తానా నవలల పోటీ – 2025

ఉత్తమ నవలకు 2 లక్షల రూపాయల బహుమతి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం – తానా (TANA) ప్రతి రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే నవలల పోటీని ఈ సంవత్సరం కూడా రెండు లక్షల రూపాయల బహుమతితో కొనసాగించాలని తానా కార్యవర్గం నిర్ణయించింది. 1997 నుంచి మధ్యలో కొంతకాలం విరామంతో తానా నవలల పోటీ నిర్వహిస్తోంది. 2017 నుంచి తానా తిరిగి నిర్వహించిన నవలల పోటీలో బహుమతికి ఎన్నికైన శప్తభూమి, నీల, ఒంటరి, కొండపొలం, మున్నీటి గీతలు, అర్ధనారి నవలలు సాహితీలోకంలో ఒక కదలికను తీసుకొచ్చాయి. శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది. కొండపొలం నవల సినిమాగా రూపొందింది. మున్నీటి గీతలు నవల త్వరలో అరేబియన్‌ కడలి పేరిట వెబ్‌ సిరీస్‌గా రాబోతోంది. తెలుగు నవలారంగంలో కొంతకాలంగా కనబడుతున్న స్తబ్ధతకు ఈ పోటీల వల్ల సడలింపు వచ్చింది. ఈ వాతావరణానికి కొనసాగింపుగా, 2025 జులై 3, 4, 5 తేదీలలో డిట్రాయిట్‌లో జరగనున్న 24వ తానా మహాసభల సందర్భంగా మరొకసారి తానా నవలల పోటీని ప్రకటిస్తోంది. తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడే నవలలను వెలికి తీసుకురావాలనే తానా ప్రయత్నానికి స్పందించి ఈ పోటీలో పాల్గొనవలసిందిగా తెలుగు రచయితలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

నిబంధనలు

  • నవలలు తెలుగు జీవితాన్ని ప్రతిబింబించాలి.
  • ప్రపంచంలోని ఎక్కడివారయినా ఈ పోటీకి నవలలు పంపించవచ్చు.
  • నవలకు పేజీల పరిమితి లేదు.
  • బహుమతికి ఎన్నిక కాని నవలలను తిప్పిపంపడం సాధ్యంకాదు. కాబట్టి జిరాక్స్‌ కాపీలు కూడా పంపవచ్చు.
  • నవలలు తమ స్వంతమని, అనువాదాలు, అనుసరణలు కావని, ఇంతకుముందు ఎక్కడా ప్రచురితం కాలేదని, ఎక్కడికీ ప్రచురణకు పంపలేదని, తానా పోటీ ఫలితాలు వచ్చేవరకూ ఏ ప్రచురణకు, పోటీకి పంపబోమని పేర్కొంటూ హామీపత్రాన్ని జతచేయాలి.
  • నవలలు వీలైనంతవరకూ డిటిపి చేసినవి పంపాలి. చదవడానికి అనువుగా ఉన్న చేతివ్రాత నవలలు మాత్రమే పరిశీలించబడతాయి.
  • డిటిపి చేసిన నవలలను tana.novel.2025@gmail.comకు పంపవచ్చు.
  • నవలల పై రచయిత పేరు, చిరునామా ఉండకూడదు. అవన్నీ కవరింగ్‌ లెటర్‌ పైనే ఉండాలి.
  • నిర్వాహకుల నిర్ణయాలపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. వివాదాలన్నింటినీ అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్ర న్యాయపరిధిలో పరిష్కరించుకోవాలి.
  • బహుమతి పొందిన నవల ఉన్నత ప్రమాణాలను అందుకునేటట్లుగా ఉండాలన్నది తానా ఆకాంక్ష. ఆ ప్రమాణాలను అందుకునే నవలలు పోటీకి రాని పక్షంలో బహుమతి ఇవ్వకపోవడం కానీ లేదా బహుమతి మొత్తాన్ని తగ్గించడం కానీ, ఒకటి కంటే ఎక్కువ నవలల మధ్య పంచడం కానీ తానా నిర్ణయం ప్రకారం జరుగుతుంది.
  • బహుమతికి ఎన్నికైన నవల మొదటి రెండు ముద్రణలను, ఇతర పారితోషికం ఏమీ లేకుండా ప్రచురించే హక్కు తానాకు ఉంటుంది.

రచనలు అందవలసిన ఆఖరు తేది: 15 ఏప్రిల్‌ 2025.


రచనలు పోస్టులో పంపవలసిన చిరునామా:

అక్షర క్రియేటర్స్‌, ఎజి-2,
‘ఎ’ బ్లాక్‌, మాతృశ్రీ అపార్ట్‌మెంట్స్‌,
హైదర్‌గూడ, హైదరాబాద్‌-500029.


ఇతర వివరాలకు సంప్రదించండి:

ఫోన్స్‌: 98493 10560, 99496 56668
Email: tana.novel.2025@gmail.com

నిరంజన్‌ శృంగవరపు
(తానా అధ్యక్షులు)

జంపాల చౌదరి
(కార్యక్రమ నిర్వాహకులు)

చంద్ర కన్నెగంటి
(తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు)