పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. రెండు కవితలు గురించి Sudheer Kumar Kothuri అభిప్రాయం:

    07/01/2007 10:09 pm

    చాలా బాగున్నాయి….అద్భుతం!

  2. నిద్ర గురించి nagaraju అభిప్రాయం:

    06/29/2007 10:01 am

    చాలా బాగుంది ఈ కవిత. ఈ కవితను చదువుతుంటే హాయిగా నిద్ర వస్తుంది.

  3. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి achalla srinivasarao అభిప్రాయం:

    06/28/2007 9:13 am

    మొదటి సారి గా ఈ ససైట్ చూడడం జరిగింది. చాలా చాలా ఉపయుక్తమవుతుంది. అభినందన్లు క్రుతజంతలు.
    ఆచాళ్ల్ ష్రీనివాసరావు

  4. నిద్ర గురించి C.S.Rao అభిప్రాయం:

    06/27/2007 4:31 pm

    Telling a great truth,propagating a doctrine,teaching a great moral or springing a surprise to arrest attention is not being poetic.A poem lies in meaningful imagery very well coordinated and unified.A good poem communicates an intense emotional experience of the poet in pleasantly captivating metaphorical language which is at once hauntingly rhythmical and picturesquely evocative.A poem may even said to be a transparently metaphorical allegory.One of the true tests of a good poem is that it will have an eternal freshness of appeal.you love it endlessly ,memorize it effortlessly,and recite it to yourself for the pure pleasure of it over and over,again and again.And you are even eager to let others share your pleasure as you recite it.

    “Nidra” is one such good poem though with one or two discordant images.The poem spans the mysterious night like a multilateral rainbow from bedtime at night to waking moment at dawn.
    The poetess communicates very well the pre-sleep pleasurableness as night lit with stars scattered, like pollen in spring, across the sky, like full blown black lotus hangs down transparent curtains, shutting down not just light, but wakefulness or wakeful consciousness. Sleep, as it descends, perhaps from the heights of night casts a magic spell on the poetess. The figure of heavy lotus flowers gently touching the eyelids is appropriately beautiful as it deepens soporific effect.

    The joy of dreaming is very well brought out through captivating images : hovering butterflies,haunting tune of a sounding cataract and jasmine meadows of sweet fragrance. The dawn smiling like ‘ummettha’ , a weed flower is not a very happy image as it does not reflect the beauty, peace and tranquility of the daybreak. It can only be justified that the poet is unhappy with the dawn as it terminates the extraordinarily pleasant dream experiences.

    The influence of Devarakonda Balagangadhara Tilak on the poetess is too evident not to notice. To be influenced rightly shows in a way her discriminating intelligence and good taste. Who does not come under the influence of Tilak when one attemps prose poetry? That’s because Tilak is a supreme master of prose poetry par excellence.

  5. ముగ్గురు ముసలమ్మలు గురించి Ravikiran Timmireddy అభిప్రాయం:

    06/21/2007 7:28 am

    “ఇండియాలో తాతయ్య లాగే ఆమెకు జీవించడంలో హుందా చావులో కూడా వుంది.” ముగ్గురు ముసలమ్మలు, మూడురకాల కోరికలు మరణం గురించి. ఐతే వీటన్నిటి పోలికకి బేస్ లైన్ మాత్రం ఇండియాలో తాతయ్య ప్రశాంతవైన మరణవే. శివ, శివా అనుకుంటూ, చక్కగా ఉయ్యాల బల్ల మీద కళ్ళు మూసుకుని పడుకోని, తేలీకుండానే కన్ను మూసిన తాతయ్య మరణవే. వొక వేళ తాతయ్యకి అత్యవసరవైన వైధ్య సహాయం అందుబాటులో వుండుంటే, అది అందుంటే, బ్రతికి బట్టకట్టుంటే ఆయన ఏ రకవైన చావుని కోరేవారో అరుణగారికి బహుశా వూహకందని విషయం. అలా కాకుండా తాతయ్య గారికి ఏ స్ట్రోకో వచ్చి మాటా, చేతా పడిపోయి, బ్రతుకు పడకకే పరిమితం ఐపోయి, డైనింగ్ నుంచి డెఫికేషన్ దాకా పడకమీదే జరిగే పరిస్తితి వచ్చుంటే, ఇంత జరిగినా, మనసు మాత్రం మామూలుగా సృహలో వుండి, బ్రతకడానికి అప్పుడప్పుడు ఏ వెన్టిలేటర్ సహాయవో అవసరవైతే, డా. సునీత గారికి తాతయ్య మీద ఎలాటి అభిప్రాయం వుండేదో అరుణగారే చెప్పాలి. డా. సునీత మనసులో ఆకాశం ఎత్తున తాతయ్య మీదున్న గౌరవం ఏ పాతాళానికి పడిపోయేదో, లేకపోతే శ్రీమతి. జేమ్సు మీద, బ్రతుకుకోసం ఆవె పడే ఆరాటం మీద గౌరవం ఆకాశం ఎత్తున పెరిగేదో అరుణ గారే చెప్పాలి.

    పరిస్థితి వున్నది వున్నట్టు వివరించడం అవసరం. కానీ తన సౌలభ్యంకోసరం చావు బ్రతుకుల నిజాన్ని, తనకనుకూలంగా కొంచం వంచి, భయం కలిగించేలా, భయంకరంగా వివరించడం, వైద్యవృత్తికే కాదు, మనిషి ప్రవృత్తికీ కూడా గౌరవం కలిగించదు. తనకి చేతకాకపోతే ఏ పేలియేటివ్ కేర్ స్పెషలిస్టు సహాయవో తీసుకోవాలి అంతేగానీ అత్యంత అనారోగ్యంగా వున్న అమ్మ (శ్రీమతి. జేమ్సు) గురించి, కుటుంబ సభ్యులతో కటువుగా మాట్లాడటం అనాగరికం, కౄరత్వం. ఐతే ఈ అనాగరిక ప్రవర్తన ఈ వొక్క సంఘటనకే పరిమితం కాదు. డా. సునీత మనసుని చూపించడానికి, ఆ మనసులో ఆలోచనల్ని, వాటిలో వున్న మురికిని చూపించడానికి డా. సునీత చేతనే ఇలా చెప్పించారు “టెక్నాలజీ, అదివాడడానికి మన చేతి డబ్బు పడనక్కరలేదన్న ధీమా లేకపోతే వీళ్ళకి ఈ టెమ్టెషన్ ఉండదేవో!” నిజవే మరి, అందుకే భారద్దేశంలో ఆ టెక్నాలజీ, ఆ సౌలభ్యం చాలా మందికి దక్కకుండా చేయడంలో డా. సునీతలు విజయం సాధించారు. గుండె జబ్బుల లాంటి ప్రాణాంతకవైన వ్యాధులే కాకుండా, అతి సారల్లాంటి అతి సాధారణ వ్యాధులు కూడా జనాన్ని ప్రశాంతంగా శివ, శివ మనిపించే గొప్ప ప్రజారోగ్య శాఖని సృష్టించారు.

    ప్రపంచంలో రకరకాలైన విభేదాలున్నయ్. జాతి, రంగు, ప్రాంతం, కులం, ధనం, వీటన్నికితోడు, అరుణ గారు మరో క్రొత్త విభేదాన్ని ప్రచారంలోకి తెస్తున్నరు. అది చావు. మనం ఏరకంగా మరణించావో అనేది మనం ఏరకంగా బ్రతికేవో అనేదాన్ని నిర్వచిస్తుంది అనమాట. డి ఎన్ ఆర్ (DNR – Do Not Resuscitate) అనేది, పరిస్థితులకి, మన ఇష్టాఇష్టాలకీ సంభందం లేనటువంటి, యూనివర్సల్ గుడ్ అనమాట. అరుణ గారి ద్రుష్టిలో అదొక గొప్ప, వీరోచితవైన విషయం, ఎవరికో కోరుకున్న వాళ్ళకి కాదు, అందరికీ.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  6. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి Rohiniprasad అభిప్రాయం:

    06/20/2007 3:35 pm

    1934 ప్రాంతాల్లో శ్రీశ్రీ రాసిన కవిత్వం చర్చించబడినంతగా, కోట్ చెయ్యబడినంతగా ఆధునిక తెలుగు కవిత్వంలో ఇంకెవరిదీ కనబడదు. అది రాసేనాటికి ఆయన వయస్సు 24 ఏళ్ళే అనేది మనం గుర్తుంచుకోవాలి.

  7. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    06/20/2007 11:23 am

    శ్రీశ్రీ గారి కవిత్వం పై విపులమైన,ఆసక్తికరమైన వ్యాసం.
    “జడలు విచ్చిన సుడులు రెచ్చిన
    కడలి నృత్యం శమిస్తుందా
    నడుము తడబడి సడలి మునుగక
    పడవ తీరం క్రమిస్తుందా”
    నాకు నచ్చిన కొన్ని శ్రీశ్రీ కవితలలో “నిజంగానే” ఒకటి.
    రచయిత వ్యాసంలో చెప్పినట్లు ఈ పంక్తులు భవిష్యత్తుని శంకించినట్లు అనిపించే అవకాశంఉన్నా,నా వ్యక్తిగత అభిప్రాయంలో ఈ కవిత లో నిరాశావాదం కన్నా మానవాళి శ్రేయస్సు కోరే ఒక కవి artistic as well as idealogic impatience for the welfare of mankind కనిపిస్తుంది.

  8. మృతజీవులు – 1 గురించి పొద్దు » Blog Archive » కొ. కు. గారి అనువాద నవల “మృతజీవులు” అభిప్రాయం:

    06/20/2007 2:25 am

    […] ఆ అనువాదం ఈమాట లో నాలుగు భాగాలు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఆ అనువాదాన్ని 25/6/2007 నుంచి పొద్దులో ధారావాహికగా అందించనున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాం. ఈ అనువాదాన్ని పొద్దులో కొనసాగిస్తామని కోరిన వెంటనే అంగీకరించి అనువాద ప్రతిని అందజేసిన రోహిణీప్రసాద్ గారికి, పొద్దులో కొనసాగించడానికి అంగీకరించిన ఈమాట సంపాదకులు కొలిచాల సురేశ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. […]

  9. మన ఛాందసులు గురించి chavakiran అభిప్రాయం:

    06/16/2007 1:54 pm

    మీరు ఆపరేటింగు సిస్టములోని లిపి వాడుతుంతే ఇంగ్లీషు పైన ఎన్నుకోని ప్రయత్నించండి!

    లేదా నోటుపేడులో వ్రాసి ఇక్కడ పేస్టు చేయండి!

  10. జిగిరీ – 6వ భాగం గురించి Kishore అభిప్రాయం:

    06/14/2007 12:03 am

    awesome