బహుభాషా పాండిత్యంతో పాటు సాహిత్యం, తత్వశాస్త్రాలలో ప్రావీణ్యం ఉన్న సూరపరాజు గారి రచనలు చదవదగ్గవి. హైడెగర్ అంత సులువుగా బోధపడడు; అందుకు కొంతవరకు అతను వాడే క్లిష్టమైన పరిభాష కారణం. తెలుగులో హైడెగర్ మీద నాన్-అకడమిక్ రచనలు అరుదు; నాకు తెలిసి, వాడ్రేవు “సత్యాన్వేషణ” లోని “Letter on Humanism” సంక్షిప్త అనువాదమొక్కటే.
కేవలం కొన్ని ఉల్లేఖనలతో మాత్రమే హైడెగర్ దర్శనాన్ని గ్రహించలేము; వచ్చే వ్యాసాల కోసం ఎదురుచూడాలి.
ప్రస్తుత వ్యాసంలోని కాలరేఖలకి కొన్ని మార్పులు చేర్పులు:
1919: కాథలిక్ మతాన్ని వదిలింది 1913లో కాదు, 1919లో మొదటి సంతానం కలిగిన తర్వాతే.
1923: బ్లాక్ ఫారెస్ట్ (Black Forest) కొండల్లో కుటీర (Todtnauberg cabin) నివాసం. అతని మాగ్నమ్ ఓపస్, బీయింగ్ అండ్ టైమ్ (Being and Time), రచన ఇక్కడే.
1931-32: నాజీ పార్టీ భావజాలం వైపు మొగ్గు.
1933 ఏప్రిల్: ఫ్రైబర్గ్ విశ్వవిద్యాలయానికి రెక్టర్‌గా నియామకం. ఆ వెంటనే మే నెలలో నాజీ పార్టీ సభ్యత్వం. అయితే, సంవత్సరం తిరక్కుండానే నాజీ పార్టీ అనుయాయులతో, తోటి ఆచార్యులతో విభేదాలు రావడంతో రెక్టర్ పదవికి రాజీనామా. కానీ ప్రొఫెసర్‌గా కొనసాగింపు.
1945: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రెంచ్ సైన్యం ఆక్రమణ, ‘Denazification’ కమిటీ విచారణ. ఫలితంగా 1949 వరకు బోధన నుండి బహిష్కరణ.
హైడెగర్ బహిరంగంగా ఎప్పుడూ తన నాజీ అనుకూలత గురించి మాట్లాడలేదు. యూదుల మారణహోమం (Holocaust) గురించి ఒక్క మాటైనా మాట్లాడి సంజాయిషీ ఇస్తాడని కొందరు ఆశించారు. కానీ అతను మౌనం వహించాడు. బహుశా దానికి తను బాధ్యుడిని కానని.
ఈ సందర్భంలో ఒక సాహిత్య ప్రస్తావన. 1967లో ప్రసిద్ధ యూదు కవి Paul Celan హైడెగర్ కుటీరాన్ని సందర్శించాడు. (ఇతని ప్రఖ్యాత కవిత ‘Todesfuge’ కి తమ్మినేని అనువాదం “మృత్యుమేళ“). ఆ పర్యటన తర్వాత, హైడెగర్ నోట ఓ మాట (“for a thinker’s word to come, in the heart”) కోసం ఎదురుచూడటంపై Celan రాసిన కవిత ‘Todtnauberg‘.
1966లో డెర్ స్పీగెల్ (Der Spiegel) పత్రికకు తను చనిపోయిన తర్వాత ప్రచురించాలనే నిబంధనపై ఇచ్చిన యింటర్వ్యూ “Only a God Can Save Us“. ఆధునిక టెక్నాలజీ మూలంగా మానవుడి జీవితం సహజత్వాన్ని కోల్పోతోందని వగచాడు:
స్పీగెల్: “కానీ ఒకరు చాలా అమాయకంగా ఇలా ప్రశ్నించవచ్చు. అంతా సజావుగానే నడుస్తోంది కదా. విద్యుత్ కేంద్రాలు పెరుగుతున్నాయి, ఉత్పత్తి పెరుగుతోంది. సాంకేతికంగా ముందంజలో ఉన్న దేశాల్లో ప్రజలు సుఖంగా ఉన్నారు. మనం సుసంపన్నమైన కాలంలో జీవిస్తున్నాం. మరి మనకు లోపించిందేమిటి?”
హైడెగర్: “అవును, అంతా సజావుగా నడుస్తోంది. ఆ సజావుగా నడవడమే ప్రతిదాన్నీ మరింత యాంత్రికత వైపు వేగంగా నెడుతోంది. ఈ సాంకేతికత మానవుడిని క్రమంగా తన నేల నుండి, మూలాల నుండి వేరుచేస్తోంది. కొద్దిరోజుల క్రితం చంద్రమండలం నుండి తీసిన భూమి ఫోటోలను చూసి దిగ్భ్రాంతుడనయ్యాను. మనిషిని తన ఉనికి నుండి వేరు చేయడానికి అణుబాంబులు అక్కర్లేదు, ఆ పరాయీకరణ ఇప్పటికే వచ్చేసింది. మన సంబంధాలన్నీ కేవలం సాంకేతిక సంబంధాలుగా మారిపోయాయి.”
అది 1960ల నాటి మాట. నేటి స్మార్ట్‌ఫోన్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లని చూసి ఏమనేవాడో ఊహించుకోవచ్చు.
చిన్నప్పుడు వడ్డెర చండీదాస్ హిమజ్వాల చదివాను. ఇప్పుడు గుర్తులేదు కానీ వడ్లమాని మణి కథ ఇదివరకు ఒకటి చదివి చెప్పాను. ఆ లెవెల్లో వుందని. ఇదీ అంతే. సామాన్య పాఠకుడు అర్ధం చేసుకోవటం కష్టం. నేను రెండోసారి చదివినప్పుడే కొంచెం అర్ధం అయింది. మణీ అప్పుడప్పుడూ ఇలాంటి ఝలక్ ఇచ్చినా నాలాంటి మామూలు పాఠకులను కూడా గుర్తుంచుకోమ్మా కొంచెం మాకు కథ చదవడమంటే జీర్ణం కావటం కూడా.
ది అన్‌సీన్
గురించి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి అభిప్రాయం:
06/16/2026
1:19 pm
ఈ కథ ప్రారంభం చదువుతూనే ఉలిక్కిపడ్డాను. తేలిగ్గా పైపైన చదువుకుంటూ వెళ్ళిపోయే కథ కాదని వెంటనే అర్థమైపోయింది. అందుకే కథను మరింత ఏకాగ్రతతో చదవడం మొదలుపెట్టాను.
పగలు మన దృష్టికి రాని చాలా విషయాలు రాత్రి కాగానే కలత పెడుతుంటాయి. మనకి అర్థం కాని విషయాన్ని “ట” లతో చెప్పడం మానవ సహజం. అలాగే పగలు చెయ్యలేని చాలా పనులని ముసుగు తొలగించుకుని రాత్రి చేస్తామన్నది కూడా నిజం.
ఎవరో అదృశ్యవ్యక్తి రాత్రి జరిగే గొడవలన్నీ ఆపేస్తున్నాడంటే అందరికీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం కలగడం సహజం. కానీ మనలో కూడా అలా ప్రవర్తించే మనసుంటుందని మనకే తెలియని నిజం.
ఈ కథంతా ఆ అదృశ్యవ్యక్తి ఎవరోననే సందేహంతోనే నడుస్తుంది.
సార్త్రే వాక్యం, “మనం చేసిన చర్యలే మనం.” అన్న మాట ఈ ప్రశ్నకి సమాధానం చెపుతుంది.
మన చేతలే మన మనసుకు సాక్షి అన్న విషయం స్పష్టంగా ఈ కథలో తెలుస్తుంది. దానిని చెప్పడంలో రచయిత్రి విభిన్నమైన శైలిని యెంచుకున్నారు.
వర్ణనలలో వడ్లమాని మణి ఒక దృశ్యాన్నే ఆవిష్కరించారు.
ఏదైనా కథ పూర్తయాక, ఆ కథను ఎదురుగా వుంచుకుని, ఆ కథలోని లోతును తరిచి చూసినప్పుడే అందులోని నిగూడార్థం బయట పడుతుంది. ఈ కథ అలాంటిదే.
ఈ కథలో ప్రముఖ రచయిత్రి వడ్లమాని మణి చేసిన ప్రయోగం అభినందించదగ్గది.
రాత్రి యొక్క అంతుచిక్కని స్వభావాన్ని పట్టుకోగల రచయితలు అరుదు. దోస్తోవిస్కీ, గురుదత్ లాంటి చాలా తక్కువమంది రాత్రి యొక్క ఆత్మను పట్టుకోగలిగారు. తెలుగులో రాత్రి యొక్క అంతుచిక్కనితనాన్ని పట్టుకోగలిగిన సామర్థ్యంగల కొద్దిమందిలో, లేదా ఓకే ఒక రచయిత్రి మణి గారు.
కథ ఒక అనుభవం. అయితే కథను ఒక నైరూప్య అనుభవంగా మలచడం అందరికీ సాధ్యం కాదు. ఒక లీనియర్ కథనానికి అలవాటు పడిన పాఠకులకు అనుభవమే కథ అని చెబితే సందేహిస్తారు. ఈ కథ కథల యొక్క చట్రాన్ని పగుల కొట్టి బయటకు వచ్చింది. ఒక గొప్ప అనుభవాన్ని సృష్టించడానికి కొత్త తరహా వ్యక్తీకరణ అవసరం. నియామాల ఉల్లంఘన అవసరం. అవి ఈ కథలో పుష్కలంగా ఉన్నాయి.
అలానే అందరూ నైరూప్య అనుభవాన్ని తీసుకునే పరిణతతో ఉండరు. అయినా పాఠకుల కోసం రచయిత కథలో గాఢతను తగ్గించాల్సిన అవసరం లేదు. పాఠకులే కథ యొక్క స్థాయిని శ్రద్ధ పెట్టి అందుకోవాలి. అటువంటి సవాలును విసిరే కథలు విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొత్తదారిలో వెళ్ళే వారికి ముళ్ళు గుచ్చుకోవడం సహజం. భరిస్తూ ముందుకుపోవాలి.
ఇది కథా? ఏమీ అర్ధమే కాలేదు నాకు! ప్రయోగమనో, వినూత్నమనో అంటే అభ్యంతరం ఏమీ లేదు గానీ, కథ అంటేనే ఏడుపొస్తుంది, ఏమీ అర్ధమే కాలేదని! ఇదంతా చదివాక, ఎవరైనా నాలుగు ముక్కల్లో కథ చెప్పమంటే, మళ్ళీ ఏడుపొస్తుంది. నచ్చడం, నచ్చకపోవడం వేరే సంగతి. అర్ధం అవాలి కదా మొదట, కథ ఏమిటో? పైన ఎవరెవరో వ్యాఖ్యానాలు చేశారు కదా, ఏదో వుంటుందని చదివాను — లేడిలాగా గెంతులేసుకుంటూ సాగిపోయింది నా చదువు. అర్ధం మాత్రం కాలేదు.
మణి వడ్లమాని గారి కథలు మామూలుగా అయితే బావుంటాయి. కానీ, ఇది ఏ రకంగానూ చదివించలేదు. ప్రయోగాలను ప్రోత్సహించాల్సిందే, కానీ “ఏ మాత్రం ఎడిటింగ్ లేకుండా, రచయిత్రితో సలహాలు, సంప్రదింపులు జరపకుండా ఈ కథని అలాగే ప్రచురించి ఉంటారా?” అనిపించింది. వాక్యనిర్మాణంలో ఏ మాత్రం స్పష్టత లేకపోవటం – ఆవిడ కథలా ఎంత మాత్రం లేదు. అన్ని కథలూ గొప్ప కథలవ్వక్కర్లేదు. కొన్ని ప్రయోగాలకి మటుకూ feedback ప్రక్రియ చాలా బలాన్నిస్తుంది. ఈ కథ ప్రచురించి ఆవిడని అవమానించారనే అనిపించింది
నడిచే చెలమ
గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:
06/12/2026
8:42 am
“నడిచే చెలమ” కథ ఆర్ద్రంగా ఉంది. కానీ నా మట్టిబుర్రకు అర్థమయ్యీ కానట్టు తోచింది. వడగాడ్పుల నిస్సార జీవితాలలో అనుబంధాల చల్లటి చెలమలు సృష్టించుకోవడం ప్రయత్నిస్తే ఎవరికైనా సాధ్యమే… అని రచయిత చెప్పదలచుకున్నారా? కథా ఉద్దేశం ఏదైనా, ఎందుకో నాకు కూడా కన్నీళ్లు వచ్చి చావవు… గుండెల్లో అలా బాధ వుండిపోతుంది తప్ప. నాలాంటి తిరువేంగడాన్ని సృష్టించడానికి ఎంతో సూక్ష్మ పరిశీలన కావాలి. మూల రచయిత ఎస్.రామకృష్ణన్ కు, చక్కగా అనువాదం చేసి అందించిన ఆవినేని భాస్కర్ గారికి ధన్యవాదాలు.
జవాబు ఇద్దామనుకుంటూనే తాత్సారం చేశాను. నా విమర్శకి మీ సమాధానం సహేతుకంగా ఉంది. రాహుల్ సాంకృత్యాయన్ కవి కాదు. చిన్నప్పుడు కవిత్వం రాయడానికి ప్రయత్నించి, అది “చాలా ప్రమాదకరమైన విషయమని, ఛందస్సులో ఒక మాత్ర తప్పినా చచ్చిపోతారని కొందరి ద్వారా తెలుసుకొని,” మానుకున్నాడు.
బండ్లపల్లె ఓబులరెడ్డి గారి “మహోన్నత మానవుడు రాహుల్ సాంకృత్యాయన్” (జయంతి పబ్లికేషన్స్, 1963; విశాలాంధ్ర, 2011) పై కొడవటిగంటి సమీక్ష (1963):
“జిజ్ఞాస – అందులోనూ అనంతమైన జిజ్ఞాస ఉండటం ఒక సుకృతం. ఆ జిజ్ఞాసకొద్దీ, సకల సౌఖ్యాలూ విడనాడి, ఎలాంటి కష్టనష్టాలనయినా లెక్కచేయక, చివరకు సన్యాసి జీవితానికి కూడా వెనుదీయక, దేశదేశాలూ తిరిగి చూడాలనేది ఒక దీక్షగా పెట్టుకోగలగటం ఒక విశేషం. తాను తెలుసుకున్న అపూర్వ విషయాలను ఎప్పటికప్పుడు గ్రంథస్థం చేసి తోటి మానవులకు అందజేయాలనే నిస్వార్థ సంకల్పం ఒక వ్యసనం అనిపించేటంతగా ఉండటం మరొక విశేషం. విజ్ఞాన సముపార్జనతో పాటు తానూ క్రమపరిణామం చెందుతూ, చైతన్య స్థాయిలో ఎప్పటికప్పుడు పైమెట్టు అందుకుంటూ రాగలగటం మరొక గొప్ప లక్షణం.
వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఆ వ్యక్తి విశిష్ట వ్యక్తి అనిపించుకుంటాడు. ఈ విశేష లక్షణాలన్నీ కలిసి ఒకే వ్యక్తిలో గూడు కట్టుకుంటే – అటువంటి వారు ఉన్నారా అనుకుంటాము. అలాంటి వారు నూటికి కోటికి ఒకరుంటారు. అచ్చంగా అటువంటి మహోన్నత మానవుడే – మహాపండిత, త్రిపిటకాచార్య రాహుల్ సాంకృత్యాయన్.
వీరి జీవిత చరిత్ర ఒక వ్యక్తి జీవిత చరిత్రగా కనబడదు. అది మన దేశములోని అభ్యుదయ కాముక వర్గాల పరిణామ చరిత్రగానే గోచరిస్తుంది. వీరి జీవిత చరిత్ర మన దేశంలోని వివిధ, విభిన్న ప్రాంతాల ప్రజల స్థితిగతులకు, ఆచార వ్యవహారాలకు ఒక ప్రతిబింబం వంటిది. అంతేకాదు, ఆయన జీవిత కథ చదువరులను హిమాలయ శిఖరాలు మొదలుకొని కన్యాకుమారి వరకు, తూర్పుతీరం మొదలుకొని పడమటి కనుమలు వరకు నడిపిస్తుంది. ఆయా ప్రాంతాల జీవన విశేషాలనూ ఆచార వ్యవహారాలనూ కళ్ళముందు ఉంచుతుంది. అంతేకాదు, సింహళం, టిబెట్, జపాన్, సోవియట్, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్సూ, ఇంగ్లాండు దేశాలకూ తీసుకువెళ్తుంది. అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలనూ, వారి మనోభావాలనూ మనకి తెలియజేస్తుంది. ఒకసారి కాదు, ఎన్నోసార్లు హిమాలయాల మీదుగా ప్రయాణం చేయిస్తుంది. టిబెట్ లోని ప్రాచీన బౌద్ధ సంఘారామాలకు తీసుకువెళ్తుంది.”
అస్తిత్వవాద సాహిత్యం: 6అ. హైడెగర్ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
06/17/2026 7:26 pm

కొడవళ్ళ హనుమంతరావు
ది అన్‌సీన్ గురించి పి.యస్.యమ్. లక్ష్మి అభిప్రాయం:
06/17/2026 4:42 am
చిన్నప్పుడు వడ్డెర చండీదాస్ హిమజ్వాల చదివాను. ఇప్పుడు గుర్తులేదు కానీ వడ్లమాని మణి కథ ఇదివరకు ఒకటి చదివి చెప్పాను. ఆ లెవెల్లో వుందని. ఇదీ అంతే. సామాన్య పాఠకుడు అర్ధం చేసుకోవటం కష్టం. నేను రెండోసారి చదివినప్పుడే కొంచెం అర్ధం అయింది. మణీ అప్పుడప్పుడూ ఇలాంటి ఝలక్ ఇచ్చినా నాలాంటి మామూలు పాఠకులను కూడా గుర్తుంచుకోమ్మా కొంచెం మాకు కథ చదవడమంటే జీర్ణం కావటం కూడా.
ది అన్‌సీన్ గురించి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి అభిప్రాయం:
06/16/2026 1:19 pm
ఈ కథ ప్రారంభం చదువుతూనే ఉలిక్కిపడ్డాను. తేలిగ్గా పైపైన చదువుకుంటూ వెళ్ళిపోయే కథ కాదని వెంటనే అర్థమైపోయింది. అందుకే కథను మరింత ఏకాగ్రతతో చదవడం మొదలుపెట్టాను.
పగలు మన దృష్టికి రాని చాలా విషయాలు రాత్రి కాగానే కలత పెడుతుంటాయి. మనకి అర్థం కాని విషయాన్ని “ట” లతో చెప్పడం మానవ సహజం. అలాగే పగలు చెయ్యలేని చాలా పనులని ముసుగు తొలగించుకుని రాత్రి చేస్తామన్నది కూడా నిజం.
ఎవరో అదృశ్యవ్యక్తి రాత్రి జరిగే గొడవలన్నీ ఆపేస్తున్నాడంటే అందరికీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం కలగడం సహజం. కానీ మనలో కూడా అలా ప్రవర్తించే మనసుంటుందని మనకే తెలియని నిజం.
ఈ కథంతా ఆ అదృశ్యవ్యక్తి ఎవరోననే సందేహంతోనే నడుస్తుంది.
సార్త్రే వాక్యం, “మనం చేసిన చర్యలే మనం.” అన్న మాట ఈ ప్రశ్నకి సమాధానం చెపుతుంది.
మన చేతలే మన మనసుకు సాక్షి అన్న విషయం స్పష్టంగా ఈ కథలో తెలుస్తుంది. దానిని చెప్పడంలో రచయిత్రి విభిన్నమైన శైలిని యెంచుకున్నారు.
వర్ణనలలో వడ్లమాని మణి ఒక దృశ్యాన్నే ఆవిష్కరించారు.
ఏదైనా కథ పూర్తయాక, ఆ కథను ఎదురుగా వుంచుకుని, ఆ కథలోని లోతును తరిచి చూసినప్పుడే అందులోని నిగూడార్థం బయట పడుతుంది. ఈ కథ అలాంటిదే.
ఈ కథలో ప్రముఖ రచయిత్రి వడ్లమాని మణి చేసిన ప్రయోగం అభినందించదగ్గది.
జి.యెస్.లక్ష్మి,(గరిమెళ్ళ సుబ్బలక్ష్మి)
ది అన్‌సీన్ గురించి SRIRAM అభిప్రాయం:
06/15/2026 10:29 pm
రాత్రి యొక్క అంతుచిక్కని స్వభావాన్ని పట్టుకోగల రచయితలు అరుదు. దోస్తోవిస్కీ, గురుదత్ లాంటి చాలా తక్కువమంది రాత్రి యొక్క ఆత్మను పట్టుకోగలిగారు. తెలుగులో రాత్రి యొక్క అంతుచిక్కనితనాన్ని పట్టుకోగలిగిన సామర్థ్యంగల కొద్దిమందిలో, లేదా ఓకే ఒక రచయిత్రి మణి గారు.
కథ ఒక అనుభవం. అయితే కథను ఒక నైరూప్య అనుభవంగా మలచడం అందరికీ సాధ్యం కాదు. ఒక లీనియర్ కథనానికి అలవాటు పడిన పాఠకులకు అనుభవమే కథ అని చెబితే సందేహిస్తారు. ఈ కథ కథల యొక్క చట్రాన్ని పగుల కొట్టి బయటకు వచ్చింది. ఒక గొప్ప అనుభవాన్ని సృష్టించడానికి కొత్త తరహా వ్యక్తీకరణ అవసరం. నియామాల ఉల్లంఘన అవసరం. అవి ఈ కథలో పుష్కలంగా ఉన్నాయి.
అలానే అందరూ నైరూప్య అనుభవాన్ని తీసుకునే పరిణతతో ఉండరు. అయినా పాఠకుల కోసం రచయిత కథలో గాఢతను తగ్గించాల్సిన అవసరం లేదు. పాఠకులే కథ యొక్క స్థాయిని శ్రద్ధ పెట్టి అందుకోవాలి. అటువంటి సవాలును విసిరే కథలు విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొత్తదారిలో వెళ్ళే వారికి ముళ్ళు గుచ్చుకోవడం సహజం. భరిస్తూ ముందుకుపోవాలి.
ది అన్‌సీన్ గురించి ప్రసాద్ అభిప్రాయం:
06/15/2026 5:03 pm
ఇది కథా? ఏమీ అర్ధమే కాలేదు నాకు! ప్రయోగమనో, వినూత్నమనో అంటే అభ్యంతరం ఏమీ లేదు గానీ, కథ అంటేనే ఏడుపొస్తుంది, ఏమీ అర్ధమే కాలేదని! ఇదంతా చదివాక, ఎవరైనా నాలుగు ముక్కల్లో కథ చెప్పమంటే, మళ్ళీ ఏడుపొస్తుంది. నచ్చడం, నచ్చకపోవడం వేరే సంగతి. అర్ధం అవాలి కదా మొదట, కథ ఏమిటో? పైన ఎవరెవరో వ్యాఖ్యానాలు చేశారు కదా, ఏదో వుంటుందని చదివాను — లేడిలాగా గెంతులేసుకుంటూ సాగిపోయింది నా చదువు. అర్ధం మాత్రం కాలేదు.
– ప్రసాద్
ఓడిస్సీ – 7: అంతిమ పోరాటం, విజయం గురించి rupesh అభిప్రాయం:
06/15/2026 3:25 pm
వేంకటేశ్వర రావు గారికి దండాలు!
ఒడిస్సీ ని ఇంత ఆద్భుతంగా తెలుగు లో చదవగలుగుతానని అనుకోలేదు. మీకు వేల దండాలు!
ఇంత అందంగా, హాయిగా అనువదించినందుకు మీకు సదా రుణపడిపోయాము.
నమస్సులతో,
రూపేష్
ది అన్‌సీన్ గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:
06/15/2026 8:06 am
ఈ కథ ఒక ప్రయోగం. అక్కడక్కదా ఏవైనా పొరపాట్లు వుంటే ఉండొచ్చు. ఇది మన బాధ్యతను వినూత్న కథనంతో గుర్తు చేసే కథ. మణి వడ్లమానికి అభినందనలు.
ది అన్‌సీన్ గురించి Swetha Karumanchi అభిప్రాయం:
06/12/2026 11:34 pm
మణి వడ్లమాని గారి కథలు మామూలుగా అయితే బావుంటాయి. కానీ, ఇది ఏ రకంగానూ చదివించలేదు. ప్రయోగాలను ప్రోత్సహించాల్సిందే, కానీ “ఏ మాత్రం ఎడిటింగ్ లేకుండా, రచయిత్రితో సలహాలు, సంప్రదింపులు జరపకుండా ఈ కథని అలాగే ప్రచురించి ఉంటారా?” అనిపించింది. వాక్యనిర్మాణంలో ఏ మాత్రం స్పష్టత లేకపోవటం – ఆవిడ కథలా ఎంత మాత్రం లేదు. అన్ని కథలూ గొప్ప కథలవ్వక్కర్లేదు. కొన్ని ప్రయోగాలకి మటుకూ feedback ప్రక్రియ చాలా బలాన్నిస్తుంది. ఈ కథ ప్రచురించి ఆవిడని అవమానించారనే అనిపించింది
నడిచే చెలమ గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:
06/12/2026 8:42 am
“నడిచే చెలమ” కథ ఆర్ద్రంగా ఉంది. కానీ నా మట్టిబుర్రకు అర్థమయ్యీ కానట్టు తోచింది. వడగాడ్పుల నిస్సార జీవితాలలో అనుబంధాల చల్లటి చెలమలు సృష్టించుకోవడం ప్రయత్నిస్తే ఎవరికైనా సాధ్యమే… అని రచయిత చెప్పదలచుకున్నారా? కథా ఉద్దేశం ఏదైనా, ఎందుకో నాకు కూడా కన్నీళ్లు వచ్చి చావవు… గుండెల్లో అలా బాధ వుండిపోతుంది తప్ప. నాలాంటి తిరువేంగడాన్ని సృష్టించడానికి ఎంతో సూక్ష్మ పరిశీలన కావాలి. మూల రచయిత ఎస్.రామకృష్ణన్ కు, చక్కగా అనువాదం చేసి అందించిన ఆవినేని భాస్కర్ గారికి ధన్యవాదాలు.
అటజని కాంచె కృషీవలుడు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
06/10/2026 2:10 pm
వడ్లవల్లి పద్మావతి గారికి,
జవాబు ఇద్దామనుకుంటూనే తాత్సారం చేశాను. నా విమర్శకి మీ సమాధానం సహేతుకంగా ఉంది. రాహుల్ సాంకృత్యాయన్ కవి కాదు. చిన్నప్పుడు కవిత్వం రాయడానికి ప్రయత్నించి, అది “చాలా ప్రమాదకరమైన విషయమని, ఛందస్సులో ఒక మాత్ర తప్పినా చచ్చిపోతారని కొందరి ద్వారా తెలుసుకొని,” మానుకున్నాడు.
బండ్లపల్లె ఓబులరెడ్డి గారి “మహోన్నత మానవుడు రాహుల్ సాంకృత్యాయన్” (జయంతి పబ్లికేషన్స్, 1963; విశాలాంధ్ర, 2011) పై కొడవటిగంటి సమీక్ష (1963):
“జిజ్ఞాస – అందులోనూ అనంతమైన జిజ్ఞాస ఉండటం ఒక సుకృతం. ఆ జిజ్ఞాసకొద్దీ, సకల సౌఖ్యాలూ విడనాడి, ఎలాంటి కష్టనష్టాలనయినా లెక్కచేయక, చివరకు సన్యాసి జీవితానికి కూడా వెనుదీయక, దేశదేశాలూ తిరిగి చూడాలనేది ఒక దీక్షగా పెట్టుకోగలగటం ఒక విశేషం. తాను తెలుసుకున్న అపూర్వ విషయాలను ఎప్పటికప్పుడు గ్రంథస్థం చేసి తోటి మానవులకు అందజేయాలనే నిస్వార్థ సంకల్పం ఒక వ్యసనం అనిపించేటంతగా ఉండటం మరొక విశేషం. విజ్ఞాన సముపార్జనతో పాటు తానూ క్రమపరిణామం చెందుతూ, చైతన్య స్థాయిలో ఎప్పటికప్పుడు పైమెట్టు అందుకుంటూ రాగలగటం మరొక గొప్ప లక్షణం.
వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఆ వ్యక్తి విశిష్ట వ్యక్తి అనిపించుకుంటాడు. ఈ విశేష లక్షణాలన్నీ కలిసి ఒకే వ్యక్తిలో గూడు కట్టుకుంటే – అటువంటి వారు ఉన్నారా అనుకుంటాము. అలాంటి వారు నూటికి కోటికి ఒకరుంటారు. అచ్చంగా అటువంటి మహోన్నత మానవుడే – మహాపండిత, త్రిపిటకాచార్య రాహుల్ సాంకృత్యాయన్.
వీరి జీవిత చరిత్ర ఒక వ్యక్తి జీవిత చరిత్రగా కనబడదు. అది మన దేశములోని అభ్యుదయ కాముక వర్గాల పరిణామ చరిత్రగానే గోచరిస్తుంది. వీరి జీవిత చరిత్ర మన దేశంలోని వివిధ, విభిన్న ప్రాంతాల ప్రజల స్థితిగతులకు, ఆచార వ్యవహారాలకు ఒక ప్రతిబింబం వంటిది. అంతేకాదు, ఆయన జీవిత కథ చదువరులను హిమాలయ శిఖరాలు మొదలుకొని కన్యాకుమారి వరకు, తూర్పుతీరం మొదలుకొని పడమటి కనుమలు వరకు నడిపిస్తుంది. ఆయా ప్రాంతాల జీవన విశేషాలనూ ఆచార వ్యవహారాలనూ కళ్ళముందు ఉంచుతుంది. అంతేకాదు, సింహళం, టిబెట్, జపాన్, సోవియట్, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్సూ, ఇంగ్లాండు దేశాలకూ తీసుకువెళ్తుంది. అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలనూ, వారి మనోభావాలనూ మనకి తెలియజేస్తుంది. ఒకసారి కాదు, ఎన్నోసార్లు హిమాలయాల మీదుగా ప్రయాణం చేయిస్తుంది. టిబెట్ లోని ప్రాచీన బౌద్ధ సంఘారామాలకు తీసుకువెళ్తుంది.”
మాఊరి గ్రంథాలయానికి పంపడానికి హైద్రాబాద్ నవోదయ వారినడిగితే దొరకడం లేదన్నారు.
మాంసం తిని, సిగరెట్లు కాల్చే ఈ బౌద్ధ సన్యాసి అలవాట్లని చూసి సంజీవదేవ్ ఆశ్చర్యపోయాడు (https://archive.org/details/in.ernet.dli.2015.387375/page/219/mode/2up).
కొడవళ్ళ హనుమంతరావు