మాట్లాడితే మనుస్మృతిని రామాయణాన్ని పురాణాలని పురాణ పాత్రల్ని విమర్శిస్తూ వాటి వెనక నక్కి ఆధునిక యుగంలో తమ ఆలోచనలు ఆచరణ తీసుకువచ్చిన విషమ పర్యవసానాలను గుర్తించడంలో ప్రగతి శీల మేధావులందరూ విఫలమయ్యారు.
రచయిత వివరాలు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
రాణి శివశంకరశర్మ ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్’ ద్వారా తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించిన రచయిత. ఆధునిక నాగరికత, సమాజం, రాజకీయాలను భారతీయ తాత్విక దృక్కోణంతో సునిశితంగా విశ్లేషించిన ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్’ ఇంగ్లీషు, కన్నడ, సంస్కృతాది పలు భాషల్లోకి అనువాదమై దేశవిదేశాల్లో ఆదరణకు నోచుకుంది. ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్’ వెలువడ్డ ఆరేళ్ల అనంతరం దానికి కొనసాగింపుగా వచ్చిన ‘గ్రహాంతరవాసి’ నవల ప్రచురితమైంది. రాజకీయాలు, మతం, తత్వశాస్త్రం, సాహిత్యాల గురించి మౌలికప్రశ్నలను రేకెత్తించిన ‘గ్రహాంతరవాసి’ కూడా ఇప్పటికే ఇంగ్లీషులోకి అనువాదమైంది. వారి మరో రచన ‘అమెరికనిజం’ ఆ మధ్య కన్నడంలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆయన కథల తొలిసంపుటి ‘రోబోబుద్ధ’గా, మలిసంపుటి ‘పూజారి 2040’గా ప్రచురితమయ్యాయి. ఈయన రచించిన నృత్యరూపకాలు ‘హిందుత్వ’, ‘ధర్మోరక్షతి రక్షితః’ను కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాథ్ ప్రదర్శించడమే కాక సీడీలుగా తీసుకొచ్చారు. కాళిదాసు నాటకాన్ని నవలగా మలచిన రచన ‘శకుంతల’ అందరి మన్ననలు పొందింది.
రాణి శివశంకర శర్మ రచనలు
ఆశిష్ నంది ఆధునిక ఇండియాని అమెరికా పాశ్చాత్య దేశాల నకలుగా భావించారు. మొదట్లో అమెరికా ఒక ఒకే ఒక దేశంగా ఎదుగుతున్న క్రమంలో సివిక్ మిషన్ – ఒక పౌరుడు ఒక జాతీయ కమ్యూనిటీ ఏర్పాటు చేయడం – ప్రధానంగా భావించబడింది. ఉత్పత్తి పెంచడం, రవాణా విస్తరించటం వాటికవే లక్ష్యాలు కాదు. ఒక జాతి భావనను కూడా అధిగమించి, పౌరుడు అనే ఉమ్మడి కమ్యూనిటీ వైపు ప్రయాణం ప్రధానంగా భావించబడింది.
భావనాబలం, సంకల్పం ఉంటే హిందూ జాతి గొప్పదిగా అవతరిస్తుoది అని గోల్వాల్కర్ అంటాడు. అదే భావనాబలంతో క్రైస్తవులు ముస్లింలు తమ జాతి గొప్పదని చాటుకోవచ్చు కదా అని నిలదీస్తాడు కరపాత్ర స్వామి. హిందుత్వకి అనుగుణంగా భారతీయ తత్వాన్ని ఆలోచనలని వక్రీకరించడాన్నీ తీవ్రంగా ఖండిస్తాడు. నిత్య అనిత్య వస్తు వివేకం అనే శంకర అద్వైత భావనని హిందూ సమాజ పరంగా అన్వయిస్తాడు గోల్వాల్కర్.
వయసు, అనారోగ్యాల కారణంగా అంబేద్కర్ తన భార్యకి మూడు లక్షణాలు ఉండాలి అనుకున్నాడు. తనకు కాబోయే భార్య విద్యావంతురాలు, వైద్యురాలు, వంటనేర్చిన వ్యక్తి కావాలని ఆయన కోరుకున్నాడు. సవితా అంబేద్కర్ ఆ పాత్రలు అన్నీ ఒక ఆధునిక ఆదర్శ గృహిణిగా పోషించినట్లుగా ఆమె కథనం ఉంది.
మానవుడిని కేంద్రంగా చేసుకుని తత్వాన్నీ విజ్ఞానాన్నీ రూపొందిస్తే తప్పేముంది? అది ప్రగతికి సోపానం కదా? మానవ జాతి అభివృద్ధికి ఉపకరిస్తుంది కదా? ప్రపంచానికి ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదించిందని చెప్పే భారత్ కులవ్యవస్థలో మగ్గిపోతుండగా క్రైస్తవ పాశ్చాత్యం మానవుడే మహనీయుడని చాటుతోంది కదా అని అడగవచ్చు.