సాహిత్యం – స్త్రీల చైతన్యం

2000 సంవత్సరం ఆగస్ట్ 18-19వ తేదీల్లో షికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో “సాహిత్యం – స్త్రీల చైతన్యం” అనే అంశం మీద డా. కోలవెన్ను మలయవాసినిగారి ప్రసంగం వీడియో ఇది. ఈ ప్రసంగంలో వారు సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో ఊర్మిళ నిద్ర పాట గురించిన ప్రస్తావన ఉన్నందువలన, ఇది జనవరి, మార్చ్ సంచికలలో స్త్రీల పాటలపై వెల్చేరు నారాయణరావు వ్రాసిన వ్యాసాలకు అనుబంధ సమాచారంగా ఉంటుందని ఇక్కడ మీకందిస్తున్నాము. కేవలం అనుబంధమనే కాకుండా, మలయవాసినిగారి ఈ ప్రసంగం స్వతహాగానే ఎంతో ఆసక్తికరమైనది, అందరూ వినదగింది. నిడివి: 28ని.

(గమనిక: వీడియోలో మొదటి 15-20 సెకన్లు మాత్రమే చక్కగా లేదు. ఆపైన ఆడియో, వీడియో రెండూ స్పష్టంగానే ఉన్నాయి.)


కోలవెన్ను మలయవాసిని

రచయిత కోలవెన్ను మలయవాసిని గురించి:

మలయవాసినిగారు రచయిత్రి, అధ్యాపకురాలు, ఉపన్యాసకురాలు. వీరి తండ్రి శేషగిరిరావుగారు ఆంధ్ర భూమి, ఆంధ్రకీర్తి, ఆనందవాణి, గృహలక్ష్మి, ప్రజామిత్రలాంటి పత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు. 1992-95 లలో బోర్డ్ స్టడీస్ కు చైర్ పర్సన్ గానూ పనిచేశారు. 60 రేడియో చర్చలను ప్రసారం చేశారు. వీరి అనేక రచనలలో \’పువ్వులు\’ మినిస్టరీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ భారత ప్రభుత్వ బహమతి పొందింది. వీరి ప్రతిభకు ఎన్నో సాహితీ సంస్థలు పురస్కారాలను, సత్కారాలను అందించాయి.

 ...