ఈమాట మే 2012 సంచికకు స్వాగతం!


యక్షుడు – మాగంటి వంశీ మోహన్

ఆషాఢ మాసం కాకపోయినా, మధ్యాహ్నాలు ఆకాశమంతా నల్లమబ్బులు నిండిపోయి ఉరుములూ, మెరుపుల జడివానలు మనల్ని అప్పుడప్పుడూ పలకరిస్తున్నాయి ఇప్పటికే. వాటిని చూసేనేమో, కృష్ణ మోహన రావు గారు, కాళిదాస విరచిత మేఘదూతంపై వ్రాసిన ఛందోవ్యాసం ఆషాఢస్య ప్రథమ దివసే ఈ సంచికలో ప్రత్యేకం. ఈ వ్యాసానికి యక్షుడి చిత్రాలను అందించినది ఔత్సాహిక చిత్రకారుడు మాగంటి వంశీమోహన్‌గారు. అంతే కాదు, ఈ వ్యాసానికి తోడుగా పరుచూరి శ్రీనివాస్ సేకరించిన మేఘసందేశం ఆడియో రూపకం కూడా ప్రత్యేకమే. బాలాంత్రపు రజనీకాంత రావు రచన, సంగీత సారథ్యంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రధాన గాయకుడిగా ఆలిండియా రేడియో, బెంగళూరు నుంచి 1978లో ప్రసారమైన ఈ రూపకం అపురూపమైనదని అనడంలో సందేహం ఏమీ లేదు. అలాగే, స్త్రీల రామాయణపు పాటలను విశ్లేషిస్తున్న పరంపరలో భాగంగా వెల్చేరు నారాయణ రావుగారి వ్యాసం లక్ష్మణదేవర నవ్వు ఈ సంచికలో మీకోసం.


సంగీత్ నాటక్ అకాడెమీ టాగోర్ సమ్మాన్ పురస్కారానికి పట్రాయని సంగీత రావుగారినీ, టాగోర్ రత్న పురస్కారానికి బాలాంత్రపు రజనీకాంత రావుగారినీ ఎన్నుకొన్నారు. వారికి మా హార్దిక శుభాకాంక్షలు. ఈమాటలో వీరి గురించిన పరిచయ వ్యాసం 88 యేళ్ళ యువకులు.


ఇంకా:

  • కవితలు :- చందవరం, ప్రకాశం జిల్లా – పాలపర్తి ఇంద్రాణి; దీక్షా లాక్షా రాగ రేఖ – తఃతః; తేనీటి సమయం – వైదేహి శశిధర్; ఓ నాలుగు చిన్న కవితలు – వై. ముకుంద రామారావు; ఒక పుస్తకం – హెచ్చార్కె.
  • కథలు:- బ్రహ్మ సృష్టి – వేలూరి వేంకటేశ్వర రావు; జాతర – గౌరి కృపానందన్; హాబూ నిప్పు – పూర్ణిమ తమ్మిరెడ్డి; కాల్వీనో కథలనుంచి 3 – మాధవ్ మాచవరం.
  • వ్యాసాలు:- లక్ష్మణదేవర నవ్వు – వెల్చేరు నారాయణ రావు; ఆషాఢస్య ప్రథమ దివసే – జెజ్జాల కృష్ణ మోహన రావు; మూడు లాంతర్లు 11 – కనకప్రసాద్; పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 – సురేశ్ కొలిచాల; నాకు నచ్చిన పద్యం: అర్జునుని వర్ణన – చీమలమర్రి బృందావన రావు.
  • ఇతరములు:- కినిమా పత్రిక నుంచి 3 – కొడవటిగంటి రోహిణీప్రసాద్; అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం – వేలూరి వేంకటేశ్వర రావు; మేఘసందేశం: ఆలిండియా రేడియో రూపకం – పరుచూరి శ్రీనివాస్; బాల బేలవు ముద్దరాల: శబ్ద రచన – కనకప్రసాద్. వలపారగింపవమ్మ వనిత నీ యలుక చిత్తమున: జయప్రభ పుస్తకం అన్నమయ్య పదపరిచయం పై సమీక్ష – సాయి బ్రహ్మానందం గొర్తి.