పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. పునశ్చరణం గురించి Aruna Gosukonda అభిప్రాయం:

    07/04/2007 1:43 am

    very nice Vaidehi garu. 🙂

  2. రెండు మౌనాల మధ్య గురించి Aruna Gosukonda అభిప్రాయం:

    07/04/2007 12:10 am

    బాగు బాగు. 🙂

    “ఆలిగితివా సఖీ చెలీ” అని హీరో గారు పాడినట్టు చెప్పి వుంటే ఇంకా బాగుండేది. 🙂

  3. గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి Lyla Yerneni అభిప్రాయం:

    07/03/2007 6:38 pm

    yummy essay! what a treat! heavenly music!

    “ఆయన పడుకుని ఏదో ఒక లయలో పాడుకుంటున్నప్పుడు కాలు
    మరొక లయలో కదులుతూ ఉండేదని మా గురువుగారబ్బాయి
    ఇర్షాద్ నాతో అన్నాడు. ”

    Is this feat of the feet humanly possible, Rohini Prasad?
    I don’t think it is, unless there is some aberration or
    re-org of his motor pathways.
    I will check with a neuro surgeon, next time I see one.:-)

    “ఆయన రికార్డులు వింటే ఈ సంగతి
    తెలుస్తుంది.”
    ??

  4. అతిథి వ్యయో భవ గురించి kumar అభిప్రాయం:

    07/03/2007 11:48 am

    కధ బాగుంది. ముఖ్యంగా ఈ నాలుగేళ్ళలో మైకు దురద దినదినాభి వృద్ధి చెందుతూ కీర్తి కేన్సర్ గా పరిణమించింద న్న పద ప్రయోగం బాగుంది.

    కొన్ని కామెంట్స్ బాగా లేవు.  Waiting for your experiences with another star (while your family was away on india trip).

    (This message has been edited – Editors) 

  5. న త్వం శోచితుమర్హసి గురించి రానారె అభిప్రాయం:

    07/03/2007 10:57 am

    వ్యాఖ్యలు రాసి అభిప్రాయాలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పడం సంప్రదాయం. అయితే, ఈ కృతజ్ఞతలు ఒక వారం ముందు చెప్పి ఉండాల్సింది. కొత్త సంచిక వచ్చి, ప్రస్తుతం నా మాటలను అసందర్భం అనిపింపజేస్తుండవచ్చు, క్షమించాలి. ఈ కథకు మూలం ఇక్కడ మొదటి వ్యాఖ్య రాసిన వ్యక్తి. ఆరోజు ఆ గిత్తను కట్టేసింది ఆయనే. విహారి, నేనుసైతం, మురళీకృష్ణ, నవీన్‌గార్లకు ధన్యవాదాలు. ప్రసాదుగారు, మీరన్నది నిజమే కావచ్చు. కానీ పెద్దగా కదిలించి కన్నీళ్లు పెట్టించడం మాత్రమే కాదు ఈ కథ ప్రధాన ఉద్దేశం. వైదేహిగారి అభిప్రాయం ఈ కథ ఉద్దేశానికి అద్దంపట్టింది: “జీవన విధానాన్ని,జీవన్మరణాల మధ్యలో నిర్వికారం గా సాగిపోయే లోకవ్యవహారాన్ని చిత్రీకరించడం”. వేంకటరత్నంబాబుగారు, కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. “ములకనాటీ మాండలికం” అంటే ఏమిటో నాకు తెలీదు. మీకు తెలిస్తే దయచేసి చెప్పండి.

  6. ఈమాట కొత్త వేషం గురించి Vanguri Chitten Raju అభిప్రాయం:

    07/03/2007 9:27 am

    ఈ యూనికోడులూ, మంచం కోడులూ నాకు బొత్తిగా తెలియవు కానీ, “ఈమాట” కొత్త వేషం బహు ముచ్చటగా ఉంది. ఇప్పుడు అన్నీ చదవడం సులభంగా ఉంది. అఫ్కోర్సు, చదివినవన్నీ అర్థం అయ్యాయి అని అబధ్ధం చెప్పను కాక చెప్పను.
    సంపాదకులకీ, నిర్వాహకులకీ ధన్యవాదాలు, అభినందనలు.
    భవదీయుడు
    వంగూరి చిట్టెన్ రాజు వ్రాలు

  7. రెండు కవితలు గురించి Kameswara Rao అభిప్రాయం:

    07/03/2007 8:10 am

    మొదటి కవిత ముద్దుగా ఉంది. రెండవది పెద్దగా ఉంది:-)

  8. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Ambanath అభిప్రాయం:

    07/03/2007 5:47 am

     నవ్వులు నవ్వే ముందు మీరు ఈ విషయాలు అర్థం చేసుకోండి.

    1. హిందీ మన జాతీయ భాష కాదు. మనం తెలుగుజాతి. మన జాతీయభాష తెలుగు మాత్రమే. ఒకడి మాతృభాష ఇంకొకడికి జాతీయ భాష కాజాలదు. హిందీ మన నెత్తిన రుద్దబడిన పరాయి భాష.

    2. భాషలకి లేబుల్స్ (ప్రాంతీయభాష, జాతీయభాష, అంతర్జాతీయభాష, అధికారభాష, మైనారిటీ భాష వగైరా) వెయ్యడం వాటి యాదృచ్ఛిక ఎదుగుదలని అడ్డుకోవడం కాదా ? మానవజాతిని అగ్రకులాలు నిమ్నకులాలు అని విభజించి కొందరిని తొక్కించడం, కొందరిని ఎక్కించడం- దీనికి ఈ లేబుల్స్ కీ తేడా ఏమిటి ?

    3. ప్రాథమికంగా ఇంగ్లీషుతో సహా (ఏదో ఒక అర్థంలో) ప్రతి భాషా ప్రాంతీయ భాషే అయినప్పుడు-తెలుగు అంతర్జాతీయ భాష అయితే/అంటే తప్పేమిటి ?

    4. అంతర్జాతీయ భాష హోదా లాంటివి ఎవడి పడగ్గదిలో వాడు పడుకుంటే వచ్చేవి కావు. దానికి ప్రయత్నం కావాలి. కృషి కావాలి. ఏ ప్రయత్నమూ లేకుండా సింగపూర్‌లో తమిళానికి అధికార హోదా సిద్ధించలేదు. కాస్త ఆలస్యంగా నైనా తెలుగువాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే మీకేంటి బాధ ?

    5. తెలుగుకు ప్రస్తుతం ఆంధ్రదేశంలో పట్టిన దుర్గతి అది అంతర్జాతీయ భాష కావడానికి అవరోధం కాదు. బ్రాంచీలు లేని వ్యాపారాలు ఈ రోజుల్లో శోభించవు. అలాగే బ్రాంచీలు లేని భాషలు కూడా వృద్ధి చెందవు. అందుకని మన ఆంధ్రదేశం కాక మరో రెండు మూడు దేశాల్లో మన భాషకి అధికార హోదా సంపాదించి పెట్టడానికి మనం కృషిచెయ్యాలి. ఇదో చారిత్రిక అవసరం.

    ఈ డిమాండు రాకముందే నా మనసులో ఈ అభిప్రాయం గత కొన్ని దశాబ్దాలుగా ఉంది.

  9. ఈమాట కొత్త వేషం గురించి jabalimuni అభిప్రాయం:

    07/02/2007 11:11 pm

    అన్ని సంచికలు PDF files గా download చేసుకోగలిగేటట్లు అవకాశము కల్పించండి
    మీ కృషి శ్లాఘనీయము.
    జాబాలిముని

  10. అతిథి వ్యయో భవ గురించి chavakiran అభిప్రాయం:

    07/02/2007 10:13 pm

    బాగుంది

    అయితే మేము ఈ సారి అమెరికా వచ్చినప్పుడు ఎవరి ఆతిధ్యమూ ఆశించకూడదన్న మాట

    మా హొటేల్లేవే మేమే చూసుకోవాలి 🙂