రుషులను చూడటానికి వారి ఆశ్రమాలకు దేవతలు వచ్చినట్లే, ఆ అరణ్యంలో సీతారాములను చూడటానికి, జగత్తులోని పూర్వపరాలలోని ప్రేమికుల జంటలు -రోమియో జూలియట్; ముంతాజ్ షాజహాన్; పార్వతి శివుడు; లైలా మజ్నూ; వీనస్ అడోనిస్; క్లియొపాట్రా ఏంటొనీ; భాగ్యమతి కులీకుతుబ్ షా; ఎంకి నాయుడుబావ; ఎలిజబెత్ ఫిలిప్; జేన్ టార్జాన్; హెలెన్ పారిస్; అనార్కలి సలీమ్, మరియా వాన్ట్రాప్ -ఎందరెందరో ఆ చుట్టు పట్ల చరించారేమో మరి!
Category Archive: పద్య సాహిత్యం
ఈ నేల నడవనిస్తుందీ
నాకు గరిక తివాసీ పరుస్తుంది
ఈ ఎండ ఎదురు వస్తుందీ
నా మెడలో పొగడ దండ వేస్తుంది
ఈ గాలి గౌరవిస్తుందీ
నాకు పూల గంధాలు పూస్తుంది
ఈ వాన పలకరిస్తుందీ
నా పై పన్నీరు చిలకరిస్తుంది
ఇందలి ఇతివృత్తము శృంగార,కరుణారస భరితమై ఇంపుగా నున్నది. దీనిని భారతసంస్కృతికి అన్వయించుకొనుటకు కొన్ని ముఖ్యమైన మార్పు లవసరమైనవి. 12వ శతాబ్దిలో జెరూసలెంవంటి క్రైస్తవపుణ్యస్థలములను పరిరక్షించుకొనుటకై అచ్చట నున్న ముస్లిముపాలకులతో మధ్యప్రాచ్యదేశములలో యూరోపియనుల కనేక మతయుద్ధములు జరిగినవి.
కట్టిన పుట్టమేమి, కనకాంబరమా? కరితోలు! నెత్తిపై
బెట్టినదేమి, మత్త శిఖిపింఛమ? ఉమ్మెత గడ్డిపువ్వు, మై
దట్టిన దేమి, చందన కదంబరమా? తెలి బూది! నిన్ను జే
పట్టిన రాచ పట్టి చలువన్ పరమేశ్వరుడైతి ధూర్జటీ!
మేనక అను ఈ ఆపెరా ఈకోవలో నేను చేసిన ఏడవరచన. ఇది మసెనే ఆపెరాకంటె అనేకవిషయములలో భిన్నముగా నున్నది. ఇతివృత్తమును భారతసంస్కృతికి అన్వయించుచు వ్రాయుటకై ఈభిన్నత్వ మవసరమైనది. అందుచే మాసినో ఆపెరాకు అనువాదముగాఁ గాక అనుసృజనగా, అనేకమైన మార్పులతో, నూతనసన్నివేశ పరికల్పనలతో చేసిన స్వతంత్రరచన యిదని గ్రహింపవలెను.
లక్ష్మి యను పేరునకు యూరోపియనుల ఉచ్చారణలో వికృతమైన లాక్‍మె యను పేరుగల ఆపెరా ఎడ్మోఁ గోడినే మఱియు ఫిలీప్ జీలా అను ఫ్రెంచి కవుల రూపకరచనకు సుప్రసిద్ధుఁడైన ఫ్రెంచి సంగీతకారుఁడు లియో డెలీబ్ సంగీతరచన చేసిన సంగీతరూపకము.
ఆయుత్సవములో ముస్తఫాకడ దాసులుగా నున్న ఇటలీదేశీయులు బృందగాయకులుగా పాల్గొన్నారు. కామాంధుడైన ముస్తఫా ఆ సభ్యత్వము గైకొని, దాని నియమములను తప్పక పాటింతునని ప్రమాణము చేసినాడు. ఆ నియమములు సుష్ఠుగా నిరంతరము తినుచుండుట, సురాపానము చేయుచుండుట, చుట్టూరా ఏమి జరుగుచున్నను దానిని పట్టించుకొనక యుండుట – అనునవి.
గణపతిముని విదేశీయుల పాలనలో కృశించిపోయిన భారతసమాజం మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలనే అకుంఠితమైన శ్రద్ధతో, వేదనతో తన తపఃజీవితాన్ని గడిపాడు. స్వతంత్రోద్యమంలో కొన్నాళ్ళు చురుగ్గా పాల్గొని, మద్రాస్ కాంగ్రెస్ సభలలో సభ్యుడిగా పాల్గొన్నాడు. గాంధీజీ హిందీ భాషోద్యమంతోనూ, హరిజనోద్యమంతోనూ ఆయనకి మౌలికమైన విభేదాలు రావడంతో, కాంగ్రెస్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది.
ఆకాశమందలి యవిభక్త నాద
మాకారమైయెప్పు నక్షరమునకు
ఆనాదముగణేశు నాదిమమూర్తి
ధ్యానముచేయుట దానిని వినుట
శర్వుని పట్టిగా సత్యనాదమును
సర్వము తెలిసిన సజ్జనులనిరి
మహాకవులు ఇలాంటి కథలు ఎందుకు వ్రాస్తారో నాకు అర్థం కాదు. శివపూజ చేస్తే పాపాలు పోతాయి అని చెప్పడానికి ఇంత మహా పాపాల్ని చేయించాల్నా? కనీసం భక్తి అనేదే లేక, అనాలోచితంగా జరిగిపోయిన పనులే పూజలుగా భావింపబడి–వినటానిక్కూడా అసహ్యం అనిపించే తనయాగమనం లాంటి భ్రష్టకార్యాలు కూడా మానవుడి ప్రయత్నం గానీ, కనీసం పశ్చాత్తాపం గానీ లేకుండా మాసిపోయేటట్లయితే–ఇక భక్తి దేనికి, సత్కర్మాచరణ ఎందుకు?
లా సెర్వ పద్రోనా అనునది జెన్నర్ ఆంతోనియో ఫ్రెదెరికో అను రచయిత ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు ఇటాలియను సంగీతకర్త యగు జ్యోవానీ బత్తిస్తా పెర్గొలేసీ అను నతడు సంగీతరచన చేసిన లఘుసంగీతరూపకము. లోగట ఈమాటలో ప్రచురింపబడిన నారెండు ఆపెరాలవలెనే, ఇందులో గూడ సులువైన పదములుగల కంద, గీత, ఆటవెలదులను, గేయములను వ్రాసినాను.
తెలుగు పెండ్లిళ్ళలో స్నాతకమనీ, నాగబలి అనీ, తలంబ్రాలు అనీ, మాంగల్యధారణ అనీ ఉండేవి కేవలం లాంఛనాలు అయితే కావచ్చునేమో గాని అప్పగింతల సమయం మాత్రం గొప్ప హృదయస్పర్శి అయిన సన్నివేశం. పెండ్లి చూడ్డానికి వచ్చినవాళ్ళకు అదొక తంతుగా కనిపించొచ్చు గాని, వధువుకూ, ఆమెని కన్నవారికీ మాత్రం అది వారికే అనుభవైకవేద్యమైన బాధ.
ఒక స్త్రీ ఏడ్పును వర్ణించే ఘట్టం అది. ఆ స్త్రీ మనుచరిత్రంలోని కథానాయిక వరూధిని. తాను కామించిన ప్రవరుడు తనను తిరస్కరించిన తరువాత, తాను కొంత చొరవ చూపబోతే త్రోసేసినప్పుడు- ఆ తిరస్కృతి కలిగించిన అవమానమూ రోషమూ వేదనా ముప్పిరిగొని ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది ఆమెకు. కన్నీరు ఉబికింది. అయితే ఆమె రోషావమానాలకన్నా, నొప్పిని కారణంగా చూపించింది.
పదాలకుండే సౌందర్యాన్ని ఎరిగి, వాటిని ఉచిత స్థానంలో పొదిగి, ఆ సౌందర్యాన్ని దిగంత ప్రదర్శనం చేసే కళను స్వాధీనం చేసుకున్న కవి వ్రాసింది ఈ పద్యం. శబ్దాలొలికించే సంగీత మాధుర్యాన్ని ఆకళింపు చేసుకుని, వాటి ప్రవాహపు ఒరవడిని ఒక క్రమవిభక్తమూ, సమవిభక్తమూ చేసి, పద్యగతిని హయగతిలోనూ, గజగతిలోనూ నిబంధించగలిగిన కవి వ్రాసిందీ పద్యం. కవి ఏమి చెపుతున్నాడు అనేది తరవాతి సంగతి. పద్యం చదువుతుండగానే శభాష్ అనిపించే పద్యం ఇది.
ఎఱ్ఱాప్రగడ రామాయణం కూడా రచించాడనీ, అది లభ్యం కావడంలేదనీ అంటారు. ఎఱ్ఱాప్రగడ రామాయణంలోవని ఒకట్రెండు పద్యాలు కొందరు లక్షణ కర్తలుదాహరించడమే ఈ అపోహకు ఆధారం. ఆ ఊహ నిజమై, ఇరవైయవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో హఠాత్తుగా నన్నెచోడుని కుమారసంభవం ప్రత్యక్షమైనట్లు ఎఱ్ఱన రామాయణం కూడా మున్ముందెపుడైనా ప్రత్యక్షమైతే తెలుగు భాషా, తెలుగు జాతీ చేసుకున్న అదృష్టం పండినట్లే.
ఏ కావ్యానికయినా దాని భాగధేయాన్ని నిర్ణయించేది కవి యెడ సానుభూతి లేని రంధ్రాన్వేషణాతత్పరులైన పండితులు కారు. సాధారణ పాఠకులు. తెలుగు పాఠకులు మొల్ల రామాయణాన్ని ఆనందంగా ఆహ్వానించి గుండెలకు హత్తుకున్నారు. మళ్ళీమళ్ళీ చదువుకొని మననం చేసుకోదగిన పద్యాలు చాలానే ఉన్నాయి అందులో. తాను విదుషిని కాదనీ, శాస్త్రాదులు తనకు తెలియవు అని అన్నాకూడా కవిత్వమనేది ఎలా ఉండాలో కచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి మొల్లకు.
భారత యుద్ధానంతరం ఒకరోజు అర్జునుడు ద్వారకకు వస్తాడు, కృష్ణుణ్ణి చూడడానికి. ఆ రోజు కృష్ణుడు ఏదో దీక్షలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక బ్రాహ్మడు ఏడ్చుకుంటూ కృష్ణార్జునుల దగ్గరికి వస్తాడు దీనంగా. ఆయన శోకాన్ని చూసి కృష్ణుడు కన్నీరు పెట్టుకుంటాడు. కృష్ణుడి బాధను చూసి అర్జునుడూ కళ్ళనీళ్ళపర్యంతమవుతాడు. సంగతేమిటంటే ఆ విప్రుని భార్య గర్భవతిగా వుండి, శిశువును ప్రసవించగానే ఆ శిశువు చనిపోతాడు.
ఇల్ మాత్రిమోనియో సెగ్రేతో అనునది జొవాన్ని బెర్తాతి ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు సుప్రసిద్ధ ఇటాలియను సంగీతకర్త యగు దొమీనికో చిమరోసా అను నతడు సంగీతరచన చేసిన సుప్రసిద్ధమైన సంగీతరూపకము . హాస్యరసాన్వితమైన అన్ని ఆపెరాలకును ఇది తలమానికమైనదని సంగీతపండితుల అభిప్రాయము.
మారన ఒక సంస్కృత పురాణాన్ని తెనిగించిన తొలి తెలుగు కవి. ఈయనకు తిక్కనగారంటే మహా గౌరవము. ‘తిక్కన సోమయాజి ప్రసాదలబ్ధ సరస్వతీపాత్రుడ’నని తన కావ్యంలోని ఆశ్వాసాంత గద్యల్లో చెప్పుకున్నాడు. అన్నట్టు ఈయన తండ్రి పేరు కూడా తిక్కనామాత్యుడే. తన మార్కండేయ పురాణం అనువాదాన్ని మారన ప్రతాపరుద్ర చక్రవర్తి సేనానాయకుడైన గన్న సేనానికి అంకితమిచ్చాడు.