంగారం చెట్టు గురించి ఈగ హనుమాన్ గారి అభిప్రాయం:

    09/08/2009 1:40 am

    “అనుభవాలను ఆయుధాలుగా
    జమ్మిచెట్టుపై దాచి తిరగాలి
    అరణ్యవాసమైనా
    అజ్ఞాతవాసమైనా
    జనవాసమైనా..”

    మేరా జాన్,
    ఇది మీ లోని కవిత్వ ప్రతిభకు నిదర్శనం.
    ఈగ హనుమాన్
    nanolu.blogspot.com

  1409. జమ్మిబంగారం చెట్టు గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:

    09/06/2009 1:19 pm

    జాన్ హైడ్ గారికి
    మీ శైలికి భిన్నంగా వినిపిస్తూందీ కవిత. భిన్న మతాల చిహ్నాల సమ్మేళన కనపడుతూంది. ఆ మేళవింపూ సమర్థవంతంగా జరిగింది. ఈ కోణంలోంచి మీనుంచి మరిన్ని కవితల్ని ఆశిస్తున్నాను. కవితలోని కొన్ని పదచిత్రాలు లోతుగా ఉండి కవితకు గాఢతను చేకూర్చాయి. మంచి కవితను అందించారు.

    బొల్లోజు బాబా

  1410. ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి Dr.Darla గారి అభిప్రాయం:

    09/01/2009 10:19 pm

    బాబా గారు!
    అద్భుతమైన కవితను పరిచయం చేశారు. ఆ తడబాటు కూడా కవి తన శైలిలో చూపినట్లుంది. అనుభూతితో నిండిపోయింది.
    ”ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
    పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.”
    * * * *
    “రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.”
    ”అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
    * * * *
    కానీ మేమిరువురమూ అప్పటిలా లేము”
    నా హృదయాన్నేదో ఆవహించినట్లుందీ కవిత చదువుతుంటే!
    బాబాగారూ! మీది మంచి టేస్ట్!
    అభినందనలు.
    మీ
    దార్ల

  1411. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    09/01/2009 10:13 am

    ఈమాట పాత సంచికల్లో జాషువా గారి కవిత్వంపై (ఫిరదౌసి) చక్కని విశ్లేషణ ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి, “20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తులు” లో ఒకరిగా గుర్తించబడిన శ్రీ జాషువా గురించి నాలుగు మాటలు ఇక్కడ చెప్పుకోవటం అవసరం. శ్రీ తిరుమల రామచంద్ర గారు, శ్రీ నీలంరాజు మురళీధర్ గార్లు (అందమైన చాయాచిత్రాలు తీసిన వారు) కలసి, ఆంధ్రప్రభ కోరిక మేర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రముఖుల్ని కలిసి ఇంటర్వ్యూలు చేసి, వ్యాసాల రూపంలో అందంగా ఫొటోలతో సహా 1960 దశాబ్దంలో ప్రచురించారు. అదే “మరపురాని మనీషి – 20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప జీవిత చిత్రాలు”. ఈ వ్యాస సంపుటికి తరవాత “అజో-విభో” ఫౌండేషన్ వారు పుస్తక రూపాన్నిచ్చారు. అందులోవి ఈ నాలుగు మాటలు శ్రీ గుర్రం జాషువాపై ఉన్నాయి.

    గుర్రంవారు ఒక మారు వార్ధాకు గాంధీజీ దర్శనం కోసం వెళ్ళారు. అక్కడున్న ఒక జర్మన్ పండితునికి ఒక రాజకీయ నాయకుడు వారిని “దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ పొయట్” అని పరిచయం చేసారట. ఆ విదేశీ పండితుడు ఆశ్చర్యపడి ఆ నాయకుని వైపు చూశాడట. కవితకు కులమతాలు అంటగట్టటం ఎలాంటి సభ్యతో అర్ధం కావటంలేదంటారు గుర్రంవారు. “విశ్వమానవ సౌభ్రాత్రం, నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి, ఒక మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు. అవి కవిత్వాలే కావు. అలాంటివి వీలునామా కవిత్వాలంటాను. నా భావం సామాన్యులకు అందివ్వడానికే ప్రయత్నించాను. గహనసంచారం లేని కవిత్వం నా లక్ష్యం” అని స్పష్టపరిచారు గుర్రంవారు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  1412. ప్రేమ కవితలు గురించి priya గారి అభిప్రాయం:

    08/24/2009 12:49 pm

    చాల చక్కగా ఉంది మీ కవిత..

  1413. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి గిరి గారి అభిప్రాయం:

    08/23/2009 2:25 am

    బ్రహ్మానందం వ్యాసాన్ని వాక్యాలకు వాక్యాలను, కామాలతో సహా కాపీ కొట్టారో కొట్టలేదో నాకైతే తెలియదు! ఈనాడులో వచ్చిన వ్యాసాన్ని, ఈమాటలో వ్యాసాన్ని పోలుస్తూ – ఎక్కడెక్కడ కాపీ కొట్టారో విపులంగా బ్రహ్మానందం గారే వ్రాస్తే, పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది.

    కాపీ కొట్టడం నిజమైతే, అది చాలా విచారించదగ్గ విషయం.

    మరో విషయం –

    త్యాగరాజు మీదో రాగరాజు మీదో రాసినది (non-fiction) మరొకరు వ్రాయడానికి, ‘నేను సైతం’ కవితాపాదాలను (fiction) సుద్దాల అశోక్ తేజ సినిమా పాటలో ఉపయోగించుకోడానికి తేడా లేదా? సుద్దాల ‘నేను సైతం’ పాదాలను తనవిగా ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఆ పాటకు జాతీయ స్థాయి అవార్డ్ వచ్చింది ఈ తరంలోనా…ముందు తరంలోనా, లేక వెనక తరంలోనా? అవార్డ్ ఇచ్చే వాళ్ళకు, ‘నేను సైతం’ పాదాలు అశోక్ తేజవి కావు అని తెలియవా? అవార్డు ఇచ్చే వాళ్ళు అజ్ఞానులైతే, జ్ఞానులు అజ్ఞానులకు తెలియ చెప్పవచ్చు! చెప్పినా వినకపొతే, నిరసన తెలుప వచ్చు. కానీ మనం అదేమీ చేయం. వ్రాసిన కవి పేరు (అందరికీ తెలిసిన పేరే అయినా) చెప్పడానికే గుండెల్లో దడ?!

    (ఒకవేళ)అవార్డు ఇచ్చిన ఈ తరం వీళ్ళకే ఆ పాట లోని పంక్తులు కొన్ని(లేక పల్లవి) శ్రీశ్రీ వి అని తెలియక పోతే, రాబోయే తరాలకు తెలియక పోవడంలో వింతేముంది!

    త్యాగరాజు జీవితాన్నో, అన్నమయ్య జీవన విధానాన్నో వస్తువుగా తీసుకుని పుస్తకం వ్రాయమని పోటి పెడితే – ఆ పోటీకి ఒక వంద పుస్తకాలొస్తే – వంద పుస్తకాల్లో స్పృశించే అంశాల్లో అస్సలు పోలికలు లేకుండా ఉంటాయా? పుస్తకాల్లో వాక్యాల్లో (విభిన్న రచయితలు వ్రాసినవే అయినా) సారూప్యతలు, (కనీసం) అక్కడక్కడ అయినా ఒకే రకమైన వాక్యాలు లేకుండా ఉంటాయా? పోటీలకు పుస్తకాలు పంపిన వందమంది రచయితలు, త్యాగరాజు/అన్నమయ్య మీద బయట లభ్యమయ్యే (mostlty non-fiction) పుస్తకాల్లోంచే (non-fiction)విషయాన్ని సేకరించి వ్రాయాలి కదా. అలాంటి పరిస్థితుల్లో వంద పుస్తకాలు విభిన్నంగా నాపూర్తిగా ఒక దానికి ఒకటి పోలిక లేకుండా ఉండేందుకు ఎంత వరకు అవకాశం ఉంది?

    ఇంకో ప్రశ్న –

    ‘త్యాగరాజుకు ఇరవైమంది శిష్యులు కలరు.’
    ‘అన్నమయ్య పాట పాడాడు.’
    ‘రాముడు మంచి బాలుడు.’
    అన్న పై మూడు వాక్యాలను తెలుగులో ఎన్ని విధాలుగా వ్రాయగలం? ప్రయత్నించి చూడండి!

    – గిరి

  1414. కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి ఉష గారి అభిప్రాయం:

    08/21/2009 1:55 am

    బాబా గారి మాటే నాదీను. సంతోషంగా వుంది యధాలాపంగా ఇటు వచ్చి ఈ శీర్షిక చదవగలిగినందుకు. నా కవితనిక్కడ ప్రస్తావించటం దుస్సాహసమేమో తెలియదు కానీ మీరు చర్చించిన ఆ రెండు కవితలు చదవక మునుపే అసలు వాటి వునికినెరుగక మునుపే నేను వ్రాసుకున్న కవిత “దేవా! కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా,” http://maruvam.blogspot.com/2009/06/blog-post_23.html

  1415. కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి Sowmya గారి అభిప్రాయం:

    07/16/2009 2:54 am

    వ్యాసం ఇంకా పూర్తిగా చదవలేదు కానీ, ఇక్కడ్ “ప్రార్థన”, “దేవుడు” కవితలకి లింకులు లేవు. అంటే, అవి మళ్ళీ ఆ పేజీకే వస్తున్నాయి. దేవుడు కవిత ఉన్నా ప్రార్థన ఈమాటలో ఉందో లేదో నాకు తెలీదు 🙂

    [కవితలకి లింకులు వేరే పేజీకి తీసికెళ్ళవు. కవితలు రెండూ హైస్లయిడ్ పాప్ అప్ విండోలలో తెరుచుకుంటాయి వ్యాసం ఉన్న పేజీలోనే. ఫైర్‌ఫాక్స్ లోనూ ఐ.ఈ. లోనూ ప్రయత్నించాము. లింకులు సరిగ్గానే పని చేస్తున్నాయి. మీరు ఇప్పడికీ చూడలేకపోతే మాకు తెలియజేయండి – సం. ]

  1416. నిద్రిత నగరం వైదేహి ప్రపంచం గురించి Sowmya గారి అభిప్రాయం:

    07/16/2009 2:50 am

    నాకు కూడా ఇందులోని కొన్ని కవితలు చాలా నచ్చాయి… “నిశబ్దం నీకూ నాకు మధ్య” ఐతే ఈమాటలో వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా బోలెడు సార్లు చదివా, చదువుతూనే ఉంటా…అలాగే, కొన్ని కవితలు చదువుతూ ఉంటే, ఎంత హాయిగా అనిపించిందో…అయితే, ఈ సంకలనం మరీ చిన్నది అనిపించింది నాకు….

  1417. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/13/2009 11:17 pm

    ఇక్కడ చర్చ పత్రికల మనుగడ. వెబ్ లో కొనక్కరలేకుండా “అప్పనంగా” దొరుకుతున్నప్పుడు పత్రికల్ని “కొని” ఎవరు చదువుతారని వాపోయిన వారు వేమూరి వారు. “అప్పనంగా” అన్నమాట free అన్న మాటకి దాదాపు సమానార్ధకమే అయినా విశాఖపట్ణం ప్రాంతంలో దాన్ని కాస్త ఉక్రోషంగానూ..కోపప్రకటన లోనూ ఉపయోగిస్తారు. ఈమాట వేమూరి వారు పత్రికల్ని కొని చదివి నిలబెట్టుకోని చందాలు కట్టని పత్రికల కృషిని గుర్తించని తెలుగుల పట్ల కోపప్రకటన గానే వాడేరు. ఆయన బాధ..లేదా కోపం నాకు అర్ధం అవుతాయి కూడా! అవి సమంజసమైనవేనని నేననుకుంటూనే..ఆ కోపానికి అటూ ఇటూ ఉన్న విషయాల్ని కూడా ఈ సందర్భంలో మరోసారి గుర్తు చేసాను. అంతేగానీ పత్రికలు ఇచ్చిన డబ్బుల్తోనే కవులూ రచయితలూ సంసారాలు చేస్తున్నారనీ కాదు. రేపు ఈ పత్రికలన్నీ ఆగిపోతే రాసేవాళ్ళ బతుకులు వీధిన పడిపోతాయనీ కాదు.
    రాసే వారు లేందే..ఏ పత్రిక్కీ మనుగడ లేదు. అలా ఉంటుందని ఎవరైనా అన్నా..అనుకున్నా..అది వట్టి దబాయింపు..బుకాయింపు మాత్రమే!! పత్రికా నిర్వాహకులకందరికీ ఈ సంగతి బాగా తెలుసు. మాకు రచనల్తోనీ..రచయితల్తోనీ అవసరం లేదని ఏ పత్రికల్ వాళ్ళైనా అన గలరా?? అనలేరు. ఏనాడైనా రచయితలు పత్రికల మనుగడకి అంతే అవసరం. అదే రచయితలు[కొత్తకొత్తగా రాస్తున్న వారు తప్ప] డబ్బుల కోసం కాక పోతే పత్రిక్కి పంపనఖ్ఖర లేదు. బెంగాల్ లో రచయితల కోసం రచయితలే little magzines పేర చిన్న కరపత్రాల వంటివి న డిపిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. చాలా పెద్ద కవులు వాటిలోనే తమ కవిత్వాన్ని ప్రచురించారు. పత్రిక స్వభావాన్ని బట్టి దాని ఆశయాన్ని బట్టి..దాన్ని బతికించుకుందికి రచయితలే ముందుకొచ్చారు. ఇంక కొని చందాలు కట్టే పత్రిక ఉద్దేశ్యం బట్టీ..దాని పాఠక వర్గ స్వభావాన్ని బట్టీ అది ఎన్నాళ్ళు న డిచేదీ నిర్ణయమైపోతుంది మరి..
    .రమ.

  1418. హాయిహాయిగా ఆమని సాగే గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    07/13/2009 2:54 pm

    ఇదే సంచికలో (కవిత్వంలో) “ప్రభావం” పైన వ్యాసం చదివిన తరువాత గుర్తుకొచ్చిన విషయం: “పిలువకురా”, “హాయి హాయిగా” పాటల బాణీలు వసంత దేశాయ్
    చేసిన _milan hon kaise_ (“Dhuaan”, 1953), అనీల్ బిశ్వాస్ చేసిన _ritu aaya, ritu jaaya_ (“Hamdard” 1953) పాటలకు అనుసరణలని విమర్శలొచ్చాయి. వాటిలో ఎంత నిజముందో చెప్పనక్కర్లేదు.

    ఆదినారాయణరావు సంగీత శాస్త్ర పరిజ్ఞానం గురిచి చాలా గొప్పగా చెప్తారు. Posthumousగా ఆయన సంగీతంపైన రాసిన పుస్తకమొకటి ప్రచురితమయ్యింది. కానీ పుస్తకాల షాపుల్లో యెక్కడా దొరకదు. కేవలం పుట్టపర్తి బాబాగారి ప్రాంగణలో మాత్రమే దొరుకుతుందని వార్త.

    ఆదినారాయణరావు గురించి కొంత సమాచారం: http://www.bhaavana.net/ghantasala/0202.html
    [పైన లింకులో ఒక చిన్న తప్పు దొర్లింది. “శాంతవంటి పిల్ల లేదోయి” పాట పాడింది ఘంటసాల. పిఠాపురం కాదు.]

    — శ్రీనివాస్

  1419. కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    07/09/2009 12:24 pm

    మంచి వ్యాసం, ఏన్నో విషయాలను తెలియజేసారు.

    ఒక్క మాట, వ్యాసం ఉద్దేశానికి సంబంధించింది కాబట్టి ప్రస్తావించడం.

    “ఒక కవి పెద్ద కవో, చిన్న కవో నిర్ణయించడానికి సాహిత్య విమర్శ పరిభాషలో ఏర్పడిన లాంఛనాల కోవలోకే వస్తాయి- స్వతంత్ర రచన, ప్రభావం, అనుకరణ, అనువాదం, కాపీ, ఫోర్జరీ- ఇలాంటి మాటలన్నీ” అని అన్నారు. విమర్శలు కవిత గొప్పదో చిన్నదో అనే కాని, రాసింది పెద్ద కవో, చిన్న కవో అని కాదనుకుంటాను. అవార్డులు, పురస్కారాలు ఫలానా కవితకు, కథకు, నవలకు ఇస్తున్నామనే చెప్పుకుంటాం, ప్రకటించుకుంటాం కదా, వ్యక్తికి ఇచ్చినప్పటికినీ.

    “‘ప్రభావం’ అంటే కవిత్వానికి సంబంధించినంత వరకూ ఉపయోగపడే అర్థం” అన్నది కవిత్వానికే కాక జీవితానికి కూడా వర్తించే మంచి మాట.
    ===========
    విధేయుడు
    -Srinivas

  1420. పడమట సంధ్యారాగం గురించి Kiran గారి అభిప్రాయం:

    07/08/2009 8:55 am

    ఇలాంటి కథల కన్నా పొడుపు కథలు బెటరు. వచన కవిత్వం పేరుతో, కథల పేరుతో గాలి రాయడం పెద్ద ఫేషనైపోయింది, “హింట్లు చూసి కథ రాయుము”, “బొమ్మ చూసి కథ రాయుము” టైపులో సగం కక్కిన భోజనం లాంటి కవితలూ, కథలూ పత్రికల్లో చెలామణీ చెయ్యడం చూస్తే పాఠకుల్ని ఎంత వెర్రోళ్ళనుకుంటారో కదా ఈ రచైతలు అనిపిస్తుంది.

    సాఫ్ట్ వేర్లు డెవలప్ చేసేటప్పుడు User Friendly Interfaces కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉపయోగించేవాడికి అర్థం కాకపోతే ఎంత గొప్ప సాఫ్ట్ వేర్ అయినా చెత్తకిందే లెక్క. ఒక్క ఈ అతితెలివి రచయితలే End Users ని లోకువ సరుకుగా లెక్కగడతారు. అందుకే సాహిత్యం అంతరించిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అతి తెలివిగా రాసే కథలూ, కవితలూ రాసినవాళ్ళే చదూకుని మిగతా జనాభా అంతా వెర్రోళ్లనుకుని తృప్తి పడుతూ బతుకుతారు.

  1421. కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    07/03/2009 11:13 pm

    ప్రభావం, అనుసరణ, అనుకరణ అనేవి ఏ మాత్రం తప్పు కాదు. మీ ఈ అభిప్రాయం సరైనదని నేను భావిస్తున్నాను. కవిత్వమే కాదు ఏ శాస్త్ర పురోగతి కైనా ఇవి అత్యంత ఆవశ్యకాలు. ముందు తరాల వారి విజయ రహస్యాలను ఆకళించుకొంటూ, వారి విజ్ఞానాన్ని మనది చేసుకొని దానిని మన తెలివితేటలతో ఇంకొంచెం ఉద్దీపనం చేయడమే పురోగమనం. మీ రిచ్చిన ఉదాహరణలోని రేవతీ దేవి గారు తిలక్ మహాశయుని కవితను చదివిన తరువాతనే తమ కవితను వ్రాసారనుకోండి. అప్పుడు ఆమె తన దైన శైలిలో దానిలోని భావ ప్రకటనా విధానాన్ని ఇంకా మెరుగు పరచారేమో ఆలోచించండి. మెరుగు కాదని కొందరనుకున్నా ఆమెకూ ఆమె లాంటి మరికొంతమందికి అది మెరుగైనదే అని అనిపించవచ్చుగా. అప్పుడు ఆమె తిలక్ మహాశయునితో సమానమైన లేదా మెరుగైన కవయిత్రి అని ఒప్పుకోవలసి వుంటుంది. కాలమొక్కటే ఇటువంటి సందిగ్ధతలను నివారిస్తుంది.

    భవదీయుడు

  1422. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Subbarao Nanduri గారి అభిప్రాయం:

    07/03/2009 6:46 am

    వాక్యం రసాత్మకం కావ్యం అని నాకు తెలుసు. నిజంగానే అలాంటి వాక్యాల కోసం జీవితకాలం ఎదురుచూడాల్సిరావడం, ఒక నూక గింజకోసం బుట్టెడు ఊకను తినాల్సిరావడం ఇబ్బంది కాదూ?
    కవి కష్టపడి కవిత్వం వ్రాయడం ఎందుకు? సరే కవులకూ , రచయితలకూ కూడా “ప్రసవ వేదన” ఉంటుందని ఒప్పుకుందాం. కానీ అంతవేదనా తన భావాలు పాఠకుడి హృదయానికి హత్తుకొనేలా చెప్పడానికే గానీ పాఠకుడి మేథస్సుకు ప్రహేళికలివ్వడానికి కాదు గదా? మనం కవిత్వం చదవాలంటే దానికి తగ్గ మానసిక నేపథ్యాన్ని సిద్ధం చేసుకొని ఉండాలా? ఇవన్నీ కవులకే ప్రయోజనం కలిగించే ప్రశ్నలు. వీటికి సహేతుకమైన సమాధానం వెతకగలితే కవిత్వం పూర్వవైభవము సంతరించుకుంటుంది. అలా కానప్పుడూ చివరకు నానీలే బదుకుతాయి. అసలు ఆ రకంగా చూస్తే సామెతలకన్నా మంచి కవితా వాక్యాలు దొరకవేమో.

    [ఈ అభిప్రాయంపై వచ్చిన సాటి పాఠకుల అభిప్రాయాలు చర్చావేదికలోకి మార్చాము – సం.]

  1423. కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:

    07/03/2009 6:27 am

    ఈ వ్యాసంద్వారా కవిత్వాన్ని బహిరంగ, అంతరంగ కవిత్వాలు అని రెండు రకాలుగా విభజించవచ్చని తెలుసుకొన్నాను.
    కవిత్వంలోని టోన్ సన్నగా, బిగ్గరగా ఎలా ఉంటుందో చక్కటి ఉదాహరణనిచ్చారు.
    ధన్యవాదములు.
    బొల్లోజుబాబా

  1424. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి yasasvi గారి అభిప్రాయం:

    07/03/2009 6:21 am

    కవిత్వంలో”తర్కం” వెతికే పాఠకుడున్నందుకు ఆశ్చర్యపడ్డాను. కవిత్వం గురించి తెలియదని ఒప్పుకున్నారు గనక కానీలెమ్మనుకున్నాను.
    యశస్వి.

  1425. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:

    07/02/2009 8:41 pm

    కొన్ని వాక్యాలు ఆలోచనల్ని గాలనం చేస్తాయి. జీవితాన్ని వెంటాడతాయి. ఒక వాక్యం కోసం ఓ జీవితకాలం ఎదురుచూస్తే తప్పేమిటీ అని భూషణ్ గారు ఒకసారి ప్రశ్నించారు. కవి ఎంతో కొంత కష్టపడి వ్రాస్తున్నప్పుడు చదువరి దానిని అర్ధం చేసుకోవటానికి శ్రమిస్తే తప్పేమిటి అని అలోక్ గారు అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ వ్రాసిన ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం అన్న వాక్యం నేను మొదటిసారిగా చదివి ఇరవైఏళ్లు అవుతున్నా ఇంకా అది తడితడిగానే తగుల్తూంటుంది.

    అఫ్సర్ గారు వ్రాసిన ఈ కవితలో ఒక జీవితం ఉంది. ఒక అనుభవం ఉంది. హృదయాన్ని కుదిపేసిన ఒక ఉప్పెన ఉంది. మరణం భౌతికమైనదే కాకపోవచ్చుగా.

    ఇంకా

    వెర్రిపాటలు పాడుకొంటూ చీకటిని దాటివేయగల తెంపరితనమూ
    చిరునవ్వులు మధ్యలో తెగిపోవటాలు ఇంకా అనుభవంలోకి రాని పసితనం ఉంది.
    చిన్న చీకట్లు పెద్దమరణాలు ఎలా అవుతాయో తెలీనితనం ఉంది.
    ఉలిక్కిపడి నిద్రలోంచి చీకట్లోకి తెగిపడ్డం ఈ కల్లోల జీవనం మనకిచ్చే “బహుమానం”.
    బహుసా తడికలిగినవారికే అది అనుభవమౌతుందేమో.

    బొల్లోజు బాబా

  1426. పట్టుకో పట్టుకో గురించి hrk గారి అభిప్రాయం:

    07/02/2009 7:20 am

    గాలా బాగుంది కవిత, పోగొట్టుకున్న బాల్యంలో కొంచెం తెచ్చి ఇచ్చినట్టుగా, హాయిగా.
    -హెచ్చార్కె.

  1427. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Subbarao Nanduri గారి అభిప్రాయం:

    07/02/2009 6:59 am

    అఫ్సర్ గారికి,
    అభినందనలు. మీ కవితలో పదప్రయోగం, భావగాఢత బాగుంది. కానీ తర్కం ఏదీ? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వ్రాశారు. ఎవరితో? మీ నాన్నతోనా? పాఠకుడితోనా? మీలో మీరే మాట్లాడుకుటున్నారా? నేను ఆధునిక కవిత్వం చదవను. ఇప్పటి ట్రెండ్ ఇదేనేమో నాకు తెలియదు. విప్పి చెబితే వచనం. కప్పి చెపితే కవిత్వం ఇంతేనా తేడా?
    శ్రీశ్రీ, దేవులపల్లి, కుందుర్తి, తిలక్ , నండూరి, వీళ్ళందరి కవితలూ సూటిగా, తర్కబద్దంగానే ఉంటాయి కదా? తర్కం లేకుండా కేవలం పదాల పోహళింపుతో, భావగాఢతతో కవిత బతకదేమో? ఇప్పటి కవితలు పాఠకుల హృదయాల్లో నిలబడటం లేదేమో? ఇదంతా మీరూ మిగతా కవులూ ఆలోచించాల్సిన విషయం. నేను కవిని కాను కనుక నాకు అన్నీ సందేహాలేగానీ వాటిని పరిష్కరించగల సామర్ద్యం లేదు.
    మరోసారి అభినందనలతో,
    నండూరి వెంకట సుబ్బారావు.

  1428. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Pasunoori Ravinder గారి అభిప్రాయం:

    07/02/2009 5:34 am

    “చీకటి వంతెన
    దిగులు పొలాలు
    ఖాళీ ఆకాశాలు”
    వెనక్కి తిరిగి చూసుకునే గడియలే నిజంగా బతికిన క్షణాలు
    అక్షరాల్లో బ్రతుకును చూపించడం అందరి వల్ల కాదు.
    అందుకేనేమో కవిత్వానికి, కన్నీళ్ళకి దగ్గరి సంబంధం ఉందనిపిస్తది.
    ఓ మంచి కవితను చదివే అవకాశాన్ని కల్పించిన అఫ్సర్ గారికి అభినందనలు

  1429. పట్టుకో పట్టుకో గురించి yasasvi గారి అభిప్రాయం:

    07/01/2009 9:06 pm

    భావుకత కరవైపోతోన్న ఇవాళ్టి కాలంలో ఇంద్రాణి గారి కవిత ఆహ్లాదంగా
    అన్పించింది. రోజూ మన చుట్టూ ఉండే చిన్న చిన్న అందాలని గమనించలేని
    వేగపు బతుకైపోయి ఎవరైనా ‘పట్టుకో పట్టుకో” అని వెనకబడమంటూ..ఊరించే దృశ్యాలని చూపిస్తే “హమ్మయ్య” అని జీవించటానికి
    ఇంత నమ్మకం కలగదూ!! అంత నమ్మకాన్నిచ్చింది ఈ కవిత. ఆమెకు అభినందనలు.

    యశస్వి.

  1430. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Seshagiri Rao Devaguptapu గారి అభిప్రాయం:

    07/01/2009 3:00 pm

    చాలా బాగుంది మీ కవిత. హృదయ బాధ అనుభవించితె గానీ రాదిటు వంటి కవిత. భాదల మీద అభిప్రాయం చె ప్ప గ ల ధై ర్యం లే దు లే దు నాకు లే దు

    శేషగిరి రావు.

  1431. పట్టుకో పట్టుకో గురించి obul reddy గారి అభిప్రాయం:

    07/01/2009 9:42 am

    కవితలో పదహారణాల భావుకత.. చక్కటి కవిత ..అభినందనలు !

  1432. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    06/26/2009 11:07 pm

    ప్రాచీనాద్యతన కవితా గుణ వ్యాసావలంబమై సహితానేక సాహిత్య చతుర విశ్లేషణా కదంబమైన మీ వ్యాసం చాలా బాగున్నది. ధన్యవాదాలు అభివందనలు కొన్నిపదాల/భావాల పరిభాషలు కొత్తగా తెలుసుకొని కొంచెం విశాలమైన దృక్పధాన్ని ఏర్పరచుకోడానికి తోడ్పడే మీ కృషి అభినందనీయం.

    మరొక్కమారుకృతజ్ఞతలతో

    భవదీయుడు

  1433. నౌషాద్‌ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    06/16/2009 11:07 pm

    అయ్యా! శ్రీమదిత్యాది శ్రీమాన్ రోహిణీ ప్రసాద్ ఆచార్యుల వారూ!
    అది ఇది అని పేరు పెట్టి చెప్పవలసిన పని లేకుండా మీరు వ్రాసిన అన్ని వ్యాసాలు అమూలాగ్రం ఉత్కంఠ భరిత సమాచారాలతోనూ స్ఫూర్తిదాయక మైన అనేక విషయాలతో సుసంపన్నమై ఉంటున్నాయి. వయం ధన్యాః వయం ధన్యాః వయం ధన్యాః మహీతలే, రోహిణీ వల్లభో యేషాం సంగీత పధ దర్శకః.

    ఏదో సంగీతం గురించిన ఒకటి రెండు విషయాలు తెలుసుకుందామని యాధాలాపంగా ఒక వ్యాసం చదివిన తరువాత మీ తక్కిన వ్యాసాలు చదవకుండా ఉండలేకపోతున్నాను. దిశా నిర్దేశన మాత్రమే కాక దిగ్గజాల ప్రదర్శన కూడా మాలాంటి వారికై చేస్తున్న మీ కృషి ప్రశంసనీయం.

    ఎందర జూపెనేని వరియింపదు మా కవితా కుమారి – మీ పేరు విని ఉరకలు వేసి వస్తుంది చిత్తగించండి

    ఇది హృద్యం బనవద్య మాఢ్య మిది యెంతే ప్రీతి పాత్రంబటం
    చెది గైకొన్నను తోప జేసెడి తవానేకామలోదార జ్ఞా
    నద వ్యాసావళి భారతీ చరణ ద్వంద్వ ప్రాప్త పుష్పౌఘమై
    కదలించున్ రస భావ కందళిత హృత్కంజాత పుంజంబులన్

    ఇరువది ఏడు తారలను యింపుగ పెండిలి యాడి “రోహిణీ”
    తరుణి “ప్రసాద” బుద్ధి జని తక్కిన వారి ననాదరించు యా
    కొరత “సితార వల్లభత” కొంచెము సేసిన రోహిణీ ప్రసా
    దురుతర శేముషీ విభవ మూర్జితమై చెలువొందు గావుతన్

    అయ్యా! మాకుమరికొన్ని రాగాల పరిచయ భిక్ష ప్రసాదించండి.

    భవదీయుడు

  1434. నిశ్శబ్దం గురించి Mr.Suneeth గారి అభిప్రాయం:

    06/12/2009 3:52 am

    కవిత్వంలో శబ్దం, శిల్పం రెండు ముఖ్యమే. పచ్చిగా రాస్తే అది depth వున్న కవిత్వం అని కొద్ది మంది పెద్దవాళ్ళ కవిత్వమం చదివితే కలిగే తొందరపాటు నిర్ణయం. “Poetry is the economy of words” అన్నడు చలమ్. నాకు తెలిసి propriety of words is THE fundamental. ఖడ్గం సినిమాలొ “నువ్వు నువ్వు” పాట్లొ “మెత్తని ముల్లై గిల్లె తొలి చినుకె నువ్వు” అని రాసాడు కవి. అదే విషయాన్ని పచ్చిగా రాస్తే చదవడానికి నోరు రాదు. కవిలో మర్యాదస్థున్ని చదవాలి, కవిత్వం అబ్బిన వాడికి మర్యాద అబ్బకపొదు.

    I am sure it is just a slight perversion before the perfection and you CAN write better than what you did. So రవికిరణ్ గారూ Best of luck !!

  1435. ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి” గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    06/12/2009 12:18 am

    అత్యద్భుతం గురువు గారూ, మీ ఈ పరిశ్రమ సుశ్లాఘ్యం, సర్వ రసజ్ఞ జనమనో రంజకం. ఆపాత మధురమైన సంగీతం గొప్పదా లేక జీవితాంతం ఆలోచించినంత కొలది ఊట చెలమలాగా రసానందం సృజించే శాశ్వతానంద దాయకమైన సాహిత్యం గొప్పదా అని వివాదం కలిగించేలా ఘంటసాలగారు=కరుణశ్రీ గారు స్వర పరచి పాడిన=రచించిన కుంతీ కుమారి అద్భుతంగా జోడించి మాకందించారు. మీ ఈ కృషికి ఈమాట రసజ్ఞ హృదయులైన పాఠకులంతా ఋణపడిఉంటారు.

    ఇది పద్యం బిదియే కవిత్వ మిదెపో ఇంపైన సాహిత్య మం
    చిది గాన మ్మిదియే రస మ్మిదియపో ఇంపైన సంగీత మం
    చెద తా భావ రసాద్భుతామర ఝరీ హేలా విలోలార్భటీ
    విదితానంద మరందమై చెలగె సంప్రేహ్యేంద్రియారామమై

    మరొక్కమారు దశ సహస్ర శత కోటి అభివందనలతో

    భవదీయుడు

  1436. స్త్రీ పర్వంలో గాంధారి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    06/08/2009 9:32 pm

    ఎప్పటిలాగానే, మంచి పుస్తకాన్ని భద్రిరాజుగారి వ్యాసవిశేషాలగురించి తెలిపినందుకు హనుమగారికి కృతజ్ఞతలు.

    పండితులుచేసే వ్యాఖ్యానాలగురించి ఒక్క మాట. భాషలో నుడికారాలు, సమాసాల సొగసులు, ఉక్తివైచిత్రి వగైరాల గురించి ఎంత చెప్పినా, అసలు చెప్పాల్సినదేదో ఎందుకో వదిలేసిన భావం, కొరత. అంటే వాటి ప్రాముఖ్యతను కాదనడం కాదు. కానీ అవన్నీ వాటికవే సొంతంగా ఎంతవరకు సాధారణ పాఠకులను పుస్తకానికి దగ్గరచేస్తాయి అని, అసలు అవేనా తిక్కన కవిత్వం అంత సొగసుగా అందిస్తున్నది అని కూడా అనిపిస్తుంది.

    నెత్తిమీదున్న బతుకు బరువుకు, ప్రస్తుత పరిస్థితులకు తిక్కన రచన ద్వారా ఏమైనా లబ్ధిపడే అవగాహన, నిశితమయ్యే దృక్కు, స్పష్టతనిచ్చే అభివ్యక్తి లాంటివి కొంతైనా, ఎంతైనా, వడలి మందేశ్వరరావు, జీ.వి.సుబ్రహ్మణ్యం గార్ల వలె అందించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఆ demand ఎప్పుడూ ఉంటుందని కూడా అనిపిస్తుంది. అట్లా కాకుండా వొట్టి పాండిత్య ప్రకర్షగా, భాషాశాస్త్రం, పద సంపద వివరించడం, వ్యాకరణ అంశాలతో
    వూదరగొట్టడం- రుచికర ఆహారపదార్థాలను scientists వాటి పుట్టుపూర్వోత్తరాలు, చెట్ల పేర్లు, వాటి రసాయనాలు, అవి జీర్ణించబడడానికయ్యే reactions- మొత్తం వాళ్ళకు తెలిసిన శాస్త్రమంతా పేజీలలో గుమ్మరించినట్లుంటుందేమో అని అనుమానం. తీరా ఇదంతా మనకు రుచి, బలం ఇచ్చే ఆహారం గురించే(నా) అన్నది కూడా మరిచిపోయేటట్లు చెప్తారేమోనని కూడా భయం! కుయ్యోమంటున్న పాఠకులను చూసి అయ్యో ఇంత పాండిత్యంతో రాసిన వ్యాఖ్యానాలు చదువుకొ(న)డం లేదని వాపోవడం కూడా అతిశయోక్తి కాదేమో అని కూడా అనిపిస్తుంది.
    ———-
    విధేయుడు
    _Srinivas

  1437. స్త్రీ పర్వంలో గాంధారి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    06/06/2009 10:11 pm

    “తిక్కన పదసంపద”

    “ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన యాచేయి దొలుతగాఁ బోరిలో దుస్ససేను
    తనువింత లింతలు దునియలై చెదరి రూపఱియున్నఁ గని యుడుకాఱుఁగాక!
    యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది;”

    అని చదివితే, అబ్బ! ద్రౌపది కసి ఏం కసి, అనిపించింది. చిన్న చిన్న తెలుగు మాటలతో తిక్కన లెక్కలేనన్ని కొత్త కొత్త సమాసాలూ నుడికారాలూ మన భాషకి చేర్చాడట . ‘నెత్తురు మడువు’, ”కయ్యపునేల’, ‘మెత్తనిపులి’, ‘పెట్టనికోట’, ‘గుండెకాయ’, ‘చెలియలికట్ట’, ‘చిందరవందర’, ‘తేనె పూసిన కత్తి”, ఇలా అనంతం – అని భద్రిరాజు గారి వ్యాసంలో [1] చదివాను. తిక్కన కవితా శిల్పంలో సొగసులు చూడాలంటే, దగ్గరికిపోయి నిలకడతో చూడాలన్నారు. దానికి నాకింకాస్త తీరిక దొరకాలి.

    ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి వ్యాఖ్యానాల అవసరం ఉంది కాని దాని గురించి కేవలం చదువుకున్న వాళ్ళు ఆలోచించి చేసేదేముంది? వాటిమీద పండితులు పని చెయ్యాలి. అందుకు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు సాయం చెయ్యాలి. “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు…”

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] భద్రిరాజు కృష్ణమూర్తి “భాష, సమాజం, సంస్కృతి”, పుస్తకంలో “తిక్కన పదసంపద” అన్న వ్యాసం.

  1438. వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    06/01/2009 10:14 pm

    మొన్న ఆదివారం నాడు పుణె లో ప్రసిధ్ధ ఆంగ్ల కవయిత్రి కమలాదాస్ తన 75వ ఏట [చిన్న కుమారుని ఇంట్లో] తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆమె రాసిన అనేక కవితలు చాలా ప్రఖ్యాతినందినవి. ఆమె మాధవికుట్టి పేరుతో మళయాళంలో కధలు రాసేరు. ఆమె ఆత్మకధ my story చాలా సంచలనం రేపింది. వ్యక్తిగతంగా సూటిగా..సున్నిత స్వభావిగా ఉండే కమలాదాస్ జీవితం చివరి దశకంలో ఇస్లాం స్వీకరించి కమలా సురయ్యా గా పేరు మార్చుకున్నారు. ఆమె మళయాళీ నాయర్ కుటుంబంలో హిందువుగా పుట్టి..కృష్ణ భక్తురాలిగా గడిపి..చివర్లో ముస్లింగా మారటం..కేరళ సమాజాన్ని విభ్రాంతి పరిచింది. తన రచనల ద్వారానూ..తన జీవితం ద్వారానూ కమలాదాస్ ఒక రెబెల్ గానే చివరిదాకా కొనసాగారు. ఆమెని భారతీయులెందరో స్త్రీ మనోకామనల్ని ఎటువంటి సంకోచమూ లేకుండా వ్యక్తీకరించిన తొలి indian modern poetess గా గుర్తుపెట్టుకుంటారు.

    రమ.

  1439. పాటల్లో లయవిన్యాసాలు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/26/2009 11:27 pm

    మోహన గారికి

    ఒకే గురులఘువుల అమరికతో వేరువేరు గతులలో రాయడానికి
    వీలవుతుందని ఛందస్సు రచ్చబండ వేదికలపైన ఎన్నో ఉదాహరణలతో
    నేను నిరూపించిన సంగతి కొందరికి గుర్తు ఉందనుకొంటాను. ఇది
    కూడా ఒక చిత్రకవిత్వమే.

    దయచేసి మీరు పై విషయంపై వ్రాసిన వ్యాసం (వ్యాసాలు) అందజేయగలరా?
    లేదా వాటిని నేనెక్కడ (అంతర్జాలంలో) పొందగలనో తెలియజేయండి.

    భవదీయుడు

  1440. పాటల్లో లయవిన్యాసాలు గురించి mOhana గారి అభిప్రాయం:

    05/26/2009 11:01 am

    తాళం గురించి చదివిన తరువాత రెండు విషయాలు జ్ఞాపకానికి వచ్చాయి.

    1. పురందరదాసు కింది కీర్తన –
    తంబూరి మీటిదవ భవాబ్ధి దాటిదవ
    తాళవ తట్టిదవ సురరొళు సేరిదవ
    గెజ్జెయ కట్టిదవ ఖలరెదె మెట్టిదవ
    గాయన పాడిదవ హరి మూర్తి నోడిదవ
    విఠలన నోడిదవ వైకుంఠ సేరిదవ
    (తంబురాను మీటినవాడు భవాబ్ధిని దాటినవాడు,
    తాళాన్ని వేసినవాడు సురులలో చేరినవాడు,
    అందెలను ధరించినవాడు దుష్టులను అంతము చేసినవాడు,
    గానాన్ని పాడినవాడు హరిమూర్తిని చూచినవాడు,
    విఠలుని చూచినవాడు వైకుంఠాన్ని చేరినవాడు)

    2. హంసగీతె చిత్రంలో శిష్యుడు గురువుతో శ్యామశాస్త్రి పాటను
    మరొక తాళంలో పాడటానికి వీలవుతుంది అని నిరూపించాడు.
    గురువు ఓటమిని అంగీకరించి ఆత్మహత్య చేసికొంటాడు.

    ఒకే గురులఘువుల అమరికతో వేరువేరు గతులలో రాయడానికి
    వీలవుతుందని ఛందస్సు రచ్చబండ వేదికలపైన ఎన్నో ఉదాహరణలతో
    నేను నిరూపించిన సంగతి కొందరికి గుర్తు ఉందనుకొంటాను. ఇది
    కూడా ఒక చిత్రకవిత్వమే.

    ((పగలే వెన్నెల చరణం నింగి పైన చందమామ … మాత్రలు త్ర్యస్ర గతియే)

    విధేయుడు – మోహన

  1441. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి రాకేశ్వర రావు గారి అభిప్రాయం:

    05/20/2009 9:18 am

    ఈ వ్యాసం మీరు ఒక ఏఁడాది ముందు వేసుంటే, నా తరఫునుండి మీకు ఒక బాణం మినహాయింపుగలిగేది. నేను ఈ-మాటకు పంపేముందు ‘దాన్ని’ ఇద్దరు బుల్లి సంపాదకులకు పంపాను. వారిదగ్గర ఈ చిట్కాల చిట్టా లేక పాపం కాదనలేకపోయారు. నా కవిత ఎంత సక్సో (ఈ పదప్రయోగం తప్పుటకాలేదు, దాని వలన అశ్లీల పాళ్ళు పెరగకుండ ప్రార్థన ) నాకు తరువాత తెలిసిందనుకోండి. స్నేహితుల్ని సంపాదకులుగా పెట్టుకోకూడదన్నమట :). ఇలా పలు సార్లు పలు చోట్ల యాచాయాచితాలుగా జరిగిందనుకోండి. అయినా నేర్చుకునేవయస్సుగా, పర్వాలేదు.

    చాలా ధైర్యం కావాలి ఒక పూర్తి స్థాయి ఈ-పత్రికకు ఇలాంటి వ్యాసం ప్రచురించడానికి. ఇలాంటివి సాధారణంగా నాలాంటి విప్లవాత్మక బ్లాగర్ల బ్లాగుల్లో కనిపిస్తుంటాయి. అక్కడుకూడా వెటకారమాడినప్పుడు జనులు గర్హించేవారు. అతిథి దేవోభవః అన్నట్టు రచయితదేవోభవః అని ఏదైనా సూక్తి పాటిస్తాయేమో ఈ పత్రికలు అనుకుంటే పప్పులో కాలేసినట్టేనన్నమట.

    ఏదీ ఏమైనా ‘కొన్ని’ మంచి ఆచరణీయ సూక్తులు చెప్పారు. యాచిత రచయితల అహాల గుఱించి సగటు పాఠకునికి పెద్ద పట్టింపు లేకపోయినా, రచనల గుఱించి చేసిన సూక్తులు ఆచరణీయములుగా బాగున్నాయి (పునరుక్తి వ్యాఖ్యలకు వర్తించదుగదా కంపఁదీసి). కానీ మీరు FYEO అని మీ మామూలు సంపాదకులుకుఁ జెప్పి మఱీ ఈ ఉత్తరం వ్రాసారు కాబట్టి రచయితల వ్యక్తిత్వాల గుఱించి వ్రాయడం సబబే. కానీ అలా ఎప్వైవోయూ అని చెప్పినా ఎవరో లీకు చేసారంటే, అలాంటి వారికోసం లీకు చేయకూడదంటూ ఇంకో ఎప్వైవోయీ ఉత్తరం వ్రాయవచ్చు. అది లీకైతేనో ???

    పునరుక్తి గుఱించి ఒక్క మాట, పైన మోహన గారు, శ్రీనివాసు గారు ప్రస్తావించే పునరుక్తి మీ పునరుక్తి వేఱు వేఱు (మళ్ళీ మళ్ళీ క్షమించగలరు) అనుకుంట. వారు ప్రస్తావించింది అచ్చమైన పునరుక్తి, మీరు ప్రస్తావించింది అదే భావనను పునరుక్తి చేయడం అనుకుంట. ఉదా- నేను ఎప్పుడో వ్రాసిన కాపలాదారు కవితలో అచ్చపునరుక్తి లేకపోయినా, ఒక విషయాన్ని మరలా మరలా (యఱ్ఱ్.. మరలా మరలా క్షమించగలరు) చెప్పినందుకు, పునరుక్తి వచ్చింది రాకేశ్వర తస్మాజ్జాగ్రత్త అని గురువులు హెచ్చిరించడం జరిగింది.

    కొసమెఱుపు – ఒక సారి నాతోనొక సదరు బుల్లి సంపాదకులు (‘ఒక సదరు’ తప్పైతే క్షంతవ్యుడను) చెప్పారు, “పెట్టుబడిదారువ్యవస్థ వచ్చింతరువాత ఎవరైనా వ్యవస్థాపకులే, బ్లాగులు వచ్చింతరువాత ఎవరైనా రచయితలేనని”. ఎంత నిజం.

    మీరాకేశ్వర.
    త.క- పాఠక దేవులకు సైతం సూచనలనమట. లెస్స లెస్స.

  1442. రెండో పాత్ర గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/15/2009 11:50 pm

    చాలా బాగుంది. వచన కవితలు కూడా వాటిని అణుమాత్రమూ ఇష్టపడని అరసికుల మనసులను అలరింపచేయగలవని ఇటువంటి కొన్ని కవితలు ఋజువు చేస్తాయి.

    భవదీయుడు

  1443. రెండో పాత్ర గురించి rajeswari poluri గారి అభిప్రాయం:

    05/15/2009 1:31 am

    కవిత ప్రతి తల్లి అనుభవాలకు, మనొభావాలకూ అద్దము లాగ ఉన్నది.

  1444. రెండో పాత్ర గురించి T V KALIDAS గారి అభిప్రాయం:

    05/14/2009 9:13 am

    కవిత తన వెంట చదువరి పాకేలాగా చేసుకుంది. చివరిన పరిమళించింది అని ఉండాలేమో కదా ?

  1445. రెండో పాత్ర గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:

    05/13/2009 3:54 pm

    కొన్నేళ్ళ క్రితం చదివిన కవిత. ఎప్పటికీ గుర్తు వుంటుంది. అంత అద్భుతంగా వుంది.

  1446. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/12/2009 11:15 am

    పొరపాటుగానే అయినా ఒక ముఖ్య విషయం ప్రస్తావనకు రావటం మంచిదే అయింది. అది “సంపాదన”.గురించి. లోకం మొత్తంమీద తన శ్రమకి తగిన “కూలి” ఏ కోశానా.. గిట్టనిది ఒక్క తెలుగు రచయితకే… అన్న ది జగద్విదితం!! తెలుగుదేశంలోని పత్రికల్లో మంచి కవితకీ.. కాని కవితకీ కూడా ఒకటే రేటు. మీరు ఎంత గొప్ప కవితనైనా రాయండీ..మీకు వారిచ్చేది..ఒక 150రూపాయలు మాత్రమే!! గొప్పవ్యాసం రాసినా అంతే పారితోషికం.!! మరి ఇది రచయిత బుధ్ధి పరిశ్రమని కారుచౌకగా దోచుకోవటమే కదా? ఈమాట లో అచ్చయ్యే వాటికి “అంతర్జాతీయ ప్రమాణాల”కి ధీటుగానే ధర చెల్లిస్తారేమో..నాకు తెలీదు మరి.

    నా ఉద్దేశ్యంలొ మంచి రచనలు రావాలంటే మంచి పారితోషికం చాలా ముఖ్యం. అక్కడ మార్పు లేకుండా..ఏమీ కిమ్మనకుండా.. “పెద్ద రచయితలు” రాయడంలేదని ఊరికే వగచినా..అనవసరంగా రచనలు పంపని వారిని ఆడిపోసుకున్నా… లాభం ఏముంటుందీ??

    రచనలు కావాలీ..కానీ వారి అక్షరానికి కిట్టుబాటు ధర కల్పించం..అన్న వైఖరి అయాచితంగా రచయితల కల్పనాశక్తిని దోచుకోవటమే అవుతుంది. అందుకే పత్రికలకి అరుదుగా తప్ప చెప్పుకోదగ్గ రచనలు రానిది.ఈపాటి భాగ్యానికి వచ్చిన రాతల్తో సరిపెట్టుకుని నడుపుకోవటమే పత్రికని. అందుట్లో పస లేదని అనుకున్నా ఫలితమేముందీ?? ఊరికే వచ్చింది ఉత్తమం కాదా?!ఆలోచించండి.

    రమ.

    [విస్తృత చర్చకు వీలుగా ఈ అభిప్రాయం చర్చావేదికలో కూడా వుంచబడింది.]

  1447. రామన్న గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    05/08/2009 11:22 am

    వినీల్,

    అద్భుతంగా వుంది. ఎందుకు బాగుంది, ఏవి బాగుంది అనే తర్కం కూడా రానంతగా మనసునంతా ఆవహిస్తుంది నీ కవిత. మసకబారిపోయిన గుర్తులేవో ఉలిక్కిపడి లేచి కూర్చొనేలా.. .

    రవి

  1448. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/05/2009 10:21 am

    అయ్యా ముఖ్య సంపాదకుల వారూ..!!
    మీకూ..మీ స హ..లేదా ఉప సంపాదకులకు మరో సులువు చెప్పాలని అన్పించింది. మీరెటూ సున్నిత మనస్కులు అయివుండరు గనక, కాస్త నిశ్చింత గానే చెబుతున్నాను. అదేమంటే..అసలు ఇన్ని సూచనలిస్తూ.. కత్తిరిస్తూ..ఇలాంటి అవస్థలన్ని పడేకన్నా..ఆ కధలూ..కవితలూ..వ్యాసాలూ..వాక్యాలూ..మీరే రాసేసుకుంటే పోలా??

    మీకు ఇతరుల రచనల్ని సంస్కరింఛే శ్రమ తప్పుతుంది. పాఠకులకి మీ శత..స హస్ర నిషేధాల బరువూ తప్పుతుంది. పెద్ద రచయితలు మీకు రాయరు. ఔత్సాహికులని మీరు రాయనిచ్చేలా లేరు. చూడబోతే..మీరు కవులకెల్ల కవి లాగానూ..విమర్శకులకెల్ల… విమర్శకులుగానూ..పాఠకులని మించిన పాఠకుని గానూ కన్పిస్తున్నందున..మీ పత్రికని మీ సూచనల మేరకు మీరే బాగా నడుపుకోగలరు.

    రమ.

  1449. వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/05/2009 7:32 am

    ఛందొబధ్ధవయిన కవిత్వం రాస్తున్నవాళ్ళు అనుభూతికి, భావానికి రెండో పీట వేసి ఛందస్సుకి పెద్దపీట వెయ్యడం వల్లే వాళ్ళ కవిత్వంలో ఛందస్సు తప్ప కవిత్వం వుండకుండాపోతోంది. ఈ పీటల గురించి నా విమర్శ కొంచెం రసజ్ఞ పాఠకులముందుంచి నా దృక్పధం సరి ఐనదో కాదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

    సాహిత్యానికి అందాన్ని కూర్చేవి మొదటిది శబ్దం రెండవది భావం. శబ్దం చెవిని పడుతూనే శృతిపేయంగానో కర్ణ కఠోరంగానో ఆకర్షణ వికర్షణలను ఆ కవిత్వంపై కలుగజేస్తుంది.

    [ఈ కామెంట్ పూర్తిపాఠం చర్చావేదిక లో చదవగలరు – సం]

  1450. ఒక్కతే… మృత్యువు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/04/2009 10:41 am

    మంచి అనువాదం. కవిత కన్నా అనువాదం కష్టమనుకుంటాను. మూలభాషలో చదివినవాళ్ళను మెప్పించడం ఇంకా కష్టతరం.
    “మృత్యుగీతానిది తడి ఊదాపూల రంగు మృత్యుముఖం ముదురాకుపచ్చ కాబట్టి” చదివాక ఏదో తెలియని వెలితి, ఇది రాయడానికి స్ఫూర్తి….

    [పూర్తిపాఠం చర్చావేదికలో చూడగలరు -సం.]

  1451. రామన్న గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/04/2009 10:04 am

    వినీల్ గారు
    కవిత నచ్చిందందామనుకున్న కాని గుచ్చింది, car accident లో పోగొట్టుకున్న దోస్తు యాదికొచ్చి. చివరి లైను కొసమెరుపు.
    ______
    విధేయుడు
    -Srinivas

  1452. ఈమాట పాఠకులకు… గురించి Meher గారి అభిప్రాయం:

    05/04/2009 1:15 am

    పాఠకుల అభిప్రాయ నియమావళి చదివాను. అన్నీ బానే వున్నాయి. ముఖ్యంగా ఒక పాఠకుడు మరో పాఠకుని అభిప్రాయంపై దండెత్తే చెడు అలవాటుపై పరిమితి విధించడం మంచిదే. కానీ పాఠకులు తన స్పందనలు సంపాదకుల్ని సంభోదిస్తూ చెప్పాలన్న నియమం మాత్రం బాలేదు. పాఠకునిగా ఒక రచన నాకు నచ్చినపుడు నేను ఆ కృతజ్ఞతను తిన్నగా రచయితకే తెలుపుకోవాలనుకుంటాను. నచ్చనపుడు సాధారణంగా అక్కడ స్పందనే తెలపను. పాఠకునిగా నాకూ రచయితకూ మధ్య సంపాదకులు మీడియేటర్స్ అంతే. వాళ్ళతో నాకే నిమిత్తమూ లేదు. ఏదన్నా కథో కవితో నచ్చినప్పుడు ఇక ఇక్కడ కూడా మామూలు పత్రికల్లోలా “ఎడిటర్జీ మీరు ప్రచురించిన ఫలానా కవిత/ కథ చాలా బాగుంది” అని చెప్పాలంటే ఏదో కోల్పోయినట్టనిపిస్తుంది. రచయితలు ప్రతిస్పందించడం/ ప్రతిస్పందించకపోవడం వాళ్ళ యిష్టం. పాఠకుని స్పందన మాత్రం రచయితకు ఉద్దేశిస్తేనే బాగుంటుంది.

    [మీ సలహా ప్రకారం తగువిధంగా పాఠకులకు సూచనలలో మార్పులు చేశాము. – సం]

  1453. ఒక్కతే… మృత్యువు గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:

    05/03/2009 7:28 pm

    అనువాదాలు కత్తి మీద సాము లాంటివే, అందులోనూ లయ బద్దమైన వాక్య నిర్మాణానికి పెరెన్నిక గన్న నెరుడా కవిత్వానువాదమంటే ఎంతో లోతైన ఆలోచన, కవిత్వం చదివినప్పుడు కలిగిన నిండైన భావావేశం రెండూ కలపోయాలని నా స్వీయానుభవం. లేకపోతే అనువాదం రక్తి కట్టదు.

    మొదటి ఏడు పాదాల స్పానిష్ మూలం;

    SÓLO LA MUERTE

    HAY cementerios solos,
    tumbas llenas de huesos sin sonido,
    el corazón pasando un túnel
    oscuro, oscuro, oscuro,
    como un naufragio hacia adentro nos morimos,
    como ahogarnos en el corazón,
    como irnos cayendo desde la piel al alma.

    ఉరామరికగా, స్పానిష్ నుంచి అర్థం:

    మృత్యువొక్కటే

    అక్కడ ఒంటరిగా శ్మశానాలు
    ఎముకలు నిండిన సమాధులు, శబ్దం లేదు
    గుండె గుండా ఒక సొరంగం
    చీకటి, చీకటి, చీకటి
    మనని మృత్యువులో దించిన పగిలిన ఓడన్నట్టు
    మన గుండెలోన మనని ముంచినట్టు
    మనం తోలు నుండి ఆత్మ లోకి పడినట్టు

    ఇక భైరవభట్ల గారి అనువాదం పరిశిలిస్తే: మొదటి పాదం బాగా వచ్చింది, కానీ రెండవ పాదంలో కవి(నెరుడా) హృదయం నిశ్శబ్దం అని కాదు, శబ్దం లేదని (కవిత్వంలో ఈ రెంటికీ చాలా తేడా ఉంది),అలాగే సమాధులు ఎముకల నిశ్శబ్దం నిండినవని కూడా కాదు.

    ఇక మూడవ పాదం ఆంగ్లానువాదంలోని తప్పుని ఖరారు చెయ్యడం.
    నాలుగవ పాదంలో మూలంలో లేని అనవసరమైన దండుగ్గణం (కటిక)
    ఐదు, ఆరు, ఏడు పాదాలు Como అనే పదంతో మొదలైతాయు స్పానిష్ లో, దానర్థం లా, ఉపమానంగ చెప్పినట్టు. “ఈ మరణం” అనేది ఎక్కడ నుండి వచ్చింది? కవితా వాక్య నిర్మాణానికి అనువాదంలో ఎటువంటి స్థానం కల్పింఛారు భైరవభట్ల వారు?

    అనువాదాలు చేసేప్పుడు కొన్ని సూచనలు:

    1. మూలాన్ని రక్షించండి (మూలో రక్షతి రక్షితః)
    2. వివరణల్లోకి పోవద్దు, కవితని కవితగానే ఉంచండి (ఉదాహరణకి పై ఐదు, ఆరు, ఏడు పాదాలు వివరణ)
    3. మూల భాషలో కనీస పరిజ్ఞాన్ని పెంచుకోవడం.

    మన పద్యాలను సంస్కృతంలో నుంచి జర్మనులోకి పరివర్తించేప్పుడు, ఛందోబద్దంగా అనువదించగలిగితే బాగుండేదని మహకవి గోథే అభిప్రాయపడ్డాడు. ఈ వివరణ భైరవభట్ల గారి కలం నుంచి ఇంకా మంచి అనువాదాలు వెలువడాలనే.

    [మరింత చర్చకు వీలుగా ఈ అభిప్రాయాన్ని చర్చావేదికలో కూడా ప్రచురించాము. – సం]

  1454. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి mOhana గారి అభిప్రాయం:

    05/03/2009 4:34 pm

    శ్రీనివాస్ గారు ఉదహరించిన మరో ప్రపంచం అనే రెండు పదాలు మూడు మారులు ఉపయోగించడము పునరుక్తి ఎలా కాదు, మూడు వేరువేరు మరో ప్రపంచాలు ఉంటే తప్ప? అదే విధంగా మూడు మారులు భజ గోవిందం అన్నది పునరుక్తి కాదా? వేరు వేరు అర్థాలలో ఉపయోగిస్తే తప్ప పై పదాలు పునరుక్తి దోషం కాదా? దేశంలాటి ఒక పదాన్ని మరల మరల వాడితే పునరుక్తి కాదు, ఎందుకంటే అది వాక్య నిర్మాణానికి కావాలి. లేక నేను బాగా అర్థం చేసికోలేదా పునరుక్తిని గురించి? మన జీవితమే ఒక పునరుక్తి కదా? మొన్నటిలా నిన్న, నిన్నటిలా ఈరోజు. అదే ఆఫీసు, అదే పని, అవే కష్టాలు, అవే నష్టాలు. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే భూమి, అదే ఆకాశం. పునరపి జననం పునరపి మరణం, భజ గోవిందం, భజగోవిందం! – విధేయుడు – మోహన.

    [పునరుక్తిని నిఘంటు అర్ధంతో కవిత్వంలో వాడరు. కేవలం పదం పునరుక్తమైతేనే దోషం కాదు. ఒక భావానికి ఊనిక కోసమో, తూగు కోసమో పదాల్ని తిరిగి వాడడం ఇటరేషన్. చెప్పదలచుకున్న విషయాన్నే మళ్ళీ మళ్ళీ అనవసరంగా చెప్పడం రిడండన్సీ. పునరుక్తి అన్న పదాన్ని ఈ రిడండన్సీ అన్న అర్ధంలో వాడతారు. ఇది మొనాటనీ కాదు. మరికొంత చర్చ అవసరం అనుకుంటే దయచేసి చర్చావేదికను ఉపయోగించుకోగలరు. – సం.]

  1455. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/03/2009 12:32 pm

    నమస్కారం
    చెప్పిన ఉదాహరణలలో పునరుక్తి దోషం లేదన్నందుకు సంతోషం.
    “పునః ఉక్తి పునరుక్తి” అనుకుంటున్నాను. మరి పునరుక్తి ఎప్పుడు దోషంగా
    మారుతుందో కొంచెం వివరణ, వీలైతే ఎక్కువ పాపులారిటీ పొందిన కవితలలోనుంచేదైనా సాయపడే ఉదాహరణ దయచేసి తెలుప మనవి. పాయింటు బొత్తిగా అర్థం కాలేదు, నాకొక్కనికే కాదేమో అని కూడా అనుమానం, ప్రయత్నిస్తున్నప్పటికినీ.
    ____
    విధేయుడు
    -Srinivas

  1456. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/02/2009 10:08 pm

    నమస్కారం
    చమత్కారంగా చక్కగా తెలిపారు, ఒక్కటి మాత్రం అర్థం కాలేదు.
    “ముఖ్యంగా కవితలలో పునరుక్తి పనికిరాదు. కత్తిరించేయండి.”
    అన్నదొక్కటి వ్యంగ్యమో హాస్యమో నిజమో తెలియని (దు)స్థితి.

    వచనంలో పునరుక్తి వద్దనేది అర్థంచేసుకోగల్గినా, కవితలలో_ మనకున్న ఎన్నో తెలుగు, తెలుగేతర కవితలలో, అందంగానే కనబడుతుంది, స్పష్టంగానే వినపడుతుంది, సమంజసంగానే అనిపిస్తుంది కదా పునరుక్తి! అపార్థం చేసుకున్నాననేమో అని అనుమానం, అంతకన్నా దాన్ని సరిచేసుకోడానికే ఈ ప్రయత్నం.

    To be or not to be: that is the question” అనే అంటాం కాని ఎంత Elements of Style ఘోషించినా To be or not: that is the question” అని అనం కదా! “మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది” అనీ, “భజ గోవిందం, భజగోవిందం, గోవిందం భజ” అనీ, “సంభవామి యుగే యుగే” అనీ, “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ” అనీ, “వాగర్థావివ సంప్రృక్తౌ” అని తిరిగి “వాగర్థ ప్రతిపత్తయే” అనీ, “దేశమంటే మట్టికాదోయ్ దే శమంటే మనుషులోయ్”-పునరుక్తులు లేక్కపెట్టుకుంటూపోతే, కత్తిరిస్తూవుంటే మిగిలేదేమిటో conclusion ఏమిటో తెలియదు!
    ప్రార్థన చివర్లో కూడా పునరుక్తే ఓం శాంతిః శాంతిః శాంతిః !
    “And miles to go before I sleep, And miles to go before I sleep”
    —–
    విధేయుడు
    -Srinivas

    [శ్రీనివాస్ గారూ: మీరు పైన ఉదహరించిన వేటిల్లో కూడా పునరుక్తి దోషం లేదు. -సం.]

  1457. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి darla గారి అభిప్రాయం:

    05/02/2009 10:32 am

    నమస్కారం,
    వెంకటేశ్వరరావు గారు వ్యాసంలో అక్కడక్కడా ఆధునిక అప్పకవి కనిపించినా, చాలా విషయాలను సూటిగా స్పష్టంగా చెప్పారు. మన తెలుగు వ్యాసాలను ఎం.ఎల్.ఏ స్టైల్ షీట్ కూడా తెలియని/ అసలు పాటించన పరిశోధన వ్యాసాలు మాత్రమే అధికంగా ప్రచురితమవుతున్నాయి. కవిత, కథ, వ్యాసాల్లో వాక్యాల గురించి కొన్నింటిని ప్రస్తావించారు. పునర్తుక్తి గురించి రాశారు. కావ్యాలంకార సంగ్రహం లో ప్రత్యేకించి దోష ప్రకరణం ఉంది. అందులో ఉన్నవన్నీ శాశ్వత ప్రామాణికాలని అనలేం, కానీ, అత్యధిక శాతం అవి ప్రామాణికాలే! ఇలాంటి వన్నీ మన భాషా, సాహిత్యాలను మరింత ముందుకు తీసుకువెళతాయి. అలాగే ఇలాంటి వ్యాసాలు కూడా కొందరినైనా కదిలిస్తాయి.
    మంచి ప్రయత్నం. అభినందనలు అనలేను…. ఇంకా వారికంటే చాలా చిన్నవాణ్ణి. ఉపయోగపడే వ్యాసం అని మాత్రం చెప్పగలను.
    దార్ల

  1458. ఒక్కతే… మృత్యువు గురించి bollojubaba గారి అభిప్రాయం:

    05/02/2009 1:25 am

    ముందుగా నా పేరు కూడా ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు.

    భలే ఉంది. నేనెక్కడెక్కడ బొక్కబోర్లా పడ్డానో తెలిసింది. (రింగ్ అనే మాటను ఘంటారావం అనే అర్ధంలో అనువదించాను. మీరు ఉంగరం అన్నారు. మీరే కరక్ట్ . ఇంకా చాలాచోట్ల 🙂 కవిత్వానికి క్లుప్తత ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తూంది.

    కొన్ని సందేహాలు

    with bakers white as angels, = గంధర్వ గాయకుల మూగబోయిన గాత్రాలు – అన్నారు ఎందుకు అందంకోసమా? లేక మరేమైనా అర్ధాలున్నాయా?
    like a shoe without a foot, like a suit without a man, = ఈ వాక్యాన్ని మొత్తం వర్జించారు. కారణం తెలుసుకోవాలని ఉంది.

    మొత్తంమీద అనువాదం బాగా వచ్చింది.

    బొల్లోజు బాబా

  1459. భ్రంశధార గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    05/01/2009 6:49 pm

    కనక ప్రసాదు గారి స్థాయిని సూచించే మరొక మంచి కవిత. ఒక చిన్న అనుమానం. నాకు తెలిసి Dover Beach లోని ఏజియాన్ సముద్ర ఘోష ప్రసక్తి సోఫోక్లీస్ విరచిత “ఈడిపస్ రెక్స్” లో ఈడిపస్ రాజు మనోవేదనని తెలియ చేసేది. తను తెలియక వివాహమాడినది తన తల్లినని తెలుసుకుని ఈడిపస్ ఏజియాన్ సముద్రం ఒడ్డున నిలబడి పరితపిస్తాడు. మరి భ్రంశధార కవితలో శాక్యముని ఎవరు? ఈయన కూడా సొఫోక్లీస్ వలనె tragedies వ్రాయడంలో ప్రసిద్ధుడా? Or am I looking for too much correspondence between Dover Beach and BhraMSadhAra?

    విధేయుడు,
    రాజాశంకర్ కాశీనాథుని

  1460. ఇంట్లో ఎవరూ లేరు గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    05/01/2009 3:26 pm

    ఇంద్రాణిగారి కవితలు ఏవి చదివినా ఒక అనిర్వచనీయమైన అనుభూతి. This poem is no exception.

    రాజాశంకర్ కాశీనాథుని.

  1461. ఇంట్లో ఎవరూ లేరు గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:

    05/01/2009 2:48 pm

    హాట్స్ ఆఫ్ ఇంద్రాణి గారికి!! ఎంతో క్లుప్తత ఈ కవితలో సాధించారు. వీరిచ్చిన Contrasting భావాలు (చేతి వేళ్ళ మధ్య కాళ్ళు జాపి, ఎండ వేళ హిమానీ పాతం మొదలైనవి ) ఎంతో బాగున్నాయి.

    పవన్

  1462. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    04/27/2009 10:09 am

    అన్నమయ్య సాహిత్యం గురించిన.. మీ పాఠకుల సందేహాలని చూసేక ఈ సమాచారం.. ఈమాట కి తెలుబడి చేయటం మంచిదని నాకు అన్పించింది. జయప్రభ గారు అన్నమయ్య పదాల విశ్లేషణ రెండు సంపుటాల్లో చేసారు.మొదటి సంపుటం 2006 లో రాగా..ఈ నెలలోనే రెండవ సంపుటం అచ్చయి వచ్చింది. పుస్తకం పేరు..”కాంతల మనసు లోని కఱవు వాసె..అంతటా జవ్వనమనే ఆమని కాలమున”. 450 పేజీలు; ఖరీదు 500 రూపాయలు.

    ప్రసాద్ గారూ! అన్నమయ్య సంకీర్తనా సంపుటాలని నిఘంటువుల్ని దగ్గర పెట్టుకుని చదవండి. ఒక నిఘంటువు కాదు..చాలా నిఘంటువుల్ని వెతకండి.మీకు అన్నమయ్య సాహిత్యం్ ఇష్టం్ అయినప్పుడు అంతపాటి శ్రమ పడాలి. క్రమేపీ మీకు వాటి లోని అందాలు అవగతం కాగలవు. అన్నమాచార్యుని కవిత్వం ఎందుకు వైవిధ్యమైందో..అది ఎంత గొప్పదో..చాలా ఆసక్తి గానూ..చాలా విపులంగానూ ఆమె విశ్లేషించారు. వాటిని చదవండి. మీ చాలా సందేహాలకి సమాధానం దొరుకుతుంది. పుస్తకాల ప్రాప్తి స్థానం…రచయిత్రి దగ్గర గానీ..అక్షర బుక్ షాప్ లో గానీ.

    బాబ్జీలు గారూ! ఒక సామెతకి ఒకే రూపం..ఉండనఖ్ఖర లేదు. ఒక అర్ధాన్ని ఇచ్చే సామెత భిన్న ప్రాంతాల్లో..భిన్న కాలాల్లో ప్రాచుర్యం లో ఉండటం్ అన్న ది..దాని ప్రభావానికీ..ప్రచారానికీ..ఆ భావ వ్యక్తీకరణ అవసరానికీ గుర్తు. సామెతలకి, కర్తృత్వాలూ..కాల నిర్ణయాలూ ఉండవు. అందువల్ల వాడకంలోని ప్రాచీనతే..దాని చెలామణీని ..వ్యాప్తినీ సూచిస్తుంది. మనకి అట్టు తొలి గానూ..రొట్టె..అటు తర్వాతా వచ్చిన ట్లయితే అన్నమయ్య వాడిన రూపమే మొదటిది కావొచ్చు. నిప్పట్టు అంటే అరిసె అన్న వాడుక సీమలో ఉంది మరి.

    రమ.

  1463. వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    04/25/2009 12:01 am

    తెలుగు వారందరికి
    వాడుక భాషా ప్రయోగం వలన కవితా వికాసం పక్కనుంచితే, భాషా వికాసం జరిగిందాలేక వినాశం జరిగిందా అనేది ఆలోచించదగిన విషయం. నాకైతే వినాశం జరిగినదనిపిస్తోంది.
    దయమాలి తుదముట్ట తలకట్లు నిగిడించి
    ధీరుడై నన్ను బాధించు నొకడు
    పాదాంబులోపల పాదంబు లిమిడించి
    వీరుడై నన్ను నొప్పించు నొకడు
    ప్రాసంబుపై పెక్కు ప్రాసంబు లడరించి
    పోటుబంటయి నన్ను పొడుచు నొకడు
    బెండు పల్కులు గూర్చి నిండైన నగలంచు
    దిట్టయై చెవులు వేధించు నొకడు

    ఖడ్గ చక్రాది రూపముల్ గానిపించి
    వర్ణముల్ మార్చి నను చిక్కుపరచు నొకడు
    కుమతు లొడ లెల్ల విరిచి ప్రాణములు తీయు
    ఒడలి పస లేక శుష్కించియున్న దాన
    రసజ్ఞులను ఆకట్టుకొనే రసాన్ని అలక్ష్యం చేసి కేవలం అద్భుతం విస్మయం కలిగించే పై దిక్కుమాలిన సర్కస్ ఫీట్ల పై దృష్టి పెట్టిన ఆనాటి కవుల ధోరణిని నిరసిస్తూ చేసిన సరస్వతీ దేవి విలాపం సరి ఐనదే. కానీ దానికి స్పందన, విస్పందన, ప్రతిస్పందన, విపరీత స్పందన బాగా ఎక్కువై ఈనాటి స్థితికి కారణమైనది. నాకైతే ఇప్పుడు మాత సరస్వతి మన ముందు నిలబడి ఈ విధంగా ఆక్రందిస్తున్నట్లు అనిపిస్తుంది.
    ప్రాస, యనుప్రాస, బహు ప్రాస, యంత్యను
    ప్రాస నా బడు నగల్ దీసినారు
    శ్లేషోప మాది విశిష్టార్ధ భూషల
    పాత పెట్టెల పార వైచినారు
    లలిత నారీకేళ రస రమ్య పాకాల
    చీనాంబరాల్ చింపి చీల్చినారు
    కంద మత్తేభాది కమనీయ గతులిచ్చు
    మంజీరముల హత మార్చినారు
    తిలక, మంగరాగము, కురుల్ తీర్చి దిద్దు
    సరణి, పారాణి, ప్రాతని పరిహరించి
    అన్ని దిగలాగి నగ్నతా ఖిన్న జేసి
    నిలిపి నారయ్యయో వీధి నేటి కవులు

    పలుభూషణంబులు వలదంటి నే గాని
    తల శిరోమణి నైన దాల్పనొక్కొ?
    నగలిన్ని మోయంగ జగడమాడితి గాని
    ఒకపేట గొలుసైన నొల్లనొక్కొ?
    పట్టు జరీ చీర పెట్టెలొల్లను గాక
    వస్త్రమే వలదని పలికితొక్కొ?
    పలుగతులను నృత్యముల సేయ భరమంటి
    నడవనే నని సుడి వడితి నొక్కొ?
    భావ భాషాది భూషల బార వైచి
    యమక గమకాదిగతులెల్ల యణగ ద్రొక్కి
    రస విలాసాఖ్యమౌ యంబరముల నూడ్చి
    నిలిపి నారయ్యయో మది తొలచినారు
    నేను మీ వ్యాసంలో ఉదహరించిన పేరెన్నిక గన్న మహా కవుల గురించి గానీ జనాదరణ పొందిన వారిఉదాహృత కవితల గురించి గానీ పై అభిప్రాయాన్ని వెలువరించ లేదు. ఈ మహా కవులందరు అద్భుత ప్రతిభా వ్యుత్పత్తి గలవారు. భాషలో అనంత పద పరిజ్ఞానం గలవారు. జనరంజకమైన భావాభి వ్యక్తికై ఛందో బంధనాలనుంతెగద్రెంచిన వారు. కావలసి వస్తే గర్భ కవిత్వాన్ని గానీ బంధ కవిత్వాన్ని గాని అలవోకగా నిర్మించగల భాషా శెముషి గలవారు.
    నేను చింతించేది తామర తంపరలుగా అనేక పత్రికలలో వచన కవిత అనే పేరుతో కవితా సరస్వతిని గాయపరచే వారి గురించి. ఈ తరహాలో నాకు తెలిసిన చాలా కవులకు 100 -150 కన్నా తెలుగు పదాలు రావు. ఒక ఆట వెలదిలో పద్యం వ్రాయగలిగే పద సామర్ధ్యం లేదు. అసలు వారికి ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి తెలిసిన పదం ఒకటే, అదీ అన్య భాషా పదం ఐనపుడు ఛందస్సు అనేది తెగగొట్టలేని అయోమయ శృంఖలగా అనిపించడంలో వింత లేదు. కనీసం ఒక లయ (మాత్రా ఛందస్సులో) ప్రకారం కూడా వ్రాయలేక ఈ నియమాలేవీ లేని వచన కవితనిఎన్నుకోవడం శొచనీయం. జన సామాన్యానికి అర్ధం అయే భాషలో వ్రాయడం మాత్రమే ముఖ్యం కాదు, జనరంజకంగా వ్రాయగలగాలి. అందుకు భాషలో పద పరిజ్ఞానం ఉండాలి. అది మృగ్యం ఔతోంది.
    ఇంకొక సంగతి. జనసామన్యానికి అర్ధం కాని సాహిత్యం నిరర్ధకమైనదనే దానిని ఎవ్వరూ ఇష్టపడరు, దానిపై మా కసహ్యం లేదు. మానేశాము అనే వాదన ఈ వ్యాసంలో బయట కూడా కర్ణతాడితమౌతోంది. జనసామాన్యానికి అర్ధం కాలేని వన్నీ పరిత్యజించాలంటే, ఒక గణితం, సర్వ విజ్ఞాన శాస్త్రాలు పరిత్యజించి గుహలలో ఉండాల్సి వస్తుంది. క్లిష్టమైన దాని ఆలోచించి అర్ధం చేసుకోవడం ద్వారానే విజ్ఞానం పెరుగుతుంది. భాషకు కూడా ఇది వర్తిస్తుందని తెలుసుకోక పోవడం వలన మన భాష ఇప్పటికే చాలా నష్టమైంది. వ్యాసకర్తగారు వొక చోట వేమన గారు జనసామాన్య భాషలో వ్రాశారన్నారు. ఆ మాట కు కాలదోషం పట్టిందని తెలుసుకుంటే వారు తమ మాటను వెనక్కు తీసుకుంటారేమో. ఎందుకంటే ఇప్పటి తెలుగు వారికి వేమన సుమతీ శతకం లు అర్ధం కావడం లేదు. ఆ గ్రాహ్య శక్తి 100-150 దాక పద పరిజ్ఞానం గలిగిన కవులకే పరిమితం. ఈ విధంగా భాష ఒక్కొక్క తరంలో క్రమక్రమంగా వినష్టమైపోతోంది. ఛందో బద్ధమైన కవిత్వం వ్రాయడం వలన కవి పద పరిజ్ఞానం పెరుగుతుంది. భాష విస్తృతమౌతుంది. తన అధీనంలో వున్న అనంత పదరాశిలో జనరంజకమైన పదాన్ని ఎన్నుకోడానికి కవికి వీలుంటుంది. నియమ బద్ధంగా ఆరంభించినవారికే ఆ నియమాలను ఎట్టి సందర్భాలలో ఎలా అతిక్రమించి జనరంజకమైన కవిత్వం వ్రాయడం సాధ్యమౌతుంది.

  1464. షష్ఠ్యంతములు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    04/21/2009 3:29 am

    ప్రాచీనాంధ్ర సాహిత్యానికి సంబంధించిన ఇటువంటి వ్యాసాలు చదివినప్పుడల్లా హృదయం అమందానంద సందోహ కందళిత మై ఉత్తేజితమౌతుంది. మీ వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. విభక్తులగురించి షష్ఠ్యంతాలు గురించి బాగా వివరించారు. ఏకో కవిః పోతన ఏవ అని భావించే నాకు ఆయన షష్ఠ్యంతాలు వదలక ఉదహరించడం ఆనందం కలిగించింది. పోతన తరువాత నాకెక్కువ అభిమాన పాత్రుడై కవిత్వంలోనూ విద్వత్తులోనూ అద్వితీయుడైన సురభి మాధవరాయల షష్ఠ్యంతాలు కొన్ని నా స్మృతిపధంలో వున్నవి మీతో పంచుకోడానికి ఉత్సహిస్తాను
    భాషాధివ, శెషాహివ,
    భాషా భూషాయితాత్మ పటుగుణ తతికిన్
    దోషాచర, దోషాచర,
    దోషాచర చక్ర కలిత దోర్బల ధృతికిన్

    పాపాయిత, కోపాయత
    భూపాయిత దనుజ మధన పూజిత మతికిన్
    గోపాలన, గోపాలన,
    గోపాలన నిబిడ రతికి, గోహిత మతికిన్

    కమలాస జనక నాభికి,
    కమలన్మోహాంధ తమస కమలాంకునకున్
    కమలాలయ, కమలాలయ,
    కమలాలయ శయన ధృతికి, కాంతాకృతికిన్

    శరణాగత పరిరక్షణ
    చరణ ప్రవణాత్మ చిత్త సరసీజునకున్
    నరకాసుర, నరకాసుర,
    నరకాసుర బాణహృతికి, నరసారధికిన్

    సమధికమైన ప్రతిభ, విద్వత్తు కలిగిన మీ లేఖిని నుండి ఇటువంటి అనేక వ్యాసాలు జాలువారి రసజ్ఞ హృదయాలనలరింపజేయాలని ఆశిస్తూ
    భవదీయుడు

  1465. చంపకోత్పలమాలల కథ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    04/20/2009 12:07 am

    ఈ వ్యాసం ఎంతో బాగుంది. నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికే గాక, ఇది వరకే తెలిసిన విషయాలలో అవగాహన ఇంకా పెరగడానికి దోహదపడింది. వ్యాసకర్తకీ రంగంలో వున్న అభినివేశం, అభిరుచి, సాధికారత, ప్రామాణికత్వం శ్లాఘనీయమైనది. లక్షణాలకు లక్ష్యాలను స్వయంగా సమకూర్చడంలో (సర్వ) జన వేద్యమైన సరళ సంస్కృత భాషా పద ప్రయోగం అమోఘం. ఆదిలోనే ఉదహరించిన శ్లేషాలంకార సహితమైన మాఘుని సంస్కృత చంపకమాల ఆకట్టుకుంది. చంపకమాల, ఉత్పలమాల, కందం, తేటగీతి, మధ్యాక్కర, సీసం వగైరా వృత్తాల సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ సృష్టించిన (చిత్ర విస్తర కవిత్వాలలో ఒకటిగా చెప్పబడిన) గర్భ కవిత్వం ప్రశంసార్హం. ఈ గర్భిత వృత్తాలలో భిన్న వృత్తాలలో భిన్న భావాలు ప్రదర్శించే అద్భుత నైపుణ్యాన్ని ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలిపివుండాలనిపించింది. ఉదాహరణకి ఈ క్రింది పద్యాన్ని చూడండి

    శ్రీరామ స్తుతి
    గురు కరుణాకరా! సమద కుంజర దానవ శక్తి హార సం
    భరిత మనా! త్రయీ భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన! ఈ
    శ్వర గురు ధర్మ భంజన! నిశాచర వర్ధన శస్త శూల! క్ష్మా
    ధర వర! జానకీ సతి హృదంతర మందిర! సర్వ పాలకా!

    దేవీ స్తుతి
    కరుణాకరా! సమద కుం జర దానవ శక్తి హార సంభరిత మనా!
    గురు ధర్మ భంజన! నిశా
    చర వర్ధన శస్త శూల! క్ష్మాధర వరజా!
    శివ స్తుతి
    సమద కుంజర దానవ శక్తి హార
    భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన!
    జన! నిశాచర వర్ధన శస్త శూల!
    సతి హృదంతర మందిర! సర్వ పాల!

    తరువాత అగ్ని ర గణం అని, సూర్య జ గణం అని, చంద్ర భగణం అని, ఇంద్ర నగణం అని తెలిపారు. మిగిలిన గణాలు అంటే య, మా, తా, స, వ, లఘు గురువులకు ఏవి వర్తిస్తాయో తెలుపవలసినదిగా ప్రార్ధన.

    చివరగా

    అనుపమ మద్భుతావహ మనన్య జనాచరితం బమోఘమున్
    అనితర మన్య దుర్లభ మనంత మనోజ్ఞ రసాభిరామమై
    దనరెడు మీ వచో నిపుణతా, కవితాతుల రీతి మెత్తు, మో
    హన కవితా వశీకృత దిగంత సుధీజన! కృష్ణ మోహనా!
    భవదీయుడు

  1466. బోడి పద్యం గురించి Alok గారి అభిప్రాయం:

    04/19/2009 11:19 pm

    ఇప్పటికాలంలో గూడా “వచన” కవిత్వాన్ని “పద్య” మనడం జరుగుతోంది. అంచాత ఇది కవిత్వమా, పద్యమా అన్న మీమాంస అక్కర్లేదు.

    చూడగా, ఇందులో నాలుగు భాగాలున్నాయి.

    1. కవిత్వం పుట్టక-కవి బాధలు (1, 3, 6వ స్టాంజాలు)
    2. భిన్న మతాలు – సౌహార్ద్రత (2, 4వ స్టాంజాలు)
    3. కులం – వైయక్తిక వేదన (4, 5 వ స్టాంజాలు)
    4. రాజకీయాలు – అభిప్రాయ ప్రకటన (కూలిన మసీదు గోడ, బ్రోచేవారెవరురా వగైరా వాక్యాలు)

    యిన్నేసి భావాలు, అభిప్రాయాలు, ప్రకటనలు, నిట్టూర్పులూ వొకేచోట గుమిగూడ్డంతో కవిలోని సంకీర్ణత, అస్పష్టత పాఠకుల్లోకీ వరదలా పారాయి.

    రాజకీయలపై కన్నేసి వుంచేవాళ్ళకి అవే కనపడ్డాయి. కులం, మతం కవితల్లో ఆసక్తివున్నోళ్ళకి అదే కనపడింది. అంచాత చర్చ కూడా నానాజాతి సమితి శిఖరాగ్ర సమావేశంలా సాగుతూనే వుంది.

  1467. బోడి పద్యం గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    04/07/2009 8:50 am

    బోడి కామెంట్

    “దిక్” తో వచ్చిన వాళ్ళ గురించి ఇస్మాయిల్ రాసింది: “The Digambara poets aim was to shock their readers into an awareness of their social apathy and personal degradation.”

    “shock their readers” అనేది కూడా ఒక టెక్స్ట్ కు ఉండాల్సిన లక్షణమే!? అయితే, ఈ కవిత/Text చిందించిన మిగతా Texts ఈ కవితకు అవసరమైన టీకా టిప్పణికి పనికొస్తయి. Writer is dead after he wrote this Text.

    A Disturbance must be understood by the graph it creates, like that quake that happened in Italy for example, can be read acorss the world if there is an instrument: it is least understood at the far end but will not be mistaken for something else that it is not. Every text written and followed up with by each subsequent commentor is another tick mark on the graph. I hope the data points here cross a century OR even a శత కోటి.

    అన్నట్టు, రాసిన వాళ్ళు ఏం చెప్పక పోయినా, చదివిన వాళ్ళు దాన్ని గురించి చించుకున్నా తప్పులేదు. సంపాదకులు మాత్రం “దీంట్లో ఏం చూసి ప్రచురించారో చెప్పాలి” అన్న డిమాండ్ పాఠకుల నుంచి వస్తే వాళ్ళ అభిప్రాయం లేక వాళ్ళ రివ్యూయర్ల (పేర్లు లేకుండా) అభిప్రాయాలు కొంతయినా చెప్పటం అవసరమేమో!? అప్పుడు మరింత “మేత” దొరుకుతుంది అని నా అభిప్రాయం.

    విప్లవ్
    సంపాదకుల వారికి: మీరు ఈ మాట అభిప్రాయాల పేజీని సంస్కరించాలని తలిస్తే మాత్రం, పేరు మాత్రం మార్చి వదిలేయండి. ఇది “ఈ మాట: పాఠకుల బ్లాగ్” అంటే సరిపోతుంది. ఎక్కువ కండీషన్లు పెడితే సగం ఖండితం, సర్వం పీడితం టైపు అయిపోతుందని నా భయం.

  1468. బోడి పద్యం గురించి Meher గారి అభిప్రాయం:

    04/05/2009 11:57 pm

    ఇక్కడ కవితలో కన్నా వ్యాఖ్యానాలలో ఎక్కువ వల్గారిటీ కనిపిస్తోంది. కళాకారునికి వస్తువు ఎన్నుకోవడంలో అది అశ్లీలమా, సచ్ఛీలమా అన్నవి ప్రమాణాలు కావు. ఏది కదిలించినా దానిపై రాసే అధికారం అతనికి ఉంది.

    నిజానికి కవిత నాకూ అర్థం కాలేదు. కానీ నాకు ఈ సున్తీ సెరిమొనీ గురించి ఏమీ తెలియకపోవడం దానికి కారణమని సరిపెట్టుకున్నాను. లైలా గారి వ్యాఖ్యానం మరి కాస్త స్పష్టం చేసింది.

  1469. బోడి పద్యం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    04/04/2009 9:03 am

    సమాజంలో బతకడం నేర్చుకోవాలట ఈ కవితనర్థం చేసుకోవడానికి. సమాజంలో బతకడవే సరిపోదట, వెనుకనున్న చారిత్రక సంఘటనల సారస్వం తెలిసుండాలట. కాకపోతే మరేదో వ్యాసం చదివి ఈ కవితని అర్థం చేసుకోవాలట. లేకపోతే, అర్థం లేకుండా గొప్పగా ధ్వనించే ఈ పదాల పజిల్ ని, ఒకదానికొకటి సంబంధంలేకుండా వున్న ఈ పదచిత్రాల ముక్కల్లో, నేలని విడిచి సాముచేసి, తెగిపడివున్న చర్మపు ముక్కనుంచి భూత, భవిష్యత్, వర్తమానాల్ని అన్వయించుకునే (పచ్చ, పచ్చటి డాలరు రంగులో, పడిపోతున్న అమెరికా హంగులో) ప్రత్యేకవైన రంగుల కళ్ళద్దాలన్నా కావాలట.

    ఎవరికోసం ఈ కవిత? ఎందు కోసం ఈ కవిత? కొద్దో, గొప్పో చదవనేర్చిన వాళ్లకి కూడా అర్థం కాని ఈ కవిత. పాఠకుల ప్రయత్నంలో మాత్రవే విచ్చీ విచ్చకుండా విచ్చుకునే ఈ కవిత. కవితని చదివి అర్థం చేసుకోడానికి ఒక ప్రత్యేకవైన స్థాయి కావాలని కవిగారనుకునుంటే ఇక పేచీనే లేదు. మా పత్రిక ఆ స్థాయిగల పాఠకుల కోసవే అని సంపాదకులనుకుంటే కూడా పేచీ లేదు. కానీ ఇది సర్వ తెలుగు జనుల కోసం అనే అభిప్రాయం వుంటే మాత్రం కవి(తన కవితకి తానే వివరణ ఇచ్చుకోవడం కష్టవే), వివరణ ఇవ్వడం అవసరవేవో.

    రవి

  1470. భ్రంశధార గురించి raman గారి అభిప్రాయం:

    04/03/2009 4:40 pm

    ఎంత చ క్కగా వ్రాసారు సారు
    దీనికి ముందు కవిత దాని మీది అభిప్రాయాలు చదివి చాలా పిచ్చెక్కింది
    ఇప్పుదు మనసు చాలా తెలికయ్యింది
    మరీ మరీ చదవాలనిపించింది.
    థన్యవాదాలు.

  1471. జాషువా పిరదౌసి గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    04/03/2009 3:52 am

    సంగీత, సాహిత్య, శిల్ప, చిత్రకళాది లలిత కళలు కెవల దైవ దత్త వరాలు. ఈశ్వరానుగ్రహం ఉన్న వారికే ఇవి లభ్యం అవుతాయి. జాతి కుల మతాలని ఈ దౌర్భాగ్య మానవులు చూపే వివక్ష పరమేశ్వరుడెన్నడూ అణుమాత్రం పాటించడని ఈ మహా కవి అనర్ఘ కవితా వైభవాన్ని చూస్తే అర్ధం అవుతుంది.

  1472. బోడి పద్యం గురించి ravinder posani గారి అభిప్రాయం:

    04/01/2009 1:13 pm

    ఈ పద్యాన్ని నిజంగా అర్ధం చేసుకోవాల్నే అని వుంటే అన్ని ఆధారాలు, సమీక్షకుల సర్టీఫీకెట్లు అక్కర లేదు. లైలా గారి విశ్లేషణ చాలు…
    కాని, అర్ధం చేసుకోవాలన్న తపన కన్నా, తప్పులెన్నాలన్న తాపత్రయం ఎక్కువ కనిపిస్తోంది.

    ఈ పద్యాన్ని అర్ధం చేసుకోవడానికి ముందు మీరు ఈ సమాజంలో బతుకుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోగలిగిన వాళ్లకి ఈ కవిత తేలికగానే అర్ధం అవ్వాలి.

    రవి

  1473. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/31/2009 6:55 pm

    రవికిరణ్ ,

    మీరు చెప్పిన “కూనిరాగం”తీయగల్గటం రామ దాసు పాటలకి సాధ్యం.అవి”భజన సంప్రదాయానికి”చెందినవి గనక. కానీ త్యాగయ్య popular గేయకర్త కాడు. సంగీతాన్ని నేర్చుకున్న వాళ్ళో..లేదా..regular గా classical music ని వినే అలవాటున్న వాళ్ళో తప్ప..త్యాగరాజస్వామి వారి పాటల్ని కూనిరాగం తీయటం కుదిరే పని కాదు. మిమిక్రీ చెయ్యొచ్చు..మ హా అయితే!
    ఇంక అన్నమయ్య పదాల్ని అరవైల్లో ఆల్ ఇండియా రేడియో లో మొదటిగా గాయనీ గాయకుల చేత పాడీంచేదాకా కూడా..ఆయన పాటలు తెలుగుదేశంలో ప్రచారం కాలేదు. అందువల్ల ఆయగుపాట గురించి తెలుగువారికి తెలిసిందే ఈమధ్య. ఒకవేళ మీరు ఉదాహరించబోయే”జో అచ్యుతానంద జోజో ముకుందా”..అన్నమయ్య పదంగా చెలామణీ అయిందే గానీ..అది అన్నమయ్య పదం అవునో కాదో తెలియదు. ఇంక గద్దర్ పాటతో తెలుగుతల్లులు కూనిరాగాలు తీస్తూ పిల్లల్ని పెంచుతున్నారని నేను అనుకోవడం లేదు.

    ఇదివరకూ చెప్పిన ట్టే ఇప్పుడూ చెబుతున్నాను.” కవి” గా త్యాగయ్య గారు చాలరు. కాదూ మేము త్యాగరాజుని గొప్ప కవిగా అనుకుంటూ ఉన్నాము…అని ఎవరైనా అన దల్చుకుంటే..అలా వారు అనుకున్న కారణాల్ని
    వివరించిచెప్పొచ్చు…సోదాహరణంగా!!

    కవిత్వం భాషతో..పదచిత్రాల్తో..భావచిత్రాల్తో..ఊహల్తో విశిష్టంగా మన మనఃప్రవేశం చేయాలి.అలా చేసే అక్షరం కల్గించే స్పందనలు వేరు. అది వాదించే విషయం కాదు. అనుభవించగల విషయం.అదీ తేడా!!

    రమ.

  1474. బోడి పద్యం గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:

    03/31/2009 4:39 pm

    కవితని, కవిని అర్థం చేసుకోవడానికి ఈ లంకెలోని వ్యాసం ఉపయోగపడుతుంది “అఫ్సర్‌ “వలస”, కల్పనా రెంటాల “కనిపించే పదం”” – మే 2002 ఈ మాట సంచిక http://www.eemaata.com/em/issues/200205/552.html

    గరికపాటి పవన్ కుమార్

  1475. బోడి పద్యం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/31/2009 2:29 pm

    నర్సింహ గారు,

    పూలు, పూబోడులు, పిరుదులు మీకొంటబట్టవని చెప్పేరు గానె, ఎవరిష్టం వాళ్ళది దానికెవరేం జేస్తాం దేనికైనా అదురుష్టవుండాల. మీరోరంలో ఏడ్రోజులు దిద్దుతారా అ, ఆలు. మీ మందల మీరు జెప్పేరు, మీ దోస్తుల మందల కూడా మీరే జెప్పాలా, ఏంది వాళ్ళకి అ,ఆ లు దిద్దడం ఇంకా వొగదెగలా?

    శానరోజులకి ఈమాటలొ టీ గురించి, టీ పొడి గురించి ఇన్నాను. టీ తాక్కుండా, టీ పొడి తింటే వచ్చే కెఫిన్ హైలో ఈమాట సంపాదకత్వానికి మీరిచ్చిన చరిటిపికెట్టు వాళ్ళు ప్రేంగట్టిచ్చుకుని పెట్టుకోవాల. మరీ అంత డయిరెట్టుగా ఎవరోజెప్తే గాని ఈమాట సదవనంటే వోళ్ళు పీలవుతారేవో. అద్సరేగానె, తెల్ల పవరేంది? అదేడనుంచి పట్తకొచ్చావు. కెఫిన్ లెవెల్స్ కొంచం తగ్గిన తర్వాత, అప్సరు గోరి కవిత మీద ఒక అదరగొట్టే ఇమర్స రాయగూడదా మీరు.

    రవి

  1476. బోడి పద్యం గురించి యాద్గిరి గారి అభిప్రాయం:

    03/31/2009 12:02 pm

    అన్నా నర్సిమ్మన్నా, మస్తుగ రాసినవే.

    ఎవురో సెప్పిన్రు, అఫ్సర్ కవిత మీద మస్తు లొల్లి పడ్తున్నరని ఈడ.

    గీ లొల్లి పడుడేందే? మా ఊళ్ళ లొల్లి జేస్తరు. ఇంకొన్ని ఊర్లళ్ళ గొడవ జేస్తరు/పడ్తరు. నీ బాస జరింత అటీటు గాకుండుంది. నువ్వు అ,ఆలు ఏడ నేర్సినవే?

    తెల్ల పొగరు అణగిపోవాల.

    గీడ తెల్లోల్లెవరె? ఎప్పుడో మనదేశం ఇడిసిపెట్టిండ్రు గదనే. కొంపదీసి గీ కైత అమ్రికోళ్ళ మీదన యేంది?

    ఈ మాటలో కూడా జబర్దస్తు కయితలు వస్తయని ఎడిటర్లు జర సమజున్నోళ్ళే అని ఇయ్యాల్నె సమజయ్యింది.

    ఈమాటల కైతలు ఏడిటర్లు రాయరె నర్సిమ్మన్నా. శనాది వారలల్ల అ,ఆ,ఇ,ఈ లు నేర్సినోల్లే రాస్తరే. ఎడిటర్లు ఎస్కోవల్నా లేదా అని డిసైడ్ జేస్తరు. నీకేం సమజయిందో నాకైతే సమజ్ గాలె.

    సల్లగుండు మరి.
    యాద్గిరి

  1477. బోడి పద్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/31/2009 9:26 am

    నర్సింహ గారూ,
    పని మాల సదివిన కవిత్వం గురించి ఒక్కముక్కకూడా రాయలేదు మీరు.
    తెల్ల పొగరు అణిగిపోయేట్టు ఈ “బోడి పద్యం” దేని గురించో రాయరూ, దయచేసి.
    అక్షరలక్షలు చేసీ ముక్కొహటి అన్నారు, ఈ మాట ఎడిటర్ల గురించి “అనాడీ” లు కారని. సంతోషం. మిగతావన్నీ పక్కనబెట్టి పైనున్న కవిత్వం లో ని విశేషాలగురించి రాయండీ. దెబ్బకు ఠా దొంగలముఠా అయిపోతుంది.

  1478. బోడి పద్యం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/31/2009 8:12 am

    రాళ్ళపల్లి గారు,

    నెల్లూరులో పుట్టి పెరిగిన వాడిని, మస్తాన్ రెడ్లు, రసూలమ్మలు బంధు వర్గంలో వుండటం నాకనుభవవే. అయితే ఒక కవితని చదివినప్పుడు, ఫలాని మతవో, కులం గురించి ప్రస్తావన అవసరవా?

    మీకు కవిత ఎందుకు నచ్చిందో మీరు చెప్పేరు, ఆ వివరణతో నేనీకభవించకపోయినా, కనీసం మీరు చెప్పేరు, నేల మీద నిలబడి, అందుకు నా ధన్యవాదాలు.

    ఇంకా “ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది.” అన్నారు. నిజవే, అందరి బతుకుని సృశించడం వీలుకాదు, కానీ పదుగురి బతుకుని సృశించి, పదుగురు స్పందించేవిధంగా వ్రాస్తే మరింత బాగుంటుందికదా, కాదంటారా.

    రవి

  1479. బోడి పద్యం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    03/31/2009 6:31 am

    నర్సింహన్న మాటలు చాన్నాళ్ళకింద ఆల్ఫా హోటల్్ కాడ చాయ్్ తాగినట్లనిపించింది. సుట్టుపక్కల ఎవరి మాటలు వారివి. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, కప్పు సాసర్ల చప్పుడు, ఆటోరిక్షాల అరుపులు, సిగరెట్ల కంపులు, అయినా దిల్ ఏక్దం ఖుషీ! ఆ చాయ్ లెక్క ఏ చాయ్ లేదు.

    “తెల్ల పొగరు” అంటే సరిగ్గా ఎరుకగాలె. రంగు తక్కువయితే మాత్రం పొగరు తక్కువయితదా అనిపించింది.

    “సగం కూలిన మసీదు గోడలు” అన్న లైను కూడా కొంచెం అర్థం కాలేదు.
    నమాజు చేసేచోటే మసీదు. నమాజు లేకుంటే మసీదెట్లయితదో తెలవదు.
    అట్లనే ప్రార్థనచేస్తే మందిర్్ కాని, పంచాయితీ చేస్తే అయితదా అనిపించింది.
    చిన్నప్పుడు కవిత్వం చదవాలంటే భయమయితుండె, అర్థం కావేమో అని. ఇప్పుడు కూడా భయ మయితది, ఎక్కడ అర్థమయిపోతదేమో అని.
    ========
    విధేయుడు
    -Srinivas

  1480. బోడి పద్యం గురించి narsimha గారి అభిప్రాయం:

    03/30/2009 10:40 am

    ఈమాట్లో కయిత్వం చదువుడు నాకూ, మా దోస్తుల్కూ ఆదతు పళ్లేదు. పూల్ గురించి, పూబోడుల గురించీ, పిరుదుల గురించీ, అమ్మాయి కోసమో, అబ్బాయ్ కోసం రాసిందో తెలియని నయా భావ కవిత్వం జర ఎక్కువ. ఈ మాట కయితల్లో. అమెరికా వెళ్లి సనాది వారాలు ఆంధ్రా యాదొచ్చి, అ ఆలు నేర్చుకుని రాసే వోళ్లు ఈడ మస్తుగా కనిపిస్తరు.

    ఎవురో సెప్పిన్రు, అఫ్సర్ కవిత మీద మస్తు లొల్లి పడ్తున్నరని ఈడ.

    పని మాల సదివిన. నాకయితే ఇంక కడక్ చాయ్ లాగా రాసుండాలన్పించింది. చాయ్ పత్తా జర తక్కువయింది కదన్నా! ఇంకా జోరుగా మాటలు పడాలన్నా! ఇంకా ఇలాంటి కయితలు రావాల. తెల్ల పొగరు అణగిపోవాల. ఈ మాటలో కూడా జబర్దస్తు కయితలు వస్తయని ఎడిటర్లు జర సమజున్నోళ్ళే అని ఇయ్యాల్నె సమజయ్యింది.

    నర్సింహ

  1481. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/30/2009 8:56 am

    రవికిరణ్,

    మీ ప్రశ్నకి బాబ్జీలు ఏమని ప్రతిస్పందిస్తారో..నాకు తెలీదు గానీ…అక్షరం లో వుండే గాడత ..కవితా వ్యక్తీకరణ..ఇవి అందరివీ ఒక్క ప్రమాణంలోనే ఉండవని..ఒకే అనుభవ నిర్వచనం లోకి ఒదగవని….దానిని బట్టే కవుల్లోని ఉత్తమ..మధ్యమ..శ్రేణులని..సాహిత్యంలో నిర్ణయిస్తారనీ..మనకి స్వానుభవంగానే తెలుస్తుంది. వాదన కోసం..బలం లేని కవితాపంక్తుల్ని ..ఓహో! అని అనొచ్చు. కానీ..”రసం”..”స్వారస్యం”..అన్నవి పరిగణనలోకి తీసుకున్నప్పుడు..ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అన్నట్టుగా..అందరు కవులూ సమానమే అవరు. అలా ఎందుకు కారో విడమరిచి చెప్పాలంటే..విమర్శ ఉండాలి. ఇది ఓట్లు వేయించుకుని best singer అయిపోవటం లాంటిదీ కాదు.

    శాస్త్రీయ సంగీతరంగంలోని ఉద్దండులైన శ్రీపాద పినాకపాణి గారి ..అలాగే రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారి అభిప్రాయం..కవిగా త్యాగరాజుని గురించి చెప్పబడి వున్నది… ఏకోశానా పరిగణించ వలసిన పనే లేనట్టుగా ఎవరుగానీ మాట్లాడటం ఆ రంగంలోని వారి విద్వత్తుతో పోటీ పడి మాట్లాడటం లాంటిది. అలాంటి కృషి చేసిన వారి మాటకి ఉన్న చెల్లుబాటు అది లేనివాళ్ళు అంటే ..మరి, దానికి రాదు.

    అలాగే వ్యక్తిగతంగా నేను గద్దర్ నీ..అన్నమయ్యనీ..త్యాగరాజునీ ఒక్కలాగే అర్ధంచేసుకుని ఆనందిస్తాను…అని మీరు అంటే..దాన్ని మీ వ్యక్తిగతమైన అభిప్రాయంగా మాత్రమే గ్రహించి..ఊరుకోవచ్చు.కానీ అదే సాహిత్యం విషయంతో పోల్చిచూసి దానికి ఉండే standards ప్రకారం అయితే మీ వ్యాఖ్య విమర్శ కి లొంగదు. కవితాబలం ముందు అన్నమయ్య తో పోటీకి గాని..పోలికకి గానీ..అస్సలు నిలవరు మీరు చెప్పిన ఆ ఇద్దరూ!!

    రమ.

  1482. బోడి పద్యం గురించి యుగంధర్ గారి అభిప్రాయం:

    03/29/2009 9:34 am

    ఈ పద్యమ్మీద లైలా, రాళ్ళపల్లి శర్మ, రావూరి శ్రీలత గార్లు చేసిన వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నా.
    ఏదో నాలుగు వరద తరగల్లో కొట్టుకుచ్చిన భాగ్యానికి తెలుగుకవిత్వమంతా మాకు తెలుసు, ఈమాటకొస్తే మాకే తెలుసు అని మిలట్రీకవాతు విద్వాంసుల పుంజీడు రణగొణధ్వనులు వినీవినీ వేసారిన ప్రాణానికి మీ వ్యాఖ్యలు హాయిగా ఉన్నాయంటే నమ్మండి.
    అదలాగుండగా, పైన రవికిరణ్ గారు లేవదీసిన కొన్ని ఆసక్తి కరమైన ప్రశ్నలకి రాళ్ళపల్లి గారి వ్యాఖ్య మంచి సమాధానమిస్తోంది.
    శ్రీలతగారు కూడా అడగాల్సిన ప్రశ్న అడిగారు. శ్రీలతగారూ, నాకు ఇంకో ప్రశ్న తడుతోందండీ – ఒక కవి విభిన్నమైన, ఆలోచనల్ని, పరస్పరం విరుద్ధం కాకపోయినా కొంత విభేదించే ఆలోచనల్ని రాయడం మరీ అంత విడ్డూరమంటారా?

  1483. బోడి పద్యం గురించి ravinder posani గారి అభిప్రాయం:

    03/28/2009 8:56 am

    http://www.sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=22306&subcatid=3&categoryid=1

    బాబ్జీలు గారు:

    సోమవారం పేజీలో అఫ్సర్ గారి ఈ కవితనే మీరు ఉదాహరణ గా ఇచ్చారు. చాలా ధన్య వాదాలు. మీరు లింకు ఇచ్చి వుంటె బాగుండె. వెతికి పట్టె సరికి ఆలస్యం అయ్యింది. అయినా, మంచి కవిత కోసం ఆ మాత్రం శ్రమ పడాల్లెండి.

    ఇందులో కూడా కవి ‘నా యబ్బ ‘ అనే సంబోధన ప్రయోగించారు. అది అశ్ల్లీలమా కాదా అనేది నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ‘నా యబ్బ’ అనకుండా ‘ నా తల్లి’ నీ అమ్మ’ అని వుంటే ఈ కవిత అశ్లీలం్ అయ్యేదా?

    అమెరికా ఆర్ధిక మాంద్యం మీద ఇంకా ఏమయినా కవితలు వస్తే, దయచేసి, ఎవరయినా చెప్పండి. తెలుగు కవులు దీన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారా అని మనం ఆలోచించాలి. నిజానికి ‘బోడి’ (అంటే నిరలంకార -నిరాడంబర – అతి సాధారణ అని నాకు అర్ధమయింది) పద్యాలు ఆ విషయం మీద ఒక ఇంకా రావాలి, మీలో కసి, ఉద్వేగం అనేవి వుంటే. తెల్లారి లేచి, మీరు అదే పనిగా కాగితాలు, ఈ మాట స్పేసూ ఖరాబు చేసే బదులు ఒక శీలవంతమయిన పద్యం రాస్తే బాగుంటుందేమో చూడండి.
    రవీందర్

  1484. బోడి పద్యం గురించి Shankar గారి అభిప్రాయం:

    03/28/2009 6:33 am

    బాగుంది. నేను బాగుందన్నది ‘బోడిపద్యం’ కవిత గురించి కాదు. ఆ కవిత మీద జరుగుతున్న చర్చ గురించి. వారపత్రికల్లో, దినపత్రికల సాహిత్యానుబంధాలలో కనిపించే కవితలను ఒకటి, రెండు లైన్లు చదివి నచ్చితే చివరంటా చదవడం, లేకుంటే వదిలేయడం ఆ తర్వాత మరచిపోవడం ఇదీ ప్రస్తుత (నా) పరిస్థితి. కాని కవితల గురించి ఇంత విస్తృతంగా, సాధికారంగా, సమర్థంగా, సమగ్రంగా చర్చ కొనసాగడం చాలా బాగుంది. తెలుగు భాష, తెలుగు కవిత్వం, సాహిత్య విమర్ష కలకాలం సజీవంగా ఉంటాయన్న నమ్మకం కలిగింది. అందరికీ ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  1485. నాకు నచ్చిన పద్యం: ధూర్జటి చంద్రబింబపు వర్ణన గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/28/2009 3:52 am

    గురుతుల్యులైన బృందావన రావు గారికి
    మీ వ్యాసంలోని చివరి పేరా ధూర్జటిని అమితంగా అభిమానించే నాకు ఖేదం కలిగించింది. పోతన తరువాత భక్తి రసాన్ని అద్భుతంగా పోషించిన మహా కవి ధూర్జటి.
    వాకిట గాచియుండు హరి వారిజ సంభవ ముఖ్య దేవతా
    నీకమునుం దలంప కవనీధరజా ధరహాస లోలతం
    బోక సమీపవర్తులగు బుత్రుల చూడక భక్త భక్తి క
    న్యా కర పంకజ గ్రహణ నైష్ఠికుడై కడు సంభ్రమంబునన్
    అనే ఈయన పద్యం పోతన సిరికిం జెప్పడు పద్యానికి దీటైనది.
    రాజ భోగ నిరాసక్తుడై, దుష్కర్మ నిరత రాజ నిరసనానికి అణుమాత్రం జంకక, జగత్సర్వం తన ఇష్ట దేవ (శివ) మయమని భావించి, ఈ భావాలనే తన కృతులలో పలుమార్లు ప్రస్ఫుటంగా వెలువరించిన ఈ మహ భక్త కవిని రాయలే తన కీర్తి నినుమడింపచేసుకోడానికి సాదరంగా ప్రార్ధించి తన ఆస్థానంలో ఉంచుకొనివుండవచ్చు గానీ ఈకవి తనంతట తాను రాజాశ్రయం అర్థించాడని అనుకోలేము. ఈయన తన కృతి నరాంకితం చేయలేదు సరిగదా ఏ మూలలోనూ రాయలవారి ప్రసక్తి తెచ్చి స్తుతించలేదు. తనని పెంచి పెద్ద చేసి రాజుగా నిలబెట్టిన అప్పాజీని రాయల వారు నిర్దాక్షిణ్యంగా శిక్షించినపుదు రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని బాహాటంగా గర్హించిన భక్త్యాసాదిత మహా ధైర్య సంపన్నుడు ధూర్జటి.
    నీతుల కేమి యొకించుక
    బూతాడక దొరకు నవ్వు పుట్టదు సభలో
    బూతులు నీతులు లోక
    ఖ్యాతులు రా అని అరసికుడైన ప్రభు చిత్తానుసారులై వాడు విదిల్చే ధనం కోసం వారి మనో రంజనానికై తమ కవితలో బూతులు నిరాఘాటంగా చొప్పించే క్షుద్ర దరిద్ర నీచ కవులతో సమంగా ధూర్జటిని తలవడం
    ఉరగ భూషణుతోడ ఊర జోగులను సరిచేసి ఎన్నిన చందాన మీరు
    అమిత భక్తినిధి మహా కవి తోడ సమముగా కవి పిశాచముల లెక్కింప
    డమే అవుతుంది.
    మంచెల మీద కెక్కి కటి మండలి చుట్టిన పారుటాకు లిం
    చించుక సంచలించి మరునిల్లు బయల్పడ సేయునట్లుగా
    చెంచెత లార్చి వేయుదురు అనే 1-2 పద్యాలను చూసి చాటు పద్యం ఆధారంగా ఈయనను వేశ్యాలోలుడిగా భావించడం తప్పేమో . పోతన కూడా కొన్నిచోట్ల శృంగార రసాన్ని పోషించాడు.
    దినముం జిత్తములో సువర్ణ ముఖరీ తీర ప్రదేశామ్ర ……….
    గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు .. ఇలా అనేక పద్యాలు ఈయన స్వఛ్ఛ ప్రవర్తనని ఎత్తిచూపిస్తాయి.

    ఓ సామీ! ఇటువంటి కొండ దరిలో ఒంటిం బులుల్ సింగముల్
    గాసిం బెట్టెడి కుట్ర నట్టడవిలో కల్జువ్వి క్రీనీడ యే
    యాసం గట్టితి వేటిగడ్డ నిలు నీ వాకొన్నచో కూడు నీ
    ళ్ళే సుట్టాలును దెచ్చి పోసెదరు నీ కిందేటికే లింగమా అనే పద్యంలో
    భక్తుని ఆత్రత ఆర్ద్రత నిండి కనిపిస్తాయి.

    అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్లని కల్వలే? కడుం
    బచ్చని రాలు బిల్వ నవ పత్రములే? అరుణాశ్మ భంగముల్
    విచ్చిన తెల్ల దామరలె? విశ్వపతీ! విషమోపలంబు లె
    ట్లచ్చుదలయ్యె నీకు? అవి అందునె గంధ మృదుత్వ శైత్యముల్
    అంటూ
    ఉనికి శిలోచ్చయంబు; నిజయోష శిలోచ్చయ రాజ పుత్రి; నీ
    ధనువు శిలోచ్చయంబు; పురదాహ! రధీకృత రత్నగర్భ! నీ
    మనమునకీ శిలా శకల మండన మెట్లు ప్రియంబు సేసె? నే
    మనగల వాద నిన్ను వ్రత హాని యొనర్చు దురాత్ముడుండగన్
    అని ఏనుగు ఉపాలంభించడం హృద్యంగా వుంటుంది.

  1486. నాచన సోమన చతుర వచో విలాసం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/27/2009 10:31 pm

    శతావధాన ప్రబంధం అనే సుబ్బన్నగారి పుస్తకం నాకు యాధృఛ్ఛికంగా ప్లాటు ఫారం మీద అమ్మే పుస్తకాల కొట్లో (సుమారు 25 ఏళ్ళ క్రితం) ఐదు రూపాయలకు దొరికింది. అది సుబ్బన్న కవిగారు స్వహస్తాలతో కొణిజేటి రోశయ్య (నేటీ ఆర్ధిక మంత్రి) గారి పేరు లిఖించి ఆయనకు బహూకరించింది. ఇందులో కవిగారి శతాధిక శత-అష్టావధానాలలోని ముఖ్యమైన పద్యాలను తేదీ ఊరు వివరాలతో ప్రచురించారు. దత్తపదులూ, న్యస్తాక్షరులూ, నిషేధాక్షరులూ, సమస్యలూ, వర్ణనలూ కలిసిన ఈ గ్రంధం చాలా మనో రంజకంగా ఉంటుంది. నేనుదహరించిన మత్తేభమాలిక భాగాలు ఇందులోనివే. ఇది చదివి నేను వారి ప్రగాఢాభిమానినై ఆ కాలంలో (1975-78 సమీపంలో)
    ఒక పోతన్నను చెప్ప వచ్చు, ప్రతి నింకొక్కండుగా సూరన
    ప్రకట ప్రజ్ఞుని బల్కవచ్చు, నిక చాల్ రమ్యాతి రమ్యంబు తా
    వక వైధుష్య కవిత్వ సాధిగత భవ్యత్వంబుతో బోల్పగా
    సుకవుల్ నన్నయ దొట్టి చెళ్ళపిళ వంశ్యుల్ వామనుల్ సుబ్బనా!
    అని ఇంకొన్ని పద్యాలతో వారికి అభివందనలు పంపించాను. ప్రతిగా వారు
    తాము రచించిన ధనుర్దాసు, గోపవధూ కైవల్యం అనే లఘు కావ్యాలను పంపించారు. (ఇవి ఏవీ నన్నయ,పోతనల కవితా ప్రమాణాలను అంద లేదు). ఆరి వేరొక రచన అవధాన విద్య గురించి మీరే ప్రస్తావించారు కాబట్టి దాన్ని గురించి నేను తెలుపక్కరలేదని భావిస్తాను.
    కానీ అవధాన పద్యాలన్నీ చాలా చాలా రసవత్తరంగా వున్నాయి. ముఖ్యంగా వృత్తమాలికలు – నా స్మృతిపధంలో నిలిచిన ఒక మాలికలోని కొంత భాగాన్ని
    మీతో పంచుకుంటాను. ఇందులో కవి తన పృచ్ఛక సంఘాన్ని గ్రహ దేవతలతో పోలుస్తాడు

    అకలంకాత్ములు, హవ్యవాహ సమ తేజోలంకృతుల్, లోక దీ
    పకు, లారాధ్యు, లకుత్సితుల్, నత జగద్బంధుల్, త్రయీ మూర్తు, లా
    ఢ్య కృపా పూర్ణులు, సర్వ దేవమయు, లవ్యాఘాత నిత్యోదయుల్
    సుకృతి శ్రెష్టులు మీరు సూర్యులనుచున్ , శుద్ధాంత రంగుల్, సుధా
    ముకుర స్వఛ్ఛముఖ ప్రసన్నరుచి రమ్యుల్, నిత్య వర్ధిష్ణు చా
    రు కళా స్నిగ్ధు, లమేయ సత్పధ విహారుల్, మీరహో దేవదే
    వ కపర్దాభరణుల్ హిమాంశు లనియున్ స్వర్ణ ప్రభా భాసురుల్
    ప్రకట ప్రజ్ఞులు సత్య వాదులు యువత్వ ప్రౌఢు లత్యంత ధ
    ర్మ కఠోరుల్ ……………………………………………
    వికచాబ్జాక్షులు పాండితీ భర వయో వృద్ధుల్ ధనుర్మీన నా
    యకు లాంగీరస కీర్తనీయులనుచున్ అభ్యస్త తర్కాది శా
    స్త్ర కలాపుల్ సుయశో ధురీణులనుచున్ క్ష్మా నందనుల్ మీరు మా
    మక భాగ్యామృత భాగ దాన శుభ ధామస్వామితా వైభవా
    త్మకులై తత్తదనూన భాగ్య ఫల సంపద్దాన దీక్షా క్షమ
    ప్రకృతుల్ మీరని మీకు మీకు వినయ వ్యాపార మేపార మ
    స్తక విన్యస్త శయ ప్రకారము నమస్కారమ్ము గావించి గొం
    కక భావించెద సభ్యులార వినతిన్ గావించెదన్ మీకు పృ
    ఛ్ఛక సంఘంబున వృద్ధమూర్తి వరుణాశన్ దోచునో సౌరి, త
    న్నికట క్షోణి రహించునో బుధుడు, పృశ్ని స్వాంత లబ్దాశయుం
    డకఠోరోత్పల మాలికా సుభగ కన్యా మోహనాపాంగ దృక్
    ప్రకరావలంబి విజృంభి విక్రముడు రక్షఃశ్శాస్తనున్ మించునో
    — ——-
    సుబ్బన్న శతావధాని గారు పొద్దుటూరు (కడవ జిల్లా) వాస్తవ్యులు. ఆ కాలంలో సుబ్బన్న శతావధాని పొద్దుటూరు అంటే పోష్టు వెళ్ళేది. నా దగ్గర వున్నపుస్తకాన్నివెదకి చిరునామా దొరికితే పంపుతాను. దీనికి కొంత వ్యవధి కావాలి.

  1487. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/26/2009 11:30 pm

    సంగీతం చెవుల్ని రంజింప చేస్తే, సాహిత్యం మనసుని తాకుతుంది. అప్పుడే ఆ సంగీతాన్ని మరింతగా ఆస్వాదిస్తాం.
    కేవలం సరిగమలతోనే పాడుతూ, సాహిత్యం లేని సంగీతం అందర్నీ అలరించలేదు. లోతైన అవగాహన లేకపోయినా సంగీతాన్ని పామరుల వరకూ తీసుకెళ్ళేది సాహిత్యమేనని నేననుకుంటున్నాను. “సాహిత్యం కావాలంటే యింట్లో కూర్చుని చదువుకో. సంగీతం కోసమే కృతులు విను” అన్న వ్యాఖ్యలో తొందరపాటు కనిపిస్తోంది. “ఎందరో మహానుభావులు – అందరికీ వందనములు” అనే సరళమైన సాహిత్యం లేకపోతే ఆ శ్రీరాగ కృతి ఎంతమందికి చేరేదో చెప్పండి? సాహిత్యం లేకపోతే వర్ణంలా తయారయ్యేది.
    త్యాగరాజు కృతుల్లో సంగీతమున్నంత స్థాయిలో సాహిత్యం లేదన్నారు. ఇదే మాట మరి క్షేత్రయ్య విషయంలో ఎందుకనలేదు? రామదాసు కెందుకాపాదించ లేదు?
    అలాగే సాహిత్యంలో తప్పొప్పులు పాడే వారిదా, లేక అవి రాసి, మనకందరికీ అందించిన శిష్యుల చేతి చలవా అన్నది తెలుగు భాషొచ్చిన మనం చెప్పగలం. తమిళులు తప్పు పాడితే క్షమంచచ్చు. తెలుగు వారి మాతృభాష కాదని సరిపెట్టుకోవాలి. మహాను భావుల్ని, మగాను భావులుగా పాడే తెలుగు ప్రముఖులూ వున్నారు. వారినేమనాలి?

    త్యాగరాజు శిష్యులందరికీ తెలుగొచ్చు. వారందరూ తెలుగులోనే కృతులూ, వర్ణాలూ స్వరపరిచారు. వీణ కుప్పయ్యర్, వెంకట రమణ భాగవతార్, మనంబుచవాది వారూ అందరూ తెలుగులోనే రచించారు. ఇప్పుడు మనకున్న కృతులు వీరు పొందుపరచగా వచ్చినవే! కాబట్టి వారు భాష రాక సరిగా రాసుండక పోవచ్చుననడానికి అవకాశం లేదు. పైగా వారందరూ ఆ కృతులు పాడ్డం నేర్చుకున్నారు కదా? అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు దొర్లే అవకాశముంది. ఎవరూ కాదనరు. పండితులు ( నేను కాదు ) చూపించిన తప్పులన్నింటికీ శిష్యుల్ని బోనులో నిలబెట్టడం సరికాదు.

    పాడేవాళ్ళు ఎవరికి తోచినట్లుగా వారు సాహిత్యాన్ని మార్చుకున్న సందర్భాలున్నాయి. ఆ మధ్య అమెరికాలో ఓ ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు అప్ప రామ భక్తి కృతిలో “కపి వారిధి దాటునా
    కలికి రోట కట్టునా?” అనే చరణాన్ని “కపి వారిధి దాటునా – కలికి రోట కొట్టినా” అని పాడింది. విన్నందరూ “ఆహా – ఓహో” అంటూ మెచ్చుకున్నారు. పాడినావిడ తమిళావిడ కాబట్టి ఎవరూ అనలేదు. ఇదే తెలుగు వాళ్ళు ఓ తమిళ కృతినో, కీర్తన్నో సాహిత్యాన్ని ఖూనీ చేస్తూ పాడమనండి చూద్దాం. ఆ గాయకుడు ఆ సభా ప్రాంగణాన్ని దాటి బయటకొస్తే ఒట్టు. కానీ ఏం చేస్తాం? కర్ణాటక సంగీతమూ, త్యాగరాజూ ఈ రోజువరకూ అందరి గొంతులోనూ పలకడానికి కారణం తమిళులే! తెలుగు వారెవరూ పట్టించుకోరు. ఇదీ మన దౌర్భాగ్యం.
    త్యాగరాజు కవయినా కాకపోయినా కొన్ని కృతుల్లో వాడిన భాషా, భావమూ కవిత్వంలాగే వుంటాయి. అందులో కొన్ని వాక్యాలు ఇప్పటికీ మనం వాడుతూనే వుంటాం.

  1488. బోడి పద్యం గురించి sreelata raavuri గారి అభిప్రాయం:

    03/26/2009 11:56 am

    http://www.pranahita.org/2009/03/nallanallani_navvu/

    ఈమాటలో సురయ్య మీద, కొత్త ప్రాణహితలో నవ్వు మీద అఫ్సర్ గారి కవితలు చదివాను.
    ఆ రెండిటికీ చాలా తేడాగా వుంది ‘బోడి పద్యం”
    ఈ తేడా గురించి అసలు చర్చ జరగాలి.
    ఒకే కవి రాసిన మూడు కవితలు ఇంత భిన్నంగా ఎందుకు వున్నాయి? ఏ కవితలో కవి ఆత్మ దొరుకుతుంది? (ఈ ఆత్మల గొడవ నాకు నచ్చలేదు కాని, కొద్దిసేపు ఆలోచిద్దాం)
    కవితలు సుతారంగా వున్నాయి, ఈ కవిత మోటుగా వుంది. అసలు కవిత్వ లక్షణం ఏమిటి? ఒకే కవి రెండు రకాలుగా రాసినప్పుడు ఆ కవిని ఎలా అర్ధం చేసుకోవాలి?

    శ్రీలత

  1489. బోడి పద్యం గురించి sarma rallapalli గారి అభిప్రాయం:

    03/26/2009 8:39 am

    అయ్యా, నేను ముస్లింని కాను. నాకు ముస్లిం సంప్రదాయాల గురించి అసలు తెలియదు కూడా. కాని, కవి ఈ కవిత ‘సుంతీ’ గురించి రాశారనీ, ఆ చిన్న అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ మత విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడుతున్నారనీ నా కొద్దిపాటి జ్నానం చెప్పింది. కాని, అంతకంటే బలమయిన అనుభూతి/ ఉద్వేగం (దీన్ని బాబా కవితా ధార అన్నారేమో!) ఈ కవితలో నన్ను కట్టి పడేశాయి.

    ఇది నాకు తెలియని అనుభూతి (భవిష్యత్తులో తెలిసే అవకాశమూ లేదు). అయినా, కవిత నన్ను చాలాసేపు ఆలోచింప జేసింది. చాలా విషయాలు , మతానికి సంబంధించినవి ఉదా:
    దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం

    అన్నప్పుడు దర్గాలకి వెళ్లే నేనే గుర్తు వచ్చాను.
    మా నెల్లురు , ఒంగోలు జిల్లాలో మస్తానయ్య, నాంచారయ్యని ఎవరిని అడిగినా ఈ పంక్తికి అర్ధం చెప్పగలడు. నా బ్రాహ్మణత్వం గాయత్రీ మంత్రం. కాని, దర్గా దగ్గిర మా అమ్మ మన్నతు చేసుకుంటుంది. అంత వరకే నాకు తురక మతం తెలుసు.

    మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
    సగం దళితం సగం ఖండితం

    పల్లెల్లో తురకల్ని ఎవరిని అడిగినా, వాళ్ల బతుకు పద్ధతి సగం కింది కులాల వారితో కలుస్తుంది.

    ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది. లైలా గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవి వారి పఠనం. నాకు ఆ విషయాలు తెలియవు. ఈ కవితని నేను ఒక పల్లెటూరి వాడిగా చదివాను. ఇందులో అశ్లీలం ఎమిటొ నాకు తెలియదు.
    కవిత రాసినందుకు కవికీ, వేసినందుకు ఈమాటకి ధన్యవాదాలు. ఈ కవితకి ముందు అఫ్సర్ అనే పేరు నాకు తెలియదు. వెనక్కి వెళ్లి, ఆయన రాసిన్ కవితలు చదివాను. సురయ్య గురించి కవిత చదవండి. ఆర్యులకు అది బాగా నచ్చె పద్యం.
    రాళ్లపల్లి

  1490. బోడి పద్యం గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:

    03/26/2009 7:18 am

    బొల్లొజు బాబా గారు,

    కవిత, అఫ్సర్ గారు కాకుండా, ఏ రవికిరణో, బల్లోజు బాబా గారో, లేకపోతే మరొకరో వ్రాశారనుకోండి, అప్పుడు కూడా మీరు, ఏర్నేని గారు ఈ కవితని ఈ రకంగానే అర్థం చేసుకునుండే వారా?

    “The reader then muses – The poet is a teacher of literature. He reads lot of poetry of his own students. He reads lot of other poets all over the world,” రచయిత గురించి ఈ విషయం తెలియకపోతే బహుశా కవితకి ఈ కవితార్థం మనసుకి వచ్చుండదేవో!

    నిజంగా ఈ కవిత “Look! Each piece creates a broken image. Look! multiple discordant images are lying all over the place. Each broken stanza, oh! even more painful – each broken sentence, phrase, – sings a different song. For Heavens sake! , the pieces do not even sing in one language. There is no one cohesive religious tune. Not one unified theme . Not a single consolidated thought. Nothing makes any sense,” అఫ్సర్ గారు కాకుండా మరొకరు వ్రాసుంటే పైన ఉదాహరణతోనే ఆఖరయ్యుండేదేవో, ఆలొచింఛారా.

    లైలా గారి అబిప్రాయం తప్పని చెప్పటం నా ఉద్దేశం కాదు. అఫ్సర్ గారి పేరు, ఆయన యు.టి ఆస్టిన్ పేరు ఈ కవితలోకి విస్తరించాయెమోనని నా అనుమానం, అంతే.

    నాకైతే, ఈ కవిత చాలా బోడిగానే కనిపిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది.

    ఒక మతాచారం బ్లిస్ అని అనుకున్న తర్వాత దానిమీద మరోరకవైన అభిప్రాయం ఎలా వీలవుతుంది లైలా గారు?

    “By all means. Cry all you want. But, if you are a doctor, for God’s sake , why such agony over a few words? Really, it is teensy bleeding which can be easily stopped and after all, excised prepuce is a tiny piece of useless skin.” కదా కవి అయినంత మాత్రాన “If you are an artist, let it bleed. Let it bleed” అనేది హిపాక్రసి నేవో.

    రవి

  1491. క్రీడాభిరామము:1 వ భాగం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/26/2009 3:09 am

    వల్లభ రాయని వాగ్వైభవం వర్ణించే కంద పద్యాలన్నీ చాలా హృద్యంగా ఉన్నాయి.
    సరివత్తు రీవి నిర్జర అన్న పద్యంలో జలజ అనే పదం జలద అనే పదానికి బదులు పొరపాటున పడిందేమో అనిపిస్తుంది. అట్లాగే
    వెలది కోరల మోము వేల్పు చేత కి బదులు
    వెల్ల కోరల మోము వేల్పు చేత ఉండాలేమో చూడండి

    నా చిన్నప్పుడు పాఠశాలలో క్రీడాభిరామం శ్రీనాధ కృతి అని చదువుకున్నాను. (క్షమించాలి చదివింది క్రీడాభిరామం కాదు)
    అది వల్లభ రాయ కృతి అని ఇప్పుడే తెలిసింది. కృతజ్ఞతలు.
    నేను చంద్రలేఖా విలాపం చదివాను. ఇదీ అటువంటి కావ్యమే అన్నారు. జగ్గ కవిపై ఏర్పడిన ఏహ్య భావం ఈతని పైన కూడా కలుగుతుందేమో – కానీ ఇప్పటి దాకా కవిత్వం చాలా బాగా వుండి ఆకర్షిస్తోంది. జగ్గకవి లాంటి క్షుద్ర కవుల నోటిలో బడడం వలననే నేమో కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడలు, హాటక గర్భు రాణి ఐన శారదాంబ తీవ్ర మనస్తాపానికి లోనై విలపించింది.

  1492. నాచన సోమన చతుర వచో విలాసం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    03/25/2009 10:16 am

    ఆ. నచ్చినట్టి వనిత మెచ్చినట్టి కవిత
    దృష్టి బట్టి యుండు సృష్టి లోన
    కొత్త దృష్టి చూపి కొత్త స్ఫూర్తిడు రాత
    రాత కాదు నుదుటి రాత మార్చు!
    ప్రసాదు గారు మీరుదహరించిన శ్రీ సుబ్బన్న గారి పద్యాలు ఆసక్తితో చదివాను. అదృష్టం కొద్ది అందిన వారి ‘అవధాన విద్య’ పుస్తకంలో ఇందులోదేదైనా చదివానేమో గుర్తురావడంలేదు. వారి వచనం, వివరించే శైలి కూడా నన్ను ఆకట్టుకుంది.

    అది చదివిన తరువాత, వారి రచనలేమైనా ఉన్నాయేమో అని ఇంకా వెతుకుతునే ఉన్నాను. మంచి, కాదు, గొప్ప రచయిత, (గొప్ప వక్త అని కూడా విన్నాను కాని చూసే భాగ్యం లేదు), కూడా అయిన వారి రచనల వివరాలేమైనా ఉంటే చెప్ప మనవి.
    ========
    విధేయుడు
    -Srinivas

  1493. బోడి పద్యం గురించి bollojubaba గారి అభిప్రాయం:

    03/25/2009 8:18 am

    ఎర్నేని గారి అభిప్రాయాన్ని ఇప్పటికి నాలుగు సార్లు చదివాను.

    ఒక కవితపై సైకో/సోషియో అనాలిసిస్ ఇంత అద్బుతంగా చేయవచ్చునని అర్ధంచేసుకొన్నాను. గొప్ప విశ్లేషణ.

    (అక్కడక్కడా అమెరికా ఉటంకింపులు కొంచెం ఇబ్బంది పెట్టాయి, వాటి బాక్ గ్రవుండ్ తెలియక 🙂 ).

    కవితపట్ల ఆమె వెలిబుచ్చిన అభిప్రాయలతో నూరు శాతం ఏకీభవిస్తున్నాను.

    బొల్లోజు బాబా

  1494. బోడి పద్యం గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:

    03/25/2009 7:42 am

    అశ్లీలం గురించీగొడవేవిటి. కవిత నచ్చిందో, నచ్చలేదో అంటే సరేగానీ, కవిత అశ్లీలవటవేవిటి? అలా అనేవాళ్ళు ఎందుకో కూడా చెబుతే బాగుండేది. రహశ్యాంగాన్నో (ఏవిటో అందులో అంత రహశ్యం), దానికి జరిగే వొక ప్రక్రియనో అశ్లీలవని అనగలవా? పోనీ అంత అభ్యంతరవనుకుంటే ఆ కొన్ని పదాల్ని పరాయి భాషలో అనుకోని చదివేసుకుంటే సరిపోతుంది కదా. ఆ పదాల్ని మాత్రం చక్కగా, ఏ ఆంగ్లంలోనో, సంస్కృతంలోనో అనువదించేసుకుని చదివేస్తే అసలు బాధే లేదు. ఆ భాషల్లో ఈ అశ్లీలవైన(?) పదాలు, ప్రక్రియలు చదవడం మనకి అలవాటే కదా.

    ఇప్పటికి నేనో అరడజను సార్లు చదివేనీ కవితని, నాకేం బోధపడలా కవితాత్మో, కవితార్థవో దాన్ని మీరేవన్నా సరే. కవిత్వంలో abstraction అవసరవే. కానీ దాన్ని వొక పెయింటింగ్ స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం వుందా? మనిషి మెదడుకి రంగుల చిత్రాలు, పద చిత్రాలు అర్థవయ్యే తీరు వేరు, వేరని నా అభిప్రాయం.

    పెయింటింగ్ ని కళ్ళతో చూడంగానే మనసులోకి దూకే ఆ పచ్చి ఎమోషనల్ abstraction, కవితని చదివి దాన్ని అర్థం చేసుకుని అనుభూతించగలిగే ప్రక్రియ వేరు వేరని నా అభిప్రాయం. నక్కని చూసి వాతలు పెట్టుకున్నట్టు, అవకాశం ఉందికదా అని, భాషకున్న (పెయింటింగ్ కి లేని, అందుకనే పెయింటింగ్లో ఆ abstraction అవసరవేవో) ఒక విసృతవైన వ్యక్తీకరణని ఉపయోగించుకోకుండా మామూలు మనుషులకి అర్థంకాని కవిత వల్ల ఉపయోగవేవిటి. పోనీ ఆ కవిత వ్రాసిన వారో, లేకపోతే ప్రచురించిన సంపాదకులో ఆ కవితతోబాటు ఆ కవితార్థాన్ని కూడా ప్రచురించుంటే బాగుండేది.

    సాధారణ ప్రచురణలకి లేని ఒక గొప్పతనం వెబ్ ప్రచురణలకుంది. ఇక్కడ కవిత, కథ, వ్యాస కర్త తన అభిప్రాయాల్ని పాఠకులతో ఏక్టివ్ గా పంచుకునే అవకాశం వుంది. I do not know the reason why, here in “eemaata” writers, most of the times do not participate in the debate. Though they are the instigators of the debate by mare act of writing that poetry, story, or an essay, they shy away from the debate. Many times even our editors do the same. I hope they utilize the opportunity of this facility, and participate in this live discussion and help readers like us to a better understanding.
    మరో విషయం అభిప్రాయలు రాసే వాళ్ళ పేర్లతో ఆ ఆటలేవిటండి. పేర్లను వక్రీకరించినంత మాత్రాన ఒరిగేదేవిటి.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  1495. నాచన సోమన చతుర వచో విలాసం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/24/2009 11:28 pm

    చివరి పేరాలో మీ అభిప్రాయంతో నేను పరిపూర్ణంగా ఏకీభవిస్తాను. అందుకే నవనాధ చరిత్ర, బసవపురాణం, రంగనాధ రామాయణం చదివినా వాటిలో ఒక్క పంక్తీ నా ధారణలో నిలువలేదు. ఐతే హృదయంలోనూ ధారణలోనూ నిలిచిన వందలాది పద్యాలలో పోతన తరువాత గౌరన ద్విపదలే ఎక్కువ. ఏ విధమైన అనాసక్తి కలుగనీయకుండా ఆసాంతం చదివింపచేసే ఈ గ్రంధాన్ని నేను చాలా సార్లు చదివాను. దాదాపు నాటక ఫక్కీలో వుండే ఇందులో సంభాషణలన్నీ హృద్యమై కంఠస్థమయ్యాయి.

    “భావమయ నానాలోక సౌభాగ్య సౌఖ్య వివేకాత్త మహానుభూతులకు వాగాకారతన్ గూర్చి భవ్య విరించి ప్రమదా సుధామయ కటాక్షారూఢ జీవత్కలా నవ చైతన్యము వోసి కావ్య భువనానందమ్ము” కల్పించు వాడే కవి.

    అది ద్విపద గానీ వృత్త, జాతి, వచనా బంధురమైన చంపువు గానీ

    “మాననీయ కవితా వ్యక్తిత్వ మెబ్భంగి దంచు విచారింపగ తత్స్వరూప మిది యంచుం సూటిగా చెప్పగా నెవడోపున్! మరి యే యొయారి యొరచూపింద్రాయుధాకుంచనచ్చవిమ ద్భ్రూలతికా ధనుశ్చ్యుత కటాక్షచద్మ నారాచ రేఖ వెసన్ గుండియ దూసి పోవు నదియే కాంతా శిరో రత్న మంచు వచించున్ రసికుండొకండు; సుదతీ శోణాధర వ్యంజితాసవ రాగోన్మద లోభనీయ పటు వాగ్జాల ధ్వని స్వాద మార్దవ ముగ్ధుండొకడాడు భామిని యనన్ తానిట్టిదౌనంచు; చన్ గవ రాపిళ్ళవి కుంభి కుంభ యుగమున్ దట్టించు ఠీవిన్ రహింప వరారోహ నితంబ బింబము చలింపం బొల్చు ప్రౌధా వినూత్న వయో హేల గణించి తద్గమన సౌందర్యంభు శ్లాఘించు నొక్క విపశ్చిన్మణి”

    అందాన్నే నిర్వచించలేము కవిత్వం ఇది – ఇదే అని చెప్ప సాధ్యమా.

    “సముద్యత్తుంగ రంగత్తుషార విరాజన్నగ సాను శంకర కపర్ద ప్రాంత భాగీరధీ ప్రవహత్తుంగ తరంగ ఘల్ఘల రవ ప్రాగల్భ్య నాట్యక్రియా ప్రవణ ప్రస్ఫుట వాక్ప్రసన్న కవితా ప్రారంభ సంభారుడు కవి అని వొకరనుకుంటే పూగుత్తుల వోలె నొండొరసి తూగం బల్కునం బల్కునం చవులూరించెడి కైత మేన పులకల్ దంటించగా దంట” ఐన వాడు కవి వేరొకరు భావిస్తారు. కాబట్టి మీ నా భావాలలో విపర్యం ఏమీ లేదు. తప్పులుంటే మీ మనస్సు నొచ్చుకొనే విధంగా మిమ్మల్ని అడిగి వుంటే క్షమించగలరు.

    (ఇందులో ఉదహరించిన కవిత్వం ఆధునిక మహా కవి, శతాధిక శతావధాని శ్రీ సీ వీ సుబ్బన్న గారు తమ వొకానొక అవధానంలో ఆశువుగా చెప్పినది)

  1496. బోడి పద్యం గురించి teresa గారి అభిప్రాయం:

    03/24/2009 3:18 pm

    ఈ పద్యాన్ని మొదట చదివి ” బాగుంది, విభిన్నమైన థీమ్ కి పద్య రూపమిచ్చారు . టైటిల్ లో కవి sense of humor తొంగిచూసింది’ అనుకున్నాను. ఒక్కొక్క కొత్త కామెంట్ వస్తున్నప్పుడల్లా మళ్ళీచదివాను. అశ్లీలము,,ఈమాటలో ప్రచురణకి అనర్హమూ అని ఎందుకనిపించిందో నాకు అర్థం కాలేదు. కవి పేరు మీద వ్యంగ్య విమర్శలు, విసుర్లూ చూశాక పద్యంలో లేని అశ్లీలత, కుసంస్కారం కామెంట్ల లోనే కన్పించి నవ్వుకున్నాను. అస్తమానూ వాగుల్నో, వంకల్నో, చంద్రుడినో, సూర్యుడినో వర్ణించే కవితలే గాక వైవిధ్యంగా ఈ ‘బోడి పద్యం’ ని అందించిన ఈమాట కి అభినందనలు.

  1497. బోడి పద్యం గురించి ప్రవీణ్ గారి అభిప్రాయం:

    03/24/2009 2:24 pm

    రాళ్ళపల్లి గారూ, ఈ బోడి పద్యం రాసింది ముస్లిం అని అందరికీ గుర్తు చేస్తున్నారా? ముస్లిం అయితే ఆయన పేరు మీద పన్ చెయ్యకూడదా? ముస్లిం కాబట్టి ఈ కవితకి కొంచం వెయిట్ ఎక్కువ ఇవ్వాలా?

    మండవ రవిబాబు గారూ, గుజరాత్ లో హిందుత్వ వాదులు వేసిన కరపత్రాలూ ఈ కవిత్వం ఒకటే అంటారా? అది హిందుత్వ వాదులు గుజరాతులో ఇచ్చే కరపత్రమైతే ఇది హైదరాబాదు పాతబస్తీలో ఇచ్చే కరపత్రమా? కరపత్రమైతే కవిత్వం అని ఎందుకూ అనడం?
    కవిత ఏ ‘విషయం’ చెప్తోందని మీరు అనుకుంటున్నారో కొంచం వివరిస్తారా? తెలుసుకోవాలని ఉంది. మీరు వివరిస్తే, అసలు విషయం జోలికి పోయి చర్చించడానికి నేనూ, ఇంకా చాలామందీ సిద్ధంగానే ఉన్నాం.

    మన లోపలి అశ్లీలాలన్నీ కవిత్వ రూపంలో బయట పెట్టుకోడానికి ‘ఈమాట’ అనుమతిస్తే నేను కూడా పుంఖానుపుంఖాలుగా కరపత్రాలూ, కవితలూ రాయడానికి సిద్ధంగానే ఉన్నాను. సంపాదకులవారూ, ఓకేనా?

  1498. బోడి పద్యం గురించి Mandava Ravibabu గారి అభిప్రాయం:

    03/24/2009 11:44 am

    అయ్యా వినీతుల వారూ:

    విషయం జోలికి పోవాలనే ఈ పద్యం చెబుతున్నదేమో! కొంచెం ఆలోచించండి.

    విషయంలోకి వెళ్ళడానికి భయపడె పైన రాసిన బాబ్జీలూ, రమాప్రభలూ గట్రా బాబోయ్ అశ్లీలం అని అసింటా జరిగారు. కవిత్వం పేరుతో అకవిత్వాన్ని, సౌందర్యం , రసం పేరుతో కృత్రిమ పదాల లాలిత్యాన్ని పఠాభి లాంటి కవులు ఈసడించుకున్నారా? లేదా? దిగంబర కవులు ఇంకా ‘అశ్లీలాన్ని’ గుప్పించ లేదా? స్లమ్ డాగ్ సినిమాలో బాలీవుడ్ మలాన్ని పరదేశీ ఎవడొ మన ఒంటి మీద పూసేసినప్పుడు చూసి, ఆస్కార్లు ఇచ్చామా లేదా?

    మన లోపల ఎన్ని అశ్లీలాలు వున్నాయో అవన్నీ ఇంకా కవిత్వంలోకి రావాల్సిందే….గుజరాత్ లాంటి చోట్ల ముస్లిం ఆడవాళ్ల మీద హిందూత్వ వాదులు వేసిన కరపత్రాలు ఒక సారి చదూకోండి. అశ్లీలం అంటే ఏమిటొ తెలుస్తుంది.

    రవి బాబు

  1499. బోడి పద్యం గురించి sarma rallapalli గారి అభిప్రాయం:

    03/24/2009 6:27 am

    రమ గారు:

    కవిత ఒక ముస్లిం రాయబట్టి అతని పేరు మీద పన్ చేస్తున్నారా? అఫ్సర్ని అఫ్సరుడు అనీ, absurd అనీ అనడం, ఆ తిక్క కి మీరు చంకలు కొట్టుకోవడం ఎలాంటి సంస్కారం?
    శర్మ రాళ్ళపల్లి

  1500. నాచన సోమన చతుర వచో విలాసం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    03/24/2009 12:26 am

    ప్రసాద్ గారు,
    శ్రమకోర్చి గుర్తున్న గౌరన పద్యాలని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఆ పద్యాలు అందంగా లేవని ఎవరనగలరు! ఇక్కడొక్క చిన్న విషయం స్పష్టం చెయ్యాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. నేను హరిశ్చంద్రోపాఖ్యానం చదవనిది “ద్విపద కావ్యాలపై నాకున్న వ్యక్తిగత అరుచి” వల్ల మాత్రమే అని చెప్పాను. దీని అర్థం నాకు ద్విపద ఛందస్సు నచ్చదనీ కాదు, ద్విపద కావ్యాల మీద నాకు తక్కువ భావముందనీ కాదు.
    మోహనగారు చెప్పినట్టు ద్విపద అచ్చమైన తెలుగు ఛందస్సు, తెలుగు జానపదసాహిత్యమంతా అది కనిపిస్తుంది, పాటలుగా పాడుకోడానికి చాలా అనువైనది. దీనితో నాకే మాత్రం విభేదం లేదు. నాకు కూడా ద్విపదలో ఉన్న ఎన్నో పాటలు నచ్చుతాయి.

    ఇక ద్విపద కావ్యాల విషయానికి వస్తే, నాకవి రుచించనంత మాత్రాన వాటిని తక్కువగా భావించే మనస్తత్వం నాకు లేదు. ఒక కవితో ఒక కావ్యమో మనకి బోధపడనంత మాత్రాన, రుచించనంత మాత్రాన అది మంచి కవితో, కావ్యమో కాదని నిర్ధారించెయ్యడం తెలివితక్కువ పని అని నా ఉద్దేశం.

    ఇంకొక్క విషయం. నాకు ద్విపద కావ్యాలు రుచించకపోవడానికి “పొలిటికల్” కారణాలేవీ (నాకు తెలిసి) లేవు. నేను పద్య కావ్యాలని చదువుతున్నప్పుడు, చాలా వరకూ పద్యాలని బయటకే చదువుకుంటాను, అప్పుడప్పుడు (తప్పని పరిస్థితుల్లో 🙂 మనసులో చదువుకుంటాను. ఎలా చదువుకున్నా, పద్యాల అర్థంతో పాటు (ఇంకా చెప్పాలంటే అర్థం గ్రహించే ముందు) పద్యాలలో నడకని, వాక్య విన్యాసాన్ని ఆస్వాదిస్తాను. అంచేత పద్యాలలో అర్థం ఎంత ప్రధానమో, నాకు పద్య రచనా విధానమూ అంతే ప్రధానం. ఈ విషయంలో చంపూ కావ్యాలు నాకు బాగా ఆస్వాదనీయంగా అనిపిస్తాయి. రకరకాల ఛందస్సులో పద్యాలు, రకరకాల నడకలతో నన్ను అలరిస్తాయి. వడివడిగా కందాలలో సాగుతున్న కథనంలో హఠాత్తుగా ఒక వర్ణన వయ్యారంగా సీసంతో ఎదురైనప్పుడు మనసు ఒక విధమైన ఉత్తేజాన్ని పొందుతుంది. ద్విపద కావ్యాలలో ఒకే రకమైన ఛందస్సు, ఇంచుముంచు ఒకే నడకతో పుటలకొద్దీ సాగుతుంది కదా. ఇది నాకు చదవడంలో అనాసక్తత కలిగిస్తుంది. అంతే! ఇంతకన్నా దీని వెనుక మరే కారణాలూ లేవు. ఇలా నాకు అనాసక్తి కలుగినంత మాత్రాన ద్విపద కావ్యాలు గురించి నాకెలాంటి తక్కువ అభిప్రాయమూ లేదు.

  1501. నాచన సోమన చతుర వచో విలాసం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/23/2009 3:59 am

    కామేశ్వర రావు గారికి ఇంకా తదితర రసజ్ఞులైన పాఠకులకు –
    నేనంతగా చదువుకున్న వాడిని కాదు (యస్ యస్ యల్ సీ) గౌరన గారిని గురించి వ్రాసే అంత పాండిత్యం వున్నవాడినీ కాదు. సాహిత్య ఎకాడెమీ వారి పుస్తకంలో వారు చూపించినంత వరకు మాత్రమే ఆయన కవిత్వాన్ని అర్థం చేసుకున్నాను. ఆ పుస్తకం కూద నా దగ్గర ఇప్పుడుపలబ్దం కాదు. ఐనా నా స్మృత్యనుసారంగా నాకు గొప్ప అనిపించిన గౌరన సంభాషణారూప కవిత్వాన్ని మీముందుంచి ద్విపద సాహిత్యం మీద మీకున్న తక్కువ భావాన్ని దూరం చేయ ప్రయత్నిస్తాను. ద్విపదలో కూదా పోతన, నన్నయ ల వలె మనోరంజకమైన కవిత్వాన్ని వ్రాయవచ్చునని నాకు గౌరనను చదివిన తరువాతనే తెలిసింది.

    చంద్రమతిని అమ్మేటప్పుడు పౌరులు

    కటకటా యిట్టి వెంగలి రాజు కలడె
    మటుమాయ తపసి యే మరులు గొల్పినను
    నెమ్మది తను ఏలు నేలకు తోడు
    సొమ్ములన్నియు నిల్లు చూరగా నిచ్చి
    అమ్మెద కడమకై ఆలి గొండనెడు
    తమ్ము మాలిన యట్టి ధర్మంబు గలదె?
    చదువులు విని మీద జరుగు సౌఖ్యంబు
    మది నమ్మి బ్రతుకు బ్రాహ్మణునకు నిచ్చె
    పనుపడి మొయిలులోపలి నీళ్ళు నమ్మి
    దొన నీళ్ళు చల్లు వేదురుడెందు గలడు?
    కరి రొంపి దిగబడ్డ కమ్మరి నెత్త
    కరి యోపుగాక సూకరమెట్టు లోపు?
    ధర నింత వాని దుర్దశ నివారింప
    నరులోపుదురె విశ్వనాధుండు దక్క

    నక్షత్రకుడు హరిశ్చంద్రుడితో

    నలినాప్త కులనాధ! నా తోడ నీవు
    పలికిన మాటల పధ్ధతి తప్పె
    మునినాధునకు నీవు మునుకొన్న యట్టి
    ధనమిచ్చువానికి దాసుని గాగ
    గొనిపోయి నిన్నమ్ముకొమ్మంటి గాని
    వినుత సత్కులజుని వెదకి యిమ్మనవు
    వీని కులంబేల? వీని సొంపేల?
    వీని గుణంబేల? వీని పెంపేల?
    మాలడైనను నేమి? మరి బ్రాహ్మడేమి?
    తోలు గప్పిన నేమి? తులువైన నేమి?
    గంజాయి దినెనేమి? కలుద్రావెనేమి?
    నంజక ధనమిచ్చు నతడె నా మెచ్చు.
    కోరిన ధనమిచ్చి కొనరండటంచు
    వూరక మొర వెట్టు చుంట నా పాలు
    వారక నిను గొన వచ్చిన వారి
    తో రాయిడించి పో ద్రోల నీ పాలె?
    నిను నేడు మొగమున నెత్తురు బామి
    కొని గుల్ల పరుపక కొలికికి రావు

    కాల కౌశికుడు హరిశ్చంద్రుడితో

    కసవు కట్టెలు మోయ కాయ పండ్లమ్మ
    పసుల జంగిలి గాయ పాలేరు దున్న
    కొరమాలి మ్రుచ్చుల గూడి దూరమున
    చెరవట్టి దెచ్చిన చెలువ నాలనుచు
    మొరగి ఈ రీతి నమ్ముట మాకు దోచె
    ఎరిగిరే తలవరు లిప్పుడే పట్టి
    కొరత వేయుదు రోరి కోమలి విడచి
    పరచి నీ ప్రాణముల్ బ్రతికించు కొనుము
    కాదేని వరవుడు గా ధార పోసి
    మోదంబు తోడ నీ ముదిత మా కొసగు
    ఎనయంగ నీ తప్పులేము వహించి
    కొని కాచెదము బ్రహ్మ కొడుకు వచ్చినను

    దానికి హరిశ్చంద్రుడు

    దారుణ కరవాల ధారాహతారి
    వీర మాణిక్య నవీన కోటీర
    శస్తమైనట్టి ఈ క్షత్రియోత్తముని
    హస్తమే రీతిని నలవడు కృషికి ?
    మరి బ్రాహ్మణుడు వచ్చి మరుగు జొచ్చినను
    దరమిడి రక్షింప దగుగాక మాకు
    పరభయంబున నిట్లు బరగ నీ మరుగు
    చొరబార నగునె? ఈ చొప్పైన మాకు
    బాణాసనంబేల? బాణంబులేల?
    ప్ర్రాణంబులేల? కృపాణంబులేల?

    భేతాళుడు హరిశ్చంద్రుడితో

    దేవతలకునైన దృష్టింప రాని
    నా వటమూలంబునకు వచ్చుటెట్లు?
    వచ్చి పోనీక కావలి భూతములకు
    చెచ్చెర ముక్కులు చెక్కుట యెట్లు?
    చెక్కి యంతట పోక చేరి నా యెదుట
    పెక్కులు పేలి దర్పించుట యెట్లు?
    గడగి మహమ్మారి కడుపు పొట్టేలు
    వడిచొచ్చి వాలిన వడువున నీవు….

    కాలకౌశికుడి భార్య చంద్రమతితో

    కట్టెలు దెమ్మన ఘన భుజంగముల
    పుట్టలెక్కగ నేల పోయె నీ కొడుకు?
    చేకొని యిది మేము చేసిన తప్పె?
    వాకట్ట మైతిమి వసుధ పాములకు
    మందుల విలువలు మాకేడ గలవు
    మందులు తేలేము మాకు తేలేము

    చంద్రమతీ దేవి వర్ణన

    సుందరి గాదిది, సొబగు రాయంచ
    అంచగాదిది, నడపారు క్రొమ్మించు
    మించుగాదిది, రాచ మెచ్చుల ప్రతిమ
    ప్రతిమ గాదిది, పచ్చి పగడంపు లతిక
    లతిక గాదిది, నవ లావణ్య సరసి
    సరసి గాదిది, పుష్ప చాపుని శరము
    శరము గాదిది, రతి సవరించు చిలుక
    చిలుక గాదిది, వికసించు చెంగలువ
    కలువ గాదిది, చంద్రకళ వంటి చెలువ

    కంతు సంకుకు బొమ్మ గట్టిన గళము
    అనటి కంబముల గయ్యాళించు తొడలు

    ఆమె ఏడ్పు : మెరుగు ముత్యముల మ్రింగు మీనమ్ము
    లరుగక వెసగ్రక్కు నట్టీ చందమున
    పలుమారు గ్రమ్మెడి భాష్ప బిందువుల తో…..
    నేలను పుడుకుచు నిగిడిన వగల
    వాలు గన్నుల నీరు వరదలై పార
    వశిష్ట విశ్వామిత్ర సంవాదంలో వశిష్టుడు
    రంతుగా నాబోతు రంకె వైచినను
    గంతులు దక్కునే కంఠీరవంబు?
    కల్ల జంఝాటంబు కౌశిక యిచట
    చెల్లదు సుమ్ము వశిష్టుడుండంగ

    స్ఫుట రోష శేషాహి ఫూత్కార ఘోర
    చటుల విషానల జ్వాలల కంటె
    కుపిత కౌశిక మహా కుటిల కఠోర
    విపుల శాపాగ్నుల వేడిమి ఘనము

    ఇలా అనేక సామెతలు జాతీయాలతో గూడిన సంభాషణలు వర్ణనలు హృదయంగమంగా వుంటాయి. వ్యాసంగా కాక అభిప్రాయంగా వ్రాసే దీనిలో ఇంత కన్న ఎక్కువ వ్రాయటం భావ్యం గాదు. నా కలవి కాదు కూడా.
    ఇప్పుడు ఈ గ్రంధాన్ని చదివి మీరు వ్యాసం వ్రాయగలరని భావిస్తాను.

  1502. బోడి పద్యం గురించి vineet గారి అభిప్రాయం:

    03/22/2009 7:49 pm

    మంచి ఉచ్చ స్థాయిలో ఉంది పద్యం. “మొండి గోడల” కేసులో రాముణ్ణి నిలబెట్టి కడిగేయడం బాగుంది. అదే జిహాదీ కేసులనుకోండి, అక్కడ “ఉగ్రవాదులకి మతం లేదు”. ఇంకో వింత ఏమిటంటే విమర్శకులు ఇసుమంటి బోడి పద్యాల్లో “కవిత్వ ధార” నే ఆనందిస్తారు. విషయం జోలికి పోకుండా. బాగుంది ట్రెండు.

  1503. భ్రంశధార గురించి విభు గారి అభిప్రాయం:

    03/22/2009 10:56 am

    కనకప్రసాద్ గారు,
    మానససరోవరంలో గురి చూసి విసిరిన గులకరాయి మీ కవిత.
    వలయాలతో కలవరం సృష్టిస్తోంది.
    లోతు తెలియదు – అలలు ఆగవు.

    rich, striking imagery ; unique expression.
    Always loved reading your stuff. Thank you.

  1504. ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/22/2009 10:14 am

    ఔనండీ కాకులవరం గారూ!!

    సంస్కృతంలో ప్రార్ధనలు ఏం బాగుంటాయీ!? ఎందరికి అర్ధం అవుతాయీ!? ఓ ప్రభువా!! మేము నీకు మేల్కొలుపులు..అనగా సుప్రభాతం ఈ విధంగా జరిపింతుము. అంత పొద్దుటే మేము లేవలేము.నిన్ను లేపలేము. గాన[ఇది మరీ classic telugu అవుతుందేమో?]..కాబట్టీ..[ఇక్కడ మళ్ళీ మాండలికం సమ స్య రావొచ్చునేమో?!]..ఏదైనా..సరే..ఓ ప్రభువా!! నీవే మా కాపరివి!నీ బిడ్డలైన మమ్ములను ఆశీర్వదింపుము… ఈ దేవ భాషలో దేవుడవైన నిన్ను మేము మరి స్తుతి చేయలేము. మాకు భాషా స్వాతంత్రం రావలెను. మా ప్రార్ధనలకోసం..ఈ పూజారి వర్గం {ఇది so feudal u know ]..మాకిక వద్దు.

    కానీ electoral reforms తేడానికే [ఓట్లు పోతాయని జంకే మా ప్రభుత్వం]..ఇలా మత పరమైన రిఫార్ములు తెచ్చునా? అన్న ది కోటి డాలర్ల ప్రశ్న..అది అటుంచిననూ..మా అర్జీలనైననూ తెనుగున చదవని ప్రభుత్వం మీద మాకు ఆశ లేనందుననే.”.ఈమాట” వారి ద్వారా నీకు ఇలా ఒక అర్జీ పెట్టుకొను చున్నాము. ఒక నాటికి మా కల నెరవేరును గాక ! వేలూరి వేంకటేశ్వర రావు పంతులు[వీరేశలింగం పంతులు లాగా అని నీవు గ్రహించగలవు.]…ఈ ప్రార్ధనా విషయమై ఇహ తెనుగుజాతిని జాగృతము చేయవలయును. ఇంక ఈ భూమిపై సంస్కృతము ఆవిరైపోవును గాక[ఇప్పుడు మాత్రం ఉండి ఏడ్చింది గనకనా!?]…తెనుగులోనే నుడులు జరుగుగాక[ ఏ తెలుగు!?? తెలంగాణమా..రాయల్సీమా?/ఉత్త్రాంధ్రా??కోస్తాంధ్రా//..కేసిఆర్ ..నారా నాయుడు ఎర్రన్నాయుడూ..లగడ్పాటి..రాజశేఖరుడూ..ముందు తేల్చినాక..నీకిష్టమైన నానా తెనుగులోనీ..[ఈ” దోపిడీ పూజారి” వర్గమును తప్పించి..వారికెటూ ఓటు బ్యాంకు లేదు గన్క..మా పని మరింత సులువు. ఆదాయంలేని వృత్తి గన్క వారునూ వేద మంత్రములును వచన కవితల వలే వల్లించు భారమును మాపై పెట్టి తప్పుకొనుటకు..సిద్దంగా ఉన్నారు.]..ఒక్క నువ్వు ఒప్పుకొనిన్ చాలును. ప్రభువా!! ఇహ నీ దయ..ఈమాట సంపాదకుల చలవాను.

    రమ.

  1505. కథ దేని గురించి? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/21/2009 9:18 pm

    రవికిరణ్ గారూ!! మీ చాలా అభిప్రాయాలు ఒప్పుకోవలసినవే!! రచయితల సృజన కి సంబంధించినంత వరకూ మీ ఉద్దేశ్యంలో సబబు ఉంది. కానీ అందరూ ఈ పరిస్థితి లోకి తప్పనిసరిగా రావాలనేం లేదు. రచయితకి వ్యక్తీకరణ స్వేచ్చ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో..వారు బ హుశా మరికొంత పదును కలిగి ఉండే వీలుంది రచనాపరంగా!! అలాంటి స్వాతంత్ర్యం తప్పనిసరిగా వారు కోల్పోవలసిందే.. రాజకీయ పరమైన విధివిధానాల్లో బందీ అయ్యాక. మంచి పద్యం..మంచి గేయం..శ్రీశ్రీ రచనకి బలం. అదే వచన కవిత..ఇంకా యాస లో రాయడం శ్రీశ్రీ కి రాదు. కానీ విరసం భావజాలం కారణంగా..శ్రీశ్రీ ఈ గేయ కవితాప్రక్రియలు బూర్జువా వ్యక్తీకరణలని చెప్పి..వీటిని వదిలేసి “జట్కావాలా” లాంటివి రాసే ప్రయత్నంచేసి విరసాన్ని మెప్పించబోయాడు. ఇటువంటివాటి వల్ల విరసానికి ఒన గూరిన మేలు ఏమిటో నాకైతే తెలీదు గానీ..సాహిత్యం విషయానికి వస్తే మాత్రం తప్పకుండా లోటే!! వంగపండు ప్రసాదరావు రాసినట్టో..ఒక గద్దర్ రాసినట్టో..రాయడం..శ్రీశ్రీ వల్ల కాలేదు. ఇలా శ్రీశ్రీ తన శైలికి తానే దూరమై..ఆగిపోయేడు. సృజన అన్న అనుభవం..స్వేచ్చగా జరగాలి. విరసంలో రచయితలకి స్వేచ్చ సున్నా!! ఇలా కాకపోయివుంటే..శ్రీశ్రీ..కాళీపట్నం..మరికొన్ని రాయగలిగి ఉండేవారు. ఆ తర్వాత వాళ్ళు ఆగిపోయివుంటే అది వేరేమాట. కానీ వారి సృజన అర్ధాంతరంగా ఆగిపోయిన పాపం మాత్రం తప్పకుండా విరసానిదే!! అలాగే ఇప్పటికీ ఒక మూస ధోరణిలో విరసం రూపొందించిన చట్రం..దాని పరిభాష దాటలేని పరిస్థితి ఇంకా..”ఇంగువ కట్టిన గుడ్డ” లా..తెలుగు సాహిత్యరంగంలో విరాజిల్లుతున్నాదే!! ఇందువల్ల ఒక మొనాటనీ..తెలుగు కవితల్లోనూ..కధల్లోనూ అలాగే నిలిచిఉంది. అది మరి చిన్న నష్టమా??

    రమ.

  1506. కథ దేని గురించి? గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/21/2009 12:20 pm

    బాబ్జీ,
    మడి కట్టుకున్న సాహితీవేత్తలు, సాహిత్య సంఘాలు కొత్తవేం కాదు కదా. బతుకులో, సమాజంలో ఎన్నిరకాల పరిధిలు వున్నయో, సాహిత్యంలో కూడా అన్నిరకాల పరిధిలూ వున్నాయి. ప్రతి పరిధి కూడా మడికట్టుకున్న పరిధే. ఆ పరిధిలో భావన, ఆ పరిధిలో విలువలు తప్ప మిగిలిన వాటిని దూరంగా పెట్టటం, దూరంగా వుండటవనేది ప్రతి పరిధికీ వున్న సహజ లక్షణవే. విరసం కూదా వొక మడిగట్టుకున్న పరిధే. ఐతే విరసం వొక్కటే ఆ లక్షణాలు వున్నది కాదు.

    సమాజంలో మార్పు ఎంత సహజవో, ఆ మార్పుని ముందరే పసిగట్టి, ఆ దిశలో స్పందించట వనేది, సాహిత్యనికున్న ఒక గొప్ప లక్షణం. జైన, బౌద్ద మతాలు విస్తరించే దశలోనూ, తిరిగి హిందూ మతం బలబడుతున్న సమయంలోనూ, ఆ తర్వాత స్వాతంత్రోధ్యమ సమయంలోనూ (ఇవి సమాజంలో సవాలక్ష మార్పుల్లో కొన్ని మాత్రవే) మారుతున్న సమాజంలో, పాత కొత్తల ఘర్షణ ఒక కొత్త, అధ్బుతవైన సాహిత్య సృష్టికి కారణమవుతూనే, అంతకంటే ఎక్కువగా మూస సాహిత్యానికి కూడా కారణమవుతుంది. దేశ, కాల పరిధుల్తో సంబంధం లేకుండా, ఏ కాలవైనా, ఏ దేశవైనా, ఏ ప్రదేశవైనా, ఏ రాష్త్రవైనా, ఏ ఊరైనా, ఏ వీధైనా, ఏ కుటుంబవైనా, ఏ మనిషైనా గిరిగీసుకోవడం ఒక సహజ లక్షణం. ఆ గిరి ఒక సమయంలో ఒక కొత్త మార్పుకి, ఒక కొత్త భిన్నమైన సాహిత్య సృష్టికి ప్రాణం పోస్తే, అదే గిరి ఒక సమయంలో మరో కొత్త ఆలోచనకి అడ్డంకి కావొచ్చు. విరసం దానికి భిన్నవేవీ కాదు. విరసం, మొదటిది కూడా కాదు. ఐతే ఆ గిరి వెలుపల కూడా చాలా ప్రపంచవుంటుంది. గిరి గీసుకోవడం (విరసం, అరసం లాంటి సాహిత్య సంఘాల్ని సృష్టించుకోవడం) అంటేనే ఆ గిరితో విభేదించే మరో గిరి వుందన్న మాట. ఆ గిరి వెలుపల కూడా చాలా సాహిత్య సృష్టి జరుగుతుంది.

    తెలుగు సాహిత్య లోకాన్నంతటిని విరసం గుప్పిట్లో పెట్టుకోలేదు. మొత్తం సమాజాన్ని శాసించగలిగే శక్తి దానికి లేదు. తెలుగు కవులు, కథకులు అందరు విరసం సభ్యులు కాదు. విరసాన్ని అభిమానించే వాళ్ళకన్నా, నిరశించే వాళ్ళే ఎక్కువ తెలుగు దేశంలో. ఐనా కూడా రచయితల చేతగాని తనానికి, మూస కథల సృష్టికి విరసవే కారణవని నువ్వంటే చేసేదేంలేదు. కానీ విరసానికి భిన్నవైన తెలుగు సాహిత్యంలో మూస కథలు లేవని, లేకపోవడం కాదు, ఇబ్బడి ముబ్బడిగా లేవని చెప్పగలవా? విరసం బతుకుని మరో కొత్త కోణంలో పరిశీలించింది. ఆ కోణంలో సాహిత్యానికి ఒక వూపునిచ్చింది. చూడగలిగిన వాళ్ళు చూశారు, వ్రాయ గలిగిన వాళ్ళు వ్రాశారు. కొందరు తమ పదిహేను నిముషాల వెలుగు కోసం అనుకరించారు. ఒకరి సృజన శక్తిని అణగదొక్కగలిగే బలం విరసానికి, అరసానికి, మరొ సారస్వత సంఘానికి లేదు.

    రమ గారు చెప్పినట్టు, విరసం కాదు కదా మరే సంఘం కూడా ఎవరి సృజన శక్తినీ అణచలేదు. కారా గారితోపాటు ఎవరైనా వ్రాయకపోవడానికి కారణం, వాళ్ళు వ్రాయలేకపోవడవే. ఎవరు కూడా పుట్టిందిమొదలు పొయ్యేదాకా సాహిత్య సృష్టి చెయ్యలేరు. బాల్యం లాగా, యవ్వనంలాగా, బహుశా వృద్దాప్యం లాగా, సాహిత్య సృష్టి కూదా ఒక ఆది, అంతం వున్నటువంటిదే. ఆ తర్వాత కూడా రాస్తారు, ఎప్పుడో ఒకటో అరో కవిత చమక్కుమనవచ్చు, కానీ రమ గారు అది ఇంగవ చుట్టిన గుడ్డ వాసనే కానీ, ఇంగవ కాదనీ మనవి.

    ఇక విరసం ఒక రచయితల సంఘవే కాదు, ఒక సామాజిక, రాజకీయ రచయితల సంఘం. దానీ విధానాలు, రాజకీయాలు, ఆ దిశలో దాని పరిధిలు దానివి. శ్రీశ్రీ సినిమాల్లో ప్రేమ గీతాలు వ్రాయడానికి, భక్తి గీతాలు వ్రాయడానికి, ఇందిరా గాంధీ ఇరవై సూత్రాలమీద వ్రాయడానికి ఆయనకి విరసం అడ్డురాలా. విరసం సభ్యుడైన తర్వాతో, ఆ తర్వాతో ఆయన కవిత్వ సృష్టి చేయలేకపోవడానికి కారణం, ఆయనలో ఆ సృజనాత్మక నిండుకోవడవే.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  1507. బోడి పద్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/21/2009 8:39 am

    యుగంధర్ మహాశయా!
    కందపద్యములూ, సీస పద్యములూ వ్రాయగలిగిన మీరు ఈ వచన కవిత గురించి ఎందుకు వ్రాయరు? మిగిలిన శీర్షికలలో చక్కని అభిప్రాయములు వ్రాసిన మీరు ఇచ్చట ఎందుకిటుల వ్రాయుట? మొదటి అభిప్రాయము నాది. అందు నాకవగతమవని వాటిని గురించి అడిగితిని. కవి గారెటూ జవాబివ్వజాలరు. కవితని ఆనందించి, అనుభూతించి అనుభవించిన వారుకూడా కవితని విపులీకరించకపోవడం మా దౌర్భాగ్యం. బొల్లోజుబాబా గారి అభిప్రాయమునకు జవాబుగా నాఅభిప్రాయమందు “ధార” గురించి ప్రశ్నించితిని. ఆయనా తదుపరి మీరునూ కవిత గురించి తప్ప మిగిలిన విషయముల గురించి విశ్లేషించినారు. మీరన్నట్టు కవిగారు రాసేసి జనం మీదకొదిలేస్తే సరిపోదు. ప్రతీ కాళిదాసుకీ ఓ మల్లినాథ సూరి వుంటేనే కాని కుదరదు. “అఫ్సరుడు” (మళ్ళీ వరదలో కొట్టుకొచ్చిన ప్రయోగం”) గారికి మీరో, సూర్య గారో మల్లినాథ సూరనుకుని అడగడం నా తప్పు. క్షమించండి. ఇదే “అఫ్సరుడి” గారి కవిత ఈ మధ్య సోమవారం సాహిత్య పేజీల్లో పడింది. అది లక్ష రెట్లు నయం ఈ బోడి పద్యం కన్నా. బహుశా ఈ బోడి పద్యం ఈమాట కోసం ప్రత్యేకించి రాసేరేమో? One more thing whoever punches some trash in this area are not critics. అభిప్రాయాలు రాసే వారు విమర్శకులు కారు. అంచేత పుంజీడు అభిప్రాయాలు పుంజీడు విమర్శలు కాదు. “మీ అభిప్రాయం తెలియ చేయండి” లో అభిప్రాయం తెలియచేయడం ఎందుకు? ఎవర్నుధ్ధరించడానికి? తెలుగు భాషనుధ్ధరించడానికా?

  1508. కథ దేని గురించి? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/21/2009 7:15 am

    లేదు బాబ్జీలు గారూ మీ అభిప్రాయం సహేతుకమైందే! సాహిత్యానికి తన నిరంకుశ వైఖరి ద్వారా విరసం సరిపడా అపకారం చేసింది. స్వతహాగా మంచి కవి రచయితలైన..శ్రీశ్రీ..కొకు..రావిశాస్త్రి..కాళీపట్నం..లాం టి వాళ్ళూ..అలాగే మిగిలిన మరి కొందరు..వారి విశ్వాసాలకి కట్టుబడి విరసంలో కొనసాగారు.కానీ విరసానిది ధృతరాష్ట్ర కౌగిలి. అందువల్ల అందులోకి వెళ్ళాకా కవిత్వం తగ్గి..కొత్తవి చెప్పుకోదగ్గవేవీ రాయలేక..విరసానికి పబ్లిసిటీ ముఖంలాగా మిగిలేడు శ్రీశ్రీ. కాళీపట్నం రామారావు గారు “యజ్నం” లాంటి గొప్ప కధని విరసం రాజకీయాలతో సంబంధం లేకుండానే రాసి కూడా..అందులో సభ్యులయ్యాకా..మళ్ళీ అంత బలమైన కధ ఏదీ రాయలేదు.విరసానికి పెద్ద దిక్కుగా పెద్దమనిషి పాత్రలో మిగిలారు. వీరి సంగతే ఇలా ఉంటే ఇహ మిగతా వాళ్ళ మాట చెప్పేదేముందీ??

    విరసం ఏనాడూ తన సంస్థలో భాగం కాని కవి రచయితల విషయంలో కొంచెం కూడా సానుకూల వైఖరిని చూపించలేదు సరికదా..తనకి పనిపడినప్పుడు మాత్రం..తెనుగుదేశం లోని సకల కవి,రచయిత విమర్శక శిఖామణులంతా..”మేధావులు” అందరూ..తమ వెనకే ఉన్నారని చెప్పడానికి సదా ప్రయత్నించింది. రచయితలే కాని వారికి సంస్థ పగ్గాలు అప్పజెప్పింది.వాళ్ళూ రచయితలకీ..సాహిత్యానికీ నిరభ్యంతరంగా నాయకత్వం వహించేయగలిగేరు. దీన్ని ప్రశ్నించే వీలుని గానీ..ఇందుకు జవాబు చెప్పే పూచీ గానీ ఆ సంస్థ ఏనాడూ తీసుకోలేదు. అందులో ఉన్న కవి ..రచయితలు సైతం ఈ పరిస్థితిని భరించేరు గానీ..ప్రశ్నించినట్టు కన్పించదు. అందులో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందన్న విషయం బహిరంగ రహస్యమే!! విమర్శకి చోటు తీసేసి..అడిగిన ఎవరినైనా దబాయించడంలో చూపిన శ్రధ్ధ..ఆత్మ విమర్శలో చూపక..దాని పరిధిని సంకుచితం చేసుకుంది….రచయితలు లేని రచయితల సంస్థ అది. ప్రాపగాండా లిటరేచర్ కీ..ఆ తరహా సాహిత్యానికీ మాత్రమే దాని ప్రాపు. గనక మీ పరిశీలన సరైందే!!

    రమ.

  1509. బోడి పద్యం గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:

    03/21/2009 5:18 am

    “జాగ్ నీకీ రాత్” అనే కవిత్వం గుర్తుకువచ్చింది
    కళ్ళలో సూదుల్లా గుచ్చుతున్న నిద్రలాంటి కాలాన్ని ఓపుకుంటూ గడుపుతున్న సందర్భం
    నిద్రపోని అనేక సంఘటనలు ఎదురౌతూనేవున్నాయి

    ఇంకొంచెం విస్తృతంగా రాయాలేమో!

  1510. అతడు, నేను, అతడి కథ గురించి ega hanuman గారి అభిప్రాయం:

    03/20/2009 8:31 pm

    మిత్రులారా, ఒక్క విషయం. ఈ కథ ఆత్మహత్య గురించి కానే కాదు. ప్రకృతిలో లీనమై పోవాలన్న ఒక తీవ్రమైన కోరికలోంచి వచ్చిన తాదాత్మ్యపు ఆలొచనా ధారగా నేను స్వీకరిస్తున్నా. ఎందుకంటే ఈ కథ రాస్తున్నపుడు భగవంతం, నేను కొన్ని సమయాల్లో కలిసే ఉన్నాం. ఇదొక అలోచనా ధారకు అక్షర రూపం, కొన్ని విషయాలను ఏ అక్షరం ప్రకటింప చేయగలగదు. కథ చివర్లో అర్ధం కావట్లెదు అన్నది, భాషకి అందని ఎక్స్‌ప్రెషన్ అని భావన. ఎంతైనా కథా రచయిత కథని చాలా సమర్ధవంతంగా నడిపించాడు. కథలో కవిత్వం నిబిడీకృతమైఉంది.
    ఈగ హనుమాన్

  1511. బోడి పద్యం గురించి యుగంధర్ గారి అభిప్రాయం:

    03/20/2009 6:32 am

    బాబ్జీలు మొషోయ్,
    I quote your words: “పుంజీడు మంచి “ఇమేజెస్”మంచి కవిత్వాన్ని చెయ్యవు. పుంజీడు మంచి వాక్యాలు మంచి వ్యాసాన్ని చెయ్యలేవు. పుంజీడు మంచి “పేరాగ్రాఫులు” మంచి కథని అల్లలేవు. పుంజీడు మంచి “షాట్లు” మంచి సినిమాని తయారు చెయ్యలేవు.” ఇవి బాబాగారి అభిప్రాయమ్మీద తమరుగారు వెలువరించిన అభిప్రాయం కాదా? ఇట్టాంటి పుంజీడు వ్యాఖ్యల్ని చూస్తే గరికపాటి వారికి బాధ కలగదా?

    అయినా కవితాత్మని ఎవరో ఎందుకు ఆవిష్కరించాలి? కవి చెప్పాల్సింది చెప్పాడు. ఆవిష్కరించాల్సిందేదో ఆయనే ఆవిష్కరించాడు (దాచి ఉంచాల్సిందాన్ని చూపించేశాడనే గదా, అస్లీలం అని మొత్తుకునేది జనాలు). ఆ ఆవిష్కరించింది ఆత్మకాదు, అది దెయ్యం బూతం పిశాచం అని కొందరు సహృదయులు సెర్టిఫై చేసేశారు గదా. తమరుగారికి తృప్తికాలేదా? హబ్భే, మీరనవసరంగా దాన్నొక కొరివిదయ్యమని భయపడుతున్నారు, అది ఒక దీపమే అని చూపించడానికి ప్రయత్నించిన బొల్లోజుబాబా మీద పుంజీడు పేణ్ణీళ్ళు చల్లింది తమరుగారు కాదా? ఇంకా యేల ఈ ఆత్మల వేట?

    [ఈ కామెంట్ ఎడిట్ చేయబడినది – సం.]

  1512. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/20/2009 2:31 am

    బాబ్జీలు గారూ! చర్చ సరైన దిశగా నడవాలి. కొత్త, పాత లేదా మంచి..చెడ్డ కాదు.పాండిత్యం అన్నది ముఖ్యంగా కవిత్వం విషయంలో..అందునా పాత కావ్యాల విషయంలో..ఆనాటి భాష మీద పట్టూ..అందులోని విషయాన్ని విశ్లేషించగల సామర్ధ్యం మెండుగా ఇంకా వాటిల్లోని విశేషాల్ని విప్పిచెప్పగల దక్షత ..అనేక పుస్తకాల్తో పరిచయం..వాటిని సవ్యంగా పాఠకుల ముందుకి తేగల నేర్పూ..ఉన్నవాళ్ళు..వీళ్ళూ పండితులంటే!! అనేక భాషాసాహిత్యాలు అర్ధం చేసుకోగలవాళ్ళూనూ. పాతకాలంలో ఇటువంటి విద్వత్తు ఉన్నవాళ్ళ్ళు ఉండేవారు. వారిని గొప్పగా గౌరవించేవారు. అలాంటి scholarship క్రమేపీ తగ్గిపోయింది. భట్టు అనేవారు పూర్వం. అంటే ఎనిమిది భాషల్లో విశారదులై ఉండాలి. మరి ఇవాళ ఈ నిర్వచనం పరిధిలోకి వచ్చే” పండితులు” ఏరీ??

    అందువలన చాలా మందివి అరకొర పాండిత్యాలే!! అయితే అందుకని పుస్తకాలు చదవకుండా ఉండలేము కదా? ఉన్నంతలో ఎవరి పుస్తకం మనలోని పఠన తృష్ణని తీరుస్తుందో దాన్ని చదువుకోవాల్సిందే కావాలనుకుంటేనే సుమా!! ఇంక వ్యాఖ్యాత భావాలు నచ్చకపోతే..చప్పగా అన్పిస్తే..అది సహజం గానే మరుగునపడి పోతుంది. పాఠకుల్ని ఎవరుగానీ మభ్యపెట్టలేరు. కష్టం.

    ఇంతకీ చెప్పేదేమంటే..పుస్తకాలని రానివ్వండి. పాత సాహిత్యాన్ని చదవడానికి …ఇవాళ్టి తరంకోసం.. పాత సాహిత్యం..వాటి వ్యాఖ్యానాల్తో మళ్ళీ ప్రచురించడం అవసరం. ఆ పని ఎవరు చేసినా అందుకు స్వాగతించాలి. అథవా ఆ వ్యాఖ్యానం నాసిరకంగా ఉంటే తప్ప….ఈ పుస్తకం వట్టి దండగ అని చెప్పడానికి.. తెలివైన వారు ఎప్పుడూ ఉన్నారు, ఉంటారు. ఏమంటారు?
    రమ.

  1513. బోడి పద్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/19/2009 10:20 am

    యుగంధర్ గారూ, సూర్య గారూ,
    వాగుడు కాయల్నీ, moral police ల గురించీ అభిప్రాయాలు రాసే బదులు పై పెట్టె లో నున్న కవితాత్మను ఆవిష్కరింపచేయొచ్చు కదా? గరికపాటి వారు బాధపడ్డది ఇలాటి అభిప్రాయాలపై అభిప్రాయాలకే అనుకుంటాను. ఇయన్నీ వొగ్గేసి పైనున్న బోడి పద్యం మీద ఏటైనా సెప్పండి. అప్పుడు వాగుడుకాయలూ, “మోరల్” రక్షకభటులూ సిగ్గుపడిపోయి, తప్పైపోనాదని లెంపలేసుకుని బుద్దిగుంటారు.

  1514. కథ దేని గురించి? గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/19/2009 9:55 am

    సీతారామయ్య గారు,

    ఇప్పటివరకు, ఏ విశ్వబడుల పరిశోధక వ్యాసాల్లో కథల వర్గీకరణ మీద ఎవరూ ప్రచురించకపొయ్యుంటే మీ వ్యాసం ఖచ్చితంగా ఆ దిశలో ఒక ముందడుగే. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిన అవసరం వుంది. ఈ వర్గీకరణ ఎంత ప్రాధమిక స్థాయిలో వున్నా, ఆ దిశలో అదొక ముందడుగే నని నా అభిప్రాయం.

    “మన కథలన్నీ ఎదో ఒక విషయం (వస్తువు, కథాంశం) గురించే ఉంటాయి.” మన కథ కానీ, ఇంకేదైనా కథ కానీండీ, కథే ఎందుకు, ఏరకవైన కళ కానీయండి, ఏదో ఒక అంశం గురించే కదా ఉంటాయి. అవి భౌతికం కానీయండి, మానసికం కానీయ్యండి, సిద్దాంతాలు కానియ్యండి. జీవితానుభవం, సంఘటన వస్తువుకి భిన్నవైనవా? భిన్నవైనవే అయితే ఏవిధంగా భిన్నవైనవో కూడా మీరు తెలిపితే బాగుండేది. ఆ తెలుపడానికి ముందు, మీరు ప్రస్తావించిన వస్తువు లేదా కథాంశాన్ని నిర్వచించి వుంటే బావుండేదేవో. మీరు చెప్పిన అనుభూతి, కథాంశం, లేదా వస్తువు కాదా? ఆ ఫలాని బావ, ఆయన మరిదితో తిరిగిన చెట్లూ, పుట్తలు, చూసిన పూలు, బండలు అవన్నీ కథలో ఏవి చేస్తున్నట్టు. కథా వస్తువో, కథాంశాలో ఏవైనా అవి పాఠకుడిలో నిద్రపోతున్న ఎప్పటి గుర్తుల్నో, లేకపోతే పాఠకుడిలో ముడుక్కుపోయున్న ఎప్పటి కలల్నో తట్టి లేపడానికే కదా ఆ కథ. ఇక్కడ వస్తువు లేకపోవడవెక్కడ. కళ్ళకు కనిపించి, స్పర్శకు తెలిసే వస్తువయితేనేం, మనసుకు వినిపించి, గుండెకు తెలిసే వస్తువయితేనేం. వస్తువులో చిన్న, పెద్ద బేధాలు చూడాలా?

    ఎప్పుడో అప్పుడు, ప్రతి ఇల్లు ఒక కథల ఖార్ఖానా అయ్యుంటుంది. ప్రతి అమ్మ, అక్కడక్కడా కొందరు నానలు కూడా లెక్కలేనన్ని కథలు కల్పించుంటారు. ఇంకెన్నో పాత కథల్ని చిత్రికపట్టి కొత్త కథలుగా మార్చుంటారు. వీటిలో రెక్కల గుర్రాలు, మాట్లాడే జంతువులు, పోట్లాడే కపాలాలు, మాంత్రికులు, రాకుమారులు, చూడ చక్కని రాకుమార్తెలు వుంటారు. ఈ కథల్లో వస్తువు లేదా? ప్రపంచం తెలియని పిలకాయలకి, అసలలేని కలల ప్రపంచం ఈ కథల వస్తువు కాదా? కలలు, ఊహలు, కథాంశాలు కావని, వాటి చుట్టు అల్లిన కథల్లో కథా వస్తువు లేదని మీ వర్గీకరణ బట్టి అర్థంచేసుకోవలసి వుంటుంది.

    కలలైనా, ఊహలైనా, జీవితానుభవాలైనా, మీరు చెప్పిన సంఘటనలైనా, సిద్దాంతాలైనా, ఇంకా వాటి రాద్దాంతాలైనా, అన్నీ బతుకులో ఒక భాగవే సీతారామయ్య గారు. అసలు వస్తువు లేని కథంటూ వుండదు. ఆ వస్తువు కల కావొచ్చు, శిల కావొచ్చు, మనసుకి మాత్రవే తెలిసే అనుభూతుల అల కావొచ్చు. ఆ వస్తువు, సిద్దాంత రాద్దాంతం కావొచ్చు, సామాజిక స్పృహ కావొచ్చు, సందేశం కావొచ్చు, స్వంత వ్యాఖ్యానం కావొచ్చు అన్నీ బతుకులో ఒక భాగవే కదా.

    కథ అనేక కోణాలనుండి బతుకుని ప్రతిఫలిస్తుంది. కథ బాగుండడానికి ,బాగలేకపోడానికి, కథా వస్తువు చుట్టూ అల్లడవా, అల్లకపోవడవా కారణం కాదు, కథ చెప్పడంలో పాఠకుడిని ఆకట్టుకుందా లేదా అనేదే ముఖ్యం. అదికూడా, పాఠకులందరూ ఒకటి కాదు. రకరాకాల మనుషులు, రకరకాల పాఠకులు. ఏ కథా కూడా అందర్నీ స్పర్శించలేదు. ఏ కథా కూడా భౌగోలికవైన, సామాజికవైన, మానసికవైన, కాలానుగుణవైన పరిధులకిలోబడి మాత్రవే మంచి కథ అనిపించుకుంటుంది.

    మీరు ఉదాహరణలుగా ఇచ్చిన కథల్లో లోపాలు, ఆ కథ చెప్పడంలో లోపాలే గాని, కథలో వస్తువు వల్ల వచ్చిన లోపాలు కాదు. సూటిగా చెప్పదలచుకున్నప్పుడు వ్యాసాలు రాసుకోవచ్చు కదా అన్నారు, వ్యాసాలు రాసుకోవచ్చు, కానీ కథలు కూడా సూటిగా చెప్పడానికి ఉపయోగించే మాద్యమాల్లో ఒకటని నా మనవి. చక్కగా అరటిపండొలచి చేతులో పెట్టినట్టు సూటిగా సిదాంతాన్ని వివరించే కథలు చాలానే వున్నాయి (పిపీలకం). ఎటూ చెప్తాం కదా అని కథని సరిగ్గా అల్లకపోవడం, కథకు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధంలేకపోవటం, స్వయం వ్యాఖానంతో పాఠకుడ్ని బోరు కొట్టించడం ఇవన్నీ కథకునిలోపాలే గాని, దానికి, కథాంశానికి, కథకుడు చెప్పదలుచుకున్న సందేశానికి సంబంధం వుందని నేననుకోను.

    కథ నచ్చకపోవడానికి కథకుని లోపవే కాదు, పాఠకుల పరిధులు కూడా (సామాజికవైన, సిద్దాంతపరవైన, కాలాణుగుణవైన) ఒక అంశవే. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు, అప్పుడు అడిగి అడిగి మరీ చెప్పించుకున్న కథలు ఈరొజు ఈ వయసులో మనసుకి అంత పట్టకపోవచ్చు. దాచుకుని, దాచుకుని చదివిన డిటెక్టివ్ నవలలు ఇప్పుడు చెత్త బోరుకొట్టొచ్చు, ఆవురావురు మంటూ ఎదురు చూసిన ప్రేమ కథలు ఇప్పుడు తమాషాగా అనిపించొచ్చు. కొందరు మహానుభావులకి కన్యాశుల్కం అనవసరపు రాద్దాంతంలా కనిపించొచ్చు. గోవులొస్తున్నాయి జాగ్రత్త సిద్దాంత రగడలా స్పురించొచ్చు. వీటిల్లో కలలు, కల్పనలు, సంఘ సంస్కరణలు, సిద్దాంతాలు అన్నీ వున్నయి వాటితోపాటు చదివించే గుణం ఈ వీటన్నికీ వుంది. కాబట్టి కథ చెప్పడానికి వస్తువు అడ్దం కాదు. ఏ వస్తువైనా చేవ వున్న కథకుడు మంచి కథగా అల్లగలడు. అంతే కాదు, కవితల్ని స్పురింపజేసే కథలు, కథల్ని చెప్పే కవితలు, రెంటినీ గుర్తుతెచ్చే కరపత్రాలు వీటి సంగతేవిటి?

    బాబ్జీ,
    ఇదేవిటి, విరసం వల్ల కథలు వ్యాసాలైపోవటవేవిటి. విరసం ముందు అరసం, దాని ముందు సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటం, దాని ముందు మరింకేదో మార్పు, ఆ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు వుండడవనేది సహజం కదా. విరసం మాత్రమే కథనెందుకు నాశనం చేసింది, లేకపోతే మూసలోకెందుకు నెట్టింది. ఐనా నువ్వుదాహరించిన రావీ శాస్త్రి, కోకు, కారా విరసంతో సరసం చేసిన వాళ్ళే కదా! రచయితల నిజాయితో నీకేం పని, వాళ్ళు వ్రాసిన కథలతో పని కాని. దీనికి వ్యతిరేకంగా ఈ నడవ నువ్వే ఒక అభిప్రాయం వ్రాసినట్టు గుర్తు.

    కళ, కళకోసవే అనే వాదాన్ని తమ్మినేని గారు మరొక అడుగు ముందుకి తీసుకెళ్ళేరు, కళలో కల తప్ప నిజం (బుద్ది) వుందకూదదంటున్నారు. కథ బుద్దిని తాకకూడదంటారు. ఐతే మీరు చెప్పింది మాత్రం బాగుంది, సరి ఐన వాతావరణం లేని కథ, నిజవే పాఠకుడ్ని తాకదు. బుద్దిని తాకే కథల్లో ఆ వాతావరణం ఉంటే అవి మంచి కథలే కదా తమ్మినేని గారు.

    మీతో ఏకీభవిస్తాను రమ గారు, గురూ గారన్నట్టు, నవ్వేది, నవ్వించేది, కదిలేది, కదిలించేదే కదా, కవితైనా, కథైనా.

    కోడవళ్ళ గారు, మీ అభిప్రాయాల్లో, పెద్ద, పెద్ద పేర్లినిపిస్తాయి, చాలా కోట్స్ కనిపిస్తాయి, కానీ మీరు మాత్రం మీ మాటల్లో కనిపించరు ఎప్పుడో తప్ప. పుస్తకాల్లేకపోతే హాయిగా వుండగలవా? తెలీదు, కానీ పుస్తకాల్లేందెప్పుడు? కాగితం లేనప్పుడు, తాటేకులో, మరో చెట్టు బెరళ్ళో, లోహాలో, అవీ కానప్పుడు, నోటిమాటగా తరాన్నుంచి తరానికి సాగే కథలు, పాటలు అవన్నీ ఏవిటి? మనిషి మాటల్తోబాటు కథ కూడా పుట్టుందడంటారా. అది ఏరూపంలో భద్ర పరిస్తేనేవి.

    గడ్దగట్టిన సముద్రాలెక్కడవి, ప్రవహించే నదులు తప్ప, అప్పుడప్పుడూ ఆ నదులెండి పోవచ్చు, గడ్డకట్టి పోవచ్చు. కానీ కొద్ది కాలవే. మార్పు మనిషికి సహజ గుణం కదా. కథ, కవిత ఇవేవి గొడ్డళ్ళు కావేవో, మహా అయితే మట్టి బెడ్డలాగా కాసేపు నదిలో చిన్న అలల్ని రేపుతాయేవో. కాఫ్కానే చెప్పుండొచ్చు గానీ గడ్డకట్టిన సముద్రవే అయితే మెటామార్ఫొసిస్లో ఆ గుమస్తా అంత హింస పడివుండడు కదా?

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  1515. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/19/2009 2:28 am

    పండిత వ్యాఖ్యానాలు పక్కన లేకుండా ప్రాచీన సాహిత్యం పూర్తిగా అర్థం చేసుకోవదం, గురుముఖతః గాక ఔత్సాహికంగా సంస్కృతాంధ్రాలని స్వయం కృషితో అభ్యసించిన మా బోటి వారికి సాధ్యం కాదు. సాహిత్య ఎకాడమీ వారు ప్రచురించిన వసుచరిత్ర, మనుచరిత్రాదులను పఠించినా అవి ఏవీ 20్ సంవత్సరాల క్రింద శరదాగమ వ్యాఖ్యా సహితంగా చదివిన చంద్రికా పరిణయం అంత సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. రామరాజభూషణుడితో సమానమైన లేదా అంతకు మించిన విద్వత్కవితా పాటవాలు కలిగిన సురభి మాధవరాయని ప్రజ్ఞ నాకా వ్యాఖ్య లేకుందా అవగతమయ్యేది కాదు. అందుకే నేను పండిత వ్యాఖ్యాసహిత కావ్యాలను స్వాగతిస్తాను, ఎదురుచూస్తాను ఆదరిస్తాను. ఇంతకీ మీరు పరిచయం చేసిన పుస్తకం ఎక్కడ ఎంతకు లభ్యమౌతుందో వివరించలేదు.

  1516. బోడి పద్యం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/17/2009 3:40 am

    కవిగారే పెట్టిన పేరుకన్నా దీనికి వేరే అభిప్రాయం అనవసరం. ఐతే దీన్నిపద్యం అనడానికి నాకు మనస్కరించటం లేదు. మాత్రా ఛందస్సో లేక వృత్త ఛందస్సో కలిగి ఏ పాదం ఎందుకు ఎక్కడ ఎలా ఆపాలో అనే దానికి విస్ఫష్ట మైన నియమాలు కలిగిన పద్యం అనే సాహిత్య ప్రక్రియకీ దీనికీ ఒకే పేరు తగునా అని సందేహం. బిస్మిల్లా ఖాన్ సన్నాయి పాప అనే పాదంలో “పాప” దగ్గర నెందుకువిరిచారో అవగతం కాలేదు. కవితలో కవి హృదయం గానీ ఉద్దేశం గానీ జటిలమైన ప్రహేళిక అనిపిస్తోంది. నాకైతే అర్థం కాలేదు మరి.

  1517. కథ దేని గురించి? గురించి giri గారి అభిప్రాయం:

    03/16/2009 11:10 am

    సీతా రామయ్య గారికి, నమస్కారములు. శతాబ్ది వయసు దాటిన తెలుగు కధని ఇంత తక్కువ కేటగిరి లలొ కూర్చడం దుస్సాహసము అని నా అభిప్రాయము. కధ పరమార్థము తెలుసుకుందామని చదివిన నాకు నిరాశే మిగిలింది. నిశ్శబ్దం కన్నా మెరుగయినది ఏదేనా చెప్పగలిగినప్పుడె, కథ గాని, కవిత్వము గాని, మాట గాని చెప్పడం వుండాలనుకుంటాను. చాలా వ్యాసాల లానె, మీ వ్యాసం రూపంలొ కొత్తదనం లెదు. క్షమించగలరు.
    The title of the article( కథ దేని గురిMచి) gives an impression that you are going to discuss the basic objective of the stories. But, Surprisingly, the article was discussing the different styles of the story narration.

    I am puzzled!!

    బందా గిరి బాబు

  1518. కథ దేని గురించి? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/14/2009 10:33 pm

    బాబ్జీలు గారూ ! సాహిత్యం ఒక్కటే ఉంటుంది. అది చదివినప్పుడు మనసుకి సుఖాన్నివ్వాలి అంతే!! మంచి సాహిత్యానికి అదే గుర్తు. అది కవిత్వమైనా..కధ అయినా!! కధకుల్ని కవులు చిన్న చూపు చూస్తారన్నది దేని ఆధారంగా మీరు అంత సునాయాసంగా అనీసిందీ ..అభాండాలు వేసిందీ నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే నిజమైతే రావిశాస్త్రి..శ్రీశ్రీ కి అంత అభిమానిగా ఉండగలిగేవారా?? కేశవరెడ్డి గారి ‘మునెమ్మ’ కి ..కాశీభట్ల వేణుగోపాల్ ‘ తపన’ కీ జయప్రభ గారు ముందుమాట రాసేవారా?

    కవిత్వం చదివినప్పుడు కలిగే అనుభవం భిన్నమైంది. క్లుప్తంగా ఉంటూనే గాఢంగా మనసు మీద ఒక ముద్ర వేయగలదు కవిత్వం.నేను చెప్పేది మంచి పోయెమ్ గురించి. మంచి కధ కూడా చాలా ఆలోచనల్ని రేకెత్తించగలదు. తెలుగులో ఈ గాడత పరిధిలోకి వచ్చే కవులు.. రచయితలు..అన్ని కాలాల్లోనూ కొందరే !!

    సిధ్ధాంతాలు సృజనకి ప్రేరణనిస్తాయి. అదే లేకపోతే గోర్కీ..’అమ్మ’ వచ్చేదే కాదు. సిధ్ధాంతాన్ని సృజనాత్మక సాహిత్యం ఎలా ప్రతిఫలించాలి అన్న విషయంలో తెలుగులో రావిశాస్త్రీ..కాళీపట్నం…చాసో…కేశవరెడ్డి వంటి వారిలో తప్ప మిగిలిన అనేకుల్లో ఏ స్పష్టతా కనిపించదు.ఫెమినిస్టుల కధల్లోనూ ఇది ఉంది. బ హుశా యదుకులభూషణ్ గారి కోపం వెనక ఉద్దేశ్యం ఇదే కావొచ్చు.మీరు ‘విరసం’ ప్రభావాన్ని గురించి అన్న నిష్టూరం కూడా ఇదే కావొచ్చు. అప్పటికీ తప్పు సిధ్ధాంతాలదే కాలేదు. సృజన లేమి ఉన్న వాళ్ళు చేసే రచనలకి సిధ్ధాంతాలూ..సంస్థలూ బాధ్యత ఎంత వరకూ తీసుకోగలవూ?? వాళ్ళు మేలైన రచయితల్ని ఆకట్టుకోలేకపోయి ఉండొచ్చును కదా? ఖాదిర్ బాబు ఏ సిధ్ధాంత చట్రాలకీ లోబడకుండా మంచి కధలు రాస్తున్నాడు కదా?ఇదే దృష్టాంతం.

    అందువల్ల నా అభిప్రాయం మంచి కవుల్నీ, కధకుల్నీ సిధ్ధాంతాలు తయారుచేయవు. అలాగే చంపవు.
    రమ.

  1519. నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana గారి అభిప్రాయం:

    03/11/2009 11:03 am

    వ్యాసం నచ్చినవారికి నా నమస్సులు. నచ్చనివారికి ఇక మీద బాగుగా రాయటానికి ప్రయత్నిస్తా. ఒక రెండు విషయాలు. ఈ వ్యాసరచనకు ప్రోత్సాహం శ్రీ బ్రందావనరావుగారి పద్యం. నన్నెచోడుని విపులంగా ఎందుకు పాఠకులకు పరిచయం చేయరాదనే భావం నాకు అప్పుడు కలిగింది. మొదటి భాగంలో అతని కవిత్వాన్ని గురించి వివరించాను. రెండవ భాగం నా అభిప్రాయాలు. పాఠకుల అభిప్రాయాలకు జవాబు ఇవ్వరాదనే
    భావం నాకు లేదని వినయపూర్వకంగా విన్నవించుకొంటున్నాను.

    కలింగత్తుప్పరణి మదురై ప్రాజెక్టులో దొరుకుతుంది. బ్రహ్మానందంగారు చెప్పిన పద్యం చూడగలిగాను. దాని అర్థపర్థాలు అడిగి తెలుసుకోవాలి. ఒక పద్యం ఎవరు ముందు రాశారో ఎవరు అనుకరించారో
    చెప్పడం సులభం కాదు. భూషణ్ గారు నాగేంద్ర చోడుడు 940 కాలం వాడన్నది బహుశా కవిగారి సిద్ధాంతాన్ని ఉద్ఘాటిస్తున్నారని అనుకొంటాను. రెడ్డిగారు కూడా నన్నెచోడుడు శాలివాహనశకం కాక విక్రమశకం వాడాడని అనుకొన్నారు.

    శ్రీనివాస్ గారూ, నాకు నన్నయ లేక నన్నిచోడులలో ఒకరు ముందు మరొకరు వెనుక అనే స్థిరమైన అభిప్రాయం లేదు, అట్టి అభిప్రాయాన్ని బలపరచాలని ఈ వ్యాసం రాయలేదు. నేను చెప్పిందల్లా రేచన నన్నెచోడుని పిదప అని మాత్రమే. నన్నయ నన్నెచోడులకు ముందు గ్రంథాలు ఉన్నాయని పంపడు తెలుగులో రాశాడని వేంకటరావుగారు అభిప్రాయ పడ్డారు. ఇక పోతే నన్నెచోడులు ఎందరో ఉన్నారు. బద్దెనకు కూడా నన్నెచోడుడని పేరుందని చదివాను. నా ఆశయం ఛందస్సు కొన్ని సంశయాలను తీరుస్తుందేమోననే. చరిత్రగురించి చర్చించడానికి నాకు అర్హత లేదు. ముఖ్యంగా కొత్త వృత్తాల ఉపయోగం, వాటి పేరులు, చిత్రకవిత్వం ఇత్యాదులను చోడుడు ఉపయోగించాడు. వీటిని కన్నడం నుండి గ్రహించి ఉండాలి. కవిరాజమార్గములో చిత్రకవిత్వం ఉంది.

    శ్రీనివాస్ గారూ, ఆదిదంపతుల శృంగారాన్ని వర్ణించేటప్పుడు కాలిదాసుకు కూడా సమస్యలే వచ్చాయి. ఈశ్వరునిపై ఎన్నో భక్తిభరితమైన పద్యాలు కుమారసంభవంలో ఉన్నాయి. బహుశా నేను బాగా ఎత్తి చూపలేదేమో, అందుకు నన్ను క్షమించాలి. నన్నెచోడునికి సంగీతంలో కూడా బాగా పరిచయము ఉండి ఉండాలి. అతడు ఒక తరువోజలో ఎన్నో రాగాలను (సాహురి, ఫలమంజరి, పౌరాలి, ఆందోలి, భైరవి, నాట రాగాలను) పేర్కొన్నాడు. ఇవన్నీ పురాతన రాగాలు, అపూర్వ రాగాలు. అందులో కొన్ని బృహద్దేశిలో కూడా ఉన్నాయి. సంగీతజ్ఞానము ఉన్న వాళ్లు పరిశోధనలు చేయవచ్చు. వ్యాసం అచ్చవడానికి ముందు విజ్ఞుల క్రిటిసిసం తీసికోవాలని ప్రయత్నించాను, కాని సఫలీకృతుడిని కాలేక పోయాను.

    విధేయుడు – మోహన

  1520. కవిరాజశిఖామణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    03/11/2009 7:42 am

    నమస్కారం. ఎంతో పరిశ్రమతో ఎన్నో విషయాలను అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మూడవపేజీలో, “తరువాతి కాలంలో తిక్కన కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని *తిక్కనకు* అంకితము చేసి..” అని ఉంది. Typo అనుకుంటాను.

    తట్టిన కొన్ని ఆలోచనలు.

    కవి తామరలు విష్ణువు, లక్ష్మీదేవి కన్నులలా ఉన్నాయనడం చాలా అసహజంగా, కృత్రిమంగా ఉంది. తెలియని దానిని, తెలిసిన దానితో పోల్చడం, లేక తెలిసిన దానిని సైతం ఇంకో తెలిసిన దానితో పోల్చడం చూస్తాం. ఇక్కడ కళ్ళకు కనబడే తామర పూలను కనిపించని లక్ష్మీనారాయణుల కళ్ళతో పోల్చడం కవిత్వం కన్నా, పాపము శమించుగాక, పైత్యం లాగా అనిపిస్తుంది.

    ఎవరి పద్యం ముందో తెలియదుకాని, పోతన గారి “అడిగెదనని కడువడి జను” పద్యం లక్ష్మి తడబడ అడుగులను ఎంతో సహజంగా, సుందరంగా సర్వ లఘు కందంలో అందంగా అనిపిస్తుంది, వినిపిస్తుంది. దాని ముందు “తగుదగదని మనమున” అన్న నన్నెచోడుని పద్యం, కాపీ కొట్టింది కాకపోయినా, వెలవెల పోయినట్లే అనిపిస్తుంది.

    పాండిత్యం గురించి కాదు కాని, హృదయాన్ని తాకే భక్తి భావం మాత్రం ఇన్ని పద్యాలను చదివినా ఎందుకో, పోనీ పోతన ధూర్జటి స్థాయిలను అందుకోకపోయినా, ఏ మాత్రం కూడా అనుభవంలోకి రావడం లేదు. కవిరాజశిఖామణికైనా కూడా, కామున్ని స్తుతించిన కలంతోనే కామేశ్వరున్ని గొప్పగా స్తుతించడం కష్టమేనేమో!

    విధేయుడు
    -Srinivas

    [టైపో సరిదిద్దాము. చూపినందుకు కృతజ్ఞతలు – సం]

  1521. నన్నెచోడుని క్రౌంచపదము గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    03/11/2009 7:08 am

    ఈ మాటలో వచ్చే కధలూ, కవితలూ, వ్యాసాల పైన వచ్చే అభిప్రాయాల్లో చర్చన్నది (ఒకటీ అరా సందర్భాల్లో తప్ప)లేదనే నా అభిప్రాయం. ఎవరైనా ఒక వ్యాసం పైన అభిప్రాయమో, ప్రశ్నో వేసారనుకోండి. దానికి సమాధానం ఇచ్చే బాధ్యత (తీసుకుంటేనే లెండి) రచయితది. చాలాసార్లు రచయిత మౌన ముద్ర పాటిస్తే, ఆ వాఖ్యలు చదివేవారు ఆవేశ పడిపోడం ఎక్కువగా ఉంటోంది. అందులో “నాకే అన్నీ తెలుసు – నీకేం రాదు – నువ్వు చవట దద్దమ్మవి” అని రుజువు చేయడమే ప్రధానోద్దేశ్యంగా అభిప్రాయాల గొంతుంటోంది. అందువల్ల చర్చకి అవకాశం తగ్గిపోతోంది. చర్చకి ప్రధాన లక్షణం ఎదుటి వారి అభిప్రాయాన్నీ గౌరవించడం. అది కొరవడినప్పుడే అది తప్పుదారిపడుతుంది.
    ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అయితే వ్యాసాలపైనా, కథలపైనా ఎవరూ అభిప్రాయాన్ని వ్యక్తీకరించరు. దూరంగా ఉంటారు. పాఠకుడికీ, రచనకీ మధ్య రచయితపై నున్న వ్యక్తిగత అభిప్రాయమొచ్చి కూర్చుంటే ఆ రచన ఎప్పటీకీ నచ్చదు. ఒకవేళ అందులో విషయమున్నా మనసొప్పుకోదు. తెలుగులో సాహితీ విమర్శ లేదని మనకి మనమే బాధ పడుతూ ఉంటాం. చర్చించుకుంటూ వుంటాం. కానీ ఆ విమర్శకీ, చర్చకీ మనమెంత ఆసరా ఇస్తున్నామన్నది ఆలోచించుకోవాలి. తెలుగునాట చర్చకీ, విమర్శకీ అవకాశమే తక్కువ. ఇంటర్నేట్ పత్రికల్లో ఆ అవకాశముంది. అదే ఇలా అభిప్రాయం రాయడానికి దోహదం చేస్తోంది.

  1522. నన్నెచోడుని క్రౌంచపదము గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    03/10/2009 3:27 pm

    నన్నెచోడుని మీద జరుగుతున్న చర్చ చూస్తున్నాను. చర్చలో మంచిచెడ్డల గురించి చెప్పబోయేముందు చర్చకు వాడుతున్న భాషను గురించి ఒక మాటచెప్పాలనుకుంటున్నాను. ఆ చర్చల్లోని కొన్ని వాక్యాలలో స్పష్టత కన్నా ఆవేశం ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకి భూషణ్ గారి మొదటి వాక్యం: “అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం.” ఈ వాక్యం వల్ల చర్చకు ఏ రకమైన ఉపయోగం జరగదు సరికదా అనవసరమైన ఆవేశం పెరుగుతుంది. మనం ఎవరినీ చెంపదెబ్బలు కొట్టనక్కరలేదు. ఎవరి పాండిత్యాన్నీ ఈసడించుకోనవసరం లేదు. “ఈమాట” చదువుతున్న వాళ్ళందరూ చదువుకున్నవాళ్ళు. వాళ్ళంతట వాళ్ళు మంచి అభిప్రాయాలు ఏర్పరుచుకోగలిగినవాళ్ళు. అందువల్ల “ఈమాట”లో చేస్తున్న చర్చల్లో ఆవేశాలు ఎంత తక్కువుంటే అంత మంచిది.

    ఇక నన్నెచోడుని మీద మోహనరావుగారు రాసిన వ్యాసం నిజంగా బాగుంది. అయినా ఆ వ్యాసంలో కూడా సమాచారం కొత్తదే కానీ సమన్వయం కొత్తది కాదు. ఆయన ఛందస్సుని వాడుకున్న పద్ధతి అయన వ్యాసానికి చాలా బలానిచ్చింది. కాని ఆయన వేసుకున్న ప్రశ్న; నన్నెచోడుడు, నన్నయ వీరిద్దరిలో ముందెవరు, తరువాతెవరు అనేది. అయనిచ్చిన సమాచారంలో ఏదీ కూడా ఈ ప్రశ్నకు నిష్కర్షగా జవాబివ్వదు. దానికి కారణం ఆయనిచ్చిన సమాచారంలో లోపం కాదు. ఆ సమాచారాన్ని ఆయన విశ్లేషించిన తీరులో లోపం కూడా కాదు. లోపమల్లా ఆ ప్రశ్నలోనే వుంది. అది సమాధానం దొరకడానికి వీల్లేని ప్రశ్న. ఇంకొక మాటల్లో చెప్పాలంటే అది పరిశోధకులు వేసుకోవలసిన ప్రశ్న కాదు.

    నన్నెచోడుడు, నన్నయ రెండు భిన్నమైన సంప్రదాయాలకు చెందినవాళ్ళు. నన్నయది పురాణ సంప్రదాయం, నన్నెచోడుడిది కావ్య సంప్రదాయం. ఇద్దరూ తెలుగులో రాస్తున్నారు అన్నమాట మినహాయిస్తే వీళ్ళిద్దరి మధ్య పోలికలు లేవు. మోహనరావుగారు చేసిన ఉపకారం ఏమిటంటే నన్నెచోడుడు దాదాపుగా నన్నయ కాలానికి చెందినవాడే అని ఛందస్సులో ఋజువులు చూపించి చెప్పగలగడం.

    అయితే ఆ కాలంలో నన్నెచోడుని కావ్యంలాంటి కావ్యం ఎలావచ్చిందో చెప్పడానికి కావలసిన సమాచారమేదీ మోహనరావుగారి వ్యాసంలో కనిపించదు. నన్నెచోడుడు ఏ పరిస్థితుల కారణాల వల్ల అలాంటి కావ్యాన్ని తెలుగులో నిర్మించాడో కానీ, ఆ తరువాత అతనికి దరిదాపు అయిదు వందలేళ్ళపాటు ఆయనకు అనూయాయులెవ్వరూ లేకపోయారు. ఎంతగా లేకపోయారంటే తరువాత వచ్చిన కవులెవ్వరూ ఆయన పేరుకూడా చెప్పలేదు. ఆయన రాసిన పుస్తకానికి ఒక్కటే ప్రతి దొరికింది. అంటే ఆ పుస్తకానికి ప్రతులు రాసుకున్నవాళ్ళు కూడా తక్కువేనన్నమాట. దీనితో పోల్చి చూస్తే నన్నయ భారతానికి ప్రతి తరంలోను కొన్ని వందల ప్రతులు రాసుకున్నారు. నన్నయ సంప్రదాయాన్నీ, దానికి తిరుగుబాటుగా వచ్చిన శివకవుల మార్గాన్నీ కలుపుకొని తిక్కన “ఉభయకవిమిత్రుడు” అనే పేరుతో నన్నయకే ఎక్కువ మిత్రుడై తెలుగులో పురాణ సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఆ తరువాత ప్రబంధం అని ఆధునిక విమర్శకులు అనే కావ్య సంప్రదాయం పెద్దన నాటికి కాని నిక్కచ్చయిన రూపు కట్టుకోలేదు. నన్నెచోడుడు ఆయనకు సుమారు 500 ఏళ్ళ ముందే కావ్యసంప్రదాయాన్ని తెలుగులో మొదలు పెట్టాడని తనకి తెలియకుండానే పెద్దన ప్రబంధ సంప్రదాయాన్ని మొదలు పెట్టి “ఆంధ్రకవితాపితామహుడ”యినాడు.

    ఇంతగా తెలుగు సాహిత్య సంప్రదాయంతో సంబంధం లేకుండా ఏకాకిగా నన్నెచోడుడు మిగిలిపోయాడు. నన్నెచోడుడిమీద చర్చంతా మానవల్లి రామకృష్ణకవిగారు కుమారసంభవాన్ని బయటకు తెచ్చిన తరవాతే మొదలయ్యింది. నన్నెచోడుడి భాషలో చాలా మాటలకి అర్థాలు అందుకే ఇప్పటికీ మనకు తెలియవు. ఉదా: వస్తుకవిత, జానుతెలుగు అనే రెండు మాటలు చూడండి. వాటికి తెలుగులో వాడుక లేకపోబట్టి ఆయన ఏ అర్థంలో ఈ మాటలు వాడాడో స్పష్టంగా చెప్పడం కష్టం అవుతుంది. ఈమాటలకు అర్థాలు మోహనరావుగారి వ్యాసం చదివిన తర్వాత కూడా అస్పష్టంగానే మిగిలిపోతాయి.

    నన్నెచోడుడు, నన్నయ దాదాపు ఒక కాలం వారయినప్పటికీ భిన్న సంప్రదాయాల వాళ్ళు అనేమాట గుర్తిస్తే ఈ యిద్దరిలో ఎవరు ముందు, ఎవరు తరువాత అనే ప్రశ్న తప్పేది. తారీఖులు మాత్రమే సాహిత్యచరిత్ర అని మనం 19వ శతాబ్దం చివరిలో నేర్చుకున్న పాఠాలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాం. మనకు కావలసింది ఋజురేఖలాగా నడిచే తారీఖుల సాహిత్యచరిత్ర కాదు, సంప్రదాయాల చరిత్ర కావాలి.

    ఇకపోతే ఈ చర్చలోకి Caldwellని, Brownని తీసుకురావడం స్పష్టత తీసుకురాదు సరికదా ఇంకా గజిబిజికి కారణమవుతుంది. ఈ చర్చకు సంబంధించిన విషయం కాదు కాబట్టి Caldwell, Brown తెలుగు సాహిత్య చరిత్రకు కానీ, తెలుగు భాషకు కానీ చేసిన ఉపకారమేమిటి, అపకారమేమిటి అన్న విషయాలు వేరేగా చర్చించాలి.

    — శ్రీనివాస్

  1523. నాకు నచ్చిన పద్యం: వసుచరిత్రలో చంద్రోదయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/10/2009 6:45 am

    అవును లైలా గారూ! రాత్రి మార్మికంగా ఉంటుంది. ఉద్విగ్నంగా ఉంటుంది, ఊహాతిరేకాల కవ్వింతగా ఉంటుంది. రాత్రి నలుపు సృష్టి రహస్యాల కలగలుపుగా ఉంటుంది. వ్యధకీ విశ్రాంతికీ వ్యాఖ్యానంలా ఉంటుంది. ఎంతైనా రాత్రి రాత్రే!!

    మీరు ఉదాహరించిన poem చెప్పలేనంత బాగుంది. పరమ సున్నితమైన తండ్రిని బొమ్మకట్టి చూపింది. భట్టుమూర్తి కాలానికి వర్ణనీయ వస్తువు ఆడదే!మగవాడి మనసుని శృంగార పరంగా మాత్రమే పట్టించుకున్నారు తెలుగు కవులు. అందుకే పాత కావ్యాల్లో ముసలమ్మలూ, పసి బాలికలూ ఉండరు. వయసులో ఉన్న స్త్రీమీదే వారి దృష్టి. అందులో మరీ వేలంవెర్రి రామరాజభూషణునిది. అది అలా ఉంచినా, కొన్ని వర్ణనలు పాత సాహిత్యంలో నిషిధ్ధం, అందునా జనన మరణాలు. అదీకాక తండ్రి ప్రసవాన్ని చూడటం పాశ్చ్యాత్త దేశాల్లో సాధ్యం. మన పాత సమాజంలోనే కాదు..ఇవాళ్టికీ ఇక్కడ తండ్రికి ఆ అవకాశం లేదు. పైగా పాత కాలంలోనూ ఇప్పటి కాలం లోనూ కూడా తెలుగు సమాజం ఒప్పుదల అన్న విషయంలో బహు జాగ్రత్తగా ఉంటుంది. మీరు ఉటంకించింది అమెరికా తండ్రి స్పందన. ఈ దేశం నించి ఇంకా ఈ సమాజం నించి ఇప్పటప్పట్లో అలాంటి కవిత వచ్చే వీలులేదు. మంచి పోయెమ్ ని ఉదాహరించినందుకు నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను.

    రమ.

  1524. కథ దేని గురించి? గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    03/09/2009 6:41 pm

    నీవు బ్రతికున్నావు అన్నదానికి దాఖలా:కథ,కవిత లేదా మరే కళాకృతైనా. కథ అనాది నుండి ఉంది.కథ అంటే పిల్లలు ఎందుకు చెవి కోసుకుంటారు?? కలతచెందిన మనసుకు-వెచ్చని ఊహాలోకాల్లో విహరింపజేసి హాయిగొల్పేదికథే కదా.బుద్ధిమార్గం ప్రతి ఒక్కరికీ అనాయాసంగా సిద్ధిస్తుంది.ప్రొద్దున లేచింది మొదలు పక్కలోచేరే దాకా మనం చేసే పనుల్లో బుద్ధి ప్రాబల్యం ఎక్కువ.దాన్నుండి రక్షించేదే కథైనా,కవితైనా.మనందరం అన్నీ మరచి చిన్నపిల్లల్లా కల్పనాజగత్తులో తేలిపోవాలనుకుంటాము.స్థాయీభేదాలతో ఆ అవసరాన్ని తీర్చేవి కథ, నవల.ఈ ప్రాథమిక విషయాన్ని మరచి కథారచన పేరిట మనం చేసే కసరత్తులన్నీ వికటిస్తాయి.కవిత ఒక రూపం ద్వారా, కథ ఒక వాతావరణం ద్వారా వ్యక్తమవుతుంది.

    వాతావరణం లేని కథ నీలోని కల్పనాశక్తిని తట్టిలేపదు.నానా వాదాలు (కమ్యూనిజం,ఫెమినిజం,వల్లకాడిజం) తాకేది బుద్ధిని.కథలో ఏ పాత్రకైనా పూనకం వచ్చినట్టు నానా వాదాలను ఏకరువు పెడితే రసాభాసయిపోతుంది.గొప్ప కథను ,మామూలు కథను విడదీసేది, ఈ వాతావరణ కల్పనే.పా.ప,కొ.కు ల కథలను విడదీసేది ఈ లక్షణమే.పా.ప కథలు మనలోతులని తడుముతాయి.కొ.కు కథలు పైపైనే తారాట్లాడుతాయి.ఇద్దరు వారి వారి ఫాయాలో గొప్ప రచయితలే. కొ.కు మంచినీళ్ళ ప్రాయంగా కథారచన చేసినా, ఒక గొప్ప పాత్రను మన కళ్ళముందు నిలపలేక పోయాడు.వేలాది పుటల్లో విస్తరించిన ఆయన కథలు చదివి, పుస్తకం మూసి,కనులు మూసుకుంటే బలంగా మనసు పొరల్లో చొచ్చుకుపోయే పాత్రలు తక్కువ.

    గురజాడ కథల్లో వాతావరణ కల్పన ఎంతో ఉజ్వలంగా ఉండి పాత్రలు బలంగా మనసులో దిగబడిపోతాయి.హిందీలో ప్రేంచంద్ నవలలు తేలిపోవడానికి, జయశంకర్ ప్రసాద్ కథలు వెలిగిపోవడానికి కారణం ఇదే.(వాతావరణ కల్పనలో మన గురజాడకు సరిజోడు,దాదాపు ఆయనకు సమకాలికుడు చంద్రధర శర్మ గులేరి ఉస్నే కహా థా (1911)కు సాటి రాగల కథలు హిందీలో నాకు తెలిసి లేవు.ఈయన గురజాడలాగే అనేక భాషల్లో మహా పండితుడు.ఈ కథను ఇదే పేరుతో సినిమా కూడా తీశారు(1961).ఈయన తన జీవిత కాలంలో రాసినవి ముచ్చటగా మూడు కథలే.)

    కేవలం వస్తువుంటే చాలు కథయిపోతుంది ,కవితైపోతుంది, అన్న ధోరణి అసలుకే ఎసరు పెడుతుంది.ఈ ధోరణి వల్లే మన భాషలో కల్పనా శక్తిని మెలకువగా కాపాడుకోవలసిన కవులు/రచయితలు కరపత్రాలు రాసే స్తాయికి దిగజారిపోయారు.గతం గతః రాగల కాలంలోనైనా కథా రచయితలు వాతావరణ కల్పన మీద దృష్టి నిలిపితే బుద్ధిబులపాటాలు తగ్గి కథ యథాస్థానానికి చేరి హుందాగా మనగలుగుతుంది.

    ఈ దిశలో ఆరి.సీతారామయ్య గారి వ్యాసం మంచి ముందడుగు. క్లుప్తంగా చెప్పవలసింది చెప్పి ముగించడం చాలా గొప్ప విషయం.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  1525. నాకు నచ్చిన పద్యం: వసుచరిత్రలో చంద్రోదయం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/09/2009 3:01 am

    ఇది కొంచెం సమంజసరహితంగా కనిపిస్తున్నది. నాటకంలో క్రమక్రమంగా నటి ముఖ చంద్రుడు కనిపించినట్లు ఒకే రోజున చంద్రరెఖ, అర్ధచంద్రుడు, పూర్ణ చంద్రుడు కనపడరు. సమర్ధించగలరు.

    నేను చంద్రికా పరిణయం అనేకసార్లు చదివి ఆ పై వసు చరిత్ర కొన్ని సార్లు చదివాను. ఇతర పిల్ల వసు చరిత్రలు చదవలేదు కానీ నాకు సురభి మాధవ రాయుల కృతి తల్లి వసు చరిత్ర అనిపిస్తుంది. సమకాలీనులైన మాధవ రాయలు భట్టు మూర్తులలో మాధవరాయులు కవితా సౌరభంలో వినూత్న ప్రయోగాలలో పాండిత్యంలో అధికులనిపిస్తూంది. మీ విశ్లేషణ వ్యాసరూపంగా వీలైతే వెలువరించగలరు.

  1526. నాచన సోమన చతుర వచో విలాసం గురించి chinta rama krishna rao గారి అభిప్రాయం:

    03/07/2009 8:06 pm

    ఆర్యా! శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారూ! నమస్తే.
    నవ్య కవితా సనాధుడు నాచన సోమనాధుడు అని స్పష్ఠపరచింది మీ వ్యాసం. ఈ విధమైన మీ వ్యాసాలు పద్య కావ్య పఠనాసక్తిని కలిగిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
    క:-
    నాచన వచో విలాసము
    నే చదివితినయ్య! మీదు నేర్పును గంటిన్
    జూచిన, చదివిన వారికి
    మీ చరితముతోడ కవుల మెప్పును దెలియున్

    అభినందనలు.

  1527. బోడి పద్యం గురించి bollojubaba గారి అభిప్రాయం:

    03/06/2009 8:09 am

    బాబ్జీలు గారు దుడ్డుకర్ర పుచ్చుకొని కూర్చుంటే నేనింకేం మాట్లాడగలనూ.

    నే పైనుటంకించిన ఇమేజెస్ నే మంచి కవిత్వ ధారగా భావించాను.

  1528. కొండ నుంచి కడలి దాకా గురించి kasinadhuni rajasankar గారి అభిప్రాయం:

    03/06/2009 7:28 am

    రమ గారూ,
    Glad you were able to enjoy the song. మీరు అడిగిన వివరాల కోసం నేనూ ప్రయత్నిస్తున్నాను. ఏ శారదా అశోకవర్ధన్ గారినో, పాలగుమ్మి విశ్వనాథం గారినో లేక వేదవతీ ప్రభాకర్, చిత్తరంజన్ గారి వంటి ఆనాటి కళాకారులని అడిగితే తెలియవచ్చు. ఇక పాట రచన విషయానికి వస్తే, నేనూ మొదట ఇది కృష్ణశాస్త్రిగారి రచన అనుకున్నాను కానీ ఎంత వెతికినా, ఆయన రచనల్లో ఇది కనబడలేదు (ఇంకా జాగ్రత్తగా మరొక సారి చూడాలి). కృష్ణశాస్త్రిగారి బాణీ నాకు తెలిసి మరొకరికే ఉంది. అది మల్లవరపు విశ్వేశ్వరరావుగారు. వీళ్ళిద్దరూ సమకాలికులు. శాంతినికేతన్ లో ఉన్నప్పుడు విశ్వకవి రవీంద్రుడి ప్రభావం ఇద్దరిమీదా కనపడుతుంది. ఆందుకే భావకవిత్వంతో పాటు, ఇద్దరూ దేశభక్తి గీతాలు చాలానే రచించడం జరిగింది. “భారత భేరీ మ్రోగిందోయ్”, “ఓహో యాత్రికుడా” లాంటి ప్రేరణ గీతాలే కాకుండా, విశ్వకవి గేయాలని కూడా కొన్ని తెలుగులోకి తర్జుమా చేశారు మల్లవరపు వారు. “ఎవరూ నీ కేక వినీ రాక పోయినా సరే, ఒకడవె పదవోయ్” (ఓక్లె చలో కి అనువాదం) వంటి పాటలు, ఈయనవి బాగా గుర్తింపుని పొందాయి.

    Let us hope that someone like Sri Parachuri Srinivas who has the right contacts can find out more information.

    రాజాశంకర్

  1529. బోడి పద్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/06/2009 7:24 am

    పుంజీడు మంచి “ఇమేజెస్”మంచి కవిత్వాన్ని చెయ్యవు. పుంజీడు మంచి వాక్యాలు మంచి వ్యాసాన్ని చెయ్యలేవు. పుంజీడు మంచి “పేరాగ్రాఫులు” మంచి కథని అల్లలేవు. పుంజీడు మంచి “షాట్లు” మంచి సినిమాని తయారు చెయ్యలేవు.

    పై కవిత్వంలో “ధార” ఎక్కడుందీ?????

    “(వెర్రి) పీర్లనీ, సంపాదకులనీ దాటుకుని” అశ్లీల నీడలు తారాడుతున్న ఈ గొప్ప కవితాధార” ఇక్కడెలా “లీకు” అయిందీ?

  1530. బోడి పద్యం గురించి bollojubaba గారి అభిప్రాయం:

    03/06/2009 5:56 am

    కవితలో మంచి ఇమేజెస్ ఉన్నాయి.

    కృతకమయిన పద్యం రాసిన రాత్రి
    కంటి రెప్పల్ని ఇనప తాళ్లతో లాగుతారు, ఎవరో, దేనికో!

    బిస్మిల్లా ఖాన్ సన్నాయి పాప
    గుక్కపట్టి ఏడుస్తోంది

    పద్యానికీ నిద్రపట్టదు
    నాకు మల్లెనే!

    పునరపి ఖననం పునరపి దహనం

    అశ్లీల నీడలు కవితలో తారాడుతున్నా, గొప్ప కవిత్వ కాంతి ధారలో అవి మరుగున పడినట్లు తోస్తోంది.

  1531. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    03/05/2009 9:58 pm

    “మానవతా మంటపాన శోభించెడు స్వర్ణలతలు!”

    రామారావ్,

    థాంక్స్. నువ్వన్న మాటలు , “When I read about the people like Hilbert who pushed the limits of human knowledge, life seems noble for a brief period,” చదివితే నాకు రెండు గుర్తొచ్చాయి. మొదటిది నీకు తెలిసిందే; రెండోది బహుశా తెలియనిది – రాసింది తెలిసిన వాడే అయినా.

    Weinberg తన పుస్తకాన్ని [1] ముగిస్తూ అంటాడు: “The more the universe seems comprehensible, the more it also seems pointless. But if there is no solace in the fruits of our research, there is at least some consolation in the research itself. Men and women are not content to comfort themselves with tales of gods and giants, or to confine their thoughts to the daily affairs of life; they also build telescopes and satellites and accelerators, and sit at their desks for endless hours working out the meaning of the data they gather. The effort to understand the universe is one of the very few things that lifts human life a little above the level of farce, and gives it some of the grace of tragedy.”

    రెండోది సంతానం కవిత [2]:
    స్వర్ణలత

    కొందరు ధనార్జనలో అహర్నిశలు శ్రమిస్తారు
    మరికొందరు జ్ఞానమునే ఆశ్రయించి బతుకుతారు
    జిజ్ఞాసువుల లోకంలో శాంతిభావమే విరిసెను
    అజ్ఞాతములో ఉన్నా, వారి జన్మ ధన్యము

    అనవరతము జాగృతిలో స్వధర్మమును నెరవేర్చుచు
    చల్లదనము ప్రసరించెడు జ్ఞానులు వెన్నెల నెలవులు

    జ్ఞానులైన వారెప్పుడు లోకహితము కాంక్షింతురు
    మేనిలోని తాపాలను దైవఘటనగా ఎంతురు
    తనవలెనే ఇతరులనుచు తలపోసెడు జ్ఞానమతులు
    మానవతా మంటపాన శోభించెడు స్వర్ణలతలు!”

    ఎ. వి. సంతానం, REC Warangal లో BTech చేశాడు (1976-81). నా క్లాస్ మేట్, స్నేహితుడు. 1987 నాటికి తిరుపతిలో ఉండేవాడు. ఎవరికైనా జాడ తెలిస్తే నాకు కబురు చెయ్యమని కోరిక.

    ఈవ్యాసం చాలా ఆలస్యంగా పంపి వెంటనే ఇండియా వెళ్ళాను. నేను అందుబాటులో లేకపోయినా, సరిదిద్ది మెరుగు పెట్టినందుకు సంపాదకులకు కృతజ్ఞతలు.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:

    [1] “The First Three Minutes: A Modern View of the Origin of the Universe,” by Steven Weinberg. Basic Books, 1993.

    [2] “వెన్నెల రాణి,” ఎ. వి. సంతానం, 1987.

  1532. అనంతకవితాకాంచి గురించి రాఘవ గారి అభిప్రాయం:

    03/04/2009 8:38 am

    భలే. నవీనబంధకవిత్వం. ప్రేమబంధానికి సూచికగా కాఞ్చీబంధం వాడడం బావుందండీ.

  1533. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి అభిప్రాయం:

    03/02/2009 9:12 pm

    ఇది పదుహేడవ శతాబ్ధపు కావ్యమని వేల్చూరి గారు చెబుతున్నారు. ఆ కాలంలో దక్షిణ భారత దేశంలో, తమిళనాడులో అధికారంలో వున్న నాయక రాజులు విజయనగర ప్రభువుల వారి రాజ్యంలో వారి ఆస్థాన వుద్యోగులుగా, తమిళ దేశంలో రాయల వారి ప్రతినిధులుగా, రాయల వారితో బంధుత్వాలు వున్నటువంటి తెలుగు నాయక రాజులు కదా. వారు సామాజికంగా పెద్ద ప్రాధాన్యత లేని కులాల వారవటం ఏవిటి? రాజాస్థానోద్యోగులు, రాజ బంధువులు, రాజ ప్రతినిధులు ఊరూ పేరూ లేని కులాల కి చెందిన వారని చెప్పటం సబబా? వొకవేళ మీరు మాట్లాడే నాయక రాజులు వేరు అని అనుకుందాం. అయినా సరే పదిహేడవ శతాబ్ధంలో పెద్దగా ప్రాధాన్యం లేని కులాల వాళ్ళు, సమర్ధులైన వ్యాపారులుగా మారటానికి ఎన్ని తరాల సమయం పడుతుందో ఆలోచించారా. ఎవరో ఒకరో ఇద్దరో కాదు వొక కులవంతా సామాజిక, ఆర్ధిక పరిస్థితులని (భూమి ముఖ్య ఆదాయ వనరుగా వున్న సమాజంలో, ప్రాధాన్యత లేని కులాలకి వున్న ఆర్ధిక బలం అతి బలహీనంగానే వుంటుంది) తమకనుకూలంగా మార్చుకుని, సమాజంలో వ్యాపార పరంగా గానీ, సామాజికంగా గాని, రాజ్యాలు స్థాపించే స్థాయికి ఎదగడం వొకరోజులో, ఒక జెనరేషన్లో అయ్యే పని కాదు కదా. భూమే ప్రధానమైన ఆదాయ వనరుగా, రాజుకైనా, సామాన్యుడికైనా వున్న సమాజంలో, భూస్వామ్యంతో సంబంధం లేకుండా రాజ్యాధికారానికి రావడం, తమని తామే దేవుళ్ళుగా ప్రకటించుకోవడం ఎంత వాస్తవవిరుద్దంగా వుందో చూడండి. ఒకవేళ ఆ ప్రాధాన్యత లేని కులాల వారె, పరిణామ క్రమంలో, వ్యాపారులుగా, భూస్వాములుగా, రాజ ప్రముఖులుగా, రాజ ప్రతినిధులుగా ఎదగగలిగినప్పుడు, వారి కులం ప్రాధాన్యతని సంతరించుకుని ఒక ప్రముఖ కులంగా, సామాజిక వర్గంగా మార్పుచెందుతుంది కదా (ఇక్కడ ఏ వొక్క వ్యక్థి అభివృద్దో కాదు, మొత్తం కొన్ని కులాల సామాజిక పరిణామం). కాబట్టి అప్పటి వరకు పెద్ద ప్రాధాన్యం లేని కులాల వారు కాదు, అప్పటికే ప్రాధాన్యతని సంతరించుకున్న కులాలు అయ్యుండాలి వాళ్ళవి.

    ఇక ఎడమ చేతి కులాలు, కుడి చేతి కులాల ప్రశక్తి ఒకటి తెచ్చారు. వీరి ఆచార వ్యవహారాలు పరస్పర విరుద్దాలన్నారు. అసలు భావ మాత్రమైన, ఎప్పుడూ జన బాహుళ్యం అనుసరించని, శాస్త్రాలకి, సాహిత్యానికి పరిమితవైన చాతుర్వర్ణ వ్యవస్థ, మీరు చెప్పిన ఎడమ చేతి కులాలు అధికారంలోకి వచ్చేప్పటికి కుప్పకూలి పొయ్యె పరిస్థితి ఎందుకు తలెత్తిందో మీరే చెప్పాలి. అసలు సమాజం పాటించని భావం సమాజంలో ఒక సాజిక వర్గం ఎదుగుదలతో కుప్పకూలి పోవటవేవిటో మీరే వివరించాలి. అసలు కుల వ్యవస్థతో జన్య జనక సంబంధం లేనటువంటి, ఆకాశంలోనో, పాతాళంలోనో, ఉత్తుత్తి ఊహల ఉయ్యాలల్లోనో వుండే చాతుర్వర్ణ వ్యవస్థకి ఎడమ చేతి కులాలతో ఎందుకు తంటానో మరి?

    పెద్ద బ్రామ్హలైనా, చిన్ని బ్రామ్హలైనా, ఒక్క బ్రామ్హణులకే వేదాధ్యాయన అర్హత అని కాదనలేని సత్యం. శారీరకవైన, ఆర్ధికవైన స్వశక్థి లేని సామాజిక వర్గం, దాతల మీద, దానాల మీద అధార పడ్డ కులం అధికారాన్ని సంపాదించి, దాన పత్రం చేత పట్టిన ఎవిరినైనా ఆశీర్వదించడానికి, వారికి క్షాత్రపు పోగు తొడగడానికి లైన్ కట్టి వుంటారనడానికి అభ్యంతర వుండదనుకుంటాను. దానికి పైనుంచో, క్రింద నుంచో పిలిపించుకోవాల్సిన అవసరం వుందని నేననుకోను. అందువలననే, రాజ పీఠం ఎక్కిన ప్రతి వక్కరు క్షత్రియులయ్యారు. భారత దేశంలో నానా కులాల వాళ్ళు, బయటనుంచి వచ్చిన, శకులు, గ్రీకులు, తురుష్కులు, ఆంగ్లేయులు, మన దక్షిణంలో రెడ్లు, బలిజలు, వెలమలు, నానా రకాల రాజులు అందరూ క్షత్రియులై, క్షాత్రం ఒలకబోసిన వాళ్ళే. ఐతే ప్రాచీన రాజ్యాల నుంచి, బ్రిటీషు క్షత్రియుల వరకు, వారు బౌద్ద మతావలంబులు కానీ, తురుష్కులు కాని, సముద్రాలవతల నుంచి వచ్చిన మ్లేచ్చులు గానీయండి దేవుడిని, బ్రామ్మడిని తోసిరాజని, తమని తామే దేవుళ్ళుగా ప్రకటించుకుని, పూజలందుకున్న రాజులు కూడా కావ్యాల్లో, కథల్లో వున్నరేవోగాని, చరిత్రలో వున్నట్టు తోచదు.

    రాజు సామాజిక వర్గం పూర్వవెప్పుడో వర్తక వ్యాపారాలు చేసున్నా, వ్యవసాయాలే చేసున్నా, వేదాలే చదివున్నా, కర్రసాములే చేసున్నా, రాజుకి ఎప్పుడూ ధనం ప్రాధాన్యవే. ప్రత్యేకంగా ఎడమచేతి కులపు రాజులే విత్త ప్రాధాన్యాన్ని పెంచి పోషించేరనడం మీ స్వకపోల సిద్దాంతవేనని నా నమ్మకం. నూటికి తొంభైతొమ్మిది శాతం ప్రజలు భూమి మీద ఆధార పడిన పదిహేడో శతాబ్ధంలో, వ్యాపారం చేసి హటాత్తుగా పైకొచ్చి రాజ్యాలు చేపట్టిన కులాలు కూడా మీరు నమ్మినట్టు చాతుర్వర్ణ వ్యవస్థ లాగే ఊహల్లో వుండి వుంటే వుండి వుండొచ్చు.

    ఇటువంటి కుల సంఘర్షన కాలంలో వ్రాసిందే వేంకటాధ్వరి గారు వ్రాసిన కావ్యమని చెప్పేరు. కావ్యం నేను చదవలేదు. ఐతే మీరు పరిచయం చేసిన కావ్యాంశాలని ఒక సారి పరికిద్దాం. మీ పరిచయం ప్రకారం అప్పటి సమాజంలో పెద్ద మార్పు సంభవించింది. ఎడమ చేతి కులపు వాళ్ళు రాజ్యాధికారం సంతరించుకున్నారు. వాళ్ళు రాజ్యాధికారంతో ఆగిపోకుండా తమని తాము భగవంతులుగా ప్రకటించుకున్నారు. వాళ్ళు పూర్వాశ్రమంలో వ్యాపారులుగుట చేత, సమాజంలో డబ్బు ప్రాధాన్యత పెరిగిపొయ్యి, కులం కాకుండా, దబ్బు సంపాదన అనే గుణం సమాజంలో ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది (బలవంతులవుతున్ననవాబులు, అప్పుడప్పుడే దోపిడికి మార్గాలేస్తున్న బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ తప్ప ఆ కాలంలో అంత సమాజాన్నికల్లోలం చేసిన మార్పులేవీ జరగలేదు చరిత్ర ప్రకారం). కాబట్టి ఆ డబ్బు సంపాదన కలిగిన (ఎలా సంపాదించారో మరి, భూమి పుట్ర లేని క్రింది కులస్థులు) క్రింది కులస్థులు కూడా సమాజంలో గౌరవమైన స్థానం సంపాదించ గలిగేరు. ఎలాటి స్థానం, బ్రామ్హణులు కూడా అసూయ పడగలిగే గౌరవ స్థానాన్ని పొందగలిగేరు. దానికి చారిత్రక ఋజువు ఈ సుమతీ శతక పధ్యం. సుమతీ శతక పధ్యం ఆ కాలానిదని చెప్పడానికి, ఏకాలానిదో చెప్పడానికి ఏ ఋజువులు లేవు, కాబట్టి దాన్ని వదిలేస్తాం.

    అటువంటి సంఘర్షణల సమాజంలోంచి వచ్చిన కావ్యం, ఆ సంఘర్షణని వివరించే కావ్యం ఈ విశ్వగుణాదర్శం. ఈ కావ్యంలో అధునికులు అనుకునే విమర్శనాత్మక దృక్పథం ఆ కాలానికే వుందనివేల్చూరిగారి ఉవాచ. ఎలా? ఇద్దరు గంధర్వుల సంభాషణని రెండు విరుద్ద అభిప్రాయాలుగా మలచడం ద్వారా, ఆ విమర్శనాత్మకథని రచయిత నెలకొల్పుతాడు. కాకపోతే రెండు అభిప్రాయాలుకూడా తురకలు వీరులని చెప్పటంలో, ఆంగ్లేయులు నీతివంతులని వొప్పుకోవడం లాంటి కొన్ని విషయాల్లో వేరైనా, నారాయణ రావు గారి ఉదాహరణల్లో ఇద్దరి అభిప్రాయాలు కూడా, తరిగిపోతున్న బ్రామ్హణ ప్రాబల్యాన్ని గురించి చింత పడటవే కనిపిస్తుంది. పెరిగిపోతున్న శూద్ర కులాల ప్రాభల్యానికి విచారించడవే గోచరిస్తుంది. పాపం తురుష్కులలో, తెల్లొళ్ళల్లో వీరత్వాన్ని, నీతిని చూడ గలిగిన గాంధర్వులకి, క్రింది కులాలు రాజ్యాధికారానికి రావటం మాత్రం అంత నచ్చినట్టు లేదు. ఇదేదో అప్పుడే మొదలయ్యినట్టు, భూసురులు ఇంతకుముందెప్పుడూ లౌకిక వృత్తుల్లో లేనట్టు, ఎప్పుడూ అగ్రహారం కోసం దోసిలి పట్టనట్టు గాంధర్వులు యమ బాధపడిపోతారు.

    ఇంకా విచిత్రవైన విషయం ఏవిటంటే, గంధర్వుల విమర్శనాత్మక దృక్పథాన్ని మరింత ఎత్తుకి తీసుకపొయ్యే ఉద్దేశంతో ఇచ్చిన ఉదాహరణ. వీరు సంస్కృతాన్ని కూడా విమర్శించడానికి కాదు ఈసడించడానికి కూడా వెనుదియ్యరు. నారాయణ రావు గారు, బాపనోళ్ళలో కూడా మహాత్ములుంటారంటే ఉద్దేశం బ్రామ్హణులు మహాత్ములని కాదండి, వాళ్ళు జనరల్ గా మహాత్ములు కాకపోయినా, ఎక్కడో ఎప్పుడో వాళ్ళలో కూడా మహాత్ములుంటారని అర్థం, కాదనగలరా. ద్రవిడ భాషల్లొ మంచి వుంటే పరిగ్రహించవలసిందే, చెడ్డ విషయం సంస్కృతంలో చెప్పినా పరిహరించ వలసిందే అంటే ద్రవిడ భాషలు ప్రామాణికవైనవి, గౌరవించవలసినవి కాకపోయినా, మంచి చెప్తే తీసుకోవలసిందే, సంస్కృతం దేవ భాష, ప్రామాణికవైన భాష అయినప్పటికి చెడ్ద చెప్తే ఆచరించనవసరం లేదు అనే కదా. ఇందులో ద్రవిడ భాషల్ని సున్నితంగా (సున్నితవేం సున్నితం, అదేదో అదైనప్పటికి అది అదే కదా అన్నడట వాడెవ్వడో) కించపరచడవే కదా.

    మీరిచ్చిన ఉదాహరణలన్నీ బ్రామ్హణ కుల సంబంధవైనవే, పొనీ అగ్రకులాల అలజడి గురించి ముచ్చటించారు, అప్పుడైనా మరోకుల ప్రశక్తి లేదుకదా. మీ పరిచయం చదివిన తర్వాత ఇది ఒకే ఒక్క అగ్రకులపేడుపని నేననుకుంటే నా తప్పుందని నేననుకోను.

    ఇంత నిస్సంకోచంగా మీరెలాగ అసత్యాన్ని సత్యంగా చేయబూనుకున్నారు? కులాలతో సంబంధం లేకుండా వున్నటు వంటి చాతుర్వర్ణ వ్యవస్థ, వేదం చదవడం ద్వారానే కులలతో సంబంధం లేకుండా వర్ణ వ్యవస్థలోకి
    ఎదిగిన పెద్ద బ్రామ్హణులు (పాపం బ్రామ్హణ కులంలో చిక్కు పడిపోయిన చిన్న బ్రామ్హణులు) ఇలా అందంగా పుట్టే తక్కువ కులాల ఆడవాళ్ళని చూసి ఏడవడంవవేనా ఆధునికత? సంస్కృత సాహిత్యం ఆధునికం, ఆధునికత్వానికి దూరం కాదని చెప్పడానికి ఇవా మీ ఉదాహరణలు. సమాజంలో మరేరకవైన ఘర్షణ, మార్పు కనిపించలేదా ఉదాహరించడానికి, లేకపొతే కవి గారి ఆధునికత, ఆయన విమర్శనాత్మక దృక్పథం ఆయన ముక్కు దగ్గరే ఆగిపోయిందా? కవిత్వ శొభగుల సంగతి నాకు తెలీదు, మీరు ఏవీ చెప్పినట్టు లేరు, కానీ మీరిచ్చిన ఉదాహరణలే ఆ కావ్యానికి వస్తువైతే, ఆ గంధర్వుల, వారి ద్వారా మీరు పరిచయం చేసిన విమర్శనాత్మక దృక్పథం నిజంగా విచారింపదగిన విషయం. ఐతే అందులో నాకేవీ ఆశ్చర్యం లేదు, మీ కన్యాశుల్కానువాదానికి మీ వెనుక మాట మీద వేలూరివారిచ్చిన పరిచయం చదివేను (కన్యాశుల్కాన్ని మళ్ళీ ఎందుకు చదవాలంటే, వేలూరి వెంకటేశ్వరరావు – సెప్టంబరు 2007), కన్యా శుల్కాన్ని అంతగా వక్రీకరించగలిగిన మీనుంచి మరొకటి ఆశించటం తప్పే కదా.

    చివరగా కొడవళ్ళ హనుమంత రావు గారు, అది ప్రాచీనవైనా, అధినికవైనా, అధునికాంతరవైనా మరేదైనా, సాహిత్యాన్ని పదుగురికి అందుబాటులోకి తేవాలనే మీ సంకల్పం అనుమానం లేకుండా అభినందించదగినది. ఐతే బాబ్జీలు తన అభిప్రాయం చివర్లో చెప్పిన విషయం కూడా మనసులో పెట్టుకోదగినదని నా అభిప్రాయం.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  1534. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి mOhana గారి అభిప్రాయం:

    03/02/2009 12:46 pm

    నా ఉద్దేశంలో ఆ సామర్థ్యం చాలావరకు అంతరించి పోయిందనే అభిప్రాయం. అంతెందుకు, ఈమాటనే ఉదాహరణగా తీస్కోండి. అందులో పాఠకులు అందించే అభిప్రాయాలను ఒక కొలబద్దగా ఎంచుకొంటే, అభిప్రాయాలు ఎక్కువగా కథలపైన, తరువాత కవితలపైన. ఆ తరువాత సంగీతం, సినిమా వ్యాసాలపైన. తరువాతే సాహిత్యం వ్యాసాలపైన. ఈమాట రీడర్షిప్ చాల ఎలీట్. మరి ఇక్కడే ఇలా ఉంటే సాహిత్యంపైన, పుస్తకాలపై వ్యాసాలపైన దృష్టి ఎలా పోతుందండీ జనానికి? ఇలాగున్నా రచయితలు రాస్తున్నారంటే ఆ రచనలు వాళ్లకు ఒక తృప్తి కలిగిస్తుందేమో కాని అందరూ చదువుతారనే ఆశతో కాదని అనుకొంటాను నేను. విధేయుడు – మోహన

  1535. అతడు, నేను, అతడి కథ గురించి afsar గారి అభిప్రాయం:

    03/02/2009 11:12 am

    Dear Madhav:

    ఇలాంటి కథల గురించి మాట్లాడ్డం కష్టం. తీరా మాట్లాడ్డం మొదలెడితే అది కాస్తా కవిత్వమయి కూర్చుంటుంది. మీరూ అలాంటి ప్రమాదం లొ కాస్త పడ్డారు కాని. వచనానికీ- కవిత్వానికీ మధ్య అంచు పట్టుకుని జారిపొకుండా, పైకి వచ్చెశారు.

    విశ్లేషణ బాగుంది, త్రిపుర కథలు కొత్తగా, ఇష్టంగా చదివె వొకానొక కాలం లొ ఇలాంటి వాక్యాల కథలు బాగా నచ్చేవి. త్రిపుర తర్వాత, చంద్రశేఖర రావు, తుల్లుమిల్లి విల్సన్, అనిసెట్టి శ్రీధర్, మధ్యలొ కాస్త సుమనస్పతి రెడ్డి ఇలాంటి వచనంలోకి వెళ్ళి కథల్ని రాబట్టారు.

    మీ విశ్లేషణ ఆ అరుదయిన సాంప్రదాయానికి కొండంత బలం…మీ విమర్శ ఆ కథల చీకట్లో గొరంత టార్చ్ లైట్.

    అఫ్సర్

  1536. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/02/2009 9:31 am

    వెల్చేరు నారాయణ రావు గారికి నమస్కారములు.

    ఆధునికత గురజాడతో మొదలవలేదు, వెంకటాధ్వరి గారి లాటి వారితోనో ఇంకా ముందుగానో మొదలయ్యుండొచ్చు లాటి వాదన నిజవేఁ కావొచ్చు. కాకనూ పోవచ్చు. ఆధునికత ఎక్కడ మొదలైతేనేం? ఆధునికం అంటే ఇప్పటికీ వుండాలి. బహుశా అన్నమయ్యని “నొక్కీసినట్టు” వెంకటాధ్వరి గారినీ “నొక్కీసుంటారు” అప్పటి తరం వాళ్ళధ్వనిజం నిలకడ మీద తెలిసిపోతుంది కదూ?

    ఈ పుస్తకంలో పరమ రమణీయకరవైఁన కవిత్వం వుందన్నారు. దాని గురించి ఎక్కువ రాయలేదు మీరీ వ్యాసంలో. పోన్లెండి ఎలాగోలాగ చదివి చూస్తాం.”రీడబిలిటీ” వున్న వాళ్ళందర్నీ సామాన్య పాఠకులు నెత్తిన పెట్టుకున్నారు. వుదాహరణకి యం.వీ.నాథ్, మ.వెం.కృష్ణమూర్తి, “షాడో” మధుబాబు వగైరాలు. ఈ పుస్తకం కూడా అలాటిదే అయితే, ఇన్నాళ్ళకి దొరికింది కాబట్టి తప్పకుండా నెత్తిన పెట్టుకుంటాం.
    ఇహ భాష విషయం: జనజీవనంలో వుపయోగపడని భాషని ఆ జనులు వదిలేస్తారు. దీనికి అమెరికాలూ, యూరోపులూ వెళ్ళక్కర్లేదు. ఖర్గ్ పూరూ, కలకత్తా, తమిళ్నాడూ, బొంబాయీ వగైరాలు వెళ్తే తెలుస్తుంది. అందులో వాడి, వేడి ఆధునికత్వంతో నిండిపోయిన కవిత్వం రాసినా ఎవరూ పట్టించుకోరు. అంతేకాని సమర్ధులయిన కవులు లేరని ఏ భాషా ఆత్మహత్య చేసుకోదు.

    కొడవళ్ళ వారికి: పుస్తక ప్రచురణకి భూరి విరాళం ఇవ్వడం “జయ హో” అని “డేంచు” కట్టవలసిన విషయం. అయితే ఏ మంచికి హాని చేస్తున్నావోఁ, ఏ చెడుకి మంచి చేస్తున్నావోఁ తెలుసుకుంటే హాయి హాయి గా సాగుతుంది ఆమని.

  1537. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/02/2009 4:16 am

    కనీసం ఇప్పటికైనా కొన్ని కొత్త సంగతులు — తప్పక ఆలోచించాల్సినవి, చర్చచేయాల్సినవీ –ఈ రివ్యూ వలన ముందుకి రావడం ముదావహం! అయితే ఇటువంటి స్థితి ఇప్పటికిప్పుడే రాలేదే? ఆధునికతకీ, సాహిత్యానికీ మధ్య అనివార్యంగా ఒక లంకె పెట్టిన మొదటి తరం నారాయణరావు గారి కాలానిదే కద? శ్రిశ్రీ కవిత్వం మీద విప్లవాత్మకంగా మొదలైన ఈ మోజు పెరిగి పెరిగి చివరికి పాత సాహిత్యం మీదా, సంస్కృత భాష మీదా కూడా వైముఖ్యంగా మారలేదా?

    వాల్మీకి రామాయణాన్ని తెనుగు చేసిన విశ్వనాధని ఎంతగా వెక్కిరించడానికి వీలుందో, అంతగానూ వెక్కిరించిన ఆధునికులూ, విప్లవ వర్గాలూ ఈ విషయంలో చాలా ప్రముఖమైన పాత్ర నే పోషించాయి. మల్లంపల్లి శరభయ్య గారి లాంటి మహా పండితులని ఏం గౌరవించిందీ తెనుగు సమాజం? ఆయన వ్యాఖ్యానాలు ఇప్పటి తరాలకి అర్ధమయ్యే తెనుగులోనే ఉన్నాయే? అంతటి పండితుడూ, ఆఖరి దశలో ఎంత ఇబ్బంది పడ్డారూ? ఎం దక్కిందీ ఆయన కృషికి తెనుగుల నించీ?

    నాకు శ్రీశ్రీ ప్రతిభ మీద గౌరవం ఉంది. కానీ ఆయనకి పాత సాహిత్యం విలువ తెలిసికూడా తనని అనుసరించే యువతరానికి దానిమీద వెగటు కల్గించాడు. నారాయణ రావు గారు ఆనాటి యువతరమే! ఆయన ఇవాళ మేలుకోవడం సంతోషమే! కానీ చాలా ఆలస్యం గా మేల్కోన్నారు. ఈ మాటలు ఆయన నలుగురితోనూ పంచుకునే కాలానికి ఆ పాత పండితులు లేరు; కొత్త పండితులు తయారు కాగల వీలులేదు. మరి ఆయన ఈ సందేశం ఎవరినుద్దేశ్యించి ఇస్తున్నారా అని ఆశ్చర్యంగా ఉంది. “గతజల సేతు బంధనం”!

    రమ.

  1538. భ్రంశధార గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    03/01/2009 9:00 am

    మౌని చేవ్రాలు
    మున్నీటి పాలు.

    కవితంతా నిండిన తడి పాఠకుడి కళ్ళలోనూ చేరుతుంది కవిత పూర్తవగానే.. “ఈ ముసలి ఏరెంత ఒంటరిది” అన్న ప్రయోగం ఎంత నచ్చిందో చెప్పలేను. నిజంగా వంశధార ఒడ్డుకి వెళ్ళొచ్చినట్టుంది. తప్పక రాస్తూ ఉండండి.

  1539. నిశ్శబ్దం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/01/2009 7:30 am

    రవికిరణ్ గారూ,

    అద్భుతవైఁన “ఎమోషన్” నిస్సందేహంగా. నిశ్శబ్దంగా మీ “ఎమోషన్” ని చదవడం బానే వుంది.

    శిల్పం సంగతి?? (వల్లంపాటి వారు లేరు. తెలిసిన వాళ్ళు ఎందుకో విమర్శ గురించి మాటాడ్డం మానీసేరు) నా మట్టుకు నాకు “అతడు-ఆమె” వ్యవహారంలా అనిపిస్తోంది. కానీ మొదటి ఖండిక అతడుది. రెండో ఖండిక ఆమెది. మూడో ఖండిక నిస్సందేహంగా ఆతడిది. నాలుగో ఖండిక ఖచ్చితంగా ఆమెదే.

    విడివిడిగా వుంటే వున్న తక్కువేవిటి? కలిపి వొక కవితగా వేయడం వల్ల వచ్చిన ఎక్కువ ఏఁవిటీ?

    ఇలాటివి చదివినప్పుడు “పచ్చి ఎమోషన్” ని కవిత్వమని ఎటుల యననొప్పు అని క్రొశ్నించాలనిపిస్తుంది. మీరు నిరంకుశులు. చదివేవాళ్ళు?

    ఏదేవైఁనా. మీ “రౌడీ” పదప్రయోగాలు, మర్యాదస్థులికి ఇబ్బందేమో?

  1540. టేబుల్ పై చేతి వాచీ గురించి baabjeelu గారి అభిప్రాయం:

    02/27/2009 10:57 am

    బాబా గారూ,
    ఇది నేను చదివిన మీ రెండో కవిత. మొదటిది చీకటి నావనెక్కి ప్రపంచం వేకువ తీరం వైపు చేసే ప్రయాణం. (ఆదివారం అనుబంధం లోనేమో?) మోనాలిసా నవ్వున్న, పెళ్ళికానుక. ఇల్లు ఖాళీ చేస్తున్నపుడు డ్రాయర్ సొరుగులో దొరకడం. వరవోఁ శాపవోఁ? బతుకు తెలిసిన వారికి కోటి దండాలు. వెధవ బతుకు. మోనాలిసా నవ్వునీ పట్టించుకోదు. పెళ్ళికానుకకీ దిక్కు లేదు. ఎప్పుడో ఓ దిక్కుమాలిన సమయంలో అడ్డెస్తుంది. ఏది వరమ్మో, ఏది శాపమో తెలిసీ తెలియక అలమటిస్తూ కొండెక్కెస్తాం.

  1541. నాతి చరామి గురించి wb గారి అభిప్రాయం:

    02/21/2009 1:49 am

    మండు వేసవి మధ్యాహ్నప్పూట లేత కొబ్బరి బోండం తాగుతున్నట్టు… అల్లం, పచ్చి మిర్చీ, కొతిమీర వేసి దోరగా కాల్చిన వేడి వేడి పెసరట్టు కొబ్బరి పచ్చట్లో అద్దుకొని భోంచేసినట్టు… మంచు వెన్నెల్లో గోదారొడ్డున కూర్చుని అలల్తో ఆడుకునే చందమామను చూస్తూ మాగాయ పెరుగన్నం తిన్నట్టు… ఒక్క తెలుగు వాడూ మాత్రమే వ్రాయగలిగినట్టూ… రుచిగా, శుచిగా, చాలా చక్కగా వ్రాశారు. వేటురి గారి కలం జోరు, మీ పాట లాంటి కవితలో కొంచెం తొంగిచూసింది. ప్రేరణ కావచ్చు, లేపొతే… నాకు వేటూరి మీదున్న పిచ్చి కావచ్చు. విషయం ఏంటంటే, మీరిలా హ్యాపీగా సినిమా పాటలు వ్రాసేయొచ్చు. పొగడ్త కాదు. పచ్చి నిజం. సుబ్బరంగా దీన్నిలాగే తీసుకొని… వంశీ సినిమాలో ఇళయరాజా మ్యూజిక్ తో ఇరగదియ్యవచ్చు అన్నంత హాయిగా వుంది సార్ మీ రచన.

  1542. అదృశ్య దృశ్యాలన్నీ… గురించి prasad గారి అభిప్రాయం:

    02/17/2009 5:29 am

    కమల ప్రసాద్ గారు మీ కవిత చాలా బావుంది
    నాకు బాగా నచ్చింది. ఈ కవిత రాయడానికి మూలం ఎవరొ చెబుతారా

  1543. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి అక్షర గారి అభిప్రాయం:

    02/05/2009 2:14 am

    @rama bharadwaj (February 4, 2009 10:18 am )
    >>నాటకం గురించి వచ్చిన మంచి పుస్తకం జయప్రభ గారి “నాలుగో గోడ”. తెలుగు నాటకం మీద వచ్చిన మంచి పరిశోధన ఇది.. తెలుగు నాటకరంగం మీద అదివరకు ఎవరూ చేయని కొత్త చర్చలన్నీ… మొదటగా 91 ప్రాంతాల్లోనే ఈ పుస్తకం లో చోటుచేసుకున్నాయి.

    ఇది మీ సొంత అభిప్రాయమనుకుంటున్నాను. మీకు నచ్చింది కాబట్టి మీకు మంచి పుస్తకమై ఉండొచ్చు. అలాగే మంచి పరిశోధనగా మీకు అనిపించి ఉండొచ్చు. పరుచూరి శ్రీనివాస్ గారన్నట్లు, ఈ మంచి పుస్తకం గురించి మీరే ఒక పరిచయ వ్యాసం వ్రాస్తే , ఆ పుస్తకం గురించి కనీసం మాలాంటి ఈమాట పాఠకులకైనా తెలుస్తుంది కదా!

    >మరి నాటకం గురించి మాట్లాడేవారెవ్వరూ ..ఈ పుస్తకం ప్రస్తావనే చేయడం లేదు.??

    అందుకు కారణాలు ఏమై ఉంటాయని మీరనుకుంటున్నారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది.

    >తొలిగా వచ్చిన పుస్తకాన్ని గురించి పేర్కొన టం…ఒక మర్యాద కదా?

    అంటే ఇది తెలుగు నాటకరంగం గురించి వచ్చిన మొదటి పుస్తకమా?! అదీ 91 ప్రాంతాలలోనా? అనగా 91 కి ముందు, తెలుగు నాటకరంగం మీద అస్సలు పుస్తకాలే లేవా? ఒకవేళ ఈ నాలుగో గోడే తొలిపుస్తకమే అయితే, అందులో చర్చించిన క్రొత్త విషయాల మీద విస్తృతమైన (లేక సాధారణ) చర్చ ఏమైనా జరిగిందా? ఆ చర్చలకు సంబంధించిన వివరాలు చూడాలని ఆసక్తిగా ఉంది. అందుకు సంబంధించిన సమాచారం మీవద్ద ఏమైనా ఉంటే ఇవ్వగలరా? పోనీ సమాచారం ఎక్కడ లభ్యమౌతుందో వివరాలు ఇవ్వగలరా? ఒక మంచి పుస్తకం గురించి తెలుసుకోవాలనే తపనతో మిమ్ములను ఇవన్నీ అడుగుతున్నానని మనవి.
    ఒకానొక పుస్తకం గురించి పేర్కొనకపోవడం గురించి, వ్యాసకర్తలను నిలదీయడం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇకనుంచైనా వ్యాసాలు వ్రాసేవాళ్ళు, వ్యాస విషయమ్మీద మొదట వచ్చిన పుస్తకాన్ని మర్యాద పూర్వకంగానైనా పేర్కొంటారని ఆశిద్దాం! మొదట వచ్చిన పుస్తకాల వివరాలు వ్యాసకర్తలకు అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఎవరైనా చేస్తే చాలా బేషుగ్గా ఉంటుంది.
    మీ ఉద్దేశ్యంలో మొదట వచ్చిన, పరిశోధనాత్మక మంచి పుస్తకం గురించి వ్యాసాల్లో (నాటకాలకు సంబంధించిన) పేర్కొనక పోవడం వెనుక, పుస్తకం గురించి వ్యాస రచయితకు తెలియక పోవడం, వ్రాసే వ్యాసానికి – పుస్తకంలో సమాచారానికి లింకు లేక పోవడం, లేక పుస్తకం నచ్చకపోవడం కాక మరేమైనా కారణాలను మీరు ఊహిస్తున్నట్లైతే, వాటి గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది.

    >మీ webzine అభిప్రాయాల్లో… ఇటువంటి వాటికి ఏమంత ప్రాముఖ్యతని ఇవ్వరు కాబోలు!

    చాలా బాగుంది. వెబ్జీన్ అభిప్రాయాల్లో పాఠకులు ఎలాంటి అభిప్రాయాలకు ప్రాముఖ్యత నివ్వాలో – ఎలాంటి అభిప్రాయాలు వ్రాయాలో, వేటి గురించి వ్రాయాలో, వేటి గురించి వ్రాయకూడదో , ఏ పుస్తకాలను కోట్ చెయ్యాలో – ఒక నియమ నిబంధనావళి తయారు చేస్తే అద్భుతంగా ఉంటుంది.

    >నాకు తెలిసినంతలో ఒక అంశం మీద మాట్లాడేవారు..ఆ అంశం మీద వచ్చిన ముఖ్యమైన పుస్తకం నించి..విషయాన్ని కోట్ చేయటం అన్న ది ..ఆ విషయానికి ప్రామాణికతని ఆపాదిస్తుంది. కన్యాశుల్కం గురించి చర్చించేటప్పుడు అప్పారావుగారి ప్రసక్తి తెచ్చిన ట్టుగా అన్నమాట.

    అంశానికి సంబంధించి మాట్లాడే వాళ్ళందరికీ ఉపయోగపడే ముఖ్యమైన ముక్క ఇది. ముఖ్యమైన పుస్తకం నుంచీ, ఏదో ఒక విషయాన్ని మీ అంశానికి సంబంధమున్నా లేక పోయినా కోట్ చేయాలి. వచన కవిత్వం గురించి వ్రాసే ప్రతి వ్యాసంలో శ్రీ.శ్రీ. మహాప్రస్థానం గురించి ప్రస్తావించడం మరచిపోకూడదు(ఇంకెవరైనా విస్మరణకు గురౌతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి కూడా ఉటంకించాలి). అలాగే కథ గురించి వ్రాస్తే గురజాడ ను స్మరించాలి(ఇంకెవరైనా విస్మరణకు గురౌతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి కూడా ఉటంకించాలి). మీ భావమిదేనా?! అయితే…అర్జంటుగా ఈ నిబంధనను కూడా వ్యాస రచయితలకు తెలియచేసి, పాటించని వాళ్ళ వ్యాసాలను పబ్లిష్ చెయ్యకూడదని సంపాదకులకు తాఖీదు పంపాలి.

    కన్యాశుల్కం లో అప్పారావుగారు విషయమా? ఆయన కన్యాశుల్కం నాటకాన్ని వ్రాసిన రచయిత కదా! పొరపాటు నాదే – మీరంటున్నది – కన్యాశుల్కం గురించి ఏదైనా వ్రాసేటప్పుడు అప్పారావు గారి ప్రసక్తి తేవడం గురించి కదూ?!

    ఇంతకీ నాటకరంగం మీద వ్రాసిన వ్యాసాల్లో “నాలుగో గోడ” ప్రసక్తి లేదనా లేక “నాలుగో గోడ” రచయిత(త్రి) ప్రస్తావన లేదనా? ఇది చాలా కన్ఫూజింగ్ గా ఉంది!

    ఇంతా వ్రాసిన తర్వాత, ముందు ముందు నేను నాటకరంగం మీద వ్యాసం వ్రాస్తే “నాలుగో గోడ” గురించి ప్రస్తావిస్తే సరిపోతుందా? రచయితను కూడా స్మరించాలా? లేక రచయితను, నాలుగో గోడను రెంటి గురించీ వ్రాయాలా?

    – అక్షర

  1544. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    02/04/2009 10:01 pm

    సంపాదకులకి,
    పరుచూరి శ్రీనివాస్ గారికి నా అన్ని అభిప్రాయాల పట్ల ఎందుకనో మరీ వ్యతిరేకత ఏర్పడింది. ఆయన నాకిచ్చిన సూచననే నేను ఆయనకిస్తున్నాను. చూడబోతే ఆయన భావకవిత్వం నించీ ఆధునిక తెలుగు నాటకం దాకా విషయ సంపన్నత బాగా కలిగిన వారుగా కన్పిస్తున్నారు. మంచి సాహితీవేత్త, సాహితీ విమర్శకులూ కూడా కావొచ్చు. నా దురదృష్టం ఏమో నేను ఆయన రచనలేవీ పుస్తకాలుగా ఇంత వరకూ చదవలేదు. ఆయన నా మీద ఒంటి కాలి మీద లేవటం తగ్గించి, తనకి క్షుణ్ణంగా తెలిసిన విషయాల మీద విపులంగా ఇంగ్లీషు వాక్యాల్లో కాక తెలుగు వాక్యాల్లో ప్రకటిస్తే, తెలుగు భాషా సాహిత్యాల కోసం ఈమాట చదవదలుచుకునే పాఠకులకి మరింత మేలు జరుగుతుంది కాదా??

    రమ.

  1545. రచయితలు – ఎడిటర్లు గురించి marakkaDE.. గారి అభిప్రాయం:

    02/01/2009 7:30 pm

    -నా సంపాదకీయాలు కూడా పది మంది చేతుల్లో పడి నలిగిన తరువాతే బయటకు వస్తాయి- అని చెప్పుకొన్న వేలూరి వారి రచనలో, మొట్ట మొదటి కంద పద్యమే క్రింద పడింది. కనీసం మరొకరి పద్యాలనుదహరించేటప్పుడైనా పదాలన్నీ పడ్డాయో, లేవో, గణాలు కుదిరాయో లేదో చూసుకొంటే బాగుంటుంది. మన పత్రిక నాణ్యత చాలా బాగుందని మనకు మనమే ముక్తాయించేసుకొంటే బాగుండదు. చదివే వాళ్ళున్నారు. వారిలో కొందరికైనా పద్యానికీ, పదానికీ, కవితకీ, కథకీ తేడా తెలుస్తుంది. ఇదే వ్యాసం మరొక రచయిత ద్వారా వచ్చి వుంటే, ఇలాగే చూసీ చూడక ప్రచురించే వారా? లేక మరింత పదును పెట్టి తిరగ వ్రాయమని పంపేసే వారా?

    [శ్రీశ్రీ కందాన్ని ‘సిప్రాలి, 1987 నవంబర్, విరసం ప్రచురణ, పేజీ 44’ నుంచి తీసుకున్నాం. ఎడిట్ చేయడంలో ఎక్కడో ‘కలదు’ అన్న పదం ఎగిరిపోయింది, చూసుకోకపోవడం మా పొరపాటే. క్షమాపణలు. అచ్చుతప్పులేవైనా కనపడితే పాఠకులు మాకు ఎత్తి చూపటమూ, వాటిని మేము క్షమాపణలు చెప్పి మరీ తప్పు దిద్దటమూ జరుగుతున్నదే, ఇక ముందు కూడా జరగబోయేదే. కానీ, ఇలా నొప్పించే విధంగా, పరదాల చాటు పుంగవులు చేసే ఈ రకమైన అనుచితపు దబాయింపులు ఎంత సమంజసమో సాటి పాఠకులే నిర్ణయించుకుంటారని మా విశ్వాసం – సం.]

  1546. వానకు తడిసిన పువ్వొకటి గురించి sree rama murthy గారి అభిప్రాయం:

    01/28/2009 10:56 pm

    ఇంద్రాణి గారికి,
    మీ కవితలు పొందికగా ఉన్నాయి.”వానకు తడిసిన పువ్వొకటి” కవిత మంచి పదచిత్రం.ఇలాంటి కవితలు మీరు మరిన్ని రాయాలని ఆశిస్తూ__

    శ్రీరామమూర్తి.

  1547. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/28/2009 9:13 pm

    రవి కిరణ్ గారూ..

    తెలుగు కవిత్వం లో మరీ ముఖ్యంగా late80 ల్లో, అలాగే early 90 ల్లో స్త్రీలు అన్ని రకాల ప్రశ్నలూ అడిగేరు. అలా అడిగిన కారణానికి అనేక నిందలూ పడ్డారు. పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం వలన నాకు అర్ధమైందేమంటే ఇప్పటికీ ఎంత చదువుకున్నా ఆలోచనా విధానాల్లో ఏమంతగా తర్వాతి తరాల్లో సైతం పెద్ద మార్పులేమీ లేవని.

    ముందటి తరాల కన్నా అటు పిమ్మటి తరాలు భిన్న సిధ్ధాంతాల విషయంలో [కనీసం అభివృధ్ధి చెందిన దేశాల్లో ఐనా] మరింత సంయమనంతో ఉంటారనుకోవడం అత్యాశేనని శ్రీనివాస్ గారి గొంతు విన్నాక నాకు అర్ధమైంది. అయితే దాని వలన స్త్రీల కవితా సంపదకి వచ్చిన లోటు ఏమీ లేదు. ఎప్పుడైతే తమ కన్నా మంచి వ్యక్తీకరణ ఆడవాళ్ళు చేస్తున్నారని అన్పించినప్పుడల్లా వారి విషయంలో అయితే మౌనం పాటించడమో లేదా వారి రచనల మీద కాకపోతే ఆ రాసిన వారి మీద బురద చల్లడమో అన్ని కాలాల్లోనూ చేసారని మనం గమనించవచ్చు. అందువల్ల శ్రీశ్రీ, బంగారమ్మ గారి కవిత్వం గురించి మాట్లాడివుం టే ఆశ్చర్యపోవాలి గానీ లేకుంటే కాదు.

    scandals మీదకి దృష్టిని మళ్ళించడం తేలిక కదా? మార్పు శాశ్వతం గానీ. ఏ కాలంలోనైనా నీతి శాశ్వతం కాదు. కవితా విశ్లేషణ ఒక శ్రీశ్రీ కవిత్వంకి జరిగినట్టో ఒక కృష్ణశాస్త్రికీ, ఒక నండూరి ఎంకిపాటలకీ జరిగినట్టో, ఇప్పటికీ కవయిత్రుల కవిత్వం గురించి మరింత విస్తృతంగా ఇంకా జరగడం లేదేమని నేను ప్రశ్నించాను. బంగారమ్మ గారు కవిత్వం రాసి ఒక 60 ఏళ్ళు దాటాయా? చర్చఎక్కడన్నా మీరు చది వారా ఆమె కవిత్వం మీద? ఆధునిక కాలంలో సైతం కవయిత్రుల కవిత్వం మీద ఆరోపణలు చేసినంత జోరుగా వారి కవితావిశేషాల మీద చర్చని చేయలేదే? వారి కవిత్వం వచ్చి కూడా రెండు దశాబ్దాలు దాటిందే?? ఈ జాప్యం సమర్ధనీయమా? వాంఛనీయమా అన్నది నా ప్రశ్న. నా ప్రశ్నని పక్కదారి పట్టించ వద్దని నా మనవి.

    రమ.

  1548. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    01/28/2009 9:22 am

    హనుమంత రావు గారు,

    “అలాటి జీవితవే గడిపిన మగవాళ్ళ రచనలకి కూడా అదే గతి పట్టిందా?” అని మీరు ప్రత్యేకంగా ప్రశ్నించనవసరం లేదండి. ఎలాంటి జీవితం గడిపినా మనల్ని మన జీవితం గురించి ప్రశ్నించే వాళ్ళు అంతగా వుండరు, వున్నా దాన్ని చాలా సులభంగా సమర్ధించుకోడానికి మనకు సవాలక్ష వాదాలు మన ప్రక్కనే వున్నాయి కదా. మనకొకటుంది కాబట్టి మరి మనం ఇక దేన్ని గురించి సందేహ పడాల్సిన అవసరం లేదు.

    రమ గారు,

    బతుకు పరిధిలో మరెక్కడాలేని గుర్తింపు వొక్క కవితా లోకంలోనె కావాలనుకోవడం అత్యాశేవో కదా. జీవితంలో మరే కోణంలోనూ పోట్లాడినా చానా సార్లు దొరకని గుర్తింపు కవిత్వంలో మాత్రం ఎలా లభిస్తుందండి, నాయన పరలోకంలో వున్నా సరె, ఇంటికి పోతే అన్నం పెట్టే అమ్మ సలక్షణంగా వున్నా సరే నేను ఫలానాయన బిడ్డనని చెప్పుకునే లోకంలో, తలలో వున్న బుర్ర కంటే జననాంగానికి ప్రాముఖ్యమిచ్చీ సంఘంలో (అల్లూరే కాదండి, ఆడంస్ విల్ ఐనా అంతే).

    ఐతే ప్రశ్నించ గలిగిన మీ నైజం మాత్రం ప్రశంశనీయం.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  1549. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/27/2009 10:24 pm

    వ్యాస పరిధి దాటినందుకు సంపాదకులు దీనిని తిరస్కరిస్తే నాకభ్యంతరం లేదు. పరుచూరి వ్యాఖ్య నిగూఢంగా ఉండటానేమో అర్థం కాలేదు.

    ఓరల్ హిస్టరీ అంటే Studs Terkel చేసినట్లు రికార్డు చేసిందే కదా. అలా రికార్డు చేసిన మన సాహితీ చరిత్ర మామూలు పాఠకులకి అందుబాటులో లేదా? పెద్దమనుషులెవరినో పోయి అడిగితే గాని తెలిసే అవకాశం లేదా?

    కొకు కి చలమంటే వ్యక్తిగతంగా ఇష్టమా లేదా అన్నది అంత ముఖ్యం కాదు. చలం రచనలని కొకు పరామర్శించకపోయినా పెద్దగా నష్టం లేదు – అనేకులు ఆపని చేశారు కనుక. ప్రచురించని దేవులపల్లి (అశ్లీల?) రచనల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. వీటికీ బంగారమ్మ రచనలని ప్రస్తావించకపోవడానికీ సారూప్యత కనబడదు.

    ఆమె కవిత్వాన్ని గురించి ఇప్పటికీ మాట్లాడకపోవడానికి కారణం ఆవిడ కవిత్వం కాదు, ఆవిడ వ్యక్తిగత జీవితం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకావిడ జీవితం గురించి ఏమీ తెలియకపోయినా అది చాలా అన్యాయంగా తోస్తుంది. అలాంటి జీవితమే గడిపిన మగవాళ్ళ రచనలకి కూడా అదే గతి పట్టిందా?

    కొడవళ్ళ హనుమంతరావు

  1550. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/27/2009 9:33 pm

    శ్రీనివాస్ గారూ,

    మీ వ్యక్తిగత అభిప్రాయం లోనూ మీ గొంతు biased గానే విన్పిస్తోంది. మీరు కవుల విషయంలో “లిఖిత” విమర్శనీ, కవయిత్రుల సమాచారానికైతే మాత్రం వెతుక్కుని ఇవాళ భావకవిత్వం తెలిసిన వారినించీ “మౌఖిక”మైన సంగతులనీ సేకరించుకోవచ్చుననీ సలహా ఇవ్వడం ఆశ్చర్యమే! ఫలానా పుస్తకం అంటే ఎవరైనా సేకరించుకోవచ్చు, కానీ ఫలానా తరం వాళ్ళని కలుసుకుని విషయాలని సేకరించుకోమని అనడం ఏమిటో? ఇక్కడ నేను ప్రస్తావించిన అంశం ఒకటే. స్త్రీల సాహిత్యం మీద విమర్శ చాలా తక్కువ అన్న ది. నేను బంగారమ్మ గారి సాహిత్య విశ్లేషణలో జరిగిన జాప్యాన్ని గురించి మాట్లాడేను. స్త్రీల సాహిత్యం పై విమర్శ లోని అసమగ్రత, నా అభిప్రాయం. వారి వ్యక్తిగతాలు కాదు. శ్రీశ్రీ ఎందుకు ప్రస్తావించ లేదన్నది “మౌఖిక” చరిత్ర ద్వారా సేకరించు కోవడం మీద నాకు సమ్మతీ లేదు. ఆసక్తీ లేదు. అది స్త్రీల సాహిత్య విమర్శని సృష్టించదు. స్త్రీల సాహిత్యాన్ని పక్కకు నెట్టి స్త్రీల జీవితాన్ని gossip గా మాట్లాడుకుందికి బహుశా ఉపయోగపడొచ్చు. దాని వల్ల స్త్రీల సాహిత్యానికి మరింత నష్టం తప్ప మేలు లేదు. కవుల విషయంలో అక్షరాన్నీ, కవయిత్రుల విషయంలో మాత్రం జీవితాన్నీ గుర్తించే ఈ “మౌఖిక” విమర్శ అన్న సూచన వెనక ఉన్న ప్రమాదం ఇదీ! దీని వల్ల ఎవరికి లాభమో నేను వేరే వివరించి చెప్పనఖ్ఖర లేదు.

    రమ.

  1551. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    01/27/2009 2:17 pm

    I don’t want to comment on the alleged bias towards women writers, nor on lack of literary criticism in modern Telugu literature. However I believe that an issue is made, unnecessarily I may add. If any bias were made towards Bangaramma its definitely not because she is woman. Fact is that even in 20th century we have more oral history (and lit. criticism) than written one. There are reasons why Bangaramma’s name is not mentioned even today. If you are curious, go and talk to people who are well acquainted with భావకవిత్వం period, and there are still a few around. It has nothing to do with the quality of her poetry but her personal life. I don’t want to go into details here. On that note we never talk about why ko.ku disliked Chalam, or all those unwritten verses of Devulapalli, or all those literary happenings of 1920s, 30s and 40s.

    If I sound cryptic, yes its intentional!

    Regards,
    Sreenivas

  1552. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/27/2009 10:55 am

    హనుమంతరావు గారూ!

    నాది బాధ మాత్రమే ! అభిశంసన కాదు. మీకు నా ఆరోపణ సవ్యం గానే అర్ధమయింది. thank you. మీ భార్యగారికి వచ్చిన సందేహం ఇన్నేళ్ళలోనూ ఈ తెలుగు సాహిత్యలోకంలో ఒక్క విమర్శకుడికీ రానేలేదే? మరి ఇది ఆలోచించ వలసిన విషయం కాదా? ఒకనాటికి స్త్రీలీ ప్రశ్నలేయగలరని పురుషసాహిత్యలోకం ఊహించలేదు. మీ వివరణ లోనే శ్రీశ్రీ చూపించిన నిర్లక్ష్యం గురించి ఉంది.ఆనాటి వారికే కాదు..ఇవాళ్టికీ చాలా మందికి స్త్రీల గురించి చెప్పాలంటే ఎందుకో మరి మనసు రాదుస్మండీ !! అందునా మంచి సంగతులు చెప్పడానికి అసలే రాదు. కావాలంటే తెలుగు విమర్శ ని ఒకసారి పరికించి చూడండి మీరే! సరి అయిన దృష్టి కోణం తో..స్త్రీల రచనలని ఇంకా బేరీజు వేయగల స్థితి ఈనాటికీ ఇంకా లేదు. సాహిత్య పరంగా చాలా నష్టం ఇది.

    మోహనరావు గారూ…ప్రస్తావన చేయడం …విశ్లేషణ చేయడం రెండూవేర్వేరు. రెండో దాని పరంగా మీ వ్యాసం బలమైంది కాదని మీకే తెలియగలదు మరోసారి చదువుకుని చూడండి. మీరు”ముగురమ్మల్ని గురించి ప్రస్తావనే చేసారు…వారి కవితా విశ్లేషణ కాదు. విమర్శ పరిధి వేరు. దాని దిశ వేరు. తెలుగులో సృజనాత్మక సాహత్యం వృధ్ధి పొందింది..కానీ విమర్శ ఏదీ?

    నేను మాట్లాడుతున్న అంశం ఇదీ! ఎవరైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించండి…అదీ ముఖ్యం.

    రమ.

  1553. స్మైల్‌ – ఓ జ్ఞాపిక గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/27/2009 6:44 am

    మోహన గారికి,

    1985లో వడ్డెర చండీదాస్ “ప్రియమైన మో” అని సంబోధిస్తూ ఉత్తరం రాయడంతో వేగుంట మోహన ప్రసాద్ కేవలం ‘మో’ గా స్థిరపడిపొయ్యాడు. తెలుగు, పాశ్చాత్య సాహిత్యాలని లోతుగా అధ్యయనం చేసిన కవి. మొదటి కవితా సంపుటి, చితి-చింత, తోనే పేరు తెచ్చుకున్నాడు. ఇతర దేశాల కవులని “కరచాలనం” వ్యాసాల ద్వారా తెలుగువాళ్ళకి పరిచయం చేశాడు. ఇంకా చాలా రాశాడు. పోయిన సంచికలోనే ఆయన “నిరాకారుడుకవితని వేలూరి చవకరకం జిన్‌ అండ్ టానిక్ గా అభివర్ణిస్తే నేను మంచి కవితగా సమర్థించాను.

    మో కి విమర్శకులు ఎక్కువే. కాని, “ఈ కవిత్వ కషాయం వికటిస్తుంది,” అని విమర్శించినాయనే “నిరంతర ‘మో’హనరాగం” ఆలాపించే ఈ కవి మన మధ్యనే ఉన్నందుకు గర్వపడాలనడం గమనార్హం. [1]

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “వ్యాసాలు, ద్వేషాలు,” సౌభాగ్య. 2004.

  1554. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/27/2009 5:42 am

    అరుణ గారికి,

    శిలాలోలిత పుస్తకంలో రేవతీదేవి ఇంటి పేరివ్వనందున నేనూ దానిని ప్రస్తావించలేదు. కాని మీరన్న విన్నకోట ఆవిడ పుట్టింటి పేరూ కాదు, మెట్టింటి పేరూ కాదు – పుస్తకాన్ని అంకితం చేసింది తండ్రి యన్. సి. రాజారెడ్డి గారికి; భర్త డి. రఘురామిరెడ్డి. ఈ మధ్యనే నిడదవోలు మాలతి గారు మన దృష్టికి తెచ్చిన ఒక పుస్తకం [1] లో ఆవిడని నిడుమానూరి రేవతీదేవి గా పరిచయం చేశారు.

    రమ గారికి,

    మీ అభిశంసనా పూరక ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. రచ్చబండలో అప్పట్లో కాస్త ఎక్కువగానే వాదోపవాదాలు చేసి ఘర్షణ పడేవాణ్ణి. వాటిల్లో ఒకదానిని, వ్యాసంగా రాసి మాకు పంపగూడదా అని వేలూరి, కొలిచాల అడిగితే హడావిడిగా పంపిన రచన ఇది. నాలాంటి పాఠకులు రాయగలరేమో కాని, సాహిత్యంలో కొంత సాధికారికతగలవాళ్ళు రాస్తేగాని ఈ కవయిత్రులకి న్యాయం జరగదు.

    బంగారమ్మని ప్రస్తావించారు కనుక ఓ ముచ్చట చెప్తాను. ముద్దుకృష్ణ మూలంగా ఆవిడ పేరు తెలుసు కాని, ఈ వ్యాసం రాసేముందర నేనావిడ కవిత్వాన్ని అంతగా పట్టించుకోలేదు, వెల్చేరు గారి Hibiscus చూసింతర్వాతే నాకావిడ మీద ఆసక్తి కలిగింది. దాంట్లోనే ఉన్న My Brother మూలం వెంటనే దొరకలేదు. తర్వాత కొన్నాళ్ళకి జనవరి 2006లో శేషశాయి గారు ఆవిడ కవితా సంచికని ఆంధ్రభారతిలో పెట్టి రచ్చబండలో చెప్పారు. అందుమూలంగానే ఆవిడ కొంపెల్ల జనార్దనరావు సోదరి (అక్కో చెల్లెలో ఎందుకు చెప్పరు?!) అని తెలిసింది. అప్పుడు మా ఆవిడ నన్నడిగింది – “మరి శ్రీశ్రీ అనంతంలో ఆ విషయం చెప్పలేదా?” అని. “జనార్దనరావు జ్ఞాపకాలు” అంటూ శ్రీశ్రీ చాలానే రాశాడు కాని ఈ విషయం చెప్పిన గుర్తులేదు.

    జ్ఞాపకాలంటే, ఆచంట జానకిరామ్ [2] కొంపెల్ల జనార్దనరావు స్వగ్రామం, అమలాపురం దగ్గర గంగలకుర్రు వెళ్ళి, ఆ ఊరిని వర్ణించి బంగారమ్మ కొత్తగా రాసిన “నీడ” (Hibiscus on the Lake) ఆవిడ చదివితే విని పరవశించడం గుర్తొస్తుంది. ఆవిడ జనార్దనరావుకి అక్క అన్నారు ఆచంట. My Brother కి మూలం “మా అన్న.” పేరుకి తగ్గ కవయిత్రి బంగారమ్మ.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “Women Writing in India: 600 BC To the Present,” Volume II: The 20th Century. Edited by Susie Tharu and K. Lalita. Oxford India Paperbacks, 1993.

    [2] ఆచంట జానకిరామ్ “సాగుతున్న యాత్ర.” దీనిని “నా స్మృతిపథంలో” తో కలిపి జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు వారు 2008లో ప్రచురించారు. పేజీలు 230-231.

  1555. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి mOhana గారి అభిప్రాయం:

    01/26/2009 6:34 am

    రమగారూ, అందరూ బంగారమ్మలాటి కవయిత్రులను మరచిపోలేదు. నేను రాసిన జూలై నెల ఈమాటలోని వ్యాసంలో “ముగురమ్మలను” పేర్కొన్నాను. వారు విశ్వసుందరమ్మ, బంగారమ్మ, సౌదామిని గారలు. వారి కవితలను కూడా ఉదహరించాను. బంగారమ్మ కవితలు శాయిగారి సైటులో కూడా ఉన్నవి.
    విధేయుడు – మోహన

  1556. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama గారి అభిప్రాయం:

    01/25/2009 7:04 am

    వేలూరి గారూ !

    మీరు ఒప్పుకున్నారు, అందుకు సంతోషం. వెల్చేరు నారాయణరావు గారు..తెలుగు కవిత్వానికి సంబంధించి చెప్పుకోవలసిన పని చేసిన మాట నిజమే అయినా…ఆయన కృషి మాత్రమే సరిపోతుందని చెప్పగలమా?బంగారమ్మ గారు కవిత్వం రాసిన తరవాత మరి అర్ధశతాబ్దానికి ఒక విమర్శ వచ్చిందని చెప్పుకోవడం …విమర్శనా రంగానికి నామర్దా కాదా?అది తెలుగులొ మంచి విమర్శ ఏ కారణంగా గానీ లేదని చెప్పడమే కదా ఒకరకంగా!

    ఈ లెఖ్ఖన ఇవాళ కవితారంగంలో అనేక కల్పనా విన్యాసాలు , చతురతలు ప్రదర్శించిన కవయిత్రుల గురించి..వారి కవిత్వం లోని విశేషాంశాలు గురించి విపులంగా వివరించడానికి ఇంకో యాభయ్యేళ్ళు పట్టాలన్నమాట !! వారు జీవించి వుండగా ..వారి కల్పన గురించి పాక్షికంగానే తప్ప విశేషించి చెప్పటం ఏ విమర్శకులూ ఎందుకు చేయకూడదో ?! అపచారమా ? లేక అభద్రతా భావమా?? లేక ” ఈ ఆడాళ్ళ రాతల గురించి మనమెందుకు మాట్లాడాలిలే..అన్న తూష్ణీ భావమా? మీరయినా విశదీకరించ వచ్చునే?

    ఒక కృష్ణశాస్త్రి గురించి చర్చించిన మాదిరిగానే…ఒక శ్రీరంగం శ్రీనివాస రావుని గురించి మాట్లాడిన రీతి లోనే… తెలుగుకవితారంగం లోని స్త్రీలని గురించి అయితే మౌనమో..లేదా అస హనమో తప్ప ఒక్కరయినా వారి కవితల్లోని అందాలకి పరవశం తో మాట్లాడిన వారు లేకపోవడం వెనకవున్న కారణాలని ఆలోచించనవసరం లేదా? ప్రపంచం లోని వేరే ఏ చోటనయినా ఇటువంటి పరిస్థితి కన్పించదే? కవిత్వం విషయంలో స్త్రీల వ్యక్తీకరణల్లో ఉన్న భిన్నత్వం మీద పదుగురూ చర్చించడం మంచిదేమో?! పోయిన శిలాలోలిత విషయం లో ప్రదర్శించిన ఆద్రత … ఆతృత…ఉన్న శిలాలోలితల మీద చూపలేని సంశయానికి గల కారణాలేమిటో?

    రమ.

  1557. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి వాడపల్లి శేషతల్పశాయి గారి అభిప్రాయం:

    01/24/2009 12:42 am

    చావలి బంగారమ్మగారి కవితనీడ“ను వారి కవితాసంకలనము “కాంచనవిపంచి“లో చదువగలరు.

    శాయి

  1558. ఈ మాసపు పాట గురించి Rajesh Kumar.D గారి అభిప్రాయం:

    01/19/2009 4:47 am

    ఉదయకళ గారు ,
    మీరు రాసిన ఈ కథ, కథ మధ్యలో వ్రాసిన కవితలు కూడా చాల అర్థవంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నా పరిస్థితులకు చాల దగ్గరగా ఈ కథ ఉంది. ఆ కథ వ్రాసిన తీరు హృదయాన్ని హత్తుకునే విధముగా ఉంది. మీరు ఇలాంటి కథలు ఇంకెన్నో వ్రాయాలని కోరుకుంటూ,

    రాజేష్ కుమార్ దేవభక్తుని.

  1559. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama గారి అభిప్రాయం:

    01/19/2009 4:39 am

    హనుమంతరావు గారూ !!

    మీరు సాహిత్యరంగం లోపలి వారు కారు గనక, మీకు “వైతాళికులు” పుస్తకం లోని కవయిత్రులని గురించి తెలియదన్నారు. బైరాగి గురించి ఎలా మాట్లాడ గలిగేరో..రేవతీదేవి గురించి ఎలా మాట్లాడ గలిగేరో….అలాగే వైతాళికులు లోని కవయిత్రులని గురించి కూడా మీరు మాట్లాడగలరు. చైతన్యం కల్గిన పాఠకులు గనక. కాకుంటే అలా మాట్లాడాలని అనుకోవాలి ముందు.

    చాలా మందికి చావలి బంగారమ్మ గారి పేరు పరిచయం కాక పోయినా..ఆమె రాసిన బహు చక్కని కవిత్వం తెలియక పోయినా…అది సాహిత్య విమర్శకుల పొరపాటే !! దేవులపల్లి వెంకట క్రిష్ణశాస్త్రి గారి తో సరిసమానమైన ధీటైన గేయాలు రాసినవారు బంగారమ్మ గారు…”వైతాళికులు” లో!! మరి ఎంతమందికి ఆవిడ రాసిన గేయాలతో పరిచయం ఉందివాళ?? ఆమె కవితల విడి సంపుటి గురించిన ఊసైనా ఎవరికి తెలుసు?? వాటిలోని అందాలని విశ్లేషించిన వారేరీ?? పురుషుల చేతి లో ఒక అస్త్రంగా పనిచేసిన “విమర్శ” ఇలా ఎందరి స్త్రీల అద్భుత కల్పనా ప్రపంచాలని చిన్న చూపు చూసిందో తెలిసినప్పుడు కదా..విమర్శనా రంగం..ఎంత సంకుచితత్వం తో ప్రవర్తించిందీ స్పష్టపడేదీ??

    మంచి కల్పనని దర్శించవచ్చు…అందుకు మన మనసు కిటికీలు తెరుచుకోవాలి …ఏ భేద భావమూ అడ్డురాకుండా !!

    రమ.

  1560. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి అరుణ పప్పు గారి అభిప్రాయం:

    01/18/2009 3:06 am

    ‘ఈ శిల శిలేగాని,
    ….. అనురాగం తాగి మత్తెక్కి,
    మంచులో తడిసి
    వెన్నెట్లో మెరిసి
    లలితంగా స్థిర చిత్తలోలితంగా ఈ శిల!’
    స్త్రీ జీవితాన్ని అంతందంగా, అల్పాక్షరాలలో ఆవిష్కరించడం ఎవరికి సాధ్యం?
    ‘అనురాగదగ్థ సమాధి’ వంటి అద్భుతమైన కవితల్ని అందించిన విన్నకోట రేవతీదేవికి మీరన్నట్టు లౌకికంగా రావాల్సినంత పేరు రాలేదు.. కానీ రసహృదయులైన పాఠకుల మనో ప్రపంచంలో ఆవిడ దీపంలా వెలుగుతూనే ఉంటారు. ఆమె గురించి రాసినందుకు మీకు, ఈమాటకు ధన్యవాదాలు.

  1561. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/13/2009 3:13 am

    రమగారికి రవిగారికి ధన్యవాదాలు.
    రమగారు,
    మీరు చెప్పిన “ముక్తాఫల” వ్యాఖ్యలో కొన్ని భాగాలు Digital Libraryలో ఉన్నాయి చూసాను. కాని కొన్ని చోట్ల తప్పులున్నాయి. అంచేత అది ఎంతవరకూ సాధికారికమైనదో తెలీదు. మీరన్న జయప్రభగారి కవిత నేను చదవలేదు. ఆ పుస్తకాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాను.
    రవిగారు,
    మీరన్న ఆ రెండు పద్యాలు ఇవి:
    సోమనది:

    అరిజూచున్ హరిజూచు జూచుకములందందంద మందార కే
    సరమాలా మకరంద బిందు సలిలస్యందంబులందంబులై
    తొరుగం, బయ్యెదకొం గొకింత దొలగన్ దోడ్తో శరాసారమున్
    దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్

    పోతనది:

    పరుజూచున్ వరుజూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
    విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
    జరగన్ గన్నుల గెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహమున్
    సరసాలోక సమూహమున్ నెఱపుచున్ జంద్రాస్య హేలాగతిన్

    ఏది ఎక్కువ భావస్ఫోరకమూ అని చెప్పడం కష్టం (అనవసరం కూడా). దేని ప్రత్యేకత దానికుంది. సోమన పద్యంలోని ప్రత్యేకతంతా “చూచుకములందు మందార కేసరమాలా మకరందపు నీటి బొట్లు స్రవించడం”లో ఉంది. దాన్ని చిత్రించడంలో సోమన ఉద్దేశం ఏమిటన్నది పాఠకులెవరికి వారు ఊహించుకోవలసిందే.
    పోతన పద్యం చిత్రాన్ని స్పష్టంగా రూపుకడుతుంది. రోషము – రాగోదయమూ, అవిరత భ్రూకుటి – మందహాసము, కెంపు – సొంపు ఇలా వీర శృంగార రసాలు స్పష్టమైన జంటగా కనిపిస్తాయి. పైగా వాచ్యంగా కూడా కనిపిస్తాయి. సోమన పద్యంలో అది లీలగా మాత్రమే గోచరిస్తుంది. “సరసాలోక సమూహము” కన్నా “దరహాసామృతపూరము” నాకు అందంగా అనిపించింది. సోమన సత్యభామ పయ్యెదని ఒకింత తొలగించాడు, పోతన ఆ పని చెయ్యలేదు. ఈ ఒకింత తొలగిన పయ్యెదని కృష్ణుడా తర్వాత సరిజేస్తాడు. ఆ పద్యం వ్యాసంలో పేర్కొన్నాను. వ్యాసంలో చెప్పినట్టుగా, సోమన ఈ ఘట్టంలో శృంగార రసాన్నే ఎక్కువగా ధ్వనించాడు అని నాకనిపిస్తుంది. పోతన రెంటినీ సమానంగా పోషించాడు.
    సత్యభామ యుద్ధానికి లేచి నిలుచున్న తీరుని వర్ణించిన యీ పోతన పద్యం చక్కని చలనచిత్రాన్ని మన కళ్ళకి కట్టిస్తుంది.

    వేణిం జొల్లెము వెట్టి, సంఘటిత నీవీబంధయై, భూషణ
    శ్రేణిం దాల్చి, ముఖేందుమండల మరీచీజాలముల్ పర్వగా,
    బాణిం బయ్యెద జక్కగా దుఱిమి, శుంభద్వీర సంరంభ యై
    యేణీలోచన లేచి నిల్చె దన ప్రాణేశాగ్ర భాగంబునన్

    పోతన భాగవతంలో సత్యభామ కృష్ణుని యుద్ధానికి తీసుకువెళ్ళమని మురిపెంగా అడుగుతుంది. కృష్ణుడు ముందు వారించినా చివరికి తన మాట చెల్లించుకుంటుంది. అది యీ కథలో పోతన ప్రవేశపెట్టిన అందం.

  1562. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి rama గారి అభిప్రాయం:

    01/08/2009 11:03 am

    బ్రహ్మానందం గారూ ! మంచి వ్యాసం. సంతోషం.

    త్యాగరాజ కీర్తనలు వింటానికి ఎంతో బాగుంటాయి. అందునా పాడే గాయకుల సామర్ధ్యాన్ని బట్టీ ఇంకా రుచిగా ఉంటాయి. కానీ సాహిత్యం విషయంలో మాత్రం చాలవు. కల్పనకి వాటిల్లో చోటు తక్కువ. రాళ్ళపల్లి వారి అభిప్రాయం ఈ విషయంలో నిజమైందే! అన్నమయ్య పదం ముందు మిగిలిన అందరి పదకర్తల ఊహలూ దిగతుడుపు గానే కన్పిస్తాయి. త్యాగరాజు స్వరానికి వశ్యుడు. కవి కాడు. అన్నమయ్య కవులకే కవి. సంగీతం విండానికి త్యాగరాజు. కానీ కవిత్వ దాహం తీరాలంటే మాత్రం “దాసోహం” కావాల్సిందే అన్నమయ్య అక్షరానికి. – రమ.

  1563. రచయితలకు సూచనలు గురించి Malathi Nidadavolu గారి అభిప్రాయం:

    01/08/2009 7:15 am

    ఈ వివరణ చాలా విషయాలు స్పష్టం చేస్తుంది. బాగుంది. ధన్యవాదాలు.
    మరొక సందేహం. ఈమాటలో ప్రచురించిన రచనలు తొలిగించినప్పుడు రచయితలకు తెలియజేసే అవకాశం వుందా? నా రచనలు రెండు (“రచయితలకీ పాఠకులకీ మధ్య గల అవినాభావసంబంధం” అన్న వ్యాసమూ, “అంపకాలు” అన్న కవితా తొలిసారిగా ఈమాట.కాంలోనే ప్రచురింపబడినాయి) ఇప్పుడు కనిపించడంలేదు.
    – నిడదవోలు మాలతి

    [ఈమాటలో ప్రచురించబడిన రచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణం చేతనూ తొలగించబడవు.

    మీ ‘రచయితలకీ పాఠకులకీ మధ్య గల అవినాభావసంబంధం‘ వ్యాసం, మీ ‘అప్పగింతలుకవిత (‘అంపకాలు’ కాదు) తిక్కన ఫాంట్‌లో లేని కొన్ని ఇతర రచనలతో పాటుగా సాంకేతిక కారణాల వల్ల ఇంకా పీ.డీ.ఎఫ్ ఫైళ్ళు గానే ఉన్నాయి. వీటిని కూడా యూనికోడ్‌కి మార్చే ప్రయత్నాలు చేస్తున్నాము. మరి కొంతకాలం పట్టవచ్చు. పాత సంచికల్లో తమ రచనలు కనిపించని రచయితలు వాటి వివరాలతో మమ్మల్ని సంప్రదించవలసినదిగా కోరుతున్నాం – సం.]

  1564. నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    01/05/2009 10:36 am

    ఇరువురిలో ఏ వొక్కరినీ తక్కువ చేసి చూపడం అనే ఉద్దేశం నన్నయకు ఉండి వుండదు. అయినా కొద్ది పాటి అర్జున పక్షపాతం పైపద్యాల్లో కనిపించక పోదు. -చీమలమర్రి బృందావనరావు

    అప్పటికే పలుమార్లు ప్రదర్శించబడిన విజయుని విద్యాసక్తి, వీరగుణం గురువు ద్రోణుడినే కాకుండా, మహాభారత కథ మనకు చెపుతున్న నన్నయ కవిని కూడా మెప్పించిందేమో!
    “విద్యలెల్ల నభ్యాస వశంబునన్ బడయ భారము లేదని నిశ్చితాత్ముడై” చీకటిలో కూడా విలువిద్య ప్రాక్టీసు చేశాడట అర్జునుడు. అతని పట్టుదల చూసి గురువుకు ఇంకా ఎక్కువ కష్టమైన విద్యలు నేర్పబుద్దయ్యింది. మరి విద్యలు పరీక్షకు వస్తే:

    చెట్టుకొమ్మ మీది పక్షి తలను కూల్చమంటే, మరి ఆ పక్షితల తప్ప కంటికి ఇంకే కనిపించని ఏకాగ్రత కలవాడు. అందుకనే అర్జునుని గురి తప్పదు. ఐనా అది కృత్రిమపక్షితల. కల్పించిన పరీక్ష. అందులో అంత గొప్ప ఏముంది. :)తర్వాత గంగా స్నానాలు చేస్తున్నప్పుడు, ఒక మొసలి, ద్రోణుని తొడ పట్టుకుంటే శిష్యులంతా స్తంభించి పోయి ఉన్నప్పుడు, అర్జునుడు మొసలిని చంపి ద్రోణుని కాపాడాడు. ఇది నిజమైన మొసలి. నిజమైన ఆపద. గురి తప్పరాని సమయము. ఇదీ విద్యకు అసలు పరీక్ష. శ్రద్ధతో చదువు నేర్చి, ఆ చదువునే వాడి, గురువునే ఆపత్తి నుంచి రక్షించగలిగిన సమర్ధుల మీద ఎక్కువ అభిమానం చూపించకుండా, ఎవరైనా ఎలా ఉండగలరు?

    సంతోషమ్ము లభించె చాల, సదయున్ సందీప్తివంతున్, భళా!
    కుంతీపుత్రుని ఆ వదాన్యు నళినాక్షుం గర్ణునిన్, పిమ్మటా
    కుంతీపుత్రుని, ఆ విశేష విజయాఖ్యుం జూచి సంతోషమెం
    తెంతో! సత్కవితా నిధానము సదా నింపేను గాదా ఖుదా!

    లైలా

  1565. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి rama గారి అభిప్రాయం:

    01/01/2009 10:41 pm

    అయ్యా కామేశ్వరరావు గారూ !!

    ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న నాకు …మీరు నాచనసోమనాధుని మీద రాసిన వ్యాసం…. నిజంచెప్పొద్దూ మంచి భోజనం చేసిన అనుభవాన్ని నా మనసుకిచ్చింది.మీ ఇంకో వ్యాసం కోసం ఎదురుచూసేలాంటి ఆత్రుతని కలిగించింది.

    సోమనాధుని మీద చదలువాడ జయరామశాస్త్రి గారి “ముక్తాఫల” వ్యాఖ్య వుంది. అలాగే వజ్ఝల వేంకట సుబ్రహ్మణ్య శర్మ గారి వ్యాఖ్యానాలూ ఉన్నాయి…మల్లంపల్లి శరభయ్య గారిది నాకు తెలీదు. సమ స్య ..చాలా పుస్తకాలు దొరక్క పోవడం కొందామన్నా. ఇదీ మన పాత సాహిత్యానికి సంబంధించిన దుస్థితి. బ్రవున్ దొర ఆత్మక్షోభించదా ?? మన అలసత్వానికి.

    ఇటీవల …క్షణ క్షణ ప్రయాణం కవితాసంకలనంలో… జయప్రభ గారి long poem సోమన కధ మీదది చదివారా? లేకపోతే మాత్రం తప్పకుండా చదవండి.

    రమ.

  1566. స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత గురించి rama గారి అభిప్రాయం:

    01/01/2009 10:05 am

    యధాప్రకారం వెల్చేరు నారాయణ రావు గారి మాటలన్నీ.. స్మయిల్నీ..స్మయిల్ పద్యంలోని “రమించేసుకోవటాన్నీ” అంతే మ్రుదువుగా..అంతే గడుసుగా పట్టిచూపాయి. మ్రుదువు పద్యం లోని విషయానికి సంబంధించింది. గడుసు..అన్నమయ్య..అల్లసాని..స్మయిల్ ఈ ముగ్గురు మాత్రమే ఏ ముసుగ్గుల్లేకుండా రమించుకోడాన్ని రాసేరని అంటం.ఇదీ గడుసు.

    ఇది స్మయిల్ని స్మరించుకునే సందర్భం గనక … నారాయణ రావు గారి మ్రుదువుని మెచ్చుకుంటున్నాను. రమించుకోవటాన్నిఅంతే సున్నితంగా “ముసుగులు లేకుండానే ” రాసిన మరికొన్ని కవితలనీ..కవుల్నీ… చెప్పగలిగి కూడా…కాసేపుకి పక్కన పెట్టేస్తున్నాను. వెల్చేరు పట్ల గౌరవంగానూ..ఇస్మాయిల్కి నివాళి గానూ.

    రమ.

  1567. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి rama గారి అభిప్రాయం:

    12/30/2008 10:30 pm

    తప్పకుండా హనుమంతరావు గారూ !

    smile “గౌరవ సంపాదకత్వం” వహించిన “వతన్” ముస్లిం కథలు…అలాగే “అజాఁ” అన్న గుజరాత్_ముస్లిం కవిత్వం కి 23/9/2002 న,రాజమండ్రి నించి స్మయిల్ రాసిన ముందుమాట చదవండి.

    “వీళ్ళేం ‘దండోరా’ లు వేయించుకుంటారు. వీళ్ళేం వీధుల్లోకి వచ్చి ఊరేగింపులు జరుపుతారు అంటూ, … బ్రాహ్మణుల మీద…వాళ్ళని soft target చేయడం చాలా తేలిక అన్న సానుభూతితో మాట్లాడిన smile ‘వతన్’కి ఖాజా రాసిన దాన్ని (ఆ పుస్తకానికి “గౌరవసంపాదకుని”గా ఖాజా రాతల్లోని) బ్రాహ్మణ నిందని ఒప్పుకోవడంతో పాటు, తానుగా ‘కౌన్ సునే ఫర్యాద్? కౌన్ కరే ఇన్సాఫ్?’ అని రాసిన దాన్లో అయితే ఖాజాని మించి ‘అగ్రవర్ణాల’పై కోపం చూపించే దిశగా కదలడాన్ని గమనించవచ్చు.

    Gujarat riots గానీ …మొన్న తాజ్..నారిమన్ హౌస్ ల మీద ముస్లిం terrorists దాడి గాని ఎవరూ మెచ్చగలిగినవి కాకపోయినా, గుజ్రాత్ హింస మీద అచ్చులో వచ్చినన్ని పుస్తకాలు terrorists హింసని వ్యతిరేకిస్తూ ఒక్క పుస్తకమూ కనీసం తెలుగులో వీళ్ళెవ్వరూ ప్రచురించకపోవడం కూడా మనం గమనించవలసిన విషయాలే !!

    రమ.

  1568. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి bollojubaba గారి అభిప్రాయం:

    12/28/2008 4:38 am

    వంశీ గారికి :-)

    మీరు చెప్పిన హైకూ వ్రాసింది చెట్టుకవి ఇస్మాయిల్ గారు. మీరు వ్యంగ్యంగా ఉటంకించిన హైకూ, ఒక స్ట్రే థాట్. అలా చూడగలగడం కూడా అరుదైన విషయమే కదా. చెట్టుకవి ఇస్మాయిల్ గారి ఇతర రచనలు ఈమాట ఆర్చైవ్స్ లో ఉన్నాయి వీలైతే చదవండి. ఎంజాయ్ చెయ్యగలరు. I wonder in his poetry how he could see the things in such a totally different angles.

     ఇక ఇప్రస్తుతం జరుగుతున్న డిస్కషను ఖాళీ సీసాల ఇస్మాయిల్ గారిగురించి. వీరు తన పేరును స్మైల్ అని కుదించుకొన్నారు. తెలుగు సాహిత్యం వరలో రెండు ఇస్మాయిల్స్ దూరటం బాగోదు కనుకేమో. వీరు వ్రాసింది తక్కువైనా మంచి కవిత్వం వ్రాసారు.

     పై విషయంలో మీకే కాదు చాలా మంది కన్ఫ్యూషను లో ఉన్నారని నాకనిపించి ఈ కామెంటు వ్రాస్తున్నాను. ఎందుకంటే, ఆయన చనిపోయిన రోజున ఓ లోకల్ పత్రికలో, చానాళ్ల క్రితమే చనిపోయిన చెట్టుకవి ఇస్మాయిల్ గారిని మరలా వార్తల్లోకెక్కించేసాడో విలేఖరి. 

  1569. తెలుగు భాష వయస్సెంత? గురించి baabjeelu గారి అభిప్రాయం:

    12/19/2008 7:23 am

    సురేశ్ గారికి,

    మంచి వ్యాసవేఁ నిస్సందేహంగా. భాషాశాస్త్రవేత్తలందరకీ ఒక విన్నపం, నదికెదురీదో మరోలాగో దాని పుట్టుపూర్వోత్తరాలు నిర్ణయించొచ్చు. భాష విషయం అలా కాదు. భాషాశాస్త్రవేత్తలు వాళ్ళ కుస్తీలు వాళ్ళు పట్టొచ్చు. ఎందుకంటే భాష ఎక్కడపుట్టిందో తెలియని “జీవనది”. ముఖ్యంగా కవిత్వాన్ని “రిఫరెన్స్” గా తీసుకుని భాష గురించీ, అప్పటి బతుకు గురించీ వూహాగానాలు చెయ్యడం సరైనది కాదని నా నామ్మకం. కవులు వారివారి అభిప్రాయాల్ని వ్యక్తీకరిస్తారు తప్ప, వారి వ్యాఖ్యలు “నోటరీ సర్టిఫైడ్” కాదు. అనగా వాటిని పట్టుకు వేలాడ్డం తప్పవచ్చు.

    తల్లి ఎవరికి పుట్టిందీ, ఎలా పుట్టిందీ, ఎలాటి మార్పులికి లోనయ్యిందీ లాటివి మాట్లాడం, అది దండగ. ఆడవాళ్ళ వయసు గురించీ, మగవాళ్ళ జీతం గురించీ అని సురేశ్ గారు మీర్రాయడం బాగోలేదు, దాని బదులు “ఋషుల” పుట్టుక గురించంటే ఇంకా బాగుండేది. కుండలో పుట్టేవా, ఎవరో చేపల్దానికి పుట్టేవాఅని మహా ఋషుల్ని అడగం, దానివల్ల వాళ్ళు చెప్పిన మంచి ముక్కల్ని “ఛీ” కొట్టం.

    “అమ్మభాష” నేర్చుకోవడం గురించి: బతకడానికి ఏ భాష మంచిదయితే “అమ్మ” కూడా అదే భాష నేర్చుకోమంటుంది. ఎందుకంటే బతకడం ముఖ్యం గనుక. “వెంకటేశం” తల్లి, అగ్రహారీకురాలు, ఆ కుర్రాడి “ఇంగ్లీషు” గురించెందుకు బెంగపెట్టుకుంటుంది. బతకడానికి పనికిరాని భాష బతకదు.

    తెలుగు భాష “ఆంధ్రప్రదేశ్” లో బతికుంటే, అది బతికున్నట్టే. పాఠశాలల వ్యవహారం చాలా తక్కువ శాతం. “ఆంధ్రప్రదేశ్” జనాభాలో ఎంత శాతం పాఠశాలలకెళ్ళి చదువుకుంటున్నారు? ఎంత మంది చదువుకున్నారు? పాఠశాలలకెళ్ళి చదువుకోని వాళ్ళే ఎక్కువ శాతం అని నా నమ్మకం. వీళ్ళకి తెలుగొచ్చు. రాయడం రాకపోవచ్చు. “అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబొలె..” కి ప్రతిపదార్థం రాయడం రాకపోవచ్చు. “రావో!రావో!లోల లోల…” యక్షగానంలోని లోలకి అర్థం తెలియకపోవచ్చు, కానీ లక్షణవైన తెలుగు వచ్చు.

    ఇంకో విషయం. పరిపాలించేవాళ్ళు ఏ భాషని ఆదరిస్తే పాలింపబడేవాళ్ళు ఆభాషని నేర్చుకుంటారు. నిజాం రోజుల్లో ఎంతమంది తెలుగువాళ్ళు ఉర్దూ నేర్చుకోలేదు, అయినా తెలుగు మర్చిపోలేదు. ఇంగ్లీషు వాళ్ళ హయాం లో ఇంగ్లీషు నేర్చుకున్నా తెలుగు మర్చిపోలేదు. ప్రస్తుతానికి, అంత పట్టించుకోకుండానే, “ఆంధ్రప్రదేశ్” లో తెలుగు అమలులో వుంది. శ్రీ ఏ.బి.కే. ప్రసాదు గారి ప్రకారం మూడో నాలుగో జిల్లాల్లో అంతా తెలుగులోనే వ్యవహారం. మిగిలిన జిల్లాలు కూడా “ఫాలో” అవుతాయి.

    ఈ మధ్యనే “పంచాయితీ రాజ్ డిపార్ట్ మెంట్” కి వెళ్తే అక్కడ చక్కని తెలుగులో వ్యవహారం అంతా చూసి “హమ్మయ్య” అనుకున్నాను.

    నా ప్రస్తుత “ప్రోజెక్టు” విషయంలో గ్రామ పంచాయితీ వారిచ్చిన “నోటీసు” చూడండి: “…..కావున ఈ నోటీసు అందిన వెంటనే నిర్మాణము ఆపుదల చేయగలరు లేనిచో అట్టి నిర్మాణము నోటీసు ఇవ్వకుండానే కూలగొట్టబడునని ఈ నోటీసు ద్వారా తెలియచేయనైనది.” రాసింది బి.ఏ పేసవని కుర్రాడు.

    బహుశా ఈ అభిప్రాయవేదికల్లో అందరం భయపడుతున్న విషయం మన పిల్లలు తెలుగు నేర్చుకోవట్లేదనేమో? మనదే తప్పు. పిల్లలది కాదు, భాషది కాదు. మనదే, ముమ్మాటికీ మనదే.

    సాహితీవేత్తలకీ, భాషాశాస్త్రవేత్తలకీ వినమ్రవైఁన విన్నపం: బాగా బతకడానికి పనికొచ్చే “సామాన్య, సాంగీక మరియు లెక్కల” పుస్తకాలు “అమ్మభాష” లో రాయండి. అవి చదువుకుని మా బతుకుల్ని బాగు చేసుకుంటాం.

    అన్నట్టు, తెలుగు “ప్రాచీన భాషా?” “క్లాసికల్ భాషా?”

  1570. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:

    12/17/2008 11:04 pm

    [జరిగిన పొరపాటుకు చింతిస్తూ, రచయిత కోరికపై కవితని సవరించాము. -సం]

    శ్రీనివాస్ గారు,
    మంచి పరిశీలన. చిత్తు ప్రతిలో “జోళ్ళు” అనే వ్రాసుకున్నాను.టైపుకు వచ్చేటప్పటికి యధాలాపంగా జరిగిన పొరబాటు ఇది.మీరు చెప్పకపోతే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు
    మరిన్ని చేసి ఉండేదాన్నేమో.

    కొన్ని లక్షల ధన్యవాదాలు.

    పాలపర్తి ఇంద్రాణి.

  1571. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి Vamsi M Maganti గారి అభిప్రాయం:

    12/15/2008 6:00 am

    పోయినోళ్ళందరూ మంచోళ్ళు. పోయాక వాళ్ల విలువ “ఆలస్యం” గా నైనా తెలుస్తుంది.

    ఒక సంగతి. నేను చాలా రోజులో, ఏళ్ళ క్రితమో ఒక “ఇస్మాయిలుని” కవిత / హైకూ చదివా :

    పచ్చని పొద
    ఒకటికి
    పోయాలనిపించింది […]

    మరి ఆ ఇస్మాయిలు, ఈ ఇస్మాయిలు ఒక్కరేనో కాదో నాకు తెలియదు. మళ్ళీ ఇస్మాయిలు అని పేరు కనపడితే ఉన్న “స్మైలు” కూడా పోయి … ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

  1572. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    12/12/2008 4:08 am

    ఊరి బయటే వూరంతా (కళాకారులంతా) కనబడిపోతే వూళ్లోకి వెళ్లాల్సిన అవసరం కలగలేదనుకుంటాను. జోళ్లు అరుగుతాయి, మేజోళ్లు (సాక్సులు లేదా స్టాకింగులు) చిరుగుతాయి అనుకుంటున్నాను. మేకలు తోలుకునే పల్లెటూరమ్మాయి, మేజోళ్లేసుకోవడం నప్పలేదేమో!

    తప్పులెన్నువారు తండోపతండమ్ములు. భవిష్యత్తులో మరిన్ని మంచి కవితలు రాస్తారనీ ఆశిస్తాను.

  1573. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    12/09/2008 10:43 pm

    ఖాళీ సీసాల స్మైల్

    స్మైల్ చనిపోయారంటే, చాలా కాలం తర్వాత మళ్ళీ “ఖాళీ సీసాలు” చదివాను. అది స్మైల్ రాయడం మొదలెట్టిన ఒకటి రెండేళ్ల లోపునే, 1965లో రాసిన కథ. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా, సాహిత్య అకాడెమీ (వాకాటి, వేదగిరి) కూర్చిన “బంగారు కథలు” లో పొందుపరచిన కథ. బెడ్ టైమ్ రీడింగ్ కి పనికిరాని కథ!

    స్మైల్ కవిత్వం ఏమీ నేను చదవలేదు కాని, ఆ కథ ముగింపు:

    “… రెప్పలు మూయని కళ్ళు వెయ్యి చావులు శపించాయో.
    హాయి హాయిగా వున్న గాలికి, పల్చ పల్చగా వున్న ధూళికి, పచ్చపచ్చగా వున్న చెట్లకి, వెచ్చవెచ్చగా వున్న ఎండకి, దూరంగా హోరు హోరుగా వున్న సముద్రానికి, పైడి మీద బోర్లించిన మూకుడు సమాధి ఆకాశానికి తెలిసి వుండాలి.
    తెలియకపోయీ వుండాలి.”

    చదివిన వెంటనే రెండేళ్ళ క్రితం ఓ సైన్సు వ్యాసంలో చూసిన ఒమర్ ఖయ్యాం కవిత గుర్తొచ్చింది:

    And that inverted Bowl we call The Sky,
    Whereunder crawling coop’t we live and die,
    Lift not thy hands to It for help – for It
    Rolls impotently on as Thou or I.

    2006లో ఇండియా వెళ్ళినప్పుడు, అప్పుడే మో, స్మైల్ ఇరువురి సంపాదకత్వాన వెలువడిన “కొమ్మలు రెమ్మలు” చూశాను. “ప్రపంచీకరణ, వాణిజ్యీకరణలకు బలయిపోతున్న ఆంధ్రదేశపు యువతీయువకులకు వారి తెలుగు నేలలో మొలిచిన మహా వృక్షాలనీ, వాటి కొమ్మల్నీ రెమ్మల్నీ పిందెల్నీ పువ్వుల్నీ కాయల్నీ,” పరిచయం చేసే పుస్తకం. స్మైల్ కొమ్మని కూడా వారి మిత్రులు మిగిలిన వాళ్ళకి అందుబాటులోకి తెస్తారని ఆశిద్దాం.

    చివరగా, పాశ్చాత్య పత్రికల్లో లాగా మరణ వార్తలో వయసు ఇవ్వడం మనకు ఆనవాయితీ కాదు లాగుంది. స్మైల్ మరణం గురించి నాలుగయిదు చోట్ల చదివాను. ఎక్కడా ఆయన వయసు ఇవ్వలేదు. “బంగారు కథలు” ప్రకారం స్మైల్ పుట్టింది 1942లో. పండు వయసు రాకమునుపే ముగిసిన జీవితం.

    కొడవళ్ళ హనుమంతరావు.

  1574. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి gorusu jagadeeshwar reddy గారి అభిప్రాయం:

    12/08/2008 10:43 pm

    శ్రీవెంకటేశ్వరరావుగారికి, నమస్కారాలు.

    స్మైల్‌గారికి మీరందించిన నివాళి చదివాను. ఈ సందర్భంగా వారితో గడిపిన కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవాలనిపించింది. నా చిన్నతనంలో స్వాతి మంత్లీలో “నాకు నచ్చిన కథ” అనే పరిచయం వచ్చేది. అందులో అత్తలూరి నరసింహారావుగారు పరిచయం చేసిన “ఖాళీ సీసాలు” కథ చదివి ఆ స్మైల్‌ అనేవాడు కనిపిస్తే కాళ్లపైన పడిపోవాలనే ఆవేశం కల్గింది. ఆ తర్వాత కొన్నాళ్లకి నేను హైద్రాబాద్‌ వచ్చేశాక మా కాలేజి లెక్చరర్‌ వివిఎస్‌ఎన్‌ మూర్తి అనే ఆయనతో మాటవరసకి ఆ కథ గురించి అంటేం ‘వాడు నా క్లాస్‌ మేటయ్యా. వాడిక్కడే కమ్మర్షియల్‌టాక్స్‌లో పనిచేస్తున్నాడు’ అంటూ అప్పటికప్పుడు నాతో ఫోన్‌లో మాట్లాడించాడు. అది మొదలు స్మైల్‌గారి ఇంటికి తరచూ వెళ్తుండేవాడిని. వాళ్ల ఇల్లు క్రాస్‌రోడ్స్‌లో సప్తగిరి టాకీస్‌ దగ్గర ఉండేది. ఇది 1992 లోని సంఘటన. తర్వాత భరాగోగారు వచ్చి వాళ్లింట్లో ఉండి “‌ఖాళీ సీసాలు” పుస్తకానికి కావలసిన మెటీరియల్‌ సమకూర్చుకుంటూ ఉండగా స్మైల్‌గారు అనువాదం చేసిన “చుగ్తాయ్‌” “‌కంబలి” కథ దొరకలేదు. నాకు మొదట్నుంచి మంచి కథల్ని కుట్టుకోవడం అలవాటు. అలా నా దగ్గరున్న ఆంధ్రప్రభలో వచ్చిన కంబలి కథని తీసుకెళ్లి ఇచ్చాను. ఆ పుస్తకం ముందు మాటలో తనని పుస్తకం వేయమని సతాయించిన వారిలో నన్ను కూడా చేర్చారు స్మైల్‌గారు. ఆ పుస్తకావిష్కరణ 1995లో ప్రెస్‌క్లబ్‌లో ఎంతో నిరాడంబరంగా, ఇంటి పండగలా జరిగింది. రబ్బరుని చెక్కి బొమ్మలుగా మలిచే ఆర్ట్‌ కూడా వారికి ఉందని నేనా సభలో చెప్పాను. (ఈ విషయం నాకు మా మూర్తి సార్‌ చెప్పారు)

    ఆయన్ని చివరి సారిగా పోయిన ఏడాది అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీకె.రామచంద్రమూర్తిగారి వారబ్బాయి పెళ్లిలో హైదరాబాద్‌లో చూశాను. నా పుస్తకాన్ని అక్కడే ఇచ్చాను – వారు రాజమండ్రి వెళ్లాక ఫోన్‌ చేశారు. నా ‌”ఉసుళ్లు” అనే కథకోసం వారి “తూనీగ” కవితలోంచి కొన్ని పదాలు వాడుకున్నాను. వారి “ఖాళీసీసాలు” కథలోని “పాడు పిల్లల”తో నేను “జగదాంబ జంక్షన్‌” అనే కథ రాశాను. (ఈ కథ ఆంగ్లానువాదం టెక్సాస్‌ యూనివర్సిటీ వారేసిన “సాగర్‌”(2002)లో వచ్చింది) అవన్నీ నా పుస్తకంలో ఉటంకించాను. స్మైల్‌గారు ఎంతో సంతోషించారు.

    వారి పెద్దమ్మాయి పెళ్లి హైద్రాబాద్‌లో పింగళి వెంకట్రామారెడ్డి హాల్లో అయినప్పుడు అందరం వెళ్లాం. అది పెళ్లిలా జరగలేదు. ఏదో మహా ఉత్సవంలా అనిపించింది. ఆ పెళ్లి విందుని మా అమ్మాయి ఇప్పటికీ గుర్తు చేస్తుంటుంది, జరిగి పుష్కరం దాటినా.

    ఆయన అందం పున్నమి చందమామ – ఆయన మాట్లాడినా, నవ్వినా కురిసేది వెన్నెలే!

    అశ్రునివాళితో – గొరుసు జగదీశ్వరరెడ్డి.

  1575. సువర్ణభూమిలో … గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    12/06/2008 9:30 pm

    భూషణ్ గారి కవితా దృక్పథం గురించి కామేశ్వరరావు గారన్నది సరిగానే ఉంది. అయితే కవిలో థాయిలాండ్ యాత్ర కలిగించిన గొప్ప అనుభూతిలో అణుమాత్రమైనా చాలా మంది పాఠకులకి కలగడం లేదు. గొప్ప హృదయకంపన కలగకపోతే ఈ కవి రాసి ఉండేవాడు కాదు:

    కవిత్వం భూకంపం లాంటిదే. పునాదులతో సహా పెళ్ళగించివేయడం దాని స్వభావం. నీ అస్తిత్వ మూలాలు కదిలితే గాని కవిత్వ ప్రకంపన నీలో మొదలు కాదు. వెరసి ప్రపంచాన్ని చేరదు. ఏ కారణాల వల్ల లోపలి పొరల రాపిడితో ఆవని హృదయం బద్దలవుతుందో ఇదమిత్థంగా చెప్పలేకున్నాం. నేడు వెలువడుతున్న కవిత్వాలు రోకలి పోటు లాంటివి. వాటి అదుటు పక్కింటి వసారాను కూడా తాకదు. నీలో భూకంపం వుందా? కలం పట్టు.. ఆదిమోద్రేకాల శిలాద్రవాలను ప్రవహించనీ .. ఘనీభవించనీ .. ఆత్మను భస్మీపటలం చేయగల భయానక సౌందర్యాన్ని ఆరాధించగల చేవగలవాడే కవిత్వం చెప్పగలడు .. తతిమ్మా అందరూ ఆటలో అరటిపళ్ళు .. పనికిరాని దండుగ్గణాలు .. హృదయ పరిపాకం లేకుండానే రచనకు ఉపక్రమించిన కరటకదమనకులు.” [1]

    అందుకనే గూడార్థం ఏదన్నా ఉండి ఉంటుదని వెతుకుతున్నారనుకుంటాను.

    మొదటి మూడు కవితలలో బుద్ధుని గొప్పతనం కళ్ళకు కట్టినట్టున్నదనీ, ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేని పిల్లి, కుక్క (మనలాటి పాఠకుల్లాగే) కూడా ఉన్నారనీ, నాలుగవ కవితని, మనం కవిత్వం ఎలా చదవాలి అనే దానికి ఉపమగా తీసుకొవచ్చనీ అన్నారు గరికపాటి. సముద్రం అడుగున చేపల్ని చూసి ఆనందించమన్నది కవిత్వం ఎలా చదవాలి అన్నదానికి ఉపమా? దీనికి చాలా బుద్ధి బలం కావాలనిపించింది నాకు. అది భూషణ్ తత్వానికి వ్యతిరేకం:

    “పుస్తకానికి, జీవితానికీ మధ్య దూరం పెంచేది కవిత్వం కాదు. సరైన కవిత్వం చదివాక నీవు పఠిస్తూ వచ్చిన వంద పుస్తకాలను గోదాట్లో గిరవాటు వేయగల తత్వ నిశ్చయం కలగాలి. అంతరాత్మను ముంచెత్తేదే అసలు సిసలు కవిత్వం. హృదయవర్తనను సాకల్యంగా ఎరిగిన వాడే పదహారణాల కవి. బుద్ధి బలంతో మిడిసి పడేవాడు పుస్తకాలను మోసే గాడిద .. అధముల్లో అధముడు. గణుతి కెక్కడు, పైగా వాడికి కవిత్వం నిషిద్ధం.” [1]

    పాత కవిత్వంలో పదాల అర్థాలు తెలియకా, కొత్త కవిత్వంలో పద చిత్రాల అనుభూతి చేరకా, నలిగిపోయే వాళ్ళలో నేనొకణ్ణి.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] గరికపాటి పవన్ కుమార్ కవితా సంపుటి, “ఆ సాయంత్రం,” కి తమ్మినేని యదుకుల భూషణ్ రాసిన ముందుమాట, “ఒక్క క్షణం …” నుండి. 2003.

  1576. సువర్ణభూమిలో … గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    12/06/2008 11:12 am

    దృశ్యానుభూతి కవిత్వ లక్షణాల గురించి ఒక వ్యాసంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఇలా అంటారు:

    “దృశ్యంలోకి అనుభవం, అనుభవంలోకి దృశ్యమూ పరావర్తనమయ్యే విశిష్ట గుణం అనుభూతి కవిత్వానికి మూలం. నువ్వు చెప్పేదేదయినా నీ అనుభవంలోంచి పలకడమే ఇక్కడ ప్రాధమిక సూత్రం. కవి అనుభవానికే కాదు, పాఠకుల అనుభూతిక్కూడా ప్రాధాన్యత ఉన్నప్పుడే అది నిలబడుతుంది. అస్పష్టం గా ఉన్న అనుభవం ఇంకొకరి అనుభూతిలోకి ప్రసరించదు.

    కవితలో ప్రధాన లోపం స్పష్టత. అనుభవమే కనిపిస్తోంది – అనుభూతి మాత్రం శూన్యం.

    -సాయి బ్రహ్మానందం

  1577. సువర్ణభూమిలో … గురించి baabjeelu గారి అభిప్రాయం:

    12/06/2008 7:46 am

    ఇప్పటిదాకా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రాసేరు ఈ కవిత మీద.
    ఆరి సీతారామయ్యగారి వ్యాఖ్య చదివేక మరీ విడ్డూరంగా వుంది.
    మొదట్లో మూలా వారు “ఆరో ఖండిక” అద్భుతం అన్నారు. ఆతరవాత నానాజాతి సమితీ చేతికొచ్చినట్టూ రాసేరు. మధ్యలో “గురుతుల్యులు” అలాక్కాదిలాగ, ఇలాక్కాదలాగ అని అందర్నీ దార్లో పెట్టడానికి నానా ప్రయాసా పడ్డారు. ఇప్పుడు ఆరి వారు “ఆరో ఖండిక” ఈ కవితని గొప్ప కవిత కాకుండా అడ్డీసిందని బాధ పడ్డారు.
    మహన్నభావుల్లారా!మీకందరికీ జవాబు తెలుసు. తెలిసీ చెప్పకపోతే మా(సాధారణ పాఠకుల) తలలు వేయి వ్రక్కలైపోతాయి.

    నాగులపల్లి శ్రీనివాస్ గారికి,
    మీ అంత చక్కగా, నిష్కర్షగా, నిస్సంకోచంగా, నిర్భయంగా,నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా అభిప్రాయాలు రాసేవాళ్ళని ఇంతవరకూ నేను చూళ్ళేదు. ధన్యోస్మి.

  1578. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    12/03/2008 9:04 pm

    కామేశ్వరరావు గారికి,

    సోదాహరణంగా విపులీకరించినందుకు థాంక్స్. నా శీర్షిక మో “పోలికలు” కవితని ఉద్దేశించి, సరదాగా పెట్టింది. పాత కవిత్వంతో పోల్చడానికి కాదు.

    వినీల్, శ్రీనివాస్ గార్లని ఉద్దేశించి మీరు రాసిన అభిప్రాయంలో, తనకర్థం కాని కవితని విమర్శించే హక్కు పాఠకుడికి లేదన్నారు. నా ఉద్దేశంలో పాఠకుడికి విమర్శించే హక్కు ఎప్పుడూ ఉండాలి, అర్థం కావడం లేదన్నదీ ఓ విమర్శే. కవిత్వం లో సత్తా ఉంటే ఆ విమర్శల ధాటికి నిలుస్తుంది.

    భూషణ్ గారికి,

    నేను ప్రస్తావించిన పొరబాట్లు ఎవరివల్ల జరిగినా చివరకి రచయితే బాధ్యుడు. నాకు ఇస్మాయిల్ వ్యక్తిగతంగా తెలియకపోయినా, ఈమధ్య ఆయన రచనలని చదివి, వాటితో పూర్తి అంగీకారం లేకపోయినా, ఉన్నత వ్యక్తిత్వం కలవాడన్న భావన కలిగింది. ఒక్క పొరబాటు మూలాన ఆయన మీద ఉన్న నా అభిప్రాయం మారదు.

    మో గురించి కూడా ఒక విషయం. “నిరాకారుడు” ఆయన మొదటి సంపుటి, “చితి-చింత” లోనిది. తరవాత వచ్చిన “రహస్తంత్రి” లో చాలా చోట్ల పాశ్చాత్య కవుల ప్రేరణ సూచిస్తాడు.

    కొడవళ్ళ హనుమంతరావు

  1579. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    12/03/2008 6:51 am

    హనుమగారు,

    ప్రాచీన ఆధునిక కవిత్వాలలోని అస్పష్టతని పోల్చడం నా ఉద్దేశం కాదు. రెండూ వేరువేరు తరహాలకి చెందినవి కాబట్టి వాటిని పోల్చలేము కూడా. ప్రాచీనకవిత్వంలో కూడా అస్పష్టత ఉందని, అది మీరన్న ఆధునికకవిత్వంలోని అస్పష్టతకి భిన్నమైనదని చెప్పడమే నా ఉద్దేశం. ఆధునికకవిత్వంలో అస్పష్టతకి మీరిచ్చిన ఉదాహరణ నేనన్న వాక్యగత అస్పష్టతకి మంచి ఉదాహరణే. ఇక్కడ వాక్యాలు అర్థ రహితం (వ్యాకరణ రీత్యా) కావడం మూలాన అస్పష్టత ఏర్పడుతోంది. ప్రాచీనకవిత్వంలో ఇలాటిది దాదాపుగా కనిపించని మాట వాస్తవమే.

    ప్రాచీనకవిత్వంలో అస్పష్టతకి ఇంకా మంచి ఉదాహరణలు ఉన్నాయి కాని ప్రస్తుతానికి ఇది:

    “ఈ కలహంసయాన నను నెక్కడి కెక్కడ నుండి తెచ్చె! నా
    హా! కడుదూరమిప్పు”డని యక్కున జేర్పక జంపుమాటలన్
    వ్యాకుల పెట్టుటేల? విరహాంబుధి ముంపకపోదు నన్; జలం
    బేకద నీకు; మంచిదిక నీతకు మిక్కిలి లోతు గల్గునే!

    ఇందులో అస్సలు అర్థంకాని పదాలు కానీ, అర్థంలేని వాక్యాలు కానీ ఏవీలేవు. అయినా కవి ఇక్కడ ఏవిటి చెప్పదలచుకున్నాడో స్పష్టంగా తెలియటంలేదు. ఇది విజయవిలాసంలో ఉలూచి అర్జునునితో అనే మాటలు. అర్జునుడు తనని పెళ్ళిచేసుకోడానికి ఒప్పుకోకపోతే అంటున్న మాటలు. సందర్భాన్ని బట్టి ఈ పద్య తాత్పర్యం చూచాయగా తెలుస్తున్నా, దీనికి సంతృప్తికరమైన వివరణ ఎక్కడా నాకు కనిపించలేదు. హృదయోల్లాస వ్యాఖ్య రాసిన తాపీవారు కూడా ఈ పద్యంలో కవి చెపుతున్న “ఎక్కడినుండి ఎక్కడకి” తేవడం, విరహ అంబుధిలో “ముంచడం”, “ఈతకు మిక్కిలి లోతుగల్గునే” అనే జాతీయాన్ని ప్రయోగించడం మొదలైన విషయాల్లో కవి ఆంతర్యం స్పష్టం కాలేదని ఒప్పుకున్నారు. “ఈతకు మిక్కిలి లోతు చావుకి మిక్కిలి చింత ఉండవు” అనే జాతీయాన్ని ఇక్కడ ప్రస్తావించి, తనకి చావే శరణ్యం అని ఉలూచి అంటోంది అని అర్థం చేసుకోవాలి. కానీ వచ్చిన చిక్కల్లా, ఈతవస్తే సముద్రంలో మునిగిపోవడం ఉండదు కదా, మరి విరహాంబుధిలో ముంచడం గురించి ఎందుకు ప్రస్తావించినట్టు?

    ఇంతకీ నేను చెప్పదలచుకున్న సారాంశమేమిటంటే, ప్రాచీన కవిత్వంలో కూడా కొన్ని చోట్ల అస్పష్టత కనిపిస్తుంది. అయితే, అది మీరు ఆధునిక కవిత్వంలో చూపిన అస్పష్టత లాంటిది కాదు. ఏది స్వచ్ఛమైనది, గాఢమైనది అన్న ప్రశ్న అనవసరం.

  1580. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి తమ్మినేని యదుకులభూషణ్. గారి అభిప్రాయం:

    12/02/2008 10:25 pm

    ఇస్మాయిల్ గారిని బాగా ఎరిగున్న వ్యక్తిగా నాలుగు మాటలు చెబుతాను.ఆయన వ్యక్తిగా చాలా ఉదారుడు. చేయనిదానికి ఘనత పొందాలనే తాపత్రయం ఆయనలో ఏనాడు లేదు. అయితే కొడవళ్ల హనుమంతరావు గారు చూపిన వ్యాసం ఇస్మాయిల్ గారి “ఇద్దరు భాష్యకారుల”కు మూలం అన్న దాంట్లో రెండవ అభిప్రాయానికి తావు లేదు.

    ఇంకో పార్శ్వం:
    తెలుగులో పుస్తక ప్రచురణ పెద్ద తలనొప్పి వ్యవహారం (దేశిబుక్స్ తరపున ఇస్మాయిల్ గారి “కవిత్వంలో నిశ్శబ్దం”, “పల్లెలో పాత ఇల్లు” మేము ప్రచురించిన సంగతి కొంత మంది పాఠకులకైన తెలిసే ఉంటుంది). ఆ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే , ఇస్మాయిల్ గారి ఆముద్రిత కవితలు అనువాదాలు ప్రచురించే ముందు ఆయన స్వదస్తూరిలో ఒక అనువాదం దొరికింది. దాని మీద, ఆయన రష్యన్ కవయిత్రి అని రాశారు అంతే. ఊరు, పేరు ఏమీలేవు. ఆయనకు రష్యన్ లో ఇష్టులైన కవులు/కవయిత్రులు నాకు తెలుసు కాబట్టి, అందునా అది ఆ కవయిత్రి రాసిన కవితల్లో కొంత విలక్షణమైనది కాబట్టి నేను వెంటనే, గుర్తించి ఒక లఘు టిప్పణి లిఖించి ప్రచురణ పనులు చూస్తున్న కవిమిత్రులకు పంపాను. అదే రకంగా ఇంకో రెండు పోలిష్ కవితలను గుర్తించడం జరిగింది. శ్రీనివాస్ రాయప్రోల్ కవిత్వం/జీవితం గురించి అమెరికన్ పత్రికలో వచ్చిన సమాచారం ఆధారంగా నాలుగు వాక్యాలు రాసి పంపాను. కానీ, ఇవేవీ పుస్తకం ప్రచురణలోకి రాలేదు.

    నేను చెప్ప దలచుకొన్నది ఏమంటే, మనవారికి పాదపీఠికలమీద పెద్ద ఖాతరీ లేదు. కవి /రచయితల శుద్ధప్రతి మొదలుకుని ప్రెస్సుకు వెళ్ళే ఆఖరి ప్రతి (gateway అంటారు మన ప్రెస్సువాళ్ళు) దాకా ఎన్నో మార్పు చేర్పులు చోటు చేసుకొంటాయి. పుస్తక ప్రచురణలో కవి /రచయిత /సంపాదకుల ప్రమేయం ఉన్నా, ఒక్కొక్కసారి కొందరి అజాగ్రత్త వల్ల ఎన్నో స్ఖాలిత్యాలు. అటువంటి స్ఖాలిత్యాల ఫలితమా ఇది? ఇస్మాయిల్ గారు మొదట రాసిన ప్రతిలో దాని మూలాన్ని పేర్కొన్నారా?? అసలు మొదటి సారి ఏ పత్రికలో ప్రచురించ బడింది?? ఇవన్నీ సాహిత్య చరిత్రకారులు తేల్చవలసిన విషయాలు.

    తమ్మినేని యదుకులభూషణ్.

  1581. సువర్ణభూమిలో … గురించి ఆరి సీతారామయ్య గారి అభిప్రాయం:

    12/02/2008 3:11 pm

    సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు.

    కవితలో మూడు దృశ్యాలున్నాయి. మొదటిది ఒక కొండమీది (ఒక భక్తుడు ఎన్నో మెట్లెక్కి వచ్చాడు కదా) బౌద్ధ దేవాలయం. బౌద్ధ మతాన్ని అభ్యసిస్తున్న విద్యార్ధులు ఎదురెదురుగా కుర్చోనున్నారు. దేవాలయం లోపలికి వెళ్ళేముందు భక్తులు కాళ్ళుకడుక్కోవటానికి ఒక పెద్ద నీళ్ళతొట్టె ఉంది. అందులో కలువలున్నాయి. ఒక కలువ మీద తేనెటీగ వాలి ఉంది. అగరొత్తుల పొగ దేవాలయం అంతా వ్యాపించి ఉంది. ఎర్ర చారల పిల్లి ఒకటి ఉంది ఆ దృశ్యంలో. కవి చూస్తుండగానే కొండ పైదాకా వచ్చిన భక్తుడొకడు పైకప్పుకు అంటుకొనిఉన్న గబ్బిలాలను అదలించాడు. మన కవి, అతని భార్య (మేము అన్నాడు కదా? అరుంధతి గారికి కవితను అంకితం ఇచ్చాడు) బంగారు బుద్ధుడికి కలువలు సమర్పించారు.

    రెండో దృశ్యం పర్యాటకులు చూసే ఒక శిధిలమైన దేవాలయం. ఒక పర్యాటక బృందానికి మన కవికి తెలియని ఏదోభాషలో గుడి గురించి చెప్తున్నాడు గైడ్. దేశం మీద జరిగిన దాడుల్లో దేవాలయంలోకూడా విధ్వంసం జరిగింది. విగ్రహాల తలలు తెగిపోయాయి. దేవాలయపు గోడలమీద ఇప్పుడు పెద్దపెద్ద చెట్లున్నాయి. వాటి వేళ్ళలో ఒక బుద్ధ విగ్రహానికి చెందిన తల ఇరుక్కుపోయి ఉంది. మొండెం మాత్రం ఇంకా ధ్యానం చేస్తున్నట్లే ఉంది. మామూలు కవికీ మంచి కవికి తేడా – ఆ పర్యాటకుల బృందంలో ఒకావిడ అక్కడకొచ్చిన కుక్క పిల్లని ఒడిలోకి తీసుకున్నది అని చెప్పటం. చరిత్రలోనుంచి మనల్ను బయటకు తీసుకొచ్చాడు కవి.

    మూడో దృశ్యం సముద్రపు నీళ్ళలోతుల్లో జంతుజాలాన్ని చూడటానికి వెళ్ళే పర్యాటకులు. కొంచెం అటూ ఇటూ అయితే ప్రమాదం. బాగా ఈత వచ్చిన వాళ్ళు పర్యాటకులను రక్షించాల్సి వస్తుంది.

    ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్‌ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.

  1582. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    12/01/2008 11:05 pm

    స్వచ్ఛమైన గాఢమైన అస్పష్టత 🙂

    కామేశ్వరరావు గారికి,

    నన్ను కరెక్ట్ చేసినందుకు థాంక్స్. నాకు పాత సాహిత్యంతో పరిచయం నామమాత్రంగా కూడా లేదు. నేను పాపినేని ని paraphrase చేశానంతే. ఆయన మాటల్లో:

    “భావ కవిత్వానికి ముందు తెలుగు కవిత్వంలో అస్పష్టత (ambuguity), దానిని గూర్చిన భావన కన్పించవు. వెనకటి ఏ ప్రసిద్ధకవి పద్యమైనా భాషాకాఠిన్యం వల్ల, అన్వయక్లేశం వల్ల అర్థంకాక పోవటమంటూ వుందిగానీ అస్పష్టం కావటమంటూ లేదు. ప్రాచీన కావ్యాల్లో కవి ఉద్దేశ్యాన్ని ప్రతి పద్యంలోనూ సుళువుగానే గ్రహించవచ్చు. కవి ఉద్దేశ్యం తెలియకపోవటం అనే ఇబ్బంది ఆధునిక కవిత్వంలోనే ఎదురవుతోంది. ఈ ఇబ్బందిని గూర్చి ముచ్చటించుకోవాలంటే ముందుగా అస్పష్టత అనే భావనను నిర్వచించుకోవాలి.”

    అస్పష్టతకి ఉదాహరణగా పాపినేని ఇచ్చిన ఒక కవిత – “పోలికలు”:

    “అద్దాలమేడ – అందాల భామ
    బృహదారణ్య కోపనిషత్తులో
    సీలియాని కుట్టి చంపేసిన కిం గం జా ఐలండ్ చీమలు
    వేదాల పనసలు – ఉల్లిపాయ పొరలు.
    నిలువుటద్దాల్ని నిట్టూర్పులతో కొలువ్
    షాపెనోవర్ పడుకున్నచోట
    పడిపోయిందొక క్షురకర్మ అద్దం.
    పగిలిన అద్దంలో అతనొక
    అనంత శయన ఐక్యతా శతమూర్తి.
    సంసారి కొలిమిలో సన్యాసి ఊపిరి ఊదు
    దీపాల కొలువులో పాపాల చీకటి చిమ్ము
    నిలువుటద్దాలపై పడకటద్దాలు పడితే
    కళ్ళు విరిగి కాళ్ళు పగుల్తాయ్.
    వాలుటద్దాలపై కార్నర్ అద్దాలు రగిలితే
    స్ప్లింటర్స్ లో సిన్నర్స్ మిగుల్తారు.
    అద్దాల మేడలో గాజుసూదుల కంపలో
    గాయపడ్డ వాళ్ళని చూచి డాక్టరే కట్టుకుంటాడు.”

    ఎలియట్, డెరీడా, షెల్లీ లకి అధోదీపికలున్నాయి! ఎవరు రాసిందో చెప్పనవసరం లేదు కదా. పాత కవిత్వంలో కూడా ఇంతటి అస్పష్టత కలవి ఉన్నాయంటారా? పాతా కొత్తా, రెండూ ఎరిగిన మీరే చెప్పాలి.

    నాకిది అర్థమయితే ఒట్టు. అందంగా ఉందని మాత్రం ఒప్పుకోవాలేమో!

    కొడవళ్ళ హనుమంతరావు

  1583. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    12/01/2008 5:51 am

    “భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు.”
    అని హనుమగారన్నది సరి కాదు. భావకవిత్వం ముందర వాక్యగతమైన (వ్యాకరణ ధిక్కారంతో వచ్చే) అస్పష్టత చాలా వరకూ లేదు. కాని భావగతమైన అస్పష్టత ఉంది. వాక్యగతమైన అస్పష్టత కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అంతకన్నా పై మెట్టు మరొకటి ఉంది! అది కవిత్వంలో పొరలు (layers). అంటే పైకి స్పష్టంగా ఒక అర్థాన్నిస్తూనే అంతర్గతంగా మరొక (మరికొన్ని) అర్థాన్ని స్ఫురింపజెయ్యడం. ఇక్కడనేనంటున్నది శ్లేష గురించి కాదు.

    “కవి అమూర్త భావాలు వాడటం వల్ల కలిగిన అస్పష్టత. ట్రాన్స్పరెంట్ చీకట్లు, చంద్రుణ్ణి తాగడాలు లాంటి expressions ఐతే I can empathize with you.” అని వినీల్ గారన్నారు.

    But I cannot! ఒక పాఠకుడికి, తనకి అర్థం కాని కవిత్వాన్ని అర్థం కాలేదని చెప్పడానికి అధికారం ఉంది కానీ, దాన్నసలు కవిత్వమే కాదనడానికీ, విమర్శించడానికీ హక్కు లేదని నా ఉద్దేశం. ఆ కవిత్వం వేరెవరికైనా అర్థం కావచ్చు, వాళ్ళా కవిత్వాన్ని అనుభవించవచ్చు. ఏదైనా కవిత్వం ఎవరికీ అర్థం కాకుండా పోతే, దానికి ఆదరణ లేక అది సహజమరణం పొందుతుంది. దాని గురించి విమర్శించడం అనవసరం.

    ఈ వ్యాసంలో వేలూరివారు ప్రస్తావించిన కవిత్వానికి కొలమానాలు కాని, టెక్నిక్కు కానీ మొత్తం కవిత్వానికంతకీ వర్తించేవి తయారుచెయ్యడం అసాధ్యం, అనర్థం కూడా. ఒకో “రకమైన” కవిత్వానికీ (కొన్ని ప్రత్యేక కొలమానాలతో) ఒకో టెక్నిక్కు సృష్టించుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. ఒక రకమైన కవిత్వానికి సంబంధించిన టెక్నిక్కుని మరొక రకమైన కవిత్వమ్మీద ప్రయోగించడం పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం వెయ్యడమవుతుంది!

  1584. అసంపూర్ణ చిత్రం గురించి nagaraju raveender గారి అభిప్రాయం:

    12/01/2008 3:15 am

    కవిత ఒక నిశబ్దపు అనుభూతిని మిగిల్చింది.

  1585. చంద్రుణ్ణి చూపించే వేలు గురించి nagaraju raveender గారి అభిప్రాయం:

    12/01/2008 2:47 am

    హైకు కవితాత్మను ఆవిష్కరింప జేస్తే , ఈ వ్యాసం హైకూను సాక్షాత్కరింప జేసింది.

  1586. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/30/2008 11:16 pm

    To Give Credit Where It Is Due

    సంపాదకులకి: ఈ అభిప్రాయాన్ని “గ్రంథచౌర్యం గురించి,” అన్న మే 2008 సంపాదకీయం కింద వెయ్యవచ్చు కాని, ఇక్కడే ఉంచమని మనవి.

    గట్టు వినీల్ నా కొటేషన్స్ ని ప్రస్తావించి సమర్థించినందుకు థాంక్స్. ఆ సందర్భంలో రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. మొదటిది అల్పమైనది, రెండోది ముఖ్యమైనది.

    మొదటిది: కొటేషన్స్ ఇవ్వడం నా బలహీనత. సృజనా లోపమని భావిస్తాను. సాహిత్యం నా వృత్తీ, ప్రవృత్తీ కానందుకు బతికిపోయాననుకుంటాను. 🙂 పదే పదే నేను కోట్ చెయ్యడం విమర్శించదగ్గ విషయమే.

    రెండోది: అయితే అది నేనేదో గొప్పవాణ్ణని చూపించడానికో ఇతరులని భయపెట్టడానికో కాదు. భావమో, వ్యక్తీకరణో మనది కానపుడు, ఎవరిదో సూచించడం నైతిక బాధ్యత. సైన్సు రంగంలో ఉండటానో, పాశ్చాత్య ప్రభావమో నాకిది దాదాపుగా అలవాటు. అలా చెయ్యని సందర్భాల్లో తప్పు చేశానని చానాళ్ళు మనసులో పీకుతుంటుంది.

    ముఖ్యమైన విషయాలు ప్రస్తావించినపుడు, మూలం మనది కాకపోతే విధిగా కారకులని గుర్తించాలి. మొన్ననే ఇస్మాయిల్ పుస్తకాన్ని ప్రస్తావించాను. దాంట్లోనే “ఇద్దరు భాష్యకారులు,” [1] అన్న 1980లో రాసిన వ్యాసం ఉంది. చలం “మ్యూజింగ్స్” ప్రస్తావనతో మొదలయిన వ్యాసంలో రెండో పేరా చూడండి:

    “అప్పుడప్పుడూ రంగులు లేతగానో, ముదరగానో మారుస్తుండటమూ, లేదా ఎడమొహం పెడమొహం వేసి రెంటిగా చీలిపోవటమూ మార్క్సిస్టు ఉద్యమాలన్నిటికీ సామాన్య లక్షణమనుకుంటాను. మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం.”

    వెంటనే పక్కా ఇస్మాయిల్ అనిపిస్తుంది కదూ. 🙂 మార్క్సిస్టు విమర్శకుల్లో రెండు రకాలు – ఛాందసులు, అఛాందసులు – అని వాళ్ళలో తేడాలని వివరించే వ్యాసం. నాకు చాలా నచ్చింది. కాని అఛాందసుల మీద మామూలుగా ఇస్మాయిల్ మార్క్సిస్టుల మీద వేసేటన్ని వాతలు పడనందుకు ఆశ్చర్య మేసింది. తెలుగు వాళ్ళు కానందువల్లనేమో నని సమాధానపడ్డాను. వాళ్ళ గురించి ఏమన్నా తెలుసుకుందాం అని వెతికితే ఓ George Steiner పుస్తకం [2] కనబడింది.

    నేనీ Steiner వేమీ చదవలేదు. ఆదివారం కదా అని లైబ్రరీకెళ్ళి తెచ్చుకొని తిరగేశాను. దాంట్లోని “Marxism and the Literary Critic,” అన్న వ్యాసం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఇస్మాయిల్ వ్యాసం దీనికి సంక్షిప్తానువాదం! మంచి అనువాదం, సందేహం లేదు. కాని మూలంలో లేనిది ఒక్క అక్షరం కూడా లేదు, దాంట్లో అనుమానం లేదు. మరి ఇస్మాయిల్, “ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం,” అన్న దాంట్లో ఆవగింజంతయినా ఔచిత్యం ఉందా? తను సొంతంగా ఏం ఆరా తీశారు?

    ఇస్మాయిల్ ప్రతిభావంతుడైన కవి, విమర్శకుడు. సాహిత్యం, తత్వశాస్త్రాల్లో విద్యాధికుడు. సొంతంగా ఇలాంటి వ్యాసం రాసే సత్తువ ఆయనకుంది, నాకెలాంటి సందేహం లేదు. కాని ఈ వ్యాసం మూలం మాత్రం ఇస్మాయిల్ ది కాదు. Steiner పేరు ప్రస్తావించకపోవడం పెద్ద నేరం.

    ఆ రీతిలో కాకపోయినా, ఇక్కడే ప్రస్తావించిన మో “నిరాకారుడు” కవితని చూద్దాం. మొదలొకటే అయినంత మాత్రాన “The Listeners,” తో పోల్చకూడదన్నాడు మో. అది ఒక పేజీ, ఇది ఆరు పేజీలు, అనువాదం కాదు. కాని కవితలోని వాతావరణం అదే, అనుమానం లేదు. మో ఆంగ్ల సాహిత్యం విస్తృతంగా చదివిన వాడు. స్పూర్తి దానినుండే వచ్చి ఉండాలి. పేరు చెప్తే సొమ్మేం పోయింది? సాధారణ పాఠకులకి కవిత చేరేదేమో కూడాను.

    చివరగా, మరో విషయం. మూలాలు చెప్తే, పాఠకులు పోయి ఇంకాస్త చదువుకొని లాభించే అవకాశం ఉంది. చెప్పకపోతేనే నష్టం.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “కవిత్వంలో నిశ్శబ్దం,” ఇస్మాయిల్. పేజీలు 102-106.
    [2] “George Steiner: A Reader,” Oxford University Press, 1984. పేజీలు 37-53. “Marxism and the Literary Critic,” వ్యాసం మొదట ప్రచురించింది 1958లో.

  1587. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/29/2008 3:52 pm

    హనుమ గారు
    Thanks for the reference.
    ఇది రాద్దామనుకోలేదు, కాని నేను రాసింది అస్పష్టంగా ఉందేమోనని అనుమానం వచ్చి రాయడం. “ఈ మాట” యొక్క అభిప్రాయవేదిక చర్చావేదిక గా మారకుండా ఉండాలని గింజుకుంటూ కూడా రాయడం.

    గ్లోబలైజేషన్్ ఉన్నా లేకపోయినా, “నారికేళపాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టమే కాదు, నిజాయితీ అని కూడా అనిపించడంలేదు నాకు.

    వినీల్్ గారు “అస్పష్టతకు కారణాలేమిటి?” అని చాలా మంచి ప్రశ్న వేసారు. రెండు పాయింట్లు చెప్పి నా అభిప్రాయంతో ముగిస్తాను.
    1. అస్పష్టత చాలా సార్లు subjective అనిపిస్తుంది.
    2. అస్పష్టత వేరు complexity వేరు.
    ఒకరికి అస్పష్టంగా ఉన్నది ఇంకొకరికి ఉండకపోవచ్చు. లోకం మొత్తానికి అస్పష్టంగా ఉన్నది కవికి స్పష్టంగా ఉండొచ్చు, hopefully! Subjective అన్నప్పుడు, అస్పష్టతకు సవాలక్ష కారణాలుండొచ్చు. పాఠకుడు సరిగ్గా చదవకపోవడం నుంచి, భాషా పరిచయం లేకపోవడం నుంచి అచ్చుతప్పులు గ్రహించకపోవడం దాకా ఎన్నో కారణాలుండొచ్చు. వాటికి కవిత మాత్రం కారణం కాదు. కాబట్టి వాటి గురించి, అంటే “1” గురించి కాదు ఈ చర్చ అని అనుకుంటున్నాను.

    ఇక “2” వ అంశం. ఆలోచనా విస్తృతి పెరిగినప్పుడు complexity తగ్గిపోతుందని కాదు కాని, complexity పట్ల స్పష్టత పెరుగుతుంది. వీటి ఉదాహరణలు అందరి దగ్గరా ఉంటాయి.

    నేను సమర్థించని “అస్పష్టత” పై రెండు కోవలకు సైతం చెందనిది, ఇతరమైనది! కవిత అర్థం కాకముందు కాదు, దాని అర్థం తెలుసుకున్నాక కూడా అది అస్పష్టంగా కనిపించడం గురించి. అప్పుడు ఆ “కవిత” అనే రాతలో ఏముంది డొల్ల అని ఎందుకు నిలదీయకూడదో తెలియదు, నిజాయితీగా. నేనన్న “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టం అని అన్నది దీని గురించి మాత్రమే.
    ==================
    విధేయుడు
    -Srinivas

  1588. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    11/29/2008 2:02 pm

    కవిత్వంలో అస్పష్టతను గురించి ప్రస్తావిస్తూ నేను కోట్ చేసిన తిలక్ కవితా పంక్తులలో , కవిత్వంలో అస్పష్టతని తిలక్ సమర్థిస్తున్నారన్న అభిప్రాయం కలిగితే అది నా పొరపాటు మాత్రమే.
    ఆయన వ్రాసిన “నవత – కవితకవిత లో కవిత్వం పట్ల ,కవిత్వం లో అస్పష్టత పట్ల ఆయన అభిప్రాయాలు చూడవచ్చు.బహుశా ఏభై ఏళ్ళక్రితం వ్రాసిన కవిత అయినా మౌలికంగా కవిత్వాన్ని గురించిన కొన్ని ఆలోచనలు ఇప్పటికీ Out of context కాకపోవటం కూడా మనం చూడవచ్చు. ఈ కవిత నగ్నమునిగారికి ఆయన వ్రాసిన లెటర్ అని విన్నాను.

  1589. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి mOhana గారి అభిప్రాయం:

    11/29/2008 1:14 pm

    కవిత్వం చదువగానే ఒక అనుభూతి కలగాలి అని చదివిన తరువాత నాకు నన్నెచోడుడుగారు వ్రాసిన క్రింది పద్యం గుర్తుకు వచ్చింది –

    ముదమునఁ గవికృత కావ్యము
    నదరున విలుకాని పట్టినమ్మును బర హృ-
    ద్భిదమై తల యూఁపును, బెఱ
    యది కావ్యమె చెప్పఁ, బట్ట నదియున్ శరమే
    – కుమారసంభవము (1.41)

    మంచి కవిత హృదయాన్ని తాకి సంతోషాన్ని కలిగిస్తుంది, విలుకాడు పట్టిన బాణము భయము కలిగించి శత్రువు గుండెను తాకుతుంది. కవిత అంటే అది, బాణమంటే అది.
    మిగిలిందంతా కవిత అవుతుందా, బాణమవుతుందా అని దీనికి అర్థము.

    విధేయుడు – మోహన

  1590. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి వినీల్ గారి అభిప్రాయం:

    11/29/2008 11:23 am

    1) hanuma gaaru, hats off to your patience and focused responses. I have seen people taking digs at you for quoting from others. I wonder why is it so objectionable? Why should an objective reader (whether ordinary or extra-ordinary) be concerned about source of the content rather than the content? Infact, one should appreciate the honesty of writer for giving credits to the right people instead of flaunting them as his own.

    2) శ్రీనివాస్ గారు, “కవిత చదవగానే ఎదో ఒక అనుభూతి కలగాలి….”.
    Since when did instant gratification become a yard stick for good poetry? what about readers role, EQ/IQ level in understanding a poem?
    నారికేళ పాకం మాటున అస్పష్టత సమర్థించటం గురించి… అస్పష్టతకు కారణాలేమిటి? పాఠకుడికి విషయపరిజ్ఞానలోపం వల్ల కలిగిన అస్పష్టతా? ఐదేళ్ళ క్రితం ఈమాటలో కనకప్రసాద్ గారి ‘టకరగాయికె‘ చదివినప్పుడు నాకు అర్థం అవలేదు. దాంట్లో కవి దోషం ఉందనుకోను. ఇంకో రకం ఉంది. కవి అమూర్త భావాలు వాడటం వల్ల కలిగిన అస్పష్టత. ట్రాన్స్పరెంట్ చీకట్లు, చంద్రుణ్ణి తాగడాలు లాంటి expressions ఐతే I can empathize with you.

    3)బాబ్జీలు గారు, “2008 లో ఇస్మాయిల్ గారి మాటల గురించి ఆలోచించడం సబబు కాదని…”
    అలవోకగా ఇలాంటి విప్లవాత్మక అభిప్రాయాలు వెలిబుచ్చేటపుడు కాస్తా ముందూ వెనకలు…ఆయన ఆలోచనలు ఏమిటి? ఇప్పుడవెందుకు పనికి రావు? 2009 నుండి ఎవరి మాటల గురించి ఆలోచించడం సబబు? సెలవిచ్చి ఉంటే బాగుంటుంది. అణువులో బ్రహ్మాండాన్ని గ్రహించలేని మా బోంట్లకొరకు అభిప్రాయవేదిక బదులు వచ్చే సంచికలో ఒక వ్యాసం రాస్తే మరీ మంచిది. మరో విన్నపం. ఆ వ్యాసంలో పాత తెలుగు రచయితలు, వారి రచనలు పాత్రల రిఫరెన్సులు లేకుండా ఉంటే, మాలాటి సాధారణ పాఠకులకు ఇంకా మంచిది.
    వినీల్

  1591. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/29/2008 12:13 am

    ఆధునిక కవిత్వంలో అస్పష్టత

    నాగులపల్లి శ్రీనివాస్ గారికి,

    మన భాష ఉనికికే ముప్పు కలిగితే, పాఠశాలల్లో, ప్రజల లావాదేవీలలో తెలుగు వాడకం ఎక్కువ చేస్తే ఫలితం ఉంటుంది కాని, కవులని స్పష్టంగా రాయండర్రో అని మొరెట్టుకున్నా, ఒకవేళ వాళ్ళు దానిని పాటించగలిగినా, ఒరిగేది మాత్రం సున్నా!

    సాహిత్యానికీ సమాజ స్థితిగతులకీ పరస్పర సంబంధం ఉంది. కాని కార్యకారణ సంబంధాలు చూపకుండా ప్రతిదానికీ గ్లోబలైజేషన్ పేరెత్తడం వలన సాహిత్య వివేచన పెరగదు.

    భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు. ఆధునిక కవిత్వంలో అస్పష్టతని వర్ణించడానికి నారికేళ పాకం అన్న పదమే అనుచితం కావచ్చు. వర్తమాన కాలపు కవిత్వంలో అస్పష్టత స్వభావం ఏమిటి? అది ఎన్ని రకాలు? ఏది అనివార్యం? ఏది అవాంఛనీయం? ఇది రావడానికి అసలు కారణాలు ఏమిటి? అని పాపినేని శివశంకర్ [1] తన సిద్ధాంత గ్రంథంలో కాస్త వివరించాడు. మనమాయనతో ఒప్పుకోనవసరం లేదు కాని చర్చలోకి తీసుకోవాలి.

    సామాన్య పాఠకులు తెలుగు PhD థీసిస్ లు చదువుతారా? కవిత్వం ఆస్వాదించడానికి సిద్ధాంత గ్రంథాలు చదవాలా? అంటే అక్కర్లేదు. కాని గ్లోబలైజేషన్ ప్రభావంలో తెలుగు ఉనికికే ఆపద ముంచుకొచ్చిన తరుణంలో నారికేళ పాకం ముసుగులో అస్పష్టతని సమర్థించకూడదన్నప్పుడు – దీంట్లో సాహిత్య ప్రభావం గురించి చాలా గంభీరమైన భావాలున్నాయి కనుక – కాస్తో కూస్తో సిద్ధాంతపరమైన విచారణ చెయ్యాలి. PhD థీసిస్ లు కాకపోతే మరేదో, మనదో మరెవరిదో, కాస్త లోతుగా ఆలోచన చేసిన రచన ఆధారంగా.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “సాహిత్యం – మౌలిక భావనలు,” పాపినేని శివశంకర్, 1996. పేజీలు 139-146.

  1592. సార్ గారండీ… సార్ గారండీ… గురించి bharath గారి అభిప్రాయం:

    11/28/2008 2:15 am

    ఒక తరం తన నడతను ప్రసవించుకొనే వేళ
    నేను మంత్రసాని నౌతాను

    బాబాగారూ, మీకవిత చాలా బాగుందండీ. ముఖ్యంగా పైన పేర్కొన్న వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది.

  1593. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/27/2008 6:19 pm

    బాబ్జీలు గారు
    నిజమే మీరన్నట్లకు బోలెడు నిర్వచనాలున్నాయి. పంచుకున్నవి నాకు తెలిసిన కొంచెం మాత్రమే.

    కవిత్వాన్ని నిర్వచించడం కుదరదు అని అనుకున్నా, చేసిన వాళ్ళు చేసారు, చేయని వాళ్ళు ఆగకుండా చేస్తున్నారు, ఇంకా ముందుకు చేయకుండా ఆగుతారనీ లేదు.

    ఇక మీరడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానమే నాది కూడా అని అనుకుంటాను. విశ్వశ్శ్రేయం కావ్యం అంటే విశ్వశ్రేయం కానిదేదీ కావ్యం కాదని కాదు. తీపి మంచి రుచి అంటే తీపి కానిదేదీ మంచి రుచి కాదని అననట్లు.

    మీరన్న ఒక మాట మాత్రం చాలా సత్యం. కవిత చదవగానే చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి అన్నది పాఠకుని పట్ల సహాయమే కాదు, అవసరం కూడా అనిపిస్తుంది. తెలుగు భాష ఉనికే సవాలుగా మరుతున్న సమయంలో “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టంగా అనిపిస్తుంది.
    ————————–
    విధేయుడు
    -Srinivas

  1594. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/27/2008 8:12 am

    నాగులపల్లి శ్రీనివాస్ గారూ,
    నిర్వచనం, అందులోనూ కవిత్వాన్ని నిర్వచించడడం, మీరు చెప్పినట్టు కుదరదు. “సామాన్య, సాంగీక” శాస్త్రాల్లో కుదురుతాయి.

    మీరు 12 రకాల నిర్వచనాలు రాసేరు. ఇంకా బోల్డు వుండే వుంటాయి. ప్రస్తుతానికి ఇవే అనుకుందాం. అంటే 12 రకాల కవిత్వాలనా? లేదా పన్నెండింటినీ కలగలపాలా? విశ్వ శ్రేయస్సు కోరని రసాత్మకవైఁన వాక్యం ఏఁవఁవుతుంది? Tranquility లో ఎమోషన్ రికలక్ట్ అవకపోయినా మిగిలిన పదకొండు నిర్వచనాల్లో ఏదో ఒకదానికి సరిపోయీ రచన ఏఁవఁవుతుందీ?
    వేలూరి వారు, పై వ్యాసంలో, ఆశించింది ఇలాటి సందిగ్ధావస్థని నివారించడానికే ఏదో ఒక “టెక్నిక్” కోసవేఁ కదా?
    హనుమంత రావు గారూ, “మో” కవిత్వం, దాన్ని వేలూరి వారు వుదాహరణగా వాడుకున్న పధ్ధతికీ, లేదా చేరా చేసిన వ్యాఖ్యలకీ, మీరెందుకు ఇంత బాధపడుతున్నారూ? ఏం నిరూపిద్దావఁని?

  1595. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/27/2008 1:31 am

    “నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.” – మో

    బాబ్జీలు గారికి, (కొంత వైదేహి గారికి),

    “ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి,” అన్నారు మీరు. కవిత్వానికి సంబంధించినంతవరకు నాలాటి వాడు ఏమీ తేల్చలేడు. (నాలుగేళ్ళ క్రితం గట్టు వినీల్ నో పార్టీలో కలిసి, సాహిత్యం గురించి ముచ్చటించుకున్నాం. వినీల్ ది ఈ తరం. నేనో ఇరవై ఏళ్ళు సాహిత్యాంధకారంలో ఉండటాన ఈ తరం రచయితల పేర్లు కూడా తెలియలేదు. ఆ ఖాళీ పూరించుకోడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాలుగు పుస్తకాలు చదివి, నలుగుర్ని కోట్ చేసినంత మాత్రాన పండితులవుతామన్న అపోహ లేదు.)

    మో గురించి చేరా “ఆషామాషీగా చదివితే అర్థమయ్యే కవి కాడు … అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచం తిక్క చూపిస్తాడు” అన్నాడు. సామాన్య పాఠకులయినంత మాత్రాన ఆషామాషీగా చదవాలని లేదు కదా. లోతు ఉంటే తెలుసుకోడానికి కష్టపడితే ఏం?

    కొన్ని కవితలు వెంటనే మనసుకు హత్తుకుపోవు. అందీ అందక ఉంటాయి. వాటిని కాస్త తెలిసిన వాళ్ళు ఎవరన్నా వివరిస్తే అప్పుడు మామూలు పాఠకులకి కూడా గాఢమైన అనుభూతి కలుగుతుంది.

    వేలూరి గారి వ్యాసంలో మో కవిత మీద వ్యాఖ్యానం చూసి, చితి-చింత తీశాను – ఎవరన్నా ప్రస్తావిస్తేనే కాని ఇలాటివాటి జోలి కెళ్ళను నేను. వేలూరి గారు కోట్ చేసిన పాదాలు నాకూ అర్థం కాలేదు. “ఎర్ర ద్రాక్ష పళ్ళూ, తెల్ల అన్నం,” ఏమిటీ గొడవ? అనుకున్నాను.

    కాని ఇది దీర్ఘ కవిత. ఇంకా ముందుకు పోతే, నిరాకారుడు, తలుపుతో,
    “నీకు నిద్ర వృద్ధాప్యంలా ముంచుకొచ్చినపుడు
    చలి కొణుకుతూ రాంకీర్తనలు గొణుగుతూన్నపుడు
    నన్ను తలుచుకొని నీ పుస్తకం లోపల్లోపల చదువుకో,

    మూసేసిన వెన్నెలమాసికలేసిన తలుపూ
    నేనెళ్ళొస్తా గడేసుకో.”

    అనేటప్పటికి, అయ్యో! ఇది మన గురించే, అని తెలిసింది, విషాదమావరించింది. అందుకే నా మొదటి అభిప్రాయం రాసింది. ఇవాళ మీరు మో మీద రాసింది చదివి, మో తన మీద తనే అన్న మాటలు గుర్తొచ్చాయి [1]:

    “నా కవిత్వానికి ఎంతమంది అభిమానులున్నారో అంతేమంది విమర్శకులూ ఉన్నారు. అది అర్థం కాదనేది ప్రధాన విమర్శ. దాన్ని నేను ఖండించను. ఎందుకంటే నిజంగానే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎవరిదాకో ఎందుకు… చలసాని ప్రసాదరావు గారే నాకు రాసిన ఆఖరి లేఖలో, ‘మీ కవితా సంకలనాలన్నీ మీరు అరబ్బీలోనో పార్శీలోనో లేదా ఆఫ్రికా ఖండపు బురుండీ దేశభాషలోనో రాశారని ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు,’ అంటూ హాస్యమాడారు. నేనెన్నుకున్న వస్తువు నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఏ ఇంగ్లీషు కవి ప్రభావమో నామీద పడవచ్చు. ఆ భావాలతో బొత్తిగా పరిచయం లేని వ్యక్తికి… నేను రాసిన కవితలోని మూలం అందకపోవచ్చు. అలాగని నేను రాసిందంతా సంక్లిష్టమైన కవిత్వమంటే మాత్రం ఒప్పుకోను. నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.”

    నిరాకారుడి లాంటి కవితలకి చేరానో, మరో పండితుడో కాస్త వ్యాఖ్యానం ఇవ్వాలి. వెతికితే, వడాలి [2] లో కాస్త ఉంది: “Walter de la Mare’s poem The Listeners opens with a traveller “knocking on the moon-lit door”. MO’s Nirakarudu has a similar opening, but he cautions us against reading too much similarity between the two poems.”

    “The Listeners” బాగా పేరున్న కవిత అట. ఆ కవి మీద TS Eliot చక్కటి కవిత రాశాడట. ఇవేవీ నాకు తెలియవు. ఇప్పుడవి చదివి, మళ్ళీ “నిరాకారుడు” చదివాను. ఈ వ్యాసంలోని మిగతా కవితలూ చదివాను.

    “అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు,” అని చదివితే నాకూ చిన్నప్పటి మాఊళ్ళో బంతి భోజనాలు, గాడిపొయ్యులు, వాటితో పాటు వంటసాల చేసి పొగకి మండిన కళ్ళూ – అవన్నీ గుర్తొస్తాయి. మిగిలిన కవితలు గూడా మరికొన్ని జ్ఞాపకాలని తలపుకొస్తాయి. కాని అవేవీ మో కవిత అంతగా కదల్చడం లేదు. దానికి ఫలానా జ్ఞాపకం కారణం అని చెప్పలేను. నిరాకారుడు గొప్ప కవిత. కాస్త చెయ్యిస్తే సామాన్య పాఠకులని కూడా విషాదంలోనూ మోదంలోనూ ముంచెత్తేది.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “ఏకాంతం నుంచి ఏకాంతంలోకి,” ఈనాడు ఆదివారం, మార్చి 27, 2005.
    [2] “Modern Poetry in Telugu,” by V. Mandeswara Rao.

  1596. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/26/2008 9:43 pm

    బాబ్జీలుగారు
    “నిర్వచనాలు out of context లో అనిర్వచనాలయిపోతాయి.”

    ఏ context లోనైనా వర్తించేదే నిర్వచనం. ఫలానా context లోనే వర్తించేది వొట్టి వచనం. ఉదాహరణకు కావ్యానికి, కవితకు కొందరిచ్చిన నిర్వచనాలు, ఏ context లోనైనా పనికివచ్చేవి మచ్చుకు కొన్ని.

    1. నానృషిః కురుతే కావ్యం – సంస్కృత సూక్తి
    2. శబ్దార్థౌ సహితౌ కావ్యం – భామహుడు
    3. ఇష్టార్థ పదావ్యచ్చిన్నా వళీ కావ్యం – దండి
    4. ధ్వనిః కావ్య జీవితం – ఆనంద వర్ధనుడు
    5. ఔచిత్యం కావ్యస్య జీవితం – క్షేమేంద్రుడు
    6. లోకోత్తర వర్ణనా నిపుణ కవి కర్మ కావ్యం – మమ్మటుడు
    7. వాక్యం రసాత్మకం కావ్యం, రసోవై సః – విశ్వనాథుడు
    8. రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యం – పండితరాయలు
    9. విశ్వశ్రేయః్ కావ్యం – ఆంధ్ర శబ్ద చింతామణి
    10. కవయః్ క్రాంతః్ దర్శనః – సంస్కృత సూక్తి
    11. Poetry is emotion recollected in tranquillity – Wordsworth
    12. Poetry turns everything to loveliness. It exaults the beauty of that whcih is beautiful and it adds beauty to that which is deformed. – Shelley
    ——————————
    విధేయుడు
    -Srinivas

  1597. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    11/26/2008 2:42 pm

    నా ఉద్దేశ్యం లో మంచి కవిత కి ఉండవలసిన లక్షణాలలో ఒకటి పాఠకుడి అనుభవం లోకి రావటం .ఈ అనుభవం లోకి రావటం పాతజ్ఞాపకాలని/పాత అనుభూతులని గుర్తు తేవటం ద్వారా కావచ్చు ,లేదా ఓ కొత్త అనుభూతిని కలుగజేయటం ద్వారా కావచ్చు. పాతజ్ఞాపకాలు ఒకప్పటి కొత్త అనుభూతులే కదా!

    కవిత్వం లో అస్పష్టతని గూర్చి

    “అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి
    దాని అనుభూతి ఆకారం పాఠకుడికి అందాలి,హత్తుకోవాలి”

    అని తిలక్ చెప్పింది ఇప్పటికీ నిజమేనేమో అనిపిస్తుంది.

    My humblest two cents.

  1598. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    11/26/2008 1:02 pm

    తను సృష్టించిన Common Man గురించి చెబుతూ RK Laxman ఇలా అన్నాడు: “I would say he symbolises the mute millions of India, or perhaps the whole world, a silent spectator of marching time.”

    ఆర్. కె. లక్ష్మణ్ గారి కామన్ మాన్ లాంటివాడే వేలూరి గారి సాధారణ పాఠకుడు. పాకశాస్త్రంలో ప్రత్యేక తర్ఫీదు, ప్రావీణ్యత లేకపోయినా ఒక సామాన్య మానవుడు ఎలాగైతే నవవిధ పాకాలని ఆస్వాదించగలుగుతున్నాడో, అలాగే ఏ కవిత్వ తత్త్వ విచారము, సాహితీ సిద్ధాంతాల పరిచయం లేకపోయినా వేలూరి గారి సాధారణ పాఠకుడు — పాత జ్ఞాపకాలే సాధనంగా — కవితాస్వాదన చెయ్యగలడు.

    అంటే, ఈ వ్యాసంలో వేలూరి గారిది ద్విపాత్రాభినయనం :-): సిసిఫస్ రాయిలా ఏ సిద్ధాంతాన్ని మోయకుండా, మంచి భోజనాన్ని ఆస్వాదించినట్టే మంచి కవిత్వాన్ని ఆస్వాదించే సాధారణ పాఠకుడు ఒక పాత్ర అయితే, ఆ సాధారణ పాఠకుడు సాహిత్య సేవనం చేస్తునప్పుడు కలిగే అనుభవాన్ని సిద్ధాంతీకరించే సాహితీ సిద్ధాంతకర్తగా, Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాలను చదివిన వేలూరిగారిది ఇంకో పాత్ర.

    కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి.

    వేలూరి గారు బహుశా “కొత్త జ్ఞాపకాన్నీ సృష్టించడం ఒక మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి” అని రాయాలనుకున్నారని నా అభిప్రాయం.

    పాఠకుడిగా,
    సురేశ్.

  1599. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/26/2008 7:52 am

    హనుమంతరావు గారికి
    2008 లో ఇస్మాయిల్ గారి మాటలగురించి ఆలోచించడడం సబబు కాదని నా నమ్మకం. ఆధునిక కవిత్వం అని ఆయన అన్నది శ్రీశ్రీ కవిత్వం తరవాత రాసిన వాళ్ళ గురించనే అనుకుంటున్నాను నేను. లేదా కుందుర్తి వారి తరవాత రాసిన వాళ్ళ గురించా? “మో” గారు ఆధునికుడే కాబోలు ఇస్మాయిల్ గారి వ్యాఖ్యతో చూస్తే.

    ముందు “మో” గారి కవిత్వం గురించి: నాలాటి “సాధారణ పాఠకులు” చదివీసి ఏవనకుండా వూరుకుంటారు. ఎందుకంటే చదివిన వెంటనే ఏవీఁ అనిపించదు, అర్ధవూఁ అవదు. చేకూరి రామారావు గారు “చేరాతలు” లో “చితి-చింత” గురించి “…తొందరపడకుండా చదివితే కవితానుభవం ఇవ్వగల కవితలున్నాయి అందులో.” అని రాసేరు. Concluding paragraphs లో “అతని (మో) కి చెప్పాల్సిందేమిటంటే తిక్కగా రాస్తేనే కవిత్వం కాదు. కవిత్వం అంటూ వుంటే తిక్కను క్షమిస్తామని.”

    ఇక “ఆధునిక” కవిత్వం: ఇప్పుడొస్తున్న కవిత్వాన్ని “ఆధునిక” కవిత్వం అనడం భావ్యం కాదని నా అభిప్రాయం. “గురుజాడ” దగ్గరనుంచీ, హైకూలవరకూ; హైకూల తరవాత ప్రస్తుత కవుల వరకూ, వీళ్ళందరూ “ఆధునికు” ల్లోకొస్తారా? ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి. అందుచేత కవిత్వం అనడం న్యాయం. నిర్వచనాలు out of context లో అనిర్వచనాలయిపోతాయి.

    కవిత్వాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం “అనంతాన్ని” నిర్ణయించడం లాటిది. గుడ్డివాళ్ళు ఏనుగుని తెలుసుకోడం లాటిది, తెలుసుకుని “సాధారణ” పాఠకులికి విపులీకరించి విశ్లేషించడం లాటిది.

    ఇక “అస్పష్టత”: ప్రస్తుతం కవిత్వంలో “కతలు” చెప్పడం మానీసేరు కవులు. అనుభవాల్ని మాత్రమే చెబ్తున్నారు. ఒక కవిగారు అడవుల్లో ప్రయాణం చేస్తూ “ఆకులో ఆకునై….” అంటూ రాసేరు. “యదుకులభూషణ్” గారు థాయ్ లాండ్” వెళ్ళొచ్చి కవిత రాసేరు. ఆయా కవిత్వాల్ని అనుభవించిన పాఠకులు “వహ్వా” అన్నారు. అనుభూతించని పాఠకులు “….చెప్పుచ్చుకు కొట్టండి” అన్నారు. Transmitting station తప్పా? Receiving station తప్పా? “చేరా” గారు “తొందర పడకుండా చదివితే…” అని రాసింది ఇలాటి వాటికేనేమో? నా మట్టుకి నాకు, కవిత్వం చదవగానే, “ప్రతిపదార్థం” రాయడానికి ముందు, చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి. ఆ తరవాతే అందులోని “ఛమక్కులు”, “పన్నులూ”, “పదప్రయోగాలూ” వగైరాలు.

    ఈ మాట లో వ్యాసానికి అభిప్రాయం రాయాలి తప్ప సంబంధంలేని విషయాల గురించి రాయకూడదేమో? మళ్ళీ “మో”. ఏమో!

  1600. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/25/2008 9:30 pm

    ఎప్పటిలాగానే హనుమగారు శ్రమతో, ఓపికతో మనకు అందించే quotes నుండి, చదివిన ఇస్మాయిల్ గారి quote –
    “మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో కవి చేసే ఎక్స్ ప్లొరేషనే కవిత్వం”

    ఇటువంటివి చదివినప్పుడు ఆశ్చర్యం, ఆవేదన, కొంత అనుమానం కూడా కలుగుతుంది. అలా అన్నారా అని ఆశ్చర్యం. అయ్యో అలా అన్నారా అని ఆవేదన. నిజంగా అలా అన్నారా అని అనుమానం.

    మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో exploration చేయని మనిషి ఎవరో, చేయని క్షణమేదో అంతుపట్టదు. ఇది చదవడం సైతం ఇందులో ఏముందో అనే exploration వల్లనే కదా సాధ్యం.. అసలు మాటలు రాని పసిపిల్లాడు సైతం అందుకోవాలనే ఆటవస్తువుకోసం వెతుకులాట, దానికి ప్రేరణ లేక పరిణామంగా మనస్సులో అనుభవించే ఉత్సాహం నిరుత్సాహం వగైరా భావాలెన్నో ఏకకాలంలో జరిగే exploration ఫలితమే కదా!

    వారన్న చివర నాలుగు పదాలతో “కవి చేసే exploration కవిత్వం” అంటే సరిపోదా అని కూడా అనుమానం. Scientist చేసే exploration science. Painter చేసే exploration painting. Investor చేసే exploration investing etc, అన్నట్లు.
    — ————————–
    విధేయుడు
    Srinivas

  1601. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/25/2008 8:22 pm

    బాభ్జీలు గారికి,

    వేలూరి సాధారణ పాఠకుడి గానే రాశారని వదిలేద్దాం. అదంత గొడవపడాల్సిన విషయం కాదని నా ఉద్దేశం. నే వెలిబుచ్చిన అభిప్రాయంలో కొటేషన్లెక్కువ. వాటినన్నిటినీ అవతల పెట్టండి – ఒక్క ఇస్మాయిల్ ది తప్ప.

    మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇస్మాయిల్ మాటలు ఆలోచించదగ్గవి. అవి ఆధునిక కవిత్వ స్వరూప స్వభావాల గురించీ, అది సామాన్య పాఠకులకర్థం కాకపోవడం గురించీ కదా. అవి వేలూరి గారన్న దానికి కొంత భిన్నంగా ఉండటాన వాటిని చర్చలోకి దింపాలని నా కోరిక.

    కొడవళ్ళ హనుమంతరావు

  1602. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి rama గారి అభిప్రాయం:

    11/25/2008 10:42 am

    ఏమండీ వేలూరి గారూ!

    మీరు ఎంచుకున్న కవిత్వం లోనే పస లేనప్పుడు, దాన్ని మీరు ఎంత రసంలేదని నిరూపించినా అది వృధా ప్రయాస కాదా? మీకు తెలుగులో మంచి కవిత్వమే కనిపించలేదంటే అది మీరెంచుకున్న కవుల లోపం ఏమో? ఒకసారి ఆలోచించారా?
    మీరు మంచి కవిత్వాన్ని పట్టుకోలేని ఒక సాధారణ పాఠకుడు గానే మీ కవితల ఎంపికలో కనిపించారు. మీ కవిత్వపు ఆసక్తి అంతిమంగా అలాంటిదైతే అందుకు కవులేంచేస్తారండీ? మంచి కవిత్వం దేవుడిని చూడగల్గటంలాంటిది. కాస్త రసహృదయం చూపించండి. అక్షరం మీకు దర్శనమిస్తుంది.
    రమ.

  1603. తరువాతేమిటి? గురించి tavva obul reddy గారి అభిప్రాయం:

    11/25/2008 9:33 am

    హెచ్చార్కె గారూ!
    చాలా మంచి కవిత రాశారు.
    _పొలాల్లో విత్తనాల కన్నా ముందు
    రైతులు కలల్ని నాటుతారు_
    ఎంత చక్కటి వ్యక్తీకరణ!
    చాలా రోజుల తర్వాత ఒక మంచి కవిత చదివాను.
    _తవ్వా ఓబుల్ రెడ్డి

  1604. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి tavva obul reddy గారి అభిప్రాయం:

    11/25/2008 9:13 am

    మా కడప జిల్లా లో ఇలాంటి పల్లె ఒకటి గుర్తొచ్చింది, ఈ కవిత చదివాక!
    చాలా బాగుంది. అభినందనలు!
    _ తవ్వా ఓబుల్ రెడ్డి

  1605. సువర్ణభూమిలో … గురించి tavva obul reddy గారి అభిప్రాయం:

    11/25/2008 9:00 am

    కవితలు చక్కగా ఉన్నాయి.

  1606. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/25/2008 8:42 am

    సాధారణ పాఠకుడు:
    చిన్న పిల్లల్లాటి వాడు. ఏది జరిగినా “శ్రీశ్రీ” కవితలో చెప్పినట్టు ఆకసమున హరివిల్లు విరిస్తే ఆశ్చర్యంతో, ఆనందంతో చప్పట్లు కొట్టేరకం. మాహాకవుల రచనకీ, మామూలువాళ్ళరచనకీ, ఆఖరుకి సినిమా పాటకీ తేడా పట్టించుకోకుండా “రసాత్మకవయిన వాక్యానికి” సాష్టాంగ పడిపోయే రకం. ఏ గ్రూపు వారు రాసేరో పట్టించుకోని రకం. అసాధారణ పాఠకులు ” ఇలాటి దిగుడు ధరల సమయంలో, మబ్బూ, వానా, మల్లెల వాసనా.. లాటి వాక్యాలని ఆనందిస్తావా?” అని గదమాయిస్తే, సిగ్గు పడిపోయే రకం. సిగ్గు పడుతూనే “బాపూ బాగా రాసేడు కదా?” అని మెలికలు తిరిగే రకం. ఎవరైనా ఆంగ్ల రచయతల్ని గానీ, పాత తెలుగు కవుల/రచయతల ని గానీ “కోట్” చేస్తే గజగజలాడీ రకం.
    అసాధారణ పాఠకుడు:
    గిడసబారిన సరుకిది. ఎందుకో తెలీదు కానీ “సృజనాత్మక ప్రక్రియ” ఫలానా విధంగానే వుండాలి, ఫలానా పధ్ధతిలోనే రాయాలి, ఫలానా వస్తువు గురించే అని, “రాజు-మహిషి” వర్ధనమ్మ గారి లాగ “రూల్సు” పెట్టుకున్న రకం. “రూల్సు” దాటితే, ఆ ” సృజనాత్మక ప్రక్రియ” ఎంత బాగున్నా “యాక్” అని నిర్భయంగా అని ఋజువు చెయ్యగల రకం. “సాధారణ పాఠకుల్ని” “డామినేట్” చేసే రకం. అలవోకగా వాళ్ళ వాదానికి తగ్గట్టూ ఆంగ్ల/పాత తెలుగు రచయతల్ని “కోట్” చేసి సాధారణ పాఠకుల్ని గజగజలాడించీ రకం.
    ఇలాటి పరిస్తుతుల్లో “సాధారణ పాఠకుడికి” ఏదో ఒక “యార్డ్ స్టిక్” వుంటే మంచిదే గదా? మామూలు బతుకుని మరీ మామూలుగా బతుకుతూ, కుదిరినపుడు “సాహిత్య సేవనం” చేస్తూ హాయ్ హాయ్ గా బతకడానికి.
    అలాకుదరదు, “త్రిక సంధి” కంఠతా రావాలి, “పదహారు పదహార్లూ” కంఠతా రావాలి, future perfect continuous tense లో కూడా “సొంత వాక్య” ప్రయోగం రావాలి అని “రూల్సు” పెడితే సాధారణ పాఠకుల గతి? సాహిత్యం గతి?
    వేలూరి వారు, బహుముఖ ప్రజ్నా(స్పెల్లింగ్?) శాలీయున్నూ, బహు భాషావేత్తయున్నూ, సంస్కృతాంధ్రాంగ్లముల యందు బండితుడున్నూ, సమీక్షా చక్రవర్తీ, విమర్శకాగ్రేసరుడున్నూ, వగైరాలన్నియునూ అయుండొచ్చు. కానీ పై వ్యాసంలో ఆయన వుదహరించిన wide spectrum of కవిత్వాలు/కవితలు ఆయనని “సాధారణ పాఠకుడనే” పట్టించెస్తాయి.

  1607. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Krishna గారి అభిప్రాయం:

    11/24/2008 11:57 pm

    అనుకున్నా ఈ పొరబాటు జరుగుతుందని. నేను వేరు. మొదటి అభిప్రాయం వెలిబుచ్చినది కృష్ణ ఎ. గారు. నేను వేరే కృష్ణ (Krishna) ని.
    ఇప్పుడు చెప్పండి నా అభిప్రాయం కూడా బానే ఉందేమో. కవిత నాకూ నచ్చింది. కానీ, ఇంకేదో చెయ్యాలనిపించింది. అంతే.

  1608. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/24/2008 8:52 am

    ఒక కవిత పాత జ్ఞాపకాల పుట్ట అని వేలూరి గారు అంటే, పాత జ్ఞాపకాలు, కాదు గాయాలు, మానిపోయాయని మన హనుమగారు ఆశిస్తున్నారు. రెండూ సహృదయంతో చెప్పినవే కాబట్టి, దేన్ని కాదనగలం?

    షడ్రుచులున్నాయి అని మన వాళ్ళంటే, “లోకో భిన్న రుచిః” అని అంతకంటే ముందే అన్నారు. ఎంత మధురమైనా మోతాదెక్కువైతే మొహమెత్తిపోతుందని చుట్టున్నవాళ్లు గుర్తుచేస్తూనే ఉంటారు. ఈ రుచి బాగుంది, ఆ రుచి గొప్పది అని వెలకట్టబోతుంటే, “అన్నేసి చూడు, నన్నేసి చూడు” అన్న ఉప్పును మాత్రం ఎవ్వరు తక్కువ చేయగలరు!

    రుచులు, వాసనలు అందరికీ సాధారణంగా అనుభవంలోకి వచ్చినట్లు, అన్ని కవితలు అర్థమయి, అనుభవంలోకి వస్తాయి అనలేం. పెళ్ళిచేసుకోవడం, ఇల్లుచూసుకోవడం సంగతేమోకాని, పింగళిగారెప్పుడో “భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్” అనేసారు. పాటలేకాదు, ఏవో కవితలు రాయాలోయ్ అని కూడా అన్వయించుకోవచ్చేమో.

    కొన్ని కవితలు మిగిల్చిన జ్ఞాపకాల గురించి రెండు లైన్లు రాయాలనిపించింది.

    ఎన్నో జ్ఞాపకాల నిధులున్న మనసే ఒక కోట
    ఎన్నో శబ్దాలు నింపుకున్న కవితే ఒక ఫిరంగి
    ఇది కూలదు
    అది పేలదు!

    ఏది ఏమైనా కవులూ, పాఠకులూ, పాఠకులు కానివారుతో సహా
    “ఎల్లరు హాయిగ ఉండాలోయ్” అన్న పింగళిగారి కాంక్షనే ఆకాంక్షిస్తూ
    ===========
    విధేయుడు
    – Srinivas

  1609. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/23/2008 9:40 pm

    కవిత్వం ఒక ఆల్కెమీ”

    Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాల సాహితీ సిద్ధాంతాలని పేర్కొనేవారు తాము సాధారణ పాఠకులమంటే, ఇక “సాధారణ” అన్న మాటకి అర్థమేముంది? “Oh, Lord Venkateswara! If you are only a stone, what are we?” అని ఎక్కడో ఎవరినో అన్నది గుర్తొస్తోంది. 🙂 అల్ప విషయంగా వదిలేద్దాం.

    వేలూరి గారన్న దాంట్లో ఓ చిన్న సందేహం: “వాన ఏ రకమైన వెనకటి జ్ఞాపకాలని గుర్తుకి తెచ్చినా, కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి.”

    కొత్త జ్ఞాపకం అంటే ఇటీవలిదనా (recent memory)? మంచి కవితకి అదెందుకు ఉండాలో వివరిస్తే బావుండేది.

    హార్డీ Apology లో Housman పేరు చూశాను. పోయినేడే ఆయన 1933లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసం, “The Name and Nature of Poetry,” [1] చదివాను. కవిత్వ స్వభావం గురించి Housman చెప్పింది నాకు నచ్చింది. దీనినే రచ్చబండలో కాస్త ఘాటుగా ప్రస్తావించి, ఘర్షణ పడ్డాను. (పడిన గాయాలు అందరిలోనూ మానిపోయాయని ఆశిస్తాను.)

    వేలూరి గారు పాఠకుని జ్ఞాపకాలు కవిత్వాన్ని ఆస్వాదించడానికి కావలసిన పరికరం అంటే, Housman, భావోద్వేగాన్ని కలిగించడమే కవిత్వ విశేష లక్షణం అన్నాడు:

    “And I think that to transfuse emotion – not to transmit thought but to set up in the reader’s sense a vibration corresponding to what was felt by the writer – is the peculiar function of poetry.”

    ఉద్వేగం వేలూరి/Benjamin అన్నట్లు జ్ఞాపకాల వలనే వస్తుందనుకుందాం. అయితే ఒక సందేహం వస్తుంది. మన జ్ఞాపకాలని మనమే గుర్తు తెచ్చుకోడానికి వేరేవాళ్ళ కవిత్వం ఎందుకు? దీనికి సమాధానంగా నాకు రెండు విషయాలు గోచరిస్తాయి.

    ఒకటి, కొన్ని జ్ఞాపకాలు గుప్తంగా ఉండొచ్చు; మనకంతుపట్టని అంతర్గత మానవ స్వభావానికి చెంది ఉండొచ్చు. Housman మాటల్లో;

    “But in these six simple words of Milton –
    Nymphs and shepherds, dance no more –
    what is it that can draw tears, as I know it can, to the eyes of more readers than one? What in the world is there to cry about? Why have the mere words the physical effect of pathos when the sense of the passage is blithe and gay? I can only say, because they are poetry, and find their way to something in man which is obscure and latent, something older than the present organisation of his nature, like the patches of fen which still linger here and there in the drained lands of Cambridgeshire.”

    రెండోది మనలో ఉద్వేగం కలిగించాలంటే ఆ భావాలని వ్యక్తీకరించే భాష ప్రత్యేకమైనదిగా ఉండాలి. Housman అన్నట్లు, “Poetry is not the thing said but a way of saying it.”

    రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తన వేమన ఉపన్యాసాలలో అన్నారు: “తీవ్రమైన భావములు మనుష్యులు కందరికిని కలవు, కాని ఆ భావములను బైట పెట్టవలసినప్పుడు మన కందరికిని వచ్చునది కవిత్వం గాదు; నత్తి. కొందరికది నాలుకకే అంటియుండును. మరికొందరికి వ్రాతలోను కలదు. కవులనబడే వారిలో ననేకులిట్టి నత్తివ్రాతవారే. బుద్దిమంతులైన వారి కీరెంటికిని మందొకటే; చేతనైనంతవరకు మౌనము వహించుట.”

    (1929లో కన్నా ఇప్పుడు కవుల్లో నత్తి ఎక్కువయిందా?:-))

    పైదీ, వేలూరి గారన్నదీ నాకు చాలావరకు సమ్మతమే. కాని నేనిది రాయడానికి కారణం, ఆధునికులు ఇదంతా పాత చింతకాయపచ్చడి, అని కొట్టిపారేస్తారేమోనని. మన ప్రముఖ కవి ఇస్మాయిల్ మాటల్లో [2]:

    “మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో కవి చేసే ఎక్స్ ప్లొరేషనే కవిత్వం. అందరికీ తెలిసిందాన్నే అందంగా చెప్పడం కాదన్నమాట కవిత్వం. ఇది సంప్రదాయవాదులిచ్చిన నిర్వచనం. దీన్ని ఆధునికులు ఒప్పుకోరు. కవిత్వం ఎక్స్ ప్లొరేషన్ కనక, కొత్త సత్యాలని ఆవిష్కరిస్తుందని వీళ్ళంటారు. అందుకే, అస్పష్టం అనే ఫిర్యాదు ఆధునిక కవిత్వం గురించి అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అస్పష్టమంటే కొత్త అని అర్థం చేసుకోవాలి, చదువరికి ఇంతవరకూ అనుభవంలోకి రాని విషయమన్న మాట.”

    మో ఆధునిక కవి. ఆయన కవిత్వం అస్పష్ట పాకమా? లేక మనకింతవరకూ అనుభవంలోకి రాని సరికొత్త పాకమా?

    ఎప్పటికైనా మో “కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం” చేస్తుందని నా ఆశ. అప్పటిదాకా “శాంతి ఒక్కొక్క బొట్టూ పడ్తుంది వేకువ కళ్ళల్లోంచి. కట్టేసిన కన్నీటి మేలిముసుగు కుళాయిల్లోంచి.” అన్న నిరాకారుణ్ణి “లైఫ్ బాయ్ సబ్బుతో కడిగిన గ్లాసులో తాగిన చవకరకం జిన్‌ అండ్ టానిక్” తో పోల్చడం మాత్రం అన్యాయమే!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “The Name and Nature of Poetry and Other Selected Prose,” by AE Housman. Cambridge University Press, 1961.

    [2] “కవితా విహంగానికి స్వేచ్ఛ ఊపిరి,” అన్న ఇస్మాయిల్ 1981 వ్యాసం. “కవిత్వంలో నిశ్శబ్దం,” నుండి.

  1610. సువర్ణభూమిలో … గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/21/2008 8:03 am

    కవిత “ముక్తసరి” పదగ్రస్తవాఁ?

  1611. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి పాఠకుడు గారి అభిప్రాయం:

    11/20/2008 12:32 pm

    ఇన్ని విషయాలు చెప్పి, ఆ తర్వాత, “నేనొక సాధారణ పాఠకుణ్ణి” అని అంత వినయంగా అనేశారేవిటీ? ఎవరూ నమ్మరు ఆ మాట. “నేనొక అసాధారణ పాఠకుణ్ణి” అని పెట్టాలి పేరు ఈ వ్యాసానికి, ఇందులో వున్న “అసాధారణ విషయాల” వల్ల. అందుకే నా లాంటి పాఠకుడికి ఇదొక పెద్ద సోదిలా అనిపించి, చాలా బోరు కొట్టింది. కాసిన్ని తెలివితేటలుంటేనే గానీ చదివి, హరాయించుకోలేమనిపించింది కూడా. ఈ తప్పు విశ్వనాథ కవిత ప్రకారం అయితే నాదే. వేలూరి గారి మాటల వల్ల అయితే ఆయనదీ. మొత్తానికి చందమామలో రామాయణం సంక్షిప్తంగా ముద్రించినట్టూ, రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం విన్నట్టూ, లేడిలా గెంతుకుంటూ, వాక్యాలు వదిలేస్తూ చదవాల్సి వచ్చింది.
    – పాఠకుడు

  1612. తెలుగు కథల పోటీ గురించి Bhushan గారి అభిప్రాయం:

    11/20/2008 2:00 am

    కధల పోటీకో, కవితల పోటీకో రాసేవాళ్ళ మనసుల్లో మొదట, ఆ పోటీ నడిపేవాళ్ళు ప్రకటించిన బహుమతులే మెదులుతూవుంటాయి. బహుమతి వొచ్చిన కధలు/కవితలు ఒక్కోసారి బావున్నా, స్వలాభాపేక్ష లేకుండా, సహజంగా రాసినట్టు పాఠకులకి అనిపిస్తుందా? మామూలుగా వొచ్చే పారితోషికం వేరు, బహుమతి వేరు. ఆశాజీవిగారి కవిత బావుంది అని వూరుకోవడంకన్నా, కవితలో చెప్పినట్టు పాఠకులే పోటీసంస్కృతిని రూపుమాపడానికి క్రుషి చెయ్యాలి. – భూషణ్

  1613. తెలుగు కథల పోటీ గురించి Sai Brahmanandam గారి అభిప్రాయం:

    11/19/2008 8:29 pm

    ఆశాజీవి గారూ,

    మీ ఆక్రోశం బావుంది. కవితావేదనా నచ్చింది. కథల పోటీల ద్వారా మంచి కథలొస్తాయో లేదో తెలీదు. కొత్త కథకులు పుడతారో లేదో తెలీదు. సాహిత్యానికి ఏం ఒరిగినా, ఒరగక పోయినా పత్రికలకి ఏడాదికి సరిపడా ముడిసరుకు లభిస్తుంది. కథలకోసం ఎవరి వెంటా పడనవసరం లేదు. పాతికేళ్ళ క్రితం నాటి ( 1970 – 80 ల మధ్యకాలం ) నాటి కథలపోటీలకీ, ఇప్పటి కథల పోటీలకీ, కథల పరంగానూ, బహుమతులు పంచే తీరులోనూ చాలా తేడా ఉంది. కథల నాణ్యత పడిపోయినంత వేగంగానూ ఇవన్నీ పడిపోయాయి.

    చాలా కాలం నాటి మాట. ఆంధ్రప్రభలో చివుకుల పురుషోత్తం ” ఏది పాపం?” నవలకి మొదటి బహుమతి ఇస్తే అది ప్రధమ బహుమతికి ఎంపిక ఎందుకు చేసారో మూడు పేజీల సమీక్ష రాసారు. అదే ఆంధ్రప్రభ ( యాజమాన్యం మారారులెండి ) రెండేళ్ళ క్రితం కథల పోటీలో బహుమతిచ్చిన కథలు నాసిరకం కన్నా హీనంగా ఉన్నాయి. పైగా పేరుమోసిన రచయిత ( త్రు ) లూ (అందులో ఒకరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడా ) ఆ పోటీకి గుణనిర్ణేతలు. వచ్చిన చెత్తలోంచి మంచి చెత్తని ఏరి మనముందు పోసారంతే! ఆ కథల్లో కథనం లేదు. శిల్పం లేదు. పాత్రోచితం అంతకన్నా లేదు. కేవలం వస్తువు ఆధారంగా బహు”మతులు” ఇచ్చారు. దళిత పీడిత కథకొకటీ, స్త్రీల సమస్యలకొకటీ, ప్రాంతీయతత్వానికొకటీ, గ్లోబలైజేషన్ ప్రభావం మీదొకటీ ఇలా అన్ని వస్తువులూ ఏరారు. రాశి తప్ప వాసి లేదంటూ సరిపుచ్చుకున్నారు.

    ఇలాంటివాటినెవరూ ప్రశ్నించరు! అడిగితే వచ్చే జవాబు తెలుసు. ఆంధ్రభూమి వాళ్ళు ఏటా ఉగాది కథల పోటీ పెడతారు. ఎందుకొచ్చిన పోటీలనీ ఆ పత్రిక సంపాదకులతో అంటే – ఎవరి వెంటా పడనవసరం లేకుండా ఈ పోటీ ద్వారా మాకు ఏడాదికి సరిపడా కథలొస్తాయంటూ నిజాయితీగానే చెప్పారు. మీరు ఓ విషయం గమనించారో లేదో తెలీదు. గత అయిదేళ్ళగా కథల పోటీలు చూస్తే అవే రచయితలు అన్ని పోటీల్లోనూ బహుమతులు కొట్టేస్తున్నారు. నిజాయితీ, నిబద్ధతా అందరికీ లోపిస్తోంది. మనం ఎంత గట్టిగా అరిచినా వారి చెవుల్ని చేరదు. ఆ మధ్య విపుల వాళ్ళు కథల పోటీ పెట్టారు. అందులో మొదటి బహుమతొచ్చిన “అతడు మనిషి” అనే కథ నిజంగా మొదటి బహుమతికి అర్హతున్న కథ. మిగతా కధలు షరా మామూలే! ఇలాంటి పోటీల ద్వారా మంచి కథలొస్తాయనుకోడం మన వెర్రితనం అంతే! పత్రికలు పదికాలల పాటూ నడుపుకోడానికిదొక పద్దతి. ఎంతకాదన్నా ప్రస్తుతం జరుగుతున్నదిదే! గొంతు చించుకొని ప్రయోజనం లేదు.

  1614. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Sastry గారి అభిప్రాయం:

    11/18/2008 11:49 pm

    కృష్ణ గారు,
    మీ మొదటి అభిప్రాయం బాగుంది. మీకు సమాధానము కూడా లభించింది. ఈ కవిత నాకు ఎంత గానొ నచ్చింది. కవయిత్రి గారు తన భావాలను మంచి కవిత గా మనకు బహూకరించారు. వెన్నలకంటి వసంతసేన గారు చెప్పినట్టు ఎంతో మనోహరంగా, కులాసాగా, భావానికీ భాషకూ ఎలాంటిసమన్వయలోపమూ లేకుండా చాలా హృద్యంగా ఉంది ఈ కవిత.
    ఇక మీ రెండవ అభిప్రాయం – మీ భావాలను కవయిత్రి గారి మీద రుద్దటము ఎంత మటుకు సమంజసము? ఎవరి శైలి వారికుంటుంది కదా!!ఏమంటారు!?

  1615. తెలుగు కథల పోటీ గురించి ఆశాజీవి గారి అభిప్రాయం:

    11/18/2008 11:10 am

    ఏమిటో, ఈ కథల పోటీ లేమిటో
    నీ కథ కన్నా నా కథ గొప్పని నా ఘోష ఏమిటో!!

    విద్యలో పోటీ, వ్యాపారంలో పోటీ
    కథల్లో పోటీ, కవితల్లో పోటీ
    ఇంట్లో పోటీ, వీధిలో పోటీ
    ఈ పోటీల్లో నేనే గొప్పనే నా తపన ఏమిటో!!

    దేశంలో రాజకీయాలు, రాష్ట్రంలో రాజకీయాలు
    యూనివర్శిటీలో రాజకీయాలు, కాలేజీలో రాజకీయాలు
    కథల న్యాయ నిర్ణేతల్లో రాజకీయాలు
    అందరూ నా కథనే మెచ్చాలన్న నా కీర్తి కాంక్ష ఏమిటో!!

    న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం
    పాఠకులకి అభిప్రాయాలు తప్ప హక్కులు లేవు
    ఈ నియమాలకి లోబడే రచయితలకి వెన్నెముకలు లేవు
    అయినా కథల పోటీలు వర్థిల్లుతూనే వుంటాయేమిటో!!

    ఒక్క కథా బాగో లేదంటారు
    అందుకే, ఒకటీ, రెండూ రద్దు చేసి, మూడో బహుమతి ముగ్గురికిస్తారు
    రచయితలు అక్కడా, ఇక్కడా ఆక్రోశిస్తారు
    అయినా క్రమం తప్పకుండా పోటీలో పాల్గొంటారెందుకో!!

    సాహిత్య ప్రపంచంలో కూడా ప్రవేశించిన పోటీ సంస్కృతిని
    హతమార్చడానికి రచయితలు చాలరు, పాఠకులే నడుం కట్టాలి
    వర్గ బేధాలతో కుళ్ళి పోయిన సమాజంలో
    కథల్లో పోటీని పెట్టిన పెట్టుబడిని నరికే దెవరో!!

    – ఓ ఆశాజీవి

  1616. మరచిపొమ్మంటున్నారు గురించి krishna akkulu గారి అభిప్రాయం:

    11/17/2008 11:43 am

    మంచి కవితనిచ్చినందుకు ధన్యవాదములు. చాలా బాగుంది.

  1617. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/16/2008 4:36 am

    వేలూరి వారికి. దండాలు.

    ఇదేట్రా, special issue లో మీదని “సెక్రం” తిప్పడం తప్ప కిందని ఏటీ special లేదు, బెంగెట్టీసుకున్నాను. సంపాదకులు రాసినవి చదవకూడదని ఎంకట్రవణమూర్తికి మొక్కుకోడం వల్ల, ఇది చదవలేదు ఇప్పటిదాకా. తప్పైపోయింది.

    మొక్కుకున్నాక కూడా కొన్ని చదివి లెంపలేసుకున్నాను. అయినా “దాలిగుంట బతుకు” కదా మళ్ళీ చదివేను. అద్రుష్టం.నిజంగా మీరు సాధారణ పాఠకుడే. లేపోతే ఇంత చక్కగా రాయరు. మధ్యలో హుషారు ఇచ్చే వైనాలు.

    సాధారణపాఠకుడికి “group లు” వుండవు. వాదాలుండవు. ఏ రసం నచ్చిన వాడు ఆ రసాప్లావితం లో కొట్టుకుపోతాడు. తమ్మినేని వారి “థాయి ల్యాండు” టూరు కవిత మీద మనలాటి సాధారణ పాఠకుల అభిప్రాయలకి, గురుతుల్యులు భైరవభట్ల వారూ, జెజ్జాల వారూ “గెడ్డ’ లో ఈత కొట్టేరు. గజీతగాళ్ళని “గెడ్డ” లో దింపనక్కరలేకుండా ఈ “వైన్వ్యాసం” మన్లాటోళ్ళందరిచేతా టోకున చదివించేస్తే కవిత్వపు మత్తొదిలిపోతుంది. లేదా కవిత్వపు సత్తువా తేలిపోతుంది.

  1618. రెండు తీరాలు గురించి krishna a గారి అభిప్రాయం:

    11/12/2008 10:16 pm

    నాకయితే ఈ కవితలో అంత గొప్ప ఏమీ కనిపించ లేదు.
    ఒకటి మాత్రం కరెక్టు గా చెప్పగలను. ఈ సైటులో ఏమి అర్థం కాకపోయినా అన్నీ గొప్ప గా వున్నట్లు వ్రాస్తారు.

  1619. చంపకోత్పలమాలల కథ గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    11/12/2008 7:11 am

    చాలా కాలం కిందట ఆదినారాయణ శాస్త్రి గారి పుస్తకం తిరగేస్తూ ఈ పద్యాన్ని చదివి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.ఆ తర్వాత ఎంతోమంది కవితాభిమానులతో ఈ పద్యం గురించి ముచ్చటించాను. కానీ,ఎవరూ ఎరిగినట్టులేరు ఈ తొలినాటి్ ఉత్పలమాలిక గురించి .అద్దంకి శాసనపద్యం (తరువోజ) మీద కొందరు శ్రద్ధ తీసుకుని చిరు పొత్తాన్ని ప్రకటించి ఉన్నారు. అలాగే,ఈ పద్యం గురించి కొంచెం చర్చ జరిపి విస్తృత ప్రచారంలోకి తీసుకు రావలసిన అవసరం ఉంది.నన్నయకు ముందు కవిత్వం లేదు అన్నఅపప్రధను తొలగించవలసి ఉంది.కారణం ,మొన్న ప్రాచీన భాష చర్చల్లో తమిళ పండితులు భద్రిరాజు గారి వ్యాసాన్ని ఉటంకించి నన్నయకు ముందు మీరే తెలుగులో కవులెవరూ లేరని సిద్ధాంతీకరించి ఉన్నారు,మరి ఇదెలా సాధ్యం అన్నట్టు పత్రికల్లో చదివాము.మొత్తానికి ప్రాచీన భాష (లేదా శ్రేష్ఠ భాష) హోదా లభించింది. అది వేరే విషయం.

    ముక్కలు ముక్కలైన శాఫో పద్యాలను ప్రకటించటంలో ముందుంటారు పాశ్చాత్య పండితులు.మనం కూడా అజ్ఞాతకవి రచనగా కొట్టిపారేయకుండా ,చదిపిరాళ్ళ కవిగా ప్రచారంలోకి తీసుకురావలసి ఉంది.బలమైన ఎత్తుగడ,స్ఫుటబలోక్తి , సూటిగా దూసుకు పోయే శైలీవిన్యాసాలతో అలరారుతున్నపద్యం నిస్సందే్హంగా ఎన్నదగిన పద్యాల్లో ఒకటి.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  1620. ప్రేమ కవితలు గురించి mOhana గారి అభిప్రాయం:

    11/10/2008 7:49 am

    నాకు మూడవ అభిప్రాయం అర్థం కాలేదు. దానిని సంస్తుతి అనుకోవచ్చా లేక నింద అనుకోవాలా? నాకేమో కవిత చక్కగా ఉంది. కవితలో చెప్పిన దానికంటే చెప్పనిది ఎంతో ఉంది. పాఠకుల ఊహకు, ప్రేమికుల ఊహకు ఈ కవిత పల్లవి అయితే చరణాలను వారే వ్రాసికోవాలి. విధేయుడు – మోహన

  1621. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Audisesha reddy Kypu గారి అభిప్రాయం:

    11/09/2008 5:16 am

    ఇంద్రాణి గారూ! మీకు అలాంటి ఊరిలోకి పోవాలనే కోరిక ఎందుకు కలిగిందో! సాయంత్రం దాకా చూడండి. మరి ఎవరయినా చెప్పగలిగే వారు వస్తారేమో! సరదాగా అన్నాను. కోప్పడకండి. మీ కవిత బాగుంది.
    నా రచనలు… audiseshareddy.blogspot.com లో వున్నాయి.
    —- ఆదిశేషా రెడ్డి కైపు. నెల్లూరు.

  1622. పదేళ్ళ “ఈమాట” మాట గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/08/2008 11:49 am

    వ్యాసాల్లో వైవిధ్యం

    ఈమాట జన్మానికి కారకులైన రామారావు గారికి అభినందనలు, కృతజ్ఞతలు. “వ్యాస విభాగం రాశిలోనూ, వాసిలోనూ పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా వుంది… వస్తువైశాల్యంతో పాటు …,” అని వారు అన్న దానితో నాకు భేదాభిప్రాయం ఉంది.

    వ్యాసాల్లో ఎక్కువ భాగం సంగీత, సాహిత్య, విజ్ఞాన శాస్త్రాలకి పరిమితం. అది చాలదా, అంతకన్నా వైవిధ్యమేముంటుంది? అనిపించవచ్చు. కాని ఇవి ‘విషయభారమైన’ వ్యాసాలు; కొన్నయితే, జర్నల్స్ పేపర్లలాగా రెఫరెన్సుల జాబితాలతో సహా ఉంటాయి. 🙂 మహానుభావులు, విజ్ఞానవేత్తలు, కళాకోవిదులు – వీళ్ళ ప్రస్తావన లేని వ్యాసం అరుదు. ఇది ప్రవాసాంధ్రులలో ఉన్న లోపమా అన్న అనుమానం వచ్చింది.

    కాని తన వచనం తన కవితలకే మాత్రమూ తీసిపోదని గర్వంగా చెప్పుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్యాసావళిని చూస్తే వాళ్ళ ఊళ్ళోని రావిచెట్టు మీద చెప్పిన ఓ అమూల్యాభిప్రాయం లాంటి ఒకటి రెండింటిని మినహాయిస్తే, మళ్ళా మహావ్యక్తులు, కవుల పరంపర, కవితా ప్రశస్తి – వాటికే ప్రాధాన్యత. వచనం చెప్పుకోదగ్గదేగాని, వైవిధ్యమెక్కడ?

    కుప్ప తెప్పలుగా వ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబరావు ని తిరగేస్తే, “కళలు-శాస్త్రీయ విజ్ఞానం,” “సాహిత్య ప్రయోజనం,” “చరిత్ర వ్యాసాలు,” … – మళ్ళా అన్నీ విషయభారమైనవే!

    సాహితీ ప్రక్రియలన్నిటిలోకీ సుళువైనదీ, అనేకానేక విషయాలకి అనువైనదీ, వ్యాసం: “There are as many kinds of essays as there are human attitudes or poses, as many essay flavors as there are Howard Johnson ice creams. The essayist arises in the morning and, if he has work to do, selects his garb from an unusually extensive wardrobe: he can pull on any sort of shirt, be any sort of person, according to his mood or his subject matter — philosopher, scold, jester, raconteur, confidant, pundit, devil’s advocate, enthusiast.” — EB White.

    ఈమాట వ్యాసాల్లో కూడా వైవిధ్యం పెరగాలి. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు వేరే విషయాల మీద కూడా దృష్టిసారించాలి. రాయనివాళ్ళు ఇదో బ్రహ్మవిద్య కాదని గ్రహించి ప్రయత్నించాలి.

    అలాగని వ్యాసాలు రాసి పేరుప్రతిష్టలు గడించాలనుకుంటే అది దురాశే. ఆ భాగ్యం కలగాలంటే కవితలూ, కథలూ, నవలలూ రాయండి. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?” అన్న పాదం మన భాష ఉన్నన్నాళ్ళూ నిలుస్తుంది. పూలు పూసినంత కాలం “ఓ పువ్వు పూసింది” చదువుకుంటాం. “అతడు-ఆమె,” మనం, మధ్య సంబంధాల మాటొచ్చినపుడల్లా శాంతం గారు మన మనసులో మెదులుతూనే ఉంటారు. అందుకే వాటికున్న యోగ్యత వ్యాసాలకి లేదు, ఉండబోదు.

    అందుకే సాహిత్యకారుల్లోకెల్లా కవులకీ, కథకులకీ, నవలాకారులకీ పెద్ద పీట. అందుకు తగ్గట్టుగా ఈమాట రచయితలు ఎదుగుతారని ఆశిస్తూ,

    కొడవళ్ళ హనుమంతరావు

  1623. సువర్ణభూమిలో … గురించి Sangeeta గారి అభిప్రాయం:

    11/07/2008 10:08 pm

    శ్రీనివాస్ గారు:

    థాయ్ లాండ్, సువర్ణ భూమిలో ఒక ముఖ్యమైన భాగం,

    1. బ్యాంగ్ కాక్ ఐర్ పోర్ట్ పేరు : సువర్ణ భూమి

    లింకు: http://www.bangkokairportonline.com/node/15
    ___________________________
    Official name
    Suvarnabhumi Airport. The name Suvarnabhumi was chosen by HM King Bhumibol Adulyadej which means “The Golden Land”, specifically referring to the continental Indochina. “Golden Peninsula”or “Golden Land” is a traditional name for the Thailand-Cambodia-Laos-Burma region
    ___________________________

    కవితలు చాలా భావావేశం నిండి, ఒక వారం రోజులు నేను అనందించిన నా థాయ్ లాండ్ యాత్ర స్మృతులను తిరిగి వెలిగించాయి. ఇటువంటి కవితలు ఇంకా చదవాలని కోరిక.

    –సంగీత

  1624. సువర్ణభూమిలో … గురించి Garikapati గారి అభిప్రాయం:

    11/07/2008 9:16 pm

    ఇందులో అయుదు ఇంపైన కవితలు:

    ముందు మూడు కవితల్లో బుద్ధ జీవితం గొప్పతనం కళ్ళకు కట్టినా, ప్రతి కవితలో ఎదో ఒక ప్రాణి (ఎర్ర చారల పిల్లి, తేనెటీగ, కుక్కపిల్ల) బుద్దుడి గొప్పతనం ఎమీ తెలియదు, తెలుసుకోలేవు(కొంతమంది మన పాఠక మిత్రుల్లా) కనుక వాటి పనిలో అవి ఉన్నాయి (పాదాలను నాకుతూ).

    నాలుగవ కవిత: మనం కవిత్వం ఎలా చదవాలి అనే దానికి ఉపమగా తీసుకొవచ్చు. తల ఎత్తక, దించక నిలిచి గమనించమని చెపుతున్నా, పైకి కిందికి చూసి ప్రాణ వాయువు అందని కొందరు పాఠకులు, గజ ఈతగాళ్ళైన మోహన, కామెశ్వర రావుగార్లకు నిజంగా పని పెట్టారు.

    చివరి కవిత: ముఖ్యంగా ఈ కవితల నేపధ్యం థాయ్ ల్యాండ్ అని ప్రియురాలి మనసునే కాదు మొత్తం కవితలనే ఛాయామాత్రంగనైనా ఆనవాలు పట్టడానికి కవి వదిలిన సూచన. ఈ సందర్భంగా “ఇస్మాయిల్ గారితో నా పరిచయం” అన్న విన్నకోట రవి శంకర్ గారి వ్యాసంలో వారు సూచించిన ‘కవిత్వంలో అస్పష్టత’ అనే అంశంపై చర్చ గుర్తుకు వచ్చింది.

    రవిశంకర్ గారు: “హంపీ పద్యమేమిటి అలా ఉందీ”
    ఇస్మాయిల్ గారు: “నువ్వు హంపీ వెళ్ళావా?”
    రవిశంకర్ గారు: “లేదు”
    ఇస్మాయిల్ గారు: “మరి హంపీ చూడకుండా హంపీ మీద పద్యం ఎలా అర్ధం అవుతుంతుంది?”

    కవిత అర్ధం చేసుకోవడానికి కవి అనుభవించిన ప్రదేశం వెళ్ళాలని” జర్మన్ మహా కవి గోథె ఎక్కడో అన్నట్టు గుర్తు.

    కాబట్టి కనీసం మన్సుతో నైనా కవి ప్రదెశాన్ని చూడకుండా విమర్శించడం భావ్యం కాదు.

    –గరికపాటి

  1625. సువర్ణభూమిలో … గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    11/07/2008 4:57 pm

    “కాని కవికి గౌరవం చూపాలి, కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు….

    “సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు,వాటిని చదివి ఆనందించవచ్చు…”

    -mOhana అభిప్రాయం

    కవిత్వంలో పొరలు ఉన్నట్లే, ఈ మాటలలో కూడ ‘ధ్వని’ ఉన్నది. An implied meaning. అది మీరు ఏ మాత్రం ఉద్దేశించి ఉండరు. కాని వేరే చెవులకు అలా వినిపిస్తుంది. అది ఏమిటంటే – చర్చలలో – ప్రశ్న అడిగినప్పుడల్లా, కవితో వ్యతిరేకించినప్పుడల్లా, ఇది మాకు నచ్చలేదు -అని ఒక పాఠకుడు వ్యక్త పరిచినపుడల్లా, మరొక పాఠకుడు వచ్చి -కవిని గౌరవించాలనీ, కవి మనకు తెలియని విషయాలు పరిచయం చేస్తున్నందుకు ఋణపడి ఉండాలనీ – ఇలాటి మాటలు మళ్ళీమళ్ళీ రాయటం.

    ప్రశ్నలు అడిగిన వారికి కవిమీద గౌరవం లేదు – అన్న ధ్వని ఈ మాటలలో వినిపిస్తుంది. అది మంచిది కాదు. చాలా పాత పద్ధతి. సత్వరం మానివెయ్యాల్సిన పద్ధతి. ఈ పద్ధతి ప్రశ్నలు రాసే వాళ్ళను విముఖులను చేస్తుంది. విషయాలు నేర్చుకోటానికీ, తమ అభిప్రాయాలు వ్యక్త పరచటానికీ ప్రతిబంధకమవుతుంది. మనుషులు అందరూ ఒకరినొకరు గౌరవించుకోవలసిన అవసరం ఎప్పుడూ ఉంది. ఆ ఆదరానికి నోచుకోటానికి కవులూ, పండితులే కానక్కర్లేదు. కాబట్టి కవితలని గూర్చిన వాదాల్లో- కవులను గౌరవించాలి అని బోధలు అవసర్ల్లేదు.

    మనకు అర్థం ఐన కవితలను గురించి అభిప్రాయాలు రాసుకుని, అర్థం కాని వాటిని గురించి మౌనంగా ఉంటే, కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటాము? అర్థం కాని వాటిని గురించి ఎందుకు అడగ్గూడదు? చేతనైన వాళ్ళు చెపుతూనే ఉండాలి. చెప్పినందువల్ల ఈ కవిత కొంతైనా అర్థమయిందికదా.ఈ కవి రచనలు మరింత చదివిన కొద్దీ, ఇంకా ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంది.

    ఐనా, కవులు, పాఠకులు, అని వర్గాలు -అన్ని వేళలా లేవే. పండితులూ, కవులూ సర్వ వేళలా గురువులే కారే. వారు శిష్యులు కూడా. ఒకరి ప్రశ్నలూ, అభిప్రాయాలనుంచి ఇంకొకరు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు కాదా.

    కవిని గౌరవించక పోతే కవిత్వం మనుషులకు అర్థం కాదా ఏమిటి? ఈ కవి చెప్పిన ప్రకారం ఒక్క ప్రియురాలి మనసు తప్ప అందరికీ అన్నీ అర్థం అయ్యే అవకాశం ఉన్నట్లే ఉంది మరి.

    లైలా

  1626. సువర్ణభూమిలో … గురించి mOhana గారి అభిప్రాయం:

    11/07/2008 3:29 pm

    మొన్న డెట్రాయిట్లో జరిగిన సమావేశంలో (నా సమీక్ష చూడండి) కవితల పైన ఒక సదస్సు ఉండింది. అందులో కవితలో పొరలు పొరలుగా అర్థం ఉండాలి అన్నారు ఒకరు. కాని అలా రాస్తే పాఠకులకు అర్థం అవుతుందా అనే ప్రశ్నకు ఈ చర్చ జవాబు అనుకొంటాను. ఇందులో ఎన్నో పొరలు ఉన్నాయి. ఎవరికి కావలసిన అర్థాలు వారు కల్పించుకోవచ్చు. కొన్ని రచయితకు కూడా తోచిఉండక పోవచ్చు. ఉదాహరణకు బుద్ధుని శిరస్సు, మొండెము. దీనిని చదువగానే నాకు తోచింది ఎప్పుడో చదివిన షెల్లీగారు రాసిన ఓజిమాండియస్ అనే సానెట్. అందులో కూడా విరిగిన ఓజిమాండియస్ శిలావిగ్రహం ఎడారిలో ఉంటుంది.
    My name is Ozymandius, King of Kings,
    Look on my works, ye Mighty, and despair!
    అని అంతమవుతుంది. నిరంకుశుని ఎవరూ తలచుకోరు. ఆ విగ్రహంలోని కళను తప్ప, దాని కారకుడు శిల్పి. బుద్ధుని విగ్రహం విరిగి ఉన్నా, బుద్ధుని ఇప్పుడు కూడా పూజిస్తూనే ఉన్నారు కలువలతో. మనం ఎలా జీవిస్తున్నామో అన్నదే ముఖ్యం అనే ఒక భావన కలుగుతుంది ఈ పంక్తులు చదివిన తరువాత. ఈ ఊహ అందరికీ కలుగకపోవచ్చు. కాని పొరలు పొరలుగా ఉండాలి కవిత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక కవిత మంచిదో కాదో అనే దానికి తూనిక రాళ్ళు ఎలాగ ఉండాలో చెప్పలేము (వేలూరిగారి వ్యాసం చదవండి). కవిత మంచిదైతే కలకాలం నిలుస్తుంది, లేకపోతే తెలుగు సినిమాలా ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కాని కవికి గౌరవం చూపాలి,
    కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు. సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు, వాటిని చదివి ఆనందించవచ్చు. నేను పారిస్ వెళ్లినప్పుడు పోంపెదూ మ్యూసియంకి వెళ్లాను. అది మాడర్న్ ఆర్ట్ పైన. అందులో కొన్ని నాకు ఇంకా అర్థం కాలేదు. కాని ఉత్తమ కళాకారులచే సృష్టించబడినవి అవి. దానిని రసాస్వాదన చేయలేకపోవడం నా తప్పే గాని మ్యూసియం వారిది మాత్రం కాదు. విధేయుడు – మోహన

  1627. సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/07/2008 1:15 pm

    కామేశ్వరరావు గారు
    ముందుగా, నచ్చనిది మర్యాదగా, అవహేళన చేయకుండా చెప్పడాన్ని పూర్తిగా అంగీకరిస్తాను. నేను రాసింది, రాస్తున్నది అది కాదనే ఆశిస్తాను.

    ఇక ఈ చర్చ, కవిత ఎంతమందికి అర్థం అవ్వాలి అని opinion poll లో తూచి వెలకట్టడం కాదనుకుంటాను. సొంతంగా ఎంతవరకు కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడానికి వీలవుతున్నది అన్నదే ప్రశ్న అనిపిస్తుంది. కనీసం దేనిగురించో అన్నదైనా తెలియవీలవుతుందా అని కూడా.

    కవిత యొక్క శీర్షిక “సువర్ణ భూమిలో…” అన్నారు. థాయలాండ్్ ని “సువర్ణభూమి” అని అంటారని చదవలేదు, వినలేదు. తెలిసిన వారు చెప్ప మనవి. థాయ్లాండ్్ పూర్వనామం సియాం. సియాం కు సంస్కృతంలో ఉన్న “శ్యామ” కు సంబంధం ఉంది. “శ్యామ” అంటే నలుపు, నీలం కాని సువర్ణమని తోచడంలేదు. ఇదంతా ఎందుకంటే, థాయలాండ్్ గురించి ఎక్కువగా తెలియని వారికి, ఈ కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడం కష్టం. మోహనగారు, మీరూ, చెప్పింతర్వాత కొంత background తెలిసి ఇది అసలు దేనిగురించో అన్న చిక్కుముడి వీడింది. అది చాలు పాఠకునికి ఊరటనివ్వడానికి.

    కవితను ఆస్వాదించడం పక్కకు పెట్టి, అసలు దేనిగురించి చెబుతున్నారో కూడా తెలియని అయోమయ స్థితిని నివారించడం రచయిత బాధ్యతే కాదు, politeness to readers అనిపిస్తుంది. ఏం చెప్పారో అని కాదు, దేని గురించి చెప్పారో అన్నదే తేలకపోతే గందరగోళం. సమయం వెచ్చించి, కష్టపడి చదివితే, దేనిగురించి చెప్పారో కూడా తెలియని స్థితిలో ఉంటే ఆ రచనను rude to readers అని ఎందుకు అనుకోకూడదో తెలియదు. That is no reason to be rude to writer in turn.
    =============
    Regards
    -Srinivas

  1628. సువర్ణభూమిలో … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/07/2008 12:26 pm

    ఇక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే మనుషుల్లో ఇంతటి అసహనం ఉంటుందా అన్న ఆశ్చర్యం కలుగుతోంది, బాధేస్తోంది. ఎందుకంటే,
    1. మనకి ఒక కవిత నచ్చకపోతే (అర్థంకాకపోతే) అది నచ్చలేదని (అర్థం కాలేదని) మర్యాదగా చెప్పవచ్చు, అవహేళన చెయ్యాల్సిన అవసరం లేదు.
    2. సరే కొంతమందికి అర్థం కాలేదని, మాకు అర్థమయిందేదో నేను, అలానే మోహనగారు చెప్పాం. మేమేమీ కొమ్ములు మొలిచిన పాఠకులం కాదు, మామూలు పాఠకులమే. మేమర్థం చేసుకున్నట్టుగా తక్కిన వాళ్ళు అర్థం చేసుకోవాలని రూలేం లేదు. అయితే దీన్నేదో కవితకి సమర్థింపుగా అనుకోవడంలో అర్థమేముంది? నాకు భూషణ్ గారు చుట్టమేమీ కాదు, అసలు నాకతనితో పరిచయమే లేదు, అతను నా అభిమానకవి అంతకన్నా కాదు. మరి దేనికి ఉట్టినే సమర్థిస్తాను? అసలు అతని కవిత బాగుంది అని కూడా నేననలేదే! మరి సమర్థింపు ఏమిటి?
    3. ప్రతికవితా మనకి అర్థం అవుతుందన్న నమ్మకమూ లేదు, అవ్వాల్సిన అవసరమూ లేదు. మనకి అర్థం కాని కవితకి వేరెవరైనా తమకి తోచిన అర్థాన్ని చెపితే, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఉచితమైన పని. “నేనలా అర్థం చేసుకోడానికి ప్రయత్నించను, నాకు ప్రతీదీ అప్రయత్నంగానే అర్థమవ్వాలి, అలా అవ్వకపోతే అది కవిత కాదు” అని అనుకోవడం మొండితనమే అవుతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు?

    బాబాగారు, శ్రీనివాస్ గారు, బాబ్జీలు గారు,
    కవితని ఒక పాఠకునిగా మనం అర్థం చేసుకొని ఎంతవరకూ ఆస్వాదించేం అన్నది ముఖ్యం కాని, అది ఎంతమందికి అర్థం అవ్వాలి? ఎక్కువమందికి అర్థమయ్యేట్టు కవి రాసాడా? అలా రాయకపోవడం కవి దోషమా ఇత్యాది వాదోపవాదనలు అవసరం అంటారా?

  1629. సువర్ణభూమిలో … గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/07/2008 9:51 am

    కవుల మనసులో ఏముందో వారు రాసిన కవిత్వం చెప్పాలితప్ప మరొకరు చెప్పజాలరు. చదవగానే ఎలాటి భావం కలగకపోతే లేదా దేనిగురించి ఈ కవిగారు రాసేరూ? అని మామూలు పాఠకుడికి అనిపిస్తే ఇలాగే వుంటుంది. యద్భావం తద్భవతి లాగ, రాసిన ప్రక్రియ వుంటే తప్పు కాదా? క్లుప్తతకి కూడా “లిమిట్” వుండాలేమో? “శుక్లాంబరధరం..” శ్లోకం గాడిద పరంగానూ వ్యాఖ్య చెయ్యొచ్చునని వేదంవారో, తాతావారో నిరూపించినట్టుంటే ఎలా?

    కవిగారివల్ల పాఠకుల స్థాయి పెరగాలి. కానీ కవిగారివల్ల పాఠకులు తగ్గిపోతే అది కవిగారి తప్పే. “అర్ధవఁవకపోతే, భాషనేర్చుకుని చదవండి” అని కాబోలు విశ్వనాధ వారి సమాధానం, “జరుక్ శాస్త్రి గారికీ” “శ్రీశ్రీ” కీ. కానీ “బ్రౌణ్యం” పక్కన పెట్టుకున్నా కొరుకుడు పడని కవిత్వం సంగతి?

  1630. సువర్ణభూమిలో … గురించి రోమేశ్ గారి అభిప్రాయం:

    11/07/2008 6:38 am

    కవిత కన్నా, ఇందులోని వ్యాఖ్యలు ఎంత కామెడీని పంచాయంటే, చదివి, చదివి నవ్వుకున్నాను. ఇలాంటి కవితలవల్లే కవులన్నా, కవితలన్నా జన సామాన్యంలో చాలా చులకన భావం కలగడం, సినిమాల్లో కామెడీ చెయ్యడం జరుగుతోంది.

    ఎవడిక్కావాలి ఈ కవితలో అర్థం ఉందో, లేదో!!

    కవితలు రాయడం అంటే పొడుపుకథలు రాయడం కాబోలు. మా చిన్నప్పుడు ఆరో తరగతి ఇంగ్లీషు పుస్తకాల్లో హింట్లు ఇచ్చి, వాటిని బట్టి కథలు రాయమనేవారు. కవితలు రాసే ఫార్మ్యులా కూడా అంతే కాబోలు.

    కవితనీ, కవినీ ఎందుకు అభినందించాలంటే – ఆ కవితకి పేరడీలూ, వ్యంగ్య వ్యాఖ్యానాలు రాయడానికి స్ఫూర్తినిచ్చినందుకు. అవి చాలు పాఠకుడికి కడుపు నిండడానికి. వామన మూర్తిగారూ, ప్రజాపతి గారూ, సునీల్ గారూ, అందుకోండి మా అభినందనలు.

  1631. సువర్ణభూమిలో … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/07/2008 6:22 am

    బాబా గారు,
    మీరు యదుకులభూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తర్వాత కవిత అర్థం కాకపోయినా ఏదో ఉండి ఉంటుందిలే అని అనుకున్నానన్నారు. నేను కూడా భూషణ్ గారి కవిత్వం, అతనికి కవిత్వంపై ఉన్న దృక్పథం రుచి చూడడం మూలానే, ఆ కవితలో చెప్పిన విషయం కాకుండా అంతర్గతంగా మరేదీ దాగి ఉండదని నిర్ణయించుకున్నాను!వినీల్ గారు గణితంతో చెప్పిన పోలికా, కవితలోంచి తీయడానికి ప్రయత్నించిన అర్థమూ చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నా అవగాహన మేరకు భూషణ్ గారు సరిగ్గా అలాటి దానికి వ్యతిరేకి! క్లుప్తత విషయంలో అతనన్నది నిజమే కాని, కవితలకి అస్పష్టతని తెచ్చి పెట్టే సాంకేతికత (symbolism) అంటే, నాకు తెలిసి భూషణ్ గారికి అసలు నచ్చదు.

    చివరిగా మీరడిగిన మిలియన్ డాలర్ల ప్రశ్నకి నా రెండు సెంట్లు: మనవాళ్ళు “సహృదయత” అన్నది పాఠకుల విషయంలోనే చెప్పారు కాబట్టి, కవి హృదయాన్ని తెలుసుకోవలసిన బాధ్యత పాఠకులదే అని నా ఉద్దేశం. అది ఎక్కువమంది పాఠకులు చెయ్యగలిస్తే ఆ కవికి ప్రాచుర్యం లభిస్తుంది. ఎవరూ అర్థం చేసుకోలేకపోతే, ఆ కవి ఒంటరిగా మిగిలిపోతాడు!

  1632. సువర్ణభూమిలో … గురించి bollojubaba గారి అభిప్రాయం:

    11/07/2008 12:01 am

    పైన నేను చేసిన కామెంటుకి కొంత వివరణ

    కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో సాధారణంగా పాఠకుడు ఉండటంలో తప్పుకాదుగా. ఎందుకంటే యదుకుల భూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తరువాత, కొంత ఎక్స్పెక్టేషన్ తో కవిత ను చదవటం, కొంత అర్ధం కాకపోయినా ఎదో ఉండి ఉంటుందిలే, అని సరిపెట్టుకోవటం, తోచిన రీతిలో అన్వయించుకోవటం సహజమే.

    ఏది ఏమైనా ఈ పద్యాలు ఈ క్రింది ఇవ్వబడిన లింకులోని వారి కవితా సంపుటిలోని పద్యాల వలేకాక, కొంత అస్ఫష్టంగానూ, ప్రతీ ఒక వాక్యానికీ ఏదో ఒక భాష్యం చెప్పుకొంటే తప్ప అర్ధంకానట్లు గానూ ఉన్నాయన మాట వాస్తవం.

    http://www.eemaata.com/em/category/library/nnn/

    ఇక పోతే కవి పాఠకుని స్థాయికి తగినట్లుగా వ్రాయాలా, లేక పాఠకుడే కవి స్థాయికి వెళ్ళి చదవాలా అనేదీ ఎప్పటికీ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నే.

    బొల్లోజు బాబా

  1633. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    11/06/2008 11:31 pm

    ఎన్నె సార్లు చదివినా చదవాలనిపిస్తున్నది కవిత…. ఇంత చక్కగా ఎలా వ్రాస్తారబ్బా….

  1634. పదేళ్ళ “ఈమాట” మాట గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    11/06/2008 12:13 pm

    “ముఖ్యంగా కథలు. ఆలోచనల్లో లోతు, శిల్పంలో పనితనం, వస్తువులో విస్తృతి అంతగా కనిపించటం లేదు. ఇంతెందుకు, కథల్లో ముందుగా వుండాల్సిన చదివించే గుణం కూడ అరుదైంది. రచయితల సంఖ్య సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్టుంది. కవితల్లోనూ విషయవిస్తృతి కనిపించదు. భాషాపాటవం, శిల్పసౌందర్యం, భావసాంద్రతల మాట సరేసరి. ఇక దృశ్య, శ్రవ్య విభాగాలు. వీటిలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించటం లేదు. భవిష్యత్తు బాగుంటుందని ఆశ.”

    రామారావు గారు చెప్పిన పై మాటలు ఆలోచింపతగ్గవి. ఈ విషయమై నా ఆలోచనలు:

    ఎందుకు కథల్లో పరిణతి కనపడట్లేదు? అంతో, ఇంతో కథలు రాయగలిగిన శక్తి ఉన్నవారి తగినంత కృషి, శక్తి లోపమే దీనికి కారణం అనుకుంటాను. ఒక విషయాన్ని వ్యాసం ద్వారా సూటిగా చెప్పటం, మంచి శిల్పం ఉన్న కథ రాయటం కన్నా, సులభం కదా! కథకుల అధ్యయనలోపం కూడా ఇందుకు తోడ్పడింది. తను రాసే వన్నీ కథలుగా చెలామణీ చేసుకుంటున్న ఒక రచయిత, మంచి కథ రాయటానికీ, శిల్ప జ్ఞానానికీ సంబంధం లేదనటం నాకు అనుభవమే! బహుశా కవితల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు.

    కానీ, ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. తెలుగు నాట ఉద్దండ కథకుల్ని దృష్టిలో పెట్టుకొని, అటువంటి కథకులు రావాలని ప్రవాసాంధ్రులను కోరితే అది సాధ్యమా! బహుశా సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఒక్క విషయం మాత్రం నిజం – కథల్లో చదివించే గుణం కూడా అరుదైంది అన్న ఆవేదన సరైందే.

    దీనికి సరైన సమాధానం కథలు, కవితలు రాసే వారి నుంచే రావాలి!

    లక్ష్మన్న

  1635. సువర్ణభూమిలో … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/06/2008 12:09 pm

    కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో ప్రతి కవితనీ శల్యపరీక్షకి గురిచేస్తే ఇలాటి అవస్థే ఏర్పడుతుంది కాబోలు!
    నాకు చదవగానే కవిత చాలా తేలికగానే అర్థమైందనిపించించి! కవి థాయిలాండు యాత్ర చేసాడు. ఆ యాత్రలో అతని మనఃఫలకంపై బలంగా ముద్రపడిన కొన్ని దృశ్యాలను, మిగిల్చిన అనుభూతిని యథాతథంగా పదాలలో చిత్రించే ప్రయత్నం ఈ కవిత అని నా కనిపించింది.
    ఆ తర్వాత వెతికితే ఈ లంకె కనిపించింది:
    http://www.pbase.com/ratluk/allofthailand

    కవితలో ఉన్న కొన్ని పద చిత్రాలకి చాయా చిత్రాలని ఆ లంకెలో చూడవచ్చు.

  1636. సువర్ణభూమిలో … గురించి Suneel గారి అభిప్రాయం:

    11/06/2008 10:39 am

    వినీల్ గారి జ్ఞాన బోధ తర్వాత నాకు వామన మూర్తి గారి కవిత partial differential euqation of second kind కింద తోస్తోంది.

    నాకు తోచిన interpretetion

    అంకాలమ్మ గుడి మన సంస్కృతికి ప్రతీక. ఒక అడుగు అనడంలో అది అంతరించిపోతోందే అన్న బాధ ధ్వనిస్తోంది.

    ఆ ఆటో నేటి పత్రికలకీ, శవం నేటి కవిత్వానికీ ప్రతీకలు.

    ఆ జెండా మరేమీ కాదు నేటి కాలపు కవిత్వంలో కనిపించే వాదాలకి ప్రతీక. ఆ బల్లి నాలాంటి సామాన్య పాఠకుడు.(బాధితుడు)

    తామరాకు నిద్రలేచి ఆవులించడమనేది వినీల్ గారి జ్ఞాన బోధకి నిద్రలేచిన నా మనసుకి ప్రతీక. వామన మూర్తి గారు కాల జ్ఞానానికి అబ్బురపడడం తప్ప మరేమీ చేయలేను.

    “పసిపాప ప్రత్యేక రాష్ట్రం కోసం గర్జిస్తోంది ఎంత సుకుమారం” ఆ పసిపాప విమర్శకుడు, ప్రత్యేక రాష్ట్రం భూషణ్ గారి కవిత్వం లాంటి కవిత్వమనీ నాకు అర్ధమైంది. ఎంత సుకుమారం అనడంలో విమర్శలు ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు. కవి ప్రతిభ అద్భుతంగా వ్యక్తమైంది.

    ఇక ఛాంగు భళ ఎంకి మావ అని కవితని ముగించడం. ఈ ఒక్కటీ మాత్రం అర్ధం కాలేదు. అందుకే partial differential equation అన్నది.

  1637. సువర్ణభూమిలో … గురించి ప్రజాపతి గారి అభిప్రాయం:

    11/06/2008 9:57 am

    చాలా బావుంది. అసలు ఇవన్నీ తెలుగు అక్షరాలే కదా.ఎందుకు అర్థం కావడం లేదు అని బాగా ఆలోచిస్తున్నా. వినీల్ గారి ఇంటర్‌ప్రెటేషన్ చదివాక నాకైతే ఈ కవిత అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి వ్రాసినట్లు అనిపించింది. ఎలాగంటే
    ముఖ ముఖి
    సుఖాసీనులై
    బుద్దులు
    (ఒబామా, మెకైన్ లు ఇద్దరూ చెరొక బుద్దుడిలా సుఖంగా కూర్చునీ, నిలుచొనీ మనకి సందేశాలిస్తున్నారు)

    వాడని కలువలు
    అలుముకునే ధూపం
    (ఆ మాటలు వినే మన మనసులు కలువలు లాంటివి. వాటి చుట్టూ పొగ అలుముకుంటోంది)

    ఎదురెండలో
    ఎర్ర చారల పిల్లి
    (వాళ్ళ మాటలు సరిగా అర్థం చేసుకోలేని, ఎర్రచారల పిల్లి లాంటి, కొంతమంది అయోమయం అనే ఎండలో)
    చెలగాటమాడుతుంది
    తలను పాదాలమీద ఉంచి
    (తమలో తాము ఘర్షణ పడుతూ, చెలగాటంలాగా, పాపం తలని మోకాళ్ళలో దాచుకుంటూన్నారు)

    ఈ విధంగా చూస్తే కవితా చాలా సులభంగానే అర్థమౌతోంది.
    ఏమైనా యదుకుల భూషణ్ గారి కవితలు చాలా ఇనిస్పిరేషన్ గా ఉంటున్నాయి. నెలకొక కవితైనా వారినుంచీ రావాలని కోరుకుంటున్నాను.

  1638. సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/06/2008 9:21 am

    I say, not just poem, but any writing starts only in writers mind and ends in reader’s. Probably with the exception of one’s shopping list.

    గణితం నేర్చుకున్న ప్రతి విద్యార్థికి Fermat Theorem’s proof అర్థం కాకపోవచ్చు. కాణి, గణితం కూడా రానివారు సైతం అది Fermat Theorem’s proof గురించి అని మాత్రం తెలుసుకోవచ్చు, సుళువుగా.

    మరి రచన అర్థం కాకపోయినా, అసలు అది దేని గురించి అన్నది కూడా స్పష్టంగా తెలియకపోతే ఆ రచన పాఠకులను చేరుతుందే కాని, తాకదు. రచన అనే అన్నాను, కవిత అని అనలేదు. ముందు రచన అర్థం అయితే, అది కవితో కాదో కూడా తెలుసుకోవచ్చు.

    చివరలో చెప్పింది “దూరమైన థాయ్ భాష నేర్చుకున్నా కూడా, దగ్గరున్న ప్రియురాలు మనసు తెలుసుకోలేకపోయాను” అన్న contrasting తో చేసిన
    వ్యక్తీకరణ బాగుంది.

    అది తప్ప మిగితాది ఏది కూడా దేన్ని గురించి చెపుతున్నారో, ఏం చెప్పదలచుకున్నారో, ఏమీ అర్థం కాని (దు)స్థితి, interpretation ఇచ్చినప్పటికినీ. Interpretation తెలిసినదానికి లోతును, వైవిధ్యాన్ని ఇవ్వగలదేమో కాని, తెలియని దానిని పరిచయం చేయలేదు అనిపిస్తుంది.

    May be better to study about Fermat Theorem’s proof, even if not totally understood _ it only widens one’s understanding.
    ====
    Regards
    Srinivas

  1639. సువర్ణభూమిలో … గురించి vineel గారి అభిప్రాయం:

    11/05/2008 1:39 pm

    [ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది. — సం]

    తెలుగులో ఉండి, అన్నీ తెలిసిన పదాలే ఉన్నంత మాత్రాన ప్రతి కవిత మనకి అర్థం కావలనుకోవడం, కాస్తో కూస్తో గణితం నేర్చుకొన్న ప్రతి విద్యార్థికి, ఫెర్మాట్స్ థియరం ప్రూఫు అర్థమవ్వాలనుకోవడం లాంటిది.

    ఈ సంచికలోనే వేలూరి గారి “నేనొక సాధారణ పాఠకుణ్ణి” వ్యాసంలో ఈవాక్యాలు బాగా పనికొస్తాయి ఈ కవిత గురించి రెండు మాటలు చెప్పడానికి. “… ఇలా అనుభవ పరిథి పెరిగి, జ్ఞాపకాలు పెరగడంతో, నీవు విద్యాధికుడవవుతున్నావు. అది మంచిదే. కానీ, దీనితో ఒక చిక్కు లేకపోలేదు. నీకు సరికొత్త పదజాలం అబ్బుతుంది అన్నాం కదూ! దానితో, నీ స్నేహపరివారం తగ్గుతుంది. ఎందుకంటే, నీ పరిభాష అర్థం చేసుకొనే వాళ్ళు, సరిగ్గా నీకు మల్లే అనుభవించి, ఆనందించిన వాళ్ళే అవుతారు. మిగిలినవాళ్ళకి నీ పరిభాష పరమ అరుచి కలిగిస్తుంది…”

    భూషణ్ కవిత్వం ఇలాగే ఉంటుందనిపిస్తుంది నాకు. ఈ కవి కవితల్లో క్లుప్తత తారాస్థాయికి చేరి ఒక గణిత సమీకరణమంత క్లుప్తంగా తయారవుతాయి, కవితలు. గణితంలో ఏమో కానీ, కవిత్వంలో ఇలాంటి క్లుప్తత వల్ల కవితలు డేవిడ్ లించ్ సినిమాల్లాగా open to reader’s interepretation అవుతాయి. ఉదాహరణకు సువర్ణభూమి కవితకు నాకు తోచిన ఒక ఇంటర్ ప్రెటేషన్.

    “ముఖా ముఖి సుఖాసీనులై బుద్ధులు ( చక్కని కవిత్వం వ్రాసే కవి, అస్వాదిస్తున్నపాఠకుడు)
    వాడని కలువలు ( మంచి కవితలు)
    అలముకున్న ధూపం (పాఠకుని మదిలో ఆవరించిన కవిత్వ సౌందర్యం)

    ఎదురెండలో ఎర్రచారల పిల్లి,
    చెలగాట మాడుతుంది
    తలపాదాలమీదుంచి.
    (కొన్ని కవితలు కదళీ పాకాలైతే, కొన్ని నారికేళ పాకాలు. తమకు అర్థం కాని కవితకు అర్థమే లేదని కుప్పిగంతులు వేసే పాఠకులే ఈ ఎర్రచారల పిల్లులు)

    ఎన్నో మెట్లెక్కి/గర్భ గృహంలో/గబ్బిలాలను/అదిలిస్తున్నాడు/విహార భిక్షువు ( ఉచ్ఛస్థాయిలో ఉండే కవిత్వమనే ఆలయపు పవిత్రతను, గబ్బిలాలను పారద్రోలి కాపాడే విమర్శకుడు).

    As some wise soul once said, A poem starts in writers mind and ends in readers mind. To conclude, for some one who is used to Van Gogh’s impressionistic paintings, Picasso’s Guernica might be pointless. That does nt reduce the essence of Guernica by an ounce.
    వినీల్.

  1640. బాలమురళీకృష్ణ సంగీతం గురించి mOhana గారి అభిప్రాయం:

    11/05/2008 10:52 am

    కవిత్వంలో ఒక భాగం చిత్రకవిత్వం. ఇందులో కొన్ని నియమాలను ఉంచుకొని పద్యాలు రాస్తారు. అందులో కొన్ని – పెదవులతో పలుకని అక్షరాలతో ఉండేవి, అలా లేనివి, కొమ్ములు ఉండేవి, అలా లేనివి, ఇలా ఎన్నో. అదే విధంగా సంగీతంలో కూడా ఐదుకన్న తక్కువ స్వరాలతో కల్పించిన రాగాలు కాబోలు. అంటే మూడు, నాలుగు స్వరాలతో ఉండే రాగాలు.
    బహుశా వీటిని చిత్ర రాగాలు అని పిలువవచ్చు. రెండు స్వరాలతో గాయకులు మొట్టమొదట పాడే స-ప-స! – మోహన

  1641. సువర్ణభూమిలో … గురించి surya గారి అభిప్రాయం:

    11/05/2008 2:24 am

    అయ్యి బాబోయ్ వామనమూర్తి గారూ మీ కవితలో చాలా ఇన్ఫర్మేషనుందండీ బాబూ

  1642. అరణ్య కవితలు గురించి A. KISHORE BABU గారి అభిప్రాయం:

    11/05/2008 1:07 am

    సుబ్రహ్మణ్యం గారు
    మీకు మొదట నా అభినంధనలు.

    మీ కవితలు చాలా ఆలస్యంగా చదివాను.నేను కవితలు రాయను కానీ బాగా చదువుతాను. ఎక్కడైనా ఒక మంచి కవిత చూసినా హాయిగా చదువుకొని హృదయంలొ దాచుకొంటాను. ఇక్కడ కొంతమంది చేసిన విమర్శల గురించి ఎమీ పట్టించుకోకండి.అసలు ఏ కవి కూడా కవిత్వం కేవలం తనకోసం రాసుకొంటాడనేది నా అభిప్రాయము. ఆ సమయంలో కవి తాను పొందిన అనుభూతిని అక్షరాల్లో ఆవిష్కరించుకొంటాడు. అది మీరైనా, ఎవరైనా కావొచ్చు. మీ కవితల్లో ఎంతో అనుభూతివుంది.

    “ఎంత దారి తప్పి
    ఎక్కడెక్కడో తిరిగినా
    ఎట్టకేలకు నీటి జాడ

    అడవిలో మరొకసారి
    తప్పి పోవాలని ఉంది”

    ఎంత గొప్ప అనుభూతి. ఇది అనుభవించినవారికే తెలుస్తుంది. మరి కొన్ని కవితల్లో మీరు..
    “సముద్రం నుంచి
    పల్చటి నీటి పొర
    రెక్కలు కట్టుకొని
    రెప్పల కిందకి చేరుతుంటే
    మౌనంగా
    ఆ తీరాన ఆమె
    ఈ తీరాన నేను”

    “….
    ప్రకృతి రంగులన్నిటిని
    దోచెసుకొని రాత్రి
    తూరుపు కొండ చాటున
    మాటు వేసిన సూర్యుడు
    రాత్రి మీద దాడి చేసి
    వేటి రంగుల్ని తిరిగి
    వాటికే ప్రసాదిస్తాడు”

    ఆదునికత కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఇప్పుడెలాగు ఆ ప్రకృతి రమణీయతకు దూరమవుతున్నాము.పచ్చటి పైర్లు, పల్లె లోగిళ్ళ అందాలు ఎక్కడా. ఆ ప్రకృతి వొడిలో తిరిగి తిరిగి అలసి సొలసి, సేదతీరి తమని తామె మైమరచిపోయే అదృష్టాన్ని కోల్పోతున్న కాంక్రీట్ జంగిల్ పక్షులం. కనీసం ఇలాంటి కవితలు చదివినప్పుడైనా మళ్ళి ఒకింత సేపు మనసు ఆ ప్రకృతి వొడిని ఊహించుకొని సేద తీరుంది. ఇక్కడ విమర్శకులను నేనేమీ అనడం లేదు. కాకుంటే ఒక మనవి..
    నేడు తెలుగు అంతరించి పోతోందని, ముఖ్యంగా ఇంగ్లీషు మోజులో నేటి తరం తెలుగు భాషా సౌందర్యాన్ని మరచి పోతున్నారని బాధపడుతున్న తెలుగు లోకం ఒకసారి ఇలాంటి యువ కవులను వెన్ను తట్టి ప్రోత్సహించండి.ఇది మరికొంతమంది నవ కవులు పుట్టుకు రావడానికి దోహదపడుతుంది. కవులు కాక పోయినా ఫరవాలేదు, కనీసం తెలుగులో తమ భావావేశాన్ని అక్షరాలుగా మార్చే వారైనా పుట్టుకొస్తారు.

    ఈ స్పూర్థితో మరికొంత మంది నవ కవులు (మీ దృష్టిలొ కవులు కకున్నా ఫరవాలేదు) కనీసం తెలుగులో తమ భావావేశాన్ని అక్షరాలుగా మర్చే వారైనా పుట్టుకొస్తారు..

    “నేను బతకటానికి ఏమి కావాలి
    ఒక్క చిరునవ్వు చాలు
    ఆమె నవ్వింది
    నేను బతికాను”

    ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం దారిలొ దొరికిన కాగితంలో కవి ఆశారాజు రాసిన కవితలో చివరి వాక్యలు ఇవి..
    ఎంత తృప్తి కలిగించే కవితా ప్రయోగం, (వచనా ప్రయోగం అని కూడా అనుకోండి ఇబ్బంది లేదు).

    “తెలుగు బతకడానికి ఏమి కావాలి
    చక్కటి భావాన్ని వొలికే
    నాలుగు కమ్మని
    పదాలు తప్ప”

    మంచి కవిత రాశారు
    తెలుగు తల్లి నవ్వింది

    అమృతంలాంటి తెలుగు
    కవితా లోకానికి
    మీకు ఇదే
    నా చిరునవ్వుల స్వాగతం.

    కవితాభినందనలతో

    మీ
    కిషోర్ బాబు

  1643. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    11/04/2008 12:24 pm

    ఎందుకు, ఎలా, అని అడక్కండి. నా దగ్గర నిజంగానే సమాధానం లేదు. కానీ యెందుకో పై కవిత చదవగానే సత్తసాయ్ (గాథాసప్తశతి) లోని “గాథలు” కొన్ని, అలాగే సుభాషిత రత్నకోశం, సుభాషిత రత్నభాండాగారాల్లోని కొన్ని ప్రకృతి వర్ణనలతో కూడిన సంస్కృత పద్యాలు గుర్తుకొచ్చాయి. లైలాగారన్నట్లు నిజంగా సరదాగా వుంది మీ కవిత. అభినందనలు.

    భవదీయుడు,
    శ్రీనివాస్

  1644. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    11/04/2008 12:06 pm

    భలే సరదాగా ఉంది కవిత. ఇంకా ఆ ఊళ్ళోకి వెళ్ళాలనే! ఎందుకు! 🙂

    ఇంతకు ముందు సంచికలో -తారామతి బిరాదరి- కూడా బహుత్ ఖూబ్. Haunting. Spell casting.

    ‘మబ్బు కొప్పు’ లోంచి బదులు, మబ్బు జుల్ఫ్ నుండి నీటిపూలు రాలి కొమ్మల్లో చిక్కుపడరాదా?

    మీ పొయెట్రీ లింకు ఇచ్చారు. చదువుకుంటాను. థేంక్యూ ఇంద్రాణీ!

    లైలా

  1645. నాన్నా తెలుసా గురించి చంద్ర మోహన్ గారి అభిప్రాయం:

    11/04/2008 5:37 am

    చాలా బాగున్నాయండీ పద్యాలు! కళ్ళవెంట నీళ్ళు తెప్పించాయి. ఈమాటలో లంకె చూడకపోతే ఇంత మంచి కవిత్వం కంట పడిఉండేది కాదు. ” అమ్మను నవ్వుతు చూస్తే నమ్మకమే కలగలేదు…” మళ్ళీ నీళ్ళు కళ్ళలో.

  1646. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి నెటిజన్ గారి అభిప్రాయం:

    11/03/2008 10:49 pm

    “షోకుల, బాకాల,పొలికేకల కింద
    ఆకలి కేకలు అడుగంటుతున్నాయి”
    బావుంది.

    16కోట్ల రూపాయల జాకెట్ ప్రకటనలు గుప్పించిన వైనం గుర్తు వచ్చింది.

    తెలుగవ్వడం ఒక్కటే కాదు, మీకు కవిత్వం కూడా చేసింది.

  1647. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి galls గారి అభిప్రాయం:

    11/03/2008 7:31 pm

    అయ్యా మీ కవిత చాలా బాగుంది. మీ కోరిక నెరవేరాలని కోరుతున్నాను. మీకు ఆ నైపుణ్యం ఉంది.

    All the best.

  1648. ఈమాట – నామాట గురించి వామనమూర్తి గారి అభిప్రాయం:

    11/03/2008 7:13 pm

    ఈ మాట సంపాదక వర్గానికీ, కవితల్నీ, కథల్నీ చూసే ‘పీర్ల ‘ కీ భారత ప్రభుత్వం ‘మహా పద్మ విభూషణ సమ్రాట్ శేఖర ‘ బిరుదులు ఎనౌన్స్ చెయ్యాలని ఒక ఉద్యమం చేపట్టాలనుకుంటున్నాము. మీ ‘పీర్లు ‘ అనుమతిస్తే తెలీయచేయండి.

  1649. సువర్ణభూమిలో … గురించి వామనమూర్తి గారి అభిప్రాయం:

    11/03/2008 7:07 pm

    కవిత యదుకుల భూషణ్ గారికి అంకితమిస్తూ..
    అంకాలమ్మ
    గుడిలో ఒక అడుగు
    ఆటోలో శవం ఊరేగుతోంది
    జెండాపై బల్లి
    ఒకటే గురకపెడుతోంది
    తామరాకు నిద్రలేచి
    ఆవులించింది
    పసి పాప
    ప్రత్యేక రాష్ట్రం కోసం
    గర్జిస్తోంది
    ఎంత సుకుమారం
    ఛాంగు భళ ఎంకి మామా

  1650. సార్ గారండీ… సార్ గారండీ… గురించి ప్రజాపతి గారి అభిప్రాయం:

    11/03/2008 3:49 pm

    అద్భుతంగా ఉంది.చక్కటి చిక్కటి కవిత్వం. పదచిత్రాలు, అన్వయం, మనసుని కదిలించే ముగింపు.చాలా రోజుల తర్వాత మళ్ళీమళ్ళీ చదివించిన కవిత.

    ఈ దేహం కలిసిపోయే లోపు
    ఎప్పుడో, ఎక్కడో వాడు కన్పించి,
    “బాగున్నారా మాష్టారూ” అంటాడు.
    అంతకుమించింకేం కావాలీ జీవితానికి.
    హేట్సాఫ్.

  1651. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి ఉమాశంకర్ గారి అభిప్రాయం:

    11/03/2008 1:42 pm

    కవిత బావుంది.

    మీరు బేసిగ్గా విశాఖ వాస్తవ్యులనుకున్నా.గుంటూరు నుంచి వలస వెళ్ళారన్నమాట.

  1652. ఈమాట – నామాట గురించి Madhav గారి అభిప్రాయం:

    11/03/2008 8:16 am

    మా నుంచి మరికొంచెం వివరణ (ఈమాట రివ్యూ పద్ధతి గురించి అపోహలేమన్నా ఉంటే తొలగిపోతాయనే నమ్మకంతో).

    1. ఈమాటను scientific journal లాగా మేము చూడటం లేదు. ఒక సాహితీ పత్రిక లాగానే నడుపుతున్నాం. అలాగే నడుపుతాం కూడా.

    2. పీర్ రివ్యూ అన్నపదం పదేపదే వాడడం వల్ల కొంచెం “భయం” ఏర్పడ్డదేమో, నిజమే అయుండచ్చు. అది పోగొట్టడానికి కృషి చేస్తాం.

    3. ఈమాటకు ప్రత్యేకంగా సమీక్షకులు లేరు. రచయితలూ, కవులూ వ్యాసకర్తలే మా సమీక్షకులు. (కొన్ని విశేష సాంకేతిక వ్యాసాల సమీక్షలకు తప్ప). అందువల్ల రచయితలూ సమీక్షకులూ ఒక తానులో ముక్కలే.

    4. ఈమాట విలువలు నిలుపుకుంటూ, “అన్ని రంగాల వారినీ” ఆకర్షించేదిగా మెలగాలనే మా కోరికా, తపనా కూడానూ. వచ్చిన ప్రతీ వ్యాసాన్నీ ప్రతీసారీ external review కి పంపము అని ఇంతకుముందే చెప్పా గదా. మోహనరావు గారు చక్కగా చెప్పారు. ఈమాట ఎలా ఉండాలి అనే విషయం మీద మాకు నిర్దిష్టమైన అభిప్రాయం లేదా దృక్పథం ఉంది. (అది మీకు నచ్చడం మా అదృష్టం). సంపాదకులుగా ఈమాటలో ప్రచురణలు ఎలా ఉండాలో వారికే తెలుస్తుంది, కాబట్టి మొదటి రివ్యూ సంపాదక బృందానిదే, ఆఖరి నిర్ణయం కూడా వారిదే. కానీ, బయాస్ కి తావు లేకుండా, (మాకు కొమ్ములు మొలవకుండా) an external perspective కోసం, వేరే వారితో రివ్యూ చేయించడం సబబు అనే మా నమ్మకం. అలాగే, సాంకేతిక, చారిత్రాత్మక, తదితర సంబంధమైన వ్యాసాలు కూడా. ఎందుకంటే అటువంటి వ్యాసాల్లో మేము వ్యాస లక్షణాలను సరిదిద్దుకోగలమే కానీ, ప్రతీసారీ వస్తుశీలతను నిర్ధారించలేం కదా! కొన్నిసార్లు కథలూ, కవితలకి కూడా ఈ అవసరం పడుతూ ఉంటుంది. అంతేకాదు, ఎవరికి రివ్యూకి పంపాలో వారి ప్రతిభ, పటిమ రెండూ ముందు తెలుసుకునే పంపుతున్నాం కూడా.

    (పనిభారం వల్ల మాత్రం కాదని ఒట్టేసి చెబుతున్నాను. 🙂 నాకు ఈ పని భారమనిపిస్తే నేనిక్కడ ఉండగూడదని అర్థం, అంతే. సహధర్మచారుల అభిప్రాయం వేరే అనుకోండి, అది వేరే విషయం)

    ఇక నిక్కచ్చిగానే కొన్ని విషయాలు చెపుతాను. అన్యధా భావించవద్దు.

    తెలుగు సాహితీరంగంలో సంపాదకుడు తన బాధ్యతను, కర్తవ్యాన్నీ మర్చిపోయి చాలా కాలమయిందనే “నా” అభిప్రాయం. మంచి సాహిత్యమనే నాణేనికి రచయిత ఒక వైపు ఉంటే పాఠకుడు రెండోవైపు. ఈ రెండు పార్శ్వాలనీ నిలబెడుతూ, రచయిత అందించే సాహిత్యాన్ని పరిష్కరించి పాఠకుడికి అందిస్తూ, అనుసంధానుకుడైన సంపాదకుడు ఆ నాణేనికి మూడోవైపు. పరిష్కర్త గా ఉండవలసిన వ్యక్తి కేవలం పేజీ కంపోజర్ గా మిగిలిపోడం దురదృష్టం. కారణాలేమిటన్నది అప్రస్తుతం. మంచి సాహిత్యానికి సమీక్ష, పరిష్కరణ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్న బలీయమైన నమ్మకమే ఈ రివ్యూ పద్ధతికి అంకురార్పణ.

    ఈ రివ్యూ పద్ధతి కొత్తగా తిరిగి నేర్చుకోవలసి రావడం వలన, రచయితలలో జంకు కలగడం సహజం. వారి కోకిలను సంపాదకుడు ఏ కాకిగా మారుస్తాడో అన్న భయం వల్ల. అందువల్ల, మేము మార్పులూ చేర్పులూ చేసిన ప్రతీసారీ, రచయితలకు ప్రివ్యూ చూపించి వారికి నచ్చి, ఒప్పుకున్న తర్వాతే వారి కథనూ, కవితనూ, వ్యాసాన్నీ ప్రచురిస్తున్నాం. ఒకవేళ వారికి నచ్చక పోతే, మార్పులు చేయకుండా ప్రచురించడం మాకు ఇష్టం లేకపోతే, వారి రచన ప్రచురింపబడదు. అది రచయిత ఉపసంహరించుకోవడమో, మేమూ తిరస్కరించడమో జరుగుతుంది. నిజానికి ఈ ప్రివ్యూ పద్ధతి వేరే పత్రికలకు లేదు. సంపాదకులదే ఏకపక్ష నిర్ణయం. కానీ ఈమాట పద్ధతి అది కాదు. మనమందరమూ కలిసి ఒక మంచి సాహిత్యాన్ని ఆనందిద్దాము, అనేది మా అంతిమ లక్ష్యం.

    ఏదేమైనా ఈమాట రచయితల విశాల హృదయం, విమర్శను స్వీకరించే సహృదయతా మా రివ్యూ పద్ధతి కొనసాగడానికీ, ఈమాట ప్రమాణాలు నిలబడడానికీ కారణాలు. ఇలాగే మా కర్తవ్య నిర్వహణలో లోపాలున్నా, మా పద్ధతి నచ్చకున్నా చక్కగా విమర్శించడం మీ బాధ్యత. విని తప్పు దిద్దుకోడం మా కర్తవ్యం. (విలువలకి రాజీ పడి మాత్రం కాదని మీకూ తెలుసు, అలా రాజీపడితే మీరు ఏమాత్రం సహించరని మాకూ తెలుసు).

    ఇంతకంటే వివరణ అనావశ్యమనే మా భావన. శెలవు.

    మాధవ్ మాచవరం
    ఈమాట సంపాదకుల తరఫున.

  1653. తరువాతేమిటి? గురించి bollojubaba గారి అభిప్రాయం:

    11/03/2008 7:12 am

    అద్బుతంగా ఉంది.
    కవిత్వం జల జలా రాలింది.
    వస్తువుని స్పష్పాష్పష్టంగా మాత్రమే చేతికి చిక్కేలా చేయటం గొప్ప టెక్నిక్. అచ్చు జీవితంలా.

    బొల్లోజుబాబా

  1654. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:

    11/03/2008 3:46 am

    సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలు.
    మీకు సమయం దొరికినప్పుడు మరికొన్ని కవితలు
    ఇక్కడ చదువవచ్చును.
    http://teneetikappu.blogspot.com/

    ఇంద్రాణి పాలపర్తి.

  1655. సార్ గారండీ… సార్ గారండీ… గురించి రాధిక గారి అభిప్రాయం:

    11/03/2008 1:55 am

    కవిత బాగుంది.
    “హృదయాన్ని అంకితమీయచ్చు” కి బదులు “హృదయానికి అంకితమీయచ్చు” అని ప్రచురింపబడినట్లుంది!?

  1656. ఈమాట – నామాట గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    11/02/2008 12:37 pm

    మోహన గారు మంచి సలహా ఇచ్చారు.
    ప్రతీ కథనీ, కవితనీ, వ్యాసాన్నీ సమీక్ష చేసి వేస్తామని సంపాదకులు సెలవిచ్చారు. బాగుంది. సంపాదక వర్గాన్ని మెచ్చుకున్నారు. రచయితలకీ, పాఠకులకీ కృతజ్ఞతలు చెప్పిన చేత్తోనే సమీక్షకులకి ( పేర్లు చెప్పనవసరం లేదు )కూడా చెప్పుంటే బావుండేది. ఈ వ్యాసంలో ఆ లోపం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది.

  1657. ఈమాట – నామాట గురించి Madhav గారి అభిప్రాయం:

    11/02/2008 10:44 am

    నమస్తే. – ఈమాట సంపాదకుల అనుభవం ఎంత వున్నా కూడా, అన్నీ వారే రివ్యూ చేసేస్తూ ఉంటే ఒక బయాస్ ఏర్పడుతుందనీ కాలానుక్రమంలో multiple perspectives of evaluation ని కోల్పోతామనీ మా నమ్మకం. అంతే కాదు, కొన్ని విషయాల్లో మాకు తగినంత పరిజ్ఞానం ఉండదు. అందువలన కూడా external peer review తప్పనిసరి అనే మా అభిప్రాయం. అయితే రివ్యూ చేసేవారి ప్రజ్ఞ మీద నమ్మకం ఉంటేనే వారికి రచనల్ని పంపుతాము, కదా.

    వచ్చిన ప్రతీ రచననీ ముందర మేము రివ్యూ చేస్తాం. మా దృష్టిలో ప్రచురణార్హత ఉన్న రచనలు మాత్రమే మరింత నిశితంగా పరిశీలించ బడతాయి. కొన్ని కేవలం సంపాదకులే రివ్యూ చేస్తే కొన్ని బైటివారితో కూడా రివ్యూ చేయబడతాయి.

    కథ అయినా, కవిత, వ్యాసం అయినా ఇక్కడ బాలేదు, ఇలా రాస్తే బాగుంటుందేమో, అని సలహా ఇవ్వడంలో తప్పేమిటో ‘తల పండిన’ వారికొచ్చిన ముప్పేమిటో నాకు అర్ధం కాదు. రివ్యూ కామెంట్లు నచ్చకపోతే రచయితలు వాటిని తిప్పికొట్టవచ్చనీ, రచయితదే ఆఖరి నిర్ణయమనీ ప్రతీసారీ మేం చెప్తునే ఉన్నాం. కొన్నిసార్లు రివ్యూ అసమంజసం అనిపించినప్పుడు దానిని బుట్టదఖలు చేసిన సందర్భాలు లేకపోలేదు కూడా. అలాగే రివ్యూ కామెంట్లు సమంజసమని మాకు అనిపించి రచయితకు నచ్చకపోతే, మా అభిప్రాయాన్ని రచయితకు నిక్కచ్చిగానే చెపుతున్నాం. కానీ, ఇటువంటి వాటికి మా మేధా మా ప్రజ్ఞా అతీతం అనుకునే పండితుల కోసం ఈమాట రివ్యూ పద్ధతులు మార్చలేమనే చెప్పాలి. ఆఖరుగా ఏ రచనైనా ప్రచురించడమా మానడమా అనేది మా నిర్ణయం. అది తప్పో ఒప్పో నిర్ణయించేది పాఠకులే. వారి తీర్పే మాకు శిరోధార్యం.

    మాధవ్ మాచవరం
    ఈమాట సంపాదక బృందం తరఫున.

  1658. హిమపాతము గురించి karverababu గారి అభిప్రాయం:

    11/02/2008 6:29 am

    తిరుమల వారి హిమపాతము కవిత చాల బాగుంది. ఉత్తర అమెరికా శీతాకాలాన్ని వర్ణించారనుకుంటున్నా. కొన్ని పద్యాలు సరళ ఛందస్సు కాకపొయినా నారికేళపాకము కాదు. ఒకప్పుడు ఉత్తర ఐర్లెండు లో ఇలాంటి వాతావరణము లో చిక్కున్నప్పుడు మనుచరిత్ర లో ప్రవరాఖ్యుడి పాట్లు-పద్యాలు నెమరేశాను.

  1659. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    11/01/2008 11:16 pm

    మంచి వాతావరణ కల్పన ఉంది. పడికట్టు పదాలు లేకపోవడం మీ కవిత్వ బలం. keep writing!

  1660. వాడుక భాషలో పద్యాలు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/01/2008 5:33 am

    ఈ మధ్య ఇంటర్నెట్టు సౌలభ్యానికి కాస్తంత అభ్యంతరం ఏర్పడి ఈ చర్చని ఇంతవరకూ చూడలేదు. దీని గురించి తాపీగా మళ్ళీ ఆలోచించి రాయాలి. ప్రస్తుతానికి రెండు మూడు విషయాలు.
    మోహనగారు వాడుకభాషలో పద్యాలకి ఆదరణ లభించాలని కోరుకున్నారు. సమంజసమే. వాడుక భాషలో పదునైన, అందమైన పద్యకవిత్వం వస్తే (రా గలిగితే) దానికి ఆదరణ తప్పకుండా లభిస్తుందని నా నమ్మకం.
    తెలుగులో పాదాంత విరామం గురించి. అది సంస్కృతంలో నియమం. తెలుగులో లేదు. కాబట్టి, కావాల్సిన చోటల్లా ఆ విరామాన్ని పాటించడానికీ అవకాశం ఉంది, అక్కరలేదనుకున్నప్పుడు పాటించకపోడానికీ అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తెలుగు ఛందస్సులో ఎక్కువ వెసులుబాటు ఉందన్నమాట!
    బాబ్జీలుగారు తమ వ్యాఖ్యల్లోకి రెండు మూడు సార్లు నన్ను లాక్కొచ్చారు 🙂 వారికోసం నేను వాడుకభాషలో రాసిన పద్యాలు: “నాన్నా తెలుసా“.

  1661. వాడుక భాషలో పద్యాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    10/28/2008 11:16 am

    శ్రీశ్రీ రాసిన వచనంలాంటి కందపద్యం:

    అవురా శ్రీరంగం శ్రీ
    నివాసరావూ బలే మనిషివే ఇక నీ
    కవితావాద్యం చాలిం
    చి వెళ్ళిపొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వా

  1662. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి mOhana గారి అభిప్రాయం:

    10/28/2008 7:13 am

    త్యాగరాజుగారికి తమిళం బాగానే వచ్చి ఉంటుంది. కాని వారికి అందులో కవిత్వం వ్రాయగలిగిన శక్తి లేదేమో? ఆ కాలంలో దక్షిణదేశంలో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉండింది సాహిత్యభాషగా. అదీకాక వారి మాతృభాష తెలుగు కాబట్టి ఆ భాషలోనే తమ పాటలను వ్రాసి వాటికి స్వర జీవాన్ని పోశారు. ఆత్మ పొందే అవస్థను మాతృభాషలో కాక మరే భాషలో సులభంగా చెప్పగలం? ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన మణిప్రవాళ కీర్తనలు కొన్ని తెలుగు తమిళ భాషలలో ఉన్నాయి. విధేయుడు – మోహన

  1663. వాడుక భాషలో పద్యాలు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    10/28/2008 1:49 am

    క్రు(కృ)ష్ణమోహన్ గారూ,
    వాడుకభాషలో ఛందొబద్ధమైన పద్యములనల్లి, సాహితీపిపాసులనలరించుతున్న కవివరేణ్యులు, ప్రస్తుతంలో ఎవరూ?
    రహ్మతుల్లా గారు చెప్పిన, పాదాంతంలో విరామం: “అలా విరామం ఇచ్చేరో వేపా/చింతావారమ్మాయితో పెళ్ళి చేసేస్తాను” అని ఛందో గురువులెవరైనా జీ.వో.జారీ చేసేరా?
    వేమన పద్యాల్లో ఈ “పాదాంతంలో విరామం” ?
    బాబ్బాబూ “వేమన పద్యాల్లో కవిత్వం వుందా?” అని అనకండి.

  1664. ప్రేమ కవితలు గురించి mahesh గారి అభిప్రాయం:

    10/24/2008 9:35 am

    మీ కవిత చూస్తుంటే మీరు ఎవ్వరినో బాగా ప్రేమించినట్లున్నారు. చాల బాగుంది. హృదయాన్ని తాకింది. ఇంకా మంచి కవితలు మీ కలం నుంచి ఆశిస్తూ…

  1665. అలుసవుతోన్న అమ్మ భాష గురించి rahamthulla గారి అభిప్రాయం:

    10/20/2008 7:37 pm

    ఇంటి భాషంటే ఎంత చులకనో!

    భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించారు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మాగ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథంస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కత గని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండ గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ఉన్నారు. మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం. కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగు తుందో చూద్దామని వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షులపేర్లు చెప్పారో చూడండి: మట్టగిడస, కర్రమోను, బొమ్మిడయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….. పరజ, గూడ, ఆసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపుచిలుక, నత్తకొట్టుడు…. భాషాసమృద్ధే స్వతంత్రతా భీజం అన్నారు నెహ్రూ. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా ఇండియాలో 7 శాతం మించి పి.జి స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర ఉన్నత విద్యాచైర్మన్‌ కె.సి రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18-10-2005) అంటే ఇంగ్లీషు భాష మీద పట్లులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నప్పటికీ ఉన్నత విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించు కుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి. తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడ వెళ్ళారు. కొద్దిరోజులకే జార్జిబుష్‌ హైదరాబాద్‌ రావటం, సివికాన్‌ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‌కు చెందిన వారేనని తేల్చటం, దిల్‌కుష్‌ అతిథి భవనంలో అమెరికా వెళ్ళ టానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు; ఇలా ఆంగ్లాన్ని స్తుతించారు: ఆంగ్లమేరా జీవితం- ఆంగ్లమేరా శాశ్వతం ఆంగ్లమే మనకున్నది- ఆంగ్లమేరా పెన్నిధీ ఆంగ్లమును ప్రేమించు భాయీ- లేదు అంతకు మించి హాయీ ||ఆంగ్ల|| తెలుగును విడిచీ- ఆంగ్లము నేర్చీ అమెరికా పోదామూ- బానిసలవుదామూ డాలర్లు తెద్దామూ ||తెలుగు|| అంటూ పాటలు కూడ పాడుతున్నారు.

    తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణా లతో సహా వివరిస్తున్నారు:
    1. తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించటం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనను పెద్దగా ప్రోత్సాహించటం లేదు. తెలుగులో చదివితే ఉద్యోగాలూలేవు.

    2. పెద్ద కులాలవాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండ చేయటానికి తెలుగు భాషా ఉద్యమాలు చేయిస్తున్నారు.

    3. నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవా లని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండి తులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.

    4. దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెలితే దుకాణాల బోర్డులపేర్లు చద వాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడ అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సుల భంగా వస్తుంది.

    5. యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్ను లెత్త బ్రహ్మవశమే?

    6. కంప్యూటర్‌కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్‌ నేర్వాలి.

    7. అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్య మాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి.

    ఇక మనం తెలుగువాళ్ళం అనీ, మన తెలుగును రక్షించుకుందాం అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?:

    1. మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషువాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా?

    2. మన పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవ పరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన

    3. మన భాషను రక్షించుకోవాలంటే నిర్భంద చట్టాలు ఉండల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సుళువుగా వస్తుంది. మన లిపిని కంప్యూ టర్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమయితే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం.

    4. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్‌ దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడ తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి?

    5. తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండ అమ్మా అని ఎందు కరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం.

    6. మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండలి. కంప్యూటర్‌ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషు లోకి అనువదించుకున్నారు. అవసరం అటు వంటిది.

    7. ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం చెయ్యడమే. తెలుగులోనే ఇంజనీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవచేయగలిగితే మన భాషతో పాటు మన జాతి వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందు లకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృ భాషకు ప్రాథంమిక విద్యలోకూడ స్థానం లేకుండ చేసే వాళ్ళది ఇంటి కూడు తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా? మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిర స్కారం అన్నారు మహాత్మాగాంధీ. మాతృ భాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడ సరిగా రావు అన్నారు జార్జి బెర్నార్డ్‌షా. మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారు: మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయ స్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినపుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం. (అమ్మనే మరుస్తారా! ఈనాడు 27-2-2006)

    అమ్మభాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథల మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్‌ డానియల్‌ నెగర్స్‌ ఇలా అంటున్నారు: తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకో డానికి సీఫెల్‌ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయు లకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించ లేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషాసంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాష లున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులు తాయి. భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య భాషలుగా పరణతి చెందాయి. అయితే ఫ్రెంచిభాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ఉనికిని కాపాడు కోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు. (ఆంధ్రజ్యోతి 22-2-2006) ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ఉన్నాయట. అయితే భాషాశాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60వేలకు మించి రాయడంలోకానీ, చదవడంలో కానీ ఉపయోగించలేరట. అంటే అరవై వేల అవ సరమైన పదాలను రాయడంలో, చదవ డంలో ఉపయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు.

    మెదక్‌ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్‌ పూర్‌ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోం దట. విత్తనాల పేర్లు చూడండి: తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డ జొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ. (వార్త 6-3-2006) ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవ సాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్‌ పదాల కిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడ ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబులు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయాని కొచ్చారు. బాషాప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా అంటే మొగలులు, బ్రిటీష్‌ వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే ఎవరిభాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యంకాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది.

    తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ఉన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో చాలా వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించు కోవాల్సిన పదజాలం ఎంతోఉంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగు తుంది? మన పంచాయితీలు, న్యాయ స్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచి నపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథంమిక విద్య అయినా తెలుగులో అందించినప్పుడు. ప్రైవేట్‌ స్కూళ్ళు తెలుగు నేర్పవు.

    మార్కుల కోసం కళాశాల విద్యార్ధులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్‌ చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో? కర్నాటకలో కన్నడం లేకుండ హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమి ళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది. ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్‌ స్కూళ్ళమీద కర్నాటక, తమిళనాడు ప్రభు త్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి. భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారుకూడ వెనుకబడిపోతారు. భాషను ఉపాధితో ముడిపెట్టండి అన్నారు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌.

    గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవం గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 19ని తెలుగు మాండ లిక భాషా దినోత్సవం గానూ జరుపుకుంటు న్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా.

    నూర్‌బాషా రహంతుల్లా

  1666. జ్ఞాపకాల ఎదురుచూపు గురించి Anand.g గారి అభిప్రాయం:

    10/08/2008 8:31 am

    భావం , కవిత చాలా బాగుంది.

  1667. గుప్పెడంత మనసు గురించి ఫణీంద్ర గారి అభిప్రాయం:

    10/06/2008 9:41 pm

    రాధిక గారూ,

    LOVED IT.

    మీ ప్రతీ కవితకూ నాకు “బాగుంది” అనే చెప్పాలనిపిస్తుంది. కానీ ప్రతీసారీ అదే చెప్తే, అదో cliched response గా మారిపోయి, సాంద్రతలేని స్పందనగా మీ ముందు ధ్వనిస్తుందని భయమేస్తుంది. కాబట్టి, దయచేసి, నేను “బాగుంది” అన్నప్పుడల్లా దాని ముందు “చాలా” అనే అదృశ్య విశేషణాన్ని దగ్గర దగ్గర ఓ లక్షమార్లు జత చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.

    “ఆదర్శాలు నేర్పామంటే
    అవనిలో మన బ్రతుకు
    దుర్భరం చేస్తుంది
    అవసరాలే తెలియచెప్తే
    నరకంలో కూడా
    మనకి చోటు లేకుండా చేస్తుంది”

    ముఖ్యంగా ఈ పేరా నాకు చాలా నచ్చింది.

  1668. గుప్పెడంత మనసు గురించి Audisesha reddy Kypu గారి అభిప్రాయం:

    10/06/2008 12:34 am

    మనసు గుప్పెడు అయినా అందులొని భావాలు గుప్పెడు కాదు. రాధిక గారు తన కవితలొ చక్కగా వివరించారు. కైపు ఆదిశేషారెడ్డి. నెల్లూరు.

  1669. జ్ఞాపకాల ఎదురుచూపు గురించి shivakumar గారి అభిప్రాయం:

    10/03/2008 1:09 am

    మీ కవిత చాలా బాగుంది.

  1670. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి peesaati soma surya sekharudu గారి అభిప్రాయం:

    10/01/2008 8:45 am

    చాలా కాలానికి చక్కని కవిత్వం చదివిన అనుభూతి కలిగింది. అతి మధురం గా ఉంది.

  1671. చంద్రోదయం గురించి Audisesha Reddy Kypu గారి అభిప్రాయం:

    09/20/2008 5:53 am

    కవిత చిన్నదే అయినా చక్కగా వుంది.

  1672. రచయితలకు సూచనలు గురించి KATTULA.VENKATESWARARAO గారి అభిప్రాయం:

    09/15/2008 10:50 pm

    మీ పత్రిక చాలా బాగుంది. నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. అయితే అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు.
    కె.వి.రావు.
    [కె. వి. రావు గారు, రచయితలకు సూచనలు మరొకసారి చదవమని మనవి. — సంపాదకులు]

  1673. మరో గుప్పెడు మొర్మొరాలు గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/15/2008 11:06 am

    భాషా, వాక్యమూ అద్భుతంగా ఉన్న ఈ వ్యాసంలో విషయానుక్రమ లోపం కొట్టచ్చినట్లు కనిపించింది.
    ఈ వ్యాసం సమీక్ష లా అనుకుందామా అంటే అలా అనిపించలేదు. పోనీ “నాకు నచ్చిన పుస్తకం ( పద్యం)” లా అనుకుందామా అంటే అలాగానూ లేదు. ఎత్తుగడ ప్రధానంగా స్వానుభవం తో మొదలయ్యింది. అది కాస్తా సాగదీయబడింది. తరువాత హఠాత్తుగా వస్తువు వైపు మళ్ళింది. ఎదో ఆ పుస్తకంలో విశేషాలు తెలుస్తాయి అనుకునేంతలో మధ్యలో “మానేపల్లి సత్యనారాయణ మేష్టారు ” వచ్చేసారు. పోనీలే అనుకుని సాగితే ఇంకో వ్యాస ప్రస్తావన వస్తుందీ అనుకుంటే తాతాజీ గారెందుకు రాసారో వివరణ చెప్పారు. వెంటనే ఇంకో వ్యాసం గురించి వ్యాసకర్త అభిప్రాయాలు బిలబిలా వచ్చేసాయి.
    “ఎందుకు తాతాజీ గారి పుస్తకం చదవాలి? అందులో ఆయన చెప్పిందేంటి? వ్యాసకర్తని అంతలా స్పృశించిన అంశాలేంటి? అనేవి ఎక్కడా కనిపించకపోడమే ఇందులో వున్న లోపం. స్వానుభవం ముందు చెప్పి, పుస్తకంలో ఏం వుందో రాసి, ఆ తరువాత వ్యాసకర్తని ప్రభావితం చేసిన అంశాలు రాసుంటే మరింత బాగుండేదని నా అభిప్రాయం. వ్యాసం పూర్తయ్యాక తాపీ గారి పుస్తకం గురించి తెలిసింది చాలా తక్కువ. ఇదంతా కేవలం వస్తువు చుట్టూ అల్లుకున్న అనుభవాల సాగతీత వల్ల అయ్యుండచ్చు.

    హస్తభూషణం అయితే ఓ సారి చదివి ఆనందిస్తాం. శిరోభూషణం అయితే పక్క వాళ్ళకీ చెబుతాం. మనోభూషణం అయితేనే ఆ పుస్తకం గురించి రాయడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ అది కనిపించలేదు ( నాకు మాత్రమే).

    హనుమంత రావు గారు “చదివించగలిగే శక్తి ఉన్న రచనని మరీ అంత హీనంగా చూడకూడదేమో! ” అని రాసారు. ఈ మాటలో కొన్ని కథలూ, వ్యాసాలూ, కవితలపై ఇంతకు ముందొచ్చిన ఘాటైన పదజాలం ఇక్కడ కామెంట్లలో లేదనే అనిపించింది. వ్యక్తిగత నిందలేనంత వరకూ అభిప్రాయ ప్రకటనకొచ్చిన అడ్డేం లేదు. కాదంటే ఈమాట వారి “పదునైన” కత్తెరెలాగూవుంది.

    అన్ని రచనలూ అందరికీ నచ్చాలని లేదు. కొందరికి వంకాయిష్టం. మరికొందరికి కాకర కాయ ప్రాణం. వంట సరిగ్గా ఉంటే, నచ్చిన వాళ్ళు లొట్టలేస్తారు. నచ్చని వాళ్ళు నీళ్ళు నమిలి నిష్క్ర మిస్తారు. మరీ కడుపు మండితే ఎలావుంటుందో అందరికీ తెలుసున్నదే!

  1674. తారామతి బిరాదరి గురించి jaabilli గారి అభిప్రాయం:

    09/15/2008 10:06 am

    ఈమాట సంచిక వెలువడగానే నేనాసక్తిగా వెదికి చదివేది మీ కవితే. మీరూహించే తీరు, దాని అభివ్యక్తి చాలా చాలా స్నిగ్ధంగానూ ముగ్ధంగానూ వుంటాయి. కవిత్వం ఒక కళ….కవిత్వం ఒక వరం … ఆ భగవంతుడు సదా మిమ్ములను ఆశీర్వదించును గాక!

  1675. రచయితలకు సూచనలు గురించి Audisesha Reddy Kypu గారి అభిప్రాయం:

    09/15/2008 5:52 am

    eemaata.com చూశాను బాగుంది. మంచి కథలు, కవితలతో చూడ చక్కగా వుంది. నిర్వాహకులకు ధన్యవాదాలు.
    — కైపు ఆదిశేషా రెడ్డి, రచయిత.
    23-1-1256 , అరవింద నగర్ ,
    నెల్లూరు – 524 003 ( ఆం .ప్ర ))

  1676. మరో గుప్పెడు మొర్మొరాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/15/2008 12:15 am

    చదివించగలిగే శక్తి ఉన్న రచనని మరీ అంత హీనంగా చూడకూడదేమో! ఈ రచన ముఖ్యోద్దేశం ఏమిటి? పాత పద్యాల గురించి సామాన్య పాఠకులకుండే భయాన్ని పోగొట్టడం. ఎలా? ఓ పుస్తక పరిచయం ద్వారా.

    దానిని మన పత్రికలలో ఏదో మొక్కుబడికో పేజీ నింపడానికో చేసినట్లు కాక తన అనుభవంతో అన్వయించుకుంటూ సొంత జీవితంలో ఎరిగిన వ్యక్తుల్ని స్మరించుకుంటూ చేశాడు. అది మెచ్చుకోదగ్గ ప్రయత్నం.

    పోయినేడు, ఈమాట మిత్రులు నన్నేమైనా వ్యాసం రాయమని పదేపదే పోరితే, సరేనని మాఊళ్ళో లైబ్రరీ కెళ్ళి పుస్తకాలు తిరగేశా – Essay Writing for Dummies లాంటిదేమైనా దొరుకుతుందని. వ్యాస రచన నాకంత సులభం కాదని తెలిసిపోయింది. ఈ వ్యాసమూ, అబిప్రాయాలూ చదివాక, ఆ పుస్తకాలలో చదివినదొకటి గుర్తుకొచ్చింది:

    “The hallmark of the personal essay is its intimacy. The writer seems to be speaking directly into your ear, confiding everything from gossip to wisdom. Through sharing thoughts, memories, desires, complaints, and whimsies, the personal essayist sets up a relationship with the reader, a dialogue – a friendship, if you will based on identification, understanding, testiness, and companionship.” [1]

    Montaigne, “Every man has within himself the entire human condition,” అన్నాడట. అంటే బాబ్జీలు గారు తన గురించి చెప్తున్నప్పుడు నిజంగా మన (అంటే నాలాంటి వాళ్ళు, కామేశ్వరరావు గారి లాంటి వారు కాదు) గురించి చెప్తున్నట్లు.

    అలా చూస్తే ఇది చదవదగ్గ రచనే. లోపాల్లేవని కాదు. ఉదాహరణకి, “పోతన్న కవిత్వ పటుత్వం,” వ్యాసం గురించి రాజాజీ వ్యాఖ్య కన్నా చెప్పదగ్గ విషయం లేదా? (తేల్చుకోడానికి ఈ పుస్తకం నాకందుబాటులో లేదు.) మరొకటి, వాళ్ళ చిన్నాన్న పక్కన ఆయవారాలు చేసుకునే ఆయన్ని చూసి చికాకు పడే నాన్నమ్మ – ఇది పాఠకుడిలో సరయిన స్పందన కలిగిస్తుందా?

    “ఈ యువతరం వారు సుప్రసిద్ధాలయిన పాత విషయాలు,” తెలుసుకోవాలనే కోరికతో రాశానన్నారు తాపీధర్మారావు, అవి బూజుపట్టిన మరమరాలు, why the heck you are reintroducing us to something passé? అంటోంది యువత!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] From “Introduction,” in “The Art of the Personal Essay: An Anthology from the Classical Era to the Present,” by Philip Lopate.

  1677. ఏటి ఒడ్డున గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    09/13/2008 7:45 pm

    నా “ఏటి ఒడ్డున” కవిత పై తమ స్పందనని,అభిప్రాయాలని తెలియజేసిన బాబ్జీలు,నిషిగంధ,మాలతి,కొడవళ్ళ హనుమంతరావు,కాళ్ళకూరి సాయిలక్ష్మి,సాయికిరణ్ కుమార్,కొత్తపాళీ,కొ స్యా సు రా, యెర్నేని లైలా, రాధిక,రవికిరణ్ తిమ్మిరెడ్డి గార్లకు ధన్యవాదాలు.
    I am truly happy that my poem could evoke a warm response from such gifted readership.
    Vaidehi Sasidhar.

  1678. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    09/12/2008 7:30 am

    పాణిని గారు
    నిజమే. పద్యం నచ్చడం, నచ్చకపోవడం నాకైనా, వ్యాసకర్త కైనా ఒక్క మాటలో చెప్పడం ప్రధానం కాదు, అవసరం లేదు. ఎందుకు నచ్చిందో, నచ్చలేదో అని సాహిత్య పరంగా స్పర్శించడానికి, పంచుకోవడానికి, చర్చించడానికి మాత్రమే వ్యాసాల ఉపయోగం, అభిప్రాయాలను వ్రాయడం, ప్రచురించడం, పాఠకులు చదవడం _ పడే శ్రమ అంతానూ.

    “సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు, యతులు ఈ పద్యంలో ఎంత అద్భుతంగా
    ఒదిగిపోయాయో” అన్నారు వ్యాసకర్త. అవి సాయపడే helpful, may be even necessary అంశాలు అయినా, అంత మాత్రంచేత గొప్ప పద్యానికి అవి ఏ మాత్రం అవసరమయ్యే, sufficient conditions కావేమో అని అనిపిస్తుంది.

    సోదాహరణంగా చెప్పాలంటే, మన సామెత, (ఎన్నో సామెతల పుస్తకాలలో అచ్చేసింది కూడా), ఇట్లా వ్రాస్తే
    “జగడమె ట్లావచ్చు జంగమ య్యాయంటె
    బిచ్చము పెట్టవే బొచ్చు ముంX” అన్నదాన్ని,

    సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు, యతులు, ప్రాసయతులు అద్భుతంగా ఒదిగిపోయిన గొప్ప, సీస పద్య పాదం అది అని అంటామా, అనుకుంటామా!
    .
    అయ్యో, తిక్కన గారి కవిత్వాన్ని ఎత్తి చూపడానికి మనకు ఈ పద్యమే దొరికిందా అని గింజుకుంటూ వ్రాసింది మాత్రమే ఇది.
    I change little bit the saying “with friends like this who needs enemies”, to say, “with examples like this, what need for critics” for the poet !

    విధేయుడు
    Srinivas

  1679. ఏటి ఒడ్డున గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి అభిప్రాయం:

    09/11/2008 7:48 pm

    అద్భుతంగా వ్రాశారు. ఒక impressionist painting ని చూసిన అనుభూతి. మీ కవిత చదివేక శారద గారి కథ చదివేను. మీ అద్భుతవైన పదచిత్రాలు పూరించలేని వెలితేదో శారద గారి కథలోని అతి సాదారణ పదాల్లో పూరించబడిందని నా అభిప్రాయం. నేనే తప్పేవో, మీ కవితలో వెలితి may be due over dose of romanticism in “ఈమాట” అని అనుకుంటున్నాను.

  1680. పడవ మునుగుతోంది గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి అభిప్రాయం:

    09/11/2008 7:02 pm

    పువ్వులూ, చెట్లూ, అకాశాలూ, సూర్యుళ్ళూ, చంద్రుళ్ళూ, మనసులో మాకుమేవే కల్పించుకునే అవాస్తవ సమస్యలు, నిన్న త్రాగిన నేతుల వాసన్లు, వీటినుంచి చిలికిన కథలో, కవితలో చదివి అలసిన మనసుకి, నేలని చూపించారు, బతుకుని కళ్ళ ముందర, ఏ మాత్రం భేషజాల్లేకుండా, నగ్నంగా కూర్చోబెట్టేరు.

  1681. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    09/11/2008 11:47 am

    నమస్కారం.
    నేను వ్రాసిందాంట్లో తప్పేమన్నా ఉంటే దయ చేసి క్షమించమని మొదటగా మనవి. మహా కవి తిక్కన కవిత్వాన్ని గాని, ప్రతిభను గాని విమర్శించే తాహతు కాదు కదా, పూర్తిగా గ్రహించి గుర్తించడం కూడా నాకు మించిన పనే. కేవలం ఈ పద్యం చదివిన తరువాత కలిగిన ఆలోచన మాత్రమే ఇది. తిక్కన రచనను బేరీజు వేసే దుస్సాహసం కాదు.

    ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ద్రౌపది కోపంగా దుశ్శాసనుని వొళ్ళు ముక్కలైపోనీ, భీముని బలం, అర్జునిని గాండీవం తగలబడడానికా, దుర్యోధనుని పీనుగెల్లనీ, అని వొళ్ళు మండి చెప్పడాన్ని సీస పద్యంలో, సహజత్వానికి దగ్గరగా చెప్పినట్టున్నది. అంత మాత్రం చెప్పడం న్యాయమూ, అవసరమే కాని గొప్ప విషయంగా కనిపించడం లేదు. వీధిలో మంచినీళ్ళ కోసమో, ఇంకదేనికోసమో తెలుగులో కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు ఉన్నట్టుగా అనిపించింది, కాకపోతే సీసం, ఆటలెదులలో. అట్లా కాదు, అసలు అదే ఆ పద్యం గొప్పతనం అంటే చెప్పేదేమీ లేదు, విని ఊరుకోవడం మాత్రమే, ఆ వీధిలోని తిట్లు విని ఊరుకున్నట్లుగా.

    అదే తిక్కన గారిదే, “వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి” అన్న పద్యం ఎంతో రసవంతంగా, పదాల ప్రవాహ ధారతో, మనకు గుర్తుండే విధంగా, ఆకట్టుకునే పద్యం ఉంది కదా!

    పోనీ, ఈ పద్యం కంటే సహజంగా, సరళంగా, రుసరుస సాగే ధారతో, “గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకంజెండుచున్నప్పుడొక్కండును నీ మొఱ నాలకింపడు” అని బెదిరించే తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ పద్యాలు కూడా ఉన్నవి కదా! తిట్లు, బెదిరింపులు, శపథాలు, ఆవేశపరమైన ఘట్టాలలో ఉన్న పద్యాలెన్నో ఉన్నాయి మనకు. వాటన్నింటి backdrop లో ఈ పద్యం గొప్పగా ఆకట్టుకుంటూ నిలబడుతుందని మాత్రం అనిపించడంలేదు.
    ***
    విధేయుడు
    Srinivas

  1682. ఏటి ఒడ్డున గురించి radhika గారి అభిప్రాయం:

    09/11/2008 10:31 am

    కవిత్వమంటే ఇదీ అని ఎవరికన్నా చెప్పాల్సివస్తే ఈ కవిత ఒక్కటి చూపిస్తే చాలు. ఎన్ని పదచిత్రాలో, ఎన్ని మెరుపులో….
    నా మనసు, నేనూ పూర్తిగా మునిగిపోయాము.

  1683. తారామతి బిరాదరి గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:

    09/09/2008 9:05 pm

    గత మూడేళ్ళుగా తారామతి బిరాదరిని ప్రతి రోజూ సందర్శిస్తూనే ఉన్నాను.
    వర్షం కురిసిన ఓ సాయంకాలం బిరాదరిలో నాకు కలిగిన అనుభూతే ఈ కవిత.
    పాలపర్తి ఇంద్రాణి.

  1684. అక్కడ… గురించి bhavani devi గారి అభిప్రాయం:

    09/08/2008 3:11 am

    కవిత చాలా బాగుంది.

  1685. తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి ramadevi గారి అభిప్రాయం:

    09/07/2008 10:41 am

    బాబ్జీలు గారు,

    ఇలా మనము ఈ వ్యాసం అభిప్రాయాల శీర్షిక కింద ఇన్ని సార్లు రాసుకోవచ్చో లేదో తెలియదు క్షమించాలి.

    మీరు మీ ఈమైల్ ఏదీ ఇవ్వలేదు.

    సాహిత్య సేవ చెయ్యక పోయినా ఫరవాలేదు కానీ సాహిత్యం కనీసం అర్ధం చేసికొగలిగితే బాగుండును అని కోరిక. “ఇక్కడ” అని మీరు అన్నది ఎక్కడో అర్ధం కాలేదు. నేను ఆంధ్ర ప్రదేశ్ లో ఇంగ్లీషు మీడియం పిల్లలగురించే చెప్పాను. వీళ్ళకి చదవటం రాయటం మాట్లాడడం వస్తాయి కాని పదవ తరగతి తరవాత తెలుగుకు ఎంత సాధ్యమయితే అంత దూరంగా వుండడానికి ప్రయత్నిస్తారు.

    మీరు నా ఆఖరి పేరా చదివారా? గ్లామరైజు చేస్తే, పాపులరైజ్ చేస్తే పిల్లలు ఎంత కష్టానికి కూడా వెనుకాడరు. మా పెద్ద బాబు ని వాడి పుస్తకం కాక CBSE లేక lCSE పుస్తకాలు చదమంటే అవసరం లేదు అనేవాడు. అదే IIT FOUNDATION Classes పేరుతో మిగిలిన పిల్లలు వెళుతుంటే నేనూ అని తయారయ్యాడు.

    There is something called Peer group influence.

    కాశీనాధుని గారన్నట్లు పిల్లలు ఏది నేర్పితే అది తక్కినవాళ్ళతో కలిసి అయిన పక్షంలో తొందరగా మన కష్టం ఎక్కువ లేకుండా తక్కువ వ్యతిరేకతతో నేర్చుకుంటారని అభిప్రాయం.

    విఠ లాచార్య సినిమా ట్త్రాష్ , హేరీ పాటర్ నవల అద్భుతం.

    మరీ ఎక్కువ ప్రాచీన సాహిత్యం కాకపోయినా కనీసం ఒక ఆరుద్ర, అత్రేయ పాట, ఒక శ్రీశ్రీ కవిత ని ఆనందించేలా అభిమానం పెంచాలని అసలు మాతృభాషని చులకన చేయడం అంటే తల్లిని కించపరచడం అని వాళ్ళూ అనుకోవాలని ఓ ఆరాటం.

    ఆజో ఇభొ ఫౌండేషన్ల లాగ సామాన్య ప్రజానీకం లో ఈ తపన, కనిసం ఒక ఫాషన్ గా ఫీల్ అయ్యేలా చెయ్యగలగాలని. యోగా కంటె Slimming centres fitness centres ఎక్కువ popular అయినట్లు ఒక Brand Image వచ్చెలా ఏమైనా చెయ్యలేమా?

    రమాదేవి గొడుగుల
    బాబ్జీలు గారు: మీ ఈమైలో, మీ ఫోను నంబరో ఇవ్వగలరా?
    email: rd6219@yahoo.com

  1686. గుప్పెడంత మనసు గురించి ko sya su ra గారి అభిప్రాయం:

    09/07/2008 6:30 am

    మనసులోంచి ఊరిన కవిత ,”మన” సులలో ముసురు పట్టించే కవిత.
    బాగుంది…కాదు…కాదు.. ( నామనసొప్పడంలేదు ) చాలాబాగుంది
    కొ శ్యా సు రా
    http://ksraoeil.blogspot.com/

  1687. ఏటి ఒడ్డున గురించి ko sya su ra గారి అభిప్రాయం:

    09/07/2008 6:11 am

    బాగుంది. చాలాబాగుంది.
    కవిత చదువుతున్నంత సేపూ, చదివినతరవతా కూదా నదీ తీరాన
    “పచ్చని ఆకుల పట్టుగొడుగుల క్రింద” సేదతీరుతూ,ఆకులమధ్యనుంచి తప్పించుకువచ్చ్చికిరణాల,ని,అరమోద్పుకళ్ళతో,చూస్తున్నట్టుగానే అనిపించింది…. కానీ..
    “అగరొత్తుల పరిమళం
    వెంటాడుతూనే ఉంటుంది”

    కొ స్యా సు రా
    http://ksraoeil.blogspot.com/

  1688. రచయితలకు సూచనలు గురించి “Vidyavachaspati” Prof Dr N N Murthy గారి అభిప్రాయం:

    09/07/2008 2:18 am

    పత్రిక చూడగానే ప్రవాసం లో ఉన్న నేను పరమానంద భరితుణ్ణయ్యాను. మీ పత్రిక బాగుంది.

    నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. ఆయితె అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు. మా వద్ద లికిత తెలుగు సాఫ్ట్ వేరుంది. అందులొ పంపవచ్చా? లేదా ఎలా పంపాలో తెలుప గలరు.

    “విద్యావాచస్పతి” డా. నరసింహ ముర్తి

  1689. తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    09/06/2008 12:43 pm

    ramadevi గారూ,
    rama గారు చెప్పింది అక్షరలక్షలు.
    కుటుంబం, స్కూలూ ఈ రెండు institutions మాత్రమే భాష కానీ మరోటి కానీ తరవాతి తరానికి సరిగ్గా చేరవేయగలిగినవి.
    స్కూలుని మనమెవరిమీ ఏమీ చేయలేం.
    మనమేం చేస్తున్నాం, భాషని నిలబెట్టుకుందికి? అక్కడ సంగతి నాకు తెలీదు, ఇక్కడ ఇవాళ్టికి కూడా ఇంగ్లీషు గురించే బెంగ. ఇంగ్లీషులో గట్టిగా, ధాటిగా మాట్లాడగలిగినవారికే పెద్దపీట. అందులోనూ “యూ నో, యూ నో” అంటూ మాట్లాడేవాళ్ళకి ఎదురుచెప్పం, వారెంత “అద్దువైతం” గా మాట్లాడినా.
    “కోతికొమ్మచ్చి” లో రమణ గారు వెటకారంగా రాసేరు “బాపు, నండూరి రామ్మోహన రావు గారితో ఇంగ్లీషులో మాటాడేడు” (రమణ గారి పెళ్ళి విషయం). అది ఇవాల్టికి కూడా నిజం.
    ఇక సాహిత్యం గురించి, అందులోనూ తెలుగు సాహిత్యం గురించి:
    తెలుగు సాహిత్యం చదవకపోతే, ఏవయ్యిందిట? ఎందుకంత బాధ?
    నిజానికి తెలుగు సాహిత్యం, తెలుగు మాట్లాడగలిగిన వాళ్ళు ఎంత మంది చదువుతున్నారు?
    కుందుర్తి ఆంజనేయులు గారు “వంద చెప్పు, వెయ్యి చెప్పు లక్షలో ఒకడుంటాడు కవిత్వం చదివే వాడు” అన్నది పరమ సత్యం. పత్రికలు చదివే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వుండొచ్చు. (నా లాటి వాళ్ళు)
    ఒకసారి, హిందీ నటుడు దిలీప్ కుమార్, విమాన ప్రయాణం లో ఒకాయన పట్టించుకోకుండా కూచున్నాట్ట. “క్రూ”, మిగిలిన ప్రయాణీకులూ తెగ హడావిడి పడిపోతున్నా. దిలీప్ కుమార్ అడిగేట్ట ఆ పెద్దమనిషిని “మీరు సినిమాలు చూడరా?” అని. వాళ్ళ కంపెనీ కోసం తీసిన సినిమాలు చూస్తానన్నాట్ట ఆ పెద్ద మనిషి. ఇక ఆపుకోలేక దిలీప్ కుమార్ “ఎవరు మీరు?” అని అడిగేట్ట. “I am JRD Tata ” అన్నాట్ట ఆ పెద్ద మనిషి.
    పిల్లలు తెలుగు మాట్లాడగలిగి, రాయగలిగితే చాలు. సాహిత్య “సేవ” చెయ్యకపోయినా పరవా లేదు. మాట్లాడ్డానికీ, రాయడానికీ కుటుంబం కష్టపడితే చాలు.

  1690. ఏటి ఒడ్డున గురించి Sai Kiran Kumar గారి అభిప్రాయం:

    09/06/2008 2:56 am

    చాలా బాగున్నదండి. ప్రతి ఖండిక అద్భుతంగా ఉంది. ఇంత మంచి కవిత్వం చదివి చాలా రోజులయ్యింది.

  1691. ఏటి ఒడ్డున గురించి Lakshmi Kallakuri – ‘Sailakshmi’ గారి అభిప్రాయం:

    09/04/2008 12:14 am

    సాయిలక్ష్మి స్వాభిప్రాయము:
    అర్ధరాత్రి అందమైన నిశ్శబ్దములో నీ పిక్నిక్ బాస్కెట్టు కొట్టేశానోచ్ ….!

    గలగల పారే ఆలోచనల సవ్వడిలేక
    కాలాన్ని కట్టేసి జలతరంగిణిల
    అలౌకిక (నీకవితా) రసాస్వాదన చేస్తూ
    వెలలేని అపార సౌందర్య చిత్రమైన నా సగంతో
    కలసి తాదాత్మ్యమ్ చెందానే ! సఖీ!
    ఆలపించింతిని రహస్యగానాన్ని.
    కల గాదే నీ కవితా పరిమళమ్ !

    ఏలనైనా నే ‘దేహి’ యందునే నీ కవితలకై
    వలదనకే! ‘వై’ యనకే చెలీ! వైదేహి!

  1692. పుస్తక సమీక్షల గురించి… గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/03/2008 10:58 pm

    రారా, తాపీ, కీట్సు, కుటుంబరావు

    ఇది మొదలెట్టడంతోటే నాకు కుటుంబరావు వ్యాసం, “విమర్శలకు ప్రమాణాలు,” (సాహిత్య వ్యాసాలు, పేజీ 413), గుర్తొచ్చింది.

    సెవెన్ స్టార్స్ సిండికేట్ ప్రచురించిన ‘నవత’ పత్రికలో కవిత్వాన్ని రారా నిశితంగా విమర్శిస్తే, తాపీ రారాని మందలిస్తూ, “రారా గారి విమర్శన లాంటి విమర్శనలు ప్రతి సంఘటనకూ స్పందించే సున్నిత హృదయులైన రచయితల మీద ఎంతటి తీవ్రంగా పని చేయగలదో చెప్పాలంటే పూర్వం ఇలాంటి విమర్శ కారణంగానే కీట్సు కవి జీవితం అంతమయింది. విమర్శకుని కర్తవ్యం అభ్యుదయ రచనను పెంపొందించటం తప్ప ఖండించడం కాదు,” అని రాశారు.

    రారాని సమర్థిస్తూ కుటుంబరావు రాసిన వ్యాసం అది.

    కొడవళ్ళ హనుమంతరావు

  1693. వాడుక భాషలో పద్యాలు గురించి Vamsi M Maganti గారి అభిప్రాయం:

    09/03/2008 10:12 pm

    JKM garu

    As usual wonderful piece from you. Thankyou.

    Might be off the track conversation but for some strange reason, your post here brings back memories of the following….Thanks to Dr Dwa.na.Sastry gari sAhitya kaburlu book –

    “మున్ పటి రూల్సుకు కట్టుపడమ”ని చెప్పినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు భావకవిత్వంపై ధ్వజమెత్తారు. బహుధాన్య సంవత్సరంనాటి “అభినవ సరస్వతి” పత్రికలోని ఈ రచన చదివితే చెళ్ళపిళ్ళవారి భావాలు తెలుస్తాయి.

    భావప్రధానమగు కవిత్వమే భావకవిత్వమగు. ఈ కవిత్వమందు బ్రయోగించు పదములన్నియు సంస్కృత పదములే కాని మనకవి సంపూర్ణముగ దెలియుట దుర్లభము. భావకవిత్వమనినంతమాత్రమున బదుగురకు దెలియనిచో బ్రయోజనమేమి? అంగటిలో నన్నియు నున్నవి – అల్లుని నోట శని యున్నది యన్నట్లగును. భావప్రధాన వాక్యములు కొంతవరకుండి తదితరము కొంతచేరియుండవలెనుగాని తుట్టతుదవఱకు నొకటే యుండరాదు. నేటి భావకవిత్వము గూటి చిలకేదిరా చిన్నన్నా లాగున వెళ్ళుచున్నది. అర్థము జెప్పలేము. ఇది యొక పరిభాష. సైన్సులోను, వైద్యములోను నెటులో యటులే నేటి భావకవిత్వమందును నీ పరిభాష ముక్కలు పడుచుండును.

    ప్రతి పుస్తకమందును నీ భావకవిత గాంపింపగలదు. కాని పూర్వులీ కవితకు శీర్షిక పెట్టలేదు. “కుందనము వంటి మేను మధ్యందినా తపోష్మహతి గందె, వడదాకె నొప్పు లొలుకు వదనమ”ని వరూధిని బ్రాహ్మణునితో బలికెను. ఆ పద్యములో భావకవిత్వ మిమిడియున్నది. భావకవిత్వము నారంభించినవారి యుద్దేశము మంచిదే కాని దాని నితరులెంతవఱకు నిర్వర్తించుచున్నారోయనునది విచారణీయము. ప్రస్తుతము వచ్చెడి భావకవిత్వము ప్రజలనెంతవఱకు రంజింపజేయునను విషయము వేఱు.

    ఇక నెంకిపాటల విషయమై సుబ్బారావుగారు యోగ్యతాపత్రమీవలసినదిగ నన్ను గోరిరి. “కడుపులో సెయ్యెట్టి కలసేసినాదే” మున్నగు పద్యములు వ్యంగ్యపూరితముగ మంచి యభిప్రాయమును దెల్పుపట్టులు చాలగలవు. ఒక్కొక్కొచో వ్యాకరణ దోషములను గూడ సరకుచేయకపోవచ్చును. “జగమేలే పరమాత్మా యెవరితో మొరలిడిదు”నను త్యాగయ్యగారు జగమేలెడి యని యనజాలకుండెనా? ఎంకిపాటలలో మొదటినుంచి చివరవరకు రసాభాస గలదు. కొన్నివేళల మాత్రము స్వదేశభాషను వాడిన దోషము లేదనిరి. కాని తుట్టతుదివఱకు గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస.

  1694. ఏటి ఒడ్డున గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/02/2008 9:19 pm

    “The Fire of Life”

    ఈమాటలోని పాత్రధారులే కొందరు రచ్చబండలో ఉన్నారు. ఆమధ్య ఇక్కడ పుట్టిన వివాదమొకటి ఎగిరి అక్కడ వాలింది. వైదేహి గారి కవిత చదివితే అక్కడ ప్రస్తావించిన Rorty వ్యాసం గుర్తొచ్చింది.

    అది చూసి, షెల్లీ వ్యాసం చదివితే ఇది కనిపించింది:

    “A Poet is a nightingale who sits in darkness, and sings to cheer its own solitude with sweet sounds; his auditors are as men entranced by the melody of an unseen musician, who feel that they are moved and softened, yet know not whence or why.”
    కవిత్వం దైవం లాంటిదట. అందుకే దానికి పెద్దపీట.

    కొడవళ్ళ హనుమంతరావు

  1695. ఏటి ఒడ్డున గురించి baabjeelu గారి అభిప్రాయం:

    09/01/2008 11:23 pm

    వైదేహి శశిధర్ గారూ,
    చిక్కని కవిత్వం.
    అన్ని ప్రక్రియలలోనూ కవిత్వానికే ఎందుకు పెద్దపీట వేస్తారో ఢంకా బజాయించి చెప్పేవి ఇలాటి రచనలే.
    ఇంత చిన్న మోనిటర్ మీద, ఏ ఇషాన్ ఆర్యో షూట్ చేసిన దృశ్యాన్ని, చూపించగలిగేరు.

  1696. పుస్తక సమీక్షల గురించి… గురించి rama గారి అభిప్రాయం:

    09/01/2008 7:52 pm

    వెంకటేశ్వర రావు గారు, మీ దృష్టికి రాలేదో, లేక మీకు దొరకలేదో, నాకు తెలీదు గానీ, జయప్రభ గారి “వామనుడి మూడోపాదం” కవితా సంపుటి మీద వెల్చేరు నారాయణ రావు గారు చేసిన సమీక్ష చెప్పుకోవలసిన రివ్యూ. ఆ పుస్తకం అచ్చై తెలుగులో ఒక సంచలం సృష్టించిన రోజుల్లో ఆంధ్రజ్యోతి వీక్లి లో అచ్చు అయ్యింది. అలాగే దాదాపు వెనువెంటనే అనుకుంటాను జయప్రభ గారి “భావకవిత్వంలో స్త్రీ” అన్న విమర్శ పుస్తకాన్ని పురాణం సుబ్రమణ్య శర్మ గారు ఒక మూడు వారాల పాటు ఆంధ్ర జ్యోతి వీక్లి లోనే సమీక్ష చేసారు. అది ఒక కొత్త దృక్పథాన్ని సరిగా గ్రహించలేక సమీక్షకుడు ఎన్ని పిల్లి మొగ్గలు వేసి బొల్తాపడతాడో చెప్పడానికి మరో వుదహారణ. మీరు వీటిని పట్టించుకోలేదేమా? అనుకున్నాను.

    rama

  1697. అమెరికా పర్యాటకుల రెండు పుస్తకాలు – II గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/01/2008 12:45 pm

    రవిశంకర్ గారి కవిత్వం అంటే ఇష్టపడే వాళ్ళల్లో నేనొకణ్ణి. ఈ వ్యాసం మొదటి భాగం కవితా సమీక్ష ఉన్నట్లుగా నవలా సమీక్ష లేదు.

    నవీన్ గారు ఆయన అనుభవాలు రాసారు. అమెరికాలో జరిగే కొన్ని విషయాల గురించి పైపైనే స్పృశించి చెప్పారు. అందువల్ల ఇది ఇండియానుండి వచ్చేవాళ్ళకి గైడులా ఎలా ఉపయోగపడుతుంది? ఈ నవల్లో చాలా చోట్ల పొందుపర్చిన వివరాలు సరిగ్గా లేవు. తెలీని వాళ్ళకి పరవాలేదు కానీ, అమెరికాలో ఉంటున్న వాళ్ళకి ఈ నవల ఓ పట్టాన మింగుడుపడదు.

    ఎయిర్ పోర్ట్లో అమెరికన్ సంభాషణ గురించి ఈ వ్యాసంలో రాయలేదు. ఇరాక్ యుద్ధం గురించి నవీన్ గారేమనుకుంటున్నారో అది అమెరికన్తో మాట్లాడినట్లుగా రాసారు. పరిచయం లేని వ్యక్తుల దగ్గర అమెరికన్లు అంత లా మనసు విప్పి చెప్పరు. సిడ్నీ షెల్డన్ నవల్లో సెక్స్ లేకపోతే ఇక్కడ పుస్తకాలెవరూ కొనరన్నట్లుగా రాసారు. అది మాత్రం నిజం కాదు. ఇలాంటి చోటే నవీన్ సొంత అభిప్రాయాల్ని చొప్పించారన్నట్లుగా ఉంది. ఇవేమీ ఈ వ్యాస సమీక్షలో రాయలేదు. ఇది ఖచ్చితంగా రివ్యూ రాసేటి నవలల జాబితాలో చేరదు. వ్యాస రచయిత చెప్పినట్లుగా ఒక్క బిగిని చదివేసే నవల మాత్రం కాదు.

    ప్రశంసల దగ్గర పెల్లుబికిన విశేషణాలు విమర్శ దగ్గర మౌనం వహించడం ఈ వ్యాసంలో కొట్టచ్చినట్లుగా కనిపించింది. నవల చదివితే ఈ అభిప్రాయం మరింత నిర్ధారింప బడుతుంది. ఇదే ఏ పేరులేని మామూలు రచయితో రాస్తే ఇలా రివ్యూలకి నోచుకుంటుందా? అందుకే అతితక్కువగా మెల్లని స్వరంలో విమర్శ సాగింది.

    యాత్రా నవల అన్నారు. అంటే యాత్ర చేస్తూ రాసిన నవలనా లేక యాత్ర గురించి నవలనా? ట్రావెలాగ్ అని అనుంటే పోయేది. మరలా నవల అంటూ ఈ బిల్డప్పు ఏమిటి? నవలకి కావల్సిన మౌలిక లక్షణాలు ఈ పుస్తకంలో ఏ కోశానా కనిపించవు. అది వ్యాస రచయిత ఎక్కడా చెప్పినట్లు లేదు. విమర్శ మాత్రం ఘాటుగా లేదు. మరీ చెయ్య లేదనకుండా “కవర్ డిజైన్” సరిగ్గా లేదు. ఇంకాస్త శ్రద్ధ చూపిస్తే బాగుండేది అని రాసారు. ఇందులో నవలా వస్తు విమర్శ లేదు. స్నేహ పూర్వక సమీక్షలా వుంది.అందుబాటులో వుంటే చదవండి. చదివాక మీరూ నాతో ఏకభవిస్తారన్న నమ్మకం నాకుంది.

    [ఈ కామెంటు ఎడిట్ చేయబడినది – సం.]

  1698. మంచులో తడిసిన ఉదయం గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    08/30/2008 5:42 pm

    బాబ్జీలు గారూ, జయప్రభ గారూ,
    నా కవితపై మీ స్పందన కి , ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
    గత కొద్ది వారాలుగా ఇండియా లో Whirlwind tour లో ఉండటం వల్ల ఈమాట చూడలేకపోయాను.

    జయప్రభ గారూ,
    “జలపాత(స్నాన)పు ఖడ్గచాలనానికి” వెరవని వాళ్ళు , మంచు గాలి వణుకు కి జడుస్తారంటారా?! 🙂

  1699. ఛందోధర్మము గురించి Bhushan గారి అభిప్రాయం:

    08/29/2008 1:03 am

    శ్రీరంగనీతులు చెప్పేవాళ్లు దొంగదారులు దూరొచ్చు. మనకు నీతి కథలు రాసేవాళ్లు అవినీతిగా వుండొచ్చు. తానే ఆచరించలేనిదాన్ని ఇతరులకెందుకు చెప్పాలి? దెయ్యాలు వున్నట్టు ఆద్యంతం కథ రాసిన రచయిత ఆఖర్న తన జుట్టులోని వెంట్రుకల్ని చేతబడి చేసేవాళ్ళకెవరికైనా పంపించడానికి రెడీ అంటాడు. కథలోని మంచిని సమర్థించేవాళ్లు, కథకుళ్లోని చెడ్డని ఖండించకపోతే అప్పుడు ఎటు వైపున వున్నట్టు? ఇలా అభిప్రాయాన్నిచెప్పిన జె.యు.బి.వి.గారూ, సాయిబ్రహ్మానంద గొర్తిగారూ, మీ దగ్గర మహాప్రస్థానాలు వుంటే వాటిని మహాసముద్రంలో విసిరెయ్యాల్సిన పని లేదు గానీ, అలాంటి రచయితల వ్యక్తిగతజీవితాల కుళ్ళుని విమర్శించి తీరాల్సిందే. లేకపోతే చాలామంది పాఠకులు, ఆ రచయితల కథల్లాగే, కవితల్లాగే వాళ్ళని కూడా వుత్తములనుకునే ప్రమాదముంది.

    భూషణ్
    nagabhushanamr@hotmail.com

  1700. ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    08/27/2008 11:30 pm

    నమ్మకాలు – బ్రతుకుతెరువు

    సాయి గారికి,

    చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.

    రేపో మాపో చండీదాస్ స్వీయచరిత్ర వెలువడితే, ఆయనొక యోగిలా బ్రతికాడని తెలిస్తే, అనుక్షణికం విలువ ఓ పిసరు పెరగొచ్చు. భ్రష్టుడనిపిస్తే ఓ పిసరు తగ్గొచ్చు. కాని మౌలికంగా నవల విలువలో మార్పుండదు. ఉంటే మనం సాహిత్యాన్ని వెలకట్టడానికి వాడే తూనికరాళ్ళని తనిఖీ చెయ్యాలి.

    శ్రీశ్రీ భక్తి రచనలు జీవనోపాధి కోసం రాశానన్న సమర్థన దబాయింపు గానూ లేదు, సంజాయిషీ గానూ లేదు. కఠోరమైన వాస్తవికతతో కూడి ఉంది. మహాప్రస్థానం తోనో విప్లవ రచనలతోనో వచ్చే డబ్బుతో పొట్ట గడుస్తుందంటారా? గడవకపోతే ఏమాయె, “సతుల్, సుతుల్, హితుల్ పోతే పోనీ, … తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ,” అన్న కళా రవి, ఆ మాత్రం నిజజీవితంలో ఆటుపోట్లకి తట్టుకోలేనివాడు, కవిత్వం, కాకరకాయా రాయడమెందుకు అంటారా?

    నాస్తికులు పురాణకథని చెప్తే ప్రశ్నించే హక్కు పాఠకులకుండొచ్చు. కొడవటిగంటి కుటుంబరావుకి నివాళులర్పిస్తూ చలసాని ప్రసాదరావు చందమామ నిర్వాహకులు సమర్పించిన శ్రద్ధాంజలిని ప్రస్తావించారు:

    “తన విశ్వాసాలు, నమ్మకాలూ ఎలాంటివైనా చందమామ పాఠకుల కోసం ఆయన విశేషమైన కృషి చేసి, సేకరించి, అందజేసిన ప్రాచీన ఇతిహాసాలూ, పౌరాణిక గాథలూ, ఆ శైలీ మరువరానివి. స్వర్గీయ శ్రీ చక్రపాణి ఆశయాలకు రూపం కల్పించి, తన శైలితో పాఠకలోకాన్నీ, తక్కిన పత్రికలనూ ఆకర్షించిన మేధావి శ్రీ కుటుంబరావు.”

    అంటే కుటుంబరావు తన నమ్మకాలతో సంబంధంలేని రచనలకి మెరుగులు దిద్దే పనికి అంకితమయ్యేడనే కదా! ఎందువలన? అని చలసానే కుటుంబరావుని సూటిగా ఆయన బ్రతికుండగనే అడిగారు:

    “మీరు – నేనూ ఒకే వృత్తిలో ఉన్నాం. ఎడిటర్ గిరీ అనేది ఒక వృత్తి. బతుకుతెరువు. మనం ఎడిటర్లగా కాక ఏ ఆఫీసర్ గానో, లెక్చరర్ గానో, బ్యాంకు ఉద్యోగిగానో వుంటే, ఆఫీసులో మనం చేసే పని గురించిగానీ, దాని స్వభావం గురించిగానీ ఎవరూ ప్రశ్నించరు, విమర్శించరు. కానీ, ఎడిటర్ అనీగాన అందరూ అతను పనిచేసే పత్రికలోని భావాలన్నింటికీ అతన్నే బాధ్యుడిగా భావిస్తారు, విమర్శిస్తారు. మీరు చందమామ లో వేసే కథల స్వభావం గురించి, వాటిలో రాక్షసులు, భూతాలు, దయ్యాలు, దేవుళ్ళు మున్నగు వాటిలో గల ఔచిత్యాన్ని గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు…. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?” (రసన, పేజీ 133.)

    కుటుంబరావు దీనికి సమాధానం ఇవ్వలేదు కాని, నేనూహించుకోగలను – కుటుంబరావుకీ పోషించాల్సిన కుటుంబమొకటుంది. శ్రీశ్రీ, కుటుంబరావు, ఇంకా అనేకమంది, పొట్టపోషణ కోసం తమ నమ్మకాలతో పూర్తిగా కాకపోయినా కొంతయినా పొసగని పనిలో ఉండి ఉండొచ్చు. వాళ్ళు తమ నమ్మకాలని వదిలెయ్యాలా? లేక వేరే బ్రతుకుతెరువు చూసుకోవాలా? మీరయితే ఏం చేస్తారు?

    కొడవళ్ళ హనుమంతరావు

  1701. ఛందోధర్మము గురించి జె.యు.బి.వి. ప్రసాద్ గారి అభిప్రాయం:

    08/26/2008 7:25 am

    విప్లవ్ గారు, “పిల్లలకొరకు ‘నీతి పుస్తకాలు’ రాయటానికి child molestors పనికి రారు, రాసిన విషయం ఎంత గొప్పదయినా సరే. రాసే వాళ్ళకు credibility ఉండాలి కాబట్టే ఎవర్రాసారు అన్నది ముఖ్యం” అని రాసినదాన్ని, బాబ్జీలు గారు మహా యాంత్రికంగా అర్థం చేసుకుని, బదులుగా ఆయన, “మీరు రాసిన “ఛైల్డ్ మోలెస్టర్స్” చిన్న పిల్లల కథలు రాయడానికి పనికిరారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళకోసం కథలు రాస్తే పర్వాలేదా?” అని అడిగారు. అదా దానర్థం?

    విప్లవ్ గారు రాసిన మాటల వెనకనున్న అర్థాన్ని సరిగా గ్రహించాలి. నీతివంతమైన ప్రవర్తన లేని మనుషులు గురివింద గింజల్లాగా, నంగనాచుల్లాగా ఇతరులకి నీతులు చేప్పే అర్హత కలిగి వుండరు అని అర్థం. యాంత్రికంగా అర్థం చేసుకుని, చైల్డ్ మోలెస్టర్సూ, పెద్దాళ్ళూ, గట్రా అని రాస్తే, ఏమన్నా అర్థం వుంటుందా?

    విప్లవ్ గారు రాసింది చాలా కరెక్టు. “దెయ్యాలు మంత్రాలు వల్లించకూడదు” అని అంటారు చూశారా, అలాగన్న మాట. నీతి లేని వారు నీతి గురించి ఇతరులకి చెప్తే, “నువ్వు చేసేదేవిటీ, చెప్పొచ్చావు గొప్పగా ఇతరులకి” అని ఆ ఇతరులు నిలదీస్తారు. వాళ్ళు దులుపుకు పోతారనుకోండీ, అది వేరే సంగతి.

    అయితే ప్రస్తుత సమాజాన్ని పరిశీలించండి. దెయ్యాల కధలూ, థ్రిల్లర్ నవల్లూ రాసి, పాపులర్ రచయితగా పేరు సంపాదించుకుని, కాలేజీ ఆడపిల్లను వశపరుచుకుని, ఆ పిల్ల ఆత్మహత్యకు కారణమైన గొప్ప రచయిత ఈ రోజుకీ గొప్పగానే చలామణీ అవుతున్నాడు. విప్లవాల గురించి గొప్పగా రాసి, ఇద్దరు భార్యలను పెట్టుకుని, బయట స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటూ, “ఎన్ని సిగరెట్లు కాల్చినా చార్ మీనార్ కాల్చిన తృప్తి వుండదు. ఎంత మంది ఆడవాళ్ళతో తిరిగినా, నా రెండో భార్యతో గడిపినట్టు వుండదు” అని ఆత్మ కధలో రాసుకుని, ఆ బయటి ఆడవాళ్ళను స్నేహితులతో పంచుకుంటూ, విచ్చలవిడిగా తిరుగుబోతుతనాన్ని ప్రదర్శించిన వారు మహా కవులుగా చలామణీ అవుతూ, పతితల గురించీ, భ్రష్టల గురించీ గొప్ప కవిత్వాలు రాశారు. ఇద్దరు భార్యల భుజాల మీదా చేతులు వేసి, పత్రికల్లో ఫొటోలు వేయించుకునే విప్లవ కవులున్నారు. ఇలా ఎంత మంది గురించో చెప్పుకోవచ్చు. ప్రజలు వీళ్ళ సాహిత్యం చదవడం మానేశారా? ఆ మధ్య ఆడపిల్లల్ని ఇండియా నించి తీసుకువచ్చి, అమెరికాలో వ్యభిచారంలోకి దించిన బిజినెస్ మేన్ కేసు గురించి విన్నాము. ఆ మనిషీ హాయిగా బతుకుతూనే వున్నాడు.

    పైన వుదాహరించిన వాళ్ళకి సమర్థకులు లేరా? వాళ్ళేమంటారు? “ఈ సాహిత్యకారుల అసలు జీవితాలు మాకెండుకూ? వారు రాసింది మాత్రమే చూస్తాం” అని సన్నాయి రాగాలు తీస్తారు. ఇంకా గడుసు సమర్థకులైతే, “వీళ్ళ గురించి తెలిసినవన్నీ నిజాలే అని గేరంటీ ఏమిటీ? ఏమో, అవి నిజాలు కావేమో? మీరేమన్నా చూశారా? మీ దగ్గర రుజువులున్నాయా?” అని మన్నే దబాయిస్తారు. చాలా మంది అయితే, “ఏమోనండీ! మాకవేవీ తెలియవు” అని తప్పించుకుంటారు.

    అదీగాక నీతులు రాసేవారి చరిత్రలు చాలా మందికి నిజంగానే తెలియవు. తెలిసినా పట్టించుకోరు. “సిగరెట్ కాల్చేవాడు ఇతరులకి కాల్చొద్దని చెప్పకూడదా? ఆ అలవాటు వల్ల జరిగే హాని అనుభవిస్తున్నాడు కాబట్టి, ఇతరులకి చెప్పగలుగుతున్నాడు” అని మొండిగా వాదిస్తారు కొంత మంది మహానుభావులు.

    ఇదంతా చూస్తే, కప్పల తక్కెడ వ్యవహారమే గుర్తొస్తుంది. “ఏది నీతీ, ఏది అవినీతీ? అన్నీ కాలాన్ని బట్టి మారుతూ వుంటాయి” అని అడ్డగోలుగా మాట్టాడే సూడో ఫెమినిస్టులూ, సూడో కమ్యూనిస్టులూ కూడా వున్నారు.

    ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, విప్లవ్ గారు చెప్పింది కరెక్టే అయినా, ప్రస్తుత సమాజంలో ఆయన చెప్పింది జరగడం లేదు. అవినీతి పరులు నీతి గురించి సాహిత్యంలో పొగలు కక్కుతూనే వున్నారు!

    – జె.యు.బి.వి. ప్రసాద్

  1702. ఛందోధర్మము గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:

    08/25/2008 6:34 am

    “ఇదిగో, బతుకంటే ఇదీ బతుకు, ఇలా బతకడవే బతుకు.” ఫలాని విధంగా బ్రతకటవే గొప్ప, ఫలాని దార్లో ప్రయాణించడవే వొప్పు, బతుక్కి ఫలాని నిర్వచనవే కరక్టు. ఒక అనంతవైన అనుభవానికి దిశ నిర్దేశం చేసే ప్రయత్నం. ఎల్లలు లేనటువంటి ఒక అద్భుతానికి చట్రాలు బిగించే ప్రయత్నం. నియమితవైన సంఘంలో, పరిమితవైన అవకాశాలున్న సంఘంలో (బతుకవసరాలు తీర్చుకోడానికి) ఈ రకవైన దిశనిర్దేశం సహజవే. కానీ కొందరుంటారు వాళ్ళని నియమాల్తోనూ, అవకాశాల్తోనూ ఆపడం సాద్యంకాదు. అకాశాన్నీ, గాలిని, అనంతాన్ని నింపుకుని పుట్టిన వాళ్ళు, ఆన్ని చట్రాలని పగల కోడ్తారు, అన్ని నియమాల్ని చిందరవందర చేస్తారు. వాళ్ళకి బ్రతుకొక స్వప్నం, వాళ్ళు బ్రతుకుని, బ్రతకడాన్ని వేరువేరుగా చూడరు, వాళ్ళు కవితని, వచన కవితని విడదీసి చూడరు. నా ద్రుష్టిలో బ్రతుకుని అనుభవించి పలవరించడవే కవిత్వం. ఆ పలవరింతకి వొక నియమావళి అక్కరలేదు, ఒక రెఫరెన్సు అక్కరలేదు. దానికో ప్రణాలిక, పాఠ్య గ్రంధం అక్కరలేదు, దానికో సర్టిఫికేట్ అక్కరలేదు. ఆ అనుభూతి, ఆ పలవరింత ఎదుటి మనసుని తాకగలిగితే చాలు (తాకకపోయినా పరవాలేదు). అది ఏ రూపంలో వుంది, ఏ భాషలో వుంది, ఎవరి బతుకును తనలో పొదువుకునొచ్చింది అనేవి అవసరవని నేననుకోను. ఛందోధర్మాలు, వ్యాకరణ సూత్రాలు వుంటే వుండనివ్వండి, కానీ అవి లేకపోవడం బలహీనత కాదు. భావప్రసరణ జరిగిందా లేదా అనేదే కావాలిగానీ, గడిచిపోయిన దినాల్లో, నడిచిపోయిన కవుల రెఫరెన్సులు అవసరం వుందని నేననుకోను.

    నామిని, రావీ శాస్త్రి రచనల్లో నాకా బతుకు పలవరింతే కనపడుతుంది, నాకు కవిత్వవే కనపడుతుంది. అది వచనవా అంటే వచనవే కానీ అది నిస్సండేహంగా కవిత్వవే. మన అనుభవాన్ని వ్యక్థం చేయడానికి రోజువారీ పదాలు సరిపోకపోవడవేవిటో నాకు తెలీదు. అక్కడా, ఇక్కడా గతంలోనూ, గ్రంధాల్లోనూ వెతకనక్కరలేదు. ఈమాటలో ప్రచురితవైన కవితల్లో (కవితలన్నీ నచ్చాలని కాదు), నాకెక్కడా పదదారిద్ర్యం కనపడలేదు. మామూలు మనుషుల, మామూలు బ్రతుకుల, మామూలు మాటల్లో వ్యక్తీకరించలేని జీవితానుభవం వొకటుందా?

  1703. ఈమాట గురించి గురించి mOhana గారి అభిప్రాయం:

    08/21/2008 7:52 am

    నమస్తే /\
    ముందంతా ఈమాట అంటే రెండు నెలలకోసారి కొత్త వ్యాసాలను,
    కవితలను, కథలను ఒక నాలుగు రోజులు చదవడం, అప్పుడప్పుడు
    వీలున్నప్పుడు పాత సంచికలను చదవడం వాడుకగా ఉండేది.
    మరి ఇప్పుడో, అదెవరో గాని (వారికి భగవంతుడు నూరు సంవత్సరాల
    ఆయుస్సును ప్రసాదిస్తాడు తప్పక) శ్రీ(మతి) బాబ్జీలుగారి ధర్మమా
    అని ప్రతిరోజూ ఒక్కమారైనా ఈమాటను అభిప్రాయాలకోసం
    చూడాలనే ఆకాంక్ష కలుగుతూ ఉంది. వారి అభిప్రాయాల
    ముత్యాలను ఏ వ్యాసుడైనా ఒక వ్యాస హారంగా నిర్మిస్తే ఎంత
    బాగుంటుందో?
    – మోహన

  1704. ఛందోధర్మము గురించి baabjeelu గారి అభిప్రాయం:

    08/20/2008 9:06 pm

    రాసీ వాళ్ళ “అర్హత” తో పేచీ?
    రాసీ వాళ్ళూ “రాసినదాని” తో పేచీ?
    “అర్హత” లేన్నివాళ్ళు మంచి కవిత్వం రాస్తే పేచీ?
    “అర్హత” వున్న వాళ్ళు ఎలా గిలికినా “పేచీ”?

    చాలా పెద్ద పేచీ.

  1705. ఛందోధర్మము గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    08/20/2008 10:22 am

    కుక్కపిల్ల, అగ్గిపెట్టి, సబ్బు బిళ్ళ, గుర్రం, గాడిద కావేవీ కవితకనర్హం. ఎటొచ్చీ రాసేవాళ్ళకున్న అర్హత తోనే పేచీ.

    రాజాశంకర్ కాశీనాథుని

  1706. పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి jayaprabha గారి అభిప్రాయం:

    08/20/2008 10:07 am

    అయ్యా బాబ్జీలు గారూ! మీరెవరండీ బాబు!!
    మాకేసి ముత్తేలమ్మని మధురవాణిని నాకు చెప్తున్నారు. vaaLLu maa APPAle kaaraa?”chatri baabu” ikaTaalu meevannee!!

    కృష్ణ దేశికాచారి గారి వ్యాసం మీద మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. చాన్నాళ్ళకి మంచి సరదా కలిగింది నాలో. కానీ మీతో పోటీపడి respond కాగల సత్తువ నాకు లేదు గనుక విరమించుకుంటున్నాను. కవులకి కవిత్వంతో పాటు వుండవలసిన మిగితా నేర్పుల తాలూకు లిస్టు ఇంకా నాకు నవ్వుతెప్పిస్తూనే వుంది.

    ముత్తాలమ్మో, మధురవాణో, ఎవరైతేనేం గానీ, వున్నవిషయమే అన్నది కదా? సారం అన్నది అనిర్వచనీయం సామీ. వుప్పు ఎక్కువో, తక్కువో తిని చెప్పాల్సిందే, విని కాదు!

    మీ “ఇజీనగరంలో” లేదా “ఇస్సపట్నంలో” మరోపాలి బొంకులదిబ్బ కాడినించి అయ్యకోనేరు దాటి వెతకండి. పైడి తల్లి, నూకాలమ్మ వరం ఇస్తే సారం మీకు తెలుస్తుంది. అనిర్వవచనీయం గనక చర్చతో పనిలేదు. ఎవరెవరి రూప సారాల సంతోషాలు వారివే.

    anyway, చాలా enjoy చేస్తున్నాను మీ అభిప్రాయాలని. “ఒగ్గీకండి. రాస్తూండండి. బెగి తొంగోవాలి. శానా పొద్దోయింది”

    సెలవ్..
    జయప్రభ.

    a_jayaprabha@yahoo.co.in

  1707. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    08/20/2008 10:05 am

    అయ్యా బాబ్జీలుగారు కవిత్వం, సాహిత్యం గురించి కాదు కాని, నాకు తెలిసిన విషయంలో మాత్రం మీరు పొరబడ్డారేమో అని భయం!

    పిల్లల “హోం వర్క్” (సొంతంగా) చేయడం సులువంటే ఒప్పుకోవచ్చేమో కాని, “చేయించడం సులువు” అంటే నిజమేనా అనిపిస్తుంది. చేయించడానికి కనీసం పిల్లలను ఒక్కచోట కూచోబెట్టాలి. కాళ్ళు కట్టేసినా, పిల్లకాయల మనసులను కట్టేయడం, కాదు ఆకట్టుకోవడం, ఒక చాలెంజ్. ఇంతా అయింతర్వాత మన ధిమాక్ లోకెక్కింది వాళ్ళ ధిమాక్ లోకి ఎక్కించడాన్ని ఏమన్నా అనొచ్చు కాని సులువు అని మాత్రం అనగలమా అని డౌటు. ఈ తిప్పలంతా చూసే గురువుగారిని “గురు బ్రహ్మ” అనికూడా అనేసారేమో అని అనుమానం కూడా. దీనికంటే ఒకచోట కూర్చోని, అక్షరాల ఒక కావ్యమో, విమర్శో, గేయమో, వచనమో, కథనో, నవలనో, లేకపోతే ఇప్పటి దాక పుట్టని ఒక అపూర్వ సాహితీప్రక్రియనో ఈ తిప్పలగురించే వ్రాసేయడం సులువేమో అని కూడా చెడ్డ అనుమానం. కాదంటారా?!

    విధేయుడు
    -Srinivas

  1708. పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    08/20/2008 9:46 am

    “నాకు పద్యం రాయడం రాదు, అందుచేత రాయలేదు” అని. అది మా కాలోజీ సూటితనం. మరి నేను చెప్పేది కూడా అంతే.

    జయప్రభగారూ,
    మీరు చెప్పింది కాళోజీకి, ఈనాటి వాళ్ళకీ వర్తిస్తుందేమో కానీ, మొదట్లో కవిత్వాన్ని పద్యానికి దూరంగా నడిపించిన అతిరథ మహారథులకి ( గురజాడ, శ్రీశ్రీ, నారాయణబాబు, తిలక్, ఆరుద్ర) వర్తించదనుకుంటాను. (మిగతావాళ్ళు మహారథులు కారని నా ఉద్దేశం కాదు, వాళ్ళకి పద్యం రాయడం వచ్చో రాదో నాకు తెలీదు!)

  1709. ఛందోధర్మము గురించి baabjeelu గారి అభిప్రాయం:

    08/20/2008 9:27 am

    పావలా పట్కా, పాతికరూపాయిల జట్కా.
    పట్కా ఛందస్సు, సంధులూ, సమాసాలూ వగైరాలు.
    జట్కా కవిత్వం.
    మరి గుర్రం?
    అసలయిన దానినెలా వొగ్గెస్తావండీ.
    కవితా వస్తువు”.

    పద్య కవిత్వవయినా, పొలై పొలై / మిల్లు ఖద్దరు కవిత్వ వయినా “ఇత్యాని పద్య/కవిత లక్షణాని” (పైటలు/చున్నీలు తగలెట్టండి అనే కవిత్వవయినా)

  1710. ఛందోధర్మము గురించి satya rama prasad kalluri గారి అభిప్రాయం:

    08/20/2008 7:27 am

    అన్నట్లు శ్రీశ్రీ ‘ సిప్రాలి ‘ ఏమిటండీ? ‘సిరిసిరిమువ్వ, ప్రాసక్రీడ, లిమరిక్కుల సమాహారమే కదా! వీటిలో ఛందస్సు లేనివేవి?

    తెలుగు సామెతల్లో సాధారణంగా యతో, ప్రాసో లేకుండా ఉండి ఉంటే వాటిలో సగానికి సగం కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి కావా?

    భావం పుణ్యాంగన అయితే దానికి సోకును (బాహ్యమే కానక్కరలేదు) ఛందస్సు అనుకోవచ్చును అని నేననుకొంటున్నాను. (దీనినే ఎవరో ఒక పూర్వికుడు పుణ్యాంగనకు పణ్యాంగనకువలె అందాన్ని కూర్చేది ఛందస్సు అన్నాడు.) ‘యతిప్రాసలు విసర్జింపబడినవి’ అని బోరవిరుచుకోవటం సులభమేగాని, లయ కూడా లేని కవితలు కాలపురుషుడి కట్టెదుట నిలవటం కష్టమే.

    ఎటొచ్చీ ఛందస్సుకోసం కవిత్వం అనటంకూడా తెలివితక్కువే.

    ఆంధ్రపత్రికలో ఒకప్పుడు ప్రాస ఎంత సాంక్రామికమో (contagious) చెప్పటానికి ఒక ఉదాహరణను ఇచ్చారు. ఎవరో ఒక సింగుగారు క్రొత్తగా తెలుగుతో కుస్తీపడుతూ ‘అనుమానానికైనా ఆస్కారంలేకుండా తిరస్కరించి పంపారు’ అంటే కోపంతో వాళ్ళ బాసు ‘మిస్టర్ సింగ్ ! రైమింగ్ కోసం మీనింగ్ పాడుచేయద్దని మీకెన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి?’ అన్నాడట. మరి దీనిని కవిత్వం అని ఎవరూ అనరు కదా!

    చేతనైన వైణికుడి చేతిలో ఎలాగైతే స్వరాలు వాటంతట అవే సరిగ్గా వస్తాయో, అలాగే కవిత్వంచెప్పేవాడి ముఖతః రావలసిన లయ, సందర్భోచితఛందస్సు వగైరా అవే వచ్చిపడతాయి. వెతుక్కుంటే వచ్చేవికావు అవి.

    గణితంప్రకారం కవిత్వంలో భావం, ఛందస్సు పరస్పరపూరకాలు (complementary) అనుకోవటం సబబేమోననిపిస్తోంది నాకైతే.

    ఏది ఏమైనా ఆలోచింపజేసిన, మంచి వ్యాసాన్ని అందించిన దేశికాచార్యులవారిని అభినందిస్తున్నాను.

    కల్లూరి సత్యరామ ప్రసాద్
    kalluriprasad@hotmail.com

  1711. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    08/20/2008 7:23 am

    (ఈ అభిప్రాయం కామేశ్వర రావు గారినుద్దేసించి రాసినది కాదు. ఆయన తిరుమల రామచంద్ర గారు రాసిన “తెలుగు వ్యాసం” వ్యాసం ప్రకారం “వ్యాసుడు”. కామేశ్వర రావు గారి గురించి కానీ, వారు వ్రాసిన పై వ్యాసం గురించి కానీ అనుకొని ఎవరయినా, ఈ క్రిందు వ్రాసిన అభిప్రాయానికి “సెట్ పట్” లాడిస్తూ “అభిప్రాయం” వ్రాస్తే అట్టి వారు “ఇంటర్నేషనల్ పీనల్ కోడు టూ థౌజెండైటు” ప్రకారం శిక్షార్హులగుదురు)

    ఇహపోతే, ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.

    “ట్రాఫిక్ డిపార్ట్ మెంట్” కీ కవిత్వం గురించి రాసీవాళ్ళకీ పెద్ద తేడా లేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.

    కవిత్వంగురించి రాసీ వాళ్ళు, అందులోనూ ఇది కవిత్వం, అది కవిత్వం కాదు అని రాసీ వాళ్ళు “పెథాలజిస్టులు”. ఆ మాటకొస్తే “విమర్శకులు” కూడా.

    వొక రకంగా కవిత్వం రాసేవాళ్ళకూ, వచనం రాసేవాళ్ళకూ ఇది ఆనందదాయకవైన వార్త. ( ఈముక్కే మా స్నేహితుడితో అంటే, రాసీ వాళ్ళు విమర్శించీవాళ్ళనెప్పుడు పట్టించుకున్నార్రా అనీసేడు, ధన్యుడు వాడు.) బహుశా “ఉక్తి వైచిత్రి” వున్న వాళ్ళందరికీ “ఈ చీకిరెట్టు” ముందే తెలుసేమో? అందుకే క్రుష్ణశాస్త్రి గారు విమర్శకులకి మందు ఇంకా రాయడవే అనీసేరు.

    వుదాహరణకి, “వైదేహీ శశిధర్” గారి కవిత్వంలో, “క్లుప్తత” లేదు, “భావ శబలత” లేదు వగైరాలతో పాటూ, “కుకవి నింద” లేదు, “పుష్పలావికల” వర్ణన లేదు అని మహానుభావుడు “చేరా” గారన్నా ఆ కవిత్వాన్ని మనం చదువుతాం. (“చేరా” గార్ని “బరువు” కోసం వాడుకున్నాను. తప్పు నాది)

    “అద్దువైతం” అంతా తెలిసిపోయిందనుకుంటున్నాను.

    “చాత్రిబాబు” వచనంలో కవిత్వాన్ని, బతుకునీ, చూసి మురిసిపోయే మాకు, వొక వ్యాసంలొ (పేరు గుర్తులేదు), వొకాయన “చాత్రిబాబు”కి “మెంటల్ మెనోపాజ్” వచ్చేసింది అని రాసేరు. అది చదివి”ఏందార్రా బగమంతుడా” అని “బెంగటిల్లిపోయేం” జమిలిగా మేవందరం.

    అయినా “చాత్రిబాబు” ఈయేల్టికీ బతికేవున్నాడు. హమ్మయ్య అనుకున్నాం మళ్ళీ జమిలిగా.

    ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.

    సర్పవా? రజ్జువా? ఎవళు చెబ్తారో? ఎవళికాళ్ళే తెల్సుకోవాలో?

    “యద్యదాచరిత శ్రేష్ఠహ తత్త దేవేతరో జనహ” అన్న “మంచిముక్కకి” ఇలా అర్ధం చెప్పుకోవల్సొస్తుంది: “ఆవిడ పట్టిన నోము, జగవంతా పట్టింది. జగం పట్టిన నోము మనం పడుతున్నాం”. ఎవరూ మిగల్రూ. అయినా నోవుపట్టాల్సిందే.

    “అసందర్భ ప్రేలాపన” అని మా “సాయి” లాటి వాళ్ళు అనొచ్చు.

    “సాయి” గారూ, “ఎమ్ ఒ ఎమ్ ” లో ఇలా రాస్తే మనకెవరికీ అభ్యంతరం వుండదనే అనుకుంటున్నాను.

    కవిత్వం/వచనం రాయడం సులువు. దాన్ని చదువుకుని “ఆహా, వోహో” అనుకోవడం ఇంకా సులువు. “చెస్, చెండాలం” అనుకోవడం మరీ సులువు.

    ఎవరో రాసిన కవిత్వం/వచనం గురించి, అది ఎందుకు బాగుందో/బాగోలేదో రాయడం చాలా కష్టం.”ఈ చాలా కష్టాన్ని” చదివి, నాలాటి పాఠకుడు అయోమయంలో పడడం ఇంకా సులువు. (మా “సాయి” లాటి వారు కాదు).

    దీని బదులు, పిల్లల పుస్తకాలకి అట్టలేసుకోడం, వాళ్ళ “హోమ్ వర్క్” చేయించడం సులువు.

    ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.

    ఛందస్సు ప్రకారం రాయాలి, సమాసాల ప్రకారం చదవాలి, వొకే గుక్కలో చదవాలి, వొకేగుక్కక్కర్లేదు. వుత్పలమాలలోనూ, చంపకమాలలోనూ, మత్తేభంలోనూ, అన్నిట్లోనూ అన్ని రసాలూ ఆవిష్కరించొచ్చు.

    ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.

  1712. ఛందోధర్మము గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    08/20/2008 6:28 am

    కవిత్వం కోసం ఛందస్సా, ఛందస్సు కోసం కవిత్వమా? కవిత్వం కోసం ఛందస్సు వదులుకోడం తప్పా? ఛందస్సు కోసం కవిత్వాన్ని బలి చేయడం ఒప్పా?

    ఛందస్సువలన కవిత్వానికి ఒరిగేదేమిటి?

    ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆంగ్లకవి P.B. Shelley రాసిన “To a Sky Lark”


    Thou art unseen, but yet I hear thy shrill delight

    Like a high-born maiden
    In a palace tower,
    Soothing her love-laden
    Soul in secret hour
    With music sweet as love, which overflows her bower…

    లోని భావాన్ని రాయప్రోలు సుబ్బారావుగారు తన చంపకమాల పద్యాలలో ఎంత మధురంగా పొందుపరిచారో ఆలోచించి చూస్తే దొరకవచ్చు:
    “ప్రమద రసోదయాలస తరంగములన్ దవిలించి, పారవ
    శ్యమున నుయాలలూపెదవయారె! చరాచర చేతన ప్రపం
    చము బహిరంతర భ్రమణ సాధ్వసమేది ప్రశాంతమయ్యె, నే
    త్రములకు గానరావు, మధురంబుగ పాడెదవెందొ కోయిలా!

    ధవళ చిరత్న రత్నరచితంబగు సౌధమునగ్రమందు పూ
    నవకపు సెజ్జపై వలపునన్ తన కిన్నెర మేళవించి మో
    హవశముగా ప్రపంచమును నాకులపెట్టు నొయారివోలె, నీ
    భువనమునెల్ల రాగమయ భోగములన్ దనియింతొ కోయిలా!”

    నేను నమ్మిన సత్యం: నిజమైన కవిత్వం చెప్పగలిగన వారికెవరికీ ఛందస్సు ఆటంకం కాదు. భాష మీద పట్టులేక, వచనకవితా ప్రక్రియని అడ్డంపెట్టుకుని ఎదో గిలికి పారేసి ఛందోధర్మాన్ని వదిలిపెట్టినందువల్లె ఇంత గొప్ప కవిత్వం వ్రాయగలిగామని జబ్బలు చరుచుకునే (కు)కవులు, వారి భజంత్రీలు విస్తృతపఠనం అలవాటు చేసుకుంటే పైన మచ్చుకు చెప్పిన ఉదాహరణలులాటివి కోకొల్లలు కనపడతాయి తెలుగు సాహిత్యంలో.

    ఆధునిక తెలుగుకవిత్వానికి ఆద్యుడుగా గుర్తింపు పొందిన రాయప్రోలువారు అద్భుతమైన కవిత్వాన్ని అలవోకగా చిలికించగల గొప్ప కవి. యతిప్రాసలు పద్యానికి అతికించినట్టు ఉండకూడదనేవారిలో ఆయన ఒకరు అని ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తంగారు నాతో ఎప్పుడూ అనేవారు. కవిత్వభాష గురించి అలాంటి మహనీయుడు రాయప్రోలువారి మాటల్లోనే:

    ధేనువులు తిను బహువిధ తృణచయమ్ము
    త్రావు నానానదీకూప జీవనమును
    కలిసి పరిణమింపవె పాలుగా ధరిత్రి
    శబ్దమేళన తంత్రనైజమ్ము నిదియె

    రాయప్రోలుగారి కవిత్వానికి నన్ను పరిచయం చేసిని పూజ్యులు ఆచార్య భొడ్డుపల్లి పురుషోత్తంగారికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను.

    రాజాశంకర్ కాశీనాథుని

  1713. పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి jayaprabha గారి అభిప్రాయం:

    08/20/2008 2:49 am

    కామేశ్వర రావు గారు,

    మీ పద్యం అంటే వున్న “సుముఖత” గురించిన విచికిత్స చదివాను. అన్ని రకాల కారణాలని గురించి సుహృద్బావంగా విశ్లేషణ చెయ్యాలన్న ఒక తపన కనిపించింది. కానీ అసలు విషయం ఏమిటంటే మా కాళోజీ చెప్పిన జవాబే నేనూ చెబుతాను వినండి (ఈ మాట మీద కాపీరైట్ కాళోజీదీ సుమా!).

    ఒకసారి ఆయన్ని నేను అడిగాను పద్యాలు ఎందుకు రాయలేదు మీరు అని. ఆయన అన్నాడు కదా “నాకు పద్యం రాయడం రాదు, అందుచేత రాయలేదు” అని. అది మా కాలోజీ సూటితనం. మరి నేను చెప్పేది కూడా అంతే. “పద్యవిద్య” అని అనేవారు కదా — అంటే అది ఒక skill అన్నమాట. దానిలో శిక్షణ పొందాలి. ఛందస్సు క్షుణ్ణంగా చదువుకుని వుండాలి. ముక్కున పట్టిన నాలుగు అవసరార్థపు “గణ” పరిజ్ఞానంతోనే ఈ కాలం వాళ్ళు పద్యాలు ఎట్లా రాసేయగలరండీ? అత్యాశ అలా ఎవరైనా ఆశిస్తే, అవునా?

    ఇంకా వచన పద్యం (ఇక్కడ పద్యాన్ని కవిత్వానికి పర్యాయంగా అంటున్నాను) రాయటం కూడా సుళువేమీ కాదు. వచనంలో నిట్ట నిలువుగా రాసేదంతా కవిత్వం అని ఎవరూ అనలేరు. మంచి పద్యానికి వుండే లక్షణం మంచి prose poem కి కూడా వర్తిస్తుంది. ఒక లయ, తూగు అంతర్లీనంగా వుండాలి. “కంఠగత లక్షణం” మంచి పోయెమ్ కి వుండాల్సిన లక్షణం కూడా, వచన కవిత్వం అయినా సరే. బాగున్న పద్యం, అది యే రూపంలో వున్నా, కాళిదాసు చెప్పినట్టుగా, “రసనగర నర్తకి” గా వుండాల్సిందే. దీనికి తిరుగు లేదు. వచన కవిత్వం లో కూడా మంచి పద్యం కోట్ చెయ్యగలిగినది నోటిమీద వుండగలిగినదై వుండటం దాని ప్రభావానికి గుర్తే.

    అయితే, అలాగే ఛందోబద్ధమైన పద్యాలన్నీ కూడా గొప్పవి కావు. మీరు వుదాహరించిన తిక్కన గారి పద్యం, రామాభ్యుదయంలోని తిక్కన గారి పద్యాన్ని అనుకరిస్తూ రాసిన పద్యం — వీటిని వుదాహరణలుగా చెప్పవచ్చు. అలాగే బాగున్న poem ఎందుకు బాగుందో చెప్పటం తేలిక. బాగాలేనిది ఎందుకు బాగాలేదో చెప్పటం — ముఖ్యంగా సమకాలంలో — చాలా కష్టం. అంచేత మాట్లాడకుండా వూరుకుంటారు (లేదా బాబ్జీలు గారి లాంటి అవతారం ఎత్తవలసి వుంటుంది మరి నిజాలు చెప్పడానికి).

    ఇంకా మళ్ళీ వెనక్కి అంటే ఛందోబద్ధమైన పద్యం రాయటం దగ్గరికి వస్తాను. మంచి లయతో, ధారాశుద్ధితో చక్కని ఉపమానంతో, పుష్టిగా వున్న భాషతో (భాషాడంబరం కాకుండా) ఎవరైనా రాస్తే, పద్యం అయినా చెలామణీ అవుతుందనే నేననుకుంటాను, ఇవ్వాళకూడా!

    విషయం ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఛందస్సును స్వాధీన పరుచుకొని పరిపుష్టిగా పద్యాలు చెప్పేవాళ్ళ సంఖ్య తగ్గటం వల్ల పద్యం వెనకబడింది తప్ప, వచన కవిత్వం వల్ల కాదు. ఔననిపించుకునే పద్యాలు రాసేవారి సంఖ్య పద్యంలోనూ, వచన పద్యంలోనూ కూడా ఇవ్వాళ తక్కువే సుమా.

    “వస్తువు” ముఖ్యమే ఎప్పుడైనా కవిత్వంలో. కానీ దాని వ్యక్తీకరణ ఎట్లా వున్నదన్నదాని మీదనే ఒక మామూలు కవికి, ఒక మహాకవికి మధ్యనుండే భేదం బోధపడుతుంది.

    కవి నామధేయులు ఉంటారు అన్ని కళల్లోనూ. కవులు కొందరే వుంటారు అన్ని కలాల్లోనూ. రూపం ఏది అన్నదానికన్నా సారం ఎంత అన్నది చూడవలసిన విషయం కవిత్వంలో. ఎందులోనైనా బాగున్నవి నిలబడగలిగినవీ నిలబడతాయి. మిగితాయి పోతాయి. అది కాల మహిమ. అదంతే. మంచి కవిత్వానికి, మంచి సంగీతానికి సూర్య చంద్రులు కాపలా వుంటారు. నిశ్చింతగా వుండండి. అస్తు!

    జయప్రభ.

  1714. పద్య శిల్పం గురించి jayaprabha గారి అభిప్రాయం:

    08/19/2008 1:59 am

    కామేశ్వర రావు గారు,

    చాలా సంతోషం. మరోమాట: మీరిచ్చిన లింకు లోకి వెళ్ళి “మనుచరిత్ర” లోని “అటజనికాంచె” పద్యం మీద వ్యాఖ్యానం కూడా ఇప్పుడే చూసాను. మీకు మనుచరిత్రలో “సహసానఖంపచ …” పద్యం నచ్చలేదా? దాన్ని అందంగా వ్యాఖ్యానించవచ్చునే? బహుశా కావాలనే మీరంతా ఆ పద్యాల జోలికి పోవడం లేదు కాబోలు (సంశయించి), ఔనా? కానీ నేనేమనుకుంటానంటే ఇంతమంది సాహితీ ప్రియులుండి మంచి పద్యాన్ని మళ్ళీ మరోసారి పాఠకులకు పరిచయం చేయకపోతే ఎట్లా అని. సరసులైన పాఠకులున్నారు; చాలా సంయమనంతో మాట్లాడగలిగిన వాళ్ళు వున్నారు; స్వారస్యం తెలుసుకుని రసాస్వాదన చేయగలరు వాళ్ళు. చూడండి. పెద్దన గారి గాంధర్వం అంతా ఆ పద్యంలో వుంది.

    ఏమండీ, బాబ్జీలు గారు మీరేమంటారు? ఎంతసేపూ “అటజనికాంచె” గురించేనా? కాస్తా ముందుకి వెళ్ళండి మనుచరిత్రలో. పోనీ “చలిగాలి బొండుమల్లెల పరాగము వైచి నిబిడంబు చేసే వెన్నెల రసంబు” దాకానైనా. నాకు తెలిసి చాలామంది మీ చర్చలు ఆనందిస్తారని. ముఖ్యంగా పెద్దన గారి కవిత్వాన్ని మరింత ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. శృంగారాన్ని మాట్లాడటం లో మీ విశ్లేషణలు వెనకపడితే, పాపం, ఆ పద్యాలని రాసిన పెద్దన గారేమనుకోవాలి? ఈ తెలుగు వాళ్ళకి సరసత లేదన్నీనూ, విజయనగర కాలం దగ్గరే శృంగారం కూడా ఆగిపోయిందనీన్నూ అనుకోడా? ఈ తరం వాళ్ళకి పాత (I mean, “భూస్వామ్య వాద”) తెలుగు కవిత్వంలోని మధురిమలని సైతం కాస్త రుచి చూపించండి. నేను చెప్పేదాన్నే గానీ, నేను పీక లోతు దాకా అన్నమయ్య శృంగార సంకీర్తనల వ్యాఖ్యానంలో కూరుకుపోయి వున్నానిప్పుడు, గనుక దారి మళ్ళలేను.

    జయప్రభ

  1715. అమ్మ గురించి sri గారి అభిప్రాయం:

    08/13/2008 4:06 am

    మనసుకు హత్తుకునేలా, మైమరపించే అమ్మ జోలపాటలా వుంది మీ కవిత.

  1716. మంచులో తడిసిన ఉదయం గురించి jayaprabha గారి అభిప్రాయం:

    08/12/2008 10:11 am

    వైదేహి, చాలా బాగుంది మీ కవిత. చాలా రోజుల తరువాత originality వున్న images చూస్తున్నాను. మంచి హేమంతం, చంద్రునిలో అవ్వ రాట్నం వడకడం (వహ్!), అదంతా మంచులా రాలిపడటం!! గొప్ప ఊహా చిత్రం సుమా.

    మీరు మీ కవితలతో కవ్విస్తున్నారు నన్ను. మరీ చెలరేగి వస్తున్నాయి మీ వూహలు. వాటిని రానివ్వండి అలా. కానీ తలుపు తీయను నేను. మంచు గాలి వణుకుకి జడిసి. మరి మీ హేమంత సుందరి తో చేయి కలపటం ఎలా? మీరే ఏదైనా వుపాయం చెప్పాలి.

    జయప్రభ.

  1717. ఛందోధర్మము గురించి baabjeelu గారి అభిప్రాయం:

    08/08/2008 8:23 am

    అయ్యా,
    మీరు వ్రాసిన వ్యాసం చాలా చక్కగా వుంది.
    “ప్రసాదు” గారు వ్రాసిన అభిప్రాయం సరైనది. దానికి మీరు ప్రతిస్పందించకపోవడం బాధాకరమయిన విషయం.
    “రాజాశంకర్ ” గారు వ్రాసిన “పదదారిద్ర్యం తో బాధపడే” కవుల విషయం అన్యాయం.
    కవిత్వం కోసం ఛందస్సా, ఛందస్సు కోసం కవిత్వమా? కవిత్వం కోసం ఛందస్సు వదులుకోడం తప్పా? ఛందస్సు కోసం కవిత్వాన్ని బలి చేయడం ఒప్పా?

    కవికి ఛందస్సుతో పాటూ, సంస్క్రుతం, కరాటే, భరతనాట్యం, వుర్దూ, ఇటాలియన్, గోంగూర పచ్చడి చేయడం, వూడిపోయిన గుండీలు కుట్టడం, పుస్తకాలకి అట్టలేయడం, పిల్లలకి అన్నాలు పెట్టడం, చిత్రలేఖనం, మేజిక్ చేయడం, పిల్లిమొగ్గలేయడం వగైరాలలో అద్వితీయ ప్రతిభ వుంటే, ఆ కవిగారి కవిత్వానికి మీలాటి పండితులూ, “ప్రసాదు” గారిలాటివాళ్ళు, మా బోంట్లు మైమరచిపోతం.

    మీవంటివారు శ్రీశ్రీ కవిత్వాన్ని పరామర్శించి, శ్రీశ్రీ కూడా చందస్సనే పాముకాటుకి గురయ్యాడని రాయడం భావ్యమా? మధ్యలో కాళోజీ గారి “గొడవ”, “జయప్రభ” గారు కూడా “గతి” తప్పలేదని తెలిసి “హమ్మయ్య” అనుకున్నను.

    శ్రీశ్రీ ఛందస్సు చదువుకుని వచ్చినవాడేకదండీ? అందుకే తొలిరోజుల్లో రాసిన కవిత్వం వుత్పలమాల, చంపకమాల వగైరాలలో వుండకపోయినా “గతి”లో వుంటుంది. శ్రీశ్రీ కూడా “గతి” తప్పలేదని “ప్రూవ్” చేసెస్తే ఛందస్సు గొప్పదయిపోతుందా?

    మారుతున్న కాలంతో పాటూ మారిన కవులందరూ ఇవాల్టికీ బతికేవున్నారు.
    నన్నయ తెలుగులో కవిత్వం మొదలెట్టిన రోజుల్లో ఎన్నితిట్లు తిని వుంటాడండీ, సంస్క్రుత పండితుల వల్ల. అలాగే మాములు ప్రజలు మాట్లాడే భాషలో కవిత్వం రాయడం మొదలెట్టిన కవులు, నన్నయ “పధ్ధతిలో” వ్రాసిన కవుల తిట్లు తినేవుంటారు.
    అంతెందుకు, యండమూరి వీరేంద్రనాథ్ మొదట్లొ తిట్లుతిని, తరవాత, తరవాతి తరం వాళ్ళని “సాహిత్యాన్ని భ్రష్టు పట్టించెస్తున్నారు” అని అనడం కాల మహిమ కదూ? వింత కదూ?
    పానుగంటి వారు వ్రాసిన “కాల స్వరూపుడు” చదివితే, నన్నయని తిట్టిన వాళ్ళూ, తరవాతి వాళ్ళని తిట్టిన వాళ్ళూ, వీరేంద్రనాథూ అందరూ “సర్వేజనా సుఖినో భవంతు” అనుకునుండే వారు. (“సర్వేజనా” అంటే “సర్వే” డిపార్ట్మెంటే కాదు “రెవిన్యూ” వారు కూడా అని మనవి.)
    “ధారణ” గురించీ, కంఠతా పట్టవలసిన అవసరం లేకపోవడం గురించీ ఇక్కడ వ్రాయడం మీ లాటివాళ్ళ విజ్నతని అనుమానించడవే. అంత సత్తువ నా దగ్గర లేదు.

  1718. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu గారి అభిప్రాయం:

    08/07/2008 9:44 am

    “ఈ మాట” సంపాదక వర్గానికి
    వుప్పల లక్ష్మణరావు గారి ప్రభావం వల్ల “అమ్రుతం”, “క్రుష్ణుడు”, “క్రుతగ్యత”, “సంస్క్రుతం” వగైరాలు.
    “ప్రాలేయరుఙ్మండలీ” తెలుగులో రాయడానికి సాయం చేసినందుకు సంపాదకవర్గానికి “క్రుతగ్యతలు”. “డబలెమ్” రాయాలని్ పట్టుకోలేకపోయేను.

    కామేశ్వర రావు గారికి,
    నేను కోరిన కొండ మీద వాన కురిసిందని “నామిని” రాస్తే పూర్తిగా అర్ధం కాలేదు. మీ చిన్న వాక్యం “డైనమైట్” లా పేలింది. ఆ వ్యాక్యం అర్ధం పూర్తిగా “అర్ధవయ్యింది”.

    అ) చందస్సు ప్రకారం “రెసైట్” చెయ్యడానికని చందస్సు “చెక్” చెయ్యలేదు. పద్యం, పద్యంలా రాసుకోవాలి కదా. అందుకు.
    “అల వైకుంఠ…” చిన్నప్పుడు ఎందువల్ల కంఠతా పట్టేనో గుర్తులేదు, పద్యం గుర్తుంది. అందుకని ఇన్ని దశాబ్దాల తరవాత గణవిభజన చేసి పద్యం పద్యంలా “తయారు చేయగలిగేను. (ఇంకా “రిసైట్” చేయడం వరకూ రాలేదు.)
    “సిరికిం జెప్పడు..” బహుశా “ఎగ్జామ్” లో రాదని “మేషారు” చెబితే వదిలేసేనేమో? కొన్ని పదాలకి అర్ధం కూడా సరిగ్గా తెలీదు. “అభ్రతపతి” కి “గరుత్మంతుడని, “ఆకర్ణికాంతరథమిల్లము” అంటే “విల్లు బాణాలు” అని “జక్కనొత్తడు” అంటే “పట్టుకోడు” అని నాలుగో తరగతి పిల్లకి చెప్పేను. తప్పులయుండొచ్చు. తప్పులేనేమో.
    ఆ) నిన్న నేను “ఈ మాట” పాత సంచికలలో “దేశికాచారి” గారు రాసిన వ్యాసం, చందస్సు గురించి ( తారీఖు, ఇది రాస్తూ ఎలా వెనక్కి వెళ్ళి “చెక్” చెయ్యాలో నాకు తెలీదు, ఈ అభిప్రాయం “సబ్మిట్” చేసేక అది వెతుకుతాను. ) , చదివేను. చందస్సు కవిత్వం రాయడానికి బాగా వుపయోగపడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ, కాళోజీ గారు కూడా చందస్సు అనే పాముకాటుకి ఎలా గురయ్యారో సోదాహరణంగా రాసేరు. “జయప్రభ” గారి కవిత్వం కూడా ఉదహరించేరు. ఇంకా చాలా మంది ఆధునిక కవుల కవిత్వాన్ని కూడా వుదహరించేరు. వ్యాసాలు రాసేవాళ్ళందరూ వాళ్ళకి అనువయిన వుదాహరణలే తీసుకుంటారు. అందువల్ల ఆ వుదాహరణలకి అంత “ఏల్యూయేషన్” వుండదు. ఎందుకంటే అన్ని సహజ సంఖ్యలకీ ఆ “థీరమ్” రుజువవాలి. దీని మీద ఎక్కువ ఇక్కడ నేను రాయను. దీని గురించి మీరేం రాయకండి.
    ఆ వ్యాసం చదివిన తరవాత, ఏపని చేస్తున్నా, ఒకటే ప్రశ్న వెంటాడింది.
    ఆ ప్రశ్న “సిరికిం జెప్పడు…” పద్యమే.
    “… శంఖచక్రయుగమున్ జేదోయి సంధింపడేపరివారంబున్ జీరడభ్రతపతింబన్నింపడాకర్ణికాంతరథమ్మిలములన్ జక్కనొత్తడు..”
    ఇదంతా కలిపి చదవాలా? చదవక్కర్లేదా? చదివినపుడు కలిపి, ఒకే గుక్కలో చదవక్కరలేక పోతే “డా” లన్నిటినీ కలపడవెందుకు? ఇలా ఎందుకు రాయకూడదు?
    “….శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు,
    ఏ పరివారంబున్ జీరడు, అభ్రతపతింబన్నింపడు,
    ఆకర్ణికాంతరథమ్మిలము జక్కనొత్తడు..” అని ఎందుకు రాయకూడదు.
    రాయడానికి చందస్సు కావాలి, చదవడానికి ఎందుకు అక్కర్లేదు?
    కామేశ్వర రావు గారూ,
    దయచేసి ఛందస్సు ప్రకారం పద్యమెందుకు రాయలి? చదివినపుడు ఎందుకు విడగొట్టాలి? దీని మీదే (ప్లీజ్) రాయండి. మిగిలినవాటిగురించి రాసి మీ సమయం వ్రుధా చేసుకోకండి.

    “ధారణ” ముఖ్యావసరం వేదకాలంనాటినుంచీ, తాళపత్ర గ్రంథాలొచ్చిన తరవాత కూడాతప్పలేదు. “గుటెన్ బెర్గ్” తరవాత ధారణ అక్కరలేదు. “కుందుర్తి ఆంజనేయులు” గారి “నగరంలో వాన” కవిత ధారణకి లొంగదు అయినా ఇబ్బంది లేదు. అందులోని “కోటబుల్ కోట్స్” గుర్తుంటాయి. పూర్తి పాఠం కావాలంటే పుస్తకం వుంటుంది. ఎక్కాలు గుర్తుంచుకోవలసిన తరం “రెండోట్ల రెండు. రెండ్రెళ్ళ్నాలుగు..” అని “రిథిమిక్” గా కంఠతా పట్టేరు. “కేలిక్యులేటర్” ఆ తరవాత “కంపూటర్” వచ్చేక కంఠతా అవసరం తీరిపోయిందికదా? “ఇంటర్నెట్” వచ్చాక ఇంకా సులువయిపోయిందికదా?

    పండితులకి ఛందస్సు “కంపల్సరీ” గా వస్తుంది. రాకపోతే పండితుడు అవుతాడా?
    ఛందస్సు వచ్చిన వాళ్ళందరూ కవులుకారు.

    సాయంకాలం అయిదు గంటల వేళ ఒక చక్కని అమ్మాయిని చూసి నాలాటివాడు “తూర్ణం మానీయతాం చూర్ణం పూర్ణచంద్రనిభాననే” అన్నాట్ట. మీ లాటి కవిగారు “పర్ణాని, స్వర్ణ పర్ణాని, కర్ణాంతాయతలోచనే” అన్నారుట. ఆ చక్కనమ్మ, పరిచారికకి నన్ను చూపించి “ఈ పండితుడికి సున్నప్పిడత ఇవ్వవే” అంది. మిమ్మల్ని “మేషారూ, ఇలారండి, ఇక్కడ కూచోండి, స్వర్ణ పర్ణానికి చాలా టైమ్ పడుతుందికదా? ఎంత చక్కని కవిత్వం మీది” అందిట. ఎంత తెలివయిన అమ్మాయి కదండీ? అలా ఎందుకందో మీకు తెలుసు. మాలాటివాళ్ళకి మీరు వివరించి చెప్పాలి.

  1719. నూలు చీర గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    08/05/2008 11:55 am

    బాబ్జీలు గారూ,

    సరదాగా రాసింది “దిల్” మీదకి తీసుకున్నట్లున్నారు.
    తప్పులు దొర్లితే చూపించడమూ, అచ్చయిన దాన్ని “ఇలా రాయాలి సుమా” అని చెప్పడమూ రెండూ ఒకటి కాదని నా అభిప్రాయం. రెంటికీ తేడా ఉంది.
    మీ స్పందన కంటే,
    “రోజుకి మూడు కవితలూ ఆరు వ్యాసాలుగా, “చింతబొట్టలు దులిపినట్టు” దులిపేయాలి.” అన్న సలహా బాగా నచ్చింది. ఇది నాకు మాత్రమేనా? లేక “చెయ్యి” చేసుకునే అందరికీనా?

    మీకు పలవరింతలెలాగో, నాకు ఈ పేలాపన్లలాగ!
    బతుకు మాట దేవుడెరుగు, “అబద్ధం నిజంలా మాట్లాడ్డం మాత్రం నాకు తెలీదు.”
    నమ్మినా, నమ్మక పోయినా మీ వాక్యం మాత్రం నాకు నచ్చింది.
    ఇహ ఈ చర్చకి దారీ, తెన్నూ లేనట్లు అనిపిస్తోంది.

    శలవ్,
    సాయి బ్రహ్మానందం

  1720. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu గారి అభిప్రాయం:

    08/05/2008 7:45 am

    నాలుగవ తరగతి చదువుతున్న మా అమ్మాయికి, తెలుగు “రెసిటేషన్” పోటీకి, మూడు పెద్దన గారి పద్యాలు, మనుచరిత్రము నుండి, వాళ్ళ తెలుగు “మేమ్” ఇచ్చేరు.
    “మేమ్” గారూ శిష్యురాలూ కలిసి, మూడు పద్యాలూ వచన కవిత్వంలా రాసేరు.
    వచనకవిత్వాన్ని ఛందస్సర్పపరిష్వంగంలోకి తీసుకెళ్ళాలి. పగవాడికి కూడా వద్దు ఈ బాధ.
    “… ప్రాలేయ (కామా) రుణ్మండలీ..” అని రాసేరు “తెలుగుమేమ్ గారు”.(నా యూనీకోడ్ చేతకాని స్పెల్లింగ్ “రుణ్మండలీ”)

    మూడవ తరగతి లో “అల వైకుంఠపురములో..” పద్యం, “సిరికింజెప్పడు..” పద్యం “రిసైట్” చేసి “ఫస్ట్ ప్రైజ్” “కొట్టేసిన” విద్యార్ధినిని, “నాలుగోక్లాసు మేమ్” “బాగా చెప్పి ప్రైజ్ రాకపోతే వుంది నీ పెళ్ళి” అని భయపెట్టి మరీ పంపించింది.

    మనుచరిత్ర(ము, ప్రథమా విభక్తి????) ఇప్పుడెక్కడ దొరుకుతుందిరా “దేవుడా” (ప్రథమా విభక్తి కాదు) అని అనుకుంటూంటే, “ఈమాట” “గ్రంధాలయం” గుర్తొచ్చి బతుకుజీవుడా అనుకున్నాను.
    “ఈ మాట” చలవ వల్ల పద్యాలు, పద్యాల్లా దొరికేయి. “ప్రైజ్” మాట దేవుడెరుగు, “ప్రైజ్” రాకపోతే “నాలుగోక్లాసు మేమ్ చేతిలో మా అమ్మాయి పెళ్ళి దేవుడెరుగు.”
    “ఈ మాట” నామాం మరువాం, మరువాం.

    చిన్న పిట్టకథ: కిందటేడాది నాకు “ఈ మాట” పరిచయం లేక, “సిరికిం..” పద్యం కోసం, తెలిసిన వాళ్ళిళ్ళకి తిరిగేను. ఓ ఇంట్లో, ఓ ఐటీ అమ్మాయి, ఏడాది కొడుక్కి అన్నం పెడుతూ “అంకుల్, అది శ్రీరామదాసు సినిమాలోది” అంది. ఆ పిల్ల తల్లితండ్రులు చాలా గర్వంగా చూసేరు నావేపు. “ధన్యోస్మి” అని మనసులో అనుకుని, “థేంక్సు సుజాతా” అని బయటకని, బయటపడ్డాను.
    గణవిభజన చేసి “అల వైకుంఠపురములో…” “సెట్” చెయ్యగలిగేను. “సిరికింజెప్పడు..” మాత్రం “శ్రీరామదాసు సినిమా సిడిలో” బాలసుబ్రహ్మణ్యం పాడినదే దిక్కయిపోయింది.

    [బాబ్జీలు గారు: అభిప్రాయాలు రాసే పెట్టె పైన ఉన్న “కీబోర్డు మ్యాపింగ్ చూపించండి” అన్న లింకు నొక్కితే మీకు R.T.S. (Rice Transliteration Standard) కీబోర్డు మ్యాపింగ్ ప్రత్యక్షమవుతుంది. ఋకారానికి “ru” బదులు “R” అని టైపు చెయ్యాలి. ఉదా: కృష్ణుడు (kRshNuDu), సంస్కృతం (samskRtam). వర్గాల వారీగా అనునాసికాలు: ఙ (~ma), ఞ్ (~na), ణ (Na), న (na), మ (ma). మరికొన్ని ఉదాహరణలు: జ్ఞానము (j~nAnamu), ప్రాలేయరుఙ్మండలీ (prAlEyaru~mmanDalI) ఇవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. — పద్మ, ఈమాట సంపాదక వర్గం.]

  1721. నూలు చీర గురించి baabjeelu గారి అభిప్రాయం:

    08/04/2008 11:05 am

    సాయి గారూ,
    అభిప్రాయాలు రాసేవాళ్ళు, కవి/రచయిత కి తెలియని విషయాలు చెప్పాలి, తప్పులు ఎత్తి చూపాలి, విపులంగా రాయాలి అని మీరు “నొక్కి వక్కాణించ” డానికి ఇదో ప్రయోగం.
    “ఈ మాట” ని నేను “రవికిరణు” కవిత్వం తో మొదలెట్టేను. “నూలు చీర” ఎలా “మిస్ కొట్టీసేనో?” ఈ కవితకి అభిప్రాయం రాస్తూ, “రవికిరణు గారూ మీరు ఈ కవితని ఇలా రాయాలి. చిత్తగించండి.” అని రాస్తే “సృష్టికర్తలు” “సృజనాత్మక శక్తి” వుందని మేం నమ్ముతున్నవాళ్ళు వూరుకుంటారా?
    (రవికిరణు గారూ, క్షమించాలి. దీనికి మీరు స్పందించకండి)
    *************
    {“నూలు చీర”
    కొత్తలో
    వెలుగు, జిలుగుల్ని ప్రదర్శించిందే,
    పాముకుబుసం కాకపోయినా
    పట్టు వస్త్రం కాకపోయినా
    వాటి సావాసగత్తె.
    మా అమ్మకి అమ్మేమో
    అమ్మని చుట్టుకునుండేది, కనిపెట్టుకునుండేది.
    అమ్మ కన్నీళ్ళకీ, వేణ్ణీళ్ళకీ, చన్నీళ్ళకీ
    అమ్మ కష్టాలకీ, సుఖాలకీ,దుఃఖాలకీ
    మమ్మల్ని మించిన తోడు.
    కుంకుమ తప్ప పౌడరు వాసన మర్చిపోయిన అమ్మలా
    తడి పిడిచి ఆరెయ్యడం తప్పఇస్త్రీ పెట్టె సావాసం అడగలా.
    ఒక చెట్టులా, తాపసిలా
    ప్రాపంచిక సౌందర్యం వదిలేసి
    మా అమ్మ అనంత సౌందర్యంలో కలిసిపోయింది.
    అమ్మకీ, చీరకీ తేడా తొలగిపోయింది.
    ఆ ముతక నూలు చీర
    మా మనసుల్లో రంగూ, రూపం లేని భావంలా
    మా అమ్మలా మిగిలిపోయింది.}

    సాయి గారూ, మీరంతా “ఫలించిన వృక్షాలు.” “రాతి దెబ్బలకి” చలిస్తారేం?

    {రవికిరణు గారూ, ఈ నూలు చీర అమ్మకి తలదిండుగా కూడా పనిచేసేది, ఇంటికి చుట్టాలొచ్చినపుడు. ఉన్న తలగడలు ముఖ్యవైనవాళ్ళకిచ్చీసి, మిగిలినవాళ్ళకి బొంతలూ, దుప్పట్లూ మడతపెట్టిచ్చేక, “అమ్మా నీకో” అన్నపుడు, “దా, పడుకో” అని పిలిచి అమ్మ తలకింద ఈ “నూలుచీరే” “ఆదిశేషుళ్ళా” నుమ్మలు చుట్టుకుని.}

    సాయిగారూ,
    బతుకు తెలిసిన మీలాటివాళ్ళు, అనుభవాన్నిభావంగా పట్టుకోగలిగిన మీలాటివాళ్ళు, భాష తెలిసిన మీలాటివాళ్ళు, “టుమ్రీ” గాళ్ళ “అజ్ఞానపు విజ్ఞానపు” అభిప్రాయాల్ని పట్టించుకోకుండా, రోజుకి మూడు కవితలూ ఆరు వ్యాసాలుగా, “చింతబొట్టలు దులిపినట్టు” దులిపేయాలి. అప్పుడే కదా “ఈ మాట” ఏడాదికే నాలుగేళ్ళెదిగినప్పటికీ ఎప్పటికి ముఫ్ఫైలోపే వుంటుంది. “భారతి” లా కాకుండా.

  1722. సప్తపది గురించి baabjeelu గారి అభిప్రాయం:

    08/02/2008 7:25 am

    కవితలోని అమ్మాయికి, (ఉదయకళ గారికి కాదు)
    అమ్మడూ సెబాస్.
    మా నాన్నమ్మా, అమ్మమ్మా,అమ్మా, మా మేనత్తలూ, మా దొడ్డమ్మలూ, మా పిన్నిలూ, మా అప్పచెల్లెళ్ళూ, (నిజాయితీతో రాస్తున్నాను మా ఆవిడా, మరదలూ)
    అందరి బాధా ఇదే.
    మంచి నిర్ణయం తల్లీ.
    అన్యాయాల్ని ఎదిరించీవాళ్ళు అన్యాయాలవల్ల బాధపడ్డవాళ్ళేనని మా గురువుగారు రావిశాస్త్రిగారనీసేరు. నిజవేనమ్మా.
    మంచి నిర్ణయం కొండా.
    అందులోనూ “ఎకనామికల్ ఫ్రీడమ్” ఉన్న ఈ రోజుల్లోనా ఈ బాధలు.
    పట్టపగలు బయటికి వచ్చీ అమ్మా, చెప్పు తీసుకుని కొట్టినట్టుంటుంది మా ఎమ్ సీ పీ లందరికీ. బాగుండదనుకుంటే, నీ ఇష్టం.
    మంచి నిర్ణయం పండూ.
    నువ్వు “రమణగారు” అన్నట్టు నీ కష్టాల్ని నువ్వే భరాయించుకోగలవు, నీ తిండి నువ్వే హరాయించుకోగలవు.
    ఇన్ని తరాలు ఎందుకాగేవు పాపాయీ?
    అల్లప్పుడే వాణ్ని “అగ్గిలోకి దూక మంటావురా?” అని నిగ్గతీయవలిసిందమ్మా.
    ఆ తరవాత ఇంకోణ్ణి “ఏవనుకుంటున్నావురా? నన్ను పణంగా పెట్టడవేవిటి? నీ ధర్మం మొహం మండా” అని “ఫిల్టు” పట్టుకుని ఆ లెంపా ఈ లెంపా వాయించీవలసింది.
    “బెటర్ లేట్ దేన్ నెవర్”.
    “అమ్మోరుకి దండవెడతాం” కానీ ఆడపిల్లని అణగతొక్కెస్తాం.
    “అమ్మోరు” నిజంకాదు, ఆడపిల్ల నిజవని మాకు తెలుసు.
    “అటూ ఇటూ సూడక”, “ఈ మెయిలో” అదేటొ నాకు చరిగ్గా తెల్దు దానికోసం సూడక బయల్దేరమ్మడూ. మరేటీ బయంలేదు. బయల్దేరు తల్లీ.

    నోట్ టు జయప్రభ: ఈ కవితని ఎలా మిస్సయిపోయేరూ?

  1723. గుల్మొహర్ గురించి jayaprabha గారి అభిప్రాయం:

    08/01/2008 10:52 am

    డియర్ వైదేహి,

    చెట్టు అందాన్ని అక్షరం లో పట్టుకోగలగటం అంత తేలిక కాదు. అలాంటిది ఆ అందాన్ని సునాయాసంగా అంతే అందంగా కవిత్వం చేసేరు. చదువుతూంటే మనసుకి కూడా ఆ రంగు అంటింది సుమా. హాయిగా అనిపించింది. బాగా రాస్తున్నారు. కంగ్రాట్స్. మరిన్ని రంగుల్ని మీ ఊహ ప్రతిఫలించాలని …

    జయప్రభ

    note for babjeelu; బాబ్జీలుగారు రామలింగని అవతరమా మీది?? మీ ధోరణి నాకు బాగా నచ్చింది, అభిప్రాయాలు చెప్పటంలో. ఎన్‌జాయ్ చేస్తున్నాను వాటిని చదువుతూ. — జయప్రభ.

  1724. రంగులప్రవాహం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    08/01/2008 7:02 am

    వైదేహీ శశిధర్ గారూ,
    “ఆమె చెక్కిలి మీద హేలగా విరిసిన చంద్రవంకని” చూసిన వారు,
    “సంధ్య ఎరుపులో నా పారాణి మెరుపును మేళవిస్తూ” ఎలా చిత్రిద్దామని ప్రయత్నం చేయగలరు?
    “…నా పారాణి..” నా పారాణి కాదా? ఆ పారాణా?
    సమన్వయం అంటారు కాబోలు కొడవళ్ళ వారి లాటి విజ్ఞులు, అది కుదరిందా?
    ఇది వదిలేయండి. మీ కవిత చాలా “సింపుల్” గా వుంటూనే చిక్కగా వుంటుంది.
    “చిక్కని మజ్జిగ” లాగ. మా అదృష్టం.

  1725. తెలుగదేమిటనిన… కాదు… తెలుగదెందుకనగ… గురించి pingali sasidhar గారి అభిప్రాయం:

    07/31/2008 1:55 am

    నేను గత కొంత కాలంగా ఈమాట చదువుతున్నాను. ముఖ్యంగా కొందరి కవితలు ఎంతగానో ఆకట్టుకుంటున్నయి. ఉదా: వైదేహి శశిధర్ గారివి చాలా చాలా ఇష్టము.
    ఆయితే, నాకూ ఈమాటలో సభ్యుడినయ్యి నావీ కొన్ని కవితలు పంపాలని ఉంది. చాలా సార్లు యెలా పంపాలని అడిగాను. ప్రవాసాంధ్రులకే ఈ ఈమాట ప్రత్యేక మైతే సరే. అదే తెలియజేయండి. అదీ సంతొషమే ఒక పాఠకుడిగానే ఆనందిస్తా.

    పింగళి శశిధర్ (జాబిల్లి)

    [శశిధర్ గారు: ఈమాట ఎల్లలులేని ప్రపంచ పత్రిక. మీ రచనలకి ఆహ్వానం. దయచేసి రచయితలకి సూచనల పేజీ చూడండి. మీ రచనలని ఈ పేజీ క్రింద ఉన్న ఈమెయిల్ అడ్రస్‌కు మెయిల్ చెయ్యవచ్చు. అన్ని రచనలూ సమీక్షించబడతాయని గమనించగలరు. మీ నించి మంచి రచనలకై ఎదురు చూస్తాము.
    — ఈమాట సంపాదక వర్గం]

  1726. గుల్మొహర్ గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/29/2008 8:04 am

    వైదేహి గారూ,

    సమకాలీనులు మెచ్చరు ఎలారాసినా అని ఓ పాత కవిగారి బాధ నాకర్థం కాలేదు. మీ పునశ్చరణ కి “రవికిరణు”, “ఈ మాట” లో మీ సహవాసి, పులకించడం ముచ్చటేసింది.

    చక్కని అనుభూతి; అనుభూతిని అంతకన్నా చక్కగా అభివ్యక్తీకరించడం; అంతేకదా కవిత్వం అంటే.

    “నిరలంకారం” అంటే సరిగ్గా అర్ధం కాలేదు. మీరేం రాయకండి. ఏ భైరవభట్లగారో, కొడవళ్ళవారో ఇంకెవరో తీరికా ఓపికా వుంటే రాస్తారు.

    అభిప్రాయాల్ని పట్టించుకోకండి. పట్టించుకున్నా సమాధానాలివ్వకండి. కవిత్వం రాయండి.

  1727. కవుల వాగ్వాదాల్లోంచి కవిత్వం – గీరతం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/29/2008 7:32 am

    అళియ రామరాయల సమయంలో హంపీ “పీక్ పీరియడ్” చేరుకుంది. సుఖాలకలవాటయిన సైనికులు బహమనీ సుల్తానుల్ని అడ్డుకోలేకపోయేరు. “తళ్ళికోట” యుధ్ధంలో అళియరామరాయలు ఓడిపోయేడు. తరవాత ఏవయిందీ అందరికీ తెలుసు.

    “శ్రీ తిరుపతి వేంకట కవులు” అళియరామరాయలు లాటివారు తెలుగు సాహిత్యం వరకూ. ఏంచేసినా “పడ్డ చన్నునెత్త బ్రహ్మ వశమే?” లాగా అయింది వ్యవహారం.

    “తిరుపతి వేంకట కవులు” అద్భుతవయిన కవులు. అయితే “ఒరిజినాలిటీ” లేని కవులు. మన అద్రుష్టం. “పాండవోద్యోగవిజయాలు” సహజవయిన ప్రక్రియ. కవిత్రయం ఏం సాధించారో మామూలు ప్రజకి అర్ధం కావడం కష్టం. “పాండవోద్యోగవిజయాలు” ద్వారా “తిరుపతి వేంకటకవులు” అంతకన్నా ఎక్కువ సాధించేరు. ఇంతకుముందు ప్రజా కవులని వ్యాసం, ఇప్పుడుఇలాటి వ్యాసాలు “చెళ్ళపిళ్ళ” వారు చదివితే రాసిన వాళ్ళ మర్యాద మిగల్చరు.

    “కొప్పరపు కవులూ, వేంకట రామక్రుష్ణ కవులూ” “తిరుపతి వేంకటకవు” లకి విమర్శకులు మాత్రవే. “తిరుపతి వేంకటకవుల్ని” ఢీ కొన్న కవులుగానే వాళ్ళు చరిత్రలో మిగిలి పోతారు. వారెవరివీ స్వతంత్ర రచనలు నిలబడలేదు కదా తరవాత.

    ఇప్పటికీ మా వూరి “సర్పంచ్” “చెల్లియో చెల్లకో..”అనీ, “బావా సత్యవతీ పౌత్రా..” అనీ”సెట్ పట్” లాడించీసి, ఇప్పటి కుర్రకారు ఈ పద్యాల్ని విని ఎందుకానందించరని తెగ బాధపడిపోతుంటాడు. “తెగ దీర్గాలు తీస్తాడెస్ ” అంటాడు వాళ్ళబ్బాయి.

    తెగ దీర్ఘాలే అనర్ధాలు, సాహిత్యవయినా, బతుకయినా.

  1728. పునశ్చరణం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/25/2008 7:41 am

    ఇదీ “ఈ మాట” గొప్పతనం.
    క్లుప్తత గురించి వొకరు, దానికి ప్రతివాదం తో ఇంకొకరు. అద్భుతం.
    కవయిత్రి వొక్క ముక్క కూడా రాయలేదు, కవిత తప్ప. అది సరైన పధ్ధతి.
    రాస్తూ వుండడవే, విమర్శకులకీ, అభిమానులకీ సరైన సమాధానం.
    మీరు రాస్తూ వుండండి వైదేహి గారూ. భావవ్యక్తీకరణ ముఖ్యం. భావాన్ని ఏదో వొక నడకతో చకచకా నడిపించడం కవిత. అంతే కదా కవులూ, కవయిత్రులూ చెయ్యవలసిన పని.
    అభిప్రాయాల్ని జాగ్రత్తగా చదవండి. మీ కవితల్లో కవిత్వం, మీ ఈ కవితలో చెప్పిన పసికందులాగా పెరిగి పెద్దవాడయిపోతుంది. మామూలుగా కాదు, “ఏడాదికే నాలుగేళ్ళు రావాలీ….. ఎప్పటికి ముప్ఫయ్యిలోపె వుండాలీ…” లాగ.

  1729. ఏకాకితనం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/25/2008 6:30 am

    సాయిగారూ,
    ఎంత చక్కని భావ వ్యక్తీకరణ. హ్రుదయ విస్తారం కేంద్రంలోకి కుచించుకు పోవడం, చోటూ(టు) చాలని మనసులో మనసులో కుటుంబం ఇరుకుగా సర్దుకోవడం, నీకు నువ్వే అయిన ప్రపంచంలో జనాభా ఒంటరి సంఖ్య, పరిమితులకలవాటయిపోయిన మనం నిజంగానే మరుగుజ్జులం. మీరు రాసినట్టు పక్కింట్లో చావూ, పెళ్ళీ ఒకటే.
    మహాప్రభో, మీకో దండం.

    బావి గోడల్ని దాటించెస్తే, మరుగుజ్జులు అమితాబ్ లయిపోతారని రాయడానికి చాలా దమ్ము కావాలి. వుంది కాబట్టే రాయ గలిగేరు.

    మహాప్రభో మీకు మళ్ళీ మరో దండం.

    స్పెల్లింగ్ మిస్టేకులెలా వచ్చేయి. జివిత నిఘంటువు వేవిటి? జాగ్రత్తగా చూసుకోండి. పాత సంచికల్లో కవితలేవేనా రాసేరా? నేను వెతుక్కుంటాను లెండి. మీ వచనం మీ కవితంత అందంగా వుండదెందుకని?

  1730. ఈ-మెయిలు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/25/2008 3:36 am

    ఇది కవిత్వం. తేటయిన కవిత్వం. హాయి హాయి కవిత్వం.”గరళమును ఇత్తువో” ఇస్తే ఇయ్యి గరళాన్ని కూడా నిభాయించుకోగలనన్న ధీమా,”మరల అమ్రుతమునిత్తు” మళ్ళీ అమ్రుతాన్నే ఇస్తానని భరోసా ఇవ్వడం. బేహద్బీగా వుంది.”ఇత్తువో” బదులు “నిత్తువో” అని వుంటే ఇంకా సాఫీగా వుండేదేమో?ఏ ఛందస్సయినా అవనీండి. నడక చక్కగా వుంది. నడత చక్కగా వుంది. “నను జూడకుండినను, నీ కుశలమే చాలు” గరళమిచ్చినా అమ్రుతమే ఇస్తాను లాటివి చూసి స్త్రీ వాద కవిత్వం రాసీ వాళ్ళందరూ ఉదయకళ గారిని దెబ్బలాడతారేమో? అయితే వాళ్ళు దెబ్బలాడీది కవిత లో కవిత్వం లేదని కాదు. కవిత లోని వస్తువు ని చూసి అనుకుంటాను. ఈ మెయిల్ చూసి, రిప్లై మీద క్లిక్ కొట్టి, సారీ బాస్ చెయ్యి కాళీ లేదు సెండ్ క్లిక్ కొడితే, స్త్రీ వాద కవిత్వం రాసీ వాళ్ళందరూ ఈ కవితని ఊరూరా మోసుకు తిరుగుతారు. ఆహా, ఓహో అంటారు.
    వాళ్ళదీ తప్పు కాదు కాబోలు. పెద్దలెవరయినా వివరిస్తే బాగుంటుంది.

     

  1731. ఈమాట గురించి గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/24/2008 7:19 pm

    కాలంతోపాటూ పరుగెత్తడవంటే వుదాహరణ “ఈ మాట”.
    టెక్నాలజీ ని మనక్కావల్సినట్టు వాడుకోడానికి కూడా వుదాహరణ “ఈ మాట”
    మామూలు పత్రికలో ఒక వుపన్యాసం చదువుతాం, ఇక్కడ వింటాం.
    మామూలు పత్రికలో ఒక పాట పాఠం చదువుతాం, ఇక్కడ పాట వింటాం.
    మామూలు పత్రికకి అభిప్రాయం సాధారణంగా ఇలావుంటుంది:
    “ఎడిటర్జీ, ఇలియానా ముఖచిత్రంతో మీ(మా) పత్రిక సర్వాంగసుందరంగా వుంది.
    సాయి బ్రహ్మానందం గారి మనోవైజ్ఞానిక సీరియల్ మా ఇంటిల్లిపాదినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. లక్ష్మన్న గారి కవిత మమ్మల్నందరినీ అలోచింపచేసింది. రోహిణీప్రసాదుగారి కార్టూనులు మమ్మల్ని కడుపుబ్బ నవ్వించేయి.
    కొడవళ్ళ వారి వ్యాసం ఆవునేతితో అరటికాయ బజ్జీలు అద్భుతం…”
    ఈ మాట లో అలాటి ముసుగులో గుద్దులాటల్లేవు.
    పాఠకుల “పార్టిసిపేషన్” వల్ల, అదికూడా అతి సులువుగా, పత్రిక ఇంకా “లైవ్లీ” గా వుండడానికి ఆస్కారం ఏర్పడింది.
    పాత సంచికలలో ని శీర్షికలు కూడా ప్రస్తుతం అభిప్రాయ వేదికలోకి రాగలగడం, మళ్ళీ దానిమీద అభిప్రాయాలూ నిజంగానే వింత.
    పాఠకుల అభిప్రాయాలు విమర్శలు కావు. విమర్శలని పట్టించుకోవాలి అవి రచయత బాగుపడ్డానికి పనికొస్తే, లేకపోతే “వోటర్ల” లిస్ట్ లోంచీ తీసెయాలి ఆ విమర్శని. అభిప్రాయాల్ని మామూలు పాఠకులు రాసినవి గానే తీసుకోవాలి. అంతేగానీ, “..తాడి ఎత్తు గాండీవము తో ముత్తాడి ఎత్తుగా ఎదిగి, చండకోపముతొ..” “సెట్ పట్” లాడించకూడదు.
    (సాక్షి దినపత్రికలో,జూలై 21న, చేరా తో మొదలెట్టి కొంతమంది విమర్శకులు తమతమ అభిప్రాయాలు రాసేరు)
    “చూపుల కన్నా ఎదురుచూపులే తీయన..”. ఒప్పుకుంటాం.
    ద్వై మాసిక ఎదురుచూపులు చూడ్డం చాలా కష్టమయిపోతోంది. ఆదివిష్ణుగారి స్నేహితులు “ఆషాఢ మాసం” ఎన్ని నెలలుంటుంది అని అడిగినట్టు.
    కనీసం “వీక్లీ” కూడా అవదా?

  1732. నేను – నువ్వు గురించి sravanthi గారి అభిప్రాయం:

    07/24/2008 2:14 am

    “ఆ క్షణం నేను
    నీ మనసున మనసవుతాను
    నేను నువ్వవుతాను”
    కవిత లోని ఈ చివరి వాక్యాలు మనసుని స్పందించేల చేసాయి..

  1733. సంగీతంతో కుస్తీ గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/19/2008 6:15 pm

    గురుభ్యోన్నమహ.
    శ్రీశ్రీ కవిత్వం విని ఓ కుర్రాడు “ఓస్ ఇంతేనా కవిత్వం” అన్నాట్ట. అది విని శ్రీశ్రీ తన కవిత్వపు ప్రయోజనం నెరవేరిందని మురిసిపోయేట్ట.
    మీ వ్యాసాలన్నీ చదివేను, గత వారం రోజుల్లో.
    సంగీతం గురించి ఇలాటి వ్యాసాలు ఎక్కడా రాలేదు. వచ్చిన వ్యాసాలే చలా తక్కువ. వచ్చినవి సంగీతకారుల గురించే, అందులోనూ వాళ్ళని భజన చెయ్యడం తప్ప ఇంకేవీ వుండదు.
    అందుకే మీ చేత బాలమురళీ జీవిత చరిత్ర రాయిస్తే అది చాప్లిన్ జీవితచరిత్ర అంత ఉద్గంధ్రం అవుతుందని నేను నమ్ముతున్నాను.
    మీ వ్యాసాలు చాలా ధైర్యం ఇచ్చేయి, సంగీతం నేర్చుకునే విషయంలో.
    ఇంకో విషయం.
    పేరడీ ల గురించి ప్రచురితవయిన వ్యాసంలో వచన పేరడీ ల గురించి ప్రస్తావించలేదని బాధపడిపోయి, అందులోనూ శ్రీరమణ ని, గబ గబా అభిప్రాయాల్లోకి వెళ్తే. మీ అభిప్రాయం శ్రీరమణ గురించి చూసి “నల్ల వాడే, అమ్మమ్మ అల్లరి పిల్ల వాడే” అనుకున్నాను. నేను రాసింది తమిళ్ “నల్ల”

  1734. నా స్మృతి పథంలో గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/18/2008 7:28 am

    రవికిరణూ, మూలా సుబ్రహ్మణ్యమూ,

    ఇది చదివేరా? దయచేసి చదవండి. కవిత్వానికి కావలసిన ప్రాథమిక రిక్వైర్ మెంట్స్ తెలుస్తాయి. ఆతరవాత మీ మీ ఆలోచనాధోరణులు, మీ మీ పొలిటికల్ నమ్మకాలూనూ.
    ప్రోజు లో రిథిమ్ చాలా కష్టం. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి మాత్రమే అది కుదురుతుంది.
    పోయెట్రీ లో రిథిమ్ కోసం కొంచెం కష్టపడండి నాయనలారా, తరిస్తాం.

  1735. గడియారపు ముల్లులు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/17/2008 11:53 am

    ఇంతకు ముందు మీ తడి వున్న వూహల్ని చదివి, ఇదీ మొదలెట్టేను
    మీరూ, రవికిరణూ వగైరాలందరూ “పొలై పొలై” కవిత్వానికి బానిసలయిపోయేరు.
    మంచి అనుభూతి, అనుభవం ఎదురవగానే “పొలై పొలై” అంటూ మొదలెట్టెస్తే ఎలా?
    గురజాడ ముందు చందోబధ్ధంగా రాసీ కవులు ఇలాగే రాసేవారు. అందుకే ముత్యాల సరాలు వెతుక్కోవలసొచ్చింది ఆయనకి.
    మీరూ, రవికిరణూ వగైరాలందరూ ఇలాగే రాయండి వచన కవిత్వం ఏవవుతుందో?
    దయచేసి ఒకటి గుర్తుంచుకోండి.
    లంబోదర లకుమికర వాయించడానికి సంగీత విద్వాంసుడు ఎంత కష్టపడతాడో. అందులో పది శాతం కూడా కష్టపడప్పోతే ఎలా అనుభూతిని కవిత్వంగా మలచడానికి?

  1736. శ్రుతిలయల నందనవనం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/17/2008 10:06 am

    గురువుగారూ,

    ఇంతకుముందు తెలీక అవాకులూ, చవాకులూ వ్యక్తీకరించాను. ఈ వ్యాసంలో మీరు రాసిన “కంక్లూడింగ్ పేరాగ్రాఫ్” చదివేక తెలిసింది లోతైన వేళ్ళు గురించి.

    సంగీత్ సరితా గురించి చిన్న ముచ్చట. లేకపోతే వివిధ్ భారతి గురించి:

    మా పిల్లలు, అందరి పిల్లల్లాగే, పొద్దున్న స్కూలుటైముకి తయారవడానికి చాలా ఇబ్బంది పడుతుంటే, ఏందారిరా “బగమంతుడా” అని తెగ ఆలోచించి, వివిధ్ భారతి టెక్నిక్ కనిపెట్టేను. సరిగ్గా ఏడు గంటలకి “భూలేబిసరే గీత్”. భూలేబిసరే గీత్ మొదలయిపోయింది లేవండి, లేవండి అంటే, అదేదో ఆటనుకుని లేచీ వాళ్ళు.

    అమ్మో సైగల్ పాడేస్తునాడు, ఏడున్నరయిపోయింది. సంగీత్ సరితా అయిపోయింది పావుతక్కువ ఎనిమిది. సంగీత్ సరితా ట్యూను మా పిల్లలిద్దరికీ కంఠతా.

    ఇప్పుడు వాళ్ళే “నాన్నా ఇంకా సైగల్ మొదలెట్టలేదు, నువ్వుండు” అంటున్నారు.

    దీనివల్ల ఇంకో ఎడ్వాంటేజ్ లేక డిసెడ్వాంటేజ్ ” అదేంటి, సైగల్ సైగలంటావు, మై క్యాజానూ క్యా జాదూ హై.. అలా పాడతాడు? అంటారు వాళ్ళు. “తప్పు, అలా అనకూడదంటే”, ఓకే అనేస్తారు.
    నాకే సైగల్ తెలీదు, ముఖేష్ తప్ప.

    అయితే “అప్పట్లో సైగల్ షాన్ లేపోతే కైలాష్ ఖేర్” అని నేను చెప్పినప్పుడు “అవునా” అని వాళ్ళు విచిత్రంగా నా వేపు చూస్తారు. అప్పుడు నాకు వేగుంట మోహన్ ప్రసాదు గారు మిగిలిన వాళ్ళు కలిసి ఎప్పుడో ఎనభైల్లో తెలుగు కవిత్వాన్ని ఇంగ్లీషు లోకి తర్జుమా చేసి ఆ పుస్తకానికి “టెన్స్ టైంస”ని పేరు పెట్టేరు. అద్భుతవయిన పేరు.

    వీళ్ళకి బాలసుబ్రహ్మణ్యవే పాత. ఘంటసాల దాటి, నాగయ్య, సైగల్ అంటే ప్రెజెంట్ టైం కాదు, ప్రెజెంట్ టెన్స్ కాదనిపించి ఏడవాలో నవ్వాలో తెలీక వెర్రి నవ్వు నవ్వేస్తాను.

    టెన్స్ టైం గురించి మాట్లాడండి

  1737. సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    07/12/2008 2:47 pm

    తెలుగు నవల బాగోగులు

    మృణాళిని గారి విలువైన ఉపన్యాసాన్ని సేకరించినందుకు బ్రహ్మానందం గారికి చాలా కృతజ్ఞతలు. ఒక మనవి. సాహితీవేత్తలైన వక్తలు అమెరికా వచ్చినప్పుడు, వారికి అభ్యంతరం లేకపోతే ఈమాటలోనో రచ్చబండలోనో ఓ చిన్న ప్రకటన వెయ్యండి. వీలయితే వాళ్ళని సాహితీప్రియులు తమ తమ ఊళ్ళకి పిలిపించుకోవచ్చు.

    మృణాళిని ఉపన్యాసం కేవలం డాక్టరేటు కోసం చేసిన పరిశోధన నుండి వచ్చినట్లు లేదు. లోతైన పరిశీలనతోబాటు తాదాత్మ్యంతో కూడిన విస్తృత పఠనంతో చేకూరిన అనుభూతితో సాధికారంగా మన నవలా చరిత్రని చెప్పి రక్తి కట్టించారు. ఎటు చూసినా కవితలూ, కథలూ, వాటి మీద చర్చావేదికలే కాని నవల గురించి మాట్లాడే వాళ్ళే తక్కువ. గత పాతికేళ్ళుగా స్తబ్ధుగా ఉండిపోయిన తెలుగు నవలా రంగానికి విశిష్ట చరిత్ర ఉందనీ, పాఠకుల సంస్కారానికి కథా కవితలకన్నా నవలలే ఎక్కువ దోహదిస్తాయనీ, ఆవేదనతో కూడిన ఉత్సాహంతో గంటన్నర పైగా అనర్గళంగా ఉపన్యసించి ఆకట్టుకున్నారు. గురజాడా, శ్రీశ్రీ రచనలకి సముచిత ఆదరణ వచ్చినా వారికే మాత్రమూ తీసిపోని నవలా రచయితల పేర్లన్నా ఇప్పటి వాళ్ళకి తెలియదే, కనీసం వారి రచనల ప్రస్తావన గూడా సాహితీ చర్చల్లో లేశమైనా కనబడదే అని గట్టిగా విమర్శించారు – ఎందువల్ల ఈ చిన్న చూపు?

    ఇలా పారంభమైన ఉపన్యాసం వినడంతోటే నాకు ప్రముఖ కవి Auden రాసిన “Letter to Lord Byron” అన్న కవిత గుర్తొచ్చింది:

    I don’t know whether
    You will agree, but novel writing is
    A higher art than poetry altogether
    In my opinion, and success implies
    Both finer character and faculties
    Perhaps that’s why real novels are as rare
    As winter thunder or a polar bear.

    The average poet by comparison
    Is unobservant, immature, and lazy.
    You must admit, when all is said and done,
    His sense of other people’s very hazy,
    His moral judgements are too often crazy,
    A slick and easy generalization
    Appeal too well to his imagination.

    కందుకూరి తో మొదలైన మన నవలలు సంఘ సంస్కరణకీ, భావ విప్లవానికీ, మానసిక వికాసానికీ బాట వేశాయనీ, దాదాపు వందేళ్ళ క్రితమే ఉన్నవ రాసిన మాలపల్లి ని ఆకాశానికెత్తేశారు. అసలాకాలానికి మన దేశభాషలు వేటిలోనూ అంతటి గొప్ప నవల రాలేదని ఇతర రాష్ట్రీయులు మెచ్చుకున్నా, తెలుగువాళ్లలో చాలా మందికి ఉన్నవ పేరు కూడ తెలియదని బాధపడ్డారు. చలం నవలలు చదిలోతే చెడిపోతారన్నవాళ్ళు ఆయనని సరిగా అర్థం చేసుకోలేదనీ, ఆయన రాసిన స్త్రీ, బిడ్డల శిక్షణ చదివితే గాని చలం భావ విప్లవం అర్థం కాదన్నారు. మైదానం కి వ్యతిరేకంగా విశ్వనాథ రాసిన చెలియలికట్ట ని ప్రస్తావిస్తూ, వీరిద్దరూ గొప్ప ప్రతిభావంతులనీ, వాళ్ళ మధ్య పోటీ సాహిత్యానికి మేలుచేసిందే కాని కీడు చెయ్యలేదన్నారు.

    పల్లెటూరి జీవితాన్ని మరీ ఆదర్శప్రాయంగా కాక రాజకీయాలతో ఎలాముడిపడి ఉందో చిత్రీకరించిన జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు, మొట్ట మొదటిగా విశాలమైన ఉన్నతభావాలతో స్త్రీ పాత్రని ప్రవేశపెట్టిన ఉప్పల లక్శ్మణరావు అతడు-ఆమె, ఒక్క వ్యర్థ పదం కూడా లేకుండా గోపీచంద్ రాసిన గొప్ప మనోవైజ్ఞానిక నవల అసమర్థుని జీవయాత్ర, మనిషి జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనా సంస్కార పరిణామానికి ఎలా దారితీస్తుందో చిత్రీకరించిన బుచ్చిబాబు చివరకు మిగిలేది, ఇలా అనేక పేరున్న తెలుగు నవలల గురింఛి, క్లుప్తంగా నయినా మనసుకి హత్తుకు పొయ్యేట్లు చెప్పి, అవి చదివిన వాళ్ళకి మరోసారి ఉద్విగ్నత కలిగించారు.

    ఇంతటి ప్రాభవం ఉన్న నవలా ప్రక్రియ ఎనభయ్యో శతాబ్దం నాటికి వ్యాపార నవలలు విజృంబించడంతో ఓ ఊపు ఊగి, ఆ తర్వాత వచ్చిన ఉద్యమాల వరవడిలో చదివే పాఠకులు లేకా, పాఠకులేరని రాసే వాళ్ళు లేకా కుంటుబడిందన్నారు. ఉద్యమాల ప్రభావం గురించి మృణాళిని చేసిన వ్యాఖ్య చాలా ఆలోచించదగ్గది: ఉద్యమాల మూలంగా వచ్చే రచనల్లో ఆవేశం పాలెక్కువ. అందుకు కవిత్వానికి మించిన సాహితీ ప్రక్రియ లేదు. అయితే నవలకి కావలసింది స్పష్టతతో కూడిన ఆలోచన, మానవజీవితం గురించి సమగ్రమైన పరిశీలన – వీటితో రసవంతంగా ఏవో నాలుగు పాదాలు కాక కట్టదిట్టంగా నాలుగయిదొందల పేజీల సాహిత్యం సృష్టించాలంటే మాటలు కాదు. మరలా Auden రాసిన “The Novelist” అన్న కవితొకటి గుర్తొస్తుంది:
    Encased in talent like a uniform,
    The rank of every poet is well known;
    They can amaze us like a thunderstorm,
    Or die so young, or live for years alone.
    They can dash forward like hussars: but he
    Must struggle out of his boyish gift and learn
    How to be plain and awkward, how to be
    One after whom none think it worth to turn.

    For, to achieve his lightest wish, he must
    Become the whole of boredom, subject to
    Vulgar complaints like love, among the Just

    Be just, among the Filthy filthy too,
    And in his own weak person, if he can,
    Must suffer dully all the wrongs of Man.

    ఉపన్యాసం అయింతర్వాత చాలా మంది మంచి ప్రశ్నలే వేశారు. మన సాహిత్యం ఉద్యమాలకే ఎందుకు పరిమితమైందని ఒకరడిగారు. మృణాళిని ఉద్యమాల వలన కలిగిన మంచిని గుర్తిస్తూనే, ప్రస్తుత సాహితీ వాతావరణంలో ఏదో ఒక గ్రూపుకి చెందకుండా మనడం కష్టమయిందన్నారు. చంద్రలత రాసిన రేగడివిత్తులు మంచి నవలే అయినా అది రచయిత కోస్తా ప్రాంత దృష్టితో రాసిందని విమర్శించి, సాహితీపరమైన విలువలకి విమర్శకులే తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి వాతావరణం నెలకొని ఉండటం చాలా విచారకరమన్నారు.

    ఇది సాహితీ అభిమానులందరూ తప్పక వినవలసిన ఉపన్యాసం. ఇచ్చిన మృణాళిని గారికీ, సేకరించిన బ్రహ్మానందం గారికి మరోసారి కృతజ్ఞ్తలతో,

    కొడవళ్ళ హనుమంతరావు

  1738. వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/12/2008 9:40 am

    kRష్ణమోహన్ గారూ,
    మరొక సంగతి. శనగన నరసింహస్వామి, ఈయన వివరాలు నాకు తెలీవు, కానీ ఈయన ప్రతీ పండక్కి అయిదో ఆరో పద్యాలు రాసి ఆంధ్రపత్రిక్కి, ఆంధ్రప్రభకీ పంపీవారు. వాళ్ళు వేసీవారు. అంతే వాటిగురించి ఎవరూ మాటాడీ వారు కాదు. మీరెవరూ ఆయన ఛందోబధ్ధవయిన పద్యాల్ని ఉదహరించరు. ఆ పద్యాల్లో భక్తి తప్ప కవిత్వం వుండీదికాదు.
    శనగన నరసింహస్వామి గారికి క్షమాపణలు.

    కరటకశాస్త్రి చేత గురజాడ చెప్పించినట్టు చదువు పొట్టపోషించుకోడానికే..సంస్కృతం నుంచి తెలుగు నుంచి ఇంగ్లీషు కి పొట్ట నింపీ భాష మారిపోడంవల్ల, ఇంగ్లీషు లోని పద్యరీతులు తెలియడంవల్ల, అవి తేలికగా వుండడంవల్ల, వాటిని ఛందోబధ్ధవయిన కవిత్వం రాసీ ఛాందసులు ఏవీ చేయలొకపోవడంవల్ల, తెలుగు కవిత్వం ఇటు మళ్ళింది. ఇండియా ట్రాఫిక్, ఇండియన్ పోలిటిక్స్ ప్రవాసాంధ్రులికి, ఎంత అసహ్యం కలిగిస్తాయో, బహుశా గురజాడకి, ఛాందసుల స్టాండర్డ్ ప్రకారం కవి, పండితుడు, కానివాడికి, అప్పటి అన్ని విషయాలూ అసహ్యం కలిగించేయి. అందుకే ముత్యాల సరాలు సృష్టించబడ్డాయి, పాత వాసన వదల్లేక. లేక పాతకొత్తల మేలుకలయిక కోసం. పాత వదులుకోలేక. పాత వదులుకోడం, మూలాల్ని తెగ్గొట్టుకోడవేకదా?

    కవిత్వాన్నికానీ, సంగీతాన్నికానీ, మిగిలిన కళారూపల్ని కానీ అప్పటి కాలపరిస్తుతులు నిర్ణయిస్తాయి తప్ప ఇంకేవీ ఏవీ చెయ్యలేవు. ఈ కాల పరిస్థితులే విశ్వనాధ వార్ని కూడా మార్పు వేపు ఈడ్చుకొచ్చేయి. కాదని పురాణం సుబ్రహ్మణ్యం గారన్నా, పురాణం సీతన్నా, పి.ఎస్ అన్నా,”చేరా” అన్నా, వేగుంట మోహన్ ప్రసాద్, “మో” అన్నా, భగవంతుడే అన్నా అది ఒప్పుకోకూడదు..

  1739. వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/12/2008 7:59 am

    కృష్ణమోహన్ గారూ,
    ఛందస్సు అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా రాసేవాళ్ళకి, అంతకన్నా ముఖ్యంగా చదివేవాళ్ళకి. అయితే ఛందోబధ్ధంగా రాయకపోతే కవిత్వంకాదు అని మీరు రాసిన సంధియుగం సీనియర్ కవులు కుర్రాళ్ళని నిర్బంధించకపోయినట్టయితే, లేక కవులు కాదు అని ఈసడించకపోయివుంటే ఎలావుండునో కథ. అప్పటి యూరోపియన్ కవిత్వపు ఇన్ఫ్లూయెన్స్, ఇంగ్లీషు చదువులు, పట్టించుకోకుండా, సంస్కృతం ఇంకా రాజభాషే అన్న అపస్మారక స్థితిలో వుండి, సంస్కృతం నుంచి డిరైవై న ఛందోబధ్ధవయిన తెలుగు కవిత్వం మాత్రమే కవిత్వమని అనుకున్నవాళ్ళ వల్లే కుర్రాళ్ళందరూ ఇటు మారిపోయేరు.

    ఇంకొక విషయం, ఛందోబధ్ధవయిన తెలుగు పద్యం, గురజాడ ముందు తరంలో మహానుభావుడనే కవికి ఎంత గేప్ వుందో చూడండి. సంధి యుగం అని ఎందుకన్నారూ?
    ఛందస్సు నుంచి ముత్యాల సరాలు నుంచి శ్రీశ్రీ కవిత్వం నుంచి కుందుర్తి ఆంజనేయులు వరకూ అని మీ అభిప్రాయమా? అందుకని ఛందస్సు కీ శ్రీశ్రీ కీ మధ్యది సంధియుగమా?
    చందస్సు మీద ఇప్పటికీ ఎవరికీ కోపంలేదు, అసహ్యంలేదు. అక్కరలేదు కాబట్టి మానీసేరు. మానేస్తున్నారు. ఛందొబధ్ధవయిన కవిత్వం రాస్తున్నవాళ్ళు అనుభూతికి, భావానికి రెండో పీట వేసి ఛందస్సుకి పెద్దపీట వెయ్యడం వల్లే వాళ్ళ కవిత్వంలో ఛందస్సు తప్ప కవిత్వం వుండకుండాపోతోంది.

  1740. బంధుత్వం గురించి Surya గారి అభిప్రాయం:

    07/09/2008 3:10 am

    కవిత బాగుంది

  1741. బంధుత్వం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/08/2008 4:27 am

    “కాబూలీ వాలా” లోని మన్నాదే పాట గుర్తొచ్చింది.

    “మల్లినాథ్” గారి అభిప్రాయం అంత బాగుంది ఈ కవిత.

    మంచి కవిత.

  1742. చిలక జోస్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/08/2008 4:15 am

    టి ట్వంటీ లాటిది కవిత.
    వండే లాటిది కథ.
    టెస్టు మేచ్ లాటిది నవల.

    ఇదీ, కొంచెం వెటకారంగా, ఇప్పటి వాళ్ళకి సులువుగా అర్థవయ్యేట్టు చెప్పాలంటే వర్గీకరణ. మూడు రకాల్లోనూ బోరింగ్ మేచులుండొచ్చు. థ్రిల్లింగ్ వీ ఉంటాయి.

    ఇది బోరింగ్ కవిత నాకు. కవిత్వం ఎలా వుండాలో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కవిత చూసిన లేక చదివిన తరవాత దాంట్లో కవిత్వం వుందొ లేదో చెప్పడం చలా సులువు. “ఛిలక జొస్యం” లో కవిత్వం వుందో లేదొ చెప్పడానికి “రారా” కానీ, “కాంతారావు” కానీ, “చేరా” కానీ అఖ్ఖర్లేదు. అయితే ఉదయకళ గారి సిన్సియారిటీ కనపడుతోంది ఇందులో. కష్టపడితే, మంచి కవిత్వం రాయగలరేమో?

  1743. చీకటి పరచుకున్న ఆకాశంలో…. గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/07/2008 5:17 am

    అనుభూతి అందరిదీ. కవిత్వం కిరణుది. ఆవేశాలు అనుభవాలయి చచ్చిపోవడం నిజం. మినుకుమినుకు మంటున్న ఆ జ్ఞాపకాలే మిగిలిన బతుకంతా వెలిగిస్తాయి.

  1744. అక్షరాలు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/07/2008 5:01 am

    అద్భుతవయిన అసంపూర్తి కవితలా వుంది.
    మనలో, మనతో నిత్యం ప్రయాణించేవి మననుంచి వేరెలా అవుతాయి? ఎందుకవుతాయి?
    చివరి రెండు పంక్తులు అస్పష్టంగా వున్నాయి, ఊపున్నా సరే.
    అవి లేకపోతే, చక్కని అక్షరాంజలి.
    “మహాకవి…….వొదిగిపోయే ఈ అక్షరాలు” కోటబుల్ కోట్సు.
    బహుశా, “మనలో ఒకటై..”పడ్డ తరవాత పధ్ధతికలవాటు పడిపోయిన కవితా స్రవంతి లా అనిపిస్తోంది.
    అలాటి అలవాట్లే వదిలించుకోవాలి.
    మీ కవిత్వం లో ఇలాటివి ఎక్కువ. మంచివి కావేమో?

  1745. అక్టోబరు పులి గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/07/2008 4:28 am

    చిన్నప్పుడు చూసిన పులి మళ్ళీ స్క్రీను మీద “డేంచాడీసింది”
    అమరావతి కథ గుర్తొచ్చింది.
    “విజినారం” గుర్తొచ్చింది.
    మొన్న వేసవి సెలవలకి విజయనగరం వెళ్ళిన మా అయిదేళ్ళబ్బయి, మొదటి సారిగపులివేషం చూసి, నా చిన్నప్పుడు నాలాగే, భయపడిపోయి దాన్నిఎంత ఎగ్జైటింగా చెప్పేడంటే, మీ కవితలో మొదటి సగంలాగే.

    అయితే, ఇలాటి కవితలు “టుమ్రీల్లాటివి”. కచేరీ లొ లాస్టులొ పాడేవి.
    మీరింకా అసలు కచేరీ మొదలెట్టేరా కిరణు?

  1746. సీతా-రామా గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/06/2008 4:50 am

    ఇది కథ కాదు. కవిత అంతకన్నా కాదు. కథని కానీ, కవితని గానీ అనుకుని ఏవరయినా చదివితే అది వారి తప్పు. కథ కుండవలసిన లక్షణాలు ఏవీ లేవు. అందుకే లలిత గారు చదవలేకపొయేరు.
    అయితే, కథ, కవిత రెండూ కలగలిపిన పధ్ధతి అద్భుతం. కథ తూనిక రాళ్ళతో దీన్ని తూచకూడదు.ఈ పధ్ధతిని మ్యూజింగ్స్ అనవచ్చా?
    కిరణ్, కవితలు కాదయ్యా నువ్వు రాయవలసినవి. ఇలాటివి రాయాలి.విమర్శకుల్ని పక్కన పెట్టు. కృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు, ఇంకా రాయడవే విమర్శకులకి మందు.
    కంగారుగా, బధ్ధకంగా, “చాల్చాల్లెగెహె..” అనుకొని రాసినట్టుంది. తేట తెలుగులో రాసినట్టు రాయవయ్యా. శబ్దాడంబరం ఏందుకు? అనుభూతికి ఏలాటి ఆడంబరం వుండదే? శబ్దానికెందుకు? శ్రీశ్రీ చెప్పినట్టు “సింపుల్ గా చారు పెట్టినట్టు..” రాయలేవా?

  1747. పేరులేదు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/06/2008 3:21 am

    కొడవళ్ళ వారి క్లుప్తత గురించి కిరN గారు ఖచ్చితంగా పట్టించుకొవాలి. స్మైలు గారి అభిప్రాయము గురించి కొడవళ్ల వారి వ్యాఖ్య అనవసర ప్రసంగము. ఇలాటివే మన కవిత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. స్మైలు గారు రాసింది ఒకటి, ఈయన చెప్పుకొచ్చింది ఇన్కొకటి. కిరణూ మంచి భావము ఉన్నప్పటికీ, మంచి భాష ఉన్నప్పటికీ పద్యము మంచి పద్యము అవదు, క్లుప్తత లేకపొతే.

  1748. నేను – నువ్వు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    07/06/2008 2:42 am

    బహుశా ఈ కవి గారు ఆశువుగా చెప్పినదయుంటుంది ఈ కవిత. కవిత్వముంది ఇందులో. నిస్సందేహంగా. అయితే భావమొక్కటే రాసేస్తే కవిత అవదుకదా? ఆ కృషి చేస్తే ఇంకా మంచి కవివితం రావచ్చు కిరణ్ గారి దగ్గర్నుంచి.

  1749. వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి rama గారి అభిప్రాయం:

    07/03/2008 10:45 am

    మోహన రావు గారు, నమస్కారమండీ!

    కవిత్వం అంటే మీకున్న మమకారం నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది సుమా. సంప్రదాయ కవిత్వం నించి మీరు ఇచ్చే పద్యాల వుదాహరణలని అప్పుడప్పుడు చూస్తూ వుంటాను. అమెరికా లొ వుంతూ కూడా తెలుగు కవిత్వం పట్ల మీకున్న ప్రేమ మెచ్చుకో తగ్గది.

    అయితే మీకు ఇటీవల కాలం లోని కవిత్వం అందుబాటులో లేకనో, లేక మరి ఏ కారణామో నాకు స్పష్టపడలేదు గాని, వుదాహరణలు ఇచ్చినప్పుడు బలం చాలలేదు అనిపించింది.

    మిగత కవయిత్రుల మాట అటుంచినా జయప్రభ గారి కవిత్వం “స్త్రీ వాద” పరిధిని దాటి విస్తరించిందన్న విషయం కవిత్వాభిమానులకి సుస్పష్టమైన విషయమే. మీరు బహుశా ఆమె రాసిన మొత్తం కవితా సంపుటాలని చదివే వుంటారు. మీరు ఇచ్చిన వుదాహరణకన్నా మంచి వుదాహరణ ఆవిడ పోయెట్రి నించి ఇవ్వవచ్చునేమోనని నాకు అంపించింది. అలాగే ఆమె కవిత్వం లో వస్తు వైవిధ్యం వ్యక్తీకరణలో వైవిధ్యము గాఢమైనవి గనక కొల్లలుగా వుదాహరణలని ఎంచుకునే అవకాశం కూడా వుంది.

    తెలుగు లోనే కాదు, అసలు భారతీయ భాషలలోనే ఒకలాంటి ప్రత్యేకమైన పరిస్థితి కనిపిస్తుంది; అది ఎలాంటిదంటే, ఒక ముద్రతో ఒక రచయితనో ఒక కవినో గుర్తు పెట్టుకోవటం. ఒకవేళ ఆ కవులు ముద్రల లో వొదగని కవిత్వం రాస్తే వాటిని వారి కవిత్వం ఆధారంగా విశ్లేషించటం, ఒక మూసలో వేసి చూసే దృష్టిని వదిలి వేయటం అవసరం అనుకుంటాను, సాహిత్య విశ్లేషకులకి. అప్పుడు మాత్రమే నిస్పక్షపాతమైన విమర్శ సాధ్యం అవగలదు.

    ఇది, మంచి విశ్లేషణ, మీలాంటి వారి నించి వస్తుందన్న ఆశతో చేస్తున్న సూచన గా మాత్రమే భావించగలరు. సింప్లిఫై చేసి చెప్పటం కాకుండా మీలాంటి వాళ్ళు ఇటీవలి కాలంలో, ఆమె కవిత్వం లాంటి గాఢమైన రచనలను, అందులోని విశేషాలని చెప్పటం కవితా ప్రేమికులకి సంతోషదాయకమైన విషయం కాగలదు.

    ఒక కవిలోని విశేషాంశాలని ఆ కవి సమకాలం లొనే చెప్పటం ఒక సాహిత్య మర్యాద కూడా. మన తెలుగు లొ ఎప్పుడూ కవి కలం కన్నా వందేళ్ళు దాటితేనేగాని వారి కవిత్వం వేసిన ప్రభావాన్ని అంచనా వేసే దృష్టి కనిపించదు. కనీసం మీరైనా సమకాలం లోని మంచి కవిత్వాన్ని సమకాలం లోనే అంచనా వెయ్యగల సమ దృష్టిని చూపిస్తారని ఎదురుచూస్తాను.

    మీ అభిమాని,
    రామ

  1750. కలల మైకంలో గురించి Achalla Srinivasarao గారి అభిప్రాయం:

    07/03/2008 6:17 am

    సాధనల ఎడారిలో నే జీవిత జీవం మెటీరియలిస్టిక్ గా యింకిపోతున్న రోజులలో
    నిశ్శబ్దపు ధాత్రి లో నీరవపుటర్ధరాత్రి గుండె లో ఏవో జ్నాపకాల పొరలు కదిలి కదిలే నీలి మేఘం కనులలోనే కరిగి….’కలల మైకం’ లో తేలి పోవడం మంచి అనుభూతి కవిత్వపు లక్షణ మనుకుంటా… చాలా బావుంది . కవిత తిలక్ గుర్తుకొచ్చారు.

  1751. బంధుత్వం గురించి S. Mallinath గారి అభిప్రాయం:

    07/03/2008 1:02 am

    వంశవృక్షం ఆధారంగా బంధుత్వ సంబంధాలను నెలకొల్పే Geni.com, Amiglia వంటి వెబ్ సైట్ లకు వాణిజ్య ప్రకటనగా వాడుకోగలిగేంత బాగుందీ కవిత.

  1752. బంధుత్వం గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:

    07/03/2008 12:01 am

    చాలా బాగుందీ కవిత.

  1753. ఆరుద్ర తో ముఖాముఖీ గురించి mOhana గారి అభిప్రాయం:

    07/02/2008 9:09 am

    చాలా బాగుంది, దీనిని అందించినందులకు ధన్యవాదాలు. ఆధునిక కవిత – అభిప్రాయవేదిక అనే పుస్తకంలో ఆరుద్రగారు మరి కొందరితో చర్చను జరిపారు. దీనిని నా వ్యాసములో కూడ ఉదహరించాను. ఇందులో రాయప్రోలు, దాశరథి, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె, దివాకర్ల, శేషేంద్ర్రశర్మ, కుందుర్తి, వేదుల, మహీధర, నార్ల, ఆధునిక కవిత్వంపై తమ భావాలను వెలిబుచ్చారు. ఈ ఆడియోలో ఉన్నవి కొన్ని ఇంకా విడమర్చబడి ఉన్నాయి పుస్తకంలో. తప్పక చదవండి. – మోహన

  1754. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    07/02/2008 8:09 am

    మొదటి పేజీ చదివి, కొంచెం ఈ నాటి కవిత్వం లోనించి కూడా ఉదాహరణలు ఇస్తే బాగుండునే అనుకున్నాను. తరువాతి పేజీల్లో ఈ ముచ్చట కూడ తీర్చారు. వ్యాసం సమగ్రంగా ఉంది. ఉదాహరణలు యథోచితంగా ఉన్నాయి.
    ఆముక్తమాల్యదలో రాయల వారు భాష పరంగా చేసిన్ ఇంకో ప్రక్రియ నేను గమనించాను. ఈయన పదాల్ని ఒక ప్రెస్సులో పెట్టి నొక్కేస్తాడు. ఇల్లాంటి నొక్కుళ్ళు విచిత్రమైన పదబంధాల్ని సృష్టిస్తాయి. అలాంటి పలుకుబళ్ళు ఇంకెక్కడా కనబడవు.
    ఉదా. మంగళ కైశికి ఉపాఖ్యానం నుండి మాలదాసరి భగవంతుని స్తుతించే వర్ణన
    శా. గండా భోగముల న్ముదశ్రులహరుల్గల్ప న్నుతుల్పాడి యా
    దండ న్వ్రేగులు డించి భక్తిజనితోద్యత్తాండవం బాడు నా
    చండాలేతర శీలుడుత్పులకియై చాండాలికన్మీటుచున్
    గుండుల్నీరుగనెండ గాలి పసి తాకుం జూడ కాప్రాహ్ణమున్.

  1755. ప్రతీకగా శరీరం గురించి bollojubaba గారి అభిప్రాయం:

    06/27/2008 8:28 am

    మంచి వ్యాసం. పరిచయం చేసిన పద్యాలు అద్భుతాలు. మూడు కవితలు మూడు ప్రపంచాలకు ప్రతినిధులు. ఒకటి ఆధ్యాత్మికత, రెండు అధివాస్తవికత, మూడు భావుకత. మూడూ హృదయంలోని భిన్న నాడులను స్పందింపచేసేవే.
    ఇంతకంటే మాటలు రావటం లేదు.

  1756. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    06/24/2008 11:07 pm

    నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్న పాఠకులకి కృతజ్ఞతలు.

    నాగమురళి గారూ,

    మిమ్మల్ని ఏకబిగిన చదివింప చేసిందన్నారు. సంతోషం. నా తెలుగు మూలన పడిందని నాకు భయం. రోజూ పది నిముషాలు మా ఆవిడతో తెలుగులో మాట్లాడటం మినహా, నిత్యజీవితంలో నా తెలుగు వాడకం పుస్తకాలు చదవడానికే పరిమితం.

    ప్రస్తుతానికి వేరే విషయాల మీద రాసే ఆలోచన లేదు. ఆయా రంగాలలో అనుభవం ఉన్నవాళ్ళు తెలుగువాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొందరైనా పూనుకొని రాస్తే ఎంతో సేవ చేసిన వారవుతారు.

    లక్ష్మన్న గారూ,

    నేను ఇంజనీరింగులో అత్యుత్తమ స్థాయికి చెందినవాడిని కాదు. మీరన్నట్లు మన దేశంలో విజ్ఞానశాస్త్రాలలో నిష్ణాతులైన వారు చాలా మంది ఉన్నారు. కాని వాటిని సామాన్యప్రజలకి పరిచయం చేసినవాళ్ళు తక్కువ. తెలుగులో మహీధర నళినీమోహన్ చెప్పుకోదగ్గవాడు. బహుముఖ ప్రతిభావంతులైన కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఇంకా ఎక్కువ రాస్తే బావుంటుంది.

    ఈ వ్యాసాలు తెలుగు దినపత్రికలలో వస్తే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయన్నది నాఆశ కూడా. ఆంధ్రజ్యోతి కి రాశాను – జవాబు లేదు!

    సిలికాన్ మహత్యం మీద మీరు రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా రాయండి.

    సాధ్యమైనంతవరకు కవితలకు దూరంగా ఉండమని సూచన ఇచ్చారు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, నా విభేదాన్ని తెలుపుతాను. కవితయినా, మరేదయినా, అసందర్భంగా ఉటంకిస్తే తప్పుపట్టాల్సిందే. కాని సైన్సు వ్యాసాలలో కవితలుంటే నష్టం లేదు. ఆలోచనకి అడ్డురావనీ, ఆసక్తి కలిగించి అవగాహనని పెంచుతాయనీ నా విశ్వాసం. దీని మీద గతంలో నాగులపల్లి శ్రీనివాస్ గారికి సమాధానమిస్తూ పలుగురు పేర్లని వాడుకున్నాను. ఇప్పుడూ మరొకరి పేరు చెప్పి సమర్థించుకుంటాను.

    ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జీవశాస్త్రవేత్త, తెలుగువాళ్ళకి కాస్త దగ్గ్గరయిన (మరణానంతరం ఆయన దేహాన్ని పరిశోధనలకై కాకినాడ లోని రంగరాయ వైద్య కళాశాల కిచ్చారు), జె బి యస్ హాల్డేన్ అన్న మాటలు:

    “In my last book on genetics, there are seven quotations from Dante’s Divine Comedy. I have been criticized for ‘dragging in’ Dante. But I think it worthwhile to show the continuity of human thought. I don’t agree with Dante’s theory that mutations are due to divine providence, but I consider it desirable to point out that he had a theory on this subject. I think popular science can be of real value by emphasizing the unity of human knowledge and endeavor, at their best. This fact is hardly stressed at all in the ordinary teaching of science, and good popular science should correct this fault, both by showing how science is created by technology and creates it, and by showing the relation between scientific and other forms of thought.” [1]

    చివరిగా, నా వ్యాసాలని గడువు దాటి పంపినా, తామెంత పని వత్తిడిలో ఉన్నా, ఓపిగ్గా చదివి, ప్రశ్నలేసి, సరిదిద్ది, సాయం చేస్తున్న సంపాదకులకి, ముఖ్యంగా ఇంద్రగంటి పద్మగారికీ, కొలిచాల సురేశ్ కీ కృతజ్ఞతలు.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:
    [1] “On Being the Right Size and other Essays,” by J.B.S Haldane. Edited by John Maynard Smith. Oxford University Press, 1985.

  1757. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి bollojubaba గారి అభిప్రాయం:

    06/22/2008 6:22 am

    కామేశ్వరరావు గారికి

    మంచి విషయాలను మీ వ్యాసంలో పొందుపరిచారు. దీని ద్వారా చాలా విషయాలు నాకు తెలిసినయ్ .

    మీరన్న భాషా వైఫల్యం కేటగిరీకి, శిఖామణి వ్రాసిన “వాడే అశుద్ద మానవుడు” అనే కవిత సరిపోతుంది అని తోస్తోంది. గమనించగలరు.

    మంచి విశ్లేషణ తో కూడిన విషయాలనందిచారు. ధన్యవాదములు

    బొల్లోజు బాబా

  1758. ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    06/21/2008 1:42 am

    శ్రీనివాస్ గారు,

    మంచి విషయాలని ప్రస్తావించారు. నేనన్న వాటికి కాస్త వివరణ అవసరమే.

    1. వ్యావహారిక భాషోద్యమ మూలాలు: నిజమే, మీరన్నట్టు బోధనాభాష విషయం ఒక ముఖ్య చోదకమే కాని మూలాలు ఇంకా ముందే కనిపిస్తాయి. తూమాటి దోణప్పగారు “వ్యావహారిక భాషోద్యమ నేపథ్యం, గిడుగువారి సారథ్యం” అన్న వ్యాసంలో దీన్ని కొంత ప్రస్తావించారు. ముందుగా ఆంగ్లేయుల హయాంలో పరిపాలనాభాషగా వ్యావహారిక భాష ప్రవేశించించడం, ఆ తర్వాత ముద్రణా యంత్ర ప్రభావం వల్ల పుస్తకాలూ, పత్రికలూ సామాన్యజనులకి దగ్గరవ్వడం మొదలైన అంశాలని అతను పేర్కొన్నారు.

    2. పాఠ్యపుస్తకాలలో శృంగార ప్రధానమైన కావ్యభాగాల గురించి: వ్యావహారికభాషా వాదుల వ్యాసాలలో కూడా యీ విషయ ప్రస్తావన చదివినట్టుగా గుర్తు. కానీ మీరన్న తర్వాత తిరిగి వెతికితే ఎక్కడా కనపడలేదు. కాబట్టి నేనీ విషయంలో పొరబడినట్టే ఉన్నాను.

    3. కందుకూరి మధ్యేమార్గం: “గ్రామ్యదేశ నిరసన సభ”లో జయంతి, కందుకూరి ఉపన్యాసాలని గమనిస్తే ఈ విషయం కొంత స్పష్టమవుతుంది. చిన్నయ్యసూరి రాసిన వ్యాకరణం ముఖ్యంగా పద్యకావ్యాల ఆధారంగా రాయబడిందనీ, దానిననుసరించి రాసే గద్యశైలి చాలా కఠినమైనదనీ అతను ఆనాడే గుర్తించారు. నన్నయ్య కాలమునుండీ గ్రాంధిక భాష మారలేదన్న దురభిప్రాయమూ అతనికి లేదు. అతను వ్యావహారికవాదంతో (మొదట్లో) విభేదించినది, నియమ రాహిత్యం గురించే. వ్యాకరణం లేని వాడుకభాషని రచనకి వాడకూడదని అతని అభిప్రాయం. గ్రాంధికవాదం నుంచి, వ్యావహారికవాదం వైపు అడుగువేసిన తర్వాత కూడా, రచనలో వ్యావహారికభాష వాడినా, అది వ్యాకరణ బద్ధమై ఉండాలనే అతని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వ్యావహారికభాషకి వ్యాకరణం రాయడానికి పూనుకున్నారు కూడా. వ్యావహారికభాషా వాదుల్లో, ఇది కనిపించదు. గిడుగువారికికూడా వ్యావహారిక రచనా భాషకి వ్యాకరణం ఉండాలా లేదా అన్న విషయంలో స్పష్టమైన అభిప్రాయం ఉన్నట్టు కనిపించదు.

    4. గురజాడ “పాతకొత్తల మేలికలయిక”: “పాతకొత్తల మేలికలయిక” అంటే ఆశు, లిఖిత సంప్రదాయాలన్నది వేల్చేరువారి interpretation. అది సమంజసమైనదే కావొచ్చు. కాని, గురజాడ ఉద్దేశం కూడా అదే అనడం సరికాదేమో. గురజాడకి ఆ స్పృహే కనక ఉండి ఉంటే, ముత్యాలసరాల గురించి, రగడలూ లేదా మన జానపద పాటల వరసుంచి తీసుకున్నానని అనకుండా పారశీ గజల్ ప్రేరణ అని ఎందుకంటాడు? “ప్రక్రియ”, “భాష”కి సంబంధించే గురజాడ ఆ మాట అన్నాడని నే ఉద్దేశం. గురజాడ కవిత్వంలో, శ్రవ్య కథాకావ్యం, దృశ్య కావ్యం, జానపద గేయం వంటి పాత ప్రక్రియలూ కనిపిస్తాయి; కొత్తవైన భావగీతాలూ, ఇతర పాశ్చాత్య ప్రక్రియలూ కనిపిస్తాయి. అలాగే అతను వచనరచనలో పూర్తిగా వాడుకభాష వాడినా, కవిత్వంలో గ్రాంధిక పోకడలని గమనించవచ్చు.

    5.భావ కవుల “పాతకొత్తల మేలికలయిక”: ఇంతకీ నేను గురజాడని కోట్ చెయ్యడం, అతని పాతకొత్తల మేలికలయికే భావకవులది అని చెప్పడానికి కాదు. భావకవులు వ్యావహారికభాషా వాదాన్ని నెత్తిన పెట్టుకొన్నా, వారి కవిత్వంలో ఎక్కువగా కనిపించేది పూర్వ కావ్యాలలోని భాషే, వాడుకభాష కాదు. “ఎంకిపాటలు”లాంటివి అక్కడక్కడే కనిపిస్తాయి. నేనన్న పాతకొత్తల కలయిక, యీ ఉద్దేశంతో. వీళ్ళతో పోలిస్తే, గురజాడ ఇంకా ఆధునికుడుగా కనిపిస్తాడు. కవిత్వంకూడా వాడుకభాషలో రాయవచ్చని, కాకపోతే దానికి పద్యాలు పనికి రావని అతను గుర్తించాడు. పద్యాలు కూడా వాడుకభాషలో రాయడానికి గిడుగు సీతాపతిలాంటివారు విఫల ప్రయత్నం చేసారు.

    6. తిరుపతివేంకటకవులు: వ్యావహారికభాషా వాదానికి వీరు అనుకూలురు కాకపోయినా, వ్యతిరేకులు మాత్రం కాదని అనిపిస్తుంది. ముఖ్యంగా భాష మార్పు చెందే విషయమై, వ్యాకరణాల పరిమితి విషయమై, వ్యావహారికభాషా వాదులతో వీరు ఏకీభవించారు. “కాలముబట్టి దేశమును గాంచి ప్రభుత్వమునెంచి దేశభాషా లలితాంగి మారుటది సత్కవి సమ్మత”మని గుర్తించారు. వాళ్ళ పద్యాలలో లక్షణ విరుద్ధ ప్రయోగాలూ, అన్యభాషా పదాలూ వాడడం ప్రసిద్ధమే కదా. కొంత అధిక్షేపం ఉన్నా, “గిడుగా? పిడుగా?” అన్న వ్యాసంలో గిడుగు గురించి చెళ్ళపిళ్ళవారన్నదాంట్లో నిజాయితీ ఉందని నాకనిపించింది. అందులో, ఈ వాదాలగురించి వారు స్పష్టంగా చెప్పారు:

     నామతం గ్రాంథికభాషలో వ్రాసేవారు గ్రాంథికభాషలోనే వ్రాసుకోవచ్చుననిన్నీ వ్యావహారికభాషలో వ్రాసేవారు వ్యావహారికభాషలోనున్నూ వ్రాసుకోవచ్చుననిన్నీ వీరికీ వారికీ వివాదపడవలసిగాని తిట్టుకోవలసికాని లేశమున్నూ ప్రసక్తి వుండకూడదనియ్యేవే. అయితే గ్రాంథిక కవుల పుస్తకాల్లో యెన్నో వ్యావహారిక ప్రయోగాలు కనపడడంచేత యీ గ్రాంథిక కవులు గ్రాంథిక కవులు కారంటూ పంతులవారు తరచు ఆక్షేపించడం కలదు. దానికి నా సమాధానం యేమిటంటే, యెక్కడో వక్కటితప్ప ఆ వ్యావహారిక పదాలు చాలా వఱకు సాధ్యాలే అవుతవి. కానిదేదేనా వుంటే అది ప్రమాదపతితంగా భావించవలసిందేగాని అంతమాత్రంచేత ఆ గ్రంథకర్త వ్యావహారిక భాషా కవి కాడనియ్యేవే. 

    ఇక, గురజాడ మధ్యేమార్గస్థుడెలాగో వివిరించడం మీ వంతు 🙂

  1759. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Nanduri Venkata Subbarao. గారి అభిప్రాయం:

    06/19/2008 6:43 am

    హనుమంతరావు గారు చెప్పింది నిజమే, విశ్వనాధ గొప్పదనం చెప్పడానికి ఇంకొకరిని కించపరచాల్సిన పనిలేదు. ఎవరి గొప్ప వారిది. విశ్వనాధ గొప్పదనం చాలాతక్కువ మందికి తెలుసని బాధపదటం వేరే విషయం.

    నాకు తెలిసి విశ్వనాధ శ్రీశ్రీ ని గానీ, శ్రీశ్రీ విశ్వనాధను అగౌరవపరచుకొన్నది, ఖండించినదీ లేదు. ఒకరి మహాకవిత్వాన్ని, మరొకరు మౌనంగా అంగీకరించినట్లే కనబడ్డారు. వారి గురించి మనం తగూ పడటం సరికాదు.

  1760. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    06/18/2008 10:55 pm

    చక్కని వ్యాసం… ప్రాచీన, ఆధునిక కవిత్వాల్ని చక్కగా అనుసంధానిస్తూ రచన సాగింది. కవిత్వ మూలాలు భాషాతీతంగానే ఉన్నా, కవిత్వ భాష మీద ఇలాంటి పరిశోధనా వ్యాసాలు కవిత్వాన్ని మరింత లోతుగా అర్ధం చేసుకోడంలోనూ, రూప పరమైన క్లుప్తత సాధించడంలోనూ ఖచ్చితంగా ఉపయోగపడతాయి.

  1761. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    06/18/2008 10:34 pm

    “కాని ఈయన కన్నా ఎంతో తక్కువ రాసి, తోటి మనుషులమీద సానుభూతి నాలుగు గేయాల్లొ కుమ్మరించేసి (అందులొ కొన్ని వేరే దేశపు కవుల పాటల అనువాదాలు) ప్రజాకవులై పోయారు కొందరు. తడి తక్కువ. బడాయి ఎక్కువ. 🙂 కవి ఒక్కటో రెండో చిన్న పాటల పుస్తకాలు రాస్తే, వాటినుండి రోజూ ఉదహరించటం తేలిక. మనకీ కంఠతా వస్తాయి. కంఠతా వచ్చాయి కాబట్టి, పద్యాలు గొప్పవీ, కవి గొప్పవాడు అని ఒక వాదం లేవదియ్యొచ్చు.”

    లైలా గారు శ్రీశ్రీ మీద వేసిన పై విసురులో వేడెక్కువ, వెలుగు మాత్రం శూన్యం! కంఠస్థం చెయ్యడం సులభం అని మహాప్రస్థానాన్ని కంఠస్థం చెయ్యరు; గొప్ప కవిత్వం అంతా కంఠస్థం చెయ్యదగ్గది కనుకే చేస్తారు. శ్రీశ్రీ బండెడు సాహిత్యం రాసినా రాయకపోయినా మహాప్రస్థానం ఒక్కటే చాలు తనని నిలపడానికి. అయినా ఈ పోలిక వలన ఒరిగేదేముంది – సాహితీ చర్చల స్థాయిని దిగజార్చడం మినహా!

    మన సాహిత్య చరిత్రలో విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ – ముగ్గురూ మూడు మార్గాలకు ప్రవర్తకులంటూ కాస్త వెలుగు ప్రసరించిన వడలి వ్యాసం [1] చదవదగ్గది.

    విశ్వనాథ వ్యాసం బావుంది. కాని, భాషా సంపర్కం కలచోట నివసించే వాళ్ళు మార్పుని సంబాళించుకోలేరు అని ఆయన అన్నదానికీ, భాషాశాస్త్రవేత్తలు చెప్పేదానికీ పొంతన లేదు.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:
    [1] “సాహిత్య ప్రస్థానం – కొన్ని మజిలీలు” లో వ్యాసం, “క్లాసిక్ – రొమాంటిక్.” వడలి మందేశ్వరరావు.

  1762. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    06/18/2008 7:59 am

    నోరూరించే ఆహార పదార్థాల గురించి విశ్లేషించి వివరించే విధంగా, కవిత్వ భాష లక్షణ స్వరూపాలను చెప్పడం మాత్రమే కాక, samples గా రుచి చూపే విధంగా సోదాహరణంగా అందించడం చాలా బాగుంది. ఎంతో పరిశీలన, పరిశోధన, పరిశ్రమలతో పలు విషయాలను ఆసక్తికరంగా అందించినందుకు చాలా కృతజ్ఞతలు.

    ఇటువంటి కృషి, రచనలు కవిత్వాన్ని అర్థంచేసుకోవడానికీ, మరింతగా ఆనందించడానికీ సాయపడుతాయి నిస్సందేహంగా. అయితే మంచి కవిత్వాన్ని సృష్టించడానికి మాత్రం ఇవి ఎంతగా ఉపయోగపడుతాయో సరిగ్గా తెలియదు, నాకైతే. రసాత్మకమైనదే కవిత్వం, లేదా ‘కదిలించేదే’ మంచి కవిత్వం, అని అనుకుంటే దాని రూపాలు భాషలోనే ఉన్నా, మూలాలు మాత్రం భాషను దాటగలిగే భావగతమైన హృదయస్పందన పరిధిలోనే ఎక్కువుగా ఉంటాయేమోనని అనిపిస్తుంది.

    ఏదియేమైనా, ఆలోచింపజేసే పలువిషయాలను అందించిన వ్యాసమిది. ఇంకా ఇటువంటివి ఎన్నో కామేశ్వరరావుగారు మనకు అందించాలని ఆశిస్తూ,

    విధేయుడు
    Srinivas

  1763. ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    06/17/2008 9:33 pm

    కామేశ్వరరావు గారు:

    ఇది మీరు 06/12/2008 నాడు రాసిన వ్యాఖ్యకు followup.

    పాఠ్యపుస్తకాలలో బోధనా భాష విషయమన్నది ఈ వాదులాటకి ఒక catalyst లాంటిది మాత్రమే. నా దృష్టిలో యీ ఉద్యమానికి మూలకారణాలు వేరే చోటున్నాయి (ఒక ముఖ్య కారణం అచ్చుయంత్ర ప్రవేశం). మీరు మొదటి పేరాలో చెప్పిన మిగిలిన విషయాలతో అందరూ (నేనైతే) ఏకీభవిస్తారు (ను). కాకుంటే ఈ కింది వాక్యమెందుకు ప్రస్తావించారో బోధపడలేదు. ఇదే సందని కావ్యాలోని శృంగారరసం ఉన్న భాగాలు పాఠ్యపుస్తకాలలో ఉండకూడదని సంబంధం లేని చర్చ ఇంకొకటి. ఈ రెండు చర్చలకు ఎలాంటి సంబంధం లేదు. వీటిలో పాల్గొన్న వ్యక్తులు/సంస్థలు (వావిళ్ళ వారినొక్కరిని మినహాయిస్తే!) కూడా వేర్వేరు అని మీకు నేను చెప్పనవసరం లేదు.

    కందుకూరి మధ్య మార్గం పాటించిన మనిషిగా ఎలా చెప్తున్నారో అర్థం కాలేదు. వివరించగలరు. గురజాడ “కొత్తపాతల మేలు కలయిక” అన్నప్పుడు ఆశు (/మౌఖిక), లిఖిత సంప్రదాయాల్ని కలుపుకుంటూ అన్న అర్థంలో వాడాడు. భావకవులకు ఆశుకవిత్వం పట్ల, “గ్రాంథికం” పట్ల వున్న అయిష్టత తెలిసినదే.

    అలాగే తి.వెం.కవులు గ్రాంథికవాదాన్ని తిరస్కరించారని ఏ ఆధారంతో చెప్తున్నారో కూడా నాకు బోధపడలేదు. తిరుపతిశాస్త్రి గారు జీవించి వున్న కాలంలో వారిద్దరూ “వ్యావహారిక వాదానికి” అనుకూలురు కాదు. నిజానికి చాలకాలం (అంటే జమీందారుల పోషణ పొందినంతకాలం), వారే చాలాచోట్ల చెప్పుకున్నట్లు, తెలుగంటే చిన్నచూపే (చూ: కథలు-గాథలు, మూడు భాగాలూ). వెంకటశాస్త్రి గారు చివరిరోజుల్లో కూడా “వ్యావహారికానికి” అనుకూలుణ్ణని చెప్పుకోలేదు. ఒక ఉదాహరణ:

    “నేనీ పొత్తమును సర్వసాధారణమయిన వ్యవహారిక భాషలోనే వ్రాస్తాను. 64 వత్సరములు నిండు వయస్సులో వ్రాస్తూ వున్న దీనిని చూచి, నన్ను “తుద కబ్బెరా తురక భాష” అని నా మిత్రులూ, శిష్యులూ లోనగువారు కొందరు నిందింతురని నక్కు తెలిసిన్నీ, నేనిట్టి భాషను సమర్థించు వారిలో చేరినవాడను కాక యుండిన్నీ, ఇందులో వ్రాయుటకు కారణము, నాకు ఈ భాష అంటే అంతగా యిష్టం లేకపోయినా, ద్వేషం కూడా అంతగా లేదని లోకులకు తెలియజేయటమే నా ముఖ్యోద్దేశ్యము.” (చూ: కాశీయాత్ర, 1942)

    ఏమయినా, వాళ్ళు, ముఖ్యంగా చెళ్ళపిళ్ళ, ఏ గాటానా కట్టడానికి లొంగని వ్యక్తులు :-). వాళ్ళ Cultural Biography ఎవరైనా రాయవలసిన అవసరం యెంతైనా వుంది.

    సంస్కృత ప్రభావంతో “తెలుగుకున్న వ్యాకరణదీపం చిన్నదనే” భావన పండితలోకంలో చాలాకాలం బలంగా వుంది. అది చెళ్ళపిళ్ళవారి అభిప్రాయం మాత్రమే కాదు.

    #[…] All Telugu courtly poets proudly proclaimed that they commanded scholarship in Sanskrit, Prakrits of different varieties, Puranas, Sastras and a host of related subjects like meter. While they composed poetry almost entirely in Telugu, they did not have to support their Telugu by texts of grammar or dictionaries: Telugu was a language of poetry, not of scholarship. When challenged, the court poet supported the Sanskrit words he had used in his poem by quoting the great Sanskrit lexicographers of the past, but for his Telugu words, he only needed the approval of past usage by an earlier court poet. There was also a long and sustained effort on the part of grammarians and lexicographers to produce a set of rules and dictionaries for the Telugu used in courtly poems. None of them however had the status of the famous Sanskrit grammarians and lexicographers.[…*] #

    నాకు తెలిసి మధ్యేమార్గస్తుడెవరైనా వుంటే అది గురజాడ మాత్రమే.

    చివరిగా మీరు ముగింపులో ప్రస్తావించిన రెండు విషయాలపై మాత్రం యెంతైనా చర్చ జరగవలసిన అవసరం వుంది.

    — శ్రీనివాస్

    * V. Narayanarao, Print and Prose: Pundits, Karanams and the East India Company in the Making of Modern Telugu. In _India’s Literary History: Essays on the Nineteenth Century_, S. Blackburn (Ed). Delhi: Permanent Black. 2004. pp. 146-66.

  1764. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    06/16/2008 7:51 am

    విశ్వనాథ రచనలు ఎన్నోచదివాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. స్కూల్లో రోజూ పాఠాలు చెబుతూనే అన్ని గొప్ప రచనలు ఎలా చేశారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో తెలుగు వారు ఒక్క పద్యం రాసినా ఒక పేజీ వచనం రాసినా ఒక సంవత్సరం పాటు దాని గురించే మాట్లాడుతారు. అందులో ఏం ఉండదు కూడా. ఆ రాసిన ఒక్క పెజి చదవమని వంద లింకులు. హంగామా. 🙂

    విశ్వనాథ పాండిత్యం, కవితాశక్తి, తర్కం, తాత్విక భావాలు, ఆలోచనలో విశాలత్వం, పాతబడని ఆధునికత – అన్నీ నన్ను మెప్పిస్తాయి. విశ్వనాథకు ఆయన సమకాలంలోనూ, ఇప్పటివరకూ పోటీనే లేదు. కాని ఈయన కన్నా ఎంతో తక్కువ రాసి, తోటి మనుషులమీద సానుభూతి నాలుగు గేయాల్లొ కుమ్మరించేసి (అందులొ కొన్ని వేరే దేశపు కవుల పాటల అనువాదాలు) ప్రజాకవులై పోయారు కొందరు. తడి తక్కువ. బడాయి ఎక్కువ. 🙂 కవి ఒక్కటో రెండో చిన్న పాటల పుస్తకాలు రాస్తే, వాటినుండి రోజూ ఉదహరించటం తేలిక. మనకీ కంఠతా వస్తాయి. కంఠతా వచ్చాయి కాబట్టి, పద్యాలు గొప్పవీ, కవి గొప్పవాడు అని ఒక వాదం లేవదియ్యొచ్చు.

    విశ్వనాథ వ్యాసం నాకు నచ్చింది. ఈ ప్రత్యేక వ్యాసాలు అన్నీ చదివాను. మళ్ళీ చదవాలి. ఈమాట పత్రిక చాలా ఉల్లాసం కలిగిస్తున్నది.

    లైలా.

  1765. ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    06/12/2008 9:49 am

    అసలీ ఉద్యమం మొదలయ్యింది పాఠ్యపుస్తకాలలో బోధనా భాష విషయమై. మన అదృష్టమో, దురదృష్టమో అది దారితప్పి చిలికిచిలికి గాలివానయ్యింది! ఏది గ్రాంధికభాష, ఏది గ్రామ్యము అన్న వాదాలే పెరిగిపోయాయి. చిన్నయ్యసూరి వ్యాకరించినది తప్ప తక్కినదంతా గ్రామ్యమే అని కొందరు వాదిస్తే, నన్నయాదులు కూడా వాళ్ళకాలంలోని శిష్టవ్యావహారికాన్నే వాడేరని కొందరు నిరూపించడానికి ప్రయత్నించారు. బాలవ్యాకరణమే శిరోధార్యమని కొందరంటే, అసలు వ్యాకరణమే అక్కరలేదని కొందరన్నారు! పులిమీద పుట్రలా గ్రాంధికభాష కృతకభాష అని మరో వాదన. ఇదే సందని కావ్యాలోని శృంగారరసం ఉన్న భాగాలు పాఠ్యపుస్తకాలలో ఉండకూడదని సంబంధం లేని చర్చ ఇంకొకటి.

    ఇవేవీ ఎవరూ సంయమనంతో శాస్త్రదృష్టితో చేసిన వాదనలు కావని యిప్పుడు మనం చదివితే అనిపిస్తుంది. అసలు వ్యావహారిక భాషా స్వరూపం ఏమిటి, అది యేయే సందర్భాలలో, యేవిధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించిన సందర్భాలు చాలా తక్కువ.

    మధ్యే మార్గంలో కనిపించేది ప్రథానంగా కందుకూరి వారే. తర్వాతి కాలంలో పాతకొత్తల మేలికలయిక అన్నమార్గం ఎక్కువగా భావకవులలో కనిపిస్తుంది. తిరుపతి వేంకటకవులు కూడా వీరగ్రాంథిక వాదాన్ని తిరస్కరించి అప్పటికున్న శిష్టవ్యావహారికంలో కవిత్వం రాసినవారే. వ్యాకరణాన్ని తిరస్కరించకుండా, తెలుగుకి ఉన్న వ్యాకరణదీపం చిన్నదని, దాన్ని విస్తృతపరచాలనీ అన్నది ఆ కాలంలో నాకు తెలిసీ ఒక్క చెళ్ళపిళ్ళవారే!

    వచ్చిన చిక్కల్లా ఇలాటి మధ్యేమార్గస్తులు ఇరుపక్షాలవారికీ విరోధులయ్యారు!

    ఇంతకీ ఇప్పటి మన ప్రస్తుతకర్తవ్యం, ఈ కిందవాటి గురించి ఆలోచించడం:

    1. మనకి ప్రామాణిక భాష అవసరమా, సాధ్యమా? అయితే దాని స్వరూపం ఏమిటి? ఏ సందర్భాలలో అది వాడాలి? ఏ సందర్భాలలో అవసరం లేదు?
    2. మన ప్రాచీన కావ్యభాష ఎవరికి, ఎందుకు, ఎంతవరకూ రావాలి?

  1766. నన్నయ హంసగీతికలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    06/07/2008 5:37 am

    కొడవళ్ళ హనుమంత రావు గారు, నేను ఇప్పుడే చదివాను మీ అభిప్రాయాన్ని. మీ అభిప్రాయం తో నాకు పూర్తి ఏకీభావం వుంది.

    అసలు ఆసక్తిఅంటు వుండాలి గాని ఎలాంటి పుస్తకాన్నైనా చదవ వచ్చు. మీకు కొన్ని కారణాల వల్ల పద్యం మీద ఇష్టం కలిగితే, మరి కొందరికి మరికొన్ని కారణలకి పద్యం గాని లేదా ఇతర కవిత్వం గాని ఆకట్టుకొవచ్చును. అందువల్ల విషయం ఏదైనా, కారణం ఏమైనా పద్యం చదవాలన్న ప్రేరణ కలగటం కదా ముఖ్యం.

    చాలామంది దృష్టికి రాని అనేక సరదా పద్యాలు వున్నాయి మన సాహిత్యంలో. అవి చదివే సందర్భం మీకు తటస్థపడాలని మనసా కోరుకుంటున్నాను.

    వుదాహరణకి:

    • “సహసా నఖంపచ” మనుచరిత్ర లో,
    • అలాగే “చలిగాలి బొండు మల్లెల పరాగము రేచి” మనుచరిత్ర లో
    • “తరగల్ పిప్పల పాత్రముల్” “పవి పుష్పంబగు” లాంటివి కనీసం ఒక 25 పద్యాలైనాదూర్జటి కాళహస్తీశ్వర శతకం నించి.
    • కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకం మొత్తంగా 8 పద్యాలు
    • ఒక చిన్న పద్యం పాండురంగ మహత్మ్యం నించి తెనాలి రామకృష్ణునిది. “వెడదకన్నుల వాని, వే నామముల వాని” అన్నది
    • క్రీడాభిరామం లో “శ్రీమదసత్యమధ్యకును, చిన్నివయారికి ముద్దులాడికిన్” అనే ప్రేమ లేఖ

    ప్రస్తుతానికి వీటితో ఆపుతాను. మీకు వుద్దేశించి నేను ఇది రాస్తున్న. మీతోపాటు మంచి పద్యాలంటే సరదాపడే ఇతర సాహితీ మిత్రులు కూడ చదివి ఆస్వాదిస్తారన్న ఆశతో వీటిని పేర్కొంటున్నాను. ఇవి మీరు చదివి మీకు నచ్చితే సంతొషమే.

    సాహిత్యాకాంక్షలతో,
    rama.

  1767. నీటి అద్దాలు గురించి Ananth గారి అభిప్రాయం:

    06/05/2008 9:22 pm

    ఫణి గారు,
    నీటి అద్దాలు, ఊట, నీటి గుంటలు, వయసునిబట్టి మారేతీరు బాగుంది. మంచి కవిత.

  1768. 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    05/30/2008 6:40 am

    నేను ఈ సదస్సుకి వెళ్ళేను. రెండవ వరసలోనే కూర్చుని ఉండటం వల్ల కాబోలు సదస్సు కిటకిటలాడిపోయిందన్న విషయం నాదృష్టిలోకి రానే లేదు. వక్తలు తెలుగులో అంతబాగా మాట్లాడుతూ ఉంటే దిక్కులు చూడవలసిన ఆవసరం కనిపించలేదు. పోనీ “మా తాతల్నాడు నేతులు తాగేం, కావలిస్తే మా మూతులు వాసన చూసుకోండి” అనే బాపతేమో ఈ పూర్వ వైభవపు ప్రసంగాలు అని అనుకుందామా అంటే, “అబ్బే అదీ కాదు, చూడండి మా తడాఖా” అంటూ స్వీయ కవితా పఠనంతో అదరగొట్టేసేరు. కనీసం ఈ సదస్సుకి హాజరయిన తరం వాళ్ళు ఉన్నంత వరకూ తెలుగుకి ఢోకా లేదు .. అమెరికాలో. భారీ ఎత్తున జరుగుతూన్న తిరునాళ్ళ కంటె ‘పీల ఎత్తు’లో జరుగుతూన్న ఈ సదస్సులే మేలేమో.

  1769. గ్రంథచౌర్యం గురించి … గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    05/27/2008 1:46 pm

    విమర్శకుడు గారూ,

    దీన్నే అనువాద ప్రేరణ అంటారని మీకు ఆమాత్రం తెలియదా? పదాల అందం చూడాలి లేదా ఏ సందర్భంలో రాసారో చూడాలి. అంతేకానీ ఇలా కాపీ అంటే ఎలా చెప్పండి? నానీల నాన్న గారికి కూడా ఒక నాన్నుంటారన్న విషయం గుర్తించాలి. చిత్రం ఏమిటంటే దీన్ని సదరు కవిగారు పట్టించుకోనట్లు నటిస్తారు. కానీ ఆయన భక్త బృందం వచ్చే సంచికలో విరుచుకు పడేవరకూ కాస్త ఓపిక పట్టండి. ఈ రోజుల్లో కవిత్వానికి కాదు, కవికి అనుచరులుంటే చాలు. పబ్బం గడుపోడానికి.

  1770. గ్రంథచౌర్యం గురించి … గురించి విమర్శకుడు గారి అభిప్రాయం:

    05/27/2008 12:40 pm

    “ఆధునిక తెలుగు సాహిత్యంలో వున్న చౌర్యాల ఉదాహరణలు కూడా కొన్ని ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా పేరున్న రచయితల రచనల గురించి.”

    మీ కోసమే అన్నట్టు డా.గోపీ నోబెల్ బహుమతి గ్రహీత Octavio Paz ను కాపీ కొడుతూ దొరికి పోయాడు.

    వివరాలకు ఈ లింకును చూడుడు:

    ఔరా! ఏమి ఈ ‘దిగుమతి’? (ఆంధ్రజ్యోతి వివిధ)

    నానీల నాన్నగా గోపీ ఖ్యాతి ఖండాంతరాల్లొ వ్యాపించి, ఆయనకు గురు పీఠాన్ని ప్రసాదించి పెట్టింది. దీర్ఘ కవితలు రచించి చిరయశస్సునార్జించిన గోపీ ప్రస్తుతం తెలుగు విశ్వ విద్యాలయ వీసీ ; ఘనత వహించిన కవి గారి ఛాయాచిత్రం కోసం క్రింది లింకును చూడండి.

    A `Water Song’ to die for, to pray for – The Hindu story

    విమర్శకుడు

  1771. పేరులేదు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    05/27/2008 12:09 am

    వరూధిని అందం, సరస్వతి సౌందర్యం

    సంప్రదాయ సాహిత్యాన్నీ, అభ్యుదయ సాహిత్యాన్నీ జమిలిగానే కాదు, విడిగా నయినా విమర్శించడానికి నాకు కనీస యోగ్యత కూడా లేదు. కాని డాక్టర్ స్మైల్ గారి అభిప్రాయం రెండురోజుల నుండి నా మనసును పట్టి వదలకపోవడాన ఇది రాస్తున్నాను. ఇది వారిపై విమర్శ కాదు. దీంట్లో సాహిత్యాభిమానులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉండొచ్చనే ఆశ.

    పాతసాహిత్యం సామాన్యప్రజల జీవితాన్ని కావ్యవస్తువుగా తీసుకోలేదనీ, అభ్యుదయసాహిత్యానికీ సంప్రదాయ సాహిత్యానికీ గల ముఖ్యమైన తేడా అదేననీ అంటే నేనొప్పుకుంటాను.

    వరూధిని సంప్రదాయసాహిత్యానికి ప్రతీక అయితే నష్టం లేదుగాని, “భిక్షువర్షీయసి” అభ్యుదయసాహిత్యానికి ప్రతీక అయితే మనకి లోటుగానే ఉంటుందనుకుంటాను. “భిక్షువర్షీయసి” మంచి కవిత కాదని కాదు, ప్రతీక కాకూడాదనే నాఉద్దేశం.

    వరూధిని ప్రవరులది ప్రేమకథ. ప్రేమకథల్లో అందానికి ప్రాముఖ్యత ఉంటుంది. అందం బాహ్య సౌందర్యం గురించీ, హృదయ సౌందర్యం గురించీ కూడానూ. అయితే ఎవరికైనా మనిషిని చూడటంతోటే ఆకట్టుకునేది బాహ్య సౌందర్యమే. నాభి లోతు దాకా పోవాలో లేదో నాకు తెలీదు కాని, వరూధినిని పరిచయం చేసిన విధం ఆకర్షణీయమే. “మగువపొలుపుఁదెలుపు నొక్క మారుత మొలసెన్,” అన్న మాటలు కవితా సౌరభం తో నిండినవే. ఈతరం కవులు కూడా స్వీకరించదగ్గవే.

    ఆ పద్యాల వెనువెంటనే వరూధినిని మన కళ్ళముందట నిల్పే పద్యమిది:

    “తతనితం బాభోగ ధవళాంశుకములోని
    అంగదట్టపు కావిరంగువలన
    శశికాంతమణిపీఠి జాజువారగ కాయ
    లుత్తుంగ కుచపాళి నత్తమిల్ల
    తరుణాంగుళీ ధూత తంత్రీస్వనంబుతో
    జిలిబిలిపాట ముద్దులు నటింప
    ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి
    రతిపారవశ్య విభ్రమము తెలుప

    ప్రౌఢి పలికించు గీతప్రబంధములకు
    కమ్ర కరపంకరుహ రత్న కటక ఝణఝ
    ణధ్వనిస్ఫూర్తి తాళమానములు కొలుప
    నింపు తళుకొత్త వీణ వాయింపుచుండి.”

    తిక్కన, సూరన లను మించి ఇంత సుకుమారమైన పద్యం మన భాషలోనే లేదన్నారు పుట్టపర్తి [1]. అదెందుకో తెలుసుకునే పరిజ్ఞానం నాకు లేదు కాని, “ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి రతిపారవశ్య విభ్రమము తెలుప,” అన్నది నన్నాకర్షించింది.

    కారణం దానిపై రారా ఇచ్చిన వివరణలు. ఆయన దానిని “రసపారవశ్య” మని చదువుకున్నాడు. సుకుమార హృదయం గలవాళ్ళే సాహిత్యంలోనైనా ఏకళలోనైనా పారవశ్యం చెందుతారనీ, “కవితా! ఓ కవితా!” లో శ్రీశ్రీ చెప్పిన “క్షణికమై, శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం,” పెద్దన చెప్పిన పారవశ్యమూ ఒకటేననీ అన్నాడు. నాకది నచ్చింది.

    ఇంతకీ రారా ఈ మాటలన్నది కొడవటిగంటి కుటుంబరావు రాసిన కొన్ని ప్రేమకథలను విశ్లేషించే సందర్భంలో [2]. కుటుంబరావు రాసిన పెద్దకథ “కురూపి” లో అనాకారిగా కనకం ప్రపంచంలోకి ప్రవేశించిన సరస్వతి అతనిని తన హృదయసౌందర్యం ద్వారా చివరికెలా వశం చేసుకుంటుందీ వివరిస్తూ శిల్పానికి గల ప్రాముఖ్యతని వివరించాడు.

    సమాజంలో అందవిహీనమైన స్త్రీ పురుషులు ఉండితీరతారు. మరి వాళ్ళ ప్రేమా పెళ్ళీ లాంటి చిక్కు సమస్యలు తీరేదెలా? దీనికి కుటుంబరావు ఇచ్చిన సమాధానం – ఆధ్యాత్మికం. అంటే అదేదో పరలోకానికి సంబంధించిందని కాదు. మనిషి నుండి వేరే మనిషి పొందే లక్షలాది అనుభూతుల్లో అందం ఇచ్చేది ఒక్కటేననీ, అంతకంటే గాఢమైన అనుభూతులు చాలా ఉంటాయనీ, వీటి మూలంగా ప్రేమా పెళ్ళి సఫలం అవుతాయనీ వ్యక్తం చెయ్యడనికే “కురూపి” రాశానన్నాడు.

    “అందచందాలు లేని భార్యలను ఆప్యాయంగా ప్రేమించే భర్తలున్నట్టు నాకు చిన్నతనం నుండి కూడా తెలుసు. నాకు తెలియనిదల్లా నేటి మన సమాజం కిందకే దిగుతున్నదో, మీదికో ఎక్కుతున్నదో, నేటీ యువకులు పైనే చూస్తున్నారో, కిందకో చూస్తున్నారో … అది మాత్రమే,” అని కొంత నిరాశపడ్డాడు.

    కుటుంబరావువి చదవ్వలసిన ప్రేమకథలు. అవి అభ్యుదయసాహిత్యాన్ని “భిక్షువర్షీయసి” కవితా పరిమితుల్ని దాటి విస్తరింపచేస్తాయి.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:

    [1]. “వ్యాసవల్మీకం” లో “వరూధిని” అన్న వ్యాసం. పుట్టపర్తి నారాయణాచార్యులు, 2004. “వరూధిని హృదయమున రససముద్రమున్నది. మాటలలో కవిత యున్నది. ప్రకృతి యొక్క విచికిలస్వరూపము వరూధిని…” అని ముగించారు. ఈయనా, రారా, ఇద్దరూ ప్రొద్దుటూరు వారే! వాళ్ళూ, శ్రీశ్రీ, కొకు, ఇంకా కొందరు అభ్యుదయరచయితలూ కలిసి “సంవేదన” ఆవిష్కరణ సందర్భంగా తీయించుకున్న ఫొటొ ఈ పుస్తకంలో ఉంది.

    [2] “కుటుంబరావు సాహిత్యం,” అయిదవ సంపుటం లో “భావుకుల రచయిత కొకు,” అన్న వ్యాసం, రాచమల్లు రామచంద్రారెడ్డి. 1983. కవులలోకెల్లా అల్లసాని పెద్దన తన అభిమాని కవి అని చాటుకుని, “కవిత్వానికి కావలసింది ఆవేశబలం కాదు, అనుభూతి సౌకుమార్యం,” అన్న విలక్షణ విమర్శకుడు రారా.

  1772. పేరులేదు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    05/23/2008 9:29 pm

    “ప్రశ్నలే శాశ్వతం”

    శ్రీశ్రీ షష్టిపూర్తికి ఇస్మాయిల్ రాసిన “శ్రీశ్రీ జన్మ వృత్తాంతం,” అన్న వ్యాసంలో, “కవిత్వమైనా తత్త్వమైనా సందేహాల్లోంచి, ఆందోళన నించి, తిరుగుబాటు నించీ పుడుతుంది. ప్రశ్నలే శాశ్వతం. సమాధానాలు కావు. సమాధానాలతో సంతృప్తి పడితే వెంటనే చస్తుంది కవి ప్రతిభ,” అన్నారు.

    ప్రశ్నలతో కూర్చిన పదచిత్రాలతో నిండిన కవిత మనసుని పట్టేసింది. తూచేరాళ్ళని కాదు గాని, నేను స్థూలంగా కవితలని – అర్థంకాని, మామూలు, మంచి, గొప్ప అని – నాలుగు రకాలుగా చెప్పుకుంటాను. ఇది నిస్సందేహంగా మంచి కవిత. నా దృష్టిలో గొప్ప కవిత్వానికున్న ఒక గుణం – కంఠస్థనీయం కావడం. ఈ కవిత గొప్పది కాగలిగి ఉండీ కాలేదనిపించింది. అందుకు అక్కడక్కడా అనవసరంగా వాడిన మాటలే కారణం. క్లుప్తత ముఖ్యం అంటారు, ముఖ్యంగా కవిత్వానికి.

    తనకి పేరులేకపోయినా కవికి పేరుతెచ్చే కవిత.

    కొడవళ్ళ హనుమంతరావు

  1773. నీటి అద్దాలు గురించి Giri గారి అభిప్రాయం:

    05/21/2008 7:15 am

    ఫణీ స్వామీ,
    మీ పేరు తప్పు రాసినందుకు సారి. దానికి మీ సమాధానం బావుంది.
    కవిత బావుంది.
    ఇట్లు
    గిరి

  1774. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    05/20/2008 7:25 am

    హనుమ గారూ:

    మీ సుదీర్ఘమైన వ్యాసాన్ని చదవటం ఇప్పుడే పూర్తి చేసాను. ఈ వ్యాసం రాయడానికి వెనక ఉన్న మీ కృషి, “ఈమాట” సంపాదకుల సంపాదకత్వం మెచ్చుకోవాలి. తెలుగులో ఇటువంటి వ్యాసాలు అరుదు. మీ లాగ సైన్సులో కాని ఇంజినీరింగులో కాని అత్యుత్తమ స్థాయిని చేరుకున్న తెలుగు వారు చాలా మంది ఉన్నా, తెలుగులో ఇటువంటి రచనలకి శ్రీకారలోచుట్టిన వారు తక్కువ. ముఖ్యంగా సైన్సు, ఇంజినీరింగు విభాగాల్లో అతి క్లిష్టమైన భావాలను తేలిక తెలుగులో రాయటం అంత తేలిక కాదు అన్న విషయం, అది ప్రయత్నించిన వారికి అనుభవమే!

    ఇటువంటి రచనల్లో ఎదుర్కొనే చిక్కుల్లో రెండు విషయాలు ప్రస్తావిస్తాను. మొదటిది: అత్యుత్తమ స్థాయిలో, సాంకేతికమైన పదజాలం తెలుగులో ఎక్కువ లేకపోటం. రెండవది: తేలికగా చదవటానికి వీలైన తెలుగు భాష. ఈ రెండు కష్టాలని దాటటం అంత సులభం కాదు. మీరు సమర్ధవంతంగా ఈ రెండు కష్టాలని ఎదుర్కొన్నారు. ఈ విషయంలో ముందు, ముందు మీ రచనల్లో మరింత పరిణితి వస్తుందని నేను నమ్ముతున్నాను.

    రెండు చిన్న సూచనలు: (1) ఎంతో అవసరమైతే తప్ప, తెలుగు కాని ఇంగ్లీషు కానీ కవితలని ఇటువంటి వ్యాసాల్లో ఉల్లేఖించకండి. చదువరుల ఆలోచనలను, ఇవి అసలు విషయం నుండి పక్కదారి పట్టిస్తాయి. (2) ఇంటర్నెట్ అందుబాటులో లేని సైన్సు లేక ఇంజినీరింగ్ చదువుతున్న తెలుగు విద్యార్ధుల కోసం, మీ రచనలను ఆంధ్ర దేశంలో ప్రచురిస్తున్న దిన, వార, మాస పత్రికల్లో ప్రచురిస్తే, అక్కడి వారికి సాయపడినవారు అవుతారు. ఇందులో కస్టాకస్టాలు నాకు తెలిసినా, ప్రయత్నించమని మనవి.

    ఈ వ్యాసాలు చదువుతుంటే, వృత్తి రీత్యా నాకు బాగా పరిచయమైన సెమికండక్టర్సు సిలికాన్ ఛిప్స్ తయారీ వెనుక ఉన్న ‘సిలికాన్ మహత్యం ” పై ఈమాట కోసం వ్యాసాలు రాయాలని అనిపిస్తోంది. వీలు చూసుకొని ఎప్పుడైనా…

    మంచి వ్యాసాలను అందించినందుకు, ధన్యవాదాలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  1775. నీటి అద్దాలు గురించి Phani DokkA గారి అభిప్రాయం:

    05/19/2008 9:41 am

    కొశ్యాసురా గారూ, బొల్లోజుబాబా గారూ,

    కవితపై మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.

    గిరి గారూ,
    ఇంతకీ “చల్లా” గారెవరు స్వామీ ? నా పేరుని ఎటునించి కుదించినా “చల్లా” అని రాదుకదా? అర్థంకాలా 🙁

    ఫణి డొక్కా.

  1776. ఒక్క ప్రశ్న గురించి Raghu గారి అభిప్రాయం:

    05/18/2008 1:33 pm

    మీ కవితకు వ్యాఖ్య రాసేటంతటి అర్హత లేకపోయినా అభిప్రాయము తెలియజేయాలనే ఆత్రుతతో రాసే రెండు మాటలు…
    మీ లోతైన ఆలోచనా శక్తి కి జోహార్లు. ముఖ్యముగా ఆఖరి నాలుగు lines చాలా బాగున్నాయి.

  1777. ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా గురించి B.AJAY PRASAD గారి అభిప్రాయం:

    05/15/2008 4:20 am

    లక్ష్మన్నగారూ మీరు రాసిన వ్యాసం చాలా బాగుంది. చారులత నాకు ఇష్టమైన సినిమాలలో ఒకటి. ముఖ్యంగా చారులత (మాధవి ముఖర్జి ) కవిత రాస్తున్నప్పుడు ఆమె కంటిపాపలో కనిపించే పడవ, ఆ వెంటనే కొలిమి అదొక ఎన్నటికీ మరచిపోలేని దృశ్యం. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    అభినందనలతో..
    బి.అజయ్ ప్రసాద్

  1778. లింకన్ తో ఓ రాత్రి గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    05/14/2008 6:03 am

    ఈ చర్చలవలన నాకు కొత్తగా బోధపడిన విషయం ఏమిటంటే, కాఫీ తాగుతూ లేదా కూరగాయలు తరుగుతూ చెప్పుకునే కబుర్లు కథలనిపించుకునే దాకా కథల పరిమితి పెరిగిందనీ, అలా పెరగడానికి వీలుగా కొత్త కొలమానాలు కనుక్కోబడుతున్నాయనీ. సందేశం (బ్రహ్మ రహస్యాల మాట దేవుడెరుగు) ఉన్నా లేకపోయినా, పాఠకులని నవ్వించడమో, కవ్వించడమో, ఏడిపించడమో, ఆలోచింపచేయడమో, ఆసక్తికరంగా చదివించడమో వగైరా వగైరా లక్షణాలు కథలకి ఉండాలనే అపోహలో ఉన్నాను ఇంతకాలం. ఇహనేఁ, నాలాంటి వాళ్ళుకూడా రచనలు మొదలుపెట్టవచ్చు (లేక కథల, కవితల స్థాయి పడిపోవడానికి ఇదే కారణమా?)

  1779. నన్నయ హంసగీతికలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/12/2008 9:59 pm

    కొడవళ్ళ హనుమంతరావు గారు,

    పద్యాన్ని చదివి అర్ధం చేసుకుని ఆస్వాదించగల అవకాశం ఇంగ్లిష్ చదువులు చదువుకున్న ఇటీవలి వారందరి లోను అరుదుగానే వుంటోది మరి. ఇది మీ ఒక్కరి అనుభవమే కాదు. అయితే పూర్వ కవుల సాహిత్యానికి వ్యాఖ్యానాలు పండితులు రాసినవి వున్నాయి. అవి ఎక్కువగా “వావిల్ల” వారివి. వాటి కాపీలని మీరు సంపాదించుకోవచ్చు. వావిల్లవారివి పుస్తకాలు మళ్ళీ కొన్నింటిని కొనుక్కుందికి వీలుగ అందుబాటు లోకి తెస్తున్నారు. మీరు వాటిని సేకరించుకొగలిగితే మీ అంతట మీరే పెద్దన మనుచరిత్రని, రాయల ఆముక్తమాల్యదని కూడా స్వయంగా చదివి ఆనందించవచ్చు. కవిత్రయ మహాభారతాన్ని ఈమధ్యనే తి.తి.దే. వాళ్ళు ఒక 15 సంపుటాల్లో అర్ధ టీకాతాత్పర్య సహితంగా అచ్చువేసారు. మీరు వాటిని కొనుక్కొగలిగితే కవిత్రయ భారతాన్నికూడా స్వయంగానే అర్ధం చెసుకుందికి వీలుంది.

    పింగళి సూరన “కళాపూర్ణోదయం” మీద కట్టమంచి రామలింగారెడ్డి గారి విశ్లేషణ వుంది. మీరు మీ ఆసక్తిని బట్టి వీటిని సేకరించుకుని వీలున్నప్పుడు చదువుకోగలిగితే పాత సాహిత్యం చదివి అర్ధం చేసుకొవటం మరీ అసాధ్యం కాదు అని మీకే తెలియగలదు. మీ ఇష్టాన్ని గమనించి, సంతోషంతో నాకు తెలిసిన విషయాలని మీకు చెబుతున్నాను.

    wish u best of luck.

    rama.

  1780. నన్నయ హంసగీతికలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    05/11/2008 6:52 pm

    శారద రాత్రులు

    దాదాపు రెండేళ్ళ క్రితం, రచ్చబండలో ఈ పద్యం గురించి రాశాను: గొప్ప కవిత్వం రాయాలంటే గొప్ప కవిత్వం చదవాలన్నారు (తమ్మినేని అనుకుంటా); దానిని వచనానికి అన్వయించుకొని, శ్రీపాద “అనుభవాలూ – జ్ఞాపకాలూనూ” చదవడం మొదలెడితే “శారద రాత్రులు” పద్యం మీద ఆయన వ్యాఖ్యానం నన్ను కట్టేసింది. ఎవరన్నా వివరిస్తే తప్ప నాకై నాకు మన పాత పద్యాల్లోని కవిత్వాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియదు.

    (కొడవటిగంటి కుటుంబరావుకి శ్రీపాద ఇచ్చిన సలహా: “ఆడవాళ్ళు మాట్లాడుకునేది వినవోయ్. అసలైన తెలుగు వస్తుంది.” పుస్తకభాషగా ఉన్న కుటుంబరావు రచనాధోరణి దానితో మారిపోయిందట! సౌమ్య గారు చెప్తున్న మాటలు నిజమయితే, శ్రీపాద పాతబడిపోయాడా అని అనుమానమేస్తుంది. ఆవిణ్ణి తప్పుపట్టడం లేదని మనవి.)

    అప్పుడు గూడా రచ్చబండలో ముచ్చటించుకున్నాం – పాత్రలు ఇవే. మోహనరావు గారూ, కామేశ్వరరావు గారూ పాత సాహిత్యంలో (ఇతరేత్రా కూడా) ఉద్దండులు. సమగ్రమైన చక్కటి వ్యాసం రాసినందుకు JKM గారికి అభినందనలు.

    “దళిత నవీన” పద్యం వివరణ మనోహరంగా ఉంది. కప్పల బెకబెకలలో ఉపనిష్ద్గానామృతం అతిశయోక్తి అనిపించింది. (మా ఇంటి వెనకాల ఉన్న చెరువులో కప్పలు పాడే సంగీతానికి ఇంట్లో ఫ్యాను మోత జత చేస్తే తప్ప నాకు నిద్ర పట్టదు.) వానా, వెన్నెలా కలిసిన మంచి ఇస్మాయిల్ కవిత “కప్పల నిశ్శబ్దం.”
    మోహనరావు గారు పద్యాల గురించి రాసే కొన్ని వాక్యాలు – “పందొమ్మిది ర-కారాలు, ఎనిమిది ల-కారాలు, ఏడు శసలు, ఆరు ప-కారాలు, త-కారాలు ఈ పద్యానికి ఒక ఊపునిస్తుంది” – చదివితే నాబోంట్లకు చెవిటివాడి ముందర శంఖం ఊదినట్లుంటుంది. లైలా గారి లాంటి ప్రతిభావంతులు మాత్రం ఉత్తేజపడి ఠకీ మని ఓ కవిత అల్లేస్తారు! పాఠకుల్లో రకాలు అనేకం.

    కామేశ్వరారావు గారు చెప్తేనే మధునాపంతుల వారి వ్యాసం చదివాను. “శారద రాత్రులు” అను ఉత్పలమాలలో చుట్టుకొని నన్నయ గంటము ఇక కదలలేదట! నన్నయ మొదటి ఉత్పలమాల “రాజుకులైక భూషణుడు” లోనూ చివరి ఉత్పలమాల “శారద రాత్రుల” లోనూ వెన్నెల ప్రస్తావనే అన్నారు. అది గూడా మంచి వ్యాసం.

    కొడవళ్ళ హనుమంతరావు

  1781. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    05/11/2008 7:03 am

    రావు గారికి:

    మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం.

    ఈ వ్యాసం ప్రచురించే కాలానికి “ఈమాట” వయస్సు ఒక్క సంవత్సరం మాత్రమే. ఆ రోజుల్లో, “ఈమాట” గురించి తెలిసిన వారు ఇప్పటి కన్నా సంఖ్యలో తక్కువే! అప్పట్లో ఈమాట ప్రచురణార్ధం వచ్చిన కథలు, కవితలు, వ్యాసాలు కూడా తక్కువే. అందుకని, అప్పటి సంపాదకులం, మేమే, మాకు తెలిసిన విధంగా ఈమాట కోసం రాసేవాళ్ళం. ఇదంతా, దాదాపు పది ఏళ్ళ నాటి మాట.

    అప్పట్లో, ఎక్కువ ఫొటోలు కూడా అంతర్జాలంలో దొరికేవి కావు. సాలూరు రాజేశ్వరరావు పై ఈమాట లో మరో రెండు వ్యాసాలను మీరు పాత సంచికల్లో చదవచ్చు. నేను రాసిన ఈ వ్యాసం కన్నా మరిన్ని వివరాలు మీకు ఆ రెండు వ్యాసాల్లో దొరుకుతాయి.

    మీ అభిరుచికి తగ్గట్టు ఈ రెండు వ్యాసాలు ఉంటాయని ఆశిస్తూ,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  1782. అలిగితివా… గురించి arunkumar గారి అభిప్రాయం:

    05/09/2008 12:51 pm

    చాలా కాలానికి మంచి కవిత చదివాను.
    అరుణ్ కుమార్

  1783. చివరకు మిగిలేది గురించి bollojubaba గారి అభిప్రాయం:

    05/09/2008 12:31 am

    మనం నడచొచ్చేసిన మార్గాన్ని విశ్లేషించుకోవటంలో ఎంత ఆత్మానందం ఉంది. సముద్రాల గారు అన్నట్లు గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమేముంది.
    కవిత చదువరి మనసుల్లో కవిఉద్దేశించిన భావాల్నె రేకెత్తించిందంటే, అంతకంటే ఆకవితకు సార్ధకత ఏముంటుంది. కవికి ధన్యతేముంటుంది?

    బావగారో మంచి బాలుడనుకునే మరదలు అన్న వాక్యంలో బాలుడు అనే మాట కంటే పురుషుడు/భర్త/మగడు/వ్యక్తి అంటే బాగుంటుందేమో. ఆ సంభోదన మరదలి తరపున అంత ఉచితంగా అనిపించటంలేదు. (బహుసా మీరు రాముడు మంచి బాలుడు అన్న రీతిలో చెప్పాలనుకుంటున్నారా)

    చాలా మంచి కవిత చదివించారు.

    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

  1784. పేరులేదు గురించి bollojubaba గారి అభిప్రాయం:

    05/09/2008 12:20 am

    చాలా అద్బుతమైన కవిత
    పైకామెంటు చదివిన తరువాత కవితపై ఇంకా గౌరవం పెరిగింది. డా. స్మైల్ గారి కన్నా మించి నేనేమి చెప్పగలను. ఏకీభవించటం తప్ప.
    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

  1785. నీటి అద్దాలు గురించి bollojubaba గారి అభిప్రాయం:

    05/09/2008 12:17 am

    ఫణి గారికి
    మీ కవిత మంచి ఆర్ధ్రతతో ఉంది. ఒక మంచి లైఫ్ సైజ్ స్కెచ్ ని అక్షరబద్దం చేసారు. చాలాబాగుంది.

    బొల్లోజు బాబా

    http://sahitheeyanam.blogspot.com/

  1786. బ్రహ్మ జ్ఞానం గురించి kosyasura గారి అభిప్రాయం:

    05/07/2008 8:59 am

    శర్మ గారి కథలో కూడా కవిత్వం చిమ్ముతుంది.
    ఈ సాకేతుడి మీద ఆ శంకరుడు చల్లిన జలం తుంపరలు ఎప్పుడు పడతాయో
    కొ శ్యా సు రా

  1787. అక్షరం పరమం పదం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    05/05/2008 9:57 pm

    Life and IT
    మాలతి గారూ,

    ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్ళి ఓ చేత్తో దానిని ఉయ్యాలూపుతూ ఇంకో చేత్తో ఓ తెలుగు పుస్తకం పట్టుకొని చదువుతున్నా. అంతలో ఓ పెద్ద కంపెనీలో IT విభాగంలో పనిచేసే తెలుగాయన ఒకాయన పలకరించాడు. ఈ upgrades, patches తో చచ్చిపోతున్నామన్నాడు. “మీ బాధలు, మీ గాథలు / అవగాహన నా కవుతాయి!” అనుకున్నాను. 🙂

    IT వాళ్ళ గతే అలా ఉంటే మిగిలినవాళ్ళు కంప్యూటర్లతో పడే అగచాట్లని ఊహించుకోగలను. కాని అవే ఈ కథకి మూలమయితే అవి ముఖ్య పాత్ర జీవితాన్నెలా ప్రభావితం చేశాయో చూపాలి – చెప్పడం కాకుండా.

    సంగాలు జీవితం గురించి తెలిసినంత మాత్రం పధానపాత్ర గురించి తెలియలేదు. ముప్ఫై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నదనీ, కథలు రాస్తుందనీ, తెలియక ఓ డొక్కు ఉద్యోగంలో పడిందనీ తెలుసనుకోండి. కథ ఉత్తమ పురుష దృక్కోణంలో చెప్పడానికి ముఖ్యకారణం పాఠకులకి నమ్మకం పెంచడానికని విన్నాను. దీంట్లో “నేను” ఔట్సోర్సింగ్, ప్రపంచీకరణ, కంప్యూటర్ టెక్నాలజీ, తెలుగు భాషా దుస్థితి, శ్రీశ్రీ కవిత్వం, జీవిత పరమార్థం – ఇలా అనేక విషయాల మీద అభిప్రాయాలు చెప్పేటప్పటికి, మూడు పేజీల కథలో జీవితానికి చోటు తక్కువయి పాఠకుణ్ణి స్పందించే అవకాశం సన్నగిల్లింది.

    వారసత్వపు హక్కుగా మిద్దె జీవితాన్ని అనుభవించలేకపోయానే అని వగచే విద్యావంతురాలి పట్ల సానుభూతి ఎలా పుడుతుంది? కూరలమ్ముకొని బ్రతికిన సంగాలుకి తన ‘డూటీ’ పట్ల నిర్లిప్తత లేదు. “నేను” కి తన ‘డూటీ’ ఒక శాపం. అలా ఎందుకు పరిణమించిందో చిత్రించక పోవడం, దాన్నుంచి విముక్తి లేనట్లు చిత్రించడం, ఈ కథలో లోపం.

    కొడవళ్ళ హనుమంతరావు

  1788. అక్షరం పరమం పదం గురించి malathi గారి అభిప్రాయం:

    05/05/2008 11:56 am

    నాకథ ఓపిగ్గా చదివినవారికీ, చదివి అభిప్రాయాలు వెలిబుచ్చినవారికీ ధన్యవాదాలు.
    సాయిలక్ష్మిగారూ, మీ అభిమానానికీ అభిప్రాయాలకీ చాలా సంతోషం అండీ. నాసంకలనం చదివినట్టు నేను విన్న సందర్భాలు చాలా తక్కువ.
    హనుమంతరావు గారూ, స్థూలంగా
    కథ కానీ కవిత కానీ ఒక పాత్ర అనుభవించిన రసాన్ని, ఆనందం, దైన్యం, నిస్పృహ ఏదైనా కానీ – పాఠకుడిలో కలిగిస్తే ఆకథ రక్తికట్టేననుకుంటాను నేను.. (పెద్దవారు, మీకు తెలిసే వుంటుంది. తిరిగి చెప్తున్నందుకు క్షమించండి)
    మీమాట నిజమే. ఆదిలో వున్న సముద్రపుహోరు చివరికి నీరు గారిపోయింది. కథలో ముఖ్యపాత్ర అనుభవం అదేనని చెప్పడమే ఈకథలో వావుద్దేశ్యం.

    రవికిరణ్ గారూ, ఇది వ్యాసం అయితే పూర్వసిద్ధాంతాలూ, ఉపపత్తులూ, నిరూపణలూలాటి సరంజామా కావాలి. తదితర వచనరచనల్లో ఏది కథ, ఏది కాదు అన్నదానికి చాలా వాదాలూ, వివరణలూ వున్నాయి. అవన్నీ ఇక్కడ సాధ్యం కాదు.
    చలనం చైతన్యానికి చిహ్నం. మొత్తం మానవాళి పురోభివృద్ధికి చలనం ముఖ్యం అన్నది నేను కూడా ఒప్పుకుంటాను.
    అయితే ఒకమనిషి అనుభవం లెక్కలోకి రాదు అనడం న్యాయం కాదు. ఒక్కొక్క మనిషీ కూడితేనే మొత్తం మానవాళి అయింది.

    మరొకవిషయం. ఈ కథలో ప్రధానపాత్ర యాంత్రికజగత్తులోని ఈతిబాధలకి వగచినా, వాటిని పూర్తిగా విసర్జించలేదు. ఈయాంత్రకజగత్తు సుడిగాలిలో సాంకేతిపరికజ్ఞానం అట్టే లేనివాళ్లూ, వారికి కలిగే అసౌర్యాలూ కూడా భాగమే. వీరిని కూడా లెక్కలోకి తీసుకున్నప్పుడే టెక్నాలజీ విలువ సంపూర్ణంగా కొలవడం సాధ్యం అని చెప్పడానికే ఈకథ. ఇది కేవలం ఒక కోణం అనుకోండి, మీ కవితలో వ్యక్తీకరించిన స్థితి లోకంలో ప్రతిఒక్కరిస్థితీ కానట్టే. ఇదొక్కటే కోణం కాదు కానీ ఇది కూడా ఒక కోణమే.
    మరోసారి థాంక్స్.

  1789. డాలర్ దేహాన్నొదిలి గురించి kosyasura గారి అభిప్రాయం:

    05/03/2008 6:57 pm

    రెడ్డి గారు తెలుగు మట్టి వాసన గుప్పిటి విప్పి గుప్పు మనిపించారు. computer లకి కూడా మనసుంటుందనిపించారు, నలభై మంది Washington లు ఒక బాపూకి సాటి కాదని పించారు. కవిత చదివినతర్వాత నిట్టూర్పు విదవకుండా ఉండలేకపోయాను.
    కొ శ్యా సు రా

  1790. పేరులేదు గురించి డా.స్మైల్ గారి అభిప్రాయం:

    05/03/2008 2:33 pm

    సంప్రదాయ సాహిత్యానికి, ఇంకా చెప్పాలంటే…

    ‘మృగమదసౌరభవిభవ
    ద్విగుణితఘనసారసాంద్రవీటీగంధ
    స్థగితేతరపరిమళమై
    మగువపొలుపుఁదెలుపు నొక్క మారుత మొలసెన్’

    అతఁడా వాతపరంపరా పరిమళ వ్యాపార లీలన్‌ జనా
    న్విత మిచ్చోటని చేరబోయి కనియెన్‌ విద్యుల్లతావిగ్రహన్‌
    శతపత్రేక్షణఁ చంచరీకచికురన్‌ చంద్రాస్యఁ చక్రస్తనిన్‌
    నతనాభిన్‌, నవలా ,నొకానొక మరున్నారీ శిరోరత్నమున్‌

    అన్న పద్యానికీ-ఈ కింది అభ్యుదయ కవితకు

    ‘దారిపక్క చెట్టుకింద,ఆరిన కుంపటి విధాన
    కూర్చున్నది ముసల్దొకతె
    మూలుగుతూ-ముసురుతున్న ఈగలతో వేగలేక
    ముగ్గుబట్టవంటి తలా, ముడుతలు తేరిన దేహం,
    కాంతిలేని గాజుకళ్లు-తనకన్నా శవం నయం.
    పడిపోయెను జబ్బుచేసి, అడుకొన్నే శక్తిలేదు,
    రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు,
    ఏళ్లు ముదిరి, కీళ్లు కదిలి, బతుకంటే కోర్కెసడలి-
    పక్కనున్న బండరాతి పగిదిగనే పడిఉన్నది.
    “ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి”దని
    వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది!
    ఎముకముక్క కొరుక్కొంటూ ఏమీ అనలేదు కుక్క,
    ఒక ఈగను పడవేసుక తొందరగా తొలగె తొండ;
    క్రమ్మె చిమ్మచీకట్లూ, దుమ్మురేగె నంతలోన
    “ఇది నా పాపం కా”దనె ఎగిరివచ్చి ఎంగిలాకు.

    గల తేడాను మీ కవితలో చూసుకొన్నాను. మనస్సు కదిలించిన కవిత, పేరులేక పోయినా గొప్పదనానికి లోటులేదు.

  1791. సడిచేయకే గాలి గురించి జె.యు.బి.వి. ప్రసాద్ గారి అభిప్రాయం:

    05/03/2008 11:12 am

    ఇక్కడ ఇచ్చిన లింకుకి కృతజ్ఞతలు. చక్కగా రాజసులోచననీ, యంటీ రామారావునీ, రాజనాలనీ చూస్తూ, పాట మూడు సార్లు విన్నాను లీల గారి చక్కటి గొంతుతో. సంతోషం కలిగింది.
    ఈ పాటలో పల్లవి కాకుండా మూడు చరణాలున్నాయి. ఒక్కో చరణంలో ఆరు చిన్న లైన్లు (లేదా మూడు చిన్న లైన్లు) వున్నాయి. మొత్తం పద్దెనిమిది చిన్న లైన్లు, లేదా తొమ్మిది పెద్ద లైన్లు. చొక్కాకుల వెంకట ప్రసాద్ గారు రాసిన కవితలో (పాటలో?) మూడు చరణాలున్నాయి. మొదటి చరణంలో ఆరు లైన్లూ, రెండవ చరణంలో నాలుగు లైన్లూ, మూడో చరణంలో ఐదు లైన్లూ. మొత్తం పదిహేను లైన్లు. రెండింటి లోనూ పల్లవి రెండు లైన్లు. పల్లవి లోని మొదటి లైను మాత్రం ఒకేలా వుంది. అంటే కవి గారు ఈ పాటలోని మొదటి లైను మాత్రం స్ఫూర్తిగా తీసుకుని రాశారనుకుని, కాస్త ఈజీగా తీసుకుని వదిలెయ్యాలి. “గ్రంధ చౌర్యం” అనే పెద్ద మాటలూ, “రాసిందేమో నాలుగు లైన్ల కవిత” అనే అన్యాయం మాటలూ ‘విజ్ఞత’కి చెందినవి అవవు.
    ఈ సందర్భం గురించి నిన్న ఇంకో వెబ్ పత్రిక ఎడిటర్ గారితో మాట్టాడుతున్నప్పుడు, కొన్ని విషయాలు తెలిశాయి. సుద్దాల అశోక్ తేజ అనే సినీ పాటల రచయిత, శ్రీశ్రీ “మహాప్రస్థానం” లోని “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధార పోశాను” తీసుకుని, దాన్ని మూడు లైన్ల పల్లవిగా చేసి, సొంత చరణాలు రాసుకుని, ఠాగూర్ సినిమాకి ఇచ్చారు. ఈ పాటకి National Film Aware for Best Lyrics Award వచ్చింది. కొంత మంది విమర్శించారు. దానికి బదులుగా శ్రీశ్రీ మహాప్రస్థానం లోంచి ఒక్క లైను మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నాను అని సమర్థకులు అన్నారు. కేంద్ర బహుమతి విషయంలోనే ఇలా వుంటే, తెలుగు జ్యోతి వారి బహుమతుల విషయంలో ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదనిపించింది.
    – ప్రసాద్

  1792. అక్షరం పరమం పదం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    05/02/2008 9:04 pm

    సంద్రాలూ, శ్రీఫాంట్లూ

    గలగల పారే గోదారిలా సవ్వడి చేస్తూ సాగిన సంద్రాలు సంభాషణల్లో నుండి హఠాత్తుగా ఫ్లాపీలూ, సీడీలూ, పిడియఫ్ ల గందరగోళంలో పడి సజీవంగా సాగుతున్న కథ కాస్తా నిర్జీవమైన సాంకేతిక వ్యాసంగా మారిపోయింది!

    “చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా బట్టీపట్టిన గీతం పాడుకోవాలనిపిస్తోంది. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు, … చక్రవర్తి అశోకుడేడీ, … జగద్గురు శంకరుండేడీ”. నిరుడుకురిసిన హిమ సమూహములని వదిలిపెట్టి, పద పదమంటూ ముందుకు తోసుకుపోయాడు శ్రీశ్రీ మరోప్రపంచానికి.”

    “మహాప్రస్థానం” ముందో “ఏవి తల్లీ!” ముందో నాకు గుర్తు లేదు కాని,
    “చక్రవర్తి అశోకుడెచ్చట?
    జగద్గురు శంకరుండెచ్చట?
    ఏవి తల్లీ! నిరుడు కురిసిన
    హిమ సమూహములు?”

    మాత్రం కలకాలం నిలిచే కవిత.

    కొడవళ్ళ హనుమంతరావు

  1793. గ్రంథచౌర్యం గురించి … గురించి Sai Brahmanandam Gorthi గారి అభిప్రాయం:

    05/02/2008 8:47 pm

    ఈ భావ చౌర్యం బెడద అన్నమాచార్యకీ తప్ప లేదు. ఈ భావ చౌర్యం చేసిన వాళ్ళకి “ఛాయాపహారులు” అన్న ముద్దు పేరు కూడా పెట్టి చురకలేసాడా వాగ్గేయకారుడు.

    వెర్రులాల మీకు వేడుక గలితేను
    అర్రు వంచి తడుకల్లంగ రాదా?

    ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యముగాదు
    కుడుచి వేసిన పుల్లె కుడువుగా గాదు
    బడి నొకరు జెప్పిన బ్రతి జెప్పబోతేను
    ఆడరి శ్రీ హరి కది అరుహము గాదు

    ఉమిసిన తమ్మలో నొక కొంత కప్రము
    సంకూర్చి చవిగొని చప్పరింపనేల
    అమరంగ ఛాయాపహారము చేసుక
    తమ మాట గూర్చితే దైవము నగడా

    ఇలా దాదాపు ఓ పది చరణాలు పైగా దుమ్మెత్తి పోసాడు, తన పద కవితలని కాపీ కొట్టిన వాళ్ళని. ఆయన వాళ్ళని “ఛాయాపహారులు” అంటూ నిందించాడు. ఈ కీర్తన పూర్తిగా పధం -దృక్పధం లో చదవగలరు

    కాబట్టి కాపీరాయుళ్ళు ఈ మధ్యనే పుట్టుకొచ్చేరనుకోనక్కరలేదు. ముందునుంచీ ఉన్నారనుకోవచ్చు.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  1794. సడిచేయకే గాలి గురించి Sai Brahmanandam Gorthi గారి అభిప్రాయం:

    05/02/2008 8:11 pm

    ఉదాహరణ ఇచ్చినా మీకు అలా అనిపించక పోతే నేనేమీ చెయ్యలేను. మీ అందరికీ నచ్చితే మంచిదే ! జిహ్వ కో రుచి.
    నా అభిప్రాయం చెప్పాను. అభాండాలు వేరుగా ఉంటాయి. రాసిందేమో నాలుగు లైన్ల కవిత అందులో రెండు వేరే దానితో పోలిక ఉంటే దాన్ని ఏవో రెండు లైన్లు కలిసాయి దానికింత రాద్ధాంతమా అని అంటే నేనేమీ చేసేది లేదు.
    ఒకవేళ ఆ సినిమా పాట రాసిన వాళ్ళకి తెలియదు అనుకుందాం, కానీ బహుమతి ఇచ్చిన వారిలో ఒక్కరికీ తెలియదు అంటే కాస్త నమ్మబుద్ది కావడం లేదు నాకు. పోనీ అది అంత ప్రాచుర్యం పొందిన పాట కాదూ అనుకోడానికీ లేదు. ఏభై ఏళ్ళ తరవాత కూడా ఇంకా టీవీ లో వస్తోంది. కాస్త ఇక్కడ గూగ్లింగ్ చేస్తే ఎవరైనా వినచ్చు:

    మీ వ్యాఖ్యలు చూసాకా, కవిత్వంలో ఒకటి అరా లైన్లు వేరే కవితతో కలిసినా ఫర్వాలేదన్న కొత్త విషయం తెలిసింది. ఈ మధ్యనే ఆంధ్రభూమిలో ఉగాది కవితల పోటీకి రెండో బహుమతి ఇచ్చిన కవిత మక్కీకి మక్కీ లాగించేసి, ఇది నా సొంతమే అని ఒక వ్యక్తి హామీ పత్రం రాసి పంపారు. తీరా కవితని ప్రచురించాకా, ఇది నా కవితా అంటూ ఇంకో పెద్దమనిషి లబోదిబో మన్నాడు. ఆంధ్రభూమి వాళ్ళు ఇచ్చిన బహుమతి వెనక్కి తీసుకున్నారు. దీనికి కొసమెరుపేమిటంటే, ఆ పెద్దమనిషి కవిత ఆంధ్రభూమిలోనే అచ్చు వేసుకున్నారు, కొన్ని నెలల క్రితం.
    సరిపెట్టుకుంటే సర్వమూ సుందరంగానే కనిపిస్తుంది.
    మీరందరూ విజ్ఞులే! నా బుద్ధే కాస్త మందగించింది.

  1795. సడిచేయకే గాలి గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి అభిప్రాయం:

    05/02/2008 6:39 pm

    “గ్రంధచౌర్యం గురించి రాసిన వేలూరి గారి సంపాదకీయానికి ఉదాహరణ గా అనిపించింది ఈ కవిత నాకు.
    – సాయి బ్రహ్మానందం గొర్తి ”
    ఎక్కడో వకటి, అరా లైన్లు కలిస్తే దానికి గ్రంధచౌర్యం అనే మాట వాడాల్సిన అవసరం లేదు. దానికోసం అక్షరం అక్షరం పోలికలవసరం లేదు. సాయి గారు ఎంత సున్నితంగా తమ అభిప్రాయం చెప్పారనుకున్నా, వేసిన అభాంఢం పెద్దది. సరి ఐన పరిశీలన లేకుండానే అపవాదు వేశారని నా అభిప్రాయం.

    రెండు కవితలు జోల పాట బాణీలో వ్రాసినవే. కవితలో భావం, కవిలో భావావేశం లో పోలికలున్నప్పుడు, భాషలో కొంత పోలికలుండటం సహజవే. ఈ కవితలో ఆ పోలికలు హద్దులు మించలేదని నా అభిప్రాయం.

    సాయి గారు ఇంత పెద్ద ఆరోపణని పత్రికా ముఖంగా ఇంత తేలిగ్గా చెయ్యటం నాకైతే విజ్ఞత అనిపించడం లేదు.

  1796. సడిచేయకే గాలి గురించి జె.యు.బి.వి. ప్రసాద్ గారి అభిప్రాయం:

    05/02/2008 5:44 pm

    నేను సాధారణంగా కవిత్వం జోలికి పోను. నాకు బాగా అర్థం కాదు. ఈ పాట నాకు చాలా ఇష్టం. అందుకని ఈ కవిత కూడా చదివాను. ఎవరినీ నొప్పించకుండా నా అభిప్రాయం చెబుదామని నా తాపత్రయం.

    కవితలో మొదటి రెండు లైన్లు:
    “సడిసేయకే గాలి సడిసేయకే
    సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే”

    పాటలో మొదటి రెండు లైన్లు:
    “సడి సేయకో గాలి సడి సేయ బోకే
    బడిలి వడిలో రాజు పవళించెనే”

    నాకు మొదటి లైనులో తప్ప, రెండో లైనులో సారూప్యత కనబడలేదు.
    కవితలోని మిగిలిన లైన్లు అన్నీ వేరుగానే వున్నాయి.

    “సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!” అని అంటే, అర్థం కాలేదు. ఎందుకంటే, కవితలో రెండవలైనులోని మొదటి పదం “సవ్వడి” అయితే, పాటలో రెండవ లైను లోని మొదటి పదం “బడిలి”. పాటని కోట్ చేసేటప్పుడు, ఒక లైనుని రెండు లైన్లుగా విడగొట్టారు. అలా చేస్తే, సారూప్యత పోతోంది. కవితలో మొదటి లైను “సడిసేయకే గాలి సడిసేయకే” అని వుంటే, పోలిక కోసం, పాటలో మొదటి లైను, “సడి సేయకో గాలి సడి సేయ బోకే” గానే వుండాలి. కాబట్టి “సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!” అని అనడం కరెక్టు కాదని అనుకుంటున్నాను.

    ఇక మొదటి లైనుకి వస్తే, కవితలో, “సడి సేయకే” అని వుంటే, పాటలో, “సడి సేయబోకే” అని వుంది. ఒక్క పిసర తేడా వుంది.

    మొత్తానికి మొదటి లైను తప్పితే, ఇంకేదీ పోలికతో కనబడలేదు. అలాంటప్పుడూ, దీన్ని “గ్రంధ చౌర్యం” లాంటి పెద్ద పదాలతో చెప్పొచ్చా అన్నది నా ప్రశ్న.
    అసలు కవి గారు ఈ పాట ఎప్పుడన్నా విన్నారో లేదో. ఎప్పటిదో పాత పాట. కవి వివరణ కూడా వుంటే బాగుండేది. మిగిలిన కవిత అంతా ఇంత తేడాగా రాసి నప్పుడు, మొదటి లైను మాత్రం చౌర్యం అయి వుంటుందా? కాస్త ఆశ్చర్యమే. కవికి కూడా ఇదే లైను తోచి వుండ కూడదా?

    ఏమో! నాకు అనిపించింది చెప్పాను. ఎవరినీ చిన్నబుచ్చాలని కాదు.
    కవి గారు తన అభిప్రాయం చెబితే బాగుంటుంది. నాకయితే ఇది చౌర్యం అని అనిపించడం లేదు. బహుశా నా విజ్ఞత తక్కువయి వుంటుంది. 🙂
    – ప్రసాద్

  1797. సడిచేయకే గాలి గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    05/02/2008 2:10 pm

    ఈ క్రింది పాటనీ, ఈ కవితనీ తరచి చూడండి.
    దేనికేది మూలం అన్నది ఎవరి విజ్ఞతకి వారిని వదిలేస్తున్నాను.

    సడి సేయకో గాలి
    సడి సేయ బోకే
    బడిలి వడిలో రాజు పవళించెనే

    ఏటి గలగలలకే ఎగసి లేచేనే
    ఆకు కదలికలకే అదిరి చూసేనే
    నిదుర చెదిరిందంటే నేనూరు కోనే

    పండు వెన్నెలనడిగి – పానుపు తేరాదే
    నీడ మబ్బుల దాగు – నిదుర తేరాదే
    విరుల వీవెన బూని – విసిరి పోరాదే

    ఇది రాజమకుటం సినిమాలో పాట.
    కవిత మొదటి రెండు లైన్లూ ఒకేలా అనిపించడం లేదూ –

    సడిసేయకే గాలి సడిసేయకే
    సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే

    సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!

    గ్రంధచౌర్యం గురించి రాసిన వేలూరి గారి సంపాదకీయానికి ఉదాహరణ గా అనిపించింది ఈ కవిత నాకు.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  1798. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    05/02/2008 6:52 am

    నా కవితపై తమ అభిప్రాయం తెలిపిన సాయిలక్ష్మి,పద్మజ గార్లకు ధన్యవాదాలు.

    లక్ష్మి గారూ, “ఏటవాలుగా విరిసిన ఇంద్రధనుస్సు ” తుషార కన్నీటి భావ బిందువా అన్న మీ ప్రశ్నచాలా అందమైన స్పందన.ఆ భావన తాలూకు క్రెడిట్ పూర్తిగా మీదే.

    “ఒక కవిత కవికి “ఒక్క” కవితే కానీ అది పాఠకులకు అనేక కవితలుగా ఆవిష్కరింప బడుతుంది “,అంటూ ఉండేవారు మా నాన్న గారు. ఇది కవిత్వానికి ఉన్న universality కి,రసజ్ఞులైన పాఠకుల స్పందనా శక్తికి సంబంధించిన విషయమేమో అనిపిస్తుంది. ఒక కవితలో ఉన్న నిర్దేశిత భావాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి ఆస్కారం ఉన్న అనేక సంబంధిత భావనల్ని పాఠకులు చూడగలుగుతారు. ఒక సాధారణ అనుభవం,కవి వైయుక్తిక అనుభూతిగా కవిత్వీకరణ చెందినపుడు,అదే అనుభవం పాఠకుల వైయుక్తిక అనుభూతిలోకి ఒక కొత్త కోణం లో transfer అవటం కారణం కావచ్చు కూడా.

    అభిప్రాయాలు తెలిపి ప్రోత్సహించిన పాఠకులందరికీ కృతజ్ఞతలు.

    వైదేహి శశిధర్.

  1799. చెప్పులు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    04/30/2008 6:43 pm

    “. ..కాబట్టి, లైలా యెర్నేని గారి పాయింటు ఈ విషయంలో కరెక్టే. అయితే తోలూ, సూదీ, దారం లాంటివి సంపాదించి, చెప్పులు స్వయంగా కుట్టుకోవాలి అనేది అర్థం లేని విషయం.”

    ఎందుకు కుట్టుకోకూడదు. చాలమంది చొక్కాలూ, జాకెట్లూ, కుట్టుకుంటూనే ఉంటారుగా? కరెక్టే అంటూనే మళ్ళీ కాదంటారు. అంతా రైటే అంటే మనమిద్దరం స్నేహితులమై పోతామని భయమా ఏమిటి?

    “రెండవ విషయం – ఒక మగ పిల్లాడు, ఆడవాళ్ళ కష్టం, అదీ తన తల్లీ, సోదరిల కష్టం తింటే, అది అతనికి అవమానమా? అదే ఒక ఆడపిల్ల, మగ వాళ్ళ కష్టం, అదీ తన తండ్రీ, సోదరుల కష్టం తింటే, అది ఆమెకి అవమానం కాదా? లైలా గారి అభిప్రాయం ప్రకారం కాదు మరి!”

    రామ రామ! నెనెక్కడన్నాను అవన్నీ.
    రచయిత కథలో ఒక అమ్మాయి సంపాదన మీద నలుగురు బ్రతుకుతున్నట్లు రాశారు.
    అబ్బ! ఆమెకు ఎంత కష్టమైన పనో అని నేను అనుకోకూడదా?
    రచయిత ఆమె గురించి పెద్దగా చెప్పరు. ఎందుకో మరి. సంపాదనపరులైన ఆడవాళ్ళను రచయితలు ఫోకస్ లోకి తేరు. ఏం చెయ్యను. నేనే ఊహించుకోవాలి.
    ఆడవాళ్ళు పని చేస్తుంటే మగవాళ్ళు , తమ మీదే కథలూ కవితలూ రాసుకుని మరోమారు – అదేంటీ ఆ మాట – తేజో మూర్తులై పోతారు.
    అందుకని నెను కూడా – ఆమెను ఇగ్నోర్ చెయ్యాలా? ఆమె, బాథ్యతను , బరువును, ఆమె త్యాగాన్ని. ఎందుకని?
    రచయిత కు మస్తుగా చెప్పులు లేని కుర్రాడి మీద జాలి ఉంది. అందుకని నేనూ ఆయన జాలిపడిన వాళ్ళమీదే నా జాలి చూపాలా? వేరే వాళ్ళను గురించి తలచకూడదా? నిషేధమా?
    కథలో ఒక్క స్త్రీ సంపాదన, నలుగురి నోట్లోకి ముద్ద వెళ్ళటం కదా రాసిన విషయం? రచయిత ఒక పురుషుడి సంపాదన మీద నలుగురు బ్రతుకుతున్నట్లు రాస్తే, నేను అయ్యో! ఒక్క మగవాడి రెక్కల కష్టం మీద అంతమందా? అతనికి ఎంత కష్టం! అంటానే. అన్నాను ఎన్నోసార్లు.
    కాని ‘చెప్పులు’ కథలో అది రాయందే. రాయకపోయినా అది అన్న ఐతే, తమ్ముడైతే , తాతైతే – వారు వీరైతే వీరు వారైతే – ఈ కాంబినేషన్లన్నీ నన్నెందుకు ఆలోచించమంటారు.? ముందు సంపాదించి నలుగురికి తిండి పెట్టిన అక్క మీద కథ రాయండి. గొప్పగా రాయండి. నెగెటివ్ గా రాయకండి. అప్పుడు ఆమె శ్రమ సార్థకమౌతుంది.

    “వయసులో పెద్దవాళ్ళు, అంటే అన్న చెల్లెలి కష్టం తింటే, తప్పు పట్టొచ్చు. అది తమ్ముడి కష్టం తిన్నా తప్పే మరి. అన్న వుద్యోగం చేస్తూ, చెల్లెలిని పోషిస్తూ, చదివించుకోవడంలో లేని అవమానం, ఒక అక్క వుద్యోగం చేస్తూ, తమ్ముడిని పోషిస్తూ, చదివించుకోవడంలో ఎందుకు వుందీ? ఆడవాళ్ళ కష్టం తినడం అంత హీనమయిన విషయమా? అలా అని ఆడవాళ్ళే అనడం ఏం అర్థమయిన విషయం? ”

    అవమానం లేదు. అవమానాలు – కాలం నీతిని బట్టి ఊహించుకునేవి. రుక్మిణి కృష్ణుడితో వెళ్ళి పోతే ఇంట్లో వాళ్ళకి కలిగే తలవంపుల వంటివి. శ్రమ అంటారా అది నిజం. ఉంది. మనిషికి మానసికంగా గాని, శారీరకంగా గాని శ్రమ లేకపోతే ఒక మనిషి ఎంతమందినైనా పోషించవచ్చు. అసలు ఆ పోషించే వాళ్ళు బంధువులే ఐ ఉండవసరం లేదు. ఎవరికైనా సాయం చెయ్య వచ్చు.
    కుటుంబంలో పెద్ద సంతానమైనంత మాత్రాన, అమ్మా నాన్నా కన్న మిగతా సంతానాన్ని, వాళ్ళెందుకు సాకాలి. అమ్మా నాన్నా వాళ్ళను అడిగి, ఒప్పందం మీద కన్నారా మిగతా వారిని. మనకు ఏ నీతి ఉపయోగం గా ఉంటే అది వాడేసి, మన బాధ్యతను వేరే వాళ్ళ మీదకు నెట్టటమే కదా?
    కథలో హీరో అక్క మనసు బాథ పడుతుందేమో అని సంపాదించుకోటం మానేస్తాడు. అందులో అతనికి నష్టం ఏముంది. తనే పని చెయ్యగా లేంది తన తమ్ముడు గారు పని చేస్తే అక్కకు ఎందుకు కష్టం. తల్లి -తండ్రికి కూతురు పనిచేస్తుంటే బాగానే ఉండి, కొడుకు పనిచెయ్యకుండా చదువుకుంటే వాళ్ళకు అప్పుడు అవమానం ఎందుకు కలగటం లేదు? దీనివల్ల అవమానాలు మనకు ఇస్టం వచ్చిన రీతిగా మార్చుకుంటాం అని తెలుస్తూంది కదా?

    “ఆడవాళ్ళ కష్టం, మగవాళ్ళ కష్టం అనే వేరు వేరు పదాలే అర్థం లేనివి.”

    అది నిజమే. ఆడ పని, మగపని అని లేదు. మీకూ, నాకూ లేదిప్పు డు. కాని కథా కాలం నాటికి రచయితకు, ఆ కథలో అబ్బాయి మీద ఎక్కువ సానుభూతి ఉంది. అంత మాత్రం చేత అది మంచి కథ కాకుండా పోదు. అది అప్పటి కథ, అప్పటి అవగాహన.

    J.D. Salinger రాసిన The Catcher in the Rye చదివి నా మేనల్లుడు , ‘చెప్పులు’ హీరో వయసప్పుడే – Self pitying selfish brat. What is Holden Caulfield’s problem? Why do you like this book? అని అడిగాడు నన్ను.

    The characters don’t have to be perfect to like a book 🙂

    “ఒక ఆడపిల్ల కుటుంబ భాధ్యతని తీసుకుంటే (జీవితాంతం తన జీవితాన్ని సినిమాల్లో లాగా త్యాగం చేసి కాకుండా), ఆ కుటుంబంలో వున్న చిన్నవాళ్ళకి సిగ్గు పడాల్సిన విషయం కాదు అది.”

    కానీ ఆడపిల్ల గర్వ పడవచ్చుగదా? ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు కదా, అవునా? సంపాదించే మగవాళ్ళూ బాగా గర్వ పడుతారేమో. ‘నేను ఆమెవ్వరో డబ్బు ఇబ్బందిలో ఉన్నపుడు డబ్బు పంపాను’ – అని రాయగలిగిన మగవాడు, ‘నాకు ఆమె ఎంతో సాయం చేసింది’ అని అంతే నిజాయితీతో చెప్పవద్దా? అలాగే ప్రతి సంపాదించే స్త్రీ కూడా నా సంపాదన మీదే ఈ ఇల్లు గడుస్తూంది అని చెప్పవచ్చు. చెపితే వేరే వాళ్ళ మనసుకు కష్టం, అవమానము కలుగకూడదు. అవునా? అవును. ఎందుకంటే అది నిజము కాబట్టి. నిజం మనం చెప్పగలగాలి కాబట్టి.

    “ఇంతకన్నా చెప్పడానికి ఏమీ వుంటుందని నేననుకోను.”

    ‘ఈ మాట కథల’ పరిథి దాటి మాట్లడనిస్తే – చాలా ఉంటాయి చెప్పటానికి. కాని మనం రాస్తున్నది రచనల మీద పాఠకుల అభిప్రాయ వేదికలో కదా. ఇంతింత పొడుగు రాస్తే పత్రిక వారికి, పాఠకులకు ఇబ్బంది కలగవచ్చు.
    ముగించే ముందు – మీరు నాతో మాట్లాడటం నాకు చాలా సంతోషం కలిగించింది ప్రసాద్!

    లైలా
    మీరు నవలలు రాయాలి ఇక. కథ పరిథి ఇక మీకు చాలదు జె.యు.బి.వి. 🙂

  1800. బ్లాగుల గురించి – నా మాట గురించి bollojubaba గారి అభిప్రాయం:

    04/30/2008 11:32 am

    మీ బ్లాగు బాగుంది
    మంచి క్వాలిటీ ఉన్న రచనలే ఉంటున్నాయి.
    మీ బ్లాగుకు నేను కవితలు పంపవచ్చా లేక నాబ్లాకు లింక్ ఇస్తే సరిపోతుందా? తెలుపగలరు.

    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

  1801. పిచ్చి నాన్న గురించి bollojubaba గారి అభిప్రాయం:

    04/30/2008 11:26 am

    మూర్తిగారికి

    చాన్నాళ్లతరువాత ఒక మంచి కవిత చదివాను,
    మీ కవితలొ చక్కటి పదచిత్రాలు ఉన్నాయి
    ఉదా:టీ డికాషనై మారటం, పత్తికాయలా పగలటం, ఆకాశానికి బెలూనై వేలాడటం మార్వలెస్ ఇమేజెస్.
    నవ్యంగానూ, హృద్యంగానూ ఉన్నాయి.

    కాని చిన్న అబ్యంతరం
    ఆ అమ్మాయికి ఇపుడు అద్దంలో తనబొమ్మ తప్ప ఏమీ పట్టదు అని చెప్పటం అంత అందంగా లేదు. అది పెంపక లోపంగా అనిపించదూ. యవ్వనంలో యువత అద్దానికి అంటుకుపోవటం సహజమైనా, సత్యమైనా మీ కవితమొత్తం ఒక మూడ్ లో ఉంటే ఆ రెండు లైన్లు మిస్ ఫిట్ అయినట్లు గా అనిపిస్తూంది. తప్పైతే క్షమించండి.

    మరోచోట పిచ్చినాన్న అనిపించటం వ్యంగ్యంగా కాక ప్రేమగానే తీసుకున్నాను సుమా!

    నా బ్లాగును విసిట్ చేసి, దయచేసి మీ కామెంట్శ్ వ్రాయండి.

    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

  1802. ఓ చందమామ గురించి bollojubaba గారి అభిప్రాయం:

    04/30/2008 11:15 am

    కవిత చాలాబాగుంది

    చందమామను మనింట్లోని పాపతో పోల్చి, వర్ణించటం నచ్చింది.
    వ్యక్తీకరణ అందంగా ఉంది.

    కానీ చందమామ కు సంబందించిన వివిధ అంశాలైన, పౌర్ణమి, అమావస్య, శుక్లపక్షం, కృష్ణపక్షం, వెన్నెల, నెలవంక, హేమంతరుతువు, ఆటుపోట్లు మొదలైనవాటిని కూదా కవితలో చొప్పించగలిగితే ఇదొక అద్భుతమైన కవితగా మిగిలిపోతుంది.
    బొల్లోజు బాబా

    http://sahitheeyanam.blogspot.com/

  1803. ఆహా గురించి Hrk గారి అభిప్రాయం:

    04/09/2008 3:23 pm

    ఒక సారి విన్నదే మళ్లీ చదువుతుంటే అప్పుడే పూచిన పూవులా .. మెత్తగా… హాయిగా… చాల బాగుంది. జేసుదాసు గొంతులో అన్నమయ్య కీర్తన విన్నంత హాయిగా వుంది.
    నిజానికి పద్యం మరి మరి చదవ బుద్ధేసింది. కొత్త అర్థాలు వెదకడానికి కాదు. ఉత్తినే ఉన్నదున్నట్టు ఆనందించడానికి.
    ఒక రోజును చెబుతున్నట్లుండడం వల్ల పద్యానిక స్త్రక్చరల్ గా కూడ గాచక్కని యూనిటీ కుదిరింది… అది కవితకు అంత ముఖ్యం కాకపోయినా.
    ప్రకృతిలో తనను గొప్ప నిర్గర్వంతో చూసుకునే కవి ” నాతో పాటు కళ్ళు తెరిచి/ నాతో పాటు కళ్ళు మూసే లోకం/ నా కనురెప్పల వెనకే / అనంత విశ్వం!” అనడం తాత్విక స్థాయిలో కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.. ఆ రొమాంటిక్ ఊహ నిజమైతే బాగుండునని ఆశః కలుగుతుంది. మనిషికి చిరకాలంగా ఉన్న ఆఃశః.

    సుబ్రహ్మణ్యం గారూ,
    మరోసారి అభినందనలు.

  1804. ఆహా గురించి vani గారి అభిప్రాయం:

    04/07/2008 11:15 pm

    హాయ్ !

    మీ కవిత అధ్బుతం
    మనసుని కదిలించింది ప్రకృతిలోని అందాలన్నింటినీ
    ప్రేమించిన మనసు ఆనందం వర్ణనాతీతం
    మనసు నవ్వుతుంది,
    నవ్వుతూనే కనుమరుగయ్యే కాలంకోసం వేదన చెందుతుంది
    మీ కవితను నేను మరువలేను
    ఎన్నాల్లకో నన్ను నేను చూసుకున్నాను
    _ వాణి

  1805. ఈమాట కొత్త వేషం గురించి sasidhar pingali గారి అభిప్రాయం:

    04/04/2008 7:56 pm

    సాగి పోయెను నెచ్చలీ సార భరిత
    వత్సరము లెన్నొ ఈరీతి వదలి నన్ను
    ఒంటినై సాగ నిక మీద నోర్వ లేను
    వేగ రమ్మోయి ప్రియతమా ! వేడుకొందు !

    ఇటు వంటి కవితలు పద్యాలు ఇంకా కొన్ని వునాయి.
    మాకూ మీ ఈమాట లొ పాలు పంచు కోవాలనుంది.
    రచనలు పంపే విధానం తెలుపండి.
    మీ ఫాక్సు నెంబరు కూడా తెలుప గలరు.

    పింగళి శశిధర (జాబిల్లి)
    హైదరాబాదు

  1806. చీలిన మనిషి గురించి gks raja గారి అభిప్రాయం:

    04/03/2008 7:24 am

    కవిత చాలా బావుంది. ‘ఈ’మాట’ కు ధన్యవాదాలు. చందాదారులుగా చేరాల్సిన వివరాలను తెలుపగలరు.
    విధేయుడు.
    రాజా.

    [“ఈమాట” ఆన్లైనులో మాత్రమే ప్రచురించబడే పత్రిక. చందాదారులు కానవసరం లేదు. ఉచితంగా ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు. –సంపాదకులు]

  1807. పిచ్చి నాన్న గురించి Seetha గారి అభిప్రాయం:

    04/02/2008 11:26 pm

    అవును నిజమే నాన్న దృష్టిలో కూతురు ఎప్పుడూ యువరాణే…మంచి కవిత touching…

  1808. రచయితలకు సూచనలు గురించి sasidhar pingali గారి అభిప్రాయం:

    03/29/2008 1:26 am

    ఆర్యా !

    మీ సంపాదకత్వంలో వెలువడే ఈమాట చాలా హృద్యంగా వున్నది. అభినందనలు. మా కుటుంబ సభ్యులు కొన్ని సాంప్రదాయక కవిత్వం లో పద్యాలు వ్రాశారు. నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. ఆయితె అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు. మా వద్ద లికిత తెలుగు సాఫ్ట్ వేరుంది. అందులొ పంపవచ్చా? లేదా ఎలా పంపాలో తెలుప గలరు.

    ధన్యవాదములు

    పింగళి శశిధర

  1809. నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/25/2008 7:26 am

    సాహితీ మిత్రులకి ఒక సమాచారం.

    అన్నమాచార్యుని పద సాహిత్యాన్ని ప్రముఖ కవయిత్రి జయప్రభ గారు, “వలపారగించవమ్మ వనిత_నీ యలుక చిత్తమున కాకలివేసినది” అన్న టైటిల్‌తో ఒక మూడు వందల పై చిలుకు పేజీలతొ ప్రచురించారు. అన్నమయ్య పదములని , అందులోని కవిత్వాన్ని ఆవిడ తనదైన శైలి లో చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు. అన్నమాచార్యుని పదాలని అమె వ్యాఖ్యానించిన పద్ధతి, చాలా ఆసక్తికరం గానూ, చదివించే ఉత్కంఠభరిత శైలి లోనూ వుంది. ఆసక్తి వున్న పాఠకులు తప్పక చదవ వలసిన పుస్తకం.

    రమ.

  1810. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    03/22/2008 9:45 pm

    వెన్నెల, వెర్రి

    KS హరీష్ కుమార్ గారి అభిప్రాయం చదివితే చంద్రుడికో నూలు పోగని శ్రీశ్రీ సమర్పించిన దారంలాంటి తేలికైన దీర్ఘమైన కవిత “శరచ్చంద్రిక” గుర్తొచ్చింది.

    “అందుచేత ఓ చందమామా!
    అందమైన ఓ పూర్ణసోమా!
    సముద్రం మీదా అరణ్యం మీదా
    సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా!

    చెప్పొచ్చిందేమిటంటే
    చెప్పడనికేమీ లేదని!
    అంతమందికీ అన్నీ తెలుసు
    అదే మన అజ్ఞానం.

    ఎవడో చెబితే వినే రోజులు
    ఏనాడో వెళ్ళిపోయాయి
    ఇంకా ఏదో చెప్పాలని
    ఎందుకీ ఉబలాటం?

    అసలు నిజం ఏమిటంటే
    ఎవడికీ ఎమీ తెలియదు
    ఇలా ఎందుకొచ్చామో
    ఇక్కడెంత సేపుంటామో

    ఇక్కడనుంచి వెళ్ళేదెక్కడికో
    ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో
    ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి.
    చెబితేమాత్రం నమ్మకండి.”

    నిరాశగా కాస్సేపు మాట్లాడి, మరో వైపు నుంచి చూస్తే వెలుగు కనబడుతుందంటూ:

    “పరమాణువు గర్భంలోని
    పరమ రహస్యాలూ
    మహాకాశ వాతావరణంలోని
    మర్మాలూ తెలుసుకున్నాక

    సరాసరి నీదగ్గరకే
    ఖరారుగా వస్తాంలే
    అప్పుడు మా రాయబారుల్ని
    ఆదరిస్తావుకదూ నువ్వు?”

    అని జోస్యం చెప్పి, మానవుడి progress report చదివాడు.

    సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమ్మీద వచ్చే సముద్రాల ఆటుపోట్ల గురించి లోతుగా తెలియాలంటే కష్టమేకాని స్థూలంగా అర్థం చేసుకోవడం సులభమే. చంద్రునికి అభిముఖంగా ఉన్న భూమి ఉపరితలంపై ఒక బిందువు A, దానికి ఎదురుగా భూమ్మీద అవతలివైపు B, భూకేంద్రం C అనుకోండి. చంద్రుడు భూకేంద్రం C కన్నా A ని ఎక్కువ గానూ B ని తక్కువగానూ ఆకర్షిస్తాడు — దూరాల్లో ఉన్న తేడా బట్టి. అందుమూలంగా A, B రెండూ కూడా కేంద్రానికి దూరంగా వెళ్తాయి. కాని అవి భూమిలో భాగం కావడాన, భూమి సాగినట్లవుతుంది. దాని ప్రభావమే సముద్రాల్లో ఆటుపోట్లు.

    భూగోళం చాలా పెద్దది కావడాన చంద్రుడికీ A, B, C లకీ మధ్య ఉన్న దూరాల్లో చెప్పుకోదగ్గ తేడా ఉంది – ఆ తేడానే ఆటుపోట్లకి కి కారణం. భూమితో పోలిస్తే మాఊరి చెరువు చాలా చిన్నది – దానిపై అన్ని బిందువులూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చెరువుపై చంద్రుడి ప్రభావం ఉండదు. అలాగే మన శరీరంలో ఎక్కువ వున్నది నీళ్ళే అయినా శరీరంలోని అన్నిభాగాలూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చంద్రుడి ప్రభావం మనపై ఉండదు. (ముఖం పాదాలకన్నా దగ్గర ఉంటుంది కాని, మనిషి పొడవు భూమితో చంద్రునితో పోలిస్తే అతి తక్కువగా ఉంటుంది కనుక ఆ తేడాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.)

    సమీకరణాలంటే భయం లేని వాళ్ళు ఈ “The Physics Teacher” పేపరు – “Myths about Gravity and Tides” – చదివి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే వెన్నెల ప్రభావాన్ని సమీకరణాలతో అంచనా వెయ్యలేం. అందుకు కవిత్వమే సాక్ష్యం:

    “వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
    వినిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ
    మనోహరమైన సంగీతం వినిపిస్తూ
    ప్రయాణించు శశీ ప్రయాణించు.

    ఇదిగో జాబిల్లీ నువ్వు
    సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
    గాలిదాన్ని చెరిపెయ్యకుండా
    కాలమే కాపలా కాస్తుందిలే.”

    కొడవళ్ళ హనుమంతరావు

  1811. ఆహా గురించి రాకేశ్వర రావు గారి అభిప్రాయం:

    03/15/2008 9:48 am

    Is it just me? or is it toooooo perfect?

    నాదో అభిప్రాయం: మీ కవిత చదువుతుంటే అన్ని క్లైమేక్సులు వున్న సినిమా చూస్తున్నట్టు వుంది. ఇక పద్యానికి పద్యానికీ థీమేటిక్ సంబంధం వున్నా వాటికి క్రమనియమం అవసరం లేదనిపిస్తుంది. అంటే కొన్ని పద్యాలను పైకీ క్రిందకీ చేసినా కొంత వరకూ అదే ఫలితం ఉంటుంది చదువరికి అని. ప్రతి పద్యాన్ని (లేదా ఒకటి రెండిటినీ) ప్రక్కకు తీసి, దాన్ని క్లైమాక్సుగా వాడి, వాటికి తగిన బిల్డప్పు ఇస్తే వాటిని నాలాంటి వారు ఇంకా బాగా ఆస్వాదించగలరనిపిస్తుంది. ఈ శైలిలో ఏదో బాణాల వర్షం కురిసినట్టూ భావాల వరదలో కొట్టుకుపోతున్నట్టూ వుంది (మీ కవిత ప్రభావం అనుకుంటా నాకు కూడా ఉపమాలు వస్తున్నాయి :))

    నేను చెప్పదలచుకుంది ఆంగ్లంలో కౢప్తంగా : Not just the metaphoric mountains but also some build up to them through some winding scenic mountain paths, with an occasional flower here and there would be perfect, as opposed to being too perfect.

    రాకేశ్వర రావు

  1812. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/12/2008 7:27 pm

    కేశవస్వామి గారు “హేతువాదులు” గురించి నిర్వచనం బాగుంది. కానీ “హేతువాదులు” నాస్తికులు కాదనడం విడ్డూరమైన విషయం. “దేముడు” అనేది ఒక నమ్మకం. దానికి హేతువు లేదు. అంటే దానికి రుజువు లేదు. నమ్మకం ఆధారపడి, హేతువు లేని వాటిని హేతువాదులు అంటే, నాస్తికులు నమ్మరు. ఇక హేతువాదులు అనే పదానికి ఎవరికి వారు వారి కిష్టమైన అర్థం తీసుకుంటామంటే, కాదనేదెవరు. కానీ ఒక హేతువు అనేది కొందరికే హేతువుగా కనబడి (నమ్మకం మీద ఆధారపడిన హేతువు అన్నమాట), కొందరికి హేతువుగా కనబడక పోతే, అది ప్రశ్నించవలసిన హేతువు (అంటే నమ్మకం) అన్న మాట.
    వ్యాసకర్త చక్కగా గోడకి ఒకవేపున వుండే రాశారు. “గోపి”లా రాయలేదు. అయితే అది అర్థం అయ్యేవారికే, రెండు వేపులా వున్నట్టు అర్థం అవుతోంది. ఆ మధ్య కధలే ఒక్కోరికి ఒక్కోలా అర్థం అవుతున్నాయనుకున్నాను. కవితలెప్పుడూ అలాగే అర్థం అవుతాయనుకోండీ. ఇప్పుడు వ్యాసాలు కూడా ఒక్కోరికి ఒక్కోలా అర్థం అవుతాయనిపిస్తోంది. ఇంకేం చెప్తాం. వ్యాసకర్త చక్కగా నమ్మకంతో గోడకి ఒకే వేపున వుండి, వివరంగా రాశారు. అది మనకి “ఒకరిని నొప్పించక, తానొవ్వక” అన్నట్టు కనబడితే, అది విడ్డూరమే.

    రిచర్డ్ డాకిన్సు గట్టి నాస్తికుడు. జ్యోతిషంతో పాటూ, చాలా వాటిని విమర్శిస్తాడు. కిందటి వారం, ఆయన యూనివర్శిటీ ఆఫ్ బర్కిలీలో లెక్చరిస్తే, వెళ్ళాను. దాని గురించి వ్యాసం రాయాలనుంది, గానీ ఓపికే లేదు. ఈ వ్యాసం నచ్చిన వారికి, డాకిన్సు వ్యాసం నచ్చుతుందంటే అర్థమే లేదు. ఆ లెక్చరు విని వుండాలి, ఆయన ఆస్తికులని ఎంతగా విమర్శించారో తెలియడానికి. వారి నమ్మకాలని, జ్యోతిషంతో సహా, ఎంతగా విమర్శించారో, ఆయన మాటలు వింటే తెలుస్తుంది.

    జ్యోతిషం మీద నమ్మకం వున్నవాళ్ళు, ఆ శాస్త్రం గురించి వ్యాసాలు రాస్తే, ఆ విషయం అర్థం అవుతుంది. నాస్తికులని చెప్పుకునే వారు, ఆ వ్యాసాల్ని మెచ్చేసుకుంటూ వుంటేనే విచిత్రంగా వుంటుంది.

    – ప్రసాద్

  1813. ఓ చందమామ గురించి సోమ శంకర్ గారి అభిప్రాయం:

    03/12/2008 1:00 am

    చాలా బాగుంది! కొత్త పాళీ గారు లింక్ ద్వారా అందించిన “పిచ్చినాన్న” కవిత కూడ బాగుంది. రెండు, రెండే నాన్న వాత్సల్యాన్ని బాగా వ్యక్తం చేసాయి.
    సోమ శంకర్

  1814. ఆహా గురించి Sivasankar గారి అభిప్రాయం:

    03/11/2008 7:42 pm

    సుబ్బు,

    కవితలు చాలా చాలా బాగున్నాయి, కొన్ని పోలికలు సహజంగా మనస్సు ని సులువైన పద్ధతిలో ఆకట్టుకున్నాయి.

    వర్షం కురిసిన ప్రతిసారీ
    ఆమె గుర్తుకు రావడంలో
    ఆశ్చర్యం ఏముంది?

    తరచి తరచి చూశాకా
    దేనికీ అర్ధంలేదని తెలిశాకా
    నిఘంటువును చూస్తే
    నవ్వొస్తోంది

    ఇది చదివాకా గుండె జలదరించింది నాకు. It takes years or centuries to understand above few words. It gets very tough to indulge in such thoughts when one considers life in practical terms. It’s a good depiction. I bow humbly to your great work!

    Keep up!
    Reg
    ur siva

  1815. లిటిల్‌సైంటిస్టు గురించి srinivas Chilakapati గారి అభిప్రాయం:

    03/09/2008 5:02 pm

    ఎడిటర్లు తమ నియమాల్ని సడలించుకుని, వంగూరి వారి తొమ్మిదవ సంకలనంలో ముద్రితమైన ఈ సరదా కబుర్లని కథగా పునర్ముద్రించినందుకు ధన్యవాదాలు. హాయిగా నవ్వుకున్నాను.

    [Editors’ Note: మునుపెక్కడైనా ప్రచురింపబడ్డ కథల్నీ కవితల్నీ వ్యాసాల్నీ (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప)ఈమాటలో పునర్ముద్రించగూడదనే నియమం ఉన్నదని మీకందరికీ తెలిసిన విషయమే.అయితే కొన్నిసార్లు పొరపాట్లు సహజం. ఫణి డొక్కా గారి ఈ కథ పునర్ముద్రితమని మాకు తెలియగానే మా నియమాన్ననుసరించి కథను తొలిగించి వేశాం. కానీ, పాఠకుల స్పందన, రచయిత వివరణల తదుపరి మా నియమాన్ని సడలించి ఈ కథను ఈ సంచికలో ఉంచడానికే మేము నిర్ణయించాం. మరొక్కసారిగా – ప్రచురితమైనవే కాక, ఇంకెక్కడైనా ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు కూడా ఈమాటకి ఆమోదయోగ్యం కావు. కొన్ని కొన్ని చోట్ల, ఒక రచనని ప్రచురిస్తున్నారో లేదో ఒక పట్టాన చెప్పరు. అటువంటి సందర్భంలో, ఈమాటకు పంపేటప్పుడు, ఆ ఇంకో చోటినుంచి ఆ రచనను తప్పక ఉపసంహరించుకునే బాధ్యత రచయితదే. ]

  1816. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    03/06/2008 6:34 am

    ముందుగా నా కవిత పై అభిప్రాయం తెలిపిన రవికిరణ్, మాలతి, నిషిగంధ, రాధిక, రమ, సౌమ్య గార్లకు ధన్య వాదాలు.

    సౌమ్య గారూ, యండమూరి మరీ పాప్యులర్ (కొంతమంది కమర్షియల్ అని కూడా అంటారు) రచయిత కాకముందు వ్రాసిన చిన్న నవలలలో ఓ నవల పేరు “నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య”. ఆల్రెడీ ఆయన Coin చేసిన Phrase ను నా కవిత టైటిల్ గా పెట్టటం జరిగింది కాబట్టి కృతజ్ఞతలు తెలిపాను. It is nothing but a polite acknowledgement. అంతకు మించి ఈ కవితతో,ఆ నవలకి,యండమూరి కి ఏమీ సంబంధం లేదు.

    Sorry for the confusion.

    Regards
    Vaidehi

  1817. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి Sowmya గారి అభిప్రాయం:

    03/06/2008 1:04 am

    ఇక్కడ నాకు యండమూరి కాన్సెప్ట్ ఏమిటో అర్థం కాలేదు కానీ,
    కవిత మాత్రం చాలా నచ్చింది !

  1818. యాత్ర గురించి ప్రసాదు గారి అభిప్రాయం:

    03/05/2008 11:32 am

    వినీల్, కవితలు చాల బాగున్నాయి!!

  1819. చెట్టు కూలిన వేళ గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    03/04/2008 7:06 pm

    సాధుసజ్జనులను చెట్టుతో పోల్చే తులసీదాసు దోహాని జ్ఞప్తికి తెచ్చిందీ కవిత:

    తులసీ సంత్ సుఅంబ్ తరూ ఫూల్ పలహి పర్ హేత్
    ఇతతే వే పాహన్ హనత్ ఉతతే వే ఫల్ దేత్

  1820. చెట్టు కూలిన వేళ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/04/2008 5:30 am

    డియర్ ఝాన్సీ,

    మీ కవిత లోని చెట్లు కూలటం లోని ఆవేదన బాగా వచ్చింది. ఆర్ద్రత వుంది. ఇండియాలో ముఖ్యంగా తెలుగుదేశం లొ పిచ్చికలు క్రమంగా మాయమై పొతున్నాయి. చాలా బాధకరం ఆ సన్నివేశం.

    రమ.

  1821. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి rama గారి అభిప్రాయం:

    03/04/2008 5:18 am

    డియర్ వైదేహి,

    చక్కటి భావానలున్నాయి మీలో. బాగా వ్యక్తం చెయ్యగలిగారు. congrats. “సంక్షిప్తమైన మన చూపుల్ని కలుపుతూ ఏటవాలుగా విరియటానికి ఓ ఇంద్రధనుస్సు ఆరాటపడుతూనే ఉంటుంది” భలే గా వుంది ఊహ. అలాగే “నిశ్శబ్దం మూగబోయిన వాయిద్యం” అనటం కూడా. మంచి ఇమేజెస్, original గా ఉన్నాయి. మరిన్ని మంచి కవితలని మీనించి ఆశిస్తూ…

    rama

  1822. ఆహా గురించి kalhara గారి అభిప్రాయం:

    03/04/2008 1:24 am

    ఇలాంటి కవితలు చదివాక కొన్నాళ్ళు ఏమీ రాయాలనిపించదు. ‘ఇక గొప్పగా రాయటానికి ఏం మిగిలింది గనక’ అనిపించి. ఎన్నాళ్ళు సాన పట్టారు ఈ వజ్రాన్ని?

  1823. ఓ చందమామ గురించి radhika గారి అభిప్రాయం:

    03/03/2008 1:56 pm

    మీ చందమామ వెన్నెలను మాకు కూడా పంచినందుకు చాలా థాంక్స్.కవిత ముద్దుగా అనిపించింది.

  1824. ఆహా గురించి నిషిగంధ గారి అభిప్రాయం:

    03/03/2008 4:48 am

    ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ‘ఆహా!’ అనిపిస్తాయి నీ కవితలు.. ప్రతి ఒక్కటి అద్భుతం!!

  1825. బ్లాగుల గురించి – నా మాట గురించి radhika గారి అభిప్రాయం:

    03/02/2008 7:39 am

    వ్యాసం చాలా బాగుందండి.బ్లాగులు చదవమని పోరుతున్న ఆ మిత్రుడెవరో మాకు తెలిసిపోయింది మీరు రాసిన కవిత తో.అదే చేత్తో కూడలికి,లేఖిని కి లింకులు ఇచ్చుంటే సరిపోయేది.

  1826. యాత్ర గురించి Pavan Kumar Garikapati గారి అభిప్రాయం:

    03/01/2008 8:04 pm

    కవితలు ఎంతొ బాగున్నాయి. క్లుప్తత కి అర్థం ఇదే. వినీల్ ఉక్కు పిడికిళ్ళతో వదులుతున్నాడు కవితలని. కొత్త కొత్త పద బంధాలు చాలా అందంగా ఇమిడాయి.

    పవన్ కుమార్ గరికపాటి

  1827. ఓ చందమామ గురించి mOhana గారి అభిప్రాయం:

    03/01/2008 1:48 pm

    ఆకాశంలో ఒకే చందమామ, కాని మంచు బిందువులు ఎన్ని
    చందమామలను ప్రతిఫలనము చేస్తుందో! అలాగే జీవితంలో
    ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చందమామ!

    చక్కని హృదయంగమమైన కవిత – మోహన

  1828. కొన్ని మినీ కవితలు గురించి varma గారి అభిప్రాయం:

    02/29/2008 12:08 pm

    సుబ్రహ్మణ్యం గారూ,

    “బాల్యం” కవిత అద్భుతంగా ఉంది. నే ఇన్నాళ్ళనుంచి వెతుకుతున్న బంతి ఎక్కడికి పోయిందో ఇప్పుడర్థమైంది.

    ధన్యవాదాలు,
    వర్మ

  1829. చెప్పులు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    02/25/2008 10:57 pm

    చెప్పులు, చదువులు, కొన్ని తీపి గుర్తులు

     బళ్ళో చదువుకున్న రోజులు, కాలేజీ రోజులు, బోంబే ఉద్యోగపు రోజులూ గుర్తొచ్చాయి.

     రెండు మూడేళ్ళ కొకసారి మాఊరు, రావినూతల, వెళ్ళినప్పుడల్లా మాహైస్కూలు కెళ్తాను. పాతవిద్యార్థి వచ్చాడని సంతోషంతో మాష్టార్లు పిల్లల్తో బయట సమావేశం ఏర్పాటుచేసి నన్ను ప్రసంగించమంటారు.

    క్రింద కూర్చున్న పిల్లలని చూస్తే నా చిన్నతనం గుర్తొచ్చి, రెండు తేడాలు కొట్టొచ్చినట్లు కనబడతాయి:

     ఒకటి అల్పమయింది: ఇప్పుడు దాదాపు పిల్లలందరూ చెప్పులేసుకొని ఉన్నారు. అప్పట్లో చెప్పులేసుకొని వచ్చేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు.

     రెండోది అతిముఖ్యమయింది: ఇప్పుడ సగంమంది విద్యార్థులు అమ్మాయిలు. అప్పట్లో పైతరగతులకి వెళ్ళే కొలదీ అమ్మాయిలు పలచబడేవాళ్ళు. 

     ఇంజనీరింగ్ కాలేజీలోనయితే కొన్ని సీనియర్ల బ్యాచ్ లలో అసలు అమ్మాయిలే లేరు! రోజులు మారాయి. కట్నకానుకలు, లాంఛనాలలో మాత్రం పెద్దగా మార్పు లేదు.

     దాదాపు పాతికేళ్ళ క్రితం మొదటి ఉద్యోగం కోసం బోంబే వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ మహా నగరంలో జీవితం తలుచుకొని భయమేసింది – అప్పటిదాకా పల్లెటూరునీ హాస్టళ్ళనీ దాటి బయటక ఉండకపోవడాన. పాత కాలేజీమిత్రులుంటారని IIT కెళ్తే కొందరు కొత్త మిత్రులయ్యారు, తర్వాత సహోద్యోగులయ్యారు – హంస, OVG, నరసింహ – ఫిజిక్సు వాళ్ళు, ఎప్పుడూ పగలబడి నవ్వేవాళ్ళు. వాళ్ళ బృందంలో TIFRలో PhD చేస్తున్న లక్ష్మన్న గూడా ఒకరు. TIFR తీసుకెళ్ళేవాళ్ళు. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, బ్రహ్మాండమైన మెస్సు! ఒకవైపు Indian Breakfast మరోవైపు Western Breakfast అని చెప్పేవాళ్ళు – Corn Flakes ని వర్ణించేవాళ్ళు.

     ఇలా రాస్తుంటే, నా కాలేజీ మిత్రుడు, కన్నెగంటి చంద్ర రాసిన ”జ్ఞాపకం చాలు నాకు” గుర్తొస్తోంది:

     ”జ్ఞాపకాలెప్పుడూ ఒంటరిగా రావు,
    ఒకదాన్నొకటి తరుముకుంటూ వస్తాయి సముద్రపు కెరటాల్లా!
     వస్తూనే వుంటాయి పెళ్ళికొచ్చే చుట్టాల్లా, తిరునాళ్ళకు జనాల్లా…
     తీగలాగి డొంకంతా కదుపుతుంది…
    మెదడు గనిని తవ్వితవ్వి జ్ఞాపకాల నిధులన్నీ బయటికి లాగుతుంది!
     … ఎట్లా వచ్చాయో అట్లాగే వెళ్ళిపోయిన జ్ఞాపకాలకు
    వీడ్కోలు పలికిన మనసంతా బెంగపడిపోయి బిక్కుబిక్కుమంటుంది
     నీరంతా వెళ్ళిపోయిన ఏరులా…
    చుట్టాలంతా వెళ్ళిపోయిన పెళ్ళివారిల్లులా…

    జ్ఞాపకాలెప్పుడూ ఒంటరిగా పోవు, నా జీవితం సగాన్ని తీసుకునే పోతాయి!”
    — వాన వెలిసిన సాయంత్రం కవితా సంపుటి.

    ప్రసాద్ గారికి ధన్యవాదాలతో,
    కొడవళ్ళ హనుమంతరావు 

  1830. రంగులు గురించి తెలుగు అభిమాని గారి అభిప్రాయం:

    02/22/2008 9:34 am

    బాగుంది. చక్కటి కవిత్వం.

  1831. నడిమి వయసు యిడుములు గురించి prabhala l k sastry గారి అభిప్రాయం:

    02/21/2008 4:02 am

    హర్షనీయ మాట – సూర్యనారాయణగారు మీరు వ్రాసిన పద్య
    సంకలనం మెచ్చుకో తగ్గది.. మీ రచనా శైలి పూర్వం తెలిసిన వాడిని ,
    అయినా ప్రశంసించడం వ్యక్తిగతంగా తలుస్తున్నాను . మీరు
    ముంబయి నుండి పాశ్చాత్య దేశంలో నలస ఏర్పర్చుకున్న
    తర్వాత ఈ కవిత వెబ్ లో చదివాను . కవికి సృజనాత్మక
    ప్రతిభ అవసరం అనే మాట చెప్పినట్లు మీరు నిజంగా భావుక
    పండితులు .
    ఇట్లు , పి. ఎల్. కె. శాస్త్రి

  1832. నా జ్ఞాపకం గురించి yasasvi గారి అభిప్రాయం:

    02/15/2008 8:15 am

    డియర్ వేలూరి,

    అనుకోకుండా మీ సైట్ లోకి రావటము, కొన్ని రచనలని చదవటము జరిగింది.

    congratulations చెప్తాను ముందు. ఎందుకంటే పత్రిక అన్నది – అదీ ఈ formలో కానివ్వండి – నడపటం కొంచెం కష్టమైన విషయమే గనక. అందునా మీరు “ఉత్తమ సాహిత్యం” తెలుగులొ ప్రచురిస్తామని మీ ధ్యేయం గ చెప్పేసరికి కొంచెం ఆసక్తి గ మీ పత్రిక ని browse చేసాను.

    నన్ను మరీ నిరాశ పరిచింది మీరు అచ్చు వేసిన కవిత్వం. బహుశా మీరు మంచి సాహిత్యాన్ని తెలిసిన వారే అయి వుంతారు. మంచి కవిత్వాన్ని కూడ. మీరు ప్రకటించిన ఉత్తమమైన అనే standard లోకి రాకపొతే పొయే, గాని మరీ నేలబారు గ వుంటే ఎలాగండీ?? పద్మలత అయల సొమయాజుల గారి ది కవిత్వమా? భాష లేదు. భావం లేదు. మిగతా వాళ్ళవి కూడ బొత్తిగా బాగులేవు. జంధ్యాల సినిమా లో “తవిక” అని వెక్కిరించిన స్థాయి లొ వున్నాయి. ఉదయకళ అన్న ఆవిడవి కాస్త మెరుగు.

    మీరు ఒక standard ని ప్రకటించాక అంతకు తగ్గ కుండా వుండక పోయినా అసలు కవిత్వం రాయటం రానివాళ్ళవో… రాయలేని వాళ్ళవో ప్రచురించటం poetry కి ద్రోహం చేయటం కాదా??

    am sorry to say this.. కవిత్వం రాయటం చాత కాని వాళ్ళు .. తమ హద్దులు తెలుసుకుని ఆగిపోవటం మంచిది. తెలుగు కవుల మీద గౌరవం వుంటేనూను, తెలుగు పాఠకుల మీద ప్రేమ కాకపోయిన కనీసం జాలి లాంటిది ఉంటేనూను.

    అనేక నమస్కారాలతో,
    యశస్వి

  1833. తీన్‌ కన్యా గురించి పాఠకురాలు గారి అభిప్రాయం:

    02/08/2008 11:29 am

    వేలూరిగారి గురించి జయప్రభగారు అన్నది కరెక్టే. ఆయన విమర్శల విషయంలోగానీ, మెచ్చుకోళ్ళ విషయంలో గానీ హుందాగా వుంటారు. ప్రతీదానికీ కలగజేసుకోరు. అయితే చిక్కల్లా, అవసరమైన చోట కూడా ఆయన ఏమీ అనరు. సమాధానంచెప్పడం, చెప్పకపోవడం ఆయన హక్కు అనుకోండీ. అది అందరం ఒప్పుకుంటాం. ఇక్కడ హక్కుల గురించి మాట్టాడ్డం లేదు కదా? ప్రతీ విషయంలోనూ మౌనంగా వుండటం వల్ల, ఆయన గంభీరత్వాన్ని (పాఠకుల కామెంట్ల విషయంలో) ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాదు అప్పుడప్పుడు. మొత్తానికి ఆయనంటే గౌరవమే గానీ, వేరే అభిప్రాయం లేదు.

    మొదటగా ఈ కధ పేరు గురించి. “తీస్ కన్య” ఈ కధ పేరు. జయప్రభ గారు కూడా “కన్యల” గురించి తన అభిప్రాయాలు రాశారు. “కన్య”, “కన్యాదానం”, “కన్యాత్వం”, వగైరా లాంటీ మాటలు స్త్రీలకి గౌరవం కలిగించేవేనా? ఇటువంటి మాటలు పురుషులకి లేవు కదా? ఇటువంటి ఎబ్బెట్టు మాటలు స్త్రీల పట్ల వాడటాన్ని, ఫెమిస్టులు సమర్థిస్తారా? పురుషాధిక్యత కలిగిన సమాజం లోంచి కొట్టుకు వచ్చిన ఈ పదజాలాన్ని, స్త్రీలని గౌరవించేవారు అంగీకరించాలా?

    ఇకపోతే, జయప్రభగారు, “పెద్దచదువులు చదుకొని, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, స్వతంత్రభావాలు ఎన్ని ఉన్నా, — గౌరవనీయమైన కుటుంబాలనించి వచ్చిన అమ్మాయిలు, తల్లితండ్రుల మాటలకి, సంప్రదాయానికీ గౌరవం ఇవ్వడం తప్పేమీ కాదు. పైగా, అది వాళ్ళ పరిపక్వతకి నిదర్శనం.” అని రాశారు. ఈ తప్పొప్పులు ఎవరి దృష్టిలో? స్త్రీ,పురుష సమానత్వం గురించి మాట్టాడే వారి దృష్టిలో కూడానా? ఏ కారణం చేత కానీయండీ, ఒక స్త్రీ “కన్యాదానం” చేయించుకుంటే, అది ఎవరికి తప్పు కాకుండా వుంటుందీ? స్త్రీ మెడ ఒంచి, ఒక పురుషుడి చేత పసుపు తాడు కట్టించుకుంటే, అది ఎవరికి తప్పు కాకుండా వుంటుందీ? తమని చూడ్డానికి వచ్చే పెళ్ళికొడుకుల్లో, “కాస్త నాగరీకులైన పెళ్ళికొడుకుల” కోసం చూడ్డం కూడా ఆ స్త్రీలకి గౌరవమైన విషయమేనా? ఇటువంటి పరిస్థితులు పురుషులకి కూడా వుంటాయా? ఈ “పెళ్ళిచూపులు” అనే సాంప్రదాయం ఏ విధంగా స్త్రీ,పురుష సమానత్వాన్ని సమర్థిస్తుందీ, ఫెమినిస్టు సిద్ధాంతం ప్రకారం?

    పెద్దవాళ్ళు చూపించిన సంబంధాన్ని పరిశీలించడం వేరూ, స్త్రీలని అగౌరవపరచే సాంప్రదాయ పద్ధతిలో ఆ సంబంధాన్ని పరిశీలించడం వేరూ. ఒక పురుషుడి ఇంటికి అతని పెద్దవాళ్ళు చూపించిన సంబంధం స్త్రీలు వెళ్ళి, ఆ పురుషుడిని పరిశిలించే పద్ధతి కూడా వుంటే, ఆ విషయం వేరూ. భర్త చేత దెబ్బలు తిన్న ఒక స్త్రీ, దాన్ని అగౌరవంగా తీసుకోనంత మాత్రాన, ఆ విషయం స్త్రీలకి గౌరవం కలిగించేదిగా అయిపోదు. స్త్రీ, పురుష సమానత్వ విషయాల్లో పురుషులే కాదు, స్త్రీలు కూడా చాలా తప్పుగా ప్రవర్తిస్తూ వుంటారు ఎన్నోసార్లు. అంతమాత్రాన ఆ విషయాలన్నీ కరెక్టయి పోవు.

    ఇక్కడో చిన్న సరదా విషయం. జయప్రభగారు ఇలా రాశారు: “అమెరికా నుంచివచ్చినా, కాస్త నాగరీకులయిన పెళ్ళికొడుకులు రావచ్చుగా! “. ఆంటే ఏమిటీ? అమెరికా నుంచి వచ్చే పెళ్ళికొడుకులు సాధారణంగా నాగరీకులు కారనా? కొంతమంది మాత్రం నాగరీకులుగా వుండొచ్చనా? సరదాగా వుంది, అమెరికా పెళ్ళికొడుకులకిచ్చిన చురక!

    ఒక స్త్రీకి తన కిష్టమయిన పద్ధతిలో వుండే హక్కు ఎప్పుడూ వుండాలి, ఒక పురుషుడికి వున్నట్టే. దాన్ని ఎవరూ వ్యతిరేకించకూడదు. ఈ హక్కు ప్రకారం, ఆ స్త్రీ ఇష్టమైతే సాంప్రదాయ పెళ్ళిచూపులకీ, సాంప్రదాయ పెళ్ళిళ్ళకీ ఇష్టపడొచ్చు. అది ఆ స్త్రీ వ్యక్త్రిగత విషయం అవుతుంది. అది ఆ స్త్రీ స్వేచ్చకి సంబంధించిన విషయం అవుతుంది. కానీ ఈ విషయాన్ని పబ్లిక్ లోకి తీసుకువచ్చి, అది స్త్రీలని అగౌరవ పరిచే విషయం కాదూ అని వాదిస్తే, దానికి సమాధానం చెప్పడానికి స్త్రీలే కాదు, పురుషులు కూడా ముందుకు రావొచ్చు. ఎటొచ్చీ వారు స్త్రీ,పురుష సమానత్వం గురించి సరిగా అర్థం చేసుకోవాలంతే!
    బీ. యే. డిగ్రీ గురించి నేనడిగింది ఒక చిన్న ప్రశ్న మాత్రమే. అది విమర్శ కాదు. “అయినా ఇదో పెద్ద విషయం కాదు లెండి” అని కూడా అన్నాను. అమెరికాలో బీ. యే. డిగ్రీ ఇస్తారనే అన్నాను. అవేమీ పట్టించుకోకుండా, జయప్రభగారు, నేనేదో విమర్శ చేశానని, ఈ విషయంలో చాలా ముచ్చటగా విడ్డూరపడ్డారు. ఒక చిన్న టెక్నికాలిటీకి సంబంధించిన విషయంలో చర్చ అనవసరం.
    ఒక కవిత చదివి, దాని భావం ఇదీ అని తలో పాఠకుడూ తలో విధంగా అనుకునే రోజులు ఇవి. తమకి అర్థమైనన భావం వేరే వారికి అర్థం కాకపోతే, ఆ వేరేవారు తక్కువ స్థాయికి చెందినవారు అని అనుకునే రోజులు ఇవి. అలాంటి రోజులు కధకి కూడా వచ్చినట్టున్నాయి. అందుకే ఈ మధ్య కధలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థం అవుతున్నాయి. అందుకే ప్రతీవారూ కధ చదివి, రచయిత వుద్దేశ్యం ఇదీ అని తమ భావనల్ని చెప్పుకుంటున్నారు. ఆ విషయాలు కధలోంచే స్పష్టంగా బయటికి వస్తే ఎంతో బాగుంటుందని నా భావన మరి.
    ఈ కధ నెగిటివ్ అని నేనెప్పుడూ అనలేదు. ఇందులో కొన్ని విషయాలు మాత్రమే నెగెటివ్ గా వున్నాయన్నాను. కధ స్పష్టంగా లేదు అని కూడా అన్నాను. మరి అది నా “భావన” కదా?
    చదువుకుని, మంచి మంచి ఉద్యోగాల్లో వున్న అమ్మాయిలు చాలా స్వతంత్రంగా వుంటూ, “పెళ్ళిచూపులకి” దిగడంలో వారికి అగౌరవం ఏమీ లేదన్నట్టేగా? పురుషులు మాత్రమే స్త్రీల ఇళ్ళకి వెళ్ళి చూడ్డం, గట్రా లాంటీ పద్ధతులున్న పెళ్ళిచూపుల గురించి మాట్టాడుతున్నాను ఇక్కడ. నచ్చని వాళ్ళని తిరస్కరించే పని చాలా మంచి ఉద్యోగాల్లో లేనివాళ్ళూ, గొప్పగా చదువుకోని వాళ్ళూ కూడా చేసే రోజులివి. డాక్టరేట్ డిగ్రీ వుంటేనేగానీ, నచ్చని వాళ్ళని తిరస్కరించకూడదూ అని ఎవరూ అనడం లేదు. అంటే నచ్చని వాళ్ళని తిరస్కరించడానికి పెద్ద చదువులూ, మంచి వుద్యోగాలూ అక్కరలేదనేగా అర్థం? చిన్న మనసు వుంటే చాలు.

    మొత్తానికి ఈ కధ చాలా విషయాల్లో నాకు అసంతృప్తినే కలగజేసింది. అభ్యుదయ రచయిత/త్రులు ఇలాంటి కధలు రాసినప్పుడు మాత్రమే ఇలా అనిపిస్తుంది. నా భావాలు ఎవరినైనా నొప్పిస్తే, మన్నించండి.

    – పాఠకురాలు

  1834. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/12/2008 9:35 pm

    వైజ్ఞానిక వ్యాసాల కథా కమామీషు

    రాజాశంకర్ గారూ, శ్రీనివాస్ గారూ,

    మీ ప్రోత్సాహనికి కృతజ్ఞతలు. మీరిచ్చిన కొన్ని సలహాలు పాటిస్తాను. మీరు వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలతో విభేదిస్తాను.

    ఎందుకు రాయాలనిపించలేదో తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నానో వివరించి digress అయ్యానన్నారు రాజాశంకర్ గారు. “నరావతారం” కి పరిచయం రాస్తూ నార్ల విష్ణావతారాలవి రాసేవాళ్ళ మీద ఎందుకు విసుర్లు వెయ్యడం? పండిత పురస్కారం గురించి ప్రకటన చేస్తూ తమ్మినేని కవుల మీద ఎందుకు చురక వెయ్యడం? వాళ్ళ వాళ్ళ దృక్పధాన్ని బట్టి తమకి ముఖ్యమైన వాటి గురించి ప్రస్తావించారు. నేను మన భాషలో సైన్సుగా చలామణి అవుతున్న వాటిని చూసి కొంత “కడుపు మండి” నాలుగు మాటలు రాశాను. రాస్తున్నది పాపులర్ సైన్సు గురించి కాబట్టి అవి అసందర్భం కాదు. నిజానికి నాదృష్టిలో చాలా అవసరం. అలాగే ప్రేరణ కలిగించిన వాటిని ప్రస్తావించడం కూడా మామూలే.

    కాని అందు మూలంగా అసలు విషయానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, అది తప్పే. ముందు ముందు ఎలాగూ లోతుగా వివరిస్తాను కనుక, అది సరిదిద్దుకునే అవకాశం వుంది.

    నేను రాయాలనుకున్నదంతా ఒకే వ్యాసంలో వివరించడం సాధ్యం కాదు. ఖగోళ శాస్త్రం మీదా, కాలెండర్ మీదా మనకి వ్యాసాలు పరంపర గానే వచ్చాయి. అవి వచ్చింది వారపత్రికల్లో కాబట్టి గత వారం విషయం గుర్తుండటం సులభం కావొచ్చు. ఈమాట, రెండు నెలలకోసారయినా, ఇంటర్నెట్ పుణ్యమా అని పాత సంచిక పక్కనే ఉండటాన పాఠకులు దారితప్పరనే నా ఆశ. కాని శ్రీనివాస్ గారన్నట్లు, ప్రతి వ్యాసమూ సాధ్యమైనంతవరకు సమగ్రంగానూ సమైక్యంగానూ ఉండాలి. మొదటి వ్యాసం కాస్త కలగాపులగంగా వున్న మాట నిజమే. ఈ విషయంలో నేను జాగ్రత్తపడాలి.

    ఇకపోతే ఈ వ్యాసాల్లో దొర్లే కవితల వలన ఉపయోగమేమిటి? పాఠకుల ఏకాగ్రతకు భంగం కావా? అన్నదానికి నా సమాధానం: కొడవటిగంటి కుటుంబరావు, “తెలుగులో ఏదన్నా వైజ్ఞానిక రచన, కథలాగా చక్కగా హృద్యంగా, ఆపబుద్ధి పుట్టకుండా రచించినది కంటపడితే పర్వం లాగుంటుంది,” అన్నాడు.

    కాని పాత్రలు, సంభాషణలు, ప్రకృతి వర్ణనలూ లేకుండా కథలా హృద్యంగా నడిపించడం ఎలాగ? అందుకు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తారు – కవిత, జీవిత చరిత్ర, పురాణ కథ, నవ్వుతెప్పించే సంఘటన, ఇలా ఏది చాతనయితే అది.

    “విశ్వరూపం,” తెలుగు వైజ్ఞానిక సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడుతుందన్నాడు కొడవటిగంటి. నా ఉద్దేశంలో మైలురాయే కాదు, ఉత్తమ రచనకి గీటురాయి కూడాను. దాంట్లో, నండూరి, “సాధారణభాషలో సాపేక్షసిద్ధాంతం,” అధ్యాయాన్ని చార్లెస్ లాంబ్ పలుకులతో మొదలెట్టి, మధ్యలో కీట్సు ప్రేమగీతాన్నొకదాన్ని ఉటంకించి, షెల్లీ పద్యాన్ని పఠాభి తెనిగింపుతో సహా ఇచ్చి, పోతన భాగవతాన్నెలా మొదలెట్టాడో వివరించాడు! వాటికితోడు బాపూ కార్టూన్లు!

    సాపేక్ష సిద్ధాంతం వివరించడానికి ఇవన్నీ అవసరమా అంటే, బహుశా కాదేమో! కాని అవన్నీ ఉంటే గాని హృద్యంగా ఉండదనీ, అవి వ్యాసాన్ని మళ్ళీ మళ్ళి చదివించేలా చేస్తాయనీ రచయిత ఉద్దేశం.

    దీంట్లో ఏకాభిప్రాయం ఉండాలని లేదు. Feynman ఉపన్యాసాల్లో కవిత్వం ఎక్కడా కనిపించదు. కవిత్వం లేకుండా Brownowski ఉపన్యాసం ఉండదు. నాకు Brownowski అంటే చాలా ఇష్టం. మన ఇష్టాఇష్టాలు మన రచనల్లో వ్యక్తం అవతాయి.

    చాలా మంది పేర్లని వాడాను. వారి ప్రజ్ఞా పాటవాలు నాకున్నాయనే అపోహ నాకేమాత్రమూ లేదు. వాస్తవం చెప్పాలంటే, పులిని చూచి నక్క వాతబెట్టుకున్న ట్లవుతుందేమోనన్న భయం కొంత వుంది. కాని, చుక్కలదాకా నిచ్చెనేస్తే చూరు దాకానన్నా చేరతాం, అన్నది మన సూక్తి.

    కొడవళ్ళ హనుమంతరావు

  1835. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    01/09/2008 2:07 pm

    సాంకేతికపరమైన విషయాన్ని సరళంగా తెలుగులో అందించే మీ ప్రయత్నాన్నికి హృదయపూర్వక అభినందనలు.

    కొన్ని తోచిన స్నేహపరమైన సూచనలు.
    1. విషయ వివరణకు అంతగా సాయపడని Blake కవితా పంక్తులు, వాటి అనువాద వాక్యాలు మొదలైనవి, పాఠకుని అర్థగ్రహణకు అడ్డుపడకపోయినా, ఉపయోగపడకపోవచ్చు. అసలు విషయమే అంత సులభమైనది కాదు కాబట్టి, ఇటువంటి ఏ చిన్న distraction అయినా ఉండకపోవడం పాఠకుని ఏకాగ్రతకు అవసరమేమో ఆలోచించగలరు.
    2. వీలైనంతవరకు మీ ఆలోచనా సరళిని ఒకే వ్యాసంలో ఒక కొలిక్కి వచ్చేలా పూర్తిచేయండి. కథ లేదా నవల సీరియల్్ కు, ఇటువంటి సాంకేతిక రచనలకు ఇదే ఒక పెద్ద తేడా, చిక్కు కూడానేమో! కథలు నవలలు గుర్తుంటాయి, లేకపోయినా ఇప్పటిదాక జరిగింది ఇది అని టూకీగా చెప్పి సాగవచ్చు.ఇక్కడ అట్లా కాదు. అట్లా చేయడం అంత సుళువు కూడా కాదు. మధ్యలో పాఠకుడు దారి తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు.

    సూచనలు సహృదయంతో చేసినవని, విమర్శ కాదని మరో సారి మనవి.
    విధేయుడు
    Srinivas

  1836. నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో చిక్కులో పడిన పల్లెపడుచులు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/06/2008 3:18 pm

    ఆముక్తమాల్యదతో నా అగచాట్లు

    ఆముక్తమాల్యదతో నాకున్న అష్టకష్టాలు ఇవాళ్టివి కాదు. పెద్దలు దీన్ని ప్రౌఢ కావ్యం అన్నారు. మామూలు కావ్యాలని అర్థం చేసుకునే స్తోమతే నాకు లేకపోతే ప్రౌఢ కావ్యాల జోలికెళ్ళే ధైర్యం ఎక్కడుంది? అయినా సాహసం చేసి ఎప్పుడో ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో కొన్ని పేజీలు చదివాను. రాయలు James Joyce కోవలో వారన్నారాయన. నా గుండెలో పెద్ద రాయి పడింది.

    కాలేజీ రోజుల్లో బుచ్చిబాబు రాసిన “చైతన్యస్రవంతి” చదివి, ఎప్పటికయినా Ulysses చదవాలని నిశ్చయించుకున్నా. నాలుగు రాళ్ళు సంపాదించే స్థికి రావడంతోటే మద్రాసులో మూర్ మార్కెట్ కెళ్ళి Ulysses కొన్నా. పది పేజీలు గూడా చదవలేకపోయా! ఇప్పటికీ ఇండియాలో ఓ స్నేహితుడింట్లో పెట్లో భద్రంగా ఉందది.

    కె. వి. యస్. రామారావు గారి సులభ అనువాదం చదివా. అది మొదటిమెట్టుగా ఉపయోగపడి స్వయంగా చదువుకోడానికి ప్రోత్సాహమిస్తుందని భావించారాయన. అయినా నేను కనీసం రెండో మెట్టుకి కూడా చేరుకోలేకపోయాను. లోపం నాదే కాని వేదం గారి సంజీవనీ వ్యాఖ్య దొరకలేదనే వంకతో సరిపెట్టుకున్నా.

    తర్వాత, మెచ్చుకోదగ్గ విస్తృత చదువరి పరుచూరి శ్రీనివాస్ పెట్టిన ‘వాత’ చదివి, కనీసం వావిళ్ళ వారి టీకా తాత్పర్యాలతో నన్నా ఓ మెట్టు ఎక్కగలనేమో అని ఆశ పడ్డా. ఊహు, కదలదే!

    ఇప్పుడీ పద్యం చదివాను. వెంటనే అనిపించిందేమిటంటే, “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్న రాయలు వారు రాసిన తెలుగు నాకెందుకందుబాటులో లేదా అనే విచారం! చిన్నగా చీమలమర్రి గారి వివరణ చదివాను. ఓహో అనుకున్నా. కాని “జలరుహనాభగేహ రురుశాబము” లో జింక దాక్కొని ఉందంటే నమ్మశక్యం కాలా!

    ఈ కష్టాల్లో నాకింకో పద్యం కనిపించింది. ఇది నాఅష్టకష్టాలకీ ప్రతిఫలం అనిపించింది. వానాకాలంలో ఆడవాళ్ళు పడే అగచాట్లని వర్ణించేది:

    ఇల్లిల్లు దిరుగ నొక్కిం తబ్బు శిఖి, యబ్బెనే నింటిలో బూరి యిడి విసరక
    రాజదు, రాజిన రవులుకొల్పాసలెగాని కల్గదు గూడు దాన, గలిగె
    నేని కూరగుట మందైన బెన్పొగ సుఖ భుక్తి సేకూర, దాభుక్తి యిడిన
    బ్రాగ్భోక్తలకె తీరు బహుజనాన్నము, దీర నారుల కొదవు పునఃప్రయత్న
    మాజ్యపటముఖ్యలయ మెన్న, రాలయాంగ
    దారులయమెన్న, రంతిక కారజనిక
    పచన నాంధోగృహిణి రామి బడక మరుడు
    వెడవెడనె యార్వ నొగిలి రజ్జడిని గృహులు.

    ఆముసుర్లో ఇంటింటికీ తిరిగితే కాస్త నిప్పు దొరుకుతుంది. దొరికినా, ఇంట్లోని ఎండుగడ్డి పెడితేగాని రాజుకోదు. రాజుకున్నా, రగులుకోవాలనే ఆశే కాని రగుల్కోదు. రగుల్కొన్నా అన్నం ఉడకదు. అన్నమయినా కూర గాదు. అయినా, ఇల్లంతా పొగతో నిండి, సుఖ భోజనం కాదు. తిన్నా, ఇంట్లో అందరికీ వండిన అన్నం, మొదటి బంతి వాళ్ళకే సరిఫోతుంది. ఆడవాళ్ళు మళ్ళీ వంటకి తయారు. అప్పుడు నేతిలో తడిపిన కోకలూ, ఇంట్లోని వాసాలూ గూడా పొయ్యిలో వెయ్యడానికి వెనుకాడరు. రాత్రంతా వండుతూ, అన్నం లేని గృహిణి, ఎంతకీ పక్కలోకి రానందుకు ఇంటాయన చిందులేస్తాడు!

    ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే, ఇదెప్పుడో రాయల కాలంనాటి ఆడవాళ్ళ అగచాట్లు కాదు; నా చిన్నతనంలో మా ఇంట్లో, రావినూతలలో ప్రతి ఇంట్లో, వానాకాలంలో జరిగే తంతు కవితాత్మకంగా చెప్పాడు కనుక.

    చివరికే మనిపించిందంటే, రాయల్ని అర్థం చేసుకోవాలంటే నాలాటి సగటు పాఠకుడికీ అగచాట్లు తప్పవు. కాని పడితే, కె.వి.యస్., పరుచూరి, చీమలమర్రి, ఆరుద్ర, వావిళ్ళ వగైరాల సాయం వుంటే, కొన్ని రత్నాలు దొరక్కపోవు!

    కృతజ్ఞతలతో,
    కొడవళ్ళ హనుమంతరావు

  1837. నా జ్ఞాపకం గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    01/03/2008 9:00 pm

    చాలా బావుందండీ.. మీ పాత కవితలు కూడా చదివాను.మంచి పదచిత్రాలు ఉన్నాయి. keep writing!

  1838. రంగులు గురించి కృష్ణ గారి అభిప్రాయం:

    01/03/2008 3:08 pm

    బాగుంది. ఇదీ కవిత్వమంటే. కొత్త ఆవకాయ ఘుమఘుమలు బాగున్నాయి. ఇంత తక్కువే పెట్టారే? నిజంగా కొత్తదనమున్న కవిత.

  1839. ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి వెంకట్ గారి అభిప్రాయం:

    01/03/2008 7:32 am

    మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇప్పుడు యువతరంగం తెలుగు చదవడం రాదు అని చెప్పుకోవడం గొప్ప ఫ్యాషనయ్యింది. మొన్నొకాయన తెలుగులో వెబ్సైట్ స్థాపిస్తూ సలహా కోసం అతనికి తెలిసిన ఒక ఎంబిఏ కుర్రాడినడిగాడు. “మీరు సినిమాల గురించి రాయండి చాలా మంది వస్తారు. ఇలా సాహిత్యం, కవిత్వం అంటే మీకు నలభై ఏళ్ళకు మించిన వాళ్ళే గతి” అన్నాడు. అది ఒక విధంగా నిజమే. ఆ పరిస్థితి ఇక మారదు కూడా అని నా అభిప్రాయం. కానీ చూస్తూ వదిలేయకుండా ఓపికున్న వాళ్ళు తమ వంతు ప్రయత్నం చేస్తూనే వుండాలి.

  1840. నా జ్ఞాపకం గురించి teresa గారి అభిప్రాయం:

    01/01/2008 7:00 pm

    మొదట చదవగానే ఈ కవిత కొంత disconnected గా అన్పించింది గానీ నాలుగు సార్లు ఓపిగ్గా చదివితే మంచి భావం కనబడింది!

  1841. వసంతభామిని గురించి lakshmikant గారి అభిప్రాయం:

    11/28/2007 5:26 am

    ఝాన్సీ లక్ష్మి గారు,

    కవిత్వం అమోఘంగా వుందంది. చక్కటి తెలుగు. మీలాంటి రచయితలు వున్నంతవరకు తెలుగు భాషకు డోఖా లేదు.

  1842. బైపోలార్ భూతం గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    11/09/2007 12:16 pm

    బైపోలార్ రుగ్మత తో బాధింపబడే వారి మానసిక స్థితిని,పరస్పర విరుద్ధమైన,విపరీతమైన, భావసంచలనం తో మస్తిష్కంలో ఏర్పడే సంక్షోభవాతావరణాన్ని, ఈ Malady ముందు బాధితుని నిస్సహాయతని కవిత చివరి పది,పన్నెండు పంక్తులలో effective గా చిత్రీకరించారు.
    అభినందనలు.

  1843. అరణ్య కవితలు గురించి రానారె గారి అభిప్రాయం:

    10/23/2007 9:04 am

    ఆధునిక తెలుగు కవిత్వం మీద రసవత్తరమైన చర్చ జరుగుతోందని తెలిసి ఇలా వచ్చాను. కవితను ఠపీమని చదివేశాను. అభిప్రాయాలుగా మొదలైన వాదప్రతివాదాలనబడే చర్చను కూడా చదివాక నా అభిప్రాయాన్ని చెబితే దానికున్న విలువేపాటిదనే ప్రశ్నలొస్తాయేమోనని, అందుకు సాహసించలేకపోయినా ఒక్కటిమాత్రం చెప్పాలనిపిస్తోంది. సరదా సుబ్బారావుగారి పేరడీ దాని మూలంకన్నా నాకెంతో నచ్చింది. మూలంలో భావుకతను తెలిసినవైరికీ వెతికేవారందరికీ కూడా పేరడీలోనూ అంతే భావుకత కనిపించే వుంటుందని నా అంచనా. మూలం మీద ఆధారపడినదైనా పేరడీలో వున్న కొన్ని విలువలు నాలాంటి పామరుణ్ణికూడా రంజింపజేస్తాయి. అందుకే సరదా సుబ్బారావు జిందాబాద్!! చర్చ రచ్చగా మారేటప్పుడు C.S.Rao గారి ప్రవేశం అక్కడ ఆయన చెప్పిన సంగతులు ఏ చర్చలో పాల్గొనేవారైనా సరే ఒకసారి చదివి గుర్తుంచుకోదగినవనిపించాయి. జై తెలుగు తల్లి!

  1844. సందుక గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    10/15/2007 3:11 pm

    స్వగతంగా సాగిన “సందుక” కవిత లో తెలంగాణా మాండలిక భాష వ్యక్తీకరణ మాధ్యమంగా ఎన్నుకోబడిందని మొదటి కొద్ది పంక్తులలోనే అర్ధమవుతుంది.అంచేత స్వగతం గా సాగిన కవిత మొత్తం ఆ మాండలిక భాషా పదజాలంతోనే సాగుతుందని ఆశించటం అసమంజసం కాదనుకుంటాను.
    అసలు ఈ కవిత ప్రత్యేకమైన సొగసు ఆ పదజాల ప్రయోగం లోనే ఉంటుంది కూడాను. ఈ కవిత ఎంత కవితా శక్తిని సంతరించుకున్నదనే విషయం నా ఈ అభిప్రాయం లో సమీక్షాంశం కాదు.కాకపోతే చాలా తక్కువ శాతం తెలంగాణా మాండలిక పదాలను మాత్రమే ఈ కవిత లో వాడటం చూసి నిరుత్సాహ పడ్డాను.

    “అర్ర” లో మాండలిక భాష పదాల్ని వాడినంతగా కూడా ఈ కవితలో (సందుక) వాడలేదు.రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారైనా బాగా చదువుకున్నవారు వ్రాసే సంపాదకీయాల వ్యావహారిక భాషే ఈ కవితలో అధికాధికం గా వాడబడటం కనబడుతుంది. ఆ మేరకు ఈ కవితలోని సౌందర్యాన్ని ,ఔచితిని అది బలహీన పరుస్తుంది.
    ఈ క్రింది పంక్తులలో తెలంగాణా మాండలిక భాషా పద ప్రయోగం లేకపోవటం
    గమనించండి.

    ” ముదురు రంగులోకి
    జీర్ణమవుతున్న
    అట్టలు లేని పుస్తకాలు…”

    “ఊపిరి పోసిన
    ఒక్కో వాక్యం క్రింద
    అరిగిన పెన్సిల్ తో…”

    “తెరలు తెరలుగా
    బాగా పరిచయమున్న
    ఒక కొత్త సువాసన
    చుట్టుముడుతుంది”

    “చెంపకానించుకున్నపుడు
    వెచ్చని వాగు నీటి కింది
    గరుకైన ఇసుక
    మెత్తదనం ఆపేక్షగా తగులుతుంది”

    “(ఎట్లా పారేసుకుంటాం)
    మన తొలి యవ్వనాల
    రంగురంగుల
    ఉద్రేకాల్ని?”

    మరొక విషయం.పైన ఉదహరించిన మూడవ స్టాంజా లో “బాగా పరిచయమున్న”దంటూనే ,మరలా దాని”నొక కొత్త సువాసన “ననడం లో వైరుధ్యం లేదూ?
    C.S.Rao

  1845. అరణ్య కవితలు గురించి rudra గారి అభిప్రాయం:

    10/02/2007 10:34 pm

    నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి పంక్తి భోజనం చేసినట్టుంది నా తెలుగు సోదరులతో……కవిత రాసిన వారికి విమర్శ చేసిన వారికి, నా వందనాలు. చూస్తుంటే అందరూ కవనంలో బాగా పండిన కవుల్లాగున్నారు
    మీరందరూ ఇలాగే తెలుగును ఆ భాషయొక్క తీయదనాన్ని అందరికీ పంచుతారనే భావిస్తాను….(కులాల ప్రసక్తి తేకుండా…..)

  1846. వాన-పాట గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    10/02/2007 5:55 am

    అలోక్ గారూ,
    అసలు “వాన-పాట” కు సంబంధించి కవి లో గాని,కవితలో గానీ అస్పష్టత (ambiguity) ఉన్నదని నేను అనలేదు కదా!
    ఒక వేళ ఒకానొక కవితలో అస్పష్టత ఉంటే, దాని లో అస్పష్టత ఉన్నదని అనవచ్చును. కానీ, దాని నాధారం చేసికొని,ఆ కవి యొక్క, దాదాపు అన్ని కవితలనీ సాధ్యమైనంత సమగ్రంగా అధ్యయనం చేయకుండా ఆ కవి లో
    అస్పష్టత ఉన్నదనటం Rash and Irresponsible Comment అవుతుంది.

    “వాన -పాట” కవిత చాలా స్పష్టం గా ఉంది. సందేహం లేదు. పైన నా అభిప్రాయం లో చెప్పినది దీనిలోని అననుసంధానుభూతి,రసవైరుధ్యం గురించి. అవి Contradictions క్రిందికి వస్తవి. వాటిని గురించి చెప్పవలసింది నా అభిప్రాయం లో చెప్పాను కాబట్టి ,మరలా చెప్పటం చర్విత చర్వణం అవుతుంది.

    ఇంతకుముందు నేను వ్రాసిన అభిప్రాయం కేవలం ఈ కవితకు మాత్రమే పరిమితమైనది. కవికి కాదు.

    C.S.Rao

  1847. అరణ్య కవితలు గురించి Sivasankar గారి అభిప్రాయం:

    09/26/2007 1:12 am

    ఒక్కో మనిషి ఒక్కో రకముగా ఆలోచిస్తారు, వాళ్ళ వాళ్ళ పరిస్తితులను బట్టి వాళ్ళ మనసు స్పందిస్తూ ఉంటుంది.
    ప్రపంచము లొ దేనికీ ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు గాని కొలతలు గాని లేవు,యేదీ తప్పు కాదు యేదీ ఒప్పు కాదు.
    అలాగే కవిత్వం కూడాను, మనస్సు లోని భావాలకు అక్షరాలు జత కూర్చి చెప్పినదే కవిత్వం.
    సుబ్బు గారి కవిత్వం చాలా బాగుంది.

  1848. వాన-పాట గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    09/25/2007 8:29 pm

    వానా, పాటా రెండూ ఆనందాన్నిచ్చేవే! అప్పుడప్పుడూ రెండూ బాధపెట్టేవే కూడానూ. అలాటి వాన గురించి, పాట గురించి, వానలాంటి పాట గురించీ చెప్పే కవిత…ఎంత బావుంది!
    ఒక్క వానగురించో, లేదా పాట గురించో మాత్రమే కవిత రాస్తే, అందులో ఎన్ని అందమైన, కొత్తవైన పదచిత్రాలున్నా, అది ఒక స్థాయిలో ఆగిపోతుంది. ఈ రెంటినీ పెనవేసి చెప్పడం ఒక గొప్ప కవితకి ఉండే లోతును కలిగించింది.
    వాన ఒక ప్రాకృతిక సంఘటన. పాట, మనిషి లోంచి పుట్టుకొచేది. కాబట్టి అవి కలిగించే అనుభూతిలో కొంత తేడా ఉంటుంది. పాట కలిగించే అనుభూతి మరి కొంత గాఢమైనదీ, మరికొంత ఎక్కువ కాలం నిలిచేదీనూ. అదే ఈ కవితలో మనకి కనిపించేది. ఇది మనసుకి హత్తుకోవాలంటే, కేవలం పాటని వానతో పోల్చే symbolism సరిపోదు. వానని వర్ణించి పాటగురించి కూడా ఇలాగే ఊహించుకోమని పాఠకులకి వదిలేస్తే, ఆ అనుభూతిలోని తారతమ్యం పాఠకులకి అందదు. అందికే ఈ కవిత “నీ పాట కూడా అంతే.” అన్న వాక్యంతో ఆగిపోదు. వానగా మొదలై పాటగా మిగిలిపోతుంది.
    ఇక శిల్పదృష్టితో చూస్తే:
    మొదటి చరణం ప్రాతిపదిక.
    రెండవ చరణంలో ప్రధానంగా కనిపించేది వాన. వాన ద్వారా పాట గురించిన ఊహ.
    మూడవ చరణంలో వాన-పాట సమాంతరంగా అవి కలిగించే అనుభూతుల చిత్రణ-సాదృశ్యం.
    నాల్గవ చరణంలో చివరకి మిగిలిపోయేది పాట.
    వానా, పాటా రెండు చిత్రాలైతే. మొదట వాన మీద focus చేసిన లైటు, క్రమేపీ, పాటమీదకి మారడం ఈ కవితలో శిల్పం సాధించిన విశేషం.
    కవిత నిజానికి ఆ పాట గురించే!

  1849. వాన-పాట గురించి Alok గారి అభిప్రాయం:

    09/24/2007 1:34 am

    మొదటగా సి.ఎస్.రావు గారికి
    రావుగారూ, కవిలోను, కవితలోనూ అస్పష్టత లేదు గనక రవిశంకర్ గారి కవితలో రసవైరుధ్యము, అననుసంధానభూతులు లేవు. మీరు లోపాలుగా చెప్పిన వాటినే తీసుకొందాం. మొదటి స్టాంజాలో కురుస్తున్న వాన తనలో యే భావాన్ని రేపిందో చెప్పడం జరిగింది. రెండవ స్టాంజా మొదటి మూడు లైన్లు వాన గురించిన వర్ణన. మిగతా లైన్లలో మళ్ళీ వాన పై కవి భావం. ఈ రెండో భావం మొదటి భావంతో పోలివుండడం వల్ల రసవైరుధ్యమేవీ లేదు.చెట్ల ఆకులు వానా నీళ్ళని ఆనందంతో పట్టుకోడమన్న భావం కవిలోని దు:ఖాన్ని ఎత్తి చూపించేది.

    ఇహ జ్ఞాపకాల గురించి మీరిచ్చిన లోతైన వివరణ పెద్దగా వుపయోగపడేది గాదు.

    కొత్తపాళీ గారికి

    పునరుక్తి వేరు.విస్తరణ వేరు.ఈ విషయం మీకు తెలిసేవుంటుంది.చెప్పిందె చెప్పడం పునరుక్తి. వుదాహరణకి ప్రజాకళ కొత్త సంచికలోని శివారెడ్డిగారి కవిత.
    http://prajakala.org/mag/2007/09/sivareddy_poem2#more-436

    ఇక్కడ వున్నది విస్తరణ.చెప్పాల్సిన దానికంటే ఎక్కవగా చెప్పడం.

    1) అందంగా,
    స్వచ్చంగా,
    అప్రయత్నంగా కురుస్తుంది వాన

    2) జలజలమంటూ కురిసే వాన

    3) వెలిసిన వాన

    వాన వచ్చింది, కురిసింది, వెళ్ళిపోయింది అన్న గొలుసును కవి అనుసరించినట్టు తెలుస్తోంది. ఆ గొలుసును పేనడానికి గతాన్ని, జ్ఞాపకాల్ని, తన అనుభూతుల్ని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కవి చెప్పదల్చుకొన్న అసలు విషయమేమంటే వానని చూడగానే పాత పాట సలుపుతున్న గాయం గురించి. ఆ విషయం “నీపాట కూడా అంతే” అన్న చోటనే ఆగిపోతుంది. మిగిలిన రెండు స్తాంజాలు నే ఇందాక చెప్పిన గొలుసును కొనసాగించే ప్రయత్నమే.

  1850. అరణ్య కవితలు గురించి Viswa K గారి అభిప్రాయం:

    09/19/2007 9:19 pm

    చాలా సరళంగా, సూటిగా ఉన్న కవిత ఇది.
    అసలు ఇక్కడ అభిప్రాయాలు వ్రాసే వారికి, ఇతరుల అభిప్రాయం చదవటం, చదివినా అర్ధం చేసుకోవటం చేతనౌనా?
    ముందుగా అలోక్ వాస్తవ్ వ్రాసిన మొదటి అభిప్రాయంలో అసభ్యకరమైనదేదీ నాకైతే కనిపించటంలేదు. ఒకే విషయాన్ని ఒకటికి పదిసార్లు చెప్పి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలే ప్రస్ఫుటంగా అవగతమౌతున్నాయి.
    అలాగే కృష్ణగారు చెప్పిందేమిటి? ఇక్కడ అర్ధం చేసుకుంటున్నదేమిటి? ఒక వాక్యానికి ఖండన ముండన సత్కారాలు చేసినంతమాత్రాన కవిత ఎలా అవుతుందని ఆయన ప్రశ్న. అంతేకాదు, ఆ సత్కారాల వలన భాషే చచ్చిపోతున్నదని ఆయన అభిప్రాయం.

    ఆ ఘనసత్కారాలన్నీ విన్నకోటవారి వానపాటలోనూ కనిపిస్తున్నాయి కదా, మరి అది ఏవిధంగా కవిత అయ్యిందనేది కూడా చర్చించాలి. అలోక్ వాస్తవ్ చెప్పినట్లు, వానపాటలో అతివిస్తరణ దోషం ఉన్నదనేది నిస్సందేహం.

    ప్రస్తుత కవితలోని సూటిదనం, సరళత్వం కృష్ణగారి దృష్టిలో కొద్దిగా మితిమీరి పేలవంగా కనిపించి ఉండవచ్చు. అంతమాత్రాన అది కవితే కాదనటం ఔచిత్యాన్ని మించి చేసిన విమర్శనా ప్రయత్నం.

  1851. అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    09/19/2007 5:10 am

    గుడి గంటలు
    మౌనంలోకి జారుకుంటాయి
    చంద్ర కిరణాలు
    కోనేటిని చేరుకుంటాయి

    చిరుగాలి సైతం అలసిపోతుంది
    ఆకుల శబ్దం ఆగిపోతుంది
    వెన్నెలని నిండా కప్పుకుని
    గన్నేరు చెట్టు నిద్రపోతుంది

    గాయాలన్నీ మానిపోతాయి
    సమస్యలన్నీ సమసిపోతాయి
    నక్షత్రాల్లా మెరిసిపోతూ
    అక్షరాలొక్కటే మిగిలిపోతాయి!

    అరణ్య కవితల్ని తెగిడినవాళ్ళకీ, పొగిడినవాళ్ళకీ, పేరడీలు రాసినవాళ్ళకీ అందరికీ కృతజ్ఞతలు.ఇక ఈ చర్చని, వాదనల్ని ఇంతటితో ఆపేస్తే బావుంటుందని నా అభిప్రాయం. లేదు ఇంకా లాగీ, పీకుతామంటే మీ ఇష్టం.

  1852. అరణ్య కవితలు గురించి Alok గారి అభిప్రాయం:

    09/19/2007 4:04 am

    అయ్యా తిమ్మిరెడ్డిగారు…అసలు విషయాని మీరిట్టా బమ్మిని చెయ్యడం సమయోచితంగాలేదు. మీలెక్కన రారా, చేరా వగైరాల్ని తోసవతల పారేద్దాం. ప్రతి దద్దమ్మనీ కవిత్వం గురించి రాసేయమనేద్దాం. కత్తెర పట్టుకొన్నాడుగదాని దర్జీని కూడా ఆపరేషను ధియేటర్లోకి వొదిలేద్దాం.

    పాఠకుడిగా విఫలమైన క్రిష్న గారు విమర్శకుడిగా అవతరించడంతోనే సిసలైన అసంబద్ధత బయలుదేరింది. సదరు అసంబద్ధత మాబాదిగ గారితో పరుగులెట్టడం మొదలెట్టింది. చివరకు క్రిష్నగారు ఆవకాయ గురించి అనర్గళంగా ప్రసంగించడంతో శిఖరాగ్రం చేరింది. హమ్మయ్య అక్కడితో అసంబద్ధం శాంతించిందని సంతోషించేలోగా మీతో మళ్ళీ మొదలైంది. ఈ విపరీత అసంబద్ధత ముందు మీరు నాకు ఆపాదించిన “అసభ్యత” యేపాటి?
    //కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం// అని అనడం మీ సభ్యతేవో !! కానివ్వండి.

    రవిశంకర్ గారి కవితలో విస్తరణ దోషముంది. సాగతీత వుంది. మీరన్నట్టు సూపర్ కండక్టివిటీ, రేడియోయాక్టివిటీ గట్రా యేవీ లేవు. మీరుత్తినే ఆపాదించేస్తే సరిపోదు. మీమాటల్లోనే చెప్పాలంటే “కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని వానపాట ద్వారా రవిశంకర్ గారు నిరూపించారనే నేననుకుంటునాను”

    మఠాధిపతులు, పీఠాధిపతులు,ముఠాధిపతులు వీరంగం జేస్తున్న వర్తమాన తెలుగు సాహిత్య ప్రపంచంలో స్వచ్ఛమైన అక్షరం కోసం తపించడం నేరం.భుజకీర్తులు భజనబృందాలు లేకపోవడం లోపం.వాదాలు బూజులు దులుపుకోవడం ద్రోహం.

  1853. అరణ్య కవితలు గురించి chavakiran గారి అభిప్రాయం:

    09/19/2007 2:01 am

    సిగ్గు లేకుండా చెప్తున్నా

    ఈ ఆవకాయ కవిత కూడా బాగుంది, నోరూరుతుంది.

  1854. అరణ్య కవితలు గురించి సరదా సుబ్బారావు గారి అభిప్రాయం:

    09/18/2007 6:06 pm

    ఎంత ఆకలేసి
    దిక్కులంతా కలియతిరిగినా
    ఎట్టకేలకు ఆవకాయ జాడీ

    ఆకలితో మరొక సారి
    అలమటించాలనుంది
    _____________

    చిక్కనైన కమ్మనైన ఆవకాయ జాడీ

    పిండిలో దూరి
    కారంతో మమేకమై
    కమ్మని నూనె తమని
    ముద్దాడుతుంటే

    పుల్ల్లనైన
    ఆవకాయ
    ముక్కలన్నీ
    నోరూరిస్తూ…
    _________________

    తనలో మునిగిన
    ప్రతీ మామిడి ముక్కకీ
    దీక్షగా కారపు ఘుమఘుమల నూనె
    ఒక రుచినిస్తోంది

    చూడ్డానికి ఒకేలా ఉన్నా
    దేని రుచి దానిదే!
    _______________________

    ఏ ఊరి ఆవకాయని చూసినా
    ఆ ఘుమఘుమలు
    నా ఆకలిలో ప్రతిఫలిస్తున్నాయి

    కొన్నాళ్ళకి నేను
    ఆవకాయి వేయడం మొదలు పెట్టాను
    ______________________

    ఒకరితో
    నిమిత్తం లేదు

    ఆవకాయ పెడతారు
    ఖాళీ అయ్యాక కడిగేస్తారు

    మా మంచి బామ్మలు.
    ********************************

    అయ్యా! సరదగా నేను వ్రాసినా అందులో ఉద్దేశ్యం కనిపెట్టలేనివారు కాదు. ఈ ఆవకాయ కవితలా మాత్రం కవితలు ఉండకూడదన్నదే కృష్ణ గారు చెబుతున్నారు. కాస్త నిదానించి అర్ధం చేసుకోండి.

    కొత్త విషయమో లేక కొత్తగానో చెప్పమని అడిగితే ఎక్కడ చూశారో చూపండీ అంటుంటే నవ్వు వస్తోంది. ఏనాడో రామాయణం నుంచి ఈ మధ్య నాటి ఎంకి పాటలు.. దాక ఎన్ని వేల సార్లు అడవి నీటిపై కిరణాలు ప్రతిఫలించడం ఎన్ని వేల రకాలుగా మనం చదవలేదు? అవేవీ ఎవరూ చదవలేదా ఏమిటి కొంపదీసి? ఎన్నో ప్రబంధ కావ్యాలున్నయి కదా.. వాటి నిండా ఈ గొడవే కదా (నాకు అవి నచ్చాయి అన్నది వేరే విషయం!) కొత్తగా కూడా ఎంతో మంది భావకులు వచనంలోనే ఎంతో అందంగా ఈ విషయాన్నే కొత్తగా చెప్పారు.

  1855. నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి swarupkrishna గారి అభిప్రాయం:

    09/18/2007 4:14 am

    చాలా బాగుంది. విషయాన్ని చక్కగా విశ్లేషించారు. పెద్దన కవితలోని పెద్దతనం ఇదే కాబోలు.
    స్వరూప కృష్ణ

  1856. వాన-పాట గురించి Sivasankar గారి అభిప్రాయం:

    09/18/2007 1:16 am

    రవి శంకర్ గారు,

    మీ కవిత చాలా బాగుంది.
    రాధా విరహం లా అనిపించింది.
    కృష్ణుడి పాటలకి/రాక కోసం ఆమె విలపించినట్టు ఉంది.

    శివ

  1857. అరణ్య కవితలు గురించి Hanumantu గారి అభిప్రాయం:

    09/17/2007 3:06 am

    బాగు బాగు. అయ్యా తిమ్మారెడ్డి రవికిరణ్ గారు….

    ఈ చర్చలో అసంబద్ధత ఎక్కడ మొదలయ్యిందనే విషయంలో మీరు కావాలనే పప్పులో కాలు వేసినట్లు అగుపిస్తున్నది.

    పెద్ద తలకాయలో, పిన్న తలకాయలో కవిత్వం గురించి ఇచ్చిన నిర్వచనాలు, విశ్లేషించే పద్ధతులు సామాన్య పాఠకునికి అనవసరం. ఇవేవీ లేకుండానే కవిత బాగున్నదో లేదో అభిప్రాయం చెప్పగలిగే జ్ణానం సామాన్యపాఠకునికి ఉంటుంది.

    కాకపోతే, ఎవరో ఒకరిద్దరు ‘భుజకీర్తులు’ తొడిగారన్న ‘ఘనకీర్తి’తో అసలు విశ్లేషించకుండానే ‘దాడి’ చేయటం విమర్శకునికి తగదు.

    ముందస్తుగా అసలు కవితే అర్ధంకాలేదన్నారు కృష్ణ గారు. ఆపైన అరిగిపోయిన భావాలే అని తేల్చేసారు. ఆ భావాలతో భాషను అధోగతి పట్టించారనీ అపవాదు వేసారు. కవులూ కాస్త చదవటం కూడా చేయండనే సలహానూ పడేసారు.

    అరిగిపోయిన భావాలతో వచ్చిన మునుపటి కవితలను మాత్రం ఉదహరించలేదు. భాషలో ఏ లోపం ఉన్నదో ఎక్కడా విశ్లేషణా లేదు. కవులే కాదు, విమర్శకులకూ చదవటం అవసరమే అన్న విషయాన్ని ‘వివేకంగా’ మరచిపోవటంలోని ఔచిత్యం నాలాటి ‘అవివేకులు’ అర్ధం చేసుకోలేరేమో!

    ‘విస్తరణభీతి’ వలన అభిప్రాయం మాత్రమే తెలియబరచానని కృష్ణగారు ప్రకటించి మరీ, దాదాపు యాభలైనుల పైబడి ‘అభిప్రాయం’ మాత్రమే వ్రాసారనుకుంటాను కానీ, విశ్లేషణ మాత్రం ఎందుకో వ్రాయలేదు.

  1858. అరణ్య కవితలు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    09/16/2007 12:35 pm

    కవిత్వం గురించి ఫలాని, ఫలాన వాళ్ళు ఏం చెప్పేరో, విమర్శ గురించి, విశ్లేషణ గురించి ఏఏ పెద్ద తలకాయలు ఏం చెప్పెయో తెలుసుకున్న వాళ్ళే విమర్శ చేయదగ్గ వాళ్ళనే స్వరం వొకటి ఈ కవిత మీద వచ్చిన అభిప్రయాల్లో వినిపిస్తుంది. ఐతే వాళ్ళు చెప్పిన కవిత్వ లక్షణాలు కానీ, వాళ్ళు కవిత్వానికిచ్చిన నిర్వచనాలుగానీ, వాళ్ళు స్థిరీకరించిన విష్లేషణా పద్దతులు కానీ తెలీకుండానే, తెలుసుకోవాల్సిన అవసరంలేకుండానే, తెలుగొచ్చిన ప్రతివాడికీ, ఫలాని కవిత తనకు నచ్చిందో, నచ్చలేదో, నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పగలీగే ఙ్ఞానం వుందని నా నమ్మకం.

    కృష్ణ గారి అభిప్రాయంతో మొదలైన ఈ చర్చ, మూలా సుబ్రహ్మణ్యం గారి జవాబుతో దారి తప్పిపోయి, అలోక్ గారి అభిప్రాయంతో అసభ్యత వైపు జారిపోయిందేవో అనిపిస్తుంది. “మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని,” కృష్ణ గారికి మూలా గారు జవాబియ్యటంతోనే అసంబద్దవైన వాదం మొదలైందనిపిస్తుంది. ఒక కవితలో వుండేటటువంటి అందాన్ని, అర్థాన్ని, అనుభవాన్ని, అనుభూతిని కష్టపడి తవ్వితీయవలసిన అగత్యం, అవసరం పాఠకుడికి లేదనే నేను భావిస్తాను. రచయిత తన అనుభవాన్ని, తనలోని ఉద్వేగాన్నీ కవిత ద్వారా పాఠకుడికి ట్రాన్ఫర్ చేయలేకపోవటం ఆ రచన బలహీనతని సూచిస్తుందే తప్ప పాఠకుడి అవివేకాన్ని కాదు. ఉదాహరణల కోసం ఎక్కడకో పోవాల్సిన అవసరం లేదు, ఇదే సంచికలో ప్రచురించబడినట్టి విన్నకోట రవిశంకర్ గారి “వాన-పాట” నే ఉదాహరించ వచ్చు. అందం, భావుకతా రెంటిలోనూ వుండొచ్చు, కానీ వాన-పాటలో వున్నటువంటి కవితకి ఆత్మలాంటి ఆ సూపర్కండక్టివిటి, రచయిత ఎమోషన్ ని పాఠకుడి మనసులోకి ట్రాన్ఫర్ చేసి, కవిత చదివేసిన తర్వాత కూడా, మనసుని వదలిపోని వొక ఉద్వేగాన్ని సృష్టించగలిగే ఆ శక్తి మూలా గారి కవితలో లేదు. కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం. దళిత కవిత్వం, లేక అయావాద కవిత్వాలని తలకెక్కించుకోని ఈ అభిప్రాయం చెబుతున్నానని, లేక ఫలాని వారి విమర్శనాత్మక పుస్తకం చదవకపోవటం వలననో, లేకపోతే నా సహజవైన అవివేకంవలననో ఈ కవితమీద ఈ అభిప్రాయానికి వచ్చానని ఎవరైనా భావిస్తే వారి వివేకానికి సంతోషిస్తాను. కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని అరణ్య కవితల ద్వారా మూలా గారు నిరూపించారనే నేననుకుంటునాను.

  1859. వాన-పాట గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    09/16/2007 7:56 am

    రవిశంకర్ గారి “వాన-పాట” కవితలో ఒక fluency of style ఉంది.కాబట్టి చదివిస్తుంది. చదివేప్పుడు బాగున్నట్లు అనిపిస్తుంది.అంచేత మరలా చదివిస్తుంది. అలా చదివినప్పుడు వాన,పాటలకు కవి స్పందించిన రీతి లేదా వాటికి సంబంధించి ఆయన పొందిన అనుభూతిని కవిత్వీకరించటం లో ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంది.ఈ అసంతృప్తి కి కారణమేమై ఉంటుందని ఆలోచించినప్పుడు కవితలో అంతర్గత మైన అననుసంధానానుభూతి (Ununified emotional responses ) అని నాకు అనిపించింది.అసలు కవిత ప్రారంభమే ,”వాన లో తడిసినప్పుడు/పాతగాయాలేవో సలపరించినట్లు.”ఆ పైన తన “మెత్తబడ్డ మనసుని/నిర్దయ గా మరింతగా…….” కోసే వాన అందంగా ,స్వచ్ఛంగా కురుస్తుందనటం రసవైరుధ్యానికి దారి తీసి,పాఠకుడి స్పందన లో ఒక చిన్న గందరగోళం సృష్టిస్తుంది.

    మనల బాధ పెట్టే జ్ఞాపకాలు రెండు రకాలు.
    మొదటివి: ఒకప్పుడు మనకు గొప్ప ఆనందాన్ని కలిగించిన వ్యక్తో ,లేదా పరిస్థితో ఇప్పుడు లేకపోవటం అనే వాస్తవం తాలూకు జ్ఞాపకాలు .ఈ రకమైన జ్ఞాపకాలు మరువలేనివి,మరిచిపోతే బాగుండునని అనుకోనివి, నెమరువేసుకుంటూ బాధ పడేవి,బాధ పడుతూ నెమరువేసుకుండేవి.వీనికొక శాశ్వతత్వం ఉంటుంది. ఇవి వీడనివి.
    రెండవవి: ఒకప్పుడు మనకు దారుణమైన దు:ఖాన్ని కలిగించిన వ్యక్తో ,పరిస్థితో మనకు జ్ఞాపకం వచ్చినపుడు బాధపెట్టేవి ,భయపెట్టేవి ,పీడకలలాంటివి;జ్ఞాపకం రాకుండా ఉంటే బాగుండునని అనిపించేవి.
    కవితలోని జ్ఞాపకాలు మొదటి రకమైన జ్ఞాపకాలు గా “నీ పాట” అనడం ద్వారా సూచింపబడుతున్నట్లు నేను భావిస్తున్నాను.కాబట్టి తన కంటిమీద కన్నీటి తెరలు దించే ఆ పాట ,ఒకప్పుడు తనకు గొప్ప ఆనందాన్ని కలిగించిన అనుభవమై ఇప్పుడు ఒక గాఢమైన శాశ్వతమైన శోకానుభూతిని మిగిల్చినదై ఉండాలి.
    మరి ,నీ పాట లో “తడిసినప్పుడు” అనడం,”ముగిసిన ” నీ పాటమాత్రం అనడం,”కొన్నాళ్ళ వరకు తలపుల్లో గూడు కట్టుకుని ” అనడం, కవి మీద వేదనా ప్రగాఢతను వీడని దిగులు గొలిపే బలీయమైన శాశ్వతమైన బంధాన్ని సూచించకపోవటం వల్ల పాఠకుడి మీద కవిత బలీయమైన ముద్ర వేయలేకపోతుంది.”పాట లో తడిసినప్పుడు” అనడం ,పాట లో తడవక పోవటం అనే స్థితి ఉందని,పాట లో తడవటం ఒక శాశ్వతమైన,నిరంతరమైన మానసిక స్థితి కాదని స్ఫురింప చేస్తుంది.మరలా ఇక్కడ కూడా పైన పేర్కొనబడినటువంటి రసవైరుధ్యమే ఉత్పన్నమవుతుంది.అలాకాక,పాట ముగియటం శ్రవణ సంబంధి మాత్రమే నని, మనసు ,పాట లో శాశ్వతం గా అనుక్షణం తడుస్తూనే ఉంటుందనే భావాన్ని వైరుధ్యాలు లేని విధంగా కవిత్వీకరిస్తే ,ఈ కవిత చాలా బాగుండేది.
    కవిత లో impressive imagery లేకపోలేదు. కానీ ,ఆ ఇమేజరీ వైరుధ్యాలు లేని కవి యొక్క అనుభూతుల సమూహాలను ప్రతిబింబించకపోతే, దాని నిగనిగలు మాసిపోయినట్లు కనిపిస్తవి.
    అయినా,ఈ కవిత లో ఆకర్షణ లేకపోలేదు.

    C.S.Rao

  1860. అరణ్య కవితలు గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    09/16/2007 7:18 am

    డు,ము,వు,లు వంటి తెలుగు ప్రత్యయాలు లేకుండా సంస్కృత పదాలను తెలుగు వాక్యంలో రాయడం దాదాపు అసంభవం. కవిత అన్న పదాన్ని “poem” (ఒక కవితా ఖండిక) అన్న అర్థంలో ప్రయోగించడం అర్వాచీనమైనంత మాత్రాన “అరణ్యకవితలు”, “విప్లవ కవితలు”, “వచన కవితలు”- ఇవేవి దుష్టసమాసాలు అయిపోవు. ఇక సమాసం అందంగా అనిపించడంలేదన్న అభ్యంతరం మోహనరావు గారు చెప్పినట్టుగా వ్యక్తిగతం. నా మట్టుకు నాకు అంత ఎబ్బెట్టుగా లేదు. – సురేశ్.

  1861. అరణ్య కవితలు గురించి Sriram గారి అభిప్రాయం:

    09/12/2007 9:43 pm

    అరణ్యకవిత దుష్టసమాసం కాకపోవచ్చు. కానీ కవితలు అనేప్పటికి డు,ము,వు,లు ప్రధమావిభక్తి గుర్తొచ్చి తెలుగు పదం అనిపించేస్తోంది. మరి అరణ్యకవితలు కూడా దుష్టసమాసం కాదా?

    నిజానికి, అరణ్యకవిత అంటే నాకు బానే ఉంది కానీ అరణ్యకవితలు అంటే మాత్రం అందంగా అనిపించట్లేదు.

  1862. అరణ్య కవితలు గురించి girinandini గారి అభిప్రాయం:

    09/12/2007 1:04 pm

    కవితా అంటే కవిత్వము అని అర్థము.
    తెలుగులోకి వచ్చేటప్పటికి దీర్ఘము
    హ్రస్వము అవుతుంది. అరణ్యకవిత
    దుష్టసమాసము కాదు. ఇక పోతే అది
    వినడానికి పొయెటిక్ గా ఉందో లేదో అన్నది
    వ్యక్తిగతమైన అభిప్రాయము. – మోహన

  1863. అరణ్య కవితలు గురించి Sriram గారి అభిప్రాయం:

    09/12/2007 8:23 am

    అరణ్య కవితలు అనే కన్నా అడవి కవితలనో అరణ్యకవిత్వమనో అంటే బాగుండేది.

    సంస్కృత పదమూ తెలుగు పదమూ కలిపి దుష్టసమాసం చేసారని కాదు. ఈరోజుల్లో కవిత్వానికి తర్కమే కాదు వ్యాకరణం కూడా అఖ్ఖల్లేదు కదా.

    “అరణ్య కవితలు” అన్నది ఏంటో నాకు వినడానికే అన్ పొయెటిక్ గా ఉంది.

    కేవలం నా అభిప్రాయం.

    షరా: నేను స్వతహాగా ఛాందసుడినే కానీ, ఇది మాత్రం నా సహాధ్యాయి ప్రభావం.

  1864. అరణ్య కవితలు గురించి నవీన్ గార్ల గారి అభిప్రాయం:

    09/11/2007 7:32 am

    కుక్క పిల్ల
    అగ్గి పుల్ల
    సబ్బు బిళ్ళ
    ఆడ పిల్ల
    ……..కవితకేవి రెశ్ట్రిక్షెన్సు!!!!!

  1865. అరణ్య కవితలు గురించి girinandini గారి అభిప్రాయం:

    09/11/2007 7:29 am

    బ్రహ్మాండమైన వ్యాసాలు, సమీక్షలు, కథలు చదివిన
    తరువాత అందరూ ఎందుకు ఈ కవితపైన మాత్రమే
    అభిప్రాయాలను ఇస్తున్నారు? అవి కూడా ఎంతో
    బాగున్నాయి. వాటిపైన రాయరేం ఎవరూ.
    – నందిని

  1866. అరణ్య కవితలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    09/10/2007 4:55 pm

    కవితను చదవగానే, ప్రత్యేకముగా చివరి పంక్తులను,
    ఎందుకో నాకు విల్లియం వర్డ్స్‌వర్త్ వ్రాసిన క్రింది పద్యము
    జ్ఞాపకానికి వచ్చింది. చాల మంది ఈ పద్యాన్ని బడిలో
    చదివే ఉంటారు. ఆ పద్యము –

    She dwelt among the untrodden ways
    Beside the springs of Dove,
    A Maid whom there were none to praise
    And very few to love:

    A violet by a mossy stone
    Half hidden from the eye!
    Fair as a star, when only one
    Is shining in the sky.

    She lived unknown, and few could know
    When Lucy ceased to be;
    But she is in her grave, and, oh,
    The difference to me!

    మోహన

  1867. అరణ్య కవితలు గురించి కవిత్వానికి తర్కం అవసరం లేదా? « వికటకవి గారి అభిప్రాయం:

    09/10/2007 12:58 pm

    […]అగ్నికి ఆజ్యం తోడైనట్లు, చావా కిరణ్ గారిచ్చిన ఈ లంకె చూసి ఆ కవితలు, చర్చ చదివాక ఇక లాభం లేదురా అబ్బాయ్, నీ బాధని, నీ సంశయాన్ని బయటికి కక్కేయ్ అని ఆత్మ ఘోషిస్తూంటే, ఇదిగో ఇలా బయటకి చెప్పేసుకుంటున్నా!
    కవిత్వానికి తర్కం అవసరం లేదా? […]

  1868. అరణ్య కవితలు గురించి krishna గారి అభిప్రాయం:

    09/09/2007 3:26 pm

    నా అభిప్రాయాన్ని తెలుపుకునే అవకాశం ఉన్నది కనుక ఇక్కడ చెప్పటం జరిగింది. అదేదో తేనెతుట్టె కదల్చడం అని ఊహించలేదు. సరే! మీ సలహాననుసరించి మీరు సూచించిన పుస్తకాలలో చదవనివి చదవటానికి ప్రయత్నిస్తాను. కానీ నేను చేసినది కేవలం అభిప్రాయమం తెలుపడమే! పూర్తి స్థాయి విమర్శ కాదు. అలా విమర్శ చేసి ఉంటే సవివరంగా అన్నీ విడమర్చి ఉండేవాడిని. అభిప్రాయ విస్తరణ భీతి వల్ల కొద్దిగానే చెప్పవల్సి వచ్చింది.

    నేను మీ ఇంటికి వచ్చినపుడు మీరేదో తెలుగువాడని మీ ఇంట్లో ఆవకాయ వేసి భోజనం పెట్టారు.. ఎందుకనో అది నాకు నచ్చలేదు. నా అభిప్రాయం తెల్సుకుందామని మీరు ఎలా ఉంది అని అడిగితే నిర్మొహమాటంగా బాలేదని చెప్పాను. అయితే అక్కడితో ఆగకుండా నాకు కనిపించిన లోపాలూ చెప్పాను. పాతగా ఉందనో, నూనె ఎండిపోయిందనో, కారం లేదనో, ఇంకేదో లేదనో చెప్పాను. దానికి మీరు, నేను ఏమీ చేయలేం. మీకు నచ్చినా అది నా జిహ్వకు నచ్చలేదు. ఇప్పుడు అర్గెంటుగా ‘ఆవకాయ చేయడం ఎలా?’, “నేటికాలంలో ఆవకాయ తీరుతెన్నులూ” అన్న పుస్తకాలిచ్చి చదవమంటే అవి చదివినా నా నోటికి రుచి కొత్తగా పుట్టి మీ ఆవకాయను ఓహో అనలేం కదా. (ఆ పుస్తక రచయితల్ని అవహేళన చేయడం నా ఉద్దేశ్యం కాదు. నా భావాన్ని వివరించడమే నేను చేస్తున్నది.) నేను ఎంతో ఇష్టంతో కొన్ని యేళ్ళుగా ఆవకాయ తింటున్న నా అనుభవం మీరు కాదనలేనిది.

    ఒక కవిగా విమర్శో అభిప్రాయమో యుక్తం అనుకుంటే స్వీకరించండి. లేదంటే మీ ఇష్టం. ఇక కొంత మంది అభిప్రాయాల్లో చెప్పినట్లు వారు సూచించినవన్నీ నేను చదవాక కానీ అభిప్రాయాలు వ్రాయకూడదంటే మీకు విమర్శకులు దొరకడం కష్టమే మరి!

    ఇక ఈ కవిత(ల)లో నేను వెతికింది లాజిక్కు కాదు. ఒక అందమైన భావ చిత్రణ, దాన్ని నూతనంగా ఆవిష్కరించడం. అదేమంత గొంతెమ్మ కోరిక కాదనుకుంటా. ఇక్కడే ఉన్న రవిశంకర్ గారి కవితలో నాకు కనిపించింది అదే. అదే, మనసును స్పందింపజేసి ఒక క్షణ కాలమన్నా ఆహా అనిపించేట్టు చేసింది. అలా చేయనిది కూడా కవిత్వమే అనమంటే, నేను అనలేను. భావ చిత్రణలో లాజిక్కు ఉందా అంటే భౌతిక శాస్త్ర రీత్యా లేదు. చెట్టుకు పూలదోసిళ్ళు అంటే ఏ బయాలజీ ఒప్పుకోదు. కానీ దానికి స్పందించే మనసు, సృజనాత్మకత పెద్ద పీట వేస్తాయి. దానికి కవిత్వం అని పేరు పెడుతుంటాయి. కవిత్వం అంటే ఇది అని నిర్దిష్టంగా ఎవరూ చెప్పలేకపోయినా రసజ్ఞత కలిగిన మనసనే హంస రాసిన దాంట్లో కవిత్వాన్ని వేరు చేసి చూసి ఆనందిస్తుంది. అది నాలుగు పాదాల్లో ఉందా? ఛందస్సులో ఉందా? మాదిగనో బ్రాహ్మణుడినో తిట్టిందా అనో మన వాదానికి సరిపోయిందా అనే అసంబధ్ధపు శషభిషల రంగు కళ్ళ్జోళ్ళలో చూడటం స్పందించే మనసుకు అనవసరం.

    కవిగారూ, మీ కవితలో కొత్తగా చెప్పింది ఏమిటి? కిరణాలు అలల మీద పడడమా? ‘ఆకుల్లో దూరి… ‘ ఆ వాక్యంలో కొత్తదనం ఏది? ఆ వాడుక ఎన్నో సార్లు వాడబడిందే కదా. మీరు కొత్త విషయాన్నీ చెప్పలేదు, కొత్తగనూ చెప్పలేదు. అలాగే గులకరాళ్ళు. ఎంత పాతబడిపోయింది. మీరు ఒక విషయం మాత్రమే చెప్పారు. అడవిలో నీళ్ళు కనపడ్డాయి అన్నారు. అందులోకొత్తదనం ఏముంది? అందరికీ తెలిసినదే కదా. తప్పిపోవాలనుంది అన్నారు. ఆ భావాన్ని మీ అంతగా పాఠకుడు స్పందిస్తూ అనుకునేలా మీరు ఏం చేశారు? మొదటగా చదివినపుడు ఆ వాక్యాల ముందుభాగం పొరపాటున పడలేదేమో అని అనుకున్నాను. ఇక పూలు అన్నారు. పూస్తాయి, రాలిపోతాయి. నిజమే! మిరు చెప్పిన కవితలో అక్షరాలా నిజం ఉంది. కవిత్వం ఏది? ఏతావాతా మీ ‘కవిత’లో చాలా( information) విషయాలున్నాయి. (సీరియెస్ చర్చలో కాస్త సరదగా మాత్రమే వాడాను. వాతావరణం చల్లబరచడానికి)
    మిగిలినవారిలో ఒకొక్కరూ ఎవరికి తోచింది వారికి వ్రాశారు. అది వారిష్టం. కానీ నేను వ్రాసిమనది పూర్తిగా చదివితే భాష కు అధోగతి ఎందుకు పడుతోందో నేను వ్రాసింది స్పష్టమయ్యేది. ఈనాడు కవిత్వం చదివేవాళ్ళు మన యువతరంలో ఎంతమందుంటారు? అందుకు కారణాలెన్నో ఉన్నా.. కవిత్వం అద్భుతంగా ఉంటుందని 80 శాతం మంది అనుకోకపోవడం కాదూ ఒక ముఖ్య కారణం? బెంగాలీ వంటి భాషలు ఆయా ప్రాంతాల్లో నిత్య నూతనంగా ఉండటానికి జనులు పుస్తకాలు, కవితలూ చదవటం కాదూ ముఖ్య కారణం? మన భాషలో కవిత్వం వ్రాస్తే చదివేవాళ్ళు ఎంతమందో మనకు తెలియదూ. అందుకు కవిత్వం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అందరూ మంచి కవిత్వం రావడానికి తలో చెయ్యి వేయాలన్నదే నా భావన. విమర్శకులు, కవులు ఇలా అందరూ. అది తప్పని అనేవారు ఉండరనుకుంటా.

    అనవసరంగా నాకు లేని భావాలను ఆపాదించి మరీ కొంతమంది మాట్లాడినా.. నాకు లేనప్పుడు ఉలకను. అయితే, సహృదయంతో ఆలోచించి, మంచి కవిత్వం వ్రాస్తూ తద్వారా మన భాషా గౌరవాన్ని ఇనుమడించుదాం. సుబ్రహ్మణ్యం గారూ కొత్త ఆవకాయ పెట్టండి. క్షణాల్లో మీ ఇంటికి వస్తా! తిండి గురించి వ్రాసేదే కవిత్వం అని నా భావన కాదని వేరే చెప్పక్కరలేదనుకుంటా. ‘కవితాత్మకత’ ఉన్న వచనం కూడా ఆనందంగానే చదువుతా. కవి గారికి నాఆక్రందన అర్ధం అవుతుందని ఆశిస్తా..

  1869. అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    09/08/2007 12:03 am

    మాబాపదిగనోడు గారు,

    సంగీతాన్ని ఆస్వాదించడానికి రాగాలు తెలియక్కరలేకపోయినా , అందులోని లోటుపాట్లు తెలుసుకోడానికి తెలియాలి కదా! భూషణ్ గారి పుస్తకం చదువుతామన్నారు. చాలా సంతోషం. ఇండియాలో ఉంటే మీ అడ్రసు subrahmanyam.mula@gmail.com కి మెయిల్ చెయ్యండి. పుస్తకం పంపే ఏర్పాటు చేస్తాను.

    ఇస్మాయిల్ గారి కరుణ ముఖ్యం కింది లింకులో ఉంది. చదవండి వీలైతే.

    http://eemaata.com/em/category/library/karunamukhyam/

    అలాగే కింది వ్యాసం కూడా చదవండి. మీకు ఉపయోగపడొచ్చు.

    http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=32265&page=1

    ఇక కవిత్వంలో తర్కం ఎందుకుండకూడదో అన్న విషయం మీద నాగరాజు గారు చక్కని వ్యాసం రాసారు. కింది లింకు చూడండి.

    http://canopusconsulting.com/salabanjhikalu/?p=53

  1870. అరణ్య కవితలు గురించి Alok గారి అభిప్రాయం:

    09/07/2007 10:42 pm

    ఓహో మీరు క్రిష్న గారు కాదా? కానీ మీరిద్దరూ గుంటూరు శేషేంద్రశర్మ గారినే ఉటంకిస్తారా? “వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? ” అని క్రిష్న గారంటే “అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా” అని మీరడిగారు. ఇద్దరి వాదనలూ అర్ధరూపాయి గాదు రెండు పావలాలన్నట్టే వుంది !! సర్లేండి మీరిద్దరూ ఒకటా వేరా అన్నది దండగమారి విషయం.

    కవిత్వానికి లాజిక్కు అక్కరలేదా? ”

    మీలాంటి లోతైన అధ్యయనశీలి కం పాఠకుడు ఇట్టాంటి ఉబుసుపోని ప్రశ్న వెయ్యడం విచారకరం. లాజిక్కు లేనిదంతా కవిత్వమా అన్న ప్రశ్నలో మీ భోళాతనం, నేటి తెలుగు సాహిత్య పాఠకుని దివాలాతనం కనపడుతోంది. సంతా సింగు బంతాసింగు జోకుల్ని కూడా అద్భుతమైన కవిత్వం అనే మరో తరం త్వరలోనే పుట్టుకొచ్చే సూచనలు కనపడుతున్నాయ్.

    కవిత్వానికి లాజిక్కు బద్ధశతృవు. సృజనాత్మకతకు లాజిక్కే పునాదైతే క్రిష్న గారు ఇక్కడే వున్న రవిశంకర్ గారి కవితలో “అద్భుతమైన చిత్రా”న్ని ఎట్లా చూడగలిగారో లాజికల్ గా చెప్పమనండి. పూలదోసిళ్లతో చెట్లు నీళ్ళు పట్టుకోడమేవిటి? చలిగాలి మనసుని కోయడమేవిటని కవిగారు వచ్చి లాజికల్ గా వివరించనివ్వండి. ఇంత లాజికల్ సర్కసూ జరిగాక కవిలోనూ, పాఠకునిలోనూ సున్నితత్త్వం, సృజన బతికుంటుందో లేదో మీరొచ్చి చెప్పండి.

    “ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది” అని క్రిష్న గారు అసంబధ్ధంగా బాధ పడగాలేంది నేనేసిన ప్రస్న ఎట్లా అసంబద్ధం మాబా గారూ? ఈ కవితలో కవెక్కడా భాషని చట్టుబండలు కానివ్వలేదే? ఇక్కడెవరో “అల్లాష్టకం” అని రాస్తే గౌ. సంపాదకులు గారు దాన్ని కవిత్వం కింద జమకట్టారు. ఆ అల్లాష్టకం కంటే ఈ కవితేమీ ఘోరంగా లేదే? మరి క్రిష్న గారు సడెన్ గా భాష గురించి కిందా మీదా పడ్డం అవసరమేనా? సంబద్ధమేనా?

    ముందు వీటికి సూటిగా ఇద్దరూ కూడబలుక్కుని సమాధానాలివ్వండి. సెలయేటి అలల గురించి చెప్పడం ఆనక….

    చివరగా, రాగాల గురించి తెల్సుకొన్నవారు సంగీతాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలరు. పాడాలని వుంది కార్యక్రమంలో పాల్గొన్న 10 ఏండ్ల పాపకు కూడా ఈ సంగతి తెల్సును.

  1871. అరణ్య కవితలు గురించి KS Kiran Kumar గారి అభిప్రాయం:

    09/07/2007 9:35 pm

    మాబాపదిగనోడు గారు కొంపదీసి కవిత్వానికి లాజిక్ అవసరమని, లాజికల్ గా వ్రాసిన ప్రతీది కవిత్వమని తీర్మానిస్తున్నారా ఏమిటి? కొద్దిగా వివరించమని మనవి.
    🙂

  1872. అరణ్య కవితలు గురించి మాబాపదిగనోడు గారి అభిప్రాయం:

    09/07/2007 9:33 am

    కవిత్వం మాథమేటిక్సు గాదు లాజికల్ గా ఆలోచించి చదువర్లని అలోచింపచేడానికి. కవిత్వం పొలికేకలు గాదు. కవిత్వం జాగ్రఫీ, తిండియావ గాదు.”

    అయ్యా అలోకు,
    మొదటగా నేను కృష్ణ ను కాదు. కవిత్వం ఏది కాదో చెప్పినంత తేలిక కాదు, కవిత్వం ఏదో చెప్పటానికి. నేను ఓ పాఠకుణ్ణి, అంతే. కృష్ణ అన్న వ్యక్తి ఏమన్నాడో నాకనవసరం. కవిత్వానికి లాజిక్కు అక్కరలేదా? ధన్యోస్మి. గుడ్డిలో మెల్ల, ఇంకా నయం, లాజిక్కు లేనిదంతా కవిత్వమే అనలేదు. నా అభిప్రాయం నేను చెప్పాను, అంతే. అయినా, రచయిత కున్నపాటి సహనం తమరికి లేకపోయింది. ఇంతచెప్పి మరి, సెలయేటి అలల గురించి (రచయిత గారిని అవమానించే ఉద్ధేశ్యంతో కాదు సుమా) మాట్లాడలేదే మరి?

    “నేను మాదిగనురా బాపనోడా అని పొలికేకలెట్టడవే కవిత్వమా కృష్ణాజీ? ”
    పై వాక్యానికి, ప్రస్తుత చర్చ కి ఏ విధంగా సంబంధం ?

    సుబ్రహ్మణ్యం గారు,

    మిమ్మల్నేదో విమర్శించ్చేద్దామని చదవలేదు. నా అభిప్రాయం చెప్పా.
    “యదుకుల భూషణ్ గారి “నేటికాలపు కవిత్వం — తీరు తెన్నులు” పుస్తకం చదవండి. ఆయన అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా ఒక కొత్త కోణాన్ని చూసినవారవుతారు.” అన్నారు. త్వరలో తప్పక చదువుతాను.

    కానీ ముందుగా ఒక పుస్తకాన్ని చదివి, దాని ఆధారంగా కవిత్వాన్ని అర్థం చేసుకోండి, అని అనటం భావ్యమా? రాగాలు తెలుసుకొనే, సంగీతాన్ని ఆస్వాదిస్తామా?

  1873. అరణ్య కవితలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    09/07/2007 7:01 am

    చూడ్డానికి ఒకేలా ఉన్నా
    దేని అందం దానిదే!

    అని కవితలోనే వ్రాయబడినది కదా!
    ఎందుకో ఇంత తర్జన-భర్జనలు?
    అన్ని కవితలు ఛందోబద్ధముగా నుండ నవసరము లేదు.
    అన్ని కవితలు ఒక ప్రత్యేక కవి వ్రాసినట్లు ఉండవలసిన
    అవసరము లేదు. లోకో భిన్నరుచిః
    ఎవరికివారే యమునాతీరే! కవితాభావము ఉంటే
    చాలు కవిత్వానికి. దానిని జూవాలజీ విద్యార్థి కోసే
    ఒక కప్ప కళేవరములా కోయ నవసరము లేదు.
    నచ్చితే మఱొక సారి చదవండి.

    – మోహన

  1874. అరణ్య కవితలు గురించి తెలుగుఅభిమాని గారి అభిప్రాయం:

    09/07/2007 12:01 am

    అడివిమనుషులంమనము.( కుంచెం వేరే రకమైన అడవిలో
    తప్పిపోయి ఉన్నాముకదా.) అందుకే అడివి కవితలు
    తొందరగా ఇష్టపడలేము.అలాగే కృష్ణగారి విమర్శ
    కూడా స్వాగతించదగ్గదే. నాలుగు మినీ కవితలను కలిపి
    ఒకేచోట వేసినట్టుంది. ఎక్కడో చదివిన భావంకలిగినా
    మంచిపాటను మళ్ళీ మళ్ళీ విన్నట్టుగా తప్పులేదు కదా.

  1875. అరణ్య కవితలు గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    09/06/2007 11:22 pm

    కృష్ణ గారూ,

    మీ వాదనలోను, విమర్శ లోనూ లోపాలు ఉన్నాయి. యదుకులభూషణ్ గారు వ్రాసిన “నేటి కాలపు కవిత్వం, తీరుతెన్నులు” తప్పక చదవాల్సిన పుస్తకం. మీరు అది చదివి అర్థం చేసుకునే వరకూ వాదనలు అనవసరం.

    నమస్తే
    రఘు

  1876. అరణ్య కవితలు గురించి Alok గారి అభిప్రాయం:

    09/06/2007 9:53 pm

    “చదివాక మనల్ని అలోచింపచేసేదిగా లేదు” అని మీరే గదా అన్నది. అందుకనే ఈరోజుల్లో “ఆలోచింప”జేస్తున్న కవితల వరైటీల్ని చెప్పా. అందులో భాగమే వాళ్ళని పట్టుకొచ్చా. నేను దళితుల్ని పొగిడినట్టు బాపనలని తిట్టినట్టు మీకెలా, ఎందుకు, ఎక్కడ కనిపించిదో నాకర్ధమ్ కాలేదు. ఇది చాలు మీకు చదవడం రాదని. చదివినా అరకొరగానే చదూతారని తెల్సుకోడానికి. ముందు మీరు “సరిగ్గా”చదవడం నేర్వండి సార్

    “అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా?”
    విమర్శకుడు ఇంత పేలవంగా మాట్టాడ్డం అవమానకరం. అసంపూరి వాక్యం వచనం అనెవరన్నారో రెఫెరెన్స్ చూపండి. మీరుదహరించిన వాక్యాలు మీకు అర్థం కాకపోడమే కవి చేసిన తప్పా?

    మళ్ళీమళ్ళీ శేషేంద్రశర్మ గారి పేరెత్తుతున్నారంటే మీకు వారు తప్ప ఇంకొహరు తెలీదన్న మాట. తప్పు సార్. విమర్శకుడిగా అవతారమెత్తాక కూపస్థమండూకావతారాన్ని విడిచితీరాలి.

    చివరగా ఒక సలహా…క్రిష్న అన్న పేరు బావులేదనా డుండుండిగాడిగా టైపు పేరుతో వొచ్చారు. ఊరుమారినా ఉనికి మారునా అన్న తీరున మీరు జేసే జ్ణానోపదేశానికి మళ్ళీ మళ్ళీ నామకరణాలు జేసుకొనే అవసరం లేదులేండి.

  1877. అరణ్య కవితలు గురించి Hanumantu గారి అభిప్రాయం:

    09/06/2007 8:37 pm

    చాలాకాలానికి మంచి కవిత్వం చదవటం తటస్థించింది.

    కవిత గుంటూరు శేషేంద్రశర్మ గారి శైలిలా ఉన్నదనటం ఆశ్చర్యం.
    కృష్ణగారి విమర్శ ఏమాత్రం సహేతుకంగా లేదు. ఇందులోని భావం అర్ధంకాలేదని భాషను ఎద్దేవా చేయటంలోని ఔచిత్యం ఏమిటో?

    ‘అడవి అందంగా ఉన్నదని ఏం రాసినా చెల్లుబాటౌతుందా?’ అని అడిగారు. ఈ కవితలో మీకు అడవి అందమే కనిపించి, భావం అర్ధంకాకపోవటం, విమర్శకుడుగా మీరు సాధించిన / సాధించని పరిణితి మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది.

    బహుశా ఆయావాద కవిత్వాలు తలకెక్కించుకొని , అదే కవిత్వం అనుకునే ధోరణితో రాసిన విమర్శే కానీ, సహేతుకమైన విషయం ఒక్కటీ లేదు.

  1878. అరణ్య కవితలు గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    09/06/2007 5:56 pm

    మీరంతా ఏదో కృష్ణగారికేవీ తెలీనట్టు సలహాలివ్వొచ్చారే?
    శేషేంద్రశర్మని తెలిసినవారికి ఈ మాత్రం తెలీదనుకున్నారా? ఐనాఎంత అమాయకులండీ … అది చదవండీ ఇది చదవండీ అని సలహాలు చెప్పినంత మాత్రాన వినెయ్యడానికి ఆయనేం వెర్రివాడా? పద్యం రాసి దానిమీద సంజాయిషీ ఇవ్వాల్సి రావడం జోకుని వివరించడం కన్న ఘోరం. అరణ్యకవితలకి ఆ దుస్థితి పట్టలేదనే నేననుకుంటున్నా.

  1879. అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    09/06/2007 7:42 am

    మాబాపదిగనోడు గారు,

    కవిత్వాన్నీ, వచనాన్నీ విడదీసే ప్రాథమిక అంశాలేవి?” , “పాఠకుడు కవి స్థాయికి ఎదగాలా , కవే పాఠకుడి స్థాయికి దిగాలా” వంటి మౌలిక ప్రశ్నల దిశగా చర్చ సాగుతోంది. వీటి మీద ఇప్పటికే లెక్కలేనన్ని వాదనలు జరిగాయి. మీరు , నేను కొత్తగా చర్చించేదేమీ లేదు. కిరణ్ గారు చెప్పినట్టు యదుకుల భూషణ్ గారి “నేటికాలపు కవిత్వం — తీరు తెన్నులు” పుస్తకం చదవండి. ఆయన అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా ఒక కొత్త కోణాన్ని చూసినవారవుతారు. ఈ సైటులోనే ఉన్న ఇస్మాయిల్ గారి “కరుణ ముఖ్యం” పుస్తకం కూడా చదవండి వీలైతే.

  1880. అరణ్య కవితలు గురించి KS Kiran Kumar గారి అభిప్రాయం:

    09/06/2007 6:34 am

    కృష్ణ గారు

    అసలు ఈ కవిత కన్నా కూడా, మీ విమర్శ మాత్రం అర్ధం కావడంలేదు. ఒకవైపు మనసును హత్తుకునే భావం లేదంటూ.. ఇందువల్లే మన భాషకి అధోగతిపడుతున్నదని ప్రకటించేసారు.

    కవితలోని భావం మీకు అర్ధం కాలేదంటే, ఏవో కవితా సంకలనాలు చదివి పదును పెంచుకోమని మీకూ ఓ ఉచితసలహా పారేయొచ్చు. కానీ, ఈ కవితలోని ఏ భాష మీకు అర్ధం కాక, మన భాష అధోగతి పడుతోందని బాధపడుతున్నారో!!

    సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు, ఈ భావనతో వచ్చిన ఇతరత్రా కవితలని మీరు ఇక్కడ ఉదహరించితే, విమర్శ మరింత సూటిగా ఉండగలిగేది.

    ‘యదుకులభూషణ్ గారు వ్రాసిన ‘నేటికాలం కవిత్వం తీరుతెన్నులు’ మీరోసారి చదివి, విమర్శలు ఎలా పదునుగా ఉండాలి అనేది నేర్చుకుంటే బాగుంటుంది.

    అలానే మరోసారి అలోక్ గారు వ్రాసిన విషయం ప్రశాంతంగా చదవండి. ఆయన ఏం చెబుతున్నది అర్ధం అవుతుంది.

  1881. అరణ్య కవితలు గురించి మాబాపదిగనోడు గారి అభిప్రాయం:

    09/06/2007 5:15 am

    సుబ్రహ్మణ్యం గారు,

    కవితా సారాన్ని వచనంలో వివరించడం కవిత్వాన్ని అవమానించడంగానే భావిస్తాను.” అని అన్నారు బాగుంది. కానీ, అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా?

    “ఎంతదారి తప్పి
    ఎక్కడెక్కడో తిరిగినా
    ఎట్టకేలకు నీటి జాడ”

    పైది వచనం కాదా?

    “గలగలలాడే
    సెలయేటి
    అలలన్నీ
    వెలిగిపోతూ…”

    సెలయేట్లో అలలు ఎక్కడుంటాయండీ? గలగల పారే సెలయేరులో అలలా?…… ఏదో తేడాగా ఉంది. ఇకపోతే, మీరు వాడిన శైలి శేషేంద్ర శర్మ గారి శైలి లాగానే ఉంది. కాకపోతే, మీ రచనలో మీరు పాఠకుల బుర్రకి మరీ పని పెడదామన్న తాపత్రయంలో కొంచం దారి తప్పారు అనిపించింది.

    @అలోక్,

    మాదిగలు, బాపనోడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావ్? ఇక్కడ జరుగుతున్నదేమిటి, మీరు మాట్లాడేదేమిటి? ఓ గద్దర్ జనపదంలో పాటలు కట్టి పాడాడంటే అర్థం ఉంది. కనీసం ఆయన వాళ్ళ కర్థమయ్యే భాషలో పాడతాడు. తమరు వక్కాణించిన పెద్దవాళ్ళ కవిత్వం పెద్దవాళ్ళు చదువుకోటానికి , విమర్శించుకోటానికి, పీ.హెచ్.డి లకి పనికొస్తుందంతే. అందులో ఒక్క అక్షరం ముక్క నువ్వు అన్న ఆ పేద జనానికి అర్థం కాదు. అయినా, ఇదేం జబ్బో! దళితుల్ని పొగిడి, బ్రాహ్మణున్ని తిడితే గొప్పవాడైపోతామనుకుంటారెందుకో?

  1882. వాన-పాట గురించి Alok గారి అభిప్రాయం:

    09/06/2007 12:46 am

    ఇందులో అద్భుతమైన చిత్రాలేవీ కనపడ్డంలేదు. “నీ పాట కూడా అంతే” అన్న చోటనే కవిత ఆగిపోయింది.

  1883. అరణ్య కవితలు గురించి Alok గారి అభిప్రాయం:

    09/05/2007 11:09 pm

    ఇంక్విలాబు జిందాబాదు, నేను మాదిగనురా బాపనోడా అని పొలికేకలెట్టడవే కవిత్వమా కృష్ణాజీ? అక్కడెక్కడో కట్టే డాము మీద, ఫ్లై వోవర్ మీదా రాసే జాగ్రఫీనా కవిత్వం? తమ కడుపులో చల్ల కదలకండా వుంచుకొని ఫుట్ పాత్ జీవుల గురించి పేజీలెక్కన, కేజీలెక్కన మోజుకొద్దీ రాయడమేనా కదిలించే కవిత?

    గుంటూరు శేషేంద్ర శర్మ గారి అభిప్రాయం రాసారు. బానే వుంది. మరి మిగతా కవులు మరీ ముఖ్యంగా ఇస్మాయిలు గారు ఏం చెప్పారో చదవలేదా? చదవకపొతే చదవండి.

    జయప్రభగారి పబ్ ఆఫ్ వైజాగపట్నమ్ చదివారా? చదవకపోతే ఎంటనే చదవండి. గుత్తొంకాయ ఎలా వొండాలి, తద్దినాలప్పుడు ఏమేం తినొచ్చు అన్నీ తెలుస్తాయి. అట్లా తెల్సుకొని తెలుగు భాషని కవిత్వాన్ని పొయ్యిల్లోకి, గుండిగల్లోకి తోసి సంతోషిద్దాం.

    కవిత్వం మాథమేటిక్సు గాదు లాజికల్ గా ఆలోచించి చదువర్లని అలోచింపచేడానికి. కవిత్వం పొలికేకలు గాదు. కవిత్వం జాగ్రఫీ, తిండియావ గాదు.

    కవిత్వం గురించి చదవండని పక్కవాళ్ళకి సలహా ఇచ్చేముందు మనమెంత చదవేసామో చూసుకోవడం మంచిది.

  1884. అరణ్య కవితలు గురించి chavakiran గారి అభిప్రాయం:

    09/05/2007 9:29 pm

    ఆర్యా!

    కృష్ణాజీ,

    ఓ నాలుగు మంచి కవితలు చెపితే చదివి ఆనందించాలనుంది.

    ఇహ పోతే (ఎవరు అని అడగరు అని ఆశిస్తూ 🙂 )

    నాకు ఈ కవిత చదవగానే అర్జంటుగా అడవిలో తప్పిపోవాలనిపించింది (ఇంతకు ముందు చాలా సార్లు అలా జరిగిందిలేండి)

    అందుకనే నచ్చినది.

    అందుకు కాకపొయినా ఈ కవితలో పాజిటివ్ నెస్ చాలా ఎక్కువ ఉన్నది. ఆశావాదం వైపు నడిపిస్తుంది.

    మీ విమర్శ బాగుంది, ఇలాగే కొనసాగించండి మీ దాడి.

  1885. అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    09/05/2007 9:07 pm

    కృష్ణ గారు…

    జీవితమైనా , కవిత్వమైనా ఒక అరణ్యం అనుకుంటే అందులోని అసలు సారాన్ని (నీటి జాడ) గ్రహించలేక , అందరం ఒకానొక దశలో దారి తప్పి తిరిగే వాళ్ళమే. ఐతే ఆ నీటి జాడని కనుగొన్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో వ్యక్తం చెయ్యలేం. ఆ ఆనందం కోసం ఎన్ని సార్లైనా అడవిలో తప్పిపోవాలనిపిస్తుంది. అదే మొదటి కవిత.

    కవితా సారాన్ని వచనంలో వివరించడం కవిత్వాన్ని అవమానించడంగానే భావిస్తాను. ఐనా మీ విమర్శ వల్ల తప్పలేదు. మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని, ఇదే కోణంలో మిగతా కవితల్లోని నీటి జాడ కోసం వెతుక్కునే సత్తా మీకు ఉందనే నమ్ముతాను.

    “నమిలి మింగిన పిప్పి” లాంటి పదాలు వాడే ముందు, ఇలాంటి కవితలు ఇంతకు ముందు ఏ కవి ఎలా వ్యక్తపరిచాడో చెప్పి ఉంటే మీ విమర్శలో కాస్త పస ఉండేది. మాబోటి కవులకి కాస్త ఉపయోగపడేది.

    ఏమైనా మీ విమర్శ కి ధన్యవాదాలు.

    శెలవు.

  1886. వాన-పాట గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    09/05/2007 5:05 pm

    “జలజలమంటూ కురిసే వాన
    కిటికీ పై నీటిపరదాలు జార్చినట్టు
    నీ పాట నా కంటిమీద
    కన్నీటి తెరలు దించుతుంది.”
    ఎంత బాగా రాసారు! మీ కవిత చాలా హాంటింగ్ గా ఉంది, మీరు విన్న పాట లాగే!

  1887. అరణ్య కవితలు గురించి krishna గారి అభిప్రాయం:

    09/05/2007 2:05 pm

    నాకు ఈ కవిత అర్ధం కాలేదో లేక అసలు ఈ మధ్య కవిత అనే పేరుతో వచ్చేవి ఇలా ఉంటున్నాయో తెలీదు. అసలు ఏముంది ఈ కవితలో? బాగుందో బాలేదో తర్వాత ఆలోచిద్దాం. ఎవరైనా కాస్త వివరించే పుణ్యం కట్టుకోరూ దయచేసి.

    వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? అడవి అనేది అందంగా ఉంటుంది కాబట్టి ఏం రాసినా చెల్లిపోతుందనే భావన మాత్రమే ఉంది ఈ కవితలో. మనసును హత్తుకునే భావమ్ ఒక్కటి లేదు, ఒక అందమైన భావాన్ని అందంగా వివరించడం లేదు, చదివాక మనల్ని అలోచింపచేసేదిగా లేదు. మొత్తానికి అసలు కవిత అంటే ఏమిటో నేర్చుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది.

    ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది. కవులూ కాస్త చదవడం కూడా చేయండి. లేకపోతే అరిగిపోయిన భావాలే చర్విత చర్వణం అవుతాయి. శేషేంద్ర శర్మ గారి గురించి వారి శిష్యులు ఒకాయన వ్రాస్తూ అరిగిపోయిన భావాలు నింపిన ఒక అనువాదాన్ని చూపిస్తే ఆయనేమన్నారటో తెలుసా? “కిళ్ళీ బాగా నమిలి నమిలి నమిలీ రసమంతా అయిపోయాక థుపుక్కున ఉమ్మిన పిప్పిలా ఉంది” అని. కొత్త భావాల్లేని కవితలు చదివితే అలానే అనిపిస్తుంది. అందుకే కాస్త చదవండీ దయచేసి.

    రచయిత నొచ్చుకుంటారని తెలుసు. అయినా ఇంత ఘాటుగా వ్రాయడానికి కారణం, ఈ మధ్య కవితలు వ్రాసే వారు జాగ్రత్తలు తీసుకోవట్లేదన్న బాధే. అలాంటి కవితలే వస్తే ఇక సంపాదకులూ ఏం చేస్తారు? వచ్చిన వాటిల్లో ఏదో ఒకటి వేయడం తప్ప.. ఈ మధ్య ఆన్ లైన్ పత్రికలన్నిటిలో కవితలు ఇలానే ఉంటున్నాయి. కవులు జాగ్రత్త తీసుకోకపోతే కవిత్వం మీద ఆసక్తి చచ్చిపోయి భాష చచ్చిపోతుందన్నదే నా బాధ.

  1888. వాన-పాట గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/04/2007 12:35 pm

    కవితా వర్షం వెలిసినా
    పాట తడి ఇంకా అంటిపెట్టుకునే ఉంది.

  1889. రెండు కవితలు గురించి kbssarma గారి అభిప్రాయం:

    08/25/2007 6:38 am

    కవితలు చాలా బాగున్నాయి. అల్పం లో అనల్పం.

  1890. ఆ రోజులు గురించి mohanraokotari గారి అభిప్రాయం:

    08/14/2007 9:10 pm

    ఎందుకో మేధావులంతా రసాస్వాదన మాని కవితా కన్యకని surgery చేస్తారు. వలువలూడదీసి శల్య పరీక్ష చేస్తారు. కవి మనసుతో కలవరించి పలువరించకుండా. మరచి పోలేని ఆనాటి సాహస కృత్యాలు మరువలేని వారితో మనసు కలపి ఆలోకంలోకి మనుమూ వెల్లితే పోలా.

  1891. గ్రహ బలాబలాలు గురించి mohanraokotari గారి అభిప్రాయం:

    08/14/2007 8:58 pm

    బాగుంది. surrealistic కవిత నాలాంటి సామాన్యులకి అందనిది. అసామాన్యమైన కవితా రచయిత్రికి అభినందనం.

  1892. ఆ రోజులు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    07/22/2007 2:37 pm

    నాకు కూడ వాదిరాజయతి రచించిన అశ్వధాటిలోని
    దశావతారస్తుతి అంటే ఎంతో ఇష్టము.
    ఇక్కడ ఒకటి చెప్పాలి అందరికీ. అన్ని సంస్కృత పదాలు
    అర్థము చేసికొనుటకు కష్టము కాదు, అన్ని తెలుగు పదాలు
    అర్థము చేసికొనుటకు సులభము కాదు. నాకు అన్నమాచార్యుల
    కీర్తనలలో ఎన్నో పదాలకు ఇంకా అర్థము తెలియదు. క్రింద ఒక
    అచ్చ తెలుగు పద్యము సీతాకళ్యాణమునుండి. ఇది అచ్చ తెలుగు
    మాత్రమే కాక ఇందులోని అక్షరాలు పెదవులను తాకవు.
    గట్టంత ఱాయి నా కా-
    లట్టే తాకంగ నెలతయై నిల్చిన డా
    కట్టడి దెలిసిన యంతా
    గట్టిగ నెఱగంగ జేసి గడతేర్చగదే
    – మఱిగంటి సింగనాచార్య, శుద్ధాంధ్రనిరోష్ఠయసీతాకళ్యాణము (2.65)
    ఇది రాముని కాలి స్పర్శచే ఱాయి అహల్యగా మారినప్పుడు
    రాముడు విశ్వామిత్రునితో తెలిపినది.

    తెలుగో సంస్కృతమో అర్థమైతే చాలు. ఇక ప్రత్యేక పదాలా?
    ఒక్కొక్క కవి ఒకలా వ్రాస్తాడు. ఒకే కవి అదే కవితను మరలా
    వ్రాస్తే అదే విధముగా వ్రాయడు కూడ! – విధేయుడు – మోహన

  1893. ఆ రోజులు గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    07/19/2007 5:48 pm

    రఘోత్తమ రావు గారూ,
    కవితా భాష గురించి మీ అభిప్రాయాలు మీవి. నా అభిప్రాయాలు నావి. నా అభిప్రాయాల గురించి స్పష్టంగా చెప్పటానికి నేను చేయవలసిన ప్రయత్నం అంతా చేసానని నమ్ముతున్నాను.ఇక కొత్తగా నేను చెప్పబోయేదేమీ లేదు.

    C.S.Rao

  1894. ఆ రోజులు గురించి పాఠకుడు గారి అభిప్రాయం:

    07/19/2007 11:29 am

    “ఇప్పటి సంగతి” (ఈ మాట, 2002) లో వెల్చేరు గారొకసారన్నారు:

    ఈమధ్య ఒకసారి అఫ్సర్‌తో మాట్లాడుతూ ఇండియా టుడే వాళ్లు వేసిన సాహిత్య సంచికలో మీ పద్యం చూసానని చెప్పాను. అఫ్సర్‌ వెంటనే ఆ పద్యం చాలా పొడుగ్గా ఉందని కొందరు స్నేహితులు అన్నారని నేనేమీ అనకముందే చిన్న గొంతుకతో అన్నాడు. “కవులు పద్యం కూర్పు ఎలా వచ్చిందన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారన్న మాట!” అనుకుని చాలా సంతోషించాను.

    ఈ సంతోషించటంలో ఆయన “ఇట్లా అయితే బాగుంటుంది” అని చెప్పలేదు, ప్రొఫెసర్ కదా!

    కవితను పక్కకు పెడితే, మీ రెండు వాదనలూ బాగున్నయి. (రఘోత్తమ రావు, సీ ఎస్ రావు). ఆయనను మరింత సంతోష పెడ్తాయి కూడా.

    1.
    తెలుగు పద్యంలో “వీలైనన్ని తెలుగు పదాలు ఉంటేనే బావుంటుందని” అట్లా అయితే అది బాగా కూర్చుంటుందని రఘోత్తమ రావు (తెలుగులో మీ పేర్రాయడం కష్టం, యూనికోడ్ లో అది జరిగే పని కాదు!) గారనటం ఈ కూర వండటం లోకే వస్తుందనుకుంటాను (కూర్పు).

    కవిత్వంలో శుద్ధ సంస్కృతం, శుద్ధ వ్యావహారికం/గ్రామ్యం వాటినుదహరిస్తూ ఆయన ఏది ఎట్లా సరిపోయిందో ఒక పూర్తి నిడువు వ్యాసం (పద్నాలుగు టావులకు తగ్గకుండా) రాస్తే నా లాంటి ‘అక్షర జ్ఞానం’ లేని వాళ్ళకుపయోగపడుతుంది.

    కానీ,
    2.
    సీ ఎస్ రావు గారి అభిప్రాయం: కవులకవసరమైన పదాలు, తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పార్సీ కావాలంటే పంజాబీ, గుజరాతీ (నా మటుకు ఆ భాషంటే అదో చెప్పలేని ప్రేమ, అక్కడి అమ్మాయిలు కొంత కారణం కావచ్చు), ఏదైతేనేం వాళ్ళకవసరం అయిన పదాలు వాడే స్వాతంత్య్రం వాళ్ళకు లేదా?

    కవిత గురించి పెద్దగా చెప్పేందుకేంలేదు నాకు.

    సీ ఎస్ రావు గారు చెప్పినట్టు (“పాఠకమహాశయులు తర్కించుకుంటారు,ఆస్వాదిస్తారు”), నేను ఎప్పుడో తప్ప కవిత్వం తలుపు తెరవని పాఠకవర్గంలో వాణ్ణి కాబట్టి పెద్దగా తర్కించటానికి ఏం లేదు, మరి ఆస్వాదించుదామంటే ఈ కవిత ‘కెరటమై’ ‘బాణమై’ అంటూ అక్కడక్కడ గుచ్చుకున్నది.

    చివరి ఆరు లైన్ల కొచ్చాక, పద్నాలుగు రీళ్ళతో ముగిసే తెలుగు సినిమా పద్దెనిమిదికి లాగినట్టనిపించింది. ఈ కవితను ఇంత లోతుగా చూడటం అనవసరమేమో రఘోత్తమ రావు గారూ. కానీ మీ వాదన భాషను, వాడిన పదాలను పట్టుకుని ఎవరైనా (రాసిన మనిషి కాక) ఎడిట్ చేస్తూ పోతే చివరికేం మిగలదు అనిపిస్తుంది.

    సెలవ్.
    పాఠకుడు.

  1895. ఆ రోజులు గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    07/18/2007 10:43 pm

    సంస్కృతం పట్ల నాకు చిన్నచూపని, రవంత కూడా పట్టదని నేనక్కడా చెప్పలేదే!! కవిత్వంలో తెలుగు పదాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. పేర్లు, అభిప్రాయాలలో దొర్లే వాటి గురించి కాదు. ఐతే మీరు కవితకు వీటికి పోలిక తెచ్చి చూస్తున్నారు.

    “ప్రోష్ఠీశ విగ్రహ నునిష్ఠీవనోద్ధత విశిష్టాంబుచారి జలధే
    కోష్టాంతరాహిత విచేష్టాఘమౌఘ పరమేష్టీడిత త్వవతు మాం
    ప్రేష్టార్కసూను మనుచేష్టార్థమాత్మ విదతీష్టో యుగాంతసమయే
    శ్రేష్టాత్మ శృంగ ధృత కాష్టాంబు వాహన వరాష్టా పద ప్రభతనో”

    “ఎంకి ఏదంటే వెలుగు నీడలకేసి వేలు చూపింతు”

    ఇలా శుద్ధ సంస్కృతమో, శుద్ధ వ్యావహారికమో/గ్రామ్యమో ఏదైనా సరే వాటివే ఐన రంగు, రుచి, వాసనా ఉంటాయి. తెలుగు కవితలో వీలైనన్ని తెలుగు పదాలు ఉంటేనే బావుంటుందని నా అభిప్రాయం.

  1896. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    07/18/2007 5:44 pm

    తిక్కన గారి గొప్ప పద్యానికి బృందావన రావు గారి వ్యాఖ్యానం చాలా బావుంది.

    ద్రౌపది హోమగుండం నుండి ఆవిర్భవించిన అయోనిజ.మహారాణి.ఒక కౄరుడి దుశ్చర్యకి లోనై పరాభవాగ్ని తో ప్రతీకారం కోసం వేచిచూస్తున్న మూర్తీభవించిన పౌరుషాగ్ని.

    ఈ దుశ్చర్యకు పాలుబడిన దుశ్శాసనునికి, చేయే కాదు శరీరం మొత్తం ఖండ ఖండాలుగా, తుత్తునియలుగా నరకబడి యుధ్ధరంగం మీద పడి ఉండటం చూసినప్పుడే ఆమెకు,ధర్మరాజుకు మనశ్శాంతి.

    ఇక భీమార్జునలును,వారి ఆయుధాలను ఒకింత చులకనగా మాట్లాడి వారి పౌరుషాన్ని జాజ్వల్యమానం చేయదలచుకున్నది.

    ఆ మహా సాధ్వి దుఃఖావేశంతో,క్రోధావేశంతో ఉన్నప్పుడు దేవతలకు ప్రతీకలైన సూర్యచంద్రులు, మహర్షులకు ప్రతీకలైన యతీంద్రులు అవనత శిరస్కులై ఉన్నారనడం లో అందమైన శ్లేష ఉన్నది. ద్రౌపది క్రోధావేశానికి తిక్కన కవితాశక్తికి భయపడి సూర్య, చంద్ర, ఇంద్ర, గణాలు, యతిప్రాసలు భయభక్తులతో మెత్తగా ఒదిగిపొయ్యారని శ్లేషార్ధం.

    బావుందండీ. అభినందనలు.

  1897. ఆ రోజులు గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    07/17/2007 7:32 pm

    రఘోత్తమరావు గారూ,
    కవితలో రవంత సంస్కృతం ఉన్నా ఇష్టపడని మీరు,మీరు వ్రాసిన మొదటి అభిప్రాయం లో “శ్రద్ధ” బదులు”పట్టించుకోవలసింది ” అనవచ్చుగా?మీ రెండవ అభిప్రాయం లో”బాదరాయణ సంబంధం” బదులు “ఈ రెంటికీ పోలికేమిటి” అనవచ్చుగా?
    తెలుగు, సంస్కృతం అందంగా పెనవేసికొని పోతే ,తెలుగు భాషలోని సరళమైన సంస్కృత పదాలని అంటరాని పదాలు గా చూడాలా?
    “ప్రాతఃకాలం” బదులు”తొలి పొద్దు” ,”కపోలాలు” బదులు “చెక్కిళ్ళు” అన్నప్పుడు మరొకరు “తెల్లారగట్ల” ,”చెంపలు” అనవచ్చుగా అని
    అడగవచ్చునేమో?
    నేనుదహరించిన కవితలలో కూడా ఇలానే ‘దైనందిన” బదులు “రోజువారీ””కోలాహలం” బదులు “సందడి” వగైరా అనవచ్చుగా?
    తన ఊహకు తగినట్ట్లుగా ఏ పదం వాడి ఎంత సౌందర్యం సాధించగలడో ,తన కవితావేశం పాఠకులకి అందించగలడో , కవిత వ్రాసే వ్యక్తి నిర్ణయించుకుంటాడు.
    పాఠకమహాశయులు తర్కించుకుంటారు,ఆస్వాదిస్తారు.
    పోతే,మాటలకు కొత్తదనం ఏముంటుంది?అవి అనాదిగా వస్తున్నవే.మాటల కూర్పులో ,లయబధ్ధమైన నడక లో,అవగాహనా మాధ్యమాలను వాడటం లో సొగసు,కొత్తదనం ఆవిర్భవిస్తవి.

    Middleton Murry గారి “Mode of Apprehension” కి “అవగాహనా మాధ్యమం” నా అనువాదం.ఇది”metaphor” కి ఆ గొప్పసాహితీ విమర్శకుని
    నిర్వచనం.

  1898. ఆ రోజులు గురించి కొత్త రవికిరణ్ గారి అభిప్రాయం:

    07/17/2007 3:30 am

    భాస్కర్రావు గారూ, జాగర్లమూడి, అంగలకుదురు మధ్య ఊరకే అలా నడుచుకుంటూ వెళ్ళినంత ఆహ్లాదంగా ఉంది మీ కవిత

  1899. ఆ రోజులు గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    07/16/2007 5:15 pm

    రఘోత్తమరావుగారు చెప్పినట్లు పై కవితలో “కపోలాలు” బదులు “చెక్కిళ్ళు”, “ప్రాతఃకాలం” బదులు “తొలిపొద్దు”అనే పదాలు వాడవచ్చు.తెలుగు వంటి సుసంపన్నమైన భాష లో పర్యాయపదాలకి లోటు లేదు.అనేకం ఉన్నాయి.ఆ రకం గా చూస్తే ఈ కవితని (ఏ కవిత నైనా) ప్రతి ఒక్కరూ వారి పంధా లో,వారి కిష్టమైన పదాలు వాడి వ్రాయవచ్చు. కానీ, ఒక రచయిత తన వైయుక్తిక అనుభూతిని ఎలా కవిత్వీకరించాలి అనేది పూర్తిగా ఆ రచయిత నిర్దేశించుకునే విషయం.అయితే ,ఆ ప్రయత్నం లో రచయిత తన అనుభవాన్ని,అనుభూతిని పాఠకుల అనుభవం లోకి సమర్ధవంతంగా, అందించగలిగారా లేదా అన్నది మాత్రమే చర్చనీయాంశమని నా అభిప్రాయం.

  1900. ఆ రోజులు గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    07/16/2007 5:48 am

    సి.ఎస్ . రావుగారూ,

    వ్యక్తి పేర్లు, ఊరి పేర్లలోనూ ఉన్న సంస్కృతానికి, కవిత్వంలోని సంస్కృతానికి ఉన్నది బాదరాయణ సంబంధం మాత్రమేనని నా అభిప్రాయం.

    తీసివేయలేని విధంగా వాడిన సంస్కృత పదాల గురించి నేను చెప్పలేదండీ.

    నున్నని ఆకుల కపోలాలు కంటే నున్నని ఆకుల చెక్కిళ్ళు అని అనకూడదా?

    ప్రాత:కాలపు పిల్లతెమ్మర కంటే తొలిపొద్దు పిల్లతెమ్మర అంటే ఎలా ఉంటుంది?

    అచ్చతెలుగు పదాలు వాడితే కవిత్వంలో లోటు రాదు కదా !

    కవితలో కొత్తదనమంటూ ఉంటే అది ఒకే ఒక్క వాక్యంలోనే ఉంది “చేప పొలుసుల్లాంటి మబ్బుతునకల మాటుగా”.

  1901. ఆ రోజులు గురించి chavakiran గారి అభిప్రాయం:

    07/15/2007 9:33 pm

    ప్రాతః కాలం తప్ప మరీ పెద్ద సంస్కృత ఓన్లీ పదాలు నాకు పెద్దగా కన్పించలేదు.

    కవిత బాగుంది.

  1902. ఆ రోజులు గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    07/15/2007 5:57 am

    రఘోత్తమరావు గారూ,
    పాలలో వెన్న కలిసి ఉన్నట్ట్లు తెలుగు లో సంస్కృతం ఉండనే ఉంటుంది.
    మీ మంచి పేరు లో ఉన్నదానికంటే ఎక్కువ సంస్కృతం నా కవిత లో ఉన్నదంటారా ?
    ఒక పదం అవసరమా ,అనవసరమా అన్నది మీ లాంటి రసజ్ఞులైన (ఇలా సంస్కృత పదాలు నిత్యం వాడుతూనే ఉంటాము) పాఠకుల అనుభూతికి సంబంధించిన విషయం.
    ఇక కొత్తదనమంటారా,ఈ విషయమై వచన కవితను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చాలా గొప్పకవి తిలక్ గారు అన్నట్ట్లు
    “అసలు కవిత లో నే నవత కూడా ఉంది”.
    కవిత సాధించవలసింది అందం,అందించవలసింది ఆనందం.అవి సాధించలేనపుడు అది కవితే కాదు.ఇక అప్పుడు కొత్తదనం అవసరమే ఉండదు.
    “అమృతం కురిసిన రాత్రి” లో అంటారు తిలక్ గారు,
    “చలజ్జీవన దైనందిన కోలాహల పాంసుప రాగం లో
    తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు”.
    సామాన్య ప్రజానీకం మాట్లాడే భాష రచనలో కూడా వాడాలని అవిశ్రాంతం గా పోరాడిన చలం గారు
    “రవి కిరణాంగుళీ నఖక్షతాలతో శ్యామలాకాశం కందింది”
    అని వ్రాస్తే ,గొప్ప రచయిత,విమర్శకుడు,మార్క్సిస్ట్ మేధావి ,సరళ వ్యావహారిక భాషాభిమాని రాచమల్లు రామచంద్రారెడ్డి గారు పులకించిపోయారు.

    వీరి కవితా పంక్తులలో ఏ సంస్కృత పదాన్ని తీసి ,ఏ తెలుగు పదం అతికి వారు సాధించిన సౌందర్యాన్ని పరిరక్షించుకోగలం?

  1903. ఆ రోజులు గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    07/14/2007 12:38 am

    అనవసరమైన సంస్కృత పదాలను వాడారు. కవితలో కొత్తదనం పై కూడా శ్రద్ధ చూపి ఉండాల్సింది.

  1904. నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి vrveluri గారి అభిప్రాయం:

    07/06/2007 5:42 pm

    జయదేవ్ గారూ:

    శ్రీ కొడవళ్ళ హనుమంత రావు గారు (మైక్రో సాఫ్ట్ ) కొన్ని మంచి పుస్తకాలు (కొత్తవి, పాతవీ!) ప్రచురించడానికి భూరి విరాళం ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ వారు ఆయన విరాళానికి సమంగా మేచింగ్ విరాళం కూడా ఇచ్చారు. కొద్దినెలలలో, ఆ పైకంతో ముందుగా మూడు పుస్తకాలు తానా ఆధ్వర్యంలో ప్రచురించబడతాయి. ఈ పుస్తకాల జాబితాలో నారాయణరావు గారి కవితావిప్లవాల స్వరూపం కూడా ఉన్నది. పాత పుస్తకంలో అచ్చుతప్పులు సరిదిద్దటం పూర్తికాగానే ఆ పుస్తకం, మరొక రెండు పుస్తకాలూ ఈ సంవత్సరాంతం లోగా విడుదల కావచ్చు!

    నారాయణరావు గారి అనువాదాలు, ఒకటో రెండో మినహా, మిగిలినవన్నీ కొందామనుకునేవారికి అమెజాన్ డాట్ కాం లో దొరుకుతాయి.

    — వేలూరి వేంకటేశ్వర రావు

  1905. నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    07/06/2007 5:14 pm

    తెలుగులో కవితా విప్లవ స్వరూపము Digital library of India సైటునుండి డవున్లోడ్ చేసికొనవచ్చును:

    మోహన

  1906. నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి Jaydev Mettupalli గారి అభిప్రాయం:

    07/06/2007 3:19 pm

    వేలూరి గారి వ్యా సం చాలా బాగుంది. చాలా చిన్నదనిపించింది. ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ పుస్తకం ఇప్పుడు ఎక్కడయినా దొరుకుతుందా?. ఈ ప్రవాసం లో పిల్లలతో తెలుగు ఎలాగు మాట్లాడించలేము , శ్రీ వేల్చేరు వారి అనువాదాలు కొని వారికిఇస్తే కనీసం తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసినవాళ్ళ మవుతాం అని నా అభిప్రాయం.
    జయదేవ్ మెట్టుపల్లి
    చికాగో్ 07-06-07

  1907. గ్రహ బలాబలాలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    07/05/2007 10:59 am

    కవిత చాల బాగుంది. ఇందులో హ్యూమర్, సీరియస్నస్
    రెండూ ఉన్నాయి. అమెరికా దేశపు 25వ అధ్యక్షుడు
    మెకిన్లీ, టివీ స్టార్ ఓప్రాల పుట్టిన రోజే నా పుట్టినరోజు! నే
    నూ ఒకనాడు గొప్పవాడవుతాను తప్పకుండా! – మోహన

  1908. కోరిక గురించి raju గారి అభిప్రాయం:

    07/05/2007 1:49 am

    మీ కవిత చాలా బాగున్నది….

  1909. రెండు కవితలు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    07/03/2007 8:10 am

    మొదటి కవిత ముద్దుగా ఉంది. రెండవది పెద్దగా ఉంది:-)

  1910. నిద్ర గురించి nagaraju గారి అభిప్రాయం:

    06/29/2007 10:01 am

    చాలా బాగుంది ఈ కవిత. ఈ కవితను చదువుతుంటే హాయిగా నిద్ర వస్తుంది.

  1911. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    06/20/2007 3:35 pm

    1934 ప్రాంతాల్లో శ్రీశ్రీ రాసిన కవిత్వం చర్చించబడినంతగా, కోట్ చెయ్యబడినంతగా ఆధునిక తెలుగు కవిత్వంలో ఇంకెవరిదీ కనబడదు. అది రాసేనాటికి ఆయన వయస్సు 24 ఏళ్ళే అనేది మనం గుర్తుంచుకోవాలి.

  1912. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    06/20/2007 11:23 am

    శ్రీశ్రీ గారి కవిత్వం పై విపులమైన,ఆసక్తికరమైన వ్యాసం.
    “జడలు విచ్చిన సుడులు రెచ్చిన
    కడలి నృత్యం శమిస్తుందా
    నడుము తడబడి సడలి మునుగక
    పడవ తీరం క్రమిస్తుందా”
    నాకు నచ్చిన కొన్ని శ్రీశ్రీ కవితలలో “నిజంగానే” ఒకటి.
    రచయిత వ్యాసంలో చెప్పినట్లు ఈ పంక్తులు భవిష్యత్తుని శంకించినట్లు అనిపించే అవకాశంఉన్నా,నా వ్యక్తిగత అభిప్రాయంలో ఈ కవిత లో నిరాశావాదం కన్నా మానవాళి శ్రేయస్సు కోరే ఒక కవి artistic as well as idealogic impatience for the welfare of mankind కనిపిస్తుంది.

  1913. అద్వైతం గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    06/06/2007 11:23 pm

    ముగింపులోని భావం కోసమే మిగతా కవిత వ్రాసినట్టు అనిపిస్తోంది.

  1914. అగ్ని స్నానం గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    06/06/2007 11:21 pm

    చక్కగా మొదలైన కవిత్వం మధ్యలో పేలవంగా మారింది. ఉపమానాల సాగతీత ఒక కారణం్ కావచ్చునేమో!!

  1915. లోపలికి గురించి Vamshidhar Kudikala గారి అభిప్రాయం:

    05/31/2007 4:38 am

    అన్నీ బాగున్నాయి. నాకు ‘లోపలికి’ కవిత చాలా బాగా నచ్చింది.

  1916. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి jilukara Sreenivas గారి అభిప్రాయం:

    05/22/2007 6:59 pm

    అరుదైన వ్యాసం. ఇంకా శ్రీశ్రీ కవిత్వం గురించి ఆనాటి విమర్శకుల విశ్లేషణలు పొందుపరచాలని కోరుతున్నా.

  1917. లోపలికి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    05/20/2007 4:08 pm

    ఒహో! కవిత్వంపై కవిత్వం. అన్నీ బాగున్నాయ్ .
    బాగా రాసారు జయ గారు!

  1918. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి వాడపల్లి,శేషతల్పశాయి గారి అభిప్రాయం:

    05/04/2007 10:06 pm

    వీరిదే మరొక విలువైన ‘ఖండకావ్యము – భావకవిత్వము‘ అను వ్యాసమును ఆంధ్రభారతిలో చదువగలరు.


    నమస్సులతో,
    శాయి.

  1919. మురికి గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:

    05/01/2007 1:14 pm

    ఎప్పుడో, ఎక్కడో చదివిన గీతాంజలిలో కవితొకటి మసకమసకగా గుర్తుకొస్తూ రానట్టు. చాలా బావుందండీ కన్నెగంటి గారు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  1920. పునశ్చరణం గురించి Pavan garikapati గారి అభిప్రాయం:

    04/30/2007 8:36 am

    చాలా అనందంగా ఉంది, వాదన ప్రతి వాదనలు చూడడం ఈ కవిత మీద,
    మనం వ్యాసాలు రాయకుండా కవితలు రాయడమెందుకు? వ్యాసాలకు వచన కవితలకు ఎక్కడ తేడా? ఎంతో గొప్ప భావాన్ని ఎన్నో పదాలని ఉపయోగించి చెప్పినా అది కవిత్వమేనా? ఈ మధ్య చాలా మంది ‘కవులు?’ క్లుప్తత అంత పెద్ద విషయమే కాదని వాదిస్తున్నారు, దాని కోసం చేపల కధని ఉపమానంగా ఉపయోగించడం? హాస్యాస్పదం.
    ఏ కవి కైనా ఏదో ఒక భావావేశంతొ కవిత మొదలవుతుంది, అది అప్పుడే గని నుండి బయట పడ్డ వజ్రం లాంటిది. దానికి ఎంతో సాన పెడితే గాని అది చూపరులకు అనందాన్ని ఇవ్వలేదు.

    ఉదాహరణకు: పైన కవిత

    పునశ్చరణ ఎందుకు? మాతృత్వ ప్రేమతోనా? అయితే ఈ తొలి చూలాలు ఎందుకు? పాఠకుడు ఏ భావనకు లోనవ్వాలని?

    ఒక్క క్షణం కూడా వదలలేక — నిజంగా మాతృమూర్తికి ఆ భావన సహజమా?

    అప్పుడే పుట్టిన పసికందును
    ముద్దాడే మాతృమూర్తిలా

    ఈ రెండు పంక్తులు సరిపోవా? ఎక్కువ గా వివరిస్తే భావాలు బంధీ అయిపోవా? అప్పుడే పుట్టిన పసికందుని ముద్దాడే మతృమూర్తి ‘ఒక్క క్షణం కూడా వదలలేక’ అనే భావానికే పరిమితమా?

    అన్నీ ప్రశ్నలే వేసాను పరిశీలించండి.

    ఇలాగే ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని పరిశీలించి సరి చేస్తే కవిత తప్పకుండా బాగుంటుంది.
    పవన్

  1921. పునశ్చరణం గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    04/20/2007 7:10 pm

    అయ్యా శివ గారు,
    రసభంగాలూ, కొంపలంటుకోవడాల దాకా మీ అలోచనలు వెళ్ళిడానికి నా అభిప్రాయాలలో ఏవుందో నాకు ఎంత వెతుకున్నా అర్థం కాలేదు. నాకు నచ్చిన కవితలు కనుక రెండింటికీ చెరి ఒక (చిన్న) సవరణ సూచించాను. అవి,
    1. విన్నకోట రవి శంకర్ గారు కవితని (భావం ఏ మాత్రం దెబ్బ తినకుండా) ఇంకొంత concise గా చెప్పి ఉండవచ్చని
    2. వైదేహి గారు పోలికలని కూడా ముచ్చటగా మూడేసి పంక్తులలో చెప్పినట్లైతే structural uniformity వల్ల కవిత మరింత రక్తి కట్టేదని

    వచనకవిత్వానికి ఏ నియమాలులేవు కనుక నా సూచనలు అంత సమంజసమైనవి కావని వచన కవిత్వం రాసే వాళ్ళూ, చదివేవాళ్ళూ అనుకోవచ్చు. కానీ వచన కవిత్వంలో కూడా సందర్భోచితంగా కొన్ని లక్షణాల విషయంలో శ్రధ్ధ చూపించడం అవసరం అని నా నమ్మకం. ఒక్క Economy of words మాత్రం అన్ని సందర్భాలలోనూ సముచితమైనది (We will have to agree to disagree here).

    చివరగా, ఎవరి రచనలు వారికి అపురూపం కనుక పై రెండు కవితలనీ (నా సూచనలు మీకు అర్థం అవడం కోసం) నాకు తోచినట్లుగా మార్పులు చేసి ఇక్కడ చూపెట్టడం అంత సబబు కాదు నా అభిప్రాయం.
    శలవు,
    కా.రా

  1922. పునశ్చరణం గురించి P. Siva గారి అభిప్రాయం:

    04/20/2007 12:58 pm

    కా.రా. గారు,
    మీ కథ బావుంది.
    క్లుప్తత అన్నిచోట్లా పనికిరాదంటే ఎక్కడా పనికి రాదని కాదు. సందర్భాన్నిబట్టి అవసరం మారుతుంది.
    ఈ రెండు కవితల్లో ఏ మాటలు అనవసరంగా చేరి మీకు రసభంగం కలిగించాయో వివరిస్తారా? లేదా అదే భావస్ఫూర్తి కలిగిస్తూ ఏ మాటలు తొలగించవచ్చో తెలియజేయగలరా?
    జిజ్ఞాసతో,
    శివ

  1923. పునశ్చరణం గురించి P. Siva గారి అభిప్రాయం:

    04/19/2007 6:40 am

    రాజశంకర్ గారు,
    ఇవి మెటఫర్లు కావు సిమిలీలు. అనగా ఉత్ప్రేక్షలు కావు, ఉపమానాలు. ఇక ‘క్లుప్తంగా వివరించడం’ అనేది oxymoron.
    ఈమధ్య క్లుప్తత మీద obsession పెరుగుతున్నట్లుంది. నాలుగు మాటలు ఎక్కువయినంత మాత్రాన కొంపలేవీ మునిగిపోవు భావం అద్భుతంగా ఉన్నప్పుడు, కవి చెప్పదలుచుకున్నది పాఠకుడి మనసుకి అందినప్పుడు. సందర్భాన్ని బట్టి కవితలు ఒక్కోసారి దీర్ఘంగానూ ఉంటాయి, పదాలూ, భావాలూ పునరావృతమవుతూ ఉంటాయి. అందరి నవ్వులూ, ఏడుపులూ ఒకలా ఉండవుగదా! అన్నింటికీ క్లుప్తత మంత్రం పనికి రాదు. అప్పుడు మనకు హైకూలు తప్ప ఏవీ మిగలవు. ‘ఇక్కడ తాజా చేపలు సరసమైన ధరలకు అమ్మబడును’ అన్న బోర్డు కథ వినలేదా? అవధరించండి.
    ఒకాయన కొత్తగా చేపలకొట్టు పెట్టుకున్నాడు పైన చెప్పిన బోర్డు రాయించుకుని. మీలాంటి పెద్దమనిషి వచ్చి “పిచ్చోడా, షాపు ఇక్కడ పెట్టుకుని చేపలు ఇంకెక్కడో అమ్ముతావా? ‘ఇక్కడ’ అక్కర్లేదు తీసేయ”మన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. ఇంకొకాయన వచ్చి “ఈ సముద్రపొడ్డున తాజా చేపలు కాకపోతే కుళ్ళినవి ఎవరయినా అమ్ముతారా? ‘తాజా’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మరొకాయన వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుని చేపలు కాక ఇంకేం అమ్ముతావు. ‘చేపలు’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మీరొచ్చి “చుట్టూ పోటీగా ఇన్ని కొట్లుంటే అందరూ సరసమైన ధరలకే అమ్ముతారు గనక ‘సరసమైన’ అనవసరం’ తీసేయించు” అన్నారు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వేరొకాయన వచ్చి “ధరకు కాకుండా ఊరికే ఎవరయినా ఇస్తారా? ఆ మాట తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వాళ్ళావిడ వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుంది అమ్మడానికి కాక కొనడానికా? అర్థం లేని మాట, తీసేయించు” అన్నదిట. ఆ అమాయకుడు అలాగే చేశాడు.
    ఇప్పుడు ఆ ఖాళీ బోర్డున్న షాపులో చేపలు ఎవరు కొంటున్నారో మీకే తెలియాలి.
    అన్నట్టు మళ్ళీ పైకి వెళ్ళకుండా బోర్డు మీదినుంచి మీరే మాట తీయించారో చెప్పుకోండి.

  1924. ఒక చలిపొద్దు గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    03/31/2007 8:32 am

    కవిత చాలా బావుంది. ఎంచుకున్న కవితావస్తువు కూడా చాలా బావుంది. పదాలు పొదుపుగా వాడి ఉంటే కవితాసౌందర్యం మరింతగా ఆవిష్కరింపబడి ఉండేది.

  1925. పునశ్చరణం గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    03/31/2007 8:14 am

    కవిత బావుంది. metaphors ని కూడా ముచ్చటగా మూడేసి పంక్తులలో క్లుప్తంగా వివరిస్తే కవిత మరింత బాగుండేదని నా అభిప్రాయం.

  1926. ఓ.పీ.నయ్యర్‌ గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    03/30/2007 12:39 pm

    చక్కటివ్యాసం.శాస్త్రీయ సంగీత జ్ఞానం లేకుండా సంగీత దర్శకత్వం చేయగలగటం అన్ని పాప్యులర్ గీతాలు అందించటం ఆశ్చర్యమే కాదు అపురూపం కూడా.

    నయ్యర్ అందమైన బాణీలు, S.H.Bihari,Sahir Ludhiyanvi,Majrooh Sultan Puri లాంటి కవుల చక్కని కవిత్వం ,అలల మీద తేలుతున్నట్లు సాగే ఆశా కంఠస్వరం, వెరసి మంచి పాటలు చాలా గుర్తు చేసారు.

    చివరి రోజుల్లో నయ్యర్ గురించి చదివాక మాత్రం విషాదంగా అన్పించింది. ఎందుకో దువ్వూరి రామిరెడ్డి గారి “అంతము లేని ఈ భువనమంత పురాతన పాంధశాల” గుర్తుకి వచ్చింది.

  1927. నిన్నటి కల గురించి t.sujatha గారి అభిప్రాయం:

    03/28/2007 1:53 am

    చాలాబగుంది.చక్కటి శైలి కొనసాగించండి మీ కవితా ఝురి.

  1928. పునశ్చరణం గురించి స్వాతి గారి అభిప్రాయం:

    03/19/2007 5:03 am

    అద్భుతం!!
    బిడ్డను కన్న ప్రతి తల్లికీ
    కవిత రాసిన ప్రతి వారికి అనుభవమే ఇది.

  1929. “పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    03/17/2007 3:37 pm

    సమీక్ష బావుంది.ఈ సంపుటి లో నాకు నచ్చిన కవిత “బనలతాసేన్”.

    రచయిత చెప్పినట్లు ఈ కవిత లో ఇస్మాయిల్ గారి స్వంత ముద్ర,ఆయన సొత్తైన పదాల పొదుపు లేకపోవటమే కాక ఆయన సాధారణంగా వాడని గ్రాంధిక పదాలు కూడా ఉన్నాయి.అయితే మూలకవిత లో ఉన్న భావగాఢతకు ,ధారకు అనుగుణమైన అనువాదం అనిపిస్తుంది. మూల కవిత లోని mystic beauty ని ఇస్మాయిల్ గారు చాలా అందం గా పట్టుకున్నారు. మంచి అనువాదం లక్షణం కూడా అదే కదా!

    కవిత రచనా కాలం గురించి పుస్తకం లో లేదు.ఇస్మాయిల్ గారు చెప్పుకున్నట్లు మొదట్లో ఆయన పైన కృష్ణశాస్త్రి తదితర భావకవుల ప్రభావం ఉండేది.ఈ కవిత ఆయన తనదైన”ఇస్మాయిల్ బాణీ” ని ఏర్పరచుకొనక ముందు వ్రాశారో తర్వాత వ్రాశారో తెలియదు.తర్వాతే వ్రాసి ఉంటే అది ఆయన కవిత్వం లోనే ఓ ఆసక్తికరమైన పరిణామం అయిఉండ వచ్చేమో!

    దీర్ఘకవితైనా,మినీకవితైనా,సరళమైనా,గ్రాంధికమైనా,వచనమైనా,పద్యమైనా,ఏ మాండలికంలో వ్రాసినా హృదయాన్ని తాకే కవిత్వం పదికాలాలు నిలబడుతుంది.

    మూలకవితల గురించి,కవుల గురించి వివరాలు లేకపోవటం రచయిత చెప్పినట్లు పెద్ద లోపం.మూలకవితలపై అవగాహన లేనిదే అనువాదకవితలని
    ఆనందించగలమేమో కానీ అంచనా వేయటం కష్టమేమో అనిపిస్తుంది.

  1930. పునశ్చరణం గురించి మిరపకాయ్ గారి అభిప్రాయం:

    03/16/2007 6:11 pm

    నేను కవిని కాదు కానీ మీకవిత చదివిన తర్వాత… నాకు నేను ఎప్పుడో గీసిన బొమ్మలు మళ్ళీ చూడాలనిపించింది …. మనస్సుమూలల్లో ఎక్కడో ముళ్ళ చెట్లకు చిక్కుకుపోయిన గాలిపటాల్లాటి జ్ఞాపకాలు వెనక్కొస్తున్నాయి… కవిత చాలా బాగుంది ..

    ఒక చిన్నవిషయం .. మీరు కవితను ఇంకా పెద్దది వ్రాసి సగమే ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తొంది . మీరు అర్ధోక్తిలో ఆగిపోయిన విషయం మీభాష చెబుతోంది … లేకపోతే పైన ఎవరో చెప్పినట్టు metaphors ఎక్కువవ్వడం వలన అలా అనిపిస్తోందేమో ..

  1931. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/08/2007 10:59 am

    వ్యాస కర్త గారి వివరణ కాస్త దురుసుగా ఉన్నట్లుగా అనిపించిందని నా అభిప్రాయం. ఏ వ్యాసమైనా, కథ అయినా, కవిత అయినా విమర్శ ఉన్నప్పుడే దాని బాగోగులు తేలేది! రచయితలకి తమ తమ రచనలనీ, అభిప్రాయాలనీ, విశ్లేషణనీ, ప్రజల్లోకి తీసుకెళ్ళే స్వేచ్ఛ ఎలా ఉంటుందో, పాఠకులకీ విమర్శంచే స్వాతంత్ర్యం ఉంటుది కూడా! ఈ వ్యాసం బాగోలేదని ఎవరూ ఉటంకించ లేదు. అక్కడక్కడ కాస్త తప్పులు దొర్లాయంతే ! దానికే సవాళ్ళు చేస్తే ఎవరూ ఏమీ చేయలేరు.

  1932. పునశ్చరణం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/08/2007 8:44 am

    నిద్రపోతున్న నా కూతుర్ని చూస్తుంటే మళ్ళా, మళ్ళా చూడాలనిపిస్తుంది. నా చేతుల్లో వొదిగిపోయిన ఆ పిల్లేనా, ఈ రోజు నేనెత్తలేనంత ఎత్తుకి ఎదిగిపోయింది అనిపిస్తుంది. చెప్పలేని అధ్భుతవైన భావవొకటి మనసంతా విస్తరిస్తుంది. కాగితం మీద పరచుకున్న ఈ నల్లని నాలుగు మరకలు, మన మన్సులో పుట్టిన, మనలో భాగవే కదూ! మెదడులో వుక్కిరిబిక్కిరగా వున్న ఆ రసాయనిక సమీకరం విచ్చుకున్న రూపవేకదా మన కవితకానీ, కథ కానీ.

    చాలా అద్భుతంగా వుందండీ మీ కవిత వైదేహీ శశిధర్ గారు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  1933. పునశ్చరణం గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    03/07/2007 6:54 am

    నిదర్శనలు ఒకటి కంటే ఎక్కువైతే కవిత పలచనబడగలదు.

  1934. సీతా-రామా గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/06/2007 12:21 pm

    నా కథ గురించి నేను

    సౌమ్యా, కిషోర్, ప్రసాద్,

    విమర్శ నిజవే. పది, పదిహేనేళ్ళుగా ఈ దేశంలో గడపటం వలన, చాలా ఆలోచనలు కూడా ఆంగ్లంలోనే వస్తాయ్ . వాటిని మరికొంచం ఓపిక చేసుకుని తెలుగులో పెట్టకపోవటం వొక లోపవే.

    కొంచెం కామాలు ఎక్కువగానే వున్నాయ్ ఈ కథలో. కానీ ఇక్కడ ఏదో జరిగిన సంఘటనని చెప్పడం కాకుండా, గతం గురించి మనసు ఏడ్చే ఏడుపీ కథ. మనిషికొచ్చే ఏడ్పు ఎలా ఐతే వెక్కుళ్ళు, వెక్కుళ్ళుగా వస్తుందో, మనసికంగా కలిగే వొత్తిడి కుడా అట్లాగే వెక్కుళ్ళు, వెక్కుళ్ళుగా, కామాలు, కామాలుగా పాటలాగా వస్తుంది. ఆ కామాలు, వాటి మధ్య వున్న కనిపించీ, కనిపించని రిథమ్, ఆ మానసిక వొత్తిడిని, ఘాడత తగ్గకుండా అక్షరాల్లోకి అనువదించగలిగేయని నా ఉద్దేశం.

    పేర్లను అలాగ పెట్టటంలో ఉద్దేశవేంటంటే, సీతా, రామ్ ల మధ్య వున్నటువంటి లింగ బేధాన్ని తీసేసి, వాళ్ళిద్దరి వ్యధ వొకటిగా వుండటం చూపించ దలచుకున్నాను. అదెంతవరకు క్లిక్ అయిందో అనుమానవే.

    మనం వ్రాసిన కథ కానీ కవిత కానీ ప్రచురణకి పంపే ముందు, చాలా సార్లే చదువుతాం. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు, ఎన్ని సార్లు చదివినా, మనదనే మమత మనసుని కప్పేసి లోపాల్ని అంతగా తెలీనీదు. వొకసారి ప్రచురించబడిన తర్వాత, వొకటి, రెండు విమర్శలు వచ్చిన తర్వాత, బుర్ర మళ్ళా ఓపెన్ కావడం మొదులవుతుంది.

    కథ ఆరంభం బాగుంది గానీ, ముగింపు చాలా పేలవంగా వుంది. వున్నట్టుండి ఏవి వ్రాయాలో తెలియక, ఎలా ముగించాలో తెలియక, ఏదో రెండు పేరాలు వ్రాసి ఆపేసినట్టుంది. ఇక సీతా రావుల చిత్రణ నాకు చాలా నచ్చినా, వారి ద్వారా చెప్పదలచుకున్న విషయం కథంతా అంతర్లీనంగా సాగినా, వారి మనసు వొత్తిడి అక్షరాల్లోంచి చదవరి మనసులోకి ట్రావర్స్ కాగలిగేలా వున్నా, ఎందుకో కథ అసంపూర్తిగా అనిపించింది. పది పేజీల కథలో మధ్యలో నాలుగు పేజీలు చదివినట్లుంది. గతంలోకి తొంగి చూస్తున్నట్టు కాకుండా, వర్తమానంలో జరుగుతున్న కథలా వ్రాసుంటే బాగుండేది. బ్రతుకులో ఇష్టవైందేదో తెలిసి, దాన్ని కొంచం కొంచగా వదులుకుంటూ, అశహ్యించుకునే దారిలోకి తెలిసీ, తెలియకుండా సీత రావుల ప్రయాణాన్ని, ఆ ఘర్షణని జరుగుతున్న విధంగా చిత్రిస్తే మరింత బాగుండేది.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  1935. ఒక చలిపొద్దు గురించి ఫణి డొక్కా గారి అభిప్రాయం:

    03/06/2007 11:15 am

    చాలా బాగా రాసారు.

    ఆకులు రాల్చే చెట్టైనా, ఆకులు రాలని చెట్టైనా, మీ కవితలో ఎంతో అందంగా వొదిగిపోతుంది. చూడగలిగిన వారికి మీకవితల్లో మనోహర దృశ్యాలు కనిపిస్తాయి.

    నా మట్టుకు నేను మీ కవితలకోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ వుంటాను, ఆసక్తిగా..

    మీ ఫణి డొక్కా.

  1936. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    03/06/2007 9:13 am

    చక్కని వ్యాసం! సంగీతాన్ని ఆనందించటం తప్ప విశ్లేషించటం తెలియని వారిని,సంగీతం పై అపారమైన అభిమానమే తప్ప అధికారం,విజ్ఞానం లేని వారిని కూడా ఆసక్తి కరంగా చదివించిన వ్యాసం. ప్రాక్పశ్చిమ సంప్రదాయాలలోని దిగ్గజాల జీవిత విశేషాలను,విభిన్న సంగీత రీతుల లోని కొన్ని విశేషాలను వివరించిన తీరు బావుంది.ఆకట్టు కునే శైలి వచనంలో దాగిన కవిత్వంలా ఉంది.

  1937. “పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి ప్రద్యుమ్న గారి అభిప్రాయం:

    03/05/2007 11:36 am

    ఈమాటలో అప్పట్లో చాలా కామెంట్లు ” ఈ కథ బాగుందనో, ఈ కథ బాగోలేదనో వచ్చేవి. మన సంపాదకులు గారే ఇలాంటివి బదులు, బాగుంటే ఎందుకు బాగుందో, బాగోలేకపోతే ఎందుకు బాగోలేదో సవివరంగా సెలవిస్తే మిగిలిన వారికి బాగుంటుందని సెలవిచ్చారు.

    ఈ వ్యాసంలో మాత్రం సంపాదకులు అలాంటి తప్పేచేసినట్టు నాకు అనిపించింది. ముఖ్యంగా రెండు విషయాల్లో.

    1.ఇస్మాయిల్ గారే ఈ సంకలనం అచ్చువేసుకొనివుంటే, దీనిలో చాలా భాగం అచ్చయేది కాదు, అని నా దృఢ నమ్మకం. (ఏ కవితలు/హైకూలు ఇస్మాయిల్ గారి తరహాలో లేవో, వ్యాసకర్త పై అభిప్రాయాన్ని corroborate చేయడమో, కొంతచర్చ చేయడమో చేస్తే బాగుండేది.)

    2. ఇస్మాయిల్ గారి భక్తులు నామీద విరుచుక పడ్డా, ఈ సంకలనం గురించి నేను చెప్ప దలచుకున్నది (చర్వితచర్వణం అని ఆరోపించినా సరే!) చెప్పి తీరాలి. ఇస్మాయిల్ గారే బ్రతికి ఉంటే ఈ సంకలనం ఇంతకన్నా ఎక్కువశ్రద్ధతో చదువరికి సులువుగా ఉండేట్టు ప్రచురించి ఉండేవారనుకుంటాను! (ఇదీ అంతే. చదువరికి పుస్తకంలో ఏం సులువుగా లేదో నాకైతే అర్థం కాలేదు. సరైన చర్చ లేకపోవడం వల్ల “ఇస్మాయిల్ గారి భక్తుల్ని” ఏదో ఒకటి అనడం కోసం రాసినట్టనిపించింది. అలాగే తెలుగులో ఎవరైనా ఒక విషయాన్ని ప్రతిపాదిస్తేనో, ఎవర్నో ఒకరిని మెచ్చుకుంటేనో, వాళ్ళందరిని ఒకగాటన కట్టి ఒక లేబిల్ అంటించే దురాచారం రొచ్చులో సంపాదకులు పడడం ఆశ్చర్యంగా ఉంది. అన్ని తెలుగు సంప్రదాయాలతో బాటు దీనినీ తు.చ. తప్పకుండా పాటించినట్టున్నారు. ఇస్మాయిల్ గారే ఈ లేబిల్స్ అంటించే సంప్రాదాయాన్ని తీవ్రంగా గర్హించినట్టు గుర్తు.

    ఇక వ్యాసకర్తతో నేనీకభవించిన ఒక సూచన తెలుగులో వచ్చిన చాలా అనువాదపుస్తకాలకు వర్తిస్తుంది. అనువాద కవితతో బాటు, original write name, poem name ఆంగ్లంలో రాస్తే చాలా మందికి original చదివే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇంటర్నెట రోజుల్లో. ఉదా: జోర్గె లూయిస బోర్గెస కవితలు అని రాస్తే ఆయనెవరో కనుక్కోవడానికి మరో పరిశోధన మొదలెట్టాలి.

    పుస్తకం చదివిన తరువాత నాకు తోచిన మరో విషయం. ఒక పుస్తకం మరణాంతరం ప్రచురించేటప్పుడు, ప్రచురణ కర్తలు, ఆ కవితల్ని ఎలా సేకరించిందీ? (రచయిత ఎవరికైనా ప్రచురించమని ఇచ్చారా? లేక డైరీలో, చిత్తు కాగితాలో వెతికి సంపాదకులే ప్రచురించారా? ఇక ఈ సంపాదకవర్గం ఎవరు? ఈ ప్రక్రియలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఇలాంటివి ముందుమాటలో రాస్తే బాగుండేది.

    ప్రద్యుమ్న
    (ఆచార్యుల, పీఠాధిపతుల, రకరకాల రసాల -భక్తుల -బాధితుడు).

  1938. “పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి Narayanaswamy గారి అభిప్రాయం:

    03/05/2007 7:04 am

    సమీక్ష బాగుంది. ఇస్మాయిల్ గారి ఈ సంకలనం లోని కొన్ని పారడాక్సెస్ ని బాగా పట్టుకున్నారు. అయితే ఒక చిన్న సమాచారం – జీవ(బ)నానంద దాస్ మీద కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఒక పుస్తకం తెచ్చారు. భారతీయ సాహిత్యకారులు అన్న సిరీస్ లో అనుకుంటా! దాన్ని కుందుర్తి గారు రాసారు. అందులో జీవనానందదాస్ కవితలని చాలా అనువాదం చేసారాయన. వాటిల్లో “వనలతా సేన్” ఉంది. చాలా సాఫీగా , అచ్చతెలుగు పదాలతో అద్భుతంగా సాగుతుందా అనువాదం.

  1939. “పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/04/2007 9:18 pm

    భావ కవిత్వం రాసే ప్రతీ కవీ, రాద్దమనుకొనే వర్థమాన కవులు తప్పక చదవాల్సిన పుస్తకం. కేవలం వస్తు విమర్శ లేదా సమీక్ష తప్ప ఎక్కడా అతి స్తుతి లేని సమీక్ష ఇది. ఆకులు, పూలు, చెట్ల మీదే కవిత్వం రాసే కవులు
    చదవాల్సిన పుస్తకం. సమీక్ష చదివితే ఖచ్చితంగా పుస్తకం చదవాలి అన్నట్లుగా రాసారు.

  1940. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    03/03/2007 4:50 pm

    ఒత్తున్న విలేఖరి ఒప్పే!

    నేను చాలాకాలంగా అమెరికాలో ఉండటాన, మన దినపత్రికలు చదివే అలవాటు పోయి, సాహితి గారు సవరిస్తే, భయమేసి తప్పు ఒప్పేసుకున్నాను. కాని “శబ్దార్థ రత్నాకరము” లో వెతికినా, “బ్రౌన్” లో వెతికినా ఆ రెండు మాటలూ కనిపించక ఏది తప్పో ఏది ఒప్పో నిర్ధారణగా తెలియలేదు. బూదరాజు ఏ సందర్భంలో విలేకరులు అన్నది వాడారో వారి పుస్తకాల్లో కనబడలేదు.

    లేఖలు రాసే అలవాటు తప్పినా, చలం రాసిన “ప్రేమలేఖలు” ఇంకా గుర్తున్నాయి. ప్రాచీన కవిత్వంతో పరిచయం లేకపోయినా, కవిత్వం రాయడానికి నిరుపహతిస్థలమూ, ఉయ్యాల మంచమూ, ఊహ తెలిసిన లేఖకులూ, వగైరా అవసరం అని పెద్దన చెప్పిన ఆశుపద్యమొకటి నోటికొచ్చు.

    మరి మన పత్రికల్లోకి విలేకరులు ఎలా జొరబడ్డారా అని నా మనసులో తీరని సందేహం ఉండిపోయింది. ఈవిషయంలో పత్రికల వాళ్ళకన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అని సరిపుచ్చుకోలేకపోయాను. అల్పప్రాణమా, మహాప్రాణమా అని నాప్రాణం రెంటి మధ్యా చానాళ్ళు ఊగిసలాడింది. చివరకి రాత్రి ఇది నాకంటబడింది. ప్రాణం లేచి వచ్చింది:

    “పత్రికలలో విలేకరి, విలేఖరి అనే మాటలు విస్తృతంగా కనిపిస్తుంటాయి. బహువచనంలో విలేకరులు – విలేఖరులు. విలేఖరుడు వంటి ఏకవచనరూపం కూడా ఉండవచ్చు. ఇక్కడ లిఖ్ అన్నది ధాతువు. అందువల్ల విలేఖరి అనే రూపం ఏర్పడుతుంది. దీనిలో ఖర శబ్దాన్ని విరిచి గాడిదలని చమత్కరించడానికి వీలుంటందన్న భయంతోనేమో కొంతమంది విలేకరి అనేమాటకు ప్రచారం కలిగించారు. చంద్రశేఖర, రాజశేఖర, గుణశేఖర వంటి పేర్లలో కూడా ఈ విధమయిన విరుపునకు అవకాశం ఉంది. అట్లా అని ఈ పేర్లు పెట్టుకోవడం మానలేదు కదా. ఈ భయం తప్పితే విలేఖరిని విలేకరి అనడానికి కారణం కనిపించదు. ఖ-క అయి విలేకరి అనే తద్భవపదం ఏర్పడడంలో అసహజమేమీ లేదు. కాని, ఆధునిక రచనా భాషలో విలేఖరి అని రాయడానికి సందేహించ వలసిన అవసరమేమీ లేదు.”
    — “మన భాష,” డి. చంద్రశేఖర రెడ్డి, పేజీ 28.

    హమ్మయ్య! ఇప్పుడు ప్రాణం కుదుటబడింది.

    ఈ సంచిక సంపాదకీయం లో ప్రస్తావించారు కనుక మరో మాట చెప్తాను. విద్యావంతులు తమ మాతృభాషలోనే స్పెల్లింగు తప్పులు చెయ్యటం చాలా సిగ్గుచేటయిన విషయం. కాని ఇలాంటి తప్పులని సవరించుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకన్నా సహాయపడే సమగ్రాంధ్ర నిఘంటువు మనకి లేదు. కవిత్వ భాషకి కాకపోయినా వాడుక భాషకన్నా మంచి నిఘంటువు లేకపోవడం మనకున్న పెద్దలోటు. ఇంతకన్నా శోచనీయమైనది మరేముంది? ఈ లోటు తీర్చడం కన్నా ముఖ్యమైన వేరే పనేముంది?

    ఆవుల మంజులత గారు అధికారంలోకి వచ్చినప్పుడు దీనికోసం తప్పక కృషి చేస్తామని మాట ఇచ్చారు. ఆవిడ కార్యదక్షురాలని కూడా విన్నాను. కాని ఆ ప్రాజెక్టు ఏస్థితిలో ఉందో ప్రకటించినట్లు లేదు!

    ఇదేదో కొందరు ఔత్సాహికులు చెయ్యగలిగింది కాదు. అనేకమంది పండితులు దీక్షతో చాలాకాలం కలిసి పనిచేస్తేగాని ఫలితం ఉండదు. దీని కోసం తానా, ఆటా సంస్థలు కృషి చెయ్యాలనీ, అందరూ తమ వంతు సాంకేతిక, ఆర్థిక సహాయం అందజెయ్యాలనీ నా కోరిక.

    అంతవరకూ, భాషావ్యాసాల ద్వారా నాలాంటి సామాన్య పాఠకులకి ఉపయోగపడే రచనల్ని చేస్తున్న భాషావేత్తలకి కృతజ్ఞతలతో,

    కొడవళ్ళ హనుమంతరావు

    [విలేకరి, విలేఖరి అన్న పదాలలో ఏది సరైనదో నిర్ణయించడం అంత సులభం కాదు. -అరి అన్న తెలుగు ప్రత్యయాన్ని సుంకరి, కుమ్మరి, కమ్మరి మొ॥ తెలుగు పదాల్లో వాడితే, -కర/కరి /కార అన్న సంస్కృత ప్రత్యయాలను సుధాకర, అహంకారి మొ॥ సంస్కృత ప్రత్యయాల్లో వాడుతాము. లెక్క ప్రకారం విలేఖ(సంస్కృతం) లను సృష్టించే వాడు విలేఖకరుడు, విలేఖకరి అవ్వాలి. అయితే, రెండు సన్నిహిత ధ్వనులు పక్కపక్కనే ఉన్నప్పుడు, రెండు ధ్వనులకు మారుగా ఒక్క ధ్వనిని మాత్రమే పలకడం అన్ని భాషలలో జరిగే ధ్వని పరిణామమే (ఈ ధ్వని పరిణామాన్ని సదృశ వర్ణలోపం (Haplology) అని అంటారు). ఈరకమైన ధ్వని పరిణామం వలన విలేఖకరి అన్న పదం విలేఖరి/విలేకరి గా మారిందని చెప్పుకోవచ్చు. లిఖించేవాడిని (రాసేవారిని) అచ్చతెలుగులో “లేకరి” అనేవారు (మహాప్రాణాలు అచ్చతెలుగులో అల్పప్రాణాలు అవుతాయి కదా!). విలేఖలు రాసేవాడు, విలేకరి అయినా కావాలి, లేదా విలేఖకరి అయినా కావాలి. బూదరాజు గారెప్పుడూ విలేకరి అనే రాసేవారు – సం.]

  1941. నామాట గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:

    03/02/2007 8:01 pm

    అయ్యా,
    మట్టి పిసుక్కోని, ఎద్దు తోక తిప్పుకొనేవాడ్నే కానీ, యెప్పుడో సిన్నప్పుడు, మా ఊరయ్యొరు పున్నెవా అని ఏదో రెండు ముక్కలొంట బట్టినాయ్ కాబట్టి, నేనీ రెండు ముక్కలు రాస్తుండా. నాకు సంస్కృతవెంత తెలుసో, సంస్కృతి, సంస్కారాల గురించికూడా అంతే తెలుసు. అందుకని వాటి గురించి నేను మాట్లాడితే బాగుండదు. కాకపోతే ఇన్నేళ్ళు తెలుగు గడ్డమీద బతికేను కాబట్టి, తెలుగు బతుగ్గురించి కొంచెంతెలుసు. అదిగిదిగో దాన్ని గురించే చెప్తున్నా. దాన్నే మీరు సంస్కృతి, సంస్కారవనో, మట్టీ మశానవనో ఏదో అంటారు. మందలేందంటే అయ్యా, మన తెలుగోళ్ళలో మూడూముక్కాలు మందికి సదవటవే రాదు. నాలుగచ్చరాలు వొచ్చినోల్లు ఒందకి నలగరకన్నా ఎక్కువుండరు. అట్టాటోల్లకి బాపూలు, సినారేలు ఏందెలస్తారయ్యా? వాళ్ళకి నన్నయ, మావూర్లోపుట్టిన తిక్కన గురించే తెలీదు. ఇంకమాకు బంధ కవిత్వాలు, అష్టావధానాల గురించేంతెలస్తదయ్యా. సరే మేవేదో యెగసాయం కేసుకునేవాళ్ళం అనుకుంటే, దురద్రృష్టం కొద్దీ మిగతావాళ్ళు మాకన్నా అన్నేయం. ఈ నాలుగు ముక్కలు నేర్చే అవకాశం, తీరికా కుడాలేఓళ్లకి. ఇంతకీ మందలేందంటే, ఏవీ తెలీకపోయినా, భాస కుడా సరిగా రాకపోయినా, మీరనే ఆ సంస్కృతి మా బతుకుల సారవే. మేవే కదా తెలుగు నేలంతా, తెలుగుతనవంతా మాదే కదా. బాపూది, సినారేది, నన్నయ్యది, తిక్కనది, లేకపోతే మావూరి తెలుగయ్యోరిది, మా వూరి భజనసంగానిదీ మాత్రవే కాదుకద తెలుగుతనం. భజన సంఘవంటే గుర్తుకొచ్చింది, మీ తానాలూ, ఆటాలు అట్టటియే కదా. కాకపోతే మీది కోచం ఐటెక్కు అంతేకదా. మా భజనసంఘం మా తెలుగుతనాన్ని రచ్చించదు. మా తెలుగుతనవే లేకపోతే మీరనేటటువంటి మా సంస్కృతే భజన సంఘాన్ని రచ్చిస్తది, పోసిస్తది. సంస్కృతంటే మాపోలేరమ్మ ఇగ్రహంకాదు, రాతిలో పోతపోసినట్టు, నిన్నా, ఈరోజు, రేపు కూడా శిలకొట్టినట్టు మార్పు లేకుండా అట్టె వుండడానికి. మంచికానీ, చెడుకానీ అది మారేది మారేదే. బాపూలూ, సినారేలు, అష్టావదానాలు, శథావదానాలు, ఎమ. ఎ తెలుగులు, చంధస్సులో డాక్టరేట్లూ, త్యాగరాజు కీర్తనలు, సరసవైన ప్రార్థనలు, భజన సంఘాలు, తానాలు, ఆటాలు ఇయ్యన్నీ సంస్కృతిలో భాగవే, ఈటితోపాటు, జజ్జనక జనారేలు, లబ్జు లబుకు సినిమా పాటలు, రికార్డీంగు డేన్సులూ కూడా ఈరోజు తెలుగు సంస్కృతిలో భాగవే. అందుకని మీరేం దిగులు పడకండి, సినిమా వాళ్ళని పిలిసినందుకు, పిలకాయలు త్యాగరాజ కీర్తనలకి డాన్సులేయనందుకు. మరీ భాదపడిపోకండి, తనాలు ఆటాలు లేకపోయినా అమెరికాలో తెలుగు సంస్కృతికేం డోకా రాదు. బాపూలూ, సినారేలూ లేకపోయినా, తెలియకపోయినా తెలుగు సంస్కృతికేం పరవాలేదు, తరవాతి తరాలు సంస్కారపరంగా ఆటవికదశకి చేరుతాయని మీరు మనేద పడబల్లే. సంస్కృతికి ఏ వొక్కరి రక్షా అక్కరలేదు, తెలుగు మాట్లాడే మనుశులుంటే చాలు. మీ లాగా, నా లాగా, ఇంకా రకరకాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళుంటే సాలు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  1942. నామాట గురించి lalitha గారి అభిప్రాయం:

    03/02/2007 5:44 pm

    నేను నా వైపు ప్రయత్నంగా పిల్లల కోసం తెలుగు (నా బ్లాగు లింకు) మొదలు పెట్టాను. మెచ్చుకోళ్ళు బాగానే వస్తున్నాయి. అవి నాకు ఉత్సాహాన్నీ ఇస్తున్నాయి. నిజంగా ఎంతమంది ఎంత తరచుగా అందులోని అంశాలు గాని దాని వల్ల స్ఫూర్తినందుకొని ఇతరం ఏవైనా గాని తమ పిల్లలకు తరచుగా పరిచయం చేస్తున్నారు అని నాకు అనుమానంగా ఉంటుంది. కాని నేను సందేహంతో ఆగదల్చుకోలేదు. ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతూనే ఉంటాను. నా పిల్లలకైతే ఉపయోగపడుతోంది. ఇంకొంచెం విస్త్రుతంగా పరిచయమైతే చేసుకుంటూనే ఉంటాను. ఒకే లాంటి అభిరుచులూ, ఆశయాలూ ఉన్న వాళ్ళు కొందరు తప్పని సరిగా ఉంటారు. వారు కొందరూ కలిసినా చాలు. ఇది నా వైపునుంచి నా ప్రయత్నం.

    ఇక, రచ్చబండ లో చాలా మంది చాలా advanced భాషా విషయాలు చర్చిస్తారు, మంచి అనువాదాలు, కవితలూ రాస్తూ ఉంటారు. ఎవరైనా పూనుకుని వాటిని compile చేసి ఒక బ్లాగులో కాని వెబ్సైటు లో కాని పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకెప్పుడూ.

    ఈ రోజున internet లో తెలుగులో రాయ గలుగుతున్నాము, చాలా మంచి బ్లాగుల్లో మంచి తెలుగు ఉపయోగింప బడుతోంది. తెలుగు భాషకు సంబంధించిన విషయాలు తెలియజేయబడుతున్నాయి. ఈ రాస్తున్న వారిలో చాలా మంది యువకులు కూడ ఉన్నారు. ఇవన్నీ ఆశాజనకమైన విషయాలు అనిపిస్తుంది నాకు. ఏమి లేకున్నా, పిల్లలకు తెలుగుని పరిచయం చెయ్యాలన్నా, వాళ్ళకు కుతూహలం కలిగించాలన్నా, వాళ్ళని తెలుగుతో “touch” లో ఉంచాలన్నా, ఇప్పుడు చాలా సమాచారం అందుబాటులో ఉంది. ఉన్న మంచిని పెంచుకుంటూ ముందుకి సాగుతూ ఉందాము.

    ఇది నా అభిప్రాయం.

    లలిత.

  1943. నామాట గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    03/02/2007 1:17 pm

    రోహిణీప్రసాద్ గారూ:

    సుమారు పది సంవత్సరాలుగా ఛందస్సులో శాస్త్రీయముగా
    పరిశోధన చేస్తున్నాను. దాని ఫలితాలను ఛందస్సు, రచ్చబండల
    మూలముగా అందరికీ తెలియజేస్తున్నాను. సుమారు 300
    పద్యాలను గర్భ, బంధ తదితర చిత్రకవితలను వ్రాసియున్నాను.
    కాని ఇందులో జనులకు అంతగా ఆసక్తి లేదండీ. దేనికీ ఫీడ్ బ్యాక్
    ఉండదు. కొన్నిటికి పవర్ పాయింట్ ప్రెసెంటషన్లు కూడ ఉన్నాయి.

    నా ఉద్దేశములో ఇంటర్నెట్ ద్వార తెలుగు నేర్చే ప్రయత్నాలను
    ఎక్కువగా చేయాలి. విశ్వవిద్యాలయాల ద్వారా నేర్చుకోవడం
    కొద్దిగా కష్టమేమో? కాని ఈ విశ్వవిద్యాలయాలు ఆన్ లైన్
    డిస్కషన్లకు వినియోగిస్తే బాగుంటుందేమో?

    ఆలోచనలకు ఆసక్తికరమయిన మాటను శ్రీ వేలూరి గారు
    అందజేసినందులకు వారికి హార్దిక వందనములు.

    – మోహన

  1944. నామాట గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    03/02/2007 12:43 pm

    తెలుగు సంఘాలని గురించి పెద్ద ఎత్తున చర్చించటానికి ఇది సరైన వేదిక కాకపోవచ్చు గాని విహారిగారు రాసినది చదివాక లోగడ నేను చేసిన ఒక సూచనను మళ్ళీ ప్రస్తావించా లనిపిస్తోంది.

    టీనేజర్లకు తెలుగు గురించి చెపుతున్నప్పుడు మన చిత్ర కవిత్వం గురించీ, బంధ కవిత్వం, అష్టావధానాలను గురించీ తెలిసినవారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చెయ్యగలిగితే వారికి కొంత ఆసక్తి కలిగే అవకాశం ఉంది. భాషని పెర్ఫార్మింగ్ ఆర్ట్ గా ప్రదర్శించడం సరికాకపోవచ్చు కాని దాని శక్తుల గురించి తెలియజేస్తే కొన్నేళ్ళకైనా బాపూ, సినారె తదితరులను గురించి తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తారేమో.

    తరవాతి తరాలు సంస్కారపరంగా ఆటవిక దశకు చేరుకోకుండా చూడాల్సినది మనమే కదా. అందుకని నిరాశపడకుండా ప్రయత్నాలు చెయ్యాలి. ఏ ప్రోగ్రాములకు ఎంతమంది వస్తున్నారనేది ముఖ్యం కాదు. మంచి ప్రోగ్రాములు నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగి తీరాలి. కేవలం అంకెలనే ప్రామాణికంగా తీసుకుంటే అర్ధనగ్న రికార్డు డాన్సులు పెట్టించాలి. అప్పుడు చిరంజీవి పాటల కన్నా హెచ్చుగా జనం వస్తారు. అందుకని జనం రావడం ఒక్కటే కొలమానం కాదు. ఆడియన్స్ సంస్కారం కంటే కార్యకర్తల సంస్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది మరిచిపోకూడదు.

  1945. చెట్టు నా ఆదర్శం గురించి డా.ఇస్మాయిల్ పెనుకొండ గారి అభిప్రాయం:

    02/22/2007 5:36 am

    అద్భుతమైన కవితలందించిన మీకు నా కృతజ్ఞతలు!

  1946. పద్యాలు – వాడుకభాష గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    02/14/2007 12:18 am

    “ఛందస్సు లేకుండా కవిత్వం లేదు” – వరద
    కామేశ్వరరావు గారూ,

    కందకీ గీతకీ తేడా తెలియని ‘విద్యావంతుణ్ణి’ నేను. అదేదో గొప్పగా చెప్పుకోడం లేదు; ఉన్న విషయం చెప్తున్నా. అయినా మీ వ్యాసం నాకు బాగా నచ్చింది.

    విశ్వనాథ కవిత్వంలోని తెలుగు వెలుగులు చూపినందుకు సంతోషం. మీరు చెప్పింతర్వాత కొన్ని పద్యాలు చదివి “ఓహో” అనుకున్నాను – “ప్రొద్దుననే లేచి పులికాపు పెట్టును” అంటూ మొదలైన సీసం!

    మధ్యాక్కర వాడుకభాషకు వీలుగా ఉంటుందన్నారుగాని “విశ్వనాథ మధ్యాక్కరల” నీ ఆరుద్ర “శుద్ధ మధ్యాక్కరల”నీ ప్రస్తావించలేదు. ఆరుద్ర రాసినది వాడుక భాషగానే కనపడుతుంది.

    అబ్బూరి ‘చెరకాలం’ రాస్తున్నప్పుడే శ్రీశ్రీ ‘కలకాలం’ తలపెట్టి, ‘చెరకాలం’ కోసం ఉపోద్ఘాతం రాస్తూ,
    “కలకాలం చెరకాలం
    సిలువై తుదికావ్యమై స్పృశించెను వరదా!”

    అని అన్నాడట. అని ‘చెరకాలం’ వ్రాతప్రతిని పట్టుకెళ్ళి పోగొట్టుకున్నాడు! అబ్బూరి దగ్గర మరో కాపీ లేదు! ‘తెలుగు స్వతంత్ర’ లోనూ “అందాకా” లోనూ ప్రచురితమైనవీ, అముద్రితమైనవీ, దొరికినంతవరకు వీళ్ళదగ్గరా వాళ్ళ దగ్గరా సేకరించి, లండన్ వాస్తవ్యులైన పరకాల ప్రభాకర్ 1993లో “కవితా సంచిక” గా ప్రచురించారు. దాంట్లో దాదాపు డెబ్భై పేజీలు ‘చెరకాలా’ నివే! దాని చివర్లో అబ్బూరితో “కవిత్వం అంటే…” అన్న పేరుతో పరకాల జరిపిన ఆసక్తికరమైన ఇంటర్వ్యూ కూడ వుంది.

    విశ్వనాథ వారు అబ్బూరి ప్రయోగాలని చూసి, “నీ స్నేహితులంతా ఛందస్సు మీద విరుచుకు పడతారేం? వాళ్ళకి చాతకావాలి కాని అందులో రాయటానికేం బాధ? నువ్వు రాసి చూపించావు కదా – యింకా యేం కావాలి వాళ్ళకి?” అని మెచ్చుకున్నాడు.

    చెదురుమదురుగా వున్న మరికొన్ని అబ్బూరి రచనల్ని ఒకచోట చేర్చి, వారి కుటుంబసభ్యులు 1995లో “సామిధేని” పేరిట మరో పుస్తకాన్ని ప్రచురించారు. దాంట్లో చేకూరి రామారావు గారి వ్యాసం, “నిరంతరాన్వేషి, నిత్యప్రయోగశీలి వరద,” కోవెల సంపత్కుమారాచార్య గారి వ్యాసం, “ఛందో వరదస్మృతి,” వున్నాయి. నిజం చెప్పాలంటే, ఆ పండితుల వ్యాసాల్లో కన్నా మీ వ్యాసంలో “ప్రవాహ గుణం” బాగుంది.

    ఈ పుస్తకాలు నేను గత రెండేళ్ళ లోపునే కొన్నాను కనుక ఇంకా దొరుకుతున్నాయనుకుంటాను. మీ వ్యాసానికి అవి ఉపయోగపడొచ్చు.

    కొడవళ్ళ హనుమంతరావు

  1947. పద్యాలు – వాడుకభాష గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/31/2007 8:24 am

    భాషకి అనువుగా ఛందస్సు మారాలని మొదట గుర్తించింది గురజాడ. అతని అడుగుజాడలో నడిచిన వాడు శ్రీ శ్రీ (ఆ విషయంలో). గురజాడ, శ్రీ శ్రీ సాంప్రదాయిక ఛందస్సులలో రాసిన పద్యాలలో భాషనీ, మాత్రా ఛందస్సుల్లో రాసిన పద్యాలలోని భాషనీ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికున్న కవితత్వం ప్రథానంగా పద్యరూపం కావడం మూలానా, పద్యాలకి వ్యవహార భాష తగదని తెలుసున్న కారణానా, ఆనాటి వ్యావహారిక భాషా వాదులు వచన సాహిత్యం గురించే పోరాడారుగాని పద్యాలజోలికి, కవిత్వం జోలికీ పెద్దగా పోలేదు. గురజాడ ఒకడుగు ముందుకు వేసి కవిత్వంలో కూడా వ్యవహార భాష తెచ్చే ఉద్దేశంతోనే మాత్రా ఛందస్సులని స్వీకరించాడు. ఐతే మాత్రా/దేశి ఛందస్సులలో కథా కావ్యాలని సృష్టించగలమా, సృష్టించినా అవి ఎంత వరకూ జన రంజకం అవుతాయీ అన్నది పరిశీలించాల్సిన విషయం. పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యాలుకాని, రంగనాథ రామాయణం కానీ అంతగా ప్రసిద్ధి చెందకపోవడానికి కారణం కేవలం రాజకీయమనో, పండితుల నిరాదరణ అనో కొట్టి పారేశాం కానీ, వాటిని ఒక పోతన భాగవతం తోనో, మొల్ల రామాయణంతోనో పోల్చి వాటి అనాదరణకి కారణాలు వెతికే ప్రయత్నం జరగలేదు.

    భాషా శాస్త్ర పారిభాషిక పదాలపై నాకు పెద్ద అధికారం లేదు కాని, agglutination, inflection, vowel harmony మొదలైన లక్షణాలన్నీ కలిసి తెలుగు భాషకి ఆ ప్రవాహగుణాన్ని స్తున్నాయి, బహుశా.

    “జ”కి “శో” కి హల్ మైత్రి కుదిరినా అచ్చుల మైత్రి కుదరదు (“అ”కి “ఒ”కి). కాబట్టి ఆ రెండక్షరాల మధ్య యతి సాధ్యం కాదు. అలాగే “వ”కి “వి”కి కూడా కుదరదు. కొంత అరుదైనా నన్నయ్య “ప”కి “వ”కి, “బ”కి “వ”కి యతి వేసాడు. ఉదా:
    “నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
    వ్రత యొక బావి మేలు మఱి బావులు నూరిటికంటె నొక్క స
    త్క్రతువది మేలు…”

    “ప్రల్లదుడైన యొక్క కులపాంసను జేసిన దాన దత్కులం
    బెల్లను దూషితంబగుట యేమి యపూర్వము గావునన్ మహీ
    వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలో
    …”

  1948. పద్యాలు – వాడుకభాష గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/30/2007 4:10 pm

    కామేశ్వరరావుగారు,

    “-‌న్”, “-ల్” వంటి ప్రత్యయాలు మొదలైనవి లేకుండా నేటి కాలపు భాషలో పద్యాలు రాయాలంటే ఛందస్సు (వృత్తాలు) మారాలి అన్న విశ్వనాథ అభిప్రాయం సబబే అని తోస్తోంది. ఒక విధంగా చూస్తే, ఆధునిక భాషలో అద్భుతమైన శబ్దసౌందర్యాన్ని, ప్రవాహగుణాన్ని ప్రదర్శిస్తూ దేశీ ఛందస్సులతో (మాత్రా ఛందస్సులతో) కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ ఇత్యాదులు సృష్టించిన కవితలే మారిన ఛందస్సుకు ఉదాహరణలని నాకనిపిస్తోంది. ఈ ఆధునిక కవులు వాడిన భాష నిజంగా వాడుక భాషేనా అని కొంతమంది వేసే ప్రశ్నకు సమాధానం మీరు చర్చించకుండా వదిలేసిన “కవిత్వ భాష”. కొన్ని పదాలూ, లక్షణాలూ ఎప్పటికీ వ్యవహారంలోకి రానివీ, వ్యవహార దూరమైనవీ కవిత్వ భాషలోనే ఉంటాయి. “పరిమళపు తుఫానుల్ని రేపి, మహారణ్యాల సౌందర్యాన్ని చూపి, మౌనంగా ఉన్న ద్వీపాల్ని ఊపి” అన్న మాటలు కవిత్వంలోనే తప్ప మనం సాధారణంగా మాట్లాడే వాక్యాల్లో వినిపించవు కదా!

    ఇంకో విషయం. “తెలుగు పద్యాలకి ఉండే మరొక ప్రత్యేకమైన లక్షణం ప్రవాహ గుణం, లేక ధార … ఈ నాదం తెలుగు భాష సొత్తు.” అని అన్నారు. ఇక్కడ మీరు తెలుగు భాష agglutinative స్వభావాన్ని వివరిస్తున్నారని నా సొంత అభిప్రాయం ! అయితే, ప్రపంచీకరణ వల్ల, అన్యభాషాప్రభావాల వల్ల తెలుగు agglutinative స్వభావాన్ని కోల్పోయి ఇంగ్లీష్ భాష లాగే isolating భాషగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. “ఈ వారము సమైక్య కృషి” అన్న తెలుగు వికీపీడియా లేబుల్ ఇందుకు ఒక ఉదాహరణ 🙂

    కృతజ్ఞతలతో,
    సురేశ్.

    – “శోకింపంగన్” అన్నప్పుడు యతిభంగం కాలేదు. నన్నయ్య “జ”-కారానికి “శ”-కార యతి వాడిన సందర్భాలు ఆది పర్వంలోనే కనిపిస్తాయి.
    – నన్నయ్య “వ”-కారానికి “ప”-కార యతి వాడాడో లేదో నాకు తెలియదు. “వారిజ కాంతల్” కు బదులుగా “వికచ కుసుమముల్” వాడొచ్చని అది పోస్టు చేసిన కాసేపట్లోనే అనుకున్నాను.

  1949. పద్యాలు – వాడుకభాష గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/30/2007 11:27 am

    నిజమే, గ్రాంధిక భాషకీ వాడుకభాషకీ మధ్యనున్న భేదాన్ని వివరించడం శ్రమతో కూడుకున్న పనే. అసలు గ్రాంధిక భాషనీ, వ్యావహారిక భాషనీ సరిగ్గా నిర్వచించాలంటేనే అనేక సమస్యలున్నాయి. వాడుక భాషకి ఒక కాలపరిమితిలోనే లక్షణాలు చెప్పుకోగలం, అది నిత్యం మారుతూ ఉంటుంది కాబట్టి. గ్రాంధిక భాష అంటే, గ్రంథస్థమైన భాష అన్న నిర్వచనం చెప్పుకుంటే, అదీ కాలంతోపాటు మారుతూ ఉంటుంది. గాంధిక వ్యావహారిక భాషా వాదాలు నడచిన కాలంలో, గ్రాంధిక భాషంటే ప్రాచీన కావ్యాల ఆధారంగా రూపొందించిన కొన్ని వ్యాకరణాలకి బద్ధమైన భాష అనీ, వ్యావహారిక భాష అంటే ఆ వ్యాకరణాలకి బద్ధం కానిదనీ నిర్వచించుకున్నారు. ఐతే అటువంటి వ్యాకరణాలకి విరుద్ధమైన ప్రయోగాలు కావ్యాలలో ఉండడం అటు గ్రాంధిక భాషా వాదులు, ఇటు వ్యావహారిక భాషా వాదులూ కూడా గుర్తించారు. ఐతే గ్రాంధిక భాషంటే కేవలం సంస్కృత పదభూయిష్టమైన రచనే కాదన్నది నిర్వివాదం. శివుడిని “అరపదిమోముల దయ్య”మనడం వ్యవహార దూరమే కదా, అంచేత అది గ్రాంధిక భాషే అవుతుంది. ఒక రకంగా ఆలోచిస్తే వాడుకభాష ఎప్పుడైనా గ్రాంధిక భాష కావచ్చు. కానీ గ్రాంధిక భాషలో కొన్ని పదాలూ, లక్షణాలూ ఎప్పటికీ వ్యవహారంలోకి రానివీ, వ్యవహార దూరమైనవీ ఉంటాయి.

    గ్రాంధికభాష అంటే గ్రంథస్థమైన భాష అని చెప్పుకుంటే, అది వ్రాసే భాష అవుతుంది. అప్పుడు వాడుకభాషంటే మాట్లాడుకునే భాష అని నిర్వచించుకోవాలి. ఐతే ప్రాచీన కాలంలోని కావ్యేతరమైన లిఖిత సాహిత్యాన్ని పరిశీలిస్తే, అది కావ్య భాషకి భిన్నంగా కనిపిస్తుంది.

    ఈ రకంగా గ్రాంధిక, వ్యవహార భాషల నిర్వచనాలగురించే చాలా చర్చ చెయ్యవచ్చు. భాషా శాస్త్ర అభిమాన్లు గ్రాంధిక, వ్యవహార భాషల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులని పరిశీలించ వచ్చు.

    ఇవన్నీ నా వ్యాసానికి ముఖ్యం కాదని నేననుకోవడం వల్ల ఈ విషయాల్లోకి వెళ్ళలేదు. నేను ప్రథానంగా చర్చించాలనుకున్నది – ఈ కాలంలో పద్య కవిత్వం రాయాలంటే, ఇప్పటి వాడుకభాషను ఎంతమేరకు ఉపయోగించ వీలవుతుంది? ప్రాచీన కావ్య భాష అనువైనంతగా నేటి వాడుక భాష పద్యాలకి తగుతుందా? దీనికోసమే వాడుక భాష అంటే గత వంద సంవత్సరాలుగా వాడుకలో ఉన్న భాష అని అన్నాను. గ్రాంధిక భాషకి తాత్కాలిక నిర్వచనం (ఇది చేరాగారి దగ్గరనుండి నేనరువుతీసుకున్న పదం) మాత్రమే ఇచ్చి, ఆ భాషలో కనిపించే లక్షణాలని ప్రస్తావించాను. ప్రాచీన కావ్య భాష కూడా నన్నయ్య నుండి, విశ్వనాథ వరకూ మార్పులు పొందుతూ వచ్చినా కొన్ని ప్రధానమైన లక్షణాలను మాత్రం కోల్పోలేదు. వాటినే నా వ్యాసంలో ఉపయోగించుకున్నాను. అధికమైన పద సంపద, “-‌న్”, “-ల్” వంటి ప్రత్యయాలు మొదలైనవి. అలాగే వాడుక భాషలోని ప్రధానమైన లక్షణాలని ప్రస్తావించాను – నామవాచకాలలోని “ము” సున్నాగా మారడం, విసంధి మొదలైనవి.

    ఆధునిక పద్య కవిత్వాన్ని పరిశీలించి, వాడుక భాష పద్య కావిత్వంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అన్న విషయమ్మీద ఇంకా పరిశోధన చెయ్యవచ్చు.

    “నేనొక పూలమొక్క….” పద్యం మనసుకి హత్తుకోవడం వెనుక వాడుకభాష సహాయం తగినంత ఉందని తెలుస్తుంది – “చివాలున” కొమ్మ వంచడం, “జాలిగ నోళ్ళు”విప్పడం, “బావురు”మనడం వంటి పదాలని గమనిస్తే.

    సురేశ్ గారూ, “అడవికి బువ్వులు దేరగ వడి నరిగిన కచుని జంపి…” అన్న నన్నయ్య గారి పద్యాన్ని బాగానే పట్టుకున్నారండీ!

    వారిజములంటే తామరపువ్వులుకాబట్టి ఆ పదం సరిపోదు. “ప్రసవమ్ములొగిన్” అంటే సరిపోతుంది:-)

    అలాగే చివరి పాదంలో యతిభగం జరిగింది, “జాలింబడగన్” అని మార్చుకోవచ్చు.

  1950. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    01/26/2007 10:04 am

    సురేష్,

    వొక అద్భుతవైన రచన, పాఠకుల్ని ఎంత ప్రభావితం చేస్తుందో మీ వ్యాసం మీద వెల్లువెత్తిన అభిప్రాయాలే వొక వుదాహరణ. శ్రీశ్రీ కవిత్వం చాలా మంది సాధారణ పాఠకుల్ని కవులుగా మార్చింది అన్నది వొక అభిప్రాయం. మీ వ్యాసం కుడా కొందరు పాఠకుల్ని భాషాశాస్త్ర దిశలో ప్రయాణం కట్టిస్తుందని నా అబిప్రాయం.

    పత్రికలు చదివే చాలామంది పాఠకులు నాలాగే, ప్రత్యేకవైన భాషా, సాహిత్య పరిఙ్ఞానంలేని సాధారణ పాఠకులే. సాధారణ జీవితం ఇచ్చిన కొద్దిపాటి లోకఙ్ఞానం, పాఠశాలల్లోనో, కళాశాలల్లోనో నేర్చుకున్న కొద్దిపాటి శాస్త్ర పరిశీలనా పరిఙ్ఞానం, ఈ రెండిటి కలబోతలోంచి అలవరచుకున్న కొద్దిపాటి తర్కఙ్ఞానం ఇవే మాకున్న అతి సరళవైన logical skills, నిజాన్నిఅబద్దంలోంచి వేరుచైడానికి, తప్పుని వొప్పులోంచి చెరిపేయడానికి. ఐతే ఈ nascent rational attitude lives along with irrational emotional beliefs about race, language, nationality in our minds. తెలుగు ప్రాచీనత మీద ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఆ నాలుగు వ్యాసాలు చదివేక మనసుకెంత ఆనందవేసిందంటే, ఎక్కడో కుర్చోని ఎదో చదువుకుంటున్న నా ఏడో తరగతి కుతుర్ని పిలిచి, చదివి వినిపించి, చుశావా, మన తెలుగు జాతి, తెలుగు భాష గొప్పదనం, ఎప్పుడో సుమేరియన్ నాగరికత కాలంలోనే మన roots వున్నయ్ అని డబ్బా కొట్టి మరీ చెప్పెటంత ఆనందం. తర్వాత మళ్ళా నా కుతురుతో కుర్చోని అ తప్పుని సరి చేసుకోవటం సురేష్ రచన చదివేకే సాధ్యపడింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సురేష్ గారి వ్యాసం ఇంతకుముందు వచ్చిన వ్యాసాలమీద విమర్స లేకుండా వొక్క భాషా శాస్త్రం 101 కే పరిమితవైయ్యుంటే బావుండేది అనే అభిప్రాయం ఈమాట అభిప్రాయాల్లో వ్యక్తం కావటం వలనే. మేవు అతి సాధారణ పాఠకులం, మా బుర్రలో వుండే సవాలక్ష తర్కానికి నిలవని నమ్మకాల్ని తొలగించుకొని, ఎక్కడో, మనసులో ఏ ములో నక్కి నిద్రపోతున్న శాస్త్రియ పరిశీలనని నిద్రలేపాలంటే సురేష్ వ్యాసంలో వున్నటువంటి juxtaposition అవసరవని నా ఉద్దేశం.

    విప్లవ్ చెప్పినట్టు ఏ కళ్ళంలో గింజలు ఆ కళ్ళంలో నే నూర్చుకోవటం సహజవే. చేనైతే చాలానే వుంది. కానీ అదేం యదకొచ్చిన చేనేం కాదు. నిదర్శనం కావాలంటే మన ఘనత కెక్కిన విశ్వవిధ్యాలయాల భాషాశాస్త్ర శాఖల వెబ్ సైట్లకెళ్ళి వొకసారి చూడండి. పెట్టుబడైతే చాలానే పెడ్తున్నరు గాని, చేన్ని మాత్రం చవుడు నేల చేస్తున్నారు. కాబట్టి దుక్కి దున్ని, నారేతలేసి, కోసి, నూర్పులు చేసే మెళుకువలు, వోపికలు లేని నాలాటి పాఠకులకి శాస్త్రం తో పాటు, అశాస్త్రియతని వేలెత్తి చూపే సురేష్ గారు వ్రాసిన వ్యాసాలే ఉపయోగకరం.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  1951. కిటికీ గురించి viswamitrudu గారి అభిప్రాయం:

    01/24/2007 10:18 am

    మొదటి కవిత కిటికి బాగుంది.

  1952. ఓ శాంతీ గురించి viswamitrudu గారి అభిప్రాయం:

    01/24/2007 10:15 am

    మధ్యమధ్య ప్రాసకోసం ప్రాకులాడినా, కవిత బాగుంది.
    ముగింపు చాలాబాగుంది.

  1953. తరం మారినా … గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/18/2007 5:20 am

    ఈ కథను పూర్తిగా అన్వయం చేసుకోవాలంటే శివారెడ్డి కవితలతో పరిచయం చాలా అవసరం అనుకుంటాను. ఉదాహరణకు “తరం మారినా…” అన్న మకుటంతో ఉన్న ఈ కవిత చూడండి:

    తరం మారినా…

    ఆ గేటు పక్క
    బెరుకు బెరుగ్గా – బెదురుగా
    నిలబడ్డాడు – మూడేళ్ళవాడు,
    లోన వాళ్ళమ్మ
    బాసాన్లు తోముతుంది
    బయట వాళ్ళయ్య
    ఏడ రాళ్ళు గొడుతున్నాడో –
    వాళ్ళయ్య కూడా
    అదే వయసులో అలానే
    ఈ గేటుపక్క కాకపోతే
    మరోగేటుపక్క
    నిలబడే వున్నాడు.

    —- శివారెడ్డి (1973 నవంబర్
    రక్తం సూర్యుడు సంకలనం నుంచి)

  1954. వలసపోతున్న మందహాసం గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    01/14/2007 4:16 am

    చాలా బావుంది సుబ్బూ….నిజమే రామారావుగారిని కలిసాకే కవిత్వం లోతు తెలిసింది. మందహాసం వలసపోయినా వారధి ఉందిగా 🙂

  1955. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/13/2007 4:07 pm

    చరిత్ర, ‘శాస్త్రీయ’ దృక్కోణం

    శ్రీనివాస్,

    “తెలుగు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల పునరుజ్జీవనం కోసం నిస్వార్థ కృషి చేస్తున్న” అజో-విభో-కందాళం ఫౌండేషన్ నుండి “చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎట్లా చూడాలో, ఎట్లా చెప్పాలో, ఎట్లా రాయాలో అనే అంశాలమీద మనజాతి అలవరచుకోవలసిన దృక్పధాల్ని” శాస్త్రిగారు నిర్దేశించారని హార్దిక ప్రశంసలను అందుకున్న పుస్తకాన్ని,

    చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారిచే “భారతీయ చరిత్రకు దిద్దిన తిలకం”గా “శాస్త్రీయ ఆయుర్వేద సామాజిక బలవర్థక ఔషధం” గా కీర్తించబడ్డ గ్రంథాన్ని, క్లుప్తంగానన్నా సమీక్షించడానికి నాకు చరిత్రలో డిగ్రీ లేదు సరికదా,కనీసం ఔత్సాహికులకుండాల్సిన పరిజ్ఞానమన్నా లేదు.

    “చరిత్ర గతికి, కాలచక్ర గమనానికి సంబంధించినంతవరకూ అస్పష్టతకు తావు లేని ప్రాచీన భారతీయ సారస్వతాన్ని,” “క్షణంలో 1/300 వంతు అయిన వేధ నుంచి 30 కోట్ల 67 లక్షల సంవత్సరాలుండే మన్వంతరం వరకు, ఆపైన కూడా ఆధునిక కంప్యూటర్లకు సైతం అంతుబట్టనంత సూక్ష్మాతి సూక్ష్మ, స్థూలాతిస్థూల కాలగణన అనాదిగా సొంతమైన” భారతీయ మేధని అందుకోడానికి నేను ఎప్పుడో వెలగబెట్టిన కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఏమాత్రం పనికొస్తుంది?

    “ప్రాచీన భారత చరిత్రకు తిరుగులేని ప్రమాణాలైన భవిష్య, మత్స్య, బ్రహ్మాండ, విష్ణు, వాయు పురాణాలు” ఏమైనా చదివానా?

    ప్రాచీన సాహిత్యాన్ని చదవడమేకాక, భర్తృహరి కవిత్వం మీదనే అసమాన విమర్శ రాసి, లెక్కల్లోనూ జన్యుశాస్త్రంలోనూ కృషి చేసి, తనతో అంగీకరించని చరిత్రకారులచేత గూడా ఆద్యుడిగా ప్రశంసించబడ్డ కోశాంబి రచనలతోగానీ, వాటిని తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన బాలగోపాల్ పుస్తకంతోగానీ పోల్చడానికి, వాళ్ళు దేశద్రోహులూ, జాతిద్రోహులూ అయిన మార్క్సిస్టు వర్గానికి చెందిన కుహనా మేధావులాయె!

    భారతీయ ఆత్మని ఆవిష్కరించగల బ్రహ్మజ్ఞాన సంపన్నులెవరన్నా సమీక్షించడానికి అర్హులేమో!

    కొడవళ్ళ హనుమంతరావు

  1956. పద్యాలు – వాడుకభాష గురించి vaidehi sasidhar గారి అభిప్రాయం:

    01/12/2007 5:56 am

    చాలా మంచి వ్యాసం!!ఒకటికి రెండు సార్లు చదివించిన వ్యాసం!!వ్యవహార భాష లో పద్యరచన గురించి చక్కని విశ్లేషణ తో సరళంగా రచయిత ప్రధానాంశాన్ని ప్రతిపాదించారు.ముఖ్యం గా విశ్వనాధ వారి కల్పవృక్షంలోని వ్యవహారభాషా సౌందర్యాన్ని,నుడికారాన్ని చాలా ఆసక్తి దాయకంగా వివరించారు.

    వచన కవిత్వం లో ఎక్కువ ధార లేక పోవటానికి రచయిత చెప్పినట్లు తమకు ధారతో అవసరం లేదని వచనకవులు అనుకోవటం ఒక కారణమైతే ఏ నిర్మాణ చట్రపు సౌలభ్యం (చందస్సు,వృత్తాల ద్వారా వచ్చే ఓ సహజ సౌందర్యమైన నడక) లేకపోవటం మరోకారణమేమో అనిపిస్తుంది.ఈ క్లిష్టత వల్ల చక్కని ధార కలిగిన వచన కవిత రాయటం పూర్తిగా కవి ప్రతిభ,భావనాశక్తి,భావావేశం మీద ఆధారపడుతుందేమో !!!

    నాకు పరిచయమున్న స్వల్ప సాహిత్యం లో వచనకవిత్వం అంతటి ధారతో వ్రాసిన కవులలో ప్రముఖులు శ్రీ tilak. వారి “నువ్వు లేవు, నీ పాట ఉంది” కవిత ఒక గొప్ప కళాకారుడు తాదాత్మ్యం తో ఏకబిగిన ఊదిన వేణువు పాట లా సాగుతుంది,ఏ మాత్రం (మాత్రా) ఛందస్సు సహాయం (కూడా) లేకుండా!! (teluguone.com లో నువ్వు లేవు, నీ పాట ఉంది).

    చక్కని వ్యాసాన్ని అందించారు!! ధన్యవాదాలు!!!

  1957. తరం మారినా … గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    01/10/2007 12:13 pm

    కధ చదివాను . కామెంట్లూ చదివాను.

    దారిపక్క, చెట్టు క్రింద ,
    ఆరిన కుంపటి విధాన
    కూర్చున్నది ముసల్దొకతె
    మూలుగుతూ ముసురుతున్న
    ఈగలతో వేగలేక …

    “ఆ అవ్వే మరణిస్తే
    ఆ పాపం ఎవ్వరి” దని
    వెర్రిగాలి ప్రశ్నిస్తూ
    వెళ్ళిపోయింది…

    కవిత ఎవరిదో చెప్పక్కర్లేదు కదా!

    జె.యు.బి.వి. ప్రసాదు గారు, కధలో “నేను”, “పార్వతమ్మ” లను మీరైతే ఎలా నడిపిస్తారో కొద్దిగా నమూనా వీలైతే రాయండి. చదవాలని ఉంది. ఇంకెవరైనా రాసినా సరే! 🙂 చూద్దాం . చూద్దాం. ఎవరెలా కధ నడుపుతారో చూద్దాం!

  1958. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Sai Brahamanandam Gorti గారి అభిప్రాయం:

    01/07/2007 9:31 pm

    మనకంటూ శాస్త్ర పరిశోధనా పద్ధతి, ముఖ్యంగా భాష పుట్టు పూర్వోత్తరాల గురించి మొదలైంది 20 వ శతాబ్దం లోనే. పైగా ఈ పరిశోధనలకి మూల గ్రంధాలు సాహిత్యమే కదా! పలానా కావ్యంలో ఇలా రాసినట్లుగా ఉంది కాబట్టి ఆ కాలంలో పదాల వాడుక నిర్ధారించి కాల క్రంలో అవి ఎలా రూపాంతరం చెందాయో భాషా కోవిదులు వివరణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది మీరంటునట్లుగా వారు చదివిన, విన్న వాటి నాధారంగా వాళ్ళ సొంత కవిత్వం కలిపి ప్రజల మీది రుద్దేస్తున్నారు. దానికి తోడు ఈ మధ్య రాజకీయం ప్రవేశించి సాహిత్యం కూడా కలుషితం అయిపోతోంది. మాండలికానికి, మూలానికి అర్ధం తెలియని వారికి ఈ వ్యాసం కాస్త కనువిప్పు కలగజేసే అవకాశం ఉంది.

    ఆ మధ్య ఇంకో తర్కం చదివాను. మహమ్మదు ప్రవక్త భార తీయుడే ఆయన పేరు మహామతి అని, ఏసుక్రీస్తు పేరు ఈశు కృష్ణ అనీ, ఇలా చాలా కల్పిత తర్కాలు రాసేస్తునారు. పత్రికలవాళ్ళూ పంపిందే తడవుగా ప్రజలందరికీ అచ్చులో అందిస్తున్నారు.

    మంచి వ్యాసం. ఈ మధ్య వచ్చిన కొన్ని మంచి వ్యాసాల్లో ఇదీ ఒకటి.

  1959. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/05/2007 11:28 pm

    భాషావేత్తల సరదా తగాదా ప్రయాణం

    వార్తాపత్రికలలో మన భాష మీద వచ్చే ఊహాగానాల వలన ఒక ఉపయోగముంది – “ఔత్సాహికులు” వాటిని చదివి నిరాశపడి ఊరుకోకుండా వాటిలోని నిజానిజాల గురించి అద్భుతమైన వ్యాసాలు రాయడం. సురేష్ ఇంతకుమునుపూ, ఇప్పుడూ రాసిన వ్యాసాలు భాషాశాస్త్రంలో ప్రవేశం లేని నాలాంటి వాళ్ళకి సులభంగా అర్థమవడమేకాక ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం కలిగిస్తున్నాయి. ఇవి 201, 301, … సీరీస్ లా కొనసాగుతాయని నా ఆశ.

    స్వల్ప లోపాలనిపించిన రెండు విషయాలు:

    1. అందుబాటులో లేని ఉపయుక్త గ్రంథాలు: గంటి గారి పుస్తకం అరవై ఏళ్ళనాటిది, అది దొరకడం కష్టం. భద్రిరాజు గారి పుస్తకం ఖరీదు డెబ్భై అయిదు డాలర్లు! అమెరికాలో ఉన్న భాషాభిమానులైనా కాస్త వెనకాడతారు. ఇంతకన్నా అందుబాటులో ఉన్నవి ఏవైనా ఉంటే చెప్పండి.

    2. పేరులేని విమర్శలు: “సాహిత్యం కళ, భాషాశాస్త్రం విజ్ఞాన శాస్త్రం” అన్నారు, బావుంది. చరిత్రకారుడిగా పేరున్న ఓ ప్రముఖ రచయిత, తెలుగు పైశాచి భాష నుండి పుట్టిందనీ, అర్జునుడు అమెరికా వెళ్ళొచ్చాడనీ ఘంటాపథంగా చెప్తున్నారనీ విమర్శించారు. సాహిత్యరంగంలో సంప్రదాయాలెలా వున్నా, శాస్త్రీయరంగంలో వేరేవాళ్ళని విమర్శించేటప్పుడు వారి రచనని ప్రస్తావించడం ఆనవాయితీ. కనీసం రచయిత పేరన్నా చెప్తే వారి రచనలని పరిశీలించే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ఆ రచయిత గూడా “ఈమాట”లో తనని తాను సమర్థించుకోడానికీ లేకపోతే సరిదిద్దుకోడానికీ వీలవుతుంది.

    అర్జునుడు అమెరికా వచ్చాడనడం హాస్యాస్పదం కావచ్చు గాని, పైశాచీ ప్రాకృతమే తెలుగుకు మాతృక అని పేరున్న పండితులే వాదించారని చదివాను. అదీ Caldwell శాస్త్రీయంగా నిరూపించిన వందేళ్ళ తర్వాత గూడా! మన సాహిత్యంపైనేకాక మన భాష మీదకూడా విస్తృతమైన పరిశోధనలు చేసిన చిలుకూరి నారాయణరావు గారు Caldwell తో విభేదించారట. మిడిమిడి జ్ఞానంగల వాళ్ళనీ రాజకీయ ప్రయోజనాల దృష్టి తో చేసే వాదనలనీ వదిలేద్దాం. చిలుకూరి లాంటి గొప్ప పండితుడు గూడా ఒప్పుకోలేదంటే, మనం తెలుసుకోదగ్గ కారణాలు ఏవో ఉండి ఉండాలి. వాటిని స్థూలంగానయినా చెప్తే బావుండేది.

    ఇది చదువుతుంటే, శిథిలావస్థలో ఉన్న తిరుమల రామచంద్ర “సాహితీ సుగతుని స్వాగతం” గుర్తుకొచ్చి తీస్తే, దాంట్లో “దేశినామమాల లోని మరికొన్ని తెలుగు పదాలు” అనే వ్యాసం నన్నాకర్షించింది. మన భాషావేత్తల తగాదాలకు రైలుపెట్టెలకన్నా సరైన చోటు మరి లేనట్లుంది.

    “నిన్ను చూస్తే తందామనిపిస్తుందోయ్!” అన్నారట చిలుకూరి, మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో తిరుమల రామచంద్రని చూసి. “అంతటి అపరాధం ఏం చేశానండీ?” అని అడిగితే, “అపరాధం? మహాపరాధమే చేశావ్. సంస్కృత ప్రాకృత సాహిత్యాలకే ద్రోహం తలపెట్టావు. గాథాసప్తశతిలో తెలుగు పదాలు చేరాయని వ్రాశావు” అన్నారట.

    తిరుమల రామచంద్ర, “నాదేముందండీ, ఆచార్య హేమచంద్రుడంతటి వాడే శ్రమపడి అలాంటి పదాలని “దేశి నామమాల” గా క్రోడీకరిస్తే,” అన్నారట. “పదకొండో శతాబ్దపు హేమచంద్రుడా నీకు ప్రామాణికం?” అంటే, “నేను గూడా సొంతంగా పరిశోధించి కనుగొన్నానన్నా”రట తిరుమల. “ఏదీ చెప్పు చూద్దాం” అంటే, గుక్క తిప్పుకోకుండా, తెలుగు, కన్నడం, తమిళం నుండి సంస్కృతంలో వచ్చి చేరిన పదాలను – వరసలు, వస్తువులు, జంతువులు, రుతువుల గురించి – ఇలా అనేక పదాల పుట్టుపూర్వోత్తరాలని తిరుమల తడువుకోకుండా వివరించారు.

    నాకు బాగా నచ్చిన ఒక పదం గురించి మాత్రం రాస్తాను. అందుకు కారణం చిన్నప్పుడు ఆడిన ఆటలూ పెద్దయింతర్వాత చదివిన కవితలూ గుర్తుకురావడమే.

    శ్రీశ్రీ Swinburne కవితల్ని “షెల్లీ కవనపు హల్లీసకం” తో పోల్చాడు. నేను పాతికేళ్ళుగా, “హల్లీసకం” అంటే అర్థం తెలియకుండానే ఆ కవితని గుర్తుచేసుకునే వాణ్ణి. ఈ మధ్య, వేలూరి గారితో పరిచయమయిన తర్వాత, “అర్థం తెలియకుండా చదివిన చదువూ ఒక చదువేనా!” అని ఆయన మెత్తని “దీవెనలు” ప్రసాదిస్తే, బుద్ధిగా నిఘంటువు చూడటం అలవాటు చేసుకున్నాను.

    “హల్లీసకం” అంటే స్త్రీలు గుండ్రంగా నిలిచి ఆడే ఆట అని బ్రౌన్ లో ఉంది. అది సంస్కృత పదం. దానికి తిరుమల వ్యాఖ్యానం చూడండి:

    “హాల్లీసో = రాసకః. మండలేని స్త్రీణాం నృత్యం. మనకు, కన్నడం వారికి హళ్ళి అనే పదం ఉంది. ఇది సున్నకు పర్యాయపదం. చిన్న వర్తులానికి అల్లి అంటారు కొన్ని ప్రాంతాలలో. గోలీలను అల్లి కాయలంటారు. అల్లికాయలంటే గుండ్రని గుళ్ళు. బొంగరాలాటలో నేలమీద గుండ్రని గీటుగీచి దాని మధ్యన ఒక బొంగరాన్ని ఉంచుతారు చూచారా? అలా గీచే గుండ్రని గిరిని అల్లి అంటారు. అలాగే పిల్లలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని గుండ్రంగా పందెం కట్టి నిలవడాన్ని అల్లి కట్టడం అంటారు. కనుక ఈ అల్లే హల్లీసో అయిందేమో! హల్లీసం నుంచే అల్లీ కాకూడదూ అని ఎదురు ప్రశ్న వేస్తారు కదూ? కావచ్చు. కాని హేమచంద్రుడు దీన్ని దేశి పదంగా పరిగణించాడు కనుకనే ఈ శ్రమంతా.”

    అలా మాట్లాడుకుంటూ పోతే రైలు అరక్కోణంలో ఆగినప్పుడు గాని తెలియలేదట, ఎంతసేపు అయిందనీ, తను టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాననీ! అప్పుడు చిలుకూరి:

    “చూచావా! నీకిదే శిక్ష. తెల్లవారుజాము బండి ఎక్కి మద్రాస్ చేరుకో. మరొకమారి హోరాహోరిగా పోట్లాడుకుందాం. ద్రావిడ భాషావాద సన్నిపాతం ముంచుకొచ్చింది. మీ కందరికీ స్వాస్థ్యం కలగాలంటే కొంతకాలం పడుతుంది,” అన్నారు.

    జులై 1959 “భారతి”లో వచ్చిన ఈ వ్యాసాన్ని తిరుమల ఇలా ముగించారు: “నేను బండి దిగాను. బండి కదిలింది. సాహిత్యంలో అభిప్రాయ భేదాలను వ్యక్తిగత ద్వేషంగా భావించుకొని పగపట్టే ఈ కాలం ఎక్కడ? అభిప్రాయ భేదాలు వేరు. అభిమానాదరాలకూ, మానవత్వానికి సాహిత్యంలోని మత భేదాలు అడ్డురావనే ఆ సహృదయ విమర్శక పరిశోధకాగ్రణి ఎక్కడ? అలాంటి ఉదాత్త హృదయుడు మరొకడు నాకు కనిపించలేదు. ఆయన కీర్తిమూర్తికి నా నమోవాకాలు.”

    ఇంతకీ చిలుకూరి తెలుగు సంస్కృత ప్రాకృతాలనుంచి పుట్టిందనడానికి కారణాలేవిటో నాకు తెలియలేదు. రైలు ప్రయాణం లో ఎక్కువ మాట్లాడింది తిరుమలే. చిలుకూరి రాసిన “ఆంధ్ర భాషా చరిత్ర” కూడా అందుబాటులో లేదు. ఈ లోటుని ముందు ముందు సురేష్ పూరించాలని కోరుకుంటూ,

    కొడవళ్ళ హనుమంతరావు

  1960. కిటికీ గురించి pavan dunna గారి అభిప్రాయం:

    01/04/2007 3:32 pm

    మీ కవిత చదివిన తరువాత … నా కాలెజీ హస్టల్ కిటికి గుర్తుకొచ్చింది…

  1961. వలసపోతున్న మందహాసం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/02/2007 11:33 am

    శీర్షిక చూసి ఏదేదో అపార్థం చేసుకున్నాను. ఇంత సున్నితమైన విషయం గురించని కవిత చదివాక తెలిసింది. బాగుంది. మధ్యలో “అలల గుడ్డతో” అన్న పదం మాత్రం ఎందుకో, పాయసంలో బెడ్డలా తగిలింది.

  1962. ప్రతీకగా శరీరం గురించి దివాకర్ ధరణీప్రగడ గారి అభిప్రాయం:

    12/11/2006 4:31 am

    చాలా అద్భుతంగా ఉంది మీ విశ్లేషణ. కవితానువాదం బావుంది. ధన్యవాదాలు.

  1963. డే జా వూ గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    12/07/2006 8:40 pm

    మంచి కవిత….

  1964. అక్టోబరు పులి గురించి వడ్లూరి కేశవా చారి గారి అభిప్రాయం:

    12/07/2006 3:19 am

    కవిత చాలా బాగుంది.
    రచయిత తన మాండలికాన్ని చక్కగా నిర్వహించారు…

  1965. అంతరం గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    12/02/2006 9:23 pm

    చక్కని కవిత

  1966. కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    11/20/2006 10:27 am

    స్ఫూర్తిప్రదాతలు

    ఈ మధ్య ఒక ప్రబుద్ధుడు గురజాడ అప్పారావును సంస్కృతికి విధ్వంసకుడుగా అభివర్ణిస్తూ ఒక వ్యాసం రాశాడు. తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు రచయితలకూ, వాటిని ప్రచురించేందుకు సంపాదకులకూ హక్కు ఉంటుంది కనక దీనికి అభ్యంతరం చెప్పే పనిలేదు. నా లెక్కన గురజాడ వంటి గొప్ప రచయిత దేని విధ్వంసానికైనా పూనుకుని ఉంటే అది విధ్వంసం చెయ్యతగినదే. ఎటొచ్చీ ఆ విధ్వంసకాండ సమగ్రంగా జరగనందువల్లనే ఇటువంటి అభిప్రాయాలు ఇన్ని దశాబ్దాల తరవాత వ్యక్తమవుతున్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పై వ్యాసాన్ని అవహేళన చేస్తూ నేను ఇంగ్లీషులో రాసి పంపిన ఉత్తరాన్ని అదే పత్రిక సంపాదకవర్గం తమకు తోచిన విధంగా తెలుగులో ప్రచురించింది. తెలిసీ తెలియని నావంటి పాఠకులను వదిలేసినా, హాస్యబ్రహ్మగా పేరుపొందిన భమిడిపాటి కామేశ్వరరావుగారూ, మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారూ గురజాడను యుగకర్తగా గుర్తించారు. మీ రచయిత మేధావి అనీ, పేరు మోసిన ఆ రచయితలిద్దరూ మూర్ఖులనీ నేను వెటకారంగా సంపాదకులతో అన్నాను. నన్ను అపార్థం చేసుకున్న కొందరు పాఠకులకు నామీద కోపం కూడా వచ్చింది. ఈ సంవాదాన్ని పొడిగించి, దీనికి ప్రాముఖ్యతను ఆపాదించడం అర్థంలేనిపని. అంతకన్నా ముఖ్యవిషయాలెన్నో ఉన్నాయి. ఇటీవలి హ్యూస్టన్‌ (టెక్సస్‌) సాహిత్య సమావేశంలో మిత్రులను కలుసుకుని చర్చిస్తున్నప్పుడు కొన్ని అంశాలు తలెత్తాయి. వాటిని గురించి క్లుప్తంగా చెప్పడమే నా ఉద్దేశం.

    మన దేశంలో హైదరాబాదు, బొంబాయివంటి మహానగరాలు విపరీతంగా విస్తరించడం, కొత్త నగర శివార్లూ, వాటిలో కాలనీలూ పుట్టుకురావడం మనకు తెలిసినదే. ఈ ప్రాంతాలన్నిటిలోనూ కిక్కిరిసిన కొంపల్లో హడావిడి జీవితాలు గడుపుతూ, ఆఫీసులకూ, స్కూలు కాలేజీలకూ పరుగులు తీస్తూ జీవిస్తున్న అసంఖ్యాకులకు ఏకైక సాంస్కృతిక సాధనం టీవీయే. ఎందుకంటే పుస్తకాలు కొని చదివే తీరిక దాదాపుగా సున్నాయే. వ్యాపారమే పరమావధిగా పెట్టుకున్న టీవీ చానళ్ళన్నీ అంతులేని చెత్తను “కళా రూపాల్లో” ఎలా ప్రసారం, ప్రచారం చేస్తాయో మనకు తెలియనిది కాదు. ఈ విషయాలనన్నిటినీ జీర్ణం చేసుకుంటూ గత పాతికేళ్ళుగా కుటుంబాల్లో పెరిగిన పిల్లలే నేటి యువత. వీటన్నిటికీ ఎదురీది, మంచి విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నించిన కొద్దిమంది తప్ప తక్కినవారంతా ఉన్న పరిస్థితులకు “బలి” అయారంటే ఆ తప్పు వారిది కాదు. పాతవారికి తెలిసిన కొన్ని సామాన్య విషయాలు కూడా వారికి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు.

    పాతవారందరికీ అన్నీ తెలుసునని కాదు. 40 ఏళ్ళ క్రితం మద్రాసులో కాలేజిలో చదువుతున్నప్పుడు నేనొకసారి మా బంధువులబ్బాయి ఒకణ్ణి “కన్యాశుల్కం చదివావా?” అనడిగితే, “ఏం, అది మీనాన్న రాశాడా?” అని ఎదురు ప్రశ్న వేశాడు. కన్యాశుల్కం ఎవరు రాశారో వాడికి తెలియదు సరికదా అది మా నాన్న రాసినందువల్లే నేనా విషయాన్ని ప్రస్తావించానని వాడనుకోవడం కూడా గమనార్హం. కుటుంబ వాతావరణమే ఇందుకు కారణం. ఇటువంటి సంఘటనలు ఈ రోజుల్లో మరింతగా జరిగితే ఆశ్చర్యపోవక్కర్లేదు. “గురజాడ అంత గొప్ప రచయితయితే అతని సీరియల్స్‌ టీవీలో రావటం లేదేం?” అని ఎవరైనా అడిగే అవకాశముంది.

    ఈ పద్ధతిలో జరిగిన కొన్ని అవాంఛనీయ మార్పులను సరిదిద్దేందుకు కొత్త రకమైన ప్రయత్నాలు జరిగితే బావుంటుందనిపిస్తుంది. ఇందుకై బుద్ధిపూర్వకంగా కొన్ని పనులు జరగాలి. మొదటగా, తెలుగులో రాయగలిగినవారందరూ వివిధ విషయాలపై రచనలు కొనసాగిస్తూ ఉండాలి. (వీరిలో కొందరు కేవలం తమ పేరు ప్రఖ్యాతులకై రచనలు చెయ్యవచ్చునేమో కాని అదంత ముఖ్యవిషయం కాదు. రచయిత తాపత్రయం ఎటువంటిదైనా మంచి రచనలే నిలుస్తాయి). ఈ రచనల్లో కొన్నయినా మన సాంస్కృతిక వారసత్వంలోని “ఆరోగ్యకరమైన” విషయాలను పరిచయం చెయ్యగలిగినవై ఉండాలి. తమ మాతృభాషను గురించీ, సంస్కృతిని గురించీ ప్రతి తరంవారూ తెలుసుకోదగిన మంచి విషయాలుంటాయి. తల్లిదండ్రులు చెప్పగలిగిన విషయాలతో బాటు పుస్తకాలూ, ఇతర మాధ్యమాల ద్వారా ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. వీటి గురించి తగినంత ఆసక్తిని రేకెత్తించి, యువతీ యువకులకు ఆ వివరాలను వీలున్నంత బాగా అందజేసే బాధ్యత పాత తరానిదే. ఎటొచ్చీ ఈ పనులన్నీ కొనసాగుతున్న పద్ధతి నానాటికీ అతి బలహీనంగానూ, దయనీయంగానూ అనిపిస్తోంది. ఆధునిక జీవితాల పోకడనుబట్టి చూస్తే “కూటికీ, గుడ్డకూ పనికిరాని” మన పాత సంస్కృతిని గురించి తెలుసుకోవడం ఉత్త టైం వేస్టు. ఈ ధోరణిని నిలువరించి వెనక్కు తిప్పడం ఇప్పటికే అసాధ్యం అయిపోతోంది. అందుకని వీటికై బుద్ధిపూర్వకంగా కొన్ని ప్రయత్నాలను చేపడితే బావుంటుందేమో విజ్ఞులు గమనించాలి.

    మనలో చాలామందికి పాతవారి గురించీ, వారు సృష్టించిన సాహిత్యాదుల గురించీ నామమాత్రంగానే తెలుస్తూ ఉంటుంది. వారిని పరిచయంచేసే వ్యాసాలూ, వారి కృషికి ఈనాడున్న రెలవెన్స్‌ మొదలైన అంశాలూ వగైరాలన్నీ అందుబాటులోకి రావాలి. “ఈమాట”లో ఇటీవల వేలూరివారు తిరుపతి వెంకటకవుల పద్యాలను ఉదహరించడం ఇటువంటి మంచి ప్రయత్నాల్లో ఒకటి. పాత కవిత్వ సంకలనాలను కొని, పూర్తిగా చదివే అవకాశమూ, వ్యవధీ లేనివారికి కనీసం మెతుకు పట్టి చూసిన పద్ధతిలో వాటిని చదివే అవకాశం లభించినట్టవుతుంది. అలాగే ఈ సంచికలో సి.ఆర్‌.రెడ్డి తదితరులు కొన్ని దశాబ్దాల క్రితం చేసిన సాహిత్య విమర్శలోని అంశాలూ, వాటిలో కనబడుతున్న ఆనాటి సంకుచిత ధోరణులూ వగైరాలను వేలూరివారు బాగా వివరించారు. రెడ్డిగారైనా, బసవరాజు అప్పారావుగారైనా వారు చేసిన కృషి చెప్పుకోదగ్గదే. పేర్లు మినహాగా వీరెవరో తెలియని యువపాఠకులకు వీరి రచనలను గురించి క్లుప్తంగానైనా పరిచయం చేసి తీరాలి. వారి రచనల నమూనాలను ప్రచురించాలి. ఆ రచనలు చేసిన కాలాన్నీ, సందర్భాన్నీ, ఆయా రచయితలు గురి అయిన ప్రేరణలనూ కాస్తయినా వివరించాలి. యువపాఠకులు చాలా తెలివైనవారు. అందిస్తే అల్లుకుపోగలిగిన ప్రజ్ఞ కలవారు. పాతతరంవారు చెయ్యవలసిందల్లా అందించడమే. ఈ ప్రక్రియలో భాగంగా ఇంతకు మునుపు అచ్చయిన పరిచయ వ్యాసాలను మళ్ళీ ప్రచురించడం కూడా మంచిపనే. ఇదంతా ఒక చిన్న ఉద్యమం స్థాయిలో జరిగితే పరిమితంగానైనా కొంత సాంస్కృతిక పునరుజ్జీవనం వంటిది జరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు “ఈమాట” కూడా పూనుకుంటే బావుంటుందని నాకనిపిస్తోంది.

  1967. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    11/15/2006 8:09 am

    విప్లవ్ గారి ఒక అక్షేపణ చాలా సమంజసమైనదే అని ఒప్పుకోక తప్పదు. అది: కేంబ్రిడ్జ్ లో క్రికెట్ ఆట గురించి బ్రాకెట్లలో నేను చేర్చిన వాక్యం. ఆ వాక్యం అనవసరమైనదే! Guilty as charged!

    అయితే, “కవిత్వతత్త్వవిచారము” లో నిండుగా ఉన్న అవహేళన, అపహాస్యాలతో పోల్చిచూస్తే నా పొరపాటు క్షమార్హమనే అనుకుంటాను. అయినా తప్పు తప్పే! మరోసారి Guilty as charged.

    మరొక విషయం: ఉమాకాంతంగారి పై మంచి విమర్శ-సమీక్ష ఇంతవరకూ రాకపోవడం క్షమార్హం కాదు. ఆ పని ఎవరైనా సహృదయులు తలపెడితే మంచిది.

    అల్లాగే, మార్క్సిస్టు దృక్పథం అన్న పేరుతో ప్రస్తుతం పత్రికల్లో వచ్చిన సాహిత్య విమర్శలపై ఒక సమీక్షా వ్యాసం ఎవరైనా రాస్తే బాగుంటుందేమో!
    And the field is open, I suppose!

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  1968. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    11/13/2006 2:05 pm

    కామేశ్వరరావు గారూ మీరు చెప్పింది, నాకు అర్ధమైంది జోడించి నా ఆలోచన కొంత ఇక్కడ:

    “విమర్శ సిద్ధాంతానికున్న విస్తృతి, పరిమితీ బట్టి అది ఎలాంటి కవిత్వానికి వర్తింపచెయ్యవచ్చు, ఎలాటి విశ్లేషణకి ఉపయోగించవచ్చు అన్న విషయం ఆధారపడి ఉంటుంది. … ఇది దృష్టిలో ఉంచుకొని దానికి తగిన విశ్లేషణ చెయ్యడానికి, ఏ కవిత్వానికైనా, మార్క్సిస్టు విమర్శ పనికివస్తుంది.”

    అంటే “విమర్శ” ఏ ప్రాతిపదిక పైన చేస్తున్నారో దానికి లోబడి ఉన్నంత వరకూ ఆ సిద్ధాంతాన్ని ఎటువంటి కవిత్వ (ప్రబంధాలనుండి దిగంబరాల దాకా, ఎటువంటి కవిత్వం అయినా..) ప్రక్రియ పైన అయినా ఉపయోగించ వచ్చు.. అని అర్ధం చేసుకుంటున్నాం.

    వల్లంపాటి చెప్పిందీ ఇదే అనిపిస్తుంది.

    మరోలా చెప్పాలంటే “మార్క్సిస్టు విమర్శ” చేయతలచిన వాళ్ళు అలంకారాల వైపు, శైలి వైపు, శిల్పం వైపు దృష్టి పెట్టాలనుకోవటం అత్యాశే.

    ఇక్కడొక చిన్న detour:

    పై మాట దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఈ వ్యాసం తాను ఉదహరించిన కట్టమంచి చేసిన విమర్శ నేపధ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే తానూ (అంటే వేలూరి) అదే మూసలో చేసిన ప్రసంగ పాఠంలా తోచింది.

    కట్టమంచి చేసిన విమర్శ ఒక కోవలోకి (satire కావచ్చు) వస్తే వేలూరి ప్రసంగం అదే దోవలోకి వస్తుంది. satire (తెలుగు పదం నాకు తెలవదు) కూడా ఒక ఆర్టే. దానిక్కావలసిన లక్షణాలు చూపెట్టి కట్టమంచి వారి విమర్శ ఎందుకు ఫెయిలయిందో చెబితే వేలూరి గారన్న ప్రయోజనం {“అపూర్వకథాసంవిధాన వైచిత్రి, శృంగార ప్రాయత, పుణ్యవస్తు వర్ణనాకర్ణనీయత. “ఇవి సాధించాడా లేదా అన్నది ప్రప్రధమంగా ఏ విమర్శకుడైనా చూడాలి.} నెరవేరేది.

    వేలూరివారి ప్రసంగం కూడా {అవహేళన, అపహాస్యం!} అదే లక్షణాలు కలిగిందిగా కనిపించే అవకాశం ఎక్కువ {ఉదా: (కేంబ్రిడ్జ్ లో క్రికెట్ గురించి చెప్పి పొగడడానికి రెడ్డిగారికి ఇక్కడ అవకాశం దొరకలేదు కాబోలు!)}. అది ఆయన రాతలనెరిగిన వారు (his writing style) ఆయన లెవెలుకు సరిపోయే రీతిలో వాతలు పెట్టారా లేదా అన్నది తేల్చగలరు.

    ప్రబంధాలను ఒక రకమైన విమర్శా పరిధినుండి మినహాయించమంటే అది కుదరని పని; ఆ విమర్శ సహేతుకమా కాదా అన్నది ఆ విమర్శ కే చెందిన లక్షణాలను బట్టి ఉంటుంది అన్నవిశయం పైన మార్క్సిస్టు విమర్శ పరిధి నుండి తెలుసుకున్నాం.

    వేలూరి గారు చేసిన విమర్శ మీద నాకు complaint లేదు. దానికున్న పరిధిలో ఆయన చెప్పింది చేసారా లేదా అన్నదే కావాలి. On the space that he provided, he may have criticized CR Reddy but he seemed to have taken off off from the same origin. That truly in my opinion is a meeting place for a contradiction. It is full circle that way & this is a good writing for that reason. Had he written in any other way (without the satirical element, he would have fallen flat).

    end of detour.

    మళ్ళీ మొదటికొస్తే:

    వేలూరి రాసింది:

    కళాపూర్ణోదయ కావ్య రచనలో సూరన్న మూడు ప్రధాన లక్షణాలు సాధిస్తానని ముందుగా అన్నాడు. ఇవీ ఆ లక్షణాలు: “అపూర్వకథాసంవిధాన వైచిత్రి, శృంగార ప్రాయత, పుణ్యవస్తు వర్ణనాకర్ణనీయత. “ఇవి సాధించాడా లేదా అన్నది ప్రప్రధమంగా ఏ విమర్శకుడైనా చూడాలి.

    ఒక రచయిత లేక కవి తన ఉద్దేశం ముందే చెప్పి ఈ పరిధిలోనే నా కృతిని విమర్శించండి అనడం కరెక్టేనా? నా మటుకు నేను ఒక చెట్టును వేస్ట్ చేయటం, కొన్ని ఠావులు ఖరాబు చెయ్యటం మాత్రమే నా రచనల లక్షణం, అంతవరకే ఏ విమర్శకుడైనా పరిమితం కావాలి అని ఇప్పటినుండీ ఒక disclaimer తగిలించాలిక.

    విప్లవ్

  1969. అక్టోబరు పులి గురించి mohan mohan గారి అభిప్రాయం:

    11/12/2006 10:30 pm

    మీ కవిత బాగుంది. నెల్లూరు ముచ్చట్లు ఎన్నో జ్ఞాపకాలను వెలికి తెచ్చింది.

    Keep writing good poetry.

    Mohan

  1970. ఈ-మెయిలు గురించి phaNikaanta గారి అభిప్రాయం:

    11/11/2006 1:23 pm

    ఉదయకళ గారి కవిత ఏ ఛందస్సో తెలియదు కానీ
    బావుంది. ఇది చదివేక గుర్తొచ్చిన ఒక ఆరుద్ర మినీ కవిత:–

    ఆలు మగల లడాయి
    అంతమొందిన రేయి
    అనుపమానపు హాయి
    ఓ కూనలమ్మ!

    –P

  1971. అక్టోబరు పులి గురించి vaidehi sasidhar గారి అభిప్రాయం:

    11/11/2006 6:21 am

    ఆర్ద్రమైన కవిత!!

  1972. అన్నీ చెప్పగల భాష గురించి vaidehi sasidhar గారి అభిప్రాయం:

    11/11/2006 6:18 am

    మంచి కవిత.”దొరకలేదు” అంటూనే చక్కని భావం లో మీ భాషని బంధించారు.

  1973. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/08/2006 12:10 pm

    విప్లవ్ గారు మంచి ప్రశ్నే వేసారు. విమర్శ సిద్ధాంతానికున్న విస్తృతి, పరిమితీ బట్టి అది ఎలాంటి కవిత్వానికి వర్తింపచెయ్యవచ్చు, ఎలాటి విశ్లేషణకి ఉపయోగించవచ్చు అన్న విషయం ఆధారపడి ఉంటుంది. కాలంతో పెద్ద సంబంధం లేదు. మార్క్సిస్టు విమర్శ నాజు తెలిసీ కవిత్వ ఆవిర్భావానికి వెనకనున్న సామాజిక పరిస్థితులు, దాని ప్రభావమూ విశ్లేషించడానికి ఉపయోగపడినంతగా కవిత్వాన్ని విలువకట్టడానికి ఉపయోగపడదు. ఇది దృష్టిలో ఉంచుకొని దానికి తగిన విశ్లేషణ చెయ్యడానికి, ఏ కవిత్వానికైనా, మార్క్సిస్టు విమర్శ పనికివస్తుంది. దీనిని వల్లంపాటివారు “విమర్శా శిల్పం”లో చక్కగా వివరించారు:
    “ఉదాహరణకు మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం సాహిత్య వస్తువుకూ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని నిర్వచించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వస్తువుకూ రచయిత అంతరంగానికీ ఉన్న సంబంధాన్ని తీవ్రంగా పట్టించుకోదు. అలాగే ఆ వస్తువుకు రచయిత ఇచ్చిన రూపాన్ని విశ్లేషించటానికి మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం తగిన కొలబద్దలను ి రూపొందించలేదు. శిల్పాన్ని గురించీ, శైలిని గురించీ శాస్త్రీయమైన విశ్లేషణ చేయటానికి కూడా ఇది ప్రయత్నించదు. ప్రక్రియలు మారినప్పుడు సాహిత్య వస్తువు తీసుకొనే విభిన్న రూపాలను గురించి కూడా మార్క్సిస్టు సిద్ధాంతం దాదాపు నిశ్శబ్దంగానే ఉంటుంది. కానీ సాహిత్య ప్రక్రియల పుట్టుకకూ, అవి పుట్టిన సామాజిక సందర్భాలకూ మధ్య ఉన్న సంబంధాన్ని లేదా వైరుధ్యాన్ని మార్క్సిస్టు సాహిత్య విమర్శ మాత్రమే వివరించగలదు. శైలీ, దృష్టికోణం, కంఠస్వరం, పదచిత్రాలు, కవిత్వ ఛందస్సు మొదలైన శిల్పాంశాల విశ్లేషణకు ప్రత్యేకంగా మార్క్సిస్టు సాహిత్య దృక్పథం అంటూ ఏమీ లేదు. మార్క్సిస్టు సాహిత్య విమర్శకున్న బలమూ, బలహీనతా కూడా పునాదీ – ఉపరితలమూ సిద్ధాంతమే. ఈ సిద్ధాంతం యొక్క పరిమితుల్ని అర్థం చేసుకొని ఉపయోగిస్తే ఇది సాహిత్య వస్తువుకూ, ప్రక్రియకూ చెందిన ఎన్నీ చిక్కుముడుల్ని విప్పగలుగుతుంది. ఆర్థిక నియతి వాదాన్ని దుర్వినియోగం చేస్తే ముతక సిద్ధాంతంగా తయారౌతుంది.”

  1974. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/08/2006 5:16 am

    #
    ఉమాకాంతం గారి “నేటి కాలపు కవిత్వం” చదివిన తరువాత నాకైతే అతనికి ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము లోపించాయని అనిపించలేదు. మరి కృష్ణశాస్త్రిగారికి అనిపించింది. ఏది నిజం ఏది కాదు అంటే ఎవరు చెప్పాలి? అయినా ఇవి కావేమో విమర్శకుడికి ఉండల్సిన ముఖ్యార్హతలు.

    ఆర్ద్ర దృష్టి కవితా హృదయము కన్నా వేలూరి గారన్నట్లు నిష్పక్షపాత దృష్టి, నిజాయితీ హృదయమే విమర్శకు ఎక్కువగా కావలసిన సామగ్రి అనుకుంటాను.

    చదవగానే వినగానే మైమరిచి కరిగిపోయే ఆర్ద్రదృష్టి, భావాల వెల్లువలో తూలిపోయే కవితా హృదయం, భావ సమాధికి తన్మయత్వానికి సాయపడుతాయి కాని, పలు దృక్కోణాలనుంచి సమగ్రంగా అవగాహన పొందడానికి, సంయమనంతో విశేషంగా విశ్లేషించడానికి సాయపడడం కన్నా, అవి కొంత అడ్డుగానే నిలబడతాయని అనుకుంటాను.

    రచనలు పలు రకాలైనప్పుడు విమర్శలు కూడా పలు రకాలుగా ఉండడం సహజమూ అనివార్యమూ కూడా. అయితే రకాలు ఎన్నైనా, విషయం పాఠకునికి అందించడమే రచనలన్నింటి ఉద్దేశం. ఆ ఒక్కటి నెరవేర్చడంలోనే ఎన్నో ప్రక్రియలు, మార్గాలు, వైవిధ్యాలూ, సొగసులు, సృజనాత్మకమైన ప్రయోగాలు అన్నీనూ.

    అట్లే విమర్శలు ఎన్నో రకాలున్నా విమర్శించే రచన గురించి విశేషమైన అవగాహనను అందించే వరకూ అవి అన్నీ విమర్శలే, ఖచ్చితంగా. అయితే విశేషమైన అవగాహన కలిగించడం సుళువైన పని కాదు, కొన్ని సార్లు రచన కన్నా కష్టతరమైనది కూడా.

    మరి సమగ్ర విమర్శకు ఏమి కావాలి ? విమర్శకునికి రచనలో ఉన్న లోతులను చూసే నిశితమైన దృష్టి, అది వ్యక్తపరచే భావాలను అందుకునే హృదయ వైశాల్యం, సోంత ఇష్ట అయిష్టాలకు అందనట్టి ఎత్తులో ఉన్న నిష్పక్షపాతం – ఇవ్వన్నీ ఉంటేనే సమగ్రమైన అవగాహన పొందడానికి కానీ, ఇతరులకు అందించడానికి కాని సాధ్యం కాదనుకుంటాను. ఇక అవగాహన పెరుగే కొద్దీ విమర్శ యొక్క అభివ్యక్తీకరణలో స్పష్టత, క్లుప్తత వస్తుంది, సహజంగా. సూటిదనం కూడా ఉండి పాఠకున్ని విసిగించదు.

    మరి విమర్శ చేయడానికి ప్రేరణ, శిక్షణ అవసరమా అంటే తప్పకుండా అవసరమే. అయితే ప్రేరణ అందుకునేదే కాని అందించేది కాదు. ఇక శిక్షణా పద్ధతులు మాత్రం చర్చనీయాంశం.

    చివరగా ఒక్క మాట. తెలుగు భాష యొక్క వెలుగే తగ్గుతున్న రోజుల్లో తెలుగు సాహిత్యం పై చేసే విమర్శలో శిక్షణకు ఎంత priority ఉందో, ఉండాలో తెలియదు. తెల్లటి బట్టపై చిన్న మరక పడితే వేలెత్తి చూపిస్తారు కాని, పూర్తిగా మాయకపోయినా తెలె తెల బోయే బట్టపై మరకలను ఎవరు వెతికి చూపిస్తారు! రచనలు ఎక్కువగా నిస్సారమైనప్పుడు గొప్ప విమర్శలు మాత్రం ఎక్కడినుంచి వస్తాయి అని అనుకుంటాను.

    విధేయుడు
    -Srinivas

  1975. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    11/07/2006 8:26 am

    వేలూరి గారు రెండు ఉద్దేశాలు చెప్పారు మొదట్లోనే, అందులో ఒకటి:

    “సాహిత్య విమర్శలో ఈ పక్షపాతం అనావశ్యకమైన ఆవేశం గా మారితే, ఆ విమర్శ ల వల్ల సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చే నష్టాల వివరణ ఈ ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.”

    ఇందులో కొంతైనా నెరవేరినట్టుంది. ఆయన రెండవ ముఖ్యోద్దేశం గా చెప్పినది (“ఈ స్థితినుంచి తేరుకోవడానికి (విముక్తికి) మార్గాలేమయినా ఉన్నాయా”) కొద్దిగా నైనా జరగాలంటే పై మొదటిది విమర్శకులు దాటుకుని వెళ్ళాలి.

    నాకు చాలా డౌట్లు ఉన్నయి, వాటికి తొందర లేదు.

    కామేశ్వర రావు గారన్న మాట:

    “రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు.”

    ఈ మాట మీద కొంచెం వివరణ అవసరం అనుకుంటాను. నా ప్రశ్న: మనం మార్క్సిస్టు విమర్శ అనే సిద్ధాంతకోణం లోనించి ఒక శతాబ్దం లేక దశాబ్దం లో వచ్చిన సాహిత్యాన్ని critic చేయటం తప్పంటారా? (“మార్కిస్టు విమర్శ” మీద అభ్యంతరాలు ఉంటే దాని బదులు మోరలిస్ట్ విమర్శ కాకపోతే మరొకటి అనుకోండి ఇప్పటి మటుకు).

    విప్లవ్

  1976. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Alok Vastav గారి అభిప్రాయం:

    11/06/2006 10:57 am

    కామేశ్వరరావు గారు పొరబడ్డారు.అక్కిరాజుగారు తమ గ్రంధంలో ఎక్కడా “ఇది నా అభిప్రాయం, “ఈ కవిత నా అభిప్రాయానికి అనుగుణంగా లేదు”, “లేదు కాబట్టి ఇది కవిత గాదు” అని ఎక్కడా అనలేదు.అల్లా అనడం బుద్ధితక్కువదనమని మనకే తెలిసినపుడు వ్యాకరణ, తర్క నిష్ణాతుడైన ఆయనకు తెలియకపోవడమేంటి?

    తాను మండన జేసిన ప్రతి సిద్ధాంతానికీ వేద, పురాణ, ఇతిహాస, అలంకారశాస్త్రం వంటి ప్రామాణికగ్రంధాలను ఉదహరించారు.అక్కడే కట్టమంచివారికీ అక్కిరాజుగారికీ తేడా కనపడేది. ఎవరైతే ప్రత్యక్ష, అనుమాన, ఆగమాలను వాడకండా వాదిస్తాడో అది సిద్ధాంతమవదు రాద్ధాంతమౌతుంది.

    అల్లా ప్రామాణికంగా రాసిన విమర్శని నిరుపయోగమైన సెంటిమెంటులతో తోసిపుచ్చడం పరిణితి చెందని మనసులకే సాధ్యం.

  1977. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/06/2006 10:04 am

    ఇక్కడ కృష్ణశాస్త్రిగారన్న “ఆర్ద్రత”, “కవితాహృదయం” అన్న పదాలని కొంత స్పష్టపరచాలి. వేలూరి వారీ వ్యాసంలో చెప్పినట్టు, రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు. ఒకో రకం కవిత్వానికి ఒకో రకమైన రూపం, వస్తువు, పాఠకవర్గం, ప్రత్యేక ప్రయోజనాలూ ఉంటయి. వాటికి తగట్టు ఆ కవిత్వానికి ప్రమాణాలు ఏర్పడతాయి. వాటిని అర్థం చేసికొని దానికి తగినట్టు విమర్శ చేస్తే అది సహృదయ విమర్శ అనిపించుకుంటుంది. లేకపోతే, ఎంత మంది ఎంతగా ఇష్టపడితే నాకేంటి, నేను మెచ్చిందే కవిత్వం అన్నట్టుంటుంది. సహృదయ విమర్శ అంటే ఊరికే రాసిన వాళ్ళను పొగడటం కాదు. వాళ్ళ కవిత్వాన్ని సరిగా అంచనా వేసి (పైన పేర్కొన్నట్టు), దానికి తగట్టు విమర్శించడం. అక్కిరాజు వారీ పని చెయ్యలేకపోయారు.

  1978. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    11/05/2006 3:43 pm

    విమర్శల్లో తెగనాడినవి గుర్తున్నంతగా తక్కినవి గుర్తుండవేమో! తెలుగులో మంచి విమర్శలు చాలానే వెలువడ్డాయి. కాని వేలూరివారు చెప్పినట్టుగా కొన్ని విమర్శల ద్వారా రచన గురించే కాక విమర్శకుడి సంగతి కూడా మనకు తెలుస్తుంది.

    పాత సాహిత్యంలో “అమలినం” కాని శృంగారాన్ని పద్ధెనిమిదో శతాబ్దం నుంచీ విమర్శకులు ఈసడించుకోవడం కనిపిస్తుంది. ఆ తరవాతి కాలంలో కూడా ముద్దుపళనివంటివారి రచనలు తీవ్ర విమర్శకు లోనవడం గురించి ఆరుద్ర ప్రస్తావించారు. వాటిలో కొన్ని శృంగారాన్ని గురించిన స్త్రీల దృక్పథాన్ని తెలుపుతాయనీ, వాటిని తరవాతి కాలంలో అణచకుండా ఉన్నట్టయితే అదొక ఆధునిక స్త్రీవాద సాహిత్యానికి దారి తీసి ఉండగలదనీ ఆయన భావించారు.

    వ్యాసంలో ప్రస్తావించిన రచనలోనే కృష్ణశాస్త్రిగారు తనకన్నా సీనియర్లనూ, జూనియర్లనూ కూడా పేర్కొంటూ, విమర్శ కాకపోయినా సమీక్ష చేశారు. కె.వి.రమణారెడ్డి అనేకుల రచనలను వివరంగా విమర్శించారు. “ఋణ” దృక్పథంతో చేసిన విమర్శల్లో రాచమల్లు రామచంద్రారెడ్డిగారు దిగంబర కవులను గురించి రాసినది కూడా ఒకటి. త్రిపురనేని మధుసూదనరావు విశ్వనాథ రచనలను విశ్లేషించి మరీ చెండాడాడు.

    ఈ మధ్య ద్వానాశాస్త్రి తదితరులు విప్లవ, స్త్రీ వాద, దళితవాద, మైనారిటీ వాద రచనలను సహృదయతతో విమర్శ చేస్తున్నారు. ఇవి అంతగా గుర్తుండకపోవటానికి కారణం ఇవన్నీ దిన, వార, మాసపత్రికల్లో ఏదో ఒక మూల కాస్తకాస్తగా కనిపిస్తూ ఉండడమే. సాహిత్యానికే దిక్కులేని ఈ రోజుల్లో విమర్శలను పట్టించుకునేవారే తక్కువ.

    మంచి సాహిత్యాన్నిగాని, ఉన్న సాహిత్యంలో మంచినిగాని పరిచయం చేస్తే అది కూడా ఉపయోగకరమే. 1969లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వెల్చేరు నారాయణరావుగారు వెన్నెల రాత్రి వేళ హాస్టలు డాబామీద తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితను విద్యార్థులకు చదివి వినిపించడం గుర్తుంది.

    విమర్శకులూ, సమీక్షకులూ సామాన్య పాఠకులకన్నా కాస్త లోతుగా పరిశీలించి, రచనలను గురించి వ్యాఖ్యానం చేస్తారు కనక సాహిత్యాభిమానులకు అది ఉపయోగపడుతుంది. అయితే వారికి కూడా తప్పనిసరిగా కొన్ని పరిమితులుంటాయి. వేలూరివారి వ్యాసంవల్ల నాకు అర్థమయినదిదే.

  1979. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    11/05/2006 11:08 am

    Alok Vastav గారు కృష్ణశాస్త్రి గారి మూల వ్యాసం చదివి ఉంటే, ఉమాపతి గారి గురించి నేను అన్నమాటలకి అక్షేపణ చేసేవారు కాదనుకొంటాను.

    కృష్ణశాస్త్రి గారి “పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము” అన్న 1948 భారతి పత్రికలోని వ్యాసం 1923 నుంచి 1948 వరకూ వచ్చిన కవిత్వంపై, నాటి కవితా ఉద్యమాలపై చక్కని విమర్శనా వ్యాసం అని నిస్సంశయంగా చెప్పవచ్చు.

    ఓరియంట్ లాంగ్మన్ వారు 1993 లో ప్రచురించిన “అప్పుడే పుట్టి ఉంటే” అన్న కృష్ణశాస్త్రి గారి వ్యాస సంపుటి లో ఈ వ్యాసం తిరిగి అచ్చయ్యింది. 1/8 డెమీ సైజులో 34 పేజీల సుదీర్ఘ వ్యాసం ఇది. ఆ వ్యాసంనుంచి ఈ కింది వాక్యాలు (చూ: 29 వ పేజీ):

    “… కృష్ణపక్షం ప్రచురించాను. స్ఫుటంగా నా మనస్సులో నాటుకొపోయిన మరి రెండు మూడు ఘట్టాలు ఉన్నాయి. 1925 లో నేమో అక్కిరాజు ఉమాకాంతం గారు వ్రాసిన “నేటి కాలపు కవిత్వము” అనే గ్రంథం వచ్చింది. ఆశనిపాతమంత తీవ్రధాటితో వచ్చింది. రాకేం జేస్తుంది? ఎప్పుడయితే నిజమైన ఒక ఉద్యమం బయలుదేరిందో, అప్పుడే దాని గుణదోషవిమర్శన కూడా వస్తుంది. ఆయన తీవ్ర విమర్శననుంచి నావంటి కవులు నేర్చుకోవలసినది లేకపోనూ లేదు; కాని కొంత ఆర్ద్ర దృష్టితో కవితాహృదయముతో ఆ విమర్శన సాగితే, నేటికాలపు కవిత్వంలో వారు చక్కదనమూ కవిత్వగుణమూ గ్రహించి ఉండేవారు. ఊపిరాడనీయనంత కోపంతో ఆ గ్రంథం దాడిచేసినట్లనిపించింది నావంటి వారికి. దానికి జవాబు వ్రాద్దామా అన్నారు కొందరు మిత్రులు. ఏమి జవాబు మేము వ్రాయగలం? కొత్త పద్యాలు వ్రాయడమే జవాబనిపించింది. వ్రాయకుండా ఎలాగుండగలం? ఈ సంకల్పం 1925 లో మదరాసులో మరీ దృఢపడింది.”

    ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము ఉమాకాంతపండితులకు లోపించిందని ఇంతకన్నా మృదువుగా, కృష్ణశాస్త్రిగారి కన్నా చక్కగా ఇంకెవరు చెప్పగలరు?

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  1980. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Alok Vastav గారి అభిప్రాయం:

    11/04/2006 12:07 pm

    అక్కిరాజు ఉమాకాంతం గారిది హద్దుమీరిన అవహేళన అన్న మీ మాటలు అంతగా నచ్చలేదు. యే కొంచెం సూటిగావున్నా అది హద్దులు మీరిందనా కొలబద్ద? కట్టమంచివారికంటే అక్కిరాజుగారిలో నాకు నిజాయితీ, ఆవేదనా కనపడుతుంది. శ్రీశ్రీ మాటల బట్టి జూస్తే కవులకు అక్కిరాజుగారి పాండిత్య భయమేగానీ ఆయన ఆవేదన కనబడలేదులా వుంది. అంటే ఆయా కవులకి కవిత్వవీరత్వం, పాండిత్యభీరుత్వమని తీర్మానించవొచ్చుగదా! లేదూ ఆయన చేత విమర్శింపబడ్డవారందరూ కవిపండితులే అనుకొంటే ఆయన విమర్శలని దీటుగా ఎదుర్కొంటూ యేల గ్రంధాలు, వ్యాసాలు వెలయించలేదు? “ఆ మహాపండితుడి ఆక్షేపణలకు సమాధానమ ఎవరేం చెప్పగలరు? మరింత ఉత్సాహంతో, పట్టుదలతో నవ్యకవితారీతులను ప్రచారం చేయడమే ఆయనకు చెప్పగల సమాధానమని మేమనుకొన్నాం” అని కృష్ణశాస్త్రిగారు భారతి రజతోత్సవ సంచికలో రాసినట్టు శ్రీ పేర్వారం జగన్నాధం గారు రాసారు. “మేమనుకొన్నాం” అన్న పదం నాకెందుకో “మూక మనస్తత్త్వా”న్ని గుర్తుకుతెచ్చింది.వొక్క పండితుడి “అవహేళన”కి మూక ప్రచారం స్థాయిలో సమాధానమివ్వాలని అంతమంది కలిసి తీర్మానించడమే సాక్షి అక్కిరాజుగారిది అవహేళనతో కూడిన విమర్శ కాదని. సంపూర్ణంగా భారతీయతత్వ చింతనతో విమర్శించిన అక్కిరాజుగారిని కట్టమంచివారి సరసన కట్టివేయడం మనసుకి కష్టంగా వుంది.

  1981. బస్సెడు దూరం గురించి Ashish.R.Katta గారి అభిప్రాయం:

    11/04/2006 3:56 am

    మనసులోని భావాలను సిరా చేసి కాగితం పై నింపితే కవితలు ఉద్భవిస్తయి
    సంఘటనలల జీవితాన్ని కాగితం పై పెట్టి కనికట్టు చెస్తే ఒక మంచి కధ జనిస్తుంది
    దాంట్లో శివం లంటి పాత్ర ఊపిరి పొసుకుంటుంది
    పేజీ చివరన వ్రాసిందెవరని చూస్తే తెలుగు భాష కి కొత్త ఊపిరి పోస్తున్న ఒక నవకిరణం నామం కనిపిస్తుంది

  1982. ఈ-మెయిలు గురించి Sudheer Kumar Kothuri గారి అభిప్రాయం:

    11/04/2006 3:25 am

    బాగుంది…అలిగిన వేళ రాజీకి ఈమెయిలొక సాధనమయ్యింది. మీ కవిత ఎంతో సహజంగా వుంది. నేను కూడా నా భార్యతో ఏమైనా గిల్లీకజ్జాలు జరిగి మాటలు మూగవోయినప్పుడు ఈమెయిల్ నే రాజీ సందేశానికి ఉపయోగిస్తాను. అందుకే మా ఇద్దరి మధ్య ఎమైన గొడవైనప్పుడు నా వైఫ్ పదే పదే ఈమెయిల్ చెక్ చేస్తూంటుంది.

  1983. ప్రతీకగా శరీరం గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    11/02/2006 4:41 am

    చక్కని వ్యాసం. మీరు అనువదించిన కవిత అద్భుతంగా ఉంది.

  1984. ఛందోధర్మము గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    11/01/2006 12:52 pm

    కృష్ణదేశికాచార్యులు గారూ,
    మీలాంటి పెద్దలకు చెప్పేంతవాన్ని కాదు. అలాగే మీరు చెప్పిన వుదాహరణలతో విభేదించాల్సిన పనీ లేదు. చందోబద్దమైన పద్యానికి, లయ బద్దమైన గేయానికి, భావ బద్దమైన వచన కవిత్వానికి దేనికున్న విలువ దానికుంది. అలాగే చంధస్సు అన్నది స్వయంభువు అన్నదానితో మీ వుదాహరణలతో నేనేకిభవిస్తాను. ఒక మంచి లయబద్దమైన పాట వింటున్నపుడు కాలు లయబద్దంగా ఎలా కదులుతుందో అలాగే మనసును రంజింపజేసిన భావము కవి నోటిలో చంధోబద్దంగా పద్యాన్ని పలికిస్తుందని మీ వ్యాసమంతా చదివాక తెలుసుకున్నాను.
    అయితే చంధస్సు, యతి ప్రాసల నియమాలు కవితాకల్పనకు దోహదం చేసే నియమాలనడంతో విభేదించాల్సివస్తోంది. మీరే అన్నట్లు లయ ప్రాధాన్యంగా వుండాలంటే చందస్సు అవసరమే. అయితే భావమే ప్రధానమంటే చందస్సు కాక బావాన్ని కఠినంగా వ్యక్తపరిచే పదాలనే ఎన్నుకోవాలి కదా! చంధస్సుకు సరిపడలేదనే కారణంచేత సరైన భావాన్ని పలికించే పదాన్ని వదిలివేయడం ఎంతవరకు సబబు? మీరే చెప్పిన చాలా వుదాహరణల్లో యతి నియమం కోసం ఒకటి రెండు నియమాలు ఆలోచించి ఆ పదభందాలు చేర్చామన్నారు కదా. నాకప్పుడు ఏమనిపించిందంటే ఈ యతి నియమం సంతృప్తిపరచే పదభందం దొరగ్గానే మీలోని కవి మరింత మంచి పదానికై తన శోధనను ఆపివేశాడేమొనని! ఆ నియమమే లేకుంటే ఇంకెంత భావపుష్టి కలిగిన పదం మీకు దొరికేదో! ఆవేశంగా ఆశువుగా పదభందాలు దొర్లి automaticగా చంధోబద్దమైన పాదాలు జనిస్తే సరే కానీ యతో, ప్రాసో కలిసిందనే సాకుతో అంతకంటె మంచివైన పదాలను వదిలివేయడం సమంజసం కాదేమొ, లయబద్దమైన కవిత్వమే కావాలనుకుంటే తప్ప!
    –ప్రసాద్
    http://blog.charasala.com

  1985. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి ObserverEccentric గారి అభిప్రాయం:

    10/24/2006 8:45 am

    “మధ్య తరగతిని తయారు చేసింది” అనే రచయితల వాక్యాన్ని శ్రీనివాస్ గారు literal గా తీసుకున్నట్టున్నారు. నాకనిపించింది ఇక్కడ తయారు చెయ్యటం అంటే – ఈ మధ్యతరగతికి ఒక legitimacy ని ఇచ్చి, వాళ్ళ భావాల్నీ ఆలోచనల్నీ ఆశయాల్నీ ఉత్తమమైనవిగా ప్రచారం చెయ్యటం.

    భారత, ఆంధ్ర జాతీయతా భావాలకీ తెలుగు భావకవిత్వానికీ ఉన్న సంబంధం బాగా చెప్పారు. ముఖ్యంగా గురజాడ ఉదాహరణ బాగా అతికినట్టు సరిపోయింది ఈ సిద్ధాంతానికి. అయితే పుట్టపర్తి శివతాండవ రచన వంటి ఉదాహరణలు అతకలేదు. చాలా చోట్ల భాస్కర్ గారు చెప్పినట్టు continuity of thought, argument లోపించింది.
    రచన గొంతు (tone) రెచ్చగొట్టాలన్నట్టుగా ఉంది. అదే కనక రచయితల ఉద్దేశమైతే సఫలమైనట్టే. అందువల్లనైనా పాఠకుల్లో కొంచెం మెలకువ కలిగి చర్చ జరిగితే మంచిదే కదా!

  1986. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    10/20/2006 9:49 pm

    ఇది ఆసక్తికరమైన వ్యాసం. పరిశోధనా పరంగా విషయాలను వెతికి వెలికి తీసి అందించిన శ్రమ కొట్టొచ్చి నట్లు కనపడుతుంది. రాజుల గురించి, కావ్యాలు, రచనలను ఉటంకించి ఎన్నో విషయాలను అందజేసారు.

    కాని వీటినన్నింటి ఆధారంగా చేసిన విశ్లేషణ, conclusion మాత్రం అసమగ్రంగా, అసంబద్ధంగా ఉంది. ఉదాహరణకు భావకవిత్వం చేసిన ముఖ్యమైన పని ఇది అని వివరించిన
    వాక్యం చూడండి. ఇది ఎందుకు ఉటంకించానంటే, మొత్తం వ్యాసానికి ఇది ప్రధాన భూమికగానే కాక, అంతస్సూత్రంగా కూడా ఉన్న ముఖ్యాంశం.

    “(భావ కవిత్వం) దేశంలో ఒక మధ్య తరగతిని తయారు చేసి వాళ్ళ ఊహల ద్వారా ఒక భారత జాతీయతని నిర్మించింది” అని అన్నారు.

    ఇది అసంబద్ధంగా ఉంది. కవిత్వానికి ఎక్కడైనా మధ్య తరగతిని తయారు చేసే శక్తి ఉంటుందా ? పోనీ, అలా చేస్తే కవిత్వానికి ఎప్పుడైనా ఒక ప్రత్యేక మైన వర్గానికి చెందిన వారి ఊహలను మాత్రమే ప్రభావితం చేసి, ఇతరులను అంటకుండా ముట్టకుండా వదిలేసే విచక్షణాపరమైన శక్తి కూడా ఉంటుందా? పోనీ, మధ్య తరగతి వాళ్ళ ఊహలు ప్రభావితం చేసిందే అని అంగీకరించినా, నేటి మధ్యతరగతి వాళ్ళు రేపు పేద వాళ్ళుగానో, కడు శ్రీమంతులుగానో మారిపోతే అప్పుడు ఏమైపోతాయి ఆ ప్రభావాలూ, ఆ ఊహలూ అన్నీనూ? భావకవిత్వమైనా, ఏ కవిత్వమైనా సరే, అది రచించినప్పుడు మధ్య తరగతిలో ఉన్న వాళ్ళందరూ కూడా తరువాత అలానే మధ్యతరగతిలో ఉండాలని కానీ, ఉంటారని కానీ ఏమీ గ్యారంటీ లేదు కదా.

    అసలు economy వల్ల మధ్య తరగతేనిది ఏర్పడుతుంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే మధ్య తరగతిలోనే కాస్త డొక్క మాడే ఆకలి బాధలు తగ్గి, కొంత కడుపు చల్లబడి తీరికగా ఊపిరి పీల్చే అవకాశాలున్నాయి కాబట్టి అటువంటి సందర్భంలోనే కొంత భావమూ, ఊహలు చేసే అవకాశమూ, ఆలోచనలూ కలుగుతాయి కాబట్టి, అసలు ఈ మధ్య తరగతే “భావ కవిత్వానికి” భూమిక అనీ, “భావ కవుల” ఊహలకు “మధ్య తరగతే” బలం, గళం ఇచ్చిందీ అని ఎందుకు అనుకోకూడదో తెలియదు.

    Literature ని economy ని ఒక్క గాటున కలిపేసి ఈ విధంగా ఒక కవిత్వం యొక్క పరిణామాన్ని ప్రతిపాదిస్తూ, ఫలానాది మధ్య తరగతి వాళ్ళ ఊహలను ప్రభావితం చేసిందనడం రెంటికి చెడిన రేవడిలాగా ఉంది.

    అంతే కాక, ఏ జాతీయ భావం ఈ కవిత్వం కల్పించిందని అన్నారో, అదే భావానికి అంకితమై, ధనిక, పేద, మధ్య తరగతి అనే ఎటువంటి భేదం అణుమాత్రం లేకుండా ఉన్న ఆస్తులూ, పాస్తులూ, పదవులూ, ప్రాణాలు ఒడ్డి పోరాడి జైల్లలో మ్రగ్గిన వారెందరినో మరచిపోవడమే అవుతుంది, ఈ ప్రతిపాదనను అంగీకరించడం. భారత జాతీయతా అనేది కవిత్వమే కనక సృష్టించి ఉంటే ఆ భావకవులందరినీ బ్రిటీషువాళ్ళు జైల్లో త్రోసి సుళువుగానే దాన్ని నొక్కి ఉంచేవారు.

    (భావ) కవిత్వం కాదు భారత జాతీయతను నిర్మించింది! అంకురించి పెల్లుబుకి వెల్లువై విజృంబించిన భారత జాతీయతా భావతరంగాలకు తనదైన గొంతు నిచ్చి రసవంతంగా పలికించిన పదాలే కొన్ని మనం భావ కవితలనే పేరుతో పిలుస్తున్నాము అని అనుకుంటున్నాను.

    విధేయుడు
    -Srinivas

  1987. అమ్మ గురించి Vardhi Reddy Harinadha Reddy గారి అభిప్రాయం:

    10/08/2006 2:45 am

    మంజు గారు
    నిజంగా చాలా అద్భుతంగా వుంది. మాట ల లో వెలక ట్ట లేని కవిత.
    ధ న్య వా దాలు.
    హర నాద రెడ్డి. వి

  1988. మొలతాడు గురించి paaThakuDu గారి అభిప్రాయం:

    09/29/2006 7:10 am

    వెతుక్కోండి మీకు కావలిసిన అందాలు అర్థాలు అవే దొరుకుతాయి. మీరు సరిగ్గా వెతికితే మీకు మొలతాడే కాదు, సిగ్గు బిళ్ళలూ కనిపిస్తాయి. అంతా చూసే కళ్ళ మీద అధారపడి ఉంటుంది.
    – ఈ కవిత మీద ఇంత చర్చ అనవసరం.

  1989. మొలతాడు గురించి Chilakapati Srinivas గారి అభిప్రాయం:

    09/28/2006 7:58 am

    కథ అర్థమయింది కానీ, పాఠకమిత్రుల వ్యాఖ్యలు అయోమయంలో పడేస్తున్నాయి. దీనికీ నేటికాలపు కవిత్వానికీ, లేదా బుష్ కీ లంకె ఎక్కడుందో ఎంత వెతికినా కనపడలేదు.
    ప్రియురాలి మీద ప్రేమతో ఈత రాకున్నా దూకి ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడి చావులో satire ఏమిటో బొత్తిగా తెలియటం లేదు. అది జాలి గొలపవలసిన విషయమో, అతని ప్రేమకు అబ్బురపడవలసిన సందర్భమో గానీ, అందులో ఎగతాళి స్ఫురిస్తే ఆ లోపం పాఠకుడిదో లేదా రచయితదో అయి ఉండాలి.
    లేదావీరిలో ఎవరయినా ఈ మతలబు ఏమిటో నా బోటి మామూలు పాఠకులకు వివరించి పుణ్యం కట్టుకోవాలి.

  1990. మొలతాడు గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:

    09/24/2006 11:14 pm

    మంచి satire. నెటి తెలుగు సాహిత్యం తీరు కవితలో తేలుతున్న మొలతాడు చందమే మరి.

  1991. అతివాదాలు – అర్థసత్యాలు గురించి Vaidehi sasidhar గారి అభిప్రాయం:

    09/22/2006 7:21 am

    Ismail గారి చక్కని వ్యాసాలు, ఇంటర్వ్యూలు ప్రచురించినందుకు ధన్యవాదాలు. ఏ కవినైనా పూర్తిగా అవగాహన చేసుకొనటానికి కేవలం వారి కవిత్వం సరిపోదు.ఇటువంటి వ్యాసాల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే కవిత్వాన్ని గూర్చిన వైయుక్తిక అభిప్రాయాలు, కవిత్వానికి కవులు ఇచ్చే philosophical extensions వెల్లడి చేసే అవకాశం లభిస్తుంది.ప్రముఖకవులు, రచయితల ఇంటర్వ్యూలు మరెన్నో “ఈమాట” ప్రచురించాలని కోరుకుంటున్నాను.

  1992. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/16/2006 1:01 pm

    “పనికిమాలిన” లెక్కల ప్రాధాన్యత

    తెలుగులో శాస్త్రీయ విషయాల్ని ఇంత తేలిగ్గా తెలియపరిచిన వేమురి వ్యాసం చాలా బావుంది. “పెద్దవాళ్ళు పుస్తకాలు రాస్తారు, యువకులు సిద్ధాంతాలని రుజువు చేస్తారు,” అన్న సూత్రాన్ని భార్గవ మరోసారి రుజువు చేశారు.

    ఇలాంటి లెక్కల సొగసుల్ని చూడాలన్నా,
    “Not all the water in the rough rude sea
    Can wash the balm off from an anointed king;”
    కన్నా
    “After life’s fitful fever he sleeps well; ”
    ఎందుకు గొప్ప కవిత్వమో తెలుసుకోవాలన్నా, తప్పక చదవాల్సిన పుస్తకం, రామానుజన్ ని కనుగొన్న Hardy రాసిన “A Mathematician’s Apology.” అచ్చుప్రతిలో ఉన్న C. P. Snow రాసిన ముందుమాట గూడా చదవదగ్గది.

    కొడవళ్ళ హనుమంతరావు

  1993. రైలు ప్రయాణం లో గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    09/15/2006 10:24 am

    లైలా గారూ,
    మీలాంటి ప్రముఖ రచయిత్రి కి నా రచనలు నచ్చటం చాలా సంతోషం.
    ధన్యవాదాలు.
    నా కవిత కంటె అందమైన వర్ణచిత్రాన్ని ఎంపిక చేసిన క్రెడిటంతా కొలిచాల సురేశ్ గారిది. Thanks to him.

  1994. రైలు ప్రయాణం లో గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    09/14/2006 4:11 pm

    మీ రచన నాకెంతో నచ్చింది వైదేహీ! కావాలని మళ్ళీ “ఈమాట” కు వచ్చి చదువుకున్నాను . గుల్మొహారు కవిత కూడా ఎంత చక్కగా వ్రాశారు! కవిత పైని వర్ణ చిత్రం మీరు చిత్రించిందేనా? అదీ బాగుంది. ఆ బొమ్మ చూసి ఆ రంగులు ఇంకా రెటీనా మీద ఉండగానే కవిత చదువుకోగలగటం నాకెంతో ఆనందం కలిగించింది. ధన్యవాదాలు.

  1995. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:

    09/11/2006 8:07 pm

    రచయితలకి నమస్కారం.

    మీరు రాద్దామనుకున్న విషయం బాగానే ఉంది. కాని , విషయాలు చెప్పిన విధానంలో స్పష్టత లోపించినట్టనిపించింది. కొన్ని చోట్ల, “చెప్పేసారు” కాని వివరించలేదు. మీ భాషలో చెప్పాలంటే, చెప్పే విషయాలమధ్య బాగా జాగా వదిలేసారు. అలాంటి వాటిలో కొన్నిటిని మాత్రమే ప్రస్తావిస్తాను.

    1. మీ రచనలో 3వ పేరా:
    అ) ఈ పేరాలో చెప్పినవి కేవలం తెలుగువాళ్ళకేనా, లేక భారతీయులందరికీ వర్తిస్తాయా?
    ఆ) చెప్పిన విషయాలకు ఆధారాల్ని జోడించక పోవడం వల్ల, కేవలం అభిప్రాయాల్లా ఉన్నాయి.
    ఇ) వందల ఏళ్ళుగా భారతదేశంలోని ప్రజలు వేరు వేరు రాజ్యాల్లో ఉన్నా అందరిదీ ఒకే ధర్మమని ఎందుకు అనుకున్నారు? మనలో అసంగతంగా ఏదో ఒక సంఘటిత భావం లేకపోతే, అందరం కలసి ఉండాలని 1947లో ఎందుకు నిర్ణయించుకున్నాము. వేరు కాపురం పెట్టిన వాళ్ళని చూసికూడా, మనం ఎందుకలా స్పందించలేదు?
    ఈ) మనకు గొప్ప చరిత్ర ఉందని మనకు తెలియదా? అశ్వఘోషుడు, కల్హణుడు, బాణుడు మొదలైన వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు చెప్పేవరకూ మనకు తెలియరా? మనం చరిత్ర అని నమ్మిన పురాణేతిహాసాల మాటేమిటి? ఇవన్నీ భావాలు కావా? ఆ భావాల్లో నిజమెంత అన్నది వేరే వాదన. మనకి మిగిలిన కళలు, కావ్యాలు, శిల్పాలు మొదలైనవి ఏ భావం లేకుండానే వెలిసాయా?/పోషింపబడ్డాయా?

    2. “ఈ ఊహల ఆధారంగా మనకి ప్రాచీన కాలం నుంచీ జాతీయతా భావం ఉంది అని వాదించడం పొరపాటు”
    అ) బ్రిటిష్ వాళ్ళు మనకి చెప్పిన మన చరిత్ర, మన సంస్కృతులకు గూడ, ఆధారాలు కొంతవరకూ “ఈ ఊహలే”. వాళ్ళు చరిత్రకోసం కొన్ని ఆధారాల్ని తవ్వితీసినా, సంస్కృతికి సంబంధించి కొత్తగా చెప్పిందేమిటి? అప్పటికి, ప్రచారసాధనాలు మెరుగవడం వల్ల వాళ్ళకి అందిందాన్ని ఎక్కువమందికి తెలిపారు.

    ఆ) భావకవిత్వం తెచ్చిన కొత్త ఊహలతో నిర్మించిన భారత జాతీయతని మనం నమ్మవలసివస్తే, మీ 4 వ పేరాలో లాంటి పాత ఊహల్తో పుట్టిన ఒక జాతీయత పూర్వం ఉండేది అని ఎందుకు నమ్మకూడదు?

    ఇ) మన పెళ్ళిళ్ళలో బ్రాహ్మలు అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజాల దగ్గరే ఆగిపోయారెందుకు? పారశీక, మ్లేచ్ఛ, యవన దేశాల్లో అమ్మాయిల్ని ఎందుకు వెతకలేదు. సంస్కృతో, మరేదో అడ్డు వచ్చాయనేనా?

    3) “రాజుల్నీ, రాజభావాన్నీ వదిలించుకున్నాకగాని మనకు జాతీయభావం ఏర్పడలేదు [1]” మీరనుకునే జాతీయభావమేదో నిర్వచించండి. [1] అని వదిలేస్తే అర్ధం అవటల్లేదు.

    ఆఖరిగా, తెలుగునాట, చదువు వచ్చినవాళ్ళెంతమంది? అందులో, కవిత్వం చదివే వాళ్ళెందరు? వాళ్ళలో ప్రభావితులయే వాళ్ళెందరు?

    ఇతరులనుండి గ్రహించిన విషయాల్ని సంగ్రహంగానైనా స్పష్టపరిచి, మరికాస్త లోతైన పరిశోధన చేసి రాస్తే బాగుండేది.

    భాస్కర్ కొంపెల్ల

  1996. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    09/10/2006 7:29 pm

    వేలూరి చెప్పిన అయిదు విషయాలు మక్కీకి మక్కీ:

    1. “మన కవులు అక్షరాస్యులేనా అని గుడిపాటి అడిగిన ప్రశ్నని, కొందరు అది కొన్ని రకాల కవిత్వాన్ని అణగదొక్కటానికి వేసిన ప్రశ్నగా తప్పు అర్థం చేసుకున్నారు.”

    2. “రాసేవాళ్ళు సమర్థులైతే మంచి కవిత్వం రాస్తున్నారు . సమర్థులు కాని వాళ్ళు ఏ భాషలో రాసినా మంచి కవిత్వం రాయలేకపోతున్నారు.”

    3. “కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి. ఈ తేడాలని గురించి ఆయా కవులే మాట్లాడాలనీ, తమరంగంలో కవులకి ఎలాటి శిక్షణ కావాలో కవులే చెప్పాలనీ నారాయణ రావు కోరాడు.”

    4. “ఎవరి కవిత్వపు మంచి చెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారుచేసుకోవచ్చు. తయారు చేసుకుంటున్నారు కూడా. ”

    5. “తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసేవాళ్ళూ , విమర్శ రాసేవాళ్ళూ తమలో తాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏప్రమాణాలూ లేకుండా ఏది రాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.”

    వేలూరి గారు చేసిన పై అయిదు ముఖ్యమైన ప్రతిపాదనల్లో (observations అనుకోండి, “ప్రతిపాదన” అనే పదం నచ్చకపోతే) దేనితో కొడవళ్ళ హనుమంతరావు గారు ఏకీభవించడంలేదో నాకు తెలియలేదు. ఆయన రాసినట్లు: “ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.” భిన్నమైన అభిప్రాయాలు శీర్షికలో ప్రశ్న గురించా లేక పైన ప్రస్తావించిన విశయాల గురించా?

    కొడవళ్ళగారికీ, వేలూరికీ ఉన్న భిన్నమైన అభిప్రాయం నాకర్ధమైన వరకూ వ్యాసానికి గుడిపాటి పెట్టిన శీర్షికలో ప్రశ్న “మౌలికమైనదా కాదా” అన్న దాని గురించి మాత్రమే అని నేనర్ధం చేసుకున్నాను, మిగాతావి ఏమైనా ఉన్నయా? (శీర్షిక గురించి వేలూరి గారు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు పైగా, ఆయన మౌలికమైందని మాత్రమే అన్నారు). నేను పైపైన చదవలేదు, ఒకటికి రెండు సార్లు ఈ అభిప్రాయాలన్నీ చదివినా నాకర్ధమవకే ఇంతవరకూ రాస్తున్నాను.

    విప్లవ్

  1997. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/10/2006 1:35 pm

    వెల్చేరుతో విభేదం

    అక్షరజ్ఞానులేనా? అన్నది అవమానకరమని చెప్పటానికీ, గుడిపాటి వ్యాసంలో నాకు కనిపించిన కొన్ని లోపాల్ని చూపటానికీ, రాశాను. వెల్చేరు వ్యాసానికి సంబంధించి మొదటి విషయాన్ని దాటి పోలేదు. భేదాభిప్రాయాన్ని మర్యాదగా వ్యక్తపరిస్తే చాలు; అంతకుమించి ఏదో “సాధించాలని” కాదు.

    బహుశా నేను చేస్తున్న పొరబాటు నెలక్రితం వచ్చిన గుడిపాటి వ్యాసం మీద కేంద్రీకరించడం, నాకు తోచిన విషయాలు మాత్రమే తీసుకోవడం, వేలూరి చెప్పినట్లుగా చర్చని సాగించకపోవడం. కాని ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.

    అవమానకరంగా ఉందన్నానుగాని అ, ఆ ల గురించిన ప్రశ్న అనలేదు. ఈ తెలుగు వాడకాన్ని అర్థం చేసుకోడానికి ఇంగ్లీషుని ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. “మన కవులు అక్షరాస్యులేనా?” అన్నది “Are our poets literate?” గా అనువదించుకోవచ్చు. (అదీ సభ్యతగా అనిపించదు.) కాని దాంట్లో మూలానికున్న బలం లేదు. “Do our poets know the ABC of poetry?” అన్నది దగ్గరగా ఉంది. “Do our engineers know the ABC of Computer Science?” అని అడిగితే కించపరిచినట్లే. ”Do our engineers have the right tools and the right training?” అంటే మర్యాదగానే ఉంది, కాని అదీ ఇదీ ఒకటి కాదు.

    నిందార్థం ఏమీ లేదన్నారు వెల్చేరు. అది వారి వ్యాసంలో నిజమే, కాని గుడిపాటి వ్యాసమంతా నిందలతో నిండి ఉంది! మన కవులు పుస్తకాలు చదవరు, వ్యాకరణం నేర్చుకోరు, వారి కవితల్లో స్పష్టత లేదు, కూర్పు లేదు – ఇవన్నీ నిందలే. ఆయన నిందార్థంలోనే వాడారని తెలుస్తుంది. నిందిస్తే తప్పేమీ లేదు – ఇది వాళ్ళ సాహిత్యాన్ని గురించే గాని వ్యక్తిగత జీవితాల గురించి కాదు. కాని అవి అపనిందలు కాదని పాఠకులకి చూపెట్టాలి. ఆయన ఆపని చెయ్యలేదన్నది నా వాదన సారాంశం.

    అలవోకగా రాసిన అభిప్రాయమని ఒప్పుకుంటాను. అది వ్యాసమంత ముఖ్యం కాదు. గుడిపాటి వ్యాసం లోతైన విశ్లేషణతో విస్తృతాధారాలతో కూడి ఉన్నదా? మన కవులు నిరక్షరాస్యులని తేల్చిన వ్యాసంలో ఏమాత్రం పరిశోధనా, తర్కం ఉన్నాయ్?

    ప్రధాన విషయాన్నించి దారిమళ్ళించలేదు. liberal education లో శిక్షణ ఉండి కూడా ఇలా ఎలా రాశావంటున్నారు. శిక్షణ “ఉండి కూడా” కాదు; “ఉండటం వల్లనే” రాశాను. వివరించే ముందు liberal education అన్నదానికి ఒక నిర్వచనం:

    “Liberal education, which consists in the constant intercourse with the greatest minds, is a training in the highest form of modesty, not to say of humility. It is at the same time a training in boldness: it demands from us the complete break with the noise, the rush, the thoughtlessness, the cheapness of the Vanity Fair of the intellectuals as well as of their enemies. It demands from us the boldness implied in the resolve to regard the accepted views as mere opinions, or to regard the average opinions as extreme opinions which are at least as likely to be wrong as the most strange or the least popular opinions.” — Leo Strauss.

    నాకు ప్రధాన విషయం గుడిపాటి వ్యాసం. దాని ప్రతిపాదన ఇది – అక్షరాస్యత అంటే స్పష్టత, భాషాధికారం, అధ్యయనంపై ఆసక్తి; కొద్ది మంది తప్ప మనకవులంతా నిరక్షరాస్యులు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఈ ప్రతిపాదనకి వ్యాసంలో ఆధారాలేవీ చూపెట్టలేదు. ఆయన చెప్పేదంతా “నాకీ కవులంతా తెలుసు, నమ్మండి” అన్నట్లుగా ఉంది గాని scholarly article లో ఉండాల్సిన పస లేదు.

    నేను తమ్మినేని వ్యాసాన్ని ఎందుకు ఉదహరించాను? అనువాద కవిత్వం గురించి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కొన్ని కవితల విశ్లేషణ ద్వారా సమర్థించాడు. అది నాకు scholarly article అనిపించింది. గుడిపాటి అలాంటిది చెయ్యలేదు, కనీసం ప్రయత్నించలేదు. ఆయన సమస్య చాలా విస్తృతమయిందంటారా? కవిత్వమంతా తీసుకోవాల్సిన పనిలేదు. వ్యాసం చదివేవాడికి గూడా బుర్ర ఉంది. ఆయన ప్రస్తావించిన కొన్ని రకాల కవిత్వ వాదాల్లో ఏదో ఒకదానిని తీసుకొని ఆ కవికో కవులకో అస్పష్టత, అనధికారం, అనాసక్తి ఉండటాన వారి కవితలెంత హీనమయ్యాయో చూపెట్టొచ్చు.

    అలా చేస్తే ఆయన వాదానికి బలం చేకూరడమే కాక అంతకన్న ముఖ్యమైన ప్రయోజనమొకటి కలిగేది. అదేంటంటే ఏది మంచి కవిత్వమో ఎందుకో కొంతైనా పాఠకుడికి తెలిసేది. గుడిపాటి వాద విధానంలోని లోపాన్ని వేరే వ్యాసంతో పోల్చి చూపెట్టాను. అది liberal education ఇచ్చిన శిక్షణలో లోపమనుకోను.

    “పరమ వినయంగా” దాటేయడం గురించి. వినయాన్ని వెల్లడించ లేదు, చూపాల్సిన సందర్భమూ కాదది. వెల్చేరు గారి వ్యాసం లోతుల్లోకి వెళ్ళని మాట నిజమే. కాని వారు కవుల్నీ విమర్శకుల్నీ చర్చకి పిలిచారు కాని పాఠకుల్ని వదిలేశారు.

    “గుడిపాటీ, నేనూ … చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబంధించింది కాదు. వ్యవస్థకి సంబంధించినది…”

    శిక్షణా సంస్థల గురించి గుడిపాటి ప్రస్తావించ లేదు. అది వెల్చేరు గారి “వివరణ” వ్యాసంలో ఉంది. నేను దానిని గురించి రాయలేదు. గుడిపాటి వ్యాసంలో అర్థంకానంత క్లిష్ట విషయాలేమీ లేవు. అదంతా వ్యక్తుల గొడవే. అస్పష్టత, అనాసక్తి, అవగాహనా రాహిత్యం, పుస్తకాలు చదవక పోవడం – ఇవన్నీ వ్యక్తుల్లో లోపాలు. ఈ లోపాలు కొన్ని వందల కవుల్లో ఉండటాన ఇది వ్యవస్థకి సంబంధించిందని వెల్చేరు అభిప్రాయం కావొచ్చు. దాని గురించి మరో సారి మాట్లాడదాం.

    కొడవళ్ళ హనుమంతరావు

  1998. గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    09/08/2006 6:32 am

    వేలూరి గారూ,

    ఈ యూనికోడ్ తెలుగు ఎప్పుడో ఒక సారి నన్ను పప్పులోకి దింపుతుంది అని తెలిసీ ఈ గెస్ట్ బుక్ లో రాయకుండా ఉండలేక పోయాను, ఇదీ ఒక వ్యసనం గా మారే ప్రమాదం ఉందనిపిస్తుంది. ఏదో రాస్తూ పోయాను ఎట్లాగైనా ఈ “ప్రజాకవి” అనే అనవసర సిద్ధాంతాన్ని, నిర్వచనాన్ని కొంతైనా discredit చేయాలనే ఉద్దేశ్యంతో.

    నా మటుకు నాకు ఇది ఒక నామ వాచకం లా లేక ఒక బిరుదు గా వదిలేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు ప్రజాకవి కాళోజీ ఉన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా రేపు (సెప్టెంబర్ 9 న) తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు ఉత్సవాలు కూడా జరుగుతున్నయి. మీరిప్పుడు తిరుపతి వెంకట కవుల్ని ప్రజాకవులు అని చెబితే ఎవరో మాష్టారుకు ఇది నచ్చి అదే మాట తెలుగు పుస్తకాల్లోకి ఉన్నది ఉన్నట్లు దింపితే అప్పుడు నాలాంటి వాడొకడు తన పాళీని జియో పొలిటికల్ ఇంకులో ముంచి ఇవ్వాళ కాక పోతె రేపు ఇట్ల రాయ వీలయితది:

    “బోగపోళ్ళ బాగోతపు పద్యాలను మా నెత్తిన /ప్రజల కవిత్వం పేర రుద్ది / సౌహార్ద్రం, సమైక్యం భాషంటివి / నా యాసను చిన్నబుస్తివి / నీ పాఠం నాకొద్దు / ప్రజలు నేను, కవిత్వం నాది, ప్రజాకవివి నువ్వెట్లయితవు”

    అందుకే: వెల్చేరు గారు సెప్టెంబరు తెలుగు నాడిలో రాసిన తిరుపతి వెంకట కవుల పరిచయం చాలు, మీ వ్యాసం కూడా మొదటి నాలుగు పేరాలు (టైటిల్ తోసహా) మినహాయించి, “1999 జూన్ జులై ” కాడ్నించి అద్భుతం. అది నా అసలు అభిప్రాయం. ఆ మాట డొంక తిరుగుడుగా చెప్పాలనుకోవటం నా తప్పే.

    అన్నట్టు, తొడ పాశం పెట్టిన సారు మీదికి ఎదురు మళ్ళానని నన్ను పక్క సెక్షనులో తోసారు, అప్పుడు ఏదో లే అని సరిపెట్టుకుని ఉంటే ఇప్పుడిట్లా తయారయి ఉండే వాడిని కాదేమో.

    మీరు తప్పుగా అనుకోకపోతే ఇప్పటికే ఎక్కువ రాసాను,
    ఇక సెలవ్, విప్లవ్

  1999. గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    09/07/2006 2:27 pm

    ఆలస్యంగా సమాధానాలిస్తున్నందుకు మన్నించండి. ముందుగా రథ్య అర్థం గురించి:
    రథ్య అంటే రాజమార్గము అనీ, రథసమూహము అనీ రెండర్థాలూ ఉన్నాయి ( చూ: సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఆరవ సంపుటము, 648 వ పేజీ, లేదా చూ: శబ్దరత్నాకరము, 922 వ పేజీ)

    నాకూ శ్రీశ్రీ అంటే చచ్చే ఇష్టం, వల్లమాలిన అభిమానం. ఏ ప్రజలకి అతను “ప్రజాకవి” గా చలామణి అవుతాడో నావ్యాసంలో (నావ్యాస పరిథిలో అంటే ఇబ్బంది తక్కువ అవచ్చు!) చెప్పిందానికన్నా ఎక్కువగా చెప్పేందుకు ఏమీ లేదు.

    గద్దర్, వంగపండుల పాటలని ముందుగా “కవితలు”గా బేరీజు వెయ్యాలి. అందుకు చెయ్యవలసిన కృషి వేరే ఉంది. (ఆ పని నేను మొదలెట్టా!)అసలు, ఆపాటలు కవిత్వమా? కాదా? అని నిర్థారణ చేసుకున్న తరువాత, వారు ప్రజాకవులా కారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. (నన్ను అపార్థం చేసుకోకండి, అక్కిరాజు గారూ! ఆహా! ఎంచక్కని సినిమా డైలాగు!)

    ఒకానొకప్పుడు, “తెలుసా”లో గద్దర్ పై నేను ఒక పెద్ద వ్యాసం రాసిన గుర్తు. ఆ వ్యాసం అంతా అతని ఒకేఒక్క పాటమీద! అప్పట్లో, కొందరు నన్ను చీవాట్లు కూడా పెట్టారు. అదివేరే విషయం, అనుకోండి.

    గద్దర్ పైవ్యాసంకూడా త్వరలోనే ( సమీక్షకులు “సై” అంటేనే సుమా!) ఈమాట లో రావచ్చు.

    విప్లవ్ గారు చాలా విషయాలు చెప్పారు. సాంఘిక చరిత్ర గురించి ఆయనకి నేను పాఠం చెప్పగల సమర్థుణ్ణి కాదు. అయినా, ఆయన నన్ను పూర్తిగా “అపార్థం” ( అబ్బ! ఇంతకన్నా మంచి మాట తెలుగులో లేదు కాబోలు!) చేసుకున్నట్టు అనుమానం గా వుంది. వ్యక్తిగత అభిప్రాయాలని మన్నించమని మా తెలుగు మేష్టారు ఎప్పుడో చిన్నప్పుడే, శొంఠిపిక్క పెట్టి మరీ నేర్పారు! అందుకు బద్ధుణ్ణి, ఇప్పటికీనూ!

    ఇతి.
    అభివాదాలతో, — వేలూరి వేంకటేశ్వర రావు.

  2000. మొలతాడు గురించి P. Siva గారి అభిప్రాయం:

    09/06/2006 6:16 am

    పవన్ కుమార్ గారికి లాగే ఈ కవిత నాకు కూడ చాలా నచ్చింది. అయితే ఈ కవిత ఇరాక్ యుద్ధాన్ని ప్రశ్నిస్తున్నట్టు నాకనిపించింది. కవితలో ప్రియురాలు ఇరాక్ లో ప్రజాస్వామ్యమయితే, ఈతరాని ప్రియుణ్ణి బుష్ గా పేర్కొనవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే, బుష్ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా తేలేది మొలతాడే (అది లేకున్నా)!
    కాకపోతే ఈ రెండు పాదాల ప్రాసకోసం పడుతున్న ప్రయాసలో చీల్చిన దుంగలో తోక ఇరుక్కున్న మర్కటంలా మారిన కవిగారి పరిస్థితికి కించిత్ జాలి కలిగిందని చెప్పక తప్పదు.. మరీ ముఖ్యంగా అనవసరంగా ఇరుక్కున్న మరకతాన్ని చూచాక.

  2001. గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    09/05/2006 2:03 pm

    “గతశతాబ్దపు” అని పేరు పెట్టారు కనుక సరిపోయింది. లేకపోతే ఇప్పటి
    “ప్రజాకవులు” మీకొక కవిత్వపు noose తయారు చేసి వేలాడ దీసే వాళ్ళు.

    గత శతాబ్దం అనే కంటే, శ్రీ శ్రీ కంటే ముందు ప్రజా కవులు అంటే మీ సొమ్మేం
    పోయింది? శ్రీ శ్రీ ని అనవసరంగా గొప్పవాణ్ణి చేస్తామని భయమా :).

    అయినా సరే, మొదట “ప్రజల గురించి” కొద్దిగా:

    “ఇకపోతే, ఎవరయ్యా నీ ప్రజలు అని నిలదీసి అడిగితే, నా సమాధానం: వీధి
    బడికెళ్ళి చదువుకోని వాళ్ళు, వీధిబడికి కూడా వెళ్ళలేని వాళ్ళు, ఏ రకంగానూ చదువుకోటానికి అవకాశంలేని వాళ్ళు, ఏదో ఒక చిన్న బడికెళ్ళి ఓ న మా లు నేర్చుకోని కాస్తోకూస్తో చదవడం చాకలిపద్దు రాయడం నేర్చుకున్న వాళ్ళు. వీళ్ళు అసలు సిసలైన ప్రజలు. మన మహానగరాలు, పెద్ద పెద్ద పట్టణాలూ వదిలేస్తే, నూటికి డెబ్భైమందో, ఎనభైమందో నేను పైన నిర్థారించిన
    ప్రజలకిందే జమా కట్టచ్చు. ఈ ప్రజల్లోకి వెళ్ళి బలపడ్డ కవిత్వం ప్రజా
    కవిత్వం.”

    ఈ ప్రజల నిర్వచనం కూడా “గత శతాబ్ది” కి చెందేదే అనుకుంటాను.

    ఇప్పటి ప్రజలు ఏ కొద్ది మందో తప్పితే పట్టణ లేక నగర వాసన, పత్రికల నీడ సోకని వాళ్ళు తక్కువ.

    1991 జనాభా లెక్కల ప్రకారం అప్పటికే 25 శాతానికి పైగా పట్టణాల్లో ఉన్నారు, 2001 వచ్చే సరికి అది మూడవ వంతుకు చేరింది. అక్కడితో సరిపెట్టకుండా ఒక ఎస్టిమేట్ ప్రకారం ఈ దశాబ్ది చివరికి యాభై శాతానికి పైగా పట్టణ వాసులే అవుతారు మన జనాభా.

    మీరన్న “ప్రజ” ఇప్పటి వాళ్ళు కాదు అనేది కొంత వరకూ క్లియర్. అంతే కాదు, ప్రజల కు నిర్వచనం మారుతుంది ఎప్పటికప్పుడు, స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కూడా. (ఉదా: అమార్త్య సేన్ పుస్తకం ఐడెంటిటీ & వయలెన్స్).

    ఇక ప్రజాకవుల గురించి:

    “ఈ ప్రజలని ఉత్తేజ పరిచి, వాళ్ళకి ఉత్సాహాన్నిచ్చిన కవిత్వం రాసిన వాళ్ళు
    ప్రజా కవులు. ”

    ప్రజలు మారినప్పుడు కవిత్వం మారుతుందన్నమాట ఈ ప్రజా కవుల Definition పట్టుకుని వెళితే. ఏది ఉత్సాహాన్ని ఇస్తే, అది ఎట్లా డెలివరీ చేస్తే
    వస్తుందో తెలిస్తే ప్రజాకవుల కు కావలసిన మినిమం క్వాలిఫికేషన్ తీరుతుందనుకుంటే ఇక సాధనాలదే ప్రధాన పాత్ర అవుతుంది, ఆ రాసింది ప్రజల నోళ్ళలో నానడానికి. నాటకాలు, అవధానాలు తిరుపతి కవులను ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాయో ఆ తరువాత సున్నమేసిన తెల్ల గోడలు, సినిమాలు, ఇప్పుడు పత్రికలు శ్రీ శ్రీ ని (అతన్ని అనుకరించే వాళ్ళను) ప్రజల్లోకి
    తీసుకెళ్తున్నాయి.

    తిరుపతి వెంకట కవులు మీరిచ్చిన డెఫినిషన్ accept చేస్తారని నేననుకోను.
    ఒక వేళ చేస్తే అది కూడా ముపటి మాట కిందికే వస్తుంది. గతం గురించి
    చెప్పేటప్పుడు అనుకోవలసినమాట.

    ఇక ఇప్పటి సంగతి: వీధి నాటకాలు ఇప్పటి ఊళ్ళలో అంతగా కానరావు. ఎప్పుడో ఏడేండ్లప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రాత్రి పూట “బావా ఎప్పుడు వచ్చితివీవు …” లాంటివి వింటూ నాటకం చూస్తూ అక్కడే పడి నిద్రపోయి, సగంలో మళ్ళీ “చెల్లియో చెల్లకో …” అంటూ మొదలు పెట్టిన గొంతుకో, హార్మోనియం దెబ్బకో మళ్ళీ దడుచుకుని లేచి ఇక నిద్ర ఎగిరిపోయి ప్రొద్దున ఆ కప్పు చాయ పడే వరకూ చొప్ప బెండ్లతో కచ్రపు బండ్లు చేసుకోవటం వంటివి తీరి రెండు దశాబ్దాలైనా అవుతుంది అనుకుంటాను.

    ఇప్పటి రోజుల్లో కొన్ని పట్నాల్లో, నేను కర్నూలు, వరంగల్లు లో కొద్దిగా
    చూసాను, నాటక పోటీల పేరుతో; కానీ చాలా వరకు సాంఘికాలే అవి. మరీ గుంటూరు, గోదావరి జిల్లాల్లో అయితే ఇప్పట్లో దసరా సెలవుల్లో రాత్రిపూట స్టేజీ మీద జరిగేవి నాటకాలు అని వెళితే వేలూరి గారు “శివ శివా” అనుకుంటూనో లేక “శెవ్వా ఇదా వేషం” అంటూ అట్లాంటా పరిగెత్తుకు వచ్చేస్తారనుకుంటాను. (అది నా ఊహే, ఆయన అక్కడే పీఠం వేసుకు కూర్చుంటారేమో మరి నాకెరుక లేదు.)

    చెప్పేదేంటంటే, ఇదివరకు ప్రజలకు సాహిత్యాన్ని చేరువ గా తెచ్చే ప్రయోగం
    నాటకమైతే ఇప్పటి సాధనాలు వేరు అని. ఇప్పుడు పేపరు చదవని వాళ్ళు అతి తక్కువ. ఒక్క ఈనాడు పత్రికను కోటిన్నర మంది చదువుతారట వాళ్ళ లెక్కల ప్రకారం. ఉన్నది ఏడెనిమిది కోట్లే కదా, పిల్లలను తీసేస్తే మిగిలేది
    అయిదు కోట్లే. ఇక పత్రికలు చదవని వాళ్ళు ఆ లెక్కన అతి తక్కువ.

    అందుకే ఇప్పటి పత్రికల్లో వచ్చేవి ప్రజా కవితలు, కవిత్వం అనిపిస్తాయి ఈ
    రోజుల్లో. అవి తవికలే కావచ్చు, మరింకేమైనా కావచ్చు. ఏ పత్రికయినా చదివే వాళ్ళను ఉద్దేశ్యించింది కాబట్టి వాళ్ళనుద్దేశించిన రాతలే ఎక్కువగా
    వస్తయి. అవి ఎటువంటివి వస్తాయి అనడానికి పెద్ద ఊహాగానాలు అక్కరలేదు. చికెన్ గున్యా మీద సీస పద్యాలు వస్తయి. మొసపొటేమియా మీద పొటేలు రంకెలు వినిపిస్తయి. ఇదంతా ప్రజా కవిత్వమే.

    దీన్ని బట్టి చూస్తే ఎవరైతే ఆ కాలపు మాధ్యమాన్ని, అప్పటి పరిస్థితులకనుకూలంగా, అతి ప్రతిభావంతంగా ఉపయోగించుకుంటారో వారే ప్రజా కవిగా మిగులుతారు, మిగతా వాళ్ళు ఉత్తుత్తి కవులుగా నిలబడి జాతర చూడవలసిందే.

    తిరుపతి వెంకట కవుల నాటకాల్లో పద్యాలు అప్పటి కాలంలో ప్రజా కవిత్వం అయితే, ఇప్పటి ప్రజా కవిత్వం ప్రతి రోజూ అచ్చయే పేజీల మధ్య కనిపిస్తుంది.

    చివరగా, వాళ్ళే ఇప్పటి కాలంలో ఉండేదుంటే అరాఫత్, ఒసామాల నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి దాకా పొయిట్రీ రాసి ఉండే వాళ్ళే. ఇదేం పోయేకాలమో ఇంతగా చదువుకుని, ఇంతింత విషయాల గురించి తక్కువ పదాలతో పొయెట్రీ రాయగల ఇప్పటి కవులు వాటినే ఇంకొంచెం సాగదీసి వ్యాసం రాయొచ్చుకదా. “ఈనాడు” లాంటి అటూ ఇటూ కాని పత్రిక(లు), వీళ్ళు వ్యాసాలు రాస్తే మీ పేరు పెట్టి వేయం అనే ఒక దరిద్రపు రూలు పెట్టినందుకే మనకు కవులెక్కువ, వ్యాస కర్తలు తక్కువ అని నా అనుమానం.

    ఈ లెక్కన “గత శతాబ్దపు” ప్రజాకవుల పక్కన ఇప్పటి ప్రజా కవులను
    నిలబెడతానంటే కుదరనిపని. అసలు ప్రజాకవి అనే పదమే అనవసరం అని outlaw చేస్తే మంచిదని నాకనిపిస్తుంది, లేకపోతే “మహాకవి” అనే పదానికి
    బహుపదార్ధాలు వాటికి మళ్ళీ తాత్పర్యాలు చెప్పుకున్నట్టే ఇదీ తయారవుతుంది, only more often we get to define and redefine it.

    విప్లవ్

  2002. మొలతాడు గురించి Garikapati Pavan Kumar గారి అభిప్రాయం:

    09/05/2006 8:19 am

    మొలతాడు కవిత చాలా నచ్చింది..
    భూషణ్ నేటికాలపు తీరుతెన్నులు లాగానే ఈ కవిత కూడా నేటికాలపు కవుల ప్రమాణాలను ప్రశ్నిస్తుంది.కవితలో ప్రియురాలు కవిత్వమైతే ..ఈతరాని
    ప్రియులని నేటికాలపు కవులుగా పేర్కొనవచ్చు.ఈ విధంగా ఆలోచిస్తే
    చాలామంది తెలుగు కవులకి ఖచ్చితంగా తేలేది మొలతాడే (అది ఉంటే)!!

    గరికపాటి పవన్ కుమార్,UK

  2003. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/04/2006 1:33 pm

    నేను కవినీ కాదు, విమర్శకుణ్ణీ కాదు. కాని ఓ పాఠకుడిగా “మన కవులు అక్షరాస్యులేనా?” అన్న ప్రశ్న అవమానకరమైన మకుటమనిపించిందిగాని మౌలికమైన ప్రశ్నగా అనిపించలేదు. “ఎదుటివారి అభిప్రాయాలనూ వ్యక్తిత్వాలనూ గౌరవించగల పెద్ద మనిషి తరహా” ఉండాలని చెప్పిన వెల్చేరు గారు కూడా “మన విమర్శకులు అక్షరాస్యులేనా?” అని అడగడం ఆశ్చర్యమేసింది. వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది.

    గుడిపాటి తన వ్యాసంలో మన కవుల గురించి చెప్పిన విషయాలు – వేరే వాళ్ళ కవిత్వాన్ని చదవరు, కవిత్వం మీద వచ్చే వ్యాసాల్నీ, సమీక్షల్నీ చదవరు, చదివినా తమ పేరుందో లేదో అన్న ధ్యాసే గాని ఏమి రాశారో అన్న ఆసక్తి లేదు … – ఆ కవులకి సన్నిహితంగా మెలగడాన తెలిసిన సమాచారం కావచ్చు. వాటి గురించి కవులతో కనీసం ముఖ పరిచయం కూడా లేని నాలాంటి పాఠకుడు చర్చించడం వీలవదు.

    వెక్కిరింపులూ, అపహాస్యాలూ మన సాహిత్య చర్చల్లో అనివార్యమయినట్లుంది. అయినా వాటితో పాటు నాలుగు ఉపయోగపడే మాటలు, కాసిని ఉదాహరణలతో చెప్తే నాబోటి వాడు అన్వయించుకుని బోధపరచుకుంటాడు.

    వాడుక భాషలో రాయడంలేదని వాపోయిన రంగనాయకమ్మ రాసిన పుస్తకం చదివితే వాడుక భాష గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది. మాతృభాషే అయినా తెలుగు భాషా స్వరూపం తెలియని యువకుల్ని చూసి బాధ పడ్డ బూదరాజు రాసిన పుస్తకాలు చదివి కొంతయినా వ్యాకరణ జ్ఞానం పెంచుకోవచ్చు.

    అలాగే మన కవిత్వ, విమర్శ రంగాల దుస్థితిని చూసి విచారించేవాళ్ళు కూడా వాటిని సవరించడానికి కృషి చేస్తే బావుణ్ణు. డబ్బుకీ, కీర్తికీ, అవార్డులకీ, రాజకీయాలకీ మన కవులు అమ్ముడు పోయారంటున్నారు. అలాంటి ప్రముఖుల కవితా సంకలనాల్ని కొన్నిటిని తీసుకొని సహేతుకంగా విమర్శించండి. శబ్దం, రూపం, లయ, అవగాహన, పాండిత్యం ఎలా లోపించాయో వివరించండి. వారాల తరబడి జరిగిన చర్చలో ఆరోపణలకు కొదవ లేదు గాని ఉదాహరణలు మాత్రం శూన్యం!

    నాకీ విషయంలో సమకాలికుల్లో తమ్మినేని యదుకుల భూషణ్ ఒక్కరే ఆపని చేస్తున్నట్లనిపిస్తుంది. ఉదాహరణకి నిన్ననే చదివిన వారి వ్యాసం, “ఉమర్ ఖయ్యాం – ఉదాహరణలు.” అనువాదానికి ఉండాల్సిన లక్షణాలేమిటో చెప్పి, మూలంలోని రుబాయి నొకదాన్ని తీసుకొని, కరుణశ్రీ, ముద్దుకృష్ణ మొదలైన వాళ్ళ అనువాదాలు ఎందుకు లోపభూయిష్టమో, చలం, ఆదిభట్ల అనువాదాలు ఎందుకు ఉన్నతమైనవో వివరించారు.

    విశేష ప్రతిభావంతుడనిపించే తమ్మినేని కున్న లోపం తనకి నచ్చని వాళ్ళని ఎద్దేవా చెయ్యటం, పెద్దమనిషి తరహా లేకపోవడం. “బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా” (?) అన్న వేమన వేదాంతం బాగా వంటబట్టించుకున్నట్లుంది. గుద్దులు తిన్నా, చదివినవాడికి కవిత్వం గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

  2004. మొలతాడు గురించి kiran kumar chava గారి అభిప్రాయం:

    09/04/2006 12:23 pm

    కొన్ని కవితలు ఆ అర్థం తెలిసిన వారికే అర్థము అవుతాయి అనుకుంటాను!

    నాకు అయితే ఇందులోని లోతైన భావం ఏమీ అర్థం కాలేదు, క్షమించాలి.

  2005. సందుక గురించి Akkiraju Bhattiprolu గారి అభిప్రాయం:

    08/18/2006 12:52 am

    స్వామి గారూ,

    చాలా బాగున్నాయి కవితలు.
    రెండు మూడు సార్లు చదివా…. ఓ ఉచిత సలహా…

    జ్ఞాపకాల్ని పదిలపరుచే క్రమంలో దరిద్రాన్ని ఎక్కడన్నా గ్లోరిఫై చేస్తున్నారేమో కొంచెం జాగ్రత్త పడండి. ఇప్పుడు మనం కారులో వెళుతూ “సిటీ బస్సులో వేళ్ళాడుతూ వెళ్ళటం గొప్ప అనుభవం” అని రాస్తే, ప్రస్తుతం వెళ్ళాడుతున్న వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. మీరిలా చేశారని కాదు, ఇలాటి వస్తువుల గురించిన సాహిత్యంలో సాధారణంగా జరుగుతున్న తప్పుని మీకు ఎత్తిచూపించాలనే ప్రయత్నం.

    హైదరాబాదు లో ఉండి మీ పుస్తకావిష్కరణకి రాలేక పోవటం దురదృష్టకరం.

    అక్కిరాజు

  2006. సందుక గురించి narayanaswamy గారి అభిప్రాయం:

    08/17/2006 10:25 am

    ప్రసాద్ గారూ
    సందుక అంటే తెలంగాణ లో పాతకాలపు ట్రన్కు పెట్టె అని. కొన్ని చోట్ల సందుగ అని కూడా అంటారు.
    నా కొత్త కవితల పుస్తకమ్ సందుక మొన్న ఆగష్టు 7 న హైదరాబాదులో ఆవిష్కరించారు.
    మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
    మీ
    నారాయణస్వామి

  2007. ఆకాశంలో ఎడారి గురించి Bandla Madhava Rao గారి అభిప్రాయం:

    08/04/2006 8:18 pm

    రాములు గారూ
    కవిత కన్నుల్ని చెమ్మగిల్ల జేసింది. రయితుల యెతల్ని కళ్ల ముందుంచింది. మంచి కవిత రాశారు. అభినందనలు.
    బంద్ల మాధవరావు

  2008. సందుక గురించి Bandla Madhava Rao గారి అభిప్రాయం:

    08/02/2006 10:56 pm

    నారాయణ స్వామి గారూ

    సందుక లోని తీపి జ్ఞాపకాల్ని మాముందుంచినందుకు మీకు అభినందనలు. 7 వ తేదీన మీ కవితల సందుక ను చదువరులకు అందించబోతున్న మీకు నా శుభాకాంక్షలు.

    బండ్ల మాధవరావు
    త్రివేణి టాలెంట్ స్కూల్
    అల్వాల్
    సికింద్రాబాద్
    98661 82378

  2009. వెల్ల గురించి Prasad గారి అభిప్రాయం:

    07/31/2006 8:57 am

    “మంచి కవిత. చక్కని భావం.
    చైతన్యం చల్లగా ఉండడం మాత్రం బాగోలేదు. పరికించి చూస్తే కవిత మొదటి తొమ్మిది లైన్లలో పూర్తయింది. మిగిలినదంతా అనవసరం. అలాగే, వెల్ల అన్నపదం కోట్స్ లో పెట్టటం కూడా అనవసరం.”
    — ప్రసాద్
    http://charasala.wordpress.com

  2010. సందుక గురించి Prasad గారి అభిప్రాయం:

    07/31/2006 8:54 am

    అన్నా, సందూక అంటే ఏంటొ జర జెప్పవూ? నేను రాయలసీమ పోరన్ని, నాకిది తెల్వదు. ఇలా మాండలీకాలల్ల కూడా కవితలొస్తే అన్ని జాగాల బాషని అందరు నేర్చుకొంటరు గద. మస్తుంగుందన్నా ఇది.
    — ప్రసాద్
    http://charasala.wordpress.com

  2011. గుల్మొహర్ గురించి Prasad గారి అభిప్రాయం:

    07/31/2006 8:45 am

    చాలా అద్భుతంగా వుంది. మోడుల్లా మారి మళ్ళీ వసంతం రాకతో కొంగొత్త పచ్చదనంతో, మరికొన్ని వడలెల్ల కొత్తకొత్త రంగుల చెంగావి చీరలు కట్టిన వాటిల్లా సింగారించుకుంటే చూసి మురిసిపోవటమే కానీ ఈ సరికొత్త భావనలు పొడచూపలేదు. ఇక ప్రతి వసంతానికీ నే చూసే ప్రతిచెట్టూ ఈ కవితే పలికిస్తుందనడంలో సందేహం లేదు.
    — ప్రసాద్
    http://charasala.wordpress.com

  2012. వార ఫలం గురించి Iswari Murthy గారి అభిప్రాయం:

    07/19/2006 12:44 am

    కవితలో మీరు ఏమి సందేశము చెప్పారో నాకు తెలియలేదు.

  2013. సందుక గురించి Geeta.K గారి అభిప్రాయం:

    07/09/2006 6:44 am

    నారాయణ స్వామి గారూ,

    మీ కవితలు సందూక, అర్ర మరిచిపోయిన బాల్యాన్ని, యౌవనాన్ని గుర్తుకు తెస్తాయి ఎవరికేనా. గడిచిన చూరు కింద రాలిపడిన సమయాల వాన చుక్కల జాడలు. రియల్లీ చాలా మంచి కవితలు. కీపిటప్.
    …కె.గీత

  2014. వెల్ల గురించి వాతాపి గారి అభిప్రాయం:

    07/05/2006 11:50 am

    మంచి కవిత. చక్కని భావం.
    చైతన్యం చల్లగా ఉండడం మాత్రం బాగోలేదు. పరికించి చూస్తే కవిత మొదటి తొమ్మిది లైన్లలో పూర్తయింది. మిగిలినదంతా అనవసరం. అలాగే, వెల్ల అన్నపదం కోట్స్ లో పెట్టటం కూడా అనవసరం.

  2015. ఓ పెన్నీ, నా పెన్నీ! గురించి V. R. Veluri గారి అభిప్రాయం:

    07/03/2006 12:40 pm

    డు, ము, వు, లు ప్రథమా విభక్తి అని చదువుకున్న గుర్తు. చూశారా! “ము” ముందు, “లు” తర్వాత! అందుకే, వేమూరి వేంకటేశ్వర రావు గారు ముందు; ఆయన తరువాతే, నేను!
    ఎంతమంది ఈసడించుకున్నా ఈమాట ఉద్యోగం నేను జలగలా పట్టుకొని ఎందుకు వదలనంటే, — ప్రచురణ కొచ్చిన అన్ని కథలూ, కవితలూ, వ్యాసాలూ (శాపనార్థాలు కూడా!) అందరికన్నా ముందుగా చదివే అవకాశం ఉన్నది కనుక! వేమూరి గారు మాకు రాసినంతకాలం, నన్ను “సంపాదకులు” (అబ్బ! ఇక్కడా “ము” తరువాతే!) గా తీసెయ్యాలంటే, నామీద విశ్వాస రాహిత్య తీర్మానం పెట్టవలసి రావచ్చు.
    మీ పెన్నీ కథ ఎప్పుడో చదివాను. ఈ క్రింది వివరాలు నాకు క్రిందటినెలే దొరికుంటే మీకు పంపేవాణ్ణే! మీరు పెన్నీకథని ఇంకా రసవత్తరం చేసి వుండేవారు.

    * Today it takes 1.2 pennies to mint one penny.
    * Gallop poll has shown that two thirds of the Americans want to retain the penny, for its historical ‘value.’
    * The idea of “penniless” society began to gain currency in the Congress in 1989. (Ever since, they are striving hard to make our society penniless!)
    * 58% of the Americans stash pennies! (For the first time, you and I are in the majority!)
    * A penny of the 1972 vintage was sold for $437,000! ( I don’t have one; do you? )
    * Edmond Knowles of Alabama hoarded pennies for over 4 decades as a hobby! He ended up with 1.3 million of them, weighing 4.5 tons and his bank refused to take them all at once!
    * There is a pro-penny lobby called American for Common Cents! (Both of us should join right away!)

    The information is from Jeff Donn, Associated Press News Release, July 3, 2006!

    And finally, I really enjoyed your article, as usual!

    వేలూరి వేంకటేశ్వర రావు

  2016. ప్రాచీన తెలుగు కొలమానం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    07/03/2006 8:34 am

    నాగార్జున ఇటువంటి వ్యాసాలని ఇంకా రాయాలని కోరుతున్నాను. మన భాష పరిపుష్టం కావాలంటే మన రాతలు ఒక్క కథలకీ, కవితలకీ పరిమితం కాకుండా ఇలా అనేక రంగాలలో అంశాలని తీసుకుని రాయాలి. అప్పుడే పాతబడ్డ మాటలని తిరిగి పలుకుబడిలోకి తీసుకురావచ్చు. కొత్త కొత్త మాటలని పుట్టించనూ వచ్చు.

  2017. ఎవరిలో ఎవరో గురించి bandla madhava rao గారి అభిప్రాయం:

    06/17/2006 11:02 pm

    చాలా మంచి కవిత రాసారు. శివశంకర్ గారికి అభినందనలు.
    కవిత 2006 లొ చోటు చేసుకోదగిన కవిత ఇది.
    బండ్ల మాధవరావు

  2018. తుది ప్రార్ధన గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:

    05/22/2006 10:45 am

    good question.

    లైలాగారూ,

    మీకో మంచి విమర్శకుడు

    ఏమంటారు?

    నామట్టుకు అయితే

    కవిత అలాగే ఉండాలనేముంది, సరే దీనిని కవిత అని పిలవకు తవిక అనే పిలువు.

    భావం అర్థము చేసుకో, అర్థమయితే ఆనందించు నచ్చకపోతే నీవు ఎలాగూ ఇక్కడ విమర్శింవ వచ్చనుకో just like now.

    What exactly is your question. What is it that you expect from a kavita?

  2019. తుది ప్రార్ధన గురించి K Kiran గారి అభిప్రాయం:

    05/22/2006 4:45 am

    అసలు ఇది ఏ రకమైన కవిత్వం??

  2020. భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    05/13/2006 11:47 am

    పఠాభిగారి గురించి పరిచయం చెయ్యడానికిది మంచి వ్యాసం. మరికొంత రాస్తే బావుండేదేమో. 1971లో నేనొకసారి పూనా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళినప్పుడు అక్కడ సంస్కార చిత్ర ప్రదర్శన జరిగింది. దర్శకుడుగా రెడ్డిగారు కాసేపు ప్రసంగించారు కూడా. అయితే ఆయన తెలుగువాడనీ, పఠాభిగా ప్రసిద్ధుడనీ తెలియక నేను ఆయనను ఎవరో కన్నడ దర్శకుడని అనుకున్నాను. భావకవిత్వం మీద అప్పటితరంవారికి కొంత వెగటు పుట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. అందుకు ప్రతిస్పందన పఠాభి రచనల్లో కనిపిస్తుంది. ఆయనకు అనుచరులుండడం సాధ్యం కాదనేది చాలా సబబయిన ప్రతిపాదన.

  2021. గతం గురించి pAlana గారి అభిప్రాయం:

    05/05/2006 9:33 am

    “నల్లని రాతిమెట్లు
    అల్లుకొన్నవి లతలు పూవులు
    చతికిల పడటానికే తప్ప
    నిన్నెటూ తీసుకు వెళ్ళవు”
    **** ఇది కవిత్వమా? లేక ఏదో దారంట పోతూ చేస్కుంటున్న స్వగతమా? నిజానికి చెప్పుకోవాలంటే, రాతి మెట్లమీద, లతలూ పూలతలూ వుండవు. రాతి స్థంభాలమీద లతలు పుష్పలతలు అల్లుకుంటాయి. అది ప్రకృతి లక్షణం. మెట్లమీద ప్రాకే లతలు తొక్కబడి బక్కచిక్కిపోతాయి, ఎండిపోతాయి. వాటిని “ట్రాంపుల్డు వైన్సు” అంటారు. పోనీ, ఆ మెట్ల మీద పూలతలు (మాలతీ, అడవి జాజి, విరజాజి, చంద్రిక) అంటుకు అల్లుకున్నాయి అనుకుందాము. కర్మానికి చతికిల పడ్ద ఆసామి, వాటి పుష్ప పరిమళాన్ని ఆస్వాధించే అదృష్టానికి నోచుకున్నాడనుకోవచ్చును కదా కవి. నల్లరాతి మెట్ల మీద చతికిల పడ్డ ఆసామి మెట్లు ఎక్కడికో తనని తీసుకు పోతాయని చతికిలపడడు. ఫూలు కాకపోతే పూలతల మీద పిర్రమోపడు. కర్మ కాలితే లత పామై కరుస్తుంది. గ్రహచారం చెడితే లతల్లో నల్లటి నాగులు నల్లరాతి నలుపులో కలిసి, చతికిల పడ్ద ఆసామీని ఛటుక్కున కౌగిలించుకుంటాయి. అయినా, మెట్లెక్కిన వ్యక్తి, మెట్లమీద చతికిలపడ్డానికి కారణం, గమ్యంలో అలసిపోవడం. అలిక తీరిన తరువాత తిరిగి ప్రయాణం ముందుకు. గమ్యం చేరే వరకూ ఎన్ని పర్యాయాలు నల్లరాతి మెట్లమీద చతికిల పడాలో? ఆహా! నిజంగా! చతికిలపడ్ద ప్రతీ మెట్టూ ఆసామీని మరింత ముందుకునెట్టే మెట్టు. కవి చెప్పినది నిజం కాదు. నిజానికి ఆ నల్లరాతి మెట్టు ప్రగతిపధానికి ప్రధమ సోపానం! పాములు లేని పూలతలు ఆ మెట్లమీద అల్లుకు అంటుకున్నాయనుకో, మరీ మంచిది. ముందు ప్రయాణం మధురం!
    కాబట్టీ …. ఇది కవితైతే, ఇలా మారిస్తే, చదువుకున్న వాడికి ఆనందాన్నిస్తుంది:
    నల్లని రాతిమెట్లు
    అల్లుకొన్నవి లతలు పూవులు
    చతికిల పడితే తప్ప
    నింగికి నిన్ను తీసుకు వెళ్ళవు !

    ***పాలన*****

    రెండో కవిత మీద “అభిప్రేమ” రేపు!

  2022. నా మాట: చాటువు – పేరడీ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    05/04/2006 1:09 pm

    పేరడీ గురించి మరికొన్ని విషయాలు – వెలుదండ నిత్యానందరావు సిద్ధాంతవ్యాసం “తెలుగు సాహిత్యంలో పేరడీ” ఉపయోగకరమైన పుస్తకం. ఈ సైట్లో వున్న క్రీడాభిరామం, చంద్రలేఖావిలాపం – రెంటిలోనూ ఎన్నో పేరడీలు వున్నాయి. ఇకపోతే ఇప్పుడు ఎక్కువగా పేరడీలు ఎందుకు కనపడటం లేదు అనే ప్రశ్న మెయిన్ స్ట్రీమ్ కవిత్వం గురించి అని అనుకుంటున్నాను (సినిమా పాటల పేరడీలు ఎప్పుడూ వస్తూనే వుంటాయి; ఎంతగానో అలరిస్తూనే వుంటాయి). కవిత్వానికి పేరడీ రావాలంటే ఆ కవిత్వంలో కొట్టొచ్చినట్టు కనిపించే గుణం ఏదో వుండాలి. దాన్ని ప్రదర్శించటం తోనే అది ఏ కవి రచనో పాఠకుడికి వెంటనే తెలిసిపోవాలి. ఇవి రెండూ లేనప్పుడు పేరడీ రాసినా అది పేరడీ అని ఎవరికీ తెలియక పోవచ్చు. ఉదాహరణకు, జయప్రభ కవిత్వానికి పేరడీలు రాయొచ్చు – ఆవిడ కొంచెం తరచుగా ఉపయోగించే ప్రయోగాలు, సంక్లిష్టసమాసాలు చూడగానే అది బహుశా ఆవిడ పద్యం అని అనిపించేవి ఉన్నాయి. అలాగే, ఇంకొంచెం వెనక్కు వెళ్తే ఇస్మాయిల్ ని, అజంతాని పేరడీ చెయ్యొచ్చు. ఇంకా పాతతరం వారైన శ్రీశ్రీ, విశ్వనాథ, కొంతవరకు ఆరుద్ర పేరడీలకు అందుతారు (ఏమాత్రం పేరడీ ఎముక వున్నవాళ్ళైనా శ్రీశ్రీని చేశారు కూడ). ఒక కవిని పేరడీ చెయ్యటం ఒక పద్ధతి ఐతే అలా కాకుండా ఒక పద్యాన్నో ఒక ఖండికనో పేరడీ చెయ్యటం మరో పద్ధతి. ఇక్కడ కావలసింది ఆ పద్యం చాలా ప్రఖ్యాతమైంది కావటం. అలాటప్పుడు ఓ పేరడీ పద్యం వింటే అది దేనికి పేరడీయో వెంటనే తెలిసిపోతుంది. ఇకపోతే మూడో రకం ఒకరకమైన పద్యాలన్నిటికి కలిపి వాటికి పేరడీ చెప్పటం. భావకవిత్వానికి పేరడీలు అలాటివి. భావకవితా ఉద్యమం మొత్తానికి ప్రతీకగా వున్న కొన్ని గుణాల్ని పేరడీ చెయ్యటం అన్నమాట. కనుక, ఇటీవలి కవిత్వం మీద పేరడీలు ఎందుకు రావటం లేదూ అంటే నా ఉద్దేశ్యం పైన చెప్పిన గుణాలు లేకపోవటం వల్లనే అని; పేరడీలు చెప్పగలిగేవాళ్ళు లేక కాదు.

  2023. కృష్ణరాయల కవిపోషణ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    05/03/2006 9:51 am

    విప్లవ్, కామేశ్వరరావు గార్ల అభిప్రాయాల పై ఒకటి రెండు మాటలు – 1. రాయవాచకం కాబోయే మంత్రుల కోసం రాసిన ఓ పాఠ్యగ్రంథం. దానికీ వాస్తవ సంఘటనలకీ సంబంధమే లేదు; అలాగే కృష్ణరాయ విజయం పేరు చెప్పినట్లు ఆయన యుద్ధవిజయాల గురించిన కావ్యం; కొన్ని వాస్తవాలున్నా అప్పటికే కృష్ణరాయల mytholozation చాలా దూరం వెళ్లింది. కనుక నిజాల్ని తెలుసుకోవటానికి ఇవి ఆధారాలు కావు. 2. ఆముక్తమాల్యద నిష్పక్షపాతంగా చదివితే అది రాసిన వ్యక్తి ఎలాటివాడో అతని జీవితానుభవాలు ఎలాటివో స్పష్టంగానే తెలుస్తాయి. అది రాయలు కాకుండా మరెవరో రాశారనటం మసి పూసి మారేడు కాయ చెయ్యటమే. చివరగా, ఆకాలాన్ని తెలుగు కవిత్వ చరిత్రలో స్వర్ణయుగం అనటం సమంజసమే – అప్పుడు వచ్చిన అద్భుతకవిత్వం చూడండి – తొలిప్రబంధం మనుచరిత్ర, ప్రబంధాల్లో శిఖరాగ్రస్థాయిని అందుకున్న వసుచరిత్ర; పింగళి సూరన లేఖిని నుంచి కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, తొలి ద్వ్యర్థికావ్యం రాఘవపాండవీయం; అక్షరశ్లేషకి ప్రాధాన్యత నిచ్చిన రాఘవపాండవీయానికి ప్రతిగా అర్థశ్లేషకు పెద్దపీట వేసిన హరిశ్చంద్రనలోపాఖ్యానం; తిమ్మన పారిజాతాపహరణం, ధూర్జటి కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి మహాత్మ్యం; రామకృష్ణుడి పాండురంగమాహాత్మ్యం; రాయల ఆముక్తమాల్యద. తెలుగు పంచకావ్యాలుగా గుర్తించేవాటిలో నాలుగింటిని contribute చేసిన కాలం అది. ఆ తర్వాత నాయక రాజుల కాలంలో ఇంతకన్న ఎక్కువ సంఖ్యలో తెలుగు కావ్యాలు వచ్చినా అవి చాలావరకు ఈ “స్వర్ణయుగం” రచనలు వేసిన బాటలో నడిచినవే.

  2024. కృష్ణరాయల కవిపోషణ గురించి kAmESwara rAvu గారి అభిప్రాయం:

    05/03/2006 9:00 am

    1. కృష్ణరాయలు తన కవితాసక్తిని బహిరంగంగా ప్రదర్శించాడా, అతడు కవి పోషకుడా?
    ఈ ప్రశ్నకి “ప్రదర్శించాడు” అని సమాధానం చెప్పుకోడానికి పెద్ద సందేహపడక్కరలేదు. పెద్దన, తిమ్మన్న కావ్యాలే కాకుండా, రాయవాచకం, కృష్ణరాయవిజయం కూడా ఇందుకు సాక్ష్యాలే. అయితే కవులపేర ఏమైనా భూములిచ్చినట్టుగా శాసనాలు ఉన్నాయా అంటే అనుమానమే. నారాయణరావుగారు ఉదహరించిన ఆముక్తమాల్యదలోని పద్యం అతని కవి పోషకత్వాన్ని అనుమానించడానికి అడ్డురాదు. అందులో ప్రస్తావించినది కవులగూర్చి కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. కవులని భిక్షువులుగా జటాధారులుగా ప్రస్తావించడం సబబుగాలేదు. అలా అని రామారావుగారన్న బౌద్ధులు, శైవులు, జైనులు అవడానికి కూడా అవకాశం లేదని నా ఉద్దేశం. వైష్ణవుడైన కృష్ణదేవరాయలు వాళ్ళని డబ్బులిచ్చి మార్చెస్తే, ధర్మగ్లాని అవుతుందని ఎందుకంటాడు? పైగా వాళ్ళమీద భక్తి చూపించమని ఎందుకంటాడు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి బౌద్ధ భిక్షువులో, శైవులో కాదు. వేదం వారి వ్యాఖ్య ప్రకారం, వాళ్ళు సన్యాసులు. “అక్షరం” అంటే (నాశనం కాని, ఆధ్యాత్మిక)విద్య.
    2. కృష్ణరాయలు స్వయంగా కవా?
    ఇది చాలా controversial ప్రశ్న. దీని గురించి చాలామంది పెద్దలు వాదులాడుకున్నారు. ఆముక్తమాల్యద పెద్దన్న కృతమని చాలా రుజువులే చూపించారు. వీటన్నిటిని వేదం వేంకటరాయశాస్త్రిగారు తన ఆముక్తమాల్యదకి రాసిన సంజీవనీ వ్యాఖ్య పీఠికలో చర్చించారు. తెనాలి రామకృష్ణునిదిగా చెప్పబడుతున్న చాటువు, కోకట గ్రామ కైఫీయతు (ఇందులో ఈ గ్రామాన్ని రాయలు పెద్దనకి దానం చేసినట్టు ఉందిట), అప్పకవి పద్యమూ, గుడుపాటి వేంకటకవిదిగా చెప్పబడుతున్న ఆముక్తమాల్యద టీకా… ఇవన్నీ ఆముక్తమాల్యద కర్త అల్లసాని పెద్దనగా పేర్కొన్నాయి. అంతేకాక, ఆముక్తమాల్యదలో కృష్ణరాయల కృతమని పేర్కొన బడ్డ కొన్ని సంస్కృత కావ్యాలు, “ప్రపంచదర్పణమ్” అనే పుస్తకంలో అల్లసాని పెద్దనవిగా పేర్కొనడ్డాయి. అంతేకాక రాయవాచకమూ, కృష్ణరాయ విజయమూ ఆముక్తమాల్యదని పేర్కొనకపోవడం మరింత అనుమానాన్ని కలిగిస్తుంది.
    3. అష్టదిగ్గజాలు అసలు ఉన్నారా లేరా ?
    దీనికి సమాధానం సబహుశా లేరనే చెప్పాలి. ఉన్నారని బలమైన సాక్ష్యం ఏదీ లేదుకాబట్టి. అష్టదిగ్గజాలుగా చెప్పబడుతున్న కవుల కావ్యాలలో కాని, రాయవాచకం, కృష్ణరాయవిజయం వంటి కావ్యాలలో కాని వీరి ప్రస్తావన లేదు. ఉన్న ఒకే ఒక చిన్న ఆధారం, కడప మండలంలోని తిప్పలూరు గ్రామ శిలాశాసనంలో అష్టదిగ్గజాల ప్రస్తావన.

    విప్లవ్ గారి సందేహానికి సమాధానం, చాలా ప్రబంధాలు రాయలకాలంలోవిగా నిర్ణయించబట్టే ఆ కాలాన్ని ప్రబంధయుగం అన్నారు. అయితే వాటికీ కృష్ణరాయల కవిపోషకత్వానికీ ఎంతవరకూ direct సంబంధమున్నదన్నదే ప్రశ్న.

  2025. వానా పూలు ఇంద్రాణి కవిత్వం గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    05/03/2006 6:30 am

    కనక ప్రసాద్ గారు ..

    Wagoner చెప్పినది నిజం..గుడిలో కుక్క చెప్పులు వెదికినట్టు..బుద్ధి
    తప్పులు వెదుకుతుంది ..కాబట్టి ప్రపంచం ముక్కలు ముక్కలైన అద్దంలో
    కనిపించే ప్రతిబింబంలా దర్శనమిస్తుంది..ఏకత్వాన్ని కోల్పోయి..కళలకు
    తలమానికమైన కవిత్వం..బుద్ధి బులపాటాలకు దూరంగా తీసుకుపోయి ..
    మన హృదయంలో ఏకత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తుంది..తన ప్రేమైక దృష్టితో..
    దానివల్ల ప్రపంచం..ఉన్నదున్నట్టు, బాల్యంలో మనం చూసినట్టు
    అనుభూతమై ఎంతో హాయి గొలుపుతుంది.

    కల్పవృక్షాన్ని బొగ్గులకోసం తగులబెట్టినట్టు,మన వాళ్ళు
    విప్లవాలు ,వీరంగాలు..వాదాలు..సిద్ధాంతాలు ,భక్తీ వేదాంతం
    అంటూ కవిత్వాన్ని అంతరించి పోయే స్థాయికి తీసుకువచ్చారు.
    కవులే కాదు ..కవిత్వాన్ని నిర్మల హృదయంతో చదివే జాతి
    కూడా కృష్ణజింకల్లా అంతరించిపోతున్న అరుదైన జీవుల పట్టికలో
    చేరింది.

    కవయిత్రిని ఒక పది కాపీలు పంపమని చెప్పాను..ప్రస్తుతానికి
    మీకు నా దగ్గర ఉన్న ఏకైక కాపీని పంపుతాను.మీ చిరునామా
    thammineni@lycos.com పంపించండి.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  2026. ఈమాట కొత్త వేషం గురించి పద్మ గారి అభిప్రాయం:

    05/02/2006 10:19 pm

    అక్కిరాజు గారు, నచకి గారు, మురళి గారు, thanks for the positive feedback and for making my day. :-)

     మొత్తం అన్ని వ్యాసాల, కథల, కవితల కామెంట్లూ చదివేశేయాలానే నాలాంటి దురాశా పరులకి కొంత కష్టమవుతోంది. బోలెడు క్లిక్కులు కొడితేగానీ ఏమన్నా కొత్త కామెంట్లు వచ్చాయో లేదో తెలియకుండా ఉంది. మరో పేజీ, “అన్ని కామెంటులూ” అని ఒకటి తయారు చేసి, దాంట్లో అన్నింటినీ చూప గలరేమో ప్రయత్నించండి.

     ఇది చాలా మంచి సూచన. ఇప్పుడు మీరు ఈమాట లో కొత్తగా వచ్చిన పది అభిప్రాయాలని చదవగలరు. త్వరలో ఈ పేజీని sidebar లో కూడా లింక్ చేస్తాను. మరొక సులువైన మార్గం: ఈమాట లో కొత్తగా వచ్చిన పది అభిప్రాయాలని RSS ద్వారా సిండికేట్ చేస్తున్నాము. మీకు  సేజ్, లేదా మరేదైనా Feed aggregator ఉంటే కొత్త అభిప్రాయాల RSS Feed కి subscribe చెయ్యచ్చు.

  2027. ఈమాట కొత్త వేషం గురించి అక్కిరాజు భట్టిప్రోలు గారి అభిప్రాయం:

    05/02/2006 10:06 am

    కొత్త వేషం చాలా బాగుంది. NYTimes, CNN లాంటి సైట్లతో పోల్చతగినట్టు గా ఉంది. మీ శ్రమ వృథా పోలేదు, పోదు.

    ఏ వ్యాసం కామెంట్లు ఆ వ్యాసం కిందే ఇవ్వటం హాయిగా ఉంది. అదే సందర్భంలో, మొత్తం అన్ని వ్యాసాల, కథల, కవితల కామెంట్లూ చదివేశేయాలానే నాలాంటి దురాశా పరులకి కొంత కష్టమవుతోంది. బోలెడు క్లిక్కులు కొడితేగానీ ఏమన్నా కొత్త కామెంట్లు వచ్చాయో లేదో తెలియకుండా ఉంది. మరో పేజీ, “అన్ని కామెంటులూ” అని ఒకటి తయారు చేసి, దాంట్లో అన్నింటినీ చూప గలరేమో ప్రయత్నించండి. వెనకాల డేటాబేస ఉందన్నారు కాబట్టి సాధ్యమవాలి.

    అక్కిరాజు భట్టిప్రోలు

  2028. తుది ప్రార్ధన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/02/2006 9:01 am

    అమ్మా నాన్న వద్దు అందామనుకుంటే
    “అమ్మ, నాన్న” లను చేసింది నా పుట్టుకే అనిపిస్తుంది

    అడవి కాని ఇల్లు వాకిలి వద్దు అందామనుకుంటే
    అవేవీ కట్టకముందు అంతా అడవే అనిపిస్తుంది

    చదువుకోవడానికి మేష్టార్లు వొద్దనుకుంటే
    ప్రతి అనుభూతి పాఠంచెప్పే మేష్టారే అనిపిస్తుంది

    సోదర సోదరీమణులు వొద్దు అందామనుకుంటే
    కాళ్ళూ చేతులూ సోదర సోదరీమణులే అనిపిస్తున్నాయి

    మూడుముళ్ళ బంధమే వద్దు అందామనుకుంటే
    తలపుల బంధాలు రోజూ ముడివేసుకుంటున్నాయి అనిపిస్తుంది

    బిడ్డలే బరువని వద్దు అందామనుకుంటే
    కవితయే కన్యగా కళ్ళెదుట కనిపిస్తుంది

    పుట్టుకే లేని భాగ్యం కావాలనుకుంటే
    పుట్టకపోతే అది భాగ్యమని తెలిసేదెట్లా అనిపిస్తుంది !

    విధేయుడు

    Srinivas

  2029. వానా పూలు ఇంద్రాణి కవిత్వం గురించి s. kanaka prasad గారి అభిప్రాయం:

    05/01/2006 3:58 pm

    ఇంద్రజాలం
    ఇంద్రాణి గారి కవితల ఇంద్రజాలంలో ఏడాదిగా పడి కొట్టుకుంటున్నాను. జనవరిలో ఎన్నో చోట్ల వెతికినా వస్తుందన్న కవితల పుస్తకం దొరకలేదు. నెట్ లో దొరికిన కాసిన్ని కవితలనే మళ్ళీ మళ్ళీ అబ్బురంగా సంబరంగా చదువుతున్నాను. గుప్తనిధి అని ముకుందరామారావు గారన్నమాట, ప్రతిభ గల కవయిత్రి అని యదుకుల భూషణ్ గారన్నమాట ముమ్మాటికీ నిజం. ఈ కవితలకి ఇంతటి లాలిత్యం ఈ సమ్మోహక శక్తి ఎలా వచ్చి ఉంటాయా అని నాలో నేనే కులికి చస్తున్నాను. ఇది చాల జటిలమైన ప్రశ్న; దీనికి సమాధానాలు మాత్రం ఈ కవితలలానే చాల సున్నితమైనవి, మేధస్సుకు అతీతమైనవి అయి ఉండాలి. ఎంతో ఇష్టంగా అవి వెదుకుతున్నాను; కాని మొత్తం పుస్తకం నాకు దొరకలేదు. పరిచయంలో ముకుందరామా రావు గారు చూపినటువంటి సంయమనం, ఏ నిరాశకు గురి కాకుండా ఉండాలన్న ఆకాంక్ష, ఈ ఐంద్రజాలికి చేయతగిన కనీస గౌరవాలు. దొరికిన కవితలు చదినప్పుడల్లా నేను అలాగే అనుకున్నాను.

    నిద్రపోతున్న పిల్లలు, సైకిలు మీద తమ్ముడితో వెళ్ళడం, నీళ్ళు తాగే పిట్ట, వానకు తడిసిన పువ్వూ ఇవి సర్వ సాధారణమైన దృశ్యాలూ, అనుభవాలూ కదా! వీటిని చూసి, రాస్తే అవి అంత చక్కదనాలుగా ఎలా, ఎందుకుంటాయో? ఈ ఒక్క ప్రశ్నDavid Wagoner అని నాకు చాల ఇష్టమైన కవి ఒకరిని అడిగేను. ఆయన ఇది చాల చిక్కు ప్రశ్న అని అంటూనే నాకు నచ్చిన జవాబు చెప్పేరు. నిత్య జీవితంలో మంచి చెడ్డల బేరీజులు, నిర్ణయాలతోనూ సతమతమౌతుంటుండే మన అంతరంగాన్ని మంచి కవిత తన పదాలు, నడకలు, చిత్రాలు, ఉపమలతో ఊరడించి, సర్వ సాధారణమైన దృశ్యాల్ని, మనుషుల్ని, ప్రపంచాన్నే మరింత ఉదారంగా లోతుగానూ దర్శింపచేస్తుంది. (I have no good way to answer your very difficult question. But a partial answer would be that the sounds and rhythms and metaphors of poetry sometimes make us suspend our ordinary judgments and help us see the material world and its people, ordinary actions, and commonplace events more openly and deeply.) ఇందుకే ఇంద్రాణి గారి కవితలలో ఏమేం ఉన్నాయి అని కాకుండా ఏమేం లేవు అని, వేటిని ఒదులుకోవటం వలన వాటికి ఆ శక్తి అనీ ఇంకా అడుగుతున్నాను నన్ను నేనే. తప్పకుండా రాసి తీరాలి అని గిలగిల్లాడుతున్నది రాసినందుకు ముకుంద రామారావు గారికి అభినందనలు.

  2030. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    05/01/2006 2:55 pm

    నా వ్యాసంలో ఉదహరించని పేర్లు చాలానే ఉన్నాయి. 30 ఏళ్ళుగా నిర్వహించిన అనేక సంగీత కార్యక్రమాలల్లో ఔత్సాహికులైన గాత్ర, వాయిద్య కళాకారులెందరితోనో పనిచేసే అవకాశం నాకు కలిగింది. ప్రస్తుతం హ్యూస్టన్ లో ఉంటున్న డా. ఎ.వి.మురళి కవిగా, ప్రయోక్తగా చాలా ప్రతిభ కలిగిన వ్యక్తి. ఆయన మా కార్యక్రమాల్లోనూ, రాజేశ్వరరావు, పెండ్యాల నైట్ వగైరాల్లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. స్వయంగా కవీ, గాయకుడూ అయినప్పటికీ నా “ధాటి”కి గాయకుడుగా ఆయన కాస్త వెనక్కి తగ్గారు! ఆయన భార్య శ్రీమతి విమల ఎన్నో పాటలకు వీణ వాయించారు. ఆయన సోదరి విమల, మేనకోడలు రేణుక కూడా మాతో పాడారు. అలాగే ప్రస్తుతం అట్లాంటాలో చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దువ్వూరి రమేశ్ కుమార్, గుణుపూరు శ్రీనివాస్ (న్యూయార్క్) పాటలు పాడారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న శ్రీమతి సరిపల్లి బాలాత్రిపురసుందరి మాకు ఉత్తమ గాయని. బొంబాయిలో ఇంతమంది తెలుగువారితో కలిసి మాకిష్టమైన పాత పాటలన్నీ పాడడం, పాడించడం చాలా సరదాగా ఉండేది. సినీగీతాలు కాకుండా కవితా స్రవంతి అనే పేరుతో గురజాడనుంచి చెరబండరాజుదాకా ఆధునిక తెలుగు కవుల గీతాలను ట్యూన్లు కట్టి, పూర్తి ఆర్కెస్ట్రా, కోరస్ వగైరాలతో రక్తి కట్టించగలిగాం. వీరందరిలోకీ రిహార్సల్స్ ని కూడా సీరియస్ గా తీసుకున్న కొద్దిమందిలో లక్ష్మన్న ఒకరు.

    మేము నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వచ్చిన ప్రొఫెషనల్ కళాకారుల దగ్గరికి “మొరటు” మనుషులు రాకుండా మర్యాదస్తులైన మా మిత్రులను “కాపలా” పెట్టవలసివచ్చేది. ఎందుకంటే ఇతర సభల్లో ఒక్కొక్కప్పుడు పొరబాట్లు జరిగేవి. నూకలవారు కచేరీ చేస్తున్నప్పుడు ఎవరో మధ్యలో పక్క వాయిద్యం వాయిస్తున్న యెల్లావారిని మృదంగం సోలో వాయించమంటూ చీటీ పంపించారు. దురదృష్టవశాత్తూ అది నూకలవారి దగ్గరకు వెళ్ళింది. అది చూసి ఆయన మైకులో పెట్టిన చివాట్లను అందరం విన్నాం!

    కొన్ని సందర్భాల్లో మా సభ్యులందరూ కూర్చుని శ్రవ్య నాటికలు వేసేవారు. ఇది ఖర్చులేని ఉత్తమ ప్రక్రియ అని ఇప్పటికీ నా అభిప్రాయం. సినిమాలే కల్చర్ అనుకోకుండా, మరొకవంక అస్తమానమూ శాస్త్రీయసంగీతం లేదా కూచిపూడితో మొహం మొత్తించకుండా ఇలాంటివి తెలుగు సంఘాలు చేపడితే బావుంటుందని నాకనిపిస్తుంది.

  2031. ‘వ్యయ’ ప్రయాస గురించి kiran kumar chava గారి అభిప్రాయం:

    05/01/2006 10:30 am

    మారుతీరావు గారూ,

    ఈ మాటకు సు స్వాగతం

    మీరు ఇలాగే మరిన్ని కవితలు (లాంటివి?) ఇక్కడ ప్రచురించాలని ఆశిస్తున్నాను

    దన్యవాదములు
    కిరణ్ కుమార్ చావా (నామధేయః)

  2032. తుది ప్రార్ధన గురించి kiran kumar chava గారి అభిప్రాయం:

    05/01/2006 10:26 am

    ఏమిటండీ లైలా గారు
    మరీ జనాలు అంతగనం ఇబ్బంది పెడుతున్నారా?

    ఓ ప్రభూ!
    నరకమైనా, స్వర్గమైనా
    భూమి అయినా పాతాళమయినా
    అడవి అయినా, జనారణ్యం అయినా
    ఎక్కడికైనా పంపు ఈ దేహాన్ని!
    కానీ,
    దానితో పాటు నీపై ప్రేమను పంపడం మరవకు సుమా

    ఓ ప్రభూ!
    కవితలు వ్రాయనీ, వ్రాయకపోనీ
    కథలు చెప్పనీ, చెప్పకపోనీ
    సంతానము ఇవ్వు, ఇవ్వకపో
    స్వర్ణము ఇవ్వు ఇవ్వకపో
    కానీ
    నీ ప్రేమను మాత్రము ఇవ్వు సుమా!
    ps: పేరడీలాగా వ్రాద్దాము అనుకున్నాను, కానీ ఇంకా చెయ్యి తిరగాలి 🙂

  2033. బతుకు గురించి telugu గారి అభిప్రాయం:

    05/01/2006 7:24 am

    ఏవిటిది? స్వప్నించడాలూ, సుస్మితించడాలూ.. ఎందుకీ బలవంతపు ప్రయోగాలు?
    కలలు కనే కవి రాలిపోతాడు అంటే ఏ లోపము జరుగుతుంది?
    అప్పు తచ్చులు చూసుకోవాలి.. నటనానుభూతులు లో నతనానుబూతులు అని
    పడింది. నతన కి సర్దుకున్నా బూతులకి మాత్రము సర్దుకోడము కష్టంగా ఉన్నది.
    కవిత బాగానే ఉంది. బలవంతపు ప్రయోగ పదాలు తప్ప.

  2034. నా మాట: చాటువు – పేరడీ గురించి Sudhakar గారి అభిప్రాయం:

    05/01/2006 5:07 am

    వేలూరి వెంకటేశ్వర రావు గారి పేరడీ చాలా బాగుంది. అవధులు దాటేదే ఆధునిక కవిత్వం అనిపిస్తాయి ఈ పేరడీలు. Modern paintings తో వీటిని పోల్చవచు నేమో ఈ పేరడీ ల ను.

  2035. ఈ శతాబ్దపు రచనా శతం గురించి Ravi Sankar Vinnakota గారి అభిప్రాయం:

    07/16/1999 6:27 pm

    I would like to add some comments on ఈ శతాబ్దపు పుస్తక శతం. I am aware of the disclaimer given in the introduction and I accept that people do hold a difference of opinion on such lists. However, I choose to put my views on record so that I can share them with others.

    1. In the first place, they should have consistently followed the principle of only one entry for one writer, under one category. This was followed when త్వమేవాహం and ఇంటింటి పద్యాలు clubbed together and also several story books are clubbed under the title వివిధ కధలు. But, by applying the same principle, మహా ప్రస్థానం and ఖడ్గసృష్టి, రామాయణ కల్పవృక్షం and కిన్నెరసానిపాటలు, వివిధ కధలు and బుడుగు also could have been clubbed under one entry. If it is not possible to do that, it is better to limit the selection to only one book and include the better one of the two. This will give scope for including some more books which rightly deserve a place.

    2. Just like, Krishna Sastry’s కృష్ణ పక్షము,ప్రవాసము & ఊర్వశి ,Ismail’s చెట్టు నా ఆదర్శం, మృత్యు వృక్షం & చిలకలు వాలిన చెట్టు are also published in a single book titled చిలకలు వాలిన చెట్టు.It is a good idea to include this , instead of చెట్టు నా ఆదర్శం alone, because that will give amore complete picture of his poetry.

    3. There are six exclusions that I should prominently point out :

    a) శేషేంద్రశర్మ ఆధునిక మహాభారతం under కవిత్వం. I don’t understand how any reference to modern Telugu poetry can be complete without mentioning శేషేంద్ర!

    b) నవీన్‌ అంపశయ్య under novels. This pioneering work introducing stream of consciousness technique in Telugu novel, deserves to be mentioned among the best books.

    c) త్రిపుర కధలు under కధలు. In my opinion, Tripura is one of those writers who gave a new dimension to Telugu కధ.

    d) రావి శాస్త్రి నిజం under నాటికలు.

    e) ఆర్‌.ఎస్‌.సుదర్శనం సాహిత్యంలో దృక్పధాలు under సాహిత్య పరిశీలన. The contribution made by r.s.sudarsanam to Telugu విమర్శ definitely needs to be acknowledged and this is the best of his books on విమర్శ.

    f) శిఖామణి మువ్వల చేతికర్ర under కవిత్వం. Many young poets of 80-90 are included in this list, some deserving and some non deserving. But, SikhamaNi’s మువ్వల చేతికర్ర is among the first books in that era that attracted wide acclaim.

    4. There is one inclusion I strongly disagree with – తులసిదళం under novels. I am unable to understand the logic behind inclusion of this book, which was responsible for a spurt of unhealthy literature, better known as క్షుద్ర సాహిత్యం. It has no values of whatsoever. Its popularity was due to the way in which it was serialized. As a book it is less popular and I doubt, if any one will pickup that book for even a casual reading now! It is better to leave it behind, while moving to next century. If one is very particular about giving credit to వీరేంద్రనాథ్‌, maybe we have to look at any other book written by him.

    5. There are at least three poetry books in the list, which are good books, but not so great to qualify to for inclusion in the list of best books of the century.

    a) మహె జబీన్‌ ఆకులు రాలే కాలం
    b) సతీష్‌ చందర్‌ పంచమవేదం
    c) ఖాదర్‌ మొహియిద్దీన్‌ పుట్టుమచ్చ

    6. In my opinion, when we include a writer in the list (thro’ his works, of course), we have to consider his overall contribution to Telugu literature and language. We cannot have a name, just to give representation to a movement or a trend. For example, ఖాదర్‌ మొహియిద్దీన్‌ has got only one poem to his credit. If somebody compiles hundred great poems of the century, then khadar definitely deserves a place in it, but not in this list. On the other hand, we cannot ignore a great poet like శేషేంద్ర, who spent his whole life on poetry !

    7. Anyway, I cannot assume that movement yardstick is also strictly applied, because, as pointed out by Narayanaswamy, books from the era of a mega movement like విరసం are not found in the list.

    Regards

    Ravi Sankar