స్టాండింగ్ న్యూడ్ – రోదాఁ (1900-05)
అనాదిగా స్త్రీని ఎన్నో రకాలుగా చిత్రకారులు చిత్రిస్తున్నారు. అయితే, ఏ చిత్రం స్త్రీ అంతరంగాన్ని కూడా చూపిస్తుంది, ఏ చిత్రం స్త్రీని కేవలం ఒక విలాసవస్తువుగానే గమనిస్తుంది, చిత్రకళా చరిత్రలో స్త్రీ మూర్తి చిత్రానికి ఉన్న విశిష్టత ఏమిటి — వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన సచిత్ర వ్యాసం ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి; భారతీయ సాహిత్యంలో వాస్తవికత పాశ్చాత్య సాహిత్య విమర్శకు ఎందుకు అందదో సత్య మొహంతితో ముఖాముఖీ-1: సాహిత్యంలో వాస్తవిక వాదం భరణి కొల్లిపర అనువాదం; సుమతి శతకం వలస పాలన వల్ల ఒక నీతి శతకంగా మన సంస్కృతిలో ఎలా మార్పు చెందిందో వివరిస్తున్న వెల్చేరు నారాయణ రావు వ్యాసం తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతీ శతకం ఈ సంచికలో ప్రత్యేకం.
ఇంకా: మూలా సుబ్రహ్మణ్యం, జాన్ హైడ్ కనుమూరి, స్వాతికుమారి బండ్లమూడి, తః తః కవితలు; గౌరీ కృపానందన్, జయప్రభ కథలు; మెలికముగ్గులలో గణితశాస్త్రపు ముడులు విప్పదీసే జెజ్జాల కృష్ణ మోహన రావు వ్యాసం; భాసుని సంస్కృత నాటకం ప్రతిమ నుంచి ఒక సన్నివేశం; పాలగుమ్మి విశ్వనాథానికి లలిత సంగీత నివాళి — పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్న అపురూపమైన ఆడియోలు; నాకు నచ్చిన పద్యం, కథ నచ్చిన కారణం…