ఆంగ్లంలోని క్లుప్తత తెలుగులో కూడా వస్తే ఇంకా బావుండేది.
కొడవళ్ళ హనుమంతరావు
ధన్యవాదాలు సర్. మెండేజ్ నీటిని ఒక దుఃఖ ప్రతీకగా తన కవిత్వంలో ఎక్కువగా వాడింది. ఆకాశాన్ని, సముద్రాన్ని దుఃఖానికి ప్రతీకలుగా చూపింది. ఇది ఒక నాలుగైదు డ్రాఫ్ట్స్ తర్వాత సంపాదకులతో చర్చల తర్వాత అంగీకరించుకున్నది. అనువాదం మూలంలో ఉన్న క్లుప్తతతో సాధారణంగా బాగుంటుంది. కానీ ఈ ఆంగ్లమూలమే స్పానిష్ కవితకు దగ్గరగాలేదు. అందుకే స్పానిష్ మూల కవితకు దగ్గరగా తేవడం కోసం కొంత వివరణ చేర్చవలసి వచ్చింది.
మీ పరిశీలనకు ధన్యవాదాలు.
నమస్తే.
వ్యభిచారం
గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/04/2026
1:25 am
పల్లిపట్టు గారు ఆన్నది నిజం. అద్భుతమైన కథ యిది. రచన జరిగి చాలా కాలం కావటం వలన ఈకథలోని భాష గ్రాంథికంనుండి వ్యావహారానికి మారుతున్న దశలో ఉంది. చదువటానికి ఇబ్బంది ఏమీ రాదు.
ఇంత మంచికథలో ఉన్న ఏకైకనిర్మాణలోపం ఎడనెడ రసాన్ని రచయిత వాచ్యం చేయటమే. (అంటే ఒక పాత్రకు భయం కలిగితే, అది కథనచాతుర్యం ద్వారా పాఠకులు గ్రహించేలా ఉండాలి కాని మధ్యలో రచయిత ఆపాత్ర నోటివెంట కాని నేరుగా కానీ ఆ భయం అనే మాట చెప్పేయకూడదు. అలా చేయటం సంప్రదాయం కాదు.)
ఉదాహరణకు “వకీలుగారికి కూడా ఆశ్చర్యం కలిగెను.” అని రచయిత చెప్పనవసరం లేదు. ఆ ఆశ్చర్యం సంగతి చదువరులు స్వయంగా గ్రహించవలసినది.
అలాగే “వాని కోసం విధి నిర్ణయించిన దెబ్బ ఆ సమయంలో తగిలెను” అన్నది పాఠకులకు కలుగవలసిన ఊహ. రచయిత స్వయంగా ఆముక్క మనతో అనకూడదు.
ఇత్యాది స్వల్పదోషాలు ఉన్నా వాటిని మనం అంతగా గణించ పనిలేదు.
కథ ముగింపు కూడా బహు సొగసుగా ఉంది. చెడింది సెట్టిగారు మాత్రమే కాదు, వకీలు గారున్నూ అన్నమాట. వేశ్యమాత వారిని దేవిడీమన్నా చేసింది. బలే.
భమిడిపాటి మూర్తి గారి పై వ్యాఖ్య చదివాక, “అందరూ దుర్మార్గులే” అనే మాటలు గుర్తొచ్చి, పై కధ చదవాలనిపించింది. చదివాను కూడా.
భాషా, శైలీ చాలా బావున్నాయి ఈ కధలో. అద్భుతం! నాకు బాగా నచ్చాయి.
ఇక కధ లోకి వొస్తే, నేను కూడా మొదట్లో, “ఈ కధ లొ అన్ని పాత్రలు ప్రతికూలం గానే ఉన్నాయి” అనే అనుకున్నాను, ప్రభుత్వం వారితో సహా. ప్రతికూల పాత్రల మధ్య ఘర్షణలు నాకు చాలా ఇష్టం. ఎవరి కష్టానికీ మన మనసు చలించదు. కానీ, ఆ ‘వేశ్య’ పాత్ర చేత “ఇది శివుని ప్రసాదమే. ఆయనను వంచించను. ఇప్పటికైనా మర్యాదగా బ్రతకడానికి స్వామి సహాయము చేసినాడు. పాడు లంజ బ్రతుకు చాలు. ఈ చెడ్డచోటు నుంచీ అయినంత దూరం దూరం పోవడం మేలు” అని రచయిత అనిపించాక, ఆ పాత్ర, ‘ప్రతికూలం’ అనిపించలేదు నాకు. ఆమె ఉద్దేశం ‘అనుకూలం’ కాబట్టి, ‘ప్రతికూల’ మనుషుల నుంచి డబ్బు దొంగిలించడం,’ ప్రతికూలం’గా అనిపించలేదు నా నీతుల స్థాయికి.
వేరు లో ఉన్న చేవ ఇది అని కొమ్మ దానిని అందమైన పువ్వులుగా మార్చి లోకానికి అందిస్తుంది .వేరుని కాసేపు మనం రచయిత అనుకుంటే ప్రతి కొమ్మ ఒక విమర్శకుడు. కొమ్మ కొత్తగా పువ్వుల్ని సృష్టించలేదు. పువ్వులో ఉన్న ధర్మం వేరుదే. కానీ వేరులో ఉన్న గొప్పతనాన్ని పువ్వులుగా లోకానికి ప్రదర్శించే “నేర్పు” మాత్రం కొమ్మదే. రచనలోని సారాంశాన్ని జీర్ణింపజేసుకుని అక్షర పుష్ప సౌరభాన్ని అందించే విమర్శకుడు రచయిత ఇద్దరూ సమస్కంధులు . ఏల్చూరి వారి వ్యాస ఘట్టాలు పుస్తకంపై పరిమి వారి ఉత్తీర్ణ వ్యాసం చదివిన తర్వాత నాకు తోచిన భావం ఇది. ఇద్దరు నాకంటే బాగా చదువుకున్నవారు. వారిని బేరీజు వేసే శక్తి నాకు లేదు. కానీ అభినందించడానికి వయస్సుతో, జ్ఞానంతో పనేమీ లేదు కదా ! వాల్మీకి బాగా వ్రాసాడని చెప్పటానికి నేను వాల్మీకిని కానక్కర్లేదు. సహృదయత ఉంటే చాలు .ఇద్దరూ ఇలాంటి మంచి రచనా కార్యక్రమాలు చేయాలని శారదా మాతకు సాంజలి బంధకముగా శిరస్సు జోడిస్తున్నాను.స్వస్తి. తాడేపల్లి పతంజలి 03.03.26
ఆకట్టుకున్న కవిత. Concha Méndez కవితలేవీ నేనింతకు ముందు చదవలేదు. పరిచయం చేసినందుకు కోగంటి గారికి కృతజ్ఞతలు. అసలు మూలం (స్పానిష్) కాకపోయినా కనీసం ఆంగ్ల మూలం ప్రస్తావించాల్సింది. వెతికితే:
This must be my last loss,
I repeat each time
grief rips apart the sky
leaving me weeping.
I don’t want to learn
that we are each a sea
where losses come as waves
breaking, always breaking.
— Translated from Spanish by Harriet Truscott in Modern Poetry in Translation (mpT), No. 3 2023, “Fresh and Salt: Focus on Water.”
ఆంగ్లంలోని క్లుప్తత తెలుగులో కూడా వస్తే ఇంకా బావుండేది.
కొడవళ్ళ హనుమంతరావు
[ఆంగ్ల అనువాదానికి లింకు మీరు సూచించిన తరువాత జత చేసాం. — సం.]
వ్యాసకర్త పరిమి శ్రీరామనాథ్ గారికి అభినందనలు. మురళీధరరావు గారి లాంటి ఆచార్యులు అరుదుగా దొరుకుతారు. అంత విశ్లేషణాత్మకంగా పరిశోధన చేసిన వారిలో కందుకూరి వీరేశలింగం గారు, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, పింగళి లక్ష్మీకాంతం గారు లాంటి మహనీయుల కోవలోకి వారు వస్తారు. వారు చేసే పరిశోధనలకు ఏదైనా విశ్వవిద్యాలయం గానీ, ప్రభుత్వం గానీ, తిరుపతి దేవస్థానం వంటి సంస్థలు గానీ అన్ని సదుపాయాలు, ధనసహాయం, తగిన పారితోషికం ఇచ్చి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. “వక్తా శ్రోతాచ దుర్లభః” అన్నట్లు మురళీధరరావు గారిలా పరిశోధన చేసి నిగూఢమైన విషయాలు వెలికి తీసుకు వచ్చే వాళ్ళు అరుదైతే, వాటిని విని (చదివి) అర్థం చేసుకుని అందులో ఉన్న శ్రమను అందరికీ తెలిసేటట్లు చెప్పే రామనాథ్ గారి లాంటి శ్రోతలు కూడా అరుదే.
కళాసాగరం కర్ణాటకం-2 గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:
03/05/2026 6:15 am
మీ శిల్పకళా వర్ణన బాగుంది. చదివే వారికి శక్తినిస్తుంది; ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అభినందనలండీ!
ఇదే చివరిసారి… గురించి Dr. Vijay Koganti గారి అభిప్రాయం:
03/04/2026 11:38 am
ధన్యవాదాలు లలిత గారూ
ఇదే చివరిసారి… గురించి Dr.Vijay Koganti గారి అభిప్రాయం:
03/04/2026 11:36 am
ధన్యవాదాలు సర్. మెండేజ్ నీటిని ఒక దుఃఖ ప్రతీకగా తన కవిత్వంలో ఎక్కువగా వాడింది. ఆకాశాన్ని, సముద్రాన్ని దుఃఖానికి ప్రతీకలుగా చూపింది. ఇది ఒక నాలుగైదు డ్రాఫ్ట్స్ తర్వాత సంపాదకులతో చర్చల తర్వాత అంగీకరించుకున్నది. అనువాదం మూలంలో ఉన్న క్లుప్తతతో సాధారణంగా బాగుంటుంది. కానీ ఈ ఆంగ్లమూలమే స్పానిష్ కవితకు దగ్గరగాలేదు. అందుకే స్పానిష్ మూల కవితకు దగ్గరగా తేవడం కోసం కొంత వివరణ చేర్చవలసి వచ్చింది.
మీ పరిశీలనకు ధన్యవాదాలు.
నమస్తే.
వ్యభిచారం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/04/2026 1:25 am
పల్లిపట్టు గారు ఆన్నది నిజం. అద్భుతమైన కథ యిది. రచన జరిగి చాలా కాలం కావటం వలన ఈకథలోని భాష గ్రాంథికంనుండి వ్యావహారానికి మారుతున్న దశలో ఉంది. చదువటానికి ఇబ్బంది ఏమీ రాదు.
ఇంత మంచికథలో ఉన్న ఏకైకనిర్మాణలోపం ఎడనెడ రసాన్ని రచయిత వాచ్యం చేయటమే. (అంటే ఒక పాత్రకు భయం కలిగితే, అది కథనచాతుర్యం ద్వారా పాఠకులు గ్రహించేలా ఉండాలి కాని మధ్యలో రచయిత ఆపాత్ర నోటివెంట కాని నేరుగా కానీ ఆ భయం అనే మాట చెప్పేయకూడదు. అలా చేయటం సంప్రదాయం కాదు.)
ఉదాహరణకు “వకీలుగారికి కూడా ఆశ్చర్యం కలిగెను.” అని రచయిత చెప్పనవసరం లేదు. ఆ ఆశ్చర్యం సంగతి చదువరులు స్వయంగా గ్రహించవలసినది.
అలాగే “వాని కోసం విధి నిర్ణయించిన దెబ్బ ఆ సమయంలో తగిలెను” అన్నది పాఠకులకు కలుగవలసిన ఊహ. రచయిత స్వయంగా ఆముక్క మనతో అనకూడదు.
ఇత్యాది స్వల్పదోషాలు ఉన్నా వాటిని మనం అంతగా గణించ పనిలేదు.
కథ ముగింపు కూడా బహు సొగసుగా ఉంది. చెడింది సెట్టిగారు మాత్రమే కాదు, వకీలు గారున్నూ అన్నమాట. వేశ్యమాత వారిని దేవిడీమన్నా చేసింది. బలే.
వ్యభిచారం గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:
03/03/2026 11:29 am
భమిడిపాటి మూర్తి గారి పై వ్యాఖ్య చదివాక, “అందరూ దుర్మార్గులే” అనే మాటలు గుర్తొచ్చి, పై కధ చదవాలనిపించింది. చదివాను కూడా.
భాషా, శైలీ చాలా బావున్నాయి ఈ కధలో. అద్భుతం! నాకు బాగా నచ్చాయి.
ఇక కధ లోకి వొస్తే, నేను కూడా మొదట్లో, “ఈ కధ లొ అన్ని పాత్రలు ప్రతికూలం గానే ఉన్నాయి” అనే అనుకున్నాను, ప్రభుత్వం వారితో సహా. ప్రతికూల పాత్రల మధ్య ఘర్షణలు నాకు చాలా ఇష్టం. ఎవరి కష్టానికీ మన మనసు చలించదు. కానీ, ఆ ‘వేశ్య’ పాత్ర చేత “ఇది శివుని ప్రసాదమే. ఆయనను వంచించను. ఇప్పటికైనా మర్యాదగా బ్రతకడానికి స్వామి సహాయము చేసినాడు. పాడు లంజ బ్రతుకు చాలు. ఈ చెడ్డచోటు నుంచీ అయినంత దూరం దూరం పోవడం మేలు” అని రచయిత అనిపించాక, ఆ పాత్ర, ‘ప్రతికూలం’ అనిపించలేదు నాకు. ఆమె ఉద్దేశం ‘అనుకూలం’ కాబట్టి, ‘ప్రతికూల’ మనుషుల నుంచి డబ్బు దొంగిలించడం,’ ప్రతికూలం’గా అనిపించలేదు నా నీతుల స్థాయికి.
కధ నాకు నచ్చింది.
ప్రసాద్
అవతీర్ణపరిమళం గురించి తాడేపల్లి పతంజలి గారి అభిప్రాయం:
03/03/2026 11:24 am
వేరు లో ఉన్న చేవ ఇది అని కొమ్మ దానిని అందమైన పువ్వులుగా మార్చి లోకానికి అందిస్తుంది .వేరుని కాసేపు మనం రచయిత అనుకుంటే ప్రతి కొమ్మ ఒక విమర్శకుడు. కొమ్మ కొత్తగా పువ్వుల్ని సృష్టించలేదు. పువ్వులో ఉన్న ధర్మం వేరుదే. కానీ వేరులో ఉన్న గొప్పతనాన్ని పువ్వులుగా లోకానికి ప్రదర్శించే “నేర్పు” మాత్రం కొమ్మదే. రచనలోని సారాంశాన్ని జీర్ణింపజేసుకుని అక్షర పుష్ప సౌరభాన్ని అందించే విమర్శకుడు రచయిత ఇద్దరూ సమస్కంధులు . ఏల్చూరి వారి వ్యాస ఘట్టాలు పుస్తకంపై పరిమి వారి ఉత్తీర్ణ వ్యాసం చదివిన తర్వాత నాకు తోచిన భావం ఇది. ఇద్దరు నాకంటే బాగా చదువుకున్నవారు. వారిని బేరీజు వేసే శక్తి నాకు లేదు. కానీ అభినందించడానికి వయస్సుతో, జ్ఞానంతో పనేమీ లేదు కదా ! వాల్మీకి బాగా వ్రాసాడని చెప్పటానికి నేను వాల్మీకిని కానక్కర్లేదు. సహృదయత ఉంటే చాలు .ఇద్దరూ ఇలాంటి మంచి రచనా కార్యక్రమాలు చేయాలని శారదా మాతకు సాంజలి బంధకముగా శిరస్సు జోడిస్తున్నాను.స్వస్తి. తాడేపల్లి పతంజలి 03.03.26
కళాసాగరం కర్ణాటకం-2 గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:
03/03/2026 4:03 am
ధన్యవాదాలు శాస్త్రిగారూ.
అక్కడ పుస్తకాలు తగలబడ్డాయి! గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/03/2026 3:21 am
మునుకొని ధనదహనంబన
తన పుస్తక మచ్చువేసి తత్ప్రతుల తుదిన్
ఘనముగ దహియింపక కల
మును తొల్లి దహించు టొప్పు భూమిన్ కవికిన్
ఇదే చివరిసారి… గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
03/02/2026 10:39 pm
ఆకట్టుకున్న కవిత. Concha Méndez కవితలేవీ నేనింతకు ముందు చదవలేదు. పరిచయం చేసినందుకు కోగంటి గారికి కృతజ్ఞతలు. అసలు మూలం (స్పానిష్) కాకపోయినా కనీసం ఆంగ్ల మూలం ప్రస్తావించాల్సింది. వెతికితే:
This must be my last loss,
I repeat each time
grief rips apart the sky
leaving me weeping.
I don’t want to learn
that we are each a sea
where losses come as waves
breaking, always breaking.
— Translated from Spanish by Harriet Truscott in Modern Poetry in Translation (mpT), No. 3 2023, “Fresh and Salt: Focus on Water.”
ఆంగ్లంలోని క్లుప్తత తెలుగులో కూడా వస్తే ఇంకా బావుండేది.
కొడవళ్ళ హనుమంతరావు
[ఆంగ్ల అనువాదానికి లింకు మీరు సూచించిన తరువాత జత చేసాం. — సం.]
అవతీర్ణపరిమళం గురించి M V S RANGANADHAM గారి అభిప్రాయం:
03/02/2026 9:24 pm