వెల్చేరు కవితలు కావలెను

వెల్చేరు నారాయణరావుగారు మనకు ప్రసిద్ధ సాహితీ విమర్శకులుగా, విద్యావేత్తగా మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక కవి అని మనలో ఎక్కువమందికి తెలియదు. ఆయన వ్రాసిన మంచి కవితలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ ఒక సంపుటంగా తీసుకురావాలని మేము సంకల్పించాము. అయితే, ఈ కవితలు అన్నీ అందుబాటులో లేవు. వాటిని సేకరించడం ముందు ముఖ్యమైన పని. ఈ బృహత్కార్యంలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. మీ దృష్టికి వచ్చినవి, మీ దగ్గర ఉన్నవి నారాయణరావుగారి కవితలు మాకు తెలియజేసి మా ప్రయత్నానికి సహకరించ వలసిందిగా కోరుతున్నాము.

అఫ్సర్
(afsarteluguఎట్gmail.com)


అఫ్సర్

రచయిత అఫ్సర్ గురించి:

కవి, విమర్శకుడు, రచయిత, సీనియర్ ఉపన్యాసకుడు అఫ్సర్ కు బాల్యం నుండి సాహిత్యవాతావరణంలో పెరగటం వల్ల కవిత్వం పట్ల మక్కువ ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి బి.ఏ. గోల్డ్ మెడల్‌తో ఉత్తీర్ణుడయ్యారు. తులనాత్మక సాహిత్యంలో ఎం.ఏ చేశారు. “ఆధునిక కవిత్వము తెలంగాణా నేపథ్యం” అనే విషయంపై పి.హెచ్.డి చేశాడు. అమెరికా లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి 2010లో Following the Saint: Devotion and Public Religious Performances in South India అనే అంశం పై పరిశోధించి డాక్టరేట్ సంపాదించారు. అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీలలో దక్షిణాసియా సాహిత్య సంస్కృతుల సీనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, భారత ప్రభుత్వంనుండి సరస్వతీ భాషాసమ్మాన్ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నారు. సారంగ సాహిత్య పక్ష పత్రికకు సారథ్యం వహిస్తున్నారు.

 ...