ఆధునిక వర్ణచిత్రకళను సమూలంగా మార్చివేసిన క్యూబిౙమ్ పద్ధతికి ఆద్యులైన బ్రాక్, పికాసో ద్వయంలో ఒకరిగా, ఇరవయ్యవ శతాబ్ది మేటి చిత్రకారుల త్రయం, బ్రాక్, పికాసో, మథీస్లలో ఒకరిగా ప్రసిద్ధి కెక్కిన చిత్రకారుడు జ్యార్జ్య్ బ్రాక్. ఆ మహోన్నత చిత్రకారుడు బ్రాక్ గురించి ఎస్. వి. రామారావు వ్రాసిన వర్ణ చిత్ర సహిత సమగ్ర వ్యాసం; సుశ్రావ్య పద్యపాఠి జువ్వాడి గౌతమరావు గానం చేసిన రుక్మిణీ కళ్యాణం; బహుముఖ ప్రజ్ఞాశాలి, నటి, గాయని, క్రీడాకారిణి టి. జి. కమలాదేవి గురించి పరుచూరి శ్రీనివాస్ సంక్షిప్త వ్యాసం; సాహిత్య విమర్శకుడు, విశ్వనాథ పాండిత్య కరదీపిక, జువ్వాడి గౌతమరావు గారి గురించి పరిచయ వ్యాసం, వారి సాహిత్యధార నుంచి రెండు వ్యాసాలు; ఈ సంచికలో ప్రత్యేకం.
ఈ సంచికలో:
- కథలు: కాల్వీనో కథలనుంచి ఆఖరి రెండు కథలు: గూగోళజ్ఞానం, తిరగబడ్డ తొమ్మిది – మాధవ్ మాౘవరం; రెండో రుమాలు – సాయి బ్రహ్మానందం గొర్తి; నిష్కృతి – గౌరి కృపానందన్.
- కవితలు: స్వప్నసుందరి – వింజమూరి బాలమురళి; ప్రాసక్రీడాశతకము – జెజ్జాల కృష్ణ మోహన రావు; తిరణాల – పాలపర్తి ఇంద్రాణి; వాన – ఆర్. శర్మ దంతుర్తి; నువ్వూ-కాలం – మూలా సుబ్రహ్మణ్యం; స్వప్నభంగం – విన్నకోట రవిశంకర్.
- వ్యాసాలు, శీర్షికలు: మహోన్నత చిత్రకారుడు బ్రాక్ – ఎస్. వి. రామారావు; మా పెద్దనాన్న జువ్వాడి గౌతమరావు గారు – రమణ జువ్వాడి; టి. జి. కమలాదేవి – పరుచూరి శ్రీనివాస్; రామాయణ కల్పవృక్షచ్ఛాయ – జువ్వాడి గౌతమరావు; వ్యవహార భాష: వ్యాకరణం – జువ్వాడి గౌతమరావు; నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన – చీమలమర్రి బృందావనరావు; పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం – వేలూరి వేంకటేశ్వర రావు.; పలుకుబడి: కాలమానము – సురేశ్ కొలిచాల
- శబ్దతరంగాలు: జువ్వాడి గౌతమరావు గానం చేసిన రుక్మిణీ కళ్యాణం పూర్తి పాఠం.
- 2012 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గ్రహీతల వివరాలు.