త్రిపురాంతకేశ్వరా
రాగం: రాగ తాళ మాలిక
స్వర కల్పన, సంగీతం, గానం: పేరి పద్మావతి
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్
సాహిత్యం
{మాయా మాళవగౌళ}
పల్లవి:
త్రిపురాంతకేశ్వరా
ఇపుడేది త్రోవరా
రిపులారుగురి కేల సోలి కైవ్రాలి వెట్టి కైకిలి సేవరా. |త్రిపు|
ఇపుడేది త్రోవరా
రిపులారుగురి కేల సోలి కైవ్రాలి వెట్టి కైకిలి సేవరా. |త్రిపు|
{పీలూ}
చరణం:
దేహమ్ దురంసల కటాహమ్
వృత్తమ్ మహేచ్ఛా విదాహమ్
గేహమ్ అవితృప్త లోలమ్
చిత్తమ్ సదా మత్త వైచిత్ర వ్యాలమ్ పశుపతే
వృత్తమ్ మహేచ్ఛా విదాహమ్
గేహమ్ అవితృప్త లోలమ్
చిత్తమ్ సదా మత్త వైచిత్ర వ్యాలమ్ పశుపతే
{నాద నామక్రియ}
అనుపల్లవి:
జపమాల చాఁతునా?
తపమేమి చేతునా?
విపులాచ పృథ్వియని ఈడ నాడ ఏడాడు త్రిప్పటలాడి వేఁతునా? |త్రిపు|
తపమేమి చేతునా?
విపులాచ పృథ్వియని ఈడ నాడ ఏడాడు త్రిప్పటలాడి వేఁతునా? |త్రిపు|
{మధువంతి}
చరణం:
వారమ్ అభివేగ భారమ్
రాత్రమ్ విగతమ్ అనువారమ్
చింతా అహఁ మదభ్యాంతా
నిద్రా ఛాయా దష్ట వికలా భస్మ శాయిన్
రాత్రమ్ విగతమ్ అనువారమ్
చింతా అహఁ మదభ్యాంతా
నిద్రా ఛాయా దష్ట వికలా భస్మ శాయిన్
{కళ్యాణ వసంతం}
అనుపల్లవి:
లోనింత లోపము
నేటించు లోకము
పైపైన గోటు మాటు వాచాటు టక్కరి పటాటోపము |త్రిపు|
నేటించు లోకము
పైపైన గోటు మాటు వాచాటు టక్కరి పటాటోపము |త్రిపు|
{శుభ పంతువరాళి}
చరణం:
విషయా: విషాదన నిచయా:
చర్యా తర్షిత కదర్యా
చర్చా నిభృత జిగీషా
శాస్త్రమ్ వాగ్జాల మాత్రమ్ భగవన్ కాలహంత్రే
చర్యా తర్షిత కదర్యా
చర్చా నిభృత జిగీషా
శాస్త్రమ్ వాగ్జాల మాత్రమ్ భగవన్ కాలహంత్రే
{మాయా మాళవగౌళ}
అనుపల్లవి:
అరుణాచలమ్మట
అరచేతి స్వఁమ్మట
కరుణా మసృణ స్థాణు మౌనావరణ మహా కృచ్ఛ్రోజ్జ్వలమ్మట. |త్రిపు|
అరచేతి స్వఁమ్మట
కరుణా మసృణ స్థాణు మౌనావరణ మహా కృచ్ఛ్రోజ్జ్వలమ్మట. |త్రిపు|
(వ్యాకరణ దోషాలు సవరించి పెట్టిన డా. జె.ఎస్.ఆర్.ఎ. ప్రసాద్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గీతానికి స్వర రచన కావలసినవారు ఈమాట సంపాదకుల ద్వారా మమ్మల్ని సంప్రదించమని మనవి.)
‘కేవీయెస్ రామారావుకు, for untold kindnesses’