రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

రెండుజడలు

రచన: ఉదయకళ
మార్చి 2012

జీవకణాలు సలిపే క్షణాల సృష్టి
ఈ వసుంధరపైన జీవనవృష్టి
డీఎన్ఏ రెండుజడల పరిష్వంగం
శివశక్తుల తాండవ తరంగం
జీవకణాల సంయోగవియోగాలు
భావకవుల భవిష్యత్కావ్యాలు
అనంత చరణాల ఈ జీవనగీతం
శతసహస్రవాద్యాల స్వరసంగమం
ఈ కంప్యూటర్ ప్రోగ్రాం ప్రణాళిక
మానవమేధ కొక ప్రహేళికల కేళిక
జనియించిన శిశువుల కేక
మరణానికిముందటి శ్వాస
ప్రణయాశ్లేషములో ప్రథమ చుంబనం
సమరాంగణములో సాహస విజృంభణం
హృదయాన్ని వణికించే వసంతయామినిలాటి యౌవనం
దేహాన్ని వణికించే హేమంతయామినిలాటి వార్ధక్యం
నవరసాల భావోద్రేకాల ఇంద్రధనుస్సు
రకరకాల రోగోద్వేగాల అంపశయ్య
పలికితే పలికించేది కులికితే కులికించేది
కదులుతూ నడిపించేది పెరుగుతూ బ్రదికించేది
జన్యువులే జీవకణాలే సర్పిలాల సంభోగాలే
చతురక్షర భాషలో వ్యాకరణదోషాలు దొర్లితే
సృష్టిగీతంలో అపస్వరవిపంచిక పలుకుతుంది
జీవననృత్యంలో మరణమృదంగం మ్రోగుతుంది
జీవనసముద్రమంథనంలో
ఆనందరాగాలను శోకార్ద్రరోగాలుగా మార్చి
ఆరోగ్యసూర్యుని మేఘాచ్ఛాదితం చేసి
అమృతానికి బదులు గరళాన్ని
ఉద్భవింపజేసే కణాలు
కాలునికి అర్పణాలు యమునికి తర్పణాలు
అదను చూచుకొని వృశ్చికము కాటేస్తుంది
కర్కటకము కౌగిలించుకొంటుంది
ఫలితం – ఇంకా ఆన్సర్ దొరకని కాన్సర్

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అమ్మా, నాకేం పేరు పెడతావు?
  • అమ్మ
  • ఓ శాంతీ
  • హిమబిందు
  • అతిథి

ఇటువంటివే…

  1. ఊపిరిపాటకు చూపేదీ?
  2. చిరునవ్వుగాది
  3. స్నానాల గదిలో
  4. మల్లెపూల మధూలిక
  5. చేపలార్బరు దినాలు

మార్చి 2012 సంచికలో ...

  • ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం!
  • ఎమితిని సెపితివె?
  • ఏకైక కథాయానా – మెడికో శ్యామ్ కథలు
  • కాల్వీనో కథల నుంచి – 2
  • కినిమా పత్రిక నుంచి – 2
  • కొవ్వుపుంజి
  • కోనసీమ కథలు: పిండంతే నిప్పటి
  • చిరునవ్వుగాది
  • చేపలార్బరు దినాలు
  • ఛందస్సు కొక కొండ కొక్కొండ
  • త్రిపురాంతకేశ్వరా!
  • త్రిపురాంతకేశ్వరా!
  • నాకు నచ్చిన పద్యం: వింధ్యుని స్వగతం
  • పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి
  • పిలూ రాగం
  • బిచ్చగత్తె శిశువు
  • భయం
  • మల్లెపూల మధూలిక
  • మూడు లాంతర్లు – 10
  • రెండుజడలు
  • వఱడు: కథ నచ్చిన కారణం
  • విధ్వంసం
  • వెల్చేరు కవితలు కావలెను
  • శివోహం! శివోహం!
  • సాహిత్యం – స్త్రీల చైతన్యం
  • సీత గడియ
  • స్నానాల గదిలో
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

చిరునవ్వుగాది
బిచ్చగత్తె శిశువు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.