Comment navigation


15643

« 1 ... 1558 1559 1560 1561 1562 ... 1565 »

  1. ఈమాట కొత్త వేషం గురించి suresh గారి అభిప్రాయం:

    05/04/2006 6:43 am

    Dear Sir,

    The PDF version has been available for 2 days. Click on the “PDF Version” on the front page or directly go to:

    http://www.eemaata.com/issue43/directory.pdf

    On reading unicode text, did you try to use Internet Explorer to see if you can read the unicode text? For reading it in Firefox, you may have to enable Complex text support for indic scripts. The following site has the instructions:

    http://en.wikipedia.org/wiki/Wikipedia:Enabling_complex_text_support_for_Indic_scripts

    If you can share the info about the operating system on your computer and the browser version, we may be able to help you enable unicode on your machine.

    Thanks,
    Suresh.

  2. ఈమాట కొత్త వేషం గురించి granthi ramaraju గారి అభిప్రాయం:

    05/04/2006 5:39 am

    Sir,

    Eematta new look is wonderful. Unfortunately, we are not able to see unicode telugu script on our browser (firefox). I also couldnot find ‘pdf ” version of May 2006 issue. Could you please provide the “pdf” version so that some of us, the lesser souls, have oppurtunity to enjoy eemaata?

    Regards.
    GRR

  3. వ్యథ – 2004 గురించి Madhav Machavram గారి అభిప్రాయం:

    05/04/2006 5:18 am

    లక్ష్మన్న గారూ, మీ అభిప్రాయాలకు కృతజ్ఞతలు. నా భాషను మరింత సరళంగా మార్చుకోడానికి ప్రయత్నిస్తాను. వ్యాసంలోనే ప్రస్తావించినట్లు ఈ విమర్శ ఈ ఒక్క సంకలానికే పరిమితం కాదు, ఏ ఒక్క రచయితనో అంటున్న మాట కాదు. ఈ సంకలనం కేవలం ఒక ఉత్ప్రేరకం మాత్రమే. ఇది ప్రస్తుత సాహిత్యస్థితి పైన, నా అభిప్రాయాలూ అనుభవాల ఆధారంగా, నా వ్యాఖ్య. ఈ కారణం వల్లనే నేను ఈ సంకలనంలో కథల్ని విశదంగా విస్తృతంగా విమర్శించలేదు. ఈ వ్యాసపు ఉద్దేశ్యం అది కాదు. అందువల్ల సూటిదనం లోపించినట్లు అనిపించి ఉండవచ్చు. ఈ వ్యాసం మొదటి భాగంలో వ్యంగ్యం వాడడానికి రెండవ భాగంలో వాడక పోవడానికీ నిర్దిష్టమైన కారణాలే ఉన్నాయి. వాడకంలో హెచ్చుతగ్గులూ వాటివల్ల కలిగే అపోహలూ నా రచనాలోపాలే కానీ ఎంచుకున్న ధోరణిది కాదు. ఇక శైలి అంటారూ, నా రాతలకు ఒక ప్రత్యేకమైన ధ్వని నివ్వడం కోసం నేను చేస్తున్న ప్రయత్నాలింకా శైశవ దశ లోనే ఉన్నాయి, అందువల్ల ఇప్పుడే పరిణతి కనిపించక పోవచ్చు. క్షంతవ్యుణ్ణి.
    మీకు మరోసారి కృతజ్ఞతలతో…
    మాధవ్ మాచవరం.

  4. ఈమాట కొత్త వేషం గురించి suresh గారి అభిప్రాయం:

    05/04/2006 2:37 am

    ప్రసాద్ గారు: 1) కిరణ్ గారు చెప్పినట్లు మైక్రోసాప్ట్ యూనికోడ్ సపోర్టుచేయటం కోసం తయారుచేసిన యూనిస్క్రైబ్ (Uniscribe) లైబ్రరీ ఈ స్లో కదలికకు కారణం కావచ్చు. మీ పీసీకి అదనంగా ఇంకొంత మెమొరినీ (RAM) జతచేస్తే యూనిస్క్రైబ్ శాంతించి మీ కంటికి కొంత ఊరటను, ఆహ్లాదాన్ని కలిగించవచ్చు. 2) తెలుగులో టైపు చేస్తున్నప్పడు మీకు ఎదురైన సమస్యల గురించి ఇంకొంత వివరంగా నాకు రాస్తే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. -సురేశ్.

  5. గుర్రాలు – గుగ్గిళ్ళు గురించి pAlana గారి అభిప్రాయం:

    05/03/2006 4:27 pm

    వేలూరి మహాశయా! మీ “గుర్రాలు – గుగ్గిళ్ళ” కధ ఓ భాగవత మిళిత బాంబు”. చక్కగా ఇమిడ్చారు “హిరణ్యాక్ష” పాత్రను. ఈ కధలో చక్కటి కొత్తదనం పాత ఇంధనం మెండిగా దట్టింపబడ్డాయి. కధ బుచ్చిదయినా నాజూగ్గా నడుస్తూ చివర్లో “భేషు” అనిపించింది. ఈ రోజుల్లో మరోసారి “పోతన భాగవతా”న్నివిధంగా నవీన తెలుగు కధలో ప్రయోగించడం మెచ్చుకోదగ్గ ప్రయోగం. పోతన భాగవతం మన నవీడి సాహిత్యసంస్కృతిలో కనుమరుగవుతున్న ఈ రోజుల్లో, వేలూరి చిన్న చురక ఈ కాలపు కధాప్రియులకు పెడుతూ, పెద్దాయనకు, ఆయన పెద్దాయనకూ, వారిద్దరూ బ్రతికుండగానే పిండం పెట్టినంతగా పేల్చారీకధాబాంబుని. ఈ గొప్ప తమ ప్రక్రియకు, రచయితగారూ! నా వేయి జోహార్లు.
    కధ మొదట్లో “హిరణ్యాక్ష – హిరణ్యకశిపు”లు జన్మించిన సమయంలో, ప్రకృతి చేసిన గగ్గోల మీ భూషయ్య పుట్టుక సమయంలో కొట్టొచ్చినట్టు సెట్టు కొట్టారు మిత్రమా! “మొనసి కుక్కలు మొరిగెను మోరలెత్తి. పగలు నక్కలు వాపోయె. ఖగములార్తరవము లిచ్చెను. దేవతా ప్రతిమ లొరగె గన్నులను నశ్రుకణములు గ్రంచుకొనగ”. ఏమి జాతకుడండీ యీ మహానుభావుండు! ప్రపంచ జాతకాన్నే మార్చేయబోతున్న బలశాలి – “ధరణి గంపించె” : వాడు పుట్టినప్పుడు కాదు, వాడి పాలనలో. “గుల పర్వతములు వణకె” : పర్వతాలు వణకడం కాదు, పేలి పిండైపోయాయి. “బిడుగులు పుడమి బడియె” : అవి పిడుగులు గావు – మారణహోమాస్త్రాలు. “హోమానలంబుల ధూమంబు లడరెను బ్రతికూల వాయువులు బలసి వీచె దరువు లెల్లెడ విటతాటంబులై కూలె గ్రహ తారకావళి కాంతి మాసె బెరసి మొగుళ్ళు నెత్తురు వాన గురిసెను…..చిమ్మ చీకట్లు పర్వె”. భూషయ్య పుట్టినపుడు నెత్తురు వాన, ఇప్పుడు “రక్తపు పెనుతుఫాను”గా మారింది. తమరు చెప్పిన “పువ్వు పుట్టగానే పరిమళించింది”. కానీ ఇప్పుడు కుళ్ళి దుర్వాసన ప్రసరిస్తోంది. ఏదేమైనా, వేలూరిగారూ! సందర్భానుచితంగా, పోతన త్రుతీయ స్కంధ పద్యాలు, భహు చక్కగా అద్దారిక్కడ. ఎంతటి చమత్కారులు కధను అల్లడంలో తమరు!
    కొన్ని పద్యాలు చక్కగా ఎంపిక చేశారిక్కడ. “బుడబుడ నెత్తురు గ్రక్కుచు, వెడరూపము దాల్చి గ్రుడ్లువెలి కురుక నిలంబడి పండ్లు గీటకొనుచును విడించె బ్రాణములు దైత్యవీరుండు…” గొప్ప మాట చెప్పిరి! “ధనం మూలం మిదం జగత్తు” – “ఆర్యులు చెప్పిరి” అనిరి. “ఆలోచన ప్రేరేపించిన” కధ కూడా ఇది.

  6. ఈమాట కొత్త వేషం గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:

    05/03/2006 2:59 pm

    I guess this slowness is due to our browsers only, not due to this eemaata software.

    Still our browsers scroll unicode text very slowly.

    But Will addming more new lines, will adding less lines for paragraph might solve the scroll slowness issues.

  7. కృష్ణరాయల కవిపోషణ గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    05/03/2006 11:39 am

    హిస్టరీ ఛానెల్ ఎక్కువగా చూడ్డంతోటో, గ్రీకు రోమన్ ఇంగ్లీషు వాళ్ళ నాగరికతలు అప్పుడో ఇప్పుడో చదవడంతోటో వచ్చిన చత్వారం వల్ల నాక్కొన్నింటిని (అక్కరలేనివైనా) పట్టుకోటం మరికొన్ని (ఎంత ముఖ్యమైనవైనా) సరే విడిచిపెట్టటం అలవాటైందనుకుంటాను.

    If such an important age with rich texts is descended on any people, I view it as a time when the soul of a civilization/tribe or country is found. I have no pretentious use to say: ‘we should explore it because it is a matter of a telugu jaati’ or whatever that is. If a cross understanding is possible from kannaDa texts of the time, it will enhance the understanding.

    ఒక ప్రాంతం లేక దేశం తనకు తాను నాగరికతను ఏర్పరుచుకోవడానికి లిటరేచర్ (గ్రంథాలు, కావ్యాలు, మిగతా Texts) ముఖ్య కారణం అనుకుంటాను. ఆ కాలంలో అంతగా వృద్ధి చెందడానికి ఒక్క రాయలే కాక కావలసినంత విమర్శ, అనువైన వాతావరణం (ఆర్ధికంగా, ముఖ్యంగా) ఉండి ఉండాలి. Art and literature flourish in times of leisure. ఒక రకమైన గ్రంథాలు రావడానికి కారణం వాటికున్న ఆదరణ కూడా కారణమై ఉండవచ్చు (ex. emergence of greek plays during the times when plays were popular among public/specific classes).

    These are various angles that should interest the literary historians. I have read very little about that period other than occassional articles about ‘raayalu’ & I guess my push at this time is to get this going into other areas.

    రాయలమీదనుండి, ఆయన భార్యల మీదనుండి, అతని ఒక్కడి కావ్యాదరణ నుండి దృష్ఠి మరల్చి ఒకసారి ఆ కాలపు పన్నుల మీద, పంటల మీద, వర్తకాల మీద, ముఖ్యంగా విద్యా వ్యాసంగాల (వాటిని ప్రభావితం చేసిన వాళ్ళ మీద, అంటే రాయలు, ఆయన దిగ్గజాల మీద కూడా) మీద ఏవైనా పరిశోధనలు చూప గలిగితే, then it becomes a base line understanding, is my humble opinion. I guess I am asking for a shift in primary focus, from ‘the importance of a “direct” connection to specific’ to ‘understanding of the whole’.

    Secondly, The understanding of Forgotten Empire is important to reflect on, before it becomes a Lost Empire, to some extent, I guess I am also trying to say:

    ఇతిహాసపు చీకటి కోణం
    అట్టడుగున పడి కాన్పించని
    కథలన్నీ కావాలిప్పుడు!
    (అవి కాస్త కథలు కాకపోతే మంచిది).

    విప్లవ్

  8. కృష్ణరాయల కవిపోషణ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    05/03/2006 9:51 am

    విప్లవ్, కామేశ్వరరావు గార్ల అభిప్రాయాల పై ఒకటి రెండు మాటలు – 1. రాయవాచకం కాబోయే మంత్రుల కోసం రాసిన ఓ పాఠ్యగ్రంథం. దానికీ వాస్తవ సంఘటనలకీ సంబంధమే లేదు; అలాగే కృష్ణరాయ విజయం పేరు చెప్పినట్లు ఆయన యుద్ధవిజయాల గురించిన కావ్యం; కొన్ని వాస్తవాలున్నా అప్పటికే కృష్ణరాయల mytholozation చాలా దూరం వెళ్లింది. కనుక నిజాల్ని తెలుసుకోవటానికి ఇవి ఆధారాలు కావు. 2. ఆముక్తమాల్యద నిష్పక్షపాతంగా చదివితే అది రాసిన వ్యక్తి ఎలాటివాడో అతని జీవితానుభవాలు ఎలాటివో స్పష్టంగానే తెలుస్తాయి. అది రాయలు కాకుండా మరెవరో రాశారనటం మసి పూసి మారేడు కాయ చెయ్యటమే. చివరగా, ఆకాలాన్ని తెలుగు కవిత్వ చరిత్రలో స్వర్ణయుగం అనటం సమంజసమే – అప్పుడు వచ్చిన అద్భుతకవిత్వం చూడండి – తొలిప్రబంధం మనుచరిత్ర, ప్రబంధాల్లో శిఖరాగ్రస్థాయిని అందుకున్న వసుచరిత్ర; పింగళి సూరన లేఖిని నుంచి కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, తొలి ద్వ్యర్థికావ్యం రాఘవపాండవీయం; అక్షరశ్లేషకి ప్రాధాన్యత నిచ్చిన రాఘవపాండవీయానికి ప్రతిగా అర్థశ్లేషకు పెద్దపీట వేసిన హరిశ్చంద్రనలోపాఖ్యానం; తిమ్మన పారిజాతాపహరణం, ధూర్జటి కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి మహాత్మ్యం; రామకృష్ణుడి పాండురంగమాహాత్మ్యం; రాయల ఆముక్తమాల్యద. తెలుగు పంచకావ్యాలుగా గుర్తించేవాటిలో నాలుగింటిని contribute చేసిన కాలం అది. ఆ తర్వాత నాయక రాజుల కాలంలో ఇంతకన్న ఎక్కువ సంఖ్యలో తెలుగు కావ్యాలు వచ్చినా అవి చాలావరకు ఈ “స్వర్ణయుగం” రచనలు వేసిన బాటలో నడిచినవే.

  9. కృష్ణరాయల కవిపోషణ గురించి kAmESwara rAvu గారి అభిప్రాయం:

    05/03/2006 9:00 am

    1. కృష్ణరాయలు తన కవితాసక్తిని బహిరంగంగా ప్రదర్శించాడా, అతడు కవి పోషకుడా?
    ఈ ప్రశ్నకి “ప్రదర్శించాడు” అని సమాధానం చెప్పుకోడానికి పెద్ద సందేహపడక్కరలేదు. పెద్దన, తిమ్మన్న కావ్యాలే కాకుండా, రాయవాచకం, కృష్ణరాయవిజయం కూడా ఇందుకు సాక్ష్యాలే. అయితే కవులపేర ఏమైనా భూములిచ్చినట్టుగా శాసనాలు ఉన్నాయా అంటే అనుమానమే. నారాయణరావుగారు ఉదహరించిన ఆముక్తమాల్యదలోని పద్యం అతని కవి పోషకత్వాన్ని అనుమానించడానికి అడ్డురాదు. అందులో ప్రస్తావించినది కవులగూర్చి కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. కవులని భిక్షువులుగా జటాధారులుగా ప్రస్తావించడం సబబుగాలేదు. అలా అని రామారావుగారన్న బౌద్ధులు, శైవులు, జైనులు అవడానికి కూడా అవకాశం లేదని నా ఉద్దేశం. వైష్ణవుడైన కృష్ణదేవరాయలు వాళ్ళని డబ్బులిచ్చి మార్చెస్తే, ధర్మగ్లాని అవుతుందని ఎందుకంటాడు? పైగా వాళ్ళమీద భక్తి చూపించమని ఎందుకంటాడు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి బౌద్ధ భిక్షువులో, శైవులో కాదు. వేదం వారి వ్యాఖ్య ప్రకారం, వాళ్ళు సన్యాసులు. “అక్షరం” అంటే (నాశనం కాని, ఆధ్యాత్మిక)విద్య.
    2. కృష్ణరాయలు స్వయంగా కవా?
    ఇది చాలా controversial ప్రశ్న. దీని గురించి చాలామంది పెద్దలు వాదులాడుకున్నారు. ఆముక్తమాల్యద పెద్దన్న కృతమని చాలా రుజువులే చూపించారు. వీటన్నిటిని వేదం వేంకటరాయశాస్త్రిగారు తన ఆముక్తమాల్యదకి రాసిన సంజీవనీ వ్యాఖ్య పీఠికలో చర్చించారు. తెనాలి రామకృష్ణునిదిగా చెప్పబడుతున్న చాటువు, కోకట గ్రామ కైఫీయతు (ఇందులో ఈ గ్రామాన్ని రాయలు పెద్దనకి దానం చేసినట్టు ఉందిట), అప్పకవి పద్యమూ, గుడుపాటి వేంకటకవిదిగా చెప్పబడుతున్న ఆముక్తమాల్యద టీకా… ఇవన్నీ ఆముక్తమాల్యద కర్త అల్లసాని పెద్దనగా పేర్కొన్నాయి. అంతేకాక, ఆముక్తమాల్యదలో కృష్ణరాయల కృతమని పేర్కొన బడ్డ కొన్ని సంస్కృత కావ్యాలు, “ప్రపంచదర్పణమ్” అనే పుస్తకంలో అల్లసాని పెద్దనవిగా పేర్కొనడ్డాయి. అంతేకాక రాయవాచకమూ, కృష్ణరాయ విజయమూ ఆముక్తమాల్యదని పేర్కొనకపోవడం మరింత అనుమానాన్ని కలిగిస్తుంది.
    3. అష్టదిగ్గజాలు అసలు ఉన్నారా లేరా ?
    దీనికి సమాధానం సబహుశా లేరనే చెప్పాలి. ఉన్నారని బలమైన సాక్ష్యం ఏదీ లేదుకాబట్టి. అష్టదిగ్గజాలుగా చెప్పబడుతున్న కవుల కావ్యాలలో కాని, రాయవాచకం, కృష్ణరాయవిజయం వంటి కావ్యాలలో కాని వీరి ప్రస్తావన లేదు. ఉన్న ఒకే ఒక చిన్న ఆధారం, కడప మండలంలోని తిప్పలూరు గ్రామ శిలాశాసనంలో అష్టదిగ్గజాల ప్రస్తావన.

    విప్లవ్ గారి సందేహానికి సమాధానం, చాలా ప్రబంధాలు రాయలకాలంలోవిగా నిర్ణయించబట్టే ఆ కాలాన్ని ప్రబంధయుగం అన్నారు. అయితే వాటికీ కృష్ణరాయల కవిపోషకత్వానికీ ఎంతవరకూ direct సంబంధమున్నదన్నదే ప్రశ్న.

  10. ఈమాట కొత్త వేషం గురించి JUBV Prasad గారి అభిప్రాయం:

    05/03/2006 6:49 am

    సురేష్ గారూ,
    ఈ “ఈమాట” పత్రిక కొత్త గెటప్ చాలా బాగుంది. మీరు చాలా శ్రమ పడి వుంటారు ఈ పనికి. నాకయితే చాలా నచ్చింది. అయితే రెండు విషయాలు: 1. కధ గానీ, వ్యాసం గానీ scroll చేస్తుంటే, చాలా slow గా వుంది కదలిక. 2. ఇక్కడ అభిప్రాయం రాస్తున్నప్పుడు, ఒక పదం type చేసి, దాన్ని correct చెయ్యడానికి ప్రయత్నిస్తే, అది వేరేగా చూపిస్తోంది. ఈ రెండూ చిన్న విషయాలే అనుకోండీ. మొత్తానికి బాగుంది.
    ప్రసాద్

« 1 ... 1558 1559 1560 1561 1562 ... 1565 »