చేపలార్బరు దినాలు
చెల్లిపోయిన క్షణాలు
చెప్పడానికి వెనక్కి
కాళ్ళీడ్చుకు నివాళ
కళ్ళారా నిన్ను.
తలుపు తియ్యి కంతల్లి
తలుపు! తలుపు!! తలుపు!!!
పర లోక రాజ్యము
మనవంటి వారిది.
నా తోవ కడాకు
నా తోవంట నాకు
ఎటూ తోచని తనాలు
ఎవో జ్ఞాపకాలు
చివరికింక తెగించి
తడబాటు దేనికి
అడుగుతున్నాను
మనకు తీయబడును.
ఉన్నట్టుండి ఆ గాలి
విన్నావా రాజాలి
బిందెలూగుతున్నట్టు
చింత చెట్టు కిచకిచలు
బతుకంత అనాది
వెదుక్కుంటున్నాము
మనకు ఈయబడును.
తెల్లవారు ఝాములు
నీ మీద నాకు
చెరుకు బళ్ళ వెనకాల
అడుగులో నీ అడుగు
నువ్వంటే ఎందుకె
కటిక్కర్రల చలి మంట
ఎన్నేళ్ళ నాటివి
నీ మీదా నాకు?
అదికాదు పాపతల్లి
తలుపు! తలుపు!! తలుపు!!!
స్ఫూర్తి: open the kingdom – డేవిడ్ బైర్న్ (David Byrne) ఫిలిప్ గ్లాస్ (Phillip Glass) సంగీతాన్ని సమకూర్చిన సాంగ్స్ ఫ్రం ది లిక్విడ్ డేస్ అన్న ఆల్బం కోసం రాసిన పాట.