ఈమాట జనవరి 2012 సంచికకు స్వాగతం

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!


ఊర్మిళ – స్వర్ణేందు ఘోష్

ఊర్మిళాదేవి నిద్ర: మన ప్రాచ్య సంస్కృతులలో రామాయణం కేవలం ఒక కావ్యం కాదు. సీతారాముళ్ళు కేవలం దేవతలూ కారు. రామాయాణంలో పాత్రలన్నీ మన జీవితాల్లోని పాత్రలు. మన జీవితాల్లో ఉండే కష్ట నష్టాలు, సుఖదుఃఖాలను మనలాగే అనుభవించే మామూలు మనవాళ్ళు. అందుకేనేమో, మనకెన్ని వందల రామాయణాలో! ఒక్కో రామాయణం చెప్పే కథ ఇంకో రామాయణం చెప్పదందుకే మరి! మన తెలుగు జానపద వాఙ్మయంలో, తరతరాలుగా తెలుగు స్త్రీల పాటలలో ఒక విడదీయరాని భాగమైపోయిన అచ్చు అలాంటి ఒక రామాయణపు కథే ఊర్మిళాదేవి నిద్ర. ఈ కథ ఇతర భాషల్లో కూడా వున్నా, ఈ పాట నిస్సంశయంగా తెలుగు కవయిత్రి సృష్టి. తెలుగు మహిళావరణంలో మౌఖికసారస్వతంగా మొదట రూపుదిద్దుకున్న ఈ అపూర్వమైన జానపద సాహిత్యం గురించి వివరిస్తున్న వెల్చేరు నారాయణరావు విశిష్ట వ్యాసం, బి. సుబ్బులు, కోలవెన్ను మలయవాసినిగార్లు పాడిన ఈ పాట, ఈ సంచిక ప్రత్యేక ఆకర్షణలు.

09 జనవరి: ఆకస్మిక ప్రచురణ – వేణునాదం ఆగింది! ఏల్చూరి విజయరాఘవరావుగారికి రోహిణీప్రసాద్ నివాళి.


ఈ సంచికలో మీకోసం:

  • కొత్త ఏడాదికి ఈమాట కొత్త తీర్మానాలపై ముఖ్యసంపాదకుడు వేలూరి వేంకటేశ్వర రావు నాలిక గాఠ్ఠిగా బుగ్గలో పెట్టుకుని చెప్పిన విశదం ఈ సంచికలో సంపాదకీయం.
  • కథలు: ఒకనేను, కొన్ని నువ్వులు – చంద్ర కన్నెగంటి; పొదుపు సమీకరణాలు – బులుసు సుబ్రహ్మణ్యం; మౌనంతో ముఖాముఖి – సి. రామసీత; భోగి తలంటు – ఆర్. దమయంతి; గోమెజ్ ఎప్పుడొస్తాడో! – వేలూరి వేంకటేశ్వర రావు; కాల్వీనో కథలనుంచి – మాధవ్ మాచవరం; మారిన కాలం మారిన మనుషులు – గౌరీ కృపానందన్.
  • కవితలు: సిరియాళదేవి -తిరుమల కృష్ణదేశికాచార్యులు; ఒక్క క్షణం – హెచ్చార్కె; ఆగవే రజనీ విభావరీ – తః తః; నన్ను ఎవరో చదివారు – జాన్‌హైడ్ కనుమూరి; కన్నెవాన – కె. వంశీకృష్ణ; నాకే గనక తెలిస్తే – కనకప్రసాద్.
  • వ్యాసాలు: సారామానను – జెజ్జాల కృష్ణమోహన రావు; మహాకవి తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము – బాలంత్రపు వేంకట రమణ; కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం – సి. ఎస్. రావ్; ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం – కొడవటిగంటి రోహిణీప్రసాద్; మూడు లాంతర్లు 9 – కనకప్రసాద్; ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన – వెల్చేరు నారాయణరావు; ఎందుకు పారేస్తాను నాన్నా! కథా రచన – చాగంటి సోమయాజులు.
  • శీర్షికలు: కథ నచ్చిన కారణం లో ఉరి కథ పై వైదేహి శశిధర్; పలుకుబడిలో మానవ బంధుత్వ పదాల గురించి సురేశ్ కొలిచాల; నాకు నచ్చిన పద్యంలో అర్జునుడి ఎత్తిపొడుపు గురించి చీమలమర్రి బృందావనరావుల వ్యాసాలు.కొడవటిగంటి రోహిణీప్రసాద్ అందించిన కినిమా పత్రికనుంచి కొన్ని జ్ఞాపకాలు.
  • శబ్ద తరంగాలు: ఊర్మిళాదేవి నిద్ర – కోలవెన్ను మలయవాసిని; అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర – బి. సుబ్బులు; రంగనాధునివా రాతిబొమ్మవా – కనకప్రసాద్.

మీ సద్విమర్శలే ఈమాటకు జీవగఱ్ఱని మరువకుండా, ఆదరాభిమానాలతో ఈమాటని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.

– ఈమాట సంపాదకులు.