కాలం: An interesting point of view
నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం
తాపధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్.
ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు-
మీ సంకలనం అర్ధవంతంగా ఉన్నది, కృతజ్ఞుడను! గుమ్మడి గోపాలకృష్ణ గారి పద్యనాటకం వీడియొ చూసిన తర్వాత, ఆ పద్యాల స్క్రిప్ట్ కోసం వెదికాను. మీ వెబ్ సైటు లో దొరికినందున బహుదానందమైనది.
ఆసక్తికరమైన టైం ట్రావెల్ స్టోరీ. లూప్ లో ఇరుక్కుపోయిన ఇద్దరిలో ఒక్కడికే అది గుర్తు ఉండడం కొత్తగా ఉంది. ఫోన్‍కి వచ్చిన మెసేజ్‍లో ఏం ఉందో చెప్పకుండా వదిలేయడం బాగుంది. అంతా ముందే సెట్ చేసి పెట్టినవాడు అతన్ని చంపి పడేసేంత కోపం తెప్పించే మెసేజ్‍ని ఎందుకు సెట్ చేసి పంపిస్తాడు? అన్న ఆలోచన చంపేవాడికి ఎందుకు కలగలేదు అనేది ఈ కథలో చిన్న లోపం.
సంపాదకులకి ఒక ప్రశ్న/ఉత్తరం లేదా మీరు ఏదనుకుంటే అది.
ఇంటర్నెట్ (అంతర్జాలం) మీద తెలుగు చదువుకోవడానికి, ఈమాట లో తెలుగు కధలు కాకరకాయలు చూసుకోవడానికి (అదే తెలుగులోనే) వస్తూ ఉంటాము. రోజులో దాదాపు 90 శాతం ఆంగ్లంలో గడుపుతూ ఉంటాం కనక తెలుగులో చదువుకోవడానికి అదో సంతోషం. మనం రాసే కధల్లో (నాతో సహా) ఆంగ్ల పదాలు లేకుండా రాయలేకపోతున్నాం, సరే కనీసం కధ పేర్లు కూడా తెలుగులో రాయరేం? జనవరి నెలలో పేర్లు ఇలా ఉన్నై – నో ఎక్జిట్, బ్లిస్ హోం, ఎవరెస్ట్ బేస్ కేంప్, వర్ల్డ్ వితిన్, ఐడెంటిటీ ఉద్యమాలు వగైరా. ఇవన్నీ పంటి కింద ఇంగువ ముక్కల్లా తగుల్తున్నాయి. ఎవరెస్ట్ బేస్ కేంప్ వదిలేసి (యాత్రానుభవం కనక, కానీ దీన్ని కూడా సులభంగా అనువదించగలరు అమరేంద్ర గారు) మిగతావి అన్నింటికీ తెలుగు పేర్లు పెట్టవచ్చు కదా? కనీసం సంపాదకులు కధలు/కవితలు రాసేవారికి ఎందుకు చెప్పడం లేదు తెలుగు పేర్లు పెట్టమని. మొత్తం అంతా తెలుగులో రాయమని కాదు కానీ కనీసం కధ/కవిత కి పేరు అయినా తెలుగులో పెట్టలేమా?
ఇంక ఈ నెలలో సంపాదకులకి ఉత్తరం గురించి చెప్పనవసరమే లేదు. దాదాపు మొత్తం అంతా ఆంగ్లంలోనే ఉంది. ఆంగ్ల కధకులని ఉటంకించినప్పుడు వాళ్ళవి ఇంగ్లీషులో చెప్పడం బాగానే ఉంది కానీ మొత్తం అంతా ఇంగ్లీషులో అయితే (అదీ వేలూరి లాంటి వారినుంచి!!). ఒక్కొక్కప్పుడు లైలాగారు స్పానిష్షో, ఫ్రెంచో రాస్తారు. అది ఎవరికోసమో అర్ధం కాదు. నాలాటి అర్భకులకి తెలుగు, ఇంగ్లీషుకూడా సరిగ్గా రావు; మిగతాభాషల సంగతి ఎందుగ్గానీ.
ఈమాట తెలుగు పత్రిక అనేది మర్చిపోతున్నామా? ఒక్కొక్కప్పుడు కధ/కవిత పేరు ఇంగ్లీషులో చూడగానే అది ఇంక చదవాలనిపించడం లేదు (కనీసం నా మటుక్కి). అనువాదాలు చేసే అవినేని భాస్కర్ గారు కూడా చక్కగా “అకాశంలో వినిపించే స్వరాలు,” అంటూ అనువదించగలుగుతున్నప్పుడు మిగతావారికి ఏమిటి కష్టం? సంపాదకులు కనీసం ఈ విషయం రచయితలతో చెప్పాల్సిన అవసరం ఉంది.
చక్కటి వ్యాసం,కధనం . వెల్చేరు నారాయణరావు గారికి ధన్యవాదాలు. చాసో కధలు మధ్యవయస్సులో పరిచయమయ్యాయి నాకు. ఇంతకు ముందే ఎందుకు దృష్టిలోకి రాలేదా అనిపించింది. యువ వయస్సులో శాఖా గ్రంధాలయాలలో అవి నాకు తగలకపోవడమే కారణం.
కాలం కథ గురించి తః తః గారి అభిప్రాయం:
01/07/2025 6:56 am
కాలం: An interesting point of view
నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం
తాపధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్.
ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు-
అక్కమహాదేవి వచనాలు – 1 గురించి Vishwanatham kamtala గారి అభిప్రాయం:
01/07/2025 3:48 am
అక్క మహాదేవి వచనాల అనువాదం బాగుంది. మధురమైన గాత్రంతో పాడి వినిపించిన గాయనిగారికి, మీకు ధన్యవాదాలు.
శ్రీనాథుని చాటుపద్యములు గురించి రమేశ్ కుమార్ నాయని గారి అభిప్రాయం:
01/06/2025 9:44 pm
మీ సంకలనం అర్ధవంతంగా ఉన్నది, కృతజ్ఞుడను! గుమ్మడి గోపాలకృష్ణ గారి పద్యనాటకం వీడియొ చూసిన తర్వాత, ఆ పద్యాల స్క్రిప్ట్ కోసం వెదికాను. మీ వెబ్ సైటు లో దొరికినందున బహుదానందమైనది.
నో ఎగ్జిట్.3 గురించి భగవంతం గారి అభిప్రాయం:
01/06/2025 1:51 pm
ఆసక్తికరమైన టైం ట్రావెల్ స్టోరీ. లూప్ లో ఇరుక్కుపోయిన ఇద్దరిలో ఒక్కడికే అది గుర్తు ఉండడం కొత్తగా ఉంది. ఫోన్‍కి వచ్చిన మెసేజ్‍లో ఏం ఉందో చెప్పకుండా వదిలేయడం బాగుంది. అంతా ముందే సెట్ చేసి పెట్టినవాడు అతన్ని చంపి పడేసేంత కోపం తెప్పించే మెసేజ్‍ని ఎందుకు సెట్ చేసి పంపిస్తాడు? అన్న ఆలోచన చంపేవాడికి ఎందుకు కలగలేదు అనేది ఈ కథలో చిన్న లోపం.
సంపాదకునికి ఉత్తరం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
01/05/2025 12:36 pm
సంపాదకులకి ఒక ప్రశ్న/ఉత్తరం లేదా మీరు ఏదనుకుంటే అది.
ఇంటర్నెట్ (అంతర్జాలం) మీద తెలుగు చదువుకోవడానికి, ఈమాట లో తెలుగు కధలు కాకరకాయలు చూసుకోవడానికి (అదే తెలుగులోనే) వస్తూ ఉంటాము. రోజులో దాదాపు 90 శాతం ఆంగ్లంలో గడుపుతూ ఉంటాం కనక తెలుగులో చదువుకోవడానికి అదో సంతోషం. మనం రాసే కధల్లో (నాతో సహా) ఆంగ్ల పదాలు లేకుండా రాయలేకపోతున్నాం, సరే కనీసం కధ పేర్లు కూడా తెలుగులో రాయరేం? జనవరి నెలలో పేర్లు ఇలా ఉన్నై – నో ఎక్జిట్, బ్లిస్ హోం, ఎవరెస్ట్ బేస్ కేంప్, వర్ల్డ్ వితిన్, ఐడెంటిటీ ఉద్యమాలు వగైరా. ఇవన్నీ పంటి కింద ఇంగువ ముక్కల్లా తగుల్తున్నాయి. ఎవరెస్ట్ బేస్ కేంప్ వదిలేసి (యాత్రానుభవం కనక, కానీ దీన్ని కూడా సులభంగా అనువదించగలరు అమరేంద్ర గారు) మిగతావి అన్నింటికీ తెలుగు పేర్లు పెట్టవచ్చు కదా? కనీసం సంపాదకులు కధలు/కవితలు రాసేవారికి ఎందుకు చెప్పడం లేదు తెలుగు పేర్లు పెట్టమని. మొత్తం అంతా తెలుగులో రాయమని కాదు కానీ కనీసం కధ/కవిత కి పేరు అయినా తెలుగులో పెట్టలేమా?
ఇంక ఈ నెలలో సంపాదకులకి ఉత్తరం గురించి చెప్పనవసరమే లేదు. దాదాపు మొత్తం అంతా ఆంగ్లంలోనే ఉంది. ఆంగ్ల కధకులని ఉటంకించినప్పుడు వాళ్ళవి ఇంగ్లీషులో చెప్పడం బాగానే ఉంది కానీ మొత్తం అంతా ఇంగ్లీషులో అయితే (అదీ వేలూరి లాంటి వారినుంచి!!). ఒక్కొక్కప్పుడు లైలాగారు స్పానిష్షో, ఫ్రెంచో రాస్తారు. అది ఎవరికోసమో అర్ధం కాదు. నాలాటి అర్భకులకి తెలుగు, ఇంగ్లీషుకూడా సరిగ్గా రావు; మిగతాభాషల సంగతి ఎందుగ్గానీ.
ఈమాట తెలుగు పత్రిక అనేది మర్చిపోతున్నామా? ఒక్కొక్కప్పుడు కధ/కవిత పేరు ఇంగ్లీషులో చూడగానే అది ఇంక చదవాలనిపించడం లేదు (కనీసం నా మటుక్కి). అనువాదాలు చేసే అవినేని భాస్కర్ గారు కూడా చక్కగా “అకాశంలో వినిపించే స్వరాలు,” అంటూ అనువదించగలుగుతున్నప్పుడు మిగతావారికి ఏమిటి కష్టం? సంపాదకులు కనీసం ఈ విషయం రచయితలతో చెప్పాల్సిన అవసరం ఉంది.
కాలం కథ గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
01/05/2025 12:12 pm
యుగాలూ, దినాలూ, ఆర్యభట్టీయం అంటూ చెప్పారు కనక ఇది కూడా చెప్తారనుకున్నా.
https://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=15 (3-345)
కాలము కొలత – రెప్పపాటు నుంచి మన్వంతరం వరకూ ఆపైన (ఒకపేజీ నుంచి మరో పై పేజీకి చూడాలి)
https://telugubhagavatam.org/?Details&Branch=anuyuktaalu&Fruit=(2)%20kalamuKolataDinaBhagamuluMuhurtamunlu
ఎవరెస్ట్ బేస్ కాంప్ – 3 గురించి Ramesh గారి అభిప్రాయం:
01/05/2025 10:48 am
మీ సాహస, అధ్యాత్మిక, యాత్ర కన్నులకు కట్టినట్లుగా వుంది, చాలా సంతోషంగా అనిపిస్తోంది.
సార్థక నామం: అధోలోకం గురించి Anil ఆట్లూరి గారి అభిప్రాయం:
01/04/2025 8:23 pm
ఈ పరిచయం చదివాక అనంతు కథ
ఫోర్ స్క్వేర్ http://vaakili.com/patrika/?p=14162
గుర్తు వచ్చింది.
‘కథనంలో ఇలాంటి వాక్యాలు పుస్తకమంతా మెరుస్తూనే ఉంటాయి.’
అనువాదకుల వాక్యాలా?
ఆకాశంలో వినిపించే స్వరాలు గురించి Vijaya Karra గారి అభిప్రాయం:
01/04/2025 3:58 pm
జయమోహన్ – ఎంత పరిశీలన, ఎంత వైవిధ్యం కదా ఈయన కథలలో !
చాసో కథ గురించి సత్తిరాజు గారి అభిప్రాయం:
01/04/2025 1:39 am