తెలుగు జానపద వాఙ్మయంలో, తరతరాల తెలుగు స్త్రీల పాటల్లో అంతర్భాగమైపోయిన రామాయణ కథల పరిశీలనలో, మరొక స్త్రీల పాట ‘సీత గడియ‘పై వెల్చేరు నారాయణరావు వ్యాసం; ఈ శీర్షికా సంప్రదాయంలో భాగంగా కోలవెన్ను మలయవాసిని 2000 ఆగస్ట్, షికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో “సాహిత్యం – స్త్రీల చైతన్యం” అనే అంశం మీద, సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం వీడియో; ఒకే గీతాన్ని ఇద్దరు గాయకులు, చిదంబరం, పద్మావతి వేర్వేరు రాగమాలికలుగా పాడిన కనకప్రసాద్ శబ్ద రచన త్రిపురాంతకేశ్వరా!; టంగుటూరి సూర్యకుమారి పాడిన నిర్వాణ షట్కం అపురూపమైన ఆడియో, ఈ సంచికలో ప్రత్యేకతలు.
ఈ సంచికలో:
- కవితలు: స్నానాలగదిలో – ఇంద్రాణి పాలపర్తి; మల్లెపూల మధూలిక – ఆర్. దమయంతి; చేపలార్బరు దినాలు – కనకప్రసాద్; చిరునవ్వుగాది – తఃతః; బిచ్చగత్తె శిశువు – రవి; రెండు జడలు – ఉదయకళ.
- కథలు: భయం – పూర్ణిమ తమ్మిరెడ్డి; కోనసీమ కథలు: పిండంతే నిప్పటి – సాయి బ్రహ్మానందం గొర్తి; కొవ్వుపుంజి – శారద; కాల్వినో కథల నుంచి 2 – మాధవ్ మాచవరం; విధ్వంసం – గౌరి కృపానందన్.
- వ్యాసాలు: సీత గడియ – వెల్చేరు నారాయణరావు; పిలూ రాగం – కొడవటిగంటి రోహిణీప్రసాద్; ఛందస్సు కొక కొండ కొక్కొండ – జెజ్జాల కృష్ణ మోహన రావు; ఏకైక కథాయానా – మెడికో శ్యామ్ కథలు – సాయి బ్రహ్మానందం గొర్తి; ఎమితినిసెపితివె – వేలూరి వేంకటేశ్వర రావు; వఱడు: కథ నచ్చిన కారణం – కె. వి. గిరిధరరావు; కినిమా పత్రిక నుంచి 2 – కొడవటిగంటి రోహిణీప్రసాద్; మూడు లాంతర్లు 10 – కనకప్రసాద్; పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి – సురేశ్ కొలిచాల; నాకు నచ్చిన పద్యం: వింధ్యుని స్వగతం – చీమలమర్రి బృందావనరావు.
- శబ్దతరంగాలు: శివోహం! శివోహం! – టంగుటూరి సూర్యకుమారి; త్రిపురాంతకేశ్వరా! చిదంబరం కవస్సెరి గానం; త్రిపురాంతకేశ్వరా! పేరి పద్మావతి గానం; రచన, స్వర కల్పన – కనకప్రసాద్.
- చిత్రతరంగాలు: సాహిత్యం – స్త్రీల చైతన్యం – కోలవెన్ను మలయవాసిని.
మీ సద్విమర్శలు, అభిప్రాయాలు మాకు తప్పకుండా తెలియజేయండి.
– ఈమాట సంపాదకులు.