వేలూరి గారి నిష్క్రమణ వార్తకి చాలా చింతిస్తున్నాను. ఇలాంటి వార్త వినాల్సొస్తుందని భయపడుతూనే ఉన్నాను. చివరకి అది నిజమయింది. వేలూరి గారి ఆశీర్వచనమూ, అభిమానమూ పొందిన అదృష్టవంతులలో నేనూ ఒకదాన్ని. వారి ప్రోత్సాహానికీ, ఆదరానికీ ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటాను.
తెలిసిన విషయాలు కొన్నీ, తెలియనివి చాలానూ తెలియజేసిన బ్రహ్మానందంగారికి ధన్యవాదాలు.
వేలూరి వారి సాహిత్య ప్రయాణం లో వచ్చిన పుస్తకాలలో 1998 లో ప్రచురించబడిన ‘మెటమార్ఫసిస్” మొదటిది.
“గత మూడు, నాలుగేళ్ళుగా ఎవరూ ఆయన్ని పలకరించలేదు” అన్న మాట నా విషయం లో నిజం కాదు.
ఇంత కాలం ఆముక్త మాల్యాద అంటే గోదాదేవి కథా అనుకున్నాము. ఇప్పుడు తెలిసింది ఆముక్తమాల్యద అంటే గోదాదేవి కథే కాక ఇంకా చాల ఉన్నది అని. కె. వి. యస్. రామారావు గారికి మా మన: పూర్వక కృతజ్ఞతలు.
దీనిని ప్రచురించిన ‘ఈమాట’ సంపాదకవర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏. ఎంతో సహృదయంతో స్పందిస్తున్న సన్మతులందరికీ ధన్యవాదాలు.🙏 ఈ కృతిని ప్రకాశింపజేసిన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారికి నేను ఎల్లకాలం తీర్పరాని ఋణగ్రస్తుడినే.🙏
ఆంగ్లంలోని క్లుప్తత తెలుగులో కూడా వస్తే ఇంకా బావుండేది.
కొడవళ్ళ హనుమంతరావు
ధన్యవాదాలు సర్. మెండేజ్ నీటిని ఒక దుఃఖ ప్రతీకగా తన కవిత్వంలో ఎక్కువగా వాడింది. ఆకాశాన్ని, సముద్రాన్ని దుఃఖానికి ప్రతీకలుగా చూపింది. ఇది ఒక నాలుగైదు డ్రాఫ్ట్స్ తర్వాత సంపాదకులతో చర్చల తర్వాత అంగీకరించుకున్నది. అనువాదం మూలంలో ఉన్న క్లుప్తతతో సాధారణంగా బాగుంటుంది. కానీ ఈ ఆంగ్లమూలమే స్పానిష్ కవితకు దగ్గరగాలేదు. అందుకే స్పానిష్ మూల కవితకు దగ్గరగా తేవడం కోసం కొంత వివరణ చేర్చవలసి వచ్చింది.
పల్లిపట్టు గారు ఆన్నది నిజం. అద్భుతమైన కథ యిది. రచన జరిగి చాలా కాలం కావటం వలన ఈకథలోని భాష గ్రాంథికంనుండి వ్యావహారానికి మారుతున్న దశలో ఉంది. చదువటానికి ఇబ్బంది ఏమీ రాదు.
ఇంత మంచికథలో ఉన్న ఏకైకనిర్మాణలోపం ఎడనెడ రసాన్ని రచయిత వాచ్యం చేయటమే. (అంటే ఒక పాత్రకు భయం కలిగితే, అది కథనచాతుర్యం ద్వారా పాఠకులు గ్రహించేలా ఉండాలి కాని మధ్యలో రచయిత ఆపాత్ర నోటివెంట కాని నేరుగా కానీ ఆ భయం అనే మాట చెప్పేయకూడదు. అలా చేయటం సంప్రదాయం కాదు.)
ఉదాహరణకు “వకీలుగారికి కూడా ఆశ్చర్యం కలిగెను.” అని రచయిత చెప్పనవసరం లేదు. ఆ ఆశ్చర్యం సంగతి చదువరులు స్వయంగా గ్రహించవలసినది.
అలాగే “వాని కోసం విధి నిర్ణయించిన దెబ్బ ఆ సమయంలో తగిలెను” అన్నది పాఠకులకు కలుగవలసిన ఊహ. రచయిత స్వయంగా ఆముక్క మనతో అనకూడదు.
ఇత్యాది స్వల్పదోషాలు ఉన్నా వాటిని మనం అంతగా గణించ పనిలేదు.
కథ ముగింపు కూడా బహు సొగసుగా ఉంది. చెడింది సెట్టిగారు మాత్రమే కాదు, వకీలు గారున్నూ అన్నమాట. వేశ్యమాత వారిని దేవిడీమన్నా చేసింది. బలే.
భమిడిపాటి మూర్తి గారి పై వ్యాఖ్య చదివాక, “అందరూ దుర్మార్గులే” అనే మాటలు గుర్తొచ్చి, పై కధ చదవాలనిపించింది. చదివాను కూడా.
భాషా, శైలీ చాలా బావున్నాయి ఈ కధలో. అద్భుతం! నాకు బాగా నచ్చాయి.
ఇక కధ లోకి వొస్తే, నేను కూడా మొదట్లో, “ఈ కధ లొ అన్ని పాత్రలు ప్రతికూలం గానే ఉన్నాయి” అనే అనుకున్నాను, ప్రభుత్వం వారితో సహా. ప్రతికూల పాత్రల మధ్య ఘర్షణలు నాకు చాలా ఇష్టం. ఎవరి కష్టానికీ మన మనసు చలించదు. కానీ, ఆ ‘వేశ్య’ పాత్ర చేత “ఇది శివుని ప్రసాదమే. ఆయనను వంచించను. ఇప్పటికైనా మర్యాదగా బ్రతకడానికి స్వామి సహాయము చేసినాడు. పాడు లంజ బ్రతుకు చాలు. ఈ చెడ్డచోటు నుంచీ అయినంత దూరం దూరం పోవడం మేలు” అని రచయిత అనిపించాక, ఆ పాత్ర, ‘ప్రతికూలం’ అనిపించలేదు నాకు. ఆమె ఉద్దేశం ‘అనుకూలం’ కాబట్టి, ‘ప్రతికూల’ మనుషుల నుంచి డబ్బు దొంగిలించడం,’ ప్రతికూలం’గా అనిపించలేదు నా నీతుల స్థాయికి.
వేరు లో ఉన్న చేవ ఇది అని కొమ్మ దానిని అందమైన పువ్వులుగా మార్చి లోకానికి అందిస్తుంది .వేరుని కాసేపు మనం రచయిత అనుకుంటే ప్రతి కొమ్మ ఒక విమర్శకుడు. కొమ్మ కొత్తగా పువ్వుల్ని సృష్టించలేదు. పువ్వులో ఉన్న ధర్మం వేరుదే. కానీ వేరులో ఉన్న గొప్పతనాన్ని పువ్వులుగా లోకానికి ప్రదర్శించే “నేర్పు” మాత్రం కొమ్మదే. రచనలోని సారాంశాన్ని జీర్ణింపజేసుకుని అక్షర పుష్ప సౌరభాన్ని అందించే విమర్శకుడు రచయిత ఇద్దరూ సమస్కంధులు . ఏల్చూరి వారి వ్యాస ఘట్టాలు పుస్తకంపై పరిమి వారి ఉత్తీర్ణ వ్యాసం చదివిన తర్వాత నాకు తోచిన భావం ఇది. ఇద్దరు నాకంటే బాగా చదువుకున్నవారు. వారిని బేరీజు వేసే శక్తి నాకు లేదు. కానీ అభినందించడానికి వయస్సుతో, జ్ఞానంతో పనేమీ లేదు కదా ! వాల్మీకి బాగా వ్రాసాడని చెప్పటానికి నేను వాల్మీకిని కానక్కర్లేదు. సహృదయత ఉంటే చాలు .ఇద్దరూ ఇలాంటి మంచి రచనా కార్యక్రమాలు చేయాలని శారదా మాతకు సాంజలి బంధకముగా శిరస్సు జోడిస్తున్నాను.స్వస్తి. తాడేపల్లి పతంజలి 03.03.26
వేలూరిగారి నిష్క్రమణ పెద్ద లోటు గురించి maaciraaju saavitri అభిప్రాయం:
03/07/2026 1:07 am
వేలూరి గారి నిష్క్రమణ వార్తకి చాలా చింతిస్తున్నాను. ఇలాంటి వార్త వినాల్సొస్తుందని భయపడుతూనే ఉన్నాను. చివరకి అది నిజమయింది. వేలూరి గారి ఆశీర్వచనమూ, అభిమానమూ పొందిన అదృష్టవంతులలో నేనూ ఒకదాన్ని. వారి ప్రోత్సాహానికీ, ఆదరానికీ ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటాను.
తెలిసిన విషయాలు కొన్నీ, తెలియనివి చాలానూ తెలియజేసిన బ్రహ్మానందంగారికి ధన్యవాదాలు.
వేలూరిగారి నిష్క్రమణ పెద్ద లోటు గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:
03/06/2026 10:28 pm
వేలూరి వారి సాహిత్య ప్రయాణం లో వచ్చిన పుస్తకాలలో 1998 లో ప్రచురించబడిన ‘మెటమార్ఫసిస్” మొదటిది.
“గత మూడు, నాలుగేళ్ళుగా ఎవరూ ఆయన్ని పలకరించలేదు” అన్న మాట నా విషయం లో నిజం కాదు.
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
కృష్ణదేవరాయల “ఆముక్తమాల్యద” గురించి సూరం సాంబశివరావు రావు అభిప్రాయం:
03/06/2026 10:21 pm
ఇంత కాలం ఆముక్త మాల్యాద అంటే గోదాదేవి కథా అనుకున్నాము. ఇప్పుడు తెలిసింది ఆముక్తమాల్యద అంటే గోదాదేవి కథే కాక ఇంకా చాల ఉన్నది అని. కె. వి. యస్. రామారావు గారికి మా మన: పూర్వక కృతజ్ఞతలు.
అవతీర్ణపరిమళం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
03/05/2026 11:20 pm
🌹🙏🌹
అప్రతర్కితమహాద్భుతమైన సమీక్షారూప సువర్ణకవితాత్మక మహాప్రసాదం ఇది. “ఆః కృతితాం గతః కృతిః” అనుకొంటూ చదువుతున్నంతసేపు – వైదుష్యదీప్తమతి, కవిరాజహంస, విద్వద్వందిత శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి సహృదయతకు, ఔదార్యానికి, వాక్యరౌచికతకు మైమరపు కలిగి కన్నులలో ఆనందాశ్రువులు చిప్పిల్లుతూనే ఉన్నాయి.
ఈ విమర్శవిద్యాధరుని ఏకావళిలోని ఒక్కొక్క పలుకు ముత్యాన్ని – అలంకారమైన ఏకావళిలో వలె గృహీతముక్తరీతిగా కాక – పట్టిపట్టి చూస్తూ ముందుకు సాగవలసివస్తున్నది.
రచనను ఇంతటి విశదప్రకాశంతో పరికించి అనుమోదించినందుకు శ్రీరామనాథులకు నిండుకైమోడ్పుతో తప్ప 🙏 ఏమని కృతజ్ఞతను వెల్లడింపను? 🙏
దీనిని ప్రచురించిన ‘ఈమాట’ సంపాదకవర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏. ఎంతో సహృదయంతో స్పందిస్తున్న సన్మతులందరికీ ధన్యవాదాలు.🙏 ఈ కృతిని ప్రకాశింపజేసిన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారికి నేను ఎల్లకాలం తీర్పరాని ఋణగ్రస్తుడినే.🙏
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
🕉️🙏
కళాసాగరం కర్ణాటకం-2 గురించి వంశీ క్రిష్ణ అభిప్రాయం:
03/05/2026 6:15 am
మీ శిల్పకళా వర్ణన బాగుంది. చదివే వారికి శక్తినిస్తుంది; ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అభినందనలండీ!
ఇదే చివరిసారి… గురించి Dr. Vijay Koganti అభిప్రాయం:
03/04/2026 11:38 am
ధన్యవాదాలు లలిత గారూ
ఇదే చివరిసారి… గురించి Dr.Vijay Koganti అభిప్రాయం:
03/04/2026 11:36 am
ధన్యవాదాలు సర్. మెండేజ్ నీటిని ఒక దుఃఖ ప్రతీకగా తన కవిత్వంలో ఎక్కువగా వాడింది. ఆకాశాన్ని, సముద్రాన్ని దుఃఖానికి ప్రతీకలుగా చూపింది. ఇది ఒక నాలుగైదు డ్రాఫ్ట్స్ తర్వాత సంపాదకులతో చర్చల తర్వాత అంగీకరించుకున్నది. అనువాదం మూలంలో ఉన్న క్లుప్తతతో సాధారణంగా బాగుంటుంది. కానీ ఈ ఆంగ్లమూలమే స్పానిష్ కవితకు దగ్గరగాలేదు. అందుకే స్పానిష్ మూల కవితకు దగ్గరగా తేవడం కోసం కొంత వివరణ చేర్చవలసి వచ్చింది.
మీ పరిశీలనకు ధన్యవాదాలు.
నమస్తే.
వ్యభిచారం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/04/2026 1:25 am
పల్లిపట్టు గారు ఆన్నది నిజం. అద్భుతమైన కథ యిది. రచన జరిగి చాలా కాలం కావటం వలన ఈకథలోని భాష గ్రాంథికంనుండి వ్యావహారానికి మారుతున్న దశలో ఉంది. చదువటానికి ఇబ్బంది ఏమీ రాదు.
ఇంత మంచికథలో ఉన్న ఏకైకనిర్మాణలోపం ఎడనెడ రసాన్ని రచయిత వాచ్యం చేయటమే. (అంటే ఒక పాత్రకు భయం కలిగితే, అది కథనచాతుర్యం ద్వారా పాఠకులు గ్రహించేలా ఉండాలి కాని మధ్యలో రచయిత ఆపాత్ర నోటివెంట కాని నేరుగా కానీ ఆ భయం అనే మాట చెప్పేయకూడదు. అలా చేయటం సంప్రదాయం కాదు.)
ఉదాహరణకు “వకీలుగారికి కూడా ఆశ్చర్యం కలిగెను.” అని రచయిత చెప్పనవసరం లేదు. ఆ ఆశ్చర్యం సంగతి చదువరులు స్వయంగా గ్రహించవలసినది.
అలాగే “వాని కోసం విధి నిర్ణయించిన దెబ్బ ఆ సమయంలో తగిలెను” అన్నది పాఠకులకు కలుగవలసిన ఊహ. రచయిత స్వయంగా ఆముక్క మనతో అనకూడదు.
ఇత్యాది స్వల్పదోషాలు ఉన్నా వాటిని మనం అంతగా గణించ పనిలేదు.
కథ ముగింపు కూడా బహు సొగసుగా ఉంది. చెడింది సెట్టిగారు మాత్రమే కాదు, వకీలు గారున్నూ అన్నమాట. వేశ్యమాత వారిని దేవిడీమన్నా చేసింది. బలే.
వ్యభిచారం గురించి ప్రసాద్ అభిప్రాయం:
03/03/2026 11:29 am
భమిడిపాటి మూర్తి గారి పై వ్యాఖ్య చదివాక, “అందరూ దుర్మార్గులే” అనే మాటలు గుర్తొచ్చి, పై కధ చదవాలనిపించింది. చదివాను కూడా.
భాషా, శైలీ చాలా బావున్నాయి ఈ కధలో. అద్భుతం! నాకు బాగా నచ్చాయి.
ఇక కధ లోకి వొస్తే, నేను కూడా మొదట్లో, “ఈ కధ లొ అన్ని పాత్రలు ప్రతికూలం గానే ఉన్నాయి” అనే అనుకున్నాను, ప్రభుత్వం వారితో సహా. ప్రతికూల పాత్రల మధ్య ఘర్షణలు నాకు చాలా ఇష్టం. ఎవరి కష్టానికీ మన మనసు చలించదు. కానీ, ఆ ‘వేశ్య’ పాత్ర చేత “ఇది శివుని ప్రసాదమే. ఆయనను వంచించను. ఇప్పటికైనా మర్యాదగా బ్రతకడానికి స్వామి సహాయము చేసినాడు. పాడు లంజ బ్రతుకు చాలు. ఈ చెడ్డచోటు నుంచీ అయినంత దూరం దూరం పోవడం మేలు” అని రచయిత అనిపించాక, ఆ పాత్ర, ‘ప్రతికూలం’ అనిపించలేదు నాకు. ఆమె ఉద్దేశం ‘అనుకూలం’ కాబట్టి, ‘ప్రతికూల’ మనుషుల నుంచి డబ్బు దొంగిలించడం,’ ప్రతికూలం’గా అనిపించలేదు నా నీతుల స్థాయికి.
కధ నాకు నచ్చింది.
ప్రసాద్
అవతీర్ణపరిమళం గురించి తాడేపల్లి పతంజలి అభిప్రాయం:
03/03/2026 11:24 am