పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. ఆ రోజులు గురించి C.S.Rao అభిప్రాయం:

    07/15/2007 5:57 am

    రఘోత్తమరావు గారూ,
    పాలలో వెన్న కలిసి ఉన్నట్ట్లు తెలుగు లో సంస్కృతం ఉండనే ఉంటుంది.
    మీ మంచి పేరు లో ఉన్నదానికంటే ఎక్కువ సంస్కృతం నా కవిత లో ఉన్నదంటారా ?
    ఒక పదం అవసరమా ,అనవసరమా అన్నది మీ లాంటి రసజ్ఞులైన (ఇలా సంస్కృత పదాలు నిత్యం వాడుతూనే ఉంటాము) పాఠకుల అనుభూతికి సంబంధించిన విషయం.
    ఇక కొత్తదనమంటారా,ఈ విషయమై వచన కవితను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చాలా గొప్పకవి తిలక్ గారు అన్నట్ట్లు
    “అసలు కవిత లో నే నవత కూడా ఉంది”.
    కవిత సాధించవలసింది అందం,అందించవలసింది ఆనందం.అవి సాధించలేనపుడు అది కవితే కాదు.ఇక అప్పుడు కొత్తదనం అవసరమే ఉండదు.
    “అమృతం కురిసిన రాత్రి” లో అంటారు తిలక్ గారు,
    “చలజ్జీవన దైనందిన కోలాహల పాంసుప రాగం లో
    తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు”.
    సామాన్య ప్రజానీకం మాట్లాడే భాష రచనలో కూడా వాడాలని అవిశ్రాంతం గా పోరాడిన చలం గారు
    “రవి కిరణాంగుళీ నఖక్షతాలతో శ్యామలాకాశం కందింది”
    అని వ్రాస్తే ,గొప్ప రచయిత,విమర్శకుడు,మార్క్సిస్ట్ మేధావి ,సరళ వ్యావహారిక భాషాభిమాని రాచమల్లు రామచంద్రారెడ్డి గారు పులకించిపోయారు.

    వీరి కవితా పంక్తులలో ఏ సంస్కృత పదాన్ని తీసి ,ఏ తెలుగు పదం అతికి వారు సాధించిన సౌందర్యాన్ని పరిరక్షించుకోగలం?

  2. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి Aanamdu అభిప్రాయం:

    07/14/2007 2:31 pm

    ఎంత బాగా చెప్పారండీ. తిక్కన మహాకవి గురించి మరికొంత చెప్పి మా అజ్ఞానాన్ని తొలగించ ప్రార్థన.

    ఆనందు

  3. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/14/2007 8:35 am

    ప్రస్తుతం ఇంగ్లీషులో వెలువడుతున్న సమాచారాన్ని (వార్తలు, సైన్సు వగైరా) ఎంత త్వరగా, ఎంత చక్కగా తెలుగులో రాసి పాఠకులకు అందించగలిగితే తెలుగు భాష పటిమా, ప్రాముఖ్యతా అంతగా పెరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం తర్జుమా అయినా సరే. పదేళ్ళ కిందట బొంబాయిలో National Centre for Science Communicators మొదలుపెట్టినప్పుడు ఈ విషయంలో కేరళ అందరికన్నా ముందున్నదని తెలిసింది.

    ప్రస్తుతగా అమెరికా తదితర దేశాల్లో తెలుగువాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది కనక తెలుగులో రాసేవారు కూడా తగిన ప్రయత్నాలు చెయ్యాలి. ఈ విషయంలో కథల కన్నా వివిధ అంశాలను గురించిన వ్యాసాలూ, వార్తాకథనాలూ తెలుగు యొక్క పరిధిని ఎక్కువగా విస్తృతం చెయ్యగలవు. తగిన పరిణామాలు కలుగుతూ ఉన్నట్టయితే తెలుగు జాతీయంగానో, అంతర్జాతీయంగానో కొనసాగగలుగుతుంది.

    ఇది కాక ఇంట్లో పిల్లల చేత తెలుగులో మాట్లాడించడం మొదలైన ప్రయత్నాలన్నీ వ్యక్తిగతస్థాయిలో జరగాలి. తెలుగును టీనేజర్లకు సులభపరిచయం చెయ్యడానికి lec dems, power point presentations మొదలైనవి స్థానికంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

  4. ఆ రోజులు గురించి Raghothama Rao C అభిప్రాయం:

    07/14/2007 12:38 am

    అనవసరమైన సంస్కృత పదాలను వాడారు. కవితలో కొత్తదనం పై కూడా శ్రద్ధ చూపి ఉండాల్సింది.

  5. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి Raghothama Rao C అభిప్రాయం:

    07/14/2007 12:32 am

    పువ్వుల గురించి ఇంకెవ్వరూ రాయకూడదని పంతం కాబోలు కరుణశ్రీ గారికి, మరెవ్వరు వ్రాసినా మెచ్చుకోనివ్వడంలేదు 🙂

  6. చిలక – గోరింక గురించి Raghothama Rao C అభిప్రాయం:

    07/14/2007 12:24 am

    ఇంట్లో పని అనుత్పాదక శ్రమ అన్నది ఎవరి నిర్వచనమైనా వ్యక్తిగతంగా నాకు నచ్చలేదు. ఇంట్లో వాళ్ళ మెచ్చుకోలు తరువాతే ప్రపంచం మెచ్చుకోలు. మనం చేసిన గొప్పపనికి మొదట సంతోషం ఇంటిదే. అలాగే చెడుపనికి కూడా విమర్శ వచ్చేది కూడా ఇంటినుండే. బైటి ఉత్పాదకతకు మూలాధారం ఇల్లు. ఇల్లు, సంసారం, పిల్లలు అని లేకపోతే ఎవరికోసం టీవీలు, వాషింగ్ మిషీనులు? ఈ యంత్రాల ఉత్పత్తి లేనప్పుడు కూడా ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఉండేవారు కాదా ! అలాంటి ఇంటిని, ఇంటిపనులను ప్రాఫిటబుల్ నాన్ ప్రాఫిటబుల్ అని విడదీయడం సబబు కాదు.

    మగ, ఆడ తేడాల కంటే కూడా సమానత్వం పై లేనిపోని పట్టింపులు మనసుల్ని ఇరుకు చేస్తున్నాయి. కేవలం వార్తాపత్రికల శీర్షికల్లోను, పెద్ద కంపెనీల మెట్లు ఎక్కితేనే స్త్రీ గౌరవం నిలబడినట్టు భావించడం సరికాదు. ఉద్యోగాలు చేయకపోయినా వ్యక్తి గౌరవాన్ని నిలుపుకున్న స్త్రీలను నేను ఎరుగుదును.

    కథలో రచయిత గారు ఏపక్షాన్నీ పసమర్ధించకుండా ప్రధానపాత్రల్ని వాటి వాటి వ్యక్తిగత అభిప్రాయాలకు కట్టుబడినవారిగా చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది. కథలో మిరుమిట్లు గొలిపే పంక్తులు, నివ్వెరపోనిచ్చే మలుపులూ లేకపోయినా చెప్పదల్చుకున్న విషయాన్ని రచయిత పాఠకులకు చేరవేసారనడంలో సందేహం లేదు. అందుకు సాక్ష్యం, జరుగుతున్న చర్చలే.

    ఇంతకంటే మంచి కథను కామేశ్వర రావు గారినుంచి ఆశిస్తూ…..

    రఘోత్తమరావు

  7. నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి నాగరాజా అభిప్రాయం:

    07/13/2007 9:16 pm

    ఇంగ్లీషు పెరుగుతుంది, తెలుగు తరుగుతుంది అనే భావన పాత చింతకాయ పచ్చడి. దాన్నే మీరు సాగదీసారు, కొత్తదనమేముంది? (ట్రాయ్, మిచిగాన్) మా ఊరికి రండి ఎక్కడపడితే అక్కడ మీకు తెలుగు వినపడుతుంది, ఉగాదికి తెలుగులో పత్రికలు ప్రింటు చేసి అందరికి పంచుతారు!

    మనం చేసే ప్రతి చర్య, పలికే ప్రతి వాక్యం ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి, అప్పుడు నిజంగానే అంతర్జాతీయ భాష అవుతుంది. ఎంతో కాలంగా నానా రకాల దెబ్బలకు తట్టుకొని ఇప్పుడిప్పుడే పైకొస్తున్న భాషను గురించి మనం జాగ్రత్తగా, గౌరవంగా మాట్లాడాలి. రాజకీయ నాయకులు ఏమైనా అనవచ్చు…

    ఇంగ్లీషు నేర్పుతూనే, తెలుగులో కూడా సమానంగా శ్రద్ధ పెట్టాలి అని మీరు చెప్పి అందరిని మెప్పిస్తే ఎంత బాగుండేది?

  8. Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి Dr T. Ravichandran అభిప్రాయం:

    07/13/2007 5:07 am

    My (limited) knowledge of Dr Rajeshwar is one that of an established critic and renowned scholar of Western Literature. It was a pleasant surprise to read through this article and learn that Dr Rajeshwar has good prowess in analyzing and interpreting (Baasha) Telegu Literature. His approach is positively deconstructive. First, he applies Adler’s theory of inferiority complex adequately to scrutinize the character of Subbaiah, comes out with new insights, and thus helps the reader to comprehend the character better. But later, he seeks to prove that even Adler’s theory is limited in dealing with the complex nature of Subbaiah and concludes that the aesthetic value of the novel emerges better when it is analysed in its own terms rather than giving undue importance to Adler’s theory. Quite an interesting article, indeed!

  9. అతిథి వ్యయో భవ గురించి Sindhu Chetty అభిప్రాయం:

    07/12/2007 10:06 am

    I liked the story. These experiences are common. I thought may be our movie stars have become little more sophisticated in past few years, apparently not. I have personally experienced the incidents that happened in the story. you do not host these people because you want socialize with actors, sometimes you host them out of obligation or get manipulated into helping others. I know these movie people who come here expect you to do things, for them, give gifts, I do not know why, but it is upto us to say a firm no.
    There was no need to wildly criticize the author of the story for god’s sake. Such criticism sounds to me like a personal grudge againist the author
    I also know people like Sundaram who loves mike in their hands as well as being on the stage all the time.

    Kudos to the author !

    Sindhu

  10. Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి Gabriel vinodkumar dolla అభిప్రాయం:

    07/12/2007 5:39 am

    This article is not only informative but also educating as it deals with one of the personalities traits i.e. inferiority complex with which many people suffer. Dr. Rajeshwar has done an excellent job by dealing with such an idea that makes all the readers think about themselves and he has done justice to the well reputed work of Ra.vi. Sastri’
    Alpajeevi with his intellectuality and he wisely connected the Indian belief with the western psychoanalysis.Finally, I should say that Dr. rajeshwar has brought global glamour to the local Telugu Fioction.