పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16391

  1. కళాపూర్ణోదయం: విషయ సూచిక గురించి Radhadevi అభిప్రాయం:

    02/01/2026 12:53 am

    నమస్కారం. కళాపూర్ణోదయం సులువుగా చదువడానికి వీలుగా అందజేసినందుకు కె.వి.ఎస్.రామారావుగారికి ధన్యవాదాలు. ఇది నా whatsapp group లో నా స్నేహితులతో పంచుకుందుకు అనుమతి అభ్యర్థిస్తున్నాను.

  2. స్క్రాప్ బుక్ మాటలు గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:

    01/31/2026 10:52 pm

    మంచితెలుగులో రచన చదువుతుంటే మంచివిందుభోజనం చేసినట్లే ఉంటుంది నాకు.

    ఈవ్యాసంలోని తెలుగుభాషావిన్యాసం అలాంటి అనుభూతిని కలిగించింది. మీరచనలు చదవాలి. ఇప్పుడంతా తీరికే కదా నాకు.

    నా టీనేజ్ చివరలో రావాడ కృష్ణ గారనే ప్రసిధ్ధ రేఖాచిత్రకారుల స్నేహం దొరికింది. ఆయన ఒక టీచర్. ఒక సందర్భంలో ఒకమ్మాయి మాష్టారూ నాబొమ్మ వేయరా అని మారాం చేస్తే ఆమె నోట్ బుక్కులో అక్షరాలా రెండు నిముషాల్లో పెన్సిల్ ఉపయోగించి బొమ్మ బ్రహ్మాండంగా వేసిచ్చారు. ఆయన కూడా ఫ్రీహేండ్ బొమ్మే బొమ్మ అనేవారు.

  3. యూట్యూబ్‍లో ఈమాట: డిసెంబర్ 2025 గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    01/31/2026 2:29 pm

    Dear editors: in my opinion, audio line for prose might not become as popular as the video line. My two cents. Tq. V r veluri.

  4. స్క్రాప్ బుక్ మాటలు గురించి Govardhan అభిప్రాయం:

    01/31/2026 2:13 pm

    అన్వర్ గారు మీ రాతల్ని ఫాలో అవుతున్నా ఈ మధ్య. చాలా బాగా రాస్తున్నారు. మీ కాంటాక్ట్ ఏమైనా ఉంటే షేర్ చెయ్యండి. మీరు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు అనుకుంటా.

  5. నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం గురించి Giri అభిప్రాయం:

    01/29/2026 6:41 pm

    అన్నమయ్య కీర్తనలు ఎక్కువగా భక్తిభావంతో కరిగిపోతున్నాయి అలాగే సంగీతసాధనలలో ఇరుక్కుపోతున్నాయి. ప్రతీ కీర్తనలో సాహిత్యాన్ని ఈకాలం వాడుకభాషలో వివరించి ఈ తరానికి అందించాలి. అన్నమయ్య కీర్తనలు, పోతన భాగవతం అలాగే రామదాసు కీర్తనలు…ఈ మహానదులు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉండాలి. అటువంటి సాహిత్యవేత్తలను eemaata.com ప్రోత్సహించాలని కోరుతున్నాం.

  6. ఆకాంక్ష గురించి venkat KVR అభిప్రాయం:

    01/29/2026 5:33 pm

    తుపానులతో తలపడుతూ శిశిరాలను ఎదిరిస్తూ యుద్ధాలు చేసి చేసి అలసిన శరీరపు కొమ్మలపై మరో వసంతపు పిట్ట అప్పుడే ఎలా వాలింది? ఏమైనా చెప్పారా… తీసుకున్నవాళ్లకు తీసుకున్నంత, పాఠకుల ఊహలకే ఒక సవాలు విసిరారు…
    కలానికి, ఎన్ని వైపులనుంచైనా పదును పెట్టొచ్చని చెప్పారుగా!

  7. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి ఉమామహేశ్వరరావు గారపాటి అభిప్రాయం:

    01/29/2026 12:42 pm

    ఈ వ్యాసం నచ్చింది, దానిపై వచ్చిన అభిప్రాయాలు చాలావరకూ వ్యాసం ప్రామాణికతకు లోటు రానీయకుండానే ఉన్నై. అయితే paradigm shift అంటే ‘రూపావళి మార్పు’ అనడం సరికాదు. భాషాశాస్త్రంలో రూపావళిని paradigmకి (ధాతువుకి తిఙ్ ప్రత్యయాలు చేర్చగా ఏర్పడిన పదావళి) వాడుతున్నది నిజమే గానీ ఆ paradigm ఇక్కడి paradigm వేరు. ఇక్కడి చర్చలో paradigm అంటే కొన్ని సిద్ధాంతాలకు ప్రాతిపదిక. దాన్ని అధిసిద్ధాంతం అనవచ్చునేమో.

  8. కళ్యాణ తిలకం గురించి చందు అభిప్రాయం:

    01/29/2026 3:38 am

    నిజమే మరి!
    రాజ కుటుంబ స్త్రీల పరిస్థితి గాలిలో నీటి బుడగ వంటిది. ప్రతి క్షణం పెనం మీద ఉన్నట్టు ఉంటుంది. ఇక దానిలో నైతికత, సంప్రదాయాలు వెతకటం సముద్రంలో మంచి నీరు వెతికినట్టే.

  9. పద్మవ్యూహం గురించి చందు అభిప్రాయం:

    01/29/2026 1:37 am

    యుద్ధం వలన గెలుపెవరిదైనా బాధ పడేది తల్లి. ఇంకెవరికీ ఆ బాధ గురించి పూర్తిగా వర్ణించడం వీలు కాదేమో.

  10. ఓ ప్రేమ కథ గురించి చందు అభిప్రాయం:

    01/29/2026 12:45 am

    కథ బాగుంది. ముగింపు ముచ్చటగా ఉంది. అయితే ఎటువంటి మలుపులు లేకుండా ఉన్నట్టుంది. శారద మనసులోని సంఘర్షణ, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులకు సిద్ధం అవ్వడం బాగుంది